anitha
-
'నువ్వు నేను' హీరోయిన్ అనిత ఇప్పుడెలా ఉందో చూశారా? (ఫోటోలు)
-
కెనడా ప్రధాని రేసు నుంచి వైదొలిగిన అనిత
ఒట్టావా: కెనడా ప్రధాని బరినుంచి భారత సంతతికి చెందిన అనితా ఆనంద్ వైదొలిగారు. ప్రస్తుతం రవాణా శాఖ మంత్రిగా పనిచేస్తున్న అనిత.. పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు శనివారం ప్రకటించారు. అంతేకాదు తాను ఎంపీగా మళ్లీ పోటీ చేయబోనని ఆమె స్పష్టం చేశారు. ప్రధానిగా, పార్టీ అధినేతగా జస్టిన్ ట్రూడో రాజీనామా చేయడంతో ఆమె బరిలోకి వచ్చారు. అయితే.. వారంలోపే తాను పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటన చేశారు. ఈ సందర్భంగా లిబరల్ బృందానికి, ఓక్విల్లే ప్రజలకూ కృతజ్ఞతలు తెలిపారు. ‘‘పార్లమెంటు సభ్యురాలిగా లిబరల్ జట్టులోకి నన్ను ఆహ్వానించినందుకు, కీలకమైన కేబినెట్ శాఖలను అప్పగించినందుకు ప్రధాని ట్రూడోకు హృదయపూర్వక ధన్యవాదాలు. కెనడా హౌస్ ఆఫ్ కామన్స్‌కు ప్రాతినిధ్యం వహించడానికి నన్ను ఎన్నుకున్నందుకు, గత ఇరవై సంవత్సరాలుగా నా భర్త, నేను మా నలుగురు పిల్లలను పెంచేందుకు స్వాగతించిన అద్భుతమైన ఓక్విల్లే ప్రజలకు నేను నిజంగా కృతజ్ఞురాలిని’’ అని అనిత తన ప్రకటనలో పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల వరకు తాను ఎంపీగా కొనసాగుతానన్నారు. భారత సంతతికి చెందిన వ్యక్తి ఓక్విల్లేలో గెలవడం సాధ్యం కాదని చాలా మంది రాశారని, అయినప్పటికీ ఒక్కసారి కాదు రెండుసార్లు గెలిపించి ప్రజలు తన వెనుకే నిలిచారని చెప్పారు. ఈ గౌరవం ఎప్పటికీ తన గుండెల్లో నిలిచిపోతుందన్నారు. -
చెక్ బౌన్స్ కేసు.. అనిత పిటిషన్‌పై హైకోర్టు అసంతృప్తి
-
మనిషిగా నిఖిల్ ఓడిపోలేదు
బనశంకరి: నా కుమారుడు ఎన్నికల్లో మూడోసారి ఓడిపోయాడు. అతను ఎన్నికల్లో ఓడిపోవచ్చు కానీ, మానవత్వం, సహృదయమున్న మనిషిగా ఓడిపోలేదని నిఖిల్ తల్లి అనితా కుమారస్వామి అన్నారు. చెన్నపట్టణ ఉప ఎన్నికలో నిఖిల్ పరాజయం తరువాత ఆమె ఎక్స్‌లో సోమవారం పోస్ట్ చేశారు. నా కొడుకు ఓటమిని ఒప్పుకుంటున్నా. ఎన్నికల్లో జయాపజయాలు సహజం. ఒకరు గెలవాలంటే మరొకరు ఓడిపోవాలి, కానీ ఓటమికి అనేక కారణాలు ఉంటాయి. రాజకీయాల్లో నా భర్త, మామగార్లకు ఇటువంటివి కొత్త కాదు. ఓటమితో కుంగిపోలేదు. నా కుమారునికీ ఇదే వర్తిస్తుంది అని ఆమె పేర్కొన్నారు. నిఖిల్ మనిషిగా ఓటమి చెందలేదన్నారు. చెన్నపట్టణ ప్రజల, ప్రేమ, విశ్వాసం నిఖిల్ వెంటే ఉన్నాయని, ప్రజాసేవ చేసే అవకాశం లభిస్తుందని చెప్పారు. -
క్షమించండి.. చైర్మన్ ను వేడుకున్న వంగలపూడి అనిత
-
హోం మినిస్టర్ పై పవన్ వ్యాఖ్యలు వైఎస్ జగన్ రియాక్షన్
-
హోమ్ మంత్రి అనితపై పవన్ ఫైర్
-
రెచ్చిపోయిన టీడీపీ ఇసుక మాఫియా.. జనసేన నేతపై దాడి
అనకాపల్లి : హోం మంత్రి అనిత నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్రమంగా ఇసుక తరలించే క్రమంలో కూటమి నేతలు కత్తులు దూసుకుంటున్నారు కోటవురట్ల మండలంలో టీడీపీ, జనసేన నేతలు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. సొమ్ము చేసుకుంటున్నారు.అయితే, ఇసుక అక్రమ రవాణా తరలింపులో కూటమి నేతల మధ్య వివాదం నెలకొంది. దీంతో ఇరుపార్టీల నేతలు ఒకరిపై ఒకరు మారణాయుధాలతో దాడులు చేసుకున్నారు. టీడీపీ నేతలు జనసేన నేత కోన మౌళిపై గొంతుపై బ్లేడ్‌తో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రగాయాల పాలైన కోన మౌళిని అత్యవసర చికిత్స నిమిత్తం నర్సీపట్నం ఆసుపత్రికి తరలించారు. కాగా, ఇసుక అక్రమ రవాణపై ఇరు పార్టీ నేతలు చేసుకున్న దాడుల్ని భూతగాదా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
చంద్రబాబు సీఎంగా వేస్ట్..
-
వరుస అత్యాచారాలతో రాష్ట్రం అతలాకుతలం
-
కళ్ళు లేని కబోదిలా హోంమంత్రి అనిత.. తెనాలి ఘటనపై మేరుగ ఆగ్రహం
సాక్షి, గుంటూరు: టీడీపీ కార్యకర్త ,రౌడీ షీటర్ నవీన్ చేతిలో గాయపడి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మధిర సహాన కుటుంబ సభ్యుల్ని వైఎస్సార్సీపీ నేతలు మాజీ మంత్రి మేరుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యే అన్నా బత్తుని శివకుమార్‌లు పరామర్శించారు.అనంతరం మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. ‘తెనాలిలో యువతిపై జరిగిన దాడిని ఖండిస్తున్నాం. టీడీపీకి చెందిన రౌడీ షీటర్ నవీన్.. మదిర సహాన అనే యువతిని కొట్టి హింసించి దాడి చేశాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి మహిళలు, చిన్న పిల్లలపై దాడులు పెరిగిపోయాయి. చంద్రబాబు పరిపాలన మొత్తం మారణ హోమానికి తెర లేపుతున్నారుహోంమంత్రి అనిత కళ్ళు లేని కబోధిలా ఉన్నారు. వైఎస్సార్సీపీ పాలనలో ఆడబిడ్డకు ఏ కష్టం వచ్చినా వారికి న్యాయం జరిగేది. దిశ పోలీసులు క్షణాల్లో స్పందించే వారు. ఇప్పుడు అదే దిశ యాప్ ఏమైంది. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. బాధితురాలికి ప్రభుత్వం అండగా నిలవాలి’ అని మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి మూడు మర్డర్లు.. ఆరు హత్యాచారాలు తరహాలో పాలన కొనసాగుతుందని మాజీ ఎమ్మెల్యే అన్నా బత్తుని శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి నేతలు దౌర్జన్యాలకు అంతు లేకుండా పోతుంది. ఎన్నికల ముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 30 వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారు అని ఆరోపణలు చేశారు.అధికారంలోకి వచ్చాక మరి వాళ్ళందరిని తీసుకువచ్చి ఎందుకు తల్లిదండ్రులను అప్పగించలేదు. ఆడపిల్ల జోలికి వస్తే తాట తీస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదు. సహానాను నవీన్ అనే టీడీపీ కార్యకర్త, రౌడీషీటర్ దారుణంగా కొట్టి హింసించాడు. యువతి శరీరంపై గాయలయ్యాయి. బాధితురాలు ఇప్పుడు కోమాలోకి వెళ్లింది. ఇంతటి దారుణికి ఒడిగట్టిన నిందితుణ్ని కాపాడటానికి కూటమి నాయకులు ప్రయత్నాలు మొదలు పెట్టారని దుయ్యబట్టారు. -
రాష్ట్రానికి సీఎం ఉన్నారా? లేరా?.. చంద్రబాబుపై వరుదు కళ్యాణి ఆగ్రహం
సాక్షి,అమరావతి : మహిళపై హత్యలు, అగాయిత్యాలు జరుగుతుంటే సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత సంతాపాలు తెలిపి చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి. బద్వేల్లో కాలేజీ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడి, ఆపై పెట్రోల్ పోసిన ఘటనపై వరుదు కళ్యాణి విచారం వ్యక్తం చేశారు.ఈ దుర్ఘటనపై వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. ఆడపిల్లల ప్రాణాలు గాలిలో దీపంలా ఉన్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా, సీఎం , డిప్యూటీ సీఎం, హోం మంత్రి, డీజీపీ ఉన్నారా? లేరా? అని ప్రశ్నించారు.ప్రతి రోజూ మహిళలపై హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఆడపిల్లను పెట్రోల్ పోసి చంపితే ఎందుకు ఆ కుటంబాన్ని ఎందుకు పరమర్శించలేదు. కూటమికి ఎందుకు ఓట్లు వేశామా అని మహిళలు భాద పడుతున్నారు. రాష్ట్రంలో ఆన్ పిట్ హోం మంత్రి ఉన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అనే అనుమానం కలుగుతుంది. మహిళపై హత్యలు అగయిత్యాలు జరుగుతుంటే సీఎం చంద్రబాబు, హోం మంత్రి సంతాపాలు తెలిపి చేతులు దులుపుకున్నారు.వీకెండ్ అయితే చాలు పక్క రాష్ట్రాలకు సీఎం, డిప్యూటీ సీఎం వెళ్ళిపోతున్నారు. దిశా యాప్ ఉంటే మహిళపై దాడులు జరిగేవి కాదు. రాజకీయ దురుద్దేశంతో దిశా యాప్ పోలీస్ స్టేషన్లను నిర్విర్యం చేశారు. ఆడపిల్లను బైటకు పంపాలంటే తల్లి దండ్రులు భయపడుతున్నారు. -
అంతా మా ఇష్టం..!
-
ఎవడికి భయపడే ప్రసక్తే లేదు
-
నువ్వు నేను హీరోయిన్ అనిత ఫ్యామిలీ (ఫొటోలు)
-
వెండితెరపై మరోసారి ఉదయ్ కిరణ్.. ఆ సూపర్ హిట్ సినిమా మళ్లీ!
చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే లాంటి సూపర్ హిట్ సినిమాలతో క్రేజ్ సంపాదించుకున్న నటుడు ఉదయ్ కిరణ్. యూత్‌లో అతని మంచి ఫాలోయింగ్ ఉంది. కానీ ఊహించని విధంగా ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకొని మనందరికీ దూరమయ్యారు. కానీ ఎప్పటికీ అతని నటించిన సినిమాలను ఇప్పటికి ఏదో ఒక సందర్భంలో గుర్తు చేసుకుంటూ ఉంటాం. అలా టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయే సినిమాల్లో నటించిన ఉదయ్ కిరణ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఉదయ్ కిరణ్‌ను మరోసారి వెండితెరపై చూసుకునే అవకాశం లభించింది. అప్పట్లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన నువ్వు నేను సినిమా ఇప్పుడు రీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఇటీవల టాలీవుడ్లో పాత సినిమాలను రి రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఉదయ్ కిరణ్ నువ్వు నేను సినిమా మళ్లీ సందడి చేయనుంది. కాగా.. ఈ చిత్రంలో ఉదయ్ కిరణ్, అనిత జంటగా నటించారు. ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహించారు. ఆర్పీ పట్నాయక్ సంగీతమందించిన ఈ సినిమా 2001వ సంవత్సరం ఆగస్టు 10న రిలీజై అప్పట్లో భారీ విజయం సాధించింది. ఈ సినిమాకు ఏకంగా 5 నంది అవార్డులు అందుకున్నారు. తాజాగా మార్చి 21న థియేటర్స్‌లో రీ రిలీజ్ అవుతోంది. దీంతో ఉదయ్ కిరణ్ అభిమానులు మరోసారి థియేటర్లో తమ హీరోని చూడటానికి ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే నువ్వు నేను రీ రిలీజ్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. -
జిల్లా సమాఖ్య అధ్యక్షురాలి తీవ్ర విషాదం!
ఆదిలాబాద్: మండలంలోని మన్మద్ గ్రామానికి చెందిన జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు దొడ్లి అనిత(50) ఆత్మహత్య చేసుకుంది. ఏఎస్సై దిగంబర్ కథనం ప్రకారం..మృతురాలు నాలుగు నెలలుగా మానసికంగా బాధపడుతోంది. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇంట్లో సూపర్ వాస్మోల్ తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆదివారం తెల్లవారుజాము నిర్మల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమద్యలో మృతిచెందింది. మృతురాలి కుమారుడు పవన్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్తు ఏఎస్సై తెలిపారు. కాగా, పార్థివదేహం వద్ద డీఆర్డీవో విజయలక్ష్మి పుష్కగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అనంతరం అంతక్రియల్లో పాల్గొంది. బాధిత కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామన్నారు. ఇవి చదవండి: వనపర్తి: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి -
నటుడి మనవరాలి పెళ్లి.. హాజరైన సూపర్ స్టార్ రజినీకాంత్!
కోలీవుడ్ సూపర్ స్టార్, తలైవా చెన్నైలో సందడి చేశారు. సీనియర్ నటుడు విజయకుమార్ మనవరాలు దియా పెళ్లికి ఆయన హాజరయ్యారు. చెన్నైలో జరిగిన ఈ వేడుకలో నూతన వధువరులను ఆయన ఆశీర్వదించారు. బంధువులు, సినీ ప్రముఖుల సమక్షంలో విజయ్ కుమార్ కూతుర్లలో ఒకరైన అనితా కుమార్తె దియా పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. ఈ వివాహా వేడుకలో తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నగరంలోని ఓ ఖరీదైన హోటల్లో ఈ వివాహా వేడుక జరిగింది. కాగా.. రజనీకాంత్, విజయకుమార్ ఇండస్ట్రీలో కొన్ని దశాబ్దాలుగా మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. వీరిద్దరు కలిసి చాలా సినిమాల్లో నటించారు. నటుడిగా విజయకుమార్ తమిళ చిత్రసీమలో సీనియర్ నటుడిగా గుర్తింపు పొందారు. కోలీవుడ్‌తో పాటు తెలుగు, హిందీ, మలయాళంలో దాదాపు 400కి పైగా చిత్రాలలో కనిపించారు. ఆయన ప్రస్తుతం సినిమాలో క్యారెక్టర్ రోల్స్ ఎక్కువగా చేస్తున్నారు. సినిమాలతో పాటు టీవీ సీరియల్స్‌లో కూడా నటించారు. కాగా.. రజనీకాంత్ ప్రస్తుతం దర్శకుడు టీజే జ్ఞానవేల్ చిత్రం'వెట్టయన్' షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత లియో దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో కలిసి'తలైవర్ 170' అనే సినిమా చేయనున్నారు. View this post on Instagram A post shared by Anitha Vijayakumar (@anits1103) -
అనితకు ఊహించని షాక్..ఈ పరిస్థితి ఎవరికీ రావొద్దు
-
Naresh Goyal: జైల్లోనే చావాలనుంది!
ముంబై: ‘‘నాలో బతకాలన్న ఆశలన్నీ పూర్తిగా అడుగంటాయి. క్యాన్సర్ ముదిరి నా భార్య అనిత మంచాన పడింది. ఆమెను ఎంతగానో మిస్సవుతున్నా. నా ఒక్కగానొక్క కూతురుకూ ఒంట్లో బాగుండటం లేదు. నా ఆరోగ్యం కూడా పూర్తిగా దిగజారింది. మోకాళ్లు మొదలుకుని మూత్ర సంబంధిత వ్యాధుల దాకా తీవ్రంగా వేధిస్తున్నాయి. ఒళ్లంతా స్వాధీనం తప్పి వణుకుతోంది. నొప్పుల బాధను తట్టుకోలేకపోతున్నా. ఇలాంటి పరిస్థితుల్లో దైన్యంగా బతుకీడ్చడం కంటే జైల్లోనే చనిపోతే బాగుండనిపిస్తోంది’’ అంటూ జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ (74) భావోద్వేగానికి లోనయ్యారు. రూ.538 కోట్ల బ్యాంకు ఫ్రాడ్ కేసులో నిందితుడైన ఆయనను ఈడీ గత సెపె్టంబర్ 1న అరెస్టు చేసింది. నాటి నుంచీ జైల్లో ఉన్న ఆయన శనివారం ముంబై ప్రత్యేక కోర్టులో విచారణకు హాజరయ్యారు. కాసేపు వ్యక్తిగతంగా విచారించాలని కోరగా జడ్జి అనుమతించారు. ఈ సందర్భంగా చేతులు జోడించి తన దైన్యం గురించి చెప్పుకుంటూ కంటతడి పెట్టారు. మాట్లాడుతున్నంత సేపూ గోయల్ వణకుతూనే ఉన్నారని జడ్జి తెలిపారు. ఆయన గత డిసెంబర్లో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. -
WFI: భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలు.. బ్రిజ్‌భూషణ్ విధేయుడి గెలుపు
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఢిల్లీ వేదికగా ఒలింపిక్ భవన్లో ఈ ఎన్నికలు జరిగాయి. ఇందుకు సంబంధించిన ఫలితాలు ఈరోజే(గురువారం) వెల్లడయ్యాయి. ఈ ఎన్నికల సందర్భంగా నూతన అధ్యక్షుడిగా సంజయ్ కుమార్ సింగ్ ఎన్నికయ్యాడు. లైంగిక వేధింపులు ఎదుర్కొన్న మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వీర విధేయుడిగా పేరొందిన సంజయ్.. మాజీ రెజ్లర్ అనిత షెరాన్‌పై విజయం సాధించాడు. ఏం జరిగిందంటే? కాగా డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డబ్ల్యూఎఫ్ఐ వివాదాల్లో చిక్కుకుంది. బ్రిజ్‌భూషణ్ అధ్యక్ష పదవికి అనర్హుడని... అతడిని వెంటనే తప్పించాలంటూ రెజ్లర్లు తీవ్రస్థాయిలో ఆందోళనలు చేశారు. ఈ క్రమంలో భారత ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) డబ్ల్యూఎఫ్ఐ ప్యానెల్‌ను రద్దు చేసింది. అనంతరం డబ్ల్యూఎఫ్ఐ నిర్వహణ బాధ్యతను అడ్‌హక్ కమిటీకి అప్పగించింది. అయితే అడ్‌హక్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నికల నిర్వహణకు అవాంతరాలు ఎదురయ్యాయి. నిజానికి షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది (2023) మే 7న డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలు జరగాల్సింది. అయితే అప్పుడు క్రీడా మంత్రిత్వ శాఖ ఎలక్షన్‌ను నిలిపి వేసింది. ఈ క్రమంలో చివరగా ఆగస్టు 12న ఎన్నికలు నిర్వహిస్తామని అడ్‌హక్ కమిటీ ప్రకటించింది. అయితే, ఓటు హక్కు కోసం పలు సంఘాలు కోర్టుకెక్కగా.. పంజాబ్-హర్యానా హైకోర్టు ఈ ఎన్నికలపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎన్నికలు మరోసారి వాయిదా పడగా... డిసెంబరు 21న ఎన్నికల నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. అనిత్ వర్సెస్ సంజయ్ భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్ష పదవి కోసం 2010 ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ రెజ్లర్ అనిత షెరాన్, యూపీ రెజ్లింగ్ సమాఖ్య ఉపాధ్యక్షుడు సంజయ్ కుమార్ సింగ్ పోటీపడుతున్నారు. నిరసన దీక్షలో పాల్గొన్న రెజ్లర్లకు వెన్నుదన్నుగా నిలిచి మాట్లాడిన 38 ఏళ్ల అనిత.. వివాదాస్పద డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్‌భూషణ్ వీర విధేయుడుగా పేరొందిన సంజయ్ కుమార్ సింగ్‌లలో ఎవరు గెలుస్తారన్న అంశంపై ఆసక్తి నెలకొనగా చివరికి సంజయ్ పైచేయి సాధించాడు. -
'తాతను మరచి ముందుకు సాగిన మనుమడి' పాదయాత్ర!
అనకాపల్లి: జెండాల హడావుడే గానీ జనం సందడి లేని నారా లోకేష్ పాదయాత్ర జిల్లాలో పేలవంగా ప్రారంభమైంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి చేపట్టిన ‘యువగళం’ తొలిరోజు చప్పగా సాగింది. జేజేలు పలకాల్సిన పార్టీ శ్రేణులు నిరసన గళానికే ప్రాధాన్యమిచ్చాయి. తుని పర్యటన ముగించుకుని సోమవారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో లోకేష్ పాయకరావుపేటలోకి అడుగుపెట్టారు. గౌతం సెంటరు వద్ద మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత తన అనుయాయులతో స్వాగతం పలికారు. జనం ఆసక్తి చూపకపోయినా.. అదే సమయానికి సినిమాహాళ్ల నుంచి బయటకు వచ్చినవారు, భవన నిర్మాణ పనులకు వెళ్లిన కార్మికులు, విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్లే ఉద్యోగులు కనిపించడంతో పార్టీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. మెయిన్‌రోడ్డులో పార్టీ ఫ్లెక్సీలు, జెండాలతో నింపేసినా తెలుగు తమ్ముళ్ల జాడ అంతంతమాత్రంగానే ఉంది. పాయకరావుపేటలో అనిత వ్యతిరేక, అనుకూల వర్గాలు ఎవరికి వారు వేర్వేరుగా లోకేష్‌కు స్వాగతం పలికేందుకు రావడం గమనార్హం. పాదయాత్రలో జనసేన కార్యకర్తలు పెద్దగా పాల్గొనలేదు. ఆ పార్టీ నాయకులు గెడ్డం బుజ్జి, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మీశివకుమారి లోకేష్‌ను కలిశారు. ఈ పాదయాత్రలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యేలు కళా వెంకటరావు, గండి బాబ్జీ, మాజీ ఎమ్మెల్సీ బుద్దనాగజగదీష్ తదితరులు పాల్గొన్నారు. తాతను మరచిన మనుమడు లోకేష్ పాదయాత్ర గౌతం సెంటరు, మంగవరంరోడ్డు మీదుగా పాయకరావుపేట వై జంక్షన్‌కు చేరుకుంది. అక్కడ దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహం ఉంది. ఈ విగ్రహం ముందు నుంచే లోకేష్ జాతీయ రహదారిపైకి చేరుకున్నారు. తాత విగ్రహం ముందు నుంచి వెళ్లి కూడా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించకపోవడం పట్ల తెలుగు తమ్ముళ్లు విస్తుపోయారు. చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకుంటున్నారని, ఆయన పెట్టిన పార్టీ లాక్కుని పదవులు అనుభవిస్తూ కనీసం ఆయన విగ్రహానికి దండ వేయకపోవడమేంటని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనితకు అసమ్మతి సెగలు! యువగళం పాదయాత్రలో నియోజకవర్గంలో పార్టీ కుమ్ములాటలు మరోసారి బయటపడ్డాయి. నారా లోకేష్ సాక్షిగా మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు నిరసన సెగ తగిలింది. అనిత అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న పార్టీ మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు గొర్లె రాజబాబు, మాజీ పట్టణ అధ్యక్షుడు మజ్జూరి నారాయణరావు జీవీఆర్ నగర్ వద్ద ఉన్న వంగవీటి మోహన్‌రంగా విగ్రహం వద్ద అనిత ఫొటో లేకుండా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. లోకేష్ పాదయాత్ర అక్కడకు చేరుకోగానే అనిత వద్దు, టీడీపీ ముద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ నినాదాలు గమనించిన అనిత వెంటనే అక్కడకు వచ్చి వారిని సముదాయించే ప్రయత్నం చేయగా ‘మమ్మల్ని పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయించారు. మేం చేసిన తప్పేంటి’ అని నిలదీశారు. లోకేష్ వారిని సముదాయించి యాత్ర కొనసాగించారు. బైపాస్ జంక్షన్, ప్రకాష్ కళాశాల, పీఎల్‌పురం, సీతారాంపురం మీదుగా నామవరం చేరుకొని, అక్కడ ప్రైవేటు లేఅవుట్లో రాత్రి బస చేశారు. ఇవి చదవండి: 15న మంత్రివర్గ సమావేశం -
టీడీపీ నేత యనమల కృష్ణుడుపై జనసేన ఫైర్
నక్కపల్లి/పాయకరావుపేట : అనకాపల్లి జిల్లా పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ టీడీపీ మహిళా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితకేనని నియోజకవర్గ పరిశీలకుడు యనమల కృష్ణుడు చేసిన ప్రకటనపై జనసేన శ్రేణులు మండిపడుతున్నారు. ఇక్కడ అభ్యర్థిని ప్రకటించడానికి కృష్ణుడెవరు అంటూ ప్రశ్నిస్తున్నారు. అభ్యర్థిని ప్రకటించే అధికారం పరిశీలకులకులేదని తేల్చిచెప్పారు. ఈ విషయంపై ఆదివారం జనసేన రాష్ట్ర కార్యదర్శి, కాపు నేత గెడ్డం బుజ్జి మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అనితకు టికెట్ ఇస్తే జనసేన కార్యకర్తలు మద్దతిచ్చే ప్రసక్తిలేదని హెచ్చరించారు. నియోజకవర్గంలో ఆమె వ్యవహారశైలి.. కాపులను, జనసేనతోపాటు, టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన విషయాలు తెలియక యనమల కృష్ణుడు అలా మాట్లాడుతున్నారని విమర్శించారు. 2014లో అనితకు ఎమ్మెల్యే పదవి భిక్ష పెట్టింది జనసేన పార్టీయేనని, తమ మద్దతువల్లే ఆమె గెలిచారని బుజ్జి చెప్పారు. పదవి చేపట్టిన వెంటనే ఆమె తనపై రేప్ కేసు పెట్టించిందని, జనసేన కార్యకర్తలను ఇబ్బంది పెట్టిందని, కాపుల వ్యతిరేకి అయిన ఆమె ఆ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని చెప్పుతో కొట్టిందని ఆయన గుర్తుచేశారు. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా పాయకరావుపేట టికెట్ జనసేనకే కేటాయించాలని నియోజకవర్గ జనసేన కార్యకర్తలు కోరుతున్నారని ఆయన తెలిపారు. పాయకరావుపేట టికెట్ ఎవరికి ఇవ్వాలనేది చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు నిర్ణయిస్తారన్నారు. -
శోభిత ధూళిపాల హోయలు.. కలర్‌ఫుల్ శారీలో కవ్విస్తోన్న అనిత!
►బ్లూ డ్రెస్‌లో స్మైలీగా యామీ గౌతమ్! ►కలర్‌ఫుల్ శారీలో కవ్విస్తోన్న అనిత! ►బాలీవుడ్ భామ సన్నీలియోన్ హాట్ పోజులు! ►స్టెలిష్ డ్రెస్‌లో శోభిత ధూళిపాల హోయలు! ►బాలీవుడ్ భామ దిశా పటానీ హాట్ లుక్స్! View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) View this post on Instagram A post shared by Anita H Reddy (@anitahassanandani) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Yami Gautam Dhar (@yamigautam) -
'అనితా ఓ అనితా' సింగర్ గుర్తున్నాడా?.. ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా?
‘ నా ప్రాణమా నను వీడిపోకుమా.. నీ ప్రేమలో నను కరగ నీకుమా.. పదే పదే నా ప్రాణం నిన్నే కలవరిస్తోంది. వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది.. అనితా ఓ అనితా నా అందమైన అనిత.. దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ మీద.' ఈ పాట వినని వారు ఉండరేమో. అంతలా యువతను ఊపేసింది ఆ సాంగ్. ఎక్కడ చూసినా ఆ సాంగ్ మార్మోగిపోయింది. దాదాపు 15 ఏళ్ల క్రితం ప్రతి ఒక్కరినీ ఊర్రూతలూగించింది. వయసుతో సంబంధం లేకుండా చిన్నా, పెద్దా అందరి నోళ్లలో ఈ పాట వినిపించేది. అప్పట్లో ఓ రేంజ్లో ఫేమస్ అయినా ఈ సాంగ్ రాసిన యువకుడు పేరు నాగరాజు. ఒక్క పాటతో సంచలనం సృష్టించిన నాగరాజు గురించి తెలుసుకుందాం. నాగరాజు మాట్లాడుతూ..'ఒక వీడియో సాంగ్ పాటకు అనితా పాటను అటాచ్ చేశారు. నిజంగా నేను చనిపోయానని అప్పుడు రూమర్స్ వచ్చాయి. అప్పుడు నాకు చాలా బాధనిపించింది. హైదరాబాద్ అంటే కొత్త కొత్తగా ఉంటుంది. భయంతో నేను మా ఊరికి వెళ్లిపోయా. ఇప్పుడు అనితకు పెళ్లి అయిపోయింది. నాకు కూడా పెళ్లి జరిగింది. నిజంగా అనితకు థ్యాంక్స్ చెప్పాలి. ఆమె వల్లే నేను ఈ పాట రాయగలిగాను. అమ్మాయి ఇంట్లో వాళ్లకి ఇష్టం లేకపోవడం వల్ల మా లవ్ బ్రేకప్ అయింది.' అని అన్నారు. నా ప్రేమను ఓ పాట రూపంలో చెబుదామని ప్రయత్నించానని నాగరాజు తెలిపారు. ఇప్పుడు నాకు మంచి అమ్మాయి భార్యగా వచ్చిందని ఆయన అన్నారు. పెద్దబ్బాయికి మూగ, చెవుడు తన కుటుంబం గురించి నాగరాజు మాట్లాడుతూ.. 'ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు. పెద్దబ్బాయికి మూగ, చెవిటి. మాటలు రావు. చిన్నబ్బాయి కూడా అన్నతో పాటే సైగలే చేస్తుంటాడు. ఇంతకుముందు ఒక చిన్న పాన్‌షాపు పెట్టుకుని జీవనం కొనసాగించా. ఎవరన్నా పిలిస్తే వెళ్లి పాటలు పాడేవాన్ని. నా తమ్ముడు హైదరాబాద్‌లో ఉంటున్నాడు. అతనితో పాటే ప్రస్తుతం నేను హైదారాబాద్‌లోనే ఉన్నానని' తెలిపారు. కాగా ప్రస్తుతం అనితా పాటకు సీక్వెల్‌గా అనిత-2 సాంగ్ రిలీజ్ చేయనున్నట్లు నాగరాజు వెల్లడించారు. 'నా ప్రాణమా నిను మరిచిపోనులే.. ఊపిరి ఆగినా నీ మీద ప్రేమ చావదే'. అంటూ సాగే సాంగ్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు నాగరాజు తెలిపారు. -
తొలి సినిమాతో హిట్.. ఆ తర్వాత అవుట్..!
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా స్టార్డమ్ సంపాదించడం అంతా ఈజీ కాదు. అలాగే వచ్చిన పేరును నిలబెట్టుకోవడం మరింత సవాలుతో కూడుకున్నది. అలా కొందరు సూపర్ హిట్ మూవీస్‌లో నటించినా ఆ తర్వాత ఇండస్ట్రీలో నిలబడలేకపోయారు. కొందరు హీరోయిన్లు పెళ్లిబంధంతో జీవితంలో సెటిలైతే.. మరికొందరు అసలుకే కనుమరుగైపోయారు. అలా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి.. ఇలా కనిపించకుండా హీరోయిన్ల గురించి తెలుసుకుందాం. నువ్వే కావాలి హీరోయిన్ రిచా హీరోయిన్ రిచా పల్లాడ్ అంటే తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ నువ్వే కావాలి హీరోయిన్ అంటే టక్కున గుర్తుపడతారు. విజయభాస్కర్ దర్శకత్వంలో తరుణ్, రిచా జంటగా నటించిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ప్రేమకథాచిత్రం వచ్చి దాదాపుగా 22 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ఈ సినిమాకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఆ తర్వాత మళ్లీ ఇంతవరకు తెలుగులో ఎక్కడా కనిపించలేదు. ప్రస్తుతం భర్తకు సాయంగా ఉంటూ కుటుంబ బాధ్యతలు పోషిస్తున్న రిచా సినిమాలకు దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ రిచా నిత్యం ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. నువ్వు నేను హీరోయిన్ అనిత బుల్లితెర సెలబ్రిటీ, 'నువ్వు నేను' హీరోయిన్ అనిత.. ఉదయ్ కిరణ్‌తో కలసి నటించింది. శ్రీరామ్', 'నేనున్నాను' వంటి చిత్రాలతో ఆకట్టుకున్న అనితా టాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పేసింది. ఆ తర్వాత బాలీవుడ్లో ''తాళ్, కుచ్ తో హై, యే దిల్, కృష్ణా కాటేజ్, రాగిణి ఎంఎంఎస్, హీరో'' లాంటి చిత్రాల్లో నటించింది. ఆమె ఆ తర్వాత యే హై మొహబ్బతే, నాగిన్ సీరియల్స్‌తో బుల్లితెర బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. 2013లో రోహిత్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న అనిత.. ఈ ఏడాది ఫిబ్రవరి 9న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. చిత్రం మూవీ హీరోయిన్ రీమా సేన్ ఉదయ్‌కిరణ్, రీమా సేన్ 'చిత్రం' మూవీలో జంటగా నటించారు. ఈ సినిమా అప్పట్లోనే ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో వేరే చెప్పక్కర్లేదు. తొలి సినిమాతోనే రీమాసేన్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలు దక్కించుకొని ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది. బావనచ్చాడు, మనసంతా నువ్వే, సీమ సింహం, అంజి బంగారం వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఆ తర్వాత సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో ఆమె సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆమె కెరీర్ లో ది బెస్ట్ సినిమా ఏది అంటే యుగానికొక్కడు అని ఆమె చెప్పుకొచ్చారు. సినిమాలకు దూరమైన తరువాత ఆమె 2012లో ప్రముఖ పారిశ్రామిక వేత్త అయిన శివకరణ్ సింగ్‌ను పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్నారు బద్రిలో నటించిన రేణు దేశాయ్ పవన్ కల్యాణ్, రేణు దేశాయ్, అమీషా పటేల్ జంటగా నటించిన ‘బద్రి’. ఆ తర్వాత రేణు దేశాయ్ ప్రేమలో పడి పవన్ కల్యాణ్‌ను వివాహం చేసుకుంది. కొంతకాలం ఇద్దరు కలిసి ఉన్నారు. వీరికి ఓ బాబు, పాప జన్మించారు. ఆ తర్వాత కొన్ని కారణాలతో పవన్, రేణు విడిపోయారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకునే రేణు దేశాయ్.. ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. వంశీ మూవీ హీరోయిన్ నమ్రత వంశీ మూవీ సమయంలో మహేశ్ బాబుతో ప్రేమ, ఆ తర్వాత పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇక వీరి పిల్లలు గౌతమ్, సితార గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. అయితే పెళ్లి తర్వాత సినిమా అవకాశాలు వచ్చినా ఆమె నటించలేదు. వివాహం అనంతరం సినిమాలకు దూరంగా ఉన్నారు. అదే విధంగా స్టూడెంట్ నంబర్- 1లో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించిన గజాలా ఆ తర్వాత కొన్ని సినిమాల్లోనే కనిపించింది. అలాగే ఇడియట్ సినిమాలో రవితేజ సరసన కనిపించిన రక్షిత కొద్ది సినిమాలు మాత్రమే చేసింది. 6 టీన్స్ మూవీలో నటించిన రుతిక, సంతోషం మూవీలో చేసిన గ్రేసీ సింగ్, మన్మథుడు మూవీలో నటించిన అన్షు, టక్కరి దొంగ నటించిన లిసా రే, బన్నీ మూవీలో అల్లు అర్జున్‌తో జోడిగా కనిపించిన గౌరీ ముంజల్, దిల్ మూవీలో చేసిన నేహా, ఆర్య మూవీలో అను మెహతా, ఒకటి రెండు సినిమాలతోనే హిట్ సాధించినా ఆ తర్వాత కనుమరుగైపోయారు. -
అదొక్కటే నాకున్న వ్యాపకం.. రెండో పెళ్లిపై దిల్‌రాజు కామెంట్స్
ప్రముఖ నిర్మాత దిల్‌రాజు డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ ప్రారంభించి ప్రస్తుతం స్టార్‌ప్రొడ్యూసర్‌గా కొనసాగుతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ చిత్రాలను రూపొందిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక దిల్‌రాజు వ్యక్తిగత జీవితానికి వస్తే.. 2017లో ఆయన మొదటి భార్య అనిత గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీంతో 2020లో తేజస్విని(వైఘా రెడ్డి)తో ఆయనకు రెండో వివాహం జరిగింది. తాజాగా తన రెండో పెళ్లిపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన దిల్‌రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు. '' నా భార్య అనిత చనిపోయాక రెండేళ్ల వరకు మెంటల్లీ చాలా స్ట్రగుల్ అనిపించింది. ఆ టైంలో కూతురు, అల్లుడు నాతోనే ఉండేవారు. ఆ బాధ నుంచి తేరుకోవడానికి చాలా ప్రయత్నించా. నాకున్న వ్యాపకం ఒక్కటే గ్యాంబ్లింగ్. నన్ను అలా చూస్తూ మా పేరెంట్స్ ఉండలేకపోయారు. వాళ్లే నన్ను రెండో పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేశారు. నా కూతురు హన్షితా కూడా సపోర్ట్ చేసింది. నా ఫ్యామిలీ డిస్టర్బ్ కావొద్దనే ఆలోచనతో అన్ని విధాలుగా ఆలోచించి రెండో పెళ్లి చేసుకున్నా'' అంటూ దిల్‌రాజు పేర్కొన్నారు. కాగా ఇటీవలె ఈ దంపతులకు కుమారుడు జన్మించాడు. అతనికి ఇద్దరి భార్యల పేర్లు కలిసొచ్చేలా అన్వయ్ రెడ్డి అని పేరు పెట్టారు. చదవండి : హీరోల క్యారవాన్ కల్చర్‌పై దిల్‌రాజు షాకింగ్ కామెంట్స్ -
సమాజ సేవతోనే జీవితానికి పరిపూర్ణత
ఒక వ్యక్తి తన కోసం తాను పని చేసుకుంటుంటే ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ ఉండకపోవచ్చు. అదే వ్యక్తి సమాజం కోసం కూడా పని చేస్తుంటే చెప్పుకోవడానికి ఎంతో కొంత ఉంటుంది. అదే... సమాజంలో మార్పు కోసం నిరంతరాయంగా శ్రమిస్తుంటే చెప్పుకోవడానికి చాలా ఉంటుంది. చాలా చెప్పుకోవాల్సిన వ్యక్తుల్లో ఒకరు అనిత చావలి. గాంధీజీతో పాటు చీరాల–పేరాల ఉద్యమంలో పాల్గొన్న తాతగారి స్ఫూర్తితో ఆమె సామాజిక కార్యకర్తగా మారారు. గత రెండు దశాబ్దాలుగా ఆమె సామాజిక జీవనం, సమాజంలో ఆమె తీసుకువచ్చిన మార్పులు కూడా చెప్పుకోదగిన స్థాయిలో ఉన్నాయి. అనిత చావలి పుట్టింది పెరిగింది బాపట్ల జిల్లా (విభజనకు పూర్వం ప్రకాశం జిల్లా) చీరాల. డిగ్రీ వరకు చీరాలలోనే చదివారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్శిటీలో చేశారు. జిల్లా బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా, ఎన్సీసీ క్యాడెట్‌గా ఆమె విద్యార్థి దశ నుంచే చురుగ్గా ఉండడానికి కారణం తాతగారు వాసుదేవమూర్తిగారినే చెబుతారు. ఇంటర్ ఫస్టియర్‌లో ఉన్నప్పుడు 1986 గోదావరికి వరదలు వచ్చినప్పుడు ఎన్సీసీ క్యాడెట్‌గా సేవలందించిన రోజులను గుర్తు చేసుకున్నారు అనిత. ‘‘బాధితులకు ఆహార పొట్లాలు పంచడం, మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్న డాక్టర్లకు సహాయం చేయడం వంటి పనులు మాకప్పగించారు. సర్వీస్‌లో ఉండే ఆత్మసంతృప్తిని నూటికి నూరుపాళ్లు అనుభవించిన సందర్భం అది. పీజీలో కూడా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో చురుగ్గా పని చేశాను. అయితే నా జీవితంలో అతి పెద్ద విరామం పెళ్లి రూపంలో వచ్చింది. నా పీహెచ్డీ సీటును కూడా వదులుకుని యూఎస్‌కి వెళ్లాల్సి వచ్చింది. పన్నెండేళ్లు అక్కడే ఉన్నాం. అయితే అక్కడ కూడా ఊరికే ఉండలేదనుకోండి. లోవెల్ జనరల్ హాస్పిటల్లో చారిటీ వర్క్ చేశాను. ఒక కల్చరల్ ఫౌండేషన్ స్థాపించి బోస్టన్, న్యూజెర్సీల్లో ఉన్న భారతీయ మహిళలను సంఘటితం చేస్తూ తరచూ కలిసే ఏర్పాటు చేశాను. యూఎస్ రోడ్లే కాదు! ఇండియాకి వచ్చి హైదరాబాద్, సఫిల్‌గూడలో స్థిరపడ్డాం. అప్పటికి మా పిల్లలిద్దరూ ప్రైమరీ స్కూల్ వయసులోనే ఉన్నారు. ఇక్కడికి రాగానే ఒకింత షాక్ ఏమిటంటే... చిన్న క్లాసుల పిల్లలను కూడా ట్యూషన్‌కి పంపిస్తున్నారు. ఆ వయసులో ఇంత ప్రెషర్ ఎందుకు? ఆట–పాట లేని చదువేమిటి! అనిపించింది. ఈస్ట్ ఆనంద్ బాగ్‌లో రెయిన్ బో డాన్స్ ఇన్స్టిట్యూట్ పెట్టాను. అదే సమయంలో కాలనీ మీద కూడా నా ఫోకస్ పడింది. ‘యూఎస్‌లో రోడ్లు శుభ్రంగా ఉంటాయి, అలాంటి రోడ్లు ఇండియాకి ఎప్పుడు వస్తాయో... అని పెదవి విరిస్తే సరిపోదు, అక్కడి వాళ్లు ఎలా పని చేస్తారో అలా మనం కూడా పని చేయాలి, అలా పని చేయడం అలవాటు చేయాలి... అనుకున్నాను. మా కాలనీలో ఉత్సాహవంతులతో ఒక సొసైటీ ఏర్పాటు చేశాం. ఒక టోల్ ఫ్రీ నంబర్ పెట్టి జీహెచ్ఎంసీ వాళ్లు చెత్త తీయకపోతే ఫోన్ చేయడం అలవాటు చేశాం. కాలనీ రోడ్లు శుభ్రంగా మారిపోయాయి. ఇలా ఉన్నప్పుడు 2015 వరదలు మా కాలనీని జలమయం చేశాయి. డ్రైనేజ్ నీరు పొంగి రోడ్ల మీదకు రావడానికి కారణం నాలాలు ప్లాస్టిక్ చెత్తతో పూడిపోవడమేనని తెలిసింది. ప్లాస్టిక్ మీద నా పోరాటం అప్పుడే మొదలైంది. ప్లాస్టిక్ వద్దు... కాలనీలో ఇంటింటికీ వెళ్లి ప్లాస్టిక్ బదులు ఈ బ్యాగ్ వాడండి అని జ్యూట్ బ్యాగ్ ఇచ్చాం. జీహెచ్ఎంసీతో కలిసి తడి చెత్త –పొడి చెత్త వేరు చేయడం నేర్పించాం. ఇంకా చక్కగా వేరు చేసిన వారిని గుర్తించి ‘స్వచ్ఛ నాగరిక’ పురస్కారంతో ప్రోత్సహించాం. స్వచ్ఛ రంగోలి పేరుతో ‘యాంటీ ప్లాస్టిక్, బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేయవద్దు, డ్రై–వెట్ వేస్ట్ సెగ్రెగేషన్, నీటి సంరక్షణ, మొక్కలు నాటడం’ అంశాల మీద ముగ్గుల పోటీలు పెట్టాం. ఈ విషయాల్లో మహిళలను ప్రభావితం చేయగలిగితే ఆ ప్రభావం ఇంట్లోనూ, సమాజంలోనూ ప్రతిబింబిస్తుందనే ఉద్దేశంతో ఈ థీమ్ డిజైన్ చేశాను. వీటన్నింటితోపాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో కలిసి ప్లాస్టిక్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ చేపట్టాం. అది అద్భుతమైన ఫలితాలనిచ్చింది. ప్లాస్టిక్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ అంటే... ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, కూల్‌డ్రింక్, ఆయిల్ బాటిల్స్ వంటివన్నీ తెచ్చి తూకానికి మాకు ఇచ్చేసి డబ్బు తీసుకెళ్లడం అన్నమాట. ఒక్కరోజులో సఫిల్‌గూడలోని నాలుగు కాలనీల్లో రెండు వందల టన్నుల ప్లాస్టిక్ వచ్చింది. స్కూళ్లలోనూ ఇదే పని చేశాం. మా దగ్గరకు వచ్చిన ప్లాస్టిక్ వేస్ట్ క్రషింగ్ యూనిట్‌కి వెళ్లిపోతుంది. ప్లాస్టిక్ ఎలిమినేషన్ కోసం రైల్వే స్టేషన్లలో కూడా క్రషింగ్ మెషీన్లు పెట్టించాం. ఇవన్నీ బాగా జరిగాయి. కానీ... చికెన్, మటన్ షాపులకు స్టీలు బాక్సు తీసుకెళ్లాలనే ఉద్యమం కరోనా ముందు వరకు విజయవంతంగా చేయగలిగాం. ఆ తర్వాత మా చేతుల్లో నుంచి మెల్లగా జారిపోయింది. దాని మీద మళ్లీ ఫోకస్ పెట్టాలి. మా కాలనీలో నేను కనిపిస్తే అందరూ ఎదురు వచ్చి పలకరిస్తారు. చేతిలో ప్లాస్టిక్ కవర్ ఉన్న వాళ్లు మాత్రం ఇప్పుడు పలకరించవద్దు అనుకుని మరో దారిలో మలుపు తిరిగి వెళ్లిపోతుంటారు’’ అన్నారామె నవ్వుతూ. సంఘటిత శక్తి ‘పని చేసే చేతులకు తీరిక ఉండదు, పని చేయని చేతులకు పని కనిపించదు’... అంటారు. అనిత వ్యాపకాల జాబితా చూస్తే ఈ నానుడి నిజమే అనిపిస్తోంది. వాటర్ బోర్డు సహకారంతో కాలనీలో ఇంకుడు గుంతల తవ్వకం వంటి పనులు చేస్తున్నారు, చేయిస్తున్నారు. ‘‘నేను ఒక పని తలపెట్టి ‘కాలనీలో ఈ పని చేద్దాం’ అని వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ పెట్టిన ఇరవై నాలుగ్గంటల్లో స్వచ్ఛందంగా తమ వంతు సహకారంగా ఎవరు ఏమేమి చేయాలనుకుంటున్నదీ తెలియచేస్తారు, అందుకయ్యే ఖర్చులో తమ వంతుగా ఎంత ఇవ్వగలరో కూడా సమాచారం ఇచ్చేస్తారు. అందుకే ఇంత సజావుగా చేయగలుగుతున్నాం. పైకి కనిపించేది నేనే, కానీ, నాకు సహకరించే ఎందరో అండగా ఉన్నారు’’ అని చెప్పారు అనితా చావలి. జీవితం అంటే... మన ఇంటి నాలుగ్గోడలకు పరిమితమైనది కాదు, సమాజంతో కలిసి ఉన్నదే జీవితం. ఇంటి బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించినట్లే, సామాజిక బాధ్యతను కూడా పూర్తి చేయాలి. అప్పుడే జీవితానికి పరిపూర్ణత. ప్లాస్టిక్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ అంటే... ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, కూల్‌డ్రింక్, ఆయిల్ బాటిల్స్ వంటివన్నీ తెచ్చి తూకానికి మాకు ఇచ్చేసి డబ్బు తీసుకెళ్లడం అన్నమాట. ఒక్కరోజులో సఫిల్‌గూడలోని నాలుగు కాలనీల్లో రెండు వందల టన్నుల ప్లాస్టిక్ వచ్చింది. స్కూళ్లలోనూ ఇదే పని చేశాం. అలాగే గౌతమ్‌నగర్ సరిహద్దులో రైల్వే పరిధిలో చెత్తకుప్పలా ఉన్న ప్రదేశాన్ని శుభ్రం చేయించి సరిహద్దు గోడకట్టించి గాంధీజీ విగ్రహం పెట్టాం. – వాకా మంజులారెడ్డి. -
Anitha Rao: మహిళా ట్రెక్కర్‌గా.. హార్స్ రైడింగ్, పెయింటింగ్‌లోనూ.. హ్యాట్సాఫ్!
మురళీనగర్: విశాఖపట్నానికి చెందిన దేవనబోయిన అనితారావు (53)కు సాహసమే ఊపిరి. ఐదు పదులు దాటినా ఆమె పర్వతారోహణ, బైక్ రైడింగ్‌తో సత్తా చాటుకుంటున్నారు. సాహసయాత్రికురాలిగా, బైక్ రైడర్‌గా ఆమె పేరు తెచ్చుకున్నారు. తండ్రి కల్నల్ అర్జునరావు మిలట్రీలో పనిచేశారు. దీంతో ఆమెలోనూ సాహస గుణం అలవడింది. ప్రస్తుతం బీచ్‌రోడ్డులోని కిర్లంపూడి లేఅవుట్లో బాలాజీ టవర్స్‌లో ఉంటున్నారు. ఆమె భర్త కమాండర్ వి.రామకృష్ణ నేవీలో రిటైర్ అయ్యారు. ప్రస్తుతం ఆమె ఆంధ్రా యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేస్తూ యువతకు ఆదర్శగా నిలుస్తున్నారు. మహిళా ట్రెక్కర్‌గా.. ఢిల్లీ యూనివర్సిటీలో ఆమె ఎంఏ సైకాలజీ చేశారు. నేవీ ఆస్పత్రిలో కొంత కాలం సైకాలజిస్టుగా కౌన్సెలింగ్ సెక్షన్లో పని చేశారు. ప్రస్తుతం గృహిణిగా ఉంటూనే పెయింటింగ్‌లో స్పెషల్ కోర్సు చేస్తూ రెగ్యులర్ విద్యార్థిగా విద్యాభ్యాసం చేస్తున్నారు.. 2004నుంచి ట్రెక్కింగ్ చేస్తున్నారు. దేశంలోని 50కి పైగా పర్వత ప్రాంతాలకు సాహసయాత్ర చేశారు. విశాఖ యూత్ హాస్టల్ తరుఫున బృందాలకు టీమ్ లీడర్‌గా వ్యవహరిస్తూ అనేక ప్రాంతాలకు సాహసయాత్ర చేశారు. కాశ్మీరులోని సోనామార్గ్‌లోని జవహర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటనీరింగ్ ఇన్స్టిట్యుట్లో 2015లో మౌంట్ ఇంజినీరింగు కోర్సు చేసిన ఆమెకు పర్వతారోహణపై పూర్తి అవగాహన ఉంది. ప్రతి ఏడాది మే/జూన్ నెలల్లో హిమాలయపర్వతాలకు వెళ్తారు. మౌంటినీరింగులో భాగంగా క్యాంప్ లీడరుగా లడక్‌లో 21రోజుల పాటు అనేక ఇబ్బందులను అధిగమించి విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆమె చెప్పారు. అత్యధిక పీక్‌పాయింటుగా అయిన ఒడిశాలోని ఈస్ట్రన్ ఘాట్స్‌లోని మహేంద్రగిరిని ఆమె అవలీలగా అధిరోహించారు. హార్స్ రైడింగ్‌లో.. అనితారావు బహుముఖ ప్రజ్ఞాశాలి. హార్స్ రైడింగులోనూ మంచి ప్రవేశం ఉంది. న్యూఢిల్లీలో 1986లో జరిగిన జాతీయ స్థాయి హార్స్ రైడింగ్ పోటీల్లో పాల్గొన్నారు. అంతే కాకుండా ఆమె నిర్వహించిన మోటారు బైక్ యాత్ర లిమ్కా బుక్ఆఫ్ రికార్డులో నమోదయ్యింది. 2009లో ఢిల్లీ నుంచి హిమాలయపర్వతాల్లో 3000 కిలోమీటర్లు యాత్ర చేశారు. 2011లో మనాలి నుంచి బైక్ యాత్ర చేశారు. దీనికి క్యాంపు లీడరుగా వ్యవహరించారు. ఈ రెండూ లిమ్కా బుక్ఆఫ్ రికార్డ్స్‌లో నమోదయినట్లు ఆమె చెప్పారు. గుజరాత్ నుంచి కేరళ వరకు 3000 కిలోమీటర్లు సైక్లింగ్ చేశారు. పెయింటింగ్‌లోనూ.. పెయింటింగ్‌లో ఆమె దిట్ట. పెన్సిల్ స్కెచింగ్, వాటర్ కలర్ పెయింగ్స్ వేస్తారు. విశాఖ మ్యూజియంలో, హవామహల్‌లో నిర్వహించిన పెయింటింగ్ ప్రదర్శనల్లో పాల్గొన్నారు. -
అన్నార్తుల సేవలో.. కర్నూలు మహిళ
కర్నూలు (ఓల్డ్‌సిటీ): అన్నార్తుల ఆకలి తీర్చే అరుదైన అవకాశం ఆమెకు దక్కింది. ఒకరు.. ఇద్దరు కాదు.. కొన్ని కోట్ల మంది అభాగ్యుల కాలే కడుపులు నింపింది. కట్టుబట్టలతో ఉపాధి కోసం దేశం కాని దేశం వచ్చిన వలస జీవులకు బాసటగా నిలిచింది. మూడేళ్ల క్రితం వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం డిప్యూటీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన కర్నూలు నగరానికి చెందిన అనిత ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలలో అన్నార్తులను ఆదుకున్నారు. 200 మంది సభ్యులతో వలస వెళ్లే కార్మికులు, సాధారణ పౌరులకు అండగా నిలిచారు. ఏడాది క్రితం ఆ సంస్థకు నోబెల్ శాంతి బహుమతి లభించగా ఆ సంస్థ హెడ్‌గా నైజీరియాలో ఆ ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డేవిడ్ బీజ్లి చేతుల మీదుగా అందుకున్నారు. ఇటీవల ఆమె కర్నూలు రాగా ‘సాక్షి’తో మాట్లాడారు. తల్లిదండ్రులు, భర్త, కుమార్తెతో.. ‘మా నాన్న అర్థోపెడిషియన్ డాక్టర్ వెంకట శెట్టి నాకు స్ఫూర్తి. ఆయన 1,500 మందికి పోలియో ఆపరేషన్స్ ఉచితంగా చేశారు. ఆ చిన్నారులు, తల్లిదండ్రుల కళ్లల్లో చూసిన ఆనందం ఎప్పటికీ మరిచిపోలేను. అరుదైన సేవలకు ఒక సార్థకత ఉంటుందని భావించి నేను సాఫ్ట్వేర్ రంగం నుంచి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం ప్రతినిధిగా ఎంపికయ్యాను. ఇటీవల ఆప్ఘనిస్తాన్‌లో సంభవించిన రాజకీయ పరిణామాలతో అక్కడి పౌరులు భారీ స్థాయిలో ఇతర దేశాలకు వలస వెళ్లిన క్రమంలో వాళ్లను వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం ఆత్మీయంగా గుండెలకు హత్తుకుంది. వాళ్లు ఎక్కడ విడిది చేస్తే అక్కడే గుడారాలు వేసి ఆహారాన్ని అందించింది. గతంలో యెమెన్‌లో భారీ సంఖ్యలో (దాదాపు 2 కోట్ల మంది) వలసలు జరిగినప్పుడు డబ్ల్యూఎఫ్‌పీ వారిని ఆదుకుంది. నైజీరియా, మయన్మార్, బంగ్లాదేశ్‌ల నుంచి ప్రజలు వలసవెళ్లిన సందర్భాల్లో ఆహారం సరఫరా చేయడంతో పాటు కొన్ని నెలల పాటు పునరావాసం కల్పించాం. ఏదైన దేశంలో విధ్వంసకర పరిస్థితులు ఏర్పడి తమ మనుగడ ప్రమాదకరంగా మారినప్పుడు చాలా మంది వలస వెళ్తున్న సమయంలో మహిళలు, చిన్నారులకు ప్రత్యేక విడిది ఏర్పాటు చేస్తాం. గర్భిణులు, బాలింతలకు ప్రత్యేక పోషక విలువలతో కూడిన ఆహారాన్ని సరఫరా చేస్తాం. వలసదారులతో పనిచేసే క్రమంలో వాళ్లు మాట్లాడే హౌసా, ఇగ్లో, ఎరూబా భాషలను కూడా నేను నేర్చుకోగలిగా. నా భర్త హరికృష్ణ, కుమార్తె మేధా అందించిన సహకారం మరవలేనిది’ అని అనిత చెప్పారు. -
అలుపెరగని అగ్గిబరాటా
వెనుకబడిన దళిత కుటుంబం. కటిక పేదరికం. తోబుట్టువుల్లో ఐదో నంబర్ తనది. సౌకర్యవంతమైన ఇల్లులేదు, కడుపునిండా తినేందుకు లేదు. ఇంతటి దుర్భర పరిస్థితులనూ ఎదుర్కొని నేడు వేలమంది విద్యార్థులకు పాఠాలు చెబుతూ రెండు సార్లు బెస్ట్ టీచర్ అవార్డును అందుకోవడమేగాక, దళిత మహిళల సమస్యలపై పోరాటాలు చేస్తోంది. మరోపక్క తన రచనలతో దళిత మహిళలను జాగృతపరుస్తున్నారు అనితా భారతి. కృషితో నాస్తి దుర్భిక్షం అనే సూక్తికి ఉదాహరణగానూ, పేదరికంలోనూ నిజాయితీగా కష్టపడితే పైకి ఎదగవచ్చని నేటి యువతరానికి ప్రేరణగా నిలుస్తున్నారు అనిత. అది 1965.. ఢిల్లీలోని సీలమ్‌పూర్‌లో నిరుపేద దళిత కుటుంబంలో పుట్టింది అనితా భారతి. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నాయి. అనితకేమో బాగా చదువుకోవాలని కోరిక. తామెలాగూ చదువుకోలేదు. కనీసం పిల్లలనైనా చదివించాలన్న ఆశతో తల్లిదండ్రులు పిల్లల్ని బాగా చదువుకోమని ప్రోత్సహించేవారు. స్కూలుకు వెళ్లడానికి యూనిఫాం గానీ చెప్పులు గానీ లేవు సరికదా... రాసుకునేందుకు పుస్తకాలు కూడా ఉండేవికావు. అయినా అలాగే స్కూలుకు వెళ్లి తనకున్న ఒక నోట్ బుక్లోనే పెన్సిల్‌తో పాఠాలు రాసుకుని అది పూర్తయిన తరువాత ఎరేజర్‌తో తుడిపేసి మళ్లీ కొత్త పాఠాలను రాసుకునేది. పాతబట్టలతో బ్యాగ్ కుట్టుకుని ఎంతో మప్పితంగా స్కూలుకు వెళ్లేది. క్రమం తప్పకుండా స్కూలుకు వెళ్తూనే .. స్కూలు అయ్యాక ఇంటికొచ్చి ఎన్వలప్‌ల తయారీలో తల్లికి సాయపడేది. పనిపూర్తయ్యాక కొవ్వొత్తి వెలుతురులో చదివి తరగతిలో తొలి రెండు స్థానాల్లో నిలిచేది. అయితే అనితా వీటన్నింటిని శ్రమపడి అధిగమించినప్పటికీ, చిన్నప్పటి నుంచి తోటి విద్యార్థుల చేసే కుల దూషణలు తనని తీవ్రంగా బాధించేవి. తొమ్మిదో తరగతికి వచ్చేసరికి కులవివక్ష ఎక్కువ అయ్యింది. ఆ సమయంలో సమాజం, జీవితం పట్ల అవగాహన ఏర్పడిన అనిత అలాంటి వాటిని పట్టించుకోకుండా చదువు మీద దృష్టి పెట్టి, పన్నెండో తరగతి పూర్తిచేసింది. అప్పులు... పోరాటాలు ఇంటరీ్మడియట్ తరువాత అప్పులు చేసి కాలేజీ చదువులు పూర్తిచేసింది. తొలుత బీఏ హిందీ హానర్స్‌లో చేరింది. తరువాత బిఈడీ చేసింది. అయితే కుల వివక్షని అధిగమించడానికి కాలేజీ యూనియన్లలో చురుకుగా పాల్గొనేది. ఇందులో భాగంగా దళిత విద్యార్థులందరితో కలిసి ‘ముక్తి’ సంస్థను స్థాపించి దళిత విద్యార్థుల హక్కులను కాపాడడానికి ప్రయతి్నంచేది. అంతేగాక ఒక స్కూలును ఏర్పాటు చేసి మురికివాడల్లోని దాదాపు వందమంది పిల్లలకు పాఠాలు చెప్పేది. మరోపక్క ఢిల్లీ యూనివర్శిటీలో ఎం.ఏ హిందీ పూర్తి చేసింది. 1992లో గవర్నమెంట్ స్కూల్లో హిందీ పండిట్ ఉద్యోగం వచ్చింది. దీంతో టీచర్‌గా పనిచేస్తూనే సామాజిక కార్యక్రమాలు చేపట్టేది. అనిత మెరుగైన పనితీరుకు గుర్తింపుగా రాధా కృష్ణన్ బెస్ట్ టీచర్ అవార్డు, ఇందిరా గాంధీ అవార్డు, ఢిల్లీ స్టేట్ టీచర్ అవార్డు, సావిత్రబాయి ఫూలే అవార్డు ఆమెను వరించాయి. భర్తతో కలిసి... ఉద్యోగం వచి్చన ఏడాదిలో కులాంతర వివాహం చేసుకుంది. భర్త ప్రోత్సాహంతో ‘కదమ్’ దళిత సెంటర్‌ను ప్రారంభించారు. దీని ద్వారా దళిత మహిళల సమస్యలను పరిష్కారానికి కృషిచేస్తున్నారు. అంతేగాక దళిత్ రైటర్స్ అసోసియేషన్‌కు ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తూ దళితులను చైతన్యవంతుల్ని చేస్తున్నారు. అంతేగాక దళిత మహిళల సమస్యలపై పోరాడే థియేటర్ గ్రూపు ‘అలటిపు’లో కూడా భాగస్వామిగా మారి, ఈ గ్రూపులోని మహిళలు తమ పిల్లల్ని ఉన్నత చదువులు చదివించేలా ప్రోత్సహిస్తున్నారు. దళిత మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయడమేగాక వారి హక్కులపై అవగాహన కలి్పంచేందుకు 2003లో దళిత్ ఉమెన్ పేరిట రచనలు చేయడం ప్రారభించింది. 2012లో హిందీలో ‘కాంటెంపరరీ ఫెమినిస్ట్ అండ్ దళిత్ ఉమెన్స్ రెసిస్టెన్స్’ బుక్‌ను విడుదల చేసింది. ఈ పుస్తకం బీబీసీ టాప్–10 పుస్తకాలలో ఒకటిగా నిలవడం విశేషం. ఎక్కువమంది బుక్‌ను ఇష్టపడడంతో మరింత ఉత్సాహంతో పుస్తకాలు రాయడం, దళిత మహిళలు, బాలికలు, అమ్మాయిలపై జరిగిన దాడులకు న్యాయం చేయాలని ఇప్పటికీ పోరాడుతున్నారు. ప్రస్తుతం రూప్‌నగర్ నంబర్ వన్ స్కూల్‌కు వైస్ ప్రిన్స్‌పాల్‌గా పనిచేస్తూ నిరుపేద పిల్లల అభ్యున్నతికి కృషిచేస్తున్నారు. -
పూజా హెగ్డే ధరించిన డ్రెస్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
బుట్టబొమ్మా.. బుట్టబొమ్మా పాటతో ప్రేక్షకులను బుట్టలో వేసుకొని అభిమానులుగా మార్చేసుకున్న నటి పూజా హెగ్డే. మరి ఆమెను బుట్టలో పడేసిన ఫ్యాషన్ బ్రాండ్స్ ఏంటో చూద్దాం.. అనీతా డోంగ్రే డిజైనర్ అనీతా డోంగ్రేకు చిన్నప్పటి నుంచే ఫ్యాషన్ అంటే ప్యాషన్. అందుకే ఫ్యాషన్ డిజైన్‌లో డిగ్రీ చేసింది. రాజస్థాన్ సంప్రదాయ ఎంబ్రాయిడరీనే తన డిజైన్స్‌కి ప్రేరణగా తీసుకుంటుంది. దాంతో అదే ఆమె బ్రాండ్ వాల్యూగా మారింది. 2015లో తన పేరుమీదే ముంబైలో ఫ్యాషన్ హౌజ్‌ను ప్రారంభించింది. ఇప్పుడది సెలబ్రిటీస్ ఫేవరెట్‌గా స్థిరపడిపోయింది. ఆ దుస్తుల ధరలు డిజైన్‌ను బట్టే ఉంటాయి. వేల నుంచి లక్షల్లో పలుకుతాయి. ఆన్‌లైన్‌లోనూ ఈ డిజైనర్ వేర్ అందుబాటులో ఉంది. బ్రాండ్: అనీతా డోంగ్రే ధర: రూ. 1,99,000 ఫుట్‌వేర్... టిన్సెల్ టోస్ టాప్ మోస్ట్ లగ్జూరియస్ ఫ్యాషన్ బ్రాండ్స్‌లో టిన్సెల్ టోస్ ఫుట్‌వేర్ ఒకటి. జపాన్‌లో మెయిన్ ఆఫీస్ ఉంది. సంప్రదాయ అల్లికలు, కుందన్ వర్క్స్‌తో లభించే ఈ జూతీస్కు ఇండియాలో మంచి గిరాకీ ఉంది. ఈ మధ్యనే చండీగఢ్‌లో కూడా ఓ బ్రాంచ్‌ను ప్రారంభించారు. సాధారణ ఫుట్‌వేర్ కూడా ఇక్కడ అందమైన డిజైన్స్‌లో దొరుకుతాయి. అందుకే, సామాన్యుడు నుంచి సెలబ్రిటీ వరకు ప్రతి ఒక్కరికీ ఈ బ్రాండ్ అంటే తీరని మోజు. ధర కూడా ఆ రేంజ్‌లోనే ఉంటుంది. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్‌లోనూ లభిస్తాయి. బ్రాండ్: టిన్సెల్ టోస్ ధర: రూ. 2,499 సెలబ్రిటీలు అనగానే ఒకసారి ధరించిన దుస్తులను ఇంకోసారి ధరించరు అని చాలా మంది అనుకుంటూంటారు. కానీ, నేను అలా కాదు. స్టయిల్ అనేది మనం సెట్ చేసేదే. మిక్స్ అండ్ మ్యాచ్‌ను ట్రై చేస్తుంటా. – పూజా హెగ్డే -
రికార్డు కోసం కాదు నా పిల్లల కోసం..
అనిత పుట్టింది పెరిగింది కరీంనగర్లో. ఎనిమిదవ తరగతి నుంచి హైదరాబాద్‌లో అమ్మమ్మగారింట్లో ఉండి చదువుకుంది. ఐటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి, ఆరేళ్ల పాటు ఉద్యోగం చేసింది. రెండవ బిడ్డ పుట్టినప్పుడు కెరీర్లో కొంత విరామం. ఇప్పుడు సొంత గ్యారేజ్ తో కొత్త కెరీర్లో అడుగుపెట్టింది. గ్యారేజ్ అనగానే టైర్లు, రెంచ్‌లు, గ్రీజు అంటిన దుస్తులతో మగవాళ్లు కళ్లముందు మెదలుతారు. మహిళలు ప్రవేశించని రంగం అనడం కంటే మహిళలు పెద్దగా ఇష్టపడని రంగం అనే చెప్పాలి. భుజబలంతో చేసే పనులు ఎక్కువగా ఉంటాయి. భౌతిక శక్తి సామర్థ్యాలకు పరీక్ష పెట్టే ఈ రంగంలో అడుగుపెట్టడం నిజంగా ఒక సాహసమే. ఆ సాహసాన్ని ఒక సవాల్‌గా స్వీకరించింది అనిత వ్యాల. ఇల్లు అమ్మేశాం! ‘‘విక్టరీ 4 వీల్స్ గ్యారేజ్‌ని 2018లో తమ్ముడు, నేను కలిసి మొదలుపెట్టాం. ఇప్పుడు నేను ఒక్కదాన్నే చూసుకుంటున్నాను. యాభై లక్షలతో పూర్తవుతుందని దిగాం. కానీ మేము అనుకున్న స్వరూపం వచ్చేటప్పటికి 90 లక్షలైంది. లోన్ కోసం నెలలపాటు బ్యాంకు చుట్టూ తిరిగి చివరికి మా ఫ్లాట్స్ అమ్మేసి గ్యారేజ్ పెట్టాం. నలుగురు ఉద్యోగులతో మొదలైన గ్యారేజ్‌లో ఇప్పుడు నాతో కలిసి పన్నెండు మందిమి పని చేస్తున్నాం. మహిళ అయిన కారణంగా ఎదురయ్యే ఇబ్బందులేమీ లేవు. కానీ వర్కర్స్ జాప్యం చేస్తున్నట్లు, మహిళను కావడంతోనే పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారేమో అనిపించేది. అయితే వాళ్ల సమాధానం విన్న తర్వాత పని ఆలస్యం కావడానికి కారణం సహేతుకంగానే అనిపించేది. పాప లక్ష్యం మెడిసిన్ పిల్లల కోసం సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసిన తరవాత గ్యారేజ్ పెట్టడానికి మధ్య కొంతకాలం ట్యూషన్లు చెప్పాను. ట్యూషన్లతో వచ్చే రాబడితో హాయిగానే ఉండేది. అయితే మా పాప లక్ష్యం మెడిసిన్. సీటు తెచ్చుకోవడం ఆమె లక్ష్యం. ఫీజులు కట్టడానికి తగినట్లు నా ఇన్‌కమ్‌ను పెంచుకోవడం నా లక్ష్యం అయింది. అందుకే పని చేయగలిగిన వయసులోనే కన్‌స్ట్రక్టివ్‌గా ఏదో ఒక బిజినెస్‌లోకి అడుగుపెట్టి స్థిరపడాలనుకున్నాను. అంతే తప్ప నేను రికార్డు సాధించడం కోసం పిల్లల భవిష్యత్తు మీద ప్రయోగం చేసే పరిస్థితి కాదు. తమ్ముడి సూచన మా తమ్ముడికి టాటా డీలర్షిప్ వర్క్‌షాపులో పదహారేళ్ల అనుభవం ఉంది. మల్టీ బ్రాండ్ కార్ సర్వీసింగ్ సెంటర్‡గురించి చెప్పాడు. అలా ఈ రంగంలోకి వచ్చాను. ఇందులో ప్రతిదీ పనిలోకి దిగిన తర్వాత నేర్చుకున్నదే. కారు డీప్ ఇంటీరియర్ క్లీనింగ్, ఇన్సైడ్ వ్యాక్యూమింగ్, కెమికల్ క్లీనింగ్, ఫోమ్ వాషింగ్, ఫాగ్ మెషీన్ శానిటైజేషన్ వంటి పనులన్నీ చేస్తాను. సమస్యలుంటాయని చెప్పడానికి... ‘దిగితేనే లోతు తెలుస్తుంది’ అంటారు. నేనయితే ‘దిగితే ఈత దానంతట అదే వస్తుంది’ అంటాను. ఇందులో పదిమందికి ఉపాధి కల్పించగలుగుతున్నాను. ఒకసారి మా గ్యారేజ్‌కి వచ్చిన కస్టమర్లు ఆ తర్వాత నుంచి కొనసాగుతున్నారు. సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకునే మహిళల విషయంలో కారు సర్వీస్‌కి కూడా వాళ్లే రావాల్సి ఉంటుంది. మగవాళ్లు నిర్వహించే గ్యారేజ్‌లో కంటే మా దగ్గర సౌకర్యంగా ఫీలవుతున్నారు మహిళలు. నేను ఉదయం పది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు గ్యారేజ్‌లో ఉంటాను. ఒక్కోసారి అర్జంట్‌గా పని పూర్తి చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటప్పుడు పన్నెండు గంటల వరకు కూడా గ్యారేజ్‌లో ఉండాల్సి వస్తుంది. అమ్మాయిలూ రెంచ్ పట్టుకోండి! ఒకప్పుడు మెకానిక్ అంటే సమాజం తక్కువ గా చూసేది. అలా చూడడం వల్లనే కావచ్చు ఇప్పుడు ఈ రంగంలో నిపుణుల కొరత ఉంది. పైగా ఇప్పుడు మెకానిక్ వృత్తికి గౌరవం పెరిగింది కూడా. కాబట్టి అమ్మాయిలకు ఇది మంచి అవకాశం. ఈ రంగంలో కెరీర్ డెవలప్ చేసుకోవాలనుకునే అమ్మాయిలకు శిక్షణ ఇచ్చి నిపుణులుగా తయారు చేస్తాను. ఈ కాలంలో టూ వీలర్ నడిపే అమ్మాయిలు, కారు నడిపే మహిళల సంఖ్య బాగా పెరిగింది. వాళ్లు గ్యారేజ్‌కి వచ్చినప్పుడు గ్యారేజ్‌లో పని చేసే వాళ్లలో అమ్మాయిలు కనిపిస్తే భరోసాగా ఫీలవుతారు. ఇది మంచి కెరీర్ ఆప్షన్. ఎప్పటికీ ఆదరణ తగ్గని మంచి రంగం అవుతుంది’’ అన్నది అనిత. కష్టం... వద్దన్నా వచ్చే అతిథి సింగిల్æమదర్‌ల మీద ఉండే బాధ్యతల బరువు నాకు తెలుసు. అందుకే సింగిల్ మదర్లు ఈ పని నేర్చుకోవడానికి ముందుకొస్తే వారికి సహకరిస్తాను.ఎవరూ కోరి కష్టాలు తెచ్చుకోరు. అనుకోని అతిథిలా కష్టం దానంతట అదే వచ్చి తిష్టవేస్తుంది. కష్టం వచ్చిందని భయపడి పిల్లలతోపాటు ఆత్మహత్యలకు పాల్పడే తల్లుల గురించి తెలిసినప్పుడు బాధ కలుగుతుంటుంది. ఒక్క క్షణం ఆలోచించండి. పరిస్థితులకు మనం బాధితులమైనప్పటికీ మన పిల్లలను బాధితులను చేయకూడదు. అలాగని అమ్మానాన్నల మీద వాలిపోకూడదు. వాళ్లు కష్టకాలంలో అండగా భుజాన్ని ఇవ్వగలుగుతారు. కానీ బరువు మోసే శక్తి వాళ్లకు ఉండదు. మీకు వచ్చిన పని చేయండి, నచ్చిన పనిని నేర్చుకోండి. – అనిత వ్యాల, ఎం.డీ. ఆమె తాను ఎంచుకున్న రంగంతో మహిళలకు స్ఫూర్తినివ్వడంతోపాటు కొత్తతరానికి స్వాగతం పలుకుతోంది కూడా. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
కొద్ది రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన ఆ జంట..
సాక్షి, మాచర్ల రూరల్: కొద్ది రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన ఆ జంట.. కుటుంబ వివాదాల కారణంగా ఆత్మహత్యాయత్నం చేసింది. ఘటనలో యువకుడు మృతిచెందగా.. యువతి ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. గుంటూరు జిల్లా మాచర్ల మండలం కొప్పునూరులో వలంటీర్‌గా పనిచేస్తున్న కేతావత్ శివా నాయక్ (22)కు, రెంటచింతల మండలం పశర్లపాడుకు చెందిన జఠావత్ అనితతో పెద్దలు పెళ్లి నిశ్చయించారు. మాచర్ల పట్టణంలోని ఓ కళాశాలలో అనిత డిగ్రీ చదువుతోంది. వేసవి సెలవుల్లో వివాహం జరిపించాలనుకున్నారు. ఈ నేపథ్యంలో అనిత కుటుంబంలో ఏర్పడ్డ స్వల్ప విభేదాలతో కలత చెందిన శివానాయక్, అనితలు గురువారం కంభంపాడు కుడికాలువలో దూకారు. అక్కడ పొలం పనులు చేసుకుంటున్న కొందరు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. రూరల్ సీఐ భక్తవత్సలరెడ్డి అక్కడికి చేరుకుని కాలువలో కొట్టుకుపోతున్న ఇద్దరినీ రక్షించేందుకు అక్కడే ఉన్న కొంతమందిని పురమాయించారు. నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో శివా నాయక్ కొట్టుకుపోగా.. కొన ఊపిరితో ఉన్న అనితను ఒడ్డుకు చేర్చి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. శివా నాయక్ మృతదేహాన్ని కాలువలో గాలించి బయటకు తెచ్చి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కొద్ది రోజుల్లో వివాహం జరగాల్సిన తమ పిల్లలకు ఈ దుస్థితేంటంటూ ఇరు కుటుంబాల బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
దేవదాయశాఖ ఈవో అనిత ఆత్మహత్య
సాక్షి, దాచేపల్లి (గురజాల): రెండు రోజుల కిందట సస్పెండైన దేవదాయశాఖ గురజాల మండల ఈవో డి.అనిత (32) కృష్ణానదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగలలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. నీటిలో తేలియాడుతున్న మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని బయటికి తీయించిన ఎస్ఐ ఇ.బాలనాగిరెడ్డి.. మృతురాలు అనితగా గుర్తించి, పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనిత భర్త రమేష్ గుంటూరులో ఉంటూ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అనిత గురజాలలో విధులు నిర్వర్తిస్తూ దాచేపల్లి మండలం శ్రీనగర్‌లో తల్లిదండ్రుల వద్ద ఉంటున్నారు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆదివారం ఉదయం భర్త వద్ద నుంచి ఇంటికి బయలుదేరినట్టు తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. బస్సులో ఉన్నప్పుడు పలుమార్లు భర్తతో కూడా మాట్లాడారు. దాచేపల్లి బస్టాండ్‌లో దిగానని 9 గంటలకు ఫోన్ చేసి.. మధ్యాహ్నం 12 గంటలైనా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు బస్టాండ్, రైల్వేస్టేషన్ ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోయింది. అంతలోనే అనిత ఆత్మహత్యకు పాల్పడినట్టు వారికి సమాచారం అందింది. 2016లో కృష్ణా పుష్కరాల సందర్భంగా గురజాల మండలం దైద, సత్రశాల ఘాట్ల నిర్వహణ బాధ్యతలను అనిత చూశారు. ఈ క్రమంలో టీడీపీ నేతల అండదండలతో నిధుల దుర్వినియోగం జరిగిందని.. త్రిసభ్య కమిటీ విచారణలో అది వాస్తవమని తేలడంతో ఉన్నతాధికారులు ఆమెను సస్పెండ్ చేశారు. దీంతో మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్టు స్థానికులు చెప్పుకొంటున్నారు. భార్యాభర్తల మధ్య వివాదాలున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. -
సత్యంబాబుకు పెళ్లయింది..
సాక్షి, ఖమ్మం: తొమ్మిదేళ్ల క్రితం విజయవాడలో బీఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా హత్యకేసులో జైలు జీవితం గడిపి... నిర్దోషిగా విడుదలైన సత్యం బాబు ఓ ఇంటివాడయ్యాడు. ఖమ్మం రూరల్ మండలం కరుణగిరి చర్చిలో శుక్రవారం అతడి వివాహం జరిగింది. అప్పట్లో సంచలనం సృష్టించిన అయేషా మీరా హత్యకేసులో ప్రధాన ముద్దాయిగా ఆరోపణలు ఎదుర్కొన్న సత్యంబాబు సుమారు తొమ్మిదేళ్లు జైలుశిక్ష అనుభవించాడు. అనంతరం ఆ కేసులో నిర్దోషిగా విడుదలయ్యాడు. ఇదిలా ఉంటే తిరుమలాయపాలెం మండలం చంద్రతండా చర్చి ఫాదర్ క్రీస్తుదాసు కుమార్తె అనితతో బంధుమిత్రుల సమక్షంలో సత్యంబాబు పెళ్లి జరిగింది. -
అనితను పరామర్శించిన మంత్రి
సాక్షి, బోథ్: పోడు భూముల సమస్య పరిష్కారానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని, త్వరలోనే సీఎం కేసీఆర్ ఈ సమస్యను పరిష్కరిస్తారని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. బోథ్ మండలం కోర్టా(కే) గ్రామంలో, గాయపడిన కాగజ్ నగర్ అటవీ రేంజ్ ఆఫీసర్ అనితను మంత్రి పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని.. అధైర్యపడవద్దని అనితను, ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు. ధైర్యంగా నిలబడి దాడిని ఎదుర్కొని, అనిత తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించిందని కొనియాడారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుందని, దాడి చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. చట్టాన్ని అతిక్రమిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అడవుల నరికివేత, ఆక్రమణల వల్ల పర్యావరణం దెబ్బతింటోందని... అడవులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గుర్తించాలన్నారు. మంత్రి వెంట ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ దేవన్న, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, ఎంపీపీ తుల శ్రీనివాస్, టీఆర్ఎస్ నేతలు అనిల్ జాదవ్, మల్లికార్జున్ రెడ్డి, జివి రమణ, పాకాల రాంచందర్, అటవీ శాఖ అధికారులు ఉన్నారు. -
నా ప్రాణాలకు రక్షణ కల్పించండి: అనిత
హైదరాబాద్: మళ్లీ విధులకు వెళితే తన ప్రాణాలకు రక్షణ ఉండదని, ప్రభుత్వం రక్షణ కల్పించాలని సిర్పూర్ కాగజ్‌నగర్ ఘటనలో గాయపడిన ఎఫ్ఆర్వో అనిత కోరారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె సోమవారం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాలను అమలు చేసేందుకు మాత్రమే అక్కడికి వెళ్లానని, 4 రోజుల ముందే గ్రామస్తులతో సమావేశం నిర్వహించి స్పష్టంగా చెప్పిన తర్వాత పొలంలోకి వెళ్లామని చెప్పారు. తాము మొక్కలు నాటే పనులు చేస్తుండగా జెడ్పీ వైస్ చైర్మన్ కృష్ణతోపాటు మిగతావారు వచ్చి తనను చుట్టుముట్టి కొట్టారని చెప్పారు. ఎంత వేడుకున్నా వినకుండా దాడి చేశారన్నారు. ఇక్కడ రాజకీయ నాయకులు గ్రామస్తులను రెచ్చగొట్టడం, అధికారులపై దాడులకు ఉసిగొల్పడం చేస్తుంటారని, గతంలో ఇలాంటి ఘటనలు జరిగాయని చెప్పారు. దాడి చేసిన వారిపై ఏదో ఒక కేసు పెడితే మళ్లీ రాజకీయ బలంతో బయటకు వస్తారని, అప్పుడు తన ప్రాణాలకు రక్షణ ఉండదని భయాందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వీరిపై చర్యలు తీసుకుని తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరారు. -
కొడుకు లేని లోటును తీరుస్తున్నాం..
‘మా అమ్మానాన్న ఆండాళమ్మ, స్వామిరెడ్డిలకు మేము నలుగురు కూతుళ్లమే. అమ్మాయిలని వివక్ష చూపకుండా.. విలువ కట్టలేని ప్రేమను పంచి మమ్మల్ని మా అమ్మానాన్న బాగా పెంచారు. అందరినీ చదివించారు. నేను డాక్టర్‌గా ఎదగాలన్నది నాన్న ఆకాంక్ష. ఈ గమ్యాన్ని చేరడంతో ఎంతో సంతోషపడ్డారు. అమ్మ మూడేళ్ల క్రితం మా నుంచి దూరమైంది. అప్పటి నుంచి నాన్న బాగోగులు బిడ్డలమే చూసుకుంటున్నాం. కొడుకులేని లోటు తీరుస్తున్నాం. ఒక ఆడబిడ్డగా దేవుడు మాకిచ్చిన వరమిది’ అని జిల్లా పరిషత్ నూతన చైర్పర్సన్ డాక్టర్ తీగల అనితారెడ్డి చెప్పారు. ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ తన విశేషాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. సాక్షి, రంగారెడ్డి జిల్లా: మా అమ్మనాన్నలది హయత్‌నగర్ మండలం అనాజ్‌పూర్. అప్పట్లో మలక్‌పేట టీవీ టవర్ వద్ద ఉండేవాళ్లు. మాకు దగ్గర్లోని తిరుమల హిల్స్‌లో నా భర్త హరినాథ్‌రెడ్డి వాళ్ల ఇల్లు. ఒకే ప్రాంతంలో ఉన్నప్పటికీ ఒకరి కంట ఒకరం పడలేదు. మాది పెద్దలు కుదిర్చిన వివాహమే. పెళ్లి నాటికే మా ఇద్దరిదీ ఎంబీబీఎస్ పూర్తయింది. వివాహం తర్వాత నేను ఉన్నత చదువులు అభ్యసించడంలో హరి ప్రోత్సాహం ఎంతో ఉంది. నేను గుల్బర్గాలో ఎండీ, డీజీఓలో చేరగా.. ఆయన తమ విద్యా సంస్థల నిర్వహణ బాధ్యతలు చూసుకునేవారు. పీజీలో ఉండగానే కూతురు త్రిష పుట్టింది. మూడు నెలల వయసులో పాపను అత్తమ్మ దగ్గరే ఉంచాను. ఆలనాపాలనా తనే చూసుకున్నారు. అప్పుడు పరీక్షలు ఉండటంతో గుల్బర్గా వెళ్లక తప్పలేదు. ఇలా పీజీ అయ్యే వరకు వారానికోసారి పాప వద్దకు వచ్చే వెళ్లేదాన్ని. మాది ఉమ్మడి కుటుంబం కావడంతో ఎటువంటి ఇబ్బందీ రాలేదు. ఆప్యాయతకు, అనురాగానికి ఏమాత్రం కొదవ లేదు. మామ తీగల కృష్ణారెడ్డి, అత్తయ్య అరుంధతి, మరిది అమర్నాథ్రెడ్డి, తోటి కోడలు తులసి, మా వారు, ఇద్దరు పిల్లలం కలిసే నివసిస్తాం. నిత్యం ఎవరి బిజీలో వాళ్లుంటారు. ప్రతి శనివారం సాయంత్రం అందరం కలిసే భోజనం చేస్తాం. మా ఆడపడుచు కుటుంబమూ ఈ విందుకు హాజరవుతుంది. సమయాన్ని బట్టి కలిసే చోటు మారుతుంది. ఇలా ఇంటిల్లిపాదితో వారానికోసారి భేటీ ఉండటం గొప్ప సంతోషానిచ్చే అంశం. చిన్నప్పటి నుంచి టాపర్‌ని బాల్యం నుంచి చదువుల్లో ముందజలో ఉండేదాన్ని. పోటీతత్వం, ఇష్టంతో చదివేదాన్ని. ఏ క్లాస్‌ని తీసుకున్నా ఫస్ట్ లేదా సెకండ్ వచ్చేదాన్ని. టెన్త్ వరకు హైదరాబాద్‌లో చదవగా.. విజయవాడలో ఇంటర్ పూర్తయింది. గుల్బర్గాలోని ఎంఆర్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, ఎండీ, డీజీఓ చేశా. వైద్య విద్యలో పీజీ కాగానే నగరంలో ఓవైసీ ఆస్పత్రికి అనుబంధంగా ఉన్న డక్కన్ మెడికల్ కాలేజీలో ఐదేళ్లపాటు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ ఇదే ఆస్పత్రిలో వైద్య సేవలందించాను. అనంతరం రెండేళ్లపాటు మహబూబ్‌నగర్‌లోని ఎస్వీఎస్ మెడికల్ కాలేజ్‌లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా కొనసాగాను. మామ, మా ఆయన ప్రోత్సాహంతో 2010లో దిల్‌సుఖ్‌నగర్‌లో టీకేఆర్–ఐకాన్ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి స్థాపించాను. స్వీట్స్ తినేందుకు కిలోమీటర్లు వెళ్లేవాళం.. వైద్యవిద్య చదివే సమయంలో నచ్చిన ఆహారం తినేందుకు క్లాస్‌లకు డుమ్మా కొట్టేవాళ్లం. మా కాలేజీకి ఐదు కిలోమీటర్ల దూరంలో రసమలై స్వీట్ తినేందుకు వెళ్లేవాళ్లం. అలాగే అక్కడ ఆశీర్వాద్ హోట్‌లో చికెన్ ఫ్రైడ్ రైస్, జనతా ఐస్‌క్రీం పార్లర్లో వివిధ రకాల ఫేవర్లలో ఐస్‌క్రీంలు చాలా ఫేమస్. చాలా ఆకర్షనీయంగా, టేస్టీగా ఉండటంతో తరగతులకు డుమ్మాకొట్టి ఆ రుచులను ఆస్వాదించేవాళ్లం. మా బెస్ట్ ఫ్రెండ్స్ మ్తొతం ఏడుగురు. ఎక్కడికి వెళ్లినా మేమంతా ఒకే జట్టుగా కదిలేవాళ్లం. 16ఏళ్ల నాటి కోరిక.. నెరవేరిన వేళ పెళ్లయిన కొత్తలో మేమిద్దరం మారీషస్కి వెళ్లాం. హెలికాప్టర్ రైడ్ చేయాలన్న కోరికను ఆయన ముందుంచా. అయితే, ఆ రైడ్ చేయడం వీలుపడలేదు. ఈ విషయాన్ని 16 ఏళ్లపాటు తనలో దాచుకున్న ఆయన నా 40వ పుట్టిన రోజు సందర్భంగా నిజం చేశారు. సౌతాఫ్రికాకు తీసుకెళ్లి ముందస్తు సమాచారం ఇవ్వకుండా అక్కడ హెలికాప్టర్ రైడ్ చేయించారు. ఈ ఘటన చాలా సర్ప్రైజ్ కలిగించింది. ఆ క్షణాన నాకసలు మాటలు రాలేదు. నా ఇష్టం పట్ల ఆయన చూపిన ప్రేమ నా జీవితకాలపు తీపిజ్ఞాపకం. వైద్య వృత్తి వల్ల నేను.. టీకేఆర్ విద్యాసంస్థల నిర్వహణలో మా భర్త చాలా బిజీ. ఉదయం లేచింది మొదలు రాత్రి 8 గంటల వరకు ఈ వ్యవహారాలే ఉంటాయి. కానీ, ప్రతి ఆదివారం పూర్తిగా మేం కుటుంబానికే కేటాయిస్తాం. ఆ రోజు ఎటువంటి పనులూ పెట్టుకోం. ఆయనది విశాల మనస్తత్వం. అన్నీ అర్థం చేసుకోగల గొప్ప వ్యక్తిత్వం ఆయన సొంతం. నాన్‌వెజ్ అంటే మహాఇష్టం.. మావారికి నాన్‌వెజ్ అంటే ఇష్టం. మటన్ మహాఇష్టం. మా ఇద్దరు పిల్లలు త్రిష, కృష్ణారెడ్డిలు కూడా వాళ్ల నాన్ననే అనుసరిస్తారు. రోజు వడ్డించినా వద్దనకుండా లాగించేస్తారు. నేనేమో నాన్‌వెజ్‌కు కొంచెం దూరం. నాన్‌వెజ్‌ని నేనే వండాలి..వడ్డించాలి. ఇక ఆరోజు క్రికెట్ ఉంటే పండగే. వారి ముంగిటకే వంటకాలను తీసుకెళ్లాలి. ఆ మ్యాచ్ అయ్యేదాకా టీవీని వదలరు. నేను పెద్దగా టీవీ చూడను. చూసే సమయమూ ఉండదు. పిల్లల చదువులో మాత్రం చాలా సీరియస్‌గా ఉంటాను. ఎక్స్ట్రా యాక్టివిటీస్, ఎడ్యుకేషన్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తాను. నన్ను స్ఫూర్తిగా తీసుకున్న మా కూతురు డాక్టర్ కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం నీట్లో మెరిట్ వచ్చింది. ఎంబీబీఎస్‌లో చేరనుంది. అబ్బాయి.. సెకండ్ క్లాస్. సినిమాలో విషయంలో మా అభిరుచులు వేరు. నేను హిందీ సినిమాలు చూస్తా, ఆయన తెలుగు కామెడీ మూవీలు ఎక్కువగా చూస్తారు. అయినా ఒకరి అభిప్రాయాలను మరొకరం గౌరవిస్తూ రెండు భాషల సినిమాలకు వెళ్తుంటాం. బేసిక్‌గా నేను చిరంజీవి ఫ్యాన్‌ని. జగదేకవీరుడు.. అతిలోకసుందరి బాగా నచ్చిన సినిమా. సేవకు కదిలి.. ప్రాణాలు కాపాడి మా ఆస్పత్రికి గ్రామీణ ప్రాంత మహిళలు అధికంగా వస్తుంటారు. వాళ్లంతా పెద్దగా పరిశుభ్రతను, ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నారని తెలిసింది. విశ్రాంతి పెద్దగా తీసుకోరని, మానసిక, శారీరక ఒత్తిడికి గురవుతున్నట్లు నా కౌన్సెలింగ్ ద్వారా తేలింది. ఇటువంటి మహిళలు చాలా మంది అనారోగ్యం పాలవుతున్నారు. ముఖ్యంగా డయాబెటిస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్ వంటి వారిని వేధిస్తున్నాయి. తొలుత వారికి చైతన్యం కల్పించడం ద్వారా కొంత అనారోగ్య సమస్యలను దూరం చేయవచ్చని భావించా. ఇందుకోసం ‘ఆర్ట్’ ఫౌండేషన్‌ను స్థాపించి.. గ్రామీణ మహిళల్లో పరిశుభ్రత, ఆరోగ్యంపై విస్తృతంగా అవగాహన కల్పించాం. 60కి పైగా క్యాంపులు ఏర్పాటు చేశాం. అలాగే ప్రభుత్వ పాఠశాలల బాలికల్లోనూ చైతన్యం తెచ్చాం. దీంతోపాటు రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్‌ని మా ఆస్పత్రిలో ఉచితంగా చేయించాం. ఇలా 1,350 మంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగా.. ఇందులో నలుగురికి క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. ప్రాథమిక స్థాయిలోనే గుర్తించడంతో వీరి ప్రాణాలను కాపాడగలిగాం. ఇప్పటికే నిత్యం ఒక గంట ఆ ఆస్పత్రిలో గర్భిణులకు ఉచిత ఓపీ సౌకర్యాన్ని కొనసాగిస్తున్నాం. -
టిక్‌టాక్ చేస్తూ విషం తాగేసింది...
సాక్షి, చెన్నై: భర్త మందలించాడని ఆత్మహత్య చేసుకుంటూ టిక్‌టాక్‌లో వీడియో పెట్టింది ఓ మహిళ. ఈ సంఘటన తమిళనాడులో చోటు వేసుకుంది. వివరాల్లోకి వెళితే... పెరంబలూరుకు చెందిన శివ, అనిత దంపతులకు ఏడేళ్ల కిందట వివాహం కాగా ఇద్దరు పిల్లలున్నారు. శివ ఉపాధి కోసం సింగపూర్ వెళ్లగా అనిత పిల్లలను చూసుకుంటూ పెరంబలూరులోనే నివశిస్తుంది. అనిత ఖాళీగానే ఉండటంతో టిక్‌టాక్ అలవాటు వ్యసనంగా మారింది. దీంతో పిల్లలను కూడా పట్టించుకోకుండా టిక్‌టాక్ ఏంటని శివ భార్యను మందలించాడు. అయినా ఆమె తీరు మారలేదు. రెండు రోజుల కిందట చిన్న కొడుకు కిందపడటంతో దెబ్బలు తగిలాయి. అయినా అనిత పట్టించుకోకుండా టిక్‌టాక్ లోకంలో ఉందంటూ ఇరుగు పొరుగు వారు శివకు ఫోన్ చేసి చెప్పారు. దీంతో శివ భార్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్రంగా మందలించడంతో మనస్తాపం చెందిన అనిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. అంతేకాకుండా భర్త మందలించాడని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ పురుగుల మందు తాగుతూ వీడియోతీసి టిక్‌టాక్‌లో పెట్టింది. అనిత పురుగుల మందు తాగడం, వెంటనే మంచి నీళ్లు తాగడం వంటి దృశ్యాలు టిక్‌టాక్ ద్వారా వెలుగులోకి వచ్చాయి. క్షణాల్లో ఆమె స్పృహ తప్పడం వంటి దృశ్యాలు అందులో ఉన్నాయి. ఇంట్లో అపస్మారక స్థితిలో పడి ఉన్న అనితను బంధువులు తిరుచ్చిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి ఆమె మృతి చెందింది. పోలీసులు మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి విచారణ జరుపుతున్నారు. కాగా గతంలో టిక్‌టాక్‌పై మద్రాస్ హైకోర్టు నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే ఆ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో బ్యాన్ తొలగించారు. -
శ్రమలోనేనా సమానత్వం?
చేనేత వస్త్రాల తయారీలో పురుషులతో సమానంగా శ్రమిస్తున్న మహిళలకు సమానమైన వేతనం లభించకపోగా, ఆర్థికంగా ఇక్కట్లపాలైన కొన్ని చేనేత కుటుంబాలను మహిళలే నడిపించవలసి వస్తోంది! ప్రభుత్వం చొరవ తీసుకుని చేయూతనిస్తే తప్ప మహిళా చేనేత కార్మికుల కష్టానికి గుర్తింపు, గౌరవం, తగిన విలువ లభించని పరిస్థితి నెలకొని ఉంది. పడుగు పేకల మేలు కలయికతో అందమైన, ఆకర్షణీయమైన వస్త్రాలు రూపుదిద్దుకుంటాయి. అలాగే స్త్రీ, పురుషులు ఇద్దరు ప్రత్యేకశ్రద్ధతో చేనేత రంగంలో తమ శక్తియుక్తులను, వృత్తినైపుణ్యాన్ని మేళవించి అపురూప కళాఖండాలతో వస్త్రాలను తయారు చేస్తారు. అయితే ఇద్దరి శ్రమ సమానమే అయినప్పటికీ మహిళా కళాకారులకు మాత్రం సరైన గుర్తింపు, వేతనాలు లభించడం లేదు. అన్నిరంగాల్లో మాదిరిగానే చేనేత రంగంలో కూడా మహిళలు వివక్షకు గురవుతున్నారు. చేనేత వస్త్రాల తయారీలో 60 శాతం పనులలో స్త్రీల భాగస్వామ్యం కచ్చితంగా ఉంటుంది. ఆ స్థాయిలో వారికి గుర్తింపు రావడం లేదు. వేతనాల్లో కూడా వివక్ష కొనసాగుతోంది. కుటీర పరిశ్రమగా ఈ రోజు చేనేత నిలదొక్కుకుందంటే దాంట్లో మహిళల పాత్రే అధికం. కూలీ గిట్టుబాటు కాక బతుకుదెరువు కోసం మగవారు ఇతర ప్రాంతాలకు వలసపోతే ఇంటి వద్ద ఉండి కుటీర పరిశ్రమను నిలబెట్టుకున్న ఘనత మహిళలదే. పోచంపల్లి, గద్వాల, నారాయణపేట, సిద్దిపేట, దుబ్బాక ప్రాంతాల్లో చేనేతలు పేర్గాంచినవి కాగా.. ఈ ప్రాంతాలకు అనుబంధంగా పలు గ్రామాల్లో చేనేత కార్మికులు.. ప్రధానంగా మహిళా కార్మికులు ఆ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. ఎనభై ఏళ్ల వృద్ధమహిళలు సైతం జీవనాధారం కోసం రోజువారి కూలీ రూ.100 గిట్టుబాటు కాకున్నా పొట్టకూటి కోసం శ్రమిస్తున్నారు. ఆర్థికపరమైన ఒత్తిళ్లకు తాళలేక భర్త ఆత్మహత్యలు చేసుకుంటే మహిళలే వృత్తిపై ఆధారపడి కుటుంబాలను పోషించుకుంటున్నారు. తమ పిల్లల భవిష్యత్‌ను భుజాన వేసుకుని కుటుంబ బాధ్యతను మోస్తూ, ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ ముందుకు సాగుతున్నారు. ఒక్క పోచంపల్లిలోనే చేనేత మగ్గాలు వేసే వారి సంఖ్య 225 వరకు ఉంటుంది. ఇక్కడ సుమారు వెయ్యికి పైగా చేనేత మగ్గాలు ఉన్నాయి. చేనేత వృత్తిలో చీరలు, ఇతర రకాల వస్త్రాలను తయారు చేయడం కోసం మగ్గం నేయడం, అచ్చులు అతకడం, చిటికీలు కట్టడం, ఆసులు పోయడం, కండెలు చుట్టడం, సరిచేయడం, రంగులు అద్దడం, రబ్బర్లు చుట్టడం ఇలా చెప్పుకుంటూ పోతే అన్నిపనుల్లో మహిళల భాగస్వామ్యం ఉంది. సంప్రదాయంగా వస్తున్న చేనేత వృత్తిలో భర్తకు తోడుగా భార్య కచ్చితంగా తన సహకారాన్ని అందిస్తుంది. అయితే మహిళలకు రావాల్సినంత గుర్తింపు, వేతనాలు అందడం లేదు. సహకార సంఘాల్లో సభ్యత్వాలు, గుర్తింపు కార్డులు అందరికీ ఇవ్వడం లేదు. అందుకే మహిళల భాగస్వామ్యంతో కొనసాగుతున్న ఈ పరిశ్రమలో మహిళలకు మరింత ఆర్థిక చేయూతనివ్వడానికి ప్రభుత్వం మహిళా సొసైటీలను ఏర్పాటు చేయాలని చేనేత కళాకారులు కోరుతున్నారు. అలాగే మహిళలకు వృత్తిపరమైన ప్రత్యేక శిక్షణను ఇస్తూ స్వయంకృషితో ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా కృషి చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. మగ్గమే జీవనాధారం భూదాన్ పోచంపల్లి మండలం భద్రావతి కాలనీకి చెందిన చేనేత కార్మికురాలు బత్తుల అనితకు మగ్గమే జీవనాధారం అయింది. నిరుపేద చేనేత కుటుంబమైన బత్తుల అంబరుషి, అనిత దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. అనిత భర్త ఐదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో కుటుంబ భారం, పిల్లల చదువులు అనితపై పడ్డాయి. అ«దైర్యపడకుండా తనకు తెలిసిన వృత్తి.. మగ్గాన్ని నమ్ముకుంది. కూలీ మగ్గం నేయగా వచ్చిన ఆదాయంతో పిల్లలను చదివిస్తోంది. ప్రస్తుతం కుమారుడు శివ డిగ్రీ చదువుతుండగా, కుమార్తె పాలిటెక్నిక్ చేస్తోంది. అనిత రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తుంది. నెల రోజులు కష్టపడి చీరెలు నేస్తే రూ.10వేలు ఆదాయం వస్తుంది. కిరాయి ఇంట్లో ఉంటుంది. రెండు రోజులకు నాలుగొందలు బాల్యం నుంచి చేనేత వృత్తి తెలుసు. మగ్గం నేస్తూ, చిటికీ కట్టడం, ఆసుపోయడం లాంటి పనులు చేస్తాను. ప్రస్తుతం కూలీకి అచ్చు అతుకుతున్నాను. ఒక అచ్చు అతకడానికి రెండు రోజులు సమయం పడుతుంది. దీనికి రూ. 400 కూలీ లభిస్తుంది. ఇలా నెలలో రూ. 4వేల వరకు సంపాదిస్తాను. నా భర్త కూడా చేతకాక, చేతనై కూలీకి మగ్గం నేస్తున్నాడు. ఒకరికొకరం చేదోడువాదోడుగా పని చేసుకుంటూ కాలాన్ని వెళ్లదీస్తున్నాం. – రాపోలు ప్రమీల, పోచంపల్లి వృద్ధాప్యంలోనూ తప్పని పని భర్త, కుమారుడు, ఇద్దరు వివాహిత కుమార్తెలు ఇదీ మా కుటుంబం. అయితే చేతికంది వచ్చిన కుమారుడు తొమ్మిదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో నా భర్త కూలీ మగ్గం నేస్తున్నాడు. నేను కూడా మాస్టర్ వీవర్ వద్ద రోజువారీ కూలీగా చిటికీలు కడుతున్నాను. నెలంతా పనిచేస్తే రూ. 6 వేల వరకు ఆదాయం వస్తుంది. ఈ వృద్దాప్యంలో కూడా ఇద్దరం పనిచేసుకుంటూనే జీవనాన్ని సాగిస్తున్నాం. – చిందం భద్రమ్మ, భూదాన్ పోచంపల్లి – యంబ నర్సింహులు, సాక్షి, యాదాద్రి -
అనితరసాధ్యం
నడవడానికి కాళ్లు కావాలేమో కానీ, జీవితంలో ఎదగడానికి కాళ్లతో పనేముందన్నట్లు అనిత దూసుకెళుతున్న విధానం చూస్తుంటే.. మరెవరికీ ఇది సాధ్యం కాదని (అనితరసాధ్యం) అనిపిస్తుంది. అయితే ‘‘లైఫ్‌లో నేను పరుగులు తీయడమే కాదు, నాలాంటి వాళ్లనూ ఉత్సాహంగా పరుగులు తీయిస్తాను’’ అని అనిత ఆత్మవిశ్వాసంతో అంటున్నారు. అనిత అందరిలాగే పుట్టింది. చలాకీగా అడుగులు వేసింది, పరుగులు తీసింది, ఆడింది, పాడింది. ఇంతలోనే ఊహించని విధంగా ఆమె ఆరో ఏట అకస్మాత్తుగా నడవలేక కూర్చుండిపోయింది. ఆమె నడకను పోలియో ఎత్తుకుపోయింది. రెండు కాళ్లు కదపలే కపోయింది అనిత. ఆమెది జైపూర్. నడక కోసం అనిత కర్ర కాళ్ల మీద ఆధారపడవలసి వచ్చింది. అయితే ఆ కర్రకాళ్లు ఆమె విజయాలకు ఎన్నడూ అడ్డంకి కాలేదు. చిన్నతనంలోనే అనిత సపోర్ట్ వీల్స్‌తో బైక్ నడిపింది. పెద్దయ్యాక మారుతి ఆల్టో కారు కొనుక్కుంది. యాక్సిలరేటర్, బ్రేక్, క్లచ్‌లను చేతితో వాడే విధంగా మార్పులు చేయించుకుంది. తనకు కావలసిన వేగాన్ని మార్చుకునేందుకు అనువుగా డాష్ బోర్డు మీద ఒక లీవర్ని ఏర్పాటు చేయించుకుంది. జైపూర్‌లోని రాజేశ్ శర్మ అనే ఒక మెకానిక్ ఈ విధంగా కారులో మార్పులు చేశాడు. ఈ కస్టమైజ్డ్ మార్పుల విద్యను ‘జుగాడ్’ అంటారు. ‘‘ఈ కారు వల్ల డ్రైవింగ్ నేర్చుకోవడంతో పాటు, ఎవరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా ఉండగలుగుతున్నాను’’ అంటున్నారు అనిత. రాజేశ్ ఇప్పటికి ఈ విధంగా మూడు వేల కార్లు తయారుచేశాడు. శరీరంలో కాళ్ల భాగం అస్సలు పనిచేయనివారికి అనువుగా మరికొన్ని మార్పులు చేస్తున్నాడు రాజేశ్‌శర్మ. అంతేకాదు ఎవరికి అవసరమో వాళ్ల ఇంటి దగ్గరకు వచ్చి మరీ కారుకి సంబంధించిన పనులు చేస్తాడు రాజేశ్. గేర్ బాక్సుని ఏ మాత్రం కదపకుండా, స్టీరింగ్ చక్రానికి కిందిగా లీవర్లు ఉంచుతాడు. బైక్‌కి ఉన్నట్లుగానే యాక్సిలరేటర్‌ను తేలికగా ఉపయోగించుకునేలా చేస్తాడు. ఈ కారే వెన్ను తట్టింది! అనిత ఉన్నత చదువులు చదవడానికి ఈ కారే ప్రోత్సహించింది. ‘డిజెబిలిటీ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్’ అనే అంశం మీద ఐఐఎం ఇండోర్‌లో పి.హెచ్డి. చేయడానికి ఆమెకు ఈ కారే సహకరించింది. ఇప్పుడు తనలాంటి వారికి ఆమె కార్ డ్రైవింగ్ నేర్పించడం కూడా ఈ కారు కారణంగానే! అనిత పిహెచ్డి చేసే సమయంలో నవీన్ గులియా అనే సాహస బాలుడిని కలవడం తటస్థించింది. అతడు సాహసాలలో ఎన్నో ప్రపంచ రికార్డులు సాధించాడు. అతనికి మెడ నుంచి కింది వరకు శరీరం నిర్జీవం అయిపోయింది. అతడితో కార్ డ్రైవింగ్ గురించి మాట్లాడుతూ ఉండగానే, ఒక అమ్మాయి తన దగ్గరకు వచ్చి, అనిత తయారు చేయించుకున్న కారులో ఎలా డ్రైవింగ్ చేయొచ్చో నేర్పించమంది. ఆ అమ్మాయి సరదాగానే అడిగింది కానీ, అనిత డ్రైవింగ్ స్కూల్ ప్రారంభించడానికి అదే పునాది అయ్యింది. ఆ తరవాత అనిత, దివ్యాంగుల డ్రైవింగ్ స్కూల్స్ గురించి ఎంక్వయిరీ చేశారు. ఎవ్వరికీ లైసెన్సు లేదు. ఇటువంటివారికి ట్రయినింగ్ ఇవ్వాలంటే లైసెన్స్ తప్పనిసరి. ఈ క్రమంలో భారతదేశంలో 2013లో మొట్టమొదటిసారిగా దివ్యాంగుల కోసం డ్రైవింగ్ స్కూల్ మొదలైంది. అప్పటికే అనిత తన కారులో కొందరికి డ్రైవింగ్ నేర్పారు. తానూ ప్రొఫెషనల్‌గా మారాలనుకున్నారు. ‘‘డ్రైవింగు నేర్చుకునేవారికి మొదటి అడ్డంకి మనోబలం లేకపోవడమే. వారి మీద వారికి నమ్మకం లేకపోవడం మరో కారణం’’ అంటారు అనిత. అనిత కూడా లైసెన్సు తీసుకుని, స్వయంగా డ్రైవింగ్ నేర్పించడం మొదలుపెట్టారు. ఆమె విద్యార్థులలో ఒకరికి ఎడమ చేయి లేదు. కుడి చేత్తోనే స్టీరింగ్ తిప్పుతూ, గేర్లు మార్చుతూ కారు నడుపుతున్నారు. గేర్లు మార్చేటప్పుడు ఏ మాత్రం తడబాటు ఉండేలా ధైర్యాన్ని అలవరుస్తున్నారు అనిత. ప్రారంభించిన ఎనిమిది నెలలకే 16 మందికి డ్రైవింగ్ నేర్పారు అనిత. ఒకసారి ఒక్కరిని మాత్రమే ఎంచుకుంటున్నారు ఆమె ఇప్పుడు 17వ స్టూడెంట్‌కి డ్రైవింగ్ నేర్పిస్తున్నారు. ఆరు వేల రూపాయల ఫీజు తీసుకుంటూ డ్రైవింగ్ నేర్పిస్తున్న అనిత, ఈ ఫీజులో అధికభాగం వీల్చెయిర్లకే కేటాయిస్తున్నారు. అందుకే అందరి కంటె కొద్దిగా ఎక్కువ ఫీజు వసూలు చేస్తున్నారు. శరీర బలం కాదు, మనోబలం చాలు కార్యసాధనకు అని నిరూపించారు అనిత. – వైజయంతి -
అనిత వద్దు టీడీపీ ముద్దు అంటూ..
సాక్షి, విశాఖపట్నం: అసమ్మతి నేతలు గళం విప్పారు.అవినీతి ఎమ్మెల్యేలకు టికెట్లు ఇస్తే చిత్తుచిత్తుగా ఓడిపోతామని అధినేత వద్ద కుండబద్ధలుకొట్టారు. పార్టీనే నమ్ముకున్న సీనియర్లకు ఈసారి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీడీపీ టికెట్ల పంచాయతీ గురువారం అమరావతిలో వాడీవేడిగా జరిగినట్టు తెలిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు నియోజకవర్గాల వారీగా సమన్వయ కమిటీ సమావేశాలు జరిగాయి. రాత్రి విశాఖ, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని సమన్వయ కమిటీల సమావేశంలో పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఆ తర్వాత నియోజకవర్గాల వారీగా సిటింగ్ ఎమ్మెల్యేలు, ఆశావహులతో విడివిడిగా మాట్లాడారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కనీసం వివాదాలకు తావులేని నియోజకవర్గాల వరకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. విశాఖ తూర్పునకు వెలగపూడి రామకృష్ణ, విశాఖ పశ్చిమకు పీజేవీఆర్ నాయుడు (గణబాబు), విశాఖ దక్షిణానికి వాసుపల్లి గణేష్‌కుమార్, పెందుర్తికి బండారు సత్యనారాయణమూర్తి, గాజువాకకు పల్లా శ్రీనివాసరావు, నర్సీపట్నానికి అయ్యన్నపాత్రుడు, అరకుకు కిడారి శ్రావణ్‌కుమార్, పాడేరుకు గిడ్డి ఈశ్వరి తొలివిడతలో టికెట్లు ఖరారయ్యాయని చెబుతున్నారు. పార్లమెంట్ అభ్యర్థుల విషయానికి వస్తే అరకుకు కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్ పేరు ఖరారయ్యే అవకాశాలున్నాయి. అనకాపల్లి ఎంపీ కోసం మంత్రి అయ్యన్నపాత్రుడు తన కుమారుడు విజయ్ కోసం పట్టుబట్టినట్టు తెలిసింది. విశాఖకు గంటా శ్రీనివాసరావు, ఎం.శ్రీభరత్ కుమార్ పేర్లను పరిశీలిస్తున్నట్టు సమన్వయ కమిటీ నేతలు చెబుతున్నారు. అనితపై ఎగసిన అసమ్మతి : పాయరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితపై అసమ్మతి సెగ అమరావతికి తగిలింది. సమన్వయ కమిటీ భేటీలోనే అనిత అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న నేతలంతా గళం విప్పారు. ఎమ్మెల్యే అనినీతి తారస్థాయికి చేరుకుందని, మళ్లీ ఆమెకు టికెట్ ఇస్తే ఘోరంగా ఓటమి పాలవడం ఖాయమని సమన్వయ కమిటీ భేటీలో నేతలు పార్టీ పెద్దలకు తేల్చి చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే అనిత– అసమ్మతి నేతల మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుందని తెలిసింది. ఎమ్మెల్యే ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, నాయకులను ఏమాత్రం పట్టించుకోవడం లేదని, ప్రజలకు అందుబాటులో ఉండడం లేదంటూ అసమ్మతి నేతలు ఫిర్యాదుచేశారు. వారు చెప్పేవన్ని అబద్ధాలేనని, తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని ఈసారి మళ్లీ గెలుస్తానంటూ అనిత చెప్పుకొచ్చారు. కాపులకు ఇవ్వండి : చోడవరం నియోజకవర్గంలో మెజార్టీ ఓటర్లు కాపులేనని, ఈసారైనా అసెంబ్లీ సీటును కాపులకు ఇవ్వాలని చోడవరం కాపు నేతలు డిమాండ్ చేశారు. చోడవరం సమన్వయ కమిటీ భేటీలో ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజుకు ఈసారి టికెట్ ఇవ్వొద్దని, పార్టీలో సీనియర్లు చాలా మంది ఉన్నారని, ఈసారి కాపులకు ఇచ్చి తీరాలని వారు పట్టుబట్టారు. మాడుగులలో కూడా ఇదే రీతిలో పార్టీ ఇన్చార్జి గవిరెడ్డి రామా నాయుడుకు వ్యతిరేకంగా పలువురు గళమెత్తినట్టు తెలిసింది. భరత్‌కు ఎంపీ టికెట్ ఇవ్వండి విశాఖ ఎంపీ టికెట్ భరత్‌కుమార్‌కు ఇవ్వాలని మెజార్టీ ఎమ్మెల్యేలు అధినేతకు సూచించినట్టు తెలిసింది. తన పేరు గట్టిగా చెప్పాలని కోరుతూ బుధవారం ఒక్కో ఎమ్మెల్యేకు రూ.40 లక్షలు ఎర చూపిన భరత్ ఒకరిద్దరికి ఇప్పటికే ఇవ్వగా.. మిగిలిన వారికి గురువారం ఉదయం సమావేశం ప్రారంభానికి ముందే అందజేసినట్టు తెలిసింది. దీంతో మెజార్టీ ఎమ్మెల్యేలు భరత్‌కుమార్ పేరునే ప్రతిపాదించినట్టు చెబుతున్నారు. అయితే మంత్రి గంటా పేరు కూడా అధిష్టానం పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. -
మాకొద్దు ఈ ఎమ్మెల్యే.. భారీ ర్యాలీ
సాక్షి, విశాఖపట్నం: ఎన్నికల సమీపిస్తున్న వేళ టీడీపీలో విభేదాలు రోడ్డునపడుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు అధికార పార్టీని వీడి వైఎస్సార్సీపీలో చేరగా.. స్థానిక ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. తాజాగా పాకయరావుపేట అధికార పార్టీ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు వ్యతిరేకంగా నిరసన సెగ తగిలింది. ఎన్నికల్లో ఆమెకు టికెట్ కేటాయించవద్దని సొంతపార్టీ మహిళలే భారీ ర్యాలీని చేపట్టారు. నియోజకవర్గంలోని మహిళా సర్పంచులు, మండల అధ్యక్షులు, మాజీ జెడ్పీటీసీ, ఎంపీటీసీల సమక్షంలో మహిళలు ర్యాలీని నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే అనితకు టీడీపీ టికెట్ కేటాయించవద్దని వారు డిమాండ్ చేశారు. గతంలో కూడా అనిత ప్రజల నుంచి తీవ్ర నిరసనను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. సబ్‌స్టేషన్‌లో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టు విషయం పెద్ద దుమారమే చలరేగింది. టీడీపీ ఎమ్మెల్యే అనితపై చెక్‌బౌన్స్ కేసు -
ఎవరూ లేని ఊరిలో అన్ననే ఎమ్మెల్యే
సినిమా: ఎవరూ లేని ఊరిలో అన్ననే ఎమ్మెల్యే అంటూ ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని కలిగించడానికి త్వరలో తెరపైకి వస్తున్నాం అన్నారు దర్శకుడు భగవతిబాలా. ఈయన కథ, కథనం, మాటలు, ఛాయాగ్రహణ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న చిత్రం ఆలిల్లాద ఊర్ల అన్నన్ దాన్ ఎమ్మెల్యే (ఎవరూ లేని ఊరిలో అన్ననే ఎమ్మెల్యే). ఈ చిత్రాన్ని శ్రీ పెరియనాయకీ అమ్మన్ ఫిలింస్ పతాకంపై సీ.రామదాస్ నిర్మిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది ప్రేమ, యాక్షన్, కామెడీ సన్నివేశాలతో పాటు రాజకీయ వ్యంగ్యాస్త్రాలు మెండుగా ఉండే కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఇప్పుడు జాతికొక సంఘం, వీధికొక రాజకీయ పార్టీ అంటూ పుట్టుకొస్తున్నాయన్నారు. కార్యకర్తల కంటే నాయకులే ఎక్కువ అవుతున్న పరిస్థితి అని అన్నారు. అలా జనం లేని ఊర్లో ఎమ్మెల్యే లాగా తిరిగే ఒక ఊరిలోని వ్యక్తి గురించి చెప్పే కథా చిత్రమే అలిల్లాద ఊర్ల అన్నన్‌దాన్ ఎమ్మెల్యే ఉంటుందని చెప్పారు. ఈ చిత్రం ద్వారా నవ నటుడు సెల్వ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారని, ఆయనకు జంటగా అనిత నటించిందని తెలిపారు. ఇతర ముఖ్య పాత్రల్లో ఆర్.సుందర్రాజన్, నలిని, వైయ్యాపురి, మీరాకృష్ణన్, కింగ్‌కాంగ్, కొట్టాచ్చి, బోండామణి, పొరోటా మురుగేశన్, సరోజా పాట్టి నటించారు. చిత్ర షూటింగ్‌ను సేలం సమీపంలోని అందమైన ప్రదేశాల్లో నిర్వహించినట్లు తెలిపారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. దేవా సంగీతాన్ని అందించిన ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. -
పెళ్లి కావడంలేదని యువతి..
బోయినపల్లి(చొప్పదండి) : మండలంలోని స్తంభంపల్లి గ్రామానికి చెందిన తంగళ్లపల్లి అనిత(27) తనకు వివాహం కావడం లేదనే మనస్తాపంతో సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని ఎస్సై పాకాల లక్ష్మారెడ్డి తెలిపారు. అనిత కొంత లావుగా ఉండడంతో వివాహ సంబంధాలు కుదరడం లేదు.. సంబంధాలు వచ్చి వెళ్లడంతో మానసికంగా కుంగిపోయింది. 15 రోజులుగా ఆరోగ్యంగా ఉండడం లేదు. దీంతో తల్లిదండ్రులు మానసిక వైద్యుని వద్ద చికిత్స చేయించారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఇంట్లోనే పురుగుల మందు తాగింది. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం వేములవాడ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అనిత మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వివాహం కావడం లేదనే మానసిక బాధలతో తన కూతురు అనిత ఆత్మహత్య చేసుకుందని ఆమె తండ్రి తిరుపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసుదర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
అనిత పాదయాత్రకు నిరసనల సెగ
విశాఖపట్నం: పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అనిత చేపట్టిన పాదయాత్రకు నిరసనల సెగ తగిలింది. మంచినీటి సరఫరా కల్పించలేదని, పారిశుద్ధ్యం లోపించిందని, గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని నిరసన వ్యక్తం చేస్తూ ఎస్ రాయవరం మండలం లింగరాజుపాలెం గ్రామస్తులు ఎమ్మెల్యే అనితను అడ్డుకున్నారు. ఫ్లకార్డులు, ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. గ్రామస్తుల చర్యతో ఏం చేయాలో పాలుపోక ఇచ్చిన హామీలు త్వరలోనే నెరవేరుస్తానని చెప్పి ఎమ్మెల్యే అనిత అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. గిడ్డి ఈశ్వరిని అడ్డుకున్న గిరిజనులు విశాఖపట్నం: ఏజెన్సీలో టీడీపీ చేపట్టిన జన్మభూమి కార్యక్రమం రసాభాసగా మారింది. జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరినీ స్థానిక గిరిజనులు అడ్డుకున్నారు. జి. మాడుగుల మండలం లోచలిలో రోడ్డు ఎందుకు మంజూరు చేయలదేని స్థానికులు ప్రశ్నించారు. ఎమ్మెల్యే నుంచి సరైన సమాధానం రాకపోవడంతో గిరిజనులు వాగ్వాదానికి దిగారు. -
ఆమె బయోపిక్‌ను నిషేధించండి
తమిళనాడు,పెరంబూరు: అనిత జీవిత చరిత్రతో తెరకెక్కుతున్న చిత్రంపై నిషేధం విధించాలంటూ ఆమె తండ్రి చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గత ఏడాది నీట్ పరిక్షల్లో ఉత్తీర్ణత కాకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్ధిని అనిత. అరియలూర్ జిల్లా కుళుమూర్ గ్రామానికి చెందిన షణ్ముగం కూతురు అనిత. ప్లస్ 2 పరీక్షల్లో 1200లకు గానూ 1176 మార్కులు తెచుకున్న ఈ విద్యార్థిని డాక్టరు కావాలని కలలు కనింది. అయితే నీట్ పరిక్షల్లో ఫెయిల్ కావడంతో తన కల కల్లలైపోయిందని భావించి మనస్తాపంతో గత ఏడాది సెప్టెంబరు ఒకటవ తేదీన ఆత్మహత్య చేసుకుంది. కాగా అనిత జీవిత చరిత్ర సినిమాగా రూపొందుతోంది. దీంతో ఆ చిత్రాన్ని నిషేధించాలంటూ అనిత తండ్రి షణ్ముగం చెన్నై హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. అందులో ఆయన పేర్కొంటూ తన కూతురు అనిత జీవిత చరిత్రను డా.ఎస్.అనిత ఎంబీబీఎస్ పేరుతో ఆర్జే పిక్చర్స్ పతాకంపై అజయ్‌కుమార్ అనే దర్శక నిర్మాత చిత్రంగా రూపొందిస్తున్నట్లు గత మే నెల 13వ తేదీన ప్రకటన చేశారన్నారు. అందులో బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో ఫేమ్ జూలీ అనిత పాత్రలో నటిస్తున్నట్లు, చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు పేర్కొన్నారని అన్నారు. అయితే అజయ్‌కుమార్ అనే దర్శకుడు అనిత జీవిత చరిత్రను చిత్రంగా చేయడానికి తమ నుంచి అనుమతి పొందలేదన్నారు. కాబట్టి ఆ చిత్రంపై నిషేధం విధించాలని, తన కూతురు పేరును ఉపయోగించినందుకు నష్ట పరిహారంగా రూ.25 లక్షలు చెల్లించేలా ఆదేశించాలని కోరారు. ఈ కేసును గురువారం విచారించిన న్యా యమూర్తి కే.కల్యాణసుందరం డా. ఎస్.అనిత ఎంబీబీఎస్ చిత్ర దర్శక నిర్మాతకు వివరణ కోరుతూ నోటీసులు జారీ చేశారు. -
కండాక్టరమ్మ
అనిత డాక్టరమ్మ కాదు. కండక్టరమ్మ. ప్రయాణికులను గమ్యం చేరుస్తూనే.. ప్రాణాంతక తలసేమియా నుంచి చిన్నారుల ఊపిర్లను నిలుపుతున్నారు! ప్రాణం పోసేవారే కాదు.. ప్రాణం పోయాలని తపించేవారూ డాక్టర్లే. అందుకే ఆమె కండాక్టరమ్మ. అరవై ఏళ్ల అత్తగారు కోడలి ముందుకు వచ్చి, ‘ఆ చిన్నపిల్లల కోసం నీవు చేస్తున్న సేవకు నా పెన్షన్‌లో మూడొంతులమ్మా’ అంటూ డబ్బులు కోడలి చేతిలో పెట్టింది. అత్త చూపిన ఔదార్యం కోడలు అనిత సేవను మరింత ముందుకు కొనసాగించేలా చేసింది. అత్తతో పాటు భర్త, తోటికోడలు, బావ, మరిది ‘మేమూ సాయం చేస్తామం’టూ తలా ఓ చేయి కలిపారు. కుటుంబంలో అందరూ చేయీ చేయీ కలిపితే కొండంత పనైనా దూదిపింజెంత తేలికవుతుందనిపించింది అనితకు. అలా తమందరి వేతనంలో నుంచి కొంత భాగంతో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులను విగతజీవులుగా మారకుండా కాపాడేందుకు వినియోగిస్తున్నారు అనిత.. ఆమె ‘సంకల్ప’బలంతో నేడు వందలాది తలసేమియా చిన్నారులు ఊపిరి నిలుపుకొని హాయిగా చిరునవ్వులు చిందిస్తున్నారు. మొగ్గ రాలిపోవడం.. దగ్గరగా చూసి! ఖమ్మం ఆర్టీసీ బస్సు డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నారు పొద్దుటూరి అనిత. స్థానిక ఇందిరానగర్ కాలనీలో ఉమ్మడి కుటుంబంతో కలిసి ఆమె నివాసం ఉంటున్నారు. ఎనిమిదేళ్ల క్రితం సమీప బంధువు కుమారుడు తలసేమియా వ్యాధితో బాధపడుతూ మరణించాడు. ఆ పిల్లవాడి తల్లిదండ్రులు పడిన బాధను చూసిన అనిత ‘ఈ వ్యాధితో పసిమొగ్గలు రాలిపోతుంటే చూస్తూ ఊరుకోవడమేనా, ఏమీ చేయలేమా..? అని ఆలోచించారు. ఎలాగైనా ఇలాంటి పిల్లలకు బాసటగా నిలవాలని అనుకున్నారు. ‘కదిలిన’.. కుటుంబం తొలుత ఒంటరిగానే తలసేమియా పిల్లలకు సేవ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు అనిత. వచ్చే వేతనంలో నుంచి కొంత మొత్తాన్ని తలసేమియా పిల్లలకు ఉచితంగా రక్తం అందించడానికి ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు హోంగార్డుగా పనిచేస్తున్న అనిత భర్త రవిచంద్ర ప్రోత్సాహం తోడైంది. అత్త చంద్రలీల, తోడికోడళ్లు పావని, ప్రియ, బావ ఉదయ్‌భాస్కర్, మరిది వంశీకిరీటి ఆర్థికంగా సహాయం చేస్తామని ముందుకొచ్చారు. అలా ఇంట నిలిచిన అనిత బయట గెలవడానికి బయల్దేరారు. 2010లో తలసేమియా వ్యాధిగ్రస్తులను అన్ని విధాలుగా ఆదుకోవాలనే లక్ష్యంతో ‘సంకల్ప’ పేరుతో స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. నిరాశ ఎదురైనా వెరవలేదు! సేవ స్వచ్ఛందమైనా ఇందుకోసం సహకరించే వారే కొరవడటంతో పిల్లలకు ఇవ్వాల్సిన రక్తం కోసం ఎక్కని గడప లేదు.. అడగని సంస్థా లేదు అన్న రీతిలో తన లక్ష్య సాధన కోసం అందరినీ అభ్యర్థించారు అనిత. మొదట్లో ‘ఇదేమి సేవ.. ఎంత చేసినా ఎక్కువ కాలం బతకని పిల్లల కోసం ఎందుకింత ఆరాటం. వాళ్లేమైనా నూరేళ్లూ బతికి బట్టకడతారా.. ’ అంటూ నిరుత్సాహంగా మాట్లాడినవారే ఎక్కువ. అయినప్పటికీ అనిత మాత్రం కుటుంబ సభ్యుల అండతో రక్త సేకరణకు పూనుకున్నారు. మొదట్లో.. కుటుంబంలో ఎవరి పుట్టిన రోజులు, పెళ్లి రోజులు వచ్చినా బంధుమిత్రులను కలుపుకుంటూ రక్తదాన శిబిరాలను నిర్వహించేవారు. ఈ క్రమంలో తలసేమియా వంటి భయంకర వ్యాధితో పిల్లలు అనుభవిస్తున్న నరకం, వారి తల్లిదండ్రులు పడుతున్న మానసిక క్షోభను సమాజానికి అర్థమయ్యేలా చెప్పడంలో కొన్నాళ్లలోనే అనిత అనితర సాధ్యురాలు అనిపించుకున్నారు. దాంతో జిల్లాల్లోని తలసేమియా వ్యాధిగ్రస్తులకు అనిత అందిస్తున్న సేవలు అందరి దృష్టిలో పడ్డాయి. యజ్ఞంలా.. ప్రతినెలా రక్త సేకరణ! తలసేమియా వ్యాధి కారణంగా పిల్లలు చిరుప్రాయంలోనే మరణించిన ఘటనలు తరచూ నమోదు అయ్యేవి. అనిత ‘సంకల్ప’ సంస్థ ఆచరణలోకి వచ్చాక జిల్లాలో తలసేమియా వ్యాధి వల్ల మరణించిన వారి సంఖ్య క్రమేణా తగ్గుతూ వస్తోంది. తొలుత రెండు, మూడు బ్యాగుల రక్త సేకరణ నుంచి ప్రారంభమైన అనిత సేవ.. నేడు నెలకు 250 బ్యాగుల రక్తం సేకరించి చిన్నారులకు ఎక్కించే స్థాయికి చేరింది. ఈ రక్తం ఇస్తేనే ఆ నెలకు 180 మంది చిన్నారుల ఆయుష్షు మరో నెలకు పొడిగించబడుతుంది! దాంతో ప్రతినెలా ఈ రకమైన రక్తయజ్ఞం చేయడం ఆమెకు అలవాటైంది. ఒకవైపు కండక్టర్ వృత్తి చేస్తూ.. మరోవైపు సంసారం చక్కదిద్దుకుంటూ, భర్త, అత్త, తోటికోడళ్ల సహకారంతో ‘సంకల్ప’ స్వచ్ఛంద సంస్థను దిగ్విజయంగా నడిపిస్తున్నారు అనిత. ఇప్పుడు తలసేమియా వ్యాధి బాధితులకు రక్తం లోటు లేదు. ప్రతి 15 రోజులకోసారి 180 మంది బాధితులకు రక్తం ఎక్కించడానికి కావాల్సినంత రక్తం ఆమె స్థిరీకరించుకోగలిగారు. కష్టార్జితాన్ని ఖర్చుపెట్టాకే.. ఇంటి నుంచి మొదలైన ఆర్థిక సహాయంతో పాటు దాతల సహకారమూ తోడై ఇప్పుడు ప్రతి నెలా రూ.3లక్షల వరకు తలసేమియా వ్యాధిగ్రస్తులకు కావాల్సిన మందులను అనిత ఆధ్వర్యంలోని ‘సంకల్ప’.. ఉచితంగా పంపిణీ చేస్తోంది. ‘మా కష్టార్జితాన్ని సేవకు వినియోగించిన తర్వాతే దాతలను ఆశ్రయిస్తామ’న్న అనిత ఆలోచన మరికొందరు సమాజ సేవకులను ఈ సేవలో పాలుపంచుకునేలా చేసింది. తలసేమియా బాధితులకు సేవ చేస్తున్నందుకు, సదస్సుల ద్వారా ప్రజలలో తలసేమియా పట్ల అవగాహన కల్పిస్తున్నందుకు ఈ ఏడాది జూలై నెలలో ఉత్తమ మోటివేటర్ అవార్డును గవర్నర్ నరసింహన్ చేతుల మీదుగా అందుకున్నారు అనిత. ‘మేము సైతం’ తలసేమియా వ్యాధి ప్రధానంగా మేనరికపు వివాహాల వల్ల సంతానానికి సంక్రమిస్తుంది. ఆరు నెలల నుంచి ఒకటిన్నరేళ్ల వయసులో ఈ వ్యాధిని గుర్తిస్తే సకాలంలో వ్యాధి నివారణ చర్యలు చేపట్టి.. మరణం అంచున ఉన్న వారిని సైతం కాపాడే అవకాశం ఉంది. ఈ వ్యాధి బాధితుల్లో ఎర్ర రక్త కణాల ఉత్పత్తి ఉండదు.. అందుకే ప్రతి 15, 20 రోజులకోసారి శుద్ధి చేసిన రక్తాన్ని ఎక్కించాల్సి ఉంటుంది. ఇది శ్రమతో కూడిందే కాదు.. ఖర్చుతో కూడుకున్నది. అయితే అనిత చేసిన ధైర్యం అందరినీ ఆలోచింపజేసింది. మేము సైతం అంటూ జిల్లాలోని పలువురు వైద్యులు, పోలీస్ అధికారులూ బాసటగా నిలిచారు. జాతీయపర్వదినాలలో రక్తదాన శిబిరాల ఏర్పాటుకు ముందుకు వచ్చారు. ‘సంకల్ప’ సంస్థకు శివ బ్లడ్ బ్యాంక్ యజమాని రాజేశ్గార్గె సేవలు తోడయ్యాయి. అలాగే పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కూరపాటి ప్రదీప్, అంకుర ఆస్పత్రి వైద్యులు డాక్టర్ రాకేశ్ తలసేమియా బాధిత చిన్నారులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. – మాటేటి వేణుగోపాల్, సాక్షి, ఖమ్మం -
కర్ణాటకలో బీజేపీకి షాకిచ్చిన అభ్యర్థి
సాక్షి, బెంగళూరు : కర్ణాటక ఉప ఎన్నికలకు ఇంకా రెండు రోజుల గడువు మాత్రమే ఉన్న నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి ఎల్ చంద్రశేఖర్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు. పార్టీ నేతలు తన గెలుపునకు కృషి చేయలేదని, ప్రచారం కూడా నిర్వహించకుండా తననో బలిపశువును చేయాలని చూస్తున్నారని ఆరోపిస్తూ పోటీ నుంచి విరమించుకున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఈ ఎన్నికలో తాను జేడీఎస్- కాంగ్రెస్ కూటమి అభ్యర్థి అనితా కుమారస్వామికి మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో అనితా కుమారస్వామి గెలుపు నల్లేరు మీద నడకే కానుందని కూటమి నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన సీఎం కుమారస్వామి మాట్లాడుతూ.. ప్రలోభాలకు గురిచేసి విజయం సాధించాలనుకోవడం బీజేపీ నైజమని వ్యాఖ్యానించారు. అయితే ఒక్కోసారి వారి వ్యూహాలు ఇలాగే బెడిసి కొడతాయని ఎద్దేవా చేశారు. కాగా ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి జేడీఎస్- కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. చెన్నపట్నం, రామ్‌నగర స్థానాల నుంచి పోటీ చేసి గెలుపొందిన హెచ్డీ కుమారస్వామి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో ఆయన రామనగర అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో కుమారస్వామి భార్య అనితా కుమారస్వామి అక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. రామ్నగరతో పాటు జంఖాడీ అసెంబ్లీ స్థానం, బళ్ళారి, శివమెగ్గ, మండ్యా లోక్‌సభ స్థానాలకు శుక్రవారం ఉప ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. -
ఉప ఎన్నికల్లో సీఎం భార్య, కుమారుడు..!
సాక్షి, బెంగళూరు : కర్ణాటకలో ఖాళీ అయిన మూడు పార్లమెంట్ స్థానాలతో పాటు, రెండు అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన కన్నడ అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నపట్నం, రామ్‌నగర స్థానాల్లో నుంచి కుమార స్వామి పోటీ చేసి విజయం సాధించారు. రెండు స్థానాల్లో ఆయన విజయం సాధించడంతో రామ్‌నగర స్థానానికి రాజీనామా చేయక తప్పలేదు. రాష్ట్రంలో ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కుమార స్వామి ముఖ్యమంత్రి అయ్యారు. కాగా ఉప ఎన్నికలు జరగాల్సిన బళ్ళారి, శివమెగ్గ, మండ్యా లోక్‌సభ స్థానాలతో పాటు, రామ్‌నగర, జంఖాడీ అసెంబ్లీ స్థానాల కోసం రాజకీయ పార్టీలు అభ్యర్థుల వేటలో పడ్డాయి. కుమార స్వామి భార్య పోటీ.. కుమారస్వామి రాజీనామా చేసిన రామ్‌నగర స్థానం నుంచి ఆయన సతీమణి అనిత కుమారస్వామి పోటీ చేస్తారనే ఊహాగానాలు కన్నడనాట కోడైకూస్తున్నాయి. ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికల ప్రకటన విడుదలైన మరునాడే ఆమె రామ్‌నగర నియోజకవర్గంలో పర్యటించడంతో ఈ వార్తలకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అనితనే ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కొంతమంది ఆమె మద్దతుదారులు ఇదివరికే ప్రకటించారు. ఈ వార్తలను జేడీఎస్ ఖండిచకపోగా.. మరో రెండో రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తామని తెలిపింది. ఇదిలా వుండగా జేడీఎస్ నేత సీఎస్ పుట్టరాజు ప్రాతినిథ్యం వహించిన మండ్యా లోక్‌సభ స్థానం నుంచి కుమారస్వామి కుమారుడు నిఖిల్ పోటీ చేస్తారని సమాచారం. నిఖిల్ ఇప్పటికే పలు చిత్రాల్లో హీరోగా నటించి గుర్తింపు పొందారు. ఆయన జాగ్వార్ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. లోక్‌సభ సీటుకు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇస్తుండడంతో ఆ స్థానంలో జేడీఎస్ విజయం నల్లేరుమీద నడకే. ఇక బీజేపీ సీనియర్ నేత రాములు ప్రాతినిథ్యం వహించిన బళ్లారి లోక్‌సభ స్థానం నుంచి ఆయన సోదరి శాంతను బరిలో నిలపే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీరాములు ఇటీవల ఎంపీకి రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించడంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. ఇప్పుడు ఎన్నికలేంటీ.. మూడు లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరపాలన్న ఎన్నికల సంఘం నిర్ణయంపై ప్రధాన పార్టీలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు సమయం ఇంకా కేవలం నాలుగు నెలలే ఉన్నందుకు వాటికి ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏంటని నేతలు ప్రశ్నిస్తున్నారు. కాగా లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు నవంబర్ మూడున ఎన్నికల నిర్వహించి నవంబర్ 6 ఫలితాలను విడుదల చేస్తామని ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసిన విషయం తెలిసిందే. -
చితిలో కాలని అప్పు
‘ఏమైనా సుబ్బయ్యన్న చేసినంత పనులు చేయటం మనవల్ల కాదు. తొలకరి రాలగానే ముందు దున్నే పొలం ఆయనదే. ఊళ్లో అందరి కంటే ముందే పంట వేయడం దగ్గర్నుంచి, మబ్బుతో లేచి వెళ్ళి మోటారేయటం కూడా అందరి కంటే ముందే’ అన్నాడు లక్ష్మీపతి ఇంటిముందున్న అరుగు మీద కూర్చుంటూ. ‘ఆ...నిజమే. కానీ అంత తొందరగా వెళ్ళొద్దన్నా వినడు. అందరూ నాలుగింటికెళ్తే ఈయన రెండు గంటలకే బయల్దేరుతాడు‘ విసుగ్గా అంది సుబ్బయ్య భార్య మునెమ్మ రోజూ లేపి టార్చ్, దుప్పటి, కర్ర అని అడగటం, తలుపుకు గొళ్ళెం పెట్టుకొమ్మని మంచి నిద్ర పాడుచేస్తాడన్న కోపంతో. ‘మనం రైతులం. అదున్లో పనిచెయ్యాల. నిద్ర, సుఖం చూసుకుంటే బ్రతకటం కష్టం. ఏమంటావురా లక్ష్మీపతి?‘ భార్య ఇచ్చిన కాఫీ గ్లాసు తీసుకుంటూ అన్నాడు సుబ్బయ్య. అప్పటికే మునెమ్మ ఇచ్చిన కాఫీ ఊదుకుని తాగుతూ ‘అవునక్కా. మనూళ్ళో అంతా అన్న ఈ వయసులో కూడా ఇంత హుషారుగా వుంటాడని, కొడుకులు ఇద్దరున్నా వాళ్ళకైనా ఇంత హుషారు లేదని అనుకుంటా వుంటారు’ అన్నాడు లక్ష్మీపతి. ‘ఏం హుషార్లే మామా..చీకట్లో ఎళ్ళి ఎన్ని సార్లు గతుకుల్లో పడ్డాడో, పాము కరిసిందో నీకూ తెల్సుకదా? కొంచెం ఆగితే మేమూ వస్తామన్నా ఇనడు కదా?’ అన్నాడు పెద్ద కొడుకు మాణిక్యం. ‘అంతేనా అందరి కంటే ముందే పంట అమ్మేస్తాడు. అప్పుడు ధర వుండదు. ధర పలికే సమయానికి మన దగ్గర పంట వుండదు. అంత ఆత్రం దేనికి చెప్పు. కొంచెం ఆగమంటే వినడు. అందుకే ప్రతిసారీ మనకే నష్టాలెక్కువ‘ భుజం మీది తువ్వాలు విసురుగా విదిల్చి తలకు చుట్టి ఆవు దగ్గరికి నడిచాడు చిన్నకొడుకు రాజేంద్ర పాత్రలో పాలు పిండటానికి. ఇంతలో రాజేంద్ర భార్య రమ ఉత్తరం తెచ్చి భర్త చేతికిచ్చింది. రాజేంద్ర గిన్నె పక్కన పెట్టి చదవసాగాడు. ‘ఎక్కడ్నుంచిరా ఉత్తరం రాజేంద్రా?‘ అడిగాడు సుబ్బయ్య. ‘మన ఉత్తేజ్ దగ్గర్నుంచీ నాన్నా. ఎంట్రన్స్ పరీక్షలు బాగా రాశానని రాశాడు‘ చెప్పాడు రాజేంద్ర. ‘సరే మరి మన జయరాం సంగతేందిరా?‘ పెద్దకొడుకుని అడిగాడు. ‘ఇద్దరూ అక్కడ్నే కదా కోచింగులో చేరుండేది. వాడూ బాగానే రాసినానన్నాడు నాన్నా’ చెప్పాడు మాణిక్యం. ‘ఎందుకైనా గానీ మంచి కాలేజీల్లో చేర్చడానికి డబ్బులు రెడీ చేసుకోమని అంటున్నారన్నా పిల్లోళ్ళిద్దరూ’ మాణిక్యంతో అన్నాడు రాజేంద్ర. ‘దేవుని దయవల్ల మంచి మార్కులొచ్చి ఫ్రీ సీట్లొస్తే ఇద్దరికీ బాగుండు. తిరుపతి వెంకన్న దగ్గరికి కాలినడకన వస్తానని మొక్కుకున్నా కూడా’ చెప్పింది మాణిక్యం భార్య సువర్ణ. ‘అయినా పోయినేడు మన స్వాతి పెళ్ళికి చేసిన అప్పే ఇంకా తీరలేదు’ నిట్టూర్చాడు మాణిక్యం. ‘ఈ సంవత్సరం మామిడి తోట బాగా కాసింది కదన్నా. తీర్చేద్దాం లే’ అంటూ పొలానికి బయలుదేరాడు రాజేంద్ర. మాణిక్యం కూడా టౌన్‌కి ఎరువుల కోసం బయలుదేరాడు. వరిలో సరిగా దిగుబడి రాలేదు. మామిడి ఆ సంవత్సరం మంచి ధర పలకలేదు. అప్పులు సగమే తీరాయి. ఆశాజీవిగా మరో పంట వేయడానికి మాత్రం సుబ్బయ్య కుటుంబం వెనక్కు తగ్గలేదు. మళ్లీ నాట్లు, ఎరువులు అంటూ పొలం పని ఎప్పట్లా జరుగుతోంది. ఈలోగా పెళ్లికి అప్పిచ్చిన వాళ్లు ఇంటి మీదికొస్తుంటే మునెమ్మ గాజులకు, సువర్ణ నెక్లెస్‌కు రెక్కలొచ్చి ఎగిరిపోయాయి. ఆ రాత్రి పెందలాడే భోంచేసి ముసుగుతన్నాడు సుబ్బయ్య. తొలికోడితో బాటే నిద్రలేచి ఏమనుకున్నాడో గానీ మునెమ్మను లేపకనే కర్ర, టార్చ్, దుప్పటి తీసుకుని తలుపు దగ్గరికి వేసుకుని వెళ్ళిపోయాడు. ఉదయం ఆరవుతోంది. నిద్రలేచి మునెమ్మ ముఖం కడుక్కొచ్చేలోగా వీధిలో కేకలు, గొడవ. ఇంట్లో వాళ్లంతా బయటకు పరుగుతీశారు. ఇద్దరు మనుషులు సుబ్బయ్య దేహాన్ని మోసుకొచ్చి వరండాలో పడుకో బెట్టారు. ఐదు గంటలకు పొలం వైపెళ్తున్న శివరాం గమనించాడట. హైటెన్షన్ వైరు మీద కాలేసి చచ్చిపడున్న సుబ్బయ్యను. చుట్టుపక్కల అందర్నీ కేకలేసి అంతా కలిసి పట్టుకొచ్చి చూసేసరికే ప్రాణం పోయి ఎంతసేపో అయ్యి వొళ్లు కర్రలా బిగుసుకుపోయుందట. సాయంత్రానికి సుబ్బయ్య దేహం మట్టిలో కలిసిపోయింది. మునెమ్మ అమ్మగారింటి వాళ్లు వచ్చారు. చివరిగా పసుపు కుంకుమలిచ్చి వెళ్ళారు. ‘ఒరే రాజేంద్రా! మామ ఫొటో పెద్దగా వుండి మన వాళ్లందరి పేర్లతో చుట్టుపక్కల పల్లెలందరికీ తెలిసేలా నాలుగైదు పేపర్లలో వేయించరా. అప్పుడే మన ఇంటిపేరు, మనం ఎంత ఘనంగా ఆయనకు కర్మ చేస్తున్నామో తెలిసేది‘ అన్నాడు వెనకింటి సుబ్బయ్య తమ్ముని కొడుకు నారాయణ. రాజేంద్ర, మాణిక్యం తమ కొడుకుల్ని ఆ పని చూడమని టౌనుకి పంపించారు. సాయంత్రానికి కాళ్లీడ్చుకుంటూ వచ్చారు వాళ్లు. ‘మనం అనుకున్నంత సైజుతో నాలుగైదు దినపత్రికల్లో వెయ్యాలంటే వందలు కాదు వేలు కావాలి ఏ మూలకూ సరిపోవు’ అని చెప్పారు. ‘అయితే ఏమైందిలేరా వెధవ డబ్బు ఇయ్యాళుంటుంది రేపు వుండదు. కానీ ఎప్పటికీ నిలిచేది మనం ఎంత గ్రాండ్‌గా ఆయన కర్మ చేశామన్నదే రా’ అన్నాడు నారాయణ. అప్పుడొచ్చాడు సుబ్బయ్య చిన్నతమ్ముడు ధనుంజయులు. ‘ఒరేయ్ అబ్బాయిలూ! అన్నకు సమాధి మాత్రం గ్రానైటు రాయితో బాగా కట్టించాల్రా. చుట్టుపక్కల ఏ వూళ్లో లేనంత బాగా వుండాలి’ అన్నాడు. ‘అది సరేగానీ అన్నా.. ముందు కర్మ రోజు ఏమేం వంటలనుకున్నారు? నా కూతురు వాళ్ల అత్తగారు, కోడలు వాళ్ల బంధువులు కూడా వస్తున్నారు బెంగళూరు, చెన్నైల నుంచి. మా అన్న కర్మంటే వాళ్లు భలే జరిగిందని అనుకోవాలి. లేకుంటే నాకు పరువు తక్కువ‘ అంది సుబ్బయ్య చెల్లెలు వరలక్ష్మి. ‘అదంతా రెడీనే అత్తా.. ఏమీ తక్కువ కాదు. లడ్డూ, జాంగ్రీ రెండురకాల వేపుళ్ళు, మూడురకాల పచ్చళ్ళు, రెండురకాల అన్నాలు, మామూలు అన్నం సాంబారు, అప్పడం వడియాలు, దప్పళం..’ అని మాణిక్యం చెప్తుంటే అడ్డొచ్చిందామె మళ్ళీ. ‘ఏంటీ ఇవన్నీ వంటవాళ్ళతోనా? సరుకులు సరంజామా అందిస్తూ మీరు కూర్చుంటే మా సంబంధులు మీరు బాగా రిసీవ్ చేసుకోలేదని అలుగుతార్రా. అయినా ఈ రోజుల్లో వంటవాళ్ల కన్నా కేటరింగ్‌కి ఆర్డర్ చేసేయండి. నా కొడుకు విజయ్ లేడూ వాడి ఫ్రెండ్‌ది ప్రక్క టౌన్లోనే కేటరింగ్ సర్వీస్. వాడు ఫోన్ చేస్తే చాలు వచ్చేస్తారు. డబ్బులిచ్చేయండంతే‘ అని తేల్చేసింది వరలక్ష్మి. ‘మాణిక్యం... మీరేమన్నా చేసుకోండి. కానీ మనూళ్లో పక్కూళ్లలో అంతా ఉన్న పద్ధతి ప్రకారం మర్చిపోకుండా కర్మ రోజు రాత్రి కథ చెప్పించాల్రా. ఏముంది... కథ చెప్పేవాళ్ళకు అన్నం పెట్టి ఓ పదివేలిస్తే చాలు’ అన్నాడు ఎదురింటి వెంకటేశ్వర్లు. తలలు ఊపారు గానీ మాణిక్యం, రాజేంద్రల ముఖాల్లో కళ లేకుండా పోయింది. రాత్రంతా ఇద్దరూ మల్లగుల్లాలు పడుతూనే ఉన్నారు. ఒకసారి పోతే పోయిందిలే వెధవ డబ్బులు తండ్రి కోసమే కదా! అప్పుచేసైనా ఖర్చుపెట్టి నలుగుర్లో తండ్రికి బాగా చేయాలని అనుకున్నా, మరోసారి ఎలా తీర్చాలి ఇంతప్పు? ఇప్పుడున్న అప్పునే ఇంకా తీర్చలేదన్న భయం మరోవైపు అనిపించి. తెల్లవారు జామున కలత నిద్రపోయారు. దినం రోజుకు రెండ్రోజుల ముందొచ్చాడు మునెమ్మ తమ్ముడు. ‘ఒరేయ్ అబ్బాయిలూ! మా అక్క మెడ తరువాత బోసిగా వుండకూడదు. ఒకడు మెడలోకి పగడాలు, ముత్యాలతో హారం చేయించాలి. ఇంకొకడు నాలుగు గాజులు చేయించి చేతికి రెండు చొప్పున వేయండి. లేకుంటే సుబ్బయ్య కొడుకులు తల్లిని బికారి దాన్లా వదిలేశారని అనుకుంటారు. ఎక్కడికి పోతుంది? అంతా మీకే కదా?‘ అన్నాడు. ‘అంతా సరే గానీ దినం రోజు వంటలు తిని, గ్రానైటు రాయితో సమాధి కడితే సరిపోదురా. అవన్నీ ఆయన ఆత్మను స్వర్గానికి తీసుకుపోవు. ఒక మంచి పాడి ఆవును దూడతో సహా దానమివ్వాలి, కనీసం మీ శక్తికొద్దీ బంగారం, బట్టలు, కాసంత భూదానం కూడా చేస్తే ఎకాఎకిని ఆత్మ స్వర్గానికెళ్లిపోతుందట. పెదనాయన ఆత్మ అలమటిస్తే మనకే మంచిది కాదురా రాజిగా‘ ముక్కుచీదుతూ చెప్పింది సుబ్బయ్య పెద్ద తమ్ముడు కూతురు శ్యామల. ఆ రాత్రి రాజేంద్ర కనిపించలేదు. రాత్రి పది గంటల వరకు వెతికి వెతికి అంతా భయపడిపోయారు. చివరికి మర్నాడు ఉదయం రాజేంద్ర కొడుకు ఏడుస్తూ ఒక ఉత్తరం పట్టుకొచ్చి మాణిక్యం చేతికిచ్చాడు.‘అన్నా. నాన్న దినం బాగా జరగాలి. ఇప్పుడు ఇంట్లో వున్న మన కొడుకుల కాలేజీ సీట్ల కోసం అప్పుచేసి తెచ్చిన డబ్బులు సరిపోవు. మన ఈరిగాడు ఎవరికో కిడ్నీ కావాలని చెప్తుంటే విన్నాను. రెండు మూడు లక్షలు ఇస్తారంట. మనిషికి ఒక కిడ్నీ సాలంట. నాకేమి భయం లేదు. పెద్దకొడుకువి కాబట్టి నువ్వుంటే చాలు దినాలకు. నా కొడుకుతో పంపితే నేను హాస్పిటల్లోనే పుణ్యావాసం నీళ్ళు చల్లించుకుంటా. వారం రోజులకే ఇంటికొచ్చేస్తా’ అని రాసుంది. అది విన్న మునెమ్మకు ఎక్కడలేని ఆవేశం వచ్చేసింది. ‘రేయ్ మాణిక్యం.. ఎళ్ళి ఈరిగాడ్ని పట్టుకోని తమ్ముడ్ని తీసుకురా. ఒక్కపైసా కూడా ఖర్చు చేయడానికి వీల్లేదు. కార్డులేసి అందరికి దినం పత్రికలు పంపావుకదా అది సాలు. కథలు చెప్పించాల్సిన అవసరం లేదు. ఆత్మ వచ్చి కథలు వినదు. దానధర్మాలు మనస్ఫూర్తిగా వున్నప్పుడు వున్నదాంట్లో చెయ్యాలిగానీ అప్పులు చేసి చెయ్య పనిలేదు. భర్తపోయిన దుఃఖంలో వున్న నాకిప్పుడు నగలు సింగారించుకోవాలన్న కోరికేం లేదు. అసలు చనిపోయిన ఆయనే బ్రతికుంటే అప్పు చేసిన డబ్బులతో గ్రానైట్ సమాధి కడతానంటే ఒప్పుకునేవాడు కాదు. దానికన్నా మనవళ్ల చదువే ముఖ్యం. ఎవరి పరువు కోసమో, ఎవరి గొప్పల కోసమో మనం ప్రాణాల మీదికి తెచ్చుకోవాల్సిన పనిలేదు. వెళ్ళండ్రా’ అని కోపంగా అరిచేసరికి ఎక్కడి వాళ్ళక్కడ తేలుకుట్టిన దొంగల్లా జారుకున్నారు. మాణిక్యం, కొడుకులు అంతా వెళ్ళి ఆపరేషన్ టేబుల్ ఎక్కకముందే రాజేంద్రను వారించి ఇంటికి తీసుకొచ్చారు. మర్నాడు సిమెంటుతో కట్టిన తండ్రి సమాధికి పూజలు చేశారు. పంతులుకి దక్షిణ ఇచ్చారు. వంటవాళ్ళతో రుచికరమైన భోజనం చేయించి వడ్డించారు. అంతా హాయిగా ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. కాలచక్రం పదేళ్లు తిరిగింది. మాణిక్యం కొడుకు ఇప్పుడు ఎందరికో కిడ్నీ వ్యాధుల్ని నయం చేసే స్పెషలిస్ట్ డాక్టరయ్యాడు. రాజేంద్ర కొడుకు ఇంజనీరై తాతకు మాంచి గ్రానైటు రాయితో, మెరిసే అక్షరాలు, సుబ్బయ్య ఫొటోతో సమాధి కట్టాడు. అంతే కాదు, ఆరోజు ముఖం తిప్పుకుంటూ వెళ్లిన వాళ్లంతా పెదవుల్లో నవ్వుల్ని సాగదీసుకుంటూ పెళ్లి సంబంధాలు చూడటానికి ఎగబడ్తున్నారు. లోకం నాలుకకు ఎన్నో చీలికలు. మనం అవసరమైనవే తీసుకోవాలి. లేదంటే ప్రతి నాలుకా విషపు కోరలతో వెంటబడుతుంది. ఆరోజు కాలిపోయిన సుబ్బయ్య కట్టె కోసం అప్పులు కూడా కరిగిపోయుంటే మిగిలిన వాళ్ళంతా కూడా జీవచ్ఛవాలయ్యేవాళ్లు. అందుకే తాహతునుబట్టి బతికినపుడే పైకెదిగే అవకాశం వుంటుంది. అనవసర గొప్పలకు పోకుంటే బాగుపడ్తారనటానికి సుబ్బయ్య కుటుంబమే ఉదాహరణైంది. - డేగల అనితాసూరి -
కోచింగ్‌కు వెళ్లిన బాలిక అదృశ్యం
సాక్షి, సంగెం(పరకాల): కంప్యూటర్ కోర్సు నేర్చుకోవడానికి వెళ్లిన బాలిక అదృశ్యమైన సంఘటన సంగెం మండలం లో చోటుచేసుకుం ది. ఎస్సై ఎస్.దీపక్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఎల్గూర్‌స్టేషన్ గ్రామపంచాయతీ శివారు రాజ్యానాయక్ తండాకు చెందిన మూడు అనిత(17) రెండు నెలలుగా వరంగల్ నగరంలోని ఓ ఇనిస్టిట్యూట్‌లో కంప్యూటర్ శిక్షణ పొందుతోంది. ఉదయం 9 గంటలకు ఆర్టీసీ బస్సులో వెళ్లి తిరిగి సాయంత్రం 3 గంటల వరకు ఇంటికి వస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఇంటి నుంచి శిక్షణకు వెళ్తున్నట్లు చెప్పి ఆర్టీసీ బస్సు ఎక్కి వెళ్లింది. తిరిగి సమయానికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఎంత వెదికినా ఆచూకీ లభించలేదు. దీంతో అనిత తండ్రి మూడు వీరన్న శనివారం సంగెం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే తన ఫిర్యాదులో నెక్కొండ మండలం చంద్రుగొండకు చెందిన పూర్ణచందర్, రాజ్యానాయక్ భుక్యా శివ, భుక్యా వెంకటేష్, మూడు బాలకృష్ణ, మూడు ప్రశాంత్, గుగులోత్ బాలులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని పేర్కొన్నారు. కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అనిత ఇంటి నుంచి వెళ్తున్నప్పుడు ఎరుపు రంగు పంజాబి డ్రస్సు, నలుపు రంగు ప్యాంట్ ధరించి ఉందన్నారు. ఆచూకీ లభిస్తే సంగెం పీఎస్ 9440700530, 9440904629 నంబర్లలకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. -
హత్య చేసిందెవరు?
సంజయ్, రవి బొమ్మవల్, అనిత, తలైవాసల్ విజయ్, ఆదిత్యా మీనన్ ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘సూర్య ది గ్రేట్’. అనితా ఉదీప్ దర్శకత్వంలో షీతల్ గుప్తా, ఎన్.జి. రాజ్‌కుమార్ నిర్మించిన ఓ తమిళ చిత్రాన్ని ‘సూర్య ది గ్రేట్’ పేరుతో అనువదించి, రంజాన్ కానుకగా ఈ నెల 15న తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. అనితా ఉదీప్ మాట్లాడుతూ– ‘‘ఐఏఎస్ కావాలనుకునే ఓ అమ్మాయి మార్కెట్ రౌడీని ప్రేమించి, పెళ్లి చేసుకుంటుంది. తర్వాత కొన్నాళ్లకు వీరు విడిపోతారు. ఇందుకు దారి తీసిన సంఘటనలు ఏంటి? వాళ్ల కడుపున పుట్టినందుకు సూర్య పడిన ఆవేదన అతని జీవితాన్ని ఎలా మలిచింది. ప్రాణ స్నేహితుని హత్యతో సూర్యలో వచ్చిన మార్పేంటి? ఫ్రెండ్ మరణానికి కారణమైన వారిపై తను ఎలా పగతీర్చుకున్నాడు? అన్నదే ఈ చిత్రకథ’’ అన్నారు. -
గుండెపోటుతో నటి అనితా దాస్ మృతి
భువనేశ్వర్: ఒడియా చలన చిత్ర నటి అనితా దాస్ (57) శుక్ర వారం మరణించారు. కొద్ది పాటి గుండెపోటుతో ఆమె సొంత నివాసంలో కన్ను మూశారు. 100కు పైబడి చిత్రాల్లో ఆమె నటించారు. తల్లి పాత్రకు ఆమె కొత్త ఒరవడి దిద్దిన నటిగా పేరొందారు. 1957వ సంవత్సరం నుంచి ఆమె చలనచిత్ర రంగంలో నటిగా వెలుగొందారు. 1975లో విడుదలైన జాజాబొరొ చిత్రం ఆమె నటనా జీవితంలో మైలు రాయిగా నిలిచింది. కృష్ణ సుధామా (1976), రామాయణ్ (1980), మా –ఓ–మమత (1980), స్వొప్నొ సాగొరొ (1983), పుఒ మోరొ కొలా ఠకురొ (1988), గొడి జణిలే ఘొరొ సుందొరొ (1994), బహుడిబే మో జొగొబొలియా (2003), సాథీరే (2004), ఓం శాంతి ఓం (2005), అమొ భిత్తొరే కిచ్ఛి ఒచ్ఛి (2010), శపథ్ (2012), అభయ్ (2017) ఆమె నటనా జీవితంలో పేరు తెచ్చిన చిత్రాలుగా నిలిచాయి. ముఖ్యమంత్రి సంతాపం అనితా దాస్ మరణంపట్ల ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ శుక్ర వారం సంతాపం ప్రకటించారు. అకాల మరణంతో వెండి తెర, బుల్లి తెర వీక్షకులు అపురూపమైన నటిని కోల్పోయారని ఆయన సానుభూతి ప్రకటించారు. ఒడియా చలన చిత్ర, టెలివిజన్ నటనా రంగానికి ఆమె సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని కొనియాడారు. అనితా దాస్ మరణం నటనా రంగానికి తీరని లోటు అంటూ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీఅధ్యక్షుడు నిరంజన్ పట్నాయక్ శ్రద్ధాంజలి ఘటించారు. ఆమె మరణ వార్త తెలుసుకున్న పలువురు చలన చిత్ర రంగ ప్రముఖులు, దర్శకులు, నిర్మాతలు, నటీనటులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. ఆమె మరణం ఒడియా చలన చిత్ర రంగానికి తీరని లోటు అంటూ కన్నీరు కార్చారు -
సూర్య గ్రేట్
సంజయ్, రవిబమ్మవళ్, అనిత, తలైవాసల్ విజయ్, ఆదిత్య మీనన్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘కులీర్ 100’. అనిత ఉదీప్ దర్శకత్వంలో సీతల్గుప్త, ఎన్.జి. రాజ్‌కుమార్ నిర్మించారు. తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ సినిమాని ‘సూర్య ది గ్రేట్’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘కుటుంబ సమేతంగా చూడదగ్గ చక్కటి కథాంశంతో రూపొందిన చిత్రమిది. యువతను అమితంగా ఆకట్టుకునే అంశాలున్నాయి. తెలుగు ప్రేక్షకులకు ఒక మంచి సినిమా అందించాలనే సదుద్దేశంతో ఈ సినిమాను విడుదల చేస్తున్నాం. వేసవి కానుకగా మే నెలలో రిలీజ్ చేస్తాం. తెలుగు వారు మా సినిమాని ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెలకంటి, సంగీతం: బోబో శశి, కెమెరా: ఎల్.కె. విజయ్. ∙అనిత, సంజయ్ -
మా కాలంలో మరీ అన్యాయం
తమిళసినిమా: ఇప్పుడు కాస్త నయం. మా కాలంలో అయితే అంటూ చెప్పుకొచ్చింది నటి అనిత. ఈ పేరు దక్షిణాదికి సుపరిచితమే. తెలుగులో నువ్వు నేను లాంటి కొన్ని విజయవంతమైన చిత్రాల్లో నటించిన అనిత తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించింది. ఇక్కడ మనోజ్ భారతీరాజాకు జంటగా వరుసమెల్లా వసంతం చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయమైంది. విక్రమ్‌కు జంటగా సాయిరాయ్, విజయ్‌తో సుక్రన్ చిత్రాల్లో నటించిన అనిత ఆ తరువాత అడపాదడపా కొన్ని చిత్రాల్లో మెరిసినా, హీరోయిన్గా కనిపించలేదు.అదే విధంగా మలయాళం, కన్నడం చిత్రాల్లోనూ నటించింది. కొన్ని చిత్రాల్లో ఐటమ్ సాంగ్‌లకు చిందేలేసిన ఈ అమ్మడు ప్రస్తుతం హిందీ టీవీ సీరియల్స్‌లో నటిస్తోంది. బాలీవుడ్ నుంచి, కోలీవుడ్, టాలీవుడ్‌లలో కలకలం సృష్టిస్తున్న కాస్టింగ్ కౌచ్ గురించి ఈ అమ్మడు కూడా గొంతు కలిపింది. వనిత ఏం చెప్పిందో చూద్దాం. సినీరంగంలో కాస్టింగ్ కౌచ్ విధానం ఉంది. ఇక్కడో విషయం చెప్పాలి. మంచి ప్రారంభం ఉంటే పయనం బాగుంటుంది. అయినా నేనూ పోరాటం చేశాను. కాస్టింగ్ కౌచ్ అనుభవం నాకు ఎదురైంది. ఈ వ్యవహారంలో మనం చాకచక్యంతో బయట పడాలి. ఏం చేద్దాం. ఈ రంగం అలా తయారైంది అంటూ నిట్టూర్చింది.అదృష్టవశాత్తు నాకు ఏక్తాకపూర్ లాంటి నిర్మాత లభించారు. ఇంకా చెప్పాలంటే కాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో ఇప్పుడు కాస్త నయం. మా కాలంలో అయితే ఇంకా అన్యాయం. ఒకవేళ నేను చెప్పేది తప్పు కూడా కావచ్చు అని పేర్కొంది.ప్రస్తుతం ఈ అమ్మడు నాగిని పార్టు–3 సీరియల్లో నటిస్తోంది. -
భగ్గుమంటున్న హిందూ సంఘాలు
సాక్షి, అమరావతి/సాక్షి, తిరుమల/సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కొత్త ధర్మకర్తల మండలి నియామకం తీవ్ర వివాదాస్పదంగా మారింది. అన్య మతస్థులను, రౌడీయిజం చేసే వారిని, ఆధ్యాత్మిక–సేవా భావం లేనివారిని టీటీడీ బోర్డులో సభ్యులుగా నియమించారని హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఏడాది పాటు అధికారుల పాలనలో సాగిన టీటీడీకి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం కొత్త బోర్డును నియమించిన సంగతి తెలిసిందే. కొత్త చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్‌పై అన్యమత ప్రచార కార్యక్రమాలకు ఆర్థిక సాయం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయన నియామకంపై హిందూ పీఠాధిపతులు, మఠాధిపతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం లెక్కచేయలేదు. అలాగే బోర్డులో సభ్యురాలుగా నియమితులైన టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత విషయంలోనూ హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తాను అన్య మతస్థురాలినని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకున్న అనితకు ఎలా అవకాశం ఇస్తారని ప్రశ్నిస్తున్నాయి. హిందూ ధార్మిక సంస్థలో రాజకీయ లబ్ధి కోసం అన్య మతస్థులకు చోటు కల్పించడం దారుణమని హిందూ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. కొత్త బోర్డును రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. రాయపాటి సాంబశివరావు అసంతృప్తి టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావును బోర్డు సభ్యుడిగా నియమించడంపై బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విజయవాడలో బ్రాహ్మణుల సత్రాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన బొండాకు టీటీడీ బోర్డులో ఎలా పదవి ఇస్తారని బ్రాహ్మణ సంఘం నేత ముష్టి శ్రీనివాసరావు నిలదీశారు. అలాగే తనను టీటీడీ సభ్యుడిగా నియమించడంపై టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కినుక వహించారు. తాను టీటీడీ చైర్మన్ పదవి అడిగితే ఇవ్వకుండా, సభ్యుడిగా నియమించి అవమానించారని ఆయన అసంతృప్తితో రగిలిపోతున్నట్లు సమాచారం. రాష్ట్రంలో బీజేపీతో టీడీపీ తెగతెంపులు చేసుకున్నా మహారాష్ట్ర మంత్రి సుధీర్ ముంగటివర్ సతీమణి సప్నను టీటీడీ బోర్డులో సభ్యురాలిగా నియమించడం గమనార్హం. రాజకీయ లబ్ధి కోసమే ఆమెకు టీటీడీ బోర్డులో చోటు కల్పించినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొత్త బోర్డులో తమకు అవకాశం కల్పిస్తారని టీడీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఆశించారు. అవకాశం రాని వారు పార్టీకి రాజీనామా చేయాలని యోచిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. మరోవైపు టీటీడీ బోర్డులో తమిళనాడుకు ప్రాతినిధ్యం లేకపోవడం దారుణమని ఆ రాష్ట్రానికి చెందిన హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. -
సూర్య పగ
తమిళనాడులో జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా అనితా ఉదీప్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సూర్య ది గ్రేట్’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. సంజయ్, రవి బమ్మావల్, అనిత, తలైవాసల్ విజయ్, ఆదిత్యా మీనన్ ముఖ్య తారలుగా నటించారు. విదీషా ఎంటర్టైన్మెంట్స్ సంస్థపై షీతల్ గుప్తా, ఎన్.జి. రాజ్‌కుమార్ నిర్మించారు. ‘‘బాధ్యత లేని యువత జీవితాలు ఎలా నాశనం అవుతున్నాయి? అన్న కథాంశంతో రూపొందిన చిత్రమిది. కాలేజీ గొడవల్లో తోటివారి కారణంగా హీరో సూర్య ప్రాణ స్నేహితులు హత్యకు గురవుతారు. శత్రువులపై సూర్య ఎలా పగ తీర్చుకున్నాడు? అన్న అంశాలు ప్రేక్షకులకు ఆసక్తికరంగా ఉంటాయి. వేసవిలో రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు చిత్రబృందం. ఈ సినిమాకు సంగీతం: బోబో శశి, ఎడిటింగ్: ఎల్.కె. విజయ్. -
అమ్మక్క
‘‘ఏమాయనే ఇంకా లేత్తలేవు.. లెవ్వు! లేటయితే మేడమ్ తిడుతది’’ అంటూ నిండా కప్పుకుని పడుకున్న కూతుర్ని లేపింది లలిత. మేడమ్ పేరు వినంగనే జప్పని లేచి కూసుంది అనిత. అనితకి పదేండ్లు. కండ్లు నలుసుకుంట టైమ్ చూసింది. ఆరుంబావు దాటింది. ‘అమ్మో! లేటయింది,’ అనుకుంట నీళ్ల కుండి కాడికి పోయింది. అసలే చలికాలం. చల్లని నీళ్లు ముట్టంగనే వేళ్లు జివ్వుమన్నయి. తొందరగ మొహం కడుక్కుని అద్దం కాడికి వచ్చింది. చెదిరిన జుట్టునంత ఎనకకు అనుకుని రబ్బర్ బ్యాండు పెట్టుకుంది. ‘‘అనితా.. నడువు ఆరన్నర అయితుంది’’ తొందరపెట్టింది లలిత. గౌను కింది అంచుతో మొహం తుడుసుకుంట చెప్పులేసుకుంది అనిత. దస్తిని రెండు మడతలేసి, చెవులకు చలిరాకుండ అనితకు కట్టింది లలిత. తను కొంగు కప్పుకుంది. అమాయకంగా పడుకున్న ఏడేండ్ల కొడుకును చూసింది. కండ్లల్ల నీళ్లు తిరిగినయి. రాత్ర అన్నం పెట్టుమని అడిగిండు. లేదు అనంగనే ఏం అనకుండ పండుకున్నడు. పాపం కొడుకుకు ఇప్పుడన్న అన్నం తీస్కరావాలే అనుకుంది. తలుపులు దగ్గరికేసి వడివడిగ నడిచింది. తల్లి వెంటనే నడిచింది అనిత. లలితకు భయంతో గుండె కొట్టుకుంటాంది. ‘అసలే మేడమ్ ఇయ్యాల ఊరికి పోతా అన్నది. ఇయ్యాలనే లేటు కావట్టే. ఈ చలికి తెల్లారిందే తెలుస్తలేదు’ అనుకుంట అనితని తొందరగ నడవమని సైగ చేసింది. కూతురును తీసుకపోవద్దు అనుకుంటది. కాని తప్పదు. అనిత ఇల్లు ఊడిస్తే, ఆమె బాసండ్లు తోముతది. అట్ల టైమ్ మిగిలి ఇంకో ఇంట్లకి పనికి పోవచ్చని ఆలోచన. అనుకున్నట్టే వాకిట్లనే నిల్సుండి కోపంగా చూసింది మేడమ్. లలిత పాణం జల్లుమన్నది. ‘‘ఏమైందే లలితా! నీకోసమే చూస్తున్న. జప్పన్నే అచ్చినట్టు ఉన్నవ్..’’ అన్నది మేడమ్ వెటకారంగా. ‘‘ఇయ్యాల చలి జర ఎక్కువుంది మేడమ్. లేసుడు లేటయింది,’’అంటూ నసిగింది లలిత. ‘‘ఊరంత ఉంది చలి.. నీకొక్కదానికేనా ఏంది?’’ అన్నది మేడమ్ కోపంగా. లలిత ఏం మాట్లాడకపోవడంతో మళ్లీ తనే అంది.. ‘‘అయినా ఎన్నిసార్లు చెప్పిన్నే.. నీ బిడ్డను ఎందుకు తీసుకత్తున్నవు? నేనేదో నీ బిడ్డను పనికి పెట్టుకున్న అనుకుంటుండ్రు అందరు.’’ ‘‘ఎవరనుకుంటరు మేడమ్, అనుకుంటే నేను చెప్పనా వాళ్లకు. నాకే కొంచెం ఆసరా అయితదని తీసుకపోతున్న అని’’ అన్నది లలిత బాసండ్లు అందుకుంట. ‘‘ఆ... అనుకునేటోళ్లు నీ ఇంటికి వచ్చి చెప్తరా’’ అంటూ లోపలికి వెళ్లిపోయింది. అనితకు అవి అలవాటయిన మాటలే. లోపలికి పోయి చీపురు పట్టుకుంది. బాసండ్లు తోముతున్న లలితకు అనిత ఆలోచనలే. తన పరిస్థితిని అర్థం చేసుకుంటది. అందరు పిల్లల లెక్క ఎక్కువ ఆడియ్యదు. అందుకే అనిత అంటే తనకెంతో అభిమానం. ఇంత చిన్న వయసులోనే అంత పరిణతి. అనిత తమ్మున్ని చూసుకునే విధానానికి ఆశ్చర్యం వేస్తుంది ఆమెకు. ఒకసారి జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది లలితకు. అది నడి ఎండకాలం. నల్ల నీళ్లు రాక వారమయితుంది. అప్పటికే బోర్లు ఉన్నోళ్ల ఇండ్లల్లకు పోయి నాలుగైదు బిందల నీళ్లు తెచ్చింది లలిత. మల్ల మల్ల అడుగుతే యాష్ట పడుతరు. ఇంట్లనేమో సుక్క నీళ్లులేవు. భర్త పని కానించి వచ్చే టైమయింది. ఏం చెయ్యాల్నో అర్థమైతలేదు లలితకు. అమ్మను చూసింది అనిత. పరిస్థితి అర్థం చేసుకుంది. తమ్మున్ని, బిందెను తీసుకుని పోయింది. అడిగిన కాడ మళ్ల అడగద్దు అని అనితకు తెలుసు. కొత్త ఇల్లు చూసింది. గేటు తీసుకుని లోపలికి పోయింది. ‘‘మేడమ్ రెండు బిందల నీళ్లు ఇస్తరా’’ అన్నది భయపడుతూ. ఇంతకుముందు అడగలే కాబట్టి వాళ్లూ సరే అన్నరు. అనితకి సంతోషం ఆగలేదు. తండ్రి సినిమాకు తీస్కపోతెనో, తల్లి అడిగింది కొనిస్తెనో కలిగే సంతోషం అది. ‘‘అమ్మను బిందె తెమ్మను’’ అని తమ్మున్ని పంపింది. అనితకు తెలుసు. బిందెలు రెండే. కాని మోసే నీళ్లే ఎక్కువ. అందుకే ఇంట్లోల్లు గుర్తించే లోపే వీలయినన్ని ఎక్కువ మోయాలని ఆరాటపడ్తూ ఉంది. తల్లి బిందెతో, తమ్ముడు సర్వతో వచ్చిండ్రు. ముందే నింపిన బిందెని తల్లి భుజం మీదికి ఎత్తింది. తమ్ముని సర్వ నింపి ఇచ్చింది. అట్ల ఆ ఎండకాలం అనిత తెలివితోని నీళ్ల కరువు నుండి బయటపడ్డది లలిత. అనిత ఇల్లు ఊడ్చి బోల్లు కడగటానికి రాంగనే, లలిత ఈ లోకంలోకి వచ్చింది. ‘‘నువ్వు కడగకు. సబ్బు పోలేదు అంటది మేడమ్’’ అన్నది లలిత. ‘‘పక్క మేడమ్ ఇంట్ల ఉడ్వన మరి..?’’ అనిత అడిగింది. ‘‘ఆ.. పో.. నేను గుడ వస్త ఇవి కడిగినంక’’ చెప్పింది లలిత. పక్కింటికి పరిగెత్తింది అనిత. బోల్లన్ని తెల్లగ కడిగి బోర్లించింది లలిత. మేడమ్ కోసం చూసింది. అన్నం అడుగుదామని. అచ్చేటప్పుడు అడుగుదాం అనుకొని పక్కింట్లకి నడిచింది. అనిత ఇల్లు ఊడ్సుడు అయిపోయింది. అనిత చేతిలో ఎర్ర స్వెటర్ మెరుస్తాంది. నమ్మలేనట్టుగ చూసింది లలిత. ‘‘మేడమ్ ఇచ్చింది.’’ మురిసిపోతూ చెప్పింది అనిత. లలితకు సంతోషంగ ఉంది. అక్కడక్కడ చిన్న చిన్న చిరుగులు ఉన్న.. బాగనే ఉంది స్వెటర్. బిడ్డకు రేపట్నుంచి చలిపెట్టదు అనుకుంది. లలిత బాసండ్లు తోముతున్నంత సేపు, అనిత స్వెటర్ చూసుకుంట మురిసిపోయింది. పని అయినంక ఇద్దరూ ఆనందంగ ఇంటికి పోయిండ్రు. ఇంటికి రాంగనే మొహం కడుక్కుని, తినడానికి తయారుగ ఉన్న కొడుకుని చూసింది లలిత. అప్పుడు గుర్తొచ్చింది.. అన్నం తీసుకస్తని వాడికి మాటిచ్చిన సంగతి. ‘‘అయ్యో! ఎంత పని అయిపాయె.. మేడమ్‌ని అన్నం అడుగుడు మర్చిపోతి..’’ అనుకుంట తనని తాను తిట్టుకుంది. కాని అప్పటికే కొడుకు కండ్లు మెరుస్తున్నయి. అనిత స్వెటరు కింద ఉన్న అన్నం కవరు చూసి. వాడు ఉర్కొచ్చి అనితను చుట్టుకున్నడు. వాడిని కూర్చోబెట్టి ప్లేట్ల అన్నం పెట్టింది అనిత. వాడు తింటుంటే తృప్తిగ చూస్తు.. ‘‘నువ్వు పని తొందర్లపడి మరిచిపోయినవే. కని నేను మర్చిపోలే. రాత్రి ఆకలితో వాడు ఏడ్చిన ఏడుపే గుర్తుకొచ్చింది’’ అన్నది. లలిత గుండె కరిగిపోయింది. కూతురునె చూస్తుండిపోయింది. - పెద్దింటి సాహితి -
బైక్ నడుపుతుంటేవింతగా చూసేవారు
కష్టసుఖాల్లో తోడుగా ఉండాల్సిన భర్త.. కుటుంబ పోషణను భారంగా తలచి పిరికి వాడిలా పారిపోయాడు.. ఆమె ఆశలపై దాయాదులూ నీళ్లు చల్లారు. అయినా జీవితంలోని ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొంది. తండ్రి కష్టాన్ని పంచుకుని కుటుంబ బాధ్యతలు భుజానికెత్తుకుంది. ఐదుగురు చెల్లెళ్లను, తమ్ముడిని చదివించడమే కాదు... నలుగురు చెల్లెళ్లకు పెళ్లి చేసి అత్తింటికి సాగనంపింది. వ్యవసాయంపై మక్కువ పెంచుకుని సాగులో రాణిస్తూ.. ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన అనిత విజయగాథ నేటి ‘నేను శక్తి’లో మీ కోసం.. అందరిలాగే ఆమెలో కూడా ఎన్నో ఆశలు. బాగా చదువుకోవాలని, ఉన్నతస్థాయి కొలువులు చేపట్టాలని భావించింది. అయితే అయిన వాళ్లే కాదన్నారు. అండగా నిలుస్తారనుకున్న బంధువులు ఛీదరించుకుని దూరమై పోయారు. వ్యవసాయం తప్ప అన్యమెరుగని తండ్రికి ఆరుగురు కూతుళ్లకు పెళ్లిళ్లు చేయడం తలకు మించిన భారమే అయింది. ఇలాంటి తరుణంలో ఆ ఇంటి బరువు బాధ్యతలను ఆమె భుజాలకెత్తుకుంది. ‘నాన్నా.. నువ్వు భయపడొద్దు! నీకు తోడుగా నేనుంటాను’ అంటూ పలుగుపార చేతపట్టి పొలం పనుల్లోకి దిగింది. పంట సాగులోని మెలకువలను అవపోశన పట్టింది. తిరుగులేని మహిళా రైతుగా అతి చిన్న వయసులోనే గుర్తింపు తెచ్చుకుని ‘నేను శక్తి’ అని నిరూపించుకున్న అనిత విజయగాథ మీ కోసం.. అనంతపురం , గుమ్మఘట్ట :మాదీ పెద్ద కుటుంబమే మాది గుమ్మఘట్ట మండలంలోని మారెంపల్లి గ్రామం. మా తల్లిదండ్రులు కురుబ మహదేవమ్మ, హనుమంతప్ప.మా నాన్న వాళ్లు ఐదుగురు అన్నతమ్ముళ్లు. మా నాన్నకు మేము మేము ఆరుగురం ఆడపిల్లలం. మాకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. మేమంతా కలిసిమెలిసి ఉండేవాళ్లం. నా ప్రాథమిక విద్యాభ్యాసం అంతా మారెంపల్లిలోనే కొనసాగింది. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఆవులదట్లలో చదువుకున్నాను. రోజూ మా ఊరి నుంచి మిగిలిన అమ్మాయిలతో కలిసి సైకిల్‌పై స్కూల్‌కు వెళ్లి వచ్చేదాన్ని. బైక్ నడుపుతుంటేవింతగా చూసేవారు పొలానికి అవసరమైన మందులు, ఇతర పనులకు గ్రామంలోకి వెళ్లి రావాలంటే రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ పోవాల్సి వచ్చేది. ఆ సమయంలోనే మా నాన్న వద్ద ఉన్న బైక్‌ను నడపడం నేర్చుకోవాలని అనుకున్నాను. ఖాళీ సమయంలో దాన్ని నడిపేందుకు ప్రయత్నించి కిందపడి గాయపడేదాన్ని. అయినా అవసరం అన్నీ నేర్పించింది. కొన్ని రోజుల తర్వాత బైక్‌ను సులువగా నడపసాగాను. మా ఊళ్లో ఆడపిల్లలు బైక్ నడిపేవారు కాదు. నేను బైక్ తోలుతుంటే అందరూ ఆశ్చర్యంగా చేసేవారు. దీనిపై చాలా కామెంట్లు కూడా వచ్చాయి. అవి నన్ను కాస్త బాధపెట్టినా.. తర్వాత మెల్లిగా అలవాటైపోయింది. ఇప్పుడు మా అమ్మనాన్ననే కాదు. ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే వారిని దిగబెట్టి వచ్చేంందుకు బైక్‌పైనే తీసుకెళుతుంటాను. ఉండేందుకు ఇల్లు కూడా లేదు ఉమ్మడి కుటుంబంగా ఉంటూ వచ్చిన మేము విడిపోయిన తర్వాత ఒంటరితనం భయపెడుతూ వచ్చింది. ఆ సమయంలో మేము ఉండేందుకు ఇల్లు కూడా లేకుండా పోయింది. భాగ పరిష్కారం కింద మా నాన్నకు వచ్చిన తొమ్మిది ఎకరాల పొలంలో రెండు చిన్న గదులు ఉన్న ఇల్లు ఉండేది. దాంట్లోకి మా నాన్న మకాం మార్చాడు. నిర్జన ప్రదేశంలో ఎప్పడు ఏం జరుగుతుందోననే భయం. ఆయన కష్టం చూస్తున్నప్పుడు లోలోన కుమిలిపోయేదాన్ని. ఆరుగురు ఆడపిల్లలు ఉన్నారనే ఒకేఒక్క కారణంతోనే కదా మా తల్లిదండ్రులకు ఈ కష్టాలు అని తలుచుకుని కన్నీరు పెట్టేవాళ్లం. ఆ సమయంలోనే మా చెల్లెళ్లు నాకు సపోర్ట్‌గా నిలిచారు. ‘అక్క నీవే ఏదైనా చేయగలవు. మేమింకా చిన్న పిల్లలం. మా వంతు సాయం మేమూ చేస్తాం. ఎలాగైనా ఈ కష్టాల నుంచి మనం బయటపడాలి’ అంటూ వారు అన్న మాటలు నేను ఇప్పటికీ మరిచిపోలేకున్నాను. రాత్రిళ్లు నాన్నకు తోడుగా.. కొన్ని నెలల తర్వాత ఓ అమ్మాయికి నేను జన్మనిచ్చాను. పేదరికం కారణంగా సరైన ఆహారం లేక చాలా నీరసించిపోయాను. ఆ సమయంలోనే నా ఆరోగ్యంతో పాటు పసిగుడ్డు బాగోగులు చూసుకునేందుకు మా తల్లిదండ్రులు మరింత శ్రమిస్తూ వచ్చారు. వారి కష్టాన్ని అతి దగ్గరగా చూసిన దాన్ని నేనే. దీంతో నేను కొంచెం కోలుకున్న తర్వాత నాన్నకు తోడుగా పంటకు నీరు పెట్టేందుకు రాత్రిళ్లు వెళ్లేదాన్ని. అమ్మానాన్న వద్దని వారించేవారు. అయినా నేను వినలేదు. ‘ఎలాగైనా ఈ కష్టాల నుంచి బయటపడాలి నాన్నా.. మనల్ని కాదని ఒంటరిగా వదిలేసి వెళ్లిన వారి ముందు సగర్వంగా మనం తలెత్తుకుని తిరగాలి’ అంటూ ధైర్యం చెబుతూ వచ్చాను. ఆడపిల్లలు ఉన్నారంటూ.. నేను పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన తర్వాత పెద్ద చదువులు అక్కరలేదని మా నాన్నపై ఆయన అన్నతమ్ముళ్లు ఒత్తిడి చేస్తూ వచ్చారు. ఆడపిల్లకు వెంటనే పెళ్లి చేసి పంపిస్తే మేలని చెబుతూ వచ్చారు. అయినా మా నాన్న వారి మాటలను వినేవారు కాదు. మా నాన్న అన్నతమ్ముళ్లందరి భయం ఒక్కటే. మా నాన్నకు ఆరుగురు ఆడపిల్లలు. వారందరికీ చదువులు చెప్పించి, పెళ్లి చేసి ఇస్తే ఇక ఆస్తులు ఏమీ మిగలవని భావించేవారు. దీంతో ఏదో ఒక విషయంపై ఘర్షణ పడేవారు. ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోయేందుకు అవకాశం కోసం ఎదురు చూసేవారు. భూమిని నమ్ముకుంటే బువ్వపెడుతుంది వ్యవసాయం దండుగని ఎవరన్నారో గాని వారు నిజంగా మూర్ఖులే. మనసుపెట్టి పంట సాగు చేస్తే కాసుల వర్షం కురుస్తుంది. భూమిని నమ్ముకుంటే బువ్వ దొరుకుతుంది. ఒక పంట పోయినా.. మరో పంట ఆదుకుంటుంది. ఆధారం కోల్పోయామనుకుని బాధపడుతూ కూర్చొంటే ఫలితం లేదు. మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చునని నిరూపించగలగాలి. వ్యవసాయం ద్వారానే ఇంత మందిని నాన్న బతికించాడు. అంగన్వాడీ కార్యకర్తగా.. మా ఊళ్లోని అంగన్వాడీ సెంటర్‌కు కార్యకర్త పోస్టు ఖాళీగా ఉందని తెలుసుకుని దరఖాస్తు చేసుకున్నాను. అన్నీ అర్హతలూ ఉండడంతో 2015లో ఉద్యోగం వచ్చింది. ఓ వైపు పొలం పనులు చూసుకుంటూనే అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తూ వచ్చాను. ప్రస్తుతం నాలుగు ఎకరాల్లో దానిమ్మ, ఆరు ఎకరాల్లో వేరుశనగ, ఐదు ఎకరాల్లో వర్షాధారంగా వేరుశనగ సాగు చేస్తున్నాం. పదేళ్ల క్రితం ఒంటరిని చేసి.. నాకు 20వ ఏటా మేనమామతో పెళ్లి చేశారు. పట్టుమని మూడు నెలలు కూడా కాపురం చేయలేదు. ఏవో కారణాలు చూపుతూ మా మామ (భర్త) మమ్మల్ని వదిలి వెళ్లిపోయాడు. చాలా కాలం ఎదురు చూశాం. ఆయన రాలేదు. అప్పటికే నేను గర్భవతిని. ఈ విషయం మరింత నాతో పాటు అమ్మనాన్నను మరింత కుంగదీసింది. దీనినే అవకాశంగా తీసుకుని ఒక్కసారిగా మా దాయాదులు చెలరేగిపోయారు. ఆస్తుల భాగ పరిష్కారమంటూ తొమ్మిది ఎకరాలను మా నాన్న పరం చేసి, మమ్మల్ని ఒంటరివాళ్లను చేసి పదేళ్ల క్రితం వెళ్లిపోయారు. మొదట్లో ఇబ్బంది పడ్డా.. మా నాన్నకు ధైర్యం కలిగించేందుకు ఏవో నాలుగు మాటలైతే చెప్పాను. కానీ, నిజానికి పార చేత పట్టుకుని రాత్రిళ్లు పంట పొలంలో నీళ్లు పెట్టడమంటే చిన్న విషయమేమీ కాదు. పురుగు పుట్ర తిరుగుతుంటాయి. దీనికి తోడు చీకటి. బ్యాటరీ వెలుగులోనే పనులన్నీ చక్కబెట్టుకోవాల్సి వస్తోంది. విత్తనం వేసినప్పటి నుంచి పంట చేతికి వచ్చే వరకు రైతు కష్టం మాటల్లో చెప్పలేను. ఆ కష్టాలన్నీ అనుభవించాను. అయితే ఇష్టపడి చేస్తుండడంతో వాటిని ఏనాడూ నేను కష్టంగా భావించలేదు. మొదట్లో కాస్త ఇబ్బంది పడ్డాను. తోబుట్టువులను కాపాడుకుంటూ వ్యవసాయ పనులపై నెమ్మదిగా నేను పట్టు సాధించాను. అనుకున్నట్లుగానే మా జీవితాల్లో మార్పులు రాసాగాయి. చెల్లెళ్లు కూడా వారికి చేతనైనా సాయం చేస్తూ వచ్చారు. నాల్గో చెల్లెలు నాతో సమానంగా పొలం పనుల్లో పాల్గొంటూ వచ్చింది. మిగిలిన వారిని చదువులపై దృష్టి మళ్లించేలా చేశాను. ఇక మా అందరిలోనూ చిన్నోడు మా తమ్ముడు. వాడు ఇక్కడే ఉంటే మా లాగే పొలం పనులు అంటూ వ్యవసాయంలో దిగుతాడని భావించి, దూరంగా హాస్టల్లో ఉంచి చదివిస్తూ వచ్చాను. ప్రస్తుతం వాడు చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఇంజినీరింగ్ చేస్తున్నాడు. చిన్న చెల్లెలు అనంతపురంలో ఉంటూ డిగ్రీ చేస్తోంది. ఇక మిగిలిన చెల్లెళ్లకు పెళ్లి చేసి ఇచ్చాను. ఇవన్నీ చేస్తూనే ఇల్లు కూడా కట్టుకున్నాం. దీంతో పాటు మరో ఆరు ఎకరాల పొలాన్ని కూడా కొనుగోలు చేశాం. -
యువరాణికి గౌరవ వందనం
రాణులంటే చుట్టూ సేవలందించే మందీ మార్బలం, సకల హంగులు అమరే జీవనంగా మన కళ్ల ముందొక దృశ్యం నిలుస్తుంది. కానీ, ప్రజల గురించి ఆలోచించి, ముఖ్యంగా మహిళా హక్కుల కోసం పోరాటం చేసి, సాధించిన అతి కొద్దిమందిలో రాణులలో సోఫియా అలెగ్జాండ్రా దులీప్‌సింగ్ ఒకరు. లండన్‌లోని ప్రముఖ రాయల్ మెయిల్ తపాలాశాఖ ‘రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ –1918’ శత వసంతాలను పురస్కరించుకొని ఆనాడు ఈ చట్టం కోసం ఉద్యమించిన 8 మంది ప్రముఖులను ఎంపిక చేసి, వారి గౌరవార్థం స్టాంప్‌లను విడుదల చేసింది. అందులో ఆసియా తరఫున ఎంపికైన ఒకే ఒక్క ఉద్యమ మహిళ మన భారతీయ యువరాణి సోఫియా! యువరాణి సోఫియా తండ్రి మహారాజా దులీప్‌సింగ్. ఆయన పంజాబ్ పాలకుడు. సోఫియా ఆగస్టు 1876 ఆగస్టు 8న పంజాబ్‌లోనే జన్మించారు. గవర్నర్ జనరల్ డల్హౌసీ రాజకీయ వ్యూహాలు పన్ని ఈ రాజ్యాన్ని బ్రిటిష్ ప్రభుత్వంలో కలుపుకున్న తర్వాత దులీప్‌సింగ్ ఇంగ్లండ్ నుంచి బహిష్కృతుడయ్యాడు. తల్లి బాంబా ముల్లర్ కూతురు సోఫియాను తీసుకొని ఇంగ్లండ్‌లోని రాణీ విక్టోరియా హాంప్టన్ కోర్ట్ ప్యాలెస్ చేరారు. తల్లితో కలిసి సోఫియా అక్కడే నివసించేవారు. విక్టోరియా రాణి సోఫియాను దత్త పుత్రికగా భావించేవారు. 19వ శతాబ్ది చివర్లో, 20వ శతాబ్ది ప్రారంభంలో బ్రిటన్‌లో ప్రజా ఎన్నికలలో మహిళలకు ఓటు హక్కు తప్పనిసరిగా ఉండితీరాలనే అంశం తలెత్తింది. అది ఉదమ్యంగా రూపుదిద్దుకుంది. ఈ ఉద్యమానికి సోఫియా ప్రాతినిధ్యం వహించారు. అలాగే ‘ఉమెన్స్ టాక్స్ రెసిస్టెన్స్ లీగ్’లోనూ సోఫియా ప్రముఖ పాత్ర పోషించారు. మహిళల సామాజిక, రాజకీయ సంఘాలతో సహా ఇతర మహిళా బృందాలలోనూ ఆమె నాయకత్వాన్ని అందించారు. ఇంగ్లండ్‌లోనే 1948 ఆగస్టు 22న సోఫియా మరణించారు. బి.బి.సి. జర్నలిస్ట్ అనితా ఆనంద్ నివేదిక ప్రకారం సోఫియాను దాదాపు 70 ఏళ్ల పాటు ఈ దేశం మర్చిపోయింది. ‘ఆసియా మహిళ’ అంటూ సోఫియా గురించి ఆనంద్ రాసిన పుస్తకంలో రాణిగా, పోరాటయోధురాలిగా, విప్లవకారిణిగా ఆమెను కీర్తించారు. – ఎన్.ఆర్. సోఫియా అలెగ్జాండ్రాపై అనితా ఆనంద్ రాసిన పుస్తకం -
వివాహిత ఆత్మహత్యాయత్నం
మంచిర్యాలక్రైం: మంచిర్యాల పట్టణంలోని శ్రీనివాస్ టాకీస్ ప్రాంతానికి చెందిన బ్రాహ్మణపల్లి అనిత(30) అలియాస్ లాస్య గురువారం రసాయనం తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం అనితకు వేధనాచారితో 2012లో వివాహం జరిగిది. అప్పటినుంచి అత్తమామలు భర్త తరుచూ వేధింపులకు గురిచేస్తున్నారు. గతంలో పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీలు నిర్వహించారు. ఇటీవల కాలంలో వేధింపులు అధికం కావడంతో భరించలేక గురువారం బాత్రూం క్లీనర్ తాగింది. కుటుంబసభ్యులు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. అనితకు కూతురు వింధ్య, కుమారుడు విశ్వన్ ఉన్నారు. అనిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు భర్త వేధనాచారి, మామ బ్రహ్మయ్య, అత్త మణమ్మలపై కేసు నమోదు చేసి దర్యాçప్తు జరుపుతున్నామని మహిళా పోలీస్ స్టేషన్ సీఐ చంద్రమౌళి తెలిపారు. -
ప్రేమ వ్యవహారం..యువతి ఆత్మహత్య
శ్రీకాకుళం సిటీ: నగరంలో పెద్దరెల్లి వీధికి చెందిన బొమ్మాలి అనిత(19) బుధవారం నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. రెండోపట్టణ ఎస్సై రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. దమ్మలరెల్లి వీధికి చెందిన నల్లపిల్ల గౌరీశంకర్, అనితకు మధ్య ప్రేమ వ్యవహారం ఉండేది. మూడు రోజులుగా వీరిద్దరూ ఫోన్లో ఘర్షణ పడుతున్నారు. ఈ క్రమంలో ఇంటికి బుధవారం ఉదయం గౌరీశంకర్ రావడం, అనంతరం ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. రిమ్స్‌లో చేర్పించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. అనిత మృతికి గౌరీశంకర్ కారణమని మృతురాలి తండ్రి దొరబాబు ఫిర్యాదు చేశారని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
చేతులు లేకున్నా కాళ్లతోనే విద్యాభ్యాసం
-
ట్రిపుల్ ఐటీ విద్యార్థిని అదృశ్యం
-
ట్రిపుల్ ఐటీ విద్యార్థిని అదృశ్యం
సాక్షి, వైఎస్సార్ కడప: వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయలో ట్రిపుల్ ఐటీ విద్యార్థిని అదృశ్యం కలకలం రేపుతోంది. తూర్పుగోదావరి జిల్లా ఇరుసుమందకు చెందిన అనిత ట్రిపుల్ ఐటీలో మొదటి సంవత్సరం చదువుతోంది. ఆదివారం సాయంత్రం నుంచి అనిత కనిపించడం లేదని తోటి విద్యార్థులు తెలిపారు. విద్యార్థి అదృశ్యంతో ట్రిపుల్ ఐటీ అధికారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఆర్కే వ్యాలీ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వివాహిత ఆత్మహత్య
శింగనమల: బుక్కరాయసముద్రం మండలం రోటరీపురంలో ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన మేరకు.. రోటరీపురం గ్రామానికి చెందిన రాచమల్ల అనిత (28), సురేష్ దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సురేష్ ఎరువుల దుకాణంలో పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అనిత బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కట్నం కోసం అత్తమామలు వేధించడం వల్లే అనిత ఈ అఘాయిత్యానికి పాల్పడిందని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
అనిత కుటుంబానికి హీరో విజయ్ పరామర్శ
పెరంబూరు: నీట్ కారణంగా వైద్య కళాశాల్లో సీటు రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని అనిత కుటుంబసభ్యులను నటుడు విజయ్ పరామర్శించారు. అనిత మరణాన్ని ఖండిస్తూ నీట్‌కు వ్యతిరేకంగా రాష్ట్రంలో విద్యాలోకం ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అనిత మరణం చాలా మంది రాజకీయ, సినీ ప్రముఖులను స్పందింపజేసింది. డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ తో పాటు పలువురు అనిత భౌతికకాయానికి అంజలి ఘటించారు. వారంతా నీట్‌ను రద్దు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ప్రముఖ నటుడు కమలహాసన్ కూడా అనిత విషయంలో తీవ్రంగానే స్పందించారు. మరో విద్యార్థిని నీట్ కారణంగా బలి కాకూడదని, అందుకు అందరూ కలిసికట్టుగా పోరాడాలని కమలహాసన్ ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో నటుడు విజయ్ సోమవారం ఉదయం అనిత స్వగ్రామం కుళుముర్ వెళ్లి ఆమె తండ్రి షణ్ముగం, సోదరులను పరామర్శించారు. ముందుగా అనిత చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన విజయ్ కాసేపు అనిత తండ్రితో మాట్లాడారు. ఆ కుటుంబానికి కొంత ఆర్థిక సాయం అందించి, ఇతరత్రా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు భరోసా ఇచ్చారు. -
చెక్కును తిరస్కరించిన అనిత కుటుంబం!
సాక్షి, చెన్నై: తమిళనాడు ప్రభుత్వం ఇవ్వజూపిన రూ. 7 లక్షల చెక్కును అనిత కుటంబం తిరస్కరించింది. వైద్య కోర్సుల ప్రవేశానికి ఉద్దేశించిన నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) పై తమిళనాడులో రగిలిన వివాదంలో అనిత ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె కుటుంబానికి రూ. 7 లక్షల పరిహారం అందించనున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి గతంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో అరియలూరు కలెక్టర్ జీ లక్ష్మీప్రియ స్వయంగా అనిత ఇంటికి వెళ్లి.. ఆమె కుటుంబసభ్యులకు చెక్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయితే, చెక్ తీసుకునేందుకు అనిత కుటుంబసభ్యులు నిరాకరించారు. 'నీట్ నుంచి తమిళనాడుకు మినహాయింపు కల్పించాలని కోరుతూ అనిత చనిపోయింది. ప్రభుత్వ ఆర్థక సాయం కోసం కాదు' అని అనిత సోదరుడు మణిరత్నం ఈ సందర్భంగా పేర్కొన్నారు. నిరుపేద దళిత కుటుంబానికి చెందిన అనిత (19) ఇంటర్లో మంచి మార్కులు తెచ్చుకుంది. దీంతో సులువుగా తనకు వైద్య కళాశాలలో సీటు వస్తుందని భావించింది. అయితే, నీట్ వల్ల ఆమెకు సీటు రాకపోవడంతో నీట్ పరీక్షకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ నేపథ్యంలో అనిత అనూహ్య ఆత్మహత్యపై పలు అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు నీట్ పరీక్షకు వ్యతిరేకంగా తమిళనాడులో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. -
తమిళనాట జల్లికట్టు తరహాలో మరో ఉద్యమం
-
దయచేసి ఆత్మహత్య చేసుకోవద్దు: నటి
సాక్షి, చెన్నై : వైద్య కోర్సులను అభ్యసించేందుకు ‘నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) పై తమిళనాడులో రగిలిన వివాదంలో విద్యార్థిని ఎస్.అనిత(19) ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారు. అనిత మృతిపై శుక్రవారం తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, డీఎంకే నేత ఎంకే స్టాలిన్ సంతాపాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా నటి కీర్తి సురేష్ అనిత ఆత్మహత్యపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యువతకు ఆమె ఓ విజ్ఞప్తి చేశారు. ఏదైనా సాధించాలనుకుంటే అందుకు ఆత్మహత్య మాత్రం పరిష్కారం కాదని సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. విద్యార్థిని అనిత తన లక్ష్యాలను నెరవేర్చుకోలేక పోయారని, మహిళా శక్తిని నిరూపించే ఓ శక్తిని మనం కోల్పోయామని ఆమె తన ట్వీట్లో రాసుకొచ్చారు. నీట్ కారణంగా దళిత విద్యార్థిని అనిత కలలు ఆవిరైపోయాయని రజనీకాంత్ చెప్పారు. రాజకీయ బేరసారాలతో తమిళనాడు ప్రభుత్వం నిరుపయోగంగా మారిందని ఎంకే స్టాలిన్ దుయ్యబట్టారు. బాధిత విద్యార్థిని కుటుంబానికి రూ. 7 లక్షల పరిహారం అందించనున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి ప్రకటించారు. అయితే నీట్ వివాదం నుంచి రాష్ట్రాన్ని బయటపడేయాలని ఆందోళన వ్యక్తమవుతోంది. అనిత.. చదువులో సరస్వతీ.. కానీ! అనిత రాష్ట్ర ఇంటర్ బోర్డు పరీక్షల్లో 1200 మార్కులకు గాను 1176 మార్కులు సాధించారు. మెడిసిన్ కటాఫ్‌లో 196.75 మార్కులు వచ్చాయి. అయితే నీట్ పరీక్షలో మాత్రం ఆమెకు కేవలం 86 మార్కులే రావడంతో ఎంబీబీఎస్ సీటు రాలేదు. తనకు డాక్టర్ కావాలని ఉందని, ఇంటర్ మార్కులను బేస్‌గా తీసుకుంటే తనకు మెడికల్ సీటు వస్తుందని అయితే నీట్ పరీక్షను ప్రామాణికంగా తీసుకోవద్దంటూ అనిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా.. విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. నీట్ ఆధారంగానే అడ్మిషన్స్ తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆగస్టు 22న తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆందోళనకు గురైన అనిత ఆత్మహత్య చేసుకున్నారు. #RIPAnitha #Strengthtoherfamily pic.twitter.com/2G8TehrpQj — Keerthy Suresh (@KeerthyOfficial) 2 September 2017 -
అనిత కుటుంబానికి రూ.7 లక్షల పరిహారం
సాక్షి, చెన్నై: వైద్య కోర్సులను అభ్యసించేందుకు ‘నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) పై తమిళనాడులో రగిలిన వివాదంలో ఉసురు తీసుకున్న విద్యార్థిని కుటుంబానికి రూ. 7 లక్షల పరిహారం అందించనున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి ప్రకటించారు. రాష్ట్రంలో జరిగిన నీట్ పరీక్షకు వ్యతిరేకంగా సుప్రీం మెట్లెక్కిన అనిత(19) అనూహ్య ఆత్మహత్యపై పలు అనుమానాలకు తావిస్తోంది. క్లిష్ట పరిస్థితుల్లో కూడా అనిత తన చదువును ఆపలేదని ఆమె తండ్రి తెలిపారు. కేవలం నీట్ పరీక్షే ఆమెను ఆందోళనకు గురి చేసిందని చెప్పారు. తన కూతురు మరణానికి ఎవరు సమాధానం చెప్తారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. నామ్ తమిళర్ కట్చి సంఘం, స్టూడెంట్స్ స్టేట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, రివల్యూషనరీ స్టూడెంట్స్ అండ్ యూత్ ఫ్రంట్ సభ్యులు అనితకు నివాళులు అర్పించారు. నీటి పరీక్షను రద్దు చేయాలంటూ చెన్నైలోని పలు ప్రాంతాల్లో శనివారం ఆందోళన నిర్వహించారు. జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష్(నీట్) నుంచి తమళనాడు మినహాయించలేమని కేంద్ర స్పష్టం చేసిన వారం రోజులకు తర్వాత, తనకు ఇక మెడికల్ సీట్ రాదన్న ఆందోళనతో అనిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. -
విద్యార్థిని ఉసురు తీసిన నీట్ వివాదం
చెన్నై: వైద్య కోర్సులను అభ్యసించేందుకు ‘నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) పై తమిళనాడులో రగిలిన వివాదం ఓ విద్యా కుసుమం ఉసురు తీసింది. నీట్‌కు వ్యతిరేకంగా పోరు మొదలు పెట్టిన దళిత విద్యార్థిని అనూహ్యంగా తనువు చాలించింది. తమిళనాడుకు చెందిన దళిత విద్యార్థిని ఎస్.అనిత (19) శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష్(నీట్) నుంచి తమళనాడు మినహాయించలేమని కేంద్ర స్పష్టం చేసిన వారంరోజులకు ఆమె, తనకు ఇక మెడికల్ సీట్ రాదన్న ఆందోళనతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం మరింత విషాదాన్నినింపింది. సెందురై సమీపంలోని కుజుమూర్ గ్రామానికి చెందిన అనిత రాష్ట్ర ఇంటర్ బోర్డు పరీక్షల్లో అద్భుత ప్రతిభకనబర్చింది. ఇంటర్లో ఆమెకు 1200 మార్కులకు గాను 1176 మార్కులు వచ్చాయి. మెడిసిన్ కట్ ఆఫ్‌లో 196.75 మార్కులు వచ్చాయి. అయితే నీట్ పరీక్షలో మాత్రం ఆమెకు కేవలం 86 మార్కులే వచ్చాయి. దీంతో ఆమె ఎంబీబీఎస్ సీటును పొందలేకపోయింది. అయితే నీట్ పరీక్షను ప్రామాణికంగా తీసుకోవద్దంటూ అనిత సుప్రీంలో కేసు వేసింది. తనకు డాక్టర్ కావాలని ఉందని, ఇంటర్ మార్కులను బేస్‌గా తీసుకుంటే తనకు మెడికల్ సీటు వస్తుందని ఆమె తన అప్పీల్లో వేడుకొంది. అయితే నీట్‌పై నిరసన తెలుపుతూ తమిళనాడు విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. నీట్ ఆధారంగానే మెడికల్ అడ్మిషన్స్ తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆగస్టు 22న తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. ఇది చాలా దురదృష్టకరమంటూ ఆమె మరణంపై సంతాపాన్ని వ్యక్తంచేశారు. అటు డీఎంకే నాయకుడు ఎంకే స్టాలిన్ కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. నీట్ కారణంగా అనిత కలలు ఆవిరైపోయాయని విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు. రాజకీయ బేరసారాలతో ప్రభుత్వం నిరుపయోగంగా మారిందని దుయ్యబట్టారు. మరోవైపు విద్యార్థుల ప్రయత్నం విఫలం కావడంతో నీట్ నుంచి తమిళనాడును మినహాయింపుకోరుతూ రాష్ట్ర అసెంబ్లీలో బిల్లును ఆమోదించింది. ఇది రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో వుంది. అలాగే నీట్ వల్ల మెడికల్ సీట్లు పొందలేక డిప్రెషన్లో ఉన్న విద్యార్థుల కోసం తమిళనాడు రాష్ట్రం ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. #RipAnitha pic.twitter.com/p5t507dLaQ — Rajinikanth (@superstarrajini) September 1, 2017 -
వివాహిత అదృశ్యంపై కేసు
చిలమత్తూరు (హిందూపురం) : చిలమత్తూరు మండలం కొడికొండకు చెందిన డి.శ్రీనివాసులు భార్య అనిత అదృశ్యంపై గురువారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ జమాల్‌బాషా తెలిపారు. తన ఇద్దరు పిల్లలను వదిలేసి, ఎనిమిది రోజుల నుంచి తమ కుమార్తె కనిపించడం లేదంటూ అనిత తండ్రి నారాయణస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. బాలిక అదృశ్యంపై.. తాడిపత్రి రూరల్: తాడిపత్రి మండలం సజ్జలదిన్నెకు చెందిన శ్రావణి(14) అదృశ్యంపై గురువారం కేసు నమోదు చేసినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. ఈ నెల 16న బయటకు వెళ్లొస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన తమ కుమార్తె ఇప్పటి వరకు తిరిగి రాలేదని ఆమె తండ్రి విజయ్ తమకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
‘దిల్’ మిస్సింగ్
‘దిల్’ సినిమా తీసినందుకు వెంకటరమణకి ‘దిల్’ రాజు అని పేరొచ్చింది. సినిమాల్లో రాణించాడు.. కారణం ఇంట్లో ఉన్న మహరాణి వల్లే. అందరూ పిలుచుకునే ‘దిల్’ రాజుకు ఇప్పుడు ఎంతగానో... ఎంతెంతగానో ‘దిల్’ మిస్సింగ్. ♦ ముందుగా ‘శతమానం భవతి’కి జాతీయ అవార్డు దక్కినందుకు కంగ్రాట్స్ రాజుగారు.. ‘దిల్’ రాజు: థ్యాంక్స్ అండి. మా సంస్థ నుంచి వచ్చిన మరో మంచి ఫ్యామిలీ మూవీ ఇది. ప్రేక్షకాదరణతో పాటు జాతీయ అవార్డు దక్కడం హ్యాపీగా ఉంది. ♦ ఇంత పెద్ద విజయం ఓ వైపు... మీ భార్య (అనిత) మరణంతో ఏర్పడిన పెద్ద వెలితి మరోవైపు... రాజు: చాలా పెద్ద వెలితి. ‘షీ ఈజ్ బెస్ట్’. ఏ భర్తకైనా ఇంట్లో ప్రశాంతత ఉన్నప్పుడే బయట సక్సెస్ కాగలడు. డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్ వ్యవహారాలతో బయట నేను ఫుల్ బిజీ. ఆమె ఇంటిని బాగా చూసుకునేది. ఇంటికి రాగానే ఒత్తిడి మొత్తం పోయేది. ♦ అనితగారికి ఆరోగ్య సమస్యలేమైనా? రాజు: పోయిన సంవత్సరం నుంచి మోకాళ్ల నొప్పితో బాధపడుతోంది. ఇప్పుడే ఇలా ఉందంటే ఫ్యూచర్లో ఎలా ఉంటుందో అని నేనూ, మా పాప బాధపడేవాళ్లం. వేరే ఆరోగ్య సమస్యలేవీ లేవు. డైట్ స్టార్ట్ చేసి, ఓ 15 కిలోలు తగ్గాలని చెబుతుండేవాణ్ణి. లైపో చేయించుకుంటానని సరదాగా అనేది. మా అమ్మాయికి మాటలు వచ్చి నన్ను ‘డాడీ’ అని పిలవడం మొదలు పెట్టినప్పటి నుంచీ అనిత నన్ను ‘డాడీ’ అనడం మొదలుపెట్టింది. మనవడి తోనూ ‘డాడీ’ అని పిలిపిస్తాననేది. మా 27 ఏళ్ల వైవాహిక జీవితంలో నన్ను పేరు పెట్టి పిలిచింది లేదు. ♦ 27 ఏళ్లు మీతో లైఫ్ పంచుకున్న అనితగారి హఠాన్మరణం... రాజు: నిజంగా పెద్ద షాక్. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని, భోజనం చేస్తుంటే ఏదో వెలితి. ఆమె కూర్చునే కుర్చీ ఖాళీగా కనిపిస్తుంటే ఏదో బాధ. ప్రతిరోజూ ఆ చైర్ చూస్తున్నా. వద్దంటున్నా కొసరి కొసరి వడ్డించేది. ఆ మూమెంట్స్ వెంటాడుతున్నాయి. ఇప్పట్లో తేరుకోవడం అంటే... (కాసేపు మౌనం). డెఫినెట్‌గా ఓవర్‌కమ్ అవ్వాలి. అది అంత సులభం కాదని తెలుసు. వాస్తవానికి మా కుటుంబంలో నేను చూసిన రెండో మరణం ఇది. 32 ఏళ్ల క్రితం మా నాన్నగారి మేనత్తగారు చనిపోయారు. నాకు తెలిసిన డెత్ అదే. ఆ తర్వాత మా ఇంట్లో మళ్లీ చూడలేదు. ఇదిగో.. ఈ ఏడాది చూడాల్సి వచ్చింది. ♦ హన్షితా (‘దిల్’ రాజు కుమార్తె).. మీకు బాబు పుట్టి నాలుగు నెలలే అయింది. ఇలాంటి టైమ్‌లో అమ్మమ్మ అవసరం బేబీకి చాలా ఉంటుంది కదా? హన్షిత: అవునండి. నాకు బాబు పుట్టాలని అమ్మ కోరుకునేది. అది నిజమైనందుకు చాలా ఆనందపడింది. మనవణ్ణి చూసి అమ్మ చాలా మురిసిపోయేది. బాబు ఆలనా, పాలనా చూసుకునేది. ఆవిడ ధ్యాస అంతా వాడి మీదే. ఇప్పుడు అమ్మ లేదనే ఆలోచన భరించలేనంత బాధగా ఉంది. డెఫినెట్‌గా వియ్ మిస్ హర్. ♦ మీ సినిమాల కథలను అనితగారు వినేవారా? రాజు: నేను, మా పాప సినిమాల గురించి ఎక్కువ డిస్కస్ చేసుకుంటాం. దాంతో ‘ఎప్పుడూ సినిమాల గురించేనా? వేరే టాపిక్ లేదా’ అనేది. ఇలాంటి కథతో సినిమా చేస్తున్నానని మా పాపకు చెబుతుండేవాణ్ణి. నా భార్యకు కథలు చెప్పింది లేదు. సినిమా రెడీ అయ్యాక చూపించేవాణ్ణి. సాంగ్స్ కావాలంటే వినిపించేవాణ్ణి. ♦ మీకు నేషనల్ అవార్డు తెచ్చిన ‘శతమానం భవతి’ చూసినప్పుడు అనితగారు ఏమన్నారు? రాజు: తనకు చాలా నచ్చిన సినిమా. మేం కలసి చూసిన చివరి సినిమా అదే. కలసి ఎటెండ్ అయిన చివరి ఫంక్షన్ కూడా ఈ సినిమాదే. ‘శతమానం భవతి’ సినిమా ఆడియో ఫంక్షన్‌కు ఫ్యామిలీ మెంబర్స్ అంతా హాజరయ్యాం. ఆ రోజు నాన్నగారి పుట్టినరోజుని ఆ స్టేజిపైనే సెలబ్రేట్ చేశాం. ఆ తర్వాత ‘శతమానం భవతి’ సక్సెస్మీట్కు అందరం కలసి వెళ్లాం. అదే లాస్ట్. ♦ మీ నాన్నగారు తీసిన సినిమాల్లో మీకు నచ్చినవి? హన్షిత: నాకు బాగా నచ్చిన సినిమా ‘బొమ్మరిల్లు’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’. ‘శతమానం భవతి’ కూడా నచ్చింది. ♦ మీ నాన్నగారు ‘బొమ్మరిల్లు’ టైప్ ఫాదర్ కాదని అర్థమవుతోంది... హన్షిత: ఆ ఫాదర్‌లా మా నాన్నగారు స్ట్రిక్ట్ కాదు. ఈయన ఫ్రెండ్లీ ఫాదర్. ఎగ్జామ్స్ టైమ్‌లో నేను ఉదయం ఐదు గంటలకు అలారం పెట్టుకుని పడుకునేదాన్ని. ఐదు గంటలకు మోగినా లేచేదాన్ని కాదు. అమ్మానాన్న కూడా నిద్ర లేపేవాళ్లు కాదు. సరిగ్గా నిద్ర పోకపోతే ఎగ్జామ్స్ రాయడం కష్టం అనేవాళ్లు. అలా చదివితేనే నాకు 60 పర్సెంట్, 70 పర్సెంట్ వచ్చేది. నువ్వింకా ఎక్కువసేపు చదివితే ఇంకా మంచి పర్సంటేజ్ వచ్చేదని ప్రోత్సహించేవారు. ♦ అనితగారు చనిపోయినప్పుడు మీరు అమెరికాలో ఉన్నారు. అక్కణ్ణుంచి ఇక్కడివరకూ రావడానికి పట్టిన టైమ్‌లో మీరెలా ఫీలయ్యారు? రాజు: నా లైఫ్‌లో ఆ రోజు వరస్ట్ డే. నాకు 46 ఏళ్లు కంప్లీట్ కావస్తున్నాయి. జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూశాను. మంచి, చెడు రోజులు చాలానే ఉన్నాయి. కానీ, ఈ వార్తను మాత్రం జీర్ణించుకోలేకపోయాను. నిజానికి కొన్ని సంఘటనలు విచిత్రంగా జరిగాయి. నేను నైట్ జర్నీస్ చేసినప్పుడు ఆమెను నిద్ర లేవద్దని చెప్పేవాణ్ణి. తను కూడా లేచేది కాదు. కానీ, లాస్ట్ మంథ్ సిక్త్స్ నేను రాత్రి రెండు గంటలకు ఎయిర్‌పోర్ట్‌కి బయల్దేరినప్పుడు తను నిద్రలేచి సాగనంపింది. ఆ రోజు ఉదయం పావ్ బాజీ చేసి, తినేవరకూ ఊరుకోలేదు. ఆమె చేతుల మీదగా తిన్న చివరి ఫుడ్ అదే. అంతకు ముందు రోజు మనవడు బోర్లా పడుతున్నాడని వాళ్ల అమ్మానాన్నలను ఇంటికి పిలిపించింది. నేనిక్కడ లేనప్పుడు జరగరానిది జరుగుతుంది కాబట్టి, మా పాపకు తోడుగా ఉండటం కోసం అనిత తన అమ్మానాన్నలను మా ఇంటికి పిలిచేలా గాడ్ డిజైన్ చేశాడేమో. ♦ జీవితం ఊహించలేని ఓ ప్రయాణం అనేది ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అనిపిస్తుంటుంది కదా? రాజు: అవును. నిజానికి మా ఇంట్లో ఈ చెడు సంఘటన జరగక ముందు నాకెందుకో తెలియని కలవరం. చెడు జరగబోతోందని అనిపిస్తుండేది. నేనొకటి ప్లాన్ చేస్తే వేరే ఒకటి జరిగేది. ఫర్ ఎగ్జాంపుల్.. ‘డీజె’ షూటింగ్ కోసం నేను కర్ణాటకలోని బేలూరు వెళ్లాలి. యూనిట్ మొత్తం వెళ్లారు. నాకు జ్వరం రావడంతో ఆగిపోయాను. తర్వాత రోజు మార్నింగ్ ఫ్లైట్ బుక్ చేసుకుని బెంగళూరు వెళ్లి, అక్కడి నుంచి బేలూరు వెళ్లా. అప్పటికే మధ్యాహ్నం దాటిపోయింది. టెంపుల్లో షూట్ ప్లాన్ చేశాం. కానీ, పర్మిషన్ దొరకలేదు. అందరి డేట్స్ వేస్ట్ అవుతాయి. ఏం చేయాలా? అని ఆలోచిస్తున్నప్పుడు హరీష్ శంకర్ నిజమాబాద్‌లోనూ, సంఘీ టెంపుల్లోనూ రెండేసి రోజులు షూట్ చేద్దామన్నాడు. ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదు. ఏదో చెడు జరగబోతుందని నా సిక్త్స్ సెన్స్ చెబుతోంది. నా మనసుకి అనిపించినట్లుగానే చెడు జరిగింది. మార్చి 19న బ్రహ్మోత్సవాలకి వెళ్లాలనుకున్నాం. 11న ఊహించని సంఘటన జరిగింది. ♦ అనితగారి మరణం తర్వాత ‘ఇదే ఇదే జీవితం..’ అనే పాటను పదే పదే విన్నానని ఇటీవల చెప్పారు. ఫిలసాఫికల్‌గా మీలో ఏమైనా మార్పు వచ్చిందా? రాజు: మార్పు తప్పకుండా ఉంది. అయితే దాని ప్రభావం ఏ రేంజ్లో ఉంటుందనేది లాంగ్ రన్లో తెలుస్తుంది. ఎంత బాధలో ఉన్నా దాన్నుంచి డీవియేట్ అయ్యి, ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయాలి. నన్ను మావాళ్లందరూ ఒంటరిగా వదలడంలేదు. హర్షిత్ (‘దిల్’ రాజు అన్నయ్య నరసింహారెడ్డి కొడుకు) అయితే నాతోనే ఉంటూ, నా రూమ్‌లోనే పడుకుంటున్నాడు. నేను పదమూడు రోజు లు ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేదు. ఆ సమయంలో ‘ఇదే ఇదే జీవితం.. సుఖః దుఃఖాల సంగమం’ పాట విన్నా. అప్పుడనిపించింది.. రచయితలు ఊరికే రాయరు. జీవితానుభవాలనే రాస్తారని. ఆ థాట్ ప్రాసెస్‌లో ఒక స్టోరీ లైన్ తట్టింది. ఆ స్టోరీతో సినిమా తీయాలనుకుంటున్నా. జీవితం చాలా విచిత్రం. గడచిన 5 నెలల్లో ‘శతమానం భవతి’ ఒక హ్యాపీనెస్, గ్రాండ్సన్ ఓ హ్యాపీనెస్, ‘నేను లోకల్’ ఒక హ్యాపీనెస్. అద్భుతంగా లైఫ్ ముందుకు వెళుతోంది అనుకున్నప్పుడు దేవుడు అనుకోని జర్క్ ఇచ్చాడు. ఆ జర్క్‌లో ఉండగానే నేషనల్ అవార్డు, చక్రపాణి, నాగిరెడ్డిగారి అవార్డు దక్కాయి. 5 నెలల్లో అటూ.. ఇటూ చూపించాడు. ఆ పాట సరిగ్గా నా పరిస్థితికి తగ్గట్టుగా ఉంది. అందుకే విన్నాను. ♦ మీది లవ్ మ్యారేజ్ కదా... రాజు: 1989లో మా కజిన్ పెళ్లిలో తనని చూశా. పెళ్లికూతురితో పాటు వస్తారు కదా.. వాళ్లతో పాటు వచ్చింది. ఆ పెళ్లి సమయంలోనే మా పెద్దమ్మగారి ఇంట్లో ఓ నాలుగు రోజులు అందరం ఉన్నాం. అప్పుడు ఏర్పడిన పరిచయం ఇష్టంగా మారింది. ఇంట్లో కొంచెం కష్టపడే పెళ్లికి ఒప్పించాం. అప్పుడు నాకు 20 ఏళ్లే. ♦ డిస్ట్రిబ్యూటర్‌గా, నిర్మాతగా మీ విజయాలకు అనితగారు గర్వపడేవారా? రాజు: గర్వం అంటే తెలియదు. సింపుల్ పర్సన్. ఫ్యామిలీ మెంబర్స్‌ని బాగా చూసుకునేది. కథలు చెప్పడానికి మా ఇంటికి వచ్చినవారిని ఎంతో మర్యాదగా చూసేది. ♦ ఇప్పుడు మీ మనసుకి స్వాంతన మీ మనవడే కదా... రాజు: అవును. ఆర్షాన్ టైమింగ్స్‌ను బట్టి నా టైమింగ్స్‌ను ఛేంజ్ చేసుకున్నాను. మార్నింగ్ 7గంటలకి లేస్తాడు. ఆ ౖటైమ్కి ఇంట్లో ఉంటున్నా. సాయంత్రం 5 నుంచి 7 గంటలు కూడా వాడితోనే. ఆర్షాన్తో టైం స్పెండ్ చేయడానికి షూటింగ్ స్పాట్ నుంచి కొంచెం త్వరగానే ఇంటికి వెళుతున్నాను. ఇప్పుడు వాడే నాకు ఊరట. అమ్మ మా మధ్యే ఉందనిపిస్తోంది మా అమ్మ మా మాధ్య లేదన్న నిజాన్ని నమ్మలేకపోతున్నా. పిల్లాడితో ఆడుకుంటున్నప్పుడు ఆమె పక్కనే ఉన్న ఫీలింగ్ కలుగుతుంటుంది. లేకపోతే కిచెన్‌లో ఉందనో, మేడ మీదకు వెళ్లిందనో, బయటకు వెళ్లింది.. వచ్చేస్తుందనో అనిపిస్తుంటుంది. నాకు తెలియకుండానే ఒక్కొక్కసారి ‘అమ్మా’ అని పిలుస్తున్నాను. వెంటనే గుర్తొచ్చి కన్నీళ్ళు వస్తాయి. సడన్‌గా కదా... నమ్మలేకపోతున్నాను. అమ్మను హాస్పిటల్‌కి తీసుకెళ్లింది నేనే. డాక్టర్స్ హార్ట్ బీట్ లేదంటే, ఏం కాలేదు. ముందు సెలైన్ ఎక్కించండి అంటూ వాదించాను. అమ్మ లేదనే విషయాన్ని నమ్మడానికి ఇంకా టైమ్ పడుతుంది. – హన్షిత మా పాప స్ట్రాంగ్ అయి నన్ను సముదాయించింది అనిత మరణం గురించి ముందు మా అల్లుడు అర్చిత్ చెప్పాడు. అప్పుడు అమెరికాలో ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ. ఆ న్యూస్ వినగానే 10 నిమిషాల పాటు బ్లాంక్ అయ్యాను. నా ఆలోచన అంతా మా పాప గురించే. కాసేపటికి హరీష్ శంకర్ (డైరెక్టర్) ఫోన్ చేశాడు. ‘అన్నా తొందరగా రా అన్నా. పాపను చూడలేకపోతున్నాం’ అన్నాడు. అక్కడే నాతోపాటు ఉన్న నా కజిన్ శిరీష్ చాలా బాధపడ్డాడు. అనితకు వాడు బాగా ఎటాచ్డ్. శిరీష్ కంట్రోల్ కావడం లేదు. హర్షిత్ ఏమో నన్ను, శిరీష్‌ను కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాడు. ఫ్లైట్ ఎక్కాక మాకు ఫోన్ కాల్స్ లేవు. వాట్సాప్‌లో టచ్‌లో ఉన్నారు. నేను ఇంటికి వచ్చిన తర్వాత కుప్ప కూలిపోతానని మా పాపకు తెలుసు. అందుకే తనను తాను సంభాళించుకుంది. తను స్ట్రాంగ్ అయి, నన్ను సముదాయించింది. నేను ఇంటి దగ్గర కారు దిగగానే, తనే బయటకు వచ్చి నన్ను లోపలికి తీసుకెళ్లింది. – ‘దిల్’ రాజు 27తో ఏదో ఉంది! మా అమ్మానాన్నల జీవితంలో ‘27’కి కీ రోల్ ఉందనిపిస్తోంది. వాళ్లిద్దరూ కలిసి చూసిన మొదటి సినిమా ‘గీతాంజలి’ (1990). 27 ఏళ్ల క్రితం వచ్చిన ఆ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది. ఆ సినిమా వచ్చిన 27 ఏళ్లకు ‘శతమానం భవతి’ వచ్చింది. దీనికీ నేషనల్ అవార్డు దక్కింది. అమ్మ చనిపోయాక అమెరికా నుంచి నాన్నగారు ఇక్కడికి రావడానికి 27 గంటలు పట్టింది. పెళ్లయిన 27 ఏళ్లకు అమ్మ చనిపోయింది. – హన్షిత ఆ 27 గంటలూ ఏవో ఆలోచనలు అనిత చనిపోయిందనే కబురు వచ్చాక అమెరికా నుంచి నాకు ఇక్కడికి రావడానికి 27 గంటలు పట్టింది. అన్ని గంటల్లో నాకు కంటి మీద కునుకు రాలేదు. ఏవో జ్ఞాపకాలు కళ్లు మూత పడనివ్వలేదు. ఏదేమైనా ఆ భగవంతుని డిజైన్ విచిత్రంగా ఉంటుంది. – ‘దిల్’ రాజు ప్రస్తుతం చేస్తున్న సినిమాలు? ‘డీజే’, ‘ఫిదా’ కంప్లీట్ స్టేజ్‌కి వచ్చేశాయి. జూలై లోపు రెండు ప్రాజెక్ట్స్ రిలీజ్ అవుతాయి. రవితేజతో ‘రాజా ది గ్రేట్’ స్టార్ట్ చేశాం. నాని హీరోగా ‘ఎమ్.సి.ఎ’ స్టార్ట్ చేయాలి. ఇప్పటికే ఈ ఏడాది మా బేనర్ నుంచి ‘శతమానం భవతి’, ‘నేను లోకల్’ వచ్చాయి. రెండూ హిట్. ఈ ఇయర్ ఆగస్ట్‌లోపు నాలుగు సినిమాలు రిలీజ్ అవుతాయి. బహుశా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకే బ్యానర్లో ఒకే ఏడాది ఆరు సినిమాలు రావడం ఇదే మొదటిసారేమో. చెక్ చేయాలి. ♦ డైరెక్టర్‌గా మారే ఆలోచన ఉందా? రాజు: లేదు. డైరెక్షన్ తెలియదని కాదు. కానీ చేయను. స్క్రిప్ట్, సీన్స్ గురించి మాత్రం డైరెక్టర్స్‌తో డిస్కస్ చేస్తాను. సినిమా రిజల్ట్‌ను చాలావరకూ జడ్జ్ చేయగలుగుతాను. ‘శతమానం భవతి’ క్లాసిక్ అవుతుందనుకున్నా. నంది అవార్డు కూడా వస్తుందనుకున్నా. ఏకంగా నేషనల్ అవార్డు వచ్చింది. 2017లో ‘బాహుబలి–2’ రిలీజ్ అవుతుంది. అవార్డులు ఆ సినిమాకే వచ్చే ఛాన్స్ ఎక్కువ. అందుకే నంది అవార్డు కోసం ‘శతమానం భవతి’ సినిమాని 2016లోనే సెన్సార్ చేయించాం. నా బ్రదర్ నర్సింహారెడ్డి ఎడిటింగ్ రూమ్‌లో ‘శతమానం భవతి’ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. డెఫినెట్‌గా నేషనల్ అవార్డు వస్తుందని ఆయన అన్నారు. అది నిజమైంది. ♦ మీ ప్రతి సినిమా రిలీజ్‌కు ముందు తిరుమల వెళ్లి తలనీలాలు ఇస్తారు.. ఫస్ట్ టైమ్ ఎప్పుడు మొదలుపెట్టారు? రాజు: డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నప్పుడే. ‘పెళ్లి పందిరి’ నుంచి తలనీలాలు ఇవ్వడం స్టార్ట్ చేశాను. దేవుడు ఈ ఏడాది నాకా అదృష్టం ఇవ్వలేదు. ఈ ఇయర్ నాలుగు సినిమాలు రిలీజ్ అవుతాయి. మరో వన్ ఇయర్ వరకు నేను గుడికి వెళ్లకూడదు కదా. 2016 ప్రొఫెషనల్‌గా ఇప్పటివరకూ రెండు సక్సెస్‌లు ఇచ్చింది. పర్సనల్‌గా ఓ చేదు అనుభవాన్ని మిగిల్చింది. జీవితం ఇంతే. ఒక మంచి... ఒక చెడు... ఒక చెడు... ఒక మంచి. దేవుడు అలా డిజైన్ చేస్తాడు. -
నిర్మాత దిల్ రాజుకు సతీ వియోగం
-
నిర్మాత దిల్ రాజుకు సతీ వియోగం
హైదరాబాద్ : ప్రముఖ తెలుగు నిర్మాత, పంపిణీదారుడు దిల్ రాజు అలియాస్ వి.వెంకట రమణారెడ్డికి సతీ వియోగం జరిగింది. దిల్ రాజు భార్య అనిత (46) శనివారం గుండెపోటుతో మృతి చెందారు. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె ఇవాళ తుది శ్వాస విడిచారు. కాగా వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'ఫిదా' చిత్రం షూటింగ్ నిమిత్తం దిల్ రాజు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఈ దుర్వార్త విన్న దిల్ రాజు... అమెరికా నుంచి హైదరాబాద్ బయల్దేరారు. ఆయన వచ్చేవరకు అనిత మృతదేహాన్ని ఆసుపత్రిలోనే ఉంచుతారని తెలిసింది. విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు దిల్‌రాజు కుటుంబానికి సంతాపం ప్రకటించారు. ఇటీవల దిల్ రాజు తమ కుమార్తె హన్హిత రెడ్డి పెళ్లిని గోవాలో గ్రాండ్‌గా జరిపించిన విషయం తెలిసిందే. దిల్ రాజు... శ్రీ వెంకటేశ్వరా ఆర్ట్స్ నిర్మాణ సంస్థను స్థాపించి తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ఆయన నిర్మించిన తొలి చిత్రం దిల్ విజయవంతం కావడంతో ఆ పేరే ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. -
అడ్డుగా ఉన్నాడనే అంతమొందించారు!
కళ్యాణదుర్గం : కుందుర్పి మండలం కరిగానిపల్లెకు చెందిన గూగుళ్ల రుద్రన్న ఇదే మండలం అపిలేపల్లి సమీపంలో గత నెల 10న అనుమానాస్పద స్థితిలో మరణించిన కేసులో భార్యే హంతకురాలని తేలింది. తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే ఉద్దేశంతో ప్రియుడితో కలసి భర్తను హతమార్చినట్లు తమ విచారనలో తేలిందని కళ్యాణదుర్గం సీఐ శివప్రసాద్, ఎస్ఐ శ్రీనివాసులు విలేకరులకు బుధవారం తెలిపారు. గూగుళ్ల రుద్రన్న, భార్య అనిత బతుకుదెరువు కోసం బెంగళూరుకు వలస వెళ్లారు. అక్కడ కర్ణాటకకు చెందిన హనుమంతునిపల్లి వాసి వడ్డే గురుమూర్తితో అనితకు పరిచయం ఏర్పడిందన్నారు. అది వారి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసిందన్నారు. ఈ విషయం తెలిసి భర్త అనితను తరచూ ప్రశ్నిస్తూ గొడవపడేవారన్నారు. ఎలాగైనా అతని అడ్డు తొలగించుకోవాలనుకున్న ఆమె ప్రియుడితో కలసి అతను తన స్నేహితుడు చెన్నరాయుడుతో కలసి ఫిబ్రవరి 10న మద్యం ఇప్పిస్తామని ఆశ చూపి, రుద్రన్నను ఊరి బయటకు తీసుకెళ్లారు. అక్కడ సదరు వ్యక్తులు బండరాయితో అతని తలపై బాది, హతమార్చి పారిపోయారు. హత్య కేసులో నిందితురాలైన మృతుని భార్య అనిత, ఆమె ప్రియుడు గురుమూర్తి, అతని స్నేహితుడు చెన్నరాయుడును కుందుర్పిలో అరెస్టు చేసినట్లు వివరించారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు జడ్జి ఆదేశించారన్నారు. -
కడుపునొప్పితో ఉద్యోగిని ఆత్మహత్య
ధర్మవరం అర్బన్ : పట్టణంలోని పీఆర్టీ వీధిలో నివశిస్తున్న విద్యుత్‌శాఖ ఉద్యోగిని అనిత(35) ఆత్మహత్య చేసుకున్నారు. కొద్ది సంవత్సరాల క్రితం ఆమె భర్త శివయ్య చనిపోవడంతో ఆయన స్థానంలో ఉద్యోగం చేస్తూ వచ్చిన ఆమె శనివారం ఇంట్లో పిల్లలు లేని సమయం చూసి చీరతో ఉరేసుకున్నారు. తన కుమార్తె కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతూ ఉండేదని, ఆ నొప్పి తాళలేకే ఆత్మహత్య చేసుకుందని ఆమె తండ్రి గోపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.