
అనిత, సంజయ్
సంజయ్, రవి బొమ్మవల్, అనిత, తలైవాసల్ విజయ్, ఆదిత్యా మీనన్ ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘సూర్య ది గ్రేట్’. అనితా ఉదీప్ దర్శకత్వంలో షీతల్ గుప్తా, ఎన్.జి. రాజ్‌కుమార్ నిర్మించిన ఓ తమిళ చిత్రాన్ని ‘సూర్య ది గ్రేట్’ పేరుతో అనువదించి, రంజాన్ కానుకగా ఈ నెల 15న తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. అనితా ఉదీప్ మాట్లాడుతూ– ‘‘ఐఏఎస్ కావాలనుకునే ఓ అమ్మాయి మార్కెట్ రౌడీని ప్రేమించి, పెళ్లి చేసుకుంటుంది. తర్వాత కొన్నాళ్లకు వీరు విడిపోతారు. ఇందుకు దారి తీసిన సంఘటనలు ఏంటి? వాళ్ల కడుపున పుట్టినందుకు సూర్య పడిన ఆవేదన అతని జీవితాన్ని ఎలా మలిచింది. ప్రాణ స్నేహితుని హత్యతో సూర్యలో వచ్చిన మార్పేంటి? ఫ్రెండ్ మరణానికి కారణమైన వారిపై తను ఎలా పగతీర్చుకున్నాడు? అన్నదే ఈ చిత్రకథ’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment