adithya menon
-
కష్టపడి చేసిన సీన్స్ కట్ చేశారు, చాలా బాధేసింది: నటుడు
సహాయ నటుడిగా, విలన్‌గా మెప్పిస్తూ వరుస సినిమాలు చేస్తున్నాడు నటుడు ఆదిత్య మీనన్. బిల్లాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఆయన సింహా సినిమాతో బ్రేక్ అందుకున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్ గురించి కూడా మాట్లాడాడు. '2006లో నాకు బెల్స్ పాల్సీ అటాక్ అయింది. దీనివల్ల నా ముఖంలో సగభాగం పక్షవాతానికి గురైంది. ఎక్కువ ఒత్తిడి వల్ల అది వచ్చినట్లుంది. కానీ ఒక నటుడిగా చాలా భయమైంది. ఫిజియోథెరపీ చేయించుకున్నా, చికిత్స తీసుకున్నా. ఒక నెలలో తిరిగి మామూలైపోయాను. ఒక సంఘటన నాకింకా గుర్తుంది. ఓ మలయాళ సినిమా కోసం చాలా కష్టపడి స్టంట్ సీన్స్ చేశాను. తర్వాత సినిమాకు సంబంధించిన పెద్ద నటుడు వచ్చి ఇతనికి ఇంత పెద్ద సీన్లు అవసరమా? అక్కర్లేదు, కొన్ని సన్నివేశాలు కట్ చెయ్ అని చెప్పాడు. అలా నేను కష్టపడ్డ చాలా షాట్స్ తీసేశారు. అప్పుడు చాలా ఫీలయ్యా. కానీ తర్వాత అర్థమైంది. సినిమా అంటేనే గేమ్ అని! స్క్రీన్‌పై వచ్చేదాకా మనం ఎక్కడున్నామనేది ఎవరికీ తెలియదు. ప్రస్తుతం సర్వ సాధారణంగా జరుగుతున్న విషయమిది. ఇప్పుడు నా సన్నివేశాలు తగ్గించినా అంతగా బాధపడను' అని చెప్పుకొచ్చాడు ఆదిత్య మీనన్. చదవండి: ప్రభాస్ సినిమాలో రామ్‌గోపాల్ వర్మ -
మంచి చేసే మాస్టర్
‘‘నేను చాలా ఇష్టపడి చేసిన సినిమా ‘బ్లఫ్ మాస్టర్’. మా సంస్థ ఈ సినిమాని సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నా. ఇది రీమేక్ చిత్రమే అయినప్పటికీ, చాలా మార్పులు చేసి, గోపి బాగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో ప్రతి ఒక్కరినీ ఆయన ఏరికోరి ఎంపిక చేసుకున్నారు’’ అని శివలెంక కృష్ణప్రసాద్ అన్నారు. సత్యదేవ్, నందితా శ్వేత, ఆదిత్య మీనన్, బ్రహ్మాజీ, పృథ్వి, సిజ్జు, చైతన్యకృష్ణ, ‘టెంపర్’ వంశీ, ‘దిల్’ రమేశ్ ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘బ్లఫ్ మాస్టర్’. గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వంలో రమేష్.పి.పిళ్లై నిర్మించారు. శ్రీదేవి మూవీస్‌పై శివలెంక కృష్ణప్రసాద్ సమర్పిస్తున్న ఈ చిత్రం డిసెంబరులో విడుదల కానుంది. శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ– ‘‘బ్లఫ్ మాస్టర్’ కథకు సత్యదేవ్ పక్కాగా న్యాయం చేశారు. సినిమా విజయం పట్ల మేం చాలా నమ్మకంగా ఉన్నాం. డిసెంబర్ ద్వితీయార్ధంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘మన సినిమా ద్వారా సమాజానికి ఎంతో కొంత మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ సినిమా చేశాను. సమాజంలో బ్లఫ్ మాస్టర్లు చాలా ఎక్కువయ్యారు. మా సినిమా చూశాక సమాజంలో మార్పు వస్తుందని అనుకుంటున్నాను’’ అని గోపీ గణేష్ పట్టాభి అన్నారు. ‘‘ఈ సినిమాకి ఎమోషనల్‌గా చాలా కనెక్ట్ అయ్యాను. నన్ను నేను ప్రూవ్ చేసుకునే అవకాశం ఈ చిత్రంతో లభించింది’’ అన్నారు సత్యదేవ్. సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్, సినిమాటోగ్రాఫర్ దాశరది శివేంద్ర పాల్గొన్నారు. ఈ చిత్రానికి కథ: హెచ్. వినోద్, అడిషనల్ డైలాగ్స్: పులగం చిన్నారాయణ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎం.కృష్ణకుమార్ (కిట్టు). ∙ -
ప్రతిదీ న్యూసే!
మనిషి చావు, జ్ఞాపకం, ప్రేమ, స్నేహం... ఇలా చేయాలనుకుంటే ప్రతిదీ న్యూసే. కానీ ఆ న్యూస్‌ను క్యాష్ చేసుకోవాలనుకుంటాడు ఓ యువకుడు. అవసరమైతే న్యూస్‌ను క్రియేట్ చేసేందుకు సిద్ధం అవుతాడు. ఈ ప్రయాణంలో అతను ఎదుర్కొన్న సవాళ్ల నేపథ్యంలో రూపొందిన సినిమా ‘ఇదం జగత్’. అనిల్ శ్రీ కంఠ దర్శకత్వంలో సుమంత్ కథానాయకుడిగా నటించారు. అంజు కురియన్ కథానాయిక. శివాజీ రాజా, సత్య, ఆదిత్యా మీనన్ కీలక పాత్రల్లో నటించారు. జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్‌లు నిర్మించిన ఈ సినిమాను ఈ నెల 28న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘‘ఇటీవల రిలీజ్ చేసిన టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో సుమంత్ కనిపిస్తారు. ఆయన పాత్ర సినిమాకు హైలైట్‌గా ఉంటుంది. కథకు ‘ఇదం జగత్’ టైటిల్ బాగా యాప్ట్ అవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సహనిర్మాత: మురళీకృష్ణ దబ్బుగుడి, సంగీతం: శ్రీచరణ్ పాకాల. -
హత్య చేసిందెవరు?
సంజయ్, రవి బొమ్మవల్, అనిత, తలైవాసల్ విజయ్, ఆదిత్యా మీనన్ ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘సూర్య ది గ్రేట్’. అనితా ఉదీప్ దర్శకత్వంలో షీతల్ గుప్తా, ఎన్.జి. రాజ్‌కుమార్ నిర్మించిన ఓ తమిళ చిత్రాన్ని ‘సూర్య ది గ్రేట్’ పేరుతో అనువదించి, రంజాన్ కానుకగా ఈ నెల 15న తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. అనితా ఉదీప్ మాట్లాడుతూ– ‘‘ఐఏఎస్ కావాలనుకునే ఓ అమ్మాయి మార్కెట్ రౌడీని ప్రేమించి, పెళ్లి చేసుకుంటుంది. తర్వాత కొన్నాళ్లకు వీరు విడిపోతారు. ఇందుకు దారి తీసిన సంఘటనలు ఏంటి? వాళ్ల కడుపున పుట్టినందుకు సూర్య పడిన ఆవేదన అతని జీవితాన్ని ఎలా మలిచింది. ప్రాణ స్నేహితుని హత్యతో సూర్యలో వచ్చిన మార్పేంటి? ఫ్రెండ్ మరణానికి కారణమైన వారిపై తను ఎలా పగతీర్చుకున్నాడు? అన్నదే ఈ చిత్రకథ’’ అన్నారు. -
సూర్య గ్రేట్
సంజయ్, రవిబమ్మవళ్, అనిత, తలైవాసల్ విజయ్, ఆదిత్య మీనన్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘కులీర్ 100’. అనిత ఉదీప్ దర్శకత్వంలో సీతల్గుప్త, ఎన్.జి. రాజ్‌కుమార్ నిర్మించారు. తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ సినిమాని ‘సూర్య ది గ్రేట్’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘కుటుంబ సమేతంగా చూడదగ్గ చక్కటి కథాంశంతో రూపొందిన చిత్రమిది. యువతను అమితంగా ఆకట్టుకునే అంశాలున్నాయి. తెలుగు ప్రేక్షకులకు ఒక మంచి సినిమా అందించాలనే సదుద్దేశంతో ఈ సినిమాను విడుదల చేస్తున్నాం. వేసవి కానుకగా మే నెలలో రిలీజ్ చేస్తాం. తెలుగు వారు మా సినిమాని ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెలకంటి, సంగీతం: బోబో శశి, కెమెరా: ఎల్.కె. విజయ్. ∙అనిత, సంజయ్ -
సూర్య పగ
తమిళనాడులో జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా అనితా ఉదీప్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సూర్య ది గ్రేట్’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. సంజయ్, రవి బమ్మావల్, అనిత, తలైవాసల్ విజయ్, ఆదిత్యా మీనన్ ముఖ్య తారలుగా నటించారు. విదీషా ఎంటర్టైన్మెంట్స్ సంస్థపై షీతల్ గుప్తా, ఎన్.జి. రాజ్‌కుమార్ నిర్మించారు. ‘‘బాధ్యత లేని యువత జీవితాలు ఎలా నాశనం అవుతున్నాయి? అన్న కథాంశంతో రూపొందిన చిత్రమిది. కాలేజీ గొడవల్లో తోటివారి కారణంగా హీరో సూర్య ప్రాణ స్నేహితులు హత్యకు గురవుతారు. శత్రువులపై సూర్య ఎలా పగ తీర్చుకున్నాడు? అన్న అంశాలు ప్రేక్షకులకు ఆసక్తికరంగా ఉంటాయి. వేసవిలో రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు చిత్రబృందం. ఈ సినిమాకు సంగీతం: బోబో శశి, ఎడిటింగ్: ఎల్.కె. విజయ్. -
రజనీకాంత్‌ను అగౌరవపరచలేదు!
నటుడు రజనీకాంత్‌ను అగౌరవపరిచేలా, ఆయన కీర్తికి భంగం కలిగే విధంగా తాను ‘మై హూ రజనీ’ చిత్రాన్ని రూపొందించలేదని ఆ చిత్ర దర్శకుడు పైసల్ సాబు వివరణ ఇచ్చారు. హర్షా ప్రొడక్షన్స్ హిందీలో నిర్మించిన ‘మై హూ రజనీ’ చిత్రాన్ని తమిళంలో ‘నాన్ దాన్ రజనీ’ పేరుతో అనువదించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో రజనీకాంత్ పేరుతో ఆదిత్యమీనన్ నటించారు. కాగా తన పేరు ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా ఉన్న ఆ చిత్రం విడుదలను నిషేధించాల్సిందిగా రజనీకాంత్ బుధవారం చెన్నై హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయగా, కోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై దర్శకుడు పైసల్ సాబు స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో ఆయన పేర్కొంటూ తాను రజనీకాంత్ వీరాభిమానినన్నారు. ‘మై హూ రజనీ’ చిత్రంలో ఆయన పేరు మాత్రమే ఉపయోగించామని తెలిపారు. అంతకుమించి రజనీకాంత్‌కు సంబంధించిన ఎలాంటి అంశం చిత్రంలో ఉండదన్నారు. చిత్రంలో హీరో పేరు రజనీకాంత్ అని వెల్లడించారు. కోర్టు నుంచి తనకెలాంటి నోటీసులు అందలేదని, ఒకవేళ అలాంటి దేమైనా వస్తే తదుపరి చర్యల గురించి నిర్ణయం తీసుకుంటానని పైసల్ సాబూ తెలిపారు. -
ఆ సినిమా.. తలైవా గౌరవాన్ని పెంచేదే: ఆదిత్యమీనన్
హిందీలో తాను తీయబోతున్న 'మై హూ రజనీకాంత్' సినిమా.. తమిళ సూపర్‌స్టార్ తలైవా గౌరవాన్ని మరింత పెంచేలాగే ఉంటుంది తప్ప.. ఆయనను కించపరిచేలా ఏమాత్రం ఉండబోదని దక్షిణాది నటుడు ఆదిత్య మీనన్ చెప్పాడు. ఇంతకుముందు విల్లువా, ఈగ లాంటి సినిమాలకు పనిచేసిన ఆదిత్య.. ఇప్పుడు హిందీలో తీస్తున్న 'మై హూ రజనీకాంత్' సినిమా విషయంలో అసలు తనను సంప్రదించకుండా తనపేరు వాడుకోవడంపై రజనీ ఆగ్రహానికి గురయ్యారు. దీనిపై మద్రాసు హైకోర్టులో ఆయన పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఇది కామెడీ సెటైర్ చిత్రమని, దీన్ని ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారని ఆదిత్య మీనన్ అన్నాడు. అసలు రజనీకాంత్‌ను సినిమాల్లో తప్పుగా చూపించే ధైర్యం ఎవరూ చేయలేరని, అలాంటిది తాను ఎలా చేయగలనని అన్నాడు. పేరుతో సహా తమ సినిమాలో రజనీ సార్ గురించి ఎక్కడా తప్పుగా ఉండదన్నాడు. ఈ సినిమాలో ఆదిత్య మీనన్ సీబీఐ అధికారిగాను, కాంట్రాక్టు కిల్లర్‌గా కూడా ఉంటాడు. అందులో ఆ పాత్ర పేరు రజనీకాంత్ రావు. ఇందులో కవితా రాధేశ్యాం, స్మితా గోండ్కర్, రీమా లాగూ, సునీల్ పాల్, గణేశ్ యాదవ్, శక్తికపూర్ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. -
నేనే రజనీకాంత్!
బస్ కండక్టర్‌గా జీవితాన్ని ప్రారంభించి సొంత దేశంలోనే కాక, పరాయి దేశాల్లో కూడా అభిమానుల్ని సంపాదించుకున్న సినీ నటుడు... సూపర్‌స్టార్ రజనీకాంత్. స్ఫూర్తిదాయకమైన ఆయన జీవితం ఆధారంగా బాలీవుడ్లో ఓ సినిమా తెరకెక్కనుంది. సినిమా పేరు ‘మై హూ రజనీకాంత్’. వర్ష ప్రొడక్షన్స్ పతాకంపై సరోజ నిర్మించనున్న ఈ చిత్రానికి ఫైజల్ సైఫ్ దర్శకుడు. తెరపై రజనీకాంత్‌లా కనిపించే అపూర్వ అవకాశాన్ని మలయాళ నటుడు ఆదిత్యమీనన్ కొట్టేశారు. బిల్లా, సింహా, మిర్చి చిత్రాల్లో ప్రతినాయకునిగా అలరించిన ఆదిత్యమీనన్ తెలుగువారికి సుపరిచితుడే. కవితా రాధేశ్యామ్, ఆర్యేమాన్ రామ్ సే ఇందులో కీలక పాత్రధారులు. పాకిస్తానీ సంగీత దర్శకుడు తౌసిఫ్ అలీ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఏప్రిల్ 31న ఈ చిత్రం సెట్స్‌కి వెళ్లనుంది. ఈ సినిమాను రజనీకాంత్‌కి అంకితం ఇవ్వాలని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారు.