నేనే రజనీకాంత్! | adithya menon new movie from varsha productions | Sakshi
Sakshi News home page

నేనే రజనీకాంత్!

Published Fri, Mar 28 2014 12:46 AM | Last Updated on Sat, Sep 2 2017 5:15 AM

నేనే రజనీకాంత్!

నేనే రజనీకాంత్!

 బస్ కండక్టర్‌గా జీవితాన్ని ప్రారంభించి  సొంత దేశంలోనే కాక, పరాయి దేశాల్లో కూడా అభిమానుల్ని సంపాదించుకున్న సినీ నటుడు... సూపర్‌స్టార్ రజనీకాంత్. స్ఫూర్తిదాయకమైన ఆయన జీవితం ఆధారంగా బాలీవుడ్‌లో ఓ సినిమా తెరకెక్కనుంది. సినిమా పేరు ‘మై హూ రజనీకాంత్’.
 
  వర్ష ప్రొడక్షన్స్ పతాకంపై సరోజ నిర్మించనున్న ఈ చిత్రానికి ఫైజల్ సైఫ్ దర్శకుడు. తెరపై రజనీకాంత్‌లా కనిపించే అపూర్వ అవకాశాన్ని మలయాళ నటుడు ఆదిత్యమీనన్ కొట్టేశారు. బిల్లా, సింహా, మిర్చి చిత్రాల్లో ప్రతినాయకునిగా అలరించిన ఆదిత్యమీనన్ తెలుగువారికి సుపరిచితుడే. కవితా రాధేశ్యామ్, ఆర్యేమాన్ రామ్ సే ఇందులో కీలక పాత్రధారులు. పాకిస్తానీ సంగీత దర్శకుడు తౌసిఫ్ అలీ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఏప్రిల్ 31న ఈ చిత్రం సెట్స్‌కి వెళ్లనుంది. ఈ సినిమాను రజనీకాంత్‌కి అంకితం ఇవ్వాలని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement