సహాయ నటుడిగా, విలన్‌గా మెప్పిస్తూ వరుస సినిమాలు చేస్తున్నాడు నటుడు ఆదిత్య మీనన్. బిల్లాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఆయన సింహా సినిమాతో బ్రేక్ అందుకున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్ గురించి కూడా మాట్లాడాడు. '2006లో నాకు బెల్స్ పాల్సీ అటాక్ అయింది. దీనివల్ల నా ముఖంలో సగభాగం పక్షవాతానికి గురైంది. ఎక్కువ ఒత్తిడి వల్ల అది వచ్చినట్లుంది. కానీ ఒక నటుడిగా చాలా భయమైంది. ఫిజియోథెరపీ చేయించుకున్నా, చికిత్స తీసుకున్నా. ఒక నెలలో తిరిగి మామూలైపోయాను.
ఒక సంఘటన నాకింకా గుర్తుంది. ఓ మలయాళ సినిమా కోసం చాలా కష్టపడి స్టంట్ సీన్స్ చేశాను. తర్వాత సినిమాకు సంబంధించిన పెద్ద నటుడు వచ్చి ఇతనికి ఇంత పెద్ద సీన్లు అవసరమా? అక్కర్లేదు, కొన్ని సన్నివేశాలు కట్ చెయ్ అని చెప్పాడు. అలా నేను కష్టపడ్డ చాలా షాట్స్ తీసేశారు. అప్పుడు చాలా ఫీలయ్యా. కానీ తర్వాత అర్థమైంది. సినిమా అంటేనే గేమ్ అని! స్క్రీన్‌పై వచ్చేదాకా మనం ఎక్కడున్నామనేది ఎవరికీ తెలియదు. ప్రస్తుతం సర్వ సాధారణంగా జరుగుతున్న విషయమిది. ఇప్పుడు నా సన్నివేశాలు తగ్గించినా అంతగా బాధపడను' అని చెప్పుకొచ్చాడు ఆదిత్య మీనన్.
Comments
Please login to add a commentAdd a comment