సూర్య గ్రేట్‌ | surya the great movie pressmeet | Sakshi
Sakshi News home page

సూర్య గ్రేట్‌

Published Sat, Apr 28 2018 12:24 AM | Last Updated on Sat, Apr 28 2018 12:24 AM

surya the great movie pressmeet - Sakshi

సంజయ్, రవిబమ్మవళ్, అనిత, తలైవాసల్‌ విజయ్, ఆదిత్య మీనన్‌ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘కులీర్‌ 100’. అనిత ఉదీప్‌ దర్శకత్వంలో సీతల్‌గుప్త, ఎన్‌.జి. రాజ్‌కుమార్‌ నిర్మించారు. తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ సినిమాని ‘సూర్య ది గ్రేట్‌’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘కుటుంబ సమేతంగా చూడదగ్గ చక్కటి కథాంశంతో రూపొందిన చిత్రమిది. యువతను అమితంగా ఆకట్టుకునే అంశాలున్నాయి. తెలుగు ప్రేక్షకులకు ఒక మంచి సినిమా అందించాలనే సదుద్దేశంతో ఈ సినిమాను విడుదల చేస్తున్నాం. వేసవి కానుకగా మే నెలలో రిలీజ్‌ చేస్తాం. తెలుగు వారు మా సినిమాని ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, సంగీతం: బోబో శశి, కెమెరా: ఎల్‌.కె. విజయ్‌.
∙అనిత, సంజయ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement