నటుడు రజనీకాంత్‌ను అగౌరవపరిచేలా, ఆయన కీర్తికి భంగం కలిగే విధంగా తాను ‘మై హూ రజనీ’ చిత్రాన్ని రూపొందించలేదని ఆ చిత్ర దర్శకుడు పైసల్ సాబు వివరణ ఇచ్చారు. హర్షా ప్రొడక్షన్స్ హిందీలో నిర్మించిన ‘మై హూ రజనీ’ చిత్రాన్ని తమిళంలో ‘నాన్ దాన్ రజనీ’ పేరుతో అనువదించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో రజనీకాంత్ పేరుతో ఆదిత్యమీనన్ నటించారు. కాగా తన పేరు ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా ఉన్న ఆ చిత్రం విడుదలను నిషేధించాల్సిందిగా రజనీకాంత్ బుధవారం చెన్నై హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయగా, కోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈ వ్యవహారంపై దర్శకుడు పైసల్ సాబు స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో ఆయన పేర్కొంటూ తాను రజనీకాంత్ వీరాభిమానినన్నారు. ‘మై హూ రజనీ’ చిత్రంలో ఆయన పేరు మాత్రమే ఉపయోగించామని తెలిపారు. అంతకుమించి రజనీకాంత్‌కు సంబంధించిన ఎలాంటి అంశం చిత్రంలో ఉండదన్నారు. చిత్రంలో హీరో పేరు రజనీకాంత్ అని వెల్లడించారు. కోర్టు నుంచి తనకెలాంటి నోటీసులు అందలేదని, ఒకవేళ అలాంటి దేమైనా వస్తే తదుపరి చర్యల గురించి నిర్ణయం తీసుకుంటానని పైసల్ సాబూ తెలిపారు.
రజనీకాంత్‌ను అగౌరవపరచలేదు!
Published Thu, Sep 18 2014 11:54 PM | Last Updated on Sat, Sep 2 2017 1:35 PM
Advertisement
Advertisement