Main Hoon Rajinikanth
-
రజనీకాంత్ కేసు వాయిదా
చెన్నై : హిందీ చిత్రం మేహూ రజనీకాంత్ విడుదలపై నిషేధం విధించాలంటూ నటుడు రజనీకాంత్ చెన్నై హైకోర్టులో వేసిన పిటీషన్ పై విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ కేసును ఇంతకు ముందు విచారించిన న్యాయ స్థానం మైహూ రజనీకాంత్ చిత్రం విడుదల పై తాత్కాలిక స్టే ను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో చెన్నైకి చెందిన సినీ ఫైనాన్షియర్ ముకుల్ చంద్ బోద్రా తనను ప్రతివాదిగా చేర్చాలని పిటీషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి సుబ్బయ్య రజనీకాంత్ తరపున బదులివ్వాల్సిందిగా నోటీసులు జారీ చేసేలా ఉత్తర్వులిచ్చారు. ఈ కేసు గురువారం మళ్లీ విచారణకు వచ్చింది. రజనీకాంత్ తరపు న్యాయవాది కోర్టుకు హాజరై తన క్లైంట్‌ను కలిసే అవకాశం దొరకలేదు కాబట్టి రజనీకాంత్‌ను కలిసి ఆయన సమాధానం తీసుకుని పిటిషన్ దాఖలు చేయడానికి కొంచెం వ్యవధి కావాలని కోరారు. దీంతో న్యాయమూర్తి ఈ కేసును వచ్చే సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. -
రజనీకాంత్ కు నా చిత్రాన్ని చూపిస్తా: ఫైజల్ సైఫ్
ముంబై: సూపర్ స్టార్ రజనీకాంత్ కు తన సినిమాను చూపించడానికి సిద్దంగా ఉన్నానని దర్శకుడు ఫైజల్ సైఫ్ అన్నారు. వివాదస్పదమైన 'మై హూ రజనీకాంత్' చిత్రం టైటిల్ ను మార్చివేయాలంటూ నమోదైన కేసులో మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రజనీకాంత్ పేరు, ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా చిత్ర టైటిల్ ఉందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈకేసులో టైటిల్ లో ఎలాంటి వివాదం లేదని, రజనీకాంత్, మద్రాస్ హైకోర్టు, ఇంకెవరికైనా ఈ చిత్రానికి చూపించడానికి సిద్దంగా ఉన్నానని, ఈ చిత్ర టైటిల్ కు, రజనీకాంత్ వ్యక్టిగత ప్రతిష్టకు ఎలాంటి సంబంధం లేదని ఫైజల్ సైఫ్ మీడిఆయకు వెల్లడించారు. -
రజనీకాంత్‌ను అగౌరవపరచలేదు!
నటుడు రజనీకాంత్‌ను అగౌరవపరిచేలా, ఆయన కీర్తికి భంగం కలిగే విధంగా తాను ‘మై హూ రజనీ’ చిత్రాన్ని రూపొందించలేదని ఆ చిత్ర దర్శకుడు పైసల్ సాబు వివరణ ఇచ్చారు. హర్షా ప్రొడక్షన్స్ హిందీలో నిర్మించిన ‘మై హూ రజనీ’ చిత్రాన్ని తమిళంలో ‘నాన్ దాన్ రజనీ’ పేరుతో అనువదించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో రజనీకాంత్ పేరుతో ఆదిత్యమీనన్ నటించారు. కాగా తన పేరు ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా ఉన్న ఆ చిత్రం విడుదలను నిషేధించాల్సిందిగా రజనీకాంత్ బుధవారం చెన్నై హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయగా, కోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై దర్శకుడు పైసల్ సాబు స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో ఆయన పేర్కొంటూ తాను రజనీకాంత్ వీరాభిమానినన్నారు. ‘మై హూ రజనీ’ చిత్రంలో ఆయన పేరు మాత్రమే ఉపయోగించామని తెలిపారు. అంతకుమించి రజనీకాంత్‌కు సంబంధించిన ఎలాంటి అంశం చిత్రంలో ఉండదన్నారు. చిత్రంలో హీరో పేరు రజనీకాంత్ అని వెల్లడించారు. కోర్టు నుంచి తనకెలాంటి నోటీసులు అందలేదని, ఒకవేళ అలాంటి దేమైనా వస్తే తదుపరి చర్యల గురించి నిర్ణయం తీసుకుంటానని పైసల్ సాబూ తెలిపారు. -
ఆ సినిమా.. తలైవా గౌరవాన్ని పెంచేదే: ఆదిత్యమీనన్
హిందీలో తాను తీయబోతున్న 'మై హూ రజనీకాంత్' సినిమా.. తమిళ సూపర్‌స్టార్ తలైవా గౌరవాన్ని మరింత పెంచేలాగే ఉంటుంది తప్ప.. ఆయనను కించపరిచేలా ఏమాత్రం ఉండబోదని దక్షిణాది నటుడు ఆదిత్య మీనన్ చెప్పాడు. ఇంతకుముందు విల్లువా, ఈగ లాంటి సినిమాలకు పనిచేసిన ఆదిత్య.. ఇప్పుడు హిందీలో తీస్తున్న 'మై హూ రజనీకాంత్' సినిమా విషయంలో అసలు తనను సంప్రదించకుండా తనపేరు వాడుకోవడంపై రజనీ ఆగ్రహానికి గురయ్యారు. దీనిపై మద్రాసు హైకోర్టులో ఆయన పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఇది కామెడీ సెటైర్ చిత్రమని, దీన్ని ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారని ఆదిత్య మీనన్ అన్నాడు. అసలు రజనీకాంత్‌ను సినిమాల్లో తప్పుగా చూపించే ధైర్యం ఎవరూ చేయలేరని, అలాంటిది తాను ఎలా చేయగలనని అన్నాడు. పేరుతో సహా తమ సినిమాలో రజనీ సార్ గురించి ఎక్కడా తప్పుగా ఉండదన్నాడు. ఈ సినిమాలో ఆదిత్య మీనన్ సీబీఐ అధికారిగాను, కాంట్రాక్టు కిల్లర్‌గా కూడా ఉంటాడు. అందులో ఆ పాత్ర పేరు రజనీకాంత్ రావు. ఇందులో కవితా రాధేశ్యాం, స్మితా గోండ్కర్, రీమా లాగూ, సునీల్ పాల్, గణేశ్ యాదవ్, శక్తికపూర్ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. -
‘రజనీకాంత్’ చిత్రంపై నిషేధం!
వివాదాలకు దూరంగా, ఆధ్యాత్మికత్వానికి దగ్గరగా మెలిగే సూపర్‌స్టార్ రజనీకాంత్ తొలిసారిగా కోర్టుకెక్కారు.‘రజనీకాంత్’ సినిమాపై న్యాయస్థానం నిషేధం విధించేలా చేశారు. ఇంతకూ విషయం ఏమిటంటే...‘మే హూనా రజనీకాంత్’ పేరుతో హిందీలో ఒక చిత్రం విడుదలైంది. ఈ చిత్రాన్ని కోలీవుడ్‌కు చెందిన వర్ష ఫిలింస్ వారు ‘ఎన్ పేయర్ రజనీకాంత్’ పేరుతో తమిళంలోకి అనువదించారు. ఈ చిత్రం త్వరలో తమిళనాడులో విడుదల కానుంది. ఈ చిత్రంలో వ్యభిచారం, అసభ్యకర సన్నివేశాలు చోటుచేసుకున్నాయని, ఇటువంటి చిత్రానికి తన పేరు వాడుకోవడం సమాజంలో తన పేరు ప్రతిష్టలకు భంగకరమని మద్రాసు హైకోర్టులో రజనీకాంత్ బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ చిత్రం విడుదల కాకుండా వెంటనే నిషేధం విధించాలని, సినిమా టైటిల్లో తన పేరును తొలగించేలా, చిత్రంలో పాత్రకు తన పేరు వాడకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. రజనీ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి, ఆ చిత్రం విడుదలపై నిషేధం విధించి కేసును 22వ తేదీకి వాయిదావేశారు.