‘రజనీకాంత్’ చిత్రంపై నిషేధం! | Rajinikanth files petition against Hindi movie 'Main Hoon Rajinikanth' | Sakshi
Sakshi News home page

‘రజనీకాంత్’ చిత్రంపై నిషేధం!

Published Wed, Sep 17 2014 10:57 PM | Last Updated on Sat, Sep 2 2017 1:32 PM

‘రజనీకాంత్’ చిత్రంపై నిషేధం!

‘రజనీకాంత్’ చిత్రంపై నిషేధం!

 వివాదాలకు దూరంగా, ఆధ్యాత్మికత్వానికి దగ్గరగా మెలిగే సూపర్‌స్టార్ రజనీకాంత్ తొలిసారిగా కోర్టుకెక్కారు.‘రజనీకాంత్’ సినిమాపై న్యాయస్థానం నిషేధం విధించేలా చేశారు. ఇంతకూ విషయం ఏమిటంటే...‘మే హూనా రజనీకాంత్’ పేరుతో హిందీలో ఒక చిత్రం విడుదలైంది. ఈ చిత్రాన్ని కోలీవుడ్‌కు చెందిన వర్ష ఫిలింస్ వారు ‘ఎన్ పేయర్ రజనీకాంత్’ పేరుతో తమిళంలోకి అనువదించారు. ఈ చిత్రం త్వరలో తమిళనాడులో విడుదల కానుంది.
 
  ఈ చిత్రంలో వ్యభిచారం, అసభ్యకర సన్నివేశాలు చోటుచేసుకున్నాయని, ఇటువంటి చిత్రానికి తన పేరు వాడుకోవడం సమాజంలో తన పేరు ప్రతిష్టలకు భంగకరమని మద్రాసు హైకోర్టులో రజనీకాంత్ బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ చిత్రం విడుదల కాకుండా వెంటనే నిషేధం విధించాలని, సినిమా టైటిల్‌లో తన పేరును తొలగించేలా, చిత్రంలో పాత్రకు తన పేరు వాడకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. రజనీ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి, ఆ చిత్రం విడుదలపై నిషేధం విధించి కేసును 22వ తేదీకి వాయిదావేశారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement