
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ తాజాగా మజాకా మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. నక్కిన త్రినాథరావు డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో రీతూవర్మ హీరోయిన్‌గా నటించారు. మన్మధుడు హీరోయిన్ అన్షు కీలక పాత్రలో కనిపించారు. అయితే ఇటీవల తన మూవీ ప్రమోషన్లలో భాగంగా పలు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తనకెదురైన ఓ ప్రశ్నకు సందీప్ సమాధానమిచ్చారు. రజినీకాంత్ కూలీ మీరు నటిస్తున్నారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. తనపై వస్తున్న వార్తలపై సందీప్ కిషన్ క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఆయన ఏమన్నారో మనం ఓ లుక్కేద్దాం.
రజినీకాంత్ మూవీ కూలీలో తాను నటించడం లేదని సందీప్ కిషన్ అన్నారు. డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తన ఫ్రెండ్ కావడంతోనే కూలీ సెట్‌కు వెళ్లానని తెలిపారు. ఈ చిత్రంలో తన పాత్రపై వస్తున్న వార్తలు కేవలం ఊహాగానాలేనని వెల్లడించారు. నేను దాదాపు 45 నిమిషాల పాటు కూలీ సినిమాను వీక్షించానని సందీప్ వివరించారు. ఈ మూవీ కచ్చితంగా రూ.1000 కోట్ల మార్క్‌ను అధిగమిస్తుందని తెలిపారు. రజినీకాంత్ సార్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ ఖాయమని మన యంగ్ హీరో తన అభిప్రాయం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో లోకేశ్ కనగరాజ్‌తో కలిసి పనిచేస్తానని పేర్కొన్నారు. కాగా.. కూలీ మూవీ సెట్స్ నుంచి లోకేష్ కనగరాజ్, సూపర్ స్టార్ రజనీకాంత్‌తో సందీప్ కిషన్ ఉన్న ఫోటో వైరల్ కావడంతో ఆయన నటిస్తున్నారంటూ వార్తలొచ్చాయి.
(ఇది చదవండి: నాగచైతన్య తండేల్ మూవీ.. అలాంటి సీన్ రిపీట్!)
సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తోన్న కూలీ చిత్రంలో అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్, సత్యరాజ్ లాంటి అగ్రతారలు నటిస్తున్నారు. ఇదిలా ఉంటే పూజా హెగ్డే అధికారికంగా ఈ ప్రాజెక్ట్‌లో చేరింది. ఈ విషయాన్ని ఫిబ్రవరి 27 న మేకర్స్ వెల్లడించారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్కరం బంగారం స్మగ్లింగ్ మాఫియా చుట్టూ తిరిగే యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నరు. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment