నటుడు రజనీకాంత్ ఆధ్యాత్మికత బాటపట్టి చాలా కాలమైన విషయం తెలిసిందే. ఒక పక్క షూటింగ్‌లతో బిజీగా ఉన్నా, కాళీ సమయాల్లో ఆధ్యాత్మికత చింతనతో హిమాలయాలకు వెళ్లి అక్కడ ధ్యానం, యోగా వంటివి చేసి నూతనోత్సాహంతో తిరిగి వస్తుంటారు. అలా ప్రతి చిత్ర షూటింగ్ పూర్తి అయిన తరువాత రజనీకాంత్ హిమాలయాలకు వెళ్లి రావడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. ప్రస్తుతం కూలీ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్ర షూటింగ్ గ్యాప్‌లో ఇటీవల జార్కండ్‌లోని 'యోగా సత్సంగ సొసైటీ రాంజీ' ఆశ్రమానికి వెళ్లి అక్కడ ఒక వారం గడిపి వచ్చారు.
అక్కడ రజనీకాంత్ అనుభవాలను రాంజీ ఆశ్రమం గురించి మీడియాకు విడుదల చేసింది. అందులో రజనీకాంత్ పేర్కొంటూ 'వైఎస్‌ఎస్ రాంజీ ఆశ్రమానికి తాను ఇప్పటికి 3 సార్లు వెళ్లి వచ్చాను. పరమహంస యోగానందా జీ గదిలో కూర్చుని యోగా చేసే భాగ్యం నాకు దక్కింది. ఆ అనుభవాన్ని మాటల్లో వ్యక్తం చేయలేను. 14 ఏళ్ల తరువాత మళ్లీ ఇప్పుడు ఈ ఆశ్రమానికి వచ్చాను. ఇకపై ప్రతి ఏడాది ఈ ఆశ్రమానికి వచ్చి ఒక వారం రోజుల పాటు ఉండాలని నిర్ణయించుకున్నాను. నేను చాలా వైడ్‌గా ఉన్నట్లు నాకే అనిపిస్తోంది. అందుకు కారణం నేను క్రియా యోగా చేయడమే.
2002లో నుంచి నేను క్రియా యోగా చేస్తున్నాను. ఆరంభ దశలో నాకెలాంటి మార్పు కనిపించలేదు. అయితే 12 ఏళ్ల తరువాత ఆ యోగా వల్ల కలిగిన మార్పును గ్రహించాను. నాలో చాలా ప్రశాంతత, మనశాంతి ఏర్పడింది. క్రియా యోగా శక్తి ఏమిటన్నది దాన్ని గురించి తెలిసిన వారికే అర్థం అవుతుంది. ఇది ఒక పరమ రహస్యం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలంటే ఆ యోగాలో మంచి గురువును కనుగొనాలి. ఆ తరువాత వారిని మనం విడిచి పెట్టినా, వారు మనల్ని వదలరు అని నటుడు రజనీకాంత్ పేర్కొన్నారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment