Yoga
-
స్థిరత్వం, నిలకడ బుద్దికోసం..!
ఆంజనేయాసనం అనేది యోగాలో ఒక భంగిమ. దీనిని క్రెసెంట్ మూన్ పోజ్ అని కూడా అంటారు. ఈ ఆసనం హనుమంతుడి తల్లి అంజన చేసే నృత్య భంగిమలోదిగా చెబుతారు. అందుకే ఈ ఆసనానికి ఆంజనేయాసనం అని పేరు. ఈ ఆసనం ప్రయోజనాలు...శరీరాన్ని ఒక కాలు మీద స్థిరంగా ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల సమతుల్యత కలుగుతుంది. స్థిరత్వం మెరుగుపడుతుంది. ఈ ఆసనాన్ని క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల శరీరానికి– మనసుకు మధ్య సమతుల్యత ఏర్పడుతుంది. హిప్ భాగం ఫ్లెక్సిబుల్ అవుతుంది. శరీరంపై అవగాహన కలుగుతుంది. కండరాలను బలోపేతం చేస్తుంది. కీళ్ల పనితీరును, ఉచ్ఛ్వాస–నిశ్వాసలను మెరుగు పరుస్తుంది. మానసిక, శారీరక సంబంధాన్ని బలోపేతం చేస్తుంది. మనస్సును స్థిరంగా ఉంచుతుంది. దిగువ శరీరాన్ని సాగదీయడానికి, ఛాతీని విశాలం చేయడానికి ఈ ఆసనం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఎలా చేయాలంటే... ఎడమ మోకాలిని ముందుకు చాపి, కుడి కాలిని వెనక్కి వంచి, కుడి కాలి మునివేళ్లమీద ఉండాలి. తలను నిటారుగా ఉంచి, రెండు చేతులను కంటికి ఎదురుగా నమస్కార భంగిమలో ఉంచాలి. ఐదు దీర్ఘశ్వాసలు తీసుకోవడం, వదలడం చేయాలి. శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మనసును స్థిరంగా ఉంచే ఈ ఆసనంలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతిరోజూ ఈ ఆసనాన్ని సాధనం చేయడం వల్ల మానసిక వికాసం కూడా మెరుగవుతుంది. (చదవండి: Round Egg Auction: కోటిలో ఒక్కటి ఇలా ఉంటుందేమో..వేలంలో ఎంతకు అమ్ముడుపోయిందంటే..) -
'వాకింగ్ యోగా': జస్ట్ ఒకే వ్యాయామంతో..!
నడక, యోగా రెండూ దేనికవే ప్రత్యేకం. ఆరోగ్యకరమైన వ్యాయామ మార్గాలు. ప్రస్తుతం ఈ రెంటినీ మిళితం చేసిన సరి కొత్త వ్యాయామంగా అందుబాటులోకి వచ్చింది వాకింగ్ యోగా. అటు నడక ద్వారా లభించే ప్రయోజనాలతో పాటు.. ఇటు యోగా ఫలితాలను ఒకే వ్యాయామం ద్వారా అందుకునేందుకు ఇది సహకరిస్తుంది. ఇటీవల తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో అనేక మందిని ఆకట్టుకుంటున్న ఈ వాకింగ్ యోగా విశేషాలివి..నడక మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ నడక– యోగా ఆ ప్రయోజనాలను మరింత ముందడుగు వేయిస్తుంది. ఆధునిక సౌకర్యాలు, పని విధానాల వల్ల చలన రహితంగా మారుతున్న శరీరాన్ని చురుకుగా కదపడానికి విభిన్న రకాలుగా సాగదీయడానికి, సరైన రీతిలో శ్వాస పీల్చుకోడానికి వీలుగా ఈ వాకింగ్ యోగా రూపుదిద్దుకుంది. ఇది నడిచేటప్పుడు మన శరీర భంగిమను మెరుగుపరచడానికి, నడకను మరింత ప్రయోజనకరంగా మార్చడానికి సహకరిస్తుంది. ఏదో నడిచాం అన్నట్టుగా కాకుండా అవగాహనతో నడవడం నేర్పిస్తుంది. ఇందులో ప్రతి అడుగు లోతైన శ్వాస, సున్నితమైన స్ట్రెచ్‌లతో కలిపి ఉంటుంది. భంగిమకు మేలు.. మనలో చాలా మంది మన శరీర భంగిమ ఎలా ఉంటుందో పట్టించుకోకుండా నడుస్తూ ఉంటారు. తద్వారా నడవడం వల్ల కలిగే ప్రయోజనాలను కోల్పోతుంటారు. వాకింగ్ యోగా భంగిమను మెరుగుపరుస్తుంది. చేతులు, కాళ్లు, మెడ.. వీటిని సరైన రీతిలో ఉంచేలా సహాయపడుతుంది. నిటారుగా నిలిచేలా, నడుము భాగం, వీపుతో నడకను అనుసంధానిస్తుంది. కండరాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కొందరికి అననుకూలం.. ఒక వ్యక్తి తమ నడకను మరింత విశ్రాంతిగా అదే సమయంలో మరింత ఉపయుక్తంగా మార్చే నడక యోగా టీనేజర్స్‌తో సహా అన్ని వయసుల వారికీ ఉపయుక్తమే. అయితే అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ఇది అందరికీ అనుకూలం కాకపోవచ్చు. వేగవంతమైన నడక లేదా తీవ్రమైన వ్యాయామాలను ఇష్టపడే వ్యక్తులకు నప్పకపోవచ్చు. అలాగే, దీనికి ఏకాగ్రత, ఎక్కువ సహనం అవసరం. అది లేనివారు దీన్ని సాధన చేయడం కష్టం. నప్పుతుందో లేదో తెలుసుకోడానికి ఒక వారం పాటు దీనిని ప్రయత్నించి పరిశీలించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మానసికంగానూ ఎంతో మేలు.. నడక యోగా ఒత్తిడిని తగ్గించడానికి విశ్రాంతిని అందించడానికి ఒక గొప్ప మార్గం. ఇది నడుస్తున్నప్పుడు లోతుగా శ్వాస తీసుకోవడం అలవాటు చేస్తుంది. తద్వారా ఆందోళనను, ప్రతికూల ఆలోచనలను తగ్గించి మనసును ప్రశాంతపరుస్తుంది. ఇది చురుకుగా ఉంటూనే మెదడుకు రిఫ్రెష్ బటన్ ప్రెస్ చేయడం లాంటిదని చెప్పొచ్చు. మనసు శరీరానికి క్రమబద్ధమైన అభ్యాసం ఇది. ఒత్తిడిని తగ్గించడానికి, మానసిక స్థితిని, ఏకాగ్రతను పెంచడానికి శరీరంపై అవగాహనను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రోజుకు 5 నిమిషాలతో.. బాగా పరిచయం ఉన్న కాస్త ప్రశాంతంగా ఉండే ప్రదేశంలో రోజుకు ఐదు నిమిషాలతో ఈ వాకింగ్ యోగాని ప్రారంభించాలి. రోజుకు క్రమంగా ఐదు నిమిషాల చప్పున పెంచుకోవచ్చు. తద్వారా రొటీన్ వ్యవహారాలకు, వ్యాయామాలతో సర్దుబాటు కావడానికి కండరాలకు సమయాన్ని ఇవ్వాలి. ‘రోజుకు 20 నిమిషాలు వచ్చే వరకూ ఈ విధంగా పెంచుతూపోవాలి. ప్రతిరోజూ 20 నిమిషాలు కేటాయించలేకపోతే.. కనీసం వారానికి మూడు రోజులు 30 నిమిషాలు చేస్తే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. 50 ఏళ్ల క్రితమే.. మైండ్‌ఫుల్ వాకింగ్ అనే ప్రక్రియను యోగా శిక్షకురాలు, యోగా ఫర్ పెయిన్ యాప్ సృష్టికర్త, లండన్‌కు చెందిన సోఫియా డ్రోజ్డ్ వ్యాప్తిలోకి తెచ్చారు. అయితే ఇదేమీ కొత్తది కాదని, దాదాపు 50 ఏళ్ల క్రితం.. అంటే 1970 ప్రాంతంలోనే రోజువారీ కార్యకలాపాలతో యోగా, బ్రీత్వర్క్లను కలిపే సాధనంగా ఇది ప్రప్రథమంగా వినియోగంలోకి వచ్చిందని డ్రోజ్డ్ అంటున్నారు. ప్రకృతితో మమేకం.. మైండ్ ఫుల్ వాక్.. దృష్టిని పూర్తిగా శ్వాస మీదే కేంద్రీకరిస్తూ.. ఆలోచనలు మరే విషయం మీదకూ మళ్లించకుండా శరీరాన్ని కదిలించడమే మైండ్ ఫుల్ నెస్. నడిచే సమయంలో ఈ ప్రక్రియను సాధన చేస్తే.. అద్భుత ప్రయోజనాలు లభిస్తాయి. అది కూడా ప్రకృతిలో మమేకమవుతూ చేయడం మరింత ప్రయోజనకరం. నడకను, యోగాను మేళవించడమే వాకింగ్ యోగా. మైండ్ ఫుల్ బ్రీతింగ్, మైండ్ ఫుల్ నేచర్ వాక్, పచ్చని గడ్డి మీద నడిచే బేర్ ఫుట్ వాక్, క్లౌడ్ గేజింగ్.. వంటివన్నీ ఇందులో భాగంగానే చెప్పవచ్చు. నగరంలో పలువురు వాకింగ్ యోగాను సాధన చేస్తున్నారు. – రీనా హిందోచా, యోగా శిక్షకురాలు (చదవండి: క్షణాల్లో తయారయ్యే ఈ మ్యాగీ నూడుల్స్ రెసిపీని కనిపెట్టిందెవరంటే..) -
Yoga శక్తికీ, ఆత్మస్థైర్య సిద్ధికి చక్కటి ఆసనాలు
యోగా సాధన వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. జీవితం పట్ల సానుకూల ధోరణి ఏర్పడుతుంది. మనోధైర్యాన్నిస్తుంది. ప్రతికూలతలను దూరం చేసి, మనసును ప్రశాంతంగా, ఆత్మస్థైర్యంతో మిమ్మల్ని మీరు కొత్తగా మలుచుకోవడానికి సహకరించే ఐదు ఆసనాలు...తాడాసనం: ఇది పర్వతాన్ని పోలి ఉంటుంది. అందుకే మౌంటెయిన్ పోజ్ అని కూడా అంటారు. చేతులను, కాళ్లను కదల్చకుండా స్థిరంగా, నిటారుగా నిల్చోవడం అలవాట వుతుంది. చదవండి: ఇక్కడ జిమ్‌లో చేరాలంటే నెలకు తొమ్మిది లక్షలు!బాలాసన: చంటి పిల్లలు మోకాళ్లపై బోర్లాపడుకొని ఉన్న భంగిమ ఇది. ఈ ఆసనంలో మ్యాట్‌పైన మోకాళ్లపైన కూర్చుంటూ, ముందుకు వంగి, నుదుటిని నేలకు ఆనించాలి. తలమీదుగా రెండువైపులా చేతులను ముందుకు తీసుకుంటూ, అరచేతులను నేలమీద ఉంచాలి. చదవండి: #WomenPower :హంపీ టెంపుల్లోని ఈ సారథుల గురించి తెలుసా?వీరభద్రాసన: దీనిని వారియర్ పోజ్ అని కూడా అంటారు. నేలపైన నిల్చొని కుడిపాదాన్ని ముందుకు ఉంచాలి. రెండు చేతులను విశాలంగా భుజాలకు ఇరువైపులా చాపాలి. ఈ సమయంలో తల నిటారుగా ఉండాలి. దీర్ఘ శ్వాస తీసుకుంటూ వదలాలి. దీనివల్ల మిమ్మల్ని మీరు శక్తిమంతులుగా భావిస్తారు. ఆత్మగౌరవం, స్వీయ ప్రేమ మెరుగుపడుతుంది. అధోముఖస్వానాసన: మ్యాట్‌పైన బోర్లా పడుకొని, చేతులు, కాలివేళ్ల మీదుగా శరీరాన్ని ఉంచుతూ, హిప్ భాగాన్ని పైకి లేపాలి. దీనిని డాగ్ పోజ్ అని కూడా అంటారు. సాధన ప్రారంభంలో ఈ ఆసనం శరీరాన్ని వామప్ చేయడానికి ఉపయోగ పడుతుంది. ఇది భావోద్వేగ సమతుల్యతను పెంచుతుంది.ఉష్ట్రాసన: మ్యాట్‌పైన మోకాళ్లను నేలకు ఆనిస్తూ కూర్చొని, రెండు చేతులతో కాలి మడమలను పట్టుకుంటూ, వెన్నెముకను వంపుగా,తలను వెనక్కి వంచాలి. దీంతో పొత్తికడుపు స్ట్రెచ్ అవుతుంది. ఈ ఆసనం వల్ల మానసిక స్థైర్యం పెరుగుతుంది. -
వసంత యోగం
ఒత్తిడి సమస్యతో యోగాకు దగ్గరైన వసంత లక్ష్మి ఆ విద్యలోప్రావీణ్యం సాధించి రికార్డులు బ్రేక్ చేస్తోంది. తాజాగా... సమకోణాసనంలో 3.22 గంటలుగా నమోదైన గత గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును బ్రేక్ చేసింది. 3.42 గంటల పాటు సమకోణాసనం వేసి సరికొత్త రికార్డు సృష్టించింది తిరుపతి జిల్లా వెంకటగిరికి చెందిన వసంతలక్ష్మి.‘నేర్చుకోవాలి–చదువుకోవాలి’ అనేది వసంతలక్ష్మి తారకమంత్రం. పెళ్లి అయిన తరువాత చదువుకు దూరం అయింది. ‘ఇక ఇంటి బాధ్యతలు చాలు’ అనుకునేలోపే తారకమంత్రం తనను అప్రమత్తం చేసింది.‘చదువుకోవాలి–నేర్చుకోవాలి’అంతే...ఆమె మళ్లీ చదువుకు దగ్గర అయింది. తిరుపతిలో డిగ్రీ, హిందీ పండిట్ కోర్సు పూర్తి చేసింది. ఆ తరువాత భర్త ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్‌కు చేరుకుంది. అక్కడ ఓ ప్రైవేట్ సంస్థలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసేది. మొదట్లో బాగానే ఉండేది కాని ఆ తరువాత కుటుంబ నిర్వహణ, సేల్స్ ఎగ్జిక్యూటివ్ పనుల వల్ల తీవ్ర ఒత్తిడికి గురయ్యేది. ఆ సమయంలో తనకు యోగా గుర్తుకు వచ్చింది. యోగా అనేది ఒత్తిడిని చిత్తు చేసే తారకమంత్రం అనే విషయం చాలాసార్లు విని ఉన్నది వనంతలక్ష్మి. హైదరాబాద్ అమీర్‌పేటలోని ‘స్వామి వివేకానంద ఇన్ స్టిట్యూట్’లో యోగా క్లాస్‌లో చేరింది. ఇది తన జీవితానికి మేలి మలుపుగా చెప్పుకోవాలి. క్రమం తప్పకుండా సాధన చేసి యోగాలో కేంద్రప్రభుత్వం నుంచి క్వాలిటీ కౌన్సెలర్ ఆఫ్ ఇండియా (క్యూసీఐ) సర్టిఫికెట్ అందుకుంది. ఆ తరువాత నిజామాబాద్‌లోని యోగా ఇన్ స్టిట్యూట్లో గురువు రామచంద్ర దగ్గర అడ్వాన్స్ డ్ యోగాలో ఆరు నెలలపాటు శిక్షణ తీసుకుంది. తనలోని క్రమశిక్షణ, ప్రతిభను గుర్తించిన గురువు రామచంద్ర జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేలా వసంతలక్ష్మిని ప్రోత్సహించాడు. తెలుగు రాష్ట్రాలతో సహా బెంగళూరు, గుజరాత్, హరియాణా, దిల్లీ, తమిళనాడులో నిర్వహించిన వివిధ పోటీల్లో సత్తా చాటి 25 స్వర్ణ, రజత పతకాలు సాధించింది. ఒకవైపు యోగా సాధన చేస్తూనే మరోవైపు ఎమ్మెస్సీ సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేసింది. ‘యోగా అకాడమి’కి శ్రీకారం చుట్టింది. ఆఫ్‌లైన్, ఆన్ లైన్ లో ఎంతోమందికి యోగా నేర్పిస్తోంది. చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలంలో అపోలో హెల్త్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రెండు సంవత్సరాల పాటు పిల్లలకు యోగాలో శిక్షణ ఇచ్చింది. గతంలో 45 మందితో 108 సూర్య నమస్కారాలను కేవలం 28 నిముషాల్లో పూర్తి చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, నోబెల్ వరల్డ్ రికార్డు, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం దక్కించుకుంది. తాజాగా గత రికార్డ్‌ను బ్రేక్ చేసి సమకోణాసనంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్‌లో చోటు సాధించింది. ఆరోగ్య భారత్ కోసం....రికార్డ్‌లు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. గిన్నిస్ బుక్ రికార్డు సాధించడం సంతోషంగా ఉంది. ఇదే స్ఫూర్తితో ఆరోగ్య భారత్ కోసం ఒక ఆశ్రమం ఏర్పాటు చేయాలని ఉంది. ప్రజల అనారోగ్య సమస్యలకు యోగా ద్వారా పరిష్కారం చూపాలనేదే నా లక్ష్యం. – వసంతలక్ష్మి – నిడిగింటి విజయకుమార్, సాక్షి , తిరుపతి డెస్క్/ కలపాటి భాస్కర్, వెంకటగిరి రూరల్ -
యోగా ఇలా చేస్తే...ఎన్నో ప్రయోజనాలు
ఏ రకమైన వ్యాయామం చేసినా పాటించాల్సిన ముఖ్య లక్షణం స్వీయ క్రమ శిక్షణ. వ్యక్తి, శారీరక, మానసిక శ్రేయస్సును మెరుగు పరచడంలో దాని సొంత ప్రాముఖ్యత, ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా యోగా వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. దీంతో పాటు యోగా లక్ష్యాలలో స్వీయ క్రమశిక్షణ పాటిస్తూ, అవగాహనను పెంచుకుంటే సానుకూల ఫలితాలు లభిస్తాయి. ప్రయోజనాలువ్యక్తిగత సంబంధాలలో సానుకూలత, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, కొత్త అభిరుచిని అలవరచు కోవడం, కోపాన్ని, భావోద్వేగాలను నియంత్రించడం, లక్ష్యంపై దృష్టి పెట్టడం, ఫలితాలను సాధించడానికి సహాయపడుతుంది. మొదట యోగా సాధన చేయాలనుకుంటున్న కారణం, నిర్దేశించుకున్న వ్యవధి, శారీరక, మానసిక ఆరోగ్యంలో చూడాలనుకుంటున్న సానుకూల మార్పులను అర్థం చేసుకోవాలి. ఎలా చేయాలంటే... క్రమం తప్పకుండా యోగసాధన చేయడం వల్ల మానసిక క్రమశిక్షణ కలగడం తోపాటు దినచర్యలో భాగం అవుతుంది. జీవనశైలిలో సానుకూల మార్పు గమనించవచ్చు. స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి...నిద్రించడానికి కనీసం 2–3 గంటల ముందు తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి ∙క్రమం తప్పకుండా 7–8 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి.ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను రాత్రిపూట ఎక్కువ సేపు ఉపయోగించకుండా చూసుకోవాలి నిర్ణీత సమయం, ప్రదేశంలో యోగసాధన చేయాలి యోగాభ్యాసాన్ని నిలిపివేయకుండా ఉండటానికి, ఒక గ్రూప్‌తో లేదా స్నేహితులతో కలిసి సాధన చేయాలి. జట్టుగా కలిసి చేసే యోగా వల్ల మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు.చదవండి: ఒక్క సోలార్ బోట్ కోసం అధిక జీతమిచ్చే ఉద్యోగం, అన్నీ వదిలేశారు!Sleep Divorce నయా ట్రెండ్: కలిసి పడుకోవాలా? వద్దా?! -
బెల్లీ ఫ్యాట్ కరగాలంటే, ఈ ఐదు ఆసనాలు చాలు!
అధిక బరువును తగ్గించుకోవడం ఒక ఛాలెంజ్. అందులోనూ కొండలా పెరిగిన బెల్లీ ఫ్యాట్‌ను కరిగించడం పెద్ద సమస్య. పొట్ట చుట్టూ పెరిగిపోతున్న కొవ్వు (ఆడవాళ్లైనా, మగవాళ్లైనా) లుక్‌ను మార్చేయ డమే కాదు, అనేక ఆరోగ్య సమస్యల్ని కూడా తెచ్చిపెడుతుంది. అయితే బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవడం అంత కష్టమేమీ కాదు. మంచి ఆహారం తీసుకుంటూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ముఖ్యంగా కొన్ని యోగాసనాల ద్వారా బెల్లీ ఫ్యాట్‌ను కరిగించవచ్చని యోగా నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఒకసారి చూద్దామా..!యోగా ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ప్యాట్ రిడక్షన్ కోసం అనేక యోగాసనాలు మనకు అందుబాటులో ఉన్నాయి. కొన్ని యోగాసనాలు ఉదర కండరాలను దృఢం చేస్తాయి. హృదయ స్పందన రేటును పెంచుతాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అలాగే బెల్లీఫ్యాట్‌కు కారణమైన ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. జీవక్రియను మెరుగుపరచడం, కోర్ కండరాలను బలోపేతం చేయడం, ఒత్తిడిని తగ్గించడం ద్వారా బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవచ్చు. ఒక విధంగా ఇది ఉదరం చుట్టూ కొవ్వు పేరుకుపోవడానికి ఇవే ప్రధాన కారణం. బెల్లీ ఫ్యాట్ కరిగించేలా మధ్యాహ్నం పూట వేసే కొన్ని ఆసనాలను చూద్దాం.భుజంగాసనం : ఇది పొత్తికడుపును సాగదీస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు జీవక్రియను పెంచుతుంది.నేలపై పడుకుని, ముఖం నేలకు సమానంగా నిలపాలి. అరచేతులను రెండు వైపులా ఉంచి నెమ్మదిగా మీ మొండెం ఎత్తాలి. అరచేతులు, దిగువ శరీరం మాత్రమే నేలను తాకేలా ఉండాలి.ఇలా 30 సెకన్ల పాటు ఉండాలి. తిరిగి యథాస్థితికా రావాలి.ఇలా 3-4 సార్లు చేయాలి. ధనురాసనం : ఇది ఉదర కండరాలను బలోపేతం చేసి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ధనురాసనం వేయడానికి ముందుగా బోర్లా పడుకోవాలి. అలా పొట్ట మీద పడుకుని రెండు మోకాళ్లనూ వెనక్కు మడిచి ఉంచాలి. రెండు చేతులనూ వెనక్కి తీసుకెళ్లి కుడిచేత్తో కుడికాలి మడాన్ని, ఎడమచేత్తో ఎడమకాలి మడాన్ని పట్టుకోవాలి. తర్వాత పొట్ట మీద బరువు మోపుతూ పైకి లేవాలి. ఇలా ఉండగలిగినంత సేపు ఉండి, మెల్లగా శ్వాస వదులుతూ యథాస్థితికి వచ్చి, తలను, కాళ్లను కింద పెట్టేయాలి. తర్వాత మెల్లగా శ్వాస తీసుకుంటూ మరోసారి చేయాలి. అలా మూడు నుంచి నాలుగుసార్లు ఈ ఆసనం చేయాలి.ఇదీ చదవండి: ‘అమ్మను నాన్నే...’’ గుండెలు పగిలే ఐదేళ్ల కుమార్తె మాటలు, డ్రాయింగ్స్పశ్చిమోత్తనాసనం: పశ్చిమోత్తనాసన ఆసనం జీర్ణక్రియను ప్రేరేపిస్తుంది, పొత్తికడుపు కండరాలను టోన్ చేస్తుంది. ఉదర కొవ్వును తగ్గిస్తుందిమొదటగా బల్లపరుపు నేలపై రెండు కాళ్లు ముందుకు చాచి కూర్చోవాలి. తర్వాత శరీరాన్ని ముందుకు వంచుతూ పొట్టను తొడలపై పెట్టాలి. అలాగే తలను మోకాళ్లపై ఆన్చాలి. ఇప్పుడు రెండు చేతులను ముందుకు చాచి రెండు పాదాలను పట్టుకోవాలి. ఈ భంగిమలో రెండు మోకాళ్లు, చేతులు నిటారుగా ఉండాలి. వెన్నుపూసను వీలైనంతవరకూ పైకి లేవకుండా నిటారుగా ఉండేదుకు ప్రయత్నించాలి.ఇలా సాధ్యమైనంత సేపు ఆగి పూర్వ స్థితిలోకి వచ్చి రిలాక్స్ అవ్వాలి.సేతు బంధాసనముందుగా నేలపై పడుకొని రిలాక్స్ అవ్వాలి. ఇప్పుడు రెండు కాళ్లను మడిచి, పాదాలు రెండు చేతులతో పట్టుకోవాలి. భుజాలు, పాదాలు ఆధారంగా చేసుకొని, నడుము భాగాన్ని పూర్తిగా పైకి లేపాలి. తల నేలపైనే ఉండాలి. ఈ పొజిషన్లో కొన్ని డీప్ బ్రీత్స్ తీసుకున్న తర్వాత సాధారణ స్థితికి వచ్చి రిలాక్స్ అవ్వాలి.ఉస్ట్రాసన : జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఒత్తిడికి సంబంధించిన కొవ్వును కరిగిస్తుందిముందుగా ఓ చోటు మోకాళ్లపై కూర్చోవాలి.శ్వాస తీసుకొని చేతులు పైకి ఎత్తాలి. ఆ తర్వాత నడుమును వెనక్కి వంచాలి.నడుము వెనక్కి వంచి.. అరచేతులతో అరికాళ్లను పట్టుకోవాలి.ఆ భంగిమకు చేరాక శ్వాస వదలాలి. ఆ భంగిమలో కొన్ని సెకన్ల పాటు ఉండాలి. ఉస్ట్రాసన్నాన్ని ఒంటె ఆసనం అని కూడా అంటారు.నోట్: వీటిని క్రమం తప్పకుండా, ఓపికగా ఆచరించడంతోపాటు, తాజా పళ్లు, కూరగాయలను ఆహారంలో చేర్చుకోవాలి. కొవ్వు పదార్థాలకు దూరంగా ఉంటూ, పీచు పదార్థం ఎక్కువగా ఆహారాన్ని తీసుకోవాలి. తగినన్ని నీళ్లు తాగాలి. ఒత్తిడికి దూరంగా ఉండాలి. ప్రతీ రోజు కనీసం 7 గంటల నిద్ర ఉండేలా జాగ్రత్త పడాలి. యోగాసనాలను నిపుణుల సలహా, పర్యవేక్షణలో చేయడం ఉత్తమం. -
14 ఏళ్ల తరువాత మళ్లీ ఇక్కడకు వచ్చాను: రజనీకాంత్
నటుడు రజనీకాంత్ ఆధ్యాత్మికత బాటపట్టి చాలా కాలమైన విషయం తెలిసిందే. ఒక పక్క షూటింగ్‌లతో బిజీగా ఉన్నా, కాళీ సమయాల్లో ఆధ్యాత్మికత చింతనతో హిమాలయాలకు వెళ్లి అక్కడ ధ్యానం, యోగా వంటివి చేసి నూతనోత్సాహంతో తిరిగి వస్తుంటారు. అలా ప్రతి చిత్ర షూటింగ్ పూర్తి అయిన తరువాత రజనీకాంత్ హిమాలయాలకు వెళ్లి రావడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. ప్రస్తుతం కూలీ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్ర షూటింగ్ గ్యాప్‌లో ఇటీవల జార్కండ్లోని 'యోగా సత్సంగ సొసైటీ రాంజీ' ఆశ్రమానికి వెళ్లి అక్కడ ఒక వారం గడిపి వచ్చారు. అక్కడ రజనీకాంత్ అనుభవాలను రాంజీ ఆశ్రమం గురించి మీడియాకు విడుదల చేసింది. అందులో రజనీకాంత్ పేర్కొంటూ 'వైఎస్ఎస్ రాంజీ ఆశ్రమానికి తాను ఇప్పటికి 3 సార్లు వెళ్లి వచ్చాను. పరమహంస యోగానందా జీ గదిలో కూర్చుని యోగా చేసే భాగ్యం నాకు దక్కింది. ఆ అనుభవాన్ని మాటల్లో వ్యక్తం చేయలేను. 14 ఏళ్ల తరువాత మళ్లీ ఇప్పుడు ఈ ఆశ్రమానికి వచ్చాను. ఇకపై ప్రతి ఏడాది ఈ ఆశ్రమానికి వచ్చి ఒక వారం రోజుల పాటు ఉండాలని నిర్ణయించుకున్నాను. నేను చాలా వైడ్‌గా ఉన్నట్లు నాకే అనిపిస్తోంది. అందుకు కారణం నేను క్రియా యోగా చేయడమే. 2002లో నుంచి నేను క్రియా యోగా చేస్తున్నాను. ఆరంభ దశలో నాకెలాంటి మార్పు కనిపించలేదు. అయితే 12 ఏళ్ల తరువాత ఆ యోగా వల్ల కలిగిన మార్పును గ్రహించాను. నాలో చాలా ప్రశాంతత, మనశాంతి ఏర్పడింది. క్రియా యోగా శక్తి ఏమిటన్నది దాన్ని గురించి తెలిసిన వారికే అర్థం అవుతుంది. ఇది ఒక పరమ రహస్యం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలంటే ఆ యోగాలో మంచి గురువును కనుగొనాలి. ఆ తరువాత వారిని మనం విడిచి పెట్టినా, వారు మనల్ని వదలరు అని నటుడు రజనీకాంత్ పేర్కొన్నారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
Yoga: అడిషనల్ ఎస్పీ వాసుదేవరెడ్డికి కాంస్యం
పోలీసుగా రక్షణ బాధ్యతలు నిర్వహిస్తూనే క్రీడలు, యోగాలో రాణిస్తున్నారు అడిషనల్ ఎస్పీ వాసుదేవరెడ్డి. కరీంనగర్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ అండ్ డ్యూటీ మీట్లో ఇంటలిజెన్స్ వింగ్ తరపున పాల్గొన్న వాసుదేవరెడ్డి యోగా విభాగంలో కాంస్య పతకం గెలుచుకున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి చేతుల మీదుగా పతకం అందుకున్నారు.కరీంనగర్ జిల్లాకు చెందిన వాసుదేవరెడ్డి, కాకతీయ యూనివర్సిటీ నుంచి డిగ్రీ చదివారు. 1996 బ్యాచ్‌లో ఎస్సైగా ఎంపికై వేర్వేరు హోదాల్లో పదవీ బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం సీఎం సెక్యూరిటీ, ఇంటలిజెన్స్ వింగ్‌లో అడిషనల్ ఎస్పీగా పని చేస్తున్నారు.గత 25 సంవత్సరాలుగా యోగాను క్రమం తప్పకుండా చేస్తోన్న వాసుదేవరెడ్డి.. ప్రతీ జూన్ 21న, కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న ఇంటర్నేషనల్ యోగా డేలో క్రమం తప్పకుండా పాల్గొంటున్నారు. యోగా చేయడం వల్ల శారీరక క్రమశిక్షణతో పాటు మానసిక సంసిద్ధత లభిస్తోందని అని ఆయన అన్నారు. ప్రతీ ఒక్కరు యోగాను అనుసరిస్తే.. జీవితంలోని ఎన్నో సమస్యల నుంచి బయటపడతారని చెప్పారు. యోగాలో తనకు పతకం లభించడం పట్ల వాసుదేవరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. -
ఎముకలు, కండరాలు దృఢంగా ఉండాలంటే ఇలా చేయండి!
శరీరం తేలికగా కదలటానికి, చురుకుగా ఉండటానికి ఎముకలు బలంగా ఉండటం ఎంతైనా అవసరం ఎముకలు బలహీనపడితే.. విరగడం, ఆస్టియోపోరోసిస్ ముప్పు పెరుగుతుంది. ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి జీవన శైలిమార్పులతోపాటు, వ్యాయామాన్ని కూడా క్రమం తప్పకుండా చేయాలి. ఎముకలు, కండరాలను బలోపేతం చేయడానికి, అకస్మాత్తుగా పడిపోయే ప్రమాదాన్ని నివారించగల శక్తి అధో ముఖానికి ఉంది. రోజూ ఈ ఆసనాన్ని దినచర్యలో భాగం చేస్తూ ఉంటే మైండ్, బాడీ చురుకుదనం పెరుగుతుంది. ఇలా వేయాలి....∙మ్యాట్ పైన లేదా నేలపైన నిటారుగా నిల్చొని చేతులను పైకి స్ట్రెచ్ ఉంచాలి. తర్వాత నడుం భాగం వంచుతూ, చేతులను పూర్తిగా నేలమీద ఆనించాలి. ∙చేతులను పాదాలకు దూరంగా తీసుకెళుతూ త్రికోణాకారంలో ఉండాలి.కాలి వేళ్ల మీద ఉంటూ మడమలను పైకి లేపాలి. శరీర బరువు చేతులు, కాలి ముని వేళ్ల మీద ఉంటుంది. ∙నిమిషం సేపు ఇదే భంగిమలో ఉండాలి. తిరిగి యధాస్థితికి రావాలి. ఇలా ఒకటి నుంచి 3 సార్లు ఈ ఆసనాన్ని పునరావృతం చేయాలి.ఈ ఆసనం వేయటానికి మొదట్లో కాస్త కష్టంగా వున్నా రోజూ సాధన చేస్తూ ఉంటే సులువవుతుంది. వెన్నెముక, కాళ్ళను బలోపేతం చేస్తుంది. అదే విధంగా ఏకాగ్రత పెంచి, ఒత్తిడి నుండి రిలీఫ్‌ని ఇస్తుంది. అజీర్తి సమస్యలు దూరమవుతాయి. నడుము నొప్పి తగ్గుతుంది. ఆస్టియోపోరోసిస్ సమస్య నుండి రక్షిస్తుంది. సైనస్, ఆస్తమా, పీరియడ్స్‌లో వచ్చే సమస్యల నుంచి రిలీఫ్‌ని ఇస్తుంది. ఇన్ని ప్రయోజనాలని ఈ ఆసనం ద్వారా పొందవచ్చు. ఎముకలు దృఢంగా ఉండటానికి ఏం చేయాలి?ఎముకలు దృఢంగా ఉండాలంటే.. సమతుల్య, పోషకమైన ఆహారాన్ని తీసుకోవాలి.కాల్షియం, విటమిన్ డి వంటి పోషకాలు సమృద్ధిగా లభించే ఆహారం తినాలి.పాలు, పెరుగు, జున్ను వంటి పాల ఉత్పత్తులు తినాలి.విటమిన్ డి సమృద్ధిగా ఉండే ఆహారాలు తినాలి.బాల్యంలో ఎముకలు దృఢంగా ఉండటానికి పోషకాలు తీసుకోవడం ముఖ్యం.వ్యాయామం చేయడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి.మెనోపాజ్ దాటిన స్త్రీలు మరింత జాగ్రత్తలు తీసుకోవాలి.ఎముకలు, కండరాలను బలోపేతం చేసేలా వ్యాయామం తప్పనిసరిగా చేయాలి.ఇదీ చదవండి: టాటూ కోసం వెళ్లి..వ్యాపారవేత్త, పాపులర్ ఇన్ఫ్లూయెన్సర్ మృతి -
మహాకుంభ మేళలో యోగమాతగా తొలి విదేశీ మహిళ..!
మహా కుంభమేళా హిందువులకు పెద్ద పండుగలాంటిది. కుంభమేళా సమయంలో హిందువులు త్రివేణీ సంగమంలో స్నానం చేయాలని అనుకుంటారు. తద్వారా తాము చేసిన పాపాలు తొలగిపోతాయని భావిస్తారు. ఈ మహాకుంభ మేళని 144 ఏళ్ల కోసారి నిర్వహిస్తారు. ఇది 12 పూర్ణకుంభమేళాలతో సమానం. దీనిని ప్రయాగ్‌రాజ్‌లోనే నిర్వహించడం ఆనవాయితీ. అలాంటి మహా కుంభమేళలో ఎందరెందరో ప్రముఖుల, నాగసాధువులు, యోగగురువులు పెద్ద ఎత్తున పాల్గొంటారు. తాజాగా ఈ కుంభ మేళలో ప్రధాన ఆకర్షణగా యోగ మాతగా తొలి విదేశీ మహిళ నిలిచింది. ఆమె ఏ దేశస్తురాలు..మన హిందూ ఆచారాలను అనసరించడానికి రీజన్ తదితరాల గురించి తెలుసుకుందామా..!.యోగమాతా(Yogmata) కైకో ఐకావా(Keiko Aikawa) సిద్ధ గురువు లేదా హిమాలయ సమాధి యోగి హోదాను పొందిన తొలి భారతీయేతర మహిళగా చరిత్ర సృష్టించారు. ఆమె ప్రపంచ ప్రఖ్యాత ధ్యాన నిపుణురాలు. అంతేగాదు మహామండలేశ్వర్ బిరుదుతో సత్కరించబడిన తొలి విదేశీ మహిళ కూడా ఆమెనే. ఈ మహామండలేశ్వర్ అనేది ఆది శంకరాచార్య స్థాపించిన దశనామి క్రమంలో హిందు సన్యాసులకు ఇచ్చే బిరుదు. ఈ బిరుదు ప్రకారం వారిని గొప్ప ఆధ్యాత్మిక నాయకుడిగా పరిగణిస్తారు. ఆమె ప్రస్తుతం జరగుతున్న మహాకుంభ మేళలో పాల్గొననున్నది. నేపథ్యం..1945లో జపాన్‌లో జన్మించిన యోగమాత కైకో ప్రకృతి వైద్యంలో మంచి ఆసక్తిని పెంచుకున్నారు. ఈ అభిరుచి పశ్చిమ దేశాలలో హిప్పీ ఉద్యమం ద్వారా సంక్రమించింది. అలాగే కైకో జపాన్‌లో యోగాను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఎంతగానో కృషి చేసింది.ఆ నేపథ్యంలోనే టిబెట, చైనా, భారతదేశం గుండా పర్యటనలు చేసింది. 1972లో జపాన్ జనరల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ను స్థాపించింది. అక్కడ యోగా నృత్యం, ప్రాణ యోగాను నేర్చుకుంది. ఆధ్యాత్మిక గురువుగా ఎలా మారిందంటే..1984లో జపాన్‌లో పైలట్ బాబాను కలిసినప్పుడు పరివర్తన చెందింది. ఎత్తైన హిమాలయాలలో సిద్ధ మాస్టర్స్‌తో కలిసి యోగాను నేర్చుకోవడానికి పైలెట్ బాబా ఆమెను ఆహ్వానించారు. అక్కడ ఆమె "సమాధి" పొందడానికి కఠినమైన శిక్షణ పొందింది. హిందూ, బౌద్ధ మతాల ప్రకారం సమాధి అనేది శరీరానికి కట్టుబడి ఉండగానే సాధించగల అత్యున్నత మానసిక ఏకాగ్రత స్థితి. ఇది వ్యక్తిని అత్యున్నత వాస్తవికతతో ఏకం చేస్తుంది. 1991లో తన తొలి బహిరంగ సమాధిని ప్రదర్శించింది. ఇది ఒక అసాధారణ యోగ సాధన. ఇందులో ఆమె ఆహారం, నీరు లేకుండా 72 గంటలకు పైగా గాలి చొరబడి భూగర్భ ఆవరణలో ఉండటం జరిగింది. ఈ ఘనతను కొద్దిమంది మాత్రమే సాధించగలరు. ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో ఉన్న ఇద్దరు సిద్ధ మాస్టర్లలో ఒకరు. 2024లో పైలట్ బాబా మరణానంతరం అతని వారసురాలిగా యోగా మాత కేవలానంద్గా పేరుపొందింది. ఆమె తరుచుగా హిమాలయ రహస్య ధ్యానం"ను బోధిస్తుంది, సాధన చేస్తుంది. ఆమె అంతర్గత పరివర్తన శక్తిని విశ్వసిస్తుంది. ప్రతి ఒక్కరిలోనూ విశ్వ ప్రేమ ఉంటుంది. దానిని గుర్తించి, సమతుల్యత, ప్రశాంతతను సాధించడమే ధ్యానం లక్ష్యం. అని చెబుతుంటుంది యోగమాత కైకో.(చదవండి: పల్లవించిన ప్రజ్ఞ! తమిళులైనా.. తెలుగులో..) -
ఈజీగా బరువు తగ్గించే యోగా డైట్ ఇదే..!
ఆధునిక కాలంలో న్యూట్రిషన్లు బరువు తగ్గడానికి వివిధ రకాల డైట్లను పరిచయం చేశారు. వాటిలో ప్రతి డైట్ ప్రత్యేకమైనది, ఆరోగ్యకరమేనదే. అయితే ఆయా వ్యక్తులు ఆరోగ్య రీత్యా తమకు సరిపడేది ఎంపిక చేసుకుని మరీ పాటించి విజయవంతం అవుతున్నారు. అయితే ఎన్నో ఏళ్ల క్రితం మన ఆయుర్వే గ్రంథాల్లో బరువుని అదుపులో ఉంచుకోవడం ఎలాగో వివరించారు. అందుకోసం ఆహారం ఎలా తీసుకుంటే మంచిదో సవివరంగా చెప్పారు. ఆ ఆహారాలు మనకు అందుబాటులో ఉండేవే, సులభంగా ఆచరించగలిగేవే. అయితే కాస్త ఓపికతో కూడిన నిబద్ధతతో క్రమం తప్పకుండా ఈ యోగా డైట్(Yogic diet) అనుసరిస్తే బరువు తగ్గడం ఖాయం అని చెబుతున్నారు యోగా నిపుణులు. అదెలాగో చూద్దామా..!.ది యోగా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ హన్సాజీ యోగేంద్ర(Dr Hansaji Yogendra)ఒక ఇంటర్వ్యూలో బరువుని తగ్గించే(weight loss) ఆహారం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. బుద్ధి పూర్వకమైన ఆహారపు(మైండ్‌ఫుల్‌నెస్) అలవాట్లతోనే బరువుని అదుపులో ఉంచుకోగలమని చెబుతున్నారు. ఇప్పుడు న్యూట్రీషన్లు చెబుతున్నారే ప్రోటీన్ల(Protein)ని వాటి గురించి అనాడే యోగా గురువులు చెప్పారని అన్నారు. కాకపోతే ఇలా ప్రోటీన్లని చెప్పకపోయినా..శాకాహారానికి ప్రాధాన్యత ఇవ్వమని నొక్కి చెప్పారు. గుమ్మడి విత్తనాలు, నట్స్, పల్లీలు, శెనగలు వంటివి ఆహారంలో భాగం చేసుకోవాలని అన్నారు. అలాగే బరువు తగ్గాలనుకునేవారు ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోమని సూచించేరు. ముఖ్యంగా అధికంగా నీళ్లు తీసుకోవాలని అన్నారు. ఒక కోడిగుడ్డు కంటే చియా గింజలు, అవిసె గింజలు మంచివని చెప్పారు. భోజనం తినడానికి ఒక గంట ముందు ఒక గ్లాసు మజ్జిగ తాగితే ఎక్కువ తినకుండా ఉంటామని చెబుతున్నారు. ఇక అన్నంలో పప్పు, రోటీ, సబ్జీ తినవ్చ్చు అన్నారు. కొద్దిగా సలాడ్లు కూడా జోడించొచ్చు. స్నాక్స్ కోసం పల్లీలు, మఖానా, శెనగలు వంటివి తీసుకోండి. ఇక రాత్రి భోజనంలో ఒక పెద్ద గిన్నె సూప్ తాగడం, ఆకలిగా అనిపిస్తే ఆ సూప్‌లో కొద్దిగా బియ్యం, రోటీల ముక్కలు జోడిస్తే సరి అని చెబుతున్నారు. ఇలా తీసుకుంటే నెల రోజుల్లోనే స్లిమ్‌గా మారడమే గాక బరువు కూడా అదుపులో ఉంటుందట.(చదవండి: స్కిన్ టోన్‌కి సరితూగే స్టన్నింగ్ మేకప్! ఏ వధువైనా అదిరిపోవాల్సిందే..) -
Year Ender 2024: చివరి వారాన్ని ఇలా ఆనందంగా గడిపితే..
2024.. ఇక కొద్ది రోజులు మాత్రమే మిగిలివుంది. ఈ ఏడాది మనకు పలు తీపి గురుతులను, విషాద ఛాయలను అందించింది. వీటిని పక్కన పెడుతూ ఈ ఏడాదిలో మిగిలిన కాసిన్ని రోజులను ఎంతో ప్రశాంతంగా, ఆనందంగా, ఉత్సాహంగా గడిపేందుకు ప్రయత్నిస్తే రాబోయే నూతన సంవత్సరం మనకు మరింత కాంతిమయం అవుతుందని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. అలాగే అందుకు అవలంబించాల్సిన పనులను కూడా వారు తెలియజేస్తున్నారు.ప్రకృతిలో ఒడిలో..ఒక అందమైన పార్క్‌లో నడవండి లేదా సైకిల్ తొక్కండి.సమీపంలోని కొండలు లేదా అడవికి షార్ట్ ట్రిప్ వెళ్లండి.సూర్యాస్తమయాన్ని ఆస్వాదించండి.ప్రియమైనవారితో..కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో సమయాన్ని గడపండి.వారితో బోర్డు గేమ్స్ ఆడండి. కలిసి భోజనం చేయండి. తనివితీరా మాట్లాడండి.కొత్తదేదో నేర్చుకోండికొత్త భాష నేర్చుకోవడం ప్రారంభించండి.కొత్త వంటకం చేయడానికి ప్రయత్నించండి.ఏదో ఒక కొత్త నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోండి.దాన గుణం, దాతృత్వం..స్వచ్ఛంద సేవలో పాల్గొనండి.స్థానికంగా ఉన్న ఆశ్రమానిక ధనరూపేణా లేదా వస్తురూపేణా దానం చేయండి.ఎవరో ఒకరికి సహాయం చేయండి.శారీరక ఆరోగ్యం కోసం..ఒక రోజు స్పాకు కేటాయించండి.మసాజ్ లేదా ఫేషియల్ చేయించుకోండి.యోగా లేదా ధ్యానం చేయండి.సృజనాత్మకతను..డ్రాయింగ్, పెయింటింగ్ లేదా ఏదోఒకటి కొత్తగా రాయడానికి ప్రయత్నించండి.సంగీత పరికరాన్ని వాయించండి లేదా పాటలు పాడండి.ఫోటోగ్రఫీ లేదా వీడియోగ్రఫీకి ప్రయత్నించండి.ఇష్టమైన అంశాలతో..మీకు ఇష్టమైన పుస్తకాన్ని చదవండి.మీకు నచ్చిన సినిమా చూడండి.మీకు ఇష్టమైన సంగీతాన్ని వినండి.తగినంత విశ్రాంతి తీసుకోండి.పుస్తకం చదువుతూ లేలేత సూర్యరశ్మిని ఆస్వాదించండి.వారాంతంలో మరింతసేపు నిద్రకు సమయం వెచ్చించండి.మీకు ఇష్టమైన పానీయం తాగండి.కృతజ్ఞత వ్యక్తం చేయండిమీకు ఈ ఏడాదిలో మంచిని అందించినవారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పండి. మిమ్మల్ని ఎంతగానో ప్రేమించే లేదా మీపట్ల శ్రద్ధ చూపే వారికి కృతజ్ఞతలు తెలియజేయండి.ఈ జాబితాలోని వీలైనన్ని అంశాలను అమలు చేయడం ద్వారా 2024లోని ఈ చివరి వారాన్ని ఆనందంగా ముగించగలుగుతారు. అలాగే రాబోయే 2025 నూతన సంవత్సరాన్ని మరింత సంతోషంగా ప్రారంభించగలుగుతారు. మరెందుకాలస్యం.. ఇవి కూడా చదవండి: Year Ender 2024: ముఖ్యాంశాల్లో మహిళా నేతలు -
Year Ender 2024: ఈ ఆసనాలను వేసి.. బరువు తగ్గామంటూ సంతోషం
2024 ముగియడానికి ఇక కొద్దిరోజుల మాత్రమే మిగిలివుంది. జనమంతా న్యూ ఇయర్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో కొందరు 2024లో తమకు ఎదురైన తీపి జ్ఞాపకాలను, చేదు అనుభవాలను గుర్తుచేసుకుంటున్నారు. 2024లో చాలామంది బరువు తగ్గేందుకు యోగాసనాలను ఆశ్రయించారు. కొన్ని ఆసనాలను వారు అమితంగా ఇష్టపడ్డారు.మలాసనం2024లో చాలామంది మలాసనం కోసం శోధించారు. దీనిని అభ్యసించి ఆరోగ్య ప్రయోజనాలు సొంతం చేసుకున్నారు. ఈ యోగాసనాన్ని స్క్వాట్ అని కూడా అంటారు. క్రమం తప్పకుండా ఈ ఆసనం వేస్తే శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవచ్చని యోగా నిపుణులు అంటున్నారు. ఈ ఆసనం వెన్నునొప్పి, మోకాళ్ల నొప్పులు మొదలైన వాటి నుండి ఉపశమనం అందిస్తుంది. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ఉదర కండరాలను బలోపేతం చేస్తుంది.పవనముక్తాసనంపవనముక్తాసనం 2024లో ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ యోగాసనం అసిడిటీ, మలబద్ధకం తదితర సమస్యల నుంచి విముక్తి కల్పిస్తుంది. అంతే కాదు ఈ యోగాసనాన్ని రెగ్యులర్‌గా చేస్తే చాలా త్వరగా పొట్ట తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. కీళ్లనొప్పుల నుంచి కూడా ఈ ఆసనం ఉపశమనం కల్పిస్తుంది.తాడాసనం2024 సంవత్సరంలో చాలామంది అత్యధికంగా శోధించిన యోగాసనాలలో తాడాసనం కూడా చోటు దక్కించుకుంది. ఈ యోగాసనం సహాయంతో శరీరంలోని పలు అవయవాలకు శక్తి సమకూరుతుంది. ఈ ఆసనం శరీరపు ఎత్తును పెంచడంలో ఎంతగానో సహాయపడుతుంది. శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.మత్స్యాసనంచాలమంది ఈ ఏడాది మత్స్యసనం కోసం సెర్చ్ చేశారు. ఈ యోగాసనం శారీరక, మానసిక అభివృద్ధికి చాలా మంచిదని నిపుణులు చెబుతుంటారు. ఈ ఆసనాన్ని క్రమం తప్పకుండా చేస్తుంటే మెడ, భుజాలకు సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇది పొట్టను కరిగించడంలో సహాయపడుతుంది.పశ్చిమోత్తనాసనంపశ్చిమోత్తనాసం యోగాభ్యాసంలో ముఖ్యమైనదిగా చెబుతుంటారు. 2024లో చాలామంది ఈ ఆసనాన్ని వేసి లబ్ధి పొందారు. ఈ యోగాసనం జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది వెన్నెముక సమస్యలను పరిష్కరిస్తుంది. పొట్ట కొవ్వును తగ్గించడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. ఈ యోగాసనాన్ని క్రమం తప్పకుండా వేస్తే, నిద్రలేమి సమస్యలను దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.ఇది కూడా చదవండి: Year Ender 2024: భారత్‌ను వణికించిన వ్యాధులు -
Yoga: కొలెస్ట్రాల్‌కు చెక్
రోజూ గంటల తరబడి డెస్క్ జాబ్ చేసేవారికి నడుం నొప్పి, పోట్ట దగ్గర కొవ్వు పేరుకు పోవడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. వీటి నుంచి విముక్తికి ఈ వక్రాసనం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఆసనాన్ని ట్విస్టెడ్ పోజ్ అని కూడా అంటారు. పది నిమిషాలు స్ట్రెచింగ్ వ్యాయామాలు చేసిన తర్వాత యోగాసనాలను సాధన చేయాలి.వెన్నెముక బలంగా అవడానికి, మెడ నరాల పనితీరు మెరుగుదలకూ సహాయపడుతుంది. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. శ్వాస సమస్యలు తగ్గుతాయి, జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. రోజూ ఈ ఆసనాన్ని సాధన చేయడం వల్ల పోట్ట దగ్గరి కొవ్వు కరుగుతుంది. నిటారుగా.. నిదానంగా! విశ్రాంతిగా కూర్చొని ఒక కాలును పోట్ట దగ్గర నుంచి రెండవ కాలు మీదుగా తీసుకెళ్లి ఉంచాలి. చేతులను వ్యతిరేక దశలో ఉంచడంతో నడుము భాగం ట్విస్ట్ అవుతుంది. ఎడమచేతితో కుడికాలి పాదాన్ని పట్టుకోవాలి. వెన్నెముకను నిటారుగా ఉంచి, తలను భుజం మీదుగా సాధ్యమైనంత వెనుకకు తిప్పి, దాదాపు ఒక నిముషం పాటు ఆసనంలో ఉండాలి. అనంతరం ఇదే విధంగా ఎడమ కాలితో కూడా చేసుకోవాలి. తర్వాత దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ ఎడమ చేత్తో కుడి మోకాలిని పోట్టవైపు నెడుతూ ఎడమ మోకాలిని పట్టుకోవాలి. ఈ ఆసనంలో ఉన్నప్పుడు ఐదు దీర్ఘశ్వాసలు తీసుకోవడం, వదలడం చేయాలి. – జి.అనూషా కార్తీక్, యోగా గురు -
దండెత్తిన క్యాన్సర్‌పై ధ్యానమే సైన్యంగా...
నేను మూడుసార్లు క్యాన్సర్ బారిన పడ్డాను. 2003లో బ్రెస్ట్ క్యాన్సర్. 2022లో బ్రెయిన్ క్యాన్సర్. 2024లో మళ్లీ బ్రెయిన్ క్యాన్సర్. నా వయసు 70 ఏళ్లు. క్యాన్సర్‌పై గెలుస్తూనే ఉన్నాను. యోగా, ధ్యానం మనలోని శక్తులను బయటకు తీసి స్థిరంగా ఉంచుతాయి. ధ్యానం నాకు ఆయుధంగా పని చేసింది. క్యాన్సర్ అనగానే కంగారు పడతారు. చికిత్స తీసుకుంటూ పోరాడొచ్చు.. గెలవొచ్చు. క్యాన్సర్ వచ్చిన వారి వద్దకు వెళ్లి ఆ విషయమే చెప్పి కౌన్సెలింగ్ చేస్తుంటా’ అంటున్న హైదరాబాద్‌కు చెందిన నల్లూరి నిర్మల పరిచయం.‘యోగా మన శరీరానికి ఉండే శక్తుల్ని వెలికి తీస్తే ధ్యానం మన మనసుని నిశ్చలం చేస్తుంది. క్యాన్సర్ వంటి జబ్బులను ఎదుర్కొనడానికి శరీర బలం ఎంత అవసరమో అంతకంటే ఎక్కువగా మానసిక బలం అవసరం. క్యాన్సర్ అనగానే చాలామంది ఆందోళన చెందిన మనసును తద్వారా శరీరాన్ని బలహీన పరుచుకుంటారు. అప్పుడు వైద్యం అనుకున్నంత సమర్థంగా పనిచేయదు. అందుకే నేను నా జీవితంలో క్యాన్సర్‌ను ఎదుర్కొనడానికి యోగా, ధ్యానాలను ఆశ్రయించాను. చికిత్స సమయంలో శరీరం బలహీనంగా ఉంటుంది కనుక అన్నిసార్లు యోగా చేయలేము. కాని ధ్యానం చేయవచ్చు. నేను ధ్యానం వల్ల చాలా మటుకు అలజడిని దూరం చేసుకున్నాను. అందుకే పల్లెల్లో స్త్రీలకు అప్పుడప్పుడు యోగా, ధ్యానం గురించి ప్రచారం చేశాను. ఇక ఇప్పుడు చేస్తున్నదేమిటంటే క్యాన్సర్ బారిన పడిన వాళ్లను కలిసి వారి ఆందోళన దూరం చేయడం. నన్ను వారికి చూపించి నేను ఎదుర్కొన్నానంటే మీరూ ఎదుర్కొనగలరని ధైర్యం చెప్పడం. యోగా, ధ్యానాలను ఎలా చికిత్సలో భాగం చేసుకోవాలో సూచించడం’ అన్నారు 70 ఏళ్ల నల్లూరి నిర్మల. ఆమెను చూసినా, ఆమెతో మాట్లాడినా తీవ్ర అనారోగ్యాలలో ఉన్న వారు కచ్చితంగా ధైర్యం తెచ్చుకోగలరని అనిపిస్తుంది. ఆమె అంత ప్రశాంతంగా, దిటవుగా కనిపిస్తారు.చిన్నప్పటి నుంచి సవాళ్లేనల్లూరి నిర్మలది ప్రకాశం జిల్లా. ఆమె తండ్రి నల్లూరి అంజయ్య ప్రజల మనిషిగా గుర్తింపు పొందారు. వీరిది కమ్యూనిస్టు కుటుంబం. ఆడపిల్లలకు చదువు ముఖ్యమని తమ గ్రామంలోనే ఒక ప్రైవేటు పాఠశాల స్థాపించాడాయన. అలా నిర్మల చదువుకొని జీవిత బీమా సంస్థలో, తర్వాత కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్లో, ఆ తర్వాత కోటీలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్టెనోగ్రాఫర్‌గా పని చేశారు. 1977 నుంచి 2014 వరకు దాదాపు 37ఏళ్ళు అదే బ్యాంకులో పని చేసి ఉద్యోగ విరమణ పొందారు. అయితే నిర్మల చిన్నప్పటి నుంచి ఆరోగ్యపరమైన సవాళ్లను ఎదుర్కొన్నారు. వివాహమై ఇద్దరు పిల్లలు పుట్టాక గర్భసంచి తీసేయాల్సి వచ్చింది. ఆ తర్వాత 2003లో బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడ్డారు. ‘ఆ సమయంలో నా భర్త వ్యాపార పరమైన నష్టాలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు నా అనారోగ్యం. అయినా సరే ఆ ఒత్తిడిని, ఈ ఒత్తిడిని ఎదుర్కొని బ్రెస్ట్ క్యాన్సర్‌ని జయించాను’ అని చెప్పారు నిర్మల. మరో రెండుసార్లు దాడిక్యాన్సర్ను జయించానని భావించిన నిర్మలను మరలా ఆ జబ్బు వెంటాడింది. 2022 లో బ్రెయిన్ క్యాన్సర్ నిర్మల శరీరంలోకి ప్రవేశించింది. మొదటిసారి తట్టుకున్నంతగా నిర్మల గారి శరీరం రెండవసారి తట్టుకోలేకపోయింది. అయినా తన మానసిక శక్తితో దాన్ని ఎలా అయినా ఓడించాలన్న సంకల్పంతో క్యాన్సర్‌ను తోక ముడుచుకునేలా చేశారామె. కాని మూడవసారి 2024లో మరలా బ్రెయిన్ క్యాన్సర్ తిరగబెట్టింది. ఇప్పుడు 70 ఏళ్ళ వయసులో కూడా నిర్మల దానితో పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ పోరాటానికి ఒక ఆయుధంగా ‘ప్రకృతి యోగా అండ్ నేచర్ క్యూర్’ని నిర్మల ఎంచుకున్నారు. డాక్టర్ సరస్వతి దగ్గర నిర్మల యోగాలో శిక్షణ తీసుకున్నారు. దానివల్ల నిర్మల జీర్ణవ్యవస్థ మెరుగైంది. కొన్ని ఆరోగ్య సమస్యలు నెమ్మదించాయి. నిర్మల పూర్తిస్థాయి శిక్షణ తీసుకుని అందరికీ ఆరోగ్యం మీద అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో యోగా క్యాంపులు నిర్వహించారు. ఇంటి దగ్గర కూడా యోగా తరగతులు నడిపారు. అలా ‘క్యాన్సర్’పై పోరాడుతూ యోగా–ప్రకృతి–ధ్యానం సమన్వయంతో జీవితాన్ని మళ్ళీ ఆరోగ్య పథంలోకి మళ్లించారు. స్త్రీలకు ఇంటా బయటా సమస్యలే‘స్త్రీలకు ఇంటా బయటా సమస్యలే. ఆ సమస్యలను చూస్తూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. అలా చేయొద్దని నేను కోరుతున్నాను. కుటుంబానికి సంబం«ధించి ఎన్ని బాధ్యతలున్నా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. ఆత్మన్యూనతా భావం విడనాడి ధైర్యంగా మసలుకోవాలి, ధ్యానం మీకు దారి చూపిస్తుంది’ అంటారామె. -
ఒత్తిడి వేధిస్తోంటే.. అద్భుతమైన ఆసనం ఇదే!
పర్వతాన్ని పోలి ఉంటుంది కాబట్టి ఈ ఆసనాన్ని మౌంటెయిన్ పోజ్ అంటారు. పిల్లలు,పెద్దలు ఎవరైనా ఈ ఆసనాన్ని సులువుగా సాధన చేయవచ్చు. ఒత్తిడినుంచి ఉపశమనం లభిస్తుంది. రెండు పాదాలను దగ్గరగా ఉంచి, నిటారుగా నిల్చోవాలి. భుజాలు వంచకుండా, చేతులను నేలవైపుకు చాచాలి. రెండు నుంచి ఐదు శ్వాసలు తీసుకొని, వదులుతూ ఉండాలి. తర్వాత పాదాలను దగ్గరగా ఉంచి, చేతులను తల మీదుగా తీసుకెళ్లి, ఒక చేతివేళ్లతో మరొక చేతివేళ్లను పట్టుకోవాలి. శరీరాన్ని పైకి స్ట్రెచ్ చేస్తూ శ్వాసక్రియ కొనసాగించాలి. శరీర కండరాలను బిగుతుగా ఉంచాలి. ఆ తర్వాత భుజాల నుంచి చేతులను పైకి లేపాలి. అరచేతులు రెండూ ఆకాశంవైపు చూస్తూ ఉండాలి.ఈ విధంగా చేసే సమయంలో కాలి మునివేళ్ల మీద నిలబడుతూ, శరీరాన్ని పైకి లేపాలి. కొద్దిసేపు అలాగే ఉండి, తిరిగి యథాస్థానంలోకి రావాలి. ∙తర్వాత కాళ్లను ఒకదానికొకటి దూరంగా ఉంచుతూ, చేతులను కిందకు దించి, విశ్రాంత స్థితికి రావాలి. తాడాసనం సాధన చేయడం జాయింట్స్‌పై మంచి ప్రభావాన్ని చూపుతుంది. పిల్లల చేత చేయిస్తే వారి ఎదుగుదలకు అమోఘంగా పనిచేస్తుంది. – జి.అనూషారాకేష్, యోగా గురుసమస్థితికి మౌంటెయిన్ -
గోవాలో 'సారా అలీ ఖాన్' వెల్నెస్ అండ్ యోగా రిట్రీట్
ఫిట్నెస్, ట్రావెలింగ్ పట్ల అమితాసక్తి చూపించే ప్రముఖ నటి.. 'సారా అలీ ఖాన్' మొదటి సారి గోవాలోని ఎయిర్‌బీఎన్‌బీలో స్పెషల్ వెల్నెస్ అండ్ యోగా రిట్రీట్ను నిర్వహించనున్నారు. దీనికోసం సూర్యరశ్మి, పచ్చటి ప్రకృతి మధ్య ఒక సెటప్ సెట్ చేసుకున్నారు.సినిమా రంగంలో ఫిట్నెస్ పట్ల అమితమైన అభిరుచి కలిగిన సారా అలీ ఖాన్.. ఇప్పుడు ఆరోగ్యం, యోగా పట్ల తనకున్న అభిరుచిని వెల్లడిస్తుంది. అద్భుతమైన ప్రదేశంలో పచ్చని ప్రకృతి మధ్య సారాతో నలుగురు వ్యక్తులు యోగా చేసే అవకాశం పొందవచ్చు.ఇక్కడ సారా వ్యక్తిగత వెల్నెస్ ఆచారాలు, ఇతర ఆరోగ్య రహస్యాలను గురించి కూడా తెలుసుకోవచ్చు. గోవాలో ఈ వెల్నెస్ మరియు యోగా రిట్రీట్ కోసం బుకింగ్‌లు నవంబర్ 27న ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి.గోవాలో ఎయిర్‌బిఎన్‌బిలో మాత్రమే జరిగే ఈ ప్రత్యేక వెల్నెస్ అండ్ యోగా రిట్రీట్‌కు అతిథులను స్వాగతించడానికి నేను నిజంగా సంతోషిస్తున్నాను. ఇక్కడ ప్రకృతి అందాల నడుమ.. మనస్సు, శరీరం, ఆత్మను పోషించడంపై దృష్టి పెట్టవచ్చు. జీవితంలో మరచిపోలేని సాధారణ ఆనందాలను స్వీకరించడానికి ఇది ఒక మంచి అవకాశం అని సారా అలీ ఖాన్ అన్నారు. View this post on Instagram A post shared by Viralbollywood (@viralbollywood) -
నా ఇల్లు.. నా భారతీయత
‘నా ఇల్లంతా భారతీయత కనిపించాలి. ఆ కళతో నేను అనుభూతి చెందాలి’ అంటోంది నటి తాప్సీపన్ను. ముంబైలోని తాప్సీ పన్ను ఇల్లు ప్రాచీన పంజాబీ కళతో ఆకట్టుకుంటుంది. ఇందుకు సోదరి షగున్ తన కలకు సహాయం చేసిందని మరీ మరీ చెబుతుంది తాప్సీ.ఇంటి లోపలి అలంకరణలో ఎర్ర ఇటుక గోడలు, జూట్ చార్పైస్, గోడకు అమర్చిన ఝరోఖాలు ఉన్నాయి. ఇది పంజాబ్ ఇంటీరియర్లలో ఒక అద్భుతమైనప్రాచీన ఇంటిని గుర్తు చేస్తుంది. ‘నా సోదరి వెడ్డింగ్ ప్లానర్,ప్రొఫెషనల్ కూడా. దీంతో ప్రత్యేకమైన డిజైనర్ అవసరం లేకపోయింది. ఆమె మా ఇంటిని చాలా అర్ధవంతంగా మార్చడానికి సహాయం చేసింది. మేం దేశంలోని పంజాబ్, రాజస్థాన్, కచ్ వంటి ప్రాంతాలకు వెళ్లినప్పుడల్లా కొన్ని వస్తువులు సేకరించి, తీసుకొచ్చాం. అలా తీసుకొచ్చిన వాటితోనే మా ఇంటి అలంకరణ చేశాం.ప్రాచీన కళ‘నేనెప్పుడూ విలాసవంతమైన ఇల్లు కావాలనుకోలేదు. భారతీయత కనిపించాలని, అనుభూతి చెందాలని కోరుకుంటాను. అందుకు ఇది ఫ్యాన్సీదా, ఖరీదైనదా అనుకోను. ఇల్లు మన ఆత్మీయులందరినీ స్వాగతించేలా ఉండాలి.దేశీ – విదేశీ మా ఇల్లు అపార్ట్మెంట్లోని డ్యూప్లెక్స్ స్టైల్. ఒక అంతస్తు మొత్తం దేశీ అనుభూతిని పంచుతుంది. నా అభిరుచికి ఈ అంతస్తు అద్దం పడుతుంది. మరొక అంతస్తు నా వ్యక్తిగత స్థలం. అక్కడ, నా మానసిక స్థితిని బట్టి, మార్చుకోవడానికి అనువైనది ఉండేలా చూసుకుంటాను. నా స్నేహితులు దేశీ ఫ్లోర్‌పైనే సందడి చేస్తారు.ఇక నా గదిని చూసి మాత్రం పింటరెస్ట్ హౌస్ అని పిలుస్తారు, ఎందుకంటే ఇంట్లోని ప్రతి మూలన ఏదో ఒక ఫొటో ఫ్రేమ్ ఉంటుంది. నాకెందుకో ఏ మూలన ఖాళీగా అనిపించినా, అక్కడ ఫొటో ఫ్రేమ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే నా ఫొటో ఆల్బమ్‌లో అన్ని మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. వాటిని ఫొటో ఫ్రేమ్స్‌లో పెట్టి, నచ్చిన చోటల్లా పెట్టేస్తుంటాను. మా నాన్నకు ఇంటీరియర్స్‌లో చాలా మంచి అభిరుచిని ఉంది. అందుకు ఉపయుక్తంగా, వైద్యపరంగా ఉండటానికి ఇష్టపడతాడు. మాస్టర్ బెడ్రూమ్ క్లాసిక్ వైట్‌తో ఉంటుంది. నలుగురు పడుకునేంత పెద్ద బెడ్, వుడెన్ ఫ్రేమ్స్, కార్వింగ్‌తో చేయించాం. వానిటీ ఏరియాలో పెద్ద డ్రెస్సింగ్ మిర్రర్ ఏర్పాటు చేయించాం. మిర్రర్ చుట్టూ ఎల్లో లైట్స్ డిజైన్ చేయించాం. మంచి రంగున్న కర్టెయిన్స్, బెడ్ కు ముందు కిటికీ, ఫ్లోరింగ్ కూడా ఉడ్‌తో తయారుచేసిందే. బాల్కనీ ఏరియాలో వుడెన్ ఫ్లోరింగ్, ముదురు గోధుమ రంగు కుషన్స్, ప్రింటె ప్యాబ్రిక్స్ ఉంటాయి. కొన్ని మొక్కలతో బాల్కనీ ఏరియాను డిజైన్ చేసుకున్నాం. యోగా చేసుకోవడానికి వీలుగా ప్లేస్ ఉంటుంది. కుండీలలో మొక్కలు, కలర్‌ఫుల్ ఫ్రేమ్స్, బుద్ద విగ్రహం, వాల్ హ్యాంగింగ్స్... అన్నీ కలిసి ఓ మినీ ఫారెస్ట్‌ని తలపించేలా డిజైన్ చేయించాం. ఇంటిని డిజైన్ చేయించం అంటే మనలోని కళకు అద్దం పట్టినట్టే’’ అంటోంది తాప్సీ. -
పిల్లల్లో ఏకాగ్రతలేదా? ఒక్క చోట నిలవడం లేదా?
పిల్లలకు ఏకాగ్రత ఉండటం లేదు, ఎదుగుదల సరిగా లేదు.. అని పెద్దల నుంచి కంప్లైంట్స్ తరచూ వింటూ ఉంటాం. పిల్లల్లో ఆందోళన, చికాకు తగ్గడానికి యోగాభ్యాసం ఎంతగానో ఉపయోగపడుతుంది. పెద్దలు చేసే విధంగా పిల్లలకు యోగా సాధన కుదరదు. చిన్న చిన్న మార్పులు చేసి, పిల్లలచే సాధన చేయిస్తే వారి ఉన్నతికి యోగా ఒక బలమైన పునాదిగా ఉంటుంది. ముందు ఓ పది నిమిషాలు పిల్లలతో చిన్న చిన్న స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయించాలి. దీనివల్ల వారి శరీరం యోగాభ్యాసానికి సిద్ధం అవుతుంది. ఆ తర్వాత 12 సూర్యనమస్కారాలు చేయించాలి. పిల్లలకు ఏకాగ్రత, ఎదుగుదలకు సహకరించేవి..ఆక్సీజన్ గా..ముందు నిటారుగా నిల్చోవాలి. రెండు కాళ్లలో ఒక కాలిని మోకాళ్ల వద్ద వంచుతూ, ΄ాదాన్ని నిలుచుని ఉన్న కాలు తొడ భాగంలో ఉంచాలి. హృదయం దగ్గర నమస్కార భంగిమ లో చేతులను ఉంచి, రెండు శ్వాసలు తీసుకుని వదిలాక, చేతులు రెండూ పైకి ఎత్తి నిల్చోవాలి. ఈ ఆసనం ద్వారా శరీరాన్ని బ్యాలెన్డ్స్‌గా ఎలా ఉంచాలో తెలుస్తుంది. ఒక చెట్టు ఆక్సిజన్‌ను ఎలా ఉత్పత్తి చేస్తుందో అలాంటి భంగిమ కాబట్టి పిల్లల శ్వాసక్రియ కూడా బాగా పనిచేస్తుంది. ఈ ఆసనం ద్వారా వారిలో ఏకాగ్రత పెరుగుతుంది. – జి. అనూ షారాకేష్యోగ గురు -
జస్ట్ ఐదేళ్లకే యోగా గురువుగా చిన్నారి..!
ఫొటోలో కనిపిస్తున్న ఈ బాలుడు ఐదేళ్ల వయసులోనే యోగా గురువు స్థాయికి చేరుకున్నాడు. రాజస్థాన్‌కు చెందిన ప్రత్యక్ష్ విజయ్ అతి పిన్న వయసు యోగా గురువుగా, ప్రతిష్ఠాత్మక గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకున్నాడు. నాలుగేళ్ల వయసు నుంచే ప్రత్యక్ష్ , తన తల్లిదండ్రులతో కలసి యోగా సాధన చేయటం మొదలు పెట్టాడు. రెండువందల గంటల యోగా టీచర్స్ ట్రైనింగ్ కోర్సును పూర్తి చేసిన ఈ బాలుడు, గత ఏడాది జులై 27న ఆనంద్ శేఖర్ యోగా పాఠశాల నుంచి యోగా గురువు ధ్రువపత్రాన్ని అందుకున్నాడు. కోర్సు సమయంలో ప్రత్యేక యోగాకు సంబంధించి అనేక మెలకువలను నేర్చుకున్నాడు. యోగాలోని ‘అలైన్మెంట్, అనాటమిక్ ఫిలాసఫీ’ వంటి క్లిష్టమైన అంశాలను నేర్చుకున్నాడు. ప్రత్యక్ష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, యోగా అనేది శారీరక భంగిమలు, శ్వాస గురించి మాత్రమే కాదు, మానసిక, శారీరక ఆరోగ్యంతో పాటు ఆనందం కూడా అని గ్రహించా’ అని తెలిపాడు. ప్రస్తుతం అతడు పెద్దలతోపాటు పిల్లలకు కూడా యోగా నేర్పిస్తున్నాడు. ఆన్లైన్లో వర్చువల్ రియాలిటీ క్లాసులు కూడా తీసుకుంటున్నాడు. వీటితోపాటు కొన్ని పాఠశాలల్లోనూ విద్యార్థులకు యోగా శిక్షణ ఇస్తున్నాడు. (చదవండి: కిడ్స్ మేకప్ కోసం ఈ బ్యూటీ కిట్..!) -
Utkatasana: బలాన్ని పెంచే ఉత్కటాసనం
రోజులో ఎక్కువ సేపు కూర్చుని పనిచేసేవారిని తక్కువ సమయంలోనే రిలాక్స్ చేస్తుంది కుర్చీ ఆసనం. ఈ కుర్చీ భంగిమను ఉత్కటాసన అంటారు. ఈ ఆసనాన్ని సాధన చేయడానికి ముందుగా శరీరాన్ని నిలుచున్న స్థానంలో సిద్ధ పరచాలి. సులువైన సాధన⇒ముందు నిటారుగా నిల్చోవాలి. పాదాలు రెండూ దగ్గరగా ఉంచి, చేతులను పైకి ఎత్తాలి. ⇒కుర్చీలో కూర్చున్నట్టుగా మోకాళ్లను ముందుకు వంచాలి. దీంతో హిప్ భాగం వెనక్కి, మోకాళ్లు ముందుకు వచ్చి, చెయిర్ మీద కూర్చున్న భంగిమ వస్తుంది. ⇒చేతులను నమస్కారం చేసినట్టుగా ఒక దగ్గరగా చేర్చాలి. ⇒ఈ భంగిమలో పొట్ట భాగం లోపలికి తీసుకుంటూ, వెన్నెముకను నిటారుగా ఉంచాలి. ∙దీర్ఘ శ్వాసలు తీసుకుంటూ, వదులుతూ వీలైనంత వరకు ఈ ఆసనంలో ఉండచ్చు. ⇒5 నుంచి 6 సార్లు ఈ ఆసనాన్నిప్రాక్టీస్ చేయడం ద్వారా కండరాలు బలపడతాయి. మెరుగైన పనితీరు⇒కాలు, కాలు వెనుక, భుజం కండరాలను బలోపేతం అవుతాయి. ∙రక్తప్రసరణ, గుండెపనితీరు పెరుగుతుంది. శ్వాసక్రియ మెరుగుపడటం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యమూ పెరుగుతుంది. -
ఊపిరితిత్తులకు ఊతం, వెయిట్ లాస్ కూడా...
పొత్తి కడుపు కొవ్వును తగ్గించి, ఛాతీ, ఊపిరితిత్తుల పనితీరును మెరుగు పరచడానికి మత్సా్యసనం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో కఠినమైన విధానం కూడా ఉంది. కానీ, సులువుగానూ ఈ పోజ్‌ను సాధన చేయవచ్చు. త్వరగా శారీరక, మానసిక ప్రశాంతత కలిగిస్తుంది. ఈ ఆసనాన్ని సాధన ఎలా అంటేమ్యాట్పైన వెల్లకిలా పడుకోవాలి.అరచేతులను నేలపైన బోర్లా ఉంచాలి. కాళ్లను నిటారుగా ఉంచి, పాదాలను స్ట్రెచ్ చేస్తూ సాధ్యమైనంత వరకు వంచాలి. తుంటి భాగాన్ని కొద్దిగా ఎత్తి, పిరుదుల కింద చేతులను ఉంచాలి. తల వెనుక మెడ భాగాన్ని సాగదీస్తూ, నేలపైకి వంచాలి. బరువు ఎక్కువ లేకుండా భంగిమను సరిచూసుకోవాలి. అదే విధంగా వెన్ను భాగాన్ని కూడా కొంత పైకి ఎత్తాలి. ఈ భంగిమ చేప మాదిరి ఉంటుంది కాబట్టి దీనిని ఫిష్ పోజ్ అంటారు. నిదానంగా 5 శ్వాసలు తీసుకుంటూ, వదలాలి. తర్వాత తలను యధాస్థానంలో ఉంచి, వెన్నెముకను చాప మీద నిదానంగా ఉంచాలి. ఆ తర్వాత పాదాలను యధాస్థానంలోకి తీసుకొని, చేతులను తుంటి నుంచి బయటకు తీసి, విశ్రాంతి తీసుకోవాలి.ఇలా చేయడం వల్ల.... ∙ఈ ఆసనం వల్ల మెడకు, ఊపిరితిత్తులకు, పొట్టలోని అవయవాలకు చాలా మేలు కలుగుతుంది. ఊపిరితిత్తులు సాధ్యమైనంతవరకు ప్రాణ వాయువును పీల్చి, కొంత సమయం ఉంచగలిగే సామర్థ్యాన్ని పెంచుకుంటాయి. వెన్ను, మెడ భాగాలు స్ట్రెచ్ అవడం వల్ల వాటి బలం పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉన్నవారు నిపుణుల సాయం తీసుకోవడం మేలు. ఊపిరితిత్తుల సామర్థ్యం పెరగడానికి..-జి.అనూష,యోగా గురు -
ఆరోగ్య యోగం ఎప్పుడో ?
సాక్షి, సిద్దిపేట: ఆయుష్ ఆస్పత్రులకు అనుబంధంగా యోగా కేంద్రాల నిర్మాణం జరిగినా, అవి ప్రారంభానికి నోచుకోలేదు. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆయుష్ మిషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 421 ఆయుర్వేద, యునాని, హోమి యోపతి వైద్య,ఆరోగ్య కేంద్రాలకు యోగా కేంద్రాలను మంజూరు చేశారు.పలు చోట్ల నిర్మా ణాలు పూర్తయినా, శిక్షకులను నియమించకపోవడంతో అవి స్టోర్ రూంలను తలపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి యోగా శిక్షకులను నియమించాలని ప్రజలు కోరుతున్నారు. ఒక్కో కేంద్రానికి రూ.6 లక్షలు ప్రస్తుత సమాజంలో మనుషులు ఉరుకులు.. పరుగుల జీవితం గడుపుతున్నారు. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకు తీరిక లేకుండా బిజీగా ఉంటున్నారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం లేదు. దీంతో అనారోగ్యం పాలై ఆస్పత్రి చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. శారీరక శ్రమ లేకపోవడంతో చాలామంది షుగర్, బీపీలతో బాధపడుతున్నారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని పట్టణాలు, పల్లెల ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం అందించేందుకు వీలుగా యోగాను ఉచితంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో యోగా కేంద్రం షెడ్ నిర్మాణానికి రూ.6 లక్షల చొప్పున రూ 25.26 కోట్ల నిధులు విడుదల చేశారు.ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో నిర్మాణ బాధ్యతలను ఆర్అండ్బీ, పీఆర్, టీఎస్ఎంఐడీసీలకు అప్పగించారు. తెలంగాణవ్యాప్తంగా 421 కేంద్రాలు మంజూరు కాగా, ఇప్పటివరకు 289 నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇంకా 42 కేంద్రాల నిర్మాణం జరుగుతుండగా, మరో 90 కేంద్రాలకు స్థల కొరత ఏర్పడింది. నిర్మాణాలు పూర్తయినా.. యోగా శిక్షణకు షెడ్ల నిర్మాణాలు పలు చోట్ల పూర్తయినా, అవి ప్రారంభానికి నోచుకోలేదు. కొన్ని జిల్లాల్లో ఏడాదిన్నర క్రితం నిర్మాణాలు పూర్తయినప్పటికీ యోగా శిక్షకులను నియమించకపోవడంతో అవి తెరుచుకోలేదు. ఈ షెడ్లు వినియోగంలో లేకపోవడంతో పలు చోట్ల స్టోర్ రూంలుగా, మరికొన్ని చోట్ల అపరిశుభ్రంగా తయారవుతున్నాయి. శిక్షకుల నియామకం ఎప్పుడు? రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో యోగా శిక్షణ కేంద్రానికి ఇద్దరు శిక్షకుల చొప్పున నియమించాలని నిర్ణయించారు. అందులో ఒక పురుషుడు, ఒక స్త్రీ ఉండే వి«ధంగా ప్రణాళిక రూపొందించారు. గత నెలలో యోగా శిక్షకుల కోసం ఉమ్మడి జిల్లాల వారీగా దరఖాస్తులు ఆహా్వనించి ఇంటర్వ్యూలు నిర్వహించారు. కానీ ఇప్పటి వరకు నియామకాలు చేపట్టలేదు. పురుషులకు నెలకు రూ.8 వేలు, మహిళకు రూ.5 వేలు వేతనం ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి యోగా శిక్షణ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. త్వరలో ప్రారంభిస్తాం త్వరలో యోగా కేంద్రాలను ప్రారంభిస్తాం. కమిషనర్ ఆదేశాల మేరకు శిక్షకుల ఎంపికకు గత నెలలో ఆయా జిల్లాల వారీగా ఇంటర్వ్యూలు నిర్వహించాం. త్వరలో శిక్షకులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తాం. – రవినాయక్, ఆర్డీడీ, హైదరాబాద్, ఆయుష్ -
యోగా : ఈ ఆసనంతో వెన్నుకు దన్ను
వంగి పనిచేయడం, నిటారుగా ఉండటంలో ఏదైనా అసౌకర్యంగా అనిపిస్తుంటే వెన్నెముక కండరాలకు శక్తి అవసరం అని గుర్తించాలి. వెన్ను కండరాలను బలపరిచి, మానసిక ఒత్తిడిని తగ్గించడంలో భుజంగాసనం బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా, పొట్ట, హిప్ కండరాలను గట్టిపరుస్తుంది. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. శ్వాసకోశ సమస్యలను నివారిస్తుంది. తాచుపాము పడగ విప్పితే ఎలా ఉంటుందో ఈ భంగిమ అలా ఉంటుంది. అందుకే ఈ ఆసనాన్ని కోబ్రా పోజ్ అని, తెలుగులో భుజంగాసనం అంటారు.యోగా మ్యాట్ పైన బోర్లా పడుకొని, చేతులను నడుము, హిప్ భాగానికి ఇరువైపులా ఉంచాలి. అర చేతులను నేలకు ఆనించి, భుజాలు, తల నెమ్మదిగా పైకి లేపాలి.అరచేతులను నేలకు నొక్కి పట్టి ఉంచి, నెమ్మదిగా ఛాతీ భాగాన్ని పైకి లేపాలి. దిగువ వీపుపై ఒత్తిడి పడకుండా వెనుక కండరాలను కొద్దిగా స్ట్రెచ్ చేయాలి. దీర్ఘ శ్వాస తీసుకుంటూ 15 నుంచి 20 సెకన్లపాటు ఈ భంగిమలో ఉండాలి. శ్వాస వదులుతూ తిరిగి యధాస్థితికి రావాలి. ∙ఇదేవిధంగా ఐదారుసార్లు ఈ ఆసనాన్ని సాధన చేయవచ్చు. గర్భిణులు ఆ ఆసనం వేయకూడదు. శస్త్రచికిత్స నుంచి కోలుకుంటున్నవారు, వయసు పైబడినవారు ఆ ఆసనాన్ని నిపుణుల సూచనల మేరకే సాధన చేయాలి.– జి.అనూష, యోగా గురు -
నౌకాసనం: లైఫ్ బోట్ బ్యాలెన్సింగ్..!
శరీర బలాన్ని బ్యాలెన్స్ చేసే ఈ ఆసనాన్ని బోట్ ఆసన అని కూడా అంటారు. ఈ ఆసనం శక్తిని పెంచుతుంది. అలసటను పోగొడుతుంది. తొడలను బలోపేతం చేయడం ద్వారా ఎక్కువసేపు కూర్చొని చేసే పనుల వల్ల కలిగే సమస్యలను నిరోధిస్తుంది. నౌకాసనాన్ని సాధన చేయాలనుకునేవారు.. ముందుగా మ్యాట్ పైన కాళ్లను ముందుకు చాపి విశ్రాంతిగా కూర్చోవాలి. తుంటి భాగానికి ఇరువైపులా చేతులను నిటారుగా ఉంచాలి. తల నుంచి వెన్నుభాగాన్ని కొద్దిగా వెనక్కి వంచాలి. ఇలాంటప్పుడు హిప్ భాగంపై బరువును బ్యాలన్స్ చేసుకునేలా చూసుకోవాలి. శ్వాస వదులుతూ మోకాళ్లను, పాదాలను నేల నుండి పైకి ఎత్తాలి. ముందు మోకాళ్లు వంగి ఉంటాయి. నెమ్మదిగా నిటారుగా ఉంచే స్థాయికి తీసుకురావాలి. కంటి చూపు స్థాయికి పాదాలను పైకి లేపాలి. సాధ్యం కాక΄ోతే కొద్దిగా మోకాళ్లను వంచి, పిక్కలు, మడమల భాగాన్ని నేలకి సమాంతరంగా ఉంచాలి. భుజాలను కొద్దిగా వెనక్కి లాగి, రెండు చేతులను మోకాళ్లకు సమాంతరంగా ఉంచాలి. నాభి భాగాన్ని దృఢంగా ఉంచడానికి ప్రయత్నించాలిపాదం, వేళ్లను కొద్దిగా వంచి, ఈ భంగిమలో శ్వాస తీసుకొని, వదలాలి. 10 నుండి 20 సెకన్ల ΄ాటు భంగిమలో ఉండటానికి ప్రయత్నించాలి.తర్వాత సాధారణ స్థితికి చేరుకోవడానికి ముందుగా పాదాలను, చేతులను నేలపై ఉంచాలి. తర్వాత తల, వెన్నుభాగాన్ని యథాస్థితికి చేర్చాలి. ∙సాధనలో నెమ్మదిగా సమయాన్ని పెంచాలి. – జి.అనూష, యోగా గురు (చదవండి: -
Health: రిలీఫ్.. మెనోపాజ్ ఎక్సర్సైజ్!
మెనోపాజ్ అనేది మహిళల జీవితంలో ఒక సహజమైన దశ. ఇది సాధారణంగా 45 నుంచి 55 సంవత్సరాల మధ్య కాలంలో సంభవించే రుతుక్రమ ముగింపును సూచిస్తుంది. హార్మోన్లు.. ప్రధానంగా ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ ఉత్పత్తి తగ్గుదల వల్ల ఒంట్లో వేడి, మానసిక అలజడి, నిద్ర పట్టకపోవడం, బరువు పెరగడం వంటివి సంభవిస్తాయి. ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు చాలామంది ‘ఇది ఈ సమయంలో సహజమే, భరించాలి మరి’ అని చెబుతుంటారు. అయితే, మెనోపాజ్ దశనూ ఆహ్లాదంగా గడిపేయాలంటే నిపుణులు సూచనలను పాటించడం మేలు.ప్రధానంగా శారీరక శ్రమ వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. ఎండార్ఫిన్ విడుదల ద్వారా మానసిక స్థితి బాగవుతుంది. ఎముకలను బలోపేతం చేయడం ద్వారా బోలు ఎముకల వ్యాధి (ఆస్టియో΄÷రోసిస్) ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వ్యాయామం, ఏరోబిక్స్ వంటివి హాయినిచ్చే నిద్రను, పనిచేయగలిగే సామర్థ్యాన్నీ పెంచుతాయి. మెనోపాజ్ సమయం లో ఉపశమనం కలిగించే ఈ 8 వ్యాయామాలను ఒక అలవాటుగా మార్చుకోవాలి.1. వాకింగ్..నడక గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి సహాయపడే ప్రభావ వంతమైన వ్యాయామం ఇది. జీవక్రియలు మందగించినప్పుడు ఇది కీలకంగా పనిచేస్తుంది. ఒత్తిడిని నివారిస్తుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.2. యోగా..ఆందోళనను తగ్గించడంలో యోగా ఔషధంగా పనిచేస్తుంది. కొన్ని యోగ భంగిమలు కీళ్ల దృఢత్వాన్ని మెరుగుపరుస్తాయి. విశ్రాంతిని, మంచి నిద్రను ΄÷ందడంలో సహాయపడతాయి.3. పవర్ ట్రెయినింగ్..మెనోపాజ్ వల్ల కలిగే కండరాల క్షీణతను ఎదుర్కోవడానికి పవర్ ట్రెయినింగ్ సహాయపడుతుంది. ఎముక సాంద్రత మెరుగవుతుంది. ఆస్టియో΄÷రోసిస్ వంటి ఎముకల వ్యాధి వల్ల కలిగే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బరువులు ఎత్తడం వల్ల కండరాల శక్తి పెరుగుతుంది. జీవక్రియ మెరుగవుతుంది.4. ఈత..మెనోపాజ్ దశలో స్విమ్మింగ్ అనేది శరీరమంతటికీ పనికి వచ్చే వ్యాయామంగా చెప్పుకోవచ్చు. ఇది కీళ్లపై సున్నితంగా పనిచేస్తుంది. దీనివల్ల కీళ్ల నొప్పులు ఉండి, రుతుక్రమం ఆగిన మహిళలకు చాలా ఉపశమనంగా ఉంటుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కండరాల బలాన్ని పెంచుతుంది. శరీరంలో వేడి ఆవిర్లు వచ్చినట్లు అనిపించే భావనను తగ్గించి, శరీరాన్ని చల్లబరచడంలో ప్రత్యేకంగా సహాయపడుతుంది.5. పిలాటిస్..శరీర భంగిమలను సరిచేయడానికి ఉపకరించే ఆధునిక వ్యాయామ పద్ధతులను పిలాటిస్ అంటారు. ప్రత్యేక సాధనాల తో ఈ వ్యాయామాలు చేస్తారు. కండరాల బలాన్ని పెంచడానికి, నొప్పులను తగ్గించడానికి సున్నితమైన కదలికల ద్వారా శరీరంపై ఎక్కువ ఒత్తిడిని కలిగించకుండా ఈ వ్యాయామాలు చేస్తారు.6. నృత్యం..చురుకుగా ఉండటానికి, ఒత్తిడిని తగ్గించడానికి డ్యాన్స్ ఒక ఆహ్లాదకరమైన మార్గం. డ్యాన్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కేలరీలను బర్న్ చేస్తుంది. సామాజికంగానూ నలుగురిని కలిసేలా చేస్తుంది. ఒంటరితనం భావాలను తగ్గిస్తుంది.7. తాయ్ – చి..తాయ్– చి వ్యాయామంలో కదలికలు నెమ్మదిగా ఉన్నా శారీరక ఆరోగ్యానికి ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ వ్యాయామం రుతుక్రమం ఆగిన మహిళలకు ప్రత్యేకంగా ఉపయోగకరంగా ఉంటుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది, మానసిక స్థితిని, నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది.8. సైక్లింగ్..హిప్ కింది భాగానికి బలం చేకూరుతుంది. ఎండార్ఫిన్ల విడుదల ద్వారా మానసిక స్థితి మెరుగవుతుంది. ఈ వ్యాయామాలు మెనోపాజ్ లక్షణాలను తగ్గించడానికి, ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి.ఇవి చదవండి: ఇంటి రూఫ్.. మొక్కలు సేఫ్..! -
స్టార్టప్ ద్వారా రూ. 500 కోట్ల ఆదాయం, కట్ చేస్తే అద్దె ఇంట్లోనే నివాసం
ఆరోగ్యకరమైన ఆహారం, లేదా ప్రొడక్ట్స్ ఎక్కడ దొరుకుతుందా అన్వేషించి, అన్వేషించి చివరికి వారే తయారు చేసిన ఇద్దరు అక్కాచెల్లెళ్ల సక్సెస్ స్టోరీ ఇది. సుహాసిని, ఆమె సోదరి అనిందితా సంపత్ న్యూయార్క్‌లో నివసించేవారు. వీరిద్దరూ కలిసి యోగా క్లాస్‌కు హాజరయ్యేవారు. ఒకరోజు అనిందిత ట్రేడర్ జో నుండి ప్రోటీన్ బార్‌ను తీసుకున్నప్పుడు, వాటికి ప్రత్యామ్నాయంగా ఏమైనా దొరుకుతుందా అని ఆలోచింది. ఆ వెదుకులాటే కొత్త స్టార్టప్ ఎనర్జీ బార్ బ్రాండ్ కంపెనీకి నాంది పలికింది. కట్ చేస్తే.. రూ. 500 కోట్ల ఆదాయం.ఎంత విజయం సాధించాం, ఎంత డబ్బు సంపాదించామన్నదికాదు ముఖ్యం, తద్వారా ప్రజల జీవితాల్లో ఎంత మార్పుతెచ్చామన్నంది కూడా ముఖ్యం అంటారు బెంగుళూరుకు చెందిన సోదరీమణులు సుహాసిని.ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం అంటే ఏమి చేయాలి?ఎలా ఉండా? అనే ఆలోచన ఫలితంగా పుట్టిందే 'యోగా బార్'. బెంగళూరుకు చెందిన సుహాసిని సంపత్, తన సోదరి అనిందితా సంపత్తో కలిసి 2014లో దీన్ని ప్రారంభించారు. యుఎస్‌లో ఉద్యోగం చేస్తూ, చదువుకుంటున్నప్పుడు ఫిట్నెస్ స్పృహతో, శ్రద్ధగా యోగా తరగతులకు హాజరయ్యేవారు. కఠినమైన వ్యాయామ సెషన్ల తర్వాత, బాగా ఆకలి వేసింది. కానీ తమ కడుపుని సంతృప్తిపరిచే ఆరోగ్యకరమైన, పోషకమైన స్నాక్స్ తిందామంటే దొరికేదికాదు. దీంతో ఉద్యోగానికి రాజీనామా చేసి రూ.25 లక్షలతో స్ప్రౌట్ లైఫ్ ఫుడ్ అనే సంస్థను ప్రారంభించారు. అలా అంచెలంచెలుగా వివిధ ఉత్పత్తులతో తమ వ్యాపారాన్ని విస్తరించారు. వాటిల్లోయోగా బార్ కూడా ఒకటి.యోగా బార్ భారతీయ ఆహార, ఆరోగ్య ప్రమాణాలను సంతృప్తి పరచడమే కాకుండా, అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA)చే ఆమోదాన్ని పొందారు. స్నాక్బార్తో మొదలుపెట్టి పీనట్ బటర్, ఓట్స్.. ఇలా రకరకాల ఉత్పత్తులతో నాణ్యతకు మారుపేరుగా నిలిచింది .కట్ చేస్తే గత ఏడాది ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ ఐటీసీ 30 శాతం వాటాను కొనుగోలు చేసింది. 2026 నాటికి 100 శాతం స్టార్టప్‌ను రూ. 500 కోట్లకు కొనుగోలు చేయాలని ఒప్పందం చేసుకుంది.తొలి సంవత్సరంలో 5 లక్షల రూపాయలు. ఇండియాకు తిరిగి వచ్చి 2015 ఆగస్టులో, తొలి ఉత్పత్తి మల్టీగ్రెయిన్ ఎనర్జీ బార్లను, 2018లో ప్రొటీన్ బార్‌ను లాంచ్ చేసింది కంపెనీ. దీని ఆదాయం 2019లో రూ. 12 కోట్ల నుండి 2021 నాటికి రూ. 45 కోట్లకు పెరిగింది. వేలాది ఔట్ లెట్లతో అమెరికా, యూకేలో రెండు లక్షలకు పైగా కస్టమర్లు, ఎగుమతులతో, యోగా బార్ భారతదేశంలో ఆరోగ్యకరమైన స్నాక్స్ సంస్కృతికి నిదర్శనంగా నిలిచింది. దీంతో రూ.175 కోట్లతో సంస్థలో 39.4 శాతం వాటా కొనుగోలు చేసింది ఐటీసీ. సుహాసిని, అనిందిత, ఆర్తి ముగ్గురు అక్కాచెల్లెళ్లు. చిన్నప్పటి నుంచీ పోటీతత్వం, విజయాల పట్ల ఆసక్తి ఉన్న సోదరీమణులు ఇంటా బైటా రాణించారు. ప్రపంచంలోని అత్యుత్తమ కాలేజీల్లో చదువుకున్నారు. పెరుగుతున్నక్రమంలో రెస్టారెంట్ ఆహారం కంటే ఇంట్లో తయారు చేసిన ఆహారాన్నే ఇష్టపడేవారు. ముఖ్యంగా కూరగాయలు, తృణధాన్యాలు ,పండ్లతో పాటు, పిల్లలు ఇష్టమపడే జంక్ ఫుడ్ కోరికలను తీర్చడానికి, వారి తల్లి ఆరోగ్యకరమైన స్నాక్స్ స్వీట్ల తయారు చేసేవారట. అదే హెల్దీ యోగా బార్ సంస్థకు పునాది అంటారీ సోదరీ మణులు. కాగా లండన్ బిజినెస్ స్కూలు నుంచి ఎంబీఏ చేసిన సుహాసిని చార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేశారు. రెండు ఇళ్లు ఉన్నప్పటికీ వాటికి అద్దెకిచ్చి బెంగళూరులో అద్దెకు నివసిస్తుండటం విశేషం. ఈమెకు రియల్ ఏస్టేట్ వ్యాపారంలో కూడా పట్టు ఉందిట. -
ప్రెగ్నెన్సీలో యోగా, నటి సొన్నల్లి సెగల్ వీడియో వైరల్
గర్భం దాల్చినపుడు వ్యాయామాలు చేస్తూ,యోగాసనాలు వేస్తూ (నిపుణుల సలహాతో) సహజ ప్రసవం కోసం ప్రయత్నిస్తున్న వారి సంఖ్య ఇటీవలి కాలంలో బాగా పెరుగుతోంది. సెలబ్రిటీల దగ్గరనుంచి సామాన్యుల దాకా దీనిపై అవగాహన పెంచుకుంటున్నారు. తాజాగా నటి సొన్నల్లి సెగల్ ఏకంగా శీర్షాసనాలు వేస్తూ మరో అడుగు ముందుకేసింది.సొన్నల్లి సెగల్ మరికొన్ని రోజుల్లో మాతృత్వాన్ని రుచి చూడబోతోంది. ఇంతలో గర్భధారణ మధురిమలను ఆస్వాదిస్తోంది. సోషల్‌మీడియాలో ఫోటోలతో ఫ్యాన్స్ ఆకట్టుకోవడంలో సొన్నల్లి ముందుంటుంది. తాజాగా తన ప్రెగ్నెన్సీలో ప్రతిదశను షేర్ చేస్తూ, ఫిట్నెస్పైన తన ఆసక్తిని తెలియజేస్తోంది. ఇటీవల, సొన్నల్లి తన భర్త అశేష్ ఎల్ సజ్నానీతో కలిసి స్విట్జర్లాండ్‌లోని ప్రశాంతమైన ప్రకృతి దృశ్యాలలో రిలాక్సింగ్ బేబీమూన్ను ఆస్వాదించింది.తాజా ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో, అంత్యంత క్లిష్టమైన శిర్షాసనానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది. అత్యంత జాగ్రత్తగా ,నిపుణుల పర్యవేక్షణలో దీన్ని సాధన చేసింది. సంవత్సరాల నుండి యోగాభ్యాసంలో తలకిందులుగా వేసే ఆసనాలు ఇవి ఒక భాగం. అయితే గర్భం దాల్చినప్పుడు దీన్ని కొనసాగించగలనా? లేదా? అని భయపడ్డాను. కానీ యోగా గురువు, వైద్యుల సలహా మేరకు దీన్ని కొనసాగించగలను అని నిర్ధారించుకున్నాను. View this post on Instagram A post shared by Sonnalli A Sajnani (@sonnalliseygall) గర్భధారణకు ముందు ఎలాంటి ఆసనాలు వేసానో అవి చేయొచ్చని తనకు అర్థమైంది అంటూ ఆసనాలపై తనకున్న ప్రేమను వ్లెలడించింది. గర్భధారణ సమయంలో దీని వల్ల అపారమైన ప్రయోజనాలుంటాయని కూడా పేర్కొంది. అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ గర్బంతో ఉన్నపుడు వీటిని మొదలు పెట్టకూడదని స్పష్టం చేసింది. ఇలాంటి యోగాలసనాలతో ప్రసవ సమయంలో బేబీకి పెల్విస్ మరింత విశాల మవుతుందట. నాడీ వ్యవస్థ శాంతపర్చి, పాదాల వాపును తగ్గించడం, తిరిగి వచ్చే రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడం లాంటి అనే ప్రయోజనాలు ఉన్నాయని తెలిపింది. కాగా సొన్నాల్లి సెగల్ ఫిట్‌నెస్‌కు చాలా ప్రాధాన్యత ఇస్తుంది. యోగాతో పాటు, జిమ్‌లో తీవ్ర కసరత్తులు చేయడం ఆమెకు అలవాటు. ఈక్రమంలో గతంలో గర్భంలో ఉన్నపుడే యోని ముద్ర అనే యోగా ఆసనం చేస్తున్న వీడియోను షేర్ చేసింది. -
2026 ఆసియా క్రీడల్లో ప్రదర్శన క్రీడగా ‘యోగాసన’
న్యూఢిల్లీ: భారతదేశ ప్రాచీన వ్యాయామ పద్ధతి ‘యోగాసన’కు ఆసియా క్రీడల్లో చోటు దక్కింది. 2026లో జపాన్‌లోని ఐచీ–నగోయాలో జరగనున్న ఆసియా క్రీడల్లో యోగాసనను ప్రదర్శన ఈవెంట్‌గా చేర్చుతున్నట్లు ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (ఓసీఏ) ప్రకటించింది. ఆదివారం జరిగిన 44వ ఓసీఏ సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఓసీఏ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన రణ్‌దీర్ సింగ్ మాట్లాడుతూ... ‘2026 ఆసియా క్రీడల్లో యోగా భాగం కానుంది. దీనికి అందరి ఆమోదం లభించింది. అన్ని సభ్య దేశాలను ఒప్పించేందుకు పది రోజుల సమయం పట్టింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యోగాను ప్రతి ఒక్కరి జీవితంలో భాగం చేసేందుకు విశేష కృషి చేస్తున్నారు. ఆ దిశగా ఇది మరో ముందడుగు వంటింది. 2030 ఆసియా క్రీడల వరకు యోగాను పతక క్రీడల్లో భాగం చేసేలా చూస్తాం’ అని అన్నారు. -
నడుం ఆకృతి మార్చే మత్స్యాసనం!
బాడీ ఫిట్నెస్ కోసం వివిధ రకాల డైట్లు, వ్యాయామాలు చేస్తుంటారు. ముఖ్యంగా యోగాసనలు శరీరాకృతిని మంచిగా ఉంచడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా మెరుగ్గా ఉంచుతాయి. అందుకే చాలమంది యోగాసనాలు వేసేందుకే ఆసక్తి చూపిస్తారు. అందులో మత్స్యాసనం ది బెస్ట్ ఆసనంగా పేరు. ముఖ్యంగా నడుం ఆకృతిని మంచిగా ఉంచడంలో కీలకంగా ఉంటుంది. దీన్నీ చేపల భంగిమ లేదా చేప ఆకృతి వ్యాయామం అని అంటారు. ఈ వ్యాయమం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాల గురించి నిపుణులు సైతం చెబుతున్నారు. ఏమంటున్నారంటే..కిగాంగ్ నిపుణుడు బామా కిమ్ ఈ వ్యాయమం వెన్నుముక అమరికను మెరుగ్గా ఉంచడంలో సహాయపడుతుందని అన్నారు. ఈ వ్యాయామం బరువు తగ్గడానికే కాకుండా నడుము ఆకృతిని నాజుగ్గా మారుస్తుందని చెప్పారు. ఈ మత్స్యాసనం శరీరానికి చాల ప్రయోజనాలని అందిస్తుందని అన్నారు. ఇది భారీ బరువుతో కూడిన ఆసనం కాదు కాబట్టి నడుమపై పరిమిత వ్యవధిలోనే బరువుని ప్రభావితం చేస్తుంది. అందులనూ ఈ భంగిమలో కాళ్లను బాగా విస్తరించి చేతులు, తలపై బరువును బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆసనంలో ఎక్కవ భారాన్ని తలపై మోపకుండా చేతులపై బ్యాలెన్స్ అయ్యేలా చూసుకోవాలి. కలిగే ప్రయోజనాలు..జీర్ణ ఆరోగ్యం: ఇది ఉదర అవయవాలను ప్రేరేపించి జీర్ణక్రియ మెరుగ్గా ఉండేలా చేస్తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. వెన్నెముక అమరిక: ఇది వెన్నెముక మెరుగ్గా ఉండేలా చేస్తుంది. నడుమ వద్ద కొవ్వు పేరుకోకుండా చూస్తుంది. నరాల పనితీరు: మెడ,వెనుక భాగాన్ని సాగదీయడం ద్వారా, ఇది నరాల పనితీరును మెరుగుపరుస్తుంది.రక్త ప్రసరణ: ఇది గుండె,ఊపిరితిత్తులకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.జాయింట్ పెయిన్ రిలీఫ్: ఇది కీళ్ల చుట్టూ ఉన్న కండరాలను సాగదీయడం, సడలించడం ద్వారా కీళ్ల నొప్పుల సమస్యల నుంచి మంచి ఉపశమనం అందిస్తుంది.సురక్షితమేనా?"చేపల భంగిమ సాధారణంగా ప్రారంభకులకు సురక్షితం.కానీ వారు అదనపు మద్దతు కోసం కుషన్ వంటి ఆధారాలను ఉపయోగించాలి. ఐతే మెడ సమస్యలు, తీవ్రమైన వెన్ను సమస్యలు లేదా గుండె సమస్యలు ఉన్నవారు దీనిని ప్రయత్నించే ముందు వ్యక్తిగత వైద్యుల సలహాలు, సూచనల మేరుకు ప్రయత్నించాలి.గర్భిణీ స్త్రీలు లేదా వెన్నెముక గాయాలు ఉన్నవారు ఈ భంగిమను నివారించాలి ఈ ఆసనంలో తలపై ఎక్కువ బరువు పడకుండా చూసుకోవాలి. అలాగే లోతుగా శ్వాస తీసుకుని కొద్దిసేపు అలానే ఉండాలి. ఈ క్రమంలో అసౌకర్యం లేదా నొప్పి వస్తే తక్షణమే వ్యాయామం ఆపేసి ఆరోగ్య నిపుణులను సంప్రదించాలని చెబుతున్నారు నిపుణులు. (చదవండి: అలియా-రణబీర్ ఇష్టపడే వంటకాలివే..!) -
వైమానిక యోగా!
బిజీ లైఫ్ స్టైల్లో తీవ్ర ఒత్తిడి, కోపం, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలతో భాగ్యనగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యోగా, ధ్యానం వల్ల మనసుకు ఎంతో ప్రశాంతత చేకూరుతుంది. ఇవన్నీ పూర్వకాలం నుంచి తరతరాలుగా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు నగరంలో వయసుతో సంబంధం లేకుండా యోగా చేస్తున్నారు. అయితే ప్రస్తుతం యోగాలో కూడా కొత్త ట్రెండ్ నడుస్తోంది. అదే ఏరియల్ యోగా.. దీన్నే రోప్ యోగా అని కూడా అంటారు. సాధారణంగా కింద కూర్చుని యోగాసనాలు వేయడం కామన్.. కానీ గాల్లో వేలాడుతూ వివిధ యోగాసనాలు చేయడమే ఏరియల్ యోగా స్పెషల్ అన్నమాట. గాల్లో యోగాసనాలు ఎలా వేస్తారనే కదా మీ అనుమానం. దీని గురించిన మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.. ఏరియల్ యోగాలో చీర పరిమాణంలో ఉన్న ఒక వస్త్రాన్ని పైనుంచి ఊయల మాదిరిగా వేలాడదీస్తారు. ఆ వస్త్రాన్ని శరీరం చుట్టూ చుట్టుకోవాలి. ఇక, వస్త్రాన్ని శరీరానికి చుట్టుకున్న తర్వాత వివిధ యోగాసనాలు వేస్తుంటారు. దీని వల్ల శరీరంలో రక్త ప్రసరణ పెరగడంతో పాటు శరీరానికి ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. అనేక ఆరోగ్య సమస్యలకూ పరిష్కారంగా నిలుస్తోంది.జీర్ణక్రియకు తోడ్పాటు.. ఏరియల్ యోగాతో జీర్ణక్రియ ఎంతో మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. మలబద్ధకం, ఉబ్బరం, కడుపు నొప్పి, అజీర్తి వంటి జీర్ణ సమస్యలను నివారించడంలో ఎంతో ఉపయోగపడుతుంది. శరీరాన్ని సాగతీయడంతో పొత్తికడుపు ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. పేగు సంబంధ సమస్యలు దరి చేరకుండా చూస్తుంది. కడుపు నొప్పి లేదా గ్యాస్ ఉంటే ఏరియల్ యోగాతో తగ్గించుకోవచ్చు. ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది..ఏరియల్ యోగా శరీర కండరాలు సాగేలా చేస్తుంది. గాల్లో ఉంటారు కాబట్టి.. శరీరాన్ని మరింత స్ట్రెచ్ చేసేందుకు వీలు కలుగుతుంది. కొద్ది రోజులకు శరీరం మరింత ఫ్లెక్సిబుల్‌గా మారుతుంది. ఇలా చేయడం వల్ల కండరాలు కూడా బలంగా తయారవుతాయి. వెన్నెముక, భుజం శక్తివంతంగా తయారయ్యేందుకు దోహదపడుతుంది.ఒత్తిడిని తగ్గించే ఆయుధం.. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలతో బాధపడుతుంటే.. ఏరియల్ యోగా చాలా ఉత్తమమైన వ్యాయామం అని చెప్పొచ్చు. మానసిక స్థితిని మెరుగుపరచడంతో పాటు ప్రవర్తనలో కూడా మంచి మార్పులు తీసుకొస్తుంది. ఒత్తిడి, ఆందోళనను తగ్గి స్తుంది. గాల్లో తల్లకిందులుగా వేలాడుతూ.. ధ్యానం చేస్తుంటే మంచి ఆలోచనలపై దృష్టి పెట్టేందుకు అవకాశం ఉంటుంది. ఏరియల్ యోగాతో మెదడులో రక్త ప్రసరణ పెరిగి మానసిక ఆరోగ్యం మన సొంతమయ్యేలా చేస్తుంది.వెన్నునొప్పి హుష్‌కాకి.. వెన్నెముకపై ఎలాంటి ఒత్తిడీ పడకుండా వెన్నెముక, దాని సంబంధిత సమస్యలను నయం చేయడంలో ఏరియల్ యోగా ఎంతో ప్రభావం చూపుతుంది. వస్త్రంలో పడుకుని వెనక్కి అలా వంగి కాసేపు ఆసనం వేస్తే వెన్నెముక సమస్యలు ఇట్టే తొలగిపోతాయి. ఏరియల్ యోగాతో శరీర తీరుతో పాటు వెన్నెముకను సరిచేసుకోవచ్చు. నడుము నొప్పి కూడా తగ్గుతుంది.బరువు తగ్గిపోతుంది.. ఏరియల్ యోగా బరువు తగ్గించడంలో కూడా ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. 50 నిమిషాల పాటు ఏరియల్ యోగా చేస్తే దాదాపు 320 కేలరీలు బర్న్ చేయగలదు. శరీర కొవ్వును బర్న్ చేసేటప్పుడు ఇది టోన్డ్, లీన్ కండరాలను పొందడానికి సహాయం చేస్తుంది. సమర్థవంతమైన ఫలితాల కోసం వారానికి ఒకసారి దీన్ని ప్రాక్టీస్ చేయవచ్చు.నిపుణుల పర్యవేక్షణలో ..యోగా చేసేటప్పుడు నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలి. సొంతంగా చేస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముందు ఎవరైనా గురువు దగ్గర నేర్చుకుని ఆ తర్వాతే అభ్యాసం చేయాలి. కొన్ని యోగాసనాలు చేస్తే పర్వాలేదు. అన్ని ఆసనాలు అందరూ చేయకూడదు. ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు నిపుణుల సలహాలు తీసుకోవాలి. క్రమం తప్పకుండా క్రమపద్ధతిలో చేయాలి. – శ్రీకాంత్ నీరటి, యోగా ట్రైనర్యోగాతో ఎన్నో ప్రయోజనాలుయోగా చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే పతంజలి సూచించిన అష్టాంగ మార్గాల్లోని యమ, నియమను పాటిస్తూ యోగా సనాలు వేయాలి. అప్పుడే మానసిక, శారీరక, ఆధ్యాత్మిక ప్రయోజనాలు చేకూరతాయి. స్థితప్రజ్ఞత సాధించేందుకు యోగా అత్యున్నత మార్గం. – నెతికార్ లివాంకర్, యోగా ట్రైనర్, రామకృష్ణ మఠంకాని్ఫడెన్స్ పెరుగుతుంది.. ఏరియల్ యోగా లేదా యాంటీ గ్రావిటీ యోగా ద్వారా శరీరం చాలా బలంగా తయారవుతుంది. అలాగే మనపై మనకు కాన్ఫిడెన్స్తోపాటు జ్ఞాపకశక్తి, రక్త ప్రసరణ పెరుగుతుంది. మైండ్ రిలాక్సేషన్ అవుతుంది. కాకపోతే సాధారణ యోగాలో కొంతకాలం అనుభవం ఉన్న వారు మాత్రమే దీనిని చేయాలి. ముఖ్యంగా గురువుల సమక్షంలో చేస్తే మంచిది. – కొండకళ్ల దత్తాత్రేయ రావు, అద్వైత యోగా సెంటర్ -
యుద్ధానికి శరీరాన్ని సిద్ధం చేస్తున్నట్టుగా.. ఈ వారియర్పోజ్!
యుద్ధానికి శరీరాన్ని సిద్ధం చేస్తున్నట్టుగా ఈ యోగా భంగిమలు ఉంటాయి. అందుకే, దీనిని వారియర్ పోజ్ అంటారు. ఈ యోగ భంగిమలో ఒక కాలి తుంటి భాగం ముందుకి ఉంటుంది. మరొక కాలు వెనక్కి చాపి, మునివేళ్ల మీద ఉంచాలి. చేతులను తలమీదుగా నిటారుగా ఉంచి, నమస్కారం చేసినట్టుగా కలపాలి. దృష్టి రూఫ్ వైపుగా ఉండాలి. కొద్దిగా వెనక్కి వంగడం వల్ల వెన్నెముక సాగుతుంది. భుజాలు, ఇరువైపులా శరీర కదలికలు ఈ భంగిమలో ఉంటాయి.అంతర్గత సామర్థ్యానికి ప్రతీకగా చెబుతుంటారు కాబట్టి దీనిని వీరభద్ర ఆసనం అని కూడా అంటారు. దీనిని రోజూ సాధన చేయడం వల్ల తుంటి, కాళ్లు, చీలమండలం, పాదాల ఎముకలకు బలం చేకూరుతుంది. కండరాలను టోనింగ్ చేస్తుంది. కాళ్లలో శక్తి సమకూరుతుంది. బలం, ఏకాగ్రత, ధైర్యం వంటి మానసిక స్థైర్యం ఈ ఆసన సాధన వల్ల కలుగుతాయి. శ్వాస తీసుకుంటూ, నెమ్మదిగా వదులుతూ ఐదు సార్లు ఈ ఆసనాన్ని సాధన చేయాలి. అన్ని వయసుల వారు చేయచ్చు. ఆర్థరైటిస్ మోకాళ్ల నొప్పులు ఉన్నవాళ్లు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.– జి.అనూష, యోగా నిపుణులు -
యోగం: విల్లులా వంచుదాం!
వెన్నెముక కండరాలను బలోపేతం చేయడంలోనూ, శరీర సమతుల్యతను మెరుగుపరచడంలోనూ.. ఎన్నో ప్రయోజనాలను అర్ధచక్రాసన ద్వారా పొందవచ్చు. ఈ ఆసనం విల్లు భంగిమను పోలిఉంటుంది. అర్ధ చక్రం (హాఫ్ వీల్ ఆసన) అంటే సగం చక్రం అన్నమాట.చురుకైన కండరాలు..దీనిని సాధన చేయడానికి మ్యాట్‌పైన నిటారుగా నిల్చోవాలి. చేతులను, తలను భుజాల నుంచి వెనక్కి తీసుకుంటూ నడుమును వంచాలి. దీని వల్ల వెన్ను భాగం సాగుతుంది. ఎంత వీలైతే అంతగా నడుము భాగాన్ని ముందుకు, తల భాగాన్ని వెనక్కి వంచుతూ కాళ్లను నిటారుగా ఉంచాలి. దీంతో కండరాలన్నీ పూర్తి చురుగ్గా అవుతాయి. వెనుకకు వంగేటప్పుడు దీర్ఘ శ్వాస పీల్చుకొని, నెమ్మదిగా వదలాలి. అదే విధంగా యధాస్థితికి చేరుకున్నప్పుడు దీర్ఘశ్వాస తీసుకుంటూ, వదలాలి. మూడు నుంచి ఐదు సార్లు..సాధారణంగా శ్వాస తీసుకునేటప్పుడు సమతుల్యతను కోల్పోకుండా ఉండేలా చూసుకోవాలి. మూడు నుంచి ఐదు సార్లు ఈ భంగిమను తిరిగి చేయాలి. తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి కొంత సమయం కేటాయించాలి. ఈ ఆసనం వల్ల వెన్నెముక నొప్పి తీవ్రత తగ్గుతుంది. కడుపుపై ఒత్తిడి పెరిగి, అదనపు కొవ్వు తగ్గిపోతుంది. ఊబకాయంపై ప్రభావంతంగా పనిచేస్తుంది. హృదయ స్పందన రేటును సమర్థంగా నిర్వహిస్తుంది. ఫలితంగా గుండె పనితీరు మెరుగుపడుతుంది.– జి. అనూషా రాకేష్, యోగా ట్రైనర్ -
ఆ యోగాసనంలో కాబోయే తల్లి దీపికా పదుకొణె..ఆ టైంలో మంచిదేనా..!
బాలీవుడ్ నటి, కాబోయే తల్లి దీపికా పదుకొణె యోగాసనాలు వేస్తూ కనిపించింది. దీపికా బేబీ బంప్‌తో విపరీత కరణి యోగాసనం వేసింది. ఎప్పటికప్పుడూ తన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ యాక్టివ్‌గా ఉంటుంది. తాను ఫిట్‌గా ఉండటానికే ఇలా యోగాసనాలు వేస్తున్నట్లు చెబుతుండే దీపికా ఈ టైంలో కూడా యోగాసనాలు వేస్తున్న ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది. మరీ ఇలా ఇలా ఆసనాలు వేయడం కాబోయే తల్లులకు మంచిదేనా? ఆ టైంలో వేయడం ఎంత వరకు మంచిది వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా..!38 ఏళ్ల దీపికా పదుకొణే వేసిన విపరీత కరణి యోగాసనం కాబోయే తల్లులకు ఎంతో ఉపయోగకరం. ఇలా ఐదు నిమిషాల పాటు వేస్తే ఎంతో మంచిది. సంస్కృతంలో దీన్ని తలకిందులుగా వేసే యోగాసనంగా చెప్పుకుంటారు. ఈ యోగా భంగిమలో మీ కాళ్ళను పైకెత్తి గోడకు ఆనించి పడుకోవడం జరుగుతుంది. ఈ పునరుజ్జీవన యోగసనం నాడీ వ్యవస్థను శాంతపరచడం, రోగనిరోధక శక్తిని పెంచడం వంటి అనేక ప్రయోజనాలను అందిస్తుంది.దీపికా పడుకుణే లాంటి కాబోయే తల్లులు ఈ యోగాను వేయాలనుకుంటే.. కుషన్ లేదా దిండు వంటివి వేసుకుని చేయడం మంచిది. ఈ వ్యాయామం కండరాలు, కీళ్ళలో నొప్పిని తగ్గిస్తుంది. గర్భం ధరించిన వారిలో కండరాలు, కీళ్ల నొప్పులు కనిపిస్తూ ఉంటాయి. వీపు కింద తలగడ పెట్టుకోవడంవల్ల తక్కువ ఒత్తిడి పడుతుంది. ఈ వ్యాయామం కాబోయే తల్లులకు సురక్షితంగా ఉంటుంది. ఈ వ్యాయామం కోసం కాళ్ళను ఎత్తినప్పుడు, ఇది వారి చీలమండలో వాపును తగ్గిస్తుంది. అయితే గ్లాకోమా, అధిక రక్తపోటు వంటి సమస్యలు ఉన్న వారు ఈ యోగా భంగిమను ప్రయత్నించకూడదు.ప్రయోజనాలుఈ ఆసనం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. గర్భం ధరించిన వారే కాదు, సాధారణ వ్యక్తులు కూడా ఈ యోగా చేయడం ఎంతో మంచిది.మేల్కొన్న వెంటనేవిపరీత కరణి వ్యాయామంతో రోజును ప్రారంభిస్తే ఎంతో మంచిది. ఇది శోషరస, గ్లింఫాటిక్ వ్యవస్థలను ఉత్తేజపరుస్తుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఇది ఎగువ అవయవాల వైపు ఆక్సిజన్ రక్త ప్రవాహాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది శరీరంలో డిటాక్సిఫికేషన్‌కు సహాయపడుతుంది. శరీరంలోని వ్యర్థాలను, విషాలను బయటకు పంపిస్తుంది. ఈ వ్యాయామం తుంటి, తొడ కండరాలను సాగదీయడానికి సహాయపడుతుంది.ఈ యోగాను నిద్రపోయే ముందు చేయడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. ఈ వ్యాయామం వల్ల శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. ఎందుకంటే ఇది శరీరాన్ని శాంతపరుస్తుంది. ఇది పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది నిద్ర నాణ్యతను పెంచుతుంది. విపరీత కరణి యోగాసనం చేయడం వల్ల కాళ్లలోని బిగువును తగ్గించడానికి సహాయపడుతుంది.దీన్ని లెగ్-అప్-ది-వాల్ భంగిమ అని కూడా అంటారు. ఇది ఒక ఆల్ రౌండర్ యోగాసనం. ఇది మానసికంగా, శారీరకంగా మిమ్మల్ని శాంతపరిచే యోగాసనం. మెరుగైన నిద్ర నాణ్యత, మంచి ఉదర ఆరోగ్యం, రోగనిరోధక శక్తి పెంచడం, ఒత్తిడి తగ్గించడం వంటి ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చు. View this post on Instagram A post shared by दीपिका पादुकोण (@deepikapadukone) (చదవండి: బేబీ క్యారెట్స్ సీక్రెట్ తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!) -
సుమ యోగా డే వీడియో వైరల్
ప్రపంచవ్యాప్తంగా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం చాలా ఉత్సాహంగా జరిగింది. ముఖ్యంగా మన దేశంలో జమ్ము కశ్మీర్లో 50 వేల మందితో నిర్వహించిన యోగా కార్యక్రమం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా యోగా ప్రాముఖ్యత రోజు రోజుకు పెరుగుతోందని, ప్రపంచ యోగా గురుగా భారత్ మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. అలాగే దేశ వ్యాప్తంగా నిర్వహించిన యోగా డే వేడుకల్లో పలువురు రాజకీయ, సినీ, క్రీడారంగ ప్రముఖులు యోగాసనాలతో సందడి చేశారు. View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma)ప్రముఖ యాంకర్ సుమ కనకాల అందరికీ అంతర్జాతీయ యోగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది. ముఖ్యంగా మహిళలు ఎలాంటి ఆసనాలు వేయాలి? వాటి లాభాలను వివరిస్తూ ఇన్‌స్టాలో ఇంట్రస్టింగ్ వీడియోను షేర్ చేసింది. ప్రతీ పండుగకు ఏదో ఒక విశేషమైన వీడియోను పంచుకునే సుమ యోగా డేనుకూడా అలా వినియోగించుకుందన్న మాట. యోగాసనాలతో విన్యాసాలు చేస్తూ హిల్లేరియస్ రీల్‌పై నెటిజన్లు కూడా ఫన్నీగా కమెంట్స్ చేశారు. అయితే ‘‘ఎందుకొచ్చిన తిప్పలు అక్కా..హాయిగా మూడు ప్రీ-రిలీజ్ ఈవెంట్లు, 6 ఇంటర్వ్యూలు చేసుకోక’’ అని ఒకరు, ‘ఈ వయసులో ఈ ప్రయోగాలు అవసరమా, లైక్స్ కోసం కాకపోతే’ అని మరొకరు, ‘‘ఇంత టైం ఎక్కడ దొరకుతుందక్కా నీకు’’ అంటూ మరొక అభిమాని వ్యాఖానించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఏ వయసులో ఉన్నవారైనా యోగాను సాధన చేయవచ్చు. కాకపోతే నిపుణుడైన గురు సమక్షంలో చేయడం ఉత్తమం. -
భారతీయ వారసత్వ సంపద యోగా
సాక్షి, అమరావతి/లబ్బిపేట (విజయవాడ తూర్పు): యోగా భారతీయ ఘన వారసత్వ సంపద అని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శుక్రవారం రాష్ట్ర ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో విజయవాడ లోని ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. శరీరంతో పాటు, మనసు శక్తివంతం కావాలంటే అందుకు ఏకైక మార్గం యోగా అని అన్నారు. ఈ ఏడాది యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ ఇతివృత్తంతో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయన్నారు. 175 దేశాలకు పైగా యోగాను ఆచరిస్తున్నాయని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్న వయసు నుంచే యోగా ఔన్నత్యాన్ని వివరించాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రకృతి వైద్యులు మంతెన సత్యనారాయణరాజు యోగాసనాలు చేయించారు. ఆయుష్ శాఖ రూపొందించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫార్మసీస్ అండ్ డాక్టర్స్ వెబ్సైట్, ఆశా ఏఎన్ఎంల కోసం రూపొందించిన శిక్షణా పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఎంపీ సీఎం రమేశ్, ఎమ్మెల్యేలు కొలికపూడి, ఎన్.ఈశ్వరరావు, రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు పాల్గొన్నారు. యోగాతో మానసిక ఆరోగ్యంగవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్నిత్యం యోగా చేయడం శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందని గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని రాజ్‌భవన్‌లో శుక్రవారం గవర్నర్‌తోపాటు అధికారులు, సిబ్బంది యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైద్య అధికారి సీహెచ్.రామానంద్, కేర్ యోగా నేచురోపతి కాలేజ్‌కు చెందిన ఎస్.సుచరిత యోగాసనాల గురించి వివరించారు. ప్రాచీన జీవన విధానాన్ని స్వీకరించాలికేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవర్మ భీమవరం: యోగా ప్రాచీన సంస్కృతిలో ఒక భాగమని, మన జీవన విధానంలో వచ్చిన మార్పుల కారణంగా పడుతున్న ఇబ్బందులను అధిగవిుంచడానికి ప్రాచీన జీవన విధానాన్ని తిరిగి స్వీకరించాలి్సన అవసరముందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని భారతీయ విద్యాభవన్స్ స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యోగా సాధన ద్వారా చక్కని శారీరక ఆరోగ్యంతో పాటు, మానసిక ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చునన్నారు. కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ నేటి ప్రపంచంలో ప్రతి రంగంలోనూ తీవ్ర పోటీ నెలకొన్నందున మానసిక ఒత్తిడికి లోనవుతున్నారన్నారు. మానసిక ప్రశాంతతకు, శారీరక ఆరోగ్యానికి యోగా దోహదం చేస్తుందన్నారు. ఎస్పీ వేజెండ్ల అజిత మాట్లాడుతూ టెక్నాలజీ, ఆధునిక సాధనాల వల్ల శారీరక శ్రమ తగ్గిపోయిందని, ప్రతి ఒక్కరూ నిత్యం కనీసం 20 నిమిషాల పాటు శారీరక వ్యాయామం చేయాలని, తద్వారా మానసిక, శారీరక సమతౌల్యత కలుగుతుందని చెప్పారు. కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ, కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ అజిత వేజెండ్ల, జాయింట్ కలెక్టర్ సీవీ ప్రవీణ్ ఆదిత్య తదితరులు విద్యార్థులతో కలిసి యోగాసనాలు వేశారు.నడి సముద్రంలో నౌకాదళం యోగాసనాలుసాక్షి, విశాఖపట్నం: ‘స్వీయ ఆరోగ్యం, సమాజం కోసం యోగా’ అనే థీమ్‌తో తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించింది. 11 రోజుల పాటు యోగా ప్రచారం నిర్వహించిన నౌకాదళం.. శుక్రవారం గ్రాండ్ ఫినాలేలో వివిధ ప్రాంతాల్లోని సాగర తీరంలోనూ, సముద్రంలోని యుద్ధ నౌకల్లో యోగాసనాలు వేశారు. శారీరక, మానసిక, భావోద్వేగ శ్రేయస్సును మెరుగుపరచడానికి నేవీ సిబ్బంది యోగా విన్యాసాలు నిర్వహించారు. యోగా సెషన్స్‌తో పాటు మైండ్‌ఫుల్‌నెస్, ధ్యానం, అధునాతన ఆసనాలపై నిర్వహించిన ప్రత్యేక వర్క్‌షాప్‌లలో నౌకాదళ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పసిఫిక్, అరేబియా, బంగాళాఖాతం, హిందూ మహా సముద్ర తీరాల్లో పహారా కాస్తున్న యుద్ధ నౌకల్లో నిర్వహించిన యోగా విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇండియన్ కోస్ట్‌గార్డ్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా డేలో కోస్ట్‌గార్డ్ ఉద్యోగులు, కుటుంబసభ్యులు పాల్గొన్నారు. -
ప్రపంచ దేశాల్లో యోగా దినోత్సవం
న్యూఢిల్లీ/న్యూయార్క్/టెల్అవీవ్: అంతర్జాతీయ యోగ దినోత్సవంలో ప్రపంచవ్యాప్తంగా ఔత్సాహికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీతోపాటు న్యూయార్క్‌లో పలు కార్యక్రమాలు జరిగాయి. న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్‌లో ప్రత్యేక యోగా కార్యక్రమాలు జరిగాయి. అత్యధిక ఉష్ణోగ్రతలను లెక్క చేయకుండా జనం వేలాదిగా పాల్గొన్నారు. అదేవిధంగా ఇజ్రాయెల్‌లోని టెల్అవీవ్లో జరిగిన కార్యక్రమంలో 300 మంది పాల్గొన్నారు. సింగపూర్‌లో ఆరోగ్య శాఖ మంత్రి రహయు మహజం ఆధర్యంలో జరిగిన కార్యక్రమంలో 200 మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. నేపాల్‌లోని పొఖారా, బుద్ధుడి జన్మస్థలం లుంబినిలో యోగా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. శ్రీలంక రాజధాని కొలంబో, చైనా రాజధాని బీజింగ్, ఫ్రాన్సు రాజధాని పారిస్, మాల్దీవులు రాజధాని మాలె, ఇటలీ రాజధాని రోమ్, సౌదీ రాజధాని రియాద్, కువైట్, మలేసియా, ఇండోనేసియాలో, స్వీడన్ రాజధాని స్టాక్‌హోం, లండన్‌లోని ట్రఫాల్గర్ స్క్వేర్‌లోనూ యోగా కార్యక్రమాలు జరిగాయి. -
ప్రపంచ శ్రేయస్సుకు యోగా శక్తివంతమైన సాధనం: మోదీ
శ్రీనగర్: యోగాను ప్రపంచ శ్రేయస్సుకు పనిచేసే శక్తివంతమైన ఉపకరణంగా నేడు అందరూ భావిస్తున్నా రని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. మరింత మంది పర్యాటకులను ఆకర్షించడం ద్వారా జమ్మూకశ్మీర్ ఆర్థిక వ్యవస్థను మార్చే సామర్థ్యం యోగాకు ఉందన్నారు. ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో యోగాను 50 వేల నుంచి 60 వేల మంది వరకు సాధన చేస్తుండటం సాధారణ విషయం కాదని తెలిపారు. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీనగర్‌లోని షేర్–ఇ–కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(ఎస్కేఐసీసీ)లో జరిగిన కార్యక్రమంలో మోదీ పాల్గొని ప్రసంగించారు. ‘దేవుడు, ఈశ్వరుడు లేదా అల్లాను చేరుకునే ఆధ్యాత్మిక ప్రయాణంగా యోగా గురించి సాధారణంగా చెబుతుంటారు. ఆధ్యాత్మిక కోణాన్ని వదిలేసి ప్రస్తుతానికి, మనం వ్యక్తిగత అభివృద్ధి కోసం యోగాపై దృష్టి పెట్టి, దానిని జీవితంలో ఒక భాగంగా ఆచరించవచ్చు. అలా చేస్తే ఎన్నో లాభాలు ఉన్నాయి. వ్యక్తిగత అభివృద్ధి సమాజ శ్రేయస్సుకు..అంతిమంగా అది మానవాళి శ్రేయస్సుకు దారితీస్తుంది’’ అని చెప్పారు.సియాచిన్‌లోనూ యోగా డేరాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, అధికారులు యోగా చేశారు. పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, ఎస్.జైశంకర్, రాజ్‌నాథ్ సింగ్ తదితరులు దేశవ్యాప్తంగా పలుచోట్ల కార్యక్రమంలో పాల్గొన్నారు. సియాచిన్‌లో, రాజస్తాన్‌లోని థార్ ఏడారిలో, సముద్రంలో విమానవాహక యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై సైనికులు యోగా చేశారు. తమిళనాడులోని రామేశ్వరంలో సాయుధ సిబ్బంది జల యోగ చేశారు. ఈ ఏడాది యోగా డే ఇతివృత్తం ‘యోగా ఫర్ సెల్ప్ అండ్ సొసైటీ’. -
50 ఏళ్ల వయసులో బైక్ రైడ్, డ్యాన్స్, ట్రెక్కింగ్..!
చుట్టుపక్కల వాళ్లంతా ఈ ఏజ్‌లో ఇవి నేర్చుకుంటున్నావా అని ఒకటే హేళన చేసేవారు ఆమెను. సోషల్ మీడియాలో సైతం ఈ వయసులో ఎందుకు మీకు..హాయిగా కృష్ణ.. రామా.. అనుకుంటూ కూర్చొక అన్న మాటలు వినిపిస్తున్నే ఉన్నాయి. అయినా లెక్కచేయకుండా ఉత్సాహభరితంగా తనకు నచ్చినవి అన్నీ చేస్తూ ఆనందంగా జీవిస్తున్నారు నీరూ సైనీ. ఆమె హర్యానాలోని పంచకులకి చెందిన 54 ఏళ్ల నీరూ సైనీ . సమాజంలో వృద్దులు అంటే ఇలానే ఉంటారనే మూస భావనను బ్రేక్ చేసింది నీరూ. ఆమె 40 ఏళ్ల వయసులో డ్యాన్సులు, బైకింగ్, ట్రెక్కింగ్ వంటివి నేర్చుకుని ఆదర్శంగా నిలిచింది. నేర్చుకోవాలనే జిజ్ఞాస ఉంటే వయసు అడ్డంకి కాదని ప్రూవ్ చేసి చూపించింది. ఇంతకీ ఆమె ఈ వయసులో ఇలా ఇవన్నీ నేర్చుకోవడానికి గల కారణం ఏంటంటే..చండీగఢ్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న నీరు కుంటుబ నేపథ్యం ఏంటంటే..నీరుకి 20 ఏళ్ల వయసులో పెళ్లయింది. ఆమె భర్త నేవీలో పనిచేస్తారు. ఆయనతో కలిసి సుమారు 26 దేశాలకు వెళ్లారు. అయితే ఆమె భర్తకు కేన్సర్ వచ్చిందని తెలిసిందో అప్పుడే ఆమె ప్రపంచం అంతా తలకిందులైపోయింది. 2000 సంవత్సరం అంతా నీరుకి బ్యాడ్ టైం అని చెప్పొచ్చు. భర్త మందులకే లక్షకు పైగా ఖర్చు అయ్యేది. ఎంతలా డబ్బు వెచ్చించినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి ఆయన కేన్సర్‌తో పోరాడుతూ 2002లో మరణించారు. అప్పటికి ఆమెకు నాలుగు, పది సంవత్సరాల ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. దీంతో ఒక్కసారిగా కుటుంబ భారం అంతా నీరుపై పడింది. భర్త చికిత్స కోసం దాచుకున్న డబ్బంతా ఖర్చు అయ్యిపోవడంతో ఒంటరిగా కూతుళ్లను పెంచడం ఆమెకు పెను భారమయ్యింది. అయినా అలానే ట్యూషన్, చెబుతూ కాలం వెళ్లదీసింది. ఈలోగా ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సంపాదించింది. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ చివరికి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకుంది. అలా ఆమె పదేహేనేళ్లు కూతుళ్ల బాధ్యతను నిర్వర్తించడంలోనే మునిగిపోయింది. నీరు పెద్ద కుమార్తె ఐవీ లీగ్ విశ్వవిద్యాలయంలో అడ్మిషన్ పొంది మంచి ఉద్యోగం సంపాదించగా, చిన్న కుమార్తె కూడా మంచి ఉద్యోగంలో సెటిల్ అయ్యింది. ఇద్దరూ ఆమెను వదిలి విదేశాలకు వెళ్లిపోవడంతో ఒంటిరిగా అయిపోయింది నీలు. ఒక్కసారిగా వచ్చిపడ్డ ఒంటరితనం భరించలేకపోయింది. ఇది ఆమె ఆరోగ్యంపై ప్రభావం చూపడంతో అనూహ్యంగా బరువు తగ్గిపోయింది. ఆమె బాధను చూడలేక చిన్న కూతురు తల్లితో గడిపేందుకు ఒక ఏడాది సెలవు తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఆ టైంలోనే ధ్యానం చేయడం స్కూబా డ్రైవింగ్, స్కై డైవింగ్ వంటి సాహస క్రీడలపై దృష్టిసారించింది. తన కూతుళ్ల సాయంతోనే తనకు నచ్చినవన్నింటిన అలవోకగా నేర్చుకుంది. అంతేగాదు 52 ఏళ్ల వయసులో రెండు సోలో బైక్ రైడ్లను కూడా విజయవంతంగా పూర్తి చేసింది. ఆమె చండీగఢ్‌లోని ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ టీచర్‌గా చేస్తూ ఇవన్నీ నేర్చుకుంది. పైగా ప్రతి స్త్రీ తన కోసం తను జీవించాలని తన కలలను కొనసాగించాలని చెబుతోంది నీరు. వ్యక్తిగత జీవితంలోని విషాదం నుంచి తేరుకుని నిలదొక్కుకోవడమే గాక పిల్లల భవిష్యత్తుని మంచిగా తీర్చిదిద్దింది. మళ్లీ జీవితంలో వచ్చి చేరిన శ్యూన్యతను చెదరగొట్టి కొత్త జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో తెలిపింది. జీవితమనేది సవాలని దాన్ని నీకు నచ్చినట్లుగా మలుచుకుంటూ ముందుకు సాగిపోవాలని నీరు కథే చెబుతోంది కదూ..!.(చదవండి: ప్రపంచ సంగీత దినోత్సవం: సంగీతం మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచగలదా..?) -
'ఆధునిక యోగా పితామహుడు'! ఏకంగా 60 దేశాలకు..
ప్రపంచానికి భారతదేశం అందించిన అద్భుతమైన బహుమతుల్లో ఒకటి 'యోగా'. అలాంటి యోగాతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనే విషయం అందరికీ తెలిసింది. అయితే ఈ యోగా భారతదేశం వారసత్వమే అయినా అందరికీ దీని గురించి కూలంకషంగా తెలియని కాలంలో తిరుమలై కృష్ణమాచార్య గారు దీన్ని వ్యాప్తి చేశారు. ఎంతలా అంటే మన దేశాన్ని పాలించిన బ్రిటిష్ వాళ్లు కూడా తెలుసుకునేలా ప్రజాధరణ తీసుకొచ్చారు. ఆయన తర్వాత కాలంలో ఆయన శిష్యుడిగా చెప్పుకునే బెల్లూర్ కృష్ణమచార్ సుందరరాజా అయ్యంగార్ లేదా బీకేఎస్ అయ్యంగార్‌కే ఆ ఘనత దక్కుతుంది. ఎందుకంటే..? ఆయన ఏకంగా 60 దేశాలకు యోగా అభ్యాసాన్ని గురించి తెలియజేశారు. ఇవాళ(జూన్ 20) అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని బీకేఎస్ అయ్యంగార్ ఎలా పాశ్చాత్య దేశాలకు యోగాను పరిచయం చేయగలిగారు? ఆయన యోగా నేర్చుకోవడానికి దారితీసిన పరిస్థితులు గురించి తెలుసుకుందామా..!బీకేఎస్ అయ్యంగార్ లేదా బెల్లూర్ కృష్ణమచార్ సుందరరాజా అయ్యంగారిని 'ఆధునిక యోగా పితామహుడి'గా పిలుస్తారు. ఆయన యోగాని శారీరక అభ్యాసానికి సంబంధించిన కళ, సైన్స్, ఫిలీసపీ అని ప్రగాఢంగా నమ్మారు. 1950లలో యోగా అభ్యాసాలను ప్రచార చేసే నిమిత్తం ముంబై పర్యటనలో ఉన్నారు అయ్యంగారు. సరిగ్గా ఆ సమయంలోనే భారత్ సందర్శనకు వచ్చిన అమెరికన్ బ్రిటీష్ వయోలిన్ వాద్యకారుడు యొహూదీ మెనూహిన్ యోగా గురువు అయ్యంగార్ని కలవడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా యోగా గురించిసేలా చేసే ప్రచారం చేయాలన్న అతని దృఢ సంకల్పం విని ఆశ్చర్యపోయారు. ఆయన అలవోకగా వేస్తున్న ఆసనాలన్నీ మెనూహిన్ని ఎతంగానో ఆకర్షించాయి. ఆ ఆసనాలు తాను నేర్చుకుంటే తన వయోలిన్ కళ మరింత మెరుగుపడుతుందని భావించి, అయ్యంగార్ని తనతోపాటు స్విట్జర్లాండ్, లండన్ వంటి దేశాలకు తీసుకెళ్లాడు. అలా అయిన యోగా ప్రాముఖ్యత గురించి విదేశాల్లో ప్రచారం చేసే అవకాశం లభించింది. ఆ క్రమంలో 1956లో అయ్యంగార్ న్యూయార్క్ వచ్చిన తొలినాళ్లల్లో చాలామంది యోగా పట్ల ఆసక్తి చూపలేదు. ఆ తర్వాత నెమ్మదిగా యోగాకు క్రేజ్ లభించడం జరిగింది. ఆ విధంగా ఆయన ఆరు ఖండాల్లో యోగా ఇన్స్టిట్యూట్లను ప్రారంభించాడు. అంతేగాదు 'లైట్ ఆన్ యోగా' వంటి పుస్తకాలను కూడా రాశారు. ఇవి అంతర్జాతీయంగా అమ్ముడైన పుస్తకంగా కూడా నిలిచింది. ఎవరంటే..అయ్యంగార్ డిసెంబర్ 14, 1918న కర్ణాటక బెల్లూరులో జన్మించారు. 1937లో మహారాష్ట్రలోని పూణేకు వచ్చి అయ్యంగార్ యోగాగా పిలిచే యోగా శైలిని తీసుకొచ్చారు. ఆయన చిన్నతనంలో క్షయ, టైఫాయిడ్, మలేరియా వంటి వ్యాధుల నుంచి బయటపడేందుకు అతనికి యోగా ఉపకరించింది. దీంతో అప్పటి నుంచి ఎన్నో ప్రయోజనాలందించే ఈ యోగాని అందరూ తెలసుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలని సంకల్పించారు. ఇక ఆయన యోగా అభ్యాసన విధానంలో చాలా సులభమైన భంగామల్లో వేసేలా బ్లాక్‌లు, పల్టీలు, వంటి వాటిని వినియోగించేవారు. ఎవ్వరైనా ఇట్టే నేర్చుకునేలా బోధించేవారు. ఆ తర్వాత 1975లో తన స్వంత 'యోగవిద్య' సంస్థను స్థాపించారు. అలా దేశవ్యాప్తంగా విదేశాలలో కూడా వివిధ శాఖలకు విస్తరించాడు. అలా యోగా వ్యాప్తి కోసం చేసిన కృషికి గానూ యోగా గురువుగా, ఆధునిక ఋషిగా కీర్తించబడ్డారు. ఆయనకు విదేశాల్లో సుమారు 100కు పైగా యోగా ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. ఆయన సామాన్యులకే గాక పలువురు ప్రముఖులకు కూడా యోగాసనాలు నేర్పారు. ఆయన వద్ద యోగాసనాలు నేర్చుకున్నవారిలో ప్రముఖ సోషలిస్ట్ నాయకుడు జయప్రకాష్ నారాయణ్, ప్రసిద్ధ తత్వవేత్త జె కృష్ణమూర్తి వంటి వారు కూడా ఉన్నారు. ఆయన యోగాసనాల శైలికి నటి కరీనా కపూర్, క్రికెటర్ సచిన్ టెండూల్కర్, నటి అన్నెట్ బెనింగ్, డిజైనర్ డోనా కరాంటో, రచయిత ఆల్డస్ హక్స్లీ వంటి అభిమానులు కూడా ఉన్నారు. అంతేగాదు యోగాకు ఆయన చేసిన అపారమైన కృషికి గానూ 1991లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2014లో పద్మవిభూషణ్ వంటి అవార్డులతో భారతప్రభుత్వ సత్కరించి, గౌరవించింది. 2004లో టైమ్ మ్యాగజైన్ ద్వారా ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులలో ఒకరిగా పేరుపొందారు. చివరిగా ఆగస్టు 20, 2014న, 95 ఏళ్ల వయసులో గుండె వైఫల్యం, మూత్రపిండ వైఫల్యంతో పూణే ఆస్పత్రిలో అయ్యంగార్ మరణించారు. (చదవండి: International Yoga Day 2024: స్ఫూర్తినిచ్చే గొప్ప ప్రయాణం) -
International Yoga Day 2024: స్ఫూర్తినిచ్చే గొప్ప ప్రయాణం
యోగా అంటే బరువు తగ్గడం కాదు. అంతకుమించిన మానసిక వికాసం. అనేకానేక ఆరోగ్య ప్రయోజనాల సమ్మేళనం. యోగ సాధన శారీరక, మానసిక ఆరోగ్యానికి సమతుల్యతకు మూలం. యోగా నేర్చుకోవాలనుకుని అనుకుంటున్నారా? యోగ మొదలు పెట్టాలనుకునే వారు, ఎలా మొదలు పెట్టాలో తెలియని వారు మార్గదర్శకాలు తెలుసుకోవడం చాలా అవసరం. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అసలు యోగా అంటే ఏమిటి? ఎలా ఆచరించాలి? తెలుసుకుందాం.యోగాని జాతి, మత, కుల, లింగ భేదాలు, చిన్నా పెద్దా లేకుండా ఎవరైనా ఆచరించవచ్చు. యోగా సాధనకు సంక్పలం, చక్కటి గురువు ఉంటే చాలు. ఐదు నిమిషాల్లో నేర్చుకోవచ్చు. అలాగే దీన్ని పట్టుదలగా కొనసాగిస్తే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలం.యోగ అనేది కేవలం ఒక వ్యాయామం మాత్రమే కాదు. అదొక అనిర్వచనీయ అనుభూతివైపుగా తీసుకెళ్లే శక్తి. విభిన్నమైన ఆసనాల ద్వారా మనల్ని మనం తెలుసుకుంటూ, మన శరీర తత్వాన్ని, లక్షణాలను అవయవాల తీరును తెలుసుకొనే శాస్త్రం కూడా.మరోవిధంగా చెప్పాలంటే...మనుషుల్లోని కోపం, ఆవేశం, ఉల్లాసం, ఆందోళన ఇలాంటి భావోద్వేగాల్ని, శరీర భంగిమల్ని ఇట్టే పసిగడతాం. ఇలాంటి మానసిక భావోద్వేగ పరిస్థితులను గమనిస్తూ మన శరీరాన్ని వివిధ భంగిమల ద్వారా కావలసిన స్థితిని తీసుకువచ్చేదే ఆసన విద్య. అలా మనుషులకు చైతన్యాన్ని, కొత్త శక్తిని అందించాలనేదే యోగాసనాల ఉద్దేశ్యం. అయితే ఇది అందరికీ ఒకేలాగా పనిచేయకపోవచ్చు. వ్యక్తుల స్వభావాన్ని బట్టి, సాధన ఎలా చేస్తున్నారు అనేదాన్ని బట్టి ఫలితాలు వేరు వేరుగా ఉంటాయి. అవగాహన, అనుభవం, ఆచరణ కూడా చాలా ముఖ్యం. ఆధునిక కాలంలో కొంతమంది నిపుణులు సోషల్ మీడియా, యూట్యూబ్ ద్వారా, ఇతర సామాజిక మాధ్యమాల యెగా శిక్షణ అందిస్తున్నారు. ఫలితంగా ఇలాంటి ఇంట్లోనే ఉండి అభ్యాసం చేసే వెసులుబాటునిస్తాయి. నిపుణుల సమక్షంలో జరిగే ఇలాంటి శిక్షణ శారీరక , మానసిక ప్రయోజనాలను చేకూర్చుతుంది. అయితే మరిన్ని ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం యోగా గురువుల సమక్షంలో భౌతిక శిక్షణ అవసరం. సముద్రంలాంటి యోగ జీవితకాలం స్ఫూర్తినిచ్చే ఒక నిరంతర ప్రయాణం. దైవాన్ని నమ్మేవారికి ఆధ్యాత్మిక తాదాత్మ్యం. మిగిలినవారికి భౌతిక మానసికోల్లాసం.యోగాసనాలలో , 84 ప్రాథమిక ఆసనాలు ఉన్నాయని చెబుతారు. శ్వాసపై దృష్టి పెడుతూ శరీరం , మనస్సు ఎలా పని చేస్తాయో అన్వేషించడమే దీని ఉద్దేశం. ఇందులో సుఖాసన మొదలు, తడసానా లేదా పర్వత భంగిమ, అధోముఖ స్వనాసన , ధనుర్ ఆసనం, శవాసనం, మొదలు, హనుమనాసన, అస్తావక్రాసన , యోగనిద్రాసన, ద్విపద విపరిత దండాసనా, ,కపోతాసా , వృశ్చికా, పింఛ మయూరాసన, బకాసనా లాంటి ఎన్నో క్లిష్టమైన ఆసనాలున్నాయి. కఠోర శ్రమతో వీటిని ఆచరిస్తే ఆరోగ్యం మన సొంతమవుతుంది. -
మనస్ఫూర్తిగా జీవించే యోగం కోసం...
ప్రస్తుతం మానసిక ఒత్తిడి, సమస్యలు లేని జీవితం లేదంటే అతిశయోక్తి కాదు. పని ఒత్తిడి, ఆర్థికపరమైన సమస్యలు, ఇతర ఇబ్బందుల కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రతిరోజూ కనీసం ఓ అర గంటయినా శారీరక శ్రమ చేయాలంటారు నిపుణులు. అందుకు యోగా చక్కని మార్గం. ఆరోగ్యకరమైన జీవితానికి యోగా ఎంతో సహాయపడుతుంది. చాలామందికి, వారి అస్తవ్యస్తమైన, బిజీ జీవితాల నుండి యోగా ఉపశమనాన్ని ఇవ్వగలదు. యోగా చేయడం వల్ల శరీరానికి నూతనోత్సాహం కలుగుతుంది. బలాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుంది. భంగిమను మెరుగుపరుస్తుంది. మనసు, శరీరం, ఆత్మను నియంత్రించడంలో యోగా సహాయపడుతుంది. యోగా ఒక శక్తిమంతమైన మైండ్‌ఫుల్‌నెస్ సాధన. యోగా ఒత్తిడిని తగ్గించి ప్రశాంతంగా ఉండేట్లు చేస్తుంది. యోగా చేయడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. యోగ శ్వాసక్రియ శక్తిని కూడా మెరుగుపరుస్తుంది. యోగా సాధన సాగదీసినట్లు అనిపించవచ్చు. కానీ శరీరానికి మంచి అనుభూతి అందించడం, కదిలే విధానంలో చాలా మార్పు చూపుతుంది. క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం వల్ల బరువు తగ్గడం, ఒత్తిడిని తగ్గించుకోవడం సాధ్యమవుతాయి. యోగ అభ్యాసం వలన కలిగే ప్రయోజనాలు ఇటీవలి కాలంలో ఎక్కువగా వ్యాప్తిలోకి వచ్చాయి. యోగాలో చాలా రకాలు ఉన్నాయి, హఠ (అనేక శైలుల కలయిక) అత్యంత ప్రాచుర్యం పొందిన శైలులలో ఒకటి. హఠ యోగం ప్రాణాయామాలపై (శ్వాస నియంత్రిత వ్యాయామాలు) దృష్టి పెడుతుంది. వీటి తర్వాత వరుసలో ఆసనాలు (యోగా భంగిమలు) ఉంటాయి. అవి శవాసనంతో (విశ్రాంతి కాలం) ముగుస్తాయి. యోగశాలల్లో సాధారణంగా అద్దాలు ఉండవు. సాధకులు తమను చుట్టుపక్కల వ్యక్తులు ఎలా చూస్తారనే దాని కంటే ముఖ్యంగా తమ పట్ల తమకు ఏకాగ్రత అవసరం. యోగా సాధన చేయని వ్యక్తుల కంటే యోగా సాధన చేసేవారికి తమ శరీరాల గురించి ఎక్కువ అవగాహన ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. యోగాసనాలు వేసేవారు ఎక్కువ సంతృప్తిగా ఉన్నారు. తమ శరీరాలపై తక్కువ ఫిర్యాదులు చేశారు. అందుకే సానుకూల శరీర ఆకృతి, ఆత్మగౌరవాలను ప్రోత్సహించే కార్యక్రమాలు యోగా చికిత్సలో భాగం అవుతున్నాయి.యోగాను అభ్యసించడం ద్వారా, ఒక వ్యక్తి జీవితంలోని ఇతర రంగాలలో కూడా అవగాహన మెరుగవుతుంది. తినే రుగ్మతలను యోగా పోగొడుతుంది. బుద్ధిపూర్వకంగా తినడం, శారీరక భావోద్వేగ అనుభూతులను అవగాహనకు తెచ్చుకోవడంలో యోగా సాయపడుతుంది. విచారంలో ఉన్నప్పుడు లేదా ఒత్తిడికి గురైనప్పుడు పరధ్యానంగా తింటారు. అదే యోగాను అభ్యసించే వ్యక్తులు ఒక పద్ధతి ప్రకారం మనస్ఫూర్తిగా భుజిస్తారు. అందుకే బరువు తగ్గాలనుకునేవారికి యోగా సాధన ఉత్తమం. బుద్ధిపూర్వకంగా తినేవారు తమ శరీరాన్ని ఆరోగ్యాంగా చూసుకుంటారు. యోగా సాధన చేసేవారిలో కండరాల బలం, స్థితప్రజ్ఞత, ఓర్పు, కార్డియో–రెస్పిరేటరీ ఫిట్నెస్ మెరుగవుతాయని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. యోగా, మంచి ఆహార అలవాట్లు మనిషి మనుగడను మెరుగుపరుస్తాయి. మనిషి ప్రశాంతతకు, ఆనందమయ జీవితానికి యోగా మంచి ఉపకరణం.– డా‘‘ ఎం. అఖిల మిత్ర ‘ ప్రకృతి వైద్యులు(నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం) -
‘ఒంటికి యోగా మంచిదేగా’ మాజీ మిస్ ఇండియా ఆసనాలు (ఫొటోలు)
-
మహిళా సాధికారత థీమ్‌తో యోగా డే
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతియేటా జూన్ 21న నిర్వహిస్తున్నారు. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా యునైటెడ్ కింగ్డమ్ (యుకె)లోని భారత హైకమిషన్ ట్రఫాల్గర్ స్క్వేర్‌లో యోగా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి మాట్లాడుతూ ఈ ఏడాది మహిళా సాధికారత థీమ్‌తో యోగా డేను నిర్వహించనున్నామని తెలిపారు. గత ఏడాది జరిగిన యోగా కార్యక్రమంలో 700 మందికి పైగా జనం పాల్గొన్నారని, వివిధ సంఘాల సభ్యులు కూడా హాజరయ్యారన్నారు. అదేవిధంగా ఈసారి కూడా అధిక సంఖ్యలో జనం యోగా కార్యక్రమంలో పాల్గొననున్నారని తెలిపారు.యోగా అన్ని వర్గాల వారినీ కలుపుతుందని, అందరికీ ఉపయోగపడుతుందని ప్రధాని మోదీ తెలిపారన్నారు. ఈ ఏడాది జరిగే యోగా కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు అధికసంఖ్యలో పాల్గొననున్నారన్నారు. బ్రిటిష్ పౌరుడు ఇందర్‌పాల్ ఓహ్రీ చందేల్ మాట్లాడుతూ యోగా అనేది మన వారసత్వంలో భాగమని, దానితో మనం కనెక్ట్ కావడం అందరికీ ముఖ్యమన్నారు. ఈ ఏడాది జరిగే యోగా దినోత్సవంలో భారత బధిర క్రికెట్ జట్టు సభ్యులు పాల్గొనబోతున్నారని అన్నారు. 2015 నుండి ప్రతీయేటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. -
యోగాసనాలతో మెస్మరైజ్ చేస్తున్న ఈ స్టార్ హీరోయిన్ను చూశారా?
బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ యోగాతో అదరగొడుతోంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ , యోగా వర్కౌట్స్‌తో ఫ్యాన్స్‌ను అలరిస్తూ ఉంటుంది. సండే యోగా అంటూ క్లిష్టమైన కరీనా డైనమిక్ యోగా చక్రాసనం ఫోటోను ఇస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అంతకుముందు ఫిట్నెస్ ట్రైనర్ నమ్రతా పురోహిత్ కరీనా ఆసనాల ఫోటోలు సోషల్‌మీడియాలోపోస్ట్ చేసింది.దీన్ని విరాభద్రసనా II అని కూడా పిలుస్తారంటూ ఆమె ఫోటోను షేర్ చేసింది. దీంతో అభిమానులు ఫిదా అవుతున్నారు. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌ను పెళ్లాడింది. ప్రస్తుతం ఇద్దరు బిడ్డల తల్లి అయిన కరీనా కపూర్ ఖాన్ ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. ముఖ్యంగా లాక్‌డైన్ సమయంలో నుంచి నిత్యం యోగా సాధన చేస్తూ వర్కౌట్స్ వీడియోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తోన్న సంగతి తెలిసిందే View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) -
గడ్డకట్టే చలిలో యూఎన్ అత్యున్నత దౌత్యవేత్త సాహసం..! ఐతే..
చైనాలోని యూఎన్ అత్యున్నత దౌత్యవేత్త సిద్ధార్థ్ ఛటర్జీ చేసిన యోగా నెట్టింట సంచలనం రేపుతుంది. మైనస్ సున్నా డిగ్రీల ఉష్ణోగ్రతలో 'ఓం' కార పఠనంతో బ్రీతింగ్ వ్యాయామాలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అందుకు సంబంధించిన నాలుగు నిమిషాల నిడివి గల వీడియోని ఛటర్జీ "బ్రీతింగ్ ఫర్ గుడ్ హెల్త్" అనే పేరుతో పోస్ట్ చేశారు. ఆయన ఆ వీడియోలో బీజింగ్‌లోని గడ్డకట్టుకుపోయిన సరస్సుపై కూర్చొని శ్వాసకు సంబంధించిన వ్యాయమాలు చేశారు. ఇది శారీరక, మానసికి ఆరోగ్యాన్ని కాపాడే బెస్ట్ వ్యాయామాలని వీడియో ప్రారంభంలోనే చెప్పారు. పొట్టను లోపలకి, బయటకు వదిలేలా లోతైన శ్వాస వ్యాయామాలు 'ఓం' కార పఠనంతో మొదలవ్వుతుందని అన్నారు. మనం ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టేటప్పుడు మొదట పని శ్వాస పీల్చుకోవడం. ఇక ఆఖరి పని దాన్ని విడిచిపెట్టయడమే అని చెప్పారు. ఇర ఆయన ఆ ఎముకలు కొరికే చలిలో పొట్టకు సంబంధించిన బ్రీతింగ్ ఎక్సర్సైజుల తోపాటు శీర్షాసనం వంటివి యోగాసనాలు వేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అంతేగాకుండా ఈ వ్యాయామాల వల్ల కరోనా వంటి మహమ్మారిల నుంచి తట్టుకునేలా రోగనిరోధక శక్తిని అందిస్తుందని తెలిపారు. ఇదిలా ఉండగా, ఆయన 2020లొ చైనాలో యూఎన్ అత్యున్నత దౌత్యవేత్తగా నియమితులైన టైంలో అధిక కొలస్ట్రాల్, బీపీ, అధిక హృదయ స్పందన రేటు, ప్రీ డయాబెటిక్, ఒబెసిటీ వంటి సమస్యలతో బాధపడుతుండేవారు. ఆ తర్వాత ఈ యోగా, బ్రీతింగ్ ఎక్సర్సైజులు, సరైన జీవన శైలితో అనూహ్యంగా 25 కిలోల బరువు తగ్గడం జరిగింది. ఇక భారత్‌కి చెందిన ఛటర్జీ చైనాలోని యూఎన్ కార్యాలయానకి అధిపతిగా నియమించడం అప్పట్లో ఓ సంచలనంగా నిలిచింది. ఎందుకంటే తూర్పు లడఖ్ ప్రతిసష్టంభన, భారత్ చైనాల మధ్య ఉద్రిక్తతల నడుమ ఆయన నియామకం జరగడమే అందుకు కారణం. కాగా, ఛటర్జీ కుటుంబం బంగ్లాదేశ్ నుంచి కోల్‌కతాకు వలస వచ్చిన కుటుంబం. చిన్నప్పుడు బాల్యంలో ఆయన పోలియో బాధితుడు. సరైన చికత్స తీసుకుని పోలియో నుంచి పూర్తిగా రికవరయ్యాడు. ఆ తర్వాత 1981లో రెండో ప్రయత్నంలో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరారు. అక్కడ నుంచి ఆయన ప్లేయర్‌గా, బాక్సర్‌గా మారి ఎన్నో టైటిల్స్ అందుకోవడం జరిగింది. ఆ తర్వాత ఎలైట్ పారా రెజిమెంటల్‌లో చేరారు. ఉన్నత విద్య కోసం యూఎస్ వెళ్లి అక్కడ ఐవీ లీగ్ ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో చేరి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత యూఎన్ మిషన్కి నాయకత్వం వహించారు. ఆయన భార్య బాన్ హ్యూన్ హీ భారత్‌లోని యూనిసెఫ్ సామాజిక విధానానికి చీఫ్‌గా ఉన్నారు. ఆయన దౌత్యవేత్తగా తన 24 ఏళ్ల కెరీర్లో కెన్యా, స్విట్జర్లాండ్, డెన్మార్క్, ఇరాక్, సోమాలియా, దక్షిణ సూడాన్, సూడాన్ (డార్ఫర్), ఇండోనేషియా, బోస్నియా అండ్ హెర్జెగోవినా చైనా పొరుగు దేశం ఇరాకీ కుర్దిస్తాన్ వంటి దేశాలలో పనిచేశారు. ఛటర్జీ యూఎన్ శాంతి పరిరక్షణ, ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP), UNICEF, UN పాపులేషన్ ఫండ్ (UNFPA), రెడ్ క్రాస్ ఉద్యమం, UNOPS,UN భద్రతలలో కూడా పనిచేశారు. తన దౌత్యపరమైన పనుల తోపాటు అనారోగ్యం బారిన పడకుండా ఉండేలా ప్రజలను చైతన్యపరిచేలా..ముఖ్యంగా ఒత్తిడిని తట్టుకుని యాక్టివ్‌గా ఉండేలా చేసే శ్వాస వ్యాయమాలను సాధన చేస్తున్న వీడియోని నెటిజన్లతో పంచుకున్నారు సిద్ధార్థ్ ఛటర్జీ. VIDEO | Siddharth Chatterjee, the head of the #UN in China, is making waves on Chinese social media where he showcased his tough yoga and fitness exploits, including breathing exercises in sub-zero temperatures, which he says helped him to maintain physical and mental… pic.twitter.com/4q5nifvJHC — Press Trust of India (@PTI_News) April 16, 2024 (చదవండి: మొలకలు వచ్చిన ఆలు, కలర్ మారిన ఆకుకూరలు వండేస్తున్నారా..?) -
మెడ పట్టేసిందా?ఈ చిట్కాలు పాలో అవ్వండి!
మెడ ఎందుకు పట్టేస్తుందో, భరించలేని నొప్పి ఎందుకు వస్తుందో ఒక్కోసారి సరిగ్గా గుర్తించలేం. రోజంతా టీవీ చూడటం, ల్యాప్‌టాప్, కంప్యూటర్లు వాడకం, గంటల తరబడి స్మార్ట్ ఫోన్‌ను చూస్తూ ఉండటంవల్లగానీ, వ్యాయామం చేస్తున్నప్పుడు గానీ, రాత్రిపూట నిద్ర పోయేటపుడు భంగిమలో తేడా తదితర కారణాలతో మెడ నొప్పి బాధిస్తుంది. ♦ నిద్ర లేచిన తర్వాత మీకు మెడ నొప్పిగా అనిపిస్తే.. నొప్పి ప్రభావిత ప్రాంతాల్లో ఐస్ ప్యాక్ లేదే చల్లని నీటిలో నింపిన క్లాత్ ను వేసి అద్దాలి. అలా చేయడం వల్ల మెడ కండరాల వాపు తగ్గుతుంది. దీంతోపాటు హీట్ ప్యాక్ ను ఉపయోగించవచ్చు. ఇది కూడా మెడ కండరాల నొప్పిని తగ్గిస్తుంది. ♦ మెడ నొప్పిగా ఉన్న వాళ్లు చేతులతో మెడను నెమ్మదిగా మసాజ్ చేయాలి. అలా చేయడం వల్ల కండరాలు సర్దుకొని నొప్పి తగ్గే అవకాశం ఉంది. ♦ మసాజ్ చేసే సమయంలో కొబ్బరి లేదా నువ్వుల నూనె ఉపయోగిస్తే మేలు జరుగుతోంది. మెడ నొప్పిని నివారించేందుకు మీరు రాత్రిళ్లు బోర్లా పడుకోకుండా ఉంటే చాలు. ♦ కొన్ని రకాల యోగా ద్వారా కూడా మెడనొప్పిని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా క్లాక్ వైజ్,యాంటి క్లాక్‌వైజ్ దిశలో మెడను మెల్లిగా సున్నాలాగా చుడుతూ చేసే వ్యాయామం మంచి ఫలితాలనిస్తుంది. ♦ మొబైల్ ఫోన్ల వల్ల వచ్చే నొప్పిని టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అంటారు. దీనికి ఆక్యుపంక్చర్ థెరపీ ద్వారా ఉపశమనం పొందవచ్చు. చాలా సందర్భాలలో, నొప్పికి కారణం తెలియదు. దానికదే మెల్లిగా నెమ్మదిస్తుంది. కొన్నిసార్లు ఇది వారం లేదా రెండు వారాల్లో తగ్గుతుంది. చిట్కాలతో కూడా మెడనొప్పి తగ్గకుండా వేధిస్తూ ఉంటే మాత్రం వైద్యులను సంప్రదించాలి. సరైన చికిత్స తీసుకోవాలి. మూడు నెలల కంటే ఎక్కువ కాలంపాటు వేధించే మెడ నొప్పికి అంతర్లీనంగా మరికొన్ని కారణాలు కూడా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. -
కుండలినీ యోగాతో అల్జీమర్స్‌కు చెక్: తాజా పరిశోధన
యోగాతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. ఇది కేవలం శారీరకదృఢత్వానికి మాత్రమే కాదు, మేధాశక్తి, ఆత్మశక్తి పెంపులో కూడా సహాయపడుతుంది. యోగా ప్రయోజనాలపై ఒక ఆసక్తికరమైన అధ్యయనం తాజాగా వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా కుండలిని యోగాతో మెదడుకు చాలా మంచిదని ఇది వెల్లడించింది. అల్జీమర్స్‌లాంటి భయంకరమైన వ్యాధికి చెక్ చెప్పవచ్చని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజిల్స్ అధ్యయనం ప్రాథమికంగా కనుగొంది. ఆ వివరాలు.. మెనోపాజ్ సమయంలో వచ్చే హార్మోన్ల మార్పులు, దీర్ఘకాలిక ఆయుర్దాయం, జీన్స్ తదితర కారణాలతో పురుషులతో పోలిస్తే మహిళలకు అల్జీమర్స్ వ్యాధి వచ్చే ప్రమాదం రెండు రెట్లు ఎక్కువ. అందుకే అల్జీమర్స్ ముప్పున్న 50 అంతకంటే ఎక్కువ వయస్సున్న 79 మహిళలపై కుండలిని యోగా, జ్ఞాపకశక్తికి సంబంధించి అధ్యయనం చేశారు. వీరంతా జ్ఞాపకశక్తి క్షీణత (మునుపటి సంవత్సరం పనితీరుతో పోలిస్తే), గుండెపోటు చరిత్ర, చిన్న వయసులోనే మధుమేహం, రక్తపోటుకు, గుండెలోని రక్తనాళాల సమస్య, అధిక కొలెస్ట్రాల్ కోసం ప్రస్తుత మందులు తీసుకుంటున్నవారే. 12 వారాల పాటు యోగా శిక్షణ, మెమరీ ట్రైనింగ్ రెండు గ్రూపులుగా వీరిపై పరిశోధన సాగింది. వీరిలో 40 మందికి యోగా, 39 మందికి మెమరీ ట్రైనింగ్ ఇచ్చారు. యోగా టీంలో వారానికి 60 నిమిషాలు చొప్పున 12 వారాలు కుండలిని యోగాను నిష్ణాతుడి ద్వారా వ్యక్తిగతంగా శిక్షణ ఇప్పించారు. 39 మందికి మెమరీ శిక్షణ నిచ్చారు. మెమరీ ట్రైనింగ్‌లో కొన్నిపేర్లను, ముఖాలను గుర్తించుకోవడం, తలుపులు తాళం వేయడం లాంటి రోజవారీ కార్యక్రమాలను గుర్తుంచుకొనే పద్దతులపై శిక్షణనిచ్చారు. తరువాత మరో 24 వారాలు వీరి మెమరీ బేస్‌లైన్ కూడా పరీక్షించారు. అలాగే వారి రక్తంలోని సైటోకిన్లనూ విశ్లేషించారు. రోగ నిరోధక వ్యవస్తలోని కీలకమైన, ప్రోటీన్లు , జన్యు వ్యక్తీకరణలో మార్పులను గమనించారు. అయితే కుండలిని యోగా టీంలో మాత్రమే ఆత్మాశ్రయ జ్ఞాపకశక్తిలో మెరుగుదల ఉందని పరిశోధకులు కనుగొన్నారు. జ్ఞాపకశక్తి శిక్షణతో పోలిస్తే, యోగాద్వారా హిప్పోకాంపస్ వాల్యూమ్‌లో పెరుగుదల గమనించామనీ, ఫంక్షనల్ కనెక్టివిటీ, స్వల్పకాలిక జ్ఞాపకాలను గుర్తుపెట్టుకొని వాటిని మెదడులోని దీర్ఘకాలిక నిల్వకు బదిలీ అనేది బాగా మెరుగుపడిందని గుర్తించారు. ఇంకా కుండలిని యోగా ద్వారా మెరుగైన జ్ఞాపకశక్తి, యాంటీ ఏజింగ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్‌లతో సహా మెదడుకు సంబంధించి అనేక ప్రయోజనాలను గమనించారు. ముఖ్యంగా అల్జీమర్స్ వ్యాధిని నివారించడంలో సహాయపడుతుందని తెలిపింది. "ఒత్తిడిని తగ్గించడానికి, మెదడు ఆరోగ్యం, ఆత్మాశ్రయ జ్ఞాపకశక్తి పనితీరును మెరుగు పర్చేందుకు, ఇన్ఫ్లమేషను, న్యూరోప్లాస్టిసిటీని మెరుగుపరచడానికి" యోగా చాలా మంచిదని దీని రచయిత హెలెన్ లావ్రెట్స్కీ చెప్పారు. మెమరీ ట్రైనింగ్‌లో దీర్థకాలిక జ్ఞాపకశక్తిలోనూ మెరుగుదల కనిపించిందట. అయితే కుండలిని యోగాతో అల్జీమర్స్ వ్యాధిని నివారణ, వాయిదా వేయడం లేదా దీర్ఘకాలిక మెరుగుదల కనిపిస్తుందో లేదో నిర్ధారించడానికి మరిన్ని అధ్యయనాలు అవసరమని వ్యాఖ్యానించారు. కుండలిని యోగ కుండలిని అనేది మానవ శరీరంలో వెన్నుపాములో ఉంటుంది. దీంట్లో దాగివున్న శక్తిని సుషుమ్నా నాడి ద్వారా పైకి సహస్రారం వరకు తీసుకొనివెళ్లే పద్ధతిని వివరించేది కుండలినీ యోగ అంటారు. కుండలినీ యోగ లో కుండలినిని జాగృతం చేయడానికి ప్రాణాయామ సాధన ఒక ముఖ్యమైన మార్గము. కుండలినీ శక్తి సహస్రారం చేరినప్పుడు యోగసాధకుడు ఒక అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవిస్తాడని యోగ నిపుణులు, గురువులు చెబుతారు. ఇతర యోగాలా కాకుండా,ఇదొక శక్తివంతమైన అభ్యాసం. మనలో నిద్రాణమైన శక్తిని మేల్కొల్పడం, దాని పరివర్తన శక్తిని ఉపయోగించడంపై దృష్టి పెడుతుంది. ఇతర రకాల యోగాల మాదిరిగా కాకుండా, కుండలిని యోగా అనేది శరీరంలోని శక్తి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని, కుండలిని శక్తి ప్రవాహాన్ని ప్రేరేపించే నిర్దిష్ట భంగిమలను కుండలిని యోగా భంగిమలు అని పిలుస్తారు శ్వాసమీద, ఉచ్ఛరణ, గానం, శారీరక భంగిమలపై దృష్టి పెడుతుంది. -
శిల్పాశెట్టి చెప్పే తిరగలి తిప్పే భంగిమ..ఎన్ని ప్రయోజనాలో తెలుసా!
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి వయసు 50కి దగ్గర పడ్డ వన్నెతగ్గని సోయగంతో పేరుకు తగ్గట్టు శిల్పంలా ఉంటుంది. అంతేగాక ఆమె మంచి ఫిట్నెస్ ఔత్సాహికురాలు కూడా. ఇక ఫిట్నెస్కి సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడూ నెటిజన్లతో షేర్ చేసుకుంటూ సోషల్ మీడియాల్లో చురుగ్గా ఉంటారు. అలానే ఈసారి కూడా ఫిట్నెస్కి సంబంధించిన ఓ సరికొత్త విషయాన్ని షేర్ చేశారు శిల్పా. ఆమె పలు యోగాసనాలు వేస్తుంటారన్న విషయం తెలిసిందే. ఈ సారి ఆమె సరికొత్త వ్యాయామ భంగిమ, దాని ప్రయోజనాల గురించి చాలా ఆసక్తికర విషయాలను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. రాజస్తాన్ పర్యటనలో ఉన్న ఆమె 'చక్కి చలసానా' భంగిమ విశేషాల గురించి చెప్పుకొచ్చారు. ఏంటీ 'చక్కీ చలసానా' అనుకుంటున్నారా..? అదేనండి తిరగలి తిప్పుతున్నట్లు చేసే ఆసనం. అంతేకాదండోయ్ మన పూర్వకాలం బామ్మలు తిరగలితో బియ్యం, గోధుమలు పిండిగా విసిరేవారు. అలా చేయడం వల్ల వాళ్ల నడుములు, పిక్కలకు మంచి వ్యాయామం చేకూరి ఆరోగ్యంగా ఉండేవారిని నిపుణులు గుర్తించారు. ఆ విషయాన్ని శిల్పాశెట్టి కూడా చెబుతున్నారు. ఆ భంగిమ ప్రయోజనాలు వివరిస్తూ తిరగలి విసిరి మరీ చూపించారు. ఇలా చేస్తే నడుము, తొడలు, పిక్కల వద్ద ఉండే కొవ్వు కరిగి ఎలా ఫిట్‌గా ఉంటారో వెల్లడించారు నటి శిల్పా. ఈ భంగిమని యోగా ఆననాల్లో గ్రైండింగ్ పోజ్ అని పిలుస్తారని అన్నారు. ఈ ఆసనం వేయడం వల్ల శరీరానికి, మనస్సుకి మంచి ప్రయోజనాలను అందిస్తుందని తెలిపారు. ఈ ఆసనాన్ని రెగ్యూలర్‌గా వేస్తే చేకూరే ప్రయోజనాలేంటో సవివరంగా వెల్లడించారు కూడా. అవేంటంటే. బలాన్ని వృద్ధి చేస్తుంది: ఈ చక్కి చలసానా(తిరగిలి తిప్పే ఆసనం) ఉదరకండరాలను బలోపేతం చేయడంలో సహయపడుతుంది. వదులుగా బాన పొట్టలా కానివ్వకుండా కాపాడుతుంది. ఇందులో వృత్తాకార కదలికలో కేవలం మొండెం మాత్రమే కదలడంతో ఉదరం చుట్టూ ఉండే కండరాలు సక్రియం అవుతాయి. దీంతో శరీరాన్ని సరైన విధంగా బ్యాలెన్స్ చేయగలిగే శక్తి ఆటోమెటిక్‌గా వస్తుంది. ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది ఈ యోగా భంగిమలో ఎగువ శరీరం మాత్రమే వృత్తాకార కదలికలో పాల్గొంటుంది కాబట్టి వెన్నెముక, భుజాలు తుంటిల ఆరోగ్యాన్ని బలోపేతం చేసేందుకు మంచి ఉపయుక్తమైన ఆసనం. ఈ ఆసనం క్రమం తప్పకుండా వేయడం వల్ల ఆయా భాగాలు త్వరితగతిన గాయాల బారిన పడకుండా దృఢంగా ఉండేలా చేస్తుంది. View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఈ చక్కి చలాసానాలో వృత్తాకార కదలిక కారణంగా ఉదర అవయవాల్లో ముఖ్యంగా జీర్ణ అవయవాలకు మంచి అవసరమైన వ్యాయామం అనే చెప్పాలి. దీంతో ఇది జీర్ణక్రియను ప్రేరేపించి అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. మనసు ఆహ్లదంగా ఉండేలా చేస్తుంది చక్కి చలసానాలో ఏకాగ్రతతో చేసే ఆసనం కాబట్టి మనస్సుపై ప్రభావం ఏర్పడి ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ భంగిమ ధ్యానానికి సంబంధించిన నియంత్రిత శ్వాసపై దృష్టి కేంద్రీకరించేలా చేస్తుంది. అందువల్ల ఈ ఆసనం వేయడం అనేది మనస్సుకు ప్రశాంతనిచ్చే ధ్యానం చేసినట్లుగా మంచి సత్ఫలితాలనిస్తుంది. ఈ వ్యాయమాన్ని క్రమం తప్పకుండా చేసి మంచి ప్రయోజనాలను పొందడమే కాకుండా ఆరోగ్యంగా ఉండడని చెబుతోంది నటి శిల్పాశెట్టి. ఇంకెందుకు ఆలస్యం ఇన్ని ప్రయోజనాలు ఉన్నా ఆసనాన్ని వెంటనే మొదలు పెట్టేయండి మరీ. (చదవండి: 'గోబీ మంచూరియా'ని ఆ నగరం పూర్తిగా బ్యాన్ చేసిందట! ఎందుకో తెలుసా?) -
కన్హా ఆశ్రమంలో దాజిని కలిసిన ఆటా ప్రతినిధులు!
రంగారెడ్డి జిల్లా కన్హా గ్రామంలో గల కన్హా శాంతి వనంను ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని ఆధ్వర్యంలో ఆటా ప్రతినిధులు సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు కమలేష్ డి పటేల్(దాజీ) ని కలిశారు. ఇదే సందర్భంలో ఆశ్రమంలో యోగ చేసి, యోగ వల్ల కలిగే లాభాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆటా వేడుకల చైర్, ఎలెక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా, ఆటా వేడుకల కో చైర్ వేణు సంకినేని, సెక్రెటరీ రామకృష్ణ రెడ్డి అల, ట్రెజరర్ సతీష్ రెడ్డి, జాయింట్ ట్రెజరర్ రవీందర్ గూడూరు, 18వ ఆటా కాన్ఫరెన్స్ నేషనల్ కో ఆర్డినేటర్ సాయి సూదిని, కన్వెన్షన్ కన్వీనర్ కిరణ్ పాశం, అడ్వైసర్ కరుణాకర్ అసిరెడ్డి, ఆటా మాజీ ప్రెసిడెంట్లు భీమ్ రెడ్డి పరమేష్, కరుణాకర్ మాధవరం, ట్రస్టీస్ కాశీ కొత్త, నరసింహ రెడ్డి ద్యాసాని, కిషోర్ గూడూరు, శివ గీరెడ్డి వారి కుటుంబసభ్యులు తదితరులు పాల్గొన్నారు. (చదవండి: లండన్‌లో ఘనంగా సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు!) -
పతంజలి యోగపీఠ్, భారత ఆర్మీ ఎంవోయూ
న్యూఢిల్లీ: పతంజలి ఇన్స్టిట్యూషన్స్, భారత ఆర్మీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఔషధ మొక్కలపై పరిశోధన నిర్వహించనున్నారు. అలాగే, భారత ఆర్మీలో విభిన్నమైన ఐటీ అప్లికేషన్లు, ఆటోమేషన్‌పై పని చేయడం కూడా ఈ ఒప్పందంలో భాగంగా ఉంది. సైనికుల ఆరోగ్యం కోసం యోగ, ఆయుర్వేద ఔషధాలపై పతంజలి పరిశోధన నిర్వహించనుంది. మరోవైపు, విశ్రాంత సైనిక ఉద్యోగులను నియమించుకునేందుకు పతంజలి, దాని అనుబంధ సంస్థలు ప్రాధాన్యం ఇవ్వనున్నాయి. -
శరీరాన్ని స్ప్రింగ్, బొంగరంలా మెలికలు తిప్పేస్తున్నారు..
కరీంనగర్: ప్రస్తుతం యోగా దైనందిన జీవితంలో ఆరోగ్యానికి ఔషధంలా దోహదపడుతుంది. కొందరు యోగాతో ఆరోగ్యాన్ని కాపాడుకుంటుంటే. ఇక్కడ కనిపిస్తున్న క్రీడాకారులు మాత్రం ప్రతీరోజు యోగా సాధన చేస్తూ దేశానికి పతకాలు సాధించే క్రీడాకారులుగా తయారవుతామని అంటున్నారు. కరీంనగర్ జిల్లా యో గా సంఘం ఆధ్వర్యంలో మానేరు సెంట్రల్ స్కూల్ వేదికగా రాష్ట్ర స్థాయి యోగా పోటీలు ప్రారంభమయ్యాయి. పోటీలకు అధి క సంఖ్యలో క్రీడాకారులు హాజరై ప్రతిభ చాటుతున్నా రు. శరీరాన్ని స్ప్రింగ్, బొంగరంలా మెలికలు తిప్పుతూ యోగాసనాలు వేసి, ఆకట్టుకుంటున్నారు. యోగాలో మేం రాష్ట్రస్థాయి పోటీల్లో విజయం సాధించాం... జాతీయ స్థాయిలో పతకాలు సాధించడమే లక్ష్యమంటున్న పలువురు క్రీడాకారుల అభిప్రాయాలు వారి మాటల్లోనే.. యోగా అంటే ఇష్టం.. యోగా చేయడమంటే చాలా ఇష్టం. సోషల్ మీడియా ద్వారా యోగాసనాలు ప్రాక్టీస్ చేశాను. ఏడాదిలోనే పూర్తి స్థాయిలో యోగాసనాలు సులువుగా వేయగలిగాను. ఇటీవల కరీంనగర్లో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో, ఇప్పుడు రాష్ట్రస్థాయి పోటీల్లో ఫెర్మామెన్స్ ఇచ్చాను. జాతీయస్థాయికి ఎంపికవుతాననే నమ్మకం ఉంది. 25–30 విభాగంలో పోటీపడ్డాను. – జె ఆమని, సుల్తానాబాద్ జాతీయస్థాయిలో పతకం సాధించాలి.. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా అగ్రహారం, దుమాలలో ఇంటర్ బైపీసీ చదువుతున్నాను. ప్రస్తుతం 16–18 విభాగంలో పోటీ పడుతున్నాను. గతంలో 9కి పైగా రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని బంగారు, రజత, కాంస్య పతకాలు సాధించాను. పంజాబ్‌లో జరిగిన జాతీయస్థాయి యోగా చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొన్నాను. ప్రస్తుతం జరుగుతున్న పోటీలకు బాగా ప్రాక్టీస్ చేశాను. జాతీయ స్థాయి పోటీల్లో పతకం సాధించడమే లక్ష్యం. – ఎల్ రంజిత, అగ్రహారం పిల్లలకు ప్రాక్టీస్ చేయిస్తూ.. మాది హన్మకొండ, యోగా ట్రైనర్‌గా స్కూల్లో పిల్లలకు ప్రాక్టీస్ చేయిస్తూ ఇటు యోగా కాంపిటీషన్‌కు ప్రిపేరవుతున్నాను. మా అమ్మాయి వర్షిణి యోగా క్రీడాకారిణి. ప్రస్తుతం రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటున్నాం. ఇదివరకు జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగిన జాతీయ పోటీల్లో పాల్గొన్నాను. పతకం సాధించడమే లక్ష్యం. – సీహెచ్.రమాదేవి, హన్మకొండ నాలుగుసార్లు పోటీల్లో పాల్గొన్నా.. జాతీయ స్థాయి యోగా పోటీల్లో ఇప్పటివరకు నాలుగుసార్లు పాల్గొన్నాను. ప్రస్తుతం కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో యోగా ట్రైనర్‌గా పనిచేస్తున్నాను. పిల్లలకు కోచింగ్ ఇస్తూ యోగా పోటీల్లో పాల్గొంటున్నాను. ప్రస్తుతం 21–25 కేటగిరిలో పాల్గొన్నాను. – బి ప్రవీణ, కరీంనగర్ -
నడిరోడ్డుపై యోగా..పోలీసులు ఏం చేసారంటే ?
-
మస్క్ మామూలోడు కాదయ్యా..వీడియో వైరల్! ఇక ఆ రోబో కూడా?
Tesla Optimus ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో తయారవుతున్న హ్యూమనాయిడ్ రోబోమరో అడుగు ముందుకేసింది. స్వయంగా మనిషిలా ఆలోచించే రోబోలను గత ఏడాది ప్రకటించిన టెస్లా ఇపుడు అచ్చం మనిషిలాగే అన్ని పనులను చేయగలదంటూ తన అద్బుతమైన రోబో ఆప్టిమస్ వీడియోను టెస్లా ఎక్స్ (ట్విటర్)లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో రోబోట్ వస్తువులను సులువుగా పట్టుకోవడం, మానవుని కంటే వేగంతో క్రమబద్ధీ కరించగల సామర్థ్యాన్ని సాధించింది. ముఖ్యంగా నమస్తే ఫోజుతోపాటు, యోగా చేస్తున్న ఈ వీడియో ఇపుడు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. మొక్కలకు నీళ్లు పోయడం, బాక్సులను మోయడం లాంటి పనులను చేసిన రోబో వీడియోను ఎలాన్ మస్క్ ప్రదర్శించారు. అయితే చివర్లో రోబో తడబడడం, ఇంజినీర్లు వచ్చి.. దానిని సరిచేయడం ట్రోలింగ్‌కు దారి తీసింది. ఇపుడు దాన్ని అధిగమించి సరికొత్త ప్రోగ్రెస్‌తో దూసుకొచ్చింది. ఈనేపథ్యంలో పురోగతి అంటూ ఈ వీడియోను మస్క్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేశాడు. హ్యూమనాయిడ్ బైపెడల్ రోబో ‘ఆప్టిమస్’ స్వయంగా-కాలిబ్రేట్ చేయగల సామర్థ్యాన్ని సొంతం చేసుకుంది. వస్తువులు, దాని కలర్స్‌ను గుర్తించి సంబంధిత ట్రేలో పెట్టడం మనం ఈవీడియోలో చూడవచ్చు. అంతేకాదు చాలా చక్కగా యోగా కూడా చేస్తోంది. ఎండ్-టు-ఎండ్ శిక్షణ పొందిన న్యూరల్ నెట్‌వర్క్‌తో వస్తువులను గుర్తిస్తోంది. ఈ విషయంలో మానవుడు జోక్యం చేసుకున్నపుడు, అతనికంటే వేగంగా రోబో విజయవంతంగా పనిని పూర్తి చేసింది. కలర్స్ బ్లాక్‌లను ఒక క్రమంలో పెడుతుండగా, స్థానాన్ని మార్చి నప్పటికీ, రోబోట్ వాటిని సరైన ట్రేలో ఉంచింది.అంతేకాదు బ్లాక్‌ను తిరగేసి పెట్టినపుడు దాన్ని మార్చి కరెక్ట్‌గా ఉంచడం కూడా ఇందులో చూడొచ్చు. దీంతో వెల్ డన్ టెస్లా టీం. అభినందనలు అంటున్నారు ట్వీపుల్. అంతేకాదు మస్క్ మామ మామూలోడు కాదు భయ్యా అంటూ నెటిజన్లు కమెంట్ చేశారు. నెక్ట్స్ రోబో కోసం వెయిటింగ్ అంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. Optimus can now sort objects autonomously 🤖 Its neural network is trained fully end-to-end: video in, controls out. Come join to help develop Optimus (& improve its yoga routine 🧘) → https://t.co/dBhQqg1qya pic.twitter.com/1Lrh0dru2r — Tesla Optimus (@Tesla_Optimus) September 23, 2023 pic.twitter.com/30mCr2Duk9 — Elon Musk (@elonmusk) September 25, 2023 కాలిఫోర్నియాలోని పాలో ఆల్టో హెడ్‌క్వార్టర్స్‌లో గత ఏడాది జరిగిన ఒక ఈవెంట్లో ప్రకదర్శించిన హ్యూమనాయిడ్ రోబో ఆప్టిమస్ టెక్నాలజీ ఆకట్టుకుంది. త్వరలో సెక్సీ రోబోలను సృష్టిస్తామంటూ ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఈ ఏడాది మార్చిలో ఇన్వెస్టర్ డే సందర్భంగా, టెస్లా ఐదు రోబోలను ప్రదర్శించింది. ఇపుడిక ఒక ఏడాదిలోపే మరో కీలకమైన పురోగతిని సాధించడం విశేషం. -
యోగాలో ఉన్న పవర్ ఇది..బాడీని బొంగరంలా తిప్పేశాడు
-
కార్యాలయాల్లో ఓన్లీ 'వై' బ్రైక్! ఏంటంటే ఇది..!
కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు టీ బ్రేక్, లంచ్ బ్రేక్, డిన్నర్ బ్రేక్‌లు ఉంటాయి. అది కామన్‌గా అన్ని ఆఫీసుల్లోనూ ఉంటుంది. అందరికీ తెలిసిందే కూడా. కానీ ఇక నుంచి వాటి తోపాటు వై బ్రేక్ ఉంటుందట. ఆ..! ఏంటి ఇది అనుకోకండి. అంటే విరామ సమయాన్ని తగ్గించేందుకు ఇలా యజమాన్యం చేస్తుందా అని డౌట్ పడోద్దు. ఎందుకంటే? ఇది ఉద్యోగుల ఆరోగ్యం కోసమేనట. అసలేం జరిగిందంటే..భారతదేశంలో మిలియన్ మంది ఉద్యోగులు విపరీతమైన ఒత్తిడికి గురవ్వుతున్నారని ఓ సర్వేలో తేలింది. కొందరూ ఉద్యోగాలు ఆఫీస్‌లో పనిభారాన్ని, మరోవైపు కుటుంబాన్ని లీడ్ చేయలేక వివిధ అనారోగ్య సమస్యలు భారినపడుతున్నట్లు సర్వే వెల్లడించింది. ఇంతవరకు అధికారులు సర్వేలు చేయడం, ఆ తర్వాత వాటిని గాలికొదిలేయడమే చేశారు అందరూ. కానీ ఇప్పుడూ సీరియస్‌గా తీసుకుని అందుకోసం చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమయ్యాయి పలు సంస్థలు, ప్రభుత్వాలు. ఈ మేరకు గత నెలలో అంతర్జాతీయ యోగ దినోత్సవం రోజు ఆయుష మంత్రిత్వ శాఖ ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 'వై-బ్రేక్ ఎట్ ఆఫీస్ చైర్' అనే సరికొత్త కార్యక్రమానికి నాంది పలికింది. ఉద్యోగుల దినచర్యలో 'యోగా'ని భాగస్వామ్యం చేసి తద్వారా ఒత్తిడిని దూరం చేసి పని చేయగలిగే సామర్థ్యం పెంచుకునే ఓ సువర్ణావకాశాన్ని ఉద్యోగులు కల్పించేందుకు రెడీ అయ్యింది. అందులో భాగంగానే ఈ 'వై' బ్రేక్‌ని కార్యాలయాల్లోకి తీసుకురానుంది ఆయుష్ మంత్రిత్వ శాఖ. ఇక నుంచి మాములుగా తీసుకునే బ్రేక్‌లు మాదిరిగా దీన్ని తీసుకుంటూ.. కాస్త పని ఒత్తిడి దూరం చేసుకోవడమే గాక తమ ఏకాగ్రతను పెంచుకుని షార్ప్‌గా తయారవ్వతారని ఆయుష్ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మేరకు హ్యుమన్ ఎడ్జ్ వ్యవస్థాపకుడు సీఈవో డాక్టర్ మార్కస్ రాన్నీ ఈ విధానాన్ని స్వాగతించారు. ఆయన ఈ విధానం వల్ల ఉద్యోగులు శారీరకంగానూ, మానసికంగానూ పిట్‌గా ఉండేదుకు దోహదపడుతుంది. పనిలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేలా చేయగలుగుతుంది. అలాగే భావోద్వేగ ఒత్తడికి కారణమయ్యే అడ్రినల్ హార్మోన్ల విడుదలపై ప్రభావవంతంగా పనిచేస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. అలాగే ఇందులో చేసే '"బ్రీథింగ్ ఎక్స్‌ర్‌సైజ్"లు కారణంగా.. లోతుగా ఆలోచించగల సామర్థ్యం అలవడుతుంది. అలాగే ఉద్యోగుల ధ్యాస వేరేవాటిపైకి పోకుండా ప్రస్తుత పనిపై దృష్టి కేంద్రీకరించేలా చేస్తుంది యోగా. తమ సంస్థ ఉద్యోగుల ఆరోగ్యానికి, సమస్యలకు ప్రయారిటీ ఇస్తుంది. ఈ 'వై బ్రేక్'ని కార్యాలయాల్లోకి తీసుకురావడం వల్ల ఉద్యోగులు ఫిట్‌గా ఉండి పని బాగా చేస్తారు. లీవ్ పెట్టే వాళ్ల సంఖ్య తగ్గిపోయి, పని సామర్థ్యం ఎక్కువ అవుతుంది. తద్వారా సంస్థ మంచి లాభాలను ఆర్జించగలదని అన్నారు. అలాగే జర్నల్ ఆప్ ఆక్యుపేషనల్ హెల్త్‌కి సంబంధించిన ఆరోగ్య నిపుణులు కూడా ఈ యోగా ఒత్తిడిని తగ్గించి శారీరకంగా, మానిసింగ్ స్ట్రాంగ్ చేయగలదన్నారు. తాము జరిపిన అధ్యయనాల్లో ఆ విషయం వెల్లడైందని పేర్కొన్నారు. దీన్ని క్షేత్ర స్థాయిలో అన్ని కార్యాలయాల్లో వచ్చేలా చేసేందుకు తన వంతుగా కృషి చేస్తానని హుడ్జ్ వ్యవస్థాపకుడు మార్కస్ చెప్పడం గమనార్హం. (చదవండి: ఓ వ్యక్తి 'మానవశునకం'గా రూపాంతరం.. కుక్కలా వీధుల్లో సంచరిస్తూ..) -
రణభూమిలో యోగ సాధన: సిరియా ముఖచిత్రాన్ని మారుస్తున్న రిషికేశ్
సిరియా.. ప్రపంచంలో గడచిన 12 ఏళ్లుగా అంతర్యుద్ధాలతో అట్టుడికికి పోతున్న ఏకైక దేశం. ఈ యుద్ధాల కారణంగా అక్కడున్న వారు సర్వం కోల్పోతున్నారు. ఆర్థిక, శారీరక, మానసిక కష్టాలతో నిత్యం కుంగిపోతున్నారు. ఇంతటి దుర్భర పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న ఆ దేశంలోని వారికి ఇప్పుడు యోగవిద్య వరప్రదాయనిగా మారింది. బ్రిటీష్ మ్యాగజైన్ ఎకనామిస్ట్‌లోని ఒక రిపోర్టు ప్రకారం ప్రస్తుతం సిరియాలో ఉన్న అన్ని మైదానాలు, స్టేడియంలు యోగా తరగతులతో కళకళలాడుతున్నాయి. ఈ తరగతులకు పెద్దలు మొదలు కొని పిల్లల వరకూ అన్ని వయసులు వారు హాజరవుతున్నారు. వారి దినచర్య సూర్యనమస్కారాలతో ప్రారంభమవుతోంది. సిరియాలో హిందువుల వేషధారణతో యోగా ట్రైనర్లు యోగ సాధనకు విపరీతమైన ప్రచారం కల్పిస్తున్నారు. యోగ విద్యను మహాశివుని వరప్రసాదంగా చెబుతున్నారు. సిరియాలో యోగ శిక్షణ అందిస్తున్న ఒక అధ్యాపకుడు మాట్లాడుతూ నిత్యం యుద్ధ భయంతో కొట్టుమిట్టాడుతున్న ఇక్కడి ప్రజలకు యోగ ద్వారా ప్రశాంతత పొందే విధానాలను వివరిస్తున్నట్లు తెలిపారు. సిరియాకు చెందిన మాజోన్ ఈసా అనే వ్యక్తి రెండు దశాబ్ధాల క్రితం యోగా అధ్యయనం కోసం భారత్‌లోని హిమాలయాల్లో గల రిషికేశ్ వచ్చారు. తన యోగా అధ్యయనం ముగిశాక తిరిగి సిరియా చేరుకుని, ఒక యోగా సెంటర్ ప్రారంభించారు. ఇప్పుడు అతని ప్రేరణతో దేశంలో వేలాది యోగాకేంద్రాలు నడుస్తున్నాయి. కాగా ఈ కేంద్రాలలో ఉచితంగా శిక్షణ అందించడం విశేషం. సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్ ఇటువంటి యోగ శిక్షణ కేంద్రాలకు మద్దతుగా నిలుస్తున్నారు. సున్నీ ముస్లిం జనాభా అత్యధికంగా కలిగిన సిరియాను అర్ధశతాబ్ద కాలంగా అసద్ కుటుంబ సభ్యులు పరిపాలిస్తున్నారు. వారు గతంలో తమ ప్రభావాన్ని పెంచుకునేందుకు ఇస్లాంలోని మరోశాఖ అల్విత్తో దోస్తీ కుదుర్చుకున్నారు. అయితే ఇప్పుడు అసద్ కుటుంబ సభ్యుల తీరుతెన్నుల్లో మార్పు వచ్చింది. ఇతర మతాల వారికి కూడా తగిన గుర్తింపునిస్తున్నారు. దీనిలో భాగంగానే యోగ విద్యకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. అలాగే ఇక్కడి క్రైస్తవులకు చర్చిలు నిర్మించుకునేందుకు అవకాశం కూడా కల్పిస్తున్నారు. ఇది కూడా చదవండి: ప్రియుని కోసం పాకిస్తాన్ వచ్చిన బ్రిటన్ మహిళ.. పోలీసులకు చుక్కలు! -
రెక్కలిచ్చిన ఆసనం
మనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి పెద్దయ్యాక ఇది అవ్వాలి, అది అవ్వాలి అని రకరకాల కలలు కంటాము. ఎంతో ఇష్టమైన కలను నిజం చేసుకునేందుకు ఎదురైన అడ్డంకులన్నింటిని దాటుకుని సాధిస్తాం. హమ్మయ్య చేరుకున్నాం అని కాస్త సంతోషపడేలోపు అనుకోని కుదుపులు కెరీర్‌ను పూర్తిగా నాశనం చేస్తాయి. తిరిగి కోలుకోలేని దెబ్బకొడతాయి. అచ్చం ఇలానే జరిగింది అన్షుక పర్వాణి జీవితంలో. తనకెంతో ఇష్టమైన కెరీర్‌ను వదిలేసినప్పటికీ... యోగా ఇచ్చిన ధైర్యంతో యోగానే కెరీర్‌గా మలుచుకుని సెలబ్రెటీ యోగా ట్రైనర్‌గా రాణిస్తోంది పర్వాణి. ముంబైకి చెందిన అన్షుక పర్వాణి విద్యావంతుల కుటుంబంలో పుట్టింది. అన్షుకకు చిన్నప్పటినుంచి ఆస్తమా ఉంది. అయితే మందులు మింగడం అంటే ఇష్టం ఉండేది కాదు. దీంతో డాక్టర్స్ అయిన తాతయ్య, నాయనమ్మలు... ‘‘రోజూ స్విమ్మింగ్ చేస్తుంటే నీ ఊపిరి తిత్తులు బలంగా మారతాయి’’ అని ప్రోత్సహించేవారు. మందులు మింగే బాధ ఉండదని, అన్షుక ఎంతో ఆసక్తిగా స్విమ్మింగ్ నేర్చుకుని రోజూ ఈతకొట్టేది. ఈతలో పట్టుసాధించి జాతీయస్థాయి ఛాంపియన్ షిప్స్‌లో గోల్డ్‌మెడల్ గెలిచింది. స్విమ్మింగ్‌తోపాటు విమాన ప్రయాణం అన్నా అన్షుకకు చాలా ఇష్టం. ఈ ఇష్టంతోనే పైలట్ కావాలని కలలు కనేది. పైలట్ అయ్యి, ప్రపంచమంతా తిరిగిరావాలని... కష్టపడి కమర్షియల్ పైలట్ అయ్యింది. ► ఎగరలేకపోయింది అది 2008.. అన్షుక అనుకున్నట్టుగానే పైలెట్‌గా గాలిలో తేలిపోతున్న రోజులవి. ఒకరోజు బైక్ యాక్సిడెంట్లో అనుష్క కాళ్లు, తల, నడుముకు తీవ్ర గాయాలయ్యాయి. ఎటూ కదల్లేని పరిస్థితి. కొన్ని నెలలపాటు బెడ్‌కే పరిమితమైంది. దీంతో కమర్షియల్ పైలట్ ఉద్యోగానికి ఫిట్ కాదని జాబ్ నుంచి తొలగించారు. ఒకపక్క గాయాలతో గుచ్చుకుంటోన్న శరీరం, మరోపక్క విమానం నడపలేని పరిస్థితి అన్షుకను కలచివేసింది. ఇదే సమయంలో తల్లిదండ్రులు అండగా ఉండి, తమ సంపూర్ణ సహకారం అందించడంతో... ఫిజియోథెరపీ, యోగాలతో కొన్ని వారాలలోనే కోల్పోయిన మనోధైర్యాన్ని కూడదీసుకుంది. ఎలాగైనా లేచి నడవాలి అని నిర్ణయించుకుని ఆసనాలను కఠోరంగా సాధన చేసేది. తన తల్లి యోగా టీచర్ కావడం, చిన్నప్పటి నుంచి ఆస్తమాను ఎదుర్కోవడానికి యోగాసనాలు వేసిన అనుభవంతో ఎనిమిది నెలల్లోనే కోలుకుని తిరిగి నడవగలిగింది. ► యోగ శక్తిని తెలపాలని... యోగాతో సాధారణ స్థితికి వచ్చిన అన్షుక.. తిరిగి పైలట్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నప్పటికీ యోగాపై ఏర్పడిన నమ్మకం, ఆసక్తితో ‘యోగాను ఎందుకు కెరీర్‌గా ఎంచుకోకూడదు? ఎగరలేక కిందపడిపోయిన తనని తిరిగి లేచి నyì చేలా చేసిన ఈ యోగా శక్తిని అందరికీ తెలియచేయాలి’ అనుకుని.. తొమ్మిది నెలల పాటు యోగాలో శిక్షణ తీసుకుని సర్టిఫికెట్ అందుకుంది. యోగాను మరింత లోతుగా తెలుసుకునేందుకు ముంబై యూనివర్శిటీలో మాస్టర్స్ డిగ్రీ చేసింది. పీజీ చేస్తూనే వివిధ రకాల సంప్రదాయ యోగాలను సాధన చేసి ఔపోసన పట్టింది. ఈ క్రమంలోనే పైలట్స్, బాలే, జుంబాను నేర్చుకుని సర్టిఫికెట్ పొందింది. 2015లో బాంద్రాలో యోగా ఇన్స్టిట్యూట్ను నెలకొల్పింది. సంప్రదాయ యోగాసనాలకు కొన్ని టెక్నిక్స్‌ను జోడించడంతో మంచి ఫలితాలు వచ్చేవి. దీంతో అన్షుక యోగా సెంటర్ బాగా పాపులర్ అయ్యింది. ► అన్షుక యోగా స్టూడియో! యోగాపై పెరిగిన అవగాహనతో సెలబ్రెటీలు సైతం తమ ఫిట్నెస్కోసం యోగాను ఎంచుకుంటున్నారు. అన్షుక ట్రైనింగ్ బావుండడంతో.. మలైకా అరోరా, హూమా ఖురేషి, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, కరీనా కపూర్, ఆలియాభట్, దీపికా పదుకోన్, రకుల్æప్రీత్ సింగ్, మిస్బా గుప్తా, అనన్య పాండే, జాహ్నవీ కపూర్, సోనాల్ చౌహాన్ వంటి సెలబ్రెటీలు అన్షుక దగ్గర యోగాలో శిక్షణ తీసుకున్నారు. ఎంతమంది సెలబ్రెటీలకు యోగా ట్రైనర్‌గా పనిచేసినా నాకు ఎలాంటి ఒత్తిడీ ఉండదు. శిక్షణ ఇవ్వడమంటే ఇష్టం. ట్రైనింగ్ ఇస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకంటే, నేను మనసా వాచా కర్మణ్యా పనిచేస్తున్నాను. ఎవరికైనా సలహాలు, సూచనలు ఇచ్చినప్పుడు అవి కచ్చితత్వంతోనూ, సత్యంతోనూ ఉంటేనే వాటికి విలువ ఉంటుంది. అందుకే నేను యోగాసనాలు వేసి, వేయించి, దాని శక్తిని అందరికీ తెలిసేలా చేస్తున్నాను. అందుకే నా శిక్షణకు ఆదరణ లభిస్తోంది. -
అలా ఉండడం దాదాపు అసాధ్యం: సమంత పోస్ట్ వైరల్
టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే సినిమాలకు బ్రేక్ ఇచ్చినట్లు చెప్పిన సామ్.. త్వరలోనే వైద్యం కోసం విదేశాలకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. గతంలో సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడిన సంగతి తెలిసిందే. అప్పట్లో చికిత్స కూడా తీసుకుంది. కోలుకున్న తర్వాత విజయ్ దేవరకొండ సరసన ఖుషి మూవీ, వరుణ్ ధావన్‌తో కలిసి సిటాడెల్ వెబ్ సిరీస్‌లో నటించింది. ప్రస్తుతం ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి షూటింగ్ పూర్తి చేసుకున్న సమంత ప్రస్తుతం తన ఆరోగ్యంపైనే పూర్తిగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సినిమాలకు బ్రేక్ కూడా ఇచ్చేసింది. త్వరలోనే అమెరికా వెళ్లనున్నట్లు సమాచారం. (ఇది చదవండి: జులై 13 నాకు చాలా స్పెషల్ : సమంత) అయితే అంతకుముందే ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయారు సామ్. ఇటీవలే తమిళనాడులోని గోల్డెన్ టెంపుల్ దర్శించుకని ప్రత్యేక పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకుంది ఖుషీ భామ. అయితే వైద్యం కోసం విదేశాలకు వెళ్లేముందు మనోధైర్యం కోసమే ఆలయాలకు వెళ్తున్నారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే తాజాగా సమంత మరోసారి ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయింది. ప్రముఖ యోగా గురువు, ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు నిర్వహించిన ఆధ్యాత్మిక యెగా కార్యక్రమానికి సమంత హాజరయ్యారు. తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన యోగా శిబిరంలో సామ్ ఓ సామాన్య భక్తురాలిగా కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలను సామ్ తన ఇన్‌స్టాలో పంచుకుంది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. సమంత తన ఇన్‌స్టాలో రాస్తూ..' ఎలాంటి ఆలోచనలు, కదలికలు, మెలికలు తిరగకుండా నిశ్చలంగా కూర్చోవడం దాదాపు అసాధ్యమనిపించింది. కానీ ఈరోజు ధ్యానం అనేది ప్రశాంతత, శక్తి, స్పష్టతకు అత్యంత శక్తివంతమైన మూలమని తెలిసింది. ఇంత సింపుల్‌గా ఉండే ధ్యానం.. ఇంత పవర్‌ఫుల్‌గా ఉంటుందని ఎవరు అనుకోరు.' అంటూ రాసుకొచ్చింది. కాగా.. ఇటీవలే ఖుషీ షూటింగ్ పూర్తి చేసుకున్న భామ త్వరలోనే వైద్యం కోసం విదేశాలకు బయలుదేరనుంది. (ఇది చదవండి: వైద్యం కోసం విదేశాలకు సమంత.. అతడు ఎమోషనల్!) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
యోగాతో సిక్స్ పాక్
-
రూప..కంప్యూటర్ ఇంజనీర్ కానీ, పిల్లల కోసం పుస్తకాలు రాస్తుంది
పిల్లల పుస్తకప్రపంచంలో తనదైన ప్రత్యేకత నిలుపుకుంది రూపా పాయ్. ఫాంటసీ–అడ్వెంచర్ పుస్తకాలతో పాటు ‘ది గీతా ఫర్ చిల్డ్రన్’లాంటి భిన్నమైన పుస్తకాన్ని రాసి ప్రశంసలు అందుకుంది. ఈ పుస్తకం ‘క్రాస్‌వర్డ్ అవార్డ్’ గెలుచుకుంది. మరో భిన్నమైన పుస్తకం ‘ది యోగా సూత్రాస్ ఫర్ చిల్డ్రన్’తో పిల్లలను పలకరించింది బెంగళూరుకు చెందిన రూప... పిల్లల పత్రిక ‘టార్గెట్’తో పాటు లండన్ కేంద్రంగా ప్రచురితమయ్యే ‘ట్రావెల్ ట్రెండ్స్’ మ్యాగజైన్ కోసం ఎన్నో రచనలు చేసింది రూప. అయితే తనకు పిల్లల కోసం రచనలు చేయడం అంటేనే బాగా ఇష్టం. ‘నేను రచయిత్రి కాకపోయి ఉంటే టీచర్ని అయ్యేదాన్ని’ అంటుంది కంప్యూటర్–ఇంజనీరింగ్ చదువుకున్న రూప. చిన్నప్పటి నుంచి పుస్తకాలు తెగ చదివేది. బెంగళూరులోని లైబ్రరీలన్నీ ఆమెకు సుపరిచితమే. చదవగా, చదవగా తనలో కాల్పనిక ప్రపంచం ఒకటి అస్పష్టంగా ఆవిష్కారమయ్యేది. కళ్ల ముందు ఏవేవో పాత్రలు, దృశ్యాలు కదలాడుతుండేవి. కాగితం, కలం పట్టిన తరువాత వాటికి ఒక రూపం ఇచ్చింది. రకరకాల జానర్స్‌లో రచనలు చేయడం గురించి రూప ఇలా అంటోంది...‘కథ మంచిదైతే, ఆకట్టుకునేలా ఉంటే అది ఏ జానర్ అనేది పిల్లలు పట్టించుకోరు. వారికి కచ్చితంగా హాస్యం ఉండాల్సిందే. ముఖ్యంగా క్లైమాక్స్ అనేది వారికి నచ్చాలి’.‘ది గీతా ఫర్ చిల్డ్రన్’ పుస్తకం రూపకు ఎంతో పేరు తెచ్చింది.‘మన పురాణాలకు సంబంధించిన ఎన్నో సంక్లిష్టమైన విషయాలను పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా రాస్తున్నారు కదా....మరి భగవద్గీత గురించి ఎందుకు రాయకూడదు’ అని ఒకరోజు అడిగింది ఎడిటర్ వత్సల. అయితే అందుకుముందెన్నడూ భగవద్గీతను రూప చదవలేదు. అలా అని ‘నేను రాయలేను’ అనలేదు. ‘ఓకే’ అంటూ రంగంలోకి దిగింది. ‘గీత’ను ఎన్నోసార్లు చదివింది. అనేకసార్లు చదివిన తరువాత ‘గీత గురించి పిల్లలకు చెప్పాలనే ఆలోచన నాకు ఎందుకు రాలేదు’ అనుకుంది.నిజానికి అదొక సవాలు. కానీ ఆ సవాలును ఇష్టంగా స్వీకరించింది రూప. ‘ది గీతా ఫర్ చిల్డ్రన్’ పిల్లలనే కాదు వారి తల్లిదండ్రులను కూడా ఆకట్టుకుంది. ‘మంచి ప్రయత్నం’ అని ప్రశంసించారు.‘ది గీతా ఫర్ చిల్డ్రన్’ పుస్తకం విజయవంతం అయిన తరువాత ‘ఇదే కోవలో మరో పుస్తకం రాస్తే బాగుంటుంది’ అని చాలామంది అడిగారు. అయితే అలా రాస్తే రొడ్డకొట్టుడుగా ఉంటుందని రూపకు ఆనిపించింది. ‘ఇప్పుడు కావాల్సింది మరో విభిన్నమైన పుస్తకం’ అని అనుకుంది. అలా వచ్చిందే...‘సో యూ వాంట్ టు నో ఎబౌట్ ఎకనామిక్స్’ పుస్తకం. ఈ పుస్తకం రావడానికి మరో కారణం ‘గీతను పిల్లలకు అర్థమయ్యేలా చెప్పడంలో విజయం సాధించాను’ అనే ఆత్మవిశ్వాసం. ఈ పుస్తకం తరువాత వచ్చిన ‘రెడీ 99’కి కూడా మంచి స్పందన వచ్చింది. పుస్తకం రాయడానికి రూప అనుసరించే పద్ధతి ఏమిటి? పుస్తకం రాయడానికి ముందు మనసు అనే కాగితంపైనే ఎన్నో వాక్యాలు రాసుకుంటుంది. అక్కడే ఎడిటింగ్ చేసుకుంటుంది. తాను ఎంచుకున్న అంశంపై ఎన్నో పుస్తకాలు చదువుతుంది. ఆ అంశంపై పట్టు ఉన్న వాళ్లతో మాట్లాడుతుంది. విషయ అవగాహన తరువాత పిల్లలను ఆకట్టుకునేలా, అర్థమయ్యేలా ఎలా రాయాలో అనేదానిపై కసరత్తు చేస్తుంది.‘పన్నెండు సంవత్సరాల వయసులో ఒక పిల్లల మాసపత్రికను చూస్తూ...పెద్దయ్యాక ఈ పత్రికకు కథలు రాయాలనుకునేదాన్ని. నా కల నెరవేరింది. ఇంతకంటే అదృష్టం, ఆనందం ఏముంటాయి!’ అంటుంది రూపా పాయ్. పిల్లలకు యోగా సూత్రాలు భగవద్గీత శ్లోకాల సారాంశాన్ని, ఆర్థిక సూత్రాల మర్మాన్ని పుస్తకాల ద్వారా పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా చెప్పిన రూపా పాయ్ తాజా పుస్తకం ‘ది యోగ సూత్రాస్ ఫర్ చిల్డ్రన్’. చిన్నప్పుడు మనసులో పడిన ఒక బీజం మొక్క అవుతుంది. ఆ తరువాత బలమైన చెట్టు అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాసిన పుస్తకం ఇది. ‘మనలో కలిగే రకరకాల భావాలకి మనమే యజమాని’ ‘నేను శరీరాన్ని కాదు. కాని ఈ శరీరమనే అద్భుతమైన నిర్మాణంతో ఈ అద్భుత ప్రపంచాన్ని చూడగలుగుతున్నాను’ ‘నేను మనసుని కాదు. కానీ మనసు అనే మహా నిర్మాణంలో ఎన్నో అద్భుతాలను అనుభవంలోకి తెచ్చుకోగలుగుతాను’... ఇలా ఆకట్టుకునే మాటలు ఎన్నో ఉన్న ‘ది యోగ సూత్రాస్ ఫర్ చిల్డ్రన్’ ఆబాలగోపాలానికి ప్రియమైన పుస్తకం అవుతుంది అనడంలో సందేహం లేదు. -
యోగా వలన బరువు తగ్గరు..?
కేరళ: భారత సంస్కృతికి, సంప్రదాయానికి ప్రతీకగా నిలిచిన యోగా ఆరోగ్య ప్రదాయనిగా, ప్రపంచ దేశాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తుంటే దాని వలన ప్రయోజనమేమీ లేదని చెబుతున్నారు కేరళకు చెందిన డాక్టర్ సిరియాక్ అబ్బి ఫిలిప్స్. ప్రపంచం మొత్తాన్ని కరోనా మహమ్మారి అప్రమత్తం చేశాక అత్యధికులకు ఆరోగ్యం పట్ల విపరీతమైన శ్రద్ధ పెరిగిపోయింది. అప్పటివరకు శరీరానికి కొంచెమైనా పని చెప్పని వారంతా ఉదయాన్నే లేచి వ్యాయామాలు, ప్రాణాయామాలు, యోగాలు చేయడం మొదలుపెట్టారు. వీటివలన బరువు నియంత్రణలో ఉండి ఆరోగ్యం మెరుగవుతుందన్నది వారి ప్రధాన ఉద్దేశ్యం. కానీ యోగా చేస్తే అసలు బరువు తగ్గరని కచ్చితంగా చెబుతున్నారు డాక్టర్ సిరియాక్ అబ్బి ఫిలిప్స్. అంతేకాదు, మానవాళి నిజమని నమ్ముతున్న కొన్ని నిజాలు అసలు నిజమే కాదని చెబుతూ డా. ఫిలిప్స్ లివర్ డాక్ పేరిట ఉన్న తన ట్విట్టర్ అకౌంట్లో ఒక సందేశాన్ని రాశారు. ఫిలిప్స్ రాసిన ట్వీట్ సారాంశమేమిటంటే.. 1. గుడ్డులోని పచ్చసొన తింటే రక్తంలో కొలెస్ట్రాల్ పెరగదు 2. గ్రీన్ టీ బరువు తగ్గడానికి సహాయపడదు 3. బెల్లం, తేనె లేదా చెఱుకు తెల్ల చక్కర కంటే ఆరోగ్యకరం కాదు 4. "ఆరోగ్యకరమైన మద్యం" అంటూ లేదు 5. ఒత్తిడిని తగ్గించడానికిగాని నిద్ర పట్టడానికిగాని అశ్వగంధ ఏమాత్రం ఉపయోగపడదు 6. శిలాజిత్తు అనే రాతి పదార్ధంలో మగవారి లైంగిక సామర్ధ్యాన్ని పెంచడం వంటి ప్రయోజనాలేమీ లేవు 7. పాలలో కలిసిన పసుపు రక్తంలో చేరదు సరికదా మలంలో బయటకు వెళ్ళిపోతుంది 8. పండ్లు తినడానికి సమయమంటూ ఏమీ ఉండదు.. రాత్రి పగలు ఎప్పుడైనా తినవచ్చు 9. చక్కర లేని బ్లాక్ కాఫీ రోజుకు మూడు సార్లు తాగితే కాలేయ సమస్యలు తగ్గుతాయి 10. ఆపిల్ సైడర్ వినెగర్ ఈగలను పట్టుకోవడానికి తప్ప ఎందుకూ ఉపయోగపడదు 11. రోజుకు ఎనిమిది గ్లాసులు నీళ్లు తాగాలన్నది వట్టి పురాణం మాత్రమే 12. అవసరాన్ని బట్టి తగిన మోతాదులో ప్రోటీన్లు తీసుకుంటూ ఉంటే కాలేయం, మూత్రపిండాలు ఆరోగ్యాంగా ఉంటాయి 13. రెస్వెరాట్రాల్ వయసును తగ్గించదు 14. స్వయంప్రకటిత శాస్త్రవేత్తలు వైద్యులు కారు 15. ఫలానా ఆహారం వలన బరువు తగ్గారంటే అది వారి శరీరంలో కేలరీల నియంత్రణల బట్టి సాధ్యమైంది తప్ప ఆహరం వలన కాదు 16. పండ్లతోపాటు పాలు పదార్ధాలు తీసుకోవడం మంచిదే 17. యోగా చేయడం వలన బరువు తగ్గరు 18. ప్రతిరోజూ మాల్ట్ విటమిన్లు తీసుకోవడం వలన ఆరోగ్యం మెరుగు పడదు, వ్యాధులు రాకుండా ఉండవు 19. జుట్టు పెరగడానికి గాని ఎదగడానికి గాని బయోటిన్ ఏ విధంగానూ ఉపయోగపడదు అని పెద్ద చిట్టా రాశారు వాస్తవాల సంగతి అటుంచితే దీనిలో యోగా వలన బరువు తగ్గదనడానికి ఏమి ఆధారాలున్నాయని అనేకమంది నెటిజన్లు డాక్టరును ఎదురు ప్రశ్నించారు. దీంతో డాక్టర్ తన పరిశోధనకు సంబంధించిన వివరాలను పొందుపరుస్తూ యోగా వలన బరువు తగ్గుతారనడానికి సరైన రుజువులు లేవని చెప్పారు. To summarize: 1. One whole egg with yolk a day does not increase blood cholesterol 2. Green tea does not help you lose weight 3. Jaggery, honey or sugarcane are not healthier than white sugar 4. There is no "healthy alcohol" 5. Ashwagandha does not reduce stress or help you… — TheLiverDoc (@theliverdr) June 25, 2023 హఠ యోగ క్రియల్లో భాగంగా చెప్పిన విన్యాసం యోగా, పవర్ యోగా మాత్రమే బరువు నియంత్రణకు ఉపయోగపడతాయని ఫిలిప్స్ తెలిపారు. Since this is blowing up: Post script: #8: Yoga and weight loss: A 2016 meta-analysis, the highest quality of evidence showed that benefits were inconclusive because studies suffered high risk bias and methodology design flawed. https://t.co/SANoMwGR3q A recent study showed… — TheLiverDoc (@theliverdr) June 25, 2023 -
యోగాతో ప్రశాంతత
సాక్షి, అమరావతి/సాక్షి, భీమవరం/లేపాక్షి/సీతంపేట/సింథియా: యోగాసాధన ద్వారా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రయోజనాలను ప్రోత్సహించడం ప్రపంచ యోగాదినోత్సవ ముఖ్య లక్ష్యమని కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమశాఖ సహాయమంత్రి డాక్టర్ భారతీప్రవీణ్ పవార్ చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని విష్ణు కళాశాల ఆడిటోరియంలో బుధవారం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగాద్వారా నిత్యం ఆరోగ్యంగా ఉండడానికి మన దేశం ఆచరణాత్మక విధానమే కారణమన్నారు. యోగాను ప్రజలకు తెలిపి ప్రపంచవ్యాప్తంగా విస్తృత అవగాహన కల్పించింది ప్రధాని నరేంద్రమోదీయేనని చెప్పారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి భారతీప్రవీణ్ పవార్, కలెక్టర్ పి.ప్రశాంతి విద్యార్థులతో కలిసి యోగాసనాలు వేశారు. యోగా వ్యాప్తికి ప్రధాని కృషి అమోఘం ప్రపంచ దేశాల్లో యోగావ్యాప్తికి ప్రధాని నరేంద్రమోదీ చేస్తున్న కృషి అమోఘమని కేంద్ర కమ్యూనికేషన్లశాఖ సహాయ మంత్రి దేవుసిన్హ్ చౌహాన్ చెప్పారు. శ్రీసత్యసాయి జిల్లా లేపాక్షిలోని నంది విగ్రహం వద్ద బుధవారం జరిగిన అంతర్జాతీయ యోగ దినోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాతో సర్వరోగాలు దూరమవుతాయని చెప్పారు. ఒత్తిడి తగ్గించుకోవడం యోగాతోనే సా«ధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దియోధర్ తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం పోర్టు అథారిటీ ఆధ్వర్యంలో అక్కయ్యపాలెం పోర్టు స్టేడియంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగాదినోత్సవంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, విదేశీ వ్యవహారాలశాఖ సహాయమంత్రి వి.మురళీధరన్ పాల్గొన్నారు. వారసత్వ సంపద యోగా యోగా మన వారసత్వసంపద అని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు చెప్పారు. ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో బుధవారం విజయవాడలో నిర్వహించిన యోగా దినోత్సవంలో ఆయన మాట్లాడారు. ప్రపంచానికి ఆరోగ్యదిక్సూచిగా యోగాను అందించిన ఘనత భారతదేశానికే దక్కుతుందని పురావస్తుశాఖ కమిషనర్ జి.వాణీమోహన్ చెప్పారు. విజయవాడలోని బాపు మ్యూజియంలో బుధవారం నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఆమె మాట్లాడారు.అనంతరం మ్యూజియం నుంచి మొగల్రాజపురం వరకు ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగులు, అధికారులు పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి యోగా సాధన చేయాలని రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఎండీ లక్ష్మీషా సూచించారు. విజయవాడలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో బుధవారం నిర్వహించిన యోగదినోత్సవంలో ఆయన మాట్లాడారు. తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో.. తూర్పు నావికాదళం పరిధిలోని అన్ని యూనిట్లలో యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో సుమారు 10 వేలమంది నౌకాదళ సిబ్బంది, డిఫెన్స్ సెక్యూరిటీ కారŠప్స్, వారి కుటుంబసభ్యులు పాల్గొన్నారు. సముద్ర ఉపరితలం మీద ఉన్న నౌకల్లో, తీరంలో వివిధ ఓడరేవుల్లో, విదేశీ పోర్టుల్లో ఉన్న ఈస్ట్రన్ ప్లీట్ షిప్‌లలో కూడా యోగా దినోత్సవం నిర్వహించారు. ఇండోనేషియాలోని జకార్తాలో ఐఎన్ఎస్ శివాలిక్, బంగ్లాదేశ్‌లోని చటోగ్రామ్‌లో ఐఎన్ఎస్ కిల్తాన్, «థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌లో ఐఎన్ఎస్ సుమిత్ర నౌకల్లో సిబ్బంది యోగాసనాలు వేశారు. మల్కాపురంలోని కేంద్రీయ విద్యాలయంలోని చిన్నారులతో ఇషా ఫౌండేషన్ ప్రతినిధులు యోగాసనాలు వేయించారు. భారతీయ త్రివర్ణ థీమ్‌తో నేవీ సిబ్బంది చేసిన యోగా సాధన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో దివ్యాంగుల యోగా ఏయూక్యాంపస్: సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ సహకారంతో ఆంధ్ర విశ్వవిద్యాలయం సౌజన్యంతో బుధవారం 500 మంది దివ్యాంగ విద్యార్థులు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఏయూలో జరిగిన ఈ కార్యక్రమం ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదైంది. కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున, ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాదరెడ్డి, సమగ్ర శిక్ష రాష్ట్ర అదనపు పథక సంచాలకుడు డాక్టర్ కె.వి.శ్రీనివాసులురెడ్డి, రాష్ట్ర సహిత విద్య కో ఆర్డినేటర్ ఎన్.కె.అన్నపూర్ణ, డీఈవో ఎల్.చంద్రకళ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల నుంచి దివ్యాంగ విద్యార్థులు, ప్రత్యేక ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులను పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్‌ప్రకాష్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేశ్‌కుమార్, సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకుడు బి.శ్రీనివాసరావు అభినందించారు. -
యోగానంద నుంచి అయ్యంగార్ వరకూ.. యోగాకు గుర్తింపునిచ్చిన గురువులు వీరే..
ఈ రోజు ప్రపంచ యోగా దినోత్సవం. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. యోగా చేయడం వలన కలిగే లాభాల గురించి తెలియజేయడమే యోగా దినోత్సవం ఉద్దేశం. యోగ విధానాలను మనదేశానికి చెందిన రుషులు, మునులు రూపొందించారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా సూత్రాలను అనుసరించడం ఎంతో అవసరమని వారు తెలియజేశారు. యోగా ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటిన ప్రముఖ గురువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పరమహంస యోగానంద పరమహంస యోగానంద తన పుస్తకం ‘ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి’ కారణంగా సుపరిచితులయ్యారు. మెడిటేషన్, యోగా విధానాలను ఆయన ప్రపంచవ్యాప్తం చేశారు. ఇంతేకాదు పరమహంస యోగానంద యోగాకు సంబంధించిన తొలి గురువులలో ప్రముఖునిగా పేరొందారు. ఆయన తన జీవితంలోని అధిక భాగాన్ని అమెరికాలోనే గడిపారు. తిరుమలాయ్ కృష్ణమాచార్య ఈయన ‘ఆధునిక యోగ పితాచార్యులు’గా గుర్తింపు పొందారు. హఠయోగను మరింత విస్తృతంగా ప్రచారం చేశారు. ఈయన అనేక ఆయుర్వేద విషయాలను కూడా ప్రపంచానికి తెలియజెప్పారు. ధీరేంద్ర బ్రహ్మచారి ధీరేంద్ర బ్రహ్మచారి దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి యోగా గురువుగా పేరొందారు. ఈయన దూరదర్శన్ ద్వారా యోగాకు ప్రాచుర్యం కల్పించేందుకు ప్రయత్నించారు. దీనికితోడు ధీరేంద్ర బ్రహ్మచారి ఢిల్లీలోని స్కూళ్లు, కాలేజీలలో యోగా క్లాసులు నిర్వహించేందుకు నడుంబిగించారు. ఈయన యోగాకు సంబంధించి హిందీ, ఆంగ్లభాషల్లో అనేక గ్రంథాలు రాశారు. జమ్ములో ధీరేంద్ర బ్రహ్మచారి ఆశ్రమం ఉంది. కృష్ణ పట్టాభి జోయిస్ ఈయన కూడా ప్రముఖ యోగా గురువుగా పేరొందారు. 1915 జూలై 26న జన్మించిన ఆయన 2009లో కన్నుమూశారు. ఈయన అష్టాంగ యోగ సాధనకు అమితమైన ప్రాచుర్యాన్ని కల్పించారు. ఇతని వద్ద శిష్యరికం చేసిన పలువురు ప్రస్తుతం పలు ప్రాంతాల్లో యోగా తరగతులు నిర్వహిస్తున్నారు. బీకేఎస్ అయ్యంగార్ బీకేఎస్ అయ్యింగార్ యోగా ప్రపంచంలో ఎంతో పేరు పొందారు. ‘అయ్యంగార్ యోగా’ పేరుతో ఒక స్కూలును నెలకొల్పారు. ఈ స్కూలు ద్వారా ఆయన లెక్కలేనంతమందికి యోగా శిక్షణ అందించారు. 2004లో టైమ్స్ మ్యాగజైన్ బీకేఎస్ అయ్యంగార్ పేరును ప్రపంచంలోని 100 మంది ప్రతిభావంతుల జాబితాలో చేర్చింది. మహర్షి మహేష్ యోగి మహర్షి మహేష్ యోగి బోధించే ‘ట్రాన్స్‌డెంటల్ మెడిటేషన్’ ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపుపొందింది. పలువురు సెలబ్రిటీలు ఈయన బోధించిన యోగ విధానాలను అనుసరిస్తుంటారు. ఇది కూడా చదవండి: అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త..హోటళ్లు ఆడ్వాన్ బుకింగ్ చేస్తే.. -
International Yoga Day: భారతీయులకు ప్రధాని వీడియో సందేశం
International Yoga Day: అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ భారత ప్రజలకు ఒక వీడియో సందేశాన్ని పంపించారు. ఈ సందేశంలో భారతీయులు కొత్తదనాన్ని స్వాగతించడంలోనూ, సాంప్రదాయాలను కాపాడుకోవటంలోనూ గొప్ప స్ఫూర్తిని కనబరిచారని అన్నారు. ఏక్ భారత్ - శ్రేష్ట్ భారత్ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆయన సతీమణి ఆహ్వానం మేరకు అమెరికా పయనమైన భారత ప్రధాని ప్రపంచ యోగా దినోత్సవం రోజును పురస్కరించుకుని భారత ప్రజానీకానికి ఒక వీడియో సందేశాన్ని పంపించారు. ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. మానవ సంబంధాలను మెరుగుపరచి ఐక్యతను పెంపొందించే యోగా వంటి సంప్రదాయాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది భారతదేశం. యోగా మనలోని అంతర్గత ద్దృష్టిని మెరుగుపరచి మనలోని ఐక్యత పెరిగే లా చేస్తుందని దీని ద్వారా వైరుధ్యాలను చెరిపేసి, అడ్డులన్నిటినీ అధిగమించి, ఆటంకాలను తొలగించుకోవచ్చని, మనమంతా కలిసి "ఏక్ భారత్ - శ్రేష్ట్ భారత్" స్ఫూర్తిని ప్రపంచానికి చాటాలని ఆయన అన్నారు. ఆర్కటిక్, అంటార్కటిక్ ప్రాంతాల్లోని పరిశోధకులు కూడా యోగా దినోత్సవాల్లో పాల్గొంటున్నారని, "మహాసముద్రాల వలయంగా యోగా" నిర్వహిస్తున్నందున ఈ ఏడాది యోగా దినోత్సవం చాలా ప్రత్యేకమైనదిగా వర్ణించారు. భారత దేశంలోని కోట్లాది ప్రజలు మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా అనేకమంది యోగా దినోత్సవ వేడుకలు జరుపుకోవడంతో యోగా కీర్తి దశదిశలూ వ్యాప్తి చెందుతోందని ఆయనన్నారు. #WATCH | At around 5:30 pm IST, I will participate in the Yoga program which is being organised at the headquarters of the United Nations. The coming together of more than 180 countries on India's call is historic. When the proposal for Yoga Day came to the United Nations General… pic.twitter.com/oHeehPkuZe — ANI (@ANI) June 21, 2023 అమెరికా పర్యటనలో భాగంగా భారత ప్రధాని ఈరోజు యోగా దినోత్సవాన్ని పురస్కరించుకు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో భారీ యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇది కూడా చదవండి: నేను మోదీ అభిమానిని: ఎలన్ మస్క్ -
Yoga Day: యోగా.. కొత్త కొత్తగా
యోగా నిపుణులు, సాధకులు, ఇన్ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియాలో తమ ఉనికిని కొత్తగా చాటుతున్నారు. వారి నిజాయితీ, స్ఫూర్తిదాయకమైన వారి మాటలు, ఉత్సాహం ఆకర్షణీయంగా మార్చే సుగుణాన్ని కళ్లకు కడుతున్నాయి. యోగా ఆరోగ్యాన్ని, ఫిట్నెస్ను రెండింటినీ అద్భుతంగా మారుస్తుంది. రోజువారి జీవనంలో యోగా ఒక భాగం అవడానికి ఇన్ఫ్లుయెన్సర్లు మరిన్ని హంగులు అద్దుతున్నారు. శాస్త్రీయ యోగాభ్యాసం ద్వారా వేగవంతమైన ఆధునిక యుగానికి తమను తాము గొప్ప స్ఫూర్తిగా మార్చుకుంటున్నారు. సెలబ్రిటీల నుంచి ఎంతోమంది మహిళలు యోగా పాఠాలు చెబుతూ సోషల్ మీడియాలో కనిపిస్తారు. వారి నుంచి ఎంతో ప్రేరణను పొందవచ్చు. ఈ రోజు నుంచే యోగాను దైనందిన జీవనంలో భాగం చేసుకోవచ్చు. ప్రపంచస్థాయి ప్రభావం శిల్పా శెట్టి భారతదేశంలో అత్యంత ప్రభావ వంతమైన ఫిట్నెస్ ఐకాన్స్, యోగా ఇన్ఫ్లుయెన్సర్లలో ఒకరుగా నిలిచింది శిల్ప. ఐదుపదులకు చేరువలో ఉన్న శిల్ప యోగా కోసం చాలా కాలం శిక్షణ పొందారు. తీరైన శరీరాకృతిని పొందడానికి, దైనందిన జీవనంలో వ్యాయామాన్ని చేర్చడానికి ఫిట్నెస్ ఫిల్మ్‌లు రూపొందించింది. యోగాకు సంబంధించిన డీవీడీలను కూడా రిలీజ్ చేసింది. కొన్ని జీవన శైలి మార్పులు మనలో ఎలాంటి పెద్ద మార్పులను తీసుకువస్తాయో చూపించడానికి సోషల్‌మీడియాను ఉపయోగిస్తుంది. ఆమె యూ ట్యూబ్ ఛానెల్‌కి 3 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. ప్రపంచ స్థాయిలో భారతీయ యోగానుప్రోత్సహించడంలో శిల్ప చేసిన కృషి అంతా ఇంతా కాదు. ఆమె వ్యాయామం చేసే విధానం, తీసుకునే ఆరోగ్యకరమైన ఆహారం గృహిణులకు స్ఫూర్తినిస్తుంది. యోగా సౌందర్యం దీపికా మెహతా రోజును యోగాసనాలతో కొత్తగా ్రపారంభించాలనే ఆలోచనను దీపికా మెహతా కళ్లకు కడుతుంది. ఆమె యూ ట్యూబ్ ఛానెల్ ద్వారా యోగా లో కళా దృష్టి ఉంటుందని చూపుతుంది. ‘రెండు దశాబ్దాల క్రితం మరణం అనుభవాన్ని చవిచూశానని, యోగా పునర్జీవితాన్ని ఇచ్చింద’ని చెబుతుంది. రాక్ క్లైంబింగ్ ప్రమాదం తర్వాత ఆమె ఇకపై నడవలేదని వైద్యులు అంచనా వేశారు. యోగా ట్రైనర్, అష్టాంగ యోగా స్పెషలిస్ట్ అయిన దీపికా యూ ట్యూబ్ ఛానెల్ కి దాదాపు 4 లక్షల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె చూపే యోగా ప్రతిభ ఎంతోమందిని ఆశ్చర్యపరుస్తాయి. ఎంతోమంది బాలీవుడ్ సెలబ్రిటీలకు యోగా గురూగా మారింది. లోపాలను సరిదిద్దుతూ... సునయన రేఖీ యోగా హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ కోచ్‌గా సునైనా రేఖీ తనను తాను కొత్తగా ఎప్పుడూ పరిచయం చేసుకుంటూనే ఉంటుంది. భారతదేశంలోని అత్యంత పేరొందిన యోగా ట్రైనర్లలలో సునయన ఒకరు. రిషీకేశ్‌లో యోగా సాధన చేసిన సునయన ఇప్పుడు ముంబైలోని అనేక ప్రసిద్ధ యోగా స్టూడియోలలో నిపుణురాలిగా శిక్షణ ఇస్తోంది. సాధనకు బలమైన పునాదిని ఏర్పరచడానికి, గాయాలను మాన్పడానికి నిపుణులైన పర్యవేక్షణ అవసరమని సునయన వీడియోలు నిరూపిస్తాయి. యోగా సాధనలో చిన్న చిన్న లోపాలు ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తాయో కూడా వివరిస్తుంది. మనస్సు, శరీరం, ఆత్మపై యోగా వల్ల కలిగే మంచి ప్రయోజనాల గురించి వివరిస్తుంది. నిరాశకు దూరం నటాషా నృత్యకారిణి, ఫొటోగ్రాఫర్, యోగా సాధకురాలు నటాషా నోయల్. యూ ట్యూబ్, ఇన్స్టాగ్రామ్ నుంచే కాదు సోల్‌ఫుల్ హ్యాపీనెస్ బ్లాగ్ ద్వారా తన యోగానుభవాలను తెలియజేస్తుంది. మాట్లాడుతుంది. తత్త్వశాస్త్రాన్ని సాధన చేసే నటాషా ‘మీ మానసిక దృఢత్వమే మీ లక్ష్యం. మిగతావన్నీ అప్రధానం’ అని చెబుతుంది. తన బాల్యంలో జరిగిన విషాదకర సంఘటనల నుంచి తేరుకొని, కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. కండరాల బలాన్ని పునర్నిర్మించే ప్రయత్నంలో ఆమె యోగా సాధకురాలిగా మారింది. ఆమె యూ ట్యూబ్ ఛానెల్‌కు సుమారు ఏడు లక్షల ముప్పై వేల మంది సభ్యులు ఉన్నారు. నిరాశ, ఆందోళన, బాడీ షేమింగ్ గురించి చర్చించడానికి ఆమె తన సోషల్‌మీడియా ΄్లాట్ఫారమ్ను ఉపయోగిస్తుంది. యోగా ద్వారా సెల్ఫ్ గ్రోత్, చికిత్స గురించి మరీ మరీ చెబుతుంది. ప్రతిరోజూ మరింత బలంగా మారడానికి ప్రయత్నిస్తూనే ఉండాలని సూచనలు ఇస్తుంది. ఆమె ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా కష్టపడి పని చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయో అందుకు తనే ఉదాహరణగా చూపుతుంది. యోగాసిని రాధికా బోస్ అనేక పేరొందిన కంపెనీలతో కలిసి పనిచేసిన అనుభవం రాధికా బోస్‌కు ఉంది. అయితే, ఆమె తన ఆరోగ్యకరమైన జీవనాన్ని సూచించడానికి మాత్రం సోషల్‌మీడియానే ప్రధాన వేదికగా ఎంచుకుంటుంది. రాధిక సూచించే అంశాలు ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంటాయి. ప్రతిష్టాత్మకమైన మ్యాగజైన్లలో ఆమె యోగసాధన గురించి ప్రచురించాయి. ‘మీడియా, ప్రకటనలలో గ్లాస్ సీలింగ్‌ను ఛేదించడానికి మహిళలు గొప్ప పురోగతిని సాధించారు. అయితే మనం ఇంకా పితృస్వామ్యంలో జీవిస్తున్నాం, అన్నింటినీ దాటుకొని చాలా దూరం ప్రయాణించాల్సింది మనమే’ అని నమ్మకంగా చెబుతుంది. యోగా, వ్యాయామ జీవనశైలితో పాటు ఇతర ఆరోగ్య మార్గదర్శకాలను అందిస్తుంది. 9 సంవత్సరాలుగా యోగా సాధన చేస్తూ, నిపుణురాలిగా తన ప్రతిభను చాటుతోంది. -
Yoga Mahotsav: హైదరాబాద్‌లో గ్రాండ్‌గా యోగా మహోత్సవ్ (ఫొటోలు)
-
యోగాను పండుగలా జరుపుకోవాలి
రసూల్‌పురా (హైదరాబాద్): అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21ని పురస్కరించుకుని 25 రోజుల కౌంట్‌డౌన్ సందర్భంగా శనివారం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో యోగా మహోత్సవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి, కేంద్ర ఆయుష్, ఓడరేవుల, షిప్పింగ్ జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్, కార్మిక, ఉపాధి, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి ముంజపరా మహేంద్రభాయ్ కాలూభాయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ దీపావళి, ఉగాదిలాగా యోగా కూడా ఒక పండుగలా సంతోషంగా జరుపుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపించి యోగా చేయాలని సూచించారు. కౌంట్‌డౌన్‌కు హైదరాబాద్ వేదిక కావడం గొప్ప విషయమని అన్నారు. యోగా మన జీవన విధానం: కిషన్‌రెడ్డి మన దేశంలో వేల సంవత్సరాల క్రితం పుట్టిన యోగా మన జ్ఞాన సంపద, జీవన విధానమని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ యోగాను ప్రపంచానికి పరిచయం చేశారని తెలిపారు. జూన్ 21న యోగా దినోత్సవం రోజున అనేక దేశాల్లో యోగా చేస్తారని, ఆరోజు మన దేశంలోనూ ప్రతిఒక్కరూ యోగా చే యాలన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 13 నుంచి దేశవ్యాప్తంగా వంద రోజులపాటు యోగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, ఇప్పుడు హైదరాబాద్‌లో 25 రోజుల కౌంట్‌డౌన్ నిర్వహిస్తున్నామన్నారు. కేంద్ర మంత్రి సోనోవాల్ మాట్లాడుతూ, యోగా మన జీవితంలో ఒక భాగం చేసుకోవడం ద్వారా మనసు సుసంపన్నం అవుతుందని అన్నారు. జూన్ 21న మైసూర్లో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొంటారని చెప్పారు. ఈ 25 రోజుల కౌంట్‌డౌన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. సినీ ఆరి్టస్టులు, రాజకీయ నాయకులు, వివిధ రంగాలకు చెందిన పదివేల మంది పైగా యోగా మహోత్సవ్‌లో పాల్గొన్నారు. -
యోగ గొప్పతనం ఏంటో చెప్పిన విశ్వక్ సేన్ శ్రీలీల..
-
పరేడ్ గ్రౌండ్స్‌లో యోగా మహోత్సవ్
రసూల్‌పురా(హైదరాబాద్): భారతీయ వారసత్వ సంపద యోగా అని.. ఇస్లామిక్, క్రిస్టియన్ అనే భేదాలు, భాషలు, ప్రాంతాల తేడా లేకుండా ప్రపంచమంతా యోగాను అనుసరిస్తున్నాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి చెప్పారు. ప్రపంచ యోగా దినోత్సవమైన జూన్ 21కి 25 రోజుల కౌంట్‌డౌన్‌గా శనివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో యోగా మహోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. కేంద్ర ఆయుష్ శాఖ ఆధ్వర్యంలోని మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా నేతృత్వంలో చేపడుతున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను శుక్రవారం కేంద్ర ఆయుష్ మంత్రి శర్వానంద సోనోవాల్, కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి ముంజ్‌పరా మహేంద్రభాయ్ కాళూభాయ్లతో కలసి కిషన్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు. ఈ యోగా మహోత్సవ్‌కు గవర్నర్ తమిళిసై ముఖ్య అతిథిగా హజరవుతున్నారని కిషన్‌రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిని కూడా ఆహా్వనించామని చెప్పారు. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు ప్రపంచ యోగా దినోత్సవానికి కౌంట్‌డౌన్‌గా యోగా మహోత్సవ్లు నిర్వహిస్తున్నామని వివరించారు. 75 రోజు ల కౌంట్‌డౌన్‌ను అసోంలో, 50 రోజుల కౌంట్‌డౌన్ జైపూర్‌లో నిర్వహించామని చెప్పారు. పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే యోగా మహోత్సవ్‌లో కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, కళాకారులు, వేలమంది యోగా గురువులు, సినీ ఆరి్టస్టులు, రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నట్టు తెలిపారు. ఆర్కిటిక్ నుంచి అంటార్కిటికా దాకా: సోనోవాల్ ఈసారి ప్రపంచ యోగా దినోత్సవ నినాదం ‘వసుదైక కుటుంబం కోసం యోగా’అని కేంద్ర మంత్రి శర్వానంద సోనోవాల్ తెలిపారు. ప్రధాని మోదీ కృషి కారణంగా ప్రపంచం మొత్తం యోగాను సంపూర్ణ ఆరోగ్యానికి మార్గదర్శిగా అంగీకరించిందని చెప్పారు. మూడు శాఖల సాయంతో ఓడరేవుల్లో నౌకలతో ‘ఓషన్ రింగ్ ఆఫ్ యోగా’ను నిర్వహించనున్నామని.. ఆర్కిటిక్ నుంచి అంటార్కిటికా వరకు ఉత్తర, దక్షిణ ధ్రువ ప్రాంతాల్లో ఈ యోగా ప్రదర్శన జరుగుతుందని తెలిపారు. ఆర్కిటిక్‌లోని స్వా ల్బార్డ్ భారత పరిశోధన స్థావరం, హిమాద్రి, అంటార్కిటికాలోని మూడో భారత పరిశోధన స్థావరం, ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఫ్లైట్ డెక్‌లపై యోగా ప్రదర్శన ఉంటుందన్నారు. -
విద్యార్థుల ఆరోగ్యం ముఖ్యం
సాక్షి, అమరావతి: విద్యార్థుల మానసిక, శారీరక ఆరోగ్య శ్రేయస్సుపై ఉన్నత విద్యాసంస్థలు దృష్టి సారించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సూచిస్తోంది. ఇందులో భాగంగా కళాశాలలు, వర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థి సేవాకేంద్రాలను (ఎస్ఎస్సీలను) ఏర్పాటు చేయాలని ఇప్పటికే మార్గదర్శకాలు జారీచేసింది. తాజాగా విద్యార్థుల సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేయడానికి ప్రత్యేక నిపుణుల కమిటీని నియమించనుంది. అనంతరం విద్యార్థులకు మేలు చేసేలా కమిటీ సిఫారసులను ఎస్‌ఎస్‌సీల ద్వారా అమలు చేయాలని యోచిస్తోంది. సంపూర్ణ సహకారం అందించేలా.. విభిన్న భాషలు, మతాలు, సంస్కృతులతో పాటు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థుల్లో సామాజిక వైవిధ్యాన్ని అర్థం చేసుకుని వారి భావోద్వేగాలను పరస్పరం గౌరవించేలా ఎస్ఎస్సీలు పనిచేస్తాయి. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులపై శ్రద్ధ తీసుకోవడంతో పాటు ఒత్తిడిని అధిగమించేలా విద్యార్థులకు మార్గనిర్దేశం చేయడానికి ఆరోగ్య సలహాదారులు, శారీరక, మానసిక ఆరోగ్య నిపుణుల సేవలను అందుబాటులో ఉంచుతారు. ఈ మేరకు కళాశాలలకు సమీపంలోని అంకితభావం కలిగిన మానసిక వైద్యనిపుణులతో పాటు ప్రఖ్యాత వైద్యసంస్థలు ఎయిమ్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్స్స్ (ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్–నిమ్హాన్స్)తో ఒప్పందాలు చేసుకోవాలని యూజీసీ సూచించింది. ఆయా కళాశాలల్లోని సైకాలజీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగాల నిపుణుల సేవలను ప్రాజెక్టు డ్రివెన్మోడ్లో వినియోగించుకోవాలని పేర్కొంది. సింగిల్‌విండో సేవలు సైకాలజీ, ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, సైకియాట్రీ, సోషల్ వర్క్, సోషియాలజీ విభాగాల్లో అనుభవం గడించిన ప్రొఫెసర్లు విద్యార్థి సేవాకేంద్రాన్ని డైరెక్టర్/డీన్ హోదాలో నిర్వహించనున్నారు. పరిస్థితులకు అనుగుణంగా ఆన్లైన్, వ్యక్తిగతంగా, టెలిఫోన్, గ్రూప్ కాలింగ్ కౌన్సెలింగ్ సెషన్ల ద్వారా విద్యార్థులకు శారీరక, మానసిక ఆరోగ్యసేవలను అందించనున్నారు. కళాశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యలు అరికట్టడంతోపాటు డ్రాపౌట్ రేట్లను తగ్గించే లక్ష్యంతో సింగిల్‌విండో పద్ధతిలో ఈ కేంద్రాలు పనిచేస్తాయి. విద్యార్థుల్లో ఫిట్నెస్ సామర్థ్యాన్ని పెంచడానికి జిమ్‌లు, యోగా సెంటర్లు నిర్వహించడంతోపాటు ఇండోర్, ఔట్‌డోర్ క్రీడా ప్రాంగణాల్లో మౌలిక వసతులు కల్పిస్తూ, బాలికలకు ఆత్మరక్షణ శిక్షణ తప్పనిసరిగా ఇవ్వాలని యూజీసీ మార్గదర్శకాల్లో పేర్కొంది. -
పరివర్తన బాటతో పదుగురికీ సేవ
పెద్దాపురం: జైలులో అలవర్చుకున్న ఆరోగ్య స్పృహను పదిమందికీ తెలియజేస్తున్నాడు మసిముక్కల రామకృష్ణ. అక్కడ నేర్చుకున్న యోగాను బయటకొచ్చి నేర్పుతూ గురువుగా ఎదిగాడు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఉదయం పోషకవిలువతో కూడిన అల్పాహారాన్ని అందిస్తున్నాడు. కోరుకొండ మండలం బొల్లెద్దుపాలెంకు చెందిన రామకృష్ణకు సుమారు 15 ఏళ్ల కిందట రాజకీయ ఘర్షణల నేపథ్యంలో ఓ హత్య కేసులో యావజ్జీవ జైలుశిక్ష పడింది. అతను జైలుకు వెళ్లడంతో భార్య సుబ్బలక్ష్మి తన కుమారుడు, కుమార్తెను వెంటబెట్టుకుని పెద్దాపురం మండలం దివిలిలోని పుట్టింటికి చేరుకుంది. కుట్టు మిషన్ సాయంతో పిల్లలను పోషించింది. 2016 జనవరి 26న సత్పప్రవర్తన కేటరిగిలో రామకృష్ణ జైలునుంచి విడుదలయ్యాడు. స్వగ్రామం వెళ్లలేక అత్తావారింటికి కాపురం వచ్చేశాడు. ఇటు..యోగా అటు వైద్య సేవలు జైలు నుంచి వచ్చాక రామకృష్ణ తన చుట్టూ ఉన్న వారికి ఏదైనా మంచి చేయాలని స్పంకల్పించాడు. జైలులో నేర్చుకున్న యోగాపై చుట్టుపక్కల ఉన్నవారికి అవగాహన కల్పించడం ప్రారంభించాడు. దీనిపై పులిమేరు పరిసర గ్రామాల్లో విస్తృత ప్రచారం చేశారు. ఇప్పటికీ కొనసాగిస్తున్నాడు. పదిహేను రోజులకోసారి దివిలి, తిరుపతి, చదలాడ, పులిమేరు, పిఠాపురం మండలం విరవ గ్రామాల్లో యోగాసనాలపై శిక్షణ ఇస్తున్నాడు. పులిమేరులో యోగాశ్రమాన్ని నెలకొల్పాడు. 12 ఏళ్ల కుర్రాడి నుంచి 60 ఏళ్ల వృద్దుల వరకూ సుమారు వంద మంది యోగా నేర్చుకుంటున్నారు. తనకు తెలిసిన ఆయుర్వేద వైద్యంతో రామకృష్ణ చిన్నపాటి రోగాలకు చికిత్స చేస్తున్నాడు. ఇటీవల పోషక విలువల ఆహారాన్ని తయారుచేసి విక్రయించడం ప్రారంభించాడు. సేంద్రీయ సాగు ఉత్పత్తులతో ఆహార పదార్ధాలను తయారుచేస్తున్నాడు. బ్లాక్ రైస్ ఇడ్లీ, నానబెట్టిన మొలకలు, కొర్రలు ఉప్మా, ఆయిల్‌లెస్ దోసె, చోడి అంబలిని కలిపి అల్పాహారంగా అమ్ముతున్నాడు. సాధారణ ధరకే విక్రయిస్తూ ప్రజారోగ్య పరిరక్షణకు కృషి చేస్తున్నాడు. పోషకాల టిఫిన్ రోజూ ఉదయం గతంలో ఇక్కడి హోటల్స్‌లో చాలామంది ఆయిల్‌తో చేసిన టిఫిన్లు తినేవారు. జనంలో ఇప్పుడు ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. ఉదయాన్నే ఇలాంటివి తినడం వల్ల అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడమేనని గ్రహిస్తున్నారు. అలాంటి వారంతా పౌషకాహారంపై మొగ్గు చూపిస్తున్నారు. సేంద్రీయ పంటలతో చేసిన వంటకాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ తరహా ఆహారాన్ని ఇష్టపడేవారు తన లాంటి వారి వద్ద కొనుగోలు చేస్తున్నారని రామకృష్ణ చెప్పారు. ఆరోగ్యం గురించి తెలియజెప్పాలని.. జైలు నుంచి వచ్చాక పెట్రోల్ బంకులో పనిచేశాను. టైలరింగ్ వృత్తి చేశాను. బతుకు గడవడం మాటెలా ఉన్నా జైలులో నేర్చుకున్న ఆరోగ్య అంశాలను పదిమందికీ తెలియజేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. జైలు జీవితం తెచ్చిన పరివర్తనను కూడా తెలియజెప్పాల్సిన అవసరం ఉందని అనిపించింది. ఇక్కడ నేర్చుకున్న యోగా గురించి చుట్టూ ఉన్నవారికి చెప్పాలని భావించాను. నెమ్మది నెమ్మదిగా ముందడుగు వేయగలిగాను. చాలామంది ప్రోత్సహించారు. ఏం చేసినా ప్రజల ఆరోగ్యం పెంచేదిగా ఉండాలని భావించి ఇప్పుడు పోషకాహారాన్ని కూడా విక్రయిస్తున్నాను. వ్యాపార దృక్పథంతో కాదు. ఆరోగ్య స్పృహ కలిగించాలనేదే నా ప్రయత్నం. – మసిముక్కల రామకృష్ణ, పులిమేరు -
మీలోని శక్తి ఎంత?!
నలుగురితో కలిసి ఉన్నప్పుడు మనలోని బలం పెరిగినట్టు అనిపిస్తుంది. అదే, ఒంటరిగా ఉన్నప్పుడు లేదా ఏదైనా సమస్యను ఎదుర్కొనే సమయంలో మానసికంగా మనంఎంతటి శక్తివంతులమో మనకే అర్ధమవుతుంది. ఈ సమయంలో భావోద్వేగాలలో మార్పులు తీవ్రంగా ఉంటే జీవన విధానంపై అవి చెడు ప్రభావం చూపుతాయి. ‘ఒంటరిగా ఉన్నా, నలుగురిలో కలివిడిగా ఉన్నా భావోద్వేగాలను అదుపులో పెట్టుకుంటూ మనల్ని మనం శక్తిమంతులుగాఎలా సిద్ధం చేసుకోవాలో తెలుసుకుంటేవచ్చే సమస్యల అలలను సులువుగా ఎదుర్కోవచ్చు’ అంటున్నారు మనస్తత్వ నిపుణులు. ‘సైకలాజికల్ ఫ్లెక్సిబిలిటీ అనేది సందర్భాన్ని బట్టి, వ్యక్తిని బట్టి మారుతూ ఉంటుంది. అయితే, ఇటీవల చాలా మందిలో గమనిస్తున్న విషయమేంటంటే చిన్న విషయానికి కూడా ఓవర్‌గా రియాక్ట్ అవుతుంటారు. నేను చెప్పిందే వినాలి’ అనే ధోరణి పెరగడం కూడా బంధాలను విచ్ఛిన్నం చేస్తుంది’ అంటున్నారు లైఫ్‌స్కిల్ ట్రెయినర్ జ్యోతిరాజ. ఎరుక అవసరం కొందరు తమచుట్టూ ఎవరికీ కనపడని ఒక వలయాన్ని సృష్టించుకుంటారు. పరిమితులను నిర్దేశించుకుని వాటిని దాటి బయటకు రారు. ఏదైనా చిన్న సమస్య ఎదురైనా సృష్టించుకున్న వలయం ఎక్కడ ఛిన్నాభిన్నం అవుతుందో అని తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతారు. ఫలితంగా భావోద్వేగాల అదుపు కోల్పోయి ఇతరులను నిందించడం, తమను తామే శిక్షించుకోవడం లేదా గాసిప్స్‌ని ఆశ్రయిస్తారు. ‘భావోద్వేగాల అదుపు కోల్పోతే ఏ బంధంలోనైనా బీటలు వస్తాయి. అందుకని వలయాలతో కాకుండా ఎరుకతో మెలిగితే మనలోని అంతర్గత శక్తి స్థాయిలు స్పష్టమవుతాయి’ అనేది నిపుణుల మాట. మౌనంగా ఉండటం మేలు అతిగా మాట్లాడటం, చేతల్లో మన పనిని చూపించకపోతే ఎదుటివారి ముందు మన శక్తి తగ్గిపోతుంది. ఫలితంగా భావోద్వేగాల్లోనూ మార్పు వస్తుంది. ఇది బంధుమిత్రుల మధ్య పెద్దగా గుర్తించకపోవచ్చు. కానీ, పని ప్రదేశాలలో ఈ ‘శక్తి’ని బాగా గుర్తించవచ్చు. ఇబ్బందిని కలిగించే సంభాషణల్లో పా ల్గొనడం కన్నా, తక్కువ మాట్లాడం వల్ల శక్తిని, భావోద్వేగాల సమతుల్యతను కాపా డుకోవచ్చు. ఆ శక్తిని ఇతర సృజనాత్మక పనులకు బదిలిచేయవచ్చు. అవగాహనతో సరైన శక్తి అంతర్గత దిక్సూచిని భావోద్వేగ మేధస్సు అని కూడా అంటారు. ఇది సున్నితం–తీవ్రం రెండింటినీ సమాన స్థాయిలో ఉంచుతుంది. అంటే, నలుగురిలో ఉన్నప్పుడు ఏ వ్యక్తి ఎలా దూకుడుగా ప్రవర్తించబోతున్నాడో ముందే పసిగట్టి, నివారించే శక్తి వీరికుంటుంది. సరైన సమయంలో ఎలా స్పందించాలో తెలిస్తే భావోద్వేగాలను అదుపులో పెట్టుకోగల అంతర్గత శక్తి పెరుగుతుంది. పట్టు విడుపులు తెలుసుండాలి... ఏ అంశం వదిలేయాలి, దేనిని మన ఆధీనంలో ఉంచుకోవాలనే దానిపై స్పష్టత ఉండాలి. అనవసరం అనిపించే సమస్య ఏదైనా వదిలేయడం కూడా తెలియాలి. పిల్లలైతే వారు చదువుల్లో ఆటపా టల్లో బిజీగా ఉంటారు. కాలేజీ స్థాయి యువతలో బిజీగా ఉంటారు. గృహిణుల్లో మాత్రం పిల్లలు పెద్దయ్యాక వారికి కొంత తీరిక సమయం ఉంటుంది. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా ముందునుంచే తమను తాము మలుచుకుంటూ ఉండాలి. తమలో ఉండే ఇష్టాయిష్టాలు, కలల కోసం ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు దాని ద్వారా కలిగే సంతృప్తి వల్ల భావోద్వేగాల అదుపు, అంతర్గత శక్తి స్ఙాయిలు పెరుగుతాయి. ఈ ప్రా క్టీస్ ఇంట్లో పిల్లల చేత కూడా చేయిస్తే, వారిలోనూ కొత్త సమర్థతలు బయటకు వస్తాయి. భావోద్వేగాల అదుపుకు అంతర్గతశక్తిని మేల్కొల్పడమే సరైన ఆయుధం. – ఆచార్య జ్యోతిరాజ, లైఫ్ స్కిల్ ట్రెయినర్ తట్టుకునే శక్తిని పెంచుకోవాలి.. సాధారణఃగా మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే కంగారు పడిపోతాం. భయం ఆవరించేస్తుంది. ఈ ఒత్తిడి మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. నేను సాఫ్ట్వేర్ ఉద్యోగినిని. బ్యాక్‌పెయిన్, నెక్ పెయిన్, స్ట్రెస్.. వంటివి సాధారణంగా ఉంటాయి. ఈ సమస్యలకు విరుగుడుగా ఆరోగ్యం, మానసిక స్థిరత్వానికి యోగ సాధన చేయడం ఒక భాగం చేసుకున్నాను. దీనితో పా టు ధ్యానం చేయడం వల్ల ప్రశాంతతను ఇస్తుంది. ఆందోళన లేకుండా సమస్యలను తట్టుకుని, ముందడుగు వేసే శక్తినిచ్చే ఆయుధాలుగా వీటిని మలుచుకున్నాను. – కవిత ఎన్, సాఫ్ట్వేర్ ఉద్యోగిని -
గుంజీలు శిక్ష కాదు.. సూపర్ బ్రెయిన్ యోగా! ఆసక్తికర విషయాలు
సాక్షి, హైదరాబాద్: గుంజీలు.. ఈ తరం పిల్లలకు పెద్దగా తెలియనప్పటికీ నిన్నటితరం వారికి మాత్రం ఈ పేరు చెప్పగానే బడిలో ఉపాధ్యాయులు విధించిన ‘శిక్ష’ గుర్తొస్తుంది. అయితే నాటి ‘దండన’ వెనకున్న శాస్త్రీయతను చాలా మంది అపార్థం చేసుకోవడంతో ఇదో పెద్ద పనిష్మెంట్‌గాగా ముద్రపడినా పాశ్చాత్య దేశాలు మాత్రం దీని అంతరార్థాన్ని, విద్యార్థులకు కలిగే ఉపయోగాలను గుర్తించాయి. దీన్ని ‘సూపర్ బ్రెయిన్ యోగా’గా పిలుస్తూ నిత్యం గుంజీలు తీయడాన్ని ప్రోత్సహిస్తున్నాయి. మరోవైపు ఇది విద్యార్థుల్లో జ్ఞాపకశక్తిని పెంచే విధానమంటూ ఆధునిక పరిశోధకులు సైతం రుజువు చేశారు. జ్ఞాపకశక్తి.. ఏకాగ్రత పెరుగుతాయి.. చదువుపై శ్రద్ధ, జ్ఞాపకశక్తి, సృజనాత్మకత, సమస్య పరిష్కారం, అభ్యసన మెరుగవ్వడం గుంజీల వల్లే సాధ్యమని నిరూపించారు. కరోనా తర్వాత విద్యార్థుల్లో పరీక్షలంటే భయం, ఏకాగ్రత కోల్పోవడం, బోధన సమయంలో ధ్యాస లేకపోవడం వంటివి వేధించే సమస్యలు. గుంజీల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం ఉందంటున్నారు పరిశోధకులు. గతంలోనే శాస్త్రీయంగా నిర్ధారణ... ఆలోచన శక్తికి కేంద్ర బిందువు మెదడే. చెవి కొనలు మెదడుకు రిమోట్ కంట్రోల్లా పనిచేస్తాయి. రెండు చెవి కొనలను పట్టుకొని లాగుతూ గుంజీలు తీయడం వల్ల నాడులు స్పందిస్తూ మెదడుకు సంకేతాలు వెళ్తాయి. గుంజీలు తీసేటప్పుడు తీసుకొనే శ్వాస, ఆక్యుప్రెషర్ క్రియల వల్ల మెదడు కుడి భాగాలు ఉత్తేజితం అవుతాయి. ఫలితంగా పిట్యూటరీ గ్రంథి శక్తివంతమవుతుంది. ఈ విషయాన్ని ప్రముఖ ఫ్రెంచ్ న్యూరాలజిస్ట్ డాక్టర్ పాల్ నోగియర్ గతంలోనే శాస్త్రీయంగా నిరూపించారు. గుంజీల వల్ల మెదడులోని ఆల్ఫా తరంగాలు క్రియాశీలత పెరిగి, భావోద్వేగ స్థిరత్వం, మానసిక స్పష్టత, మెరుగైన సృజనాత్మకతకు దోహదపడుతుందని, రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుందని తేల్చారు. పరిశోధనలేం చెప్పాయి? ► కాలిఫోరి్నయో రేడియాలజీ డాక్టర్ జోయ్ పి జోన్స్ పరిశోధన ప్రకారం... మెదడుకు చెందిన ఆక్యుప్రెషర్ బిందువులు చెవి భాగంలో కేంద్రీకృతమై ఉంటాయి. గుంజీలు తీయడం వల్ల మెదడులోని నాడీ మార్గాలు ఉత్తేజితమవుతాయి. దీనివల్ల మెదడు కుడి, ఎడమ భాగాలు సమన్వయంతో పనిచేస్తాయని ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్ (ఈఈజీ) ద్వారా నిరూపించారు. ► ఫిలిప్పీన్స్‌కు చెందిన ఆధునిక ప్రాణిక్ హీలింగ్ వ్యవస్థాపకుడు చౌ కాక్ సూయ్ గుంజిలపై పరిశోధన ద్వారా... జీవం ఉన్న బ్యాటరీగా పిలిచే మెదడు గుంజీల ద్వారా రీచార్జ్ అవుతుందని తేల్చాడు. ► మైసూరు యూనివర్సిటీ, మహారాజ కాలేజీకి చెందిన శాస్త్రవేత్త శ్రీకాంత్, లాన్సీ 2017లో 6–18 ఏళ్ల వయసున్న 1,945 మంది పాఠశాల విద్యార్థులపై మూడు నెలలు గుంజీలపై పరిశోధన చేశారు. దీనివల్ల 86% మంది విద్యార్థుల్లో పరీక్షల భయం పోయిందని, 75.9% మంది విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి పెరిగిందని, 70.5% మందిలో ఏకాగ్రత గణనీయంగా పెరిగిందని తేల్చారు. గుంజీలకు గుర్తింపు కోసం తెలంగాణ బిడ్డ పోరుబాట నిజామాబాద్‌కు చెందిన అందె జీవన్‌రావు గుంజీలపై విస్తృత పరిశోధన చేశారు. తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా ఉన్నప్పట్నుంచీ ‘సూపర్ బ్రెయిన్ యోగా’(గుంజీలు తీయడం)పై అనేక ప్రయోగాలు చేశారు. పదవీవిరమణ పొందినా బ్రెయిన్ ట్రైనర్‌గా దేశవ్యాప్తంగా గుంజీలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే 150 విద్యా సంస్థల్లో విద్యార్థులకు గుంజీలు తీయడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. కేంద్రంలోని ఎన్సీఈఆర్టీ, రాష్ట్రంలోని ఎస్సీఈఆర్టీకి దీనిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. విద్యార్థి దశ నుంచి దీన్ని అమలులోకి తేవాలని ఆయన ఉద్యమిస్తున్నారు. ఈ నెల 27 నుంచి మార్చి 2 వరకూ అస్సాంలోని బోడోలాండ్ విశ్వవిద్యాలయంలో నిర్వహించే ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో సూపర్ బ్రెయిన్ యోగాపై పరిశోధన పత్రాన్ని సమరి్పంచేందుకు సిద్ధమయ్యారు. శిక్షగా కాకుండా, విద్యార్థి వికాసానికి తోడ్పడే గుంజీల శాస్త్రీయతను ప్రభుత్వాలు గుర్తించాలని, అప్పటివరకూ అవిశ్రాంతంగా పోరాడతానని ఆయన ‘సాక్షి’ప్రతినిధికి చెప్పారు. చదవండి: బుర్ర బద్దలయ్యేలా పని చేస్తున్నారా? అంతొద్దు.. లాభమేమీ లేదు! -
Mann ki Baat: 'మన కృషి వల్లే యోగాకు అంతర్జాతీయ గుర్తింపు'
న్యూఢిల్లీ: ఈ ఏడాది తొలి మన్‌కీ బాత్ రేడియో కార్యక్రమంలో ప్రసంగించారు ప్రధాని నరేంద్ర మోదీ. వివిధ అంశాల గురించి మాట్లాడారు. సంగీతం ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైందని పేర్కొన్నారు. అనేక మంది కళాకారులకు పద్మ అవార్డులు ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. కళల అభ్యున్నతికి పాల్పడుతున్న వారిని గుర్తించినట్లు వివరించారు. మన కృషి వల్లే యోగాకు అంతర్జాతీయ గుర్తింపు దక్కినట్లు మోదీ తెలిపారు. యోగా, చిరుధాన్యాల దినోత్సవాలు జరుపుకుంటున్నామన్నారు. చిరుధాన్యాల గొప్పతనాన్ని ప్రభుత్వం గుర్తిస్తోందని చెప్పారు. చదవండి: భారత్ జోడో యాత్ర పునఃప్రారంభం -
మహిళల దుస్తులపై అనుచిత వ్యాఖ్యలు.. రామ్‌దేవ్ బాబా క్షమాపణలు
మహిళలు దుస్తులు ధరించకపోయినా అందంగా ఉంటారని యోగా గురు రామ్‌దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు కూడా పంపింది. దీంతో రామ్‌దేవ్ బాబా తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. ఈమేరకు లేఖ విడుదల చేశారు. మహారాష్ట్ర థానెలో శుక్రవారం నిర్వహించిన యోగా సైన్స్ క్యాంప్ కార్యక్రమంలో మాట్లాడుతూ నోరు జారారు రామ్‌దేవ్ బాబా. మహిళలు చీరకట్టులోనైనా, సల్వార్ సూట్లోనైనా అందంగా కన్పిస్తారని, తన దృష్టిలో వాళ్లు దుస్తులు లేకపోయినా బాగుంటారని అనుచిత వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు. దీనిపై మహిళా నేతలు సహా పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర మహిళా కమిషన్ కూడా నోటీసులు జారీ చేసింది. వివాదం మరింత ముదురుతుందని భావించి రామ్‌దేవ్ బాబా క్షమాపణలు చెప్పారు. రామ్‌దేవ్ బాబా మహిళల దుస్తుల గురించి మాట్లాడినప్పుడు ఆయన పక్కనే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ సతీమణి అమృత, సీఎం ఎక్నాథ్ షిండే కుమారుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే కూడా ఉన్నారు. దీంతో ఇది రాజకీయంగానూ వివాదాస్పదమైంది. రామ్‌దేవ్ అసలు మనస్తత్వం ఏంటో భయటపడిందని కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ఆయన మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనంటూ మండిపడింది. దుస్తుల ప్రస్తావన ఎందుకు? యోగా క్యాంప్‌లో పాల్గొనేందుకు వచ్చిన మహిళలు సల్వార్ సూట్లు ధరించారు. యోగా అనంతరం వెంటనే సమావేశం నిర్వహించడంతో వారు చీర కట్టుకునేందుకు సమయం కూడా లేకపోయింది. దీంతో వారంతా సల్వార్ సూట్‌లోనే మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే దీనిపై మాట్లాడుతూ రామ్‌దేవ్ నోరుజారారు. "Women look good even without clothes."#Ramdev's sexist comment sitting besides #AmruthaFadanavis. pic.twitter.com/FwPMH8yY1w — Sanghamitra Bandyopadhyay (@AITCSanghamitra) November 26, 2022 చదవండి: భారత్‌లో ఈ పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలంటే అనుమతి తప్పనిసరి.. -
మహిళలపై రామ్‌దేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యలు..
ముంబై: యోగా గురు రామ్‌దేవ్ బాబా మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర థానెలో శుక్రవారం జరిగిన యోగా సైన్స్ క్యాంప్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. 'మహిళలు చీరకట్టులో అందంగా కన్పిస్తారు. సల్వార్ సూట్స్‌లోనూ బాగుంటారు. ఇంకా చెప్పాలంటే నా దష్టిలో వాళ్లు అసలు దుస్తులు ధరించకపోయినా అందంగానే ఉంటారు.' అని రాందేవ్ బాబా నోరుపారేసుకున్నారు. రామ్‌దేవ్ బాబా పాల్గొన్న ఈ కర్యక్రమానికి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ సతీమణి అమృత ఫడణవీస్, సీఎం ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే కూడా హాజరయ్యారు. వాళ్ల సమక్షంలో రామ్‌దేవ్ బాబా మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఇది రాజకీయంగానూ దుమారం రెపే సూచనలు కన్పిస్తున్నాయి. రామ్‌దేవ్ బాబా వ్యాఖ్యలను మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సచిన్ సావంత్ తీవ్రంగా ఖండించారు. రామ్‌దేవ్ బాబా అసలు మనస్తత్వం ఏంటో బయటపడిందని విమర్శలు గుప్పించారు. మహిళలకు ఆయన ఇచ్చే గౌరవం ఏంటో తెలుస్తోందన్నారు. చదవండి: కొలీజియం పరాయి వ్యవస్థ -
‘ఆరోగ్యవంతమైన సమాజం కోసం యోగా అవసరం’
సాక్షి, హైదరాబాద్: పాఠశాల, కళాశాలలో యోగా నేర్చుకొనేందుకు ప్రత్యేక సమయాన్ని కేటాయించాలని హైకోర్టు జడ్జీ వేణుగోపాల్ కోరారు. ఈ సందర్భంగా ఆరోగ్యవంతమైన సమాజంతోనే దేశం నిర్మాణం ఏర్పడుతుందని స్పష్టం చేశారు. 2050 భారతదేశం గ్లోబల్ లీడర్ గా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్‌తో కలిసి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో మాదాపూర్‌లో నిర్వహించిన యోగాథాన్ కార్యక్రమంలో వేణుగోపాల్ పాల్గొన్నారు. ఆరోగ్యవంతమైన జీవనశైలిని అందించే ప్రయత్నంలో భాగంగా నిర్వహించిన యోగాథాన్ కార్యక్రమంలో ప్రభుత్వ, కార్పొరేట్ సంస్థల ఉద్యోగులు, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగథాన్‌లో 108 సూర్య నమస్కారాల ఛాలెంజ్ నిర్వహించారు. శారీరక మానసిక ఆరోగ్యం కోసం నిరంతరం యోగా చేయటాన్ని అలవాటుగా మార్చే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రత్యేకమైన పోటీ నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. వేలాదిమంది ఔత్సాహికులు ఈ పోటీలో పాల్గొన్నారు. నగరంలోని ప్రముఖ కళాశాలల విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు గోల్డ్ ఛాలెంజ్ విభాగంలో 108 సార్లు, సిల్వర్ ఛాలెంజ్ విభాగంలో 54 సార్లు సూర్య నమస్కారాలు చేశారు. -
Delhi air pollution: స్కూళ్లలో ఔట్‌డోర్ బంద్
న్యూఢిల్లీ: ఢిల్లీలో గాలి కాలుష్యం పెరగడంతో విద్యార్థుల ఆరోగ్య సంరక్షణపై పాఠశాలల యాజమాన్యాలు దృష్టిసారించాయి. ‘పాఠశాలల ప్రాంగణాల్లో చిన్నారుల ఆటపాటలు, ఇతరత్రా కార్యక్రమాలు ఉండబోవు. గదుల్లో శ్వాస సంబంధ, యోగా తరగతులు నిర్వహిస్తాం. విద్యాసంవత్సం దెబ్బతినకుండా ఉండేందుకు బోధనను కొనసాగిస్తాం. స్కూళ్ల మూసివేత ఉండదు’ అంటూ కొన్ని పాఠశాలలు నిర్ణయం తీసుకున్నాయి. స్కూళ్లో ఎయిర్ ప్యూరిఫయర్లు, వైద్య సదుపాయాలు కల్పిస్తున్నాయి. గాలి కాలుష్యం రోజురోజుకూ పెరుగుతుండటంతో విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ఢిల్లీలో స్కూళ్లు మూసేయాలన్న చిన్నారుల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్(ఎన్సీపీసీఆర్) సూచనపై విద్యార్థుల తల్లిదండ్రులు స్పందించారు. ‘పాఠశాల టైమింగ్స్ పెంచడంతో పెద్దగా ఉపయోగం లేదు. స్కూళ్లు మూసేయాలి. వాయు కాలుష్యంతో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు’ అని ఢిల్లీ స్కూల్ విద్యార్థుల సంఘం అధ్యక్షులు అపరాజితా గౌతమ్ డిమాండ్‌చేశారు. అయితే, ‘ స్కూళ్లు కొనసాగాల్సిందే. లాక్డౌన్లతో ఇప్పటికే చదువులు దెబ్బతిన్నాయి. పదో తరగతి పరీక్షలు దగ్గరపడుతున్నాయి. ఇంకొంత సేపు స్కూల్ టైమింగ్స్ పెంచాలి’ అని కొందరు తల్లిదండ్రులు వాదిస్తున్నారు. కాగా, ఈనెల 8వ తేదీ వరకు 8వ తరగతిదాకా పిల్లలకు ఆన్లైన్లోనే క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
శివానంద ‘యోగ’
-
నూనె, ఉప్పు లేదు.. పాలు, పండ్లు లేవు
8 ఏళ్ల వయస్సు నుంచే యోగాభ్యాసం.. వైవిధ్య భరితమైన భారతీయ సాంస్కృతిక జీవితానికి సమున్నతమైన ప్రతిరూపం. ప్రపంచంలోనే పెద్ద వయస్కులుగా భావించే నూటా ఇరవై ఆరు సంవత్సరాల పద్మశ్రీ స్వామి శివానంద .. రుషులు, మహర్షులకు మాత్రమే సాధ్యమైన పరిపూర్ణతను తన నిరాడంబర జీవన విధానం ద్వారా సుసాధ్యం చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ బాల్య స్నేహితుడైన స్వామి శివానంద.. 118 ఏళ్లుగా యోగా, ప్రాణాయామం చేస్తూ, ఆహార నియమాలు పాటిస్తూ.. ఇప్పటికీ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉన్న ఆయన జీవన విధానం యావత్ ప్రపంచానికే స్ఫూర్తిదాయకం. మూడు శతాబ్దాలను చూసిన ఈ యోగా గురు ఆదివారం నగరంలోని హైటెక్స్ వేదికగా నిర్వహించిన యోగానమామి అనే యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి శివానంద సాక్షితో ప్రత్యేకంగా తన జీవితానుభవాలను పంచుకున్నారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. – సాక్షి, హైదరాబాద్ డబ్బు లేని జీవితం, దానాలు, కోరికలు లేవు, నూనె, ఉప్పు, పాలు, పండ్లు ఇవేమీ నా జీవితంలో లేవు. రాత్రి 9 గంటలకే పడుకోవడం, ఉదయాన్నే 3 గంటలకు నిద్ర లేవడం, 118 సంవత్సరాలుగా యోగా.. ఇదే నా దీర్ఘాయువు రహస్యం. ఒకప్పటి బెంగాల్ ప్రెసిడెన్సీ, ఇప్పటి బంగ్లాదేశ్‌లో 1896 ఆగస్టు 8న జన్మించాను. నేను పుట్టిన ఆరు సంవత్సరాలకే భిక్షాటన చేసుకుంటూ జీవనం కొనసాగించే నా తల్లిదండ్రులు, సోదరి మరణించారు. తదనంతరం నా గురువు ఓంకారానంద గోసామి దగ్గరే నా జీవితం కొనసాగింది. అలా ఎనిమిదేళ్ల వయస్సు నుంచే యోగా చేయడం ప్రారంభించాను. పురాతన, సాధారణ జీవన విధానాన్ని పాటించే నేను రెండు పూటల ఆహారం మాత్రమే తింటాను. అల్పాహారం చాలా అరుదుగా తింటాను, అందులోనూ ఉడికించిన బంగాళదుంపలు తింటాను. మధ్యాహ్నం రెండు చపాతీలు, ఉడకబెట్టిన బంగాళదుంపలు–కూరగాయలు, రాత్రి 8 గంటల సమయంలో బార్లీ, గంజి ఆహారంగా తీసుకుంటాను. ఏది తిన్నా తక్కువ పరిమాణంలో తింటాను. రుచికరమైన ఆహారం, ఫాస్ట్ ఫుడ్‌కి దూరంగా ఉంటాను. జీవించడానికి తింటాను.. చాలామంది తినడానికి జీవిస్తారు కానీ నేను జీవించడానికి తింటాను. దినచర్యలో భాగంగా తెల్లవారుజామున 3 గంటలకు లేచి అభ్యంగన స్నానం చేసి గంటసేపు అలా నడుస్తాను. అనంతరం యోగా, పూజలు, ప్రార్థనల్లో నిమగ్నమవుతాను. పగలు రెండు గంటలు విశ్రాంతి తీసుకుంటాను. బ్రహ్మచర్య జీవితాన్ని గడుపుతున్న నాకు కుటుంబ సభ్యులు ఎవరూ లేరు, బ్రహ్మచారిగా వారణాసిలో నివసిస్తున్నాను. అతి తక్కువగా మాట్లాడతాను. అనవసర సంభాషణలు, మానసిక ఆరోగ్యానికి మంచివి కాదని నా అభిప్రాయం. ఇప్పటికీ ఎలాంటి వ్యాధులు నా దరి చేరలేదు. మందులు వాడాల్సిన అవసరం రాలేదు. ఈ వయస్సులో కూడా కర్రలేకుండా నడుస్తాను, పశ్చిమోత్తనాసనం, సర్వంగాసనం, పవన ముక్తాసనాలను ప్రదర్శిస్తాను. అత్యంత ఎక్కువ వయసున్న వ్యక్తిగా వరల్డ్‌వైడ్ బుక్ రికార్డ్‌లో స్థానం పొందాను. నేతాజీ నా బాల్య స్నేహితుడే.. ఎక్కువ సంవత్సరాలు జీవించాలంటే సర్వాంగాసనం, మత్సా్యసనం వేయాలి. ఇవి జీవితాన్ని పునరుజ్జీవింపజేస్తాయి. గత 35 ఏళ్లుగా ఆరు ఖండాల్లో ప్రయాణించాను. ఒకానొక సమయంలో మిడిల్ ఈస్ట్‌లోని ఇమ్మిగ్రేషన్ అధికారులు పాస్‌పోర్ట్‌లో నా పుట్టిన తేదీని చూసి ఆశ్చర్యపోయారు. సుభాష్ చంద్రబోస్ నా బాల్య స్నేహితుడే. ఆయన, నేను దాదాపు ఒకే సంవత్సర కాలంలో జన్మించాం. యోగాకు ఆదరణ పెరిగింది వందేళ్ల ప్రయాణంలో యోగా విధానంలో పలు మార్పులను గమనించాను. అప్పుడైనా ఇప్పుడైనా యోగా అనేది ఒక్కటే. గత కొన్ని సంవత్సరాలుగా యోగాకు ఆదరణ పెరిగింది. యోగా విధానాల్లో సందిగ్ధాలు ఉన్నప్పటికీ యోగాభ్యాసం, శ్వాస, ధ్యానం దాని ముఖ్యాంశాలు. యోగా గురు రామ్‌దేవ్ బాబా ఆచరిస్తున్న జీవన విధానం కూడా నాకు ఇష్టం. తను ఎంతో కృషి చేస్తున్నారు. నా దృష్టిలో మనిషే దైవం నా చిన్నతనంలో ఆకలి కడుపును నింపుకోడానికి భిక్షాటన చేసేవాళ్లం. అందులోని బాధ, అవస్థలు నాకు తెలుసు. ఈ దేశంలో ఇప్పటికీ కొందరు పేదలు పాలు, పండ్లు లేని జీవితాన్ని గడుపుతున్నారు. అందుకే నేను కూడా పాలు, పండ్లు తినడం మానేశాను. నా దృష్టిలో మనిషే దైవం. మనుషులకు సేవ చేస్తే దైవానికి చేసినట్టే. అలాంటి మనుషులైన కుష్టు వ్యాధిగ్రస్తులను సమాజం వెలేసింది. వారికి సాంత్వన అందించాలనే ఉద్దేశంతో గత 50 ఏళ్లుగా వారికి సేవలు అందిస్తున్నా. పూరీలోని 600 వందల మంది కుష్టు రోగులకు అన్ని అవసరాలు తీరుస్తూ అండగా ఉంటున్నా. నాకు సంబంధించి ఎలాంటి పుస్తకాలు, మరే ఇతర మాధ్యమాలు లేవు. నా జీవితమే ఒక సందేశం. ఆత్మీయతకు మారుపేరు హైదరాబాద్ హైదరాబాద్ రావడం ఇదే మొదటిసారి. కానీ ఈ నగరానికి చెందిన ఎందరో వ్యక్తులు నన్ను వారణాసిలో కలిశారు. హైదరాబాదీలు ఎంతో ఆత్మీయతను కలిగి ఉంటారు. నగరవాసులు మరింత యోగా సాధన చేయాలి, అందరికీ ఆదర్శంగా నిలవాలని ఆశిస్తున్నాను. -
ఎమ్మెల్యే కళ్లెదుటే.. బురద నీటిలో కేరళ వ్యక్తి స్నానం, యోగా..
నిత్యం వందలు, వేల సంఖ్యలో వాహనాలు వెళ్లే రహదారులు దాదాపు రాత్రింబవళ్లు రద్దీగా ఉంటాయి. అలాంటి రోడ్లపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదాలకు నిలయాలుగా మారుతుంటాయి. ఇక వర్షాకాలంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వర్షం పడుతున్నంత సేపు వరద నీటితో రోడ్లు నిండిపోతే.. వాన వెలిసిన తర్వాత ఎక్కడ చూసినా సగం కొట్టుకుపోయిన రోడ్లు, గుంతలు, గతుకులే దర్శనమిస్తాయి.. ఇలాంటి రహదారులపై ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అయితే రోడ్ల మరమ్మత్తులు చేపట్టడం లేదని తాజాగా కేరళలో ఓ వ్యక్తి వినూత్నంగా నిరసన తెలిపాడు. ఇటీవల కురిసిన వర్షానికి మలప్పురం ప్రాంతంలోని రోడ్లపై గుంతలు ఏర్పడి నీళ్లు నిలిచిపోయాయి. అయితే దీనిని అధికారులు పట్టించుకోకపోవడంతో.. ఓ వ్యక్తి స్వయంగా రంగంలోకి దిగాడు. స్థానిక ఎమ్మెల్యే యూఏ లతీఫ్ ముందు ఎమ్మెల్యే ఎదురుగానే గుంతల్లోని నీటిలో స్నానం చేశాడు. ఎమ్మెల్యే కారు సంఘటనా స్థలానికి చేరుకోగానే గుంతలో ధ్యానం చేయడం ప్రారంభించాడు. బురద నీటిలో యోగా చేశాడు. చెప్పులు శుభ్రం చేసుకొని, బట్టలు కూడా ఉతుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలోని వ్యక్తిని హంజా పోరాలిగా గుర్తించారు. #WATCH | Kerala: A man in Malappuram protested against potholes on roads in a unique way by bathing & performing yoga in a water-logged pothole in front of MLA on the way pic.twitter.com/XSOCPrwD5f— ANI (@ANI) August 9, 2022 కాగా రాష్ట్రంలో రోడ్ల దుస్థితికి వ్యతిరేకంగా కేరళలో గత వారం అనేక నిరసనలు చోటుచేసుకున్నాయి. అయితే ఈ ఆందోళనలు ఏ రాజకీయ నాయకుడి దృష్టిని ఆకర్షించలేకపోయాయి. ఇదిలా ఉండగా అయిదు రోజుల క్రితం ఎర్నాకుళం జిల్లాలోని నెడుంబస్సేరి వద్ద జాతీయ రహదారిపై గుంతల కారణంగా 52 ఏళ్ల వ్యక్తి రోడ్డుపై పడిపోయాడు. అతనిపై ట్రక్కు వెళ్లడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ క్రమంలో వారం రోజుల్లోగా తమ ఆధీనంలోని ప్రతి రోడ్డును బాగు చేసేందుకు చర్యలు తీసుకోవాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాను కేరళ హైకోర్టు ఆదేశించింది. -
Subhash Patriji: ధ్యాన గురువు సుభాష్ పత్రీజీ ఇకలేరు
సాక్షి, రంగారెడ్డి జిల్లా/కడ్తాల్: ధ్యాన మంటే శ్వాసమీద ధ్యాస అని 40 ఏళ్ల పాటు అలుపెరగని ప్రచారం చేసి, కోట్లాది మందిని ఆధ్యాత్మికతవైపు మళ్లించిన ప్రముఖ ధ్యాన గురువు సుభాష్ పత్రిజీ (74) ఆదివారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ సమీపంలోని మహేశ్వర మహాపిరమిడ్ ధ్యాన కేంద్రంలో తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయానికి సోమవారం సాయంత్రం 5 గంటలకు అదే ప్రాంగణంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు పిరమిడ్ ధ్యాన్ ట్రస్ట్ సభ్యులు ప్రకటించారు. పత్రీజీకి భార్య స్వర్ణమాల, కుమార్తెలు పరిణత, పరిమళ ఉన్నారు. కోట్లాది మందిని ధ్యానం వైపు.. సుభాష్ పత్రీజీ 1947లో బోధన్‌లోని శక్కర్‌నగర్‌లో పీవీ రమణారావు, సావిత్రీదేవిలకు జన్మించారు. తొలుత 1975లో ఓ బహుళజాతి ఎరువుల కంపెనీలో ఉద్యోగంలో చేరారు. ఆధ్యాత్మిక సాధనలో భాగంగా 1980లో జ్ఞానోదయం పొందారు. ఆయన పొందిన జ్ఞానాన్ని, ధ్యానాన్ని ఇతరులకు పంచాలని భావించారు. ఈ మేరకు 1990లో కర్నూల్ స్పిరిచ్యువల్ సొసైటీ (పిరమిడ్ కేంద్రాన్ని) స్థాపించారు. అనేక మందిని ధ్యానులుగా, జ్ఞానులుగా మార్చారు. ధ్యానంతో పాటు జ్ఞానాన్ని ప్రజలకు పంచాలని భావించిన ఆయన రంగారెడ్డి జిల్లా కడ్తాల్ సమీపంలో 2008లో మహేశ్వర మహాపిరమిడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2009 ఆగస్టు 15న పనులు ప్రారంభించారు. 2012 నుంచి ధ్యానమహా చక్రాలు ప్రారంభించారు. ఏటా లక్షలాది మందితో నిర్వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 50 వేలకుపైగా పిరమిడ్లను నిర్మించారు. దేహాన్ని విడిచి వెళ్తున్నట్లు ప్రకటన.. కొంతకాలంగా ఆయన మూత్ర పిండాల సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. 15 రోజుల క్రితం బెంగళూర్ నుంచి మహాపిరమిడ్ కేంద్రానికి చేరుకున్నారు. రెండు రోజుల క్రితం ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. ‘తాను ఆధ్యాత్మిక సేవ చేసేందుకే ఇక్కడికి వచ్చానని.. తాను లేకపోయినా తాను అందించిన ఈ ఆధ్యాత్మిక ప్రచారం నిర్విరామంగా కొనసాగుతుందని.. ఈ దేహాన్ని విడిచి వెళ్లే సమయం ఆసన్నమైంది’అని ప్రకటించారు. ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. సంతాప సూచికగా సంబురాలు పత్రీజీ నిష్క్రమణ ఆయన శిష్యులను ఆందోళనకు గురి చేసినా.. మరణాన్ని సైతం సంబురం చేసుకోవాలని ఆయన చేసిన సూచన ప్రకారం 3 రోజుల పాటు సంబురాలు నిర్వహించనున్నట్లు ధ్యానగురువులు ప్రకటించారు. -
యోగా C/o కరీంనగర్.. ఎదురులేని జిల్లాగా రికార్డ్
సాక్షి, కరీంనగర్: యావత్ ప్రపంచం మొత్తం ప్రస్తుతం యోగా జపం చేస్తోంది. అందరికీ యోగా అవసరం అనే కాన్సెప్ట్ మీద పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక కరీంనగర్ జిల్లా క్రీడాకారులు 16 ఏళ్లుగా రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో ఆదిపత్యం చెలాయిస్తున్నారు. 2005 నుంచి 2021 వరకు 14 సార్లు చాంపియన్‌గా నిలిచారు. తెలంగాణ ఆవిర్భావం నుంచి 7 సార్లు రాష్ట్ర పోటీలు జరుగగా వరుసగా 6 (2020లో కోవిడ్ కారణంగా పోటీలు జరుగలేదు) సార్లు విజేతగా నిలిచారు. 1993లో శ్రీకారం.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1993లో యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో పోటీలకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి వివిధ కేటగిరీల్లో బాలబాలికలకు యోగా శిక్షణ, పోటీలు నిర్వహించి అంచెలంచలుగా ప్రపంచ స్థాయిలో నలిచింది కరీంనగర్ జిల్లా. 2016లో అర్జెంటీనాలో జరిగిన అంతర్జాతీయ యోగా పోటీల్లో జిల్లా నుంచి సిధారెడ్డి, యమున, ప్రణీత పాల్గొని బంగారు, రజత, కాంస్య పతకాలు సాధించారు. తర్వాత మలేషియా, బ్యాంకాక్‌లో జరిగిన పోటీల్లో మనోజ్, దేవయ్య పాల్గొని పతకాలు సాధించగా ఇటీవల త్రివేండ్రంలో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో ఉదయ్ కిరణ్ సత్తాచాటాడు. వీరితో పాటుగా జాతీయ యోగా పోటీల్లో ఆనంద్ కిషోర్, మహేందర్, మల్లేశ్వరి, సాయిప్రవీణ్, సజన, రాజుతో పాటు సుమారు 100 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. యోగ శిక్షకులు సంపత్‌కుమార్, కిష్టయ్య, ప్రదీప్, సత్యనారాయణ, సుష్మా, సజన్, రామకృష్ణ, మల్లేశ్వరి తదితరులు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణ ఇస్తూ జిల్లాలో ఉన్నతమైన క్రీడాకారులను తయారు చేస్తుండడం విశేషం. యోగా సంఘం ఆధ్వర్యంలో జిల్లా యోగా సంఘం ఆధ్వర్యంలో ఏటా అట్టహాసంగా జిల్లా స్థాయి యోగా పోటీలు నిర్వహిస్తున్నారు. అలాగే సంఘం ఆధ్వర్యంలో తొలిసారి 2005లో, తర్వాత 2018, 2019, 2021 సంవత్సరాల్లో కూడా రాష్ట్ర పోటీలు నిర్వహించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన రాష్ట్ర పోటీల్లో 6 సార్లు చాంపియన్‌గా నిలిచారు. యోగా చరిత్రలో ఇప్పటికీ జిల్లా క్రీడాకారులదే పైచేయి కావడం విశేషం. 2014లో మహబూబ్‌నగర్, 2015లో నిజామాబాద్, 2016లో ఆదిలాబాద్, 2017లో కరీంనగర్, 2018 పెద్దపల్లి, 2019లో సరూర్‌నగర్, 2021లో కరీంనగర్లో జరిగిన రాష్ట్ర పోటీల్లో కరీంనగర్ జిల్లా చాంపియన్‌గా నిలిచి చరిత్ర సష్టించింది. -
వ్యాధి నిరోధక సంజీవని... యోగా!
యోగా అంటే కలయిక. మన శరీరాన్ని మనస్సుతో సంయోగం చేసే ఒక ఆధ్యాత్మిక ఆరోగ్య ప్రక్రియ. దీనిని నిరంతర సాధన చేస్తే మన గమ్యమైన ముక్తి లేక మోక్షం ప్రాప్తిస్తుంది. అనగా మనస్సును ఐహిక బంధం నుండి వేరుచేయడం అన్న మాట. దైవాంశమైన ఆత్మను క్రమబద్ధంగా నియంత్రించడం వల్ల బంధ విముక్తి పొంది సమున్నత స్థితికి చేరటమే యోగా అని అరబిందో నిర్వ చించారు. యోగాలో చాలా రకాలున్నాయి. జ్ఞానయోగం, భక్తి యోగం, పతంజలి యోగం, కుండలినీ యోగం, హఠ యోగం, మంత్ర యోగం, లయ యోగం, రాజ యోగం, జైన యోగం, బౌద్ధ యోగం వంటివి వాటిలో కొన్ని. అయితే ప్రతి యోగా పద్ధతికి సంబంధించి... నియమావళి, సూత్రాలు, ఆచరణ వేరు వేరుగా ఉంటాయి. వీటిలో ముఖ్యమైనది మన శరీర ఆరోగ్యానికి సంబంధించినదైన పతంజలి యోగా. రోజూ క్రమం తప్పకుండా యోగా చేస్తే రక్తనాళాల్లో అవరోధాలు తొలగిపోయి ప్రతి అవ యవం కండిషన్లో ఉంటుంది. దీనికి తోడు యుక్తా హారం తీసుకొని జీవనశైలిలో మార్పు తెచ్చుకొంటే ఆరోగ్య సమస్యలను రూపుమాపవచ్చు. మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. మనం రోజూ యోగా చేస్తే మన పంచేంద్రియాలు, శరీరం లోని జీర్ణ వ్యవస్థ, రక్త సరఫరా వ్యవస్థ, విసర్జిక వ్యవస్థ, శ్వాసకోశ వ్యవస్థ, పునరుత్పత్తి వ్యవస్థ, నాడీ వ్యవస్థ, వినాళ గ్రంథి వ్యవస్థ వంటి అన్ని వ్యవస్థలూ స్పందించి ఆయా అవయవాలు సక్రమ స్థితిలో ఉంటాయి. యోగా చేసేవారు గురువు సూచనలు పాటించాలి. ఆపరేషన్ చేయించుకున్నవారూ, గర్భిణులూ డాక్టర్ సూచనలు పాటించాలి. వ్యాధి ఒక్కరోజులో సంక్రమించదు. వ్యాధి పెరుగుదల ఐదు దశల్లో ఉంటుంది. మొదటి దశలో ఏ లక్షణాలూ పైకి కనపడవు కానీ శరీరంలో వ్యాధి పెరుగుతుంది. ద్వితీయ దశలో పైకి స్వల్ప లక్షణాలు కనపడతాయి. మూడవ దశలో వ్యాధి లక్షణాలు బాగా కనపడి బాధను కల్గిస్తాయి. ఈ దశలో త్వరగా వ్యాధి నిర్ధారణ చేసి వైద్యం అందివ్వాలి. లేకపోతే నాలుగవ దశలోకి ప్రవేశిస్తాడు. ఈ దశలో అవసరమైన శస్త్ర చికిత్స చేసి అంగవైకల్యానికి పరిమితం చేస్తారు. ఐదో దశ పునరావాసం లేక మరణం. వీటిలో మొదటి రెండు దశల్లోనూ యోగా వల్ల ఉత్పత్తి అయిన రోగ నిరోధక శక్తితో వ్యాధిని విజయ వంతంగా నిరోధించవచ్చు. నేడు ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో కార్డియాలజీ, న్యూరాలజీ, డయబెటాలజీ వంటి క్లినిక్‌లలో అనేక వందల మంది రోగులను ప్రతిరోజూ చూస్తున్నాం. రోగుల సంఖ్య అధికమవ్వటం వల్ల డాక్టర్లు వైద్య ప్రమా ణాలు పాటించని లేని స్థితికి చేరి వైద్యం చేస్తున్నారు. ఈ రోగుల సంఖ్యను గణనీయంగా యోగా వల్ల తగ్గించవచ్చు. అంతేకాదు యోగా చేసిన వెంటనే సదరు వ్యక్తి శరీరంలో ఎండార్ఫిన్ అనే సంతోషాన్ని కలిగించే హార్మోన్ విడుదల అవుతుంది. రాత్రి చక్కగా నిద్ర పడుతుంది. అంతేకాదు యోగా వల్ల స్థూల శరీరం తగ్గి చక్కటి ఆకృతి ఏర్పడుతుంది. మన శరీరంలోని కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. యోగా వల్ల రక్తనాళాలు, నాడులకు ఉన్న సాగే గుణం సురక్షిత మవుతుంది. యోగా వల్ల వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. క్రమం తప్పకుండా యోగా చేస్తే మనస్సు సమస్థితిలోకి వచ్చి అసహ్యం, అసూయ, కోపం వంటి మానసిక ఉద్రేకాలు తగ్గుతాయి. యోగా రక్తపోటు, మధుమేహ మందుల డోసును గణనీయంగా తగ్గిస్తుంది. కాబట్టి ప్రతి వ్యక్తీ రోజూ ఒక గంట యోగా చెయ్యాలి. - వి.వి. రత్నాకరుడు రిటైర్డ్ నాన్ మెడికల్ ఫేకల్టీ ఆఫీసర్ (జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం) -
క్లిక్ ట్రెండ్: యోగా ఫొటో
జ్ఞాపకాల పదిలానికి ఫొటోని మించిన సాధనం లేదన్నది మనకు తెలిసిందే. ప్రీ వెడ్డింగ్, మెటర్నిటీ, న్యూ బోర్న్.. అంటూ ఫొటోగ్రఫీలో రకరకాల ట్రెండ్స్‌ను మనం చూస్తూనే ఉన్నాం. వీటితోపాటు యోగా, ఫిట్నెస్ పోజెస్ ఫొటోగ్రఫీ ఇప్పుడొక ట్రెండ్ అయ్యింది. దీనికి సామాజిక మాధ్యమం కూడా ఓ కారణం. ఈ వేడుకకు ఆ ఫొటో తీసుకొని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం చాలా సహజంగా జరుగుతుంటుంది. అందుకు అందమైన, అద్భుతం అనిపించే ఫొటోలు కావాలని కోరుకోని వారుండరు. యోగా సాధనలో తాము సాధించిన విజయాలను నలుగురితో పంచుకోవడానికి ఇప్పుడు యోగా ఫొటోగ్రఫీ కళ తప్పనిసరి అవసరంగా మారిందంటున్నారు నిపుణులు. యోగా క్లాసులు ఇవ్వడానికి, యోగాలో తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించడానికి ఫొటోలే ఆధారం. అలాగే, కొత్తగా ఫొటోగ్రఫీ నేర్చుకోవడానికి యోగా ఫొటోలు తీయడం అత్యంత సమర్థవంతమైన మార్గాలలో ఒకటి. ఫిట్నెస్ మీద ఆసక్తి కనబరుస్తున్నవారు తమ శరీరాకృతిని యోగా భంగిమల్లో చూపడానికి ఈ ఫొటోగ్రఫీ ఒక అద్భుతమైన వాహికగా పనిచేస్తుంది. గతంలో యోగా, వ్యాయామం వంటివి చేసి ఆ తర్వాత వదిలేసినవారు ఎప్పుడైనా వీటికి సంబంధించిన ఫొటోలు చూసుకున్నప్పుడు ఒక ప్రేరణగా ఉపయోగపడతాయి. మొట్టమొదటి డాక్యుమెంటరీ యోగా సాధన చేయడానికి యోగా క్లాసుల్లో చేరచ్చు. యూట్యూబ్‌లో వీడియోలు చూడచ్చు. ఆన్లైన్ కోర్సులు, పుస్తకాలు చదివి కూడా ప్రయత్నించవచ్చు. అయితే, యోగా ఫొటోగ్రఫీలో పర్ఫెక్ట్ అవ్వాలంటే యోగా మీద తీసిన ‘ఆన్ యోగా ది ఆర్కిటెక్చర్ ఆఫ్ పీస్’ డాక్యుమెంటరీ చూడాల్సిందే. దీనికి ఫొటోగ్రాఫర్‌గా వర్క్ చేసిన ‘మైఖేల్ ఓ నీల్’ అద్భుతమైన చిత్రణను అందించాడు. పదేళ్లపాటు ఇండియా, టిబెట్, న్యూయార్క్‌లలోని గొప్ప గొప్ప యోగా గురువులతో మాట్లాడి, తీసిన డాక్యుమెంటరీ ఇది. యోగా ఫొటోలు తీయడానికి, తీయించుకోవడానికి ఈ డాక్యుమెంటరీ మంచి పుస్తకంలా ఉపయోగపడుతుంది. ప్రకృతిలో క్లిక్స్... యోగా ఫొటోషూట్ కోసం అందమైన ప్రకృతిని మించిన వేదిక మరొకటి లేదు. మనసు, శరీరం ఆహ్లాదంగా ఉండటానికి చేసే యోగా, ఆ ఆనందాన్ని ఒక్క క్లిక్‌తో బంధించడానికి ప్రకృతి దృశ్యాలు అనువైన స్థలాలు. అడవి, బీచ్, పార్క్ ఫొటో సెషన్‌కు మంచి వేదికలు. అనువైన సంధ్యాసమయాలు... సూర్యోదయ, అస్తమయ సమయాలను బేస్ చేసుకుంటూ తీసే యోగా ఫొటోలు ఒక కళాత్మకమైన అందాన్ని కళ్లకు కడతాయి. ఈ సమయంలో సాధారణ ఆసనాలను వేస్తూ కూడా ఫొటోలు తీసుకోవచ్చు. మ్యాట్ నీట్... మిగతా వాటితో పోల్చితే యోగా ఫొటో సెషనల్లో శుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ధరించే డ్రెస్ అయినా, యోగా మ్యాట్ అయినా శుభ్రంగా ఉండాలి. యోగా ఫొటోలా కాకుండా ఓ కథ చెప్పే విధంగా ఉండాలి. యోగా ఫొటోలు తీయడమంటే ముఖాన్ని షూట్ చేయడం కాదు... మెడలో ధరించే పూసలు, పచ్చబొట్టు, వంపులుగా తిరిగిన చేతులు, శరీరం.. ఇలా యోగా అని తెలిసే విధంగా ఫొటో తీయాల్సి ఉంటుంది. యోగా ఫొటోలు తీయాలని ఆ ఒక్కరికే క్లిక్ మనిపించ కూడదు. చుట్టూ నేపథ్యాన్ని కూడా కెమెరా కన్నుతో బంధించాల్సి ఉంటుంది. యోగా ఫొటోగ్రఫీ అనేది ఒక ఆధ్యాత్మికానుభవాన్ని దగ్గర చేస్తుంది. ఇతరులు స్ఫూర్తి పొందేలా చేస్తుంది. యోగా చిత్రకళా విభాగం మిమ్మల్ని ప్రసిద్ధులను చేస్తుంది. యోగా మెటర్నిటీ మెటర్నిటీ ఫొటోస్ కోసం వచ్చినవారు యోగా ఫొటోస్ కూడా తీసుకోవడంలోనూ ఆసక్తి చూపుతున్నారు. ఇందుకు ఔట్లొకేషన్స్ని ఇష్టపడుతున్నారు. ప్రెగ్నెన్సీ సమయంలో సెలబ్రిటీలు తీయించుకున్న యోగా ఫొటోలు మా వద్దకు తీసుకువచ్చి, అలాంటి పోజులతో ఫొటోలు తీయమని అడుగుతుంటారు. ఫిట్నెస్ ట్రెయినర్స్లోనూ ఇలాంటి ఆసక్తి ఎక్కువ. – మనోజ్ఞ, న్యూ బోర్న్ బేబీ ఫొటో గ్రాఫర్ – నిర్మలారెడ్డి -
యోగా దినోత్సవ ‘ఆసనాలు’
-
చేసింది ఐఐటీ.. ‘యోగా’లక్ష్యం కోటి!
సాక్షి, హైదరాబాద్: ఇటీవల యోగాకు ప్రాచుర్యం బాగా పెరగడంతో అనేక మంది యోగాతో లాభాలు పొందుతూనే ఉన్నారు. బెనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ) ఐఐటీ నుంచి గ్రాడ్యుయేట్ అయిన సౌరభ్ బోత్రా మరికొంతమంది ఐఐటీ, ఐఐఎమ్ నుంచి వచ్చిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌తో ‘హాబిల్డ్’ పేరిట ఓ టీమ్‌గా ఏర్పడి దేశవ్యాప్తంగా ఎంతో మందికి యోగా చాలా సులువుగా నేర్పడంతో పాటు... దాని ప్రయోజనాలనూ పంచుతున్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేసేందుకు ఆయన 21 రోజులపాటు దేశవ్యాప్తంగా ఉచితంగా శిక్షణను ఇస్తున్నారు. ఇంట్లోనే ఉంటూ మీరు కూడా హాయిగా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవచ్చు. ఈ సందర్భంగా హాబిల్డ్ సహ వ్యవస్థాపకుడు సౌరభ్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘‘నిజానికి యోగా మాస్టర్నైన నేను కూడా చిన్నప్పుడు ఆస్తమాతో బాధపడ్డవాణ్ణే. నా బాల్యమంతా దగ్గుతూ సాగింది. వాతావరణం మారినప్పుడల్లా జలుబు, ఫ్లూ జ్వరాలతో బాధపడేవాణ్ణి. ఒకసారి నేను ఐఐటీ బీహెచ్‌యూలో ఉండగా అక్కడ ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యక్రమం జరిగినప్పుడు నాకు యోగా, ధ్యానం గురించి తెలిసింది. నా సమస్యకు అదే పరిష్కారం అని అర్థమైంది. అంతే... ఆనాటి నుంచి ఈనాటివరకు... అంటే దాదాపు పదేళ్లకు పైగా నేనెప్పుడూ ఇన్హేలర్ ఉపయోగించలేదు’’ అని చెప్పారు. 21 రోజుల ఉచిత యోగా శిక్షణ గురించి వివరిస్తూ.. ‘‘నేను యోగా నుంచి ఎంతో ప్రయోజనం పొందాను. నేను పొందిన ప్రయోజనాలనే అంతర్జాతీయంగా కనీసం కోటి మందికి అందించాలన్నదే నా లక్ష్యం. మీరు మీ ఇళ్లలోనే ఉంటూ ‘ఆన్లైన్’లో ఉచితంగా యోగా నేర్చుకోవచ్చు. ఈ నెల 19 వరకు ఎంతమందైనా, ఏ సమయంలోనైనా ఉచితంగా చేరవచ్చు. ఈ 21 రోజుల కార్యక్రమంలో ప్రతిరోజూ ఆన్లైన్ ద్వారా లైవ్ కార్యక్రమాల రూపంలో క్లాసులు నిర్వహిస్తాం. ఉదయం రెండు, సాయంత్రం రెండు చొప్పున ప్రతిరోజూ నాలుగు బ్యాచ్‌లు నిర్వహిస్తాం. ప్రతి బ్యాచ్ 45 నిమిషాల పాటు కొనసాగుతుంది. ఆ టైమింగ్స్ ఏమిటంటే... 6.30 నుంచి 7.15, 7.30 నుంచి 8.15 వరకు ఉదయం బ్యాచ్.. 6.00 నుంచి 6.45 వరకు, 7.00 నుంచి 7.45 వరకు సాయంత్రం బ్యాచ్ నిర్వహిస్తాం’’ అని వివరించారు. habuild. in or https:// habit. yoga ద్వారా ఎవరైనా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవచ్చని.. 86000 39726 నెంబరుకు హాయ్ అని మెసేజ్ ఇవ్వడం ద్వారా కూడా ఇందులో చేరవచ్చని తెలిపారు. -
22,850 అడుగుల ఎత్తులో యోగా
ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీసు(ఐటీబీపీ) జవాన్లు సరికొత్త రికార్దు నెలకొల్పారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అబీ గామిన్ పర్వతం సమీపంలో సముద్ర మట్టానికి 22,850 అడుగుల ఎత్తున యోగా సాధన చేశారు. ఈ వీడియోను తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్నారు. ఒకవైపు దట్టమైన మంచు, వణికించే చలి.. అయినప్పటికీ మొక్కవోని దీక్షతో యోగాసనాలు సులువుగా పూర్తిచేశారు. ఐటీబీపీ బృందం ఈ నెల 2వ తేదీన అబీ గామిన్ పర్వత శిఖరానికి చేరుకుంది. ‘బద్రీ విశాల్‌కీ జై’ అని నినదిస్తూ యోగా సాధనకు శ్రీకారం చుట్టింది. ఈ పర్వతం భారత్–టిబెట్ సరిహద్దులో ఉంది. ఈ ప్రాంతంలో ఇది రెండో అతిపెద్ద పర్వతం. బృందంలో మొత్తం 14 మంది ఉన్నారు. -
యంగ్‌గా ఉండేందుకు యోగా
గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్): నిత్యం యవ్వనంగా ఉండేందుకు యోగా చేయాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం 25 రోజుల కౌంట్‌డౌన్‌ను పురస్కరించుకుని శుక్రవారం ఎల్బీ స్టేడియంలో ‘యోగా ఉత్సవ్’ను నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ యోగాతో శారీరకంగా ఫిట్‌గా ఉండటంతో పాటు మానసికంగా బలంగా ఉంటారని తెలిపారు. హైపర్ టెన్షన్, థైరాయిడ్‌లతో పాటు పలు ఆరోగ్య సమస్యలు దూరమవుతాయన్నారు. కేంద్రమంత్రి సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ తమ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని సూచించారు. కేంద్ర పర్యాటక శాఖమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఇస్లామిక్ దేశాల్లోనూ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కేంద్ర సహాయమంత్రి ముంజపరా మహేంద్రభాయ్, మంత్రి హరీశ్‌రావు, శాసన సభ్యుడు రాజాసింగ్, క్రీడాకారులు పీవీ సింధు, మిథాలీరాజ్, నైనా జైస్వాల్, ప్రజ్ఞాన్ ఓజా, హాకీ క్రీడాకారుడు ముఖేశ్, సినీ ప్రముఖులు మంచు విష్ణు, లావణ్యత్రిపాఠి, దిల్‌రాజు, పద్మశ్రీ పురస్కార గ్రహీత మొగిలయ్య పాల్గొన్నారు. -
ఎల్బీ స్టేడియంలో యోగా ఉత్సవాలు (ఫొటోలు)
-
దురలవాట్లకు బానిసలుగా చేసే యాంగ్జైటీ.. తేలికగా అధిగమించండిలా..!
యాంగ్జైటీ అందరిలోనూ ఉంటుంది. ఆఫీస్‌లో అధికారులు నిర్ణయించిన లక్ష్యాలు సాధించలేమేమో అని, చేపట్టిన ఫలానా పని విజయవంతమవుతుందో లేదో అని, ఏదైనా కొత్త ప్రదేశంలో నెగ్గుకువస్తామా అని... ఇలా ప్రతి విషయంలోనూ అందరిలోనూ ఈ యాంగై్జటీ కలుగుతుంది. అయితే అందరిలోనూ కలిగే ఈ భావోద్వేగాలనూ, ఉద్విగ్నతలను కొంతమంది తేలిగ్గా అదుపు చేసుకుంటారుగానీ... మరికొందరు అంత తేలిగ్గా అధిగమించలేరు. దాంతో యాంగై్జటీ వల్ల కలుగుతున్న ఉద్విగ్న స్థితిని ఎలా అదుపు చేయాలో తెలియక కొందరు ఆ స్థితిని అధిగమించడం కోసం తొలుత సిగరెట్‌ను ఆశ్రయిస్తారు. ఆ తర్వాత మరొక దురలవాటైన మద్యం. ఇంకొందరు ఎప్పుడూ పొగాకు నములుతూ ఉండే జర్దా, ఖైనీ, పాన్‌మసాలా వంటివాటికి అలవాటు పడి నోటి క్యాన్సర్లు, గొంతు క్యాన్సర్లకు గురవుతుంటారు. కొందరు పాత అలవాట్లు వదులుకునేందుకు కొత్త అలవాట్ల బాట పడుతుంటారు. ఇది మరీ ప్రమాదం. ఇది డ్రగ్స్ వంటి ప్రమాదకరమైన అలవాట్లకు దారి తీస్తుంది. అలా పొగాకు నమలడం, పొగతాగడం, మద్యంతో పాటు మరికొద్దిమందిలో మాదకద్రవ్యాల వంటి దురలవాట్లకు బానిసలై తమ కాలేయాలూ, మూత్రపిండాలను పాడుచేసుకుంటారు. యాంగ్జైటీని అధిగమించలేకపోగా... చివరకు లివరూ, కిడ్నీలు దెబ్బతింటాయి. ఆరోగ్యమంతా పాడైపోతుంది. అందుకే యాంగై్జటీకి లోనయ్యేవారు, దాన్ని అధిగమించడానికి అన్నిటికంటే మంచిదీ, తేలికైన మార్గం పుస్తకాలతో పరిచయం. పుస్తకాలు ఎక్కువగా చదవడం వల్ల... అనేక పరిస్థితులతో మానసికంగా పరిచయం కావడం వల్ల తాము ఎదుర్కొన్న పరిస్థితి పెద్దగా కొత్తగా అనిపించదు. దాంతో యాంగై్జటీ తగ్గడానికి అవకాశాలు ఎక్కువ. అదేగాక... యోగా, ధాన్యం, మంచి మంచి హాబీల వంటి తేలిక మార్గాలతోనూ అధిగమించవచ్చు. -
యోగాతో కోవిడ్ పేషెంట్లలో సత్ఫలితాలు!
న్యూఢిల్లీ: ఐసోలేషన్ కాలంలో ఆన్లైన్ యోగా క్లాసులకు హాజరైన కోవిడ్ పేషెంట్లలో 92 శాతంమందికి సత్ఫలితాలు కనిపించాయని ఢిల్లీ ఫార్మాసైన్సెస్ అండ్ రిసెర్చ్ యూనివర్సిటీ నివేదిక తెలిపింది. కోవిడ్ లక్షణాల నుంచి వీరిలో అత్యధికులు తక్షణ మెరుగుదల చూపారని తెలిపింది. కోవిడ్ హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న పేషెంట్లకు ఢిల్లీ ప్రభుత్వం ఉచిత ఆన్లైన్ యోగా క్లాసుల సదుపాయం కల్పిస్తోంది. వీరిలో 88.9 శాతం మంది తమకు శ్వాస సమస్యల నుంచి విముక్తి లభించినట్లు చెప్పారని నివేదిక తెలిపింది. ఐసోలేషన్‌లో తాము చేపట్టిన ఆన్లైన్ యోగా తరగతులు దాదాపు 4,600మంది పేషెంట్లకు ఉపకరించాయని ఢిల్లీ డిప్యుటీ సీఎం మనీశ్ సిసోడియా చెప్పారు. మూలికా వ్యాక్సిన్ భేష్.. టొరెంటో: కరోనా వేరియంట్లకు వ్యతిరేకంగా మెడికాగో కంపెనీ రూపొందించిన మూలికాధార కోవిడ్ టీకా 70 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోందని క్లినికల్ గణాంకాలు వెల్లడించాయి. మొక్కల్లో ఉత్పత్తయ్యే కరోనా వైరస్ లాంటి రేణువు (సీవోవీఎల్‌పీ)లను ఎఎస్‌ఓ3 అనే సహాయ ఔషధంతో కలిపి ఈ టీకాను తయారు చేశారు. 24వేల మందిపై ఫేజ్3 ట్రయిల్స్ జరపగా 69.5 శాతం ప్రభావం చూపినట్లు తేలింది. మోస్తరు నుంచి తీవ్ర లక్షణాలున్న వారిలో 74–78.8 శాతం ప్రభావం చూపింది. రోగుల్లో వైరల్ లోడు బాగా తగ్గినట్లు నివేదిక తెలిపింది. టీకా సైడ్ ఎఫెక్టులు స్వల్పం నుంచి మోస్తరుగా ఉన్నట్లు తెలిపింది. -
యోగా, వంట మాస్టర్లకు ఆస్ట్రేలియా బంపర్ ఆఫర్
యోగా గురువులు, వంట చేయడంలో చేయి తిరిగిన చెఫ్‌లకు ఆస్ట్రేలియా ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ రెండు రంగాలకు చెందిన వారిని ప్రత్యేకంగా పరిగణిస్తూ వీసాలు జారీ చేస్తామని తెలిపింది. ఇప్పటి వరకు వంట మాస్టర్లు, యోగా గురువులు స్కిల్క్డ్ పర్సన్స్ కోటాలోనే ఆస్ట్రేలియా వీసాలు జారీ చేస్తోంది. దీని వల్ల వీసాలు పొందడానికి చాలా జాప్యం జరుగుతూ వస్తోంది. ఇటీవల భారత్, ఆస్ట్రేలియాల మధ్య ఆస్ట్రేలియా ఇండియా ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్(ఏఐఈసీటీఏ) కుదిరింది. అందులో భాగంగా యోగా గురువులు, చెఫ్‌లకు ప్రత్యేక వీసాలు జారీ చేస్తామని ఆస్ట్రేలియా టూరిజం మినిష్టర్ డాన్ తెహాన్ ప్రకటించారు. ఇరు దేశాల మధ్య రాకపోకలు పెరిగినప్పుడే ఏఐఈసీటీఏ ప్రయోజనాలు నెరవేరుతాయని ఆయన తెలిపారు. ఈ వీసాల జారీకి సంబంధించిన నియమ నిబంధనలు త్వరలో ప్రకటించనున్నారు. -
నాలుగు మండపాలుగా యాగశాల విభజన
లక్ష్మీనారాయణుడి మహా యాగశాలను నాలుగు మండపాలుగా విభజించారు. భోగమండపం, పుష్పమండపం, త్యాగ మండపం, జ్ఞానమండపంగా వీటికి పేరు పెట్టారు. నాలుగు దిక్కుల్లో ఉన్న ఈ మండపాల్లో 114 యాగశాలలున్నాయి. మధ్య శాలలో జీయర్ స్వాములతో పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడే భగవంతుని దర్శనం ఉంటుంది. రోజుకు మూడు పూటల పూజా కార్యక్రమాలు ఇక్కడ్నుంచే నిర్వహిస్తారు. మిగతా యాగశాలల్లో రుత్వికులతో యాగ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఒక్కో యాగశాలలో 9 యజ్ఞకుండాలు ఉంటాయి. చతురస్ర కుండం (స్వకయర్), యోని కుండం (ఇన్వర్టెడ్ హార్ట్), అర్థచంద్ర/ధనుష్కుండం (హాఫ్ మూన్), సహదస్ర కుండం (హెక్సాగాన్), వృత్త కుండం (సర్కిల్), పంచస్ర కుండం (పెంటాగన్), త్రికోణ కుండం (ట్రాయాంగ్యులర్), అష్ట్రాశమ కుండం (ఆక్టాగాన్), పద్మకుండం (లోటస్)గా వీటిని పిలుస్తారు. మొత్తంగా 1,035 యజ్ఞ కుండాల్లో 5 వేల మంది రుత్వికులతో యాగం నిర్వహిస్తారు. -
ముక్తి అంటే ఏమిటి? ఎలా సాధించాలి?
శాస్త్రాలలోని విషయాలను గురుసమ్ముఖంలో కూర్చొని శ్రవణం చేసి, గ్రహించిన జ్ఞానాన్ని ఏకాగ్రమైన మనస్సుతో అనుభవానికి తెచ్చుకొని, స్వీయ స్వరూపాన్ని తెలుసుకోవటమే ‘జ్ఞానం’. ఆ జ్ఞానాన్ని ఏకాగ్రతతో అనుభవానికి తెచ్చుకొనుటకు ఆచరించే ఉపాయమే ‘యోగం’ (యోగ సాధన) మనస్సు పూర్తిగా నిర్మలంగా, నిష్కల్మషంగా, స్వచ్ఛంగా ఉంటేనే అందులో పరమాత్మ ఉండేది. నిర్మలమైన అద్దంలో ప్రతిబింబం బాగా ప్రకాశిస్తుంది గాని, దుమ్ము కొట్టుకొని ఉన్న అద్దంలో ప్రతిబింబం సరిగ్గా కనిపించదు గదా! కనుక నీలో పరమాత్మ జ్ఞానం ప్రకాశించాలంటే నీ అంతఃకరణం స్వచ్ఛంగా నిర్మలంగా ఉండాలి. అలాంటి జ్ఞానం కలిగి, నిరంతరం యోగం నందే ఉండాలి, ఏదో కొద్దిసేపు నేను ఆత్మను అనే జ్ఞానంలో ఉండటం కాక శాశ్వతంగా – స్థిరంగా ఆత్మగా ఉండిపోవాలి. ఇలా ఉండాలంటే మనం బ్రహ్మనిష్ఠ, కరుణా సముద్రుడైన గురువును ఆశ్రయించాలి. నిత్యం గురువు ద్వారా సందేహాలను తొలగించుకోవాలి. అలా జ్ఞానంలో నిలబడటం జరుగుతుంది. బుద్ధి ద్వారా పరమాత్మను గురించి శ్రవణం చేయడం, విచారణ చేయడం. ఆయనను చేరుకొనేందుకు కృషి చెయ్యాలి. సత్కార్యాలను సక్రమంగా చేసినట్లైతే స్వర్గ లోకాలకు వెళ్ళి అక్కడ భోగాలు అనుభవించటం కూడా నిజమే. అయితే పుణ్యఫలం ఖర్చైపోగానే తిరిగి ఈ లోకంలోకి రావాలాల్సిందే. మళ్ళీ చరిత్ర ప్రారంభించవలసిందే. తాను చెప్పే నూతన విషయాలను, సూక్ష్మబుద్ధికి తప్ప అంతుబట్టని వేదాంత విషయాలను అతడు చక్కగా అర్థం చేసుకొని వదలవలసిన వాటిని వదిలి, పట్టుకోవలసిన వాటిని పట్టుకోవాలి. తీవ్రమైన మోక్షాపేక్షతో తన దగ్గరకు వచ్చిన శిష్యుడు దృఢ నిశ్చయంతో మోక్షమార్గంలో ప్రయాణించాలంటే తాను కొన్ని కఠోరమైన సత్యాలను చెప్పక తప్పదు. అందుకే గురువులు ఇలా గట్టిగా చెబుతుంటారు. వాడు పిల్లికి బిచ్చం పెట్టడు, ఫలానా వాడు ఎంగిలి చేత్తో కాకిని తోలడు, వాడికి పూజా లేదు పునస్కారం లేదు. ఇంక వాడేం మోక్షాన్ని పొందుతాడు? మోక్షాన్ని గనక పొందాలంటే భక్తితో భగవంతుని కొలవాలని, జపతపాలు చేయాలని, పరోపకారాలు (దానధర్మాలు) చేయాలని.. ఇలా చేస్తేనే ముక్తి అని అంటూ ఉంటారు. ముక్తి పొందాలనుకున్నవారు, మోక్షప్రాప్తిని కోరేవారు ఇవన్నీ చెయ్యాల్సిన పనిలేదా? చేయకూడదా ? అంటే చేయాల్సిందే. అయితే ఎలా చేయాలి ? ఎందుకు చేయాలి? మన మనోబుద్ధుల అలజడులు తగ్గించి శాంత పరచుకోవటానికి – నిష్కామంగా, ఎట్టి కోరికలు లేకుండా కర్మలను చేయాలి. అంతవరకే వీటి ప్రయోజనం. సరే మరి ఇంత కర్కశంగా చెప్పటం ఎందుకు? వేదాంతాన్ని అభ్యసించటానికి ఒక సద్గురువు ను సమీపించేటప్పటికే శిష్యుడు కొన్ని అర్హతలను కలిగి ఉండాలి. ఈ సంసార సాగరాన్ని తరించే ఉపాయాన్ని బోధించమని గురువును ప్రార్థించినప్పుడు గురువు చెప్పే సునిశిత విషయాలను గ్రహించే మానసిక స్థిరత్వం, ఏకాగ్రత, బుద్ధిసూక్ష్మత శిష్యుడికి ఉండాలి. అలా ఉండాలంటే అప్పటికే వారు ధార్మిక జీవనానికి అలవాటు పడి, నిష్కామ కర్మలు, జపతపాలు ఇష్టదేవతారాధన మొదలైన వాటిని సక్రమంగా ఆచరించేవారై ఉండాలి. ► మీరు ఇతరులను ఆదుకుంటే ఇతరులు మిమ్మల్ని ఆదుకుంటారు. ► మీరు ఇతరుల అభివృద్ధికి కృషి చేస్తే , మీ అభివృద్ధికి ఇతరులు కృషి చేస్తారు. ► మీరు ఇతరుల కోసం సమయాన్ని వెచ్చిస్తేనే, మీ కోసం ఇతరులు సమయాన్ని వెచ్చిస్తారు. ► మీరు ఇతరులకు ఆత్మ విజ్ఞానాన్ని పంచితే , మీకు సృష్టి ఆత్మ విజ్ఞానం పంచుతుంది. ► మీరు ఇతరుల దైవత్వానికి కృషి చేస్తేనే , మీరు దైవత్వం పొందగలుగుతారు. ► ‘పరోపకారం‘ (దానాలు) చేయాలని నిజంగా మీరు నిర్ణయించుకుంటే ఎన్నో రకాలుగా చేయవచ్చు. మనసు ఉంటే మార్గం ఎప్పుడూ ఉంటుంది. ► ‘పరోపకారం’ ద్వారా అన్ని సమస్యలలో నుంచి సులభంగా, వేగంగా, శాశ్వతంగా బయటపడవచ్చు. ► సామాన్యంగా లోకంలో ముక్తి అంటే ఏవో పైనున్న లోకాలకు వెళ్ళి కైలాసం, వైకుంఠం, లేదా స్వర్గానికి వెళ్ళి సుఖాలు అనుభవించటమే అని అనుకుంటారు. కాని కలియుగంలో అన్నిటికన్నా ప్రధానం ► ‘పరోపకారం’. (దానాలు) చేసుకోకపోతే ముక్తి ఎలా వస్తుంది..? జీవితంలోని ఏ సమస్యలైనా ‘పరోపకారం’ ద్వారా తొలగిపోతాయి. సర్వ అనారోగ్యాలను, సమస్త సమస్యలను ‘పరోపకారం’ ద్వారా శాశ్వతంగా తొలగించుకోవచ్చు. ఎవరికైనా సహాయం చేయండి. మంచి పనులు చేయండి. అడగక ముందే వారి అవసరాన్ని కనిపెట్టి, ఏమీ ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయండి. ఏ సహాయం చేయగలుగుతారో అదే చేయండి. మీకు సహాయం చేసే వీలు లేకపోతే కనీసం సహాయం ఎక్కడ దొరుకుతుందో తెలియజెప్పండి. మీరు ఏదైనా సహాయం చేస్తేనే మీకు సహాయాలు లభిస్తాయి. మీరు ప్రేమను పంచితేనే, మీరు ప్రేమను పొందగలుగుతారు. బయటి ప్రవర్తన – లోపల మనస్సు రెండూ ఒక్కటిగా ఉంటేనే ధ్యానంలో మనస్సు నిలుస్తుంది. జ్ఞానాన్ని చక్కగా గ్రహించగలుగుతారు. అప్పుడే మనస్సు పరమాత్మకు దగ్గరగా ఉంటుంది. ఇలా మనస్సు నిర్మలంగా స్వచ్ఛంగా ఉండాలంటే – నిరంతరం భగవంతుని పూజలు, యజ్ఞలు, పరోపకారం (దానాలు), తపస్సులు, ఆధ్యాత్మిక సాధనలు భక్తితో ఆచరించాలి. అలాగాక ఆచరణ గొప్పగా ఉండి మనస్సు మాత్రం ప్రాపంచిక విషయాలతో, స్వార్థపూరిత భావాలతో వ్యవహరిస్తే అది పరమాత్మకు దూరం చేస్తుంది. – భువనగిరి, కిషన్ యోగి -
బరువు పెరుగుతున్నా.. మానసిక చికాకులను ఆపడానికైనా అదే సరైన ఔషదం
బరువు పెరుగుతున్నట్టు అనిపించినా, మానసిక చికాకులను ఆపడానికైనా వ్యాయామం సరైన ఔషధంగా పనిచేస్తుంది. అందులోనూ కరోనా మహమ్మారి కాలంలో శరీరానికి తగినంత శక్తిని అందించడానికి కూడా వ్యాయామం ఎంతగానో తోడ్పడుతుందని తెలిసిందే. ఇక నేడు, రోజూ 8–9 గంటల పాటు ఉద్యోగం చేసేవారు తమ జీవన శైలిలో విపరీతమైన మార్పులను చవిచూస్తున్నారు. వీటన్నింటికీ సరైన సమాధానం శారీరక శ్రమను కలిగించే వ్యాయామం. వర్క్‌ఫ్రమ్ హోమ్ అయ్యాక బెడ్రూమ్, లివింగ్ రూమ్‌లలో పనిచేసే కొత్త సంస్కృతి వచ్చి చేరింది. ఈ గదులు సౌకర్యంగా అనిపించినా, వారి ఆరోగ్యంపై కనిపించని ప్రభావం మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. చురుకుదనానికి.. నిద్రలో ఉన్నప్పుడు కూడా బరువు తగ్గడంలో సహాయపడే రోజువారీ అలవాటుగా వ్యాయామాన్ని భాగం చేసుకోవాలి. శరీరం తన శారీరక కదలికలను తగ్గించుకున్నప్పుడు రకరకాల సమస్యలు, వ్యాధులు ఎలాంటి హెచ్చరిక లేకుండా వచ్చి చేరిపోతాయి. అప్పుడు శరీరానికి పని లేకుండా గంటలతరబడి కూర్చోవడం వల్ల ఆరోగ్యం ఎలా పాడైందో గ్రహిస్తారు. ముఖ్యంగా 40 ఏళ్ల తర్వాత మహిళలు శారీరక శ్రమ తగ్గితే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. శరీరాన్ని చురుకుగా ఉంచుకోవడం వల్ల గుండె సమస్యలు, మధుమేహం, కీళ్లనొప్పులు.. మొదలైన ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా కాపాడుకోవచ్చు. నడకతో బలం కండరాలను బలపరచడంలోనూ, నిద్రను మెరుగుపరచడంలోనూ ఎంతో ప్రభావంతంగా పనిచేస్తుంది నడక. అంతేకాదు ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. అలై్జమర్స్ ప్రమాదాన్ని నివారిస్తుంది. రుతుక్రమం ఆగిపోయిన స్త్రీలపై జరిగిన ఒక అధ్యయనంలో ప్రతిరోజూ 30 నిమిషాల నడక వారి తుంటి పగుళ్ల ప్రమాదాన్ని 40 శాతం తగ్గించిందని గుర్తించారు. హార్వర్డ్ హెల్త్ రీసెర్చ్ ప్రకారం 70 కిలోలు ఉన్న వ్యక్తి 30 నిమిషాల పాటు (గంటకు ఆరున్నర కిలోమీటర్ల వేగంతో) నడిస్తే 167 కేలరీలు ఖర్చు చేస్తారని అంచనా వేశారు. హానికారకాలకు దూరం 30 నిమిషాల పాటు నడవడం సౌకర్యంగా ఉంటే నడకను సాధారణ జాగింగ్‌కు అప్‌గ్రేడ్ చేయవచ్చు. నడక కంటే జాగింగ్ ఇంకాస్త ప్రభావవంతంగా ఉంటుంది. ఇది హానికరమైన కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. వాకింగ్లాగానే జాగింగ్ చేయడానికి ఎలాంటి పరికరాలు అవసరం లేదు. ప్రారంభించడానికి ఒక జత బూట్లు ఉంటే చాలు. బరువును తగ్గించే సైక్లింగ్ సైక్లింగ్ చేయడం వచ్చినా మూడు పదుల వయసు దాటిన తర్వాత దానిని దాదాపుగా మూలన పడేస్తారు మహిళలు. కానీ, 30 ఏళ్ల తర్వాతనే సైక్లింగ్ వలన శరీరానికి మరిన్ని ప్రయోజనాలు అందుతాయి. హార్వర్డ్ హెల్త్ ఉదహరించిన ఒక పరిశోధనా ప్రకారం శారీరక శ్రమ, బరువులో మార్పులను అధ్యయనం చేయడానికి పరిశోధకులు 16 సంవత్సరాల పాటు 18,000 మందికి పైగా మహిళలను గమనించారు. వీరి అధ్యయనంలో వ్యాయామం చేయని మహిళలు సగటున 20 పౌండ్ల బరువు పెరిగారు. అదే రోజూ 30 నిమిషాలు సైక్లింగ్ చేసిన వారు 20 పౌండ్ల బరువు తగ్గారు. దీనివల్ల సైక్లింగ్ మిగతా వాటికన్నా అదనపు ప్రయోజనాలు ఇస్తుందని నిరూపించారు. మెరుగైన ఆనందానికి.. ఈత అనేది వినోదంతో పాటు ఆరోగ్యకరమైన చర్య. ఈత హృదయ స్పందన రేటును పెంచుతుంది. కండరాలను టోన్ చేస్తుంది. శరీరానికి మొత్తం వ్యాయామం అందిస్తుంది. కీళ్ల నొప్పులు ఉన్నవారికి, ఇతర రకాల శారీరక శ్రమలు నొప్పిని తీవ్రతరం చేస్తాయి కానీ, ఈత మరిన్ని ప్రయోజనాలు అందిస్తుంది. ఆర్థ్రరైటిస్ ఉన్న వ్యక్తులకు కూడా ఈత ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తుంది. నీటి ఆధారిత వ్యాయామాల వల్ల కీళ్ల పనితనం మెరుగుపడుతుంది. సంపూర్ణ ఆరోగ్యం.. ఇది శారీరక శ్రమకు రూపం మాత్రమే కాదు. మానసిక ఒత్తిడిని నివారిస్తుంది. బరువును తగ్గించడంతో పాటు మొత్తం ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడుతుంది. యోగాలోని ధ్యానం అలై్జమర్స్ రాకుండా నిరోధించడమే కాదు జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఇతరులతో పోల్చితే యోగా చేసే వ్యక్తులు 43 శాతం తక్కువ వైద్య సేవలను ఉపయోగించుకుంటారని అధ్యయనాలు చూపుతున్నాయి. -
పాజిటివ్ వ్యక్తుల్లో ధైర్యం నింపేందుకు.. ఢిల్లీ సర్కార్ వినూత్న కార్యక్రమం
సాక్షి,న్యూఢిల్లీ: స్వీయ రక్షణ చర్యలతోనే కోవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని చెప్పిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బాధితులు త్వరగా కోలుకునేందుకు, వారిలో ధైర్యం నింపేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న బాధితులకు యోగా/ప్రాణాయామంపై అవగాహన కల్పించే కార్యక్రమం చేపడుతున్నట్టు ట్విటర్లో మంగళవారం పేర్కొన్నారు. యోగా ద్వారా రోగ నిరోధకశక్తి పెంచుకోవచ్చని చెప్పారు. యోగా క్లాసులకు సంబంధించి పాజిటివ్ వ్యక్తుల ఫోన్లకు నేడు ఒక లింక్ పంపిస్తామని బుధవారం నుంచి బ్యాచ్‌ల వారీగా ఆన్లైన్లో క్లాసులు మొదలవుతాయని సీఎం పేర్కొన్నారు. కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో ఢిల్లీలో లాక్డౌన్ పెట్టే యోచనలేదని ఇదివరకే కేజ్రీవాల్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ప్రజలంతా కోవిడ్ మార్గదర్శకాలు పాటిస్తే లాక్డౌన్ పెట్టాల్సిన అవసరం లేదని అన్నారు. ఇక ఢిల్లీలో రోజూవారీ కోవిడ్ కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో అక్కడ 19,166 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఢిల్లీలో 65,806 యాక్టివ్ కేసులున్నాయి. దేశ వ్యాప్తంగా ఈ మొత్తం సంఖ్య 8,21,446. అలాగే ఢిల్లీలో ఇప్పటివరకు 546 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. (చదవండి: టెక్ ఫాగ్ యాప్ కలకలం.. గూఢచర్యం ఆరోపణలు!) -
శభాష్ విజయ్.. యోగాలో గిన్నిస్ రికార్డ్
అనకాపల్లి: విశాఖ జిల్లా అనకాపల్లిలో పుట్టి చైనాలో యోగా గురువుగా ప్రఖ్యాతి గాంచిన కొణతాల విజయ్ గిన్నిస్‌బుక్‌లో స్థానం సంపాదించారు. చైనాలోని జెంజూ నగరంలో ఆగస్ట్ 4న అష్ట వక్రాసనాన్ని 2.32 నిమిషాలపాటు ప్రదర్శించి ఈ ఘనత సాధించారు. విజయ్ చదువుకునే సమయంలోనే యోగా నేర్చుకున్నారు. తర్వాత నృత్యంలో మెలకువలు సంపాదించి స్టార్ డ్యాన్సర్‌గా గుర్తింపు పొందారు. పలు దేశాల్లో డ్యాన్స్ శిక్షకుడిగా పనిచేసిన ఆయన చైనాలో స్థిరపడి నృత్యం, యోగ విద్యలో శిక్షణ ఇస్తున్నారు. చదవండి: 17 నుంచి గుంటూరులో అగ్రి ఇన్ఫోటెక్–2021 భార్యాభర్తలిద్దరికీ గిన్నిస్‌బుక్‌లో స్థానం విజయ్ భార్య జ్యోతి కొద్ది నెలల క్రితం గిన్నిస్‌బుక్‌లో స్థానం దక్కించుకున్నారు. నిండు గర్భంతో యోగాసనాలు వేసి ఆమె ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఇప్పుడు విజయ్‌కు కూడా అదే యోగాలో గిన్నిస్ బుక్‌లో స్థానం లభించడం గొప్పవిషయమని గిన్నిస్‌బుక్ ప్రతినిధులు పేర్కొన్నారు. చైనాలో కుంగ్ ఫూ, కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్‌లో ఎంతోమంది నిష్ణాతులు ఉంటారని, అక్కడ పోటీని తట్టుకొని యోగాసనాల్లో గిన్నిస్‌బుక్‌లో స్థానం పొందడం సంతోషంగా ఉందని విజయ్ ‘సాక్షి’తో చెప్పారు. -
రాందేవ్ బాబాకే గురువులా ఉన్నాడుగా..!
Viral Video Man Called As Father Of Ramdev Baba Bends His Body: యోగా గురువు రాందేవ్ బాబా వేసే కొన్ని ఆసనాలు చూస్తే.. ఈయన ఒంట్లో స్ప్రింగ్‌లున్నాయా ఏంటి నిపించకమానదు. చాలా సులభంగా.. ఇంకా చెప్పాలంలే విల్లులా శరీరాన్ని వంచుతాడు. నిత్యం యోగా సాధనతో ఇది సాధ్యమవుతుంది. (చదవండి: video viral: విదేశి యువకుడితో వృద్ధుడి అదిరిపోయే డ్యాన్స్!) తాజాగా సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఓ వీడియో చూసిన జనాలు ఆశ్చర్యంతో నోరు వెళ్లబెడుతున్నారు. వీడేవడో.. రాందేవ్ బాబాకే గురువులా ఉన్నాడు.. శరీరాన్ని ఒంచడంలో ఆయనను మించిపోయాడు అని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. (చదవండి: రామ్‌దేవ్‌బాబాకు సమన్లు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు) వీడియోలో ఉన్న వ్యక్తిది ఏ దేశం.. ఎక్కడ దీన్ని షూట్ చేశారు.. అనే వివరాలు మాత్రం తెలియడం లేదు. వీడియోలో ఓ వ్యక్తి తన శరీరాన్ని విల్లు మాదిరి వంచుతూ.. రకరకాల విన్యాసాలు ప్రదర్శిస్తూ.. అందరిని ఆశ్చర్యచకితుల్ని చేస్తున్నాడు. అతడి విన్యాసాలు చూసిన వారంతా.. ఫాదర్ ఆఫ్ రాందేవ్ బాబా అని కామెంట్ చేస్తున్నారు. చదవండి: పతాంజలి సునీల్ మృతి.. మా మందులు వాడలేదు! -
ఇది కదా ఫిట్నెస్: ఈ ముగ్గురు భామలకు ఫిదా అవ్వాల్సిందే
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యంగా ఉండాలని వ్యాయామాలు చేయడం సర్వసాధారణం. ఇందుకోసం వాకింగ్, జాగింగ్‌తోపాటు, యోగా, జిమ్‌లో బాగా కసరత్తులు చేయడం కూడా తెలిసిందే. అయితే ఒక్కసారి వ్యాయామం అలవాటు అయితే దాన్ని వదిలిపెట్టలేనంతగా లీనమైపోతారు. ఈ కోవలో యోగాసనాలు, జిమ్నాసిక్ట్స్ ముందు వరుసలో నిలుస్తాయి. తాజాగా ముగ్గురు యువతులు తమ యోగా విన్యాసాలతో ఆకట్టుకున్నారు. అసలు ఎముకలే లేనట్టుగా బాడీని విల్లులలా వంచడం పాటు వీరు చేసిన ఫీట్స్ ఆకర్షణీయంగా మారాయి మండే మోటివేషన్ అంటూ తరానా హుస్సేన్ ఈ వీడియోను ట్వీట్ చేశారు. యోగా గాల్స్ స్టామినాకు ఎవరైనా అద్భుతం అంటూ ఫిదా అవ్వాల్సిందే. మీరు కూడా ఓ లుక్కేసుకోండి మరి! Monday motivation 💪💪. #goodmorning #fitness #fitnessmotivation #workoutmotivation #workout #yoga #healthcare #motivation #healthylifestyle #healthyliving #healthierhappenstogether #fit #FitnessGirl #inspiration #yogalife #yogagirl pic.twitter.com/TPmOaVrifS — Tarana Hussain (@hussain_tarana) November 22, 2021 -
బెస్ట్‌గా తీర్చిదిద్దే.. బ్లష్ విత్ మి స్కూల్
జీవితంలో బతకాలంటే ఉద్యోగం కావాలి. ఉద్యోగం కోసం అనేక రకాల అవగాహనను పెంచుకోవడం కోసం చాలా డబ్బులను వెచ్చిస్తాం. ఉద్యోగం వచ్చాక మనల్ని మరింత బెస్ట్‌గా నిరూపించుకోవడానికి ప్రయతి్నస్తాం. కానీ అది ఎలాగో తెలీదు. చాలామందికి ఎక్కడ ప్రారంభించాలి, వ్యక్తిగత స్టైల్ అంటే ఏంటీ? మనల్ని మనం చక్కగా ఎలా ప్రజెంట్ చేసుకోవాలి? ఆత్మధైర్యాన్ని ఎలా పెంపొందించుకోవాలి? సామాజిక కార్యక్రమాల్లో ఎలా పాల్గొనాలి వంటి వాటి గురించి బొత్తిగా తెలీదు. దీనివల్ల కూడా కెరీర్లో వెనుకబడి పోతుంటారు. మిమ్మల్ని మీరు మరింత బాగా తీర్చిదిద్దుకోవాలంటే ‘‘బ్లష్ విత్ మి – పరి్మతా’’ స్కూల్‌ను ఫాలో అవ్వండి అని చెబుతోంది పర్మితా కట్కర్. నలభైఏళ్ల వయసులో తను ఫిట్‌గా ఉండడమేగా, గ్లామరస్ రోల్స్ పోషిస్తూ, చూపుతిప్పుకోని ర్యాంప్‌వాక్‌లు చేస్తూ, మరోపక్క ఫిట్నెస్ ట్రైనర్‌గా రాణిస్తూ వీక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఢిల్లీలో పుట్టిన పర్మితా కట్కర్..తల్లిదండ్రులు ఉద్యోగ రీత్యా బెంగళూరుకు మకాం మార్చడంతో ఆమె అక్కడే చదువుకుంటూ పెరిగింది. తొలుత మోడల్‌గా కెరియర్ ప్రారంభించింది కానీ తరువాత నటన వైపు ఆకర్షితురాలయ్యింది. ఒక పక్క మోడల్‌గా రాణిస్తూనే 2003లో మిస్ఇండియా పసిఫిక్ కిరీటాన్ని గెలుచుకుంది. దీంతో మోడలింగ్, యాక్టింగ్‌కు మంచి అవకాశాలు వచి్చ పడడంతో బాగా బిజీ అయ్యింది. కెరియర్ ప్రారంభంలోనే బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌తో కలిసి మోడలింగ్ చేసింది. ఈ క్రమంలోనే ఇండియాలో ప్రముఖ ఫోటోగ్రాఫర్స్‌తో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. దీంతో ఫోటోగ్రఫీ ఎలా చేస్తున్నారో బాగా గమనించేది. ఇదే ఏడాది ‘బాస్ యన్ హై’లో తారా పాత్రను పోషించింది. మనోజ్ బాజ్‌పేయితో కలిసి ఇంటెకామ్: ద పర్ఫెక్ట్ గేమ్, హూసన్–లవ్ అండ్ బెట్రియాల్, లవ్ కే చక్కర్ మెయిన్, కచ్చి సాదక్ సినిమాల్లో నటించింది. అంతేగాక మధు బండార్కర్ నిర్మించిన ‘పేజ్ 3’లో ఐటమ్ సాంగ్‌లో నటించింది. పెళ్లి... పిల్లలు... ఫోటోగ్రఫీ.. వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ 2008లో రవికురదాను పెళ్లి చేసుకుని న్యూయార్క్‌లో స్థిరపడింది. పరి్మతాకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. తన కొడుకులిద్దరిని రకారకాల ఫొటోలను క్రియేటివ్‌గా తీసేది. ఆ ఫోటోలు చూసిన స్నేహితులు, ఇరుగుపొరుగు వారు ‘ఫోటోలు చాలా బావున్నాయి’ అని చెప్పి పరి్మతను వాళ్ల ఇళ్లలో జరిగే కార్యక్రమాలకు ఫోటోలు తీయమనేవారు. దాంతో ఆమెకు తనలో దాగి ఉన్న ఫోటోగ్రఫీ కళకు మెరుగులు దిద్దుకోవాలనిపించింది. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ఫోటోగ్రఫీలో డిగ్రీ చేసింది. అదీ సాదాసీదాగా ఏం కాదు... క్లాస్ టాపర్‌గా నిలిచింది. డిగ్రీ చదువుతోన్న సమయంలోనే నేషనల్ మేకప్ ఆర్టిస్ట్ బాబీ బ్రౌన్‌తో కలిసి పనిచేసే అవకాశం దొరికింది. దీంతో బాబీ బ్రౌన్‌తో కలిసి న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో పనిచేసింది. అంతేగాక అనేక ఈవెంట్లకు కొరియోగ్రఫీ కూడా చేసింది. మిస్ ఇండియా అమెరికా, మిస్ ఇండియా న్యూయార్క్, మిస్ ఇండియా కనెక్టికట్ వంటి ఈవెంట్లకు పనిచేసి తన కళకు మరిన్ని మెరుగులు దిద్దుకుంది. నైపుణ్యం కలిగిన ఫోటోగ్రాఫర్స్‌తో కలిసి అనేక కార్యక్రమాల్లో పనిచేసింది. అంతేగాక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్(ఎన్‌ఐఎఫ్‌డీ)కు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా పనిచేసింది. వీటన్నింటితోపాటు ఫ్యాషన్ వరల్డ్‌లో విద్యార్థులు మరింత ఎదిగేలా ప్రేరణ అందించింది. ఇవేగాక ఎంటర్టెయిన్మెంట్, కామెడీ, సెలబ్రెటీ గాసిప్ వంటి ఎనిమిది రకాల టెలివిజన్ టాక్ షో లకు హోస్ట్‌గా వ్యవహరించింది. బ్లష్ విత్ మి.. ఫ్యాషన్, బ్యూటీపై ఉన్న అవగాహన, ఫోటోగ్రఫీపై పట్టుతో బ్లష్ విత్ మి–పరి్మతా పేరుతో 2014లో యూ ట్యూబ్ చానల్‌ను ప్రారంభించింది, దీని ద్వారా మహిళాభివృద్ధి కోసం కృషిచేస్తున్నారు. మహిళల్లో ఫిట్‌నెస్‌పై అవగాహన కల్పించి, వారిపై వారికి నమ్మకం, ఆత్మవిశ్వాసం పెంపొందించి అంతర్గతంగానూ శక్తిమంతులుగా తీర్చిదిద్దేందుకు అనేక రకాల వీడియోలను అప్లోడ్ చేస్తోంది. కెమెరా ముందు తమను తాము ఎంత అందంగా చూపించవచ్చో కూడా నేర్పిస్తుంది. తన యూట్యూబ్ చానల్లో..ముఖ్యంగా మహిళల ఫిట్‌నెస్‌కు సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేస్తూ ఎంతోమందికి ఫిట్‌గా ఎలా ఉండాలో అవగాహన కల్పిస్తోంది. అంతేగాక వన్ ఆన్ వన్ ఇమేజ్ కోచింగ్, ఫేస్ యోగా, ఫోటోగ్రఫీలలో శిక్షణ ఇస్తోంది. పర్మితా ఫిట్నెస్ ఐడియాలు నచ్చడంతో ఆమె చానల్‌ను ఫాలో అయ్యేవారి సంఖ్య దాదాపు ఇరవై లక్షలకు చేరింది. -
Ankita Konwar: వృక్షాసనం నాకు చాలా స్పెషల్.. ఎందుకంటే?
ప్రముఖ బాలీవుడ్ యాక్టర్ మిలింద్ సోమన్ భార్య అంకిత కోన్వర్ కు యోగా చేయడమంటే మహా ఇష్టమట. అంతేకాకుండా ఆమె తన ఫిట్నెస్ సీక్రెట్స్‌ను సోషల్ మీడియాలో అభిమానులు, ఫాలోవర్స్‌తో తరచూ పంచుకుంటుంది కూడా. ఐతే తాజా ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో యోగాసనాల్లో వృక్షాసనం తనకు ఇష్టమైన యోగా అని చెప్పుకొచ్చింది. ఈ పోస్టును చూసిన అభిమానుల నుంచి వేలసంఖ్యలో లైక్‌లు, కామెంట్లు వెల్లువెత్తాయి. ఈ పోస్ట్‌లో వైట్ స్లీవ్ లెస్ టీషర్ట్, రెడ్ కలర్ ఫ్యాంట్ ధరించి, వెనుక పచ్చని చెట్లు ఉన్న లొకేషన్లో వృక్షాసనంలో అంకిత కనిపిస్తుంది. తన పోస్ట్‌లో వృక్షాసనం వల్ల చేకూరే ప్రయోజనాలు, వేసే విధానం కూడా తెల్పింది. ‘యోగాసనాల్లో వృక్షాసనం నాకు ఇష్టమైనది. ఇది కాళ్లు, తొడలకు దృఢత్వాన్ని ఇస్తుంది. నాడి వ్యవస్థ కండరాలను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా ఏకాగ్రతను, చురుకుదనాన్ని వృద్ధి చేస్తుంది. ఈ ఆసనాన్ని వేసేటప్పుడు వీటిని ఖచ్చితంగా గుర్తుంచుకోండి. మీ వెనుక భాగాన్ని నిటారుగా ఉంచండి. లేదంటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాగే పాదంతో మోకాలును నొక్కడం కూడా చేయకూడదు. మీ తొడభాగాన్ని నిటారుగా ఉంచండి’ అని.. ఆసనం వేసేటప్పుడు పాటించవల్సిన జాగ్రత్తలు కూడా వెల్లడించారు. ఐతే వ్యాయామం కోసం ప్రేరణ పొందాలనుకునే వారు అంకిత కోన్వార్ పోస్ట్‌లను ఫాలో ఐతేచాలు.. ఖచ్చితంగా ఇన్స్పైర్ అవుతారని ఆమె చేసిన పలు పోస్టులను చూస్తే అనిపిస్తుంది. చదవండి: Brief Emotion: ఆపరేషన్ టైంలో ఏడ్చినందుకు ఏకంగా రూ.800ల బిల్లు ..! View this post on Instagram A post shared by Ankita Konwar (@ankita_earthy) -
ప్రతి జిల్లాలో పీజీ వైద్య కళాశాల
జైపూర్: పోస్టు–గ్రాడ్యుయేట్(పీజీ) వైద్య విద్య కోసం దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఒక వైద్య కళాశాల లేదా విద్యా సంస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. వైద్య విద్య, ఆరోగ్య సేవలను అందించడం మధ్య అంతరం తగ్గుతోందని తెలిపారు. ఆయుర్వేదం, యోగాను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్లు గుర్తుచేశారు. దేశంలో గత ఆరేళ్లలో 170కిపైగా మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయని, కొత్తగా మరో 100 కాలేజీల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోందని హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ గురువారం రాజస్తాన్‌లో నాలుగు నూతన వైద్య కళాశాలల నిర్మాణానికి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. అలాగే ‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ టెక్నాలజీ’ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... వైద్య వ్యవస్థను సమూలంగా మార్చడానికే ఎంసీఐ స్థానంలో నేషనల్ మెడికల్ కమిషన్‌ను తీసుకొచి్చనట్లు ఉద్ఘాటించారు. ఈ కమిషన్‌తో ఇప్పటికే సానుకూల ఫలితాలు వస్తున్నాయని వివరించారు. దేశంలో సంప్రదాయ, ఆధునిక వైద్యం నడుమ అంతరం ఉందని, దీన్ని తొలగించాలి్సన అవసరం ఉందని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఇందుకోసమే కొత్తగా నేషనల్ హెల్త్ పాలసీని తీసుకొచ్చినట్లు వివరించారు. ఎయిమ్స్ లేదా మెడికల్ కాలేజీలు.. వాటి నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా అన్ని మూలలకూ విస్తరింపజేయాలని సూచించారు. దేశంలో గతంలో కేవలం 6 ఎయిమ్స్‌లు మాత్రమే ఉండేవని, ఇప్పుడు 22కుపైగానే ఉన్నాయని పేర్కొన్నారు. 2014లో కేవలం 82,000 అండర్–గ్రాడ్యుయేట్, పోస్టు–గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లు ఉండేవని, ఇప్పుడు వాటి సంఖ్య 1.40 కోట్లకు చేరిందని వెల్లడించారు. చాలా మంది విద్యార్థులకు ఆంగ్ల భాష పెద్ద అవరోధంగా మారిందని, నూతన విద్యా విధానంలో భాగంగా భారతీయ భాషల్లోనూ వైద్య విద్యను అభ్యసించే వెలుసుబాటు లభిస్తోందని తెలిపారు. -
Vajrasana Benefits: మానసిక ఒత్తిడి, వెన్నునొప్పి, ఎసిడిటీ నివారణకు.. యోగా మంత్రమిదే!
యోగా భారతీయుల శాస్త్రబద్ధమైన జీవన విధానానికి ప్రతీక. జ్ఞాన, ధ్యాన, చైతన్యాలకు ఇదొక జీవమార్గం. వేదకాలం నుంచే మన దేశంలో వెలుగుచూసిన ఈ ప్రాచీన ప్రక్రియ నేడు విశ్వవ్యాప్తంగా ఆదరణ పొందుతోంది. యోగా వాసిష్ఠం, యోగ యజ్ఞవల్క, మహాభాష్యం, కుండలిని యోగ.. ఇలా మన పూర్వికులు రచించిన ఎన్నో గ్రంథాలు యోగా ప్రాశస్త్యాన్ని తెలియజేస్తున్నాయి. సూర్యనమస్కారం, పద్మాసనం, త్రికోణాసనం, ప్రాణాయామం.. ఇలా సులువుగా వేయదగిన ఆసనాలను రోజువారీ జీవనవిధానంలో కనీసం అరగంటైనా చేస్తే మానసిక, శారీరక ఆరోగ్యం మీ సొంతమౌతుంది.సులభంగా చేయదగిన ఆసనాల్లో వజ్రాసనం కూడా ఒకటి. తిమ్మిర్ల నివారణ నుండి జీవక్రియను పెంచడం వరకు వజ్రాసనం ఎన్నో సమస్యలకు అద్భుతమైన పరిష్కారమార్గం. ఈ ఆసనాన్ని ప్రతి రోజూ 15 నిముషాలపాటు చేస్తే చేకూరే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కాదండోయ్!! ►మనసిక ఒత్తిడి నుంచి విడుదల ►జీర్ణక్రియ వృద్ధి ►ఎసిడిటీ నివారణ ►బరువు తగ్గడం ►రుతుస్రావ, కండరాలు, మూత్ర సమస్యలకు చికిత్స ►వెన్నునొప్పిని తగ్గిస్తుంది.. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్దలిస్టే అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆరోగ్య జీవనానికి మూలసూత్రమని చెప్పొచ్చు. ఐతే కొంతమంది 5 నిముషాలు కూడా వజ్రాసన భంగిమలో కూర్చోలేకపోతారు. కాళ్లు తిమ్మిర్లు లేదా బెణకడం వంటివి అందుకు కారణాలుగా చెబుతారు. మామూలే అని వీటిని కొట్టిపారేయలేం. ఎందుకంటే ఇటువంటివి మన జీవనశైలి మనుగడకు ముందస్తు సంకేతాలుగా పనిచేస్తాయి. ప్రముఖ యోగా నిపుణులు గ్రాండ్ మాస్టర్ అక్షర్ మాటల్లో.. నేలపై కూర్చోలేకపోవడం ప్రస్తుత జీవనవిధానం వల్ల నేలపై కూర్చునే అలవాటే చాలా మందికి లేదు. తినడానికి, రాయడానికి, చదవడానికి... ప్రతిపనికీ కుర్చీ-టేబుల్ వాడేస్తున్నారు. ఇలాంటివారు నేలపై వజ్రాసనం వేయడం కష్టం. మన జీవనశైలి, అలవాట్ల కారణంగా, నడుము దిగువ భాగంలో ముఖ్యంగా మోకాలి కీళ్లలో బలం లేకపోవడంవల్ల కఠినమైన నేలమీద మోకాళ్లపై ఒత్తిడి పెంచే భంగిమలో కూర్చోలేకపోతున్నారు. కీళ్ల సమస్యలు మోకాళ్ల, కీళ్ల సమస్యలతో బాధపడేవారికి కూడా నేలపై వజ్రాసనం వేయడం సమస్యగానే ఉంటుంది.చీలమండలంలో బిగుతుకు పోయిన కండరాల కారణంగా కూడా దీర్ఘకాలం పాటు వజ్రాసన భంగిమలో ఉండకుండా మిమ్మల్ని నివారిస్తాయి" అని గ్రాండ్ మాస్టర్ అక్షర్ చెప్పారు. అధికబరువు ఉబకాయం (ఒబేసిటీ) సమస్యతో బాధపడే వారు కూడా మోకాళ్లపై వేసే ఈ ఆసనాన్ని వేయలేరు. ఇలాంటివారికి నేలపై కూర్చోవడమే పెద్దసవాలుగా ఉంటుంది. వంగని బిరుసైన కండరాలు కూడా కారణమే బిరుసైన కండరాలు కలిగిన వారిలో రక్తస్రసరణ సక్రమంగా ఉండదు. అందువల్లనే కేవలం కొన్ని సెకన్లపాటు కూడా వజ్రాసనంలో కూర్చోలేరు. స్తబ్ధమైన జీవనశైలి కారణంగా కండరాల సంకోచవ్యాకోచాలు జరగకపోవడంతో ఇటువంటి సమస్యలు తలెత్తుతాయి. దిగువ శరీరం మొద్దబారడంవల్ల, మోకాలు, చీలమండ కీళ్ల బలహీనత వల్ల, మీ ప్రస్తుత జీవనశైలి అలవాట్ల వల్ల కూడా కావచ్చు. ఎక్కువ సమయం వజ్రాసనంలో ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి ►కాళ్లను సాగదీయడం చేయాలి. కేవలం ఉదయం మాత్రమే కాకుండా సాయంత్ర సమయంలో కూడా తప్పనిసరిగా సాగదీస్తూ ఉండాలి. ►నడవడం, సైకిల్ తొక్కడం, మెట్లు ఎక్కడం.. వంటి ఎక్సర్‌సైజ్‌లతో మీ కాళ్లను దృఢంగా మలచుకోండి. ►ఒకేసారి ఎక్కువ టైం వజ్రాసనం వేయకండి. 30 సెకన్లతో ప్రారంభించి 4, 5 సార్లు ప్రాక్టీస్ చేయాలి. తర్వాత కొంచెం కొంచెంగా టైం పెంచుకుంటూ అలవాటు చేసుకోవాలి. ►మీ మోకాళ్లు లేదా కాళ్ల కింద దిండును సపోర్టుగా ఉంచి కూడా ప్రాక్టీస్ చేయవచ్చు. వీటిని తరచూ ప్రాక్టీస్ చేయడం ద్వారా వజ్రాసనం వేయడంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా వేయగలుగుతారని యోగా ఎక్స్పర్ట్ గ్రాండ్ మాస్టర్ అక్షర్ సూచించారు. చదవండి: బీట్ రూట్, పెరుగు, పాలకూర, దానిమ్మగింజలు ప్రతిరోజూ తిన్నారంటే..! -
కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో కొత్త బ్రేక్.. 5 నిముషాల సమయం
న్యూఢిల్లీ: టీ బ్రేక్, లంచ్ బ్రేక్ అంటే మనకి తెలుసు. ఇప్పుడు కేంద్ర కార్యాలయాల్లో ఇంకో కొత్త బ్రేక్ రాబోతోంది. అదే యోగా బ్రేక్.. పనిలో వచ్చే ఒత్తిళ్లను జయించి రెట్టించిన ఉత్సాహంతో ఉద్యోగులు పని చేస్తారన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ యోగా బ్రేక్ ప్రవేశపెట్టింది. ఒక అయిదు నిమిషాల సేపు ఉద్యోగులు అన్నీ మర్చిపోయి ప్రాణాయామం, ఆసనాలు, ధ్యానం చేస్తే శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుందని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం కేంద్ర ఆయుష్ శాఖ వై–బ్రేక్ యాప్ అనే యాప్‌ని రూపొందించింది. అందులో యోగా, ప్రాణాయామం ఎలా చేయాలో 5 నిమిషాల వీడియో ఉంటుంది. యోగా బ్రేక్ సమయంలో వై–బ్రేక్ యాప్‌లో చూపించినట్టుగా ఉద్యోగులు చేస్తే సరిపోతుంది. ఈ నెల 30 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ యోగా బ్రేక్ తీసుకోవాలని సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా ప్రైవేటు కార్యాలయాల్లో సిబ్బందికి కూడా యోగా బ్రేక్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ఆ శాఖ తన ఆదేశాల్లో పేర్కొంది. ఆ యాప్‌లో ఏముంది ? పని చేసే ప్రాంతాల్లో 5 నిమిషాల సేపు రిలాక్స్ అవడానికి ఏమేం చెయ్యాలన్న దానిపై 2019లోనే కేంద్రం యోగా నిపుణులతో ఒక కమిటీ వేసింది. వారి సూచనల మేరకు ఈ 5 నిమిషాల యోగా ప్రోటోకాల్‌ను రూపొందించారు. గత ఏడాది జనవరిలో ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతాలలో దీనిని ఒక పైలెట్ ప్రాజెక్టులా ప్రారంభించారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఈ 5 ని.ల యోగా ప్రోటోకాల్‌ని తప్పనిసరి చేశారు. ఈ నెల 1న కేంద్రం వై–బ్రేక్ యాప్‌ని ప్రారంభించింది. -
హీరోయిన్ లేటెస్ట్ పిక్, వావ్ అంటున్న ఫ్యాన్స్
సాక్షి, ముంబై: బొద్దుగుమ్మలుగా అలరించిన స్టార్ హీరోయిన్లు ఇపుడు సన్నజాజి తీగల్లా మరింత మెరిసి పోతున్నారు. భారీ కసరత్తు, యోగాసనానలతో నాజూగ్గా, సెక్సీగా తయారవుతున్నారు. తాజాగా టాప్ హీరోయిన్ హన్సిక ఇన్‌స్టా పోస్ట్ సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే హన్సిక ప్రతిరోజూ ఫోటోలు వీడియోలతో అభిమానులను మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. సముద్ర తీరాన బాడీ మొత్తాన్ని అలవోకగా అలా వంచేస్తూ చేసిన యోగాసనం ఫోటోను హన్సిక్ షేర్ చేసింది. దీంతోఫ్యాన్స్ వావ్ అంటున్నారు. తెలుగులో బొద్దుగుమ్మగా పాపులర్ అయిన హన్సిక పలు సూపర్ హిట్ చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్నసంగతి తెలిసిందే. కాగా టాలీవుడ్ టాప్‌హీరోయిన్ సమంత, మహానటిలో బొద్దుగా మారిన కీర్తి సురేష్, క్రేజీ హీరోయిన్స్, పూజా హెగ్దే తదితర హీరోయిన్లు జిమ్‌లు, యోగా అంటూ బాడీ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టారు. View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) -
రెండో తరగతి చిన్నారి.. ఆసనాలు వేయడంలో ఆరితేరింది
సాక్షి, శృంగవరపుకోట(భువనేశ్వర్): యెగాతో అందరికీ ఆరోగ్యం సాధ్యం. ఈ విషయం తెలిసినా అధికశాతం మంది కాదనుకుని వదిలేస్తున్నారు. ఏడేళ్ల చిన్నారి వత్రం మేనమామను అనుకరించి ఆసనాల్లో దిట్ట అనిపించుకుంటోంది. శృంగవరపుకోటకు చెందిన ఏడేళ్ల కర్రి హర్షిత యోగాలో విశేష ప్రతిభ చపుతోంది. హర్షిత మేనమామ భానుప్రకాష్‌రెడ్డి నిత్యం యోగా సాధన చేస్త నైపుణ్యం సాధించారు. మేనమామ యోగా సాధన చేస్తున్న సమయంలో అతడిని హర్షిత అనుకరించేది. ఆసనాలు వేయడం నేర్చుకుంది. మేనకోడలి ఆసక్తి గమనింన భానుప్రకాష్ ఏడాదిన్నర వయసు నుం హర్షితకు ఆసనాలు వేయడం నేర్పించారు. ఐదేళ్ల వయసు వచ్చేసరికి ఆసనాల్లో దిట్ట అయ్యింది. ప్రస్తుతం రెండో తరగతి చదువుతున్న హర్షిత 200పైగా ఆసనాలు వేస్తోంది. సువరు 100 వరకూ ఆసనాలు పేర్లు చెప్పగానే వేస్తుంది. మరో 100 వరకూ సంక్లిష్ట ఆసనాల పేర్లు తెలియకపోయినా అనుకరిస్త క్షణాల్లో అలాగే ఆసనం వేస్తుంది. పిన్న వయసులో ప్రతిభ చపుతున్న చిన్నారి హర్షితను పలువురు అభినందిస్తున్నారు. -
ఫిట్నెస్ ప్రియులకు గుడ్‌న్యూస్..!
హెల్దీ ఫుడ్, ఇమ్యూనిటీ బూస్టర్, ఫిట్నెస్ అనే పదాల చుట్టే తిరుగుతోంది కాలం. రకరకాల సైట్స్‌లో, యాప్స్‌లో సెర్చ్ చేసి మరీ ఆరోగ్య భాగ్యాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నారు ఎంతో మంది. కరోనా వల్ల జిమ్‌లకు వెళ్లి చెమటోడ్చే పరిస్థితి లేదు. అందుకే ఇంటిపట్టున చేసుకునే వ్యాయామాల కోసం పెయిడ్ యాప్స్ వెంటపడుతున్నారు. అలాంటివారికి ‘బంకర్‌ఫిట్’ అనే యాప్ బోలెడు ఆఫర్స్ ఇస్తోంది ఫ్రీగా. ట్రైనింగ్ మాడ్యూల్స్, ఆరోగ్యవంతమైన రెసిపీలనూ ఉచితంగా అందిస్తోంది. ప్రస్తుతానికిది హిందీ, ఇంగ్లిష్, తమిళం, తెలుగు భాషల్లో అందుబాటులో ఉంది. ఇంకొన్ని నెలల్లో మొత్తంగా 14 భాషల్లో కంటెంట్‌ను అందించడానికి సిద్ధమవుతోంది. యోగాతో పాటు ట్రైనింగ్, న్యూట్రిషన్, రన్నింగ్‌కు సంబంధించిన విభాగాలు కూడా అందుబాటులో ఉంటాయి. ‘ఫిట్ ఇండియా’ నినాదాన్ని బలపరుస్తూ 2030 నాటికి 10 కోట్ల మంది వినియోగదారులను చేరుకోవడమే బంకర్‌ఫిట్ లక్ష్యంగా పెట్టుకుంది. అద్నాన్ అదీబ్, జెబా జైదీలు ఈ యాప్‌ను రూపొందించారు. వీళ్లెవరో అనుకునేరు..! ఎంతో పాపులర్ అయిన ‘డెవిల్స్ సర్క్యూట్ ఫేసెస్’ గుర్తుంది కదా! దాని స్థాపకులే ఈ ఇరువురు. ఫిట్నెస్ ప్రక్రియను ప్రతి గడపకు పరిచయం చేయడమే తమ ప్రధాన లక్ష్యమంటున్నారు వాళ్లు. సామాన్యుల చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్స్ ఉంటున్న ఈ రోజుల్లో.. ఈ యాప్‌ని అందరికీ అందుబాటులోకి తేవడమేమంత కష్టం కాదని వీరి నమ్మకం. అందుకే కంటెంట్ అంతా ఉచితమని, దేశంలోని అన్ని వర్గాల వారికీ ఇది ఉపయోగపడుతుందని చెప్తున్నారు. మార్చిలో లాంచ్ అయిన ఈ యాప్.. ఇప్పటికే 25 వేలకు పైగా డౌన్ లోడ్స్ దాటింది. కరోనా కారణంగా ఫిట్నెస్, ఆరోగ్యానికి సంబంధించిన కంటెంట్‌ను చూసేవారి సంఖ్య భారీగా పెరగడమే కాకుండా.. దేశంలో డేటా చవకగా లభించడం కూడా ఈ యాప్‌కి ప్లస్ కాబోతోంది. ఎయిర్టెల్ స్టార్ట్–అప్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్‌లో భాగంగా బంకర్‌ఫిట్ స్పెక్టా కామ్‌లో 10% వాటాను ఎయిర్టెల్ కొనుగోలు చేసింది. దీంతో ఈ యాప్‌కు ఎయిర్ టెల్ సపోర్ట్ కూడా బాగా లభిస్తోంది. ఎయిర్టెల్కున్న విస్తృతమైన ఎకోసిస్టంతో పాటు ఎయిర్ టెల్ సీనియర్ టీం సలహాలూ ఉపయోగపడనున్నాయి. ఆఫ్‌లైన్, ఆఫ్ లైన్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ విషయంలోనూ ఎయిర్ టెల్ సాయపడుతుంది. మొత్తానికి దేశంలో ఉచిత ఆరోగ్యాన్ని సాధించడటంలో బంకర్‌ఫిట్ తన వంతు ప్రయత్నం చేస్తోంది. -
Viral Video: దేవతలా యోగా ఫోజు, పట్టుతప్పి..
ఆరోగ్యం కంటే.. అవతలి వాళ్లను ఆకర్షించడానికే చాలామందికి ఇప్పుడు యోగా ఉపయోగపడుతోంది. రకరకాల ఆసనాలతో ఇంటర్నెట్ అటెన్షన్ కొట్టేయడానికి ప్రయత్నిస్తున్నారు చాలామంది. ముఖ్యంగా సెలబ్రిటీలైతే రకరకాల భంగిమల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వాళ్లను వాళ్లు ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇక ఓ యువతి విచిత్రమైన ఆసనం కోసం ప్రయత్నించి బొక్కాబోర్లా పడ్డ వీడియో ఒకటి ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ప్రమాదకరంగా ఉన్న ఫీట్‌ను ఆ యువతి ప్రయత్నించడం విశేషం. బార్ టేబుల్‌పై కొంచెం ఎత్తులో రెండు మందు బాటిళ్లపై కాళ్లు పెట్టి.. చాలా కష్టతరమైన ఫోజు కోసం ఆ యువతి ప్రయత్నించింది. దేవతా మూర్తి తరహాలో ఫోజు ఇవ్వడానికి ప్రయత్నించింది. ఇంకేం బ్యాలెన్స్ ఆగక వెల్లకిల్లా పడిపోయింది. Hold my beer while I do the goddess yoga pose 🍺🧘♀️ pic.twitter.com/dfQASdfL2S — 🍺 Hold My Beer 🍺 (@HldMyBeer) June 25, 2021 అయితే ఆ యువతికి ఏం జరిగిందనేది, వీడియో ఎక్కడిది? ఎప్పటిది? అనే విషయాలపై మాత్రం క్లారిటీ లేదు. హోల్డ్ మై బీర్ అనే ట్విటర్ అకౌంట్ నుంచి వైరల్ అయిన ఈ వీడియోను షేర్ చేస్తున్న పలువురు ‘డోంట్ ట్రై దిస్’ అనే క్యాష్షన్ను ఉంచుతున్నారు. ఫొటోలు: బమ్ చిక్..బమ్ చిక్..చెయ్యిబాగా -
యోగా మా అక్కను మనిషిని చేసింది...
మా అక్క 21 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు యాసిడ్ అటాక్ జరిగింది. ఒక కన్ను, వక్షం, చెవి దగ్ధమయ్యాయి. ఆమె బండరాయిగా మారిపోయింది. ఆమెను మళ్లీ మనిషిని చేయడానికి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు యోగా ఆమెను కాపాడింది. నేను రోజూ ఆమెను యోగాకు తీసుకెళ్లడంతో ఆమె తిరిగి పూర్తి మామూలు మనిషయ్యింది... అని కంగనా రనౌత్ తన కుటుంబం యోగా వల్ల ఎంత లబ్ధి పొందిందో చెప్పుకొచ్చింది. ‘‘2006లో మా అక్క రంగోలికి 21 ఏళ్లు. అవినాష్ శర్మ అనే అతను ఆమెను ప్రేమిస్తున్నానని వెంటపడేవాడు. మా అక్క తిరస్కరించింది. ఒకరోజు అతను, మరో స్నేహితుడితో కలిసి మా అక్క మీద యాసిడ్ కుమ్మరించాడు. మా అక్క చెవి, చెంప, ఒక వక్షం పూర్తిగా దెబ్బ తిన్నాయి. కంటి చూపు పోయింది. ఆమెకు డాక్టర్లు 54 సార్లు కాస్మటిక్ సర్జరీ లు చేసి పూర్వపు ముఖం తేవడానికి ప్రయత్నించారు. ఆమెకు రెటినా రీప్లేస్మెంట్ అయ్యింది. వక్షాన్ని పూర్వరూపంలోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. ఆ సమయంలోనే ఒక సంబంధం మాట్లాడితే వచ్చిన కుర్రాడు మా అక్క ముఖం చూసి మళ్లీ రాలేదు. ఇవన్నీ జరిగాయి. అప్పుడు నాకు 18 ఏళ్లు. మా అక్క భౌతిక ఆరోగ్యం కంటే కూడా ఆ సమయంలో నేను ఎక్కువగా ఆలోచించింది మానసిక ఆరోగ్యం గురించే. ఆ ఆరోగ్యాన్ని ఆమె యోగా నుంచి పొందింది’ అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలియచేసింది కంగనా రనౌత్. ‘మా అక్క ఆ సమయంలో ఒక బండరాయిలా మారిపోయింది. ఏం మాట్లాడినా ఊరికే అలా చూసేది తప్ప స్పందించేది కాదు. మా జోక్స్‌కు నవ్వేది కాదు. అసలు తన మీద తాను విశ్వాసం ఉంచుకుందా లేదా అర్థమయ్యేది కాదు. ఆమెను నేను కాపాడుకోవాలనుకున్నాను. నేను ఎక్కడికి వెళితే అక్కడకు తీసుకువెళ్లేదాన్ని. అలాగే నా యోగా క్లాసులకు కూడా తీసుకెళ్లేదాన్ని. అక్కడకు వస్తూ ఉండటం వల్ల క్రమంగా ఆమెకు యోగా మీద ఆసక్తి ఏర్పడింది. ఆమె యోగా చేయసాగింది. ఆమెకు మెల్లమెల్లగా ఆత్మవిశ్వాసం పెరిగింది. జీవం వచ్చింది. చూపు మెరుగు అయ్యింది. ఆమె పూర్తిగా మామూలు మనిషి కావడంలో యోగా అద్భుతంగా పని చేసింది’ అని రాసింది కంగనా. ‘మా అమ్మకు ఒక దశలో కొలెస్ట్రాల్ పెరిగిందని, డయాబెటిస్ ఉందని ఓపెన్ హార్ట్ సర్జరీ వరకూ వెళ్లారు డాక్టర్లు. కాని నేను ఆమెను రెండు నెలలు ఆగు అని యోగాసనాలలోకి తెచ్చాను. ఆమె యోగా చేసింది. ఏ సర్జరీ అవసరం ఏర్పడలేదు. ఇవాళ మా ఇంట్లో అందరి కంటే ఆమే ఆరోగ్యంగా ఉంది’ అని రాసింది కంగనా. యోగా అంరత్గత శక్తులను వెలికి తీస్తుందన్న సంగతి తెలిసిందే. ఇలాంటి అనుభవాలు విన్నప్పుడు యోగాను స్వీకరించాల్సిన, సాధన చేయాల్సిన ఉత్సాహం కలిగితే అది చాలు కదా. -
కరోనా కాలంలో యోగా ఆశాకిరణం!
న్యూఢిల్లీ: కరోనాపై పోరుకు కావాల్సిన బలాన్నివ్వడంలో యోగా ఎంతో సాయం చేసిందని, ఈ కష్టకాలంలో యోగా ఒక ఆశాకిరణంలా కనిపించిందని ప్రధాని మోదీ ప్రశంసించారు. సోమవారం ఏడవ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పలువురు యోగా ఆచరించడం ద్వారా అంతర్జాతీయ యోగాడేను నిర్వహించారు. ఈ సందర్భంగా డబ్ల్యూహెచ్ఓ సహకారంతో రూపొందించిన ఎం– యోగా యాప్‌ను ప్రధాని ఆవిష్కరించారు. ఈ యాప్‌లో పలు భాషల్లో యోగా ట్రైనింగ్ వీడియోలు అందుబాటులో ఉంటాయి. పాత సాంప్రదాయం, ఆధునిక టెక్నాలజీ మేళవింపునకు ఈ యాప్ నిదర్శనమని ప్రధాని అభిప్రాయపడ్డారు. ‘వన్ వరల్డ్, వన్ హెల్త్’ సాకారమయ్యేందుకు ఈ యాప్ తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా గత ఏడాదిన్నరలో లక్షల మంది కొత్తగా యోగా నేర్చుకున్నారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. సమస్యలెన్ని ఉన్నా, పరిష్కారాలు మనలోనే ఉంటాయనేందుకు యోగా ఉదాహరణ అని కొనియాడారు. ఈ ఏడాది యోగా డే థీమ్‌గా ‘యోగా ఫర్ వెల్నెస్’ను ఎంచుకున్నారు. ప్రతి దేశం, ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు. భారత్ అందించిన బహుమతి ప్రపంచానికి భారత్ అందించిన అద్భుత బహుమతి యోగా అని రాష్ట్రపతి కోవింద్ కొనియాడారు. కరోనా సమయంలో యోగా మరింత సహాయకారని యోగా డే సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారతీయ సంస్థలు యోగా ఈవెంట్లు నిర్వహించాయి. ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద దాదాపు 3వేల మంది జతకూడి యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమం ద్వారా యోగాను మరింతమందికి చేరువచేయాలని భావించినట్లు ఇండియా కౌన్సిల్‌జనరల్ రణధీర్ చెప్పారు. ఖట్మండూలో ఇండియన్ ఎంబసీ ‘ఆజాదీకాఅమృత్ మహోత్సవ్’ పేరిట నిర్వహిస్తున్న సంబరాల్లో భాగంగా యోగాపై ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఆన్లైన్లో నిర్వహించింది. కోయంబత్తూర్‌లో పీపీఈ సూట్లు ధరించిన కొందరు కోవిడ్ పేషంట్లు యోగాసనాలు వేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు. లడఖ్‌లో ఐటీబీపీ జవాను ఒకరు మంచులో సూర్యనమస్కారాలు నిర్వహించారు. 2014లో జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినంగా ఐరాస ప్రకటించింది. -
mYoga: యోగా యాప్‌ను లాంచ్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ
న్యూ ఢిల్లీ: ఇంటర్నేషనల్ యోగా డేను పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ mYoga పేరుతో సరికొత్త యాప్‌ను లాంచ్ చేశారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా డబ్ల్యూహెచ్ఓ ఎంయోగా యాప్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.ఈ mYoga యాప్‌లో ఆడియో, వీడియో క్లిప్‌ల సహాయంతో యోగాపై ప్రజలకు మరింత అవగాహన కల్పిస్తుందని ఆయూష్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ యాప్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఈ యాప్ ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే ఐవోస్ యూజర్లకోసం అందుబాటులోకి రానుంది. ఈ యాప్‌ను ఉపయోగించి 12 నుంచి 65 సంవత్సరాల వయసు వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలిపింది. వివిధ రకాల ఆసనాలను నేర్చుకోవడానికి, సాధన చేయడానికి 10 నుంచి 45 నిమిషాల నిడివితో ఉన్న ఆడియో, వీడియో క్లిప్‌లను ఈ యాప్ అందిస్తోంది. ఇంటర్నేషనల్ యోగా డే ను పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ..‘‘కరోనాతో భారత్ సహా పలు దేశాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. దేశంలోని ప్రతి చోటు నుంచి చాలా మంది యోగా సాధకులుగా మారారు. కరోనాపై ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన అవసరం ఉంది. యోగాను సురక్ష కవచంగా మార్చుకోవాలి . యోగా ద్వారా రోగ నిరోధక వ్యవస్థ మెరుగవుతుంది. మంచి ఆరోగ్య సమకూరుతుంది. దీర్ఘకాల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. శారీరక, మానసిన దృఢత్వాన్ని యోగా పెంపొదిస్తుంది. కరోనా విపత్తు వేళ యోగా ఆశాకిరణంగా మారింది.’’ అని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. చదవండి: PM Modi: కరోనా విపత్తు వేళ యోగా ఆశాకిరణం -
ఆన్లైన్లోనే.. ఆరోగ్య ‘యోగ’
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ కారణంగా ప్రజల జీవనశైలిలో ఎన్నెన్నో మార్పులు తెచ్చింది. నాలుగు గోడల మధ్యలోనే అన్ని వ్యవహారాలూ చక్కబెట్టే ఓర్పూ నేర్పూ అలవాటు చేసింది. అదే క్రమంలో వ్యాయామాలకూ ఇళ్లే కేంద్రమైంది. మరీ ముఖ్యంగా కోవిడ్‌పై పోరాటం తప్పనిసరి కావడంతో యోగా, ప్రాణాయామ సాధనపై నగరవాసుల్లో ఆసక్తి బాగా పెరిగింది. కేవలం తాము నివసిస్తున్న నగరం నుంచి మాత్రమే కాదు వేర్వేరు ప్రాంతాలకు చెందిన యోగా శిక్షకులు శిక్షణ తరగతులకు సైతం హాజరయ్యే వెసులుబాటు కలిగింది. మొత్తం మీద చూస్తే ఆన్లైన్లోనే యోగా సాధన మరింత ప్రయోజనకరమంటున్నారు యోగా ప్రియులు. ‘‘గత రెండేళ్లుగా ఇంట్లోనే వ్యాయామం అలవాటైంది. కరోనాపై పోరాటానికి యోగా చాలా ఉపయోగపడుతుందని తెలిసింది, కాబట్టి ఇంటిల్లిపాదీ యోగా సాధన ప్రారంభించి కొనసాగిస్తున్నాం. ఆన్లైన్లో కృష్ణాజీ ఉచితంగా అందించే శిక్షణ తరగతులకు రెగ్యులర్‌గా అటెండ్ అవుతున్నాం’’ అని మెహదీపట్నంలో నివసించే స్మిత వాడేకర్ తెలిపారు. ఆన్లైన్లోనే మేలు... ఇతర వ్యాయామాల పరికరాల అవసరం గానీ, నేరుగా నేర్చుకోవడానికి ఆన్లైన్ శిక్షణకీ పెద్దగా తేడా లేకపోవడంతో ఆన్లైన్ యోగా అనూహ్యంగా అందరికీ సులభంగా దగ్గరైపోయింది. కేవలం ఒక యోగా మ్యాట్ తీసుకుని ఇంట్లో ఏ కాస్త జాగా దొరికినా యోగ చేయడం ఇప్పుడు సర్వసాధారణమైంది. ‘‘గతంలో ఎన్నోసార్లు యోగా శిక్షణ తీసుకుందాం అనుకుంటూనే వాయిదా వేస్తూ వచ్చాం. ఇప్పుడు ఇంట్లోకే యోగా క్లాసెస్ వచ్చేయడంతో ఇక వాయిదా వేయాల్సిన అవసరం లేకపోయింది’’ అని నగరానికి చెందిన ఐటీ ఉద్యోగి ఉమాకాంత్ చెప్పారు. గత కొన్ని నెలల్లో ప్రాణయామ, సూర్య నమస్కారాలు వంటి పలు రకాల సులభమైన ఆసనాల సాధన బాగా అలవాటైందని, నిజానికి యోగా శిక్షణకి వెళ్లడం కంటే ఆన్లైన్లోనే నేర్చుకోవడం మరింత సులభమనీ ఆయన అభిప్రాయపడ్డారు. పెరిగిన విశ్వాసం కోవిడ్ ప్రధానంగా శ్వాస కోస వ్యాధి కావడం, ఊపిరితిత్తుల సామర్ధ్యానికి య్రోగాలో భాగమైన పాణయామ వంటివి చాలా ఉపయుక్తమైనవి అని తేలడంతో యోగాపై నగరవాసుల్లో మరింత నమ్మకం బలపడింది. తక్కువ వ్యయ ప్రయాసలతోనే ఎక్కువ ఆరోగ్య లాభాలు అందించే దిగా యోగా సాధన సిటీజనులకు నచ్చే వ్యాయామాల జాబితాలో ప్రధమ స్థానం దక్కించుకుంది. ఉచితంగా..యోగా గత కొంత కాలంగా యోగా శిక్షణ అందిస్తున్నాను. లాక్‌డవున్ తర్వాత ఆన్లైన్ క్లాసులు ప్రారంభించాను. ఇంత పెద్ద సంఖ్యలో తెలుగు రాష్ట్రాల నుంచి ఆన్లైన్ యోగా శిక్షణకు హాజరవడం ఇంతకు ముందెన్నడూ చూడలేదు. కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన తర్వాత కూడా పలువురు ఆన్లైన్ ద్వారా యోగా సాధన చేసి త్వరగా వ్యాధి నుంచి కోలుకోగలిగారు. ఈ సమయంలో వీలైనంత ఎక్కువ మందికి ఉపయోగపడాలని పూర్తి ఉచితంగా యోగా శిక్షణ ఇస్తున్నాను. ఎవరైనా సరే మెయిల్ krishnajikorti@gmail.com ద్వారా లేదా ఫోన్ నెం: 9969860352లో సంప్రదించి పేరు నమోదు చేసుకోవచ్చు. -కృష్ణాజీ, శ్రీ నాగరాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా, ముంబయి చదవండి: Yoga Day 2021: ప్రపంచానికి భారత్ ఇచ్చిన బహుమతి యోగా : రాష్ట్రపతి -
యోగా సాధనతో సుఖ ప్రసవం
సాక్షి, హైదరాబాద్: యోగా అంటే మంచి ఆరోగ్యం కోసం, శరీర సౌష్టవం కాపాడుకునేందుకు చేస్తారనే చాలామందికి తెలుసు. అలాగే యోగా వత్తిడిని తగ్గిస్తుందనీ అంటారు. కరోనా నేపథ్యంలో ఇది మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ప్రెగ్నెన్సీ యోగాతో గర్భిణులకు చాలా మేలు జరుగుతుందని, ఆరోగ్యంగా ఉండటంతో పాటు సిజేరియన్ బాధ లేకుండా సహజమైన సుఖ ప్రసవం జరిగే అవకాశాలు పెరుగుతాయని చెబుతున్నారు ప్రెగ్నెన్సీ యోగా నిపుణురాలు అనిత అత్యాల. ఆరోగ్యవంతమైన బిడ్డ జననానికి ఈ ప్రత్యేక ప్రెగ్నెన్సీ యోగా దోహదపడుతుందని అంటున్నారు. అయితే డాక్టర్ల సలహాతో నిపుణుల వద్దే యోగా సాధన చేయాలని సూచిస్తున్న అనిత అత్యాలతో.. సోమవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ఇంటర్వూ్యలోని ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే.. ఆరోగ్యానికి అనుగుణంగా ఆసనాలు గర్భిణుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన (మోడిఫై చేసిన) ఆసనాలు, ప్రాణయామాన్నే ప్రెగ్నెన్సీ యోగా అని చెప్పవచ్చు. వీరికి చాప (మ్యాట్)తో పాటు కుర్చీ, బోలస్టర్ సహాయంతో వారి ఆరోగ్యానికి అనుగుణంగా ప్రత్యేక తరగతులు ఉంటాయి. అపోహతో అనర్థం గర్భం దాల్చిన తర్వాత ఏ పనీ చేయకూడదు.. విశ్రాంతిగా ఉండాలి అనే ఒక విధమైన అపోహతో సరైన వ్యాయామం చేయకపోవటం వల్ల సహజ ప్రసవాలు చాలా తగ్గిపోయాయి. కొన్నిసార్లు ప్రమాదకర పరిస్థితి కూడా ఏర్పడుతోంది. ఇందుకు కారణం శరీరాన్ని కొన్ని భంగిమలలో మాత్రమే ఉంచటం ద్వారా కండరాల పటుత్వం పెరగకపోవటం, బిడ్డ ఎదుగుదలకు అనువుగా మార్పులు చెందకపోవడం. దీంతో అనేక సమస్యలు ఏర్పడి ప్రసవ సమయంలో ఆపరేషన్ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల గర్భిణులు ప్రత్యేకమైనటువంటి వ్యాయామాలు, యోగా సాధన చేసినట్లయితే సిజేరియన్ బాధలేకుండా సహజ ప్రసవం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తల్లి ఆరోగ్యం బాగుంటుంది. గర్భంలో ఉన్న బిడ్డకు అన్ని అవయవాలు సక్రమంగా పెరుగుతాయి. బిడ్డ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. హార్మోన్లను సమతుల్య పరుస్తుంది గర్భం దాల్చిన తర్వాత మహిళల శరీరంలో అనేక మార్పులు వస్తాయి. హార్మోనల్ మార్పులు కూడా సంభవిస్తుంటాయి. వాటి మధ్య అసమతుల్యత ఏర్పడుతూ ఉంటుంది. ఇటువంటి సమయంలో యోగాసనాలు గర్భిణీకి చాలా ఉపయోగపడతాయి. అలాగే తలతిప్పడం, మలబద్దకం లాంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ సమయంలో మహిళలు తరచుగా ఆందోళన ఒత్తిడి, కోపం, మూడ్ స్వింగ్‌కు గురవుతుంటారు. అనులోమ, విలోమ, భ్రమరి, ప్రాణాయామాలు ఒత్తిడి ఆందోళనలను తగ్గించేందుకు సహాయపడతాయి. దీని ద్వారా శిశువుకు కూడా ఆరోగ్యం చేకూరుతుంది. గర్భం దాల్చిన తర్వాత యోగా సాధన చేయడం వల్ల గర్భిణులకు మంచి ఉపశమనం లభిస్తుందని మిచిగన్ విశ్వవిద్యాలయం పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ముందస్తు ప్రసవం తప్పించుకోవచ్చు గర్భిణులు ఆరోగ్యంగా ఉండటానికి సురక్షితమైన, సున్నితమైన మార్గంగా యోగా నిర్ధారించబడింది. 2012 లోనే జర్నల్ ఆఫ్ ఆల్టర్నేటివ్ అండ్ కాంప్లిమెంటరీ మెడిసిన్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. ప్రెనటల్ యోగా (స్ట్రెచింగ్, శ్వాస సంబంధిత)ను సాధన చేయడం ద్వారా శిశువు బరువు మెరుగవుతుందని, ముందస్తు ప్రసవ ప్రమాదం తగ్గుతుందని తేలింది. ఇక ఈ సమయంలో వెన్నునొప్పి, వికారం, నిద్రలేమి, తలనొప్పి, మధుమేహం వంటి అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడంలో ప్రెనటల్ యోగా సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రెనటల్ యోగా ఆసనాలను అభ్యసిస్తున్నప్పుడు తల్లి శరీర కండరాలు, రక్తప్రసరణ గణనీయంగా మెరుగుపడే అవకాశం ఉంది. యోగా సాధనతో తల్లితో పాటు శిశువుకు సులువుగా ఆక్సిజన్ అందుతుంది. గర్భిణీ స్త్రీ శరీర కండరాలు, లిగ్మెంట్స్ సాగదీయడానికి ఈ యోగా సహాయపడుతుంది. గర్భిణులకు మేలు చేసే ముఖ్యాసనాలు 1. వీరభద్రాసన 2. బద్ధ కోణాసన 3. తాడాసన 4. కటి చక్రాసన 5. ఊర్ధ్వ వజ్రాసన 6. మార్జారి ఆసన 7. త్రికోణాసన 8. పశ్చిమోత్తాసన -
International Yoga Day 2021: ధ్యానం... ఒక యోగం
ఈ ప్రపంచాన్ని నడిపించే అనంతమైన శక్తి ఒకటుంది. దానిని తెలుసుకుని, ఆ శక్తిని చేరుకోవడానికి మార్గమే ధ్యానం. ఆ ధ్యానం యోగంలో భాగం. ధ్యానం అంటే మనసులోకి చేసే ప్రయాణం. ఆ ప్రయాణం ఎందుకో, ఎలా చేయాలో తెలుసుకున్నవారు మానసికంగానూ, శారీరకంగానూ దృఢంగా ఉండగలరు. ఆది పరాశక్తి నుంచి త్రిమూర్తుల వరకు మహర్షుల నుంచి మహాయోగుల వరకు ప్రతి ఒక్కరూ ధ్యానయోగులే. మనమందరం ధ్యానించేది ఆ దేవుళ్లనే కదా, మరి ఆ దేవుళ్లు ధ్యానించేది ఎవరిని అన్న సందేహం కలగటం సహజం. దేవతలకన్నా బలమైన, మహత్తరమైన మహాశక్తి మరోటి ఉంది. ఆ శక్తే మనసు. ఆ మనసు బలంగా ఉన్నప్పుడే ఏ పనైనా చేయగలం. అసలు మనం ఏ పని చేయాలన్నా మనస్సు సహకరించనిదే ముందుకు పోలేం. మనస్సును అదుపు చేయడానికి, జయించడానికి ముఖ్య సాధనం ధ్యానం. నీరు ఏ పాత్రలో ఉంచితే ఆ పాత్ర ఆకారాన్ని బట్టే మనస్సు కూడా ఏ వస్తువుపై లగ్నమైతే ఆ వస్తువు రూపాన్ని సంతరించుకుంటుంది. దివ్యత్వాన్ని ధ్యానించే మనస్సు నిర్విరామ భక్తిభావంతో దానినే ధారణ చేస్తుంది. అంతరాయం లేని విద్యుత్ సరఫరాతో విద్యుద్దీపంలో తీగె వెలిగినట్టే, ధ్యానంతో మనసు తేజోమయమవుతుంది. – డి.వి.ఆర్. మౌనంగా ధ్యానం చెయ్యి. ఈ బాహ్య ప్రపంచపు విషయాలేవీ నీకు అంతరాయం కలిగించకుండా చూసుకో. నీ మనస్సు అత్యున్నత స్థితిలో ఉన్నప్పుడు, దాని గురించి నీకు చింత ఉండదు. మౌనంలో శక్తిని సమీకరించుకుని శక్తిజనక కేంద్రంగా మారు. – స్వామి వివేకానంద -
International Yoga Day: ప్రపంచ గురువుగా భారత్
నిరంతరం ఉరుకులు పరుగుల జీవితంలో మన శరీరం, మనస్సు రెండూ ఒత్తిడికి గురవుతున్నాయి. అలాంటి ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించే ఔషదమే యోగా. ప్రపంచ దేశాలకు యోగాను పరిచయం చేసింది మనదేశమే. క్రీస్తు పూర్వమే పతంజలి మహార్షి యోగాను అభివృద్ధి చేశారు. ఆ తర్వాత భారత దేశం నుంచి ఉద్భవించిన హిందూ, జైన, బౌద్ధ , సిక్కు మతాలు యోగాకు ప్రత్యేక స్థానం కల్పించాయి. 20వ శతాబ్ధం తర్వాత ఆరోగ్య పరిరక్షణలో యోగా ఒక భాగంగా చేసుకుంటున్న ప్రజల సంఖ్య పెరుగుతోంది. యోగాకు సంబంధించి ప్రపంచానికే భారత్ గురువుగా ఉంది. 2,000 ఏళ్ల చరిత్ర కలిగిన మన ప్రాచీన వారసత్వానికి వాస్తవమైన గుర్తింపును ఆపాదించే యోగాకు అంతర్జాతీయంగా ప్రాచుర్యం ఉన్నా కొన్ని వర్గాలకే అది పరిమితమైంది. ఈ నేపథ్యంలో ప్రధానిగా నరేంద్ర మోదీ పదవీ బాధ్యతలు చేపట్టాక కేవలం ఆరు నెలల్లోనే యోగాకు పెద్దపీట వేశారు. ప్రపంచం అనారోగ్యం నుంచి ఆరోగ్యంవైపు వెళ్లేందుకు యోగానే సన్మార్గమంటూ ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు 2014 సెప్టెంబర్ 27న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో యోగా ప్రాధాన్యం గురించి ఆయన ప్రసగించారు. ఆ తర్వాత భారత ప్రధాని చూపిన చొరవతో, ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని 2014 డిసెంబర్ 11న ఐక్యరాజ్య సమితి తీర్మానించింది. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి 177కు పైగా దేశాలు మద్దతు పలుకగా, మరో 175 దేశాలు తీర్మానాన్ని సమర్థించాయి. అప్పటి నుంచి ప్రతీ ఏడు జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా యోగాను ప్రాక్టీస్ చేసే ఎందరో ఈ రోజు జరిగే వేడుకల్లో భాగం అవుతున్నారు. పాశ్చాత్య దేశాల్లో క్రమంగా యోగాకు ప్రాచుర్యం పెరుగుతోంది. చాలా దేశాల్లో యోగాను ఆచరిస్తున వారి సంఖ్య క్రమ క్రమంగా పెంజుకుంటోంది. వివిధ వ్యాయామాల సమాహారమే యోగ. ఈ ప్రక్రియను నిత్యం ఆచరించడం ద్వారా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండవచ్చు. యోగాలోనే ఒక భాగమైన హఠయోగాన్ని నేర్చుకుంటే వందల ఏళ్లు బతకొచ్చంటూ యోగాపై అపార అనుభవం ఉన్న వారు చెబుతుంటారు. పవాహారిబాబా నుంచి స్వామి వివేకనంద వరకు హఠయోగం నేర్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. -
సులభమైన యోగాసనాలు మీకోసం: మాధురీ దీక్షిత్
శారీరక, మానసిక ఆరోగ్యాన్ని యోగా ఎంతో మేలు చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా యోగా ఎంతో ఆదరణను పొందుతోంది. ఇప్పుడు ప్రపంచ ప్రజలంతా యోగా వైపే చూస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ యోగాతో ఆరోగ్యాన్నిపెంపొందించుకుంటున్నారు. ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా యోగాతో అందాన్ని కూడా పెంచుకోవచ్చు. అందుకే మన సినీ తారలంతా యోగా ఆసనాలు వేసి వారి అందాన్ని మరింత పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో జూన్ 21 అంతర్జాతీయ యోగా డే సందర్భంగా బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ తప యోగా వీడియోను షేర్ చేశారు. ‘యోగా నా రోజు వ్యాయమంలో ఒక భాగం అయ్యింది. త్వరలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కొన్ని సులభమైన యోగా ఆసనాలు మీకోసం. రండి నాతో పాటు మీరు కూడా ఈ ఆసనాలు చేయండి’ అంటూ మాధురి దీక్షిత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసనాలు వేసి చూపించారు. View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) -
Yoga: డిప్రెషన్‌కు ఔషధ యోగం!
యోగా ఎంత మంచిదో ఇప్పటికీ మనకందరికీ తెలుసు. అంతేకాదు... పరిశోధనలూ, అధ్యయనాలూ జరుగుతున్న కొద్దీ మన యోగా తాలూకు ప్రాముఖ్యం కొత్త కొత్త విషయాలతో మాటిమాటికీ ప్రపంచానికి తెలియవస్తూనే ఉంది. ఇప్పుడు మళ్లీ మరోసారి కొత్తగా పాశ్చాత్యుల పరిశోధనల్లో సైతం యోగా గురించి మరో అంశం తాజాగా వెలుగుచూసింది. గర్భం ధరించిన యువతుల్లో అనేక హార్మోన్ల మార్పుల వల్ల భావోద్వేగాల మార్పులు (మూడ్ స్వింగ్స్) సాధారణం. అయితే ప్రతి ఐదుగురు గర్భవతులను పరిశీలిస్తే... వారిలో ఒకరికి ఈ మార్పులు చాలా తీవ్రంగా కనిపిస్తుంటాయి. ఇటీవల మిషిగాన్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంతో ఈ మూడ్ స్వింగ్స్కు ఒక ఆరోగ్యకరమైన పరిష్కారం కనిపిస్తోంది. గర్భవతుల్లో ఒత్తిడిని ఎంత ఎక్కువగా తగ్గించగలిగితే... మూడ్ స్వింగ్స్ తీవ్రత అంతగా తగ్గుతుందని పరిశోధక బృందం తెలుసుకున్నారు. మూడ్ స్వింగ్స్ కారణంగా కలిగే డిప్రెషన్ లక్షణాల (డిప్రెసివ్ సింప్టమ్స్) ను నివారించేందుకు ఒత్తిడిని తొలగించేలా స్ట్రెస్ బస్టర్ షెడ్యూల్‌ను రూపొందించారు. ఈ అధ్యయన బృందానికి నేతృత్వం వహిస్తున్న మారియా ముజిక్ మాట్లాడుతూ ‘‘భారతీయుల యోగా మంచి స్ట్రెస్ బస్టర్ అని మనం గతంలోనే విని ఉన్నాం. అయితే అప్పట్లో దీన్ని పూర్తి తార్కాణాలతో నిరూపించేలా పరిశోధన ఫలితాలేమీ లేవు. దాంతో వాటి ఫలితాలు ఎలా ఉంటాయన్న విషయాలను రికార్డు చేసే పనిలో పడ్డాం. ఈ పనిలో మాకోవిషయం తెలియవచ్చింది. గర్భవతులు అనుసరించదగిన ఆరోగ్యకరమైన, సురక్షితమైన యోగా ప్రక్రియలతో అటు తల్లికి, ఇటు బిడ్డకు మేలు జరుగుతుందని మా అధ్యయనంలో తేలింది’’ అన్నారు. కొత్తగా తల్లి కాబోయే యువతుల్లో హార్మోన్ల మార్పుల వల్ల మానసిక సమస్యలు రావడం చాలా సాధారణం. అయితే వీటికి చికిత్స చేయకుండా అలాగే వదిలేయడం వల్ల తల్లికీ, బిడ్డకూ హాని చేకూరడానికి అవకాశాలు ఎక్కువ. పైగా ఇలాంటి మహిళల్లో తల్లీ, బిడ్డా బరువు కోల్పోవడం, ప్రీ ఎక్లాంప్సియా, నెలలు నిండకముందే కాన్పు కావడం వంటి దుష్పరిణామాలు సంభవించవచ్చు. అయితే గర్భవతులు పాటించదగిన సురక్షితమైన యోగా ప్రక్రియలు ఇలాంటి దుష్పరిణామాలను నివారించడమే గాక... తల్లికీ, బిడ్డకూ మధ్య మంచి ప్రేమానురాగాలను కూడా మరింత ఇనుమడింపజేస్తాయని మారియా ముజిక్ పేర్కొన్నారు. ఈ అధ్యయనంలో 1226 మంది గర్భిణులు రోజూ 90 నిమిషాలపాటు యోగా చేయడం వల్ల కడుపులోని పిండం మరింత ఆరోగ్యంగా పెరుగుతున్నట్లు తెలిసింది. యోగా చేసే తల్లులు ఈ మార్పులను సులభంగా గుర్తిస్తున్నట్లుగా కూడా తేలింది. అయితే గర్భవతులు అనుసరించాల్సిన యోగా ప్రక్రియలను కేవలం నిపుణులైన యోగా టీచర్ల సమక్షంలోనే ఆచరించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చదవండి: ఆమెకు సముద్రమే అన్నం ముద్ద -
వ్యాక్సిన్లపై రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: యోగా గురు రాందేవ్ బాబా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాక్సిన్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని వ్యాఖ్యానించారు. తాను టీకా తీసుకోలేదని, సుదీర్ఘం కాలంగా సాధన చేస్తున్న యోగా, ఆయుర్వేదమే తనకు రక్ష అని పేర్కొన్నారు. ఈ సందర్భంగావ్యాక్సిన్‌ల సమర్థత, అల్లోపతి ప్రభావంపై తన దాడిని మరింత తీవ్రం చేశారు. తద్వారా అల్లోపతి, ఆయుర్వేదం మధ్య రగిలిన వివాదానికి మరింత ఆజ్యం పోశారు. పురాతన భారతీయ వైద్య విధానం ఆయుర్వేదానికి వ్యతిరేకంగా ఒక పథకం ప్రకారం పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోందని ఆయన ఆరోపించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) వెయ్యికోట్ల రూపాయల పరువు నష్టం దావా హెచ్చరిక అనంతరం రాందేవ్ తాజా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దశాబ్దాలుగా యోగా, ఆయుర్వేదం అభ్యసిస్తున్నాను, కాబట్టి తనకు టీకా అవసరం లేదని రాందేవ్ వాదించారు. భారతదేశంతో పాటు విదేశాలలో 100 కోట్లకు పైగా ప్రజలు ఈ పురాతన చికిత్స ద్వారా లబ్ది పొందుతున్నారనీ, రానున్న కాలంలో ఆయుర్వేదానికి ప్రపంచవ్యాప్తంగా ఆమోదం లభించనుందని ఆయన పేర్కొన్నారు. కాగా వ్యాక్సినేషన్ ఉత్తరాఖండ్ డివిజన్ ఐఎంఏ పరువు నష్టం నోటీసును పంపించిన సంగతి తెలిసిందే. "స్టుపిడ్ సైన్స్" అల్లోపతి మందుల సామర్థ్యాన్ని ప్రశ్నిస్తూ ఆయన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. 15 రోజుల్లోగా లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పక పోతే, రూ.1,000 కోట్లకు పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లేఖ రాసింది. వ్యాక్సినేషన్ విషయంలో ఆయన చేస్తున్న తప్పుడు వ్యాఖ్యాలను నిలువరించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. అంతేకాకుండా దోశద్రోహ చట్టం ప్రకారం ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల 10 వేల మంది డాక్టర్లు చనిపోగా, లక్షల మంది ప్రజలు అల్లోపతి వైద్యం వల్ల మరణించారన్న రాందేవ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. అలాగే ఈ విషయంలో రాందేవ్ వాదనలకు సమాధానం ఇవ్వడానికి తాము సిద్ధమని ఉత్తరాఖండ్ ఐఎంఏ ప్రధాన కార్యదర్శి డాక్టర్ అజయ్ ఖన్నా ప్రకటించిన సంగతి తెలిసిందే. చదవండి: కరోనా మూలాలు కనుక్కోండి: లేదంటే మరిన్ని మహమ్మారులు వ్యాక్సిన్: మందుబాబులకు పరేషాన్! కరోనా: మరో గుడ్ న్యూస్ చెప్పిన డా.రెడ్డీస్ -
బెలూన్లు ఊది.. ఒక్క ఊపిరితిత్తితోనే కరోనాను జయించిన నర్సు
భోపాల్: భారత్‌లో ఇటీవల కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేసులతో పాటు మరణాలు కూడా విపరీతంగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో అధిక భాగం ఊపిరి అందక వేలాది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మరో పక్క కరోనా వచ్చిందనే భయంతోనే.. కొందరు ఊపిరి ఆడటంలేదనే ఆందోళనతో కూడా కొన్ని ప్రాణాలు గాల్లో కలిసిన ఘటనల ఉన్నాయి. కానీ ధైర్యం, నమ్మకం ఉంటే కరోనా మనల్ని ఏం చేయలేదని నిరూపించింది ఓ మహిళ. ఒక్క ఊపిరితిత్తితో తనపై దాడిచేసిన కరోనా వైరస్ జయించింది. అది కూడా హోమ్ ఐసోలేషన్‌లో ఉండి 14 రోజుల్లోనే తరిమేసింది మధ్యప్రదేశ్ కు చెందిన ఓ నర్సు. కంగారు పడక.. కరోనాను జయించింది మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రఫులిత్ పీటర్ టికామ్‌గఢ్ ఆసుపత్రిలో నర్సుగా కొవిడ్ వార్డులో పనిచేస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు ఇటీవల కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. కరోనా ప్రభావం ఎక్కువగా ఊపిరితిత్తులపైనే ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. దీంతో ఒక్క ఊపిరితిత్తితోనే బతుకుతున్న ప్రఫులిత్ పీటర్ ఏమైపోతుందోనని కుటుంబ సభ్యులు, సన్నిహితులు భయపడిపోయారు. కానీ ప్రపులిత్ మాత్రం కేవలం 14 రోజులపాటు హోం ఐసోలేషన్‌లో ఉండి వేగంగా కోలుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. కరోనాను జయించిన ప్రపులిత్ అది తనకు ఎలా సాధ్యమైందో మాట్లాడుతూ.. కరోనా సోకినా నేను భయపడలేదు. ధైర్యం కోల్పోలేదు. హోం ఐసోలేషన్‌లో ఉన్నప్పుడు యోగా, ప్రాణాయామం, బ్రీతింగ్ ఎక్స్‌ర్‌సైజ్‌లు క్రమం తప్పకుండా చేసేదాన్ని. అలాగే ఊపిరితిత్తులకు బూస్టింగ్ ఇవ్వటానికి బెలూన్లు ఊదేదాన్ని అని చెప్పుకొచ్చింది. ఆమె ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకుంది. దీనికితోడు తన ధైర్యమే కరోనా మీద విజయం సాధించేలా చేసిందని ప్రఫులిత్ చెప్పుకొచ్చింది. ప్రఫులిత్ పీటర్ చిన్నప్పుడు ఓ ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో ఒక ఊపిరితిత్తి బాగా డ్యామేజ్ కావడంతో ఆపరేషన్ చేసి ఒకదాన్ని తొలగించాలని చెప్పారు. వేరే దారి లేక కుటుంబ సభ్యుల అనుమతితో డాక్టర్లు ఒక ఊపిరితిత్తిని తొలగించారు. అప్పటి నుంచి ప్రపులిత్ ఒక్క ఊపిరితిత్తితోనే జీవిస్తోంది. ( చదవండి: విషాదం: రోజు వ్యవధిలో కడుపులో బిడ్డ, డాక్టర్ మృతి ) -
యోగా చేస్తున్నారా? అయితే ఇలా మాత్రం అస్సలు వద్దు
మానవ జీవన గమనాన్ని మార్చే దివ్య ఔషధం యోగా.. దీన్ని సరైన నియమ నిబంధనలతో ఆచరిస్తేనే శారీరకంగా, మానసికంగా, దృఢంగా ఉండగలం. మనలో చాలామంది యోగాసనాలను ఎలా పడితే అలా వేస్తుంటారు. ఇలా చేయడం వలన సత్ఫలితాలు రాకపోగా ఫలితాలు తారుమారయ్యే ప్రమాదం ఉంది. ఆసనాలు వేసే ముందు కనీస జాగ్రత్తలు తీసుకోవడం వలన అద్భుతమైన ఫలితాలు రాబట్టవచ్చు. యోగా చేయాలనుకునేవారు తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు పరిశీలిద్దాం.. తినగానే చేయొద్దు.. యోగాసనాలు వేసే ముందు ఆహరం విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం. ఈ విషయంలో చాలామందిలో సరైన అవగాహన లేకపోవడం వలన ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంటారు. నిపుణుల సలహా ప్రకారం ఏదైనా తిన్న రెండు గంటలలోపు యోగా చేయడం మంచిది కాదు. అలాగే ఆహరం అంటే సుష్టుగా భోంచేయడం కాదు. మరోమాట, అసలు తినవద్దు అన్నారని ఉపవాసం చేసి యోగా చేయడం కూడా మంచిది కాదు. ఆసనాలు వేసే ముందు ఖాళీ కడుపు ఉండకుండా తక్కువ పరిమాణంలో తేలికైన ఆహారం తీసుకోవడం మంచిది. కడుపు నిండా ఆహరం తీసుకుని యోగాసనాలు వేయడం వలన జీర్ణ సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. అలాగే తాగే నీటి విషయంలోను అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఆసనాలు వేసే గంట ముందు చిన్న గ్లాసు నీళ్ళు మాత్రమే తీసుకోవాలి. యోగా చేస్తున్న సమయంలో బాగా దాహం వేస్తే మధ్యలో గుక్కెడు నీరు తీసుకోవచ్చు. అలా ఆరంభించాలి.. యోగాసనాలను నేరుగా మొదలుపెట్టకూడదు. మొదట ప్రాణాయామం, శ్వాస క్రియలు ఆచరించిన తర్వాతే ఆసనాలు వేయడం మొదలుపెట్టాలి. ఇలా చేయడం వలన అలుపు లేకుండా ఆసనాలను ఎక్కువ సమయం వేయవచ్చు. దీంతో ఆశించిన స్థాయిలో సత్ఫలితాలు వస్తాయి. ప్రాణాయామంలో భాగంగా శ్వాసపై ధ్యాస పెట్టడం వలన మానసికంగా ఉత్తేజం పొందవచ్చు. పై నియమాలు పాటిస్తూ క్రమపద్ధతిలో యోగా ఆచరిస్తే.. శారీరకంగా , మానసికంగా ధృడంగా మారవచ్చు. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, గ్రహణ శక్తి పెరుగుతాయి.ఆత్మవిశ్వాసం, స్వీయక్రమశిక్షణ వంటి సులక్షణాలు అలవడతాయి. భావోద్వేగాలు నియంత్రణలో ఉంటాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు,టైప్ 2 మధుమేహం వంటి వ్యాధులను దూరం చేస్తుంది. ఊబకాయంతో బాధపడేవారికి ఇది సంజీవనిలా పనిచేస్తుంది. శ్వాసకోశ, జీర్ణకోశ సంబంధిత వ్యాధులు తొలగిపోతాయి. కీళ్ళ నొప్పులు, తలనొప్పి, మైగ్రేన్, మెడ , వెన్నునొప్పుల వంటి సమస్యల నుంచి విముక్తి. ఎముకలు ధృడంగా మారతాయి. సైనస్, అలర్జీ వంటి దీర్ఘకాలిక సమస్యలు దూరమవుతాయి. యోగాసనాలు శరీరంలోని హర్మోన్లను నియంత్రించడంలో ఎంతగానో సహయ పడతాయి. నిద్రలేమి సమస్యలు, కంటి సమస్యలు మాయమవుతాయి. గ్యాడ్జెట్స్ పక్కన పెట్టండి.. యోగా చేసే సమయంలో సెల్‌ఫోన్, ఐపాడ్, టీవి వంటి గ్యాడ్జెట్స్‌కు దూరంగా ఉండడం చాలా ఉత్తమం. వీటి వలన ఏకాగ్రత దెబ్బతిని ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోగా దీని ప్రభావం మీ దినచర్యలోని ఇతర పనులపై పడే ప్రమాదం ఉంది. ప్రశాంతతే కీలకం.. యోగాను ఎక్కడపడితే అక్కడ చేయకూడదు. దీనికంటూ ప్రత్యేకమైన ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. నిశ్శబ్ధమైన ప్రదేశంలో ఎటువంటి ఆదరాబాదరా లేకుండా ప్రశాంతమైన మనస్సుతో యోగాభ్యాసం చేయడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది.యోగా ముగిసిన అనంతరం శవాసనం వేయడం మరవకూడదు. అనారోగ్యంగా ఉన్నప్పుడు దూరం.. దగ్గు, జ్వరం, నీరసం, తలనొప్పి వంటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు యోగాసనాల జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఇలాంటి పరిస్థితుల్లో యోగాసనాలు వేయడం వలన మొదటికే మోసం రావచ్చు. -
కరోనా కాదు.. ముందు భయాన్ని వీడండి.. థింక్ పాజిటివ్
సాక్షి, గాంధీఆస్పత్రి( హైదరాబాద్): మనోధైర్యంతో కరోనా మహమ్మారిని జయించారు.. నాలుగు గోడల మధ్య ఒంటరిగా హోంక్వారంటైన్లో ఉంటూ పాజిటివ్ దృక్పథంతో ఆలోచించడంతో కోవిడ్ నెగిటివ్ వచ్చింది. ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల చుట్టూ తిరిగి లక్షల రూపాయలు ఖర్చు చేయకుండా చిన్న చిట్కాలతో కరోనాను చిత్తు చేశారు. ప్రతిరోజూ ప్రాణాయామం, యోగాతోపాటు బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు చేసి శ్వాస సంబంధ సమస్యలు అధిగమించారు. కుటుంబసభ్యులు, బంధువులతో వీడియో కాలింగ్, ఛాటింగ్ చేస్తూ ఒంటరితనాన్ని దూరం చేస్తూ ఆనందంగా గడిపారు. తేలికపాటి వ్యాయామాలు చేస్తూ ఆక్సిజన్ సాచ్యురేషన్ లెవల్స్ తగ్గకుండా చూసుకున్నారు. వేడినీళ్లు మాత్రమే తాగుతూ, ఉప్పు, పసుపు వేసిన నీటిని గొంతులో పోసుకుని గార్గిల్ చేస్తూ, రెండు పూటలా ఆవిరిపట్టారు. గదిలో ఒంటరిగా ఉన్నామనే భావన మనసులోకి రానీయకుండా, ఒత్తిడి కలిగించే అంశాలను ఆలోచించకుండా, కుటుంబసభ్యుల సహాయ సహకారాలతో క్వారంటైన్‌ను మామూలు రోజుల్లాగే కామన్‌గా గడిపారు. గడువు ముగిసిన తర్వాత నిర్వహించిన వైద్యపరీక్షల్లో నెగిటివ్ రావడంతో కరోనాను జయించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారు. హోంఐసోలేషన్లో ఉంటూ కరోనాపై విజయం సాధించిన పలువురు సలహాలు, సూచనలతోపాటు తమ అభిప్రాయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ధైర్యమే బతికించింది నా వయసు 65 ఏళ్లు.. మాది ఉమ్మడి కుటుంబం. స్వల్ప అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. టెస్ట్ చేయిస్తే కరోనా పాజిటివ్ వచ్చింది. ఆస్పత్రిలో జాయిన్ చేస్తామంటే వద్దని, హోంఐసోలేషన్లో ఉంటానని చెప్పాను. తర్వాత కుటుంబ సభ్యుల్లో ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. నలుగురం కలిసి అపార్ట్మెంట్ ఫ్లాట్‌లో ఉన్నాం. పల్స్ ఆక్సిమీటర్ తెప్పించుకున్నా. ప్రతిరోజు ఉదయం ప్రాణాయామం, యోగా సాధన. కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో వీడియో కాలింగ్, చాటింగ్ చేసుకుంటూ ఆనందంగా గడిపాను. 14 రోజుల తర్వాత టెస్ట్ చేయించుకుంటే అందరికీ నెగిటివ్ వచ్చింది. – మణెమ్మ, శ్రీనివాసనగర్, సీతాఫల్మండి భయాందోళన వద్దు కరోనా పాజిటివ్ వస్తే భయాందోళన వద్దు. గతనెల 5వ తేదీన నాకు, మానాన్న నర్సింగ్‌రావుకు ఒకేరోజు జ్వరం వచ్చింది. ట్యాబ్లెట్లు వేసుకున్నాక జ్వరం తగ్గింది. వైద్యుల సూచన మేరకు కరోనా ర్యాపిడ్ టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది. హోంక్వారంటైన్లో ఉండాలని నిర్ణయించుకున్నాం. మా నాన్న అందించిన ధైర్యంతో భయాన్ని పోగొట్టింది. ఆవిరి పట్టడం, కషాయం తాగడం, పోషకాహారం తినడంతోపాటు మనసుకు ఉత్సాహాన్ని ఇచ్చే సంగీతం, పాటలు వింటూ ఆనందంగా గడిపాం. అమ్మ సహకారంతో హోంక్వారంటైన్ పూర్తిచేశాం. తర్వాత నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్ వచ్చింది. – లక్ష్మీప్రియ, ప్రైవేటు ఎంప్లాయి, న్యూబోయిగూడ జాగ్రత్తలు పాటించా.. నేను కోవిడ్ నోడల్ కేంద్రమైన గాంధీ ఆస్పత్రిలో నాల్గవ తరగతి కాంట్రాక్ట్ ఉద్యోగిని. కరోనా బాధితుల మధ్యే సేవలు అందిస్తుంటాను. ఈ క్రమంలో స్వల్ప అస్వస్థతకు గురికావడంతో టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది. ఇంట్లో భార్యతోపాటు ముగ్గురు చిన్నపిల్లలు, వృద్ధురాలైన అమ్మ ఉన్నారు. గాంధీ సూపరింటెండెంట్ రాజారావు, నోడల్ అధికారి ప్రభాకర్‌రెడ్డి ఇతర వైద్యులు ఆస్పత్రిలో బాధితులకు ఇచ్చే కౌన్సిలింగ్ గుర్తుకు వచ్చింది. అవసరమైతేనే ఆస్పత్రికి రావాలి. జాగ్రత్తలు పాటిస్తే సులభంగా తగ్గిపోతుంది. ఆ మాటలు గుర్తొచ్చి 14 రోజులు హోంక్వారంటైన్లో ఉన్నాను. ఇప్పుడు కరోనా నెగిటివ్ వచి్చంది. – గణపతి, గాంధీఆస్పత్రి స్టాఫ్ మెదడులో హార్మోన్ల సంఖ్య తగ్గి.. తీవ్రమైన భయాందోళనకు గురికావడం వల్లే కరోనా మృతుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఒత్తిడి పెంచే అంశాలు వలన మెదడులోని హార్మోన్ల సంఖ్య తగ్గి శరీర అవయవాలు సక్రమంగా పనిచేయవు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వాటిని గుడ్డిగా నమ్మవద్దు. ముక్కులో నిమ్మరసం పిండుకుంటే కరోనా తగ్గుతుందని వీడియోను చూసిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కరోనా బాధితులు మధుర క్షణాలను మాత్రమే గుర్తుచేసుకుని ఆనందంగా ఉండాలి. గాంధీ ఆస్పత్రిలో ప్రతిరోజూ వందలాది మంది బాధితులకు కౌన్సిలింగ్ నిర్వహించి వారి ఆలోచన విధానంలో మార్పు తెచ్చి స్వస్థత చేకూర్చేందుకు కృషి చేస్తున్నాం. – జూపాక అజయ్‌కుమార్, సైకియాట్రిస్ట్ ( చదవండి: ఆక్సిజన్ కొరత లేదు.. కరోనా కంట్రోల్లోనే: సీఎస్ ) -
ఇప్పుడు శ్వాస తీసుకోగలుగుతున్నా: పూజా హెగ్డే
సమయాన్ని వృథా చేయడాన్ని కొందరు హీరోయిన్లు అస్సలు ఇష్టపడరు. ఈ జాబితాలో అగ్ర హీరోయిన్లలో ఒకరైన పూజా హెగ్డే పేరు కచ్చితంగా ఉంటుంది. పూజ చేతిలో ఉన్న అరడజను (‘రాధేశ్యామ్’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, ‘ఆచార్య’, ‘సర్కస్’, ‘కభీ ఈద్.. కభీ దీవాలీ’, తమిళ విజయ్‌తో సినిమా) సినిమాలే ఇందుకు నిదర్శనం. ఇటీవలే కరోనా సోకడం వల్ల పూజా హెగ్డే హోమ్ ఐసోలేషన్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. కానీ ఈ టైమ్‌ను కూడా క్వాలిటీగా వినియోగించుకుంటున్నారామె. వర్చ్యువల్ యోగా సెషన్స్‌లో పాల్గొన్నారు పూజ. అంతేకాదు... ఆన్లైన్లో ఈ సెషన్స్‌ను షేర్ చేశారీ బ్యూటీ. ‘‘ఈ కోవిడ్ క్లిష్ట పరిస్థితుల్లో అందరూ ప్రాణాయామాన్ని ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రాణాయామం మనకు ఎంతో మేలు చేస్తుంది. మనం మెరుగైన విధంగా శ్వాసను తీసుకోగలిగేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ ప్రాణాయామం వల్ల నేను సరిగ్గా శ్వాస తీసుకోగలుగుతున్నాను’’ అన్నారు పూజా హెగ్డే. దర్శకుడు హరీష్ శంకర్, హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వంటి ప్రముఖులు పూజా ఆన్లైన్ సెషన్‌ను ఫాలో అవ్వడం విశేషం. View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) -
Immunity పెరగడానికి యోగ, ప్రాణాయామం
-
బెగ్గర్లకు బంపరాఫర్: ప్రభుత్వం నుంచి రోజుకు రూ.215
రాజస్తాన్: ఇంట్లో నుంచి బయటకు వచ్చామంటే ఎక్కడో ఒకదగ్గర యాచకులు తారసపడుతుంటారు. కొందరు వారి పరిస్థితిని అర్థం చేసుకుని చేయగలిగిన సాయం చేస్తే మరికొందరు విస్కుంటూ ఉంటారు. కానీ ఇటువంటి వారి జీవితాలు మర్చేందుకు రాజస్థాన్ ప్రభుత్వం అక్కున చేర్చుకుంటోంది. ఈ క్రమంలోనే జైపూర్‌లో ‘బెగ్గర్‌ఫ్రీ’ అనే వినూత్న కార్యక్రమానికి రాజస్థాన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాజస్తాన్ స్కిల్ అండ్ లైవ్లీహుడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఆర్ఎస్ఎల్డీసీ), సోపన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ భాగస్వామ్యంతో బెగ్గర్ ఫ్రీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం 43 మంది యాచకులను చేరదీశారు. వీరంతా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిషా రాష్ట్రాల నుంచి జైపూర్ లో యాచిస్తూ జీవిస్తున్నారు. ఈ 43 మందికి వసతి సదుపాయం కల్పించి, యోగా నేర్పించడం, ఆటలు ఆడించడం, కంప్యూటర్ తరగతులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేస్తున్నారు. బెగ్గర్స్ ఫ్రీ కార్యక్రమం గురించి రాజస్థాన్ స్కిల్ అండ్ లైవ్లీహుడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నిరజ్ కుమామర్ పవన్ మాట్లాడుతూ... రాష్ట్రంలోని యాచకులందర్ని బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. యాచకులు లేని రాష్ట్రంగా రాజస్థాన్‌ను తీర్చిదిద్దాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించడంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు పవన్ తెలిపారు. రాజస్థాన్ పోలీసులు జైపూర్‌లో నిర్వహించిన సర్వే ఆధారంగా బెగ్గర్స్ ఫ్రీ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించామని, దీనికోసం ‘కౌశల్ వర్ధన్’ అనే కేంద్రాన్ని ఏర్పాటు చేసి బ్యాచుల వారీగా శిక్షణ నిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 20 మంది నైపుణ్య శిక్షణ పొందుతున్నారని, శిక్షణ పూరై్తన తరువాత ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. తొలిసారి జైపూర్‌లో ప్రారంభించిన ఈ కార్యక్రమం విజయవంతమైతే భవిష్యత్తులో రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు విస్తరిస్తామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతామని విశ్వాసం వ్యక్తం చేశారు. యోగా ట్రైయినర్ మాట్లాడుతూ.. సాధారణ వ్యక్తులతో పోలిస్తే వీరు కాస్త భిన్నంగా ఉంటారు. మానసికంగానే గాక, వివిధ అనారోగ్య సమస్యలతో శారీరకంగానూ బలహీనంగా ఉంటారు. అందువల్ల వ్యక్తిగతంగా మాట్లాడి మానసిక, శారీరక స్థితిగతులను అంచనావేసిన తరువాత వారికి యోగా నేర్పిస్తున్నట్లు చెప్పారు. ‘‘సమాజంలో యాచకులకు గౌరవప్రదమైన జీవితాన్ని ఇవ్వడమే తమ లక్ష్యమని సోపన్ సంస్థ అధికారి చెప్పారు. మూడున్నర నెలలపాటు వారికి శిక్షణతోపాటు రాజస్థాన్ ప్రభుత్వం వారికి రోజుకు రూ.215 చెల్లిస్తుంది. ఈ నగదు భవిష్యత్తులో వ్యాపార అవసరాలకు ఉపయోగపడుతుందని వివరించారు. -
రకుల్ ఫిట్నెస్ మంత్రా : ఫ్యాన్స్ ఫిదా
సాక్షి, హైదరాబాద్: అందం, అభినయంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్య యోగాసనాలతో కూడా బాగానే ఆకట్టుకుంటున్నారు. ఇటీవల కరోనా బారిన పడిన రకుల్ ఆరోగ్యంగా ఉండాలనే ధ్యేయంతో పాటు మరింత ఫిట్నెస్ సాధించేందుకు కృషి చేస్తున్నట్టు కనిపిస్తోంది. యోగాలో అతికష్టమైన ఆసనంతో కొత్త యోగిని భామగా అవతరించారు. ఈ మేరకు ఆమె ఒక క్లిష్టమైన ఆసన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. తెలుగు, తమిళంతోపాటు, పలు భాషల మూవీ కమిట్మెంట్స్ తో బిజీ బిజీగా ఉన్న ఈ బ్యూటీ తన ఫిట్నెస్ పోస్ట్‌లతో సందడి చేస్తోంది. తాజాగా మరో అద్భుతమైన యోగా భంగిమతో అభిమానులను ఫిదా చేశారు. ఇటీవల కోవిడ్-19 బారిన పడిన రకుల్ రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు కండరాల టోనింగ్ కోసం రకుల్ ప్రీత్ ఈ మల్టీ డైమెన్షనల్ యోగాసనాన్ని ఎంచుకోవడం విశేషం. View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) -
ఇకపై యోగా కూడా ‘క్రీడ’
న్యూఢిల్లీ: భారత్‌లో ప్రాచీన చరిత్ర ఉన్న యోగాసనాలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ తాజాగా గుర్తింపునిచ్చింది. ఇక నుంచి యోగాసనాలను అధికారికంగా పోటీ క్రీడగా పరిగణించనున్నట్లు గురువారం తెలిపింది. జాతీయ స్థాయి టోర్నీ ఖేలో ఇండియా క్రీడల్లోనూ యోగాసనాలను భాగం చేస్తామని క్రీడా మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ‘జాతీయ వ్యక్తిగత యోగాసన క్రీడా పోటీల’ను పైలట్ చాంపియన్‌షిప్‌గా నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. సంప్రదాయక, ఆర్టిస్టిక్, రిథమిక్, వ్యక్తిగత ఆల్‌రౌండ్ చాంపియన్‌షిప్, టీమ్ చాంపియన్‌షిప్ విభాగాల్లో పోటీలను నిర్వహిస్తామన్నారు. భారత జాతీయ యోగాసన క్రీడా సమాఖ్య (ఎన్‌వైఎస్‌ఎఫ్‌ఐ)కు ఆర్థికంగా దన్నుగా నిలుస్తామని స్పష్టం చేశారు. -
ఏనుగుపై యోగా : ట్రెండింగ్‌లో రాందేవ్
సాక్షి, లక్నో: పతంజలి ఆయుర్వేద్ సహ వ్యవస్థాపకుడు, యోగాసనాలకు పెట్టింది పేరైన బాబా రామ్‌దేవ్ ట్విటర్ ట్రెండింగ్‌లో ఉన్నారు. ఒక ఆశ్రమంలో ఏనుగు మీద యోగా నేర్పిస్తూ కిందపడిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆయనపై సానుభూతితో పాటు కొంతమంది నెటిజనులు రకారకాల మీమ్స్ తో, యాక్ట్ ఆఫ్ గ్రావిటీ అంటూ వ్యంగ్యోక్తులతో సందడి చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే బాబా రాందేవ్ ఉత్తరప్రదేశ్‌లోని మథురలోని ఒక ఆశ్రమంలో నిర్వహించిన యోగా క్యాంప్ లో యోగా నేర్పించే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ చక్కగా అలంకరించి ఉన్న ఏనుగును చూసి ఉత్సాహం పట్టలేని వెరైటీగా ఆసనాలు వేద్దామనుకున్నారు. ఆ భారీ ఏనుగుపై పద్మాసనంలో కూర్చుని ప్రాణాయామం సాధన ఎలా చేయాలో వివరిస్తున్నారు.ఇంతలో ఏమైందో ఏమో తెలియదు గానీ ఆ ఏనుగు కుదురుగా ఉండకుండా అటూ ఇటూ కదిలింది. అయినా బాబాగారు బింకంగా అవేమీ పట్టించుకోకుండా యోగా భంగిమను కొనసాగించారు. మరోసారి ఏనుగు కదలడంతో అదుపు తప్పి రాందేవ్ ఒక్కసారిగా కిందపడిపోయారు. వెంటనే లేచి సర్దుకున్నరాందేవ్ అక్కడినుంచి లేచి వెళ్లిపోయారు. అయితే ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. చిత్ర విచిత్ర భంగిమలు, ఫోజులతో గతంలో వార్తల్లో నిలిచిన రాందేవ్ తాజాగా ఏనుగుమీద యోగాతో మరోసారి ట్రెండింగ్ లో నిలిచారు. అంతేకాదు గతంలో సైకిల్ తొక్కుతూ రాందేవ్ కింద పడ్డ వీడియో కూడా ఇపుడు విపరీతంగా షేర్ అవుతోంది. Baba Ramdev had said Corruption will fall if Narendra Modi becomes PM pic.twitter.com/qauXNgISqG — Joy (@Joydas) October 13, 2020 #NirmalaSitharaman on #BabaRamdev be like:- pic.twitter.com/avFn4K7WH6 — sarcastic guy (@thejoe1785) October 13, 2020 Aree phir se Gir Gye abhi to Cycle se gire the..😆😆😂😂 pic.twitter.com/YKwhnWP4qU#BabaRamdev — Md Iquebal Hossain (@Iquebal_) October 14, 2020 -
అమెరికా మహిళపై లైంగిక దాడి
రిషికేష్ : అమెరికాకు చెందిన 37 ఏళ్ల మహిళపై ఉత్తరాఖండ్ రిషికేష్‌లోని స్థానిక నివాసి అత్యాచారానికి పాల్పడ్డాడు. యోగా మీదున్న అభిరుచితో భారత్ వచ్చానని, ఈ నేపథ్యంలోనే నమ్మకస్తుడిగా ఉంటూ ఓ వ్యక్తి తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. స్నేహంగా మెలుగుతూ రిషికేష్ నివాసి అభినవ్ రాయ్ అనే వ్యక్తి తనపై లైంగిక దాడికి పాల్పడినట్టు ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. బాల్కనీ నుంచి తన గదిలోకి చొరబడి అతడు ఈ దురాఘతానికి ఒడిగట్టినట్టు వెల్లడించింది. కేసు ఉపసంహరించుకోవాలని నిందితుడి తండ్రి తనపై ఒత్తిడి తెస్తున్నారని ఆమె ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఘటన జరగక ముందు నుంచి వారిద్దరి మద్య శారీరక సంబంధం ఉన్నట్లు స్థానిక పోలీసు అధికారి ఆర్కే సక్లానీ వెల్లడించారు. డ్రగ్స్, యోగా పట్ల ఉన్న ఆసక్తితోనే అభినవ్ రాయ్‌కు అమెరికా మహిళ దగ్గరైందని పేర్కొన్నారు. (పన్నెండేళ్ల బాలికపై కజిన్స్ అత్యాచారం) -
గాయాన్ని జయించిన యామీ గౌతమ్..
ముంబై: బాలీవుడ్ నటి యామీ గౌతమ్ గత కొద్ది కాలంగా తీవ్రమైన మెడ నొప్పితో బాధపడుతుంది. కాగా మెడ నొప్పిని తగ్గించుకోవడానికి యోగా చేశానని తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్ వల్ల తన శరారీక, మానసిక ఫిట్నిస్పై శ్రద్ధ వహించినట్లు పేర్కొన్నారు. కాగా తన శరీరాన్ని అంతర్గతంగా నయం అయ్యే విధంగా శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. తన గాయాన్ని దృష్టిలో ఉంచుకొని శ్రద్ధ వహించానని, అంతిమంగా నొప్పిని జయించి సాధారణ జీవితాన్ని గడుపుతున్నట్లు పేర్కొన్నారు. తన తదుపరి సినిమా గిన్నీ వెడ్స్ సన్నీ ద్వారా త్వరలో ప్రేక్షకుల ముందుకు యామీ గౌతమ్ రానున్నారు. కాగా యామీ మొదట్లో ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్‌తో అందరిని ఆకట్టుకుంది. మొదట సీరియల్ నటిగా తర్వాత మోడల్‌గా, అనంతరం హీరోయిన్గా కెరీర్లో దూసుకెళ్తుంది. కాగా ఇటీవల బాలా చిత్రం ద్వారా యామీ గౌతమ్ మంచి విజయం అందుకున్న విషయం తెలిసిందే. చదవండి: అందులో తప్పేముంది? : నటి -
ఇంతకీ ‘మ్యాటరేంటంటే!’
స్కూల్‌కి వెళ్లేటప్పుడు క్లాస్మేట్స్ కావాలి. చదివింది షేర్ చేసుకోవడానికి.. అల్లరి పనులు చేయడానికి. పనిలో ఉన్నప్పుడు ఆఫీస్ మేట్స్ కావాలి పని పంచుకొని ఒత్తిడి తగ్గించుకోవడానికి. సినిమా విషయానికి వస్తే గ్రీన్‌మ్యాట్ కావాలి గ్రాఫిక్స్ ద్వారా కష్టాన్ని తగ్గించుకోవడానికి. గ్లామర్ ఇండస్ట్రీలో వాళ్లకు యోగా మ్యాట్ కూడా కావాలి ఫిట్నెస్ పెంచుకోవడానికి. ఇంతకీ ‘మ్యాటరేంటంటే!’ మ్యాటర్ చదవండి.. అర్థమైపోతుంది. కరోనా వల్ల ఎవ్వరం ఇంట్లో నుంచి కాలు కదపడానికి లేదు. ఫిట్నెస్ ప్రియులకు ఇది కాళ్లు కట్టేయడంలాంటిదే. కానీ హీరోయిన్లు ఫిట్‌గా ఉండాలి. ఫిట్‌నెస్‌ని అశ్రద్ధ చేయకూడదు. ఫిట్‌గా స్క్రీన్ మీద కనిపించాలి. అందుకే నోరు కట్టేస్తూ, జిమ్ చుట్టేస్తారు. ఇప్పుడు ఈ కరోనా సమయంలో జిమ్ సెంటర్ కి వెళితే రిస్క్‌ని వర్కవుట్ తో తెచ్చుకునే ప్రమాదం ఉంది. అందుకే ఈ మధ్య అందాల తారలు ఎక్కువగా ‘యోగా మ్యాట్’తో ఫ్రెండ్ షిప్ చేస్తున్నారు. మ్యాట్రేంటంటే ... హీరోయిన్లందరూ తరచూ యోగాసనాలు చేస్తూ ఫోటోలను షేర్ చేస్తున్నారు. అయితే క్లిష్టమైనవి నేర్చుకోవాలంటే కాస్త టైమ్ పడుతుంది. ఈ కరోనా లాక్ డౌన్ హీరోయిన్లకు కావాల్సినంత సమయాన్ని ఇచ్చింది. దీంతో కొత్త ఆసనాలు ప్రాక్టీస్ చేస్తున్నారు. కొందరు టార్గెట్ ను చేరుకున్నారు. మరికొందరు చేరుకుంటున్నారు. మ్యాట్ మీద ఫీట్లు చేస్తున్న హీరోయిన్ల విషయానికి వస్తే.. ‘లాక్ డౌన్లో గార్డెనింగ్‌తో పాటు యోగాను బాగా ఆస్వాదిస్తున్నా’ అని సమంత తెలిపారు. యోగాసనాల్లో అతి క్లిష్టమైన మయూరాసనం వేయాలనే లక్ష్యాన్ని చేరుకోగలిగారు సమంత. రకుల్‌కు ఫిట్నెస్ మీద ఎంత శ్రద్ధో అందరికీ తెలిసిందే. యోగా కేవలం శరీరానికి సంబంధించింది కాదు మనసుకు, మన జీవిత విధానానికి సంబంధించింది అంటారామె. ‘వర్కౌట్‌లో క్రమం తప్పేది లేదు’ అంటున్నారు తమన్నా. ఎప్పటికప్పుడు వర్కౌట్ ఫోటోలతో అభిమానులనూ వర్కౌట్ చేసేలా ప్రోత్సహిస్తున్నారామె. ధనురాసనం నేర్చేసుకున్నారట పూజా హెగ్డే. ‘యోగా చేస్తే తెలియని సంతోషం’ అంటున్నారు పూజ. ‘ఇంట్లో వీలయ్యే వర్కౌట్స్ చేయండి.. నేను చేస్తున్నా’ అంటారు రాశీ ఖన్నా. అదా శర్మ, తాప్సీ తదితరులు కూడా వర్కౌట్స్‌తో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. -
జిమ్‌లు రేపట్నుంచే..
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: నాలుగున్నర నెలల విరామం తర్వాత దేశవ్యాప్తంగా జిమ్‌లు, యోగా కేంద్రాలు బుధవారం నుంచి తెరుచుకోనున్నాయి. అన్‌లాక్–3.0లో వీటిని తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ‘యోగా కేంద్రాలు, జిమ్‌లలో కరోనా వ్యాప్తి నివారణ మార్గదర్శకాలను’ సోమవారం జారీ చేసింది. ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేని వారిని మాత్రమే యోగా కేంద్రాలు, జిమ్‌లలోకి అనుమతించాలని తేల్చిచెప్పింది. భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. కంటైన్మెంట్ జోన్లలోని యోగా కేంద్రాలు, జిమ్‌లు మూసి ఉంటాయి. ఈ జోన్ల వెలుపల ఉన్న వాటిని మాత్రమే తెరిచేందుకు అనుమతిస్తారు. మార్గదర్శకాలివే.. ► స్పాలు, స్టీమ్ బాత్, స్విమ్మింగ్ పూల్స్ మూసివేయాలి. ► యోగా సెంటర్లు, జిమ్‌లలో అవసరాన్ని బట్టి మార్పులు చేర్పులు చేసుకోవాలి. వ్యక్తుల మధ్య కనీసం 4 మీటర్ల దూరం ఉండేలా రీడిజైనింగ్ చేయించాల్సి ఉంటుంది. ► జిమ్‌లో సెంట్రలైజ్డ్ ఏసీ లేదా సాధారణ ఏసీ ఉంటే గది ఉష్ణోగ్రత 24 డిగ్రీల నుంచి 30 డిగ్రీల మధ్య ఉంచాలి. వెంటిలేషన్ అధికంగా ఉండేలా చూడాలి. ► 65 ఏళ్ల వయసు పైబడినవారు, ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారు, గర్భిణులు, పదేళ్ల లోపు చిన్నారులు జిమ్‌లకు వెళ్లకపోవడమే మంచిది. ► హ్యాండ్ శానిటైజర్‌తో చేతులను శుభ్రం చేసుకున్న తర్వాతే ఎవరైనా యోగా సెంటర్/జిమ్ లోపలికి ప్రవేశించాలి. ప్రవేశ ద్వారం వద్ద థర్మల్ స్క్రీనింగ్ టెస్టు కూడా చేయించుకోవడం తప్పనిసరి. ► ఫేస్ మాస్కు/కవర్ ధరించిన వారిని మాత్రమే లోపలికి అనుమతించాలి. ► యోగా కేంద్రం/జిమ్‌లో ఉన్నంత సేపు ఆరోగ్యసేతు యాప్ ఉపయోగించాలి. ► జిమ్/యోగా కేంద్రంలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బందితో పాటు విజిటర్స్ తప్పకుండా ఫేస్ షీల్డ్‌లు ధరించాలి. ► కార్డియో, స్ట్రెంత్ ట్రైనింగ్ వంటి కఠినమైన వ్యాయామాలు చేసేముందు పల్స్ ఆక్సీమీటర్‌తో ఆక్సిజన్ స్థాయిలను పరీక్షించుకోవాలి. -
మూడు నిమిషాలు... 100 ఆసనాలు
సమృద్ధి కాలియా ఘనతను చూసి దుబాయ్‌లోని భుజ్ ఖలీఫా ఆకాశ హర్మ్యం కూడా కరతాళధ్వనులు చేసింది. జూలై 15న ఆ మహా కట్టడంలోని వ్యూయింగ్ డెక్ మీద సమృద్ధి పరీశీలకుల సమక్షంలో తన యోగ విన్యాసాలు చూపి ఆశ్చర్య చకితులను చేసింది. ఒక చిన్న కలప బాక్స్‌లో (రిస్ట్రిక్టెడ్ స్పేస్) నుంచి నేల మీద కాలు పెట్టకుండా మూడు నిమిషాల పద్దెనిమిది సెకన్స్‌లో వంద యోగాసనాలు వేసి అరుదైన రికార్డును సాధించింది. ఈ వయసులో ఇంత సమయంలో ఇన్ని ఆసనాలు వేసిన బాలిక ప్రపంచంలో మరొకరు లేరు. ఆరేళ్ల వయసు నుంచి దుబాయ్‌లో స్థిరపడ్డ భారతీయ కుటుంబానికి చెందిన సమృద్ధి అక్కడి అంబాసిడర్ స్కూల్లో 7వ తరగతి చదువుతోంది. ఆమె తండ్రి సిద్దార్థ్ కాలియా. తల్లి ప్రేరణ కాలియా. అమ్మమ్మ భారతదేశంలో యోగ సాధకురాలు. అందువల్ల సమృద్ధి కూడా ఆరేళ్ల వయసులో స్కూల్లో యోగ క్లాసుల్లో జాయిన్ అయ్యింది. ‘నేను మిగిలిన పిల్లలు చేయడాన్ని చూసి సరదాగా చేరాను కాని తర్వాత తర్వాత నాకు యోగా అంటే ఆసక్తి పెరిగింది’ అంది సమృద్ధి. తొలి రోజుల్లో స్కూల్లో యోగా క్లాసుల్లో మాత్రమే సాగిన ఆ అమ్మాయి సాధన రాను రాను ఇంట్లోకి మారింది. ‘ఆమె శరీరం యోగాసనాలకు తగినట్టుగా సులువుగా వొంగడం గమనించాను’ అన్నాడు తండ్రి. క్రమంగా యోగాలో సమృద్ధి నిమగ్నత పెరిగింది. ‘ఆ సమయంలో నా వయసు పిల్లలు కూడా రికార్డులు సాధించడం నేను గమనించాను. నేను కూడా అలాంటి రికార్డు సాధించవచ్చు కదా అనిపించింది. వెంటనే ఆ లక్ష్యం పెట్టుకున్నాను’ అంది సమృద్ధి 1 నిమిషంలో 40 ఆసనాలు మొన్నటి జూన్ 21న సమృద్ధి ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఒక నిమిషంలో నలభై యోగాసనాలు వేసి రికార్డు సాధించింది. ఇది చూసి అందరూ ఉత్సాహ పరిచారు. అతి తక్కువ సమయంలో 100 ఆసనాలు వేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ‘ఇందుకు నా శారీరక బలం కంటే కూడా మానసిక బలం ప్రధాన కారణం అనుకుంటున్నాను’ అందా అమ్మాయి. ‘ఇండియాలో ఉండే మా అమ్మమ్మ నాకు స్ఫూర్తి’ అని కూడా చెప్పింది. ప్రతి నిత్యం సమృద్ధి చేసిన సాధన ఫలితాన్ని ఇచ్చింది. నిపుణులు, పరిశీలకుల సమక్షంలో అతి తక్కువ సమయంలో 100 ఆసనాలు వేసి రికార్డు సాధించింది. సమృద్ధికి ఇంకా సైకిలింగ్ పట్ల, రిథమిక్ యోగా పట్ల, స్విమ్మింగ్ పట్ల కూడా ఆసక్తి ఉంది. వాటిని కూడా సాధన చేస్తూ ఉంది. ‘మా అమ్మాయి త్వరలో ప్రపంచ దేశాలలో తన ప్రతిభను చాటనుంది. మేము అన్ని దేశాలలో ఆమె యోగ విన్యాసాల ప్రదర్శన ఏర్పాటు చేయనున్నాం’ అన్నాడు తండ్రి. ‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని’ అన్నాడు కవి. దుబాయ్‌లో స్థిరపడ్డ అమ్మాయి భారతీయ మూలమైన యోగాలో ప్రతిభ చాటుతూ దేశ ప్రతిష్టను ఇనుమడింపచేయడం ప్రశంసనీయం. స్ఫూర్తిమంతం. మా అమ్మమ్మ వయసు 70. ఇండియాలో ఆమె ఉదయాన్నే నాలుగున్నరకు లేచి యోగాసనాలు సాధన చేస్తుంది. నేను ఎందుకు చేయకూడదు అనుకున్నాను. రోజూ నేను చేసిన సాధన ఇవాళ నాకు రికార్డు సాధించి పెట్టింది అంటోంది 11 ఏళ్ల సమృద్ధి కాలియా. మూడు నిమిషాల 18 సెకన్లలో 100 ఆసనాలు వేసి ‘గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చోటు సాధించింది. -
అప్పుడు అన్నీ మాయం!
‘‘నా మైండ్‌లోని ఆలోచనలు నన్ను మానసికంగా ఎంత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పటికీ ఒక్కసారి నేను వర్కౌట్స్ చేయడం ప్రారంభిస్తే అవన్నీ మాయమైపోతాయి. అంతేకాదు నా లక్ష్యానికి నేను మరింత దగ్గరగా వస్తున్నానన్న భావన కలుగుతుంది’’ అంటున్నారు ఇలియానా. ‘వ్యాయామానికి రోజూ ఎంత సమయం కేటాయిస్తారు? అనే ప్రశ్నను ఇలియానా ముందుంచితే – ‘‘ప్రస్తుతం ఆన్లైన్ వర్కౌట్ ప్రోగ్రామ్ చేస్తున్నాను. ప్రతి రోజూ ఓ కొత్త వర్కౌట్‌ను ట్రై చేస్తున్నాను. నా వర్కౌట్ సమయం అన్ని రోజులూ ఒకేలా ఉండదు. ఒకరోజు 75 నిమిషాలు, మరో రోజు 45 నిమిషాలు.. ఇలా రోజు రోజుకీ తేడా ఉంటుంది. ఒక్కో రోజు జస్ట్ యోగా మాత్రమే చేస్తాను. ఫిట్‌గా ఉండటానికి, మానసిక ఆరోగ్యం బాగుండేందుకు మీరు (అభిమానులు) వర్కౌట్స్ చేసి చూడండి. వచ్చే ఫలితం మీకు సంతోషాన్ని ఇస్తుంది’’ అని పేర్కొన్నారు ఇలియానా. -
కూతురి ముందు తల్లి ఓడిపోవాల్సిందే
-
కూతురి ముందు తల్లి ఓడిపోవాల్సిందే
ఇంట్లో ఉండే చిన్న పిల్లల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మనం చేయాలనుకున్న పనిని తెలిసి తెలియని తనంతో చెడగొట్టాలని అనుకుంటారు. వారు అనుకున్నది సాధించడం కోసం ఏదో ఒక తుంటరి పనులు చేస్తుంటారు. కానీ వారు చేసే పనులు కోపం కాకుండా నవ్వును తెప్పిస్తుంటాయి. తాజాగా అలాంటి ఘటనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (అర్జంట్ బాత్రూం: 185 కిమీ వేగంతో) వివరాలు... యోగా చేద్దామని కూతురికి తెలియకుండా ఏకాంత ప్రదేశానికి వచ్చింది ఆ తల్లి. కానీ తల్లిన వెతుక్కుంటూ వెనుకే వచ్చిన ఆ కూతురు తల్లి చేస్తున్న యోగాను చెడగొట్టే పని మొదలుపెట్టింది. జుట్టు లాగడం, పైన పడడం, ముఖాన్ని టచ్ చేయడం ఇలా ఎన్ని చేసినా రాచెల్ కళ్లు తెరవలేదు. ఇలా కాదని అమ్మను వెనుకకు గట్టిగా తోస్తూ అరిచింది. దీంతో తల్లి నవ్వు ఆపుకోలేక కళ్లు తెరిచి పాపును గుండెకు హత్తుకున్నది. మొత్తానికి తల్లి యోగాను చిన్నారి చెడగొట్టానంటూ సంతోషం వ్యక్తం చేసింది. 'యోగా చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందంటారు.. కానీ నా కూతురు ఆ అవకాశం నాకు ఇవ్వలేదు' అనే క్యాప్షన్‌తో వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియో 25 వేలకు పైగా లైకులు పొందింది. 'మీ ఇద్దరి మధ్య నాకు చాలా ప్రేమ కనిపిస్తుంది'... 'కూతురు ముందు ఏ తల్లైనా ఓడిపోవాల్సిందే ' అంటూ కామెంట్లు పెడుతున్నారు. -
మయూరంలా...
లాక్డౌన్ టైమ్‌లో టెర్రస్ గార్డెనింగ్ మొదలుపెట్టారు సమంత. వంట చేయడం నేర్చుకుంటున్నారు. అలాగే కొంత సమయాన్ని యోగాకి కేటాయిస్తున్నారు. యోగాసనాల్లో చాలా క్లిష్టమైన ‘మయూరాసనం’, ‘శీర్షాసనం’ వేశారామె. ఆ ఫొటోలను షేర్ చేశారు సమంత. ‘‘నేను, నాగచైతన్య (సమంత భర్త) కలిసి యోగా చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు సమంత. -
సమంత ట్రై చేసిన కొత్త ఆసనం చూశారా
సాక్షి, హైదరాబాద్ : ఫిట్నెస్ మంత్రాతో అభిమానులను ఆకట్టుకుంటున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని మరోసారి తన యోగాసనంతో ఫ్యాన్స్ ను ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇటీవల సోషల్ మీడియాలో యోగా ప్రాక్టీస్ ఫోటోలను షేర్ చేస్తున్నసమంత తాజాగా భర్త నాగ చైతన్య తో కలిసి వేసిన ఆసనాల ఫోటోలను ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశారు. (కొత్త ప్రయాణం) తోటపనితో పాటు, యోగాను కూడా ఇష్టపడతానని చెప్పిన సమంత, భర్తతో కలిసి చేయడం ఇంకా ఎంజాయ్ చేస్తానన్నారు. తొలిసారి శీర్షాసనం కోసం ప్రయత్నించి విజయం సాధించామంటూ శీర్షాసనం ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఈ సందర్భంగా ఫ్యామిలి పోర్ట్రయిట్ ఫోటో అంటూ పెంపుడు కుక్క ఫోటోను కూడా ఉంచడం విశేషం. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరలవుతున్నాయి. సమంతా, నాగచైతన్య జంట యోగాలో ప్రొఫెషనల్ శిక్షణ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం చేసిన యోగా ఫోటోలను ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. సూపర్ బెస్ట్ ట్రైనర్ అంటూ సంతోష్ గురించి కూడా సమంత ప్రస్తావించారు. -
‘అప్పటి నుంచే ఆ అలవాటు ఉంది’
టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చూడటానికి ఎంత అందంగా కనిపిస్తారో అంతే ఫిట్‌గా ఉంటారు. ఫిట్‌నెస్‌పై రకుల్‌కు ఉన్న శ్రద్ధ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిత్యం వివిధ రకాల యోగాసనాలు, జిమ్‌లో వర్కౌట్లు చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆరోగ్యంగా ఉండటం ఎంత అవసరమో తెలియజేస్తూ ఉంటారు. యోగా చేస్తున్న ఓ ఫోటోను తన తాజాగా ఇన్‌స్ట్రామ్ అకౌంట్లో షేర్ చేశారు. అయితే ఇది ఇప్పటి ఫొటో కాదు. ఆమె చిన్నప్పటి ఫోటో. 1993 అంటే తనకు మూడేళ్ల వయస్సులో ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. (అంతరిక్షానికి వెళ్తున్నట్లుగా ఉంది: రకుల్) 1993 నుంచి యోగా సాధన చేస్తున్నాను అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ ఫోటోను చూస్తుంటే రకుల్‌కు యోగాపై చిన్ననాటి నుంచి ఎంత ఆసక్తి ఉందనే విషయం అర్థమవుతోంది. లాక్డౌన్లో షూటింగ్‌లు లేకపోవడంతో సమయాన్ని వృథా చేయకుండా వినూత్న రీతిలో యోగాసానాలు వేస్తూ అభిమానులను అలరించిన విషయం తెలిసిందే. ఇక లాక్డౌన్లో ముంబైలో కుటుంబంతో సరదాగా గడిపిన రకుల్.. వంటలు చేస్తూ, సినిమాలు చూస్తూ, వర్కౌట్స్‌తోనూ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఇటీవల రకుల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని యోగాసానాల ఫోటోలను ఈకింద చూడవచ్చు. (రకుల్ టీ షర్ట్ చాలెంజ్.. ఇలా కూడా వేసుకుంటారా..!) అతని వల్లే అన్నీ కోల్పోయా: View this post on Instagram TRUE YOGA is not about the shape of your body but the SHAPE of your LIFE , it’s not about touching your toes but what you learn on the way down .You can’t always control what goes on outside but you can control what goes on inside. Sink into the stillness and celebrate this union of mind , body and soul to self reflect and vibrate at the highest frequency of life at all times ❤️ 🧘♀️ #happyinternationalyogaday and thankuuuuuu my soul sista @anshukayoga for making yoga my way of life ❤️❤️ A post shared by Rakul Singh (@rakulpreet) on Jun 20, 2020 at 6:02pm PDT View this post on Instagram Throwback : when the world wasn’t upside down but I was !! My yoga journey Began in 2018 and since then it’s pure joy to do my practice everyday. Life is all about balance. You don’t always need to be getting things done. Sometimes it’s absolutely ok to shut down , kick back and do nothing. ❤️ @anshukayoga this was the first time I did an inversion 😀 A post shared by Rakul Singh (@rakulpreet) on May 2, 2020 at 7:01pm PDT View this post on Instagram Life is a BALANCE of holding on and letting go 😜 first headstand without support!! @anshukayoga u make things look better upside down ! ❤️❤️ A post shared by Rakul Singh (@rakulpreet) on Jan 22, 2020 at 7:50pm PST View this post on Instagram Times like these make us realise the importance of good health and how grateful we should be for it! Health to me is not just physical but also mental and emotional well being. How joyful and happy you are at all times irrespective of the external factors determines your health. Making the right choices is the key and if you haven’t already started then do it now . We need to be healthy more so now than ever before !! This #worldhealthday take a step towards your well being!! Eat right , think positive , live happily , Stay Safe , Stay home ! A post shared by Rakul Singh (@rakulpreet) on Apr 7, 2020 at 4:15am PDT -
బ్రీతింగ్ వ్యాయామంతో వైరస్ల కట్టడి!
సాక్షి, న్యూఢిల్లీ: యోగాలో భాగంగా లేదా ఇతర బ్రీతింగ్ ఎక్సర్సైజ్లో భాగంగాగానీ ముక్కుతో గాఢంగా గాలిని పీల్చుకొని నోటి నుంచి వదలడం ద్వారా పలు రకాల వైరస్ల బారి నుంచి బయటపడి ప్రాణాలు దక్కించుకోవచ్చని నోబెల్ బహుమతి గ్రహీత, కాలిఫోర్నియా యూనివర్సిటీలో ‘ఎమిరిటస్ ఆఫ్ మాలిక్యులర్ అండ్ మెడికల్ ఫార్మాకాలోజీ, స్కూల్ ఆఫ్ మెడిసిన్’లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న లూయీ జే ఇగ్నారో తెలియజేశారు. ముక్కుతో గాలిని గాఢంగా పీల్చుకోవడం వల్ల గాలి ముక్కు రంధ్రాల గోడలకు తగలడంతో అక్కడ నైట్రిక్ ఆక్సైడ్ (ఎన్ఓ) అణువులు పుడతాయని, అవి గాలి ద్వారా ఊపిరి తిత్తుల్లోకి వెళ్లడంతో అక్కడ రక్త ప్రసరణ ఎక్కువ జరుగుతుందని, అంతే కాకుండా రక్తంలో ఆక్సిజన్ శాతం ఎక్కువగా కలిసి ప్రవహించేందుకు కూడా ఈ నైట్రిక్ ఆక్సైడ్ అణువులు ఎంతగానో తోడ్పడుతాయని ఆయన చెప్పారు. అందుకే ఊపిరితిత్తుల సమస్యలున్న చిన్న పిల్లలకు ఇన్హేలర్ ద్వారా నైట్రిక్ ఆక్సైడ్ చికిత్సను అందిస్తారని ఆయన తెలిపారు. (చదవండి: హెర్బల్ టీ తో కరోనాకి చెక్!) 2003–04 సంవత్సరాల్లో సార్స్ వ్యాధి విజృంభించినప్పుడు శ్వాస పీల్చుకోలేక ఇబ్బంది పడుతున్న రోగులకు నైట్రిక్ ఆక్సైడ్ ఇన్హేలర్లు మంచి ఫలితాలను ఇచ్చాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం కరోనా రోగులపై కూడా నైట్రిక్ ఆక్సైడ్ ప్రయోగ పరీక్షలు జరపుతున్నారని ఆయన తెలిపారు. ఈ శ్వాస సంబంధిత వ్యాయామం ద్వారా రక్తపోటు (బీపీ) కూడా అదుపులో ఉంటుందని ఆయన అన్నారు. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఎలా చేస్తే బాగుంటుందన్న ప్రశ్నకు ‘ఆక్సిజన్ ఎక్కువగా ఉండే బహిరంగ ప్రదేశాల్లో అంటే, ఇంటి మేడ మీద లేదా పార్కుల్లో పది నిమిషాల చొప్పున రోజుకు రెండు సార్లు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. ఊపిరి తిత్తుల్లోకి గాలిని గాఢంగా పీల్చుకునేందుకు వీలైన భంగిమలో కూర్చొని చేయడం మంచిది’ అని ఆయన సూచించారు. (కరోనా: 56.71 శాతానికి పెరిగిన రికవరీ రేటు) -
కరోనాపై యోగాస్త్రం
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి జనం ప్రాణాలను బలిగొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో యోగా అవసరం గతంలో ఎప్పుడూ లేనంతగా పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. కరోనా బాధితులు ఆరోగ్యవంతులుగా మారడానికి యోగా దివ్యౌషధంగా పని చేస్తుందని తెలిపారు. ఆరో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఆదివారం దేశ ప్రజలకు సందేశమిచ్చారు. దాదాపు 15 నిమిషాలపాటు ప్రసంగించారు. కరోనా ప్రధానంగా శ్వాస వ్యవస్థను దెబ్బతీస్తుందని అన్నారు. ప్రాణాయామంతో శ్వాస వ్యవస్థ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. దేశ ప్రజలందరినీ ఐక్యం చేసే చోదకశక్తిగా యోగా రూపాంతరం చెందిందని అభివర్ణించారు. మనుషుల మధ్య అనుబంధాన్ని పెంచుతుందని వివరించారు. యోగాకు జాతి, కులం, వర్ణం, లింగభేదం, నమ్మకాలతో సంబంధం లేదన్నారు. ఎవరైనా యోగా సాధన చేయొచ్చన్నారు. ఆరోగ్యవంతమైన సమాజం యోగాతో సాధ్యమని చెప్పారు. ప్రాణాయామం.. నిత్య జీవితంలో భాగం ‘‘శరీరంలో బలమైన రోగ నిరోధక శక్తి ఉంటే కరోనాను సులువుగా జయించవచ్చు. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి యోగాలో ఎన్నో ఆసనాలు ఉన్నాయి. ప్రాణాయామం ప్రభావవంతంగా పనిచేస్తుంది. ప్రాణాయామాన్ని నిత్య జీవితంలో భాగంగా మార్చుకోవాలి. ప్రపంచంలో చాలామంది కరోనా బాధితులు యోగాతో ఉపశమనం పొందారు. కరోనాను ఓడించే శక్తి యోగాకు ఉంది’’ అని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ‘‘సరైన ఆహారం తీసుకోవడం, సరైన క్రీడల్లో పాలుపంచుకోవడం, క్రమశిక్షణ కలిగి ఉండడం కూడా యోగా చేయడమే’’ అని పేర్కొన్నారు. ఒక కుటుంబంగా, ఒక సమాజంగా మనమంతా కలిసికట్టుగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా.. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఔత్సాహికులు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. కరోనా వైరస్ వల్ల ఈసారి చాలా దేశాల్లో డిజిటల్ వేదికలపై ఈ కార్యక్రమం నిర్వహించారు. అమెరికా, చైనా, యూకే, టర్కీ, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, నేపాల్ తదితర దేశాల్లో జనం యోగాసనాలు వేశారు. చైనా రాజధాని బీజింగ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో భారత రాయబార కార్యాలయ ఉద్యోగులు, భారతీయులు పాలుపంచుకున్నారు. -
యోగా సీక్రెట్ చెప్పిన కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ : యోగాను క్రమం తప్పకుండా అభ్యసించే వారికి కరోనా వైరస్ ముప్పు తక్కువని కేంద్ర ఆయూష్ శాఖ మంత్రి శ్రీపాద్ నాయక్ అన్నారు. మోదీ ప్రభుత్వ హయాంలో దేశ, ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న యోగా కరోనాతో పోరాటం చేయటానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురష్కరించుకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యోగా దినోత్సవానికి విశేషమైన స్పందన వస్తోంది. ప్రజలందరూ ఇంట్లో ఉంటూనే యోగాను చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో యోగా చేస్తున్నట్లయితే 20 మంది కంటే ఎక్కువ ఉండరాదని స్పష్టం చేశాము. ( యోగాతో కరోనాను ఎదుర్కోవచ్చు: మోదీ) యోగాతో మన శరీరంలో జరిగే వాటిని నియంత్రించవచ్చు, ఆరోగ్యకర జీవితాన్ని పొందవచ్చు. ఈ సంవత్సరం ఆరోగ్యకర అలవాట్లను అలవర్చుకుంటూనే ఇంట్లో యోగా అభ్యసించాలనే దానిపై దృష్టి సారించాము. ఈ యోగా దినోత్సవం సందర్బంగా అందరూ ప్రతి రోజూ ఓ గంట పాటు యోగా చేసేందుకు ప్రతినబూనాలి’’ అని అన్నారు. -
యోగాతో ఆరోగ్యంగా ఉండండి: ఏపీ గవర్నర్
సాక్షి, విజయవాడ: యోగా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సాధనలను మిళతం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ రూపొందించిన కామన్ యోగా ప్రోటోకాల్ (సివైపి)ను అనుసరించి ఈ నెల 21న (ఆదివారం) అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. గవర్నర్ శనివారమిక్కడ మాట్లాడుతూ యోగా మన దేశంలో ఐదువేల సంవత్సరాల క్రితమే ఉద్భవించిన పురాతన సాంప్రదాయమన్నారు. (రేపొక్క రోజే ఏడు రోజులు) యోగా కుటుంబాన్ని మంచి ఆరోగ్యంతో ఉంచడానికి సాయం చేస్తోందన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచనతో ఐరాస జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినంగా ప్రకటించిందన్నారు. కరోనా బారిన పడకుండా ఇంట్లోనే ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. కాగా ప్రపంచవ్యాప్తంగా జూన్ 21, 2015న మొదటి అంతర్జాతీయ యోగా డేను నిర్వహించారు. (ఇంట్లోనే యోగా చేయండి!) -
బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి ఈ ఒక్కటి చేస్తే చాలు
ఈ కాలం అమ్మాయిలను వేధిస్తోన్న ముఖ్యమైన సమస్య "బెల్లీ ఫ్యాట్". దీన్ని తగ్గించుకోవడానికన్నా కవర్ చేసుకోడానికే ఎక్కువ తంటాలు పడుతూ ఉంటారు. ఎక్కువగా తినడం లేదా ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. అయితే పైసా ఖర్చు లేకుండా పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వును సులువుగా కరిగించేయొచ్చు. ఇంట్లోనే ఎంతో సులువైన "పవనముక్తాసనం" వేశారంటే సరిపోతుంది. పవనం అంటే గాలి, ముక్త అంటే తొలగించడం. పేగుల్లో పేరుకుపోయిన అపాన వాయువును తొలగిస్తుంది. కాబట్టే దీనికి ఆ పేరు వచ్చింది. ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయవచ్చు. ఎలా వేయాలి? ► ముందుగా నేలపై వెల్లకిలా పడుకోవాలి. ► దీర్ఘంగా శ్వాస పీల్చుకోవాలి. ► మోకాళ్లను రెండు చేతులతో పట్టుకుని చాతీ వరకు తీసుకురావాలి. మోకాలితో పొట్టను అదుముతూ శ్వాసను వదులుతూ చుబుకాన్ని మోకాళ్లకు తాకించాలి. ► ఈ స్థితిలో కొద్దిసేపటి వరకు ఉంటూ గాఢ ఉఛ్వాస, నిఛ్వాసలను తీసుకోవాలి. ► అనంతరం తిరిగి యధాస్థితికి వచ్చేయాలి. ► దీన్ని రెండు, మూడు సార్లు చేయాలి. ఉపయోగాలు: ⇒ కండరాలను బలపర్చడంతో పాటు బెల్లీ ఫ్యాట్ తగ్గిస్తుంది. ⇒ జీర్ణక్రియను మెరుగుపరుస్తూ మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ⇒ పేగులు, ఇతర ఉదర అవయవాలకు మసాజ్ చేస్తుంది. ⇒ కీళ్లలో రక్తప్రసరణను మెరుగుపర్చుతుంది. ⇒ అధిక బరువును తగ్గిస్తుంది. ⇒ గ్యాస్ బయటకు వెళ్లిపోతుంది. నోట్: మహిళలు రుతుస్రావం, గర్భధారణ సమయంలో ఈ ఆసనం చేయరాదు. -
బరువు తగ్గాలనుకుంటే.. ఈ ఆహారం తీసుకోండి!
సాక్షి, మహబూబ్‌నగర్ : కొత్త వంటకాలు.. సరికొత్త రుచులకు అలవాటు పడి కొందరు తమ శరీర బరువును అమాంతం పెంచేసుకుంటున్నారు. ఆ తరువాత దాన్ని తగ్గించుకోవడానికి ఎన్నో కుస్తీలు పడుతున్నారు. ఇలా అధిక బరువుతో బాధపడే వాళ్లంతా సమ్మర్ చిట్కాలు.. యోగా.. పండ్ల జ్యూస్‌లతో స్లిమ్‌గా తయారు కావచ్చునని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. (కరోనా: వర్క్ ఫ్రం హోం వాళ్లు ఇలా చేయండి!) వేసవికాలం.. ఎంతో వరం బరువు తగ్గాలనుకొనేవారికి వేసవి కాలం వరంలాంటిది. బరువు పెరిగిపోతున్నామని తెగ బెంగ పడుతున్న వారు ఎలాగైనా బరువు తగ్గించుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ఫిట్నెస్ సెంటర్లకు పరుగులు పెడుతున్నారు. మరో వైపు మారుతున్న జీవన విధానంలో జిహ్వచాపల్యాన్ని అదుపులో ఉంచుకోలేక మోతాదుకు మించి భుజిస్తుండడంతో బరువు పెరుగుతున్నారు. దాంతోపాటు ప్రస్తుత యాంత్రిక జీవనంలో ఎన్నో రకాల పనుల నిమిత్తం ఒత్తిడి సైతం రెట్టింపవుతుంది. అయితే, నడకతో ఒత్తిడిని అధిగమించవచ్చునని నిపుణులు చెబుతున్నారు. శ్వాస సంబంధ వ్యాధులు, దీర్ఘకాలిక నొప్పులు తగ్గుతాయంటున్నారు. ప్రస్తుతం లాక్డౌన్ ఉండడం వల్ల ఇంట్లోనే వాకింగ్, చిన్నపాటి వ్యాయామాలు చేసుకోవచ్చు. (పదే పదే శానిటైజర్ వాడుతున్నారా?) వేసవిలో ఈ ఆహారం తీసుకుంటే మేలు.. ► నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు ఆహారంగా తీసుకోవాలి. పుచ్చ, కీర, కర్భూజ, తాటి ముంజలు, బీర, పొట్ల వంటి వాటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. వీటి ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు, లవణాలు అందుతాయి. ► పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల కడుపు నిండినట్లు అవుతుంది. డైట్ కంట్రోల్ అవుతుంది. బరువు కూడా తగ్గుతుంది. ► షుగర్ వేసిన జ్యూస్ మ్యాంగో, సపోటా వంటివి తీసుకొంటే బరువు తగ్గకపోగా కొత్త సమస్యలు మొదలవుతాయి. ► వేసవిలో ఆకలి తక్కువగాను దాహం ఎక్కువగాను ఉంటుంది. జీర్ణక్రియలోను తేడాలు వస్తుంటాయి. డైట్‌పాటిస్తూ కాలానికి తగ్గట్టుగా ఆహారపదార్థాలను తీసుకోవడం ద్వారా బరువును నియంత్రించవచ్చు. మజ్జిగ, కొబ్బరి నీళ్ళు తీసుకోవాలి. (కొబ్బరిబోండంతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా) శీతల ప్రాణాయామంతో మేలు వేసవిలో భానుడి ప్రతాపం ఉదయం 8 నుంచి మొదలవుతుంది. ఎండ తీవ్రతను తట్టుకోవాలంటే సరైన ఆహారం తీసుకోవాలి. నీరు ఎక్కువగా తాగాలి. నీటితో పాటు శీతల ప్రాణాయామం చేస్తే కొంతవరకు ఎండల ప్రతాపాన్ని తట్టుకునే శక్తి శరీరానికి అందుతుంది. శీతల ప్రాణాయామం బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఉదయం ఏడు గంటలలోపు 5 నిమిషాల పాటు ఈ వ్యాయామం చేయడం మంచిదని యోగా నిపుణులు పేర్కొంటున్నారు. యోగా చేస్తే బరువు తగ్గవచ్చు నిత్యం క్రమపద్ధతిలో యోగా చేస్తే బరువు తగ్గవచ్చు. వయస్సు ప్రకారం యోగాసనాలు, సూక్ష్మ వ్యాయామాలు, సూర్యనమస్కారాలు చేయాలి. ప్రాణాయామాలు కూడా నిత్యం చేస్తే శరీరం అదుపులో ఉండి బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది. – బాల్‌రాజు, జిల్లా యోగా సంఘం కార్యదర్శి ద్రవ పదార్థాలు ఎక్కువగా.. ఎంతటి భోజన ప్రియులైన వేసవి కాలంలో కాస్తా మోతాదు తగ్గించి ఆహారం తీసుకోవాలి. వేసవిలో ఘన పదార్థాల కంటే ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. వేసవిలో దాహం ఎక్కువ. ఆకలి తక్కువగా ఉంటుంది. అందువలన 15 నుంచి 20 నిమిషాలకు ఒక సారి చొప్పున రోజుకు కనీసం 5 లీటర్లను వివిధ రూపాల్లో తీసుకుంటే బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. ఫ్రిజ్‌లో నీటికన్నా కుండలోని నీటిని తాగడం ఉత్తమం. గొంతు నొప్పి తదితర సమస్యలు తలెత్తవు. -
లాక్డౌన్ వేళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే..
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా సృష్టించిన విద్వంసం అందరికి తెలిసిందే. ఈ మహమ్మారి నుంచి రక్షించుకోవడానికి ప్రతి దేశం లాక్‌డైన్‌ను విధించాయి. ప్రస్తుత కష్టసమయంలో వివిధ వయస్సుల వారు ఎదుర్కొంటున్న మానసిక సమస్యలకు నిపుణులు అందిస్తున్న సూచనలు. లాక్డౌన్ కారణంగా ఎక్కువ ప్రభావితమయ్యే రంగం విద్యారంగమే అని నిపుణుల అభిప్రాయం. ముఖ్యంగా విద్యార్థులు తీవ్ర మనోవేదనను అనుభవిస్తున్నారు. విద్యాసంవత్సరం నష్టపోతుందని.. ఎంట్రన్స్ పరీక్షలకు ఎలా సన్నదం కావాలనే బెంగ విద్యార్థులకు కునుకు లేకుండా చేస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. విద్యార్థులు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని.. మన అధీనంలో లేని విషయాలను ఎక్కువగా ఆలోచించి ఒత్తిడికి గురికావొద్దని కేంద్ర ఆరోగ్య సంస్థ నిపుణుడు పంకజ్ గుప్తా పేర్కొన్నారు. తల్లిదండ్రులు, విద్యాసంస్థల నిపుణులు, సైకాలజీ కౌన్సిలర్లు నిరంతరం విద్యార్థులను పర్యవేక్షిస్తు కౌన్సెలంగ్ చేయాలని తెలిపారు. ఈ లాక్డౌన్ గండం నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ధ్యానం, యోగ, వ్యాయామాలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు ప్రస్తుత టెక్నాలజీ యుగంలో చిన్నారులు స్మార్ట్ ఫోన్లకు పరిమితవ్వడంతో తాత, అవ్వలతో ఆడుకునే పరిస్థితి లేక వృద్ధులు తీవ్ర మనోవేదన చెందుతున్నారు. మరోవైపు వయస్సు రీత్యా వచ్చే జబ్బులతో నరకయాతన అనుభవిస్తున్నారు. ముఖ్యంలో మతిమరుపు, దీర్ఘకాలిక జబ్బులతో వృద్ధులు బాధపడుతున్నట్లు కొన్ని సర్వే సంస్థలు వెల్లడించాయి. ప్రభుత్వాలు వృద్ధుల సమస్యలను పరిష్కరించేవిధంగా ప్రత్యేక హెల్పలైన్ నెంబర్ రూపొందించాలని సైకాలజిస్టులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు వర్క్ ఫ్రమ్ ఉద్యోగం చేసే మహిళలకు కుటుంబాన్ని సమన్వయపరుచుకుంటూ ఉద్యోగం చేయడం ఇబ్బందిగా మారిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
పుస్తకాలు.. సినిమాలు.. వంటలు
‘‘లక్ష్యసాధన కోసం నిత్య జీవితంలో మనమందరం పరుగులు పెడుతూనే ఉంటాం. కానీ ప్రకృతి విపత్తు వస్తే మనం ఎంతవరకు ఎదుర్కోగలమో ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనే అర్థం అవుతుంది. మన ఆరోగ్యం, కుటుంబం, మనల్ని ప్రేమించేవారు, వారితో ముడిపడి ఉన్న జ్ఞాపకాలు ఎంతో అమూల్యమైనవి. మిగతావన్నీ తర్వాతే అనిపిస్తోంది’’ అంటున్నారు రకుల్‌ప్రీత్ సింగ్. లాక్డౌన్ సమయం ఎలా గడుస్తుందో రకుల్ చెబుతూ – ‘‘ఈ ఏడాది మార్చి 18 నా చివరి వర్కింగ్ డే. అప్పట్నుంచి నేను ఇంట్లోనే ఉంటున్నాను. ఎప్పటిలానే ఉదయం యెగాతో నా రోజు మొదలవుతుంది. పుస్తకాలు బాగా చదువుతున్నాను. ప్రస్తుతం నేను ‘వై వియ్ స్లీప్’ అనే పుస్తకం చదువుతున్నాను. ‘ఛారియట్స్ ఆఫ్ గాడ్స్’, ‘కాస్మిక్ కాన్షియస్నెస్’ అనే పుస్తకాలను చదవడం పూర్తి చేశాను. మార్నింగ్ టైమ్‌లో బుక్స్ చదువుతున్నాను. మధ్యాహ్నం ఏదైనా సోషల్ మీడియా లైవ్స్ చూస్తాను. సాయంత్రం ఒక సినిమా చూస్తాను. అలాగే ఒక షోకు సంబంధించిన రెండు, మూడు ఎపిసోడ్స్ ఫాలో అవుతాను. ఆస్కార్ అవార్డు సాధించిన అన్ని సినిమాలను చూడాలనుకుంటున్నాను. ఆస్కార్ సినిమాలను రెండేళ్లుగా చూస్తున్నాను. వీలైనప్పుడు వంట కూడా చేస్తున్నాను. దీనిపై ఓ యాట్యూబ్ చానెల్‌ను కూడా స్టార్ట్ చేశాం. ఆత్మపరిశీలన చేసుకోవడానికి, వ్యక్తిగతంగా మరింత స్ట్రాంగ్ అవ్వడానికి ఈ సమయాన్ని వినియోగించుకుంటున్నాను. కానీ ఇంత లాంగ్ బ్రేక్ నా లైఫ్‌లో రాలేదు. లాక్డౌన్ పూర్తయిన తర్వాత సినిమాలతో మళ్లీ బిజీ అవుతాను’’ అన్నారు. -
‘ఆ నూనెతో కరోనా చనిపోతుంది’
సాక్షి, న్యూఢిల్లీ: ఎవరైనా నిమిషం పాటు శ్వాసను అదుపుచేయగలిగితే వారికి కరోనా లేనట్టేనని ప్రముఖ యోగ గురువు రామ్‌దేవ్ బాబా అన్నారు. శనివారం ఈ-ఎజెండా ఆజ్‌తక్ ప్రత్యేక సెషన్లో పాల్గొన్న రామ్‌దేవ్ కరోనా లక్షణాలు ఉన్నవారు కానీ, లేని వారు కానీ ఒక నిమిషం పాటు శ్వాసను ఆపగలిగితే వారికి కరోనా లేనట్టేనని తెలిపారు. కరోనా వైరస్‌కి ప్రత్యేకమైన ప్రాణాయామం ఉందని దానిని ఉజ్జయ్ అంటారన్నారు. ఈ ఉజ్జయ్ ప్రాణాయామంలో నోటిని మూసి ముక్కుద్వారా శ్వాస తీసుకొని దానిని కొంచెం సేపు ఉంచి నెమ్మదిగా విడుదల చేయాలని చెప్పారు. ఇలా చేయడం ద్వారా కరోనా ఉందో లేదో స్వయంగా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. గుండె జబ్బులు, దీర్ఘకాలిక వ్యాధులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్నవారు 30 సెకన్ల పాటు శ్వాసను ఆపగలిగితే చాలని కరోనా లేదని నిర్థారించుకోవచ్చన్నారు. మిగిలిన వారు ఒక నిమిషం పాటు శ్వాసను కట్టడి చేయాలన్నారు. దీంతో పాటు ఆవ నూనెను ముక్కు రంధ్రంలో వేసుకోవడం ద్వారా అక్కడ కరోనా వైరస్ ఉంటే కడుపులోకి వెళ్లి ఉదరంలో ఉండే ఆమ్లాల కారణంగా చనిపోతుందన్నారు. (లాక్డౌన్ కారణంగా డిప్రెషన్‌కు లోనై ఆత్మహత్య) ఇక శరీరంలో ఆక్సిజన్ తగ్గడం కూడా అనేక జబ్బులకు కారణమని రామ్‌దేవ్ బాబా అన్నారు. ఇది సైన్స్ ద్వారా కూడా నిరూపితమైందన్నారు. ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండే యోగ చేయాలని సూచించారు. యోగ చేయడం ద్వారా రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు అంతర్భాగాలన్ని శక్తిమంతమవుతాయని, దీని ద్వారా మనల్ని మనం కరోనా నుంచి రక్షించుకోగలమని రామ్‌దేవ్ తెలిపారు. ఇక భారతదేశంలో ఇప్పటి వరకు 24,500 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 775 మంది కరోనా బారిన పడి మరణించారు. (162 మంది జర్నలిస్టులకు కరోనా టెస్ట్...) -
ప్రాణాయామం.. ప్రాణాన్ని నిలబెట్టింది
ఢిల్లీలో తొలి కరోనా బాధితుడు 45 ఏళ్ల వ్యాపారి రోహిత్ దత్తా పూర్తిగా కోలుకొని బయటపడ్డారు. ఆయన ఇటీవలే డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా కోవిడ్-19 బారి నుంచి తానెలా బయటపడిందీ వివరించారు. కరోనా సోకిన వాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో సూచించారు. ఈ మేరకు గురువారం ఓ వీడియోను పోస్ట్ చేశారు. అది కాసేపటికే వైరల్ అయ్యింది. ఈ వీడియోలో రోహిత్ దత్తా మాట్లాడుతూ..ఆసుపత్రిలో ఉన్న 14 రోజులూ క్రమం తప్పకుండా యోగా, ప్రాణాయామం చేసేవాడినని వివరించారు. ఈ రెండింటితోనే తాను ఈ మహమ్మారి గండం నుంచి గట్టెక్కానని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు వీటిని అభ్యాసం చేయాలని సూచించారు. కరోనాకు భయపడాల్సింది ఏమీ లేదని పేర్కొన్న రోహిత్ దత్తా యోగా, ప్రాణాయామం, మానసిక స్థైర్యం.. కరోనాను ఓడించేందుకు ఈ మూడే కీలకమన్నారు. రోహిత్ దత్తా ఫిబ్రవరి 24 న యూరప్ నుండి తిరిగి వచ్చారు. తర్వాత జ్వరంగా ఉండటంతో స్థానికి రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి వెళ్లగా, అక్కడ కరోనా పాజిటివ్ అని నిర్ధారించారు.దీంతో హాస్పిటల్లోనే క్వారంటైన్లో ఉంచినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా వైద్యసిబ్బంది బాగా చూసుకున్నారని వివరించారు. తనను తాను శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా ఉంచుకున్నట్టు తెలిపారు. సామాజిక దూరం పాటించాలని, ఏం చేయాలి, ఏం చేయకూడదనే దానిపై అవగాహన కలిగి ఉండాలని రోహిత్ దత్తా సూచించారు. కాగా, వేడినీళ్లు తాగాలని, రోజులో కనీసం 30 నిమిషాలపాటు యోగా, ప్రాణాయామం, ధ్యానం చేయడం ద్వారా వైరస్ బారి నుంచి తప్పించుకోవచ్చని ఆయుష్ మినిస్ట్రీ కూడా సూచించింది