ఒత్తిడి వేధిస్తోంటే.. అద్భుతమైన ఆసనం ఇదే! | How to do Mountain Pose and benefits | Sakshi
Sakshi News home page

ఒత్తిడి వేధిస్తోంటే.. అద్భుతమైన ఆసనం ఇదే!

Published Sat, Nov 23 2024 3:03 PM | Last Updated on Sat, Nov 23 2024 3:03 PM

How to do Mountain Pose and benefits

యోగా సమస్థితికి తాడాసనం 

పర్వతాన్ని పోలి ఉంటుంది కాబట్టి ఈ ఆసనాన్ని మౌంటెయిన్‌ పోజ్‌ అంటారు. పిల్లలు,పెద్దలు ఎవరైనా ఈ ఆసనాన్ని సులువుగా సాధన చేయవచ్చు.  ఒత్తిడినుంచి ఉపశమనం లభిస్తుంది.

 

  • రెండు పాదాలను దగ్గరగా ఉంచి, నిటారుగా నిల్చోవాలి. 
  • భుజాలు వంచకుండా, చేతులను నేలవైపుకు చాచాలి. 
  • రెండు నుంచి ఐదు శ్వాసలు తీసుకొని, వదులుతూ ఉండాలి. 
  • తర్వాత పాదాలను దగ్గరగా ఉంచి, చేతులను తల మీదుగా తీసుకెళ్లి, ఒక చేతివేళ్లతో మరొక చేతివేళ్లను పట్టుకోవాలి. శరీరాన్ని పైకి స్ట్రెచ్‌ చేస్తూ శ్వాసక్రియ కొనసాగించాలి.  శరీర కండరాలను బిగుతుగా ఉంచాలి. 
  • ఆ తర్వాత భుజాల నుంచి చేతులను పైకి లేపాలి. అరచేతులు రెండూ ఆకాశంవైపు చూస్తూ ఉండాలి.
  • ఈ విధంగా చేసే సమయంలో కాలి మునివేళ్ల మీద నిలబడుతూ, శరీరాన్ని పైకి లేపాలి. కొద్దిసేపు అలాగే ఉండి, తిరిగి యథాస్థానంలోకి రావాలి. ∙తర్వాత కాళ్లను ఒకదానికొకటి దూరంగా ఉంచుతూ, చేతులను కిందకు దించి, విశ్రాంత స్థితికి రావాలి. 
    తాడాసనం సాధన చేయడం జాయింట్స్‌పై మంచి ప్రభావాన్ని చూపుతుంది. పిల్లల చేత చేయిస్తే వారి ఎదుగుదలకు అమోఘంగా పనిచేస్తుంది. 
    – జి.అనూషారాకేష్, యోగా గురు

సమస్థితికి మౌంటెయిన్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement