
యోగా సాధన వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. జీవితం పట్ల సానుకూల ధోరణి ఏర్పడుతుంది. మనోధైర్యాన్నిస్తుంది. ప్రతికూలతలను దూరం చేసి, మనసును ప్రశాంతంగా, ఆత్మస్థైర్యంతో మిమ్మల్ని మీరు కొత్తగా మలుచుకోవడానికి సహకరించే ఐదు ఆసనాలు...
తాడాసనం: ఇది పర్వతాన్ని పోలి ఉంటుంది. అందుకే మౌంటెయిన్ పోజ్ అని కూడా అంటారు. చేతులను, కాళ్లను కదల్చకుండా స్థిరంగా, నిటారుగా నిల్చోవడం అలవాట వుతుంది.
చదవండి: ఇక్కడ జిమ్‌లో చేరాలంటే నెలకు తొమ్మిది లక్షలు!
బాలాసన: చంటి పిల్లలు మోకాళ్లపై బోర్లాపడుకొని ఉన్న భంగిమ ఇది. ఈ ఆసనంలో మ్యాట్‌పైన మోకాళ్లపైన కూర్చుంటూ, ముందుకు వంగి, నుదుటిని నేలకు ఆనించాలి. తలమీదుగా రెండువైపులా చేతులను ముందుకు తీసుకుంటూ, అరచేతులను నేలమీద ఉంచాలి.
చదవండి: #WomenPower :హంపీ టెంపుల్‌లోని ఈ సారథుల గురించి తెలుసా?
వీరభద్రాసన: దీనిని వారియర్ పోజ్ అని కూడా అంటారు. నేలపైన నిల్చొని కుడిపాదాన్ని ముందుకు ఉంచాలి. రెండు చేతులను విశాలంగా భుజాలకు ఇరువైపులా చాపాలి. ఈ సమయంలో తల నిటారుగా ఉండాలి. దీర్ఘ శ్వాస తీసుకుంటూ వదలాలి. దీనివల్ల మిమ్మల్ని మీరు శక్తిమంతులుగా భావిస్తారు. ఆత్మగౌరవం, స్వీయ ప్రేమ మెరుగుపడుతుంది.
అధోముఖస్వానాసన: మ్యాట్‌పైన బోర్లా పడుకొని, చేతులు, కాలివేళ్ల మీదుగా శరీరాన్ని ఉంచుతూ, హిప్ భాగాన్ని పైకి లేపాలి. దీనిని డాగ్ పోజ్ అని కూడా అంటారు. సాధన ప్రారంభంలో ఈ ఆసనం శరీరాన్ని వామప్ చేయడానికి ఉపయోగ పడుతుంది. ఇది భావోద్వేగ సమతుల్యతను పెంచుతుంది.
ఉష్ట్రాసన: మ్యాట్‌పైన మోకాళ్లను నేలకు ఆనిస్తూ కూర్చొని, రెండు చేతులతో కాలి మడమలను పట్టుకుంటూ, వెన్నెముకను వంపుగా,తలను వెనక్కి వంచాలి. దీంతో పొత్తికడుపు స్ట్రెచ్ అవుతుంది. ఈ ఆసనం వల్ల మానసిక స్థైర్యం పెరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment