stress
-
విధుల ఒత్తిడి.. వ్యాధుల ముట్టడి..!
ఓ వైపు శాంతిభద్రతలు అదుపు తప్పుతున్నాయి.. మరోవైపు ఆకతాయిలు పెచ్చు మీరుతున్నారు. ఇంకోవైపు గంజాయి బ్యాచ్‌ల ఆగడాలు పెరుగుతున్నాయి. అన్నింటికీ పోలీసులే కావాలి. కానీ సరిపోయేంత సంఖ్యలో ఖాకీలు ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలో లేరు. ఫలితంగా ఉన్న వారిపైనే ఒత్తిడి పడుతోంది. ఊపిరి సలపనంత పనితో వారి గుండెపై భారం పడుతోంది. తీవ్ర నిద్రలేమి, సరైన సమయానికి భోజనం లేక 30 ఏళ్లు దాటిన పోలీసులకు సైతం బీపీ, మధుమేహం వస్తున్నాయి. చాలా మందికి ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు కూడా దెబ్బతింటున్నాయి. 50 ఏళ్లు దాటిన వారితో పాటు 35 ఏళ్లలోపు వారు పదుల సంఖ్యలో మరణిస్తున్నారు. ఉన్నతాధికారులకు చెప్పుకోలేక, కుటుంబ సభ్యులతో ఈ కష్టం పంచుకోలేక చాలా మంది తమలో తామే కుమిలిపోతున్నారు. సిబ్బంది.. ఇబ్బంది జిల్లాలో 38 పోలీస్స్టేషన్లు ఉన్నాయి. రెండు వేల మంది పోలీసులు ఉన్నారు. ఉన్నవాళ్లలో 20 శాతం మందిని దేవాలయాలు, రాజకీయ సమావేశాలు, పోలీస్ పికెటింగ్, విద్యార్థుల పరీక్షలు వంటి బందోబ స్తు కార్యక్రమాలకు పంపుతుంటారు. ఒక్కో స్టేషన్లో 50 నుంచి 70 మంది ఉండాల్సి ఉన్నా పట్టుమని 20 మందైనా ఉండడం లేదు. ఈలోగా స్టేషన్లలో పెండెన్సీ కేసులు, కొత్త కేసులు, కొత్త చట్టాలు, కొత్త యాప్‌లు, సంకల్పాలు, అవగాహనలు ఒకదాని మీద ఒకటి వచ్చి పడుతూనే ఉంటాయి. ముఖ్యంగా హోంగార్డులు, కానిస్టేబుళ్లు, హెడ్‌కానిస్టేబుళ్ల కొరత వేధిస్తోంది. మరో 500 మంది సిబ్బంది ఉంటే తప్ప ఉన్న వారి ఆరోగ్యం బాగు పడేట్లు కనిపించడం లేదు. సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరీ.. 50 ఏళ్లు దాటిన వారిని సైతం సుదూర (విజయవాడ)బందోబస్తులకు పంపిస్తుండటం ఇబ్బందిగా ఉంటుంది. టీఏ, డీఏలు, సరెండర్లీవ్లు కూటమి ప్రభుత్వం ఇవ్వకపోవడంతో పదిమంది వెళ్లాల్సిన స్థానంలో వందమందినైనా అక్కడి వాళ్లు అడుగుతుండటం, సొంత డబ్బులతోనే సిబ్బంది వెళ్తుండటం జీతాలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. స్టేషన్లలో పోలీసు వాహనాల కొరత ఉండటంతో సొంత వాహనాలకు పెట్రోల్ పోసి పరిసర ప్రాంతాల విధుల్లో తిరగాల్సి వస్తోందని చాలామంది వాపోతున్నారు. జిల్లా కేంద్రం సమీపంలోని జెమ్స్ లో ఇటీవల పోలీసులకు నిర్వహించిన మెడికల్ క్యాంపులో 103మందికి పైగా సిబ్బందికి గుండెకు సంబంధించిన యాంజియోగ్రామ్, స్టంట్స్ అవసరమని వైద్యులు నిర్ధారించారంటే పరిస్థితి ఎంతవరకు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.వీరి పరిస్థితే హెచ్చరిక.. జనవరిలో నగరంలోని ఒకటో పట్టణ పరిధిలో యువకుడైన నాగరాజు అనే హోంగార్డు గుండెపోటుతో మరణించాడు. ఆయనకు భార్య, చిన్న పిల్లలున్నారు. జిల్లా కలెక్టరేట్ ట్రెజరీ విభాగంలో చెస్ట్ గార్డుగా ఉన్న ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ సవర జోక్యో గుండెపోటుతో మరణించాడని పోలీసులు ధ్రువీకరించారు. ఆయన వరుసగా మూడురోజులు విధుల్లో ఉన్నారు. మందస హెడ్‌కానిస్టేబుల్ గవరయ్య (59) గుండెపోటుతోనే మరణించారు. నగరంలోనే కిడ్నీలు ఫెయిల్ అయి ఓ కానిస్టేబుల్ మృతిచెందాడు. సీఎం చంద్రబాబు ప్రమాణస్వీకార బందోబస్తు విధులకు వెళ్లిన 57 ఏళ్ల ఆబోతుల లక్ష్మయ్య ఎండల వేడిమి తట్టుకోలేక స్ట్రోక్ వచ్చి విజయవాడలోనే మృతిచెందాడు. ఈయనది పోలాకి మండలం పల్లిపేట. సోంపేట ఎస్ఐ రవివర్మకు ఇటీవలే రెండోసారి స్ట్రోక్ వచ్చింది. తొలిసారి ఒక స్టంట్, ఇప్పుడు యాంజియోగ్రామ్ అవసరమన్నారు. ప్రస్తుతానికి లీవ్‌లో ఉన్నారు. కాశీబుగ్గ కానిస్టేబుల్‌కు హార్ట్ ప్రాబ్లెం ఉండటంతో స్టంట్ వేయించుకున్నారు. సోంపేటలో ఓ కానిస్టేబుల్‌కు ఇదే పరిస్థితి ఉంది. డే బై డే నైట్ డ్యూటీలతో సిక్.. గతంలో నైట్ బీట్ డ్యూటీల్లో కానిస్టేబుళ్లు, హోంగార్డులే ఉండేవారు. ఎస్ఐలు, సీఐలు రౌండ్లకు వెళ్లేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. 50 ఏళ్లు నిండి రిటైర్మెంటుకు దగ్గరలో ఉన్న ఏఎస్ఐలు నుంచి హెడ్‌కానిస్టేబుళ్లు కూడా డే బై డే నైట్ బీట్లకు వెళ్లాల్సి వస్తోంది. అవసరాన్ని బట్టి కొన్ని చోట్ల ఎస్ఐ–2లు వెళ్తున్నారు. రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఐదు వరకు ఉండటమే కాక గంట గంటకూ లైవ్ లొకేషన్, రెండు ఫొటోలు పంపాల్సిందే. మళ్లీ ఉదయాన్నే రోల్‌కాల్ 8గంటలతో డ్యూటీ మొదలు. 7:45 కల్లా సిద్ధంగా ఉండాలి. సెట్కాన్ఫరెన్సు (ఎస్ఐ, ఆపై ర్యాంకు) అయితే 7:30 నుంచి 9 గంటల వరకు ఉంటుంది. మళ్లీ సాయంత్రం 5కి రోల్ కాల్, 7:30 నుంచి సెట్ కాన్ఫరెన్సు.. కొన్నిమార్లు జూమ్ కాన్ఫరెన్సులు.. సాయంత్రం విజిబుల్ పోలీసింగ్ ఉంటాయి. (చదవండి: -
అధిక వేడి వల్ల... ముందస్తు ముదిమి!
మెల్బోర్న్: రోజంతా వేడిమి పరిస్థితుల్లో పనిచేశాక అలసిపోయిన భావన కలగడం సహజం. అలసిపోతే పర్లేదు గానీ దానివల్ల ఆయుష్షు కూడా వేగంగా క్షీణిస్తుందట! పర్యావరణ ఒత్తిళ్లకు తలొగ్గి మన శరీరంలో చాలా మార్పులే జరుగుతాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. డీఎన్ఏలో మార్పులు జరగకపోయినా మారే ఉష్ణ పరిస్థితులకు తగ్గట్లు ఒంట్లో ఏ ప్రొటీన్ ఉత్పత్తి ఏ మేరకు పెరగాలో, ఏది ఎంతగా తగ్గాలో నిర్ణయాలు జరిగిపోతాయట. ఈ ఎపీజెనిటిక్స్ శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆ్రస్టేలియాలో జరిగిన తాజా అధ్యయనంలో తేలింది. అధిక ఉష్ణోగ్రతలు మనిషిపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశంపై మొనాష్ విశ్వవిద్యాలయంలోని రోంగ్బిన్ క్సూ, యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్లోని షుఆయ్ లీ సారథ్యంలోని అధ్యయన బృందం పరిశోధన చేసింది. అత్యధిక ఉష్ణోగ్రతలకు లోనైన వ్యక్తుల్లో వృద్దాప్య ఛాయలు త్వరగా కనిపిస్తాయని తేల్చారు. అంతేకాదు, దీర్ఘకాలం పాటు వేడిమి పరిస్థితుల ప్రభావానికి గురైతే వృద్ధుల ఆయుష్షు రెండేళ్లకు పైగా హరించుకు పోతుందని వెల్లడించారు! వాతావరణ మార్పుల ప్రభావం వాతావరణ మార్పుల వల్ల వేడి పెరిగేకొద్దీ మన శరీరం మరింత ఒత్తిడికి గురవుతుంది. ఈ ఒత్తిడే వృద్ధాప్యం త్వరగా రావడానికి ప్రధాన కారణంగా మారుతోంది. ముఖ్యంగా వడగాల్పులకు, వేడి వాతావరణానికి చిరునామాగా నిలిచే ఆ్రస్టేలియాలో కొన్నేళ్లుగా ఈ పరిస్థితులు పరిపాటిగా మారుతున్నాయి. ఉష్ణోగ్రత ప్రభావ మార్పులు అక్కడ మనుషులపై స్పష్టంగా కనిపించాయని అధ్యయనం పేర్కొంది. జెనటిక్ స్థాయిల పరిస్థితేంటి? తీసుకునే ఆహారానికి తగ్గట్లు శరీరంలో మార్పులు జరుగుతాయి. పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, దుంపల వంటి తేలిగ్గా జీర్ణమయ్యే సహజసిద్ద ఆహారం తీసుకుంటే ప్రోటీన్లు, విటమిన్లు తగిన మోతాదులో అంది శరీరంలో సానుకూల మార్పులు జరుగుతాయి. అలాగాక బాగా వేయించిన, ప్యాక్ చేసిన, నూనెలు అతిగా వాడిన, పూర్తి ప్రాసెస్డ్ ఆహారం తీసుకుంటే పోషకాలందక ఒంట్లో ప్రతికూల మార్పులు సంభవిస్తాయి. దాంతో వయసు మీద పడకుండా ఆపే సహజసిద్ధ సామర్థ్యం తగ్గుతుంది. వేడిమి సందర్భాల్లోనూ ఒంట్లోని జన్యు కణాలు విరుద్ధ రీతిలో స్పందిస్తాయి. ఫలితంగా ఏ సందర్భంలో ఏ రకం ప్రొటీన్‌ను ఎంత మోతాదులో ఉత్పత్తి చేయాలనే డీఎన్ఏ సీక్వెన్స్ దెబ్బ తింటుంది. ఇది శరీర భౌతిక క్రియలపై ప్రతికూల ప్రభావం చూపి ఆరోగ్య స్థితిని పాడుచేసే ప్రమాదముంది. వేడిమి వృద్దాప్య రేటును నిర్దేశించే జన్యు కణాలను అసంబద్ధంగా క్రియాశీలం చేస్తుంది. అలా ముందుగానే వృద్ధాప్యంలోకి జారిపోతాం. పరిశోధనల్లోఏం తేలింది? 68 ఏళ్ల పైబడిన 3,700 మందిపై సదరన్ కాలిఫోరి్నయా వ ర్సిటీలో పరిశోధన చేశారు. తక్కువ వయ సు వారిలో పోలిస్తే పెద్దవాళ్ల మీదే అత్యధిక ఉష్ణోగ్రత పరిస్థితులు అధిక ప్రభావం చూ పాయి. వయసు పెరిగేకొద్దీ వేడిని నియంత్రించుకునే సామర్థ్యమూ సన్నగిల్లుతోంది. దాంతో అనారోగ్యం బారిన పడటం, చనిపోవడం వంటివి జరుగుతున్నాయి. వృద్ధాప్య ఛాయలను నిర్ధారించే మూడు రకాలైన పీసీఫీనో ఏజ్, పీసీగ్రిమ్ ఏజ్, డ్యూన్డిన్ పేస్ జీవ గడియార పద్దతుల్లో వలంటీర్ల రక్త నమూనాలను పరిశీలించారు. 2010 నుంచి ఆరేళ్లపాటు వీళ్లంతా అధిక వేడి పరిస్థితులను ఎదుర్కొన్నప్పటి పరిస్థితులను పోలి్చచూశారు. అమెరికాలో ప్రామాణికమైన 32 డిగ్రీ సెల్సియస్ వరకు సాధారణ, 32–39 డిగ్రీలను మధ్యస్థ, 39–51 డిగ్రీల దాకా అతి తీవ్ర వేడిమిగా పరిగణించి వ లంటీర్ల డేటాతో సరిచూశారు. పీసీఫినో ఏజ్ ప్రకారం సుదీర్ఘకాలం వేడికి గురైతే 2.48 ఏళ్లు ముందుగానే వృద్ధాప్యం వస్తుందని తేలింది. పీసీగ్రిమ్ ఏజ్ పద్దతిలో 1.09 ఏళ్లు, డ్యూన్డిన్ పేస్ పద్ధతిలో 0.05 ఏళ్లు ముందుగా వృద్ధాప్యం వస్తుందని వెల్లడైంది. వేడికి, వయసుకు లింకేమిటి? వయసు మీద పడటం సహజ ప్రక్రియ. వృద్ధాప్య ఛాయలు బయట పడటం ఒక్కో మనిషిలో ఒక్కోలా ఉంటుంది. ఒత్తిళ్లు, షాక్ వంటి అనూహ్య ఘటనలు ఎదురైనప్పుడు శరీరంలో పెనుమార్పులు సంభవిస్తాయి. చాన్నాళ్లపాటు సరిగా నిద్ర పోకుంటే వృద్ధాప్య ఛాయలు త్వరగా రావడం ఖాయం. అత్యధిక వేడిమి పరిస్థితులు మనిషిలోని సత్తువను లాగేస్తాయి. జీవక్రియలను పూర్తిస్థాయిలో చేసే సామర్థ్యాన్ని శరీరం క్రమంగా కోల్పోతుంది. వయసు మీదపడే రేటు పెరుగుతుంది. వృద్ధాప్యంలో రావాల్సిన రోగాలు ముందే ముసురుకుంటాయి. -
పరీక్షా పే చర్చ: మెంటల్ హెల్త్‌పై దీపికా పదుకొణె కామెంట్స్ వైరల్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె(Deepika Padukone)తాను మానసిక ఆందోళనకు గురైన ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ( Narendra Modi) ప్రతి ఏడాది నిర్వహించే పరీక్షా పే చర్చ(Pariksha Pe Charcha) తాజా ఎపిసోడ్ (రెండో)లో పాల్గొన్నదీపికా బాల్యంలో, చదువుకునే సమయంలో తానెదుర్కొన్న ఆలోచనలు, సమస్యల గురించి వివరించింది. బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులతో ప్రధానమంత్రి సంభాషించే కార్యక్రమం 'పరీక్ష పే చర్చ' ఎపిసోడ్‌కి తనను ఆహ్వానించినందుకు ప్రేక్షకులకు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దీపికా కృతజ్ఞతలు తెలిపింది. పరీక్షా పే చర్చ 2025 రెండో ఎపిసోడ్ దీపికా పదుకొణెతో విజయవంతంగా ముగిసింది. ఈ ఎపిసోడ్లో, దీపికా పదుకొనే తన బాల్య ప్రయాణాన్ని పంచుకుంది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ తాను అల్లరి పిల్లనని తెలిపింది. లెక్కలు నేర్చుకోవడంలో ఇబ్బంది ఉండేదని గుర్తు చేసుకుంది. అంతేకాదు ఇప్పటికీ లెక్కలంటేనే భయమేనని తెలిపింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి పుస్తకాన్ని కూడా ప్రస్తావించింది. అందరూ తమ మనసులోని భావాలను బయటపెట్టాల్సిన అవసరాన్నిగురించి వివరించింది. మానసిక ఆరోగ్యం, ఒత్తిడి ఎదుర్కోవడం లాంటి అంశాలపై విద్యార్థులకు ఆమె కీలక సలహాలిచ్చింది.Deepkia Padukone thanks PM Modi for giving her the platform to speak on Depression, anxiety and other mental health issues! pic.twitter.com/BlqGy8fGrN— Janta Journal (@JantaJournal) February 12, 2025తన అనుభవాలను పంచుకుంటూ..స్కూల్ విద్యార్థిగా ఉన్నపుడే క్రీడల వైపు ఆసక్తి ఉండేదని, ఆ తరువాత మోడలింగ్, నటన వైపు తన దృష్టి మళ్లిందని తెలిపింది. అయితే ఒకానొక దశలో మానసికంగా చాలా కుంగుబాటుకు లోనయ్యానని, ఆత్మహత్య చేసు కోవాలనే ఆలోచనలు కూడా వచ్చేవని దీపికి తెలిపింది. అవిశ్రాంతంగా పనిచేస్తూ,తన మానసిక ఆరోగ్యం గురించి పట్టించుకోలేదనీ, చివరికి ఒక రోజు స్పృహ కోల్పోయాను. రెండు రోజుల తర్వాత, నిరాశతో బాధపడుతున్నానని గ్రహించి చికిత్స తీసుకున్నట్టు వెల్లడించింది. తన జీవితంలో వచ్చిన ఎన్నో మార్పులను అవగాహన చేసుకుంటూ, తనను తాను మోటివేట్ చేసుకుంటూ ముందుకు సాగినట్టు చెప్పింది. ఈ ఒత్తిడి అనేది కంటికి కన్పించదు, కానీ అనుక్షణం దెబ్బతీస్తుంది. మన జీవితంపై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. నిజానికి మన చుట్టూ ఈ సమస్యతో బాధపడేవారు చాలామందే ఉంటారు. అందుకే రాయడం అలవర్చుకోవాలని పిల్లలకు సలహా ఇచ్చింది. జర్నలింగ్ అనేది మనమనసులోని భావాలను ప్రాసెస్ చేయడానికి, వ్యక్తీకరించడానికి ఒక మంచి మార్గమని ఆమె విద్యార్థులకు సూచించారు. ఒకరితో ఒకరు పోటీ పటడం, పోల్చుకోవడం సహజం. మన బలాలు ,బలహీనతలను గుర్తించడం, మన బలాలపై దృష్టి పెట్టడం, మన బలహీనతలను మెరుగుపరచుకోవడం చాలా అవసరమని పేర్కొంది. అలాగే మన బలాన్ని మనం తెలుగుకో గలిగిన రోజు మీలోని మరో వ్యక్తి బయటికి వస్తారని ధైర్యం చెప్పింది.కాగా పరీక్షా పే చర్చ ఎపిసోడ్స్ విద్యా మంత్రిత్వ శాఖ యూట్యూబ్ ఛానల్, మైగవ్ ఇండియా, ప్రధాని మోదీ యూట్యూబ్ ఛానల్, దూరదర్శన్ ఛానల్స్ వంటి అన్ని ప్రభుత్వ పోర్టల్స్ ద్వారా ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే.2014లో క్లినికల్ డిప్రెషన్‌తో బాధపడిన దీపికా పదుకొణె ఈ ఎడిసెడ్లో పాల్గొంది. హీరో రణవీర్‌ను పెళ్లాడిన దీపిక ప్రస్తుతం పాపకు తల్లిగా మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తోంది. -
భారత్ బాగుండాలంటే.. పని గంటలు తగ్గాల్సిందే!
ఆరోగ్యం ఏమాత్రం చెడిపోకుండా.. అసలు ఎన్ని గంటలు పని చేస్తే సరిపోతుంది?. 7 గంటలా?, 8 గంటలా?, పోనీ 10 గంటలా?.. ఏదో ఒక సందర్భంలో తమను తాము ఉద్యోగులు వేసుకునే ప్రశ్నే ఇది. అయితే అది పనిని, పని ప్రదేశాన్ని బట్టి మారొచ్చనేది నిపుణులు చెప్పే మాట. అలాంటప్పుడు మార్గదర్శకాలు, లేబర్ చట్టాలు ఎందుకు? అనే ప్రశ్న తలెత్తడం సహజమే కదా!.ఆమధ్య కేరళకు చెందిన అన్నా సెబాస్టియన్ అనే యువ చార్టెడ్ అకౌంటెంట్.. పుణేలో ఓ ఎమ్మెన్సీలో చేరిన నాలుగు నెలలకే అనారోగ్యం పాలై చనిపోయింది. పని ఒత్తిడి వల్లే తన కూతురి ప్రాణం పోయిందంటూ సదరు కంపెనీకి, కేంద్రానికి బాధితురాలి తల్లి ఓ లేఖ రాసింది. యూపీలో ఫైనాన్స్ కంపెనీలో పని చేసే తరుణ్ సక్సేనా.. 45 రోజులపాటు విశ్రాంతి తీసుకోకుండా పని చేసి మానసికంగా అలసిపోయాడు. చివరకు టార్గెట్ ఒత్తిళ్లను భరించలేక.. బలవన్మరణానికి పాల్పడ్డాడు. చైనాలో, మరో దేశంలోనూ ఇలా పని వల్ల ప్రాణాలు కోల్పోయిన కేసులు చూశాం. ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చినప్పుడు తీవ్రస్థాయిలో పని గంటల గురించి.. పని వాతావరణం గురించి తీవ్ర చర్చ జరుగుతుంది. అసలు ఇలా.. ఉద్యోగులు ఇన్నేసి గంటలు బలవంతంగా పని చేయడం తప్పనిసరేనా? చట్టాలు ఏం చెబుతున్నాయంటే..భారత్‌లో పనిగంటలను నిర్దారించేవి యాజమానులు/ సంస్థలు/కంపెనీలే. కానీ, ఆ గంటల్ని నియంత్రించేందుకు చట్టాలు మాత్రం అమల్లోనే ఉన్నాయి. అవే.. ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948, షాప్స్ అండ్ ఎస్టాబిష్మెంట్స్ యాక్ట్స్ ఉన్నాయి.ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 ప్రకారం..రోజూ వారీ పని గంటలు: గరిష్టంగా 9 గంటలువారంలో పని గంటలు: గరిష్టంగా 48 గంటలురెస్ట్ బ్రేక్స్: ప్రతీ ఐదు గంటలకు ఆరగంట విరామం కచ్చితంగా తీసుకోవాలిఓవర్ టైం: నిర్ణీత టైం కన్నా ఎక్కువ పని చేస్తే చేసే చెల్లింపు.. ఇది ఆయా కంపెనీల, సంస్థలపై ఆధారపడి ఉంటుందిషాప్స్ అండ్ ఎస్టాబిష్మెంట్స్ యాక్ట్లురోజువారీ పని గంటలు: 8-10 గంటలువారంలో పని గంటలు: 48 గంటలకు పరిమితం.. ఓటీని కలిపి 50-60 గంటలురెస్ట్ బ్రేక్స్: ఫ్యాక్టరీస్ యాక్ట్ తరహాలోనే తప్పనిసరి విరామంకొత్త లేబర్ చట్టాల ప్రకారం..(అమల్లోకి రావాల్సి ఉంది)రోజువారీ పని గంటలు: 12 గంటలకు పరిమితంవారంలో పని గంటలు: 48 గంటలకు పరిమితంఓవర్ టైం: అన్నిరకాల పరిశ్రమల్లో.. త్రైమాసికానికి 125 గంటలకు పెరిగిన పరిమితి‘దేశంలోని ఉద్యోగులకు పని వేళలను కుదించండి.. ఆ నిబంధనలను కఠినంగా అమలయ్యేలా చూడండి’ తాజా పార్లమెంట్ సమావేశాల్లో లోక్‌సభ వేదికగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కేంద్రానికి చేసిన విజ్ఞప్తి ఇది. ‘‘ఇది అత్యవసరమైన అంశం. గంటల తరబడి పనితో.. ఉద్యోగుల మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. ఒకవైపు ఒత్తిడి, మానసిక ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు డయాబెటిస్, హైపర్‌టెన్షన్‌లాంటి సమస్యల బారిన పడుతున్నారు. పని గంటలను పరిమితం చేసే చట్టాలకు ప్రాధాన్యమిస్తూనే.. కఠినంగా వాటిని అమలయ్యేలా చూడాలి’’ అని కార్మిక శాఖ మంత్రి మాన్షుక్ మాండవియాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.ఉద్యోగుల పని గంటలకు సాధారణ మార్గదర్శకాలుఫుల్ టైం వర్క్.. ఎనిమిది గంటలకు మించకుండా వారంలో ఐదు దినాలు.. మొత్తం 40 గంటలు. ఓవర్ టైం.. 40 పని గంటలకు మించి శ్రమిస్తే.. రకరకాల సమస్యలు రావొచ్చు. అందుకే ఓటీ విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి. పని మధ్యలో.. ఎక్కువ సేపు తదేకంగా పని చేయడం అంత మంచిది కాదు. మధ్యమధ్యలో కాసేపు విరామం తీసుకోవడం కంపల్సరీ. ఆయా దేశాల జనాభా, ఆర్థిక పరిస్థితులు, ఇతరత్రా అంశాలను పరిగణనలోకి తీసుకుని వివిధ దేశాల వారపు పని గంటల జాబితాను పరిశీలిస్తే.. అత్యధిక పని గంటలు ఉన్న దేశాలుగా కంబోడియా, మయన్మార్, మెక్సికో, మలేషియా, బంగ్లాదేశ్ లిస్ట్‌లో ప్రముఖంగా ఉన్నాయి. అత్యల్పంగా పని గంటల దేశాలుగా దక్షిణ ఫసిఫిక్ దేశం వనౌతు, కిరిబాటి, మొజాంబిక్, రువాండా, సిరియా ఉన్నాయి.ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ గణాంకాల ప్రకారం.. ప్రపంచంలోనే ఎక్కువ పని గంటలు ఉన్న దేశంగా జాబితాలో భారత్ కూడా ఉంది. అందుకు కారణం.. దేశ శ్రామిక శక్తిలో 51 శాతం ఉద్యోగులకు వారానికి 49 పని గంటల విధానం అమలు అవుతోంది కాబట్టి. అలాగే ఆ మధ్య వెలువడిన ఓ అధ్యయనం ప్రకారం.. 78 శాతం భారతీయ ఉద్యోగులు పని గంటలతో శారీరకంగా, మానసికంగా అలసటకు గురవుతున్నారు.వర్క్-లైఫ్ బ్యాలెన్స్ కోసం, పని ప్రాంతాల్లో పరిస్థితులు మానవీయ కోణంలో కొనసాగాలన్నా.. తక్షణ చర్యలు అవసరం అని థూరూర్ లాంటి వాళ్లు చెబుతున్నారు. అందుకు అన్నా సెబాస్టియన్ అకాలమరణా ఉదంతాన్నే ఉదాహరణగా చెబుతున్నారు. చిన్నవయసులో.. అదీ కొత్తగా ఉద్యోగంలో చేరి మానసికంగా వేదనకు గురైంది ఆమె. అలా.. ఆరోగ్యం చెడగొట్టుకుని ఆస్పత్రిపాలై.. ప్రాణం పొగొట్టుకుంది. దేశ ఎదుగుదలకు శ్రమించే ఇలాంటి యువ నిపుణల బాగోగుల కోసం ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ, ఇలాంటి వరుస విషాదాలు.. వ్యవస్థాగత వైఫల్యాలను ప్రతిబింబిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి హద్దులు చెరిపేసి ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచనలు చేస్తాయా?. -
ఒత్తిడి వేధిస్తోంటే.. అద్భుతమైన ఆసనం ఇదే!
పర్వతాన్ని పోలి ఉంటుంది కాబట్టి ఈ ఆసనాన్ని మౌంటెయిన్ పోజ్ అంటారు. పిల్లలు,పెద్దలు ఎవరైనా ఈ ఆసనాన్ని సులువుగా సాధన చేయవచ్చు. ఒత్తిడినుంచి ఉపశమనం లభిస్తుంది. రెండు పాదాలను దగ్గరగా ఉంచి, నిటారుగా నిల్చోవాలి. భుజాలు వంచకుండా, చేతులను నేలవైపుకు చాచాలి. రెండు నుంచి ఐదు శ్వాసలు తీసుకొని, వదులుతూ ఉండాలి. తర్వాత పాదాలను దగ్గరగా ఉంచి, చేతులను తల మీదుగా తీసుకెళ్లి, ఒక చేతివేళ్లతో మరొక చేతివేళ్లను పట్టుకోవాలి. శరీరాన్ని పైకి స్ట్రెచ్ చేస్తూ శ్వాసక్రియ కొనసాగించాలి. శరీర కండరాలను బిగుతుగా ఉంచాలి. ఆ తర్వాత భుజాల నుంచి చేతులను పైకి లేపాలి. అరచేతులు రెండూ ఆకాశంవైపు చూస్తూ ఉండాలి.ఈ విధంగా చేసే సమయంలో కాలి మునివేళ్ల మీద నిలబడుతూ, శరీరాన్ని పైకి లేపాలి. కొద్దిసేపు అలాగే ఉండి, తిరిగి యథాస్థానంలోకి రావాలి. ∙తర్వాత కాళ్లను ఒకదానికొకటి దూరంగా ఉంచుతూ, చేతులను కిందకు దించి, విశ్రాంత స్థితికి రావాలి. తాడాసనం సాధన చేయడం జాయింట్స్‌పై మంచి ప్రభావాన్ని చూపుతుంది. పిల్లల చేత చేయిస్తే వారి ఎదుగుదలకు అమోఘంగా పనిచేస్తుంది. – జి.అనూషారాకేష్, యోగా గురుసమస్థితికి మౌంటెయిన్ -
పిల్లల్లో ఏకాగ్రతలేదా? ఒక్క చోట నిలవడం లేదా?
పిల్లలకు ఏకాగ్రత ఉండటం లేదు, ఎదుగుదల సరిగా లేదు.. అని పెద్దల నుంచి కంప్లైంట్స్ తరచూ వింటూ ఉంటాం. పిల్లల్లో ఆందోళన, చికాకు తగ్గడానికి యోగాభ్యాసం ఎంతగానో ఉపయోగపడుతుంది. పెద్దలు చేసే విధంగా పిల్లలకు యోగా సాధన కుదరదు. చిన్న చిన్న మార్పులు చేసి, పిల్లలచే సాధన చేయిస్తే వారి ఉన్నతికి యోగా ఒక బలమైన పునాదిగా ఉంటుంది. ముందు ఓ పది నిమిషాలు పిల్లలతో చిన్న చిన్న స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయించాలి. దీనివల్ల వారి శరీరం యోగాభ్యాసానికి సిద్ధం అవుతుంది. ఆ తర్వాత 12 సూర్యనమస్కారాలు చేయించాలి. పిల్లలకు ఏకాగ్రత, ఎదుగుదలకు సహకరించేవి..ఆక్సీజన్ గా..ముందు నిటారుగా నిల్చోవాలి. రెండు కాళ్లలో ఒక కాలిని మోకాళ్ల వద్ద వంచుతూ, ΄ాదాన్ని నిలుచుని ఉన్న కాలు తొడ భాగంలో ఉంచాలి. హృదయం దగ్గర నమస్కార భంగిమ లో చేతులను ఉంచి, రెండు శ్వాసలు తీసుకుని వదిలాక, చేతులు రెండూ పైకి ఎత్తి నిల్చోవాలి. ఈ ఆసనం ద్వారా శరీరాన్ని బ్యాలెన్డ్స్‌గా ఎలా ఉంచాలో తెలుస్తుంది. ఒక చెట్టు ఆక్సిజన్‌ను ఎలా ఉత్పత్తి చేస్తుందో అలాంటి భంగిమ కాబట్టి పిల్లల శ్వాసక్రియ కూడా బాగా పనిచేస్తుంది. ఈ ఆసనం ద్వారా వారిలో ఏకాగ్రత పెరుగుతుంది. – జి. అనూ షారాకేష్యోగ గురు -
డొనాల్డ్ ట్రంప్ బరువు తగ్గడం: ఒత్తిడి కారణంగా బరువు కోల్పోతారా..?
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్‌పై డొనాల్డ్ ట్రంప్ ఘనవిజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. అగ్రరాజ్యం 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నా ట్రంప్ చాలా బరువు కోల్పోయినట్లుగా కనిపిస్తున్నారు. మునుపటి ట్రంప్‌లా కాకుండా చాలా స్లిమ్‌గా ఉన్నారు. ఆయన బరువు తగ్గేందుకు ఏవేవో వాడుతున్నారంటూ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కానీ అందులో ఏ మాత్రం నిజంలేదు. ఓ ఇంటర్వ్యూలో తానెందుకు బరువు తగ్గారో స్వయంగా వివరించారు ట్రంప్. ప్రస్తుతం తాను చాలా బిజీగా ఉండటం వల్లే హాయిగా తినే సమయం లేకపోయిందని అందువల్లే బరువు తగ్గినట్లు చెప్పుకొచ్చారు. అయితే ఇలా ఆహారంపై శ్రద్ధ చూపకుండా పనిలో బిజీగా ఉంటే బరువు తగ్గిపోతామా..?. ఇలా అందరికీ సాధ్యమేనా..?.అధ్యక్ష్య ఎన్నికల కారణంగా వచ్చే ఒక విధమైన ఒత్తిడి, బిజీ షెడ్యూల్ తదితరాలు ట్రంప్ బరువు కోల్పోయేందుకు దారితీశాయి. ఇక్కడ ట్రంప్ నిరవధిక ప్రచార ర్యాలీల కారణంగా సరిగా భోజనం చేయలేకపోయానని చెప్పారు. ఓ పక్క వేళకు తిండి తిప్పలు లేకపోవడం, మరోవైపు ఎన్నికల్లో గెలుపు ఎవరిది అన్న ఆందోళన తదితరాలే ఆయన బరువు తగ్గేందుకు ప్రధాన కారణాలు. మొత్తంగా దీని ప్రభావం వల్ల ట్రంప్ దాదాపు 9 కిలోలు తగ్గిపోయారు. నిజానికి ఒత్తిడి కారణంగా బరువు పెరగాలి కానీ ట్రంప్ విషయంలో అందుకు విరుద్ధంగా ఉంది. ఇదెలా అంటే..మానిసిక ఆరోగ్య నిపుణులు బరువు తగ్గడం అనేది మనస్సు, శరీరానికి సంబంధించినదని చెబుతున్నారు. ఇక్కడ శారీరక ఆరోగ్యాన్ని ఒత్తిడి ఎలా ప్రభావితం చేస్తుంది అని చెప్పేందుకు స్వయంగా ట్రంప్ ఒక ఉదాహరణ అని అన్నారు. ఎప్పుడైనా ఒత్తిడికి లోనైతే శరీరంలో కార్డిసాల్ అనే హార్మోన్ విడుదలవుతుంది. అందుకు అనుగుణంగా శరీరం ప్రతిస్పందిస్తుంది. దీంతో రక్తప్రవాహంలో కార్టిసాల్ స్థాయిలు ఒక్కసారిగా పెరిగి విపరీతమైన ఆకలి లేదా ఆకలి లేకపోవడం వంటి మార్పులకు లోనవుతుంది. ప్రతిఒక్కరిలో ఈ ఒత్తిడి ఒక్కో విధంగా ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. కొందరు దీని కారణంగా బరువు తగ్గొచ్చు, మరికొందరూ పెరగొచ్చు అని అన్నారు. అంతేగాదు కొందరిలో ఈ ఒత్తిడి బ్రెయిన్‌ని ఆడ్రినల్ హార్మోన్ విడుదలచేసేలా ప్రేరేపిస్తుంది. ఫలితంగా తినాలనే కోరిక ఆటోమేటిగ్గా తగ్గిపోవడం మొదలవుతుంది. అలాగే జీర్ణాశయంపై కూడా తీవ్ర ప్రభావం చూపి కేలరీలు బర్న్ అయ్యేలా చేసి బరువు కోల్పోయేందుకు దారితీస్తుంది. మరికొందరికి మాత్రం.. ఒత్తిడిలోనైతే ఇదే కార్డిసాల్ అధిక కేలరీలు కలిగిన చక్కెరతో కూడిన పదార్థాలను తినేలా ప్రేరేపిస్తుంది. దీని వల్ల చాలామందికి పొత్తికడుపు పెద్దగా లావుగా ఉండటం లేదా బానపొట్ట తదితరాలకు కారణమని చెబుతున్నారు నిపుణులు. ఇలాంటి వ్యక్తులు కనీస శారీరక శ్రమ చెయ్యనట్లయితే ఒబెసిటికి దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. (చదవండి: అందాల రాణి ఐశ్వర్య రాయ్ బ్యూటీ సీక్రెట్ ఇదే..!) -
నిశ్శబ్ద మహమ్మారి : కనిపెట్టకపోతే కాటేస్తుంది!
National Stress Awareness Day 2024 జీవితంలో ప్రతీ వ్యక్తికి ఎంతో కొత్త ఒత్తిడి ఉంటుంది. ఏదో ఒక స్థాయిలో ఏదో ఒక కారణానికి ఒత్తిడిని అనుభవిస్తారు. కానీ ఒత్తిడికి మనం ప్రతిస్పందిస్తున్నామనేది మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. ఒత్తిడి తీవ్రమైతే మాత్రమే ముప్పే. ఈ నిశ్శబ్ద మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేస్తుంది. ప్రతీ ఏడాది నవంబరు 6న నేషనల్ స్ట్రెస్ అవేర్నెస్ డే జరుపు కుంటారు. ఈ సందర్భంగా ఒత్తిడి, అవగాహన విషయాలను తెలుసుకుదాం.దీర్ఘకాలిక ఒత్తిడి ఆందోళన, నిరాశలను కారణం. ఇది అనేక శారీరక అనారోగ్యాలకు దారితీస్తుంది. అందుకే దీనిపై అవగాహన పెంచుకుని, అప్రమత్తంకావాలి. స్ట్రెస్ మేనేజ్మెంట్పై అవగాహన పెంచుకోవాలి.జాతీయ ఒత్తిడి అవగాహన దినోత్సవం 2024: థీమ్నేషనల్ స్ట్రెస్ అవేర్నెస్ డే 2024 థీమ్ "ఒత్తిడిని తగ్గించేందుకు, వారి సంరణక్షను మెరుగుపరచడానికి ప్రచారం చేయడం". ఇది ఒత్తిడి నిర్వహణ, మానసిక ఆరోగ్యం , స్వీయ సంరక్షణను ప్రోత్సహించేలా చేస్తుంది. విశ్రాంతి, సంపూర్ణత, సామాజిక సంబంధాలకు ప్రాధాన్యత ఇచ్చేలా ప్రోత్సహిస్తుంది.ఆరోగ్యంపై ఒత్తిడి ప్రభావాలు ఏమిటి?ఆరోగ్యంపై ఒత్తిడి ప్రభావం శారీరకంగా, మానసికంగా గణనీయంగా ఉంటుంది. పని, ఆర్థిక వ్యవహారాలు, మానవ సంబంధాలు, ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు, అనారోగ్యం, ప్రియమైన వ్యక్తి మరణం, లాంటి అంశాలు ఒత్తిడికి కారణమవుతాయి. ఇవి హార్మోన్లు, మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి. దీర్ఘకాలిక ఒత్తిడి ఒత్తిడి కార్టిసాల్ అనే హార్మోన్‌ను పెరుగుదలకు దారి తీస్తుంది. రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. ఫలితంగా సాధారణ జలుబు నుండి మరింత తీవ్రమైన అనారోగ్యాలకు దారి తీస్తుంది. జలుబు, ఫ్లూ, వైరస్లు , ఇతర వ్యాధులుడిప్రెషన్ , ఆందోళన, అలసటతలనొప్పి, గుండె సమస్యలు లేదా గుండెపోటు, నిద్రలేమి చిరాకు , కోపం, అతిగా తినడం, కడుపు, జీర్ణశయాంతర సమస్యలుఏకాగ్రతలోపించడం,బయటపడేదెలా?ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలి అనేది ఎవరికి వారు ప్రయత్నించాలి. ఒత్తిడికి కారుణాలను అర్థం చేసుకోవడం ముఖ్యం.మన చేయి దాటిపోతోంది అనిపించినపుడు థెరపిస్ట్ లేదా కౌన్సెలర్‌తో మాట్లాడి, వారి సలహాలను పాటించాలి. గిన చికిత్స తీసుకోవాలి.వ్యాయామం చేస్తూ మనసుని, శరీరాన్నిఉత్సాహంగా ఉంచుకోవాలి.నడవడం, జాగింగ్ బైక్ నడపడం, గార్డెనింగ్, యోగా లేదా వెయిట్ లిఫ్టింగ్ వంటివి చేయాలి. ఈ సందర్భంగా వెలువడిన హార్మోన్లు మెదడుకి మంచిది. సంతోషకరమైన అనుభూతినిస్తాయి.ధ్యానం,మెడిటేషన్ టెక్నిక్‌ని ప్రయత్నించవచ్చు. ధ్యానం రక్తపోటును తగ్గిస్తుంది. నచ్చిన పనిపై దృష్టిపెట్టాలి. తద్వారా మనసుకు ప్రశాంతత తనిస్తుంది. -
ఆందోళనని హ్యాండిల్ చేయడంపై హీరో విక్కీ కౌశల్ సలహాలు!
బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ అత్యంత ప్రతిభావంతమైన హీరోల్లో ఒకరు. `యూరి` లాంటి సంచలన మూవీతో ఒక్కసారిగా అతడి పేరు మారుమ్రోగిపోయింది. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించి వారి మనుసులను గెలుచుకున్నాడు. నిజానికి విక్కీ ఓవర్‌నైట్‌లో స్టార్‌డమ్‌ని సంపాదించుకోలేదు. అతను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలా కష్టాలు పడ్డాడు. ఆ క్రమంలో ఆందోళన(యాంగ్జయిటీ), అభద్రతభావానికి గురయ్యేవాడనని చెప్పుకొచ్చాడు విక్కీ. అయితే దాన్ని ఏవిధంగా హ్యాండిల్ చేయాలో ఓ సీనియర్ నటుడు తనకు మంచి సలహ ఇచ్చారని అన్నారు. ఇంతకీ ఏంటా సలహా అంటే..నటన, డ్యాన్స్ పరంగా విక్కీ కౌశల్ చాలా టాలెంటెడ్ హీరో. ఏ పని అయినా చాలా పర్ఫెక్ట్గా చేస్తాడు. కెరీర్లో హీరోగా ఎదుగుతున్న సమయంలో చాలా సవాళ్లను ఎదుర్కొన్నాడు. ఆ క్రమంలో తాను ఆందోళనకు గురయ్యేవాడనని అన్నారు. అయితే దాన్ని హ్యాండిల్ చేయడంపై ఓ సీనియర్ నటుడు ఇచ్చిన సలహను తూచాతప్పకుండా పాటిస్తానని అన్నారు. అదేంటంటే..ఆందోళనను ఎలా మ్యానేజ్ చేయాలంటే..మనకు ఆందోళన లేదా యాంగ్జయిటీని ఫేస్ చేస్తున్నప్పుడూ దానని మంచి స్నేహితుడిగా మార్చుకుండి. మీరు ఏ విషయమై ఆందోళన చెందుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఆందోళన అనేది ఎప్పుడు కలుగుతుందంటే.. ఒక పనిలో సరైన టాలెంట్ లేకపోవడం లేదా ఏదైన బలహీనత కారణంగా ఎదురవ్వుతుంది. కాబట్టి ముందుగా అందులో మంచి నైపుణ్యం సాధించండి ఆటోమేటిగ్గా ఆందోళన మీకు దాసోహం అవుతుందని చెబుతున్నాడు నటుడు విక్కీ. అంతేగాదు ఆందోళనను అధిగమించాలంటే ముందుగా మన బలహీనతల్ని మనస్ఫూర్తిగా అంగీకరించాలి, దాంట్లో ప్రావీణ్యం సాధించే యత్నం చేయాలి. అప్పుడు ఆందోళన, ఒత్తిడి వంటివి మన దరిచేరవని అన్నారు . ఇలా మానసిక ఆరోగ్యం గురించి విక్కీ మాట్లాడటం తొలిసారి కాదు. గతంలో ఓ టీవీ షోలో కాలేజ్ టైంలో తాను ఎలా ఆత్యనూన్యతతో బాధపడ్డాడో షేర్ చేసుకున్నారు. అంతేగాదు తన ఫిజికల్ అపీరియన్స్ పట్ల ఎలా ఆందోళన చెందిందే, అవన్నీ తన మానసిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేశాయో వివరించడమే గాక తన అభిమానులకు మానసిక ఆరోగ్యంపై స్ప్రుహ కలిగిస్తున్నాడు. (చదవండి: అమితాబ్ బచ్చన్ 'గోల్డెన్ రూల్ ఆఫ్ పేరెంటింగ్'!) -
ఇంట్లో రెస్ట్ లేదు... ఆ‘పీస్’ లేదు
పూర్వం పురుషుడి సంపాదనకు స్త్రీ సంపాదన తోడైతే ‘ఏదో వేణ్ణీళ్లకు చన్నీళ్లు తోడు’ అనేవారు. రాను రాను స్త్రీ సంపాదన ప్రధానం అయ్యింది. స్త్రీలు ఇంటి పని, ఉద్యోగం చేయాల్సి వస్తోంది. కాని పని గంటలు వారి జీవితాలను కబళిస్తున్నాయా? ప్రయివేటు ఉద్యోగాలు పది గంటలు డిమాండ్ చేస్తుంటే సేల్స్ విమెన్ గానో, చిన్న ఉద్యోగాల్లోనో ఉండే మహిళలు ఏకంగా 12 గంటలు చేయాల్సి వస్తోంది. కుటుంబ, సాంఘిక, సామాజిక జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ఈ పని గంటలపైకార్మిక చట్టాలు ఏమీ చేయడం లేదు. స్త్రీలు ప్రాణాలు ΄ోయేంతగా వొత్తిడి అనుభవించాలా?ఇటీవల పూణెలో అన్నా సెబాస్టియన్ అనే యువ చార్టర్డ్ అకౌంటెంట్ తను పని చేసే సంస్థలో ఒత్తిడి తట్టుకోలేక మరణించింది. మంగళవారం (సెప్టెంబర్ 24) లక్నోలోని ఒక ప్రయివేట్ బ్యాంకులో పని చేస్తున్న ఫాతిమా అనే ఉద్యోగిని కుర్చీలోనే కుప్పకూలి మరణించింది. పని ఒత్తిడి వల్లే అని సహోద్యోగుల ఆరోపణ. ఇవి తెలిసి. తెలియనివి ఇంకెన్నో.స్త్రీలకు రెండు ఉద్యోగాలుఉదయం ఎనిమిదన్నర నుంచి రాత్రి ఎనిమిదన్నర వరకూ పని చేస్తే తప్ప జీతం రాని ఉద్యోగాలు చేస్తున్న స్త్రీలు మన దేశంలో కోట్ల సంఖ్యలో ఉన్నారు. సేల్స్‌గర్ల్స్, హాస్పిటల్ స్టాఫ్, హోటల్ రంగం, కాల్ సెంటర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫ్యాక్టరీ వర్కర్లు... 12 గంటలు చేయలేం అంటే 10 గంటలు అడుగుతున్నారు. అదీ కాదంటే 9 గంటలకు ఒక్క నిమిషం కూడా తక్కువ కాకుండా పని చేయాలన్నది వాస్తవం. ఈ 9 గంటలతో పాటు రాక΄ోకల సమయం కూడా కలుపుకుంటే స్త్రీలకు ఇంటి పనికీ, పిల్లల పెంపకానికి, విశ్రాంతికీ మిగిలే సమయం ఎంత?జీవితం గడవడానికి సంపాదన చాలా ముఖ్యమయ్యాక, ఆ సంపాదనలో ప్రధాన భాగం పిల్లల చదువుకు, వైద్యానికి, రవాణాకు ఖర్చు చేయకతప్పని పరిస్థితుల్లో భార్యాభర్తలు పని చేయక తప్పడం లేదు. మగాడిగా భర్తకు ఉద్యోగ వొత్తిడి తప్పదు. కాని స్త్రీలకు ఇంటి బాధ్యత కూడా ఉంటుంది. వంట వారే చేయాలి. ఇక పిల్లల పనులు, బట్టలు ఉతకడం, ఇంటి శుభ్రత, ఆతిథ్యం, అత్తమామలు ఉంటే వారి బాగోగులు... ఇవన్నీ భారమే. ఇటు ఈ పని అటు ఆ పని వీటి మధ్య సమన్వయం చేసుకోలేక మౌనంగా వొత్తిడి ఎదుర్కొంటూ అనారోగ్యం తెచ్చుకుంటూ ఒక్కోసారి ప్రాణాల మీదకు వచ్చే స్థితికి చేరువ చేస్తోంది మహిళా ఉపాధి.ఒకప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలలో కొంత వెసులుబాటు ఉండేది. కాని ప్రస్తుతం వారి పని ఒత్తిడి కూడా తక్కువగా లేదు. సుఖమైన బ్యాంకు ఉద్యోగం ఇప్పుడు పచ్చి అబద్ధం. చాలా చాకిరి అందులో ఉంటోంది. పెద్ద జీతాల సాఫ్ట్వేర్ రంగం విషయానికి వస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చాక ఇరవై నాలుగ్గంటలు పనే అనే భావన కలుగుతోంది. ‘మల్టీ నేషనల్ కంపెనీలు భారతీయ ఉద్యోగులను మనుషుల్లా కాకుండా గాడిదలతో సమానంగా చూస్తున్నాయి’...‘లాగిన్ చేయడం వరకే మా చేతుల్లో ఉంటుంది. ఆ తర్వాత ఎన్ని గంటలు పని చేస్తామో మాకే తెలియదు’ అనే మాటలు ఆ రంగంలో సర్వసాధారణం అయ్యాయి. ఈ నేపథ్యంలో స్త్రీలు తమ ఉద్యోగ, కుటుంబ జీవితాలను నిర్వహించుకోవడానికి సతమతమవుతున్నారు.వారానికి 60 గంటలుఈ మధ్య కాలంలో సాఫ్ట్వేర్ రంగంలో ఎవర్ని పలకరించినా చేస్తున్న ఉద్యోగం గురించి గొప్పగా చెప్పుకోవడం కంటే ఆవేదన వ్యక్తం చేసే సందర్భాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. లైఫ్‌కు భరోసా ఇవ్వాల్సిన ఉద్యోగాలే ప్రాణాలను హరిస్తున్నాయనడానికి పూణెలో అన్నా సెబాస్టియన్ అనే మహిళ పని ఒత్తిడితో మరణించడం ఒక ఉదాహరణ మాత్రమే. 26 ఏళ్ల చార్టెడ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ ఉద్యోగంలో చేరిన కొన్ని నెలలకే దారుణమైన వర్క్ కండిషన్స్ కారణంగా ఆరోగ్యం క్షీణించి ప్రాణాలు కోల్పోయింది. భారత్‌లో యువ మహిళా ఉద్యోగులు ప్రపంచంలో అందరి కంటే ఎక్కువ గంటలు పనిచేస్తున్నారని తాజా సర్వేలు చెబుతున్నాయి. వారానికి 40 గంటలు పాత మాటగా మారగా 55 నుంచి 60 గంటలు మహిళలతో కార్పోరేట్ కంపెనీలు పని చేయించుకుంటున్నాయి. సాఫ్ట్వేర్, ఐటీ, ఫైనాన్స్ రంగాల్లో రోజుకు 18 గంటల పని విధానం సర్వసాధారణంగా మారి΄ోయింది. పని గంటలు ముగిసినా ఇంట్లో ఉన్నా చివరకు వారాంతమైనా సరే టార్గెట్లు పూర్తి చేయించుకోవడానికి ఆయా సంస్థలు ఉద్యోగులను వెంటాడుతున్నాయి. కుటుంబం, వ్యక్తిగత జీవితంతోపాటు ఆరోగ్యాన్ని కూడా త్యాగం చేస్తే తప్ప ఈ తరహా ఉద్యోగాలు చేయలేని పరిస్థితి.హక్కులు ఏవి? చట్టాలు ఎక్కడ?చట్టాలను కఠినంగా అమలు చేసే దేశాల్లో ఇంత చాకిరి చెల్లుబాటు కాదు. ప్రపంచంలో అతి తక్కువ పని గంటలున్న 20 దేశాల్లో ఇండియా ఊసు కూడా లేదు. మన దేశంలో జీవించడానికి ఉద్యోగం చేస్తున్నామా లేక ఉద్యోగం చేయడమే జీవితమా అన్న స్థాయిలో పని కబళించేస్తోంది. ఒకరకంగా మానవ హక్కుల ఉల్లంఘనే జరుగుతోంది. వర్క్ కండిషన్స్ ఎలా ఉండాలి అనే అంశంపై 1948లో ‘యూనివర్సల్ డిక్లరేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్’ను మెజార్టీ దేశాలు ఆమోదించాయి. ఉద్యోగుల హక్కులను కాపాడే ఈ డిక్లరేషన్ ను రూ΄÷ందించడంలో భారత్ కూడా కీలక పాత్ర ΄ోషించింది. అయితే దానికి కట్టుబడి చట్టాలను అమలు చేయడంలో మాత్రం మన ప్రభుత్వాలు, వ్యవస్థలు విఫలమవుతున్నాయి. అందుకే భారతీయులతో గొడ్డుచాకిరీ చేయించుకునే సంస్థలు పెరిగి΄ోయాయి.స్మార్ట్‌వర్క్‌ను ప్రోత్సహించాలిఎక్కువ గంటలు పని చేయడం ఉద్యోగి డెడికేషన్ కు ఏమాత్రం కొలమానం కాదన్న విషయాన్ని సంస్థలు గుర్తించాలి. వర్కింగ్ కండిషన్స్ ఏమాత్రం సానుకూలంగా లేని చోట హార్డ్ వర్క్ కంటే స్మార్ట్ వర్క్ చేయడం చాలా అవసరం. ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలంటే ‘నో’ చెప్పడం ఒక్కటే ఉత్తమమైన మార్గం. ఇన్ని గంటలు ఇంత పనే చేయగలం అని చె΄్పాలి. ఎవరి జీవితం వాళ్ల చేతుల్లోనే ఉండాలంటే మొహమాటాలను పక్కన పెట్టి నో చెప్పడానికి సిద్ధంగా ఉండాలి.ఫ్యాక్టరీస్ చట్టం 1948, మైన్స్ చట్టం, బీడీ– సిగార్ కార్మికుల చట్టం మొదలగు చట్టాల కింద ప్రత్యేక సందర్భాలలో తప్ప ఉదయం 6 నుంచి సాయంత్రం 7 వరకు మాత్రమే స్త్రీలు పని చేయాల్సి ఉంటుంది. ఈ పని వేళలు దాటి రాత్రి 10 వరకు పనిచేయాలి అంటే సదరు యాజమాన్యం ప్రత్యేకమైన వసతులు; రక్షణ, రవాణా వంటివి కల్పించాల్సి ఉంటుంది. అయితే ఈ పని వేళలు సాఫ్ట్వేర్ రంగానికి కూడా వర్తించినప్పటికీ, కొన్ని వెసులుబాటులను ప్రభుత్వం ఐటీ రంగానికి కల్పించింది. అయినప్పటికీ స్త్రీలను రాత్రి వేళలో పనిచేయాలి అని ఏ యాజమాన్యం కూడా ఒత్తిడి చేయడానికి వీలులేదు. ఒకవేళ అలా పని చేయాల్సి వస్తే రవాణా, చిన్నపిల్లల సౌకర్యార్థం (క్రెచ్) సదుపాయాలు కల్పించాల్సి వుంటుంది. – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిస్త్రీలకు పిల్లల పెంపకం, ఇంటి పని భారం, ఉద్యోగ భారం... ట్రిపుల్ బర్డన్ కలిగిస్తున్నాయి. ఇంటిని చూసుకోవాలి... సంపాదించాలి... అంటే రెండు చోట్లా ఆమె ఉత్పాదనను పరీక్షకు పెడుతున్నట్టే లెక్క. ఈ రెండు పనులు ఆమెకు సౌకర్యంగా లేక΄ోతే శారీరకంగా మానసికంగా చాలా సమస్యలు వస్తున్నాయి. మానసికంగా యాంగ్జయిటీ, డిప్రెషన్ చూస్తున్నాం. ఇక ఎముకల బలం క్షీణించడం, బహిష్టు సమస్యలు... కనపడుతున్నాయి. కొందరిలో ఇన్ఫెర్టిలిటీ పెరుగుతోంది. భార్యాభర్తల మధ్య సమన్వయమే ఈ పరిస్థితి నుంచి స్త్రీలను బయటపడేయగలదు.– డాక్టర్ ఆరతి బెల్లారి, కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్– ఫణికుమార్ అనంతోజు, సాక్షి -
Health: స్ట్రెస్.. హెల్త్ మిస్! టీచర్లపై ఒత్తిడి బెత్తం..
టీచర్స్ డే రోజు పూజించుకుంటున్నాం సరే. వారి మానసిక ఆరోగ్యం గురించి ప్రభుత్వానికి, ఇంటికి శ్రద్ధ ఉందా? చెప్పాల్సిన క్లాసుల సంఖ్య, సిలబస్‌ల వత్తిడి, విద్యార్థులు నిత్యం తెచ్చే సమస్యలు, స్కూల్లో అరాకొరా వసతులు, స్కూలుకు రానూ పోనూ ప్రయాణ సౌలభ్యం లేని ఆందోళన... ఇవన్నీ టీచర్ల మానసిక ఆరోగ్యం దెబ్బ తీస్తున్నాయి. ఆ అసహనం విద్యార్థుల మీదకు మళ్లితే వారు గాయపడటమే కాక పాఠాలు నడవవు. శాంతంగా, నవ్వుతూ ఉండే టీచర్లు ఎందరు?2023లో బిహార్‌లో టీచర్ల మానసిక ఆరోగ్యం మీద ప్రభుత్వం సర్వే చేసింది. మొత్తం 75 వేల ప్రభుత్వ పాఠశాలల్లోని 4 లక్షల మంది టీచర్లకు 12 రకాల ప్రశ్నలున్న ప్రశ్నాపత్రాన్ని పంపి వాటికి సమాధానాలు రాయించారు. ఈ సర్వే చేయడానికి ముఖ్య కారణం విద్యార్థుల నుంచి వచ్చిన ఫిర్యాదులు...– టీచర్లు తరచూ తిడుతూ ఉండటం, కొడుతూ ఉండటం– స్కూలుకు సరిగ్గా రాకపోవడం– సిలబస్ సమయానికి పూర్తి చేయలేకపోవడం ప్రభుత్వం జీతాలు ఇచ్చి పాఠాలు చెప్పమంటే పిల్లలతో వారు వ్యవహరిస్తున్న తీరులో ఎందుకు తేడా వస్తున్నదో తెలియడానికి ఈ సర్వే చేశారు. కాని సర్వే ఫలితాలను మాత్రం బయట పెట్టలేదు. సర్వేలో అడిగిన కొన్ని ప్రశ్నలు ఇలా ఉన్నాయి.– మీ ఇంట్లోని ఒత్తిడి స్కూల్లో మీ ఉద్యోగం మీద పడుతున్నదా?– పిల్లల్ని ఎంత తరచుగా తిడుతున్నారు?– సిలబస్ టైమ్‌కి పూర్తి చేయగలుగుతున్నారా?– మీరు ఇంట్లో ఎక్కువ ఒత్తిడి ఫీలవుతారా స్కూల్లోనా?– ఇప్పటి విద్యా వ్యవస్థ మీద సంతృప్తిగా ఉన్నారా?ఈ సర్వేతో సంబంధం లేకుండా ఎక్కువ మంది ఏం చెప్పారంటే మాకు పాఠాలు చెప్పే పని కంటే వేరే పనులు ఎక్కువ చెబుతున్నారు అని. వాటిలో ఎలక్షన్ డ్యూటీలు, సర్వేలు, మిడ్ డే మీల్స్ ఉన్నాయి. సర్వేల పనిలో టీచర్లను పెడితే ఆ సమయంలో టీచర్ల అటెండెన్స్ దారుణంగా పడిపోతోంది. కొందరైతే ‘మిడ్ డే మీల్స్‌ను బయటి ఏజెన్సీకి అప్పగించాలి. చీటికి మాటికి దాని గురించి ఇన్స్పెక్షన్లకు వస్తుంటే ఒత్తిడిగా ఉంది’ అన్నారు.వ్యక్తిగత శ్రద్ధకు సమయం లేదు..స్కూల్లో పాఠాలు, హోమ్‌వర్క్‌లు, పరీక్షలు పెట్టి పేపర్లు దిద్దటాలు, స్కూల్ మేనేజ్మెంట్తో మీటింగ్‌లు, పేరెంట్స్‌తో మీటింగ్‌లు, సిలబస్‌ను పూర్తి చేయడం, వృత్తిపరమైన పోటీ (మంచి పేరు రావడం), స్టూడెంట్ల వ్యవహారశైలితో సమస్యలు... ఇవన్నీ ఒత్తిడి కలిగించేవే. ఇక కుటుంబ పరమైన ఒత్తిడులు కూడా ఉంటాయి. ఇంటి వొత్తిడి స్కూల్లో స్కూలు ఒత్తిడి ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే రెండు చోట్లా టీచర్లకు స్థిమితం ఉండదు. స్థిమితంగా లేని స్వభావంతో పాఠం చెప్పడం కష్టం. ఈ మొత్తం వ్యవహారంలో టీచర్లు తమ మానసిక స్థితి గురించి శ్రద్ధ పెట్టే ఆలోచన చేయలేకపోతున్నారు.పిల్లలకు ఒత్తిడి..క్లాసురూమ్‌లో కూచోగానే పిల్లలు తలెత్తి చూసేది టీచర్నే. టీచర్ ముఖం ప్రసన్నంగా ఉంటే వారు ప్రసన్నంగా పాఠం వింటారు. చిర్రుబుర్రులాడే టీచర్ ఉండే క్లాసులోని పిల్లల్ని పరీక్షిస్తే వారిలో ‘కార్టిసల్’ అనే స్ట్రెస్ హార్మోన్ ఎక్కువగా విడుదలవుతున్నదని తేలింది. పిల్లల మానసిక ఆరోగ్యం పై స్కూల్ వాతావరణం నెగెటివ్ ప్రభావం ఏర్పరిస్తే వారిలో సమస్యలు వస్తాయి. వీళ్లు మళ్లీ టీచర్‌కు స్ట్రెస్ ఇస్తారు. అంటే ఇదొక సైకిల్‌గా మారుతుంది.వ్యక్తిగత ఒత్తిడి..టీచర్ ఉద్యోగంలో ఉన్నవారికి కుటుంబం నుంచి చాలా సపోర్ట్ ఉండాలి. ఇంటి పని తగ్గించగలగాలి. ఆర్థిక, భావోద్వేగ సమస్యలు తెలుసుకొని మిత్రులు, బంధువులు సపోర్ట్‌గా నిలవాలి. సక్సెస్ఫుల్ విద్యార్థులను తయారు చేయించడంలో ఆమె సక్సెస్ అయ్యేలా తోడు నిలవాలి.చర్యలు తీసుకోవాలి..టీచర్లు, పిల్లలు మంచి మానసిక స్థితిలో ఉంటూ స్కూల్ జీవనం కొనసాగించాలంటే టీచర్ల గురించి ఆలోచించాలి. టీచర్ల కోసం ప్రభుత్వంగాని, ప్రయివేటు యాజమాన్యాలుగాని కింది చర్యలు తీసుకోవాలి.– తరచూ నిపుణులచే కౌన్సిలింగ్ చేయించడం– మెంటల్ హెల్త్ వర్క్‌షాప్‌లు నిర్వహించడం– సాటి టీచర్ల నుంచి మద్దతు లభించే పని వాతావరణం.– వసతులు, బోధనా సామాగ్రి ఏర్పాటు– ఇంటి పని, ఉద్యోగ బాధ్యత సమతుల్యత గురించిన అవగాహన – యాజమాన్యం, తల్లిదండ్రులు, పిల్లలకు టీచర్లు అనుసంధానకర్తలుగా ఉండేలా చేసి ఆ టీచర్లు చెప్పే సూచనలను పాజిటివ్‌గా చూడటం. -
మజిల్స్ రిలాక్సయితే మనసూ రిలాక్సవుతుంది! ఎలా అంటే..?
ప్రపంచం పరుగెడుతోంది. ఒత్తిడి, ఆందోళన సర్వసాధారణమయ్యాయి. వీటిని ఎదుర్కొనే అత్యంత ప్రభావవంతమైన పద్ధతుల్లో ఒకటే ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ (PMR). అమెరికన్ వైద్యుడు ఎడ్మండ్ జాకబ్సన్ 1920లో అభివృద్ధి చేసిన ఈ పద్ధతి ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతోంది. ఆయన పేరు మీదే దీన్ని జాకబ్సన్ ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ (PMR) అంటున్నారు.శరీరం, మనసు వేర్వేరు కాదని, రెండూ ఒకటిదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయనే ఆలోచనపై ఈ టెక్నిక్ ఆధారపడి ఉంటుంది. ఇది ఒక సులువైన, శక్తిమంతమైన టెక్నిక్. దీన్ని ప్రాక్టీస్ చేయడం చాలా ఈజీ. మన శరీరంలోని కండరాల (మజిల్స్)ను నిర్దిష్ట క్రమంలో టెన్షన్ చేయడం, రిలాక్స్ చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకుని ప్రశాంతతను సాధించడమే జేపీఎమ్మార్ (PMR). ఇది నిద్ర నాణ్యతను పెంచుతుంది, రక్తపోటును తగ్గిస్తుంది. దీర్ఘకాలిక నొప్పులున్న వారికి ఉపయోగపడుతుంది. ఈ టెక్నిక్ ద్వారా పబ్లిక్ స్పీకింగ్, పరీక్షలు లేదా మెడికల్ టెస్టుల సమయంలో కలిగే ఒత్తిడినీ తగ్గించుకోవచ్చు. అదెలా చేయాలో తెలుసుకుందాం.ఎలాంటి అంతరాయం కలగని ప్రశాంతమైన, సౌకర్యవంతమైన స్థలాన్ని ఎంచుకోవాలి. రిలాక్సింగ్ చైర్ లేదా మంచం మీద పడుకోవాలి.వదులుగా ఉండే, సౌకర్యవంతమైన దుస్తులను ధరించాలి. మన కదలికలకు ఇబ్బంది కలిగించే వస్తువులను తీసేయాలి.నిండుగా ఊపిరి తీసుకోవడం మొదలుపెట్టాలి. ఇది శరీరాన్ని, మనసును విశ్రాంతికి సిద్ధం చేస్తుంది.పాదాల నుంచి తల దాకా ప్రతిభాగంలోని కండరాలను ఐదు నుంచి పది సెకన్ల వరకు వీలైనంత గట్టిగా పట్టి ఉంచాలి. తర్వాత నిదానంగా సడలించాలి.దాదాపు 20 నుంచి 30 సెకన్ల పాటు విశ్రాంతి తీసుకోవాలి. నెమ్మదిగా నిండుగా ఊపిరి తీసుకోవాలి. కండరాలు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఎలా అనిపిస్తుందో గమనించాలి.అన్ని కండరాల సమూహాలను సడలించిన తర్వాత, పూర్తి విశ్రాంతిని ఆస్వాదించడానికి కొంత సమయం కేటాయించాలి. మెల్లగా.. నిండుగా ఊపిరి తీసుకోవడం ద్వారా ఒత్తిడి నెమ్మదిగా కరిగిపోతుంది.కాసేపటి తర్వాత నెమ్మదిగా కళ్లు తెరచి, శరీరాన్ని సున్నితంగా కదిలించడం మొదలపెట్టాలి. మైకంగా ఉంటే మరి కాసేపు విశ్రాంతి తీసుకోవాలి.మంచి ఫలితాలు పొందడానికి ఈ ఎక్సర్సైజ్ ను క్రమం తప్పకుండా రోజుకు ఒకటి లేదా రెండుసార్లు ప్రాక్టీస్ చేయాలి.టెన్షన్, రిలాక్సేషన్ సమయాల్లో శరీరం, మనసు ఎలా స్పందిస్తున్నాయో గమనించాలి.అవసరాన్ని బట్టి, సౌకర్యానికి అనుగుణంగా కండరాలకు ఒత్తిడిని, విశ్రాంతినిచ్చే సమయాన్ని సర్దుబాటు చేసుకోవాలి. JPMR ప్రాక్టీస్ చేయడమిలా..– కాలి వేళ్లను గట్టిగా ముడుచుకుని, ఆపై వాటిని రిలాక్స్ చేయాలి.– కాలి వేళ్లను తల వైపు లాగుతూ కండరాలను బిగించి, తర్వాత నిదానంగా సడలించాలి.– మీ తొడ కండరాలను బిగించి, ఆపై సడలించాలి.– కడుపు కండరాలను బిగించి, నిదానంగా సడలించాలి.– నిండుగా ఊపిరి తీసుకుని.. అలాగే పట్టి ఉంచాలి. కాసేపటి తర్వాత శ్వాస వదిలి విశ్రాంతి తీసుకోవాలి.– వీపును కొద్దిగా వంచి, ఆపై నిదానంగా యథాస్థితికి రావాలి.– పిడికిలిని గట్టిగా బిగించి, ఆపై వదలాలి.– మోచేతులను వంచి, కండరాలను బిగించి, ఆ తర్వాత సడలించాలి.– భుజాలను చెవుల వైపు లేపి.. ఆపై వదలాలి.– తలను సున్నితంగా వెనక్కి నొక్కాలి. గడ్డాన్ని ఛాతీ మీదకు లాగాలి. ఆపై విశ్రాంతి తీసుకోవాలి.– కనుబొమలను పైకి లేపడం ద్వారా నుదిటిని బిగించి, ఆపై వదిలేయాలి.– కళ్లు గట్టిగా మూసుకొని, ఆ తర్వాత నెమ్మదిగా వదిలి విశ్రాంతి తీసుకోవాలి.– దవడను బిగించి, ఆపై విశ్రాంతి తీసుకోవాలి.– పెదాలను గట్టిగా ఒత్తి పట్టి, ఆపై వదిలేయాలి.– సైకాలజిస్ట్ విశేష్ఇవి చదవండి: ఇమామ్ కజిన్ : ఓ సిటీలోని ఒక కాలనీలో.. -
మానసిక ఆరోగ్యంపై సంగీత ప్రభావం.. ‘మ్యూజిక్ ఆఫ్ హోప్’..!
సాక్షి, సిటీబ్యూరో: శిశుర్వేత్తి, పశుర్వేత్తి వేత్తిగాన రసం ఫణిః అనే విశ్వాసాన్ని అనుసరిస్తూ. వంధ్యత్వానికి చికిత్సలో సంగీతాన్ని మిళితం చేస్తూ ‘మ్యూజిక్ ఆఫ్ హోప్’ పేరిట ఓ ట్యూన్‌ను నగరానికి చెందిన ఫెర్టీ–9 ఫెర్టిలిటీ సెంటర్ రూపొందించింది. ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవ వేడుకల ముగింపును పురస్కరించుకుని దీనిని విడుదల చేసినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.మానసిక ఆరోగ్యంపై సంగీతం గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని, ఒత్తిడి, ఆందోళనను తగ్గించి ప్రశాంతత, విశ్రాంతి భావాన్ని కలిగిస్తుందని నిరూపితమైన నేపథ్యంలో ఈ ట్యూన్ ప్రత్యేకంగా తయారు చేశామన్నారు. అదే విధంగా ‘టుగెదర్ ఇన్ ఐవీఎఫ్’ పేరిట వంధ్యత్వానికి సంబంధించిన అపోహలను పోగొట్టడం లక్ష్యంగా నిర్వహించిన ప్రచారంలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో 15 వేర్వేరు ప్రదేశాల్లో వీధి నాటకాలు లేదా నుక్కడ్ నాటకాలను ప్రదర్శించామని వివరించారు. -
వాతావరణ యాంగ్జైటీ అంటే ఏంటి..? ఎదుర్కోవడం ఎలా..?
పచ్చని చెట్లు కొట్టేస్తూంటే మీకు గుబులుగా ఉంటోందా? ఊరి చెరువు నెర్రలుబారితే అయ్యో ఇలా అయ్యిందేమిటి? అన్న ఆందోళన మొదలవుతుందా? ఉష్ణోగ్రత ఒక్క డిగ్రీ పెరిగినా..‘‘అంతా అయిపోయింది’’ అన్న ఫీలింగ్ మీకు కలుగుతోందా? అయితే సందేహం లేదు.. మీరు కూడా ఎకో యాంగ్జైటీ బారిన పడ్డట్టే అంటున్నారు మానసిక వైద్య నిపుణులు. ఏంటీ ఎకో యాంగ్జైటీ? మానసిక రోగమా? చికిత్స ఉందా? లేదా? ఎలా ఎదుర్కోవాలి? ఈ రోజు జూన్ ఐదవ తేదీ. ప్రపంచం మొత్తమ్మీద పర్యావరణ దినంగా ఉత్సవాలు జరుగుతాయి. మారిపోతున్న పర్యావరణం తీసుకొచ్చే ముప్పుల గురించి చర్చలు, అవగాహన శిబిరాలూ నిర్వహిస్తారు. అయితే ఇటీవలి కాలంలో పర్యావరణ మార్పుల చర్చల్లో ఎకో యాంగ్జైటీ కూడా ఒక టాపిక్‌గా మారిపోయింది. వాతావరణంలో వస్తున్న మార్పుల మీలో ఆందోళన, ఒత్తిడి కలిగిస్తూంటే దాన్ని ఎకో యాంగ్జైటీ అని పిలుస్తున్నారు. కొన్నిసార్లు మనం దాన్ని గుర్తించలేకపోవచ్చు. గానీ ఆ ప్రభావం మనం మీద ఎక్కువగానే ఉంటుంది. దీని కారణంగా మన మూడ్స్ మారిపోవడం జరిగి ఒక దానిపై ఏకాగ్రత పెట్టలేని స్థితికి చేరుకుంటాం. ముఖ్యంగా వరదలు, అడవి మంటలు, భూకంపాలు, అపూర్వమైన వేసవి, చలికాలం, హిమనీనదాలు కరగడం, గ్లోబల్ వార్మంగ్ తదితరాలన్నీ మానవులను ఆందోళనకు గురి చేసేవేననిశారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసేవేనని నిపుణులు చెబుతున్నారు. పెనుముప్పు... మారుతున్న వాతావరణం కలిగించే ఆందోళన ప్రపంచానికి పెనుముప్పు అని అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ స్వయంగా చెబుతోందంటే పరిస్థితి ఏమిటన్నది అర్థం చేసుకోవచ్చు. చాలాసార్లు దీన్ని వైద్య పరీక్షల ద్వారా గుర్తించలేమని అంచనా. అయితే తట్టుకునేందుకు, సమస్య నుంచి బయటపడేందుకు చాలా మార్గాలు ఉన్నాయని వీరు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని రక్షించుకునేలా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. అందుకోసం శాస్త్రీయంగా చేయాల్సిన పనులపై దృష్టిసారించడం, తీసుకోవాల్సిన చర్యలు, పరిష్కారాలను అమలు చేయడం వంటివి చేయాలి. కార్బన్ ఉద్గారాలను తగ్గించేలా పర్యావరణ అనుకూలమైన జీవనశైలి మార్పులను చేసుకోవడం వాతావరణ పరిక్షణకు అనుకూలంగా ఉన్న విధానాలకు మద్దతు ఇవ్వడం లేదా స్థానిక పర్యావరణ కార్యక్రమాల్లో పాల్గొనడం. మైండ్‌ఫుల్‌నెస్, రిలాక్సేషన్‌ను ప్రాక్టీస్ చేయడం. మనసు ప్రశాంతంగా ఉంచేలా ధ్యానం, శ్వాస లేదా ప్రకృతిలో గడపడం వంటి వాటితో ఈ పర్యావరణ ఆందోళనను తగ్గించుకోవచ్చు ఈ వాతావరణ మార్పులను తట్టుకునేలా ఇతరులతో కనెక్ట్ అవ్వడం. ఆన్లైన్ కమ్యూనిటీలు లేదా స్థానిక సంస్థల్లో చేరడం వంటివి చేయండి. వాతావరణ సంక్షోభంపై అవగాహన కలిగి ఉండటం తోపాటు సవాళ్లును ఎదుర్కొనేలా సిద్ధం కావాలి. అలాగే పురోగతిని, వాతావరణ మార్పులు పరిష్కరించడానికి సమిష్టి ప్రయత్నాలు చేయాలి. (చదవండి: పర్యావరణహితం యువతరం సంతకం) -
లైఫ్‌లో దీన్ని నిర్లక్ష్యం చేశారో... ముప్పే!
ఉరుకులు, పరుగుల జీవితంలో ఒత్తిడి చాలా కామన్ అని లైట్ తీసుకుంటున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే. ఒత్తిడి చాలారకాలుగా మన అందర్నీ వేధిస్తూ ఉంటుంది. తీవ్రమైన ఒత్తిడిమానసిక సమస్యలే కాదు, శారీరకంగానూ అనేక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. చర్మ సమస్యలు, త్వరగావృద్ధాప్యం శరీరం ఒత్తిడికి గురైనప్పుడు తలనొప్పికి మానసికంగా కుంగుబాటుతోపాటు అనేక చర్మ సమస్యలకు దారి తీస్తుంది. సోరియాసిస్ వంటి చర్మ పరిస్థితులను మరింత తీవ్రతరం చేస్తుంది.స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిసాల్ హార్మోన్ విడుదల ఎక్కువ అవుతుంది. ఇది చర్మ సున్నితత్వం రియాక్టివిటీని పెంచుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.ఇప్పటికే తామర ఉన్నవారిలో అది మరింత ముదరవచ్చు. అలాగే గాయాలను సహజంగా నయం చేసే చర్మ సామర్థ్యానికి ఒత్తిడి ఆటంకం కలిగిస్తుంది. చర్మంలోని కొల్లాజెన్, సాగే ఫైబర్‌ను ప్రభావితం చేస్తోంది చర్మంలోని రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది దీంతో చాలా తొందరగా వృద్ధాప్యం వచ్చేస్తుంది. ఇంకా మొటిమలు, దద్దుర్లు రావడం, జట్టు సన్నబడటం, రాలిపోవడం లాంటి ఇతర చర్మ సమస్యలు కూడా వస్తాయని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. హార్మోన్లపై ప్రభావం: ఎక్కువగా స్ట్రెస్‌కు గురైనపుడు డొపమైన్, కార్టిసోల్ అనే హార్మోన్స్ ఉత్పత్తి అవుతుంది. ఇవి మిగిలిన హార్మోన్స్‌పై ప్రభావం చూపుతాయని ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోవచ్చు. బీపీ పెరగడం లాంఇ సమస్యలు ఎదుర్కొంటారు. గుండె పోటు ముప్పు : తీవ్రమైన ఒత్తిడితో హృదయ స్పందనల్లో తేడాలొస్తాయి. ఒక్కోసారి గుండెపోటుకు ప్రమాదం ఉంది. బీపీ పెరిగి పక్షవాతంముప్పు పొంచివుంటుంది. ఒత్తిళ్లతో రక్తపోటు అదుపులో లేని వారిలో హెమరైజ్డ్ బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యే అవకాశం ఉంది. ఇమ్యూనిటీ క్షీణిస్తుంది. దీని కారణంగా ఇన్ఫెక్షన్ల ముప్పు పెరుగుతుంది. జీర్ణ సమస్యలు: ఒత్తిడి ఎక్కువైతే కడుపునొప్పి, అజీర్ణం, ఆకలి మందగించడం, అతిగా తినడం, వికారం లాంటివి కన్పిస్తాయి. కడుపులో అల్సర్లు ఏర్పడతాయి. జీవక్రియల వేగం మందగిస్తుంది. ఎంజైమ్‌ల ఉత్పత్తి తగ్గుతుంది. సైలెంట్ కిల్లర్... ఏం చేయాలి? సైలెంట్ కిల్లర్ లాంటి ఒత్తిడిని సరైన సమయంలో గుర్తించి పరిష్కరించుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. గుర్తించి చికిత్స తీసుకుంటే మాత్రం చాలా సులువుగా దీన్నుంచి బయటపడవచ్చు. స్ట్రెస్‌మేనేజ్‌మెంట్ తగినంత నిద్రపోవడం, హైడ్రేటెడ్‌గా ఉండటం, ఆరోగ్యకరమైన ఆహారంపై దృష్టి పెట్టడం చాలా కీలకం. రిలాక్సేషన్ టెక్నిక్స్ , యోగా, ధ్యానం లాంటి సాధన. రెగ్యులర్ వ్యాయామం ఒత్తిడి హార్మోన్లను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, చర్మానికి మేలు చేస్తుంది. 7-9 గంటల నాణ్యమైన నిద్ర, ఆరోగ్యకరమైన ఆహారం, పండ్లు, కూరగాయలు , తృణధాన్యాలతో సమతుల్య ఆహారం తీసుకోవాలి. తగినంత నీటిని తీసుకోవాలి. కెఫిన్ , ఆల్కహాల్‌కి దూరంగా ఉండటంతోపాటు, ఒత్తిడి కలిగించే పనులు, ఎక్కువ శ్రమకు దూరంగా ఉండాలి. స్నేహితులు, ఆత్మీయులు,కుటుంబ సభ్యుల మంచి సంబంధాలకు ప్రయత్నించాలి. ఇక ఒత్తిడి భరించలేని స్థాయికి చేరిందని పిస్తే థెరపిస్ట్ లేదా కౌన్సెలర్, లేదా నిపుణుడైన వైద్యుని సలహా తీసుకోవాలి. -
ఎక్కువగా ఏడుస్తున్నారా? హార్ట్ ఎటాక్ రావొచ్చు, జాగ్రత్త!
కొన్ని మానసిక సమస్యలు శారీరక లక్షణాలతో వ్యక్తమవుతాయి. అయితే ప్రతి శారీరక లక్షణమూ మానసిక సమస్య కారణంగా కాకపోవచ్చు. కానీఙో రిపోర్ట్ ప్రకారం ఔట్ పేషెంట్ విభాగానికి వచ్చే బాధితుల్లో 15 శాతం మందికి అవి మానసిక సమస్యలతో వచ్చిన లక్షణాలు కావచ్చేమోనని గణాంకాలు పేర్కొంటున్నాయి. మానసిక సమస్యలు ఇలా శారీరక లక్షణాలతో ఎందుకు కనిపిస్తాయి, అనేకసార్లు చికిత్స తీసుకున్న తర్వాత కూడా పదే పదే లక్షణాలు కనిపిస్తుంటే కొన్నిసార్లు అది మానసికమైన కారణాల వల్ల కావచ్చేమోనని ఎలా అంచనా వేయవచ్చు లాంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. మానసిక సమస్యలు అనేక శారీరక వ్యవస్థలపై తమ ప్రభావాలను చూపవచ్చు. మానసిక సమస్యల కారణంగా కొన్ని శరీరంలో కనిపించే లక్షణాలెలా ఉంటాయో చూద్దాం. జీర్ణవ్యవస్థ పైన... గట్ ఫీలింగ్ అనే మాటను చాలామంది ఉపయోగిస్తుంటారు. ఫీలింగ్స్ మనసుకు సంబంధించిన భావన కదా... మరి జీర్ణవ్యవస్థ అయిన శారీరకమైన అంశంతో దాన్ని ముడిపెట్టడం ఎందుకు అని అనిపించవచ్చు. ఒక చిన్న పరిశీలనతో దీన్ని తెలుసుకోవచ్చు. ‘సెరిటోనిన్’ అనే స్రావం మానసిక ఉద్వేగాలకు కారణమవుతుంది. నిజానికి మానసిక అంశాలకోసం స్రవించడం కంటే... సెరిటోనిన్ అనేది జీర్ణవ్యవస్థలోనే ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఆందోళన, వ్యాకులత జీర్ణవ్యవస్థలో మార్పులకు దారితీస్తాయి. దాంతో ఎసిడిటీ, కడుపునొప్పి, కడుపు ఉబ్బరం, విరేచనాలు, మలబద్ధకం, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్, ఆకలి వేయకపోవడం, వెంటనే మల విసర్జనకు వెళ్లాల్సి రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రక్తప్రసరణ వ్యవస్థపై... మనసుకు తీవ్రమైన దుఃఖం కలిగినప్పుడు అది గుండె, రక్తప్రసరణ వ్యవస్థ ప్రభావితం చేస్తుంది. తీవ్రమైన దుఃఖం, ఉద్వేగాలు కొందరిలో గుండెజబ్బులకు దారితీస్తాయి. ఒకసారి గుండెపోటు వచ్చినవారిలో మానసిక సమస్యలు ఉంటే అది మళ్లీ వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ. మానసిక ఒత్తిడి కలిగినప్పుడు రక్తపోటులోనూ తేడాలు రావడం తెలిసిన విషయమే. ఒళ్లునొప్పులు... మానసిక సమస్యలు కొన్నిసార్లు ఒళ్లునొప్పులు, కండరాల నొప్పుల రూపంలోనే వ్యక్తమవుతుంటాయి. మానసిక సమస్యలకూ, ఒంటినొప్పులకూ సంబంధమేమిటనే కోణంలో పరిశీలించినప్పుడు కొన్ని అంశాలు అబ్బురపరుస్తాయి. ఉదాహరణకు సెరిటోనిన్, అడ్రినలిన్ వంటి రసాయన స్రావాలు మానసిక సమతౌల్యతకు దోహదపడుతుంటాయి. ఈ రసాయనాలను ‘కెమికల్ గేట్స్’గా పరిగణిస్తారు. గేట్ అనేది అనవసరమైన వాటిని రాకుండా నిరోధించడం కోసం అన్నది తెలిసిందే. అలాగే ఈ రసాయన గేట్స్... అనవసరమైన అనేక సెన్సేషన్స్‌ను నివారించి, అవసరమైన వాటినే మెదడుకు చేరవేసేలా చూస్తాయి. కానీ డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు ఉన్నప్పుడు సెరిటోనిన్ వంటి ఈ ద్రవాలు తగ్గడంతో కెమికల్ గేట్స్ తమ కార్యకలాపాలను నిర్వహించలేవు. ఫలితంగా అవసరమైనవే కాకుండా అనవసరమైన సెన్సేషన్లు కూడా ఫిల్టర్ కాకుండా మెదడుకు చేరతాయి. దాంతో డిప్రెషన్ వంటి సమస్యలున్నప్పుడు... కొద్దిపాటి నొప్పి కూడా చాలా తీవ్రంగా ఉన్నట్లు తోచవచ్చు. చిన్న నొప్పి కూడా చాలా ఎక్కువగా అనిపించవచ్చు. ఇలాంటి ఈ పరిణామాన్నే ‘అన్ ఎక్స్ప్లెయిన్డ్ పెయిన్ సిండ్రోమ్’ అని అంటారు. ఇలాంటప్పుడు దీర్ఘకాలిక వెన్నునొప్పి (క్రానిక్ బ్యాక్ పెయిన్), శరీరంలోని అనేక భాగాల్లో నొప్పులు, మెడనొప్పి, కండరాల నొప్పి వంటివి కలిగే అవకాశముంది. శరీరం లాగే మనసుకూ జబ్బూ.. మన సమాజంలో మానసిన సమస్యలను బయటకు చెప్పుకోలేని సమస్య (స్టిగ్మా)గా చూస్తుంటారు. మానసిక సమస్య అని చెప్పుకోవడం కష్టం కాబట్టి... మనసు వాటిని శారీరక లక్షణాలుగా మార్చి వ్యక్తం చేస్తుంటుంది. అయితే ఇది కాన్షియస్గా జరిగే ప్రక్రియ కాదు. బాధితులకూ / పేషెంట్లకూ ఇలా జరుగుతుందని తెలియదు. అధిక ఒత్తిడి వంటి కొన్ని మానసిక సమస్యలు ఉన్నప్పుడు రోగనిరోధక వ్యవస్థ పనితీరూ తగ్గి అది శారీరక లక్షణాలుగా వ్యక్తమవుతుంది. అందుకే పరీక్షల సమయంలో లేదా పరీక్షలకు ముందు పిల్లల్లో / పెద్దల్లోనూ జ్వరాలు, జీర్ణ సమస్యలు, తలనొప్పి, కడుపునొప్పి, నిద్రలేమి... వంటి సమస్యలు కనిపిస్తుంటాయి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. శరీరానికి లాగే మనసుకూ జబ్బు వచ్చే అవకాశముందని గుర్తించి, అది ఏమాత్రం తప్పు కాదని గ్రహించి, తగిన మందులు తీసుకుంటే... ఈ సమస్యలు రావడం తగ్గిపోయి, మాటిమాటికీ డాక్టర్ షాపింగ్ చేస్తూ, డబ్బు, ఆరోగ్యం వృథా చేసుకునే అవస్థలూ తగ్గుతాయి. ∙ -
ఎక్కడంటే అక్కడ ఆపాలంటూ!
రాయచూర్ వెళ్లే నాన్‌స్టాప్ ఎక్స్‌ప్రెస్ బస్సు ఇమ్లీబన్‌లో బయలుదేరింది.. బస్సు కిక్కిరిసిపోయి ఉంది.. బహదూర్‌పుర రాగానే తాము దిగుతామని, బస్సు ఆపాలంటూ ముగ్గురు మహిళలు డ్రైవర్ వద్దకు వచ్చి నిలబడ్డారు. అలా మరికొంత దూరం వెళ్లాక, మరో ఇద్దరు మహిళలు బస్సు ఆపాలంటూ అడిగారు. వాస్తవానికి ఆ బస్సు ఎక్కడా ఆగకుండా రాయచూరుకు వెళ్లాల్సి ఉండగా, ఇలా మహిళల వాదనలు, డిమాండ్లతో పదిహేను చోట్ల ఆపాల్సి వచ్చింది. సాక్షి, హైదరాబాద్: మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి అందుబాటులోకి వచ్చాక, ఆర్టీసీకి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఉచితంగా ప్రయాణించే వెసులుబాటును కొందరు మహిళలు దుర్వినియోగం చేస్తున్నారన్న వాదనలు వెల్లువెత్తుతున్నాయి. తాము ఎక్కడ ఆపమంటే బస్సును అక్కడ ఆపాలంటూ ఒత్తిడి చేసు్తన్నారు. ఆ బస్సులకు స్టాప్ లేని చోట్ల, సాధారణ పాయింట్ల వద్ద ఆపాలంటూ డ్రైవర్, కండక్టర్‌తో వాగ్వాదానికి దిగుతున్నారు. ఫలితంగా ఎక్స్‌ప్రెస్ బస్సులు ఆర్డినరీ బస్సుల్లాగా చాలా చోట్ల ఆగుతూ వెళ్లాల్సి వస్తోంది. ఈ పథకం ప్రారంభమైన కొత్తలో, ఓ మహిళ నుంచి టికెట్ రుసుము వసూలు చేశారంటూ ఆ మహిళ తాలూకు వ్యక్తి ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. సదరు మహిళ తరపున పురుష వ్యక్తి టికెట్ తీసుకోవటంతో, మహిళ కూడా ఉందన్న విషయం తెలియక కండక్టర్ జీరో టికెట్‌కు బదులు సాధారణ టికెట్ ఇచ్చాడు. ఫిర్యాదు నేపథ్యంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించి ఆ కండక్టర్‌పై చర్యలకు ఉపక్రమించారు. దీంతో ఇప్పుడు కొందరు మహిళలు తాము కోరిన చోట బస్సు ఆపకుంటే ఫిర్యాదు చేస్తామని డ్రైవర్, కండక్టర్లను బెదిరిస్తున్నారు. దీంతో బస్సులను వారు ఆపుతున్నారు. మరోవైపు ఇతర ప్రయాణికుల అభ్యంతరం ఎక్కడపడితే అక్కడ బస్సులను ఆపేస్తుండటంతో ఇతర ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురై కండక్టర్లు, డ్రైవర్లతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఇలా రెండు వైపుల నుంచి ఒత్తిళ్లు వస్తుండటంతో భరించలేక సిబ్బంది శుక్రవారం ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఆయన నిర్వహించిన గూగుల్‌మీట్‌లో ఈమేరకు మొర పెట్టుకున్నారు. దీనికి సజ్జనార్ స్పందించారు. ఎవరు ఒత్తిడి చేసినా ఆపొద్దు: సజ్జనార్ ఇకపై ఎక్స్‌ప్రెస్ బస్సులను నిర్ధారిత స్టాపుల్లో మాత్రమే ఆపాల ని, తక్కువ దూరం వెళ్లాల్సిన మహిళా ప్రయాణికులు పల్లె వెలుగు, ఆర్డినరీ బస్సుల్లోనే వెళ్లాలని సజ్జనార్ సూచించారు. స్టాపు లేనిచోట ఎవరు ఒత్తిడి చేసినా ఆపొద్దని స్పష్టం చేశారు. -
ధ్యానం ఎందుకు చేయాలి? నిజంగానే ఒత్తిడి తగ్గుతుందా?
ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. జీవనశైలిలో మార్పులు, తినే ఆహారం, మానసిక ఆందోళన, ఆర్థిక ఇబ్బందులు.. తదితర కారణాల వల్ల నేడు అనేక మంది ఏదో ఒక సందర్భంలో స్ట్రెస్(ఒత్తిడి)ని ఎదుర్కోవాల్సి వస్తోంది. దుకే ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. ధ్యానం, యోగా వంటివి చేసి ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఎప్పుడైనా తీవ్ర ఒత్తిడికి గురైతే ఓ పది నిమిషాలు ధ్యానం చేసి చూడండి. తేడా మీకే అర్థమవుతుంది.మెదడుకు రిలాక్సేషన్ ఇచ్చే ఏకైక సాధనం ధ్యానం మాత్రమే. అందుకే మన పూర్వికులు ధ్యానాన్ని జీవితంలో భాగంగా చేసుకున్నారు.ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో మనం ధ్యానం కోసం కొన్ని నిమిషాల సమయం కూడా వెచ్చించలేక మానసిక ఒత్తిడికి గురవుతున్నాం. బీపీ, హార్ట్ రేట్, గ్లూకోజ్ లెవెల్స్, కార్టిసాల్ లెవెల్స్ అన్నింటినీ నియంత్రించే శక్తి ధ్యానానికి ఉంది. జర్నల్ ఆఫ్ న్యూరోలాజికల్ సైన్సెస్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం.. శ్వాస వ్యాయమాల్లో నిమగ్నమైనప్పుడు వారి ఒత్తిడి తగ్గి, హార్ట్‌రేట్ నార్మల్‌గా ఉందని తేలింది బీపీ, హార్ట్ రేట్, గ్లూకోజ్ లెవెల్స్, కార్టిసాల్ లెవెల్స్ అన్నింటినీ నియంత్రించే శక్తి ధ్యానానికి ఉంది. ఉచ్వాస, నిశ్వాసాలపై మనుసును ఏకాగ్రం చేస్తూ కొద్దిసేపు ధ్యానం చేస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఒత్తిడికి గురయ్యే వారిలో కార్టిసోల్, డొపమైన్ వంటి హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. తీవ్ర ఒత్తిడికి లోనైనప్పుడు షుగర్ లెవల్స్ పడిపోవడం, హైపర్‌టెన్షన్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. 1970వ దశకంలో హార్వర్డ్ మెడికల్ స్కూల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ హెర్బర్ట్ బెన్సన్ ఒత్తిడి, అధిక రక్తపోటు వంటి సమస్యలకు ధ్యానం ఒక ఉత్తమ మార్గమని గుర్తించారు. శ్వాస వ్యాయామాలను తరచూ చేయడం వల్ల మనల్ని మనం ప్రశాంతంగా ఉంచుకోవచ్చని హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్ ప్రచురించింది. ఇన్‌స్టంట్‌తో రిలీఫ్ ముందుగా ప్రశాంతమైన, సౌకర్యవంతమైన స్థలాన్ని ఎంచుకోవాలి. ప్రారంభదశలో ఛాతీ నుంచి మొదలుకొని పొత్తికడుపు వరకు వీలైనంత లోతుగా గాలి పీల్చుకొని నెమ్మదిగా వదలండి. ఈ పద్దతిని మీకు వీలైనన్నిసార్లు 10-20నిమిషాల వరకు రిపీట్ చేయండి. గట్టిగా శ్వాస పీల్చడం, కొన్ని సెకెండ్ల పాటు నిలిపి ఉంచడం, వదిలేయడం అనే డీప్ బ్రీతింగ్ టెక్నిక్ స్ట్రెస్ నుంచి ఇన్స్టంట్ రిలీఫ్‌ని ఇస్తుంది. మనస్సును ఒక చోట కేంద్రీకరించడానికి మెదడుకు శిక్షణ ఇవ్వగలగడమే మెడిటేషన్. మొదట్లో అంత ఏకాగ్రత కుదరకపోయినా ఆ తర్వాత చేస్తున్న కొద్దీ డైవర్షన్స్ తొలగిపోతాయి. -
‘స్ట్రెస్’ నుంచి బయట పడేందుకు ఎలాన్ మస్క్ చేసే పని ఇదా!
ఒత్తిడి! పోటీ ప్రపంచంలో సర్వసాధారణం అయ్యింది. ఈ స్ట్రెస్ నుంచి రిలాక్స్ అయ్యేందుకు సినిమాలు చూడడం, క్రికెట్ ఆడుతుంటారు. దిగ్గజ కంపెనీల సీఈఓలు రోజూ వారి ఒత్తిడిల నుంచి ఉపశమనం పొందేందుకు ఏం చేస్తుంటారు. గోల్ఫ్ లేదంటే, సెయిలింగ్ క్లబ్బులకు వెళుతుంటారు. మరి ఎలాన్ మస్క్ ఏం చేస్తారని మీకెప్పుడైనా తెలుసుకోవాలని అనిపించిందా? ప్రంపచంలో అపరకుబేరుడు, పదుల సంఖ్యలో కంపెనీలకు అధినేత ఎలాన్ మస్క్ ఒత్తిడిని పోగొట్టుకునేందుకు ఏం చేస్తుంటారో ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో వెల్లడించారు. మస్క్ ఒత్తిడిలో ఉన్నప్పుడు వీడియో గేమ్స్ ఎక్కువగా ఆడుతానని చెప్పారు. పరిమితులు లేని నా ఆలోచనల్లోని అల్లకల్లోలాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుందని అన్నారు. అమెరికన్ కంప్యూటర్ సైంటిస్ట్, పాడ్‌కాస్టర్ లెక్స్ ఫ్రిడ్మాన్ పాడ్ కాస్ట్లో మస్క్ మాట్లాడుతూ.. నా మెదడు తుఫాను లాంటింది. ఒకేసారి పదిపనులు చేయాల్సినప్పుడు నా మైండ్ నా కంట్రోల్లో ఉండదు. నా గురించి తెలియని వారు నాలా ఉండాలని, లేదంటే పనిచేయాలని అనుకుంటారు. కానీ అది సాధ్యం కాదని చెప్పారు. ఇదే విషయాన్ని ఆయన (మస్క్)తో కలిసి ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన గ్రైమ్స్..ప్రముఖ మీడియా సంస్థ సీఎన్ఎన్ మాజీ సీఈవో వాల్టర్ ఐజాక్సన్ ఎలాన్ మస్క్ జీవితం గురించి రాసిన ‘ఎలాన్ మస్క్’ ఆటో బయోగ్రఫీ బుక్‌లో చెప్పారు. మస్క్ ఎక్కువగా ఆడే వీడియో గేమ్‌లలో ‘ది బ్యాటిల్ ఆఫ్ పాలిటోపియా’, ‘ఎల్డెన్ రింగ్’లు ఉన్నాయి. ‘ది బ్యాటిల్ ఆఫ్ పాలిటోపియా’ నాగరికతను నిర్మించడం, యుద్ధానికి వెళ్లడం గురించిన వ్యూహాత్మక గేమ్ కాగా.. ఒక సీఈఓకు కావాల్సిన నైపుణ్యాలను నేర్చుకునేందుకు ఈ గేమ్ ఉపయోగపడుతుందని మస్క్ భావిస్తారని పేర్కొన్నారు. మరో వీడియో గేమ్ ‘ఎల్డెన్ రింగ్’. యుద్ధంపై దృష్టి సారించడం, రాజ్యాన్ని నిర్మించడమే ఈ గేమ్ లక్ష్యమని పాడ్‌కాస్ట్‌లో వివరించారు. తన మెదడును ఒక నిర్దిష్ట స్థితికి తీసుకెళ్లడానికి వీడియో గేమ్స్ ఉపయోగపడతాయి. గేమ్‌లో ముందుకు వెళుతున్న కొద్దీ పురోగతి సాధిస్తున్న ఫీలింగ్ కలుగుతుందని ఎలాన్ మస్క్ పాడ్ కాస్ట్లో వివరించారు. -
ఇలా చేస్తే ఒత్తిడి మీ దరిదాపుల్లోకి కూడా రాదు, ఇల్లాలి ఆరోగ్యం కోసం..
ఇంటిని చక్కదిద్దుకోవడం మొదలుకొని పిల్లలకు చక్కని భవిష్యత్ నిర్మాణం వరకు ఇంటి ఇల్లాలు పడే తపన అంతా ఇంతా కాదు. ఈ క్రమంలో ఎంతో ఒత్తిడికి గురై, మానసికంగా, శారీరకంగా బలహీనంగా మారుతుంటారు మహిళలు. ఇల్లాలి బాధ్యతలను చక్కగా నెరవేరుస్తూనే కొన్ని అలవాట్లను దైనందిన జీవితంలో భాగం చేసుకుంటే శరీరం ఆరోగ్యంగా... మనసుకు ఉల్లాసంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. దైనందిన జీవితంలో ఎదురయ్యే అనేక ఆందోళనలను దూరం చేసి మనసుకు సాంత్వన నిచ్చేది మన అభిరుచులే. రోజులో కొంతసమయాన్ని ఎంతో ఇష్టమైన పనిమీద కేంద్రీకరించడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. భావోద్వేగాలు, ఒత్తిళ్లు, నిరాశలు తగ్గుముఖం పడతాయి. యోగా... ప్రపంచంలోనే పాపులర్ వ్యాయామం యోగా. మహిళలు అలవర్చుకోవాల్సిన అభిరుచిలో ఇది ప్రధానమైనది. యోగా చేయడం వల్ల ఫిట్‌గా, బలంగా తయారవడంతో పాటు ఒత్తిడి తగ్గి, సంతోషంగా ఉంటారు. శరీరంతో పాటు మానసిక పరిస్థితి మెరుగుపడి ప్రతికూల పరిస్థితులను తట్టుకుని నిలబడేందుకు అనువుగా మనసు మారుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. సిరామిక్స్ తయారీ... ఒత్తిడిని తగ్గించడంలో సిరామిక్స్ తయారీ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. రకరకాల పాత్రల తయారీ నేర్చుకోవడంపై దృష్టి పెట్టడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. స్వయంగా అందమైన పాత్రలు రూపొందించి బహుమతిగా ఇవ్వడానికి లేదా ఇంట్లో వాడుకోవచ్చు. క్రోకరీ తయారీ సమయంలో దృష్టిమొత్తం పాత్రపై ఉండడం వల్ల మెడిటేషన్ చేసినట్లవుతుంది. ఫొటోగ్రఫీ... మంచి అలవాట్లలో ఫొటోగ్రఫీ కూడ ఒకటి. మనం ఎక్కడున్నా, ఏం చేస్తున్నా ఫోటోలు తీయవచ్చు. ఇప్పుడు ఖరీదైన కెమేరాలు కూడా అవసరం లేదు. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ఫోన్లు ఉంటున్నాయి. మీ అభిరుచికి తగ్గట్టుగా క్లిక్‌మనిపించాలి. తీసిన ఫోటోలను క్రియేటివ్‌గా తయారు చేసి వివిధ రకాల ప్లాట్‌ఫామ్‌లపై పెట్టుకుంటే ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయి. ఈ ఫోటోగ్రఫీ వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గి మనసు ఉత్సాహంతో నిండుతుంది. స్విమ్మింగ్ ఈత కొట్టడం వల్ల చాలారకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. ఎండార్ఫిన్స్ విడుదలవుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. స్విమ్మింగ్ కోసం బయటకు వెళ్లడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యాలతో పాటు కొత్త పరిచయాలతో ఉత్సాహం కలుగుతుంది. డ్యాన్సింగ్... నాలుగు స్టెప్పులు వేసారంటే హుషారు దానంతట అదే పరిగెత్తుకుంటూ వస్తుంది. మ్యూజిక్కు తగ్గట్టుగా శరీరాన్ని కదిలిస్తే ఆనందం రెట్టింపు అవుతుంది. డ్యాన్స్‌తో అధిక బరువు తగ్గి, కండరాలు బలంగా మారతాయి. మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఆభరణాల తయారీ జ్యూవెలరీ తయారీ అలవాటు చాలా మంచిది. దృష్టిమొత్తం డిజైన్ మీద ఉంటుంది. మనలోని సృజనాత్మకతను వెలికి తీసి సరికొత్త అభరణాలు తయారు చేసి ఎవరికైనా గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. దీనిలో మంచి నైపుణ్యం సాధిస్తే ఆదాయం కూడా వస్తుంది. ఆన్లైన్ లో కూడా నేర్చుకోవచ్చు. కుట్లు... అల్లికలు ప్రస్తుత కాలంలో మహిళలు ధరించే డ్రెస్సులు దాదాపు అన్నీ ఎంబ్రాయిడరీతోనే ఉంటున్నాయి. వీటి రేటు కూడా ఎక్కువే. స్వయంగా మీ డ్రెస్ మీద మీరే ఎంబ్రాయిడరీ చేస్తే ఖర్చూ ఉండదు. స్వయంగా డిజైన్ చేశామన్న సంతృప్తి కలుగుతుంది. సులభంగా వేయగలిగే ప్యాట్రన్ లేదా ఫ్లోరల్ డిజైన్‌తో మొదలు పెట్టి మెల్లగా ఎంబ్రాయిడరీలోని మెలకువలు నేర్చుకోవాలి. ఇందుకు ఏకాగ్రతతో΄ాటు ఓపిక కూడా కావాలి. మీరు ఎంబ్రాయిడరీ చేసిన డిజైన్ లేదా అల్లిన వస్తువు ఇతరులకు నచ్చినప్పుడు మీలో ఆత్మవిశ్వాసం పెరిగి సంతోషంతో పాటు, ఆదాయమూ వస్తుంది. కుకింగ్, బేకింగ్... సరికొత్త కలెక్షన్.. దాదాపు మహిళలంతా వంటచేస్తుంటారు. అయితే రోజూ చేసే వంట కాకుండా... కొంచం కొత్తగా చేసి ఇంట్లోవాళ్లకు రుచులను వడ్డించండి. తిన్నవారు ‘ఎంత బావుందో’ అని చెప్పేమాట మీ కడుపుని నింపేస్తుంది. ఇంట్లో చేసినవి ఏవైనా ఆరోగ్యమే! అందుకే రకరకాల వంటకాలను తయారు చేయడానికి ప్రయత్నించాలి. గార్డెనింగ్... బొకేల తయారీ గార్డెనింగ్‌ను అలవాటు చేసుకుంటే.. ఒత్తిడి మీ దరిదాపుల్లోకి రాదు. సేంద్రియ కూరగాయలు, పండ్లు పండించడంతో΄ాటు, సువాసనలు వెదజల్లే పూలపరిమళాలు ఇంటి ఆవరణలో మీతో పాటు మీ కుటుంబానికీ ఉల్లాసాన్ని కలిగిస్తాయి. ఇక పూలను బొకేలుగా మార్చితే మీ నైపుణ్యాలు మెరుగుపడినట్టే. పూలను ఒకదానికి ఒకటి జత చేసే క్రమంలో మనలోని సృజనాత్మకత వెలికి వస్తుంది. మనసు ఆహ్లాదంగా మారుతుంది. అందంగా... ఆరోగ్యంగా ఒత్తిడి వల్ల ముఖసౌందర్యాన్ని గాలికి వదిలేస్తుంటారు. అద్దంలో ముఖం చూసుకున్నప్పుడు మరింత నిస్సత్తువగా అనిపిస్తుంది. అందువల్ల మీ ముఖాన్ని మరింత కాంతిమంతంగా మార్చుకునేందుకు ఇంట్లోనే ఫేషియల్ తయారు చేసుకోవాలి. చర్మ సంరక్షణకు ఎటువంటి క్రీమ్‌లు, ఫేషియల్స్లు చేసుకోవాలో నేర్చుకుని చర్మసౌందర్యాన్ని పెంచుకోవాలి. వీటికి ఫేషియల్ యోగాను జతచేస్తే ఆందమూ ఆరోగ్యం మీ సొంతమైనట్టే. వీటిలో కనీసం కొన్నింటిని అలవరచుకున్నా మీలో పేరుకుపోయిన ఒత్తిడి, నిస్సత్తువలు నియంత్రణలోకి వచ్చి ఆనందంగా జీవించ గలుగుతారు. -
ఒత్తిడితో పిల్లల్ని ఇంకా చంపుదామా?
మన దేశంలోని ఐఐటీలు 2018 నుండి 2023 వరకు 33 మంది విద్యార్థుల ఆత్మహత్యలను నివేదించాయి. ఎన్ఐటీలు, ఐఐఎమ్‌లు అలాంటి 61 కేసులను నమోదు చేశాయి. ‘విజయం’ అనే కలలను అమ్మే బ్రహ్మాండమైన కోచింగ్ ఫ్యాక్టరీలకు అపఖ్యాతి గాంచిన రాజస్థాన్ లోని కోటాలో ఈ సంవత్సరం జనవరి నుండి ఆగస్టు వరకు ప్రతి నెలా సగటున మూడు ఆత్మహత్యలు నమోదయ్యాయి. ప్లేస్మెంట్లు, జీతం ప్యాకేజీల కథలతో ఈ వ్యవస్థ యువ మనస్సులను హిప్నోటైజ్ చేస్తోంది. అర్థం లేని పరుగు కోసం గుర్రాలుగా మారుస్తోంది. గొప్ప ఆకాంక్షలను, కలలను చంపుతోంది. అయినా విద్యార్థుల ఆత్మహత్యలను మనం సాధారణీకరిస్తున్నాం. ఈ ప్రాణాపాయ విద్యకు బలంగా ‘నో’ అని చెప్పాలి. ఈ మధ్య ఓ దీర్ఘకాలిక ఆందోళన నాతో ఘర్షించడం మొదలెట్టింది. విద్యార్థుల ఆత్మహత్యలను మనం సాధారణీకరిస్తున్నామా? విద్య పేరిట, ‘విజయం’ కోసం జరిగే పరుగుపందెంలో కొందరు ‘బలహీనమైన’, ‘భావోద్వేగా నికి లోనయ్యే’ యువకులు తమ జీవితాలను అంతం చేసుకుంటున్న ప్పటికీ, దీన్నంతా మామూలు వ్యవహారం లానే చూస్తున్నామా? ఇలాంటి విద్య... విద్యార్థి స్ఫూర్తినే నాశనం చేస్తుందనీ, సామాజిక మానసిక వ్యాధిని సాధారణీకరిస్తుందనీ చెబుతూ, మధ్యతరగతి తల్లిదండ్రులతోనూ, ఉపాధ్యాయులతోనూ నేను తరచుగా కమ్యూని కేట్ చేయడానికి ప్రయత్నించాను. గణాంకాల ద్వారా వారిని ఒప్పించేందుకు కూడా ప్రయత్నించాను. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2021 నివేదిక ప్రకారం, ఆ ఏడాది 13,089 మంది విద్యార్థులు ఆత్మ హత్యలు చేసుకున్నారు. అంటే ప్రతిరోజూ 35 కంటే ఎక్కువ చొప్పున అన్నమాట. అయినప్పటికీ, నేను ఒక తిరస్కరణ లేక నిరాకరణ స్థితిని ఎదుర్కొంటున్నాను. మన కాలంలో వాతావరణ అత్యవసర పరిస్థితికి చెందిన కఠినమైన వాస్తవికతను మనం ఎలాగైతే తిరస్కరిస్తున్నామో దాదాపుగా ఇదీ అంతే! మన దేశంలోని ఐఐటీలు 2018 నుండి 2023 వరకు 33 మంది విద్యార్థుల ఆత్మహత్యలను నివేదించాయి. మరో వైపున ఎన్ఐటీలు, ఐఐఎమ్‌లు అలాంటి 61 కేసులను నమోదు చేశాయి. అయినప్పటికీ, మనం మౌనంగా ఉండటానికే ఇష్టపడతాం లేదా దానిని కేవలం ఒక అపసవ్యతగా భావిస్తాం. అదే విధంగా, ‘విజయం’ అనే కలలను అమ్మే బ్రహ్మాండమైన కోచింగ్ ఫ్యాక్టరీలకు అపఖ్యాతి గాంచిన రాజస్థాన్ లోని కోటాలో ఈ సంవత్సరం జనవరి నుండి ఆగస్టు వరకు ప్రతినెలా సగటున మూడు ఆత్మహత్యలు నమోదయ్యాయి. నిజానికి, జీవితాన్నే నిరాకరించే ఈ పోటీ వ్యాప్తికి సంబంధించిన వ్యవస్థీకృత, సామాజిక కారణాల గురించి నాకు తెలుసు. ఇంకా చెప్పాలంటే, అధిక జనాభా కలిగిన ఈ దేశంలో ఉద్యోగాల కొరత ఉంది. ఉదారవాద కళలు, మానవ శాస్త్రాల విలువ తగ్గిపోయింది. ఇంజినీరింగ్, వైద్యశాస్త్రాలు, బిజినెస్ మేనేజ్మెంట్, ఇతర సాంకేతిక కోర్సులపై మక్కువ పెరిగింది. సంస్కృతిపై, విద్యపై నయా ఉదార వాద దాడి కారణంగా జీవిత ఆకాంక్షల మార్కెటీకరణ జరిగింది. అన్నింటికంటే మించి, ‘యోగ్యత’ లేదా ‘బలవంతులదే మనుగడ’ సిద్ధాంతాలకు పవిత్రత కల్పించడం కోసం... అన్యాయమైన సామాజిక వ్యవస్థలో ఒక జీవన విధానంగా అతి పోటీతత్వాన్ని లేదా సామాజిక డార్వినిజంను అంగీకరించడం జరిగింది. మన పిల్లలు, యువ విద్యార్థులు బాధపడుతున్న తీరును చూస్తూనే ఉన్నాం. దీర్ఘకాలిక ఒత్తిడి, భయం, ఆందోళన, ఆత్మహత్య ధోరణులతో వారు జీవిస్తున్నందున, మనం మౌనంగా ఉండలేం. ఈ అన్యాయాన్ని మనం సాధారణీకరించలేం. ఒక ఉపాధ్యాయునిగా, ఈ విధమైన ఏ విద్యనైనా ఏమాత్రం సందిగ్ధత లేకుండా మనం విమర్శించాలనీ, దీని ద్వారా కొత్త అవ కాశాల కోసం ప్రయత్నించాలనీ నేను భావిస్తాను. వాస్తవానికి, ప్రతి ఒక్కరూ ఆత్మహత్య చేసుకోవడం లేదు. కానీ ఈ విద్యా వ్యవస్థలో భాగమైన ప్రతి యువ విద్యార్థి కూడా మానసిక ఒత్తిడి, ఆందోళన, ‘వైఫల్యానికి’ సంబంధించిన అమితమైన భయాలతో అననుకూల మైన వాతావరణంలో పెరుగుతున్నారనేది కూడా అంతే నిజం. ప్రేమ, సహకారానికి సంబంధించిన ఆవశ్యకత; పట్టుదల, ప్రశాంతతకు సంబంధించిన కళ ద్వారా భూమ్మీద మన ఉనికి తాలూకు హెచ్చు తగ్గులను అర్థం చేసుకోగలిగే సామర్థ్యం; సాధారణ విషయాలలో జీవి తానికి సంబంధించిన నిజమైన నిధిని కనుగొనడానికి వీలు కల్పించే బుద్ధిపూర్వక స్థితి... ఇలా, అర్థవంతమైన జీవితాన్ని గడపడానికి అవ కాశం లేని, నిజంగా ముఖ్యమైన వాటిని పెంపొందించడంలో ఆసక్తి లేని వ్యవస్థ ఇక్కడ ఉంది. ఒక సీతాకోక చిలుక చిన్న పసుపు పువ్వుతో ఆడుకోవడం, ముసలి నాయనమ్మ కోసం ఒక కప్పు టీ తయారు చేయడం, ఆమెతో పారవశ్యంలో ఒక క్షణం పంచుకోవడం, లేదా శీతా కాలపు రాత్రి ఒక నవలను చదవడం... ఇలాంటి వాటికి బదులుగా, ఈ వ్యవస్థ అన్ని గొప్ప ఆకాంక్షలను, కలలను చంపుతోంది. ఇది యువ మనసులను అర్థం లేని పరుగు కోసం గుర్రాలుగా మారుస్తోంది. పాఠశాలల నుండి కోచింగ్ ఫ్యాక్టరీల వరకు, మనం విద్యను అన్ని రకాల ప్రామాణిక పరీక్షలను ‘ఛేదించే’ ఒక వ్యూహంగా కుదించి వేశాము. గొప్ప పుస్తకాలను చదవడం, వినూత్న ఆలోచనలను అన్వేషించడం, చర్చించడం, వాదించడం, సైన్ ్స, సాహిత్యం, కళలతో ప్రయోగాలు చేయడం వంటి వాటి కంటే పరీక్షలు, మార్కులు చాలా ముఖ్యమైనవి కావడంతో నిజమైన అభ్యాసం దెబ్బతింటోంది. ‘వేగా నికి’ సంబంధించిన మాంత్రికతతో ఓఎమ్ఆర్ షీట్లో ‘సరైన’ సమా ధానాన్ని టిక్ చేయగల సామర్థ్యమే విలువైనది అయిపోయింది. ఎమ్సీక్యూ – కేంద్రీకృత పరీక్షా వ్యూహాలను విక్రయించే మార్గ దర్శక పుస్తకాలు యువ అభ్యాసకుల మానసిక స్థితిని వలసీకరించడం ప్రారంభించాయంటే ఆశ్చర్యపోనవసరం లేదు.ఈ వ్యవస్థ సౌందర్యం, సృజనాత్మకత, ఉత్సుకత లేనిది. ఇది యాంత్రికమైన, ప్రామాణికమైన, కరుడు గట్టిన మనస్సులను తయారు చేస్తుంది. ఉపకరణ ‘మేధస్సు’కు మాత్రమే అది విలువ నిస్తుంది. దీనిలో సృజనాత్మక కల్పన లేదా తాత్విక అద్భుతం లేదు. కోచింగ్ సెంటర్ వ్యూహకర్త మీ బిడ్డను సూర్యాస్తమయాన్ని చూడ డానికీ, ఒక పద్యం చదవడానికీ లేదా సత్యజిత్ రే చలన చిత్రాన్ని మెచ్చుకునేలా ప్రేరేపించాలనీ మీరు ఆశించలేరు. ఈ బోధకులు మీ పిల్లలను వేగంగా పరిగెత్తమని, ఇతరులను ఓడించమని, భౌతిక శాస్త్రాన్ని లేదా గణితాన్ని కేవలం ప్రవేశ పరీక్ష మెటీరియల్‌గా కుదించుకోమని, అతని/ఆమె స్వీయ–అవగాహనను ఐఐటీ–జేఈఈ లేదా నీట్ ర్యాంకింగ్‌తో సమానం చేయమని మాత్రమే అడగగలరు. మరో మాటలో చెప్పాలంటే, ఈ విధమైన విద్య ఒక వ్యక్తిని సాంస్కృతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా కూడా దారిద్య్రంలోకి నెడుతుంది. ఇది జీవితం కోసం, దాని లోతైన అస్తిత్వ ప్రశ్నల కోసం ఎవరినీ సిద్ధం చేయదు. కార్ల్ మార్క్స్ ఒకప్పుడు ‘సరుకుల మాయ’గా భావించిన దానిని ఈ విధమైన సాధనా విద్య చట్టబద్ధం చేస్తోంది. అవును, మన పిల్లలు ఒక విధంగా శిక్షణ పొందవలసి ఉంటుంది, తద్వారా వారు ఒక ధర ట్యాగ్‌తో వస్తువులుగా లేదా ‘ఉత్పత్తులుగా’ ఉద్భవించవలసి ఉంటుంది. కఠినమైన వాస్తవాన్ని అంగీకరించండి. చాలా హైప్ చేయబడిన ఐఐటీలు, ఐఐఎమ్‌లు – మధ్యతరగతి తల్లిదండ్రులు తమ పిల్లల కోసం చూసే అంతిమ మోక్షమైన ‘ప్లేస్మెంట్లు మరియు జీతం ప్యాకేజీల’ పురాణాల ద్వారా యువ మనస్సులను హిప్నోటైజ్ చేస్తాయి. మన పిల్లలను, ప్రత్యేకమైన స్వయంప్రతిపత్తి గల వ్యక్తు లుగా చూడకుండా, కేవలం ‘పెట్టుబడి’ లేదా విక్రయించదగిన వస్తు వుల స్థాయికి తగ్గించి, మనం న్యూరోటిక్, ఆందోళనతో కూడిన, అధిక ఒత్తిడితో కూడిన తరాన్ని సృష్టించడం కొనసాగిస్తాము. ‘మోటివేషనల్ స్పీకర్ల’ను ‘స్వయం–సహాయ’ పుస్తకాల మార్కెట్‌ను అభివృద్ధి చేయ డానికి వ్యవస్థ అనుమతించినప్పటికీ, పెరుగుతున్న ఆత్మహత్యల రేటును అరికట్టడం అసాధ్యం. ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, శ్రద్ధగల పౌరులుగా, మనం అప్రమత్తంగా ఉండాలి, మన స్వరం పెంచాలి, ఈ ప్రాణాపాయ విద్యకు నో అని చెప్పాలి, కొత్త అవగాహనను ఏర్పరచాలి. మన పిల్లలకు జీవితాన్ని ధ్రువీకరించే, కరుణను పెంచే మరో దృక్పథాన్ని అందించాలి. అవిజిత్ పాఠక్ వ్యాసకర్త సామాజిక శాస్త్రవేత్త (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
మానసిక ఒత్తిడి, మందులు వాడినా తగ్గడం లేదా? ఇలా చేయండి
పెరుగుతున్న జనాభాతోపాటు అన్ని రకాల జబ్బులు కూడా పెరుగుతున్నాయి. ఏ వ్యాధైనా తొలిదశలో గుర్తించి, సరైన చికిత్స చేయించుకుంటే తగ్గిపోతాయి. మానసిక వ్యాధులు సైతం ఇలాగే తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు. కానీ.. మానసిక వ్యాధిగ్రస్తులు అందరిలో ఒకరిలా ఉండలేకపోతున్నారు. ఏ విషయమైనా ప్రతికూలంగా ఆలోచిస్తుంటారు. చిరునవ్వును ఆస్వాదించలేకపోతున్నారు. మానసిక క్షోభ అనుభవిస్తూ జీవితాన్ని నరకం చేసుకుంటున్నారు. ప్రతి విషయంలోనూ ఒత్తిడికి గురికావడం వల్లే మానసిక ఆరోగ్యం క్షీణిస్తోందని.. దీన్ని అధిగమించడానికి జీవితంలో పాజిటివ్ దృక్పథం పెంచుకుంటూ ఒత్తిడిని జయించాలని మానసిక వైద్యులు సూచిస్తున్నారు. అప్పుడే ఉత్తమ సమాజం ఏర్పడుతుందని చెబుతున్నారు. మహానుభావుల జీవితమే స్ఫూర్తి.. స్వాతంత్రోద్యమ సమయంలో బ్రిటిష్ వారు మహాత్మా గాంధీని రైలు నుంచి కిందకు నెట్టేశారు. ఆ స్థానంలో సాధారణ వ్యక్తులుంటే అవమానం తట్టుకోలేకపోయేవారు. కానీ.. గాంధీ వారినే భారతదేశం నుంచి నెట్టేసే వరకు విశ్రమించలేదు. అవమానాన్ని పట్టుదలగా మార్చుకుని దేశానికి స్వాతంత్య్రం తెచ్చే వరకు వెనుకడుగు వేయలేదు. అలాగే.. మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు 91 ఏళ్ల జీవితంలో 60 ఏళ్లు సినిమానే జీవితంగా గడిపారు. సుమారు 40 ఏళ్ల క్రితమే అనారోగ్యానికి గురయ్యారు. తనకు కేన్సర్ ఉందని తెలిసినా.. దానిని జయిస్తానని ధైర్యంగా గడిపారు. నైతిక విలువలు, క్రమశిక్షణ పాటిస్తూ.. నిత్యం నకడ, మితాహారం, సమయానుకూలంగా నిద్ర, అందరితో స్నేహంగా, సంతోషంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగారు. తాను సంతోషంగా ఉంటూ ఇతరులను ఆనందంగా ఉంచగలిగితే అంతకు మించింది మరేదీ లేదు. ప్రతి మనిషికి జీవితంలో ఏదో ఒక ఘటన జరుగుతుంది. దాని నుంచి పాఠాలు నేర్చుకోవాలి. మానసిక వ్యాధులు.. లక్షణాలు మనిషి శరీరంలో జరిగే రసాయనిక మార్పులు, హార్మోన్లకు సంబంధించిన మార్పుల వల్ల మానసిక వ్యాధులు పుట్టుకొస్తాయి. సెరటోనిన్ అనే రసాయన పదార్థం మెదడులోని నాడీ కణాల్లో తగ్గినప్పుడు డిప్రెషన్ వస్తుంది. ఈ వ్యాధితో బాధ పడేవారు ఎప్పుడూ నిషాతో ఉండటం.. ఆత్మహత్య ఆలోచనలు, నిద్ర రాకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. డోపమెన్ అనే రసాయన పదార్థం మెదడులోని కొన్ని భాగాల్లో ఎక్కువగా పెరగడంతో స్కిజోఫ్రినియా అనే వ్యాధి వస్తుంది. విచిత్రమైన అనుమానాలు, భయభ్రాంతులు, వారిలో వారే మాట్లాడుకోవడం వంటి లక్షణాలు ఉంటాయి. మెదడులో సెరటోనిన్, అడ్రనలిన్ అనే రసాయన పదార్థాల హెచ్చుతగ్గులతో ఆనక్సిటీ వ్యాధి వస్తుంది. ఎసిట్రైల్ కోలిన్ అనే రసాయన పదార్థం తగ్గినప్పుడు మతిమరుపు వస్తుంది. బైపోలార్ డిజార్డన్ అనే వ్యాధికూడా రసాయనాల హెచ్చుతగ్గుల వల్ల వస్తుంటుంది. మంత్రాలు, తాయత్తులతో తగ్గదు మానసిక వ్యాధి వస్తే మంత్రాలు, తాయత్తులు కట్టించుకుంటుంటారు. గ్రామీణ ప్రాంతాలలో ఈ విశ్వాసాలు ఎక్కువ. పట్టణాల్లోనూ కొన్నిచోట్ల ఈ సంస్కృతి కనిపిస్తోంది. మానసిక జబ్బులకు శాసీ్త్రయ వైద్యం ఒక్కటే పరిష్కార మార్గం. మందులు వాడినా తగ్గట్లేదు అనే ధోరణి ప్రజల్లో ఉంది. ఒక్కోసారి నెల పట్టొచ్చు. ఆరు నెలలైనా పట్టొచ్చు. కానీ మానసిక ఆరోగ్యానికి ఇదే మంచి మార్గం. ఒత్తిడిని అధిగమిద్దాం ఇలా.. మనుషులు పలు కారణాలతో అనేక రకాల ఒత్తిడులకు గురవుతుంటారు. అవి శారీరక, మానసిక ఒత్తిడి అని రెండు రకాలుంటాయి. ఆరోగ్యం కాపాడుకుంటే శారీరక ఒత్తిడిని జయించవచ్చు. మిత ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం, నిత్యం యోగా చేయడం, వృత్తిపరమైన శిక్షణతో మానసిక ఒత్తిడిని అధిగమించొచ్చు. వ్యాపారంలో సరైన లాభాలు రాకపోవడం, అధిక పని, పదోన్నతి లేని ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. చేసే పనిని ప్రేమించాలి. వృత్తిపరంగా గెలుపు, ఓటములు ఉంటాయి. ఓటమిని సవాల్‌గా స్వీకరించి విశ్లేశించుకుని ముందుకెళ్లాలి. స్ఫూర్తిదాయక వ్యక్తుల మధ్య గడపడం, మంచి పుస్తకాలు చదవడం, అనవసర ఆలోచనలు, చికాకులను దూరం పెట్టడం ద్వారా సంతోషమైన జీవితాన్ని గడపాలి. -
ఎదుగుదల వాయిదా!
బాపట్లకు చెందిన చిట్టిబాబు ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగి. వయసు 40 దాటడంతో ఆరోగ్యంపై దృష్టిపెట్టాలనుకున్నాడు. ‘రేపటి నుంచి మార్నింగ్ వాక్ చేయాలి’.. అని నిర్ణయం తీసుకుని ఉదయం 5 గంటలకు అలారం పెట్టుకున్నాడు. తెల్లారింది.. అలారం మోగడం మొదలైంది. నిద్రమత్తులోనే చిట్టిబాబు అలారాన్ని ఆపి.. ఈ రోజు గురువారం.. అటూఇటు కాకుండా ఈ రోజే మొదలెట్టాలా? సోమవారం నుంచైతే ఓ క్రమపద్ధతిలో ఉంటుంది కదా అనుకుని.. వచ్చే సోమవారానికి వాయిదా వేసుకుని మళ్లీ ముసుగుతన్నాడు. సోమవారం ఉదయాన్నే అలారం మోగడంతో భారంగా నిద్రలేచాడు. వాకింగ్‌కు సిద్ధమవుతున్న తరుణంలో అతడి మెదడులో తళుక్కున ఓ ఆలోచన మెదిలింది..ఎటూ మూడు రోజుల్లో ఈ నెల ముగిసిపోతుంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి వాకింగ్ ప్రారంభిస్తే ఎలా ఉంటుందబ్బా.. అని ఆలోచించాడు. తన ఆలోచన కరక్టే అనిపించింది. ఒకటో తేదీ అయితే లెక్కించుకోడానికి కూడా సులువుగా, అనువుగా ఉంటుందనుకుంటూ.. వాకింగ్‌కు వెళ్లే ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ఒకటో తేదీ కూడా రానే వచి్చంది.. ఆ రోజు బుధవారం. మరీ వారం మధ్యలో ఎందుకు? సోమవారం నుంచి నడుద్దాంలే.. అని వాయిదా వేశాడు. మళ్లీ సోమవారం రాగానే.. ఆపై సోమవారానికి వాయిదా. ఇలా రెండేళ్లుగా వాయిదాల పరంపర కొనసాగుతూనే ఉంది గానీ.. మార్నింగ్ వాక్కు మాత్రం అడుగు ముందుకు పడలేదు. వాకింగ్ మొదలెడదామనుకున్న రోజు రాగానే ఏదో ఒక కారణాన్ని వెతుక్కోవడం.. ఆ సాకుతో వాయిదా వేసుకుని, ఆ క్షణానికి హమ్మయ్యా.. అని ఊపిరిపీల్చుకోవడం పరిపాటిగా మారింది. – తమనంపల్లి రాజేశ్వరరావు, ఏపీ సెంట్రల్ డెస్క్ ఒక్క చిట్టిబాబు విషయంలోనే కాదు.. దాదాపు అందరి జీవితంలోనూ ఏదో ఒక సందర్భంలో ఇలాంటి వాయిదా ఘటనలు ఉండే ఉంటాయి. ఒక్కసారి ఈ వాయిదా సంస్కృతికి అలవాటు పడితే.. మన ఎదుగుదలను, అభివృద్ధిని వాయిదా వేసుకున్నట్టే లెక్క. విలువైన కాలాన్ని హరించి వేస్తుంది. వాయిదా వేయడం.. ఆ సమయానికి ఎంతో రిలీఫ్‌నిస్తుంది. చేయాల్సిన పనిని ‘తర్వాత చేద్దాంలే..’ అనుకోవడం ఆ క్షణానికి ప్రశాంతతనిస్తుంది. కానీ ఆ వాయిదా తాలూకు పర్యావసానం నష్టాన్ని కలిగించినప్పుడు తల పట్టుకుని కుమిలిపోతుంటారు. ఇలా డిప్రెషన్లోకి వెళ్లిపోయే ప్రమాదమూ లేకపోలేదని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. చూద్దాంలే.. చేద్దాంలే.. అనేవి జీవితాన్ని వెనక్కి లాగే విషయాలని, వీటి నుంచి ఎంత త్వరగా బయటపడగలిగితే అంత మంచిదంటున్నారు. మనం ఇలా ఆలోచిస్తే.. మెదడు అలా ఆదేశిస్తుంది.. సాధారణంగా మనకు ఒత్తిడి కలిగించేవాటిని వాయిదా వేయమని మెదడు చెబుతుంది. పరీక్షల కోసం చదవడం, ఉదయాన్నే లేచి నడవడం వంటివి మానసికంగా భారంగా ఉండే పనులు. ఎక్కువగా ఇలాంటి వాటినే వాయిదా వేయాలని మెదడు చెబుతూ ఉంటుంది. ఇలాంటి వారిలో ఎక్కువ మంది డిప్రెషన్, మానసిక ఆందోళనల బారిన పడే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఫోన్లో మునక నుంచి బయటి కొద్దాం.. ఏ పనినైనా అనుకున్న సమయానికి పూర్తిచేయాలంటే ఫోన్‌కు దూరంగా ఉండటం మంచిది. ఫోన్ అనేది మనకు తెలియకుండానే సమయాన్ని హరిస్తుంది. మనలో అంతులేని బద్దకానికి కారణమవుతుంది. ఫోన్ చేతిలో ఉందంటే చాలు.. ఇక ఏపనైనా ‘ఆ చేయొచ్చులే..’ అనిపించే నీరసం, ‘ఇప్పుడే చేయాలా..’ అనేంత బద్దకం, ‘చేయలేక చస్తున్నా..’ అనుకునేంత నిస్తేజం మనల్ని ఆవహించేస్తాయి. అందుకే ఫోన్‌కు దూరంగా ఉంటే ఈ వాయిదా అలవాటు నుంచి బయటపడే అవకాశం ఉంది. అందరిలో ఉండే లక్షణమే గానీ.. పనులు వాయిదా వేయడం అనేది టైం మేనేజ్మెంట్ సమస్య అని చాలామంది అనుకుంటారు. వాస్తవానికి ఇది ఎమోషనల్ రెగ్యులేషన్ సమస్య. ఏదైనా ఒక పని మనలో ఒత్తిడిని కలిగిస్తే.. మెదడులోని దానికి సంబంధించిన భాగం ఆ పనిని వాయిదా వేయాలని ప్రేరేపిస్తుంది. దీంతో మనం ఆ పనిని వాయిదా వేస్తాం. అందుకే వాయిదా వేయడాన్ని ఓ డిఫెన్స్ మెకానిజంగా పరిగణించవచ్చు. ఇది అందరిలో ఉండే లక్షణమే గానీ, ఇది క్రానిక్‌గా మారినప్పుడు మాత్రం సైకాలజిస్టులను సంప్రదించాల్సి ఉంటుంది. కాగి్నటివ్ బిహేవియర్ థెరపీ, మైండ్ ఫుల్నెస్ ట్రైనింగ్, బిహేవియర్ షేపింగ్, ఎపిసోడిక్ ఫ్యూచర్ థింకింగ్ వంటి పద్ధతులు ఉపయోగించి వాయిదా వేసే లక్షణాన్ని సైకాలజిస్టులు తగ్గిస్తారు. – బి.కృష్ణ, సైకాలజిస్ట్ మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువ పనులు వాయిదా వేయడం అనేది మెదడులోని లింబిక్ సిస్టం, ప్రీ ఫ్రొంటల్ కార్తెక్స్ మధ్య ఘర్షణతో సంభవిస్తుందని న్యూరో సైన్స్ చెప్తుంది. ఈ లక్షణం విద్యార్థుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్‌లో 81 శాతం మంది పనులు వాయిదా వేస్తున్నారని ఒక సర్వేలో తేలింది. పనులు వాయిదా వేయడానికి కొన్ని మానసిక కారణాలున్నాయి. మోటివేషన్ లేకపోవడం, ఓటమి భయం, ఒత్తిడి, స్వీయ విమర్శలు తదితరాలు ఓ వ్యక్తి పనులు వాయిదా వేయడానికి కారణమవుతాయి. వాయిదా లక్షణం మహిళల కంటే పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వాయిదా వేసే లక్షణం దైనందిక జీవితానికి ఇబ్బంది కలిగించే స్థాయికి చేరుకుంటే మానసిక నిపుణులను సంప్రదించడం మంచిది. – బి.అనితజ్యోతి, సైకాలజిస్ట్ ‘వాయిదా’పై నిపుణులు ఏమంటున్నారంటే.. ఒక పనిని వాయిదా వేయడానికి ముఖ్య కారణం ఆ పని చేయడానికి ఆసక్తి లేకపోవడంతో పాటు ఉత్సాహ లేమిని కూడా ఓ కారణంగా చెప్పొచ్చు. మనం ఇంతకు ముందు చెప్పుకొన్నట్టు ఆ పని మనకు ఒత్తిడి కలిగించేది, లేదా మానసికంగా భారంగా అనిపించేదై ఉంటుంది. ఒక పనిని ఒక్కసారి వాయిదా వేశామంటే.. మళ్లీ మళ్లీ వాయిదా వేసేందుకే మన మెదడు మొగ్గు చూపుతుంది. బద్దకం, సోమరితనం కూడా ఈ వాయిదా పరంపరకు ప్రధాన కారకంగా నిలుస్తున్నాయి. అసలు ఎలాంటి కారణం లేకుండా కూడా పనులు వాయిదా వేస్తూ అదో రకమైన మానసిక ఆనందాన్ని పొందుతుంటాం. చాలా కోల్పోతున్నాం వాయిదా వేసిన పనిని పూర్తిచేయలేక దాని తాలూకు నష్టాన్ని మూటగట్టుకుంటాం. వాయిదాల వల్ల తరచూ ఇలానే జరగడంతో ఆందోళన, భయానికి లోనవుతాం. మనమీద మనకు నమ్మకం సన్నగిలి.. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతాం. ఇది మన నిద్రను ప్రభావితం చేస్తుంది. మనకు నిద్రలేని రాత్రులను మిగులుస్తుంది. ఫలితంగా మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది.. ఇలా అధిగమిద్దాం.. ఒక పనిని చేయడంలో హాయిని అనుభవించాలి గానీ.. ఒత్తిడిని దరిచేరనీయ కూడదు. ఈ వాయిదా వేయడం అనే దాన్ని మన ఎదుగుదలను నియంత్రించే రుగ్మతగా భావిస్తూ.. దాని బారిన పడకుండా ఉండాలంటూ మనసుకు ఆదేశాలిచ్చుకుంటూ.. మనసును పూర్తిగా మన నియంత్రణలో ఉంచుకోవాలి. ఏదన్నా పని మొదలెట్టామంటే.. దానికి అంకితమైపోవాలి. అది పూర్తయిందాకా వెనకడుగు వేయకూడదు. వాయిదా సంస్కృతి అనేది మన ఉన్నతిని, ఎదుగుదలను నిలువరించే ఓ సోమరిపోతు. ఈ జీవన పరుగు పందెంలో తోటివారితో పాటు మన అడుగుల్ని ముందుకు పడనీయకుండా అనుక్షణం వెనక్కి లాగుతూ.. మనల్ని ఓ మాయా ప్రపంచంలోని నిష్క్రియా స్థితికి తీసుకెళ్లే ఓ మత్తుమందు. దీని విషయంలో మనం అప్రమత్తంగా, అనుక్షణం జాగరూకతతో ఉండాలి. పనిని విభజించుకోవాలి. ఓ టైం టేబుల్ వేసుకుని ఆ సమయానికి ఎట్టి పరిస్థితుల్లో ఆ పనిని పూర్తిచేసి తీరాలి. ఒక సామెత చెప్పినట్టు.. రేపు మనం చేయాలనుకుంటున్న పనిని ఈ రోజే.. ఈ రోజు ఏం చేయాల్సి ఉందో దానిని ఇప్పుడే చేసెయ్యాలి. పోషకాహారం తీసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా యోగా లేదా వ్యాయామం, ధ్యానం చేయాలి. -
ఎగ్జామ్స్ అనేసరికి తీవ్రమైన జ్వరం వస్తుందా? ఒత్తిడి తగ్గించడం ఎలా?
కిషోర్ చాలా తెలివైన విద్యార్థి. టెన్త్ ్త క్లాస్‌లో 10జీపీఏతో పాసయ్యాడు. దాంతో ఒక కార్పొరేట్ కాలేజీవాళ్లు ఫ్రీ సీట్ ఇచ్చారు, హాస్టల్‌తో సహా. కానీ హాస్టల్‌కి వెళ్లాక కిషోర్ జీవితమే మారిపోయింది. పొద్దున్నే ఐదు గంటలకు లేస్తే బెడ్ ఎక్కేసరికి రాత్రి 11 గంటలవుతుంది. ప్రతిరోజూ ఇదే పరిస్థితి. మరోవైపు ఫ్రీ సీట్ కాబట్టి మంచి మార్కులు తెచ్చుకోవాలని కాలేజీ యాజమాన్యం ఒత్తిడి. మార్కులు తగ్గితే ఫ్రీ సీట్ కేన్సిల్ చేస్తారని, ఫీజు మొత్తం చెల్లించాల్సి వస్తుందని పేరెంట్స్ ఒత్తిడి. ఈ మధ్యకాలంలో కాలేజీలో మోటివేషన్ క్లాస్ పెట్టించారు. ఆ స్పీకర్ చెప్పినట్లు తాను సాధించలేకపోతే ఎలా? అంటూ కిషోర్‌లో ఒత్తిడి మరింత పెరిగింది. ఒకరోజు కాలేజీలో స్పృహ తప్పి పడిపోయాడు. కాలేజీ యాజమాన్యం అతన్ని హుటాహుటిన హాస్పిటల్లో చేర్పించి పేరెంట్స్‌కి ఫోన్ చేసింది. అన్ని రకాల వైద్య పరీక్షలు చేసినా కిషోర్ అనారోగ్యానికి కారణం తెలియలేదు, ఎన్ని మందులు వాడినా అనారోగ్యం తగ్గడం లేదు. ఇంటర్మీడియట్ చదువుతున్న శిరీషది మరో రకమైన సమస్య. రెగ్యులర్ స్లిప్ టెస్టులతో ఎలాంటి సమస్యా లేదు. ఫైనల్ ఎగ్జామ్ అనేసరికి తీవ్రమైన జ్వరం వచ్చేస్తుంది. హాస్పిటల్లో చేర్పించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. టెన్త్ క్లాస్‌లో అలాగే హాస్పిటల్ నుంచి వెళ్లి పరీక్షలు రాసి 8జీపీఏతో గట్టెక్కింది. ఇంటర్ ఫస్టియర్‌లోనూ అదే సమస్య. ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండియర్‌లోనూ అదే సమస్య ఎదురవుతుందని తల్లిదండ్రులు భయపడుతున్నారు. నీట్ పరీక్ష సమయంలో ఇలా జ్వరం వస్తే ఏం చేయాలని కంగారు పడుతున్నారు. కిషోర్, శిరీష అంత సీరియస్ కాకపోయినా చాలామంది విద్యార్థులకు పరీక్షలంటే కొద్దిపాటి ఆందోళన లేదా భయం ఉంటుంది. దీన్నే టెస్ట్ యాంగ్జయిటీ అంటారు. తాను పరీక్షల్లో సరిగా పెర్ఫార్మ్ చేయలేనేమో, ఫెయిల్ అవుతానేమోనని స్టూడెంట్స్ ఆందోళన చెందుతుంటారు. ఒక మోతాదు వరకు టెస్ట్ యాంగ్జయిటీ ఉండటం మంచిదే. అది పరీక్షలకు సిద్ధమయ్యేలా చేస్తుంది. మోతాదు మించితేనే రకరకాల సమస్యలకు దారి తీస్తుంది. విద్యార్థుల్లో టెస్ట్ యాంగ్జయిటీకి ప్రధాన కారణం తల్లిదండ్రులు, అధ్యాపకులు లేదా కాలేజీ యాజమాన్యాల ఒత్తిడి. పరీక్షల్లో తప్పితే లేదా మంచి మార్కులు రాకపోతే భవిష్యత్తు ఉండదని పదేపదే చెప్పడం వల్ల కొంతమంది విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. సరిగా ప్రిపేర్ కాకపోవడం లేదా గత పరీక్షల్లో ఆశించిన మార్కులు రాకపోవడం వల్ల కూడా పరీక్షలంటే భయం ఏర్పడుతుంది. ఆ పరీక్షలు తప్పించుకునేందుకు మనసు రకరకాల వేషాలు వేస్తుంది. అనారోగ్యం పాలయ్యేలా చేస్తుంది. టెస్ట్ యాంగ్జయిటీ లక్షణాలు: విద్యార్థుల్లో టెస్ట్ యాంగ్జయిటీ అనేది రకరకాల రూపాల్లో కనిపిస్తుంది. శారీరక, భావోద్వేగ, కాగ్నిటివ్ లక్షణాలుంటాయి. శారీరక లక్షణాలు: తలనొప్పి, కడుపునొప్పి, జ్వరం, విపరీతమైన చెమట, ఊపిరి ఆడకపోవడం, గుండె కొట్టుకునే వేగం పెరగడం, తలతిరగడం, స్పృహ తప్పి పడిపోవడం. భావోద్వేగ లక్షణాలు: ఒత్తిడి, భయం, నిస్సహాయత, నిరాశ, ప్రతికూల ఆలోచనలు, గతంలో పరీక్ష తప్పిన ఘటనలు పదే పదే గుర్తుకు రావడం, పరీక్ష తప్పితే తల్లిదండ్రుల ప్రవర్తన గురించిన ఆలోచనలు, ఫ్రెండ్స్ ఎలా ఎగతాళి చేస్తారోననే భయం. ప్రవర్తనా/అభిజ్ఞా లక్షణాలు: ఏకాగ్రత లోపించడం, వాయిదా వేయడం, ఇతరులతో పోల్చుకుని ఆత్మన్యూనతగా ఫీలవ్వడం. టెస్ట్ యాంగ్జయిటీని ఎలా తగ్గించాలి? ∙పరీక్షలకు ముందు.. బాగా చదవడానికి వేరే ప్రత్యామ్నాయమేదీ లేదు. చదవాల్సిన సిలబస్‌ను చిన్నచిన్న భాగాలుగా చేసుకుంటే త్వరగా నేర్చుకోవచ్చు, ఒత్తిడి తగ్గుతుంది ∙చాలామంది విద్యార్థులకు ఎలా చదివితే గుర్తుంటాయో తెలియకే బోల్తాపడుతుంటారు. అందువల్ల ముందుగా ఎఫెక్టివ్ స్టడీ స్ట్రాటజీస్ నేర్చుకుని, వాటి ప్రకారం చదువుకోవాలి. ∙కాఫీ, టీలు మానేసి సమయానికి తినడం, వ్యాయామం చేయడం, తగినంత నిద్ర పోవడం ద్వారా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒత్తిడి నుంచి శరీరాన్ని, మనస్సును కాపాడుకునేందుకు జాకబ్సన్ ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ రోజూ ప్రాక్టీస్ చేయండి. పరీక్షకు ముందురోజు నైట్ అవుట్ చేయకుండా, కచ్చితంగా 7–9 గంటలు నిద్ర ఉండేలా చూసుకోండి. మీ ఆందోళన మరింత పెరగకుండా ఉండేందుకు పరీక్ష సెంటర్‌కి.. ముందే చేరుకుని మీ సీట్లో కూర్చోండి ∙పరీక్షకు ముందు ఐదు నిమిషాలు దీర్ఘంగా శ్వాస తీసుకోండి. ఐదు నిమిషాలు రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయండి ∙మిమ్నల్ని మీరు గ్రౌండింగ్ చేసుకోండి. మీ చుట్టూ ఉన్నవారికన్నా మీరు మెరుగైనవారని విజువలైజ్ చేసుకోండి. గతంలో మీరు బాగా పెర్ఫార్మ్ చేసిన పరీక్షలను గుర్తు చేసుకోండి. అది మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. హాయిగా, ప్రశాంతంగా పరీక్ష రాయండి. టెస్ట్ యాంగ్జయిటీని తగ్గించుకోవాలంటే అత్యంత ముఖ్యమైంది తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మద్దతు. రిజల్ట్స్ కోసం విద్యార్థిపై ఒత్తిడి పెంచకుండా, బెస్ట్ పెర్ఫార్మెన్స్ని ఇస్తే చాలని భరోసానివ్వాలి. సమస్య తీవ్రంగా ఉంటే ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్‌ని సంప్రదించాలి. -
డిప్రెషన్, ఒత్తిడితో చిత్తవకండి.. ఈ పనులు చేయండి
ఉదయం లేచినప్పటి నుంచి ఉరుకులు పరుగులు మొదలు. చేయాల్సిన పనుల చిట్టా చాంతాడంత. దీంతో హడావుడి, ఆందోళన. ఫలితం ఒత్తిడి. అందుకనే ఈ రోజుల్లో ఎక్కువ శాతం మంది ప్రజలు ఒత్తిడికి గురవుతున్నారు. ఆందోళనతో చిత్తవుతున్నారు. వీటి వల్ల వచ్చే శారీరక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. మరి ఈ ఒత్తిడిని తగ్గించుకుంటే చాలా అనారోగ్య సమస్యల నుంచి బయట పడొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకు ఇంట్లో మనంతట మనం పాటించగల చిన్న చిట్కాలను చెబుతున్నారు. అవేంటో చూద్దామా..? గోరు వెచ్చని లేదా చల్లని నీటితో స్నానం చేయడం చాలా మంచిది. శరీరంలో ఎక్కడైనా నొప్పులుగా అనిపిస్తే చిన్నగా మసాజ్ చేసుకోవడం, కండరాలన్నీ సాగేలా ఒళ్లు విరుచుకోవడం లాంటి పనుల వల్ల ఒత్తిడి తగ్గుతుంది. బాత్ రూమ్‌లో కూనిరాగాలు తీయడం లేదా ఏదైనా లైట్ మ్యూజిక్‌ని పెట్టుకుని, గోరువెచ్చని నీటితో శరీరం, మనస్సు తేలిక పడేంతవరకు టబ్ బాత్ చేయాలి. అందుకు మంచి సువాసన ఉన్నసహజమైన సబ్బును ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. డ్యాన్స్ నృత్యం చేయడం అనేది ఒత్తిడి నివారిణిలా పని చేస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. మంచి సంగీతాన్ని పెట్టుకుని దానికి తగినట్లుగా డ్యాన్స్ చేయవచ్చు. ఎవరైనా ఉన్నప్పుడు చేయడం మొహమాటం అయితే ఎవరూ లేనప్పుడు ఆ పని చేయండి. దీనివల్ల మనసుకు ఆనందం కలుగుతుంది. ఒత్తిడి హార్మోన్ల స్థాయి తగ్గుతుంది. ఇష్టమైన వారితో ప్రేమగా... ఎక్కువ ఒత్తిడిలో ఉన్నప్పుడుఇష్టమైన వారితో ప్రేమగా...సంతోషంగా గడిపేందుకు ప్రయత్నించండి. అందువల్ల శరీరంలో డోపమైన్ లాంటి హ్యాపీ హార్మోన్ లు విడుదలవుతాయి. దీంతో మీరు ఒత్తిడి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. బబుల్ ర్యాప్‌లను పగలగొట్టడం... బబుల్ ర్యాప్ కవర్లను చూడగానే అంతా వాటిని పగలగొట్టాలని ఉవ్విళ్లూరతారు. అందుకు కారణాలు లేక΄ోలేదు. అలా వాటిని పేల్చడం వల్ల మనలో ఓ రకమైన ఆనందం కలుగుతుంది. ఒత్తిడి దూరమవుతుంది. అందువల్లనే మనం వాటిని పేల్చేందుకు ఇష్టపడుతుంటాం. మంచి పుస్తకాలు చదవడం... మంచి పుస్తకాలు, పేపర్లు చదవడం ద్వారా కూడా ఒత్తిడి నుంచి బయటపడవచ్చు. ఒత్తిడిగా అనిపించినప్పుడు మీకు నచ్చిన పుస్తకం తీసి చదవండి. వెంటనే తగ్గుముఖం పడుతుంది ఆ ఒత్తిడి. అలాగే రోజూ దినపత్రికలను చదవడం కూడా ఒత్తిడి నివారణలో ఒక భాగం. దినపత్రికలు చదవడమనగానే నేరవార్తలు, హత్యావార్తలు కాదు. మనసుకు కాస్తంత ఆహ్లాదం కలిగించే వార్తలు చదవడం మేలు. ఆలయ సందర్శనం... మీ మతాన్ని అనుసరించి మీరు ప్రార్థనామందిరాలను సందర్శించడం మంచిది. రోజూ కాసేపు పూజామందిరంలో గడపడం వల్ల మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. అలాగని దేనినీ అతిగా చేయరాదు. గంటలు గంటలు పూజలు చేస్తూ గడపడం కూడా మంచిది కాదు. క్రమం తప్పకుండా ఆలయానికి లేదా మసీద్‌కు లేదా చర్చికి వెళ్లడం వల్ల ఒత్తిడి దూరం అవుతుంది. మీరు ఒత్తిడిలో ఉన్నారు అనుకున్నప్పుడువీటిలో మీకు వీలైనవాటిని పాటించి చూడండి. అన్నింటికన్నా ముఖ్యం ఒత్తిడి వచ్చాక బాధ పడేకంటే ఒత్తిడికి గురికాకుండా చూసుకోవడం చాలా ఉత్తమం. అదేవిధంగా ఒత్తిడి ఎందువల్ల వస్తుందో తెలుసుకుంటే నివారించుకోవడం సులభం కాబట్టి. ముందుగా మీ పనులను ప్రశాంతగా పూర్తి చేయడం ఆరంభించండి. ధ్యానం... ఒత్తిడి నుంచి బయట పడటానికి ధ్యానం అద్భుతమైన మార్గం అని చాలా అధ్యయనాల్లో తేలింది. శ్వాస మీద ధ్యాస పెట్టి కేవలం రెండు నిమిషాలు కళ్లు మూసుకున్నా సరే అది మీ శరీరంలో స్ట్రెస్ హార్మోన్ స్థాయుల్ని తగ్గిస్తుంది. -
ఒత్తిడి కూడా మంచిదే!.. స్ట్రెస్ పెరిగిపోయిందా? ఇలా చేయండి
ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. అందుకు కారణాలు లేకపోలేదు. జీవనశైలిలో మార్పులు, తినే ఆహారం, మానసిక ఆందోళన, ఆర్థిక ఇబ్బందులు.. తదితర కారణాల వల్ల డిప్రెషన్‌కు లోనవుతున్నారు. ఇలాగే ఒత్తిడిలోనే ఎక్కువ కాలం గడిపేవారికి భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ఎదురయ్యే ఒత్తిడిని అదుపులో ఉంచుకోకపోతే ఇతర అనారోగ్యాలూ చుట్టుముట్టే ప్రమాదం ఉంది. మరి మానసిక ఒత్తిళ్ల నుంచి గట్టెక్కాలంటే ఏం చేయాలి? అన్నది ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డా. నవీన్ నడిమింటి మాటల్లోనే తెలుసుకుందాం. మనసుకు కష్టం కలిగినప్పుడు మెదడు ఎంతో ఒత్తిడికి గురవుతుంది. తక్కువ స్థాయిలో ఉండే ఒత్తిడి ఉద్రిక్తత.. కొన్ని సందర్భాల్లో లాభదాయకంగానే ఉంటుంది. ఉదాహరణకు.. ఒక ప్రాజెక్ట్ లేదా ఏదైనా పనిని నిర్వహిస్తున్నప్పుడు తక్కువ స్థాయిలో కలిగే ఒత్తిడి మనం చేసే పనిని మరింత కేంద్రీకరించి పనిని మరింత, శక్తివంతంగా, ఉత్సాహవంతంగా పూర్తి చేసేటట్లు చేస్తుంది. ముఖ్యంగా ఒత్తిడిలో రెండు రకాలున్నాయి. వాటిలో స్ట్రెస్ (‘అనుకూలవంతమైన ప్రోత్సాహకరమైన ఒత్తిడి’)డిస్ట్రెస్ ‘ప్రతికూలమైన, నిరుత్సాహకరమైన ఒత్తిడి‘( ఛాలెంజ్ మరియు అదనపు బరువు) ఒత్తిడిని తట్టకునేందుకు చాలామంది పొగత్రాగడం, మద్యం సేవించడం, అతిగా తినడం, ఎక్కువ గంటలు నిద్రపోవడం, ఇతరులపై విరుచుకుపడటం, కోపంతో అరిచేయడం వంటివి చేస్తుంటారు. కానీ వీటివల్ల మంచి జరగడం పక్కపపెడితే ఎక్కువగా చెడు జరుగుతుంది. అందుకే స్ట్రెస్‌ను అదుపులో ఉంచుకునేందుకు డా. నవీన్ నడిమింటి సలహాలు మనసు భారంగా, ఒత్తిడిగా అనిపిస్తే కాసేపు వాకింగ్‌కు వెళ్లండి ప్రకృతి అందాలను చూస్తూ కాసేపు కాలక్షేపం చేయండి ఒక మంచి స్నేహితుడితో మాట్లాడండి. రిలీఫ్‌గా అనిపిస్తుంది వ్యాయామానికి మించిన పని ఇంకొకటి ఉండదు. జర్నల్ రాయడానికి ప్రయత్నించండి. వెచ్చటి కప్పు కాఫీ, టీ తాగండి. సువాసన వెదజల్లే ఓ కొవ్వొత్తిని వెలిగించండి. మీ పెంపుడు జంతువులతో కాసేపు కాలక్షేపం చేయండి మంచి పుస్తకాన్ని చదవడం అలవాటు చేసుకోండి. ఫన్నీ మూవీస్ చూడండి. గార్డెనింగ్ అలవాటు చేసుకోండి ఒత్తిడిని దూరం చేసుకోవడానికి ఏం చేయాలన్నది మీ ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. తీరిక వేళల్లో మీకు సంతోషాన్ని పనులు చేయండి. పియానో వాయించడమో, పాటలు పాడటమో..ఇలా ఏదైనా సరే మీకు నచ్చింది చేయండి. ఇవి చాలా అవసరం... ఆహారాన్ని మెరుగుపరచే గ్రూప్ బి, విటమిన్లు, మెగ్నీషియం చాలా ముఖ్యమైనవి. ఒత్తిడి నుంచి కాపాడుకోవడానికి విటమిన్-సి చాలా అవసరమైనది. విటమిన్ డి శరీర పోషణకు, మెదడుకు సరిపోయినంత స్ధాయిలో ఖనిజాలను తీసుకోవడానికి సహాయపడుతుంది. ప్రాసెస్డ్ ఫుడ్ ఐటెమ్స్, అధికంగా ఉప్పు ఉండే పదార్థాలకు దూరంగా ఉంటే మంచిది. డా. నవీన్ నడిమింటి, ప్రముఖ ఆయుర్వేద నిపుణులు -
‘ఐటీ’కి మెటబాలిక్ సిండ్రోమ్!
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో సగం మందిలో మెటబాలిక్ సిండ్రోమ్ సమస్య కనిపిస్తోందని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) పేర్కొంది. ఉద్యోగ హడావుడిలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ.. మధుమేహం, తీవ్ర రక్తపోటు, గుండె జబ్బుల బారినపడుతున్నారని తమ అధ్యయనంలో తేలిందని వెల్లడించింది. ఐటీ కంపెనీలు ఉద్యోగుల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని.. సరైన పోషకాహారం తీసుకునేలా చూడటంతోపాటు వ్యాయామాలు చేయించడం, ఒత్తిడిని తగ్గించే కార్యక్రమాలను చేపట్టడం మంచిదని సూచించింది. –సాక్షి హైదరాబాద్ ఐసీఎంఆర్ నేతృత్వంలో.. భారతీయ వైద్య పరిశోధన సమాఖ్య (ఐసీఎంఆర్) నేతృత్వంలో ఎన్ఐఎన్ ఈ అధ్యయనం నిర్వహించింది. దేశంలో ప్రముఖ ఐటీ హబ్ అయిన హైదరాబాద్‌లో పెద్ద, మధ్య తరహా, చిన్న ఐటీ కంపెనీల్లో విస్తృత స్థాయిలో అధ్యయనం నిర్వహించింది. ఉద్యోగాల తీరుతెన్నులు, వాటిలో పనిచేస్తున్నవారి ఆహార అలవాట్లు, జీవనశైలి, వారి ఆరోగ్యం వంటి వివరాలను సేకరించి విశ్లేషించింది. వారిలో 46శాతం మందికిపైగా మెటబాలిక్ సిండ్రోమ్ బారినపడినట్టు గుర్తించింది. చాలా మందిలో హెచ్‌డీఎల్ (మంచి) కొవ్వులు తక్కువగా ఉండటం, రక్తపోటు, నడుము చుట్టుకొలత వంటివి ఎక్కువగా ఉండటాన్ని గమనించింది. ఐటీ ఉద్యోగులు రోజులో కనీసం ఎనిమిది గంటల పాటు కూర్చునే ఉంటున్నారని.. 22 శాతం మంది మాత్రమే వారానికి కనీసం 150 నిమిషాల శారీరక వ్యాయామం చేయాలన్న సూత్రాన్ని పాటిస్తున్నారని తేల్చింది. వ్యాయామం లేకపోవడం, తీవ్ర ఒత్తిడి, పోషకాలు లేని జంక్ ఫుడ్ తీసుకోవడం వంటివి శరీరంలో ఇన్ఫ్లమేషన్కు కారణం అవుతున్నాయని.. ఇది కాలం గడిచిన కొద్దీ మెటబాలిక్ సిండ్రోమ్‌కు దారితీస్తోందని ఎన్ఐఎన్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.హేమలత తెలిపారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న ఉద్యోగుల సగటు వయసు 30 ఏళ్లు మాత్రమేనని.. చిన్నవయసులోనే సమస్యల బారినపడుతున్నారని వివరించారు. ఏమిటీ మెటబాలిక్ సిండ్రోమ్! మన శరీరంలో క్రమంకొద్దీ జరగాల్సిన జీవక్రియల్లో తేడాలు రావడం, లోపాలు చోటు చేసుకోవడమే మెటబాలిక్ సిండ్రోమ్. ఊబకాయం, ట్రైగ్లిజరైడ్స్, హెచ్‌డీఎల్, రక్తపోటు, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు.. అనే ఐదు ప్రధాన రిస్క్ ఫ్యాక్టర్లను బట్టి దీన్ని నిర్ధారిస్తారు. నడుము చుట్టుకొలత, అధిక బరువు ఊబకాయాన్ని సూచిస్తాయి. వైద్య నిపుణుల సూచనల ప్రకారం.. నడుము చుట్టుకొలత పురుషుల్లోనైతే 90 సెంటీమీటర్లకన్నా, మహిళలకు 80 సెంటీమీటర్లకన్నా ఎక్కువగా ఉండటం ఊబకాయానికి సూచిక. ఇక రక్తంలో ట్రైగ్లిజరైడ్లు 150ఎంజీ/డెసిలీటర్ కంటే ఎక్కువ ఉండటం అనారోగ్యకరం. ఆరోగ్యకరమైన కొవ్వులైన హెచ్‌డీఎల్ (హైడెన్సిటీ లిపిడ్స్) పురుషుల్లోనైతే 40 ఎంజీ/డెసిలీటర్ కంటే, మహిళల్లో 50 ఎంజీ/డెసిలీటర్ కంటే ఎక్కువగా ఉండాలి. రక్తపోటు 135/85 కన్నా తక్కువగా ఉండాలి. కనీసం ఎనిమిది గంటలకన్నా ఎక్కువ సమయం ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉన్నాక రక్తంలో గ్లూకోజు స్థాయిలు 100 ఎంజీ/డెసిలీటర్ కన్నా తక్కువగా ఉండాలి. ఈ ఐదింటిలో ఏ మూడు వ్యతిరేకంగా ఉన్నా.. సదరు వ్యక్తులు మెటబాలిక్ సిండ్రోమ్ సమస్యను ఎదుర్కొంటున్నట్టేనని వైద్యులు చెప్తున్నారు. జీవన శైలిలో మార్పులే పరిష్కారం మెటబాలిక్ సిండ్రోమ్‌కు గురి కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం పెద్ద కష్టమేమీ కాదని నిపుణులు చెప్తున్నారు. తరచూ బయటి ఆహారం (ఫాస్ట్‌ఫుడ్, జంక్‌ఫుడ్) తినడం తగ్గించుకోవాలని.. కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలని, వీలైనంత వరకూ కాయగూరలు, పండ్లు తినాలని సూచిస్తున్నారు. ఐటీ ఉద్యోగులు చాలామంది సమయానికి ఆహారం తీసుకోవడం లేదని వెల్లడైందని అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.సుబ్బారావు గవరవరపు తెలిపారు. దీనికితోడు ఒత్తిడికి లోనవుతుండటం మెటబాలిక్ సిండ్రోమ్‌కు గురయ్యేందుకు దారితీస్తోందని వివరించారు. అధ్యయనంలో పాల్గొన్న వారి సంఖ్య తక్కువే అయినా.. సగటున అందరు ఉద్యోగుల జీవనశైలి, ఆహార అలవాట్లు, ఒత్తిడి దాదాపు ఒకేలా ఉన్నట్టు గుర్తించామని వెల్లడించారు. ఈ సమస్య నుంచి ఐటీ ఉద్యోగులు బయటపడేందుకు తీసుకోవాల్సిన చర్యలనివేదికను ఎన్ఐఎన్ శాస్త్రవేత్త భానుప్రకాశ్‌రెడ్డితో కలసి సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. న్యూట్రియంట్స్’ఆన్లైన్ జర్నల్‌లో ఈ అధ్యయనం వివరాలు ప్రచురితమయ్యాయి. -
ఖుదీరామ్ కష్టాలు
భారతదేశ స్వాతంత్య్ర సమరయోధుల్లో అతి చిన్న వయసులో అమరులైన ఖుదీరామ్ బోస్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘ఖుదీరామ్ బోస్’. రాకేష్ జాగర్లమూడి టైటిల్ రోల్లో విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహించారు. జాగర్లమూడి పార్వతి సమర్పణలో రజితా విజయ్ జాగర్లమూడి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ, హిందీ భాషల్లో రిలీజ్ చేయాలనుకున్నారు. ఇటీవల గోవాలో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్లో, అలాగే గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులకు ఈ సినిమాని ప్రదర్శించగా ప్రశంసించారని యూనిట్ పేర్కొంది. అయితే కోట్లాది రూపాయలు ఖర్చు చేసి తీసిన ఈ సినిమా విడుదలకు నోచుకోక, ఆర్థిక సమస్యల ఒత్తిడితో విజయ్ జాగర్లమూడి గుండె పొటుకు గురై, చికిత్స తీసుకుంటున్నారని చిత్ర యూనిట్ పేర్కొంది. -
విలయం.. యువ హృదయం!
విజయవాడ క్రీస్తురాజుపురానికి చెందిన 40 ఏళ్ల యువకుడు వ్యాపారం చేస్తుంటారు. ఇటీవల ఓ రోజు ఉదయం ఛాతిలో నొప్పి అని చెప్పి కుప్పకూలాడు. ఆస్పత్రికి తీసుకెళ్లేసరికే ప్రాణాలు విడిచాడు. తీవ్రమైన గుండెనొప్పి కారణంగా ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు తేల్చారు. విజయవాడ వన్‌టౌన్ ప్రాంతానికి చెందిన 31 ఏళ్ల యువకుడు ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. ఇటీవల ఓ రోజు అర్ధరాత్రి ఛాతిలో నొప్పి అని కుటుంబ సభ్యులకు చెప్పాడు. వారు ఆస్పత్రికి తీసుకెళ్లేలోగా ప్రాణాలు కోల్పోయాడు. లబ్బీపేట(విజయవాడతూర్పు): ఇటీవల కాలంలో యువతలో గుండె పోటు మరణాలు ఎక్కువగా సంభవించడం వైద్యులను సైతం ఆందోళనకు గురిచేస్తోంది. మరీముఖ్యంగా 30 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు వారికి గుండెపోటు మరణాలు పెరిగిపోయాయి. మారుతున్న జీవన శైలి, దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్న తీవ్రౖమెన ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, పెరిగిపోతున్న కాలుష్యం కారణంగానే చిన్న వయస్సులో గుండె జబ్బుల మరణాలు సంభవిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. వీటిని ని యంత్రించేందుకు ప్రజల్లో విస్తృత అవగాహన కలిగించాల్సిన అవసరముందంటున్నారు. అడ్వాన్స్డ్ పరికరాలను ఉపయోగించుకుని గుండె సమస్యలను ముందుగానే గుర్తించవచ్చని వైద్యులు చెబుతున్నారు. అందుకే ఆకస్మిక మరణాలు గుండె ఆగిపోవడం వల్ల సంభవిస్తున్న మరణా లకు వైద్యులు పలు కారణాలు చెబుతున్నారు. మధుమేహం, రక్తపోటు. ధూమపానం, మద్యపానం,ఊబకాయం, వ్యాయామం లేకపోవడం పోస్టు కోవిడ్ గుండె రక్తనాళాల్లో పూడికలు, గుండె కండరాలు ఉబ్బడం(మయోకార్డిటైస్) పల్మనరీ ఎంబోలిజం(గుండె నుంచి ఊపిరి తిత్తులకు వచ్చే రక్తనాళాల్లో పూడికలు) ముందు జాగ్రత్తే మందు గుండెను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరూ పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. శ్రమతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకోవడం స్వచ్ఛమైన ఆహారాన్ని తీసుకోవడం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఒత్తిళ్లకు దూరంగా ఉండటం నీరు ఎక్కువగా తీసుకోవడం యువతలో అధికమవుతున్నాయ్.. గుండెపోటుకు గురవుతున్న యువతను ఇటీవల ఎక్కువగా చూస్తున్నాం. ఇలాంటి వారిలో 80 శాతం మందికి గుండెపోటు రావడానికి పొగతాగడం, మద్యం తీసుకోవడం, ఒత్తిడే కారణాలు. రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడిన వారిని గుర్తించి స్టెంట్స్ వేస్తున్నాం. పోస్టు కోవిడ్ వారిలో కూడా గుండె సమస్యలు తలెత్తుతున్నాయి. రక్తపోటు, మధుమేహం ఉన్న వారు ముందుగా గుండె పరీక్షలు చేయించుకోవాలి. ఆరోగ్యకర జీవనశైలిని అలవర్చుకోవాలి. నిత్యం వ్యాయామం చేయాలి. ఒత్తిళ్లను అధిగమించేందుకు యోగా, మెడిటేషన్‌ను అలవర్చుకోవాలి. – డాక్టర్ బొర్రా విజయ్‌చైతన్య, కార్డియాలజిస్ట్ -
ఔరా అమ్మకచెల్ల... భాంగ్రా స్టెప్పులు వేయడం ఇల్లా!
ఆఫీసులో ఉద్యోగులు ఏం చేస్తారు?’ అనే ప్రశ్నకు...‘ఆఫీసు వర్క్ చేస్తారు’ అని మాత్రమే ఊరుకోనక్కర్లేదు. ‘భాంగ్రా డ్యాన్స్ కూడా చేస్తారు’ అని భేషుగ్గా చెప్పవచ్చు. ఎందుకంటే ఇదిప్పుడు ఒక ట్రెండ్‌గా మారనుంది. విషయంలోకి వస్తే... డల్ వర్క్‌డేకు ఒక కార్పొరేట్ కంపెనీ ఫన్ ట్విస్ట్ ఇచ్చింది.‘పనిచేసింది చాలు. ఇప్పుడిక భాంగ్రా నేర్చుకోండి’ అంటూ ఫిజికల్ ఇన్స్ట్రక్టర్, డ్యాన్సర్ సాహిల్శర్మను ఆఫీసుకు తీసుకువచ్చింది. ‘లెట్స్ డ్యాన్స్’ అంటూ శర్మ భాంగ్రా స్టెప్పులు స్టార్ట్ చేయడంతో ఉద్యోగులు ఎవరి డెస్క్‌ల దగ్గర వారు అతడిని అనుసరించి డ్యాన్స్ చేయడం మొదలు పెట్టారు. ‘ఐ వాంట్ యాన్ ఆఫీస్ లైక్ దిస్’ కాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ వీడియో 2.9 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. ‘గుడ్ ఐడియా. 9 టు 5 జాబ్ వల్ల ఉద్యోగులు ఫిజికల్ యాక్టివిటీకి దూరం అవుతున్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల వ్యాయామం చేసినట్లుగా ఉంటుంది. హుషారు వస్తుంది’ అని ఒక యూజర్ స్పందించాడు. View this post on Instagram A post shared by Sahil sharma (@sahil_sharma0007) (చదవండి: సిరియా భూకంప శిథిలాల్లో బొడ్డుతాడుతో దొరికిన మిరాకిల్ బేబి ఎక్కడుందో తెలుసా!) -
అమెరికా వీధుల్లో తిరుగుతూ.. ఆకలితో అలమటిస్తూ..
సాక్షి, హైదరాబాద్: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన యువతి. రెండేళ్లుగా బాగానే ఉన్నా ఇటీవల తీవ్రంగా మానసిక ఒత్తిడికి లోనైంది. ఆస్పత్రిలో చేర్చినా భయాందోళనతో బయటికి వెళ్లిపోయింది. తన పేరేమిటో కూడా సరిగా చెప్పలేని స్థితికి చేరుకుంది. చివరికి ఆకలితో అలమటిస్తూ అక్కడి వీధుల్లో తిరుగుతోంది. హైదరాబాద్‌లోని మౌలాలి ప్రాంతానికి చెందిన సయ్యదా లులూ మిన్హాజ్ జైదీ దీన గాథ. ఆమెను గమనించిన ఓ హైదరాబాదీ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఆమె ఎవరన్నది తెలిసింది. ఆమెను హైదరాబాద్‌కు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఆకలితో అలమటిస్తూ.. లులూ జైదీ 2021 ఆగస్టులో ఎంఎస్ ఇంజనీరింగ్ చేసేందుకు అమెరికాలోని డెట్రాయిట్కు వెళ్లింది. అక్కడి ట్రినీ యూనివర్సిటీలో చదువుతోంది. తరచూ తల్లితో ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. కానీ కొన్ని నెలల కింద మానసిక ఒత్తిడికి లోనైంది. నాలుగు నెలల నుంచి తల్లికి ఫోన్ చేయడం కూడా మానేసింది. ఆమె ప్రవర్తనలో విపరీత మార్పును చూసిన తోటి విద్యార్థులు తల్లికి సమాచారం ఇచ్చారు. ఆమె ఆరోగ్యం బాగా దెబ్బతినడంతో స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. లులూ జైదీ తీవ్ర మానసిక ఒత్తిడిలో కూరుకుపోయినట్టు గుర్తించిన వైద్యులు చికిత్స ప్రారంభించారు. కానీ ఆమె ఆస్పత్రిలోంచి వెళ్లిపోయింది. వీధుల్లో తిరుగుతూ, ఎవరేమైనా పెడితే తింటూ గడుపుతోంది. ఈ క్రమంలో షికాగో నగరానికి చేరుకుంది. అక్కడ ఓ వీధిలో ఆకలితో ఆలమటిస్తున్న లులూ జైదీని అక్కడే ఉంటున్న హైదరాబాదీ గమనించి మాట్లాడారు. ఆమె పేరు కూడా చెప్పలేని పరిస్థితి, ఆకలితో అలమటిస్తున్న తీరును వీడియో తీసి సోషల్ మీడియాలో హైదరాబాద్ గ్రూప్‌లలో షేర్ చేశారు. అమెరికాలోని హైదరాబాదీలు, తోటి విద్యార్థులు ఇది చూసి.. లులూ జైదీని షికాగోలోని సురక్షిత ప్రాంతానికి తరలించి, వైద్యం అందిస్తున్నారు. హైదరాబాద్‌కు తిరిగి తీసుకొచ్చే ప్రయత్నాలు లులూ జైదీ దుస్థితి గురించి తెలిసిన ఆమె తల్లి.. తన కుమార్తెను కాపాడి, తిరిగి హైదరాబాద్‌కు తీసుకురావాలంటూ విదేశాంగ మంత్రి జైశంకర్‌కు లేఖ రాశారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఈ వీడియో వైరల్‌గా మారింది. ఆమెను రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలంటూ విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. దీనిపై స్పందించిన జైశంకర్.. ఆమెను తిరిగి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో షికాగోలోని భారత కాన్సులేట్ జనరల్.. లులూ జైదీ ఎవరి వద్ద ఉందో తమతో టచ్‌లోకి రావాలని విజ్ఞప్తి చేశారు. -
మాకిచ్చే జీతానికి ఈ మాత్రం పని చేస్తే చాల్లే..!: సర్వే
ఆఫీసులో ఎంత కష్టపడ్డా... శాలరీ పెరిగేది మాత్రం అత్తెసరుగానే.. ఎంత గొడ్డు చాకిరీ చేసినా... లభించే గుర్తింపు అంతంతే.. వేతనంతో పాటు ఇంకేదైనా అలవెన్స్ రూపంలో నగదు ఇస్తే బాగుంటుంది.. రోజూ ఆఫీసుకు రావాలా? వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువ రోజులుంటే బాగుండు.. మీకు ఈ మధ్యకాలంలో ఇలాగే అనిపిస్తోందా? పైన చెప్పుకున్న నాలుగు అంశాల్లో ఏదో ఒకటి మీకు వర్తిస్తుందా? అలాగైతే మీరు ఒంటరి వారేమీ కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగులు ఇదే విధమైన భావనలతో ఉన్నారు. కోవిడ్ భయం ముగిసి అన్నిరకాల ఉద్యోగులు మళ్లీ పూర్తిస్థాయిలో అఫీసులకు వెళ్లాల్సి వస్తున్న ఈ సమయంలో వారి మనోభావాలు తెలుసుకునేందుకు అంతర్జాతీయ సర్వే సంస్థ ‘గాలప్’ఓ అధ్యయనం నిర్వహించింది. (వైట్‌హౌస్ స్టేట్ డిన్నర్: నీతా అంబానీ చీరల విశేషాలేంటో తెలుసా?) కంపెనీలు, ఉద్యోగుల మధ్య సంబంధాలేమైనా బలపడ్డాయా? ఉద్యోగుల సంక్షేమానికి ఏం చేస్తున్నారు? పనిచేసే చోట ఒత్తిడి ఏ స్థాయిలో ఉంది? వంటి అనేక అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది. వర్క్ ఫ్రమ్ హోమ్ వదిలిపెట్టి ఆఫీసులకు వస్తున్నవారిలో వివిధ కారణాలతో నెలకొన్న ఆందోళన, ఒత్తిడి తగ్గించడంపై కంపెనీలు దృష్టి పెట్టాయని తేల్చింది. ఉద్యోగుల్లో కోవిడ్ భయాలు ఇంకా కొనసాగుతున్న సమయంలో కంపెనీలు వారిని ఆఫీసులకు రమ్మనడం మాత్రమే కాకుండా, వారి యోగక్షేమాలు కనుక్కునేందుకు, అవసరమైన సాయం చేసేందుకూ ముందుకొచ్చాయని గాలప్ అధ్యయనం పేర్కొంది. (టీసీఎస్‌లో రూ.100 కోట్ల స్కాం: ఇదిగో క్లారిటీ ) ఉద్యోగుల బాగోగులపై కంపెనీల దృష్టి మూడేళ్ల క్రితం 2020 జనవరిలో మొదలైన కోవిడ్ మహమ్మారి రెండేళ్ల పాటు ప్రపంచాన్ని అట్టుడికించిందంటే అతిశయోక్తి కాదు. ఆఫీసులు మాత్రమే కాదు కరోనాతో సామాన్యుడి జీవితం దాదాపుగా స్తంభించిపోయింది. ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు పరిమితమయ్యారు. అయితే టీకాలు వేయడం మొదలైన తరువాత 2021 ఆఖరుకు పరిస్థితిలో కొంత మెరుగుదల కనిపించి, 2022 మార్చికల్లా పరిస్థితులు సాధారణమయ్యాయి. ఇదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ తగ్గించే ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే ఉద్యోగుల్లో ఆందోళన మునుపెన్నడూ లేనంత ఉచ్ఛస్థితిలో ఉందని, కోవిడ్ భయాలు తొలగినా ద్రవ్యోల్బణం, అర్థ వ్యవస్థ మందగమనం, భవిష్యత్తుపై చింత వంటి అంశాలు ఇందుకు కారణమయ్యాయని గాలప్ అధ్యయనంలో తేలింది. ఈ నేపథ్యంలోనే కంపెనీలు గత ఏడాదిలో ఉద్యోగుల ఆందోళనను, వారిలో ఒత్తిడిని తగ్గించేందుకు, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేందుకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చాయి. కంపెనీలు ఉద్యోగుల బాగోగులు చూసుకునే ప్రయత్నం చేయడం గత ఏడాది పతాక స్థాయిలో ఉన్నట్టు గాలప్ చెబుతోంది. 2009 నుంచి తాము ఈ ఎంప్లాయీ ఎంగేజ్మెంట్ సమాచారాన్ని నమోదు చేస్తున్నామని, 2022లో అది రికార్డు స్థాయిలో 23 శాతానికి చేరిందని తెలిపింది. కోవిడ్ ముందునాటి పరిస్థితితో పోలిస్తే భారత్ సహా దక్షిణాసియా దేశాల్లో ఉద్యోగుల బాగోగులు చూసుకునే అంశం 33 శాతానికి చేరింది. (ఉద్యోగులతో సంప్రదింపులు జరపడం ఆధారంగా ఈ అంచనాకొచ్చారు) (ఇటలీలో లగ్జరీ విల్లా: రూ.40 లక్షల అద్దె సంపాదన, ఎవరీ సూపర్‌స్టార్?) కొనసాగుతున్న క్వైట్.. లౌడ్ క్విట్టింగ్.. మీరెలా ఉన్నారని కంపెనీ తరచూ అడుగుతూంటే ఉద్యోగులు సంతోషంగా మరింత కష్టపడతారని అనుకుంటాం కానీ, గాలప్ సర్వే ఫలితాలు దీనికి భిన్నంగానే కనిపించాయి. ఎందుకంటే చాలామంది ఉద్యోగులు క్వైట్ క్విట్టింగ్... అంటే ఆఫీసుకు రావడం.. అప్పగించిన పనిని పూర్తి చేయడం. ఎప్పుడు టైమ్ అవుతుందా.. అని కాచుకు కూర్చొని ఇంటికెళ్లిపోవడం చేస్తున్నారని సర్వే తెలిపింది. వీరు తాము పనిచేస్తున కంపెనీతో ఎలాంటి మానసికమైన సంబంధాన్ని కూడా కలిగిలేరని తెలిపింది. నామ్ కే వాస్తే పని మాత్రం చేస్తున్నారు. అంతే. ఇలా క్వైట్ క్విట్టింగ్ చేస్తున్న ఉద్యోగులు ఎక్కువగా ఉండగా.. కొంతమంది లౌడ్ క్విట్టింగ్‌కు పాల్పడుతున్నారు. అంటే.. తరచూ గ్రూప్ లీడర్లు లేదా సెక్షన్ హెడ్లతో విభేదించడం, కంపెనీ ప్రయోజనాలకు భిన్నంగా పనిచేయడం చేస్తున్నారు. తమకు తగ్గ పని చేయనందుకు కంపెనీ పట్టించుకోవడం లేదని వీరు భావిస్తున్నారు. క్వైట్ క్విట్టర్లు సరిగా పనిచేస్తే.. క్వైట్ క్విట్టర్లు.. తమకు అప్పగించిన పనికి మించి వీసమెత్తు ఎక్కువ చేసేందుకు ఇష్టపడరు. మాకిచ్చే జీతానికి ఈ మాత్రం చేస్తే చాల్లే అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. దీనర్థం.. వారు మరింత ఎక్కువ ఉత్పాదకత సాధించగల సామర్థ్యం ఉన్నవారే. కానీ.. వేతనం, సౌకర్యాలు, నైతిక మద్దతు వంటి అనేక కారణాల వల్ల నిరాసక్తంగా వ్యవహరిస్తున్నారని ఈ సర్వే తేల్చింది. ఒకవేళ వీరు కూడా ఉత్సాహంగా పనిచేస్తే... అది ఉత్పాదకతపై ప్రభావం చూపుతుంది. గాలప్ అంచనాల ప్రకారం క్వైట్ క్విట్టర్లు మనసుపెట్టి పూర్తిస్థాయిలో పనిచేయకపోవడం వల్ల ఏటా దాదాపు 8.8 లక్షల కోట్ల డాలర్ల నష్టం జరుగుతోంది. ఇది ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిలో దాదాపుగా తొమ్మిది శాతం. ఒత్తిడి...పైపైకి! కోవిడ్ భయాలు తొలగిపోయినప్పటికీ గత ఏడాది ఉద్యోగులు విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొన్నారని గాలప్ సర్వే తెలిపింది. కోవిడ్ తీవ్రస్థాయిలో ఉన్నప్పటి మాదిరిగానే 2022లోనూ ఉద్యోగుల్లో సుమారు 44 శాతం మంది తాము తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నట్లు ఈ సర్వేలో తెలిపారు. చైనా, అమెరికా, కెనడాల్లో ఇది మరింత తీవ్రంగా ఉన్నట్లు స్పష్టమైంది. తూర్పు ఆసియా ప్రాంతంలో ఆఫీసులకు దూరంగా ఉంటూ పనిచేస్తున్న వారు, యువకులు 60 నుంచి 61 శాతం మంది రోజూ ఒత్తిడికి గురైనట్లు సర్వే వివరించింది. ఈ ఒత్తిడి పనికి సంబంధించింది మాత్రమే కాకుండా.. కుటుంబ ఆరోగ్య సమస్యలు, ద్రవ్యోల్బణం వంటి వాటివల్ల కూడా కావచ్చునని అంచనా. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే. ఉద్యోగుల యోగక్షేమాలు కనుక్కునేందుకు ప్రయత్నించిన కంపెనీల్లో ఈ ఒత్తిడి తక్కువగా ఉండటం!. ఉద్యోగులకు స్వేచ్ఛ ఇవ్వడమే మంచిది.. కోవిడ్ తదనంతర పరిస్థితుల్లో ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ మేలా? లేక ఆఫీసుకు రావాలా? ఈ రెండూ కాకుండా హైబ్రిడ్ పద్ధతుల్లో పనిచేయించుకోవాలా? అన్న అంశాలపై ఇప్పటికే చర్చ చాలానే జరిగింది కానీ.. ఈ విషయాల్లో ఉద్యోగులకు స్వేచ్ఛనివ్వడం అన్నింటి కంటే మేలైన పద్ధతని గాలప్ చెబుతోంది. అంతేకాదు... తరచూ మాట్లాడుతుండటం, వారికి అవసరమైన పనులు సులువుగా చేసి పెట్టగలగడం వంటివి ఉద్యోగులకు కంపెనీపై ఉన్న అభిప్రాయాన్ని తీవ్రంగా ప్రభావితం చేయగలవని ఈ సర్వే తెలిపింది. పనిచేసే చోటుకు కాకుండా... పరిస్థితులు, వాతావరణానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం ద్వారా ఉద్యోగుల్లో ఒత్తిడిని తగ్గించవచ్చునని గాలప్ సూచిస్తోంది. మెరుగైన ఉద్యోగానికి మంచి సమయం 2022లో కొత్త ఉద్యోగం చూసుకునేందుకు లేదా ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి మెరుగైంది చూసుకునేందుకు మంచి సమయం ఇదే అని గాలప్ సర్వేలో పాల్గొన్న వారిలో 53 శాతం మంది అభిప్రాయ పడ్డారు. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది గణనీయమైన వృద్ధి కాగా.. 2019 నాటి స్థాయికి దగ్గరగా ఉండటం గమనార్హం. అయితే అమెరికా, కెనడాల్లో మాత్రం ఈ పరిస్థితి లేదని సర్వే తెలిపింది. చేసే ఉద్యోగం పట్ల అసంతృప్తిగా ఉన్న వారు స్వేచ్ఛగా ఉద్యోగాలు వదులుకునే పరిస్థితి 2022లో కనిపించిందని, ఇది కాస్తా ఉద్యోగాల లభ్యతను అధికం చేసిందని గాలప్ విశ్లేషించింది. ఆసక్తికరంగా... సర్వే చేసిన ఉద్యోగుల్లో యాభై శాతం మంది ఉద్యోగం మానేసే ఆలోచన చేశారు. కంపెనీలు ఉద్యోగులను కోల్పోకూడదని అనుకుంటే వారి బాగోగులు మరింత మెరుగ్గా చూసుకోవాల్సిన అవసరముందని గాలప్ తెలిపింది. ఇలా చేసిన కంపెనీల్లో ఉద్యోగం మానేసే ఆలోచన చేసిన వారు గణనీయంగా తక్కువగా ఉండటాన్ని ఇందుకు సాక్ష్యంగా చూపుతోంది. సమస్య వేతనం ఒక్కటే కాదు... ఒత్తిడి, పనిచేసే వాతావరణం లేకపోవడం వంటి అనేక కారణాలతో ఉద్యోగాలు మానేయాలని అనుకున్న వారికి గాలప్ ఒక ప్రశ్న వేసింది. ‘‘పరిస్థితులు మెరుగవ్వాలంటే మీ ఆఫీసులో లేదా మీ కంపెనీలో ఏ చర్యలు తీసుకోవాలి?’’అన్న ప్రశ్నకు వచ్చిన సమాధానాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. దాదాపు 85 శాతం మంది కేవలం వేతనాలు, ఆర్థిక లాభాలు కాకుండా.. వర్క్/లైఫ్ బ్యాలెన్స్, ఎంగేజ్మెంట్ లేదా ఆఫీసు కల్చర్ వంటి విషయాలను ప్రస్తావించారు. మిగిలిన 15 శాతం మంది సమాధానాలు ఏ కోవకూ చెందనివి కావడం గమనార్హం. ఎంగేజ్మెంట్ లేదా ఆఫీస్ కల్చర్ వర్గంలో మేనేజర్లు మరీ కఠినంగా ఉండరాదని, స్వేచ్ఛగా మాట్లాడే అవకాశమివ్వాలని కొందరు అభిప్రాయపడ్డారు. సొంతంగా పనిచేసుకునేందుకు అవకాశముండాలని, కొత్త విషయాలు నేర్చుకునే సౌకర్యం, తగిన గౌరవం లభించాలని, ప్రమోషన్లలో అందరికీ సమాన అవకాశాలుండాలని మరికొందరు భావించారు. దాదాపు 28 శాతం మంది వేతనాలు, ఇతర లాభాలను ప్రస్తావిస్తే.. ఆఫీసులో మంచి క్యాంటీన్/కేఫటేరియా ఉండాలని కొందరు, పిల్లల సంరక్షణ ఖర్చుల గురించి కొందరు, కంపెనీ ఫలితాలకు తగ్గట్టుగా ఉద్యోగులందరికీ సమానంగా ప్రతిఫలాలు దక్కాలని ఇంకొందరు అభిప్రాయపడ్డారు. ఆఫీసు వాళ్లు హెల్త్ క్లినిక్‌లు ఏర్పాటు చేయాలని, భోజన సమయం మరింత పెంచాలని పని మధ్యలో సేద తీరేందుకు తగిన ప్రాంతం లేదని ఇంకొందరు భావించారు. - కంచర్ల యాదగిరిరెడ్డి -
అశ్వాలు ఆందోళన తగ్గిస్తాయి
సాక్షి, హైదరాబాద్: ఆందోళన, ఒత్తిడి వంటి మానసిక సమస్యలతో బాధపడేవారు వాటి నుంచి బయట పడేందుకు వివిధ రకాల చికిత్సా పద్ధతులను పాటించే ఉంటారు. అలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఇప్పుడు మరో కొత్త తరహాలో సాంత్వన అందించవచ్చని సైకాలజిస్ట్ నిమ్రా మీర్జా చెబుతున్నారు. దాని పేరు ‘ఈక్వైన్ అసిస్టెడ్ థెరపీ’... అంటే గుర్రాలతో స్నేహం చేయడం, వాటితో సహవాసం వల్ల కూడా మానసిక సమస్యలకు చికిత్స అందించవచ్చు. యూరోపియన్ దేశాల్లో ఇప్పటికే దీనికి గుర్తింపు ఉండగా, మన దేశంలో బెంగళూరు, చెన్నైల్లో ఈ పద్ధతి వచ్చేసింది. ఇక తెలంగాణలో తొలిసారి ఈ థెరపీని నిమ్రా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. వృత్తిరీత్యా సైకాలజిస్ట్ అయిన నిమ్రా ఒక స్వచ్ఛంద సంస్థను నడిపిస్తున్నారు. ఈ థెరపీలోనూ లోతైన అధ్యయనం చేశారు. ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ (ఈఎఫ్‌టీ)లో కూడా పట్టా పొందిన ఆమె హార్స్ రైడర్‌గా పలు పోటీల్లో పాల్గొన్నారు. తొలిసారి రానున్న ‘ఈక్వైన్ అసిస్టెడ్ థెరపీ’పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం శనివారం నగరంలో జరిగింది. అజీజ్ నగర్‌లోని హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్ (హెచ్పీఆర్సీ)లో నిమ్రా మీర్జా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఔత్సాహికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హార్స్ రైడింగ్‌కు సంబంధించి ప్రాథమికాంశాలు, గుర్రాల మానసిక స్థితిని అర్థం చేసుకుంటూ మంచి రైడర్‌గా మారేందుకు అవసరమైన సూచనలతో పాటు థెరపీకి సంబంధించిన పలు అంశాలను నిమ్రా వివరించారు. ‘హార్స్ రైడింగ్ అంటే చాలా మంది ఒక ఆటగా మాత్రమే చూస్తారు. తక్కువ సమయంలో ఎక్కువ కేలరీలను కరిగించి శారీరకంగా మంచి ఫలితాలు అందించడం రైడింగ్‌లో సహజంగా కనిపించే ప్రయోజనం. కానీ రైడింగ్‌తో పాటు గుర్రాలను మచ్చిక చేసుకోవడం ద్వారా మానసిక సమస్యలకూ పరిష్కారం లభిస్తుంది. తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న వారిపై, కొన్ని రకాల మానసిక వ్యాధులతో బాధడుతున్నవారిపై కూడా ఈ థెరపీ బాగా పని చేస్తుంది. ఒకదశలో ఆత్మహత్య చేసుకోవాలని భావించిన వారు సైతం ఈ ఈక్వైన్ అసిస్టెడ్ థెరపీతో కోలుకున్న అనుభవం నా ముందుంది. కొత్తగా వచ్చిన ఈ చికిత్స ఎక్కువ మందికి చేరాలనేదే మా ప్రయత్నం’అని నిమ్రా వివరించారు. మున్ముందు కూడా హెచ్పీఆర్సీ కేంద్రంగా ఈ చికిత్స అందిస్తామని ఆమె వెల్లడించారు. -
బుర్ర వేడెక్కి, కాలిపోతుంది.. బర్న్ ఔట్ సిండ్రోమ్, మూన్‌లైటింగ్ అంటే?
విపరీతంగా ఆలోచించినప్పుడు బుర్ర వేడెక్కిపోయింది అంటుండటం సాధారణం. మరి అంతకంటే ఎక్కువ తీవ్రతతో కూడిన ఒత్తిడితో పని చేస్తుంటే దాన్ని కాలిపోవడంతో పోల్చవచ్చా అంటే అవునంటున్నారు వైద్యనిపుణులు. నియంత్రణ ఏమాత్రం లేకుండా, తీవ్ర ఒత్తిడితో పనిచేస్తే కలిగే దుష్ప్రభావాలను ‘‘బర్న్ ఔట్ సిండ్రోమ్’’గా చెబుతున్నారు. దీనికి ఒకింత తీవ్రత ఎక్కువగా ఉన్న మరో స్థితి కూడా ఉంది. దాని పేరే ‘మూన్‌లైటింగ్’ ఎఫెక్ట్. ఈ మాటలిప్పుడు మరింత ప్రాచుర్యంలోకి రావడానికి కారణం ఉంది. కోవిడ్ సమయంలో లాక్డౌన్ విధించడంతో కొన్ని వృత్తులవారు... ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఆమాటకొస్తే డాక్టర్లు, నర్సుల వంటి వారూ ఈ ‘బర్న్ ఔట్ సిండ్రోమ్’, ‘మూన్ లైట్ ఎఫెక్ట్’ బారిన పడ్డట్లుగా అధ్యయనాల్లో తేలడంతో వాటి ప్రభావమిప్పుడు చర్చనీయాంశమైంది. ‘బర్న్ ఔట్ సిండ్రోమ్’, ‘మూన్ లైట్ ఎఫెక్ట్’పై అవగాహన కల్పించే కథనమిది. లాక్డౌన్ లేని సమయంలో సాఫ్ట్వేర్ వృత్తుల వారు ఎవరి ఆఫీసుల్లో వారు.. వారి సంస్థకు చెందిన పనులు చేసుకునేవారు. లాక్డౌన్ విధించాక ఇంట్లోనే ఉండి పనిచేసుకోవచ్చనే వెసులుబాటు రావడంతో.. కొంతమంది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఒకటి కంటే ఎక్కువ సంస్థల నుంచి పనులు స్వీకరించి పనిచేయడం మొదలుపెట్టారు. మామూలుగానే ఒత్తిడితో కూడిన వృత్తి.. దానికి తోడు మరిన్ని సంస్థలకు పనిచేయాల్సి రావడంతో ఏర్పడ్డ అదనపు ఒత్తిడి కారణంగా ‘బర్న్ ఔట్ సిండ్రోమ్’కు గురికావడం ఎక్కువయ్యింది. ఒక సంస్థకు తెలియకుండా మరొక సంస్థలో పనిచేస్తూ.. ఒకటి కంటే ఎక్కువ సంస్థలకు చెందిన కార్యకలాపాలు నిర్వహించడంతో.. అనూహ్యంగా పెరిగిపోయిన తీవ్రమైన ఒత్తిడిని ‘మూన్లైట్ ఎఫెక్ట్’గా వైద్యులు పేర్కొంటున్నారు. వీటివల్ల మెదడులో అనూహ్యపరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు వెల్లడిస్తున్నారు. దీని ఫలితంగా చాలామంది ఉద్యోగాలనూ, ఉపాధిని కోల్పోవడమూ జరిగిందంటే దీని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. చదవండి: ఇలా చేస్తే పురుగులు పడిపోతాయి! అప్పుడు ఎంచక్కా... లక్షణాలు ►తీవ్రమైన నిస్సత్తువ, పని పైన ఆసక్తి లేకపోవడం ►పని మీద దృష్టి కేంద్రీకరించలేకపోవడం ►వృత్తికి సంబంధించిన ప్రతి అంశంలోనూ ప్రతికూల ధోరణి (నెగెటివిజమ్) ►భవిష్యత్తు గురించి నిరాశాజనకంగా ఆలోచించడం ►తనను తాను ప్రోత్సహించుకుని, పని చేయడానికి పురిగొల్పుకునే ధోరణి (మోటివేటెడ్‌గా) లేకపోవడం. ‘బర్న్ఔట్’ తాలూకు తీవ్రతలూ – దశలు... ఈ దుష్ప్రభావల తీవ్రత... ఒకేసారి కాకుండా దశలవారీగా కనిపిస్తుంది. అవే... 1. హనీమూన్ ఫేజ్ : పని పెరిగినప్పటికీ అదనపు ఆదాయం సమకూరుతుండటం, డబ్బు కళ్లబడుతుండటంతో మొదట్లో చాలా ప్రోత్సాహకరంగా, హాయిగా, ఆనందంగా ఉంటుంది. అందుకే దీన్ని ‘హనీమూన్ ఫేజ్’గా చెబుతారు. 2. అర్లీ స్ట్రెస్ ఫేజ్ : ఒత్తిడి తాలూకు మొదటి దశ ఇది. 3. క్రానిక్ స్ట్రెస్ ఫేజ్ : ఒత్తిడి మొదటి దశ దాటిపోయి... ఎల్లప్పుడూ అదే ఒత్తిడితో ఉండటం జరుగుతుంది. అందుకే దీన్ని ‘క్రానిక్ స్ట్రెస్ ఫేజ్’గా చెబుతారు. 4. ఎస్టాబ్లిష్డ్ బర్న్ ఔట్ : నిత్యం ఒత్తిడి కారణంగా కనిపించే దుష్ప్రభావాలు స్పష్టంగా వెల్లడవుతూ ఉండటం (ఎస్టాబ్లిష్ అవుతుండటం) వల్ల దీన్ని ఈ పేరుతో పిలుస్తారు. ఇదీ చదవండి: పిల్లల్ని పెంచేపుడు ఏం తప్పులు చేస్తున్నాం? అసలు ఎలా పెంచాలి? 5. హ్యాబిచ్యువల్ బర్న్ ఔట్ : నిత్యం కనిపించే ఒత్తిడికి పూర్తిగా అలవాటు పడిపోయి, దాన్లోంచి తప్పించుకోలేక, ఒప్పుకున్న పనినుంచి తప్పుకోలేక ఒకరకమైన నిస్పృహకూ, నిరాసక్తతకూ లోనుకావడాన్ని ‘హ్యాబిచ్యువల్ బర్న్ ఔట్’ దశగా చెప్పవచ్చు. పైగా ఈ దశలన్నీ వ్యక్తుల్లో మంచి అభివృద్ధికి తోడ్పడే కీలకమైన వయసులో అంటే 30 నుంచి 35 ఏళ్ల మధ్యన కలగడంతో తీవ్రమైన నిరాశ, నిస్పృహలకు లోను కావడంతో ఆ కుటుంబం అతలాకుతలం కావడం, ఛిన్నాభిన్నమైపోవడం లాంటి పరిణామాలు సంభవిస్తుంటాయి. ఎవరిలో ఎక్కువంటే... సాఫ్ట్వేర్ ఉద్యోగులే కాకుండా, కోవిడ్ సమయంలో కీలకమైన బాధ్యతలు నిర్వహించిన వైద్యవర్గాలూ ‘బర్న్ ఔట్ సిండ్రోమ్’కు గురికావడం ఆసక్తికరమైన అంశం. గణాంకాల్ని చూసినప్పుడు ఈ వైద్యవర్గాల్లోనూ ఎమర్జెన్సీ వైద్య విభాగాల్లో పనిచేసేవారు 65%, కార్డియాలజీ విభాగానికి చెందిన వారు 43%, న్యూరోసర్జరీ విభాగాల్లో పనిచేసే వైద్యుల్లో 21% మంది దీని బారిన పడ్డారని తేలింది. వీళ్లే కాదు... ఫాస్ట్‌ఫుడ్ డెలివరీ వర్కర్లు, ట్రాఫిక్ పోలీసులు, ఫైర్ ఫైటర్లూ దీనికి గురవుతుంటారు. మహిళలు దీని బారిన ఎక్కువగా పడుతుంటారు. దీనికి తోడు వ్యాయామం చేయనివాళ్లూ, ఊబకాయం ఉన్నవారూ, ఒంటరివాళ్లూ, బాగా ఎక్కువగా ఆల్కహాల్ తాగేవారిలోనూ బర్న్ఔట్ సిండ్రోమ్ బారిన పడే అవకాశాలు మరీ ఎక్కువ. మూన్‌లైటింగ్ ఎఫెక్ట్ అంటే... తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం పెంచుకోవాలనే కోరికతో, ఎలాగూ తమపై ఆఫీసు నిఘా ఉండదు కాబట్టి పలుచోట్ల పనులను ఒప్పుకున్నవారు మరింత ఎక్కువ ఒత్తిడికి గురికావడాన్ని ‘మూన్‌లైటింగ్ ఎఫెక్ట్’ అంటారు. మామూలుగా మనం పగలు పనిచేస్తుంటాం. అదనపు పనిని ఒప్పుకున్నందున నిద్రమానేసి విశ్రాంతి లేకుండా రాత్రుళ్లూ పని చేస్తూ పోవడాన్ని ‘మూన్‌లైటింగ్’గా చెబుతున్నారు. మొదట్లో దీన్ని ఓ వైవిధ్యమైన పరిస్థితిగా అనుకున్నప్పటికీ విస్తృత అధ్యయనం తర్వాత ‘మూన్‌లైటింగ్’ కూడా ‘బర్న్ఔట్’ తాలూకు మరో రూపమనీ, దానికంటే ఒకింత తీవ్రత ఎక్కువని తేలింది. దీనివల్ల ఆఫీసులో జరిగే తప్పులే కాకుండా... భవిష్యత్తులో హైబీపీ, గుండెజబ్బులకూ, డిప్రెషన్‌కూ దారితీయవచ్చని పరిశోధనల్లో తేలింది. విముక్తి ఎలా... ఈ సమస్యల నుంచి బయటపడటం కూడా తేలికే. అవసరమైనంత విశ్రాంతి తీసుకోవడం, వీలైనంతవరకు మధ్యాహ్నాలు ఓ అరగంట నిద్ర (పవర్‌న్యాప్), రాత్రుళ్లు కంటి నిండా కనీసం ఎనిమిది గంటల పాటు నిద్రపోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తినడం, వీలైనంతవరకు చక్కెర పదార్థాలు చాలా తక్కువగా తీసుకోవడం ద్వారా ఈ సమస్యల నుంచి బయట పడవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఆల్కహాల్‌కూ, నిద్రపట్టనప్పుడు స్లీపింగ్ పిల్స్ వాడేవారు వాటికి దూరంగా ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం, ధ్యానం చేయాలి. తమ పట్ల తాము జాగ్రత్తలు తీసుకోవడం మాత్రమే కాకుండా... ఇతరులకు సహాయం చేయడంలోని ఆనందమూ వారిని బర్న్ ఔట్ నుంచి రక్షిస్తుందని అధ్యయనాలు తేల్చాయి. అప్పటికీ నిరాశ, నిస్పృహ, నిస్సత్తువ, అనాసక్తి వంటి లక్షణాలు చాలాకాలం పాటు కనిపిస్తుంటే ఒకసారి డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. మెదడుపైనా దుష్ప్రభావాలు ప్రీ–ఫ్రంటల్ కార్టెక్స్ ప్రాంతంలో : బర్న్ ఔట్ కారణంగా మెదడులోని ప్రీ–ఫ్రంటల్ కార్టెక్స్ ప్రాంతంలోని ‘గ్రే మ్యాటర్’ బాగా పలచబారినట్లు ఇటీవలి తాజా పరిశోధనలు చెబుతున్నాయి. దీని కారణంగా జ్ఞాపకశక్తి బాగా తగ్గడం, ఏ విషయాన్నైనా సమగ్రంగా ఆకళింపు చేసుకోవడంలో లోపాలు, చేసిన తప్పిదాలే మళ్లీ మళ్లీ చేయడం, కొత్త విషయాలు నేర్చుకోవడంలో నైపుణ్యాలు తగ్గడం వంటి లోపాలు కనిపించాయి. టెంపోరల్ లోబ్ ప్రాంతంలో : మెదడులోని మధ్య (మీడియల్) టెంపోరల్ లోబ్ అనే చోట బాదం కాయ ఆకృతిలో ‘ఎమిగ్దలా’ అనే ఓ ప్రదేశం ఉంటుంది. (నిజానికి గ్రీకు భాషలో ఎమిగ్దలే అంటే బాదం కాయ అనే అర్థం. అందుకే దానికా పేరు). భయాలూ, ఆందోళనల్లాంటి అనేక ఉద్వేగాలకు కారణమయే, ఆవిర్భవించే ప్రదేశమది. బర్న్ ఔట్‌కు లోనైన వారిని పరిశీలించినప్పుడు వాళ్లలో ‘అమిగ్దలా’ బలంగా మారినట్లు తేలింది. ఫలితంగా తమ చుట్టూ ఉన్న ప్రపంచమంతా భయంకరంగా అనిపించడం లాంటి అనుభవాలకు గురిచేస్తుందన్న మాట. ఒకవైపు గ్రేమ్యాటర్ పలచబారడం, మరోవైపు ఎమిగ్దలా బలపడటం... ఈ రెండింటి మధ్య సమన్వయం లేకపోవడంతో బర్న్ఔట్ తీవ్రత మరింతగా పెరుగుతోంది. -
సరదా అనుకున్నాం కానీ, అదొక వ్యాధి అనుకోలేదు.. అసలు ఏంటిది?
గత కొన్ని రోజులుగా శ్రీనగర్ కాలనీ నివాసి లలిత (35) ఏదో ఒత్తిడికి గురవుతున్నట్టు కనిపిస్తోంది. ఇంట్లో ఏవో కొన్ని వస్తువులు రహస్యంగా దాస్తోంది. డబ్బులు ధారాళంగా ఖర్చు చేస్తోంది. ఈ విషయాలన్నీ గమనించిన కుటుంబసభ్యులు ఎందుకయినా మంచిదని ఒకరోజున సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లారు. కొన్ని గంటల పాటు పరిశీలించిన వైద్యుడు ఆమె సీబీఎస్డీ అనే వ్యాధికి గురైందని నిర్ధారించారు. అదేమిటీ..తరచూ షాపింగ్ చేస్తుంటే సరదా అనుకున్నాం కానీ అదొక వ్యాధి అనుకోలేదే అని ఆశ్చర్యపోయారు కుటుంబ సభ్యులు. నగరంలో విజృంభిస్తున్న సరికొత్త మానసిక వ్యాధికి లలిత ఓ ఉదాహరణ. సాక్షి, హైదరాబాద్: కంపల్సివ్ బయింగ్ బిహేవియర్ లేదా కంపల్సివ్ బైయింగ్, షాపింగ్ డిజార్డర్ (సీబీఎస్డీ/సీబీడీ)తో బాధపడు తున్నవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఒకప్పుడు మహిళల్లో ఎక్కువగా కనిపించే ఈ సమస్య ఇప్పుడు అందరినీ వేధిస్తోందని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు. సీబీఎస్డీ తీవ్రమైన ఒత్తిడితో ముడిపడిన మానసిక ఆరోగ్య పరిస్థితి అని, అనవసరమైన వాటిని కూడా కొనడాన్ని నియంత్రించుకోలేని సమస్య గా మనస్తత్వవేత్తలు పేర్కొంటున్నారు. ఇటీవలే ప్రపంచ ఆరోగ్యసంస్థ ఇంపల్స్ కంట్రోల్ డిజార్డర్స్ (కొన్నిప్రత్యేక అలవాట్ల నియంత్రణ లోపాలు)లో ఒకటిగా దీనిని చేర్చింది. ఈ సమస్య ఉన్నవారికి తరచుగా షాపింగ్ చేయాలనే కోరిక కలుగుతుంటుంది. అధిక వ్యయం వల్ల ఉత్పన్నమయ్యే ఆర్థికసమస్యలు, అను బంధాల విచ్ఛిన్నం వంటి ప్రతికూల ఫలితాలున్నప్పటికీ పట్టించుకోకుండా అదేపనిలో నిమగ్నమైపోతారు. ఈ రుగ్మత ఉన్నవారు తమ బడ్జెట్‌పై స్పష్టమైన వైఖరి లేకుండా వారి సాధారణ కార్యకలాపాలను సైతం నిర్లక్ష్యం చేస్తూ కొనడంలోనే నిమగ్నమవుతుంటారు. కరోనా సహా...కారణాలనేకం.. మానసిక, పర్యావరణ, జీవ సంబంధమైన కార ణాలుసహా అనేక అంశాలు కంపల్సివ్ షాపింగ్ ను ప్రేరేపిస్తున్నాయి. పెరిగిన ఇంటర్నెట్, సోషల్ మీడియా, క్రెడిట్ కార్డ్‌లు, ఆన్లైన్ షాపింగ్, ప్రకటనలు, ప్రమోషన్ కార్యక్రమాలు కూడా సీబీఎస్డీకి దోహదపడుతున్నట్లు మనస్తత్వవేత్తలు పేర్కొంటున్నారు. మరోవైపు ఆర్థిక అవగాహన లోపించడం, రుణాలు సులభంగా అందుబాటులోకి రావడం కూడా కారణమవుతున్నాయి. మరీ ముఖ్యంగా కరోనా సమయంలో ప్రతి చిన్న వస్తువును ఆన్లైన్ ద్వారా కొనడం అత్యధికశాతం మందిని ఈ వ్యాధికి చేరువ చేసిందంటున్నారు. కంపల్సివ్ షాపింగ్ కోసం చికిత్స కోరిన వ్యక్తుల్లో దాదాపు 34% మంది ఆన్లైన్ షాపింగ్‌కు అలవాటు పడినవారని జర్మనీలోని హన్నోవర్ మెడి కల్ స్కూల్ పరిశోధకులు తేల్చడం గమనార్హం. భావోద్వేగ పరిస్థితులతో వ్యాధి తీవ్రం.. కంపల్సివ్ షాపింగ్ లింగ భేదాలకు అతీతంగా ఉందని నిపుణులు అంటున్నారు. అయితే సాధారణంగా పురుషులతో పోలిస్తే మహిళలకు కాస్త షాపింగ్ ప్రియత్వం ఎక్కువ. అందువల్ల మహిళలే ఎక్కువగా ఈ వ్యాధి బారినపడే అవకాశం ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఒత్తిడి, ఆందోళన, నిరాశ, ఆత్మవిశ్వాస లోపం వంటి ప్రతికూల భావోద్వేగ పరిస్థితులతో వ్యాధి తీవ్రతరం కావొచ్చు. బైపోలార్ ఎఫెక్టివ్ డిజార్డర్ (కొన్ని సమయాల్లో కుంగుబాటు, కొన్ని సమయాల్లో విపరీత ప్రవర్తన), అబ్సెసివ్–కంపల్సివ్ డిజార్డర్ (అతిగా ప్రవర్తించడం) (ఓసీడీ) తదితర ఇంపల్స్ కంట్రోల్ డిజార్డర్స్‌తో బాధపడుతున్న వ్యక్తులలో కంపల్సివ్ షాపింగ్‌ను వైద్యులు గుర్తిస్తున్నారు. దీనికి మందులు, జీవనశైలి మార్పుల కలయికతో కూడిన సమగ్ర చికిత్స విధానం అవసరమని వైద్యులు అంటున్నారు. వ్యక్తులు ఖర్చు చేసే అలవాటుపై తిరిగి నియంత్రణ సాధించేందుకు ఈ చికిత్స సహాయపడుతుందని చెబుతున్నారు. కంపల్సివ్ షాపింగ్‌తో పోరాడుతున్న వ్యక్తులు శిక్షణ పొందిన మానసిక ఆరోగ్య నిపుణుల నుంచి సహాయం పొందాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లోనూ.. సమగ్ర మనోరోగ చికిత్స జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, అభివృద్ధి చెందిన దేశాలలో 5% మంది పెద్దలను కూడా సీబీఎస్డీ ప్రభావితం చేస్తోంది. ప్రతి 20 మందిలో ఒకరు దీని బారిన పడుతున్నారని ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్ నివేదించింది. వీరిలో ప్రతిముగ్గురి లో ఒకరు ఆన్లైన్ కొనుగోలు వ్యసనంతో బాధ పడుతున్నారు. ‘షాపింగ్‌పై కోరికతో వారు కొనుగోలు చేయగలిగిన దానికంటే ఎక్కువ కొనుగోలు చేస్తారు. మహిళలే కాదు..అందరిలోనూ కని్పస్తోంది గతంలో పార్కిన్సన్స్ లాంటి మెదడు మీద ప్రభావం చూపే వ్యాధుల్లో ఒక లక్షణంగా ఈ సీబీడీని గుర్తించేవాళ్లం. దీన్ని బైపోలార్ డిజార్డర్ అనేవాళ్లం. అయితే ఇటీవలి కాలంలో ఇతరత్రా వ్యాధులు లేకుండానే..సీబీడీకి గురవుతున్నారు. విచిత్రమేమిటంటే అవసరానికో, ఆర్థికంగా బాగుండో కొనేవారిలా కాకుండా ఈ వ్యాధికి గురైన వారు కొన్నవాటితో సంతోషం కూడా పొందరు. కొన్నప్పటికీ అసంతృప్తితో ఉంటారు. అవమానంగా ఫీలవుతారు. దాంతో మళ్లీ కొంటారు. అలా అలా.. మత్తు పదార్థాలకు అలవాటైన వారిలా.. కొంటున్న విషయాన్ని, కొన్న వస్తువుల్ని రహస్యంగా ఉంచుతారు. వీరికి చికిత్సలో భాగంగా కౌన్సెలింగ్ తో పాటు మందులను కూడా వాడాల్సి ఉంటుంది. గతంలో మహిళల్లో ఎక్కువగా చూసేవాళ్లం. ఇప్పుడు అందరిలోనూ కనిపిస్తోంది. –డాక్టర్ చరణ్ తేజ, న్యూరో సైకియాట్రిస్ట్, కిమ్స్ ఆసుపత్రి -
మొక్కలు కూడా ఏడుస్తాయ్! సాయం చేయమంటూ అరుస్తాయ్!
మనుషుల్లానే మొక్కలు కూడా ఒత్తిడికి గురైతే ఏడుస్తాయట. తమ ఆవేదనను శబ్దాల రూపంలో వెళ్లగక్కుతాయట. అయితే వాటిని మనం వినలేం! అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తాజా అధయనాల్లో పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. పరిశోధనల్లో మొక్కలు ఒకదానితో ఒకటి సంభాషించుకుంటాయని తేలిందని కూడా చెప్పారు. ఈ మేరకు ఇజ్రాయెల్‌కి చెందిన టెల్ అవీవ్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు ఒత్తిడికి గురైతే సహాయం కోసం మొక్కలు అరుస్తాయని కనుగొన్నారు. దీని కోసం టొమాటో, పొగాకు వంటి మొక్కలను గ్రీన్హౌస్ లోపల ఉంచి పరిశోధన చేసినప్పుడూ.. అవి డీహైడ్రేట్ అయ్యి ఏడుపు రూపంలో శబ్దాలను విడుదల చేయడం గమనించారు. ప్రతి మొక్క ఒత్తిడిని ఎదుర్కొన్నప్పుడూ ఒక్కో రకమైన నిర్ధిష్ట శబ్ద రూపంలో ధ్వనిని ప్రదర్శించాయని చెప్పారు. మానవులు గబ్బిలాలు, కీటకాలు, ఎలుకలు వంటి వివిధ జంతువుల శబ్దాన్ని వినగలరు. మహా అయితే 16 కిలో హెర్ట్జ్ వరకు మాత్రమే మానవులు వినగలరు. పరిశోధనలో మెక్కలు 10 సెంటీమీటర్ల పరిధిలో ఉన్న 20 నుంచి 250 పౌనఃపున్యాల శబ్దాలను అందుకుంటాయని అల్ట్రాసోనిక్ మైక్రోఫోన్ల ద్వారా గుర్తించారు. మొక్కలకు తగు మోతాదు నీరు అందనప్పుడూ, లేదా కొమ్మలకు/కాండానికి గాయాలైనప్పుడు వాటి నుంచి ఏడుపు రూపంలో శబ్దాలు రావడాన్ని గుర్తించినట్లు తెలిపారు. మొక్కలు విడుదల చేసే శబ్దాలను గబ్బిలాలు, ఎలుకలు, కీటకాలు వంటివి గుర్తించగలవని, అవి మొక్కల నుంచి సంబంధిత సమాచారాన్ని కూడా పొందగలవని పరిశోధకుడు లిలాచ్ హడానీ చెప్పుకొచ్చారు. (చదవండి: రెండో పెళ్లి కావలి అంటూ పోలీస్టేషన్లో వధువు హల్చల్! మద్యంమత్తులో ఊగిపోయి..) -
Health: పొద్దుతిరుగుడు గింజలు, ఇంకా వీటిని తింటే? వెల్లుల్లిలో ఉండే గ్లటాథియోన్ వల్ల
Health Tips In Telugu: మానసిక ఆరోగ్యం బాగుండాలంటే కొన్ని రకాల పోషకాలను తప్పకుండా తీసుకోవాలి. దానికి పిల్లలు, పెద్దలు అనేం లేదు. ఈ కింద ఇచ్చిన కొన్ని పదార్థాలలో మానసికంగా చురుగ్గా ఉంచే కొన్ని కారకాలు ఉన్నట్లు పోషకాహార నిపుణులు గుర్తించారు. వాటిని తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గి చురుగ్గా ఉండగలం. అవేమిటో చూద్దాం. మానసిక ఆందోళన, ఒత్తిడి, కుంగుబాటు, డిప్రెషన్.. పేరు ఏదైనా వచ్చిన తర్వాత బాధ పడేకంటే రాకుండా చూసుకోవడం చాలా మేలు. ఈ కింద ఇచ్చిన కొన్ని పదార్థాలు తీసుకోండి. శారీరకంగానే కాదు, మానసికంగానూ ఆరోగ్యంగా ఉండండి. పొద్దుతిరుగుడు గింజలు... వీటిలో విటమిన్ ‘ఇ’ అధిక స్థాయిలో ఉంటుంది. ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సమర్థంగా పనిచేస్తుంది. వెల్లుల్లి... వెల్లుల్లిలో సల్ఫర్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి గ్లటాథియోన్ అనే యాంటీ ఆక్సిడెంట్‌ను ఉత్పత్తిచేస్తాయి. ఇది ఒత్తిడిని ఎదుర్కొనే రక్షణ ఛత్రంలో మొదటి మూలకంగా పనిచేస్తుంది. గుడ్లు... గుడ్లలో పోషకాలు పుష్కలం అనే విషయం తెలిసిందే. వీటిలో విటమిన్లు, మినరల్స్, అమైనో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్స్ సంతృప్త స్థాయిలో లభిస్తాయి. ప్రత్యేకంగా ఇందులో చోలిన్ అనే పోషకం పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడు ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుందని, అలాగే ఒత్తిడి నివారణకు సమర్థం గా పనిచేస్తుందని వైద్యులు గుర్తించారు. నువ్వులు... నువ్వులతో తయారుచేసే పదార్థాలలో ఎల్–ట్రిప్టోపాన్ అనే అమైనో ఆమ్లం పాళ్లు ఎక్కువ. ఇది మనసును ఉల్లాసంగా ఉంచే డోపమైన్, సెరటోనిన్ ఉత్పత్తిలో ఉపయోగపడుతుంది. అలాగే ఒత్తిడిని తగ్గించేందుకు తోడ్పడుతుంది. 25 మంది యువకులకు నాలుగు రోజుల పాటు నువ్వుల ఉండలను తినిపించి పరిశీలించినప్పుడు వారిలో ఆందోళన, ఒత్తిడి స్థాయులు గణనీయంగా తగ్గినట్లు ఓ సర్వేలో తేలింది. నువ్వులతో రకరకాల స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. ఏదైనా పదార్థాన్ని రుచిగా ఉండేలా తయారు చేసుకోవడం వల్ల వాటిని తినే విధంగా మెదడు కూడా మనల్ని ప్రోత్సహిస్తుంది. చదవండి: Pomegranate: 3 నెలల పాటు ప్రతిరోజు తింటే! ఇక తొక్కలు పొడి చేసి నీళ్లలో కలిపి తాగారంటే.. -
ఒత్తిడికి దూరంగా ఉండాలంటే..?
ఈ రోజుల్లో చాలా మంది ఒత్తిడికి గురవుతున్నారు. దీనికి కారణం సరైన జీవనశైలి, మంచి ఆహారపు అలవాట్లు లేకపోవడమే. డైట్ నుంచి కొన్ని ఆహారాలని మినహాయించడం వల్ల డిప్రెషన్ నుంచి బయటపడవచ్చు.వాటి గురించి వివరంగా తెలుసుకుందాం... చక్కెర మీరు ఎప్పుడూ ఒత్తిడికి లోనవుతున్నట్లయితే ముందుగా ఆహారం నుంచి చక్కెరను మినహాయించండి. ఎందుకంటే తీపి పదార్థాలు మీ శక్తి స్థాయిని ప్రభావితం చేస్తాయి. శరీర అసమతుల్యతను కలిగిస్తాయి. దీనివల్ల మనిషిలో టెన్షన్ పెరగడం మొదలవుతుంది. అందుకే డిప్రెషన్‌తో బాధపడేవారు చక్కెరను ఎక్కువగా తినకూడదు. ఆల్కహాల్ ఆల్కహాల్ కాలేయానికి మాత్రమే కాకుండా మొత్తం ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ఆల్కహాల్ మెదడులోని సెరోటోనిన్ చర్యను మారుస్తుంది. ఇది ఆందోళనను పెంచుతుంది. అందుకే మద్యం తాగకూడదు. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ∙ఆందోళన పెరుగుతుంది. కెఫిన్ కెఫిన్ కలిగిన పానీయాలు అధికంగా తీసుకోవడం వల్ల ఆందోళన, ఒత్తిడి, నిద్రలేమికి కారణమవుతాయి. కెఫిన్ అనేది కాఫీలోనే కాదు, టీలో కూడా ఉంటుంది. అందువల్ల కాఫీ, టీ, చాక్లెట్లు, కొన్ని రకాల శీతల పానీయాలలో కూడా కెఫిన్ ఉంటుంది కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే వీటివల్ల డిప్రెషన్‌కు గురవుతారు. ఉప్పు ఉప్పు మానసిక స్థితిని పాడు చేస్తుంది. మీరు అలసిపోయేలా చేస్తుంది. అలాగని ఉప్పు తీసుకోవడాన్ని పూర్తిగా మానేయకూడదు. తగ్గించి తీసుకుంటే ఉత్తమం. కొందరికి మజ్జిగన్నంలో ఉప్పు తప్పనిసరి. ప్రాసెస్డ్ ఫుడ్ అంటే నిల్వ పచ్చళ్లు, అప్పడాలు, వడియాలలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అలాంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. -
అయితే హింస.. లేదంటే కుంగుబాటు!
తాను ప్రేమించిన యువతిని ప్రేమిస్తున్నాడనే కక్షతో హైదరాబాద్‌లో ఓ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థి తన స్నేహితుడిని ఇటీవల అత్యంత కిరాతకంగా హతమార్చాడు... సీనియర్ పీజీ వైద్య విద్యార్థి వేధింపులు, ర్యాగింగ్‌ను తాళలేక, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా తగిన స్పందన రాక తాజాగా ఓ పీజీ వైద్య విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ తరహా ఘటనలు ఇటీవల కాలంలో తరచూ చోటుచేసుకుంటుండటం దేనికి సంకేతం? ఇందుకు కారణం ఏమిటి? సాక్షి, హైదరాబాద్ : నేటి ఉరుకుల పరుగుల జీవనంలో విద్యార్థులపై చదువుల ఒత్తిడి పెరగడం, వారి సమస్యలు ఏమిటో ఎవరూ అడిగి తెలుసుకొనే పరిస్థితి లేకపోవడం, సెల్ఫోన్లు, ఇంటర్నెట్టే ప్రపంచంగా మారడం, మద్యం, డ్రగ్స్ వాడకం తదితర కారణాలతో కొంత మంది చెడుదారుల్లో పయనిస్తున్నారు. ఫలితంగా చిన్నచిన్న కారణాలు, సమస్యలనే తట్టుకోలేని పరిస్థితికి చేరుకుని విపరీతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏం చేయాలి? సమాజంలో నెలకొన్న పరిస్థితులు, వాటి వల్ల ఎదురుకాబోయే పరిణామాలపై విద్యార్థులకు శాస్త్రీయంగా అవగాహన కల్పించాలని మానసిక శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వారు మానసికంగా కుంగిపోకుండా ఆత్మవిశ్వాసం, మనోధైర్యం పెంపొందించే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వివిధ పరిస్థితులు, జీవితంపై పడబోయే ప్రభావాలను తల్లిదండ్రులు పిల్లలకు వివరించాలని చెబుతున్నారు. ఏదో జరిగిపోతుందనే భయం కంటే భవిష్యత్తులో ఎలాంటి ఆటుపోట్లనైనా ఎదుర్కోగలిగే మనోస్థైర్యాన్ని, విశ్వాసాన్ని వారిలో కలిగించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులు ఇంటర్నెట్ ప్రపంచంలో మునిగితేలకుండా ఇతర సామాజిక అంశాలపై వారికి అవగాహన కల్పించాలని చెబుతున్నారు. ఇన్స్టంట్ పరిష్కారాలే అసలు సమస్య.. ఇప్పుడు యువత ఇన్ స్టంట్ పరిష్కారాలు కోరుకుంటోంది. ఏవైనా సవాళ్లు ఎదురైనప్పుడు ఒత్తిళ్లను తట్టుకొనే శక్తి కొరవడటం, సంయమనం పాటించలేకపోవడం వారిలో సమస్యగా మారింది. ఓపికతో వ్యవహరించలేకపోవడం వల్ల సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. ఇవే హత్యలు, ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. పశ్చిమ దేశా ల్లో పిల్లలకు లైఫ్‌స్కిల్ ట్రైనింగ్‌లో వీటన్నింటిపై అవగాహన కల్పిస్తారు. మన దేశంలోనూ అలాంటి శిక్షణనివ్వాలి. ఒంటరిగా డిజిటల్ పరికరాలతో ఎక్కువ సమయం గడిపే బదులు మిత్రులతో ఆటపాటలు, మాటల వల్ల సోషల్ స్కిల్స్ పెరుగుతాయి. – డాక్టర్ నిషాంత్ వేమన, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, సన్ షైన్, చేతన హాస్పిటల్స్ వ్యక్తిత్వ లోపాలతోనే అలాంటి నిర్ణయాలు.. ప్రేమికుల్లో లేదా యువతలో క్రూరమైన ఆలోచనలు, కిరాతకంగా హత్యలకు పాల్పడాలనే ధోరణులు ఉత్పన్నమయ్యాయంటే వారిలో ‘సైకో పాథాలజీ’ లక్షణాలున్నట్లుగానే భావించాలి.వ్యక్తిత్వ లోపాలు ఉండటం వల్లే వారు అలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇళ్లలోనూ పిల్లలకు సమస్యలపై సరైన అవగాహన కల్పించకపోవడం కూడా ప్రస్తుత పరిస్థితులకు కారణం. ఇలాంటి వారికి ఎమోషనల్ అవేర్నెస్ కల్పించాలి. ప్రభుత్వాలు, యూనివర్సిటీలు, విద్యాసంస్థలు ప్రతి కాలేజీలో కమ్యూనికేషన్, కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. భావోద్వేగాలను ఎలా నియంత్రించుకోవాలి, ప్రతికూల భావోద్వేగాలను ఎలా అధిగమించాలనే అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి. చిన్నప్పటి నుంచే బోధన పద్ధతుల్లో వాటిని భాగం చేయాలి. – సి.వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్ ఒత్తిడిని దూరం చేసుకోవాలిలా ♦ ఏవైనా సంక్షోభ పరిస్థితులు ఎదురైతే మానసిక ప్రశాంతతను పాటిస్తూ ఒత్తిళ్లను దరిచేరనీయరాదు. ♦ కష్టకాలంలో మనకు చేదోడువాదోడుగా నిలుస్తారనే విశ్వాసం, నమ్మకం ఉన్న వారితో మాట్లాడుతుండాలి. ♦ మనకు ఆప్తులుగా ఉన్నవారితో మనలోని భావాలు పంచుకుంటూ రోజువారీ జీవితం ఆహ్లాదంగా గడిపేలా చూసుకోవాలి. -
PTSD: సొంత తాతే తన పట్ల, తన చెల్లి పట్ల నీచంగా.. అందుకే ఆమె ఇలా..
రియాకు 15 సంవత్సరాలు. గత కొద్ది రోజులుగా తనను తాను గాయపరచు కుంటోంది. ఎందుకలా చేస్తుందో పేరెంట్స్ అడిగినా, ఫ్రెండ్స్‌తో అడిగించినా ఏమీ చెప్పలేదు. ఏం చెయ్యాలో అర్థంకాక ఫ్రెండ్స్ సలహాపై పేరెంట్స్ ఆ అమ్మాయిని కౌన్సెలింగ్‌కి తీసుకొచ్చారు. ఆమెతో మాట్లాడినప్పుడు కూడా కారణమేంటో చెప్పలేదు. రెండు మూడు సెషన్లతో ఆమె నమ్మకం సంపాదించుకున్న తర్వాత తన మనసులోని బాధను బయటపెట్టింది. తన 8 నుంచి 12 ఏళ్ల వరకు సొంత తాతే తనను లైంగికంగా వేధించాడని బోరుమని ఏడ్చింది. ఆ విషయం ఎవరికైనాచెప్తే చంపేస్తానని బెదిరించడంతో ఎవ్వరికీ చెప్పలేదంది. తనతో కూడా అలాగే ప్రవర్తించాడని తన చెల్లీ చెప్పిందని, ఆయన ఏడాది కిందట చనిపోయాడని తెలిపింది. తాత తనతో, చెల్లితో ప్రవర్తించిన విధానం అమ్మానాన్నలకు చెప్తే నమ్మకపోగా... ఇద్దరినీ కలిపి తిట్టారనీ చెప్పింది. తాను ముందే చెప్పి ఉంటే చెల్లెలైనా సేఫ్‌గా ఉండేదని, చెల్లెలికి అలా జరగడానికి తానే కారణమని బాధపడింది. చెల్లెల్ని చూసినప్పుడల్లా తాత గురించి పేరెంట్స్‌కు చెప్పకుండా తప్పుచేశాననే గిల్టీ ఫీలింగ్ చంపేస్తోందని, తాను చేసిన తప్పుకు శిక్షగా చెయ్యి కోసుకుంటున్నానని తెలిపింది. తానలా శిక్ష అనుభవించినప్పుడే మనసుకు కాస్త ప్రశాంతంగా ఉంటోందని తెలిపింది. ∙∙∙ కుటుంబ సభ్యుల మరణం, రక్తసిక్తమైన చావుని కళ్లారా చూడటం, చంపేస్తామనే బెదిరింపులు, యాక్సిడెంట్, అగ్నిప్రమాదం, తీవ్రమైన గాయం, లైంగిక హింసకు గురికావడం లాంటి అత్యంత బాధాకరమైన సంఘటనలు ఎదుర్కొన్నవారిని అవి జీవితాంతం వెంటాడుతుంటాయి. ఆ సంఘటన జరిగింది ఒకసారే అయినా దాన్ని మర్చిపోలేకపోతుంటారు. ఆ సంఘటన గుర్తొచ్చిన ప్రతిసారీ తీవ్రమైన ఒత్తిడికి లోనవుతారు. చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్‌కు గురైన రియాకు ఆ జ్ఞాపకాలు పదేపదే గుర్తొచ్చి తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తున్నాయి. దీన్నే పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (PTSD) అంటారు. పీటీఎస్డీ లక్షణాలు.. ►బాధాకరమైన సంఘటనలు పదేపదే గుర్తొస్తుంటాయి ∙దానికి సంబంధించిన పీడకలలు రోజూ భయపెడుతుంటాయి. ►ఆ సంఘటనకు సంబంధించిన ఆలోచనలు, ప్రాంతాలు తీవ్ర ఒత్తిడిని కలుగజేస్తాయి ∙వాటిని నివారించేందుకు రోజూ తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుంటారు. ►కొందరిలో బాధాకరమైన సంఘటనలకు సంబంధించి మతిమరపు ఏర్పడుతుంది∙ ►ప్రపంచం, వ్యక్తులు ప్రమాదకరమైనవనే నమ్మకాలు ఏర్పడతాయి. ►ఒంటరిననే భావన కమ్మేస్తుంది. రోజువారీ పనులపై ఆసక్తి తగ్గుతుంది నిరంతరం భయం, కోపం, అపరాధ భావన, అవమానాలతో కుమిలిపోతుంటారు∙ ►స్నేహం, ప్రేమ, దయ, కరుణలాంటి సానుకూల భావోద్వేగాలను అనుభవించలేకపోతారు చిరాకు, విధ్వంసకర ప్రవర్తన, నిద్రలేమి, ఏకాగ్రత లేమి, హైపర్ విజిలెన్స్ ఉంటాయి. ►రియాలో కూడా ఇలాంటి లక్షణాలు కనిపించాయి. చెల్లెలిపై వేధింపులకు తాను చెప్పకపోవడమే కారణమనే అపరాధ భావన, తాను చెప్పినా పేరెంట్స్ నమ్మలేదనే బాధ ఆమె మనసును నిత్యం దహించివేస్తున్నాయి. ►లైంగిక వేధింపులకు గురైన పిల్లల్లో పీటీఎస్డీ ప్రధాన సమస్యగా మారుతుంది. ఇది వారి సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ని, డిఫెన్స్ సిస్టమ్‌ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. తమను తాము హింసించుకునేలా ప్రేరేపిస్తుంది. రియా చేసిందదే. తనకు తానే శిక్ష వేసుకుంటోంది. ఏం చెయ్యాలి? ►ప్రతి ఏడుగురిలో ఒకరు రియాలా బాల్యంలోనే లైంగిక హింసకు గురవుతున్నారని గణాంకాలు చెప్తున్నాయి. లైంగిక వేధింపులకు గురైన వారిలో తీవ్రమైన ఒత్తిడి ఏర్పడుతుంది. అది జీవితాంతం వేధించే పీటీఎస్డీగా మారుతుంది. దీన్ని డీల్ చేయడంలో ముందుగా పేరెంట్స్‌కి కౌన్సెలింగ్ అవసరం. ఆ తర్వాత క్వాలిఫైడ్ సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్‌ల ద్వారా థెరపీ, చికిత్స అవసరం ఉంటుంది. ►లైంగిక హింసకు పాల్పడేవారిలో ఎక్కువమంది సన్నిహిత బంధువులో, తెలిసినవారో అయ్యుంటారు ∙తల్లిదండ్రులు నిత్యం జాగరూకతతో ఉండాలి. బాల్యంలోనే గుడ్ టచ్–బ్యాడ్ టచ్ గురించి పిల్లలకు అర్థమయ్యేలా వివరించాలి ∙తమపట్ల ఎవరు అనుచితంగా ప్రవర్తించినా పేరెంట్స్‌కి చెప్పవచ్చనే భరోసా కల్పించాలి ►పీటీఎస్డీ వల్ల వచ్చే ఒత్తిడిని తగ్గించుకునేందుకు స్ట్రెస్ బాల్స్ ఉపయోగించవచ్చు ∙అనుచిత ఆలోచనలను తప్పించుకోవడానికి విజువలైజేషన్ ఉపయోగపడుతుంది ►మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు మైండ్‌ఫుల్ నెస్ ప్రాక్టీస్ సహాయపడుతుంది ∙ప్రతికూల ఆలోచనలు, బాధాకరమైన జ్ఞాపకాలు వచ్చినప్పుడు స్టాప్ అనే పదాన్ని మనసులో చూడండి ►కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, ఎక్స్పోజర్ థెరపీ, ఐ మూవ్ మెంట్ డిసెన్సిటైజేషన్ అండ్ రిప్రాసెసింగ్((EMDR)), ట్రామా–ఫోకస్డ్ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ (TF&CBT) లాంటి థెరపీ పద్ధతులు సహాయపడతాయి∙ న్యూరో లింగ్విస్టిక్ సైకోథెరపీలోని VK Dissociation టెక్నిక్ జ్ఞాపకాల నుంచి దూరమయ్యేందుకు సహాయపడుతుంది. ►సాధారణంగా 12 నుంచి 16 సెషన్లు కౌన్సెలింగ్‌కి హాజరవ్వాల్సి ఉంటుంది. ►యాంగ్జయిటీ, డిప్రెషన్, నిద్రలేమి నుంచి ఉపశమనం కలిగించేందుకు సైకియాట్రిస్ట్‌ని సంప్రదించి యాంటీ డిప్రసెంట్ పిల్స్ వాడవచ్చు. చదవండి: ADHD: చురుకైన పిల్లాడని మురిసిపోకండి! ఈ లక్షణాలు ఉంటే.. మృణ్మయ భవనం.. పూర్తిగా మట్టితో నిర్మించిన ఈ హోటల్ ఎక్కడుందో తెలుసా? -
Unpaid Care Work: వేతనం లేని పనికి.. గుర్తింపు ఉండదా?!
స్త్రీల ఇంటిపనికి ఎలాంటి గుర్తింపు, వేతనం ఉండదు. ఇదే విషయమై సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ ప్రపంచవ్యాప్తంగా ఒక అధ్యయనం చేసింది. పేద, ధనిక దేశాలలోనూ ఈ విషయంలో అంతరాలనూ చూపించింది. గుర్తింపు లేని పని కారణంగా స్త్రీలలో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యలు, ఇంటి పనితో పాటు ఉపాధి పొందుతున్న మహిళలపై పడుతున్న అధిక భారం గురించి కూడా చేసిన ఈ అధ్యయనం అన్నివర్గాల వారినీ ఆలోచింపజేస్తోంది. ఇంటి పనులు, బాధ్యతలను సమతుల్యం చేయడం మహిళల నైతిక బాధ్యతగా అంతటా వాడుకలో ఉన్నదే. దీని వల్ల కలుగుతున్న నష్టాలనూ, భాగస్వామ్యంతో ఎలా సమన్వయం చేసుకోవాలో కూడా ఈ సంస్థ తెలిపింది. తేలిక భావన మహిళకు ఉదయం లేస్తూనే ఒక సాధారణ రోజుగా ప్రారంభమవుతుంది. ఊడవడం, తుడవడం, కడగడం, కుటుంబ సభ్యులకు భోజనం సిద్ధం చేయడం... ఈ రొటీన్ పనులన్నీ వీటిలో ఉండవచ్చు. వీటన్నింటి మధ్య వారు తమ భర్త లేదా పిల్లలు లేదా పెద్దలైన కుటుంబ సభ్యుల అవసరాలను చూస్తుంటారు. ఇక బయట ఉద్యోగం చేసే మహిళలైతే, ఇంటి పనులు పూర్తిచేయడంతో పాటు తమను తాము సిద్ధంగా ఉండటానికి సమయం కేటాయించాలి. ఆఫీస్ లోకి వచ్చాక ఆఫీస్ వర్క్ తో ముడిపడి ఉండాలి. పిల్లలు స్కూల్‌కి వెళ్లాక, భర్త ఆఫీసుకు వెళ్లినప్పుడు గృహిణులు ఊపిరి పీల్చుకోవడం లేదు. చేయాల్సింది చాలా ఉంటుంది. ఇంటి పనులను చూసుకోవడం, చేయడం మహిళలు మాత్రమే చేయదగినపనిగా పరిగణించబడుతోంది. దీనిని దాదాపు అందరూ స్త్రీలను తేలికగానే తీసుకుంటారు. ‘కాలక్రమేణా, వేతనంలేని శ్రమ కారణంగా పురుషుల కంటే స్త్రీలు మానసిక ఆందోళనకు గురవుతున్నార’ని హెల్త్ షాట్స్ సైకాలజిస్ట్ డాక్టర్ మాలినీ సబా తెలియజేస్తున్నారు. డబుల్ బైండ్ ఇంటి యజమానులుగా గుర్తించే మగవారు కార్యాలయంలో పెద్దగా పనులు చేయనప్పటికీ వారు చాలా బిజీగా ఉంటారు. కానీ ఇంటిపని, పిల్లల సంరక్షణతో సహా వేతనంలేని పనికి ఉపాధి పొందుతున్న మహిళలు బాధ్యత వహిస్తారు. డాక్టర్ సబా ప్రకారం, ‘గుర్తించబడని మహిళల శ్రమ రెండు రూపాలుగా ఆమెను సవాల్ చేస్తోంది. ఒకటి ఆమె శారీరక ఆరోగ్య సంరక్షణ తగ్గుతోంది. దీంతో పాటు మానసిక భారం అధికమవుతోంది.’ అసమానతకు నిదర్శనం ప్రపంచవ్యాప్తంగా ఉపాధి, నిరుద్యోగ మహిళలు జీతం లేని పనికి ఎక్కువ గంటలు వెచ్చిస్తున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. కోవిడ్–19 మహమ్మారి సమయంలో ఈ ధోరణి మరీ ఎక్కువగా కనిపించింది. సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం 2021లో పురుషుల 59 అదనపు గంటలతో పోలిస్తే మహిళలు 173 అదనపు గంటలు చెల్లింపు లేని ఇంటిపని, పిల్లల సంరక్షణ బాధ్యతలను తీసుకున్నారు. దిగువ, మధ్య ఆదాయ దేశాలలో ఈ అంతరం మరింత పెరిగింది. ఈ దేశాలలో మహిళలు పురుషుల కంటే మూడు రెట్లు ఎక్కువ గంటలు ఇల్లు, పిల్లలను చూసుకున్నారు. భారాన్ని పెంచిన వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి నుండి ఆఫీసు పని చేయడం చాలా మంది మహిళల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. మహిళలు వంట చేయడం, శుభ్రపరచడం, పిల్లలు, పెద్దవారిని చూసుకోవడం.. వంటి ఉదాహరణలెన్నో ఉన్నాయి. ఇంటి నుండి ఆఫీసు పని చేయడం అనేది చాలా మందికి కష్టతరమైనది. దాంతో ఎంతో సమయాన్ని కోల్పోతున్నారు. దీనివల్ల స్త్రీలకు ఏ విధమైన వినోదం, విశ్రాంతి లేదా కోలుకోవడానికి సమయం దొరకడం లేదు. శారీరక, మానసిక వేధింపుల కథనాలలో ఒకటైన వైద్యం అందుబాటులో లేకపోవడం కూడా సమతుల్యత దెబ్బతింటుంది. మహమ్మారి సమయంలో పరిమిత ఉపాధి అవకాశాలు, ఆరోగ్య సంరక్షణ సవాళ్లు, పిల్లల సంరక్షణ లేకపోవడం వల్ల చాలా మంది మహిళలు తమ కుటుంబాలను చూసుకోవడం కోసం తమ వృత్తిని విడిచిపెట్టారని నిపుణులు గుర్తించారు. ఇది ముఖ్యంగా నెలవారీ తక్కువ ఆదాయం కలిగిన తల్లులలో ఎక్కువగా ఉంది. (క్లిక్ చేయండి: తక్కువ బడ్జెట్లో ఇంటి అలంకరణ.. వావ్ అనాల్సిందే!) న్యాయమైన వాటా పురుషులు ఇల్లు, పిల్లల పనుల్లోనూ వారి న్యాయమైన వాటాను తీసుకుంటే మహిళలపై చెల్లింపు లేని పని భారం తగ్గుతుంది. కలిసి పనులు చేసుకోవడంలోని అన్యోన్యత స్త్రీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది వారి ఆదాయ వనరుల అవకాశాలను కూడా పెంచుతుంది. భావోద్వేగ ఒత్తిడి కూడా తగ్గుతుంది. పురుషులకు అనువైన ఏర్పాట్లను సాధారణం చేస్తే, పితృస్వామ్య, పెట్టుబడిదారీ డిమాండ్లను చర్చించడంలో స్త్రీలకు సమయం కలిసివస్తుంది. -
ప్రతికూల ఆలోచనల వల్లే ఆందోళన, కుంగుబాటు
లండన్: వృద్ధుల్లో ఆందోళన, కుంగుబాటు, ఒత్తిడికి ప్రతికూల భావోద్వేగాలు, ఆలోచనలే కారణమని పరిశోధకులు తాజా అధ్యయనంలో గుర్తించారు. మనసులో ప్రతికూల ఆలోచనలు మొదలైతే ఆందోళన పెరుగుతున్నట్లు తేల్చారు. భావోద్వేగాలను నియంత్రించుకుంటే ఒత్తిడి నుంచి బయటపడవచ్చని సూచించారు. పెద్దల్లో మెదడుపై ప్రతికూల ఆలోచనల ప్రభావం, మానసిక ఆందోళనకు మధ్య గల సంబంధాన్ని స్విట్జర్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ జెనీవాకు చెందిన న్యూరో సైంటిస్టులు కనుగొన్నారు. ఇతరుల మానసిక వ్య«థ పట్ల యువకులు, వృద్ధులు ఎలా స్పందిస్తారు? వారి మెదడు ఎలా ఉత్తేజితం చెందుతుంది? వారిలో ఎలాంటి భావోద్వేగాలు తలెత్తుతాయి? అనే దానిపై పరిశోధన చేశారు. మొదటి గ్రూప్‌లో 27 మందిని(65 ఏళ్లు దాటినవారు), రెండో గ్రూప్‌లో 29 మందిని(25 ఏళ్ల యువకులు), మూడో గ్రూప్‌లో 127 మంది వయో వృద్ధులను తీసుకున్నారు. విపత్తుల వంటి ప్రతికూల పరిస్థితుల కారణంగా మానసికంగా బాధపడుతున్న వారి వీడియో క్లిప్పులను, తటస్థ మానసిక వైఖరి ఉన్నవారి వీడియో క్లిప్పులను చూపించారు. యువకులతో పోలిస్తే వయో వృద్ధుల మెదడు త్వరగా ఉత్తేజితం చెంది, ప్రతికూల భావోద్వేగాలకు గురవుతున్నట్లు ఫంక్షనల్ ఎంఆర్ఐ ద్వారా గమనించారు. వారి మనసులో సైతం ఆందోళన, కుంగుబాటు, ఒత్తిడి వంటి విపరీత భావాలు ఏర్పడుతున్నట్లు గుర్తించారు. అలాంటి ప్రతికూల భావోద్వేగాలను నియంత్రించుకుంటే ఆందోళన, ఒత్తిడి సైతం తగ్గుముఖం పడుతున్నట్లు కనిపెట్టారు. అధ్యయనం వివరాలను నేచర్ ఏజింగ్ పత్రికలో ప్రచురించారు. -
మనుషులకే కష్టాలు.. మానులకు కాదు! ఈ నాలుగు ప్రాక్టీస్ చేయండి చాలు!
Sakshi Funday Cover Story: కష్టాలు మనుషులకు కాకుండా.. మానులకొస్తాయా! ఓదార్పు కోసం పెద్దవాళ్లు చెప్పే సాధారణమైన మాటిది. నిజమే కానీ.. సమాజంలో ఒకరిద్దరికి కష్టాలొస్తే ఇలాంటి ఓదార్పు మాటలు ఉపయోగపడతాయి! కానీ.. వందలో 42 మందికి తాము కష్టాల్లోనే బతుకీడుస్తున్నట్లు అనిపిస్తే? ఆ దుఃఖంలోనే వారు కుంగి కృశించి పోతూంటే.. అప్పుడు ఆ కష్టాలకు పెట్టుకోవాల్సిన పేరు.. ఒత్తిడి. ఇంగ్లిష్‌లో చెప్పుకుంటే స్ట్రెస్! ప్రపంచ దేశాలన్నింటిలోనూ అతిసామన్యమైపోతున్న ఈ మానసిక సమస్య గురించి భారత్‌లో చాలా తక్కువమందికి మాత్రమే తెలుసు. చాలామంది... పైన చెప్పుకున్నట్లు ఓదార్పు మాటలతోనే సరిపెట్టుకుంటున్నారు. అందుకే.. ఆందోళనకరమైన ఈ సమస్య ఆనుపానులు సులువుగా... సచిత్రంగా!!! సాధనం-1: గ్రౌండింగ్ గ్రౌండింగ్ అంటే మీతో మీరు కనెక్ట్ కావడం. అంటే.. మీ శరీరం, ఆలోచనలు, భావాలు, పరిసరాలతో కనెక్ట్ కావడం. మీరు భావోద్వేగాల తుఫానులో కొట్టుకుపోతున్నప్పుడు నెమ్మదిగా మీ పాదాలను నేలకు ఆనించండి. భూమితో కనెక్ట్ అవ్వండి. తర్వాత మీ దృష్టిని శ్వాసపై నిలపండి. ఆ తర్వాత మీ చుట్టూ ఉన్న పరిసరాలను గమనించండి. మీరు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో, ఏం చూస్తున్నారు, ఏం వింటున్నారు, ఏం వాసన, రుచి చూడగలరనే విషయాన్ని శ్రద్ధగా గమనించండి. అంటే మీరు మీ ఆలోచనల నుంచి దూరంగా జరిగి.. మీతో, మీ చుట్టూ ఉన్న పరిసరాలతో మమేకం అవండి. గ్రౌండింగ్ అంటే సింపుల్‌గా ఇంతే. గ్రౌండింగ్‌ను ప్రాక్టీస్ చేయడానికి ప్రత్యేక సమయం అవసరంలేదు. ఒకటి రెండు నిమిషాలు చాలు. ప్రతిరోజూ మీరు తినడం, వంట చేయడం లేదా నిద్ర పోవడం వంటి పనులకు ముందు గ్రౌండింగ్ ప్రాక్టీస్ చేయవచ్చు. అలా ప్రాక్టీస్ చేసినప్పుడు మీరు ఆలోచనల నుంచి బయటపడి, ఒత్తిడికి దూరంగా ఆనందంగా మారడాన్ని గమనించవచ్చు. మొదట చిన్న చిన్న పనులకు ముందు గ్రౌండింగ్ ప్రాక్టీస్ చేస్తే ఆ తర్వాత క్లిష్ట పరిస్థితుల్లో గ్రౌండింగ్ ఉపయోగించడం సులభం అవుతుంది. సాధనం-2: అన్ హుకింగ్ అన్ హుకింగ్ అంటే మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తున్న ఆలోచనల గాలం నుంచి తప్పించుకోవడం. మూడు దశల్లో ఆ పని చేయవచ్చు. మొదట మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తున్న ఆలోచన లేదా ఫీలింగ్‌ను గుర్తించండి. తర్వాత దాన్ని ఉత్సుకతతో గమనించండి. ఆ తర్వాత ఆ ఆలోచనకు లేదా అనుభూతికి ఓ పేరు పెట్టండి. ఇలా ఆలోచనలను, అనుభూతులను దూరంగా ఉండి గమనించడం, వాటికో పేరు పెట్టడం వల్ల.. మీరు, మీ ఆలోచనలు ఒకటి కాదనే స్పృహæ కలుగుతుంది. అది మిమ్మల్ని ఒత్తిడి నుంచి దూరంగా పెడుతుంది. ఆ తర్వాత మీతో ఎవరున్నారో, మీరేం చేస్తున్నారో దానిపై దృష్టి పెట్టండి. సాధనం-3: విలువలపై స్పందించడం ప్రతి మనిషికీ కొన్ని విలువలుంటారు. మీకు అత్యంత ముఖ్యమైన విలువలేమిటో ఎంచుకోండి. ఉదాహరణకు ప్రేమ, పని, ధైర్యం, దయ, కష్టపడి పనిచేయడం.. ఇలా చాలా! వీటికి దూరంగా జరగాల్సిన పరిస్థితుల్లో ఒత్తిడి కలుగుతుంది. ఆ ఒత్తిడిని తగ్గించుకోవాలంటే ముందుగా మీరు ముఖ్యమైన నాలుగైదు విలువలేమిటో నిర్ణయించుకోండి. వచ్చే వారమంతా మీ విలువలకు అనుగుణంగా పనిచేసే ఒక చిన్న మార్గాన్ని ఎంచుకోండి. మీ విలువలకు అనుగుణంగా జీవించండి. మీరు పాటించలేని విలువల గురించి ఒత్తిడికి గురికాకుండా, మార్చగలిగే వాటిని మార్చండి. మార్చలేని వాటిని వదిలేసి ముందుకు సాగండి. సాధనం-4: ప్రేమతో నింపుకోండి మీరు మీ పట్ల ప్రేమతో, దయతో ఉంటే ఒత్తిడిని అధిగమించడానికి కావాల్సిన శక్తి మీకు వస్తుంది. ఆ ప్రేమ, దయ ఆకాశం నుంచి ఊడిపడవు. మీరే ఊహించుకోవాలి, సృష్టించుకోవాలి. మీ మెదడుకు ఊహకు, వాస్తవానికీ ఉన్న తేడా తెలియదు. కాబట్టి మీరు జస్ట్ ఊహించుకున్నా చాలు దానికి అనుగుణంగా స్పందిస్తుంది. అందుకే మీ దోసిటి నిండా ప్రేమ లేదా దయ ఉన్నట్లు ఊహించండి. దాన్ని ఏ ఆకారంలో ఊహించుకుంటారనేది మీ ఇష్టం. తర్వాత, మీ శరీరంలో బాధ అనిపించే చోట చేతులుంచండి. మీ చేతుల నుంచి శరీరంలోకి ప్రవహించే ప్రేమను, దాని వెచ్చదనాన్ని అనుభవించండి. ఆ ప్రేమ ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. -
అక్కలకు ఇంకా పెళ్లి కాలేదు! కుటుంబం ఇలా.. ఒత్తిడిలో సాఫ్ట్వేర్ ఇంజినీర్.. పరిష్కారం?
జీవన శైలి మారింది.. పర్యవసానంగా వచ్చిన.. వస్తున్న శారీరక సమస్యల మీదే మన దృష్టి అంతా! అదే తీవ్రత మానసిక ఆరోగ్యం మీదా ఉంది.. కానీ అది అవుట్ ఆఫ్ ఫోకస్లో ఉంది! ఫలితంగా సమాజమే డిప్రెషన్లోకి వెళ్లొచ్చు! వెళ్లకూడదు అనుకుంటే మానసిక సమస్యలు, రుగ్మతల మీద సాధ్యమైనంత వరకు చర్చ జరగాలి.. కౌన్సెలింగ్, వైద్యం దిశగా ప్రయాణం సాగాలి! ఆ ప్రయత్నమే ఈ కాలమ్!! ఆనంద్ 28 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజినీర్. హైదరాబాద్‌లో ఉద్యోగం. తన ఫ్రెండ్ కుమార్‌తో కలసి మాదాపూర్‌లో ఒక డబుల్ బెడ్ రూమ్‌లో ఉంటున్నాడు. రోజూ ఉదయాన్నే జాగింగ్‌కు, అట్నుంచటే జిమ్‌కు వెళ్లేవాడు. ఇరుగుపొరుగు కనిపిస్తే నవ్వుతూ పలకరించే వాడు. నీట్‌గా రెడీ అయ్యి, తన కొత్త బైక్‌పై ఆఫీస్‌కి వెళ్లేవాడు. అక్కడ కొలీగ్స్ అందరితో సరదాగా ఉండేవాడు. వారానికి ఐదురోజులు పనిచేయడం, వీకెండ్స్‌లో ఫ్రెండ్స్‌తో కలసి ఔటింగ్‌కి వెళ్లడం అలవాటు. అయితే గత రెండు నెలలుగా ఆనంద్ ప్రవర్తన మారిపోయింది. రూమ్మేట్ కుమార్‌తో మాట్లాడటం తగ్గించేశాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నాడు. స్నానం చేయడం లేదు, సరిగా డ్రెస్ చేసుకోవడం లేదు. అత్యవసరమైతే తప్ప రూమ్ దాటి బయటకు వెళ్లట్లేదు. అన్నీ ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకుంటున్నాడు. కుమార్‌కు ఇదంతా కొత్తగా అనిపించింది. అడిగితే ‘‘నేను బాగానే ఉన్నాను’’ అని చెప్తున్నాడు. ..కానీ బాగాలేడు.. క్రమేపీ ఆనంద్‌కు ఆరోగ్య సమస్యలూ మొదలయ్యాయి. తరచూ తలనొప్పి, ఒళ్లు నొప్పులంటూ బాధపడుతున్నాడు. అస్సలు నిద్రపోవడంలేదు. అల్సర్ వచ్చింది. డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కూడా మొదలయ్యాయి. గుండె దడగా ఉంటోందంటున్నాడు. వర్క్ విషయంలోనూ ఆఫీసు నుంచి కంప్లయింట్స్ వస్తున్నాయి. అలాగే వదిలేస్తే ఏమై పోతాడోననే భయంతో కుమార్ బలవంతంగా ఆనంద్‌ను కౌన్సెలింగ్‌కి తీసుకువచ్చాడు. కౌన్సెలింగ్‌లో భాగంగా ఆనంద్ కుటుంబం, గతం గురించి తెలుసుకున్నాను. అతనికి ముగ్గురు అక్కలు. లేకలేక పుట్టిన మగబిడ్డ కావడంతో పేరెంట్స్ చాలా గారాబం చేసేవారు. ఆనంద్ 12 ఏళ్ల వయసులో తండ్రి చనిపోవడంతో కుటుంబం అతలాకుతలమైంది. తల్లి, అక్కలు ఏదో ఒక జాబ్ చేస్తే తప్ప గడవని పరిస్థితి. ఆనంద్‌కు ఉద్యోగం వచ్చాకే కుటుంబం ఊపిరి పీల్చుకుంది. కానీ అక్కలకు ఇంకా పెళ్లి కాకపోవడం ఆనంద్‌పై తెలియని ఒత్తిడిని పెంచింది. అక్కలకు పెళ్లి కాదేమో, వాళ్లకు పెళ్లి చేయకుండా తాను పెళ్లి చేసుకోలేడు కాబట్టి, తనకు జీవితంలో పెళ్లి కాదేమోననే ఆందోళన మొదలైంది. అది అతని ఆలోచనలన్నింటినీ ఆక్రమించేసింది. దీన్నే జనరలైజ్డ్ యాంగ్జయిటీ డిజార్డర్ లేదా GAD అంటారు. ఆనంద్ ఆలోచనల్లో, ప్రవర్తనలో మార్పులన్నీ ఈ డిజార్డర్ వల్ల వచ్చినవే. ఆరుగురిలో ఒకరు.. ఇది ఆనువంశికంగా వచ్చి ఉండవచ్చు. లేదా జీవితంలో ఎదురైన అనుభవాలు, వ్యక్తిత్వ లక్షణాల వల్లా కావచ్చు. ఆనంద్ తల్లి కూడా ఇలాగే ప్రతి చిన్న విషయానికీ ఆందోళన చెందుతుంటుందని అతని మాటల్లో తెలిసింది. దానికితోడు చిన్నప్పుడే తండ్రిని కోల్పోవడం, కుటుంబ కష్టాలు, అక్కల పెళ్లిళ్లు.. అవన్నీ అతన్ని ఆందోళనలోకి నెట్టేశాయి. ఎలాంటి సపోర్ట్ సిస్టమ్ లేకపోవటం, ఆందోళనను తగ్గించుకునే ప్రయత్నాలు చేయకపోవడంతో అది డిజార్డర్‌గా మారింది. వందమంది భారతీయుల్లో ఆరుగురు ఈ డిజార్డర్‌తో బాధపడుతున్నారని అధ్యయనాలు చెప్తున్నాయి. మానసిక సమస్యలకు చికిత్స లేదా కౌన్సెలింగ్ తీసుకుంటే ‘పిచ్చి’ అనే ముద్ర వేస్తారనే భయం వల్లే చాలామంది చికిత్సకు వెనుకడుగు వేస్తుంటారు. ఫలితంగా అది మరిన్ని మానసిక, శారీరక సమస్యలకు కారణమవుతుంది. అందుకే మానసికంగా ఏ మాత్రం తేడాగా అనిపించినా వెంటనే చర్యలు తీసుకోవడం అవసరం. జనరలైజ్డ్ యాంగ్జయిటీ డిజార్డర్ లక్షణాలున్నవారు దాన్నుంచి బయటపడేందుకు చేయాల్సిన పనులు.. ►ఆందోళన కలిగించే ఆలోచనలను ఒక జర్నల్‌లో రాసుకోవాలి. వాటిని గమనిస్తే.. మీకు వస్తున్న చాలా ఆలోచనలు నిజం కావడంలేదని అర్థమవుతుంది. అది మీకు ధైర్యాన్నిస్తుంది, ఆందోళనను తగ్గిస్తుంది. ►క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. దానివల్ల మెదడులో విడుదలయ్యే సెరటోనిన్ మూడ్‌ను మెరుగుపరుస్తుంది. కనీసం వారానికి ఐదురోజులు, రోజుకు అరగంట వ్యాయామం చేయాలి. ►ఆందోళనకూ శ్వాసకూ సంబంధం ఉంది. ఆందోళనలో ఉన్నప్పుడు శ్వాస వేగమవ్వడం గమనించవచ్చు. అందువల్ల బ్రీతింగ్ ఎక్సర్సైజ్ను రోజూ ప్రాక్టీస్ చేయాలి. మెడిటేషన్ కూడా ఉపయోగ పడుతుంది. ఇవన్నీ చేసినా ఆందోళన తగ్గకపోతే ఏమాత్రం బెరుకులేకుండా సైకాలజిస్టును సంప్రదించండి. ►మనదేశంలో వందలో ఏడుగురు ఏదో ఒక మానసిక సమస్యతో బాధపడుతున్నారు. వారిలో 80శాతం మంది ఎలాంటి చికిత్స తీసుకోవడంలేదు. మానసిక సమస్యల పట్ల అవగాహన లేకపోవడం, సమస్యను బయటకు చెప్పుకుంటే ‘పిచ్చి’ అనే ముద్ర వేస్తారనే భయమే ఇందుకు కారణం. ఎలాంటి భయం లేకుండా మీ సమస్యను కింద ఇచ్చిన ఐడీకి మెయిల్ చేయవచ్చు. పరిష్కారమార్గం చూపిస్తాం. -సైకాలజిస్ట్ విశేష్(psy.vishesh@gmail.com) చదవండి: Jeelakarra Health Benefits: జీలకర్ర వేసి కాచిన గోరువెచ్చని నీటిని రోజూ పరగడుపున తాగితే జరిగేది ఇదే! ఈ విషయాలు తెలిస్తే.. Health Tips: క్యాన్సర్‌కూ, గుండెజబ్బులకూ ఒకేలాంటి రిస్క్ ఫ్యాక్టర్లు... మామోగ్రామ్‌తో.. -
Health: రోజూ స్కిప్పింగ్ చేసే అలవాటుందా? ఈ విషయాలు తెలిస్తే
Skipping- Health Benefits: వర్కవుట్స్ మన ఆరోగ్యానికి చాలా అవసరం. ఇవే మనల్ని ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంచుతాయి. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తగ్గించగలవు. అయితే అందరూ వర్కవుట్స్ చేయలేరు. అలాగని వర్కవుట్స్ చేయకుంటే స్థూలకాయంతో సహా రకరకాల సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం పొంచి ఉంది. ఈ తలనొప్పంతా మాకెందుకులే అనుకుంటే మాత్రం రోజూ చిన్నవో పెద్దవో వ్యాయామాలు చేయాల్సిందేనంటున్నారు నిపుణులు. అలాంటి వ్యాయామాలలో స్కిప్పింగ్ ఒకటి. దీనినే ఒకప్పుడు తాడాట అనేవాళ్లు. ఇప్పుడు స్కిప్పింగ్ అంటున్నారు. స్కిప్ చేయకుండా స్కిప్పింగ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం. కొంతమంది జిమ్ములకు వెళ్లి వ్యాయామాలు చేస్తుంటారు. అయితే సమయం లేక కొంతమంది అవి కూడా చేయకుండా స్కిప్ చేస్తుంటారు. అయితే ఇలాంటి వారు ఎంచక్కా స్కిప్పింగ్‌ను చేయొచ్చు. చిన్న తాడుతో చేసే ఈ వ్యాయామం వల్ల మాకేంటి ప్రయోజనాలు అనేవారు... అనుకునేవారు కాస్త ఆగండి.. జిమ్ముల్లో చేసే వర్కవుట్స్‌లో కష్టపడి చెమటలు చిందించే వారు ఎలాంటి ప్రయోజనాలను పొందుతారో.. స్కిప్పింగ్ వల్ల కూడా అన్ని ప్రయోజనాలను పొందుతారని ఫిట్నెస్ నిపుణులంటున్నారు. స్కిప్పింగ్‌ను ఎంచక్కా ఇంట్లో ఉండే చేసుకోవచ్చు. ఇంట్లో చేసే స్కిప్పింగ్ వల్ల ఏం లాభాలుంటాయని తేలిగ్గా తీసిపారేయకండి.. ఇది ఎన్నో రోగాలను ఇట్టే తగ్గించేయగలదు.. సులువుగా బరువు తగ్గచ్చు స్కిప్పింగ్ బరువు తగ్గాలనుకునే వారికి ఎంతో సహాయపడుతుంది. దీనివల్ల శరీరంలో ఉన్న అదనపు కేలరీలు కరిగిపోతాయి. స్కిప్పింగ్ కూడా ఒక లాంటి వ్యాయామమే. స్కిప్పింగ్ వల్ల నిమిషాలను 15 నుంచి 20 కేలరీలను బర్న్ చేస్తారు. సో వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు స్కిప్పింగ్ ను చేస్తే మంచి ఫలితాలను పొందుతారు. గుండె బాగుంటుంది స్కిప్పింగ్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. స్కిప్పింగ్ వల్ల హృదయ స్పందన రేటు పెరుగుతుంది. తద్వారా గుండె ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదు ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. మెదడు పనితీరు మెరుగు స్కిప్పింగ్ మెదడుపై అనుకూల ప్రభావాన్ని చూపెడుతుంది. ఎందుకంటే మీరు జాగ్రత్తగా జంప్ చేసేలా మెదడు సంకేతాలను పంపిస్తుంది. ఈ శ్రద్ధ మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బద్దకాన్ని వదిలిస్తుంది స్పిప్పింగ్ చేసే మొదట్లో బాగా అలసిపోయినట్టుగా అనిపిస్తుంది. కానీ రోజూ స్కిప్పింగ్ చేయడం వల్ల శరీరం హుషారుగా మారుతుంది. ఇది మీ అలసటను పోగొట్టడమే కాదు.. మిమ్మల్ని రీఫ్రెష్ గా ఉంచుతుంది. అందుకు బద్దకంగా, ఎప్పుడూ విసుగ్గా ఉండేవారు స్కిప్పింగ్ ను రోజూ చేయండి. స్ట్రెస్‌ను తగ్గిస్తుంది ఈ రోజుల్లో ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక ఆరోగ్య సమస్యలు ఎక్కువ అయ్యాయి. ఈ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో స్కిప్పింగ్ ముందుంటుంది. ఎందుకంటే ఇది మానసిక స్థితిని మెరుగుపరిచే ఎండార్ఫిన్ల ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది.. స్కిప్పింగ్ చేసే అలవాటు మీకు లేకపోతే వెంటనే అలవాటు చేసుకోండి. మీ పిల్లలకు కూడా స్కిప్పింగ్ చేయడాన్ని ప్రాక్టీస్ చేయించండి. వారితోపాటు మీరు కూడా పోటీ పడి స్కిప్పింగ్ చేస్తూ ఉత్సాహంగా... ఉల్లాసంగా ఉండండి. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యం మీద అవగాహన కోసం మాత్రమే! చదవండి: Health Tips: నీరసం.. నిస్సత్తువా? వీటిని ఆహారంలో చేర్చుకున్నారంటే.. రాత్రిపూట పదే పదే మూత్ర విసర్జన: కెఫిన్, శీతల పానీయాలు.. ఇంకా వీటికి దూరంగా ఉండకపోతే -
Kanala hindola: ఆటలకు మానసిక బలం
ఆటల్లో ఒకరు గెలిస్తే మరొకరు ఓడాలి. గెలిచినప్పుడు పొంగిపోకుండా ఓడినప్పుడు కుంగిపోకుండా ఉండగలిగేవారు స్పోర్టివ్ స్పిరిట్ ఉన్నావారు. కాని అందరూ అలా ఉండరు. ఆటల్లో రాణించాలంటే వారిని ఓటమి భయం వెంటాడుతూ ఉంటుంది. ప్రత్యర్థి గురించి ఆందోళనలు ఉంటాయి. చిన్నపిల్లల దగ్గరి నుంచి సీనియర్ ఆటగాళ్ల వరకూ ఈ ఒత్తిడి తప్పించుకోని వారు ఉండరు. మరి వీరికి సాయం? హిందోళ వంటి స్పోర్ట్స్ సైకాలజిస్ట్‌ను కలవడమే. ‘మైండ్ లీడ్’ అనే ప్రోగ్రామ్ ద్వారా ఆటగాళ్ల ఒత్తిడిని తొలగిస్తూ వారికి అవసరమైన మానసిక బలం అందిస్తోంది హైదరాబాద్ వాసి హిందోళ. ‘స్పోర్ట్స్ సైకాలజీ అనేది ఒకటుంటుందని మనలో చాలా మందికి తెలియకపోవచ్చు. దాని అవసరం ఏముందిలే అనుకోవచ్చు. కానీ ఈ రంగంలో ఈ సైకాలజీ అవసరం ఎంతో ఉంది’ అంటోంది హైదరాబాద్ మాదాపూర్‌లో ఉంటున్న హిందోళ. అందుకు డియర్ కామ్రెడ్‌లోని ఒక సీన్‌ను ఉదాహరిస్తూ.. ‘లిల్లీ క్రికెటర్‌గా రాణిస్తున్న అమ్మాయి. రాష్ట్రస్థాయి క్రీడాకారిణి. మంచి నైపుణ్యం ఉన్న అమ్మాయి సడెన్‌గా డిప్రెషన్ బారిన పడుతుంది. ఎవరికీ అర్థం కాదు. ఎవరూ అర్థం చేసుకోలేరు. క్రికెట్టే లోకంగా బతికిన ఆ అమ్మాయి మూడేళ్లపాటు మానసికంగా ఒంటరైపోతుంది. ఆసుపత్రి పాలైన ఆ అమ్మాయిని హీరో వచ్చి ఆమెను మానసిక వేదన నుంచి బయటికి తీసుకొస్తాడు. అందరి జీవితాల్లోనూ అలాంటి హీరోలు ఉండకపోవచ్చు. కానీ, మానసిక స్థైర్యం ఇవ్వగలిగేవాళ్లు ఉండాలి. ఇటీవల తొమ్మిదవ తరగతి చదువుతున్న ఓ అమ్మాయి బ్యాడ్మింటన్ చాలా బాగా ఆడేది. సడెన్‌గా అకాడమీకి రావడం మానేసింది. ఆ స్పోర్ట్స్ అకాడమీకి సైకాలజిస్ట్‌గా పనిచేస్తున్న నేను ఏమైందని తెలుసుకోవడానికి వారి తల్లిదండ్రులను సంప్రదించాను. తనను కష్టపెడుతున్న సమస్యలు ఆమె తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేకపోయింది. తోటి వారి నుంచి వస్తున్న కామెంట్స్ ఆమెను ఆ ఆట నుంచి తప్పుకునేలా చేశాయి. ఈ విషయంపై కొన్నిరోజుల పాటు చేసిన కౌన్సెలింగ్ ఆమెలో మార్పు తీసుకువచ్చింది. లేదంటే, ఇదే ప్రభావం ఆమె చదువుమీద ఆ తర్వాత తన కెరియర్ మీద పడుతుంది. ముఖ్యంగా అమ్మాయిలకు బయటకు చెప్పుకోలేని ఎన్నో సమస్యలు ఉంటాయి. అవి కోచ్‌ల ద్వారా కావచ్చు, తోటి క్రీడాకారుల ద్వారా కావచ్చు, ఆత్మన్యూనత కావచ్చు, మరేవిధమైన మానసిక సంఘర్షణ అయినా కావచ్చు. ఇలాంటప్పుడు స్పోర్ట్స్ సైకాలజిస్టుల మద్దతు అవసరం అవుతుంది’ అని వివరించింది ఈ మైండ్లీడ్ ఛాంపియన్. అకాడమీలో సైకాలజిస్ట్‌గా.. తను చేస్తున్న వర్క్స్, ప్రణాళికల గురించి వివరిస్తూ – ‘బెంగళూరులోని పదుకొనే ద్రావిడ్ సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్‌లెన్స్’లో పనిచేస్తున్నాను. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అథ్లెట్స్తోనూ మాట్లాడుతుంటాను. దీంతో ఏ స్థాయిలో స్పోర్ట్ సైకాలజీ అవసరం అనేది మరింత క్షుణ్ణంగా అర్ధమవుతుంది. చాలామంది క్రీడలలో మానసిక అంశాలకు సంబంధించిన విషయాలు ఎప్పుడూ పక్కన పెట్టేస్తారు. మన దేశంలో అయితే చాలా వరకు దీనిని విస్మరిస్తుంటారు. అందుకే, క్రీడాకారులందరికీ మానసిక శిక్షణను అందుబాటులో ఉంచాలని ఆన్లైన్లో మైండ్లీడ్ ప్రోగ్రామ్ ద్వారా వర్క్‌షాప్స్ నిర్వహిస్తున్నాను. బలమైన స్థితి క్రీడలకు మానసిక బలం అవసరమని విదేశీయులకు బాగా తెలుసు. అందుకే వారు ప్రతి పోటీలో స్పోర్ట్స్ సైకాలజిస్ట్‌ల గైడెన్స్ తప్పక తీసుకుంటారు. మన దేశంలో కూడా దీనిని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన దగ్గర ఇంకా రకరకాల భావజాలాలు ఉన్నాయి. అమ్మాయిలను ఓ స్థాయి వరకే క్రీడలకు పరిమితం చేస్తుంటారు. కుటుంబం, బయట, అకాడమీ, స్కూల్, కాలేజీ.. ప్రతిచోటా వెనక్కి లాగడానికే ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఈ విధానంలో మార్పులు తీసుకురావడానికి ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించాను. దీని ద్వారా అథ్లెట్లు, కోచ్‌లు, బృందాలు, తల్లిదండ్రులకు, సహాయక సిబ్బందికి వినూత్నమైన విధానంలో మానసిక శిక్షణతో పాటు కౌన్సెలింగ్ ఇస్తున్నాను. రాహుల్ ద్రావిడ్‌తో... ఈ భిన్నమైన కోర్సును ఎంచుకున్నప్పుడు మా అమ్మ మాలతి, నాన్న సుధాకర్ల మద్దతుగా నిలిచారు. వారి వల్లే ఈ రంగంలో మరింతగా కృషి చేయగలుగుతున్నాను. ఈ మైండ్ లీడ్ ప్రోగ్రామ్ ద్వారా స్కూల్స్ కాలేజీలలో వర్క్‌షాప్స్ నిర్వహించబోతున్నాను. గ్రామీణ స్థాయి క్రీడాకారులలోనూ మానసిక చైతన్యం నింపే దిశగా కృషి చేస్తున్నాను’ అని వివరించింది ఈ యువ స్పోర్ట్స్ సైకాలజిస్ట్. ఆటలు పరిచిన బాట ‘చిన్నప్పటి నుంచి నాకు ఆటల్లో ఆసక్తి ఎక్కువ. బహుశా కేంద్రీయ విద్యాలయంలో చదవడం, అక్కడ అన్ని ఆటల్లో పోటీపడటం వల్ల క్రీడలు నా జీవితంలో కీలకమయ్యాయి. నా దృష్టి ఎక్కువగా బ్యాడ్మింటన్‌పై ఉండేది. అదే నన్ను ప్రొఫెషనల్ స్పోర్ట్స్ పర్సన్స్‌కి పరిచయం చేసింది. ఈ రంగంలో కొత్త కొత్త వ్యక్తులను కలిశాను. గెలుపు కోసం ప్రయత్నించేవారితో కలిసి ఉండటం వల్ల ప్రతిరోజూ నన్ను నేను కొత్తగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. ఇందులో ఉండే చేదు అనుభవాలు, పంచుకున్నవారి వేదనలు.. ఇవన్నీ నా కెరియర్ని డిసైడ్ చేసుకునేలా చేశాయి. అందుకే, స్కూల్ చదువు పూర్తవగానే స్పోర్ట్స్ సైకాలజీ దిశగా అడుగులు వేశాను. దీనికోసం బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకాలజీ అండ్ రీసెర్చ్ నుండి సైకాలజీ, జర్నలిజం అండ్ ఉమన్ స్టడీస్‌లో డిగ్రీ చేశాను. ఆ తర్వాత స్పోర్ట్స్ సైకాలజీలో మాస్టర్స్ చేయడానికి మణిపూర్ వెళ్లాను. ఇక్కడే క్రీడలలో మైండ్‌ఫుల్‌నెస్‌పై ప్రయోగాత్మక పరిశోధన చేశాను. భారతదేశంలోని అథ్లెట్ల కోసం సొంతంగా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించాను.’ కె.హిందోళ, స్పోర్ట్స్ సైకాలజిస్ట్ – నిర్మలారెడ్డి -
కలలు కల్లలు.. కలవరపెడుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: దేశంలో ఉన్నత ప్రమాణాలున్న విద్యాసంస్థల్లో పెరిగిçపోతున్న విద్యార్థుల ఆత్మహత్యలు కలవరం రేపుతున్నాయి. ఇతర విద్యాసంస్థలకు మార్గదర్శకంగా నిలవాల్సిన ఈ సంస్థలు బ్రిలియంట్ విద్యార్థుల బలవన్మరణాలతో వివాదాల్లో చిక్కుకుంటున్నాయి. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఈ సంస్థల్లో ప్రవేశించిన విద్యార్థులు, వారి తల్లితండ్రుల కలలు కల్లలు చేస్తున్నాయి. బంగారు భవిష్యత్తును ఊహించుకుని ఆ సంస్థల్లో అడుగిడుతున్న విద్యార్థులు అక్కడ ఒత్తిడి, వివక్ష, బెదిరింపులు, సరైన మార్గదర్శనం లేక బలవంతంగా తనువులు చాలిస్తున్నారు. కట్టడి నుంచి ఒక్కసారిగా స్వేచ్ఛా ప్రపంచంలోకి ప్రవేశిస్తున్న విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటూ కన్నవారికి శోకం మిగిలిస్తున్నారు. ఇక్కడ విజయం సాధించకపోతే భవిష్యత్తు లేదన్నట్లుగా కుంగిపోతున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్సీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లతోపాటు కేంద్ర విశ్వవిద్యాలయాల్లో రాత్రింబవళ్లు కష్టపడితే గానీ సీటు రాదు. మంచి ర్యాంకులతో చేరుతున్న విద్యార్థులు అక్కడికెళ్లిన తరువాత సామాజిక పరిస్థితులు, విద్యా విధానం పూర్తి భిన్నంగా ఉండటంతో ఒత్తిడి తట్టుకోలేకపోతున్నారు. సహచరæ విద్యార్థులతో పోల్చుకుని కూడా నిరాశా నిస్పృహల్లోకి వెళ్తున్నారు. దీంతో వారు ఆత్మహత్యల వైపు మళ్లుతున్నారు. ఏనిమిదేళ్లలో 130 మంది దేశవ్యాప్తంగా గత ఎనిమిదేళ్లలో 130 మంది వరకు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. విద్యార్థుల బాగోగులను చూడాల్సిన ఆయా సంస్థల్లోని అధ్యాపకుల సరైన పర్యవేక్షణ లేకపోవడం కూడా ఓ కారణంగా చెబుతున్నారు. ఇలా బలవన్మరణాలు చేసుకుంటున్న వారిలో 60 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులే ఉండటం గమనార్హం. ఇంటర్మీడియెట్ వరకు అధ్యాపకులు పూర్తిస్థాయిలో వారికి ప్రతీ అంశంలో సహకారం అందిస్తారు. అయితే, ప్రీమియర్ విద్యాసంస్థల్లో చేరే విద్యార్థులకు అవసరమైన మానసిక ధైర్యం, అక్కడ ఎలా మసలుకోవాలి లాంటి వాటి గురించి వివరించకపోవడం వల్ల ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయన్న అభిప్రాయం ఉంది. గ్రామీణ ప్రాంతాల నుంచి వచి్చన వారు ఈ సంస్థల్లో ఎక్కువ ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. 2014 నుంచి ఇప్పటివరకు ఐఐటీల్లో 38 మంది, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 39 మంది, ఎన్ఐటీల్లో 32 మంది, ఐఐఎంలలో ఐదుగురు, ఐఐ ఎస్సీ అండ్ ఐఐఎస్ఈఆర్లో తొమ్మిది మంది, ట్రిపుల్ ఐటీల్లో నలుగురు, కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చే విద్యాసంస్థల్లో ముగ్గురు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇటీవలే ఐఐటీ హైదరాబాద్‌లో... ఇటీవలే హైదరాబాద్ ఐఐటీకి సంబంధించి ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం విదితమే. ఇక్కడ ఎంటెక్ చదువుతున్న రాహుల్ హాస్టల్ గదిలోనే మంచానికి ఉరేసుకోగా.. ఈ మధ్యనే విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న విద్యార్థి సంగారెడ్డిలో లాడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ముంబైకి చెందిన మరో ఐఐటీ విద్యార్థి కూడా హాస్టల్ గదిలోనే ఆత్మహత్య చేసుకున్నారు. కుల వివక్ష నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. కొన్ని ఘటనలు సంచలనంగా మారుతుంటే.. మరికొన్ని కేసులు పెద్దగా పట్టించుకోకుండానే ముగిసిపోతున్నాయి. విద్యార్థుల ఆత్మహత్యలకు బాధ్యులుగా గుర్తించిన వారిపై చర్యలు లేకుండా ముగుస్తున్నాయి. గత ఏప్రిల్‌లో ఖరగ్‌పూర్ ఐఐటీలో హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ బోధించే ప్రొఫెసర్ దళితులను, ఆదివాసీ విద్యార్థులను అవమానించేలా మాట్లాడటంతో పెద్దఎత్తున నిరసన పెల్లుబుకడంతో ఆ ప్రొఫెసర్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. సాధారణ విద్యార్థుల ఆత్మహత్యలూ ఎక్కువే.. దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు ఏటా పెరుగుతూనే ఉన్నాయి. 2017లో 9,905 మంది, 2020లో 12,526 మంది, 2021లో 13,089 మంది విద్యార్థులు బలవన్మరణం పొందారు. గతేడాది 18 ఏళ్లలోపు వయసున్నవారు 10,732 మంది ఆత్మహత్య చేసుకున్నారు. పరీక్షల్లో ఫెయిలవడాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వారే ఇందులో అధికంగా ఉండటం గమనార్హం. విద్యార్థుల ఆత్మహత్యలు మహారాష్ట్ర (1,834)లో ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత మధ్యప్రదేశ్ (1,308), తమిళనాడు (1,246), కర్ణాటక (855), ఒడిశా (834) నిలిచాయి. మొత్తం విద్యార్థుల బలవన్మరణాల్లో గ్రాడ్యుయేట్, ఆపైస్థాయి వారి శాతం 4.6గా ఉంది. మరో విద్యార్థి ఇలా కావొద్దు బలవన్మరణం వల్ల తల్లిదండ్రులకు శోకం మిగల్చడం తప్ప... సాధించేది ఏమీ ఉండదు. ప్రతిభ ఉన్న విద్యార్థులే ఇలాంటి విద్యాసంస్థల్లో చేరుతారు. వారికి సరైన మార్గదర్శనం ప్రొఫెసర్లు చేయాలి. మా అబ్బాయి రాహుల్ ఆత్మహత్య చేసుకునే రకం కాదు. అంతకు ముందే పుట్టిన రోజు జరుపుకున్నాడు. షిర్డి వెళ్లి వచ్చాం. ఎక్కడా డిప్రెషన్‌కు గురైనట్లు కనిపించలేదు. ప్రొఫెసర్ల ఒత్తిడి ఉండొచ్చని భావిస్తున్నా. ఏదైనా లోతుగా విచారణ జరపాలని జిల్లా ఎస్పీని కోరా. ల్యాప్‌టాప్ ఇప్పటి వరకు మాకు ఇవ్వనేలేదు. మీకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. ఆత్మహత్యలు ఎవరూ చేసుకోవద్దు. ఇది లేకపోతే భవిష్యత్తు లేదనే భావన విరమించుకోండి. –ఐఐటీ హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి తండ్రి మధుసూధన్‌రావు మానసిక ధైర్యం ప్రధానం విద్యార్థులు మానసికంగా దృఢంగా ఉండాలి. ఇంటర్ వరకు ఉన్న వాతావరణానికి æఐఐటీ, ఎన్ఐటీల్లో వాతావరణం భిన్నంగా ఉంటుంది. విద్యా బోధనలో మార్పులు ఉంటాయి. స్వేచ్ఛ ఉంటుంది. స్వతంత్రంగా నేర్చుకోవడంపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు కూడా విద్యార్థులతో మాట్లాడినప్పుడు ఎప్పుడూ చదువు కోసమేకాకుండా.. వారు మానసికంగా దృఢంగా ఉండేలా ధైర్యం చెప్పాలి. సహచర విద్యార్థులు కూడా తోటి విద్యార్థులు డిప్రెషన్లో ఉన్నట్టు తెలియగానే ధైర్యం చెప్పాలి, అధికారుల దృష్టికి తీసుకురావాలి. అప్పుడు సరైన కౌన్సెలింగ్ తీసుకుని ధైర్యం నింపేందుకు వీలవుతుంది. – ఎన్వీ రమణారావు, ఎన్ఐటీ వరంగల్ డైరెక్టర్ మెంటల్ హెల్త్ అవేర్నెస్ క్యాంపులు అవసరం వివిధ సాంస్కృతిక నేపథ్యాల్లో పెరిగిన వాతావరణానికి.. ఐఐటీల్లోని వాతావరణం పూర్తిభిన్నంగా ఉండటంతో విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారు. ఇతర నేపథ్యం నుంచి వచి్చన సహచర విద్యార్థులతో కలవలేకపోవడం, వారితో పోల్చుకుని కుంగుబాటుకు గురికావడం, తక్కువ మార్కులొస్తే క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సరైన ప్లేస్మెంట్లు రావనే భయాలు, బాగా మార్కులు తెచ్చుకుని పెద్ద పెద్ద ప్యాకేజీలు తెచ్చుకోవాలనే తల్లితండ్రుల అంచనాలు చేరుకోకపోవడం వంటివి ప్రభావం చూపిస్తున్నాయి. ఉన్నత చదువు, సంబంధిత అంశాల ఒత్తిళ్లతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడకుండా అన్ని విద్యాసంస్థల్లో ‘మెంటల్ హెల్త్ అవేర్నెస్’క్యాంపులు నిర్వహించాలి. విద్యార్థులు ఒత్తిడికి లోనైనప్పుడు ఏ లక్షణాలు కనిపిస్తున్నాయి? సహ విద్యార్థులు, ఇతరుల ద్వారా ఆయా దశలను ఎలా గుర్తించాలనే దానిపై పకడ్బందీ కార్యాచరణ రూపొందించాలి. ఐఐటీలు, ఎన్ఐటీల వంటి చోట్ల సైకాలజిస్టులను పెట్టినా.. ఒత్తిళ్లు, ఇతర అంశాలపై సరైన అవగాహన కలి్పంచడం లేదు. క్లాస్‌లు జరిగేప్పుడు, డైనింగ్, టీవీ హాల్ తదితర చోట్ల జనరల్ అంశాలపైనా అవగాహన కల్పించాలి. –వీరేందర్, సైకాలజిస్ట్ చదవండి: మూడు పదులు నిండకుండానే 'గుండెపోట్లు'.. కారణాలివే.. -
Divine Space: శ్వాసపై ధ్యాస
రోజుకు ఉన్నది ఇరవై నాలుగ్గంటలు. పాతిక గంటలు చేసినా తరగనన్ని పనులు. ఇదీ నేటి ఫాస్ట్ లైఫ్... బతుకు చిత్రం. ప్రతి ఒక్కరికీ ఒత్తిడి పెరుగుతోంది. మెదడు తన వంతుగా హెచ్చరిక చేస్తుంది. గమనించే తీరిక ఉండదు మనిషికి. ఊపిరి సలపనివ్వనన్ని పనులు. ఆరోగ్యాన్ని హరిస్తున్న బిజీ లైఫ్‌లో ధ్యాసతో ఊపిరి పీల్చమంటున్నారు అర్పిత. మోడరన్ లైఫ్‌లో మనిషి జీవితం... మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నట్లు కూడా గమనించలేని స్థితిలోనే ఎక్కువ భాగం గడిచిపోతోంది. కొన్నిసార్లు సమస్య మానసికమైనదా, శారీరకమైనదా అనే స్పష్టత కూడా ఉండదు. డాక్టర్ దగ్గరకు వెళ్లి టెస్టులు చేయించుకుని మందులతో నయం చేసుకోవాల్సిన అనారోగ్యం కూడా చాలా సందర్భాల్లో ఉండదు. అలాగని మనశ్శాంతి కోసం ధార్మిక సత్సంగాలతో కాలం గడిపే విశ్రాంత జీవనమూ కాదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పరుగులు తీయక తప్పదు. ఈ పరిస్థితికి సమాధానం డివైన్ స్పేస్‌లో దొరుకుతోంది. ఒత్తిడుల మధ్య జీవిస్తూనే తేలికగా జీవించగలగడం ఎలాగో తెలిపే ఒక వేదిక ఇది... అంటున్నారు అర్పితా గుప్తా. విభిన్నమైన రంగాన్ని ఎంచుకుని సమాజహితం కోసం పని చేస్తున్న అర్పితా గుప్తా పరిచయం. గాలి పీల్చడం తెలియాలి! ‘‘సైకాలజీ, ఫిలాసఫీ, స్పిరిచువాలిటీ కలగలిసిన వేదిక ఇది. కెరీర్లో కొనసాగుతూనే వారానికో గంట సమయం కేటాయించుకోవడం అన్నమాట. మా నాన్న డాక్టర్, అమ్మ టీచర్. మా ఇంట్లో ఎవరూ ఈ ఫీల్డ్‌లో లేరు. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించడం అలవాటైంది నాకు. మొదటి నుంచి అలాగే ఉండేదాన్ని. పుట్టింది పెరిగింది హైదరాబాద్‌లోనే. ఇంటర్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ కొంతమంది పార్ట్‌టైమ్ జాబ్‌లు చేయడం చూసి నేను కూడా ఒక ఇరిగేషన్ కంపెనీలో చేరాను. డిగ్రీ వరకు అంతే... చదువు ఉద్యోగం రెండూ. పెళ్లి తర్వాత చదువు, ఉద్యోగం రెండూ మానేసి ఇంట్లో ఉన్నాను. నాకు అది ఒక టర్నింగ్ పాయింట్. 1998–99 సంవత్సరాల్లో రేఖీ సాధన ట్రెండింగ్‌లో ఉండేది. పక్కింటి ఆవిడ వెళ్తూ నన్ను పిలిచింది. ఆ ప్రాక్టీస్‌తో నా ఆలోచనా ధోరణి మారిపోయింది. త్రీ లెవెల్స్ వరకు ప్రాక్టీస్ చేసి మానేశాను. ఓ ఏడాదిపాటు మళ్లీ గృహిణిగా, పిల్లల్ని పెంచుకుంటూ రొటీన్ లైఫ్. అయితే ఆ గ్యాప్‌లో ఫ్రెండ్స్, బంధువులు తలనొప్పి, మైగ్రేన్, డయాబెటిక్, ఎసిడిటీ వంటి సమస్యలకు రెమిడీ అడిగేవారు. శ్వాస తీసుకోవడం కరెక్ట్‌గా వస్తే జీవక్రియలన్నీ సక్రమంగా ఉంటాయి. గంట నుంచి ఒకటిన్నర గంట హీలింగ్ సెషన్ లో శ్వాస సాధన చేయించడమే వైద్యం. ఇంట్లో మూడు వారాలు ప్రాక్టీస్ చేస్తే ఇక అదే అలవాటయిపోతుంది. ఇలా మొదలైన సర్వీస్ ఆ తర్వాత చారిటబుల్ ట్రస్ట్‌గా రూపాంతరం చెందింది. అవి బంధాలే– బంధనాలు కాదు! ఇటీవల అమ్మాయిల్లో చాలా మంది పెళ్లంటే భయపడుతున్నారు. పెళ్లి చేసుకున్నప్పటికీ భర్తతో అన్యోన్యంగా ఉండలేకపోతున్నారు. బాల్యంలో సెక్యువల్ అబ్యూస్‌కి గురి కావడమే ప్రధాన కారణం అయి ఉంటుంది. మగవాళ్ల మీద ఏహ్యభావం పేరుకుపోయి ఉంటుంది. భర్తతో సరిగ్గా మెలగలేకపోతుంటారు. ఈ పరిస్థితులు అనేక అపార్థాలకు, విడాకులకు దారి తీస్తున్నాయి. ఆ అమ్మాయి ఓపెన్ అయ్యే వరకు ఆమెకు ఆలంబనగా నిలవాలి. మొదట తన దేహాన్ని తాను ప్రేమించుకునేటట్లు కౌన్సెలింగ్ ఇవ్వాలి. వైవాహిక జీవితాన్ని స్వాగతించడానికి మానసికంగా సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఇక మధ్య వయసు గృహిణుల్లో... ఎంప్టీనెస్ట్ సిండ్రోమ్ చాలా పెద్ద సమస్య. ఆర్థిక సమస్యలు ఉండవు, ఆరోగ్య సమస్యలూ ఉండవు. ఏమీ తోచని స్థితి నుంచి దేహంలో ఏదో ఒక అనారోగ్యం ఉన్నట్లు భావిస్తుంటారు. పిల్లలు పెద్దయి చదువు, ఉద్యోగాలతో వేరే ప్రదేశాలకు వెళ్లిపోయిన తర్వాత ఇంట్లో భార్యాభర్తలు మాత్రమే మిగులుతారు. మగవాళ్లు దాదాపుగా రోజంతా బయట పనుల్లో నిమగ్నమై ఉంటారు. ఆడవాళ్లు ఇంట్లో రోజంతా ఒంటరిగా గడపలేక ఏదో కోల్పోయినట్లవుతారు. అలాంటి వాళ్లను ‘మీకు ఏ కూర ఇష్టం’ అంటే వెంటనే సమాధానం చెప్పలేరు. భర్త ఇష్టాలు, పిల్లల ఇష్టాలను టక్కున చెప్పేస్తుంటారు. తమకంటూ జీవితం ఉందనే వాస్తవాన్ని కూడా గ్రహించకుండా యాభైఏళ్లపాటు జీవించేసి ఉంటారు. సెల్ఫ్ లవ్ అనే భావనే ఉండదు వాళ్ల మనసులో. మన సమాజం ఆడవాళ్లను అలా పెంచేసింది మరి. అలాగే ఆఫీసుల్లో ఆడవాళ్లకు ఎమోషనల్ అబ్యూజ్ మరో రకమైన సమస్య. ఇవన్నీ ఇలా ఉంటే... అత్తగారి హోదా వచ్చేటప్పటికి విచిత్రంగా మారిపోతుంటారు. ‘మేము వీకెండ్ సినిమాకు వెళ్తే మా అత్తగారు ఒప్పుకునే వారు కాదు. ఎంత బాధగా అనిపించేదో’ అని గుర్తు చేసుకుంటూ తాను మాత్రం కోడలి విషయంలో అలా ఉండకూడదు... అని నిర్ధారించేసుకుంటారు. ఇక కోడలితో ‘సండే సినిమాకు వెళ్లండి’ అని పదే పదే చెబుతుంటారు. సినిమాకు వెళ్లాలని ఆ కోడలికి ఉందా లేదా అనే ఆలోచన ఉండదు. ఇలాంటి ఎన్నో సున్నితమైన సమస్యలకు పరిష్కారం తమంతట తాముగా తెలుసుకోగలిగినట్లు చేయడమే నా సర్వీస్. నేనిచ్చే పాతిక ప్రశ్నలకు సమాధానాలు నిజాయితీగా రాసుకుంటే చాలు... బంధాలు అనుబంధాలుగా ఉండాలి తప్ప బంధనాలుగా ఉండకూడదని వాళ్లే తెలుసుకుంటారు. కుటుంబ బంధాలు బలపడతాయి’’ అని చెప్పారు అర్పితా గుప్తా. భయం కాదు... భరోసానివ్వాలి! కొంతమందికి క్లోజ్డ్ లిఫ్ట్ అంటే భయం. బలవంతంగా తీసుకువెళ్లినా కూడా ఊపిరాడనట్లు సతమతమవుతారు. ఇంట్లో వాళ్లు జాగ్రత్త కొద్దీ ‘లిఫ్ట్‌లోకి వెళ్లకు, నీకు ఊపిరాడదు’ అని భయపెడుతుంటారు. లిఫ్ట్‌లో ఏ ప్రమాదమూ రాదని ధైర్యం చెప్పాలి. వారిలో ఆ భయాన్ని పోగొట్టాలంటే ఆత్మీయంగా మాట్లాడాలి. మాటల్లో మాటలుగా ఎప్పటికో అసలు విషయం బయటపడుతుంది. చిన్నప్పుడు ఎప్పుడో తలుపులు, కిటికీలు మూసి ఉన్న గదిలో బంధీ అయి ఉక్కిరి బిక్కిరి కావడం వంటివేవో కారణాలు ఉంటాయి. ఒక పేషెంట్ కోసం గంట– రెండు గంటలు కేటాయించడం డాక్టర్లకు సాధ్యం అయ్యేపని కాదు, అంతేకాదు, ఇలాంటి ఫోబియాలున్న వాళ్లలో చాలామంది పేషెంట్ అనిపించుకోవడం ఇష్టంలేక డాక్టర్ దగ్గరకు వెళ్లరు. ఒక స్నేహితురాలిగా వాళ్లకు ఇష్టమైన టాపిక్ మాట్లాడుతూ వాళ్లంతట వాళ్లే ఓపెన్ అయ్యేలా చూడాలన్నమాట. – అర్పితా కె గుప్తా, చైర్ పర్సన్, డివైన్ స్పేస్ చారిటబుల్ ట్రస్ట్, సైనిక్‌పురి, సికింద్రాబాద్ – వాకా మంజులారెడ్డి – ఫొటోలు: నోముల రాజేశ్ రెడ్డి -
చదువులో ఒత్తిడికి గురై విద్యార్థిని ఆత్మహత్య
భాగ్యనగర్‌కాలనీ: చదువులో త్రీవ ఒత్తిడికి గురై ఓ విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వైజాగ్‌కు చెందిన విశ్వనాథం కుమార్తె హర్షిత (19) ఆరు నెలల క్రితం నగరానికి వచ్చి కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీలో నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నది. హర్షితతో పాటు అనన్య అనే మరో విద్యార్థినికి కాలేజీ హాస్టల్లో 206 నెంబర్ రూమ్ కేటాయించారు. ఆదివారం జేఈఈ మెయిన్స్ పరీక్ష ఉండటంతో అనన్యను తల్లిదండ్రులు వచ్చి తీసుకెళ్లారు. హర్షిత తండ్రి విశ్వనాథం ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కళాశాలకు ఫోన్ చేసి కూతురితో మాట్లాడారు. అనంతరం హర్షిత రూమ్‌కి వెళ్లింది. కొద్దిసేపటి తర్వాత విద్యార్థులందరినీ యూనిట్ పరీక్షకు పిలుస్తున్నారని వార్డెన్ స్వరూప హర్షిత గదికి వెళ్లి పిలువగా గడియ వేసి ఉంది ఎంతకూ తలుపు తీయలేదు. దీంతో కళాశాలలో పనిచేస్తున్న హరి, దేవదాస్‌ల సహాయంలో తలుపులు పగులగొట్టి తెరిచి చూడగా నల్ల చున్నీతో సీలింగ్ ఫ్యాన్‌కి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న కూకట్పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతికి గల కారణాలపై ఆరాతీశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: వివాహేతర సంబంధం: ఏం జరిగిందో కానీ చివరకు..) -
టీనేజ్ స్ట్రెస్. ఒత్తిడిని చేత్తో తీసేయడం కుదరదు... కానీ!
జూన్ నెల వచ్చేసింది. కొత్త విద్యాసంవత్సరం మొదలు. పాత సమస్యలే కొత్తగా పుట్టుకొస్తాయి. ‘నేను కాలేజ్‌కి వెళ్లను’ అనిపిస్తుంది టీనేజ్ స్ట్రెస్. ఒత్తిడిని చేత్తో తీసేయడం కుదరదు... కానీ మంచి మాటలతో... ఒత్తిడి మూలాలకు మందు వేయవచ్చు వేసవి సెలవులు పూర్తవుతున్నాయి. అకడమిక్ క్యాలెండర్ మొదలవుతోంది. కొన్ని విద్యాసంస్థలు ఇప్పటికే క్లాసులు మొదలు పెట్టేశాయి. కొన్ని కొత్త విద్యాసంవత్సరానికి సిద్ధమవుతున్నాయి. టెన్త్ పూర్తి చేసుకున్న స్టూడెంట్స్ కొత్త కాలేజీలో అడుగుపెట్టాలి. ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న వాళ్లు గ్రాడ్యుయేషన్ కాలేజీల బాటపట్టాలి. అప్పటివరకు ఆత్మీయతలు పంచుకున్న స్నేహితులు మరోచోట చేరిపోయి ఉంటారు. కొత్త వాతావరణానికి అలవాటు పడాలి. కొత్త మనుషుల మధ్య మెలగాలి. కొత్త వాళ్లలో స్నేహితులను వెతుక్కోవాలి. కొత్త మిత్రులు అర్థం అవుతున్నట్లే ఉంటారు, అలాగని పూర్తిగా అర్థం కారు. గతంలో స్నేహితులు, శత్రువుల్లా కొట్టుకున్న తోటి విద్యార్థులు గుర్తు వస్తారు. అప్పటి శత్రువులు కూడా చాలా మంచివాళ్లనిపిస్తుంటుందిప్పుడు. అలాగని వెనక్కి వెళ్లలేరు, ముందుకు సాగాల్సిందే. ఇది చిన్న సంఘర్షణ కాదు. రెక్కలు విచ్చుకుంటున్న లేత మనసులకు అది విషమ పరీక్ష అనే చెప్పాలి. పిల్లలు రెండు రకాలు ‘‘కొత్త పుస్తకాలు, కొత్త డ్రస్‌లు, కొత్త కాలేజ్... పట్ల ఉత్సుకత, ఉత్సాహంతో ఉరకలు వేసే పిల్లలు ఒక రకం. వీళ్లలో టీనేజ్ స్ట్రెస్ వంటి ఇబ్బందులుండవు. కొత్త వాతావరణానికి అలవాటు పడడానికి బెంబేలు పడే వాళ్ల విషయంలోనే తల్లిదండ్రులు జాగ్రత్తగా మెలగాలి. టెన్త్ పరీక్షలకు ముందు పిల్లలు విపరీతమైన ఆందోళనకు గురైతే అప్పటికి ధైర్యం చెప్పి పరీక్షలు రాయించి ఉంటారు. అయితే అలాంటి పిల్లలను కాలేజ్‌లో చేర్చే ముందే వాళ్లకు తగిన కౌన్సెలింగ్ ఇప్పించాలి. కొత్త వాతావరణంలో ఇమడలేకపోవడం అనేది అలాంటి పిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. పేరెంట్స్ తమకు నచ్చిన కాలేజ్ అని, మంచి కాలేజ్ అనే పేరుందని, అక్కడ చదివితే ఐఐటీలో సీటు వస్తుందని తమకు తామే నిర్ణయించేసి ఫీజులు కట్టేస్తారు. పిల్లలు ఆ కాలేజ్‌కి వెళ్లడానికి ఇష్టపడకపోతే ఫీజు వృథా అవుతుందేమో, బిడ్డ భవిష్యత్తు ఏమవుతుందోననే ఆందోళనతో పిల్లలను మరింత ఒత్తిడికి గురి చేస్తుంటారు’’ అని చెబుతున్నారు ప్రముఖ సైకాలజిస్ట్ వీరేందర్. మౌనం వీడరు ఇక్కడ విచిత్రం ఏమిటంటే... పేరెంట్స్ ఎంత సున్నితంగా అడిగినా పిల్లలు పూర్తిగా ఓపెన్ కారు. అలాగే పేరెంట్స్ ఎంతగా కౌన్సెలింగ్ ఇచ్చినా అవన్నీ నీతిసూత్రాలే అవుతుంటాయి. అందుకే పిల్లలు ‘ఎప్పుడు ఆపేస్తారా’ అన్నట్లు చికాగ్గా ముఖం పెడతారు. ఒక కాలేజ్ కుర్రాడు కరోనా సమయంలో ఆన్లైన్ క్లాసులకు ఠంచన్‌గా లాప్టాప్తో సిద్ధమయ్యేవాడు. పేరెంట్స్ కూడా క్లాసులను జాగ్రత్తగా వింటున్నాడనే అనుకున్నారు. పరీక్షలు రాసిన తర్వాత తెలిసింది అస్సలేమీ చదవలేదని, పాఠాలు వినలేదని. ఆ ఏడాది మొత్తం లాప్టాప్లో వెబ్‌సీరీస్ చూశాడా కుర్రాడు. కొంతమంది జూనియర్ కాలేజ్‌లో యంత్రాల్లా చదివి చదివి విసిగిపోయి ఉంటారు. డిగ్రీ కాలేజ్‌కి వెళ్లగానే వాళ్లకందిన స్వేచ్ఛను ఎలా ఆస్వాదించాలో తెలియక అనేక దురలవాట్లకు బానిసలవుతుంటారు. స్వేచ్ఛ కూడా ఒత్తిడి చేసినంత నష్టాన్ని కలిగిస్తోంది. ఆ ఒత్తిడిని ఒక్కసారిగా తీసి పక్కన పెట్టినప్పుడు వచ్చే స్వేచ్ఛతో... అన్నింటికీ ‘ఇట్స్ ఓకే’ అనే కొత్త భాష్యం చెప్పుకోవడం మొదలైంది. చదవడం లేదా, బ్యాక్‌లాగ్స్ ఉన్నాయా, క్లాసులు బంక్ కొడుతున్నారా, బ్యాక్ బెంచ్ స్టూడెంటా... అన్నింటికీ ఇట్స్ ఓకే ఫార్ములానే. దీంతోపాటు బ్యాక్లాగ్ లేని స్టూడెంట్స్ మీద కామెంట్స్ చేయడం కూడా. ఒక కప్పు కింద రెండు ప్రపంచాలు సమాజానికి ఆరోగ్యకరమైన ఒక కొత్త తరాన్ని ఇవ్వడం పేరెంట్స్ బాధ్యత. ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన కారణంగా ఈ తరం పిల్లలు పేరెంట్స్ కంటే చాలా అడ్వాన్స్డ్గా ఉంటున్నారు. చాలామంది పేరెంట్స్ ఆ డిజిటల్ ప్రపంచంలోకి ఎంటర్ కాలేని స్థితిలోనే ఉంటారు. అలాగే పేరెంట్స్ ప్రపంచంలో జీవించడానికి పిల్లలు ఇష్టపడరు. రెండు భిన్నమైన ప్రపంచాలు ఒకే ఇంట్లో నివసిస్తున్నాయిప్పుడు. ఈ క్లిష్టమైన స్థితిలో పేరెంట్స్ పిల్లలతో మరింత స్నేహంగా మెలగాల్సిన అవసరం ఏర్పడింది. టీన్స్‌లోకి రాకముందు నుంచే వాళ్లతో స్నేహితులుగా మెలగాలి. పిల్లలు చెప్పే విషయాలను అనుమానించడం మాని అర్థం చేసుకోవాలి, అర్థవంతంగా విశ్లేషించడం మొదలుపెట్టాలి. ఒక తోటలో చిగురించిన మొలకను పెకలించి మరో చోట నాటితే మొదట వాడిపోతుంది. జాగ్రత్తగా చూసుకుంటే కొత్త వాతావరణానికి అలవాటు పడుతుంది. కొత్త చివుళ్లు వేస్తుంది. కొత్త మట్టిసారంలో మరింత ఏపుగా పెరుగుతుంది. ఈ దశలో నిర్లక్ష్యంగా ఉంటే మొక్క వాడిపోతుంది. పిల్లలు కూడా మొక్కల్లాంటి వాళ్లే. టీనేజ్ స్ట్రెస్ లక్షణాలిలా ఉంటాయి అస్థిమితంగానూ ఆత్రుతగానూ ఉండడం, త్వరగా అలసటకు లోనుకావడం, తరచుగా కడుపు నొప్పి, ఛాతీ నొప్పి అని చెప్పడం, కుటుంబ సభ్యులతో కలవకుండా దూరం పెంచుకోవడం, నిద్రలేమి లేదా విపరీతంగా నిద్రపోవడం, పనులను వాయిదా వేయడం, బాధ్యతల పట్ల నిర్లక్ష్యం... పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే ఉపేక్షించరాదు. మొండి నిద్రపోతారు! కొత్త కాలేజ్‌లో అలవాటు పడలేని పిల్లల్లో ఆకలి మందగించడం, తిన్నది జీర్ణం కాకపోవడం, వాంతులు, విరేచనాలు కూడా వస్తుంటాయి. నిజానికి ఆ లక్షణాలు దేహ అనారోగ్య లక్షణాలు కావు, మానసిక ఆందోళన ప్రభావంతో ఎదురయ్యే సమస్యలు. కాబట్టి మొదట పిల్లలను జాగ్రత్తగా గమనించాలి, అది నిఘా కాకూడదు. ఎనిమిదిన్నరకు కాలేజ్‌కి రెడీ కావాల్సిన పిల్లలు ఒక్కోసారి తొమ్మిది వరకు నిద్రలేవరు. ఎంత లేపినా సరే మొండిగా నిద్రపోతుంటారు. కాలేజ్ టైమ్ దాటిన తర్వాత వాళ్లే లేస్తారు. ఆ రోజుకు ఏమీ అడగకుండా వాళ్లనలా వదిలేయడమే మంచిది. కాలేజ్‌కి వెళ్లడానికి అయిష్టత వెనుక కారణాలేమిటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. – డా‘‘ సి. వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్ , యు అండ్ మి – వాకా మంజులారెడ్డి -
టెన్త్ పరీక్షలు రాస్తున్నారా? సక్సెస్‌బాట పట్టించే సూచనలు తెలుసుకోండి
పదోతరగతి పరీక్షలు సమీపిస్తున్న వేళ విద్యార్థులు ఓ వైపు ఒత్తిడి, మరోవైపు వారిలో ఆందోళనను నివృత్తి చేసేందుకు వారికి ఉపాధ్యాయులు, అధికారులు పలు సూచనలు చేశారు. మైలార్‌దేవ్‌పల్లి (హైదరాబాద్): ఏకాగ్రత, ప్రణాళిక బద్ధంగా చదివితేనే విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఒత్తిడికి గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వారు స్పష్టం చేశారు. పలు సూచనలు.. ► పరీక్షా సమయంలో సెల్‌ఫోన్, టీవీ, కంప్యూటర్ల వైపు దృష్టి మరలకుండా చూసుకోవాలి. ప్రతి రోజు విద్యార్థి నిర్ధేశించుకున్న టైమ్ టేబుల్ ప్రకారం చదువుకోవాల్సి ఉంటుంది. ► ఉపాధ్యాయులు, స్నేహితులు, సీనియర్ల ద్వారా తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలి. ఆత్మ విశ్వాసంతో పరీక్షలకు సిద్ధమైతేనే విజయం మరింత సులభమవుతుంది. ► ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు ముఖ్యంగా విద్యార్థులకు పరీక్ష సమాయాల్లో ఇంట్లో చక్కటి వాతావరణం కల్పించాలి. ► విద్యార్థిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు కృషి చేయడంతో పాటు అవసరమైన ధైర్యాన్ని అందించాలి. ► ఒత్తిడిని తగ్గించేందుకు వారికి సహకారం అందిస్తే అధిక సమయం చదువుకే కేటాయిస్తారు. ► తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానుకూలంగా విద్యార్థికి తగిన ఆహారం అందించాలి. ► విద్యార్థులు సమయానికి తగినట్లుగా నిద్రపోయేలా కుటుంబసభ్యులు చూసుకోవాలి. రెండు ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించాం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదోతరగతి విద్యార్థులను పరీక్షలకు పూర్తి సన్నద్ధం చేశాం. ఇప్పటికే రెండు ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించి వారికి మనోధైర్యాన్ని కల్పించాం. గణితం, సైన్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులలో మంచి మార్కులు వచ్చేలా ఎప్పటికప్పుడు తరగతులు నిర్వహిస్తున్నాం. మే 23 నుంచి జూన్ 1 వరకు పరీక్షలను నిర్వహిస్తున్నాం. –రామిరెడ్డి, ఎంఈఓ రాజేంద్రనగర్ సొంతంగా రాసిన జవాబులకే అధిక మార్కులు ఉపాధ్యాయులు ఇచ్చిన మెటీరియల్‌ను విద్యార్థులు చదువుకుని పాఠ్య పుస్తకాలపైనే దృష్టిసారించాలి. సమయాన్ని వృధా చేయకుండా పరీక్షలకు సిద్ధం కావాలి. సొంతంగా రా సిన జవాబులకే అధిక మార్కులు వేసే అవకాశం ఉంటుంది. –ఎన్.మాణిక్యంరెడ్డి, ఉపాధ్యాయుడు ఖాళీ కడుపుతో వెళ్లకూడదు విద్యార్థులు పరీక్షలకు వెళ్లే సమయంలో మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. పరీక్షలకు వెళ్లే ముందు తప్పనిసరిగా బ్రేక్‌ఫాస్ట్ చేయాలి. ప్రశ్నా పత్రాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్న తర్వాతే జవాబులు రాయాలి. –డాక్టర్ సుభాష్, మైలార్‌దేవ్‌పల్లి 10 జీపీ సాధిస్తామనే నమ్మకం ఉంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఎలాంటి ఒత్తిడి లేదు. తరగతి గదుల్లో ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను శ్రద్ధగా వింటూ ఉపాధ్యాయులు ఇచ్చిన నోట్స్‌ను ఇప్పటికే చదివేశాం. పదికి పది జీపీ సాధిస్తామన్న విశ్వాసం ఉంది. –స్వాతి, పదో తరగతి విద్యార్థిని -
ఎగ్జామ్స్ టైమ్ ఫ్రెండ్
‘సబ్జెక్ట్ సరిగ్గా అర్థమే కాలేదు. ఎగ్జామ్‌లో ఫెయిల్ అవడం ఖాయం. ఇంట్లోవాళ్లకు ఏం చెప్పాలి?!’ భయం. ‘కోవిడ్ టైమ్‌లోనే బాగుంది.కాలేజీకి వెళ్లి అందరిలో కూర్చోవాలంటే ఏంటోగా ఉంది’ విసుగు ‘నేనసలు బాగుపడతానా? ఈ లైఫ్ పెద్ద బోర్.. ’ డిప్రెషన్. ‘అనుకున్న టైమ్‌లో చదవాల్సిన సిలబస్ పూర్తవుతుందా?’ ఒత్తిడి. కాలేజీ స్టూడెంట్స్ తమ భావోద్వేగాలను బ్యాలెన్స్ చేసుకోవడానికి, ఒత్తిడుల నుంచి దూరం అవ్వడానికి ఉచితంగా ‘డాక్టరైట్ వెల్నెస్ యాప్’ ద్వారా సేవలను అందిస్తున్నారు హైదరాబాద్ వాసులు రజినీకాసు, జయంతీ సుబ్రహ్మణ్యం, ప్రసన్నలక్ష్మి, మధు రఘునాయకులు. ‘17 నుంచి 24 ఏళ్ల వయసు వారిలో భావోద్వేగాల బ్యాలెన్స్ చేసుకోవడం అనే సమస్య అధికంగా ఉంటుంది. ఏ విషయాన్ని ఎవరితో చెబితే ఏం సమస్యో అనుకునే వయసు అవడంతో ఎవరికీ చెప్పుకోలేక, జీవితంలో వెనకడుగు వేసేవారికి నేస్తంలా చేయూతనివ్వడానికి ముందుకు వచ్చాం’ అని వివరిస్తున్న ఈ బృందం చెబుతున్న విషయాలు ఇవి.. నేరుగా ఎదుర్కోలేని ఒత్తిడి ‘‘ఇంటర్మీడియెట్, ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీ స్టూడెంట్స్‌ను నేరుగా కాలేజీలకు వెళ్లి కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. ఈ ఏజ్‌గ్రూప్‌లో వచ్చే రకరకాల సింప్టమ్స్‌ని సరైన సమయంలో బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. వీరిలో సోషల్ ఇంట్రాక్షన్స్ చాలా తక్కువ ఉన్నాయని గమనించాం. కోవిడ్ సమయంలో వర్చువల్‌గా మాట్లాడిన పిల్లలు ఆ తర్వాత కాలేజీలో నేరుగా ఫ్రెండ్స్‌తో కూడా ముఖాముఖిగా కలుసుకొని మాట్లాడుకోవడం కష్టపడుతున్నట్టు తెలిసింది. విద్యార్థుల్లో మార్పుకోసం ఏదైనా చేయాలన్న ఆలోచనను ఇలా అమలులో పెట్టాం’ అంటారు రజని కాసు. ఇరవై ఏళ్లుగా ఐటీ రంగంలో ఉన్న రజిని కాసు విద్యార్థుల మానసిక సమస్యలపై కౌనెలర్లతో చర్చించిన ఎన్నో విషయాలను పంచుకున్నారు. డిజిటల్ స్పేస్ నుంచి దూరంగా! ‘‘దాదాపు ఇంటిదగ్గరే రెండేళ్లుగా కంఫర్టబుల్ జోన్లో ఉన్నవాళ్లు నేరుగా ప్రతిభ చూపించమంటే వారి ఆత్మవిశ్వాసం స్థాయుల్లో మార్పులు వచ్చాయి. సాధారణంగా డిగ్రీస్థాయి పిల్లలకు ఫస్ట్ ఇయర్లో కాలేజీ వాతావరణం అంతా అలవాటు పడుతుంది. కానీ, ఆన్లైన్ క్లాసుల నుంచి నేరుగా కాలేజీకి రావడంతో అంతా కొత్తగా ఉండటంతో ప్రతి చిన్న విషయంలో వెనకడుగు వేస్తున్నారు. గ్యాడ్జెట్స్‌తోనే టైమ్ అంతా స్పెండ్ చేస్తున్నారు. అమ్మాయిలు–అబ్బాయిల్లో కెరియర్ పరంగా ఒకే విధమైన ఆలోచనలు ఉన్నాయి. కానీ, అమ్మా యిలు ‘వేధింపు’ అనే సమస్యను ఎదుర్కొంటున్నారు. పేరెంట్స్ ఇద్దరినీ ఒకే విధంగా చూస్తున్నప్పటికీ, ఎంత స్నేహంగా ఉన్నా అన్నీ పెద్దలకు చెప్పుకోలేరు. పిల్లలు తమ భావాలను సరైన దారిలో పెట్టడానికి అనువైన వేదిక దొరకడం లేదు. ఇవన్నీ విద్యార్థులతో ఈ ఏడాది కాలంగా మాట్లాడి తెలుసుకున్నవి’ అని వివరించారు అమెరికాలో హెల్తెకేర్ లీడర్షిప్, మేనేజ్మెంట్ విభాగంలో వర్క్ చేస్తున్న జయంతి. వినడమే కావాలి... ‘మనం కోపంగా చెప్పిన విషయేమేదీ పిల్లలు అర్ధం చేసుకోరు. అంతకు ముందు వాళ్లేం చెబుతున్నారో మనం శ్రద్ధగా వినాలి. ‘ఏం కాదు’ అనే మాట ఒక్కటే సరిపోదు. వాళ్లలో ఉన్న బాధ అంతా ఏడుపు రూపంలో బయటకు రావాలి. అప్పుడు వారు మానసికంగా ఏ సమస్యనైతే ఎదుర్కొంటున్నారో దాని నుంచి దూరమవుతారు. చెప్పడం నుంచే రియలైజ్ అవడం కూడా మొదలు పెడతారు. అప్పుడు వారిని సరైన మార్గంలో పెట్టచ్చు. బయటకు ఎవరికీ ఏం చెప్పుకోకుండా తమలో తామే అన్నట్టుగా ఉన్న వాళ్లు చాలావరకు డిప్రెస్ అవుతున్నారు. ఈ విధానం నుంచి బయటపడటానికి యాప్ ద్వారానే రకరకాల యాక్టివిటీస్‌ను కూడా పరిచయం చేస్తున్నాం’ అని తెలియజేశారు ఇరవై ఏళ్లుగా ఐటీ రంగంలో ఉన్న మధు. భయం నుంచి దూరం ‘కొన్ని భయాలు.. చెప్పుకోదగినంత పెద్దవీ కావు, చెప్పకూడనంత చిన్నవీ కాదు. ఈ సమస్య స్కూల్, కాలేజీ రోజుల్లో మొదలైతే ఆ తర్వాత కెరియర్లోనూ ఎదుర్కోవచ్చు. భయాన్ని వీడలేక రకరకాల వ్యసనాలకు లోనైనవారూ ఉన్నారు. ఈ సమస్య నుంచి బయటపడాలన్నా సరైన గైడెన్స్ విద్యార్థులకు చాలా అవసరం. కోవిడ్ టైమ్‌లో ‘కోవిడ్ సాథీ’పేరుతో హెల్ప్‌లైన్ అందించిన మా గ్రూప్ సభ్యులం ఇప్పుడు ఈ యాప్ ద్వారా విద్యార్థులకు మేలు చేయాలనుకుంటున్నాం. ఏడాది క్రితం 6 వేల మంది విద్యార్థులకు చేరువఅవ్వాలని ఈ వర్క్ ప్రారంభించాం. ఇప్పుడు 2 వేల మంది విద్యార్థులు రోజూ సెషన్స్‌లో పాల్గొంటున్నారు. రోజులో 24 గంటలూ స్టూడెంట్స్‌కి అందుబాటులో ఉంటున్నాం. ఈ యాప్ నుంచి సైకియాట్రిస్ట్‌లు, క్లినికల్ సైకాలజిస్ట్‌లు, శిక్షణ పొందినవాళ్లూ విద్యార్థులకు సరైన గైడెన్స్ ఇస్తున్నారు. ఎవరికీ చెప్పుకోలేని వాళ్లు తమ సమస్యలను నిపుణులతో చర్చించి సరైన మార్గం తెలుసుకోవచ్చు’ అని వివరించారు ఫార్మసీ రంగంలో ఇరవై ఏళ్లుగా సేవలు అందిస్తున్న ప్రసన్నలక్ష్మి. – నిర్మలారెడ్డి -
ఇంటర్ విద్యార్థులకు కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురి కాకుండా ప్రత్యేక కౌన్సెలింగ్ చేపడుతున్నట్లు ఇంటర్ బోర్డు సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. పరీక్షల పట్ల భయం, ఒత్తిడి సహా ఇతర మానసిక సమస్యలు ఎదుర్కొనే వారు బోర్డు సూచించిన ఫోన్ నెంబర్ల ద్వారా మానసిక వైద్యులు క్లినికల్ సైకాలజిస్టులను సంప్రదించవచ్చని సూచించింది. వారి వ్యక్తిగత నెంబర్లను బోర్డు విడుదల చేసింది. -
అవును... నాకు బట్టతలే.. అయితే ఏంటి?
ఇటీవల ఆస్కార్ వేడుకలలో నటుడు విల్ స్మిత్ భార్య జాడా స్మిత్ పై వేసిన జోక్ ఎదురు తిరిగింది. స్త్రీలకు వచ్చే అరుదైన సమస్య బట్టతల. జాడా స్మిత్ ఆ సమస్యతో బాధ పడుతోంది. ఇండియాలో కూడా ఈ సమస్యతో బాధ పడుతున్న స్త్రీలు ఉన్నారు. ఆ స్థితిని స్వీకరించి ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతున్న వారు ఉన్నారు. బెంగళూరుకు చెందిన 32 ఏళ్ల పరోతిమ గుప్తా తమ జీవితం ఎదుటి వాళ్లకు జోక్ కాదని హెచ్చరిస్తున్నారు. ఇది ఆమె కథ. ఆడుతూ పాడుతూ ఉండే పదేళ్ల అమ్మాయి ఉదయాన్నే నిద్ర లేచే సరికి దిండంతా ఆ అమ్మాయి జుట్టుతో నిండిపోయి ఉంటే ఎలా ఉంటుంది? పరోతిమ గుప్తాకు అలా జరిగింది. అప్పుడు ఆమె వయసు పదేళ్లు. డార్జిలింగ్‌లో బోర్డింగ్ స్కూల్లో చదువుకుంటోంది. వాళ్ల నాన్న, అమ్మలది కోల్కటా. నాన్న టీ ప్లాంటేషన్లలో పని చేసేవాడు కాబట్టి ఒక్కోసారి ఒక్కోచోట ఉండాలి కాబట్టి పరోతిమను, ఆమె చెల్లెల్ని బోర్డింగ్ స్కూల్లో ఉంచి చదివించేవారు. పరోతిమ క్లాసులు బాగా చదివేది. డిబేట్లు గెలిచేది. స్టేజ్ మీద భయం లేకుండా ఉండేది. అలాంటిది ఒక ఉదయం ఇలా జరిగే సరికి బెంబేలెత్తిపోయింది. తల్లిదండ్రులు వచ్చారు. డాక్టర్ల దగ్గరకు తిరిగారు. ‘ఇలా టైఫాయిడ్ వల్ల జరుగుతుంది’ అన్నాడో డాక్టరు. కాని అప్పటికి పరోతిమకు టైఫాయిడ్ రాలేదు. మరేంటి? చివరకు సిలిగురిలో ఒక డాక్టరు దీనిని ‘అలోపేసియా అరెటా’ (పేనుకొరుకుడు/ఆటోఇమ్యూన్ డిసీజ్) అని కనిపెట్టి వైద్యం మొదలెట్టాడు. అలా పదేళ్ల వయసు నుంచి పరోతిమ జీవితంలో ఒక పెద్ద యుద్ధం మొదలైంది. మందే లేని జబ్బు అలోపేసియా వల్ల హఠాత్తుగా జుట్టు రాలిపోతుంది. ఇది తల మీద కొన్ని ప్రాంతాల్లో జరగొచ్చు. పూర్తిగా కూడా జరగొచ్చు. కొన్నిసార్లు కొన్నాళ్ల తర్వాత మళ్లీ జుట్టు వస్తుంది. కొందరికి రాదు. ‘పదేళ్ల వయసు నాకు. ఏమీ అర్థం కాలేదు. డాక్టరు ఎన్నో మందులు రాశాడు. లెక్కలేనన్ని ఇంజెక్షన్లు పొడిచాడు. కొందరేమో ఆయుర్వేద తైలాలు అని, హోమియోపతి మందులు అని. ఎప్పుడూ నా తల మీద అల్లం, వెల్లుల్లి గుజ్జు రాసి ఉండేవారు. ఇంకేవో కంపు కొట్టే నూనెలు. ఎప్పుడూ వాసన కొడుతూ ఉండేదాన్ని. కొన్నాళ్లకు స్కూలుకు వెళ్లాను. అది ఇంకా ఘోరమైన అనుభవం. పిల్లలు నన్ను వెక్కిరించేవారు. కొందరు నాకొచ్చింది అంటువ్యాధి ఏమోనని దగ్గరకు వచ్చేవారు కాదు. స్టేజ్ ఎక్కి నేను ఏదైనా మాట్లాడాలంటే వెళ్లలేకపోయేదాన్ని. మగపిల్లలు నాతో అసలు మాట్లాడేవాళ్లు కాదు. ఇంట్లో బాత్రూమ్లో దూరి గంటలు గంటలు ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. కొందరు ఫ్రెండ్స్, టీచర్లు నాకు గట్టి ధైర్యం చెప్పారు. వాళ్ల వల్ల నిలబడ్డాను’ అంటుంది పరోతిమ. ఇంటర్లో వెలుగు అయితే పరోతిమ ఇంటర్‌కు వచ్చేసరికి జుట్టు మళ్లీ రావడం మొదలెట్టింది. లోపల ఒకటి రెండు పాచెస్ ఉన్నా కొంచెం కవర్ చేసుకునే విధంగా ఉండేది. పరోతిమ కోల్కటాలో డిగ్రీ, పి.జి. చేసింది అక్కడే ఒక డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటూ. ఆ వైద్యం కఠినతరంగా ఉండేది. ఇంజెక్షన్లు ఉండేవి. వాటన్నింటిని ఆమె భరించింది. ఇప్పుడు ఉద్యోగం కోసం బెంగళూరు వచ్చింది. మార్కెటింగ్ ప్రొఫెషనల్‌గా మారింది. కొత్త ఉద్యోగం. స్ట్రెస్. 2007లో మళ్లీ పూర్తిగా జుట్టు రాలడం మొదలయ్యింది. ‘ఇక ఈ హింస చాలు. నాకు జట్టు లేదు... రాదు అనే స్థితిని నేను స్వీకరించి మిగిలిన జీవితం సాధారణం గా గడపడానికి నిశ్చయించుకున్నాను’ అంటుంది పరోతిమ. ‘నేను నా చెల్లెల్ని తోడు పిలిచాను. పద నేను గుండు గీయించుకోవాలి అన్నాను. శిరోజాలు లేని నా ముఖాన్ని చూసి తట్టుకోవడానికే నా చెల్లెల్ని తోడు చేసుకున్నాను. కాని శిరోముండనం అయ్యాక నాకు హాయిగా అనిపించింది. ఇక మీదట ఇలాగే ఉండాలని నిశ్చయించుకున్నాను.’ అందామె. అయితే ఈ ఆకారాన్ని చూసి సానుభూతి, అనవసర ప్రశ్నలు రాకుండా ఉండేందుకు తాను పని చేసే చోటులో అందరికీ ఈమెయిల్ ద్వారా తన అరుదైన జబ్బు గురించి తెలిపి ఆ చర్చను ముగించింది. ‘ఇప్ప టికీ కొందరు వింతగా చూస్తారు. గాంధీలా ఉన్నావ్ అంటారు. ఇలా ఉన్నా నీ లుక్స్ బాగున్నాయి అంటారు. కొందరు నీ తల తాకి చూడమంటావా అంటారు. అందరికీ తగిన సమాధానం చెప్పి ముందుకు పోతుంటాను’ అంటుంది పరోతిమ. ఆస్కార్ అవార్డ్స్‌లో జాడా స్మిత్ మీద జోక్ వేయడాన్ని ఆమె తప్పు పట్టింది. ‘మా జీవితం ఏ మాత్రం జోక్ కాదు’ అంది. ఎదుటి వాళ్ల వెలితిని హాస్యం చేయకూడని సంస్కారం అందరం అలవర్చుకోవాలి. -
పరీక్షలకు పండుగలా సిద్ధం కావాలి
న్యూఢిల్లీ: పరీక్షలంటే భయం వద్దేవద్దని విద్యార్థులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్బోధించారు. పరీక్షలకు ఒక పండుగలా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పరీక్షలు రాయడం ఇదే మొదటిసారి కాదని, గతంలో ఎన్నో పరీక్షలను విజయవంతంగా ఎదుర్కొన్న అనుభవం విద్యార్థులకు ఉందని, ఒత్తిడికి లోను కావొద్దని సూచించారు. తాము నెరవేర్చుకోలేని కలలు, ఆకాంక్షలను పిల్లలపై బలవంతంగా రుద్దవద్దని తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తును నిర్ణయించుకొనే స్వేచ్ఛను పిల్లలకు ఇవ్వాలన్నారు. శుక్రవారం ఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో కేంద్ర విద్యా శాఖకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, లిటరసీ నిర్వహించిన ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో ముచ్చటించారు. నరేంద్ర మోదీ ఇంకా ఏం చెప్పారంటే.. ► వాట్సాప్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలతో సమస్య ఏమీ లేదు. సమస్య మన మనసుల్లోనే ఉంది. ఆన్లైన్ అయినా, ఆఫ్‌లైన్ అయినా సరే చదువుపై మనసు పూర్తిగా లగ్నం చేయాలి. అప్పుడు పరధ్యానానికి తావుండదు. ► చదువు నేర్చుకోవానికి అందుబాటులోకి వస్తున్న నూతన మార్గాలను ఒక అవకాశంగానే భావించాలి తప్ప సవాలు అనుకోకూడదు. ► విద్యార్థులు అప్పుడప్పుడు ఇన్లైన్లోకి (వారితో వారే గడపాలి) వెళ్లాలి. ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో గడపడానికి దూరంగా ఉండాలి. ► విద్యార్థులతో మాట్లాడుతున్నప్పుడు నా వయసు 50 ఏళ్లు తగ్గిపోయినట్లుగా అనిపిస్తోంది. ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమం నాకు ఎంతగానో తోడ్పడుతోంది. ► కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ విద్యా విధానాన్ని (ఎన్ఈపీ) దేశంలో అన్ని వర్గాలు మనస్ఫూర్తిగా స్వాగతిస్తుండడం సంతోషకరం. ► నచ్చిన సబ్జెక్టులను అభ్యసించే అవకాశం ఎన్ఈపీలో ఉంది. సరిగ్గా అమలు చేస్తే భవ్యమైన భవితకు కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. ► పోటీని చూసి బెంబేలెత్తిపోవాల్సిన పని లేదు. దాన్ని జీవితంలో అతిపెద్ద బహుమతిగా భావించాలి. పోటీని ఆహ్వానించాలి. అప్పుడే మనం పరీక్షకు గురవుతాం. సామర్థ్యం బయటపడుతుంది. యువతరం ఎదుట ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అందుకు గర్వపడాలి. ► ‘పీ3 (ప్రో ప్లానెట్ పీపుల్) ఉద్యమ’ అవసరం ఎంతైనా ఉంది. ‘యూజ్ అండ్ త్రో’ సంస్కృతిని వదిలించుకోవాలి. బాలికల ప్రతిభను గుర్తించకపోతే ప్రగతే లేదు కుమారులతోపాటు కుమార్తెలను సమానంగా చూడాలని ప్రధాని మోదీ చెప్పారు. ఇరువురి మధ్య భేదభావం చూపొద్దని కోరారు. ఇద్దరికీ సమాన అవకాశాలు కల్పించాలన్నారు. బాలికల ప్రతిభను గుర్తించని సమాజం ఎప్పటికీ ప్రగతి సాధించలేదని స్పష్టం చేశారు. పరీక్షా పే చర్చలో ఆయన మాట్లాడుతూ... గతంలో బాలబాలికల మధ్య వ్యత్యాసం చూపేవారని, ఇప్పుడు పరిస్థితి చాలావరకు మారిపోయిందని అన్నారు. కొత్తగా పాఠశాలల్లో చేరుతున్నవారిలో బాలల కంటే బాలికలే ఎక్కువ మంది ఉంటున్నారని హర్షం వ్యక్తం చేశారు. ప్రతి కుటుంబానికి బాలికలు పెద్ద ఆస్తిగా, బలంగా మారుతున్నారని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో బాలికలు రాణిస్తున్నారని ఉద్ఘాటించారు. తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవడానికి పెళ్లికి దూరంగా ఉన్న కుమార్తెలు ఎంతోమంది ఉన్నారని, అదే సమయంలో తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో చేర్చి, హాయిగా కాలం గడుపుతున్న కుమారులు కూడా ఉన్నారని మోదీ వ్యాఖ్యానించారు. -
మీకళ్లు 60లో కూడా 20 లా కనిపించాలని ఉందా!
మొహంలో కళ్లు ఎంత ప్రత్యేకమో.. అంతే సున్నితం కూడా! అందుకే ఫేషియల్స్ చేసినా.. స్క్రబ్ చేసినా..మసాజ్ చేసినా..నయనాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. లోషన్స్, క్రీమ్స్ అప్లై చేసుకునేటప్పుడు కూడా కళ్లకు తగలకుండా జాగ్రత్తపడతాం. కీరాముక్కలు, గోరువెచ్చటి కాపడంతో కనుల సోయగాన్ని కాపాడే ప్రయత్నం చేస్తుంటాం. అపురూపమైన కళ్లు అందంగా.. ఎల్లప్పుడూ ఆకట్టుకునేలా ఉండాలంటే స్పెషల్ కేర్ తప్పనిసరి. వయసుతో వచ్చే నల్లటి వలయాలు, ముడతలు, నిద్రలేమితో కలిగే అలసట.. వీటన్నింటినీ దూరం చెయ్యాలంటే చిత్రంలోని కళ్లజోడు ఎంతో చక్కగా పనిచేస్తుంది. దీన్ని పెట్టుకుని కళ్లు మూసుకుని ఉండటం బోర్ కదా అనుకునే వారికి ఆ దిగులే అవసరం లేదు. ఎందుకంటే ఈ డివైజ్.. పాటలను వినిపిస్తూ కళ్ల పని చూస్తుంది. ఒత్తిడి, అలసట, కళ్ల మంటలు, కళ్లు పొడిబారడం, తలనొప్పి వంటి వాటిని దూరం చేస్తూనే.. 60లో 20లా కనిపించేలా అందాన్ని కాపాడుతుంది. 180 డిగ్రీస్ యాంగిల్లో XECH Eye Massager డివైజ్‌ని సులభంగా ఫోల్డ్ చేసుకోవచ్చు. అలా ఫోల్డ్ అయిన గాడ్జెట్ చూడటానికి వైర్లెస్ మౌస్లా ఉంటుంది. డివైజ్‌కి ఒకవైపు.. చార్జర్ జాక్, ఇయర్ ఫోన్ జాక్ ఉంటాయి. పైభాగంలో ఆన్, ఆఫ్, వైబ్రేషన్, మ్యూజిక్ వంటి ఆప్షన్స్ ఉంటాయి. దీనికి ఇయర్ ఫోన్స్ పెట్టుకునే వీలుండటంతో.. నచ్చిన పాటను వినొచ్చు. నచ్చకుంటే మార్చుకోవచ్చు. సౌండ్ పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. డివైజ్ ఆన్ చేసుకుంటే సున్నితంగా వైబ్రేట్ చేస్తూ.. ట్రీట్మెంట్ అందిస్తుంది. ఆఫీస్‌లో, ఇంట్లో ఎక్కడైనా దీన్ని సులభంగా ఉపయోగించుకోవచ్చు. దీనికి 2 గంటల పాటు చార్జింగ్ పెడితే చాలు బ్యాటరీ ఫుల్ అవుతుంది. ఈ డివైజ్ అడుగు భాగంలో సాఫ్ట్ స్కిన్ కేర్ లైనింగ్ అమర్చి ఉంటుంది. వెనుకవైపు బ్యాండ్ అటాచ్ అయ్యి ఉంటుంది. దాని సాయంతోనే తలకు అమర్చుకోవచ్చు. దీని ధర సుమారు 28 డాలర్లు. అంటే 2,108 రూపాయలు. -
ఒత్తిడిని తగ్గించుకోవడానికి... వాడండి.. ఈ అరుపు మాత్రలు
Scream To Release Stress: డాక్టర్ రాసే మాత్రలు వేరు. మనం వాడుకోవాల్సిన మాత్రలు కూడా ఉంటాయి. అమెరికాలో స్త్రీలు ఇప్పుడు ‘స్క్రీమ్ గేదరింగ్స్’లో పాల్గొంటున్నారు. అంటే ఒక మైదానంలో చేరి పెద్ద పెద్దగా అరిచి తెరిపిన పడుతున్నారు. ఎందుకు? ఒత్తిడి దూరం చేసుకోవడానికి. మన దేశంలో కూడా కోవిడ్ వల్ల, కుటుంబ సభ్యుల అనారోగ్యాల వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల స్త్రీలు లోలోపల వొత్తిడి పేరబెట్టుకుంటున్నారు. ఇది మంచిది కాదు. డాబా మీదకో, గ్రౌండ్లోకో వెళ్లి ‘స్క్రీమ్’ చేయడం ఒత్తిడికి ఒక మందు. ‘లాఫింగ్ థెరపీ’లా ఈ థెరపీ ఇప్పుడు అవసరమే సుమా. సంప్రదాయ చైనీయ వైద్యంలో కొండ చిటారుకో, ఏదైనా ఏకాంత ప్రదేశానికో వెళ్లి పెద్ద పెద్దగా అరవడం కూడా ఒక ఆరోగ్య సాధనం అని నమ్ముతారు. చైనా సంగతేమో కాని అమెరికాలోని స్త్రీలు మా అసహనాన్ని పెద్దగా అరచి పారదోలుతాం అని ఇటీవల ఏదో ఒక ఫుట్‌బాల్ గ్రౌండ్లోనో పార్క్‌లోనో ‘స్క్రీమ్ గేదరింగ్స్’ నిర్వహిస్తున్నారు. అంటే ఒక పదీ పదిహేను నిమిషాల సేపు పెద్దగా అరిచి తమ మనసులో, శరీరంలో ఉన్న అలజడిని తగ్గించుకోవడం అన్నమాట. దానికి కారణం గత రెండేళ్లుగా కోవిడ్ వారిపై ఏర్పరుస్తున్న ఒత్తిడిని వాళ్లిక సహించలేని స్థాయికి చేరడమే. కోవిడ్‌ను పూర్తిగా నిర్మూలించే వాక్సిన్ ఇంకా రాకపోవడం, వాక్సిన్ వేసుకున్నా దాని బారిన పడుతూ ఉండటం, చంటి పిల్లలకు ఇంకా వాక్సిన్ లేకపోవడం, కోవిడ్ వల్ల అందరూ ఇంట్లో ఉండిపోవాల్సి రావడం, ఉద్యోగాలు ఊడటం, రెట్టింపు పని చేయాల్సి రావడం... ఇవన్నీ పురుషులలో కంటే స్త్రీలలో ఎక్కువగా గూడు కట్టుకుని పోతున్నాయి. అవి అలాగే లోపల సాంద్రపడటం ప్రమాదం అని నిపుణులు అంటారు. వొత్తిడిని సాటివారితో పంచుకుని రిలీఫ్ పొందాలి. కాని సాటివారు కూడా అలాంటి వొత్తిడిలో ఉంటే ఏమిటి చేయడం. ‘పదండి... అందరం కలిసి అరుద్దాం’ అని అమెరికాలోని స్త్రీలు స్క్రీమ్ థెరపీని సాధన చేస్తున్నారు. అయితే ఈ అరుపులు ఇతరులు వినకపోవడమే మంచిది. పెద్దగా గట్టిగా అరిచే మనిషిని చూడటం, వినడం ఎదుటి వారికి ఆందోళన కలిగించవచ్చు. అందుకే వీలైనంత ఏకాంత ప్రదేశంలో వీటిని సాధన చేయడం ఉత్తమం అని నిపుణులు అంటున్నారు. యోగాలో కూడా ‘జిబ్రిష్’ వంటివి సాధన చేయిస్తుంటారు. అంటే ఒక ఐదు పది నిమిషాలు గొంతులో నుంచి ఏ పిచ్చి అరుపులు వస్తే ఆ అరుపులను అలౌ చేస్తూ వెళ్లడం. దీని వల్ల సబ్కాన్షియస్ మైండ్‌లో గూడు కట్టుకుని ఉన్న గాఢమైన భావాలు వదిలిపోతాయని చెబుతారు. మరో పద్ధతి ‘ట్రీ షేక్’. అంటే ఒక చెట్టు గాలికి ఎలా గలగలలాడిపోతుందో అలా మూడు నాలుగు నిమిషాలు నిటారుగా నిలబడి ఒళ్లంతా గలగలలాడించాలి (కదిలించాలి). దాని వల్ల ఒత్తిడి దూరం అవుతుందని నిపుణులు అంటారు. మన దేశంలో అమ్మలు, పెద్దవాళ్లు ఏదైనా ఒత్తిడి పెరగడం వల్ల గట్టిగా తిట్టడం, అరవడం చూస్తూ ఉంటాం. అది ఒక రకంగా స్ట్రెస్ నుంచి దూరమవడమే. ఎన్నో చేదు సంఘటనలు, అయిష్టమైన పరిణామాలు చూసిన స్త్రీలు ‘గయ్యాళి’ ముద్రతో ఉండటం కూడా మన సమాజంలో ఉంది. నిజానికి అదంతా లోపలి ఒత్తిడికి ఒక బయటి ప్రతిఫలనం. ఆ ఒత్తిడి ఏమిటో కనుక్కుని దూరం చేయగలిగితే వారు కూడా శాంత స్వభావులు అవుతారు. గత రెండేళ్లుగా ఇళ్లల్లో ఉగ్గ పట్టుకుని ఉన్న స్త్రీలు ఏ మేరకు ఒత్తిడిలో ఉన్నారో కుటుంబం మొత్తం పట్టించుకోవాలి. ఇవాళ రేపూ అంటూ కోవిడ్ ముగింపు వాయిదా పడే కొద్దీ వారి మనసులో ఎలాంటి భావాలు చెలరేగుతున్నాయో కూడా పరిశీలిస్తూ ఉండాలి. వారు విసుక్కుంటూ ఉంటే, ఒక్కోసారి పని వైముఖ్యం చూపుతుంటే కుటుంబం సంపూర్ణంగా ఆ మూడ్స్‌ను అర్థం చేసుకోవాలి. మగవాళ్లు స్ట్రెస్‌ను తప్పించుకోవడానికి ఏదో ఒక మార్గం వెతుక్కుంటారు. వారికి కనీసం బయట ఒకరిద్దరు స్నేహితులను కలిసే వీలు ఉంటుంది. స్త్రీలు ఇళ్లకే పరిమితమయ్యే అనివార్య పరిస్థితులు ఈ రెండేళ్లలో వచ్చాయి. అందుకే వారి మానసిక ఆరోగ్యం కూడా శ్రద్ధ పెట్టక తప్పదు. మంచి నిద్ర, ఉల్లాసం, ఆశావహమైన భవిష్యత్తు కనిపించకనే తాము పార్కుల్లో చేరి కేకలేస్తున్నాం అంటున్నారు అమెరికా వనితలు. ‘మా మీద మేము అరుచుకోలేము. కుటుంబం మీద అరవలేము. పిల్లల చదువు సరిగ్గా సాగకపోవడం మాకు చాలా వొత్తిడి కలిగిస్తోంది. వాళ్ల మూడ్స్ కూడా మాకు కష్టమే. మాకు వొత్తిడిగా ఉంది. అందుకే ఏడ్చి తెప్పరిల్లే బదులు అరిచి తెరిపిన పడుతున్నాం’ అని బోస్టన్‌లో స్క్రీమ్ థెరపీలో పాల్గొన ఒక గృహిణి అంది. ‘కోపం పోవడానికి పంచింగ్ బ్యాగ్‌ను పంచ్ చేయడం ఎలాగో ఒత్తిడి పోవడానికి ఇలా పెద్దగా అరవడం అలాగా’ అని కొందరు నిపుణులు అంటున్నారు. యుద్ధ సైనికుడు గెలుపు నినాదం ఇచ్చినట్టు, కుంగ్‌ఫూ ఫైటర్ పంచ్ ఇచ్చే ముందు అరిచినట్టు, కింగ్ కాంగ్ శత్రువు మీద దాడి చేసే ముందు గుండెలు చరుచుకున్నట్టు మామూలు మనుషులు కూడా ఏదో ఒక పార్కులో చేరి తమ లోపల ఉన్న ఒత్తిడి అనే శత్రువును ఈ పద్ధతుల్లో ఓడించవచ్చని నిపుణులు అంటున్నారు. స్క్రీమ్ థెరపీ వల్ల ప్రయోజనం ఎలా ఉన్నా దాని వంకతో తమ లాంటి కొంతమంది స్త్రీలతో ఏదో ఒక మేరకు కొత్త స్నేహం, సంభాషణ కూడా ఒత్తిడి తగ్గిస్తాయి. కాబట్టి కొత్త మార్గాలు వెతకండి. ఆరోగ్యంగా ఉండండి. ఒత్తిడిని ఒంట్లో నుంచి ఖాళీ చేయండి. -
నవ్వితే ఇన్ని ఉపయోగాలా? విస్తుపోయే వాస్తవాలు..
Laughter Decreases Stress Hormones And Increases Immune Cells And Infection-fighting Antibodies: నవ్వితే మానసిక ఉత్తేజం కలుగుతుంది. నవ్వినప్పుడు ఎండార్ఫిన్ హార్మోన్ విడుదలవుతుంది. ఈ హార్మోన్ హాయిని కలిస్తుంది. ఎండార్ఫిన్ విడుదలయ్యే స్థాయి నవ్వు అంటే ఏ లాఫింగ్ క్లబ్లోనో చేరి నవ్వాల్సిన పనిలేదు. అలాగని వికటాట్టహాసం చేయాల్సిన పని కూడా లేదు, ఓ చిరుదరహాసం చాలు. సైంటిఫిక్ అమెరికన్ స్టడీ ప్రకారం చిరునవ్వుతో ముఖ కవళికలు మారుతాయి, చూసేవారికే కాదు నవ్విన వారికి కూడా అసంకల్పితంగా మనోల్లాసం కలుగుతుంది. మతికి సానుకులమైన ఆలోచనలు కలుగుతాయి. నొప్పి నివారణకు కూడా నవ్వు ఉపయోగపడుతుందంటే నమ్ముతారా! నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. చక్కగా హాయిగా నవ్వినట్లయితే ఒంటినొప్పులు తగ్గుతాయి. నొప్పి బాధపెడుతుంటే నవ్వు ఎలా వస్తుంది? అనే సందేహం అక్కర్లేదు. ఒళ్లు నొప్పులు, తలనొప్పితో బాధపడేటప్పుడు కామెడీ షోలు చూడండి. ఒకరు పక్కన ఉండి గిలిగింతలు పెట్టే పని లేకుండా మీకై మీరే హాయిగా నవ్వేస్తారు. నొప్పుల నుంచి ఉపశమనం పొందుతారు. హాయిగా నవ్వడం రక్తప్రసరణ మీద కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. ద కాలేజ్ ఆఫ్ ఫ్యామిలీ ఫిజీషియన్స్‌లో ప్రచురించిన కథనం ప్రకారం నవ్వేటప్పుడు ఊపిరితిత్తుల నిండుగా గాలి పీల్చుకుంటాం. దాంతో ఆక్సిజన్ ఎక్కువ మోతాదులో దేహంలోకి వెళ్తుంది. దాంతో కండరాలు సాంత్వన పొందుతాయి. గుండె లయ కూడా క్రమబద్ధమవుతుంది. చదవండి: Men's Day 2021: పక్కా జెంటిల్మన్ ఎలా ఉండాలో తెలుసా!.. అదే జెంటిల్‌నెస్.. నవ్వడం వల్ల దేహంలో విడుదలయ్యే ఫీల్‌గుడ్ హార్మోన్ల ప్రభావంతో దేహంలోని వ్యాధి నిరోధక శక్తి మెరుగవుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అందుకే రోజూ పది నిమిషాల సేపు హాయిగా నవ్వడానికి కేటాయించండి. మనసు బాగుంటే నవ్వమా? అని ప్రశ్నించే వారికో సూచన. మనకు నిజంగా హాయిగా నవ్వాలనే ఆలోచన ఉంటే... నవ్వించడానికి సాధనాలెన్నో ఉన్నాయిప్పుడు. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటుంది. ఒక హ్యూమరస్ వీడియో చూస్తే చాలు. హాయిగా నవ్వుకుంటాం. మనసు తేలికపడుతుంది. ఇప్పటి వరకు నవ్వడం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యానికి కలిగే మేలు గురించి చెప్పుకున్నాం. ఇక సామాజిక ఆరోగ్యం విషయానికి వస్తే... చిరునవ్వు పెట్టని ఆభరణంలా ముఖానికి అందాన్ని తెస్తుంది. ఎదుటి వ్యక్తిని చిరునవ్వుతో పలకరిస్తే అవతలి వాళ్లు కూడా పలకరింపుగా ఓ చిరునవ్వు నవ్వుతారు. నవ్వులేని ముఖంలో ఆత్మీయతను, స్నేహితులను వెతుక్కోవడం ఎవరికైనా కష్టమే. సామాజిక బంధాలు మెరుగవ్వాలన్నా కూడా చక్కటి చిరునవ్వే సాధనం. అందుకే స్టైలిష్‌గా లేకపోయినా ఫర్వాలేదు, కానీ స్మైలిష్గా ఉండడానికి మాత్రం తప్పకుండా ప్రయత్నించండి. చదవండి: Covid Taste Test: తెలుసా..! కాఫీతో కోవిడ్ టెస్ట్ చేయొచ్చు... ఎలాగంటే.. -
Health Tips: ఈ విటమిన్ లోపిస్తే మతిమరుపు, యాంగ్జైటీ, హృదయ సమస్యలు.. ఇంకా..
రక్తహీనత, అలసట, తిమ్మిర్ల నివారణకు విటమిన్ బి12 ఎంతో సహాయపడుతుంది. ఇది శరీర పెరుగుదలకు, రక్త కణాల నిర్మాణంలో, నాడీ వ్యవస్థ క్రమబద్ధీకరణకు, డీఎస్ఏ ఉత్పత్తికి ప్రధాన పోషకం. అలాగేశరీరంలోని వివిధ భాగాల పనితీరును క్రమబద్ధీకరిస్తుంది కూడా. ఐతే ప్రపంచవ్యాప్తంగా 15% కంటే ఎక్కువ మంది ప్రజలు విటమిన్ బి12 లోపంతో బాధపడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. విటమిన్ బి 12 మన శరీరంలో సహజంగా ఉత్పత్తి కాదు. సీ ఫుడ్ (సముద్ర ఆధారిత ఆహారాలు), గుడ్లు, మాంస ఉత్పత్తులు, కొన్ని ప్రత్యేక పండ్లు, కూరగాయల్లో మాత్రమే ఈ విటమిన్ ఉంటుంది. ఏదిఏమైనప్పటికీ శాఖాహారులు ఈ విటమిన్ లోపంతో అధికంగా బాధపడుతున్నారు. విటమిన్ బి12 లోపిస్తే శక్తి హీనతతోపాటు కొన్ని రకాల మానసిక సమస్యలు కూడా తలెత్తుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అవేంటో తెలుసుకుందాం.. యాంగ్జైటీ విటమిన్ బి12 స్థాయిలు తక్కువగా ఉంటే మానసిక సమతుల్యత దెబ్బతిని డిప్రెషన్‌కు దారితీస్తుంది. ఎందుకంటే మెదడులోని ముఖ్యమైన న్యూరోట్రాన్స్మిటర్ రసాయనాలైన డోపమైన్, సెరోటోనిన్ ఉత్పత్తికి విటమిన్ బి 12 బాధ్యత వహిస్తుంది. చదవండి: Suspense Thriller Crime Story: 37 కోట్ల బీమా కోసం పాముకాటుతో చంపించి.. తిమ్మిర్లు చేతులు, కాళ్ల వేళ్ల చివర్లు సూదులతో గుచ్చినట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా విటమిన్ బి12 మన శరీరంలో నాడీవ్యవస్థ పనితీరులో, ఎర్ర రక్తకణాల ఉత్పత్తిలో కీలకపాత్ర పోషిస్తాయి. ఇది లోపిస్తే శరీరం సమతుల్యత తప్పి కళ్లు తిరగడం, వికారం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. మతిమరుపు విటమిన్ బి12 లోపం మెదడు ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. మతిమరుపు, తికమకపడటం, విషయాలను గుర్తుపెట్టుకోవడం కష్టతరమవ్వడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కొన్ని సందర్భాల్లో మిమిక్ డైమెన్షియా అనే వ్యాధి భారీనపడే అవకాశం కూడా ఉంది. చదవండి: Science Facts: క్యాన్సర్ నివారణకు పసుపు ఉపయోగపడుతుందా?.. అదే అడ్డంకి.. నాలుక రుచి మందగించడం విటమిన్ బి12 లోపిస్తే నాలుకపై ఉండె రుచిమొగ్గలు క్రమంగా రుచిని కోల్పోతాయి. అంతేకాకుండా నాలుక వాపు, నోటి పుండ్లు, ముడతలు, నోటిలో మంట వంటి ఇతర సమస్యలు కూడా సంభవించవచ్చు. హృదయ సమస్యలు గుండె వేగం పెరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కూడా తలెత్తుతాయని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: Viral Video: అరె.. ఏం చేస్తున్నావ్.. ఛీ! డ్రైనేజీ వాటర్‌తోనా.. -
55% వృత్తి నిపుణుల్లో పని ఒత్తిడి
సాక్షి, హైదరాబాద్: దేశంలోని వివిధ రంగాలు, విభాగాల్లో పనిచేస్తున్న వృత్తి నిపుణుల్లో 55 శాతం మంది పని ప్రదేశాల్లో ఒత్తిళ్లకు లోనవుతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. గత 18 నెలలుగా కరోనా మిగిల్చిన చేదు జ్ఞాపకాలు, ఎదురైన ప్రతికూల పరిస్థితుల ప్రభావం ఈ ఒత్తిళ్లకు కారణమవుతున్నట్లు లింక్డ్ఇన్ సంస్థ చేపట్టిన ‘ద వర్క్‌ఫోర్స్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్’ సర్వే పేర్కొంది. ఈ ఏడాది జూలై 31 నుంచి సెస్టెంబర్ 24 వరకు దేశవ్యాప్తంగా వృత్తి నిపుణులపై నిర్వహించిన అధ్యయనంలో అనేక ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. దేశంలోని మొత్తం వృత్తి నిపుణుల్లో (ఉద్యోగాలు చేస్తున్న వారు) 55 శాతం మంది పనిచేసే చోట్ల ఒత్తిళ్లకు గురవుతున్నట్లు ఈ పరిశీలన తేల్చింది. ఈ 55 శాతం మందిలో వృత్తిధర్మంలో భాగంగా చేసే పనులు–వ్యక్తిగత అవసరాల మధ్య తగిన సమన్వయం, పొంతన సాధించకపోవడం వల్ల 34 శాతం మంది, ప్రస్తుతం తాము చేస్తున్న ఉద్యోగాల్లో తగినంతగా సంపాదించలేకపోతున్నం దువల్ల 32 శాతం మంది, వృత్తిపరంగా పురోగతి చాలా నెమ్మదిగా సాగడం వల్ల 25 శాతం మంది వృత్తినిపుణులు ఒత్తిళ్లకు గురవుతున్నారు. నిత్యం ఆఫీసుల్లో పనిని నిర్ణీత కాలానికి ముగించాలని 47 శాతం మంది భావించినా పనిఒత్తిళ్ల కారణంగా వారిలో 15 శాతం మందే అనుకున్న సమయానికి పని ముగించుకోగలుగుతున్నట్టు సర్వే తెలిపింది. అయితే ప్రస్తుతం తాము చేస్తున్న ఉద్యోగాలు, పనిప్రదేశాలపట్ల ప్రతి ముగ్గురిలో ఒకరు (36 శాతం) సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాము చేస్తున్న ఖర్చులపై పట్టు పెంచుకోగలిగామని 30 శాతం మంది తెలిపారు. కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్న క్రమంలో మార్కెట్లో ఉద్యోగాలు సాధించే విషయంలో పోటీ పెరిగినా క్రమంగా పరిస్థితులు మెరుగవుతున్నాయనే భావనను పలువురు వెలిబుచ్చారు. పని–జీవితం మధ్య సమతూకం సాధించాలి వృత్తి నిపుణులు, ఇతర ఉద్యోగుల పని ఒత్తిళ్లను పైస్థాయిలో యజమానులు అర్థం చేసుకొని వాటిని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తమ సర్వే ద్వారా వెల్లడైందని లింక్డ్ఇన్ ఇండియా కంట్రీ మేనేజర్ అశుతోష్ ఘోష్ పేర్కొన్నారు. మారుతున్న కాలాన్ని బట్టి వృత్తి నిపుణుల ప్రాధాన్యతలు మారుతుంటాయని, రాబోయే కాలానికి అనుగుణంగా భారతీయ వృత్తి నిపుణులు తమ పని–జీవితం మధ్య సమతూకాన్ని సాధించాల్సిన అవసరాన్ని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోందన్నారు. -
ఈ చిన్నారి కష్టం తెలిస్తే కడుపు తరుక్కుపోతుంది
ఇంగ్లండ్/ బ్రిస్టల్: కరోనా మహమ్మారి ఏ నిమిషాన ఈ ప్రపంచంలో అడుగుపెట్టిందో తెలియదు కానీ... మనుషులెవరిని ప్రశాంతంగా బతకనీయడం లేదు. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఏదో ఒక రకంగా బాధిస్తోంది. ప్రతి ఒక్కరి మీద ప్రభావాన్ని చూపుతోంది. మరీ ముఖ్యంగా కరోనా కట్టడి కోసం విధించిన లాక్డౌన్ చాలా మందిపై ఆర్థిక, మానసిక ప్రభావం చూపింది. పాఠశాలలు మూసివేయడం.. బయటకు వెళ్లే అవకాశం లేకుండా ఇంటికే పరిమితం కావడంతో పిల్లలు కూడా డిప్రెషన్ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో లాక్డౌన్ ఒత్తిడి భరించలేక ఎనిమిదేళ్ల చిన్నారి చేసుకున్న కొత్త అలవాటు ప్రస్తుతం తన జీవితాన్ని నరకప్రాయం చేసింది. స్నేహితులు, చుట్టుపక్కల వారు గేలి చేస్తూ ఏడిపిస్తున్నారు. ఆ చిన్నారి వ్యధ ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. ఆ వివరాలు.. (చదవండి: Stonehenge: ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే!!) ‘ట్రైకోటిల్లోమానియా’ అనే వ్యాధితో బాధపడుతున్న చిన్నారి అమెలియా ఇంగ్లండ్, బ్రిస్టల్ నగరానికి చెందిన అమెలియా అనే ఎనిమిదేళ్ల చిన్నారి.. మొదటిసారి 2020లో విధించిన లాక్డౌన్ కాలంలో తీవ్ర ఒత్తిడికి గురయ్యింది. దాన్ని తట్టుకోలేక కనురెప్పలను లాగి పడేయ్యడం ప్రారంభించింది. ఆ అలవాటు అలానే కొనసాగి.. చివరకు తల వెంట్రుకలను కూడా అలానే లాగసాగింది. కొన్ని రోజుల్లోనే బాలిక కనురెప్పలు, తలలో ముందు భాగంలో ఉన్న వెంట్రుకలు పూర్తిగా మాయమయ్యాయి. అమెలియా పరిస్థితి చూసిన ఆమె తల్లి.. స్నేహితులను కలవకుండా ఉండటం, పాఠశాలకు వెళ్లకపోవడం వల్లే.. తన కుమార్తె ఇలా అయ్యిందని భావించింది. ఆస్పత్రికి తీసుకెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఆన్లైన్లో డాక్టర్ని సంప్రదించి కుమార్తె పరిస్థితిని వివరించింది అమెలియా తల్లి. చిన్నారిని పరీక్షించిన వైద్యులు తను ‘ట్రైకోటిల్లోమానియా’ అనే వ్యాధితో బాధపడుతుందని వెల్లడించారు. ‘ట్రైకోటిల్లోమానియా’ అనే వ్యాధితో బాధపడుతున్న చిన్నారి అమెలియా (చదవండి: వైరల్: బుజ్జగించడానికి మీ పిల్లలకు ఇవి ఇస్తున్నారా..) కొద్ది కాలం తర్వాత లాక్డౌన్ ఎత్తేశారు.. పాఠశాలలు తెరిచారు. కానీ అమెలియా మాత్రం తన అలవాటును మానుకోలేకపోయింది. వైద్యుల ప్రకారం జనాభాలో ప్రతి 50 మందిలో ఒకరు ట్రైకోటిల్లోమానియాతో బాధపడుతుంటారు. దీనికి ప్రధాన కారణం ఒత్తిడి, ఆందోళన, ఏదైన బాధ. ప్రస్తుతం అమెలియా తల మీద.. అది కూడా వెనకభాగంలో మాత్రమే కొన్ని వెంట్రుకలు మిగిలి ఉన్నాయి. విగ్గు, స్కార్ఫ్ లేకుండా అమెలియా బయటకు వెళ్లడం లేదని ఆమె తల్లి తెలిపింది. ఈ వ్యాధి కారణంగా తన కుమార్తె ఎన్నో అవమానాలు ఎదుర్కొందని.. తోటి పిల్లలు తనను ఏడిపించారని.. ఫలితంగా అమెలియా మరింత డిప్రెషన్‌కు గురైందని తెలిపింది. (చదవండి: అయ్యో! వారి బతుకులు కరిగిపోతున్నాయ్) ‘ట్రైకోటిల్లోమానియా’ అనే వ్యాధితో బాధపడుతున్న చిన్నారి అమెలియా అమెలియా తల్లి మాట్లాడుతూ.. ‘‘తను ప్రారంభంలో కనురెప్పలను లాగుతున్నప్పుడు నేను దాని గురించి పెద్దగా ఆందోళన చెందలేదు. కానీ తన కనురెప్పలు పూర్తిగా పోయాయో అప్పుడు నాకు భయం వేసింది. ఈ అలవాటును మాన్పించాలని ప్రయత్నించాను కానీ సాధ్యం కాలేదు. అలా పెరుగుతూనే ఉంది. చివరకు తల వెంట్రుకలను లాగడం ప్రారంభించింది. ప్రస్తుతం తన తల వెనకభాగంలో మాత్రమే వెంట్రుకలు ఉన్నాయి. ముందు భాగం అంతా గుండయ్యింది’’ అని వాపోయింది. తన కూతురు పరిస్థితి గురించి ఆందోళన చెందుతున్న అమెలియా తల్లి, ఆమెను వారం వారం స్కూల్ థెరపిస్ట్, ప్రైవేట్ హిప్నోథెరపీ సెషన్లకు తీసుకెళ్తుంది. ఇందుకు ఎంతో డబ్బు ఖర్చు అవుతుందని తెలిపింది. అంతేకాక ప్రస్తుత సమాజంలో చాలా మంది ప్రజలు ట్రైకోటిల్లోమానియాతో బాధపడుతున్నారని కానీ ఇప్పటికీ దాని గురించి పెద్దగా అవగాహన లేదని.. పరిస్థితికి చాలా తక్కువ మద్దతు ఉందని వాపోయింది. చదవండి: ఒక్క కరోనా కేసు.. మూడు రోజులు దేశాన్నే మూసేశారు -
Panchayat Secretary: ఉద్యోగమా.. చాకిరా?
ఆమె ఓ పంచాయతీ కార్యదర్శి. ఇద్దరు పిల్లల తల్లి. చీకటిలోనే పనులు ముగించు కున్నారు. ఈలోపు భారీ వర్షం. అయినా.. తడుస్తూనే విధులకు వెళ్లారు. కార్యాలయానికి చేరుకొని ఫొటో తీసుకుని యాప్‌లో అప్లోడ్ చేశారు. ఇదంతా ఎందుకంటే కేవలం అటెండెన్స్ కోసమే. సాక్షి, కరీంనగర్: ఉదయాన్నే 8 గంటలకు విధుల్లో చేరామన్న సందేశం చేరితేనే ఆ రోజు పనిచేసినట్లు లెక్క. పోనీ అంత ఉదయం వెళ్లినా.. ఎప్పుడు తిరిగి వస్తారో తెలియనంతగా పనులు. ఇంతటి దారుణమైన పరిస్థితుల్లో తీవ్ర పని ఒత్తిడి మధ్య పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులకు పల్లెప్రగతి యాప్ వచ్చాక వేధింపులు పెరిగిపోయాయి. ముఖ్యంగా తాము ఉదయాన్నే అది కూడా ఉదయం 8 గంటల్లోపే గ్రామపంచాయతీ కార్యాలయాన్ని చేరుకొని, కార్యాలయం కనిపించేలా సెల్ఫీ తీసుకుని దాన్ని అప్లోడ్ చేయాలి. ఏదైనా కారణం చేత కాస్త లేటైనా.. ఆ రోజు జీతం హుష్‌కాకి. ఇటీవల బుగ్గారంలో ఓ ఎంపీడీవో తన పరిధిలోని తొమ్మిది మంది పంచాయతీ కార్యదర్శులకు మెమో జారీ చేయడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. తాను వాట్సాప్ గ్రూపులో పెట్టిన సందేశానికి స్పందించలేదన్న కారణానికే ఆగ్రహించిన అధికారి ఏకంగా 9 మందికి మెమో జారీ చేశారు. ఈ విషయం పలువురు నెటిజన్లు మంత్రి కేటీఆర్‌కు, జగిత్యాల కలెక్టర్ రవి దృష్టికి తీసుకెళ్లారు. సెల్ఫీ తీసుకుంటేనే మస్టర్.. ► ఉదయాన్నే ఎనిమిది గంటలకు పంచాయతీ కార్యాలయానికి రావాలి. అక్కడ జీపీ లైవ్ లొకేషన్‌తోపాటు, లాంగిట్యుడ్, లాటిట్యూడ్ వివరాలు, పంచాయతీ భవనం కనిపించేలా సెల్ఫీ దిగి పల్లె ప్రగతి పీఎస్ యాప్‌లో అప్లోడ్ చేయాలి. ► పల్లెప్రగతి పీఎస్ యాప్.. ఎంపీవో (మండల పంచాయతీ ఆఫీసర్) అనే రెండు రకాల లాగిన్లు పంచాయతీ కార్యదర్శులకు ఉంటాయి. ప్రతీ పంచాయతీ కార్యదర్శి విధిగా రోజూ రెండు కాలువలు, రెండు రోడ్లు, ఏదైనా ఒక ప్రభుత్వ సంస్థల భవనాలను క్లీన్ చేయించాలి. ► ఈ ఐదు పనులకు సంబంధించి ఐదు ఫొటోలు విత్ డేట్ అండ్ టైం ప్రకారం.. అప్లోడ్ చేస్తేనే ఆ రోజు పనిచేసిట్లు లెక్క. ఈ విధంగా నెలలో మొత్తం 24 పనిదినాలు ఇదే రకంగా విధులు నిర్వహించాలి. పాత ఫొటోలు అప్లోడ్ కావు. ► దీనికితోడు వీధి బల్బులు మార్చడం, ఇళ్ల నుంచి చెత్త సేకరణ వివరాలు కూడా రోజూ రిపోర్టు అప్లోడ్ చేయాలి. ► ఏ ఉద్యోగికైనా ఇంట్లో కనీస బాధ్యతలు ఉంటాయి. పిల్లలను స్కూలుకు పంపడం, మహిళలైతే ఇంట్లో వంట, పిల్లలు తదితర పనులు ఉంటాయి. కానీ.. కొత్త నిబంధన కారణంగా ఉదయాన్నే 7 గంటలకు బయల్దేరాలి. పిల్లలు నిద్రలేవక ముందే వదిలేసి రావడం చాలా బాధగా ఉందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ► పోనీ, 5 గంటలకు ఉద్యోగం ముగుస్తుందా.. అంటే అదీ లేదు. వీడియో కాన్ఫరెన్స్‌లు, టెలీకాన్ఫనెన్స్లు జరిగితే గంటల కొద్దీ సమయంపాటు అక్కడే ఉండాలి. అవి పూర్తయ్యాక ఏ అర్ధరాత్రో అపరాత్రో ఇల్లు చేరాలి. మళ్లీ ఉదయాన్నే విధులకు హాజరవ్వాలి. ► పంచాయతీ కార్యదర్శులపై మండలస్థాయిలో ఎంపీవో, ఎంపీడీవో, డివిజనల్ స్థాయిలో డీఎల్పీవో, ఏపీడీ, పీడీ జిల్లాస్థాయిలో ఏపీవో, డీపీవో వరకు ఇంతమంది సూపర్విజన్ ఉంటుంది. వీరందరూ ఏం పనిచెప్పినా ఎదురుచెప్పకుండా చేయాల్సిందే. ► ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలి. జనన మరణ రికార్డులు, ఇంటి పన్నులవసూళ్లు, రెవెన్యూ రికార్డుల నమోదు, పరిపాలనపరమైన విధులన్నీ వీరే నిర్వహించాలి. ► పొరపాటున ఎదురుతిరిగినా, చేయలేమని చెప్పినా, టైమ్‌కు విధులకు రాలేకపోయినా మెమోలు జారీ చేస్తూ మానసికంగా తీవ్రంగా వేధిస్తున్నారు. ► హరితహారం మొక్కలు పెరగకపోయినా, ఊర్లో కోవిడ్ వ్యాక్సినేషన్ వేసుకోకపోయినా, చిన్న చెత్త కనిపించినా వెంటనే మెమో జారీ చేస్తారు. ► ఇవి చాలవన్నట్లుగా గ్రామంలో సర్పించి, వార్డుమెంబర్లు, ప్రతిపక్ష నాయకులు, ఊర్లో ఉన్న పెద్దమనుషులు అంతా ప్రతీ పనికి వీరి మీదే పడుతున్నారు. ► ఈ ఉద్యోగాలు చేస్తున్న వారిలో దాదాపు 99 శాతం మంది పీజీలు చదివిన వారే. కరోనాకు ముందు ఈ ఉద్యోగాన్ని చాలామంది మానేద్దామనుకున్నారు. కానీ.. బయట కూడా పరిస్థితి బాగాలేకపోవడంతో విధిలేక ఈ కొలువులోనే కొనసాగుతున్నారు. చదవండి: 50 వేల టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలి -
ఒత్తిడి తగ్గించుకోవడానికి 365 రోజులుగా అదే పనిలో
చికాగో: వారమంతా కష్టపడితే మనకు సెలవు దొరికేది ఒకరోజు. ఆ ఒక్కరోజును ఎలా ప్లాన్ చేసుకొని గడపాలా అని ఆలోచిస్తుంటాం. ముఖ్యంగా పనివల్ల కలిగే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి రకరకాల ఆలోచనలు చేస్తుంటాం. ఇక ఒత్తిడిని దూరం చేయడానికి కొంతమంది స్విమ్మింగ్‌ను మార్గంగా ఏంచుకుంటారు. అయితే స్విమ్మింగ్ చేసేవాళ్లు మహా అయితే నెల రోజులు కంటిన్యూగా చేయగలుగుతారు. అంతకుమించి చేసినా బోర్ కొట్టడం ఖాయం. కానీ అమెరికాలోని చికాగొకు చెందిన ఒక బస్‌డ్రైవర్ మాత్రం 365 రోజుల నుంచి ప్రతీరోజు లేక్ మిచిగాన్‌లో ఈత కొట్టడానికి వస్తూనే ఉన్నాడు. అదేంటి ప్రతీరోజు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగితే.. నాకున్న ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇదొక్కటే మార్గం అనిపించింది.. అందుకే సంవత్సరం నుంచి ఇదే పనిలో ఉన్నా అంటూ వింత సమాధానమిచ్చాడు. వివరాలు.. చికాగోకు చెందిన డాన్ ఓ కానర్ బస్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇంటికి వస్తే ప్రశాంతంగా ఉండనివ్వకపోవడం.. ఆఫీస్‌కు వెళితే అధికారులు ఒత్తిడి తేవడం.. దీనికి తోడూ రోజు 12 గంటలకు పైగా బస్ నడపడం.. ఇవన్నీ కలిపి అతన్ని మానసికంగా చాలా కుంగదీశాయి. అదే సమయంలో కరోనా మహమ్మారితో అమెరికా మొత్తం లాక్డౌన్ ఉండడంతో అతనికి పని తగ్గిపోయింది. దీంతో మానసిక ప్రశాంతత కోసం కాస్త భిన్నంగా ఆలోచించాడు. గతేడాది సరిగ్గా ఇదే రోజున మాంట్రోస్ హార్బర్లో ఉన్న లేక్ మిషిగాన్‌కు చేరుకొని దూకడం ప్రారంభించాడు. అప్పటినుంచి కాలాలు మారుతున్నా తన పని మాత్రం ఆపలేదు. గడ్డకట్టే చలిలోనూ వచ్చి నదిలో దూకడంతో గడ్డకట్టిన నీళ్లతో దాదాపు 20 సార్లు దెబ్బలు తగలడంతో పాటు ఒంటినిండా గాట్లు పడేవి. అంత బాధను ఓర్చుకొని తన పని కానిచ్చి వెళ్లిపోయేవాడు. అలా సరిగ్గా నిన్న(శనివారంతో) ఏడాది పూర్తి కానుండడంతో కానర్ సంతోషంలో ఉన్నాడు. కానర్ స్పందిస్తూ.. '' ఒకవైపు మహమ్మారి బయపెడుతుంది.. మరోవైపు నాకు మానసిక ఒత్తిడి ఎక్కువైంది. ఏం చేయాలో అర్థం కాలేదు. మానసిక ప్రశాంతతను పొందడానికి లేక్ మిషిగాన్‌ను ఏంచుకున్నాను. 365 రోజులుగా నదిలో దూకుతున్న ప్రతీసారి కొత్తగానే కనిపించేది. అలా ఒక పనిని ఏడాది పాటు విజయవంతంగా పూర్తి చేశాను. ఈ ఏడాది వ్యవధిలో ఎన్నో జ్ఞాపకాలు మిగిలాయి.'' అంటూ చెప్పుకొచ్చాడు. కానర్ చేసిన పని ఇప్పుడు అక్కడ హాట్‌టాపిక్‌గా మారింది. కొందరు కానర్‌ను కలిసి ఒత్తిడి తగ్గించుకోవడం కోసం చిట్కాలు అడుగుతున్నారు. మరికొందరు మాత్రం అతనికి పనిపాటా లేక అలాంటి దారిని ఏంచుకున్నాడు. అంటూ కామెంట్లు చేశారు. చదవండి: 10 నిమిషాల అంతరిక్ష యాత్ర కోసం రూ.205 కోట్లు ఖర్చు చందమామపై బాంబులు ఎందుకు? -
ఈ యాప్స్‌తో ఒత్తిడి పరార్..!
డిజిటల్ వరల్డ్ ఐసోలేషన్లు, అంబులెన్స్ చప్పుళ్లు... స్ట్రెస్‌గా ఫీలవుతున్నారా? జోష్ మిస్సయిందా?అల్లావుద్దీన్ అద్భుతదీపంలాంటి ‘యాప్స్’ మీ దగ్గరే ఉన్నాయి. మీ మనసులో మాట చెప్పండి చాలు...‘జీ హుజూరు’ అని ఒత్తిడిని మాయం చేస్తాయి. మాయాతివాచీ మీద మిమ్మల్ని కూర్చోబెట్టుకొని రాగాల ప్రపంచంలోకి తీసుకువెళతాయి. రంగులతో బొమ్మలు వేయిస్తాయి. సవాల్ దూసే ఆటలకు సై అనేలా చేస్తాయి. టోటల్‌గా జోష్‌ను టన్నుల కొద్దీ ఇస్తాయి... జోరుగా....హాయి హాయిగా! ‘కరెంటు తీగలా ఎనర్జిటిక్‌గా ఉండేవాడివి...అదేంటి బ్రో ఇలా కనిపిస్తున్నావు!’ అనే పలకరింపుకు అటు నుంచి ఒక నవ్వు అయితే వినిపించిందిగానీ అది జీవం లేని నవ్వు. జోష్‌లేని జీరో నవ్వు! పైకి ఎంత గంభీరంగా కనిపించినా ఒత్తిడి, ఆందోళన, ఒంటరితనం, నిద్రలేమి...మొదలైన సమస్యలతో డీలా పడిపోతున్న కుర్రకారు సంఖ్య తక్కువేమీ లేదు. డీలా పడిపోకుండా సమస్యను ఢీ కొట్టాడానికి అందుబాటులో ఉన్న ఫీల్‌గుడ్ యాప్స్‌లో ఒకటి ‘ఎన్స్మైల్స్’ ఇప్పుడు మనం ఎదుర్కుంటున్న కనిపించే, కనిపించని మానసిక సమస్యలపై కత్తిదూసే సెల్ఫ్–హెల్ప్ టూల్స్ ఇందులో ఉన్నాయి. నిద్ర లేమి నుంచి కెరీర్ మెనేజ్మెంట్ వరకు నిపుణుల సలహాలు, సూచనలు ఇందులో కనిపిస్తాయి. ‘ఖాళీగా ఉన్న బుర్ర దెయ్యాల కార్ఖానా’ అంటారు కదా! ఈ సమయంలో మెదడుకు ఎంత పని కలిపిస్తే అంత మంచిది. దీనికి కొత్త భాష నేర్చుకుంటే మరీ మంచిది. మోస్ట్ పాప్లర్ లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్‌గా పేరున్న ‘డ్యుయో లింగో’లో స్పానీష్, జర్మన్, ఫ్రెంచ్, ఇటాలియన్, జపనీస్....మొదలైన భాషలు నేర్చుకోవచ్చు. అకాడమిక్ పాఠాల మాదిరిగా కాకుండా గేమ్–లైక్ ట్రిక్స్‌తో కొత్త భాష నేర్చుకోవచ్చు. అలా కళ్లు మూసుకొని, రిలాక్స్ అవుతూ పుస్తకం చదవాలని...సారీ వినాలని ఉందా? అందుకు ‘ఆడిబుల్’ యాప్ ఉంది. అమెజాన్ వారి ఈ ఆడియోబుక్ సర్వీస్‌లో ఎన్నో పుస్తకాలు వినవచ్చు. కాస్త ఎంటర్టైన్మెంట్ కావాలంటారా? అయితే ఇదే కంపెనీ వారి ‘ఆడిబుల్ సునో’ ఉంది. బాలీవుడ్ నుంచి టీవి సెలబ్రిటీల వరకు ఎన్నో గొంతులు వినొచ్చు. కామెడీతో కడుపుబ్బా నవ్వుకోవచ్చు. ఆసక్తి కలిగించే సినిమా, ఆటల కబుర్లు హాయిగా వినవచ్చు. గూగుల్ ప్లేస్టోర్‌లో హైయెస్ట్–రేటెడ్ యాప్‌లలో ఒకటైన ‘కలర్ఫై’ రిలాక్స్ కావడానికి ఉపకరించే యాప్. మనల్ని వేలు పట్టుకొని బాల్యంలోకి తీసుకువెళుతుంది. పూలతోటలు, జంతుజాలం, ప్రముఖ చిత్రాలు, ప్రముఖుల చిత్రాలకు రకరకాల రంగులు వేయవచ్చు. స్ట్రెస్, అకారణ ఆందోళల నుంచి బయటపడడానికి కలరింగ్ యాప్స్ బెస్ట్ అని సూచిస్తున్నారు మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్. ప్రపంచవ్యాప్తంగా పేరున్న సోషల్ గేమింగ్ యాప్‌లలో ‘హగో’ ఒకటి. మనదేశంలో కూడా ప్రాచుర్యం పొందింది. ‘ప్లే విత్ ఫ్రెండ్స్ అండ్ మేక్ ఫ్రెండ్స్’ అని ఆహ్వానిస్తోంది. బ్రెయిన్ క్విజ్ (బ్రెయిన్ పవర్‌ను చెక్ చేసుకునే గేమ్) మొదలు క్రేజీ ట్యాక్సీలాంటి మైండ్ బ్లోయింగ్ గేమ్స్ వరకు ఎన్నో గేమ్స్ ఇందులో ఉన్నాయి. పాత గేమ్స్‌నే పదేపదే ఆడనక్కర్లేదు. ప్రతిరోజూ కొత్త గేమ్స్ లైబ్రరీలో చేరుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా మీలాగే గేమ్స్ ఆడేవారితో కనెక్ట్ కావచ్చు. బొమ్మలు వేయాలని ఎవరికి మాత్రం ఉండదు! మీ ఐఫోన్‌నే కాన్వాస్‌గా చేసుకొని ఆయిల్ పెయింటింగ్ నుంచి డిజిటల్ ఆర్ట్ వరకు కుంచెలను కదిలించడానికి ‘ఇన్స్పైర్ ప్రో’ ఉంది. ఉదాహరణ కోసం గ్యాలరీలో బోలెడు చిత్రాలు ఉన్నాయి. ఎయిర్ బ్రషెస్ నుంచి గ్రాఫిటీ పెన్సిల్స్ వరకు ఎన్నో టూల్స్ ఉన్నాయి. ఇక ఇల్లే చిత్రశాల అవుతుంది. లాక్డౌన్, ఐసోలేషన్‌లతో బాహ్య ప్రపంచం దూరమైపోయిందని బాధ అక్కర్లేదు. యాప్ ప్రపంచంలోకి అడుగుపెడితే ఒకటి కాదు ఎన్నో ప్రపంచాలు స్వాగతం పలుకుతాయి. నిరుత్తేజ క్షణాల్లో కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. -
Kavitha Natarajan: ఆప్యాయతే.. అభయం
ఇప్పుడు సమాజం ఎన్నడూ లేనంత భయాందోళనల మధ్య కొట్టుమిట్టాడుతోందని, ఆప్యాయత, అవగాహన నిండిన మాటలతో దాన్ని పోగొట్టాల్సిన అవసరం ఉందని అంటున్నారు కవితా నటరాజన్. కరోనా కల్లోలం నేపథ్యంలో సమాజంలో విజృంభిస్తున్న పలు రకాల మానసిక సమస్యలకు ఆమె తన వంతు పరిష్కారాలను స్వచ్ఛందంగా అందిస్తున్నారు. గత ఏడాది తెలంగాణలోని రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటైన సైకోసోషల్ కౌన్సిలింగ్ సర్వీసెస్‌లో భాగంగా ఆమె కౌన్సిలింగ్ సేవలు కొనసాగిస్తున్నారు. ఐటీ ఉద్యోగినిగా పనిచేస్తూనే మరోవైపు తనకు ఇష్టమైన సోషల్ సర్వీస్‌నూ వదలకుండా కృషి చేస్తున్న కవితానటరాజన్ తన అనుభవాలను పంచుకున్నారిలా... కిందటేడాది కరోన.. ‘‘కార్పొరేట్ రంగంలో ఉన్నా, ప్రస్తుతం సిజిఐ అనే ఐటి కంపెనీలో పనిచేస్తున్నా. చిన్ననాటి నుంచీ స్వచ్ఛంద సేవ అంటే ఇష్టం. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో ఎన్నడూ ఎరగనంత విచిత్రమైన పరిస్థితులున్నాయి. లాక్‌డవున్ అనే మాట అంతకుముందు మనలో ఎవరమూ కనీ విననిది. ఆకలి కేకలు విని చాలా బాధపడ్డా. అయితే బయటకు వెళ్లి ఫుడ్ ప్యాకెట్స్ పంచాలి వంటి ఆలోచనలు వచ్చినా, నా వ్యక్తిగత ఇమ్యూన్ సిస్టమ్ గురించి తెలుసు కాబట్టి అలా చేయలేకపోయా. అదే సమయంలో ఎన్నడూ లేనట్టు కొన్ని నెలల పాటు ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితుల వల్ల చుట్టుపక్కల పలువురిలో విభిన్న రకాల మానసిక సమస్యలను గుర్తించాను. అప్పటికే సైకాలజీలో డిగ్రీ చేశాను కాబట్టి.. స్వచ్ఛందంగా సైకలాజికల్ కౌన్సిలింగ్ ఎందుకు ఇవ్వకూడదు? అనిపించింది. ఆ ఆలోచనను పోలీసు ఉన్నతాధికారి మహేష్ భగవత్ గారితో పంచుకుని, వారి సూచనల మేరకు రాచకొండ కమిషనరేట్ ఆధ్వర్యంలో మేం గత ఏడాది ఏప్రిల్ 2 న కౌన్సిలింగ్ సేవలు ప్రారంభించాం. ఉదయం 9గంటల నుంచి రాత్రి 9గంటల వరకూ వచ్చిన కాల్స్ ఇంకా గుర్తున్నాయి. లాక్ డౌన్ వల్ల పెరిగిన పనిభారంతో ఇళ్లలో మహిళలు చాలా ఇబ్బందులు పడ్డారు. వర్క్ డివిజన్ తెలియక చాలా మానసికంగా ఒత్తిళ్లకు లోనయ్యారు. మహిళలపై గృహహింసకు సంబంధించిన కాల్స్ కూడా విపరీతంగా వచ్చాయి. వీరందరికీ కౌన్సిలింగ్ ఇస్తూ అలా... మూడు నెలల పాటు పని చేశాం. కోవిడ్ తగ్గటంతో ఆ కాల్స్ తగ్గిపోయాయి. అయితే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయినప్పుడు మానసిక సంఘర్షణకు లోనైన యువత నుంచి పెద్ద సంఖ్యలో కాల్స్ వచ్చాయి. సెకండ్‌వేవ్ బాధితులు మరోసారి కోవిడ్ తన ప్రతాపం చూపిస్తున్న పరిస్థితుల్లో భావోద్వేగాలు మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. అందుకే మరోసారి ఈ కౌన్సిలింగ్ సేవలు ప్రారంభించాం. గతం తో పోలిస్తే ఇప్పుడు మరింత విభిన్నమైన మానసిక సమస్యలతో సంప్రదిస్తున్నారు. వీరిలో తమ వారిని పోగొట్టుకున్న మహిళల మానసిక పరిస్థితి దయనీయంగా ఉంది. అలాగే దగ్గర బంధువుల్లో చావులు ఈసారి చాలామంది మనోధైర్యాన్ని పోగొడుతున్నాయి. తాజాగా బ్లాక్ ఫంగస్ గురించి కూడా కాల్స్ వస్తున్నాయంటే... ఇప్పుడు భయం ఎంతగా జనాల్లో పేరుకుపోయిందో అర్థమవుతుంది. మా వంతుగా వారిలో ధైర్యాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నాం. ఈసారి నాతోపాటు బాగా అనుభవం ఉన్న మరో 13 మంది మహిళ కౌన్సిలర్లు తమ సేవలు అందిస్తున్నారు. పోలీసుకూ మహిళకూ మధ్య గతంలో కూడా ఈ తరహా కౌన్సిలింగ్ చేసిన అనుభవం ఉంది. ‘మార్గదర్శక్’ పేరుతో మా లాంటి కొందరు స్వచ్ఛంద సేవకులకు గృహహింస, వేధింపులు.. వంటి వాటి విషయంలో చట్టబద్ధమైన అంశాలపై పోలీసు శాఖ ఆధ్వర్యం లో శిక్షణ అందించారు. అలాగే మన సమాజంలో కొందరు మహిళలకు పోలీస్ స్టేషన్ అన్నా, పోలీసులన్నా భయం ఉండొచ్చు. ముందు వారిని మానసికంగా ధైర్యం పుంజుకునేలా చేసి, వారి సమస్య నిర్భయంగా చెప్పగలిగేలా ప్రిపేర్ చేస్తాం, షీ టీమ్‌కు అనుసంధానంగా పనిచేస్తాం’’ అని వివరించారు కవిత. – నిర్మలారెడ్డి -
కరోనా భయాన్ని జయించడం ఎలా..?
అనవసర భయాల నుంచి మనస్సును వేరే అంశాల వైపు మళ్లించుకోవడానికి (డైవర్ట్ చేయడానికి) గట్టిగా ప్రయత్నించాలి. కరోనా అంటేనే చాలామందిలో భయం ఏర్పడిపోయింది. కరోనా సోకితే భయం. పాజిటివ్ కాకపోయినా తమకూ వస్తుందేమో అనే భయం. కరోనాతో ఆస్పత్రుల్లో సీరియస్‌గా ఉన్న వారి గురించి, మరణించిన వారి గురించిన వార్తలు, అంబులెన్సుల సైరన్లు వంటి నెగెటివ్ విషయాలు వినడం వల్ల ఓవర్ థింకింగ్ అలవాటైపోతోంది. దీంతో గుండె దడ, గాభరా పెరిగి పోతుంది. పులి వచ్చినప్పుడు ఫేస్ చేయడం ఎలా అనేది నేర్చుకోవాలి. అంతే కానీ అదిగో వస్తోంది, ఇదిగో వస్తోంది అనే టెన్షన్ పడకూడదు. ఈ విధమైన అవగాహన పెంచుకోవాలి. కొందరైతే పాజిటివ్ కాకపోయినా ముందుగానే ఆసుపత్రిలో బెడ్ బుక్ చేసుకుంటున్నారు. ఇంత ఆలోచన పనికిరాదు. ఒక విషయం గురించి ఎంత ఎక్కువ ఆలోచిస్తే... అంతగా అదే జోన్లోకి మనం వెళ్లిపోతాం. ప్రసుతం కోవిడ్ వచ్చినవారికి అప్పటివరకూ లేని భయాలు కూడా ఆవరిస్తున్నాయి. అందులో ముఖ్యమైనది హార్ట్ అటాక్ వస్తుందేమోనన్నది. దాంతో కాస్త గుండె గట్టిగా కొట్టుకున్నా ఆందోళన పడుతున్నారు. ఇవన్నీ ఇమ్యూనిటీని దెబ్బతీసేవే. ఇలాంటివారిలో రికవరీ అయ్యాక కూడా తీవ్రమైన అలసట కనపడుతోంది. పెద్ద వయసు వారిలో జ్ఞాపకలేమి, ఏవోవో ఫోబియాలు పెరుగుతున్నాయి. అందుకే ఈ సమయంలో మనసును బాగా డైవర్ట్ చేసుకోవాలి. వీలైతే గార్డెనింగ్ దగ్గర్నుంచి కేరమ్స్ ఆడడం వరకు నచ్చిన పనులు చేసుకుంటూ ఉండాలి. కోవిడ్ వల్ల నలుగురితో కలవడం కూడా (సోషలైజేషన్) బాగా తగ్గిపోయింది. అలవాటు లేని ఒంటరితనం వల్ల బాగా డిప్రెషన్‌కి గురవుతున్నారు. ఎవరైనా సరే ఒంటరిగా ఉండొద్దు. ఇతరులు కూడా ఇలాంటి వారిని ఒంటరిగా వదలొద్దు. ఏదో రకమైన పలకరింపు ముఖ్యం. డా.హరిణి, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, కేర్ హాస్పిటల్, హైదరాబాద్ -
నిమ్మ ఆకులతో ప్రయోజనాలెన్నో..
నిమ్మకాయలు ఆరోగ్యానికి ఎంత మంచివో.. ఆకులు కూడా అంతే ఉపయోగమైనవి. నిమ్మ ఆకుల్లో ఐరన్, క్యాల్షియం, విటమిన్ ఏ, విటమిన్ బీ1, ఫ్లేవనాయిడ్స్, రైబోఫ్లోవిన్, సిట్రిక్ యాసిడ్ ఉంటాయి. నాలుగు తాజా నిమ్మ ఆకుల్ని ఒక గ్లాసు వేడినీటిలో మూడుగంటలు నానబెట్టి తాగితే.. నిద్రలేమి, గుండెదడ, నరాల బలహీనత వంటివి తగ్గుతాయి. వేడినీటిలో మరిగించకూడదు. కేవలం నానబెట్టాలి. అంతే! నీళ్లను వేడిచేసి దించేయాలి. అందులో గుప్పెడు నిమ్మ ఆకుల్ని వేసి.. ఆ నీటిని రాత్రి పడుకునే ముందు తాగాలి. ఇలా నెలరోజులు చేస్తే మైగ్రేన్ తలనొప్పి, ఆస్మా వంటివి తగ్గిపోతాయి. మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు నిమ్మ ఆకుల్ని నలిపి.. ఆ వాసన పీలిస్తే మంచిది. మనసు వెంటనే ఆహ్లాదకరంగా మారుతుంది. నిమ్మ ఆకుల్లో యాంటీబ్యాక్టీరియా గుణాలు ఉన్నాయి. అందుకనే నిమ్మను పలు రూపాల్లో సౌందర్య ఉత్పత్తులలో వాడుతున్నారు. నిమ్మ ఆకుల పేస్టును ఫేస్‌ప్యాక్‌లా వేసుకోవచ్చు. దీనికి కాస్త తేనె కూడా కలుపుకోవచ్చు. దీనివల్ల ముఖ పర్చస్సు పెరుగుతుంది. ముఖం మీదున్న మచ్చలు, మొటిమలను కూడా పోగొడతాయివి. నిమ్మ ఆకుల్ని మెత్తగా నూరి పళ్లకు పట్టిస్తే.. నోటి దుర్వాసన పోతుంది. పళ్లలోని బ్యాక్టీరియా నశిస్తుంది. దంతాలు ఆరోగ్యంగా మారతాయి. స్నానం చేసే నీటిలో నిమ్మ ఆకుల్ని వేసుకుని స్నానం చేస్తే చర్మ ఆరోగ్యం బావుంటుంది. నిమ్మ ఆకుల్ని హ్యాండ్‌వాష్‌లా వాడవచ్చు. ఆకుల్ని నలిపి చేతులకు పూసుకుంటే చెడు బ్యాక్టీరియా నశిస్తుంది. వికారం పోవడానికి నిమ్మ ఆకుల్ని వాడవచ్చు. -
2021లో బాగుండాలంటే.. ఈ 5 మార్చుకోండి!
2020 ప్రతి ఒక్కరి జీవితాల మీద ఎంతో ప్రభావాన్ని చూపించింది. ఊహించని మార్పులు తీసుకొచ్చింది. వేడుకలు దూరమయ్యాయి... ఇళ్లు ఆఫీసయ్యింది. సినిమాలు లేవు.. షికార్లు లేవు. మన జీవిన విధానంలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. చాలా వరకు బయటి తిండి తగ్గించాము. ఇంటి భోజనానికి అందులోనూ.. ఆరోగ్యకరమైన ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యత పెరిగింది. ఇవి మంచి విషయాలైతే.. లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితం కావడం.. చాలా కంపెనీలు ఉద్యోగుల్ని తొలగించడం వంటి సంఘటనలతో ఒత్తిడి, ఆందోళన పెరిగాయి. చాలా మందిలో మానసిక కుంగుబాటు ఎక్కువయ్యింది. మరి కొద్ది రోజుల్లో 2020కి ముగింపు పలకబోతున్నాం. ఇక 2021లో మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ ఐదు అలవాట్లను తప్పక మార్చుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు. అవేంటో చూడండి.. మీలో కూడా ఈ లక్షణాలు ఉంటే మార్చుకుని వచ్చే ఏడాదిని సంతోషంగా గడపండి... ఫీలింగ్స్‌ని అణిచవేసుకుంటున్నాం.. దాదాపు ఈ ఏడాది ప్రతి ఒక్కరు ఈ పరిస్థితిని అనుభవించారు. మన ఎమోషన్స్‌ని కావాలని ఇగ్నోర్ చేసే పరిస్థితులను 2020లో ఎదుర్కొన్నాం. అయితే ఇలా ఫీలింగ్స్‌ని అణిచివేసుకోవడం మంచిదేనా అంటే.. కాదని అంటున్నారు నిపుణులు. అవసరానికి తగ్గట్లు ప్రస్తుతం మన భావాల్ని అణచివేసుకుంటూ పోతే భవిష్యత్తులో అది మన మానసిక ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపుతుంది అంటున్నారు. ఫీలింగ్స్‌ని అణిచి వేసుకోవడం వల్ల మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోవడమే కాక మైగ్రేన్, హై బీపీ వంటి అనారోగ్యాల బారిన పడతామంటున్నారు. ఈ క్రమంలో డ్రగ్స్, ఆల్కహాల్ వంటి చెడు వ్యసనాలకు బానిసవుతామని హెచ్చరిస్తున్నారు. కనుక దగ్గరి వాళ్లతో మన ఫీలింగ్స్‌ని షేర్ చేసుకోవడం.. లేదంటే ఓ పేపర్ మీద రాసుకుని.. ఆ పరిస్థితుల గురించి మనకు మనమే విశ్లేషించుకోవడం బెటర్ అంటున్నారు నిపుణులు. ఇవేవి కాదంటే థెరపిస్ట్‌ని కలవమని సూచిస్తున్నారు. (చదవండి: న్యూ ఇయర్ నిర్ణయాలు కొనసాగాలంటే) అధిక ఒత్తిడి భరిస్తున్నాం.. మనం ఎదుర్కొనే సగం అనారోగ్యాలకి మూల కారణం ఒత్తిడికి గురవ్వడం. ఆందోళనని బయటకు వెళ్లడించడం ఎంతో మంచిది. ఇక మన బుర్రలో నడిచే విషయాల గురించి పట్టించుకోకపోతే.. వాటిని విశ్లేషించి ఓ కొలిక్కి రాకపోతే.. ఒత్తిడి పీక్స్‌కి వెళ్తుంది. దాంతో మన మెదడు కార్టిసాల్ అనే ఒక స్టెరాయిడ్ హార్మోన్ విడుదల చేస్తుంది. సాధారణంగా కార్టిసాల్ పని ఏంటంటే ఇది మన జీవక్రియ రోగనిరోధక ప్రతిస్పందనతో సహా శరీరమంతా విస్తృతమైన ప్రక్రియలను నియంత్రిస్తుంది. ఈ హార్మోన్ ఎక్కువ మొత్తంలో విడుదల అయితే.. ఇది మెదడు పని తీరును అడ్డుకుంటుంది. దాంతో రోజువారి జీవిన విధానం పూర్తిగా దెబ్బ తింటుంది. కనుక ఒత్తిడి లేవల్స్ పెరిగినప్పుడు తప్పకుండా బ్రేక్ తీసుకొండి. దాన్ని జయించడానికి ప్రతిరోజు యోగా, ధ్యానం చేయడం అలవాటు చేసుకొండి. తీవ్రమైన ఆలోచనల నుంచి బయటపడేందుకు మీ మనసుకు నచ్చే పనులు చేయడం మంచిది అంటున్నారు నిపుణులు. తగినంత నిద్ర పోవడం లేదు... దురదృష్టవశాత్తు.. గత కొద్దేళ్లుగా మన నిద్ర అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. ఇది అనారోగ్యకరమైన పద్ధతి అని తెలిసినప్పటికి మార్చుకోలేకపోతున్నాం. మంచి మానసిక ఆరోగ్యం కోసం ప్రతిరోజూ ఎనిమిది గంటల నిద్ర పొందడం చాలా ముఖ్యం. వాస్తవానికి, ది స్లీప్ హెల్త్ ఫౌండేషన్ చేసిన పరిశోధనలో 60 నుంచి 90 శాతం మంది రోగులు నిద్రలేమితో బాధపడుతున్నా వారే అని తెలిపింది. ఒక్క రోజు సరిగా నిద్రపోకపోతేనే.. ఆ రోజంతా ఏదోలా ఉంటుంది. గందరగోళంగా అనిపిస్తుంది. ఈ అలవాటు ఇలానే కొనసాగితే.. ఇది దీర్ఘకాలంలో మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కనుక రాబోయే సంవత్సరంలో నిద్రకు ప్రాధాన్యతనివ్వండి. మీరు బాగా విశ్రాంతి తీసుకోకపోతే, మీ మనస్సు సరిగా పనిచేయదు, ఇది అనేక ఇతర సమస్యలకు దారితీస్తుంది. (చదవండి: ఆనందారోగ్యాలకు పది సూత్రాలు) తగినంత వ్యాయామం లేదు.. మన శారీరక ఆరోగ్యానికి వ్యాయామం ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. అయితే ఇది మన మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని మీకు తెలుసా. ఎక్సర్సైజ్ విషయంలో 2020 మమ్మల్ని మరింత బద్దకస్తులుగా మార్చింది. లేచిన దగ్గర నుంచి చాలా మంది మొబైల్ స్క్రీన్లు, కంప్యూటర్లకు అతుక్కుపోయారు. సామాజిక దూరం కారణంగా వ్యాయమాన్ని నిర్లక్ష్యం చేశాము. ఇక రాబోయే సంవత్సరంలో ఈ అలవాటును తప్పక మార్చాల్సిందే. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అనేది ఎండార్ఫిన్లను విడుదల చేయడంలో సహాయపడుతుంది. మనకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. మయోక్లినిక్ విడుదల చేసిన ఒక కథనం ప్రకారం, వ్యాయామం “ఫీల్-గుడ్ ఎండార్ఫిన్లు, సహజ గంజాయి లాంటి మెదడు రసాయనాలు (ఎండోజెనస్ కానబినాయిడ్స్), ఇతర సహజ మెదడు రసాయనాలను విడుదల చేస్తుంది. ఇవి మనల్ని మానసికంగా సంతోషంగా ఉంచుతాయి”. జిమ్‌కు వెళ్లడం మరి కొద్ది రోజులు వీలుపడక పోవచ్చు. కానీ వాకింగ్ చేయడం ఒకే కదా. ప్రయత్నించండి.. 21 రోజుల తర్వాత ఎలా ఉందో పరిశీలించండి. 24 గంటలు సోషల్ మీడియానే లోకం.. 2020 మనల్ని సోషల్ మీడియాకు మరింత బానిసల్ని చేసింది. లాక్డౌన్ కారణంగా చాలా రోజుల పాలు అందరూ ఇళ్లకే పరిమితం కావడంతో ఏం చేయాలో పాలుపోక స్క్రోలింగ్ చేయడం, సెల్ఫీలు పోస్ట్ చేయడం, రోజంతా మీమ్స్‌ను సర్చ్ చేయడం వంటివి చేస్తూ టైం పాస్ చేశారు. సోషల్ ప్లాట్‌ఫామ్‌లపై కొంత సమయం గడపడం మంచిదే. కానీ ప్రతి ఐదు నిమిషాలకోసారి ఎఫ్బీ, ఇన్‌స్టాగ్రామ్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలనే కోరిక ఉంటే, మీ సమస్య తీవ్రమైనట్లే. ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తుంది. మొబైల్‌కే అతుక్కపోవడం వల్ల శారీరక ఆతోగ్యం కూడా దెబ్బతింటుంది. కష్టమైనా సరే ఈ ఏడాది సోషల్ మీడియా వాడకాన్ని తగ్గిద్దాం అని నిర్ణయం తీసుకొండి. ఆ సమయాన్ని మీలోని సృజనాత్మకతకు మెరుగులు దిద్దుకునేందుకు.. కుటుంబంతో గడిపేందుకు.. ఇష్టమైన వ్యాపకాలను కొనసాగించడానికి వినియోగించండి. ఆ తర్వాత మీరే అద్భుతః అంటారు. (చదవండి: మోదీ ఎలా యాక్టివ్‌గా ఉంటున్నారు ?) -
ఒత్తిడి నివారణకు ఆయుర్వేద చిట్కాలివే..
న్యూఢిల్లీ: ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒత్తిడి, డిప్రెషన్ (మానసిక ఆందోళన)తో మెజారిటీ ప్రజలు బాధపడుతున్నారు. కొన్ని ఆయుర్వేద చిట్కలతో ఒత్తిడి సమస్యను నివారించవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. భారత ఆయుర్వేదానికి గణనీయమైన చరిత్ర ఉంది. గత 2వేల సంవత్సరాలుగా అనేక జబ్బులకు ఆయుర్వేద వైద్యం దివ్యౌషదంగా పని చేసింది. అయితే ఇటీవల కాలంలో జబ్బులు నయం కావడానికి ఆయుర్వేద వైద్యం చాలా సమయం తీసుకుంటుందని కొందరు అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అపోహలకు దీటుగా ఆయుర్వేద నిపుణులు చక్కటి విశ్లేషణతో దీటైన కౌంటర్ ఇస్తున్నారు. ఒత్తిడిని ఎదుర్కొనే ఆయుర్వేద వైద్యంపై విశ్లేషణ: ఆయుర్వేద వైద్యంలో ఒత్తిడి సమస్యకు నాడీ వ్యవస్థ మూలమని భావిస్తారు. మానసిక సమస్యలను దోషా అనే ప్రక్రియ నియంత్రిస్తుంది. కాగా నరాల వ్యవస్థను బలంగా ఉంచే వాత ప్రక్రియ ద్వారా శారీరక, మానసిక సమస్యలను అధిగమించవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలిపారు. తీవ్ర ఒత్తిడి సమస్యను నివారించేందుకు పోషకాహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం పరిష్కార మార్గంగా నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడిని అధిగమించేందుకు ప్రాచీన కాలం నుండి హెడ్ మసాజ్ ప్రక్రియ చాలా ప్రాచుర్యం పొందింది. అయితే తల, మెడ ప్రాంతాలను మసాజ్ చేయడం ద్వారా ప్రశాంతమైన నిద్రతో పాటు రక్త ప్రసరణను పెంచుతుంది. దీంతో పాటు చర్మం, జుట్టు సమస్యను నివారిస్తుంది. కాగా మసాజ్ చేయుటకు నారాయణ తైలా, బ్రాహ్మి నూనె వంటి సహజ నూనెలను ఉపయోగిస్తారు. సమతుల్య ఆహారం ద్వారా ఒత్తిడి నివారణ మనిషికి ఏం కావాలో శరీరం సిగ్నల్స్ ఇస్తుంది. అలాగే శరీరం కోరుకున్న సమయంలో ఆహారం తీసుకోవడం ద్వారా హార్మోన్ల సమస్యను నివారించవచ్చని తెలిపారు. కాగా విటమిన్ సీ, బీ, ఒమెగా, మాగ్నిషియమ్ కలిగిన ఆహారాలను తీసుకోవడం ద్వారా ఒత్తిడిని ఎదుర్కోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఒత్తిడి సమస్యను నివారించేందుకు క్రమం తప్పకుండా యోగాను సాధన చేయాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు -
కాలేజీ యువతపై మానసికంగా తీవ్రప్రభావం
న్యూఢిల్లీ: కరోనా మూలంగా తలెత్తిన సంక్షోభం, లాక్డౌన్ మూలంగా కాలేజీ విద్యార్థుల మానసిక ఆరోగ్యంపైనే అందరికంటే ఎక్కువగా ప్రభావం పడిందని ఓ సర్వే తేల్చింది. ఆన్లైన్ మానసిక ఆరోగ్య వేదిక ‘యువర్‌దోస్త్’ఎనిమిది వేల మందితో రెండు విడతలుగా సర్వే నిర్వహించింది. మొదట లాక్డౌన్ ప్రారంభంలో, రెండోసారి జూన్‌లో సమాజంలోని వివిధ వర్గాల మానసిక పరిస్థితిని ఈ సర్వే విశ్లేషించింది. లాక్డౌన్ ముందుకుసాగిన కొద్దీ... కాలేజీ విద్యార్థుల్లో భావోద్వేగాల్లో తీవ్ర మార్పులు చోటుచేసుకున్నాయి. కోపం, అసహనం, ఆందోళన, ఒంటరితనం ఫీలవ్వడం, నిరాశానిస్పృహల్లో కూరుకుపోవడం అధికమైంది. ఆందోళన, భయం 41 శాతం ఎక్కువైంది. విద్యార్థినీ విద్యార్థుల్లో సాధారణ పరిస్థితులతో పోలిస్తే... కోపం, అసహనం, చికాకు 54 శాతం ఎక్కువయ్యాయి. నిరాశకు లోనుకావడం 27 శాతం, విచారంలో మునిగిపోవడం 17 శాతం, ఒంటరితనం, బోర్‌గా ఫీలవ్వడం 38 శాతం పెరిగాయి. ఇంటికి మాత్రమే పరిమితమైపోవడం విద్యార్థుల మానసిక స్థితిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. స్వేచ్ఛను కోల్పోయామనే భావన కాలేజీ లేదు. స్నేహితులతో పిచ్చాపాటి, క్యాంపస్‌లో సరదాలు... ఏవీ లేవు. రోజంతా ఇంట్లోనే ఉండాల్సి రావడం కూడా వారికి ఇబ్బందిగా మారింది. అన్నివేళలా తల్లిదండ్రులు కూడా ఉండటంతో స్వేచ్ఛను కోల్పోయామని విద్యార్థులు పేర్కొన్నారు. ఇంట్లోనే ఉండటంతో తీవ్ర అసహనానికి లోనయ్యారు. తర్వాతేంటి? కాలేజీ విద్యార్థుల తర్వాత ఉద్యోగుల మానసిక ఆరోగ్యంపై ఎక్కువగా ప్రభావం పడిందని సర్వే తేల్చింది. ఉద్యోగ రంగాల్లో నెలకొన్న అనిశ్చితి, తర్వాత ఏంటి? అనే ప్రశ్న ఉద్యోగులను కుంగుబాటుకు గురిచేసింది. ఉద్యోగుల్లో భయాందోళనలు 41 శాతం పెరిగాయి. కోపం, అసహనం, చిరాకు 34 శాతం పెరిగాయి. నిరాశావాదం 17 శాతం, విచారపడటం 18 శాతం, ఒంటరితనం, బోర్‌గా ఫీలవ్వడం 26 శాతం పెరిగాయి. దీర్ఘకాలం నలుగురితో కలవకపోవడం, ఇంటికే పరిమితం కావడం, జీవనశైలిలో ఒక్కసారిగా మార్పులు రావడంతో ఉద్యోగులు ఇప్పటికీ వీటికి అలవాటుపడటానికి ఇబ్బందిపడుతున్నారు. అందరిలోనూ ఒత్తిడి పెరిగిపోయింది. లాక్డౌన్ ఆరంభంలో 33 శాతం మంది తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నట్లు చెప్పగా... జూన్‌లో ఇది మరో 7.55 శాతం పెరిగింది. నిద్రలేమితో బాధపడుతున్న వారు కూడా 11 శాతం వరకు పెరిగారు. -
బ్యాంకులకు ‘కరోనా’ స్ట్రెస్ టెస్టులు
ముంబై: కరోనా వైరస్ పరిణామాలతో మందగమన పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో మొండిబాకీల స్థాయిని మదింపు చేసేందుకు బ్యాంకులు స్ట్రెస్ టెస్టులు నిర్వహించాయి. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియేనని, ఆర్బీఐ ప్రత్యేకంగా బ్యాంకులకు ఆదేశాలివ్వాల్సిన అవసరం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆఖరు త్రైమాసికం కూడా ముగియడంతో ఆర్థికపరమైన ఒత్తిళ్ల గురించి ఒక అవగాహన కోసం ఈ సమీక్షల నిర్వహణ శ్రేయస్కరమని పేర్కొన్నాయి. అసెట్ క్వాలిటీ దిగజారే అవకాశమున్న కేసులను ముందుగా గుర్తించేందుకు, ఒకవేళ పరిస్థితి చేయి దాటితే సమకూర్చుకోవాల్సిన మూలధనం తదితర అంశాలపై ఒక అంచనాకు వచ్చేందుకు ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది. దీనివల్ల మేనేజ్మెంట్కు, నియంత్రణ సంస్థకు ఆయా బ్యాంకుల ఆర్థిక స్థితిగతుల గురించి ముందస్తుగా ఒక అవగాహన ఉంటుంది. మొండిబాకీలను సకాలంలో గుర్తించడం ద్వారా మెరుగ్గా ఉన్న పద్దులపై ప్రతికూల ప్రభావాలు పడకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు బ్యాంకులకు ఈ స్ట్రెస్ టెస్ట్ తోడ్పడుతుందని కేపీఎంజీ ఇండియా పార్ట్నర్ (ఫైనాన్షియల్ సర్వీసెస్ అడ్వైజరీ) సంజయ్ దోషి తెలిపారు. బ్యాంకింగ్ వ్యవస్థ స్థాయిలో నెలకొన్న ఒత్తిళ్ల గురించి తెలియజేసేందుకు రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఏటా రెండు సార్లు ఆర్థిక స్థిరత్వ నివేదిక (ఎఫ్ఎస్ఆర్) విడుదల చేస్తుంది. గతేడాది డిసెంబర్లో విడుదల చేసిన నివేదిక ప్రకారం 2019 సెప్టెంబర్‌లో 9.3 శాతంగా ఉన్న బ్యాంకుల స్థూల మొండిబాకీల నిష్పత్తి 2020 సెప్టెంబర్ నాటికి 9.9 శాతానికి పెరగనుంది. మొండిబాకీలు పెరుగుతుండటం, రుణ వృద్ధి తగ్గుతుండటం, స్థూల ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు తదితర అంశాలు ఇందుకు కారణం కాగలవని ఆర్బీఐ నివేదికలో పేర్కొంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల మొండిబాకీల (జీఎన్‌పీఏ) నిష్పత్తి 2019 సెప్టెంబర్‌లో 12.7%గా ఉండగా.. 2020 సెప్టెంబర్ నాటికి 13.2%కి పెరగవచ్చని అంచనా వేసింది. అలాగే ప్రైవేట్ బ్యాంకుల జీఎన్‌పీఏ నిష్పత్తి 3.9 శాతం నుంచి 4.2 శాతానికి పెరగవచ్చని పేర్కొంది. -
స్ట్రెస్ వద్దు... సినిమా చూడండి
కరోనా వార్తలు బెంబేలెత్తించవచ్చు. జనతా కర్ఫ్యూ మనం ఇంట్లోనే ఉండవలసిన బాధ్యతను గుర్తు చేయవచ్చు. ఇదీ ఒకందుకు మంచిదే. ఉరుకుల పరుగుల జీవితం నుంచి కొంచెం బ్రేక్ దొరికినట్టవుతుంది. ఇలాంటి టైములో స్ట్రెస్‌ను పక్కన పెట్టండి. హాయిగా కుటుంబంతో కామెడీ సినిమాలు చూడండి. కామెడీ సీన్లు ప్లే చేసి హాయిగా నవ్వుకోండి. ‘కరోనా’కు రోగ నిరోధక శక్తిని చూస్తే భయం. హాస్యం అత్యంత పెద్ద రోగనిరోధక శక్తి. గొప్ప హెల్త్ టానిక్. ‘మీకు పాండిత్యం ఉంది కాని బుద్ధి లేదోయ్’ అంటాడు శకుని ‘మాయాబజార్’లో శర్మ, శాస్త్రిలను ఉద్దేశించి. వారు చేసిన బుద్ధిమాలిన పని ఏమిటి? యాదవుల విడిదికి వచ్చి, మగపెళ్లివారమన్న సంగతిని మరచి, సాక్షాత్తు సుయోధనుని ముందే ఆడపెళ్లివాళ్లను పొగడటం... వాళ్ల ఏర్పాట్లను చూసి నోరు వెళ్లబెట్టడం. పండితులంటే గొప్పవారని మన ఉద్దేశం. కాని పాండిత్యం వేరు, బుద్ధి వేరు అని ఈ సినిమాలో నవ్వు వచ్చేలా నీతి చెబుతాడు దర్శకుడు కె.వి.రెడ్డి. కొంచెం స్ట్రెస్ వదిలించుకోవడానికి ఆ సినిమాయో సీనో చూసేయండి. బాగుంటుంది. ‘జస్టిస్... జస్టిస్... ఐ వాంట్ సింపుల్ జస్టిస్’ అంటుంటాడు రమణారెడ్డి ‘మిస్సమ్మ’ సినిమాలో. సావిత్రి మీద కన్నేసిన ఈ మాయలమరాఠి ఆమెను ఎలాగైనా సొంతం చేసుకోవాలని ఇచ్చిన అప్పును అడ్డం పెట్టి బ్లాక్మెయిల్ చేస్తుంటాడు. అతడో పెద్ద ఫోర్ట్వంటి. కానీ నోరు తెరిస్తే ‘జస్టిస్’ అని న్యాయం మాట్లాడుతుంటాడు. లోకంలో నిండా ఉన్నది ఇలాంటి మనుషులే అని రచయిత చక్రపాణి, దర్శకుడు ఎల్.వి.ప్రసాద్ నవ్విస్తూ చూపుతారు ‘మిస్సమ్మ’లో. చూడండి బాగుంటుంది. ‘బ్రేకులా... మనం ఈ కారు కొన్నప్పటి నుంచి వాటి కోసమే వెతుకుతున్నాం... దొరకలేదు’ అంటాడు అక్కినేని సరాసరి తన డొక్కు కారుతో కాంచన, రాజశ్రీల కారును డాష్ కొట్టి. ‘ప్రేమించి చూడు’లో రెండు జంటలు, నాలుగు నవ్వులు ఉంటాయి. ‘నీ అందాల చేతులు కందేను పాపం ఎందుకు ఈ బెడద... సాయము వలదా’ వంటి రసగుల్లాలు, ‘అందాలు తొంగి చూసే హా..హా..హా..’ వంటి పాల తాలికలు ఉంటాయి. ఈ సినిమాలోనే సినిమా పిచ్చోడు చలం వాళ్ల నాన్న రేలంగికి వల్లకాడు కథ చెప్పి భయపెడుతుంటాడు. రావికొండల రావు ‘తెలుగు మాష్టారు’ హాస్యం ఉంటుంది. సరదా సినిమా. ఇది ఖాళీ సమయం. చూసేయండి. భానుమతిని చాలా సినిమాల్లో ఇష్టంగా చూడొచ్చుగాని ‘మట్టిలో మాణిక్యం’లో ఇంకా ఇష్టంగా చూడొచ్చు. ఆమె వ్యంగ్యం అంతా ఆ సినిమాలో ఉంటుంది. మరిది చలంను కన్నబిడ్డలాగా కాపాడుకోవడంలో ఆమె చూపించే ఆరిందాతనం ఎంతో ఆహ్లాదం కలిగిస్తుంది. ఎంతో అమాయకంగా ఉండే చలం నటన, అతని స్నేహితుడిగా పద్మనాభం హాస్యం సినిమాను పరుగులెత్తిస్తాయి. జమున ఒక జాంపండులా ఉంటుంది. ‘నా మాటే నీ మాటై చదవాలి’ అని పాట కూడా పాడుతుంది. ఇంట్లోనే ఉండి హైదరాబాద్ చుట్టేయాలంటే ఈ సినిమా చూడొచ్చు. ‘రిమ్జిమ్ రిమ్జిమ్ హైదరాబాద్ రిక్షావాలా జిందాబాద్’ పాడేయొచ్చు. రేడియో ప్రోగ్రామ్ వింటూ వంకాయ కూర చేద్దామనుకుంటాడు సీతాపతి. కానీ పక్క స్టేషన్లో యోగా క్లాస్ కూడా వస్తుంటుంది. రెండు స్టేషన్లూ జామ్ అవుతుంటాయి. దాంతో యోగా చేస్తూ వంకాయ కూర చేస్తూ నవ్విస్తాడు మనల్ని. ‘సీతాపతి సంసారం’ సినిమా మధ్యతరగతి గుమాస్తా బతుకులో భర్త మీద భార్యకు, భార్య మీద భర్తకు ఉన్న కంప్లయింట్లను లైటర్ వెయిన్‌లో చూపిస్తుంది. సంసారం పెద్ద కష్టం కాదు అని భార్య రోల్‌లోకి వచ్చిన సీతాపతి చాలా కామెడీ చేస్తాడు. చంద్రమోహన్, ప్రభ నటించిన ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చింది. ఇప్పుడు ఇంట్లో భార్య, భర్త తీరుబడిగా ఉండే సమయం. చాలా కంప్లయింట్లు చేసుకునే మూడ్ కూడా వస్తుంది. ఆ మూడ్ వద్దు. అడ్జ్‌స్ట్ అవుతూ బతకడమే ముద్దు అని ‘సీతాపతి సంసారం’ చూసేయండి. అతనికి ఆరుగురు పిల్లలు. ఆమెకు అరడజను సంతానం. ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలి. అతని పిల్లలు రౌడీ మూక. ఆమె పిల్లలు కిష్కింధ ఇలాక. ఈ పన్నెండు మంది కలిస్తే ఆ పెళ్లి ఎంత అల్లరిగిల్లరిగా, ఆ కాపురం ఎంత నవ్వులుపువ్వులుగా ఉంటుందో చెప్ప లేం. ‘రామదండు’ సినిమా ఇది. మురళీమోహన్, సరిత నటించారు. కె.బాలచందర్ దర్శకత్వ పర్యవేక్షణ వహించారు. ‘బండి కాదు మొండి ఇది సాయం పట్టండి’ పాట ఇందులోదే. ఇంట్లో పిల్లలు ఇప్పుడేం చేయాలో తెలియక కోతి పనులు చేస్తుంటారు. వారికి ఈ కోతి సినిమా చూపించండి. బుద్ధిగుంటారు. భలే నవ్వుకుంటారు. ఇక జంధ్యాల, రేలంగి నరసింహారావు, వంశీ, ఇ.వి.వి. సత్యనారాయణ, పి.ఎన్.రామచంద్రరావు, శివ నాగేశ్వరరావు, భీమనేని శ్రీనివాసరావు, విజయ భాస్కర్... వీరంతా తీసిన సినిమాలు తెలుగులో ఎన్నో స్ట్రెస్ బస్టర్స్‌గా ఉన్నాయి. ఎన్నో పాత్రలు నవ్వించి మనల్ని కాసేపు టెన్షన్స్ మర్చిపోయేలా చేస్తాయి. ‘శ్రీవారికి ప్రేమలేఖ’లో కోపం వస్తే తల గోడలకేసి బాది క్రాకులు సృష్టించే సుత్తి వీరభద్రరావు, ‘ఆనందభైరవి’లో నవ్వొచ్చినా ఏడుపొచ్చినా కయ్యిన విజిల్ వేసే శ్రీలక్ష్మి, ‘ఎదురింటి మొగుడు–పక్కింటి పెళ్లాం’లో స్టాంపు అంటించడానికి కూడా సొంత ఉమ్మును వాడటానికి వెనుకాడే పిసినారి రాజేంద్రప్రసాద్, వాళ్లకూ వీళ్లకూ ఠస్సా ఇచ్చి వీడియోలైబ్రరీ పెట్టే ‘ఏప్రిల్ 1 విడుదల’ దివాకరం, ‘ఆ ఒక్కటీ అడక్కు’లో రొయ్యల నాయుడు రావు గోపాలరావు, అద్దె ఇంటి కోసం ఆడవేషం కట్టే ‘చిత్రం భళారే విచిత్రం’ నరేష్, ‘మనీ’లో ఖాన్‌దాదా, ‘శుభాకాంక్షలు’లో ‘చరణకింకిణులు గొల్లుగొల్లుమన’ పాడే గాయకుడు ఏ.వి.ఎస్, ‘నువ్వు నాకు నచ్చావ్’లో తల్లి మీద కవిత్వం చెప్పే ఎమోషనల్ కొడుకు ప్రకాష్ రాజ్... వీరంతా ఈ కరోనా కాలంలో కాసింత దృష్టి మళ్లించే ఔషధాలు... మందులు. కనుక స్ట్రెస్ మానండి. సినిమా చూడండి. – సాక్షి ఫ్యామిలీ -
తెల్ల వెంట్రుకల గుట్టు తెల్సింది!
న్యూఢిల్లీ : నెత్తిన నల్లగా నిగనిగలాడాల్సిన వెంట్రుకలు ఎందుకు తెల్లబడతాయి? ఇంతవరకు ఏ శాస్త్రవేత్త ఇదీ కారణమంటూ నిగ్గు తేల్చలేకపోయారు. వయస్సు మీరితే వెంట్రుకలు తెల్లపడతాయని కొందరు, బలహీనత వల్ల తెల్లబడతాయని కొందరు, విటమిన్ల లోపం వల్ల వస్తాయని మరికొందరు చెబుతూ వచ్చారు. వయస్సులో ఉన్న వారికి వెంట్రుకలు ఎందుకు తెల్లబడుతున్నాయి, విటమిన్లు పుష్టిగా ఉన్నా ఎందుకు తెల్ల వెంట్రుకలు వస్తున్నాయంటూ అడుగుతున్న ప్రశ్నలకు ఇంతకాలం సరైన జవాబు దొరకలేదు. హార్వర్డ్ యూనివర్శిటీ నిపుణులు ఎలుకలపై జరిపిన తాజా అధ్యయనంలో అసలు కారణం తెల్సింది. మానసిక ఒత్తిడి కారణంగానే వెంట్రుకలు తెల్లబడతాయని తేలింది. మానసిక ఒత్తిడి వల్ల ‘నోర్పైన్ప్రైన్ లేదా నోరాడ్రెనాలైన్ లేదా నోరాడ్రెనాలిన్గా పిలిచే హార్మోన్ శరీరం నుంచి విడుదలై అది రక్తంలో కలుస్తుంది. దాని వల్ల గుండె కొట్టుకునే వేగం కూడా పెరుగుతుంది. రక్తంలో కలిసిన ఈ హార్మోన్ వెంట్రుకలను ఎప్పుడు నల్లగా ఉంచే ‘మెలానోకైట్’ మూల కణాలను తెబ్బతీస్తుంది. అందుకని వెంట్రుకలు తెల్లబడుతాయి. సాధారణంగా తెల్ల వెంట్రుకలు 30వ ఏట మొదలై, 50వ ఏడు వచ్చే సరికి సగం జుట్టు తెల్లబడుతుంది. ఇంకా అంతకంటే ముందు టీనేజ్లోనే వెంట్రుకలు తెల్లబడినట్లయితే అది వంశపారంపర్యంగా వచ్చే జన్యువులు కారణం. ఒత్తిడి నుంచి శరీర భాగాలను రక్షించేందుకే నోరాడ్రెనాలిన్ హార్మోన్ విడుదలవుతుంది. ఎలుకల్లో నోరాడ్రెనాలిన్ హార్మోన్‌ను పంపించిన 24 గంటల్లోనే వాటి వెంట్రుకలు 50 శాతం తెల్లబడ్డాయని అధ్యయన బృందం పేర్కొంది. మానసిక ఒత్తిడి వల్ల ఒక్క వెంట్రుకలే కాకుండా శరీరంలోని పలు భాగాలపై ప్రభావం చూపుతుందని, వేటి వేటిపై ప్రభావం చూపుతుందో ఇంకా అధ్యయనం చేయాల్సి ఉందని తెలిపింది. ఒక్కసారి తెల్లబడిన వెంట్రుకలు ఎప్పటికీ నల్లగా మారే ప్రసక్తే లేదని, మానసిక ఒత్తిడి తట్టుకునేందుకు ఎప్పుడు మానసికంగా అప్రమత్తంగా ఉండాలని వైద్య బృందం సూచించింది. వారి అధ్యయన వివరాలను ‘నేచర్’ తాజా సంచికలో ప్రచురించారు. -
బ్యాక్టీరియాతో ఒత్తిడికి ఔషధాలు..
పుట్టగొడుగుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయన్నది మనకు తెలిసిన విషయమే. కొన్ని రకాల పుట్టగొడుగుల్లో ఉండే సైలోసైబిన్ అనే రసాయనం ఒత్తిడి చికిత్సకూ ఉపయోగపడుతుంది. అయితే వీటి మోతాదు చాలా తక్కువ. వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేయడం అసాధ్యం. ఈ నేపథ్యంలో మియామీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ బ్యాక్టీరియా సాయంతో సైలోసైబిన్ రసాయనాన్ని తయారు చేసే పద్ధతిని ఆవిష్కరించారు. బ్యాక్టీరియా జీవక్రియల్లో కొన్ని మార్పులు చేయడం ద్వారా ఇది సాధ్యమైంది. పుట్టగొడుగుల్లో సైలోసైబిన్ రసాయనాన్ని ఉత్పత్తి చేసే జన్యువులను ఇకోలీ బ్యాక్టీరియాలోకి ప్రవేశపెట్టినప్పుడు అవి గ్రాముల స్థాయిలో సైలోసైబిన్ ఉత్పత్తి చేశాయి. ఇది ఒకరకంగా బీర్ తయారు చేయడం లాంటిదేనని.. ధాన్యం గింజలతో తయారైన ద్రావణాన్ని బ్యాక్టీరియా సాయంతో పులియబెట్టినట్లు ఉంటుందని పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. తగిన పరిస్థితుల్లో ప్రతి లీటర్ ద్రావణం ద్వారా 1.16 గ్రాముల సైలోసైబిన్ ఉత్పత్తి అయినట్లు చెప్పారు. తొలుత ఈ పద్ధతిలో మిల్లిగ్రాముల స్థాయిలో మాత్రమే సైలోసైబిన్ ఉత్పత్తి అయ్యేదని, ఉష్ణోగ్రత వంటి అనేక అంశాల్లో మార్పులు, చేర్పులు చేయడం ద్వారా ఉత్పత్తిని 500 రెట్లు ఎక్కువ చేయగలిగామని వివరించారు. పరిశోధన వివరాలు మెటబాలిక్ ఇంజనీరింగ్ జర్నల్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. -
రెడ్ వైన్‌తో ఆ వ్యాధులకు చెక్
లండన్ : పరిమితంగా రెడ్ వైన్ తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని పలు పరిశోధనల్లో వెల్లడవగా తాజాగా రెడ్ వైన్‌లో ఉండే ఓ పదార్ధం కుంగుబాటు, యాంగ్జైటీల నుంచి ఉపశమనం కలిగిస్తుందని తేలింది. రెడ్ వైన్ తయారీలో ఉపయోగించే ద్రాక్షలో ఉండే పదార్ధం ఈ వ్యాధులను నిలువరిస్తుందని ఎలుకలపై చేపట్టిన పరిశోధనలో వెల్లడైంది. కుంగుబాటు, యాంగ్జైటీలను ప్రేరేపించే ఎంజైమ్‌ను రెడ్ వైన్‌లో ఉండే రిస్వరట్రాల్ అడ్డుకుందని పరీక్షల్లో వెలుగుచూసింది. ఈ పరిశోధనలో వెల్లడైన అంశాలు డిప్రెషన్, ఎంగ్జైటీలో నూతన చికిత్సలకు దారితీస్తాయని భావిస్తున్నారు. ఈ రెండు వ్యాధులపై రిస్వరట్రాల్ ప్రభావాన్ని యూనివర్సిటీ ఆఫ్ బఫెలో శాస్త్రవేత్తలు ఎలుకలపై పరీక్షించడం ద్వారా అంచనా వేశారు. క్యాన్సర్, అర్ధరైటిస్, డిమెన్షియా సహా పలు వ్యాధులను ప్రభావవంతంగా ఎదుర్కొనే సామర్ధ్యం రిస్వరట్రాల్‌కు ఉందని చాలా కాలంగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వేరుశెనగ పప్పులోనూ ఉండే రిస్వరట్రాల్ శరీరంలో వాపు ప్రక్రియను తగ్గిస్తుందని పలు అథ్యయనాల్లో వెల్లడైంది. హాని చేసే కొవ్వులను నియంత్రించడం, మెదడు పనితీరును మెరుగుపరచడం, బీపీని నియంత్రించడంలోనూ ఇది మెరుగ్గా పనిచేస్తుందని పలు అథ్యయనాల్లో వెలుగుచూసింది. వైన్‌లో తక్కువ పరిమాణంలో ఉండే రిస్వరట్రాల్‌ను సప్లిమెంటరీలుగా అందిచడంపైనా పలు అథ్యనాలు జరుగుతున్నాయి. -
పెట్ యువర్ స్ట్రెస్ అవే!
వాషింగ్టన్: పెంపుడు పిల్లులు, కుక్కలతో కాస్త సమయం వెచ్చిస్తే కాలేజీ విద్యార్థుల మానసిక స్థితి మెరుగవడంతోపాటు, వారిలో ఒత్తిడి స్థాయి తగ్గుతుందని వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధనల్లో తేలింది. పెంపుడు జంతువులతో గడిపే పది నిమిషాల సమయం కూడా ఎంతో ప్రభావం చూపిస్తుందని వాషింగ్టన్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పాట్రిషియా పెండ్రీ తెలిపారు. పెంపుడు జంతువులతో సమయం గడిపిన విద్యార్థుల్లో ఒత్తిడిని కలిగించే కార్టిజాల్ అనే హార్మోన్ ఉత్పత్తి గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు. ఇది ప్రయోగశాలల్లో కంటే నిజ జీవితంలో అనుసరిస్తే ఇంకా మంచి ఫలితాలుంటాయని తెలిపారు. ఈ మేరకు ప్రముఖ జర్నల్ ఏఈఆర్ఏ ఓపెన్‌లో వ్యాసం ప్రచురించారు. ‘పెట్ యువర్ స్ట్రెస్ అవే’ పేరిట యూనివర్సిటీ పరిశోధకులు 249 మంది కాలేజీ విద్యార్థులపై పరిశోధనలు నిర్వహించారు. ఈ 249 మంది విద్యార్థులను 4 గ్రూపులుగా విభజించారు. మొదటి గ్రూప్ సభ్యులకు 10 నిమిషాల పాటు పిల్లులు, కుక్కలతో సమయం గడిపేలా చూశారు. రెండో గ్రూప్ సభ్యులు మొదటివారిని చూస్తూ ఉండేలా ఏర్పాట్లు చేశారు. మూడో గ్రూప్ వాళ్లకు మొదటి గ్రూప్ సభ్యులు జంతువులతో సమయం గడుపుతున్న చిత్రమాలిక చూపించారు. నాలుగో గ్రూప్ సభ్యులను తమ వంతు వచ్చేవరకు వేచి ఉండమన్నారు. వాళ్లను అంతసేపు ఫోన్ వాడడం కానీ, చదవడం కానీ చేయవద్దన్నారు. ఇలా పరిశోధనల్లో పాల్గొన్న సభ్యుల నుంచి లాలాజలం నమూనాలను ఉదయం నుంచి సేకరించారు. ఇందులో జంతువులతో నేరుగా గడిపిన విద్యార్థుల లాలాజలంలో కార్టిజాల్ తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. విద్యార్థులు తమ పెంపుడు జంతువులతో సమయం గడపడాన్ని ఆనందిస్తారని తెలుçసు కానీ, ప్రయోజనం కూడా ఉంటుందని ఈ పరిశోధనల్లో తేలిందని పెండ్రీ తెలిపారు. దీంతో శారీరక ఒత్తిడిని కూడా జయించవచ్చన్నారు. -
బయటకు చెప్పడానికి భయపడ్డా
‘‘నేను చిన్నప్పుడు మానసిక ఆందోళనతో బాధపడ్డాను. మానసిక ఆరోగ్యంపై మన దేశంలో ఓ దురభిప్రాయం ఉంది. అందుకే చాలామంది బయటకు చెప్పలేక నిశ్శబ్దంగా బాధపడుతున్నారు’’ అన్నారు శ్రుతీహాసన్. మానసిక ఆరోగ్యం, దాని చుట్టూ ఉన్న అపోహల గురించి శ్రుతీ ఇటీవల ఓ ఈవెంట్లో మాట్లాడుతూ – ‘‘నేను టీనేజ్‌లో ఉన్నప్పుడు చాలా ఆందోళనకు గురయ్యేదాన్ని. హీరోయిన్గా సక్సెస్ అయిన తర్వాత కూడా బయటకు కనిపించడానికి కొంచెం ఆందోళన పడేదాన్ని. బయటకు రావడానికి చాలా సమయం తీసుకునేదాన్ని. దీంతో చాలామంది ‘శ్రుతీ సినిమాలు మానేస్తోంది, పెళ్లి చేసుకుంటోంది, ఏదో ఆరోగ్య సమస్యలతో బాధపడుతోంది’ అంటూ రకరకాల పుకార్లు పుట్టించారు. కొన్ని విని నవ్వుకునేదాన్ని. మన దేశం అద్భుతమైనది, ఉత్సాహపూరితమైనది. అయినప్పటికీ డిప్రెషన్స్ ఎక్కువ గురవుతున్న దేశాల్లో మనం కూడా ఉన్నాం. మూడు సెకన్లకు ఒకరు ఆత్మాహత్యా యత్నం చేస్తున్నారు. నా మానసిక సమస్యలను బయటకు చెప్పుకోవడానికి కొంచెం సిగ్గు పడ్డాను, వీక్‌గా ఫీల్ అయ్యాను. మానసిక ఆరోగ్యానికి సంబంధించిన అపోహలు తొలగిపోవాలంటే బయటకు మాట్లాడాలి. పరిష్కరించుకోవాలి. ఒత్తిడి నుంచి విముక్తి పొందాలి’’ అని పేర్కొన్నారు. -
ఒత్తిడిలో పోలీసన్న!
సాక్షి, కామారెడ్డి: మారుతున్న కాలాని కి అనుగుణంగా పోలీసింగ్‌లో ఎన్నో మార్పులు వస్తున్నాయి. పోలీస్ అంటే భయపడే రోజుల నుంచి మనకోసమే పోలీసు అన్న భావన కలిగించేందుకు ఆ శాఖ ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. పోలీసు అధికారులు, సిబ్బంది సైతం తమ వైఖరిని మార్చుకుంటున్నారు. దీంతో ఫ్రెండ్లీ పోలీసింగ్ వాతావర ణం ఏర్పడుతోంది. అయితే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పోలీ స్ సిబ్బంది పెరగకపోవడం ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా కొత్త జిల్లాలు ఏర్పాటైన తరువాత ఉన్న సిబ్బందిని ఆయా జిల్లాలకు విభజిం చి కేటాయించారు. కొత్తగా నియామకాలు అనుకున్న స్థాయిలో జరగకపోవడంతో ఉన్న కొద్దిమందిపై పనిభారం పెరిగింది. దీంతో పని ఒత్తిడితో చాలామంది అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. పోలీసులకు వారాంతపు సెలవులు ఇస్తామని పాలకులు చెప్పడమే తప్ప అమలు చేయకపోవడంతో వారికి విశ్రాంతి దొరకడం లేదు. ఈ నేపథ్యంలో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడి చాలా మంది అనారోగ్యంతో ఆస్పత్రుల పాలవుతున్నారు. విధులు నిర్వహిస్తూనే తీవ్రమైన గుండెపోటుకు గురై ఇద్దరు పోలీసులు కన్నుమూసిన సంఘటనలు ఇటీవల జిల్లాలో చోటుచేసుకున్నాయి. ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్లో ఈ నెల 14న రాత్రి విధులు నిర్వహించి స్టేషన్ పైఅంతస్తులో నిద్రకు ఉపక్రమించిన ఏఎస్సై పీవీఎస్ఎంకే రాజు (56) నిద్రలోనే గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ నెల 23న బాన్సువాడ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ విజయ్‌బాబు (52) గుండెపోటుకు గురై మృత్యువాతపడ్డారు. ఇలాంటి సంఘటనలు పోలీసు కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సిబ్బంది కొరత... అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం లక్ష జనాభాకు 220 మంది చొప్పున పోలీసులు ఉండాలి. మన దేశంలోని పరిస్థితుల ప్రకారం లక్ష జనాభాకు 145 మంది ఉండాలి. కామారెడ్డి జిల్లా జనాభా దాదాపు పది లక్షలకు చేరింది. ఈ లెక్కన జిల్లాలో కనీసం 1,450 మంది పోలీసు సిబ్బంది అవసరం.. కానీ ప్రస్తుతం జిల్లాలో హోంగార్డు నుంచి జిల్లా పోలీసు అధికారి వరకు కలిపి మొత్తం 990 మంది మాత్రమే ఉన్నారు. అంటే ఇంకా 450 పైచిలుకు మంది సిబ్బంది అవసరం. ఇప్పటికిప్పుడు జిల్లాలో ఏఆర్ విభాగానికి వంద మంది, సివిల్ విభాగానికి వంద మంది సిబ్బంది, అధికారులు అవసరమని జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. ఉరుకుల పరుగుల జీవితం.. జిల్లాల విభజన తరువాత పోలీసు సిబ్బందికి పనిభారం పెరిగింది. ఉమ్మడి జిల్లాలో ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా, వీఐపీల పర్యటనలు ఉన్నా ఇరు జిల్లాల పోలీసులను అటూ, ఇటూ పంపించడం పరిపాటిగా మారింది. సంఘటనల తీవ్రత పెరగకుండా చూడడానికి పోలీసు అధికారులు బలగాలను దింపుతున్నారు. దానికితోడు ఆరు నెలలుగా ఎన్నికల హడావుడి పెరిగి వీఐపీల తాకిడి రెట్టింపైంది. మరో ఐదారు నెలల పాటు ఎన్నికల వాతావరణం కొనసాగేలా ఉంది. దీంతో పోలీసు సిబ్బంది ఉరుకులు, పరుగులు పెట్టాల్సిందే.. రెస్ట్ అనేది లేకుండా ఎక్కడ అవసరం ఉందంటే అక్కడికి పరుగులు తీయాల్సిందే.. ఉద్యోగం చేస్తున్న చోటనే ఉన్నన్ని రోజులు సమయానికి తిండి తినే పరిస్థితి ఉంటుంది. అదే బయటకు వెళ్లినపుడు సమయానికి ఆహారం తీసుకోకపోవడం, సరైన ఆహార నియమాలు పాటించకపోవడంతో అనారోగ్యానికి గురవుతున్నారు. ఒత్తిడితో కొందరు.. వ్యసనాలతో మరికొందరు పోలీసు శాఖలో పని ఒత్తిడితో కొందరు ఇబ్బంది పడుతుంటే, రకరకాల వ్యసనాలతో మరికొందరు అనారోగ్యం పాలవుతున్నారు. పోలీసు శాఖలో పనిచేసే ఉద్యోగులు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాల్సి ఉంటుంది. కానీ కొన్నిచోట్ల పోలీసు అధికారులు, సిబ్బంది వ్యాయామంపై దృష్టి పెట్టడం లేదు. మరికొందరు మద్యానికి బానిసలుగా మారి అనారోగ్యం పాలవుతున్నారు. చాలామంది పోలీసులు పొట్టపెరిగి ఇబ్బంది పడుతూ కనిపిస్తున్నారు. దీనికి రకరకాల కారణాలున్నాయి. సమయానికి ఆహారం తీసుకోకపోవడం, సరిపడా నిద్ర లేకపోవడం, మద్యం సేవించడం, వ్యాయామం లేకపోవడం వంటి కారణాలతో ఇబ్బంది పడుతున్నారు. సిబ్బంది కొరత ఉన్నా.. జిల్లాలో ప్రస్తుతం పోలీసు సిబ్బంది కొరత ఉంది. అయితే ఎవరికీ ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఏ ఉద్యోగి అయినా ఒత్తిడిని దరిచేరనీయకుండా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి. వ్యసనాలు సైతం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. వాటికి దూరంగా ఉండాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. – ఎన్.శ్వేత, కామారెడ్డి ఎస్పీ -
తనివితీరా ఏడవండి
సాక్షి, వెబ్‌డెస్క్ : సుఖ - దుఃఖాల కలయికే జీవితం అంటారు. ప్రతి వ్యక్తి జీవితంలో ఆనందం, బాధ రెండూ ఉంటాయి. ప్రతి ఒక్కరు తమ జీవితం ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. సినిమాలు, ఆటలు, పాటలు, స్నేహితులతో కబుర్లు, విహారయాత్రల్లో కొంతమంది ఆనందాన్ని వెతుక్కుంటే.. మరికొంతమంది అందరితో కలిసి పంచుకునే ఆనందం కంటే, వ్యక్తిగత ఆనందానికే పెద్దపీట వేస్తుంటారు. ఇక విషాదం విషయానికి వస్తే.. కొంతమంది బోరున ఏడ్చేస్తే, మరికొంత మంది లోలోపలే కుమిలిపోతుంటారు. ఉబికివస్తోన్న భావోద్వేగాలను అణచుకుంటారే తప్ప.. ఏడవడానికి సాహసించరు. కన్నీళ్లు కార్చడం ఓ పిరికిపంద చర్య అని, ఎవరేమనుకుంటారోనని, అందరి ముందు ఏడవడానికి వెనుకంజ వేస్తుంటారు. బాధను మర్చిపోయి ఆనందంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. నవ్వుతూ ఆనందంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారని చెబుతుంటారు. అయితే, నవ్వడం వల్ల శరీరానికి కలిగే మేలు సంగతిని కాసేపు పక్కన పెడితే... ఏడుపు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదని, దానివల్ల ఒత్తిడి తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఏడవండి... బాగా ఏడవండి ఆనందాన్ని నలుగురితో పంచుకొని..బాధను మనలోనే ఉంచుకోవాలంటారు. కానీ ఇది తప్పు అంటున్నారు జపాన్‌కు చెందిన హైస్కూల్ టీచర్ హీదెఫూమీ యోషిదా. ఏడవండి.. బాగా ఏడవండి.. ఏడవడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు. నవ్వడం కంటే ఏడవడం వల్లే ఎక్కువ ఒత్తిడి తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. ఈ విషయం ప్రయోగాత్మకంగా నిరూపించడం జరిగిందని వెల్లడించారు. వారానికి ఒక్కసారైనా గట్టిగా ఏడవడం వల్ల ఒత్తిడి తగ్గి ఆరోగ్యంగా ఉండవచ్చని చెబుతున్నారు. ఎవరీ హీదెఫూమీ యోషిదా..? హీదెఫూమీ యోషిదా (43) జపాన్‌కు చెందిన టీచర్. గత కొన్నేళ్లుగా ఏడవడం వలన కలిగే ప్రయోజనాల గురించి ఆయన పరిశోధనలు సాగిస్తున్నారు. అంతేకాదు ఈ విషయమై ఉపన్యాసాలు ఇస్తూ... ఎలా ఏడవాలో అన్న అంశంపై శిక్షణ కూడా ఇస్తున్నారు. ‘నామిదా సెంసోయీ’ (టియర్స్ టీచర్)గా పేరు గాంచిన ఈయన ఇప్పటికే అనేక మంది విద్యార్థులకు, ఉద్యోగులకు ఏడుపులోని పరమార్థాన్ని వివరించి.. వారిని ఆ దిశగా ప్రోత్సహిస్తున్నారు. అంతేకాకుంగా 2014లో తోహో యూనివర్సీటీకి చెందిన ప్రొఫెసర్ హితేహో అరితాతో జతకట్టి ‘ఏడవడం వల్ల ఒత్తిడి ఎలా తగ్గించుకోవచ్చు’ అనేదానిపై అవగాహన కల్పిస్తున్నారు. ఇలా యోషిదా ప్రచారం ఓవైపు... ప్రతి కంపెనీలోని ఉద్యోగికి ఒత్తిడి చెకప్ చేయించుకోవాలంటూ జపాన్ ప్రభుత్వం నిబంధన మరోవైపు వెరసి జపాన్‌లో ఆత్మహత్యల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఒత్తిడి తగ్గింపునకు జపాన్ కొత్త ప్రయత్నం సాధారణంగా జపనీయులు కష్టజీవులు. తక్కుత విశ్రాంతి తీసుకొని ఎక్కువ కష్టపడుతుంటారు. అయితే ఈ నేపథ్యంలో వారు ఎంతో ఒత్తిడికి కూడా గురవుతుంటారు. ఇక్కడి ఉద్యోగులతో పాటు విద్యార్థులు కూడా ఎంతో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. తాజాగా జపాన్‌లో ఒత్తిడిని తగ్గించుకునేందుకు కొత్త పద్దతిని ప్రవేశపెట్టారు. ఒత్తిడిని తప్పించుకునేందుకు వారు నవ్వుకు బదులు ఏడవడంపై దృష్టిపెట్టారు. ఇక్కడి కంపెనీల్లోని ఉద్యోగులను, స్కూళ్లలోని విద్యార్థులను వారంలో ఒకరోజు ఒక చోటచేర్చి పెద్ద పెట్టున ఏడ్చే విధంగా ప్రోత్సహిస్తున్నారు. ఏడుపుపై శిక్షణ ఇచ్చేందుకు ట్రైనర్లను కూడా నియమిస్తున్నారు. జపాన్‌తో పాటు చాలా దేశాలు ఒత్తిడి తగ్గించడం కోసం ఇదే విధానాన్ని అవలంభిస్తున్నాయి. దక్షిణ కొరియా నంబర్‌వన్... ప్రపంచంలో దాదాపు 90శాతం మంది డిప్రెషన్‌కు లోనై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఆ సంస్థ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. మానసిక అనారోగ్యానికి గురవుతున్న వారిలో సగం శాతం మంది 14 ఏళ్ల వయసు వారే ఉండటం గమనార్హం. వారిలో చాలా మందికి చికిత్స అందటం లేదు.15-29 ఏళ్ల వయసు వాళ్లే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని సంస్థ వెల్లడించింది. కాగా ఒత్తిడిని తగ్గించి ఆత్మహత్యలను నిలువరించేందుకు జపాన్ ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికి.. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే జపాన్‌లోనే సూసైడ్ కేసులు ఎక్కువగానే నమోదవుతున్నాయి. 2003లో చనిపోయిన వారిలో 38 శాతం మంది ఆత్మహత్యలే చేసుకుని మరణించిన వారేననని సర్వేలో తేలింది. 2017 సంవత్సరంలో దాదాపు 21,321 ఆత్మహత్య కేసులు నమోదయ్యాయి. ప్రతీ లక్ష మందిలో 16.6శాతం మంది ఆత్మహత్యలు చేసుకొనే చనిపోతున్నారు. ఆత్మహత్య కేసులు ఎక్కువగా నమోదైన దేశాల్లో దక్షిణ కొరియా (25.8శాతం) మొదటి స్థానంలో, రష్యా (19.3శాతం) రెండో స్థానంలో ఉండగా జపాన్ మూడో స్థానంలో నిలిచింది. కన్నీళ్లు మూడు రకాలు... ఏడవడం వలన కలిగే ప్రయోజనాల గురించి సాగించిన పరిశోధనల్లో దీనివలన సత్ఫలితాలుంటాయిని తేలిందట. మన కంటి నుంచి మూడు రకాలుగా కన్నీళ్లు వస్తాయట. ఒకటి అంసకల్పికంగా వచ్చే కన్నీళ్లు. ఇది ఇతరులు మనకు చికాకు తెప్పిచ్చినప్పుడు వస్తాయి. రెండోది సాధారణం కన్నీళ్లు ఒక్కొసారి అనుకోకుండా మన కంటి నీళ్లు కారుతుంటాయి. ఇవి మన కంటిని తడిగా ఉంచుతాయి. మూడోది ఎమోషనల్ కన్నీళ్లు.. బాధ, ఒత్తిడికి గురైనప్పుడు వస్తాయి. ఇలా వచ్చిన కన్నీళ్లు ఆరోగ్యానికి మంచివట. మన శరీరం నుంచి చెమట రూపంలో మలినాలు ఏవిధంగా బయటకు పోతాయో...ఒత్తిడికి గురైనప్పుడు కూడా ఏడిస్తే అది గుండెల నుంచి మోయలేని భారాన్ని తొలగించి ఆరోగ్యంగా ఉంచుతుందట. అందుకే ఇటీవలి కాలంలో మానసిక వైద్యులు తమ దగ్గరకు వచ్చే రోగులకు... రోదించాలని సలహా ఇస్తున్నారు. ఏదేమైనా ఏడుపు ఒత్తిడి తగ్గించి ఆరోగ్యాన్ని కాపాడుతుంది కాబట్టి హాయిగా తనివితీరా ఏడిచి ఆరోగ్యంగా ఉండండి. - అంజి శెట్టె, ఇంటర్నెట్ డెస్క్. -
అల్లాడిపోతున్నారు!
‘కనిపించని మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపమైతే కనిపించని ఆ నాలుగో సింహమే పోలీస్’ ఈ సినిమా డైలాగ్ వింటే సగటు పోలీసు గుండె పులకరిస్తుంది. అయితే వారి దైనందిన జీవితాన్ని కాస్తా దగ్గరగా పరికిస్తే దయనీయ స్థితి కనిపిస్తుంది. ఊపిరి సలపని విధులతో ఒత్తిడికి లోనై అనారోగ్యానికి గురతున్నారు. మరోవైపు వ్యక్తిగత పనులు చేసుకోలేక, కుటుంబసభ్యులతో గడపలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెల్లూరు(క్రైమ్): నెల్లూరు నగరంలో శాంతిభద్రతల విభాగంలో ఆరు పోలీసు స్టేషన్లు, ట్రాఫిక్, సీసీఎస్, మహిళ, ఎస్సీ, ఎస్టీ సెల్ స్టేషన్లున్నాయి. శాంతిభద్రతల విభాగంలోని పోలీసు స్టేషన్లలో గతంలో మూడు సెక్షన్ల విధానం అమలులో ఉండేది. ఒక కానిస్టేబుల్ రాత్రి తొమ్మిదికి విధులకు వస్తే ఉదయం ఆరుగంటలకు ఇంటికి వెళ్లేవాడు. తిరిగి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి తొమ్మిది వరకు పనిచేసేవాడు. అనంతరం ఇంటికి వెళ్లి మరుసటిరోజు ఉదయం 7 గంటలకు వచ్చి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విధుల్లో ఉండేవాడు. అప్పటినుంచి మరుసటి రోజు రాత్రి 9 గంటల వరకు (అసాధారణ పరిస్థితుల్లో తప్ప) వారికి ఖాళీ ఉండేది. దీంతో వ్యక్తిగత పనులు చూసుకునేవారు. మిగిలిన సమయాన్ని కుటుంబంతో గడిపేవారు. ఇటీవల నెల్లూరు నగరంలో శాంతిభద్రతలు క్షీణదశకు చేరుకున్నాయనే విషయాన్ని ఊటంకిస్తూ ఉన్నతాధికారులు మూడు సెక్షన్లను రెండు సెక్షన్లుగా కుదించారు. దీని ప్రకారం రాత్రి తొమ్మిదికి నైట్ విధులకు వచ్చిన సిబ్బంది ఉదయం 7 గంటలకు ఇంటికి వెళుతున్నారు. తిరిగి మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చి రాత్రి తొమ్మిదికి వెళుతున్నారు. యథావిధిగా మరుసటి రోజు ఉదయం ఏడుకి వచ్చి మధ్యాహ్నం ఒంటి గంటకు ఇంటికి వెళ్లి రాత్రి గస్తీకి వస్తున్నారు. ఇలా రోజుకు సుమారు 14 గంటలు విధులు నిర్వహించాల్సి వస్తోంది. ఇక బందోబస్తులు, ఆందోళనలుంటే ఖాళీ సమయం కూడా విధులు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. తీరికలేని విధులు వారిని ఊపిరి సలపనివ్వకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో వ్యక్తిగత పనులు చేసుకోలేక ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు ఒత్తిడికి లోనై అనారోగ్యానికి గురతున్నారు. పెరుగుతున్న అసంతృప్తి ఉన్నతాధికారుల చర్యలపై సిబ్బంది అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. రెండు సెక్షన్ల వి«ధానం అమలులోకి వచ్చిన కొద్దిరోజులకే సిబ్బంది వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు నగరంలో నేరాలు పెరిగిన దృష్ట్యా కొద్దిరోజులు రెండు సెక్షన్ల విధానం అమలులో ఉంటుందని, ఆపై తొలగిస్తారని వెల్లడించారు. దీంతో వారు విధులు నిర్వహిస్తూ వచ్చారు. నెలన్నరరోజులు గడస్తున్నా రెండు సెక్షన్ల విధానమే కొనసాగుతుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు సెక్షన్ల విధానాన్ని పునరుద్ధరించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ఉదాహరణలు ♦ నగరంలో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ రాత్రి విధులకు వెళ్లాడు. ఉదయం ఏడుగంటల వరకు పనిచేసి ఇంటికి వెళ్లాడు. కాలకృత్యాలు తీర్చుకుని తొమ్మిది గంటలకు నిద్రపోయాడు. ఇంతలో అతని కుమారుడు అనారోగ్యానికి గురయ్యాడు. నిద్రలేమితోనే అతడిని హాస్పిటల్‌కు తీసుకెళ్లి వైద్యపరీక్షలు చేయించసాగాడు. అప్పటికే మధ్యాహ్నం 12 గంటలైంది. కుమారుడిని కుటుంబసభ్యులకు అప్పగించి హుటాహుటిన ఉద్యోగానికి పరుగులు తీశాడు. ♦ నగరంలో ఓ పోలీసు స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్స్ ఊపిరి సలపని విధులతో అనారోగ్యానికి గురై ప్రస్తుతం అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. పనిఒత్తిడి వల్లనే అనారోగ్యానికి గురయ్యాడని వైద్యులు సంబంధిత పోలీసు స్టేషన్ అధికారులకు వెల్లడించారు. పరిస్థితిని బట్టే పనివేళలు స్థానికంగా ఉన్న రోజు వారీ పరిస్థితులు, అందుబాటులో ఉన్న సి బ్బందిని బట్టే డ్యూటీలుం టాయి. రోజూ అధికగంటలు పనిచేస్తున్నారనే విషయం నా దృష్టికి రాలేదు. సిబ్బంది ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. సమస్యలను నాకు తెలియజేస్తే పరిష్కరిస్తా. సిబ్బంది సంక్షేమం దృష్ట్యా రెండు వారాలుగా వీక్లీ ఆఫ్ అమలు చేస్తున్నాం.– ఐశ్వర్యరస్తోగి, జిల్లా ఎస్పీ పునరుద్ధరించాలి నెల్లూరు నగరంలో రెండు సెక్షన్ల విధానం వల్ల సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పని ఒత్తిడి, నిద్రలేమి కారణంగా అనారోగ్యానికి గురై అస్పత్రి పాలవుతున్నారు. తాజాగా బాలాజీనగర్ పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ ఒత్తిడికి లోనై హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. మూడు సెక్షన్ల విధానాన్ని అమలు చేయాలి. ఇదే విషయాన్ని ఇప్పటికే ఎస్పీ దృష్టికి తీసుకెళ్లాం. ఆయన పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. – మద్దిపాటి ప్రసాదరావు, పోలీసుఅధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు -
బురారీ కేసు; పోలీస్ స్టేషన్లో పూజలు!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని బురారీలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది అనుమానాస్పద రీతిలో చనిపోయిన కేసును విచారిస్తున్న క్రైమ్ బ్రాంచ్ పోలీసుల మానసిక పరిస్థితి కాస్తా ఆందోళనకరంగా ఉన్నట్లు పోలీసు ఉన్నాతాధికారులు తెలిపారు. ఈ విషయం గురించి ఒక పోలీస్ అధికారి చెబుతూ.. ‘ఈ కేసును విచారిస్తున్న పోలీసుల్లో చాలామంది తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. మునుపెన్నడు తమ జీవితంలో ఇలాంటి సంఘటనను ఎప్పుడూ చూడలేదని అంటున్నారు. పాపం చాలా మంది నిద్రలేని రాత్రులు కూడా గడుపుతున్నారు. విచారణ నిమిత్తం పోలీసులు తరచుగా బాటియా ఇంటికి వెళ్తుండటంతో వారు ఒత్తిడికి లోనవుతున్న మాట వాస్తవమే’ అని తెలిపారు. ఈ కేసు విచారణ పూర్తయిన వెంటనే ఉద్యోగుల కోసం ఒత్తిడి నివారణ కార్యక్రమాలు నిర్వహించి వారిలో నూతన ఉత్తేజాన్ని నింపేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. అంతేకాక కొందరు స్థానికులు పోలీస్ స్టేషన్లో యాగం, శాంతి హోమం వంటి పూజలు చేయమని సలహా కూడా ఇచ్చారన్నారు. అయితే ఇది ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయం కనుక కొంత గడువు ఇవ్వమని కోరామన్నారు. ఎందుకంటే 15 లక్షల జనాభాతో దాదాపు 30 కిలోమీటర్ల మేర విస్తరించిన బురారీ రక్షణ బాధ్యత పోలీసుల మీద ఉన్నది. ప్రజల మనోభావాలకు విలువ ఇవ్వడం కూడా మా విధుల్లో భాగమే, కనుక ఈ విషయంలో తొందరపాటు పనికిరాదు అని పోలీసు ఉన్నాతాధికారి తెలిపారు. ఇదిలావుండగా బురారీ ఆత్మహత్య ఘటనల ఉదంతాన్ని నిత్యం టీవీల్లో చూసి ప్రభావితమైన 63 ఏళ్ల కృష్ణశెట్టి అనే వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. -
రెండు నెలలు ఒత్తిడికి గురైతే..
లండన్ : కేవలం రెండు నెలలు తీవ్ర ఒత్తిడికి గురైతే పురుషులు సంతాన సాఫల్యతను ప్రమాదకర స్థాయిలో కోల్పోతారని తాజా అథ్యయనం హెచ్చరించింది. ఒత్తిడితో సహవాసం చేస్తే పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గడమే కాకుండా వీర్యకణాలు బలహీనమయ్యే ముప్పు 47 శాతం అధికమవుతుందని వెల్లడించింది. 11,000 వీర్య నమూనాలను పరిశీలించిన మీదట ఇజ్రాయెల్ పరిశోధకులు ఈ విషయాలు నిగ్గుతేల్చారు. కేవలం రెండు నెలల పాటు ఒత్తిడికి లోనైన పురుషుల వీర్యకణాలు బలహీనమవుతాయని, వారికి పిల్లలు పుట్టే అవకాశాలు సన్నగిల్లుతాయని పరిశోధనలో వెల్లడైంది. తీవ్ర ఒత్తిడిలో ఉన్న సందర్భాల్లో, ఒత్తిడి లేని సమయాల్లో సేకరించిన వీర్య నమూనాలను విశ్లేషిస్తూ నెగెవ్‌కు చెందిన బెన్ గురియన్ యూనివర్సిటీ, సొరొక యూనివర్సిటీ మెడికల్ సెంటర్ పరిశోధకులు ఈ అథ్యయనం చేపట్టారు. తొలిసారి తండ్రయ్యే పురుషుల సగటు వయసు 32 ఏళ్ల ఆధారంగా ఈ సర్వే నిర్వహించారు. మానసిక ఒత్తిడి సంతాన సాఫల్యతపై తీవ్ర ప్రభావం చూపుతుందని తమ అథ్యయనంలో వెల్లడైందని, దీర్ఘకాలం ఒత్తిడికి లోనైతే వీర్యకణాల నాణ్యతపై దుష్ర్పభావం చూపుతుందని తేలిందని అథ్యయన రచయిత డాక్టర్ లెవిటాస్ పేర్కొన్నారు. -
బాబు తీరుతో అధికారుల ఉక్కిరి బిక్కిరి
సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల వరుసగా ధర్మ పోరాట దీక్ష, ఆడపిల్లకు అండగా నిలుద్దాం, వక్ఫ్ బోర్డు కార్యాలయం శంకుస్థాపన, మహానాడు తదితర కార్యక్రమాలను నిర్వహించారు. మూడురోజుల పాటు జరిగిన మహానాడు ముగిసిందని అధికారులు ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో శనివారం విజయవాడలో నవ నిర్మాణదీక్ష నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యమంత్రే స్వయంగా హాజరవుతుండటంతో తగిన ఏర్పాట్లు చేయడం, జనాన్ని తరలించలేక అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరోవైపు కార్యాలయాల్లో అధికారులు అందుబాటులో లేకపోవటంతో వివిధ పనుల నిమిత్తం వచ్చే వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకపక్కన ఎండలు మండిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. జిల్లా కలెక్టర్ సైతం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు ఉదయం 10 దాటిన తర్వాత బయటకు వెళ్లవద్దని ఆదేశించారు. ఈ సమయంలో బందరు రోడ్డులో ఆరుబయట నవ నిర్మాణ దీక్ష చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించటంపై నగర వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కీలకమైన బందరు రోడ్డులో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్‌ను నిలిపివేయటం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని అంటున్నారు. ఎండల హెచ్చరికల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూర్చునే వేదిక వద్ద మాత్రం ఏసీలు, కూలర్లు ఏర్పాటు చేస్తున్నారు. సమావేశానికి వచ్చే అధికారులు, దీక్షకు తరలించే ప్రజలు, స్కూల్ వివిద్యార్థులు మాత్రం ఎండలో మాడిపోక తప్పదనే విమర్శలు విన్పిస్తున్నాయి. నవ నిర్మాణ దీక్షకు జనాన్ని తరలించటంపై అధికారులకు ఇప్పటికే టార్గెట్లు విధించారు. జిల్లాల్లో కూడా వారం రోజుల పాటు నవ నిర్మాణ దీక్షలు నిర్వహించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. కార్యక్రమానికి డ్వాక్రా మహిళలు, పింఛనుదారులను తరలించి రుణాలు, పట్టాదారు పాసు పుస్తకాల మంజూరు లాంటివి ఈ సందర్భంగా నిర్వహించాలని పేర్కొంది. నేడు వాహనాల మళ్లింపు విజయవాడ బెంజి సర్కిల్ వద్ద జూన్ 2వతేదీన æసనిర్వహిస్తున్న నవనిర్మాణదీక్ష సందర్భంగా జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టినట్లు నగర పోలీసు కమిషనర్ డి.గౌతమ్ సవాంగ్ ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి శనివారం మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టామని చెప్పారు. భారీ వాహనాలు, లారీల మళ్లింపు ఇలా... విశాఖ నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్ వెళ్లే వాహనాలను దేవరపల్లి–తల్లాడ–ఖమ్మం–సూర్యాపేట మీదుగా మళ్లించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా విశాఖపట్నంకు వెళ్లే వాహనాలను ఇబ్రహీంపట్నం–మైలవరం–నూజివీడు–హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్నంకు మళ్లించారు. విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా చెన్నై వెళ్లే వాహనాలను హనుమాన్‌జంక్షన్ నుంచిగుడివాడ– పామర్రు–చల్లపల్లి–అవనిగడ్డ–బాపట్ల–ఒంగోలు మీదుగా చెన్నైకు మళ్లిస్తారు. చెన్నై నుంచి విజయవాడ మీదుగా విశాఖకు వెళ్లే వాహనాలను ఒంగోలు–బాపట్ల–అవనిగడ్డ–చల్లపల్లి–పామర్రు–గుడివాడ–హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖకు మళ్లిస్తారు. హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా చెన్నై వెళ్లే వాహనాలను నార్కెట్‌పల్లి–నల్గొండ, మిర్యాలగూడ–పిడుగురాళ్ల–అద్దంకి–మేదరమెట్ల ఒంగోలు మీదుగా చెన్నైకు మళ్లిస్తారు. చెన్నై నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్‌కు వెళ్లే వాహనాలను ఒంగోలు–మేదరమెట్ల–పిడుగురాళ్ల–మిర్యాలగూడ–నల్గొండ–నార్కెట్‌పల్లి మీదుగా హైదరాబాద్‌కు మళ్లిస్తారు. హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా గుంటూరు వెళ్లే వాహనాలను నార్కెట్‌పల్లి–మిర్యాలగూడ–పిడుగురాళ్ల–సత్తెనపల్లి మీదుగా గుంటూరుకు మళ్లిస్తారు. గుంటూరు నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్ వెళ్లే వాహనాలను గుంటూరు–పిడుగురాళ్ల–మిర్యాలగూడ–నార్కెట్‌పల్లి మీదుగా హైదరాబాద్‌కు మళ్లిస్తారు. మచిలీపట్నం నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్ వెళ్లే వాహనాలను మచిలీపట్నం–పామర్రు–హనుమాన్‌జంక్షన్ నుంచి మైలవరం–ఇబ్రహీంపట్నం మీదుగా మళ్లిస్తారు. హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా మచిలీపట్నం వెళ్లే వాహనాలను హైదరాబాద్–ఇబ్రహీంపట్నం–మైలవరం–నూజివీడు–హనుమాన్‌జంక్షన్–మచిలీపట్నం మీదుగా మళ్లిస్తారు. -
ఆత్మీయ స్పర్శతో ఒత్తిడి దూరం
విపరీతమైన ఒత్తిడితో ఉన్నప్పుడు ఆప్తులెవరైనా కాసేపు మన చేతులు పట్టుకున్నారనుకోండి. ఏమనిపిస్తుంది? ఒత్తిడి తాలూకూ ఇబ్బంది ఎంతో కొంత తగ్గినట్టు అనిపిస్తుంది కదూ! అందులో వాస్తవం లేకపోలేదు అంటున్నారు గోథెన్బర్గ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. ఈ విషయాన్ని తాము ప్రయోగపూర్వకంగా తెలుసుకున్నామని అంటున్నారు వారు. ఆత్మీయ స్పర్శతో ఒత్తిడి తగ్గుతుందని ఇప్పటికే తెలిసినప్పటికీ ఎందుకు? ఎలా? జరుగుతుందన్న విషయాలు మాత్రం ఇప్పటివరకూ తెలియవు. ఈ నేపథ్యంలో ఛంటాల్ ట్రిస్కోలీ అనే శాస్త్రవేత్త 125 మందిపై కొన్ని ప్రయోగాలు చేశారు. దీర్ఘకాలపు స్పర్శతో శరీరంలో ఒత్తిడికి కారణమని భావిస్తున్న హార్మోన్ల ఉత్పత్తి తగ్గుతున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా గుండె కొట్టుకునే వేగం కూడా మందగిస్తున్నట్లు తెలుసుకోగలిగారు. ఒక రకమైన మానసిక తృప్తి ఏర్పడటం వల్ల ఇలా జరుగుతున్నట్లు ఇప్పటివరకూ అనుకునేవారని.. తమ ప్రయోగాల్లో దీనికి భిన్నమైన కారణాలు తెలిసాయని ఛంటాల్ చెప్పారు. ఈ ప్రయోగ ఫలితాల ఆధారంగా ఒత్తిడికి మరింత మెరుగైన చికిత్స అందించవచ్చునని అంటున్నారు. -
ఎగ్జామ్ వారియర్స్ వచ్చేసింది...
సాక్షి,న్యూఢిల్లీ: రేడియో ప్రోగ్రామ్ మన్ కీ బాత్ తో ఆకట్టుకున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థుల కోసం కలం పట్టిన బుక్ జనం ముందుకు వచ్చింది. ముఖ్యంగా విద్యార్థినీ విద్యార్థులు పరీక్షల సమయంలో ఒత్తిడి ఎలా ఎదుర్కోవాలో వివరిస్తూ ఈ పుస్తకాన్ని రచించారు. ‘ఎగ్జామ్ వారియర్స్’ తో ఈ బుక్‌ను విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో శనివారం విడుదల చేశారు. పెంగ్విన్ ఇండియా ప్రచురించిన ఈ పుస్తకాన్ని ఇవాళ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ రిలీజ్ చేశారు. విద్యార్థులు తమ శక్తిని తెలుసుకొని తెలివిగా వ్యవహరించాలని సుష్మా విద్యార్థులకు సూచించారు. గత ఏడాది ఫిబ్రవరి 16న మన్ కీ బాత్ లో విద్యార్థుల పరీక్షల భయం గురించి మాట్లాడుతూ.. వర్రీయర్స్‌గా కాదు వారియర్స్‌గా మారి పోరాడాలంటూ ఉద్బోధించారు. ఒక సంవత్సరం కఠోర శ్రమ తరువాత తమ సామర్థ్యాలను ప్రదర్శించే పరీక్షలను ఒక సంతోషకరమైన సందర్భంగా చూడాలి.. ఒక పండుగలా పరీక్షలు రాయాలన్నారు. విద్యార్థులు పరీక్షలను ఓ పండుగలా భావించి రాయాలని.. అప్పుడు ఎటువంటి ఒత్తిడి ఉండదని విద్యార్థులనుద్దేశించి మోదీ సూచించిన సంగతి తెలిసిందే. విద్యార్థుల మానసిక ఒత్తిడిని ఎదుర్కొనే శక్తి తన పుస్తకం ఇస్తుందని మోదీ చెప్పారు. కచ్చితంగా యువతలో ముఖ్యంగా పరీక్షలను రాసే విద్యార్థులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందనే ఆశాభావాన్ని పీఎం వ్యక్తం చేశారు. 10, 12 తరగతుల విద్యార్థులు ఎగ్జామ్స్ ఒత్తిడిని జయించి.. పరీక్షల్లో విజయం ఎలా సాధించాలనే విషయాలను మోదీ ఆ పుస్తకంలో పొందుపరిచారట. పరీక్షల ఒత్తిడిని జయించడం, ఏకాగ్రతను సాధించడం, చదువు పూర్తయ్యాక కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం.. ఇలాంటి అంశాలపై ప్రధాని మోదీ యువతకు తన పుస్తకంలో సూచనలు, సలహాలతో రూపొందించారు. తాజా ఆవిష్కరణతో నరేంద్ర మోదీ యాప్ ద్వారా ఈ ఎగ్జామ్ వారియర్ గ్రూప్‌లో జాయిన్ కావచ్చు. -
టెలికాంకు టారిఫ్ వార్ దెబ్బ: 2018 ఆర్థిక సర్వే
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ టెలికాం రంగం తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోందని 2017-18 ఆర్థికసర్వే విశ్లేషించింది. ముఖ్యంగా టెలికాం రంగంలోకి కొత్తగా ప్రవేశించిన రిలయన్స్ జియో మార్కెట్ సంక్షోభానికి కారణమైందని పేర్కొంది. ఇతర కారణాలతోపాటు టారిఫ్ వార్ టెలికాం సేవల సంస్థలను దెబ్బతీసిందని చెప్పడం విశేషం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్త టెలికాం పాలసీ తీసుకొస్తోందని చెప్పింది. దీని రూపకల్పన ప్రక్రియ కొనసాగుతోందని తెలిపింది. 2018 లో ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని విడుదల చేయనుందని సర్వే వెల్లడించింది. అలాగే రెగ్యులేటరీ, లైసెన్సింగ్ విధానాలు, కనెక్టివిటీ, సేవల నాణ్యత, వ్యాపార సరళీకరణ, 5జీ సేవలు, ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్ లాంటి కొత్త టెక్నాలజీపై ఈ కొత్త విధానం దృష్టిపెట్టాలని సర్వే సూచించింది. భారీ అప్పులు, తారిఫ్ వార్, అసంబద్ధమైన స్పెక్ట్రం చార్జీలు టెల్కోలను దెబ్బతీశాయని వ్యాఖ్యానించింది. టెలికాం మార్కెట్లో తక్కువ ధరలతో ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియో మార్కెట్లో సంక్షోభం ఏర్పడిందనీ, దీని కారణంగా ఇతర కంపెనీల ఆదాయం పడిపోయిందని తెలిపింది. ఈ సంక్షోభం పెట్టుబడిదారులు, రుణదాతలు, భాగస్వాములతోపాటు ఈ టెలికాం కంపెనీల వెండార్స్‌ను తీవ్రంగా ప్రభావితం చేసిందని సర్వే పేర్కొంది. అయితే హేతుబద్ధమైన స్పెక్ట్రం వేలం, ఇతన ఖర్చుల హేతుబద్ధీకరణ ద్వారా దీన్ని నియంత్రించాలని సర్వే సిఫార్సు చేసింది. కాగా సెప్టెంబరు 2017 ముగిసే నాటికి, మొత్తం వినియోగదారుల సంఖ్య 1,207.04 మిలియన్లుగా ఉంది. అందులో 501.99 మిలియన్ కనెక్షన్లు గ్రామీణ ప్రాంతాలు నమోదు కాగా 705.05 మిలియన్ల కనెక్షన్లు పట్టణ ప్రాంతాలవి. -
స్ట్రెస్ పెంచుకోకండి... జుట్టు రాల్చుకోకండి!
జుట్టు మీద ఒత్తిడి గణనీయమైన ప్రభావం చూపుతుంది. మనలో ఇలా స్ట్రెస్ (ఒత్తిడి) పెరగగానే రాలే వెంట్రుకల సంఖ్య కూడా అలా పెరిగిపోతుంది. అది శారీరకమైనా లేదా మానసికమైనా మనలో స్ట్రెస్ కలగగానే... అది జుట్టును టెలోజెన్ ఎఫ్లూవియమ్ అనే దశలోకి తీసుకెళ్తుంది. ఈ దశలో వెంట్రుక రాలి, నిద్రాణ స్థితిలోకి వెళ్తుంది. ఒత్తిడి సమయంలో ఈ టెలోజెన్ ఎఫ్లూవియమ్ చాలా సుదీర్ధకాలంపాటు కొనసాగుతుంది. అలా దువ్వుకుంటున్నా లేదా స్నానం చేస్తున్నా సరే... ఒత్తిడి సమయంలో దాని వల్ల రాలే వెంట్రుకల సంఖ్య మామూలు కంటే ఎక్కువగా ఉంటుంది. టెన్షన్, భరించలేనంత ఒంటరితనం, నిరాశ, నిస్పృహ వంటి ఫ్రస్టేషన్ లక్షణాలు మనలో ఒత్తిడిని పెంచి, జుట్టును రాల్చేస్తాయి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఆశాజనకమైన విషయం ఒకటి ఉంది. ఒత్తిడి వల్ల జుట్టురాలడంతో మనకు కలిగే హెయిర్‌లాస్ శాశ్వతం కాదు. మనం ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నపూర్వకంగా ఒత్తిడిని అధిగమించగలిగితే మనం కోల్పోయిన జుట్టు మళ్లీ పెరుగుతుంది. -
జుట్టును రాల్చేసే స్ట్రెస్
మనిషి నిత్యం శారీరక లేదా మానసిక ఒత్తిళ్లకు (స్ట్రెస్)కు లోనవుతున్నప్పుడు జుట్టు రాలిపోవడం చాలా సాధారణంగా జరిగే పరిణామం. మనం బాగా ఒత్తిడికి (స్ట్రెస్‌కు) గురైనప్పుడు మనలో స్రవించే హార్మోన్ల అసమతౌల్యత ఏర్పడి అది జుట్టును రాల్చేలా చేస్తుంది. అంతేకాదు... మనం శారీరకంగా జబ్బుపడితే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో స్ట్రెస్ కూడా అలాంటి భౌతికమైన మార్పులు కలిగేలా చేసి, జుట్టును రాలిపోయేలా చేస్తుంది. స్ట్రెస్‌తో లేదా శారీరకంగా కలిగే జబ్బుల వల్ల జుట్టు రాలడం అన్నది... జుట్టు రాలడం నుంచి మళ్లీ పెరగడం వరకు జరిగే ‘జుట్టు సైకిల్’లో ఒకటైన ‘టిలోజెన్ ఎఫ్లూవియమ్’ అనే దశ కారణంగా సంభవించే పరిణామం. ఈ టిలోజెన్ ఎఫ్లూవియమ్ దశలో వెంట్రుక ఫాలికిల్ పూర్తిగా విశ్రాంతి దశలోకి వెళ్తుంది. అందుకే ఈ దశలో జుట్టు రాలి మళ్లీ మొలవడం ఆలస్యం అవుతుంది. ఫలితంగా మాడుపైన జుట్టు పలచబడినట్లుగా కనిపిస్తుంది. అందుకే జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్న వారు, తాము ఏ కారణంగానైనా ఒత్తిడికి లోనవుతున్నారేమో గమనించి, దాన్ని దూరం చేసుకోవాలి. ఒత్తిడి తొలగగానే మళ్లీ జుట్టు మామూలుగానే వస్తుంది. -
ఒకవైపు ప్రియుడు.. మరోవైపు కుటుంబం..!
చక్కగా చదువుకునే వయసులో మోహం ప్రేమవైపు నడిపిస్తే.. అది ఏకంగా ప్రాణాన్నే బలిగొంది. ఒకవైపు ప్రియుడు, మరోవైపు కుటుంబం నుంచి వస్తున్న ఒత్తిళ్లతో మనోవేదనకు గురై ఈ లోకాన్ని విడిచివెళ్లింది. పిల్లలు లేత వయసులో వేసే తప్పటడుగులు కన్నవారికి తీరని శోకాన్నే పంచాయి. సాక్షి, బొమ్మనహళ్లి: పెళ్ళి చేసుకోవాలని ప్రియుడు పదే పదే వేధింపులకు గురి చేస్తుండటం, ఇంట్లో పెళ్ళికి ఒప్పుకోక పోవడంతో మైనర్ బాలిక తీవ్ర మానసిక క్షోభకు గురైంది. బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. బన్నేరుఘట్ట పోలీసు స్టేషన్ సమీపంలోనున్న జిగణిలో ఉన్న చెరువులో దూకింది. మృతురాలు బన్నేరుఘట్ట దగ్గరిలోని శ్యానబోగనహళ్ళి గ్రామానికి చెందిన పుష్ప (17). వివరాలు.. పుష్ప జిగిణిలో ఉన్న ప్రైవేట్ కాలేజీలో పియూసీ చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు కూలీ పనిచేస్తుంటారు. అదే కళాశాల్లో చదువుతున్న నిఖిల్ అనే యువకుడు– పుష్ప మధ్య పరిచయమై ప్రేమగా మారింది. మనం పెళ్ళి చేసుకుందామని నిఖిల్ పుష్పను పదేపదే అడుగుతున్నాడు. కానీ పుష్ప మాత్రం అప్పుడే వివాహం వద్దని, ఇంట్లో వారిని ఒప్పించి పెళ్ళి చేసుకుందామని చెబుతున్నా నిఖిల్ వినేవాడు కాదు. చివరకు పుష్ప ఈ విషయాన్ని ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పగా వారు ఈ పెళ్లికి ససేమిరా అన్నారు. కాలేజీ దగ్గరిలోని చెరువులో శవమై... ఈ పరిణామాలతో మనోవేదనకు గురైన పుష్ప రెండు రోజుల క్రితం కాలేజీకి వచ్చి మళ్లీ ఇంటికి వెళ్ళలేదు. ఆమె కనిపించకపోవడంతో అంతటా గాలించిన బంధువులు చివరికి బన్నేరుఘట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు బాలిక కోసం గాలింపు చేపట్టారు. శనివారం ఉదయం జిగణిలో కాలేజీకి సమీపంలోనున్న చెరువులో ఒక బాలిక శవం కనిపించింది. స్థానికులు జిగణి పోలీసులకు తెలియజేయగా, సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు బాలిక మృతదేహాన్ని వెలికితీసి చూడగా ఆమె పుష్పేనని తేలింది. అనంతరం కుటుంబ సభ్యులకు వివరాలను తెలిపి, శవపరీక్ష కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారూ. జిగిణి పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. -
'నారాయణ, చైతన్య’కు భారీ జరిమానా'
సాక్షి, అమరావతి: విద్యా సంస్థల్లో తీవ్ర ఒత్తిడి ఉంటున్న మాట వాస్తవమేనని విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. నిబంధనలు పాటించని పలు జిల్లాల్లోని నారాయణ, చైతన్య కాలేజీలకు రూ. 50 లక్షల చొప్పున జరిమానా విధించామని.. తగిన చర్యలు తీసుకుంటున్నామని అసెంబ్లీలో చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి అన్ని కళాశాలల్లో పూర్తిస్థాయిలో నిబంధనలు అమలు చేస్తామన్నారు. లోటు బడ్జెట్లోనూ విద్యారంగానికి అధిక నిధులు ఖర్చు పెడుతున్నామని చెప్పారు. ప్రైవేటు కళాశాలల్లో ఆత్మహత్యల నివారణకు రెండు కమిటీలు వేశామని వెల్లడించారు. రోజుకు 18 గంటలపాటు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారని, ఆత్మహత్యల నివారణ కోసం సీఎం స్వయంగా యాజమాన్యాలతో చర్చించారన్నారు. ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావద్దని హెచ్చరించారని వివరించారు. ఒక్క ఏపీలోనే కాదు.. దేశవ్యాప్తంగా ఆత్మహత్యలు జరుగుతున్నాయని, కచ్చితంగా ఆత్మహత్యలు తగ్గిస్తామని, వచ్చే ఏడాది నుంచి 100 శాతం నిబంధనలు పాటించే కళాశాలలకే అనుమతులిస్తామని మంత్రి చెప్పారు. -
అంతరిక్షంలోనూ అదే పిచ్చి!
న్యూయార్క్ : కళ్లముందు గిర్రున తిరిగే స్పిన్నర్‌ను కాసేపు చూస్తే మానసిక ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం కలుగుతుందని చెప్పే వాళ్లు ఉన్నారు. స్పిన్నర్‌ను గిర్రున తిప్పి తదేకంగా దాన్నే చూస్తుంటే ఏకాగ్రత పెరుగుతుందని అనే వాళ్లు ఉన్నారు. ఏదేమైనా ఈ స్పిన్నర్‌ను తిప్పుతూ ఆడేవాళ్లు పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్న స్పిన్నర్లలో ‘ఫిడ్గెట్’ కంపెనీవి ప్రమాణికంగా ఉన్నాయి. రోదసిలోని అంతర్జాతీయ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో పనిచేస్తున్న వ్యోమగాములు కూడా తమ అలసటు తీర్చుకోవాలనుకున్నారో లేక కాస్త టైంపాస్ చేద్దామనుకున్నారో లేక నిజంగా ఈ స్పిన్నర్లు గురుత్వాకర్షణ శక్తిలేని చోట ఎలా పనిచేస్తాయో పరీక్షించాలనుకున్నారో.....నాసా లోగో కలిగిన ఓ స్పిన్నర్‌ను తెప్పించుకొని పరీక్షించారు. దాన్నంతా ఓ వీడియా తీసి భూమికి పంపించారు. భూమి మీద ఒక్కసాని స్పిన్నర్‌ను తిప్పితే కొన్ని నిమిషాలపాటు అతి తిరుగుతుంది. అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి ఉండదుగనుక స్పిన్నర్‌ను తిప్పితే అది కొన్ని నిమిషాలు కాకుండా కొన్ని గంటలపాటే తిరగాలి. ఆ వీడియోలో అలా తిరుగున్నట్టే కనిపించింది. ఎంత సేపటికి అది ఆగిపోతుందో వ్యోమగాములే చెప్పలేకపోయారు. వ్యోమగామి రాండీ కోమ్ర్రేడ్ బ్రెస్నిక్ స్పెన్నర్ను తిప్పి తాన్ని పట్టుకోవడం వల్ల ఆ స్పిన్నర్‌తోపాటు తాను కూడా శూన్యంలో అలా గిరిగిరా తిరుగుతూ కనిపించారు. స్పిన్నర్ డైరెక్షన్ మారుస్తూ తాను ఆ డైరెక్షన్లో తిరిగారు. ఈ స్పిన్నర్ తిప్పడం వ్యోమగాములకు అలవాటైందో, లేదో తెలియదుగానీ భూమిమీద మాత్రం చిన్నా, పెద్ద తేడా లేకుండా దీన్ని పిచ్చిగా తిప్పుతున్నారు. -
లవంగం... స్ట్రెస్ బస్టర్!
లవంగాన్ని సుగంధద్రవ్యంగా వంటల్లో ఉపయోగిస్తారు. ఎడతెరిపి లేకుండా దగ్గు వస్తున్నప్పుడు ఒక్క లవంగమొగ్గను బుగ్గన పెట్టుకుంటే ఆ దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. లవంగంతో కలిగే మరికొన్ని ప్రయోజనాలు. ►లవంగం నోటికి సంబంధించిన చాలా విషాలను లవంగం హరిస్తుంది. దాంతో శ్వాస తాజాగా ఉంటుంది. ►గొంతు బొంగురుగా ఉన్నప్పుడు, గొంతునొప్పి ఉండి, పట్టేసినట్లుగా ఉన్నప్పుడు లవంగాన్ని నోట్లో ఉంచుకొని చప్పరిస్తూ, ఆ రసం కొద్దికొద్దిగా మింగుతూ ఉంటే గొంతులోని ఇబ్బంది తగ్గుతుంది. ►లవంగం మంచి స్ట్రెస్‌బస్టర్. కొన్ని తులసి ఆకులు, కాసిన్ని పుదీనా ఆకులు, ఇంకొన్ని యాలకులతో పాటు రెండు లవంగం మొగ్గలను నీళ్లలో కాచి తాగితే ఒత్తిడి తొలగిపోయి, కొత్తగా శక్తి పుంజుకుంటారు. ►వాంతి వచ్చినట్లుగా ఉన్నప్పుడు ఒక లవంగం నోట్లో పెట్టుకొని చప్పరించడం మంచిది. లవంగం వల్ల వికారం, వాంతులు కూడా తగ్గుతాయి. ►లవంగం టీ కింది నుంచి వెళ్లే గ్యాస్ సమస్యను నివారిస్తుంది. అంతేకాదు... లవంగం జీర్ణశక్తిని పెంచి, జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. ►లవంగాలు హానికరమైన బ్యాక్టీరియాను తుదముట్టిస్తాయి. అందుకే వాటిని నోటిలో ఉంచుకొని చప్పరించినప్పుడు చిగుర్లపై ఉండే హానికరమైన బ్యాక్టీరియాను నిర్మూలించడం వల్ల పళ్ల, చిగుర్ల ఆరోగ్యం బాగుంటుంది. ►లవంగం నుంచి తీసే యూజెనాల్ అనే రసాయనంలో నొప్పిని తగ్గించే గుణం ఉంది. అందుకే పంటి నొప్పికి లవంగం నూనెను ఉపయోగిస్తుంటారు. ►లవంగంలోని చాలా శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్లను సమర్థంగా నివారిస్తాయి. -
మీలో ఒత్తిడి పెరుగుతోందా...?
సెల్ఫ్ చెక్ పని, మానసిక సమస్యలు కారణం ఏదైనా ఈ రోజుల్లో ఒత్తిడి సాధారణం అయ్యింది. మ్యూజిక్ వినటం, సినిమాలు చూడటంతో కొందరు స్ట్రెస్‌ను తగ్గించుకొనే ప్రయత్నం చేస్తారు. కానీ అందరూ అలా చేయలేక అనారోగ్యం పాలవుతుంటారు. స్ట్రెస్‌వల్ల మీరు సిక్‌గా మారారేమో చెక్ చేసుకోండి. 1. రెస్ట్ తీసుకొనే సమయం దొరికి నా సరిగా నిద్రపోలేక పోతున్నారు. ఎ. కాదు బి. అవును 2. స్ట్రెస్ నుంచి దూరం అవ్వటానికి దురలవాట్లు (మద్యం, ధూమపానం మొదలైనవి) నేర్చుకోవాలనిపిస్తోంది. ఎ. కాదు బి. అవును 3. మీ చుట్టూ ఉన్నవారు సంతోషంగా ఉన్నా మీరు మాత్రం ఎప్పుడూ మూడీగానే ఉంటారు. ఎ. కాదు బి. అవును 4. తరచుగా అలసిపోయినట్లు ఉండటం వల్ల ఏదైనా పనిని మధ్యలోనే వదిలివేయవలసి వస్తోది. ఎ. కాదు బి. అవును 5. కోపాన్ని అణచుకోవటం చాలా కష్టంగా మారింది. ఎ. కాదు బి. అవును 6. ఆందోళనలో ఉన్నప్పుడు గందరగోళానికి గురవుతున్నారు. ఎ. కాదు బి. అవును 7. మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోమని, మీ శ్రేయోభిలాషుల నుంచి సూచనలు అందుతున్నాయి. ఎ. కాదు బి. అవును 8. ఆహారం మరీ ఎక్కువ లేదా మరీ తక్కువగా తీసుకుంటున్నారు. ఎ. కాదు బి. అవును 9. ఏ పనిమీదా శ్రద్ధ చూపలేకపోతున్నారు. ఎ. కాదు బి. అవును 10. మతిమరుపు వస్తోంది, ఎక్కుసార్లు తలనొప్పితో బాధపడుతున్నారు. ఎ. కాదు బి. అవును ‘బి’ సమాధానాలు నాలుగు వస్తే మీరిప్పుడిప్పుడే ఒత్తిడికి గురవుతున్నారు. ఏడు దాటితే మానసికంగా, శారీరకంగా ఇబ్బందుల్లో ఉండి ఉంటారు, వెంటనే ఒత్తిడిని నియంత్రించుకోగలిగే మార్గాలను ఫాలో అవ్వండి. ‘ఎ’ లు ఏడు కంటే ఎక్కువ వస్తే మీలో ఆందోళనకు తావులేదు. -
మా వాళ్లకు కార్లు ఇవ్వాల్సందే
► జూపూడిపై నాయకుల తీవ్ర ఒత్తిడులు ► కొన్ని రోజులు ఆగాలంటున్న చైర్మన్ నెల్లూరు(సెంట్రల్): మా అనుచరుల వద్ద నుంచి తీసుకున్న ఇన్నోవా కార్లను వారికి తిరిగి ఇవ్వాల్సిందేనని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్‌రావుపై తీవ్ర స్థాయిలో నాయకులు ఒత్తిడులు తెస్తున్నట్లు తెలిసింది. ఎస్సీ కార్పొరేషన్ సహకారంతో సబ్సిడీ ద్వారా ఇచ్చిన ఇన్నోవా కార్లపై సీఎం చంద్రబాబు ఫొటో లేదనే కారణంతో ఇచ్చిన 10 కార్లలో 8 కార్లను చైర్మన్ శనివారం వెనక్కు తీసుకున్నారు. తీసుకునే ముందు కూడా మీ నాయకులు చెప్పిన వారికే ఇచ్చాం..ఇప్పుడు ఈ విధంగా చేయడం ఏమిటని చైర్మన్ కూడా చెప్పడం గమనార్హం. ప్రస్తుతం ఆ నాయకులే జూపూడిపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. అవసరమైతే ఫొటోలు వేయించి ఇచ్చేయాలని చెప్పుకొస్తున్నారు. లేకుంటే తమ పరువు పోతుందని చెప్పుకొస్తున్నారు. దీంతో చైర్మన్ జూపూడి ప్రభాకర్‌రావు కూడా కొన్ని రోజులు ఆగాలని చెపుతున్నట్లు తెలుస్తోంది. ఇంత కాలం ఎందుకు స్పందించలేదు గత ఏప్రిల్ 14న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి రోజున ఇన్నోవా కార్లను లబ్ధిదారులకు ఇచ్చారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కార్లు జిల్లాలో తిరుగుతున్నాయి. లబ్ధిదారులకు ఇచ్చే సమయంలో కొన్ని కార్లకు సీఎం స్టిక్కర్ కూడా లేదు. ఆ తరువాత ఉన్న స్టిక్కర్‌ను కూడా పీకేశారు. జిల్లాలోని టీడీపీ నాయకులు ఎవరూ పట్టించుకోకపోయినా చైర్మన్ మాత్రం కార్లను వెనక్కు తీసుకోవడం ఏంటని పలువురు నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ నెల మొదటి వారంలో జేసీ ఇంతియాజ్ కూడా రెండోసారి ఈ కార్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అప్పట్లో కూడా ఈ కార్లకు సీఎం స్టిక్కర్ లేదు. అప్పుడు అధికారులు కూడా ఎందుకు మౌనంగా ఉన్నారో సమాధానం చెప్పాల్సి ఉంది. బాబు ఫొటోలు ఉంటే బాడుగలు రావా! చంద్రబాబు ఫొటో ఉన్న స్టిక్కర్ కారుకు ఉంటే చాలా వరకు బాడుగలు రావని పలువురు లబ్ధిదారులు చెప్పుకొస్తున్నారు. అందువల్లే సీఎం ఫొటో తీసేయాల్సి వచ్చిందని వారి వాదన. బాడుగలు రాకపోతే నెలకు దాదాపుగా రూ.20 వేల వరకు ఎస్సీ కార్పొరేషన్‌కు కట్టాల్సి ఉంది. ఈ నగదు ఎక్కడి నుంచి తీసుకురావాలని పలువురు లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా ఇన్నోవా కార్ల వ్యవహారంతో జిల్లా నాయకులకు, చైర్మన్ జూపూడి ప్రభాకర్‌రావు మధ్య కొంత మనస్పర్థలు వచ్చినట్లు తెలుస్తోంది. నాయకులు చెప్పిన ప్రకారం తిరిగి కార్లు ఇవ్వకపోతే అదే స్థాయిలో తిరుగుబాటు కూడా ఉంటుందని పలువురు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. కాగా సీఎం ఫొటో లేదని వెనక్కు తీసుకున్న కార్లను నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి తిరిగి ఆ లబ్ధిదారులకే ఇస్తారా..లేక వేరే వారికి ఇస్తారా అనేది వేచిచూడాల్సి ఉంది. -
ఆల్ ద బెస్ట్!!
పిల్లలు పరీక్షలకు రెడీ.. ఆల్ ద బెస్ట్!! పేరెంట్స్ చెయ్యాల్సిందంతా చేశారు! స్ట్రెస్ లేకుండా.. స్ట్రెస్ ఇవ్వకుండా పిల్లల్ని పరీక్షలకు పంపించండి! ఆల్ ద బెస్ట్!! పిల్లల పరీక్షలు తల్లిదండ్రులకు పెద్ద పరీక్షే. పిల్లలు ఎలాగూ కష్టపడుతున్నారు. పెద్దల యాంగ్జయిటీ అంతా ‘మనం కూడా కష్టపడుతున్నామా’ అన్నదే. పిల్లల పరీక్షల్లో భాగస్వాములుగా కాకపోతే ఫెయిలవుతామేమో అన్న భయం. ‘ఆ ఫార్మూలా గుర్తుంటుందా?’, ‘ఏ కాంటినెంట్ పక్కన ఆఫ్రికా ఉందో జ్ఞాపకం ఉంటుందా?’, ‘ఏ ప్లస్ బి హోల్‌స్క్వేర్ ఎంత?’, ‘సెకండ్ టైమ్ రివిజన్ కంప్లీట్ అయిందా?’ , ‘పొద్దున మూడింటికి అలారమ్ పెట్టి లేపుతాను సరేనా?’ .. పిల్లలకు ఇవ్వన్నీ చెప్పాలంటే పేరెంట్స్ ఎంతగా ప్రిపేర్ కావాలి? ప్రిపేర్ అయ్యేది పేరెంట్స్.. పరీక్ష రాసేది పిల్లలు. పిల్లలు మంచి మార్కులతో పాసవ్వాలనే యాంగ్జయిటీలో ఒక్కోసారి పిల్లల్ని కూడా యాంగ్జయిటీకి గురిచేస్తున్నారు. పిల్లల్లో లేని భయాన్ని సృష్టిస్తున్నారు. దాంతో జవాబులన్నీ తెలుసుండీ కూడా ఆన్సర్ పేపర్ ముందుకు వెళ్లేసరికి బ్లాంక్ అయిపోతున్నారు పిల్లలు. అందుకు పిల్లలకు కొంచెం ఊపిరాడే చోటిస్తే బాగుంటుందని చెప్తున్నారు నిపుణులు. పిల్లలూ అదే కోరుకుంటున్నారని తెలిసింది.. ఓ సోడా కంపెనీ తన సీఎస్సార్ కింద చేసిన ఓ డిజిటల్ ప్రమోషన్లో. ఇందులో పెద్దలు పెట్టిన ఒత్తిడితో సతమతమవుతున్న çపధ్నాలుగు, పదిహేనేళ్ల వయసు పిల్లలు.. పెద్దల నుంచి తాము ఎలాంటి మద్దతును ఆశిస్తున్నారో తెలుపుతూ తమ తల్లిదండ్రులకు ఉత్తరాలు రాశారు. చూస్తుంటే.. వింటుంటే.. హృదయం ద్రవిస్తోంది. ఆ ఉత్తరం ముక్కలను మీకోసం పట్టుకొచ్చాం.. ఒక్కసారి చదవండి! పిల్లల మనసు అర్థమవుతుంది! మీ స్ట్రెస్ చూస్తుంటే నర్వస్‌గా ఉంటుంది.. ప్రియమైన అమ్మా, నాన్నకు.. నేనంటే మీకెంత ఇష్టమో నాకు తెలుసు. అయినా చదువు విషయంలో మీ ప్రవర్తన నాకు అర్థంకాదు. ఫ్రెండ్స్‌తో కలవనివ్వరు. ఆడుకోనివ్వరు. ఓ బందీలా చూస్తారు. ఎందుకమ్మా? ఎందుకు నాన్నా? నాకు పరీక్షలొస్తున్నాయంటే మీరు స్ట్రెస్ ఫీలవుతారు. మీ స్ట్రెస్ చూస్తుంటే నాకు నర్వస్‌గా ఉంటుంది. మీరు నా పట్ల చూపిస్తున్న ప్రేమంటే నాకు చాలా కన్సర్న్ నాన్నా.. అమ్మా! కాని కొన్నిసార్లు, కొన్ని విషయాల్లో నన్ను వదిలేయండి. నన్నుగా ఉండనివ్వండి. ప్లీజ్! జీవితంలో మీ గౌరవాన్ని ఎక్కడా తగ్గించను. నన్ను కన్నందుకు మీరు గర్వపడేలా చేస్తాను. ఇట్లు మీ కూతురు కేసంగ్ నన్ను నమ్మండి ప్లీజ్ డియర్.. అమ్మా అండ్ అప్పా.. ఏ విషయంలోనైనా నాకెంత బెరుకు, భయమో మీకు తెలుసు. ఎంతో ధైర్యాన్ని కూడగట్టుకొని మీకు ఈ ఉత్తరం రాస్తున్నా. కిందటేడాది నేను మంచి మార్కులు తెచ్చుకోలేదు. కాని ఈసారి మార్కుల కోసం బాగా కష్టపడుతున్నా. టీవీలో ఫుట్‌బాల్, క్రికెట్ మ్యాచెస్ చూడాలనుకుంటా. వాటితో రిలాక్స్ అవాలనుకుంటా. నా ప్రెషర్ తగ్గించుకోవాలనుకుంటా. కాని మీరు పరీక్షల కోసం టీవీ కనెక్షన్ కట్ చేయించారు. దయచేసి నన్ను అర్థంచేసుకోండి! నేను బాగా చదువుతున్నాను. నన్ను నమ్మంyì ప్లీజ్! మీ ప్రవర్తన వల్ల చాలా ఫ్రస్ట్రేట్ అవుతున్నా. ఎవరితో మాట్లాడకుండా బాత్రూమ్లోకి వెళ్లి తలుపేసుకొని నన్ను నేను బంధించుకోవాలనిపిస్తోంది. మనింటిని నార్మల్ హౌజ్లా ఉంచడమ్మా...! ఇట్లు మీ అబ్బాయి కార్తిక్ ప్లీజ్ హెల్ప్ మీ నాన్నా.. ప్రియమైన నాన్నకు.. నాకు ఎగ్జామ్స్ అంటే భయంలేదు. మీరంటేనే భయమేస్తోంది. ఎంతలా అంటే మిమ్మల్ని తలచుకుంటే ధైర్యం రావాల్సింది పోయి కళ్లల్లో నీళ్లొస్తున్నాయి. అందరిముందు నిషి ఆంటి కూతురుతో నన్ను కంపేర్చేయొద్దు ప్లీజ్! నన్ను నాలా ఉండనివ్వండి నాన్నా! నువ్ అనుక్షణం నా గురించే ఆలోచిస్తూ.. నాతోనే ఉన్నా నువ్వు నాతో ఉన్నావన్న ధైర్యమే నాకు రావడంలేదు నాన్నా.. నిన్ను తలచుకుంటేనే భయమేస్తోంది. ప్లీజ్ హెల్ప్ మీ నాన్నా.. మీ లవింగ్ డాటర్ నిఖిత భయమేస్తోంది.. ప్రియమైన అమ్మా, నాన్నకు.. పరీక్షలు దగ్గరపడుతున్నాయి. భయమేస్తోంది. సరిగ్గా రాయలేనేమో అని కాదు.. మీరు నామీద పెట్టుకున్న అంచనాలను తలచుకుంటే భయమేస్తోంది. నా చదువు పట్ల మీరెంత శ్రద్ధ పెడుతున్నారో నాకు తెలుసు. కానీ నేనూ అంతే కష్టపడుతున్నానని మీకెందుకు అర్థంకావట్లేదమ్మా? ఎంత చదువుతున్నా.. ఎన్ని మార్క్స్ వస్తున్నా ఇంకా చదవట్లేదనే తిడ్తున్నారు. తట్టుకోలేకపోతున్నానమ్మా.. అందుకే పరీక్షలు వస్తున్నాయంటే భయమేస్తోంది! మీ ఒత్తిడికి ఊపిరాడనట్టవుతోంది. స్కూల్ నుంచి, మీ నుంచి పారిపోవాలనిపిస్తోంది. ప్లీజ్ నన్ను డిమోటివేట్ చేయొద్దమ్మా! నా మానాన నన్ను చదవనివ్వండి. మీరు తలెత్తుకునేలా చేస్తాను. ప్రామిస్! లవ్ యూ మా.. లవ్ యూ పా..! ఇట్లు మీ కూతురు అనీష మార్కులు తప్ప జీవితమే లేనట్టు... డియర్ మదర్.. నాతో నువ్వెప్పుడూ మార్కులు, కాంపిటీషన్ గురించే మాట్లాడతావ్! నువ్వు చెప్పినన్ని మార్కులు తెచ్చుకోకపోతే.. టాపర్స్‌తో కంపీట్ చేయలేకపోతే ఇక నా లైఫ్ వేస్ట్ అన్న ఫీలింగ్‌ను కలిగిస్తున్నావ్! మార్కులు తప్ప నాకు ఇక లైఫే లేదన్న ఫీల్ వస్తోందమ్మా..! జీవితమంటే మార్కులేనా అమ్మా...? నువ్వు, నాన్న .. నాతో ఒక్కసారి కూడా నెమ్మదిగా మాట్లాడరు. మార్కుల గురించి కాక ఇంకో టాపిక్ తీసుకురారు. మీరనుకున్నదానికంటే ఒక్క మార్క్ తక్కువైనా నా మీద గట్టిగట్టిగా అరుస్తారు. తిడ్తారు. మీరు తిట్టిన రాత్రిళ్లు ఒక్క క్షణం కూడా నాకు నిద్ర ఉండదు తెలుసా అమ్మా.. ! నువ్వు నామీద అరిచిన ప్రతిసారీ నాకెంతో దూరమైపోయినట్టు.. నువ్వో కొత్త మనిషిలా కనిపిస్తావమ్మా! ఆ క్షణంలో నిన్ను చూస్తుంటే భయమేస్తుంది. ఇంట్లోంచి పారిపోవాలనిపిస్తుంది. కడుపులో తిప్పుతుంది. వామ్టింగ్ వచ్చినట్టువుతుంది. అమ్మా.. నేను బాగా చదువుతానమ్మా.. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నన్ను తిట్టొద్దమ్మా! మీ కూతురైనందుకు చాలా గర్వంగా ఉంది. నాకోసం ఇంతగా కష్టపడుతున్నందుకు మీకెప్పుడూ రుణపడి ఉంటా. మీ గౌరవం నిలబెడ్తా. ఇట్లు మీ చిట్టితల్లి టీనా మైడియర్ పేరెంట్స్.. పది గంటలపాటు ఒక్క ఉదుటున.. కుదురుగా కూర్చోని చదివేంత ఎనర్జి నాకు లేదని మీకు తెలుసు. అయినా ఎటూ కదలనివ్వకుండా నా గదిలో కూర్చోబెట్టి చదివిస్తుంటారు. పైగా అరగంటకు ఒకసారి వచ్చి చెక్ చేస్తుంటారు నేను కుదురుగా ఉన్నానో లేదోనని. ఇదంతా నాకు చాలా బాధగా ఉంది. మీరలా చేయడం వల్లే నేను నా కాన్సంట్రేషన్‌ను కోల్పోతున్నాను. అమ్మా... నాన్నా.. ప్లీజ్ మాటిమాటికి నా సిన్సియారిటీని చెక్ చేయకండి! నా కాన్ఫిడెన్స్‌ను దెబ్బతీయకండి.ప్లీజ్... ఇట్లు మీ అబ్బాయి అన్షుల్ ఇవి ఉత్తరాలు కావు.. పసి హృదయాల ఆవేదనకు అక్షర రూపాలు. టీనేజర్స్‌లో అంతకంతకు పెరుగుతున్న డిప్రెషన్, సూసైడల్ టెండన్స్లకు కారణం పరీక్షల సమయంలో తల్లిదండ్రులు పిల్లల మీద పెట్టే ఒత్తిడేనని ఎన్నో నివేదికలు, మానసిక విశ్లేషణలూ ఘోషిస్తున్నాయి. ఈ తరమే రేపటి మన దేశ బంగారు భవిష్యత్తు. వాళ్ల అభ్యర్థనను అర్థం చేసుకుందాం. మన పిల్లల్ని కాపాడుకుందాం! మార్కుల మిల్లుల్లా కాదు మానవత్వమున్న మనషుల్లా పెంచుకుందాం! -
అవి తింటే రెండువారాల్లో ఒత్తిడి మాయం
రోజూవారీ ఆహారంలో తగినన్ని కాయగూరలు, పండ్లు తీసుకోవడం ద్వారా రెండు వారాల్లో ఒత్తిడిని దూరం చేసుకోవచ్చట. కాయగూరలు, పండ్లలో ఉండే ఆరోగ్యకరమైన విటమిన్లు ఒత్తిడిని తగ్గిస్తాయని ఒటాగో యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. పండ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల సైకలాజికల్ గా ఆ వ్యక్తి చాలా ధృడంగా తయారవుతారని తమ పరిశోధనల్లో తేలినట్లు తెలిపారు. అప్పటివరకూ ఉన్న బాధలన్నీ కేవలం రెండే వారాల్లో పూర్తిగా మాయమవుతాయని వెల్లడించారు. 18 నుంచి 25 సంవత్సరాలు వయసున్న 171మందిపై పరిశోధనలు జరిపిన తర్వాత ఈ విషయంపై ఓ నిర్ధారణకు వచ్చినట్లు చెప్పారు. -
బర్నింగ్ ప్రాబ్లమ్!
ఒకప్పుడు ట్రైన్ ఇంజన్లు బొగ్గుతో నడిచేవి. బొగ్గును తీసుకొని ఇంజన్ కడుపులో వేస్తే భగభగమని మండి ఛుక్ ఛుక్మని పరుగెడుతుండేవి. మన కడుపూ అంతే. కడుపులో అన్నం పడితే... ఆ అన్నం భగభగా మండి మనల్ని పరుగులు తీసేలా చేస్తుంది. కానీ... వేళకు అన్నం పడకపోతే కడుపే మండిపోతుంది. స్ట్రెస్ ఎక్కువైతే కడుపులో యాసిడ్ తిప్పేస్తుంది. ఈరోజుల్లో వేళకు భోజనం, నిద్ర ఎలాగూ కరువయ్యాయి. దీనికి తోడు పాడు స్ట్రెస్ యాసిడ్‌ను చిమ్మిస్తూనే ఉంటుంది. కడుపు రగిలిపోతూనే ఉంటుంది... అమ్మో!! ఎసిడిటీ... బర్నింగ్ ప్రాబ్లమ్! మనం తిన్న అన్నం అరగాలంటే యాసిడ్ కావాలి. అందుకే కడుపులోకి ఆహారం చేరగానే దాన్ని జీర్ణం చేయడం కోసం యాసిడ్ ఉత్పత్తి అవుతుంటుంది. యాసిడ్‌కు మంట పుట్టించే గుణం ఉంటుంది. అందుకే జీర్ణాశయంలో తాను పనిచేయడానికి తగినంత ఆహారం లేకపోయినా... లేదా ఏదైనా ఒత్తిడి కలిగినా కడుపులో మరింత యాసిడ్ ఉత్పన్నం అవుతుంది. అది మన కడుపు కండరాలపైన పనిచేస్తుంది. దాంతో కడుపులో మంటగా ఉంటుంది. అందుకే ఆ యాసిడ్ పైకి తంతూ ఉంటే నోట్లోకి చేదుగా వస్తుంది. ఒకవేళ లోపలే ఉండిపోతే... కడుపు కండరాలపై పనిచేస్తూ, వాటిని మండిస్తూ ఉంటుంది. ఈ మంట చాలామందికి అనుభవమే. ఆ యాసిడ్ కారణంగా అన్నం సరిగా అరగనప్పుడు అక్కడ గ్యాస్ కూడా ఉత్పత్తి అయి కడుపు ఉబ్బరమూ కలిగిస్తుంది. ఆ యాసిడ్ మంటలూ, కడుపు ఉబ్బరాలపై అవగాహన కోసం ఈ కథనం. కడుపు నిర్మాణం అర్థం చేసుకోడానికి ఒక చిన్న పోలికను చూద్దాం. అచ్చం కింద ఖాళీ స్థలం ఎక్కువ ఉండే ఒక సన్న మూతి ఉన్న సీసాలా ఉంటుంది మన కడుపు నిర్మాణం. అలాంటి సీసాలో నీళ్లు పోస్తున్నామనుకోండి. ఏమవుతుందో ఊహించండి. కింది నుంచి గాలి బుడగలు బుసబుసమంటూ పైకి వస్తాయి కదా. కడుపులోని అన్నంపై యాసిడ్ పనిచేస్తున్నప్పుడు, అవసరమైన దాని కంటే ఎక్కువగా యాసిడ్ ఉత్పత్తి అయినప్పుడు అది పైకి తంతుంది. అలాగే గ్యాస్ కూడా. ఆ గ్యాస్ పైకి వస్తూ ఉన్నప్పుడు దాంతో పాటు యాసిడ్ పైకి రావడాన్ని వెట్బర్ప్ అంటారు. ప్రతివారూ జీవితంలో ఒకసారైనా ఇలాంటి అనుభవాన్ని చవిచూసే ఉంటారు. అయితే కొందరికి అది నిత్యకృత్యం. యాసిడ్, గ్యాస్ సమస్యలతో బాధపడుతూనే ఉంటారు. ఈ సమస్యకు పేర్లు ఎన్నో... యాసిడ్ ఎక్కువగా ఉత్పత్తి కావడం, గ్యాస్ కడుపులోనే చిక్కుకుపోయి కడుపు ఉబ్బరంగా ఉండే ఈ సమస్యను సాధారణంగా ఎసిడిటీగా పేర్కొంటాం. అయితే దీనికి వైద్యపరంగా ఎన్నో పేర్లు ఉన్నాయి. అవి... నాన్ ఎరోసివ్ రిఫ్లక్స్ డిసీజ్ (ఎన్ఈఆర్డీ), ఎరోసివ్ ఈసోఫేజియల్ డిసీజ్ (ఈఈజీ), గ్యాస్ట్రో ఈజోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్డీ). కొందరిలో ఎసిడిటీ వల్ల కడుపు మంట, గ్యాస్ పేరుకుపోవడం వల్ల కడుపు ఉబ్బరం రాత్రివేళల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. అలా రాత్రివేళల్లో కనిపించే ఆ సమస్యను నాక్చర్నల్ జీఈఆర్డీ అంటారు. కారణాలు గతంలో ఎసిడిటీ కారణంగా కడుపులో మంట, గ్యాస్ వల్ల కడుపు ఉబ్బరం అనే సమస్యలు కేవలం ఒక వయసు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. అయితే ఇప్పుడవి చిన్న వయసు వారిలోనూ కనిపిస్తున్నాయి. మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా అందరిలోనూ కనిపిస్తున్నాయి. ఆధునిక నగర జీవనశైలి (అర్బన్ లైఫ్‌స్టైల్), మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల సమస్య మరింత తీవ్రమవుతోంది. ∙కడుపులో కొద్దిపాటి ఖాళీ కూడా మిగల్చకుండా తినడం ∙తిన్న వెంటనే పడుకోవడం ∙ఆహారంలో కొవ్వు ఎక్కువగా ఉండటం ∙ఉప్పు, కారం, మసాలాలు అధికరంగా ఉండటం ∙పీచు తక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడంతో యాసిడ్ పనిచేసే సమయంలో కండరాలకు తగినంత రక్షణ కరవై కడుపులో మంట, గ్యాస్ ఎగజిమ్మడం వంటి సమస్యలు మరింత తీవ్రమవుతాయి. ∙జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, అదేపనిగా వేపుడు పదార్థాలు తీసుకుంటూ ఉండటం, కొన్నిసార్లు భోజనం తినకపోవడం (మీల్ స్కిప్ చేయడం), తీవ్రమైన పని ఒత్తిడి ∙రాత్రిషిఫ్ట్‌లలో పని కారణంగా ఆహారపు వేళలు మారుతుండటం ∙అర్ధరాత్రి, అపరాత్రి వేళల్లో ఆహారం తీసుకోవడంతో వేళగాని వేళల్లో యాసిడ్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుండటం ∙నిద్రలేమి. మరికొన్ని అంశాలు పైన పేర్కొన్న కారణాలతో పాటు మరికొన్ని అంశాలు సైతం ఎసిడిటీకి దోహదం చేస్తుంటాయి. అవి... ∙స్థూలకాయం ∙ఒళ్లు కదలకుండా ఒకే చోట కుదురుగా కూర్చొని పనిచేసే వృత్తులలో ఉండటం వ్యాయామం చేయకపోవడం ∙తరచూ కాఫీ తాగడం లేదా కెఫిన్ ఎక్కువగా ఉండే ద్రవాహారం ఎక్కువగా తీసుకుంటూ ఉండటం ∙చాక్లెట్లు తినడం రాత్రివేళల్లో ఆలస్యంగా నిద్రకు ఉపక్రమించడం వంటి అంశాలు ఎసిడిటీ, గ్యాస్ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తాయి ∙ఇక మద్యం (ఆల్కహాల్), పొగతాగే అలవాటు, మింట్ (పుదీనా బిళ్లలు) చప్పరిస్తూ ఉండటం కూడా ఎసిడిటీకి దోహదం చేస్తుంది. అనర్థాలు ►దీర్ఘకాలికంగా ఎసిడిటీ సమస్యతో బాధపడుతుండేవారిలో చాలా ఆరోగ్యపరమైన అనర్థాలు సంభవిస్తుంటాయి. ►జీర్ణాశయం కింది భాగం (లోయర్ ఎండ్ ఆఫ్ ఈసోఫేగస్) సన్నబడిపోతుంది. ►చాలా కొద్ది మందిలో మాత్రం యాసిడ్ పైకి ఎగజిమ్ముతూ ఉండే జీఈఆర్డీ సమస్య చాలాకాలం పాటు కొనసాగేవారిలో నోటి నుంచి జీర్ణాశయం (పొట్ట) వరకు ఉండే నాళం క్రమంగా పేగు వంటి కణజాలాన్ని పెంపొందించుకుంటుంది. దీన్నే బారెట్స్ ఈసోఫేగస్ అంటారు. అయితే దీనిలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా అది క్రమంగా ఈసోఫేజియల్ ఎడినోకార్సినోమా అనే క్యాన్సర్‌కు దారితీసే అవకాశం ఉంది. నివారణ ►చిన్నచిన్న మోతాదుల్లో ఎక్కువసార్లు తినాలి. ►స్థూలకాయం ఉన్నవారు తప్పక బరువు తగ్గించుకోవాలి ►బరువు పెరుగుతున్న వారు జాగ్రత్తగా దాన్ని అదుపులో పెట్టుకోవాలి ► పొగ తాగడం, మద్యపానం వంటి అలవాట్లు ఉన్నవారు తక్షణం వాటిని మానివేయాలి ►రాత్రిపూట చాలా ఆలస్యంగా తినకూడదు ►రాత్రి ఆహారం తీసుకోగానే నిద్రకు ఉపక్రమించకూడదు ►రాత్రి భోజనం తర్వాత వీలైతే కాసేపు నడవాలి ► రాత్రి పూట తీసుకునే చిరుతిండ్లను వీలైనంత వరకు మానేయాలి ►రాత్రి పడుకోవడానికి ముందర రెండు గంటల పాటు ఏమీ తినకూడదు ► కంటినిండా నిద్రపోవాలి ►డాక్టర్లు ప్రిస్క్రయిబ్ చేస్తే తప్ప నొప్పి నివారణ మందులు, స్టెరాయిడ్స్‌ను తీసుకోకూడదు. ►పక్కమీదకు వెళ్లగానే సాధ్యమైనంత వరకు ఎడమవైపునకు ఒరిగి పడుకోవాలి. వీలైనంతవరకు కుడిపైపు తిరిగి పడుకోకూడదు. ఎందుకంటే... అలా పడుకుంటే స్ఫింక్టర్ మీద ఒత్తిడి పడి అది తెరుచుకుని, ఆహారం మళ్లీ వెనక్కు రావచ్చు. యాసిడ్ కూడా వెనక్కు వచ్చే అవకాశం ఎక్కువ ► మీ తల వైపు భాగం ఒంటి భాగం కంటే కాస్త ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి. ఒక మెత్త (దిండు)ను తలకింద పెట్టుకోవడం కాస్త ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈ దిండు తల క్రింద మాత్రమేగాక మీ భుజాల కింది వరకూ ఉంటే మేలు. ఎసిడిటీ నిర్ధారణ పరీక్షలు యూజీఐ ఎండోస్కోపీ పరీక్ష ద్వారా గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డీసీజ్ను నిర్ధారణ చేయవచ్చు. ఇక దీన్ని నిర్ధారణ చేయడానికి 24 గంటల పీహెచ్ మానిటరింగ్ పరీక్షను గోల్డ్ స్టాండర్డ్ పరీక్షగా పరిగణిస్తారు. చికిత్స దీనికి నివారణే ముఖ్యమైన చికిత్సగా భావించవచ్చు. అంటే మన జీవనశైలిని ఆరోగ్యవంతంగా మార్చుకోవడం. అంటే తక్కువ మోతాదుల్లో ఎక్కువ సార్లు తినడం, ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం. వీటన్నింటితో గుణం కనిపించనప్పుడే హెచ్2 బీటాబ్లాకర్స్, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ (పీపీఐ) అనే మందులతో చికిత్స అవసరం. వీటితో తగినంత ఉపశమనం కనిపిస్తుంది. డయాఫ్రమ్ బలహీనంగా ఉండటంతో కడుపు ఛాతీలోకి పొడుచుకువచ్చిన (హయటస్ హెర్నియా) కండిషన్లో ఫండోప్లికేషన్ శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. గృహ వైద్యం అప్పుడే తయారు చేసిన మజ్జిగ తీసుకోవడం ఇలాంటి సమస్యల్లో మంచి గృహవైద్యం. అప్పుడే తయారు చేసిన మజ్జిగకు క్షారగుణం ఉంటుంది. ఇది కడుపులోని ఆసిడ్ (ఆమ్లం)తో కలవగానే దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేస్తుంది. ఫలితంగా ఆమ్లం తన ప్రభావాన్ని కోల్పోతుంది. అయితే ఈ గృహవైద్యం కోసం అప్పటికప్పుడు తయారు చేసిన తాజామజ్జిగనే వాడాలి. ఎందుకంటే... కాస్త ఆలస్యం చేసినా మజ్జిగ పులవడం మొదలై అది కూడా ఎసిడిక్ (ఆమ్ల)గుణాన్ని పొందుతుంది. కాబట్టి ఆసిడ్‌లో ఆసిడ్ కలిసి సమస్య మరింత తీవ్రం కావచ్చు. కడుపును చల్లగా ఉంచే తాజా పెరుగు, తియ్యటి పెరుగు కూడా మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. పెరుగులోని ప్రొ–బయోటిక్ ఫ్యాక్టర్స్ అక్కడి బ్యాక్టీరియాను నియంత్రించి కడుపులో మంటను తగ్గిస్తాయి. ఎసిడిటీ ఉండి ఈ కింది లక్షణాలు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలి ఎసిడిటీ ఉన్నప్పుడు అకస్మాత్తుగా బరువు తగ్గుతుండటం, మింగడం చాలా కష్టంగా అనిపించడం, ఎసిడిటీ మందులు తీసుకుంటున్నా ఉపశమనం కనిపించకపోవడం, చికిత్సకు స్పందించక.. లక్షణాలు పెరుగుతూ పోతూ ఉంటే పరిస్థితిని తీవ్రంగా పరిగణించి తప్పక డాక్టర్‌ను సంప్రదించాలి. ఎసిడిటీ వల్ల కనిపించే కొన్ని అసాధారణ లక్షణాలు ఎప్పుడూ దగ్గు వస్తుండటం గొంతు బొంగురుగా అనిపిస్తుండటం ఆస్తమా – పిల్లికూతలు మింగుతున్నప్పుడు గొంతునొప్పి (అయితే దీన్ని గ్యాస్ కారణంగా అని గుర్తుపట్టలేకపోవడంతో.. దగ్గు, గొంతు బొంగురుపోవడం, ఆయాసపడటం, మింగుతునప్పుడు వచ్చే నొప్పికి మామూలుగా తీసుకునే మందులు వాడుతుంటారు. అవి సమస్యను పరిష్కరించకపోగా పరిస్థితిని మరింత తీవ్రం చేస్తాయి). కొందరిలో ఉదరంలోని భాగాలను కప్పి ఉంచే డయాఫ్రమ్ అనే పొర బలహీనంగా ఉండటంతో కడుపు భాగం ఛాతీలోకి పొడుచుకువచ్చినట్లుగా అవుతుంది. దాంతో ఛాతీలో నొప్పితో ఎసిడిటీ, గ్యాస్ సమస్య బయటపడుతుంది. కొన్నిసార్లు కొన్ని రకాల మందులు కూడా గ్యాస్ట్రబుల్కు దోహదపడుతుంటాయి. మలం నల్లరంగులో వస్తుంటే అది కడుపు లేదా పేగుల్లో రక్తస్రావం అవుతుందన్న దానికి సూచనగా భావించి తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి. గుండెపోటో, గ్యాస్ ట్రబులో తెలియక తికమక ఎసిడిటీ వల్ల వచ్చే నొప్పిని గుండెపోటులా పొరబడే అవకాశం ఉంటుంది. అది ఎసిడిటీ వల్ల వచ్చిన నొప్పే అయినా డాక్టర్‌ను సంప్రదించి, తగిన పరీక్షలు చేయించుకొని అది గుండెకు సంబంధించిన నొప్పి కాదని నిర్ధారణ చేసుకున్న తర్వాతే నిశ్చింత వహించాలి. అంతేగానీ... కేవలం ఎసిడిటీ వల్ల వచ్చే నొప్పే అయినా నిర్లక్ష్యం చేయకూడదు. తీసుకోకూడనివి ⇒ స్ట్రాంగ్ కాఫీలు n చాక్లెట్లు ⇒ కూల్ డ్రింక్‌లు ⇒ ఆల్కహాల్ ⇒ మసాలాలతో కూడిన ఆహారం ⇒పుల్లటి సిట్రస్ పండ్లు ⇒ టొమాటో ⇒ కొవ్వుతో ఉండే ఆహారాలు ⇒ వేటమాంసం (రెడ్‌మీట్) చేయకూడనివి... ⇒ ఒకేసారి ఎక్కువగా తినేయడం ⇒ రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం. ఎసిడిటీని నివారించే ఆహారాలు... ఎసిడిటీని నివారించడానికి కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మేలు. అలాగే తిన్నా ఎసిడిటీకి తావివ్వని ‘స్టమక్ ఫ్రెండ్లీ’ ఆహారాలూ ఉన్నాయి. ఎసిడిటీతో బాధపడేవారు దాని నివారణ కోసం తీసుకోకూడని, తీసుకోవాల్సిన ఆహారాల జాబితా ఇది. తీసుకోవాల్సినవి ⇒కాస్త వీక్‌గా ఉండే హెర్బల్ టీ (అవి కడుపులో యాసిడ్ పాళ్లను పెంచకూడదు) ⇒ తాజా పండ్లు ⇒ పరిశుభ్రమైన మంచినీళ్లు ⇒ నాన్ ఆల్కహాలిక్ తాజా పండ్ల రసాలు ⇒ ఉడికించిన అన్నం, తాజా బ్రెడ్, ఉడికించినమొక్కజొన్న గింజలు ⇒ పియర్పండ్లు, అరటిపండ్లు, ఆపిల్స్, పుచ్చపండు ⇒ ఉడికించిన ఆలూ, బ్రోకలీ, క్యాబేజీ, క్యారట్, గ్రీన్ పీస్ ⇒ కొవ్వు తక్కువగా ఉండే ఆహారాలు ⇒ కొవ్వు తక్కువగా ఉండే చేపలు, కోడి మాంసం చేయాల్సినవి ⇒ కొద్దికొద్దిమోతాదుల్లో ఎక్కువసార్లు తినడం ⇒ నిద్రకు ఉపక్రమించడానికి 2–3 గంటల ముందే తినడం. డాక్టర్ శివరాజు సీనియర్ జనరల్ ఫిజీషియన్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
మేని మెరుపునకు మేలైన ఆహారాలు
ఫైన్ ఫుడ్ – షైనింగ్ స్కిన్ చర్మానికి మేలు చేసే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మేని సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. దీర్ఘకాలం పాటు యౌవనంగా కనిపించడానికి ఈ ఆహారం దోహదపడుతుంది. ఆ ఆహార వివరాలు... ఆహారం: తాజా చేపలు, అవిశెలు, బాదం... వీటిల్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ. ప్రయోజనం: ఇవి చర్మంలోని తేమను బయటకు వెళ్లనివ్వకుండా కాపాడి చర్మం ఎప్పుడూ మెరుస్తూ ఉండేలా చేస్తాయి. కాస్త గరుగ్గా ఉండే చర్మాన్ని నునుపుగా చేసేందుకు దోహదపడతాయి. ఆహారం : ముడిబియ్యం, పొట్టు తీయని ధాన్యాలు, బార్లీ, పొట్టు తీయని గోధుమలతో చేసిన బ్రెడ్స్... వీటిల్లో పీచు పదార్థాలు ఎక్కువ. ప్రయోజనం: శరీరంలోని విషాలను తొలగించి బయటకు పంపడానికి సహాయపడతాయి. ఇందులోని పీచు పదార్థాలు చర్మం బిగుతుదనాన్ని కాపాడతాయి. ఆహారం: విటమిన్–బి6 ఎక్కువుండే ఆహారమైన క్యాలీఫ్లవర్, పొద్దుతిరుగుడు గింజల నూనె, వాల్నట్, అవకాడో. ప్రయోజనం: హార్మోన్లలోని అసమతౌల్యం వల్ల వచ్చే మొటిమలను విటమిన్–బి6 నివారిస్తుంది. హార్మోన్ల సమతౌల్యత సక్రమంగా ఉండేలా సహాయపడుతుంది. తాజా పండ్లు: అరటి, నారింజ, జామ వంటి అన్ని రకాల తాజా పండ్లలో అన్ని రకాల విటమిన్లతో పాటు యాంటీ–ఆక్సిడెంట్స్ ఉంటాయి. ప్రయోజనం: చర్మాన్ని ముడతలు పడేలా చేసే ఫ్రీ–రాడికల్స్‌ను తొలగించడానికి యాంటీ–ఆక్సిడెంట్లు ఉపయోగపడతాయి. అందుకే చర్మం చాలాకాలం పాటు యౌవనంగా ఉండాలంటే తాజా పండ్లు తినాలి. చర్మం గ్లో తగ్గించే పదార్థాలు ఈ తరహా ఆహారాలు ఎక్కువగా తీసుకుంటే చర్మానికి అంతగా మేలు జరగదు. మితిమీరి తీసుకుంటే కీడు జరిగే అవకాశాలు కూడా ఎక్కువే. అందుకే ఇవి తీసుకునే సమయంలో విచక్షణతో ఉండాలి. ఈ ఆహారం వివరాలివి... ఆహారం : కాఫీ, టీ, శీతలపానియాలు, కోలా డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్. చేటు : వీటిల్లో కెఫిన్ పాళ్లు ఎక్కువ. ఇది చర్మంలో నుంచి తేమను సంగ్రహించి చర్మం పొడిబారి కనిపించేలా చేస్తుంది. నీటిని తొలగిస్తుంది కాబట్టి విషాలు పేరుకుపోయే అవకాశాలు ఎక్కువ. ఆహారం : చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలైన చాక్లెట్లు, సోడా డ్రింక్స్, భోజనం తర్వాత తినే తీపి పదార్థాలు, స్వీట్స్ ఎక్కువగా ఉండే పానియాలు. చేటు : తీపి పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం ఇన్ఫ్లమేషన్ అవకాశాలను పెంచుతుంది. తీపి ఎక్కువగా ఉండే ఆహారంతో మొటిమలు వస్తాయి. ఆహారం: బేకరీ ఫుడ్స్, బర్గర్స్, నిల్వ ఉంచి తీసుకునే క్యాన్డ్ ఫుడ్. చేటు : ఇందులో అనారోగ్యకరమైన కొవ్వు పదార్థాలు ఎక్కువ. అవి చర్మసౌందర్యాన్ని దెబ్బతీస్తాయి. చర్మం త్వరగా ముడతలు పడేందుకు దోహదం చేస్తాయి. ఆహారం : నూనె పదార్థాలు, వేపుళ్లు, చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు ఉపయోగించే మార్జరిన్ నూనె ఉపయోగించిన పదార్థాలు. చేటు : ఇందులో ట్రాన్స్–ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ. ఇవి రక్తంలో కొవ్వు పదార్థాలను పెంచి చర్మంపై మొటిమలు పెరిగేందుకు దోహదం చేస్తాయి. -
చర్మానికి మనసుంది!
స్కిన్ అండ్ స్ట్రెస్ ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ చర్మానికే ఉన్నట్లున్నాయి. వాతావరణం మారితే... చర్మం మారుతుంది. మనసు మారితే కూడా... చర్మం మారుతుంది. ‘‘హలో... మనసు మారితే చర్మం మారడమేంటి? చర్మానికి ఏమైనా ఆలోచన ఉంటుందా?’’ అని అడిగితే... ‘‘అవును’’ అంటున్నారు నిపుణులు. మానసిక ఒత్తిడి వల్ల... చర్మానికీ సమస్యలు వస్తాయని నిర్ధారణ అయ్యింది. నిజమే... చర్మానికీ మనసుంది! ఉద్యోగులంతా ఏకాగ్రతతో తమ పనులు కొనసాగిస్తున్నారు. ఎంత వేగంగా చేసినా కొండంత లక్ష్యంలో కొంతైనా పూర్తవుతుందా అన్నది సందేహమే. ఆఫీసులో ఉన్నది – గంటలు కొట్టే గడియారం. అదృష్టవశాత్తూ ఒంటి గంట కావొస్తోంది. ఇందాక 12 గంటల సమయంలో ఒక్కో గంటా టార్గెట్స్‌ను గుర్తు చేసింది. ఒక గంట కంటే మరో గంట మరింత కర్ణకఠోరంగా మోగుతూ 12 వార్నింగులిచ్చింది. కానీ ఇప్పుడు మోగబోయేది కేవలం ఒక గంటే కదా అనుకున్న స్టాఫ్‌కు ఆ గంటా అంత సాంత్వన ఇవ్వలేదు. పన్నెండు గంటలు కలిపి కొడితే ఎంత శబ్దం వస్తుందో... ఆ ఒక్క గంటతోనే అంతటి వార్నింగ్! అలా మరో మూడు, నాలుగు గంటలు గడిచాయి. ఉద్విగ్నపూర్వకంగా సీట్లలో ఇబ్బందిగా కదిలారు సిబ్బంది. పాక్షికంగానైనా పూర్తయిన లక్ష్యాల మాట ఎలా ఉన్నా... ఒక్కోక్కరికి ఒంటిపై ఒక్కో లాంటి రిజల్ట్! ఒకరిద్దరికి ఫేస్‌పై మొటిమలు పొటమరించాయి. మరొకరి ముఖం రాష్తో ఎర్రబారింది. ఇంకొకరు తలపై జుట్టు పీక్కున్నారు. మరికొందరి నోళ్లలో పొక్కులు కనిపించాయి. అవును. ఇది నిజం. మానసిక ఒత్తిడి తాలుకు ప్రభావాలు ఇలా చర్మంపై రకరకాలుగా ఉంటాయి. ఇక దీర్ఘకాలంలో మరికొందరికి జట్టు రాలిపోతుంది. కొందరిలో గోళ్లూ ప్రభావితమవుతాయి. ఇరువైపులా నలిగిపోయే చర్మం... చర్మం... కోటి కాంతిపుంజాల నుంచి మొదలుకొని కొండంత రేడియేషన్ కిరణాల వరకు ఎన్నెన్నో తాకిడులనూ, కాలుష్యాలనూ ఎదుర్కొనేందుకు... ప్రతి మనిషికీ ప్రకృతి ఏర్పాటు చేసిన తొలి స్వాభావిక కవచం – మన చర్మం. పర్యావరణపరంగా బాహ్యం నుంచే కాకుండా ఒత్తిడీ, మానసిక వేదనల కారణంగా లోపలి నుంచి తాకిడి ఉండటంతో – ఇలా ఇరువైపులనుంచీ నలిగిపోతుంది చర్మం. మానసిక ఒత్తిళ్లు, తీవ్రమైన స్ట్రెస్ కారణంగా చర్మంపై పడే దుష్ప్రభావాలేమిటి, వాటిని అధిగమించడమెలాగో తెలుసుకుందాం. చర్మంపై నేరుగా... మొటిమలు: తీవ్రమైన మానసిక ఒత్తిడి అనే అంశం చర్మంపై మొటిమలను పెంచుతుంది. తీవ్రమైన ఒత్తిడికి గురయ్యే కొందరిలో మొటిమలు ఎక్కువగా వస్తాయని స్పష్టంగా తెలిసింది. ఇటీవలి అధ్యయనాల ప్రకారం ఒత్తిడి పెరిగినప్పుడు సెబేషియస్ గ్లాండ్స్ ప్రభావితమై, అవి తీవ్రంగా పనిచేయడం ప్రారంభిస్తాయి. (హైపర్ యాక్టివ్ అవుతాయి). ఆ గ్రంథుల్లోంచి ‘సెబమ్’ అనే నూనె వంటి పదార్థం స్రవిస్తుంది. అయితే ఈ గ్రంథుల చివర్లలో ఉన్న కణజాలం మృతి చెంది, ఆ నూనె వంటి పదార్థాన్ని బయటకు రాకుండా ఆపినప్పుడు, నూనె గ్రంథి మూసుకుపోయి మొటిమ వస్తుంది. ఒత్తిడితో చర్మానికి జరిగే అనర్థమిది. రోజేషియా: తీవ్రమైన ఒత్తిళ్ల కారణంగా చర్మంలోకి కొంత భాగం ఎర్రబారడాన్ని రోజేషియా అంటారు. రొజేషియా కండిషన్లో చర్మం ఎర్రగా, ఉబ్బెత్తుగా మారి ముక్కుకు ఇరువైపులా బుగ్గలపై మొటిమలు ఏర్పడతాయి. ఇలాంటివి మెడ, ఛాతీపైన కూడా కనిపిస్తాయి. అలాగే కోపోద్రిక్తతలు, తీవ్రమైన అవమానం, తీవ్రమైన అసహనం (ఇరిటేషన్), తీవ్రమైన విచారం, ఉద్విగ్నతకు లోనుకావడం (యాంగై్జటీ), వ్యాకులతకు లోనవ్వడం (డీ–మోటివేషన్), ఎదురుదాడికి దిగేందుకు సిద్ధమయ్యేంతగా ఉద్రిక్తత (అగ్రెసివ్నెస్), తీవ్రమైన ఒత్తిడి, తీవ్రమైన అలసట... ఇలాంటి ఎన్నో భావోద్వేగాలు మేని (ముఖ్యంగా ముఖంపైన ఉండే చర్మం) రంగును ఎర్రగా మారుస్తాయి. ఒత్తిడి తొలగినప్పుడు ఈ రంగు కూడా తొలగుతుంది. సొరియాసిస్ : అప్పటికే సొరియాసిస్ ఉన్నవారు... ఒకవేళ తీవ్రమైన (మానసిక, శారీరక) ఒత్తిళ్లకు లోనైతే వారి సొరియాసిస్ వ్యాధి మరింత తీవ్రమవుతుంది. ఒత్తిడి సొరియాసిస్ రూపంలో వ్యక్తమైనప్పుడు చర్మంపై అవాంఛిత లక్షణాలు కనిపిస్తాయి. అవి... ⇔ దురద, పొడిబారడం, పొలుసుల్లా రాలడం ⇔ సొరియాసిస్ ఉన్నవారికి చర్మంపై ఎర్రటి మచ్చలు ఎక్కడైనా రావచ్చు. ⇔ వెండిలా మెరుస్తున్నట్లుండే మచ్చలు కనిపించచ్చు. ⇔ పురుషుల్లో మర్మావయవాల వద్ద పుండ్లు పడచ్చు. ⇔ కీళ్లనొప్పులు ⇔ మాడుపై తీవ్రమైన చుండ్రు ⇔ ఒక్కోసారి ఈ మచ్చలు వచ్చిన భాగంలో వాపు, నొప్పి వంటివి కనిపించవచ్చు. సెబోరిక్ డర్మటైటిస్ : కొంతమందిలో తీవ్రమైన ఒత్తిడి వల్ల మాడుపై చర్మం పొలుసుల్లా రాలిపోతూ ఉంటుంది. ఇది పొట్టులా పొడిగా కాకుండా, జిడ్డుగా రాలుతుంది. తలపై చర్మం ఎర్రబారి ర్యాష్‌లా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో సొరియాసిస్, లేదా ఎగ్జిమాను పోలి ఉన్నప్పటికీ ఇది వేరు, పగుళ్లలా, పొలుసులు రాలినట్లుగా ఉండే ఈ కండిషన్ మాడుపైనే గాక... శరీరంలోని ఇతర ప్రాంతాల్లోనూ కనిపించవచ్చు. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు దీని తీవ్రత మరింత పెరుగుతుంది. సాధారణంగా ఒత్తిడి తొలగినప్పుడు ఈ సమస్య కూడా తగ్గుతుంది. ఎగ్జిమా : తీవ్రమైన మానసిక ఒత్తిళ్ల వల్ల సాధారణంగా 20 నుంచి 40 ఏళ్ల వారిలో వచ్చే ప్రధాన సమస్య ఎగ్జిమా. ఈ వయసు వారిలో తమ వృత్తికి సంబంధించిన, ఇతరత్రా ఒత్తిళ్లు ఎక్కువ. అప్పటికే ఎగ్జిమాతో బాధపడేవారికి దీని తీవ్రత మరింత ఎక్కువవుతుంది. ఇక ఒకేచోట కూర్చొని పనిచేసే ఐటీ ఉద్యోగుల వంటివారిలో చర్మానికి ‘న్యూరో డర్మటైటిస్’ అనే ఎగ్జిమా రావచ్చు. ఇంకా అటోపిక్ డర్మటైటిస్ అనే ఎగ్జిమా ఉండే పిల్లల్లో ఒత్తిడి వల్ల ఆ జబ్బు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఎగ్జిమా నివారణ, చికిత్స : ⇔ సువాసన లేని, అలర్జీ రహిత (హైపో అలర్జిక్) మాయిశ్చరైజర్స్ రాసుకోవాలి. ⇔ దురద ఉన్నప్పుడు డాక్టర్ సలహా మేరకు వాటిని తగ్గించే పూత మందులు వాడాలి. ⇔ ఈ వయసువారు తప్పక వ్యాయామం చేయాలి. విటిలిగో : తమ రోగనిరోధక శక్తి తమపై ప్రతికూలమైన ప్రభావం చూపడం వల్ల బొల్లి సమస్య వస్తుంది. ఇలా అప్పటికే బొల్లి ఉన్నవారిలో మానసిక ఒత్తిడి మరింత పెరిగితే ఆటోమేటిగ్గా బొల్లి తీవ్రత పెరుగుతుంది. బొల్లి వచ్చిన వారిలో శరీరంపై తెల్లటి మచ్చలు ప్యాచ్‌లలా కనిపిస్తాయి. ఈ మచ్చల్లో ఎలాంటి నొప్పీ ఉండదు. వీటితో ఆరోగ్యానికి హాని కూడా ఉండదు. కానీ చూడటానికి ఇది అంతగా బాగుండదు. కాబట్టి దీన్ని ఎవరూ కోరుకోరు. ఇంగ్లిష్‌లో దీన్ని విటిలిగో అంటారు. సాధారణ ఒత్తిడికి తోడు... దాని వల్ల చర్మంపై వ్యక్తమైన బొల్లి వల్ల రోగులు మరింతగా మానసికంగా కుంగిపోయే అవకాశం ఉంది. జుట్టు మీద... నిరంతర మానసిక ఒత్తిడి వల్ల జుట్టు రాలడం: నిరంతర మానసిక ఒత్తిడి వల్ల చర్మంపై పడే తొలి దుష్ప్రభావం... దానిపైన ఉండే వెంట్రుకలను రాలిపోయేలా చేస్తుంది. ఇదెలా జరుగుతుందో తెలుసుకోవడానికి వెంట్రుక పెరుగుదల దశలు కొంత ఉపకరిస్తాయి. వెంట్రుక పెరుగుదలలో కెటాజెన్, టిలోజెన్, అనాజెన్ అనే దశలుంటాయి. ఒత్తిడి కారణంగా జుట్టు రాలిపోవడం అన్నది సాధారణంగా టిలోజెన్ దశలో జరుగుతుంటుంది. ఇలా జుట్టు రాలడాన్ని ‘టిలోజెన్ ఎఫ్లూవియమ్’ అంటారు. అంటే జుట్టు ఏ దశలో ఉన్నప్పటికీ... అది ఊడిపోయే దశ అయిన టిలోజెన్ వైపునకు ప్రస్థానం జరుగుతుంది. టిలోజెన్ దశ దీర్ఘకాలం కొనసాగుతుందన్నమాట. ఫలితంగా మాడుపైన జుట్టు పలచబడినట్లుగా కనిపిస్తుంది. అందుకే ఒత్తిడితో ఉండే వారి మాడుపైన ఉండే జుట్టు దువ్వుకుంటున్నప్పుడు సాధారణం కంటే ఎక్కువగా రాలిపోతుంటుంది. స్నానం చేసే సమయంలోనూ బాత్రూమ్ ఫ్లోర్లోనూ, తూము దగ్గర కుచ్చులు కుచ్చులుగా రాలిపడుతుంది. అరికట్టడం ఇలా : ఒత్తిడి తొలగిపోయాక కేవలం ఒత్తిడి కారణంగానే రాలిపోయిన జుట్టు మళ్లీ మొలుస్తుంది. ఒత్తిడితో జుట్టు పీక్కోవడం మరీ ఒత్తిడిని తట్టుకోలేకపోయిన కొందరు జుట్టు పీక్కుంటూ ఉండే సంగతి చాలామందిలో మనం గమనించేదే. ఇలా తమ జుట్టు తాము లాక్కునే కండిషన్‌ను ట్రైకో టిల్లోమేనియా అంటారు. బాగా ఒత్తిడితో ఉండేవారు తమ గోళ్లు విపరీతంగా కొరుక్కున్న తరహాలోనే ఇలా జుట్టునూ పీకేసుకుంటుంటారు. దాంతో వారి తల బట్టతలగా మారిపోతుంది. ఇక కొందరైతే తల పూర్తిగా ప్యాచ్‌లు ప్యాచ్‌లుగా బట్టతలగా మారిపోయాక... కనురెప్పల వెంట్రుకలు కూడా లాగుతూ ఉంటారు. ఒత్తిడితో బట్టతల : ఒత్తిడి తీవ్రమైనప్పుడు చాలా మందిలో తలపై జుట్టు రాలిపోతూ ఉంటుంది. పురుష హార్మోన్ల కారణంగా వచ్చే బట్టతల ఉన్నవారిలో ఒత్తిడి పెరిగితే... ఆ బట్టతల మరింతగా పెరుగుతుంది. అలొపేషియా ఏరేటా (పేనుకొరుకుడు) అనే సమస్య కూడా ఒత్తిడి వల్ల మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. ఒత్తిడి తగ్గించుకోడానికి... ⇔ చర్మంపై శ్రద్ధ పెంచుకోవాలి. మేని నిగారింపు కోసం ఆరోగ్యకరమైన మార్గాలను ప్రయత్నించాలి. ⇔ సిగరెట్ తాగడం స్ట్రెస్‌ను తగ్గిస్తుందన్నది వట్టి అపోహ. పొగతాగడం వెంటనే మానేయండి. ∙కొంత మంది పని ఒత్తిడిని తగ్గించుకోడానికి మద్యాన్ని ఆశ్రయిస్తుంటారు. దీర్ఘకాలంలో అది దుష్ప్రభావం చూపుతుంది. మద్యం తాగేవారి చర్మం త్వరగా ముడతలు పడిపోతుంది. మద్యం అలవా టుంటే, వయసుకన్నా ఎక్కువగా కనపడుతుంటారు. ⇔ నడక చర్మానికి సైతం మేలు చేసే వ్యాయామం. ⇔ కంటి నిండా నిద్ర అవసరం. కనీసం రోజూ ఎనిమిదిగంటల పాటు నిద్రపోవాలి. ∙కాఫీలు ఎక్కువగా తాగకండి. కెఫిన్ ఉండే ద్రవపదార్థాలను తీసుకునే అలవాటుంటే, రోజూ రెండు కప్పులకు మించి వద్దు. కోలా డ్రింక్స్‌లోనూ కెఫిన్ ఉంటుంది. కాబట్టి మీ చర్మపు మెరుపును, నిగారింపును తగ్గించే కెఫిన్ పదార్థాలు మానేయండి. ∙రిలాక్సేషన్ టెక్నిక్స్ పాటించండి. ప్రతిరోజూ ప్రాణాయామం, యోగా, ధ్యానం వంటివి చేయండి. ∙భోజనవేళలను కచ్చితంగా పాటించండి. ⇔ ఎక్కువగా నీళ్లు తాగండి. దీనివల్ల డీ–హైడ్రేషన్‌కు లోనుకారు. ఫలితంగా అలసిపోకుండా పనిచేస్తారు. ⇔ ఒత్తిడిని కలిగించే అంశాలకు స్పష్టంగా ‘నో’ చెప్పాలి. ⇔ చురుకుదనం పెరుగుతుందని ఒత్తిడి సమయంలో షుగర్ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకుంటారు. అయితే ఇవి మేని నిగారింపును, మెరుపును తగ్గిస్తాయని గుర్తుంచుకోవాలి. -
యోగాతో ఒత్తిడి దూరం
– ఏపీఎస్పీ అసిస్టెంట్ కమాండెంట్ కర్నూలు: ఒత్తిడి లేని మనస్సు.. రోగంలేని శరీరం యోగాతో సాధ్యమని ఏపీఎస్పీ రెండో పటాలం అసిస్టెంట్ కమాండెంట్ శశికాంత్ అన్నారు. బెంగళూరులో ఈనెల 6,7,8 తేదీల్లో జరిగిన యోగా మహోత్సవం పోటీల్లో భాగంగా స్థానిక యోగా గురువైన మహమ్మద్‌గౌస్ పాల్గొని గోల్డ్‌మెడల్, ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్బాన్ని పురస్కరించుకుని ఏపీఎస్పీ క్యాంపులో ఆయనకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అతిథిగా శశికాంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహమ్మద్‌గౌస్ యోగా ద్వారా కర్నూలుకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకుని యోగా సాధన చేయాలని సూచించారు. అవార్డు గ్రహీత గౌస్ మాట్లాడుతూ తన జీవితాన్ని యోగాకే అంకితం చేస్తున్నట్లు వెల్లడించారు. యోగా టీచర్లంతా కలిసి గురువు గౌస్‌ను సన్మానించారు. -
తల్లిదండ్రుల ఒత్తిడితో సంతానానికి ముప్పు
న్యూయార్క్: గర్భదశలో మహిళ ఎక్కువ ఒత్తిడికి గురైతే దాని దుష్ప్రభావం పుట్టపోయే బిడ్డ మానసిక ఆరోగ్యంపై ఉంటుందట. అలాంటి మహిళలకు జన్మించే వాళ్లు కూడా ఒత్తిడి, చదువులో వెనుకబడటం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని అధ్యయనంలో తేలింది. గర్భంతో ఉన్న ఎలుకలపై ఈ అధ్యయనం చేయడం ద్వారా ఈ విషయాన్ని నిర్ధారించామని అమెరికా నగరం ఓహియో యూనివర్సిటీ పరిశోధకులు పేర్కొన్నారు. ఒత్తిడికి గురైన ఎలుకల మావి, గుండె, పేగులవాహికల్లోని బ్యాక్టీరియా తీవ్ర మార్పులకు గురైనట్టు గుర్తించారు. వాటికి పుట్టిన పిల్లల్లోనూ ఇలాంటి మార్పులే కనిపించాయి. ఒత్తిడిని తగ్గించే బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రాఫిక్ ఫ్యాక్టర్ (బీడీఎన్ఎఫ్) అనే ప్రొటీన్ కూడా క్షీణించినట్టు గుర్తించారు. -
నోట్ల రద్దుతో రియల్టీపై తీవ్ర ఒత్తిడి
‘కేంద్రం చర్య దీర్ఘకాలంలో రియల్టీ పరిశ్రమ వృద్ధికి బాగా దోహదపడుతుంది. పారదర్శకత పెరుగుతుంది కనక నిధుల సమీకరణలో డెవలపర్ల సమస్యలు కొంతమేర తగ్గుతారుు. రెసిడెన్షియల్ ప్రాపర్టీ మార్కెట్లో ధరలు అనువైన స్థారుుకి తగ్గొచ్చు. రెసిడెన్షియల్, ల్యాండ్ మార్కెట్లలో లావాదేవీలు తగ్గుతూ రావడం వల్ల సమీప భవిష్యత్తులో పరిశ్రమపై తీవ్రమైన ఒత్తిడి నెలకొంటుంది. - శిశిర్ బైజాల్, నైట్ ఫ్రాంక్ ఇండియా చీఫ్ సాహసోపేత నిర్ణయం.. నల్ల ధనం కట్టడికి ప్రధాని మోది తీసుకున్న నిర్ణయం అత్యంత సాహసోపేతం. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశ చరిత్రలో ఇలాంటి నిర్ణయం ఎన్నడూ తీసుకోలేదు. ప్రభుత్వం అనుకున్నట్టుగా ప్రధాని నిర్ణయ ప్రభావం స్వల్పకాలంలోనే స్పష్టంగా కనపడుతుంది. చిన్న, మధ్యతరహా వ్యాపారుల లావాదేవీలన్నీ నగదు ద్వారానే జరుగుతారుు. ప్రధాని చెప్పినట్టుగా న్యాయంగా వ్యాపారం చేసుకునే వారికి ఇబ్బందులు కలగకుండా చూడాలి. - రవీంద్ర మోది, ఫ్యాప్సీ ప్రెసిడెంట్ నల్లధనానికి చెక్... కేంద్రం చాలా సాహసోపేత నిర్ణయం తీసుకుంది. దీని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై ఉంటుంది. నల్లధనం, టెరర్ ్రఫైనాన్‌సకు ఇది ఎదురుదెబ్బ. కేంద్ర నిర్ణయాన్ని ఫిక్కీ స్వాగతిస్తోంది. తాజా నిర్ణయంతో ప్రజలు కొంత అసౌకర్యానికి గురికావొచ్చు. సమస్యల త్వరితగతి నియంత్రణకు ఆర్బీఐ, కేంద్రం సంయుక్తంగా పనిచేస్తున్నారుు. - హర్షవర్ధన్ నోతియా, ప్రెసిడెంట్- ఫిక్కీ దీర్ఘకాలానికి మంచి ఫలితాలు.. ప్రభుత్వ చర్య హర్షణీయం. దీని వల్ల ప్రస్తుతం కొన్ని సమస్యలు ఉత్పన్నమైనా.. దీర్ఘకాలంలో మంచి ఫలితాలను పొందొచ్చు. అంతర్జాతీయంగా పారదర్శకత, అవినీతి విభాగాల్లో భారత్ ర్యాంక్ మెరుగుపడుతుంది. - మమతా బినాని, ఐసీఎస్ఐ ప్రెసిడెంట్ అవినీతి కట్టడికిది సరైన నిర్ణయం ఇప్పుడున్న నల్ల ధనం బయటపడడానికి రూ.500, రూ.1,000 నోట్ల రద్దును మోదీ అస్త్రంగా చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో ధరల స్థిరీకరణ జరగడం ఖాయం. రానున్న రోజుల్లో గృహ కొనుగోళ్లలో నగదు లావాదేవీలకు ఆస్కారం ఉండకపోవచ్చు. వ్యక్తుల చేతుల్లోని నగదు పూర్తిగా బ్యాంకు వ్యవస్థలోకి వచ్చి అధికారికమవుతుంది. ఆర్థిక వృద్ధికి బాటలు పరుస్తుంది. - కలిశెట్టి నాయుడు, రిటైల్ రంగ నిపుణులు ఇన్వెస్టర్ల నమ్మకం పెరుగుతుంది.. కేంద్ర నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూరుస్తుంది. బ్లాక్ మనీ, అసాంఘిక కార్యకలాపాలకు నిధుల మళ్లింపు ఇక కట్టడి అవుతుంది. నోట్ల రద్దు వల్ల సామాన్యులకు కొంత ఇబ్బందున్నా.. ఇది స్వల్పకాలమే. ప్రభుత్వం, బ్యాంకులు తగు చర్యలు తీసుకుని ఆర్థిక లావాదేవీలు నిరాటంకంగా సాగేలా చూస్తాయనే నమ్మకం ఉంది. ప్రభుత్వ నిర్ణయం వల్ల ప్రపంచ వ్యాపార పటంలో భారత్ ర్యాంకు మెరుగై ఇన్వెస్టర్ల నమ్మకం అధికమవుతుంది. పెట్టుబడుల రాక పెరుగుతుంది. - రమేష్ దాట్ల, సీఐఐ దక్షిణప్రాంత చైర్మన్ -
ఆ సమయంలో డ్రింక్ చేశారంటే..
న్యూఢిల్లీ: మనసు బాగాలేదనో.. ప్రేమ విఫలమైందనో.. కుటుంబ, వృత్తిపరమైన సమస్యల వల్లో.. చాలా మంది మద్యం తాగుతుంటారు. బాధలను మరచి రిలాక్స్ కావాలనే ఉద్దేశ్యంతో డ్రింక్ అలవాటు చేసుకుంటారు. ఒత్తిడికి గురైన సమయంలో మద్యం తాగడం ప్రమాదకరమని, రానురాను ఇది అలవాటుగా మారి, మద్యానికి బానిసలవుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒత్తిడికి గురైనపుడు మెదడులో మార్పులు చోటుచేసుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో మద్యం సేవించడం హానికరమని ఓ అధ్యయనంలో తేలింది. అమెరికాలోని పెన్సల్వేనియా యూనివర్శిటీ పరిశోధకుడు జాన్ డానీ.. ఒత్తిడితో బాధపడుతున్న వారి అలవాట్లపై అధ్యయనం చేశారు. ఇలాంటి లక్షణాలు కల వారు మద్యం తాగితే.. ఇతరుల మాదిరిగా వారికి అంతగా మత్తు ఎక్కదని, దీంతో ఆల్కాహాల్ మోతాదును క్రమేణా పెంచుతారని జాన్ డానీ చెప్పారు. ఇది నరాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని తెలిపారు. పోస్ట్-ట్రామటిక్ స్ట్రెస్ డిజార్డర్ (పీటీఎస్డీ) ఉన్నవారు ఆల్కాహాల్, డ్రగ్స్ ఎక్కువగా తీసుకుంటారని చెప్పారు. ఈ అలవాటు.. మెదడు, నాడీ వ్యవస్థకు చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. ఒత్తిడికి గురైనట్టు భావిస్తున్నవారు నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు. నిపుణుల సలహాలు, సూచనలు పాటించడం వల్ల మళ్లీ సాధారణ స్థితికి రావచ్చని తెలిపారు. -
ఒత్తిడితో ఒళ్లునొప్పులు...
అదేపనిగా పన్నెండు గంటల కంటే ఎక్కువసేపు (ఒకే స్ట్రెచ్‌లో) పనిచేసేవారు తీవ్రమైన అలసట మొదలుకొని ఇంకా అనేక సమస్యలు వస్తాయి. ఇక కండరాల నొప్పులు, నడుమునొప్పితో పాటు చర్మ సమస్యలు, శ్వాసకోశ ఇబ్బందులు, ఇతర వృత్తిసంబంధ సమస్యలు సైతం రావచ్చు. వాటిని నివారించేందుకు ఈ సూచనలు పాటించడం మేలు... ⇔ పొగతాగే అలవాటు ఉంటే వెంటనే మానేయండి. సిగరెట్ పొగలో కార్బన్‌మోనాక్సైడ్ ఎక్కువగా ఉంటుంది. అది రక్తకణాల్లోని ఆక్సిజన్‌ను తీసుకెళ్లే సామర్థ్యాన్ని తగ్గించి, వెంటనే అలసిపోయేలా చేస్తుంది. ⇔ చాలాసేపు కూర్చొని పనిచేసేవారైతే, శరీరానికి కదలికలు ఉండేలా తప్పనిసరిగా వ్యాయామం చేయండి. అదేపనిగా కూర్చోవడం వల్ల కూడా అలసిపోతారు. ⇔ మీ వృత్తి ఉద్యోగాల్లో ఏదైనా సమస్యలు, మీరు లక్ష్యాలను అధిగమించాల్సిన (టార్గెట్స్ రీచ్ కావాల్సిన) వృత్తిలో ఉంటే తీవ్రమైన అలసటకు లోను కావడం చాలా సాధారణం. ⇔ కంటి నిండా నిద్ర అవసరం. కనీసం రోజూ ఎనిమిదిగంటల పాటు నిద్రపోవాలి. ⇔ కాఫీలు ఎక్కువగా తాగకండి. కెఫిన్ ఉండే ద్రవపదార్థాలను తీసుకునే అలవాటు ఉంటే, రోజూ రెండు కప్పులకు మించి వద్దు. రాత్రి డ్యూటీ ముగించుకొని ఇంటికివెళ్లే సమయంలో కాఫీ అస్సలు తాగవద్దు. ⇔ రిలాక్సేషన్ టెక్నిక్స్ పాటించండి. ప్రతిరోజూ ప్రాణాయామం, యోగా, ధ్యానం వంటివి చేస్తూ ఒత్తిడిని అధిగమించండి. ⇔ భోజనవేళలను కచ్చితంగా పాటించండి. భోజనం ఎగొట్టి పనిచేయకండి. ఇలా చేస్తే రక్తంలో చక్కెరపాళ్లు తగ్గిపోయి త్వరగా, తేలిగ్గా అలసిపోతారు. ⇔ ఎక్కువగా నీళ్లు తాగండి. దీనివల్ల మీరు డీ-హైడ్రేషన్‌కు లోనుకారు. ఫలితంగా అలసిపోకుండా పనిచేయగలుగుతారు. ⇔ ఈ సూచనలు పాటించాక కూడా మీరు ఇంకా ఒళ్లునొప్పులు, అలసటతోనూ, నడుంనొప్పి వంటి వాటితో బాధపడుతుంటే డాక్టర్‌ను సంప్రదించండి. -
సామర్థ్యాలపై పరీక్ష తగదు
ఏలూరు (ఆర్ఆర్ పేట) : శిక్షణ అవసరాల గుర్తింపు పరీక్ష పేరుతో ఉపాధ్యాయులపై ఒత్తిడి తీసుకురావడం సరికాదని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ (పీఆర్టీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీవీ సుబ్బారావు ఓ ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు పలు పరీక్షలు ఉత్తీర్ణులై, వృత్తిపరమైన శిక్షణలు పొందుతూ తమ సామర్థ్యాలను పెంచుకుంటూ అంకిత భావంతో బోధిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన సామర్థ్యాలను విద్యార్థుల్లో పెంపొందిస్తున్న తరుణంలో ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లకు, పీఈటీలకు నిర్వహించనున్న ఈ పరీక్షను తమ సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, ప్రభుత్వం పరీక్ష నిర్వహణను విరమించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు -
ఒత్తిడి తగ్గించకపోగా ఎన్నో సమస్యలు తెచ్చిపెడుతుంది!
నా వయసు 48 ఏళ్లు. రోజూ చాలా ఒత్తిడికి గురవుతుంటాను. చదువుకునే రోజుల్లో సరదాగా సిగరెట్ కాల్చడం అలవాటైంది. ఇప్పుడు రోజూ ఒత్తిడి తగ్గించుకోడానికి సిగరెట్లు కాలుస్తుంటాను. ఇటీవల నాకు తీవ్రమైన ఆయాసం, దగ్గు వస్తోంది. దాంతోపాటు సరిగా నిద్రపట్టడం లేదు. మామూలు సమస్యే కదా తగ్గిపోతుంది అనుకున్నాను. కానీ ఇప్పుడు రోజూ దగ్గు ఎడతెరిపి లేకుండా వస్తోంది. మందులు వాడుతున్నా రోజురోజుకూ పెరుగుతోంది. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. - మోహన్, ఆదిలాబాద్ సిగరెట్ కాల్చడం ఒత్తిడిని తగ్గించకపోగా అనేక రకాల ఆరోగ్య సమస్యలను కలగజేస్తుంది. మొదట్లో సరదాగా ప్రారంభమయ్యే అలవాటు... ఆ తర్వాత వదులుకోలేని వ్యసనంగా మారి మీ ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. మీరు రోజుకు మూడు పాకెట్ల వరకు సిగరెట్లు కాలుస్తుంటారని చెప్పారు. అంత ఎక్కువ సంఖ్యలో సిగరెట్లు కాల్చడం మీ ఆరోగ్యంపై చాలా తీవ్రమైన దుష్ర్పభావం చూపుతుంది. ఊపిరితిత్తులు పాడైపోయి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. పొగతాగడం వల్ల శరీరంలోని రక్తనాళాలు పూడుకుపోయి గుండె సంబంధిత సమస్యలు, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ (సీఓపీడీ), నిద్రలేమి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు... చర్మసంబంధిత వ్యాధులు కూడా రావచ్చు. కాబట్టి మీరు వెంటనే సిగరెట్లు కాల్చడం మానేయండి. వైద్యులను సంప్రదించి వారు సూచించిన పరీక్షలు చేయించుకోండి. పొగతాగడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. సిగరెట్ ఒత్తిడిని తగ్గిస్తుందన్నది కేవలం అపోహ మాత్రమే. మీరు ఎంత త్వరగా పొతతాగడం మానేస్తే... అది మీ ఆరోగ్యానికి అంత మేలు. గుండెపోటు వస్తే గుర్తించడమెలా? నా వయస్సు 58 సంవత్సరాలు. గత 8 సంవత్సరాలుగా షుగర్ వ్యాధితో బాధపడుతున్నాను. ఒకవేళ నిద్రలో ఆయాసం గాని, గుండెపోటు గాని వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. తెలుపగలరు. - భాను ప్రసాద్, కర్నూలు గుండెపోటును తొలిదశలోనే గుర్తిస్తే ప్రథమ చికిత్సతో ప్రాణాలు కాపాడుకోవచ్చు. గుండెపోటు లక్షణాలను గుర్తించడం చాలా ముఖ్యం. ఛాతి నొప్పి లేదా ఛాతి మంటలన్నీ కచ్చితంగా గుండెపోటుకు సంబంధించినవి కాకపోవచ్చు. ఈసీజీ పరీక్ష చేయించుకోవడం వల్ల చాలారకాల గుండె సమస్యలకు మూలం తెలుస్తుంది. కాళ్లవాపు, ఆయాసం, కళ్లు తిరిగి పడిపోవడం, బరువులు ఎత్తుతున్నప్పుడు గుండె దడ రావడం గుండెజబ్బుకు సంబంధించిన లక్షణాలుగా భావించవచ్చు. నిద్రలో మీకు ఆయాసం వస్తే గుండె జబ్బు అని నిర్ధారించుకోవద్దు అలాంటి అపోహలతో ఆందోళన పడొద్దు. చాలామంది స్థూలకాయం, శారీరక శ్రమ లేకపోవడం, ఆస్తమా కారణంగా నాలుగు మెట్లెక్కినా ఆయాసపడతారు. మీరు మధుమేహ వ్యాధిగ్రస్తులు కాబట్టి గుండెపోటు వస్తే ఆయాసం ఉంటుందే తప్ప నొప్పి ఉండదు. ఇది గుండెనొప్పే కానీ, కాస్త భిన్నమైనది. గుండెకు రక్తసరఫరా తగ్గడం, గుండె కవాటాల్లో జబ్బు కారణంగా ఆయాసం వస్తుంది. అందుకే శ్వాస సమస్యలన్నీ గుండెనొప్పికి సంబంధించినవి కావు. వ్యాధి నిర్ధారణకు ఆయాసంతోపాటు ఇతర అంశాలు కూడా పరిశీలించాలి. గుండెకు సంబంధించిన సమస్య కనిపించగానే మనం సత్వరం చేయాల్సినవి... తొలి గంట అమూల్యం కాబట్టి కుటుంబ సభ్యులు అతి త్వరగా రోగిని ఆస్పత్రికి తరలించాలి. వెంటనే ఈసీజీ తీయించాలి. డిస్ప్రిన్ కాని సార్బిట్రేట్ మాత్రలను వెంటనే నీటిలో కలిపి తాగించాలి. కూర్చోబెట్టి గాని, పడుకోబెట్టి గాని ద్రావణాన్ని తాగించాలి. దీనితో వెంటనే నొప్పి తగ్గిపోతుంది. డిస్ప్రిన్ మాత్ర స్ప్రెప్టోకైనేస్ ఇంజక్షన్‌కు సమానంగా పనిచేస్తుంది. అందుకే దీనివల్ల రోగికి ఎక్కువగా ప్రయోజనం ఉంటుంది. ఎల్లప్పుడు డిస్ప్రిన్ గాని సార్బిట్రేట్ మాత్రలను గాని దగ్గర ఉంచుకోవడం శ్రేయస్కరం. -
ఒత్తిడిలో 9కిలోలు తగ్గిన హీరోయిన్!
లాస్ ఏంజెల్స్: జానీ డెప్తొ తెగదెంపులు చేసుకోవడానికి కోర్టుకెక్కిన హాలీవుడ్ నటి అంబర్ హర్డ్.. తీవ్ర మానసిక ఒత్తిడి అనుభవిస్తోంది. ఈ వ్యవహారంతో ఏర్పడిన స్ట్రెస్ మూలంగా ఇటీవల ఆమె 9 కిలోల వరకూ బరువు తగ్గినట్లు వెల్లడించింది. దీంతో అంబర్ తదుపరి చిత్రం 'జస్టీస్ లీగ్'కు సంబంధించిన కాస్ట్యూమ్స్ పనులు ఆగిపోయాయి. వెయిట్ లాస్ మూలంగా అంబర్ మరీ సన్నగా కనిపిస్తుండటం పట్ల చిత్ర నిర్మాతలు కలవరపడుతుండటమే దీనికి కారణమట. 52 ఏళ్ల డెప్ నుంచి తనకు విడాకులు ఇవ్వాలంటూ గత నెల 23న అంబర్ (30) కోర్టులో విడాకుల పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. పైరేట్స్ ఆఫ్ కరేబియన్ స్టార్ తనను మానసికంగా, శారీరకంగా హింసించాడని అంబర్ ఆరోపించింది. -
కళ్లల్లో కళ్లు పెట్టి చూడు...
► సల్సాతో జల్సా ► భార్యాభర్తల మధ్య స్ట్రెస్ తగ్గించేందుకు ఉపయోగం ► సిటీలో పెరుగుతున్న సల్సా డ్యాన్సర్లు డ్యాన్స్ చెయ్యడం అంటే అందరికీ ఇష్టమే. మొహమాటం కొద్దీ కొంత మంది నో చెప్పినా లోలోపల మాత్రం నర్తించాలనే ఆసక్తి ఉంటుంది. సింగిల్‌గా, గ్రూప్ ఇలా చాలా రకాల నృత్యరీతులు ఉన్నా సల్సా ఒక ప్రత్యేకం. ఒక జంట పూర్తిగా మమేకమై చేస్తే సల్సాతో జల్సా చెయవచ్చు. - పెదగంట్యాడ సల్సాలో ఫీల్ ‘కళ్లల్లో కళ్లు పెట్టి చూడు..గుండెల్లో గుండె కలిపి చూడు..సందిట్లో బంధీవై చూడు’ అనే ఫీల్ ఈ డ్యాన్స్‌లో ఉంటుంది. భార్యాభర్తలిద్దరూ ఒకర్ని ఒకరు హగ్ చేసుకుని కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తూ డ్యాన్స్ చేస్తే స్ట్రెస్ పోయి ఒకర్ని ఒకరు ఇప్రెస్ చేసుకునే అవకాశం కలుగుతుంది. లైట్ మ్యూజిక్...రొమాంటిక్ స్టెప్స్ వావ్ అనిపించక తప్పదు. బంధం మరింత బలపడేందుకు పార్టీలకు పబ్బులకు వెళ్లినా నలుగురితో కలిసి ఎంజాయ్ చెయ్యడానికి పనికొస్తుంది తప్ప ఆలుమగల మధ్య దూరం తరిగిపోదు. అందుకే 1970లో న్యూయార్క్ సిటీలో కొత్త జంటల మధ్య సల్సా నృత్యాన్ని ప్రవేశపెట్టారు. క్యూబా, కరేబియన్ దేశాల సంప్రదాయ నృత్యరీతులను అనుసరించి ప్రత్యేక పద్ధతిలో డాన్స్‌ను డిజైన్ చేశారు. ఉపయోగాలు.... సల్సా వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. మానసిక ఉల్లాసం రెట్టింపు అవుతుంది. జంటల మధ్య అనుబంధాలు పెరుగుతుంది. శరీర ధారుడ్యం బలపడుతుంది. బరువు తగ్గుతారు. ఉత్సాహం ఉరకలు వేస్తుంది. ఎనర్జీ లాస్ అయి కేలరీస్ వేగంగా కరుగుతాయి. డ్యాన్స్‌లో స్టైల్స్ ఇవీ... సాల్సాలో కొన్ని స్టైల్స్ ఉన్నాయి. క్యూబన్ క్యాసినో స్టైల్, మియామి స్టైల్, ర్యూడా స్టైల్, లాస ఎంజల్స్ స్టైల్, న్యూయార్క్ స్టైల్ వంటివి ఉన్నాయి. సల్సా డ్యాన్స్ అంటే... నేటి హైఫై లైఫ్‌లో భార్యాభర్తలిద్దరూ విద్యావంతులే. ఇద్దరూ వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తుంటారు. ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో స్ట్రెస్‌కు గురవుతున్నారు. భార్యాభర్తలిద్దరూ ఏకాంతంగా గడిపే అవకాశమే ఉండటం లేదు. మనసువిప్పి మాట్లాడుకోవడమే అరుదుగా మారిపోయింది. ఈ నేపథ్యంలో సల్సా డ్యాన్స్ భార్యాభర్తలిద్దరి మధ్య అన్యోన్యాన్ని పెంచుతోంది. సాల్సా డ్యాన్స్ పరిచయం చేసింది ఆఫ్రికన్స్ అయినా ఇది అందరికీ మహా నచ్చేసింది. దీంతో అన్ని చోట్లా నాట్యమాడేస్తోంది. -
భర్త లేకుంటేనే నయం!
లండన్: స్త్రీకి ఐదోతనమే భాగ్యం అనే మాట మన సంప్రదాయంలో ఉంది. కానీ, భర్త బతికున్నప్పటి కంటే మరణించిన తర్వాతే భార్యలు ఒత్తిడి లేకుండా జీవిస్తారని తాజాగా చేసిన పరిశోధనా ఫలితాలు అంటున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ పడోవాకు చెందిన శాస్త్రజ్ఞులు చేసిన పరిశోధనల్లో దంపతుల్లో.. భార్య మరణిస్తే భర్తను తీవ్ర మనస్తాపానికి గురి చేస్తుందనీ, అదే భర్త మరణం భార్యపై ఒత్తిడిని తగ్గిస్తుందని తేలింది. భార్య ఇంట్లో పనులను సరిదిద్దుకుంటూ.. బాగోగులు చూస్తుండటం వల్ల భార్య మరణం భర్తకు శాపంగా తోస్తుందనీ, అదే విధంగా భర్త మరణానంతరం భార్యపై పనిభారం ఒక్కసారిగా తగ్గిపోవడం వల్ల ఆమె ఒత్తిడికి లోనుకాదని పరిశోధకులు వివరించారు. దాదాపు 733 మంది ఇటలీకు చెందిన పురుషులు, 1154 మంది మహిళలపై నాలుగున్నరేళ్ల పాటు చేసిన పరిశోధనల్లో భర్త ఉన్న మహిళల కన్నా భర్త మరణించిన వారికి 23 శాతం ఒత్తిడి తగ్గినట్లు వెల్లడైంది. -
ఆ హీరో ఆస్కార్ ఒత్తిడిని ఇలా జయించాడు!
లాస్ఏంజిల్స్: ఓవైపు ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం దగ్గర పడుతోంది. మరోవైపు ఆరుసార్లు నామినేట్ అయిన తమ అభిమాన హీరో ఈ సారైనా ఆస్కార్ గెలుస్తాడా అని ప్రపంచవ్యాప్తంగా అభిమానుల కళ్లన్నీ ఆయనపైనే. ఈ నేపథ్యంలో మరి ఆ హీరోపై ఎంత ఒత్తిడి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎట్టకేలకు రెవనాంట్ చిత్రంలో నటనకు గాను ఉత్తమ నటుడి అవార్డ్ అందుకున్న లియోనార్డో డికాప్రియో ఆస్కార్ ఒత్తిడిని ఎలా అధిగమించాడు అనే అంశంపై ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. 88వ ఆస్కార్ అవార్డుల సందర్భంగా తాను ఎలాంటి ఒత్తిడిని ఎదుర్కోకుండా ఉండటానికి లియోనార్డో డికాప్రియో పెద్ద కసరత్తే చేశాడట. అదే తేనెటీగలతో సావాసం. అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం దగ్గర పడుతున్న కొద్దీ.. పెరుగుతున్న ఒత్తిడిని దూరం చేయటానికి డికాప్రియోకు ఆయన తల్లి స్నేహితుడు డేవిడ్ సహాయం చేశాడు. స్వతహాగా తేనెటీగల పెంపకంలో మంచి అనుభవం ఉన్నవాడు అయిన డేవిడ్.. డికాప్రియోను ఆ పనిలో మునిగిపోయేలా చేశాడట. తేనెటీగలను పెంచుతూ మన హీరో మిగతా విషయాల గురించి ఆలోచించలేదట. దీని ద్వారా అవార్డుల కార్యక్రమానికి ముందుగా డికాప్రియో ఎలాంటి ఒత్తిడి ఎదుర్కోకుండా ఉన్నాడని మీడియా సంస్థ మిర్రర్ వెల్లడించింది. -
ఆ వీడియోలతో జాగ్రత్త!
ఢిల్లీ: మీరు ఓ ఎత్తైన కొండ అంచున నిల్చున్నప్పుడు మీకు ఎంత మానసిక ఒత్తిడి కలుగుతుందో.. అంతే ఒత్తిడి మీ స్మార్ట్ ఫోన్లో ఆలస్యంగా స్ట్రీమ్ అవుతున్న వీడియో చూస్తున్నప్పుడు కలుగుతోందని తాజా పరిశోధనలో తేలింది. స్ట్రీమింగ్ వీడియో ఆరు సెకన్లు ఆలస్యంగా ప్లే అయితే.. మ్యాథ్స్ ఎగ్జామ్ రాయడానికి ముందు ఎదుర్కునేంత ఆందోళన, అర్థరాత్రి ఒంటరిగా హారర్ సినిమా చూస్తున్నప్పుడు కలిగే ఒత్తడి కలుగుతోందని స్వీడన్ కు చెందిన కమ్యూనికేషన్ టెక్నాలజీ సంస్థ ఎరిక్సన్ వెల్లడించింది. వీడియో ఒకసారి మొదలైన తరువాత మధ్యలో ఆగిపోతే ఈ ఒత్తిడి ఇంకా పెరుగుతున్నట్లు పరిశోధనలో తేలింది. స్మార్ట్ ఫోన్లలో లైవ్ స్ట్రీమింగ్ వీడియోలు చూసే సమయంలో అవి లోడ్ కావడానికి ఎక్కువ సమయం తీసుకోకుండా జాగ్రత్త పడాలని ఎరిక్సన్ తన నివేదికలో తెలిపింది. వెబ్ పేజీలు, వీడియోలు లోడ్ కావడంలో జరిగే ఆలస్యంతో వినియోగదారుల హార్ట్ రేట్ 38 శాతం పెరుగుతున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. నెట్ వర్క్ ఆపరేటర్లు సైతం ఈ ఆలస్యం మూలంగా భారీగా వినియోగదారులను కోల్పోవాల్సివస్తుందని ఎరిక్ సన్ వెల్లడించింది. -
డెస్క్‌ను డైనింగ్ టేబుల్‌గా మార్చకండి
డ్యూటిప్స్ ఉద్యోగ జీవితంలో సమయపాలన ప్రాధాన్యాన్ని గుర్తించండి. పై అధికారులు అప్పగించిన విధులను చిత్తశుద్ధితో పూర్తి చేయండి. పనికి సంబంధించి ఎలాంటి సందేహాలు తలెత్తినా, సీనియర్లను అడగటానికి మొహమాట పడకండి. వీలైనంతగా గడువుకు ముందే పని ముగించడానికి ప్రయత్నించండి. చేస్తున్న పనిలో మెరుగుదల కోసం, మెలకువలను ఆకళింపు చేసుకోవడం అధ్యయనాన్ని కొనసాగించండి. పని చేస్తున్న చోట ఫోన్లో బిగ్గరగా మాట్లాడటం వంటి చర్యల ద్వారా అనవసరంగా ఇతరుల దృష్టిని ఆకర్షించే ప్రయత్నాలు చేయకండి. పని ఒత్తిడిలో ఉండి బాగా ఆకలేసినప్పుడు పండో, కాయో... ఏ బిస్కట్లో తింటే పర్లేదు గానీ, అలాగని డెస్క్‌ను డైనింగ్ టేబుల్‌గా మార్చేయకండి. -
అన్ని ఒత్తిడిలకు అదొక్కటే కారణం..!
న్యూయార్క్: చాలా సమస్యలకు నిద్ర ఒక్కటే కారణమని అధ్యయనకారులు తెలిపారు. యువకుల్లో నిద్రలేమి, సుధీర్ఘ నిద్రవంటి సమస్యలు వారిపై అమితమైన ఒత్తిడిని కలిగిస్తాయని ఓ అధ్యయనం వెల్లడించింది. ఈ ఒత్తిడి ప్రవర్తనపైనే కాకుండా ఆరోగ్యంపైనా, రోజువారిగా నిర్వహించాల్సిన కార్యకలాపాలపైన కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని అధ్యయనం తేల్చింది. నిద్రలేమి, సుధీర్ఘ నిద్ర అనే రెండు సమస్యలపై అమెరికాలోని బర్మింగామ్ లోగల యూనివర్సిటీ ఆఫ్ అలబామా కు చెందిన మనోవిజ్ఞానశాస్త్ర ప్రొఫెసర్ సిల్వీ మ్రగ్ ఆయన సహచరులు ప్రత్యేక పరిశోధనలు నిర్వహించారు. ఇందుకోసం మొత్తం 84 మంది యువకులను పరిశీలించారు. వీరిలో ఒత్తిడి స్థాయిలను పరిశీలించి ఆ ఒత్తిడిలో తారతమ్యాలు ఉండటానికి ప్రధాన కారణం నిద్రేనని తేల్చారు. సాధరణంగా నిద్రలేమి వారిలో కార్టిసోల్(అడ్రినలిన్ లో విడుదలయ్యే హార్మోన్) స్థాయిలు ఎంతైతే ఎక్కువగా ఉన్నాయో.. అంతే స్థాయి సుధీర్ఘంగా నిద్రపోయేవారిలో కూడా ఉన్నాయని, ఈ ఫలితాలు తమకు అమిత ఆశ్చర్యాన్ని కలిగించాయని చెప్పారు. ఒత్తిడి కారణంగానే ప్రతి చిన్న విషయం సమస్యగా కనిపిస్తుందని, ఆ ఒత్తిడి లేకుండా చూసుకుంటే పెద్ద సమస్యనైనా ఇట్టే పరిష్కరించుకోవచ్చని తెలిపారు. -
ఒత్తిడిలో ఉన్నప్పుడు నేను అదే చేస్తా!
సినీతారలకు సాధారణంగానే ఒత్తిడి ఎక్కువ. కొంతమంది తాము పడుతున్న బాధ బయటకు చెబుతారు. మరికొంత మంది చెప్పరు. ఇటీవల దీపికా పదుకొనే తన స్ట్రెస్ లెవల్స్ గురించి మీడియా ముందు చెప్పి అందరికీ షాకిచ్చారు. చాలా మంది ఈ స్ట్రెస్, ఫ్రస్ట్రేషన్లను తగ్గించుకోవడానికి తమదైన శైలిలో సొంత దారులు వెతుక్కుంటారు. ఇక ఆలియా భట్ అయితే తాను ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు షారుక్‌ఖాన్ పాటలు వింటా నంటున్నారు. అవి గనక వినకపోతే చచ్చిపోతానని చెబుతున్నారు. ‘‘ఈ మధ్య ఆలియాభట్ నటించిన ‘షాన్‌దార్’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఆలియా ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకు న్నారు. కానీ ఫలితం వేరేలా రావడంతో నిరాశలో పడిపోయారు. కొన్నాళ్లు మీడియా కంట పడకుండా జాగ్రత్త పడ్డారు. మళ్లీ ఈ మధ్యే కాస్త బయటకు వచ్చిన ఆలియా ఆ ఫలితం గురించి మాట్లాడారు. ‘‘నేను ‘షాన్‌దార్’ సినిమా ఎంచుకున్నందుకు బాధపడడం లేదు. ఒక్కోసారి అనుకున్నవి జరగవు. మొదట్లో కాస్త ఒత్తిడికి గుర య్యా కూడా. ఇలాంటి టైమ్‌లోనే నాకిష్టమైన షారుక్ పాటలు వింటూ రిలాక్స్ అవుతా. చిన్నతనం నుంచి షారుక్ వీరాభిమానిని. ఆ పాటలు వింటే చాలు. ఇక సైకియాట్రిస్ట్ అవసరం లేదు’’ అని ఆలియా చెప్పుకొచ్చారు. -
వాసక్టమీ రివర్స్ చేయవచ్చా...
హోమియో కౌన్సెలింగ్ మా తాతగారికి 75 సంవత్సరాలు. ఆయన చాలా కాలంగా పైల్స్‌తో బాధపడుతున్నారు. డాక్టర్‌కు చూపిస్తే ఆపరేషన్ తప్పదన్నారు. దీనికి హోమియోలో ఏమైనా మంచి మందులుంటే చెప్పగలరు. - పి. అరవింద్, హైదరాబాద్ మలద్వారంలో ఉండే రక్తనాళాలు ఉబ్బిపోయి, వాపునకు గురై, తీవ్రమైన నొప్పి, రక్తస్రావం కలగడాన్ని పైల్స్ అంటారు. కారణాలు: దీర్ఘకాలికంగా మలబద్ధకం, పొత్తికడుపు ఎక్కువకాలం ఒత్తిడికి గురవడం, దీర్ఘకాలంగా దగ్గు, గర్భధారణ సమయంలో, కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడేవారిలో పైల్స్ వచ్చే అవకాశం అధికం. మలద్వారం దగ్గర ఉండే రక్తనాళాలపై ఒత్తిడి ఏర్పడి, వాటిలోని కవాటాలు దెబ్బతినడం, రక్తనాళాలు సాగదీతకు గురై సమయంలో మలద్వారం దగ్గర వత్తిడి ఏర్పడి, దాంతో తీవ్రమైన నొప్పి, రక్తనాళాలు పగిలి రక్తస్రావం జరుగుతుంది. పైల్స్‌లో రకాలు: పైల్స్‌ని ముఖ్యంగా ఇంటర్నల్, ఎక్స్టర్నల్ అని రెండురకాలుగా విభజించవచ్చు. ఇంటర్నల్ పైల్స్: మలవిసర్జన సమయంలో రక్తనాళాలు వాపునకు గురవడం వల్ల ఇవి ఏర్పడతాయి. ఇందులో అంత ఎక్కువ నొప్పి ఉండదు. ఎక్స్టర్నల్ పైల్స్: మలద్వారం చివరి ప్రాంతంలో ఉన్న రక్తనాళాలు వాపునకు గురై, వాటిపైన ఉన్న మ్యూకస్ పొర బయటకు పొడుచుకుని రావడాన్ని ఎక్స్టర్నల్ పైల్స్ అంటారు. ఇందులో తీవ్రమైన నొప్పి, రక్తస్రావం ఉంటాయి. ఇవిగాక ఫిషర్స్, ఫిస్టులా అనేవి కూడా వస్తుంటాయి. మలద్వారం దగ్గర ఏర్పడే నిట్టనిలువు చీలికను ఫిషర్ అంటారు. ఇది చాలా నొప్పి, మంటలో కూడి ఉంటుంది. రెండు ఎపితీకల్ కణజాలాల మధ్య ఉండే ఒక గొట్టంలాంటి నిర్మాణాన్ని ఫిస్టులా అంటారు. ఇది ఎక్కడైనా ఏర్పడవచ్చు. కాని సర్వసాధారణంగా ఏర్పడేది యానల్ ఫిస్టులానే. ఇది ఎక్కువగా ఊబకాయం ఉన్నవారిలో కనిపిస్తుంది. ఫిస్టులా ఒక్కోసారి మలద్వారంలోకి తెరుచుకోవడం వల్ల ఇందులో నుండి మలం వస్తుంది. దీనినే ఫిస్టులా ఇన్ ఆనో అంటారు. హోమియో చికిత్స: హోమియోకేర్ ఇంటర్నేషనల్‌లోని జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ వైద్యం ద్వారా పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా, మలబద్ధకం వంటి వాటికి మూలకారణాలను గుర్తించి వైద్యం చేయడం ద్వారా ఈ సమస్యలు మళ్లీ తిరగపెట్టకుండా, ఎలాంటి శస్త్రచికిత్స అవసరం లేకుండా పూర్తిగా నయం చేయవచ్చు. మీరు మీ తాతగారిని మంచి హోమియో వైద్యునికి చూపించండి. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ ఫౌండర్ చైర్మన్ హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ నెఫ్రాలజీ కౌన్సెలింగ్ మా అన్నయ్య వయసు 46 ఏళ్లు. ఆయనకు రెండు కిడ్నీలూ చెడిపోయాయి. రెగ్యులర్‌గా డయాలసిస్ చేయించుకుంటున్నారు. అయితే కిడ్నీ మార్పిడి చేయడానికి నా బ్లడ్‌గ్రూపు సరిపోతుందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం నా వయసు 41 ఏళ్లు. నేను మా అన్నయ్యకు కిడ్నీ ఇవ్వడం వల్ల నాకు భవిష్యత్తులో ఏమైనా సమస్యలు వస్తాయా? నేను కిడ్నీ ఇచ్చిన తర్వాత భవిష్యత్తులో నాకు ఉన్న ఒక్క కిడ్నీ చెడిపోతే నేనుకూడా వేరేవారి కిడ్నీని మార్పిడి చేసుకోవాల్సి వస్తుందా? ఒక కిడ్నీ ఉన్నవారికి ఏమైనా సమస్యలు వస్తాయా? కిడ్నీ డొనేట్ చేయడం వల్ల ఎదురయ్యే సమస్యల గురించి నాకు వివరంగా తెలుపగలరు. మీరు చెప్పే సమాధానంపైనే కిడ్నీ ఇవ్వాలా, వద్దా అని నిర్ణయం తీసుకుంటాను. - బాల్‌రాజ్, ఖమ్మం ప్రతి మనిషిలోనూ రెండు కిడ్నీలు ఉంటాయి. ఇవి మన రక్తంలోని మలినాలను శుద్ధి చేస్తూ జీవక్రియలు సక్రమంగా జరిగేలా చూస్తుంటాయి. ఈ ప్రక్రియ నిర్వహించడానికి ఒక కిడ్నీ కూడా సరిపోతుంది. కిడ్నీ దానం చేసేవారికి అధిక రక్తపోటు, డయాబెటిస్, గుండెజబ్బులు, మెదడు జబ్బులు, కాలేయ వ్యాధులైన హెపటైటిస్-బి, సి ఉండకూడదు. ఒక కిడ్నీ దానం చేయడం వల్ల దాతకు ఎలాంటి నష్టం రాదని నిర్ధారణ చేసిన తర్వాతనే వైద్యులు కిడ్నీ తీసుకొని, రోగికి కిడ్నీ మార్పిడి చేస్తారు. దాత ఆరోగ్య పరిస్థితిని బట్టి వారు కిడ్నీ ఇచ్చేందుకు అర్హులో, కాదో నిర్ణయిస్తారు. మీరు కిడ్నీ ఇవ్వవచ్చని నిపుణులు నిర్ధారణ చేస్తే, మీరు నిరభ్యంతరంగా ఇవ్వవచ్చు. దీనివల్ల మీకు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలూ ఉత్పన్నం కావు. మీ అన్నయ్యకు రెండు కిడ్నీలూ చెడిపోయాయనీ, డయాలసిస్‌పైనే ఆధారపడుతున్నారనీ తెలిపారు. కాబట్టి మీరు కిడ్నీ ఇవ్వడం ద్వారా మీ అన్నయ్యకు కొత్త జీవితాన్ని ఇచ్చినవారవుతారు. మీ అన్నయ్యకు ఇక జీవితంలో మళ్లీ డయాలసిస్ అవసరం ఉండదు. మందుల వాడకం కూడా చాలావరకు తగ్గిపోతుంది. అందరిలాగే మీ అన్నయ్య కూడా సాధారణ జీవితం గడపగలుగుతారు. మీరు నిర్భయంగా ఉండండి. డాక్టర్ శశికిరణ్ సీనియర్ నెఫ్రాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, మలక్‌పేట, హైదరాబాద్ ఫెర్టిలిటీ కౌన్సెలింగ్ నా వయసు 50 ఏళ్లు. ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాను. ఒక బాబు పుట్టిన తర్వాత పదేళ్ల కిందట వాసెక్టమీ ఆపరేషన్ చేయించుకున్నాను. ఇప్పుడు ఆర్థికంగా కాస్త స్థిరపడ్డాను. ఇంకో బిడ్డ ఉంటే బాగుండు అని నా భార్య అంటోంది. నేను మళ్లీ బిడ్డలు కనడానికి వీలుగా వాసెక్టమీ రివర్స్ చేసుకునే అవకాశం ఉందా? - సూర్యనారాయణ, కొత్తవలస వాసెక్టమీ అయిన వారు మీలా మళ్లీ సంతానాన్ని కోరుకుంటే, వారికోసం వాసెక్టమీ రివర్స్ చేసే ప్రక్రియ అందుబాటులో ఉంది. కానీ... మీ భార్యకు గర్భం వచ్చే అవకాశాలు కేవలం వాసెక్టమీ రివర్సల్ మీదనే గాక... చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఆమె ప్రస్తుత వయసు లాంటివి. కాబట్టి మీరు వాసెక్టమీ రివర్సల్‌కు ముందుగా ఆమెలోని చాలా అంశాలను అంచనా వేయాల్సి ఉంటుంది. అయితే వాసెక్టమీ రివర్సల్‌కు బదులు మరికొన్ని ప్రత్యామ్నాయాలూ ఉన్నాయి. అందులో ఒకటి వృషణాల నుంచి గానీ... ఎపీడెడైమిస్ అనే భాగం నుంచి గానీ... మీ శుక్రకణాలను సేకరించి, ఆమె అండంతో ఫలదీకరణం చేయించే ఐసీఎస్ఐ (ఇంట్రా సైటోప్లాజమిక్ స్పెర్మ్ ఇంజెక్షన్) అనే పక్రియ సంతాన సాఫల్య ప్రక్రియల్లో ఒకటి. అయితే ఇలాంటి ప్రక్రియలు అనుసరించడం అన్నది మీ ఇద్దరి ఎంపిక మీద, ఇప్పుడు ఎంత మంది పిల్లల కోసం ప్లాన్ చేసుకుంటున్నారనే విషయం మీద, ఆర్థికంగా ఇందుకు అయ్యే ఖర్చును భరించగలిగే అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఇక మీరు పేర్కొంటున్న వాసెక్టమీ రివర్సల్ అన్న అంశానికి వస్తే... అది మైక్రోసర్జికల్ టెక్నిక్స్ ద్వారా అత్యంత నాజూగ్గా చేసినప్పుడే సత్ఫలితాలు ఇస్తుంది. మైక్రోసర్జరీ సమయంలో మీ వీర్యాన్ని సేకరించి, దాన్ని తక్కువ ఉష్ణోగ్రత వద్ద గడ్డకట్టేలా చేసి (ఫ్రోజెన్ కండిషన్లో) భద్రపరుస్తారు. ఒకవేళ వాసెక్టమీ ప్రక్రియ విఫలం అయితే ఇలా భద్రపరచిన వీర్యాన్ని ఐసీఎస్ఐ ప్రక్రియకు ఉపయోగిస్తారు. ఇక వాసెక్టమీ తర్వాత రివర్సల్ ఎంతగా ఆలస్యం అవుతుంటే దాని సత్ఫలితం ఇచ్చే అవకాశాలు అంతగా తగ్గుతుంటాయి. వాసెక్టమీ రివర్సల్ తర్వాత కొన్ని నెలల పాటు వీర్యంలోకి శుక్రకణాలు వస్తున్నాయా లేదా అనేది చూడాలి. శుక్రకణాలను వీర్యరాశిలోకి తెచ్చే నాళాలు మళ్లీ మూసుకుపోవచ్చు. కాబట్టి అది జరుగుతుందేమో అని పరీక్షిస్తూ ఉండాలి. చాలామందిలో ఈ రివర్సల్ సర్జరీ జరిగిన 24 నెలల్లో భాగస్వామికి నెలతప్పుతుంది. ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని స్పెషలిస్ట్‌ను సంప్రదించండి. డాక్టర్ కె. సరోజ సీనియర్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, నోవా ఐవీఐ ఫెర్టిలిటీ సెంటర్, రోడ్ నెం. 1, బంజారాహిల్స్, హైదరాబాద్ -
డయాలసిస్ చేయిస్తుంటే... ఒంటిపై దురద ఎందుకు?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 48 ఏళ్లు. బాగా ముక్కితే గానీ మలవిసర్జన కావడం లేదు. నాకు మలద్వారం వద్ద ఇబ్బందిగా అనిపిస్తోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. - అమీర్‌బాషా, గుంటూరు మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల మీరు పేర్కొంటున్న సమస్యలు వస్తున్నాయి. మీ ప్రశ్నలో మీ సమస్య పైల్స్, ఫిషర్ లేదా ఫిస్టులానా అన్న స్పష్టత లేదు. అయితే ఈ మూడు సమస్యల్లోనూ మలబద్దకంతో మలవిసర్జన సాఫీగా జరగదు. పైల్స్‌ను సాధారణ వాడుకలో మొలలు అని కూడా అంటారు. మలద్వారం వద్ద ఉండే సిరలు ఉబ్బడం వల్ల ఈ సమస్య వస్తుంది. పీచుపదార్థాలు తక్కువగా తీసుకునేవారిలో మలం గట్టిపడి మలబద్దకానికి దారితీస్తుంది. తద్వారా కలిగే ఒత్తిడి వల్ల మలద్వారం చుట్టూ ఉండే సిరలు ఉబ్బుతాయి. పైల్స్ ఉన్నవారిలో నొప్పి, కొందరిలో మలవిసర్జన సమయంలో రక్తం పడటం, మలద్వారం వద్ద ఏదో అడ్డంకి ఉన్నట్లు అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక యానల్ ఫిషర్ సమస్య ఉన్నవారిలో మలద్వారం చుట్టూ ఉండే చర్మం చిట్లిపోవడం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం మలబద్ధకం వల్ల మలం బయటకు రావడానికి అధికంగా ముక్కడం. యానల్ ఫిషర్లో ప్రధానమైన లక్షణం మలద్వారం వద్ద తీవ్రమైన నొప్పి. మలం బయటకు వచ్చేటప్పుడు నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. ఇక యానల్ ఫిస్టులా అంటే... మలద్వార భాగానికీ, చర్మానికీ మధ్యలో ఒక అసాధారణమైన ద్వారం ఏర్పడటం. విసర్జన సమయంలో కలిగే తీవ్రమైన ఒత్తిడికి మలద్వారంలో ఉండే కణజాలం దెబ్బతింటుంది. ఇలా దెబ్బతిన్న కణజాలంలోకి బ్యాక్టీరియా ప్రవేశించి తొలిచేస్తుంటుంది. దీనివల్ల అక్కడ ఒక అసాధారణమైన ద్వారం ఏర్పడుతుంది. మలద్వారం వద్దగల చర్మంపై ఇది ఒక చీముతో కూడిన గడ్డలాగా కనపడుతుంది. దీన్ని చీముగడ్డగా భావించి చికిత్స చేయడం వల్ల పైన చర్మం మీద ఉన్న గడ్డ నయమవుతుంది. కానీ లోపల ఉండే ద్వారం అలాగే మిగిలి ఉంటుంది. అందుకే ఈ సమస్య తరచూ వచ్చి ఇబ్బంది పెడుతుంది. యానల్ ఫిస్టులాలో కనపడే ప్రధాన లక్షణం మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి, దీనితో పాటు అక్కడ ఏర్పడ్డ రంధ్రం నుంచి చీముతో కూడిన రక్తం బయటకు వస్తుంటుంది. దీనివల్ల అక్కడ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. పైల్స్, ఫిషర్, ఫిస్టులా... ఈ మూడు సమస్యలకూ హోమియోపతిలో అద్భుతమైన మందులు అందుబాటులో ఉన్నాయి. బ్రైయోనియా, నక్స్‌వామికా, అల్యూమినా, కొలిన్సోనియా వంటి మందులను రోగి మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని ఇస్తారు. వీటిని నిర్ణీత కాలం పాటు క్రమం తప్పకుండా వాడటం వల్ల సురక్షితమైన, శాశ్వతమైన పరిష్కారం లభిస్తుంది. నెఫ్రాలజీ కౌన్సెలింగ్ నా వయసు 42 ఏళ్లు. ఒక ఏడాదిగా క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకుంటున్నాను. నాకు ఈమధ్య విపరీతంగా చర్మం దురద పెడుతోంది. ఎందుకిలా జరుగుతోంది? దురద రాకుండా ఉండటానికి ఏం చేయాలి? - మనోహర్, వరంగల్ డయాలసిస్ చేయించుకునే పేషెంట్స్‌లో చర్మం పొడిగా అవుతుంది. అంతేకాకుండా వాళ్ల రక్తంలో ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండటంవల్ల కూడా దురద ఎక్కువగా వస్తుంటుంది. చర్మం పొడిగా ఉన్నవాళ్లు స్నానం తర్వాత చర్మంపై వాజిలేన్ లేదా మాయిష్చరైజర్ రాసుకోవాలి. రక్తంలో ఫాస్పరస్ తగ్గించే మందులు తీసుకోవడంతో పాటు ఆహారంలో పాల ఉత్పాదనలు, మాంసాహారం తీసుకోవడం తగ్గించాలి. రక్తహీనత ఉన్నవాళ్లు రక్తం పెరగడానికి మందులు వాడాలి. మా బాబు వయసు ఎనిమిదేళ్లు. ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు ముఖం, కాళ్లు వాపు వచ్చాయి. యూరిన్‌లో ప్రోటీన్స్ పోయాయనీ, నెఫ్రోటిక్ సిండ్రోమ్ అని చెప్పి చికిత్స చేశారు. నెలరోజులు మందులు వాడిన తర్వాత యూరిన్‌లో ప్రోటీన్ పోవడం తగ్గింది. మందులు ఆపేశాము. మళ్లీ 15 రోజుల తర్వాత యూరిన్‌లో మళ్లీ ప్రోటీన్లు పోవడం ప్రారంభమైంది. మళ్లీ మందులు వాడితే ప్రోటీన్లు పోవడం తగ్గింది. ఇలా మందులు వాడినప్పుడల్లా తగ్గి, ఆపేయగానీ యూరిన్‌లో మళ్లీ ప్రోటీన్లు పోతున్నాయి. అయితే ఎక్కువకాలం మందులు వాడితే కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉందా అని ఆందోళనగా ఉంది. వాటివల్ల ఏవైనా సైడ్ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలూ ఉన్నాయా? వివరంగా చెప్పండి. - అక్బర్‌ఖాన్, కోదాడ నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఉన్నప్పుడు మొదటిసారి పూర్తిగా మూడు నెలల పాటు డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడాలి. కొంతమంది పిల్లల్లో మందులు మానేయగానే మళ్లీ ప్రోటీన్ పోవడం ప్రారంభమవుతుంది. ఇలాంటి పిల్లల్లో తక్కువ మోతాదులో మందులను ఆర్నెల్ల నుంచి తొమ్మిది నెలల పాటు వాడాల్సి ఉంటుంది. కొంతమందిలో సైడ్ఎఫెక్ట్స్ కనిపించే అవకాశం ఉంటుంది. అప్పుడు వేరే మందులు వాడాల్సి ఉంటుంది. చాలామంది పిల్లల్లో ఈ వ్యాధి 12-14 సంవత్సరాల వయసప్పుడు పూర్తిగా నయమవుతుంది. కిడ్నీలు దెబ్బతినే అవకాశం చాలా తక్కువ. మీరు ఆందోళన పడకుండా డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడండి. ఫెర్టిలిటీ కౌన్సెలింగ్ నా కూతురు కెరియర్ ఓరియెంటెడ్. ఈ కారణం వల్లనే పెళ్లి కూడా చాలా ఆలస్యంగా... అంటే 35వ ఏట జరిగింది. మరో నాలుగైదేళ్ల పాటు పిల్లలు వద్దనుకుంటోంది. తన వయసు రీత్యా మరో నాలుగైదేళ్లు ఆగడం సరైనదేనంటారా? తగిన సలహా ఇవ్వండి. - సుగుణ, హైదరాబాద్ వయసు పెరుగుతున్న కొద్దీ సంతానం కలిగే అవకాశాలు తగ్గుతుంటాయి. ఎందుకంటే వయసు పెరుగుతున్న కొద్దీ మహిళల్లో అండం విడుదలయ్యే అవకాశాలు తగ్గుతుంటాయి. అండం నాణ్యత కూడా తగ్గుతుంది. దాదాపు ముప్పయయిదేళ్ల వయసు తర్వాత నుంచి సంతానం పొందే అవకాశాలు క్రమంగా తగ్గుతూ పోతుంటాయి. మీ కుటుంబంలో త్వరగా మెనోపాజ్ వచ్చే అవకాశం ఉంటే, మీరు మీ అమ్మాయికి ఒవేరియన్ రిజర్వ్ పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఫెర్టిలిటీ చికిత్సలు చేయిస్తున్నా... సంతానవతి అయ్యేందుకు అవకాశాలు తగ్గిపోతుంటాయి. ఇక ఫైబ్రాయిడ్స్ వచ్చే అవకాశాలు, ట్యూబ్స్‌లో వచ్చే వ్యాధులు వయసుతో పాటు పెరుగుతాయి. ఫలితంగా సంతానవకాశాలు సన్నగిల్లుతాయి. వయసు పెరుగుతున్న కొద్దీ డయాబెటిస్, హైపర్‌టెన్షన్ వంటి సమస్యలు వచ్చి, గర్భధారణలో వచ్చే కాంప్లికేషన్స్ పెరుగుతాయి. దాంతోపాటు గర్భస్రావాలు (అబార్షన్స్) అయ్యే పర్సంటేజీ (శాతం) పెరుగుతుంది. అంటే... చిన్నవయసులో గర్భస్రావాలు అయ్యే అవకాశాలు 35 కంటే చిన్నవయసు ఉన్నవారిలో 13 శాతం ఉంటే... 45 ఏళ్ల వయసు పైబడిన వాళ్లలో అది 54 శాతానికి పెరగవచ్చు. వయసు పెరిగిన మహిళల్లో క్రోమోజోములలో మార్పులు వచ్చి, బిడ్డలో పుట్టుకతోనే వచ్చే సమస్యలు వచ్చే రిస్క్ కూడా ప్రమాదమూ పెరుగుతుంది. అందుకే కెరియర్‌కూ, సంతానాన్ని పొందడం అంశంలో సమతౌల్యం పాటించేలా మీ అమ్మాయి నిపుణుల నుంచి కౌన్సెలింగ్ పొందేలా చూడండి. అయితే ఈ అంశంలో అంతగా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆధునిక వైద్యశాస్త్రపరంగా సంతాన సాఫల్యాల కోసం ఉన్న సాంకేతికత వల్ల కాస్త పెద్దవయసు మహిళలకూ గర్భధారణ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. -
ఒత్తిడి వల్ల క్యాన్సర్ వస్తుందా?
న్యూయార్క్ : ఒత్తిడికి గురిచేసే పనులు, వాటికి సంబంధించిన ఈవెంట్లలో పాల్గొనడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం లేదని పరిశోధకులు అంటున్నారు. బోస్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన రీసెర్చర్స్ పలు విషయాలను వెల్లడించారు. ఒత్తిడిలో ఉండే వారికి క్యాన్సర్ వస్తుందని చెప్పేందుకు ఎటువంటి బలమైన ఆధారాలు లేవని తమ పరిశోధనలో తేల్చారు. మానసిక కుంగుబాటు, ఒత్తిడి వల్లే క్యాన్సర్ సంభవిస్తుందని సాధారణంగా ప్రజలు భావిస్తారని రచయిత, మానసిక శాస్త్రవేత్త జేమీ గ్రేడస్ పేర్కొన్నారు. ఒత్తిడి, క్యాన్సర్ అంశాలకు సంబంధించిన నిపుణులు 70 ఏళ్ల నుంచి ఇటువంటి అంశాలపై పరిశోధనలు కొనసాగిస్తున్నారు. వీటితో పాటు క్లినికల్ రీసెర్చర్స్ కూడా తమ అభిప్రాయాలను వీటితో కలిపి ఓ నిర్ణయానికి వచ్చారు. యూరోపియన్ పత్రికలలో ఈ విషయాలను వారు వెల్లడించారు. -
శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యానికి యోగా!
యోగా ఎన్నో ఒత్తిడులను తొలగిస్తుంది. ఇలా ఒత్తిడులను తొలగించడం ద్వారా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యానికి దోహదపడుతుంది యోగా. మన దృష్టికేంద్రీకరణ శక్తిని పెంచుతుంది. అనేక వ్యాధుల నివారణపై అవగాహన కల్పించడంతోపాటు, యోగా గురించి ప్రపంచానికి తెలియజెప్పడానికి సంకల్పంతీసుకుంది ‘సాక్షి’. ఇందుకోసం ఈ నెల 8, 9 తేదీల్లో హైటెక్స్‌లో ‘సాక్షి లివ్‌వెల్ ఎక్స్పో’ పేరిట భారీ ప్రదర్శనను, అవగాహన కార్యక్రమాలను నిర్వహించనుంది. భారత ప్రభుత్వ ప్రతిపాదనల వల్ల ఐరాస ఆధ్వర్యంలో ప్రపంచంలోని అన్ని దేశాలు 21 జూన్ అంతర్జాతీయ యోగా దినోత్సవం చేసుకున్నాయి. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా యోగా మీద ఆసక్తి పెరిగింది. కొన్ని వేల ఏళ్లుగా మన దేశంలో యోగ సాధన చేస్తున్నా ఈ తరానికి యోగా మీద పూర్తి అవగాహన లేదంటే అతిశయోక్తి లేదు. పతంజలి మహర్షి శాస్త్రీయంగా క్రోడీకరించిన యోగాను దేశ విదేశాల్లో ప్రాచుర్యం కలగజేసిన ఘనత ప్రఖ్యాత యోగాచార్య, పద్మవిభూషణ్ బి.కె.ఎస్. అయ్యంగార్‌కు దక్కుతుంది. ఆ యోగ గురువు ప్రత్యక్ష శిష్యురాలు శ్రీమతి ఝర్నా మోహన్. ఆమె గత 35 ఏళ్లుగా ఎందరికో యోగా నేర్పిస్తున్నారు. రామకృష్ణ మఠంలో బాలబాలికలకు వ్యక్తిత్వ వికాస పాఠాలు బోధిస్తున్నారు. యోగా గురించి అనేక విషయాల ఆమె మాటల్లో... ప్ర: యోగ అంటే ఏమిటి? ఝర్నా : సాహిత్యపరంగానూ, సాంకేతిక పరంగానూ యోగ అంటే శరీరం, మనస్సు, ఆత్మల అపూర్వ కలయిక. ప్ర: యోగా ఎలా పనిచేస్తుంది? ఝర్నా : దీన్ని గురించి పతంజలి మహర్షి ‘తదాశియేత్ ప్రకాశ ఆవరణం’ అని పేర్కొన్నారు. అంటే మనను కప్పివేసిన అజ్ఞానపు ముసుగును తొలగించి, మనల్ని మనం తెలుసుకునేలా చేసేదే యోగా. ప్ర: యోగసాధనకై మనం ఏం చేయాలి? ఝర్నా : దీనికోసం మనకు కావాల్సింది ఒక క్రమశిక్షణ. యోగశాస్త్రమూ అదే చెబుతోంది. ‘యోగానుశాసనం’ అవసరమని పేర్కొంటోంది. మన జీవితంలోని ఈ క్షణమే అత్యంత విలువైనది అని పేర్కొంటోంది. ఎందుకంటే ఈ క్షణంలో మనం చేసే ప్రయత్నం మనకు విలువైన జ్ఞానాన్ని తెచ్చిపెడుతుంది. అలా స్థలకాలావస్థలకు అతీతంగా మనల్ని గురించిన అవగాహనను మనకు కల్పించేదే యోగా. ప్ర: అనుశాసనం అంటే...? ఝర్నా : ఏ విభాగంలోనైనా పనిచేసే సమయంలో మనం రూపొందించుకున్న కొన్ని నియమాలు ఉంటాయి. వాటిని అనుసరిస్తూనే మనం పనిచేస్తాం. అలాగే యోగ ద్వారా మనలోకి మనం చేసే ప్రయాణంలోనూ మనం కొన్ని నియమాలు పాటించాలి. వాటినే యోగానుశాసన నియమాలుగా పేర్కొనవచ్చు. ప్ర: మనలోకి మనం ప్రయాణం అంటే ఏమిటి? మనలోకి ఎందుకు ప్రయాణించాలి? ఎక్కడికీ పయనం? ఝర్నా : మనం అంటే ఒక వ్యక్తిగా మనం కాదు. పాంచభౌతికమైన మనం పంచేంద్రియ జ్ఞానంతో మన మేధలోకీ, మన జ్ఞానంలోకి మన అహంలోకి అంటే పూర్తిగా మనలోకి వెళ్లి అన్వేషించడమే మన గురించి అన్వేషించడం. ఇక ఎందుకు అనే విషయానికి వస్తే... మనం మనకే పరిమితమై ఒక లక్ష్మణరేఖలోపలే ఉండిపోతుంటాం. మన పంచేంద్రియాలతో కనిపించేవరకే పరిమితమవుతాం. కానీ అది దాటి ఆవలకు వెళ్లాలి. ఇప్పుడు ఎక్కడికి అనే ప్రశ్న వస్తుంది. ప్రతి పయనంలోనూ ఒక బయల్దేరే ప్రదేశం, ఒక గమ్యం ఉంటాయి. కానీ ఇక్కడ మన శరీరనిర్మాణాలకు ఆవలగా, అతీతంగా అఖండ సంతోష, అక్షయానందం వైపు చేసే ప్రయాణమే యోగా. దీనికి మనమే వాహనం. ఈ ప్రయాణం ఎనిమిది దశల్లో సాగుతుంది. ఐదు అంశాలను కలిగి ఉంటుంది. త్రిగుణ సమ్మేళనమైనది. ఇవన్నీ సమ్మిశ్రీతమైన పయనమే యోగా. ప్ర: ఈ ప్రయాణం గురించి కాస్త వివరించండి. ఝర్నా : మనం యోగపయనాన్ని గురించి కాస్త పరికిద్దాం. ఉదాహరణకు నిటారుగా ఉండే తాడాసనాన్ని తీసుకుందాం. మనలో చాలా సమస్యలు నిటారుగా ఉండకపోవడం వల్లనే వస్తాయి. మనలో చాలామంది ఒకసారి తమ చెప్పుల వైపు చూసుకుంటే అవి రెండూ సమానంగా అరిగి ఉండవు. అంటే మనం రెండు కాళ్ల మీదా సమానమైన బరువు వెయ్యడం లేదన్నమాట. ఇక అన్నమయకోశమైన ఈ పాంచభౌతిక శరీరాన్ని చూద్దాం. ఇందులో ఒక క్రమబద్ధత ఉంటుంది. ఇందులో ఒక లయ ఉంటుంది. ఎడమవైపునకూ, కుడివైపునకూ ఒక సమానత, సమన్వయం ఉంటాయి. కాళ్ల నుంచి పృష్టభాగం వరకూ, ఆపైన వెన్నెముకకూ, భుజాలవరకూ, మెడకూ, చేతులకూ ఈ సమన్వయం ఉంటుంది. ఒక ఆసనాన్ని అనుసరిస్తున్న వేళ మనం అంటే అదేదో కాళ్లూ, చేతులు, శరీరం, తల అనే వేర్వేరు భాగాలు కాదనీ... సంపూర్ణంగా మనం అనే ఏకరూప వ్యక్తిత్వమని తెలుస్తుంది. మనలోని త్రిగుణాలు ఒక సమత్వ నియంత్రిత దశలో ఉంటాయి. మనం సరిగా కూర్చోకుండా జారగిలబడి కూర్చుంటే అది రజోగుణం. అదే ఒక క్రమత్వంలో కూర్చుంటే సత్వం గుణం. సత్వగుణం ఉత్తమమైన స్థితి. ప్ర: ప్రాణమయకోశం గురించి వివరించండి. ఝర్నా : ఒక రైతు తన పొలాన్ని తడపాలనుకున్నాడనుకోండి. అతడు జలాశయం దగ్గర ఉన్న మొక్కకు మరింత ఎక్కువ నీరు, దూరంగా ఉన్న మొక్కకు తక్కువ నీరు సరఫరా అయ్యేలా చూస్తాడా? చూడడు కదా! జలాశయం నుంచి కాలువలను ఏర్పాటు చేస్తూ, చేనులోని అన్ని మొక్కలకు నీళ్లు సమానంగా అందేలా చూస్తాడు. అలాగే మనలో ఉన్న శక్తి (ఎనర్జీ)ని కూడా ఎక్కడా వృథా కాకుండా అంతటా సమాన రీతిలో ప్రవహించేలా చేసేదే ప్రాణమయకోశం. ప్ర: మనోమయకోశం అంటే ఏమిటి? ఝర్నా : మనం యోగసాధనలో నిటారుగా కూర్చున్నప్పుడు మన ఛాతీని కాస్త ముందుకు ఉండేలా చేస్తాం. ఇలా చేసే సమయంలో మనలోని ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది. నిస్పృహతో ఉన్నవారు ఛాతీని ఎక్కుపెట్టి ఉంచలేరు. ఇలా ఛాతీని విరిచి నిల్చున్నామంటే అది మనలోని ‘థైమస్’ అనే గ్రంథిని ఉత్తేజపరుస్తుంది. ఇక మనలోని మేధోశక్తి ఈ సర్వజగత్తులో ఉన్న శక్తిని ఆనందస్వరూపంలోకి మార్చి మనలోకి ఇంకేలా చేసే స్తితి ఒనగూరుతుంది. మన మేధస్సు ఒక చోట కేంద్రీకృతమై దృష్టి అంతా ఒకేచోట నిలుస్తుంది. ప్ర: విజ్ఞానమయకోశం అంటే వివరించండి. ఝర్నా : యోగాను అనుసరిస్తూ మన మేధోజ్ఞానంతో మనల్ని మన నుంచి వేరు చేసుకొని మనను బయటి నుంచి చూడటాన్ని అలవాటు చేసుకోవడమే ‘స్వాధ్యాయ’. ఇలా చేయడం కోసం యోగాచార్య బీకేఎస్ అయ్యంగార్ కొన్ని సులభ మార్గాలను బోధించారు. వీటివల్ల వయసుకు అతీతంగా, ఆరోగ్యపరిస్థితితో నిమిత్తం లేకుండా ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా యోగా చేయవచ్చు. శ్రీమతి ఝర్నా మోహన్ ఈనెల 8, 9 తేదీలలో హైదరాబాద్ హైటెక్స్‌లో జరగనున్న సాక్షి వెల్నెస్ ఎక్స్పో గురించి మరింత సమాచారం కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ - 96662 84600 -
ఇంటర్వ్యూలో విజయం సాధించాలంటే...
♦ నేనో కార్పొరేట్ కంపెనీలో పని చేస్తున్నాను. టీమ్ లీడర్ని కావడంతో చాలా ప్రెజర్ ఉంటుంది. టార్గెట్ రీచ్ కావాలన్న తపనతో ఒక్కోసారి నా కింద పని చేసేవాళ్ల మీద ఒత్తిడి తేవాల్సిన పరిస్థితి ఏర్పడుతూంటుంది. కానీ దాన్ని మా టీమ్ అపార్థం చేసుకుంటు న్నారు. నేను వాళ్లని హింసిస్తున్నానని అనుకుంటున్నారు. వాళ్లలా అనుకోవడం నాకు ఇష్టం లేదు. ఈ పరిస్థితిని ఎలా డీల్ చేయాలో తెలియజేయండి? - మానస, హైదరాబాద్ కార్పొరేట్ రంగంలోని ఒత్తిడి వల్ల చాలామంది ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారు. సెల్ఫ్ కంట్రోల్, మనుషుల్ని డీల్ చేయడం, టైమ్ మేనేజ్మెంట్ తెలిస్తే ఈ సమస్యను తేలికగా పరిష్కరించుకోవచ్చు. మీ కొలీగ్స్ మీలో ఏయే లక్షణాలు ఇష్టపడటం లేదు, ఏ కారణాల వల్ల మిమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారన్నది తెలుసుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత ఆ లక్షణాల్లో మార్పు చేసుకుంటే సరిపోతుంది. అలాగే కొలీగ్స్‌తో మాట్లాడేటప్పుడు వాయిస్ పెంచకుండా నెమ్మదిగా మాట్లాడండి. ఇది అందరి లక్ష్యం, అందరం కలిసి నెరవేర్చుకుందాం అంటూ వారిని మీతో కలుపుకుని మాట్లాడండి. ఎప్పుడూ పని గురించే కాకుండా అప్పుడప్పుడూ కాస్త సరదాగా కబుర్లు కూడా చెబుతుండాలి. వారి వ్యక్తిగత జీవితం గురించి కూడా మంచి చెడులు మాట్లాడుతూ, మీరు సంతోషంగా ఉండటం నాకు అవసరం అన్నట్లు మీరు ప్రవర్తిస్తే వారు తప్పక మీకు దగ్గరవుతారు. ♦ నేను ఎంటెక్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాను. ప్రతి రిటెన్ టెస్ట్‌లో మంచి మార్కులు సంపాదిస్తాను. కానీ ఇంటర్వ్యూ దగ్గరకు వచ్చేసరికే వస్తుంది సమస్య. వాళ్లు అడిగే ప్రతి ప్రశ్నకూ సమాధానం నాకు తెలిసే ఉంటుంది. కానీ ఎంత ప్రయత్నించినా దాన్ని వెలిబుచ్చలేను. తడబడుతుంటాను. తప్పులు మాట్లాడతాను. దాంతో ప్రతిసారీ అవకాశాన్ని కోల్పోతున్నాను. ఎంతగా ప్రిపేర్ అయి వెళ్లినా ఫలితం ఉండటం లేదు. ఈ సమస్యను ఎలా అధిగమించాలి? - మనోహర్, విశాఖపట్నం మనోహర్గారూ... ఈ సమస్య చాలామందిలో సహజంగానే ఉంటుంది. దీనికే పర్ఫార్మెన్స్ యాంగ్జయిటీ అంటారు. ఇది సోషల్ ఫోబియాలో ఒక భాగం. ఒక పని చేస్తున్నప్పుడు దాని ఫలితం ఎలా ఉంటుందా అని ఆలోచించి భయపడటం వల్ల ఫలితం ఎప్పుడూ నెగిటివ్‌గానే ఉంటుంది. మీరు ఇంటర్వ్యూల్లో ఫెయిల్ కావడానికి కూడా కారణం అదే. నా సమాధానాలు అవతలివారికి నచ్చుతాయో లేదో, ఇంటర్వ్యూ ఫలితం ఎలా ఉంటుందో ఏమో అని ఆలోచించి టెన్షన్ పడటం వల్ల సరిగ్గా పర్ఫార్మ్ చేయలేకపోతున్నారు. దీనిని నెగిటివ్ ఇమాజినేషన్ అంటారు. దీనివల్ల మనిషి ఆలోచనల మీద నియంత్రణ కోల్పోతాడు. మనసులో ఉన్నదాన్ని బయటకు వెలి బుచ్చలేకపోతాడు. నోరు ఎండిపోవడం, చేతులకు చెమటలు పట్టడం, గుండె వేగం హెచ్చడం వంటి లక్షణాలతో ఉక్కిరిబిక్కిర వుతాడు. కాబట్టి ముందు మీరు మీ ఆలోచనా పద్ధతిని మార్చుకోవాలి. జీవితంలో అవకాశాలనేవి వస్తూనే ఉంటాయి, ఈ ఇంటర్వ్యూయే జీవితం కాదు అన్నట్టుగా ఆలోచించాలి. దానివల్ల మీ మైండ్ రిలాక్స్డ్గా ఉంటుంది. ఇంటర్వ్యూ బాగా చేయగలుగుతారు. ♦ నేనో గృహిణిని. నాకు నా కుటుంబ మంటే ప్రాణం. కానీ ఒక్కోసారి చిన్న చిన్న విషయాలకే చిరాకు పడిపోతుంటాను. పిల్లల మీద కూడా బాగా అరిచేస్తాను. దాంతో నాకు కోపం ఎక్కువన్న ముద్ర పడిపోయింది. ముక్కు మీదే ఉంటుంది కోపం అని అందరూ అంటుంటే మనసు చివుక్కు మంటుంది. నిజానికి నేను అంతగా కోప్పడుతున్నానన్న విషయం నాక్కూడా తెలియదు. నామీద పడిన కోపిష్టి అన్న ముద్రనెలా పోగొట్టుకోవాలి? - విజయ, కరీంనగర్ కోపం అనేది విపరీతమైన ఒత్తిడి వల్లో, మానసికంగా బలహీనపడటం వల్లో కూడా వస్తుంది. మీరు గృహిణిగా ఎన్నో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో ఒత్తిడికి లోనవడం వల్ల ఈ సమస్య వచ్చింది. మీరు కుటుంబానికే కాదు, మీకోసం కూడా కొంత సమయం కేటాయించండి. రిలాక్స్ అవ్వండి. అలాగే మీకు ఏయే విషయాల్లో కోపం వస్తోందో లిస్ట్ రాసుకోవడం వల్ల మీ బలహీనతలు, విసుగులు మీకు అర్థమవుతాయి. తద్వారా కోపం తగ్గించుకోవ డానికి ప్రయత్నం చేయవచ్చు. కోపం వచ్చినప్పుడు మనసును వేరేవైపు మళ్లించి, మీకిష్టమైన ఏదో ఒక పని చేయండి. పుస్తకాలు చదవడమో, సంగీతం వినడమో చేయండి. ఒత్తిడి అదే తగ్గిపోతుంది. మెల్లగా మీవాళ్ల మనసుల్లో మీ మీద పడిన ముద్ర కూడా తొలగి పోతుంది. ఇది చిన్న సమస్య. మీరు తేలిగ్గా అధిగమిస్తారు. దిగులుపడకండి. -
బాల్యంలో ఒత్తిడి.. మహిళలకు మరింత ముప్పు
న్యూయార్క్: ఒత్తిడి వల్ల వచ్చే అనర్థాల గురించి మనం తరచూ పేపర్లలో చదువుతూనే ఉంటాం. ఇప్పుడు దీనికి సంబంధించిన మరో కొత్త విషయం న్యూయార్క్ శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడైంది. పెద్దయ్యాక ఎదురయ్యే ఒత్తిడి సమస్యల కంటే బాల్యంలో ఎదుర్కొనే ఒత్తిడే మహిళలకు ఎక్కువ హాని చేస్తుందని ఈ పరిశోధనలో రుజువైంది. బాల్యంలో ఒత్తిడికి లోనవడం వల్ల మహిళల్లో బరువు పెరిగే అవకాశాలు అధికంగా ఉంటాయని పరిశోధకులు తెలిపారు. ఈ అధ్యయనంలో భాగంగా 2,259 మంది పురుషులు, 1,358 మంది మహిళలపై వారు పరిశోధనలు చేశారు. తల్లిదండ్రుల మధ్య సక్యత, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులు వంటి అంశాలకు, బాల్యంలో ఎదురయ్యే ఒత్తిడికి సంబంధం ఉంటుందన్నారు. ఉద్యోగం పోవడం, కావాల్సిన వాళ్లను కోల్పోవడం వంటి కారణాలు పెద్ద వయసు వారిలో ఒత్తిడికి కారణమవుతున్నాయని తెలిపారు. -
సరిపడా నిద్రతోనే చదువుల్లో చురుకుదనం..
తగినంత నిద్ర ఉంటేనే చిన్నారులు చదువుల్లో చురుగ్గా ఉండగలరని, తగిన నిద్రలేని చిన్నారులు చదువుపై దృష్టి కేంద్రీకరించలేక వెనుకబడతారని బ్రెజిల్ నిపుణులు చెబుతున్నారు. బ్రెజిల్‌లోని ఏడు నుంచి పదేళ్ల లోపు వయసు గల చిన్నారులపై వివిధ పరీక్షలు నిర్వహించి వారు ఈ నిర్ధారణకు వచ్చారు. పాఠశాలలోనైనా, ఇంట్లోనైనా ఆందోళన, ఒత్తిడి ఎదుర్కొనే చిన్నారులు సరిపడా నిద్రకు దూరమవుతున్నారని, సరైన వేళల్లో పడకకు చేరే అలవాటు లేని చిన్నారులు సైతం నిద్రలో సమస్యలు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. నిద్రకు దూరమైన పిల్లలు మిగిలిన వారి కంటే పరీక్షల్లో వెనుకబడుతున్నారని తమ అధ్యయనంలో తేలిందని బ్రెజిల్ నిపుణులు వెల్లడించారు. -
ఒత్తిడితో చిత్తు..
టెన్షన్లో గ్రేటర్ యువత 40 శాతం మందిలో హైబీపీ నేడు ప్రపంచ హైపర్ టెన్షన్ డే సిటీబ్యూరో: ఉరుకుల పరుగుల జీవితం..మారిన ఆహారపు అలవాట్లు.. అధిక బరువు..పని ఒత్తిడి.. కాలుష్యం..వెరసి మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గ్రేటర్లో 40 శాతం మంది హైపర్ టెన్షన్‌తో బాధపడుతున్నట్లు జాతీయ పోషకాహార సంస్థ ఇటీవల వెల్లడించింది. సాధారణంగా 40 ఏళ్లు పైబడిన వారిలో కన్పించే హైపర్ టెన్షన్ లక్షణాలు ప్రస్తుతం పాతికేళ్లకే బయపడుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. సకాలంలో గుర్తించి, చికిత్స తీసుకోకపోతే గుండె, మూత్రపిండాలు, మెదడు వ ంటి కీలక అవయవాల పనితీరుపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నేడు(ఆదివారం)వరల్డ్ హైపర్‌టెన్షన్ డే! మారిన జీవన శైలితోనే.. ఇటీవల అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం మనిషిని కాలు కూడా కదుపనీయడం లేదు. కూర్చున్న చోట నుంచి అన్ని పనులు చకచక పూర్తి చేసే అవకాశం వచ్చింది. సెల్‌ఫోన్ సంభాషణలు, ఇంటర్నెట్ చాటింగ్‌లు మనిషి జీవనశైలిని పూర్తిగా మార్చేశాయి. హోటళ్లలో రెడీమేడ్‌గా దొరికే బిర్యానీలు, పిజ్జాలు, బర్గలు, మద్యం కూడా అధిక బరువుకు కారణం అవుతున్నాయి. గ్రేటర్లో రోజు రోజుకు పెరుగుతున్న స్థూలకాయానికి ఇదే కారణమని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. మధ్య వయస్కులతో పోలిస్తే...యువకుల్లోనే ఈ సమస్య ఎక్కువ ఉంది. ఒత్తిడికి గురయ్యే వారు రెండు రకాలు. టైప్ ‘ఏ’ కోపంగా ఉండేవారు. టైప్ ‘బి’ తమలోని భావాలను చెప్పకుండా తక్కువ మాట్లాడే వారు. వీరిలో టైప్ ‘ఏ’ వారికే ఎక్కువ రిస్క్ ఉంటుంది. అధిక రక్తపోటుతో హృద్రోగ సమస్యలు.. 95 శాతం హైపర్ టెన్షన్‌కు మారిన జీవనశైలే కారణం. కేవలం ఐదు శాత ం మందిలో జన్యుపరంగా సంక్రమిస్తుంది. తరచు తల నొప్పి , కళ్లు బైర్లు కమ్మడం..ఛాతీ గట్టిగా పట్టేసినట్లు ఉంటుంది. చీటికిమాటికి చికాకు, పట్టలేని కోపం ప్రదర్శిస్తారు. ప్రతి ఒక్కరూ విధిగా బీపీ చెకప్ చేయించుకోవాలి.ఆహారంలో ఉప్పు, పచ్చళ్ల వాడకాన్ని తగ్గించాలి. పప్పు, కాయకూరలు తీసుకోవాలి. - డాక్టర్ సి.వెంకట ఎస్. రామ్, అపోలో ఆస్పత్రి ఇలా అధిగమించవచ్చు.. ఒత్తిడికి లోనైనప్పుడు నిశబ్దంగా ఉన్న గదిలో కూర్చుని కళ్లుమూసుకోవాలి. నెమ్మదిగా శ్వాస తీసుకొని వదులుతుండాలి. పగటి కలలు కూడా ఒత్తిడిని తగ్గిస్తాయి. వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడిపే వారిలో మానసిక ఒత్తిడి చాలా తక్కువ. 40 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. ఆటలకు కొంత సమయం కేటాయించాలి. - డాక్టర్ ప్రవీణ్ కొప్పుల, జనరల్ ఫిజిషియన్, గ్లోబల్ ఆస్పత్రి -
కార్డియాలజీ కౌన్సెలింగ్
నా వయసు 45 ఏళ్లు. నాకు చాలా రోజుల నుంచి ఛాతీ నొప్పి వస్తోంది. ఈ వయసులో గుండె జబ్బు వచ్చే అవకాశం ఉందా? - సుందర్‌కుమార్, రాజమండ్రి మీ వయసు 45 అని చెప్పారు కాబట్టి... ఈ వయసులో గుండె జబ్బు రాదని చెప్పడానికి వీల్లేదు. కానీ 60 ఏళ్లు పైబడిన వారితో పోలిస్తే ఈ వయసులో గుండెజబ్బులు వచ్చే అవకాశం తక్కువ. మీ విషయంలో కొలెస్ట్రాల్, బీపీ, షుగర్, పొగతాగే అలవాటు ఉందా లేదా అన్న విషయం రాయలేదు కాబట్టి... మీకు వచ్చే ఛాతి నొప్పి దేనికి సంబంధించినదో అని ఇదమిత్థంగా ఇప్పుడే చెప్పడం కష్టం. ఇది గుండెకు సంబంధించిన నొప్పా, కాదా అని నిర్ధారణ చేసుకోడానికి ఈసీజీ, ఎకో, ట్రెడ్మిల్ పరీక్షలు చేయించుకుని నొప్పి కారణాలను కనుగొనడానికి అవకాశం ఉంది. ఏవైనా పరీక్షలన్నీ ఒక నిపుణులైన డాక్టర్ ఆధ్వర్యంలోనే చేయించుకోవడం ఎంతైనా మంచిది. నా వయసు 40 ఏళ్లు. ఇటీవల విపరీతమైన ఒత్తిడిలో పనిచేస్తున్నాను. మా జాబ్‌లో టార్గెట్స్ రీచ్ కావాల్సిన అవసరం కూడా ఉంటోంది. గుండెజబ్బుల నివారణకు ఒత్తిడి తగ్గించుకోవాలన్న సూచన నేను తరచూ చదువుతున్నాను. కానీ మా వృత్తిలో అది సాధ్యం కాదు. మాలాంటి వారికి ఏదైనా ప్రత్యేక నివారణ సూచనలు ఉన్నాయా? దయచేసి చెప్పండి. - సుధీర్‌కుమార్, విశాఖపట్నం ఒత్తిడిలో పనిచేయడం అన్నది గుండెజబ్బు రావడానికి ఉన్న అనేక కారణాలలో ఒకటి. మీ ఉద్యోగరీత్యా నెరవేర్చాల్సిన బాధ్యతలు పూర్తి చేస్తూనే... గుండె జబ్బును నివారించడానికి రోజూ నడక, యోగా లాంటివి చేస్తూ ఆహార నియమాలు పాటిస్తూ ఉంటే గుండె జబ్బులు వచ్చే అవకాశాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. మీరు ఉద్యోగం మార్చుకోవడం వీలు పడదు కాబట్టి, దానిలోని ఒత్తిడికి రియాక్ట్ అయ్యే విధానాన్ని తగ్గించుకోండి. ప్రతిదానికి టెన్షన్ లేకుండా చూసుకోవడం వంటి ప్రక్రియలతో మీ వృత్తిలో ఎదగడంతో పాటు గుండె జబ్బు నివారణ కూడా ఏకకాలంలో జరుగుతుంది. డాక్టర్ ఎ. శ్రీనివాస్‌కుమార్ చీఫ్ కార్డియాలజిస్ట్, సిటిజన్స్ హాస్పిటల్స్, నల్లగండ్ల, హైదరాబాద్ -
ఉపవాసంతో ఒత్తిడి దూరం..
అప్పుడప్పుడు ఉపవాసం చేసే అలవాటు మంచిదే. ఉపవాసాలు చేయడం వల్ల బరువును అదుపులో ఉంచుకోవడమే కాదు, ఒత్తిడిని కూడా అధిగమించవచ్చని ఫ్లోరిడా యూనివర్సిటీ నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, అప్పుడప్పుడు ఉపవాసాలు ఉండటం వల్ల శరీరంలో సహజంగానే యాంటీ ఆక్సిడెంట్లు తయారవుతాయని, దీనివల్ల వయసు మళ్లే ప్రక్రియ మందగిస్తుందని, తద్వారా దీర్ఘయవ్వనం కూడా సాధ్యమవుతుందని వారు వివరిస్తున్నారు. ఇరవై నాలుగు మంది వాలంటీర్లను నమూనాగా తీసుకుని నిర్వహించిన పరీక్షల ఆధారంగా ఉపవాసం వల్ల కలిగే ప్రయోజనాలను ఫ్లోరిడా వర్సిటీ పరిశోధకులు శాస్త్రీయంగా తెలుసుకోగలిగారు. -
కొత్తగా... రెక్కలొచ్చెనా!
స్వప్నలిపి మీరెప్పుడైనా రెక్కలతో గాల్లోకి ఎగురుతూ వెళ్లారా? మీరెప్పుడైనా రెక్కలతో కొండకోనలపై, మహా సముద్రాలపై ఎగురుతూ వెళ్లారా?! అయితే ఈ స్వప్న విశ్లేషణ మీ కోసమే. సందర్భాన్ని బట్టి, మన మానసిక స్థితిగతులను బట్టి ఈ కల అర్థం మారిపోతుంది. కాబట్టి దీన్ని పూర్తిగా అనుకూల జాబితాలోనో, ప్రతికూల జాబితాలోనో చేర్చలేం. విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నప్పుడు, ఆ ఒత్తిడికి దూరంగా ఎక్కడికైనా పారిపోవాలనుకున్నప్పుడు ఇలాంటి కలలు వస్తాయి. సమస్య పరిష్కారం గురించి ఆలోచించి ఒత్తిడిని దూరం చేసుకోవ డానికి బదులు, పలాయనానికి ప్రాధాన్యం ఇచ్చినప్పుడు, సమస్య నుంచి పారిపోవాలనుకున్నప్పుడు ‘రెక్కల కల’ వస్తుంది. ఒంటరితనం బాగా ఎక్కువైనప్పుడు, ఆత్మవిశ్వాసం లోపించినప్పుడు, ఎప్పుడూ చేస్తున్న పనే చేస్తూ, ఎప్పుడూ ఉన్నచోటే ఉంటున్న క్రమంలో ఏర్పడే ఉత్సాహ రహిత స్థితిలోనూ ఇలాంటి కలలు వస్తాయి. అనుకూల కోణం ఏమిటంటే, సృజనాత్మకంగా ఏదైనా విషయాన్ని ఆలోచించే వాళ్లకు ఇలాంటి కలలు వస్తుంటాయి. ‘వాస్తవం ఇది. కాని ఇది నాకు నచ్చడం లేదు. నేను ఇలా ఆశిస్తున్నాను. ఇది నిజం కాదని తెలుసు. అయినా ఇదే బాగుంది’ తరహాలో ఆలోచించేవాళ్లకు కూడా... రెక్కలొచ్చి ఆకాశంలో విహరించే కలలు వస్తుంటాయి. -
అమ్మా.. నాన్నా..ఆలోచించండి!
తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగ బాధ్యతలతో పిల్లలతో తీరిగ్గా గడిపేంత సమయం ఉండడం లేదు. దీంతో పిల్లల మార్కులు, ర్యాంకులపై చూపించే శ్రద్ధ వారి మనసు తెలుసుకోవడంలో చూపడం లేదని అపోలో ఆసుపత్రి మనస్తత్వ నిపుణులు డాక్టర్ సీహెచ్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. చిన్నారుల్లో అభద్రతాభావం పెరిగిపోతోందని, వారు మానసిక వైద్యులను తరచుగా ఆశ్రయిస్తున్నారని సైకాలజిస్టు గీత చెప్పారు. ఒంటరితనం వల్ల భవిష్యత్తులో మానసిక సమస్యల బారిన పడే అవకాశాలు ఉంటాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. బడి ఒడిలో బాల్యం బందీ అందమైన బాల్యంలో ఆనందం, ఆహ్లాదం దూరమవుతున్నాయి. తెల్లవారుజామున మొదలైన పరుగు రాత్రి పదింటి వరకూ ఆగడం లేదు. బడిలో ఆటలు ఆగిపోయాయి. సాంస్కృతిక అంశాలు కనుమరుగయ్యాయి. ఎవరైనా ఆసక్తితో పిల్లలకు జీవన నైపుణ్యాలు నేర్పాలని ప్రయత్నించినా యాజమాన్యాలు అడ్డుకునే పరిస్థితి కనిపిస్తోంది. సిలబస్ నుంచి తప్ప బయటి విషయాలు ఏవి చెప్పినా వెంటనే తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదుల పరంపర మొదలవుతుంది అంటున్నారు రిటైర్డ్ అధ్యాపకులు కె.వి.సుబ్బారావు. సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, మనోధైర్యం, మానసిక వికాసం వికసించాల్సిన పాఠశాల ప్రాంగణంలో అవన్నీ దూర మయ్యాయని ఆయన ఆవేదన చెందారు. 'సాధారణంగా పిల్లలు ఎదుర్కొనే ప్రధాన సమస్య వారిని ఇతరులతో పోల్చడం. తల్లిదండ్రులు చేసే పెద్ద తప్పిదం ఇదే' అని ఆర్.సి.రెడ్డి స్టడీ సర్కిల్ డెరైక్టర్ ఆర్.సి.రెడ్డి పేర్కొన్నారు. 'స్కూలు, కాలేజీ, పోటీ పరీక్షలు ఏవైనా విద్యార్థులు తమ ప్రతిభ, సామర్థ్యం ఆధారంగానే రాణిస్తారు. కేవలం పరీక్షలో విజేతగా నిలవడమే తెలివితేటలకు కొలమానం కాదు. తెలివితేటలంటే కేవలం మార్కులు, ర్యాంకులే కాదు. సంగీతం, చిత్రలేఖనం, నటన.. ఇలా అభిరుచి ఉన్న రంగాల్లోనూ పిల్లలు రాణిస్తారు' అని చెప్పారు ఆర్.సి.రెడ్డి. బాలల్లోని సహజ సిద్ధమైన లక్షణాలను గుర్తించి, ఆ దిశగా ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు సూచించారు. మార్గం చూపే గురువులు పిల్లల మనసెరిగి ప్రవర్తించడం గొప్ప కళ. వారి ఆసక్తులు, అభిరుచులను గమనించి ప్రోత్సహించటం ఇప్పటి తల్లిదండ్రులకు సవాలుగా మారింది. గతంలో ఉమ్మడి కుటుంబాలే ఉండేవి. ఇంట్లో పెద్దలు.. పిల్లలకు వినయం, విధేయత, సంస్కృతి, సంప్రదాయాల గురించి విడమర్చి చెప్పేవారు. చిట్టిపొట్టి కథల తో దిశానిర్దేశం చేసే తాతయ్యలు, మంచి చెడులు వివరించి సన్మార్గంలో నడిపించే బామ్మలు ఇప్పటి తరానికి కరువయ్యారు. అందుకే ఈ బాధ్యతను నిర్వర్తించేందుకు పేరెంటింగ్ ఇన్స్టిట్యూట్స్ వెలిశాయి. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా ఆధునిక అంశాలు, గతాన్ని గుర్తుచేసే సంప్రదాయ విలువలను తల్లిదండ్రులకు, పిల్లలకు వారాంతాల్లో బోధిస్తున్నారు. వీరి కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. చిన్నారుల కోసం క్వాలిటీ టైం కేటాయించడం, వారి సమస్యలను సావధానంగా తెలుసుకుని సానుకూలంగా స్పందించడం, సౌమ్యంగా మాట్లాడటం వంటివి తల్లిదండ్రులకు నేర్పిస్తున్నారు. ఇంటి పనిలో, వంట పనిలో తల్లిదండ్రులకు సాయం చేసేలా పిల్లలకూ శిక్షణ ఇస్తున్నారు. ఖాళీ దొరికితే చాలు టీవీకో, ఇంటర్నెట్కో అతుక్కుపోకుండా.. చిత్రలేఖనం, సంగీతం, నాట్యం, నటన, యోగా వంటివి నేర్పిస్తున్నారు. మన సుకుమారులు 'పోటీ ప్రపంచంలో చిన్నారులను యంత్రాలుగా మార్చేశాం. మార్కులు, ర్యాంకులు సాధించేవారిగానే పరిగణిస్తున్నాం. బిజీ లైఫ్‌లో పిల్లల కోసం సమయం వెచ్చించకపోవటం పెద్ద లోపం. మంచి చెడు, సభ్యత, సంస్కారం.. ఇవన్నీ పెద్దల నుంచి పిల్లలకు అలవడాల్సిన లక్షణాలు. కానీ వీటి గురించి తెలియజెప్పే సమయం తల్లిదండ్రులకు ఉండడం లేదు. పిల్లలు తీసుకుంటున్న ఆహారంపై పెద్దలు శ్రద్ధ వహించడం లేదు. ఫలితంగా పసితనంలోనే ఊబకాయం బారిన పడుతున్నారు. మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. పిల్లల మనస్తత్వాన్ని గమనించి ప్రవర్తించాలనే విషయం చాలామంది పేరెంట్స్‌కు తెలియదు. దీనికి పరిష్కారం.. పిల్లలకు కూడా మనసుంటుందనే విషయం తెలుసుకోవడం. దీని కోసమే పేరెంటింగ్ క్లాసులు, వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నాం. పిల్లల మనసును గుర్తించడం ఎలాగో తెలియజేస్తున్నాం. తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన లభిస్తోంది' -నయనతార నందకుమార్, డెరైక్టర్, అవర్ సేక్రెడ్ స్పేస్, సికింద్రాబాద్ -
టెన్త్ టెన్షన్
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు-2015కు హాజరయ్యే విద్యార్థుల్లో, వారికి బోధించాల్సిన ఉపాధ్యాయుల్లో సిలబస్ టెన్షన్ మొదలైంది. కొత్త సిలబస్, పాత పరీక్షా విధానమే ఇందుకు ప్రధాన కారణం. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంచాలని అధికారుల ఆదేశాలు ఉపాధ్యాయుల్లో ఒత్తిడిని పెంచుతోంది. పరీక్షా విధానం పాతదైనప్పటికీ సిలబస్ కొత్తది కావడంతో అటు విద్యార్థుల్లో, అటు ఉపాధ్యాయుల్లో గందరగోళం నెలకొంది. మార్చిలో జరిగే పబ్లిక్ పరీక్షలకు జిల్లా విద్యాశాఖ ప్రత్యేక కసరత్తును ప్రారంభించింది. 40 రోజుల స్పెషల్ క్లాస్‌ను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నెల్లూరు(విద్య) :జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో సుమారు 35 వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి సమగ్ర, నిరంతర మూల్యాంకన పద్ధతిలో పాఠ్యపుస్తకాలను రూపొందించారు. పరీక్షలు మాత్రం పాతపద్ధతిలోనే నిర్వహించాలని నిర్ణయించారు. పాఠ్యాంశాలు పాతవైతే విద్యార్థులు పరీక్షల్లో ప్రశ్నలకు పేజీలు పేజీలు జవాబులు రాసేవారు. కొత్త పాఠ్యపుస్తకాల ప్రకారం పరీక్షల్లో సంక్షిప్త రూపంలో జవాబులు రాయాల్సి ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కొత్త పాఠ్యపుస్తకాల ఆధారంగా వచ్చే ప్రశ్నలకు పాతపద్ధతిలో జవాబులు రాయాల్సి రావడం విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉంటుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు మారిన పాఠ్యపుస్తకాలపై ఉపాధ్యాయులకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వకపోవడంతో పాఠ్యాంశాల బోధన అంతంతమాత్రంగానే సాగుతోంది. ఫిబ్రవరి రెండో వారానికి సిలబస్ అంతా పూర్తిచేయాలని విద్యాశాఖ అధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. కొత్త సిలబస్‌కు పాతపద్ధతిలో నమూనా ప్రశ్నాపత్రాలను తయారుచేయడం ఉపాధ్యాయులకు తలకు మించిన భారమైంది. పాతపరీక్షా విధానంలో పరీక్షలు పెట్టేందుకు నమూనాపత్రాలను రాష్ట్ర విద్యాశాఖ నవంబర్ ఆఖరు వారంలో విడుదల చేశారు. డిసెంబర్లో సమ్మెటివ్-2లో ఆ నమూనా ప్రశ్నాపత్రాల ఆధారంగా ఉపాధ్యాయులు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో వచ్చిన ఫలితాలు మిశ్రమంగా ఉండడంతో ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది. ఆశించిన స్థాయిలో విద్యార్థులు పరీక్షల్లో నిరంతర సమగ్ర మూల్యాంకన పద్ధతికి అలవాటు పడలేరనే విషయం స్పష్టమైంది. దీంతో ఉపాధ్యాయులు ఉన్న ఈ కొద్దికాలాన్ని ఎలా సద్వినియోగంచేసుకోవాలో అనే ఆలోచనలో పడ్డారు. మరో రెండు నెలల్లో జరిగే 10వ తరగతి పరీక్షలకు డిసెంబర్ నెలాఖరులోగా సిలబస్ పూర్తిచేసి రివిజన్ ప్రారంభించాల్సి ఉందని విద్యావిశ్లేషకుల అభిప్రాయం. అలాగే కొత్త సిలబస్, పాతపద్ధతి అటు అందరినీ అయోమయంలో పడేసింది. చెప్పేవారేరి?: ప్రభుత్వ, జిల్లా పరిషత్ హైస్కూళ్లలో మ్యాథ్స్-55, ఫిజికల్ సైన్స్-36, బయలాజికల్ సైన్స్- 62, సోషల్ స్టడీస్- 114, తెలుగు- 44, హిందీ- 48, ఇంగ్లిష్- 25 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఉపాధ్యాయుల అంచనా. తాజాగా జనవరి రెండో తేదీన 64 మంది ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు లభించాయి. మరో రెండు నెలల్లో పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ 64 మంది స్కూల్ అసిస్టెంట్లు పదో తరగతి విద్యార్థులకు ఏ విధంగా బోధిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. వీరిలో మ్యాథ్స్- 18, పీఎస్-28, బయాలజీ-35, ఇంగ్లిష్-11 మంది ఉన్నారు. సోషల్, తెలుగు, హిందీ సబ్జెక్టులకు పదోన్నతులు లేవు. మారిన సిలబస్ పాఠాలు చెప్పడం అనుభవమున్న ఉపాధ్యాయులకే కష్టతరంగా మారింది. ఉపాధ్యాయులు పాఠాలు చెప్పేందుకు ప్రిపేర్ కావడానికే ఎక్కువ సమయం పడుతోంది. మొదటి బ్యాచ్ కావడంతో గైడ్లు, మెటీరియల్‌లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి లేకపోవడంతో అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీర్ఘకాలికంగా ఒకే సిలబస్‌ను బోధించిన సీనియర్ ఉపాధ్యాయులు, కొత్తగా ఉద్యోగాల్లో చేరిన ఉపాధ్యాయులు పాఠాలు బోధించేందుకు ఇబ్బందులు పడుతున్నారనేది జిల్లా విద్యాశాఖ బాహాటంగా ఒప్పుకుంటున్న సత్యం. ఈ నేపథ్యంలో ప్రత్యేక తరగతులు, మెటీరియల్స్ త్వరగా విద్యార్థులకు అందజేసి 40 రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్నైనా ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తే మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉందని విద్యావేత్తల అభిప్రాయం. -
ముందు నుయ్యి..వెనుక గొయ్యి!
-
దీపిక డిప్రెషన్!
వరుస హిట్స్‌తో దూసుకుపోతున్నా ఏదో తెలియని బాధ వేధిస్తున్నట్టుంది సూపర్‌స్టార్ హీరోయిన్ దీపికా పడుకొనేని. గత ఏడాది ఆరంభంలో దీపిక విపరీతమైన మానసిక ఒత్తిడితో బాధపడిందట. కారణమేంటన్నది బయటకు రాలేదు గానీ... దాని నుంచి బయటపడటానికి తనంతట తానే శ్రమించిందట. అందులో భాగంగా తనలా మెంటల్ టెన్షన్, ఆందోళన, భయంలో కూరుకుపోయినవారికి అండగా నిలబడాలని నిర్ణయించుకుందని సమాచారం. బిజీ షెడ్యూల్ నుంచి బ్రేక్ తీసుకుని మరీ అలాంటి వారికి సహకారం అందిస్తోందిట. ప్రస్తుత లైఫ్స్టైల్లో మెంటల్ హెల్త్ సమస్యలు సాధారణమే అయినా... దాన్ని దూరం చేసేందుకు తగిన నియమాలు పాటించడం లేదనేది అమ్మడి అభిప్రాయం. -
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
ఫీజు చెల్లించాలని యాజమాన్యం ఒత్తిడి కళాశాల ఎదుట బంధువుల ఆందోళన పోలీసులకు ఫిర్యాదు చోడవరం: ఫీజు చెల్లించాలని కళాశాలయాజమాన్యం ఒత్తిడి చేయడంతో తీవ్ర మనోవేదనకు గురైన ఓ విద్యార్థి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ ప్రాంతంలో తీవ్ర సంచలనం సృష్టించిన ఈ సంఘటన వివరాలిలావున్నాయి...మండలంలోని లక్కవరానికి చెందిన బర్ల ప్రసాద్(20) చోడవరం ఎస్ఎస్పీ డిగ్రీ కళాశాలలో బికాం ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. తల్లిదండ్రులు ఈశ్వరరావు, దేముడమ్మలు రైతు కూలీలు. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా కష్టపడి కొడుకును చదివిస్తున్నారు. డిగ్రీ పరీక్ష ఫీజు రూ.2500లు చెల్లించడానికి గడువు గతనెల 30వ తేదీతో ముగిసిపోయింది. అపరాధరుసుముతో చెల్లిం చేందుకు డబ్బులు తీసుకుని రెండ్రోజుల కిం దట అకౌంటెంట్ వద్దకు విద్యార్థి వెళ్లాడు. బకా యి ఉన్న కళాశాల ఫీజు రూ.5900లు కూడా చెల్లిస్తేనే పరీక్ష ఫీజు తీసుకుంటానని అకౌం టెంట్ తెగేసి చెప్పారు. తన వద్ద ప్రస్తుతం అంత డబ్బులులేవని, త్వరలోనే ఫీజు కడతానని చెప్పినా అంగీకరించకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. తల్లిదండ్రులకు ఈ విష యం చెప్పలేక కుమిలిపోయాడు. మంగళవారం కళాశాలకని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన ప్రసాద్ తనతోపాటు తెచ్చుకున్న పురుగుమందును మార్గమధ్యలో తాగాడు. నురగలు కక్కు తూ కిందపడిపోయిన అతనిని అటుగావెళుతు న్న గ్రామస్తులు చోడవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం కోలుకున్న విద్యార్థి ఆత్మహత్యకు కారణాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో బంధువులు, గ్రా మస్తులు కళాశాలకు వెళ్లి యాజమాన్యాన్ని నిలదీశారు. ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయిలో వా గ్వాదం చోటుచేసుకుంది. తమకు సంబంధంలేదని కళాశాల కరస్పాండెంట్ త్రినాథ్ చెప్పడం తో వారు కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. జరిగిన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పుచేసి పరీక్షఫీజు తెచ్చామని, కళాశాల ఫీజు కూడా త్వరలోనే కడతామని చెప్పి నా.. కళాశాలయాజమాన్యం ఒత్తిడి వల్లే తమ కొడుకు ఇలా అఘాయిత్యానికి పాల్పడ్డాడని తల్లిదండ్రులు వాపోయారు. ఇదిలావుండగా ఫీజు విషయం తన దృష్టికి రాలేదని కళాశాల కరస్పాండెంట్ చెప్పారు. -
మైగ్రేన్ తలనొప్పి.. అశ్రద్ధ చేయొద్దు..
తరచుగా తలనొప్పి వస్తే అశ్రద్ధ చేయకూడదు. రక్తపోటు, మెదడులో కణితులు, రక్త ప్రసరణలో మార్పులు, మానసిక ఒత్తిడి, నిద్రలేమి వల్ల తల నొప్పి వచ్చే అవకాశం ఉంది. మైగ్రేన్ స్త్రీలలో అధికంగా కనిపిస్తుంది. నొప్పి చాలా వరకు తలకు ఓ పక్క భాగంలో ఉంటుంది. మైగ్రేన్ రావడానికి కారణం... తలోని రక్తనాళాలు ఒత్తిడికి లోనై వాయడం. పార్శ్వపు తలనొప్పికి కారణాలు: పార్శ్వపు తలనొప్పి ముఖ్యకారణం మానసిక ఆందోళన, మానసిక ఒత్తిడి. కొంత మందికి బయటకు వెళ్లినప్పుడు, సూర్యరశ్మి ద్వారా తలనొప్పి వస్తుంది. అధికంగా ప్రయాణాలు చేయడం. స్త్రీలలో హార్మోన్ల సమస్యలు ఏర్పడినప్పుడు, రుతుచక్రం ముందుగా గానీ, తరువాత గానీ వచ్చే అవకాశం ఉంటుంది. గర్భధారణ సమయం, రుతుచక్రం ఆగిపోయినప్పుడు ఈ సమస్య తీవ్రంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ లాంటి కొన్ని రకాల మందులు వాడటం వల్ల ఎక్కువగా వస్తుంది. మైగ్రేన్ దశలు - లక్షణాలు: చాలా వరకు మైగ్రేన్ దానంతటదే తగ్గిపోతుంది. సాధారణంగా 24 గంటల నుంచి 72 గంటలు కూడా పట్టవచ్చు. ఒకవేళ నొప్పి 72 గంటలు ఉంటే స్టేటస్ మైగ్రేన్ అంటారు. మైగ్రేన్ నొప్పి 4 దశలలో సాగుతుంది. పోడ్రోమ్ ఫేజ్: ఇది నొప్పికి ముందు 2 గంటల నుంచి 2 రోజుల ముందు వరకు జరిగే ప్రక్రియల సమూహం. ఈ దశలో చిరాకు, మానసిక ఆందోళన, డిప్రేషన్, ఆలోచనలో మార్పులు రావడం, వాసన, వెలుతురు పడకపోవడం, మెడనొప్పి ఉంటాయి. ఆరాఫేజ్: ఈ దశ నొప్పి మొదలయ్యే కొద్ది నిమిషాల ముందు ఉంటుంది. చూపు కాస్త మందగించినట్లుండటం, జిగ్‌జాగ్ లైన్స రావడం, తలలో సూదులతో గుచ్చినట్లు ఉండడం, మాటలు తడబడడం, కాళ్లలో నీరసం ఉంటాయి. నొప్పి దశ: ఈ నొప్పి దశ 2 గంటల నుంచి 3 రోజుల వరకు ఉండవచ్చు. ఈ దశలో వాంతులు ఉంటాయి. పోస్ట్‌డ్రోమ్ ఫేజ్: నొప్పి తగ్గిన తరువాత కొద్ది రోజుల వరకు తల భారంగా ఉండటం, నీరసంగా ఉండటం, శ్రద్ధ లేకుండా ఉండటం జరుగుతుంది. వ్యాధి నిర్ధారణ: రక్త పరీక్షలు - సీబీపీ, ఈఎస్ఆర్ రక్తపోటును గమనించడం ఈఈజీ పరీక్ష సీటీ స్కాన్ (మెదడు) ఎంఆర్ఐ మెదడు పరీక్షలు ఉపకరిస్తాయి మైగ్రేన్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు: మానసిక ఆందోళనలు తగ్గించుకోవాలి. మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. దీనికోసం యోగా, ప్రాణాయామం చేయాలి. ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. తలకు నూనెతో మసాజ్ చేసుకోవాలి. తలలోని నరాలు రిలాక్సవుతాయి. తలనొప్పి వచ్చినప్పుడు ప్రశాంత వాతావరణంలో, లైటు తీసేసి, నిశ్శబ్దంగా ఉన్నచోట పడుకోబెట్టాలి. హోమియో వైద్యం: మైగ్రేన్ తలనొప్పికి హోమియోలో మంచి మందులు ఉన్నాయి. ఘాటైన వాసనలు పీల్చినప్పుడు తలనొప్పి వస్తే బెల్లడోనా, లైకోపోడియం, ఇగ్నీషియా ఇవ్వాలి. తరుచూ అధికంగా తలనొప్పి వస్తుంటే నేట్రంమూర్, సాంగ్యునేరియా, చైనా, సెపియా ఇవ్వాలి. గర్భవతుల్లో తలనొప్పి వస్తే బెల్లడోనా, నక్స్‌వామికా, సెపియా ఇవ్వాలి. ఎక్కువగా చదవడం వల్ల నొప్పి వస్తే ఇగ్నీషియా, సెపియా, కాక్యులస్, కాలికార్భ ఇవ్వాలి. స్కూల్‌కు వెళ్ళే ఆడపిల్లల్లో వస్తే కాల్కేరియా ఫాస్, నేట్రంమూర్, పల్సటిల్లా ఇవ్వాలి. ఈ మందులు అవగాహనకు మాత్రమే. మందులను నిష్ణాతులైన హోమియో వైద్యుని సంప్రదించి మాత్రమే తీసుకోవాలి. డాక్టర్ మురళీ అంకిరెడ్డి, ఎం.డి హోమియో, స్టార్ హోమియోపతి సికింద్రాబాద్, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, నేరేడ్మెట్, వైజాగ్, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, హన్మకొండ మరియు కర్ణాటక అంతటా... ఫోన్: 7416 102 102, www.starhomeo.com -
మానసిక ఒత్తిడితో జాగ్రత్త!
-
ఒత్తిడిలో ఉన్నారా? అయితే రంగుపడాల్సిందే!
ట్రెండ్ ఒక్కసారి బాల్యాన్ని గుర్తు తెచ్చుకోండి. ‘రంగులు నింపండి’ అనే వాక్యం కింద ఉన్న బొమ్మలను మన దగ్గరున్న రకరకాల కలర్ పెన్సిళ్లతోనో, స్కెచ్పెన్లతోనో రంగులు వేసి మురిసిపోయేవాళ్లం. ఇప్పుడు కూడా అలా చేస్తే ఏమంటారు? ‘‘ఇంకా నీలో బాల్యం పోలేదు’’ అంటారు. లేటెస్ట్ ట్రెండ్ ఏమిటంటే, ఫ్రాన్సులో చిన్నాపెద్దా తేడా లేకుండా బొమ్మలకు రంగులు వేస్తున్నారు. ఈ ధోరణి ఇప్పుడు బ్రిటన్‌కు కూడా పాకి... అక్కడినుండి పలుదేశాలకు వెళుతోంది. బొమ్మలకు రంగులు వేయడం ద్వారా, ఒత్తిడిని జయించవచ్చుననేది సరికొత్త మానసిక సిద్ధాంతం. దీంతో ఇప్పుడు చాలా మంది అభిరుచుల జాబితాలో ఇది పెద్దపీట వేసుకుంది. ‘‘ఒత్తిడికి గురవుతున్నాననే భావనకు లోనుకాగానే మందు కొట్టేవాడిని. ఒత్తిడికి దూరం కావడం మాట అలా ఉంచి, అనారోగ్య సమస్యలు దగ్గర కావడం మొదలయ్యాయి. ఏంచేయాలో తోచేది కాదు. ఈ సమయంలో మా ఆవిడ ఈ ‘కలరింగ్ థెరపీ’ గురించి చెప్పింది. మొదట్లో నమ్మలేదుగానీ, ఒకసారి ప్రయత్నించి చూస్తే అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. ఒత్తిడి మాయమైంది’’ అంటున్నాడు మెట్జ్ (ఫ్రాన్స్) నగరానికి చెందిన విలియం హెన్రీ. కలర్ థెరపీకి నిర్దిష్టమైన సమయం అంటూ లేదు. కొందరు అయిదు నిమిషాల్లో ఒత్తిడి నుంచి ఉపశమనం పొందితే, మరికొందరు గంటల సమయాన్ని వెచ్చిస్తున్నారు. ‘క్రియేటివ్ థెరపీ కలరింగ్ బుక్’ పేరుతో మైఖేల్ ఒ మార రాసిన పుస్తకం హాట్ కేక్‌లా అమ్ముడుపోతోంది. ‘‘రంగులు వేయడం ద్వారా ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడం అనేది నిన్న మొన్నటి విషయం కాదు. చాలా ఏళ్ల క్రితమే ఇది ఉనికిలో ఉంది’’ అంటున్నారు కొందరు మానసిక నిపుణులు. ఆలస్యం ఎందుకు? మీరు కూడా ఒకసారి ప్రయత్నించి చూడకూడదూ! -
ఒత్తిడిని చిత్తు చేయండిలా
ఒత్తిడి.. స్ట్రెస్.. ఆందోళన.. మనిషి జీవితంలో సహజం. పాఠశాల విద్యార్థి మొదలుకుని.. గృహిణులు, కళాశాల విద్యార్థులు, ఉద్యోగస్థులు, వ్యాపార రంగంలో ఉన్నవారు ఇలా ప్రతి ఒక్కరూ.. ఏదో ఒక విధంగా ఒత్తిడికి గురవుతున్నారు. దీనివల్ల అనుకున్న పనులు సకాలంలో పూర్తి కావడం లేదు. అంతేకాకుండా అనారోగ్యం బారినా పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఒత్తిడికి కారణాలు.. నివారణ మార్గాలు మీ కోసం.. మానవుడు.. నిద్రలేవడం నుంచి నిద్రపోయే వరకూ ఏదో ఒక మానసిక సంఘర్షణతో సతమతమవుతూ అందమైన జీవితాన్ని అంధకారంగా మార్చుకుంటున్నాడు. జీవితంలో కావాల్సిన అవసరాలకు అనుగుణంగా చక్కని ప్రణాళిక లోపించినప్పుడు మనిషి ఒత్తిడికి గురవుతాడు. దీంతో శారీరక, మానసిక రుగ్మతలకు లోనవడంతోపాటు, సామాజికంగా, ఆర్థికంగా బలహీనుడవుతాడు. ఒత్తిడిని.. విజయానికి నాందిగా మార్చుకుంటే మనిషి ఒత్తిడిని జయించడమే కాకుండా విజయతీరాలకు చేరుకుంటాడు. ముఖ్యంగా ప్రాథమిక దశలోనే ఒత్తిడికి గల కారణాలపై దృష్టి పెట్టాలి. ఆ తర్వాత ఒత్తిడికి కారణమయ్యే ప్రతి ఒక్క అంశాన్ని నిర్మూలించాలి. అయితే చాలామంది ఒత్తిడి నుంచి బయటపడడానికి మార్గాలను అన్వేషించరు. ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి సిగరెట్, మద్యపానం, మాదక ద్రవ్యాల అలవాట్లతో పెడదారులను ఎంచుకుంటారు. దీనివల్ల ఒత్తిడి నుంచి తప్పించుకోలేకపోవడంతోపాటు ఆరోగ్యం తీవ్ర దుష్ర్పభావాలకు లోనవుతుంది. కుటుంబంపై కూడా దీని ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఎవరికీ మనశ్శాంతి అనేది లేకుండా పోతుంది. కాబట్టి ఒత్తిడికి కారణాలు, వాటిని జయించడానికి ఎంచుకోవాల్సిన మార్గాలు ఒకసారి పరిశీలిద్దాం. అందరికీ పని ఒత్తిడి! ఒక గృహిణి తన రోజువారీ వంట చేయడం నుంచి పిల్లల సంరక్షణ, ఆరోగ్యం, బట్టలు ఉతకడం, కూరగాయలు తరుక్కోవడం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఏదో ఒక విషయమై ఒత్తిడికి గురవుతుంటుంది. పాఠశాల, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు వారి హాజరు, పరీక్షలు, అసైన్మెంట్స్, ప్రాజెక్ట్ వర్క్ వంటి విషయాల్లో ఒత్తిడికి లోనవుతారు. అలాగే ఆఫీసుకు సరైన సమయంలో వెళతామో, లేదో అని ఉద్యోగులపై ఒత్తిడి ఉంటుంది. ఆఫీసుకు వెళ్లిన తర్వాత అప్పగించిన పనిని సకాలంలో పూర్తిచేయడం, సహోద్యోగులతో సమన్వయం వంటి విషయాల్లోనూ ఒత్తిడి సహజం. వ్యాపారం చేసే వారిలో ఈ సమస్య ఇంకా ఎక్కువ ఉంటుంది. వ్యాపార విషయాల్లో వ్యక్తి 24 గంటలూ (ఒక్క నిద్రపోయేటప్పుడు మినహా) ఆలోచిస్తూ ఉంటాడని ‘కాలిఫోర్నియా యూనివర్సిటీ’ చేసిన అధ్యయనంలో తేలింది. కాబట్టి ఒక గృహిణి, ఒక విద్యార్థి, ఒక ఉద్యోగస్థుడు, ఒక వ్యాపారి.. ఇలా ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో ప్రతిరోజూ, ఏదో ఒక స్థితిలో ఒత్తిడికి లోనవుతూనే ఉంటారు. ఒత్తిడిని ఇలా ఎదుర్కోండి: ఒత్తిడిని జయించడంలో భాగంగా ప్రతి ఒక్కరూ కొన్ని పద్ధతులను పాటించాలి. దీని ద్వారా ఒత్తిడిని సులువుగా ఎదుర్కోవచ్చు. కాలం అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఈ రోజు రేపు రాదు. ఓ కవి చెప్పినట్లుగా పెరుగుతుంది వయసు అని అనుకుంటారు కానీ తరుగుతుంది ఆయువు అని తెలుసుకోరు. కాలానికి ఎవరైతే విలువనిస్తారో వారు కాలానుగుణంగా ఎదుగుతారు. సమయపాలన ప్రాధాన్యతా క్రమం, పనిపై అకుంఠిత దీక్ష, వ్యాయామం, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక ప్రణాళిక; పిల్లలతో, పెద్దలతో ప్రేమతో నిజాయతీగా వ్యవహరించడం, డైరీ రాయడం, రోడ్ మ్యాప్ రూపొందించుకోవడం వంటి వాటి ద్వారా ఒత్తిడి మీ దరి చేరదు. దీనివల్ల మీరు ఎంతో ఆర్యోగంగా, ఉత్సాహంగా ఉంటారు. సమయపాలన: ప్రపంచం మొత్తానికీ అందుబాటులో ఉన్న సమయం 24 గంటలే. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఒత్తిడిని చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఒక పాఠశాలలో, కళాశాలలో చదివే విద్యార్థికి వారి టైమ్‌టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. విద్యార్థి ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు పాఠశాల/కళాశాలలో బోధించిన అంశాలను అధ్యయనం, లోతైన విశ్లేషణ చేయడం ద్వారా విద్యార్థికి ఆత్మస్థైర్యం, ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. టైమ్ టేబుల్లో ప్రతిరోజూ ప్రాధాన్యతా క్రమానికి పెద్దపీట వేయండి. రోజూ భోజనం, నిద్రతోపాటు స్టడీకి చక్కని ప్రణాళిక రూపొందించుకోండి. ప్రయోజనం లేని పనులకు ప్రాధాన్యత ఇవ్వకండి, ప్రాధాన్యతాక్రమం: విద్యార్థులు.. తమకు ఏ సబ్జెక్టుల్లో అసాధారణమైన పట్టు ఉందో, వేటిలో బలహీనంగా ఉన్నారో తెలుసుకోవాలి. దీని ఆధారంగా ప్రాధాన్యతాక్రమాన్ని రూపొందించుకోవాలి. సాధారణంగా ఒక వ్యక్తి తన పనులను ఒకచోట రాసుకొని వాటిలో ఏది అతి ముఖ్యం, ముఖ్యం, చివరి ప్రాముఖ్యత.. ఇలా ప్రాధాన్యతల వారీగా పూర్తి చేసుకోవాలి. ఒక ఉదాహరణను పరిశీలిద్దాం. అద్దె కట్టడం - సరుకులు తీసుకోవడం - దుస్తులు కొనడం - రైల్వే రిజర్వేషన్ చేయించడం - ఇవి ఆ రోజుకు పనులుగా రాసుకుంటే... 1. రైల్వే రిజర్వేషన్ చేయించడం (ఒకవేళ మనం తొందరగా చేయకపోతే వెయిటింగ్ లిస్ట్ పెరిగిపోవచ్చు) 2. కరెంట్ బిల్ కట్టడం (కట్టకపోతే పెనాల్టీ పడొచ్చు) 3. సరుకులు తీసుకురావడం, 4. దుస్తులు కొనడం. ఈ ప్రాధాన్యతల్లో చిట్టచివరిది దుస్తులు కొనడం అంత ప్రాధాన్యమైన విషయం కాదు. ఎందుకంటే మొదటి రెండు అంశాలు సమయానికి ముడిపడి ఉన్నాయి. కాబట్టి ప్రతిరోజూ ఒక పుస్తకంలో మనం చేయాల్సిన పనులను, వాటి ప్రాధాన్యతలను రాసుకోవాలి. ప్రాధాన్యతలో భాగం రోజువారీ, నెలవారీ, ఆరునెలల వారీగా టాస్క్‌లను రాసుకోవడం వల్ల పనులన్నీ సజావుగా సాగిపోతాయి. -
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య
-
ఒత్తిడిని జయించండిలా..!
అనేక భారాలు, ఒత్తిడులతో... జీతానికి, జీవితానికి మధ్య అనుక్షణం నలిగిపోతున్నాడు మగాడు. ఉరుకుల పరుగుల జీవితంలో వయోభేదాలు, స్థాయీభేదాలు లేకుండా మగాడిని ‘స్ట్రెస్’ ముప్పుతిప్పలు పెడుతోంది. అయితే ఇది మరీ వదిలించుకోలేని గడ్డు సమస్యేమీ కాదు. ఈ చిట్కాలు పాటిస్తే చాలు... ఒత్తిడిని చిత్తు చేయవచ్చు. విరామం తీసుకోండి: ఒత్తిడిని తగ్గించుకోవడానికి నంబర్‌వన్ మందు... స్వచ్ఛమైన గాలి. లాంగ్ డ్రైవ్, బీచ్‌లో గడిపే ఒక సాయంత్రం స్ట్రెస్‌ను తగ్గించడంలో మ్యాజిక్‌లా పనిచేస్తాయి. కాబట్టి చాన్స్ దొరికితే డ్రైవ్‌కి చెక్కేయండి. చల్లటి పైరగాలిని పీల్చండి. రిలీఫ్ రాకపోతే అడగండి! పక్కాగా ప్లాన్ చేసుకోండి: తమ పనుల విషయంలో కచ్చితమైన ప్రణాళికతో ఉండేవారికి సగం భారం తగ్గినట్టే. భారమే లేనప్పుడు ఒత్తిడి ఎందుకొస్తుంది! నో చెప్పడం నేర్చుకోండి: అతిగా ఆతృతపడటం వల్ల ఏర్పడినంత స్ట్రెస్ మరి దేనివల్లా రాదు. అవతలి వారిని మెప్పించడానికి, పై వారిని ఆకట్టుకోవడానికి మీ స్థాయికి మించిన భారాలను తలకెత్తుకోకండి. మీ వల్ల కాదు అనుకున్న సందర్భాల్లో ‘నో’ అని చెప్పడానికి మొహమాటపడకండి. జిమ్కెళ్లండి: జిమ్ అనగానే బాడీ బిల్డింగ్ కోసమనుకుంటారు చాలామంది. కానే కాదు. వ్యాయామంతో స్వేదం చిందించడం ఒత్తిడిని తగ్గించుకోవడానికో ఉత్తమ మార్గం. మాంచి మ్యూజిక్ వింటూ కసరత్తు చేస్తే ఇక తిరుగే ఉండదు! వీటిని మార్చాలి: అలసిపోయామని టీ తాగేస్తాం. కాఫీ పట్టించేస్తాం. కూల్‌డ్రింకులతో చల్లబడదామనుకుంటాం. కానీ ఇవన్నీ ఒత్తిడిని పెంచేవేనని పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా కెఫీన్ ఎక్కువ ఉండేవాటికి దూరంగా ఉండటం ఉత్తమం! హాబీలుంటే మేలు: ఎంత బిజీగా ఉన్నా ఏదో ఒక క్రియేటివ్ హాబీ ఉంటే చాలు... మానసికాందోళన ఇట్టే పారిపోతుంది. కాబట్టి మీ మనసుకు నచ్చిన ఏదైనా సృజనాత్మక హాబీని అలవర్చుకోండి! -
బాబోయ్... నేనాడలేను
సిడ్నీ: యాషెస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో ఘోరంగా ఓడిపోయిన ఇంగ్లండ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టులో కీలక బ్యాట్స్‌మన్ జొనాథన్ ట్రాట్ సిరీస్ నుంచి వైదొలిగాడు. తీవ్ర ఒత్తిడి కారణంగా తిరిగి స్వదేశానికి వెళుతున్నట్లు ప్రకటించాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కూడా ధ్రువీకరించింది. ‘క్రికెట్ నుంచి ట్రాట్ కొంత విరామం తీసుకుంటున్నాడు. అయితే ఇది ఎంతకాలమనేది చెప్పలేం. దీని గురించి పూర్తి విషయాలు అతను వెల్లడించలేదు. ప్రస్తుతం అతను ఉన్న స్థితిలో ఆట ఆడలేడు. కాబట్టి మిగతా సిరీస్‌కు అందుబాటులో ఉండడు’ అని ఈసీబీ వెల్లడించింది. క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకుంటున్న తాను ఇక కోలుకోవడంపై దృష్టిపెట్టనున్నట్లు ట్రాట్ తెలిపాడు. 2006-07లో ఇంగ్లండ్ మాజీ ఆటగాడు ట్రెస్కోథిక్ కూడా ఇలాగే ఒత్తిడి వల్ల కొన్నాళ్లపాటు ఆటకు దూరమయ్యాడు. నిరాశలో ఉన్న ట్రాట్‌కు అందరూ మద్దతు ఇవ్వాలని ట్రెస్కోథిక్ ట్వీట్ చేశాడు. -
ఒత్తిడిని గుర్తించే టీషర్ట్
వాషింగ్టన్: పోటీ యుగంలో ప్రపంచంతో పాటు పరుగులు పెట్టక తప్పదు. దీంతో మనకు తెలియకుండానే ఒత్తిడి, నిద్రలేమి కబళించేస్తున్నాయి. ఒత్తిడి, నిద్రకు సంబంధించిన సమస్యలను గుర్తించగలిగే ఓ సరికొత్త ‘టీ షర్ట్’ త్వరలో అందుబాటులోకి రానుంది. ‘హెక్సోస్కిన్’ టీషర్ట్గా పేర్కొంటున్న దీనిని కెనడాకు చెందిన ఓ సంస్థ రూపొందించింది. ఇందులో ఉండే సెన్సార్లు ఎప్పటికప్పుడు మనం శ్వాసించే స్థాయి, శరీరం కదలికలు, గుండె కొట్టుకునే తీరు వంటి అంశాలను పరిశీలిస్తాయి. ఈ అంశాల ఆధారంగా.. నిద్ర స్థాయి (కలత నిద్ర, గాఢ నిద్ర)ని, ఒత్తిడిని అంచనా వేస్తాయి. ఈ వివరాలను స్మార్ట్ ఫోన్ సహాయంతో వైద్యులకు, మన ఆన్లైన్ అకౌంట్‌కు పంపుతాయి. ఒత్తిడి స్థాయిని గుర్తించి, తదనుగుణంగా జీవన విధానంలో మార్పులు చేసుకొనేందుకు ఈ టీషర్ట్ తోడ్పడుతుందని ‘హెక్సోస్కిన్’ సంస్థ సీఈవో అలెగ్జాండ్రె తెలిపారు. ముఖ్యంగా క్రీడాకారులకు, క్రీడా శిక్షకులకు ఉపయోగపడనుంది. -
ఉత్తరం: ఆ ఒక్కటి... అన్ని నాశనాలకు నాంది!
ఆరోగ్యంగా ఉండాలంటే... ఏం చేయాలి. ఎందుకో ఈ ప్రశ్న విలువ రోజురోజుకు పెరుగుతోంది. కొందరు చక్కగా తింటే ఆరోగ్యం అంటారు. ఇంకొందరు శారీరక శ్రమ ఉంటే ఆరోగ్యం సిద్ధిస్తుంది అంటారు. మరికొందరు తగినంత నిద్ర, విశ్రాంతి అవసరం అంటారు... అయితే, ఇవన్నీ ఆరోగ్యవంతమైన దేహానికి అవసరమే గాని అంతకంటే ప్రాధాన్యమైన విషయం ఒకటుంది. మీరు వ్యాయామం చేసినా, సరిగా నిద్రపోయినా, పౌష్టికాహారం తీసుకున్నా కలిగే లాభం ‘ఒత్తిడి’ వల్ల మాయమవుతుంది. చిల్లు పడిన కుండలో ఎంతసేపు నీరు పోసినా అది నిండదు. కాబట్టి ఒత్తిడితో కూడుతున్న జీవితానికి మిగతా ఎన్ని ఉపశమన చర్యలు తీసుకున్నా నిష్ఫలమే. కాబట్టి... ముందు ఆ ఒత్తిడిని తరిమేయాలి. అసలు ఒత్తిడి ఉంటే కలిగే నష్టాలేంటో తెలుసా... దాంపత్యంలో శృంగార సుఖం తగ్గుతుంది. ఇంకా.. పీరియడ్స్ సమస్యలు, జుట్టురాలడం, మొహంలో కళ తగ్గడం, జీర్ణ వ్యవస్థ దెబ్బతినడం, నిద్రలేమి, బరువు పెరగడం, రోగనిరోధక శక్తి తగడం వంటి సమస్యలన్నీ చుట్టుముడతాయి. మరి ఆ ఒత్తిడిని ఎలా తొలగించాలి? మొట్టమొదట చేయాల్సిన పని అపరిష్కృత సమస్యలు, మీ చేతుల్లో పరిష్కారం లేని సమస్యలు గురించి ఆలోచించడం మానేయండి. పనులన్నీ క్రమపద్ధతిన చేయడం అలవరచుకోండి. చేయగలిగినంత చేయండి, చేయలేనిది వదిలేయండి ఇక మళ్లీ దాని గురించి ఆలోచించకండి. ఆర్గుమెంట్లు మానేయండి. మీ పరిధి దాటి సమస్యలను పట్టించుకోకండి. ఇష్టమైన పనులు చేయండి. ఊపునిచ్చే సంగీతం వినండి. కుదరితే మసాజ్ చేయించుకోండి. ఒక సరదా వ్యాపకం అలవాటు చేసుకోండి. టెన్షన్ పెంచే టీవీ సీరియళ్లు మానేయండి. బద్ధకం బాడీకి ఉండదు, మనసుకే ఉంటుంది. మీ పనులు మీరే చేసుకోవడం అలవరుచుకోండి. చక్కటి ప్రసంగాలు వినండి, పుస్తకాలు చదవండి... చివరగా ఒక్క విషయం. మీరెన్ని చేసినా హాయిగా బతకడానికే కదా. దాన్ని నాశనం చేసే పనులు ఏవైనా, ఎంత విలువైనవైనా మానేయండి. అంతే! చీర కట్టు నేర్పించే పాఠాలు! వండటం, చీర కట్టడం... చేపపిల్లకు ఈతలాగా, ఆడపిల్లకు డిఫాల్ట్‌గా వచ్చే లక్షణాలు. కాలం మారింది. ఆడపిల్ల మారింది. అందుకే... అవి నేర్పించడమే వ్యాపారం అయ్యింది కొందరికి. అది సరదా వ్యాపారం ఇంకొందరికి. కానీ... అవి నేర్చుకునే వారికి మాత్రం అది ఎంతో ఆసక్తికరం. వంటయినా టీవీల్లోనూ, పేపర్లోనూ వీడియోలుగా, వ్యాసాలుగా వస్తాయి కాబట్టి... ఎలాగోలా నేర్చుకుంటున్నారు... కానీ, చీరకట్టడం నేర్చుకునే అవకాశాలు కాస్త తక్కువే అనే భ్రమలుండే అవకాశం ఉంది కొందరికి... సర్వసమస్యలకు పరిష్కారం వెతికిపెట్టే ఇంటర్నెట్ ఆ పని కూడా చేస్తోంది. దాసి... అనే ఓ బ్లాగర్ మీకు చీర ఎలా కట్టాలో నేను నేర్పుతా అంటున్నారు. ఓ మోడల్‌ను ముందుపెట్టుకుని ఎలా కట్టాలో కట్టి... చక్కగా చూపిస్తున్నారు. అవి యూట్యూబ్ వీడియోలే కావడం వల్ల మీరు ఎంచక్కా రివైండ్ చేస్తూ అలా కట్టడం వచ్చేదాకా చూసుకోవచ్చు. మీకు నచ్చితే వేరేవారికీ చూపొచ్చు. ఇదీ ఆ బ్లాగ్ అడ్రెస్: www.wearasari.wordpress.com ఇప్పటివరకు నలభై రకాలుగా చీర కట్టే ఆధునిక, సంప్రదాయ విధానాల చీరకట్టు విధానాలు ఇందులో ఉన్నాయి. మొత్తం మీద ఎలాగైనా మీకు 108 మార్గాలు చెబుతానని ఆ బ్లాగరు అంటున్నారు. ప్రస్తుతానికైతే ఆ నలభై రకాలు నేర్చుకుని రోజుకో రకంగా చీరకట్టి అందర్నీ ఆశ్చర్య పరచండి మరి! ఇంకా గూగుల్‌ను ‘హౌ టు వియర్ శారీ’ అని అడిగితే బోలెడు రకాల వీడియోలు చూపిస్తుంది. ఎంతోమంది నిపుణులు ఈ వీడియోలు అందుబాటులో పెట్టారు.