మొహంలో కళ్లు ఎంత ప్రత్యేకమో.. అంతే సున్నితం కూడా! అందుకే ఫేషియల్స్ చేసినా.. స్క్రబ్ చేసినా..మసాజ్ చేసినా..నయనాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. లోషన్స్, క్రీమ్స్ అప్లై చేసుకునేటప్పుడు కూడా కళ్లకు తగలకుండా జాగ్రత్తపడతాం. కీరాముక్కలు, గోరువెచ్చటి కాపడంతో కనుల సోయగాన్ని కాపాడే ప్రయత్నం చేస్తుంటాం. అపురూపమైన కళ్లు అందంగా.. ఎల్లప్పుడూ ఆకట్టుకునేలా ఉండాలంటే స్పెషల్ కేర్ తప్పనిసరి.
వయసుతో వచ్చే నల్లటి వలయాలు, ముడతలు, నిద్రలేమితో కలిగే అలసట.. వీటన్నింటినీ దూరం చెయ్యాలంటే చిత్రంలోని కళ్లజోడు ఎంతో చక్కగా పనిచేస్తుంది. దీన్ని పెట్టుకుని కళ్లు మూసుకుని ఉండటం బోర్ కదా అనుకునే వారికి ఆ దిగులే అవసరం లేదు. ఎందుకంటే ఈ డివైజ్.. పాటలను వినిపిస్తూ కళ్ల పని చూస్తుంది. ఒత్తిడి, అలసట, కళ్ల మంటలు, కళ్లు పొడిబారడం, తలనొప్పి వంటి వాటిని దూరం చేస్తూనే.. 60లో 20లా కనిపించేలా అందాన్ని కాపాడుతుంది.
180 డిగ్రీస్ యాంగిల్‌లో XECH Eye Massager డివైజ్‌ని సులభంగా ఫోల్డ్ చేసుకోవచ్చు. అలా ఫోల్డ్ అయిన గాడ్జెట్ చూడటానికి వైర్‌లెస్ మౌస్‌లా ఉంటుంది. డివైజ్‌కి ఒకవైపు.. చార్జర్ జాక్, ఇయర్ ఫోన్ జాక్ ఉంటాయి. పైభాగంలో ఆన్, ఆఫ్, వైబ్రేషన్, మ్యూజిక్ వంటి ఆప్షన్స్ ఉంటాయి. దీనికి ఇయర్ ఫోన్స్ పెట్టుకునే వీలుండటంతో.. నచ్చిన పాటను వినొచ్చు. నచ్చకుంటే మార్చుకోవచ్చు. సౌండ్ పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. డివైజ్ ఆన్ చేసుకుంటే సున్నితంగా వైబ్రేట్ చేస్తూ.. ట్రీట్మెంట్ అందిస్తుంది.
ఆఫీస్‌లో, ఇంట్లో ఎక్కడైనా దీన్ని సులభంగా ఉపయోగించుకోవచ్చు. దీనికి 2 గంటల పాటు చార్జింగ్ పెడితే చాలు బ్యాటరీ ఫుల్ అవుతుంది. ఈ డివైజ్ అడుగు భాగంలో సాఫ్ట్ స్కిన్ కేర్ లైనింగ్ అమర్చి ఉంటుంది. వెనుకవైపు బ్యాండ్ అటాచ్ అయ్యి ఉంటుంది. దాని సాయంతోనే తలకు అమర్చుకోవచ్చు. దీని ధర సుమారు 28 డాలర్లు. అంటే 2,108 రూపాయలు.
Comments
Please login to add a commentAdd a comment