EYE
-
యవ్వన కాంతితో కళ్లు మిరుమిట్లు గొలిపేలా ఉండాలంటే..
వయసు పెరిగే కొద్ది, చర్మంలో చాలా మార్పులు వస్తుంటాయి. ముఖ్యంగా కంటి చుట్టూ నల్లటి వలయాలు, మచ్చలు, గీతలు, ముడతలు అందాన్ని చెడగొడుతుంటాయి. అలాంటి సమస్యకు చెక్ పెడుతుంది ఈ ‘ఐ రీజెనరేటింగ్ టూల్’. దీన్ని వినియోగించడంతో కళ్లు మిరుమిట్లు గొలిపే అందంతో మృదువుగా మారతాయి. ముఖం యవ్వనకాంతితో మెరుస్తుంది.ముందుగా కళ్ల కింద చర్మానికి అనువైన క్రీమ్స్, సీరమ్స్ అప్లై చేసుకుని, అనంతరం ఈ డివైస్ సాయంతో మసాజ్ చేసుకోవాలి. కేవలం క్రీమ్ అప్లై చేసి వదిలేయడానికీ, క్రీమ్ అప్లై చేసిన తర్వాత ఈ టూల్‌తో మసాజ్ చేయడానికీ తేడా స్పష్టంగా కనిపిస్తోందని, ఈ టూల్ బెస్ట్ రిజల్ట్స్ ఇస్తోందని చాలా మంది వినియోగదారులు రివ్యూస్ ఇస్తుండటంతో ఇలాంటి పరికరాలకు మార్కెట్లో డిమాండ్ పెరిగింది.ఈ పరికరంతో క్రీమ్ లేదా సీరమ్‌ను కంటి కింద అప్లై చేసుకుంటే, చర్మం 53 శాతం వేగవంతం రికవరీ అవుతోందట! నల్లటి వలయాలను 18 శాతం, పొడిబారిన చర్మం 32 శాతం, గీతలు, ముడతలు 16 శాతం తగ్గుతున్నాయని ఐ రీజెనరేటింగ్ టూల్‌ని రూపొందించిన కంపెనీ వెల్లడిస్తోంది. హె ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్‌తో, 38–42 డిగ్రీల సెల్సియస్ హీట్ థెరపీతో ఈ మసాజ్ డివైస్ పని చేస్తుంది. దీనిలోని లిఫ్టింగ్ మోడ్.. కంటి కండరాలను ఉత్తేజపరచేందుకు, కొలాజెన్ ఉత్పత్తిని ప్రేరేపించడానికి ఉపయోగపడుతుంది.ఈ మసాజ్ హెడ్ కంటికి అనువుగా, చికిత్సకు వీలుగా డబుల్–కాంటాక్ట్ ప్రాంగ్లతో రూపొందింది. దీని హెడ్‌పైన రెండు సెమీ–కర్వ్డ్ హైపోఅలెర్జెనిక్ మెటల్ ఎలక్ట్రోడ్ పోల్స్ ఉండటంతో మసాజ్ చేసుకునేటప్పుడు అవి కంటి చర్మంపై సున్నితంగా జారుతూ, మంచి ఫలితాన్ని ఇస్తాయి. (చదవండి: మెనోపాజ్‌లో నిద్రలేమితో సతమతమవుతున్నారా..? బీకేర్‌ఫుల్..!) -
కంట్లో వలయం కనిపిస్తోందా? ఈ విషయాలు తెలుసుకోండి!
కొంతమందికి కంట్లో నల్లగుడ్డు చుట్టూరా ఓ తెల్లని రింగ్ కనిపిస్తుంటుంది. దీన్ని చూడగానే ఆందోళనకు గురవుతుంటారు. కానీ ఇది అంతగా ఆందోళన చెందాల్సిన అంశమూ కాదు... అంతగా ప్రమాదకారీ కాదు. ఇది కేవలం అలర్జీతో వచ్చిన సమస్య మాత్రమే. మన కన్ను ఆరు బయట ఉండే దుమ్మూ ధూళి వంటి కాలుష్యాలకూ, పుప్పొడికి ఎక్స్పోజ్ అయినప్పుడు... అలర్జీ ఉన్నవాళ్లలో కంటి నల్ల గుడ్డు చుట్టూ ఇలాంటి తెల్లటి రింగ్ కనిపించే అవకాశం ఉంది. అందుకే కేవలం ఇలా రింగ్ కనిపించే వాళ్లు మాత్రమే కాకుండా అందరూ ఈ తరహా కాలుష్యాలకు దూరంగా ఉండాలి. రక్షణ కోసం ప్లెయిన్ గ్లాసెస్ వాడటమూ మంచిదే. ఈ సమస్య ఉన్నవారు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు కన్ను స్వచ్ఛమైన నీటితో కడుగుతూ ఉండాలి. డాక్టర్‌ను సంప్రదించి యాంటీ అలర్జిక్ చుక్కల మందు వాడాల్సి ఉంటుంది. (కేవలం రూ. 500తో మొదలై, కష్టాలను ‘పచ్చడి’ చేసింది!)అయితే హానికరం కాదు కదా అంటూ ఈ సమస్యను అలాగే వదిలేస్తే... దీర్ఘకాలం తర్వాత చూపు కాస్తంత మందగించడం, కార్నియా పొర దెబ్బతినడం వంటి సమస్యలు వస్తాయి కాబట్టి వీలైనంత త్వరగా కంటి డాక్టర్‌కు చూపించుకొని వారు సూచించే మందులు వాడాలి. -
మరో మహమ్మారి.. 15 మందిని కబళించిన ‘బ్లీడింగ్ ఐ’
కరోనా మహమ్మారి తరువాత ప్రపంచంలో వ్యాధుల భయం మరింతగా పెరిగింది. ప్రస్తుతం మార్బర్గ్, ఎంపాక్స్ వైరస్లు ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. 17 దేశాలను అమితంగా ప్రభావితం చేస్తున్నాయి. మార్బర్గ్ వైరస్‌ను ‘బ్లీడింగ్ ఐ’ వైరస్ అని కూడా అంటారు. ఆఫ్రికా దేశమైన రువాండాలో ఈ వైరస్ కారణంగా 15 మంది మృత్యువాత పడ్డారు. కొన్నివందల మంది ఈ వైరస్ కారణంగా అనారోగ్యం బారినపడి, ప్రాణాలతో పోరాడుతున్నారు.తీవ్రమైన వ్యాధుల కేటగిరీలో..ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం బ్లీడింగ్ వైరస్ అనేది 50శాతం మరణాల రేటుతో తీవ్రమైన వ్యాధుల కేటగిరీలో ఉంది. ఈ వైరస్ రువాండాలో విధ్వంసం సృష్టిస్తూ, ప్రపంచదేశాలను వణికిస్తోంది. మార్బర్గ్ వైరస్ కారణంగా కళ్ల నుంచి రక్తస్రావం అవుతుంది. అందుకే దీనిని ‘బ్లీడింగ్ ఐ’ అని పిలుస్తున్నారు. ఇప్పటికే ఇతర వైరస్ల వ్యాప్తితో పోరాడుతున్న ఆఫ్రికా దేశాలను ఈ కొత్త వైరస్ ఇప్పుడు చుట్టుముట్టింది.లక్షణాలివే..బ్లీడింగ్ ఐ వైరస్ సోకినప్పుడు తొలి లక్షణాలు రెండు నుండి 21 రోజుల తర్వాత కనిపిస్తాయి. ముందుగా జ్వరం, తీవ్రమైన తలనొప్పి, విపరీతమైన అలసట, శరీర నొప్పులు, కండరాల నొప్పులు బాధిస్తాయి. తరువాత అతిసారం, వికారం, వాంతులు, దురద, దద్దుర్లు తదితర లక్షణాలు కనిపిస్తాయి. వీటి తరువాత ముక్కు, పంటిచిగుళ్ళు, కళ్ళు, నోరు, చెవుల నుండి రక్తస్రావం అవుతుంది. అలాగే వాంతులు, మలంలో రక్తం, అంతర్గత రక్తస్రావం, వృషణాల వాపు మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. తరువాత బ్లీడింగ్ ఐ వైరస్ బాధితునికి ప్రాణాంతకంగా మారుతుంది.కరోనా కంటే ప్రమాదకరంప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం గనులు లేదా గుహలలో ఎక్కువ కాలం నివసించే వ్యక్తులలో మార్బర్గ్ వైరస్ ముప్పు ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ప్రదేశాలలో గబ్బిలాలు నివసిస్తాయి. ఇవి ఈ వైరస్‌కు ప్రధాన కారకంగా గుర్తించారు. కరోనా కంటే మార్బర్గ్ వైరస్ చాలా ప్రమాదకరమైనదని పలు నివేదికలు చెబుతున్నాయి. వ్యాధి సోకిన గబ్బిలాల ద్వారా లేదా వైరస్ సోకిన వ్యక్తుల ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. ఈ వైరస్ రక్తనాళాలను దెబ్బతీస్తుంది. ఈ వైరస్‌కు ఎటువంటి మందులు లేవు. నివారణ చర్యలే మార్గమని వైద్యులు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: Year Ender 2024: భారత్‌ను వణికించిన వ్యాధులు -
ప్రతీదానికీ ఓ పద్ధతి ఉంటుంది కళ్ళు మూసుకుంటే సరిపోదు!!
అతను తన గురువుగారి ఆశ్రమంలో విడిగా ఏర్పాటు చేసిన ఓ పూరిపాకలో కూర్చుని స్థిరమైన మనసు కోసం తీవ్రంగా ప్రయత్నించ సాగాడు. ఎవరు చూడడానికి వచ్చినా అతను కళ్ళు తెరచి చూసేవాడు కాదు. ఎవరైనా వచ్చినట్టు అలికిడైనా సరే చూసేవాడు కాదు.అయితే ఒకరోజు గురువుగారు ఈ శిష్యుడిని చూడడానికి వెళ్ళారు. కానీ శిష్యుడు గురువుగారిని కూడా పట్టించుకోలేదు. అయినా గురువుగారు అక్కడి నుంచి కదలలేదు. పైగా ఆ పూరిపాక గుమ్మంలో ఓ ఇటుకరాయిని మరొక రాయిమీద పెట్టి అరగదీయడం మొదలుపెట్టాడు. అలా గీయడంతో పుట్టిన శబ్దాన్ని శిష్యుడు భరించలేకపోయాడు.అతను కళ్ళు తెరిచి అడిగాడు –‘‘మీరేం చేస్తున్నారు...తెలుస్తోందా...’’అని.గురువు చెప్పాడు – ‘‘ఇటుకను అద్దంగా మారుస్తున్నాను’’ అని.అప్పుడతను ‘‘ఇటుకను అద్దంగా మార్చడం సాధ్యమా... దానిని పిచ్చితనమంటారు... మరెంత అరగదీస్తే అంతగా అది అరిగి చివరికి ఇటుకరాయి జాడ కూడా కనిపించకుండా పోతుంది. అలాంటిది అద్దం ఎలా ఏర్పడుతుంది. కాస్త ఆపండి ఆలోచించండి... నన్ను నా మనసు మీద ఏకాగ్రత నిలుపు కోనివ్వండి’’ అని చెప్పాడు.అతని మాటలకు గురువుకు నవ్వొచ్చింది.‘‘అలాగైతే నువ్వేం చేస్తున్నావు... ఇటుకరాయి అద్దం కాలేని పక్షంలో మనసు ఎలా స్వచ్ఛమైన అద్దమవుతుందో చెప్పు. ముక్కు మూసుకుని కూర్చున్నంత మాత్రాన నిలకడ వచ్చేయదు. దానికో పద్ధతి ఉంది. అది తెలుసుకోకుండా ఎవరినీ చూడనని కళ్ళు గట్టిగా మూసుకుంటే సరిపోతుందని అనుకోవడం ఎంత అవివేకం?’’ అని ప్రశ్నించాడు గురువు. శిష్యుడు సిగ్గుతో తలవంచుకున్నాడు. – యామిజాల జగదీశ్ -
Children Eye Care Week బాల్య శుక్లాలపై నిర్లక్ష్యం వద్దు..
బంజారాహిల్స్: ఎల్వీప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 7 నుంచి 14వ తేదీ వరకూ నిర్వహించే బాలల నేత్ర సంరక్షణ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం అవగాహనా వాక్‌ను నిర్వహించారు. ‘బాల్య శుక్లాలు–పిల్లల చూపుపై వాటి ప్రభావం–త్వరిత గుర్తింపు–చికిత్స ప్రాధాన్యత’ థీమ్‌తో ఈ వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కల్లం అంజిరెడ్డి ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన వాక్‌ను సినీ సంగీత దర్శకుడు తమన్ ఎస్, నటుడు విశ్వ కార్తికేయలు ప్రారంభించారు. దాదాపు 300 మంది చిన్నారులు, వారి తల్లిదండ్రులు ఫ్లకార్డులు చేతబూని బాల్యశుక్లాలపై అవగాహన క్పలించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా తమన్ మాట్లాడుతూ ఈ వాక్‌లో పాల్గొనడం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. అయితే పిల్లల కంటి సమస్యలను త్వరితగతిన గుర్తించగలిగితే వారి సమస్యలను దూరం చేయవచ్చని, ఆ దిశగా తల్లిదండ్రులు అవగాహన పొందాలని కోరారు. ఎల్వీ ప్రసాద్ చైల్డ్ సైట్ ఇన్స్టిట్యూట్ అధిపతి డాక్టర్ రమేష్ కెకున్నయ్య మాట్లాడుతూ రోగ నిర్ధారణను త్వరితగతిన గుర్తించి చికిత్స అందించడం ద్వారా అత్యుత్తమ ఫలితాలు ఉంటాయన్నారు. బాల్య కంటి శుక్లం చికిత్స చేయకుండా వదిలేస్తే, చివరకు పునరుద్ధరించలేని విధంగా హాని చేయవచ్చన్నారు. ఈ నెల 14 వరకూ ఎల్వీప్రసాద్ ఆస్పత్రి ఆవరణలో చిత్రలేఖనం, ఫ్యాన్సీ డ్రెస్, వక్తృత్వ, క్లే మౌల్డింగ్, బ్రెయిలీ చదవడం, పోటరీ సెషన్లు నిర్వహించి బాలల దినోత్సవం రోజున బహుమతులు ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. -
అడుగుతో మొదలై.. లడ్డూతో ఘనమై.. ఖైరతాబాద్ మహాగణపతికి తుది మెరుగులు (చిత్రాలు)
-
విల్లులా.. ఒంపులు తిరిగిన కనుబొమ్మలకై ఈ డివైస్..!
విల్లులా.. ఒంపులు తిరిగిన కనుబొమ్మలు, నిండైన కనురెప్పలే కళ్లకు అందం. కనురెప్పలు పెద్దగా అందంగా ఉంటే ముఖం కళగా కనిపిస్తుంది. అందుకే చాలామంది కనురెప్పలకు త్రీడీ ఐలాష్లను అతికించుకుంటారు. అయితే చిత్రంలోని ఈ ఎలక్ట్రిక్ డివైస్ ఇంట్లో ఉంటే, ప్రత్యేకంగా ఐలాష్‌లు కొని అతికించుకోవాల్సిన అవసరం లేదు. దీంతో సహజంగా ఉన్న కనురెప్పలనే మరింత అందంగా తీర్చిదిద్దుకోవచ్చు.ఈ ఎలక్ట్రిక్ ఐలాష్ కర్లర్ మెషిన్ చార్జింగ్‌తో నడుస్తుంది. దీన్ని ముందే ఆన్ చేసి, హీట్ చేయాలి. అనంతరం కనురెప్పలకు అమర్చి ఉంచితే, అదే ఆ వెంట్రుకలను స్టైటెనింగ్ చేసి, కర్లింగ్ చేస్తుంది. దీంతో కనురెప్పలపై వెంట్రుకలు ఒంపులు తిరిగి పొడవుగా, అందంగా కనిపిస్తాయి. ఈ మెషిన్‌ను 10 సెకన్లలో ప్రీ హీట్ చేసుకోవచ్చు. దీనిలో రెండు రకాల మోడ్స్ ఉంటాయి. సెన్సింగ్ సిలికాన్ ప్యాడ్‌తో రూపొందిన ఈ డివైస్ చర్మానికి, కళ్లకు పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. వేడి ఎక్కువ కావడం, చర్మం కాలడంలాంటి సమస్యలు ఉండవు.దీనిలోని ఒక మోడ్ 65 డిగ్రీల ఫారెన్ హీట్ నుంచి 149 డిగ్రీల ఫారెన్ హీట్ వరకూ గ్రీన్ కలర్ లైట్‌ను చూపిస్తూ పని చేస్తుంది. అలాగే మరో మోడ్ 85 డిగ్రీల ఫారెన్ హీట్ నుంచి 185 డిగ్రీల ఫారెన్ హీట్‌తో బ్లూ కలర్ లైట్‌ను చూపిస్తూ పని చేస్తుంది. ఈ సెకండ్ మోడ్ ఆప్షన్ బిరుసైన వెంట్రుకలకు అనుకూలంగా ఉంటుంది. మోడ్‌లను మార్చడానికి డివైస్ పైభాగంలో సింగిల్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇనొవేటివ్ హీటింగ్ ఫంక్షన్ తో కూడిన ఈ ఎర్గోనామిక్ డిజైన్.. వినియోగానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అలాగే ఇది పోర్టబుల్, కాంపాక్ట్ కూడా. ఎక్కడికైనా సులభంగా తీసుకువెళ్లవచ్చు. ఇది మీ బ్యూటీ కిట్, కాస్మెటిక్ బాక్స్ లేదా ట్రావెల్ కేస్‌లో సులభంగా అమరిపోతుంది. ఈ డివైస్‌తో కనురెప్పలను కర్ల్ చేసుకుని, అనంతరం మస్కారా, ఐలైనర్ వంటివి వేసుకుంటే సరిపోతుంది.ఇవి చదవండి: Health: ఎటువంటి మందులు వాడకుండానే ఇలా జరిగింది.. అసలు కారణాలేంటి? -
ఈగను చంపడంతో ..ఏకంగా కన్నేపోగొట్టుకున్నాడు..!
వర్షాకాలం, లేదా తీపి వంటకాల ఘుమఘమలకు ఈగలు ముసురుతుంటాయి. వాటితో సమస్య అంత ఇంత కాదు. ఈగల వల్లే పలు అనారోగ్య సమస్యలు వస్తుంటాయని మనందరికీ తెలిసిందే. వాటి నివారణ కోసం పలు క్రిమి సంహరక నివారణలు వాడుతుంటాం కూడా. అయినా ఎక్కడొక చోట ఒక్క ఈగ అయినా ఉంటూనే ఉంటుంది. ఉన్న ఒక్క ఈగ ఒక్కోసారి మన చుట్టూ తిరుగుతూ ముఖంపై వాలుతూ విసిగిస్తూ ఉంటుంది. చిర్రెత్తుకొస్తే చంపందేకు యత్నిస్తాం. ఇలానే ఓ వ్యక్తి చేసి ఏకంగా కంటినే పోగొట్టుకున్నాడు. ఎలాగంటే..వివరాల్లోకెళ్తే..చైనాలో ఈ దిగ్బ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. చైనాలోని గ్వాంగ్డాంగ్లోని దక్షిణ ప్రావిన్స్‌లోని షెన్జెన్లో నివశిస్తున్న వ్యక్తికి ఒకరోజు ఈగ అతడి చుట్టూ తిరుగుతూ సందడి చేస్తుంది. దీంతో విసుగొచ్చి దాన్ని చంపాడు. అంతే ఒక గంట తర్వాత ఎడమ కన్ను ఎర్రగా అయ్యి వాపు వచ్చేసింది. ఆ తర్వాత ఒకటే నొప్పిపుట్టడంతో తాళ్లలేక వైద్యులను సంప్రదించాడు. వైద్యులు మందుల ఇచ్చిన తర్వాత కూడా పరిస్థితి మెరుగవ్వకపోగ, పరిస్థితి మరింత దిగజారింది. వైద్య పరీక్షల్లో అతడికి కండ్లకలక వచ్చినట్లు నిర్థారణ అయ్యింది. అంతేగాదు అతడి కంటి చుట్టూ ఉన్న ప్రాంతం వ్రణాలు వచ్చి ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయింది. ఆ ఇన్ఫెక్షన్ కాస్త మెదడుకు వ్యాపించే అవకాశం ఉందని భావించి ఎడమ కనుబొమ్మను మొత్తం తొలగించారు. ఈ మేరకు వైద్యులు మాట్లాడుతూ..ఈగలాంటి కీటకాలు బాత్రూమ్లు, బాత్‌టబ్‌లు, సింక్లు, కిచెన్లలో ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎక్కువగా తడిప్రదేశాల్లో కనిపిస్తాయి. ఈ కీటకాలు కళ్ల దగ్గరే తచ్చాడుతున్నప్పుడూ ప్రశాంతంగా ఉండాలి. దాని వద్దకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. బదులుగా అది తాకిన ప్రాంతాన్ని పరిశుభ్రమైన నీరు లేదా సెలైన్ ద్రావణంతో కడగాలని అన్నారు. ప్రస్తుతం ఈ ఘటన చైనా ప్రజలందర్నీ కలవరపాటుకి గురిచేసింది. ఈ విషయం నెట్టింట వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఇది చాలా భయనకంగా ఉంది. తాము కూడా తరుచు బాత్రూంలలో ఇలాంటివి చూస్తామని, దేవుడు దయ వల్ల ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదంటూ పోస్టులు పెట్టారు.(చదవండి: అనంత్ పెళ్లిలో హైలెట్‌గా ఏనుగు ఆకారపు డైమండ్ బ్రూచ్..ఆ డిజైన్లోనే ఎందుకంటే..!) -
ఈ మినీ మెషిన్‌తో.. స్కిన్ సమస్యలకు చెక్!
వయసు పెరిగే కొద్ది కళ్ల చుట్టూ ముడతలు, పెదవుల చుట్టూ గీతలు పడటం సర్వసాధారణం. అయితే దాన్ని.. చిత్రంలోని ఈ మైక్రోకరెంట్ లైన్ స్మూతింగ్ ఇన్స్టంట్ ప్లంపర్ డివైస్‌తో తగ్గించుకోవచ్చు. ఈ మినీ మెషిన్.. ఆ సమస్యను కేవలం వారం రోజుల్లోనే పరిష్కరించేస్తుంది.ఈ మినీ మెషిన్ తో ట్రీట్మెంట్ తీసుకుంటే.. కళ్లు కాంతిమంతమవుతాయి. పెదవులు ఆరోగ్యంగా కనిపిస్తాయి. ఈ డివైజ్‌కి ఒకవైపు రెండు చిన్న చిన్న బాల్స్ లాంటి మసాజర్ హెడ్స్ ఉంటాయి. వాటిని చర్మానికి ఆనించి మసాజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టూల్‌కి మధ్యలో చిన్న రోలర్ బాటిల్ ఉంటుంది. అందులో సీరమ్ ఉంటుంది.మసాజ్ చేసుకునేముందు ఆయా ప్రదేశాల్లో ఆ సీరమ్‌ని అప్లై చేసుకుని ట్రీట్మెంట్ తీసుకోవాలి. సీరమ్ రోలర్ని డివైస్ నుంచి బయటికి తీసుకోవచ్చు.. తిరిగి అక్కడే అటాచ్ చేసుకోవచ్చు. ఈ సీరమ్ .. యాంటీ ఆక్సిడెంట్ కెఫిన్, క్రాన్ బెర్రీ ఎక్స్ట్రాక్ట్, రోజ్ వాటర్, ఫర్మింగ్ నియాసినామైడ్, విటమిన్ బి5 వంటి 95% సహజ పదార్థాలతో తయారైంది.ఈ మెషిన్ తో సుమారు ఏడు రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటే.. కళ్లు, పెదవుల చుట్టూ ఉన్న ముడతలు, గీతలు పోయి సహజమైన అందం సొంతమవుతుంది. ఈ డివైస్‌కి చార్జింగ్ పెట్టుకుని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఈ మసాజర్‌లో 5 లెవల్స్‌తో కూడిన ఆప్షన్్స ఉంటాయి. దాంతో అవసరాన్ని బట్టి పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. ధర 186 డాలర్లు. అంటే 15,530 రూపాయలన్నమాట.ఇవి చదవండి: ఇవి మార్జాల పుష్పాలనుకుంటున్నారా! -
కనురెప్పల సోయగానికై.. ఇలా చేయండి!
ఆర్టిఫీషియల్ ఐ లాషెస్తో కళ్లను మీనాల్లా మెరిపించవచ్చని తెలిసినాకూడా వాటిని ఎలా అమర్చుకోవాలో అర్థం కాక ఇబ్బంది పడుతుంటే... ఒకసారి ఇలా ట్రై చేయండి.ఆర్టిఫీషియల్ ఐ లాషెస్ (సౌందర్య సాధనాల మార్కెట్లో దొరుకుతాయి) ఒక సెట్, వాటిని అమర్చడానికి ఐలాష్ గ్లూ తీసుకోవాలి.వీటితోపాటు కత్తెర, ట్వీజర్, ఐ లాష్ కర్లర్, ఐ లైనర్, మస్కారా తీసుకోవాలి.ఆర్టిఫీషియల్ ఐ లాషెస్ మరీ పొడవుగా ఉన్నట్లనిపిస్తే తగినంత మేరట్రిమ్ చేయాలి.ట్వీజర్ సహాయంతో లాషెస్‌కు గ్లూ పట్టించాలి. ఇప్పుడు వాటిని జాగ్రత్తగా కనురెప్ప మీద అమర్చాలి. గ్లూ ఆరి లాషెస్ సెట్ అయ్యే వరకు ఆగాలి. స్కిన్‌కు అంటుకోకుండా గ్లూవిడిగా ఆరిపోతున్నట్లు అనిపించినా, ఆరాక ఊడి వచ్చేటట్లు అనిపించినా కనురెప్పల మీద ఆర్టిఫీషియల్ లాషెస్ కరెక్ట్‌గా సెట్ అయ్యేటట్లు మెల్లగా నొక్కాలి.గ్లూ ఆరిన తర్వాత లాషెస్‌కు డార్క్‌షేడ్ ఐ లైనర్ అప్లయ్ చేయాలి. ఇలా చేయడం వల్ల అసలు కనురెప్పలకు, ఆర్టిఫీషియల్ లాషెస్‌కు మధ్య తేడా కనిపించకుండా అంతా ఒకేలా ఉంటాయి.చివరగా ఐలాష్ కర్లర్‌తో వంపు తిప్పాలి. అవసరమనిపిస్తే (మరింతడార్క్గా కనిపించాలనుకుంటే) మస్కారా అప్లయ్ చేయాలి.ఇవి చదవండి: మొలకలతో బోలెడన్ని ప్రయోజనాలు, ఈ సైడ్ ఎఫెక్ట్స్ తెలుసుకోండి! -
కళ్లు కలువ పువ్వుల్లా పెద్దవిగా ఉండాలంటే.. ఈ ఐ బ్యాండ్ ఉంటే చాలు!
అందానికి సహజ చిట్కాలు పాటించేవాళ్లు కొందరైతే.. మేకప్‌తో కవర్ చేసుకునేవారు మరికొందరు. అయితే ఏ పద్ధతి పాటించినా.. ముఖం కళగా, అందంగా కనిపించాలంటే.. కళ్లు ప్రత్యేకంగా అగుపించాలి. ఈ చిత్రంలోని సౌందర్య సాధనం కళ్లను అందంగా తీర్చిదిద్దుతుంది. ఇది కళ్లను పెద్దవిగా, కలువ పువ్వులా మారుస్తుంది. ఈ ఐ బ్యాండ్.. కళ్ల చుట్టూ ఉండే ప్రాంతాన్ని సాగదీసి.. ముఖానికి సొగసులు అద్దుతుంది. దీన్ని స్నానం చేస్తున్నప్పుడు కూడా సులభంగా ధరించొచ్చు. టీవీ చూస్తున్నప్పుడు.. ఇంటి పనులు చేసుకుంటున్నప్పుడు.. ల్యాప్‌టాప్ వర్క్ చేసుకునేటప్పుడూ చక్కగా వాడొచ్చు. చిత్రంలో చూపించినట్టుగా కేవలం 10 నిమిషాల పాటు కళ్లకు పెట్టుకుంటే చాలు. కళ్లు కలువల్లా ఆకర్షణీయంగా మారుతాయి. ఈ బ్యాండ్ లోపలివైపున 50కి పైగా చిన్న చిన్న పవర్ బాల్స్ అమరి ఉంటాయి. ఈ బ్యాండ్‌ని సులభంగా చెవులకు తగిలించుకుంటే.. కళ్లకు బిగుతుగా, పట్టినట్లుగా ఉంటుంది. దీని ధర 25 డాలర్లు. అంటే 2,074 రూపాయలు. (చదవండి: లీఫ్ ఆర్ట్: ఇంటికి సరికొత్త అలంకరణ తెచ్చే ఆర్ట్!) -
హాలీవుడ్‌కి హాయ్ చెప్తున్న మన హీరోయిన్స్
హాలీవుడ్లో చాన్స్ అంటే అంత సులభం కాదు. కానీ ప్రతిభ, కష్టపడేతత్వం ఉంటే అసాధ్యం కూడా కాదు. దాంతో పాటు కాస్త అదృష్టం కూడా తోడవ్వాలి. అలా టాలెంట్‌తో పాటు హార్డ్‌వర్క్ చేస్తున్న కొందరు హీరోయిన్లను అదృష్టం కూడా వరించడంతో హాలీవుడ్ కబురు అందింది. హాలీవుడ్‌కి హాయ్ చెప్పిన ఆ కథానాయికల గురించి తెలుసుకుందాం. ► శ్రుతీహాసన్‌కు గత ఏడాది బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. శ్రుతి హీరోయిన్గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’, ‘సలార్: సీజ్ఫైర్’ సినిమాలు సూపర్ హిట్స్‌గా నిలిచాయి. అలాగే శ్రుతీహాసన్ ఓ లీడ్ రోల్లో చేసిన ఇంగ్లిష్ ఫిల్మ్ ‘ది ఐ’ గ్రీక్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమైంది. ‘రివర్ సిటీ’, ‘ది లాస్ట్ కింగ్డమ్’ వంటి సిరీస్‌లలో నటించిన మార్క్ రౌలీ ఈ సినిమాలో శ్రుతీహాసన్‌కు జోడీగా నటించారు. దర్శకురాలు డాఫ్నే ష్మోన్ తెరకెక్కించారు. ‘ది ఐ’ సినిమాను త్వరలోనే థియేటర్స్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. సో.. శ్రుతీ హాసన్‌కు ఇదే తొలి ఇంగ్లిష్ మూవీ అవుతుంది. అలాగే ‘ది ఐ’ చిత్రం లండన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫెస్టివల్లో పదర్శితం కానుంది. బెస్ట్ ఫిల్మ్ విభాగంలో నామినేషన్ దక్కించుకుంది. ఇదే జోష్‌లో ‘చెన్నై స్టోరీ’ అనే మరో ఇంగ్లిష్ ఫిల్మ్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు శ్రుతీహాసన్. ‘ది ఆరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్’ నవల ఆధారంగా ‘బాఫ్తా’ అవార్డు విజేత ఫిలిప్ జాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో శ్రుతీహాసన్‌కు లీడ్ పెయిర్‌గా అమెరికన్ నటుడు వివేక్ కల్రా నటిస్తారు. ఓ ప్రైవేటు డిటెక్టివ్ ఏజెన్సీ నడిపే అను (శ్రుతి పాత్ర) అనే యువతి నేపథ్యంలో సాగే రొమాంటిక్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఫిల్మ్ ఇది. ఇండో–యూకే ్ర΄÷డక్షన్ నిర్మించనున్న ఈ చిత్రానికి యూకేకి చెందిన బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఫండింగ్ చేయనుంది. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ్రపారంభం కానుంది. అయితే ఈ సినిమాలో తొలుత సమంత నటించాల్సింది. కొన్ని కారణాల వల్ల సమంత తప్పుకోవడంతో శ్రుతీహాసన్ చేస్తున్నారు. ► తెలుగు మూలాలు ఉన్న నాయిక శోభితా ధూళిపాళ. ఈ బ్యూటీ అడివి శేష్ హీరోగా రూపొందిన ‘గూఢచారి’, ‘మేజర్’ వంటి సినిమాల్లో హీరోయిన్గా నటించారు. మలయాళం, హిందీ భాషల్లోనూ సినిమాలు చేశారు. అయితే శోభితకు హాలీవుడ్ నుంచి కబురొచ్చింది. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ ఫేమ్ దేవ్ పటేల్ నటించి, దర్శకత్వం వహించిన ఇంగ్లిష్ మూవీ ‘మంకీ మ్యాన్’లో ఓ లీడ్ రోల్ చేశారు శోభిత. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదలైంది. సినిమాను ఏప్రిల్ 5న థియేటర్స్‌లో విడుదల చేయనున్నారు. ‘‘నా తొలి హాలీవుడ్ మూవీకి మీ (అభిమానులు, ప్రేక్షకులను ఉద్దేశించి) ప్రేమ, అభిమానం కావాలి’’ అంటూ ఈ సినిమాను ఉద్దేశించి పేర్కొన్నారు శోభిత. ► దాదాపు నాలుగు దశాబ్దాలు వెండితెరపై వెలిగిన అలనాటి తార నూతన్ వారసురాలు ప్రనూతన్ బహల్. వెండితెరపై హిందీ చిత్రం ‘నోట్‌బుక్’ (2019)తో నటిగా ప్రయాణాన్ని మొదలు పెట్టారు ప్రనూతన్. ఆ తర్వాత ‘హెల్మెట్’ (2021)లోనూ మెరిశారామె. ఇప్పుడు ఈ యంగ్ బ్యూటీకి హాలీవుడ్ ఆఫర్ వచ్చింది. అమెరికన్ యాక్టర్ రహ్సాన్ నూర్ నటిస్తూ, దర్శకత్వం వహించనున్న ఓ రొమాంటిక్ డ్రామాలో ప్రనూతన్ హీరోయిన్గా నటించనున్నారు. ‘కోకో అండ్ నట్’ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా చిత్రీకరణ జూన్‌లో చికాగోలో ్రపారంభం కానుంది. ఇంగ్లిష్, ఇండియన్ నటులు ఈ సినిమాలో నటిస్తారు. ఈ ముగ్గురితో పాటు మరికొంతమంది హీరోయిన్ల హాలీవుడ్ ఎంట్రీ జరిగే అవకాశం ఉంది. -
కళ్లకు గంతలు కట్టుకుని మరీ రంగోలీ ముగ్గు!
అయోధ్యలో భవ్య రామమందిరం జనవరి 22న ప్రారంభవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ దైన శైలిలో తమ భక్తి భావాన్ని చాటుకుంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఒక్కొక్కరూ ఒక్కో పంథాలో అసాధ్యకరమైన పనులతో తమ భక్తి శక్తిని చాటుతూ విస్తుపోయేలే చేస్తున్నారు. ఆ బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట ఇంకొద్ది రోజుల్లో జరగనుండగా ఒక వైపు నుంచి అయోధ్యకు ఎంతో విలువైన కానుకలు వస్తున్నాయి. దీంతోపాటు రామ అన్న పేరుకి శక్తి ఏంటో తెలిసేలా ఒక్కో విశేషం రోజుకొకటి చొప్పున వెలుగులోకి వస్తోంది. ఇలాంటి వింతలు, విచిత్రాలు చేస్తుంటే ఆ లీలా స్వరూపుడే ఇలా తన భక్తులచే అసాధ్యమైన వాటిని చేయించుకుంటున్నాడా అన్నంత ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అలాంటి అనితర సాధ్యకరమైన ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. అదేంటో వింటే మాత్రం ఆశ్చర్యపోవడం ఖాయం. బీహార్‌లోని దర్భంగాకు చెందిన మోనికా గుప్తా అనే అమ్మాయి కళ్లకు గంతలు కట్టుకుని మరీ రంగోలీ వేసింది. అదికూడా రామ మందిరాన్ని ముగ్గు రూపంలో వేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. రామ భక్తితో ఎంతటి అసాధ్యమైన కార్యాన్ని అయినా సాధించొచ్చు అని నిరూపించింది మోనికా. ఆమె కళ్లకు గంతలు కట్టుకుని ఏ మాత్రం తడబడకుండా చాలా చాకచక్యంగా పెట్టింది. మాములుగా గీసినా.. ఎన్నో సార్లు చెరిపి.. చెరిపి..గీస్తాం అలాంటిది. చూడకుండా ముగ్గు వేయడం అంటే మాటలు కాదు. కానీ జనవరి 22న అయెధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో ఆమె బిహార్ నుంచి అయోధ్యకు వచ్చి మరీ ఇలా అసాధ్యకరమైన రీతీలో ముగ్గు వేయడం విశేషం. ఈ మేరకు మౌనిక మాట్లాడుతూ.. తాను ఎంఎస్సీ చదువుతున్నట్లు పేర్కొంది. తనకున్న ధ్యానం చేసే అలవాటు కారణంగానే ఇంతలా సునాయాసంగా చూడకుండా ముగ్గు వేయగలిగానని చెప్పుకొచ్చింది. ఈ ఘనత సాధించగలిగేందుకు కారణం తాను తల్లి వద్ద విన్నా మహాభారత గాథేనని చెబుతోంది. ఆ ఇతిహాసంలో దృతరాష్ట్రుడికి కళ్లకు కనిపించేలా సంజయుడు వివరించిన కౌరవులు పాండవుల యుద్ధ ఘట్టం. అలాగే మత్సయంత్రాన్ని చేధించటంలో అర్జునుడు కనబర్చిన ప్రతిభ పాటవలు తనను ఇలాంటి ఘనత సాధించేందుకు ప్రేరణ ఇచ్చాయని చెప్పుకొచ్చింది. ఇలా కళ్లకు గంతలు కట్టుకుని రంగోలీలు వేయడాన్ని నాలుగేళ్ల ప్రాయం నుంచే ప్రారంభించానని, ఏడేళ్లు వచ్చేటప్పటికీ ధ్యాన సాధనతో దానిపై పూర్తిగా పట్టు సాధించగలిగానని చెప్పింది. ఇలా చూడకుండా మనోనేత్రంతో గీయ గలిగే సామర్థ్యాన్ని సిక్త్స్ సెన్స్ యాక్టివేషన్ లేదా థర్డ్ ఐ యాక్టివేషన్‌గా అభివర్ణించింది మౌనిక. కాగా ఈ రామమందిర ప్రారంభోత్సవానికి ఎంతో మంది ప్రముఖులు, సెలబ్రెటీలు హాజరుకానున్నారు. (చదవండి: శని దోషాలు పోయి, సకల శుభాలు కలగాలంటే ఇలా చేయండి! ) -
సర్జరీ చేస్తున్న టైంలో పేషెంట్‌పై డాక్టర్ దాడి! వీడియో వైరల్
ఓ వైద్యుడు విచక్షణ మరిచి సర్జరీ చేసే సమయంలో పేషెంట్‌పై దాడికి దిగాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో పెద్ద దుమారం రేగింది. అతను అలా దాడి చేయడంతో ఆమెకు గాయాలు కూడా అయ్యాయని సదరు ఆస్పత్రి బాధితుడికి నష్ట పరిహారం కూడా చెల్లించినట్లు సమాచారం. ఈ షాకింగ్ ఘటన చైనాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..2019లో జరిగిన ఘటన ఆలస్యంగా ఇప్పుడు వెలుగులోకి వచ్చినట్లు చైనా పేర్కొంది. దీనిపై ఇప్పుడు చైనా అధికారులు కూలంకషంగా ధర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ఐయర్ ఆస్పత్రిలో జరిగినట్లు చైనా అధికారులు వెల్లడించారు. బాధితురాలు ఆక్టోజెనేరియన్ అనే 82 ఏళ్ల మహిళ కంటి ఆపరేషన్ కోసం ఆస్పత్రికి వచ్చింది. అయితే ఆమెకు అనస్థీషియా ఇచ్చి సర్జరీ చేస్తుండగా, ఆమె అసహనంతో కదలిపోవడం ప్రారంభించింది. ఐతే రోగికి స్థానికి మాండలిక భాష మాత్రేమ తెలుసు. పాపం వైద్యుడికి ఆ భాషలో అంత ప్రావిణ్యం లేదు. అందువల్లో ఇరువరి మధ్య కమ్యూనికేషన్ కాస్త ఇబ్బందిగా మారింది. ఓ పక్క సర్జరీ టైంలో పేషెంట్ కనుబొమ్మలు కదిలించడం వంటివి చేశాడు. వైద్యుడు చెబుతున్నవేమి రోగికి అర్థంగాక అదేపనిగా కదలడంతో అసహనం చెందిన వైద్యుడు కొట్టడం జరిగింది. దీంతో ఆమె ఎడమ కన్ను పైభాగంలో గాయలయ్యాయి. అందుకు సదరు ఆస్పత్రి దాదాపు 500 యువాన్లు(రూ. 60, వేలకు పైనే) వరకు నష్టపరిహారం చెల్లించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే సదరు వైద్యుడిపై మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదు. అనూహ్యంగా ఆ ఘటనకు సంబంధించిన సీసీఫుటేజ్ వీడియో నెట్టింట చక్కెర్లు కొడుతుండటంతో మళ్లీ తెరపైకి వచ్చింది. దీంతో చైనా అధికారులు ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఈ షాకింగ్ ఘటన ఐయర్ ఆస్పత్రిలో జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. బాధితురాలి కొడుకు ఈ సంఘటన గురించి మాట్లాడుతూ..ఆ డాక్టర్ దూకుడు ప్రవర్తన కారణంగా ఎడమ కన్ను పైభాగంలో కూడా గాయలయ్యాయిని, ఐతే ఆస్పత్రి యాజమాన్యం డబ్బులు చెల్లించినట్లు పేర్కొన్నారు. అయితే ఈ ఘటనపై సీరియస్ అయిన అధికారులు సదరు ఆస్పత్రి సీఈవో, ఆ వైద్యుడిని తక్షణమే విధుల నుంచి బహిష్కరించారు. ఇలాంటి పవిత్రమైన వృత్తిలో అలాంటి అనుచిత ప్రవర్తన తగదని, తక్షణమే చర్యలు తీసుకుంటామని చైనా అధికారులు వెల్లడించారు. (చదవండి: బ్లూ సీ డ్రాగన్! చూడటానికీ అందంగా ఉందని టచ్ చేశారో అంతే..!) -
శంకర నేత్రాలయ వ్యవస్థాపకుడు బద్రీనాథ్ కన్నుమూత
సాక్షి, చెన్నై: కంటి చికిత్స లతో ఎందరో పేదల జీవితాల్లో వెలుగులు నింపిన శంకర నేత్రాలయ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎస్.ఎస్.బద్రీనాథ్(83) వయోభారంతో చెన్నైలో మంగళవారం కన్ను మూశారు. 1978లో శంకర నేత్రాలయ పేరిట స్వచ్ఛంద సంస్థను ఆయన ఏర్పాటు చేశారు. చెన్నై నుంగంబాక్కం కేంద్రంగా శంకర నేత్రాలయ ద్వారా అనేక బ్రాంచీలతో ఉచితంగా పేదలకు సేవలు అందించారు. రోజుకు కనీసం తన బృందం ద్వారా 1,200 మందికి చికిత్సలు, వంద మందికి ఆపరేషన్లు చేసే వారు. ఆయన సేవలకు గుర్తింపుగా 1996లో పద్మభూషణ్‌తో కేంద్రం సత్క రించింది. అలాగే బీసీ రాయ్ అవార్డుతో పాటు అనేక పురస్కారాలు ఆయనను వరించాయి. చెన్నై ట్రిప్లికేన్‌లో 1940 ఫిబ్రవరి 24న బద్రీనాథ్ జన్మించారు. 1962లో మద్రాస్ వైద్యకళాశా లలో వైద్య కోర్సును పూర్తి చేశారు. అనంతరం ఆమెరి కాలో ఉన్నత విద్య ను అభ్యసించారు. 1970లో చెన్నై అడయార్‌లో వాలంటరీ హెల్త్ సర్వీస్ పేరిట సేవా కార్య క్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆయన మృతి నేత్ర వైద్య వర్గాల్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. తమిళనాడు సీఎం స్టాలిన్‌తో పాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. -
కాలుష్యంతో ఏఏ క్యాన్సర్లు వస్తాయి? 18 ఏళ్లలో ఏం జరిగింది?
పెరుగుతున్న క్యాన్సర్ కేసులు అందరినీ బెంబేలెత్తిస్తున్నాయి. ఢిల్లీలో గత 18 ఏళ్లలో క్యాన్సర్ మరణాలు మూడున్నర రెట్లు పెరిగాయి. దీనికి కాలుష్యం కూడా ఒక కారణమని వైద్యులు భావిస్తున్నారు. వాయు కాలుష్యంతో ప్రధానంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. అలాగే బ్లడ్ క్యాన్సర్, కంటి క్యాన్సర్, ఉదర, మూత్ర సంబంధిత క్యాన్సర్లు కూడా వచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. కాలుష్యం కారణంగా 11 రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీ పౌర రిజిస్ట్రేషన్ డేటాలోని వివరాల ప్రకారం 2005వ సంవత్సరంలో ఢిల్లీలో క్యాన్సర్ కారణంగా రెండు వేల నుండి రెండున్నర వేల మంది బాధితులు మరణించారు. గత ఏడాది 7400 మందికి పైగా క్యాన్సర్ బాధితులు మరణించారు. పిల్లలు, యువత కూడా క్యాన్సర్ బాధితులుగా మారుతున్నారు. గత ఏడాది క్యాన్సర్‌తో మరణించిన వారిలో దాదాపు నాలుగో వంతు మంది 44 ఏళ్లలోపు వారే. ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణంగా సంభవించే మరణాలు కూడా పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో ఏటా దాదాపు 14.50 లక్షల మంది క్యాన్సర్ బారినపడుతున్నారని, అలాగే ఏటా తొమ్మిది లక్షల మంది బాధితులు మరణిస్తున్నారని ఎయిమ్స్ క్యాన్సర్ సెంటర్ రేడియేషన్ ఆంకాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అభిషేక్ శంకర్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన పలు పరిశోధనలలో.. కాలుష్యపూరిత ప్రాంతాలలో నివసించే వారిలో మూత్రాశయ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, కంటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తేలింది. వాతావరణంలో ఎంపీ 2.5 స్థాయి క్యూబిక్ మీటరుకు 2.5 మిల్లీగ్రాముల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 28 శాతం పెరుగుతుందని ఒక అధ్యయనంలో వెల్లడయ్యింది. క్యాన్సర్‌కు ఇతర కారణాలు కూడా ఉన్నాయి. ఈ జాబితాలో అస్తవ్యస్త జీవనశైలి, ధూమపానం, పొగాకు వినియోగం, మద్యపానం మొదలైనవి ఉన్నాయి. ఇది కూడా చదవండి: అక్షరాస్యతలో దేశం ఎక్కడుంది? -
వైద్యశాస్త్రంలో అరుదైన ఫీట్! మొత్తం కంటినే మార్పిడి..
వైద్యశాస్త్రంలో మరో అద్భుతమైన ఫీట్‌ని సాధించింది. ఇంతవరకు సాధ్యం కానీ అరుదైన పూర్తి స్థాయి కంటిమార్పిడి శస్త్ర చికిత్సను చేసి చరిత్ర సృష్టించారు వైద్యులు. దీంతో భవిష్యత్తులో అంధుల కళ్లల్లో వెలుగును ప్రసాదించేలా సరికొత్త వైద్య విధానానికి నాంది పలికారు. ఏంటా అరుదైన శస్త్ర చికిత్స తదితరాల గురించే ఈ కథనం!. వైద్యశాస్త్రంలో ఇంతవరకు మొత్తం కంటిని మార్పిడి చేయండం సాధ్యం కాలేదు. అలా అయితే చాలామంది చనిపోయేటప్పుడూ కళ్లు దానం చేస్తున్నారు కదా అని అడగొచ్చు. అదీగాక కొందరూ పేషెంట్లు కన్నుమార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్నాం అంటారు కదా! అనే సందేహం కూడా మనకు వస్తుంది. కానీ అది కన్నుమార్పిడి చికిత్స కాదు జస్ట్ కార్నియా ట్రాన్స్‌ప్లాంట్ లేదా కార్నియల్ గ్రాఫ్టింగ్ అంటారు. కంటికి ఏదైన గాయం లేదా వాపు కారణంగా మచ్చలు తీవ్ర స్థాయిలో ఏర్పడి చూపుపై ప్రభావం ఏర్పడవచ్చు లేదా దృష్టి లోపం రావచ్చు. అలాంటప్పుడు దాత నుంచి స్వీకరించిన కార్నియాను నేత్ర వైద్యుడు పేషెంట్‌కు ట్రాన్స్‌ప్లాంట్ చేస్తాడు. స్పష్టమైన దృష్టికి కార్నియా అత్యంత ముఖ్యం. అంతే గానీ పూర్తి స్థాయిలో కంటిని అమర్చడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే? మన కళ్లు చిత్రాన్ని బంధించే కెమరాలాంటివే. కానీ మన మెదడు వాటిని ప్రాసెస్ చేసి ఆ వస్తువు ఏంటీ? అనేది ఐడెంటిఫై చేయగలదు. అంటే మన మెదడుతో కన్ను అనుసంధానమైతేనే చూడగలం. ఇక్కడ కంటి నుంచి మెదడుకు దృశ్యమాన సంకేతాలను పంపే ఆప్టిక్ నాడి ద్వారా మన కళ్ళు అనుసంధానించి ఉండటం అనేది అత్యంత ముఖ్యం. అందువల్ల కన్ను అనేది మెదడుకు ఆప్టిక్ నరాలతో అనుసంధానించి ఉన్న సంక్లిష్ట అవయవం. ప్రమాదవశాత్తు ఈ నరాలు తెగిపోయిన లేదా దెబ్బతిన్న చూపు తెప్పించడం అనేది అసాధ్యం. ఈ ఆప్టిక్ నరాలు పరిమాణం పరంగా చిన్నవే అయినప్పటికీ.. కంటి నుంచి మెదడుకు మిలియన్లకు పైగా చిన్న నరాలు కనెక్ట్ అయ్యి ఉంటాయి. పొరపాటున తెగితే అతుక్కోవు. అందువల్ల మొత్తం కంటిని మార్పిడి చేయలేరు వైద్యులు. ఒకవేళ వైద్యలు మొత్తం కంటిని మార్పిడి చేసినా.. మెదడుకి కనెక్ట్ చేయడం అనేది కుదరదు. దీంతో ఆ కన్ను దృశ్యమాన సంకేతాలను మెదడకు పంపలేదు కాబట్టి రోగికి చూపు రావడం అనేది అసాధ్యం. అలాంటి అసాధ్యమైన సంక్లిష్ట శస్త్ర చికిత్సనే చేసి అరుదైన ఘనత సాధించారు అమెరికా వైద్యులు. ఇంతకీ ఆ వ్యక్తి చూపు వచ్చిందా? ఎలా మెదడుకు కంటిని కనెక్ట్ చేశారు చూద్దామా! వివరాల్లోకెళ్తే..46 ఏళ్ల ఆరోన్ జేమ్స్ సరిగ్గా 2021లో దాదాపు ఏడు వేల వోల్ట్ల విద్యుత్ వైర్లు అతని ముఖాన్ని తాగడంతో మెత్తం ఎడమ భాగం అంటే.. అతడి ఎడమ కన్ను, మోచేయి, ఎడమ చెంప, గడ్డంకి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతన్ని ముఖ పునర్నిర్మాణం కోసం అమెరికాలోని లాంగోన్ ఆస్పత్రికి తరలించగా.. మే 27న అతడికి శస్త్రచికిత్స చేశారు. ఐతే ఈ ప్రమాదంలో అతను ఎడమవైపు కంటిని పూర్తిగా కోల్పోయాడు. అయితే వైద్య శాస్త్రంలో సవాలుగా ఉన్న మొత్తం కంటి మార్పిడి శస్త్ర చికిత్సపై పలు పరిశోధనలు జరగుతున్న తరుణంలో జేమ్స్ పరిస్థితి ఓ సువర్ణావకాశంలా వైద్యులకు అనిపించింది. ఇంతవరకు ఎలుకలపై చేసిన ప్రయోగాలు కొంత మేర ఫలితం ఇచ్చినప్పటికి వాటికి పాక్షిక దృష్టి మాత్రమే వచ్చింది. మెరుగైన చూపు మాత్రం రాలేదు. ఇది సాధ్యమా కాదా! అనే ఆసక్తితో ఉన్న వైద్యులకు జేమ్స్ స్థితి కొత్త ఆశను చిగురించేలా చేసింది. అలాగే జీవించి ఉన్న వ్యక్తికి ఇంతవరకు ఇలాంటి ఆపరేషన్ చేయలేదు. దీంతో ఎడ్వర్డో రోడ్రిగ్జ్ వైద్యుల బృందం జేమ్స్‌కి ఈ సంక్లిష్టమైన పూర్తి స్థాయి కంటి మార్పిడి శస్త్ర చికిత్స చేయాలనుకున్నారు. దాదపు 21 గంటలు శ్రమించి, త్రీడీ టెక్నాలజీ సాయంతో జేమ్స్‌కి ఈ శస్త్ర చికిత్సను విజయవంతంగా చేశారు. అతని ఎడమ కన్నులోని రెటీనాకు రక్తప్రసరణలో సహా కాంతి స్వీకరించి మెదడుకు సంకేతం పంపేలా చేయగలిగారు. మార్పిడి చేసిన ఎడమ కన్ను మంచి ఆరోగ్యంతో ఉన సంకేతాలు చూపినట్లు తెలిపారు. నిజానికి జేమ్స్‌కు తన చూపుని తిరిగి పొందగలడని కచ్చితంగా చెప్పలేం. కానీ తాము ఎన్నోఏళ్లుగా చూస్తున్న అద్భుతమైన ఫీట్‌ని మాత్రం చేయగలిగాం అన్నారు. అతడి దృష్టికి వచ్చినా రాకపోయినా..ఈ ఆపరేషన్ మాత్రం తన 15 ఏళ్ల అనుభవంలో చాలా అతిపెద్ద ప్రయోగమని అన్నారు కొలరాడో అన్‌స్చుట్జ్ మెడిల్ ప్రోఫెసర్ కియా వాషింగ్టన్. ఇక జేమ్స్ తనకు జీవితంలో రెండో అకాశం కల్పించిన దాతకు అతని కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం అతను నెలవారి చెకప్‌ల కోసం ఆస్పత్రికి వస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఐతే శస్త్రచికిత్స తర్వాత గడిచిన సమయాన్ని బట్టి, జేమ్స్ కంటి చూపు తిరిగి వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఈ చికిత్సలో కన్ను మెదడుకు కనెక్ట్ అయ్యేలా ఆప్టిక్ నరాలను పనరుత్పత్తి చేయడమే గాక ఆ నరాలు మెరుగ్గా పనిచేసేలా ఎముక మజ్జలోని మూల కణాలను ఉపయోగించినట్లు తెలిపారు. ఈ ప్రయోగం ఫలిస్తే భవిష్యత్తులో అంధులకు దృష్టిని ప్రసాదించగలిగే సరికొత్త వైద్య విధానానికి నాంది పలకగలుగుతామని అన్నారు వైద్యులు. (చదవండి: చెఫ్ కాదు టెక్ జీనియస్!) -
'ప్టోసిస్' గురించి విన్నారా? కంటికి సంబంధించిన వింత వ్యాధి!
ఎన్నో వింత వ్యాధులు. ఎందుకొస్తాయో తెలియదు. వాటి వల్ల అనుభవించే బాధ అంత ఇంత కాదు. బయటపడటం కూడా అంత ఈజీ కూడా కాదు. వైద్య శాస్త్రనికే సవాళ్లు విసిరే విచిత్రమైన వ్యాధులు రోజుకోకటి చొప్పున పుట్టుకొస్తూనే ఉన్నాయి. స్వయంకృతాపరాధమో మనిషి స్వార్థానికి పరాకాష్ట అనాలో తెలియదు. అలాంటి వింత వ్యాధినే ఇక్కడొక మహిళ ఎదుర్కొంటోంది. రోజురోజుకి పరిస్థితి దారుణంగా మారిందే తప్ప తగ్గలేదని బోరుమని విలపిస్తోంది. ఆ మహిళకు వచ్చిన వింత వ్యాధి ఏంటీ? ఎందువల్ల అంటే.. అమెరికాలో ప్రముఖ నటి జీనత్ అమన్ నాలుగు దశాబ్దాలుగా ప్టోసిస్ అనే పరిస్థితితో బాధపడుతోంది. కొన్నేళ్ల క్రితం కంటికి తగిలిన గాయమే ఇందుకు కారణం. ఆమె కుడి కన్నుకు ఏర్పడిన గాయం కారణంగా ఆమె కంటి నరాలు దెబ్బతిన్నాయి. ఆ తర్వాత క్రమేణ కంటి రెప్ప కుంగిపోవడం లేదా కిందకు వాలిపోవడం జరిగింది. అలా పూర్తిగా కిందకు వచ్చేస్తోంది. అది ఆమె కంట్రోల్ లేదు. అంటే కనురెప్పను కదల్చలేదు. దీని వల్ల కనుచూపు తగ్గిపోతూ వచ్చింది. ఆఖరికి ఆపరేషన్ చేయించకున్న తన పరిస్థితిలో ఎలాంటి మెరుగుదల కనిపించలేదని ఇన్‌స్ట్రాగాం వేదికగా వాపోయింది. ఇంతకీ ప్టోసిస్ అంటే ఏంటీ.. ప్లోసిస్ అంటే 'డ్రూపింగ్ కనురెప్ప' అని అంటారు. దీని కారణంగా ఎగువ కనురెప్ప కుంగిపోవడం లేదా వైద్య పరిభాషలో స్థానభ్రంశం చెందడం అంటారు. అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆప్తాల్మోలజీ ప్రకారం ఈ పరిస్థితి ఒకటి లేదా రెండు కనురెప్పలను ప్రభావితం చేస్తుంది. ఇది దృష్టిని ప్రభావితం చేయొచ్చు లేదా పూర్తిగా దృష్టిని కోల్పోవచ్చు. ఈ పరిస్థితి వయస్సు సంబంధిత మార్పలు కారణంగా గానీ కండరాల బలహీనత లేదా నరాల బలహీనత/ పుట్టుకతో వచ్చే వివిధ సమస్యలు కారణం కావచ్చు. ప్టోసిస్ లక్షణాలు.. కనురెప్పలు వంగిపోవడం స్పష్టంగా చూడలేకపోవడం కనురెప్పలు పైకి లేపాలంటే భారంగా అనిపించడం కన్ను తెరవడమే కష్టంగా ఉండటం దైనందిన పనులు చేసుకోవడం కూడా కష్టమవ్వడం తదితర సమస్యలు ఉత్ఫన్నమైతే తక్షణమే కంటి నిపుణుడిని సంప్రదించడం అత్యంత ముఖ్యం. (చదవండి: మద్యపాన వ్యసనం ఇంత ఘోరంగా ఉంటుందా? ఏకంగా యాసిడ్‌లా మూత్రం..) -
తెలుగు సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంఎస్ ధోని
భారత క్రికెట్ అభిమానులకు ఎంఎస్ ధోనిపై ఉన్న ఆదరణ తెలియనిది కాదు. తన ఆటలోని ప్రత్యేకత అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రజల అభిమానాన్ని సంపాదించిన ఆయనను కంపెనీలు తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుని వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ చేస్తూ మరింత లాభాలు సంపాదిస్తుంటాయి. అయితే తాజాగా హైదరాబాద్‌కు చెందిన మ్యాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్స్ తన బ్రాండ్ అంబాసిడర్‌గా మహేంద్ర సింగ్ ధోనిని నియమించుకుంది. మాక్సివిజన్ ఐ హాస్పిటల్స్ గ్రూప్ సీఈఓ సుధీర్ మాట్లాడుతూ ‘మాక్సివిజన్‌లో మొత్తం 40+ హాస్పిటల్స్ ఉన్నాయి. ప్రతిరోజూ వేలాది మంది రోగులకు కంటి సంరక్షణ సేవలను అందిస్తున్నాం. మారుతున్న జీవనశైలిలో భాగంగా చాలా మంది గ్లుకోమా, రెటీనా సమస్యల వల్ల బాధపడుతున్నారు. కంటి చెకప్‌ల ద్వారా ఈ వ్యాధులను నివారించే అవకాశం ఉంటుంది. మ్యాక్సివిజన్ కంటి సంరక్షణను ప్రోత్సహించే లక్ష్యంతో ఆన్లైన్, ఆఫ్‌లైన్, ఆన్-గ్రౌండ్ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఎంఎస్ ధోని వంటి ప్రముఖ వ్యక్తి ఇందులో భాగం అవ్వడం హర్షణీయం’అని అన్నారు. ఇదీ చదవండి: చట్టవిరుద్ధంగా ట్రేడింగ్ చేసిన ఏఐ బోట్ స్పష్టమైన దృష్టితో క్రీడలు, జీవితంలో విజయం సాధించవచ్చని మ్యాక్సివిజన్ ఐ హాస్పటల్స్ బ్రాండ్ అంబాసిడర్ ఎంఎస్ ధోని అన్నారు. తరచూ కంటి పరీక్షల చేసుకోవడంతో వాటిని సంరక్షించుకోవచ్చని తెలిపారు. ఈ రంగంలో మాక్సివిజన్ అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. -
అలసిన కళ్లకు రిలీఫే ఈ ఐ మసాజర్!
మారిన లైఫ్ స్టయిల్ వల్ల మన బాడీలో బాగా స్ట్రెయిన్ అవుతున్నవి కళ్లే! కంప్యూటర్, సెల్‌ఫోన్.. కళ్లకు క్షణం తీరికనివ్వడం లేదు. దాంతో ఆ అలసట అందాన్ని ఎఫెక్ట్ చేస్తోంది. దానికి చక్కటి రిలీఫే ఐ మసాజర్. చిత్రంలోని ఈ హీటింగ్ ఫటీగ్ థెరపీ వెల్నెస్ డివైస్.. కళ్ల భారాన్ని, ఒత్తిడిని దూరం చేస్తుంది. ఇందులో హై, మీడియం, లో అనే త్రీ మోడ్స్ ఉంటాయి. ‘లో’ ఆప్షన్‌కి 36 డిగ్రీల సెల్సియస్ (97 డిగ్రీల ఫారెన్ హీట్) ప్రభావం ఉంటే.. ‘మీడియం’ ఆప్షన్‌కి 39 డిగ్రీల సెల్సియస్ (102 డిగ్రీల ఫారెన్ హీట్) ప్రభావం ఉంటుంది. ఇక ‘హై’ ఆప్షన్లో 42 డిగ్రీల సెల్సియస్ (108 డిగ్రీల ఫారెన్ హీట్) టెంపరేచర్ ఉత్పత్తి అవుతుంది. ఈ డివైస్ చేతిలో ఇమిడిపోయేంత చిన్నగా.. కళ్లకు అమరేంత సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది వేడెక్కడానికి 10 సెకన్ల సమయం పడుతుంది. అలాగే దీనికి చార్జింగ్ పెట్టుకోవడానికి ప్రత్యేకమైన ప్యాడ్ లభిస్తుంది. దాంతో ఈ మసాజర్‌ని వైర్‌లెస్‌గా వినియోగించుకోవచ్చు. ఇది ఒత్తిడిని తగ్గించడంతో పాటు.. అలసటను దూరం చేస్తుంది. కళ్ల చుట్టూ మచ్చలు, ముడతలు ఏర్పడి, కళాహీనంగా మారకుండా సంరక్షిస్తుంది. అలాగే సరికొత్త ఉత్తేజాన్ని ఇచ్చి రిలాక్స్ చేస్తుంది. ఈ పోర్టబుల్ పర్ఫెక్ట్ ఐ మసాజర్‌ని ప్రతిరోజూ వినియోగించుకోవచ్చు. (చదవండి: ముఖానికి ఫేస్ యోగా! దెబ్బకు మొటిమలు, మచ్చలు మాయం!) -
కండ్లకలక వస్తే అలా మాత్రం చేయకండి, కంటిచూపు పోతుంది
కండ్లకలక.. దీన్నే పింక్ ఐ లేదా ఐ ఫ్లూ అని అంటారు. కొంతకాలంగా తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో కండ్లకలక కేసులు కలవర పెడుతున్నాయి. ఇది తరచుగా బ్యాక్టీరియా లేదా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. అసలే వర్షకాలంలో జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో బాధపడే ప్రజలకు కండ్లకలక ఇప్పుడు మరో సమస్యగా మారింది. ఐ ఫ్లూ కరోనాలా అంటువ్యాధిగా మారుతోంది. కండ్లకలక వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్లను చూసినా ఈ వ్యాధి ఇతరులకు సోకుతుందా? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. కంటిలో చిన్న నలక పడినా ఆ బాధ వర్ణనాతీతం. అందుకే కంటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దేశ వ్యాప్తంగా గత కొన్నాళ్లుగా కండ్లకలక కేసులు కలవర పెడుతున్నాయి. వైరస్ లేదా బ్యాక్టీరియా వల్ల వచ్చే కలకలు ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాప్తి చెందుతాయి. ముఖ్యంగా గుంపుగా ఉన్న ప్రదేశాల్లో ఈ వ్యాధి సొందరగా ఇతరులకు సోకుతుంది. కండ్లకలక వచ్చిన రోగి నుంచి ఈజీగా ఎనిమిది మందికి వ్యాధి సోకే అవకాశం ఉంది.ఇంట్లో ఒకరికి వస్తే అందరికీ వస్తుంది. వ్యాధి నయం కావడానికి దాదాపు 10 రోజులు పడుతుంది. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే కంటిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఒక్కోసారి చూపు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. కండ్లకలక లక్షణాలు కళ్లు ఎరుపు లేదా గులాబీ రంగులోకి మారుతుంది. కంటి నుంచి కంటిన్యూగా నీరు కారుతుంది, కంటిరెప్పలు ఉబ్బిపోతాయి. సరిగా చూడలేకపోవడం, లైట్ వెలుతురును కూడా తట్టుకోలేకపోవడం దీని లక్షణాలు కండ్లకలక వస్తే జ్వరం, తేలిపాటి గొంతునొప్పి కూడా బాధిస్తుంది. కండ్లకలక వస్తే ఏం చేయాలి? కండ్లకలక సోకితే వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. కండ్లకు గోరువెచ్చటి కాపడాలు, మంట నుంచి ఉపశమనం పొందడానికి అనెల్జెసిక్స్ వాడొచ్చు. కంటి సమస్యలు రాకుండా ఉండేందుకు యాంటీ బయోటిక్ డ్రాప్స్ వాడాలి. కండ్ల కలక వచ్చిన వ్యక్తులకు దూరంగా ఉండాలి. వాళ్లు వాడిన వస్తువులు వాడొద్దు. కంటిని తరచుగా నీటితో కడుక్కోవాలి. దీంతో తొందరగా తగ్గిపోతుంది. నీళ్లు ఎక్కువగా తీసుకోవడంతో పాటు ఆరోగ్యకరమైన డైట్‌ను పాటించాలి. కండ్లకలక వస్తే ఇలా అస్సలు చేయొద్దు కండ్లకలక చిన్న సమస్యే అని సొంత వైద్యం చేసుకోవద్దు కళ్లను తరచూ తాకొద్దు, దీనివల్ల సమస్య మరింత పెరుగుతంది ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నప్పడు జనంలోకి తిరగడం వంటివి చేయొద్దు సమస్య చిన్నగా ఉన్నప్పుడే డాక్టర్ సలహా మేరకు చికిత్స తీసుకోవడం ఉత్తమం. కళ్ల కలక లక్షణాలు! 👁🗨కళ్ళలో నొప్పి, మంట, దురద 👁🗨కళ్ళు ఎర్రగా మారడం 👁🗨కళ్ళ నుంచి తరుచుగా నీరు కారడం 👁🗨కళ్ళు వాపు 👁🗨నిద్ర లేచిన తర్వాత కనురెప్ప అతుక్కుపోవడం 👁🗨నిర్లక్ష్యం చేస్తే కండ్ల నుంచి చీము కారడం#Conjuctivitis #HealthForAll #SwasthaBharat #EyeFlu #EyeConjuctivitis pic.twitter.com/rMmPxOdB0g — PIB in Telangana 🇮🇳 (@PIBHyderabad) August 2, 2023 #Conjuctivitis#HealthForAll#SwasthaBharat pic.twitter.com/1r7hp7II4D — Ministry of Health (@MoHFW_INDIA) August 2, 2023 వాళ్లను చూస్తే కండ్లకలక వస్తుందా? కండ్లకలక వచ్చినవారిని నేరుగా చూస్తే ఇతరులకు కూడా ఆ వ్యాధి సోకుతుందా? అంటే అది ఒట్టి అపోహ మాత్రమే అంటున్నారు వైద్యులు. వైరల్ కన్జక్టివిటిస్ ఉన్న వాళ్లను చూస్తే ఇది వ్యాపించదు. ఈ వ్యాధి ప్రధానంగా చేతుల ద్వారా ఇతరులకు సోకుంది. కండ్లకలక వచ్చిన వాళ్లు వాడిన వస్తువులను తాకడం, ఉపయోగించడం వల్ల ఈ వ్యాధి అంటుకుంటుంది. అలాగే వాళ్లు మాట్లాడేటప్పుడు నోటి తుంపర్ల నుంచి కూడా ఇతరులకు సోకే ప్రమాదం ఉంది. అంతేకానీ కండ్ల కలక సోకిన వాళ్లు మరొకరిని చూసినంత మాత్రాన్నే వ్యాధి సోకే అవకాశమే లేదు. ఇక సన్ గ్లాసెస్ లేదా ముదురు కళ్లద్దాలు ధరించడం వల్ల కండ్లకలక ఇతరులకు వ్యాపించదు అనే సందేహం చాలామందికి వెంటాడుతుంది. కానీ ఇందులో నిజం లేదు. కళ్లద్దాలు ధరించడం వల్ల అసౌకర్యాన్ని కొంతమేరకు అధిగమించే అవకాశం ఉంటుంది. కానీ వ్యాధిని నిరోధించే ఛాన్స్ లేదు. ✅గత కొద్ది రోజులుగా కళ్ల కలక 👁️కేసులు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ✅మరి ఇలాంటి సమయంలో చేయాల్సినవి, చేయకూడనివి తెలిస్తే త్వరగా నయం అవుతుంది. ✅అవేంటో కింది ఇన్ఫోగ్రాఫ్ ద్వారా తెలుసుకోండి#Conjuctivitis #HealthForAll #SwasthaBharat #EyeFlu #EyeConjuctivitis pic.twitter.com/EZ7TLH6axd — PIB in Telangana 🇮🇳 (@PIBHyderabad) August 2, 2023 -
కళ్ల..కలకలం
బనశంకరి: రాష్ట్రంలో కళ్లకలక (మద్రాస్ ఐ వైరస్) జబ్బు కలకలం సృష్టిస్తోంది. ఆస్పత్రుల్లో ఈ జబ్బు బాధితులతో కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ముందు జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్యశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. కంజక్టివైటీస్ అని పిలిచే మద్రాస్–ఐ, లేదా కంటి వైరస్ వ్యాధులు ఎంతో చికాకు కలిగిస్తాయి. వాతావరణంలో తేమ అధికంగా ఉండటం, లేదా చలి వాతావరణంలో పుట్టుకు వచ్చే వైరస్లు కంటిపై ప్రభావం చూపిస్తాయి. దీనికి తోడు నగరంలో విపరీతమైన రద్దీలో నలుగురైదుగురు బాధితులు సంచరించినా వైరస్ సులభంగా ఇతరులకు వ్యాపిస్తోంది. కొన్నిరోజులుగా వానలు, తడి వాతావరణం వైరస్‌కు దోహదం చేసింది. కేసులు రోజురోజుకు హెచ్చుమీరుతున్నందున జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్యశాఖ హెచ్చరించింది. ముందుజాగ్రత్త చర్యలు ► స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇవ్వాలి ► ఆరోగ్యవంతమైన వ్యక్తి వైరస్ సోకిన వ్యక్తి కంటిని నేరుగా చూడరాదు, బాధితులకు దూరంగా ఉండాలి. ► వైరస్ సోకిన వ్యక్తి వినియోగించిన టవల్, ఇతరవస్తువులను వాడరాదు ► అప్పుడప్పుడు సబ్బు నీటితో చేతులు శుభ్రం చేసుకోవాలి ► వైరస్ సోకిన వ్యక్తులకు జలుబు, జ్వరం, దగ్గు ఉంటే తక్షణం చికిత్స తీసుకోవాలి కళ్లకలక లక్షణాలు ♦ కళ్లు ఎర్రగా మారడం, నీరుకారడం ♦ కంటి నొప్పి – వెలుతురు చూడలేకపోవడం దృష్టి మందగించడం ♦ కంటి రెండురెప్పలు వాచిపోయి ఉబ్బెత్తుగా మారడం వైద్యులను సంప్రదించండి ♦ బాధితులు వెంటనే వైద్యున్ని సంప్రదించాలి ♦ స్వచ్ఛమైన నీటితో కళ్లను శుభ్రం చేసుకోవాలి ♦ పౌష్టికాహారం తీసుకోవాలి ♦ వీలైనంతగా ఇంట్లో విశ్రాంతిగా ఉండాలి బెంగళూరు మల్లేశ్వరం మార్కెట్లో జనరద్దీ, దీనివల్ల వైరస్ సులభంగా వ్యాప్తి చెందుతుంది -
కళ్లకు విశ్రాంతినిచ్చే ఐ మసాజర్ మాస్క్.. ధర ఎంతంటే?
గాగుల్స్లా ఈ పరికరాన్ని కళ్లకు తొడుక్కుంటే చాలు, అలసిన కళ్లకు విశ్రాంతినిస్తుంది. కనురెప్పలు, కళ్ల చుట్టూ ఉండే కండరాలకు సున్నితంగా మర్దన చేస్తుంది. అమెరికన్ కంపెనీ పాట్రియాట్ హెల్త్ అలయన్స్ ఇటీవల ‘ఐ స్పా’ పేరుతో ఈ ఐ మసాజర్ మాస్క్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేస్తుంది. కోరుకున్న విధంగా దీని ఉష్ణోగ్రతలను అడ్జస్ట్ చేసుకోవచ్చు. కళ్లకు వెచ్చదనం కావాలనుకుంటే, 43.3 డిగ్రీల నుంచి 45.5 డిగ్రీల సెల్సియస్ వరకు, చల్లదనం కావాలనుకుంటే 15 డిగ్రీల నుంచి 18.3 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలను ఎంపిక చేసుకోవచ్చు. ఇందులో మిస్ట్ మసాజ్ ఆప్షన్ కూడా ఉంది. దీనిని సెట్ చేసుకుంటే, కళ్లకు తగినంతగా చల్లని తేమను విడుదల చేస్తుంది. స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా ఇది పనిచేస్తుంది. దీని ఖరీదు 34.98 డాలర్లు (రూ.2,869) మాత్రమే! -
Conjunctivitis: కండ్లకలక బారిన పడకుండా ఉండొచ్చా?
వర్షాకాలం కారణంగా గత కొన్ని రోజులుగా దేశంలో పలు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు సీజన్‌కి తగ్గట్టుగా వచ్చే వ్యాధులు ప్రజలపై దాడి చేస్తున్నాయి. ఈ తరుణంలో పెరుగుతున్న కండ్లకలక కేసులు మరింత కలవారుపాటుకు గురిచేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా తేమతో కూడిన వాతావరణం కావడంతో వైరస్లు, బ్యాక్లీరియాలు పెరిగేందుకు ఇది కాస్త అనుకూలంగా ఉంటుంది. దీంతో దేశంలో కళ్లకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు ఎక్కువయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, ఈశాన్యా రాష్ట్రాలలోని చిన్నారులు అధికంగా ఈ వ్యాధి భారిన పడ్డారు. అంతేగాదు మహారాష్ట్రలోని పూణేలో అలంది అనే పట్టణంలో కేవలం ఐదు రోజుల్లోనే దాదాపు 2,300 కండ్లకలక కేసులు నమోదయ్యాయి. ఇక అరుణాచల్‌ప్రదేశ్ అయితే కండ్లకలక వ్యాప్తి నేపథ్యంలో పాఠశాలలను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశించింది. యమునా నది వరద కారణంగా ఢిల్లీలో ఈ కంటి ఇన్ఫెక్షన్లు గతేడాదికంటే అధికంగా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అసలు కండ్లకల అంటే ఏమిటి? వర్షాకాలంలో ఇది వస్తుందా? తదితరాలు గురించి చూద్దాం!. 'ఐ ఫ్లూ' అని కూడా పిలుస్తారు కళ్లను ప్రభావితం చేసే ఇన్ఫెక్షనే కండ్లకలక. దీన్ని వైద్య పరిభాషలో 'ఐ ఫ్లూ' లేదా 'పింక్ ఐ' అని కూడా పిలుస్తారు. ఇది కంటిని కప్పి ఉంచే స్పష్టమైన పొర కండ్లకలక వాపుకు కారణమవుతుంది. ఎందువల్ల వస్తుందంటే.. ఏదైనా అలెర్జీ కారకాలు లేదా పొగ, దుమ్ము, పుప్పొడి లేదా రసాయనాల నుండి వచ్చే గాఢతతో కూడిన గాలి కంటి ఫ్లూకి దారితీయవచ్చు. కాంటాక్ట్ లెన్స్‌లను ఎక్కువ కాలం ధరించడం లేదా వాటిని సరిగా శుభ్రం చేయకుండా ధరించడం తదితరాల కారణంగా ఈ కంటి ఇన్ఫెక్షన్ రావచ్చు. అలాగే జలుబు లేదా దగ్గు వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కారణంగా కూడా ఈ కంటి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గొంతు, కంటి ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే వైరస్ ఒకటే కావడమే అందుకు కారణం. ఈ ఇన్ఫెక్షన్ లక్షణాలు ఈ వ్యాధి లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కొలా ఉంటుంది. ఐతే అందరిలో కామన్‌గా కనిపించేది.. స్టికీ డిశ్చార్జ్‌తో కళ్ళు ఎర్రగా ఉంటాయి. దురదగా అనిపించడం. కళ్ల నుంచి అదేపనిగా నీరు రావడం. కళ్లు తెరవలేకపోవడం, కంటి నొప్పి తదితర లక్షణాలు వ్యాధి సోకిన పేషెంట్లో కనిపిస్తాయి. ఈ సీజన్లోనే ఎందుకు.. వేడి వాతావరణం నుంచి ఒక్కసారిగా కూల్‌గా మారుతుంది. దీనికితోడు వర్షాకాలం కావడంతో విపరితమైన నీటి ఎద్దడిన ఉంటుంది. దీంతో నీటి వనరులన్నీ కలుషితమవుతాయి. దీంతో వైరస్లు, బ్యాక్టీరియాలు పెరిగేందుకు అనుకూలంగా ఉంటుంది. మనం తెలియకుండా ఆ నీటితో కడుక్కోవడంతో ఈ ఇన్ఫెక్షన్లు, సీజనల్ వ్యాధులు అన్ని మూక్ముమ్ముడిగా దాడి చేస్తాయి. ఈ వాతావరణ మార్పులు తగ్గట్టు సరైన శుభ్రత పాటించకపోవడంతో ప్రజలు ఈ వర్షాకాలంలో ఈ వ్యాధుల బారినపడే అవకాశాలు అధికం. నివారణ: కృత్రిమ కన్నీళ్లు లేదా ఏదైనా లూబ్రికేటింగ్ కంటి చుక్కలను ఉపయోగించడం ప్రభావంతమైన చికిత్సలలో ఒకటి. వేడి నీటితో కాటన్ క్లాత్‌ని ముంచి కళ్లను కడగడం. పరిశుభ్రతను పాటించాలి. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్లతో కూడిన యాంటీబయాటిక్ కంటి చుక్కలు మాత్రమే ఉపయోగించాలి. వ్యాధిని ముదరిపోయేంత వరకు నిర్లక్ష్యం చేస్తే ఈ యాంటిబయోటిక్స్ కూడా పనిచేయవని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే.. మంచి పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం. కనీసం 20 సెకన్ల పాటు సబ్బుతో కడుక్కోవడం. వెచ్చని నీటితో తరచుగా మీ చేతులను కడగడం వంటివి చేయాలి ముఖ్యంగా మీ కళ్ళను తాకడానికి ముందు లేదా తర్వాత కంటి చుక్కలు వేయండి. మీ కళ్ళను తాకడం లేదా రుద్దడం మానుకోండి ఒకవేళ మీకు కండ్లకలక ఉంటే, శుభ్రమైన, తడి వాష్‌క్లాత్ లేదా తాజా కాటన్ బాల్ని ఉపయోగించి మీ కళ్ళను క్లీన్ చేసుకోండి. దీంతోపాటు దిండ్లు, వాష్‌క్లాత్‌లు, తువ్వాళ్లు, కంటి చుక్కలు, కన్ను లేదా ముఖ అలంకరణ, మేకప్ బ్రష్‌లు, కాంటాక్ట్ లెన్స్‌లు, కాంటాక్ట్ లెన్స్ నిల్వ కేసులు లేదా కళ్లద్దాలు వంటి వ్యక్తిగత వస్తువులను షేర్ చేయవద్దు. వీటిలో వైరస్ లేదా బాక్టీరియా ఉండే అవకాశం ఉంది. దీంతో ఒకరి నుంచి మరొకరికి ఈజీగా సంక్రమించే అవకాశం ఉంటుంది. మీ తలగడ కవర్లను తరుచుగా మార్చండి. వేడినీటి డిజర్జెంట్లోను వాష్ చేయండి. ప్రతి రోజు శుభ్రమైన టవల్ లేదా వాష్ చేసిన క్లాత్ ఉపయోగించండి. విటమిన్ ఏ, సీలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి. రెగ్యులర్ కంటి చెకప్‌లు చేయించుకోండి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధి నుంచి సత్వరమే బయటపడొచ్చు లేదా రాకుండా జాగ్రత్తపడవచ్చు కూడా. (చదవండి: నేడు ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవం..ఎన్నో జంటలను వేధించే సమస్య) -
ఆ నీలి కళ్ల చాయ్‌వాలా.. మోడలింగ్ తర్వాత లండన్‌లో మొదలెడుతున్న పని ఇదే..
తన ప్రత్యేకమైన నీలి కళ్లతో జనం మనసులు దోచుకున్న ఆ పాకిస్తాన్ చాయ్‌వాలాను ఎవరూ మరచిపోలేరు. ఇంటర్నెట్లో తన ఫొటోతో అందరినీ కట్టిపడేసిన ఆ కుర్రాడి పేరు అర్షద్ ఖాన్. ఫొటోగ్రాఫర్ జియా అలీ తన కెమెరాతో అర్షద్‌కు ఫొటో తీసి, దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అప్పట్లో ఈ ఫొటో సంచలనాలు నమోదు చేసింది. ఈ ఒక్క ఫొటోతో అతని జీవితమే మారిపోయింది. ఇక జీవితంలో దేనికీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం అర్షద్‌కు ఏర్పడలేదు. ఈ నేపధ్యంలో 2020లో అర్షద్ పాక్‌లోని ఇస్లామాబాద్‌లో సొంతంగా టీ కెఫే ప్రారంభించారు. ఆ తరువాత రెండు కెఫేలను లాహోర్‌లో ఒక కెఫెను మురీలో తెరిచారు. తాజాగా అర్షద్ ఏకంగా లండన్‌లో ఒక కెఫె ప్రారంభించనున్నారు. మీడియాతో అర్షద్ మాట్లాడుతూ ‘నా లండన్ ప్రయాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నన్ను అభిమానించేవారి కోసం టీ తయారుచేయడాన్ని నేను ఇష్టపడతాను. లండన్ రావాలంటూ నాకు రిక్వెస్ట్ వచ్చింది. నా తొలి అంతర్జాతీయ టీ దుకాణం లండన్‌లోని ఇల్ఫోయీ లేన్‌లో ప్రారంభం కానుంది. ఇల్ఫోయి లేన్‌లో పెద్ద సంఖ్యలో పాకిస్తానీయులు, భారతీయుల ఇళ్లు ఉన్నాయి. వారంతా చాయ్‌ని అమితంగా ఇష్టపడతారు’ అని తెలిపారు. లండన్‌లో ప్రారంభించే కెఫే కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో హర్షద్ chaiwalauk_ak పేరుతో ఒక అకౌంట్ తెరిచారు. దీనిలో తన కెఫేకు సంబంధించిన అప్డేట్ అందిస్తున్నారు. అర్షద్ తొలి ఫొటో వైరల్ అయినప్పుడు అతనికి మోడలింగ్‌లో అనేక అవకాశాలు లభించాయి. యూకే బేస్డ్ కంపెనీకి అర్షద్ మోడలింగ్ చేశారు. ఇప్పుడు అర్షద్ లండన్‌లో తన నూతన టీ దుకాణం ప్రారంభంతో మరోమారు చర్చల్లో నిలిచారు. ఇది కూడా చదవండి: ఇంటి గేటు దగ్గర ఎర్రని గుర్తులు.. నెటిజన్ల వివరణలకు మహిళ హడల్! -
ఆ మేక.. అతన్ని కంటితోనే చంపేసింది..!
మనిషికి చావు అనేది అత్యంత విచిత్ర పరిస్థితుల్లో సంభవిస్తుంటుంది. చావును ఎవరూ ముందుగా ఊహించలేరు. ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్ జిల్లాలోని ఖోపాధామ్‌లో ఒక వ్యక్తి మేకలను బలిచ్చాడు. తరువాత ఆ మేక మాంసంతో వంటకాలు చేయించి అందరికీ వడ్డించి, తానూ తిన్నాడు. ఇది జరిగిన కొద్దిసేపటికే ఆ వ్యక్తి అనారోగ్యం పాలయ్యాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. అతని మృతికి కారణం ఏమిటో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఊహకందని విధంగా.. మేక కన్ను మనిషి ప్రాణాలను తీస్తుందని ఎవరైనా ఊహించగలరా? అయితే ఇది నిజంగానే జరిగింది. సూరజ్‌పూర్‌లో ఇటువంటి ఘటన చోటుచేసుకుంది. మేక కన్ను తిన్న వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన 50 ఏళ్ల వ్యక్తి ఆలయంలో మేకలను బలి ఇచ్చిన తరువాత వాటి మాంసంతో వంటలు చేయించాడు. అతను ఆ వంటకాలలోని మేక కన్నును తిన్నాడు. అయితే అది అతని గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో అతనికి ఊపిరి తీసుకోవడం కష్టంగా మారి, ప్రాణాలు వదిలాడు. జిల్లా ఆసుపత్రికి తరలించగా.. ఈ ఘటన సూరజ్‌పూర్ జిల్లాలోని మదన్‌పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన 50 ఏళ్ల బగార్ రాయ్ తన స్నేహితులతోపాటు ప్రముఖ ఖోపాథామ్కు వెళ్లాడు. తన కోరిక నెరవేరిన నేపధ్యంలో అతను అక్కడికి వెళ్లాడు. అక్కడ పూజలు నిర్వహించిన తరువాత మేకలను బలి ఇచ్చి, ఆ మాంసంతో వంటకాలు చేయించాడు. తరువాత వాటిని గ్రామస్తులకు వడ్డించాడు. ఈ నేపధ్యంలో అతను మేక మాసంలోని దాని కన్నును తిన్నాడు. అయితే ఆ కన్ను అతని గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఊపిరి అందక ఇబ్బంది పడ్డాడు. గ్రామస్తులు అతన్ని వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియగానే వారు పరుగుపరుగున ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రి ప్రాంగణం వారి రోదనలతో నిండిపోయింది. ఇది కూడా చదవండి: ప్రియురాలి కోసం భార్య ముక్కు తెగ్గోసి, జేబులో వేసుకుని.. -
Covid-19: 'మహమ్మారి ఇంకా ముగియలేదు' అంటూ కేంద్రం లేఖ
దేశంలో గత కొద్ది నెలలుగా కరోనా కేసుల తోపాటు మరణాలు సంభవిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్రం అప్రమత్తంగా ఉండాలంటూ విజ్ఞప్తి చేస్తూ.. ఎనిమిది రాష్ట్రాలకు లేఖలు రాసింది. ఈ మేరకు లేఖలో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్.. దేశంలో కరోనా మహమ్మారి ఇంకా ముగిసిపోలేదు, అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే మహమ్మారి నిర్వహణలో మనం సాధించిన విజయ నిర్వీర్యం కాక మునుపే మేల్కోవాలి. ఏ స్థాయిలోనైన అలసత్వం వహించకూడదని ఆ లేఖలో తెలిపారు. కోవిడ్ కారణంగా ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య, మరణాల సంఖ్య తక్కువే అయినప్పటికీ రాష్టాలు, జిల్లాల్ల వారిగా పెరుగుతున్న కేసులు వైరస్ సంక్రమణని సూచిస్తోందన్నారు. అందువల్ల రోజువారిగా రాష్ట్రాలు, జిల్లాలోని పెరుగుతున్న కేసులు, పాజిటివిటీ రేటుని నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రారంభ దశలోనే కేసుల పెరుగుదలను నియంత్రించేలా అవసరమైన ప్రజారోగ్య చర్యలను చేపట్టాలని రాజేష్ భూషణ్ నొక్కి చెప్పారు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్, తమిళనాడు, రాజస్తాన్, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, హర్యాన, ఢిల్లీతో సహా ఎనిమిది రాష్ట్రాలు ఈ లేఖలను అందుకున్నాయి. ఆయా రాష్ట్రాల్లోని జిల్లాలో యూపీ(1), తమిళనాడు(11), రాజస్తాన్(6), మహారాష్ట్ర(8), కేరళ(14), హర్యానా(12), ఢిల్లీ(11) తదితరాల్లో మొత్తంగా 10%కి పైగా పాజిటివిటి రేటు ఉంది. ఆయ జిల్లాలోని కోవిడ్ నిఘాను పటిష్టం చేస్తూ.. ఇన్ఫ్లుఎంజా లాంటి అనారోగ్యం (ILI), తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ (SARI) వంటి కేసుల పర్యవేక్షించాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. ఇదిలా ఉండగా, దేశంలో తాజగా కొత్తగా 11,692 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 66,170కి చేరుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ..దేశ రాజధానిలో కోవిడ్ కేసులు స్థిరంగా ఉన్నాయన్నారు. ఐతే ఇటీవల కొద్దిరోజులుగా మాత్రం కేసులు పెరుగుతున్నాయని, కాని రాబేయే రోజుల్లో తగ్గే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కేసుల్లో చాలా వరకు తీవ్రమైన అనారోగ్యాలు ఉన్నవారే కావడం యాదృచ్చికం అన్నారు. ఏదైనా మరణాలు సంభవించడం అనేది దురదృష్టకరమని, ఇలా జరగకూడదన్నారు ఆరోగ్య మంత్రి భరద్వాజ్. (చదవండి: సూడాన్‌లోని భారతీయుల పరిస్థితిపై మోదీ అత్యవసర సమీక్ష!) -
కళ్లకు గంతలు కాదు.. హైటెక్ మసాజర్
ఫొటోలో కనిపిస్తున్న యువతి కళ్లకు తెల్లని గంతలు తొడుక్కున్నట్లు కనిపిస్తోంది కదూ! ఆమె కళ్లకు తొడుకున్నది గంతలు కాదు, హైటెక్ మసాజర్. అమెరికన్ కంపెనీ ‘ట్రూరెల్’ రూపొందించిన ‘ఐ మసాజర్’. ఇది బ్లూటూత్ ద్వారా పనిచేస్తుంది. అలసిన కళ్లను సుతారంగా మర్దన చేస్తుంది. కళ్ల చుట్టూ తగినంత నులివెచ్చదనాన్ని కలిగిస్తుంది. (Radhika Merchant Bag: అంబానీకి కాబోయే కోడలు చేతిలో చిన్న బ్యాగు.. అందరి దృష్టి దానిపైనే.. ధర ఎంతో తెలుసా?) ఇందులోని ఎస్టీవీ టెక్నాలజీ ద్వారా కోరుకున్న రీతిలో వైబ్రేషన్స్, పల్సింగ్ సృష్టించి, తగినంత వెచ్చదనాన్ని, గాలి పీడనాన్ని కలిగించి కళ్ల అలసటను ఇట్టే మటుమాయం చేస్తుంది. ఇది అడ్జస్టబుల్ హెడ్‌సెట్‌తో లభిస్తుంది. తల పరిమాణానికి తగినట్లుగా దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందులోని ప్లేలిస్ట్‌లో ఉన్న పాటలను వింటూ, కళ్లకు మర్దన తీసుకుంటూ, హాయిగా సేదదీరవచ్చు. దీని ధర 105 డాలర్లు (రూ.8,678) మాత్రమే. (వెంట వచ్చే రిఫ్రిజిరేటర్.. మొబైల్ ఫోన్లోనే కంట్రోలింగ్) -
‘జలకన్య కన్ను’ పేరుతో బురిడీ
సాక్షి, హైదరాబాద్: జలకన్య కన్నుకు అతీంద్రియ శక్తులు ఉంటాయని, దీంతో మీకు అంతా శుభం జరుగుతుందని, కోరుకున్న పని ఇట్లే జరిగిపోతుందని కల్లబొల్లి మాటలు చెప్పి అందినకాడికి దండుకోవాలని భావించిన నిందితుల ఆటకట్టించారు మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు. వరంగల్‌కు చెందిన చందు, యాప్రాల్‌కు చెందిన సాంబశివ ఇద్దరు స్నేహితులు. తీర్థయాత్రల నిమిత్తం షిరిడీకి వెళ్లిన ఇరువురు.. తిరుగు ప్రయాణంలో స్థానికంగా దొరికే రంగు రాయిని కొనుగోలు చేశారు. హైదరాబాద్‌కు తిరిగొచ్చాక ఆ రంగురాయిలో బ్యాటరీ సహాయంతో చిన్నపాటి లైట్‌ను అమర్చారు. లైట్ అమర్చిన రంగురాయికి నీళ్లు తాకగానే దాని కాంతి రెట్టింపు అవుతుంది. దీన్ని గమనించిన చందు, శివలకు దుర్బుద్ధి పుట్టింది. రంగురాయికి శక్తులు ఉన్నాయని నమ్మించి అమాయకులకు విక్రయించాలని నిర్ణయించుకున్నారు. దీంతో కాప్రాలో పలువురు వ్యాపారులు, స్థానికులకు చూపించి..ఈ రంగురాయి సాగరకన్య నోటిలో నుంచి తీసిన జలకాంతం అని మాయమాటలు చెప్పారు. దీన్ని ఇంట్లో పెట్టుకుంటే శుభం జరుగుతుందని నమ్మించారు. రూ.2 కోట్లకు విక్రయించేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన ఇన్స్పెక్టర్ రాములు బృందం ఇద్దరు నిందితులు చందు, సాంబశివలను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. (చదవండి: సమరానికి సై.. ఫార్ములా–ఈ పోటీలకు రేసర్లు రెడీ.. ) -
కళ్లు చెదిరే ఆవిష్కరణ: కన్నే ఫ్లాష్ లైట్లా వెలుగుతుంది...
చాలామంది పలు రకాల ఆవిష్కరణలు సృష్టిస్తారు. అవన్నీ కూడా తాము ఎదర్కొన్న సమస్యల నుంచి పుట్టుకొచ్చిన ఆవిష్కరణలే. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి విస్తుపోయేలా కళ్లు చెదిరే ఒక సరికొత్త ఆవిష్కరణ సృష్టించాడు. వివరాల్లోకెళ్తే....యూఎస్‌కి చెందిన బ్రియాన్ స్టాన్లీ అనే ఇంజనీర్ క్యాన్సర్ కారణంగా కన్నుని పోగొట్టుకున్నాడు. దీంతో అతను కృత్రిమ కన్నుని రూపొందించాడు. ఐతే అది మాములు కన్ను కాదు ఏకంగా లైట్లా వెలిగే కన్నుని తయారు చేశాడు. తానే స్వంతంగా ప్రోథెస్టిక్ కన్నుని రూపొందించాడు. తన కనుపాప ఫ్లాష్ లైట్లా వెలిగేలా రూపొందించాడు. ఈ కన్నుని టైటానియం సైబర్గ్ కన్నుగా పిలుస్తారు. ఇది ఒక హెడ్‌ల్యాంప్ లాగా పనిచేస్తుంది. అదేనండి బొగ్గుగనుల్లో ఉండేవాళ్లు పెట్టుకునే క్యాప్ల్యాంప్లా ఉంటుందన్నమాట. చీకటిలో సులభంగా చదవడానికి ఉపకరిస్తుందని, పైగా ఈ లైట్ వేడిగా ఉండదని చెబుతున్నాడు స్టాన్లీ. అంతేగాదు ఈ ఫ్లాష్ లైట్ కన్ను బ్యాటరీ 20 గంటలు వరకు పనిచేస్తుందని తెలిపారు. ఈ మేరకు బ్రియాన్ తన ప్రోథిస్టిక్ కన్నుని ఎలా రూపొందించాడో వివరిస్తూ...వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఈ మేరకు నెటిజన్లు వావ్ వాట్ ఏ ఆవిష్కరణ, సైన్స్‌తో ఏదైన సాధించవచ్చు అంటూ స్టాన్లీని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. View this post on Instagram A post shared by Brian Stanley (@bsmachinist) (చదవండి: ఫోన్ రిపైర్ చేసేలోపే ఒక్కసారిగా బ్లాస్ట్: వీడియో వైరల్) -
ఆ వైద్యుడు పేదల కంటి వెలుగు.. వందల మందికి ఉచిత ఆపరేషన్లు
సాక్షి, కడప సెవెన్‌రోడ్స్: గోరంత సాయం చేసి కొండంత ప్రచారం పొందాలనుకునేవారు చాలామంది. తమను తాము ప్రముఖ సంఘ సేవకులుగా చెప్పుకునే ఈ కోవకు చెందిన వారిని నిత్యం చూస్తుంటాం. కానీ అందుకు భిన్నంగా నిస్వార్థ సేవలు అందిస్తూ కూడా పబ్లిసిటీకి ఇష్టపడని వ్యక్తులు సైతం ఉంటారంటే ఒకింత ఆశ్చర్యమేస్తుంది. రెండు దశాబ్దాలకు పైబడి పేదలకు ఉచిత వైద్య పరీక్షలు, ఆపరేషన్లు నిర్వహిస్తున్న కడప నగరానికి చెందిన ప్రముఖ కంటి వైద్యులు గగ్గుటూరు ప్రదీప్‌కుమార్ ఇందుకు నిదర్శనం. కడప నగరం రమేష్ థియేటర్ ఎదురు వీధిలో డాక్టర్ ప్రదీప్ కుమార్ తన తండ్రిపేరిట శ్రీ గగ్గుటూరు పిచ్చయ్య నేత్ర వైద్యశాలను చాలా ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. తన ఆస్పత్రికి వచ్చే రోగులకు ఎంతో ఓపికగా కంటి పరీక్షలు నిర్వహిస్తూ అవసరమైన సేవలు అందిస్తుంటారు. 20 ఏళ్లుగా ఉచిత సేవలు పేదలకు వారంలో ఒకరోజు ఉచిత వైద్య పరీక్షలు, అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు నిర్వహించాలని ఆయన నిర్ణయించుకున్నారు. అలా 2001 నుంచి ప్రతి ఆదివారం ఉచిత కంటి పరీక్షలు, వైద్యం అందించేవారు. మాజీమంత్రి బిజివేముల వీరారెడ్డి అల్లుడు డాక్టర్ రవికుమార్‌రెడ్డి క్లాస్మేట్. దీంతో ప్రతి ఆదివారం బద్వేలులోని వీరారెడ్డి ఆస్పత్రికి వెళ్లి ఉచిత కంటి పరీక్షలతోపాటు అవసరమైన వారికి ఆపరేషన్లు చేసేవారు. ఇలా 19 సంవత్సరాలు అక్కడ సేవలు అందించారు. ఇప్పుడు ప్రతి శనివారం కడప నగరం ఎర్రముక్కపల్లెలోని తన ఇంటి వద్ద ఉచిత పరీక్షలు చేస్తున్నారు. ప్రారంభంలో ఉచిత ఆపరేషన్లు చేశారు. అయితే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వద్ద అనుమతులు పెండింగ్‌లో ఉన్నందున ప్రస్తుతానికి ఆపరేషన్లు నిర్వహించడం లేదు. కంటి పరీక్షలు నిర్వహించి ఆపరేషన్లు అవసరమైతే ఇతర వైద్యుల వద్దకు పంపుతున్నారు. ప్రతి శనివారం ఉచిత క్యాంపునకు 60–90 మంది పేషంట్లు వస్తుంటారు. కడప నగరంతోపాటు కమలాపురం, మైదుకూరు, ఎర్రగుంట్ల, గుత్తి, బ్రహ్మంగారిమఠం ప్రాంతాల నుంచి రోగులు వస్తారు. గతంలో బద్వేలులో పనిచేయడం వల్ల ఆ ప్రాంతం వారు ఎక్కువ వస్తారు. ఉదయం 7 నుంచి 12 గంటల వరకు అవసరమైతే మరికొంత సమయాన్ని ఉచిత సేవలకు వినియోగిస్తున్నారు. చదవండి: (ఫలించిన ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి కృషి.. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు) సామాజిక బాధ్యతగా భావించాను నేను పుట్టి పెరిగింది కడప నగరం ఎర్రముక్కపల్లె. వైద్య పట్టా పుచ్చుకున్నాక మా ఇంటి చుట్టుపక్కల ఉన్న పేదలకు ఉచిత పరీక్షలు, ఆపరేషన్లు నిర్వహించడం బాధ్యతగా భావించాను. ఇప్పుడు కడపకు చెందిన వారేకాకుండా ఇతర ప్రాంతాల వారు కూడా వస్తున్నారు. శుక్లాలు, అద్దాల చెకప్, గ్లాకోమా తదితర కంటి పరీక్షలు నిర్వహిస్తాను. – డాక్టర్ ప్రదీప్‌కుమార్, కంటి వైద్య నిపుణులు, కడప పేదలకు ఎంతో మేలు ఇప్పుడున్న పరిస్థితుల్లో వైద్యం ఖరీదై పోయింది. డబ్బున్న వారికే వై ద్యం అన్నట్లు తయారైంది. గతంలో ఒకటి లేదా రెండు రూపాయల నామమాత్రపు ఫీజు తీసుకునే వైద్యులను చూశాను. ఇప్పుడు డాక్టర్ ప్రదీప్‌కుమార్ వారంలో పూర్తిగా ఒకరోజు ఉచిత సేవలు అందించడం పేదలకు ఎంతో మేలు చేసే అంశం. – సీఆర్వీ ప్రసాద్‌రావు, నాగరాజుపేట, కడప -
వింత వ్యాధితో అవస్థలు పడుతున్న విద్యార్థిని.. కళ్లు తెరిస్తే...
వేలూరు(తమిళనాడు): రాణిపేట జిల్లా ఆర్కాడు సమీపంలోని సాత్తూరు గ్రామానికి చెందిన పూంగొడి, గాండీభన్ దంపతుల కుమార్తె షాలిని(14). అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. అయితే గత 6 నెలలగా ఈ బాలికకు ఎడమ కన్ను వాపు రావడంతో పాటు.. కంటి నుంచి చలి చీమలు బయటకు రావడం మొదలు పెట్టాయి. రోజుకు సగటున 15 చీమలు బయటకు వస్తున్నట్లు వారు వెల్లడించారు. దీంతో తల్లిదండ్రులు షాలినికి వైద్య పరీక్షలు చేయింగా.. అన్నీ టెస్ట్‌లు నార్మల్‌గానే ఉన్నట్లు తెలిసింది. కంటి నుంచి రోజూ చలి చీమలు వస్తూనే ఉండడంతో పాఠశాలకు వెళ్లలేక, సాధారణ జీవితాన్ని అనుభవించలేక తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఈ మేరకు విద్యార్థినితో పాటు ఆమె తల్లి పూంగొడి కలెక్టర్ భాస్కర్ పాండియన్‌కు మంగళవారం వినతిపత్రం సమర్పించింది. ఆయన వాలాజలోని ప్రభుత్వ కంటి వైద్యశాలలో బాలికను చేర్పించి చికిత్స అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ప్రస్తుతం కంటి వైద్య నిపుణులు విద్యార్థినిని పర్యవేక్షిస్తున్నారు. చదవండి: నటుడి కుమార్తె భర్త కిడ్నాప్.. రాజ్యలక్ష్మి ఇంట్లో డెడ్ బాడీ.. ఏం జరిగింది..? -
మీకళ్లు 60లో కూడా 20 లా కనిపించాలని ఉందా!
మొహంలో కళ్లు ఎంత ప్రత్యేకమో.. అంతే సున్నితం కూడా! అందుకే ఫేషియల్స్ చేసినా.. స్క్రబ్ చేసినా..మసాజ్ చేసినా..నయనాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. లోషన్స్, క్రీమ్స్ అప్లై చేసుకునేటప్పుడు కూడా కళ్లకు తగలకుండా జాగ్రత్తపడతాం. కీరాముక్కలు, గోరువెచ్చటి కాపడంతో కనుల సోయగాన్ని కాపాడే ప్రయత్నం చేస్తుంటాం. అపురూపమైన కళ్లు అందంగా.. ఎల్లప్పుడూ ఆకట్టుకునేలా ఉండాలంటే స్పెషల్ కేర్ తప్పనిసరి. వయసుతో వచ్చే నల్లటి వలయాలు, ముడతలు, నిద్రలేమితో కలిగే అలసట.. వీటన్నింటినీ దూరం చెయ్యాలంటే చిత్రంలోని కళ్లజోడు ఎంతో చక్కగా పనిచేస్తుంది. దీన్ని పెట్టుకుని కళ్లు మూసుకుని ఉండటం బోర్ కదా అనుకునే వారికి ఆ దిగులే అవసరం లేదు. ఎందుకంటే ఈ డివైజ్.. పాటలను వినిపిస్తూ కళ్ల పని చూస్తుంది. ఒత్తిడి, అలసట, కళ్ల మంటలు, కళ్లు పొడిబారడం, తలనొప్పి వంటి వాటిని దూరం చేస్తూనే.. 60లో 20లా కనిపించేలా అందాన్ని కాపాడుతుంది. 180 డిగ్రీస్ యాంగిల్లో XECH Eye Massager డివైజ్‌ని సులభంగా ఫోల్డ్ చేసుకోవచ్చు. అలా ఫోల్డ్ అయిన గాడ్జెట్ చూడటానికి వైర్లెస్ మౌస్లా ఉంటుంది. డివైజ్‌కి ఒకవైపు.. చార్జర్ జాక్, ఇయర్ ఫోన్ జాక్ ఉంటాయి. పైభాగంలో ఆన్, ఆఫ్, వైబ్రేషన్, మ్యూజిక్ వంటి ఆప్షన్స్ ఉంటాయి. దీనికి ఇయర్ ఫోన్స్ పెట్టుకునే వీలుండటంతో.. నచ్చిన పాటను వినొచ్చు. నచ్చకుంటే మార్చుకోవచ్చు. సౌండ్ పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. డివైజ్ ఆన్ చేసుకుంటే సున్నితంగా వైబ్రేట్ చేస్తూ.. ట్రీట్మెంట్ అందిస్తుంది. ఆఫీస్‌లో, ఇంట్లో ఎక్కడైనా దీన్ని సులభంగా ఉపయోగించుకోవచ్చు. దీనికి 2 గంటల పాటు చార్జింగ్ పెడితే చాలు బ్యాటరీ ఫుల్ అవుతుంది. ఈ డివైజ్ అడుగు భాగంలో సాఫ్ట్ స్కిన్ కేర్ లైనింగ్ అమర్చి ఉంటుంది. వెనుకవైపు బ్యాండ్ అటాచ్ అయ్యి ఉంటుంది. దాని సాయంతోనే తలకు అమర్చుకోవచ్చు. దీని ధర సుమారు 28 డాలర్లు. అంటే 2,108 రూపాయలు. -
మహిళకు అరుదైన శస్త్ర చికిత్స.. కంటి నుంచి బొట్‌ఫ్లైస్ తొలగింపు!
న్యూఢిల్లీ: ప్రకృతి అంటే ఇష్టపడిని వారు ఉండరు. అందుకోసం చాలామంది అడువులకు లేదా పచ్చదనంతో కూడిని మంచి అందమైన ప్రదేశాల్లో ఉండేందుకు ఇష్టపడుతుంటారు. మరి కొద్దిమంది ఏ మాత్రం అవకాశం దొరకిన ప్రపంచంలో మంచి అభయ అరణ్యాలను సందర్శించటం వంటివి చేస్తుంటారు. అయితే అడువుల్లో తిరిగితే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్కు గురవడమే కాక ఒక్కొసారి ప్రాణాంతకంగా కూడా మారుతుంటుందంటున్నారు వైద్యులు. జౌను ఇటీవలే అమెజాన్ అడువులను సందర్శించిన ఒక మహళకి మియాసిస్ అనే ఒక రకమైన టిష్యూ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఈ ఘటన ఢిల్లీ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. అసలు విషయంలోకెళ్తే...ఢిల్లీ ఆసుపత్రిలోని వైద్యులు 32 ఏళ్ల అమెరికన్ మహిళకు అరుదైన మియాసిస్ అనే టిష్యూ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆమెకు సోమవారం విజయవంతంగా శస్త్రచికిత్స చేసినట్లు ఆసుపత్రి అధికారులు పేర్కొన్నారు. మియాసిస్(బోట్ ఫ్లై) అనేది మానవ కణజాలంలో ఫ్లై లార్వా (మాగ్గోట్)కి సంబంధించిన ఇన్ఫెక్షన్. అయితే ఆమె ఆమెరికాలో ఉండగానే తనకు ఈ ఇన్ఫెక్షన్ వచ్చిందని చ్పెపారు. కానీ అక్కడి అమెరికన్ వైద్యులను సంప్రదించినప్పడూ ఆ రోగ లక్షణానికి సంబంధించిన ఉపశమన మందులు ఇచ్చి పంపించేశారని ఆమె తెలిపారు.అయితే ఆమెకు మళ్లీ నాలుగు వారాల నుంచి శరీరంలో ఏదో కదులుతున్నట్లు అనిపించడం, కనురెప్పలో వాపు, కళ్లు ఎరుపెక్కడం వంటి ఫిర్యాదులతో ఆమె ఢిల్లీ ఆసుపత్రిలో జాయిన్ అయ్యింది. ఆ అమెరికన్ మహిళ ఒక ప్రయాణికురాలు. కాబట్టి ఆమె ప్రయాణ చరిత్ర గురించి ఆరా తీయగా.... ఆమె ఇటీవలే అమెజాన్ అడువులను సందర్శించి వచ్చినట్లు చెప్పారు. దీంతో మియాసిస్(బోట్ ఫ్లై) కి సంబంధించిన కేసుల గురించి వైద్యులు క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆమె ఇన్ఫక్షన్స్‌కి గల కారణాలను నిర్ధారణ చేశారు. ఈ మేరకు వైద్యులు ఆమెకు శస్త్ర చికిత్స చేసి దాదాపు 2 సెం.మీ పరిమాణంలోని మూడు ప్రత్యక్ష బొట్ ఫ్లైస్‌ను తొలగించారు. ఒకటి కుడి ఎగువ కనురెప్ప నుంచి, రెండవది ఆమె మెడ వెనుక నుంచి, మూడవది ఆమె కుడి ముంజేయి నుంచి బోట్ ఫ్లైని తొలగించారు. అంతేకాదు ఎలాంటి అనస్థీషియా లేకుండా అన్ని అస్ప్టిక్ జాగ్రత్తలతో 10-15 నిమిషాల్లో శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేశారు. మియాసిస్(బొట్ ఫ్లైస్) అనే ఇన్ఫక్షన్ ఉష్ణమండల ప్రాంతాలలో నివశించే వారికి వస్తుంది. ఇది ఒక రకమైన పరాన్నజీవి అడవులలో చెట్లను ఆశ్రయించి ఉంటుంది. ఇది మానవుని శరీరంలో సున్నితమైన పొరల్లోకి చొచ్చుకుపోయి మానవ కణజాల వ్యవస్థలను నాశనం చేసి ప్రాణాంతకంగా మారుతుంది. భారతదేశంలో, ఇటువంటి కేసులు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి. ఇవి దెబ్బలు తగిలి గాయాలు ఏర్పడినప్పుడు లేదా అడువుల్లోనూ, దట్టమైన చెట్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ సంచరించినప్పుడూ ఇలాంటి అరుదైన ఇన్ఫెక్షన్లకు గురవుతుంటారని వైద్యులు చెబుతున్నారు. (చదవండి: చెత్త యవ్వారం: కంటెయినర్ల నిండా టన్నుల్లో! యూకేకు షాకిచ్చిన లంక) -
స్క్రీన్ కష్టాలు.. చెక్ పెట్టండిలా!
కంప్యూటర్ ముందు పని చేసే ఉద్యోగాలు ఎక్కువయ్యాయి. ఎక్కువ సమయం తదేకంగా స్క్రీన్‌ను చూడడం ఆరోగ్యానికి హానికరం. కన్ను, మెడ సమస్యలు ఎదురవుతాయి. అందుకే త్రీ ట్వంటీస్ (20–20–20) రూల్ ఒక మంచి ఆలోచన. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి పనిలో బ్రేక్ తీసుకుని కంప్యూటర్ స్క్రీన్ మీద నుంచి దృష్టి మరల్చి 20 అడుగుల దూరంలో ఉన్న ఏదైనా వస్తువుని 20 సెకన్ల పాటు చూడాలి. ఇదే 20–20–20 రూల్. పక్కన ఉన్న ఫొటోను గమనించండి. ∙కంప్యూటర్ బాధితులకు మరో సూచన... కంప్యూటర్ స్క్రీన్ నుండి వచ్చే లైట్ వలన కంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే యాంటీ గ్లేర్ గ్లాసెస్ ధరించాలి. అలాగే మరో సంగతి... కంప్యూటర్ ముందు పని చేసే వ్యక్తి కంప్యూటర్ నుంచి వెలువడే కాంతి కంటే ఎక్కువ కాంతిలో ఉండాలి. అప్పుడు కంప్యూటర్ నుంచి వెలువడే కిరణాల దుష్ప్రభావం తీవ్రత తగ్గుతుంది. ఈ స్క్రీన్ కష్టాల్లో కొన్ని ఉద్యోగ, వృత్తుల రీత్యా తప్పని సరి అవుతుంటే మరికొన్ని మనకు మనంగా తెచ్చుకుంటున్న కష్టాలూ ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి స్మార్ట్ ఫోన్‌తో కొనితెచ్చుకునే ఇక్కట్లు. ∙నిద్రపోయే ముందు గదిలో లైట్లు ఆపేసిన తర్వాత కూడా స్మార్ట్ ఫోన్ చూస్తుంటారు. నిద్ర వచ్చే వరకు మాత్రమే అనుకుంటూ చాటింగ్, గేమ్స్, వీడియోలు చూడడం మొదలుపెడతారు. అది అరగంటకు పైగా సాగుతూనే ఉంటుంది. గేమ్ ఆడుతున్నంత సేపూ మెదడు చురుగ్గా ఉంటుంది. ఇక నిద్ర ఎలా వస్తుంది? -
అద్భుతాన్ని ఆవిష్కరించిన శాంసంగ్..! మానవ కంటి లాంటి కెమెరా సెన్సార్..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ అద్భుతాన్ని ఆవిష్కరించింది. శాంసంగ్ తన మొదటి ఐసోసెల్ కెమెరా సెన్సార్‌ను RGBW కలర్ ఫిల్టర్ సపోర్ట్‌తో అభివృద్ధి చేసింది. ఈ కొత్త కెమెరా సెన్సార్‌ను చైనా ఆధారిత కంపెనీ టెక్నో(Tecno) భాగస్వామ్యంతో రూపొందించింది. ఈ కెమెరా సెన్సార్ సహయంతో మెరుగైన రంగు, ప్రకాశంతో కళ్లు చెదిరే ఫోటోలను తీయవచ్చునని కంపెనీ పేర్కొంది. ఈ ఆవిష్కరణను శాంసంగ్ "మానవుడి కంటితో (human eye-like)" పోల్చింది.ఈ కెమెరా సెన్సార్ 2022లో టెక్నో-బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌లో రానున్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఇతర స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు కూడా అందుబాటులో ఉండనుంది. కొత్త ISOCELL GWB కెమెరా సెన్సార్ వైట్ పిక్సెల్‌తో కూడిన మెరుగైన కలర్ ఫిల్టర్ నమూనాను ఉపయోగించారని శాంసంగ్ వెల్లడించింది . ఈ సెన్సార్ 64-మెగాపిక్సెల్ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుందని తెలిపింది. శాంసంగ్ నుంచి రాబోయే Samsung Galaxy S22 స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో ఈ కొత్త కెమెరా సెన్సార్ రావడంలేదు. చదవండి: బడ్జెట్ ధరలో, బిగ్ బ్యాటరీ సపోర్ట్‌తో శాంసంగ్ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్..! -
కంటిని కాపాడుకుందాం!
సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. మనిషికి ఉన్న అవయవాల్లో అత్యంత సున్నితమైనది.. ప్రధానమైనది నేత్రాలే. వీటి పట్ల నిర్లక్ష్యంగా ఉంటే జీవితం చీకటి మయమే. ఈ అందమైన ప్రపంచాన్ని చూసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. పుట్టినప్పటి నుంచి ఈ ప్రపంచం నుంచి శాశ్వతంగా దూరమయ్యే వరకు కళ్లను భద్రంగా చూసుకోవాల్సిందే. వీటి ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేసేందుకు ఈ ఏడాది ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా ‘మీ కళ్లను ప్రేమించండి‘ నినాదంతో ప్రపంచ వ్యాప్తంగా నేత్రాల సంరక్షణపై అవగాహన కార్యక్రమాలను వైద్య ఆరోగ్య శాఖ నిర్వహిస్తోంది. శ్రీకాకుళం అర్బన్: కళ్లను ఎవరూ నిర్లక్ష్యం చేయరాదు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి వృద్ధుల వరకూ వీటికి ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. పిల్లల కంటి సంరక్షణలో తల్లి పాత్ర కీలకం. బిడ్డ కళ్లను పరిశుభ్రంగా ఉంచి వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. పుట్టిన బిడ్డ కళ్లను తల్లి నిత్యం గమనిస్తూ ఉండాలి. నేత్రాల్లో ఎటువంటి మార్పులు ఉన్న ఆలస్యం చేయకుండా వైద్యుడ్ని సంప్రదించాలి. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు బ్లాక్ బోర్డ్‌పై ఉన్న అక్షరాలు చూడటంలో ఇబ్బంది ఉన్నా, పుస్తకాన్ని, టీవీని దగ్గరుగా చూస్తున్నా వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. విద్యార్థి దశలో ప్రతి ఏడాది కంటి పరీక్ష చేయిస్తూ వారి చూపుని పరిరక్షించాలి. దృష్టిలోపం ఉన్నట్లయితే వైద్యుని సలహా మేరకు కళ్లద్దాలు వాడాలి. ఆధునిక జీవనశైలి– కంటిచూపుపై దుష్పరిణామాలు గతంలో పిల్లలకు తల్లి చందమామని చూపిస్తూ ఆహారం తినిపించేది. ఇప్పుడు సెల్‌ఫోన్ చూపిస్తూ తినిపిస్తోంది. దీనివల్ల పిల్లల కళ్లలో సున్నితమైన రెటీనా భాగాలు పాడై చూపు పోయే ప్రమాదం ఉంది. పిల్లలు ఎక్కువగా సెల్‌ఫోన్ చూడడం, వీడియో గేమ్స్ ఆడడం వల్ల మెల్లకన్ను, దృష్టి లోపంతో పాటు వారి మానసిక ప్రవర్తనలో మార్పులు ఏర్పడుతున్నాయి. అందువల్ల వీలైనంత వరకు పిల్లలకు సెల్ ఫోన్ అందుబాటులో ఉంచకూడదు. ఇక సాఫ్ట్ వేర్ రంగంలో పనిచేసేవారు, కళాశాల విద్యార్థులు, కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ ఉపయోగించినపుడు కళ్ల పట్ల శ్రద్ధ వహించాలి. స్క్రీన్‌పై వెలుతురు పడకుండా, కంటిపై నేరుగా గాలి తగలకుండా చూడాలి. కళ్లకు మధ్యలో విశ్రాంతిని ఇస్తూ అవసరమైతే వైద్యులు సూచించిన కంటి చుక్కల మందు ఉపయోగిస్తూ నేత్రాలను పరిరక్షించుకోవాలి. వయోవృద్ధుల్లో భద్రత 35 సంవత్సరాలు దాటిన చాలామందిలో చదివేటప్పు డు ఇబ్బందికరంగా ఉంటుంది. మధుమేహగ్రస్తులు, రక్తపోటు ఉన్నట్లయితే ప్రతి ఏడాది తప్పనిసరిగా నేత్ర వైద్యుని సంప్రదించాలి. దానివలన శాశ్వత అంధత్వాని కి గురికాకుండా కళ్లను భద్రంగా ఉంచుకున్నవారవుతా రు. ఎవరికైనా గ్లకోమా ఉన్నట్లేనా ప్రతి ఏడాది సంపూర్ణ కంటి పరీక్ష తప్పనిసరి. ఒత్తిడితో కూడుకున్న జీవన శైలి కంటిపై ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా 40 ఏళ్లు పైబడగానే బీపీ, సుగర్ వ్యాధులకు గురవుతున్నారు. అటువంటి వారు డాక్టర్ సూచించిన మందులు క్రమం తప్పకుండా వాడాలి. నిర్లక్ష్యం వద్దు కంటి చూపు, సంరక్షణ విషయంలో బాధ్యతగా వ్యవహరించాలి. చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు శ్రద్ధ చాలా అవసరం. ఏదైనా ఇబ్బంది గమనించినట్లయితే వెంటనే వైద్యుడ్ని సంప్రదించాలి. చాలామంది సరైన సమయంలో వైద్యులను సంప్రదించకపోవడంతో శాశ్వత అంధత్వానికి గురవుతున్నారు. – ఎం.ఆర్.కె.దాస్, పారామెడికల్ ఆప్తాల్మిక్ అధికారి అశ్రద్ధ చేయకండి మనిషి జీవితంలో ప్రతీది దృష్టితో ముడిపడి ఉంది. అందుకే కళ్లను నిర్లక్ష్యం చేయరాదు. ప్రస్తుత జీవన విధానంలో వస్తున్న మార్పులు, దీర్ఘకాలిక వ్యాధులతో కంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. ఆరు నెలలకు ఒక్కసారి కంటి వైద్యుడ్ని సంప్రదించాలి. – డాక్టర్ వి.దినేష్కాంత్, రెటీనా నేత్ర వైద్య నిపుణులు జిల్లాలో డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు పథకం మూడో దశ కింద గత ఏడాది ఫిబ్రవరి నెల నుంచి ఈనెల 12వ తేదీ వరకూ నేత్ర పరీక్షలు ఇలా.. 60 ఏళ్లకు పైబడిన ఉన్న వృద్ధులు: 3,24,764 మంది కంటి పరీక్షలు చేసినవారి సంఖ్య: 96,128 ఉచిత కళ్లద్దాలకు సిఫారసు చేసిన వారి సంఖ్య: 41,995 కాటరాక్ట్ రిఫర్ చేసిన వారి సంఖ్య :11,857 శస్త్ర చికిత్సలు చేసిన వారి సంఖ్య : 9,600 స్క్రీనింగ్ బృందాలు : 27 చిన్నారి చూపు కార్యక్రమం ద్వారా.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో కంటి పరీక్షలు చేసిన విద్యార్థుల సంఖ్య: 3,69,371 కంటి అద్దాలకు రిఫర్ చేసిన వారి సంఖ్య: 12,089 కంటి శుక్లాలు ఉన్న విద్యార్థులు: 14 మెల్లకన్ను శస్త్ర చికిత్సలు : 10 -
వైరల్: ఇదేం వింత.. ఆ బాలిక ఏడిస్తే కంట్లోంచి రాళ్లు వస్తాయట!
లక్నో: ఎవరైన ఏడిస్తే కళ్లలోంచి నీళ్లు వస్తాయి. కానీ ఈ పాపకు కన్నీళ్లతోపాటు రాళ్లు కూడా వస్తాయి. అయితే రెండు కళ్ల నుంచి కాదు.. కేవలం ఎడమ కంటిలో నుంచి రాళ్లు వస్తుంటాయి. వినడానికి కొంత వింతగా అనిపిస్తున్నా.. ఇలాంటి ఘటన తాజాగా వెలుగు చూసింది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో ఓ బాలిక కంట్లో నుంచి రాళ్లు వస్తున్నాయి. గుర్సాహైగంజ్ అనే ప్రాంతంలో 15 ఏళ్ల బాలిక ఈ వింత సమస్యతో బాధపడుతోంది. కూతురు సమస్యకు పరిష్కారం కోసం తల్లిదండ్రులు చాలా ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఏ డాక్టర్ కూడా ఇది ఏ సమస్యో చెప్పలేకపోయారు. చదవండి: కూతురు ఇష్టం లేని పెళ్లి.. మనవడిని కిరాతకంగా చంపిన బామ్మ ఆమెకు ఈ సమస్య ఎప్పటి నుంచో లేదు. గత జూలై 27 నుంచి ఆమె ఎడమ కంటిలో నుంచి కన్నీళ్లతో పాటు చిన్న సైజు రాళ్లు బయటకొస్తున్నాయి. దాదాపు రెండు నెలలుగా బాలిక ఎడమ కంటి నుంచి ఏడుస్తున్నప్పుడు చిన్న చిన్న రాళ్లు వస్తున్నాయని, రోజూ దాదాపు 10-15 రాళ్లు బయటకొచ్చాయని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. కన్నీళ్లు పెట్టుకున్న సందర్భంలోనే కాదు ఆ కన్ను నలిపినా, ఒత్తిడికి లోనైనా రాళ్లు వస్తుండటంతో ఆ బాలిక భాదపడుతోంది. అలా రాళ్లు కళ్లలో నుంచి వస్తుండటంతో ఆమె ఎడమ కన్ను ఎర్రగా, నొప్పిగా ఉంటుందని బాలిక వాపోతుంది. చదవండి: కమలా హ్యారిస్‌కు ప్రధాని మోదీ బహుమతులు.. వాటి ప్రత్యేకత ఇదే! -
మెల్లకన్ను ఉండటం అదృష్టమా? అందులో వాస్తవమెంత?
చిన్నపిల్లలు ఏ వైపునకు దృష్టిసారించినప్పటికీ... వాళ్ల రెండు కళ్లూ సమాంతరంగా కదులుతుండాలి... కదులుతుంటాయి. అలా కాకుండా... కళ్లు తిప్పినప్పుడు వాటిలో అలైన్మెంట్ లోపించడాన్ని మెల్లగా చెప్పవచ్చు. ఇది కొంతమంది చిన్నపిల్లల్లో చాలా సాధారణంగా కనిపించే సమస్య. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి మూడు నెలల వయసప్పటి వరకు పిల్లల్లో విజన్ కాస్త బ్లర్‌గా ఉంటుంది. చూపు పూర్తిగా డెవలప్ అయి ఉండదు. అంటే పిల్లలు మూడో నెల వరకు నిర్దిష్టంగా ఒకేచోట దృష్టి కేంద్రీకరించలేరు. నాలుగు–ఐదు నెలలప్పటి నుంచి పిల్లలు ఒక వస్తువు (ఆబ్జెక్ట్) మీద దృష్టి పెట్టడం మెుదలు పెడతారు. దాదాపు 12–14 నెలల వయసు వచ్చేప్పటికి వాళ్ల దృష్టి (విజన్) నార్మల్ అవుతుంది. మెల్ల ఉందని ఎప్పుడు అనుమానించాలంటే.. పిల్లల కనుపాపలు ఒకేలా లేకపోవడం, ఒక పక్కకు దృష్టి మరల్చినప్పుడు ఒక కనుపాపే ఆ పక్కకు తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే దాన్ని మెల్ల అనుకోవచ్చు. చిన్నారి బలహీనంగా ఉన్నప్పుడు, వాళ్లలో ఏదైనా రుగ్మత ఉన్నప్పుడు ఈ లక్షణం కనిపించినా దాన్ని మెల్ల అనే అనుకోవాలి. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి మూడు నెలల వయసప్పటివరకు పై లక్షణాలు కనిపిస్తే దాని గురించి అంతగా ఆందోళన అక్కర్లేదు. అయితే మూడు నెలలు దాటాక కూడా అదే లక్షణాలు కనిపిస్తే తక్షణం పూర్తిస్థాయి కంటి పరీక్షలు చేయించాలి. కారణాలు... మెల్లకన్ను రావడానికి కారణాలు చెప్పడం కష్టం. అది పుట్టుకతోనే రావచ్చు. లేదా దృష్టిలోపాలు (రిఫ్రాక్టివ్ ఎర్రర్స్) ఉండటం వల్ల... అంటే హ్రస్వ దృష్టి, దూరదృష్టి, ఆస్టిగ్మాటిజం వంటి వాటివల్ల కూడా కనిపించవచ్చు. ఇది కొంచెం పెద్దపిల్లల్లో వస్తుంటుంది. మెదడుకు సంబంధించిన కొన్ని రుగ్మతలు, జెనెటిక్ సిండ్రోమ్స్ ఉన్నప్పుడు కూడా కనిపిస్తుంది. దీని లక్షణాలు కనిపించినప్పుడు వీలైనంత త్వరగా డయాగ్నోజ్ చేయడం అవసరం. వెంటనే గుర్తించి చికిత్స అందించకపోతే అది శాశ్వతం అయ్యే అవకాశం ఉంది. మెల్లకన్ను ఉన్న పిల్లల్లో దృష్టిలోపాలు (రిఫ్రాక్టివ్ ఎర్రర్స్) ఉన్నాయా, లేదా అన్నది నిర్ధారణ చేయడం చాలా ముఖ్యం. ఒకవేళ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ఉంటే దాన్ని చక్కదిద్దేందుకు కళ్లద్దాలు (కరెక్టివ్ స్పెక్టకిల్స్) వాడటం తప్పనిసరి. అంతేకాదు... డాక్టర్ సలహా మేరకు క్రమం తప్పకుండా ఫాలోఅప్ అవసరం. మెల్లకన్నుకు వుజిల్ ఇంబాలెన్సెస్ కారణం అయితే దాన్ని సర్జికల్‌గా చక్కదిద్దాల్సి ఉంటుంది. మెల్లకన్నుకు వెంటనే సరైన చికిత్స చేయించకపోతే అది ఆంబ్లోపియా (లేజీ ఐ) అనే కాంప్లికేషన్కు దారితీయవచ్చు. అంటే... మెల్ల ఉన్న కంటిలో చూపు క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. ఆరేళ్లలోపు దీన్ని చక్కదిద్దకపోతే ఆ దృష్టిలోపం శాశ్వతం కావచ్చు. కాబట్టి కొందరు అపోహపడేలా మెల్లకన్ను ఉండటం అదృష్టం కానే కాదు. బాగా అభివృద్ధి చెందిన దేశల్లో ఉన్నట్టే ఇప్పుడు మన దగ్గర కూడా మెల్లకన్ను సమస్యను చక్కదిద్దడానికి ఆఫ్తాల్మిక్ సర్జన్స్ అందుబాటులో ఉన్నారు. కాబట్టి మెల్లకన్ను కనిపించినప్పుడు వీలైనంత త్వరగా ఆఫ్తాల్మిక్ సర్జన్లచే పిల్లలకు తగిన చికిత్స ఇప్పించాలి. డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్ -
పూజారిపై మండిపడ్డ తహశీల్దార్.. ఎందుకంటే..
సాక్షి, యశవంతపుర(కర్ణాటక): బెళగావి జిల్లా కాగవాడ తాలూకా ఐనాపురలో అమ్మవారు కన్ను తెరిచారని ప్రచారం జరగడంతో ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. కొన్ని స్థానిక టీవీ చానెళ్లలో కూడా ప్రచారం సాగడంతో జిల్లా అంతటా చర్చనీయాంశమైంది. ఆశ్చర్యపోయిన కాగవాడ తహశీల్దార్ ప్రమీళా దేశ్‌పాండే ఈ కాలంలో దేవి కన్ను తెరవడం ఏమిటని ఐనాపురకు సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. పూజారి విగ్రహంపై అంటించిన కన్ను రూపాన్ని తహసీల్దార్ తీసేయించారు. దేవుని పేరుతో ప్రజలను మభ్యపెట్టవద్దని పూజారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: వామ్మో.. మాయ మాటలు చెప్పి ఎంత పనిచేశాడు.. -
కోవిడ్–19తో కళ్లకు ముప్పు ఉంటుందా?
కరోనా వైరస్ దుష్ప్రభావాలు ఎన్నెన్నో అవయవాలపై ఉండటం మనకు తెలిసిందే. అన్నిటికంటే ఎక్కువగా ఊపిరితిత్తులు, రక్తనాళాలు, మెదడు వంటి శరీర భాగాలపై ఎలా ఉంటుందనే విషయంపై చాలా అధ్యయనాలు జరిగాయి. కానీ కంటి విషయంలో కరోనా ప్రభావాలపై అటు అధ్యయనాలుగానీ... ఇటు అవగాహన గానీ చాలా తక్కువ. అత్యంత సున్నితమైనదీ, కీలకమైనది అయిన కన్ను విషయంలో అమెరికాలోని యూఎస్సీ రాస్కి ఇన్స్టిట్యూట్కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ క్లినికల్ ఆఫ్తాల్మాలజీ డాక్టర్ ఆనీ గ్యూయెన్ వంటివారు ‘కంటిపై కరోనా ప్రభావం’ విషయంలో కొన్ని పరిశీలనలు జరిపారు. ఆ అధ్యయనాల్లో తెలిసిన అంశాలను వివరించే కథనం ఇది. చిన్న పిల్లలను కాస్త సరదాగా భయపెట్టడానికో లేదా వారిని థ్రిల్ చేయడానికో కొందరు పెద్దవాళ్లు తమ పై కనురెప్పలను పైకి మడిచి లేత గులాబీరంగులోని కనురెప్పల వెనకభాగాన్ని చూపించి వాళ్లను ఆడిస్తుంటారు. అలా కనురెప్పల వెనక లేత గులాబీరంగులో కనిపించేదే మ్యూకస్ మెంబ్రేన్. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే... కరోనా వైరస్లు మ్యూకస్ మెంబ్రేన్‌కు అంటుకున్న తర్వాత అక్కణ్నుంచి శరీరం లోపలికి వెళ్తాయన్న విషయం చాలామందికి తెలుసు. మన నోట్లో, ముక్కులో ఉన్నట్లే కళ్లలోనూ ఈ మ్యూకస్ మెంబ్రేన్ ఉంటుంది. కళ్ల ఉపరితం మీద, కనురెప్పల వెనక ఉండే ఈ మ్యూకస్ పొర లైనింగ్నే కంజంక్టివా అంటారు. వైరస్ ఉన్న నీటితుంపర్లు (డ్రాప్లెట్స్) మ్యూకస్ మెంబ్రేన్ ద్వారా లోపలికి వెళ్లి, దేహంలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి ఈ లెక్కన చూస్తే కళ్ల నుంచి కూడా వైరస్ లోపలికి వ్యాపిస్తుందన్న మాట. ఏవైనా వస్తువులనూ, ఉపరితలాన్ని అంటుకున్న తర్వాత ఆ చేతులతో (కడుక్కోకుండాగానీ లేదా శానిటైజ్ చేసుకోకుండాగానీ) కళ్లను రుద్దుకోవద్దని చెప్పడం వ్యాధి వ్యాప్తిని నివారించేందుకే. కళ్లనూ కడుక్కోవాలా? అలాగైతే కంటిపొరలనుంచి కూడా వైరస్ వ్యాప్తి చెందుతుంది కాబట్టి... చేతులను కడుక్కున్నట్టే తరచూ కళ్లనూ కడుక్కోవాలా అనే సందేహం కొందరికి రావచ్చు. ఇక్కడ ఓ రక్షణ వలయం ఎప్పుడూ పనిచేస్తూ ఉంటుంది. కళ్ల ఉపరితలాన్ని ఆక్యులార్ సర్ఫేస్‌గా చెబుతారు. ఈ ఆక్యులార్ సర్ఫేస్ను పరిరక్షించడానికి ఓ వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది. అక్కడ చేరే మైక్రోబ్స్ (వైరస్‌లూ, ఇతర బ్యాక్టీరియా వంటి అతి సూక్ష్మక్రిముల) వంటి వాటిని తుదముట్టించడానికి కన్నీరు ఎప్పుడూ స్రవిస్తూ ఉంటుంది. కన్నీరు ఊరే గ్రంథుల (లాక్రిమల్ గ్లాండ్స్) నుంచి నీరు స్రవిస్తూ కంటి ఉపరితలాన్ని ఎప్పుడూ తడిగా కూడా ఉంచుతూ సంరక్షిస్తుంటుంది. కోవిడ్ సోకితే లక్షణాలూ కంట్లోనూ కనిపిస్తాయా? కోవిడ్ సోకిన లక్షణాలు కొందరికి కళ్ల ద్వారా కూడా వ్యక్తమవుతాయి. కన్ను లేత పింక్ రంగులోకి మారడం, ఎర్రబారడం, దురదలు వంటి లక్షణాలు కనిపిస్తే అది కోవిడ్‌గా అనుమానించాలి. ఇలా కన్ను పింక్ రంగులోకి మారడం కంజంక్టివా అనే పొరకు ఇన్ఫెక్షన్ రావడం కారణంగా జరుగుతుంది. మరోమాటగా చెప్పాలంటే కరోనా వైరస్ ఒక రకంగా కళ్లకలకకూ కారణమవుతుందన్నమాట. మరి రక్షణ ఎలా? కళ్లజోడు వాడేవారికి ఎంతోకొంత రక్షణ లభించేమాట వాస్తవమే అయినా అది పూర్తి రక్షణ కాదు. అందుకే కంటిని రక్షించుకోవాలనుకునేవారు ‘ఫేస్ షీల్డ్స్’ వాడటం మంచిదే. ఇక కాంటాక్ట్ లెన్సెస్ వాడేవారు కొంతకాలం పాటు కళ్లజోడు వాడటం మంచిది. (Delta Varient: డెల్టా వేరియంట్ చాలా డేంజర్) కోవిడ్–19తో కళ్లకు ముప్పు ఉంటుందా? కనురెప్పల లైనింగ్‌కు ఉన్న మ్యూకస్ పొర ద్వారా కోవిడ్–19 వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ, ముక్కు, నోరుతో పోలిస్తే అది ఒకింత తక్కువే. అయితే కోవిడ్–19 వల్ల మరో ముప్పుకూడా ఉంటుంది. అదే ఊపిరితిత్తులకూ, గుండెకూ, మెదడుకూ ఆక్సిజన్ సరఫరా తగ్గడం. కంటి విషయంలోనూ ఇదే జరుగుతుందా అన్న విషయం ఇప్పుడు అధ్యయనంలో ఉంది. (సూపర్ వ్యాక్సిన్.. అన్ని వేరియంట్లకు అడ్డుకట్ట) కోవిడ్ అనంతరం ‘బ్లాక్‌ఫంగస్’ రూపంలో... కోవిడ్–19 సోకినప్పుడు... అది తన లక్షణాల్లో భాగంగా కళ్లను ఎర్రబార్చడం, కొంత పింక్ రంగులో కనిపించేలా చేయడం, దురదలు పుట్టించడం తప్ప నేరుగా ప్రభావితం చూపదు. కానీ కోవిడ్–19 అనంతర పరిణామంగా ‘బ్లాక్‌ఫంగస్’ రూపంలో అది కంటిని దెబ్బతీసే ప్రమాదం మాత్రం ఉంది. బ్లాక్ ఫంగస్ వచ్చినవారిలో ముఖంలో కొన్ని మార్పులు (ఫేషియల్ డిఫార్మిటీ), తలనొప్పి వంటి లక్షణాలతో బయటపడటంతో పాటు... వినికిడి, వాసన తెలిపే జ్ఞానాన్ని ప్రభావితం చేసినట్టే... చూపునూ దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఫలితంగా చూపు మందగించడం, బాగా మసక మసగ్గా (హేజీగా) కనిపించడం, కళ్లలో ఎర్రజీరలు కనిపించవచ్చు. కళ్లు వాచడంతో పాటు కంటి పరిసరాలైన చెంపలు, ముఖం సైతం వాచడం జరగవచ్చు. అప్పుడు వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. బ్లాక్‌ఫంగస్ అంధత్వాన్ని తెచ్చిపెట్టే ప్రమాదం ఉన్నందున ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. కంటి విషయంలో ఈ జాగ్రత్తలు పాటించండి... ► దేనినైనా ముట్టుకున్న తర్వాత లేదా ఉపరితలాలను తాకిన తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ అవే చేతులతో కంటిని తాకవద్దు. ∙అలా ముట్టుకోవాల్సి / తాకవలసి వచ్చినప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ► కాంటాక్ట్ లెన్స్‌లు వాడేవారు కొంతకాలం పాటు వాటికి దూరంగా ఉంటూ... కళ్లజోడు మాత్రమే వాడాలి. ► కళ్ల సమస్యలు ఉన్నవారు డాక్టర్లు సూచించిన మందులను తప్పనిసరిగా వాడుతూ ఉండాలి. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు (ఇమ్యునో కాంప్రమైజ్డ్ పర్సన్స్) తమ కళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ► అన్నిటికంటే ముఖ్యంగా కోవిడ్–19 అనంతర పరిణామంగా ‘బ్లాక్‌ఫంగస్’తో ఉన్న ముప్పు కారణంగా కన్ను దెబ్బతినడం/ అంధత్వం రావడం వంటి అవకాశాలున్నందున కళ్లలో ఎర్రజీరలు / పింక్‌రంగులో మారడం, వాపురావడం, నీళ్లుకారడం వంటి లక్షణాలు కనిపించగానే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. - డాక్టర్ రవికుమార్ రెడ్డి కంటి వైద్య నిపుణులు -
కరోనా కాలంలో... కంటి సమస్యలు
హైదరాబాద్: మారిన పరిస్థితుల్లో కంప్యూటర్ మనకి మరింత దగ్గర చుట్టం అయిపోయింది. ల్యాప్ టాప్ కావచ్చు, స్మార్ట్ ఫోన్, ట్యాబ్... ఇలా పేరేదైనా మనకు ఆత్మీయ నేస్తాల్లా మారిపోయాయి. స్క్రీన్స్‌ను తదేకంగా చూస్తుండడం అనేది ఇటీవలి కాలంలో మరింత పెరిగింది. వర్క్‌ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ స్కూల్స్, ఆన్లైన్ బిజినెస్, జూమ్ మీటింగ్స్, ఓటీటీ సినిమాలూ, ... ఇలా ప్రతీదానికీ స్క్రీన్ వ్యూ సర్వసాధారణంగా మారింది. రోజులో అత్యధిక సమయం కంప్యూటర్ స్క్రీన్ చూస్తూ గడపడం అనేది అనేక మందిలో తీవ్రమైన కంటి సమస్యలకు దారి తీస్తోంది. అలాగే ఇంటి పట్టున ఉండడం పెరగడంతో నిర్విరామంగా టీవీ చానెళ్లను వీక్షించడం ఎక్కవైంది. దీంతో ఇది కంటి మీద తీవ్రమైన భారంగా మారింది. అప్పటికే కంటి సమస్యలున్నవారు కరోనా అనంతరం మరింత తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఇలాంటి వారు తాత్కాలిక పరిష్కారాలుగా కళ్లోజోడు, కాంటాక్ట్‌లెన్స్‌లు ఎంచుకోవడం కన్నా శాశ్వత పరిష్కారమైన లేజర్ సర్జరీకి ఓటేయడమే మేలంటున్నారు. డా. అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ ఆప్తమాలజిస్ట్, ఆల్పా అతుల్ పూరాబియా, ఈ నేపధ్యంలో సర్జరీలపై ఉన్న అపోహలను భయాలను తొలగించుకోవాలని ఆమె సూచిస్తున్నారు. కాంటాక్ట్ లెన్స్‌తో డ్రై నెస్... దృష్టి లోపాన్ని సరిదిద్దడానికి కళ్లజోళ్లు, కాంటాక్ట్ లెన్స్‌లు సులభ పరిష్కారం మాత్రమే, మరోవైపు క్రీడాకారులకు ఇది సరైన పరిష్కారం కాబోదు. స్క్రీన్ వీక్షణం కోసం పరిమితంగా కొన్ని గంటల కాలమే అయినా కాంటాక్ట్ లెన్స్ వినియోగం కూడా కళ్లలో డ్రైనెస్‌ను పెంచుతోంది. కాబట్టి స్మైల్, లాసిక్, పిఆర్‌కె వంటి రిఫ్రాక్టివ్ లేజర్ ఐ సర్జరీలు కంటి సంబంధ సమస్యలకు శాశ్వత పరిష్కారం. ఎవరు చేయించుకోవచ్చు? లాంగ్, షార్ట్ సైట్లకు రిఫ్రాక్టివ్ లేజర్ ఐ సర్జరీ అనేది అత్యంత ఖచ్చితమైన పరిష్కారాల్లో ఒకటి. గత 12 నెలలుగా కళ్లజోడు వాడుతూ ఇతరత్రా ఆరోగ్య సమస్యలేమీ లేకుండా ఉన్న 21 సంవత్సరాలు దాటిన ఎవరైనా ఈ సర్జరీని ఎంచుకోవచ్చు. అయితే బాగా పల్చని కార్నియా ఉన్నా, కార్నియా పైన అపసవ్యతలేవైనా ఉన్నా దీర్ఘకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ సర్జరీ చేయించుకోవడానికి వీలు ఉండదు. దీన్ని నిర్ధారించుకోవడానికి ముందుగా కంటి పరీక్షలు చేయించుకోవడం అవసరం. అలాగే ఈ సర్జరీ విషయంలో కొందరికి పలు రకాల అపోహలు కూడా ఉన్నాయి. ►శస్త్రచికిత్స విధానం బాధాకరంగా ఉంటుందని కొందరు అపోహ పడుతున్నారు. అయితే అది నిజం కాదు. సర్జరీ విషయంలో వైద్యులు తగినన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటారు. నొప్పిని వీలున్నంత తక్కువ స్థాయిలో ఉంచేందుకు కంటి డ్రాప్స్ వంటివి వాడతారు. అలాగే శస్త్ర చికిత్స అనంతరం పూర్తిగా కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుందని కూడా సందేహిస్తుంటారు. ఇదీ నిజం కాదు. సర్జరీ పూర్తయిన తర్వాత కేవలం 2 నుంచి 6 రోజుల వ్యవధిలోనే సాధారణ జీవితానికి తిరిగి వెళ్లవచ్చు. ►శాశ్వత దృష్టిలోపానికి దారి తీసే ప్రమాదం ఉందని మరికొందరి అపోహ. అయితే కంటిలో తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఏర్పడితే తప్ప ఈ సర్జరీ కారణంగా శాశ్వత దృష్టి లోపం కలగడం జరగదు. ఇది చాలా అరుదైన విషయం. స్వల్పంగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినప్పటికీ అవన్నీ సులభంగా పరిష్కరించుకోగలిగినవే. ►సర్జరీ అయిన తర్వాత రెగ్యులర్ ఐ చెకప్స్ అక్కరలేదనేది కూడా అపోహే. లేజర్ కంటి శస్త్ర చికిత్స అనేది జీవితకాలం కంటి ఆరోగ్యానికి హామీ కాదు. వయసుతో పాటు వచ్చే మార్పుల ప్రభావం కంటి ఆరోగ్యం మీద ఉండొచ్చు. కాబట్టి సర్జరీ తర్వాత కూడా క్రమబద్ధమైన పద్ధతిలో కంటి పరీక్షలు చేయించుకోవడం అవసరమే. ►సైడ్ ఎఫెక్ట్స్ తీవ్రంగా ఉంటాయని కొందరు భయపడుతుంటారు. స్వల్పంగా అసౌకర్యం అనిపించడం సహజమే.అయితే వీటిని పెయిన్ కిల్లర్స్ ద్వారా సులభంగా చికిత్స చేయవచ్చు. అలాగే కళ్లు పొడిబాచటం కూడా మరో సైడ్ ఎఫెక్ట్. చాలా మంది పేషెంట్స్ సర్జరీ అయిన కొన్ని వారాల్లోనే అన్నింటి నుంచి విజయవంతంగా కోలుకుంటారు. ఆటలు క్రీడల్లో రాణించాలనుకున్నవారికి ఇది చక్కని ఉపయుక్తం. –డా. ఆల్పా అతుల్ పూరాబియా, ఆప్తమాలజిస్ట్, అపోలో స్పెక్ట్రా హాస్పిటల్, హైదరాబాద్. చదవండి: నిద్ర రావడం కోసం అద్భుత చిట్కాలు -
ఎక్కువగా ఏడిస్తే కళ్ల కింద క్యారీ బ్యాగులే..
పెరి ఆర్బిటల్ పఫ్ఫినెస్.. అంటే చటుక్కున అర్థం కాదు. కానీ కళ్ల కింద క్యారీ బ్యాగులనగానే వెంటనే తెలిసిపోతుంది. కళ్ల చుట్టూ ఉండే కండరాల్లో (ఆర్బిట్స్ అంటారు)వచ్చే వాపును శాస్త్రీయంగా పెరి ఆర్బిటల్ పఫ్ఫినెస్ అని, ఈ టిష్యూలో ఫ్లూయిడ్స్ పేరుకుపోవడం వల్ల వచ్చే వాపును పెరి ఆర్బిటాల్ ఎడిమా అనీ అంటారు. వయసు వచ్చే కొద్దీ కంటి దిగువ పెరిగే కొవ్వు కారణంగా ఏర్పడే సమస్యని సబ్ఆర్బిక్యులారిస్ ఆక్యులి ఫ్యాట్ అంటారు. ఈ సమస్య చిన్నపెద్దా తేడా లేకుండా అందరిలో కనిపిస్తుంది. కామన్ గా వీటిని ఐబ్యాగ్స్ అంటారు. చిన్నవయసువారి లో కనిపించే బ్యాగ్స్ కొంత జాగ్రత్త తీసుకుంటే కనిపించకుండా పోతాయి. పెద్దవారిలో వచ్చేవి ఎంత యత్నించినా కొన్నిసార్లు దాచలేము. ఇవి పెద్దగా సీరియస్ కండిషన్ కాదు కానీ నిర్లక్ష్యం చేస్తే కొన్నిమార్లు ఇబ్బందులు పెరుగుతాయి. అందుకే సాధ్యమైనంత వరకు వీటి నివారణకు యత్నించడం మేలు. కారణాలనేకం : ఐబ్యాగ్స్ పేరుకుపోవడానికి కారణాలనేకం ఉన్నాయి. వయసు, తిండి, హార్మోన్స్, వ్యాధులు, మెడిసిన్స్ వాడకం, మానసిక స్థితి.. ఇలా అనేక అంశాలు క్యారీబ్యాగ్స్కు కారణమవుతుంటాయి. వయసు వయసు పెరిగేకొద్దీ కళ్ల కింద చర్మం పలచబడి వేలాడుతుంటుంది. ఈ ఖాళీల్లోకి ఫ్లూయిడ్స్ చేరుతుంటాయి. దీంతో ఇవి క్రమంగా విస్తరించి పర్మినెంట్‌గా ఉండిపోతాయి. వయసుతోపాటు టియర్గ్లాండ్స్ సరిగా పనిచేయక లూబ్రికేషన్స్ తేడాలు వచ్చి కళ్ల కింద వాపు వస్తుంది. ఏడుపు, నిద్రలేమి ఎక్కువగా ఏడ్చేవాళ్లకు కన్నీళ్లలో ఉండే సాల్ట్ కారణంగా ఐబ్యాగ్స్ వస్తుంటాయి. అదేవిధంగా కలత నిద్ర పోయేవారిలో కంటి లూబ్రికేషన్స్ లో వ్యత్యాసాలు వస్తాయి. ఇవి క్రమంగా కంటికింద బ్యాగులకు దారితీస్తుంటాయి. అలాగే రాత్రి పడుకొని పొద్దున లేచాక కంటి చుట్టూ ఫ్లూయిడ్ బాలెన్స్ సరిగా జరగక ఉబ్బుతుంటాయి. థైరాయిడ్ సమస్యలు థైరాయిడ్ సమస్యల కారణంగా శరీరద్రావకాల్లో మ్యూకోపాలీసాఖరైడ్స్ తదితర రసాయనాల ఫిల్టరేషన్ సరిగా జరగదు. దీంతో ఇవన్నీ కణజాలాల మధ్య ఖాళీల్లోకి ఆస్మాసిస్ ద్వారా ప్రవహించి పేరుకుపోతుంటాయి. వ్యాధులు పెరిఆర్బిటాల్ సెల్యులైటిస్, బ్లిఫారో కెలాసిస్, చాగస్ డిసీజ్, మోనో న్యూక్లియోసిస్ లాంటి కండీషన్ల కారణంగా కంటి చుట్టూ వలయాల్లో ఫ్యాట్ లేదా ఫ్లూయిడ్స్ నిల్వ చేరుతుంటాయి. ఇవి క్రమంగా ఐ పఫ్ఫీనెస్కు దారితీస్తాయి. కొన్ని రకాల అలెర్జీలు, చర్మవ్యాధులు కూడా ఇందుకు కారణమవుతుంటాయి. ఆహారం సోడియం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకునేవారిలో పఫ్ఫీ ఐస్ వచ్చే అవకాశం అధికం. పొగాకు, ఆల్కహాల్ ఈ రెండూ వాడేవారు స్ట్రెస్, హార్మోన్స్ మార్పులు, అలసట, నిద్రలేమికి తొందరగా గురవుతారు. అందువల్ల వీరిలో ఈ ఐబ్యాగ్స్ కామన్‌గా వస్తాయి. ఏం చేయాలి? ఇది సాధారణ సమస్యేకానీ బయటకు కనిపించేందుకు ఇబ్బందిపెడుతుంది. కొందరిలో మాత్రం ఇది తీవ్ర సమస్యగా మారి సర్జరీ వరకు దారితీస్తుంది. క్యారీబ్యాగులు వచ్చి పోవడం వేరు, కంటి కింద పర్మినెంట్‌గా ఉండడం వేరు. ఇలా పర్మినెంట్‌గా ఈ బ్యాగ్స్ ఉండిపోతే మెడికల్ డిజార్డర్ ఏదో ఉందని డాక్టర్‌ను సంప్రదించాలి. సర్వసాధారణంగా వచ్చే వాపునకు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలు. ♦ ఆహారంలో ఉప్పు తగ్గించడం, లో కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోవడం, ఏ, సీ, ఈ విటమిన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం, అధికంగా నీరు తాగడం ద్వారా తగ్గించుకోవచ్చు. ♦ నిద్రలో తల కింద కాస్త ఎత్తు ఉంచుకోవడం, కళ్లకు కోల్డ్ కంప్రెస్ ట్రీట్మెంట్(కళ్ల మీద, చుట్టూ ఐస్ రుద్దుకోవడం) ద్వారా ఫ్లూయిడ్ అసమతుల్యతను తాత్కాలికంగా సరిచేయవచ్చు. ♦ మందులు వాడాల్సివస్తే డాక్టర్ సలహా ప్రకారం కార్టికోస్టీరాయిడ్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్, యాంటీ హిస్టమిన్స్, అడ్రినలిన్ లేదా ఎపినెఫ్రిన్ , యాంటిబయాటిక్స్ తదితరాలు వాడాలి. క్యారీ బ్యాగులు రాకుండా లేదా వచ్చినవి తగ్గించడానికి కొన్ని వంటింటి చిట్కాలు బాగా పనిచేస్తుంటాయి... ♦ ఉల్లిపాయని పిండి ఆ రసంలో కొద్దిగా ఉప్పు కలపండి. రాత్రి పడుకునే ముందు ఈ మిశ్రమాన్ని క్యారీబ్యాగ్స్‌పై పూయాలి(కంటికి తగలనీయకండి, మండిపోతుంది). మరుసటి రోజు పొద్దున్నే చల్లటి నీటితో కడగండి. ఉల్లిపాయలో ఉండే కెమికల్స్ కళ్ల చుట్టూ కొవ్వు పేరుకుపోవటాన్ని ఆపుతాయి. ♦ కాటన్ బాల్ ను ఆపిల్ సైడర్ వెనిగర్‌లో ముంచి కంటి కింద అప్లై చేయండి. తీవ్రమైన ఆమ్ల గుణాలను కలిగి ఉండే ఆపిల్ సైడర్ వెనిగర్ ఐబ్యాగ్స్ను, వాటి మచ్చలను తొలగిస్తుంది. శరీరంలో చెడు కొవ్వు స్థాయిలను తగ్గించడానికి గోరు వెచ్చని నీటిలో ఆపిల్ సైడర్ వెనిగర్ ను కలిపి తాగవచ్చు. ♦ ఆముదం నూనెలో ఉండే ’రిసినోఎలిక్ ఆసిడ్’ పేరుకుపోయిన కొవ్వు పదార్థాలను తొలగిస్తుంది. కాటన్ బాల్‌ను ఆముదంలో ముంచి ఐబ్యాగ్స్పై అద్దండి. మంచి రిజల్ట్స్ కోసం కొన్ని రోజులు దీన్ని కొనసాగించాలి. ♦ ఒక గ్లాసు నీటిలో రెండు చెంచాల మెంతులు నానబెట్టి, మరుసటిరోజు ఉదయం పరగడుపున(ఖాళీ కడుపుతో) తాగండి. మెంతులు బాడ్ కొలెస్ట్రాల్‌ను, పేరుకుపోయిన ఫ్యాట్‌ను తొలగిస్తాయి. ♦ వెల్లుల్లిని దంచి వచ్చే పేస్ట్‌ను ఐబ్యాగ్స్పై అప్లై చేయాలి. ఆవిధంగా అరగంట పాటుంచి చల్లటి నీళ్లతో కడగాలి. ఒకవేళ సెన్సిటివ్ స్కిన్ ఉంటే మాత్రం ఎక్కువ సమయం ఈ పేస్ట్‌ను చర్మంపై ఉంచకండి. వెల్లుల్లిలో ఉండే ఎంజైమ్ ఫ్లూయిడ్స్ లో కొవ్వుల స్థాయిని తగ్గిస్తుంది. -
ఇక వారు కూడా ఆపరేషన్లు చేయొచ్చు!
సాక్షి, న్యూఢిల్లీ: ఆయుర్వేద వైద్యానికి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో బీజేపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయు ఆయుర్వేద వైద్య విధానం ప్రోత్సాహానికి ఇప్పటికే అనేక చర్యలు చేపట్టిన కేంద్రం తాజాగా ఆయుర్వేదంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ హోల్డర్లు వివిధ రకాల సాధారణ శస్త్రచికిత్సలు చేసేందుకు వీలు కల్పించనుంది. ఈ మేరకు ఇండియన్ మెడిసిన్ సెంట్రల్ కౌన్సిల్ (పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆయుర్వేద విద్య) 2016 నిబంధనలను సవరించింది. షాలియా (సాధారణ శస్త్రచికిత్స) షాలక్య (ఈఎన్టీ, హెడ్, డెంటల్ స్పెషలైజేషన్) కోర్సులను పీజీలో ప్రవేశపెట్టింది. దీని ప్రకారం వారికి ప్రత్యేక శిక్షణను ప్రవేశపెట్టింది. శిక్షణ అనంతరం ఈఎన్టీ, దంత వైద్యంతోపాటు, కంటి శస్త్ర చికిత్సలు చేయడానికి కూడా అనుమతి లభిస్తుంది. ప్రభుత్వనిర్ణయం ప్రకారం ఇకపై ఆయుర్వేద వైద్యులు స్కిన్ గ్రాఫ్టింగ్, కంటిశుక్లం శస్త్ర చికిత్స, రూట్ కెనాల్ వంటి సాధారణ ఆపరేష్లన్లను చట్టబద్ధంగా నిర్వహించవచ్చు. నవంబర్ 19న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు పాఠ్యాంశాల్లో భాగంగా షాలియా (సాధారణ శస్త్రచికిత్స) షాలక్య (చెవి, ముక్కు, గొంతు వ్యాధులు) విధానాలలో అధికారికంగా శిక్షణనిస్తుంది. తద్వారా వారు స్వతంత్రగా సర్జరీలను నిర్వహించే సామర్ధ్యాన్ని సొంతం చేసుకుంటారు. ఎంఎస్ (ఆయుర్వేద) శాల్య తంత్రం డీబ్రిడ్ మెంట్ / ఫాసియోటోమీ / క్యూరెట్టేజ్ పెరియానల్ చీము, రొమ్ము గడ్డ, ఆక్సిలరీ చీము, సెల్యులైటిస్ అన్ని రకాల స్కిన్ గ్రాఫ్టింగ్, ఇయర్ లోబ్ రిపైర్ లింఫోపోమా, ఫైబ్రోమా, స్క్వాన్నోమా మొదలైన కణతుల తొలగింపు గ్యాంగ్రేన్ ఎక్సిషన్ / విచ్ఛేదనం తీవ్ర గాయాలనిర్వహణ, అన్ని రకాల సూటరింగ్, హేమోస్టాటిక్ లిగెచర్స్, బిగుసుకుపోయిన కండరాల చికిత్స లాపరోటమీ హేమోరాయిడెక్టమీ, రబ్బర్ బ్యాండ్ లిగేషన్, స్క్లెరోథెరపీ, ఐఆర్పీ, రేడియో ఫ్రీక్వెన్సీ / లేజర్ అబ్లేషన్ మొదలైన వివిధ పద్ధతులు. యానల్ డైలేటేషన్, స్పింక్టెరోటోమీ అనోప్లాస్టీ ఫిస్టులెక్టమీ, ఫిస్టులోటోమీ, పైలోనిడల్ సైనస్ ఎక్సిషన్, వివిధ రెక్టోపెక్సీలు యురేత్రల్ డైలేటేషన్, మీటోమి, సున్తీ పుట్టుకతో వచ్చే హెర్నియోటమీ, హెర్నియోరాఫీ, హెర్నియోప్లాస్టీ హైడ్రోసెల్ ఎవర్షన్, థొరాసిక్ గాయానికి ఇంటర్‌కోస్టల్ డ్రెయిన్ మొదలైనవి ఉన్నాయి కన్ను కనుపాపలను సరిచేసే సర్జరీ, క్యూరెట్టేజ్ ట్యూమర్ తొలగింపు సర్జరీ పాటరీజియం ఐరిస్ ప్రోలాప్స్-ఎక్సిషన్ సర్జరీ గ్లాకోమా-ట్రాబెక్యూలెక్టమీ కంటికి గాయం: - కనుబొమ్మ, మూత, కండ్లకలక, స్క్లెరా కార్నియా గాయాలకుమరమ్మత్తు శస్త్రచికిత్స స్క్వింట్ సర్జరీ - ఎసోట్రోపియా, ఎక్సోట్రోపియా డాక్రియోసిస్టిటిస్- డిసిటి / డాక్రియోసిస్టోరినోస్టోమీ [డిసిఆర్] కంటిశుక్లం శస్త్రచికిత్స ఇంప్లాంటేషన్ శస్త్రచికిత్సతో కంటిశుక్లం వెలికితీత మొదలైనవి ముక్కు: సెప్టోప్లాస్టీ, పాలీపెక్టమీ, రినోప్లాస్టీ చెవి : లోబులోప్లాస్టీ. అక్యూట్ సపరేటివ్ ఓటిటిస్, మాస్టోయిడెక్టమీ గొంతు వ్యాధులు : టాన్సిలెక్టమీతో పాటు ఇతర చికిత్సలు దంత : వదులు దంతాల బిగింపు, రూట్ కెనాల్,ఇతర చికిత్స -
చైనాలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన
సుజోవు: చైనాలోని సుజోవు నగరంలో ఒళ్లు గగుర్పొడిచే సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఒక వ్యక్తి కంటి నుంచి 20 నులిపురుగులను వైద్యులు బయటకు తీశారు. వాన్ అనే వ్యక్తికి కంటి నొప్పి బాగా రావడంతో ఆసుపత్రిలో చేరాడు. దీంతో అతడిని పరీక్షించిన వైద్యులు కంటిలో నులిపురుగులు ఉన్నట్లు కనుగొన్నారు. మొదటిలో కంటినొప్పి వచ్చిందని, తాను పెద్దగా పట్టించుకోలేదని వాన్ తెలిపారు. తరువాత ఆ నొప్పి ఎక్కువ కావడంతో ఆసుపత్రికి వెళ్లినట్లు చెప్పారు. అప్పటికే అతడి కంటిలో 20 నులిపురుగులు ఉన్నట్టు గుర్తించిన వైద్యులు చికిత్సనందించారు. సాధారణంగా ఇలాంటి పురుగులు కుక్కలు, పిల్లులు కన్నీటిలో ఉంటాయి. అయితే వాన్ ఇంట్లోకానీ పని చేసే చోట కానీ ఎలాంటి పెంపుడు జంతువులు లేవని వాన్ తెలిపారు. అతడి కంటిలోకి ఈ పురుగులు ఎలా చేరాయో తెలియడం లేదు. ఇలాంటి ఘటనే అంతకు ముందు అమెరికాలో కూడా ఒకటి జరిగింది. ఒక మహిళ ముఖంలో ఏదో కదలుతున్నట్లు అనిపించగా ఆమె డాక్టర్‌ను సంప్రదించింది. ఆమె చర్మం కింద నులిపురుగులు కదులుతున్నాయని గుర్తించిన వైద్యులు ఆమెకు వైద్యాన్ని అందించారు. చదవండి: ఆ వీడియో లేకపోతే... నిజం తెలిసేది కాదు!! -
ఆరోగ్య సంస్థానం: రామ్‌దేవ్‌రావు హాస్పిటల్
సిరివెన్నెల పదేళ్ల పాపాయి. తండ్రి విజయ్ కేటరింగ్ సర్వీస్ ఉద్యోగి. జగద్గిరిగుట్టలో నివాసం. రోజూ తెల్లవారు జామున మూడున్నరకే డ్యూటీకి వెళ్తాడు. తల్లి మమత పిల్లల్ని చూసుకుంటూ ఇంటిపట్టునే ఉంటుంది. పిల్లలు నిద్రలేచేలోపు దగ్గరలో ఉన్న మార్కెట్‌కెళ్లి కావల్సిన వస్తువులు తీసుకుని ఇంటికి వచ్చేస్తుంటుంది. ఎప్పటిలాగానే ఆ రోజు కూడా తలుపు బయటి నుంచి గడియపెట్టి మార్కెట్‌కి వెళ్లింది. ఆమె తిరిగి వచ్చేలోపు నిద్రలేచేశారు పిల్లలు. అమ్మ వచ్చేలోపు తమ్ముడికి పాలు వేడి చేసి తాగించాలనుకుంది సిరివెన్నెల. అగ్గిపుల్ల వెలిగించింది. స్టవ్ వెలిగించేలోపు మంట చేతి మీదకు పాకింది. భయంతో అగ్గిపుల్లను వదిలేసింది. ఏం జరుగుతోందో తెలిసే లోపే మంటలు గౌను మొత్తానికి వ్యాపించాయి. చుట్టుపక్కల వాళ్లు వచ్చేలోపు ఒళ్లు తీవ్రంగా కాలిపోయింది. గాయాలకు చికిత్స కోసం నాలుగు నెలల పాటు హాస్పిటల్లో ఉండి గడచిన మే నెలలో డిశ్చార్జ్ అయింది సిరివెన్నెల. సిరివెన్నెల అమ్మానాన్నలు కృష్ణాజిల్లా గుడివాడ నుంచి బతుకు తెరువు కోసం హైదరాబాద్‌కొచ్చారు. విజయ్‌ది పొట్ట నింపుకోవడానికి తప్ప వైద్యం చేయించుకోవడానికి డబ్బు మిగిలే ఉద్యోగం కాదు. ‘‘మాలాంటి వాళ్ల కోసమే వెలిసిన దేవాలయమే మా బిడ్డకు మాకు దక్కించింది. దేవుడు ఎక్కడో లేడు, అక్కడి వైద్యుల్లోనే ఉన్నాడు. నాలుగు నెలలు ఏసీ గదిలో పెట్టి చికిత్స చేశారు. పదహారు లక్షల బిల్లయింది. మా దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. బిడ్డను జాగ్రత్తగా చూసుకోమని మాకప్పగించారు’’ అని చేతులెత్తి మొక్కుతోంది మమత. పేదల దేవాలయం మమత చెప్పిన హాస్పిటల్ హైదరాబాద్, కూకట్పల్లి, వివేకానంద నగర్లో ఉంది. ఇది ఇప్పటిది కాదు, 1950 దశకంలో 55 ఎకరాల్లో శివానంద రిహాబిలిటేషన్ హోమ్‌గా మొదలైంది. వడ్డేపల్లి సంస్థానం ఆడపడుచు, వనపర్తి సంస్థానం కోడలు రాణి కుముదినీ దేవి ఆలోచన. కుష్టువ్యాధి, టీబీ సమాజాన్ని పీడిస్తున్న రోజులవి. పేషెంట్లను సమాజం చూపులతోనే బహిష్కరించేది. అలాంటి పరిస్థితుల్లో పేషెంట్ల కోసం ఇళ్లు, చర్చ్, మసీదు, దేవాలయాలు కట్టించి ఇచ్చారు రాణి కుముదినీదేవి. ఏకంగా ఒక ఊరినే నిర్మించారని చెప్పాలి. ఇప్పుడు హెచ్ఐవీ పేషెంట్లకు కూడా పునరావాసం కల్పిస్తున్నారు. పేషెంట్లకు కొవ్వొత్తుల తయారీ, బ్యాండేజ్ క్లాత్ తయారీ, వడ్రంగం, తాపీ పనుల్లో శిక్షణనిప్పించి వారి ఉపాధికి బాటలు వేశారు. సాధారణ పేషంట్లకు కూడా వైద్య సదుపాయం కల్పించమని సూచించారు ఆమె భర్త రాజా రామ్‌దేవ్‌రావు. అదే ప్రాంగణంలో భర్త పేరు మీద ‘రామ్‌దేవ్‌రావ్’ హాస్పిటల్ స్థాపించారు కుముదినీదేవి. ఇది పూర్తిగా చారిటీ హాస్పిటల్. నామమాత్రపు ఫీజుతో సకల వైద్యసౌకర్యాలను అందిస్తున్న వైద్యాలయం. ఆ ఫీజు కూడా చెల్లించలేని వారికి పూర్తిగా ఉచితంగా వైద్యం చేస్తున్న పేదల పాలిట దేవాలయం. సామాజిక వైద్యం ఇక్కడి డాక్టర్లు హాస్పిటల్‌కి వచ్చిన వాళ్లకు వైద్యం చేయడమే కాదు. స్కూళ్లు, కాలనీలకు కూడా వెళ్లి వైద్యం చేస్తారు. వారంలో ఒకరోజు మియాపూర్‌లోని వరలక్ష్మి ఓల్డేజ్ హోమ్, ఒక రోజు ఎల్లమ్మ బండ కాలనీలకు వైద్య బృందం వెళ్తుంది. అలాగే పల్స్‌పోలియో భూతాన్ని తరిమి కొట్టడానికి కూడా ప్రత్యేకమైన చొరవ తీసుకుంటున్నారు. భవన నిర్మాణాలు జరుగుతున్న చోట వలస కార్మికులు... కుటుంబాలతో తాత్కాలిక నివాసాల్లో జీవిస్తుంటారు. హైదరాబాద్ మహానగరంలో అలాంటి ప్రదేశాలను గుర్తించి ఆ పిల్లలకు పోలియో చుక్కలు వేయడానికి రామ్‌దేవ్‌రావ్ హాస్పిటల్ సహాయం చేస్తోంది. క్యాన్సర్ పేషెంట్లు అంత్యదశ ప్రశాంతంగా గడపడం కోసం పాలియేటివ్ కేర్ సర్వీస్ కూడా ఇస్తోంది రామ్‌దేవ్‌రావ్ వైద్యాలయం. ఈ సేవ కూడా పూర్తిగా ఉచితం. పేషెంట్‌తోపాటు సహాయకుల్లో ఒకరికి కూడా ఆహారం, బస ఉచితం. రెండో సహాయకులకు నామమాత్రపు ఫీజు వసూలు చేస్తారు. ఇంత మహోన్నతమైన సేవలందిస్తున్న ఈ ట్రస్టును స్థాపించిన రాణి కుముదినీ దేవి దంపతులు ఇప్పుడు లేరు. వారి వారసుల్లో రెండవ కొడుకు విక్రమ్‌దేవ్‌రావ్, పెద్ద కోడలు మీరారావు పర్యవేక్షిస్తున్నారు. అత్యాధునికమైన వైద్యాన్ని పేదవాళ్ల దగ్గరకు చేర్చిన మహనీయుడు స్వర్గీయ డాక్టర్ వైఎస్సార్. కన్నీళ్లతో వచ్చిన పేషెంట్ ముఖంలో చిరునవ్వు చూడాలనుకున్న మహోన్నతమైన దాత రాణి కుముదినీదేవి. రేపటి ఫలాల కోసం నేడు మొక్క నాటాలనే దార్శనికత వారిది. జ్వరంతో హాస్పిటల్లో చేరిన పేషెంట్లకు బిల్లుతో గుండెపోటు తెప్పించే కార్పొరేట్ హాస్పిటళ్ల మధ్యనే రాణి కుముదినీదేవి స్థాపించిన వైద్యాలయం కూడా ఉంది. ఎటువంటి ప్రచారం లేకుండా మౌనంగా తన పని తాను చేసుకుపోతోంది. – వాకా మంజులారెడ్డి రేస్‌క్లబ్ సౌజన్యం ఈ హాస్పిటల్లో కంటి వైద్య విభాగాన్ని హైదరాబాద్ రేస్‌క్లబ్ ఏర్పాటు చేసింది. అధునాతనమైన లేజర్ సర్జరీలు కూడా ఉచితంగా చేస్తారు. లెన్స్ వంటి పరికరాలకు మాత్రమే చార్జ్ చేస్తున్నట్లు తెలియచేశారు సీఈవో డాక్టర్ యోబు. ‘మహిళలకు మెనోపాజ్ తర్వాత కూడా ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల జీవితకాలం ఉంటుంది, ఈ దశలో అవసరమైన జాగ్రత్తలు తీసుకోకపోతే తర్వాత జీవితకాలమంతా నిస్తేజంగా కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే మెనోపాజ్ సమయంలో ఆరోగ్యపరమైన జాగ్రత్తలు, పరీక్షల కోసమే ప్రత్యేకంగా ఒక విభాగం ఉంది’ అని తెలియచేశారాయన. ఆరోగ్య ప్రదానం జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ప్రసూతి వైద్యం, ఈఎన్టీ, ఆప్తాల్మాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, రేడియాలజీ, డైటరీ కౌన్సెలింగ్ విభాగాలున్నాయి. డ్యూటీ డాక్టర్లు ఇరవై మందిమి ఉన్నాం. కన్సల్టెంట్లుగా మరో 47 మంది డాక్టర్లు సేవలందిస్తున్నారు. చారిటీ హాస్పిటల్ కదా అని పేషెంట్ల పట్ల నిర్లక్ష్యంగా ఉంటారనుకోవద్దు. మేము వైద్యవృత్తిని అవమానించం. నర్సుల చేత ప్రసవం చేయించడం వంటివి ఉండవు. హాస్పిటల్ ఆవరణలో డాక్టర్లకు క్వార్టర్లు కూడా ఉన్నాయి. ఏ సమయంలో ఎమర్జెన్సీ వచ్చినా హాజరవుతారు. మేము తీసుకునే ఫీజు సంస్థ నిర్వహణ కోసం మాత్రమే. నార్మల్ డెలివరీకి పన్నెండువేలు, సిజేరియన్‌కి పద్దెనిమిది వేలు, డయాలసిస్ చార్జ్ మూడు వందలు. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే డయాలసిస్ ఉచితం. నలభై మెషీన్లున్నాయి. రోజుకు 100 మందికి పైగా డయాలసిస్ కోసం వస్తుంటారు. మొత్తం విభాగాలకు కలిపి రోజుకు తొమ్మిది వందల మంది వస్తుంటారు. – డాక్టర్ ఎన్.యోబు,సీఈవో, రామ్‌దేవ్‌రావ్ హాస్పిటల్, హైదరాబాద్ -
డిజిటల్ చదువు.. కంటికి బరువు
అంటే పరోక్షంగా ఇది వారి కళ్లకు కూడా పరీక్షా కాలమే.. ముఖ్యంగా డిజిటల్ లెర్నింగ్ సర్వసాధారణంగా మారిన పరిస్థితుల్లో రాత్రి పగలూ తేడా లేకుండా కళ్లను తప్పని సరి శ్రమపెట్టాల్సిన విద్యార్థులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అగర్వాల్స్ ఐ హాస్పిటల్‌కు చెందిన కన్సెల్టంట్ ఆప్తమాలజిస్ట్ డాక్టర్ మాధవి మాజేటి సూచిస్తున్నారు. ఆమె అందిస్తున్న సూచనలివే... సాక్షి, సిటీబ్యూరో: సాధారణ సమయాల్లోనే గంటల కొద్దీ కంప్యూటర్ స్క్రీన్స్, మొబైల్ ఫోన్ స్క్రీన్స్‌కు కళ్లను అతికించేసే విద్యార్థులు కంటి ఆరోగ్యం గురించి తగినంత శ్రద్ధ పెట్టడం లేదు. మరోవైపు పరీక్షల సమయంలో వారి చదువులు కూడా ఆన్లైన్ ఆధారితం కావడం, ఇంటర్నెట్ నుంచి మెటీరియల్ తీసుకుని వారి ప్రాజెక్టులు సబ్మిట్ చేయాల్సి ఉండటం వల్ల దీర్ఘకాలం కంప్యూటర్ స్క్రీన్ల పైనే దృష్టి నిలపడంతో కంటి సమస్యలు ఈ సీజన్లో మరింత పెరుగుతున్నాయి. కంప్యూటర్స్, ట్యాబ్స్, ప్యాడ్స్, మొబైల్ ఫోన్స్.. ఇవన్నీ సమస్యల కారకాలే కాగా కంటి సమస్యల లక్షణాలు స్పష్టంగా కనపడతున్నాయి. పరీక్షల సమయం కదాని వీటిని నిర్లక్ష్యం చేస్తే అవి తీవ్రమైన దుష్పరిణామాలకు దారి తీస్తాయి. ఐస్ట్రెయిన్ నుంచి కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ దాకా.. దీర్ఘకాలం పాటు ఎలక్ట్రానిక్ డివైజ్‌లకు అతుక్కుపోయి ఉండటం కారణంగా ఈ సమస్య వస్తోంది. దీని వల్ల కళ్లు పొడిబారడం, దురద, ఎర్రబడటం, మంటగా ఉండటం వంటి సమస్యలు వస్తాయి. తద్వారా చూపు మసకబారుతోంది. దృష్టి నిలపడం కష్టతరమవుతోంది. నిద్రలేమి సమస్య రావచ్చు. తెలియని అలసట ఆవరిస్తుంది. దీర్ఘకాలం పాటు కంప్యూటర్ స్క్రీన్లపై నిలిపే దృష్టి, కళ్లను తరచూ అటూ ఇటూ తిప్పడం, వేగంగా ఇమేజెస్ మార్చి మార్చి చూడటం.. కంటి కండరాలను అలసటకు గురి చేస్తాయి. రెటీనా ఇబ్బందులు, కాటరాక్టస్ వగైరా సమస్యలకు కారణమవుతోంది. దీనినే కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటున్నారు. మార్పులు చేర్పులు అవసరం.. కంప్యూటర్ స్క్రీన్‌లో బ్రైట్ నెస్, ఫాంట్ సైజ్ తగ్గించడం, మానిటర్ హైట్ కంటిచూపునకు తగ్గట్టు అమర్చుకోవడం, స్క్రీన్కు కళ్లకు మధ్య దూరం సరిచూసుకోవడం వంటి మార్పులు చేసుకోవాలి. ఆప్తమాలజిస్ట్కు చూపించుకుని అవసరమైతే కంటి అద్దాలు తప్పక ఉపయోగించాలి. అలాగే నిర్విరామంగా స్క్రీన్‌ను చూడకుండా ప్రతి 20 నిమిషాలకు 20 సెకన్లు అనే 20–20–20 రూల్ ప్రకారం దృష్టిని మళ్లిస్తుండాలి. తరచూ కనురెప్పలు మూస్తూ తెరుస్తూ ఉండటం అలవాటు చేసుకోవాలి. అరచేతుల్ని రుద్ది వెచ్చగా మారాక మూసిన కళ్ల మీద పెట్టుకోవడం వంటి మసాజ్‌లు కూడా సహజమైన పద్ధతిలో ఉపకరిస్తాయి. సుదీర్ఘంగా స్క్రీన్‌ను చూడకుండా ప్రతి అరగంటకూ బ్రేక్ తీసుకోవాలి. -
ఈ కాంటాక్ట్ లెన్స్‌లతో మెరుగైన చూపు!
కంటిచూపును ఎన్నోరెట్లు ఎక్కువ చేయగల అద్భుతమైన సరికొత్త కాంటాక్ట్ లెన్స్‌లను తయారు చేసింది ఫ్రాన్స్‌కు చెందిన ఐఎంటీ ఆట్లాంటిక్ సంస్థ!! కేవలం దృష్టి సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా.. కంటిముందు ఉన్న దృశ్యాలను దూర ప్రాంతాలకు ప్రసారం చేసేందుకూ దీనిని ఉపయోగించవచ్చు. చిన్నసైజు ఫ్లెక్సిబుల్ బ్యాటరీ కూడా ఉన్న ఈ కాంటాక్ట్ లెన్స్‌లో సూక్ష్మస్థాయి ఎల్ఈడీ బల్బు ఒకటి ఉంటుంది. కొన్ని గంటలపాటు పనిచేయగలదు. ఈ కాంటాక్ట్ లెన్స్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే యుద్ధరంగంలోని సైనికులకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని అంచనా. ఈ కారణంగానే అమెరికాకు చెందిన రక్షణ, పరిశోధన సంస్థ డార్పా ఇలాంటి కాంటాక్ట్ లెన్స్‌ల కోసం దశాబ్ద కాలంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ శతాబ్దపు పదార్థంగా భావిస్తున్న గ్రాఫీన్ ఆధారంగా ఇందులోని ఎలక్ట్రానిక్ పరికరాలను తయారు చేశారని భావిస్తున్నారు. మరిన్ని పరిశోధనల ద్వారా లెన్స్ సామర్థ్యాన్ని పెంచవచ్చునని... సైనికులతోపాటు దృష్టి సమస్యలున్న డ్రైవర్లు, శస్త్రచికిత్సలు చేసే సమయంలో డాక్టర్లు కూడా ఈ లెన్స్‌లను వాడవచ్చునని ఐఎంటీ ఆట్లాంటీక్ అంటోంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న కారణంగానే ఒకవైపు అమెరికా రక్షణ పరిశోధన సంస్థ ఇంకోవైపు మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలు ఐఎంటీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. మైక్రోసాఫ్ట్ ఇటీవలే తన హాలోలెన్స్ టెక్నాలజీని అమెరికా సైన్యానికి అమ్మడం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. -
కళ్లు తెరవండి...
సూర్యుడు భగభగా మండుతుంటేకళ్లు మూసుకుంటాం. కానీ... మూసుకునే ఉండలేంగా?!అందుకే...కళ్లు తెరవండి. ఎండాకాలం నిజాలతో కనువిప్పు కలిగించుకోండి. కంటికి ఏదైనా కనపడాలంటే కాంతి కావాల్సిందే. కానీ అదే కాంతి తీవ్రత మరీ ఎక్కువైతే? వేసవిలో కాంతి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందన్నది తెలిసిందే. దాంతో ఆ కాంతిలో ఉండే అల్ట్రా వయొలెట్ కిరణాలు, ఇన్ఫ్రా రెడ్ కిరణాల ప్రతికూల ఫలితాలు కంటిని ప్రభావితం చేస్తాయి. ఈ వేసవిలో కాంతి తీవ్రతతో కంటిపై పడే దుష్ప్రభావాలు, ఇతరత్రా సమస్యలపై అవగాహన కోసం ఈ కథనం. అలాగే వేసవి కాంతి తీవ్రత నుంచి కంటిని రక్షించడం కోసం నాసిరకం కళ్లజోళ్ల వల్ల కంటికి కలిగే నష్టాలు, తీవ్ర కాంతి నుంచి కళ్లను రక్షించుకోడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకుందాం. ఏమిటీ కాంతి... దాంతో ఎలా కనిపిస్తుంది? మన కన్ను పనిచేయడానికి దోహదపడే కాంతి అంటే ఏమిటో ముందుగా తెలుసుకుందాం. సూర్యుని నుంచి భూమికి చేరే అనంతమైన రేడియేషన్ పటలంలో మనం చూడగలిగేదీ, మనం గ్రహించగలిగేదీ చాలా పరిమితం. ఈ పరిమితమైన కాంతి మన కంట్లోని కంటిపాప ద్వారా వెళ్లి రెటీనాపై రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ రెటీనాపై పడ్డ ప్రతిబింబాన్ని ఆప్టిక్ నర్వ్ మన మెదడుకు చేరవేసి, అదేమిటో తెలిపేలా చూపుకు సంబంధించిన జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఎన్నెన్నో రకాల రేడియేషన్... నిజానికి రేడియేషన్‌లో ఒక్క కాంతి కిరణాలు మాత్రమే కాకుండా... రేడియో తరంగాలూ, ఎక్స్–కిరణాలూ, మైక్రోవేవ్... ఇలా ఎన్నెన్నో రకాల తరంగాలు ఉంటాయి. వీటినన్నింటినీ కలిపి ‘ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్’ అంటారు. ఇందులో వేర్వేరు రకాల కిరణాలకు వేర్వేరు వేవ్‌లెంగ్త్ ఉంటుంది. నిజానికి ఆయా వేవ్లెంత్లను బట్టే ఆ రేడియేషన్‌ను వర్గీకరిస్తారు. అల రూపంలో ప్రసారితమయ్యే కాంతి కిరణంలోని పక్కపక్కనే ఉండే... ఒక పీక్‌కూ, మరో పీక్‌కూ మధ్యనున్న దూరమే వేవ్‌లెంగ్త్. దీన్ని ప్రామాణికంగా తీసుకొని చూస్తే... మన కళ్లకు కనిపించే, మనం చూడటానికి దోహదం చేసే ఈ కాంతి కేవలం 380 – 780 నానో మీటర్ల (మైక్రాన్స్) రేంజ్లో మాత్రమే ఉంటుంది. అంతకంటే తక్కువ వేవ్‌లెంగ్త్‌తో ఉండే కిరణాలను అల్ట్రా వయొలెట్ కిరణాలుగానూ, అంతకంటే ఎక్కువ వేవ్‌లెంగ్త్‌తో ఉండేవాటిని ఇన్ఫ్రా రెడ్ కిరణాలుగానూ చెబుతుంటారు. హాని కలిగేది అల్ట్రా వయొలెట్,ఇన్ఫ్రా రెడ్ కిరణాలతో... మనకు చేరే కాంతితో పాటు మన వాతావరణంలో ప్రసరిస్తూ, ప్రవహిస్తూ ఉండే అల్ట్రా వయొలెట్, ఇన్ఫ్రా రెడ్ కిరణాలు కంటికి హాని కలిగిస్తాయి. వేసవిలో ఈ కిరణాల తీవ్రత మరింత ఎక్కువగా ఉండటం వల్ల కంటికి హాని చేసే అవకాశాలు ఎక్కువ. ఇన్ఫ్రారెడ్ కిరణాల దుష్ప్రభావం ప్రధానంగా కార్నియా మీద ఉంటుంది. కాంతికి తక్షణం ఆవల ఉన్న రేడియేషన్, రకాలు మనకు కంటికి కనిపించే కాంతికి ఇరుపక్కల ఉండే రేడియేషన్‌తో మన కంటికి చాలా ప్రమాదం . కాంతికి ఇరుపక్కల ఉండే రేడియేషన్, అందులోని రకాల గురించి తెలుసుకుందాం. కాంతిపుంజం లేదా కాంతి కిరణానికి పక్కనే తక్కువ వేవ్‌లెంగ్త్‌లో ఉండే కిరణాలే అల్ట్రా వయొలెట్ కిరణాలు. అల్ట్రా వయొలెట్లోని మూడు రకాలు... కంటికి హాని చేయగల అల్ట్రా వయొలెట్ కిరణాల (యూవీ రేస్)ను మూడు రకాలుగా విభజించవచ్చు. అవీ యూవి– ఏ, యూవీ– బీ, యూవీ– సీ వీటిలో మొదటి రెండిటి కంటే యూవీ – సీ చాలా ప్రమాదకరం. ఇన్ఫ్రా రెడ్ కిరణాలను ఇన్ఫ్రారెడ్ – ఏ, ఇన్ఫ్రారెడ్ – బీ, ఇన్ఫ్రారెడ్ – సీ అని మూడుగా వి¿¶ జించవచ్చు. ఈ మూడు రకాల కిరణాలూ కంటికి ప్రమాదకరమైనవి. రేడియేషన్‌తో కంటికి హాని ఇలా... సూర్యుడి నుంచి మొదలై, మొదట శూన్యంలో ప్రయాణం చేసే రేడియేషన్, భూమి ఉపరితలంలో ఉన్న వాతావరణాన్ని చీల్చుకొని మన కంటి వరకు చేరుతుంది. ఈ క్రమంలో రేడియేషన్‌లోని అత్యంత హానికారకమైన కిరణాలను ఓజోన్ పొర చాలా వరకు వడపోస్తుంది. అందువల్ల కేవలం 3 శాతం కిరణాలు మాత్రమే ఉపరితలం వరకు చేరతాయి. అల్ట్రా వయొలెట్ కిరణాల ప్రభావం ఇలా... మామూలు కాంతి వల్ల కంటికి ఎలాంటి హాని ఉండదు గానీ తీవ్రమైన కాంతి వల్ల కంటికి జరిగే నష్టం రెండు రకాలుగా జరగవచ్చు. ఇందులో కంటికి తక్షణం కలిగే అనర్థాలను ‘అక్యూట్ అనర్థాలు’గా చెప్పవచ్చు. అదేపనిగా చాలాకాలం పాటు రేడియేషన్‌కు ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు కంటిపైన దీర్ఘకాలిక దుష్ప్రభావాలూ పడవచ్చు. వీటినే ‘క్రానిక్ దుష్ప్రభావాలు’ గా పేర్కొంటారు. అల్ట్రా వయొలెట్ రకాల్లో యూవీ–ఏ వల్ల కలిగే దుష్ప్రభావాలు చాలావరకు తాత్కాలికమైనవి. యూవీ–ఏ కంటే యూవీ–బీ కిరణాలవల్ల కలిగే అనర్థాల తీవ్రత ఎక్కువ. అయితే వీటివల్ల కంటికి కలిగే అనర్థాలను వైద్యచికిత్సతో చాలావరకు చక్కదిద్దవచ్చు. కానీ యూవీ–సి వల్ల కలిగే అనర్థాలు మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి. కొన్నిసార్లు ప్రాణాలకు సైతం ముప్పు కలిగించవచ్చు. అయితే అదృష్టవశాత్తు యూవీ–సీ రకానికి చెందిన కిరణాలను ఓజోన్ పొరే నిరోధించి, జీవకోటిని రక్షిస్తుంటుంది. హానికర కిరణాల దుష్ప్రభావం ఇలా... వాతావరణంలోకి ప్రవేశించిన ఈ కాంతి కిరణాలు కొన్నిసార్లు నేరుగానూ, మరికొన్నిసార్లు రిఫ్లక్షన్ చెంది కంటిపై పడి దుష్ప్రభావాలను కలిగిస్తాయి. అయితే రిఫ్లెక్షన్‌తో కలిగే నష్టాలన్నిటిలో చాలా సందర్భాల్లో మంచు, ఇసుక, నేల, రోడ్డు, కంకర, నీళ్ల ఉపరితలం వంటి వాటిపై పడి రిఫ్లెక్ట్ అయి కంటికి చేరి దుష్ప్రభావం చూపుతాయి. సాధారణంగా మనం డ్రైవింగ్ చేసేప్పుడు నేరుగా పై వైపు కంటే, ఒకింత కిందివైపుకే చూస్తూ వాహనాన్ని నడుపుతుంటాం. కాబట్టి రిఫ్లెక్టెడ్ కిరణాలతో ఇలా దుష్ప్రభావం పడే అవకాశాలు ఎక్కువ. రిఫ్లెక్ట్ అయ్యే కిరణాలు సాధారణంగా కిందివైపు నుంచి రిఫ్లెక్ట్ అయి కంటికి చేరతాయి కాబట్టి వాటి వల్ల పడే దుష్ప్రభావాలను టోపీ, గొడుగు లాంటి వాటితో ఆపలేం. మబ్బుపట్టి ఉన్నా.. వరండాలో ఉన్నా ... మబ్బు పట్టి ఉన్నప్పుడు ఈ అల్ట్రా వయొలెట్ కిరణాలను మబ్బులు అడ్డుకుంటాయి కాబట్టి వాటి తీవ్రత ఉండదని మనం భావిస్తుంటాం. కానీ... అది వాస్తవం కాదు. మబ్బులు పట్టి ఉన్నా లేదా వరండాలాంటి బయటి గదుల్లో (ఇన్–డోర్స్‌లో) ఉన్నప్పటికీ... దాదాపు 3 శాతం అల్ట్రా వయొలెట్ కిరణాలు కంటికి చేరే అవకాశం ఉంది. అవి కంటికి హాని చేయవచ్చు. ప్రత్యేకంగా యూవీ–సీ, యూవీ–బీ తరహాకు చెందిన కిరణాల వల్ల మరింత హాని జరిగే అవకాశం ఉంది. ఇక్కడ అదృష్టం ఏమిటంటే... మన కంటిలోపల ఉండే లెన్స్ యూవీ–బీ తరహా కిరణాలను చాలావరకు ఫిల్టర్ చేస్తుంది. అయితే... కొన్నిసార్లు మాత్రం ఈ యూవీ కిరణాలు రెటీనా వరకు వెళ్లి... సోలార్ బర్న్ రూపంలో రెటీనాను దెబ్బతీసే ప్రమాదం పొంచి ఉంటుంది. తాత్కాలిక దుష్ప్రభావాలు తక్కువ శక్తిమంతమైన యూవీ కిరణాల కారణంగా కంటిపై పడే దుష్ప్రభావాల ఫలితం చాలావరకు తాత్కాలికంగానే ఉంటుంది. ఉదాహరణకు.. కంటి నుంచి నీళ్లు కారడం, కన్ను పొడిబారడం, కళ్ల వాపు, ఎక్కువ కాంతిని చూడాల్సి వస్తే కంటికి ఇబ్బందిగా అనిపించడం వంటి సమస్యలు వస్తాయి. ఇలా ఎక్కువ కాంతిని చూడలేకపోవడాన్ని ‘ఫొటోఫోబియా’ అంటారు. దీర్ఘకాలిక దుష్ప్రభావాలు చాలా సందర్భాల్లో యూవీ కిరణాలకు సుదీర్ఘకాలం పాటు ఎక్స్పోజ్ కావడం కూడా వల్ల అనర్థాలు సంభవిస్తాయి. వీటిని క్రానిక్ ‘సైడ్ఎఫెక్ట్స్’గా పేర్కొంటారు. క్రానిక్ సైడ్ ఎఫెక్ట్స్: దీర్ఘకాలం యూవీ కిరణాలకు ఎక్స్పోజ్ అయితే ఈ కింది అనర్థాలు సంభవిస్తాయి. టెరీజియమ్: కంటి చివరన ముక్కుకు దగ్గర ఉండే వైపున కంటి లోపలి కండ పింక్ రంగులో కనిపిస్తుంటుంది. ఈ కండ క్రమంగా పెరుగుతూ ఒక దశలో నల్లగుడ్డును పూర్తిగా మూసేస్తుంది. దాంతో చూపు పూర్తిగా తగ్గుతుంది. ఇలా టెరీజియమ్ అనే సమస్య రావడం అన్నది పట్టపగలు తీవ్రమైన కాంతిలో ఆరుబయట పనిచేసేవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇక సముద్రప్రాంతాల్లో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండి, కాంతి తీక్షణంగా ఉంటుంది. అందువల్ల సముద్రం అలలపై సర్ఫింగ్ చేసేవారిలోనూ టెరీజియమ్ తరచుగా కనిపిస్తుంది. అందుకే దీన్ని ‘సర్ఫర్స్ ఐ’ అని కూడా అంటారు. క్యాటరాక్ట్: కంటిలో వచ్చే తెల్ల ముత్యం లేదా తెల్లపొరను క్యాటరాక్ట్ అంటారన్న విషయం తెలిసిందే. సాధారణంగా వయసు పెరగడం వల్ల వచ్చే ముప్పుగా ఈ సమస్య చాలా మందిలో కనిపిస్తుంది. అయితే వాతావరణంలోని అల్ట్రా వయొలెట్ కిరణాలకు అదేపనిగా కన్ను ఎక్స్పోజ్ కావడం వల్ల మామూలు కంటే కాటరాక్ట్ ముందుగానే వస్తుంది. అన్ని కాటరాక్ట్ కేసులను పరిశీలిస్తే... వాటిల్లో 10 శాతం కాటరాక్ట్ కేసులు యూవీ కిరణాలకు ఎక్కువగా ఎక్స్పోజ్ కావడం వల్ల వచ్చేవేనని చాలా అధ్యయనాల్లో తేలింది. మాక్యులార్ డీజనరేషన్: ఒంటిలో ఉన్నట్టే... మెలనిన్ అనే నల్లటి రంగునిచ్చే పదార్థం కంటిలోనూ ఉంటుంది. ఇది రెటీనల్ పిగ్మెంట్ ఎపిథీలియంలో ఉండి కాంతి ప్రసరించినప్పుడు అందులోని యూవీ కిరణాలను వడపోస్తూ కంటికి రక్షణ కల్పిస్తుంది. ఇది వాతావరణంలో ఉండే అల్ట్రా వయొలెట్ కిరణాలను 90 శాతం వరకు వడపోసి, కంటికి రక్షణ ఇస్తుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ మెలనిన్ పాళ్లు కంటిలో తగ్గుతుంటాయి. దాంతో కంటిలో ఉండే నల్ల గుడ్డుకు గానీ, రెటీనాలో ఉండే ఎపిధీలియంలో గానీ యూవీ కిరణాలను వడపోసే సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. ఫలితంగా కంటి చూపుపై ప్రభావం పడే అవకాశం ఉంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఇలా యూవీ కిరణాలను వడపోసే సామర్థ్యం తగ్గిపోవడం వల్ల కంటిచూపు క్రమంగా తగ్గవచ్చు. అందుకే దీన్ని ఏజ్ రిలేటెడ్ మాక్యులార్ డీజనరేషన్ (ఏఆర్‌ఎమ్‌డీ) అని కూడా అంటారు. కంటిపై భాగంలో సంభవించే తీవ్రమైన దుష్ప్రభావాలివి... ∙ కనురెప్ప క్యాన్సర్లు ... కనురెప్పపై యూవీ కిరణాల దుష్ప్రభావాల వల్ల కనిపించే కొన్ని తీవ్రమైన అనర్థాలలో బేసల్ సెల్ కార్సినోమా, స్క్వామోజ్ సెల్ కార్సినోమా, మెలనోమా అనే రకం కంటి క్యాన్సర్లు ప్రధానమైనవి. ∙ కంజెంక్టివాకు కలిగే అనర్థాలు: కంటిపై ఉండే పొర అయిన కంజెంక్టివాకు వచ్చే సమస్యను ‘పింగ్వెక్యులా’ అని అంటారు. ఈ తరహా సమస్య వచ్చిన వారిలో కంటిపై ఉండే పొర మందంగా మారి పసుపు రంగును సంతరించుకుంటుంది. కంటిలోని నల్లపొర అంచుల పైకి రెండవైపుల నుంచి ఈ పొర పాకి వస్తున్నట్లుగా అనిపిస్తుంది. అందుకే దీన్ని ‘ఎల్లో బంప్ ఇన్ ఐ’ అని కూడా అంటారు. ఎప్పుడూ కంటిపై యూవీ కిరణాలు ప్రసరిస్తూ ఉండటం వల్ల కన్ను పొడిబారిపోవడం వల్ల కూడా ‘పింగ్వెక్యులా’ రావచ్చు. ∙ కార్నియాపై: కొందరిలో ఫొటోకెరటైటిస్ అనే సమస్య వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా ఎలాంటి రక్షణ లేకుండా వెల్డింగ్ చేసేవారిలో ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. మంచుపై స్కీయింగ్ చేసే వారిలో సైతం నేరుగా పడే కాంతి కిరణాల వల్ల కార్నియాకు దెబ్బతగిలి కంటి చూపు మందగిస్తుంది. దీన్ని ‘స్నో బ్లైండ్నెస్’ అంటారు. ∙ ఐరిస్ దెబ్బతినడం వల్ల: కొందరిలో ఐరిస్‌పై దుష్ప్రభావం పడవచ్చు. ∙ రెటీనా: తీవ్రమైన యూవీ కిరణాలు ప్రసరించడం వల్ల రెటీనా దెబ్బతినే ప్రమాదం ఉండవచ్చు. దీన్నే సోలార్ బర్న్ అంటారు. దీనివల్ల హఠాత్తుగా కనుచూపు తగ్గే ప్రమాదం ఉంది. సూర్యగ్రహణాన్ని నేరుగా చూస్తే కలిగే ప్రమాదం కూడా ఇలాంటిదే. ఈ వేసవిలో కంటికి రక్షణ ఎలాగంటే... ∙ మంచి మేలైన ప్రమాణాలతో ఉన్న సన్ గ్లాసెస్ వాడటం ద్వారా తీక్షణ కాంతి దుష్ప్రభావాలనుంచి కంటిని కాపాడుకోవచ్చు. అయితే తక్కువ ప్రమాణాలతో తయారు చేసే సన్– గ్లాసెస్ వల్ల కన్ను మరింతగా తెరచుకుని చూడటంతో కంటిలోకి హానికరమైన యూవీ కిరణాలు మరింతగా ప్రవేశించవచ్చు. అందుకే మంచి ప్రమాణాలతో... అంటే పాలీకార్బనేట్, ట్రైవిక్స్ వంటి మెటీరియల్‌తో తయారైన సన్‌గ్లాసెస్ వాడాలి. ∙ 100 శాతం లేదా 400 యూవీ పొటెక్షన్ (ఇవి 400 మైక్రాన్స్ వరకు వడపోస్తాయి) ఇచ్చే లేబుల్డ్ గ్లాసెస్ కూడా వాడవచ్చు. ∙ ఫ్రేమ్ అంచులు పెద్దవిగా ఉండే గ్లాసెస్ వాడటం వల్ల కంటి మూలల నుంచి కూడా యూవీ కిరణాలు లోపలికి ప్రసరించకుండా ఉంటాయి. అందుకే ఫ్యాషన్ పేరిట ఫ్రేమ్ తక్కువగా ఉండే వాటికంటే... ఒకింత ఫ్రేమ్ ఎక్కువగా ఉండే గ్లాసెస్ మరింత మేలు చేస్తాయి. ∙ కొందరు ఏ రంగు గ్లాసెస్ అయితే మేలు అని ప్రశ్నిస్తుంటారు. ఏ రంగు అన్నదానికి అంతగా ప్రాధాన్యం ఉండదు. ఎందుకంటే... ఏ రంగు అయినా అది పూర్తిగా రక్షణ ఇచ్చేలా ఉండాలి. ∙ పోలరైజ్డ్ సన్‌గ్లాసెస్ అంత సురక్షితమైనవి కావు. ఎందుకంటే... అవి కేవలం ఒక కోణంలోంచి (భూమికి సమాంతరంగా) వచ్చే కాంతి కిరణాల నుంచి మాత్రమే రక్షణ ఇస్తాయి. ∙ కాటరాక్ట్ సర్జరీ చేయించుకున్న వాళ్లు యూవీ ప్రొటెక్షన్ ఉన్న ఇంట్రా ఆక్యులార్ లెన్స్ (ఐఓఎల్స్)ను ఎంచుకోవాలి. ∙ కంటిపైన కాంతి నేరుగా పడకుండా అంచులు (బ్రిమ్) పెద్దవిగా ఉండే టోపీలు (హ్యాట్) ధరించడం మేలు. ∙ ఫొటో కెరటైటిస్ వంటి కండిషన్ ఉన్నవారు కాంటాక్ట్ లెన్స్‌లను వాడటం ఎంతమాత్రమూ సరికాదు. ఎందుకంటే అవి వాతావరణంలోని తీక్షణ కాంతితో పాటు యూవీ కిరణాలను 50 శాతం వరకు కంటిలోకి ప్రసరింపజేస్తాయి. ∙ ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యుడిని నేరుగా చూడకూడదు. మధ్యాహ్నం వేళల్లో వీలైనంతవరకు బయటకు వెళ్లకూడదు. ∙కంటిని ఎప్పటికప్పుడు చల్లని, శుభ్రమైన నీటితో కడుక్కోవడం మంచిది. ∙ తరచూ కంటిపరీక్షలు చేయించుకోవడం. వేసవిలో కనీసం ఒకసారైనా కంటిపరీక్షలు చేయించుకోవడం మంచిది. ముఖ్యంగా మధ్యవయసు దాటిన వారికి ఇది చాలా అవసరం. ∙నాసిరకం కళ్లజోళ్లలో అల్ట్రా వయొలెట్ కిరణాలను ఫిల్టర్ చేసే సామర్థ్యం ఉండకపోవచ్చు. అందుకే సమర్థంగా అల్ట్రా వయొలెట్ కిరణాలను వడపోసే నాణ్యమైన గ్లాసులు వాడటం మంచిది. ∙వాహనాలపై ప్రయాణం చేసేవారికి తీవ్రమైన కాంతితో పాటు, గాలిలో ఎగిరి వచ్చే ఫ్లైయింగ్ అబ్జెక్ట్స్ కారణంగా కూడా కంటికి ప్రమాదం కలిగే అవకాశం ఉంది. అందుకే రాత్రి వేళల్లోనూ కంటికి రక్షణ ఇచ్చే గ్లాసులు ధరించడం మంచిది. ∙ఇటీవల రకరకాల రంగుల అద్దాలు ఉన్న గ్లాసెస్‌ను ధరిస్తున్నారు. బ్లూ కలర్ ఉన్న గ్లాసులు అన్నిటికంటే చాలా ప్రమాదం. సాధ్యమైనంత రంగు అద్దాల కంటే వరకు డార్క్షేడ్లో నల్లటివే వాడటం మంచిది. ∙స్విమ్మింగ్‌పూల్‌లో ఈదేటప్పుడు తప్పక గాగుల్స్ వాడాలి. దీనివల్ల రెండు రకాలుగా రక్షణ దొరుకుతుంది. ఒకటి యూవీ కిరణాల నుంచి; మరొకటి స్విమ్మింగ్‌పూల్‌లోని కెమికల్స్ నుంచి. ∙చెమటతో నీళ్లు కళ్ల మీదికి జారినప్పుడు కళ్లను నలపకూడదు. ∙కళ్లు పొడిబారకుండా... డాక్టర్ సలహా మేరకు ఆర్టిఫిషియల్ టియర్స్, లూబ్రికెంట్స్ వాడటం మంచిది. ∙ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే మంచి పోషకాహారం తీసుకోవడం అన్నది అన్ని సీజన్లతో పాటు ఈ వేసవిలో మరీ ఎక్కువ అవసరం. విటమిన్–ఏ ఎక్కువగా ఉండే తాజాపండ్లు, కూరగాయలు ఒంటితో పాటు కంటికీ మేలు చేస్తాయి. ∙ కంటినిండా నిద్రపోవాలి. ∙ పొగతాగకూడదు. ∙ అవసరమైనప్పుడు గదిలో తేమశాతాన్ని పెంచే హ్యుమిడిఫైయర్స్ వాడుకోవచ్చు. పిల్లల్లో ముప్పు మరీ ఎక్కువ... సాధారణంగా కాంతి మన కంటిలోకి కాంతి ప్రవేశించగానే మన ఐరిస్/ప్యూపిల్ (కంటిపాప) కాస్తంత ముడుచుకుపోతుంది. కాంతి తీవ్రతను బట్టి కంటికి రక్షణ కలిగించడం కోసం ప్రకృతి మనలో ఇలాంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేసింది. అందుకే తీవ్రమైన కాంతిలోకి వచ్చినప్పుడు మనం కనురెప్పలను కాస్త మూసి, చికిలించి చూస్తుంటాం. బయటి కాంతికి మన కన్ను అడ్జెస్ట్ అయ్యేవరకు ఇలా జరగడం మనందరికీ అనుభవమే. అలాగే బయటి నుంచి కాంతి తక్కువ ఉండే ప్రదేశానికి వెళ్లినప్పుడు కూడా కాసేపు మనకు కనపబడదు. మనం ఆ కాంతికి అడ్జెస్ట్ అయ్యాక మనకు చిరుచీకట్లోనూ కనిపిస్తుంది. దీనికి కారణం... కంటిపాప విశాలంగా విప్పారడమే. అయితే చిన్నపిల్లల్లో కంటి పాప సైజ్ ఎక్కువ. పైగా లెన్స్ ట్రాన్స్పరెంట్గానూ, క్లియర్గానూ ఉంటుంది. పైగా చిన్నపిల్లలు ఆరుబయట ఎండల్లో ఎక్కువగా ఆడుతుంటారు. అందుకే పిల్లల్లో కంటిపై పడే దుష్ప్రభావాలు ఎక్కువ. ఇంకా ఎవరెవరిలో... ∙ కాటరాక్ట్ సర్జరీ చేసుకొని, యూవీ ప్రొటెక్షన్ లేని ‘ఇంట్రా ఆక్యులార్ లెన్స్’ వాడిన వారిలో ఈ యూవీ కిరణాల వల్ల దుష్ప్రభావాలు ఎక్కువ. ∙ యూవీ ప్రొటెక్షన్ లేని కాంటక్ట్ లెన్స్ వాడేవారిలోనూ దుష్ప్రభావాలు ఎక్కువ; ∙ టెట్రాసైక్లిన్ వంటి యాంటీబయాటిక్స్ వాడేవారు, గర్భనిరోధక మాత్రలు వాడే మహిళల్లో, యాంటీ మలేరియా మందులు వాడే వారితోపాటు, ఇబూప్రొఫేన్ వంటి నొప్పి నివారణ మందులు వాడే వారిలో యూవీ ప్రభావం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఎక్కువ. మరీ ఎక్కువ ప్రమాదం జరిగే అవకాశాలు ఎప్పుడంటే... ∙కొందరు తమ వృత్తిరీత్యా చాలా ఎక్కువ కాంతికి ఎక్స్పోజ్ అవుతుంటారు. వారు సాధారణం కంటే చాలా ఎక్కువ కాంతిలో పనిచేస్తుంటారు. ఉదాహరణకు డ్రైవర్లు చాలా తీవ్రమైన కాంతిని అదేపనిగా చూడాల్సి వస్తుంది. అలాగే వేసవిలో పట్టపగలు తీవ్రమైన కాంతిలో తిరిగే సేల్స్ రిప్రజెంటేటివ్స్, నిర్మాణరంగంలోని పనివారు, రైతులు, కూలీలు వంటివారు చాలా ఎక్కువ కాంతికి ఎక్స్పోజ్ అవుతుంటారు. పైన పేర్కొన్న అనర్థాలు వీళ్లలో చాలా ఎక్కువ. ∙ఇక అత్యంత ఎక్కువ కాంతిని రిఫ్లెక్ట్ చేసే నీటి ఉపరితలానికి దగ్గరగా ఉండే... నదీప్రాంతాలు, సముద్రజలాల ఒడ్డులు (బీచ్‌ల) వంటి చోట్ల తిరుగాడేవారికి; ∙కాంతి తీక్షణత ఎక్కువగా ఉండే ప్రాంతాలైన భూమధ్యరేఖకు దగ్గరగా ఉండే ప్రాంతాల వారికీ; ∙అలాగే చాలా ఎల్తైన పర్వతసానువుల్లాంటి (హిల్లీ ఏరియాస్) ప్రదేశాల్లో ఉండేవారికీ; ∙ తెల్లని దేహఛాయతో ఒంట్లో, కంట్లో మెలనిన్ తక్కువగా ఉండే వారికి, చిన్నపిల్లల్లో... కాంతికారణంగా కంటిపై దుష్ప్రభావాలు పడే అవకాశం ఎక్కువ. డాక్టర్ రవికుమార్ రెడ్డి కంటి వైద్య నిపుణులు,మెడివిజన్ ఐ హాస్పిటల్,హైదరాబాద్. -
విజృంభిస్తున్న ‘గ్లకోమా’
సాక్షి, సిటీబ్యూరో: అనారోగ్య సమస్యల్లో రెండు రకాలుంటాయి. ముందుగా లక్షణాలను ప్రస్ఫుటింపజేసి చికిత్స ఇచ్చేందుకు అనువైనవి కొన్నయితే... లక్షణాలు లేకుండా శరీరంలో తిష్టవేసి పెద్ద సమస్యగా మారి పెను ప్రమాదాల ను సృష్టించేవి కొన్ని. వైద్య రంగానికి తరచూ సవాలు విసిరేవి రెండో రకమే. అటువంటిదే కంటి వ్యాధి గ్లకోమా అని నిర్వచిస్తున్నారు నగరానికి చెందిన అగర్వాల్ కంటి ఆసుపత్రి రీజనల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ మరుగంటి వంశీధర్. గ్లకోమా వీక్ (మార్చి 10–16) సందర్భంగా ఈ వ్యాధి గురించి ఆయన చెప్పిన విషయాలివీ... అంధత్వ కారకం.. అంతర్జాతీయంగా అంధత్వ కారకాల్లో రెండోది గ్లకోమా. మన దేశంలో అంధత్వం బారిన పడుతు న్న వారిలో అత్యధిక శాతం దీనివల్లే. దాదాపుగా 12 మిలియన్ల మంది దీని బారిన పడతుంటే వీరి లో 1.2 మిలియన్ల మంది అంధులుగా మారుతున్నారు. అంతర్జాతీయంగా 60 మిలియన్ల కేసులు నమోదైతే 2020 నాటికి ఈ సంఖ్య 80 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా. అలాగే ప్రస్తుతం అంతర్జాతీయంగా దీనివల్ల అంధులవుతున్న వారి సంఖ్య 3 మిలియన్లుగా అంచనా. తెలుగు రాష్ట్రాల్లో 3.5శాతం మంది గ్లకోమా బారిన పడ్డారని, కేవలం హైదరాబాద్‌లోనే 2.4లక్షల కేసులు నమోదయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. వయసుతో పాటు పెరిగే సమస్య... దీని ప్రభావం 40 సంవత్సరాలు దాటిన వారిలో అధికం. మన దేశంలో 40ఏళ్లు దాటిన ప్రతి 20 మందిలో ఒకరు గ్లకోమా బాధితులుగానో, బాధితులు అయ్యేందుకు అవకాశాలున్న వారిగానో గుర్తించడం జరుగుతోంది. ఈ వ్యాధి కారణంగా కంటి లోపల ఆప్లిక్ నరం డ్యామేజ్ అయి అది క్రమేపీ 60 ఏళ్ల వయసులో అంధత్వానికి దారి తీస్తుంది. ఈ వ్యాధి సాధారణంగా దృష్టి అంచున ప్రారంభం అవుతుంది. దీని లక్షణాలు గుర్తించడం కష్టం కావడంతో దాదాపు 50శాతం మంది బాగా ముదిరాకే దీన్ని తెలుసుకోవడం జరుగుతోంది. వ్యాధి గురించి పూర్తిగా తెలిసే సరికే దృష్టికి చెందిన మధ్యస్థానాన్ని నాశనం చేస్తుంది. దీని వల్ల సంక్రమించే దృష్టి లోపం శాశ్వతంగా ఉండే అవకాశాలు ఎక్కువ. ఈ వ్యాధిలో రెండు రకాలున్నాయి. ఓపెన్ యాంగిల్ గ్లకోమా, క్లోజర్ గ్లకోమా. అత్యధికంగా అంటే దాదాపు 90శాతం కేసులు మొదటివే. ఇది చాలా నెమ్మదిగా వృద్ధి చెందు తుంది. రోగికి తన చూపు మందగిస్తోందన్న సంగతి తెలిసేటప్పటికి చాలా ఆలస్యం అవుతుంది. ముందుగా గుర్తిస్తే నివారించొచ్చు... తీవ్రమైన తలనొప్పి, కంటినొప్పి, వాంతులవుతున్నట్టు అనిపించడం, బాగా ప్రకాశవంతంగా ఉన్న దీపం చుట్టూ ఇంద్రధనస్సు రంగులు కనిపించడం వంటి లక్షణాలుంటాయి. దీనిని నివారించడం కష్టసాధ్యమైనప్పటికీ... తీవ్రతను తగ్గించడం సాధ్యమే. క్రమం తప్పని పరీక్షల ద్వారా గ్లకోమాను నిర్ధారించిన తర్వాత నిర్దేశించిన పరిమాణంలో కంటి చుక్కలను వాడే తక్షణ చికిత్సను ప్రారంభించాలి. దీనివల్ల కంటి లోపల ఫ్లూయిడ్స్ ఏర్పడడం, ఔట్ ఫ్లో వృద్ధి చెందడం తగ్గిస్తుంది. తాత్కాలిక, శాశ్వత దృష్టిలోపం సంభవించకుండా లేజర్ లేదా మైక్రో సర్జరీ అవసరం అవుతుంది. శిశువులు చిన్నారుల్లో పుట్టిన సంవత్సరం లోపే గుర్తించడం జరుగుతుంది. శిశువు పుట్టకముదు కంటి లోపల ఫ్లూయిడ్ ఫ్లో వ్యవస్థ సరిగా వృద్ధి చెందకపోవడం వల్ల ఇది ఏర్పడుతుంది. తొలుత కంటి సంబంధ మందులతో ప్రారంభించి, తీవ్రవతను బట్టి లేజర్, కంటి శస్త్ర చికిత్సావకాశాలను చూస్తారు. ప్రస్తుతం గ్లకోమా చికిత్సకు ఎన్నో నూతన విధానాలు అందుబాటులోకి వచ్చాయి. సింగిల్ పాస్ ఫోర్ త్రో ప్యుపిల్లోప్లాస్టీ ద్వారా ఈ వ్యాధి మూలకానికి చికిత్స చేయవచ్చు. దీని నివారణలో భాగంగా 40ఏళ్లు దాటాక తప్పకుండా తరచూ కంటి పరీక్షలు చేయించుకోవాలి. బీపీ, మధుమేహం అదుపులో ఉంచుకుంటూ ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలిఅనుసరించాలి. -
28 ఏళ్ల క్రితం పోయింది.. ఇప్పుడు కంట్లో దొరికింది
లండన్ : కంట్లో ఏదో ఇబ్బందిగా ఉండటంతో ఆస్పత్రికి వెళ్లిన ఓ మహిళకు విస్తుపోయే వార్త చెప్పారు డాక్టర్లు. వైద్యులు చెప్పిన విషయం ఆమెనే కాకా నెటిజన్లను కూడా వామ్మో అనేలా చేసింది. విషమేంటంటే.. బ్రిటన్‌కు చెందిన ఓ మహిళ(42) కొన్ని రోజులుగా కంటి సమస్యతో బాధపడుతోంది. దాంతో వైద్యులను సంప్రదించింది. ఎమ్ఆర్ఐ స్కాన్ చేసిన వైద్యులకు ఆమె కంటిలో ఒక లెన్స్ ఉన్నట్లు తెలిసింది. అందువల్లే ఆమెకు ఇబ్బంది తలెత్తిందని, ఆపరేషన్ చేసి లెన్స్‌ను తొలగించాలని చెప్పారు డాక్టర్లు. సర్జరీ అనంతరం బయటకు తీసిన లెన్స్ వయసు నిర్థారించిన వైద్యులు ఆశ్చర్యంతో నోళ్లు వెళ్లబెట్టారు. ఎందుకంటే ఆ లెన్స్ వయసు 28 ఏళ్లు. అంటే దాదాపు 30 ఏళ్లపాటు ఆ మహిళ లెన్స్‌ను తన కళ్లలో మోస్తూ తిరింగిందన్నమాట. వైద్యులు ఇదే విషయాన్ని సదరు మహిళకు చెప్పడంతో ఆశ్చర్యపోవడం ఆమె వంతయ్యింది. తర్వాత తన టీనేజ్‌లో జరిగిన ఓ సంఘటనను గుర్తు తెచ్చుకుంది. ఈ విషయం గురించి మహిళ ‘నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కాంటక్ట్ లెన్స్ వాడుతున్నాను. అప్పుడు నాకు 14 ఏళ్లు ఉంటాయేమో... ఒక రోజు బ్యాడ్మింటన్ ఆడుతుండగా షటిల్‌కాక్ నా కళ్లకు తగిలింది. ఆ తర్వాత ఇంటికి వెళ్లి చూసుకుంటే కాంటక్ట్ లెన్స్ లేదు. షటిల్‌కాక్ తగిలినప్పుడే అది ఎక్కడే పడిపోయిందనుకున్నాను. కానీ అది నా కంటి లోపలికి వెళ్లి పోయి ఇన్నాళ్ల పాటు అలానే ఉంది’ అంటూ తెలిపింది. అంతేకాక ఇన్నేళ్లలో తనకు ఎటువంటి కంటి సమస్యలు తలెత్తలేదని తెలిపింది. అయితే ఇన్నాళ్ల నుంచి కంటి లోపల ఉన్న లెన్స్ ఇప్పుడిలా బయట పడటానికి గల కారణాలు ఇంకా తెలియలేదన్నారు డాక్టర్లు. సోషల్ మీడియాలో షేర్ అవుతోన్న ఈ లెన్స్ కథ నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. -
3.70 కోట్ల మందికి పరీక్షలు చేసి అద్దాలిస్తాం
-
రాష్ట్రానికి కంటి వెలుగు
సాక్షి, మెదక్: ‘‘కంటి వెలుగు పథకం దేశానికే ఆదర్శం. ఎంత డబ్బు ఖర్చయినా రాష్ట్రం అంతటా పథకం అమలు చేస్తాం. రాష్ట్రంలోని రూ.3.70 కోట్ల మందికి పరీక్షలు నిర్వహించి అద్దాలు ఇస్తాం. అవసరమైతే కాటరాక్ట్ ఆపరేషన్లు చేయిస్తాం’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. బుధవారం మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్ గ్రామంలో సీఎం కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. ఆ పిల్లల మాటలు కదిలించాయి: ‘‘ఆదర్శ గ్రామమైన మల్కాపూర్ నుంచి ఈ పథకాన్ని ప్రారంభించటం సంతోషంగా ఉంది. ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ఉన్నందుకు గర్వంగా ఉంది. ఎర్రవల్లి గ్రామంలో కంటి వైద్య శిబిరం నిర్వహించగా 217 మందికి కంటి సమస్యలు ఉన్నట్లు తేలింది. దృష్టి లోపం ఉన్న చిన్నపిల్లలకు అద్దాలు అందజేస్తే ‘ఇప్పుడు మాకు కళ్లు బాగా కనిపిస్తున్నాయని.. థ్యాంక్స్ అంకుల్’ అని పిల్లలన్న మాటలు నన్ను కదిలింపజేశాయి. అక్కడి అనుభవంతోనే రాష్ట్రం అంతటా కంటి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నా’’ అని సీఎం వివరించారు. కంటి అపరేషన్ అంటే ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. కంటి పరీక్షల అనంతరం సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతున్న మహిళ ‘‘నేనూ ఆపరేషన్ అంటే భయపడ్డా.. రెండు కళ్లకు కాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్నా. వైద్యులు ఆపరేషన్ చేసిన గంటలోపల ఇంటికి పంపారు’’ అని తెలిపారు. ఆపరేషన్ల కోసం ఎవ్వరూ పైసా ఖర్చు చేయాల్సిన పనిలేదన్నారు. ‘‘దేశంలో కులాలు, మతాల పంచాయతీలు ఉండటం దుర్మార్గం. అలాగే ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ఇక్కడ ఆడమగా బేధం ఉంది. కుల మతాలను వీడి అందరూ ఐకమత్యంగా పనిచేయాలి. లింగవివక్ష కూడా పక్కపెట్టాలి. ఆడవాళ్లలో గొప్పవాళ్లు లేరా? మెదక్ ఎస్పీ, ఐఏఎస్ అధికారులు శాంతికుమారి, వాకాటి కరుణ, మెదక్ జెడ్పీ చైర్పర్సన్, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి.. జెడ్పీటీసీ అందరూ మహిళలే’’ అని వివరించారు. రష్యాలో 82 శాతం పైలట్లు మహిళలే ఉన్నట్లు తెలిపారు. అవకాశాలిస్తే మహిళలు అద్భుతాలు సృష్టిస్తారన్నారు. మల్కాపూర్ మహిళలకు చేతులు జోడిస్తున్నానని.. ఈ గ్రామాన్ని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దటంలో వారి పాత్ర చాలా ఉందని కొనియాడారు. ఈ గ్రామం తెలంగాణకు మణిహారం అని, ఇక్కడి నుంచి తాను నేర్చుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. పంపిణీకి సిద్ధం చేసిన కంటి అద్దాలు రైతుల కష్టాలు తీరాలె ‘‘తెలంగాణ రైతుల కష్టాలు తీరేలే.. బాజాప్తా గోదావరి, కృష్ణా జలాలు తెలంగాణ పంట పొలాలకు మళ్లాలి. రాష్ట్రంలో కరెంటు పీడపోయింది. త్వరలో రైతుల సాగునీటి తిప్పలు పోతాయి. దేశంలోని ఏ రాష్ట్రం ఖర్చు చేయని విధంగా తెలంగాణలో సాగునీటి రంగానికి నిధులు ఖర్చు చేస్తూ చరిత్ర సృష్టిస్తున్నాం. ఎంతో బాధ ఉంటేనే ఈ స్థాయిలో సాగునీటి రంగానికి ప్రాధ్యాత ఇస్తాం’’ అని సీఎం అన్నారు. ఇక్కడి రైతులు సాగునీరు కోసం బోర్లు వేసి ఎన్నో తిప్పలు పడ్డారన్నారు. తాను కూడా 50 బోర్లు వేసినట్లు చెప్పారు. ఈ కష్టాలు తీరడానికి కృష్ణా, గోదావరి నీళ్లు బాజాప్తా రావాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో త్వరలోనే రైతుల బాధలు తీరుతాయని చెప్పారు. 15 టీఎంసీల సామర్థ్యం ఉన్న కొండపోచమ్మ సాగర్‌ను ఏడాదిలో పూర్తిచేసి ప్రపంచంలోనే రికార్డు నెలకొల్పనున్నట్లు చెప్పారు. మిషన్‌కాకతీయ ద్వారా చెరువులు నింపి 365 రోజులు నీళ్లు ఉండేలా చూస్తామన్నారు. గ్రామాల్లో మోరీల బాధ తీరుస్తాం తెలంగాణలో డ్రెయినేజీ (మోరీ)ల బాధ తీర్చేలా అమెరికా తరహాలో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థ నిర్మించనున్నట్లు సీఎం ప్రకటించారు. రాబోయే ఐదేళ్లలో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రామాల్లో మోరీలతో ప్రజలు ఇబ్బందులు పడటమే కాదు రోగాల బారిన పడుతున్నారని, వారి కష్టాలు తీర్చేందుకు అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేస్తామన్నారు. మండలం లేదా పది గ్రామాలను యూనిట్‌గా తీసుకుని నీటి శుద్ధి యంత్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థకు సంబంధించిన కసరత్తు జరుగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు, రాజ్యసభ సభ్యులు కేశవరావు, సంతోష్‌కుమార్, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేత్రదానం సర్టిఫికెట్లు ఆందజేత సీఎం కేసీఆర్‌కు మల్కాపూర్ గ్రామస్తులు ప్రత్యేక కానుక అందజేశారు. గ్రామానికి చెందిన 756 మంది నేత్రదానం చేసేందుకు ముందుకు వచ్చారు. నేత్రదానం చేస్తున్నట్లు అంగీకార పత్రాలను కంటి వెలుగు సభా వేదికపై సీఎం కేసీఆర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా వారిని సీఎం అభినందించారు. తూప్రాన్‌కు చెందిన 40 మంది జర్నలిస్టులు కూడా నేత్రదానం పత్రాలపై సంతకాలు చేశారు. -
కళ్ల కింద నల్లటి వలయాలుంటే...
ముఖానికి అప్లయ్ చేసిన క్రీములను అలాగే వదిలేయడం వల్ల క్రమంగా కళ్ల కింద చర్మం సున్నితంగా ఉంటుంది కాబట్టి కమిలి సహజత్వాన్ని కోల్పోతుంది. మేకప్ కోసం వాడిన క్రీములను శుభ్రం చేసేటప్పుడు కళ్ల కింద జాగ్రత్తగా తుడవాలి, వెంటనే బేబీఆయిల్ వంటివి రాయాలి.పలుచగా కోసిన బంగాళదుంప లేదా కీరదోస ముక్కలను కళ్లు మూసుకుని రెప్పలమీద పెట్టి పదిహేను నిమిషాల పాటు ఉంచాలి. ముక్కలను తీసిన తర్వాత చన్నీటితో ముఖం కడిగి కళ్ల కింద నరిషింగ్ క్రీమ్. రాయాలి. బంగాళదుంప రసం, కీరదోస రసం సమపాళ్లలో తీసుకుని ఆ మిశ్రమంలో ముంచిన దూదిని కళ్ల మీద పెట్టి ఇరవై నిమిషాల సేపు ఉంచాలి. కాటన్ పాడ్స్ తీసిన తర్వాత చన్నీటితో కడగాలి.తాజా నిమ్మరసంలో అంతే మోతాదు టొమాటో రసం కలిపి ఆ మిశ్రమంలోముంచిన దూదిని కళ్ల మీద పెట్టాలి. ఇలారోజుకు రెండుసార్లు చేయాలి.స్వచ్ఛమైన పసుపులో పైనాపిల్ రసం కలిపిఆ మిశ్రమాన్ని కళ్ల చుట్టూ రాసి ఆరినతర్వాత చన్నీటితో కడగాలి. పుదీనా ఆకులను చిదిమి రసాన్ని కళ్ల చుట్టూరాస్తున్నా కూడా వలయాలు పోతాయి. -
టాక్సీలో మేకప్ వేసుకుంటుండగా.. విషాదం
బ్యాంకాక్ : టాక్సీలో ప్రయాణిస్తున్న ఓ యువతి కంటికి ‘ఐలైనర్ పెన్సిల్’ సహాయంతో మెరుగులు దిద్దుతుండగా.. ఐలైనర్ పెన్సిల్ కాస్తా కంటిలో గుచ్చుకుంది. సగానికి పైగా పెన్సిల్ కంటిలోకి చొరబడటంతో భరించలేని నొప్పితో తీవ్ర ఇబ్బందులకు గురైందా యువతి. ఈ సంఘటన సోమవారం థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బ్యాంకాక్‌కు చెందిన 20 ఏళ్ల యువతి టాక్సీలో ప్రయాణిస్తోంది. ట్రాఫిక్ జామ్ కారణంగా వాహనం నిదానంగా కదులుతోంది. స్నేహితులను కలవాలన్న తొందరలో ఉన్న ఆమె బ్యాగులో ఉన్న ఐలైనర్‌ను తీసి కంటికి మెరుగులు దిద్దుకోవటం ప్రారంభించింది. ఇంతలో ఆమె ప్రయాణిస్తున్న టాక్సీ కాస్తా ముందున్న ట్రక్కును ఢీ కొట్టింది. దీంతో ఆమె తల ముందున్న సీటుకు తగిలి ఐలైనర్ పెన్సిల్ కంటిలోకి చొచ్చుకెళ్లింది. పెన్సిల్ కంట్లో గుచ్చుకోవటంతో భరించలేని నొప్పి కారణంగా ఆమె గట్టిగా అరవటం మొదలుపెట్టింది. ఆమె పరిస్థితి గమనించిన టాక్సీ డ్రైవర్ వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేశాడు. కొద్ది సేపటి తర్వాత అంబులెన్స్‌లో ఆమెను దగ్గరలోని ‘రాజవితి’ హాస్పిటల్‌కు తరలించారు. శస్త్రచికిత్స చేసిన వైద్యులు యువతి కంటి నుంచి పెన్సిల్‌ను తొలగించారు. ‘రాజవతి’ ఆస్పత్రి వైద్యులు మాట్లాడుతూ.. కంటిలోని ముఖ్యమైన భాగాలకు ఎలాంటి నష్టం కలుగకపోవటంతో ఆమె కంటిచూపుకు ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని తెలిపారు. ప్రయాణాల్లో ఉన్నపుడు మేకప్ వేసుకునే వాళ్లకు ఇదొక గుణపాఠమని, కదులుతున్న కారులో ఇలాంటివి చేయకూడదని హెచ్చరించారు. ఇటువంటి సంఘటనలు ఊహించనివని, అన్నింటికి సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. -
నయనమనోహరం
కనురెప్పల వెంట్రుకలు నల్లగా, పొడవుగా పెరగాలంటే మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెలో రెండు చుక్కల టీట్రీ ఆయిల్ కలిపి అప్లయ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని చాలా కొద్దిగా తీసుకుని కళ్లలోకి జారకుండా రెప్పల వెంట్రుకలకు మాత్రమే సరిపోయేటట్లు రాయాలి. రాత్రి పడుకునే ముందు అప్లయ్ చేస్తే మంచిది. కనుబొమలు పలుచగా ఉన్నా కూడా ఈ మిశ్రమాన్ని వాడవచ్చు. కనుబొమల వద్ద చర్మం పొడిబారి డాండ్రఫ్ వంటి సమస్యలు వచ్చినా కూడా ఈ కొబ్బరినూనె, టీట్రీఆయిల్ సమర్థంగా తగ్గిస్తాయి. ∙రోజూ పడుకునే ముందు స్వచ్ఛమైన ఆముదాన్ని రాసుకుంటే కనురెప్పలు ఆరోగ్యంగా పెరుగుతాయి. ∙కొందరికి కనురెప్పల వెంట్రుకలు చిక్కగా ఉంటాయి కాని స్కిన్ కలర్లో కలిసిపోయినట్లుంటాయి. ఫంక్షన్ల వంటి ప్రత్యేక సందర్భాలలో మస్కారాతో నల్లగా కనిపించేటట్లు చేయవచ్చు. మస్కారా వాడినప్పుడు ఇంటికి వచ్చిన వెంటనే బేబీ ఆయిల్ కాని ఆముదం కాని రాసి మస్కారాను పూర్తిగా తుడిచేయాలి. ఈ ఒక్కసారికే కదా అని తలకు వేసే హెయిర్ డైను ప్రత్యామ్నాయంగా ఎంచుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ హెయిర్‌డైని కళ్ల దగ్గరకు రానీయకూడదు. -
తీరైన కనుబొమలకు
ఐ బ్రోస్కి షేప్ చేయించేటప్పుడు హెయిర్ ఎక్స్‌ట్రాస్ మాత్రమే తీసేయండని చెబుతుంటారు. ముఖానికి తగినట్టుగా కనుబొమల షేప్ రాకుంటే ఇబ్బంది. అందుకని.. ► పెన్సిల్ తీసుకొని మీ ముక్కు చివర నుంచి కనుబొమ మొదలు వరకు (కంటి పైభాగంలో) నిటారుగా పెట్టి, మార్క్ చేయాలి. ఇప్పుడు ప్లక్కర్ లేదా థ్రెడ్ సాయంతో కనుబొమ మొదలు వద్ద గల హెయిర్ ఎక్స్‌ట్రాస్ మాత్రమే తీస్తే చాలు. ► చిత్రంలో చూపిన విధంగా ముక్కుకు వ్యతిరేక దశలో పెన్సిల్‌ను ఉంచి కనుబొమ మధ్య భాగంలో వచ్చే విధంగా మార్క్ చేయాలి. ఇది విల్లులా ఉండే భాగం. ► ముక్కు చివరన పెన్సిల్ ఉంచి వ్యతిరేక దిశలో కనుబొమ చివరన మార్క్ చేయాలి. మధ్యన, చివరన అదనపు హెయిర్ తీసేయాలి. దీంతో మీ కనుబొమ విల్లులాంటి షేప్‌కి ఇబ్బంది కలగదు. -
సహయం కోసం నిరీక్షణ
కంటి చూపు కోల్పోయిన బాధితుల వేదన స్పందించని అధికారులు, లయన్స్ క్లబ్ వర్గాలు పరామర్శలే తప్ప సహాయం లేదు నేడు అమెరికా నుంచి రానున్న క్లబ్ బృందం సామర్లకోట (పెద్దాపురం) : కంటి చూపు కోల్పొయిన బాధితులకు ఇంతవరకూ ప్రభుత్వం నుంచి లేదా లయన్స్ క్లబ్ నుంచి ఎటువంటి సహాయం అందలేదు. దీంతో బాధితులు సాయం కోసం నిరీక్షిస్తున్నారు. ఏప్రిల్ 13వ తేదీన వేట్లపాలెం గ్రామానికి చెందిన 10 మంది జగ్గంపేట వెళ్లి కోడూరి రంగారావు లయన్స్ క్లబ్ ఆస్పత్రిలో కంటి ఆపరేషన్లు చేయించుకోవడం, వారి చూపు మందగించడం విదితమే. బాధితులు మూడు నెలల పాటు వారి చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో.. చివరికి విలేకరులను ఆశ్రయించారు. అధికారులు, లయన్స్ క్లబ్ సభ్యులు తగిన అన్యాయంపై న్యాయం చేస్తారని ఆశ పడిన వారికి నిరాశే మిగిలింది. వేట్లపాలెం గ్రామంలో ఒక చర్చిలో ప్రార్థనలు చేసుకుంటోన్న సమయంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచితంగా కంటి పరీక్షలు చేయిస్తోందని, అవసరమైన వారికి ఉచితంగానే కంటి ఆపరేషన్లు చేస్తామని ప్రకటించడంతో ఈ బాధితులు వైద్యం కోసం వెళ్లారు. మసకగా ఉన్న కంటి చూపు మెరుగుపడుతుందని ఆశించిన వారికి కంటి చూపే పొయింది. ఈ గ్రామస్తులు రామిశెట్టి సత్యవతి, బావిశెట్టి రాంబాయి, కుప్పాల కృపారావు, చిట్టూరి సత్యనారాయణ, గొడత రామకృష్ణ, బొండా సత్యానందం, దోణం పెద్దిరాజులకు కంటి ఆపరేషన్లు చేయడంతో వారికి ఉన్న చూపు కోల్పోయిన విషయం విదితమే. చూపు కనిపించకపోవడమే కాకుండా కంటిలో ఈగలు తిరుగుతున్న ఉందని బాధితులు వాపోతున్నారు. డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప ఈ నెల 5న బాధితులను పరామర్శించి ప్రభుత్వ కంటి వైద్యులతో మెరుగైన వైద్యం అందిస్తామని, బాధితులకు న్యాయం చేస్తామని ప్రకటించారు. అయితే ఇప్పటివరకు ఎటువంటి వైద్యం అందలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. కంటి చూపు పోయిన వారి పట్ల సానుభూతి చూపించేవారే తప్ప వారికి సహాయం చేసేవారు లేకుండా పోయారని గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగ్గంపేటలోని కోడూరి రంగారావు లయన్స్ ఆస్పత్రి ప్రతినిధులు అమెరికాలోని అంతర్జాతీయ లయన్స్ క్లబ్ సమావేశాలకు వెళ్లారని, వారు వచ్చిన తరువాత బాధితులకు న్యాయం చేస్తామని లయన్ప్ క్లబ్ ప్రతినిధులు చెబుతున్నారు. ఆమెరికా ప్రతినిధి బృందం సోమవారం జిల్లాకు వస్తారనే ప్రచారం సాగుతోంది. వారు వచ్చిన తరువాత అయినా బాధితులకు సరైన న్యాయం చేస్తారా లేదో చూడాలని గ్రామస్తులు అంటున్నారు. -
కంటి చూపు ఇప్పించండి
డిప్యూటీ సీఎంను వేడుకున్న బాధితులు న్యాయం చేస్తామని రాజప్ప హామీ పూర్తిస్థాయి విచారణకు కలెక్టర్‌కు ఆదేశం శిబిరాల నిర్వహణలో ప్రభుత్వ వైద్యులు ఉండేలా ఆదేశాలు ఇచ్చేందుకు చర్యలు వేట్లపాలెం (సామర్లకోట) : పోయిన కంటి చూపు వచ్చేలా వైద్య పరీక్షలు చేయించాలని బాధితులు డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్పను వేడుకున్నారు. బుధవారం వేట్లపాలెంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి రాజప్ప ఆ గ్రామ సర్పంచ్ వల్లూరి శేషవేణి స్వగృహం వద్ద లయన్స్ క్లబ్ ఆస్పత్రి నిర్వహించిన శస్త్ర చికిత్సల్లో చూపు కోల్పోయిన బాధితులను పరామర్శించారు. ఈ నెల 4న సాక్షి దినపత్రిక ‘చీకటి నింపిన శస్త్ర చికిత్స’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీంతో అధికారులు, రాజకీయ నాయకులు వారి వద్దకు వచ్చి పరిస్థితి తెలుసుకొంటున్నారు. ఈ సందర్భంగా కంటి శస్త్ర చికిత్స చేయించుకున్న రామిశెట్టి సత్యవతి, కుప్పాల కృపారావు, చిట్టూరి సత్యనారాయణ, బావిశెటి రాంబాయి, గొడత రామకృష్ణ, బొండాడ సత్యానందం తమకు కంటి చూపు వచ్చేలా చేయాలని డిప్యూటీ సీఎం రాజప్పను వేడుకున్నారు. కంటి చూపు పోవడానికి గల కారణాలను గ్రామ ఉపసర్పంచ్ వల్లూరి శ్రీనివాసు రాజప్పకు వివరించారు. ఈ మేరకు బాధితులకు న్యాయం చేస్తామని రాజప్ప హామీ ఇచ్చారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ ఏప్రిల్ 13న లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంటి శిబిరంలో వేట్లపాలేనికి చెందిన వారు 10 మంది శస్త్ర చికిత్సలు చేయించుకున్నారని వారిలో 8 మందికి కళ్లు కనిపించడం లేదన్నారు. వారి సమస్యపై కాకినాడలోని ప్రభుత్వ వైద్యాధికారులతో చర్చించామని, బాధితులకు మెరుగైన వైద్యం చేయించి కంటి చూపు వచ్చేలా చేస్తామని తెలిపారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని జిల్లా కలెక్టరును ఆదేశించామన్నారు. ఉచిత వైద్య శిబిరాలు జరిగే సమయంలో సంబందిత ప్రభుత్వ వైద్యులు హాజరు కాక పోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోందన్నారు. శిబిరాలు జరిగే సమయంలో ప్రభుత్వ వైద్యులు తప్పనిసరిగా ఉండేలా ఆదేశాలు జారీ చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గొడత మార్త, జెడ్పీటీసీ సభ్యురాలు గుమెళ్ల విజయలక్ష్మి పాల్గొన్నారు. -
పిల్లలకు దానగుణం నేర్పించండి
తల్లిదండ్రులకు మహారాష్ట్ర అడిషనల్ డీజీపీ లక్ష్మీనారాయణ సూచన ఘనంగా కోనసీమ ఐ బ్యాంక్ సప్తమ వార్షికోత్సవం అమలాపురం టౌన్ : పుట్టినరోజు వేడుకలు చేసుకుని అవి వాట్సాప్‌ల్లో పెట్టి ఆనందించే నేటి యువత అదే పుట్టిన రోజున రక్తం దానం చేసి ఆ దృశ్యాన్ని వాట్సాప్‌ల్లో పెట్టినప్పుడు వచ్చే ఫలితాలు పవిత్రం, పరమార్థంతో ఉంటాయని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్, మహారాష్ట్ర అడిషనల్ డీజీసీ లక్ష్మీనారాయణ అన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు ఇదే స్ఫూర్తిని.. దానగుణాన్ని నేర్పించాలని ఆయన సూచించారు. అమలాపురంలోని కన్యకా పరమేశ్వరి కల్యాణ మండపంలో ఆదివారం ఉదయం జరిగిన యర్రా బలరామమూర్తి కోనసీమ ఐ బ్యాంక్ సప్తమ వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మానవ సేవే మాధవ సేవ సూక్తిని అందరూ తప్పకు పాటించాలని లక్ష్మీనారాయణ సూచించారు. నేత్ర, అవయవ, రక్త దానాలు చేయడం అలవర్చుకోవాలని కోరారు. మనం చనిపోయిన తర్వాత మన్నులో కలిసిపోయే అవయవాలను నిర్వీర్యం చేసే కంటే అవయవదానం చేస్తే మన మరణాంతరం మానవాళికి ఉపయోగపడతాయని గుర్తు చేశారు. ఒక పల్లె ప్రాంతమైన కోనసీమలో యర్రా బలరామమూర్తి ఐ బ్యాంక్ గత ఏడేళ్లలో 1200 కార్నియాలను సేకరించి 700 మందికి కంటి చూపు ఇచ్చేందుకు దోహదపడిదంటే సాధారణ విషయం కాదని లక్ష్మీనారాయణ అన్నారు. ఆ ఐబ్యాంక్ చైర్మన్ యర్రా నాగబాబును, వారి తండ్రి యర్రా బలరామమూర్తిని సభాముఖంగా ప్రశంసించారు. మనకు మంచి చేసినప్పుడు భగవంతుడికి మన థాంక్స్ చెప్పుకోవడం కాదు... సమాజ హితమైన నేత్ర, రక్త, అవయవ దానాలు చేసినప్పుడు భగవంతుడే మనకు థాంక్స్ చెప్పినట్టుగా మీ దానాలు పొందిన వారే పొగుడుతున్నప్పుడు అనిపిస్తుందని లక్ష్మీనారాయణ అన్నారు. ఐ బ్యాంక్ చైర్మన్ యర్రా నాగబాబు అధ్యక్షతన జరిగిన ఈ వేడుక సభలో రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, మాజీ ఎమ్మెల్యేలు బండారు సత్యానందరావు, పాముల రాజేశ్వరిదేవి, చిల్లా జగదీశ్వరి, రాష్ట్ర పశు గణాభివృద్ధి సంస్థ చైర్మన్ యాళ్ల దొరబాబు, రాష్ట్ర కాపు జేఏసీ నేతలు ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణుమూర్తి, కల్వకొలను తాతాజీ, రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ యర్రా నవీన్, రాష్ట్ర కో ఆపరేటివ్ యూనియన్ డైరెక్టర్ గణపతి వీర రాఘవులు, రాష్ట్ర కాపు వెబ్ సైట్ అధ్యక్షుడు యాళ్ల వరప్రసాద్ పాల్గొని ఐ బ్యాంక్ సేవలను కొనియాడారు. తొలుత వార్షికోత్సవ వేడుకలను జ్యోతి ప్రజ్వలన చేసి లక్ష్మీనారాయణ ప్రారంభించారు. అనంతరం నేత్రదానం చేసిన వారి కుటుంబీలకు, ప్రొత్సహించిన వారికి లక్ష్మీనారాయణ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. కోనసీమ ఐ బ్యాంక్ డైరెక్టర్ డాక్టర్ అయ్యగారి వెంకటేశ్వరరావు, టెక్నీషియన్ కె. స్వర్ణలత సేవలను కూడా వక్తలు కొనియాడారు. -
పేదల భూములు.. పెద్దల సొంతం
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పేదల భూములపై అధి కార పార్టీ పెద్దల కన్నుపడింది. సుమారు రూ.5 కోట్ల విలువైన రెండెకరాల భూమిని అడ్డదారిలో సొంతం చేసుకున్నారు. దానిని ప్లాట్లుగా విభజించి రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగించేందుకు రంగం సిద్ధం చేశారు. అధికార పార్టీ నేత అండదండలతోనే ఈ తంతు నడుస్తోంది. దళితులకు కేటాయించిన అస్సైన్డ్ భూముల క్రయ విక్రయాలకు అవకాశం లేకపోయినా పంచాయతీ సిబ్బంది నిర్వాకంతో అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యవహా రం సాగిపోతోంది. వివరాల్లోకి వెళితే.. ఏలూరు మండలం వెంకటాపురం çపంచాయతీ పరిధిలోని సుంకరవారి తోటలో సుమారు 20 ఏళ్ల క్రితం నిరుపేద ఎస్సీ, బీసీ కుటుంబాలకు ప్రభుత్వం వ్యవసాయం భూమి పంపిణీ చేసింది. ఒక్కొక్కరికి 25 సెంట్ల చొప్పున మొత్తం 8 మందికి రెండెకరాల భూమిని అధికారులు అందించారు. వ్యవసాయం చేసుకోవాలని పేదలకు సూచించారు. కొన్నేళ్ల తర్వాత ఈ భూముల చుట్టూ ప్రభుత్వ, ప్రైవేట్ లేఅవుట్లు వెలిశాయి. దీంతో అక్కడి భూముల ధరలు పెరగడంతో కొందరు వ్యక్తుల కళ్లు ఈ భూమిపై పడింది. పేద కష్టాలను ఆసరా చేసుకుని తక్కువ మొత్తానికే ఆ భూమిని కొనుగోలు చేశారు. ఈ విషయం తెలిసి ఎస్సీ, బీసీ నాయకులమంటూ కొందరు రంగంలోకి దిగారు. అస్సైన్డ్ భూముల కొనుగోలు నేరమంటూ బ్లాక్మెయిల్ చేసి సొమ్ములు గుంజుకున్నారు. ఇలా భూములు చేతులు మారాయి. ఇప్పుడు ఆ భూమిని లే–అవుట్ చేసి ప్లాట్లుగా విభజించి విక్రయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం పంచాయతీ కార్యాలయం నుంచి లే–అవుట్ అనుమతులు సైతం పొందారు. నిజానికి అస్సైన్డ్ భూముల్ని వాణిజ్య అవసరాలకు ఉపయోగించకూడదు. అధికార పార్టీ కనుసన్నల్లో.. ఇప్పుడు ఈ వ్యవహారమంతా అధికార పార్టీ నేత చేతుల్లోకి వెళ్లింది. అస్సైన్డ్ భూమిని ప్లాట్లుగా విభజించి అమ్ముకోవాలంటే.. తనకు పర్సంటేజీ ఇవ్వాలని తన అనుచరుల ద్వారా ఆ నాయకుడు డిమాండ్ చేసినట్టు సమాచారం. నెల రోజులపాటు తర్జనభర్జనల అనంతరం ఆ భూమిని ప్లాట్లుగా విభజిస్తున్న వ్యక్తులు మాజీ ప్రజాప్రతి నిధి ద్వారా టీడీపీ నేతలకు మొత్తం లాభంలో 25 శాతం కమీషన్ ఇచ్చేం దుకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం. దీంతో ఇప్పటివరకు అడ్డంకులన్నీ తొలగిపోయాయి. పనులు వేగం పుంజుకున్నాయి. భూమిని పూడ్చటానికి మట్టి తోలకాలు చురుగ్గా సాగుతున్నాయి. కలెక్టర్‌కు ఫిర్యాదు తమ భూములను అక్రమంగా లే–అవుట్ చేసి విక్రయించేందుకు కొం దరు వ్యక్తులు ఏర్పాట్లు చేస్తున్నారని, ఆ భూములను తమకు తిరిగి ఇప్పించాలంటూ గతంలో భూములు పొందిన కొందరు కలెక్టర్ కాటంనేని భాస్కర్‌కు ఫిర్యాదు చేశారు. ఆర్ఎస్ నంబర్ 903–1బీ4లో ప్రభుత్వం 25 సెంట్ల చొప్పున భూమిని కేటాయిం చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కొంతమంది రాజకీయ నాయకులు, వెంకటాపురం పంచాయతీ సిబ్బంది కలిసి లే–అవుట్ చేసినట్టుగా పత్రాలు సృష్టించి తమ భూముల్ని కాజేస్తున్నారని వాపోయారు. ఇదేమని అడిగితే తమపై దౌర్జన్యానికి దిగుతున్నారని లబ్ధిదారులు కొత్తపల్లి కుటుంబరావు, ముల్లంగి వెంకటేశ్వరరావు, ఇమ్మల జ్యోతి తదితరులు కలెక్టర్‌కు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. -
కొబ్బరి నేత్రం
► తుమకూరులో వింత కొబ్బరికాయపై వెలసిన కన్ను ఆకారం ఆసక్తి రేపుతోంది. తుమకూరు జిల్లాలోని గుబ్బి తాలూకాలో ఉన్న కడబ గ్రామానికి చెందిన రైతు వెంకటప్ప తోటలో కొబ్బరి చెట్టుకు కాసిన కొబ్బరికాయపై ఒంటి కన్ను కనిపించింది. రైతు కొబ్బరి పీచు తీస్తుండగా కన్ను రూపం బయటపడింది. ఎవరో శ్రద్ధగా తీర్చిదిద్దినట్లు కనిపిస్తోంది. దానిని చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆ రైతు కొబ్బరి కాయను దేవునిగదిలో ఉంచి పూజలు చేశారు. -
లక్.. కిక్.. ఐటీ లుక్
తణుకు : అదృష్టంతో దుకాణాలు దక్కాయని సంబరపడుతున్న మద్యం వ్యాపారుల కిక్కు దించేందుకు ఆదాయపన్ను శాఖ (ఐటీ) అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. రూ.లక్షలు పోసి మద్యం దుకాణాలు దక్కించుకున్నవారు సంతో షంగా ఉండగా దరఖాస్తు చేసి దుకా ణాలు రానివారు నిరాశతో ఉన్నారు. వీరిద్దరిపై ఐటీ అధికారులు దృష్టి సారించారు. ఆర్థిక సంవత్సరం ముగింపురోజున మద్యం దుకాణాల నిర్వహణకు సంబంధించి జరిగిన సుమారు రూ.100 కోట్ల లావాదేవీలపై అధికారులు కన్నేశారు. ఇప్పటికే తాజాగా మద్యం దుకాణాలు దక్కించుకున్న వ్యాపారుల జాబితాను సేకరించిన అధికారులు వారి ఆదాయ మార్గాలపై ఆరా తీస్తున్నారు. మరోవైపు దరఖాస్తు చేసుకుని దుకాణాలు దక్కించుకోలేకపోయిన వారి వివరాలను సైతం సేకరించడంతో ఇప్పుడు ఆయా వర్గాల్లో ఆందోళన నెలకొంది. రూ.100 కోట్ల లావాదేవీలు జిల్లాలో 2017–19కు సంబంధించి మొత్తం 474 మద్యం దుకాణాలకు ఎక్సై జ్ అధికారులు దరఖాస్తులు ఆహ్వానించారు. లైసెన్స్ ఫీజు దాదాపు 75 శాతం మేర తగ్గించడంతో 9,364 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు, రిజిస్ట్రేషన్ రుసుం దుకాణం వచ్చినా, రాకపోయినా తిరిగి చెల్లించే అవకాశం లేదు. దీని ప్రకారం ఒక్కో దరఖాస్తుదారుడు సగటున రూ.60 వేలు చొప్పున సుమారు రూ.50 కోట్ల లావాదేవీలు జరిపారు. దుకాణం దక్కించుకున్న వ్యాపారులు షాపునకు రూ.11.50 లక్షలు చొప్పున ప్రభుత్వానికి చెల్లించారు. ఈ లెక్కన జిల్లాలో మద్యం వ్యాపారులు సుమారు రూ.100 కోట్ల మేర లావాదేవీలు జరిపినట్టు తెలుస్తోంది. ఫలితంగా మద్యం వ్యాపారుల మెడకు ఐటీ ఉచ్చు బిగించడం ఖాయంగా కనిపిస్తోంది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంకు, నగదు లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. రూ.2 లక్షలు పైబడి బ్యాంకు ఖాతాల్లో నిల్వ ఉంటే దానికి లెక్కలు చెప్పాలనే నిబంధనలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మద్యం దుకాణాలకు టెండర్లు వేసిన వారిలో చాలా మంది వ్యాపారులు తమ బంధువులు, సన్నిహితుల (పాన్‌కార్డు ఉన్నవారి) పేరుతో దరఖాస్తు చేశారు. దీంతో ఒక్కో వ్యక్తికి అప్పటికప్పుడు రూ.లక్షల నగదు ఎక్కడి నుంచి వచ్చింది అనే కోణంలో ఆదాయపు పన్నుశాఖ అధి కారులు దృష్టి సారించారు. బ్యాంకు ఖాతాల్లో లావాదేవీలను చూపిం చారా..? ఆయా మొత్తాలకు రిటర్న్ దాఖలు చేశారా..? అనే అంశాల ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు ఆర్థిక సంవత్సరం ముగింపు రోజు మార్చి 31న జరిగిన కోట్లాది రూపాయల లావాదేవీలు నల్లధనంగా అధికారులు భావిస్తున్నారు. -
చూపు పదిలం...
నేత్రదానంతో ఇద్దరికి చూపు సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంధులకు కంటి చూపును ప్రసాదిద్దాం నేటినుంచి జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు కోల్‌సిటీ : ‘సర్వేంద్రియానాం నయనం ప్రధానం..’ అన్నారు పెద్దలు. అందమైన సృష్టిని చూడాలంటే కంటిచూపే ముఖ్యం. చీకట్లో మగ్గుతున్నవారెందరో కంటిచూపు కోసం ఎదురుచూస్తున్నారు. మరణించిన తర్వాత నేత్రాలు వృథాగా పోకుండా ఉండేందుకు అందరూ నేత్రదానం చేయాల్సిన అవసరముంది. ప్రజల్లో నేత్రదానంపై అనేక స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పిస్తున్నాయి. ఏటా ఆగస్టు 25నుంచి జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఒకరి దానం.. ఇద్దరికి చూపు నేత్రదానం చేయడానికి వయసుకు పరిమితులు లేవు. ఒకరుదానం చేయడంద్వారా ఇద్దరికి కంటిచూపు వస్తుంది. నేత్రదానం చేస్తున్నట్లు ప్రకటించినా, ప్రకటించకపోయినా కళ్లుదానం చేయవచ్చు. నేత్రదానం చేయాలనుకుంటే స్వచ్ఛందసంస్థలకు, ఐబ్యాంకులకు సమాచారం ఇవ్వాలి. వ్యక్తిమరణించిన 6 గంటలలోపు నేత్రాలు తీయాలి. ఐబ్యాంకు డాక్టర్కానీ, శిక్షణ పొందిన టెక్నీషియన్ మాత్రమే స్టెరైల్ పద్ధతి ద్వారా కార్నియాను బయటకుతీస్తారు. మృతదేహం ఉంచిన చోటుకే వీరు వచ్చి 15నుంచి 20 నిమిషాల్లో కళ్లు తీసుకుంటారు. మృతదేహం దగ్గర ఫ్యాన్లు ఆపేయాలి. తడిపిన దూదిని, ఐస్‌తోపాటు మూసిన కళ్లపై ఉంచాలి. తలకింద తలగడ పెట్టి ఎత్తుగా ఉండేలా చూడాలి. దీని ద్వారా టిఫ్యూ తడిగా ఉంచేలా సహాయపడుతుంది. నేత్రదానం కోసం పనిచేసే సంస్థలు –ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థ నేత్రదానం కోసం 1919/1053 టోల్‌ఫ్రీ నంబర్లను ఏర్పాటుచేసింది. –ఉదారకంటి ఆస్పత్రి,రేకుర్తి ఫోన్:0878–2285318, 2253131 –నేత్రదాన సేకరణ కేంద్రం, జిల్లా ప్రధానఆస్పత్రి, కరీంనగర్ 0878–2240337 –ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్, హైదరాబాద్ 9849545822. 040–23548266 –వాసన్ ఐ బ్యాంక్, సికింద్రాబాద్. ఫోన్: 7799281919. 040–43400000 –లయన్ డాక్టర్ కోల అన్నారెడ్డి, కరీంనగర్ లయన్స్ క్లబ్ నేత్ర వైద్యశాల ట్రస్ట్‌బోర్డు సభ్యుడు 9849059538 –కె.రాజేందర్, రామగుండం లయన్స్ క్లబ్నేత్రాల సేకరణ ఇన్చార్జి 7396295999 –టి.శ్రవణ్‌కుమార్, సదాశయఆర్గాన్ ఫౌండేషన్, టీ2–363, ౖయెటింక్లయిన్‌కాలనీ, గోదావరిఖని 9948609591. నేత్రదానం చేయాలి –డి.నిరంజన్, నేత్ర వైద్యనిపుణులు మరణించాక కళ్లు మట్టిలో కలిసిపోకుండా, మంటల్లో కాలిబూడిద కాకుండా నేత్రదానం చేయండి. కొన్ని దేశాల్లో మృతదేహాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అవయవాలను మరొకరిని అమర్చుతుంది. మనప్రభుత్వాలు కూడా ఇందుకోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి. మరణించినా మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపడానికి అందరూ నేత్రదానం కోసం ముందుకురావాలి. 190 నేత్రాలను స్వీకరించాం –టి.శ్రవణ్‌కుమార్, గోదావరిఖని మేము స్థాపించిన సదాశయ ఆర్గాన్ ఫౌండేషన్ ద్వారా 250కు పైగా కార్యక్రమాలు చేపట్టడంతో నేత్ర,అవయవదానంపై వేలాది మంది ముందుకొచ్చారు. ఇప్పటివరకు 190 నేత్రదానాలు స్వీకరించి వాటిని సకాలంలో ఆస్పత్రికి చేరవేశాం. ప్రతీ మండల ప్రభుత్వ ఆస్పత్రిలో నేత్రాలు సేకరించడానికి, ప్రత్యేకశిక్షణ పొందిన టెక్నీషియన్‌ను నియమించాలి. అంధుల కంటిపాప కరీంనగర్ కల్చరల్: కంటి చూపు ఉంటేనే ఈ సృష్టిలోని అందాన్ని చూడగలం. అలాంటి కళ్లు లేకుంటే జీవితమే అంధకారం. అంధులకు చూపు ప్రసాదించడంలో తన వంతు కృషి చేస్తున్నారు కోల అన్నారెడ్డి. జిల్లా కేంద్రంలోని కాపువాడకు చెందిన అన్నారెడ్డి 1990లో నాగపూర్ విశ్వవిద్యాలయం నుంచి సివిల్ ఇంజినీర్లో పట్టా పుచ్చుకున్నారు. చదివింది ఇంజినీరింగ్ అయినా మెరుగైన సమాజంకోసం తపనపడుతున్నారు. లయన్స్ క్లబ్ నేత్ర వైద్యశాల ట్రస్టుబోర్డు సభ్యుడిగా, అలయన్స్ క్లబ్ ఉప జిల్లాగవర్నర్గా, రెడ్‌క్రాస్ సొసైటీ మండలకార్యదర్శిగా అన్నారెడ్డి అనేక సేవా,సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఉచితవైద్య శిబిరాలు, నేత్రశిబిరాలు, దంత వైద్యశిబిరాలు, పల్స్‌పోలియో కార్యక్రమాలు ఏర్పాటుచేశారు. 15 మెగారక్తదాన శిబిరాలు నిర్వహించి 1,100యూనిట్ల రక్తాన్ని బ్లడ్ బ్యాంకులకు అందజేశారు. 3,100వేల నేత్రాలను సేకరించారు. 6వేలమంది నుంచి నేత్రదాన అంగీకర పత్రాలను రాయించారు. చూపులేక దుర్భర జీవితాలు గడుపుతున్న అన్నార్థులకు అండగా నిలుస్తున్నారు. -
నాణ్యతపై మూడో కన్ను
థర్డ్‌పార్టీకి చేరిన కోల్ క్వాలిటీ టెస్టింగ్ ౖయెటింక్లయిన్‌కాలనీ(కరీంనగర్) : సింగరేణి సంస్థ బొగ్గు నాణ్యత విషయంలో మరింత కఠిన పరీక్షలకు నిలబడాల్సి సమయం ఆసన్నమైంది. వినియోగదారులకు క్వాలిటీ బొగ్గు అందిస్తూ వారి మరింత దగ్గరకావడానికి యాజమాన్యం చర్యలు చేపట్టింది. సింగరేణి నుంచి ఎన్టీపీసీకి అందజేసే బొగ్గు నాణ్యతను పరీక్షించే పనిని మూడో సంస్థకు అప్పగించారు. గతంలో అమ్మకం దారుడు, కొనుగోదారు మధ్య నాణ్యత పరీక్షలు కొనసాగేవి. నెల రోజుల నుంచి సిమ్ఫర్(సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ ఫ్యూయల్ రిసెర్చ్) సంస్థ ఈ బాధ్యతను చేపట్టింది. క్వాలిటీ పరీక్షలు ఇలా.. ప్రతీ 45 నిమిషాలకు ఒకసారి సీహెచ్‌పీ (కోల్హ్యాం డ్లింగ్ ప్లాంట్) కన్వేయర్‌పై వెళ్తున్న బొగ్గు పెళ్లల నుంచి కొన్ని తీసి ఒకచోట చేర్చుతారు. ఇలా రోజంతా తీసిన బొగ్గును ప్రత్యేక యంత్రాలతో డస్ట్‌గా చేసి అరకిలో చొప్పున ప్యాకింగ్ చేస్తారు. సీల్ వేసిన అనంతరం నాగ్‌పూర్‌లోని టెస్టింగ్ ల్యాబ్‌కు పంపిస్తారు. ఇందులో నుంచే సింగరేణి, ఎన్టీపీసీ సంస్తలకు ఒక్కో శాంపిల్ అందజేస్తారు. ఏదైనా క్వాలిటీ విషయంలో వివాదం తలెత్తితే తిరిగి పరిశీలించేందుకు మరో శాంపిల్ నిల్వ ఉంచుతారు. ఇద్దరి నుంచి మూడో వ్యక్తికి.. గతంలో బొగ్గు నాణ్యత పరీక్షలు ఎన్టీపీసీ, సింగరేణి యాజమాన్యాల మధ్య కొనసాగేవి. ఏమైనా తేడాలుంటే ఇరువర్గాలు పరిశీలించుకునేవి. ఈ విధాన ఒప్పందం 1997–98లో జరిగింది. అయితే కోలిండియాలో ఎన్టీపీసీకి బొగ్గు సంస్థల మధ్య నాణ్యత విషయమై వివాదం ఏర్పడింది. దీన్ని పరిష్కరించేందుకు ఎన్టీపీసీ కేంద్రప్రభుత్వాన్ని ఆశ్రయించిచడంతో థర్డ్‌పార్టీ షాప్లింగ్పై అన్ని బొగ్గు సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఈక్రమంలో ధన్‌బాద్‌కు చెందిన సిమ్ఫర్ సంస్థ సింగరేణి బొగ్గు నాణ్యత పరీక్షలు చేసేలా ఒప్పందం జరిగింది. నాణ్యత విస్మరిస్తే నమ్మకాన్ని కోల్పోతాం – డైరెక్టర్(పీఅండ్‌పీ) మనోహర్‌రావు వినియోగదారుల విశ్వాసాన్ని చూరగొనేందుకు బొగ్గు నాణ్యత విషయంలో రాజీ లేకుండా పనిచేయాలి. ప్రస్తుత పోటీ మార్కెట్లో నాణ్యత ఉంటేనే సంస్థకు భవిష్యత్ ఉంటుంది. «థర్డ్‌పార్టీ చేతుల్లోకి వెళ్లిన్న క్రమంలో నాణ్యతపై మరింత లోతుగా ముందుకు సాగాలి. ఇప్పటివరకు వినియోగదారుల వద్ద ఏలాంటి తేడాలు లేకుండా వ్యవహరిస్తున్నాం. మనం ఇచ్చే క్వాలిటీ ప్రకారమే డబ్బులు వస్తాయి. బజారులో తక్కువ ధరకే నాణ్యమైన బొగ్గు లభిస్తోంది. కాబట్టి మనం అప్రమత్తంగా ఉండి బొగ్గు కొనుగోలు దారులను కాపాడుకోవాలి. -
'మోదీజీ డాక్టర్ల బృందాన్ని పంపండి'
జమ్మూకశ్మీర్: కశ్మీర్ లోయలో కొనసాగుతున్న అల్లర్లలో తీవ్రంగా గాయపడిన కొందరు యువకులు తమ కంటి చూపును కోల్పోయే ప్రమాదం ఉందని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. బుధవారం కశ్మీర్ అశాంతిపై.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీలను లక్ష్యంగా చేసుకొని ఆయన వరుస ట్వీట్లు చేశారు. గాయపడిన యువకులకు వైద్య సేవలు అందించడానికి మోదీ డాక్టర్ల బృందాన్ని పంపించాలని ఆయన కోరారు. కేరళ కొల్లాం ఆలయంలో అగ్నిప్రమాదం సంభవించినప్పుడు.. మోదీ డాక్టర్ల బృందాన్ని వెంట తీసుకెళ్లిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇప్పుడు కూడా ప్రధాని కంటి డాక్టర్ల బృందాన్ని కశ్మీర్ లోయకు పంపాలని ఆయన కోరారు. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 1200 మందికి పైగా యువత తీవ్రంగా గాయపడ్డారని వారికి సరైన వైద్యం అందటంలేదని ఒమర్ పేర్కొన్నారు. Hon @narendramodi ji. After Kerala fire you carried a plane load of burn specialists with you. Please send eye/trauma specialists to Kashmir — Omar Abdullah (@abdullah_omar) 13 July 2016 -
కంటి చికిత్సకు ముందు మ్యూజిక్ వింటే...
ఫ్రాన్స్ః సంగీతం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఒత్తిడిని తగ్గించి, మానసికోల్లాసాన్ని కలిగించే సంగీతం ఆరోగ్యవంతమైన జీవితం గడిపేందుకు కూడ సహకరిస్తుంది. సంగీతం అనేక బాధలనుంచి స్వాంతన పొందేట్టు చేస్తుంది. అయితే కంటికి శస్త్ర చికిత్స చేయించుకునే ముందు కాసేపు సంగీతం వినడం ఆందోళన తగ్గించేందుకు మంచి సాధనం అంటున్నారు ఫ్రాన్స్ పరిశోధకులు. కాసేపు సంగీతం విన్న తర్వాత శస్త్ర చికిత్సకు వెళ్ళడం ఎంతో మంచిదని సూచిస్తున్నారు. మ్యూజిక్ వినండం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతుందని, ముఖ్యంగా కంటి ఆపరేషన్ చేయించుకునే వారు ఎనస్థీషియా తీసుకునేందుకు ముందు.. కొద్ది సమయం మ్యూజిక్ వినడంవల్ల ఆందోళన తగ్గుతుందని అంటున్నారు ఫ్రాన్స్ లోని కొచిన్ యూనివర్శిటీ ఆస్పత్రికి చెందిన గిల్లెస్ గ్యూరియర్. ముఖ్యంగా శస్త్ర చికిత్స సమయంలో మెలకువతో ఉండటం రోగులకు ఆందోళనను, ఒత్తిడిని కలుగజేస్తుంది. అదే నేపథ్యంలో కాసేపు సంగీతం విన్నవారు, వినకుండా సర్జరీకి వెళ్ళిన వారిపై అధ్యయనాలు జరిపిన పరిశోధకులు ఇద్దరికీ మధ్య ఆత్రుతలో గణనీయమైన తేడా కనిపించినట్లు కనుగొన్నారు. ముఖ్యంగా ప్రతి వందమందిలో సంగీతం విన్నవారికంటే... వినకుండా సర్జరీకి వెళ్ళినవారికి మత్తుమందుల అవసరం ఎక్కువగా ఉన్నట్లు చెప్తున్నారు. సంగీతం విన్న పేషెంట్లకు మత్తు మందులు 16 శాతం అవసరమైతే, లేని వారికి 32 శాతం అవసరమైనట్లు చెప్తున్నారు. అంతే కాక మ్యూజిక్ విన్నవారిలో ఆపరేషన్ తర్వాత కూడ ఫలితాలు పాజిటివ్ గా ఉన్నట్లు కనుగొన్నారు. ఈ నేపథ్యంలో అన్ని రకాల కంటి శస్త్ర చికిత్సలకు ముందు సంగీతం అందిస్తున్నామని, అలాగే లోకల్ ఎనస్థీషియా ఇవ్వాల్సి వచ్చే ఎముకలతో సహా ఏ రకమైన ఆపరేషన్ కైనా సంగీతం వినిపించే పద్ధతిని అమల్లోకి తెచ్చేందుకు యోచిస్తున్నామని గ్యూరియర్ చెప్తున్నారు. కాటరాక్ట్ సర్జరీ చేయించుకునే ముందు పేషెంట్లు దాదాపు 15 నిమిషాల పాటు జాజ్, ఫ్లామెన్కో క్యూబన్, క్లాజికల్, పియానో, వంటి విభిన్న శైలుల్లోని సంగీతం వినడంవల్ల నొప్పిని తట్టుకొని, ఆందోళన చెందకుండా, ఆత్రుత పడకుండా ఆపరేషన్ సమయంలో చక్కగా వ్యవహరించగలిగినట్లు తమ పరిశోధనల్లో తేలిందని, శస్త్ర చికిత్స వల్ల కలిగే భయయాన్ని పోగొట్టేందుకు వినిపించే మ్యూజిక్ వినడానికి ముందు, తర్వాత... సర్జికల్ ఫియర్ క్వశ్చనీర్ (ఎస్ఎఫ్ క్యూ) ను ఉపయోగించి ఆందోళనను అంచనా వేసినట్లు పరిశోధకులు లండన్ యూరో ఎనస్థీషియా 2016 లో నివేదించారు. -
నేను మీ కన్నుని
నాకంటే సంక్లిష్టమైన అవయవం మరొకటి లేదు. నేను ఆనంద్ కన్నును. సున్నుండ సైజులో ఉంటాన్నేను. సైజు చూసి నన్ను తక్కువగా అంచనా వేయకండి. కోట్లాది ఎలక్ట్రికల్ కనెక్షన్ల సాయంతో నేను క్షణంలోనే పదిహేను లక్షల సందేశాలను స్వీకరిస్తాను. ఆనంద్ విజ్ఞానంలో ఎనభైశాతం నా ద్వారా వచ్చినదే. చరిత్రపూర్వ యుగంలోని ఆనంద్ పూర్వీకుల్లో నా పనితీరే వేరు. వాళ్లకు ఎదురయ్యే అపాయాలు ఎంతదూరంలో ఉన్నాయో చూపడమే నా పని. ఇప్పటికి కూడా దూరంగా ఉండే వాటిని చూడటానికి అనువుగానే నా నిర్మాణం ఉంటుంది. అయితే, ఇప్పుడు ఆనంద్ నన్ను చాలా కష్టపెడుతున్నాడు. చదవడం, టీవీ చూడటం వంటి పనులతో బలవంతంగా క్లోజప్‌లో చూసేలా చేస్తున్నాడు. ఆనంద్ ఒక్కడనే కాదు గానీ, ఈ కాలంలో మనుషులందరూ ఇదే పని చేస్తున్నారు. ఇదీ నా నిర్మాణం నా ముందు గదిలో ఒక కిటికీ ఉంటుంది. ప్రస్ఫుటంగా కనిపించే దానిని ‘కార్నియా’ అంటారు. నల్లగుడ్డు అని కూడా అంటారు. చూసే ప్రక్రియ ఇక్కడి నుంచే మొదలవుతుంది. కాంతి కిరణాలను ఇది ఒక క్రమపద్ధతిలో నాలోకి వంచుతుంది. దీని తర్వాత ‘ప్యూపిల్’ అనే భాగం ఉంటుంది. అది కాంతికిరణాల ప్రవేశద్వారం. కాంతికిరణాలు ఎక్కువగా ఉంటే, అవన్నీ ఒకేసారి లోపలకు పోకుండా ఇది ముడుచుకుంటుంది. చీకటిగా ఉన్నప్పుడు విశాలంగా తెరుచుకుంటుంది. నాలోని అద్భుతం అంతా ప్యూపిల్ తర్వాత ఉండే లెన్స్ నుంచి మొదలవుతుంది. ఇది బాదం ఆకారంలో ఉంటుంది. అత్యంత బలమైన కండరాలు లెన్స్ అంచుల మీద కవర్ అయ్యేలా ఉంటాయి. ఇవి లెన్స్‌ను పట్టి ఉంచుతాయి. ఈ కండరాలు బిగుతుగా మారినప్పుడు నేను దగ్గరి వస్తువులను చూస్తాను. దూరపు వాటిని చూడాలంటే, ఈ కండరాలు కాస్త రిలాక్స్ అవుతాయి. చూపు ఓ విద్యుత్స్రాయనిక చర్య ఆనంద్ ఏదైనా వస్తువును చూసేటప్పుడు దాని నుంచి వచ్చే కాంతి కిరణాలు నాలోని లెన్స్ నుంచి లోపలకు ప్రవేశిస్తాయి. అవన్నీ ఉల్లిపొరలాంటి ‘రెటీనా’ అనే తెరపై పడతాయి. రెటీనా విస్తీర్ణం కేవలం మూడు చదరపు సెంటీమీటర్లే. అయినా, అందులో కాంతిని గ్రహించే 13.7 కోట్ల రిసెప్టార్ కణాలు ఉంటాయి. బ్లాక్ అండ్ వైట్ దృశ్యాలను చూసేందుకు వీలుగా రాడ్ ఆకారంలో 13 కోట్ల కణాలు, రంగులను చూసేందుకు కోన్ ఆకారంలో 70 లక్షల కణాలు ఉంటాయి. రాడ్స్లో ఉండే ఎరుపు-ఊదా రంగులో ‘రడాప్సిన్’ అనే పిగ్మెంట్ ఉంటుంది. ఈ పిగ్మెంట్‌లో జరిగే విద్యుత్స్రాయనిక చర్య వల్లే చూడటం అనే ప్రక్రియ జరుగుతుంది. రంగులను చూడటానికి ఉపయోగపడే కోన్స్‌లో ఎరుపు, ఆకుపచ్చ, నీలి రంగులను గుర్తించడానికి వేర్వేరు పిగ్మెంట్లు ఉంటాయి. ప్రాథమికమైన ఈ రంగులను ఉపయోగించి చిత్రకారులు వివిధ వర్ణాలను రాబట్టినట్లే, కోన్స్లోని ఈ పిగ్మెంట్ల సాయంతోనే వివిధ రంగులను, వాటి ఛాయలను మెదడు గుర్తిస్తుంది. ఉదాహరణకు ఆనంద్ చిమ్మచీకట్లో ఒక మిణుగురును క్షణకాలం చూశాడనుకోండి. అప్పుడు రాడ్ కణాల మీద పడ్డ కాంతి కాస్త వెలిసిపోయినట్లుగా (బ్లీచ్) అవుతుంది. ఆ సమయంలో రాడ్ కణాల్లో ఒక వోల్టులోని పది లక్షలవ వంతు విద్యుత్తు పుడుతుంది. దాని ఫలితంగా ఆ దృశ్యం ఆప్టిక్ నెర్వ్ ద్వారా మెరుపు వేగంతో మెదడుకు చేరుతుంది. ఈ విద్యుత్స్రాయన చర్యకు పట్టే సమయం 0.002 సెకండ్లే! అయితే, కోన్స్‌లో మాత్రం చీకటిలో ఈ విద్యుత్స్రాయనిక చర్య చాలా తక్కువగా జరుగుతుంది. అందుకే చీకట్లో ఆనంద్ మెదడు రంగులను గుర్తించలేదు. ఆ పనిని రాడ్స్ కణాలే చేస్తుండటంతో రంగులు ఉన్నా, అవన్నీ నలుపు తెలుపుల్లో బూడిద రంగులోనే కనిపిస్తాయి. అంతా తల వెనుకే... చూపును కలిగించే మెదడులోని దృష్టి కేంద్రం తల వెనుక భాగంలో ఉంటుంది. ఆనంద్‌కు తల వెనుక బలంగా దెబ్బ తగిలిందనుకోండి. అతడి దృష్టి కేంద్రం తీవ్రంగా గాయపడి శాశ్వతంగా చూపు కోల్పోవచ్చు. ఒక మోస్తరు దెబ్బతగిలిందనుకోండి. క్షణకాలం అతడికి చుక్కలు కనిపిస్తాయి. దెబ్బ తాకిన సమయంలో కళ్లలో జరిగే విద్యుత్ ప్రక్రియకు విఘాతం ఏర్పడటం వల్ల అలా జరుగుతుందన్న మాట. చూసేదంతా మెదడే... చూడటానికి నేనో సాధనాన్ని మాత్రమే. నిజానికి చూసేదంతా మెదడే. ఆనంద్ నిద్రపోతున్నా కలలో అతడికి అనేక దృశ్యాలు కనిపిస్తుంటాయి. ఆ సమయంలో అతడి కళ్లు మూసుకుని ఉన్నా, చుట్టూ చిమ్మచీకటి ఆవరించి ఉన్నా అతడికి కల కనిపిస్తూనే ఉంటుంది. ఒకవేళ ఆనంద్ పుట్టుగుడ్డి అనుకోండి. అలాంటప్పుడు అతడికి కలలోనూ ఎలాంటి దృశ్యాలూ కనిపించవు. కేవలం స్పర్శ, వినికిడి, వాసనల ద్వారా కలిగిన జ్ఞానాలే కలలో వ్యక్తమవుతూ ఉంటాయి. అపారం నా కండరబలం నా కండరాల బలం అపారం. రోజుకు దాదాపు నాలుగు లక్షల సార్లు నా కండరాలు కదులుతూ ఉంటాయి. ఆనంద్ రోజుకు యాభై మైళ్లు నడిస్తే, అతడి కాళ్ల కండరాలకు ఎంతటి శ్రమ కలుగుతుందో, రోజూ నా కండరాలకు అంతే శ్రమ కలుగుతుంది. నాలోని లాక్రిమల్ గ్రంథులు స్రవించే కన్నీళ్లను చిమ్మేలా చేసుకుని క్షణకాలంలో నన్ను నేను శుభ్రం చేసుకుంటూ ఉంటాను. నా కార్నియాను తేమగా ఉంచుకుంటాను. నా కన్నీళ్లలో ఉండే ‘లైసోజైమ’ నన్ను ఇన్ఫెక్షన్లు కలిగించే సూక్ష్మజీవుల నుంచి రక్షిస్తూ ఉంటుంది. అలసట నుంచి నన్ను నేను కాపాడుకోవడానికి నిత్యం ప్రయత్నిస్తుంటాను. ఆనంద్ కనురెప్ప కొట్టినప్పుడల్లా ‘హమ్మయ్య’ అనుకుంటుంటా. ఒక్కోసారి అవతలి వైపు ఉండే నా సోదరుడు కాస్త విశ్రాంతి తీసుకుంటే, తొంభై శాతం పనిభారాన్ని నేనే తీసుకుంటా. నేను రిలాక్స్ అయ్యేటప్పుడు వాడు ఆ భారాన్ని తీసుకుంటాడనుకోండి. నాకో అద్భుతమైన గూడు... ప్రకృతి నాకో అద్భుతమైన గూడు ఏర్పాటు చేసింది. ఒక పక్క చెక్కిలి ఎముకలు, మరోపక్క నుదుటి ఎముక... వాటి మధ్య ఉండే చిన్ని తొర్రలో నేనుంటా. ఏదైనా దెబ్బ తగిలితే... మొదట వాటికే తగిలేలా నా గూడు ఉంటుంది. అప్పటికీ అగ్నికణాల్లాంటివి ఏవో దూసుకొస్తూనే ఉంటాయి. ఇలాంటి రేణువులు ఎగిసే చోట పనిచేసే వారు కళ్లజోడు ధరిస్తే మేలు. ఇక నన్ను మరింత బాధపట్టే అంశాల్లో జబ్బులు మరొకటి. కొన్నిసార్లు నాలోంచి పోయే ద్రవాల కంటే నాలోకి వచ్చే ద్రవాలు పెరిగే స్థితి ఒకటి ఉంటుంది. అలా జరిగితే నాలోని ఆప్టిక్ నర్వ్ దెబ్బతిని, చూపు తగ్గుతుంది. ఈ పరిస్థితినే గ్లకోమా అంటారు. ఈ పరిస్థితి అదేపనిగా కొనసాగితే ఆనంద్‌కు శాశ్వతంగా చూపు పోవచ్చు. ఆనంద్‌కు ఈ వయసులో వచ్చే అవకాశం ఉన్న జబ్బు ఇదే. దీనికోసం ఆనంద్ ఏటా తప్పనిసరిగా డాక్టర్‌తో పరీక్ష చేయించుకోవాలి. టోనోమీటర్ అనే పరికరాన్ని ఉపయోగించి డాక్టర్ గ్లకోమా ఉన్నది లేనిదీ నిర్ధారిస్తారు. ఇక ఈ వయసులో ఆనంద్‌కు ఆస్టిగ్మాటిజమ్ అనే జబ్బు వచ్చే అవకాశాలూ ఉన్నాయి. అద్దం మీద నీటి బుడగ ఉన్నప్పుడు దాంట్లోంచి చూస్తే ఎలా మసగ్గా కనిపిస్తుందో, ఆస్టిగ్మాటిజమ్ వచ్చినప్పుడు అలాగే కనిపిస్తుంది. ఇక రెటీనా ఊడిపోవడం అనేది మరో సీరియస్ సమస్య. విపరీతమైన కాంతిని వెదజల్లే మెరుపును చూసినప్పుడు ఇలా జరగవచ్చు. ఇదే జరిగితే ఊడిన రెటీనాను యథాస్థానంలో అతికించడానికి శస్త్రచికిత్స చేయక తప్పదు. ఎనభై శాతం కేసుల్లో శస్త్రచికిత్సలు విజయవంతమవుతాయి. నాలోని కార్నియా, లెన్స్... ఈ రెండూ పారదర్శకంగా ఉంటాయి. వాటిలో తలెత్తే లోపాల వల్ల వచ్చే అంధత్వాన్ని కార్నియా మార్పిడి శస్త్రచికిత్స ద్వారా దూరం చేయవచ్చు. లెన్స్‌లో పారదర్శకత తగ్గితే కాటరాక్ట్ ఆపరేషన్‌తో సరిచేయవచ్చు. అదృష్టవశాత్తూ... ఇలాంటి చాలా సమస్యలను ఆనంద్ ఇప్పటి వరకూ అధిగమించాడు. కానీ వయసు పెరుగుతున్న కొద్దీ అతడి ఇతర కండరాల్లాగే కంటి కండరాలూ బలహీనమవుతాయి. రెటీనాకు రక్తసరఫరా చేసే రక్తనాళాలూ బిరుసెక్కుతాయి. రెటీనాకు మునపటిలా రక్తసరఫరా జరగకపోవచ్చు. ఇలా జరుగుతందేమోనని ఆనంద్ భయపడాల్సిందేమీ లేదు. నాపై కాస్త దృష్టి పెడితే చాలు. ఆనంద్‌కు జీవితాంతం దృష్టి మెరుగ్గా ఉంటుంది. చూపు కలకాలం పదిలంగా ఉండాలంటే బీటా కెరోటిన్ ఎక్కువగా ఉండే క్యారట్, విటమిన్ ‘ఏ’ ఉండే గుడ్లు, పాలు వంటి పోషకాహారాలు తీసుకోవాలి. -
లయన్ క్లబ్లో ఉచిత కంటిపరిక్షలు
-
కంటికి జిమ్
ఒంటికి జిమ్ లాగే కంటికీ జిమ్ ఉంటుంది. కానీ, కంటికి చేయవలసిన వ్యాయామాలు కొన్ని వ్యాధులు ఉన్నప్పుడు వాటి చికిత్సకోసం ఉపయోగపడుతాయి. ఒంటికి చేసే వ్యాయామం ప్రాధాన్యం మనకు తెలియనిది కాదు. ఆయా అవయవాలకోసం చేసే ప్రత్యేక వ్యాయామాలు వాటి బలాన్ని, సామర్థ్యాన్ని పెంచేందుకు అవి ఉపకరిస్తాయి. అలాగే కంటికి చేసే ఈ వ్యాయామాల వల్ల రెండు కళ్లూ ఒకేలా చూసే క్రమంలో (బైనాక్యులార్ విజన్‌లో) ఏవైనా లోపాలు వచ్చినప్పుడు వాటిని సరిదిద్దవచ్చు. వీటిని ఎలా చేయాలో కంటి వైద్య నిపుణులు సూచిస్తుంటారు. కంటి కోసం వ్యాయామాలు చేయాల్సిన అవసరం ఎప్పుడొస్తుంది, వాటిని సందర్భాల్లో సూచిస్తారు అన్న విషయాలు తెలుసుకుందాం. దృష్టిని మెరుగుపరిచేందుకు ఆఫ్తాల్మాలజిస్టులు కంటి వ్యాయామాలు చేయించడం 1928లో మొదలైంది. దీన్ని ఒక ప్రత్యేక విభాగంగానూ అభివృద్ధి చేశారు. కంటికి చేయించే వ్యాయామాల విభాగాన్ని వైద్య పరిభాషలో ‘ఆర్థాప్టిక్స్’ అంటారు. ఈ విభాగాన్ని తొలిసారి బ్రిటన్ గుర్తించింది. కంటి వ్యాయామాలకు ఇంతటి సుదీర్ఘ చరిత్ర ఉన్నా నిజానికి సాధారణ ప్రజల్లో దీని గురించిన అవగాహన పరిమితమే. ఎలాంటి సందర్భాల్లో కంటి వ్యాయామాలు అవసరం? కంటికి సంబంధించి మూడు రకాలుగా ఉపయోగపడేలా కంటి వ్యాయామాలు చేయవచ్చు. చికిత్సలో భాగంగా వీటిని చేయించడం ద్వారా నిపుణులు దృష్టిని మెరుగుపరచగలరు. అవి... 1) తప్పక ఉపయోగపడతాయని నిరూపితమైనవి : మెల్లకన్ను లేదా స్ట్రాబిస్మస్ : రెండు కళ్ల చెందిన నల్లగుడ్లు ఒకేలా లేని (విజువల్ యాక్సిస్ పారలల్‌గా లేని) సందర్భాన్ని మెల్లకన్ను లేదా స్ట్రాబిస్మస్ అంటారు. సాధారణ వ్యక్తులందరిలోనూ రెండు కళ్లతోనూ ఒకే దృశ్యాన్న చూస్తుంటారు. దీన్ని బైనాక్యులార్ సింగిల్ విజన్ అంటారు. కానీ మెల్లకన్ను వ్యాధి ఉన్నవారిలో రెండు కనుగుడ్లూ ఒకేచోట కేంద్రీకృతం కావు. కనుగుడ్డు తిరిగి ఉన్న పొజిషన్ ఆధారంగా దీన్ని నాలుగు రకాలుగా విభజిస్తారు. అవి... ఎ) ఎగ్సోట్రోఫియా (కనుగుడ్డు బయటివైపునకు తిరిగి ఉండటం) బి) ఈసోట్రోఫియా (కనుగుడ్డు లోపలి వైపునకు తిరిగి ఉండటం) సి) హైపర్ట్రోఫియా (పై వైపునకు తిరిగి ఉండటం) డి) హైపోట్రోఫియా (కిందివైపునకు తిరిగి ఉండటం) సరిచేసే వ్యాయామాలు : మెల్లకన్నులోని పై నాలుగు లోపాలను సరిచేయడానికి రకరకాల వ్యాయామాలు ఉన్నాయి. అందులో కొన్ని ఇవి... 1) పెన్సిల్ పుష్అప్స్ (ఇందులో ఒక పెన్సిల్‌ను ముక్కుకు సూటిగా పెట్టుకొని దగ్గరగా, దూరంగా జరుపుతుంటారు) 2) బ్రోక్ స్ట్రింగ్ (ఫ్రెడ్రిక్ బ్రోక్ అనే నిపుణుడు రూపొందించిన ఈ వ్యాయామ రీతికి ఆయన పేరునే పెట్టారు. ఇందులో ఒక పది అడుగుల పురికొసపైన దారానికి మూడు పూసలు ఎక్కించి, ఆ పూసల స్థానాలను మారుస్తూ వాటిని కంటితో చూసేలా వ్యాయామం చేయిస్తారు). 3) బ్యారెల్ కార్డ్స్ ఎక్సర్సైజ్ (పేకముక్కల వంటి వాటిపై వేర్వేరు రంగులను అద్ది, ఒక్కోముక్కపైనా కాసేపు దృష్టిసారిస్తూ, మరో ముక్కవైపునకు దృష్టి మళ్లిస్తూ చేసే ఒక రకం వ్యాయామం ఇది). ఇవీగాక ప్రత్యేకమైన వైద్యపరమైన పరికరాలతోనూ వ్యాయామాలు చేయిస్తారు. ఆంబ్లోపియా (లేజీ ఐ): ఇందులో చూడటానికి రెండు కళ్లూ బాగానే కనిపించినా ఒక కంటి నుంచి మెదడుకు అందే దృశ్యంలో స్పష్టత తగ్గుతూ ఉండటం వల.్ల... మెదడు నాణ్యమైన దృశ్యం అందే కంటి నుంచే దృష్టి సంకేతాలను స్వీకరిస్తుంటుంది. అంతగా నాణ్యత లేని కంటి నుంచి సంకేతాలను నిరాకరిస్తూ ఉండటం వల్ల క్రమంగా ఒక కంటి చూపు తగ్గుతూ పోతుంది. ఈ ప్రక్రియను సప్రెషన్ అంటారు. కాలక్రమంలో ఆ కన్ను చూపును కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ కండిషన్‌ను సరిచేయడానికి వ్యాయామాలు ఉంటాయి. దీనికి అక్లూజన్ అనే వ్యాయామం చేయిస్తారు. ఇందులో బాగా కనపడే కంటిని పాక్షికంగానో లేదా పూర్తిగా మూసి, సరిగా కనిపించని కంటి ద్వారా మంచి నాణ్యమైన సంకేతాలు మెదడుకు అందేలా క్రమంగా అలవాటు చేస్తారు. దాంతో నాణ్యమైన సంకేతాలు పంపడం మానేసిన ‘లేజీ ఐ’ కూడా క్రమంగా బలపడుతూ పోతుంది. 2) దృష్టిని మెరుగుపరచడానికి పరోక్షంగా ఉపయోగపడేవి మామూలుగా మనం చేసే వ్యాయామ కార్యకలాపాలు మన పూర్తి ఆరోగ్యానికి మేలు చేసినట్లే, మన కళ్లకూ బలాన్ని చేకూర్చి, అనేక కంటి వ్యాధులను నివారిస్తాయి. మనం చేసే వ్యాయామాలు మన రక్తంలోని కొలెస్ట్రాల్ పాళ్లను అదుపులో పెడతాయి. వ్యాయామంతో అన్ని అవయవాలకు రక్తసరఫరా పెరిగినట్లే, కళ్లకూ రక్తసరఫరా పెరిగి ఎక్కువ మోతాదులో ఆక్సిజన్, పోషకాలు అందుతాయి. దాంతో కళ్లు, కంటి కండరాలు కూడా బలపడతాయి. కంటికి వచ్చే అనేక వ్యాధులు వాటంతట అవే నివారితమవుతాయి. అవి... క్యాటరాక్ట్ (కళ్లలో తెల్ల ముత్యం), ఏఆర్‌ఎమ్‌డీ (ఏజ్ రిలేటెడ్ మాక్యులార్ డీజనరేషన్), డయాబెటిక్ రెటినోపతి, హైపర్టెన్సివ్ రెటినోపతి, గ్లకోమా వంటివి. 3) కంటి ఆరోగ్యానికి తాత్కాలికంగా మాత్రమే ఉపయోగపడేవి ఇవి కంటిపై ఉన్న భారాన్ని తాత్కాలికంగా తొలగించి, కొద్దిపాటి ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయి. అప్పటికప్పుడు కనిపించే ప్రయోజనమే తప్ప దీర్ఘకాలిక లాభం ఉండని వ్యాయామరీతులుగా వీటిని చెప్పవచ్చు. అవి... ♦ కనుగుడ్డును కదిలిస్తూ ఉండటం; ♦ రెండుకళ్లనూ అరచేతులతో మూసుకొని కళ్లకు తాత్కాలిక విశ్రాంతి ఇచ్చి, కొంతసేపు ఉపశమనం కలిగించడం (దీన్ని పామింగ్ అంటారు); ♦ బ్లింకింగ్ (రెండు రెప్పలనూ ఠక్కున కొడుతూ ఉండటం, ఈ ప్రక్రియలో కారు అద్దాలపై నీరు చిమ్మి వైపర్స్‌తో శుభ్రం చేసినట్లుగానే, కంటిలోని నీటి (లాక్రిమల్ సెక్రిషన్స్) సహాయం వల్ల బ్లింకింగ్ చేసినప్పుడల్లా కన్ను శుభ్రమవుతుంది. ♦ యానింగ్ (ఆవలించడం - మనం ఆవలించినప్పుడు ఒక్కోసారి కంటిలో కొద్దిగా నీళ్లు రావడం అందరికీ అనుభవంలోకి వచ్చే విషయమే. ఈ కన్నీరు (లాక్రిమల్ సెక్రిషన్) కంటిలోని పొడిదనాన్ని తొలగించి, కన్నును తేమగా ఉండేలా చేస్తుంది. ప్రమాదకరం... ఎప్పుడూ చేయకూడని పని సన్నింగ్ కొందరు వ్యాయామంలో భాగంగా ‘సన్నింగ్’ అనే ప్రక్రియను చేస్తుండేవారు. ఇది తమకు మేలు చేసే అంశంగా భావించేవారు. ఈ తరహా భావన 1920 ల నుంచి 1960ల వరకు రాజ్యమేలుతూ ఉండేది. సన్నింగ్లో భాగంగా పట్టపగలు సూర్యుణ్ణి తదేకంగా కాసేపు చూస్తుండేవారు. ప్రాతఃకాలం, సాయం సందెవేళ మినహాయించి మిగతా ఏ సమయంలోనూ ఎలాంటి రక్షణ ఉపకరణాలు లేకుండా సూర్యుణ్ణి తదేకంగా చూడటం కంటికి తీవ్రంగా హానిజరుగుతుందనే విషయాలను గుర్తుంచుకోండి. దీన్నే ‘రెటినల్స్ బర్న్స్’ అంటారు. ఇక కంటి చూపును అద్దాలతో మాత్రమే సరిదిద్దగలిగే రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అయిన మయోపియా, హైపరోపియా, ఆస్టిగ్మాటిజమ్ వంటి లోపాలను వ్యాయామాలతో సరిదిద్దలేం. వీటికి ఎలాంటి కంటి వ్యాయామాలూ (ఆక్యులార్ ఎక్సర్‌సెజైస్) ఉండవు. వీటిని సరిచేయడానికి కేవలం అద్దాలనే వాడాలి. డాక్టర్ కె. రవికుమార్‌రెడ్డి కంటి వైద్య నిపుణులు, మెడివిజన్ ఐ హాస్పిటల్, హైదరాబాద్ -
మహిళ కంటిలో కీటకం
- శస్త్ర చికిత్స ద్వారా బయటకు తీసిన వైద్యులు - ఏడాదిగా కంటిలోనే 9 సెం.మీ. వరకు పెరిగిన వైనం సాక్షి, ముంబై: ఓ మహిళ కంటి నుంచి తొమ్మిది సెంటీమీటర్ల పొడవున్న కీటకాన్ని (వానపాము ఆకారంలో) వైద్యులు ఆపరేషన్ ద్వారా బయటకు తీశారు. ఏడాది కాలంగా మహిళ కంటిలోనే ఉన్న కీటకం అప్పటి నుంచి తొమ్మిది సెంటీమీటర్ల పొడవు పెరిగినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం గర్భవతి అయిన సంబంధిత మహిళకు ఎలాంటి హాని జరగకుండా వైద్యులు చికిత్స చేశారు. దక్షిణాఫ్రికాలో అరుదుగా కనిపించే ఈ కీటకాలు మన దేశంలో ఇప్పటి వరకు మూడు లేదా నాలుగు సార్లు మాత్రమే కనిపించినట్లు సమాచారం. కాగా ఆమె పేరు, ఫొటో ప్రచురించడానికి బంధువులు నిరాకరించడంతో చికిత్స చేసిన వైద్యులు వివరాలు వెల్లడించారు. ఏడాది కిందట ఆమె కంటిలో ఏదో కదులుతున్నట్లు అనిపించడంతో కంటి డాక్టర్‌కు చూపించగా ఏమి లేదని చెప్పాడు. అయితే అలాగే జరుగుతుండటంతో ముంబైలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లి చూపించారు. అయితే కంటిలో ఏదో కదులుతున్నట్లు వైద్యులు గుర్తించినప్పటికీ కచ్చితంగా అది ఏంటో నిర్ధారించలేకపోయారు. తరువాత మాటుంగా గాంధీ నర్సింగ్ హోంలోని సర్జన్ డాక్టర్ దీపక్ గాంధీని బాధితురాలు సంప్రదించింది. సోనోగ్రఫ్రీ చేయగా కుడి కంటిలో తొమ్మిది సెంటీమీటర్ల పొడవైన కీటకం ఉన్నట్లు ఆయన గుర్తించారు. వెంటనే ఆపరేషన్ చేసి దాన్ని బయటకు తీశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని గాంధీ చెప్పారు. కీటకాన్ని ప్రయోగశాలకు పంపామని, అక్కడి నుంచి నివేదిక వస్తే పూర్తి వివరాలు బయటపడతాయని ఆయన అన్నారు. -
రంజుగా మారుతున్న రాజ్యసభ ఎన్నికలు
-
కన్ను అదిరితే కంగారేల?
నమ్మకం ఆడవాళ్లకి కుడికన్ను అదిరితే కీడు సంభవిస్తుందని, మగవారికి ఎడమకన్ను అదిరితే కష్టాలు తప్పవని విశ్లేషిస్తుంటారు జ్యోతిషవేత్తలు. ఈ నమ్మకం తాము సృష్టించింది కాదని, రామాయణ కాలంలోనే ఇది ప్రాచుర్యంలో ఉందని చెబుతారు వారు. రావణుడు సీతమ్మవారిని ఎత్తుకెళ్లేందుకు పయనమవగానే... సీతాదేవికి కుడికన్ను, లక్ష్మణుడికి ఎడమకన్ను అదిరాయట. ఆ తరువాత రావణుడు రామపత్నిని అపహరించాడు. అప్పట్నుంచీ కుడికన్ను అదిరితే స్త్రీకి, ఎడమకన్ను అదిరితే పురుషుడికి ప్రమాదాలు సంభవిస్తాయనే నమ్మకం ఏర్పడింది అంటారు. రామదండు లంక మీద దాడి చేయబోయే ముందు రావణుడికి, మండోదరికి కూడా కన్ను అదరిందట. హవాయిలో ఎడమకన్ను కొట్టుకుంటే ఓ అపరిచితుడు జీవితంలోకి వస్తాడని, కుడి కన్ను అదిరితే... తమ ఇంట్లో కానీ, బంధువుల ఇళ్లలోగానీ పసిబిడ్డ జన్మిస్తుందని విశ్వసిస్తారు. ఆఫ్రికాలో కన్ను పై రెప్ప కొట్టుకుంటే బంధువుల రాక అని, కిందిరెప్ప కొట్టుకుంటే కన్నీళ్ల కుండపోత తప్పదని అంటారు. నైజీరియాలో ఏ కన్ను కొట్టుకున్నా చెడే జరుగుతుందంటారు. ఇక చైనా వారికి కుడికన్ను అదిరితే మంచి, ఎడమకన్ను అదిరితే కీడు. అంతేకాదు... అదిరే సమయాన్ని బట్టి వారు ఫలితాన్ని అంచనా వేస్తుంటారు. అదెలాగంటే... ఉదయం 11 నుంచి 1 గంట మధ్య అదిరితే ఓ గొప్ప వ్యక్తిని కలుస్తారట. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల మధ్య అయితే కష్టాలు వస్తాయట. 3 నుంచి 5 మధ్య అయితే విదేశాల నుంచి అతిథులు వస్తారట. ఇలా చాలా లెక్కలున్నాయి వారికి! అయితే నిద్ర సరిపోకపోయినా, కళ్లు ఎక్కువగా అలసిపోయినా, నరాల బలహీనత, విటమిన్ల లోపం, కొన్ని రకాల కంటి సంబంధిత రోగాల వల్ల కూడా కన్ను అదరడం జరుగుతుందని చెబుతున్నారు వైద్యులు. వాళ్లు చెప్పేది వాస్తవమే కావచ్చు. కానీ నమ్మకాల మాటేమిటి! -
కంటీలో గంట
-
ముక్కుతో పీల్చుకుని, కంటితో పెయింటింగ్