ఐలాష్ కర్లర్ ఎలక్ట్రిక్ డివైస్
విల్లులా.. ఒంపులు తిరిగిన కనుబొమ్మలు, నిండైన కనురెప్పలే కళ్లకు అందం. కనురెప్పలు పెద్దగా అందంగా ఉంటే ముఖం కళగా కనిపిస్తుంది. అందుకే చాలామంది కనురెప్పలకు త్రీడీ ఐలాష్‌లను అతికించుకుంటారు. అయితే చిత్రంలోని ఈ ఎలక్ట్రిక్ డివైస్ ఇంట్లో ఉంటే, ప్రత్యేకంగా ఐలాష్‌లు కొని అతికించుకోవాల్సిన అవసరం లేదు. దీంతో సహజంగా ఉన్న కనురెప్పలనే మరింత అందంగా తీర్చిదిద్దుకోవచ్చు.
ఈ ఎలక్ట్రిక్ ఐలాష్ కర్లర్ మెషిన్ చార్జింగ్‌తో నడుస్తుంది. దీన్ని ముందే ఆన్ చేసి, హీట్ చేయాలి. అనంతరం కనురెప్పలకు అమర్చి ఉంచితే, అదే ఆ వెంట్రుకలను స్టైటెనింగ్ చేసి, కర్లింగ్ చేస్తుంది. దీంతో కనురెప్పలపై వెంట్రుకలు ఒంపులు తిరిగి పొడవుగా, అందంగా కనిపిస్తాయి. ఈ మెషిన్‌ను 10 సెకన్లలో ప్రీ హీట్ చేసుకోవచ్చు. దీనిలో రెండు రకాల మోడ్స్ ఉంటాయి. సెన్సింగ్ సిలికాన్ ప్యాడ్‌తో రూపొందిన ఈ డివైస్ చర్మానికి, కళ్లకు పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. వేడి ఎక్కువ కావడం, చర్మం కాలడంలాంటి సమస్యలు ఉండవు.
దీనిలోని ఒక మోడ్ 65 డిగ్రీల ఫారెన్ హీట్ నుంచి 149 డిగ్రీల ఫారెన్ హీట్ వరకూ గ్రీన్ కలర్ లైట్‌ను చూపిస్తూ పని చేస్తుంది. అలాగే మరో మోడ్ 85 డిగ్రీల ఫారెన్ హీట్ నుంచి 185 డిగ్రీల ఫారెన్ హీట్‌తో బ్లూ కలర్ లైట్‌ను చూపిస్తూ పని చేస్తుంది. ఈ సెకండ్ మోడ్ ఆప్షన్ బిరుసైన వెంట్రుకలకు అనుకూలంగా ఉంటుంది. మోడ్‌లను మార్చడానికి డివైస్ పైభాగంలో సింగిల్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇనొవేటివ్ హీటింగ్ ఫంక్షన్ తో కూడిన ఈ ఎర్గోనామిక్ డిజైన్.. వినియోగానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అలాగే ఇది పోర్టబుల్, కాంపాక్ట్ కూడా. ఎక్కడికైనా సులభంగా తీసుకువెళ్లవచ్చు. ఇది మీ బ్యూటీ కిట్, కాస్మెటిక్ బాక్స్ లేదా ట్రావెల్ కేస్‌లో సులభంగా అమరిపోతుంది. ఈ డివైస్‌తో కనురెప్పలను కర్ల్ చేసుకుని, అనంతరం మస్కారా, ఐలైనర్ వంటివి వేసుకుంటే సరిపోతుంది.
ఇవి చదవండి: Health: ఎటువంటి మందులు వాడకుండానే ఇలా జరిగింది.. అసలు కారణాలేంటి?
Comments
Please login to add a commentAdd a comment