స్కిన్ కేర్‌లో డీప్ క్లీనింగ్ అనేది బెస్ట్ ప్రాసెస్ అంటారు నిపుణులు. వేసుకున్న మేకప్ పూర్తిగా చర్మాన్ని వదలకపోయినా, ప్రయాణాల్లో దుమ్మూధూళి నుంచి ముఖాన్ని సంరక్షించుకోవాలన్నా డీప్ క్లీనింగ్ అవసరం. అందుకు ఈ ఫేషియల్ స్టీమర్ సహకరిస్తుంది. 360 డిగ్రీలలో తిరిగే రొటేటబుల్ స్ప్రేయర్ నాజిల్‌తో కూడిన వార్మ్ మిస్ట్ ఫేస్ స్టీమర్ ముఖానికి పట్టిన మురికిని, జిడ్డును ఇట్టే పోగొడుతుంది. చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. ఈ స్టీమర్ నుంచి విడుదలయ్యే ఆవిరి చర్మపు లోలోపలి పొరల్లోకి చొచ్చుకుపోయి, క్లీన్ చేస్తుంది.
ముందుగా ముఖాన్ని చల్లటి నీళ్లతో కడిగి, మెత్తటి క్లాత్‌తో తుడిచి, ఆపైన అరోమాథెరపీ కాటన్ ప్యాడ్‌పైన ఆయిల్ చుక్కలు వేసుకుని, ముఖానికి అప్లై చేసుకోవాలి. అనంతరం ఈ స్టీమర్‌తో ఆవిరి పట్టుకుంటే, ఇంట్లోనే స్పా చేయించుకున్న ఫీలింగ్ కలుగుతుంది. దీని వల్ల మృతకణాలు తొలగిపోతాయి. ముడతలు, మచ్చలు, పిగ్మెంటేషన్ వంటి సమస్యలు నెమ్మదిగా ఒక్కొక్కటిగా తగ్గిపోతాయి. ఈ స్టీమర్‌ని క్రమం తప్పకుండా వినియోగిస్తే, యవ్వనకాంతితో కళకళలాడవచ్చు. వారానికి 2–3 సార్లు, ఒక సెషన్‌కు 10 నిమిషాల చొప్పున ఫేషియల్ స్టీమర్‌ని ఉపయోగించడం మంచిది. కాలిన గాయాలను నివారించడానికి కూడా ఫేస్ స్టీమర్‌ని వాడుకోవచ్చు.
ఇందులో నీళ్లు నింపుకుని, బటన్ ఆన్ చేసుకుని ఆవిరి విడుదల అయ్యే రాడ్‌ని మనకు అనుకూలంగా అమర్చుకుంటే సరిపోతుంది. అవసరాన్ని బట్టి దాని పొడవు పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. అనువైన విధంగా సెట్ చేసుకోవచ్చు. దాంతో ఆవిరి పట్టుకునేటప్పుడు, మన వీలుని బట్టి కూర్చుని లేదా పడుకుని కూడా డీప్ క్లీనింగ్ చేసుకోవచ్చు. దీన్ని ఎక్కడికైనా సులభంగా తీసుకుని వెళ్లొచ్చు. దీని ధర 27 డాలర్లు. అంటే 2,266 రూపాయలు. ఈ స్టీమర్స్ చాలా కలర్స్‌లో అందుబాటులో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment