Steamer
-
ఇది ఫేస్ డీప్ క్లీనింగ్ డివైస్..! ప్రయాణాల్లో..
స్కిన్ కేర్‌లో డీప్ క్లీనింగ్ అనేది బెస్ట్ ప్రాసెస్ అంటారు నిపుణులు. వేసుకున్న మేకప్ పూర్తిగా చర్మాన్ని వదలకపోయినా, ప్రయాణాల్లో దుమ్మూధూళి నుంచి ముఖాన్ని సంరక్షించుకోవాలన్నా డీప్ క్లీనింగ్ అవసరం. అందుకు ఈ ఫేషియల్ స్టీమర్ సహకరిస్తుంది. 360 డిగ్రీలలో తిరిగే రొటేటబుల్ స్ప్రేయర్ నాజిల్‌తో కూడిన వార్మ్ మిస్ట్ ఫేస్ స్టీమర్ ముఖానికి పట్టిన మురికిని, జిడ్డును ఇట్టే పోగొడుతుంది. చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. ఈ స్టీమర్ నుంచి విడుదలయ్యే ఆవిరి చర్మపు లోలోపలి పొరల్లోకి చొచ్చుకుపోయి, క్లీన్ చేస్తుంది.ముందుగా ముఖాన్ని చల్లటి నీళ్లతో కడిగి, మెత్తటి క్లాత్‌తో తుడిచి, ఆపైన అరోమాథెరపీ కాటన్ ప్యాడ్‌పైన ఆయిల్ చుక్కలు వేసుకుని, ముఖానికి అప్లై చేసుకోవాలి. అనంతరం ఈ స్టీమర్‌తో ఆవిరి పట్టుకుంటే, ఇంట్లోనే స్పా చేయించుకున్న ఫీలింగ్ కలుగుతుంది. దీని వల్ల మృతకణాలు తొలగిపోతాయి. ముడతలు, మచ్చలు, పిగ్మెంటేషన్ వంటి సమస్యలు నెమ్మదిగా ఒక్కొక్కటిగా తగ్గిపోతాయి. ఈ స్టీమర్‌ని క్రమం తప్పకుండా వినియోగిస్తే, యవ్వనకాంతితో కళకళలాడవచ్చు. వారానికి 2–3 సార్లు, ఒక సెషన్‌కు 10 నిమిషాల చొప్పున ఫేషియల్ స్టీమర్‌ని ఉపయోగించడం మంచిది. కాలిన గాయాలను నివారించడానికి కూడా ఫేస్ స్టీమర్‌ని వాడుకోవచ్చు.ఇందులో నీళ్లు నింపుకుని, బటన్ ఆన్ చేసుకుని ఆవిరి విడుదల అయ్యే రాడ్‌ని మనకు అనుకూలంగా అమర్చుకుంటే సరిపోతుంది. అవసరాన్ని బట్టి దాని పొడవు పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. అనువైన విధంగా సెట్ చేసుకోవచ్చు. దాంతో ఆవిరి పట్టుకునేటప్పుడు, మన వీలుని బట్టి కూర్చుని లేదా పడుకుని కూడా డీప్ క్లీనింగ్ చేసుకోవచ్చు. దీన్ని ఎక్కడికైనా సులభంగా తీసుకుని వెళ్లొచ్చు. దీని ధర 27 డాలర్లు. అంటే 2,266 రూపాయలు. ఈ స్టీమర్స్ చాలా కలర్స్‌లో అందుబాటులో ఉన్నాయి. -
ఈ స్టీమర్ కుకింగ్ ఎలక్ట్రికల్ పాట్.. గురించి విన్నారా..!
1.5 లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ మల్టీఫంక్షనల్ ఎలక్ట్రిక్ కుకర్.. వేపుళ్లకు, ఉడకబెట్టడానికి అనుకూలంగా ఉంటుంది. దీనికి ఆటోమేటిక్ ఆఫ్ ఆప్షన్ ఉండటంతో.. దీన్ని వినియోగించడం చాలా ఈజీ. టెంపరేచర్ సెట్ చేసుకోవడానికి ఇందులో 2 మోడ్స్ ఉంటాయి. మూవ్ చేయడానికి.. సర్వ్ చేయడానికి సులభంగా ఉంటుంది. నాన్ స్టిక్ ఇన్నర్ వాల్ కలిగిన ఈ కుకర్‌లో ఒకేసారి రెండు ఐటమ్స్‌ను వండుకోవచ్చు. కొన్నిసార్లు ఒకేదాంట్లోనూ వండుకోవచ్చు. అందుకు అదనంగా ఒక స్టీమింగ్ బౌల్ లభిస్తుంది. దీంట్లోనూ చాలా రకాల ఆహారపదార్థాలను ఆవిరిపై ఉడికించుకోవచ్చు. దీనికీ డివైస్ మూత సరిగ్గా సరిపోతుంది. బేస్ బౌల్ మీదే ఈ స్టీమర్ బౌల్ తేలికగా అమరిపోతుంది. దాంతో ఇందులో ఒకేసారి రెండు వెరైటీలను కుక్ చేసుకోవచ్చు. ఈ మోడల్లో చాలా కలర్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ స్టీమర్ బౌల్ ధర 24 డాలర్లు (రూ.1,989). ఇవి చదవండి: ఈ మినీ ఎలక్ట్రిక్ మేకర్ వెరైటీల గురించి మీకు తెలుసా..! -
పాన్ కేక్స్ నుంచి చికెన్ వరకు.. నిమిషాల్లో కుక్ అవుతాయ్
సౌకర్యవంతమైన మల్టీ కుక్వేర్ల సరసన చేరింది ఈ హార్డ్–బాయిల్డ్ స్టీమర్. ఇందులో వండివార్చుకోవడం భలే తేలిక. ఈ మెషిన్ లో గుడ్లు, జొన్నకండెలు, దుంపలు, కుడుములు వంటివన్నీ ఆవిరిపై ఉడికించుకోవచ్చు. ఆమ్లెట్స్, పాన్ కేక్స్ వంటివీ వేసుకోవచ్చు. అలాగే చికెన్ వింగ్స్, చిల్లీ చికెన్, గ్రిల్డ్ ఫిష్, క్రిస్పీ ప్రాన్స్ ఇలా చాలానే చేసుకోవచ్చు. కేక్స్, కట్లెట్స్ వంటివాటికీ పర్ఫెక్ట్ ఈ కుక్వేర్. దీని అడుగున, స్టీమింగ్ బౌల్‌లోనూ వాటర్ పోసుకుని.. ఎగ్ ట్రే మీద ఆహారాన్ని లేదా గుడ్లను పెట్టుకుని ఉడికించుకోవాల్సి ఉంటుంది. స్టెయిన్ లెస్ స్టీల్‌తో రూపొందిన ఈ మేకర్ని.. అడుగున నీళ్లు పోసుకుంటే స్టీమర్‌గా వాడుకోవచ్చు. నూనె వేసుకుంటే గ్రిల్‌గానూ మార్చుకోవచ్చు. వేగంగా, మంచిగా కుక్ అవ్వడానికి వీలుగా పెద్ద బౌల్ లాంటి మూత ఉంటుంది. దాంతో హోల్ చికెన్ వంటివీ కుక్ అవుతాయి. ఇందులో 5 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు టైమర్ స్విచ్ ఉంటుంది. కుకింగ్ పూర్తి అయిన వెంటనే ఇండికేషన్ లైట్ వెలుగుతుంది. -
Multifunction Steamer: బిర్యానీ, నూడుల్స్, బార్బెక్యూ ఐటమ్స్ చేసుకోవచ్చు.. ధర 29 వేలు!
హైక్వాలిటీ హీట్ రెసిస్టెంట్ గ్లాస్ కవర్ కలిగిన ఈ ఎలక్ట్రిక్ హీట్ పాట్.. ట్రెండీ లుక్స్‌లోనూ.. పనితనంలోనూ సూపర్బ్. ఇరువైపులా ఇన్సులేటెడ్ హ్యాండిల్స్ కలిగిన ఈ డివైజ్‌ని వినియోగించడం చాలా సులభం. 5.5 లీటర్ల సామర్థ్యమున్న ఈ పాత్రలో చాలా వంటకాలను రుచికరంగా, ఎక్కువ పరిమాణంలో తయారు చేసుకోవచ్చు. దీన్ని కుకర్‌లా, స్టీమర్‌లా, గ్రిల్‌లా అన్ని రకాలుగానూ వినియోగించొచ్చు. స్నేహితులు, బంధువులు వచ్చినప్పుడు ఇలాంటి పరికరం ఇంట్లో ఉంటే.. ఎంత పనైనా చకచకా అయిపోతుంది. 2100 వాట్స్ కలిగిన ఈ ఎలక్ట్రిక్ వోక్‌లో బిర్యానీ వంటి పలు రైస్ ఐటమ్స్‌తో పాటు.. నూడుల్స్, కర్రీస్, బార్బెక్యూ ఐటమ్స్ ఇలా అన్నీ రకాలనూ తయారుచేసుకోవచ్చు. చికెన్, మటన్ వంటివి ఇందులో.. చాలా క్రిస్పీగా గ్రిల్ అవుతాయి. దీనికి ట్రాన్స్పరెంట్ మూత కూడా ఉంటుంది. టెంపరేచర్ ఎక్కువ అవుతుంటే ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతుంది. -ధర - 392 డాలర్లు (రూ.29,323) చదవండి: పొటాటోతో ఫ్యాటీ బాడీకి చెక్ చెప్పొచ్చా? -
ఈ ఎలక్ట్రిక్ గాడ్జెట్‌కి భలే గిరాకీ! ..ఆడవాళ్లకు వెరీ స్పెషల్ అట..!
సౌందర్య పోషణలో ఆవిరిది ప్రధాన పాత్ర. వారానికి రెండు సార్లు అయినా మొహానికి ఆవిరి పట్టిస్తే.. మృతకణాలతో పాటు ట్యాన్ కూడా తొలగిపోయి.. ముఖం ప్రకాశవంతంగా మారుతుందనేది నిపుణుల మాట. అందుకే కొంతకాలంగా మార్కెట్లో ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ ఫేషియల్ స్టీమర్స్కి గిరాకీ బాగా పెరుగుతోంది. వాటికి మించిన సౌకర్యవంతమైన, సమర్థవంతమైన ఫేషియల్ స్టీమర్ ఇది. ముఖానికి చక్కగా పైనుంచి మాస్క్ తొడిగినట్లుగా తొడిగి.. బటన్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. కళ్లు, ముక్కు, నోరు ప్రతిభాగం చెక్కినట్లుగా ఫేస్ ఆకారంలోనే ఉంటుంది ఈ స్టీమర్. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా ముక్కు ఉండే భాగంలో చిన్న రంధ్రం ఉంటుంది. ఇక దీని పైభాగంలో ఉన్న చిన్నపాటి నీళ్ల ట్యాంక్‌లో నీళ్లు నింపి పెట్టుకోవాలి. పొడిబారిన చర్మం, జిడ్డు చర్మం, సాధారణ చర్మం.. ఇలా చర్మం తీరు ఏదైనా దాని తత్వానికి సరిపడా ట్రీట్ చేసి ప్రత్యేకమైన గ్లో అందిస్తుంది. వదులుగా లేదా ముడతలు పడిన చర్మాన్ని పునర్యవ్వనంగా మార్చేస్తుంది. మచ్చలు, మొటిమలు ఇట్టే పొగొడుతుంది. నానో స్ప్రే, యునిక్ హీటింగ్ టెక్నాలజీ కలిగిన ఈ స్టీమర్.. ఆన్ చేసిన ఒక్క నిమిషంలోనే ఆవిరిని అందిస్తుంది. ఇందులో స్మార్ట్ స్ప్రే మోడ్స్ ఉంటాయి. నొప్పి, ఇబ్బంది లాంటివి ఏమీ ఉండవు. సాధారణ స్టీమర్స్ అయితే వాటికి తగ్గట్టుగానే ఒకే పొజిషన్లో కూర్చుని.. ఆవిరి పట్టించుకోవాలి. కానీ దీన్ని ముఖానికి పెట్టుకుని ఎక్కడైనా కూర్చోవచ్చు, పడుకోవచ్చు. అలాగే సాధారణంగా ఆవిరి పట్టే పద్ధతిలో వేడి గాలికి సుర్రుమనేలా, చర్మం కందిపోయే సమస్య ఉండనే ఉంటుంది. కానీ ఈ ఫేషియల్ స్టీమర్ ముఖానికి అతుక్కుని, సమతుల్యమైన వేడితో సౌకర్యవంతంగా ఆవిరిని అందిస్తుంది. దీని ధర సుమారు 119 డాలర్లు. అంటే 8,865 రూపాయలు. ఇలాంటి వాటిని క్వాలిటీ, రివ్యూలను చూసి కొనుగోలు చేసుకోవడం మంచిది. చదవండి : మొట్టమొదటి టూత్ బ్రష్ ఎలా తయారుచేశారో తెలిస్తే.. యాక్!! పంది శరీరంపై...! -
హాయిగా కూర్చునే బరువు తగ్గొచ్చు..
ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ఊబకాయుల సంఖ్య పెరుగుతోంది. మరీ ముఖ్యంగా కొందరు ఆడవారికి ఇంటిపనితో పాటు ఆఫీస్ ఒత్తిడి పెరిగిపోవడం లేదా శరీరంపై శ్రద్ధ తగ్గడంతో బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పేరుకుపోతూ ఉంటుంది. వేళకు మంచి ఆహారం తీసుకోకపోవడం, శరీరానికి సరైన వ్యాయామం అందకపోవడం.. ఎక్కువ సేపు కూర్చుని పని చేయడం.. ఇలా పలు కారణాలతో.. పొట్ట, నడుము, పిరుదులు, చేతులు, తొడలు.. ఇలా చాలా భాగాల్లో కొవ్వు పేరుకుపోయి.. చూడటానికి షేప్‌లెస్‌గా మారిపోతుంటారు చాలా మంది. అతి తక్కువ సమయంలో స్లిమ్‌గా, నాజుగ్గా మారాలంటే ఈ బ్యాగ్‌లో చక్కగా ఓ కుర్చీ వేసుకుని కూర్చుంటే సరి. అదే ఈ పోర్టబుల్ పర్సనల్ స్టీమర్ ప్రత్యేకత. చిత్రంలోని మెషిన్‌తో పాటు ప్రత్యేకమైన టెంట్, ఒక చైర్(చిత్రంలో గమనించవచ్చు) లభిస్తాయి. టెంట్ ఓపెన్ చేస్తే.. గుడారంలా ఒక మనిషి పట్టేంత వైశాల్యంతో పెద్దగా ఓపెన్ అవుతుంది. అవసరం లేనప్పుడు మడిచి గుండ్రటి రింగ్‌లా చిన్న బ్యాగ్‌లో పట్టేవిధంగా మార్చేసుకోవచ్చు. (అచ్చం దోమలు రాకుండా వాడే నెట్ టెంట్ మాదిరి ఫోల్డ్ చేసుకోవచ్చు). టెంట్ వాటర్ ప్రూఫ్ కావడంతోపాటు వాటర్ లీక్ కాకుండా ప్రొటెక్టివ్‌గా ఉంటుంది. దీనికి రెండు వైపులా జిప్ ఉంటుంది. ఇక స్టీమర్లో ఉన్న వాటర్ ట్యాంక్‌లో వాటర్ పోసుకుని దాని ముందు భాగంలో ఉన్న డిస్ప్లేలో ఆప్షన్స్ సెట్ చేసుకోవచ్చు. దీన్ని రిమోట్ ద్వారా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. స్టీమర్కి, టెంట్‌కి కనెక్షన్ ఉంటుంది. లోపలికి ఆవిరి వెళ్తూ.. బాడీ మొత్తానికి స్పా అవుతుంది. దీనిలో స్పా చేసుకుంటే బరువు తగ్గడంతో పాటు.. జాయింట్ పెయిన్స్ తగ్గడం, మజిల్స్ స్టిఫ్‌గా మారడం, మానసిక ఒత్తిడి తగ్గడం.. రక్తప్రసరణ బాగా జరగడం, ఎనర్జీలెవల్స్ పెరగడం, చర్మం కాంతిమంతంగా మారడం వంటి పలు ప్రయోజనాలు ఉంటాయి. ఇక ఈ స్టీమర్‌తో పాటు అదనంగా 2 కనెక్షన్ పైప్స్, ఒక ఫస్ట్‌ఎయిడ్ బాక్స్, క్యారీ బ్యాగ్ లభిస్తాయి. దీని ధర సుమారు 90 డాలర్లు. అంటే సుమారు 6,600 రూపాయలు. -
లారీపై స్టీమర్
అర్వపల్లి (తుంగతుర్తి) : ఎప్పుడూ నీటిలో తిరిగే స్టీమర్ రోడ్డుపై కనిపిస్తే ఆశ్చర్యమే కదా.. అయితే సోమవారం అర్వపల్లిలో రోడ్డుపై ఈ దృశ్యం కనిపించింది. గుజరాత్ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం సముద్ర తీరానికి ఓ స్టీమర్‌ను లారీపై తరలిస్తున్నారు. సూర్యాపేట–జనగామ 365బీ జాతీయ రహదారిపై ఉన్న అర్వపల్లి మీదుగా ఆ లారీ వెళ్లింది. సముద్రంలో తిరిగే స్టీమర్ రోడ్డుమార్గంలో లారీపై కనిపించడంతో స్థానిక ప్రజలు, రోడ్డుపై వెళ్లే వివిధ వాహనదారులు ఆసక్తిగా తిలకించారు. -
స్టీమర్ బోల్తా..నలుగురు గల్లంతు
మహదేవ్పూర్ మండలం మెట్పల్లి వద్ద గోదావరినదిలో స్టీమర్ ప్రమాదవశాత్తూ బోల్తాపడింది. ఈ ఘటనలో నలుగురు గల్లంతైనట్లు తెలిసింది. ప్రమాదసమయంలో స్టీమర్‌పై 20 మంది ఉన్నారు. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మూలన పడిన గస్తీ స్టీమర్లు
సాక్షి, ముంబై: ఉగ్రవాదులు నగరంలో మారణహోమం సృష్టించి దాదాపు ఐదేళ్లు కావస్తున్నా ఇప్పటికీ తీర ప్రాంత భద్రతపై ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోలేదని స్పష్టమవుతోంది. తీర ప్రాంతాల వెంబడి గస్తీ నిర్వహించేందుకు ముంబై, ఠాణే పోలీసుల ఆధీనంలో ఉన్న 27 స్టీమర్లలో 18 మరమ్మతులకు లోనై ఒడ్డ్డుపై లంగరు వేసి ఉన్నాయి. పనిచేస్తున్న కొద్దిపాటి స్టీమర్లకూ తగినంత ఇంధనం సరఫరా చేయడం లేదు. దీంతో సముద్రంలో పూర్తిగా గస్తీ నిర్వహించలేకపోతున్నారు. ముఖ్యంగా ఖాళీగా ఉన్న అనేక పోస్టులు మంజూరైనప్పటికీ వాటిని భర్తీ చే యడంలేదు. దీనిపై సమాచార హక్కు చట్టం ద్వారా ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే సేకరించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి. 2008 నవంబరు 26న ఉగ్రవాదులు దాడులుచేసి దాదాపు 200 మంది అమాయకులను హతమార్చారు. ఉగ్రవాదులంతా సముద్రమార్గం మీదుగా నగరంలోకి ప్రవేశించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. దీంతో తీర ప్రాంతాల వెంబడి గస్తీ మరింత పటిష్టం చేయాలని ప్రభుత్వం అప్పట్లో నిర్ణయం తీసుకుంది. అందుకు 27 ఆధునిక స్టీమర్లు, గస్తీ పడవలు కొనుగోలు చేసింది. కాని ప్రభుత్వ ఉదాసీనతవల్ల అందులో 18 పనిచేయకుండా పోయాయి. ఇదిలాఉండగా ఈ స్టీమర్ల హాల్టు కోసం నగరంలో మడ్ ఐ ల్యాండ్, బాంద్రా, కఫ్ పరేడ్, గీత్నగర్ (ససూన్ డాక్) వద్ద సముద్రం ఒడ్డున ప్లాట్‌ఫాం(జెట్టి)లు నిర్మించాలని ప్రతిపాదించారు. మెరీటైం బోర్డు సమర్పించిన రూ.27 కోట్ల ఖర్చుతో కూడిన ఈ ప్రతిపాదన అదనపు ప్రధాన కార్యదర్శి (హోం) వద్ద 2009 నుంచి అలాగే ఉంది. కాగా దేశ ఆర్థిక రాజధానిగా వెలుగొందుతున్న ముంబై నగర తీర ప్రాంతాల వెంబడి చమురు శుద్ధి కేంద్రాలు, బీఏఆర్సీ, జేఎన్పీటీ, చమురు బావులు ఇలా అనేక కీలక సంస్థలు ఉన్నాయి. ముంబై, రాయ్‌గఢ్, ఠాణే వెంబడి 117 కి.మీ. తీరప్రాంతం ఉంది. అయితే ప్రస్తుతం ఈ తీర ప్రాంత భద్రత కేవలం తొమ్మిది స్టీమర్లపై ఆధారపడి ఉండటం శోచనీయం. రూ.కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన ఈ గస్తీ నౌకల పరిస్థితి దుర్భరంగా ఉంది. గేర్ బాక్స్ మరమ్మతులు, అయిల్, వాటర్ లీకేజీ, స్టార్టింగ్ ట్రబుల్, ఇంజిన్ ఆగిపోవడం, స్టీరింగ్ జాం తదితర అనేక సమస్యలతో ఒడ్డున పడి ఉన్న 18 నౌకల నిర్వహణ బాధ్యతలు ఏ సంస్థకూ అప్పగించకపోవడంతో మరమ్మతులకు నోచుకోవడం లేదు. స్టీమర్ల కొరతవల్ల భద్రతా సిబ్బంది పూర్తిగా గస్తీ నిర్వహించలేకపోతున్నారు. తీరప్రాంతాల భద్రతను గాలికి వదిలేయడంతో ఉగ్రవాదులు మళ్లీ నగరంలో చొరబడే అవకాశాలు లేకపోలేదు. టోల్‌నాకాల వద్ద సీసీ కెమెరాలు లేకపోవడంతో ఏదైనా అఘాయిత్యానికి పాల్పడి పారిపోతే వారి ఆనవాళ్లు గుర్తించడం కూడా కష్టతరం కానుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు తీర ప్రాంత పెట్రోలింగ్ కోసం ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటుచేస్తామని కొద్ది రోజుల కిందట ప్రకటించారు. కాని దీనిపై ఇంతవరకు ఎలాంటి కదలికలు మొదలు కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా 800 ల్యాండింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇక్కడ చిన్న నౌకలు కూడా ఆగుతాయి. ఇలాంటివి ముంబైలో దాదాపు 60 ఉన్నాయి. కాని భద్రతా సిబ్బంది కొరతవల్ల ఈ పాయింట్ల వద్ద తగినంత సిబ్బందిని నియమించలేకపోతున్నారు. ఇటీవల నిర్వహించిన మాక్ డ్రిల్‌లో కూడా ఈ అంశం స్పష్టమైంది. 2007-2010 మధ్య కాలవ్యవధిలో తీర ప్రాంతాల భద్రత కోసం మంజూరు చేసిన రూ.590 కోట్లలో కేవలం రూ.325 కోట్లే ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇదిలా వుండగా ఇంధనం కోసం తగినన్ని నిధులు ఇవ్వడం లేదు. 2009 ఏప్రిల్ నుంచి 2012 డిసెంబరు వరకు పెట్రోల్ కోసం రూ.2,57,46,476 ఖర్చయ్యాయి. అంటే రోజుకు రూ.25,592 విలువైన పెట్రోల్ మాత్రమే కేటాయించినట్లు తెలుస్తోంది. ఇదే కాలంలో డీజిల్ కోసం రూ.98,95,596 ఖర్చుకాగా రోజుకు రూ.9,836 డీజిల్ మాత్రమే అందుబాటులో ఉన్నట్లు స్పష్టమైతోంది. ఈ గణాంకాలను బట్టి సరాసరిగా ఒక్కో గస్తీ నౌకకు 17-23 లీటర్ల ఇంధనం మాత్రమే సరఫరా చేసినట్లు తెలుస్తోంది. ఇంత తక్కువ ఇంధనంతో గస్తీ ఎన్ని ట్రిప్పులు కొట్టాలనే ప్రశ్న పోలీసులను వేధిస్తోంది. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ప్రకారం గస్తీకి వెళ్లే టప్పుడు ఒక్కో నౌకలో ఒక పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ లేదా అసిస్టెంట్ ఇన్స్పెక్టర్, ఒక హెడ్ కానిస్టేబుల్, ముగ్గురు కానిస్టేబుళ్లు ఉండాలి, కాని సిబ్బంది కొరతవల్ల అవసరాన్ని బట్టి సిబ్బందిని పంపిస్తున్నారు. ఇలా అనేక సమస్యలతో తీరప్రాంతాల్లో గస్తీ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. 2008 నవంబరు సంఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే సిబ్బందితోపాటు ఒడ్డున పడి ఉన్న గస్తీ నౌకల మరమ్మతులు, ఇంధనం సరఫరా మెరుగుపరచడం వంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.