ఈ స్టీమర్‌ కుకింగ్‌ ఎలక్ట్రికల్‌ పాట్‌.. గురించి విన్నారా..! | Have You Heard About This Steamer Electrical Pot | Sakshi
Sakshi News home page

ఈ స్టీమర్‌ కుకింగ్‌ ఎలక్ట్రికల్‌ పాట్‌.. గురించి విన్నారా..!

Published Sun, Mar 3 2024 1:33 PM | Last Updated on Sun, Mar 3 2024 1:49 PM

Have You Heard About This Steamer Electrical Pot - Sakshi

1.5 లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ మల్టీఫంక్షనల్‌ ఎలక్ట్రిక్‌ కుకర్‌.. వేపుళ్లకు, ఉడకబెట్టడానికి అనుకూలంగా ఉంటుంది. దీనికి ఆటోమేటిక్‌ ఆఫ్‌ ఆప్షన్‌  ఉండటంతో.. దీన్ని వినియోగించడం చాలా ఈజీ. టెంపరేచర్‌ సెట్‌ చేసుకోవడానికి ఇందులో 2 మోడ్స్‌ ఉంటాయి. మూవ్‌ చేయడానికి.. సర్వ్‌ చేయడానికి సులభంగా ఉంటుంది. నాన్‌ స్టిక్‌ ఇన్నర్‌ వాల్‌ కలిగిన ఈ కుకర్‌లో ఒకేసారి రెండు ఐటమ్స్‌ను వండుకోవచ్చు.

కొన్నిసార్లు ఒకేదాంట్లోనూ వండుకోవచ్చు. అందుకు అదనంగా ఒక స్టీమింగ్‌ బౌల్‌ లభిస్తుంది. దీంట్లోనూ చాలా రకాల ఆహారపదార్థాలను ఆవిరిపై ఉడికించుకోవచ్చు. దీనికీ డివైస్‌ మూత సరిగ్గా సరిపోతుంది. బేస్‌ బౌల్‌ మీదే ఈ స్టీమర్‌ బౌల్‌ తేలికగా అమరిపోతుంది. దాంతో ఇందులో ఒకేసారి రెండు వెరైటీలను కుక్‌ చేసుకోవచ్చు. ఈ మోడల్‌లో చాలా కలర్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఈ స్టీమర్‌ బౌల్‌ ధర 24 డాలర్లు (రూ.1,989). 

ఇవి చదవండి: ఈ మినీ ఎలక్ట్రిక్‌ మేకర్‌ వెరైటీల గురించి మీకు తెలుసా..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement