pot
-
ఇదిగో కూజా..!
ఇదేమిటో గుర్తు పట్టారా? దాదాపు మూడు వారాల క్రితం ఇజ్రాయెల్‌లోని హెక్ట్ మ్యూజియంలో ఏరియల్ గెలర్ అనే నాలుగేళ్ల చిన్నారి పొరపాటున తాకడంతో కింద పడి ముక్కలైపోయిన 3,500 ఏళ్ల నాటి అరుదైన కూజా ఇది. పట్టి చూస్తే తప్ప పగిలిన ఆనవాళ్లు కని్పంచకుండా రిస్టొరేషన్ నిపుణుడు రో షెఫర్ సారథ్యంలోని బృందం దాన్ని అత్యంత నైపుణ్యంతో ఇలా తిరిగి అతికించింది. బుధవారం నుంచి కూజాను మ్యూజియంలో మళ్లీ ప్రదర్శనకు ఉంచారు. ఇంతటి అరుదైన కూజా పగిలిపోయినా మ్యూజియం సిబ్బంది హుందాగా స్పందించిన తీరు అందరి మనసులూ గెలుచుకుంది. బాలున్ని గానీ, అతని తల్లిదండ్రులను గానీ వాళ్లు ఏమాత్రమూ నిందించలేదు. పైగా ‘పిల్లలన్నాక ఇలా చేస్తుంటారు, మరేం పర్లే’దంటూ ఊరడించారు. జరిమానా చెల్లిస్తామన్నా అలాంటిదేమీ అక్కర్లేదన్నారు. మ్యూజియం చీఫ్ దగ్గరుండి మరీ వారికి మ్యూజియం అంతా తిప్పి చూపించారు. గిల్టీ ఫీలింగ్ నడుమ సరిగా చూశారో లేదోనని పది రోజులు పోయాక మరోసారి మ్యూజియం సందర్శనకు ఆహా్వనించారు. ఆ సందర్భంగా చిన్నారి గెలర్ ఒక మట్టి కూజా తీసుకెళ్లి బహూకరించడంతో సిబ్బంది తెగ ఆనందపడిపోయారు. బాలునితో చాలాసేపు గడపడమే గాక పగిలిన కూజాలను ఎలా అతికిస్తారో ప్రత్యక్షంగా చూపించారు. ‘‘పురాతత్వ వస్తువులను తాకి చూస్తే వాటిపై అనురక్తి కలుగుతుంది. వాటిని తాకి చూస్తే చరిత్ర, పురాతత్వ శా్రస్తాల పట్ల పిల్లల లేత మనసుల్లో గొప్ప ఆస్తకి పుట్టవచ్చు. ఎవరికి తెలుసు?! అందుకే అవి సందర్శకులకు చేతికందే సమీపంలోనే ఉండాలి తప్ప అద్దాల అరల్లో కాదన్నదే ఇప్పటికీ మా అభిప్రాయం’’ అని మ్యూజియం చీఫ్ చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్టుగానే అతికించిన కూజాను రక్షణ వలయం వంటివేవీ లేకుండా తాజాగా మళ్లీ సందర్శకులకు అందుబాటులోనే ఉంచడం విశేషం! -
భ్రుకు టీ ముడిపడే సీన్!
శివుని జటాఝూటంలోని గంగ గురించి మనకు తెలుసు. అయితే ఇరానీ మోడల్ శిరోజాలలోని ‘టీపాట్’ వీడియో ఇప్పుడు వైరల్ అయింది. హెయిర్ స్టైల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. అయితే ‘టీ పాట్ హెయిర్‌స్టైల్’ గురించి మాత్రం ఎప్పుడూ విని ఉండం. ఇరాన్‌కు చెందిన హెయిర్ స్టైలిస్ట్ సైదెహ్ ‘టీపాట్ హెయిర్‌స్టైల్’ వీడియోను చూసి నెటిజనులు ‘ఆహో వోహో’ అంటున్నారు. ఈ వీడియో నాలుగు మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. హెయిర్ పిన్స్‌తో మోడల్ సబుర్ నగర్‌కు పోనీ టెయిల్ వేసింది. ఆ తరువాత మెటల్ వైర్లు, గ్లూ గన్‌తో టీపాట్ స్ట్రక్చర్స్‌ను సెట్ చేసింది. ఈ శిరో టీపాట్‌లో టీ ΄ోసి ఆ తరువాత కప్పులోకి ఒంపి తాగింది. ‘ఫ్యాషన్ స్టైల్ అనేది ఎన్నో వెరైటీలకు కేంద్రం. హెయిర్ స్టైల్‌కు సంబంధించి సహజంగా ఉండేలా ఏదైనా చేయాలనుకున్నాను. రెండు రోజుల కృషి ఫలితమే ఈ విజయం. ఇంత స్పందన వస్తుందని ఊహించలేదు’ అని తన ఇన్స్టాగ్రామ్ ΄ోస్ట్‌లో చెప్పింది సైదేహ్. -
వేసవిలో కుండలోని నీళ్లే ఎందుకు బెటర్?
వేసవిలో దాహార్తి మాములుగా ఉండదు. ఎంతలా అంటే ఏం తిన్నా ముందుగా దాహం అనిపించేస్తుంది. దీనిక తోడు బయట ఎండ ధాటికి తట్టుకోలేక చలచల్లగా నీళ్లు ఉంటే చాలనిపిస్తుంది. అందుకని ఫ్రిజ్‌లోని బాటిళ్లను ఖాళీ చేసేస్తుంటాం. అయితే చాలామంది కుండలోని నీళ్లే మంచిది అంటారు. ఫ్రిజ్‌లోని నీరు అస్సలు తాగొద్దని హెచ్చరిస్తుంటారు నిపుణులు. అసలు కుండలోని నీళ్లే ఎందుకు బెటర్ అంటే.. వేసవి రాగానే చల్లదనాన్ని అందించే కూలర్లు, ఏసీల అమ్మకాలు ఊపందుకుంటాయి. ఇదే సమయంలో ఫ్రిజ్ అమ్మకాలు కూడా పెరుగుతాయి. నేడు ప్రతి ఇంట్లో ప్రిజ్ తప్పనిసరిగా ఉంటుంది. కూరగాయలు ఇతర పదార్థాలను స్టోర్ చేసుకోవడంతో పాటు ఇందులో నీటిని కూడా ఉంచి చల్లగా చేసుకుంటాం. అయితే ఫ్రిజ్ నీరు తాగడం అంత మంచిది కాదని కొందరు ఆరోగ్య నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. పూర్వకాలంలో వేసవిలో ఎక్కువగా మట్టితో చేసిన కుండ నీరు తాగేవారు. ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో కుండ నీరే తాగుతున్నారు. వేసవిలో కుండ నీరు మాత్రమే చల్లగా ఉంటాయి. ఓపెన్ ప్లేసులో పెట్టడం వల్ల ఇవి మరింత చల్లగా మారుతాయి. ముఖ్యంగా మట్టిలో ఎక్కువగా మినరల్స్ ఉంటాయి. అందువల్ల కుండనీరు తాగగానే అవన్నీ నేరుగా శరీరంలోకి వెళ్లి మేలు చేస్తాయి. అందువల్ల ఫ్రిజ్ నీరు కంటే కుండలోని నీళ్లే ఆరోగ్యానికి మంచిది. రిఫ్రిజిరేటర్ నీరు మోతాదుకు మించి చల్లదనం ఉంటుంది. దీంతో శరీరంలోని కొన్ని కణాలు దెబ్బతింటాయి. కుండలో నీరు అయితే సమపాళ్లలో చల్లగా ఉంటాయి. దీంతో ఇవి తాగడం వల్ల ఎలాంటి హాని జరగదు. రెగ్యులర్‌గా కుండలో నీరు తాగడం వల్ల ఎలాంటి జీర్ణ సమస్యలు ఉండవు. ఫ్రిజ్ లో నీరు ఎక్కువగా తాగితే శరీరంలో వేడి అనూహ్యంగా పెరుగుతుంది. చలవ చేయడం మాటే అటుంచి అందులోనూ ఈ వేసిలో వేడిచేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలియంది కాదు. అందువల్ల కుండలోని నీటికే ప్రాధాన్యత ఇవ్వడం మంచిది నిపుణులు సూచిస్తున్నారు. అదీగాక మట్టి కుండలో నీరు తాగడం వల్ల జీవ క్రియలు పెరుగుతాయి. పైగా ఆరోగ్యంగా కూడా ఉంటారు. (చదవండి: Fennel Seeds: సొంపుతో ఇన్ని లాభాలా? ఐతే దీన్ని..!) -
వినియోగదారుల డిమాండ్‌లో.. మల్టీఫంక్షనల్ కుకింగ్ వేర్!
ఎక్కువ పరిమాణంలో ఎక్కువ రకాలను వండిపెట్టే ఇలాంటి మల్టీఫంక్షనల్ కుకింగ్ వేర్కి.. వినియోగదారుల నుంచి ప్రత్యేకమైన డిమాండ్ ఉంటుంది. చిత్రంలోని ఈ బేర్ మల్టీఫంక్షనల్ ఎలక్ట్రిక్ పాట్.. 6లీటర్ల సామర్థ్యంతో, పలు ప్రత్యేకమైన ఆప్షన్స్‌తో రూపొందింది. ఫుడ్‌గ్రేడ్ నాన్–స్టిక్ కోటింగ్‌తో తయారైన ఈ పాత్రలో.. సులువుగా వంట చేసుకోవచ్చు. బేస్ మెషిన్‌కి సరిపడా ఈ పెద్ద పాత్ర.. 2 పార్ట్స్‌గా విడిపోయి ఉంటుంది. దాంతో ఒకేసారి రెండు వెరైటీలను వండుకోవచ్చు. దీనికి అనువైన మూత ఉండటంతో.. వంట వేగంగా పూర్తవుతుంది. క్లీనింగ్ కూడా చాలా తేలిక. డివైస్‌కి ముందువైపున్న రెగ్యులేటర్, ఆప్షన్ బటన్స్‌తో వినియోగం అంత కన్నా తేలిక. ఇంట్లో ఎక్కువ మంది ఉన్నప్పుడు దీనిపై వంట యమఈజీ. దీని ధర 132 డాలర్లు (రూ.10,942) ఇవి చదవండి: Chugurova: ఆహా...పోహ వైరల్ -
ఈ స్టీమర్ కుకింగ్ ఎలక్ట్రికల్ పాట్.. గురించి విన్నారా..!
1.5 లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ మల్టీఫంక్షనల్ ఎలక్ట్రిక్ కుకర్.. వేపుళ్లకు, ఉడకబెట్టడానికి అనుకూలంగా ఉంటుంది. దీనికి ఆటోమేటిక్ ఆఫ్ ఆప్షన్ ఉండటంతో.. దీన్ని వినియోగించడం చాలా ఈజీ. టెంపరేచర్ సెట్ చేసుకోవడానికి ఇందులో 2 మోడ్స్ ఉంటాయి. మూవ్ చేయడానికి.. సర్వ్ చేయడానికి సులభంగా ఉంటుంది. నాన్ స్టిక్ ఇన్నర్ వాల్ కలిగిన ఈ కుకర్‌లో ఒకేసారి రెండు ఐటమ్స్‌ను వండుకోవచ్చు. కొన్నిసార్లు ఒకేదాంట్లోనూ వండుకోవచ్చు. అందుకు అదనంగా ఒక స్టీమింగ్ బౌల్ లభిస్తుంది. దీంట్లోనూ చాలా రకాల ఆహారపదార్థాలను ఆవిరిపై ఉడికించుకోవచ్చు. దీనికీ డివైస్ మూత సరిగ్గా సరిపోతుంది. బేస్ బౌల్ మీదే ఈ స్టీమర్ బౌల్ తేలికగా అమరిపోతుంది. దాంతో ఇందులో ఒకేసారి రెండు వెరైటీలను కుక్ చేసుకోవచ్చు. ఈ మోడల్లో చాలా కలర్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ స్టీమర్ బౌల్ ధర 24 డాలర్లు (రూ.1,989). ఇవి చదవండి: ఈ మినీ ఎలక్ట్రిక్ మేకర్ వెరైటీల గురించి మీకు తెలుసా..! -
గిన్నిస్ రికార్డ్: టీపాట్ ధర రూ. 24 కోట్లు! దీని సృష్టికర్త మనోడే..
World most valuable teapot Guinness World Records: సాధారణంగా అందరి ఇళ్లలోనూ టీపాట్‌లు వాడుతూ ఉంటారు. వీటి ధర ఎంత ఉంటుంది? రూ.1000 వరకు ఉంటుంది. మరీ ప్రత్యేకమైనవైతే ఇంకొంచెం ఎక్కువ ధర ఉంటుంది. కానీ ఓ టీపాట్ ధర ఏకంగా రూ.24 కోట్లు. ఇది అత్యంత ఖరీదైన టీపాట్‌గా గిన్నీస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కింది. బ్రిటన్‌కు చెందిన ఎన్ సేథియా ఫౌండేషన్, లండన్‌లోని న్యూబీటీస్ సంయుక్తంగా తయారు చేయించిన ఈ టీపాట్‌ను ఇటాలియన్ స్వర్ణకారుడు ఫుల్వియో స్కావియా రూపొందించారు. 18 క్యారట్ల బంగారంతో తయారు చేసిన ఈ టీపాట్ చుట్టూ వజ్రాలను పొదిగారు. వాటి మధ్యలో 6.67 క్యారట్ల రూబీలను అమర్చారు. ఈ టీపాట్ తయారీలో మొత్తం 1658 వజ్రాలు, 386 థాయ్, బర్మీస్ కెంపులు ఉపయోగించారు. ఈ అద్భుతమైన టీపాట్కు ‘ది ఇగోయిస్ట్’ (The Egoist) అని పెట్టారు. 2016లోనే దీని విలువ 3 మిలియన్ డాలర్లు. అంటే మన కరెన్సీలో రూ.24 కోట్లు. దీన్ని ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీపాట్‌గా గిన్నిస్ బుక్ తాజాగా గుర్తించింది. ఈ టీపాట్ ఫొటోలను, వివరాలను ట్విటర్లో షేర్ చేయగా యూజర్లను అమితంగా ఆకర్షిస్తున్నాయి. చేయించింది మనోడే! ఈ అత్యంత ఖరీదైన టీపాట్‌ను తయారు చేయించింది భారత సంతతి వ్యక్తి కావడం గమనార్హం. బ్రిటిష్-ఇండియన్ బిలియనీర్ నిర్మల్ సేథియా స్థాపించిన స్వచ్ఛంద సంస్థ ఎన్ సేథియా ఫౌండేషన్ ఈ టీపాట్‌ను తయారు చేయించింది. మరో విశేషం ఏంటంటే దీని డిజైన్‌ను నిర్మల్ సేథియా స్వయంగా రూపొందించారు. టీ వ్యాపారి అయిన నిర్మల్ సేథియా ప్రపంచంలోని అత్యుత్తమ టీలకు అంకితమిచ్చేలా ఒక టీపాట్‌ను సృష్టించాలనుకుని దీన్ని తయారు చేయించినట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ పేర్కొంది. This is the most valuable teapot in the world. Owned by the N Sethia Foundation in the UK, the teapot is made from 18-carat yellow gold with cut diamond covering the entire body and a 6.67-carat ruby in the centre. The teapot's handle is made from fossilised mammoth ivory. It… pic.twitter.com/TFZZF63YiW — Guinness World Records (@GWR) August 9, 2023 -
చల్లటి నీళ్లు కావాలా నాయనా.? కొన'కుండ' ఉండలేరు మరి!
కురబలకోట : మట్టి కుండలు అనాదిగా వాడుకలో ఉన్నాయి. అల్యూమినియం, స్టీలు, ఇతర పాత్రల ప్రవేశంతో వీటికి ఆదరణ తగ్గింది. ఆధునిక (మెటల్) వంట పాత్రల వాడకం ద్వారా రోగాలు కూడా మనిషిని చుట్టుముట్టాయి. దీంతో మళ్లీ జనం ఆలోచనలో పడ్డారు. ఇప్పుడు వంటకు, తాగునీళ్లకు కుండలను ఆదరిస్తున్నారు. మట్టివి తిరిగి జన జీవన స్రవంతిలో కన్పిస్తున్నాయి. తీరెను తాపం, కలిగించెన్ ఉపశమనం వేసవిలో మట్టి కుండల్లో నీళ్లు తాగడం హాయి హాయిగా.. కూల్ కూల్‌గా అన్పిస్తుంది. వేసవి తాపాన్ని తీరుస్తాయి. దీంతో ఈ నీళ్లు మనస్సుకు హాయిని, శరీరానికి ఉపశమనాన్ని కల్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ఎండల సీజన్. ఒక పక్క ఉక్క పోత, మరో వైపు మండుటెండలు. ఇలాంటి పరిస్థితుల్లో మట్టి కుండ అనగానే ఎవ్వరికై నా చల్లని నీళ్లు గుర్తుకు వస్తాయి. చలివేంద్రాలు అంటే కూడా మట్టి కుండలే కన్పిస్తాయి. ఈ కుండల్లో నీళ్లు తాగితే వేసవి తాపం తీరుతుంది. ఆల్కలీన్ లక్షణాలు నీటిలోని పీహెచ్ స్థాయుల్ని సమతుల్యం చేస్తాయని చెబుతారు. ఆరోగ్యానికి ఎంతో మంచిది కుండ నీళ్ల వల్ల వక్రియ మెరుగపడి పొట్టకు ఇబ్బంది లేకుండా చేస్తాయన్న పేరుంది. అంతేగాకుండా ఖనిజాలు, లవణాలు కూడా అందుతాయి. ఇలా చెప్పుకుంటూ పోతే మట్టి కుండల వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతారు. అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో అంగళ్లు, కంటేవారిపల్లె, పలమనేరు, సదుం, మదనపల్లె దగ్గర సీటీఎం, ఈడిగపల్లె, కాండ్లమడుగు, కుమ్మరపల్లె తదితర ప్రాంతాల్లో వీటిని అమ్ముతున్నారు. రోడ్ల పక్కన స్టాల్స్‌లో వీటిని విక్రయిస్తున్నారు. ఉక్క పోత ఎక్కువగా ఉండడం ఎండలు మండుతుండడంతో వీటి అమ్మకాలు కూడా జోరుగా సాగుతున్నాయి. మట్టి కుండ అంటనే చల్లదనానికి మారుపేరు. దీంతో చలివేంద్రాలలో ఎక్కడ చూసినా మట్టి కుండలే కన్పిస్తాయి. మట్టి కుండలకు పెట్టింది పేరు మట్టి కుండలు, బొమ్మలు అంటేనే ఎవ్వరికై నా తొలుత గుర్తుకు వచ్చేది కురబలకోట మండలంలోని అంగళ్లు, కంటేవారిపల్లె, ఆ తర్వాత పలమనేరులోని ఘంటావూరు. వీటికి ఇవి ప్రసిద్ధి. ఇక్కడ సీఎఫ్‌సీ సెంటర్లు, ఆధునిక మిషన్లు ఉండడంతో వీటి తయారీలో హస్త కళాకారులు ఆరితేరారు. కుండలు, కడవలు రూ.120 నుంచి రూ. 300 చొప్పున అమ్ముతున్నారు. మగ్గులు రూ.150 నుంచి రూ.250, వాటర్ బాటిళ్లు రూ.150 నుంచి రూ.200, పెరుగు, మజ్జిగ కుండలు రూ.50 నుంచి రూ.70 చొప్పున విక్రయిస్తున్నట్లు హస్తకళాకారులు వెల్లడించారు. వివిధ రాష్ట్రాలకు సరఫరా కుండల తయారీ వెనుక కుమ్మరుల కృషి ప్రశంసనీయం. వేసవి వస్తే వీటికి తరగని డిమాండ్ ఉంటుంది. ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫారా అవుతున్నాయి. వీటిలో నీళ్లు ఆరోగ్యానికి మంచిదని నిపుణులు కూడా చెబుతున్నారు. మూడు నెలలు వేసవి సీజన్ ఉంటుంది. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో రూ.2 కోట్ల దాకా ఈ కుండల అమ్మకం ద్వారా లావాదేవీలు జరుగుతాయి. – కష్ణమూర్తి, టెర్రకోట హస్తకళాకారుల సలహాదారు ఫ్రిజ్‌లున్నా వీటిపైనే మక్కువ నగర, పట్టణ వాసులు సై తం ఫ్రిజ్‌లు ఉన్నా మట్టి కుండల వైపే చూస్తున్నా రు. వీటిలో నీళ్లు సహజంగా చల్లబడతాయి. ఆరోగ్యానికి శ్రేయస్కరమని ని పుణులు చెబుతారు. మనిషి నాగరిగత నేర్చుకు న్న తర్వాత మొదటి వంట చేసింది మట్టి పాత్రల్లోనే అని చెబుతారు. ఇవి ఇళ్లలో ఉండడానికి ఇష్టపడుతున్నారు. మరో వైపు పర్యావరణ ప్రేమికు లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. – శ్రీనివాసులు, హస్తకళాకారుల సంఘ నాయకులు, కురబలకోట మండలం కుండ నీరు శ్రేయస్కరం కుండ, కడవల్లోని నీరు ఎంతో మంచిది. ఇప్పటికీ పేదవాడి ప్రిడ్జ్‌గా పిలుస్తారు. సాధారణంగా మనిషి శరీరం ఆమ్లస్వభావం కల్గి ఉంటుంది. మట్టి ఆల్కలీన్. కుండనీళ్లు తాగినప్పుడు శరీర ఆమ్ల స్వభావంతో చర్య జరుపుతుంది. సరైన పీహెచ్‌కు దోహదపడుతుంది. భూమి వివిధ ఖనిజ లవణాల సహజ గని. దీని నుంచి వచ్చిన మట్టితో చేసే కుండలు, సామగ్రి ఆరోగ్య ప్రయోజనాలను కల్గిస్తుంది. – బి.పద్మనాభరెడ్డి, పవర్ వాటర్ టెక్ నిర్వాహకులు, గుంతవారిపల్లె -
Hong Kong Model Case: సూప్ కుండలో ఆమె తల..కంగుతిన్న పోలీసులు
ప్రముఖ హాంకాంగ్ మోడల్ అబ్బి చోయ్ అతి దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసును దర్యాప్తును చేస్తున్న హాంకాంగ్ పోలీసులు ఆమె ఛిద్రమైన శరీర భాగాలను నగర శివార్లలోని ఓ ఇంట్లోని ఫ్రిజ్‌లో గుర్తించగా.. తల, మొండెం కోసం తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు ఓ కుండలోని సూప్ చూసి కంగుతిన్నారు. నిండుగా ఉన్న సూప్‌ని నిశితంగా గమనించి దగ్గరకు వెళ్లితే గాని తెలియలేదు అందులో మోడల్ తల భాగం ఉందన్న విషయం. తొలుత ఆ కుండలో క్యారట్, ముల్లంగి వంటి వాటితో సూప్ మాదిరి చక్కగా ఆకర్షణీయంగా ఉండటంతో సూప్ అనే అనుకున్నారు. ఐతే అందులో ఆ మోడల్ తల భాగాం పుర్రె మాదిరిగా చూసి.. షాక్ గురైనట్లు తెలిపారు. ముఖం మీద చర్మం, మాంసం భాగాలు ఆ సూప్‌లోనే అవశేషాలుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. జుట్టుతో సహా చోయి పుర్రె ఉన్నట్లు తెలిపారు. అంతేగాదు ఈ దారుణానికి ఒడిగట్టిన వ్యక్తి కారులో ఉండగానే ఆమెపై దాడి చేసి ఇంటికి తీసుకువెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆ మోడల్ పుర్రె వెనుక ఉన్న రంధ్రాన్ని బట్టి ఆమెపై ప్రాణాంతక దాడి జరిగి ఉండవచ్చని చెబుతున్నారు. ఇదిలా ఉండగా, పోలీసుల దర్యాప్తులో.. చోయి మాజీ భర్త, అతని కుటుంబానికి సంబంధించి పది మిలియన్ల డాలర్లతో కూడిని విలాసవంతమైన ఆస్తుల విషయమై వివాదాలు ఉన్నట్లు తేలింది. చోయి అదృశ్యం కావడానికి ముందు రోజే చోయి భర్త అలెక్స్ క్వాంగ్, అతని తండ్రి క్వాంగ్ కౌ, సోదరుడు ఆంథోనీ క్వాంగ్, అత్తగారు జెన్నీ లీ కోర్టుకు హాజరుకాగా, వారికి బెయిల్ లభించలేదు. పైగా కోర్టు విచారణను మే 8కి వాయిదా వేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు ఈ దారుణ హత్యకు ఆ నలుగురి పాత్ర ఉండవచ్చన్న అనుమానంతో కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కాగా, అబ్బి చోయి హాంకాంగ్‌లో ప్రసిద్ధ మోడల్ మాత్రమేగాదు, పారిస్ ఫ్యాషన్ వీక్‌లో రెగ్యులర్‌గా పాల్గొంటోంది. ఆమె ఫిబ్రవరి19న చివరిసారిగా ఫ్యాషన్ మ్యాగజైన్ ఎల్ ఆఫీయల్ మోనాక్తో కలిసి ఒక ఫోటోషూట్ చేసినట్లు సమాచారం. (చదవండి: మోడల్ హత్య..చంపి, ఫ్రిజ్‌లో కాళ్లను దాచి..) -
మట్టికుండ బంగారమైతదని.. రూ.2లక్షల50వేలు కాజేసిన ఘనుడు
సాక్షి, దస్తురాబాద్: మట్టికుండ బంగారమైతదని నమ్మబలికి డబ్బులు కాజేశాడు ఓ ఘనుడు. మోసపోయిన బాధితుడు తిరిగి డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి తేవడంతో తప్పించుకునేందుకు దుప్పిని హతమార్చి దాని మాంసాన్ని అతడి చేనులో ఉంచి కేసు నమోదు చేయించాలని ప్లాన్ చేశాడు. చివరికి గ్రామ పెద్దల ఫిర్యాదుతో పోలీసులకు దొరికిపోయాడు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను నిర్మల్ డీఎస్పీ జీవన్‌రెడ్డి మంగళవారం మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించాడు. మండలంలోని ఆకొండపేట గ్రామానికి చెందిన జాడి బుచ్చన్న అదే గ్రామానికి చెందిన మావుకారి రాజేశ్ ఇంటికి ఏప్రిల్ 29 రాత్రి ఒక మూటలో మట్టి కుండను తీసుకెళ్లాడు. దానిని ఓ మూలన పాతిపెట్టాడు. నెల రోజుల వరకు దానిని ఎవరూ ముట్టవద్దని, నెల తరువాత తానే స్వయంగా తీస్తానని నమ్మబలికాడు. మట్టికుండ బంగారు కుండగా మారాలంటే రూ.2లక్షల 50వేలు ఖర్చు అవుతాయని చెప్పాడు. ఈ విషయం నమ్మిన రాజేశ్ అట్టి డబ్బులను ముట్టజెప్పాడు. నెల రోజులు దాటిన తరువాత బుచ్చన్న ఇంటికి వెళ్లి కుండను బయటకుతీయాలని కోరాడు. రేపుమాపు అంటూ ఆరు నెలలు గడిపాడు. తను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని రాజేశ్ ఒత్తిడి చేశాడు. అయినా డబ్బులు ఇవ్వకపోవడంతో గ్రామ పెద్దలకు విషయం చెప్పాడు. బుచ్చన్నను గ్రామపంచాయతీకి పిలిచి విషయం అడిగారు. ఈ నెల 11న చర్చించుకుందామని చెప్పి బుచ్చన్న వెళ్లిపోయాడు. గ్రామ పెద్దలు ఎలాగైనా డబ్బులు కట్టిస్తారని ఆలోచన చేసి ఈ నెల 10వ తేదీన గ్రామ సమీపంలోని అడవిలో అదే గ్రామానికి చెందిన ముష్కం శ్రీనివాస్‌తో కలిసి దుప్పిని హతమార్చాడు. ఆ దుప్పి మాంసాన్ని కోసేందుకు గోండుగుడా గ్రామానికి చెందిన సిడాం సోముకు అప్పజెప్పాడు. అదేరోజు రాత్రి ఆ మాంసాన్ని మావుకారి రాజేష్ పంట చేనులో ఉంచి మరుసటి రోజు హెడ్‌కానిస్టేబుల్ వెంకటేశ్వర్లుకు ఫోన్‌చేసి రాజేష్ పంటచేనులో వేట మాంసం ఉందని, అతడిపై ఎలాగైనా అటవీశాఖ అధికారులతో కేసు నమోదు చేయించాలని కోరాడు. అందుకు రూ.10 వేలు ఇస్తానని తెలిపాడు. దీంతో హెడ్ కానిస్టేబుల్ అటవీశాఖ అధికారి అలీమ్కు సమాచారం ఇచ్చాడు. అతడు సంఘటనా స్థలానికి చేరుకుని మాంసాన్ని స్వాధీనం చేసుకుని పంటచేను యజమాని రాజేష్, కౌలుదారుడు కుక్కరికారి లక్ష్మయ్యను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో ఆకొండపేట గ్రామపెద్దలు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి గ్రామంలో గుప్త నిధుల పేరుతో జరిగిన మోసంపై ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న బుచ్చన్న, దుప్పిని వేటాడేందుకు సహకరించిన శ్రీనివాస్‌ను మంగళవారం అరెస్టు చేశారు. అలాగే హెడ్‌కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఆయన వెంట సీఐ అజయ్‌బాబు, ఎస్సై జ్యోతిమణి ఉన్నారు. ఈ విషయమై అటవీశాఖ అధికారులను ఫోన్లో వివరణ కోరగా పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తామని చెప్పారు. (చదవండి: హైదరాబాద్: కంచే చేను మేసింది.. బ్యాంక్ ఫ్రాడ్ కేసులో సిబ్బంది సహా పదిమందికి కఠిన శిక్షలు) -
ఆ లంకె బిందెలో 98 బంగారు నాణేలు.. కానీ చివరికి!
సాక్షి, మానవపాడు(మహబూబ్‌నగర్): జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడులో వెలుగు చూసిన లంకె బిందె వ్యవహారం లింకు దొరికింది. ఈ వ్యవహారంతో సంబంధమున్న కూలీల నుంచి రూ.4.60 లక్షలు, 12.12 తులాల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శాంతినగర్ సీఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం... మానవపాడులో రెండు నెలల క్రితం జనార్దన్‌రెడ్డి అనే వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం పునాది తీస్తుండగా కూలీలకు మట్టికుండలో 98 చిన్న బంగారు నాణేలు లభించాయి. వాటిని 9 మంది కూలీలు పంచుకున్నారు. 11 నాణేలు కలిపి దాదాపు 3 తులాల వరకు ఉంటాయి. నాణేలను బంగారు దుకాణాల్లో అమ్మేసి, ఎవరికి వారు ఆభరణాలు తయారు చేయించుకున్నారు. కొందరేమో డబ్బులు తీసేసుకున్నారు. ఈ విషయం ఇంటి యజమానికిగానీ, అధికారులకుగానీ తెలియదు. ‘జూలై 28న పత్రికల్లో వచ్చిన కథనాల మేరకు సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ జరిపాం. కూలీలను పిలిపించి మాట్లాడాం. వారి నుంచి 12.12 తులాల బంగారం, రూ.4.60 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నాం. తొమ్మిది మందిని అరెస్టు చేశాం’ అని సీఐ తెలిపారు. -
పట్టరాని సంతోషంలో ఇద్దరు హీరోయిన్లు!
అందరికీ కొన్ని కలలు ఉంటాయి. ఆ కలలు నెరవేరితే ఆనందంతో ముఖం కళకళలాడిపోతుంది. ఇప్పుడు హీరోయిన్లు కృతీ సనన్, శ్రద్ధా శ్రీనాథ్ కూడా పట్టరాని సంతోషంలో ఉన్నారు. ఎందుకంటే వీళ్లిద్దరూ తమ కల నెరవేర్చుకున్నారు. నాజూకు సుందరి కృతీకి ఎప్పటినుంచో బైక్ నడపాలని కోరిక. బైక్ బరువైనా మోయగలుగుతావా? అని స్నేహితులు సరదాగా అంటే, ‘మీరే చూద్దురుగానీ’ అన్నారామె. అనడమే కాదు.. నేర్చేసుకుని రయ్ రయ్‌మంటూ ద్విచక్ర వాహనాన్ని నడిపేశారు కూడా. ప్రస్తుతం హిందీ చిత్రం ‘బచ్చన్ పాండే’లో నటిస్తున్నారు కృతీ సనన్. ఈ షూటింగ్ లొకేషన్లో కాస్త గ్యాప్ దొరకడంతో బైక్ నడిపారు. ‘ఇంతకీ బైక్ ఎప్పుడు నేర్చుకున్నావ్?’ అని ఓ ఫ్రెండ్ అడిగితే ‘ఇవాళే మొదలుపెట్టాను. నేర్చేసుకున్నాను’ అన్నారు కృతీ సనన్. దీన్నిబట్టి ఈ బ్యూటీ ఎంత త్వరగా నేర్చేసుకున్నారో ఊహించవచ్చు. ఇక శ్రద్ధా శ్రీనాథ్ విషయానికి వద్దాం. విహార యాత్రలకు వెళ్లినప్పుడు కేవలం ఎంజాయ్మెంట్ మాత్రమే కాదు... ఉపయోగపడేది ఏదైనా చేయాలనుకుంటారు శ్రద్ధా. హాలిడే కోసం ఇటీవల ఓ రిసార్ట్‌కి వెళ్లారామె. అక్కడ కుండలు తయారు చేయడం నేర్చుకున్నారు. ‘ఎప్పటినుంచో ఓ కుండ తయారు చేయాలనుకున్నా. ఇదిగో చేసేశా’ అంటూ ఫొటో షేర్ చేశారు శ్రద్ధా శ్రీనాథ్. బైక్ నడిపినందుకు కృతీకి, కుండ తయారు చేసినందుకు శ్రద్ధాకి బోలెడన్ని ప్రశంసలు లభించాయి. (చదవండి: కాలి నడకన తిరుపతి కొండెక్కిన యంగ్ హీరో) -
నివాస స్థలం ఎవరి అధీనంలో ఉంటే వారికే పట్టా
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ప్రభుత్వం దరఖాస్తు (డీకేటీ) పట్టా రూపంలో ఇచ్చిన నివాస స్థలాలు ఎవరి అధీనంలో ఉంటే వాటిపై వారికే హక్కులు కల్పించాలని రెవెన్యూ శాఖ ఆదేశించింది. 2019 జనవరి 21వ తేదీకి ముందు చేతులు మారిన నివాస స్థల డీకేటీ పట్టాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ కార్యదర్శి వి.ఉషారాణి జిల్లా కలెక్టర్లకు అంతర్గత ఆదేశాలు జారీ చేశారు. వాస్తవానికి డీకేటీ పట్టాల రూపంలో ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలు చాలావరకు అనధికార లావాదేవీల ద్వారా చేతులు మారాయి. ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్(పీఓటీ) చట్టం ప్రకారం వీటి క్రయవిక్రయాలకు ఆస్కారం లేదు. అందువల్ల విక్రయ రిజిస్ట్రేషన్లు జరగవు. ఈ నేపథ్యంలో అనధికారికంగా కొనుగోలు చేసిన స్థలం ఎవరి అధీనంలో ఉంటే వారికే అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే డీకేటీ పట్టాల రూపంలో ఇళ్ల స్థలాలు తీసుకున్న వారు ఆర్థిక సమస్యలుంటే 20 ఏళ్ల తర్వాత విక్రయించుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు పీఓటీ చట్టానికి సవరణ చేస్తూ అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించింది. దీంతో గతేడాది జనవరి 21వ తేదీకి ముందు నివాస స్థలం ఎవరి అధీనంలో ఉంటే వారికే పట్టా ఇవ్వాలని ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు మెమో జారీ చేసింది. గతంలోనే ఈ మెమో ఇచ్చినప్పటికీ కొందరు కలెక్టర్లు/ రెవెన్యూ అధికారులు సందేహాలు వ్యక్తం చేశారు. వాటిని నివృత్తి చేస్తూ తాజాగా ప్రభుత్వం మరో మెమో పంపింది. వేరే వారికి ఇచ్చిన నివాస స్థలాలను ఎవరు పడితే వారు కొనుగోలు చేసినా, స్వాధీనం చేసుకున్నా పట్టా ఇవ్వడం కుదరదు. ఇల్లు గానీ, నివాస స్థలం గానీ లేనివారికి మాత్రమే ఇలా పట్టా ఇవ్వాలని ప్రభుత్వం పేర్కొంది. పీఓటీ చట్ట సవరణ నేపథ్యంలో ఇప్పటివరకూ ఇళ్ల స్థలాలు పొందినవారు వాటిని 20 ఏళ్ల తర్వాత విక్రయించుకోవచ్చు. -
‘పీవోటీ’ని ఉల్లంఘించి థర్డ్ పార్టీలకు ప్లాట్లు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి భూ సమీకరణ ప్రక్రియలో పీవోటీ (ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్) చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘిస్తూ ఎస్సీలు, ఇతర బలహీన వర్గాలు సాగు చేసుకునేందుకు ఇచ్చిన వ్యవసాయ భూములకు బదులుగా కొందరు థర్డ్ పార్టీ వ్యక్తులకు ప్లాట్ల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు విచారణలో నిర్ధారణ అయిందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ‘రాజధాని అమరావతి’పై సోమవారం శాసనమండలిలో జరిగిన స్వల్పకాలిక చర్చలో మంత్రి బొత్స మాట్లాడారు. అసైన్డ్ భూమి కలిగి ఉన్న వ్యక్తులు తెల్ల కాగితంపై సంతకం చేసి ఇచ్చినా ప్రామాణికంగా తీసుకొని ఆ భూమికి బదులుగా థర్డ్ పార్టీ వ్యక్తులకు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసేందుకు సీఆర్డీఏ అనుమతిచ్చిందని, ఇది పూర్తిగా పీవోటీ చట్టాన్ని ఉల్లంఘించడమేనన్నారు. 455 మంది అసైన్డ్ రైతులకు సంబంధించి 289 ఎకరాల భూమికి బదులుగా 1,68,300 చదరపు అడుగుల మేర ప్లాట్లు ధర్డ్ పార్టీ వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్ జరిగినట్లు ఇప్పటివరకు జరిగిన విచారణలో తేలిందన్నారు. కమిటీ సూచనల ప్రకారమే నిర్ణయం భూ సమీకరణలో పీవోటీ చట్టాన్ని ఉల్లంఘించి గత ప్రభుత్వం ఎస్సీ, బలహీన వర్గాలకు చేసిన అన్యాయాలను సరిదిద్దేందుకు అలాంటి రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని బొత్స చెప్పారు. గుంటూరు– విజయవాడ మధ్య ఉండే సారవంతమైన భూముల్లో రాజధాని ఏర్పాటు సరైంది కాదని శివరామకృష్ణ కమిటీ స్పష్టంగా సూచించిందని బొత్స గుర్తు చేశారు. అది భవన నిర్మాణాలకు అనువైన ప్రాంతం కాదని కూడా కమిటీ సూచించిందని, ఆ కమిటీ చెప్పినట్టే తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణానికి 102 అడుగుల మేర పునాదులు వేయాల్సి రావడం వాస్తవం కాదా? అని బొత్స ప్రశ్నించారు. అభివృద్ధి ప్రణాళికల సమీక్ష, రాజధానితోపాటు మొత్తం రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం సమగ్ర వ్యూహాలను సూచించేందుకు నలుగురు నిపుణులతో కమిటీని నియమించినట్లు మంత్రి వివరించారు. రిటైర్డ్ ఐఏఎస్ జీఎన్ఆర్ కన్వీనర్‌గా ఏర్పాటైన నిపుణుల కమిటీ సూచనలకు అనుగుణంగానే రాజధానిపై ఏ నిర్ణయమైనా ఉంటుందని మంత్రి వివరించారు. దురాక్రమణ, అవినీతి, దోపిడీ సీఆర్డీఏ పరిధిలోని మొత్తం 2,600 ఎకరాల అసైన్డ్ భూములపై విచారణ కొనసాగుతుందని బొత్స స్పష్టం చేశారు. సీఆర్డీఏ పరిధిని మొదట 217 చదరపు కిలోమీటర్లగా నిర్ధారించి తర్వాత చంద్రబాబు వియ్యంకుడికి భూ కేటాయింపులపై గత ప్రభుత్వం జీవో విడుదల చేశాక వారికి ప్రయోజనం చేకూర్చేలా సీఆర్డీఏ పరిధిని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అమరావతిలో దురాక్రమణ, అవినీతి, దోపీడీ జరిగిందని చెప్పారు. -
నిండుకుండలా..కిన్నెరసాని..
పాల్వంచ రూరల్: కిన్నెరసాని రిజర్వాయర్ 407 అడుగల నీటి నిల్వ సామర్థ్యానికి గాను 406.60 అడుగులకు వరద చేరగా.శుక్రవారం ఉదయం నుంచి రెండు గేట్లను ఎత్తి, దిగువకు 6వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. రాజాపురం, యానంబైల్ గ్రామాల మధ్య లోలేవల్ చప్టాపైనుంచి వరదనీరు పొంగింది. యానంబైల్, ఉల్వనూరు, చండ్రాలగూడెం గ్రామ పంచాయతీల పరిధిలో 20కిపైగా గిరిజన గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. -
బిందెలో తల ఇరుక్కుని తల్లడిల్లిన చిన్నారి
కొడకండ్ల (వరంగల్): ఆడుకుంటున్న ఓ చిన్నారి తన తలపై బిందెను పెట్టుకోవడంతో అది మెడ భాగం వరకు అందులోనే ఇరుక్కుని తల్లడిల్లిపోయింది. ఈ ఘటన ఆదివారం వరంగల్ జిల్లా కొడకండ్ల శివారులో చోటు చేసుకుంది. ఆంధ్ర ప్రాంతం నుంచి రెండు కుటుంబాలు మండల కేంద్ర శివారులోని ఇటుకబట్టీలో పని చేసేందుకు ఇక్కడికి వచ్చారు. ఆదివారం మధ్యాహ్నం తల్లిదండ్రులు ఇటుకల బట్టీ పనిలో ఉండగా, అంకిత అనే నాలుగేళ్ల చిన్నారి బిందెతో ఆడుకునే క్రమంలో తల అందులో ఇరుక్కుపోయింది. తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినా బిందె నుంచి పాప తలను బయటకు తీయడానికి రాకపోవడంతో వారు ఆందోళనకు గురయ్యారు. అనంతరం చిన్నారిని సైకిల్‌పై మండల కేంద్రానికి తీసుకెళ్లారు. మోటార్ మెకానిక్ నర్మెట్ట ఉపేందర్ కట్టర్ తో బిందెను కట్ చేసి అందులో ఇరుక్కున్న చిన్నారి అంకిత తలకు ఎటువంటి గాయాలు కాకుండా బయటకు తీయడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.