![Have You Ever Seen This Multifunctional Cooking Ware - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/10/Multi-Functional-Pot.jpg.webp?itok=QQrZJ07J)
ఎక్కువ పరిమాణంలో ఎక్కువ రకాలను వండిపెట్టే ఇలాంటి మల్టీఫంక్షనల్ కుకింగ్ వేర్‌కి.. వినియోగదారుల నుంచి ప్రత్యేకమైన డిమాండ్ ఉంటుంది. చిత్రంలోని ఈ బేర్ మల్టీఫంక్షనల్ ఎలక్ట్రిక్ పాట్.. 6లీటర్ల సామర్థ్యంతో, పలు ప్రత్యేకమైన ఆప్షన్స్‌తో రూపొందింది. ఫుడ్‌గ్రేడ్ నాన్–స్టిక్ కోటింగ్‌తో తయారైన ఈ పాత్రలో.. సులువుగా వంట చేసుకోవచ్చు. బేస్ మెషిన్‌కి సరిపడా ఈ పెద్ద పాత్ర.. 2 పార్ట్స్‌గా విడిపోయి ఉంటుంది. దాంతో ఒకేసారి రెండు వెరైటీలను వండుకోవచ్చు. దీనికి అనువైన మూత ఉండటంతో.. వంట వేగంగా పూర్తవుతుంది. క్లీనింగ్ కూడా చాలా తేలిక. డివైస్‌కి ముందువైపున్న రెగ్యులేటర్, ఆప్షన్ బటన్స్‌తో వినియోగం అంత కన్నా తేలిక. ఇంట్లో ఎక్కువ మంది ఉన్నప్పుడు దీనిపై వంట యమఈజీ. దీని ధర 132 డాలర్లు (రూ.10,942)
Comments
Please login to add a commentAdd a comment