భ్రుకు టీ ముడిపడే సీన్‌! | Iranian woman creates teapot hairstyle but video viral | Sakshi

భ్రుకు టీ ముడిపడే సీన్‌!

Jul 7 2024 6:12 AM | Updated on Jul 7 2024 6:12 AM

Iranian woman creates teapot hairstyle but  video viral

వైరల్‌ 

శివుని జటాఝూటంలోని గంగ గురించి మనకు తెలుసు. అయితే ఇరానీ మోడల్‌ శిరోజాలలోని ‘టీపాట్‌’ వీడియో ఇప్పుడు వైరల్‌ అయింది. హెయిర్‌ స్టైల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. అయితే ‘టీ పాట్‌ హెయిర్‌స్టైల్‌’ గురించి మాత్రం ఎప్పుడూ విని ఉండం. ఇరాన్‌కు చెందిన హెయిర్‌ స్టైలిస్ట్‌ సైదెహ్‌ ‘టీపాట్‌ హెయిర్‌స్టైల్‌’ వీడియోను చూసి నెటిజనులు ‘ఆహో వోహో’ అంటున్నారు.

 ఈ వీడియో నాలుగు మిలియన్‌ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. హెయిర్‌ పిన్స్‌తో మోడల్‌ సబుర్‌ నగర్‌కు పోనీ టెయిల్‌ వేసింది. ఆ తరువాత మెటల్‌ వైర్లు, గ్లూ గన్‌తో టీపాట్‌ స్ట్రక్చర్స్‌ను సెట్‌ చేసింది. ఈ శిరో టీపాట్‌లో టీ ΄ోసి ఆ తరువాత కప్పులోకి ఒంపి తాగింది. ‘ఫ్యాషన్‌ స్టైల్‌ అనేది ఎన్నో వెరైటీలకు కేంద్రం. హెయిర్‌ స్టైల్‌కు సంబంధించి సహజంగా ఉండేలా ఏదైనా చేయాలనుకున్నాను. రెండు రోజుల కృషి ఫలితమే ఈ విజయం. ఇంత స్పందన వస్తుందని ఊహించలేదు’ అని తన ఇన్‌స్టాగ్రామ్‌ ΄ోస్ట్‌లో చెప్పింది సైదేహ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement