iran women
-
భ్రుకు టీ ముడిపడే సీన్!
శివుని జటాఝూటంలోని గంగ గురించి మనకు తెలుసు. అయితే ఇరానీ మోడల్ శిరోజాలలోని ‘టీపాట్’ వీడియో ఇప్పుడు వైరల్ అయింది. హెయిర్ స్టైల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. అయితే ‘టీ పాట్ హెయిర్‌స్టైల్’ గురించి మాత్రం ఎప్పుడూ విని ఉండం. ఇరాన్‌కు చెందిన హెయిర్ స్టైలిస్ట్ సైదెహ్ ‘టీపాట్ హెయిర్‌స్టైల్’ వీడియోను చూసి నెటిజనులు ‘ఆహో వోహో’ అంటున్నారు. ఈ వీడియో నాలుగు మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. హెయిర్ పిన్స్‌తో మోడల్ సబుర్ నగర్‌కు పోనీ టెయిల్ వేసింది. ఆ తరువాత మెటల్ వైర్లు, గ్లూ గన్‌తో టీపాట్ స్ట్రక్చర్స్‌ను సెట్ చేసింది. ఈ శిరో టీపాట్‌లో టీ ΄ోసి ఆ తరువాత కప్పులోకి ఒంపి తాగింది. ‘ఫ్యాషన్ స్టైల్ అనేది ఎన్నో వెరైటీలకు కేంద్రం. హెయిర్ స్టైల్‌కు సంబంధించి సహజంగా ఉండేలా ఏదైనా చేయాలనుకున్నాను. రెండు రోజుల కృషి ఫలితమే ఈ విజయం. ఇంత స్పందన వస్తుందని ఊహించలేదు’ అని తన ఇన్స్టాగ్రామ్ ΄ోస్ట్‌లో చెప్పింది సైదేహ్. -
తల్లి తరఫున నోబెల్ శాంతి బహుమతి స్వీకరణ
హెల్సింకీ: ఇరాన్ మానవ హక్కుల మహిళా కార్యకర్త నర్గీస్ మొహమ్మదీకి నోబెల్ కమిటీ ప్రకటించిన శాంతి బహుమతిని ఆమె తరఫున ఆమె కుమారుడు, కుమార్తె అందుకున్నారు. ఇరాన్లో మహిళల అణచివేత, మానవ హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా పోరాడుతున్న 51 ఏళ్ల నర్గీస్‌ను ఇరాన్ ప్రభుత్వం అక్రమ కేసులు మోపి టెహ్రాన్ జైలులో పడేసిన విషయం విదితమే. శనివారం నార్వేలోని ఓస్లోలో నర్గీస్ కవల పిల్లలు అలీ, కియానా రహా్మనీ పురస్కారాన్ని స్వీకరించారు. ‘‘ఇరాన్ సమాజానికి అంతర్జాతీయ మద్దతు అవసరం. ప్రభుత్వ అరాచక పాలనకు వ్యతిరేకంగా గళమెత్తిన మానవహక్కుల కార్యకర్తలు, నిరసనకారులు, పాత్రికేయుల గొంతుకను సభావేదికగా గట్టిగా వినిపించండి’’ అంటూ నర్గీస్ ఇచి్చన సందేశాన్ని వేదికపై వారు చదివారు. -
అలుపెరగని పోరాటానికి నోబెల్ బహుమతి
-
ఆ సంఘటన ఓ ఉద్యమానికే ఊపిరిపోసింది
-
ఇరాన్లో నిరసన డ్యాన్స్‌ల వెల్లువ
సాక్షి, న్యూఢిల్లీ: ఇరాన్లో ఇటీవల 18 ఏళ్ల టీనేజ్ అమ్మాయి మేదేహ్ హోజాబ్రి తాను డ్యాన్స్ చేసిన వీడియోలను ‘ఇన్స్టాగ్రామ్’లో అప్లోడ్ చేసినందుకు ఇరాన్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే. ఇప్పుడు ఆ సంఘటన ఓ ఉద్యమానికే ఊపిరిపోసింది. టీనేజ్ అమ్మాయి అరెస్ట్‌ను నిరసిస్తూ ఇరానీ మహిళలు ఇళ్లలో వీధి కూడళ్లలో డ్యాన్స్ చేస్తున్నారు. వాటి వీడియోలను ‘డాన్సింగ్ఈజ్నాట్క్రైమ్’, డాన్సింగ్టుఫ్రీడమ్’ హాష్ ట్యాగ్‌లతో సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. ఇలా వీడియోలను అప్లోడ్ చేసిన ఒకరిద్దురు మహిళలను ముందుగా అరెస్ట్ చేసిన పోలీసులు, పుంఖానుపుంఖంగా వచ్చి పడుతున్న వీడియోలను చూసి ఏం చేయాలో వారికి పాలుపోవడం లేదు. ఇరానీ మహిళలు తమ ఇళ్లలో, ఇంటి ముందు బ్యాక్ గ్రౌండ్‌కు మ్యూజిక్ అనుగుణంగా డ్యాన్సులు చేస్తున్నారు. వాటిని వీడియోలుగా చిత్రీకరిస్తున్నారు. ఇక వీధి కూడళ్లలో అయితే మగవాళ్ల కచేరి వాయిద్యాల మధ్య మహిళలు నృత్యం చేస్తున్నారు. కొన్ని చోట్ల మగవాళ్లు ఆడవాళ్ల డ్యాన్సులకు మద్దతుగా చిన్నపాటి ఉపన్యాసాలు కూడా ఇచ్చి మహిళలను ప్రోత్సహిస్తున్నారు. డ్యాన్స్ వీడియోల కారణంగా అరెస్టయిన ఇరానీ టీనేజ్ అమ్మాయికి మద్దతుగా ఇప్పటికే బ్రిటీష్ మహిళలు డాన్స్ వీడియోలను బీబీసీకి పంపిస్తున్నారు. బీబీసీ వారు వాటిని ప్లే చేస్తున్నారు. డ్యాన్స్ చేస్తే ఇరానీ అమ్మాయిలను అరెస్ట్ చేయడం ఇదే మొదటిసారి కాదు. ఓ పాటకు డ్యాన్స్ చేసి ఆ వీడియోలను పోస్ట్ చేసిన ఆరుగురు మహిళలను 2014లో మొదటిసారి ఇరానీ పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళలు డ్యాన్స్ చేయడం కుసంస్కారం, చట్ట విరుద్ధ చర్య అన్నది పోలీసుల వాదన. అప్పుడు కూడా అరెస్ట్‌లకు నిరసనగా పలువురు మహిళలు డ్యాన్స్ చేశారు. -
భర్తతో భార్య గొడవ.. విమానం మళ్లింపు.!
మద్యం మత్తులో ఓ మహిళ తనని మోసం చేశాడని భర్తపై గొడవపడి ఏకంగా విమానాన్నేదారి మళ్లించింది. వివరాల్లోకి వెళితే.. ఇరాక్ చెందిన ఓ మహిళ భర్త, కుమారుడితో ఢిల్లీ నుంచి బాలి వెళ్లేందుకు ఆదివారం ఖతార్ ఎయిర్వేస్కు చెందిన దోహా-బాలి క్యుఆర్ - 962 విమానం ఎక్కారు. భర్తపై అనుమానంతో భార్య తాను నిద్రపోతున్న సమయంలో భర్త ఫోన్‌ని అతని వేలిముద్రతో అన్‌లాక్ చేసి చూసింది. తీరా అందులో వేరే యువతి ఫోటోలు, కాల్ లిస్ట్ చూసింది. దీంతో భర్త తనను మోసంచేశాడని అందరి ముందు గొడవ పడి నానా రచ్చ చేసింది. అప్పటికే తాగి ఉన్న ఆమె తోటి ప్రయాణికులు, ఎయిర్వేస్ సిబ్బంది ఎంత చెప్పినా వినకపోవడంతో పాటు, వారిపై తిరగబడింది. అదుపు చేయలేని స్థితిలో సిబ్బంది దారి మళ్లించి చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో ఆ కుటుంబాన్ని దింపేశారు. అనంతరం విమానాన్ని బాలికి తరలించారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ఈ విమానం చెన్నైలో ల్యాండ్ అయినట్లు సీఐఎస్ఎఫ్ (సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ సెక్యురిటీ ఫోర్స్) అధికారులు వెల్లడించారు. -
మహిళల సైకిల్ ముందు ఫత్వా బలాదూర్
టెహరాన్: ఇరాన్లో మహిళలు సైకిలు తొక్కవద్దని, అలాచేస్తే వారి శీలం దెబ్బతింటోందని దేశమతాధిపతి అయతొల్లా అలీ ఖమేనీ ఫత్వా జారీ చేయడం పల్ల మహిళలు మండిపడుతున్నారు. సైకిల్ తొక్కడం తమకు జన్మతో వచ్చిన హక్కని వాదిస్తున్నారు. కాలుష్యం వదిలే కార్లను వదిలేసి సైకిళ్లను ఆశ్రయించే దిశగా ప్రపంచం పయనిస్తుంటే తమను సైకిళ్లను తొక్కవద్దంటూ ఫత్వా జారీ చేయడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఫత్వాకు నిరసనగా ఇరాన్ మహిళలు ఓ ఉద్యమంలా సైకిళ్లను తొక్కుతూ వాటి తాలూకు వీడియోలను ‘ఇరానియన్విమెన్ లవ్సైక్లింగ్’ హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తోటి దేశ మహిళల నుంచే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి మహిళలతోపాటు మగవాళ్ల నుంచి కూడా వారికి రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది. మహిళలు సైకిల్ తొక్కడం వారికి నప్పదని, అది వారి శీలాన్ని దెబ్బతీయడమే కాకుండా సమాజాన్ని కూడా అవినీతి మయం చేస్తుందని హెచ్చరిస్తూ ఖమేని ఇటీవల ఫత్వా జారీ చేశారు. ‘మైస్టీల్తీ ఫ్రీడమ్’ పేరుతో సైకిల్ తొక్కుతున్న ఇరానీ మహిళలు ఫొటోలను, వీడియోలను, కామెంట్లను ఎప్పటికప్పుడు ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేస్తున్నారు. ఇరాన్‌లోని షిరియాజ్ వీధుల్లో సైకిల్ తొక్కుతూ దిగిన వీడియోను ఓ పాతికేళ్ల అమ్మాయి బుధవారం పోస్ట్ చేయగా ఈ రెండు రోజుల్లోనే 21వేల సార్లు వీక్షించారు. ‘ఖమేనీ ఫత్వా గురించి తెలియగానే నేను, మా అమ్మ రెండు సైకిళ్లను అద్దెకు తీసుకున్నాం. టెహరాన్ వీధుల్లో వాటిని తొక్కాం. ఇది మా హక్కు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము వదులుకోం’ అని పాతికేళ్ల కూతురు మరో వీడియోను పోస్ట్ చేశారు. ఆమెతోపాటు ఆమె తల్లి కూడా ఆ వీడియోలో సైకిల్ తొక్కడం కనిపించింది. ఈ వీడియోను మంగళవారం పోస్ట్ చేయగా ఇప్పటి వరకు 1.10 లక్షల సార్లు వీక్షించారు. ఖమేని ఫత్వాను ఉల్లంఘించిన వారిపై చర్య తీసుకుంటారా? లేదా? చర్చ కూడా జరుగుతోంది. ఫత్వా ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలనే చట్టం ఇరాన్లో లేదుగానీ, మర్యాదపూర్వక దుస్తులు మాత్రమే ధరించాలనే నిబంధన కింద అప్పడప్పుడు ఫత్వా ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటారు. మర్యాదపూర్వక దుస్తుల నిబంధనకు కూడా సరైన వివరణ లేదా భాష్యం లేనందున అరెస్ట్ చేయవచ్చు లేదా చేయకపోవచ్చు. అందే ఫిర్యాదులు, దర్యాప్తు చేసే అధికారులనుబట్టి నిర్ణయం ఉంటుంది.