hair stylist
-
సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ అమిత్ ఠాకూర్: ఆ హెయిర్ ట్రీట్మెంట్లు వద్దు..!
ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అమిత్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లు ఆలియా భట్, ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్, కియారా అద్వానీ నుంచి నీతా అంబానీ వంటి ప్రముఖులందిరికీ హెయిర్ స్టైలిస్ట్ అమిత్. సెలబ్రిటీ హెయిర్‌స్టైలిస్ట్ అమిత్ మాత్రం కురుల అందం కోసం హెయిర్ బోటాక్స్, కెరాటిన్ వంటి ట్రీట్మెంట్లు అస్సలు తీసుకోవద్దని చెబుతున్నారు. తాను తన క్లయింట్లకు కూడా అస్సలు సూచించని అన్నారు. అసలు ఇవెందుకు మంచివి కావు అనేది అమిత్ మాటల్లోనే సవివరంగా తెలుసుకుందాం..!.ఈ రోజుల్లో జుట్టుకి సంబంధించిన హెయిర్ ట్రీట్మెంట్లు సర్వసాధారణం. అయినప్పటికీ అందమైన శిరోజాల కోసం ఈ ట్రీట్మెంట్లు మాత్రం తీసుకోవద్దని హెయిర్ స్టైలిస్ట్ అమిత్ అంటున్నారు. తన క్లయింట్లకు కూడా ఇలాంటి ట్రీట్మెంట్లను సూచించని అన్నారు. ఈ రోజుల్లో కురుల కోసం అందరూ చేయించుకునే హెయిర్ బోటాక్స్ లేదా కెరాటిన్ వంటి వాటికి తాను ప్రాధాన్యత ఇవ్వనని అన్నారు. తాను బాలీవుడ్ హీరోయిన్లకు, ప్రముఖులకు ఇలాంటి హెయిర్ ట్రీట్మెంట్లు అస్సలు సిఫార్సు చేయనని అన్నారు. ప్రస్తుత రోజుల్లో ఈ ట్రీట్మెంట్లు సర్వసాధారణమే అయినప్పటికీ.. ఇవి మంచివి కావని వాటి గురించి వివరించారు అమిత్. ఎందుకు మంచివి కావంటే..హెయిర్ బోటాక్స్ అనేది ప్రోటీన్లు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లతో కూడిన డీప్ కండిషనింగ్ ట్రీట్మెంట్. ఇది తాత్కాలిక చికిత్స. ఇది సాధారణంగా రెండు నుంచి నాలుగు నెలలు పడుతుంది. ఇక కెరాటిన్ చికిత్స అంటే.. ఇది జుట్టులో సహజంగా ఉండే ప్రోటీన్. ఈ చికిత్సలో ఫార్మాల్డిహైడ్ వంటి కొన్ని రసాయనాలు ఉంటాయి. వాస్తవానికి దీన్ని చాలా దేశాల్లో నిషేధించారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం..ఇది కేన్సర్ కారకమైనదని అన్నారు అమిత్. ఈ రెండు చికిత్సల ప్రాథమిక స్వభావమే తాను ప్రాధాన్యత ఇవ్వకపోవడానికి ప్రధాన కారణమని చెబుతున్నారు అమిత్. హెయిర్ బోటాక్స్ జుట్టుని మంచిగా ఉంచినప్పటికీ..జుట్టులోని సహజ పోషకాలను కోల్పోయేలా చేస్తాయి. పైగా ఇది అధిక వేడిని కలుగజేస్తుంది. దీని వల్ల జుట్టులో ఉండే సహజ ప్రోటీన్ల నిర్మాణం ప్రాథమికంగా మారిపోతుంది. ఇవి స్వల్పకాలిక చికిత్సలే తప్ప ఏ మాత్రం సత్ఫలితాలనివ్వదు. పైగా దీర్ఘకాలంలో జుట్టుకి ఎక్కువ హానిని చేకూరుస్తాయి. పదేపదే ఈ ట్రీట్మెంట్లు తీసుకోవడం వల్ల పలు దుష్ప్రభావాలకు గురయ్యే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. అదీగాక తాను సహజమైన జుట్టు ఆకృతికే ప్రాధాన్యత ఇస్తానని, అలాగే దీర్ఘకాలంలో జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మంచి అలవాట్లకే తాను ప్రాధాన్యత ఇస్తానని చెప్పుకొచ్చారు అమిత్. ఆ దిశగానే తన కస్టమర్లను కూడా ప్రోత్సహిస్తానని అన్నారు. View this post on Instagram A post shared by Amit Thakur (@amitthakur_hair) (చదవండి: శ్రద్ధా కపూర్ బ్యూటీ సీక్రెట్ ఇదే..! ఇష్టంగా పోహా..!) -
భ్రుకు టీ ముడిపడే సీన్!
శివుని జటాఝూటంలోని గంగ గురించి మనకు తెలుసు. అయితే ఇరానీ మోడల్ శిరోజాలలోని ‘టీపాట్’ వీడియో ఇప్పుడు వైరల్ అయింది. హెయిర్ స్టైల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. అయితే ‘టీ పాట్ హెయిర్‌స్టైల్’ గురించి మాత్రం ఎప్పుడూ విని ఉండం. ఇరాన్‌కు చెందిన హెయిర్ స్టైలిస్ట్ సైదెహ్ ‘టీపాట్ హెయిర్‌స్టైల్’ వీడియోను చూసి నెటిజనులు ‘ఆహో వోహో’ అంటున్నారు. ఈ వీడియో నాలుగు మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. హెయిర్ పిన్స్‌తో మోడల్ సబుర్ నగర్‌కు పోనీ టెయిల్ వేసింది. ఆ తరువాత మెటల్ వైర్లు, గ్లూ గన్‌తో టీపాట్ స్ట్రక్చర్స్‌ను సెట్ చేసింది. ఈ శిరో టీపాట్‌లో టీ ΄ోసి ఆ తరువాత కప్పులోకి ఒంపి తాగింది. ‘ఫ్యాషన్ స్టైల్ అనేది ఎన్నో వెరైటీలకు కేంద్రం. హెయిర్ స్టైల్‌కు సంబంధించి సహజంగా ఉండేలా ఏదైనా చేయాలనుకున్నాను. రెండు రోజుల కృషి ఫలితమే ఈ విజయం. ఇంత స్పందన వస్తుందని ఊహించలేదు’ అని తన ఇన్స్టాగ్రామ్ ΄ోస్ట్‌లో చెప్పింది సైదేహ్. -
షూటింగ్ కోసం నెల్లూరుకు వెళ్లిన సందర్భంలో శారీరకంగా ఒక్కటై..
సాక్షి, హైదరాబాద్(బంజారాహిల్స్): ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశాడని సినీ పరిశ్రమకు చెందిన ఓ హెయిర్ స్టైలిస్ట్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 లోని నంది నగర్లో నివాసం ఉంటున్న మహిళ సినీ ఇండస్ట్రీలో హెయిర్ స్టైలిస్ట్‌గా పని చేస్తోంది. 2018 లో ఆమెకు సినీ ఇండస్ట్రీలో హెయిర్ స్టైలిస్ట్‌గా పని చేస్తున్న మన్మధ రావు అలియాస్ మహేష్‌తో పరిచయం ఏర్పడింది. మన్మథ రావు ఆమెను ప్రేమిస్తున్నట్లు చెప్పడంతో తాను ఇప్పటికే రేప్ కేసులో బాధితురాలిగా ఉన్నానని, తనకు కొద్ది రోజులు గడువు కావాలని కోరింది. ఆ తర్వాత షూటింగ్ నిమిత్తం నెల్లూరుకు వెళ్లిన సందర్భంలో శారీరకంగా ఒకటయ్యారు. గత ఏడాది ఆగస్టులో తనను పెళ్లి చేసుకోవాలని అడగ్గా, మహేష్ ఆమెను దూరంగా పెడుతున్నాడు. ఆమె ఫోన్ నంబర్ సైతం బ్లాక్ చేశాడు. ఆదివారం మధ్యాహ్నం కృష్ణానగర్‌లో కనిపించిన మన్మథ రావును పెళ్లి విషయమై ప్రశ్నించగా ఆమెపై భౌతిక దాడికి పాల్పడ్డాడు. ఆదివారం బాధితురాలి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (ఆరు నెలల క్రితమే పెళ్లి.. పక్కింటి కుర్రాడితో మాట కలిపి..) -
నిమిషంలోపే హెయిర్ కట్.. గిన్నిస్ రికార్డు సృష్టించిన హెయిర్ డ్రస్సర్
అర్జెంట్‌గా హెయిర్ కట్ చేయించుకోవాలా? అస్సలు టైమ్ లేదా? అయితే మీకు ఈ గ్రీక్ హెయిర్ డ్రెస్సర్ కావాల్సిందే. సాధారణ హెయిర్‌కట్ కోసం గ్రీక్ హెయిర్ డ్రస్సరెందుకు? అనేగా సందేహం. ఒక్కసారి మైండ్‌లో ఫిక్సయిపోతే.. బ్లైండ్‌గా ఫాలో అయ్యే ప్రొఫెషనల్ హెయిర్ డ్రస్సర్ ఈయన. గ్రీస్‌లోని ఏథెన్స్కు చెందిన కాన్సాంటినోస్ కౌటోపీస్... నిమిషంలోపే హెయిర్ కట్ చేసేస్తాడు. 47 సెకన్లలోనే అందమైన హెయిర్‌స్టైల్ చేసి.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా సాధించాడు. ఓపికతో, ఎంత ఎక్కువ సమయం తీసుకుని కట్ చేస్తే.. అంతమంచి హెయిర్ స్టైల్ వస్తుందనే భావనకు చెక్ పెట్టేశాడు. ట్రిమ్మర్, కోంబ్ సహాయంతో చకచకా కట్ చేశాడు. గిన్నిస్ అధికారులు విడుదల చేసిన ఈ వీడియోను లక్షల మంది చూసేశారు. కొందరు సూపరని పొగుడుతుండగా, మరికొందరు బాలేదంటూ పెదవివిరిచారు. Need a quick trim? How about a 45 second trim? 💇♂️ pic.twitter.com/DqeokLazg2 — Guinness World Records (@GWR) September 4, 2022 చదవండి: మా గడ్డ మీలాగా కాదు.. పాక్‌కు తాలిబన్ల కౌంటర్ -
@ హెయిర్ బై సీమ
కట్టుబాట్లు, హద్దులు ఎన్ని ఉన్నా.. అన్నింటిని చెరిపేసి అనేక రంగాల్లో తమదైన ముద్రవేస్తున్న మహిళలెందరినో చూస్తున్నాం. చుట్టూ ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ తమలోని ప్రతిభతో వెలుగులోకి వచ్చి ప్రపంచానికి తామేంటో నిరూపిస్తూ ఎంత మందికి ఉదాహరణగా నిలుస్తున్నారు మరికొందరు. ఈ కోవకు చెందిన వారే సెలబ్రెటీ హెయిర్ స్టైలిస్ట్ సీమా మనే. షోలాపూర్‌లోని బర్షీలో పుట్టింది సీమా మనే. చిన్నతనంలో అనేక కష్టాలను చూస్తూ ఆశ్రమంలో పెరిగిన సీమ.. తొమ్మిదో తరగతి అయిన తరువాత చదువు మానేసింది. ఆశ్రమంలోనే హెల్త్ సెంటర్లో పనికి చేరింది. తర్వాత కొన్నేళ్లకు పెళ్లి కుదిరింది సీమకు. వివాహం తరువాత భర్త అండతో తన కష్టాలు కాస్త కుదుటపడ్డాయి. దీంతో ఐదేళ్ల తరువాత భర్త ప్రోత్సాహంతో తనకెంతో ఇష్టమైన హెయిర్ కటింగ్ కోర్సు చేయాలనుకుంది. భర్త సహకారం అందించడంతో పదోతరగతి చదువుతూనే హెయిర్ కటింగ్‌లో డిప్లొమా చేసింది. కోర్సు పూర్తయ్యాక ఇంట్లోనే ఒక సెలూన్ ఏర్పాటు చేసుకుంది. అలా రెండేళ్లపాటు సెలూన్ నిర్వహించిన తరువాత సీమకు ఓ ఫ్యాషన్ షోలో హెయిర్ స్టైలిస్ట్‌గా అవకాశం వచ్చింది. తక్కువ సమయంలో వెరైటీ, మోడ్రన్ హెయిర్ స్టైల్స్‌తో మోడల్స్‌ను తీర్చిదిద్దడంతో ఈ ఫ్యాషన్ ప్రాజెక్ట్ విజయవంతమైంది. దీంతో సీమకు మంచి హెయిర్ స్టైలిస్ట్‌గా గుర్తింపు వచ్చింది. ఈ గుర్తింపుతో ‘ఎట్ ది రేట్ హెయిర్బై సీమ’ పేరుతో సోషల్ మీడియాలో అకౌంట్ ను ప్రారంభించింది. ఈ అకౌంట్లో సరికొత్త హెయిర్ స్టైల్స్‌ను పోస్టు చేస్తుండేది. ఈ హెయిర్ స్టైల్స్ నచ్చడంలో గ్లామర్ ప్రపంచంలో సీమ బాగా పాపులర్ అయ్యింది. దీంతో సినిమాలు, ఫ్యాషన్ షోలు, ఫోటోషూట్స్‌లో పనిచేయడానికి అవకాశాలు వచ్చేవి. వచ్చిన ప్రతి అవకాశాన్ని తన ప్రతిభతో సరికొత్త హెయిర్‌స్టైల్స్‌ను రూపొందించి తానేంటో నిరూపించింది. దీంతో సెలబ్రిటీల దృష్టిలో పడింది సీమ. ఒక్కోమెట్టు ఎక్కుతూ... అంతర్జాతీయంగానూ సీమ హెయిర్‌స్టైలిస్ట్‌గా పనిచేసిన సెలబ్రెటీలలో మాధురీ దీక్షిత్, అలియా భట్, తాప్సీ పన్ను, కియరా అడ్వాణి, బిపాషా బసు, కత్రినా కైఫ్, అంబాని కుటుంబానికి చెందిన విభూతి ఉన్నారు. అంతర్జాతీయ వెబ్ సిరీస్ ‘ఏ సూటబుల్‌బాయ్’ లో టబుకు హెయిర్ స్టైలిస్ట్‌గా పనిచేసింది. ‘ఘాజీ’ సినిమాలో తాప్సీకి, నామ్ షబాన, లక్ష్మీబాంబ్, సూర్మ, మన్ మర్జియా, జుడ్వా–2 సినిమాలకు పనిచేసింది. కళంక్, గుడ్‌న్యూస్, ఎంఎస్ ధోణి, కబీర్ సింగ్ సినిమాల్లో కియరా అడ్వాణికి హెయిర్ స్టైల్స్ చేసింది. తెలుగు సినిమా బాద్షాలో కాజల్ అగర్వాల్‌కు మోడ్రన్ హెయిర్ స్టైల్స్‌ను అందించింది. ఒక్క ఇండియాలోనేగాక అంతర్జాతీయ స్థాయిలోనూ సీమకు మంచి గుర్తింపు లభించింది. 2016లో ఓ పెళ్లిలో హెయిర్‌స్టైల్స్ చేయడానికి ఇటలీ వెళ్లగా, ఆ ఏడాది విడుదలైన ‘ద వోగ్ వెడ్డింగ్ బుక్’లో సీమ పేరు ప్రస్తావించారు. చేసే పనిలో నిజాయితీ ఉండాలి ‘‘నిజాయితీగా పనిచేస్తే ఫలితం మనకు వందశాతం అనుకూలంగా వస్తుందని అమ్మ చెప్పేవారు. ఎన్ని సమస్యలు ఉన్నా నిబద్ధతతో పని చేయడం వల్లే ఈ స్థాయికి చేరుకున్నాను. తాప్సీ, కియరా లాంటి సెలబ్రెటీల సాయంతో బాలీవుడ్లో నాకంటూ ఒక గుర్తింపుని తెచ్చుకోగలిగాను. ప్రస్తుతం ప్రారంభించబోయే హెయిర్ అకాడమీ, స్టూడియోల ద్వారా నాలా మరికొంతమందిని ఇండస్ట్రీకి అందించడమే నా లక్ష్యం’’ అని చెబుతోంది సీమ. మనలో కష్టపడే తత్వం, ప్రతిభ ఉంటే ఎన్ని అవాంతరాలు ఎదురైనా జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగవచ్చనడానికి సీమ జీవితమే నిదర్శనం. -
థూ.. థూ ఉమ్ముతో హెయిర్ కటింగ్.. వైరల్ వీడియో
లక్నో: ఇండియాలోని అత్యంత ప్రసిద్ధిగాంచిన హెయిర్ స్టైలిస్ట్‌లలో ఒకరైన జావేద్ హబీబ్ తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. జావెద్ హబీబ్ హెయిర్ కట్ చేస్తూ ఓ మహిళ నెత్తి మీద ఉమ్మివేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హెయిర్ స్టైలిస్ట్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలేం జరిగిందంటే.. జావెద్ హబీబ్ కొంతమందితో కలిసి ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫనగర్లో ట్రైనింగ్ సెమినార్ నిర్వహించారు. ఇందులో ఓ మహిళను హెయిర్ కట్ కోసం సెలూన్ కూర్చీ వద్దకు పిలిచాడు. దువ్వెనతో జుట్టును సరిచేస్తూ.. సెమినార్‌కు హాజరైన వారికి హెయిర్ కేర్ టిప్స్ చెప్తున్నాడు ఇంతలోనే ‘ఒకవేళ నీటి కొరత ఉంటే ఉమ్మితోనే గడిపేయాలి..' అంటూ అందరి ముందే ఆయన మహిళ నెత్తి మీద ఉమ్మివేశాడు. దీంతో అక్కడున్న జనమంతా చప్పట్లు కొడుతూ నవ్వుకున్నారు. అయితే మహిళ జుట్టు చాలా పొడిగా ఉందని చెబుతూ, ఉమ్మిలో ఓ పవర్ కూడా ఉందంటూ తను చేసిన తప్పు పనిని కప్పిపుచ్చుకున్నాడు. ఈ వీడియో ఎప్పుడో జరిగిందో క్లారిటీ లేదు. కానీ దీనికి సంబంధించిన క్లిప్ వైరల్‌గా మారడంతో నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. అనేక మంది జావేద్ చేసిన అనుచిత పని పట్ల అసహనం వ్యక్తం చేస్తూ తిట్టిపోస్తున్నారు. జావేద్ చర్య సెలూన్ పరిశ్రమకు అగౌరవమని పలువురు మండిపడుతున్నారు. కాగా ఈ వీడియోలో తనకు ఎదురైన అవమానకరమైన అనుభవాన్ని షేర్ చేసేందుకు సదరు మహిళ ట్విటర్లో వీడియోను పోస్టు చేసింది. చదవండి: నోట్లో సిగరెట్, చేతిలో గన్.. జాంజాం అని బుల్లెట్ రైడింగ్.. విషయం బయటపడటంతో.. This is Javed Habeeb... Spitting instead of using water... absolutely horrible 🤮🤬 pic.twitter.com/8s7xaE8qfO — Kungfu Pande 🇮🇳2.0 (@pb3060) January 5, 2022 ‘నా పేరు పూజాగుప్తా. నేను ఓ బ్యూటీ సెలూన్‌ను నిర్వహిస్తాను. ఇటీవల జావేద్ హబీబ్ సార్ ఏర్పాటు చేసిన సెమినార్‌కు వెళ్లాను. అతను నన్ను హెయిర్ కట్ కోసం స్టేజ్ మీదకు పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడు. మీ దగ్గర నీళ్లు లేనప్పుడు హెయిర్ కట్కు ఉమ్మి ఉపయోగించవచ్చని చెప్పాడు. కానీ నేను హెయిర్ కట్ చేయించుకోలేదు. ఒకవేళ నేను మా పక్కింటి మంగళి వ్యక్తి దగ్గర హెయిర్ కట్ చేయించుకుంటాను. కానీ జావేద్ హబీబ్ దగ్గరకు వెళ్లను' అని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా తాజా వివాదంపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని మహిళా చైర్ పర్సన్ రేఖా శర్మ ఉత్తర ప్రదేశ్ పోలీసులను కోరారు. చదవండి: అరెరే ఎంతపనాయే.. బెడిసికొట్టిన వెడ్డింగ్ ఫోటోషూట్.. ఫోటోలు వైరల్ Ms. Pooja's response pic.twitter.com/QKvyoMlCHU — Kungfu Pande 🇮🇳2.0 (@pb3060) January 6, 2022 -
కొప్పున పువ్వులు పెట్టుకోవడం కాదు.. కొప్పునే పువ్వులా మార్చితే ఎలా ఉంటుందంటే?
‘‘పూల రెక్కలు.. కొన్ని తేనె చుక్కలు.. రంగరిస్తివో ఇలా బొమ్మ చేస్తివో’’అంటూ పూవులాంటి అమ్మాయిని పొగిడాడో సినీ కవి. కానీ ఆ పూల రెక్కలంత పలుచగా.. నిజమైన పువ్వేనేమో అన్నంత అం దంగా జుట్టును డిజైన్ చేయగలడీ హెయిర్‌డ్రెస్సర్. ఈ పూల కొప్పుల సృష్టికర్త వియత్నాంకు చెందిన 28 ఏళ్ల గుయెన్ ఫట్ ఫట్ ట్రి. ‘‘కొప్పున పువ్వులు పెట్టుకోవడం పాత పద్ధతి. కొప్పునే పువ్వులా దిద్దుకోవడం కొత్త స్టైల్’’అంటూ మందారం, చామంతి, లిల్లీ, లోటస్... ఇలా అనేక రకాల పూల డిజైన్లలో జుట్టును వేస్తున్నాడు. జియాంగ్ యూనివర్సిటీలో బయోటెక్నాలజీ డిగ్రీ చదివిన గుయెన్‌కు ఈ ఆర్ట్ ఏంటంటూ ప్రారంభంలో ఎన్నో అడ్డంకులు... అయినా కొన్నాళ్లకు తనది రైట్ ఛాయిస్ అని నిరూపించాడు. చదవండి: పెరిగే వయసుకు కళ్లెం.. నిత్య యవ్వనం ఇక సులువే.. ఇప్పుడు వియత్నాం హెయిర్ స్టయిల్ ఇండస్ట్రీలో గుయెన్దో ప్రత్యేక ముద్ర. ఆయన డిజైన్ చేసే ఒక్కో హెయిర్ స్టైల్ఖరీదు... పది, పదిహేను, ఇరవై వేల వరకు ఉంటుంది. ఇక సాధారణ స్టయిల్ చేయడానికి ఒకటి నుంచి రెండు రోజులుపడితే... కొన్ని మాత్రం రెండు మూడు నెలల సమయం తీసుకుంటాయి. వియత్నాం హెయిర్ ఇండస్ట్రీకి ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకురావడం, తనలాంటి కళాకారులను ప్రోత్సహించడమే తన లక్ష్యమని చెబుతున్నాడు. చదవండి: ‘ఆ పసి హృదయం ఎంతగా గాయపడిందో ఆ కళ్లే చెబుతున్నాయి' -
రామ్‌చరణ్ హెయిర్ స్టైలిస్ట్‌కు ఒక్క రోజుకే అన్ని లక్షలా?
Do You Know Ram Charan Hair Stylist Remuneration: మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ప్రతి సినిమాలో డిఫరెంట్ లుక్స్‌తో అలరిస్తారు. స్టార్ హీరో నుంచి పాన్ ఇండియా స్టార్‌గా మారిన రామ్‌చరణ్ శంకర్ దర్శకత్వంలో RC15 చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్‌చరణ్ చాలా స్టయిలిష్ లుక్‌లో కనిపిస్తున్నారు. దీని కోసం ప్రత్యేకంగా ముంబై నుంచి ఓ ప్రత్యేక టీంను నియమించుకున్నారట. రామ్‌చరణ్ హెయిర్ స్టైలిస్ట్‌కు మాత్రమే ప్రొడక్షన్ టీమ్ ఒక్క రోజుకి రూ.1.5-2 లక్షల రూపాయలు చెల్లిస్తున్నారట. ఈ స్టైలిస్ట్‌కు తోడుగా మరో ముగ్గురు అసిస్టెంట్లు కూడా ఉన్నారు. షూటింగ్ ఉన్న ప్రతిసారి వీరికి బిజినెస్ క్లాస్ ఫ్లయిట్ టికెట్‌తో పాటు స్టార్ హోటల్‌ను బుక్ చేస్తారట. అలా షూటింగ్ పూర్తయ్యేసరికి దాదాపు కోటి రూపాయల వరకు అవుతుందట. పాన్ ఇండియా సినిమా అంటే ఈ మాత్రం ఉండాల్సిందేగా మరి. ప్రస్తుతం రామ్‌చరణ్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7న విడుదల కానుంది. -
ప్రొఫెసర్ జాబ్ వదిలేసి.. బాలీవుడ్ ఫ్యాషన్‌కే ట్రెండ్ సెట్టరయ్యింది.!
భద్రజీవిత ప్రమాణాలతో పోల్చితే, దిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్)లో చేస్తున్న ప్రొఫెసర్ ఉద్యోగాన్ని వదులుకొని బాలీవుడ్‌లోకి అడుగుపెట్టడం రిస్క్ అనిపించవచ్చు. అందుకే ‘’ అని నిటషా గౌరవ్‌తో అన్నవాళ్లే ఎక్కువ. చదవండి: Health Tips: టీలో ‘తేనె’ కలిపి తాగుతున్నారా? స్లో పాయిజన్‌గా మారి..! విజయం దక్కాలంటే రిస్క్ చేయడం తప్పనిసరి అనే వాస్తవం నిటషాకు తెలియనిదేమీ కాదు. ‘నిఫ్ట్’లో ప్రొఫెసర్ అయినంత మాత్రాన, ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ న్యూయార్క్, లండన్ కాలేజీ ఆఫ్ ఫ్యాషన్‌లో చదువుకున్నంత మాత్రాన అవకాశాలు వెదుక్కుంటూ రావు అనే విషయం ఆమెకు తెలియనిదేమీ కాదు. నిటషా గౌరవ్ ఎందుకంటే...ప్రతి హీరోకి ఒక బాడీలాంగ్వేజ్ ఉంటుంది. ‘నాకు ఇలాంటి స్టైల్ ఉండాలి’ అని అతను అనుకుంటాడు. ‘మా హీరోకి ఇలాంటి స్టైలే ఉండాలి’ అని డైరెక్టర్ అనుకుంటాడు. ‘మా హీరోకి ఇలాంటి స్టైల్ ఉండాలి’ అని అభిమాని అనుకుంటాడు. చాలా సందర్భాల్లో హీరోకి నచ్చిన స్టైల్ అభిమానికి నచ్చకపోవచ్చు. ఇద్దరికీ నచ్చింది డైరెక్టర్‌కు నచ్చకపోవచ్చు. మరి ముగ్గురు మెచ్చేలా స్టైల్ డిజైనింగ్ చేయడం అనేది ఆషామాషీ విషయం కాదు. అకడమిక్ చదువులు మాత్రమే పనికిరాకపోవచ్చు. నిటషా మాటల్లో చెప్పాలంటే ఒక పుస్తకంలా హీరోని అధ్యయనం చేయాలి. చదవండి: షుగర్ వ్యాధిగ్రస్తులకు ‘తీపి’ కబురు.. పామ్ నీరా, బెల్లం! ‘బ్యాండ్ బాజా బరాత్’ సినిమా విడుదలైన రోజులవి. అప్పటికింకా రణ్‌వీర్‌సింగ్ అంత పెద్దస్టార్ కాలేదు. అంతమాత్రాన ‘మీకు స్టైలిష్ట్‌గా పనిచేస్తాను’ అంటే వెంటనే ‘ఓకే’ అని ఎవరూ అనరు. కొత్త హీరోలు, కొత్త భయాలు ఉంటాయి! ఇప్పుడిప్పుడే ప్రయోగాలు వద్దనుకుంటారు. అయితే రణ్వీర్సింగ్లాంటివారు దీనికి మినహాయింపు. కొత్తవాళ్లను ప్రోత్సహిస్తారు. రణ్వీర్ ‘ఫిల్మ్‌ఫేర్’ పత్రిక ముఖచిత్రం కోసం రణ్వీర్ స్టైలిస్ట్‌గా అడుగుపెట్టింది నిటషా. ఆ కవర్‌కు ఎంత పేరొచ్చిందంటే...‘ఎవరీ స్టైలిస్ట్?’ అని అందరూ ఆరా తీయడం మొదలుపెట్టారు. అలా రణ్‌వీర్‌కు నిటషా మీద నమ్మకం కుదిరింది. కట్ చేస్తే.... బాలీవుడ్ సెలబ్రిటీ స్టైలిస్ట్‌గా పది సంవత్సరాల మైలురాయిని దాటేసింది! ‘అదృష్టవశాత్తు అవకాశం వచ్చింది.. వినియోగించుకున్నాను’ అన్నట్లుగా కాకుండా మెన్ ఫ్యాషన్‌ను పునర్నిర్వచించిన ట్రెండ్ సెట్టర్‌గా పేరు తెచ్చుకుంది నిటషా. రణ్‌వీర్‌కు మాత్రమే కాదు ప్రియాంకచోప్రా, అర్జున్ కపూర్, విద్యాబాలన్, వరుణ్ ధవన్...ఇలా ఎంతోమంది తారలకు స్టైలిస్ట్‌గా పనిచేస్తుంది. తాను బాలీవుడ్‌లోకి అడుగుపెట్టకముందు స్టైలింగ్‌లో ‘రూల్‌బుక్’ అనేది అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. ‘రూల్‌బుక్’కు అతీతంగా ఏమీ చేయడానికి కుదరదు. అదంతే! అన్నట్లుగా ఉండేది. ‘అప్పుడప్పుడూ రూల్స్ బ్రేక్ చేయడం కూడా మంచి రూలే’ అంటున్న నిటషా చాలాసార్లు ‘రూల్‌బుక్’కు అతీతంగా వెళ్లింది. కొన్నిసార్లు పాఠాల్లో లేని ‘స్ట్రీట్ లుక్’ను సృష్టించింది. ‘స్టైల్ అనేది నేల విడిచి సాము చేయకూడదు. అది మన వ్యక్తిత్వంలో భాగంగా కనిపించాలి’ అంటున్న నిటషాకు 70’లలోని బాలీవుడ్ సినిమా స్టైల్ అంటే ఇష్టం. విజయం గొప్పదనం ఏమిటంటే...అది అందుకున్న వ్యక్తికి మాత్రమే పరిమితం కాదు. దాని వెలుగులు దశదిశలా వ్యాపించి ఎంతో మందికి స్ఫూర్తి ఇస్తాయి. సెలబ్రిటీ స్టైలిస్ట్‌గా రాణించాలనుకుంటున్న ఎంతోమంది ఔత్సాహికులకు ఇప్పుడు నిటషా గౌరవ్ రోల్ మోడల్. చదవండి: టెంపుల్ డ్యాన్స్ వీడియోలతో .. ప్రాచీన ఆలయాలకు నూతన శోభ!! -
ఎవరికి వారే హెయిర్ స్టైలిస్టులు
‘అసలే కరోనా.. పిల్లలకు కటింగ్ పెరిగింది..సెలూన్‌కు తీసుకెళ్లాలంటే భయమేస్తుంది.. అందుకే నేనే వారికి ఇంట్లో నేనే కటింగ్ చేశా ’ అని బోడుప్పల్‌కు చెందిన ప్రశాంత్ చెప్పాడు. ఇలా నగరంలో చాలా మంది పిల్లలకు కటింగ్ చేయడంతోపాటు సొంతంగా తామే చేసుకుంటున్నారు. సెలూన్ ఎట్ హోమ్..అవును ఇప్పుడు ఇదే సరికొత్త ట్రెండ్. ఎవరి ఇళ్లల్లో వారే హెయిర్ కటింగ్ చేసుకుంటున్నారు. అవసరమైతే భార్య, పిల్లల సైతం సహాయం కోరుతున్నారు. ఇంట్లో తల్లిదండ్రులే పిల్లలకు హెయిర్ కట్ చేస్తున్నారు. సెలూన్లకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు. మగువల బ్యూటీపార్లర్లు సైతం ఇళ్లల్లోనే వెలిశాయి. సాక్షి, హైదరాబాద్: కోవిడ్ మోసుకొచ్చిన సరికొత్త జీవన శైలి ఇది. సెలూన్లు, పార్లర్లకు వెళ్లేందుకు చాలా మంది వెనుకడుగు వేస్తున్నారు. కోవిడ్ కారణంగా అన్ని రంగాల్లో సరికొత్త పోకడలు ముందుకు వచ్చేశాయి. చివరకు హెయిర్ కటింగ్ కోసం కూడా బయటకు వెళ్లకుండా వైరస్ కట్టడి చేసింది. ఇందుకోసం యూట్యూబ్ పాఠాలు సైతం దొహదం చేస్తున్నాయి. నచ్చిన పద్ధతిలో, చక్కటి ఆకృతిలో హెయిర్ కటింగ్ చేసుకొనేందుకు యూట్యూబ్ శిక్షణనిస్తోంది. ఇదే సమయంలో ఇంటి వద్దకు వచ్చి సర్వీసులు అందజేసే ఆన్లైన్ సంస్థలకు సైతం డిమాండ్ కనిపిస్తోంది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పనిచేసే ఈ ఆన్లైన్ సంస్థలు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. దీంతో సాధారణ సెలూన్లు, బ్యూటీపార్లర్లకు డిమాండ్ తగ్గుముఖం పట్టింది. కార్పొరేట్ సెలూన్ల మనుగడ సైతం ప్రశ్నార్థకంగా మారింది. సెలూన్ మనుగడ ప్రశ్నార్థకం ‘‘ఆరు నెలలైంది. గిరాకీ లేదు. మూడు నెలలుగా అద్దెలు చెల్లించలేదు. కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా మారింది. భవిష్యత్తుపై ఆశలు సన్నగిల్లుతున్నాయి’’ నాగోల్ దగ్గర్లోని బండ్లగూడకు చెందిన ఉదయ్ అనే ఒక బార్బర్ ఆవేదన ఇది. చిన్న సెలూన్ అతనిది. కరోనాకు ముందు జీవితం సాఫీగా సాగింది. రోజుకు రూ.వెయ్యి పైనే లభించింది. కానీఇప్పుడు వారం రోజులు పని చేసినా రూ.200 కూడా రావడం లేదు. ఒక్క ఉదయ్ మాత్రమే కాదు. నగరంలో వేలకొద్దీ సెలూన్ల పరిస్థితి ఇదే.. క్షౌ రవృత్తిదారుల సంఘాల అంచనాల మేరకు గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 30 వేల హెయిర్ కటింగ్ సెలూన్లు, మరో 10 వేలకు పైగా బ్యూటీ పార్లర్లు ఉన్నాయి. ఈ రెండు కేటగిరీలలో కలిపి కనీసం 7 వేల నుంచి 8 వేల సెలూన్లు, పార్లర్లు గిరాకీ లేక మూతపడినట్లు అంచనా. ఇంకా కొన్ని మూసివేత దిశగా ఉన్నాయి. కోవిడ్ మహమ్మారి వేలాది కుటుంబాలకు ఆర్థికంగా చితికిపోయాయి. దూసుకెళ్తున్న ట్రిమ్మర్ సికింద్రాబాద్‌లోని ఒక కాస్మొటిక్ షోరూమ్‌లో ప్రతి నెలా సుమారు 5 వేల ట్రిమ్మర్లను విక్రయిస్తారు. సాధారణంగా సెలూన్ నిర్వాహకులే వీటిని కొనుగోలు చేస్తారు. కానీ గత జూలై నెలలో ఆ ఒక్క షోరూమ్‌లోనే ఏకంగా 20 వేల ట్రిమ్మర్లను విక్రయించారు. గ్రేటర్ హైదరాబాద్ అంతటా ఆ నెలలో సుమారు 2.5 లక్షల ట్రిమ్మర్ల విక్రయం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఒక్క హెయిర్ కటింగ్ కోసం, షేవింగ్ కోసం వినియోగించే ట్రిమ్మర్లే కాదు. రేజర్లు, సీజర్లు, లోషన్లు, ఫోమ్‌లు, డిస్పోజల్ షీట్స్, కోంబ్స్ వంటి వాటి విక్రయాలు సైతం గణనీయంగా పెరిగాయి. వినియోగదారులే స్వయంగా వచ్చి కొనుగోలు చేయడమే ఇందుకు కారణమని వ్యాపార సంస్థలు చెబుతున్నాయి. ఇలా కొనుగోలు చేస్తున్న వాళ్లలో స్వయంగా హెయిర్ కటింగ్‌లు చేసుకొనేవాళ్లతో పాటు బార్బర్ల వద్ద సొంత వస్తువులను వినియోగించే వాళ్లు కూడా ఉన్నారు. చిన్న చిన్న హెయిర్ కటింగ్ సెలూన్లు మొదలుకొని కార్పొరేట్ సెలూన్లు, బ్యూటీపార్లకు వివిధ రకాల వస్తువులను విక్రయించే వ్యాపార సంస్థలు ఇప్పుడు నేరుగా వినియోగదారులకే విక్రయించడం ఈ సరికొత్త ట్రెండ్‌లో భాగమే. దీంతో బేగంబజార్, కోఠీ, చార్మినార్, సికింద్రాబాద్, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్ వంటి వివిధ ప్రాంతాల్లో ఉన్న కాస్మొటిక్ షోరూమ్‌లలో ఈ వస్తువుల అమ్మకాలు భారీగా పెరిగాయి. రూ.కోట్లల్లో వ్యాపారాలు జరుగుతున్నాయి. కుదేలైన పార్లర్లు... తిరుమలగిరి ఆర్టీసీ కాలనీకి చెందిన ఒక బ్యూటీపార్లర్ కోవిడ్‌కు ముందు స్త్రీ, పురుషులకు ప్రత్యేకంగా సేవలందజేసింది. వినియోగదారులు ముందస్తు అపాయింట్మెంట్లతో వచ్చేవారు. కానీ ఇప్పుడు వినియోగదారుల సంఖ్య మూడొంతుల మేరకు పడిపోయింది. ‘కోవిడ్ ప్రొటోకాల్ మేరకు సర్వీసులు అందజేస్తున్నప్పటికీ వినియోగదారులు ముందుకు రావడం లేదు..’అని నిర్వాహకులు శ్రీనివాస్ విస్మయం వ్యక్తం చేశారు. బడంగ్‌పేట్‌కు చెందిన పేజ్ 18 సెలూన్ అండ్ అకాడమీ ఒక శిక్షణా సంస్థ. మహిళలకు, పురుషులకు విడి విడిగా సర్వీసులు అందజేస్తుంది. హెయిర్ డిజైనర్లకు శిక్షణనిస్తోంది.‘ఏడాది క్రితం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన అకాడమీ భవితవ్యం ప్రశార్థకంగా మిగిలింది.’’అని ఆవేదన వ్యక్తం చేశారు నిర్వాహకులు సతీష్‌కుమార్. కార్పొరేట్ సెలూన్లపైనా ప్రభావం ఈ క్రమంలోనే కోట్లాది రూపాయలు ఖర్చుచేసి ఏర్పాటు చేసిన కార్పొరేట్ బ్యూటీపార్లర్లు, సెలూన్లలోనూ వినియోగదారుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. వివిధ సంస్థలకు చెందిన వందలాది ఫ్రాంచైసీస్ మూతపడ్డాయి. నగరంలో బాగా ప్రాచుర్యం పొందిన నేచురల్స్, గ్రీన్‌ల్యాండ్స్, అలెగ్జాండర్, జావేద్ వంటి అనేక బడా సంస్థల్లో సైతం 60 శాతానికి పైగా ఆదాయం పడిపోయింది. సగానికి పైగా సిబ్బందిని కుదించారు. సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్ సెలూన్లో కరోనాకు ముందు ప్రతి నెలా రూ.25 లక్షలకు పైగా ఆదాయం లభించగా ఇప్పుడు రూ.8 లక్షలు కూడా రావడం లేదని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్లైన్ సంస్థలతో మరింత దెబ్బ.. ఇటీవల వినియోగంలోకి వచ్చిన ఆన్లైన్ సంస్థలు సెలూన్ల మనుగడను మరింత ప్రశ్నార్థకం చేశాయి. ఇళ్ల వద్దకే వెళ్లి సేవలందజేసే వెసులుబాటు కల్పించడంతో చాలామంది ఆన్లైన్ సంస్థలను ఆశ్రయియిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న సెలూన్లు, బ్యూటీపార్లకు గిరాకీ లేకుండా పోతోంది. సాధారణ సెలూన్లకే కాకుండా బడా కార్పొరేట్ సెలూన్లకు కూడా ఆన్లైన్ సంస్థలు సవాల్ విరుతున్నాయి. వ్యక్తిగత రక్షణకే కరోనా నుంచి వ్యక్తిగత రక్షణ పొందేందుకే సెలూన్లకు వెళ్లడం లేదు. యూట్యూబ్‌లో చూసి స్వయంగా హెయిర్ కట్ చేసుకుంటున్నారు. పరిస్థితులు మారే వరకు తప్పదు మరి. – సంతోష్, హైటెక్‌సిటీ పిల్లలకు నేనే హెయిర్ స్టైలిస్ట్ పిల్లలకు సెలూన్‌కు తీసుకెళ్లాలంటే భయమేస్తుంది. అందుకే ఇంటి దగ్గర నేనే కట్ చేస్తున్నాను. కొద్దిగా ఇబ్బందిగానే ఉన్నా సెలూన్ కంటే ఇల్లే సేఫ్ కదా. – ప్రశాంత్‌రెడ్డి, బిజినెస్మెన్, బోడుప్పల్ భవిష్యత్తు ప్రశార్థకమే గతంలో ప్రతి రోజూ కనీసం 30 మంది మహిళలు వివిధ రకాల సర్వీసుల కోసం వచ్చేవారు. ఇప్పుడు రోజులో ఐదుగురు కూడా రావడం లేదు. – సుకన్య, బడంగ్పేట్,బ్యూటీపార్లర్ నిర్వాహకులు ఒక పాలసీని రూపొందించాలి సెలూన్లను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి. ఆర్థిక సహాయం చేయాలి. ప్రతి కుటుంబానికి రూ.50 వేల సహాయం అందజేయాలి. –బాలకృష్ణ నాయీ, క్షౌరవృత్తిదార్ల సంఘం అధ్యక్షుడు -
పిల్లికూతల మధ్య పులి
దక్షిణాది ఇరాక్‌లో పురుషులకు పని చేసే తొలి బార్బర్‌గా జైనబ్ వార్తలకెక్కింది. స్త్రీలు కొత్త ఉపాధి మార్గాల్లో పయనించడం తెలుసు. అయితే అవన్నీ దాదాపుగా సామాజిక అంగీకారం ఉన్న ఉపాధి మార్గాలే. పురుషులకే పరిమితం వంటి ఉపాధి మార్గాల్లో స్త్రీలు ప్రవేశించినప్పుడు వారికి వ్యతికరేకత రావడం సహజం. ఇక ఇరాక్ వంటి దేశంలో ముస్లిం స్త్రీలకు ఇది ఎక్కువ సవాలు కావచ్చని అనుకుంటాం. కాని జైనబ్ ఆ సవాళ్లను ఎదిరించి నిలుచుంది.ఇరాక్‌లోని బాబిలోన్ ప్రాంతంలో ఉండే ‘హిల్లా’ పట్టణంలో జైనబ్ ఒక సంచలనం సృష్టించినట్టే లెక్క. ఎందుకంటే ఆమె హిజాబ్ ధరించి ఆ పట్టణంలోని బార్బర్ షాప్‌లో పురుషులకు హెయిర్ కట్ చేస్తుంది. కోరిన వారికి ఫ్యాన్సీ పచ్చబొట్లను కూడా పొడుస్తుంది. ఇద్దరు పిల్లల తల్లి అయిన జైనబ్ ఇలాంటి పురుషుల ఉపాధిలోకి రావడం అక్కడి పురుషులకు మింగుడు పడలేదు.‘నేను షాపుకు నడిచినంత సేపు నా వెనుక పిల్లికూతలు కూసి హేళన చేసిన వారే అంతా’ అంది జైనబ్.కాని ఆమె అదంతా పట్టించుకోకుండా పని చేయడం మొదలెట్టింది. ‘నా స్నేహితురాళ్లకు ఇదే చెబుతుంటాను. మనం ఉన్నది ఇంట్లో కూచుని గుడ్లు పెట్టడానికి కాదు అని’ అంటుందామె. జైనబ్ పని చేసే కొద్దీ ఆమెను గౌరవించి తల అప్పగించడానికి వచ్చే పురుషులు పెరిగారు. ‘నాకంటూ కొంతమంది కస్టమర్లు ఏర్పడ్డారు’ అంటుంది జైనబ్ సంతృప్తిగా. ఆమెకు సెలూన్ ఓనర్ గట్టి మద్దతుగా నిలిచాడు. ‘కొందరు మత పెద్దలు వచ్చి ఇందుకు అభ్యంతరం చెప్పారు. నేను పట్టించుకోలేదు. ఇరాక్ నవ నిర్మాణంలో స్త్రీలు కూడా ముఖ్య భూమిక పోషించేలా మనం వారిని ప్రోత్సహించాలి కదా’ అన్నాడతను.హిజాబ్‌ను ఒక అస్తిత్వంగా భావిస్తూ హిజాబ్‌తోనే ఉద్యోగ ఉపాధి రంగాల్లో కొనసాగాలనే స్త్రీలు భారతదేశంలో ఉన్నారు. -
మోడల్స్.. మెరుపుల్
-
ఆలిమ్ ఆగయా
తెరకెక్కించే ప్రతీ సినిమాలో గుర్తుండిపోయే పాత్రలను డిజైన్ చేస్తుంటారు దర్శకుడు రాజమౌళి. దానికి కారణం ఆ పాత్ర తాలూకు ఎమోషన్స్ మాత్రమే కాదు.. బాడీ లాంగ్వేజ్, కాస్ట్యూమ్స్, హెయిర్ స్టైల్.. ఇలా అన్నింట్లో రాజమౌళి అండ్ టీమ్ పెట్టే శ్రద్ధ అసమానం. ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. కియారా అద్వానీ, కీర్తీ సురేశ్ కథానాయికలు. దానయ్య నిర్మాత. ఈ చిత్రానికి హైయిర్ స్టైలిస్ట్‌గా షారుక్ ఖాన్, ఆమిర్‌ఖాన్, హృతిక్ వంటి టాప్ స్టార్స్‌కు పని చేసిన ప్రముఖ బాలీవుడ్ హైయిర్స్టైలిస్ట్ ఆలీమ్ హకీమ్‌ని ఎంపిక చేసుకున్నారు రాజమౌళి. ఆల్రెడీ ఆలిమ్తో ‘సై, బాహుబలి’ వంటి సినిమాలకు వర్క్ చేశారాయన. తాజా సినిమాలో హీరోల లుక్‌కి సంబంధించి çహకీమ్‌తో మాట్లాడారు రాజమౌళి. ఈ డిస్కషన్ గురించి ఆలిమ్ మాట్లాడుతూ– ‘‘లెజెండ్ రాజమౌళితో పని చేయడం చాలా సంతోషంగా ఉంది. క్యారెక్టర్ గురించి మొత్తం తెలుసుకోకపోతే పర్ఫెక్ట్ హెయిర్ స్టైల్ చేయలేను. ‘బాహుబలి’ తర్వాత మళ్లీ కలసి పని చేస్తున్నాం. ఈ సినిమా కూడా అలానే ఉండబోతోంది. రాజమౌళితో పని చేస్తూ చాలా నేర్చుకోవచ్చు. రాజమౌళి, రామ్‌చరణ్‌తో జరిపిన సంభాషణను చాలా ఎంజాయ్ చేశాను. ‘సై’ సినిమాలో నితిన్‌కు హైయిర్ స్టైలింగ్ చేయడం కోసం 15 ఏళ్ల క్రితం రాజమౌళిని తొలిసారి కలిశాను. ప్రతి సినిమాను వైవిధ్యంతో ప్రేక్షకులకు అందించడం ఆయనకు మామూలే. ఇండియన్ సినిమాకు ఆయన గర్వం. రాజమౌళి విజన్‌లో భాగం అవ్వడం సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు. మరి ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్ హైయిర్ స్టైల్స్ ఎలా ఉండబోతాయో? అభిమానులు అలానే హెయిర్ కట్ చేసుకొని ఎలా మురిసిపోతారో వేచి చూడాల్సిందే. ఈ చిత్రం 2020లో రిలీజ్ అవ్వనుంది. -
కంప్యూటర్ ఇంజినీర్ కత్తెర పట్టాడు
కంప్యూటర్ కీ బోర్డుపై ఆడించాల్సిన చేతులు.. సెలూన్లో కత్తెర పట్టి హెయిర్ డ్రెస్సింగ్ చేస్తున్నాయి.. కులవృత్తికి మించింది లేదు గువ్వల చెన్నా.. అనే నానుడిని నిజం చేస్తున్నాడీ కంప్యూటర్ ఇంజినీర్.. కులవృత్తిలో రాణిస్తున్నాడు.తానెంచుకున్న వృత్తికి చదువును జోడించి తన ప్రత్యేకతనుచాటుకుంటున్నాడు.అంతేకాకుండా ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన పోటీల్లో బంగారు పతకాన్ని సాధించాడు చారమ్స్ హెయిర్ బ్యూటీ సెలూన్ నిర్వాహకుడు సంపత్ కుమార్. రాంగోపాల్‌పేట్ : సికింద్రాబాద్ కార్ఖానాలోని కాకాగూడకు చెందిన నారాయణ, సత్య దంపతుల కుమారుడు సంపత్‌కుమార్. తండ్రి సికింద్రాబాద్ వైఎంసీఏ కాంప్లెక్స్‌లో చారŠమ్స్ హెయిర్ డ్రెస్సింగ్ పేరుతో రెండు దశాబ్దాలుగా బ్యూటీ సెలూన్ నిర్వహిస్తున్నారు. పలువురు సినీ ప్రముఖుల వద్ద వ్యక్తిగత హెయిర్ డ్రెస్సర్‌గా కూడా పనిచేస్తున్నారు. కుమారుడు సంపత్‌కుమార్ 2011లో బీటెక్ కంప్యూటర్స్ పూర్తి చేశాడు. కొద్దినెలల పాటు ఉద్యోగంలో చేరి నెలకు రూ.25 వేల నుంచి రూ.30వేల జీతం పొందేవాడు. కానీ ఆ ఉద్యోగం నచ్చక తండ్రి వద్దే హెయిర్ డ్రెస్సర్‌గా పనిచేస్తున్నాడు. అందరిలో ఒకడిగా ఉండకూడదని భావించి భిన్నంగా కనిపించాలని ఈ నిర్ణయానికి వచ్చాడతను. డిప్లొమాలు..ప్రముఖుల వద్ద శిక్షణ సంపత్‌కుమార్ హెయిర్ డ్రెస్సర్ వృత్తిలో అత్యున్నత స్థాయికి చేరుకోవాలని అంతర్జాతీయ పోకడలు, ఫ్యాషన్, తదితర అంశాల్లొ కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఉద్దేశంతో డిప్లొమాలు చేశాడు. ముంబైలోని ఉదయ్ టెక్కీస్ ఇనిస్టిట్యూట్‌తో పాటు అంతర్జాతీయ నిపుణుల వద్ద పలు డిప్లొమా కోర్సులు పూర్తి చేశాడు. అంతర్జాతీయంగా వస్తున్న ఫ్యాషన్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, హెయిర్, స్కిన్‌లకు సంబంధించి ఎన్నో కొత్త విషయాలను ఆకళింపు చేసుకుని ముందుకెళ్తున్నాడు. నగరంలోనే ఈ రంగంలో ఇన్ని డిప్లొమాలు చేసి ఎంతో నైపుణ్యం సంపాదించుకున్న వారిలో సంపత్‌కుమార్ లాంటి వారు లేరంటే అతిశయోక్తి కాదు. జాతీయస్థాయి పోటీల్లో బంగారు పతకం ఈ నెల 4, 5 తేదీల్లో ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఆలిండియా హెయిర్ అండ్ బ్యూటీ అసోసియేషన్ పోటీలను నిర్వహించింది. దేశ వ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖ హెయిర్ బ్యూటిషియన్లు, మేకప్ ఆర్టిస్ట్‌లు పాల్గొన్నారు. ఇందులో సంపత్‌కుమార్ హెయిర్‌కట్, మేకప్‌లో బంగారు పతకం సాధించాడు. గతంలో సూరత్‌లో జరిగిన పోటీల్లోనూ సంపత్ వెండి పతకం సాధించాడు. త్వరలో అంతర్జాతీయ స్థాయిలో జరిగే పోటీల్లో బహుమతి సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇనిస్టిట్యూట్ పెడతా.. ఎంతోమంది తమ కులవృత్తిని వదిలి ఇతర వృత్తుల్లోకి వెళుతున్నారు. రోజురోజుకూ ఫ్యాషన్ ఈ రంగం విస్తృతమవుతోంది. ఈ వృత్తిలో ఉండేవారు నైపుణ్యాలకు మెరుగులు పెట్టుకునేందుకు ఒక ఇనిస్టిట్యూట్‌తో శిక్షణ అందించాలనుకుంటున్నాను.– సంపత్ కుమార్ -
'మహానటి’.. ఆ నలుగురు
బంజారాహిల్స్ : తెలుగు చలనచిత్ర చరిత్రలోనే అద్భుతావిష్కరణ. ‘మహానటి’కిమహోన్నత ‘రూప’కల్పన. కీర్తి సురేష్‌లో సావిత్రిని పరకాయ ప్రవేశం చేసినట్లు తీర్చిదిద్దిన వైనం. ఆ నలుగురు సాంకేతిక నైపుణ్యానికితార్కాణం. ప్రేక్షకులను రంజింపజేసి.. మహానటి చిత్ర విజయంలో తమదైన పాత్ర పోషించారు వారు. కీర్తి సురేష్‌కు సావిత్రి పోలికలు, లుక్‌ను తీసుకురావడానికి నలుగురు సాంకేతిక నిపుణులు తెర వెనుక చేసిన కృషి అంతా ఇంతా కాదు. సావిత్రి నటించిన సినిమాలను ఒకటికి పదిసార్లు చూశారు. ఆమె హావభావాలు, డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్ ఒంటబట్టించుకున్నారు. కీర్తి సురేష్‌ను తెరపై జీవింపజేశారు. సావిత్రి రూపురేఖలను అచ్చుగుద్దినట్లు తీర్చిదిద్దడానికి కాస్ట్యూమర్ బొడ్డు శివరామకృష్ణ, హెయిర్‌స్టైలిస్ట్ రజబ్ అలీ, కాస్ట్యూమ్ స్పెషలిస్ట్ ఇంద్రాక్షి, మేకప్ మెన్ మూవేంద్రన్ కృషి అపురూపమైనది. వీరంతా ఓ సినిమా షూటింగ్ నిమిత్తం గురువారం హైదరాబాద్‌కు వచ్చారు. మహానటి సినిమాకు ఎలా కష్టపడింది, ఆ సినిమా ఏ మేరకు పేరుతీసుకొచ్చిందనే విషయాలపై ‘సాక్షి’తో ముచ్చటించారు. 190 హెయిర్ స్టైల్స్ మార్చాం నాది ముంబై. ఐదేళ్లుగా హెయిర్ స్టైలిస్ట్‌గా సినిమాల్లో పనిచేస్తున్నాను. అనుకోని వరంలా మహానటి సినిమాకు పనిచేసే అవకాశం లభించింది. ఈ సినిమాలో కీర్తి సురేష్‌ను సావిత్రిలా చూపించడానికి సుమారు 20 సినిమాలు నెల రోజుల పాటు చూడాల్సివచ్చింది. మూగ మనసులు సినిమాను ఆరు రోజులు ఏకధాటిగా చూశా. అందులో సావిత్రి హెయిర్ స్టైల్‌ను అచ్చుగుద్దినట్లు కీర్తి సురేష్‌కు తీసుకొచ్చాను. ఒకే విగ్గును 190 హెయిర్ స్టైల్స్‌గా మార్చాం. సావిత్రి ఒక్కో సినిమాలో ఒక్కో హెయిర్ స్టైల్‌తో ఆకట్టుకునేవారు. ఆమెది పొడవాటి జుట్టు. కీర్తి సురేష్‌ది తక్కువ జుట్టు. దీంతో విగ్గుతోనే సావిత్రిని తెరపై సృష్టించాల్సి వచ్చింది. ఇంకో వైపు సావిత్రి జుట్టు బాగా ఉంటే కీర్తి సురేష్‌ది సిల్కీ హెయిర్. దీంతో సావిత్రి జుట్టు తీసుకురావడానికి హెయిర్‌స్టైల్స్‌ను రకరకాలుగా మార్చాల్సి వచ్చింది. నా కెరీర్లోనే ఇదో అద్భుత అవకాశం. – రజబ్ అలీ, హెయిర్ స్టైలిస్ట్ 120 రోజుల కృషి ఫలితం ఇది.. మహానటి సినిమాకు 120 రోజుల పాటు పనిచేశా. పాత సినిమాలను ఔపోసన పట్టాను. ముఖ్యంగా నర్తనశాల, గుండమ్మకథ సినిమాలను పది రోజుల పాటు రేయింబవళ్లూ చూశాను. సావిత్రి హావభావాలు, ఆమె డ్రెస్సింగ్, ఆమె నడక, ఆమె కళ్లు ఎగరేసే తీరు ఇవన్నీ పరిశీలించాను. ఇంకో వైపు సావిత్రి చీర ఎలా కట్టుకుంటుంది, ఎలా నడుస్తుంది అన్నది ఈ సినిమాకు ఇంపార్టెంట్. ఇంకోవైపు సావిత్రి ఐనెక్ బ్లౌజ్‌లు వేసుకునేది. ఇప్పుడవి లేవు. ఆ తరహా బ్లౌజ్‌లను కుట్టించి సావిత్రి లుక్‌ను తెచ్చేందుకు చాలా కష్టపడ్డాను. ఈ సినిమాలో అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సావిత్రి లాంటి మహానటిని తెరమీద కీర్తి సురేష్‌లో తీర్చదిద్దడానికి కృషి చేయడం సంతోషంగా ఉంది. 40 సంవత్సరాలు వెనక్కి వెళ్లి సావిత్రిని తెరపై చూపించాలంటే ఎంత కష్టమో తెలిసింది. – బొడ్డు శివరామకృష్ణ, కాస్ట్యూమర్ చీరకట్టుతోనే సావిత్రి అందం సావిత్రి అందమంతా చీరకట్టులోనే ఉండేది. సంప్రదాయ తెలుగు యువతిని చూడాలంటే సావిత్రిని చూడాల్సిందే. కీర్తి సురేష్‌ను సావిత్రిలా చూపించాలంటే అప్పటి ఆమె కట్టు, బొట్టు బాగా ఆకళింపు చేసుకున్నా. ఇంకేముంది తగిన కాస్ట్యూమ్‌ను తగిన రీతిలో తీర్చిదిద్దాం. ఇందు కోసం రెండు నెలల పాటు కష్టపడ్డాం. సావిత్రి నడిచే విధానం, ఆమె చీరకట్టు గమనించడానికి చాలా రోజులు పట్టింది. అచ్చుగుద్దినట్లు కీర్తి సురేష్‌ను తెరపై చూపించాలంటే కాస్ట్యూమ్‌కు ఉన్న ప్రాధాన్యం గమనించాను. ఈ సినిమా ఇంత హిట్ కావడం నా జీవితంలోనే మరిచిపోలేనిది. ఇలాంటి సినిమాకు పనిచేయడం గర్వంగా ఉంది. – ఇంద్రాక్షి, స్టైలిస్ట్ ఆమె కళ్లతోనే భావాలు పలికించేవారు మహానటి సావిత్రి సినిమాను కీర్తి సురేష్‌తో తియ్యడం అందులో నేను మేకప్ మెన్‌గా ఉండటం అదృష్టమనే చెప్పాలి. సావిత్రి నటించిన 15 సినిమాలు రేయింబవళ్లూ చూసి ఆమె మేకప్‌ను గమనించాను. కీర్తి సురేష్‌కు ఎలా మేకప్ వేస్తే సావిత్రి లుక్ వస్తుందో అంచనాకు వచ్చాను. బ్లాక్ అండ్ వైట్ సీన్స్, కలర్ సీన్స్‌లో కీర్తి సురేష్ ఎలా ఉంటుంది, ఆ మేరకు మేకప్ ఎలా వేయాలి అన్నదానిపైనే దృష్టి సారించాను. సావిత్రి కళ్లు బాగుంటాయి. అవే కళ్లను కీర్తి సురేష్‌కు తీసుకురావాలంటే 20 రకాల వేరియేషన్స్‌ను తీసుకొచ్చాం. ముఖ్యంగా ఐబ్రోతోనే కీర్తి సురేష్‌కు సావిత్రి లుక్ అక్షరాలా ఒంటబట్టింది. సినిమా ఇంతగా హిట్ అవుతుందని మాకు షూటింగ్ సమయంలోనే తెలిసింది. ఎందుకంటే ఆ సినిమాకు పడుతున్న కష్టం దగ్గరుండి గమనించాను. – మూవేంద్రన్, మేకప్‌మెన్ -
వివాదంలో చిక్కుకున్న ఫేమస్ హెయిర్ స్టైలిస్ట్
సాక్షి, లక్నో : ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ జావెద్ హబీబ్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. ప్రచారంలో భాగంగా జావెద్ హబీబ్ తన సెలూన్లలో హిందూ దేవుళ్లు, దేవతల చిత్రాలను, కొన్ని వీడియోలను ఉపయోగింకుంటున్నట్లు వినయ్ పాండే అనే న్యాయవాది మహరాజ్‌గంజ్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు. దేశ వ్యాప్తంగా ఎందరో ప్రముఖులకు హెయిర్ స్టయిలిస్ట్‌గా ఉన్న హబీబ్ ప్రచారం కోసం మత విశ్వాసాలను వాడుకుంటున్నాడని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలను జావేద్ దెబ్బతీశాడని వినయ్ పాండే ఆరోపించారు. హిందూ దేవుళ్లు, దేవతలు తన సెలూన్‌కు వచ్చి కస్టమర్ల మాదిరిగా కూర్చున్నట్లు కొన్ని ప్రకటనల్లో చూపాడని ఇవి సోషల్‌మీడియాలోనూ దర్శనమిచ్చాయని లాయర్ వివరించారు. ఈ కేసును ఈనెల 11వ తేదీన న్యాయస్థానం విచారించనుంది. హిందూ దేవతలు, దేవుళ్ల ఫొటోలను తన సెలూన్లో ఉపయోగించడంపై హిందూ నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇలాంటి చెత్త ట్రిక్స్ ఎన్ని ప్లే చేసినా నీవద్ద కటింగ్ చేసుకునేందుకు ఎవరూ రారని కొందరు కామెంట్ చేయగా, మర్యాదగా యాడ్స్‌తో పాటు ఫొటోలను అన్ని తీసేస్తే మంచిదంటూ మరికొందరు హెచ్చరిస్తున్నారు. -
అభిమాని సెలూన్ ప్రారంభించిన పవన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హైదరాబాద్ బంజార హిల్స్ లో సెలూన్ ప్రారంభించాడు. సినీ వేడుకలకు కూడా పెద్దగా హజరుకానీ పవన్ తన పర్సనల్ స్టైలిస్ట్ కోసం సెలూన్ ప్రాంభించడానికి అంగీకరించాడు. గోపాల గోపాల సినిమా నుంచి తనకు హెయిర్ స్టైలిస్ట్ గా పనిచేస్తున్న రామ్ కొనికి జూబ్లీహిల్స్ లో ఓ సెలూన్ కొనికి పేరుతో సెలూన్‌ను ప్రారంభించాడు. అధునాతన పరికరాలతో ప్రారంభించిన ఈ సెలూన్ ను పవన్ స్వయంగా ప్రారంభించడం టాలీవుడ్ సర్కిల్స్ లోనూ హాట్ టాపిక్ గా మారింది. -
అత్యాచారయత్నం చేసింది కానిస్టేబులే!
-
అత్యాచారయత్నం చేసింది కానిస్టేబులే!
కారులో విజయవాడ తీసుకెళ్తామని నమ్మించి, దారిలో కారులోనే ఆమెపై అత్యాచారయత్నం చేసిన నిందితులలో ఒకరిని ఏఆర్ కానిస్టేబుల్‌గా గుర్తించారు. నిందితులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. రాత్రి 2 గంటల ప్రాంతంలో ఎల్బీనగర్ సమీపంలో నిల్చుని.. విజయవాడ వైపు వెళ్లేందుకు ఎదురుచూస్తున్న హెయిర్ స్టైలిస్ట్‌ను మహేష్ అనే ఏఆర్ కానిస్టేబుల్‌తో పాటు నికొలస్ అనే మరో వ్యక్తి ఆమెను కారులోకి ఎక్కించుకున్నారు. విజయవాడలో దింపుతామని ఆమెను నమ్మబలికారు. కొద్ది దూరం వెళ్లాక ఆమెపై అత్యాచారయత్నం చేశారు. కారు టోల్గేట్ వద్దకు చేరుకోగానే యువతి అందులో నుంచి దూకి రక్షించమని కేకలు వేసింది. ఇది గుర్తించిన టోల్గేట్ సిబ్బంది యువతిని రక్షించి నిందితులను పోలీసులకు అప్పగించారు. తమకు ముందుగా క్యాబ్ నెంబర్ దొరికిందని, దానిపై ఎల్బీనగర్ డీసీపీ బృందం, ఎస్ఓటీ బృందం కలిసి విచారణ మొదలుపెట్టారని సీపీ మహేష్ భగవత్ చెప్పారు. ఆ యువతి విజయవాడ వెళ్లేందుకు ఎల్బీనగర్ లో క్యాబ్ ఎక్కిందని, చౌటుప్పల్ దాటాక ఆమె పట్ల డ్రైవర్లు అసభ్యంగా ప్రవర్తించారన్నారు. వెంటనే యువతి డయల్ 100కు సమాచారం ఇచ్చిందని తెలిపారు. ఆ నెంబరుతో ఉన్న క్యాబ్‌లు రెండింటిలో ఒకటి నిజామాబాద్‌లో, మరోటి మౌలాలిలో ట్రేస్ అయ్యాయని, తక్కువ సమయంలోనే కారు ఆచూకీ తెలుసుకున్నామని వివరించారు. అంత అర్ధరాత్రి సమయంలో ఒంటరిగా విజయవాడకు, అది కూడా ప్రైవేటు క్యాబ్‌లో ఎందుకు వెళ్లాలనుకున్నారని ఆ మహిళను ప్రశ్నించగా, తనకు అది అలవాటేనని జవాబిచ్చారన్నారు. మహిళలు ఎవరూ ఇలా ఒంటరిగా వెళ్లొద్దని, వీలైనంత వరకు ఆర్టీసీ లేదా ప్రైవేటు బస్సులలో వెళ్లాలని, తప్పనిసరిగా కారులో వెళ్లాల్సి వస్తే.. తమవద్ద 'సేఫ్ క్యాబ్' అని రిజిస్టర్ అయి ఉన్న క్యాబ్‌లలోనే వెళ్లాలని ఆయన సూచించారు. అవైతే సురక్షితంగా తీసుకెళ్తాయని చెప్పారు. -
ఎల్సా బ్రెయిడ్
ముడి బంగారం ఎల్సా బ్రెయిడ్ హెయిర్ స్టయిల్ అనగానే ఎల్సా ఏ హెయిర్ స్టైలిస్టో అయివుంటుంది, ఆవిడ కనిపెట్టిన హెయిర్ స్టయిల్‌కి ఆ పేరు వచ్చివుంటుంది అనుకుంటారు ఎవరైనా. కానీ నిజానికి ఎల్సా అనేది ఓ కార్టూన్ క్యారెక్టర్ పేరు. వాల్ట్ డిస్నీ యానిమేషన్ స్టూడియోస్ వాళ్లు తీసిన ‘ఫ్రోజెన్’ అనే యానిమేటెడ్ ఫిల్మ్‌లోని ప్రధాన పాత్ర ఎల్సా. ఆమెకు ఈ హెయిర్ స్టయిలే ఉంటుంది. అది చాలామందికి నచ్చేసింది. దాంతో ‘ఎల్సా హెయిర్ స్టయిల్’గా దీనికి పేరు వచ్చింది. ఈ జడ ఎలా వేసుకోవాలంటే... Steps 1 నుదురు దగ్గర్నుంచి ఓ పాయను తీసి స్లయిడ్ పెట్టాలి. 2 తర్వాత రెండోవైపు నుంచి కూడా ఓ పాయను తీసి స్లయిడ్ పెట్టాలి. 3 రెండు పాయలనూ కలిపి రబ్బర్‌బ్యాండ్ పెట్టేయాలి. 4 బ్యాండ్ పెట్టిన జుత్తును మూడు పాయలుగా చేయాలి. 5 మూడు పాయలనూ జడలా అల్లుకోవాలి. 6 జడను అల్లుతూ మళ్లీ రెండు పక్కల నుంచి రెండు పాయలను తీసి ఈ జడలో కలిపేయాలి. 7 కొంచెం అల్లిన తర్వాత మళ్లీ పక్కనుంచి రెండు పాయలు తీసుకుని కలపాలి. 8 ఇలా పాయలు పాయలుగా తీసుకుని జడలు అల్లుకుంటూ పోవాలి. అయితే మరీ టైట్‌గా లేకుండా లూజులూజుగా ఉంచుకోవాలి. 9 జడ మొత్తం అల్లిన తరువాత చివర కాస్త జుత్తును వదిలేసి రబ్బర్ బ్యాండ్ పెట్టేయాలి. ఈ హెయిర్ స్టయిల్ మిడ్డీస్ మీదికి, జీన్స్-టీషర్ట్స్ మీదికి చాలా బాగుంటుంది. -
రొనాల్డోకి ఇండియన్ హెయిర్
ఫుట్‌బాల్ సూపర్ స్టార్ క్రిస్టియానో రోనాల్డో తన మైనపు బొమ్మ తయారు చేయడానికి 20 లక్షలు ఖర్చు చేశాడు. అంతే కాదండోయ్ దీనికోసం అసలైన జుట్టును భారత్ నుంచి తెప్పించినట్లు సమాచారం. తన సొంత హెయిర్ స్టెయిలిస్ట్తో దానికి సొబగులద్దిస్తున్నాడట ఈ పోర్చుగీస్ కెప్టెన్. మైనపు విగ్రహం అచ్చు తనలాగే ఉండేందుకు జాగ్రత్తపడుతున్నాడట. స్పెయిన్‌లోని వ్యాక్స్ మ్యూజియంలోని తన విగ్రహానికి యథాతథంగా కాపీ చేయించాడట. బ్రిటిష్ మైనపుశిల్పి మైఖేల్‌కు తన విగ్రహం తయారీ బాధ్యతలు అప్పగించాడు. విగ్రహం తయారీ వివరాలు మీడియాతో పంచుకున్న మైఖేల్ ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. విగ్రహానికి రోనాల్డో లేటెస్ట్ ఫుట్‌బాల్ కిట్‌ను అమర్చడంతో పాటు. సరికొత్త షూ ఉపయోగిస్తున్నట్లు వివరించాడు. ఇక హెయిర్ స్టెయిల్ విషయంలో రొనాల్డో ఏమాత్రం రాజీ పడలేదట. రోనాల్డో కోరిక మేరకు భారత్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన జుట్టును మైనపు విగ్రహానికి అమర్చి.. తర్వాత తన సొంత హెయిర్ డ్రెస్సర్‌తో స్టయిలింగ్ చేయించాడట. ఈ విగ్రహాన్ని రొనాల్డో భవనంలో ఏర్పాటుచేసే ముందు యూరోప్‌లోని ప్రధాన నగరాల్లో ప్రదర్శనకు పెట్టనున్నట్లు తెలుస్తోంది. అంతే కాదండోయ్.. మాడ్రిడ్‌లోని వ్యాక్స్ మ్యూజియంలో ఏర్పాటుచేసిన మైనపు విగ్రహం పట్ల కూడా రొనాల్డో వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటాడట. 2013 నుంచి వ్యాక్స్ మ్యూజియంలో ఉన్న రొనాల్డో విగ్రహం బాగోగులు చూసేందుకు ఆయన ప్రతి నెలా నిపుణులను పంపిస్తాడట. ఈ నిపుణులు ప్రత్యేకంగా రొనాల్డో విగ్రహం హెయిర్ స్టెయిల్ పట్ల జాగ్రత్త వహిస్తారని మ్యూజియం కమ్యూనికేషన్ డైరెక్టర్ తెలిపారు. -
హెయిర్‘కట్’!
సినీ జనం ఏం చేసినా న్యూసే. ఎందుకో తెలియదు కానీ.. హాలీవుడ్ అందం జెస్సికా అల్బా తన జుత్తు కత్తిరించుకుంది. ఒంపులు తిరిగి.. వయ్యారాలు ఒలికించిన కురులను.. కురచగా చేసుకుంది. ‘బాబ్డ్ హెయిర్‌లో ఎంత ముచ్చటగా ఉన్నానో...’ అంటూ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేసింది. ఈ న్యూ స్టయిల్‌ను తనకు సెట్ చేసిన హెయిర్ స్టయిలిస్ట్కు స్పెషల్ థ్యాంక్స్ చెప్పడమే కాదు... అతనితో ఫొటో దిగి దాన్ని కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిందీ చిన్నది! -
కొద్దిగా తీరిక చిక్కాకే... అవన్నీ!
‘‘సంగీతం, రచన... ఈ రెండింటికీ వయసుతో సంబంధం లేదు. మనసులో ఇష్టం, ఆలోచనల్లో కొత్తదనం ఉంటే చాలు. ఏ వయసులోనైనా ఇవి చేయొచ్చు’’ అని శ్రుతీహాసన్ అంటున్నారు. కొన్ని ఆల్బమ్స్‌కి సంగీతం సమకూర్చడంతో పాటు, పాటలు కూడా పాడారామె. శ్రుతి పాటలు, కవితలు కూడా రాస్తుంటారు. కథా నాయికగా చేయాలంటే చాలామంది మీద ఆధారపడాల్సి ఉంటుందనీ, కానీ సంగీతం, రచనలకు ఎవరి మీదా ఆధారపడాల్సిన అవసరం లేదనీ శ్రుతీహాసన్ చెబుతూ - ‘‘కథానాయికగా ఓ పాత్రలో ఒదిగిపోవాలంటే, మేకప్‌మ్యాన్ చేసే మేకప్, హెయిర్ స్టయిలిస్ట్ చేసే కేశాలంకరణ చాలా ముఖ్యం. అలాగే, పాత్రకు తగ్గట్టు కాస్ట్యూమ్ డిజైనర్ సెలక్ట్ చేసే డ్రెస్ వేసుకోవాలి. ఆ తర్వాత డెరైక్టర్ చెప్పినట్లు చేస్తే, కెమెరామ్యాన్ చిత్రీకరిస్తారు. తెరపై కనిపించాలటే ఇంతమంది మీద ఆధారపడాలి. అదేగనక కథలూ, కవితలూ రాయాలనుకోండి... మన బుర్ర, కొన్ని కాగితాలు, కలం చాలు. ట్యూన్స్ తయారు చేయాలన్నా అంతే! సంగీత పరికరాలుంటే మనకు నచ్చిన ట్యూన్ రెడీ చేసుకోవచ్చు. అదే నాయిక పాత్రలనుకోండి... కొన్నేళ్ల తర్వాత చేయలేం. అది తెలుసు కాబట్టే, ఇప్పుడు బిజీగా సినిమాలు చేస్తున్నాను. కొంచెం తీరిక చిక్కాక సంగీతం, రచనలపై దృష్టి సారిస్తా’’ అన్నారు. -
యువ సేన @ ట్రాన్స్ఫార్మర్స్
చెత్త తీసుకెళ్లేవాడు వస్తేనే ఆరడుగుల దూరంలో నుంచో పెట్టడం... మాసిపోయిన దుస్తుల్లో ఎవరైనా కనిపిస్తే చాలు వారిని హీనంగా చూడటం... ఇదీ మన సమాజం తీరు. ఈ సంఘం నుంచి ఫుట్‌పాత్ మీద కునారిల్లుతున్న బతుకులను చూసి అసహ్యించుకోవడమో, ఆమడదూరం నుంచి సాగిపోవడమో తప్ప వారిని ఆప్యాయంగా స్పర్శించే మానవత్వం ఆశించగలమా ? మట్టికొట్టుకుపోతున్న ముఖాలను తుడిచి, కడిగిన ముత్యాల్లా మెరిపించే ప్రేమాభిమానాలను ఊహించగలమా? కాచిగూడ రైల్వేస్టేషన్ ప్రాంతం..ఆదివారం.. సాయంత్రం 4 గంటలు.. ఫుట్‌పాత్ మీద ఓ వ్యక్తి ఉన్నాడు. చింపిరి జుట్టు.. అడ్డదిడ్డంగా పెరిగిన గడ్డం.. అక్కడక్కడా గాయాలు.. ముసిరిన ఈగలు.. అటుగా వెళ్తున్న వారు అతడ్ని చూడగానే దూరంగా జరిగి వెళ్తున్నారు. కొందరు ఈసడించుకుంటున్నారు. అదే సమయంలో ఓ ఐదుగురు యువకులు అక్కడికి వచ్చారు. ఫుట్‌పాత్‌పై ఏదో ధ్యాసలో ఉన్న ఆ వ్యక్తిని పలకరించారు. ఏదో చెబుతున్నారు.. అతను వద్దంటున్నాడు (సైగలతోనే). వీరు గడ్డం పట్టుకుని బతిమాలుతున్నారు. చుట్టుపక్కల జనాలంతా ఈ తంతును వింతగా చూస్తున్నారు. ఓ అరగంట తర్వాత అతడు సరేననడంతో సీన్ మారిపోయింది. అప్పటికప్పుడు తమ వెంటున్న సరంజామా బయటకు తీశారు. ఒకరు హెయిర్ స్టైలిస్ట్‌గా మారిపోతే, మరొకరు ఆస్పత్రిలో నర్స్ విధులను మొదలుపెట్టారు. ఒకరు వెంట తెచ్చిన క్యారియర్ నుంచి ఫుడ్ తీసి సిద్ధం చేస్తుంటే.. ఇంకొకరు ఓ వారానికి సరిపడా.. మందులు, సబ్బులు వంటివి కిట్‌లో సర్దుతున్నారు. ‘మమత కరువై.. మనుషుల మధ్యే మానుల్లా మనుగడ సాగిస్తున్న వారి జీవితాలు శిథిలమైపోతుంటే మౌనంగా ఉండటం సరైనదేనా..?’.. ఈ ప్రశ్నకు సమాధానంగా అవతరించిందే ‘ట్రాన్స్ఫార్మర్స్’. ఫుట్‌పాత్‌పై తెల్లారిపోతున్న బతుకులకు కాసింత వెలుగు ప్రసాదించడానికి నగర యువత తీసుకొచ్చిన కాంతిపుంజం. ఆదివారం అంటే ఆనందం అనుకునే ఈ తరం యువతకు కాస్త భిన్నంగా హాలిడేను హార్ట్ టచింగ్ డేగా కూడా మార్చుకుంటున్నారు వారు. మ్యూజిక్ బాండ్ నుంచి యంగిస్థాన్ వరకు.. నగరానికి చెందిన అరుణ్ డేవిడ్ మరికొందరు మిత్రులతో కలసి టేకెన్ పేరుతో మ్యూజిక్ బ్యాండ్ నిర్వహించేవారు. ‘అప్పడు మేం చాలా కన్సర్ట్స్‌లో సోషల్ రెస్పాన్సిబులిటీ గురించి పాటలు పాడేవాళ్లం. వాటికి ఇన్స్పైర్ అయిన వారు.. ఏం చేయాలని అడిగేవారు. అప్పుడే ఓ వేదిక స్థాపించాలనుకున్నాం. అలా ఓ ఐదుగురం కలసి 2012 మార్చిలో యంగిస్థాన్ స్టార్ట్ చేశాం’ అని తమ తొలి అడుగులను గుర్తు చేసుకున్నారు అరుణ్. ప్రస్తుతం ఇందులో 120 మంది రిజిస్టర్ట్ వాలంటీర్లు ఉన్నారు. ప్రతి ఆదివారం వీరు సమావేశమవుతారు. వారానికో వాలంటరీ ఇంట్లో వంట చేయించి 1,000 మంది నిర్భాగ్యులకు పంపిణీ చేస్తుంటారు. ప్రతి శనివారం కనీసం ఐదు అనాథ శరణాలయాలకు వెళ్లి అక్కడి పిల్లలకు ట్యూషన్ చెబుతారు. ఇదే కోవలో ఈ యువసేన వేసిన మరో ముందడుగే ట్రాన్స్ ఫార్మర్స్. ఆలోచన వెనుక.. ఫుట్‌పాత్ మీద అపరిశుభ్రంగా ఉన్న ఓ వ్యక్తితో మాట్లాడినప్పుడు ఈ ఆలోచన కలిగిందని యంగిస్థాన్ సభ్యుడు రోహిత్ చెబుతాడు. ‘పగబట్టిన విధి వీరిని విగత జీవులుగా మార్చేసింది. నెలలు కాదు ఏళ్లకేళ్లు వీళ్లు స్నానం చేయరు. వీరి జీవితాలను ఎందుకు మార్చకూడదు అనిపించింది అనుకున్న’ ఈ యువత కాచిగూడ స్టేషన్ దగ్గర ఫుట్‌పాత్ మీదున్న ఓ వృద్ధుడి మేకోవర్‌తో ‘ట్రాన్స్ఫార్మర్స్’గా తొలి అడుగు వేసింది. ‘అపరిశుభ్రంగా ఉన్న ఆ వృద్ధుడ్ని ఎంతో బతిమాలితే గాని ఒంటి మీద చేయి వేయనీయలేదు. అతనికి ట్రిమ్ చేసి.. స్నానం చేయించి.. ఫొటో తీసి చూపిస్తే.. ఆయన దాన్ని ముద్దాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడ’ని చెప్పుకొచ్చారు ఆ యువకులు. వారానికి ఐదుగురు వీరిలో వారానికి ఐదుగురు బ్యాచ్ చొప్పున ట్రాన్స్ఫార్మర్స్ అవతారమెత్తుతున్నారు. హెయిర్ కటింగ్, ప్రాథమిక చికిత్స మెళకువలు నేర్చుకుంటు న్నారు. ‘మేకోవర్‌కు గంట పడుతోంది. కొందరి వెంట్రుకల్లో పురుగులుంటాయి. కొందరి జుట్టు కట్ చేయడానికి వీలులేకుండా ఉంటాయ’ని గుర్తు చేసుకుంటూ ఆ అభాగ్యజీవుల బతుకులపై వీరికున్న సానుభూతి వ్యక్తమైంది. అలా వదిలేయకుండా.. ‘ఈ ఫుట్‌పాత్ జీవులలో వృద్ధులే ఎక్కువ. పిల్లల ఆదరణ లేని వారు, రోడ్డు ప్రమాదాలకు గురై మానసికంగా దెబ్బతిన్నవారు.. ఇలా ఎందరో ఉన్నారు. వీరిని మేకోవర్ పూర్తయ్యాక వదిలేయకుండా ట్రైనింగ్ సెంటర్స్‌కు పంపాలని ఆలోచనలో ఉన్నాం. రిహాబిలిటేషన్, స్కిల్ ట్రైనింగ్, షెల్టర్ హౌస్‌కు కూడా ప్లాన్ చేస్తున్నాం. సులభ్ వారితో మాట్లాడి వారికో శాశ్వతమైన ఐడీ తీసుకుందాం అనుకుంటున్నాం’ అంటూ తమ భవిష్యత్ ప్రణాళికలు వివరించారీ మిత్రబృందం. ‘ది సోల్ మీనింగ్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు సర్వ్ హ్యుమానిటీ’ అన్న లియో టాల్‌స్టాయ్ మాటల్నే తమ చేతలకు ప్రాతిపదికగా చెబుతున్న ఈ స్నేహితులు చేస్తున్న సేవ.. యువత నడతకు కొత్త భాష్యం. -
జిమ్‌కి డుమ్మా కొడితే దెబ్బలు పడతాయ్!
‘‘భవిష్యత్తు కోసం మనం డబ్బులు వెనకేసుకోవాలనుకుంటాం. దానికోసం పరుగులుపెట్టి సంపాదిస్తాం. కానీ, ఆరోగ్యంగా లేకపోతే ఏం లాభం’’ అని బిపాసా బసు అంటున్నారు. ఫిట్నెస్కి ప్రాధాన్యం ఇచ్చే బిపాసా దానికి సంబంధించిన డీవీడీలు కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎన్ని డబ్బులున్నా ఆరోగ్యం లేకపోతే జీవితాన్ని ఆస్వాదించలేం అంటున్నారు ఈ బ్యూటీ. అందుకే, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండని సూచిస్తున్నారు. తన దగ్గర కేశాలంకార నిపుణురాలిగా చేస్తున్న అమ్మాయి చాలా బరువుగా ఉంటుందట. ఏవో సలహాలిచ్చి, తను సన్నబడేలా చేశారు బిపాసా. బరువు తగ్గిన తర్వాత మునుపటికన్నా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నానని ఆ హెయిర్ స్టయిలిస్ట్ అంటున్నారు. ఇక, ఇంట్లో వాళ్లకి బిపాసా ఇచ్చే సలహాలు అన్నీ ఇన్నీ కావట. ప్రతిరోజూ తన తల్లితో జాగింగ్ చేయిస్తుంటానని పేర్కొన్నారామె. ఇక, తన సోదరినైతే రోజూ జిమ్కెళ్లమంటారట. ఎప్పుడైనా జిమ్‌కి డుమ్మా కొడితే దెబ్బలు పడతాయ్ అని బెదిరిస్తుంటారట. ఒక్కరోజు వ్యాయామం చేయకపోతే ఆరోగ్యపరంగా వెనకబడ్టట్లే అంటున్నారు ఈ బెంగాలీ బ్యూటీ. మనం ఇప్పుడు చేసే వ్యాయామం ఆరోగ్యపరంగా మన భవిష్యత్తుకి మంచి పెట్టుబడివంటిదని బిపాసా చెబుతున్నారు.