ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అమిత్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లు ఆలియా భట్, ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్, కియారా అద్వానీ నుంచి నీతా అంబానీ వంటి ప్రముఖులందిరికీ హెయిర్ స్టైలిస్ట్ అమిత్. సెలబ్రిటీ హెయిర్‌స్టైలిస్ట్ అమిత్ మాత్రం కురుల అందం కోసం హెయిర్ బోటాక్స్, కెరాటిన్ వంటి ట్రీట్‌మెంట్‌లు అస్సలు తీసుకోవద్దని చెబుతున్నారు. తాను తన క్లయింట్‌లకు కూడా అస్సలు సూచించని అన్నారు. అసలు ఇవెందుకు మంచివి కావు అనేది అమిత్ మాటల్లోనే సవివరంగా తెలుసుకుందాం..!.
ఈ రోజుల్లో జుట్టుకి సంబంధించిన హెయిర్ ట్రీట్‌మెంట్లు సర్వసాధారణం. అయినప్పటికీ అందమైన శిరోజాల కోసం ఈ ట్రీట్‌మెంట్‌లు మాత్రం తీసుకోవద్దని హెయిర్ స్టైలిస్ట్ అమిత్ అంటున్నారు. తన క్లయింట్‌లకు కూడా ఇలాంటి ట్రీట్‌మెంట్‌లను సూచించని అన్నారు.
ఈ రోజుల్లో కురుల కోసం అందరూ చేయించుకునే హెయిర్ బోటాక్స్ లేదా కెరాటిన్ వంటి వాటికి తాను ప్రాధాన్యత ఇవ్వనని అన్నారు. తాను బాలీవుడ్ హీరోయిన్‌లకు, ప్రముఖులకు ఇలాంటి హెయిర్ ట్రీట్‌మెంట్లు అస్సలు సిఫార్సు చేయనని అన్నారు. ప్రస్తుత రోజుల్లో ఈ ట్రీట్‌మెంట్లు సర్వసాధారణమే అయినప్పటికీ.. ఇవి మంచివి కావని వాటి గురించి వివరించారు అమిత్.
ఎందుకు మంచివి కావంటే..
హెయిర్ బోటాక్స్ అనేది ప్రోటీన్లు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లతో కూడిన డీప్ కండిషనింగ్ ట్రీట్‌మెంట్. ఇది తాత్కాలిక చికిత్స. ఇది సాధారణంగా రెండు నుంచి నాలుగు నెలలు పడుతుంది. ఇక కెరాటిన్ చికిత్స అంటే.. ఇది జుట్టులో సహజంగా ఉండే ప్రోటీన్. ఈ చికిత్సలో ఫార్మాల్డిహైడ్ వంటి కొన్ని రసాయనాలు ఉంటాయి. వాస్తవానికి దీన్ని చాలా దేశాల్లో నిషేధించారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం..ఇది కేన్సర్ కారకమైనదని అన్నారు అమిత్.
ఈ రెండు చికిత్సల ప్రాథమిక స్వభావమే తాను ప్రాధాన్యత ఇవ్వకపోవడానికి ప్రధాన కారణమని చెబుతున్నారు అమిత్. హెయిర్ బోటాక్స్ జుట్టుని మంచిగా ఉంచినప్పటికీ..జుట్టులోని సహజ పోషకాలను కోల్పోయేలా చేస్తాయి. పైగా ఇది అధిక వేడిని కలుగజేస్తుంది. దీని వల్ల జుట్టులో ఉండే సహజ ప్రోటీన్ల నిర్మాణం ప్రాథమికంగా మారిపోతుంది. ఇవి స్వల్పకాలిక చికిత్సలే తప్ప ఏ మాత్రం సత్ఫలితాలనివ్వదు.
పైగా దీర్ఘకాలంలో జుట్టుకి ఎక్కువ హానిని చేకూరుస్తాయి. పదేపదే ఈ ట్రీట్‌మెంట్లు తీసుకోవడం వల్ల పలు దుష్ప్రభావాలకు గురయ్యే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. అదీగాక తాను సహజమైన జుట్టు ఆకృతికే ప్రాధాన్యత ఇస్తానని, అలాగే దీర్ఘకాలంలో జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మంచి అలవాట్లకే తాను ప్రాధాన్యత ఇస్తానని చెప్పుకొచ్చారు అమిత్. ఆ దిశగానే తన కస్టమర్లను కూడా ప్రోత్సహిస్తానని అన్నారు.
(చదవండి: శ్రద్ధా కపూర్ బ్యూటీ సీక్రెట్ ఇదే..! ఇష్టంగా పోహా..!)
Comments
Please login to add a commentAdd a comment