శ్రద్ధా కపూర్‌ బ్యూటీ సీక్రెట్‌ ఇదే..! ఇష్టంగా పోహా..! | Shraddha Kapoors Diet Plan: What She Eats From Breakfast To Dinner | Sakshi
Sakshi News home page

శ్రద్ధా కపూర్‌ బ్యూటీ సీక్రెట్‌ ఇదే..! ఇష్టంగా పోహా..!

Published Tue, Oct 22 2024 1:18 PM | Last Updated on Tue, Oct 22 2024 2:31 PM

Shraddha Kapoors Diet Plan: What She Eats From Breakfast To Dinner

బాలీవుడ్ స్టార్ క్వీన్ శ్రద్ధా కపూర్ స్త్రీ 2 మూవీ బాలీవుడ్ బాక్సాఫీసును షేక్ చేసింది. ఆ విజయోత్సాహంలో మునిగితేలుతుంది. శ్రద్ధా తన విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటుంటుంది. అంతేగాదు శ్రద్ధా నటనకు, గ్లామర్‌ మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కూడా ఉంది. పాపులారిటీ పరంగా భారతదేశంలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న నటీనటులలో శ్రద్ధా కపూర్ కూడా ఒకరు. అలాంటి శ్రద్ధాకి ఆరోగ్య స్ప్రుహ కూడా ఎక్కువే. ఎప్పటికప్పుడూ సోషల్‌ మీడియాలో ఎలాంటి ఆహారం తింటే మంచి ఫిట్‌నెస్‌తో ఆరోగ్యంగా ఉంటామో తన అభిమానులతో షర్‌ చేసుకుంటుంటుంది. బాలీవుడ్‌ ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లయినా..ఇప్పటికి అలానే వన్నె తరగని అందంతో కట్టిపడేస్తుంది. అందుకు కారణం శ్రద్ధా పాటించే ఆహార నియమాలే. అవేంటో చూద్దామా..!

2010లో తీన్ పట్టితో బాలీవుడ్‌లో అరంగేట్రం చేసిన శ్రద్ధా ఇప్పటికీ అలానే అంతే అందంతో ఆకర్షణీయంగా ఉంటుంది. అంతే యంగ్‌గా ఫిట్‌నెస్‌తో ఉండేందుకు మంచి జీవనశైలిని పాటిస్తుంది. అలాగే రోజువారీ వ్యాయామాలు తప్పనిసరి అంటోంది. అంతేగాదు ఇటీవల ఇంటర్యూలో శ్రద్ధా కపూర్‌ తాను కొన్నేళ్లక్రితం శాకాహారిగా మారానని చెప్పుకొచ్చింది. తన భోజనంలో పూర్తిగా స్వచ్ఛమైన శాకాహారమే ఉంటుందని తెలిపింది. 

ఇక ఆమె ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ మాహెక్‌ నాయర్‌ కూడా శ్రద్ధా పోహా, ఉప్మా, దలియా, ఇడ్లీ లేదా దోస వంటి ఆరోగ్యకరమైన ఇంటి భోజనంతో ప్రారంభిస్తుందని చెబుతున్నారు.  కక్డీ చి భక్రి వంటి సాధారణ మహారాష్ట్ర వంటకం,  దాల్ చావల్, ఊరగాయలంటే మహా ఇష్టమని చెబుతున్నారు. ఇలా వైవిధ్య భరితమైన వంటకాలని ఇష్టపడే ఆమెకు ఈ డైట్‌ప్లాన్‌ని అనుసరించాలని చెప్పడం కాస్త కష్టమని చెప్పారు. 

 

అందువల్లే ఆమె రోజులో మూడు సార్లు విభిన్నంగా తినేందుకే ఇష్టపడుతుందట. కూరగాయల్లో బెండకాలయంటే ఇష్టమని, పండ్లలో మామిడి పండు అంటే మహా ఇష్టమని పేర్కొంది శ్రద్ధా. తన సినిమాల పరంగా ఎక్కువ డ్యాన్స్‌తో కూడిన వాటికి గానూ మితమైన కార్బ్‌, ప్రోటీన్‌​, ఫ్యాట్‌ డైట్‌లు తీసుకుంటుందని శ్రద్ధా ట్రైనర్‌ చెబుతున్నారు. అలాగే బికినీ పాత్రలకు అనుగుణంగా మంచి టోన్‌ స్కిన్‌ కోసం అధిక ఫైబర్‌తో కూడిన పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వుతో కూడిన లీన్‌ డైట్‌ని తీసుకుంటుంది. 

ఆమె భోజనంలో తప్పనిసరిగా స్ప్రౌట్‌ సలాడ్‌లు, ఓట్స్‌ ఉంటాయి. అయితే ఏదైనా పండుగ సమయాల్లో మాత్రం డైట్‌ని పక్కన పెట్టేసి మరీ తనకిష్టమైన మోదకాలు, స్వీట్లు లాగించేస్తుంది. అయితే లిమిట్‌ దాటకుండా తీసుకుంటుదట. అంతేగాదు ఆమెకు ఫ్రెంచ్‌ ఫ్రైస్‌, వడ పావ్‌, పానీ పూరీ వంటివి కూడా చాలా ఇష్టమని చెబుతోంది శ్రద్ధా. 

 

(చదవండి: యాపిల్స్‌లోని ఈ రకాలు ట్రై చేసి చూశారా..!)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement