కారులో విజయవాడ తీసుకెళ్తామని నమ్మించి, దారిలో కారులోనే ఆమెపై అత్యాచారయత్నం చేసిన నిందితులలో ఒకరిని ఏఆర్ కానిస్టేబుల్‌గా గుర్తించారు. నిందితులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. రాత్రి 2 గంటల ప్రాంతంలో ఎల్బీనగర్ సమీపంలో నిల్చుని.. విజయవాడ వైపు వెళ్లేందుకు ఎదురుచూస్తున్న హెయిర్ స్టైలిస్ట్‌ను మహేష్ అనే ఏఆర్ కానిస్టేబుల్‌తో పాటు నికొలస్ అనే మరో వ్యక్తి ఆమెను కారులోకి ఎక్కించుకున్నారు. విజయవాడలో దింపుతామని ఆమెను నమ్మబలికారు. కొద్ది దూరం వెళ్లాక ఆమెపై అత్యాచారయత్నం చేశారు. కారు టోల్‌గేట్ వద్దకు చేరుకోగానే యువతి అందులో నుంచి దూకి రక్షించమని కేకలు వేసింది. ఇది గుర్తించిన టోల్‌గేట్ సిబ్బంది యువతిని రక్షించి నిందితులను పోలీసులకు అప్పగించారు.