నిటషా గౌరవ్, రణ్‌వీర్
భద్రజీవిత ప్రమాణాలతో పోల్చితే, దిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్)లో చేస్తున్న ప్రొఫెసర్ ఉద్యోగాన్ని వదులుకొని బాలీవుడ్‌లోకి అడుగుపెట్టడం రిస్క్ అనిపించవచ్చు. అందుకే ‘’ అని నిటషా గౌరవ్‌తో అన్నవాళ్లే ఎక్కువ.
చదవండి: Health Tips: టీలో ‘తేనె’ కలిపి తాగుతున్నారా? స్లో పాయిజన్‌గా మారి..!
విజయం దక్కాలంటే రిస్క్ చేయడం తప్పనిసరి అనే వాస్తవం నిటషాకు తెలియనిదేమీ కాదు. ‘నిఫ్ట్’లో ప్రొఫెసర్ అయినంత మాత్రాన, ఫ్యాషన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ న్యూయార్క్, లండన్ కాలేజీ ఆఫ్ ఫ్యాషన్‌లో చదువుకున్నంత మాత్రాన అవకాశాలు వెదుక్కుంటూ రావు అనే విషయం ఆమెకు తెలియనిదేమీ కాదు.
నిటషా గౌరవ్
ఎందుకంటే...ప్రతి హీరోకి ఒక బాడీలాంగ్వేజ్ ఉంటుంది. ‘నాకు ఇలాంటి స్టైల్ ఉండాలి’ అని అతను అనుకుంటాడు. ‘మా హీరోకి ఇలాంటి స్టైలే ఉండాలి’ అని డైరెక్టర్ అనుకుంటాడు. ‘మా హీరోకి ఇలాంటి స్టైల్ ఉండాలి’ అని అభిమాని అనుకుంటాడు. చాలా సందర్భాల్లో హీరోకి నచ్చిన స్టైల్ అభిమానికి నచ్చకపోవచ్చు. ఇద్దరికీ నచ్చింది డైరెక్టర్‌కు నచ్చకపోవచ్చు. మరి ముగ్గురు మెచ్చేలా స్టైల్ డిజైనింగ్ చేయడం అనేది ఆషామాషీ విషయం కాదు. అకడమిక్ చదువులు మాత్రమే పనికిరాకపోవచ్చు. నిటషా మాటల్లో చెప్పాలంటే ఒక పుస్తకంలా హీరోని అధ్యయనం చేయాలి. చదవండి: షుగర్ వ్యాధిగ‍్రస్తులకు ‘తీపి’ కబురు.. పామ్ నీరా, బెల్లం!
‘బ్యాండ్ బాజా బరాత్’ సినిమా విడుదలైన రోజులవి. అప్పటికింకా రణ్‌వీర్‌సింగ్ అంత పెద్దస్టార్ కాలేదు. అంతమాత్రాన ‘మీకు స్టైలిష్ట్‌గా పనిచేస్తాను’ అంటే వెంటనే ‘ఓకే’ అని ఎవరూ అనరు. కొత్త హీరోలు, కొత్త భయాలు ఉంటాయి! ఇప్పుడిప్పుడే ప్రయోగాలు వద్దనుకుంటారు. అయితే రణ్‌వీర్‌సింగ్‌లాంటివారు దీనికి మినహాయింపు. కొత్తవాళ్లను ప్రోత్సహిస్తారు.
రణ్‌వీర్
‘ఫిల్మ్‌ఫేర్’ పత్రిక ముఖచిత్రం కోసం రణ్‌వీర్ స్టైలిస్ట్‌గా అడుగుపెట్టింది నిటషా. ఆ కవర్‌కు ఎంత పేరొచ్చిందంటే...‘ఎవరీ స్టైలిస్ట్?’ అని అందరూ ఆరా తీయడం మొదలుపెట్టారు. అలా రణ్‌వీర్‌కు నిటషా మీద నమ్మకం కుదిరింది. కట్ చేస్తే.... బాలీవుడ్ సెలబ్రిటీ స్టైలిస్ట్‌గా పది సంవత్సరాల మైలురాయిని దాటేసింది!
‘అదృష్టవశాత్తు అవకాశం వచ్చింది.. వినియోగించుకున్నాను’ అన్నట్లుగా కాకుండా మెన్ ఫ్యాషన్‌ను పునర్‌నిర్వచించిన ట్రెండ్ సెట్టర్‌గా పేరు తెచ్చుకుంది నిటషా.
రణ్‌వీర్‌కు మాత్రమే కాదు ప్రియాంకచోప్రా, అర్జున్ కపూర్, విద్యాబాలన్, వరుణ్ ధవన్...ఇలా ఎంతోమంది తారలకు స్టైలిస్ట్‌గా పనిచేస్తుంది. తాను బాలీవుడ్‌లోకి అడుగుపెట్టకముందు స్టైలింగ్‌లో ‘రూల్‌బుక్’ అనేది అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. ‘రూల్‌బుక్’కు అతీతంగా ఏమీ చేయడానికి కుదరదు. అదంతే! అన్నట్లుగా ఉండేది. ‘అప్పుడప్పుడూ రూల్స్ బ్రేక్ చేయడం కూడా మంచి రూలే’ అంటున్న నిటషా చాలాసార్లు ‘రూల్‌బుక్’కు అతీతంగా వెళ్లింది. కొన్నిసార్లు పాఠాల్లో లేని ‘స్ట్రీట్ లుక్’ను సృష్టించింది. ‘స్టైల్ అనేది నేల విడిచి సాము చేయకూడదు. అది మన వ్యక్తిత్వంలో భాగంగా కనిపించాలి’ అంటున్న నిటషాకు 70’లలోని బాలీవుడ్ సినిమా స్టైల్ అంటే ఇష్టం.
విజయం గొప్పదనం ఏమిటంటే...అది అందుకున్న వ్యక్తికి మాత్రమే పరిమితం కాదు. దాని వెలుగులు దశదిశలా వ్యాపించి ఎంతో మందికి స్ఫూర్తి ఇస్తాయి. సెలబ్రిటీ స్టైలిస్ట్‌గా రాణించాలనుకుంటున్న ఎంతోమంది ఔత్సాహికులకు ఇప్పుడు నిటషా గౌరవ్ రోల్ మోడల్.
చదవండి: టెంపుల్ డ్యాన్స్ వీడియోలతో .. ప్రాచీన ఆలయాలకు నూతన శోభ!!
Comments
Please login to add a commentAdd a comment