star stylist
-
గ్లామర్ అంటే స్కిన్ షో కాదు : నివేదా థామస్
నివేదా థామస్.. గ్లామర్ కన్నా అభినయతారగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటి వరకు తెలుగులో చేసిన సినిమాలు కొన్నే అయినా.. ఇక్కడ సంపాదించుకున్న అభిమానం మాత్రం ఘనమే. అందం కన్నా అభినయం మీద ఆమెకున్న శ్రద్ధ అలాంటిది. తనలోని గ్లామర్‌ను ఆమె అశ్రద్ధ చేసినా ఈ బ్రాండ్స్ మాత్రం తీర్చిదిద్దుతున్నాయి.. సొబారికో దర్జా, విలాసం, సౌకర్యం .. ఈ మూడింటినీ ఒకేసారి ఆస్వాదించాలంటే సొబారికో బ్రాండ్‌ను ఎంచుకోవాలి. దేశంలోని ఏ మూలలో ఏ చేనేత ప్రత్యేకత ఉన్నా.. ఏ కళాకారుడి.. ఏ కళాకారిణి చేతిలో సృజన ఉన్నా అది ఈ బ్రాండ్‌లో ప్రతిబింబిస్తుంది. అందుకే సొబారికో అవుట్ ఫిట్స్‌ను ఇష్టపడని వాళ్లు లేరు సెలబ్రిటీల నుంచి సామాన్యుల దాకా. ఈ అభిమానాన్నే బ్రాండ్ వాల్యూగా స్థిరపరచుకుంది. దాన్నే వారసత్వంగానూ మలచుకుంది ఏళ్లుగా. ఫ్యాబ్రిక్, డిజైన్‌ను బట్టి ధరలు. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. డ్రెస్ బ్రాండ్ : సొబారికో అనార్కలీ సెట్ ధర: 37,500 జ్యూయెలరీ బ్రాండ్: అమెథిస్ట్ అండ్ ఆమ్రపాలి ధర: డిజైన్‌పై ఆధారపడి ఉంటుంది. అమెథిస్ట్ ఇది కిరణ్ రావు మానస పుత్రిక. అమూల్యమైన కళాఖండాల నిలయం.. ఈ బ్రాండ్. 2000 సంవత్సరంలో ప్రారంభమైంది. దుస్తులు, జ్యూయెలరీ, ఫుట్ వేర్ నుంచి ఇంటి అలంకరణ వస్తువులు.. కాఫీ షాప్ వరకు అన్నిటికీ ఈ అమెథిస్ట్ కేరాఫ్. ఈ బ్రాండ్ రిచ్‌నెస్‌కు తగ్గట్టే ధరలు ఉంటాయి. ఆమ్రపాలి నిజానికి ఇదొక మ్యూజియం. అంతరించిపోతున్న గిరిజన సంప్రదాయ ఆభరణాల కళను కాపాడేందుకు ఇద్దరు స్నేహితులు రాజీవ్ అరోరా, రాజేష్ అజమేరా కలసి జైపూర్‌లో ‘ఆమ్రపాలి’ పేరుతో మ్యూజియాన్ని స్థాపించారు. నచ్చిన వాటిని కొనుగోలు చేసే వీలు కూడా ఉంది. అయితే, వీటి ధర లక్షల్లో ఉంటుంది. అందుకే, అలాంటి డిజైన్స్‌లో ఆభరణాలు రూపొందించి తక్కువ ధరకు అందించేందుకు ‘ఆమ్రపాలి జ్యూయెలరీ’ ప్రారంభించారు. ఒరిజినల్ పీస్ అయితే మ్యూజియంలో, మామూలు పీస్ అయితే ఆమ్రపాలి జ్యూయెలరీలో లభిస్తుంది. చాలామంది సెలబ్రిటీస్‌కు ఇది ఫేవరెట్ బ్రాండ్. ఆన్లైన్లో కూడా ఆమ్రపాలి జ్యూయెలరీని కొనుగోలు చేయొచ్చు. -
చిన్న చిన్న ఆనందాలను ఎక్కువగా ఇష్టపడుతుంటా... అదే నా బ్యూటీ సీక్రేట్: కృతి శెట్టి
తొలి సినిమాతోనే అదృష్టం ఆమెను ‘ఉప్పెన’లా ముంచెత్తింది. ఎస్.. ఇక్కడ కృతి శెట్టి ఫాలో అయ్యే ఫ్యాషన్ బ్రాండ్స్ గురించే తెలుసుకోబోతున్నాం. దృష్టి సారించండి... పెర్నియా పాప్ అప్ షాప్ అందమైన డిజైన్స్ అందించే ఫ్యాషన్ డిజైనర్స్‌కు, వాటిని ధరించి ఆనందించే ఫ్యాషన్ ప్రియులకు మధ్య వారధి ఈ ‘పెర్నియాస్ పాప్ అప్ షాప్’. ఇదొక ఆన్లైన్ స్టోర్. చిన్న నుంచి పెద్ద వరకు ఎందరో డిజైనర్ల డిజైన్స్ ఇక్కడ లభిస్తాయి. ప్రత్యేకంగా డిజైన్ చేయించుకునే అవకాశమూ ఉంది. ధరను నిర్ణయించేదీ డిజైనరే. వైవిధ్యమైన డిజైన్స్‌ను మాత్రమే అందుబాటులో ఉంచుతుందీ స్టోర్. ఇందుకు వివిధ పరీక్షలు కూడా నిర్వహిస్తారు. అదే దీని బ్రాండ్ వాల్యూ. ప్రత్యక్షంగా కొనుగోలు చేసే అవకాశం లేదు. ఆన్లైన్లోనే కొనుగోలు చేయాలి. జ్యూయెలరీ బ్రాండ్: పెర్నియాస్ పాప్ అప్ షాప్ ధర: ఆభరణాల నాణ్యత, డిజైన్‌పై ఆధారపడి ఉంటుంది. చదవండి: అచ్చం భేతాళ కథల్లో మాదిరి.. ఈ నీటిలో పడితే వెంటనే రాయిలా అయిపోతారు..! సురభి షా.. పెళ్లిరోజున భర్త ఇచ్చే బహుమతి భార్యకు ప్రత్యేకమే. సురభికి మాత్రం ఆ బహుమతి ప్రత్యేకం కాదు, తనలోని ప్రతిభను పదిమందికి చూపించే ఓ అద్భుతమైన అవకాశం. ఫ్యాషన్‌పై ఉన్న పట్టు, ఆసక్తి, తన దుస్తులను తానే డిజైన్ చేసుకునే తీరుకు మెచ్చిన ఆమె భర్త 2006లో ‘సురభి షా’ పేరుతో ఓ బొటిక్‌ను బహుమతిగా ఇచ్చాడు. ఆ కానుకనే టాప్ మోస్ట్ ఫ్యాషన్ బ్రాండ్స్‌లో ఒకటిగా నిలిపింది సురభి. ఎటువంటి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేయకపోయినా, తన సృజనాత్మక ఆలోచనలతో ఆకట్టుకునే డిజైన్స్‌ను రూపొందిస్తూ అనతికాలంలోనే ఫేమస్ డిజైనర్‌గా ఎదిగింది. ఆ కళాత్మకత సెలబ్రిటీలను సైతం మెప్పించింది. ఈ డిజైన్స్ సరసమైన ధరల్లోనే లభిస్తాయి. సురభి షా మెయిన్బ్రాంచ్ జైపూర్‌లో ఉంది. ఆన్‌లైన్‌లోనూ ఆమె డిజైన్స్‌ను కొనుగోలు చేయొచ్చు. డ్రెస్ డిజైనర్ : సురభి షా ధర: రూ. 36,000 - దీపిక కొండి చదవండి: World's Rarest Dog Breed: ఇది జిరాఫీ కాదు!! కుక్క.. అత్యంత అరుదైన బ్రీడ్!! కానీ కారు ప్రమాదంలో.. -
సెట్ కాదన్న డ్రెస్సే కొంటా..! నా ఫేవరేట్ బ్రాండ్ ఇదే..: హెబ్బా పటేల్
‘నా పేరు కుమారి.. నా ఏజ్ 21..’ డైలాగ్ ఎవరిదో గుర్తుంది కదా.. ఎస్.. హెబ్బా పటేల్. ఆమెకు సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ అంతే క్రేజీ ఫాలోయింగ్ ఉంది. ఆ అందానికి పర్ఫెక్ట్ మ్యాచింగ్ అవుట్‌ఫిట్స్.. జ్యూయెలరీని అందిస్తున్న బ్రాండ్స్ ఇవే.. నచ్చితే వెంటనే కొనేస్తా. నాలాగే బొద్దుగా ఉన్నవాళ్లకి కొన్ని దుస్తులు నప్పవని అంటుంటారు. అందులో నిజం లేదు. శరీరానికి కష్టం కలిగించకుండా.. ఇష్టంతో ధరించే ఏ దుస్తుల్లో అయినా అందంగానే కనిపిస్తాం – హెబ్బా పటేల్ ఇస్సా స్టూడియో... ఇటీవలే ప్రారంభమై, బాగా పాపులారిటీ సంపాదించుకున్న ఫ్యాషన్ హౌస్‌లలో ఒకటి ఇస్సా స్టూడియో. హైదరాబాద్‌కు చెందిన స్వాతి, చేతన అనే ఇద్దరు స్నేహితులు కలసి స్థాపించిన ఈ సంస్థ, ఆరంభంలోనే అందమైన డిజైన్స్‌తో పలువురు సెలబ్రిటీలను ఆకర్షించింది. నిహారిక కొణిదెల, అనసూయ భరద్వాజ్, మంచు లక్ష్మి తదితరులు వీరి కలెక్షన్స్‌ను రెగ్యులర్‌గా ఫాలో అవుతుంటారు. యువతరమే వీరి టార్గెట్. యూత్ స్టైల్‌ను మ్యాచ్ చేస్తూ డిజైన్ చేసే సంప్రదాయ దుస్తులతో ఫేమస్ బ్రాండ్‌గా ఇస్సాను నిలిపారు. ప్రస్తుతం భారత్‌తో పాటు, అమెరికా నుంచి కూడా ఆర్డర్లను తీసుకుంటున్నారు. ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఆన్‌లైన్‌లోనూ ఇస్సా స్టూడియో డిజైన్స్‌ను కొనుగోలు చేయొచ్చు. ఆ డ్రెస్ నీకు సెట్ కాదని ఎంతమంది చెప్పినా వినను. చీర..బ్రాండ్: ఇస్సా స్టూడియో ధర: రూ. 34,000 ఆర్నీ బై శ్రావణి.. ఈ బ్రాండ్ పెళ్లి ఆభరణాలకు ఫేమస్. ఈ నగలను ధరించి పెళ్లి పందిట్లోకి వెళ్లాలని చాలా మంది అమ్మాయిలు కోరుకుంటారు. రెడీమేడే కాదు స్వయంగా ఆర్డర్ ఇచ్చి కూడా కావలసిన నగలను డిజైన్ చేయించుకోవచ్చు. విలువైన రత్నాలు, వజ్రాలతో తయారయ్యే ఈ డిజైన్స్‌కు మంచి గిరాకీ ఉంది. పలువురు సెలబ్రిటీల ఫేవరెట్ అనీ ఈ బ్రాండ్‌కి పేరుంది. డిజైన్‌ను బట్టే ధర. కొన్ని సందర్భాల్లో రత్నాల విలువ, ఆభరణాల నాణ్యతపైనా ఆధారపడి ఉంటుంది. హైదరాబాద్ మెయిన్ బ్రాంచ్‌గా ఉన్న ఆర్నీ బై శ్రావణి జ్యూయెలరీని ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయొచ్చు. జ్యూయెలరీ బ్రాండ్: ఆర్నీ బై శ్రావణి ధర: ఆభరణాల నాణ్యత, డిజైన్‌పై ఆధారపడి ఉంటుంది. -దీపిక కొండి చదవండి: Scientifically Proven Facts: నవ్వితే ఇన్ని ఉపయోగాలా? విస్తుపోయే వాస్తవాలు.. -
నా ఫ్యాషన్ సీక్రేట్ అదే.. షాపింగ్‌పై చాలా కంట్రోల్‌గా ఉంటా..: త్రిష
ఆచి తూచి అడుగులు వేయకుంటే.. బోల్తా కొట్టడం ఎవరికైనా తప్పదు. కెరీర్లో అలాంటి జాగ్రత్తలు పాటించింది కాబట్టే.. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి రెండు దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ స్టార్ హీరోయిన్‌గానే కొనసాగుతోంది త్రిష. ఆ ప్రేక్షకాదరణకు ఆమె అభినయంతో పాటు అందమూ ఓ కారణమే. ఆ అందానికి అద్దం పడుతున్న ఫ్యాషన్ బ్రాండ్స్ ఇవే.. సబ్యసాచి.. పేరుకే ఇండియన్ బ్రాండ్ కానీ, ఇంటర్నేషనల్ బ్రాండ్ కంటే గొప్పది, ఖరీదైనది. దాదాపు బాలీవుడ్ సెలబ్రిటీస్ పెళ్లిళ్లు అన్నీ సబ్యసాచి కలెక్షన్స్‌తోనే జరుగుతాయి. వాటిల్లో విరాట్ కొహ్లీ, అనుష్కశర్మల పెళ్లి బట్టలు ఫేమస్. కనీసం ఒక్కసారైనా సబ్యసాచి డిజైన్ వేర్ ధరించాలని, సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకు ఏంతోమంది ఆశపడుతుంటారు. ఆ బ్రాండ్‌కున్న వాల్యూ అలాంటిది. ఈ మధ్యనే మధ్యతరగతి మహిళల కోసం రూ. పదివేల చీరను డిజైన్ చేశారు. ఇదే ఈ బ్రాండ్ చీపెస్ట్ చీర. సుమారు లక్ష చీరలను సిద్ధం చేస్తే, రెండు రోజుల్లోనే మొత్తం కొనుగోలు చేశారు. పదివేల చీరైనా, పదినిమిషాల్లో అమ్ముడైపోతుంది. ఇదంతా సబ్యసాచి ముఖర్జీ డిజైన్ మహత్యం. బెంగాలీ కుటుంబ నేపధ్యం నుండి వచ్చిన సబ్యసాచి కెరీర్ ఆరంభించిన అనతి కాలంలోనే ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్‌గా ఎదిగాడు. 1999లో తన పేరునే ఓ బ్రాండ్ హౌస్‌గా మార్చి, మరింత పాపులర్ అయ్యాడు. అందమైన ఆభరణాలు కూడా ‘సబ్యసాచి’ స్టోర్స్‌లో లభిస్తాయి. ఇండియాలోని ప్రముఖ నగరాలతోపాటు అమెరికా, లండన్‌లోనూ స్టోర్స్ ఉన్నాయి. ఆన్‌లైన్‌లోనూ సబ్యసాచి డిజైన్స్‌ను కొనుగోలు చేయొచ్చు. చీర బ్రాండ్: సబ్యసాచి ధర: రూ. 1,79,500 మంజుల జ్యూయెల్స్... ఒక సమస్యను ఎదుర్కొనే సమయంలోనే మన ప్రతిభ బయట పడుతుందంటారు. ఈ మాట మంజుల విషయంలో అక్షరాల నిజం. కుటుంబం గడవటం కోసం భర్తతో కలసి మైనింగ్ పరిశ్రమలో పనిచేసి, బంగారంతోపాటు తనలోని ప్రతిభను కూడా వెలికి తీసింది మంజుల. అప్పటివరకూ బంగారం అంటే ఇష్టం మ్రాతమే. ఆ ఇష్టాన్ని ఆసక్తిగానూ.. ఆ తర్వాత ఉపాధి అవకాశంగానూ మార్చుకుంది. జెమాలజీలో పీజీ చేసి, ఆభరణాల రూపకల్పన నేర్చుకుంది. మొదట బంధువులు, తెలిసిన వారి వివాహాది శుభకార్యాలకు డిజైన్ చేసింది. వాటికి మంచి పేరు రావడంతో 2010లో ‘మంజుల జ్యూయెల్స్’ సంస్థ స్థాపించింది. ప్రస్తుతం పలు సినిమాలతో పాటు, చాలామంది సెలబ్రిటీలకు కూడా మంజుల తన డిజైన్స్‌ను అందిస్తోంది. ధర ఆభరణాల నాణ్యత, డిజైన్ ఆధారంగా ఉంటుంది. హైదరాబాద్ మెయిన్ బ్రాంచ్‌గా ఉన్న మంజుల జ్యూయెల్స్ను ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయొచ్చు. జ్యూయెలరీ బ్రాండ్: మంజుల జ్యూయెల్స్ ధర: ఆభరణాల నాణ్యత, డిజైన్‌పై ఆధారపడి ఉంటుంది. - దీపిక కొండి చదవండి: దుస్తులకు లింగ భేదం ఏంటీ..! స్కూల్‌కి స్కర్టులతోనే వస్తాం!! -
చీర కట్టులో మెరిసిపోతున్న అను ఇమాన్యుయేల్.. ధరెంతో తెలుసా!
‘కళ్లు మూసి తెరిచేలోపే, గుండెలోకే చేరావే..’ అంటూ అభిమానుల మనసు దోచుకొని మజ్నూలుగా మార్చేసిన నటి.. అమెరికా అమ్మాయి.. అను ఇమాన్యుయేల్. ఆమె మదిలో స్థానం సంపాదించుకున్న ఫ్యాషన్ బ్రాండ్స్ ఏంటో చూద్దాం.. మెరో జ్యూయెలరీ రాజస్థాన్‌లో ‘మెరో’ అంటే ‘గని’ అని అర్థం. పేరుకు తగ్గట్టుగానే ఇదొక ఆభరణాల ఖని. అంతరించిపోతున్న గిరిజన, సంప్రదాయ ఆభరణాల డిజైన్స్‌ను శోధించి, సాధిస్తుంది ఈ బ్రాండ్. ఎక్కువగా హస్తకళ, శిల్పకళల సంప్రదాయ వారసత్వం నుంచి ప్రేరణ పొందిన డిజైన్స్ ఇక్కడ లభిస్తాయి. బంగారు ఆభరణాలు కూడా దొరుకుతాయి. కానీ, వెండితో తయారు చేసిన వాటికే గిరాకీ ఎక్కువ. ఆభరణాల నాణ్యతతో సంబంధం ఉండదు. డిజైన్‌ను బట్టే ధర ఉంటుంది. ముంబై, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ నగరాల్లో ఈ బ్రాండ్‌కి స్టోర్స్ ఉన్నాయి. ఆన్‌లైన్‌లోనూ మెరో జ్యూయెలరీని కొనుగోలు చేయొచ్చు. జ్యూయెలరీ బ్రాండ్: మెరో జ్యూయెలరీ ధర: రూ. 8,000 సాక్షం అండ్ నీహారిక సాక్షం, నీహారిక బిజినెస్ పార్ట్‌నర్సే కాదు.. మంచి స్నేహితులు కూడా. ఫ్యాషన్‌పై వారికి ఉన్న అభిరుచులు, ఆలోచనలు ఒక్కటే కావడంతో కలసి కెరీర్‌ను స్టార్ట్ చేశారు. న్యూఢిల్లీలోని ఎన్ఐఎఫ్టీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేసి, 2017లో ఇద్దరి పేరుతో ఓ ఫ్యాషన్ హౌస్ ప్రారంభించారు. ఎక్కువగా చేనేత కళాకారులు నేసిన ఫ్యాబ్రిక్‌నే ఉపయోగిస్తారు. సూరత్, జైపూర్ కళాకారులతో కుట్లు, అల్లికలు, రంగు అద్దకాల డిజైన్స్ వేయిస్తుంటారు. ఇక సున్నితమైన సంప్రదాయ డిజైన్స్‌లో వీరికి పెట్టింది పేరు. ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఆన్‌లైన్‌లోనూ ఈ డిజైనర్ వేర్ అందుబాటులో ఉంటుంది. చీర బ్రాండ్: సాక్షం అండ్ నీహారిక ధర: రూ. 36,990 - దీపిక కొండి చదవండి: ఈ పుట్టగొడుగు పొడిని మహిళలు ప్రసవసమయంలో తింటే.. -
ప్రొఫెసర్ జాబ్ వదిలేసి.. బాలీవుడ్ ఫ్యాషన్‌కే ట్రెండ్ సెట్టరయ్యింది.!
భద్రజీవిత ప్రమాణాలతో పోల్చితే, దిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్)లో చేస్తున్న ప్రొఫెసర్ ఉద్యోగాన్ని వదులుకొని బాలీవుడ్‌లోకి అడుగుపెట్టడం రిస్క్ అనిపించవచ్చు. అందుకే ‘’ అని నిటషా గౌరవ్‌తో అన్నవాళ్లే ఎక్కువ. చదవండి: Health Tips: టీలో ‘తేనె’ కలిపి తాగుతున్నారా? స్లో పాయిజన్‌గా మారి..! విజయం దక్కాలంటే రిస్క్ చేయడం తప్పనిసరి అనే వాస్తవం నిటషాకు తెలియనిదేమీ కాదు. ‘నిఫ్ట్’లో ప్రొఫెసర్ అయినంత మాత్రాన, ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ న్యూయార్క్, లండన్ కాలేజీ ఆఫ్ ఫ్యాషన్‌లో చదువుకున్నంత మాత్రాన అవకాశాలు వెదుక్కుంటూ రావు అనే విషయం ఆమెకు తెలియనిదేమీ కాదు. నిటషా గౌరవ్ ఎందుకంటే...ప్రతి హీరోకి ఒక బాడీలాంగ్వేజ్ ఉంటుంది. ‘నాకు ఇలాంటి స్టైల్ ఉండాలి’ అని అతను అనుకుంటాడు. ‘మా హీరోకి ఇలాంటి స్టైలే ఉండాలి’ అని డైరెక్టర్ అనుకుంటాడు. ‘మా హీరోకి ఇలాంటి స్టైల్ ఉండాలి’ అని అభిమాని అనుకుంటాడు. చాలా సందర్భాల్లో హీరోకి నచ్చిన స్టైల్ అభిమానికి నచ్చకపోవచ్చు. ఇద్దరికీ నచ్చింది డైరెక్టర్‌కు నచ్చకపోవచ్చు. మరి ముగ్గురు మెచ్చేలా స్టైల్ డిజైనింగ్ చేయడం అనేది ఆషామాషీ విషయం కాదు. అకడమిక్ చదువులు మాత్రమే పనికిరాకపోవచ్చు. నిటషా మాటల్లో చెప్పాలంటే ఒక పుస్తకంలా హీరోని అధ్యయనం చేయాలి. చదవండి: షుగర్ వ్యాధిగ్రస్తులకు ‘తీపి’ కబురు.. పామ్ నీరా, బెల్లం! ‘బ్యాండ్ బాజా బరాత్’ సినిమా విడుదలైన రోజులవి. అప్పటికింకా రణ్‌వీర్‌సింగ్ అంత పెద్దస్టార్ కాలేదు. అంతమాత్రాన ‘మీకు స్టైలిష్ట్‌గా పనిచేస్తాను’ అంటే వెంటనే ‘ఓకే’ అని ఎవరూ అనరు. కొత్త హీరోలు, కొత్త భయాలు ఉంటాయి! ఇప్పుడిప్పుడే ప్రయోగాలు వద్దనుకుంటారు. అయితే రణ్వీర్సింగ్లాంటివారు దీనికి మినహాయింపు. కొత్తవాళ్లను ప్రోత్సహిస్తారు. రణ్వీర్ ‘ఫిల్మ్‌ఫేర్’ పత్రిక ముఖచిత్రం కోసం రణ్వీర్ స్టైలిస్ట్‌గా అడుగుపెట్టింది నిటషా. ఆ కవర్‌కు ఎంత పేరొచ్చిందంటే...‘ఎవరీ స్టైలిస్ట్?’ అని అందరూ ఆరా తీయడం మొదలుపెట్టారు. అలా రణ్‌వీర్‌కు నిటషా మీద నమ్మకం కుదిరింది. కట్ చేస్తే.... బాలీవుడ్ సెలబ్రిటీ స్టైలిస్ట్‌గా పది సంవత్సరాల మైలురాయిని దాటేసింది! ‘అదృష్టవశాత్తు అవకాశం వచ్చింది.. వినియోగించుకున్నాను’ అన్నట్లుగా కాకుండా మెన్ ఫ్యాషన్‌ను పునర్నిర్వచించిన ట్రెండ్ సెట్టర్‌గా పేరు తెచ్చుకుంది నిటషా. రణ్‌వీర్‌కు మాత్రమే కాదు ప్రియాంకచోప్రా, అర్జున్ కపూర్, విద్యాబాలన్, వరుణ్ ధవన్...ఇలా ఎంతోమంది తారలకు స్టైలిస్ట్‌గా పనిచేస్తుంది. తాను బాలీవుడ్‌లోకి అడుగుపెట్టకముందు స్టైలింగ్‌లో ‘రూల్‌బుక్’ అనేది అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. ‘రూల్‌బుక్’కు అతీతంగా ఏమీ చేయడానికి కుదరదు. అదంతే! అన్నట్లుగా ఉండేది. ‘అప్పుడప్పుడూ రూల్స్ బ్రేక్ చేయడం కూడా మంచి రూలే’ అంటున్న నిటషా చాలాసార్లు ‘రూల్‌బుక్’కు అతీతంగా వెళ్లింది. కొన్నిసార్లు పాఠాల్లో లేని ‘స్ట్రీట్ లుక్’ను సృష్టించింది. ‘స్టైల్ అనేది నేల విడిచి సాము చేయకూడదు. అది మన వ్యక్తిత్వంలో భాగంగా కనిపించాలి’ అంటున్న నిటషాకు 70’లలోని బాలీవుడ్ సినిమా స్టైల్ అంటే ఇష్టం. విజయం గొప్పదనం ఏమిటంటే...అది అందుకున్న వ్యక్తికి మాత్రమే పరిమితం కాదు. దాని వెలుగులు దశదిశలా వ్యాపించి ఎంతో మందికి స్ఫూర్తి ఇస్తాయి. సెలబ్రిటీ స్టైలిస్ట్‌గా రాణించాలనుకుంటున్న ఎంతోమంది ఔత్సాహికులకు ఇప్పుడు నిటషా గౌరవ్ రోల్ మోడల్. చదవండి: టెంపుల్ డ్యాన్స్ వీడియోలతో .. ప్రాచీన ఆలయాలకు నూతన శోభ!! -
నిషా అగర్వాల్ న్యూ స్టైలిష్ లుక్.. వీటి ధర తెలుసా..
‘ ఏమైంది ఈ వేళ ’ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి నిషా అగర్వాల్. ఆమెకు నప్పే ఆహార్యాన్ని అందించి ఆమె అందాన్ని మరింత ఇనుమడింప చేసిన ఫ్యాషన్ బ్రాండ్స్ ఇవే.. జయంతి రెడ్డి.. హైదరాబాద్‌కు చెందిన జయంతి.. బిజినెస్ కోర్సు చేసింది, కానీ ఆమె ప్యాషన్ మొత్తం ఫ్యాషన్‌పైనే. ఎన్ఐఎఫ్టీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసి, 2011లో తన పేరు మీదే ఓ ప్యాషన్ హౌస్ ప్రారంభించింది. చేతితో చేసే అల్లికలకే ప్రాధాన్యం. అందుకే, లేట్‌గా వచ్చినా లేటేస్ట్‌గా ఉంటాయి ఆమె డిజైన్స్. శుభకార్యాల కోసం, ముందుగానే డిజైన్స్ బుక్ చేసుకోవాలి. 2015 లాక్మే ఫ్యాషన్ వీక్‌లో ‘హల్దీ కుంకుమ్’ కలెక్షన్స్‌తో సెలబ్రిటీ డిజైనర్‌గా ఎదిగింది. చాలామంది సెలబ్రిటీస్‌కు తన డిజైన్స్ అందించింది. డిజైనర్ పీస్ కాబట్టి కాస్త ఎక్కువగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది. పలు ప్రముఖ ఆన్ లైన్ స్టోర్స్‌లో ఈ బ్రాండ్ డిజైన్స్ లభిస్తాయి. డ్రెస్ డిజైనర్: జయంతి రెడ్డి ధర:రూ. 2,89,900 డ్యూయెట్ లగ్జరీ.. లెదర్–వుడ్ స్పెషలిస్ట్ ఈ బ్రాండ్. నాణ్యమైన టేకు కలపకు ప్యూర్ లెదర్ జోడించి వివిధ అలంకరణ సామాగ్రిని తయారు చేస్తారు. వీటిల్లో బ్యాగులు, బెల్టులు చాలా ఫేమస్. ఇక లెదర్ ఐటమ్స్‌పై అందించే యూనిక్ ఎంబ్రాయిడరీ డిజైన్స్, ఈ బ్రాండ్ వాల్యూను అమాంతం పెంచేశాయి. మెటల్ ఐటమ్స్ డిజైన్స్‌లోనూ దీనికి మంచి పేరుంది. ఆ ఫేమ్‌కు తగ్గట్టు వీటి ఖరీదూ ఎక్కువే. పలు ప్రముఖ ఆన్ లైన్ స్టోర్స్‌లోనూ దొరుకుతాయి. ఫుట్‌వేర్ బ్రాండ్: డ్యూయెట్ లగ్జరీ ధర: రూ. 13,000 జైపూర్ జ్యూయెల్స్.. ఏడుతరాల చరిత్ర కలిగిన జైపూర్ జ్యూయెల్స్.. సుమారు 150 సంవత్సరాల కిందటిది. అప్పట్లో ఇది రాజకుటుంబీకులకు బంగారు ఆభరణాలను అందించేది. అయితే, అధికారికంగా మిలాప్‌చంద్ నహతా 1966లో ‘జైపూర్ జ్యూయెల్స్’ పేరుతో వ్యాపారం ప్రారంభించాడు. ప్రస్తుతం అతని కుమారుడు సుభాష్ నహతా ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు. రాయల్ జ్యూయెలరీ డిజైన్స్‌లో వీరికి పెట్టింది పేరు. అందుకే, ఎక్కువగా సెలబ్రిటీస్ పెళ్లిళ్లలో ఈ జైపూర్ జ్యూయెల్స్ మెరుస్తాయి. కేవలం డిజైన్ అధారంగానే ఆభరణాల ధర నిర్ణయిస్తారు. జైపూర్, ముంబై, ఢిల్లీ వంటి ప్రముఖ నగరాల్లో వీరి బ్రాంచీలు ఉన్నాయి. అన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయొచ్చు. చిన్నప్పుడు మొత్తం అక్కే నన్ను రెడీ చేసేది. జ్యూయెలరీ బ్రాండ్: జైపూర్ జ్యూయెల్స్ ధర: డిజైన్ పై ఆధారపడి ఉంటుంది. - దీపిక కొండి చదవండి: డార్క్ చాక్లెట్, నారింజ పండ్లు, చేపలు.. తరచూ తిన్నారంటే.. -
నా దగ్గర అన్ని రకాల సాక్స్ కలెక్షన్ ఉంది : హీరోయిన్
నిధి అగర్వాల్.. వైవిధ్యమైన ఆలోచన, ఆచరణే ఆమె విజయ రహస్యం. ఫ్యాషన్‌లోనూ అదే ఫార్ములా! ఆమె ఫేవరేట్ బ్రాండ్సే నమూనా!! స్టార్స్‌కు ఎస్వీఏ ఫేవరేట్ 'సోనమ్, ప్రకాశ్ మోదీ అనే ఇద్దరు డిజైనర్స్ కలసి స్థాపించిన సంస్థ ఎస్వీఏ. దాదాపు ఏడు సంవత్సరాలుగా ఎవర్ గ్రీన్ డిజైన్స్‌ను అందిస్తున్నారు. అదే వీరి బ్రాండ్ వాల్యూని పెంచింది. డిజైన్స్‌కు ఎంత ప్రాధాన్యం ఇస్తారో.. ఫ్యాబ్రిక్కూడా అంతే ప్రాధాన్యం ఇస్తారు. నాణ్యమైన వస్త్రాల కోసం ముంబైలో ఓ పరిశ్రమనే స్థాపించారు. అక్కడ తయారైన ఫ్యాబ్రిక్‌తో మాత్రమే వీరు డిజైన్స్ చేస్తారు. అందుకే చాలా మంది స్టార్స్‌కు ఎస్వీఏ ఫేవరేట్. విదేశాల్లో కూడా వీరి దుస్తులకు మంచి గిరాకీ ఉంది. డిజైనర్ పీస్ కాబట్టి కాస్త ఎక్కువగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్‌లో ఈ బ్రాండ్ డిజైన్స్ లభిస్తాయి. నీతా బూచ్రా.. ప్రసిద్ధ బంగారు ఆభరణాల వ్యాపారి లలిత్ కుమార్ బూచ్రా వారసురాలు. నగల మీదున్న మోజుతో జ్యూయెలరీ డిజైనర్‌గా మారింది నీతా. స్టార్స్ కోసం ప్రత్యేకంగా ఆభరణాలను డిజైన్ చేస్తుంది. ప్రియాంక చోప్రా, విద్యా బాలన్ వంటి సెలబ్రిటీస్‌కు ఆమె అభిమాన డిజైనర్. జైపూర్‌లో ‘నీతా బూచ్రా జ్యూయెలరీ ’ పేరుతో బంగారం, వెండి, వజ్రాల ఆభరణాల దుకాణం ఉంది. కేవలం డిజైన్ ఆధారంగానే ఆభరణాల ధర నిర్ణయిస్తారు. పలు ప్రముఖ ఆన్ లైన్ స్టోర్స్‌లో ఈ డిజైన్స్ లభిస్తాయి. ఏది కొనాలన్నా రూ. వేల నుంచి లక్షల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది. క్రిస్ట్యా లుబుటా టాప్ మోస్ట్ లగ్జూరియస్ ఫ్యాషన్ బ్రాండ్స్‌లో క్రిస్ట్యా లుబుటా ఫుట్‌వేర్ ఒకటి. దాదాపుగా ప్రతి హాలీవుడ్ స్టార్ దగ్గర దీని కలెక్షన్ ఉంటుంది. 1991లో మొదలైన ఈ సంస్థను ది గ్రేట్ డిజైనర్ క్రిస్ట్యా లుబుటా స్థాపించారు. ఫ్యాషన్ వరల్డ్ .. ప్యారిస్‌లో దీని మెయిన్ బ్రాంచ్ ఉంది. ఇప్పటి వరకు సుమారు ఆరు లక్షల ఫుట్‌వేర్ డిజైన్స్‌ను ఈ సంస్థ అందించింది. ఈ బ్రాండ్‌కు ప్రపంచమంతా స్టోర్స్ ఉన్నాయి. ఈ ఫుట్‌వేర్ ఖరీదు చాలా చాలా ఎక్కువ. పలు ప్రముఖ ఆన్ లైన్ స్టోర్స్‌లోనూ దొరుకుతాయి. బ్రాండ్ వాల్యూ డ్రెస్ బ్రాండ్: ఎస్వీఏ ధర: రూ. 65,000 జ్యూయెలరీబ్రాండ్: నీతా బూచ్రా జ్యూయెలరి ధర: డిజైన్ పై ఆధారపడి ఉంటుంది. ఫుట్‌వేర్ బ్రాండ్: ఐరిజ క్రిస్ట్యా లుబుటా పంప్స్ ధర:రూ. 55,567 ఎవరైనా రకరకాల షూస్ ఇష్టపడ్తారు. నాకైతే రకరకాల సాక్స్ ఇష్టం. ఎప్పుడూ ఒకేరకమైన సాక్స్ ధరించను. నా దగ్గర వివిధ బ్రాండ్స్ సాక్స్ కలెక్షన్ ఉంది.– నిధి అగర్వాల్ -దీపిక కొండి -
నచ్చితే రూ.100ల టీషర్ట్ అయినా వేసుకుంటా : నటి
రెజీనా.. ఆన్ స్క్రీన్ అయినా.. ఆఫ్ స్క్రీన్ అయినా సహజంగా కనిపించడానికే ఇష్టపడుతుంది. అదే ఆమె స్టయిల్ అయింది. ఆ శైలిని ట్రెండ్‌గా మార్చేసిన బ్రాండ్స్ ఏవంటే.. ఫారిన్ ఫ్యాషన్స్‌కు స్వదేశీ టచ్ అనుశ్రీ బ్రహ్మభట్.. చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ ప్రపంచంలోనే పెరిగింది. తల్లి పెద్ద ఫ్యాషన్ డిజైనర్ కాకపోయినా చక్కటి టైలర్. అందమైన డిజైన్స్‌తో దుస్తులు కుట్టేది. దీంతో అనుశ్రీకి ఫ్యాషన్‌పై మక్కువ పెరిగింది. లండన్ ఎస్ఎస్డీటీ యూనివర్సిటీలో చదివి, ఫ్యాషన్ డిజైనర్‌గా మారింది. 2015లో ముంబైలో ‘లేబుల్ అనుశ్రీ’ పేరుతో సంస్థ స్థాపించింది. ఫారిన్ ఫ్యాషన్స్‌ను ఆనుసరించి స్వదేశీ డిజైన్స్ చేయడం ఈమె ప్రత్యేకత. ఎక్కువగా సంప్రదాయ చేనేత కళకు ప్రాధాన్యం ఇస్తుంది. కస్టమర్ అభిరుచి, బడ్జెట్‌కు తగ్గట్టుగా రూ. వేల నుంచి లక్షల వరకు డిజైన్ చేయగలదు. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్ అన్నిటిలోనూ అనుశ్రీ కలెక్షన్స్ లభిస్తాయి. నియతి డిజైన్స్.. నియతి అంటే సంస్కృతంలో విధి. పేరుకు తగ్గట్టుగానే స్థాపించిన కొన్ని రోజుల్లోనే ఆ బ్రాండ్ రాత మారిపోయింది.. ఆకర్షణీయమైన డిజైన్స్ వల్ల. ఇక్కడ లభించే ప్రతి ఆభరణాన్నీ చేత్తోనే తయారు చేస్తారు. అదీ ప్రత్యేకమైన పాత పద్ధతులను అవలంబించి. అదే నియతి బ్రాండ్ వాల్యూ. దీనిద్వారా అంతరించి పోతున్న గిరిజనకళా నైపుణ్యాన్ని కాపాడుతున్నారు. సాధారణంగా ఈ ఆభరణాల కోసం రాగి, వెండి లోహాలను ఉపయోగిస్తారు. అయితే ఈ బ్రాండ్ జ్యూయెలరీలో వాడే మెటల్ కన్నా వాటి కళాత్మకమైన డిజైన్స్‌కే విలువ ఎక్కువ. కొన్ని ఆభరణాలు రూ. లక్షల్లో కూడా ఉంటాయి. కేవలం నియతి ఒరిజిన్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, వెబ్సైట్, స్టోర్స్‌లో మాత్రమే వీటిని కొనుగోలు చేయొచ్చు. బ్రాండ్ వాల్యూ జ్యూయెలరీ బ్రాండ్: నియతి హారం: పరమ కలెక్షన్స్ ట్రైబల్ నెక్‌పీస్ ధర: రూ. 29,000 డ్రెస్.. మస్డడ్ లెహంగా అండ్ ఆర్గంజా నాటెడ్ షర్ట్ బ్రాండ్: లేబుల్ అనుశ్రీ ధర: రూ. 22,000 కమ్మలు అద్వితీయ కలెక్షన్స్ ఇయరింగ్స్ ధర: రూ. 5,290 ఫలానా బ్రాండ్ నుంచి ఇది లాంచ్ చేశారు. వెంటనే దానిని కొనాలి, వేసుకోవాలి అని నాకు ఎప్పుడూ ఉండదు. వంద రుపాయల టీషర్ట్ అయినా సరే.. నాకు నచ్చితే వేసుకుంటా– రెజీనా ∙దీపిక కొండి -
తాప్సీ ధరించిన ఈ చీర ఖరీదు ఎంతో తెలుసా?
తాప్సీ పన్ను.. టాలెంటెడ్ బ్యూటీ. నటనలోనే కాదు ఫ్యాషన్‌లోనూ వెర్సటాలిటీ ఆమె స్పెషాలిటీ. దాన్ని ఆమె స్టయిల్ సిగ్నేచర్‌గా మార్చిన బ్రాండ్స్ ఇవి... బ్రాండ్ వాల్యూ ఆప్రో : వత్సల కొఠారి, అర్హత కొఠారి, భవిత కొఠారి.. అక్కాచెల్లెళ్లు. ఈ ముగ్గురూ కలసి 2015లో జైపూర్‌లో ‘ఆప్రో’ అనే సంస్థను స్థాపించారు. ప్రతి కస్టమర్‌కు నచ్చే విధంగా ట్రెడిషనల్, ట్రెండీ, ఫ్యాషనబుల్ డిజైన్స్‌ను అందించడం వీరి ప్రత్యేకత. ఎక్కువగా సంప్రదాయ చేనేత కళకు ప్రాధాన్యం ఇస్తారు. తాజాగా గృహాలంకరణ వస్తువుల కోసం ‘ఆప్రో ఘర్’ పేరుతో మరో సంస్థనూ ప్రారంభించారు. ఇందులో అందమైన కుషన్స్, కర్టెన్స్, బెడ్‌షీట్స్ వంటి ఇతర వస్తువులూ ఉన్నాయి. తతిమా బ్రాండ్స్‌తో పోలిస్తే ఈ బ్రాండ్ డిజైన్స్ సరసమైన ధరల్లోనే దొరుకుతాయి. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. చీర బ్రాండ్: ఆప్రో ధర: రూ. 15,500 నా స్టైల్ డబుల్ సీ డబుల్ సీ. అంటే.. కాంటెంపరరీ, కాన్ఫిడెన్స్, క్లాసీ, కంఫర్టబుల్ డిజైన్స్. వీటినే ఎక్కువగా ఇష్టపడతాను. అది ధరించే దుస్తుల్లో అయినా, పోషించే పాత్రల్లో అయినా..– తాప్సీ పన్ను ఇయర్రింగ్స్ బ్రాండ్: రియా ధర: రూ. 5,290 కుటుంబ నేపథ్యం వజ్రాల వ్యాపారం కావడంతో రియాకు చిన్నప్పటి నుంచి ఆభరణాలపై మక్కువ ఎక్కువ. ఆ ఇష్టంతోనే జ్యూయెలరీ డిజైనర్‌గా మారింది. బంగారం, వెండి, వజ్రాలతోనే కాకుండా ప్లాస్టిక్ నుంచి ఫ్యాబ్రిక్ వరకు ప్రతి పదార్థాన్నీ ఆమె డిజైన్స్ కోసం ఉపయోగిస్తుంది. అదే ఆమె యూఎస్పీ. ఆరుసంవత్సరాల కిందట సొంతంగా ‘రియా’ పేరుతో బ్రాండ్‌ను క్రియేట్ చేసింది. కొద్దికాలంలోనే ఆమె పాపులరై ప్రముఖ జ్యూయెలరీ డిజైనర్స్‌లో ఒకరిగా నిలిచింది. అతి తక్కువ ధరల్లో, ప్రత్యేకమైన డిజైన్స్ ఇక్కడ లభిస్తాయి. యువతలో ఈ బ్రాండ్‌కు మంచి క్రేజ్ ఉంది. ఆన్లైన్లో రియా జ్యూయెలరీని కొనుగోలు చేయొచ్చు. -దీపిక కొండి -
స్టార్ స్టైలిస్ట్... నిశ్చయ్ నియోగి
హైదరాబాద్: రవీనా టండన్ నుంచి సోనాక్షి వరకు, జూహీ నుంచి శ్రద్ధాకపూర్ వరకు, రానా నుంచి రన్బీర్ సింగ్ దాకా నిశ్చయ్ నియోగీ స్టైలింగ్‌కు ఫ్యాన్సే.. చాలా మంది స్టార్స్‌కు లక్కీ మస్కట్.. స్టార్స్‌ని స్టైలిష్‌గా మార్చే ఈయన హైదరాబాదీ. ముంబైలో బిజీగా ఉండే నిశ్చయ్ నియోగి ఇటీవల ఓ అసైన్మెంట్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు ‘సాక్షి’తో కాసేపు ముచ్చటించారు.. స్టైలింగ్, స్టైలిస్ట్ స్టార్స్‌పై వివరాలు ఆయన మాటల్లోనే. మీ గురించి.. ‘హైదరాబాద్‌లో పుట్టి, పెరిగిన నేను యూకేలో ఫ్యాషన్ డిగ్రీ చేసి అక్కడే 7 ఏళ్లపాటు అంతర్జాతీయ పత్రికల కు పని చేశా. సెలవుల్లో నగరానికి వచ్చిన నాకు వీఎన్ ఆదిత్య దర్శకత్వంలో రెయిన్బో చిత్రానికి అవకాశం వచ్చింది. దీంతో తొలి సారి స్టైలిస్ట్‌గా పనిచేశాను. ఆయన ఇచ్చిన అవకాశం నాకు టర్నింగ్ పాయింట్. ఈ విషయంలో ఆయనకు జీవితాంతం కృతజ్ఞతలు చెప్పుకుంటా... ముంబై కాల్.. రెయిన్బో సినివూ తర్వాత జావేద్ అక్తర్ ఫోన్ చేసి హైదరాబాద్‌లో ఏం చేస్తావ్ వెంటనే ముంబైకి రా అన్నారు. అప్పటి నుంచి 6 ఏళ్లుగా అక్కడే పని చేస్తున్నాను. అనిల్ కపూర్, జూహీ చావ్లా, ప్రియాంక చోప్రా, సోనూసూద్, శ్రద్ధా కపూర్, కృతీ సనన్, కాజోల్, తమన్నా తదితర బాలీవుడ్ అండ్ సౌత్ స్టార్లకి స్టైలిస్ట్‌గా చేశాను. సోనాక్షిసిన్హాకు కెరీర్ ప్రారంభం నుంచి నేనే స్టైలిస్టుగా ఉన్నాను. ఆమె యాడ్స్‌కి కూడా పని చేశాను. మీ కెరీర్లో బాగా గుర్తింపు తెచ్చినవి.. సౌత్ స్కోప్ క్యాలెండర్‌తో నాకు గుర్తింపు వచ్చింది. ఫిలింఫేర్ కోసం కంగ్నా రనౌత్‌కి చేసిన స్టైలింగ్‌తో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. తర్వాత సోనాక్షి స్టైలిస్ట్‌గా మరింత పాపులారిటీ వచ్చింది. ఆమెకు ఐఫా అవార్డ్ కోసం స్టైలింగ్ చేశాను. బెస్ట్ వెల్డ్రెస్డ్ వుమెన్ లిస్ట్‌లో ఆమె టాప్ త్రీలో నిలిచారు. టాలీవుడ్లో నెగెటివ్ రోల్ కోసం జగతిబాబు మేకవర్కి కూడా మంచి గుర్తింపు వచ్చింది. బాలీవుడ్, టాలీవుడ్ల మధ్య తేడాలు గతంలో మాలా సిన్హా ఆంకే సినిమాలో 80కి పైగా కాస్ట్యూమ్స్ వేసుకున్నారు. 1940 హీరోయిన్ నూతన్, ఆ తర్వాత వైజయంతి, హేమామాలిని, షర్మిలా ఠాగూర్‌లు ఫ్యాషన్‌కు సింబల్‌గా నిలిచారు. వాళ్లు ఎప్పటి నుంచో ఫాస్ట్ అండ్ ఫార్వర్డ్. ఇక సోనమ్ దాన్ని ఇంకో లెవల్‌కు తీసుకువెళ్లారు. ఇండియన్ సినిమాలో ఆమెలా ఎవరూ స్టైలింగ్‌లో ప్రయోగాలు చేయులేదు. ప్రస్తుతం కంగనా కూడా బాగా ఎక్స్పరిమెంట్స్ చేస్తున్నారు. మేకప్, హెయిర్‌లో ఇక్కడ చాలా తేడా ఉంది. ఇక్కడ సింపుల్‌గా ఒక పోనీ వేసుకుని, క్లిప్స్, బ్యాండ్ పెట్టుకుని నెటివిటీ ఫ్యాషనే కనిపిస్తుంది. సౌత్‌లో హీరోయిన్ల కన్నా హీరోలు ఫ్యాషన్, స్టైల్లో ఫాస్ట్‌గా చేంజ్ అవుతున్నట్లు కనిపిస్తుంది. ఆసక్తి కూడా వాళ్లలోనే కనిపిస్తుంది. తెలుగులో పెద్ద హీరోయిన్లు కూడా ఎక్స్పరిమెంట్ చేయట్లేదు. . దానికి కారణం హీరోలు ఉన్నంత కన్సిస్టెంట్గా సినిమాల్లో హీరోయిన్లు ఉండకపోవటం కావచ్చు. టాలెంట్ మెరుగుపరచుకోవాలి ఈ రంగంలో అవకాశాలు బాగా ఉన్నాయి. ఏ వృత్తి అయినా ఎప్పటికప్పుడు టాలెంట్‌ని మెరుగుపరుచుకోవాలి. హార్డ్‌వర్క్, క్రియేటివిటీ తప్పనిసరి. తెలుగు సినిమాల్లో ఫ్యాషన్‌పై.. హెయిర్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, కే3 ప్యాంట్స్, వేలాడే కమ్మలు వేసుకుని కనిపిస్తున్నారు. షాట్స్ ఎక్స్పోజింగ్, ప్యాంట్ ఫుల్ కవర్ అవుతుందని 3/4ప్యాంట్స్ వేసుకుంటారు. ఏదైనా కాన్ఫిడెంట్‌గా చేస్తే బాగుంటుంది. తెలుగు సినిమా వాళ్లు ఫ్యాషన్‌లో వెనుకబడి ఉన్నారు. టాలీవుడ్లో ఫ్యాషన్ ప్రయోగాలపై.. ఈ విషయంలో నాగార్జునకు హ్యాట్సాఫ్. ఆయన స్టైల్స్, లుక్స్‌లో చాలా ఎక్స్పరిమెంట్స్ చేశారు. తెలుగులో ఎవరూ ఆయనలా ప్రయోగాలు చేయలేదు. ఇక రామ్‌చరణ్ డ్రెస్సింగ్ ఎక్స్పెన్సివ్, స్టైలిష్‌గా ఉంటుంది. నాగచైతన్య డ్రెస్సింగ్ డీసెంట్‌గా ఉంటుంది.. అయితే ఆడియన్స్‌ను ఎప్పుడు తక్కువగా అంచనా వేయకూడదు. వీళ్లకి ఇదే చాలు అనుకుంటే ఫ్యాషన్ ముందుకు వెళ్లదు. ఎక్స్పరిమెంట్స్ చేయాలి. క్లాత్స్ మాత్రమే కాకుండా హెయిర్, లుక్ అన్నింట్లో మార్పులు రావాలి.’ అంటారు నిశ్చల్ నియోగి.’