‘నా పేరు కుమారి.. నా ఏజ్ 21..’ డైలాగ్ ఎవరిదో గుర్తుంది కదా.. ఎస్.. హెబ్బా పటేల్. ఆమెకు సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ అంతే క్రేజీ ఫాలోయింగ్ ఉంది. ఆ అందానికి పర్‌ఫెక్ట్ మ్యాచింగ్ అవుట్‌ఫిట్స్.. జ్యూయెలరీని అందిస్తున్న బ్రాండ్స్ ఇవే..
నచ్చితే వెంటనే కొనేస్తా. నాలాగే బొద్దుగా ఉన్నవాళ్లకి కొన్ని దుస్తులు నప్పవని అంటుంటారు. అందులో నిజం లేదు. శరీరానికి కష్టం కలిగించకుండా.. ఇష్టంతో ధరించే ఏ దుస్తుల్లో అయినా అందంగానే కనిపిస్తాం – హెబ్బా పటేల్
ఇస్సా స్టూడియో...
ఇటీవలే ప్రారంభమై, బాగా పాపులారిటీ సంపాదించుకున్న ఫ్యాషన్ హౌస్‌లలో ఒకటి ఇస్సా స్టూడియో. హైదరాబాద్‌కు చెందిన స్వాతి, చేతన అనే ఇద్దరు స్నేహితులు కలసి స్థాపించిన ఈ సంస్థ, ఆరంభంలోనే అందమైన డిజైన్స్‌తో పలువురు సెలబ్రిటీలను ఆకర్షించింది. నిహారిక కొణిదెల, అనసూయ భరద్వాజ్, మంచు లక్ష్మి తదితరులు వీరి కలెక్షన్స్‌ను రెగ్యులర్‌గా ఫాలో అవుతుంటారు.
యువతరమే వీరి టార్గెట్. యూత్ స్టైల్‌ను మ్యాచ్ చేస్తూ డిజైన్ చేసే సంప్రదాయ దుస్తులతో ఫేమస్ బ్రాండ్‌గా ఇస్సాను నిలిపారు. ప్రస్తుతం భారత్‌తో పాటు, అమెరికా నుంచి కూడా ఆర్డర్లను తీసుకుంటున్నారు. ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఆన్‌లైన్‌లోనూ ఇస్సా స్టూడియో డిజైన్స్‌ను కొనుగోలు చేయొచ్చు.
ఆ డ్రెస్ నీకు సెట్ కాదని ఎంతమంది చెప్పినా వినను.
చీర..బ్రాండ్: ఇస్సా స్టూడియో
ధర: రూ. 34,000
ఆర్నీ బై శ్రావణి..
ఈ బ్రాండ్ పెళ్లి ఆభరణాలకు ఫేమస్. ఈ నగలను ధరించి పెళ్లి పందిట్లోకి వెళ్లాలని చాలా మంది అమ్మాయిలు కోరుకుంటారు. రెడీమేడే కాదు స్వయంగా ఆర్డర్ ఇచ్చి కూడా కావలసిన నగలను డిజైన్ చేయించుకోవచ్చు. విలువైన రత్నాలు, వజ్రాలతో తయారయ్యే ఈ డిజైన్స్‌కు మంచి గిరాకీ ఉంది.
పలువురు సెలబ్రిటీల ఫేవరెట్ అనీ ఈ బ్రాండ్‌కి పేరుంది. డిజైన్‌ను బట్టే ధర. కొన్ని సందర్భాల్లో రత్నాల విలువ, ఆభరణాల నాణ్యతపైనా ఆధారపడి ఉంటుంది. హైదరాబాద్ మెయిన్ బ్రాంచ్‌గా ఉన్న ఆర్నీ బై శ్రావణి జ్యూయెలరీని ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయొచ్చు.
జ్యూయెలరీ బ్రాండ్: ఆర్నీ బై శ్రావణి
ధర: ఆభరణాల నాణ్యత, డిజైన్‌పై ఆధారపడి ఉంటుంది.
-దీపిక కొండి
చదవండి: Scientifically Proven Facts: నవ్వితే ఇన్ని ఉపయోగాలా? విస్తుపోయే వాస్తవాలు..
Comments
Please login to add a commentAdd a comment