deepika
-
మరుగుజ్జు గెలాక్సీల్లోనూ భారీగా బ్లాక్‌హోల్స్!
తెనాలి: అమెరికాలోని సాల్ట్‌లేక్ సిటీలోని ఉటా విశ్వవిద్యాలయంలో పోస్ట్ డాక్టోరల్ పరిశోధన చేస్తున్న గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త డాక్టర్ రాగదీపిక పుచ్చా బ్లాక్‌హోల్స్‌కు సంబంధించిన అద్భుతమైన అంశాన్ని ఆవిష్కరించారు. దాదాపు అన్ని భారీ గెలాక్సీల కేంద్రాల్లోనూ సూపర్ మాసివ్ బ్లాక్‌హోల్స్ ఉన్నట్టు ఇప్పటికే కనుగొనడం జరిగింది. అయితే మరుగుజ్జు గెలాక్సీల్లోనూ పెద్దసంఖ్యలో 2,500 బ్లాక్‌హోల్స్‌ను కనుగొని, వాటిల్లోనూ బ్లాక్‌హోల్స్ సర్వసాధారణమని రాగదీపిక తేల్చారు. ‘గెలాక్సీలు ముందా? బ్లాక్‌హోల్స్ ముందా?’ అనే శాస్త్ర ప్రపంచం ఎదుట ఉన్న పెద్ద పజిల్ అన్వేషణలో ఇదో పెద్ద ముందడుగని రాగదీపిక చెప్పారు. తన పరిశోధన అంశాలను ఇటీవల అమెరికాలో విడుదల చేసిన ఆమె, ఈ సందర్భంగా ఆయా వివరాలను ‘సాక్షి’కి పంపారు. కొన్ని వివరాలను పరిశీలిస్తే..» ఆరిజోనా, మాయల్ టెలిస్కోపీలోని ‘డార్క్ ఎనర్జీ స్పె్రక్టాస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్’ (దేశీ) ప్రాజెక్టు 30 మిలియన్ గెలాక్సీలను పరిశీలిస్తోంది. » ఈ క్రమంలో ఎప్పటికప్పుడు డేటాను భద్రపరుస్తోంది. » ‘మరుగుజ్జు గెలాక్సీలు’ వ్యవస్థల్లో బ్లాక్‌హోల్స్ (కృష్ణబిలాలు) అన్వేషణలో ఉన్న డాక్టర్ రాగదీపిక నేతృత్వంలోని బృందం ‘దేశీ’ సేకరణలోని అంశాలను పరిశోధించింది. » ఆ అధ్యయనంలో భాగంగా దాదాపు 1,15,000 మరుగుజ్జు గెలాక్సీల్లో దాదాపు రెండు శాతం క్రియాశీల బ్లాక్‌హోల్స్‌ను కనుగొంది. » భారతదేశానికి చెందిన నోబెల్ బహుమతి గ్రహీత ఎస్.చంద్రశేఖర్ 50 ఏళ్ల క్రితం తొలిసారి బ్లాక్‌హోల్స్ సమాచారాన్ని అందించారు. దేశం తరఫున ఏకైక తెలుగమ్మాయి... మరుగుజ్జు నక్షత్ర మండలాల (డ్వార్ఫ్ గెలాక్సీస్)పై భారతదేశం నుంచి పరిశోధన చేస్తున్న ఏకైక తెలుగమ్మాయి రాగదీపిక పుచ్చా. సొంతూరు తెనాలి. తండ్రి రాజగోపాల్ కేంద్ర సర్వీసులో విశ్రాంత సివిల్ ఇంజినీరు. తల్లి కనకదుర్గ శాస్త్రీయ సంగీతం (వీణ) గురువు. పశ్చిమబెంగాల్లోని శాంతినికేతన్ విశ్వవిద్యాలయం విశ్వభారతిలో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్‌లో టాపర్‌గా నిలిచారు రాగదీపిక. అహ్మదాబాద్, నైనిటాల్, ముంబైలోని ప్రసిద్ధ పరిశోధన సంస్థల్లో సమ్మర్ ఇంటర్న్‌షిప్ చేసి, చివరి ఏడాది బెంగళూరులోని ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్’లో ‘సూర్యుడి మచ్చలు’పై థీసిస్ చేశారు. జర్మనీలోని ‘మాక్స్ ఫ్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోలార్ సిస్టమ్ రీసెర్చ్’లో గెస్ట్ సైంటిస్ట్‌గా సూర్యుడిపై పరిశోధనలు కొనసాగించారు. యూనివర్శిటీ ఆఫ్ ఆరిజోనాలో ‘ఆ్రస్టానమి అండ్ ఆస్ట్రో ఫిజిక్స్’లో ఎంఎస్ చేశారు. 2023లో అదే యూనివర్శిటీ నుంచి ‘మరుగుజ్జు గెలాక్సీలు–బ్లాక్‌హోల్స్’పై డాక్టర్ స్టెఫానీ జునో, డాక్టర్ అర్జున్ డే మార్గదర్శకత్వంలో సమర్పించిన థీసిస్‌కు పీహెచ్డీ స్వీకరించారు. శాస్త్ర ప్రపంచంలో ఇదే తొలిసారి మరుగుజ్జు గెలాక్సీల్లో బ్లాక్‌హోల్స్‌ను ఇంత భారీ సంఖ్యలో కనుగొనటం శాస్త్ర ప్రపంచంలో ఇదే ప్రథమం. మా బృందం నాలుగు వేలకన్నా ఎక్కువ గెలాక్సీల్లోని బ్లాక్‌హోల్స్ ద్రవ్యరాశిని కూడా నిర్ణయించింది. సూర్యుడి కంటే దాదాపు 1,000 నుంచి మిలియన్ రెట్ల ద్రవ్యరాశి కలిగిన ఇంటర్మీడియట్ బ్లాక్హోల్స్నూ శోధించింది. ‘దేశీ’ డేటాతో మా బృందం దాదాపు 300 డిటెన్షన్లను ఆవిష్కరించింది. దీని ఫలితంగా విశ్వంలో మొదటి బ్లాక్çహోల్స్ సాపేక్షికంగా తేలికైనవని తెలుస్తోంది. ‘దేశీ’తో ఇప్పటివరకు గెలాక్సీలలో అతి తక్కువ ద్రవ్యరాశి గల 2,500 బ్లాక్‌హోల్స్‌ను మేం కనుగొన్నాం. ఇది ఉత్తేజకరమైన ఫలితం. గెలాక్సీలు...బ్లాక్‌హోల్...వీటిలో ఏది ముందు? అనేది శాస్త్ర ప్రపంచానికి పెద్ద ప్రశ్న. గెలాక్సీలు, బ్లాక్‌హోల్స్ పరిణామ క్రమాన్ని విశ్లేషించటానికి, విశ్వంలో తొలి బ్లాక్‌హోల్స్ ఎలా ఏర్పడ్డాయనేది తెలుసుకునేందుకు మా అధ్యయనం ఉపకరిస్తుంది. బ్లాక్‌హోల్స్‌ను విడిగా కాకుండా ఒక సమూహంగా అధ్యయనం చేయడాన్ని ఇక ప్రారంభించవచ్చు. – డాక్టర్ రాగదీపిక పుచ్చా, ఖగోళ శాస్త్రవేత్త -
అక్రమంగా హిందూపురం ఛైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకున్న టీడీపీ
-
సూపర్ సిక్స్ పథకాల అమలుపై చంద్రబాబు చేతులెత్తేయడం సరికాదు
-
శీతాకాలపు అద్భుత ప్రపంచంలో ఎంజాయ్ చేస్తున్నా దీపిక పిల్లి (ఫొటోలు)
-
చాంపియన్స్ ధీరజ్, దీపికా కుమారి
జంషెడ్పూర్: ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ జాతీయ సీనియర్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచాడు. పారిస్ ఒలింపిక్స్‌లో మెగురైన ప్రదర్శన కనబర్చినా... పతకం సాధించలేకపోయిన ఈ ఆంధ్ర ఆర్చర్.. జాతీయ టోర్నీలో పెద్దగా పోటీ ఎదుర్కోకుండానే స్వర్ణం గెలుచుకున్నాడు. శుక్రవారం జరిగిన రికర్వ్ సింగిల్స్ ఫైనల్లో ధీరజ్ 6–2తో హరియాణాకు చెందిన దివ్యాన్‡్ష చౌధరిపై విజయం సాధించాడు. తొలి రెండు సెట్లలో వెనుకబడిన ధీరజ్ ఆ తర్వాత పుంజుకొని అదరగొట్టాడు. ఉత్తరాఖండ్‌కు చెందిన అతుల్ వర్మ కాంస్యం గెలుచుకున్నాడు. మహిళల విభాగంలో నాలుగుసార్లు ఒలింపియన్ దీపికా కుమారి చాంపియన్‌గా నిలిచింది. పారిస్ ఒలింపిక్స్‌లో తన సహచర ఆర్చర్ అకింత భకత్‌పై విజయంతో దీపికా కుమారి పసిడి పతకం కైవసం చేసుకుంది.శుక్రవారం ఫైనల్లో దీపిక 6–2తో అంకితపై గెలిచింది. సిమ్రన్‌జీత్ కౌర్‌కు కాంస్యం దక్కింది. మిక్స్డ్ టీమ్ ఈవెంట్లోనూ దీపిక స్వర్ణం గెలిచింది. తన భర్త అతాను దాస్‌తో కలిసి పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ) జట్టు తరఫున బరిలోకి దిగింది. ఫైనల్లో పీఎస్‌పీబీ 6–2తో పంజాబ్ టీమ్‌పై విజయం సాధించింది. -
దీపిక ‘హ్యాట్రిక్’
మస్కట్ (ఒమన్): జూనియర్ మహిళల ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. మలేసియా జట్టుతో సోమవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ రెండో లీగ్ మ్యాచ్‌లో జ్యోతి సింగ్ నేతృత్వంలోని భారత జట్టు 5–0 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దీపిక మూడు గోల్స్‌తో ‘హ్యాట్రిక్’ నమోదు చేసింది. దీపిక 37వ, 39వ, 48వ నిమిషాల్లో గోల్స్ చేసింది. వైష్ణవి ఫాల్కే (32వ నిమిషంలో), కనిక సివాచ్ (38వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించారు. మ్యాచ్ మొత్తంలో భారత జట్టుకు ఎనిమిది పెనాల్టీ కార్నర్లు... రెండు పెనాలీ స్ట్రోక్‌లు లభించాయి. ఇందులో మూడు పెనాల్టీ కార్నర్లను, ఒక పెనాల్టీ స్ట్రోక్‌ను భారత జట్టు గోల్స్‌గా మలిచింది. మిగతా ఐదు పెనాల్టీ కార్నర్లను, మరో పెనాల్టీ స్ట్రోక్‌ను భారత్ లక్ష్యానికి చేర్చి ఉంటే విజయం తేడా మరింత భారీగా ఉండేది. మరో మ్యాచ్‌లో దక్షిణ కొరియా 7–2 గోల్స్ తేడాతో చైనీస్ తైపీ జట్టును ఓడించింది. ఐదు జట్లున్న గ్రూప్ ‘ఎ’లో రెండేసి విజయాలు సాధించిన భారత్, చైనా జట్ల ఖాతాలో ఆరు పాయింట్ల చొప్పున ఉన్నాయి. అయితే చైనా చేసిన గోల్స్ (27) సంఖ్యకంటే భారత్ చేసిన గోల్స్ (17) తక్కువగా ఉండటంతో చైనా టాప్ ర్యాంక్‌లో, భారత్ రెండో ర్యాంక్‌లో ఉన్నాయి. బుధవారం జరిగే మూడో లీగ్ మ్యాచ్‌లో చైనాతో భారత్ తలపడుతుంది. -
చైనాకు షాక్.. చాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్.. అరుదైన రికార్డు
రాజ్‌గిర్(బిహార్): నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో భారత మహిళల హాకీ జట్టు అద్భుతం చేసింది. వుమెన్ ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో చైనాను ఓడించి.. టైటిల్‌ను సొంతం చేసుకుంది. తద్వారా ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. కాగా సొంతగడ్డపై జరిగిన ఈ మెగా టోర్నీ భారత్ డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగింది.అద్భుత విజయాలతో సెమీస్‌కు చేరుకున్న సలీమా బృందం.. అక్కడ జపాన్ను ఓడించి.. ఫైనల్‌కు చేరుకుంది. వరుసగా ఆరో గెలుపు నమోదు చేసి తుదిపోరుకు అర్హత సాధించింది. ఈ క్రమంలో బుధవారం జరిగిన ఫైనల్లో.. పారిస్ ఒలింపిక్స్ సిల్వర్ మెడల్ విజేత, ఆసియా క్రీడల చాంపియన్ అయిన చైనాతో తలపడింది.చైనాను 1-0తో ఓడించిఆద్యంతం ఆసక్తి రేపిన ఈ మ్యాచ్‌లో భారత మహిళా హాకీ జట్టు చైనాను 1-0తో ఓడించి.. ఆసియా చాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ మెగా టోర్నీలో భారత్ చాంపియన్‌గా నిలవడం ఇది మూడోసారి. ఈ క్రమంలో సౌత్ కొరియాతో కలిసి ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక టైటిళ్లు సాధించిన జట్టుగా అగ్రస్థానంలో నిలిచింది.ఇక చైనాతో ఫైనల్లో భారత్ తరఫున దీపికా చేసిన ఒకే ఒక్క గోల్‌తో విజయం సలీమా బృందం సొంతమైంది. మూడో క్వార్టర్లో ఆమె గోల్ కొట్టి భారత్‌ను విజయపథంలో నిలిపింది. దీంతో రాజ్‌గిర్‌లో సంబరాలు అంబరాన్నంటాయి.ఇదిలా ఉంటే.. ఈ ప్రతిష్టాత్మ టోర్నీలో 2016, 2023లలో భారత మహిళా జట్టు చాంపియన్‌గా నిలిచింది విజేతగా నిలిచింది. అదే విధంగా.. 2013, 2018లలో రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది.వుమెన్స్ ఆసియా చాంపియన్స్ ట్రోఫీ-2024లో పాల్గొన్న భారత జట్టుగోల్ కీపర్స్- సవిత, బిచు దేవి ఖరీబామ్డిఫెండర్స్- ఉదిత, జ్యోతి, వైష్ణవి విట్టల్ ఫాల్కే, సుశీలా చాను పఖ్రంబం, ఇషికా చౌదరిమిడ్ఫీల్డర్స్- నేహా, సలీమా టెటె(కెప్టెన్), షర్మిలా దేవి, మనీషా చౌహాన్, సునేలిటా టొప్పో, లల్రేమిసియామి.ఫార్వర్డ్స్- నవనీత్ కౌర్(వైస్ కెప్టెన్), ప్రీతీ దూబే, సంగీతా కుమారి, దీపికా, బ్యూటీ డంగ్‌డంగ్.చదవండి: ICC: వరల్డ్ నంబర్ వన్‌గా హార్దిక్ పాండ్యా.. దూసుకువచ్చిన తిలక్ వర్మ.. ఏకంగా.. -
దీపిక ఐదు గోల్స్... సెమీస్‌లో భారత్
రాజ్‌గిర్ (బిహార్): ఆద్యంతం ఆధిపత్యం చలాయిస్తూ భారత మహిళల హాకీ జట్టు ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో వరుసగా మూడో విజయం నమోదు చేసింది. థాయ్‌లాండ్ జట్టుతో గురువారం జరిగిన మూడో రౌండ్ లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 13–0 గోల్స్ తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది. భారత్ తరఫున దీపిక అత్యధికంగా ఐదు గోల్స్ (3వ, 19వ, 43వ, 45వ, 45వ నిమిషంలో) చేయగా ... ప్రీతి దూబే (9వ, 40వ నిమిషంలో), లాల్రెమ్సియామి (12వ, 56వ నిమిషంలో), మనీషా చౌహాన్ (55వ, 58వ నిమిషంలో) రెండు గోల్స్ చొప్పున సాధించారు. బ్యూటీ డుంగ్‌డుంగ్ (30వ నిమిషంలో), నవ్‌నీత్ (53వ నిమిషంలో) ఒక్కో గోల్ నమోదు చేశారు. ఈ గెలుపుతో భారత జట్టు అధికారికంగా సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఆరు జట్ల మధ్య లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో ఈ టోర్నీ జరుగుతోంది. ఆరు జట్లు మూడేసి మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాయి. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో నెగ్గిన పారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేత చైనా, భారత్ 9 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. అయితే గోల్స్ అంతరం కారణంగా చైనా (చేసిన గోల్స్ 22; ఇచ్చిన గోల్స్ 1) టాప్ ర్యాంక్‌లో, భారత్ (చేసిన గోల్స్ 20; ఇచ్చిన గోల్స్ 2) రెండో ర్యాంక్‌లో ఉన్నాయి. 3 పాయింట్లతో మలేసియా మూడో స్థానంలో, 2 పాయింట్లతో జపాన్ నాలుగో స్థానంలో, 1 పాయింట్‌తో కొరియా ఐదో స్థానంలో, 1 పాయింట్‌తో థాయ్‌లాండ్ ఆరో స్థానంలో ఉన్నాయి. నిర్ణీత ఐదు మ్యాచ్‌లు పూర్తయ్యాక టాప్–4లో నిలిచిన జట్లు సెమీఫైనల్లోకి దూసుకెళ్తాయి. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఎలాంటి ఫలితాలు వచ్చినా చైనా, భారత జట్ల తొమ్మిది పాయింట్లను మిగతా జట్లు దాటే పరిస్థితి లేదు. దాంతో ఈ రెండు జట్లకు సెమీస్ బెర్త్‌లు ఖరారయ్యాయి. మూడో నిమిషంలో మొదలై... గత పదేళ్లలో ఏడోసారి థాయ్‌లాండ్‌తో తలపడిన భారత జట్టుకు ఈసారీ ఎలాంటి పోటీ ఎదురు కాలేదు. గతంలో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో థాయ్‌లాండ్‌కు ఒక్క గోల్ మాత్రమే సమర్పించుకొని 39 గోల్స్ సాధించిన భారత జట్టు ఏడోసారీ అదే దూకుడును కొనసాగించింది. మూడో నిమిషంలో దీపిక చేసిన గోల్‌తో భారత్ ఖాతా తెరిచింది. అటునుంచి టీమిండియా వెనుదిరిగి చూడలేదు. మ్యాచ్ మొత్తంలో భారత జట్టుకు 11 పెనాల్టీ కార్నర్లు లభించాయి. ఇందులో ఐదింటిని మాత్రమే భారత్ గోల్స్‌గా మలిచింది. లేదంటే విజయాధిక్యం మరింతగా ఉండేది. గురువారమే జరిగిన ఇతర లీగ్ మ్యాచ్‌ల్లో చైనా 2–1 గోల్స్‌తో జపాన్‌పై, మలేసియా 2–1 గోల్స్‌తో కొరియాపై గెలిచాయి. శనివారం జరిగే నాలుగో రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో మలేసియాతో జపాన్; కొరియాతో థాయ్‌లాండ్; చైనాతో భారత్ తలపడతాయి. -
ఆ పిల్లల చదువు బాధ్యత నాదే
చెన్నారావుపేట: వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం 16 చింతల్ తండాలో ప్రేమోన్మాది దాడిలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. నిందితుడు నాగరాజు దాడిలో తల్లిదండ్రులు శ్రీనివాస్, సుగుణలు చనిపోవడంతో పిల్లలు దీపిక, మదన్‌లు అనాథలయ్యారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, జెడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్నలు మంగళవారం హైదరాబాద్‌లోని కేటీఆర్ వద్దకు పిల్లలను తీసుకెళ్లారు.వారితో మాట్లాడిన కేటీఆర్ జరిగిన విషయాలు తెలుసుకుని ధైర్యం చెప్పారు. అనంతరం సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ అనాథ పిల్లల చదువు బాధ్యత తానే తీసుకుంటానని కేటీఆర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. సుగుణ బీఆర్ఎస్ క్రియాశీల కార్యకర్త, గ్రామ పంచాయతీలో వార్డు సభ్యురాలు కావడంతో పార్టీ తరఫున కుటుంబాన్ని ఆదుకునేందుకు రూ. 5 లక్షలు ఆర్థికసాయం అందించనున్నట్లు తెలిపారు. కుటుంబానికి భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం రూ.50 లక్షల ఆర్ధిక సాయం అందించాలని కోరినట్లు తెలిపారు. అంతేకాకుండా నిందితుడు నాగరాజుకు కఠినశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని సీఎంను కేటీఆర్ కోరినట్లు చెప్పారు. -
కత్తిదూసిన ఉన్మాదం
చెన్నారావుపేట: ఓ ఉన్మాది చేతిలో భార్యాభర్తలు దారుణ హత్యకు గురయ్యారు. యువతి, ఆమె సోదరుడు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని పదహారుచింతల్తండా గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా.. తండాకు చెందిన భానోతు శ్రీనివాస్(40), సుగుణ(35) దంపతులకు కూతురు దీపిక, కుమారుడు మదన్‌లాల్ ఉన్నారు. వీరిది వ్యవసాయ కుటుంబం. దీపిక డిగ్రీ సెకండియర్, కుమారుడు మదన్‌లాల్ ఇంటర్ సెకండియర్ చదువుతున్నారు. కాగా.. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మేకల నాగరాజు(బన్ని)తో దీపిక ప్రేమలో పడింది. నాగరాజు తల్లిదండ్రులు హైదరాబాద్‌కు వలస వెళ్లగా నాగరాజు గ్రామంలోనే ఉంటున్నాడు. గత నవంబర్‌లో నాగరాజు, దీపిక వెళ్లిపోయి కులాంతర వివాహం చేసుకున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో జనవరిలో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోవడమే కాకుండా.. చెన్నారావుపేట పోలీస్‌స్టేషన్‌లో పరస్పరం ఫిర్యా దులు చేసుకున్నారు. అనేక మార్లు పెద్ద మనుషుల మధ్య పంచాయితీ జరిగింది. ఒకరి జోలికి ఒకరు వెళ్లకుండా ఉండాలని తీర్మానం చేశారు. అప్పటి నుంచి దీపిక కుటుంబంపై కక్ష పెంచుకున్న నాగరాజు.. బుధవారం అర్ధరాత్రి పదహారుచింతల్తండాకు చేరుకున్నాడు. ఆరు బయట నిద్రిస్తున్న దీపిక, ఆమె తల్లిదండ్రులు భానోతు శ్రీనివాస్, సుగుణపై వేట కొడవలితో దాడి చేశాడు. ఆ అలజడికి ఇంట్లో నిద్రిస్తున్న కుమారుడు మదన్‌లాల్ బయటికి రాగా అతడిపైనా దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన సుగుణ అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు శ్రీనివాస్‌ను నర్సంపేట ప్రభు త్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. తీవ్రంగా గాయపడిన దీపిక, మదన్‌లాల్‌ను హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతున్నారు. పోలీసుల అదుపులో నిందితుడు! నిందితుడు నాగరాజు గుండెంగ ప్రభుత్వ పాఠశాల వరండాలో తెల్లవారు వరకు ఉన్నట్లు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు అక్కడికి చేరుకున్నారు. అతడితోపాటు హత్యకు ఉపయోగించిన వేటకొడవలి, ఎక్సెల్ ద్విచక్ర వాహనాన్ని స్వా«దీనం చేసుకున్నట్లు సమాచారం. నిందితుడిని విచారిస్తున్నట్లు తెలిసింది. కాగా, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మృతుల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నర్సంపేటలో పోలీస్‌స్టేషన్ వద్ద, వరంగల్ రోడ్డ జంక్షన్ వద్ద ఆందోళనకు దిగారు. ఈస్ట్‌జోన్ డీసీపీ రవీందర్ ఘటనస్థలానికి చేరుకుని వారితో మాట్లాడారు. ఫోన్లో కలెక్టర్ సత్యశారదాదేవితో మాట్లాడించి న్యాయం చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. కాగా, గురువారం రాత్రి నాగరాజును అదుపులోకి తీసుకున్నామని డీసీపీ రవీందర్ తెలిపారు. కాగా గురువారం పొద్దుపోయాక మృతులిద్దరి అంత్యక్రియలను స్వగ్రామంలో పూర్తి చేశారు. కూతురు దీపిక తల్లిదండ్రుల మృతదేహాలకు తలకొరివి పెట్టారు.పక్కా వ్యూహంతోనే హత్యలకు ప్లాన్ ఇద్దరూ విడిపోయాక హైదరాబాద్‌లోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయిన నాగరాజు నెల రోజుల క్రితం మళ్లీ గుండెంగ గ్రామంలో అమ్మమ్మ ఇంటికి చేరుకుని ఆటోను అద్దెకు తీసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో దీపికకు వివాహ సంబంధాలు చూస్తున్నారనే విషయం తెలుసుకున్న నాగరాజు ఆమె కుటుంబంపై పగ తీర్చుకోవాలని పక్కా వ్యూహంతోనే రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తాం: సీతక్క హన్మకొండ: జంట హత్యలపై మంత్రి సీతక్క తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇప్పటికే నిందితుడిని అరెస్టు చేసినట్లు ఆమె ఒక ప్రకటనలో వెల్లడించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, దాడిలో గాయపడిన యువతికి, ఆమె సోదరుడికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపిన సీతక్క, బాధిత కుటుంబానికి రక్షణ కలి్పస్తామని వివరించారు. బతిమిలాడినా వినలేదు.. నాగరాజును చంపేయాలి: దీపిక నాకు తల్లిదండ్రులను లేకుండా చేసిన నాగరాజును చంపేయాలి.. మాకు వాటర్‌ప్లాంట్ నుంచి వాటర్ పోసేందుకు తండాకు వచ్చేవాడు. అలా పరిచయం అయిన తర్వాత నెక్కొండకు వెళ్లే క్రమంలో వెంటపడేవాడు. నన్ను హైదరాబాద్‌కు తీసుకెళ్లి ఏడు నెలలైనా పెళ్లి చేసుకోలేదు. ఇద్దరికీ కుదరలేదు. హైదరాబాద్ నుంచి వచ్చాక తల్లిదండ్రులతో ఉంటున్నా. బుధవారం రాత్రి అమ్మా, నేను, నాన్న బయట పడుకున్నాం. నాపై ఉన్న దుప్పటి తొలగించగా అరవడంతో అమ్మ లేచింది. బతిమిలాడుతున్నా కత్తితో దాడికి పాల్పడ్డాడు. నేను భయంతో నానమ్మ వాళ్ల ఇంటికి వెళ్లి అక్కడ స్పృహ తప్పి కిందపడిపోయా. ఆ తర్వాత లేచి సమీపంలో ఉన్న వదిన వాళ్ల ఇంటికి వెళ్లాను.. అక్కడికి సైతం వచ్చి పిలిచాడు. వాళ్లు నన్ను బయటకు రానివ్వలేదు. అందరు లేచి అరవడంతో పరారయ్యాడు. -
చీపురు పట్టిన చేత్తోనే మైక్ అందుకుంది..!
ఇంటి పెద్ద అనారోగ్యంతో మంచం పట్టాడు.ఐదుగురు వ్యక్తులు ఉన్న ఆ ఇల్లు నిలబడాలంటే ఇంటి ఇల్లాలు ఏదో ఒక పని వెతుక్కోవాలి. గృహిణిగా ఇంటి పనులు చేయగలగడం తప్ప మరే నైపుణ్యాలు లేవు.అలాంటి దిక్కుతోచని వాతావరణం నుంచి దీపికా మహత్రే ఓ కొత్త మార్గంవైపు నడిచింది.భర్త, ముగ్గురు పిల్లల పోషణ కోసం ఇళ్లలో పనిమనిషిగా చేరింది. ముంబయ్ లోకల్ రైళ్లలో ఇమిటేషన్ జ్యువెలరీని అమ్మేది. అక్కడ నుంచి స్టాండ్ అప్ కమెడియన్‌గా ఆమె జీవితం ఓ గొప్ప మలుపు తీసుకుంది. వెబ్ సిరీస్‌లో నటించే అవకాశంపోందింది. పనిమనిషి నుంచి స్టాండ్ అప్ కమెడియన్‌గా ఎదిగిన ఆమె కథ ఎంతో మంది జీవితాలను ఉత్సాహపరుస్తుంది.‘‘నా భర్త ఆరోగ్యం బాగోలేనప్పుడు ఐదుగురు సభ్యులతో కూడిన నా కుటుంబానికి ఏకైక జీవనో΄ాధిని అయ్యాను. మా ్ర΄ాథమిక అవసరాలు తీర్చడానికి ఊరగాయలు, ΄ాపడ్లను అమ్మడం మొదలు పెట్టాను. పేషెంట్ కేర్ సర్వీస్‌లో పనిచేశాను. ఐదు ఇళ్లలో వంటపని చేయడం ్ర΄ారంభించాను. అంతేకాదు, ముంబై లోకల్ ట్రైన్లో ఇమిటేషన్ జ్యువెలరీని అమ్మడం ్ర΄ారంభించాను. ఇన్ని పనులు చేయడం కష్టమయ్యేది. కానీ, కష్టసమయాల్లో నా కుటుంబాన్ని నిలబెట్టాలి, నా పిల్లలకు మెరుగైన విద్యను అందించాలి. ఈ తపనతోనే అన్ని పనులూ ఓర్పుగా చేసేదాన్ని. మలుపు తిప్పిన కామెడీ..అయితే, అన్ని పనుల్లో ఒక ప్రత్యేకత ఉందన్న విషయం నాకే తెలియదు. నలుగురిని నవ్విస్తూ, సరదాగా మాట్లాడుతుంటాను. నేను పనిచేసేచోట యజమాని ఫ్రెండ్ ఒకరు నా టాలెంట్‌ను ప్రదర్శించమని ్ర΄ోత్సహించాడు. సంపన్నుల కుటుంబాల్లో వ్యక్తుల ద్వంద్వ ప్రమాణాలను ఎగతాళి చేస్తూ, నేను గమనించిన అసమానతలను హాస్యంగా హైలైట్ చేస్తూ చె΄్పాను. చాలా మెచ్చుకున్నారు. కామెడీ అనేది ఒక అద్దంలా పనిచేస్తుంది, మార్పును కలిగిస్తుంది. ఒక రి΄ోర్టర్ నా వినోద భరితమైన స్టోరీని పత్రికలో వేశారు. హాస్యనటుడు అదితి మిట్టల్ నా స్టోరీ చూసి, నన్ను కలవడానికి వచ్చారు. నా కామెడినీ కొనసాగించమని ్ర΄ోత్సహించారు. నేను దానిని అనుసరించాను. పరిశీలనే కంటెంట్..నాలాంటి మహిళలకు ఆర్థికంగా సొంతకాళ్లపై నిలబడే అవకాశం రావడం నిజంగా అదృష్టమే. వేదికపైన అందరి దృష్టిని ఆకర్షించాలంటే నాదైన ప్రత్యేకత చూపించాలి. నేను ఎక్కడ పనిచేసినా ఆ ఇంటి యజమానుల పనులను గమనించేదాన్ని. అదే నా కంటెంట్‌గా మారింది. నాలాగా పని చేస్తున్నవారు ఎదుర్కొంటున్న వాస్తవాలను వెలుగులోకి తేవడం మొదలుపెట్టాను. పనిమనిషికి కూర్చునేందుకు ఎక్కడా సరైన స్థలం కూడా ఉండదు. ఎంత కష్టంగా అనిపించినా అన్నీ పెదవి చాటున బిగపట్టుకొని పనులు చేస్తూ ఉండాలి. నా పరిశీలనలే నా హాస్య కచేరీలకు సరైన కథనాలను అందించాయి. వెబ్‌సీరీస్ ‘బ్యాడ్ గర్ల్’ వంటి ్ర΄ాజెక్ట్లలో కూడా ΄ాల్గొన్నాను. సామాజిక అసమానతలను హాస్యంలో మేళవించి నిర్భయంగా ప్రస్తావిస్తూ రావడంతో ΄ాల్గొన్న వేదికలన్నీ వినోదానికే కాదు న్యాయం వైపుగా కూడా ఆలోచింపజేసేవి. పెరిగిన ఆదరణజనాదరణ పెరగడంతో టెలివిజన్ ఛానెల్స్ నుండి ఆఫర్లు రావడం పెరిగాయి. పేరు, డబ్బు రావడంతో కుటుంబం కూడా ఆర్థికంగా నిలదొక్కుకుంది. ‘స్మైల్ ఈజ్ మై సూపర్ పవర్’ అని నమ్మకంగా చెబుతాను. ఎందుకంటే, నా జీవితంలో ఒడిదొడుకులను చిరునవ్వుతోనే ఎదుర్కొంటున్నాను. జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదించాలనే నమ్మకాన్ని ఏ ఒక్కరూ కోల్పోనక్కర్లేదు. అందుకు వయసుతో, పరిస్థితులతో కూడా సంబంధం లేదు. ఇప్పుడు నేను నడివయసు మహిళను. ఎవరైనా సరే 40, 50 లేదా వందేళ్లయినా సరే జీవితం పట్ల అభిరుచిని కోల్పోవాల్సిన అవసరం లేదు. మనం వృద్ధా΄్యానికి దగ్గర కావచ్చు. కానీ, మనలో ఎప్పటికీ ఒక చిన్న అమ్మాయి ఉంటుంది. ఆమె ఎప్పటిలాగే ఉత్సాహంగా ఉంటుంది. మనం కూడా అలాగే ఉండాలి. ఏదైనా సమస్య మన తలుపు తడితే భయపడకుండా, విచారంగా లేకుండా చిరునవ్వుతో స్వాగతించాలి. ఎలాంటి సవాళ్లు వచ్చినా సానుకూల దృక్పథంతో ఎదుర్కోవడం మొదలుపెడితే మన మార్గం కూడా సులువు అవుతుంది. స్టాండ్ అప్ కామెడీ పురుష ఆధిపత్య ప్రపంచానిదే. అలాంటి రంగంలో నాకంటూ ఓ సముచిత స్థానాన్ని సం΄ాదించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. నిరాశావాదంతో కొట్టుమిట్టాడేవారికి నా జీవితమే ఓ గొప్ప ఉదాహరణ. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక గొప్పదనం ఉంటుంది. దానిని వెలికి తీసేందుకు ఎవరికి వారు ప్రయత్నం చేస్తూనే ఉండాలి’ అంటోంది ఈ స్టాండప్ కమెడియన్. -
హిందూపురంలో బాలకృష్ణకు ఎదురీత తప్పదా?
ఎన్నికల వేళ హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం హాట్ సీటుగా మారింది. హిందూపురం నుంచి ఎవరు విజేతగా నిలుస్తారన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. గత నలభై సంవత్సరాలుగా టీడీపీ అభ్యర్థులే ఇక్కడి నుంచి గెలుస్తూ వస్తున్నారు. ఇప్పటికి రెండు సార్లు గెలిచిన నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ సాధిస్తానంటున్నారు. అయితే ప్రజల్ని ఏమాత్రం పట్టించుకోని బాలకృష్ణకు హిందూపురం ఓటర్లు గట్టిగానే గుణపాఠం చెప్పారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే సినీ హీరో బాలయ్య హిందూపురంలో ఎదురీదుతున్నట్లు జోరుగా చర్చ జరుగుతోంది.శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం అసెంబ్లీ స్థానంలో గెలుపు ఎవరిదన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. హిందూపురం నియోజకవర్గంలో మొత్తం 2,49,174 మంది ఓటర్లు ఉండగా. 77.82 శాతం ఓటింగ్ నమోదైంది. 2014, 2019 ఎన్నికలతో పోలిస్తే.. ఈసారి స్వల్పంగా పోలింగ్ శాతం పెరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టీఎన్ దీపిక పోటీ చేయగా..ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ అభ్యర్థిగా ముచ్చటగా మూడోసారి నందమూరి బాలకృష్ణ బరిలో నిలిచారు. నందమూరి కుటుంబానికి కంచుకోటగా హిందూపురం నియోజకవర్గానికి పేరుంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు 1985 నుంచి వరుసగా మూడు సార్లు, ఆయన కుమారుడు నందమూరి హరికృష్ణ 1996లో జరిగిన ఉప ఎన్నికలో ఒకసారి హిందూపురం నుంచే గెలిచారు.2014, 2019 ఎన్నికల్లో రెండుసార్లు గెలిచిన నందమూరి బాలకృష్ణ ముచ్చటగా మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే మా బ్లడ్ వేరు..మా బ్రీడ్ వేరు అంటూ డప్పు కొట్టుకునే బాలకృష్ణకు బీసీ మహిళ అయిన కురుబ దీపిక చుక్కలు చూపించారు. నియోజకవర్గం అంతటా ఇంటింటా ప్రచారం నిర్వహించి వైఎస్ జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను గడపగడపకూ తీసుకెళ్లారు. తాను హిందూపురం కోడలినని.. తనకు ఓటు వేస్తే హిందూపురంలోనే ఉండి సమస్యలు పరిష్కరిస్తానని ఆమె భరోసా ఇచ్చారు. గత పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గానికి చుట్టం చూపుగా వచ్చి వెళ్తున్నారు. తనను రెండుసార్లు అసెంబ్లీకి పంపించిన హిందూపురం ప్రజల బాగోగులను ఆయన ఏనాడూ పట్టించుకోలేదు.తాను హైదరాబాద్‌లో సినిమా షూటింగుల్లో బిజీగా ఉంటూ..హిందూపురంలో తన తరపున పీఏలను ఏర్పాటు చేసి ప్రజాగ్రహానికి గురయ్యారు బాలకృష్ణ. అందుకే ఈ ఎన్నికల్లో బాలకృష్ణకు బుద్ధి చెప్పేందుకు ఓటర్లు వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. హిందూపురం, లేపాక్షి, చిలమత్తూరు మండలాల్లో బాలకృష్ణకు వ్యతిరేక పవనాలు బలంగా వీచినట్లు చర్చ జరుగుతోంది. హిందూపురం పట్టణంలో ముస్లిం మైనార్టీలు పెద్దసంఖ్యలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి వ్యతిరేకంగా ఓట్లు వేసినట్లు స్పష్టం అవుతోంది. దీంతో ఫలితం ఎలా ఉండబోతోందో అని సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణ టెన్షన్ కు గురవుతున్నట్లు టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దీంతో ఖచ్చితంగా హిందూపురంలోనూ జెండా ఎగురవేస్తామన్న ధీమాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు.మూడోసారి గెలవాలనే లక్ష్యంతో నందమూరి బాలకృష్ణ ఆపసోపాలు పడ్డారు. పదేళ్ళ పాటు ఎమ్మెల్యేగా ఉండి..నియోజకవర్గం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి..ఇప్పుడు తనను ఈసారి గెలిపిస్తే ప్రజలకు మేలు చేస్తానంటూ చెప్పిన కబుర్లు ప్రజలు విశ్వసించలేదు. చంద్రబాబు నాయకత్వంలో టీడీపీయే విశ్వసనీయత కోల్పోగా..ఆయన బావమరిదిగా బాలకృష్ణ కూడా అదే బాటులో పయనించి ప్రజలకు దూరమయ్యారు. అందుకే ఈసారి హిందూపురంలో ఫ్యాన్ గిర్రున తిరిగిందని చెబుతున్నారు. -
హిందూపూర్ లో నా మెజారిటీ ఎంతంటే..?
-
చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
-
సరికొత్త ప్రయత్నం చేయనున్న కల్కి
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ ఇతర లీడ్ రోల్స్ చేస్తున్నారు. భైరవ పాత్రలో ప్రభాస్, పద్మావతి పాత్రలో దీపికా పదుకోన్, అశ్వత్థామ పాత్రలో అమితాబ్ కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. సి. అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 9న విడుదల కావాల్సింది. అయితే వాయిదా పడే అవకాశం ఉందట. కాగా ఈ చిత్రం యూనిట్ ఓ సరికొత్త ప్రయత్నం చేస్తోందనే టాక్ ప్రచారంలోకి వచ్చింది. ఈ చిత్రంలో లీడ్ రోల్స్‌లో కనిపించే ప్రభాస్, దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్ల పాత్రలకు సంబంధించిన పూర్వాపరాలను, ఆ పాత్రల తీరు తెన్నులను చెబుతూ ఓ యానిమేటేడ్ వీడియోను రెడీ చేస్తున్నారట. ఈ వీడియో నేరుగా ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుందని భోగట్టా. ఈ వీడియోలోని తన పాత్రకు ప్రభాస్ ఇప్పటికే డబ్బింగ్ కూడా పూర్తి చేశారని తెలిసింది. అయితే ఈ యానిమేటెడ్ వీడియో ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఎప్పట్నుంచి స్ట్రీమింగ్ కానుంది? వీడియో నిడివి ఎంత? అసలు వార్తల్లో ఉన్నట్లు యానిమేటెడ్ వీడియో షూట్ జరిగిందా? లేదా అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. -
హిందూపురం అభ్యర్థి దీపికా సవాల్
-
స్టన్నింగ్ లుక్‌లో అదిరిపోతున్న మెగా డాటర్ నిహారిక!
నిహారిక కొణిదెల.. యాంకర్‌గా, నటిగా, నిర్మాతగానే కాదు ట్రెండీ లుక్స్‌తో ఫ్యాషన్ ఐకాన్ గానూ ప్రేక్షకులకు సుపరిచితురాలే. అయితే ఆమెకు స్ట్రీట్ షాపింగే ఇష్టమట. సెలబ్రిటీలు అందరూ బ్రాండెడ్ దుస్తులే ధరిస్తారు అని అనుకుంటారు. కానీ నాకు మాత్రం స్ట్రీట్ షాపింగే ఇష్టం. నచ్చిన వాటిని వెదికి వెదికి వెలికి తీస్తాను అంటోంది. ఇక ఆమె ఫ్యాషన్ సెన్స్‌ను క్యారీ చేస్తున్న బ్రాండ్స్‌లో కొన్ని ఇక్కడ.. డ్రెస్ బ్రాండ్:తన్వా బై దీపిక హైదరాబాద్ ఎన్ఐఎఫ్టీలో డిజైనింగ్ కోర్సు పూర్తి చేసిన దీపిక ఆనంద్.. కొంతకాలం ప్రముఖ డిజైనర్ల దగ్గర పనిచేసి.. ఈ మధ్యనే హైదరాబాద్‌లోనే ‘తన్వా బై దీపిక’ పేరుతో సొంత ఫ్యాషన్ హౌస్‌ను ప్రారంభించింది. ఆధునిక డిజైన్స్‌ని క్రియేట్ చేస్తూ, అనతికాలంలోనే టాలీవుడ్ సెలబ్రిటీలకు హాట్ ఫేవరెట్‌గా మారింది. ధరలు.. సామాన్యుడికీ అందుబాటులో ఉంటాయి. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. ఇక్కడ నిహారిక ధరించిన తన్వా బై దీపిక డిజైనర్ డ్రస్ ధర రూ. 21,000/- జ్యూలరీ బ్రాండ్: రియా జ్యూయెల్స్ వెరైటీ డిజైన్స్‌కు క్రేజీ కేరాఫ్ ఈ బ్రాండ్. అన్ని రకాల బంగారు, వెండి పూత నగలతోపాటు ఫ్యూజన్, నక్షీ, నవరతన్ వంటి ఇతర డిజైనర్ నగలూ ఇక్కడ లభిస్తాయి. ధర.. ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. కేవలం వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా మాత్రమే కొనుగోలు చేసే వీలుంది. ఉంగరం ధర: రూ.750/-, కమ్మలు ధర: రూ.4,200/- (చదవండి: సారా టెండూల్కర్‌కి ఇష్టమైన బ్రేక్‌ఫాస్ట్‌లు ఇవే!) -
Deepika Padukone: వెంకన్న సన్నిధిలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ (ఫోటోలు)
-
Deepika Padukone HD Photos: మతిపోగొట్టే ఫోజులతో దీపిక పదుకొణె (ఫోటోలు)
-
Deepika Deshwal: ముచ్చటగా మూడోసారి...
ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో మూడుసార్లు ప్రసంగించిన తొలి భారతీయ యువతిగా లా ఆఫీసర్ దీపికా దేశ్వాల్ చరిత్ర సృష్టించింది. కాలేజీ రోజుల నుంచి సేవాపథంలో నడుస్తున్న దిల్లీకి చెందిన దీపిక ఎంతోమంది బాధితులకు అండగా నిలిచి, ఎన్నోరకాల సేవాకార్యక్రమాల్లో పాల్గొంది. నలుగురిని ఒకటి చేసి తన దారిలో నడిచేలా చేసింది... పీహెచ్డీ స్కాలర్ అయిన దీపికా దేశ్వాల్కు చదువు మాత్రమే ప్రపంచం కాదు. కాలేజీ రోజుల నుంచి సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనడం అంటే ఇష్టం. కోవిడ్ కల్లోల కాలంలో సామాజిక సేవా కార్యక్రమాలలో విస్తృతంగా పాల్గొంది. పంజాబ్‌లోని మోగా జిల్లాలో ప్రభుత్వ అధికారులను సమన్వయం చేసుకుంటూ పల్లె, పట్టణం అనే తేడా లేకుండా వందలాదిమందికి సహాయం అందించింది. స్నేహితులు, బంధువులను కూడా తన సేవాకార్యక్రమాలలో భాగం చేసింది. అన్నదానం నుంచి అనుకోకుండా ఆపదలో చిక్కుకున్న వారికి సహాయం చేయడం వరకు ఎన్నో చేసింది. తన జీతం మొత్తం కరోనా బాధితుల చికిత్స కోసం విరాళంగా ఇచ్చేది. ఆమె తండ్రి కూడా తన జీతంలోని కొంతమొత్తాన్ని విరాళంగా ఇచ్చేవాడు. ఏ అవసరం ఎప్పుడు వచ్చినా ఫోన్ చేయమంటూ ఎంతోమందికి తన ఫోన్ నంబర్ ఇచ్చింది. అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడు ఫోన్ వచ్చినా పరుగులు తీసేది. బాధితులకు అన్ని రకాలుగా అండగా నిలిచేది. సోషల్ మీడియాలో వేధింపులకు గురవుతున్న 80 మంది అమ్మాయిలకు అండగా నిలిచి, నేరస్థులు అరెస్ట్ అయేలా ఉద్యమించింది. వ్యభిచార కూపంలో చిక్కుకున్న అమ్మాయిలను రక్షించి వారికి పునరావాసం ఏర్పాటయ్యేందుకు కృషి చేసింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగానికి మనదేశం తరఫున ప్రాతినిధ్యం వహించింది. మహిళా సాధికారత నుంచి మానవ హక్కుల వరకు ఎన్నో కార్యక్రమాలలో క్రియాశీల పాత్ర పోషించిన దీపికకు న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో మూడోసారి ప్రసంగించే అరుదైన అవకాశం లభించింది. గత రెండు సమావేశాల్లో ‘మానవ హక్కులు–మహిళా హక్కులు’ అంశంపై మాట్లాడి 150 దేశాలకు చెందిన ప్రతినిధుల ద్వారా ప్రశంసలు అందుకుంది. మనసున్న దీపిక ఆటల్లోనూ బంగారం అనిపించుకుంది.‘యూనివర్శిటీ ఆఫ్ దిల్లీ’ లో రెజ్లింగ్, జూడోలలో ఆరుసార్లు బంగారు పతకం గెలుచుకుంది. ఆత్మరక్షణకు సంబంధించి అమ్మాయిల కోసం రకరకాల వర్క్‌షాప్‌లు నిర్వహించింది. -
భారత్‌లో బస్సు ఎక్కితే.. ఆస్ట్రేలియాలో దిగాడు
‘‘7:11 పీఎం’ ట్రైలర్ ఆసక్తిగా ఉంది. సౌండ్, విజువల్స్, వీఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉన్నాయి’’ అని డైరెక్టర్ హరీష్ శంకర్ అన్నారు. సాహస్, దీపిక జంటగా చైతు మాదాల దర్శకత్వం వహించిన చిత్రం ‘7:11 పీఎం’. నరేన్ యనమదల, మాధురి రావిపాటి, వాణి కన్నెగంటి నిర్మించిన ఈ సినిమా జూలై 7న విడుదలవుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ను హరీష్ శంకర్ రిలీజ్ చేశారు. చైతు మాదాల మాట్లాడుతూ–'ఒక టౌన్, రెండు గ్రహాలు, మూడు కాలాలు.. ఇదీ మా సినిమా లైన్. వీటిని ఎలా కనెక్ట్ చేశామనేది ఆసక్తిగా ఉంటుంది. మా సినిమాని విడుదల చేస్తున్న రవిశంకర్, నవీన్‌గార్లకు థ్యాంక్స్' అన్నారు. 'ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది' అన్నారు వై. రవిశంకర్. ట్రైలర్ విషయానికొస్తే.. కథానాయకుడు తనకు తెలియకుండానే టైమ్ ట్రావెల్ చేయడం జరుగుతుంది. ముందు రోజు రాత్రి బస్ ఎక్కిన అతడు.. తర్వాతి రోజు ఉదయాన్నే ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ సముద్ర తీరంలో నిద్రలేస్తాడు. పలు ఆసక్తికరమైన సన్నివేశాలను ట్రైలర్లో చూపిస్తూ.. చివరికి ఓ టైమ్ మిషన్‌తో ముగించారు. మొత్తంగా ఓ గ్రామం, రెండు గ్రహాలు, మూడు వేర్వేరు కాలాల.. చుట్టూ ఈ కథ నడుస్తుందని అర్థమవుతోంది. -
Yoga Day: యోగా.. కొత్త కొత్తగా
యోగా నిపుణులు, సాధకులు, ఇన్ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియాలో తమ ఉనికిని కొత్తగా చాటుతున్నారు. వారి నిజాయితీ, స్ఫూర్తిదాయకమైన వారి మాటలు, ఉత్సాహం ఆకర్షణీయంగా మార్చే సుగుణాన్ని కళ్లకు కడుతున్నాయి. యోగా ఆరోగ్యాన్ని, ఫిట్నెస్ను రెండింటినీ అద్భుతంగా మారుస్తుంది. రోజువారి జీవనంలో యోగా ఒక భాగం అవడానికి ఇన్ఫ్లుయెన్సర్లు మరిన్ని హంగులు అద్దుతున్నారు. శాస్త్రీయ యోగాభ్యాసం ద్వారా వేగవంతమైన ఆధునిక యుగానికి తమను తాము గొప్ప స్ఫూర్తిగా మార్చుకుంటున్నారు. సెలబ్రిటీల నుంచి ఎంతోమంది మహిళలు యోగా పాఠాలు చెబుతూ సోషల్ మీడియాలో కనిపిస్తారు. వారి నుంచి ఎంతో ప్రేరణను పొందవచ్చు. ఈ రోజు నుంచే యోగాను దైనందిన జీవనంలో భాగం చేసుకోవచ్చు. ప్రపంచస్థాయి ప్రభావం శిల్పా శెట్టి భారతదేశంలో అత్యంత ప్రభావ వంతమైన ఫిట్నెస్ ఐకాన్స్, యోగా ఇన్ఫ్లుయెన్సర్లలో ఒకరుగా నిలిచింది శిల్ప. ఐదుపదులకు చేరువలో ఉన్న శిల్ప యోగా కోసం చాలా కాలం శిక్షణ పొందారు. తీరైన శరీరాకృతిని పొందడానికి, దైనందిన జీవనంలో వ్యాయామాన్ని చేర్చడానికి ఫిట్నెస్ ఫిల్మ్‌లు రూపొందించింది. యోగాకు సంబంధించిన డీవీడీలను కూడా రిలీజ్ చేసింది. కొన్ని జీవన శైలి మార్పులు మనలో ఎలాంటి పెద్ద మార్పులను తీసుకువస్తాయో చూపించడానికి సోషల్‌మీడియాను ఉపయోగిస్తుంది. ఆమె యూ ట్యూబ్ ఛానెల్‌కి 3 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. ప్రపంచ స్థాయిలో భారతీయ యోగానుప్రోత్సహించడంలో శిల్ప చేసిన కృషి అంతా ఇంతా కాదు. ఆమె వ్యాయామం చేసే విధానం, తీసుకునే ఆరోగ్యకరమైన ఆహారం గృహిణులకు స్ఫూర్తినిస్తుంది. యోగా సౌందర్యం దీపికా మెహతా రోజును యోగాసనాలతో కొత్తగా ్రపారంభించాలనే ఆలోచనను దీపికా మెహతా కళ్లకు కడుతుంది. ఆమె యూ ట్యూబ్ ఛానెల్ ద్వారా యోగా లో కళా దృష్టి ఉంటుందని చూపుతుంది. ‘రెండు దశాబ్దాల క్రితం మరణం అనుభవాన్ని చవిచూశానని, యోగా పునర్జీవితాన్ని ఇచ్చింద’ని చెబుతుంది. రాక్ క్లైంబింగ్ ప్రమాదం తర్వాత ఆమె ఇకపై నడవలేదని వైద్యులు అంచనా వేశారు. యోగా ట్రైనర్, అష్టాంగ యోగా స్పెషలిస్ట్ అయిన దీపికా యూ ట్యూబ్ ఛానెల్ కి దాదాపు 4 లక్షల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె చూపే యోగా ప్రతిభ ఎంతోమందిని ఆశ్చర్యపరుస్తాయి. ఎంతోమంది బాలీవుడ్ సెలబ్రిటీలకు యోగా గురూగా మారింది. లోపాలను సరిదిద్దుతూ... సునయన రేఖీ యోగా హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ కోచ్‌గా సునైనా రేఖీ తనను తాను కొత్తగా ఎప్పుడూ పరిచయం చేసుకుంటూనే ఉంటుంది. భారతదేశంలోని అత్యంత పేరొందిన యోగా ట్రైనర్లలలో సునయన ఒకరు. రిషీకేశ్‌లో యోగా సాధన చేసిన సునయన ఇప్పుడు ముంబైలోని అనేక ప్రసిద్ధ యోగా స్టూడియోలలో నిపుణురాలిగా శిక్షణ ఇస్తోంది. సాధనకు బలమైన పునాదిని ఏర్పరచడానికి, గాయాలను మాన్పడానికి నిపుణులైన పర్యవేక్షణ అవసరమని సునయన వీడియోలు నిరూపిస్తాయి. యోగా సాధనలో చిన్న చిన్న లోపాలు ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తాయో కూడా వివరిస్తుంది. మనస్సు, శరీరం, ఆత్మపై యోగా వల్ల కలిగే మంచి ప్రయోజనాల గురించి వివరిస్తుంది. నిరాశకు దూరం నటాషా నృత్యకారిణి, ఫొటోగ్రాఫర్, యోగా సాధకురాలు నటాషా నోయల్. యూ ట్యూబ్, ఇన్స్టాగ్రామ్ నుంచే కాదు సోల్‌ఫుల్ హ్యాపీనెస్ బ్లాగ్ ద్వారా తన యోగానుభవాలను తెలియజేస్తుంది. మాట్లాడుతుంది. తత్త్వశాస్త్రాన్ని సాధన చేసే నటాషా ‘మీ మానసిక దృఢత్వమే మీ లక్ష్యం. మిగతావన్నీ అప్రధానం’ అని చెబుతుంది. తన బాల్యంలో జరిగిన విషాదకర సంఘటనల నుంచి తేరుకొని, కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. కండరాల బలాన్ని పునర్నిర్మించే ప్రయత్నంలో ఆమె యోగా సాధకురాలిగా మారింది. ఆమె యూ ట్యూబ్ ఛానెల్‌కు సుమారు ఏడు లక్షల ముప్పై వేల మంది సభ్యులు ఉన్నారు. నిరాశ, ఆందోళన, బాడీ షేమింగ్ గురించి చర్చించడానికి ఆమె తన సోషల్‌మీడియా ΄్లాట్ఫారమ్ను ఉపయోగిస్తుంది. యోగా ద్వారా సెల్ఫ్ గ్రోత్, చికిత్స గురించి మరీ మరీ చెబుతుంది. ప్రతిరోజూ మరింత బలంగా మారడానికి ప్రయత్నిస్తూనే ఉండాలని సూచనలు ఇస్తుంది. ఆమె ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా కష్టపడి పని చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయో అందుకు తనే ఉదాహరణగా చూపుతుంది. యోగాసిని రాధికా బోస్ అనేక పేరొందిన కంపెనీలతో కలిసి పనిచేసిన అనుభవం రాధికా బోస్‌కు ఉంది. అయితే, ఆమె తన ఆరోగ్యకరమైన జీవనాన్ని సూచించడానికి మాత్రం సోషల్‌మీడియానే ప్రధాన వేదికగా ఎంచుకుంటుంది. రాధిక సూచించే అంశాలు ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంటాయి. ప్రతిష్టాత్మకమైన మ్యాగజైన్లలో ఆమె యోగసాధన గురించి ప్రచురించాయి. ‘మీడియా, ప్రకటనలలో గ్లాస్ సీలింగ్‌ను ఛేదించడానికి మహిళలు గొప్ప పురోగతిని సాధించారు. అయితే మనం ఇంకా పితృస్వామ్యంలో జీవిస్తున్నాం, అన్నింటినీ దాటుకొని చాలా దూరం ప్రయాణించాల్సింది మనమే’ అని నమ్మకంగా చెబుతుంది. యోగా, వ్యాయామ జీవనశైలితో పాటు ఇతర ఆరోగ్య మార్గదర్శకాలను అందిస్తుంది. 9 సంవత్సరాలుగా యోగా సాధన చేస్తూ, నిపుణురాలిగా తన ప్రతిభను చాటుతోంది. -
ట్రిపుల్ ఐటీలో ఏం జరుగుతోంది?
నిర్మల్: చదువుల తల్లులుగా నిలవాల్సిన వాళ్ల చావుల వెనుక కారణాలేంటి.? ఆత్మహత్యలు చేసుకునేంత నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు? మొన్న దీపిక ఎందుకు ఆత్మహత్య చేసుకుంది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత లిఖిత చనిపోవడం వెనుక సరైన కారణమేంటి..? భవిష్యత్తుకు భరోసా ఇవ్వాల్సిన విద్యాక్షేత్రం ఇలా విద్యార్థుల బతుకులను ఎందుకు బలి తీసుకుంటోంది..? అసలు బాసర ట్రిపుల్ ఐటీలో ఏం జరుగుతోంది? ఇవీ..సాధారణ ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యారంగ నిపుణుల్లో వ్యక్తమవుతున్న సందేహాలు. ఈనెల 13న బలవన్మరణానికి పాల్పడిన సంగారెడ్డికి చెందిన వడ్ల దీపిక (17) మృతిపై ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. అదేరోజు నలుగురు సభ్యుల నిజనిర్ధారణ కమిటీ వేసినా ఇప్పటికీ కారణాలు బయటపెట్టకపోవడం సందేహాలకు, క్యాంపస్ వాతావరణంపై అనుమానాలకు తావిస్తోంది. ఇక బుధవారం అర్ధరాత్రి తర్వాత గంగాబ్లాక్ నాలుగో అంతస్తుపై నుంచి పడి చనిపోయిన లిఖిత మరణంపై ఎలాంటి అనుమానాలు లేవని కుటుంబసభ్యులు, వర్సిటీ వర్గాలు చెబుతున్నా.. ఏదో మిస్టరీ ఉందన్న వాదనలూ బలంగా ఉన్నాయి. రాత్రి 2.30 గంటల సమయంలో లిఖిత బయటకు ఎందుకు వచ్చిందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆమె మరణంపై గురువారం ఉదయం సెక్యూరిటీ గార్డులు, అధికారులు చెప్పిన వివరణలు వేర్వేరుగా ఉండటం గమనార్హం. ఎన్నో ప్రశ్నలు..మరెన్నో అనుమానాలు ♦ విద్యార్థుల మృతిపై ప్రతిపక్ష పార్టీ లు, విద్యార్థి సంఘాలు అనేక అనుమానాలు లేవనెత్తుతున్నాయి. పలు ప్రశ్నలూ సంధిస్తున్నాయి. ♦ పరీక్షలు రాస్తున్న సమయంలో కాపీయింగ్‌కు పాల్పడిన విద్యార్థిని ప్రాణం తీసుకునేదాకా ఎందుకు తీసుకువచ్చారు? ♦ తన మానసిక పరిస్థితిని అంచనా వేయకుండా ఎందుకు బెదిరింపులకు పాల్పడ్డారు..? ♦ వర్సిటీలో విద్యార్థుల కోసం ఏకంగా ముగ్గురు కౌన్సిలర్లతో కూడిన డిపార్ట్మెంట్ ఉండగా, వారి దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదు? ♦ విద్యార్థులు ఎందుకు ప్రాణాలు తీసుకుంటున్నారో ఎవరూ, ఎందుకు లోతుగా పరిశీలించడం లేదు? ♦ స్థానికంగా ఉంటానని ఇన్చార్జిగా వచ్ఛిన వీసీ వెంకటరమణ గెస్ట్‌గానే ఎందుకు వ్యవహరిస్తున్నారు? ♦ ఇలాంటి ఎన్నో ప్రశ్నలు వర్సిటీలో వాతావరణాన్ని, అక్కడి అధ్యాపకులు, ఇన్చార్జీల తీరును నిలదీస్తున్నాయి. దీనిపై సర్కారు సీరియస్‌గా దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
టాలీవుడ్లో మళ్లీ డ్రగ్స్.. నాడు ఏం జరిగింది?
టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ దుమారం తెరపైకి వచ్చింది. తాజాగా కబాలి తెలుగు నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడంతో తెలుగు చిత్రసీమను కుదిపేస్తుంది. ఇప్పటికే అతని కాల్ లిస్ట్‌లో ఇద్దరు స్టార్ హీరోయిన్లతో పాటు నలుగురు మహిళా నటులు ఉన్నారని సమాచారం. ఈ లింక్ వెనుక ప్రముఖ డైరెక్టర్ కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తెలుగు పరిశ్రమలో డ్రగ్స్ మాఫియా కొత్త కాదు. 2017లో టాలీవుడ్లో డ్రగ్స్ కేసు భారీగా ప్రకంపనలు రేపింది. గతంలో టాలీవుడ్‌ను డ్రగ్స్‌తో షేక్ చేసిన అలెక్స్‌ను పోలీసులు పట్టుకోవడంతో సినీ తారల పేర్లు ఒక్కోక్కటిగా బయటకొచ్చాయి. ఈ కేసుపై ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో సిట్ నియమించి విచారణ చేపట్టారు. రవితేజ, ఛార్మీ, రకుల్ ప్రీత్ సింగ్, రానా, పూరి జగన్నాధ్, నవదీప్, తరుణ్, తనీష్, సుబ్బరాజు, ముమైత్ ఖాన్ సహా పలువురు సెలబ్రిటీలను విచారించి..వారి నుంచి గోళ్లు, వెంట్రుకల నమూనాలను సేకరించారు. మొత్తం 12 కేసులు నమోదుచేసిన పోలీసులు 7 చార్జిషీట్లు వారిపై అప్పట్లో దాఖలు చేశారు. (ఇదీ చదవండి: Drugs Case: కేపీ చౌదరి ఫోన్ లిస్ట్‌లో సినీ ప్రముఖల లిస్ట్) నాటి విచారణలో ఏం తేల్చారు దర్యాప్తులో భాగంగా అప్పటి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో టాలీవుడ్‌కు చెందిన అనేక మందిని విచారించి.. వారి వాంగ్మూలం నమోదు చేశారు. డ్రగ్స్ వాడుతున్నదీ, లేనిదీ శాస్త్రీయంగా నిర్ధారించేందుకు వీరందరి గోళ్లు, వెంట్రుకలు సేకరించి ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు. అన్ని కోణాల్లో దర్యాప్తుతో పాటు సాక్షులనూ విచారించారు. దాదాపు మూడేళ్లపాటు దర్యాప్తు చేసినా మత్తుమందుల వాడకంపై ప్రాథమిక ఆధారాలూ లభించలేదు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు ముగిసిన తరుణంలో అకస్మాత్తుగా ఈడీ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఈ వ్యవహారంపై మళ్లీ కొత్తగా సినీ ప్రముఖులపై కేసు నమోదు చేశారు. డ్రగ్స్ దిగుమతితో పాటు విదేశాలకు నిధుల మళ్లింపు కోణంలో ఈడీ దర్యాప్తు చేపట్టింది. (ఇదీ చదవండి: రాయలేని భాషలో బూతులు.. ‘సైతాన్’ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే..) దీనిలో భాగంగా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన హీరో రవితేజ, ఛార్మీ, రకుల్ ప్రీత్ సింగ్, రానా, పూరి జగన్నాధ్, నవదీప్, తరుణ్, తనీష్, సుబ్బరాజు, ముమైత్ ఖాన్ వంటి వారిలో 12మందిని విచారించారు. వారందరి బ్యాంకు లావాదేవీలు పరిశీలించారు. అలా ఈడీ విచారణ కూడా సుమారు 2 నెలలు కొనసాగింది. అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపినా కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలూ లభించలేదని ఈడీ తేల్చేసింది. వారిలో ఎవరూ కూడా డ్రగ్స్ వాడినట్లుగా ఆధారాలు లభ్యం కాలేదని ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చేసింది. ఈ నేపథ్యంలో డ్రగ్స్ కేసును మూసివేసినట్లు అయింది. ఈడీ ఎంట్రీతో ఆయన బదిలీ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతున్న సమయంలో ఈడీ రంగంలోకి దిగడం అబ్కారీ శాఖకు సంకటంగా మారింది. ఆ సమయంలో అకున్ సబర్వాల్ ఆకస్మికంగా బదిలీ కావడం సంచలనం కలిగించింది. తర్వాత ఆ సిట్‌కు వేరే అధికారుల నేతృత్వంతో కేసు నీరుగారిపోయిందని, సిట్ తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందని ఆ సమయంలో పలు విమర్శలు వచ్చాయి. బాలీవుడ్లో డ్రగ్స్.. అక్కడా ఇదే స్టైల్ బాలీవుడ్ బాద్షా షారుక్ కొడుకు ఆర్యన్ కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు అప్పట్లో దుమారం జరిగింది. ఏం జరిగిందో తెలియదు కానీ అతనికి క్లీన్ చిట్ వచ్చింది..అతను నిర్దోషిగా తేల్చి నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ వదిలేసింది. మరి ఆర్యన్ నిర్దోషి అయితే 28 రోజులు ఎందుకు జైల్లో పెట్టారు? రెండు సార్లు బెయిల్ ఎందుకు తిరస్కరించారు? అసలు ఏ ఆధారాలతో పట్టుకున్నారు? అనే ప్రశ్నలకు ఇప్పటికి సమాధానాలు దొరకలేదు. (ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ అని చెర్రీకి చెప్పా.. అలా చేయొద్దన్నాడు: ఉపాసన) ఆర్యన్ కేసుకు ముందు కూడా బాలీవుడ్లో డ్రగ్స్ కలకలం రేపింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత రియా చక్రవర్తి ఫోన్లో పోలీసులకు కీలక ఆధారాలు దొరికాయని చెప్పారు. రియా సుశాంత్‌కు డ్రగ్స్ తెప్పించేదని ఆరోపణలొచ్చాయి. డ్రగ్స్ వ్యవహారం తెరపైకి రావడంతో.. సుశాంత్ మృతి కేసు కూడా మరుగున పడిపోయింది. అక్కడి నుంచి రియా చక్రవర్తి, రకుల్ ప్రీత్ సింగ్ నుంచి శ్రద్ధ కపూర్, దీపికా పదుకునే లాంటి టాప్ స్టార్స్ పేర్లు కూడా వినిపించాయి. వీళ్లందర్నీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారించింది. ఆ సమయంలో కూడా బాలీవుడ్ మూలస్తంభాలకూ డ్రగ్స్ లింకులున్నాయని, టాప్ హీరోలందరికీ నోటీసులిస్తారని పెద్దఎత్తున దుమారం రేగింది. కానీ అక్కడా కేసు సైలెంటైపోయింది. సినిమా రంగంలోనే ఎందుకు? సినిమా అనేది అనేక రంగుల ప్రపంచం. అక్కడ డబ్బు, ఫేమ్ సంపాదించే క్రమంలో నటీనటులతో పాటు టెక్నీషియన్స్లలో కొందరు ఈ డ్రగ్స్ కల్చర్‌కు అలవాటు పడుతారని తెలుస్తోంది. అంతేకాకుండా ఫిట్ నెస్, సౌందర్యం కోసం కూడా డ్రగ్స్ తీసుకుంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు. బాడీని మైంటైన్ చేయడంతో పాటు వయసు మీద పడకుండా ఉండటానికి కూడా కొన్ని రకాల మాదక ద్రవ్యాలు తీసుకుంటారని కామెంట్స్ వస్తున్నాయి. ఇందులో నిజమెంత ఉందో తెలియదు కానీ.. సినీ ఇండస్ట్రీలలో జరిగే పార్టీ కల్చర్ లో వీటిని అలవాటు చేసుకొని.. మెల్లమెల్లగా డ్రగ్స్‌కు బానిసలుగా మారుతున్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే డ్రగ్స్‌కి బానిసలైన సెలబ్రిటీలను లొంగదీసుకుని... సెలబ్రిటీలను డ్రగ్స్ ఉచ్చులోకి డీలర్స్ దింపుతారని తెలుస్తోంది. ఆ మధ్య బాలీవుడ్ హీరోయిన్స్ కంగనా రనౌత్ - మాధవీలత వంటి వారు సినీ ఇండస్ట్రీలో జరిగే పార్టీలలో డ్రగ్స్ కంపల్సరీ అని కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. -
పరీక్ష మధ్యలో వెళ్లి ఉరేసుకుని..
సాక్షి, హైదరాబాద్/నిర్మల్ చైన్‌గేట్/భైంసా: పరీక్షలు రాస్తున్న విద్యార్థిని.. ఉన్నట్టుండి మధ్యలో లేచి వెళ్లిపోయింది.. అలాగని హాస్టల్ గదికి కాకుండా బాత్రూంలోకి వెళ్లింది.. అందులోని ఎగ్జాస్ట్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుంది. నిర్మల్ జిల్లా బాసరలోని ట్రిపుల్‌ఐటీలో మంగళవారం ఉదయం జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. పరీక్షల ఒత్తిడితోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు ట్రిపుల్ ఐటీ అధికారులు చెప్తున్నారు. అయితే పరీక్ష హాల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్నారంటూ పలువురు విద్యార్థులను పరీక్ష సిబ్బంది, చీఫ్ వార్డెన్ మందలించారని.. దీనితో ఆందోళనకు లోనైన దీపిక బలవన్మరణానికి పాల్పడిందని విద్యార్థులు అంటున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం గొర్రెకల్ గ్రామానికి చెందిన వడ్ల దీపిక.. బాసర ఆర్జీయూకేటీలో పీయూసీ–1 చదువుతోంది. మంగళవారం ట్రిపుల్‌ఐటీలో జరిగిన పరీక్షకు హాజరైంది. అయితే మధ్యలోనే ఆమె పరీక్ష హాల్ నుంచి బయటికి వెళ్లిపోయింది. హాస్టల్ గదికి వెళ్లాల్సిన ఆమె.. పరీక్ష హాల్ సమీపంలో ఉన్న బాత్రూంలోకి వెళ్లింది. చాలాసేపైనా ఆమె బయటికి రాకపోవడం, పిలిచినా పలకకపోవడంతో అక్కడివారు వెంటనే సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు తలుపులు బద్దలుకొట్టి చూడగా.. దీపిక బాత్రూంలోని ఎగ్జాస్ట్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని కనిపించింది. ఆమెను వెంటనే క్యాంపస్‌లోని హెల్త్ సెంటర్‌కు.. అక్కడి నుంచి భైంసాలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే విద్యార్థిని మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో పోస్టుమార్టం నిమిత్తం విద్యార్థిని మృతదేహాన్ని నిర్మల్‌కు తరలించారు. దీనిపై ఆమె కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. అయితే విద్యార్థిని దీపిక ఆత్మహత్య విషయం చాలాసేపు బయటికి రాకుండా అధికారులు కట్టుదిట్టం చేశారు. ట్రిపుల్ ఐటీ ప్రధాన ద్వారం వద్ద పోలీసులను మోహరించారు. లోనికి ఎవరినీ అనుమతించలేదు. విషయం తెలుసుకున్న విద్యార్థి, ప్రజాసంఘాలు, ప్రతిపక్షాల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు గేటు వద్ద ఆందోళనకు దిగారు. దీపిక ఆత్మహత్యపై అనుమానాలు ఉన్నాయని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పరీక్షల ఒత్తిడి అంటున్న అధికారులు పరీక్షల ఒత్తిడి కారణంగానే దీపిక ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నామని ట్రిపుల్ఐటీ డైరెక్టర్ సతీశ్‌కుమార్ చెప్పారు. ట్రిపుల్‌ఐటీలో ముగ్గురు సభ్యులతో కౌన్సెలింగ్ డిపార్ట్మెంట్ ఉందని, కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నా మని తెలిపారు. అయినా ఈ ఘటన చోటుచేసుకో వడం బాధాకరమన్నారు. దీపిక ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు తేల్చేందుకు నలుగురు సభ్యులతో నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేశామని వివరించారు. నా బిడ్డను వేధించారు ట్రిపుల్ఐటీ సిబ్బంది, అధికారులు తన బిడ్డను వేధించారని, లేనిపోని విషయాలు చెప్పి భయభ్రాంతులకు గురిచేశారని దీపిక తండ్రి వడ్ల వీరన్న ఆరోపించారు. ట్రిపుల్ ఐటీ అధికారులు కొన్ని రోజుల క్రితం తనను పిలిపించి ఆమె వాట్సాప్‌లో చాటింగ్‌లు చేస్తోందని ఆరోపించారని వివరించారు. తన బిడ్డను అడిగితే.. ట్రిపుల్‌ఐటీలో కొందరు తనపై కక్షగట్టి ఇలా చేశారంటూ కన్నీళ్లు పెట్టుకుందని తెలిపారు. ఈ విషయాన్ని వార్డెన్‌కు, ఉన్నతాధికారులకు వివరించేందుకు తాను ప్రయత్నించినా.. పట్టించుకోలేదన్నారు. తన బిడ్డకు కౌన్సెలింగ్ చేసి దారిలో పెడతానని రాసివ్వాలని ఒత్తిడి చేశారని.. లేకుంటే సీటు రద్దు చేసి ఇంటికి పంపుతామని బెదిరించారని ఆరోపించారు. ఆ తర్వాత కూడా పలుమార్లు దీపిక తమకు ఫోన్ చేసి సిబ్బంది అనేక రకాలుగా వేధిస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేసిందని తెలిపారు. పత్తాలేని ట్రిపుల్ఐటీ అధికారులు దీపిక చనిపోయి కొన్ని గంటలు గడిచినా, రెండు ఆస్పత్రులకు మృతదేహాన్ని తరలించినా.. ట్రిపుల్ఐటీ అధికారులు, అధ్యాపకులెవరూ రాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాసరకు సమీపంలోనే మెరుౖగెన వైద్యసేవలు అందే నిజామాబాద్ పట్టణం ఉండగా.. ఆమెను భైంసాకు ఎందుకు తరలించారని దీపిక బంధువులు, బీజేపీ నేతలు మండిపడ్డారు. ఆమె మృతికి వర్సిటీ అధికారులే బాధ్యత వహించాలన్నారు. సమగ్ర విచారణ జరపాల్సిందే.. ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని దీపిక ఆత్మహత్యపై అనేక అనుమానాలు ఉన్నాయని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని ఏబీవీపీ వర్కింగ్ కమిటీ సభ్యుడు ప్రవీణ్‌రెడ్డి, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. ట్రిపుల్‌ఐటీలో విద్యార్థులపై వేధింపులను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. కాగా దీపిక ఆత్మహత్యకు ట్రిపుల్ ఐటీ అధికారులు కారణం చెప్పేంత వరకు ఆమె మృతదేహానికి పోస్టుమార్టం చేసేందుకు అంగీకరించేది లేదని తండ్రి వీరన్న తేల్చి చెప్పారు. ఏడాదిలో ముగ్గురు ఆర్జీయూకేటీలో సమస్యలను పరిష్కరించాలంటూ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళనకు దిగి మంగళవారం నేటికి ఏడాది అవుతోంది. రెగ్యులర్ వీసీని నియమించాలని, అధ్యాపకుల సంఖ్యను పెంచాలని, ఇతర వర్సిటీలతో అనుసంధానం చేయాలని, కనీస సౌకర్యాలను మెరుగుపర్చాలని డిమాండ్ చేస్తూ ఎండనకా, వాననకా వారం పాటు ఉద్యమించారు. విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి వర్సిటీకి వచ్చి హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. నాటి నుంచి ఇప్పటివరకు ట్రిపుల్‌ఐటీలో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం కలకలం రేపుతోంది. బిడ్డ మార్చురీలో.. తండ్రి ఐసీయూలో.. దీపిక మృతిపై ట్రిపుల్ఐటీ అధికారులు ఆలస్యంగా సమాచారం ఇవ్వడంతో ఆమె తండ్రి వీరన్న.. మంగళవారం సాయంత్రం పొద్దుపోయాక నిర్మల్ జిల్లా ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. అప్పటికే పలువురు బంధువులు, బీజేపీ నేతలు కూడా ఆస్పత్రి వద్దకు వచ్చారు. పోలీసులు తండ్రిని తప్ప మరెవరినీ ఆస్పత్రిలోకి వెళ్లనివ్వలేదు. దీనితో బంధువులు, బీజేపీ నేతలకు పోలీసులకు వాగ్వాదం జరిగింది. ఆస్పత్రిలో బిడ్డ మృతదేహాన్ని ఉంచిన మార్చురీవైపు వెళ్తుండగానే వీరన్న ఛాతీలో నొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీనితో వెంటనే ఆయనను ఆస్పత్రిలోని ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఓ వైపు మార్చురీలో బిడ్డ మృతదేహం ఉండగా.. అదే ఆస్పత్రి ఐసీయూలో తండ్రికి చికిత్స జరుగుతుండటం అందరినీ కన్నీరు పెట్టించింది. ఘటనపై కమిటీ వేశాం ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థిని దీపిక ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరం. ఈ ఘటన షాక్‌కు గురిచేసింది. ఇంజనీరింగ్ ఫలితాల విడుదల నేపథ్యంలోనే నేను హైదరాబాద్‌లో ఉన్నాను. అసలేం జరిగిందో పూర్తి వివరాలు తెలుసుకునేందుకు నలుగురు సభ్యులతో అంతర్గత నిజ నిర్ధారణ కమిటీ వేశాం. త్వరలోనే ఘటనకు కారణాలు తెలుస్తాయి. విద్యార్థులు ఒత్తిడికి గురి కావద్దు. – వెంకటరమణ, ఇన్చార్జి వీసీ, ఆర్జీయూకేటీ -
యాక్షన్.. థ్రిల్
సాహస్, దీపికా ముఖ్య తారలుగా నటించిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ ‘7:11’. నూతన నటీనటులతో చైతు మాదాలను దర్శకుడిగా పరిచయం చేస్తూ నరేన్ యనమదల, మాధురి రావిపాటి, వాణి కన్నెగంటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ను దర్శకుడు గోపీచంద్ మలినేని విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ– ‘‘మానవుల మనుగడకు సంబంధించిన కీలకమైన సమాధానాల కోసం హంసలదీవి అనే చిన్న ఇండియన్ టౌన్‌కి చేరుకుంటారు ఏలియన్లు. అదే రోజున ఆ టౌన్‌ని నాశనం చేయడానికి ప్రయత్నాలు జరుగుతుంటాయి. హీరో తన చేతిలోని టైమర్‌ను రాత్రి 7:11 లోపు డీయాక్టివేట్ చేయాలి. గడువు కంటే ముందే అతను మిస్టరీని ఛేదించాలి.. లేదంటే కార్డియాక్ అరెస్ట్‌తో అతని గుండె ఆగిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని తెలియజేసింది. ఈ చిత్రానికి సంగీతం: జ్ఞాని, కెమెరా: శివ శంకర్, ఫాబియో కాపోడివెంటో. -
Deepika Pilli : పింక్ జాకెట్లో దీపికా పిల్లి పరువాల విందు (ఫోటోలు)
-
నీలా.. నన్నిలా..
సాహస్, దీపిక జంటగా చైతు మాదాల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘7:11’. నరేన్ యనమదల, మాధురి రావిపాటి, వాణి కన్నెగంటి నిర్మించారు. ఈ చిత్రంలోని ‘నీలా.. నన్నిలా...’ అంటూ సాగే తొలి పాటను విడుదల చేశారు. గ్యానీ స్వర పరచిన ఈ మెలోడీ సాంగ్‌కు మణి దీపక్ కడిమిశెట్టి సాహిత్యం అందించగా అనురాగ్ కులకర్ణి పాడారు. ‘‘ఇది టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగే సైన్స్ ఫిక్షన్ క్రైమ్ డ్రామా. 1999లో ఒక ముఖ్యమైన రోజున భవిష్యత్తులో 400 సంవత్సరాలలో వేరే గ్రహం నుండి మానవుల మనుగడకు సంబంధించిన కీలకమైన సమాధానాల కోసం ‘హంసలదీవి’ అనే చిన్న ఇండియన్ టౌన్‌కి చేరుకుంటారు. అదే రోజున ఆ టౌన్‌ని నాశనం చేయడానికి కొన్ని ఘటనలు జరుగుతాయి’’ అని యూనిట్ పేర్కొంది. -
Sirimanostavam 2022: సిరిమానోత్సవానికి పటిష్ట బందోబస్తు
విజయనగరం: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి ఉత్సవాలను విజయగవంతంగా నిర్వహించేందుకు మూడువేల మంది పోలీస్ బలగాలతో పటిష్టబందోబస్తు ఏర్పాటు చేస్తామని ఎస్పీ ఎం.దీపిక స్పష్టం చేశారు. ఈ నెల 10న జరిగే తొలేళ్ల ఉత్సవం, 11న జరిగే సిరిమానోత్సవానికి గట్టి బందోబస్తు ఏర్పాటుచేస్తామని చెప్పారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో విజయనగరం ఇన్చార్జి డీఎస్పీ టి.త్రినాథ్, ట్రాఫిక్ డీఎస్పీ ఎల్.మోహనరావుతో కలిసి గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. సిరిమానోత్సవం రోజున బందోబస్తును 22 సెక్టార్లుగా విభజించి, సుమారు మూడువేల మంది పోలీసులు రెండు షిఫ్ట్‌లుగా విధులు నిర్వహించేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఎస్పీ, అదనపు ఎస్పీ, 12 మంది డీఎస్పీలు, 63 మంది సీఐ/ఆర్ఐలు, 166 మంది ఎస్ఐ/ఆర్ఎస్ఐలు, 11 మంది మహిళా ఎస్ఐలు, స్పెషల్ పార్టీ సిబ్బందితో సహా సుమారు మూడువేలమంది పోలీస్ అధికారులను, సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహిస్తారన్నారు. మహిళా పోలీసులు, ఎన్సీసీ క్యాడెట్ల సేవలను వినియోగిస్తామని చెప్పారు. సమావేశంలో ఎస్బీ సీఐ జి.రాంబాబు, వన్‌టౌన్ సీఐ బి.వెంకటరావు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. డ్రోన్లతో నిరంతర పర్యవేక్షణ అమ్మవారి చదురుగుడి ఎదురుగా తాత్కాలిక కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటుచేస్తామని ఎస్పీ దీపిక తెలిపారు. సిరిమాను తిరిగే ప్రాంతాలను, సిరిమాను తీసుకుని వచ్చే మార్గంలోనూ, ఇతర ముఖ్య కూడళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటుచేస్తున్నట్టు వివరించారు. బందోబస్తు నిర్వహించే పోలీస్ సిబ్బందికి బాడీ వార్న్ కెమెరాలను ధరించేలా చర్యలు తీసుకున్నామన్నారు. భద్రతను నిరంతరం పర్యవేక్షించేందుకు డ్రోన్ కెమెరాలను ఏర్పాటుచేశామన్నారు. వాటన్నంటినీ కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేస్తున్నట్టు తెలిపారు. సిరిమాను తిరిగే ప్రాంతంలో ముందుగా గుర్తించిన 30 ప్రాంతాల్లో రూఫ్ టాప్లలో పోలీసులను నియమించి, నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. రూఫ్ టాప్లలో విధులు నిర్వహించే సిబ్బంది బైనాక్యూలర్స్‌తో సిరిమాను తిరిగే ప్రాంతాలను పరిశీలిస్తూ, అవసరమైన సమాచారాన్ని కమాండ్ కంట్రోల్ రూమ్‌కు తెలియజేసి పోలీసులను అప్రమత్తం చేస్తారన్నారు. 200 మందితో ప్రత్యేక నిఘా నేరాలను నియంత్రించేందుకు, నేరస్తులను గుర్తించడంలో అనుభవజ్ఞులైన 200 మంది క్రైమ్ సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశామన్నారు. ఈ బృందాలు ఆలయం రద్దీ ప్రాంతాల్లో మఫ్టీలో తిరుగుతూ జేబు దొంగతనాలు, గొలుసు దొంగతనాలు జరగకుండా చర్యలు చేపడతారన్నారు. రంగంలోకి బాంబ్ స్క్వాడ్ అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించేందుకు పోలీసు జాగిలాలతో పాటూ ప్రత్యేక బాంబ్ స్క్వాడ్ బృందాలను రంగంలోకి దింపుతున్నట్టు ఎస్పీ స్పష్టం చేశారు. ఈ బృందాలు ఆలయాలు, బస్టాండ్ , రైల్వే స్టేషన్ , ఇతర రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు చేపడతారన్నారు. అదేవిధంగా అత్యవసర సమయాల్లో తక్షణమే స్పందించేందుకు ఏడు ప్రత్యేక పోలీస్ బృందాలు కమాండ్ కంట్రోల్ వద్ద సిద్ధంగా ఉంటాయన్నారు. పార్కింగ్ ఇలా.. ట్రాఫిక్ నియంత్రణకు వాహనాల పార్కింగ్‌కి సంబంధించి అయోధ్యా మైదానం, రాజీవ్‌స్టేడియం, రామానాయుడు రోడ్డు, పెద్దచెరువు గట్టు, అయ్యకోనేరు గట్టు, పోర్ట్ సిటీ స్కూల్ రోడ్డు, ఎస్వీఎన్ నగర్ రోడ్డు, ఐస్ ఫ్యాక్టరీ కూడలి నుంచి బాలాజీ కూడలి వరకూ గల రింగురోడ్డు ప్రాంతాల్లో ప్రజలు వాహనాలను పార్కింగ్ చేసుకునేందుకు స్థలాలు ఏర్పాటుచేశామన్నారు. వీఐపీల వాహనాల పార్కింగ్‌కు బొంకులదిబ్బ, టీటీడీ కల్యాణమండపం, గురజాడ కళాక్షేత్రం, కోట ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలు ఏర్పాటుచేసినట్టు వివరించారు. ప్రజలకు సూచనలు చేసేందుకు, సమాచారాన్నిచ్చేందుకు వాహనాలకు పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్స్ ఏర్పాటు చేశామన్నారు. సిరిమానోత్సవం రోజున ఫోర్ వీలర్స్ వాహనాలు ఎంఆర్ కళాశాల, కేపీ టెంపుల్, గంటస్తంభం, ట్యాక్సీ స్టాండ్, శివాలయం వీధి, ఘోష ఆస్పత్రి, గుమ్చీ రోడ్డు, సింహాచలం మేడ, సత్యా లాడ్జి ప్రాంతాల్లో ప్రవేసించేందుకు అనుమతి ఉండదన్నారు. సిరిమాను తిరిగే ప్రాంతంలో ఎటువంటి తోపులాటలు, అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రజలందరూ సిరిమాను తిలకించేలా అనుసంధాన రోడ్లలో బాక్స్ సిస్టమ్స్‌ను ఏర్పాటుచేస్తున్నామన్నారు. అధికారులు 200 వైర్లెస్ సెట్స్‌ను పోలీసుల వద్ద ఉంచి, ప్రజలకు సూచనలు చేస్తారు. పోలీసు సేవాదళ్ భక్తులకు సేవలందిస్తారు. బందోబస్తుకు వచ్చే మహిళా సిబ్బందికి దిశ మహిళా టాయిలెట్స్ ఏర్పాటుచేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. పైడితల్లి అమ్మవారి పండగ శాంతియుతంగా భక్తి వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలందరూ పోలీసుశాఖకు సహకరించాలని, పోలీసుల సహాయాన్ని పొందాల్సిన వారు దేవాలయం ఎదురుగా ఏర్పాటుచేసిన తాత్కాలిక కంట్రోల్‌రూమ్‌ను సంప్రదించాలని ఎస్పీ సూచించారు. పోలీసులందరూ భక్తులతో మర్యాదగా ప్రవర్తించాలని, వారికి ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా చూడాలని, దురుసుగా ప్రవర్తించరాదన్నారు. వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలందించాని ఆదేశించారు. సిరిమానోత్సవం రోజున డైవర్షన్స్ ఇలా.. పట్టణంలోని వాహనాలు సీఎంఆర్ జంక్షన్, గూడ్స్షెడ్ల మీదుగా పట్టణం బయటకు వెళ్లవచ్చు. బాలాజీ జంక్షన్, రామానాయుడు రోడ్డు, సీఎంఆర్ జంక్షన్, గూడ్స్‌షెడ్ మీదుగా పట్టణం బయటకు వెళ్లవచ్చు. ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్, బాలాజీ కూడలి, ఆర్టీసీ కాంప్లెక్స్, ఎత్తుబ్రిడ్జి మీదుగా పట్టణం బయటకు వెళ్లవచ్చు. కొత్తపేట జంక్షన్, దాసన్నపేట, ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్, ధర్మపురి రోడ్డు మీదుగా పట్టణం నుంచి వెళ్లేందుకు వాహనాలకు అనుమతిస్తారు. జేఎన్టీయూ, కలెక్టేరేట్, ఆర్అండ్బీ, ఎత్తుబ్రిడ్జి, ప్రదీప్‌నగర్ మీదుగా పట్టణ బయటకు వాహనాలకు అనుమతిస్తారు. ప్రదీప్‌నగర్ కూడలి, ధర్మపురి రోడ్డు, ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్, దాసన్నపేట మీదుగా బయటకు అనుమతిస్తారు. -
చిట్టి నడుము సొగసులతో దీపికా లొల్లి (ఫోటోలు)
-
Hyderabad: నగరంలో 8 మంది అదృశ్యం
సాక్షి, హైదరాబాద్: వేర్వేరు ప్రాంతాల్లో ఒకే రోజు ఎనిమిది మంది అదృశ్యమైన సంఘటన బోయిన్పల్లి, లాలాగూడ, సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసు స్టేషన్ల పరిధిలో చోటు చేసుకుంది. వీరిలో ఇద్దరు మతిస్థిమితం లేని యువకులు కాగా, మరో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మతిస్థిమితం లేని యువకుడు.. కొడంగల్, రావులపల్లికి చెందిన బీమయ్య చిన్నతోకట్టాలో నివాసముంటున్నాడు. వీరి ఇంట్లోనే ఉంటున్న అతడి మేనల్లుడు రవి కుమార్ (19)కు మతిస్థిమితం లేదు. ఈ నెల 1న ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన రవికుమార్ తిరిగి రాకపోవడంతో భీమయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. టీ తెచ్చేందుకు వెళ్లిన బాలుడు.. బోరబండలో ఉంటున్న దర్లావత్ గుత్యా కుమారుడు రమేశ్ (13)తో కలిసి గత నెల 26న బోయిన్పల్లి పెన్షన్‌లైన్‌లో ఉంటున్న తమ బంధువు ఇంటికి వచ్చాడు. మతిస్థిమితం సరిగా లేని రమేశ్‌ను టీ తెమ్మని బయటికి పంపగా, అతను తిరిగి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బర్త్‌డే పార్టీకి వెళ్లిన కుటుంబం అదృశ్యం బోయిన్పల్లి బాపూజీనగర్‌కు చెందిన సురేశ్ కుమార్, భార్య సంతోషి, కుమారుడు లిఖిత్తో కలిసి గత నెల 30న బయటికి వెళ్లి తిరిగి రాలేదు. ఈ నెల 1న సురేశ్ బంధువు వెంకటేశ్, అతని డ్రైవర్ దుర్గా ప్రసాద్ బాపూజీనగర్‌లోని సురేశ్ ఇంటికి వచ్చారు. ఇళ్లు తాళం వేసి ఉండటంతో ఇంటి ఓనర్‌ను వాకబు చేయగా, రెండు రోజుల క్రితం బర్త్ డే పార్టీకని బయటికి వెళ్లినట్లు తెలిపారు. సురేశ్ తండ్రి ధర్మపాల్‌కు సమాచారం ఇవ్వగా వారి కోసం గాలించినా ఆచూకీ తెలియరాలేదు. ఒకే రోజు పోలీసు స్టేషన్లో మూడు కేసులు నమోదు కావడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. చదవండి: (Hyderabad: అసెంబ్లీ ఎదురుగా ఘోర రోడ్డు ప్రమాదం) యువతి అదృశ్యం అడ్డగుట్ట: ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన ఘటన లాలాగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ రాఘవేంద్ర స్వామి కథనం ప్రకారం. లాలాపేట, సత్యనగర్ ప్రాంతానికి చెందిన గండు నర్సింగ్‌రావు కుమార్తె గండు దీపిక(19) నాచారంలోని ఓ డయాగ్నస్టిక్ సెంటర్లో ల్యాబ్ టెక్నీషియన్‌గా ట్రెయినింగ్ తీసుకుంటోంది. ఈ నెల 3న ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్లిన దీపిక ఇంటికి తిరిగిరాలేదు. ఆమె కుటుంబసభ్యులు గాలింపు చేపట్టినా ఫలితం లేకపోవడంతో అదే రోజు రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (సామాజిక మాధ్యమాల్లో భార్య నగ్న దృశ్యాలు.. విటులకు ఆహ్వానం..) భర్త ఊరెళ్లొచ్చేసరికి భార్య.. భర్త ఊరెళ్లొచ్చేసరికి భార్య అదృశ్యమైన ఘటన లాలాగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇందిరానగర్ బి కాలనీలో నాగేంద్ర, మమత దంపతులు నివాసం ఉంటున్నారు. నాగేంద్ర ఇటీవల అనంతపురం వెళ్లాడు. గత నెల 30న ఊరి నుంచి తిరిగి వచ్చే సరికి ఇంటికి తాళం వేసి ఉంది. మమత కోసం గాలించినా ఆచూకీ లభించకపోవడంతో శుక్రవారం లాలాగూడ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇంజినీరింగ్ విద్యార్థి.. సికింద్రాబాద్: ఇంజినీరింగ్ విద్యార్థి అదృశ్యమైన ఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం. సంగారెడ్డికి చెందిన మహేష్కర్ గిరిధర్ రోజు రైలులో కాలేజీకి రాకపోకలు సాగించేవాడు. ఈనెల 3న కాలేజీకి వెళ్లిన మహేష్కర్ గిరిధర్ ఇంటికి తిరిగి రాలేదు. ఆయన ఆచూకీ కోసం వాకాబు చేసిన ఫలితం లేకపోవడంతో కుటుంబ సభ్యులు శుక్రవారం సికింద్రాబాద్ రైల్వేపోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
Deepika Bhardwaj: సాఫ్ట్వేర్ రంగాన్ని వదిలి మరీ.. పెళ్లి బాధల పురుషులకు బాసటగా..
‘మేరేజ్ స్ట్రయిక్’...ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్. ‘వివాహ చట్టాలన్నీ స్త్రీని కాపాడి పురుషులను బాధ పెడుతున్నాయి. తప్పుడు కేసులతో హింసిస్తున్నాయి. ఇక మాకు పెళ్లొద్దు బాబోయ్’... అని కొంతమంది పురుషులు ఈ హ్యాష్‌ట్యాగ్ మూవ్‌మెంట్‌ను ప్రారంభించారు. పురుషులకు బాధలు ఉంటాయా? ‘అవును ఉంటాయి’ అంటుంది దీపికా భరద్వాజ్. 'మేట్రియర్స్ ఆఫ్ మేరేజ్’, ‘టేల్ ఆఫ్ ఫాల్స్ రేప్ కేస్ సర్వయివర్స్’ పేరుతో రెండు డాక్యుమెంటరీలు తీసిన దీపిక పెళ్లి వ్యవస్థలో పురుషుల బాధలకు తన గళం వినిపిస్తోంది. ఒక స్త్రీగా ఆమె పురుషులకు ఎందుకు బాసటగా నిలుస్తోంది. గత రెండు రోజులుగా ట్విటర్లో ‘మేరేజ్స్ట్రయిక్’ పేరుతో మగవాళ్ల మూవ్మెంట్ ట్రెండ్ అవుతోంది. ‘పెళ్లి చట్టాల వల్ల మగవాళ్లకు వచ్చిన కష్టాలు చాలు. ఇక మేము పెళ్లి చేసుకోము’ అనే అర్థంలో ఈ మూవ్మెంట్ మొదలెట్టారు. దానికి కారణం ఢిల్లీ హైకోర్టులో ‘మేరిటల్ రేప్’ మీద ఒక కేసు చర్చకు రావడమే. ‘పెళ్లయ్యాక భార్యకు అంగీకారం లేకుండా భర్త శృంగారంలో పాల్గొంటే అది రేప్ కిందకు రాదని చట్టం చెబుతోంది. కాని భర్తకు పెళ్లి అనే కారణంగా రేప్ అభియోగానికి వీలు లేని రక్షణ ఎందుకు? స్త్రీకి ఇష్టం లేకుండా జరిగేది రేప్ అయినప్పుడు భర్త చేసినా రేపే అవుతుంది’ అని ఆ కేసులో వాదన. దీనికి ఢిల్లీ హైకోర్టు ‘మీరేం అంటారు’ అని కేంద్ర హోమ్ శాఖను అడిగితే ‘ఇది సున్నిత అంశం. పెళ్లి అనే వ్యవస్థను ఈ విషయం చెదరగొట్టే అవకాశం ఉంది. ఆలోచించి చెప్తాం’ అని సమాధానం ఇచ్చింది. ఈలోపు మగవాళ్ల హాహాకారాలు మొదలయ్యాయి. ‘ఇప్పటికే విడాకుల కేసుల్లో భరణం పేరుతో, గృహహింస అంటే 498ఏ కేసులతో, వరకట్నం కేసులతో మగవాళ్లు అవస్థలు పడుతున్నారు. నిజమైన కేసుల కంటే అబద్ధపు కేసుల వల్ల బాధ పడుతున్నవారి సంఖ్య ఎక్కువ. ఇప్పుడు మేరిటల్ రేప్ పేరుతో అది కూడా శిక్షార్హమైన నేరం చేస్తే రేపు భార్యలు భర్తల మీద కోపంతో తప్పుడు మేరిటల్ రేప్ కేసులు పెడితే మా గతేం కాను. ఇక ఈ పెళ్లి అనే వ్యవస్థకు రాంరాం’ అంటూ ట్రెండింగ్ మొదలెట్టారు. ‘అవును. వీరి బాధను అర్థం చేసుకోవాలి’ అని వీరికి వత్తాసు పలుకుతున్నారు దీపికా నారాయణ్ భరద్వాజ్. బీటెక్ చేసి టీవీ జర్నలిజం చదివిన దీపిక తాను చేస్తున్న సాఫ్ట్వేర్ రంగాన్ని వదిలి మరీ మగవాళ్లకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడడానికి రెడీ అయ్యారు. ‘దానికి కారణం పర్సనల్‌గా ఎదురైన అనుభవమే. మా కజిన్‌కు జరిగిన పెళ్లి మూడు నెలల్లో పెటాకులు అయ్యింది. ఆ అమ్మాయి తనను మేమంతా కొట్టి హింసించామని, వరకట్నం పేరుతో వేధించామని తప్పుడు కేసు పెట్టింది. నన్ను కూడా కేసులో ఇరికించింది. ఆ కేసు నుంచి బయటపడటానికి మేమందరం ఆమెకు పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వాల్సి వచ్చింది. నేనే కాదు ఇలా దేశంలో ఎందరో ఈ చట్టం వల్ల బాధలు పడుతున్నారు. స్త్రీల మీద హింస జరిగే ఘటనలను మనం తప్పక ఖండించాలి. వారికి న్యాయం జరిగేలా చూడాలి. అంత మాత్రం చేత పురుషులకు అన్యాయం జరిగినా పర్వాలేదు అనుకోవడం దారుణం. దేశంలో 498ఏ కేసులు మొదలయ్యాక అర్థం పర్థం లేకుండా కుటుంబ సభ్యులను తీసుకెళ్లి లోపల వేయడం మొదలెట్టారు. కొన్ని కేసుల్లో చిన్నపిల్లలను కూడా అరెస్టు చేశారు. చివరకు సుప్రీం కోర్టు పూనుకుని ఇలాంటి కేసుల్లో 9 అంశాలను పరిగణనలోకి తీసుకున్నాక అరెస్టులు చేయాలని చెప్పింది. ఈలోపు తప్పుడు కేసుల వల్ల ఆత్మహత్యలు చేసుకున్న పురుషులు ఎందరో ఉన్నారు’ అంటుంది దీపికా నారాయణ్. పురుషుల కోసం పని చేసే ‘సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్’ వంటి సంస్థలతో ఈమె పని చేయడమే కాకుండా జాతీయ మహిళా కమిషన్ ఉన్నట్టుగానే ‘జాతీయ పురుష కమిషన్’ ఉండాలని ప్రచారం చేస్తూ అందుకు అవసరమైన ఉద్యమాన్ని నిర్మిస్తోంది. ‘స్త్రీలపై అత్యాచారాలు నిరోధించడానికి చట్టాలు గట్టిగా పని చేయాలి. దోషులను పట్టుకోవాలి. అదే సమయం లో తప్పుడు అత్యాచారాల కేసులు పెట్టి వేధించే ఆడవాళ్లను కూడా శిక్షించాలి’ అంటుంది దీపికా నారాయణ్. నెల రోజుల క్రితం ఢిల్లీలోని ఒక యువతి అత్యాచార కేసు పెడతానని కనీసం ఏడు మంది పురుషులను బెదిరించి భారీగా డబ్బు వసూలు చేయడాన్ని ఆమె ఉదాహరణగా చూపుతోంది. ఆ యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ‘నేను పురుషుల తరఫున మాట్లాడుతున్నానంటే స్త్రీలకు వ్యతిరేకం అని కాదు. దుర్మార్గులైన పురుషులను వెతికే క్రమంలో మంచి తండ్రిగా, భర్తగా, కొడుకుగా ఉండే పురుషులను శత్రువులను చేసుకోవాల్సిన పని లేదు. స్త్రీ, పురుషులు ఒకరికొకరు గౌరవించుకునే సమాజాన్ని నిర్మించుకోవాలి. ఒకరిని ఒకరు బాధించే సమాజం, కుటుంబం ప్రమాదం. తప్పు చేసే వారు ఇరువైపులా ఉంటారని గ్రహించక పోతే న్యూట్రల్ దృష్టితో న్యాయం చేయకపోతే కేవలం మగవారు అయినంత మాత్రాన నింద భరించే ఒత్తిడి మగవాళ్ల నెత్తిన ఉండటం సరి కాదు. స్త్రీ ఏ ఆరోపణ చేసినా నమ్మేస్తూ మగవాణ్ణి విక్టిమ్ చేయడం ఎంత కాలం? దాని వల్ల ఎందరు ఎన్ని విధాలుగా నాశనం అవుతున్నారో అర్థం చేసుకోవాలి’ అంటుంది దీపిక. సమాజంలో పురుష పెత్తనం వల్ల స్త్రీల వేదనలు, కష్టాలు వాటి నుంచి రక్షణకు చట్టాలు ఇవన్నీ కాలక్రమంలో దేశం నిర్మించుకుంటూ వచ్చింది. అయితే వివాహ వ్యవస్థలో స్త్రీ, పురుష తకరార్లు పాలు నీళ్లు లాగా విడివిడిగా కనిపించేంత స్పష్టంగా ఉండవు. ఎక్కువ బాధితులు స్త్రీలే కనుక వారి పక్షాన పని చేయాల్సిన అవసరం నేటికీ రేపటికీ ఉంటుంది. అయితే ఈ ప్రాసెస్‌లో ఒక్క నిరపరాధి పురుషుడు కూడా నష్టపోకూడదని దీపిక లాంటి వాళ్లు ఉద్యమిస్తే ఆ మాటను పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. స్త్రీకైనా పురుషుడికైనా సమన్యాయం జరిగే వైవాహిక వ్యవస్థ గురించి సమాజం మరింత ఫలవంతమైన చర్చలు చేయాలని కోరుకుందాం. చదవండి: Health Benefits Of Ivy Gourd: దొండకాయ కూర తింటున్నారా.. అందులో ఉండే బీటా కెరోటిన్ వల్ల.. -
చిన్న చిన్న ఆనందాలను ఎక్కువగా ఇష్టపడుతుంటా... అదే నా బ్యూటీ సీక్రేట్: కృతి శెట్టి
తొలి సినిమాతోనే అదృష్టం ఆమెను ‘ఉప్పెన’లా ముంచెత్తింది. ఎస్.. ఇక్కడ కృతి శెట్టి ఫాలో అయ్యే ఫ్యాషన్ బ్రాండ్స్ గురించే తెలుసుకోబోతున్నాం. దృష్టి సారించండి... పెర్నియా పాప్ అప్ షాప్ అందమైన డిజైన్స్ అందించే ఫ్యాషన్ డిజైనర్స్‌కు, వాటిని ధరించి ఆనందించే ఫ్యాషన్ ప్రియులకు మధ్య వారధి ఈ ‘పెర్నియాస్ పాప్ అప్ షాప్’. ఇదొక ఆన్లైన్ స్టోర్. చిన్న నుంచి పెద్ద వరకు ఎందరో డిజైనర్ల డిజైన్స్ ఇక్కడ లభిస్తాయి. ప్రత్యేకంగా డిజైన్ చేయించుకునే అవకాశమూ ఉంది. ధరను నిర్ణయించేదీ డిజైనరే. వైవిధ్యమైన డిజైన్స్‌ను మాత్రమే అందుబాటులో ఉంచుతుందీ స్టోర్. ఇందుకు వివిధ పరీక్షలు కూడా నిర్వహిస్తారు. అదే దీని బ్రాండ్ వాల్యూ. ప్రత్యక్షంగా కొనుగోలు చేసే అవకాశం లేదు. ఆన్లైన్లోనే కొనుగోలు చేయాలి. జ్యూయెలరీ బ్రాండ్: పెర్నియాస్ పాప్ అప్ షాప్ ధర: ఆభరణాల నాణ్యత, డిజైన్‌పై ఆధారపడి ఉంటుంది. చదవండి: అచ్చం భేతాళ కథల్లో మాదిరి.. ఈ నీటిలో పడితే వెంటనే రాయిలా అయిపోతారు..! సురభి షా.. పెళ్లిరోజున భర్త ఇచ్చే బహుమతి భార్యకు ప్రత్యేకమే. సురభికి మాత్రం ఆ బహుమతి ప్రత్యేకం కాదు, తనలోని ప్రతిభను పదిమందికి చూపించే ఓ అద్భుతమైన అవకాశం. ఫ్యాషన్‌పై ఉన్న పట్టు, ఆసక్తి, తన దుస్తులను తానే డిజైన్ చేసుకునే తీరుకు మెచ్చిన ఆమె భర్త 2006లో ‘సురభి షా’ పేరుతో ఓ బొటిక్‌ను బహుమతిగా ఇచ్చాడు. ఆ కానుకనే టాప్ మోస్ట్ ఫ్యాషన్ బ్రాండ్స్‌లో ఒకటిగా నిలిపింది సురభి. ఎటువంటి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేయకపోయినా, తన సృజనాత్మక ఆలోచనలతో ఆకట్టుకునే డిజైన్స్‌ను రూపొందిస్తూ అనతికాలంలోనే ఫేమస్ డిజైనర్‌గా ఎదిగింది. ఆ కళాత్మకత సెలబ్రిటీలను సైతం మెప్పించింది. ఈ డిజైన్స్ సరసమైన ధరల్లోనే లభిస్తాయి. సురభి షా మెయిన్బ్రాంచ్ జైపూర్‌లో ఉంది. ఆన్‌లైన్‌లోనూ ఆమె డిజైన్స్‌ను కొనుగోలు చేయొచ్చు. డ్రెస్ డిజైనర్ : సురభి షా ధర: రూ. 36,000 - దీపిక కొండి చదవండి: World's Rarest Dog Breed: ఇది జిరాఫీ కాదు!! కుక్క.. అత్యంత అరుదైన బ్రీడ్!! కానీ కారు ప్రమాదంలో.. -
సెట్ కాదన్న డ్రెస్సే కొంటా..! నా ఫేవరేట్ బ్రాండ్ ఇదే..: హెబ్బా పటేల్
‘నా పేరు కుమారి.. నా ఏజ్ 21..’ డైలాగ్ ఎవరిదో గుర్తుంది కదా.. ఎస్.. హెబ్బా పటేల్. ఆమెకు సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ అంతే క్రేజీ ఫాలోయింగ్ ఉంది. ఆ అందానికి పర్ఫెక్ట్ మ్యాచింగ్ అవుట్‌ఫిట్స్.. జ్యూయెలరీని అందిస్తున్న బ్రాండ్స్ ఇవే.. నచ్చితే వెంటనే కొనేస్తా. నాలాగే బొద్దుగా ఉన్నవాళ్లకి కొన్ని దుస్తులు నప్పవని అంటుంటారు. అందులో నిజం లేదు. శరీరానికి కష్టం కలిగించకుండా.. ఇష్టంతో ధరించే ఏ దుస్తుల్లో అయినా అందంగానే కనిపిస్తాం – హెబ్బా పటేల్ ఇస్సా స్టూడియో... ఇటీవలే ప్రారంభమై, బాగా పాపులారిటీ సంపాదించుకున్న ఫ్యాషన్ హౌస్‌లలో ఒకటి ఇస్సా స్టూడియో. హైదరాబాద్‌కు చెందిన స్వాతి, చేతన అనే ఇద్దరు స్నేహితులు కలసి స్థాపించిన ఈ సంస్థ, ఆరంభంలోనే అందమైన డిజైన్స్‌తో పలువురు సెలబ్రిటీలను ఆకర్షించింది. నిహారిక కొణిదెల, అనసూయ భరద్వాజ్, మంచు లక్ష్మి తదితరులు వీరి కలెక్షన్స్‌ను రెగ్యులర్‌గా ఫాలో అవుతుంటారు. యువతరమే వీరి టార్గెట్. యూత్ స్టైల్‌ను మ్యాచ్ చేస్తూ డిజైన్ చేసే సంప్రదాయ దుస్తులతో ఫేమస్ బ్రాండ్‌గా ఇస్సాను నిలిపారు. ప్రస్తుతం భారత్‌తో పాటు, అమెరికా నుంచి కూడా ఆర్డర్లను తీసుకుంటున్నారు. ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఆన్‌లైన్‌లోనూ ఇస్సా స్టూడియో డిజైన్స్‌ను కొనుగోలు చేయొచ్చు. ఆ డ్రెస్ నీకు సెట్ కాదని ఎంతమంది చెప్పినా వినను. చీర..బ్రాండ్: ఇస్సా స్టూడియో ధర: రూ. 34,000 ఆర్నీ బై శ్రావణి.. ఈ బ్రాండ్ పెళ్లి ఆభరణాలకు ఫేమస్. ఈ నగలను ధరించి పెళ్లి పందిట్లోకి వెళ్లాలని చాలా మంది అమ్మాయిలు కోరుకుంటారు. రెడీమేడే కాదు స్వయంగా ఆర్డర్ ఇచ్చి కూడా కావలసిన నగలను డిజైన్ చేయించుకోవచ్చు. విలువైన రత్నాలు, వజ్రాలతో తయారయ్యే ఈ డిజైన్స్‌కు మంచి గిరాకీ ఉంది. పలువురు సెలబ్రిటీల ఫేవరెట్ అనీ ఈ బ్రాండ్‌కి పేరుంది. డిజైన్‌ను బట్టే ధర. కొన్ని సందర్భాల్లో రత్నాల విలువ, ఆభరణాల నాణ్యతపైనా ఆధారపడి ఉంటుంది. హైదరాబాద్ మెయిన్ బ్రాంచ్‌గా ఉన్న ఆర్నీ బై శ్రావణి జ్యూయెలరీని ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయొచ్చు. జ్యూయెలరీ బ్రాండ్: ఆర్నీ బై శ్రావణి ధర: ఆభరణాల నాణ్యత, డిజైన్‌పై ఆధారపడి ఉంటుంది. -దీపిక కొండి చదవండి: Scientifically Proven Facts: నవ్వితే ఇన్ని ఉపయోగాలా? విస్తుపోయే వాస్తవాలు.. -
నా ఫ్యాషన్ సీక్రేట్ అదే.. షాపింగ్‌పై చాలా కంట్రోల్‌గా ఉంటా..: త్రిష
ఆచి తూచి అడుగులు వేయకుంటే.. బోల్తా కొట్టడం ఎవరికైనా తప్పదు. కెరీర్లో అలాంటి జాగ్రత్తలు పాటించింది కాబట్టే.. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి రెండు దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ స్టార్ హీరోయిన్‌గానే కొనసాగుతోంది త్రిష. ఆ ప్రేక్షకాదరణకు ఆమె అభినయంతో పాటు అందమూ ఓ కారణమే. ఆ అందానికి అద్దం పడుతున్న ఫ్యాషన్ బ్రాండ్స్ ఇవే.. సబ్యసాచి.. పేరుకే ఇండియన్ బ్రాండ్ కానీ, ఇంటర్నేషనల్ బ్రాండ్ కంటే గొప్పది, ఖరీదైనది. దాదాపు బాలీవుడ్ సెలబ్రిటీస్ పెళ్లిళ్లు అన్నీ సబ్యసాచి కలెక్షన్స్‌తోనే జరుగుతాయి. వాటిల్లో విరాట్ కొహ్లీ, అనుష్కశర్మల పెళ్లి బట్టలు ఫేమస్. కనీసం ఒక్కసారైనా సబ్యసాచి డిజైన్ వేర్ ధరించాలని, సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకు ఏంతోమంది ఆశపడుతుంటారు. ఆ బ్రాండ్‌కున్న వాల్యూ అలాంటిది. ఈ మధ్యనే మధ్యతరగతి మహిళల కోసం రూ. పదివేల చీరను డిజైన్ చేశారు. ఇదే ఈ బ్రాండ్ చీపెస్ట్ చీర. సుమారు లక్ష చీరలను సిద్ధం చేస్తే, రెండు రోజుల్లోనే మొత్తం కొనుగోలు చేశారు. పదివేల చీరైనా, పదినిమిషాల్లో అమ్ముడైపోతుంది. ఇదంతా సబ్యసాచి ముఖర్జీ డిజైన్ మహత్యం. బెంగాలీ కుటుంబ నేపధ్యం నుండి వచ్చిన సబ్యసాచి కెరీర్ ఆరంభించిన అనతి కాలంలోనే ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్‌గా ఎదిగాడు. 1999లో తన పేరునే ఓ బ్రాండ్ హౌస్‌గా మార్చి, మరింత పాపులర్ అయ్యాడు. అందమైన ఆభరణాలు కూడా ‘సబ్యసాచి’ స్టోర్స్‌లో లభిస్తాయి. ఇండియాలోని ప్రముఖ నగరాలతోపాటు అమెరికా, లండన్‌లోనూ స్టోర్స్ ఉన్నాయి. ఆన్‌లైన్‌లోనూ సబ్యసాచి డిజైన్స్‌ను కొనుగోలు చేయొచ్చు. చీర బ్రాండ్: సబ్యసాచి ధర: రూ. 1,79,500 మంజుల జ్యూయెల్స్... ఒక సమస్యను ఎదుర్కొనే సమయంలోనే మన ప్రతిభ బయట పడుతుందంటారు. ఈ మాట మంజుల విషయంలో అక్షరాల నిజం. కుటుంబం గడవటం కోసం భర్తతో కలసి మైనింగ్ పరిశ్రమలో పనిచేసి, బంగారంతోపాటు తనలోని ప్రతిభను కూడా వెలికి తీసింది మంజుల. అప్పటివరకూ బంగారం అంటే ఇష్టం మ్రాతమే. ఆ ఇష్టాన్ని ఆసక్తిగానూ.. ఆ తర్వాత ఉపాధి అవకాశంగానూ మార్చుకుంది. జెమాలజీలో పీజీ చేసి, ఆభరణాల రూపకల్పన నేర్చుకుంది. మొదట బంధువులు, తెలిసిన వారి వివాహాది శుభకార్యాలకు డిజైన్ చేసింది. వాటికి మంచి పేరు రావడంతో 2010లో ‘మంజుల జ్యూయెల్స్’ సంస్థ స్థాపించింది. ప్రస్తుతం పలు సినిమాలతో పాటు, చాలామంది సెలబ్రిటీలకు కూడా మంజుల తన డిజైన్స్‌ను అందిస్తోంది. ధర ఆభరణాల నాణ్యత, డిజైన్ ఆధారంగా ఉంటుంది. హైదరాబాద్ మెయిన్ బ్రాంచ్‌గా ఉన్న మంజుల జ్యూయెల్స్ను ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయొచ్చు. జ్యూయెలరీ బ్రాండ్: మంజుల జ్యూయెల్స్ ధర: ఆభరణాల నాణ్యత, డిజైన్‌పై ఆధారపడి ఉంటుంది. - దీపిక కొండి చదవండి: దుస్తులకు లింగ భేదం ఏంటీ..! స్కూల్‌కి స్కర్టులతోనే వస్తాం!! -
అదిరిపోతున్న యువ యాంకర్ గ్లామర్ షో
-
అప్పికొండ తీరంలో కాకినాడ బాలిక గల్లంతు
సాక్షి, పెదగంట్యాడ: జీవీఎంసీ 77వ వార్డు పరిధి అప్పికొండ సముద్ర తీరంలో ఓ బాలిక సోమవారం గల్లంతైంది. దువ్వాడ సీఐ లక్ష్మి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ మండలం జగన్నాథపురానికి చెందిన ఓబులూరి ప్రదీప్, సత్య దంపతులు తమ ఇద్దరి కుమార్తెలతో పాటు బంధువులతో కలిసి దసరా పండగకని గంగవరం గ్రామంలోని అత్తారింటికి వచ్చారు. వారంతా సోమవారం తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్నారు. దువ్వాడ రైల్వేస్టేషన్లో రైలు వచ్చేందుకు ఇంకా సమయం ఉండడంతో పెద్దలు, పిల్లలతో సహా మొత్తం 12 మంది అప్పికొండ తీరానికి వెళ్లారు. అక్కడ సముద్రంలో సరదాగా గడుపుతుండగా.. ఓబులూరి దీపిక(15)తో పాటు స్నేహితురాలు హరిణి ఒక్కసారిగా కెరటాల ఉధృతికి కొట్టుకుపోయారు. గమనించిన దీపిక తండ్రి వారిని రక్షించే ప్రయత్నం చేశారు. హరిణిని ఒడ్డుకు తీసుకువచ్చారు. దీపిక మాత్రం అలల తాకిడికి కొట్టుకుపోయింది. వారు ఎంత ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న దువ్వాడ పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. దీపిక కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రదీప్ ఫిర్యాదు మేరకు దువ్వాడ సీఐ లక్ష్మి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (అడవి బిడ్డలకు ఐఐటీ అవకాశాలు) -
ట్రెండ్ ఆమె స్వరం... అక్షరాలకు బలం
చెవులకు హెడ్‌ఫోన్ ధరించి, కళ్లు మూసుకొని, శ్రద్ధగా వింటున్న ఆమెను చూస్తుంటే ధ్యానస్థితిలో ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇంతకీ ఆమె వింటున్నది ఏమిటి? అది తెలుసుకునేముందు.... ప్రియా వసంత్ చెన్నైలోని సాధారణ గృహిణి. ఇంటిపనులు పూర్తి కాగానే టీవిలో సీరియల్స్, వోటీటీలో సినిమాలు చూడడంలో ఎక్కువ టైమ్ గడిపేది. రాను రాను ఆమెకు ఇది విసుగనిపించింది. మార్పు కావాలనిపించింది. ‘ఏంచేయాలి?’ అని ఆలోచిస్తున్నప్పుడు అరల్లోని పుస్తకాలు ఆమెను ఆకర్షించాయి. కాలేజి రోజుల్లో ప్రియ పుస్తకాల పురుగు. కానీ విజువల్ మీడియా విస్తృతమయ్యాక చాలామందిలాగే తనలోనూ పఠనాసక్తి వెనకబడింది. ఎక్కడో విన్న ‘ఆడియోబుక్’ అనే మాట గుర్తుకు వచ్చింది. ఈ అనుభవం ఎలా ఉంటుందో చూద్దామనుకుంది. తాను వింటున్నది కల్కి క్రిష్టమూర్తి ‘పోన్నియన్ సెల్వన్’ ఆడియో పుస్తకం. ఆ పుస్తకంలో వినిపించే గొంతు ఆమెను కొత్త లోకాల్లోకి తీసుకెళ్లింది. మరిన్ని ఆడియో పుస్తకాలను వినే ఆసక్తిని కలిగించింది. ఆ స్వరం... కీర్తనది. ‘ఆడియో పుస్తకాలను నెరేట్ చేయడం ద్వారా అదనపు ఆదాయం వస్తుంది. అయితే అది చిన్న విషయం. కొత్త ఉత్సాహం అనేది పెద్ద విషయం’ అంటుంది కీర్తన. ఆడియోబుక్స్ మార్కెట్ పెరిగి, వరల్డ్ ట్రెండ్‌గా మారుతున్న ఈ దశలో నెరేటర్‌గా మంచి పేరు తెచ్చుకుంటుంది దీపిక అరుణ్. ‘ఏదో అవకాశం వచ్చింది. చెప్పాం. అయిపోయింది అనుకుంటే కుదరదు. ఏ మేరకు శ్రోతలను ఆకట్టుకున్నామన్నది ముఖ్యం. నెరేటర్కు ఉచ్ఛారణ, మాడ్యులేషన్ అనేవి చాలా ముఖ్యం’ అంటుంది దీపిక. ‘తన్నీర్’ అనే తమిళ పుస్తకానికి తన స్వరాన్ని ఇచ్చిన లక్ష్మీ ప్రియాకు వచ్చిన ప్రశంసలు ఇన్నీ అన్నీ కావు. కాలేజి స్టూడెంట్స్ నుంచి రిటైర్డ్ ప్రొఫెసర్ల వరకు ఆమె అభిమాన గణంలో ఉన్నారు. ‘నాటకాలు, సినిమాలకు సంబంధించి శిక్షణ సంస్థలు ఎన్నో ఉండవచ్చు. అయితే స్వరాన్ని ఏ సందర్భంలో, ఏ పాత్రకు ఎలా ఉపయోగించాలనే విషయంలో మాత్రం ఎవరికి వారే గురువులు. ప్రతి పుస్తకం ఎన్నో కొత్త పాఠాలు నేర్పుతుంది. ఇంతకంటే కావాల్సింది ఏముంటుంది’ అంటుంది లక్ష్మీ ప్రియా. ఇవి దక్షిణాదికి సంబంధించి కొన్ని ఉదాహరణ మాత్రమే. ఇక జాతీయస్థాయిలో ఎన్నో ఆంగ్లపుస్తకాలకు మహిళల గొంతు బలమైన మాధ్యమంగా మారుతుంది. బెస్ట్ సెల్లర్‌గా పేరు తెచ్చుకున్న కవిత కనే ‘కర్నాస్ వైఫ్’ ఆడియో బుక్‌ను షాహీన్ఖాన్ అందంగా నెరేట్ చేసింది. ‘అద్భుతమైన పుస్తకాలను అంతకంటే అద్భుతంగా నెరేట్ చేసినప్పుడే మనం విజయం సాధించినట్లు అనుకోవాలి’ అంటుంది షాహీన్ఖాన్. అమెజాన్ కంపెనీ వారి ‘ఆడిబుల్’ శ్రోతలకు చిరపరిచితమైన పేరు....ఇక్రూప్ కౌర్ చంబా. రకరకాల జానర్లలో వచ్చే ఆడియో పుస్తకాలకు గొంతు ఇచ్చి ‘ఆహా’ అనిపించుకుంటుంది. దేవాన్షిశర్మ ‘ఐ థింక్ ఐయామ్ ఇన్ లవ్’ పుస్తకాన్ని నెరేట్ చేయడం ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. అరుణ్ అంజు హిందీలోకి డబ్ అయ్యే హాలివుడ్ సినిమాలలోని పాత్రలకు గొంతు ఇచ్చే ఆల్కాశర్మ తాజాగా ఆడియోబుక్స్ నెరేటింగ్ పనుల్లో బిజీ అయింది. ‘రకరకాల జానర్స్ గురించి అవగాహన రావడంతో పాటు, పుస్తకం గొప్పతనం తెలిసింది’ అంటుంది ఆల్కా. ఫిక్షన్‌తో పాటు విద్యార్థుల కోసం చరిత్ర నుంచి భౌగోళికం వరకు ఆడియో పుస్తకాలను నెరేట్ చేస్తూ భేష్ అనిపించుకుంటుంది అంజు పణిక్కర్....ఇలా చెప్పుకుంటే పోతే ఎంతోమంది ఉన్నారు. పుస్తకం హస్తభూషణం అంటారు.గళభాషణం కూడా అంటే కాదనేదేముంది! -
రాజీవ్ ఖేల్‌రత్న: హాకీ గోల్‌కీపర్ శ్రీజేష్ పేరు నామినేట్
న్యూఢిల్లీ: రాజీవ్ ఖేల్‌రత్న అవార్డ్‌కు హాకీ గోల్‌కీపర్ శ్రీజేష్ పేరును నామినేట్ చేస్తున్నట్లు హాకీ ఇండియా శనివారం ప్రకటించింది. అదే విధంగా.. హాకీ మహిళా జట్టుకు ప్రాతినిథ్యం వహించిన క్రీడాకారిణి దీపిక పేరును కూడా ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్ చేసింది. ధ్యాన్‌చంద్ లైఫ్‌టైం అవార్డుకు డాక్టర్ ఆర్పీ సింగ్, సంగాయి ఇబెంహాల్ పేర్లను ప్రతిపాదించింది. ద్రోణాచార్య పురస్కారానికి బీజే కరియప్ప, సీఆర్ కుమార్ పేర్లను నామినేట్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఇక అర్జున పురస్కారానికి హర్మన్‌ప్రీత్ సింగ్, వందనా కటారియాతో పాటు నవజోత్ కౌర్ పేర్లను ప్రతిపాదించింది. చదవండి: 2 డజన్లకు పైగా పతకాలు.. రోడ్డు పక్కన చిప్స్ అమ్ముతూ -
Cyber Crime: పిన్ని స్నానం చేస్తుండగా వీడియో తీసిన బాలుడు.. ఆపై
సంధ్య (పేరు మార్చడమైనది)కు ఇంజనీరింగ్ లో సీటు రావడంతో తన పెద్దమ్మ కూతురైన గీత ఇంట్లో ఉండి చదువుకుంటోంది. గీత, ఆమె భర్త ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులే. వారి కొడుకు కిశోర్ (పేరు మార్చడమైనది) ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. కొన్ని రోజులుగా సంధ్య ముభావంగా ఉండటం, తనలో తనే బాధపడటం చూసిన గీత ఏమైందని అడిగింది. అయినా, ఏమీ చెప్పలేకపోయింది సంధ్య. కానీ, గీత గట్టిగా అడిగేసరికి ‘చచ్చిపోతాను’ అంటూ ఏడవడం మొదలుపెట్టింది. సమస్య ఏంటని సముదాయిస్తూ అడిగేసరికి తన ఫోన్ చూపించింది గీత. సంధ్య స్నానం చేస్తుండగా ఎవరో తీసిన వీడియో అది. ఆ వీడియో ఏదో వెబ్సైట్లో ఉందని, స్నేహితురాలు తనకు షేర్ చేసిందని ఏడుస్తూ చెప్పింది సంధ్య. గీతకు ఏం చేయాలో అర్థం కాలేదు. విషయాన్ని భర్తతో చెప్పింది. ఎటువైపు నుంచి ఏ దుండగుడు ఆ వీడియోను తీశాడో తెలియలేదు. సైబర్‌క్రైమ్‌కు ఫిర్యాదు చేయడంతో విషయం మొత్తం వెలుగులోకి వచ్చింది. సంధ్య స్నానం చేస్తుండగా కిశోర్ తీసిన వీడియో అది అని తేలి, ఇంట్లో అంతా ఉలిక్కిపడ్డారు. ఇలాగే, వారి ఇంటి పక్కనే ఉంటున్న అమ్మాయిల హాస్టల్ బాత్రూమ్ల నుంచీ వీడియోలు తీస్తున్నాడనే విషయాన్ని రాబట్టారు. కిశోర్ ఫోన్లో ఉన్న వీడియోలు చూస్తే ఇలాంటి వీడియోలు పదికి పైగానే ఉన్నాయి. ఇంత దారుణాన్ని పన్నెండేళ్ల పిల్లవాడు చేశాడంటే ఎవ రికీ నమ్మబుద్ధికాలేదు. ఆడుకోవడానికని ఇస్తే.. గీత, ఆమె భర్త ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు. పనివేళలూ ఎక్కువే. పిల్లవాడికి కాలక్షేపంగా ఉంటుందని స్మార్ట్‌ఫోన్, గేమ్స్ ఆడుకోవడానికి ఐపాడ్ వంటివి ఏర్పాటు చేశారు. కిశోర్ స్కూల్ టైమ్ అయిపోగానే వాటిని ముందేసుకునేవాడు. పెద్దవాళ్లు కూడా పిల్లవాడు తమను విసిగించుకుండా ఖాళీ సమయంలో సద్వినియోగం చేసుకుంటున్నాడని అనుకున్నారు. డిజిటల్ గేమ్స్ వల్ల మెదడు కూడా చురుకుగా మారుతుందని భావించారు. అయితే, గేమ్‌లో భాగంగా ఆన్లైన్ ఫ్రెండ్స్ గ్రూప్‌లో భాగస్థుడయ్యాడు కిశోర్. ‘ట్రూత్ అండ్ డేర్’ గేమ్‌లో భాగంగా టీనేజర్లు ఒక్కో సాహసక్రియకు పూనుకోవాలనేది ఛాలెంజ్. అందులో ఎవరికి ఏ ఛాలెంజ్ వస్తే దాన్ని పూర్తి చేయాలి. దాంట్లో భాగంగా టీనేజర్లు ఇలాంటి దారుణాలకు ఒడిగట్టి, వీడియోలను షేర్ చేసుకుంటూ వస్తున్నారని తెలిసింది. కిందటేడాది... 2020 క్రైమ్ గణాంకాల ప్రకారం విజయవాడతో సహా కృష్ణాజిల్లాలో 220 లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. ఈ కేసులలో ఎక్కువమంది నిందితులు మైనర్లే. పోర్న్ వీడియోలు చూసి, తాము ఈ నేరం చేశారని అంగీకరించారు. కృష్ణా జిల్లాలో 10వ తరగతి విద్యార్థి ఎనిమిదేళ్ల బాలికను లైంగిక వేధింపులకు గురిచేశాడన్న విషయమై అరెస్ట్ చేశారు. దర్యాప్తులో పోలీసులు యువకుడిని ప్రశ్నిస్తే స్మార్ట్‌ఫోన్‌లో పోర్న్ చూసేవాడినని, అవే తనను ఈ దారుణానికి ప్రోత్సహించేలా చేశాయనే వాస్తవాన్ని బయటపెట్టాడు. టీనేజర్లు, యువకులు అశ్లీల చిత్రాలకు బానిసలైన వారు ఈ తరహా నేరాలకు పాల్పడే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో టీనేజర్లు కోపం, క్రూరత్వం, వక్రబుద్ధి, లైంగిక దాడి వంటి అసాధారణ లక్షణాలను కూడా చూపుతున్నారని మానసిక నిపుణులు అభిప్రాయపడ్డారు. శారీరక శ్రమ లేకుండా డిజిటల్ మీడియాతో ఎక్కువ కాలక్షేపం చేసే టీనేజర్లలో విపరీత చర్యలు చూడాల్సి వస్తోందని, టీనేజర్ల మనసును క్రీడల వంటి శారీరక శ్రమ వైపు మళ్లిం^è గలగాలని నిపుణులు సూచిస్తున్నారు. డిజిటల్ పేరెంటింగ్ తప్పనిసరి పిల్లలు డిజిటల్ వాతావరణంలో ఎంతవరకు సురక్షితంగా ఉన్నారనేది ఎలా తెలుసుకోవాలన్నది ఈ రోజుల్లో తల్లిదండ్రులకు పెద్ద సమస్య. పిల్లలు ఎదిగే క్రమంలో వారికి కొన్ని హద్దులను నిర్ణయంచడంతో పాటు కొంత బ్యాలెన్సింగ్ విధానాన్ని కూడా నేర్పాలి. మీరు తమకు గైడ్‌గా వ్యవహరిస్తున్నారనే విషయం పిల్లలు తెలుసుకోగలగాలి. ఆన్లైన్ సమస్యలను పరిష్కరించడంలో పెద్దలు తమకున్న అనుభవాన్ని పిల్లలకు చెప్పాలి. పిల్లల భావాలను అర్ధం చేసుకోవడానికి ముఖ్యంగా వారు చెప్పింది వినడానికి సిద్ధంగా ఉన్నామన్నది వారికి తెలియాలి. వారి ఆన్లైన్ ప్రపంచాన్ని పర్యవేక్షించడం, నియంత్రించడం, సరైన భద్రత తీసుకుంటూ వారు సురక్షితంగా ఉన్నారని పెద్దలు నిర్ధారించుకోవాలి. మీ పిల్లల మాట వినడానికి ఎక్కువ సమయం కేటాయించాలి. దీనిద్వారా వారు ఏం చేస్తున్నారో గమనించవచ్చు. – అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్, హైదరాబాద్ తల్లితండ్రుల పర్యవేక్షణే రక్షా కవచం పిల్లలు టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి. కానీ, అనవసర చెత్తనంతా మెదళ్లకు చేర్చుకుంటున్నారు. ఆన్లైన్ క్లాసులు, వీడియో గేమ్స్ దృష్ట్యా పిల్లలందరూ ఇంటర్నెట్ వాడుతున్నారు. అయితే, డిజిటల్ విధానంలో జరిగే క్రైమ్‌ను అరికట్టాలంటే మాత్రం తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి. ఈ విషయంగా వచ్చే కేసుల విషయంలో మేం కౌన్సిలింగ్ కూడా ఇస్తుంటాం. పిల్లలకు స్మార్ట్ఫోన్లు ఇచ్చినప్పటికీ అందులో కొన్ని సెక్యూరిటీ సేఫ్టీ యాప్స్ ఉన్నాయి. వాటిని ఇన్స్టాల్ చేసి తాము పర్యవేక్షణ చేయవచ్చు. వీటితోపాటు పిల్లలకు నైతిక విలువలు నేర్పాలి. ఏ మార్గమైనా ఎదుటివారికి ఇబ్బంది కలిగించని, కుటుంబానికి హాని తలపెట్టని విధంగా ఉండేందుకు ఎప్పుడూ గైడ్‌లైన్స్ ఇస్తూ ఉండాలి. పిల్లలను వారి మానాన వారిని వదిలేయకుండా, ఇంట్లో ఆరోగ్యకరమైన వాతావారణం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. – దీపికా పాటిల్,స్పెషల్ ఆఫీసర్, (దిశా చట్టం అమలు విభాగం), ఆంధ్రప్రదేశ్ చదవండి: నగ్న ఫొటోలు పంపాడు.. నాకేమీ తెలియదంటూ బోరుమంది -
దీపిక పిల్లి లేటెస్ట్ క్యూట్ ఫోటోలు
-
హోలీ వేడుకల్లో అదరగొట్టిన అందాల భామలు
-
తన నవ్వుకే పడి చచ్చిపోతాను: నటుడు
ముంబై: నేటికీ మన దేశంలో రుతుక్రమం గురించి మాట్లాడేందుకు సందేహించే అమ్మాయిలు ఎక్కువగానే ఉన్నారు. నెలసరి సమయంలో ఎంత కష్టాన్నైనా ఓర్చుకుంటారే తప్ప ఆ బాధను ఎవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడరు. పీరియడ్స్‌లో అటు గృహిణులకు, ఇటు ఉద్యోగినులకు గానీ ప్రత్యేకంగా సెలవులేమీ దొరకవు. నొప్పి భరిస్తూనే ఇంట్లో పనులు చక్కదిద్దుకోవాలి, ఆఫీసులో వర్క్ చేస్తూనే ఉండాలి. చాలా మంది మగవాళ్లు సైతం.. నెలసరి సమయంలో ఇంట్లోని ఆడవాళ్లు కష్టపడుతూ పనిచేసుకుంటుంటే చూస్తారే తప్ప సాయం చేయడానికి ముందుకురారు. ఇది చాలా తప్పు అంటున్నాడు హిందీ బుల్లితెర నటుడు షోయబ్ ఇబ్రహీం. లాక్డౌన్ కాలంలో షూటింగ్ లేకపోవడంతో ఇంటికే పరిమితం కావడం వల్ల చాలా మంది సెలబ్రిటీలు సొంతంగా యూట్యూబ్ చానెళ్లు మొదలుపెట్టి, వ్లోగ్స్ చేయడం ఆరంభించారు. వారిలో ‘ససురాల్ సిమర్ కా’ సీరియల్ జంట దీపికా కక్కర్- షోయబ్ కూడా ఉన్నారు. కలిసి నటిస్తున్న సమయంలో స్నేహితులుగా మారిన వీరు 2018లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ క్రమంలో కపుల్ గోల్స్ సెట్ చేస్తూ గతంలో అనేకసార్లు అభిమానుల మనసు దోచుకున్నారు. ఇక తాజాగా తన వ్లోగ్‌లో పీరియడ్స్ గురించి ప్రస్తావించి నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్నాడు షోయబ్.(చదవండి: పెళ్లికి ముందు ఆ ఒప్పందం పెట్టుకున్నాం: ప్రియాంక) నెలసరిలో ఉన్న భార్య దీపిక కోసం వంట చేసి, ఆమెకు వడ్డించిన అతడు.. తన అభిమానులు కూడా ఇలాగే రుతుక్రమ సమయంలో ఇంట్లో వాళ్లకు సాయం చేయాలని అభ్యర్థించాడు. అలాగే పీరియడ్స్ గురించి మాట్లాడితే తప్పేమీ కాదన్నాడు. శరీరంలో సహజసిద్ధంగా కలిగే మార్పుల గురించి, తద్వారా కలిగే ఇబ్బందుల గురించి చర్చిస్తేనే విశ్రాంతి తీసుకునే వెసలుబాటు ఉంటుందని లేడీ ఫ్యాన్స్‌కు సైతం సలహా ఇచ్చాడు. ఇక ఆస్క్ మీ ఎనీథింగ్ క్వశ్చన్ అవర్‌లో భాగంగా.. తన భార్య నవ్వు నకిలీది అంటూ కామెంట్ చేసిన నెటిజన్‌కు దిమ్మదిరిగే సమాధానం ఇచ్చాడు షోయబ్. ‘‘నా దీపిక నవ్వుకు నువ్వు దిష్టిపెట్టకు. ఎందుకంటే తన స్మైల్‌కే నేను పడిచచ్చిపోతాను. మా గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోకు. ఏది పడితే అది మాట్లాడకు సరేనా!’’ అంటూ కౌంటర్ ఇచ్చాడు. -
దీపిక కిడ్నాప్ కథ సుఖాంతం
-
దీపిక కిడ్నాప్ కథ సుఖాంతం
-
బ్రేకింగ్ : దీపిక కిడ్నాప్ కథ సుఖాంతం
సాక్షి, వికారాబాద్ : వికారాబాద్‌లో మూడు రోజుల క్రితం కిడ్నాప్‌కు గురైన దీపిక కిడ్నాప్ కథ సుఖాంతమైంది. మంగళవారం సాయంత్రం దీపిక తన భర్త అఖిల్‌తో కలిసి వికారాబాద్ ఎస్పీ కార్యాలయానికి చేరుకుంది. ఈ మేరకు దీపిక ఇష్టంతోనే భర్త అఖిల్ ఆమెను తీసుకెళ్లినట్లు పోలీసులు నిర్థారించారు. దీపిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో గత మూడు రోజులగా ఆమె కోసం ఆరు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపడుతున్న పోలీసులకు మంగళవారం ఉదయమే ట్విస్ట్ ఇచ్చింది. పోలీసులకు ఫోన్ చేసిన దీపిక.. తనను ఎవరు కిడ్నాప్ చేయలేదని.. తాను ఇష్టపూరితంగానే భర్త అఖిల్‌తో కలిసి వెళ్లినట్లు పోలీసులకు తెలిపింది. (చదవండి : మలుపులు తిరుగుతున్న దీపిక కిడ్నాప్ కేసు) అసలు విషయంలోకి వెళితే.. వికారాబాద్‌కు చెందిన దీపిక, అఖిల్ 2016లో ఆర్యసమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి అమ్మాయి తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడం రెండు సంవత్సరాల క్రితం అమ్మాయిని తీసుకొచ్చారు. కుటుంబ సభ్యుల బలవంతం మేరకు అఖిల్ నుంచి విడాకులు కోరుతూ దీపిక కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలోనే గత (శనివారం) ఇరువురు వికారాబాద్ కోర్టుకు హాజరయ్యారు. అనంతరం అదే రోజు సాయంత్రం దీపిక షాపింగ్‌కు వెళ్లి ఇంటికి వెళ్తుండగా.. ఓ కారులో ముగ్గురు వ్యక్తులు వచ్చి ఆ యువతిని బలవంతంగా కారులో ఎక్కించుకుని పోయారు. దీనిపై యువతి కుటుంబ సభ్యులు పోలీసులు ఆశ్రయించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు గత మూడు రోజులుగా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా దీపిక తన భర్త అఖిల్‌తో కలిసి ఎస్పీ కార్యాలయానికి రావడంతో కిడ్నాప్ కథ ముగిసినట్లయింది. (చదవండి :వికారాబాద్‌లో కిడ్నాప్ కలకలం) -
దీపిక కిడ్నాప్ కేసులో ఊహించని ట్విస్ట్
సాక్షి, రంగారెడ్డి : వికారాబాద్‌లో మూడు రోజుల క్రితం కిడ్నాప్‌కు గురైన దీపిక కేసు ఊహించని మలుపు తిరిగింది. గత మూడు రోజులగా ఆమె కోసం ఆరు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపడుతున్న పోలీసులకు యువతి షాకిచ్చింది. తాను ఇష్టపూరితంగానే భర్త అఖిల్‌తో వెళ్లినట్టు పోలీసులకు తెలిపింది. మేరకు మంగళవారం వికారాబాద్ పోలీసులకు ఫోన్ చేసిన దీపిక.. తాను అఖిల్ వద్ద క్షేమంగానే ఉన్నట్లు చెప్పింది. పోలీసుల సూచన మేరకు కాసేపట్లో వీరిద్దరు వికారాబాద్ పోలీస్ స్టేషన్ వద్దకు రానున్నారు. దీంతో దీపిక కుటుంబ సభ్యులతో పాటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇంట్లో నుంచి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో తెలియాల్సి ఉంది. (మలుపులు తిరుగుతున్న దీపిక కిడ్నాప్ కేసు) వివరాల ప్రకారం.. వికారాబాద్‌కు చెందిన దీపిక, అఖిల్ 2016లో ఆర్యసమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి అమ్మాయి తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడం రెండు సంవత్సరాల క్రితం అమ్మాయిని తీసుకొచ్చారు. కుటుంబ సభ్యుల బలవంతం మేరకు అఖిల్ నుంచి విడాకులు కోరుతూ దీపిక కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలోనే గత (శనివారం) ఇరువురు వికారాబాద్ కోర్టుకు హాజరయ్యారు. అనంతరం అదే రోజు సాయంత్రం దీపిక షాపింగ్‌కు వెళ్లి ఇంటికి వెళ్తుండగా.. ఓ కారులో ముగ్గురు వ్యక్తులు వచ్చి ఆ యువతిని బలవంతంగా కారులో ఎక్కించుకుని పోయారు. దీనిపై యువతి కుటుంబ సభ్యులు పోలీసులు ఆశ్రయించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు గత మూడు రోజులుగా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా దీపిక ఫోన్ చేయడంతో కథ సుఖాంతమైంది. మరోవైపు తమ కుమార్తెను అఖిల్ కిడ్నాప్ చేశాడని యువతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. -
దొరకని దీపిక ఆచూకీ..
-
దొరకని దీపిక ఆచూకీ.. పేరెంట్స్‌లో టెన్షన్
వికారాబాద్ : పట్టణంలో సినీ ఫక్కీలో వివాహితను కిడ్నాప్ చేసిన ఘటనలో పోలీసులు 6 బృందాలుగా ఏర్పడి గాలింపును ముమ్మరం చేశారు. పట్టణానికి చెందిన దీపిక ఆదివారం సాయంత్రం తన అక్కతో కలిసి ఆలంపల్లి రోడ్డులో షాపింగ్ చేసి తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో దుండగులు వాహనంలో వచ్చి కిడ్నాప్ చేశారు. అనంతరం వికారాబాద్ బీజేఆర్ చౌరస్తా వైపు నుంచి పరారయ్యారు. కాగా దీపిక 2016లో ఆర్యసమాజ్‌లో అఖిల్ అనే యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది. కొన్నేళ్లుగా తల్లిగారి ఇంటి వద్దనే ఉంటుంది. భర్తే ఆమెను కిడ్నాప్ చేసి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీపిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీసీ ఫుటేజీ, ఫోన్‌కాల్ డేటా ఆధారంగా గాలిస్తున్నారు. ఎస్పీ నారాయణ ఆదేశాల మేరకు డీఎస్పీ సంజీవరావు ఎప్పటికప్పుడు కేసు వివరాలు ఆరా తీస్తున్నారు. (దీపిక కిడ్నాప్ కేసు: పెళ్లైన విషయం తెలీదు) మరోవైపు కుటుంబ సభ్యుల ద్వారా మరికొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2016లో పెళ్లి చేసుకున్నా.. దీపిక, అఖిల్ నెల రోజులు కూడా కలిసి ఉండలేకపోయారని తెలిసింది. దీపికకు ఇష్టముంటే ఇంత కిడ్నాప్ డ్రామా అవసరం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటన జరిగి మూడు రోజులు కావస్తున్న దీపిక ఆచూకీ ఇంకా లభ్యం కాకపోవడంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీపికను ఆమె భర్త అఖిలే కిడ్నాప్ చేశాడని పోలుసులునిర్ధారించారు. అఖిల్ స్నేహితుల ద్వారా పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో ఉన్నట్లు పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీపిక కిడ్నాప్ వ్యవహారాన్ని పోలీసులు సవాలుగా తీసుకున్నారు. అఖిల్ బంధువులు, స్నేహితులను విచారిస్తున్నారు. అయితే వికారాబాద్‌లో పలుచోట్లు సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో వారు ప్రయణించిన కారు ఎటువైపు వెళ్లిందో కనిపెట్టడం పోలీసులకు కష్టతరంగా మారింది. అయితే దీపిక ఎక్కడ ఉన్నది అనేది మాత్రం పోలీసులు బయటకి చెప్పడం లేదు. భర్త వద్దే దీపికా ఉందని అనుమానం వ్యక్తం చేస్తు న్నామని త్వరలో కేసు ఛేదిస్తాం అంటున్నారు. ఇక ఈ కిడ్నాప్ కేసు చివరికి ఎటువైపు మలుపు తిరుగుతుందో చూడాలి. -
మలుపులు తిరుగుతున్న దీపిక కిడ్నాప్ కేసు
-
దీపిక కిడ్నాప్ కేసు: పెళ్లైన విషయం తెలీదు
సాక్షి, హైదరాబాద్ : వికారాబాద్‌కు చెందిన యువతి దీపిక కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. స్థానికుల సమాచారం ప్రకారం..దీపిక, అఖిల్ 2016లో ఆర్యసమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి అమ్మాయి తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడం రెండు సంవత్సరాల క్రితం అమ్మాయిని తీసుకొచ్చారు. కుటుంబ సభ్యుల బలవంతం మేరకు అఖిల్ నుంచి విడాకులు కోరుతూ దీపిక కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలోనే నిన్న (శనివారం) ఇరువురు వికారాబాద్ కోర్టుకు హాజరయ్యారు. అనంతరం అదే రోజు సాయంత్రం దీపిక షాపింగ్‌కు వెళ్లి ఇంటికి వెళ్తుండగా.. ఓ కారులో ముగ్గురు వ్యక్తులు వచ్చి ఆ యువతిని లాక్కొని పక్కనున్న ఆమె సోదరిని బయటకు తోసి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని దీపిక కుటుంబ సభ్యులు వికారాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. డీఎస్పీ సంజీవరావు తమ సిబ్బందితో వెళ్లి సంఘటన స్ధలంతో పరిశీలించారు. దీపికను ఆమె భర్త అఖిలే కిడ్నాప్ చేశాడని యువతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు దీపిక ఆచూకీ ఇంతవరకు లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. (వికారాబాద్‌లో కిడ్నాప్ కలకలం) ఈ నేపథ్యంలో అఖిల్ తండ్రి మరో విధంగా స్పందించారు. అసలు తన కొడుకు పెళ్లి చేసుకున్నాడనే విషయం ఇప్పటి వరకు తెలీదన్నారు. శనివారం సాయంత్రం తన ఇంటికి పోలీసులు వచ్చిన తర్వాతే తెలిసిందని పేర్కొన్నారు. అప్పటి నుంచి అఖిల్‌కు వరుసగా ఫోన్ చేస్తున్నా.. స్విచ్ ఆఫ్ వస్తుందని తెలిపారు. గతంలో తన కుమారుడు ఒకసారి తన స్నేహితునికి కోర్టులో కనిపించాడని తెలిసి అడిగానని, కానీ సరిగ్గా సమాధానం చెప్పలేదన్నారు. ప్రస్తుతం అఖిల్ హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో అకౌంటెంట్‌గా పని చేస్తున్నట్లు వెల్లడించారు. వారాంతంలో ఎప్పుడో ఒక్కసారి ఇంటికి వచ్చి వెళ్తుంటాడని, గత శనివారం కూడా అదే విధంగా వచ్చి వెళ్లాడని చెప్పారు. ఇంతలోనే నిన్న సాయంత్రం ఇంటికి పోలీసులు వచ్చి ఓ యువతిని తన కుమారుడు కిడ్నాప్ చేశాడని చెప్పడంతో షాక్‌కు గురయ్యానని పేర్కొన్నారు. అయితే దీపిక గురించి పూర్తి వివరాలు వెల్లడించడానికి పోలీసులు, కుటుంబ సభ్యులు నిరాకరిస్తున్నారు. ప్రస్తుతం ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. వికారాబాద్ సీఐ గురుకుల రాజశేఖర్ సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి వెళ్లి కిడ్నాప్‌పై స్థానికులను విచారించారు. అనంతరం సీసీ పుటేజీ ద్వారా కారు గురించి ఆరా తీశారు. కారు హైదరాబాద్ వైపు వెళ్లిన్నట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇక ఈ కిడ్నాప్ కేసు చివరికి ఎటువైపు మలుపు తిరుగుతుందో వేచిచూడాలి. -
టిక్‌టాక్‌లు చూడొద్దన్నందుకు యువతి ఆత్మహత్య
ఉప్పల్(హైదరాబాద్): టిక్‌టాక్‌తోపాటు వీడియో గేమ్‌లు ఆడవద్దన్నందుకు మనస్తాపం చెందిన యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గురువారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. రా మంతాపూర్ అరవింద్ కాలనీ వీధి–2లో ఉండే కనుపూర్తి రాజ లింగం ఫుట్‌వేర్ వర్క్‌షాపు నిర్వాహకు డు. ఇతనికి ముగ్గురు కూతుళ్లు. రెండో కూతురు దీపిక (17) పాలిటెక్నిక్ మొదటి ఏడాది చదువుతోంది. తరచూ ఫోన్లో టిక్‌టాక్‌లు చూస్తూ, వీడి యోగేమ్‌లు ఆడుతూ సమయం వృథా చేస్తుండటం తో తల్లి మందలించింది. దీంతో మనస్తాపం చెందిన దీపిక గదిలోకి వెళ్లి తలుపులేసుకుంది. ఎంతకూ బయటకు రాకపోవడంతో అనుమానంతో కుటుంబ సభ్యులు తలుపులు విరగ్గొట్టి చూడగా గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఉంది. వెంటనే దించి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీ సులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఎమ్మెస్‌కు వెళతానని ఊహించలేదు: సూర్య దీపిక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన విద్యార్థినికి అమెరికాలోని ప్రతిష్టాత్మక అబర్న్ యూనివర్సిటీలో ఎమ్మెస్ కోర్సులో సీటు దక్కింది. హైదరాబాద్ లోని అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ (ఎఫ్సీఆర్ఐ)లో బీఎస్సీ ఫారెస్ట్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న రంగారెడ్డి జిల్లాకు చెందిన సూర్య దీపిక ఈ ఘనత సాధించింది. ఇంకా ఫైనల్ పరీక్షలు రాయాల్సి ఉన్నప్పటికీ గత నాలుగేళ్లుగా ఫారెస్ట్రీ కోర్సులో దీపిక కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఈ యూనివర్సిటీ ఎమ్మెస్‌లో సీటును పూర్తి ఉచితంగా ఇచ్చింది. రెండేళ్ల ఈ ఎమ్మెస్ కోర్సు ఫీజు 15,000 డాలర్లు కాగా దీనిని మాఫీ చేయటంతో పాటు నెలకు 1,500 డాలర్ల స్కాలర్షిప్ను కూడా మంజూరు చేసింది (ఈ రెండింటి విలువ దాదాపు రూ. 50 లక్షల వరకూ ఉంటుందని అంచనా). అబర్న్ యూనివర్సిటీలో ప్రముఖ డాక్టర్ జన్నా విల్లోగ్ నేతృత్వంలో జెనెటిక్స్, వైల్డ్ లైఫ్‌ను సూర్య దీపిక అధ్యయనం చేయనుంది. రాష్ట్ర విద్యార్థులకు మెరుగైన ఉన్నత విద్యను అందించడంలో భాగంగా ఎఫ్సీఆర్ఐ గతంలో అబర్న్ తోపాటు కెనడాకు చెందిన బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీతోనూ ఒప్పందాన్ని కుదుర్చుకున్న విషయం తెలిసిందే. మరో ముగ్గురు విద్యార్థులకు కూడా ఈ యూనివర్సిటీల్లో ప్రవేశం దక్కే అవకాశం ఉందని కాలేజీ డీన్ చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. ఎమ్మెస్‌కు వెళతానని ఊహించలేదు: సూర్య దీపిక తన అకడమిక్ కోర్సులో భాగంగా ఉన్నతవిద్యను అభ్యసిస్తానని, అందులోనూ అమెరికాలో ఎమ్మెస్ చదువుతానని తాను ఊహించలేదని సూర్య దీపిక తెలిపింది. తన కలను నిజం చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు ఆమె కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ విషయంలో అటవీ కళాశాల యాజమాన్యం, సిబ్బంది తనకు అన్నివిధాలా అండగా నిలిచారని పేర్కొంది. నగర శివార్లలోని ములుగులో నెలకొల్పిన ఎఫ్సీఆర్ఐలో ప్రస్తుతం బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సు నడుస్తోంది. 2016కు చెందిన మొదటి బ్యాచ్ విద్యార్థులు ప్రస్తుతం చివరి ఏడాదిలో ఉన్నారు. వీరిలో సుమారు 20 మంది ఉన్నత చదువులతో పాటు, సివిల్ సర్వీసులకు కూడా ప్రిపేర్ అవుతున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఎమ్మెస్సీ ఫారెస్ట్రీ కోర్సును ఆరంభించేందుకు అన్ని అనుమతులు వచ్చినట్లు డీన్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. మొదటి బ్యాచ్‌లో 24 మందికి ఎమ్మెస్సీ కోర్సులో ప్రవేశం కల్పిస్తామన్నారు. -
మహిళలను వేధిస్తే కఠిన చర్యలు
-
గృహహింస: దిశ టీం 24 గంటలు పనిచేస్తుంది
సాక్షి, విజయవాడ: లాక్డౌన్ కాలంలో గృహహింస ఎదుర్కొంటున్న మహిళలకు రక్షణకు ఏర్పాటు చేసిన వన్‌స్టాప్ సెంటర్లలో దిశ టీం 24 గంటలు పనిచేస్తుందని దిశ చట్టం ప్రత్యేకాధికారి దీపికా పాటిల్ తెలిపారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వన్‌స్టాప్ సంటర్ల నుంచే బాధితులకు నిపుణులైన ఆరోగ్య, వైద్య, మానసిక, సాంఘిక, న్యాయ సహాయం అందుతుందన్నారు. 24 గంటలు పోలీసుల సంరక్షణ, వసతి సౌకర్యం అందుబాటులో ఉంచామన్నారు. (గృహహింస: మహిళలకు అండగా ఏపీ ప్రభుత్వం) రాష్ట్రంలోని 23 స్వధార్ గృహాల్లో బాధిత మహళలకు వసతి, రక్షణ కల్పిస్తామని, ఇందుకోసం ఉమెన్ హెల్స్‌లైన్ 181 రౌండ్ దీ క్తాక్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. లాక్డౌన్లో పోలీసు స్టేషన్లకు వెళ్లలేరని మహిళలను వేధిస్తే చర్యలు తప్పవని దీపికా హెచ్చిరించారు. మహిళా రక్షణ కోసం దిశ సిబ్బంది 24 పనిచేస్తున్నారని, బాధిత మహిళల తక్షణ సహాయం కోసం ప్రతీ జిల్లాలో కాల్ సెంటర్లను ఏర్పాటు చేశామని దీపికా పాటిల్ తెలిపారు. (గృహ హింసా.. ఫోన్ చేస్తే రక్షణ) జిల్లా పేరు డయల్ చేయాల్సిన నెంబరు శ్రీకాకుళం 9110793708 విశాఖపట్టణం 6281641040 పశ్చిమ గోదావరి 9701811846 గంటూరు 9963190234 పొట్టిశ్రీరాములు నెల్లూరు 9848653821 కర్నూలు 9701052497 అనంతపురం 8008053408 విజయనగరం 8501914624 తూర్పుగోదావరి 9603231497 కృష్ణ 9100079676 ప్రకాశం 9490333797 చిత్తూరు 9959776697 వై.యస్.ఆర్ . కడప 8897723899 -
గగన దీపిక
ఆకాశంలోని నక్షత్రాలు చిన్ని బుర్రల్లో మెరుపులు మెరిపిస్తాయి. రాగదీపికకు మాత్రం నక్షత్రాల వెలుగుల వెనుక దాగిన చీకట్లను ఛేదించాలనే కోరిక కలిగింది. డ్వార్ఫ్ గెలాక్సీలపై పరిశోధన చేస్తున్న ఈ తెలుగమ్మాయిది గుంటూరు జిల్లా తెనాలి. గగన దీపిక పిల్లలకు ఒక్కొక్కరికి ఒక్కో ఇష్టం ఉంటుంది. రాగదీపికకు చదువుకోవడం ఇష్టం. అయితే ఆమెకు అంతరిక్షం అంటే ఇంకా ఇష్టమని ఆమె తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు తల్లిదండ్రులకు తెలిసింది. టెన్త్‌క్లాస్‌లో నారాయణ ఒలింపియాడ్‌లో సీట్ వచ్చింది. కానీ చేరలేదు. ఇంటర్‌కి ఢిల్లీలో అత్యంత సాధారణమైన కాలేజ్ సరస్వతి విద్యామందిర్‌లో చేరింది. అప్పుడే ‘ఢిల్లీ విద్యామందిర్ క్లాసెస్’ అనే కోచింగ్ సెంటర్లో ట్యూషన్‌కు వెళ్లేది. అక్కడ ఒక సబ్జెక్టులో వారానికి నాలుగు క్లాసులు మాత్రమే ఉంటాయి. అలా ఏ మాత్రం ఒత్తిడి లేకుండా ఆడుతూ పాడుతూ ఇంటర్ పూర్తి చేసింది. ఇంటర్ తర్వాత ‘నెస్’్ట రాసి విశ్వభారతి యూనివర్సిటీ, శాంతినికేతన్లో ఎమ్మెస్సీ ఫిజిక్స్ (ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సు)లో చేరింది. మనదేశంలో పిల్లలను పరిశోధన రంగంవైపు మళ్లించాలనే ఆలోచనతో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ పెట్టించిన కోర్సు ఇది. భువనేశ్వర్, శాంతినికేతన్, బొంబాయిల్లో మాత్రమే ఈ కోర్సు ఉంది. అందులో దీపిక గోల్డ్ మెడల్ తెచ్చుకుంది. నక్షత్రాల వేట 2018 జనవరిలో అమెరికన్ ఆస్ట్రనామికల్ సొసైటీ సమావేశంలో పోస్టర్ ప్రెజంటేషన్, యూకేలోని డర్హామ్‌లో అంతర్జాతీయ సమావేశంలో ‘ఫ్లాష్ టాక్’ ఇచ్చింది రాగదీపిక. ప్రస్తుతం ట్యూసాన్లోని స్టూవర్డ్ అబ్జర్వేటరి, యూనివర్శిటీ ఆఫ్ ఆరిజోనాలో ‘డ్వార్ఫ్ గెలాక్సీస్–బ్లాక్ హోల్స్’ అనే అంశంపై పరిశోధన చేస్తోంది. ‘ఐసీ1613’ అనే డ్వార్ఫ్ గెలాక్సీ చుట్టూ అతి పురాతనమైన నక్షత్రాలు ఉన్నాయని ఈ పరిశోధనలోనే రాగదీపిక కనిపెట్టింది. భూమ్మీదే ఆగిపోకూడదు ‘మనకు బాగా తెలిసిన ఇంజినీరింగ్, మెడిసిన్ రంగాలే కాదు. ప్రపంచం చాలా విశాలమైంది. అంతరిక్షం అంతకంటే విశాలమైనది..’ అని.. సెలవులకు ఇండియా వచ్చినప్పుడు ఇచ్చే ప్రసంగాలలో తరచు చెబుతుంటుంది రాగదీపిక. తెనాలి, విజయవాడలోని కొన్ని స్కూళ్లు, కాలేజీల వాళ్లు పిల్లలకు గెస్ట్ లెక్చర్ కోసం దీపికను ఆహ్వానిస్తుంటారు. ‘‘మా నాన్నగారు ఖగోళశాస్త్రం పుస్తకాలు ఇష్టంగా చదివేవారు. దీపికకు తాతతో బాగా మాలిమి. ఆయన చదివే పుస్తకాలను చూస్తూ ఉండేది. దీపిక పదేళ్ల వయసులోనే మా నాన్నగారు పోయారు. కానీ ఈ రంగం మీద తనకు ఇష్టం కలగడానికి చిన్నప్పుడు పడిన తాతగారి ముద్రే కారణం అనిపిస్తుంది’’ అన్నారు రాగదీపిక తల్లి కనకదుర్గ.– బి.ఎల్.నారాయణ,సాక్షి, తెనాలి మరో రెండు పరిశోధనలు శాస్త్రవిజ్ఞానాన్ని వృత్తిగా స్వీకరించటానికి ప్రోత్సాహం కల్పించాలనేదే నా ఉద్దేశం. మరో రెండేళ్లలో నా పీహెచ్డీ పూర్తవుతుంది. తర్వాత ఇంకో రెండు పోస్ట్ డాక్టోరల్ పరిశోధనలు చేయాలనుకుంటున్నాను. పరిశోధనలు సాగిస్తూనే ప్రొఫెసర్‌గా పనిచేయాలనేది నా కోరిక. ఏదైనా సాధించి మంచి సైంటిస్టుగా చరిత్రలో నిలవాలనేది నా లక్ష్యం.– రాగదీపిక, పీహెచ్డీ స్కాలర్ -
ఏపీలో దిశ యాప్‌కి అనూహ్య స్పందన
-
బాధ్యతలు స్వీకరించిన దీపిక పాటిల్
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో దిశ చట్టం అమలు కోసం ప్రత్యేక అధికారిణిగా నియమితురాలైన దీపిక పాటిల్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా దీపిక మాట్లాడుతూ.. మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు అడ్డుకట్టవేస్తామని చెప్పారు. మహిళల సంరక్షణకు పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్తామని తెలిపారు. త్వరిత గతిన దర్యాప్తును పూర్తి చేసి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పనిచేసి దిశ చట్టాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. కాగా, రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం ప్రవేశపెట్టిన ఏపీ దిశ చట్టం -2019 అమలు కోసం కృతికా శుక్లా, దీపికాలను ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్లుగా నియమించిన సంగతి తెలిసిందే. ఇందులో దీపిక 2014లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. శిక్షణ పూర్తయిన తర్వాత కొంత కాలం గ్రేహౌండ్స్, మరికొంతకాలం పార్వతీపురం ఏఎస్పీగా పనిచేశారు. తిరుపతి ఏసీబీ విభాగంలో ఏఎస్పీగా పనిచేసిన తర్వాత ఐదు నెలల పాటు సెలవులో వెళ్లారు. ఆ తర్వాత కర్నూలుకు బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఐపీఎస్ విభాగంలో కర్నూలు ఏఎస్పీగా ఉన్న దీపికను గుంటూరు సీఐడీ విభాగంలో ఏడీజీగా బదిలీ చేసి దిశ స్పెషల్ ఆఫీసర్‌గా నియమించారు. -
మై మదర్ టి.కృష్ణకుమారి
చక్కటి ఒడ్డూ పొడుగు, పెద్ద పెద్ద కళ్లు, పొందికైన శరీరంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో గ్లామర్ క్వీన్‌గా మెరిశారామె. జానపదాలలో ఎక్కువ నటించారు. వాటిలో కత్తుల కాంతారావుతో కలసికట్టుగా చేసినవే అధికం. ఒక కంట కన్నీటిని, మరోకంట పన్నీటిని కూడా అలవోకగా అభినయించిన ఆ అభినేత్రి కృష్ణకుమారి. కెరీర్లో బాగా బిజీగా ఉన్న కృష్ణకుమారి, ఒక అనాథ బాలికను దత్తత తీసుకున్నారు. ఆమెను సినిమాలకు దూరంగా అల్లారు ముద్దుగా పెంచారు. ‘తనను కన్న తల్లి కంటె గారంగా పెంచారు’ అని తల్లి గురించి సాక్షికి వివరించారు దీపిక. ఆమె తెలిపిన వివరాలే ఈ వారం మన సినీ పరివారం. అమ్మీకి దత్తుకుమార్తె అని ఇప్పుడు అంటున్నారు కానీ నాకసలు 19 సంవత్సరాల వయసు వచ్చేవరకు ఆమె నన్ను దత్తు తీసుకుందనే విషయమే తెలియదు. విషయం తెలిశాక నాకు అమ్మ మీద గౌరవం పెరిగింది. మా పెద్దమ్మ షావుకారు జానకి. ఆవిడ తన పిల్లలతో సమానంగా చూస్తుంది నన్ను కూడా. ఇంకా చెప్పాలంటే, నాతో మరింత ఎక్కువ ప్రేమగా ఉంటుంది. అమ్మ కెరీర్ సుదీర్ఘ కాలం నడిచింది. అందువల్ల వివాహం కూడా ఆలస్యంగా అయ్యింది. 1978లో నేను మూడు నెలల పసిపిల్లగా ఉన్నప్పుడు, వన్శంకరిలో ఉన్న అనాథాశ్రమం నుంచి నన్ను దత్తత తీసుకుంది అమ్మ. నేను అమ్మను అమ్మీ అని పిలిచేదాన్ని. నేను మదనపల్లిలో జిడ్డు కృష్ణమూర్తి స్కూల్లో పదో తరగతి వరకు చదువుకున్నాను. స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక అమ్మమ్మ వాళ్లతో పచ్చీస్, చింతగింజలు, క్యారమ్ బోర్డులాంటివి ఆడేదాన్ని. అమరచిత్ర కథలు, పిల్లల మహాభారతం చదివించేది. నా హిందీ టెక్ట్స్ చదివి, అమ్మీ హిందీ నేర్చుకుంది. అమ్మీకి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. అమ్మతో గడిపిన రోజులు నేను మరచిపోలేను అమ్మీ షూటింగ్ నుంచి ఇంటికి వచ్చాక ఆ రోజు జరిగిన షూటింగ్ వివరాలతోపాటు, నటీనటులంతా ఒకే కుటుంబంలా ఎంత సరదాగా ఉండేవారో చెప్పేది. చిన్నతనంలో అమ్మీ నాకు అన్నం తినిపిస్తూ, తను నటించిన సినిమాలు చూపించేది. నాకు మైథాలజీ, మాయలు మంత్రాల చిత్రాలంటే చాలా ఇష్టం. నేను ఒక సెలబ్రిటీలాగే ఎదిగాను. ఇంట్లో మాత్రం మామూలుగానే ఉండేవాళ్లం. కుటుంబం కోసం అమ్మీ చదువు ఆపేయవలసి వచ్చింది. అందుకు అమ్మీ అప్పుడప్పుడు బాధపడుతుండేది. నాకు స్నేహితులు చాలామంది ఉన్నారు. వాళ్లని ఇంటికి తీసుకువస్తే అమ్మీనే స్వయంగా వండి పెట్టేది. అమ్మీ వంటలు చాలా బాగా చేసేది. ఇడ్లీలు చేయడంలో ఎక్స్పర్ట్. వంట అమ్మీనే స్వయంగా చేసేది. నాన్నకి అమ్మీ అంటే చాలా ఇష్టం. అమ్మ సినిమాలు కాదు, అమ్మీ చేతి వంట అంటే ప్రీతి. అమ్మ ప్రతి వంటకం తయారీ గురించీ ఒక పుస్తకంలో రాసి పెట్టుకుంది. ఆ పుస్తకం ఇప్పటికీ నా దగ్గర ఉంది. మాది పెద్ద ఫామ్ హౌస్. అన్ని కూరలు అమ్మీ స్వయంగా పండించేది. ఒక్క కూర కూడా బయట నుంచి కొనలేదు మేం. మా అబ్బాయంటే ప్రాణం నా పెళ్లి అమ్మ వాళ్లే చేయాలనుకుని, చాలా సంబంధాలే తెచ్చారు, నేను రిజెక్ట్ చేశాను. చాలామంది నిర్మాతలు కూడా నన్ను కోడలు చేసుకోవాలని అమ్మని అడిగారట. అందరూ మా డబ్బుకోసం చూసినవారు కావడంతో అమ్మ నిరాకరించింది. నా స్నేహితులే విక్రమ్ అనే అబ్బాయిని ఎంపిక చేసి, 2003లో నా వివాహం జరిపించారు. మా వివాహాన్ని అమ్మ వాళ్లు మొదట్లో అంగీకరించలేకపోయారు. కొంత కాలం తరవాత అంగీకరించారు. 2006లో నాకు బాబు పుట్టాడు. పవన్ మయ్యా అని పేరు పెట్టుకున్నాం. వాడు పుట్టినప్పుడు ‘ఆపిల్ ఆఫ్ ద ఐ’ డిజైన్‌లో మాకు ఇల్లు కట్టించారు అమ్మీవాళ్లు. మా అబ్బాయిని చాలా ప్రేమగా చూసేది. అమ్మీ చాలా లవింగ్ అండ్ ఓపెన్ హార్టెడ్ పర్సన్. ఇంటికి ఎవరు వచ్చినా మర్యాదగా చూసేది. షాపింగ్ బాగా చేసేది. ఒకే ఒక్క హిందీ సినిమాలో నటించింది. నాన్న వద్దనడంతో మానుకుంది. అమ్మ 20 సంవత్సరాల పాటు నాన్నతో లివ్ ఇన్ టుగెదర్‌గా ఉంది. నాన్నగారు అజయ్ మోహన్ ఖైతాన్ చాలా బాగా చదువుకున్నారు. పెళ్లి అయిపోయిందని తెలిస్తే సినిమా అవకాశాలు రావని ఉద్దేశంతో అమ్మ ఆ విషయాన్ని రహస్యంగా ఉంచింది. పిల్లలు లేని ఇంటికి నేను ఇంటికి దీపంలా వచ్చాననే ఉద్దేశంతో నాకు దీపిక అని పేరు పెట్టారు. నా 21వ ఏట, డ్రీమ్ డ్రీమ్ పేరున ఒక ఎన్జీవో ప్రారంభించాను. ఎయిడ్స్‌తో బాధపడుతున్న వారి పిల్లలకి, క్యాన్సర్ బాధితుల పిల్లలకి వృత్తివిద్యలలో శిక్షణ ఇప్పిస్తున్నాం. అది నేటికీ విజయవంతంగా నడుస్తోంది. ప్రస్తుతం అందులో నేను యాక్టివ్‌గా ఉండట్లేదు. మయ్యా పబ్లిషింగ్ హౌస్ ప్రారంభించి, అన్ని రకాల పుస్తకాలను ఆన్లైన్లో పెడుతున్నాం. నాకు కుక్కలంటే ప్రాణం. ప్రాణిక్ హీలింగ్ నమ్ముతాను. గతంలో మోటరోలా, జీ కంపెనీలలో పనిచేశాను. సొంతగా ఇంటీరియర్ కంపెనీ కొంతకాలం నడిపాను. నాన్నగారు గ్లకోమాతో బ్లైండ్ అయ్యారు. అప్పుడు నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. 2012లో నాన్న పోయాక చాలా ఇబ్బందులు పడ్డాం. అమ్మ 2018లో మరణించారు. ‘మై మదర్ టి. కృష్ణకుమారి’ అని అమ్మ మీద ఇంగ్లీషులో బయోగ్రఫీ రాశాను. ప్రస్తుతం కుటుంబం, గార్డెనింగ్, ప్రాణిక్ హీలింగ్ పనుల్లో బిజీగా ఉన్నాను. మా వారు మధ్వులు. ఉడిపి నుంచి వచ్చారు. లాల్ బాగ్ హోటల్‌తో పాటు సుమారు 15 రెస్టారెంట్లు ఉన్నాయి. -
రెండు బస్సుల మధ్య నలిగి విద్యార్థిని దుర్మరణం
కర్ణాటక, మాలూరు: రెండు బస్సుల నడుమ ఓ విద్యార్థిని నలిగి మృతి చెందిన విషాద ఘటన సోమ వారం ఉదయం పట్టణంలోని బస్టాండు ప్రాంగణంలో చోటు చేసుకుంది. తాలూకాలోని జయమంగల గ్రామ పంచాయతీ పరిధిలోని తాళికుంటె గ్రామానికి చెందిన టీఎం దీపిక (19) ప్రమాదంలో మృత్యువాతపడింది. దీపిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఉదయం కళాశాల కోసం గ్రామం నుంచి బయలుదేరింది. ఈ సమయంలో తమిళనాడుకు చెందిన ప్రైవేటు బస్సులో ఎక్కడానికి ప్రయత్నించింది. అయితే బస్సు డ్రైవర్ వాహనాన్ని వెనక్కు తిప్పుతున్న సమయంలో వెనుక ఉన్న కేఎస్ ఆర్టీసీ బస్సు దగ్గరగా వచ్చింది. ఈ సమయంలో బాలిక రెండు బస్సుల మధ్యన చిక్కుకుని నలిగి చనిపోయింది. బాలిక మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రైవేటు బస్సు డ్రైవర్, కండక్టర్లు అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.విషయం తెలుసుక్ను స్థానికులు ఆందోళన నిర్వహించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళనకారులకు సర్దిచెప్పి విరమించారు. -
సైకలాజికల్ థ్రిల్లర్
అరుణ– కళ్యాణి టాకీస్ పతాకంపై కృష్ణచైతన్య దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘ఒకడు’. శనివారం హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రారంభమైంది. అఖిల్‌రెడ్డి హీరోగా పరిచయమవుతున్నారు. ముహూర్తపు సన్నివేశానికి శేఖర్ మాస్టర్ క్లాప్‌నివ్వగా, సత్య మాస్టర్ కెమెరా స్విచాన్ చేశారు. స్క్రిప్ట్‌ను దర్శకుడు బీవీయస్ రవి దర్శకునికి అందించారు. ఈ సందర్బంగా కృష్ణచైతన్య మాట్లాడుతూ – ‘‘ఇది నా మొదటి చిత్రం. అందరూ అనుభవం ఉన్న టెక్నీషియన్లతో ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది. సంగీత దర్శకులు మణిశర్మ గారు స్వరాలందించడం హ్యాపీ. మొత్తం ఐదు ఫెడ్యూల్స్లో సినిమా పూర్తి చేస్తాం ఈనెల 16న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. ఈ సినిమా మంచి మెసేజ్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తుందని చిత్ర నిర్మాత ముత్తయ్య అన్నారు.‘‘నేను చేస్తున్న మొదటి సినిమాకు మంచి స్క్రిప్ట్ కుదిరింది. మంచి సైకలాజికల్ థ్రిల్లర్‌ను ప్రేక్షకులకు ఇవ్వబోతున్నాం’’ అన్నారు అఖిల్‌రెడ్డి. -
బాత్రూమ్లో కిందపడి విద్యార్థిని మృతి
గచ్చిబౌలి :బాత్రూమ్లో కిందపడటంతో ఓ విద్యార్థిని మృతి చెందిన సంఘటన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సోమవారం చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాస్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆదివాసి స్టడీస్‌లో పీహెచ్డీ చేస్తున్న దీపిక మహాపాత్ర (29) ఎల్‌హెచ్1 హాస్టల్లోని రూమ్ నెంబర్ 204 లో ఉంటోంది. సోమవారం ఉదయం ఉదయం బాత్రూంలోకి వెళ్లిన దీపిక కింద పడిపోయింది. శబ్ధం రావడంతో స్నేహితులు అక్కడికి వెళ్లి పిలిచినా స్పందించలేదు. దీంతో బాత్రూం తలుపులు తోసి చూడగా ఆమె కింద పడి ఉన్నట్లు గుర్తించారు. యూనివర్సిటీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లడంతో సిబ్బంది ఆమెను నల్లగండ్లలోని సిటిజన్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్దారించారు. గచ్చిబౌలి పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు విచారణ చేపట్టిన గచ్చిబౌలి పోలీసులు దీపిక కొంతకాలంగా ఎపిలెప్సీ (మూర్చ) వ్యాధితో బాధపడుతున్నట్లుగా డాక్టర్లు ధృవీకరించిన కేస్ షీట్లు లభించినట్లు తెలిపారు. దీనిని బట్టి ఆమె నరాల సంబంధ వ్యాధి కారణంగానే వెనక వైపు పడిపోవడంతో మృతి చెంది ఉండవచ్చునని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
హెచ్‌సీయూ విద్యార్థిని అనుమానాస్పద మృతి
సాక్షి, హైదరాబాద్ : సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. హిందీ సబ్జెక్ట్‌లో పీహెచ్డీ చేస్తున్న దీపికా మహాపాత్రో (29) బాత్రూమ్లో జారిపడి చనిపోయినట్లు తెలుస్తోంది. కాగా గత కొంతకాలంగా ఆమె న్యూరో సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. సోమవారం ఉదయం బాత్రూమ్కు వెళ్లిన దీపికా ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన సహచర విద్యార్థినులు వెళ్లిచూడగా అప్పటికే ఆమె అపస్మారక స్థితిలో పడిఉండటాన్ని గమనించారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే దీపిక మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
‘పెద్దింటి అల్లుడవుతున్నాడని ఈర్ష్య పడ్డానేమో.. అందుకే’
జీవితమైనా మాటైనా సరైన రూట్లో వెళ్లాలి. జీవితం తూలినా మాట తూలినా భవిష్యత్తు చతికిల పడుతుంది. చట్టం చుట్టుముడుతుంది. ‘దీపికా ఎందుకంతగా భయపడతావు. ఈ రోజే మీ వాళ్లతో మాట్లాడతాను. ఒప్పుకోక ఏం చేస్తారు? కాదంటే ఎటైనా వెళ్లి పెళ్లి చేసుకుందాం. సరేనా’ కళ్లనీళ్లతో ఉన్న దీపికకు ధైర్యం చెబుతూ అన్నాడు కుమార్. ‘ఒప్పుకుంటారని ఎలా అంటావు. ఆల్రెడీ నీ మీద కేసు పెట్టి లోపలేయించారు. మీ వాళ్లు ఏదో చేసి బయటకు తెచ్చారు. నువ్వు మారలేదు. నేను మారలేదు. మన ప్రేమ ఇంకా పెరిగింది. నువ్వు లేకుండా నేను బతకలేను కుమార్’ అంది దీపిక ఏడుస్తూ. ‘భయపడకు. మన ప్రేమలో నిజాయితీ ఉంది. తప్పక మనం ఒకటవుతాం’ అన్నాడు కుమార్. దీపిక హుజురాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియెట్ సెకండ్ ఇయర్ చదువుతోంది. కుమార్ ఓ సెల్‌ఫోన్ షాప్‌లో జాబ్ చేస్తున్నాడు. ఇద్దరికీ ఏడాది క్రితం పరిచయం అయ్యింది. పరిచయం కాస్తా స్నేహంగా, ప్రేమగా మారింది. తమ విషయం ఇంట్లో వాళ్లకు తెలిస్తే ఏమంటారోనని దీపిక భయపడుతోంది. అలా ఏమీ జరగదని దీపికకు ధైర్యం చెబుతూ వస్తున్నాడు కుమార్. దీపిక –కుమార్‌లు మళ్లీ కలిసి తిరుగుతున్నట్టు దీపిక తండ్రికి తెలిసింది. ‘నిన్ను చంపేస్తాను. చదువుకోమని పంపితే పుస్తకాలు వదిలిపెట్టి బేవార్స్ పనులు చేస్తున్నావా? సెల్ఫోన్లు రిపేర్ చేసుకునేవాడితో ప్రేమేంటే?’ కూతురుపై అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. దీపిక తాత, మేనమామ సర్దిచెప్పారు. దీపిక పెదనాన్నలు కూడా ‘ఏందిరా.. బిడ్డ మీద అలాగేనా నోరేసుకునేది. దానికేం తెలుసు పెద్ద పెద్ద విషయాలు.మనమే చక్కదిద్దాల. పిల్లోడ్ని పిలిపించి అన్నీ సరే అనుకుంటే లగ్గం చేద్దాం’ అన్నారు. అన్నల మాటలకు దీపిక తండ్రి వాళ్లవైపు చూశాడు. అతనికి ఏదో అర్థమైంది.‘సరే’ అని నెమ్మదించాడు.‘అన్నీ ఆలోచించి చేద్దాం’ అంటూ చుట్ట వెలిగించుకుంటూ వాకిట్లోకి వెళ్లాడు దీపిక తాత. ‘చూడబ్బీ.. పిలవగానే వచ్చినవ్. మాకు మీ ప్రేమ విషయం అర్థమైంది. మంచి పిల్లోడివి కాబట్టే మా చిట్టితల్లి నిన్ను ఇష్టపడింది. గతంలో జరిగినవి మనసుల పెట్టుకోకు. మీ పెళ్లి మేం జరిపిస్తం.భయాలేవీపెట్టుకోవద్దు సరేనా!’ అన్నాడు దీపిక తాత. ‘మైనర్ అయిన అమ్మాయిని మాయమాటలు చెప్పి ప్రేమ పేరుతో వంచిస్తున్నాడ’ని ఆరు నెలల క్రితం కుమార్ మీద కేసు పెట్టింది దీపిక తాతే.‘కేసు విషయం పట్టించుకోవద్దు. ఎలా కాదనుకున్నా మా ఇంటి అల్లుడివి. మంచి ముహూర్తం పెట్టి మేమే నిన్ను పిలుస్తాం’ అన్నారు దీపిక పెదనాన్నలు. కుమార్ సంతోషంగా తలవూపి ఇంటి దారి పట్టాడు. అక్టోబర్ 9, 2018.కరీంనగర్ జిల్లా శంకరపట్నం.తెల్లవారుజాము.అప్పుడప్పుడే వెలుతురు విచ్చుకుంటోంది.ఎంగిలిపూల బతుకమ్మ కోసం ఊరి జనం అడవి పూల సేకరణలో పోటీపడుతున్నారు. అరుణ అనే మహి తమ పత్తి చేనులోకి పత్తిపువ్వులను తెంపుకు రావడానికి వెళ్లింది. నాలుగైదు పువ్వులను తెంపిందో లేదో ఎదురుగా కనిపించిన దృశ్యానికి షాకై ఆ పువ్వులను అక్కడే పడేసి ఊరివైపుగా పరిగెత్తింది.అరుణ చెప్పిన విషయం వింటూనే ఊరి జనం పరుగున పత్తిచేనువైపుగా వచ్చారు. అక్కడ ఒక యువకుడి శవం. చిన్న ఊరు అది. మనిషిని పోల్చడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఆ శవం కుమార్‌ది. అంతే. ఆ వార్త వినగానే అతని తల్లీదండ్రి కంటిమింటికీ ఏడుస్తూ వచ్చారు. చుట్టూ మూగిన జనంలో ఎన్నో సందేహాలు.ఏం జరిగింది..? ఎలా జరిగింది..? కుమార్‌ని ఎవరైన హత్య చేశారా? లేక అతనే ఆత్మహత్య చేసుకున్నాడా? అందరిలోనూ అన్నీ సమాధానం లేని ప్రశ్నలే. పోలీసులు వచ్చారు. వారిని చూడటంతోటే కుమార్ బంధువులు ఊరి జనం తిరగబడ్డారు.‘బంగారంలాంటి పిల్లాణ్ణి ప్రేమించాడని చంపేస్తే తీరిగ్గా ఇప్పుడొస్తున్నారు. తప్పుడు కేసు పెట్టి లోపల వేయించినప్పుడే వాళ్లను మీరు కంట్రోల్ చేయాల్సింది’ అని పోలీస్ జీపు మీద రాళ్ల వర్షం కురిపించారు.దాంతో పోలీసులు అనుమానాస్పద మృతి నుంచి హత్య కేసుగా ఎఫ్.ఐ.ఆర్ రాశారు. అయినా జనం శాంతించ లేదు. ఉన్నతాధికారులు వచ్చి ఊరిజనాన్ని సమాధానపరిచి, హంతుకులను త్వరలోనే పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో సర్దుకున్నారు. కుమార్ పడున్న చోట అతని సెల్‌ఫోన్ ఒకటే ఆధారంగా దొరికింది. అందులోని కాల్‌డేటా పరిశీలించారు. ఊరిజనంతో మాట్లాడి మరిన్ని వివరాలు రాసుకొని బయల్దేరారు. కుమార్ చనిపోయి పది రోజులు అవుతుంది. అతనిది హత్యో, ఆత్మహత్యో తేలడం లేదు. కుమార్ ఫోన్లో కాల్‌డేటా ఆధారంగా 128 మందిని దర్యాప్తు చేశారు పోలీసులు.‘సార్.. ఇది మా వాళ్ల పనే. చింతగుట్ట గుట్టల్లోకి వెళుతున్నానని నాకు లాస్ట్ ఫోన్ కాల్లో కుమార్ చెప్పాడు’ ఏడుస్తూ చెప్పింది దీపిక. పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. ‘ఇది ప్రేమకు సంబంధించిన హత్య అయి ఉంటుందా?’ అని దీపిక తండ్రి, మేనమామ, పెదనాన్నల మీద నిఘా పెట్టారు. ఇంటికెళ్లి విచారణ చేశారు. వాళ్లు పొడిపొడిగా సమాధానం చెప్పారు కానీ అందులో నుంచి ఏమీ దొరకడం లేదు. తగిన ఆధారం లేకుండా అరెస్టు చేయడం ప్రమాదం. ఇప్పుడు ఆధారం ఎలా?మరో నాలుగు రోజులు గడిచాయి. కేసు మిస్టరీ ఎలా ఛేదించాలో పోలీసులకు అర్థం కాలేదు. కుమార్ లాస్ట్ఫోన్ కాల్‌ను బట్టి అతడు చింతగుట్ట గుట్టల్లోకి వెళ్లాడు.కాని ఆ గుట్టలకు వెళ్లి వెతికితే ఏమీ కనిపించలేదు... తాగేసిన సీసాలు తప్ప. ఆ ప్రాంతంలో కుర్రాళ్లు తాగాలంటే సాధారణంగా ఆ గుట్టల్లోకి వెళుతుంటారు.‘కుమార్‌కు తాగుడు అలవాటుందా?’ స్నేహితులను అడిగారు.‘అప్పుడప్పుడు తాగుతాడు సార్’ అని చెప్పారు వాళ్లు.దీనిని క్లూగా తీసుకుని ఆ చుట్టుపక్కల పల్లెల మద్యం దుకాణాల సీసీ పుటేజీ పరిశీలించారు. అక్టోబర్ 8న అర్థరాత్రి ఓ ఆటో ఆనవాలు కనిపించింది. ఆ ఆటో నంబర్ ట్రేస్ చేసి డ్రైవర్‌ను పట్టుకున్నారు.‘సార్.. ఆ రోజు కుమార్‌తో పాటు వెంకటేశం అనే అతని స్నేహితుడు ఆటో ఎక్కారు. ఇద్దరూ అప్పటికే ఫుల్లుగా తాగున్నారు. అయినా సరే గుట్ట వైపు వెళ్లి తాగాలని అనుకున్నారు. వాళ్లు చెప్పిన చోట ఆటో ఆపేశాను. ఇద్దరూ బాటిళ్లు తీసుకొని దిగారు. నన్ను వెళ్లిపొమ్మనడంతో వెళ్లిపోయాను సార్’ అన్నాడు.‘కుమార్ పోన్ స్విbŒ∙ఆఫ్ అయ్యింది 12:10 గంటల ప్రాంతం. అంటే, అప్పటి వరకు వారిద్దరూ కలిసే ఉన్నారా...’ పోలీసులకి అనుమానం వచ్చింది. ఆటో ఆనవాలు కనిపించిన కేశవపట్నం మద్యం దుకాణం వద్ద సీసీ పుటేజీ పరిశీలించారు.12:30 గంటల ప్రాంతంలో వెంకటేశ్ ఒక్కడే మళ్లీ వచ్చి బీరు బాటిల్ తీసుకున్నట్లు రికార్డు అయ్యింది. ‘ఇక్కడే ఏదో తేడా కొడుతోంది. ఇద్దరుగా వెళ్లి ఒక్కడే ఎందుకు వచ్చాడు?’పోలీసులు వెంటనే వెంకటేశ్‌ను పట్టుకొచ్చారు. ‘సార్... నాకే పాపం తెలియదు. కుమార్‌ను వాళ్ల ఇంటిదగ్గరే దింపి వెళ్లిపోయాను’ అన్నాడు వెంకటేశ్. పోలీసులు సరైన ‘విచారణ’ మొదలెట్టే సరికి అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.‘సార్... దీపిక ఇంట్లో వాళ్లు పెళ్లికి ఒప్పుకున్నారన్న సంతోషంతో కుమార్ పార్టీకి పిలిచాడు. నేను వెళ్లాను’‘తర్వాత?’‘ఇద్దరం వైన్‌షాప్ దగ్గరే తాగాం. ఇంకా తాగుదాం అన్నాడు కుమార్.సరే అని రెండు బీరు బాటిళ్లు తీసుకుని గుట్ట వైపు వెళ్లడానికి ఆటో ఎక్కాం. కాని మధ్యలోనే పత్తి చేను దగ్గర దిగేశాం’‘ఊ...’‘నా ఆలోచన ఏంటంటే తొందరగా తాగేసి కుమార్‌ను ఇంటి దగ్గర దించి నేను కూడా ఇంటికి వెళ్లిపోవాలని. కాని మత్తు నా నెత్తికి ఎక్కింది. ఏం మాట్లాడుతున్నానో తెలియదు. దీపికతో ప్రేమ వరకేనా... పెళ్లికి ముందే ఇంకేమైనా చేశావా అనే అర్థంలో మోటుగా ఏదో అడిగినట్టున్నాను’...‘ఊ...’‘దానికి కుమార్‌కు కోపం వచ్చింది. పవిత్ర ప్రేమను అవమానిస్తావా అని నన్ను కొట్టాడు. నాక్కూడా చాలా కోపం వచ్చింది. కాని అసలు కారణం వేరేమో. నాలాంటి చిన్న చితకా మనిషైన కుమార్ దీపిక లాంటి మంచి అమ్మాయిని చేసుకుని పెద్దింటి అల్లుడు అవుతున్నాడని ఈర్ష్య పడినట్టున్నాను. అందుకే దారుణంగా అతడిపై దాడి చేశాను. దేంతో కొట్టానో కూడా తెలియదు. అతను చచ్చిపోయాడు. భయం వేసి శవాన్ని అక్కడే వదిలేశాను. ధైర్యం కోసం మళ్లీ వచ్చి ఒక బీరు కొనుక్కున్నాను. అలా బీరు కొనుక్కోవడం వల్లే మీకు దొరికిపోయాను’ అన్నాతడు.ఈ కేసును పోలీసులు తొమ్మిది రోజుల్లో ఛేదించారు.కాని ఒకడి క్షణికావేశం ఒక యువకుడి నూరేళ్ల జీవితాన్ని బలిగొంది. నేరస్తుడి జీవితాన్ని నాశనం చేసింది. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది. – గడ్డం రాజిరెడ్డి, సాక్షి ప్రతినిధి, కరీంనగర్ -
వాళ్లు నన్ను కచ్చితంగా చంపేస్తారు!
నువ్వొక జాతి వ్యతిరేక శక్తివి. నీ ఆరేళ్ల కూతురికి, నీకు అదే గతి పడుతుంది. ఛీ.. అసలు వీళ్లతో మనకు మాటలేంటి? నీ కుటుంబం మొత్తాన్ని అంతమొందిస్తాం.. – ఇవి అత్యాచార ఘటనలో బాధితురాలి తరపున వాదిస్తున్నందుకు ఓ మహిళా న్యాయవాదికి వస్తున్న బెదిరింపులు, ఈసడింపులు. నల్లకోటు వేసుకున్న ప్రతీ ఒక్కరూ న్యాయవాది అనిపించుకోరు.. ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే బాధితులకు న్యాయం చేకూర్చేందుకు ప్రాణాలను సైతం పణంగా పెట్టేవారే నిజమైన న్యాయవాదులు. ఇందుకు ఉదాహరణ దీపికా రజావత్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా అత్యాచార ఘటనలో ఎనిమిదేళ్ల చిన్నారి తరపున వాదిస్తున్నారు ఆమె. అడుగడుగునా అవరోధాలే ఈ కేసులో బాధితురాలి తరపున వాదిస్తానని చెప్పగానే దీపికకు బెదిరింపుల పర్వం మొదలైంది. సంప్రదాయ కశ్మీరీ పండిట్ కుటుంబంలో జన్మించిన దీపికా.. ఓ గిరిజన తెగకు చెందిన ముస్లిం బాలిక తరపున వాదించడమేమిటని కొంతమంది అసహ్యించుకుంటే... మరికొంత మంది ఇంకో అడుగు ముందుకేసి దీపికను, ఆమె కూతురిని అత్యాచారం చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఇప్పటికైనా ఈ కేసు నుంచి తప్పుకోకపోతే కుటుంబం మొత్తాన్ని అంతమొందిస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే న్యాయవాద వృత్తిని ప్రాణంగా ప్రేమించే దీపికా ఈ బెదిరింపులకు ఏమాత్రం లొంగడం లేదు. చంపేస్తారు.. నాకు తెలుసు ‘‘ప్రతీరోజూ ఇంటికి చేరుకోగానే మెయిన్ గేటు నుంచి ఇంట్లో వరకు గల పరిసరాలన్నింటినీ ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటాను. నా కూతురు, భర్త గురించి ఏ క్షణాన.. ఏ చేదు వార్త వినాల్సి వస్తుందోనని ఆందోళనకు గురవుతాను. కథువా ఘటన జరిగి 10 నెలలు గడిచిపోయింది. విచారణ కొనసాగుతోంది. నా అభ్యర్థనను మన్నించి రాష్ట్ర ప్రభుత్వం నా ఇంటి చుట్టూ పోలీసు కాపలా ఏర్పాటు చేసింది. అయితే ఒకటి మాత్రం నిజం.. వాళ్లు ఏదో ఒకరోజు కచ్చితంగా నన్ను చంపేస్తారు. నాకు ఈ విషయం స్పష్టంగా తెలుసు. సరైన సమయం కోసం వాళ్లు ఎదురుచూస్తున్నారు. అయినా పర్లేదు. ఈ కేసును విడిచిపెట్టే ప్రసక్తే లేదు’ అంటూ ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు దీపికా. ‘‘అత్యంత పాశవికంగా సామూహిక అత్యాచారానికి గురైన ఆ ఎనిమిదేళ్ల చిన్నారి చనిపోయేముందు ఎంత నరకయాతన అనుభవించిందో ఓ మహిళగా, తల్లిగా నేను అర్థం చేసుకోగలను. మానవ హక్కుల కార్యకర్తగా, ఓ న్యాయవాదిగా బాధితుల తరపున పోరాడాల్సిన బాధ్యత నాపై ఉంది. అందుకే ఈ కేసు వాదించేందుకు నాకు నేనుగా ముందుకు వచ్చాను. ఈ కారణంగా నా తల్లిదండ్రులు కూడా చాలా వేధింపులు ఎదుర్కొన్నారు. నన్నో జాతి వ్యతిరేక శక్తిగా నాపై ముద్ర వేసినపుడు వారి బాధ వర్ణనాతీతం. నా తోటి న్యాయవాదులు కూడా నా పట్ల ఇదే భావన కలిగి ఉండటం నన్ను మరింతగా బాధిస్తోంది. కానీ ఇప్పుడిప్పుడే వారిలో కాస్త మార్పు కన్పిస్తోంది. కానీ అది నిజమైనదో కాదో పోల్చుకోలేకపోతున్నాను’’ అంటూ ‘వోగ్ క్రూసేడర్ ఆఫ్ ది ఇయర్’–2018’గా ఎంపికైన సందర్భంగా దీపికా రజావత్ తన అనుభవాలను పంచుకున్నారు. కథువా ఘటన కశ్మీర్‌లోని కథువా సమీపంలో గల రసనా గ్రామానికి చెందిన ముక్కుపచ్చలారని ఎనిమిదేళ్ల బాలికకు డ్రగ్స్ ఇచ్చి, ఆమెను అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి ఆమెను అంతమొందించారు కొందరు. బాకర్‌వాలాగా పిలిచే ఓ ముస్లిం తెగకు చెందిన ఆ చిన్నారి శవం ఈ ఏడాది జనవరి 17వ తేదీన పోలీసులకు దొరికింది. అంతకు వారం రోజుల ముందే ఆ పాప అదృశ్యం అయింది. ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని, తమ ఫిర్యాదు స్వీకరించి ఉంటే కూతురిని పోగొట్టుకునేవాళ్లం కాదని చిన్నారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా అలజడి సృష్టించడంతో చలించిన కశ్మీర్ ప్రభుత్వం విచారణ వేగవంతం చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ క్రమంలో జనవరి 21వ తేదీన దీపు భయ్యాగా పిలిచే 15 ఏళ్ల బాలుడిని పోలీసులు పట్టుకొచ్చి నిందితుడిగా చూపారు. హీరానగర్ ప్రాంతానికి చెందిన ఆ బాలుడు అలాంటి వాడు కాదని స్థానికులు చెప్పడం, పోలీసుల చిత్ర హింసలకు ముందుగా నేరాన్ని అంగీకరించినా ఆ తర్వాత ప్రజల సమక్షంలో తానే పాపమూ చేయలేదని మొరపెట్టుకోవడం పలు అనుమానాలకు దారితీసింది. దీంతో ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో.. అందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు.. పంజాబ్‌లోని పఠాన్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు ఈ కేసును బదిలీ చేసింది. – సుష్మారెడ్డి యాళ్ల, సాక్షి వెబ్‌డెస్క్ -
కష్టాలకు కితకితలు
ఒక ఉద్యోగానికి వెళ్లి వస్తేనే ప్రాణం సొమ్మసిల్లుతుంది. కుటుంబం ఆర్థికంగా సొమ్మసిల్లకుండా ఉండేందుకు తన బతుకు బోగీని రైలు బండికి తగిలించి దీపిక అనేక ఉద్యోగాలను చేస్తున్నారు! స్టాండప్ కమెడియన్‌గా కష్టాలకు కితకితలు పెడుతున్నారు. ముంబైలో లోకల్ ట్రైన్లు నిరంతరం సందడిగా ఉంటాయి. సందడి అంటే ‘రద్దీ’గా అని కాదు. ఆ ట్రైన్లలో ప్రతిరోజూ ఉద్యోగాలకు వెళ్లేవాళ్లు పనిలోపనిగా ప్రయాణంలో పెళ్లి సంబంధాలు మాట్లాడుకోవడం, కూరలు కట్ చేయడం, ప్లేయింగ్ కార్డ్స్ ఆడటం.. అదో చిన్న ప్రపంచం. వీటితో పాటు వస్తు విక్రయాలూ జోరుగానే సాగుతాయి. కష్టపడి పనిచేసుకునేవారికైతే ఈ ట్రైన్లలో లోటే ఉండదు. మరికొందరు మంచి మాట తీరుతో జోరుగా అమ్మకాలు సాగిస్తుంటారు. అలాంటి వారిలో 45 ఏళ్ల దీపికా మాత్రే ఒకరు. ప్రయాణికులతో ఆమె ఎంతో ఆప్యాయంగా, సరదాగా మాట్లాడుతూ ఇమిటేషన్ జ్యూయలరీని అమ్ముతుంటారు. అయితే దీపిక దైనందిన జీవితంలో ఇదొక్కటే వ్యాపకం కాదు. దీపిక గురించి తెలిసి, ఆమెతో ఫోనులో సంభాషించినప్పుడు ఎంతో ఉత్సాహంగా మాట్లాడారు. ఉదయం ట్రైన్లో గంట సేపు నాకు ముగ్గురు ఆడ పిల్లలు. నా భర్త అనారోగ్యం కారణంగా ఇంటికే పరిమితమయ్యారు. నేను ఉదయం నాలుగు గంటలకు నిద్ర లేచి, ఐదున్నరలోగా ఇంటి పని పూర్తి చేసుకుని, రెండు బ్యాగుల నిండా ఇమిటేషన్ జ్యూయలరీ సర్దుకుని, లోకల్ ట్రైన్ ఎక్కేస్తాను. ముంబైలో కొన్ని లక్షల మంది ప్రతిరోజూ తెల్లవారుజామునే ప్రయాణిస్తారు. వారికి విడిగా షాపింగ్ చేసుకునే తీరిక ఉండదు. అటువంటి వారికి నా దగ్గర కొనడం వల్ల చాలా సమయం సేవ్ అవుతుంది. అందరిలాగే ఎక్కువ ధర చెప్పి, వారు అడిగిన ధరలకు ఇస్తుంటాను. అలా ఇస్తే, వారు కావలసిన ధరకు కొనుక్కున్న ఆనందం పొందుతారు. అయితే ప్రతిరోజూ ఈ బేరాలు చేస్తూ సమయం వృథా చేసుకోవడం ఎందుకు అనుకున్నాను. ఒక ఆలోచన తట్టింది. నగల మీద ధరల స్టికర్ వేసేశాను. బేరం అడగడం మానేశారు. దాని మీద ఉన్న ధర చూసి డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఇలా వాటిని అమ్ముకుంటూ, ఆరున్నరకల్లా మలాడ్ స్టాపులో రైలు దిగేస్తాను. మధ్యాహ్నం వరకు వంట పని గిల్టు నగలు అమ్మితే వచ్చిన డబ్బుతో కుటుంబం నడవదు కదా. అందుకే ఐదుగురి ఇళ్లలో వంట పని చేస్తున్నాను. మధ్యాహ్నం దాకా ఆ పనితోనే సరిపోతుంది. అక్కడ పనులు ముగించుకుని, మధ్యాహ్నం రెండు గంటలకు ఇంటికి వస్తాను. భోజనం చేసి, కాసేపు విశ్రాంతి తీసుకుని సాయంత్రం నాలుగు గంటలకు స్టాండప్ కామెడీ షోలు చేస్తున్నాను. రాత్రి ఎనిమిది గంటలకు ఇల్లు చేరుకుంటాను. ఇది నా దినచర్య. నగలు అమ్ముతూనే కామెడీ కుటుంబ పోషణం కోసం నేను ఇన్ని పనులు చేస్తున్నానని, ఎన్నడూ బాధపడలేదు. నా కుటుంబానికి నేనే ఆధారం అనే ఆలోచనే నాకు ఆనందాన్ని కలిగిస్తుంది. మేం నివసించే ‘నాలా సోపారా’ నుంచి ‘మలాడ్’ వరకు అనునిత్యం ట్రైన్లలో ప్రయాణిస్తుంటాను. జ్యూయలరీ అమ్మకాలతో పాటు అప్పుడప్పుడు స్టాండప్ కామెడీ షోలు చేస్తూ అందరికీ ఆనందం కలిగిస్తుంటాను. గ్రామీణ వాతావరణంలో పెరిగిన నేను నా జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నాను. అన్నిటినీ చిరునవ్వుతో ఎదుర్కొన్నాను. ఆ అనుభవాలు ఈ కామెడీ షోలు ఇవ్వడంలో పనికొస్తున్నాయి. జీవితమే జోక్స్ చెప్పిస్తోంది వయసు మీద పడుతోంది. దానికి తోడు డయాబెటిస్ కూడా వచ్చింది. ఇంటి పనులతో పాటు కామెడీ షోలు చేయలేకపోతున్నాను. అయినా ధైర్యం విడిచిపెట్టకుండా, షోలు చేస్తూనే ఉన్నాను. చాలామంది కమెడియన్లు భార్యాభర్తల గురించి జోక్‌గా చెబుతుంటారు. ఇప్పుడు అలాంటివి నేను చెబుతున్నాను. నా జీవితంలో తారసపడిన సంఘటనలను హాస్యరూపంలో ప్రదర్శనలు ఇస్తున్నాను. నేను నటిస్తున్నంతసేపు ప్రేక్షకులను చూసి నవ్వుతూ ఉంటాను. నా పంచ్‌లకు ప్రతిస్పందన వచ్చేవరకు నిరీక్షిస్తాను. నా అదృష్టం ఏమిటంటే, ఈ షోలు మొదలుపెట్టిన నాటి నుంచి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతూనే ఉన్నాను. సంగీతా మేడమ్ వల్లే..! ఇళ్లలో వంట పనిచేయడం నుంచి, స్టాండప్ కమెడియన్‌గా ఎలా మారానా అని చాలామందికి సందేహం. వాస్తవానికి నేను వంట పనులు మానలేదు. అవి చేస్తూనే, లోకల్ ట్రైన్లలో నగలు అమ్ముతూనే ఉన్నాను. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటంటే, నేను వంట చేస్తున్న ఇంటివారు నాతో స్నేహపూర్వకంగా ఉంటున్నారు. నేను వంట చేస్తున్న సంగీత మేడమ్, నా కోసం ఒక టాలెంట్ షో ఏర్పాటు చేశారు. ఈ మాత్రం సహాయం కూడా చేయని రోజులు ఇవి. కాని ఆవిడ నా టాలెంట్‌ని చూపడానికి ఒక వేదిక ఏర్పాటు చేశారు. నేను నా జోకులను ప్రదర్శించడం ప్రారంభించాను. అలా నెమ్మదిగా చిన్న చిన్న ప్రదేశాలలో, రైళ్లలో ఈ ప్రదర్శనలు ఇస్తూ, ఏడాది క్రితం స్టేజీ మీద కామెడీ షో చేశాను ఈ కార్యక్రమానికి వచ్చిన ‘రచేల్ లోపెజ్’ అనే ఒక జర్నలిస్టు, నాకు మంచి భవిష్యత్తు ఉందని నన్ను ప్రశంసించారు. అప్పటికే సుపరిచితురాలైన అదితి మిట్టల్ అనే యాంకర్‌ను రేచల్ పరిచయం చేశారు నాకు. వీరిద్దరినీ సంగీత మేడమ్ ఇంట్లోనే కలిశాను. అప్పుడే రచేల్ నన్ను ‘నువ్వు ప్రొఫెషనల్‌గా మారతావా’ అని అడిగారు. నేను ఎన్నడూ పెద్ద స్టేజీ మీద ప్రదర్శన ఇవ్వలేదు. అందువల్ల అదితి నా మెంటర్‌గా ఉండి, నా ప్రదర్శన ఏర్పాటుచేశారు, ‘బ్యాడ్ గర్ల్’ పేరున మేం ఒక ప్రదర్శన ఇచ్చాం. కొన్ని ఇళ్లలో వేరుగా చూస్తారు సంగీత మేడమ్‌లా చేయూత ఇచ్చేవారు ఒకరో ఇద్దరో ఉంటారు. ఇప్పటికీ నేను వంట పనులు చేస్తూనే ఉన్నాను. కొందరు మేడమ్స్ నన్ను ఇంకా పనిమనిషిగానే చూస్తున్నారు. వారు నన్ను కుర్చీలో కూర్చోనివ్వరు. నేల మీద కూర్చోవాలి. ప్రత్యేకమైన గ్లాసులలో మంచినీళ్లు, టీ ఇస్తారు. అవేవీ నేను పట్టించుకోను. నా పని మీద దృష్టి పెట్టి, పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లిపోతాను. మేం పనిచేస్తున్న బిల్డింగ్‌లో నా వంటివారిని కొంచెం దూరంగా చూస్తారు. మాకు ప్రత్యేకమైన లిఫ్ట్ ఉంటుంది. మాకు ఇచ్చే వస్తువులన్నీ విడిగానే ఉంచుతారు. పనివారంతా వేరే లిఫ్ట్‌లో వెళ్లాలని రూల్ కూడా ఉంది. మా పాత్రలను కూడా దూరంగా ఉంచాలి. చిత్రం ఏమిటంటే, మేం చేసిన రోటీలు చక్కగా తింటారు. ఇదంతా షోలో చెబుతున్నప్పుడు ప్రేక్షకులంతా చప్పట్లు కొడతారు. నేను చెప్పేవి జోకులే కాని అన్నీ వాస్తవాలే. అయితే ఇవి ఏవీ ఇతరులను నొప్పించేవిగా ఉండవు. వారి పనుల గురించి వారు ముచ్చటించుకున్నట్లుగానే ఉంటాయి’’ అంటారు దీపిక.ప్రస్తుతం దీపిక షోలన్నీ ఉచితంగానే చేస్తున్నారు. తనకు ఎంతోకొంత ఆర్థిక సహాయం అందితే తన జీవితం బాగుంటుంది అంటున్నారు. దీపికతో మాట్లాడినంతసేపు ఆమె మాటల్లో బాధ కాని, నిట్టూర్పు కాని వినిపించలేదు. తన పని గురించి ఎంతో గర్వంగా భావిస్తున్నట్టుగానే అనిపించింది. ఆత్మవిశ్వాసం తొణికిసలాడింది. ఎలా అమ్మాలో తెలిసేది కాదు నా భర్త ఆస్తమాతో బాధపడుతున్నారు. ఇప్పుడు నాకు హై బ్లడ్ సుగర్ వచ్చింది. అందువల్ల మేం ఇద్దరమూ పని చేసే స్థితిలో లేము. మా పెద్దమ్మాయి ‘మిడ్ డే’ వారు చేసిన ఇంటర్వ్యూలో ఉద్యోగానికి అర్హత సంపాదించింది. నాకు ఓపిక ఉన్నంతవరకు వేదికల మీద అందరినీ నవ్విస్తూనే ఉంటాను. మొదట్లో నాకు గిల్టు నగలు అమ్మకం చేత కాదు, అవసరమే నాకు అన్నీ నేర్పింది. ఇలాగే మిగతావీ నేర్చుకుంటాను. – దీపికా మాత్రే – సంభాషణ: వైజయంతి పురాణపండ -
ఆమె వేసే ఆసనాలు చూస్తే.. షాక్ అవ్వాల్సిందే!
యోగా అంటే మనకు గుర్తొచ్చేది రాందేవ్ బాబా. కానీ, బాలీవుడ్ సెలబ్రెటీలకు యెగా నేర్పించే గురువు దీపికా మెహతాను చూస్తే.. మతి పోతుంది. ఇక యోగా అంటే దీపికా మెహతానే గుర్తొచ్చేలా ఉంది. అంతలా ఆసనాలు వేస్తూ.. సోషల్ మీడియాలో వేల మంది ఫాలోవర్స్‌ను సంపాదించింది. కత్రినా కైఫ్, ప్రియాంక చోప్రా, ఐశ్వర్య బచ్చన్‌లాంటి ప్రముఖులెందరికో యోగాను నేర్పిస్తున్నారు దీపికా మెహతా. ఈమె వేసే ఆసనాలు వైరల్ అవుతున్నాయి. ఇక వీటిని చూస్తే మీకు కూడా వెంటనే ఫిట్‌నెస్‌పై శ్రద్ద వచ్చి.. యోగాను నేర్చుకుంటారు. ఈమెను సెలబ్రెటీలు కూడా ఫాలో అవుతుంటారు. అలియా భట్, మలైకా అరోరా, కరీనా కపూర్ లాంటి సెలబ్రెటీలు ఆమెను అనుసరిస్తుంటారు. -
నీ పక్కన చోటుందా?
‘‘అది ముంబై మహానగరంలోని విరార్ స్టేషన్. అక్కడి నుంచి పరుగున వచ్చి చర్చ్‌గేట్ లోకల్ ట్రెయిన్ సెకండ్ క్లాస్ కంపార్ట్మెంట్లో లేడీస్ డబ్బా ఎక్కాను. కిటకిటలాడిపోతున్న ఆ డబ్బాలో ఎలాగో చోటు సంపాదించుకుని కూర్చున్నాను. కాస్త అలసట తీర్చుకున్నాక నా దృష్టి ఎదురుగా నిలుచుని ఉన్న ఒక వృద్ధురాలి మీద పడింది. బక్కపల్చగా, ముతక దుస్తులు ధరించి, చేతిలో ఒక పాత బట్టల మూట పట్టుకుని ఉన్న ఆమె ‘‘అమ్మా! మీరు కొద్దిగా సర్దుకుంటే నేను కూడా కూచుంటాను’’ అని అడిగింది. ఆ పర్సనాలిటీకి కొద్దిస్థలం సరిపోతుంది. అయితే అక్కడ అంగుⶠం కూడా ఖాళీలేనట్టుగా అందరూ సీట్లకు అతుక్కుని కూర్చున్నారు. అది చూసి నేను నా సీటులోంచి లేచి కాస్తంత సర్దుకుంటే ఆ పెద్దావిడ కూడా కూచుంటుంది కదా అన్నాను. కొందరు కొద్దిగా మెత్తబడ్డారు కానీ, అసలు విషయం ఏమిటంటే, ఖాళీ లేకపోవడం వల్ల కాదు, ఆమె అవతారం చూస్తుంటే వారికి తమ పక్కన ఆమెకి చోటివ్వబుద్ది కావడం లేదని, అందుకే సర్దుకుని కూర్చోడానికి ఇష్టపడటం లేదని అర్థమైంది. దాంతో నేనే కొంచెం జరిగి, నా పక్కన కూచోబెట్టుకున్నాను. కానీ ఇందాక జరిగిన సంఘటన ఆమెను ఎంతగా బాధపెట్టి ఉంటుందో అనిపించి దిగులేసింది. ఊరుకోలేక అదే మాట ఆమెతో అన్నాను– మీరు బాధపడకండమ్మా వాళ్ల ప్రవర్తనకు అని. అందుకామె చిన్నగా నవ్వి చెప్పింది ‘‘దాని గురించి నేనెప్పుడూ బాధపడనమ్మా. వాళ్ల విసుర్లు, ఛీత్కారాలు, చీదరింపులు అన్నీ మహా అయితే ఓ గంటసేపు పట్టే ప్రయాణం వరకే కదా! 65 సంవత్సరాల నా జీవన గమ్యంలో ఆ గంట ప్రయాణం ఎంత!? అయితే ఈ బక్కపల్చటి ముసలామె ఒకప్పుడు రాష్ట్రస్థాయిలో ప్రశంసలు పొందిన హాకీ ప్లేయరని తెలియకపోవడం వారి తప్పు కాదు కదమ్మా! ముతక బట్టలు ధరించిన ఈ ముసల్ది ఫ్రెంచి ఎంబసీలో భారతదేశం తరఫున పని చేసిన దుబాసీ అని తెలియకపోవడం వారి తప్పు కాదు కదా! విడిచిన బట్టలు మూట చేతపట్టుకుని, ముతక దుస్తులు కట్టుకుని సాదా సీదాగా ఉన్న ఈ అనాకారి ముసలామె వయసులో ఉన్నప్పుడు పార్ట్ టైమ్ మోడల్‌గా పని చేసిందని వారికేమైనా తెలుసా? చిన్నగా నెడితే చాలు తూలి పదిచోట్ల పడిపోయేంత బలహీనంగా ఉన్న ఈ బక్కపీనుగ తన భర్తని, ఏకైక కుమార్తెని కోల్పోయినా తట్టుకోగలగడమేగాక, జీవితంలో ఆనందాన్ని వెదుక్కుంటూ జీవన గమ్యాన్ని కొనసాగిస్తున్నంత బలమైనదని తెలిస్తే వారలా ప్రవర్తించరు కదా! నా ఆకారాన్ని, వాలకాన్ని చూసి ‘ఎప్పుడైనా ఈ రైలు ముఖం చూసెరుగుదువా?’ అంటూ చులకన చేసిన ఆ ముఖాలకు ఈ ముసల్దానికి దాదాపు యాభై ఏళ్లుగా ముంబై లోకల్ ట్రెయిన్లో ప్రయాణం అలవాటని తెలుసా? కృష్ణారామా అనుకుంటూ ఇంట్లోనో లేదా వృద్ధాశ్రమంలోనో మూలుగుతూ పడి ఉండక, ఇంత రద్దీగా ఉండే ఈ రైలు ఎక్కి విరార్ నుంచి బాంద్రాకు ప్రయాణం చేయడం కొన్ని సంవత్సరాలుగా జరుగుతూనే ఉందని, అదీ అభాగ్యులైన పిల్లలకు పాఠాలు చెప్పడం కోసమని వారికేమైనా తెలుసా తల్లీ? మాసిపోయిన అట్టతో, ముట్టుకుంటే చాలు పొడి పొడిగా అయేలా ఉన్న పుస్తకాన్ని చూసి, అందులో విషయమేమీ ఉండదని నిర్ధారించడానికి వాళ్లేమైనా న్యాయనిర్ణేతలా అమ్మా?’’ అని అడుగుతుంటే ఆమె పక్కన కూర్చుని ప్రయాణం చేయడానికి నేను ఎంత అదృష్టం చేసుకుని ఉంటానో అనిపించి గర్వంతో కూడిన పులకరింత కలిగింది. వెంటనే ఆమెతో సెల్ఫీ తీసుకోవాలనుకున్న నా కోరికను ఏమాత్రం అణచుకోలేకపోయాను. మేము విడిపోయేటప్పుడు ఆమె నా కళ్లలో కదలాడుతున్న భావాలను చదివినట్లుగా అంది– ‘సంజీవని అనే మొక్క పేరును అందరూ వినే ఉంటారు. అది ప్రాణం పోసేలా ఉండాలనుకుంటాంగానీ అందంగా ఉండాలని అనుకుంటామా? నీ గుణమే నువ్వు’.ఫేస్బుక్లో దీపికా డి. నాయక్ అనే ఆమె పంచుకున్న జ్ఞాపకాల పరిమళాలివి. – డి.వి.ఆర్. -
నా లైఫ్ నాకు నచ్చినట్లు లేదు
బంజారాహిల్స్: ‘నాన్నా.. నాకు హాస్టల్‌కు వెళ్లడం ఇష్టం లేదు. నేను అనుకున్నది వేరు.. నువ్వు చేస్తోంది వేరు. నాకు నచ్చింది నన్ను చేయనివ్వడం లేదు. బలవంతంగా హాస్టల్‌కు వెళ్లి, ఇష్టం లేకుండా చదవలేను. నా లైఫ్ నాకు నచ్చినట్లు లేదు. ప్రతి దానికి అనుమానిస్తున్నారు. ఫ్రీడమ్ లేదు. ఎక్కడికి వెళ్లాలన్నా పంపరు. కష్టంగా ఉంది నాన్నా..’ అంటూ ఓ విద్యార్థిని లేఖ రాసి, ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. తండ్రి అప్పారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని విద్యార్థిని కోసం గాలిస్తున్నారు. ఫిలింనగర్‌లోని పద్మాలయ అంబేడ్కర్‌నగర్‌లో నివసించే అప్పారావు అపోలో ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డ్. ఆయన కూతురు దీపిక(20) ఇంటర్ పూర్తి చేసింది. డిగ్రీ కోసం గురుకులంలో చేర్చాలని తండ్రి ఫీజు కూడా చెల్లించాడు. ఈ నెల 20న హాస్టల్లో చేరాల్సి ఉంది. ఇంతలోనే తనకు ఇష్టం లేని పనులు చేయిస్తున్నారంటూ దీపిక సోమవారం ఉదయం ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయింది. ఆమె రాసిన లేఖను తండ్రి పోలీసులకు అందజేశాడు. ‘నేను ఒకటి అనుకుంటే.. మీరు ఒకటి చేస్తున్నారు. నేను చనిపోవాలని డిసైడ్ అయ్యాను. నా చావుకు ఎవరూ బాధ్యులు కాదు. కేవలం నా లైఫ్’ అంటూ ఆమె లేఖలో పేర్కొనడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ‘నా లైఫ్ నాకు నచ్చినట్లు లేనందునే చనిపోతున్నాను. నేను కూడా మనిషినే డాడీ’ అని లేఖరో పేర్కొంది. -
దొంగనోట్ల చలామనీపై అప్రమత్తం : ఏఎస్పీ
రామభద్రపురం: సాలూరు పరిధిలో దొంగనోట్లు చలామనీ అవుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పార్వతీపురం డివిజన్ ఏఎస్పీ దీపికాపాటిల్ సూచించారు. స్థానిక పోలీసుస్టేషన్లో గురువారం ఆమె మాట్లాడారు. ఇటీవల సాలూరు ప్రాంతంలో దొంగనోట్లు చలామనీ చేసిన ముఠాను పట్టుకొన్నామని, వారి నుంచి కొంత మొత్తాన్ని రికవరీ చేశామన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. దొంగనోట్లలో వాటర్ మార్క్ కనిపించదని, అటువంటి నోట్లు ప్రజలు గమనించి తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ సమస్య ఉన్న అన్ని ప్రాంతాల్లో నియంత్రణ చర్యలు చేపడుతున్నామని చెప్పారు. రామభద్రపురం, సాలూరు, పి.కోనవలస వద్ద ఘాట్ రోడ్డు, పార్వతీపురం, తోటపల్లి ప్రాజెక్టు, కొత్తవలస రైల్వేగేట్ తదితర ప్రాంతాల వద్ద ట్రాఫిక్ సమస్య అధికంగా ఉందని ఈ సమస్యను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. రామభద్రపురంలో రహదారి విస్తరణపై ఎస్పీకి లేఖ రావామని, రోడ్లు భద్రతా కమిటీకి కలెక్టర్ చైర్మన్‌గా ఉన్నందున నిధులు సమకూర్చుతామని తెలిపినట్టు పేర్కొన్నారు. ఆమె వెంట ఎస్ఐ డీడీ నాయుడు ఉన్నారు. -
మెరిటోరియస్ అవార్డుకు దీపిక
నిజామాబాద్‌నాగారం(నిజామాబాద్‌అర్బన్): జిల్లాలో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న దీపిక అంతర్జాతీయ మహిళా దినోత్సవా న్ని పురస్కరించుకుని అవార్డుకు ఎంపికయ్యారు. ఈనెల 8న రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో మెరిటోరియస్ అవార్డు అందుకోనున్నారు. జిల్లాలో క్లోరోహైడ్రేట్, గంజాయి నిందితులను పట్టుకోవడంలో దీపిక ప్రధాన పాత్ర పోషించారు. ఈ మేరకు ఆమెను అవార్డుకు ఎంపిక చేశారు. జిల్లాలో కల్తీకల్లు, గుడుంబా అరికట్టడంలోనూ ఆమె పాత్ర ఉంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలతోపాటు నిర్మల్ జిల్లాలోనూ క్లోరోహైడ్రేడ్కు సంబంధించి 16 కేసులు నమోదు చేసి 23.58 కేజీల క్లోరోహైడ్రేడ్ను స్వాధీనం చేసుకున్నారు. 58 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఇందుకుగాను ఎక్సైజ్‌శాఖ ప్రత్యేకంగా మహిళ దినోత్సవం పురస్కరించుకొని అవార్డు అందించనున్నారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్, రెండుజిల్లాల ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, అధికారులు, సిబ్బంది దీపికను ప్రత్యేకంగా అభినందించారు. -
నాన్నను చూసే లాఠీ పట్టా...
సాక్షి ప్రతినిధి, విజయనగరం : వారిది పోలీస్ కుటుంబం... తండ్రి ఉన్నతాధికారి కావడంతో చిరు ప్రాయం నుంచి ఖాకీ దుస్తుల మధ్య పెరిగారు... లాఠీలతో ఆడుకున్నారు... పెరిగి పెద్దయ్యాక ఇటు సోదరుడు... అటు భర్త కూడా అదే శాఖలో ఉన్నత స్థానాల్లో ఉండటంతో సమాజంలో ఆ విభాగానికి ఉన్న గుర్తింపు ఏమిటో తెలుసుకున్నారు. దాని ద్వారా ప్రజలకు నేరుగా సేవ చేయగలమని గుర్తించారు. అదే ఆమెలో పోలీస్ అధికారి కావాలన్న కోరికకు ప్రేరణగా నిలిచాయి. తొలి ప్రయత్నంలోనే ఐపీఎస్ సాధించారు. అసాధారణమైన గ్రేహౌండ్స్ కమాండంట్‌గా రాటుదేలారు. ఇప్పుడు పార్వతీపురం ఏఎస్పీగా కొత్త బాధ్యతలు చేపట్టారు. ఆమే దీపికా ఎం పాటిల్. ఆంధ్రాలో పుట్టి ఝార్ఖండ్‌లో స్థిరపడిన తెలుగు పోలీస్ కుటుంబానికి చెందిన ఆమెతో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ సాక్షి: దీపిక ఎం పాటిల్. మీ పేరులోనే వైవిధ్యం కనిపిస్తోంది? దీపిక: మా నాన్న మండవ విష్ణు వర్ధన్.. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా సమీపంలోని కృష్ణా జి ల్లా ఆమదాలలంక గ్రామంలో పుట్టారు. నాన్నవాళ్లది వ్యవసాయ కుటుంబం. ప్రభుత్వం ఇచ్చే స్కాలర్‌షిప్‌ల మీదే ఆధారపడి చదువుకుని ఐపీఎస్ సాధించారు. నా భర్త విక్రాంత్ పాటిల్ 2012 తమిళనాడు కేడర్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం విజయనగరం ఓఎస్డీగా పనిచేస్తున్నారు. మాది ప్రేమ వివాహం. నాన్న ఇచ్చిన ఇంటిపేరును అలానేఉంచేసి దాని పక్కన నా భర్త ఇంటిపేరుని చేర్చుకున్నాను. అందుకే దీపిక ఎం పాటిల్‌గా స్థిరపడ్డాను. సాక్షి: బాల్యం, విద్య, కుటుంబ విశేషాలు? దీపిక: మాది పోలీసు కుటుంబం. నాన్న ఆంధ్రాలో పుట్టినప్పటికీ వృత్తిరీత్యా ఝార్ఖండ్‌లో స్థిరపడటంతో అక్కడే నా బాల్యం ప్రారంభమయ్యింది. నాన్నకు ఏటా బదిలీ అవుతుండటంతో తరచూ మేము కూడా ఆయనతో పాటు అనేక ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. ఝార్ఖండ్‌లో ప్రారంభమైన విద్యాభ్యాసం నాన్న బదిలీ ప్రాంతాల్లో కొనసాగింది. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు 13 స్కూళ్లు మారాల్సివచ్చింది. రాజస్థాన్‌లోని బిట్స్ పిలానీలో ఇంజినీరింగ్ పూర్తి చేశాను. సాక్షి: ఆంధ్రాలో గ్రేహౌండ్స్ కమాండర్‌గా ఎలా మారారు? దీపిక: మా అమ్మానాన్న నన్ను ఎంతో క్రమ శిక్షణతో పెంచారు. నాన్న ఉద్యోగ విధుల్లో తీరిక లేకుండా ఉన్నప్పటికీ అమ్మ పోస్టు గ్రాడ్యూయేట్ కావడంతో నన్ను బాగా చదివించేది. ఆడపిల్లలంటే కేవలం పెళ్లి వస్తువుగా నేటి సమాజం చూస్తోంది. పెళ్లి చేసేస్తే బాధ్యత తీరిపోతుందని భావించేవాళ్లే ఎక్కువ. కానీ మా ఇంట్లో ఆ పరిస్థితి లేదు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనే భావనతో నా తల్లిదండ్రులు నన్ను ప్రోత్సహించారు. 2013లో సివిల్స్ రాశాను. మొదటి ప్రయత్నంలోనే 2014లో ఐపీఎస్‌గా ఎంపికయ్యాను. గ్రేçహౌండ్స్ కమాండర్‌గా మొదటి సారిగా పనిచేసే అవకాశం లభిం చింది. నాన్న, అన్నయ్య, భర్త ఐపీఎస్‌లే కాబట్టి పోలీసుల విధులు ఏ విధంగా ఉంటాయి, సమస్యలను ఏ రకంగా పరిష్కరిస్తారో దగ్గరగా చూసేదాన్ని కాబట్టి గ్రేహౌండ్స్ కమాండర్‌గా పెద్ద కష్టమేమీ అనిపించలేదు. నాన్న ఆంధ్రాలో జన్మించారు కాబట్టి ఆంధ్రాలో పనిచేయాలనుకునేవారు. ఆయన కోరిక నా ద్వారా తీరింది. సాక్షి: చిన్న వయసులోనే పెద్ద బాధ్యతలు చేపట్టారు? దీపిక: నేటి యువత శక్తివంతమైనది. యువత సాధించలేనిది ఏదీ లేదు. క్షణికావేశంలో తప్పటడుగులు వేస్తూ తప్పుడు నిర్ణయాలతో తమ జీవితాలను పాడుచేసుకుంటున్నారే తప్ప భావిభారతావనికి అవసరమైన పౌరులుగా తయారు కావడం లేదు. దేశం మనకేమిచ్చింది అనే కంటే దేశం కోసం మనం ఏం చేశామని ఆలోచించే వారు చాలా తక్కువ. దేశం గర్వించదగ్గ పౌరులుగా యువత తయారు కావాలి. సాక్షి: ఐపీఎస్‌ను ఏరికోరి పెళ్లిచేసుకోవడానికి కారణం? దీపిక: అన్నయ్య హర్షవర్ధన్, విక్రాంత్ పాటిల్ మంచి స్నేహితులు. తరచూ అన్నయ్యతో కలసి ఆయన రావడంతో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. ఇరువురి ఇష్టాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు మా వివాహం జరిపించారు. సమాజంలో పోలీస్ డిపార్ట్మెంట్కు ప్రత్యేక స్థానం ఉంది. ప్రజలకు సేవచేసే భాగ్యంతో పాటు వ్యవస్థను అదుపులో ఉంచే అధికారం కూడా మనకు ఉంటుందని నాన్న తరచూ చెబుతుండేవారు. నాన్న చెప్పిన మంచి మాటలు, ప్రజలకు పోలీసు వ్యవస్థ ద్వారా ఆయన చేస్తున్న సేవలు చూసి ఐపీఎస్ అంటే ఇష్టం ఏర్పడింది. సాక్షి: సరదాలు, సంతోషాలు? దీపిక: చిన్నప్పుడు అమ్మా, నాన్న ఆట విడుపుకోసం గుర్రపు స్వారీకి నన్ను తీసుకెళ్లేవారు. అది అలవాటుగా మారింది. గుర్రపు స్వారీ చేయడం ఎంతో ఇష్టం. స్విమ్మింగ్, టెన్నిస్ ఆడడం కూడా ఇష్టం. అలాగే పెయింటింగ్స్ వేయడం, మంచి పుస్తకాలను చదవడం అలవాటు. జంక్ఫుడ్స్, పిజ్జా, బర్గర్, ఐస్‌క్రీం వంటివి ఎక్కువగా తింటుంటాను. చాక్లైట్ ఫ్లేవర్ ఐస్‌క్రీమ్ అంటే ఇష్టం. పింక్ కలర్ ఇష్టం. ఆ రంగు దుస్తులు మహిళలకు ఎక్కువ అందాన్నిస్తాయి. చిన్నతనంలో సినిమాలు చూసేదాన్ని, కానీ సినిమాల్లో ప్రజలకు ఉపయోగకరమైన అంశాలకంటే అనవసరమైనవే ఎక్కువగా ఉంటున్నాయి. వాటిని చూసి యువత చెడిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడొస్తున్న సినిమాల్లో ఒకటి , రెండు తప్ప మిగతా సినిమాలన్నీ కామెడీ, ద్వంద్వ అర్థాలతో ఉన్న సినిమాలే కాబట్టి చూడాలనిపించడం లేదు. -
పార్వతీపురం ఏఎస్పీగా దీపిక
పార్వతీపురం: పార్వతీపురం ఏస్పీగా ఎం.దీపికను నియమించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ దినేష్ కుమార్‌పేరుతో సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటివరకు ఇక్కడ ఏస్పీగా విధులు నిర్వర్తించిన అమిత్ బర్దార్ విశాఖపట్నం జిల్లా పాడేరు ఏఎస్పీగా బదిలీ అయ్యారు. రెండు, మూడు రోజుల్లో దీపిక విధుల్లో చేరే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా మూడు నెలల క్రితం పార్వతీపురం ఏస్పీగా విధుల్లో చేరిన అమిత్‌బర్దార్‌కు ఇంత త్వరగా బదిలీ కావడం విశేషం. -
దీపిక–జోష్నా జంటకు కాంస్య పతకం
న్యూఢిల్లీ: ప్రపంచ డబుల్స్ స్క్వాష్ చాంపియన్‌షిప్ మహిళల డబుల్స్ విభాగంలో దీపిక పళ్లికల్–జోష్నా చినప్ప (భారత్) జంట పోరాటం ముగిసింది. ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌లో శుక్రవారం రాత్రి జరిగిన సెమీఫైనల్లో దీపిక–జోష్నా ద్వయం 11–6, 6–11, 8–11తో జెన్నీ డన్‌కాఫ్–అలీసన్ వాటర్స్ (ఇంగ్లండ్) జోడీ చేతిలో ఓడిపోయింది. దాంతో ఈ భారత జంటకు కాంస్య పతకం లభించింది. అంతకుముందు క్వార్టర్ ఫైనల్లో దీపిక–జోష్నా 10–11, 11–6, 11–8తో సమంత కార్నెట్–నికోల్ టాడ్ (కెనడా)లపై గెలిచారు. -
సెమీస్‌లో జోష్నా, దీపిక
చెన్నై: ఆసియా స్క్వాష్ వ్యక్తిగత చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ క్రీడాకారిణులు దీపిక పళ్లికల్, జోష్నా చినప్ప సెమీఫైనల్లోకి ప్రవేశించారు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో దీపిక 11–3, 11–6, 11–6తో లియు లింగ్ (హాంకాంగ్)పై, జోష్నా 11–7, 11–3, 9–11, 12–10తో మిసాకి కొబయాషి (జపాన్)పై గెలిచారు. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో సౌరవ్ ఘోషాల్ 11–7, 11–7, 11–7తో విక్రమ్ మల్హోత్రా (భారత్)పై నెగ్గగా... హరీందర్ పాల్ సంధూ 8–11, 9–11, 8–11తో మాక్స్ లీ (హాంకాంగ్) చేతిలో ఓడిపోయాడు. -
ప్రియాంక, కత్రినా, దీపికల స్వయంవరం రేపే
డెహ్రాడూన్: ప్రియాంక, కత్రినా, దీపీకా రేపు పెళ్లి చేసుకోబోతున్నారు. మహా శివరాత్రి సందర్భంగా తమకు కాబోయే వరుడ్ని స్వయంవరంలో ఎంచుకోబోతున్నారు. వీరిని వివాహం చేసుకునేందుకు మొత్తం 15మంది పెళ్లి కుమారుల్లు సిద్థం కాగా వారిలో తమకు నచ్చిన వారిని లైఫ్ పార్టనర్‌గా ఎంపికచేసుకోబోతున్నారు. ఈ కార్యక్రమానికి ఉత్తరఖాండ్‌లోని తేరి జిల్లా జౌన్‌పుర్ ప్రాంత పరిధిలోని పంత్వాడి గ్రామం వేదిక కానుంది. అదేమిటీ బాలీవుడ్లో మంచి క్రేజ్ ఉన్న ఈ ముగ్గురు ఇలా పెళ్లికి సిద్ధమై పోవడం ఏమిటని ఆశ్చర్యపోతూ అవాక్కవుతున్నారా.. వాస్తవానికి పెళ్లి ప్రియాంక, కత్రినా, దీపికాదే కాని.. బాలీవుడ్ నటులైన ప్రియాంక, కత్రినా, దీపికాలది కాదు. ఆ పేర్లు కలిగిన మూడు గొర్రెలది. అవును.. మహాశివరాత్రి సందర్భంగా ఈ పేర్లు గల మూడు గొర్రెలకు స్వయం వరం నిర్వహిస్తున్నారు. ఇలా చేయడం ప్రతిఏడాది ఆ గ్రామంలో ఆనవాయితీ. ఈసారి ఈ మూడు గొర్రెలకు స్వయం వరం చేస్తున్నారు. వీటికోసం 15 మగ గొర్రెలను సిద్ధం చేశారు. ఒక్కో గొర్రెకు ఐదు గొర్రెలను ఓ రింగ్‌లోకి పంపించగా వాటిల్లో నుంచి ఒకదానిని ఆడ గొర్రె ఎంపిక చేసుకుంటుంది. అలా ఎంపిక చేసుకున్న గొర్రెతో దాని వివాహం జరిపిస్తారు. ఈ తంతుకు సాధారణంగా పెళ్లిల్లకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారో అలాంటివే వీటి కోసం కూడా సిద్ధం చేస్తారు. ఇలా చేసి మూగజీవాలను గౌరవించడం తమ ప్రాంతంలో ఆనాదిగా వస్తున్న గొప్ప ఆచారంగా అక్కడి ప్రజలు చెప్పుకుంటుంటారు. -
గ్రాండ్ షో మేన్
► రాజ్‌కపూర్ మరణించినప్పుడు రణ్‌బీర్‌కు ఆరు సంవత్సరాలు. తాతగారి గొప్పతనం విని పులకించిపోతుంటాడు. ► నేను ఈ దేశంలోని ప్రతి ఒక్కరికీ తెలిసినప్పుడే నన్ను నేను స్టార్ అనుకుంటాను... అంటాడు రణ్‌బీర్. ► దీపికా పదుకొనె, రణ్‌బీర్... కెరీర్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఫ్రెండ్స్. దీపికా అతడిని బాగా ఇష్టపడింది. ‘ఇతర ప్రలోభాల వల్ల ఆమె స్నేహాన్ని వదలుకున్నాను’ అని రణ్‌బీర్ చెప్పాడు. ► కత్రీనా కైఫ్‌తో రణ్‌బీర్ స్నేహం నడిచింది. కాని ఆ ముక్కు ఒక్క తుమ్ముకే ఊడిపోయింది. రణ్‌బీర్ కపూర్ టాప్ 10 సినిమాలు 1. ఏ దిల్ హై ముష్కిల్ 2. బర్ఫీ 3. రాక్‌స్టార్ 4. వేకప్ సిద్ 5. రాజ్‌నీతి 6. ఏ జవానీ హై దివానీ 7. అన్జానీ అన్జానా 8. అజబ్ ప్రేమ్‌కీ గజబ్ కహానీ 9. సావరియా 10. బే షరమ్ ► రాజ్ కపూర్‌కు షో మేన్ అనే బిరుదు ఉంది. ►ఆయన గ్రాండ్ సన్ని ‘గ్రాండ్ షో మేన్’ అనక తప్పదు. ► ఏ సినిమాలో నటించినా దృష్టి తన మీద పడేలా చేసుకునే నటుడు రణ్‌బీర్. ► తాతకు దగ్గులు నేర్పించే స్థాయిలో ‘బర్ఫీ’, ‘రాక్‌స్టార్’, ► ‘ఏ దిల్ హై ముష్కిల్’ వంటి సినిమాలలో నటించాడు. ► తండ్రి రిషి కపూర్, తల్లి నీతూ సింగ్‌ల కంటే కచ్చితంగా మెరుగైన నటుడు. ► ఇటీవల ఫ్లాపుల తర్వాత ‘ఏ దిల్ హై ముష్కిల్’తో లేచి నిలబడిన మొనగాడు రణ్‌బీర్ కపూర్. సినిమా వాళ్ల జీవితం పైకి కనిపించేటటువంటిది కాదు. ముళ్లుంటాయి – అని అంటూ ఉంటారు. రణ్‌బీర్ కపూర్ దారిలో కూడా ముళ్లున్నాయి. కాకపోతే ఆ ముళ్ల పేర్లు– రిషి కపూర్, నీతూ సింగ్. రణ్‌బీర్ కపూర్ బంగ్లాలో అతడికి ఇష్టమైన భాగం ఏదైనా ఉందంటే అది మెట్ల వరుసే. చాలాసార్లు రణ్‌బీర్ తన బాల్యంలో ఆ మెట్ల మీద కూచుని ఉండేవాడు. ఒక్కోసారి రాత్రి 12 నుంచి ఉదయం 5 వరకూ ఆ మెట్ల మీదే ఉండిపోయేవాడు. కారణం– లోపల తల్లిదండ్రుల తగాదా నడుస్తూ ఉండేది. వస్తువులు పగులుతూ ఉండేవి. అరుపులు వినిపిస్తూ ఉండేవి. చివరికి వాళ్లు రాజీ పడేవారు. ఈ లోపు రణ్‌బీర్ కపూర్ నిముషాలు లెక్కపెట్టుకుంటూ ఉండేవాడు. సెలబ్రిటీల మధ్య పొరపొచ్చాలు సహజం. ఇక వాళ్లిద్దరూ భార్యాభర్తలు అయినప్పుడు మరీ సహజం. రిషీ బిజీ స్టార్. నీతు పెళ్లయ్యాక కుటుంబానికి కట్టుబడింది. అతడు బయటా ఆమె ఇంట్లో... తెలియని అభద్రత... దూరం ఇవి సమస్యకు కారణాలు. ఆ కొట్లాటలు రణ్‌బీర్ మీద వయసులో అతడి కంటే రెండేళ్లు పెద్దదయిన అతడి సోదరి రిద్ధిమా మీద ప్రభావం చూపాయి. ‘తర్వాత తర్వాత ఆ గొడవలు ఎంత పెద్ద ఎమోషన్ని అయినా లోపలికి తీసుకునే స్థాయికి నా మానసిక లోతులను పెంచాయి’ అని రణ్‌బీర్ చెప్పుకున్నాడు. రణ్‌బీర్ రానురాను ఇంట్రావర్ట్‌గా మారిపోయాడు. తల్లితోనే అనుబంధం పెంచుకున్నాడు. తండ్రితో దాదాపు దూరమే. ఆ తర్వాత చాలా రోజులకు తండ్రితో కలిసి పని చేసేటప్పుడే తండ్రి హృదయం కూడా మంచిదే అని గ్రహించాడు. చదువు రాదు. తల్లిదండ్రులు ముంబైలో ప్రసిద్ధ స్కూల్ – బాంబే స్కాటిష్ స్కూల్లో చేర్పిస్తే చివరి నుంచి మూడో ర్యాంకులో ఉండేవాడు. అల్లరి ఎక్కువ. ఒకసారి ప్రిన్సిపాల్ అతడి జుట్టు పట్టుకుని వరండాలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కొట్టుకుంటూ వెళ్లాడు. అయినా దారికి రాలేదు. ఆ రోజుల్లో కరాటేలో చేరి పెద్దయ్యాక కరాటే ఇన్స్ట్రక్టర్ కావాలని అనుకున్నాడు. కాని ఆ తర్వాత తెలిసింది– సినిమాల్లో పని చేయడానికి చదువు పెద్దగా అక్కర్లేదని. చదువు అక్కర్లేదా? ఇంతకు మించిన మంచి మాట లేదని 7–8 తరగతులు చదువుతుండగా తాను కాబోయే సినిమా హీరో అని నిశ్చయించుకున్నాడు. అయితే పది గండం దాటాలి కదా. పరీక్షలు రాశాడు. చివరకు రిజల్ట్స్ వచ్చాయి. అతడి కష్టం మీద 53.4 పర్సెంటేజీ మార్కులు వచ్చాయి. ఆ సమయంలో రణ్‌బీర్ తన తండ్రి రిషితో కలిసి న్యూయార్క్‌లో ఉన్నాడు. మార్కులు తెలుసుకున్న నీతూ సింగ్ అమెరికాకు ఫోన్ చేసి ఒకటే ఏడవడం– నా బంగారు తండ్రి పాసయ్యాడు... పదో తరగతి పాస్ అయ్యాడు... అని. న్యూయార్క్‌లో తండ్రి పెద్ద పార్టీ ఇచ్చాడు. కపూర్ ఫ్యామిలీలో పదో క్లాసు ఇబ్బంది పడకుండా పాసైన మొదటి కుర్రాడు మరి రణ్‌బీర్. పెద్దింటి కుటుంబాలు తమ పిల్లలను అమెరికాలోని బిజినెస్ స్కూళ్లలో చదివించడం ఫ్యాషన్. రిషి కపూర్, నీతూ సింగ్ కూడా రణ్‌బీర్ దగ్గర అలాంటి ప్రతిపాదన తెస్తే నేనెలాగూ యాక్టర్‌ని కావాలనుకుంటున్నాను కదా మధ్యలో ఈ డూప్లికేట్ చదువు ఎందుకు నేరుగా యాక్టింగ్‌కు సంబంధించిన చదువే చదువుతాను అని న్యూయార్క్ మెథడ్ యాక్టింగ్ నేర్చుకోవడానికి వెళ్లాడు. అక్కడ కొన్నాళ్లు చదువుకున్నాడు. కాని ఒంటరితనం... బోరింగ్ క్లాసులు... ఈ గొడవ ఎందుకు చలో ఇండియా అనుకొని వచ్చేశాడు. అప్పట్లో సంజయ్‌లీలా బన్సాలీ ఉమ్ము కూడా పెట్రోల్లా మండుతోంది. బన్సాలీ హీరోగా లాంచ్ చేస్తే ఆ హీరోకి తిరుగుండదు. రణ్‌బీర్ కూడా సంజయ్ తనను హీరోగా లాంచ్ చేయాలని కోరుకున్నాడు. అతణ్ణి ఇంప్రెస్ చేయడానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరాడు. అప్పుడు బన్సాలీ ‘బ్లాక్’ సినిమా తీస్తున్నాడు. ఒకసారి టీమ్‌లో చేరాక ఎవరి కొడుకైనా ఒకటే. రణ్‌బీర్ కపూర్‌కి సెట్లో ఇతరులకు ఎదురయ్యే అన్ని రకాల అవమానాలు ఎదురయ్యాయి. మరుసటి రోజు ఉదయం షూటింగ్ అంటే ఈ ముందు రోజు రాత్రి 2 గంటల నుంచి 4 గంటల వరకు లైట్లు బిగించడం సెట్లో సహాయకుడిగా పని చేయడం.. ఫ్లోర్లు తుడవడం... అంతా చాకిరి. అదంతా చేశాడు. చివరకు బన్సాలీ కరుణించాడు. సినిమా దొరికింది. భారీ సినిమాయే దొరికింది. రిషికపూర్ నీతూ సింగ్‌ల కుమారుడు రణ్‌బీర్ కపూర్– అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్లు జంటగా బన్సాలీ సినిమా అనౌన్స్ చేశాడు. పేరు– సావరియా. ‘సావరియా’ ఫ్లాప్ అయ్యింది. భయంకరంగా ఫ్లాప్. రణ్‌బీర్ కపూర్ అందులో టవల్ కట్టుకుని పాట పాడితే దానిని చూసి అందరూ ఆటపట్టించారు. ఏదో అనుకుంటే ఏదో అయ్యింది. కొందరు మాత్రం రణ్‌బీర్ యాక్టింగ్ బాగుందని అన్నారు. వచ్చిన ప్రచారం ఎంతో కొంత వచ్చింది దీనిని వాడుకుందాం అని భావించిన యశ్‌రాజ్ ఫిల్మ్స్ వెంటనే రణ్‌బీర్‌తో ‘బచ్ నా ఏ హసీనో’ సినిమాను ప్రకటించింది. ‘బచ్ నా ఏ హసీనో’ మకుటంతో మొదలయ్యే ‘హమ్ కిసీసే కమ్ నహీ’ పాట రిషి కపూర్ జీవితాన్ని వెలిగించింది కనుక ఆ పేరుతో వచ్చే సినిమా రణ్‌బీర్‌ను ఫీల్డ్‌లో స్థిరపరుస్తుందని భావించారు. అంచనా తప్పలేదు. ఆ సినిమా కమర్షియల్ సక్సెస్ అయ్యింది. 2009 వచ్చేసరికి రణ్‌బీర్ అకౌంట్లో మూడు సినిమాలు పడ్డాయి. 1. వేకప్ సిద్, 2. అజబ్ ప్రేమ్‌కీ గజబ్ కహానీ 3. రాకెట్ సింగ్. మూడూ బాక్సాఫిస్ దగ్గర మంచి ఫలితాలు రాబట్టాయి. మూడింటికీ కలిపి రణ్‌బీర్ ఫిల్మ్‌ఫేర్ నుంచి క్రిటిక్స్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. అయితే రణ్‌బీర్‌లోని నటుడి సత్తాను చాటిన రెండు సినిమాలు మాత్రం ఆ తర్వాత వచ్చాయి. అవి ‘రాక్‌స్టార్’, ‘బర్ఫీ’. ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో వచ్చిన ’రాక్‌స్టార్’ గాఢమైన అనుభూతులను ప్రదర్శించగల శక్తిని వెలికి తెచ్చింది. అనురాగ్ బసు దర్శకత్వంలో వచ్చిన ‘బర్ఫీ’ మూగ చెవిటి పాత్రను ఇచ్చి కేవలం హావభావాలతో ఒక పెద్ద సినిమాను భుజం పై మోయగల సత్తా రణ్‌బీర్‌కు ఉందని నిరూపించింది. ఆ తర్వాత అతడికి ఆర్థికంగా మంచి ఫలితాలు ఇచ్చిన సినిమా – ‘ఏ జవానీ హై దివానీ’. ఫ్లాపులు రావడం చాలా బాధగా ఉంటుంది. ముఖ్యంగా ఒకదాని తర్వాత ఒకటి. పైగా బాగా ఆడుతాయనుకున్న సినిమాలు పోతే తట్టుకోవడం కష్టంగా ఉంటుంది. బే షరమ్ (2013), రాయ్ (2015), బాంబే వెల్వెట్ (2015) రణ్‌బీర్ కపూర్‌ని దాదాపు చావు దెబ్బ తీశాయి. మూడు పెద్ద ఫ్లాపులు. మాజీ గర్ల్ ఫ్రెండ్ దీపికా పదుకొనెతో యాక్ట్ చేసిన సినిమా ‘తమాషా’ (2015) కూడా సోసోగా వెళ్లింది. ఒక హీరోకు ఇన్ని ఫ్లాపులు కష్టమే. అప్పటికే రణ్‌బీర్ భారతదేశంలో భారీ పారితోషికం డిమాండ్ చేసే నటుడి స్థాయిలో నిలబడి ఉన్నాడు. గ్రాఫ్ పడటానికి లేదు. మరేం చేయాలి. జవాబు కనిపించింది. అది– కరణ్ జొహర్. టాలెంట్ ఉన్న నటుడికి టాలెంట్‌తో పాటు పోరాటం చేయగల నటుడికి సరైన అవకాశం ఇస్తే నిలబడతాడు అనటానికి మొన్న వచ్చిన ‘ఏ దిల్ హై ముష్కిల్’ సినిమా ఒక ఉదాహరణ. కరణ్ జొహర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అనేక వొడిదుడుకులను దాటుకుని (పాకిస్తాన్ నటీనటులు ఉన్నారని గొడవైంది) విడుదలయ్యి విజయం సాధించింది. భారీ విజయమే సాధించింది. శుద్ధమైన ప్రేమను కనుగొనే ప్రయాణం చేసిన ఒక ప్రేమికుడి కథ అయిన ఈ సినిమాలో రణ్‌బీర్, అనుష్కల నటనతో పాటు పాటలు కూడా సినిమా విజయంలో కీలకపాత్ర పోషించాయి. అయిపోయిందనుకున్న రణ్‌బీర్ మళ్లీ తన ట్రాక్‌లో సగర్వంగా నిలబడ్డాడు. రణ్‌బీర్ నటుడుగా తన తోటి నటులైన షాహిద్ కపూర్, రణ్వీర్ సింగ్ వంటి వారితో పోటీ పడటం ఎలాగూ ఉంటుంది... కాని కపూర్ల వారసుడిగా వారి కంటే ముందు ఉండాల్సిన బరువు కూడా ఉంటుంది. ఆ సంగతి రణ్‌బీర్‌కు తెలుసు. అందుకే అతడు మరింత కష్టపడుతుంటాడు. తనను తాను నిలబెట్టుకోవడానికి కష్టపడుతుంటాడు. ఏ కష్టమైనా ముష్కిల్గానే ఉంటుంది. కాని హిట్ సినిమా కోసం ఆ ముష్కిల్కు ఎస్ అంటుంటాడు రణ్‌బీర్. రణ్‌బీర్ కపూర్ టాప్ 10 పాటలు 1. జబ్ సే తేరే నైనా – సావరియా 2. బచ్ నా ఏ హసీనో – బచ్ నా ఏ హసీనో 3. గూంజ్సా హై కోయి ఇక్తారా – వేకప్ సిద్ 4. ఎత్తిసీ హసీ ఎత్తిసీ ఖుషీ – బర్ఫీ 5. తూ జానే నా – అజబ్ ప్రేమ్ కీ గజబ్ కహానీ 6. జో భి మై – రాక్‌స్టార్ 7. బద్ తమీజ్ దిల్ – ఏ జవానీ హై దివానీ 8. తూ హై కి నహీ – రాయ్ 9. తూ సఫర్ మేరా – ఏ దిల్ హై ముష్కిల్ 10. మేరి రూహ్కా పరిందా (బులయా)– ఏ దిల్ హై ముష్కిల్ – సాక్షి ఫ్యామిలీ ప్రతినిధి -
తొలి రౌండ్లోనే దీపికకు షాక్
కై రో: భారత టాప్ స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పళ్లికల్‌కు వాడి డగ్లా ఓపెన్‌లో అనూహ్య పరాజయం ఎదురైంది. సోమవారం జరిగిన తొలి రౌండ్లో క్వాలిఫయర్ మరియమ్ మెట్వాలీ (ఈజిప్ట్) చేతిలో 11-5, 11-9, 6-11, 7-11, 8-11 తేడాతో దీపిక ఓడింది. తొలి రెండు గేమ్స్ సులువుగానే నెగ్గినా ఆ తర్వాత మాత్రం ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురుకావడంతో వరుసగా మూడు గేమ్‌లను కోల్పోరుుంది. ఇక దీపిక ఓటమితో ఈ ఈవెంట్లో భారత్ పోరాటం ముగిసింది. -
పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని..
హైదరాబాద్‌సిటీ: పాతబస్తీ చత్రినాక పోలీస్‌స్టేషన్ పరిధిలోని శివాజీనగర్‌లో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని మనస్తాపం చెందిన విజయ్, దీపిక అనే యువతీయువకులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. విజయ్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
దీపికా హాలీవుడ్ మూవీ ట్రైలర్