చాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్ (PC: Hockey India)
రాజ్‌గిర్(బిహార్): నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో భారత మహిళల హాకీ జట్టు అద్భుతం చేసింది. వుమెన్ ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో చైనాను ఓడించి.. టైటిల్‌ను సొంతం చేసుకుంది. తద్వారా ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. కాగా సొంతగడ్డపై జరిగిన ఈ మెగా టోర్నీ భారత్ డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగింది.
అద్భుత విజయాలతో సెమీస్‌కు చేరుకున్న సలీమా బృందం.. అక్కడ జపాన్‌ను ఓడించి.. ఫైనల్‌కు చేరుకుంది. వరుసగా ఆరో గెలుపు నమోదు చేసి తుదిపోరుకు అర్హత సాధించింది. ఈ క్రమంలో బుధవారం జరిగిన ఫైనల్లో.. పారిస్ ఒలింపిక్స్ సిల్వర్ మెడల్ విజేత, ఆసియా క్రీడల చాంపియన్ అయిన చైనాతో తలపడింది.
చైనాను 1-0తో ఓడించి
ఆద్యంతం ఆసక్తి రేపిన ఈ మ్యాచ్‌లో భారత మహిళా హాకీ జట్టు చైనాను 1-0తో ఓడించి.. ఆసియా చాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ మెగా టోర్నీలో భారత్ చాంపియన్‌గా నిలవడం ఇది మూడోసారి. ఈ క్రమంలో సౌత్ కొరియాతో కలిసి ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక టైటిళ్లు సాధించిన జట్టుగా అగ్రస్థానంలో నిలిచింది.
ఇక చైనాతో ఫైనల్లో భారత్ తరఫున దీపికా చేసిన ఒకే ఒక్క గోల్‌తో విజయం సలీమా బృందం సొంతమైంది. మూడో క్వార్టర్‌లో ఆమె గోల్ కొట్టి భారత్‌ను విజయపథంలో నిలిపింది. దీంతో రాజ్‌గిర్‌లో సంబరాలు అంబరాన్నంటాయి.
ఇదిలా ఉంటే.. ఈ ప్రతిష్టాత్మ టోర్నీలో 2016, 2023లలో భారత మహిళా జట్టు చాంపియన్‌గా నిలిచింది విజేతగా నిలిచింది. అదే విధంగా.. 2013, 2018లలో రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది.
వుమెన్స్ ఆసియా చాంపియన్స్ ట్రోఫీ-2024లో పాల్గొన్న భారత జట్టు
గోల్ కీపర్స్- సవిత, బిచు దేవి ఖరీబామ్
డిఫెండర్స్- ఉదిత, జ్యోతి, వైష్ణవి విట్టల్ ఫాల్కే, సుశీలా చాను పఖ్రంబం, ఇషికా చౌదరి
మిడ్‌ఫీల్డర్స్- నేహా, సలీమా టెటె(కెప్టెన్), షర్మిలా దేవి, మనీషా చౌహాన్, సునేలిటా టొప్పో, లల్రేమిసియామి.
ఫార్వర్డ్స్- నవనీత్ కౌర్(వైస్ కెప్టెన్), ప్రీతీ దూబే, సంగీతా కుమారి, దీపికా, బ్యూటీ డంగ్‌డంగ్.
చదవండి: ICC: వరల్డ్ నంబర్ వన్‌గా హార్దిక్ పాండ్యా.. దూసుకువచ్చిన తిలక్ వర్మ.. ఏకంగా..
Comments
Please login to add a commentAdd a comment