Asian Champions Trophy
-
‘మట్టి’లో మాణిక్యాలు
ఏ దేశంలోని మైదానంలోనైనా సరే.. ప్రత్యర్థి జట్టును మట్టికరిపిస్తూ దూసుకెళ్లే భారత హాకీ జట్టు అంటే ప్రపంచ దేశాలకు హడల్.. ఆసియా ఛాంపియన్ ట్రోఫీలతో పాటు ఒలింపిక్స్‌లోనూ భారత్ సత్తాచాటి ఎన్నో మెడల్ సాధించిన సంగతి తెలిసిందే.. క్రికెట్‌తో పోలిస్తే మన దేశంలో జాతీయ క్రీడ హాకీకి ఆదరణ అంతంత మాత్రమే.. హాకీలో మహిళలు సైతం పతకాల పంట పండిస్తుండటంతో ఉత్తరాది రాష్ట్రాల్లో క్రీడాకారులకు అత్యుత్తమ సౌకర్యాలు కల్పిస్తూ శిక్షణ అందిస్తున్నారు. దీంతో కొందరు క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. ఇక మన రాష్ట్రంలో హాకీ క్రీడకు కనీస సదుపాయాలు లేకపోయినా క్రీడాకారులు మాత్రం తగ్గేదే లే అన్నట్లు పక్క రాష్ట్రాలకు వెళ్లిమరీ కోచింగ్ తీసుకుంటున్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ శెభాష్ అనిపించుకుంటున్నారు. టర్ఫ్ గ్రౌండ్స్‌ను అభివృద్ధి చేస్తే మరింత ప్రాక్టీస్ చేసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాల వేట కొనసాగిస్తామంటున్నారు హైదరాబాదీలు.. సికింద్రాబాద్ ఆర్ఆర్సీ గ్రౌండ్లో ఈ నెల 26 నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు 14వ హాకీ ఇండియా సబ్ జూనియర్ ఉమెన్ నేషనల్ చాంపియన్‌షిప్ –2024 పోటీలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌కు చెందిన లాలస తెలంగాణ జట్టుకు కెప్టెన్‌గా, మరో ఇద్దరు సోదరీమణులు భవిష్య, చరిత్ర తెలంగాణ జట్టు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లాలస ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) క్యాంపులో ఉంటూ ప్రాక్టీస్ చేస్తోంది. భవిష్య, చరిత్ర కేరళలో సాయ్ క్యాంపులో శిక్షణ పొందుతున్నారు. హాకీ పట్ల ఉన్న మక్కువతో జాతీయ స్థాయికి ఎదిగిన క్రమంలో వీరు పడ్డ కష్టాలు, సాధించిన విజయాల గురించి వారి మాటల్లోనే..కేరళలో శిక్షణ పొందుతున్నాం: భవిష్య, చరిత్ర మల్కాజిగిరికి చెందిన సందీప్ రాజ్ తెలంగాణ మాస్టర్స్ హాకీ టీమ్‌లో సభ్యుడిగా కొనసాగుతున్నారు. తండ్రి నుంచి స్ఫూర్తి పొందిన ఆయన ఇద్దరు కుమార్తెలు భవిష్య, చరిత్ర తెలంగాణ బాలికల జట్టు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. స్థానిక కీస్ హైసూ్కల్లో ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన భవిష్య, చరిత్ర తొలినాళ్లలో జింఖానా మైదానంలో కోచ్ కామేశ్ శిక్షణలో హాకీ క్రీడాకారులుగా గుర్తింపు పొందారు. కేరళలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శిక్షణ శిబిరానికి ఎంపిక కావడంతో ప్రస్తుతం అక్కడే ఉండి శిక్షణ తీసుకుంటున్నారు. 9, 10వ తరగతి చదువుతున్న వీరు అక్కడి రాష్ట్ర భాష మళయాళీ నేర్చుకుని మరీ పరీక్షలకు హాజరవుతున్నారు. తన ఇద్దరు కూతుళ్లు ఇప్పటి వరకు 6 జాతీయ స్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహించినట్లు తెలిపారు. ఆట కోసం ఒడిశా వెళ్లా: లాలస సికింద్రాబాద్ మహేంద్రాహిల్స్‌లోని ఆక్సిల్లమ్ స్కూల్లో 1 నుంచి 9వ తరగతి వరకు చదువుకున్నాను. స్థానిక జింఖానా మైదానంలో హాకీ శిక్షణ తీసుకున్నా. కోచ్ కామేశ్ ప్రోత్సాహంతో ఆటలో నైపుణ్యం సాధించా.. హైదరాబాద్‌లో టర్ఫ్ కోర్టులు అందుబాటులో లేకపోవడంతో గ్రావల్ (కంకర మట్టి) కోర్టుల్లోనే ప్రాక్టీస్ చేయాల్సి వచ్చేది. ఉత్తమమైన శిక్షణ కోసం తొలుత బెంగళూరుకు వెళ్లా. పదో తరగతి పరీక్షలు అక్కడే రాయాల్సి వచ్చింది. స్థానిక భాష కన్నడ నేర్చుకుని మరీ పదో తరగతిలో పాసయ్యా. ప్రస్తుతం ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లోని నవల్ టాటా క్రీడాప్రాంగణంలో శిక్షణ తీసుకుంటున్నాను. ప్రముఖ హాకీ క్రీడాకారుడు భారత జాతీయ జట్టు మాజీ కెపె్టన్, గోల్ కీపర్ శ్రీజేశ్ ద్వారా స్ఫూర్తి పొంది గోల్ కీపర్‌గా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలన్నదే లక్ష్యం. తండ్రి జగన్, తల్లి ప్రోత్సాహం ఉంది. ఇప్పటి వరకు మూడు జాతీయ పోటీల్లో పాల్గొన్నాను. -
చైనాకు షాక్.. చాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్.. అరుదైన రికార్డు
రాజ్‌గిర్(బిహార్): నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో భారత మహిళల హాకీ జట్టు అద్భుతం చేసింది. వుమెన్ ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో చైనాను ఓడించి.. టైటిల్‌ను సొంతం చేసుకుంది. తద్వారా ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. కాగా సొంతగడ్డపై జరిగిన ఈ మెగా టోర్నీ భారత్ డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగింది.అద్భుత విజయాలతో సెమీస్‌కు చేరుకున్న సలీమా బృందం.. అక్కడ జపాన్ను ఓడించి.. ఫైనల్‌కు చేరుకుంది. వరుసగా ఆరో గెలుపు నమోదు చేసి తుదిపోరుకు అర్హత సాధించింది. ఈ క్రమంలో బుధవారం జరిగిన ఫైనల్లో.. పారిస్ ఒలింపిక్స్ సిల్వర్ మెడల్ విజేత, ఆసియా క్రీడల చాంపియన్ అయిన చైనాతో తలపడింది.చైనాను 1-0తో ఓడించిఆద్యంతం ఆసక్తి రేపిన ఈ మ్యాచ్‌లో భారత మహిళా హాకీ జట్టు చైనాను 1-0తో ఓడించి.. ఆసియా చాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ మెగా టోర్నీలో భారత్ చాంపియన్‌గా నిలవడం ఇది మూడోసారి. ఈ క్రమంలో సౌత్ కొరియాతో కలిసి ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక టైటిళ్లు సాధించిన జట్టుగా అగ్రస్థానంలో నిలిచింది.ఇక చైనాతో ఫైనల్లో భారత్ తరఫున దీపికా చేసిన ఒకే ఒక్క గోల్‌తో విజయం సలీమా బృందం సొంతమైంది. మూడో క్వార్టర్లో ఆమె గోల్ కొట్టి భారత్‌ను విజయపథంలో నిలిపింది. దీంతో రాజ్‌గిర్‌లో సంబరాలు అంబరాన్నంటాయి.ఇదిలా ఉంటే.. ఈ ప్రతిష్టాత్మ టోర్నీలో 2016, 2023లలో భారత మహిళా జట్టు చాంపియన్‌గా నిలిచింది విజేతగా నిలిచింది. అదే విధంగా.. 2013, 2018లలో రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది.వుమెన్స్ ఆసియా చాంపియన్స్ ట్రోఫీ-2024లో పాల్గొన్న భారత జట్టుగోల్ కీపర్స్- సవిత, బిచు దేవి ఖరీబామ్డిఫెండర్స్- ఉదిత, జ్యోతి, వైష్ణవి విట్టల్ ఫాల్కే, సుశీలా చాను పఖ్రంబం, ఇషికా చౌదరిమిడ్ఫీల్డర్స్- నేహా, సలీమా టెటె(కెప్టెన్), షర్మిలా దేవి, మనీషా చౌహాన్, సునేలిటా టొప్పో, లల్రేమిసియామి.ఫార్వర్డ్స్- నవనీత్ కౌర్(వైస్ కెప్టెన్), ప్రీతీ దూబే, సంగీతా కుమారి, దీపికా, బ్యూటీ డంగ్‌డంగ్.చదవండి: ICC: వరల్డ్ నంబర్ వన్‌గా హార్దిక్ పాండ్యా.. దూసుకువచ్చిన తిలక్ వర్మ.. ఏకంగా.. -
Asian Champions Trophy 2024: ఎదురులేని భారత్
రాజ్‌గిర్ (బిహార్): మరోసారి సాధికారిక ఆటతీరుతో అలరించిన భారత మహిళల హాకీ జట్టు సొంతగడ్డపై జరుగుతున్న ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో ఐదోసారి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ 2–0 గోల్స్ తేడాతో 2018 జకార్తా ఆసియా క్రీడల విజేత జపాన్ జట్టును ఓడించింది. భారత్ తరఫున వైస్ కెప్టెన్ నవ్‌నీత్ కౌర్ (48వ నిమిషంలో), లాల్రెమ్సియామి (56వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. సలీమా టెటె నాయకత్వంలో ఈ టోర్నీలో ఆడుతున్న భారత జట్టుకిది వరుసగా ఆరో విజయం కావడం విశేషం. లీగ్ దశలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నెగ్గిన టీమిండియా నాకౌట్ మ్యాచ్‌లోనూ గెలుపొందింది. నేడు జరిగే ఫైనల్లో పారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేత, ప్రస్తుత ఆసియా క్రీడల చాంపియన్ చైనా జట్టుతో భారత్ తలపడుతుంది. తొలి సెమీఫైనల్లో చైనా 3–1తో మలేసియాపై గెలిచింది. లీగ్ దశలో భారత జట్టు 3–0తో చైనాపై గెలిచింది. అదే ఫలితాన్ని నేడూ పునరావృతం చేస్తే భారత జట్టు మూడోసారి ఆసియా చాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను సొంతం చేసుకుంటుంది. అంతేకాకుండా దక్షిణ కొరియా (2010, 2011లలో) జట్టు తర్వాత వరుసగా రెండుసార్లు ఈ టైటిల్‌ను నెగ్గిన జట్టుగా భారత్ గుర్తింపు పొందుతుంది. గతంలో భారత జట్టు 2016, 2023లలో విజేతగా నిలిచింది. 2013, 2018లలో రన్నరప్ ట్రోఫీ సాధించింది. జపాన్‌తో జరిగిన సెమీఫైనల్లో భారత్ పూర్తి ఆధిపత్యం చలాయించింది. మ్యాచ్ మొత్తంలో భారత జట్టుకు 12 పెనాల్టీ కార్నర్లు లభించగా... ఒక్కదానిని కూడా టీమిండియా సద్వినియోగం చేసుకోలేకపోయింది. లేదంటే భారత గెలుపు ఆధిక్యం భారీగా ఉండేది. మరోవైపు జపాన్ కేవలం ఒక్క పెనాల్టీ కార్నర్కే పరిమితమైంది. -
చైనానూ చుట్టేసి...
రాజ్‌గిర్ (బిహార్): సొంతగడ్డపై భారత మహిళల హాకీ జట్టు తమ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఆసియా చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లో వరుసగా నాలుగో విజయం నమోదు చేసింది. పారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేత చైనా జట్టుతో శనివారం జరిగిన నాలుగో రౌండ్ లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు 3–0 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున సంగీత కుమారి (32వ నిమిషంలో), కెప్టెన్ సలీమా టెటె (37వ నిమిషంలో), దీపిక (60వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. మ్యాచ్ మొత్తంలో భారత జట్టుకు ఐదు పెనాల్టీ కార్నర్లు లభించాయి. ఇందులో చివరిదైన ఐదో పెనాల్టీ కార్నర్‌ను దీపిక గోల్‌గా మలిచింది. తమకు లభించిన ఏకైక పెనాల్టీ కార్నర్‌ను చైనా జట్టు వృథా చేసుకుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టుకు ఆరంభంలో గట్టిపోటీ లభించింది. తొలి రెండు క్వార్టర్లు ముగిసేసరికి ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. మూడో క్వార్టర్లో భారత క్రీడాకారిణులు ఒక్కసారిగా విజృంభించి ఐదు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ సాధించారు. చివరి నిమిషంలో దీపిక గోల్‌తో భారత్ విజయం సంపూర్ణమైంది. ఇతర నాలుగో రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో జపాన్ 2–1తో మలేసియాపై, కొరియా 4–0తో థాయ్‌లాండ్‌పై గెలిచాయి. ఆరు జట్ల మధ్య లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి 12 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. మూడు మ్యాచ్‌ల్లో నెగ్గిన చైనా జట్టు 9 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఈ రెండు జట్లకు ఇప్పటికే సెమీఫైనల్ బెర్త్‌లు ఖరారయ్యాయి. లీగ్‌లో టాప్ ర్యాంక్ అధికారికంగా ఖరారు కావాలంటే నేడు జపాన్‌తో జరిగే చివరిదైన ఐదో రౌండ్ లీగ్ మ్యాచ్‌ను (సాయంత్రం గం. 4:45 నుంచి) భారత జట్టు ‘డ్రా’ చేసుకుంటే చాలు. ఇప్పటి వరకు ఈ టోర్నీలో భారత జట్టు 23 గోల్స్ చేసి 2 గోల్స్ మాత్రమే సమర్పించుకుంది. మరోవైపు చైనా జట్టు 22 గోల్స్ చేసి, 4 గోల్స్‌ను ప్రత్యర్థి జట్లకు కోల్పోయింది. నేడు జరిగే ఇతర చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో థాయ్‌లాండ్‌తో మలేసియా (మధ్యాహ్నం గం. 12:15 నుంచి), దక్షిణ కొరియా జట్టుతో చైనా (మధ్యాహ్నం గం. 2:30 నుంచి) తలపడతాయి. -
అజేయంగా ‘ఆసియా’ విజేతగా
డిఫెండింగ్ చాంపియన్ హోదాకు తగినట్టుగానే టోర్నీలో ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ జయకేతనం ఎగురవేసిన భారత హాకీ జట్టు ఆసియా చాంపియన్స్ ట్రోఫీ (ఏసీటీ)లో వరుసగా రెండోసారి విజేతగా నిలిచింది. టైటిల్ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత్‌కు చైనాతో తుదిపోరు అందరు అనుకున్నంత సులువుగా సాగలేదు. భారత్ స్థాయికి ఏమాత్రం సరితూగని చైనా ప్రతి క్వార్టర్లోనూ ఊహించని విధంగా ప్రతిఘటించింది. దీంతో భారత్ గోల్ చేసేందుకు ఆఖరి క్వార్టర్ దాకా నిరీక్షించక తప్పలేదు. చివరకు జుగ్రాజ్ చేసిన గోల్‌తో టీమిండియా ఏసీటీలో ఓవరాల్‌గా ఐదో టైటిల్‌ను కైవసం చేసుకుంది. హలుంబుయిర్: పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన భారత హాకీ జట్టు ఆసియా చాంపియన్స్ ట్రోఫీ (ఏసీటీ)లో వరుసగా రెండోసారి విజేతగా నిలిచింది. చైనాలో జరిగిన ఈ ఈవెంట్లో పరాజయం ఎరుగని టీమిండియా జైత్రయాత్ర టైటిల్ నిలబెట్టుకునేదాకా అజేయంగా సాగింది. మంగళవారం జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా 1–0తో చైనా జట్టుపై గెలిచి టోర్నీ చరిత్రలో ఐదోసారి చాంపియన్‌షిప్‌ను సాధించింది. ఇప్పటి వరకు 8 ఏసీటీ ఈవెంట్లు జరిగితే ఇందులో అత్యధికంగా ఐదుసార్లు భారత్ 2011, 2016, 2018 (పాక్‌తో కలిసి సంయుక్త విజేత), 2023లలో విజేతగా నిలవడం విశేషం. డిఫెండర్ జుగ్రాజ్ సింగ్ ఆఖరి క్వార్టర్లోని 51వ నిమిషంలో చేసిన ఫీల్డ్ గోల్‌తో భారత్ విజయం సాధించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో గానీ, ఆటతీరులో గానీ సాటిరాని చైనా జట్టు ఫైనల్లో హర్మన్‌ప్రీత్ సేనకు ఊహించని విధంగా పోటీ ఇచ్చింది. ఈ టోర్నీలో లీగ్ దశ పోటీల్లో 3–0తో చైనా, 5–1తో జపాన్, 8–1తో మలేసియా, 3–1తో కొరియా, 2–1తో పాకిస్తాన్లను ఓడించిన భారత్ సెమీస్‌లో 4–1 కొరియాను ఓడించి టైటిల్‌పోరుకు చేరింది. దీంతో సులువైన ప్రత్యర్థి చైనాపై కనీసం రెండు, మూడు గోల్స్ తేడాతో విజయం ఖాయమని విశ్లేషకులు, అభిమానులు భావించారు. కానీ వారి అంచనాలన్నీ తారుమారయ్యాయి. తుదిపోరులో కేవలం ఒకే ఒక్క గోల్ తేడాతో భారత్ గెలిచింది. చైనా డిఫెండర్లు భారత స్ట్రయికర్లను సమర్థంగా నిలువరించారు. దీంతో ఈ టోర్నీలోనే అతి తక్కువ గోల్స్ తేడాతో, భారత్ గెలిచిన మ్యాచ్ ఇదే కావడం గమనార్హం! మూడు క్వార్టర్ల పాటు... చైనా డిఫెండర్ల ఆటతీరు భారత ఫార్వర్డ్ లైన్‌కు గోడకట్టినట్లుగా సాగింది. మూడు క్వార్టర్ల పాటు ప్రత్యర్థి రక్షణ శ్రేణి భారత సేనను సమర్థవంతంగా నిలువరించింది. భారత్ ప్రత్యర్థి గోల్ పోస్ట్ లక్ష్యంగా చేసిన దాడులన్నీ చైనా ఆటగాళ్ల పోరాటపటిమతో విఫలమయ్యాయి. నిజానికి ఇప్పటివరకు ఎన్నో ఫైనల్స్ ఆడిన చరిత్ర భారత్‌ది కాగా... చైనాకు మాత్రం ఇది రెండో టైటిల్ పోరు. 2006 ఆసియా క్రీడల ఫైనల్లో చైనా 1–3తో కొరియా చేతిలో ఓడింది. ఫైనల్స్ మ్యాచ్‌ల అనుభవం తక్కువే అయినా ప్రదర్శనతో చైనా ఆకట్టుకుంది. ఆట ఆరంభం నుంచి భారత స్ట్రయికర్లను ఎక్కడికక్కడ నిలువరించడంతో రాజ్ కుమార్, కెపె్టన్ హర్మన్‌ప్రీత్, నీలకంఠ శర్మ తొలి క్వార్టర్లో కొట్టిన టార్గెట్ షాట్లు నిరీ్వర్యమయ్యాయి. రెండో క్వార్టర్లోనూ ఇదే ఆటతీరు కొనసాగింది. 27వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచేందుకు సుఖ్జీత్ సింగ్, హర్మన్‌ప్రీత్‌లు చేసిన ప్రయత్నాల్ని చైనా గోల్‌కీపర్ వాంగ్ వీహావొ చాకచక్యంగా అడ్డుకున్నాడు. ఎట్టకేలకు ఆఖరి క్వార్టర్లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ వద్దకు వచ్చిన బంతిని నేర్పుగా చైనా డిఫెండర్లను ఏమార్చుతూ డి ఏరియా వద్ద అప్రమత్తంగా ఉన్న జుగ్‌రాజ్‌కు పాస్ చేశాడు. అతను ఎలాంటి పొరపాటుకు తావివ్వకుండా బంతిని గోల్‌పోస్టులోకి తరలించడంతో భారత్ శిబిరం ఎట్టకేలకు సంబరాల్లో మునిగింది. వర్గీకరణ పోరులో పాకిస్తాన్ 5–2తో కొరియాను ఓడించి మూడో స్థానంలో నిలిచింది. వైఎస్ జగన్ ప్రశంస: ఆసియా చాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన భారత జట్టును ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. -
ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీ విజేతగా భారత్..
ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీ-2024 విజేతగా భారత్ నిలిచింది. మంగళవారం జరిగిన ఫైనల్లో చైనాను 1-0 తేడాతో ఓడించిన భారత్.. వరుసగా రెండోసారి టైటిల్‌ను ముద్దాడింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన తుది పోరులో చివరి క్వార్టర్లో గోల్‌కొట్టిన జుగ్రాజ్ సింగ్.. టీమిండియాను ఛాంపియన్‌గా నిలిపాడు.తొలి మూడు క్వార్టర్స్‌లోనూ ఇరు జట్ల డిఫెండర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. మూడు క్వార్టర్స్ ముగిసే సరికి భారత్-చైనా జట్లు కనీసం ఒక్క గోల్ కూడా సాధించలేకపోయాయి. ఆఖరికి నాలుగో క్వార్టర్ 51వ నిమిషంలో డిఫెండర్ జుగ్రాజ్ సింగ్ అద్భుతమైన ఫీల్డ్ గోల్‌తో భారత్‌కు విజయాన్ని అందించాడు.ఐదో సారి..కాగా టీమిండియా ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీని సొంతం చేసుకోవడం ఇది ఐదోసారి. 2011, 2016, 2018, 2021 టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది. కాగా భారత హాకీ జట్టు ప్యారిస్ ఒలిపింక్స్‌లో కూడా సత్తాచాటింది. కాంస్య పతకంతో హర్మన్‌ప్రీత్ సింగ్ సేన మెరిసింది. Full TimeHero Asian Champions Trophy Moqi China 2024#hact2024#asiahockey pic.twitter.com/zHqk9A1LNN— Asian Hockey Federation (@asia_hockey) September 17, 2024 -
కొరియాను కొట్టేసి...
ఆద్యంతం తమ ఆధిపత్యం కనబరిచిన భారత పురుషుల హాకీ జట్టు ఆసియా చాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు విజయం దూరంలో నిలిచింది. కెపె్టన్ హర్మన్‌ప్రీత్ సింగ్ మరోసారి జట్టును ముందుండి నడిపించగా... ఇతర ఆటగాళ్లు కూడా రాణించడంతో ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత జైత్రయాత్ర కొనసాగుతోంది. లీగ్ దశలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన టీమిండియా నాకౌట్ దశ సెమీఫైనల్ మ్యాచ్‌లోనూ అదే జోరు కనబరిచింది. తనదైన రోజున ఎంతటి మేటి జట్టునైనా ఓడించే సత్తాగల దక్షిణ కొరియాతో జరిగిన సెమీఫైనల్ పోరులో భారత్ ఏకపక్ష విజయాన్ని అందుకుంది. 13 ఏళ్ల చరిత్ర కలిగిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో ఆరోసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. నేడు జరిగే టైటిల్ పోరులో చైనాతో భారత్ అమీతుమీ తేల్చుకుంటుంది. హులున్‌బుయిర్ (చైనా): డిఫెండింగ్ చాంపియన్ హోదాకు తగ్గట్టు ఆడిన భారత పురుషుల హాకీ జట్టు ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో అంతిమ సమరానికి అర్హత సాధించింది. సోమవారం జరిగిన సెమీఫైనల్లో హర్మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టు 4–1 గోల్స్ తేడాతో దక్షిణ కొరియా జట్టును ఓడించింది. భారత్ తరఫున కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు గోల్స్ (19వ, 45వ నిమిషంలో) సాధించగా... ఉత్తమ్ సింగ్ (13వ నిమిషంలో), జర్మన్‌ప్రీత్ సింగ్ (32వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. కొరియా జట్టుకు యాంగ్ జిహున్ (33వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు. ఆరంభం నుంచే... అటాకింగ్ ఆటకు ప్రసిద్ధి అయిన కొరియాతో మ్యాచ్‌లో భారత్ పక్కా వ్యూహంతో ఆడింది. ప్రత్యర్థి జట్టుకు ఎదురుదాడులు చేసే అవకాశం ఇవ్వకుండా హర్మన్‌ప్రీత్ బృందం ఆరంభం నుంచే సమన్వయంతో ముందుకు కదులుతూ కొరియా గోల్‌పోస్ట్ లక్ష్యంగా దాడులు చేసింది. దాంతో భారత ఫార్వర్డ్ ఆటగాళ్లను నిలువరించడంపైనే కొరియా ఆటగాళ్లు ఎక్కువ దృష్టి పెటాల్సి వచి్చంది. ఆట నాలుగో నిమిషంలోనే భారత్ ఖాతా తెరిచేది. అభిషేక్ కొట్టిన రివర్స్ షాట్‌ను కొరియా గోల్‌కీపర్ కిమ్ జేహన్ నిలువరించాడు. ఆ తర్వాత కూడా భారత్ తమ దాడులు కొనసాగించగా 13వ నిమిషంలో ఫలితం వచి్చంది. అరిజిత్ సింగ్ హుండల్ అందించిన పాస్‌ను ‘డి’ ఏరియాలో అందుకున్న ఉత్తమ్ సింగ్ దానిని లక్ష్యానికి చేర్చాడు. ఆ తర్వాత కొరియా దూకుడు పెంచి నిమిషం వ్యవధిలో రెండు పెనాల్టీ కార్నర్లు సంపాదించింది. అయితే ఈ రెండింటిని భారత రక్షణపంక్తి ఆటగాళ్లు నిర్వీర్యం చేశారు. రెండో క్వార్టర్లో నాలుగు నిమిషాలు గడిచాక భారత్‌కు లభించిన తొలి పెనాల్టీ కార్నర్‌ను హర్మన్‌ప్రీత్ గోల్‌గా మలచడంతో భారత ఆధిక్యం 2–0కు పెరిగింది. మూడో క్వార్టర్లో సుమిత్ అందించిన పాస్‌ను సర్కిల్ బయట అందుకున్న జర్మన్‌ప్రీత్ సింగ్ ‘డి’ ఏరియాలోనికి వచ్చి కొరియా గోల్కీపర్ను బోల్తా కొట్టించడంతో భారత్ ఖాతాలో మూడో గోల్ చేరింది. ఈ గోల్ తర్వాత కొరియాకు దక్కిన పెనాల్టీ కార్నర్‌ను యాంగ్ జిహున్ లక్ష్యానికి చేర్చాడు. కొరియా ఖాతా తెరిచినప్పటికీ భారత్ తమ దాడులను యధేచ్చగా కొనసాగించింది. 45వ నిమిషంలో భారత్‌కు లభించిన పెనాల్టీ కార్నర్‌ను హర్మన్ గోల్‌గా మలిచాడు. దాంతో భారత ఆధిక్యం 4–1కు చేరుకుంది. మూడు గోల్స్ ఆధిక్యం పొందిన భారత్ ఆ తర్వాత నియంత్రణతో ఆడి కొరియాను కట్టడి చేసి విజయాన్ని ఖరారు చేసుకుంది. పాక్‌కు చైనా షాక్ అంతకుముందు జరిగిన తొలి సెమీఫైనల్లో ఆతిథ్య చైనా జట్టు అద్భుతం చేసింది. రెండుసార్లు చాంపియన్ పాకిస్తాన్ జట్టును మట్టికరిపించి తొలిసారి ఈ టోరీ్నలోఫైనల్కు చేరుకుంది. నిరీ్ణత సమయం ముగిసేసరికి రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్’ నిర్వహించగా పాకిస్తాన్ ఆటగాళ్లు వరుసగా నాలుగు షాట్లలో విఫలమయ్యారు. చైనా రెండు షాట్లను వృథా చేసినా మిగతా రెండు షాట్లను గోల్‌గా మలిచి చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. -
భారత్ ఖాతాలో వరుసగా నాలుగో విజయం
ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీమెంట్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ వరుసగా నాలుగో విజయం నమోదు చేసింది. దక్షిణ కొరియాతో ఇవాళ (సెప్టెంబర్ 12) జరిగిన మ్యాచ్‌లో భారత్ 3-1 గోల్స్ తేడాతో గెలుపొందింది. భారత్ తరఫున కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు, స్ట్రయికర్ అరైజీత్ సింగ్ హుండల్ ఓ గోల్ చేశారు. కొరియా చేసిన ఏకైక గోల్‌ను జిహున్ యంగ్ సాధించాడు. భారత్ తమ తదుపరి లీగ్ మ్యాచ్‌లో దాయాది పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 14న జరుగనుంది. భారత్ ఈ టోర్నీలో ఇదివరకే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. టీమిండియా.. తమ తొలి మ్యాచ్‌లో చైనాపై 3-1 గోల్స్ తేడాతో.. రెండో మ్యాచ్‌లో జపాన్‌పై 5-1 గోల్స్ తేడాతో.. మూడో మ్యాచ్‌లో మలేసియాపై 8-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. భారత్ ఈ టోర్నీలో జయకేతనం ఎగురవేసి రికార్డు స్థాయిలో వరుసగా ఐదోసారి టైటిల్ కైవసం చేసుకోవాలని భావిస్తుంది. -
రాజ్ కుమార్ హ్యాట్రిక్.. ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌లో భారత్
చైనా వేదికగా జరుగుతున్న హీరో ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ టోర్నీలో భారత్ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. తొలి మ్యాచ్‌లో చైనాను 3-0 తేడాతో మట్టికరిపించిన భారత్.. రెండో మ్యాచ్‌లో జపాన్ను 5-1 తేడాతో చిత్తు చేసింది. తాజాగా మలేసియాపై 8-1 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ సెమీఫైనల్స్‌కు అర్హత సాధించింది.రాజ్ కుమార్ హ్యాట్రిక్మలేసియాతో మ్యాచ్‌లో రాజ్ కుమార్ పాల్ హ్యాట్రిక్ గోల్స్ సాధించాడు. ఆట 3, 25, 33వ నిమిషాల్లో రాజ్ కుమార్ గోల్స్ చేశాడు. భారత్ తరఫున రాజ్ కుమార్‌తో పాటు అరైజీత్ సింగ్ హుండల్ 6, 39 నిమిషంలో, జుగ్రాజ్ సింగ్ 7వ నిమిషంలో, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ 22వ నిమిషంలో, ఉత్తమ్ సింగ్ 40వ నిమిషంలో గోల్స్ సాధించారు. మలేసియా సాధించిన ఏకైక గోల్‌ను అకీముల్లా అనువర్ 34వ నిమిషంలో సాధించాడు.ఈ టోర్నీలో భారత్ తమ తదుపరి మ్యాచ్‌ల్లో కొరియా, పాకిస్తాన్లతో తలపడనుంది. కొరియాతో మ్యాచ్ సెప్టెంబర్ 12న.. పాక్‌తో మ్యాచ్ సెప్టెంబర్ 14న జరుగనున్నాయి. చదవండి: స్టిమాక్ కాంట్రాక్ట్ పునరుద్ధరణపై ఏఐఎఫ్ఎఫ్ విచారణ -
మూడో ర్యాంక్‌లో భారత హాకీ జట్టు
న్యూఢిల్లీ: స్వదేశంలో తొలిసారి జరిగిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన భారత పురుషుల జట్టు ర్యాంక్ కూడా మెరుగైంది. ఆదివారం విడుదల చేసిన అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) తాజా ర్యాంకింగ్స్‌లో భారత జట్టు ఒక స్థానం పురోగతి సాధించి నాలుగు నుంచి మూడో ర్యాంక్‌కు ఎగబాకింది. హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత జట్టు ఖాతాలో 2771.35 పాయింట్లు ఉన్నాయి. 2021 తర్వాత భారత జట్టు మరోసారి మూడో ర్యాంక్‌లో నిలిచింది. 2021లో టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన తర్వాత భారత జట్టు మూడో ర్యాంక్‌కు చేరింది. నెదర్లాండ్స్ జట్టు 3095.90 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా, 2917.87 పాయింట్లతో బెల్జియం రెండో ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. ఇంగ్లండ్ మూడు నుంచి నాలుగో స్థానానికి చేరగా... జర్మనీ, ఆ్రస్టేలియా వరుసగా ఐదు, ఆరో ర్యాంక్‌ల్లో ఉన్నాయి. తొలిసారి ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో రన్నరప్‌గా నిలిచిన మలేసియా జట్టు తొమ్మిదో స్థానంలో ఉంది. హాకీ ఇండియా నజరానా ఆసియా చాంపియన్స్ ట్రోఫీ విజేత భారత జట్టుకు హాకీ ఇండియా నజరానా ప్రకటించింది. జట్టులోని ప్రతి సభ్యుడికి రూ. 3 లక్షల చొప్పున... శిక్షణ బృందంలోని ప్రతి సభ్యుడికి రూ. లక్షా 50 వేల చొప్పున నగదు పురస్కారం అందజేస్తారు. -
ఫైనల్ బెర్త్ లక్ష్యంగా...
చెన్నై: ఫైనల్ బెర్తే లక్ష్యంగా భారత హాకీ జట్టు సన్నద్ధమైంది. ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో శుక్రవారం జరిగే సెమీఫైనల్లో హర్మన్‌ప్రీత్ బృందం జపాన్ జట్టుతో తలపడుతుంది. ఈ టోరీ్నలో ఇప్పటివరకు ఓటమెరుగని భారత జట్టే ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఈ టోర్నీలో అందరిపై అధిపత్యం కనబరిచింది... గెలిచింది. కానీ ఇలాంటి అజేయమైన భారత్‌ను నిలువరించింది మాత్రం జపానే! లీగ్ దశలో ఇరుజట్ల పోరు 1–1తో డ్రాగా ముగిసింది. ఇప్పుడు నాకౌట్ దశలో జరిగే ఈ పోరులో ఎవరు గెలిస్తే వాళ్లే టైటిల్ ఫేవరెట్ కావడం ఖాయం. గతంలో జపాన్ చేతిలో భారత్‌కు చేదు అనుభవం ఉంది. 2021లో బంగ్లాదేశ్‌లో జరిగిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో లీగ్ దశలో టీమిండియా 6–0తో జపాన్ను చిత్తు చేసినప్పటికీ తీరా సెమీస్‌కు వచ్చేసరికి వారి చేతిలో 3–5తో ఓడి ఇంటికొచ్చింది. ఇప్పుడు సమష్టి ఆటతీరుతో బదులు తీర్చుకుంటుందా లేదంటే స్వదేశంలోనూ గత అనుభవాన్నే చవిచూస్తుందా అనేది ఇంకొన్ని గంటల్లో తేలుతుంది. చివరి లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను 4–0తో చిత్తు చేసి జోరుమీదున్న భారత్ పట్టుదలగా ఆడితే విజయం ఏమంత కష్టం కానేకాదు. మరో సెమీఫైనల్లో మలేసియాతో దక్షిణ కొరియా తలపడుతుంది. 5–6 స్థానాల కోసం పాకిస్తాన్, చైనా జట్లు తలపడతాయి. -
Ind Vs Pak: పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించిన భారత్
చెన్నై: గత ఏడేళ్లుగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టు చేతిలో ఓటమి ఎరుగని భారత హాకీ జట్టు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బుధవారం పాకిస్తాన్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 4–0 గోల్స్‌తో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున కెపె్టన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (15వ, 23వ ని.లో) రెండు గోల్స్ చేయగా... జుగ్రాజ్ (36వ ని.లో), ఆకాశ్‌దీప్ (55వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. భారత జట్టుకు ఐదు పెనాల్టీ కార్నర్లు రాగా ఇందులో మూడింటిని గోల్స్‌గా మలి చింది. ఇతర లీగ్ మ్యాచ్‌ల్లో జపాన్ 2–1తో చైనాపై, మలేసియా 1–0తో కొరియాపై నెగ్గాయి. పాక్‌పై విజయంతో ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో లీగ్ దశ ముగిశాక భారత్ 13 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచింది. 12 పాయింట్లతో మలేసియా రెండో స్థానంలో, 5 పాయింట్లతో దక్షిణ కొరియా, జపాన్, పాకిస్తాన్ సంయుక్తంగా మూడో స్థానంలో, ఒక పాయింట్‌తో చైనా చివరి స్థానంలో నిలిచాయి. కొరియా, జపాన్, పాక్ ఐదు పాయింట్లతో సమంగా ఉన్నా... మెరుగైన గోల్స్ అంతరంతో కొరియా, జపాన్ జట్లకు సెమీఫైనల్ బెర్త్‌లు ఖరారయ్యాయి. దాంతో మాజీ చాంపియన్ పాకిస్తాన్ సెమీఫైనల్ చేరలేకపోయింది. శుక్రవారం 5–6 స్థానాల కోసం జరిగే వర్గీకరణ మ్యాచ్‌లో చైనాతో పాకిస్తాన్...సెమీఫైనల్స్ లో కొరియాతో మలేసియా; జపాన్‌తో భారత్ ఆడతాయి. -
భారత్ ఘనవిజయం
చెన్నై: ఆసియా చాంపియన్స్ ట్రోఫీ పురుషుల హాకీ టోర్నీలో ఆతిథ్య భారత జట్టు ఖాతాలో రెండో విజయం చేరింది. మలేసియాతో ఆదివారం జరిగిన మూడో లీగ్ మ్యాచ్ హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని టీమిండియా 5–0 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున సెల్వం కార్తీ (15వ ని.లో), హార్దిక్ సింగ్ (32వ ని.లో), హర్మన్‌ప్రీత్ సింగ్ (42వ ని.లో), గుర్జంత్ సింగ్ (53వ ని.లో), జుగ్రాజ్ సింగ్ (54వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. భారత్‌కు మొత్తం తొమ్మిది పెనాల్టీ కార్నర్లు రాగా అందులో మూడింటిని సది్వనియోగం చేసుకుంది. నేడు జరిగే నాలుగో లీగ్ మ్యాచ్‌లో దక్షిణ కొరియాతో భారత్ ఆడుతుంది. ఆదివారం జరిగిన మిగతా రెండు మ్యాచ్‌లు ‘డ్రా’ అయ్యాయి. చైనా–కొరియా 1–1తో, పాకిస్తాన్–జపాన్ 3–3తో ‘డ్రా’ చేసుకున్నాయి. -
భారత్, జపాన్ మ్యాచ్ ‘డ్రా’
చెన్నై: ఆసియా చాంపియన్స్ ట్రోఫీ పురుషుల హాకీ టోర్నమెంట్లో భారత్ తమ రెండో మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. శుక్రవారం జపాన్‌తో జరిగిన మ్యాచ్ 1–1తో ‘డ్రా’గా ముగిసింది. ఇరు జట్ల ఆటగాళ్లు ఆరంభం నుంచే పట్టుదల కనబరచడంతో మ్యాచ్ ఆఖరిదాకా పోటాపోటీగా సాగింది. రెండో క్వార్టర్ ముగిసే దశలో జపాన్‌కు లభించిన పెనాల్టీ కార్నర్‌ను కెన్ నగయొషి (28వ ని.లో) గోల్‌గా మలచడంతో జపాన్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం మూడో క్వార్టర్లో భారత్‌కు లభించిన పెనాల్టీ కార్నర్‌ను కెప్టెన్ హర్మన్‌ప్రీత్ ఎలాంటి పొరపాటుకు తావివ్వకుండా గోల్‌పోస్ట్‌లోకి నెట్టాడు. స్కోరు సమం కాగా... ఆఖరి క్వార్టర్లో మరో గోల్ నమోదు కాలేదు. ఇతర మ్యాచ్‌ల్లో మలేసియా 5–1తో చైనాపై ఘనవిజయం సాధించగా... డిఫెండింగ్ చాంపియన్ దక్షిణ కొరియా, పాకిస్తాన్ల మధ్య జరిగిన పోరు కూడా 1–1తో ‘డ్రా’ అయ్యింది. ఆదివారం జరిగే తదుపరి లీగ్ మ్యాచ్‌లో భారత్... మలేసియాతో తలపడుతుంది. -
‘కరోనా’తో తప్పుకున్న భారత్!
డాంఘె (కొరియా): మహిళల ఆసియా చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన భారత హాకీ జట్టును కరోనా కారణంగా టోర్నీ నుంచి తప్పిస్తున్నట్లు ఆసియా హాకీ సమాఖ్య (ఏహెచ్ఎఫ్) గురువారం ప్రకటించింది. జట్టులో ఒకరికి కరోనా సోకడంతో ఏహెచ్ఎఫ్ ఈ నిర్ణయం తీసుకుంది. దక్షిణ కొరియాతో మ్యాచ్‌కు ముందు భారత జట్టులో ఒకరికి కరోనా సోకడంతో ఆ మ్యాచ్‌ను రద్దు చేశారు. ఇదే కారణంగా మలేసియా కూడా టోర్నీ నుంచి విరమించుకుంది. చదవండి: Ravi Shastri: వన్డే వరల్డ్‌కప్ 2019.. అంబటిని జట్టులోకి తీసుకోవాల్సింది.. కానీ సెలక్టర్లే.. -
మేం ఆడాలనుకున్నాం: పాక్ ..కాదు...వాళ్లే వద్దన్నారు: భారత్
న్యూఢిల్లీ: ఇటీవల ముగిసిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌తో కలిసి సంయుక్త విజేతగా నిలిచిన పాకిస్తాన్ వక్రబుద్ధిని చాటుకుంది. వర్షం అనంతరం మ్యాచ్ ఆడేందుకు తాము సిద్ధంగా ఉన్నా... భారత్ విముఖత చూపిందని పాకిస్తాన్ కోచ్ హసన్ సర్దార్ బుధవారం తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. దీన్ని హాకీ ఇండియా (హెచ్ఐ) అదే స్థాయిలో తిప్పికొట్టింది. ‘ ‘భారీ వర్షం కురిసిన అనంతరం కూడా మా కుర్రాళ్లు ఆడేందుకు సిద్ధంగానే ఉన్నారు. అదే విషయాన్ని మేము నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లాం. కానీ అలాంటి స్థితిలో ఆడేందుకు భారత ఆటగాళ్లు నిరాకరించారు’ అని బుధవారం కరాచీలో హసన్ సర్దార్ వ్యాఖ్యానించాడు. దీన్ని తీవ్రంగా పరిగణించిన హెచ్ఐ అధికారులు హసన్ ఆరోపణలను తోసిపుచ్చారు. ‘ఇది పచ్చి అబద్ధం. తెల్లవారుజామున 3 గంటలకు పాకిస్తాన్ జట్టు కరాచీకి తిరుగు ప్రయాణం కావాల్సి ఉంది. అందుకే వాళ్లు ఆడేందుకు నిరాకరించారు. మా విమానం మరుసటి రోజు అక్కడి నుంచి బయలుదేరింది. అలాంటిది మాకు అభ్యంతరం ఏముంటుంది’ అని వివరించారు. -
ట్రోఫీ మనకు... పతకాలు వారికి!
మస్కట్ (ఒమన్): ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీలో సంయుక్త విజేతలుగా నిలిచిన భారత్, పాకిస్తాన్ జట్లకు ఆశ్చర్యకరరీతిలో బహుమతి పంపకం జరిగింది. ఫైనల్ మ్యాచ్ రద్దు అనంతరం ట్రోఫీ అందించేందుకు నిర్వాహకులు టాస్ వేశారు. టాస్ గెలిచిన భారత్‌కు ట్రోఫీని అందజేశారు. రెండేళ్లకు ఒకసారి ఈ టోర్నీ జరుగనుండగా... తొలి సంవత్సరం పాటు ట్రోఫీ మన వద్దే ఉంటుంది. రెండో సంవత్సరం పాకిస్తాన్ తీసుకువెళుతుంది. ఈసారి ట్రోఫీ మనకు దక్కడంతో ఫైనల్ విజేతలకు ఇచ్చే స్వర్ణ పతకాలు పాకిస్తాన్ ఆటగాళ్లకు అందించారు. అయితే బహుమతి ప్రదానోత్సవ సమయంలో మాత్రం ముందుగా సిద్ధం చేసుకున్న విధంగా రన్నరప్‌కు ఇచ్చే రజత పతకాలను మాత్రం భారత ఆటగాళ్ల మెడలో వేశారు! త్వరలోనే భారత జట్టు సభ్యులకు కూడా స్వర్ణ పతకాలు పంపిస్తామని ఆసియా హాకీ ఫెడరేషన్ సీఈ దాటో తయ్యబ్ ఇక్రామ్ చెప్పారు. భారత ఆటగాడు ఆకాశ్‌దీప్ సింగ్ ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డు గెలుచుకోగా, పాకిస్తాన్‌కు చెందిన మహమూద్ ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ టోర్నమెంట్’గా నిలిచాడు. నవంబర్ 28 నుంచి సొంతగడ్డపై జరిగే ప్రపంచ కప్‌కు ముందు భారత జట్టుకు ఇదే ఆఖరి టోర్నీ. మరోవైపు భువనేశ్వర్‌లో జరిగే ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి టాటా స్టీల్ అధికారిక భాగస్వామిగా ఉండేందుకు ముందుకు వచ్చింది. ప్రపంచంలో పదో అతి పెద్ద ఉక్కు ఉత్పత్తి సంస్థ అయిన టాటా స్టీల్‌కు గతంలోనూ హాకీతో అనుబంధం ఉంది. ప్రైవేట్ రంగంలో తొలి హాకీ అకాడమీని ఏర్పాటు చేసిన ఘనత ఈ సంస్థదే. -
మన్‌ప్రీత్‌కు పగ్గాలు
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో భారత నిరాశాజనక ప్రదర్శనకు కెప్టెన్ పీఆర్ శ్రీజేష్ మూల్యం చెల్లించుకున్నాడు. ఏషియాడ్‌లో స్వర్ణం సాధించి 2020 టోక్యో ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని జారవిడుచుకున్న భారత్... చివరకు కాంస్యంతోనే సరిపెట్టుకుంది. దాంతో వచ్చే నెలలో జరిగే ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టు సారథ్య బాధ్యతల నుంచి గోల్‌కీపర్ శ్రీజేష్ను తప్పించారు. శ్రీజేష్ స్థానంలో మిడ్‌ఫీల్డర్ మన్‌ప్రీత్ సింగ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. అక్టోబరు 18 నుంచి మస్కట్‌లో జరిగే ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌తోపాటు పాకిస్తాన్, మలేసియా, దక్షిణ కొరియా, జపాన్, ఒమన్ పాల్గొంటాయి. 18 మంది సభ్యులుగల భారత జట్టులో 20 ఏళ్ల హార్దిక్ సింగ్‌కు తొలిసారి స్థానం లభించింది. చింగ్లేన్‌సనా సింగ్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. భారత హాకీ జట్టు: మన్‌ప్రీత్ సింగ్ (కెప్టెన్), చింగ్లేన్‌సనా సింగ్ (వైస్ కెప్టెన్), పీఆర్ శ్రీజేష్, కృషన్ బహదూర్ పాఠక్ (గోల్‌కీపర్లు), హర్మన్‌ప్రీత్ సింగ్, గురీందర్ సింగ్, కొతాజిత్ సింగ్, ఆకాశ్‌దీప్ సింగ్, గుర్జంత్ సింగ్, మన్దీప్ సింగ్, దిల్‌ప్రీత్ సింగ్, జర్మన్‌ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్, సురేంద్ర కుమార్, వరుణ్ కుమార్, సుమీత్, నీలకంఠ శర్మ, లలిత్ ఉపాధ్యాయ్. -
భారత మహిళల జైత్రయాత్ర
డాంఘయీ సిటీ (దక్షిణ కొరియా): డిఫెండింగ్ చాంపియన్ భారత మహిళల జట్టు తమ జైత్రయాత్ర కొనసాగిస్తూ... ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందిన సునీత లాక్రా బృందం గురువారం జరిగిన మూడో మ్యాచ్‌లో 3–2 గోల్స్ తేడాతో మలేసియాపై విజయం సాధించింది. టోర్నీ ప్రారంభానికి ముందు నిర్వహించిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో 6–0 తో మలేసియాను మట్టికరిపించిన భారత్ ఈ మ్యాచ్‌లోనూ ఆధిపత్యం చలాయించింది. భారత్ తరఫున గుర్జిత్ కౌర్ (17వ ని.లో), వందన కటారియా (33వ ని.లో), లాల్రేమ్సియామి (40వ ని.లో) తలా ఓ గోల్ చేశారు. మలేసియా తరఫున నురైనీ రషీద్ (36వ ని.లో), హనీస్ (48వ ని.లో) చెరో గోల్ చేశారు. నామమాత్రమైన చివరి లీగ్ మ్యాచ్‌లో శనివారం ఆతిథ్య కొరియాతో భారత్ ఆడనుంది. -
బెలారస్‌పై భారత్ ఘనవిజయం
భోపాల్: ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత మహిళా హాకీ జట్టు బెలారస్‌పై 5–1తో ఘనవిజ యం సాధించింది. మ్యాచ్‌లో నవజోత్ కౌర్ చేసిన రెండు గోల్స్‌తో భారత్ ఖాతా తెరిచింది. 11వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ని గోల్‌గా మలిచిన నవజోత్ ఆ వెంటనే 15వ నిమిషంలో చక్కని ఫీల్డ్ గోల్‌తో భారత్‌ను 2–0 ఆధిక్యంలోకి తీసుకువెళ్లింది. ఈ సమయంలో బెలారస్ ఆటగాళ్ల డిఫెన్స్‌ను ఛేదిస్తూ పూన మ్ బర్ల (29వ నిమిషం) మరో చక్కనిగోల్తో భారత స్కోర్‌ను మూడుకి పెంచింది. బెలారస్ క్రీడాకారిణి స్వెత్లానా బహుషివిచ్ (37వ నిమిషం) గోల్ చేసి ఆధిక్యాన్ని 3–1కి తగ్గించినా... చివర్లో ఎక్కా (57వ ని.), గుర్జిత్‌కౌర్ (60వ ని.)లు పెనాల్టీకార్నర్లతో భారత్‌కు ఘనమైన ముగింపునిచ్చారు. -
భారత హాకీ జట్టుకు ఘనస్వాగతం
బెంగళూరు: చిరకాల శత్రువు పాకిస్తాన్‌ను ఓడించి ఆసియా చాంపియన్స ట్రోఫీ నెగ్గిన భారత హాకీ జట్టుకు స్వదేశంలో ఘనస్వాగతం లభించింది. జట్టు కెప్టెన్ పీఆర్ శ్రీజేష్, నికిన్ తిమ్మయ్య గత రాత్రి కౌలాలంపూర్ నుంచి బెంగళూరు చేరుకున్నారు. వీరికి విమానాశ్రయంలో అభిమానుల నుంచి భారీ ఆదరణ లభించింది. మరోవైపు ఈ విజయాన్ని ఉడీ ఉగ్రవాదుల దాడిలో మరణించిన అమర జవాన్ల కుటుంబాలకు అంకితమిస్తున్నట్టు శ్రీజేష్ తెలిపాడు. ‘భారత సైనికులకు దీపావళి బహుమతిగా ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాం. కచ్చితంగా వారు ఈ విజయాన్ని చూసి పొంగిపోరుు ఉంటారు. పాక్‌తో ఆడేటప్పుడు మాలో భావోద్వేగాలున్నా మ్యాచ్‌పై ఎక్కువగా దృష్టి పెట్టాం. అలాగే సోషల్ మీడియాకు దూరంగా ఉన్నాం. మొత్తం ఏడు మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు, ఓ డ్రా చేసుకున్న భారత జట్టు ఆసియా స్థారుులో అత్యంత పటిష్టంగా ఉంది’ అని శ్రీజేష్ పేర్కొన్నాడు. -
మువ్వన్నెలు మురిసేలా..
► ఆసియా చాంపియన్స ట్రోఫీ విజేతగా భారత్ ► ఫైనల్లో 3-2తో పాకిస్తాన్‌పై విజయం ► ఒక్కో ఆటగాడికి రూ.2 లక్షల నజరానా దేశం మొత్తం దీపావళి పర్వదినాన వెలిగిపోతున్న వేళ... భారత హాకీ జట్టు ఆ వెలుగును రెట్టింపు చేసింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను చిత్తు చేసి ఆసియా చాంపియన్స ట్రోఫీ విజేతగా అవతరించింది. దేశంలో సెలబ్రిటీలంతా సైనికులకు పండగ సందేశాలను పంపుతుంటే... హాకీ జట్టు ఈ గెలుపును సైనికులకు అంకితం చేసింది. చాలా కాలం తర్వాత జాతీయ క్రీడలో ఓ గొప్ప విజయంతో మువ్వన్నెలు మురిశారుు. పండుగ రోజు దేశం యావత్తు మరింత సంబరపడింది. కౌంటాన్ (మలేసియా): ఆసియా చాంపియన్స హాకీ టోర్నమెంట్లో భారత జట్టు రెండోసారి విజేతగా నిలిచింది. ఆదివారం హోరాహోరీగా జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ పాకిస్తాన్‌ను 3-2తో ఓడించి భారతీయుల దీపావళి ఆనందాన్ని రెట్టింపు చేసింది. అటు లీగ్ దశలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని చూసిన పాక్‌కు భారత ఆటగాళ్ల వీరోచిత ఆటతో మరోసారి భంగపాటు ఎదురైంది. రూపిందర్ పాల్ సింగ్ (18వ నిమిషంలో), యూసుఫ్ అఫ్ఫాన్ (23), నిఖిల్ తిమ్మయ్య (51) భారత్‌కు గోల్స్ అందించారు. పాకిస్తాన్ నుంచి ముహమ్మద్ అలీమ్ బిలాల్ (26), అలీ షాన్ (38) గోల్స్ చేశారు. 2011లో జరిగిన ప్రారంభ టోర్నమెంట్ ఫైనల్లోనూ భారత జట్టు పాకిస్తాన్నే ఓడించి తొలి చాంపియన్‌గా నిలిచింది. ఆరంభం నుంచే దూకుడు భారత్, పాక్ జట్టు ఈ టోర్నీ తుది సమరంలోనూ నువ్వా..నేనా అనే తరహాలో ఆడారుు. కెప్టెన్, గోల్‌కీపర్ శ్రీజేష్ గాయం కారణంగా ఫైనల్‌కు దూరం కాగా అతడి స్థానంలో ఆకాష్ చిక్టే బరిలోకి దిగాడు. ఇరు జట్లు కూడా విపరీతమైన ఒత్తిడితో బరిలోకి దిగినా భారత్‌కు ఏడో నిమిషంలోనే తొలి పెనాల్టీ కార్నర్ చిక్కింది. అరుుతే దీన్ని సద్వినియోగం చేసుకోలేకపోరుుంది. జస్జిత్ సింగ్ కులార్ సంధించిన ఈ షాట్ ఎడమ వైపు నుంచి వైడ్‌గా వెళ్లడంతో ఫలితం దక్కలేదు. అటువైపు 12వ నిమిషంలో పాకిస్తాన్ తరఫున ముహమ్మద్ రిజ్వాన్ జూనియర్ నుంచి వచ్చిన షాట్‌ను చాలా దగ్గరి నుంచి కీపర్ ఆకాష్ అద్భుత రీతిలో అడ్డుకున్నాడు. ఈ ప్రయత్నాలతో భారత్ 18వ నిమిషంలో లబ్ధి పొందింది. తమకు దక్కిన రెండో పెనాల్టీ కార్నర్‌ను రూపిందర్ పాల్ సింగ్ మెరుపు వేగంతో ఎడమవైపుకు ఫ్లిక్ చేసి జట్టుకు తొలి గోల్ అందించాడు. టోర్నీలో తనకిది 11వ పెనాల్టీ కార్నర్ గోల్ కావడం విశేషం. మరో మూడు నిమిషాల్లోనే రమణ్‌దీప్ అందించిన క్రాస్‌ను యూసుఫ్ ఎలాంటి పొరపాటుకు తావీయకుండా గోల్ చేసి ఆధిక్యాన్ని 2-0కి పెంచాడు. దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన పాక్ తమ ఎదురుదాడులను ముమ్మరం చేసింది. 26వ నిమిషంలో పాక్ తొలి పీసీని అలీమ్ బిలాల్ గోల్‌గా మలిచి భారత్ ఆధిక్యాన్ని తగ్గించాడు. అంతేకాకుండా 38వ నిమిషంలో భారత డిఫెన్స మధ్య గ్యాప్‌ను సొమ్ము చేసుకుంటూ అలీ షాన్ మరో గోల్ చేయడంతో స్కోరు 2-2తో సమమైంది. దీంతో మ్యాచ్‌లో ఉత్కంఠ తారాస్థారుుకి చేరింది. 40వ నిమిషంలో భారత్ గోల్ చేసినా వీడియో రివ్యూలో అది అవుట్‌సైడ్ సర్కిల్ షాట్‌గా తేలింది. అరుుతే జట్టు విజయానికి కారణమైన కీలక గోల్‌ను నిఖిల్ తిమ్మయ్య 51వ నిమిషంలో సాధించాడు. సర్దార్‌సింగ్ నుంచి వచ్చిన పాస్‌ను అందుకున్న తను చక్కటి గోల్‌తో భారత శిబిరంలో ఆనందం నింపాడు. చివర్లో గోల్ కోసం పాక్ భీకర పోరాటమే చేసినా భారత్ ఎట్టి పరిస్థితిలోనూ ఏమరపాటుకు తావీయకుండా మ్యాచ్‌ను ముగించింది. మలేసియాకు కాంస్యం ఆతిథ్య మలేసియా జట్టు ఆసియా చాంపియన్స హాకీలో వరుసగా నాలుగోసారి కాంస్యం దక్కిం చుకుంది. మూడో స్థానం కోసం ఆదివారం జరి గిన మ్యాచ్‌లో మలేసియా 3-1 తేడాతో పెనాల్టీ షూటవుట్‌లో కొరియాపై నెగ్గింది. అంతకుముం దు నిర్ణీత సమయంలో ఇరు జట్లు 1-1 గోల్స్‌తో సమానంగా నిలిచారుు. దీంతో ఫలితం తేల్చేం దుకు పెనాల్టీ షూటవుట్ అనివార్యమైంది. ఆటగాళ్లకు నజరానా పాకిస్తాన్‌పై అద్భుత విజయం సా ధించిన భారత జట్టుకు హాకీ ఇండియా నజరానా ప్రకటించింది. జట్టులోని ఒక్కో ఆటగాడితో పాటు చీఫ్ కోచ్ రోలంట్ ఓల్ట్మన్సకు రూ.2 లక్షల చొప్పున అందించనుంది. సహాయక సిబ్బందికి రూ. లక్ష చొప్పున ఇవ్వనుంది. అలాగే టోర్నీలో అత్యధిక గోల్స్ చేయడంతో పాటు ఉత్తమ ఆటగాడిగా నిలిచిన రూపిందర్ పాల్‌సింగ్‌కు మరో రూ.2 లక్షలు ఇవ్వనుంది. అభినందనల వెల్లువ ఆసియా చాంపియన్స హాకీలో విజేతగా నిలిచిన భారత్‌పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు , సచిన్, సెహ్వాగ్ తదితర క్రీడా ప్రముఖులు తమ అభినందనలు తెలిపారు. ⇒మన హాకీ జట్టును చూసి గర్విస్తున్నాను. ఆసియా చాంపియన్స ట్రోఫీ గెలిచినందుకు అభినందనలు. - మోదీ ⇒ భారత హాకీ జట్టు ఎంతో గొప్ప విజయం సాధించింది. - సచిన్ టెండూల్కర్ ⇒ నిన్నటి కథలో నీతి: తల్లి ఆశీర్వాదం ఉంటే విజయం సులువవుతుంది. నేటి కథలో నీతి: తండ్రి స్థారుు తండ్రిదే. - సెహ్వాగ్ కొరియాపై భారత మహిళల విజయం సింగపూర్: మహిళల ఆసియా చాంపియన్స ట్రోఫీ హాకీలో భారత జట్టు 2-1తో కొరియాపై విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ నుంచి రాణి (47వ నిమిషంలో), దీపికా ఠాకూర్ (54) గోల్స్ చేశారు. తొలి అర్ధభాగంలో అంతగా రాణించని భారత మహిళలు ద్వితీయార్ధంలో రెచ్చిపోవడంతో రెండు గోల్స్ నమోదయ్యారుు. నేడు (మంగళవారం) భారత జట్టు మలేసియాతో ఆడనుంది. -
దీపావళి రోజు పాక్‌కు భారత్ షాక్
-
దీపావళి రోజు పాక్‌కు భారత్ షాక్
క్వాంటన్ (మలేసియా): ఆసియా చాంపియన్స్ ట్రోఫీ పురుషుల హాకీలో భారత జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం హోరాహోరీగా జరిగిన ఫైనల్లో భారత్ 3-2 స్కోరుతో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై విజయం సాధించింది. దీపావళి రోజున భారత హాకీ ఆటగాళ్లు ట్రోఫీ సాధించి భారతీయులకు కానుకగా అందించారు. ఈ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. భారత ఆటగాడు రూపిందర్ పాల్ సింగ్ తొలి గోల్ సాధించి జట్టుకు శుభారంభం అందించాడు. 23వ నిమిషంలో భారత ఆటగాడు అఫాన్ యూసుఫ్ మరో గోల్ చేయడంతో ఆధిక్యం 2-0కి పెరిగింది. కాగా ఆ తర్వాత పాక్ వరుసగా రెండు గోల్స్ చేయడంతో ఇరు జట్ల స్కోర్లు 2-2తో సమమయ్యాయి. ఈ దశలో తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. మ్యాచ్ మరికొద్ది నిమిషాల్లో ముగుస్తుందనగా, నికిన్ తిమ్మయ్య గోల్ చేయడంతో భారత్ మళ్లీ 3-2 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత పాక్ ఆటగాళ్లు గోల్ చేయలేకపోయారు. భారత్ మ్యాచ్‌తో పాటు ట్రోఫీని సొంతం చేసుకుంది. ఓవరాల్‌గా భారత్ ఆసియా చాంపియన్స్ ట్రోఫీని గెలవడమిది రెండోసారి. భారత హాకీ జట్టుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. -
పాక్... మళ్లీ కాచుకో
ఆసియా చాంపియన్ ట్రోఫీ హాకీ ఫైనల్ భారత్ పాకిస్తాన్‌తో నేడు తుదిపోరు క్వాంటన్ (మలేసియా): ఆసియా చాంపియన్స ట్రోఫీ హాకీ లీగ్ దశలో పాక్‌ను చిత్తు చేసిన భారత జట్టుకు దాయాదిని మరోసారి దుమ్ముదులిపే అవకాశం లభించింది. నేడు జరిగే ఫైనల్లో ఈ రెండు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నారుు. శనివారం జరిగిన తొలి సెమీస్‌లో భారత్ షూటౌట్లో 5-4తో దక్షిణ కొరియాపై విజయం సాధించగా... రెండో సెమీస్‌లో పాకిస్తాన్ షూటౌట్లోనే మలేసియాను 3-2తో ఓడించింది. కొరియా, భారత్‌ల సెమీస్ పోరులో నిర్ణీత సమయానికి ఇరు జట్లు 2-2తో సమంగా నిలిచారుు. ఆట 15వ నిమిషంలో తల్విందర్ సింగ్ గోల్‌తో భారత్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అరుుతే 21వ నిమిషంలో కొరియా ఆటగాడు సియో ఇన్ వూ గోల్ చేసి స్కోరును 1-1తో సమం చేశాడు. 53వ నిమిషంలో జిహున్ యాంగ్ గోల్‌తో కొరియా 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అరుుతే 55వ నిమిషంలో సర్దార్ సింగ్ అందించిన పాస్‌ను రమణ్‌దీప్ సింగ్ గోల్‌గా మలచడంతో భారత్ 2-2తో స్కోరును సమం చేసింది. దీంతో ఫలితం కోసం కోసం షూటౌట్‌ను ఆశ్రరుుంచారు. షూటౌట్లో కొరియా ప్లేయర్ లీ డా యోల్ ఐదో షాట్‌ను భారత కెప్టెన్, గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేష్ అడ్డుకొని భారత్‌ను ఫైనల్‌కు చేర్చాడు. షూటౌట్లో భారత్ తరఫున సర్దార్ సింగ్, రమణ్‌దీప్ సింగ్, రూపిందర్ పాల్ సింగ్, ఆకాశ్‌దీప్ సింగ్, బిమల్ లాక్రా (రూపిందర్ పాల్ సింగ్) సఫలమయ్యారు. చివరిదైన ఐదో షాట్‌ను బిమల్ లాక్రా తీసుకోగా కొరియా గోల్‌కీపర్ ఫౌల్ చేయడంతో రిఫరీ భారత్‌కు పెనాల్టీ ో్టక్ ్రఇచ్చాడు. ో్టక్న్రు రూపిందర్ గోల్‌గా మలిచాడు. కొరియా తరఫున మన్జే జంగ్, కిమ్ హయోంగ్జిన్, లీ జుంగ్జిన్, బే జోంగ్సుక్ సఫలంకాగా... చివరిదైన ఐదో షాట్లో లీ డా యోల్ విఫలమయ్యాడు. ఈ టోర్నీ చరిత్రలో భారత్ ఫైనల్‌కు చేరడం ఇది మూడోసారి. ఫైనల్ సాయంత్రం గం. 6.00 నుంచి స్టార్ స్పోర్ట్స-4లో ప్రత్యక్ష ప్రసారం -
అదరగొట్టిన హాకీ జట్టు
కుంటాన్ (మలేసియా): భారత పురుషుల హాకీ జట్టు ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరింది. కెప్టెన్ పీఆర్ శ్రీజేష్ అద్భుతమైన గోల్‌కీపింగ్‌తో రాణించడంతో సెమీఫైనల్లో భారత్.. దక్షిణ కొరియాపై పెనాల్టీ షూటౌట్లో నెగ్గింది. నిర్ణీత సమయంలో ఇరుజట్ల స్కోర్లు 2–2తో సమమవడంతో షూటౌట్ నిర్వహించారు. షూటౌట్లో భారత్ 5–4తో గెలిచింది. మ్యాచ్ 15వ నిమిషంలో తల్విందర్ సింగ్ గోల్‌తో భారత్‌కు చక్కటి ఆరంభం లభించగా.. 21 నిమిషంలో గోల్ చేసిన సియో ఇన్ వూ స్కోర్లను సమం చేశాడు. 53వ నిమిషంలో యాంగ్ జి హున్(కొరియా).. 55వ నిమిషంలో రమన్ దీప్ సింగ్ (భారత్) గోల్స్ చేయడంతో స్కోరు 2–2తో సమమైంది. ఆ తర్వాత చివరి 5 నిమిషాల్లో భారత్ దూకుడుగా ఆడి పదేపదే ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై దాడి చేసినా.. సఫలం కాలేకపోయింది. దాంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. షూటౌట్లో భారత్ తరఫున సర్దార్ సింగ్, రమన్ దీప్ సింగ్, రూపిందర్ పాల్ సింగ్, ఆకాశ్‌దీప్ సింగ్ విజవంతంగా గోల్స్ చేయగా.. ఐదోషాట్ ఆడిన బీరేంద్ర లక్రాను కొరియా గోల్‌కీపర్ మొరటుగా అడ్డుకోవడంతో భారత్‌కు పెనాల్టీ స్ట్రో్టక్ లభించింది. దాన్ని రూపింద్ గోల్ చేయడంతో ఐదుషాట్లలో భారత్ 5 గోల్స్ సాధించింది. ఇక కొరియా తరఫున ఆ జట్టు కెప్టెన్ జంగ్ మాన్జీ, కిమ్ హెయాంగ్ జిన్, లీ జంగ్ జున్ వరుసగా మూడుషాట్లలో గోల్స్ చేశారు. నాలుగో షాట్ ఆడిన బీ జంగ్ సుక్ను శ్రీజేష్ మొరటుగా అడ్డుకోవడంతో కొరియాకు పెనాల్టీ స్ట్రోక్ లభించింది. దాన్ని యాంగ్ జి హున్ గోల్ చేశాడు. చివరగా ఐదోషాట్ను లీ డీ ఇయోల్ ఆడగా.. బంతిని అద్భుతంగా అడ్డుకున్న శ్రీజేష్ భారత్‌కు విజయాన్ని అందించాడు. ఆసియా చాంపియన్స్ ట్రోఫీకి ఇది నాలుగో సీజన్ కాగా.. భారత్ మూడోసారి ఫైనల్‌కు చేరింది. 2011లో తొలిసీజన్లో విజేతగా నిలిచిన టీమిండియా.. 2012లో పాక్ చేతిలో ఫైనల్లో ఓడి రన్నరప్‌గా నిలిచింది. -
కొరియాతో భారత్ అమీతుమీ
ఆసియా చాంపియన్ ట్రోఫీ హాకీ సెమీస్ నేడు క్వాంటన్ (మలేసియా): లీగ్ దశలో కనబరిచిన జోరును నాకౌట్ మ్యాచ్‌లోనూ పునరావృతం చేయాలనే పట్టుదలతో భారత హాకీ జట్టు ఆసియా చాంపియన్స ట్రోఫీ సెమీస్‌కు సమాయాత్తం అరుుంది. దక్షిణ కొరియాతో శనివారం జరిగే మ్యాచ్‌లో భారత్ తలపడనుంది. లీగ్ దశలో కొరియాతో జరిగిన మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకున్న భారత్ ఈ నాకౌట్ పోరులో మాత్రం విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. కెప్టెన్, గోల్‌కీపర్ శ్రీజేష్ గాయం నుంచి కోలుకోకపోవడం, డిఫెండర్ సురేందర్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు పడటం భారత శిబిరానికి ఆం దోళన కలిగిస్తోంది. అరుుతే రూపిందర్ పాల్ సింగ్, జస్జీత్, ఆకాశ్‌దీప్, రమణ్‌దీప్ సింగ్, సర్దార్ సింగ్ సమన్వయంతో ఆడితే మాత్రం భారత్‌కు విజయం దక్కడం కష్టమేమీకాదు. శ్రీజేష్ స్థానంలో గోల్‌కీపింగ్ చేస్తున్న ఆకాశ్ కూడా అద్భుతంగా ఆడుతున్నాడు. మలేసియా తో జరిగిన మ్యాచ్‌లో చివరి సెకన్లలో ఆకాశ్ ప్రత్యర్థి జట్టు పెనాల్టీ కార్నర్‌ను అడ్డుకున్నాడు. ‘కొరియా శక్తి అంతా వారి డిఫెన్‌సలోనే ఉంది. వారి రక్షణశ్రేణిని దాటుకొని ముందుకు వెళ్లడంపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంటుంది’ అని భారత కోచ్ ఒల్ట్‌మన్‌స అన్నారు. మరో సెమీఫైనల్లో పాకిస్తాన్‌తో మలేసియా ఆడుతుంది. ఆదివారం ఫైనల్ జరుగుతుంది. -
భారత్ సెమీస్ ప్రత్యర్థి కొరియా
కౌంటన్ (మలేసియా): ఆసియా చాంపియన్స ట్రోఫీ హాకీ టోర్నీ సెమీఫైనల్లో భారత్ జట్టు శనివారం కొరియాతో తలపడుతుంది. లీగ్ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత భారత్ 13 పారుుంట్లతో అగ్రస్థానంలో నిలవగా... మలేసియా, పాకిస్తాన్, కొరియా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. గురువారం మలేసియా, కొరియా జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో కొరియా గెలిచి ఉంటే... సెమీస్‌లో భారత్‌కు పాక్ ప్రత్యర్థిగా ఎదురయ్యేది. మ్యాచ్ డ్రాగా ముగిసినందున కొరియా పారుుంట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. భారత్, కొరియాల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. మరో సెమీస్‌లో మలేసియా, పాకిస్తాన్ తలపడతారుు. -
భారత్‌కు గట్టిపోటీ ఇస్తాం: పాక్ కోచ్
క్వాంటాన్(మలేషియా):ఆసియా చాంపియన్స్ ట్రోఫీ పురుషుల హాకీలో భాగంగా ఆదివారం భారత్‌తో జరిగే మ్యాచ్‌లో గట్టిపోటీ ఇస్తామని పాకిస్తాన్ కోచ్ ఖవాజా జునైద్ పేర్కొన్నాడు. అసలు ఇరు జట్ల మధ్య మ్యాచ్ అంటేనే ఎప్పుడూ భావోద్వేగాలు నిండి వుంటాయని, అయితే రేపటి మ్యాచ్ ఎటువంటి గంభీర వాతావరణం లేకుండా జరగాలని కోరుకుంటున్నట్లు జునైద్ తెలిపాడు. 'భారత్-పాకిస్తాన్ల మ్యాచ్ అంటే ఎప్పుడూ భావోద్వేగంగా ఉంటుంది.ఇరు జట్ల మధ్య పోరు అంటే లక్షల సంఖ్యలో అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తారు. ఇరు జట్ల వల్లే హాకీకి మరింత పాపులారిటీ వచ్చిందని అనుకుంటున్నా. భారత్ తో మ్యాచ్‌లో గట్టిపోటీ ఇవ్వడానికి పాక్ యువకులు సిద్ధంగా ఉన్నారు. మా జట్టులో యువ ఆటగాళ్లు ఎక్కువగా ఉంటే, భారత జట్టులో అనుభవం మెండు. మా అనుభవ లేమిని రేపటి మ్యాచ్‌లో అధిగమించాల్సి ఉంది. మేము ఒక సంవత్సరకాలంలో ఒక అంతర్జాతీయ టోర్నమెంట్ మాత్రమే ఆడాం. మరోవైపు గత ఐదేళ్లలో భారత్ 200కు పైగా మ్యాచ్‌లు ఆడింది. ఏది ఏమైనా ఈ మ్యాచ్ ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా జరుగుతుందని ఆశిస్తున్నా. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆవేశానికి లోనుకావద్దని మా కుర్రాళ్లకు చెప్పా'అని జునైద్ పేర్కొన్నాడు. -
సునీల్, మన్ ప్రీత్ అవుట్
బెంగళూరు:త్వరలో మలేషియాలో జరుగునున్న ఆసియా చాంపియన్స్ హాకీ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టు నుంచి ఎస్ వి సునీల్, మన్ ప్రీత్ సింగ్ లు దూరం కానున్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు గాయాల బారిన పడటంతో వారికి విశ్రాంతి నివ్వనున్నట్లు కోచ్ ఓల్ట్‌మన్స్ తెలిపాడు. గత కొన్ని రోజులుగా సునీల్ మణికట్టు గాయంతో బాధపడుతుండగా, మన్ ప్రీత్ గజ్జల్లో గాయమైనట్లు పేర్కొన్నాడు. అయితే మన్ ప్రీత్ గాయం తగ్గుముఖం పట్టినా, మళ్లీ తిరగెట్టే అవకాశం ఉన్నందును అతనికి విశ్రాంతి ఇస్తున్నట్లు ఓల్ట్‌మన్స్ తెలిపాడు. వీరి స్థానంలో రమణ్ దీప్ సింగ్, అక్షదీప్ సింగ్ లు జట్టులోకి తీసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. ఈ నెల 20వ తేదీ నుంచి మలేషియాలో ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ఆరంభం కానుంది. -
కెప్టెన్‌గా వందన
న్యూఢిల్లీ: ఈ నెలాఖర్లో సింగపూర్‌లో జరిగే ఆసియా చాంపియన్స ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో పాల్గొనే భారత మహిళల జట్టుకు వందన కటారియా కెప్టెన్‌గా వ్యవహరించనుంది. ఈ టోర్నీలో పాల్గొనే 18 మంది సభ్యుల భారత జట్టును మంగళవారం ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 24 ఏళ్ల వందన ఇప్పటివరకు భారత్ తరఫున 120 మ్యాచ్‌లు ఆడి 35 గోల్స్ చేసింది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి యతిమరపు రజని రెండో గోల్‌కీపర్‌గా ఎంపికైంది. మరో గోల్‌కీపర్‌గా సవిత వ్యవహరించనుంది. డిఫెండర్ సునీత లాక్రా వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తుంది. ఈ టోర్నీలో భారత్‌తోపాటు డిఫెండింగ్ చాంపియన్ జపాన్, చైనా, కొరియా, మలేసియా బరిలో ఉన్నాయి. గత మూడు వారాలుగా భోపాల్‌లోని భారత స్పోర్ట్స అథారిటీ (సాయ్) కేంద్రంలో భారత జట్టుకు శిక్షణ శిబిరం కొనసాగుతోంది. భారత మహిళల హాకీ జట్టు సవిత, యతిమరపు రజని (గోల్‌కీపర్లు), వందన కటారియా (కెప్టెన్), సునీత లాక్రా (వైస్ కెప్టెన్), దీప్ గ్రేస్ ఎక్కా, రేణుక యాదవ్, హినియాలుమ్ లాల్ రువాత్ ఫెలి, నమితా టొప్పో, నిక్కీ ప్రధాన్, నవజ్యోత్ కౌర్, మోనిక, రాణి రాంపాల్, దీపిక, నవదీప్ కౌర్, పూనమ్ రాణి, అనురాధ దేవి, ప్రీతి దూబే, పూనమ్ బార్లా. -
‘మన సైనికుల కోసం పాకిస్థాన్ ను చిత్తుగా ఓడిస్తాం’
బెంగళూరు: ఆసియన్ చాంపియన్స్ ట్రోఫిలో పాకిస్థాన్ ను చిత్తుగా ఓడిస్తామని భారత హాకీ జట్టు కెప్టెన్ పీఆర్ శ్రీజేష్ అన్నాడు. మలేసియాలో వచ్చే నెల 20 నుంచి 30 జరగనున్న టోర్నమెంట్ లో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. కశ్మీర్ లోని ఉడీ సైనిక స్థావరంపై ఉగ్రదాడి నేపథ్యంలో సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో భారత్-పాక్ మ్యాచ్ కు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ ఘటన గురించి ప్రస్తావించకుండానే శ్రీజేష్ పలు వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ హాకీ టీమ్ చేతిలో ఓడిపోయి భారత సైనికులను నిరాశ పరచాలని తాము కోరుకోవడం లేదని చెప్పారు. ‘భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే అందరూ ఆసక్తిగా చూస్తారు. మేము వందశాతం కష్టపడతాం. ఓడిపోయి మన సైనికులను నిరుత్సాహపరచం. దేశ సరిహద్దులో ఎదురుకాల్పుల్లో ప్రాణాలర్పించిన సైనికుల కోసమేనా గెలుస్తామ’ని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. పాకిస్థాన్ హాకీ జట్టు ప్రస్తుతం దిగువస్థాయి ఆటతీరు కనబరుస్తోందని, తొలిసారిగా ఒలింపిక్స్ కు అర్హత సాధించలేకపోయిందని తెలిపాడు. అయితే తనదైన రోజున ఏ జట్టునైనా ఓడించే సత్తా పాక్ టీమ్ ఉందన్నాడు. ఆసియన్ చాంపియన్స్ ట్రోఫిలో మలేసియా, కొరియా జట్లను తక్కువగా అంచనా వేయడానికి లేదని శ్రీజేష్ పేర్కొన్నాడు. -
భారత పురుషుల జట్టుకు ఐదో స్థానం
న్యూఢిల్లీ: ఆసియా చాంపియన్స్ ట్రోఫీ పురుషుల ఈవెంట్లో భారత జట్టు ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. జపాన్‌లోని కకమిగహరలో ఆదివారం ఐదు, ఆరు స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో భారత్ 6-1 గోల్స్ తేడాతో ఒమన్‌పై ఘనవిజయం సాధించింది. ఆకాశ్‌దీప్ సింగ్ మూడు గోల్స్ చేసి రాణించాడు. మొత్తం మీద భారత్ రెండు అర్ధభాగాల్లోనూ మూడేసి గోల్స్ చేసింది. ఆట ఆరంభమైన ఆరో నిమిషంలోనే కొతాజిత్ సింగ్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచి జట్టుకు శుభారంభాన్నిచ్చాడు. తర్వాత మరో ఐదు నిమిషాలకే గుర్జిందర్ సింగ్, ఆట 24వ నిమిషంలో ఆకాశ్‌దీప్ గోల్స్ చేయడంతో భారత్ తొలి అర్ధభాగాన్ని 3-0తో ముగించింది. రెండో అర్ధభాగంలో మళ్లీ ఆకాశ్‌దీప్ (40వ ని, 68వ ని.) రెండు గోల్స్, మలక్ సింగ్ (66వ ని.) ఒక గోల్ సాధించారు. ఒమన్ తరఫున నమోదైన ఒక్క గోల్‌ను ఆట 58వ నిమిషంలో మహ్మద్ హూబైస్ అల్ షర్ చేశాడు. -
మలేసియాపై భారత్ గెలుపు
న్యూఢిల్లీ: ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో భారత పురుషుల జట్టు 4-3తో మలేసియాపై గెలుపొందింది. జపాన్‌లోని కకమిగహరలో శుక్రవారం హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత ఆటగాడు మలక్ సింగ్ (41వ, 51వ ని.) రెండు గోల్స్ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. రమణ్‌దీప్ సింగ్ (4వ ని.), మన్దీప్ సింగ్ (54వ ని.) గోల్స్ చేశారు. మలేసియా తరఫున అజ్రీన్ రిజాల్ బిన్ నాసిర్ (10వ ని.), ఫైజల్ సారి (12వ, 67వ ని.) గోల్స్ చేశారు. ఐదు, ఆరు స్థానాల కోసం ఆదివారం జరిగే వర్గీకరణ మ్యాచ్‌లో భారత్... ఒమన్‌తో తలపడుతుంది. -
భారత జట్ల ఓటమి
న్యూఢిల్లీ: ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీలో భారత పురుషుల, మహిళల జట్లు పరాజయం పాలయ్యాయి. జపాన్‌లోని కకమిగహరలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల జట్టు 4-5 గోల్స్ తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో, మహిళల జట్టు 1-2తో జపాన్ చేతిలో ఓటమి చవిచూశాయి. పురుషుల విభాగంలో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో గుర్జిందర్ సింగ్ (24వ ని.), అమిత్ రోహిదాస్ (30వ ని.), మన్‌ప్రీత్ సింగ్ (40వ ని.), మలక్ సింగ్ (49వ ని.) గోల్స్ చేశారు. పాకిస్థాన్ జట్టు తరఫున అబ్దుల్ హసీమ్‌ఖాన్ (2వ ని.), ఇమ్రాన్ (35వ ని.), మహ్మద్ రిజ్వాన్ (36, 44వ ని.) రిజ్వాన్ జూనియర్ (53వ ని.) గోల్స్ సాధించారు. శుక్రవారం భారత్ తన చివరి లీగ్ మ్యాచ్‌లో మలేసియాతో తలపడనుంది. మహిళలకు తొలి ఓటమి భారత మహిళల జోరుకు ఆతిథ్య జపాన్ బ్రేకులేసింది. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 1-2 గోల్స్ తేడాతో కంగుతింది. చంచన్ దేవి (33వ ని.) గోల్‌తో తొలి అర్ధభాగంలో 1-0తో ఆధిక్యం కనబర్చినప్పటికీ ప్రత్యర్థి జట్టు తరఫున అరాయ్ మజుకి (59వ ని.), ఒత్సుకా షిహో (61వ ని.) గోల్ చేయడంతో భారత్ ఓడింది. ఇంతకుముందు జరిగిన మ్యాచ్‌ల్లో భారత్ 4-2తో చైనాను, 5-1తో మలేసియాను ఓడించింది. శనివారం జరిగే ఫైనల్లో భారత్, జపాన్‌లే మళ్లీ తలపడతాయి. -
సౌందర్యకు చోటు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ అమ్మాయి యెండల సౌందర్య భారత మహిళల హాకీ జట్టుకు ఎంపికైంది. జపాన్‌లో జరిగే ఆసియా చాంపియన్స్ ట్రోఫీకి 18 మంది సభ్యుల భారత జట్టును శుక్రవారం ప్రకటించారు. ఈ టోర్నీ కకమిగహరలో వచ్చే నెల 2 నుంచి 9 వరకు జరుగుతుంది. ఇందులో భారత్‌తో పాటు చైనా, జపాన్, మలేసియాలు తలపడుతున్నాయి. మిడ్‌ఫీల్డర్ రీతూ రాణి జట్టుకు సారథ్యం వహించనుంది. గత నెల మలేసియాలో జరిగిన ఆసియా కప్‌లో భారత్ రజత పతకం గెలిచింది. జట్టు: రీతూ రాణి (కెప్టెన్), యెండల సౌందర్య, నమిత, చంచన్ దేవి, వందన, రాణి, పూనమ్ రాణి, రితుష్య ఆర్య, దీప్గ్రేస్ ఏక్కా, దీపిక, కిరణ్‌దీప్ కౌర్, సునీత లక్రా, సుశీల చాను, మోనిక, మంజీత్ కౌర్, అమన్‌దీప్, సానరిక్ చాను, సందీప్ కౌర్, లిలీ మింజ్, లిలీ చాను, అనురాధా దేవి, అనూప బార్లా. -
భారత హాకీ జట్టులో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ అమ్మాయి యెండల సౌందర్య భారత మహిళల హాకీ జట్టుకు ఎంపికైంది. జపాన్‌లో జరిగే ఆసియా చాంపియన్స్ ట్రోఫీకి 18 మంది సభ్యుల భారత జట్టును శుక్రవారం ప్రకటించారు. ఈ టోర్నీ కకమిగహరలో వచ్చే నెల 2 నుంచి 9 వరకు జరుగుతుంది. ఇందులో భారత్‌తో పాటు చైనా, జపాన్, మలేసియాలు తలపడుతున్నాయి. మిడ్‌ఫీల్డర్ రీతూ రాణి జట్టుకు సారథ్యం వహించనుంది. గత నెల మలేసియాలో జరిగిన ఆసియా కప్‌లో భారత్ రజత పతకం గెలిచింది. జట్టు: రీతూ రాణి (కెప్టెన్), యెండల సౌందర్య, నమిత, చంచన్ దేవి, వందన, రాణి, పూనమ్ రాణి, రితుష్య ఆర్య, దీప్గ్రేస్ ఏక్కా, దీపిక, కిరణ్‌దీప్ కౌర్, సునీత లక్రా, సుశీల చాను, మోనిక, మంజీత్ కౌర్, అమన్‌దీప్, సానరిక్ చాను, సందీప్ కౌర్, లిలీ మింజ్, లిలీ చాను, అనురాధా దేవి, అనూప బార్లా.