ఆసియా చాంపియన్స్ ట్రోఫీ పురుషుల ఈవెంట్‌లో భారత జట్టు ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. జపాన్‌లోని కకమిగహరలో ఆదివారం ఐదు, ఆరు స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో భారత్ 6-1 గోల్స్ తేడాతో ఒమన్‌పై ఘనవిజయం సాధించింది.
న్యూఢిల్లీ: ఆసియా చాంపియన్స్ ట్రోఫీ పురుషుల ఈవెంట్‌లో భారత జట్టు ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. జపాన్‌లోని కకమిగహరలో ఆదివారం ఐదు, ఆరు స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో భారత్ 6-1 గోల్స్ తేడాతో ఒమన్‌పై ఘనవిజయం సాధించింది. ఆకాశ్‌దీప్ సింగ్ మూడు గోల్స్ చేసి రాణించాడు. మొత్తం మీద భారత్ రెండు అర్ధభాగాల్లోనూ మూడేసి గోల్స్ చేసింది.
ఆట ఆరంభమైన ఆరో నిమిషంలోనే కొతాజిత్ సింగ్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచి జట్టుకు శుభారంభాన్నిచ్చాడు. తర్వాత మరో ఐదు నిమిషాలకే గుర్జిందర్ సింగ్, ఆట 24వ నిమిషంలో ఆకాశ్‌దీప్ గోల్స్ చేయడంతో భారత్ తొలి అర్ధభాగాన్ని 3-0తో ముగించింది. రెండో అర్ధభాగంలో మళ్లీ ఆకాశ్‌దీప్ (40వ ని, 68వ ని.) రెండు గోల్స్, మలక్ సింగ్ (66వ ని.) ఒక గోల్ సాధించారు. ఒమన్ తరఫున నమోదైన ఒక్క గోల్‌ను ఆట 58వ నిమిషంలో మహ్మద్ హూబైస్ అల్ షర్ చేశాడు.