చెన్నై: ఆసియా చాంపియన్స్ ట్రోఫీ పురుషుల హాకీ టోర్నమెంట్‌లో భారత్ తమ రెండో మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. శుక్రవారం జపాన్‌తో జరిగిన మ్యాచ్ 1–1తో ‘డ్రా’గా ముగిసింది. ఇరు జట్ల ఆటగాళ్లు ఆరంభం నుంచే పట్టుదల కనబరచడంతో మ్యాచ్ ఆఖరిదాకా పోటాపోటీగా సాగింది.
రెండో క్వార్టర్ ముగిసే దశలో జపాన్‌కు లభించిన పెనాల్టీ కార్నర్‌ను కెన్ నగయొషి (28వ ని.లో) గోల్‌గా మలచడంతో జపాన్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం మూడో క్వార్టర్‌లో భారత్‌కు లభించిన పెనాల్టీ కార్నర్‌ను కెప్టెన్ హర్మన్‌ప్రీత్ ఎలాంటి పొరపాటుకు తావివ్వకుండా గోల్‌పోస్ట్‌లోకి నెట్టాడు.
స్కోరు సమం కాగా... ఆఖరి క్వార్టర్‌లో మరో గోల్ నమోదు కాలేదు. ఇతర మ్యాచ్‌ల్లో మలేసియా 5–1తో చైనాపై ఘనవిజయం సాధించగా... డిఫెండింగ్ చాంపియన్ దక్షిణ కొరియా, పాకిస్తాన్‌ల మధ్య జరిగిన పోరు కూడా 1–1తో ‘డ్రా’ అయ్యింది. ఆదివారం జరిగే తదుపరి లీగ్ మ్యాచ్‌లో భారత్... మలేసియాతో తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment