న్యూఢిల్లీ: భారత్ 2026 నాటికి ప్రపంచంలో జపాన్‌ను అధిగమించి 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని పరిశ్రమల సంఘం– పీహెచ్‌డీసీసీఐ అంచనా వేసింది. మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25)లో భారత్ ఎకానమీ 6.8 శాతంగా నమోదవుతుందని విశ్లేషించింది. ఇది ఆర్‌బీఐ, ప్రభుత్వ అంచనాలకన్నా అధికంగా ఉండడం గమనార్హం.
ఇక ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే 2025–26 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.7 శాతంగా ఉంటుందని అంచనాకు వచ్చింది. అమెరికా, చైనా, జర్మనీ, జపాన్‌ల తర్వాత భారత్ ప్రస్తుతం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1 వతేదీన లోక్‌సభలో 2025–26 వార్షిక బడ్జెట్‌ను సమ ర్పించనున్న నేపథ్యంలో పీహెచ్‌డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు హేమంత్ జైన్ చేసిన ఒక ప్రకటనలో కొన్ని ముఖ్యాంశాలు...
→ ప్రస్తుతం రూ.15 లక్షల పైన ఉన్న ఆదాయానికి 30 శాతం పన్ను రేటు వర్తిస్తోంది. అయితే ఈ స్థాయి పన్ను రేటును రూ.40 లక్షల పైన ఉన్నవారికి మాత్రమే వర్తింపజేయాలి.
→ ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి రూ.10 లక్షలకు పెంచాలి.
Comments
Please login to add a commentAdd a comment