భారత్కు జపాన్ భారీ సాయం
టోక్యో: భారత్కు జపాన్ భారీ సహాయం అందించనున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. చెన్నై, అహ్మదాబాద్లోని మెట్రో ప్రాజెక్టుల కోసం మొత్తం రూ.5,479 కోట్ల సహాయం అందించనున్నట్లు ఆర్దికమంత్రి ఆదివారం తెలిపారు. ఇప్పటికే రెండు దేశాలు ఈ ఒప్పందాలపై సంతకాలు చేసినట్లు చెప్పారు.
చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్టు(4వ దశ)కు(రూ.1,069 కోట్లు), అహ్మదాబాద్ మెట్రో ప్రాజెక్టుకు రూ.4,410 కోట్ల సహాయం చేయనుందని చెప్పారు. భారత్లో చేపట్టే పలు ప్రాజెక్టులకు తరుచుగా జపాన్ ఆర్థిక సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే. లోన్ రూపంలో ఇచ్చే ఈ ఆర్థికమొత్తాన్ని భారత్ కాలక్రమంలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.