
ముంబై: కఠిన ద్రవ్యపరపతి విధానం బాటలో ఎకానమీ నడుస్తున్న నేపథ్యంలో బ్యాంకింగ్ యేతర ఫైనాన్స్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీ) తమ రుణ వ్యయం పెరగకుండా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని ఆర్‌బీఐ బులిటిన్‌లో జారీ అయిన ఆర్టికల్ అభిప్రాయపడింది. ఆర్‌బీఐ అభిప్రాయాలుగా భావించాల్సిన పనిలేని ఈ ఆర్టికల్‌ను ఎన్‌బీఎఫ్‌సీలకు సంబంధించి పరిశోధనా విభాగాంలో పనిచేస్తున్న రజనీష్ కే చంద్ర, నందిని జయకుమార్, అభ్యుదయ్ హర్‡్ష, కేఎం నీలిమ, బ్రిజేష్ రూపొందించారు.
వీరి అభిప్రాయాల ప్రకారం, నాన్–బ్యాంకింగ్ రుణదాతలు బలమైన మూలధన బఫర్‌లు, మొండి బకాయిలకు తగిన కేటాయింపులతో విస్తరణకు సిద్ధంగా ఉన్నారు. ఎకానమీ రికవరీ బాటలో ఉన్నప్పటికీ, ప్రస్తుత ఆర్థిక అనిశ్చితి ధోరణుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. బడా ఎన్‌బీఎఫ్‌సీలు తమ విస్వరణకు వ్యాపార నమూనాలను మార్చుకుంటూ, డిజిటల్ మార్గాలను వినియోగించుకుంటున్నప్పటికీ చిన్న స్ఘాయి ఎన్‌బీఎఫ్‌సీలకు ఇది కొంత సవాలుగా మారవచ్చు. ఆయా సంస్థలు సాంకేతిక సామర్థ్యాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది.
చదవండి: Tencent: పదేళ్లలో ఇదే తొలిసారి.. 5వేలకు పైగా ఉద్యోగులను తొలగించిన ప్రముఖ కంపెనీ
Comments
Please login to add a commentAdd a comment