NBFC company
-
గోల్డ్‌ఫైనాన్స్ తీసుకుంటే రూ.20వేలే ఇస్తారట! మిగతా డబ్బు..?
నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ ) నగదు పంపిణీని రూ.20,000కి పరిమితం చేయాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. లోన్కోసం వచ్చిన వినియోగదారులకు ఎన్బీఎఫ్సీలు నగదు రూపంలో గరిష్ఠంగా రూ.20వేలు మాత్రమే అందించేలా ఆర్బీఐ ప్రకటనలో తెలిపింది. తాజా ప్రకటనతో గోల్డ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు గురువారం బలహీనపడ్డాయి. ముత్తూట్ ఫైనాన్స్ షేర్ ధర 3.73%, మణప్పురం ఫైనాన్స్ 7.3%, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ 4% క్షీణించింది. ఆర్బీఐ నిర్ణయంతో బంగారం తాకట్టుపెట్టి నగదు తీసుకోవాలనుకునే వారికి ఇబ్బంది కలుగుతుందని పలువురు భావిస్తున్నారు.ఇదీ చదవండి: ప్రీమియంను మరింత పెంచనున్న బీమా సంస్థలుఎన్నికల నేపథ్యంలో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకోవడం సరైందేనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రచారంలో భాగంగా ఖర్చులకు డబ్బు సమకూర్చాలంటే ఇంట్లో బంగారం తాకట్టుపెట్టి నగదు తీసుకుంటారు. అలాంటి చర్యలను కట్టడి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకొచ్చినట్లు కొందరు చెబుతున్నారు. కొత్త నిబంధనల ప్రకారం.. బంగారం తాకట్టు పెట్టే వారికి ఇకపై గరిష్ఠంగా రూ.20వేలు నగదు మాత్రమే ఇస్తారు. మిగతా డబ్బు నేరుగా తమ బ్యాంకు అకౌంట్లో జమచేస్తారు. తిరిగి బ్యాంకుకు వెళ్లి నిబంధనల ప్రకారం డబ్బు తీసుకోవాల్సి ఉంటుంది. -
బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల జోరు.. వెహికల్ లోన్స్‌లో సరికొత్త రికార్డ్‌లు
ముంబై: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల వాహన రుణ పుస్తకం గణనీయంగా పెరిగి 2025 మార్చి నాటికి రూ.8.1 లక్షల కోట్లకు చేరుకుంటుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తెలిపింది. 2023 మార్చి నాటికి ఇది రూ.5.9 లక్షల కోట్లుగా ఉంది. వాణిజ్య వాహనాలు, కార్లు, యుటిలిటీ వాహనాలు, ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు డిమాండ్‌కు తోడు.. ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై దృష్టి సారించడాన్ని అనుకూలమైన అంశాలుగా పేర్కొంది. రుణ చెల్లింపులు మెరుగ్గా ఉండడంతో, ఆస్తుల నాణ్యత మరింత బలపడుతుందని తెలిపింది. 2023 నాటికి మొత్తం వాహన రుణాల్లో 50 శాతం వాణిజ్య వాహనాల కోసం తీసుకున్నవేనని పేర్కొంది. ఆ తర్వాత కార్లు, యుటిలిటీ వాహన రుణాలు 29 శాతం, ద్విచక్ర/త్రిచక్ర వాహన రుణాలు 11 శాతం, ట్రాక్టర్ల కోసం తీసుకున్న రుణాలు 10 శాతంగా ఉన్నాయి. ‘‘వాణిజ్య వాహనాల ఫైనాన్స్ ఏటా 12–14 శాతం చొప్పున 2023–25 మధ్య కాలంలో వృద్ధి చెందుతుంది. వాణిజ్య వాహనాలను వినియోగించే సిమెంట్, స్టీల్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్‌లో వినియోగం పెరగనుంది’’అని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ అజిత్ వెలోనీ తెలిపారు. కొత్త వాహనాల ధరలు పెరగడంతో, యూజ్డ్ (అప్పటికే ఒకరు వాడిన) వాహన రుణాలకు డిమాండ్ పెరుగుతున్నట్టు క్రిసిల్ నివేదిక వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం నుంచి ఆస్తుల నాణ్యత మెరుగుపడడం వాహన రుణ సంస్థల పరపతికి మద్దతుగా నిలుస్తుందని పేర్కొంది. వాహన రుణాల మార్కెట్లో 90 శాతం వాటా కలిగిన సంస్థల బ్యాలన్స్ షీట్లను పరిశీలించినప్పుడు, 90 రోజులకు పైగా బకాయి ఉన్న రుణాల శాతం 1.2 శాతం తగ్గి 4.7 శాతానికి పరిమితమైనట్టు ఈ నివేదిక వెల్లడించింది. -
బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు ఆర్బీఐ ఆదేశాలు
బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు సంబంధించి రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా నియమ నిబంధనలను విడుదల చేస్తూ ఉంటుంది. తాజాగా ఆర్బీఐ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) గవర్నెన్స్ నియంత్రణలకు సంబంధించిన మార్గదర్శకాలను మంగళవారం విడుదల చేసింది. రిస్క్ మేనేజ్మెంట్, రిసోర్స్ మేనేజ్మెంట్, పనితీరు నిర్వహణ వంటి కీలకమైన అంశాల్లో ఐటీ గవర్నెన్స్ పాత్ర కీలకం. ఐటీ గవర్నెన్స్‌కు సంబంధించి ఆర్బీఐ జారీ చేసిన ఆదేశాలు ఏప్రిల్ 1, 2024 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆ ఆదేశాల ప్రకారం.. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ఐటీ కార్యాకలాపాల్లో ఎలాంటి అవరోధం రాకుండా ఉండేందుకు పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. అన్ని మౌలిక సదుపాయాలతో కూడిన సమగ్ర ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్ ఫ్రేమ్‌వర్క్‌ను సిద్ధం చేసుకోవాలి. డేటా మార్పులున్నపుడు మైగ్రేషన్ ప్రక్రియకు సంబంధించి ప్రత్యేకమైన డాక్యుమెంట్ పాలసీని కలిగి ఉండాలి. సున్నితమైన సమాచారాన్ని యాక్సెస్ చేసే ప్రతి ఐటీ అప్లికేషన్ ఆడిట్ ట్రయల్స్, ఆడిట్‌ను అందించాలి. క్రిప్టోగ్రాఫిక్ నియంత్రణలపై ట్రాన్స్మిషన్ ఛానెల్‌లలో ఉపయోగించే అల్గారిథమ్‌లు, ప్రోటోకాల్‌లు పకడ్బందీగా ఉండాలని పేర్కొంది. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రికార్డ్
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో భారీ రుణ వృద్ధి నేపథ్యంలో ఎన్బీఎఫ్సీ దిగ్గజం బజాజ్ ఫైనాన్స్ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 40 శాతం జంప్‌చేసి రూ. 2,973 కోట్లను తాకింది. కంపెనీ చరిత్రలోనే ఒక క్వార్టర్‌కు ఇది అత్యధికంకాగా.. నికర వడ్డీ ఆదాయం 28 శాతం ఎగసి రూ. 7,435 కోట్లకు చేరింది. ఈ కాలంలో కొత్తగా 3.14 మిలియన్ల క్రెడిట్ కస్టమర్ల(రుణగ్రహీతలు)ను జత చేసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ ఏడాది ఇప్పటివరకూ 7.84 మిలియన్ల కస్టమర్లను కొత్తగా పొందినట్లు తెలియజేసింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 1.73 శాతం నుంచి 1.14 శాతానికి, నికర ఎన్పీఏలు 0.78 శాతం నుంచి 0.41 శాతానికి దిగివచ్చాయి. బజాజ్ ఫైనాన్స్ షేరు ఎన్ఎస్ఈలో 0.5 శాతం నీరసించి రూ. 5,770 వద్ద ముగిసింది. -
పసిడి రుణాలపై విస్తృత ప్రచారం
హైదరాబాద్: విద్య సహా పలు కుటుంబ పురోభివృద్ధి చర్యలకు, యువత ఉన్నతకి బంగారం రుణాలను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ దేశంలో విస్తృత ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు దిగ్గజ గోల్డ్‌లోన్ ఎన్బీఎఫ్సీ కంపెనీ ముత్తూట్ ఫైనాన్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘మీ బంగారాన్ని సద్వినియోగం చేసుకోండి’ (పుట్ యువర్ గోల్డ్ టు వర్క్) అనే సందేశంలో ఈ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపింది. మూడు దశలుగా విభజించిన ఈ ప్రచారాన్ని విభిన్న మాధ్యమాలు– టీవీ, ప్రింట్, రేడియో, కేబుల్ టీవీ, మ్యాగజైన్, థియేటర్, మల్టీప్లెక్స్, ఓఓహెచ్, బీటీఎల్, ఆన్ గ్రౌడ్ యాక్టివేషన్స్, ఓటీటీ, యూట్యూబ్, సోషల్ మీడియా తదితర డిజిటల్ మార్గాల ద్వారా నిర్వహిస్తున్నట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేఆర్ బిజిమాన్ తెలిపారు. ఈ మేరకు విడుదల చేస్తున్న ప్రకటనల్లో సుప్రసిద్ధ భారతీయ హాస్యనటులు– బ్రహ్మానందం, జానీ ఆంటోనీ, సాధు కోకి, రెడిన్ కింగ్ల్సేలు నటిస్తున్నట్లు సంస్థ తెలిపింది. -
ఎన్‌బీఎఫ్‌సీలూ.. రుణ వ్యయాలపై జర భద్రం
ముంబై: కఠిన ద్రవ్యపరపతి విధానం బాటలో ఎకానమీ నడుస్తున్న నేపథ్యంలో బ్యాంకింగ్ యేతర ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ) తమ రుణ వ్యయం పెరగకుండా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ బులిటిన్‌లో జారీ అయిన ఆర్టికల్ అభిప్రాయపడింది. ఆర్బీఐ అభిప్రాయాలుగా భావించాల్సిన పనిలేని ఈ ఆర్టికల్‌ను ఎన్‌బీఎఫ్‌సీలకు సంబంధించి పరిశోధనా విభాగాంలో పనిచేస్తున్న రజనీష్ కే చంద్ర, నందిని జయకుమార్, అభ్యుదయ్ హర్‡్ష, కేఎం నీలిమ, బ్రిజేష్ రూపొందించారు. వీరి అభిప్రాయాల ప్రకారం, నాన్–బ్యాంకింగ్ రుణదాతలు బలమైన మూలధన బఫర్లు, మొండి బకాయిలకు తగిన కేటాయింపులతో విస్తరణకు సిద్ధంగా ఉన్నారు. ఎకానమీ రికవరీ బాటలో ఉన్నప్పటికీ, ప్రస్తుత ఆర్థిక అనిశ్చితి ధోరణుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. బడా ఎన్బీఎఫ్సీలు తమ విస్వరణకు వ్యాపార నమూనాలను మార్చుకుంటూ, డిజిటల్ మార్గాలను వినియోగించుకుంటున్నప్పటికీ చిన్న స్ఘాయి ఎన్‌బీఎఫ్‌సీలకు ఇది కొంత సవాలుగా మారవచ్చు. ఆయా సంస్థలు సాంకేతిక సామర్థ్యాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. చదవండి: Tencent: పదేళ్లలో ఇదే తొలిసారి.. 5వేలకు పైగా ఉద్యోగులను తొలగించిన ప్రముఖ కంపెనీ -
రెడీగా ఉండండి.. త్వరలో బడా సంస్థ నుంచి మరో ఐపీఓ!
ప్రముఖ వ్యాపారవేత్త, ఆసియా కుబేరుడు గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ నుంచి మరో కంపెనీ ఐపీఓకి రానుంది. 2024 కల్లా బ్యాంకింగేతర సంస్థ అయిన ‘అదానీ క్యాపిటల్’ను పబ్లిక్ ఆఫర్‌కు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు కంపెనీ ఎండీ సీఈఓ గౌరవ్ గుప్తా వెల్లడించారు. అందుకోసం అదానీ క్యాపిటల్ నుంచి 10 శాతం వాటా విక్రయించడం ద్వారా 1500 కోట్ల నిధులను సమకూర్చుకునే యోచనలో ఉన్నట్లు తెలిపారు. గతంలో ఈ గ్రూప్ నుంచి అదానీ విల్మర్ ఐపీఓకి వచ్చిన సంగతి తెలసిందే. అదానీ క్యాపిటల్ 2017 ఏప్రిల్‌లో ఎన్బీఎఫ్సీ విభాగంలోకి అడుగుపెట్టింది. అప్పటి నుంచి వ్యాపారం రిటైల్, గ్రామీణ ఫైనాన్సింగ్ విభాగంపై దృష్టి పెట్టింది. వ్యవసాయ పరికరాలు, చిన్న వాణిజ్య వాహనాలు, 3-వీలర్లు, వ్యవసాయ రుణాలను అందిస్తూ వస్తోంది. వీటితో పాటు ఎంఎస్ఎంఈ( MSME) వ్యాపార రుణాలను కూడా ఇస్తుంది. అదానీ క్యాపిటల్‌కు దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాల్లో 154 బ్రాంచీలు ఉన్నాయి. 60,000 మంది రుణగ్రహీతలు ఉన్నారు. ప్రస్తుతం, కంపెనీ గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ & మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. చదవండి: Passport: పాస్‌పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకపోయినా 60 దేశాలు చుట్టేయచ్చు! -
ఐపీవోకు మరో రెండు కంపెనీలు రెడీ
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూలు చేపట్టడం ద్వారా స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యేందుకు మరో రెండు కంపెనీలు సిద్ధపడుతున్నాయి. ఇందుకు తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతులు పొందాయి. వీటిలో కెమ్‌స్పెక్ కెమికల్స్, నార్తర్న్ ఆర్క్ క్యాపిటల్ ఉన్నాయి. ఐపీవో ద్వారా నిధులు సమకూర్చుకునేందుకు వీలుగా జులైలోనే ఈ రెండు కంపెనీలూ సెబీకి ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. కెమ్‌స్పెక్ కెమ్.. స్పెషాలిటీ కెమికల్స్ తయారు చేసే కెమ్‌స్పెక్ కెమికల్స్ ఐపీవో ద్వారా రూ.700 కోట్లు సమకూర్చుకునే సన్నాహాల్లో ఉంది. కంపెనీ ప్రమోటర్లు మితుల్ వోరా, రిషభ్ వోరా విడిగా రూ. 233.3 కోట్ల విలువైన ఈక్విటీని విక్రయానికి ఉంచనున్నారు. అంతేకాకుండా బీఏసీఎస్ ఎల్ఎల్పీ సైతం రూ. 233.4 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేయనుంది. వెరసి ప్రమోటర్లే పూర్తిస్థాయిలో నిధులను సమకూర్చుకోనున్నారు.(చదవండి: మన క్రెడిట్ స్కోరును వేగంగా ఎలా పెంచుకోవాలి..?) కంపెనీ ప్రధానంగా స్కిన్, హెయిర్‌కేర్ ప్రొడక్టుల తయారీలో వినియోగించే కీలక ఎడిటివ్స్‌ను రూపొందిస్తోంది. ఎఫ్ఎంసీజీ విభాగంతోపాటు.. అధిక రక్తపోటు నివారణకు వినియోగించే ఔషధాలకు అవసరమయ్యే ఫార్మా ఏపీఐలను సైతం తయారు చేస్తోంది. మహారాష్ట్ర తలోజలో తయారీ ప్లాంటును కలిగి ఉంది. నార్తర్న్ ఆర్క్.. ఆర్బీఐ వద్ద డిపాజిట్లు స్వీకరించని ఎన్‌బీఎఫ్‌సీగా రిజస్టరైన నార్తర్న్ ఆర్క్ క్యాపిటల్ పబ్లిక్ ఇష్యూలో భాగంగా 3.65 కోట్లకుపైగా షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటికి జతగా మరో రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని సైతం కొత్తగా జారీ చేయనుంది. తాజా ఈక్విటీ ద్వారా సమీకరించనున్న నిధులను కంపెనీ మూలధన పటిష్టతకు వినియోగించనుంది. తద్వారా భవిష్యత్ పెట్టుబడి అవసరాలకు వాడుకోనుంది. కంపెనీ దశాబ్ద కాలంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన లీప్‌ఫ్రాగ్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్-2, యాక్సియన్ ఆఫ్రికా-ఆసియా ఇన్వెస్ట్మెంట్, ఆగస్టా ఇన్వెస్ట్మెంట్స్2, ఎయిట్ రోడ్ ఇన్వెస్ట్మెంట్స్ మారిషస్-2 తదితరాలు ఐపీవోలో వాటాలను ఆఫర్ చేయనున్నాయి.(చదవండి: బ్యాటరీతో నడవనున్న హీరో స్ప్లెండర్ బైక్) తమిళనాడు మెర్కంటైల్ బ్యాంక్ కూడా ప్రయివేట్ రంగ సంస్థ తమిళనాడు మెర్కంటైల్ బ్యాంక్ పబ్లిక్ ఇష్యూ చేపట్టనుంది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాథమిక పత్రాలను (ప్రాస్పెక్టస్) దాఖలు చేసింది. వీటి ప్రకారం ఐపీవోలో బ్యాంక్ 1.58 కోట్లకుపైగా షేర్లను కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 12,505 షేర్లను వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. తాజా షేర్ల జారీ ద్వారా సమీకరించనున్న నిధులను టైర్-1 మూలధన పటిష్టతకు కేటాయించనుంది. తద్వారా భవిష్యత్ పెట్టుబడి అవసరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో వెల్లడించింది. 100 సంవత్సరాలకుపైగా చరిత్ర కలిగిన బ్యాంక్ అత్యంత పురాతన సంస్థలలో ఒకటిగా నిలుస్తోంది. వివిధ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులను అందిస్తోంది. ఎంఎస్ఎంఈ, వ్యవసాయం, రిటైల్ కస్టమర్లకు ప్రాధాన్యత ఇస్తోంది. 2021 జూన్‌కల్లా 509 బ్రాంచీలను నిర్వహిస్తోంది. 4.93 మిలియన్ కస్టమర్లను కలిగి ఉంది. -
దుమ్మురేపిన బజాజ్ ఫైనాన్స్
ముంబై, సాక్షి: పతన మార్కెట్లోనూ ఎన్బీఎఫ్సీ దిగ్గజం బజాజ్ ఫైనాన్స్ షేరు కదం తొక్కుతోంది. వెరసి తొలిసారి కంపెనీ విలువ రూ. 3 ట్రిలియన్ మార్క్‌ను అధిగమించింది. ఎన్ఎస్ఈలో షేరు ప్రస్తుతం 2.5 శాతం ఎగసి రూ. 5,018 సమీపంలో ట్రేడవుతోంది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రూ. 3.02 లక్షల కోట్లను తాకింది. ఇందుకు ప్రధానంగా రానున్న రెండేళ్లలో బిజినెస్ 25 శాతం చొప్పున వృద్ధి సాధించగలదంటూ కంపెనీ వేసిన అంచనాలు ప్రభావం చూపుతున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. మార్కెట్ విలువరీత్యా తాజాగా బజాజ్ ఫైనాన్స్ 9వ ర్యాంకుకు చేరడం గమనార్హం! ర్యాలీ బాటలో గత మూడు నెలల్లో మార్కెట్లు 18 శాతమే పుంజుకున్నప్పటికీ.. బజాజ్ ఫైనాన్స్ షేరు మాత్రం 42 శాతం ర్యాలీ చేసింది. కోవిడ్-19 ప్రభావం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ బయటపడుతుండటం, ఆర్థిక రికవరీ సంకేతాలు వంటి అంశాలు పలు రంగాలకు జోష్‌నిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. మరోవైపు కోవిడ్-19 నేపథ్యంలోనూ ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) క్యూ2(జులై- సెప్టెంబర్)లో బజాజ్ ఫైనాన్స్ పటిష్ట పనితీరును చూపడం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు తెలియజేశారు. కాగా.. ఆర్బీఐ తాజా మార్గదర్శకాల ప్రకారం రూ. 50,000 కోట్ల ఆస్తులను కలిగి పదేళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎన్బీఎఫ్సీలు బ్యాంకింగ్ లైసెన్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు. వెరసి బ్యాంకింగ్ లైసెన్స్ రేసులో బజాజ్ ఫైనాన్స్ ముందుంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో బజాజ్ ఫైనాన్స్ షేరుపట్ల రీసెర్చ్ సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఆశావహంగా స్పందించింది. రూ. 5,900 టార్గెట్ ధరతో ఈ షేరుని కొనుగోలు చేయవచ్చంటూ సిఫారసు చేస్తోంది. -
మారిటోయం పొడగింపు ఎన్‌బీఎఫ్‌సీలకు ప్రతికూలమే: ఎమ్కే గ్లోబల్ ఫైనాన్స్
టర్మ్‌లోన్లపై ఈఎంఐ మరో 3నెలల పొడగింపు నాన్‌బ్యాంకింగ్‌ఫైనాన్స్ కంపెనీలకు ప్రతికూలమని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ఎమ్కే గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. ఇదే సమయంలో మారిటోరియం పొడగింపు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు కలిసొచ్చే అవకాశం ఉందని బ్రోకరేజ్ సంస్థ అభిప్రాయపడింది. కరోనా వైరస్ (కోవిడ్ -19) దృష్ట్యా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్ని రకాల టర్మ్‌లోన్లపై మారటోరియం మరో 3 నెలల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘‘మారిటోరియం పొడగింపు.. వసూళ్లు, రికవరీ విధానాన్ని మరింత ఆలస్యం చేస్తుంది. లిక్విడిటీ సైకిల్‌కు విస్తరించి ప్రతిబంధకంగా మారుతుంది. అన్ని రంగాల ఆర్థిక క్రమశిక్షణను దెబ్బతీస్తుంది. ముఖ్యంగా చిన్న స్థాయి రుణదాతలు, మైక్రో ఫైనాన్స్ వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యే అవకాశం ఉంది.’’ అని ఎంకే గ్లోబల్ తమ నివేదికలో తెలిపింది. అయితే రెపోరేటు 40 బేసిన్ పాయింట్ల కోత విధింపు ఎన్‌బీఎఫ్‌సీలకు కలిసొచ్చే అంశమేనని ఎంకే గ్లోబల్ తెలిపింది. బ్యాంకుల నుంచి ఎన్‌బీఎఫ్‌సీల కోసం మారటోరియం పొడిగింపుపై ఇంకా స్పష్టత లేదని అనే అంశాన్ని ఈ సందర్భంగా బ్రోకరేజ్ సంస్థ గుర్తుచేసింది. పెద్ద ఎన్బీఎఫ్సీలు తాత్కాలిక నిషేధాన్ని ఎంచుకోకుండా దూరంగా ఉన్నాయని అయితే ఇప్పుడు ఆర్బీఐ ప్రకటనతో వారు వైఖరిని మార్చాల్సిన అవసరం ఉందని బ్రోకరేజ్ సంస్థ వివరించింది. 31 తో ముగుస్తున్న అసెట్ రీక్లాసిఫికేషన్ నిలిపివేతపై స్పష్టత లేకపోవడంపై మరో ఆందోళన తెరపైకి వచ్చినట్లు బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. ఆస్తి ఫైనాన్స్ కంపెనీలతో (ఏఎఫ్సి) పోల్చితే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (హెచ్ఎఫ్సి) మెరుగ్గా ఉన్నాయని మేము పునరుద్ఘాటిస్తున్నాము. అయితే అన్ని రంగాలు స్వల్ప కాలం పాటు ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. జజాజ్ ఫైనాన్స్, చోళమండలం ఇన్వెస్ట్మెంట్&ఫైనాన్స్ కంపెనీ, అండ్ ఎంఅండ్ఎం ఫైనాన్స్ సర్వీసెస్‌లు కొద్దిగా ఎక్కువ దెబ్బతినే అవకాశం ఉందని ఎంకే బ్రోకరేజ్ తన నివేదికలో పేర్కోంది. -
ఆర్బీఐకి మరిన్ని అధికారాలు!
సాక్షి, న్యూఢిల్లీ : నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ(ఎన్బీఎఫ్సీ)ల పై మరింత పర్యవేక్షణ, మరిన్ని నియంత్రణ అధికారాలను ఆర్బీఐకి కట్టబెట్టే విషయాన్ని పరిశీలిస్తున్నామని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. ఎన్‌బీఎఫ్‌సీల లిక్విడిటీ పరిస్థితిని ఆర్బీఐ నిశితంగా పరిశీలిస్తోందని, ఈ రంగం పనితీరును, కార్యకలాపాల పర్యవేక్షణను కొనసాగిస్తుందని పేర్కొన్నారు. ప్రైవేట్ ఎన్‌బీఎఫ్‌సీలకు మూలధన నిధులు సమకూర్చే యోచనేదీ లేదని స్పష్టం చేశారు. పార్లమెంట్‌కు ఈ వివరాలను ఆమె వెల్లడించారు. వివిధ అంశాలపై వివరణలను ఆమె పార్లమెంట్‌కు నివేదించారు. మూత పడ్డ 6.8 లక్షలకు పైగా కంపెనీలు భారత్‌లో ఇప్పటివరకూ 6.8 లక్షలకు పైగా కంపెనీలు మూతపడ్డాయని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. ఆర్ఓసీ కింద మొత్తం 18.9 లక్షల కంపెనీలు నమోదయ్యాయని, దీంట్లో 36 శాతం మేర కంపెనీలు మూతపడ్డాయని ఆమె పార్లమెంట్‌కు వెల్లడించారు. వరుసగా రెండు ఆర్థిక సంవత్సరాల పాటు వార్షిక నివేదికలను సమర్పించని కంపెనీలను గుర్తించి, రద్దు చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలను తీసుకుందని పేర్కొన్నారు. 19 కోట్ల ‘ముద్ర’ రుణాలు ... ప్రధాన మంత్రి ముద్ర యోజన(పీఎమ్ఎమ్వై) కింద ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు ఈ ఏడాది జూన్ 21 వరకూ 19 కోట్ల ముద్ర రుణాలు మంజూరు చేశాయి. వీటిల్లో 2,313 ముద్ర ఖాతాలు మోసపూరితమైనవిగా గుర్తించామని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. వీటిల్లో అత్యధికంగా తమిళనాడు(344)లో చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. నకిలీ ఐటీసీ క్లెయిమ్‌లు రూ.2,565 కోట్లు... రూ.2,565 కోట్ల ఇన్పుట్ట్యాక్స్ క్రెడిట్(ఐటీసీ)క్లెయిమ్ చేస్తూ, దాఖలు చేసిన 535 నకిలీ ఇన్వాయిస్లను జీఎస్టీ అధికారులు గుర్తించారని ఆర్థిక మంత్రి నిర్మల సీతారమన్ పార్లెమెంట్‌లో వెల్లడించారు. దీనికి సంబంధించి 40 మందిని ప్రభుత్వం అరెస్ట్ చేసిందని పేర్కొన్నారు. పెరుగుతున్న కంపెనీ మోసాలు... కంపెనీల మోసాలు పెరిగిపోతున్నాయని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పేర్కొన్నారు. ఈ మోసాలకు పాల్పడ్డవారిపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 594 కంపెనీలకు పాత్ర ఉన్న 79 కేసులను గత మూడేళ్లలో సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్ట్‌గేషన్ ఆఫీస్(ఎస్ఎఫ్ఐఓ) దర్యాప్తు చేసిందని ఆమె పార్లమెంట్‌కు వెల్లడించారు. ఈ కాలంలోనే రిజిష్ట్రార్ ఆఫ్ కంపెనీస్(ఆర్ఓసీ) 256 కేసులను దర్యాప్తు చేసిందని తెలిపారు. వైట్ కాలర్ నేరాల నియంత్రణ నిమిత్తం సెబీ, కంపెనీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు డేటా బదిలీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని తెలిపారు. రూ.14,578 కోట్లకు అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు.... బ్యాంకింగ్ రంగంలో అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు గత ఏడాది 27 శాతం ఎగసి రూ.14,578 కోట్లకు పెరిగాయని పార్లమెంట్‌కు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ నివేదించారు. 2016లో రూ.8,928 కోట్లుగా ఉన్న అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు 2017లో రూ.11,494 కోట్లకు చేరాయని తెలిపారు. గత ఏడాది చివరినాటికి ఒక్క ఎస్బీఐలోనే రూ.2,516 కోట్ల అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు ఉన్నాయని పేర్కొన్నారు. కాగా జీవిత బీమా రంగంలో రూ.16,888 కోట్లు, సాధారణ బీమారంగంలో రూ.990 కోట్ల అన్క్లెయిమ్డ్ మొత్తాలున్నాయని తెలిపారు. 23 కోట్ల టన్నుల చమురు నిక్షేపాలను కనుగొన్న ఓఎన్జీసీ... ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ కంపెనీ గత మూడేళ్లలో 23 కోట్ల టన్నుల చమురు నిక్షేపాలను కనుగొన్నది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నాటికి ఓఎన్జీసి వద్ద 459.84 మిలయిన్ టన్నుల చమురు నిక్షేపాలున్నాయని పెట్రోలియమ్ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లోక్‌సభకు రాతపూర్వకంగా వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో ఓఎన్జీసీ 21.11 మిలిన్ టన్నుల చమురును ఉత్పత్తి చేసిందని, గత మూడేళ్లలో మొత్తం 65.66 మిలియన్ టన్నుల చమురును ఉత్పత్తి చేసిందని పేర్కొంది. ఇంధన దిగుమతులను తగ్గించుకునే ప్రణాళిక కోసం ఓఎన్జీసీ ఒక కమిటీని ఏర్పాటు చేసిందని వివరించారు. 2017–18లో రూ.5.66 లక్షల కోట్లుగా ఉన్న ముడిచమురు దిగుమతుల బిల్లు గత ఆర్థిక సంవత్సరంలో రూ.7.83 లక్షల కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. 2013–14లో ముడి చమురు దిగుమతుల బిల్లు అత్యధికంగా రూ.8.64 లక్షల కోట్లకు పెరిగిందని తెలిపారు. -
ఆ సంస్థలతో జాగ్రత్త..
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక నేరాలు పెరుగుతున్న క్రమంలో నల్లధనంపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్రం సన్నద్ధమైంది. ప్రమాణాలు పాటించని సంస్థల నిగ్గుతేల్చనుంది. మనీల్యాండరింగ్ నియంత్రణ చట్ట ప్రమాణాలకు అనుగుణంగా లేని 9491 బ్యాంకేతర ఆర్థిక సంస్థలను (ఎన్బీఎఫ్సీ) గుర్తించింది. వీటిని హై రిస్క్ ఆర్థిక సంస్థలుగా ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుబంధంగా పనిచేసే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) ప్రకటించింది. ఈ సంస్థల జాబితాను ఎఫ్ఐయూ ప్రచురించింది. మనీల్యాండరింగ్ నియంత్రణ చట్టం ప్రకారం సహకార బ్యాంకులు సహా ఎన్బీఎఫ్సీలు తమ ఆర్థిక కార్యకలాపాలు,లావాదేవీల వివరాలను ఎఫ్ఐయూకు సమర్పించాల్సి ఉంటుంది. ఈ డేటాను పరిశీలించిన ఎఫ్ఐయూ ఆయా ఎన్బీఎఫ్సీలు, సంస్థలు నిబంధనలకు అనుగుణంగా లేవని ఎఫ్ఐయూ గుర్తించింది. ముఖ్యంగా రూ 10 లక్షలకు పైబడిన నగదు లావాదేవీలను పర్యవేక్షించి, అనుమానిత లావాదేవీలను విశ్లేషించి నివేదికలు రూపొందించాల్సిన ప్రిన్సిపల్ అధికారిని ఈ సంస్థలు నియమించలేదని ఎఫ్ఐయూ గుర్తించింది. నోట్ల రద్దు అనంతరం ఈ సంస్ధల కార్యకలాపాలపై ఎఫ్ఐయూ నిఘా పెట్టింది. ఈ సంస్థలతో లావాదేవీలకు దూరంగా ఉండాలని ప్రజలను అప్రమత్తం చేసింది. -
రుణం రూ.25,000 దాటితే చెక్కే ఇవ్వాలి
-
పసిడిపై రుణం రూ.25,000 దాటితే చెక్కే ఇవ్వాలి
⇒ ఎన్బీఎఫ్సీ కంపెనీలకు ఆర్బీఐ ఆదేశాలు ⇒ ఇప్పటి వరకూ రూ.లక్షగా ఉన్న పరిమితి ముంబై: పసిడి ఆభరణాలపై రుణాలకు సంబంధించి నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు (ఎన్బీఎఫ్సీ) గురువారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక ఆదేశాలు జారీ చేసింది. రుణం రూ.25,000 దాటితే చెక్కురూపంలోనే మంజూరు చేయాలన్నది ఈ ఆదేశాల సారాంశం. అంటే ఇకపై పసిడి తనఖాలపై రుణం రూ.25,000 వరకే నగదు రూపంలో ఎన్‌బీఎఫ్‌సీల వద్ద లభిస్తాయన్నమాట. ఇంతక్రితం ఈ పరిమితి రూ.లక్షగా ఉండేది. ఆదాయపు పన్ను చట్టం నిబంధనలను అనుసరించి ఆర్బీఐ తాజా నిర్ణయం తీసుకుంది. ఆర్థిక లావాదేవీలు అన్నీ నగదు రహితంగా జరగాలని కోరుకుంటున్నట్లు ప్రభుత్వం నుంచి పదేపదే వెలువడుతున్న ప్రకటనల నేపథ్యంలో తాజా ప్రకటన వెలువడింది. పెద్ద నోట్ల రద్దు అనంతరం నగదు రహిత లావాదేవీల ప్రోత్సాహానికి పలు చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.