హైదరాబాద్: విద్య సహా పలు కుటుంబ పురోభివృద్ధి చర్యలకు, యువత ఉన్నతకి బంగారం రుణాలను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ దేశంలో విస్తృత ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు దిగ్గజ గోల్డ్‌లోన్ ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీ ముత్తూట్ ఫైనాన్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘మీ బంగారాన్ని సద్వినియోగం చేసుకోండి’ (పుట్ యువర్ గోల్డ్ టు వర్క్) అనే సందేశంలో ఈ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపింది.
మూడు దశలుగా విభజించిన ఈ ప్రచారాన్ని విభిన్న మాధ్యమాలు– టీవీ, ప్రింట్, రేడియో, కేబుల్ టీవీ, మ్యాగజైన్, థియేటర్, మల్టీప్లెక్స్, ఓఓహెచ్, బీటీఎల్, ఆన్ గ్రౌడ్ యాక్టివేషన్స్, ఓటీటీ, యూట్యూబ్, సోషల్ మీడియా తదితర డిజిటల్ మార్గాల ద్వారా నిర్వహిస్తున్నట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేఆర్ బిజిమాన్ తెలిపారు. ఈ మేరకు విడుదల చేస్తున్న ప్రకటనల్లో సుప్రసిద్ధ భారతీయ హాస్యనటులు– బ్రహ్మానందం, జానీ ఆంటోనీ, సాధు కోకి, రెడిన్ కింగ్ల్సేలు నటిస్తున్నట్లు సంస్థ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment