muthoot finance
-
వీధి వ్యాపారులకు రూ.5 లక్షల వరకు రుణం
ప్రైవేటు రుణ రంగంలో ముత్తూట్ ఫిన్‌కార్ప్ వన్ సంచలనాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. చిన్న వ్యాపారుల బ్యాలెన్స్ షీట్లతో కాకుండా తమ లావాదేవీల ఆధారంగా వ్యాపారాలను అంచనా వేసి వారికి లోన్ల ఇవ్వాలని నిర్ణయించింది. దాంతో వీధి వ్యాపారులు సైతం ఇప్పుడు రూ.5 లక్షల వరకు రుణాలు పొందవచ్చని పేర్కొంది.రోజువారీ వసూళ్ల కోసం క్యూఆర్ కోడ్ ఆధారిత యాప్‌లను ఉపయోగించే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) సంస్థలకు రోజువారీ చెల్లింపు సౌకర్యంతో రుణాలను అందిస్తామని ముత్తూట్ ఫిన్‌కార్ప్ వన్ వెల్లడించింది. ‘ఇది చిన్న వ్యాపారాల కోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జులై 23న తన బడ్జెట్ ప్రెజెంటేషన్‌లో ప్రకటించిన న్యూ క్రెడిట్ అసెస్మెంట్ మోడల్‌కు అనుగుణంగా ఉంది. ఈ మోడల్ కింద బ్యాంకులు చిన్న వ్యాపారుల బ్యాలెన్స్ షీట్లతో కాకుండా డిజిటల్ లావాదేవీల ఆధారంగా వ్యాపారాలను అంచనా వేయాలి. బలమైన నగదు రాక ఉన్నప్పటికీ రుణం పొందడంలో వ్యాపారులు విఫలం చెందుతున్నారు. ఇటువంటి వారు క్యూఆర్ కోడ్ లావాదేవీల ఆధారంగా రుణం అందుకోవచ్చు’ అని కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: మస్క్ వేతన ప్యాకేజీపై కోర్టు తీర్పుఈ సందర్భంగా ముత్తూట్ ఫిన్‌కార్ప్ వన్ సీఈవో చందన్ ఖైతాన్ మాట్లాడుతూ.. భారత్‌లో దాదాపు 6 కోట్ల అనధికారిక సూక్ష వ్యాపారాలు ఉన్నాయన్నారు. ఇవి దేశంలోని అతిపెద్ద ఉపాధి సృష్టికర్తలలో ఒకటని, దేశ జీడీపీకి ఇవి గణనీయంగా తోడ్పడుతున్నాయని చెప్పారు. సంప్రదాయకంగా అధికారిక రుణాలను పొందడంలో అడ్డంకులను ఎదుర్కొనే అనధికారిక సూక్ష వ్యాపారాలకు క్రెడిట్‌ను అందుబాటులో ఉంచడం క్యూఆర్–కోడ్ ఆధారిత రుణ కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు. ఈ ఉత్పత్తిని వారి రోజువారీ వ్యాపార అవసరాలకు అనుగుణంగా రూపొందించామని తెలిపారు. ఇప్పటి వరకు 75,000 పైచిలుకు అనధికారిక సూక్ష వ్యాపారులకు రుణం సమకూర్చామని వివరించారు. -
ముత్తూట్ వివాహ సన్మానం.. దరఖాస్తుల ఆహ్వానం
హైదరాబాద్: ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్ ముత్తూట్ వివాహ సన్మానం ప్రాజెక్టు కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వితంతువులైన తల్లుల కుమార్తెల వివాహానికి ఆర్థిక సహాయం అందించడానికి సంస్థ నిర్వహిస్తున్న ప్రత్యేక కార్పొరేట్ సేవా బాధ్యత(సీఎస్ఆర్) కార్యక్రమం ఇది. ఈ ప్రాజెక్టు కింద ప్రతి లబ్ధిదారు ర.50 వేల ఆర్థిక సహాయాన్ని పొందవచ్చు. అర్హత కలిగిన లబ్ధిదారులు డిసెంబర్ 25 సాయంత్రం 5.30 గంటలలోగా లక్ష్మీ నారాయణ యమగాని, మేనేజర్ సీఆర్ఎస్, ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్, హైదరాబాద్ చిరునామాకు సమర్పించాలని కంపెనీ ఒక ప్రకటనలో తెలియజేసింది. వితంతు తల్లులకు ఆర్థిక సాయం ద్వారా వారి ఆర్థిక ఒత్తిడిని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ముత్తూట్ ఫైనాన్స్ సీఎస్ఆర్ హెడ్ బాబు జాన్ మలయల్ తెలిపారు. -
చిరు వ్యాపారుల కోసం ముత్తూట్ ఫిన్‌కార్ప్ రుణాలు
హైదరాబాద్: చిరు వ్యాపారులు మొదలుకుని స్వయం ఉపాధి పొందుతున్న వారి వరకు వివిధ వ్యాపార వర్గాలకు రుణాలను అందించడంపై ముత్తూట్ ఫిన్‌కార్ప్ దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా అదనపు హామీ అవసరం ఉండని వ్యాపార్ మిత్ర బిజినెస్ లోన్స్‌ను ప్రవేశపెట్టింది. దీనితో ఆదాయ పన్ను రిటర్న్ పత్రాలు లేదా సిబిల్ స్కోర్ రికార్డులు మొదలైనవి అందించకుండానే వ్యాపార రుణాలను పొందవచ్చని సంస్థ తెలిపింది. రోజువారీ చెల్లింపుల అవకాశాన్ని అందిస్తున్నామని, ముందస్తు చెల్లింపు చార్జీలేమీ ఉండవని పేర్కొంది. దేశవ్యాప్తంగా 3,600 పైచిలుకు ముత్తూట్ ఫిన్‌కార్ప్ శాఖల్లో ఈ రుణాలు పొందవచ్చని వివరించింది. -
దేశంలో పలు కంపెనీల సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో కల్యాణ్ జ్యువెలర్స్ పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 54 శాతం జంప్‌చేసి రూ. 106 కోట్లకు చేరింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 69 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం 20 శాతం వృద్ధితో రూ. 3,476 కోట్లను తాకింది. గత క్యూ2లో రూ. 2,889 కోట్ల టర్నోవర్ సాధించింది. ఈ కాలంలో దక్షిణాది మినహా ఇతర మార్కెట్లలో కొత్తగా ఐదు షోరూములను ప్రారంభించినట్లు కంపెనీ వెల్లడించింది. వెరసి సెప్టెంబర్‌కల్లా మధ్యప్రాచ్యంతో కలిపి మొత్తం స్టోర్ల సంఖ్య 163కు చేరినట్లు తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో కల్యాణ్ జ్యువెలర్స్ షేరు ఎన్ఎస్ఈలో 4 శాతం పతనమై రూ. 103 వద్ద ముగిసింది. ఎన్‌హెచ్‌పీసీ లాభం ప్లస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో విద్యుత్ రంగ పీఎస్‌యూ ఎన్‌హెచ్‌పీసీ పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం దాదాపు 22 శాతం వృద్ధితో రూ. 1,686 కోట్లకు చేరింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 1,387 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 3,166 కోట్ల నుంచి రూ. 3,529 కోట్లకు ఎగసింది. ఫలితాల నేపథ్యంలో ఎన్‌హెచ్‌పీసీ షేరు ఎన్ఎస్ఈలో 1.5 శాతం క్షీణించి రూ. 43 వద్ద ముగిసింది. ఆయిల్ ఇండియాకు రికార్డు లాభాలు ప్రభుత్వరంగ చమురు, గ్యాస్ ఉత్పత్తి సంస్థ ఆయిల్ ఇండియా సెప్టెంబర్ క్వార్టర్‌కు రికార్డు స్థాయి లాభాలను ప్రకటించింది. రూ1,720 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. ఆదాయం రూ.6,671 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.504 కోట్లు, ఆదాయం రూ.3,679 కోట్లుగా ఉండడం గమనార్హం ఓఎన్జీసీ తర్వాత ఆయిల్ ఇండియా దేశీయంగా రెండో అతిపెద్ద చమురు కంపెనీ కావడం గమనార్హం. ఒక్కో బ్యారెల్‌కు సెప్టెంబర్ క్వార్టర్లో రూ.100.59 డాలర్లు ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇది బ్యారెల్‌కు 71 డాలర్లుగా ఉండడం గమనార్హం. ఆయిల్ ఉత్పత్తిలోనూ పెద్దగా మార్పులేదు. 0.79 మిలియన్ టన్నులుగా, గ్యాస్ ఉత్పత్తి 0.82 బిలియన్ క్యూబిక్ మీటర్లుగా ఉంది. ఐషర్ మోటార్స్ లాభం హైజంప్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఆటో రంగ దిగ్గజం ఐషర్ మోటార్స్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 76 శాతం జంప్‌చేసి రూ. 657 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 373 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2,250 కోట్ల నుంచి రూ. 3,519 కోట్లకు ఎగసింది. ద్విచక్ర వాహన విభాగం రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాలు 65 శాతం వృద్ధితో 2,03,451 యూనిట్లకు చేరాయి. ఫలితాల నేపథ్యంలో ఐషర్ మోటార్స్ షేరు బీఎస్ఈలో 0.8 శాతం క్షీణించి రూ. 3,702 వద్ద ముగిసింది. లాభాల్లోకి సుజ్లాన్ ఎనర్జీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో పవన విద్యుత్ రంగ కంపెనీ సుజ్లాన్ ఎనర్జీ టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ 2)లో రూ. 56.5 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 12.4 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అయితే మొత్తం ఆదాయం రూ. 1,362 కోట్ల నుంచి రూ. 1,443 కోట్లకు బలపడింది. సెప్టెంబర్‌కల్లా 759 మెగావాట్ల ఆర్డర్‌బుక్‌ను కలిగి ఉన్నట్లు కంపెనీ వైస్‌చైర్మన్ గిరీష్ తంతి పేర్కొన్నారు. 193 మెగావాట్ల కొత్త ఆర్డర్లను జత చేసుకున్నట్లు తెలియజేశారు. రైట్స్ నిధులతో రూ. 583 కోట్ల రుణాలను తిరిగి చెల్లించినట్లు కంపెనీ సీఎఫ్‌వో హిమాన్షు మోడీ తెలియజేశారు. వెరసి నికర రుణ భారం రూ. 2,722 కోట్లకు చేరినట్లు వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో సుజ్లాన్ ఎనర్జీ షేరు ఎన్ఎస్ఈలో 0.6 శాతం బలపడి రూ. 8.30 వద్ద ముగిసింది. పెట్రోనెట్ డివిడెండ్ రూ. 7 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఇంధన రంగ కంపెనీ పెట్రో నెట్ ఎల్ఎన్జీ ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 4 శాతం క్షీణించి రూ. 786 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 818 కోట్లు ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం ఒక క్వార్టర్‌కు కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 15,986 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 10,813 కోట్ల టర్నోవర్ మాత్రమే నమోదైంది. కంపెనీ బోర్డు వాటాదారు లకు షేరుకి రూ. 7 చొప్పున ప్రత్యేక మధ్యంతర డివిడెండు ప్రకటించింది. ఈ కాలంలో కంపెనీ ప్రధాన టెర్మినల్ దహేజ్ 182 టీబీటీ యూనిట్ల ఎల్ఎన్జీని ప్రాసెస్ చేసింది. గత క్యూ2లో 225 టీబీటీయూ నమోదైంది. ఒడిషాలోని గోపాల్పూర్ పోర్టులో 4 మిలియన్ టన్నుల సామర్థ్యంతో తేలియాడే ఎల్ఎన్జీ టెర్మినల్ ఏర్పాటుకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలియజేసింది. ఇందుకు రూ. 2,306 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో పెట్రోనెట్ షేరు ఎన్ఎస్ఈలో 1.5 శాతం పుంజుకుని రూ. 212 వద్ద ముగిసింది. బాటా లాభంలో 47% వృద్ధి న్యూఢిల్లీ: బాటా ఇండియా కన్సాలిడేటెడ్ లాభం సెప్టెంబర్ త్రైమాసికంలో 47% పెరిగి రూ. 55 కోట్లుగా నమోదైంది. ఆదాయం 35% వృద్ధితో రూ.830 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి లాభం రూ.37 కోట్లు, ఆదాయం రూ.614 కోట్లుగా ఉన్నాయి. క్లిష్టమైన నిర్వహణ వాతావరణం, అధిక ద్రవ్యోల్బణం ఉన్నప్పటికీ అన్ని వ్యాపార చానల్స్‌లోనూ మెరుగైన పనితీరు చూపించినట్టు బాటా తెలిపింది. తగ్గిన అపోలో లాభం వైద్య సేవల సంస్థ అపోలో హాస్పిటల్స్ సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 20 శాతం తగ్గి రూ.213 కోట్లు నమోదు చేసింది. టర్నోవర్ రూ.3,723 కోట్ల నుంచి రూ.4,274 కోట్లకు ఎగసింది. క్రితం ముగింపుతో పోలిస్తే అపోలో షేరు ధర బీఎస్ఈలో గురువారం 1.80 శాతం తగ్గి రూ.4,282.25 వద్ద స్థిరపడింది. తగ్గిన నాట్కో లాభం ఔషధ రంగ కంపెనీ నాట్కో ఫార్మా సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 12.75 శాతం తగ్గి రూ.56.8 కోట్లు సాధించింది. టర్నోవర్ 9 శాతం ఎగసి రూ.452 కోట్లు నమోదు చేసింది. 2022–23 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రెండవ మధ్యంతర డివిడెండ్ కింద 75 పైసలు చెల్లించాలని బోర్డు ప్రతిపాదించింది. క్రితం ముగింపుతో పోలిస్తే ఎన్ఎస్ఈలో నాట్కో షేరు ధర గురువారం 4.19 శాతం తగ్గి రూ.588.25 వద్ద స్థిరపడింది. ఐఆర్ఎఫ్సీ ఫర్వాలేదు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లాభం సెప్టెంబర్ త్రైమాసికంలో 14 శాతం పెరిగి రూ.1,714 కోట్లుగా ఉంది. ఆదాయం రూ.24 శాతం పెరిగి రూ.5,810 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది కాలానికి లాభం రూ.1,501 కోట్లు, ఆదాయం రూ.4,690 కోట్ల చొప్పున ఉన్నాయి. నిర్వహణ ఆస్తులు రూ.4,39,070 కోట్లకు చేరాయి. ఒక్కో షేరుకు రూ.0.80 చొప్పున మధ్యంతర డివిడెండ్ ఇచ్చేందుకు కంపెనీ నిర్ణయం తీసుకుంది. ముత్తూట్ ఫైనాన్స్ లాభం రూ.902 కోట్లు బంగారం, ఇతర రుణాలు అందించే ముత్తూట్ ఫైనాన్స్ సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి రూ.902 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి వచ్చిన లాభం రూ.1,003 కోట్లతో పోలిస్తే 10 శాతం తగ్గింది. కానీ, ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికంలో లాభం రూ.825 కోట్లతో పోలిస్తే (సీక్వెన్షియల్‌గా ) 9 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. ఇక కంపెనీ ఆదాయం సెప్టెంబర్ త్రైమాసికానికి రూ.2,842 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.3,065 కోట్లతో పోలిస్తే తగ్గింది. ముఖ్యంగా వడ్డీ ఆదాయం 8.2 శాతం తగ్గి రూ.2,758 కోట్లకు పరిమితం కావడం లాభాల క్షీణతకు దారితీసింది. దేశవ్యాప్తంగా ఈ సంస్థకు 4,641 శాఖలు ఉన్నాయి. తన దగ్గర రుణగ్రహీతలు తనఖాగా ఉంచిన 177 టన్నుల బంగారం ఆభరణాల్లో 65 శాతం గ్రామీణ ప్రాంతాల నుంచే ఉన్నట్టు ముత్తూట్ ఫైనాన్స్ తెలిపింది. వ్యక్తిగత రుణాలు, నగదు బదిలీ సేవలను కూడా ముత్తూట్ ఆఫర్ చేస్తుంటుంది. -
ముత్తూట్ మైక్రోఫిన్ ఐపీవో బాట.. రూ.1800 కోట్లు టార్గెట్!
ముంబై: ప్రయివేట్ రంగ కంపెనీ ముత్తూట్ మైక్రోఫిన్ పబ్లిక్ ఇష్యూ యోచనలో ఉంది. ముత్తూట్ ఫిన్‌కార్ప్ ప్రమోట్ చేసిన కంపెనీ 2023 చివరి క్వార్టర్‌కల్లా క్యాపిటల్ మార్కెట్లను ఆశ్రయించే ప్రణాళికల్లో ఉన్నట్లు వెల్లడించింది. ఐపీవో ద్వారా రూ. 1,500–1,800 కోట్లను సమీకరించాలని భావిస్తున్నట్లు కంపెనీ ఎండీ థామస్ ముత్తూట్ తెలియజేశారు. దీంతో మైక్రోఫైనాన్స్ పరిశ్రమ(ఎంఎఫ్ఐ)లోనే అతిపెద్ద ఐపీవోగా నిలవనున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా లిస్టింగ్కల్లా రూ.10,000 కోట్ల నిర్వహణలోని ఆస్తుల(ఏయూఎం) కలిగిన తొలి ఎంఎఫ్ఐగా రికార్డ్ సాధించే వీలున్నట్లు తెలియజేశారు. కంపెనీలో ముత్తూట్ ఫిన్‌కార్ప్, ముత్తూట్ కుటుంబానికి 71 శాతం వాటా ఉన్నట్లు వెల్లడించారు. పీఈ సంస్థ జీపీసీ 16.6 శాతం వాటాను కలిగి ఉన్నట్లు తెలియజేశారు. చదవండి: ఐటీలో ఫేక్ కలకలం.. యాక్సెంచర్ బాటలో మరో కంపెనీ, వేరే దారిలేదు వాళ్లంతా ఇంటికే! -
పసిడి రుణాలపై విస్తృత ప్రచారం
హైదరాబాద్: విద్య సహా పలు కుటుంబ పురోభివృద్ధి చర్యలకు, యువత ఉన్నతకి బంగారం రుణాలను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ దేశంలో విస్తృత ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు దిగ్గజ గోల్డ్‌లోన్ ఎన్బీఎఫ్సీ కంపెనీ ముత్తూట్ ఫైనాన్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘మీ బంగారాన్ని సద్వినియోగం చేసుకోండి’ (పుట్ యువర్ గోల్డ్ టు వర్క్) అనే సందేశంలో ఈ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపింది. మూడు దశలుగా విభజించిన ఈ ప్రచారాన్ని విభిన్న మాధ్యమాలు– టీవీ, ప్రింట్, రేడియో, కేబుల్ టీవీ, మ్యాగజైన్, థియేటర్, మల్టీప్లెక్స్, ఓఓహెచ్, బీటీఎల్, ఆన్ గ్రౌడ్ యాక్టివేషన్స్, ఓటీటీ, యూట్యూబ్, సోషల్ మీడియా తదితర డిజిటల్ మార్గాల ద్వారా నిర్వహిస్తున్నట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేఆర్ బిజిమాన్ తెలిపారు. ఈ మేరకు విడుదల చేస్తున్న ప్రకటనల్లో సుప్రసిద్ధ భారతీయ హాస్యనటులు– బ్రహ్మానందం, జానీ ఆంటోనీ, సాధు కోకి, రెడిన్ కింగ్ల్సేలు నటిస్తున్నట్లు సంస్థ తెలిపింది. -
ముత్తూట్ ఫైనాన్స్ ‘మిల్లీగ్రామ్ గోల్డ్ ప్రోగ్రామ్’
కొచ్చి: గోల్డ్ ఫైనాన్సింగ్ దిగ్గజం ముత్తూట్ ఫైనాన్స్ ‘మిల్లీగ్రామ్ గోల్డ్ ప్రోగ్రామ్’ను ప్రారంభించింది. ఇందులో భాగంగా ముత్తూట్ గ్రూప్ వద్ద లావాదేవీలను నిర్వహించే కస్టమర్లకు కనీసం మిల్లీగ్రామ్ బంగారం బహుమతిగా అందజేస్తుంది. రిఫరల్ లావాదేవీపై 20 మిల్లీగ్రాముల బంగారం పొందవచ్చు. ఈ ప్రోగ్రామ్ ఏప్రిల్ 2022 నుంచి నిర్వహించిన అన్ని లావాదేవీలపై వర్తిస్తుంది. ఏటా రూ.50 కోట్ల విలువైన(100 కేజీలు) బంగారాన్ని కస్టమర్లకు అందించాలని కంపెనీ భావిస్తోంది. ‘రెండేళ్ల పాటు జరిగే ఈ కార్యక్రమం ద్వారా కస్టమర్లతో మా అనుబంధం మరింత బలోపేతం అవుతుందని విశ్వసిస్తున్నాము. ఎన్నో ఏళ్లుగా వారు మాపై చూపుతున్న అభిమానానికి కృతజ్ఞత ఇది’ అని కంపెనీ ఎండీ జార్జ్ అలెగ్జాండర్ ముత్తూట్ తెలిపారు. -
ముత్తూట్ ఫైనాన్స్ లాభం అప్
న్యూఢిల్లీ: గోల్డ్ ఫైనాన్సింగ్ దిగ్గజం ముత్తూట్ ఫైనాన్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 4 శాతం పుంజుకుని రూ. 1,044 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 1,007 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 5 శాతం వృద్ధితో రూ. 3,168 కోట్లను అధిగమించింది. గత క్యూ3లో రూ. 3,016 కోట్ల టర్నోవర్ నమోదైంది. వడ్డీ ఆదాయం 5 శాతం బలపడి రూ. 3,087 కోట్లకు చేరింది. నిర్వహణలోని స్థూల గోల్డ్ లోన్ ఆస్తులు రూ. 54,688 కోట్లకు చేరినట్లు కంపెనీ వెల్లడించింది. కంపెనీ ఫలితాలలో ముత్తూట్ హోమ్‌ఫిన్(ఇండియా), బెల్‌స్టార్ మైక్రోఫైనాన్స్, ముత్తూట్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ తదితర అనుబంధల సంస్థల పనితీరు కలసి ఉన్నట్లు పేర్కొంది. -
ముత్తూట్‌కు ఆర్బీఐ షాక్
ఫైనాన్షియల్ కార్పొరేషన్ ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షాకిచ్చింది. వెహికిల్స్ విభాగానికి సంబంధించిన ముత్తూట్ వెహికిల్ అండ్ అస్సెట్ ఫైనాన్స్ లిమిటెడ్‌కు ఆథరైజేషన్ సర్టిఫికెట్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మంగళవారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. నియంత్రణ అవసరాలకు అనుగుణంగా లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. అంతేకాదు చెల్లింపు వ్యవస్థ ఆపరేటర్ (PSO)గా ఉన్న మరో కంపెనీ ఈకో(EKO) ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు సైతం సీవోఏను రద్దు చేసేసింది. ఇదిలా ఉంటే ఎస్బీఐ, ఐసీసీఐ బ్యాంక్‌తో పాటు యస్ బ్యాంక్ తరపున సేవలు అందిస్తోంది ఈకో. సర్టిఫికేట్ ఆఫ్ ఆథరైజేషన్ (CoA) రద్దు చేయబడిన తరువాత.. ముత్తూట్ వెహికిల్ ఫైనాన్స్, ఈకో కంపెనీలు ప్రీపెయిడ్ చెల్లింపు సాధనాల జారీ, నిర్వహణ లాంటి వ్యాపారాలకు అర్హత కోల్పోయినట్లు అయ్యింది. అయితే, ఈ కంపెనీలపై PSOలుగా చెల్లుబాటు అయ్యే క్లెయిమ్ ఉన్న కస్టమర్లు, వ్యాపారులు.. రద్దు చేసిన తేదీ నుండి మూడు సంవత్సరాలలోపు తమ క్లెయిమ్‌ల పరిష్కారం కోసం వారిని సంప్రదించవచ్చు. ఇదిలా ఉంటే పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007లోని విచక్షణ అధికారాల్ని వినియోగించి బ్యాంకుల పెద్దన్న ఈ నిర్ణయం తీసుకుంది. సీవోఏ క్యాన్సిలేషన్ డిసెంబర్ 31నే జరిగినప్పటికీ.. అధికారిక ప్రకటన మాత్రం జనవరి 4న చేసింది ఆర్బీఐ. చదవండి: బ్యాంకు కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్బీఐ! -
హైదరాబాద్‌లో ముత్తూట్ గోల్డ్ పాయింట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పుత్తడి వ్యాపారంలో ఉన్న ముత్తూట్ ఎగ్జిమ్ తెలంగాణలో తొలి గోల్డ్ పాయింట్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. సంస్థ ఖాతాలో దేశవ్యాప్తంగా ఇటువంటి కేంద్రాల సంఖ్య 14కు చేరుకుంది. ఈ సెంటర్స్ ద్వారా వినియోగదార్ల నుంచి పాత బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. రీసైకిల్ ద్వారా శుద్ధిచేసిన బంగా రాన్ని దేశీయంగా సంస్థ విక్రయిస్తుంది. విజయవాడ తర్వాత ముత్తూట్ సంస్థ 2015లో తొలి గోల్డ్ పాయింట్ సెంటర్‌ని తమిళనాడులోని కోయంబత్తూర్‌లో నెలకొల్పింది. ఆ తర్వాత ముంబై, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, మధురై, విజయవాడ, ఎర్నాకుళం, తిరుచ్చి, పూణేలలో ఈ సెంటర్లు ప్రారంభించింది. తెలుగు స్టేట్స్లో విజయవాడ తర్వాత రెండో సెంటర్ హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ గోల్డ్ సెంటర్లలో బంగారం నాణ్యత పరీక్షలు, విలువ మదింపులు ఎంతో పారదర్శకంగా జరుగుతాయని ముత్తూట్ అంటోంది. చదవండి: బంగారం ప్రియులకు భారీ శుభవార్త! -
ముత్తూట్ లాభం అప్
ముంబై: గోల్డ్ లోన్ కంపెనీ ముత్తూట్ ఫైనాన్స్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో క్వార్టర్లో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 8 శాతం పుంజుకుని రూ. 1,002 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 926 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 2,821 కోట్ల నుంచి రూ. 3,052 కోట్లకు ఎగసింది. దీనిలో వడ్డీ ఆదాయం రూ. 2,729 కోట్ల నుంచి రూ. 3,003 కోట్లకు బలపడింది. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో నిర్వహణలోని ఆస్తుల(రుణాలు) విలువ(ఏయూఎం) 17 శాతం ఎగసి రూ. 60,919 కోట్లను తాకింది. బంగారు రుణాలకు డిమాండ్ పెరగడం, పండుగల సీజన్ ప్రారంభంకావడం వంటి అంశాల నేపథ్యంలో ఈ ఏడాది ద్వితీయార్ధం (అక్టోబర్–మార్చి)లోనూ పటిష్ట పనితీరును చూపగలమని కంపెనీ ఎండీ జార్జ్ అలెగ్జాండర్ ముత్తూట్ పేర్కొన్నారు. ఈ ఏడాది 15 శాతం వృద్ధిని సాధించగలమని అంచనా వేశారు. -
ముత్తూట్ ఫైనాన్స్ లాభం అప్
కొచ్చి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో ముత్తూట్ ఫైనాన్స్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 14 శాతం ఎగసి రూ. 979 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 858 కోట్లు మాత్రమే ఆర్జించింది. గోల్డ్‌లోన్ విభాగం నికర లాభం 16 శాతం వృద్ధితో రూ. 971 కోట్లను తాకింది. నిర్వహణలోని స్థూల రుణ ఆస్తులు(ఏయూఎం) 25 శాతం బలపడి రూ. 58,135 కోట్లకు చేరాయి. మొత్తం ఆదాయం సైతం 14 శాతం పుంజుకుని రూ. 2,963 కోట్లకు చేరింది. -
మూడు నెలల్లో రూ.404 కోట్ల విలువైన బంగారం వేలం
ముంబై: పసిడి రుణాల విషయంలో బ్యాంకింగ్‌లో ‘బబుల్’ ఆందోళనలు తలెత్తుతున్న పరిస్థితి కనిసిస్తోంది. మణప్పురం ఫైనాన్స్ వంటి పసిడి హామీగా రుణాలను మంజూరుచేసే బ్యాంకింగ్యేతర ఫైనాన్షియల్ సంస్థలు(ఎన్బీఎఫ్సీ) బంగారాన్ని పెద్ద ఎత్తున వేలం వేసే పరిస్థితి నెలకొంది. ఒక్క మణప్పురం ఫైనాన్స్ 2021 జనవరి-మార్చి మధ్య రికార్డు స్థాయిలో దాదాపు రూ.404 కోట్ల విలువైన టన్ను బంగారాన్ని వేలం వేసింది. కరోనా మహమ్మారి వల్ల ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నారన్న విషయాన్ని ఇది స్పష్టం చేస్తోంది. 2021-22 సెప్టెంబర్ త్రైమాసికం నుంచీ బ్యాంకింగ్‌కూ మొండిబకాయిల(ఎన్పీఏ) సెగ తీవ్రమయ్యే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందుకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. మహమ్మారి వల్ల ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ప్రజానీకం కష్టాల నుంచి గట్టెక్కడానికి 2020లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పలు చర్యలు తీసుకుంది. తనఖాలకు సంబంధించి పసిడి విలువలో 90 శాతం వరకూ రుణాలను అందించవచ్చన్నది ఆర్బీఐ సడలించిన నిబంధనల్లో ఒకటి. బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో (ఆగస్టులో గ్రాముకు గరిష్టంగా రూ.5,600 పలికింది) కష్టకాలంలో ఈ మెటల్ ప్రజలను ఆదుకుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల పసిడి పోర్ట్ ఫోలియోలూ భారీగా పెరిగాయి. 2020-21లో ఈ విలువ దాదాపు రూ.2 లక్షల కోట్లకు పెరిగింది. 2019-20లో ఈ విలువ రూ.1.6 లక్షల కోట్లు కావడం గమనార్హం. పసిడి రుణ పరిశ్రమ విలువ దాదాపు రూ.6 లక్షల కోట్లు. ఇందులో 75 శాతం వాటా అసంఘటిత, చిన్నపాటి రుణదాతలదే. బ్యాంకింగ్ వంటి వ్యవస్థీకృత సంస్థల వాటా కేవలం 25 శాతం (రూ.2 లక్షల కోట్లు). 2020-21లో వ్యవస్థీకృత రంగంలో బ్యాంకింగ్ పసిడి రుణ పోర్ట్‌ఫోలియో వాటా రూ.1.2 లక్షల కోట్లయితే, ఎన్‌బీఎఫ్‌సీల వాటా రూ.80,000 కోట్లు. ఇటీవల మోతీలాల్ ఓశ్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విడుదల చేసిన ఒక నివేదిక ఇక్కడ పరిశీలించాల్సి ఉంటుంది. ఈ నివేదిక ప్రకారం భారత్‌లో 2020 మహమ్మారి విసిరిన సవాళ్లలో (మొదటి వేవ్‌లో) ప్రైవేటు రంగమే 80 శాతం ఆదాయం నష్టపోయింది. ప్రభుత్వం భరించిన నష్టం 20 శాతమే. ఇందులోనూ కార్పొరేట్ రంగం కేవలం 12 నుంచి 16 శాతం భరిస్తే, మిగిలినది కుటుంబాలు భరించాయి. త్రైమాసికాల్లోనే టాప్... మార్చి త్రైమాసికంలో మేము దాదాపు రూ.404 కోట్ల విలువైన 1,000 కేజీల తనఖా బంగారాన్ని వేలం వేశాము. అంతక్రితం మూడు త్రైమాసికాల్లో కేవలం రూ.8 కోట్ల విలువచేసే పసిడినే వేలం వేశాం. ఒక త్రైమాసికంలో వేలం ద్వారా రూ.404 కోట్ల రికవరీ ఇదే తొలిసారి. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రికవరీలు రికార్డు స్థాయిలో రూ.1,932 కోట్లు. ఇక ఇప్పటికి మా ఖజానాలో 300 టన్నుల పసిడి ఉంది. కాగా, బ్యాంకులు, ఇతర పోటీ సంస్థలు ఆరు నుంచి 12 నెలల కాలానికి పసిడీ రుణ కాలపరిమితులను అనుసరిస్తుండగా, మేము మూడు నెలల కాలపరిమితినే అనుసరిస్తున్నాం. అందువల్ల మేము ప్రతి నేలా పసిడి వేలం నిర్వహిస్తాము. నిజానికి 2020లో ధరలు భారీగా పెరిగాయి. పసిడి విలువలో 90 శాతం వరకూ రుణాలకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. అయితే ఇప్పుడు ధరలు అప్పటితో పోల్చితే భారీగా పడిపోయాయి. దీనితో ఈ రుణాల విషయంలో ‘బబుల్’ ఆందోళనలు తలెత్తుతున్నాయి. ఏడాది వరకూ రుణ కాలపరిమితి ఉన్నందున, బ్యాంకులు అలాగే ఇతర ఎన్బీఎఫ్సీలు తమ రుణ నాణ్యత సమస్యలపై మార్చి లేదా జూన్ త్రైమాసికం వరకూ తమ రుణ నాణ్యతను తెలియజేయవు. అయితే ఈ విషయంలో సెప్టెంబర్ త్రైమాసికం నుంచీ ఎన్పీఏల సెగ తీవ్రమయ్యే అవకాశం ఉంది. తమ గోల్డ్ రుణ పుస్తకంలో దాదాపు 90 శాతాన్ని బ్యాంకులు ప్రాధాన్యతా పూర్వక రుణంగా పేర్కొన్నాయి. - వీపీ నందకుమార్, మణప్పురం ఎండీ, సీఈఓ బ్యాంకులకు ఎన్పీఏల తీవ్రత! గ్రాము ధర రూ.5,600 ఉన్న గరిష్ట స్థాయిల నుంచి చూస్తే, ఇప్పుడు ధరలు 10 నుంచి 13 శాతం పడిపోయాయి. ఈ పరిస్థితుల్లో సెప్టెంబర్ త్రైమాసికం నుంచీ బ్యాంకుల రుణ నాణ్యత సమస్యలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే ఇప్పటికి మా సంస్థ భారీ వేలాలు ఏవీ నిర్వహించలేదు. మా రుణ కాలపరిమితి 9 నుంచి 12 నెలలు ఉండడమే దీనికి కారణం. - థామస్ జాన్ ముత్తూట్, ముత్తూట్ గ్రూప్ చైర్మన్ -
ముత్తూట్‌లో బంగారం క్షేమమేనా? షేర్లు ఢమాల్
సాక్షి, ముంబై : బంగారు రుణ సంస్థ ముత్తూట్ గ్రూపు చైర్మన్, హోల్ టైమ్ డైరెక్టర్ ఎంజీ జార్జ్ ముత్తూట్ (71) అనుమానాస్పద మరణం ఇన్వెస్టర్ల సెంటిమెంటును తీవ్రంగా ప్రభావితం చేసింది. వీంతో సోమవారం బుల్ మార్కెట్లో కూడా ముత్తూట్ ఫైనాన్స్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఆరంభంలోనే 6.57 శాతం క్షీణించి బీఎస్ఈలో 1205 రూపాయల ఇంట్రాడే కనిష్టానికి చేరుకున్నాయి. ప్రస్తుతం 3 శాతం వద్ద కొనసాగుతున్నాయి. మరోవైపు సంస్థ పెద్ద మరణంతో ముత్తూట్ ఫైనాన్స్ లో తమ బంగారాన్ని తనఖా పెట్టి రుణం తీసుకున్న వినియోగదారుల్లో భారీ ఆందోళన నెలకొంది. (Muthoot Group: ఛైర్మన్ జార్జ్ ముత్తూట్ దుర్మరణం) జార్జ్ ముత్తూట్ అకాలమరణంపై విచారం వ్యక్తం చేసిన ముత్తూట్ ఫైనాన్స్ ఆయన నాయకత్వంలో సరికొత్త వృద్ధిని నమోదు చేసిందని, గోల్డ్ లోన్ ఇండస్ట్రీలో మార్కెట్ లీడర్ అయ్యిందని కంపెనీ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆయన ఆకస్మిక మరణం కుటుంబం, సన్నిహితులతోపాటు, కంపెనీకి, ఉద్యోగులకు తీరని నష్టమంటూ సంతాపాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా ముత్తూట్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది, కానీ ఆయన మరణానికి కారణం కంపెనీ ప్రస్తావించలేదు. అయితే తన నివాసంలోని నాలుగో అంతస్తునుంచి పడి జార్జ్ ముతూట్ చనిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేట్‌ను పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు. మరోవైపు దీనిపై ఢిల్లీలోని ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగం ముగ్గురు సీనియర్ వైద్యుల బోర్డును ఏర్పాటు చేసింది. ఈ కేసులో వారు అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తున్నారని, ఎయిమ్స్ ప్రొఫెసర్, ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగం అధిపతి డాక్టర్ సుధీర్ కుమార్ గుప్తా వెల్లడించారు. కాగా జార్జ్ ముతూట్ అనుమానాస్పద పరిస్థితుల్లో శుక్రవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. జార్జ్ ముత్తూట్ 1993లో ముత్తూట్ గ్రూపునకు ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సంస్థ భారీగా విస్తరించింది. గత దశాబ్దంలో మార్కెట్ క్యాప్‌ను దాదాపు ఎనిమిది రెట్ల మేర వృద్ధి చెందేలా కృషి చేశారు. -
ముత్తూట్ గ్రూప్ ఛైర్మన్ జార్జ్ ముత్తూట్ దుర్మరణం
సాక్షి, న్యూఢిల్లీ : ముత్తూట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ మత్తయ్య జార్జ్ ముత్తూట్ (72) కన్నుమూశారు. శుక్రవారం రాత్రి ఢిల్లీలోని తన నివాసంలో మెట్లపై నుంచి జారి పడి మరణించినట్టు తెలుస్తోంది. ఎంజీ జార్జ్ ముత్తూట్ హఠాన్మరణంపై వ్యాపార వర్గాలు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశాయి. 1949, నవంరులో కేరళలోని పఠనమిట్ట జిల్లాలోని కోజెన్‌చేరిలో జన్మించారు జార్జ్ ముత్తూట్. కుటుంబ వ్యాపారంలో చిన్న వయస్సులోనే ప్రవేశించారు. మూడో తరానికి చెందిన వారు. 1979లో మేనేజింగ్ డైరెక్టర్ పదవిని చేపట్టిన ఆయన 1993 లో ముత్తూట్ గ్రూపు చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటినుంచి జార్జ్ నేతృత్వంలోని కంపెనీ రూ. 51 వేల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ను సాధించింది. దీంతో కంపెనీ ఆదాయం 8వేల 722 కోట్ల రూపాయలకు చేరింది. ఆయనకు భార్య సారా జార్జ్, ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కుమారుడు జార్జ్ ఎం జార్జ్ ఈ బృందానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కాగా, చిన్న కుమారుడు అలెగ్జాండర్ జార్జ్ డైరెక్టర్ గా ఉన్నారు. కాగా రెండవ కుమారుడు పాల్ ముథూట్ జార్జ్ 2009 లో హత్యకు గురయ్యారు. కాగా దేశంలోనే అతి పెద్ద బంగారు ఆభరణాల తనఖా రుణాలసంస్థగా పేరున్న ముత్తూట్ ఫైనాన్స్‌కు 5,000 బ్రాంచీలు ఉన్నాయి. 20కి పైగా వ్యాపారాలు, 550 శాఖలున్నాయి. ఫిక్కీ జాతీయ కార్యవర్గ కమిటీలో సభ్యుడిగా, ఫిక్కీ కేరళ రాష్ట్ర కౌన్సిల్ ఛైర్మన్‌గా కూడా జార్జ్ ముత్తూట్ వ్యవహరిస్తున్నారు. ఫోర్బ్స్ ఆసియా మ్యాగజీన్ ఇండియా సంపన్నుల జాబితా ప్రకారం, 2011లో భారత్‌లో 50వ స్థానంలో ఉన్నారు. 2020 నాటికి ర్యాంకింగ్ మెరుగుపరచుకుని 500 కోట్ల డాలర్ల సంపదతో 44వ స్థానానికి చేరారు. MG George, Chairman Muthoot Group passed away. RIP pic.twitter.com/6GZGLuDRXr — Liz Mathew (@MathewLiz) March 5, 2021 -
‘ముత్తూట్’ దొంగలు దొరికారు
సాక్షి, హైదరాబాద్: తమిళనాడులో శుక్రవారం సినీఫక్కీలో భారీ దోపిడీకి పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను తెలంగాణ పోలీసులు 24 గంటల వ్యవధిలోనే చాకచక్యంగా పట్టుకున్నారు. కృష్ణగిరి జిల్లా హోసూర్‌లో ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలోకి చొరబడి సిబ్బందిని తుపాకులతో బెదిరించి సుమారు రూ. 7.5 కోట్ల విలువజేసే 25 కిలోల బంగారు ఆభరణాలు, రూ. 93 వేల నగదు కొట్టేసిన దోపిడీ దొంగలు తెలంగాణ రాష్ట్రం మీదుగా మహారాష్ట్ర పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 25 కిలోల బంగారు ఆభరణాలు, ఏడు తుపాకులు, 13 సెల్ ఫోన్లు, రూ. 93 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నేరానికి ఉపయోగించిన వాహనాలను సీజ్ చేశారు. తమిళనాడు పోలీసులు ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఈ కేసు వివరాలను కృష్ణగిరి ఎస్పీతో కలసి గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో సీపీ సజ్జనార్ శనివారం మీడియాకు తెలిపారు. లూ«థియానాలో విఫలయత్నం... హోసూర్‌లో సక్సెస్ మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన అమిత్, శంకర్‌సింగ్ బయ్యాల్ బాగల్, రూప్సింగ్ బాగల్, సుజీత్‌సింగ్, సౌరభ్, రోషన్‌సింగ్‌లు సులువుగా డబ్బు సంపాదించేందుకు నేరాలబాట పట్టారు. గతేడాది అక్టోబర్‌లో పంజాబ్‌లోని లూథియానాలో ఉన్న ఓ ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీలో వారు దోపిడీకి యత్నించగా సుజీత్‌సింగ్, సౌరభ్, రోషన్‌సింగ్‌ను అక్కడి ప్రజలు పట్టుకున్నారు. కానీ అమిత్, శంకర్‌సింగ్ మాత్రం కాల్పులు జరుపుతూ తప్పించుకొని పరారయ్యారు. ఈసారి ఎలాగైనా దోపిడీని విజయవంతం చేయాలని అమిత్, శంకర్‌సింగ్‌లు రూప్‌సింగ్‌కు చెప్పారు. దీంతో రూప్సింగ్, అమిత్‌లు నవంబర్‌లో బెంగళూరు వెళ్లి అక్కడ ఓ గదిలో అద్దెకు దిగారు. దోపిడీ పథకాన్ని తనకు పరిచయమున్న ఆయుధాలు సరఫరా చేసే నాగపూర్‌కు చెందిన లూల్య పాండేకు రూప్సింగ్ వివరించాడు. జార్ఖండ్‌లో పనిచేసే సమయంలో అమిత్‌కు స్నేహితులైన వివేక్ మండల్, భూపేందర్ మాంజిలతో ఏర్పడిన పరిచయంతో వారికి కూడా వివరించాడు. చాలా వరకు ముత్తూట్ కార్యాలయాల్లోనే రూప్సింగ్ రెక్కీలు చేశాడు. కంటైనర్ లోపల పరిశీలిస్తున్న సజ్జనార్ -
హోసూరు దోపిడీ ముఠా.. హైదరాబాద్‌లో పట్టేశారు..
సాక్షి, హైదరాబాద్: తమిళనాడు ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. శంషాబాద్ తొండపల్లి వద్ద అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేశారు. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హోసూర్ టౌన్ ముత్తూట్ ఫైనాన్స్‌లో దోపిడీకి పాల్పడిన ఈ గ్యాంగ్ నుంచి 25 కేజీల బంగారం, 7 తుపాకులు, బుల్లెట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు నుంచి హైదరాబాద్, కర్ణాటకకు పారిపోయేందుకు దోపిడీదారులు ప్రయత్నించగా, సైబరాబాద్ పోలీసులకు వచ్చిన సమాచారంతో దోపిడీ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. చదవండి: జైలు నుంచి విడుదలైన అఖిల ప్రియ సీపీ సజ్జనార్ వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు.‘‘తక్కువ సమయంలోనే దొంగలను పట్టుకున్నాం. నిందితుల చేతుల్లో వెపన్స్ ఉన్నాయి. 3 కమిషనరేట్ల పరిధిలోని పోలీస్ బృందాలు సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. అక్టోబర్‌లో లూథియానా, పంజాబ్ ముత్తూట్ ఫైనాన్స్‌లో దోపిడీ చేశారు. అప్పటి నుంచి నిందితులు తప్పించుకుని తిరుగుతున్నారు. తొండపల్లి చెక్‌పోస్ట్ వద్ద నిందితులను అరెస్ట్ చేశాం. వారిని విచారించగా మరో కంటైనర్‌లో గోల్డ్, వెపన్స్ తరలిస్తున్నట్లు తెలిసింది. మేడ్చల్ వద్ద కంటైనర్‌ను పట్టుకున్నాం. నిందితులు మధ్యప్రదేశ్, జార్ఖండ్, యూపీలకు చెందినవారని’’ సీపీ తెలిపారు. చదవండి: ఆ ఇద్దరు సైకోలకు ఉరిశిక్షల వెనుక.. తెలంగాణ పోలీసులు అద్భుతంగా స్పందించారు.. దోపిడీ ముఠాను పట్టుకోవడంలో తెలంగాణ పోలీసులు అద్భుతంగా స్పందించారని కృష్ణగిరి జిల్లా(తమిళనాడు) ఎస్పీ బండి గంగాధర్ అన్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ దాటుకుని తెలంగాణకు వచ్చారని.. ఈ గ్యాంగ్ చాలా ప్రమాదకరమైనదన్నారు. ఆయుధాలతో ఎదురు కాల్పులు జరిపే ప్రమాదం ఉందని, గతంలో లూథియానాలో ఈ గ్యాంగ్ చోరీ విఫలయత్నం అయినపుడు 32 రౌండ్లు కాల్పులు జరిపారని.. ఈ కాల్పులో ఒక వ్యక్తి కూడా మరణించాడని ఆయన వివరించారు. -
ముత్తూట్‌లో పట్టపగలే భారీ దోపిడీ.. రూ.7 కోట్లు చోరి
హోసూరు: బెంగళూరు సమీపం లోని తమిళనాడు పట్టణం హో సూరులో భారీ బంగారం దోపిడీ జరిగింది. ముత్తూట్ ఫైనాన్స్‌లో దుండగులు చొరబడి రూ.7 కోట్ల విలువ చేసే నగలు, నగదును దోచుకెళ్లారు. హోసూరులోని ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచ్‌లోకి శుక్రవారం ఉదయం గుర్తు తెలియని ఆరుగురు దుండగులు మాస్క్‌లు, హెల్మెట్లు ధరించి చొరబడ్డారు. కత్తులు, తుపాకులతో సిబ్బందిని బెదిరించి 14 కేజీల బంగారు నగలు, రూ.96 వేల నగదును బ్యాగుల్లో నింపుకుని పరారయ్యారు. విషయం తెలిసి హోసూరు డీఎస్పీ, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరిపారు. దుండగులు హిందీలో మాట్లాడారని, ఉత్తరాది వారిగా అనుమానిస్తున్నట్లు సంస్థ మేనేజర్ తెలిపారు. పట్టపగలే భారీ దోపిడీ జరగడం తీవ్ర కలకలం సృష్టించింది -
గోల్డ్ లోన్ కంపెనీలకు ఆర్బీఐ ఝలక్
సాక్షి, ముంబై: గోల్డ్ లోన్ కంపెనీలు మణప్పురమ్ ఫైనాన్స్, ముత్తూట్ ఫైనాన్స్‌కు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఝలక్ ఇచ్చింది. నిర్దేశిత నిబంధనలను అతిక్రమించారంటూ ఇరు కంపెనీలకు భారీ జరిమానా విధించింది. ముత్తూట్ ఫైనాన్స్, మనప్పురం ఫైనాన్స్‌లకు వరుసగా రూ .10 లక్షలు, రూ .5 లక్షలు జరిమానా విధించినట్టు గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ర్నాకులంలోని ముత్తూట్ ఫైనాన్స్ విభాగం మార్చి 31, 2018 మరియు మార్చి 31, 2019 కాలంలో గోల్డ్ లోన్లకు సంబంధించి లోన్ టు వ్యాల్యూ రేషియో మార్గదర్శకాలను ముత్తూట్ ఫైనాన్స్ అనుసరించలేదని రిజర్వు బ్యాంక్ పేర్కొంది. నిబంధనలను అతిక్రమించిన కారణంగా రూ.10 లక్షల జరిమానా విధిస్తున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా సంస్థ రూ.5 లక్షలకు పైన బంగారు రుణాలు జారీ చేసేటప్పుడు రుణ గ్రహీతల నుంచి పాన్ కార్డు తీసుకోవడమనే రూల్స్‌ను అనుసరించలేదని, అందుకే ఫైన్ వేశామని వివరణ ఇచ్చింది. దీంతోపాటు గోల్డ్ జువెలరీ ఓనర్షిప్ వెరిఫికేషన్ రూల్స్‌ను అనుసరించకపోవడంతో త్రిసూర్‌లోని మణపురం ఫైనాన్స్‌పై ఆర్బీఐ చర్య తీసుకుంది. రూ.5 లక్షల జరిమానా విధించింది. 2019 మార్చి 31 నాటికి సంస్థ ఆర్థిక స్థితిగతులను పరిశీలిస్తే, ఆర్బీఐ ఆదేశాలను పాటించలేదని తేలిందని చెప్పింది. -
టాటా పవర్.. స్పార్క్- ముత్తూట్ బోర్లా
ప్రపంచ ఆర్థిక రికవరీపై సందేహాలతో దేశీ స్టాక్ మార్కెట్లు డీలాపడ్డాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు, నిఫ్టీ 80 పాయింట్లు చొప్పున నష్టపోయి కదులుతున్నాయి. కాగా.. విద్యుత్ రంగంలో కార్యకలాపాలను మరింత భారీగా విస్తరించనున్నట్లు ప్రకటించడంతో టాటా పవర్ కంపెనీ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. మరోపక్క ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించినప్పటికీ గోల్డ్ లోన్ కంపెనీ ముత్తూట్ ఫైనాన్స్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి టాటా పవర్ భారీ లాభాలతో సందడి చేస్తుంటే.. ముత్తూట్ ఫైనాన్స్ నష్టాలతో కళ తప్పింది. వివరాలు చూద్దాం... టాటా పవర్ కంపెనీ ఇప్పటికే విద్యుదుత్పత్తి, ప్రసారం, పంపిణీ బిజినెస్‌లను నిర్వహిస్తున్న టాటా పవర్ ఇతర విభాగాలవైపు దృష్టిసారించింది. దేశవ్యాప్తంగా కార్యకలాపాలను విస్తరించడంతోపాటు.. రూఫ్‌టాప్ సోలార్, సోలార్ పంప్స్, లోకార్బన్ సొల్యూషన్స్, హోమ్ ఆటోమేషన్, ఈవీ చార్జింగ్ తదితరాలలోకి ప్రవేశించనున్నట్లు తాజాగా పేర్కొంది. దీంతో ఈ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో టాటా పవర్ షేరు 7 శాతం జంప్‌చేసి రూ. 61 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 62కు చేరింది. ముత్తూట్ ఫైనాన్స్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్- జూన్)లో ముత్తూట్ ఫైనాన్స్ నికర లాభం రూ. 858 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఇది 52 శాతం వృద్ధికాగా.. మొత్తం ఆదాయం 26 శాతం పెరిగి రూ. 2604 కోట్లను అధిగమించింది. నిర్వహణలోని ఆస్తుల విలువ 16 శాతం పుంజుకున్నట్లు కంపెనీ పేర్కొంది. కాగా.. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ముత్తూట్ ఫైనాన్స్ షేరు 4.2 శాతం పతనమై రూ. 1203 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1185 వరకూ నీరసించింది. ఇటీవల కొంత కాలంగా ఈ కౌంటర్ ర్యాలీ చేయడంతో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగుతున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. -
ఆర్బీఐ: ఆభరణాలపై ఇక 90 శాతం రుణాలు
మూడు రోజుల పరపతి విధాన సమీక్షలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ యథాతథ రేట్ల కొనసాగింపునకే కట్టుబడింది. దీంతో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో 4 శాతం వద్ద, రివర్స్ రెపో 3.35 శాతం వద్ద కొనసాగనున్నాయి. బ్యాంక్ రేటు సైతం 4.25 శాతంగా అమలుకానుంది. ఈ నిర్ణయాలతోపాటు బంగారు ఆభరణాలపై రుణాల పరిమితిని పెంచేందుకు ఆర్బీఐ నిర్ణయించింది. తద్వారా బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు ఆభరణాల విలువలో ఇకపై 90 శాతం వరకూ రుణాన్ని ఇచ్చేందుకు వీలు చిక్కనుంది. ఇప్పటివరకూ 75 శాతం విలువవరకూ రుణాల మంజూరీకి అనుమతి ఉంది. ఈ నిర్ణయాలు 2021 మార్చి వరకూ అమలుకానున్నట్లు తెలుస్తోంది. ధరలు తగ్గితే.. ప్రస్తుతం పసిడి ధరలు అనూహ్య ర్యాలీ చేస్తున్న విషయం విదితమే. దీంతో ఆభరణాలపై 90 శాతం రుణాలను మంజూరు చేస్తే బంగారం ధరలు తగ్గినప్పుడు రికవరీ సమస్యలు ఏర్పడగలవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో పసిడి ఆభరణాలపై రుణాలిచ్చే ఫైనాన్షియల్ కౌంటర్లలో అమ్మకాలు తలెత్తినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. నేలచూపులో.. బంగారు ఆభరణాలపై రుణాలిచ్చే ముత్తూట్ ఫైనాన్స్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 5 శాతం పతనమై రూ. 1198 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1325 వరకూ ఎగసిన ఈ షేరు తదుపరి రూ. 1196 వరకూ నీరసించింది. ఈ బాటలో మణప్పురం ఫైనాన్స్ 1 శాతం క్షీణించి రూ. 158 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 169 వద్ద గరిష్టాన్నీ, రూ. 157 వద్ద కనిష్టాన్నీ తాకింది. ఇక ముత్తూట్ క్యాపిటల్ 4 శాతం వెనకడుగుతో రూ. 358 వద్ద కదులుతోంది. ఒక దశలో రూ. 354 వరకూ నష్టపోయింది. -
ముత్తూట్ ఫైనాన్స్ షేరు రికార్డ్
గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో ముత్తూట్ ఫైనాన్స్ కౌంటర్‌కు డిమాండ్ కొనసాగుతోంది. తాజాగా ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ఎన్ఎస్ఈలో ఈ షేరు 15 శాతం దూసుకెళ్లింది. రూ. 1150 సమీపానికి చేరింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 13 శాతం జంప్‌చేసి రూ. 1129 వద్ద ట్రేడవుతోంది. ట్రేడింగ్ ప్రారంభమైన తొలి పావుగంటలోనే ఈ కౌంటర్లో ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో కలిపి 3.12 మిలియన్ షేర్లు చేతులు మారాయి. కాగా.. ఈ ఏడాది మార్చి 24న ముత్తూట్ ఫైనాన్స్ షేరు రూ. 477 వద్ద 52 వారాల కనిష్టాన్ని తాకింది. తదుపరి ర్యాలీ బాటలో సాగుతూ రెట్టింపునకుపైగా ఎగసింది. నిధుల దన్ను గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో ముత్తూట్ ఫైనాన్స్ నికర లాభం 59 శాతం వృద్ధితో రూ. 836 కోట్లను తాకింది. కన్సాలిడేషన్ ప్రాతిపదికన నిర్వహణలోని ఆస్తులు(రుణాలు) 22 శాతం పెరిగి రూ. 46,871 కోట్లను తాకాయి. క్యూ4లో గోల్డ్ లోన్ పోర్ట్‌పోలియో రూ. 3113 కోట్లు పెరిగి రూ. 41,611 కోట్లకు చేరింది. గత రెండు త్రైమాసికాలలో ముత్తూట్ ఫైనాన్స్ ఈసీబీల జారీ ద్వారా 1 బిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. బంగారం ధరల ర్యాలీ, పసిడిపై రుణాలకు పెరుగుతున్న డిమాండ్ వంటి అంశాలు కంపెనీకి జోష్‌నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. -
ముత్తూట్ రికార్డ్- ఎంజీఎల్ జోరు
ప్రపంచ మార్కెట్లు వెనకడుగు వేయడంతో దేశీయంగానూ సెంటిమెంటు బలహీనపడింది. 2020లో యూఎస్ జీడీపీ 6.5 శాతం క్షీణించనున్నట్లు తాజాగా ఫెడరల్ రిజర్వ్ వేసిన అంచనాలతో అమెరికా, ఆసియా మార్కెట్లు క్షీణించాయి. ఈ బాటలో దేశీ స్టాక్ మార్కెట్లు సైతం నష్టాలతో కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో విభిన్న వార్తల ప్రభావంతో ఎన్బీఎఫ్సీ ముత్తూట్ ఫైనాన్స్, మహానగర్ గ్యాస్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. నష్టాల మార్కెట్లనూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ముత్తూట్ ఫైనాన్స్ కోవిడ్-19 కట్టడికి లాక్‌డవున్ అమలు నేపథ్యంలో పసిడి రుణాలకు డిమాండ్ పెరిగినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించడం కూడా దీనికి జత కలసినట్లు చెబుతున్నారు. దీంతో బంగారు ఆభరణాలపై రుణాలిచ్చే ముత్తూట్ ఫైనాన్స్ కౌంటర్‌కు డిమాండ్ కొనసాగుతున్నట్లు తెలియజేశారు. మరోవైపు పసిడి ధరలు బలపడుతుండటం కూడా కంపెనీని సానుకూల అంశంగా తెలియజేశారు. ఈ నేపథ్యంలో వరుసగా మూడో రోజు ముత్తూట్ ఫైనాన్స్ కౌంటర్‌కు డిమాండ్ కనిపిస్తోంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు 2 శాతం బలపడి రూ. 990 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 998వరకూ ఎగసింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ఇంతక్రితం ఈ ఫిబ్రవరి 25న రూ. 954 వద్ద రికార్డ్ గరిష్టానికి చేరింది. ఇక మార్చి కనిష్టం రూ. 477 నుంచి చూస్తే 105 శాతంపైగా ఎగసింది. మహానగర్ గ్యాస్ గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో యుటిలిటీ కంపెనీ మహానగర్ గ్యాస్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి-మార్చి)లో నికర లాభం 25 శాతం పెరిగి రూ. 167 కోట్లకు చేరగా.. నికర అమ్మకాలు 5 శాతం నీరసించి రూ. 687 కోట్లకు పరిమితమయ్యాయి. నిర్వహణ లాభం మాత్రం 10 శాతం పుంజుకుని రూ. 225 కోట్లను తాకింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మహానగర్ గ్యాస్ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం జంప్‌చేసి రూ. 1042 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1044 వరకూ ఎగసింది. -
అందుకే బంగారు రుణాల వైపు మొగ్గు
ముంబై: భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమొ అందరికి తెలిసిందే. పసిడి మన సంస్కృతిలో అంతర్భాగమని నిపుణులు చెబుతుంటారు. కరోనా వైరస్ విలయతాండవంతో దేశ వ్యాప్తంగా ప్రభుత్వం లాక్డౌన్ అమలు చేస్తుంది. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కి తిరిగి వ్యాపారంలో పుంజుకునేందుకు ప్రజలు బంగారు రుణాల వైపు మొగ్గు చూపుతున్నట్లు బ్యాంక్ అధికారులు తెలిపారు. బ్యాంక్‌లు కూడా వివిధ ఆస్తుల గ్యారెంటీ కన్నా బంగారు రుణాలే మేలని భావిస్తున్నాయి. దేశంలో బంగారు రుణాలవైపు ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ క్రెసిల్ పేర్కొంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి, ఎక్కువ శాతం ప్రజలు బంగారు రుణాలు తీసుకోవడానికి సానుకూలంగా ఉన్నట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ హెడ్ పీఆర్ సోమ సుందరం పేర్కొన్నారు. కాగా దేశంలోని ప్రజలు సగటున (రూ.40,000) బంగారు రుణాలు తీసుకుంటున్నట్లు ముథుట్ ఫైనాన్స్ మేనేజింగ్ డైరెక్టర్ జార్జ్ అలెగ్జాండర్ ముథూట్ తెలిపారు. బంగారు రుణాలు ఇవ్వడానికే తమ బ్యాంక్ ప్రాధాన్యమిస్తున్నట్లు ఫెడరల్ బ్యాంక్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అశుతోష్ ఖాజురియా పేర్కొన్నారు. (చదవండి: మీ రుణం ‘బంగారం’ గాను..) -
ముత్తూట్ ఫైనాన్స్ ఎండీపై దాడి
కొచ్చి : ముత్తూట్ ఫైనాన్స్ ఎండీ జార్జ్ అలెగ్జాండర్ ముత్తూట్‌పై కొందరు వ్యక్తులు మంగళవారం ఉదయం దాడికి పాల్పడ్డారు. ఆయన కారులో వెళ్తుండగా రాళ్లు రువ్వడంతో తలకు గాయమైంది. దీంతో ఆయన్ని దగ్గర్లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. కోచిలోని ఐజీ ఆఫీస్ ఎదురుగా ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గతేడాది డిసెంబర్లో కేరళలోని 43 బ్రాంచ్‌ల్లో పనిచేస్తున్న 160 మంది సిబ్బందిని ముత్తూట్ సంస్థ తొలగించింది. దీంతో ఆ ఉద్యోగులు కొద్ది రోజులుగా సంస్థ నిర్ణయానికికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. ఈ క్రమంలోనే మంగళవారం కొందరు జార్జ్‌పై దాడి చేశారు. అయితే సీఐటీయూ గుండాలే ఈ దాడికి పాల్పడ్డారని ముత్తూట్ యాజమాన్యం ఆరోపించింది. సీఐటీయూ మాత్రం ఆ ఆరోపణలను ఖండించింది. ఈ దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. ఇలాంటి హింసాత్మక దాడులకు పాల్పడటం తమ విధానం కాదని సీఐటీయూ నాయకులు మీడియాకు తెలిపారు. జార్జ్‌పై దాడిని తీవ్రంగా ఖండించిన భారత పరిశ్రమల సమాఖ్య కేరళ విభాగం.. ఇది ఆందోళన కలిగించే విషయమని పేర్కొంది. -
77 కేజీల బంగారు నగలు చోరీ
కృష్ణరాజపురం: బెంగళూరులో అత్యంత భారీ చోరీ చోటుచేసుకుంది. ఏకంగా 77 కేజీల బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. బెంగళూరు పులకేశినగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని బాణసవాడి–హెణ్ణూరు రోడ్‌లోని లింగరాజపురం బ్రిడ్జి దగ్గర్లో ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయం ఉంది. ఇందులో తమ వినియోగదారులకు వారి బంగారం కుదువ పెట్టుకుని నగదు ఇస్తుంటారు. ఈ కార్యాలయంలో భారీగా బంగారం ఉంటుం దని భావించిన దుండగులు శనివారం రాత్రి గోడకు కన్నమేసి లోపలికి చొరబడ్డారు. బంగారం భద్రపరిచిన బీరువాలను గ్యాస్ కట్టర్లతో కత్తిరించారు. అందులోని 77 కేజీల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. పోలీసులకు ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు ముందుగా సీసీ కెమెరాలను తొలగించారు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేపట్టారు. చోరీ జరిగిన తీరు చూసి తెలిసిన వ్యక్తుల పనిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. కస్టమర్లకు భరోసా బంగారం చోరీ నేపథ్యంలో కస్టమర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బంగారానికి పూర్తిగా బీమా భద్రత ఉందని ముత్తూట్ ఫైనాన్స్ స్పష్టం చేసింది. దోపిడీ కారణంగా కస్టమర్ల బంగారానికి ఎలాంటి నష్టం వాటిల్లదని ఓ ప్రకటనలో పేర్కొంది. చోరీకి గురైన బంగారాన్ని పోలీసులు రికవరీ చేసే వరకూ కొంత సమయం ఇవ్వాలని తర్వాత వారికి పూర్తి పరిహారం చెల్లిస్తామని పేర్కొంది. నిందితులను పోలీసులు ఇప్పటికే గుర్తించారని, వారి నుంచి చోరీకి గురైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకునేందుకు అన్ని చర్యలూ చేపడుతున్నారని తెలిపింది. -
మీ రుణం ‘బంగారం’ గాను..
ఎవరికైనా అత్యవసరంగా డబ్బులు అవసరం పడితే వెంటనే తెలిసిన వారి దగ్గర చేబదులు తీసుకునేందుకు ప్రయత్నిస్తారు. పర్సనల్ లోన్‌కు వెళ్లాలంటే అందుకు కొన్ని రోజుల సమయం తీసుకుంటుంది. వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి రుణం తెచ్చుకోవడం వల్ల ఆర్థికంగా ఎంతో భారం పడుతుంది. ఇటువంటి అవసరాల్లో అన్నింటికంటే మెరుగైన మార్గంగా బంగారంపై రుణాన్ని చెప్పుకోవాలి. గోల్డ్‌లోన్ ఇతర రుణాలతో పోలిస్తే ఎన్నో విధాలుగా సౌకర్యమైనదే కాదు, మన డబ్బును కొంత ఆదా చేస్తుంది. పర్సనల్ లోన్, ఇతర వ్యక్తిగత రుణాల్లో వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. ఇది 12.75 శాతం నుంచి 19 శాతం వరకు ఉండొచ్చు. అదే గోల్డ్ లోన్స్‌పై వడ్డీ రేటు 12 శాతం నుంచి ప్రారంభమవుతుంది. కనుక ఇతర రుణాలతో పోలిస్తే ఈ విషయంలో గోల్డ్‌లోన్ చౌక అని చెప్పుకోవాలి. ఇతర రుణాలతో పోలిస్తే ఆ మేరకు ఆదా చేసుకోవచ్చు. కాకపోతే బంగారం విలువలో గరిష్టంగా ఎంత మేరకు రుణాన్ని తీసుకుంటున్నారు? అనే అంశమే వడ్డీ రేటును నిర్ణయిస్తుంది. ఉదాహరణకు మణప్పురం సంస్థ బంగారం విలువలో 45 శాతం వరకు రుణం తీసుకుంటే కేవలం 12 శాతం రేటునే చార్జ్ చేస్తోంది. ఇంకాస్త అదనంగా కావాలనుకుంటే అప్పుడు 18 శాతం వడ్డీ చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇక బంగారం విలువలో 75 శాతం వరకు రుణం కోరుకుంటే అప్పుడు 24–26 శాతం వరకు వడ్డీ రాబడుతోంది. కనుక రుణం తీసుకునే వారు ఈ అంశాన్ని గుర్తు పెట్టుకోవాలి. తమవద్దనున్న బంగారం విలువలో సగానికి మించకుండా రుణం తీసుకుంటే అధిక వడ్డీ బాదుడు ఉండదు. గంటలోపే రుణం వ్యక్తిగత రుణం తీసుకోవాలని భావిస్తే అందుకు ఎంతలేదన్నా కనీసం రెండు మూడు రోజుల సమయం తీసుకుంటుంది. మధ్యలో సెలవు రోజు ఉంటే ఇంకా ఒకటి రెండు రోజుల అదనపు సమయం తీసుకోవచ్చు. కానీ, బంగారంపై రుణానికి ఇంత సమయం వేచి ఉండక్కర్లేదు. మీ వద్దనున్న బంగారం, ఆధార్ కార్డు, మీ చిరునామా వివరాలతో ఎన్బీఎఫ్సీ సంస్థను ఆశ్రయిస్తే అరగంట నుంచి గంటలోపే రుణంతో తిరిగి వెళ్లిపోవచ్చు. ముత్తూట్ ఫైనాన్స్ అయినా మణప్పురం ఫైనాన్స్ అయినా గంటలోపే ప్రాసెస్ చేస్తున్నాయి. ప్రాసెసింగ్ ఫీజు పర్సనల్ లోన్‌పై కచ్చితంగా ప్రాసెస్ ఫీజు భరించాల్సి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు రుణం మొత్తంలో 1–2.5 శాతం వరకూ ఉండొచ్చు. గృహ, వాహన రుణాల్లోనూ ఈ చార్జీ తప్పదు. కానీ, బంగారంపై రుణానికి ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండకపోవడం ఎంతో వెసులుబాటు. కొన్ని సందర్భాల్లో చార్జీ తీసుకున్నా, ఆ మొత్తం రూ.10–50 మధ్యే ఉంటోంది. క్రెడిట్ స్కోరు అవసరం లేదు బంగారంపై రుణం అన్నది సెక్యూర్డ్ లోన్. పర్సనల్ లోన్ అన్నది అన్సెక్యూర్డ్ లోన్. బంగారంపై రుణం ఎగవేతకు అవకాశాలు చాలా చాలా తక్కువ. రుణ గ్రహీత చెల్లింపులు చేయడంలో విఫలమైతే సంస్థ తనఖాగా ఉంచిన బంగారాన్ని విక్రయించి రుణం కింద సర్దుబాటు చేసుకుంటుంది. అందుకే దీన్ని సెక్యూర్డ్ లోన్ అంటారు. తక్కువ వడ్డీ రేటుకు రుణం లభించడం ఇందువల్లే. ముఖ్యంగా ఇతర ఏ రుణానికైనా క్రెడిట్ స్కోరు చాలా కీలకం అవుతుంది. స్కోరు బాగాలేకపోతే దరఖాస్తును తిరస్కరించే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ, బంగారంపై రుణానికి క్రెడిట్ స్కోరుతో పనిలేదు. తనఖాగా బంగారం ఉంచితే చాలు. ముందుగా రుణాన్ని తీర్చేయవచ్చు.. వ్యక్తిగత, వాహన, గృహ రుణాలను నిర్ణీత కాల వ్యవధికి ముందుగానే తీర్చివేస్తే అందుకు కొంత మొత్తం చార్జీలను భరించాల్సి వస్తుంది. అదే బంగారంపై రుణాన్ని ఈ రోజు తీసుకుని రేపు తీర్చివేసినా ఎటువంటి చార్జీల్లేకపోవడం మరో సానుకూలత. గ్రామీణ ప్రాంతాల్లో ఉంటుంటే.. మణప్పురం, ముత్తూట్ వంటి సంస్థలు పట్టణాలకే పరిమితం. బ్యాంకులు మండల స్థాయి వరకు విస్తరించాయి. కనుక పట్టణాలకు కొంచెం దూరంలో ఉండే గ్రామీణులకు.. సమీపంలో ఉండే బ్యాంకుల నుంచి గృహ రుణం తీసుకోవడం కొంచెం సౌకర్యంగా ఉండొచ్చు. ఇంటివద్దకే రుణం కావాలంటే.. రుపీక్ అనే స్టార్టప్ ఇంటి వద్దకే వచ్చి బంగారంపై రుణాన్ని ఆఫర్ చేస్తోంది. ఆరు నెలల నుంచి ఏడాది వరకు కాల వ్యవధిపై రుణాలను ఇస్తోంది. వడ్డీ చెల్లింపుల్లో విఫలమైతే వడ్డీరేటును పెంచే చర్యలను అమలు చేయడం లేదు. పైగా ఆరు నెలలకు ఒకేసారి చెల్లించే సదుపాయాన్ని కూడా ఇస్తోంది. సేవల నాణ్యత బంగారంపై రుణం కోరుకునే వారు సేవల నాణ్యతను కూడా చూడాల్సిందే. బ్యాంకులతో పోలిస్తే ఎన్‌బీఎఫ్‌సీల సేవలు కాస్త మెరుగ్గా ఉంటాయి. ముత్తూట్ వంటి సంస్థలు మొబైల్ అప్లికేషన్ ద్వారా రుణంపై వడ్డీ చెల్లింపులు, అసలు చెల్లింపు తదితర ఎన్నో సేవలను అందిస్తున్నాయి. ఆదాయంతో కూడా పనిలేదు రుణం కావాల్సిన వారిలో గృహిణులు, వితంతువులు, వృద్ధులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు కూడా ఉండొచ్చు. మరి రుణం కోసం ఆదాయ ధ్రువీకరణ చూపించడం అంటే వీరికి కష్టమే. పర్సనల్ లోన్, వాహన రుణం, గృహ రుణాలకు ఆదాయాన్ని (బ్యాంకు స్టేట్మెంట్, పేస్లిప్ తదితర) కూడా చూపించాలి. కానీ, బంగారంపై రుణానికి ఎటువంటి ఆదాయ ధ్రువీకరణలు కూడా అవసరం లేదు. వడ్డీ వరకే.. బంగారంపై రుణంలో ఉన్న మరో సాకర్యం.. కేవలం వడ్డీ మాత్రమే చెల్లించే అవకా శం ఇవ్వడం. ఉదాహరణకు బంగారాన్ని తనఖా గా ఉంచి రూ.లక్ష రుణాన్ని తీసుకున్నారనుకోం డి. 12 శాతం వడ్డీ రేటు ఆధారంగా ప్రతీ నెలా రూ.1,000 మొత్తాన్ని చెల్లిస్తూ వెళ్లొచ్చు. అసలు మొత్తాన్ని బంగారం విడిపించుకోవాలనుకునే సమయంలో చెల్లించేందుకు అవకాశం ఉంది. కాకపోతే గోల్డ్ లోన్ 3 నెలలు, 6 నెలల కాల వ్యవధితో ఉంటుంటాయి. లోన్ టర్మ్ అయిన తర్వాత మళ్లీ రెన్యువల్ చేసుకుంటే సరిపోతుంది. మణప్పురం, ముత్తూట్ వంటి ఎన్బీఎఫ్సీ సంస్థల్లో ఇలా ఉంటుంది. అదే బ్యాంకుల్లో అలా కాదు అసలు, వడ్డీతో కలసిన ఈఎంఐ మొత్తాన్ని ప్రతీ నెలా చెల్లిస్తూ వెళ్లాలి. ఒకవేళ విఫలమైతే చార్జీలు బాదేస్తాయి. ప్రతీ నెలా క్రమం తప్పకుండా ఆదాయం వచ్చే అవకాశం లేని వారికి ఇది ఇబ్బందే. అందుకే అటువంటి వారు ఎన్బీఎఫ్సీ సంస్థల నుంచి తీసుకోవడం సౌకర్యం. కాల వ్యవధి బ్యాంకులు సాధారణంగా దీర్ఘకాలానికి అంటే – ఏడాది నుంచి మూడేళ్ల కాల వ్యవధికి బంగారం రుణాలను మంజూరు చేస్తుంటాయి. వ్యాపారానికి బంగారాన్ని తనఖాగా ఉంచి రుణా న్ని పొందే వారికి దీర్ఘకాలం అనుకూలం. కనుక అటువంటి వారికి బ్యాంకులే అనుకూలం. వీటిని గమనించాలి.. ► బంగారు ఆభరణాలు, బంగారం కాయిన్లపై బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. అయితే, మణప్పురం, ముత్తూట్ ఫైనాన్స్ వంటి సంస్థలు బంగారు ఆభరణాలపైనే రుణాలను ఆఫర్ చేస్తున్నాయి. బంగారం స్వచ్ఛత 18–24 క్యారెట్ల మధ్య ఉండాలి. ► చిరునామా, గుర్తింపు ధ్రువీకరణలు, ఇందులో ఆధార్ తప్పనిసరి, ఒక పాస్‌పోర్ట్ సైజు ఫొటో తీసుకెళ్లాల్సి ఉంటుంది. ► ఎన్బీఎఫ్సీ సంస్థల నుంచి తీసుకున్న బంగారం రుణంపై అసలు తర్వాత చెల్లించినా కానీ, వడ్డీని 30 రోజులు మించకుండా చెల్లించేయాలి. లేదంటే వడ్డీపై వడ్డీ పడుతుంది. అంతేకాదు, 12 శాతం వడ్డీ రేటు తీసుకుని 30 రోజులు దాటినా వడ్డీని చెల్లించకపోతే అప్పుడు ఆ రేటు కాస్తా 18 శాతానికి పెరిగిపోతుంది. ► అసలు, వడ్డీ చెల్లింపుల్లో విఫలమైతే మూడు, ఆరు నెలల పాటు వేచి చూసి అప్పటికీ చెల్లించకపోతే.. ఆ తర్వాత సంస్థలు వేలానికి వెళ్లొచ్చు. ► మీ వద్ద రూ.లక్ష బంగారం ఉంటే రూ.లక్ష రుణంగా లభించదు. బంగారం విలువలో 60–75 శాతం వరకు రుణంగా (లోన్ టు వ్యాల్యూ/ఎల్టీవీ) ఎన్బీఎఫ్సీలు ఇస్తున్నాయి. పెద్ద మొత్తంలో రుణం కోరుకుంటే అప్పుడు 60 శాతానికే పరిమితం చేస్తున్నాయి. అదే బ్యాంకులు అయితే బంగారం విలువలో 65 శాతానికే రుణాన్ని పరిమితం చేస్తున్నాయి. ► బ్యాంకులతో పోలిస్తే, సులభంగా, వేగంగా రుణం కోరుకుంటే గోల్డ్‌లోన్ కంపెనీలను ఆశ్రయించడమే మంచిది. కొన్ని బ్యాంకులు బంగారం రుణాలపైనా ప్రాసెసింగ్ చార్జీని రాబడుతున్నాయి. ► బంగారం రుణాలను టర్మ్ లోన్స్గానే బ్యాంకులు పరిగణిస్తున్నాయి. కనుక వడ్డీ, అసలు కలిపి వాయిదాలుగా చెల్లించాల్సి ఉంటుంది. ► బ్యాంకుల్లో బంగారం రుణాలపై వడ్డీ 14–18 శాతం మధ్య ఉంది. కానీ, ఎన్బీఎఫ్సీల్లో ఇది గరిష్టంగా 26 శాతం వరకు ఉండడం గమనార్హం. -
ఏటా 200 కొత్త శాఖలు: ముత్తూట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ముత్తూట్ ఫిన్‌కార్ప్ దేశవ్యాప్తంగా ఏటా 200 కొత్త కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. ప్రస్తుతం సంస్థకు 3,600 సెంటర్లు ఉన్నాయి. ఇందులో తెలంగాణలో 265, ఆంధ్రప్రదేశ్‌లో 317 నెలకొన్నాయని ముత్తూట్ ఫిన్‌కార్ప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వాసుదేవన్ రామస్వామి తెలిపారు. బిజినెస్ డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్ కోల వినోద్ కుమార్‌తో కలిసి గురువారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ఏడాదిలో తెలుగు రాష్ట్రాల్లో నూతనంగా 60 శాఖలు రానున్నాయని చెప్పారు. ఒక్కో కేంద్రానికి 3–5 మంది సిబ్బంది అవసరమవుతారని వివరించారు. అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ 2018–19లో రూ.11,200 కోట్లు ఉన్నాయి. ప్రస్తుత ఆరి్థక సంవత్సరంలో 15–17 శాతం వృద్ధి ఆశిస్తున్నట్టు వెల్లడించారు. -
మ్యూచువల్ ఫండ్స్ వ్యాపారంలోకి ముత్తూట్ ఫైనాన్స్
న్యూఢిల్లీ: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ) ముత్తూట్ ఫైనాన్స్ కొత్తగా మ్యూచువల్ ఫండ్స్ వ్యాపారంలోకి అడుగుపెడుతోంది. రూ.215 కోట్లతో ఐడీబీఐ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఐడీబీఐ ఏఎంసీ), ఐడీబీఐ మ్యూచువల్ ఫండ్ ట్రస్టీ కంపెనీలో నూరు శాతం ఈక్విటీని కొనుగోలు చేయనున్నట్టు ముత్తూట్ ఫైనాన్స్ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఇందుకు ఒప్పందం చేసుకున్నట్టు తెలిపింది. ఈ డీల్‌కు సెబీ తదితర నియంత్రణ సంస్థల ఆమోదం అవసరమని, వచ్చే ఫిబ్రవరి నాటికి కొనుగోలు పూర్తవుతుందని పేర్కొంది. ఐడీబీఐ ఏఎంసీ 2010లో ఏర్పాటు కాగా, రూ.5,300 కోట్ల పెట్టుబడులు నిర్వహణలో ఉన్నాయి. -
కిలాడీ లేడీ!
సాక్షి, చెన్నై : తిన్నింటి వాసాలు లెక్కించిన ముత్తూట్ ఫైనాన్స్ మహిళా ఉద్యోగి కటకటాల పాలైంది. ప్రియుడితో కలిసి పక్కా పథకం రచించిన ఈ కిలాడీ లేడి పోలీసులకు ఇచ్చిన సమాచారం, తనను చితక్కొట్టినట్టుగా వ్యక్తం చేసిన ఆవేదన వెరసి ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టించింది. దీంతో ప్రియుడితో పాటుగా కిలాడీ ని కోయంబత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. కోయంబత్తూరులోని ముత్తూట్ ఫైనాన్స్‌లో శనివారం దోపిడి జరిగిన విషయం తెలిసిందే. ఇందులో సుమారు రూ. 2 కోట్ల విలువైన నగలు, నగదు చోరీకి గురైంది. అయితే ఒకే వ్యక్తి దోపిడీకి పాల్పడినట్లు సీసీ కెమెరాల దృశ్యాలు పోలీసుల్నే విస్మయంలో పడేశాయి. వచ్చి రాగానే ఆ వ్యక్తి తనను చితక్కొట్టినట్టుగా, స్పృహ తప్పినట్టుగా అక్కడి మహిళా ఉద్యోగి రేణుకాదేవి(24) ఇచ్చిన సమాచారంతో పోలీసులు విచారణను మొదలెట్టారు. తొలుత ఓ క్లీనిక్‌లో ఆ తర్వాత ప్రైవేటు ఆస్పత్రిలో రేణుకాదేవి అడ్మిట్ అయినా, ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదని వైద్యులు తేల్చారు. ఇది పోలీసుల అనుమానానికి బలం చేకూర్చింది. అలాగే తనపై దాడి చేసి బంగారాన్ని అపహరించుకుని వెళ్లిన వ్యక్తి హిందీలో మాట్లాడినట్టుగా ఆమె పేర్కొనడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు. అయితే ఓ చోట సీసీ కెమెరాలో దోపిడికి పాల్పడ్డ వ్యక్తి ఆటోలో వెళ్లడం కనిపించింది. డ్రైవర్‌ను విచారించగా అతడు స్పష్టమైన తమిళంలో మాట్లాడినట్టు పేర్కొనడం పోలీసుల అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చాయి. దీంతో రేణుకాదేవిని తమదైన స్టైల్లో మహిళా పోలీసులు విచారించగా ప్రియుడితో కలిసి వేసిన స్కెచ్ బయట పడింది. పథకం ప్రకారం...అన్ని సక్సెస్ ఫైనాన్స్ సంస్థలో ఏ మేరకు నగలు ఉన్నాయి, శనివారం రద్దీ వివరాలను ముందుగానే తన ప్రియుడు ఈరోడ్ జిల్లా సత్యమంగళంకు చెందిన సురేష్(30)కు రేణుకాదేవి చేరవేసింది. ఆ రోజు విధుల్లో తనతో పాటుగా దివ్య కూడా ఉండడంతో పథకం ప్రకారం సాయంత్రం 3 గంటల తర్వాత నిద్ర మాత్రల్ని కాఫీలో కలిపి ఆమెకు ఇచ్చింది. దీంతో దివ్య పక్కనే ఉన్న గదిలో నిద్రకు ఉపక్రమించగా, తన వద్ద ఉన్న సెల్ ఫోన్ ద్వారా ప్రియుడికి డైరెక్షన్ ఇచ్చింది. అతడు ఉన్నది దోచుకున్నట్టు చేసింది. తాను స్పృహ తప్పినట్టుగా పడి పోవడం, గంట తర్వాత లేచి కేకలు పెట్టడం, ఇది విన్న దివ్య భయంతో పరుగున రావడం, ఆ పరిసర వాసులు చేరుకోవడం చోటు చేసుకున్నాయి. పథకం ప్రకారం దోపిడిని విజయవంతం చేసిన రేణుకా దేవి, తనపై దాడి చేసినట్లుగా, కొట్టిన వ్యక్తి హిందీలో మాట్లాడినట్టుగా పేర్కొని అడ్డంగా బుక్కయింది. కాగా సురేష్‌కు ఇప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రేణుకా దేవితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న సురేష్ విలాసవంతంగా జీవించేందుకు ప్రియురాలితో కలిసి పథకం వేసి చివరకు ఊచలు లెక్కించాల్సిన పరిస్థితి. ఈ ఇద్దర్ని అరెస్టు చేసిన పోలీసులు నగల్ని ఎక్కడ దాచి పెట్టారో విచారిస్తున్నారు. కాగా, సురేష్ తండ్రి నగల తయారీలో నిమగ్నమై ఉన్న దృష్ట్యా, ఆయన ద్వారా ఆ నగల్ని కరిగించే ప్రయత్నం చేసి ఉండవచ్చన్న కోనంలో విచారణ చేస్తున్నారు. -
ఒక్క భారీ చోరీతో సెటిలవుదామని..
సాక్షి, భీమవరం టౌన్: చిల్లర దొంగతనాలు మాని ఒకే ఒక్క భారీచోరీతో స్థిరపడిపోవాలని నిర్ణయించుకున్నాడు ఆ దొంగ. తాను దొంగిలించిన వస్తువులను తాకట్టుపెట్టే జ్యూయలరీ షాపునే అందుకు ఎంచుకున్నాడు. ఒక మోటార్ సైకిల్‌ను అపహరించి రెండుసార్లు రెక్కీ చేశాడు. ప్లాన్ ప్రకారం ఒక్కడే రూ.1.50 కోట్లు విలువ చేసే నాలుగు కిలోల బంగారు ఆభరణాలు, 1.3 కిలోల వెండి ఆభరణాలను చోరీ చేశాడు. చోరీ సమయంలో ముఖానికి వస్త్రం కట్టుకుని ఉన్న తనను జ్యూయలరీ షాప్ సీసీ కెమెరాలో కనిపించినా ఏ మాత్రం గుర్తు పట్టకూడదని పోలీసులను ఏమార్చేందుకు దేవుని గుడికి వెళ్లి గుండుకొట్టించుకున్నాడు. ఇక జీవితం బంగారుమయం అనుకున్నంతలోనే పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. భీమవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ఎం.రవిప్రకాష్, డీఎస్పీ కె.నాగేశ్వరరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉండి నియోజకవర్గం ఉండి గ్రామం కొత్తపేట సాయిబాబా గుడి ప్రాంతానికి చెందిన ఇర్రింకి చంద్రరావు వయసు 35 ఏళ్లు. కూలి పని చేసుకుంటూ దొంగతాలను ప్రవృత్తిగా ఎంచుకున్నారు. ఇతనిపై గతంలో ఉండి పోలీస్‌స్టేషన్‌లో రెండు కేసులు, భీమవరం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో రెండు కేసులు, పెంటపాడు పోలీస్‌స్టేషన్‌లో ఒక కేసు నమోదై ఉన్నాయి. ఉండి కేసులో పట్టుబడి గతేడాది అక్టోబర్‌లో జైలుకు వెళ్లి డిసెంబర్లో విడుదల అయ్యాడు. ఆ తర్వాత జీవితంలో స్థిరపడాలని నిర్ణయించుకుని అందుకు చీకటి మార్గా్గన్నే ఎంచుకున్నాడు. చోరీకి పక్కా ప్లాన్ ఈ ఏడాది మార్చి 25న పెంటపాడు గ్రామంలోని ఒక మద్యం దుకాణం వద్ద ఇర్రింకి చంద్రరావు మోటార్ సైకిల్‌ను అపహరించాడు. దానిపై భీమవరం వచ్చి భీమవరం ప్రకాశంచౌక్‌లోని మద్దుల వెంకటకృష్ణారావు జ్యూయలరీ షాపు వద్ద రెండు సార్లు రెక్కీ నిర్వహించారు. ఆ షాపు ప్రధాన గుమ్మం మెయిన్ రోడ్డులో ఉండడం, పోలీసు సీసీ కెమెరాతో పోటు గస్తీ కూడా ఉండడంతో వెనుక వైపు నుంచి చోరీకి నిర్ణయించాడు. మార్చి 31వ తేదీ రాత్రి 8 గంటలకు రూపాంతర దేవాలయంపై నుంచి జ్యూయలరీ షాపుపై అంతస్తు వెనుక భాగం వద్దకు చేరుకున్నాడు. రూపాంతర దేవాలయానికి చర్చి ఉన్న జ్యూయలరీ షాపు పై భాగంలో గోడకు బదులుగా ఉన్న ఐరన్ గ్రిల్స్ మెస్, ఇనుప గేటు, రెండు షెట్టర్ల తాళాలు తన వద్ద ఉన్న గునపం, స్క్రూ డ్రైవర్, కటింగ్ ప్లేయర్‌తో తొలగించాడు. లోపలికి ప్రవేశించి లాకర్లో పెట్టిన ఆభరణాలను కొట్టేశాడు. వాటిని బ్యాగ్‌లో వేసుకుని ఇంటికి చేరుకున్నాడు. సింహాచలం వెళ్లి గుండు కొట్టించుకుని.. చోరీసొత్తు నుంచి ఒక బ్రాస్లెట్, మూడు లాకెట్లు, రెండు జతల చెవిదిద్దులు మినహా మిగిలినవి ఇంట్లో మరో బ్యాగ్‌లో పెట్టి రహస్యంగా దాచేశాడు. బయటకు తీసిన కొన్ని ఆభరణాలను భీమవరంలోని ముత్తూట్ ఫిన్‌కార్ప్‌లో తాకట్టుపెట్టి సింహాచలం వెళ్లి అక్కడ గుండు కొట్టించుకుని ఈనెల 5న ఇంటికి చేరుకున్నాడు. వేగవంతంగా పోలీసుల దర్యాప్తు భారీచోరీతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దుకాణ యజమాని మద్దుల వీరనాగరాజు ఫిర్యాదుతో జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్ ఆదేశాల మేరకు నరసాపురం డీఎస్పీ కె.నాగేశ్వరరావు పర్యవేక్షణలో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. క్లూస్ టీమ్ సంఘటనా స్థలాన్ని అన్ని కోణాల్లోనూ పరిశీలించింది. సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. పాత నేరస్తులే ఈ పనిచేసి ఉంటారని భావించారు. ఇటీవల కాలంలో జైలు నుంచి విడుదలై బయట ఉన్న నేరస్తులపై దృష్టి పెట్టారు. మూడు నెలల క్రితం బయటకు వచ్చిన చంద్రరావును గతేడాది భీమవరం పోలీసులు అరెస్ట్ చేయగా అతను ఇచ్చిన సమాచారం మేరకు చంద్రరావు దొంగతనం చేసినట్టు భావించారు. సీసీ కెమెరా ఫుటేజిలో వ్యక్తి పోలికలు కూడా పోలీసులకు దర్యాప్తులో సహకరించాయి. సింహాచలం నుంచి ఇంటికి చేరుకున్న చంద్రరావు పెంటపాడులో అపహరించిన మోటార్ సైకిల్‌పై శనివారం చోరీ సొత్తుతో బయల్దేరాడు. టూటౌన్ సీఐ ఎస్ఎస్వీ నాగరాజు, కానిస్టేబుల్ ఎం.ప్రకాష్‌బాబుకు అందిన సమాచారంతో అప్రమత్తమయ్యారు. వన్‌టౌన్, టూటౌన్ సీఐలు పి.చంద్రశేఖరరావు, ఎస్ఎస్వీ నాగరాజు సిబ్బందితో కలిసి నర్సయ్య అగ్రహారం బైపాస్ రోడ్డు శివారులో నిందితుడిని పట్టుకుని అరెస్ట్ చేశారు. విచారణలో చంద్రరావు దొంగతనాన్ని ఒప్పుకున్నాడు. కోర్టులో హాజరుపరిచినట్లు చెప్పారు. అతడిపై రౌడీషీట్ తెరుస్తామన్నారు. చాకచక్యంగా కొద్ది రోజుల్లోనే కేసును ఛేదించి మొత్తం సొత్తును రికవరీ చేసిన సిబ్బందిని అభినందించారు. ఇద్దరు సీఐలు, సిబ్బందికి రివార్డులు అందచేశారు. -
మాయచేసి.. మాటల్లో దింపి..
సాక్షి, కరీంనగర్‌క్రైం: కరీంనగర్, వరంగల్, జనగామా జిల్లాల్లో అమాయక ప్రజలకు మాయమాటలు చెప్పి.. మోసం చేస్తున్న సికింద్రాబాద్ చిలకలగూడకు చెందిన కొవ్వూరి రాజేశ్వర్‌రావు(45) ఊరాఫ్ కిరణ్‌రెడ్డి, సురేష్, రాజును కరీంనగర్ సీసీఎస్ పోలీసులు గురువారం అరెస్ట్ చూపారు. ఏసీపీ శ్రీనివాస్ వివరాల ప్రకారం.. కొవ్వూరి రాజేశ్వర్‌రావు హన్మకొండలోని అమరావతినగర్లో నివాసముంటున్నాడు. అమాయకులను మోసం చేయడమే వృత్తిగా ఎంచుకున్నాడు. ప్రధాన పట్టణాల్లోని ఆస్పత్రుల వద్ద మకాం వేసి అక్కడికి వచ్చే అమయకులకు, వృద్ధులకు సాయం చేస్తున్నట్లు నటించి వారివద్దనున్న బంగారం చోరీ చేస్తుంటాడు. రైల్వేస్టేషన్లు, ఆలయాల వద్ద మకాంవేసి తను దోషాల నివారణకు మార్గం చెప్తానని నమ్మిస్తాడు. తమవద్ద ఉన్న బంగారు ఆభరణాలు ఇమ్మని, వాటికి పూజలు చేస్తానని, ఈ లోపు కాళ్లుకడుక్కుని రమ్మని అక్కడినుంచి పరారవుతాడు. ఇంకా పలురకాల విద్యలు వచ్చని మోసం చేస్తున్నాడు. చోరీచేసిన బంగారు ఆభరణాలను ముణప్పురం, మూత్తుట్ వంటి ఫైనాన్స్ కంపెనీల్లో తాకట్టుపెట్టి వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తుంటాడు. ఇలా ఆరు నేరాలకు సంబంధించిన ఆభరణాలను హుజూరాబాద్‌లోని మణప్పురంలో, మూడు నేరాలకు సంబంధించిన ఆభరణాలను హన్మకొండ నయిమ్నగర్లో మణçప్పురంలో, మరోనేరానికి సంబంధించిన వాటిని నయిమ్‌నగర్ మూత్తుట్ మినీలో తాకట్టు పెట్టాడు. ఈ క్రమంలో పలువురు బాధితులు కరీంనగర్ సీపీ కమలాన్రెడ్డిని ఆశ్రయించారు. కేసును సీసీఎస్ పోలీసులకు అప్పగించారు. సీఐ కిరణ్, సైబర్‌క్రైం ఇన్చార్జి మురళి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేశారు. పలు సీసీఫుటేసీలు పరిశీలించగా బాధితులు నిందితుడ్ని గుర్తించారు. సైబర్ ల్యాబ్ ద్వారా నిందితుడు రాజేశ్వర్రావుగా నిర్దారించుకున్నారు. గురువారం ఉదయం జమ్మికుంటలోని డాక్టర్స్ట్రీట్లో సంచరిస్తుండగా సీఐ కిరణ్, జమ్మికుంట సీఐ సృజన్‌కుమార్ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. అతడినుంచి రూ.4 లక్షల విలువైన 13 తులాల బంగారం, 2 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన సీసీఎస్ సీఐ కిరణ్, జమ్మికుంట సీఐ సృజన్‌రెడ్డి, సైబర్ ల్యాబ్ ఇన్చార్జి మురళి, సీసీఎస్ ఎస్సై కనుకయ్య, సిబ్బందిని సీపీ కమలాసన్‌రెడ్డి అభినందించి రివార్డు అందించారు. -
ముత్తూట్ ఫైనాన్స్ లాభం రూ.483 కోట్లు
న్యూఢిల్లీ: ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.484 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.446 కోట్ల నికర లాభం సాధించామని, 9 శాతం వృద్ధి సాధించామని ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీ తెలిపింది. గత క్యూ2లో రూ.1,662 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.1,650 కోట్లకు తగ్గిందని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ముత్తూట్ ఫైనాన్స్ షేర్ 7.1 శాతం నష్టంతో రూ.416 వద్ద ముగిసింది. -
ముత్తూట్ ఫైనాన్స్ లాభం రూ.492 కోట్లు
న్యూఢిల్లీ: ముత్తూట్ ఫైనాన్స్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 43 శాతం పెరిగింది. గతేడాది క్యూ1లో రూ.345 కోట్లుగా ఉన్న లాభం ఈ క్యూ1లో రూ.492 కోట్లకు పెరిగింది. మొత్తం ఆదాయం రూ.1,377 కోట్ల నుంచి 19% వృద్ధి చెంది రూ.1,633 కోట్లకు ఎగసిందని కంపెనీ చైర్మన్ ఎమ్. జి. జార్జ్ ముత్తూట్ తెలిపారు. కంపెనీ ఇచ్చిన రుణాలు రూ.27,857 కోట్ల నుంచి 11% వృద్ధితో రూ.30,997 కోట్లకు పెరిగాయని చెప్పారు. ఫలితాల ప్రభావంతో కంపెనీ షేర్ 9.4% లాభంతో రూ.437 వద్ద ముగిసింది. -
రూ.300 కోట్ల వ్యక్తిగత రుణాలిస్తాం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ ముత్తూట్ ఫైనాన్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.300 కోట్ల మేర వ్యక్తిగత రుణాలు జారీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇటీవలే వ్యక్తిగత రుణాల విభాగంలోకి ప్రవేశించిన ఈ సంస్థ... 2018 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు రూ.30 కోట్లను కస్టమర్లకు అందించింది. అయిదేళ్లలో రూ.3,000 కోట్ల స్థాయికి ఈ విభాగాన్ని తీసుకెళతామని ముత్తూట్ ఫైనాన్స్ ఈడీ జార్జ్ ఎం అలెగ్జాండర్ మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. ఉద్యోగం చేస్తున్న వారికే రుణాలిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తొలుత హైదరాబాద్‌లోనే ఈ సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు తెలియజేశారు. దశలవారీగా ఇతర నగరాలకు విస్తరిస్తారు. రెండు రోజుల్లో రుణం మంజూరు చేస్తారు. కస్టమర్ కనీస జీతం నెలకు మెట్రో నగరాల్లో రూ.20,000, ఇతర పట్టణాల్లో రూ.10,000 ఉండాలి. రూ.1 లక్ష నుంచి రూ.10 లక్షల దాకా రుణం తీసుకోవచ్చు. వడ్డీ 14– 21 శాతం ఉంటుంది. ఏడాది నుంచి అయిదేళ్ల కాల పరిమితిలో అప్పు తిరిగి చెల్లించాలి. -
‘ముత్తూట్ ఫైనాన్స్’ నిందితుల అరెస్టు
హైదరాబాద్: దొంగతనాలనే వృత్తిగా చేసుకుని బతుకుతున్న మహారాష్ట్రకు చెందిన ముఠాను మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. రాజేంద్రనగర్ ఏసీపీ అశోక్‌కుమార్, ఇన్స్పెక్టర్ జగదీశ్వర్, అడిషనల్ ఇన్స్పెక్టర్ హన్మంత్ తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన మహ్మద్ షరీఫ్ (35), హర్షద్ (28), సయ్యద్ షఫీయుద్దీన్ (30), అన్నా (35), సంతోష్ దశరథ్ వీర్కర్(35), మహ్మద్ ఫారూఖ్ (30), మహ్మద్ దస్తగిరి (55) ముఠాగా ఏర్పడ్డారు. దస్తగిరి చాంద్రయణగుట్ట బండ్లగూడ ప్రాంతంలో ఉంటూ పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన వీరంతా హైదరాబాద్‌లో పలు దొంగతనాలు, దోపిడీ కేసుల్లో నిందితులుగా ఉండి జైలు శిక్ష సైతం అనుభవించారు. దోపిడీకి ప్లాన్ చేసి పరారీ: మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ముత్తూట్ ఫైనాన్స్‌లో కిందటేడాది జూన్ 3న దోపిడీ చేసేందుకు ఈ ఏడుగురు నిందితులు పథకం పన్నారు. మహారాష్ట్రలో దొంగిలించిన టవేరా వాహనంలో వీరంతా ఆయుధాలతో మైలార్‌దేవ్‌పల్లికి చేరుకున్నారు. ప్లాన్ ప్రకారం ముత్తూట్ ఫైనాన్స్‌కు చేరుకోగా.. అందులో రద్దీ ఎక్కువగా ఉండటంతో మేనేజర్‌తో మాట్లాడి వెళ్లిపోయారు. మరుసటి రోజు ఉదయం 10 గంటలకు మైలార్‌దేవ్‌పల్లిలో కలుసుకున్నారు. ఆయుధాలతో వచ్చిన దుండగులు మేనేజర్‌తో గొడవపడి ఘర్షణ పడుతున్న సమయంలో సిబ్బంది అలర్ట్ అయి సైరన్ మోగించారు. దీంతో టవేరా వాహనంలో బయలుదేరి ఉప్పర్‌పల్లి హ్యాపీ హోమ్స్‌లో వదిలి వెళ్లిపోయారు. కొంతకాలంగా మహారాష్ట్రకు చెందిన దొంగలను పట్టుకునేందుకు నిఘా ఏర్పాటు చేసిన పోలీసులకు చిక్కారు. ఈ ఏడుగురు నిందితుల్లో నలు గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. -
గుత్తి ముథూట్ ఫిన్‌కార్ఫ్ బ్రాంచ్‌లో గోల్మాల్
-
అంతా పథకం ప్రకారమే..
గుత్తి : తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలు, చే బదులుగా ఇచ్చిన నగదుతో ముత్తూట్ ఫిన్‌కార్ప్ మేనేజర్ రవికుమార్ ఉడాయించాడు. బాధితులు తమ సొమ్ము కోసం ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి. గుత్తిలోని ముత్తూట్ ఫిన్‌కార్ప్ మేనేజర్ రవికుమార్ తమవద్దకు వచ్చే ఖాతాదారులతో పరిచయం పెంచుకుని, వారిని తన బుట్టలో వేసుకున్నాడు. తనకు సంస్థ టార్గెట్ కేటాయిచిందని, మీ బం గారు ఆభరణాలు ఇస్తే.. తర్వాత తిరిగి ఇస్తానని తెలపడంతో దాదాపు 12 మంది అమాయకులు అతడి మాటలు నమ్మి 30 తులాలమేర ఆభరణాలతోపాటు, చేతి బదులు కింద రూ.5 లక్షల నగదు అప్పగించారు. అయితే వారికి ఎటువంటి రసీదూ మేనేజర్ ఇవ్వలేదు. అలా కొద్దిరోజులు గడిచాక తమ సొమ్ము తెచ్చుకునేందుకు కస్టమర్లు కార్యాలయం వద్దకు వస్తున్నారు. అయితే మేనేజర్ లేడని సిబ్బంది చెప్పి పంపుతూ ఉన్నారు. మేనేజర్ ఇంటికి తాళం పడి ఉండటం.. సెల్‌ఫోన్ స్విచాఫ్ కావడం, ఇరవై రోజులు దాటినా లేడని సిబ్బంది నుంచి సమాధానం వస్తుండటంతో ఓపిక నశించిన బాధిత కస్టమర్లు గౌరమ్మ, సరోజ, రంగయ్య(గుత్తి), నరసింహులు( గుత్తి ఆర్ఎస్), విరూపాక్షిరెడ్డి(ఇసురాళ్లపల్లి) మరికొంతమంది మంగళవారం కార్యాలయంలో ఆందోళనకు దిగారు. ప్రస్తుత మేనేజర్ నౌషద్ స్పందించిత్వరలోనే న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
దొంగను చేసిన క్రికెట్ బెట్టింగ్!
సాక్షి, చిత్తూరు : క్రికెట్ బెట్టింగ్ ఓ ఫైనాన్స్ కంపెనీ మేనేజర్‌ను దొంగను చేసింది. జిల్లాలోని వి.కోట ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచిలో మేనేజర్‌గా పనిచేస్తున్న ప్రకాశ్ ఏకంగా తనాఖా పెట్టిన నగలను బెట్టింగ్ కాసి పోగొట్టుకున్నాడు. గుట్టుచప్పుడు కాకుండా కాజేసిన 2 కేజీల నగల స్థానంలో నకిలీ బంగారు నగలను పెట్టాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో మనస్థాపంతో ప్రకాశ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ముత్తూట్ ఫైనాన్స్ లాభం 53 శాతం అప్
న్యూఢిల్లీ: బంగారు ఆభరణాలపై రుణాలిచ్చే ముత్తూట్ ఫైనాన్స్ సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.454 కోట్ల నికర లాభం సాధించింది. గత క్యూ2లో సాధించిన నికర లాభం(రూ.297 కోట్లు)తో పోల్చితే 53 శాతం వృద్ధి సాధించామని ముత్తూట్ ఫైనాన్స్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ. 1,386 కోట్ల నుంచి రూ.1,670 కోట్లకు పెరిగిందని కంపెనీ ఎండీ, జార్జ్ అలెగ్జాండర్ ముత్తూట్ పేర్కొన్నారు. నికర లాభం, ఆదాయం బాగానే పెరిగినప్పటికీ, మొండి బకాయిలు కూడా బాగానే పెరిగాయి. గత క్యూ2లో రూ.6,016 కోట్లుగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో రూ.12,593 కోట్లకు, నికర మొండి బకాయిలు రూ.4,997 కోట్ల నుంచి రూ.11,021 కోట్లకు పెరిగాయని జార్జ్ చెప్పారు. -
ముత్తూట్ కేసులో ప్రధాన నిందితుడి అరెస్టు
- రెండు పిస్టళ్లు, 15 బుల్లెట్లు స్వాధీనం - ఆరు నెలలు రెక్కీ చేసిన గ్యాంగ్ హైదరాబాద్: మైలార్‌దేవ్‌పల్లి ముత్తూట్ ఫైనాన్స్‌లో చోరీ యత్నం కేసులో ప్రధాన నిందితుడిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి 2 పిస్టల్స్, 15 బుల్లెట్లు, 4 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ సందీప్ శాండిల్యా వివరాలు వెల్లడించారు. గత నెల 4న మైలార్‌దేవ్‌పల్లిలోని ముత్తూట్ ఫైనా న్స్ చోరీ యత్నం కేసులో ముంబై కల్యాణీకి చెందిన మహ్మద్ షరీఫ్ అబ్దుల్ ఖాద్రీ(42) ప్రధాన నిందితుడు. ఏడుగురితో కలసి షరీఫ్ మైలార్‌దేవ్‌పల్లి ముత్తూట్ ఫైనాన్స్‌పై 6 నెలలు రెక్కీ నిర్వహించాడు. చోరీ అనంతరం గాల్లో కాల్పులు జరిపి పారిపోవాలని భావించినా..జనం ఒక్కసారిగా లోపలికి రావడంతో దిక్కుతోచక తలో దిక్కు పారిపోయారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్ట్ చేయగా, శుక్రవారం షరీఫ్‌ను మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన నిందితులు పరారీలో ఉన్నారు. ఏడేళ్లు జైలు శిక్ష అనుభవించిన షరీఫ్... షరీఫ్‌ది తొలి నుంచీ నేర చరిత్రే. యూపీలోని సిద్ధార్థనగర్ జిల్లాకు చెందిన ఇతడు 1994లో ముంబైకి మకాం మార్చా డు. రెండేళ్లు సెలూన్లో పనిచేసిన తర్వాత స్నేహితులతో స్క్రాప్ బిజినెస్ మొదలుపెట్టాడు. 1999లో థానేలో దోపిడీకి యత్నించి అరెస్టయ్యాడు. థానే జైల్లో ఫిరోజ్ పరిచయమయ్యాడు. భారీ చోరీకి పథకం వేయాలని సూచించిన ఫిరోజ్ సర్దార్‌ను పరిచయం చేశాడు. 2008లో ఆరుగురు సభ్యులతో కలసి మహారాష్ట్రలోని నందూర్బార్లో నగల షాపునకు వస్తున్న యజమానిపై దాడి చేసి, కిలో బంగారు ఆభరణాలు దోచుకుని పరారయ్యాడు. పోలీసులకు చిక్కి, ఏడేళ్ల జైలు శిక్ష అనుభవించాడు. విడుదలయ్యాక జైల్లో పరిచయమైన అర్షద్, షఫీతో కలసి గుజరాత్ (2015)లో కారు చోరీ చేశాడు. అదే కారును తాజా కేసులో ఉపయోగించాడు. అనంతరం అర్షద్, షఫీ, రాజేశ్, ఫరూక్, సంతోష్, మహ్మద్ దస్తగిరి, షేరుతో కలసి ముఠాగా ఏర్పడిన షరీఫ్ భారీ చోరీకి పథకం వేశాడు. అందులో భాగంగానే మైలార్‌దేవ్‌పల్లిలోని ముత్తూట్ ఫైనాన్స్‌ను ఎంచుకున్నట్టు పోలీసులు తెలిపారు. చోరీ స్కెచ్‌కి 3 లక్షల ఖర్చు చోరీకి పథకం వేసిన షరీఫ్ గ్యాంగ్... రూ.35 వేలు చెల్లించి యూపీకి చెందిన షేరు నుంచి 2 పిస్టళ్లు, 15 బుల్లె ట్లు కొనుగోలు చేసింది. ఈ ముఠా ముత్తూట్‌లో చోరీకి రూ.3 లక్షలు ఖర్చు చేసినట్లు పోలీసులు తెలిపారు. షరీఫ్ వద్ద మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్న బుల్లె ట్లు పోలీసులకు చెందినవిగా భావిస్తున్నారు. అవి యూపీ పోలీసులవి అయివుండవచ్చని తెలుస్తోంది. వీటిపై విచారణ జరుపుతున్నామని సీపీ చెప్పారు. -
ముత్తూట్ దోపిడీ: ప్రధాన నిందితుడి అరెస్ట్
హైదరాబాద్ : ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీకీ విఫలయత్నం చేసిన ప్రధాన నిందితుడు మహ్మద్ షరీఫ్ అబ్దుల్ ఖాదర్‌ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. మొత్తం 8 మంది నిందితుల్లో ఐదుగురిని పోలీసులు పట్టుకోగా.. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ముత్తూట్ చోరీ కోసం మూడు లక్షల రూపాయలను షరీఫ్ ఇన్వెస్ట్ చేసినట్లు తెలిసింది. అతని వద్ద నుంచి 2 అత్యాధునిక పిస్టల్స్, 4 సెల్ ఫోన్ లు, 15 రౌండ్ల బుల్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు. -
‘ముత్తూట్’ నేరం ‘మహా’ ముఠా పనే!
⇒ బందిపోటు దొంగలకు ఆశ్రయం ఇచ్చిన నగరవాసి ⇒ దర్యాప్తులో కీలకాధారంగా మారిన ప్లాస్టిక్ కవర్ ⇒ నలుగురు నిందితుల అరెస్టు, పరారీలో ముగ్గురు సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలో భారీ చోరీ యత్నం కేసును పోలీసులు ఛేదించారు. దొంగల ముఠాలోని నలుగురిని అరెస్టు చేశారు. పట్టుబడినవారిలో అర్షద్, సంతోష్, షఫీ, దస్తగిరి ఉన్నారు. సూత్రధారి సహా ముగ్గురు పరారీలో ఉన్నారు. దొంగల ముఠాకు ఓ నగరవాసి షెల్టర్ ఇచ్చాడు. మైలార్‌దేవ్‌పల్లిలోని ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలో చోరీకి యత్నించింది మహారాష్ట్రకు చెందిన ముఠా అని సంయుక్త పోలీసు కమిషనర్ షానావాజ్ ఖాసిం తెలిపారు. క్రైమ్, ఎస్వోటీ, శంషాబాద్ డీసీపీ జానకి షర్మిల, శ్రీనివాస్‌రెడ్డి, పద్మజలతో కలసి శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జైల్లో జట్టుకట్టిన ముఠా మహారాష్ట్రకు చెందిన షరీఫ్, అర్షద్ ఫలుముద్దీన్ ఖాన్ వివిధ కేసుల్లో అరెస్టు అయి అక్కడి ధూలే సబ్–జైలుకు వెళ్ళిన నేపథ్యంలో వీరికి పరిచయమైంది. జైలు నుంచి విడుదలైన తర్వాత ఉస్మానాబాద్‌కు చెందిన పాత నేరగాడు షర్ఫుద్దీన్ నవబుద్దీన్ సయ్యద్ అలియాస్ షఫీని తమతో కలుపుకున్నారు. ఈ ముగ్గురూ కలిసి దోపిడీలు, బందిపోటు దొంగతనాలు చేయాలని పథకం వేశారు. లక్ష్యాలను ఎంపిక చేసుకోవడానికి షరీఫ్, షఫీ పలుమార్లు హైదరాబాద్ వచ్చి వెళ్లారు. బండ్లగూడలో నివసించే షఫీ మామ మహ్మద్ దస్తగిరి వద్ద వీరు షెల్టర్ తీసుకున్నారు. ఈ ముఠా హైదరాబాద్‌లో ఉన్న పలు ముత్తూట్ సంస్థల వద్ద రెక్కీ నిర్వహించిన మీదట మైలార్‌దేవ్‌పల్లి ముత్తూట్ బ్రాంచిని టార్గెట్‌గా ఎంచుకున్నారు. ఈ పథకాన్ని అమలులో పెట్టడానికి అన్నా, ఫరూఖ్‌లను తమతో కలుపుకున్నాడు. ఈ ఆరుగురు ముఠాగా ఏర్పడ్డారు. ఈ నెల 3వ తేదీ ఉదయం ఈ ఆరుగురు మారణాయుధాలతో హైదరాబాద్ చేరుకుని సాయంత్రం మైలార్‌దేవ్‌పల్లిలోని ముత్తూట్ సంస్థకు వెళ్లారు. అయితే, జనం ఎక్కువగా ఉండటంతో ఇద్దరు నిందితులు సంస్థ మేనేజర్‌ను కలిసి రూ.20 వేలకు బంగారు ఉంగరాన్ని తాకట్టు పెట్టాలంటూ మాట్లాడారు. గుర్తింపు పత్రాలు లేనిదే తాకట్టు సాధ్యం కాదని మేనేజర్ చెప్పడంతో తిరిగి వచ్చారు. ఆ రోజు షఫీ తన మామ దస్తగిరి ఇంటికి వెళ్ళి షెల్టర్ తీసుకోగా, మిలిగిన ఐదుగురు నగర శివార్లలోని జాతీయ రహదారిపై బుదేరా గ్రామంలో ఉన్న తాజ్ ధాబాలో బస చేశారు. పథకం పారకపోవడంతో ... దస్తగిరి మినహా మిగిలిన ఆరుగురు మరునాడు ముత్తూట్ సంస్థ వద్దకు టవేరా వాహనంలో చేరుకున్నారు. తమ వెంట రెండు తుపాకీలతో పాటు తల్వార్లు సైతం తీసుకువచ్చారు. డ్రైవర్‌తో పాటు మరో నిందితుడు వాహనంలోనే ఉండిపోగా... మిగిలిన నలుగురూ సంస్థ వద్దకు వెళ్లారు. ఒకరు మెట్ల వద్ద, మరొకరు తలుపు దగ్గర కాపుకాయగా... ఇద్దరు సంస్థ లోపలకు వెళ్ళారు. కొద్దిసేపటికి మిగిలిన ఇద్దరూ సంస్థలోకి వెళ్లి బందిపోటు దొంగతనానికి యత్నించారు. సిబ్బంది అప్రమత్తం కావడంతో వీరి ప్రయత్నం విఫలమైంది. భయంతో అర్షద్ అక్కడ నుంచే పారిపోగా, మిగిలిన ఐదుగురూ టవేరా వాహనంలోనే ఉప్పర్‌పల్లిలోని హ్యాపీహోమ్స్ అపార్ట్మెంట్ వద్దకు వెళ్లారు. ముగ్గురు రోడ్డుపై దిగిపోయి పరారు కాగా, ఇద్దరు వాహనాన్ని పార్కింగ్ స్థలంలో నిలిపి నంబర్ ప్లేట్లు తీసేసి పారిపోయారు. వీరంతా తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. ఈ ఉదంతంపై కేసు నమోదు చేసుకున్న మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు. పార్క్ చేసిన వాహనాన్ని గుర్తించిన నేపథ్యంలో అందులోంచీ వేలిముద్రలు సేకరించారు. హ్యాపీహోమ్స్ అపార్ట్మెంట్ వద్ద టవేరా వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా అందులో ఓ ప్లాస్టిక్ కవర్ లభించింది. కేసు దర్యాప్తులో ఈ కవర్ కీలకంగా మారింది. దానిపై ఉస్మానాబాద్‌లోని వీర్‌సావర్కర్ చౌక్ చిరునామా ఉండటంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఇటీవల హైదరాబాద్‌కు చేరుకున్న షఫీ తన మామ దస్తగిరి దగ్గర ఆశ్రయం తీసుకున్నాడు. షఫీ కదలికలపై సమాచారం అందుకున్న పోలీసులు వీరిద్దరినీ పట్టుకుని విచారించగా, మిగిలిన వారి వివరాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఉస్మానాబాద్, ముంబై వెళ్లిన పోలీసులు అర్షద్, సంతోష్‌లను పట్టుకున్నారు. పరారీలో ఉన్న షరీఫ్, అన్నా, ఫారూఖ్ కోసం గాలిస్తున్నారు. ‘ముత్తూట్’లో ఎవరి ‘పాత్రలు’వారివి! మైలార్‌దేవ్‌పల్లిలోని ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలో బందిపోటు దొంగతనానికి యత్నించిన మహారాష్ట్ర ముఠాలో ఎవరి పాత్రలు వారు పోషించారు. రెక్కీ నుంచి రంగంలోకి దిగే వరకు ప్రతి ఒక్కరూ కీలకంగా వ్యవహరించారు. నగరవాసిని మినహాయిస్తే ముంబై, ఉస్మానాబాద్‌కు చెందిన ఈ గ్యాంగ్‌లో ఒక్కరు మినహా మిగిలిన వారందరికీ నేర చరిత్ర ఉంది. షరీఫ్: ఈ ముఠాకు, బందిపోటు దొంగతనం స్కెచ్‌కు సూత్రధారి షరీఫ్. 2008లో దోపిడీ కేసుకు సంబంధించి మహారాష్ట్రలోని నందుర్బాగ్ పోలీసులకు చిక్కి ధూలే సబ్–జైలుకు వెళ్లాడు. ఇతడు ఎడమ కాలు కుంటుతూ ఉంటాడు. అర్షద్: ముత్తూట్ సంస్థలోకి ముందుగా వెళ్లి కౌంటర్ పైనుంచి లోపలకు దూకింది అర్షదే. పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చి ముంబైలో స్థిరపడిన ఇతడు హోటల్లో సర్వర్. ఇతడు కూడా 2008లోనే దోపిడీ కేసులో నందుర్బాగ్ పోలీసులు అరెస్టు చేయగా ధూలే సబ్–జైలుకు వెళ్ళాడు. అక్కడే ఇతడికి షరీఫ్‌తో పరిచయం ఏర్పడింది. షఫీ: మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌కు చెందిన షఫీ సీసీ టీవీలు ఇన్స్టలేషన్లో సాఫ్ట్వేర్ అంశాలు పర్యవేక్షించే పని చేస్తుంటాడు. 2004లో నకిలీ కరెన్సీ కేసుకు సంబంధించి షోలాపూర్ పోలీసులకు చిక్కాడు. 2006లో పదేళ్ళ జైలు శిక్షపడగా మినహాయింపుల తర్వాత 2011లో విడుదలయ్యాడు. నగరవాసి దస్తగిరికు అల్లుడు. అర్షద్‌తో కలిసి ముత్తూట్ సంస్థలోకి ముందుగానే వెళ్ళాడు. అన్నా, ఫారూఖ్: అన్నా, ఫారూఖ్ పైనా మహారాష్ట్రలో వివిధ కేసులు నమోదై ఉన్నాయి. షరీఫ్‌తో కలిసి అన్నా ముత్తూట్ సంస్థలోకి కత్తి పట్టుకుని వెళ్ళాడు. డ్రైవర్‌గా వ్యవహరించిన ఉస్మానాబాద్ వాసి సంతోష్‌తోపాటు ఫారూఖ్ సైతం కిందే వాహనంలో ఉండిపోయారు. అనుకోకుండానే హ్యాపీహోమ్స్లోకి... నగరవాసి దస్తగిరి సహా ఈ ముఠాలో ఎవరికీ ఉప్పర్‌పల్లిలోని హ్యాపీహోమ్స్ అపార్ట్‌మెంట్‌కు సంబంధించి అవగాహన లేదు. కేవలం పారిపోయే క్రమంలోనే రహదారి పక్కన కనిపించిన బోర్డు ఆధారంగా వాహనం అక్కడ ఆపారు. ఈ నేరం చేయడానికి వినియోగించిన రెండు తుపాకుల్నీ సూత్రధారి షరీఫ్ సేకరించాడని, ప్రస్తుతం అవి అతడి వద్దనే ఉన్నాయని పట్టుబడిన నిందితులు చెప్తున్నారు. -
ముత్తూట్ కేసులో నలుగురు అరెస్ట్
-
ఆక్టోపస్ రాకకు ముందే దొంగలు పరార్
-
ఆగని వేట
- ‘ముత్తూట్’ దొంగల కోసం సాగుతున్న గాలింపు - హ్యాపీ హోమ్స్‌లో చిక్కని నిందితులు - పోలీసుల తనిఖీలకు ముందే పరారీ - ప్రత్యేక బృందాలతో గాలింపు ముమ్మరం - మారణాయుధాలు ఉండటం వల్లే ఆక్టోపస్ ఆపరేషన్ చేపట్టామంటున్న అధికారులు సాక్షి, హైదరాబాద్: ముత్తూట్ ఫైనాన్స్ దొంగల కోసం పోలీసులు, ఆక్టోపస్ బలగాలు చేపట్టిన భారీ ఆపరేషన్ ఏమీ తేలకుండానే ముగిసింది. ఉప్పర్‌పల్లిలోని హ్యాపీ హోమ్స్ అపార్ట్మెంట్లలో ఉన్న తొమ్మిది బ్లాకుల్లో నూ చేసిన తనిఖీల్లో నిందితులెవరూ పట్టుబడలేదు. దాంతో పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. ప్రధాన రహదారులు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, టోల్గేట్ల వద్ద సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. పలు రాష్ట్రాలకు నిందితుల చిత్రాలను పంపించి ఆరా తీస్తున్నారు. రాత్రంతా ఆపరేషన్ మంగళవారం ఉదయం హైదరాబాద్ శివార్లలోని మైలార్‌దేవ్‌పల్లిలో ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో దోపిడీకి కొందరు దొంగలు విఫలయత్నం చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వారు వినియోగించిన టవెరా కారును సాయంత్రం ఉప్పర్‌పల్లిలోని హ్యాపీ హోమ్స్ అపార్ట్మెంట్ వద్ద పోలీసులు గుర్తించారు. దొంగలు అపార్ట్మెంట్లోనే ఉండవచ్చనే అనుమానంతో భారీ ఆపరేషన్ చేపట్టారు. దాదాపు 500 మంది ఆక్టోపస్ సిబ్బందితో 9 బ్లాకుల్లోని దాదాపు 750 ఫ్లాట్లలో అణువణువూ గాలించారు. దీంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మంగళవారం రాత్రంతా సాగిన ఈ తనిఖీల్లో నిందితులెవరూ పట్టుబడలేదు. దాంతో దొంగలను పట్టుకునేందుకు బుధవారం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. అన్ని కోణాల్లోనూ.. దొంగలు మైలార్‌దేవ్‌పల్లిలోని ముత్తూట్ కార్యాలయంలో దోపిడీకి యత్నించిన సమయంలో.. ఆ ప్రాంతంలో ఏయే సెల్ఫోన్లు పనిచేశాయనే దిశగా పోలీసులు దృష్టి పెట్టారు. ఈ మేరకు సమాచారం సేకరిస్తున్నారు. ముత్తూట్ కార్యాలయంలో వేలిముద్రలు సేకరించారు. ఈ వేలిముద్రలను, ముత్తూట్ కార్యాలయంలోని సీసీ కెమెరాల్లో రికార్డయిన నిందితుల చిత్రాలను తెలంగాణ, ఏపీలతో పాటు గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, అస్సాం రాష్ట్రాల పోలీసులకు పంపించారు. నిందితులను గుర్తించగలరా, వారిపైనా ఏమైనా కేసులున్నాయా, కనబడితే వెంటనే సమాచారం అందించాలంటూ సమన్వయం చేసుకుంటున్నారు. దొంగలు ముందే మాయం! ముత్తూట్‌లో దోపిడీకి విఫలయత్నం చేసిన దొంగలు... మైలార్‌దేవ్‌పల్లి నుంచి ఆరామ్‌ఘర్ చౌరస్తా వరకు వెళ్లి, అక్కడి నుంచి పీవీ ఎక్స్‌ప్రెస్ వే మీదుగా ప్రయాణించి ఉప్పర్‌పల్లి వద్ద దిగారు. అక్కడ ఆ కారులోంచి ఐదుగురు దిగిపోగా... మిగతా ఇద్దరు ఆ వాహనంలో హ్యపీ హోమ్ టవర్స్‌లోకి వచ్చారు. అక్కడ ఆరో నంబర్ బ్లాక్ వద్ద పార్కింగ్ చేసి.. వాహనం నంబర్ ప్లేట్‌ను ఊడదీసేసి వెళ్లిపోయారని పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీల ద్వారా గుర్తించారు. అయితే నిందితులు నగరంలోనే ఉండవచ్చని, వారు బయటకు వెళ్లే అవకాశం లేదని అంటున్నారు. ఆరో బ్లాక్ వద్ద బందోబస్తు హ్యాపీ హోమ్స్‌లో బుధవారం సాధారణ పరిస్థితి నెలకొన్నా... ముత్తూట్ దొంగలు కారు పార్క్ చేసిన ఆరో నంబర్ బ్లాక్ వద్ద మాత్రం ముందు జాగ్రత్తగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక ఎస్సై, ఆరుగురు కానిస్టేబుళ్లకు ఈ బాధ్యతలు అప్పగించారు. కాగా దాదాపు 750 కుటుంబాలు ఉన్న హ్యాపీ హోమ్స్ అపార్ట్మెంట్లో సీసీ కెమెరాలు లేవు. గతంలో పోలీసులు దీనిపై విస్తృతంగా ప్రచారం నిర్వహించినా ఫలితం లేదు. దాతలు ఇచ్చిన ఒక కెమెరాను పోలీసులే ఇక్కడి ప్రధాన రహదారిపై ఏర్పాటు చేశారు. దానిలోనే తాజాగా ముత్తూట్ దొంగల వ్యవహారాన్ని గుర్తించారు. కుదుటపడిన అపార్ట్మెంట్ వాసులు ముత్తూట్ దొంగల కోసం పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టడంతో ఉద్రిక్తంగా మారిన హ్యాపీ హోమ్స్ అపార్ట్మెంట్ ప్రాంతం బుధవారం సాయంత్రానికి కుదుటపడింది. మంగళవారం రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపినవారంతా బుధవారం ఉదయం నుంచి యథావిధిగా తమ పనులు చేసుకున్నారు. అయితే హ్యాపీ హోమ్స్ ఆపరేషన్‌పై మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో పెద్ద సంఖ్యలో జనం, యువకులు అక్కడికి రావడం కనిపించింది. మారణాయుధాలు ఉండడం వల్లే.. ముత్తూట్ కార్యాలయంలో దోపిడీకి యత్నించిన వారి వద్ద రివాల్వర్లు, కత్తులు ఉండడం వల్లే.. హ్యాపీ హోమ్స్ ఆపరేషన్‌లో ఆక్టోపస్ బలగాల సహాయాన్ని తీసుకున్నట్లు రాజేంద్రనగర్ ఏసీపీ గంగారెడ్డి తెలిపారు. ఆ అపార్ట్మెంట్లో 750 కుటుంబాలు ఉన్నాయని, వారి రక్షణ కోసం ముందు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. అయితే ఈ సోదాల్లో ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని చెప్పారు. నిందితులను పట్టుకునేందుకు ప్రధాన రహదారులు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, టోల్గేట్ల వద్ద ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నామని చెప్పారు. -
త్వరలోనే దోషులను పట్టుకుంటాం
-
త్వరలోనే దోషులను పట్టుకుంటాం: ఏసీపీ
హైదరాబాద్ : మైలార్‌దేవ్‌పల్లిలోని ముత్తూట్ కార్యాలయంలో జరిగిన దోపిడీకి యత్నించిన ముఠాను సాధ్యమైనంత త్వరలో పట్టుకుంటామని రాజేంద్రనగర్ ఏసీపీ గంగారెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఈ కేసుకు సంబంధించి ఇద్దరు అనుమానితులు బంటి, సర్దార్‌ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నిందితులు ఉన్నారన్న సమాచారంతోనే ఉప్పర్‌పల్లి హ్యాపీ హోమ్స్‌లో సోదాలు నిర్వహించామన్నారు. మొత్తం ఆరుగురు ముత్తూట్ కార్యాలయంలో దోపిడీకి యత్నించినట్లు గుర్తించామన్నారు. చోరికి నెల రోజులుగా ముఠా రెక్కీ నిర్వహించినట్లు గుర్తించామన్నారు. వీరంతా ముంబైకి చెందిన అర్జున్వెట్టి గ్యాంగ్ సభ్యులుగా ఏసీపీ వెల్లడించారు. ఎక్కువ బంగారం దొరుకుతుందనే ముత్తూట్‌ను టార్గెట్ చేసి ఉంటారని, త్వరలోనే దోషులను పట్టుకుంటామన్నారు. టవేరా వాహనంలో యాక్సిల్ బ్లేడ్, వేట కొడవలి, ఫేక్ నంబర్ ప్లేట్, ఓ పెద్ద బ్యాగు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. టవేరా వాహనం గుజరాత్‌కు చెందినదిగా గుర్తించినట్లు ఏసీపీ తెలిపారు. మొత్తం ఎనిమిది బ్లాక్‌ల్లో తనిఖీలు చేశామని,ఇంకా సోదాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు క్లూస్ టీమ్ పూర్తి ఆధారాలు సేకరిస్తోందని అన్నారు. దుండగుల వద్ద ఆయుధాలు ఉండటం వల్లే ఎవరికీ ప్రాణనష్టం జరగకూడదనే ఆక్టోపస్‌ను రంగంలోకి దింపామన్నారు. మరోవైపు పోలీసు శునకాలు దుండగుల వాహనం దగ్గరి నుంచి.. పీవీ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నంబర్ 171 దగ్గరకు వెళ్లి ఆగిపోయాయి. దీంతో కొందరు దుండగులు వేరే వాహనాల్లో వెళ్లిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. మిగిలిన వారు హ్యపీహోమ్ అపార్ట్మెంట్లో ఉండొచ్చనే యోచనతో అణువణువునా తెల్లవారు జాము 3 గంటల వరకూ తనిఖీ చేశారు. -
‘హ్యాపీ హోమ్స్’ ముట్టడి
-
‘హ్యాపీ హోమ్స్’ ముట్టడి
- ముత్తూట్ దొంగలను ఎట్టకేలకు పట్టుకున్న ఆక్టోపస్ బలగాలు - తెల్లవారుజాము 3:30 వరకూ కొనసాగిన ఆపరేషన్ - ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారుల ప్రకటన - ముత్తూట్ కార్యాలయంలోకి తుపాకులు, తల్వార్లతో వచ్చిన దొంగలు - బంగారం తాకట్టు పెడతామంటూ మాటా ముచ్చట - ఒక్కసారిగా కౌంటర్‌పై నుంచి దూకి దోపిడీకి యత్నం - భయంతో కేకలు వేసిన ఉద్యోగులు, ఖాతాదారులు - అప్రమత్తమైన స్థానికులు.. ఆందోళనతో దొంగలు పరారు - స్పందించిన పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు ఉదయం గం. 10:00 - మైలార్‌దేవ్‌పల్లిలోని ముత్తూట్ ఫైనాన్స్‌లో దోపిడీకి దుండగుల విఫలయత్నం ఉదయం గం. 10:29 - ఉప్పర్‌పల్లిలోని హ్యాపీహోమ్స్ అపార్ట్మెంట్లో టవేరా వాహనాన్ని నిలిపిన దుండగులు సాయంత్రం గం. 6:30 - హ్యాపీహోమ్స్ అపార్ట్మెంట్ సెల్లార్లో టవేరా వాహనాన్ని గుర్తించిన పోలీసులు రాత్రి గం. 7:30 - వందలాది మంది పోలీసుల మోహరింపు రాత్రి గం. 9:30 - ఆక్టోపస్ బలగాల రాక. విద్యుత్ సరఫరా నిలిపివేత రాత్రి గం. 10:00 - సైబరాబాద్ పోలీసులు, ఆక్టోపస్ సిబ్బంది కార్టన్ సెర్చ్ ప్రారంభం తెల్లవారుజాము(బుధవారం) 3:30 - ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు సాక్షి, హైదరాబాద్: నగరంలో అర్ధరాత్రి హైటెన్షన్.. ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో దోపిడీకి ప్రయత్నించిన దుండగులు.. వారిని పట్టుకొనేందుకు భారీ స్థాయిలో ఆపరేషన్.. వందలాది మంది పోలీ సులు.. ఆక్టోపస్, గ్రేహౌండ్స్ బలగాలు.. దాదాపు 500 ఫ్లాట్లలో అణువణువూ గాలింపు.. వెరసి క్షణక్షణం ఉత్కంఠ! గంటలపాటు ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు ఎట్టకేలకు బుధవారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆపరేష్ పూర్తయిందని, ఇక పట్టుబడ్డవారిని విచారించాల్సిఉందని అధికారులు ప్రకటించారు. మంగళవారం ఉదయం మైలార్‌దేవ్‌పల్లిలోని ముత్తూట్ కార్యాలయంలో జరిగిన దోపిడీ యత్నం, దొంగలను పట్టుకునేందుకు పోలీసుల ఆపరేషన్‌తో నెలకొన్న పరిస్థితి ఇదీ.. అసలేం జరిగింది..? హైదరాబాద్ శివార్లలోని ముత్తూట్ ఫైనాన్స్‌లో భారీ దోపిడీకి దొంగలు విఫలయత్నం చేశారు. దాదాపు ఆరు నెలల కింద బీరంగూడలోని ముత్తూట్ ఫైనాన్స్‌లో రూ. 12 కోట్ల విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లిన తరహాలోనే... మంగళవారం మైలార్‌దేవ్‌పల్లిలోని ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ దోపిడీకి ప్రయత్నించారు. ఇందుకోసం ఒక రోజు ముందుగానే రెక్కీ చేసి.. పక్కాగా ప్లాన్ వేశారు. మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో తల్వార్లు, తుపాకీలతో ఫైనాన్స్ కార్యాలయంలోకి చొరబడ్డారు. లాకర్ తాళాలివ్వాలంటూ మేనేజర్‌కు తుపాకీ ఎక్కుపెట్టారు. కానీ కార్యాలయం సిబ్బంది, ఖాతాదారులంతా అప్రమత్తంగా ఉండి కేకలు వేయడం, చుట్టుపక్కల వారు స్పందించడంతో దొంగలు పారిపోయారు. హిందీలో మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు కేవలం ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ప్రజాభవన్ ప్రధాన రహదారిపై ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయం ఉంది. ఆ భవనంలో గ్రౌండ్ ఫ్లోర్లో హార్డ్‌వేర్ దుకాణం, కిరాణా, మొబైల్స్ సెంటర్, టీ స్టాల్లు ఉండగా.. మొదటి అంతస్తులో ఈ కార్యాలయం ఉంది. మంగళవారం ఉదయం పది గంటల సమయంలో 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న కొందరు యువకులు సిల్వర్ (వెండి) రంగు టవెరా కారు (టీఎస్ 12 ఈబీ 3711)లో అక్కడికి వచ్చారు. వారిలో నలుగురు బంగారం తనఖా పెడతామంటూ కార్యాలయంలోకి వచ్చి దోపిడీకి విఫలయత్నం చేశారు. సిబ్బంది, ఖాతాదారులు పెద్ద పెట్టున కేకలు వేయడంతో ఎవరైనా వస్తారేమోనన్న ఆందోళనతో పారిపోయారు. వారంతా హిందీలోనే మాట్లాడటంతో ఉత్తరాదికి చెందిన దొంగల ముఠా కావొచ్చని.. ఉదయం పెద్దగా జనమెవరూ ఉండరనే ఉద్దేశంతో దోపిడీకి ఆ సమయాన్ని ఎంచుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కాపాడాలంటూ అరుపులతో.. ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయానికి ఓ పక్కన పెద్ద కిటికీ ఉంది. దాని ద్వారా పక్కనే ఉన్న బస్తీ కనిపిస్తుంది. ఆ కిటికీ పక్కనే ఉన్న స్థలంలో ఇంటి యజమాని కిషోర్ అదనపు గదులు కట్టిస్తున్నారు. మంగళవారం 10 గంటల సమయంలో ముత్తూట్ కార్యాలయం కిటికీ నుంచి ‘కాపాడండి’అంటూ పెద్ద పెట్టున కేకలు వినిపించాయి. దీంతో కిషోర్ వెంటనే పైఅంతస్తులోకి పరుగు తీశారు. అదే సమయంలో కిందికి పరుగెత్తుకుంటూ వస్తున్న నలుగురు దుండగులు ఆయుధాలతో బెదిరించడంతో గోడదూకి బయటకు వచ్చారు. దీంతో కిశోర్ కాళ్లకు గాయాలయ్యాయి. రోజూ లక్షల రూపాయల లావాదేవీలు నిర్వహించే ముత్తూట్ కార్యాలయంలో సెక్యూరిటీ గార్డు కూడా లేకపోవడం గమనార్హం. మరోవైపు ముత్తూట్ ఫైనాన్స్‌లో దోపిడీ జరిగిందన్న ప్రచారంతో.. బంగారం తాకట్టు పెట్టిన వారంతా కార్యాలయానికి చేరుకున్నారు. ఎలాంటి దోపిడీ జరగలేదని తెలుసుకుని వెనుదిరిగారు. పక్కాగా రెక్కీ చేసి..: పటాన్చెరు నుంచి ఓఆర్ఆర్ మీదుగా వచ్చిన దుండగుల కారు శంషాబాద్ టోల్గేట్ వద్ద సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు టోల్ ఫీజు కట్టినట్టుగా పోలీసులు గుర్తించారు. సాయంత్రం 4.15 గంటల సమయంలో వారు మైలార్‌దేవ్‌పల్లిలోని ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయానికి వచ్చారు. బంగారం తనఖా పెడతామంటూ మేనేజర్, కంప్యూటర్ ఆపరేటర్‌ను అడిగారు. అయితే వారివద్ద ఆధార్ కార్డుగానీ, ఇతర చిరునామా ధ్రువీకరణ పత్రాలుగానీ లేకపోవడంతో.. బంగారాన్ని తాకట్టు పెట్టుకునేందుకు మేనేజర్ నిరాకరించారు. ఈ సమయంలో దాదాపు గంట పాటు వారు అక్కడే ఉండి పరిస్థితిని గమనించారు. తాము అద్దెకు ఉంటున్న వ్యక్తి నుంచి ఆధార్ కార్డు తీసుకొని మరుసటి రోజు వస్తామంటూ వెళ్లిపోయారు. వేగంగా స్పందించిన పోలీసులు: ముత్తూట్ దోపిడీ యత్నం విషయం తెలిసిన పోలీసులు వేగంగా స్పందించారు. మంగళవారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 6.30 వరకు ఔటర్ రింగ్‌రోడ్‌తో పాటు హైదరాబాద్ నుంచి బయటికి వెళ్లిపోయే దారుల వద్ద ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. సీసీ కెమెరాల డేటా ఆధారంగా దుండగులు ఉపయోగించిన టవెరా కారును ఉప్పర్‌పల్లి హ్యపీహోమ్స్ వద్ద పార్కు చేసినట్టుగా గుర్తించారు. ఉదయం 10.45 గంటల సమయంలోనే హ్యాపీహోమ్స్ వద్దకు వచ్చిన దొంగలు.. ముందు గేట్ నుంచి వెళ్లి లోపల పార్క్ చేశారు. అనంతరం కారు నంబర్ ప్లేట్‌ను ఊడదీసి పడేసి.. వెనుకగేటు నుంచి వెళ్లిపోయారు. అయితే కారు ఛాసిస్ నంబర్ ఆధారంగా అది గుజరాత్‌కు సంబంధించిన కారు అని, యజమాని పేరు మహ్మద్ ఫజుల్లాగా పోలీసులు గుర్తించారు. బీరంగూడ ముత్తూట్ చోరీ వ్యక్తేనా? మైలార్‌దేవ్‌పల్లిలో జరిగిన ముత్తూట్ దోపిడీ యత్నానికి గతేడాది డిసెంబర్ 28న రామచంద్రపురం ఠాణా పరిధిలోని బీరంగూడ ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీకి సంబంధం ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దోపిడీలో భాగస్వామి అయిన ఒక నిందితుడు.. ఆ సమయంలో ఉప్పర్‌పల్లిలోని హ్యపీ హోమ్స్ వద్దే ఉన్నట్టుగా నిర్ధారణ కావడం... తాజా దోపిడీకి యత్నించినవారు ఇక్కడే కారు పార్కింగ్ చేయడంతో సందేహాలు వస్తున్నాయి. అలాగే ఈ దోపిడీలో భాగస్వాములైన వారిలో ఒకరు పదిరోజుల క్రితం ఇక్కడ షెల్టర్ తీసుకుంటున్నట్టుగా అనుమానిస్తున్న పోలీసులు... ఎవరు ఆశ్రయం కల్పించి ఉంటారనే దిశగా విచారణ ముమ్మరం చేశారు. టెన్షన్.. హైటెన్షన్ హ్యపీ హోమ్స్ వద్ద దుండగుల కారును గుర్తించడంతో వందలాది మంది పోలీసులు మోహరించారు. దొంగల వద్ద తుపాకులు, మారణాయుధాలు ఉన్న నేపథ్యంలో ఆక్టోపస్, గ్రేహౌండ్ దళాలూ రంగంలోకి దిగాయి. హ్యాపీ హోమ్స్‌లో 9 బ్లాకుల్లో దాదాపు 500 ఫ్లాట్లు ఉన్నాయి. దాదాపు రాత్రి 9 గంటల ప్రాంతంలో హ్యాపీ హోమ్స్‌ను చుట్టుముట్టిన పోలీసులు.. అపార్ట్మెంట్లన్నింటికీ విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. పెద్ద సంఖ్యలో పోలీసులతో అణువణువూ గాలింపు చేపట్టారు. దీంతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సైబరాబాద్ జాయింట్ సీపీ షానవాజ్ ఖాసీమ్, అడిషనల్ డీసీపీ క్రైమ్స్ జానకి షర్మిల, శంషాబాద్ ఇన్చార్జి డీసీపీగాఉన్న సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలోని పోలీసు బృందాలు ప్రతి ఫ్లాట్‌ను క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నాయి. మంగళవారం అర్ధరాత్రి దాటిన అనంతరం కూడా తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు పోలీసు శునకాలు దుండగుల వాహనం దగ్గరి నుంచి.. పీవీ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నంబర్ 171 దగ్గరకు వెళ్లి ఆగిపోయాయి. దీంతో కొందరు దుండగులు వేరే వాహనాల్లో వెళ్లిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. మిగిలిన వారు హ్యపీహోమ్ అపార్ట్మెంట్లో ఉండొచ్చనే యోచనతో అణువణువునా తనిఖీ చేశారు. -
దొంగల కోసమా.. ఉగ్రవాదులా?
హైదరాబాద్: ముత్తూట్ ఫైనాన్స్ సంస్ధలో దోపిడికి విఫలయత్నం చేసిన వారిని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున పోలీసులను రంగంలోకి దించారు. దాదాపు 50 మంది ఎస్సైలు, 10 మంది సీఐలు, నలుగురు ఏసీపీలు, ఒక డీఎస్పీ సహా 300 మంది పోలీసులు దొంగలు ఉన్నారని భావిస్తున్న హ్యాపీ హోమ్స్ అపార్ట్మెంట్ వద్దకు చేరుకున్నారు. 100 మందికి పైగా ఆక్టోపస్ బలగాలు భారీ ఎత్తున ఆయుధాలతో చేరుకుని 450 ఫ్లాట్ల తనిఖీని ప్రారంభించాయి. ఆక్టోపస్ ఎందుకు? ఆక్టోపస్, కౌంటర్ ఇంటలిజెన్స్, గ్రే హౌండ్స్ బలగాలను సాధారణంగా కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్లకు వినియోగిస్తారు. దొంగల కోసం ఆక్టోపస్ బలగాలను ఎందుకు రప్పిస్తున్నారన్న విషయంపై పోలీసులు క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో కేవలం దొంగలు మాత్రమే కాకుండా అపార్ట్మెంట్లో ఇంకేదో కీలకమైన విషయం ఉంటుందని భావిస్తున్నారు. మూడేళ్ల క్రితం ఇండియన్ మొజాహిద్దీన్‌కు చెందిన టెర్రరిస్టులు బ్యాంకు దోపిడికి యత్నించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముత్తూట్‌లో దోపడీ యత్నం కూడా ఉగ్రవాదులే చేసుండొచ్చనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. -
ఉప్పర్‌పల్లిలో అపార్ట్‌మెంట్‌ను చుట్టుముట్టిన పోలీసులు
-
‘ముత్తూట్’ దొంగలు.. అపార్ట్మెంట్ చుట్టుముట్టిన పోలీసులు
హైదరాబాద్: ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలో దోపిడీకి పాల్పడిన దొంగల కోసం వేట మొదలైంది. రాజేంద్రనగర్ పరిధిలోని ఉప్పరపల్లిలో పోలీసులు పెద్ద మొత్తంలో తనిఖీలు మొదలుపెట్టారు. దొంగలు వాడిన టవేరా వాహనాన్ని పోలీసులు గుర్తించారు. రంగారెడ్డి జిల్లా మైలార్ దేవరపల్లి ముత్తూట్ ఫైనాన్స్ లో దుండగులు దోపిడీకి విఫలయత్నం చేశారు. కత్తి, తుపాకీతో మంగళవారం ఉదయం ముత్తూట్‌లోని వచ్చిన దుండగులు సిబ్బందిని బెదిరించారు. దీంతో అప్రమత్తమైన ముత్తూట్ అసిస్టెంట్ మేనేజర్ లతీఫ్ అలారం నొక్కడంతో స్థానికులు రావడంతో దుండగులు పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు వేగం పెంచారు. అందులో భాగంగా దొంగలు వాడిన టవేరా వాహనంలో దొంగలు సోమవారం ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణించినట్లు నిర్దారణకు వచ్చారు. శంషాబాద్ టోల్ గేటు వద్ద మధ్యాహ్నం 3.30గంటల ప్రాంతంలో టోల్ చెల్లించినట్లు గుర్తించారు. ఈ సమాచారం ఆధారంగా వారికోసం గాలింపులు ప్రారంభించిన పోలీసులు ఉప్పరపల్లిలో ఓ అపార్ట్‌మెంట్‌ను చుట్టుముట్టారు. నలుగురు ఏసీపీలు, 10మంది సీఐలు, 50మంది ఎస్ఐలు అపార్ట్‌మెంట్‌ను చుట్టుముట్టడంతో స్థానికులంతా కొంత ఆందోళన చెందుతున్నారు. మీడియాను కూడా పోలీసులు దగ్గరకు రానివ్వడం లేదు. గతంలో ఒకసారి ఇలాంటి దొంగతనానికి పాల్పడింది ఉగ్రవాదులని తెలియడం, ప్రస్తుతం కూడా అదే తరహా దోపిడీ యత్నం జరిగిన నేపథ్యంలో పోలీసులు వారిని ఉగ్రవాదులుగా అనుమానిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే వారి వద్ద ఎలాంటి ఆయుధాలు ఉన్నాయోనని పోలీసులు ముందు జాగ్రత్తగా తాము చుట్టుముట్టిన అపార్ట్మెంట్ వద్ద దాదాపు 200మంది పోలీసులను మోహరించినట్లు తెలుస్తోంది. -
ముత్తూట్‌లో దోపిడీకి యత్నం
-
ముత్తూట్‌లో దోపిడీకి యత్నం
మైలార్దేవరపల్లి: రంగారెడ్డి జిల్లా మైలార్ దేవరపల్లి ముత్తూట్ ఫైనాన్స్ లో దుండగులు దోపిడీకి విఫలయత్నం చేశారు. కత్తి, తుపాకీతో మంగళవారం ఉదయం ముత్తూట్‌లోని వచ్చిన దుండగులు సిబ్బందిని బెదిరించారు. దీంతో అప్రమత్తమైన ముత్తూట్ అసిస్టెంట్ మేనేజర్ లతీఫ్ అలారం నొక్కడంతో స్థానికులు రావడంతో దుండగులు పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రాజారత్నం అరెస్ట్
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ముత్తూట్ ఫైనాన్స్‌లో బంగారం దోపిడీ కేసులో కీలక నిందితుడు సుందర్ రాజారత్నంను పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలోని ధారవి ప్రాంతంలో పట్టుబడిన అతడిని సైబరాబాద్ పోలీసులు ఇక్కడికి తీసుకువచ్చారు. అతడి భార్య రాధను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. గతేడాది డిసెంబర్ 28న సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని బీరంగూడ కమాన్ సమీపంలో ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో మహారాష్ట్ర దోపిడీ ముఠా సినీ ఫక్కీలో దాదాపు 42 కిలోల బంగారాన్ని దోచుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికి 8 మందిని అరెస్ట్ చేసి 3.5 కిలోల బంగారాన్ని రికవరీ చేయగలిగారు. మిగతా బంగారం అంతా రాజారత్నం దగ్గరవున్నట్టు అనుమానిస్తున్నారు. అతడిని పోలీసులు విచారిస్తున్నారు. రోషన్ కాలా అలియాస్ లంబు, తుకారాం గైక్వాడ్‌లు పరారీలో ఉన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా మద్దూరు మండలం దొరెపల్లికి చెందిన రాజారత్నం కుటుంబం ముంబైలో స్థిరపడింది. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా పోటీ చేయడానికి టికెట్ కోసం అతడు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. -
శశికళ దిష్టి బొమ్మల దహనం
వేలూరు: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు వ్యతిరేకంగా వేలూరులో ఆ పార్టీ కార్యకర్తలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. శశికళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టరాదని పెద్దఎత్తున నినాదాలు చేశారు. అన్నాడీఎంకే పార్టీ మాజీ కౌన్సిలర్ ముత్తు ఆధ్వర్యంలో ఆమె దిష్టిబొమ్మను దహనం చేశారు. వేలూరు జిల్లాలోని ఆర్కాడు, తిరుపత్తూరు వంటి ప్రాంతాల్లోను ఆ పార్టీ కార్యకర్తలు శశికళకు వ్యతిరేకంగా బుధవారం ఉదయం నుంచి నినాదాలు చేయడంతో పాటు ఆమె దిష్టి బొమ్మలను దహనం చేస్తున్నారు. గురువారం ఉదయం కూడా వేలూరు సైదాపేటలోని మురుగన్ గుడి వెనుక వైపున దీప పేరవై కార్యకర్తలు సుమారు 20 మంది కలిసి శశికళ దిష్టి బొమ్మను ఊరేగింపుగా తీసుకెళ్లి దహనం చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు శశికళకు అర్హత లేదంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. కాగిదపట్టరైలో కూడా శశికళకు వ్యతరేకంగా నిరసనలు కార్యక్రమాలు జరిగాయి. -
క్యూఐబీ హోదాని ఆహ్వానిస్తున్నాం: ముత్తూట్
ఐపీఓలో క్యూఐబీ కోటాను నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు వర్తింపజేయడాన్ని ఆహ్వానించదగ్గ అంశమని ముత్తూట్ ఫైనాన్స్ మేనేజింగ్ డైరెక్టర్ జార్జ్ అలెగ్జాండర్ ముత్తూట్ వెల్లడించారు. ఈ నిర్ణయం ద్వారా ముత్తూట్ లాంటి ఎన్బీఎఫ్సీ కంపెనీలకు ఐపీఓ మార్కెట్లో బ్యాంకులు, బీమా సంస్థలకు సమానంగా పెట్టుబడులు పెట్టే అవకాశం లభించిందని అన్నారు. జైట్లీ తీసుకున్న నిర్ణయం ఎన్‌బీఎఫ్‌సీకు నిధుల సమీకరణలో తోడ్పాటునిస్తుందని అభిప్రాయపడ్డారు. క్యూఐబీ హోదాలో పెట్టుబడులు పెట్టే వెసులుబాటు ఉండడం వల్ల, పోర్టిఫోలియో డైవర్సిఫికేషన్‌కు అవకాశం లభించడమే కాకుండా పెట్టుబడులలో పారదర్శత పెరుగుతుందని అన్నారు. ఆన్లైన్లో బ్రోకింగ్ సంస్థల రిజిస్ట్రేషన్ వ్యాపారాల నిర్వహణ సులభతరం చేసే దిశగా.. బ్రోకింగ్ సంస్థలు, పోర్ట్‌ఫోలియో మేనేజర్లు, మ్యూచువల్ ఫండ్స్ తదితర మార్కెట్ మధ్యవర్తిత్వ సంస్థలు నమోదు చేసుకునేందుకు పేపర్ రహిత ఆన్లైన్ వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎగుమతి లక్ష్యం మౌలిక సదుపాయాల కల్పనకు రంగం సిద్ధం ఎగుమతులను ప్రోత్సహించడంలో భాగంగా 2017–18 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధిక ప్రాధాన్యతను ఇచ్చారు. ట్రేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎక్స్పోర్ట్ స్కీం (టీఐఈఎస్) పేరిట నూతన స్కీంను ప్రకటించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఈ స్కీం విధివిధానాలను ప్రకటించనున్నారు. -
ముత్తూట్ దొంగలు వీరే!
► ఎవరి ‘పాత్ర’ ఏమిటనేది నిర్ధారించిన పోలీసులు ► అరెస్టైన వారి విచారణలో కీలక విషయాలు వెల్లడి ► ప్రధాన నిందితుడు సుందర్ స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా మద్దూరు ► 38 కిలోల బంగారం అతడి వద్దే ఉన్నట్లు అనుమానం సాక్షి, హైదరాబాద్: బీరంగూడలోని ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ దోపిడీకి పాల్పడిన మహారాష్ట్ర ముఠా వేసిన ‘స్కెచ్’ చూసి అధికారులు విస్తుపోయారు. సీబీఐ అధికారి, ట్రాఫిక్ కానిస్టేబుల్, దొంగ, సఫారీ సూట్ వేసుకున్న ధనికుడు, మిలటరీ క్యాప్‌తో మరొకరు.. ఇలా ముఠాలోని ఒక్కో సభ్యుడు ఒక్కో అవతారంలో కార్యాలయంలోకి ప్రవే శించి, సినీ ఫక్కీలో దాదాపు 42 కిలోల బం గారాన్ని దోచుకున్న విషయం తెలిసిందే. వారిలో ముగ్గురిని అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులు.. ఎవరి ‘పాత్ర’ ఏమిటనేది నిర్ధా రించారు. ఈ ముఠాలో కీలక సభ్యుడిగా వ్యవహరించిన సుందర్ రాజారత్నం కనగల్ల మహబూబ్‌నగర్ జిల్లాకు చెందినవాడిగా గుర్తించారు. దాదాపు 38 కిలోల బంగారం అతని వద్దే ఉందని భావిస్తున్నారు. రాజకీయాల్లోకి వెళ్లే యత్నం..? ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేసిన పోలీ సులు.. 3.5 కిలోల బంగారాన్ని రికవరీ చేయ గలిగారు. మిగతాదంతా పరారీలో ఉన్న సుం దర్ దగ్గర ఉన్నట్లు భావిస్తున్నారు. పోలీ సులకు చిక్కిన ముఠా నాయకుడు లక్ష్మణ్, విజయ్‌కుమార్ (వాహనం సమకూర్చిన వ్యక్తి), సుభాష్ పుజారిలు సైతం విచారణలో ఇదే విషయం చెప్పినట్లు తెలిసింది. సుం దర్ స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా మద్దూరు మండలం దొరెపల్లి. అతడి తండ్రి రాజారత్నం రైల్వే ఉద్యోగి. వారి కుటుంబం ముంబైలో స్థిరపడింది. ముంబైలోని ధారావి ఎమ్మెల్యే వర్షా గైక్వాడ్‌కు సన్నిహితుడు. వచ్చే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా పోటీ చేయడానికి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ కేసులో సుందర్‌తోపాటు కాలా అలియాస్ లంబు, తుకారాం గైక్వాడ్‌లు పరారీలో ఉన్నారు. సెక్యూరిటీ లోపంతోనే టార్గెట్.. ఈ ముఠా సభ్యులు గతంలోనూ ముత్తూట్ సంస్థల్లో పంజా విసిరారు. ముత్తూట్ బ్రాంచీ ల్లో బంగారం ఎక్కువగా ఉండడం, సెక్యూ రిటీ తక్కువగా ఉండడం వల్లే వాటిని టార్గెట్ చేస్తున్నట్లు నిందితులు విచారణలో వెల్లడిం చారు. మరోవైపు కొన్ని అంతర్రాష్ట్ర ఫైనాన్స్ సంస్థల్లో కేంద్రీకృత సీసీ కెమెరా వ్యవస్థ ఉం టుంది. వాటిలో ఏ బ్రాంచిలో ఏం జరుగు తోందనేది కేంద్ర కార్యాలయంలో ఉన్నవారు ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ముత్తూట్ సంస్థల్లో కేవలం ఆ కార్యాలయానికి సంబంధించి మాత్రమే సీసీ కెమెరా వ్యవస్థ పనిచేస్తుంది. దోపిడీ కోసం ఇదే సంస్థల్ని టార్గెట్ చేయడా నికి ఇదీ ఓ కారణమని పోలీసులు చెప్తున్నారు. వాహనాల నంబర్లు మార్చేసిన సుభాష్ దొంగతనం చేసిన వాహనాలు కొనుగోలు చేసే సుభాష్ 2007 మోడల్‌కు చెందిన స్కార్పియోను తక్కువ ధరకు కొన్నాడు. దాని ఛాసిస్ నంబర్లు, ఇంజన్ నంబర్‌ను తొలగిం చాడు. తర్వాత ఎంహెచ్06 ఏఎన్ 1174 నంబర్ (మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ )తో నకిలీ నం బర్ ప్లేట్ తయారుచేయడంతో పాటు ఆర్సీ, కారుకు సంబంధించిన ఇతర నకిలీ పత్రాల నూ సిద్ధం చేశాడు. పోలీసులు ఏ సమయం లోనూ ఛాసిస్ నంబర్లు తనిఖీ చేయరాని తెలిసి ఇలా వ్యవహరించినట్టు తెలిసింది. గుజరాత్లో రోషణ్ కోసం గాలింపు ఇక పరారీలో ఉన్న రోషణ్ యాదవ్ గుజరాత్ లో ఉన్నట్టు అనుమానిస్తున్న పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. గుజరాత్‌లోని మెహసానా వద్ద రూ.15 కోట్ల హవాలా డబ్బులు కాజేయాలన్నదే ఈ గ్యాంగ్ తర్వాత ప్లాన్ గా ఉందని పోలీసులు చెబుతున్నారు. పాటిల్.. యమ స్పీడున్న డ్రైవర్ గణేశ్ పాండురంగ భోంస్లే అలియాస్ పాటిల్ స్టీరింగ్ పట్టుకుంటే గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లా ల్సిందే. ఎక్కడా విరామం తీసుకోకుం డా వాహనాన్ని వెయ్యి కిలోమీటర్ల వరకు అలవోకగా నడిపేస్తాడు. అందుకే బీరంగూడలో దోపిడీ చేసిన సొత్తును తీసుకెళ్లిన నల్ల రంగు స్కార్పియోకు పాటిలే డ్రైవర్‌గా వ్యవహరించాడు. బీరంగూడ నుంచి కర్ణాటకలోని హలీకట్ట వరకు కేవలం రెండున్నర గంట ల్లోనే కారును తీసుకెళ్లాడంటే ఎంత వేగంగా నడిపాడో తెలిసి పోతుంది. అదే దూరాన్ని తాము చేరుకునేందుకు దాదాపు నాలుగు గంటలకుపైగా పట్టిందని పోలీసులే చెబుతున్నారు. ఎవరి ‘పాత్రలు’ ఏమిటంటే..? లక్ష్మణ్ నారాయణ్ మధుంగ్ అలియాస్ భయ్యా ముఠాకు నాయకుడు. ముత్తూట్ ఫైనాన్స్ లోకి సర్దార్జీ వేషంలో సీబీఐ అధికారిగా ప్రవేశించాడు. హిందీ, ఇంగ్లిష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడుతూ ఓ ఐడీ కార్డు సైతం చూపించాడు. తుపాకీ చూపించి సిబ్బందిని బెదిరించింది కూడా ఇతడే. గణేశ్ పాండురంగ భోంస్లే అలియాస్ పాటిల్ ఇతడిపై రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌ల్లోనూ కేసులున్నాయి. దోపిడీ కోసం ముత్తూట్ ఫైనాన్స్ లోకి ప్రవేశించినప్పుడు లేత బూడిదరంగు సఫారీ డ్రస్ వేసుకుని అధికారిగా చెప్పుకున్నాడు. చేతిలో తుపాకీ తో పాటు బేడీలు పట్టుకుని వచ్చాడు. సుభాష్ పుజారీ పాండే ముఠా సభ్యులు ‘దొంగ’గా చెబుతూ తీసుకువచ్చింది ఇతడినే. ఆ సమయంలో నల్లని మాస్క్, మంకీ క్యాప్ ధరించి వచ్చాడు. ఇతడి నేరానికి సంబంధించిన ‘వెరిఫికేషన్’ కోసమే వచ్చామంటూ ‘సీబీఐ అధికారి’ ముత్తూట్ సిబ్బందికి చెప్పాడు. బంగారం మూటకట్టడంలో సహకరించాడు. కాలా అలియాస్ లంబు తమిళనాడుకు చెందిన ఇతను ముంబైలో స్థిరపడ్డాడు. పరారీలో ఉండటంతో పూర్తి వివరాలు సరిచూడాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. తెల్లటి షర్ట్‌ను టక్ చేసుకుని, జంగిల్ క్యాప్‌తో వచ్చాడు. అల్మారా వెత కడంతోపాటు బంగారం మూటకట్టాడు. తుకారాం గైక్వాడ్ నేరచరితుడైన తుకారాం ముంబైలోని అంధేరీ ప్రాంతానికి చెందిన వాడు. ముత్తూట్లోకి ప్రవేశించిన సమయంలో తెల్ల షర్టు, డార్క్ కలర్ ప్యాంట్‌తో ట్రాఫిక్ కానిస్టేబుల్ వేషంలో ఉన్నాడు. -
దొరికిన ‘ముత్తూట్’ దొంగలు
ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు 3.5 కిలోల బంగారం, ఐదు లక్షల నగదు స్వాధీనం సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు ముత్తూట్ దొంగలు దొరికారు. డిసెంబర్ 28న సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పరిధిలో ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో దోపిడీకి పాల్పడిన కేసులో పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. దోపిడీకి మాస్టర్ మైండ్‌గా పనిచేసిన లక్ష్మణ్ నారాయణ్ ముదంగ్, పాటిల్, విజయ్‌కుమార్, సుభాష్‌లతో పాటు వారి నుంచి బంగారాన్ని కొనుగోలు చేసిన కుమార్ పాల్ త్రిలోక్‌చంద్ షాలను అరెస్టు చేసినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్యా ఆదివారమిక్కడ వెల్లడించారు. వీరి నుంచి 3.5 కిలోల బంగారం, ఐదు లక్షల నగదు, స్కార్పియో, డాట్సన్ వాహనాలు, బజాజ్ అవేంజర్ బైక్, దేశవాళీ తుపాకీ, పగిడి స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. దోపిడీలో పాలుపంచుకున్నవారిలో కొందరికి ఛోటా రాజన్, రవి పూజారా, డబ్బుశేషు గ్యాంగులతో సంబంధం ఉందని వెల్లడిం చారు. ఈ కేసుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబధం ఉన్న సుందర్, తుకారాం, రోషణ్ యాదవ్, ట్వింకిల్ మిశ్రా, కాలా కోసం గాలిస్తున్నట్లు వివరించారు. వీరికి 2015లో కేపీహెచ్‌బీ, బీరంగూడలో జరిగిన ముత్తూట్ దోపిడీ కేసులతో కూడా సంబంధమున్నట్టుగా గుర్తించామన్నారు. సుందర్, పాటిల్‌లు పుణెలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో రూ.6 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టారని పేర్కొన్నారు. కారు కోసం వచ్చి చిక్కారు.. దోపిడీ కోసం ఉపయోగించిన నల్ల స్కార్పియో కారును కర్ణాటక కాల్బుర్గిలోని హలకట్టలో విజయ్‌కుమార్ ఇంటి వద్ద ఉంచారు. దాన్ని తీసుకు వెళ్లేందుకు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు వీరంతా ఓ కారులో వచ్చారు. తిరుగుప్రయాణంలో కారు ముందు బజాజ్ అవేంజర్ మోటార్ సైకిల్‌పై విజయ్ కుమార్ వెళ్తుండగా కొడంగల్ క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు వారిని పట్టుకున్నారు. ఆ వెంటనే వెనుక నుంచి వచ్చిన స్కార్పియోను డ్రైవ్ చేస్తున్న పాటిల్‌ను, మరో వాహనంలో వస్తున్న పాటిల్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీళ్లను విచారించగా ముత్తూట్ దోపిడీ తమ పనేనని ఒప్పుకున్నారు. ముంబైలోని జావేరి బజార్లో జ్యువెల్లరీ షాప్ నిర్వహిస్తున్న కుమార్ పాల్ త్రిలోక్‌చంద్ షాకు బంగారం అమ్ముతామని వెల్లడించారు. ఇదే సమయంలో సుభాష్ తన వాటా డబ్బుల కోసం ముంబైలోని షాను కలిసేందుకు మధురై, బెంగళూరు మీదుగా ముంబైకి చేరుకున్నాడు. వాడీ బస్టాండ్‌కు చేరుకొని ల్యాండ్ లైన్ నంబర్ నుంచి షాకు ఫోన్‌కాల్ చేశాడు. తర్వాత వారిద్దరిని పోలీసులు పట్టుకున్నారు. దోపిడీకి మాస్టర్‌మైండ్‌గా వ్యవహరించిన లక్ష్మణ్ మహారాష్ట్రలోని వాడీకి చెందినవారు. ఈయనకు సుభాష్ పాటిల్, రోషణ్ యాదవ్, ట్వింకిల్ మిశ్రా తోడయ్యారు. వీరు నలుగురు కలిసి ఓ ముఠాగా ఏర్పడి దోపిడీలు మొదలెట్టారు. ఆ బైక్ పట్టించింది.. దోపిడీ జరిగిన రోజున మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ నంబర్ ఉన్న నల్ల స్కార్పియో కారు శంకర్పల్లి రోడ్డు మీదుగా వెళ్లింది. అదే వాహనం 8.57 గంటల సమయంలో పటాన్ చెరు మీదుగా ఆర్సీపురానికి ఏపీ నంబర్ ప్లేట్‌తో వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసు లు సీసీటీవీ ఫుటేజీలను తనిఖీ చేయగా ఆ స్కార్పియో కారు ముందు బజార్ అవేంజర్ బైక్ పైలటింగ్ చేస్తూ కనిపించింది. ఈ వాహనం వికారాబాద్, పరిగి, కొడంగల్, రిబ్బన్పల్లి, సేడమ్ నుంచి చిత్తాపూర్ చేరుకుంది. బజార్ అవేంజర్ వెహికల్ రిజిస్ట్రేషన్ వివరాలను పరిశీలించగా అది గుల్బార్గాలోని కాల్బుర్గిలోని హలకట్ట గ్రామంలోని విజయ్‌కుమార్ (మహబూబ్ నగర్‌వాసి) పేరుతో ఉండటంతో కేసులో నిందితులను పట్టుకోగలిగారు. బంగారం అంతా షాకు అమ్మి ఉంటారని అనుమానిస్తు న్నారు. త్వరలోనే అంతా బంగారం అంతా పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. -
అన్నింటా..వీరే
ముత్తూట్...మినీ... ‘మహా’ దొంగల గుర్తింపు రామచంద్రపురం ఠాణా పరిధిలో దోపిడీ, కేపీహెచ్‌బీ ఠాణా పరిధిలో దోపిడీ యత్నం వీరి పనే దేశవ్యాప్తంగా 22 ముత్తూట్ దోపిడీ కేసుల్లో వీరిదే మెజారిటీ మహారాష్ట్ర కేంద్రంగా హవాలా డబ్బు చోరీ చేసినట్లు అనుమానం పోలీసుల అదుపులో బీరంగూడ దోపిడీ కేసు నిందితులు సిటీబ్యూరో: రామచంద్రపురం ఠాణా పరిధిలోని బీరంగూడ ముత్తూట్ మినీ ఫైనాన్స్‌లో జరిగిన భారీ దోపిడీ...అదే ఏడాది మే 29న కేపీహెచ్‌బీకాలనీలోని హైదర్‌నగర్ ముత్తూట్ మినీ ఫైనాన్స్‌లో దోపిడీకి విఫలయత్నం, గతేడాది డిసెంబర్ 28న అదే బీరంగూడలోని ముత్తూట్ ఫైనాన్స్‌లో భారీ దోపిడీ...సంచలనాలకు కేరాఫ్‌గా మారిన ఈ మూడు ‘ముత్తూట్’ కేసుల్లోనూ దోపిడీ దొంగల శైలి ఒకేలా ఉండటం, వారు స్కార్పియో కారులోనే రావడం ఒకటే ముఠా పనిగా సైబరాబాద్ పోలీసులు అనుమానిస్తున్నారు. తొలి, రెండు కేసుల్లో నిందితుల ఊహాచిత్రాలను విడుదల చేసినా ఒక్కరినీ కూడా పట్టుకోకపోవడంతో తాజా ముత్తూట్ కేసు విచారణతో ఆ రెండు చోరీలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతేడాది డిసెంబర్ 28న ముత్తూట్‌లో దోపిడీ చేసిన ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న సీబీఐ అధికారి వేషధారణలో ఉన్న వ్యక్తి లక్ష్మణ్ నారాయణ్‌తో పాటు స్కార్పియో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు గతంలో జరిగిన దోపిడీలపై కూపీ లాగుతున్నారు. దాదాపు పది మంది సభ్యులు గల ఈ ముఠా దేశవ్యాప్తంగా జరిగిన 22 ముత్తూట్ దోపిడీ కేసుల్లో మెజారిటీ దోపిడీలు ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. గతేడాది మేలో గుల్బర్గాలోని ముత్తూట్ కార్యాలయంలోనూ వారు దోపిడీ చేసినట్లు గుర్తించారు. దక్షిణ భారతదేశ గ్యాంగ్‌గా పేరొందిన వీరు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో బంగారం చోరీలకు పాల్పడిందని, ఈ కేసు విచారణ పూర్తయితే సంచలనాత్మకమైన కేసులు ఎన్నో వెలుగులోకి వస్తాయని సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. ఇప్పటికే ముఠా సభ్యులందరిపై నిఘా ఉంచామని, సాధ్యమైనంత త్వరలో వారిని పట్టుకొని బంగారం రికవరీ చేస్తామన్నారు. సొత్తు పంచుకొని ఎవరి ప్రాంతాలకు వాళ్లు.... తాము దోపిడీ చేయాలనుకుంటున్న కార్యాలయంలో భద్రతపై ముందే రెక్కీ నిర్వహిస్తారు. అంతా ఓకే అనుకున్నాక తమ పని పూర్తి చేసుకుని స్కార్పియో కారులో చక్కేస్తారు. దోపిడీ చేసే ముందు నేరగాళ్లు వాడిన సెల్‌ఫోన్ నంబర్లన్నీ ఆ తర్వాత స్విచ్ఛాఫ్ అవుతాయి. నేరస్థలిలో కనీస ఆధారాలు లేకుండా జాగ్రత్త పడతారు. చోరీ సొత్తును సమానంగా పంచుకొని ఎవరి ప్రాంతానికి వారు వెళ్లిపోతారు. ఒకరికి ఒకరు దాదాపు పక్షం రోజుల పాటు కాంటాక్ట్‌లో ఉండరు. దీంతో పోలీసులకు దొరకడం ఇబ్బందిగా మారింది. ఇంకో విషయమేంటంటే ఇద్దరు ముగ్గురు సభ్యులు తమ ప్రాంతంలో దోపిడీలు చేసినా చోరీ సొత్తును తమ బృందంలోని మిగతా ఏడుగురు సభ్యులకు కూడా సమానంగా పంచుతారు. హవాలా డబ్బులు కూడా... బంగారు ఆభరణాలతో పాటు వీరు ఎక్కువగా హవాలా దందా డబ్బులు కూడా చోరీ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మహారాష్ట్ర కేంద్రంగా ఈ దందా నడిపినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. హవాలా డబ్బులు బ్లాక్‌మనీ కావడంతో బాధితులు ఎక్కడా ఫిర్యాదు కాకపోవడంతో కేసులు నమోదుకాన్నట్టుగా సమాచారం. ముంబైలోని ఓ జైల్లోనే కలిసిన వీరంతా పక్కాగా బంగారు ఆభరణాల దోపిడీని అమలు చేస్తున్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. -
‘ముత్తూట్’ బంగారం ఎక్కడ..?
• ఇన్నాళ్లూ దొంగల కోసం.. ఇçప్పుడు పసిడి కోసం వేట • క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్న ‘ముత్తూట్’ దోపిడీ • సూత్రధారి దొరికినా ‘బంగారం’ దొరకకపోవడంతో తంటాలు • వాడీ, ముంబైలో గాలింపు.. రెండు, మూడు రోజుల్లో రికవరీకి యత్నాలు సాక్షి, హైదరాబాద్: ‘ముత్తూట్ ఫైనాన్షియల్’లో భారీ దోపిడీ.. క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. సర్దార్జీ పాత్రలో సీబీఐ అధికారిగా నటించి.. దోపిడీకి ముఠా నాయకుడిగా వ్యవహరించిన ముంబైలో స్థిరపడిన కర్ణాటకవాసి లక్ష్మణ్ నారాయణ్‌తో పాటు మరో ఇద్దరు నిందితులు దొరకడంతో కేసు ఛేదించామని పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే వారి వద్ద బంగారం లేకపోవడంతో కథ అడ్డం తిరిగినట్లయ్యింది. దీంతో ఇన్నాళ్లు దొంగల కోసం వెతికిన పోలీసులు ఇప్పుడు బంగారం కోసం పరుగులు పెడుతున్నారు. దొంగలతో కలసి పోలీసుల గాలింపు.. డిసెంబర్ 28న రామచంద్రపురం ఠాణా పరిధిలోని బీరంగూడలోని ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో ఆరుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠా 46 కిలోల బంగారాన్ని దోపిడీ చేసిన సంగతి తెలిసిందే. పోలీసులకు చిక్కకుండా కర్ణాటక వాడీలోని తమ స్థావరానికి చేరుకునే వరకు ఈ ముఠా చాకచాక్యంగా వ్యవహరించింది. జాతీయ రహదారి 65పై ఉన్న ముత్తూట్ ఫైనాన్షియల్‌లో దోపిడీని సవాల్‌గా తీసుకున్న సైబరాబాద్ పోలీసులు.. 16 బృందాలను దొంగలను పట్టుకునేందుకు రంగంలోకి దింపారు. గ్రేహౌండ్స్ సిబ్బంది సహకారం కూడా తీసుకున్నారు. దాదాపు వారం తర్వాత దోపిడీకి ఉపయోగించిన స్కార్పియో.. దాని డ్రైవర్, సర్దార్జీ వేషధారణలోని లక్ష్మణ్నారాయణ్తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద బంగారం లభించకపోవడంతో కథ మొదటికొచ్చింది. దీంతో ఆరు బృందాలుగా ఏర్పడిన పోలీసులు బంగారం కోసం దొంగలతోనే కలసి ముంబై, వాడీ ప్రాంతాల్లో గాలిస్తున్నారు. ఆది నుంచి పక్కా వ్యూహాలే.. ‘ముత్తూట్’దోపిడీ కోసం దొంగలు పక్కా వ్యూహాన్ని అమలు చేయగా.. వారిని పట్టుకునేందుకు సైబరాబాద్ పోలీసులు కూడా అదే మంత్రాన్ని పఠించారు. దోపిడీ జరిగినప్పటి నుంచి దొంగలు వాడీ స్థావరా నికి చేరుకున్నంత వరకు ఏ చిన్న విషయం కూడా బయటకు తెలియకుండా పోలీసు కమి షనర్ సందీప్ శాండిల్యా జాగ్రత్తలు తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీల సేకరణకు.. దొంగలను వెతికేందుకు.. వాహనాల తనిఖీ లకు.. వాడీతో పాటు ముంబైలో గాలింపునకు ఇలా వివిధ బృందాలను పంపించి ఒకరి విషయం ఒకరికి తెలియకుండా దొంగలను పట్టుకోవడంలో సఫలీకృతులయ్యారు. ఇన్ని ప్రయత్నాలు చేసి పట్టుకున్న దొంగల వద్ద బంగారం లభ్యం కాకపోవడంతో దాని కోసం మళ్లీ కసరత్తు మొదలైంది. దోపిడీ సూత్రధారి లక్ష్మణ్నారాయణ్ అదుపులోనే ఉండటంతో బంగారం రికవరీ చేస్తామన్న ధీమాలో పోలీసులు ఉన్నారు. రెండు, మూడు రోజుల్లో మిగతా ముగ్గురు నిందితులతో పాటు బంగారాన్ని స్వాధీనం చేసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. -
ముత్తూట్ దోపిడీ ‘సర్దార్ జీ’ గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: సైబ రాబాద్ పోలీసు కమిషన రేట్ పరిధిలో సంచలనం సృష్టించిన ముత్తూట్ దోపిడీ కేసులో ప్రధాన నిందితుడైన సర్దార్ జీ సింగ్ వేషధారణలో ఉన్న వ్యక్తిని లక్ష్మణ్ నారా యణ్‌గా పోలీసులు గుర్తించినట్టు తెలిసింది. కర్ణాటకకు చెందిన లక్ష్మణ్ నారాయణ్ ముంబైలో స్థిరపడి చాలా దోపిడీలకు పాల్పడినట్టుగా ఆధా రాలు సేకరించిన పోలీసులు ముంబైలో అతడి కోసం వెతుకుతున్నారు. ముంబై పోలీసుల సహ కారంతో లక్ష్మణ్ నేరచరిత్రను తెలుసుకున్న పోలీసులు మరో ఒకటి రెండు రోజుల్లో అతడిని పట్టుకునే అవకాశముందని తెలుస్తోంది. సీబీఐ అధికారినని చెప్పి రామచంద్రపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని బీరంగూడ ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో మరో ఐదుగురు వ్యక్తులతో కలసి 46 కిలోల బంగారం ఎత్తుకెళ్లిన సంగతి తెలిసిందే. పోలీసులు అదుపులోకి తీసుకున్న స్కార్పియో డ్రైవర్, మరో వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆధారంగా పరారీలో ఉన్న నలుగురిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న ఇద్దరిలో ఒకరిని గురువారం రామచంద్రపురం పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి మళ్లీ నాసిక్‌కు తీసుకెళ్లినట్టు తెలిసింది. మరో రెండు రోజుల్లో ఈ కేసులో కీలక పురోగతి ఉంటుందని పోలీసు ఉన్నతాధి కారులు చెబుతున్నారు. -
పోలీసుల అదుపులో ‘ముత్తూట్’ దొంగలు!
♦ వాడీ నుంచి ముంబై వెళుతుండగా ఇద్దరిని పట్టుకున్నట్టు సమాచారం ♦ సర్దార్జీతో పాటు మరో ముగ్గురి కోసం ముంబైలో ప్రత్యేక బృందాల గాలింపు ♦ నాలుగుసార్లు రెక్కీ, ఐదోసారి దోపిడీ చేసినట్టుగా నిర్ధారణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముత్తూట్ ఫైనాన్స్ సంస్థ దోపిడీ కేసులో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. సర్దార్జీతోపాటు మరో ముగ్గురి వద్ద భారీ మొత్తంలో బంగారం ఉండటంతో వారి ప్రతి కదలికపై పోలీసులు ప్రత్యేక నిఘాను ఉంచినట్టు సమాచారం. సర్దార్ జీ వేషధారణలో ఉన్న ప్రధాన నిందితుడు, మిగత వారు పాత నేరస్తులు కావడంతో వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ముంబైలో గాలిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే కర్ణాటకలోని వాడీలోని వారి స్థావరాల్లో ముత్తూట్‌లో దోపిడీకి ఉపయోగించిన స్కార్పియో, బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ‘వాడీ’ కేంద్రంగానే దోపిడీకి స్కెచ్.. డిసెంబర్ 23 నుంచి 25 వరకు ఆరుగురు నిందితుల కదలికలను తెలుసుకునేందుకు 35 సీసీ టీవీ కెమెరా ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. దోపిడీ తర్వాత రాష్ట్ర సరిహద్దులు దాటేలోపు బైక్, స్కార్పియోలు రెండు సార్లు కలుసుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఏ మార్గంలో వెళితే బాగుంటుందని రెక్కీ చేసుకుని దోపిడీ తర్వాత అదే మార్గంలో వాడీ వెళ్లినట్టుగా గుర్తించారు. ఈ ఆరుగురు అంతర్రాష్ట్ర నేరగాళ్లే అని, జైలులోనే కలసి ఈ దోపిడీకి స్కెచ్ వేసి ఉంటారని సీపీ సందీప్ శాండిల్యా అనుమానం వ్యక్తం చేశారు. దోపిడీ చేయడానికి ముందు మహారాష్ట్ర(ఎంహెచ్) రిజిస్ట్రేషన్‌తో కూడిన నంబర్ ప్లేట్‌ను స్కార్పియోకు వినియోగించారు. పరిగి బస్టాండ్‌లో బైక్‌ను పార్క్ చేసిన సమయం లో కర్ణాటక రిజిస్ట్రేషన్‌తో కూడిన నంబర్ ప్లేట్‌ను వాడారు. నేరం జరిగే రోజుకు ఘటనాస్థలికి 5 కిలోమీటర్ల ముందు తమ బండి నంబర్ ప్లేట్‌ను ఏపీకి మార్చారు. రెక్కీ తీరు ఇలా.. డిసెంబర్ 14: ఏపీ23ఎం3107 నంబర్ గల స్కార్పియో బీరంగూడలో చక్కర్లు డిసెంబర్ 23: ఉదయం 5 గంటలకు వాడీ నుంచి స్కార్పియోలో సర్దార్జీ గ్యాంగ్ ప్రయాణం. ఉదయం 9 గంటలకు బీరంగూడ ముత్తూట్ కార్యాలయానికి చేరిక. ఇద్దరు వ్యక్తులు లోనికి వెళ్లి బంగారంపై ఎంత రుణం ఇస్తారని ఆరా. రాత్రి బీరంగూడకు సమీపంలోని ఓ దాబాలో ఆశ్రయం డిసెంబర్ 24: మళ్లీ ఉదయం 9 గంటలకు బీరంగూడ ముత్తూట్ కార్యాలయానికి చేరిక. మరో ఇద్దరు వ్యక్తులు వెళ్లి బంగారంపై రుణం ఆరా. సిబ్బంది ఎంత మందనే దానిపై దృష్టి. ద్విచక్ర వాహనాన్ని పరిగి బస్టాండ్‌లో పార్క్ చేసి స్కార్పియోలో వాడీకి ప్రయాణం డిసెంబర్ 26: బీరంగూడ నుంచి దోపిడీ చేశాక పోలీసుల కంట పడకండా ఏయే మార్గాల్లో తప్పించుకోవచ్చనే దానిపై చక్కర్లు. బైక్ మళ్లీ పరిగి బస్టాండ్‌లోనే పార్కింగ్. వాడీకి ప్రయాణం దోపిడీ అమలు చేసిందిలా.. డిసెంబర్ 27: ఉదయం 5 గంటలకు వాడీ నుంచి స్కార్పియోలో ఆరుగురి రాక. పరిగి బస్టాండ్‌కు చేరుకున్నాక ఇద్దరు దిగి బైక్‌ను తీసుకుని పైలట్‌గా స్కార్పియో ముందు బయలుదేరారు. సైబరాబాద్ కమిషనరేట్ సరిహద్దులోకి ప్రవేశించే సమయంలో పెట్రోలింగ్ వాహనాన్ని చూసి దోపిడీ ప్లాన్ విరమణ. బీరంగూడకు పది కిలోమీటర్ల దూరంలోని దాబాలో రాత్రి బస చేశారు. డిసెంబర్ 28: ఉదయం 8 గంటలకు బైక్‌పై ఇద్దరు వ్యక్తులు బీరంగూడ వరకు చక్కర్లు. ఆ తర్వాత స్కార్పియోలో ముత్తూట్ కార్యాలయానికి చేరుకుని 9 నుంచి 9.30 గంట మధ్యలో 46 తులాల బంగారం దోపిడీ. 9.30 నుంచి 9.40 వరకు దోపిడీ జరిగిన ప్రాంతం నుంచి 2 కిలోమీటర్ల వరకు స్కార్పియో ముందు బైక్ పైలటింగ్. వాడీలోని స్థావరంలో వాహనాలు వదిలేసి రైలులో ముంబైకి పరారీ. ఈ క్రమంలోనే ఇద్దరి అరెస్ట్. -
ముత్తూట్ ఫైనాన్స్ దొంగలు దొరికారు
-
ముత్తూట్ దొంగలు దొరికారు
హైదరాబాద్: కలకలం సృష్టించిన ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ కేసు వీడింది. దోపిడీ దారులను నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకలోని గుల్బర్గాలో నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. సంగారెడ్డి జిల్లా బీరంగూడలోని ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలోకి సీబీఐ అధికారులమంటూ వచ్చి పట్టపగలే ఆరుగురు దుండగులు భారీ దోపిడీ చేసిన విషయం తెలిసిందే. 13 కోట్ల రూపాయల విలువ చేసే 46 కేజీల బంగారాన్ని దోచుకెళ్లారు. సీబీఐ అధికారులమని చెప్పి లోపలికి ప్రవేశించిన దుండగులు ఉద్యోగులను మారణాయుధాలతో బెదిరించి ఈ దోపిడీకి పాల్పడ్డారు. (చదవండి.. ముత్తూట్‌లో ఘరానా దోపిడీ) దుండగులు నలుపు రంగు స్కార్పియో కారులో వచ్చారని, ఇద్దరు వ్యక్తుల చేతుల్లో తుపాకులు ఉన్నట్టు సిబ్బంది ఆ సమయంలో వివరాలు ఇచ్చారు. తమను గుర్తుపట్టకుండా సీసీ కెమెరాలను కూడా దొంగలు ధ్వంసం చేశారు. అయితే, అదే రోజు సాయంత్రంలోగా వారు వెళుతున్న వాహనం ఆధారాలు గుర్తించిన పోలీసులు అనంతరం వారి ఊహాచిత్రాలు కూడా విడుదల చేసి గాలింపు చర్యలు మొదలుపెట్టారు. వారిని తాజాగా కర్ణాటకలోని గుల్బార్గాలో అదుపులోకి తీసుకొని ఆ ముఠా మొత్తాన్ని హైదరాబాద్‌కు తరలించారు. వీరిని ప్రస్తుతం సైబరాబాద్ సీపీ సందీప్ శాండిల్య విచారిస్తున్నారు. -
కిట్టాపూర్ వద్ద సీసీటీవీకి..
► కర్ణాటకలోని ఈ ప్రాంతంలోనే సీసీటీవీ ఫుటేజీకి చిక్కిన ‘ముత్తూట్’దొంగల కారు సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ రాంచంద్రపురం ఠాణా పరిధిలో ‘ముత్తూట్ భారీ దోపిడీ’కి పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే గ్రేహౌండ్స్, టాక్టికల్ వింగ్‌లతో కూడిన 16 బృందాలు కర్ణాటకను జల్లెడ పడుతున్నాయి. (చదవండి : ‘ముత్తూట్’లో ఘరానా దోపిడీ) నిందితులు వెళ్లిన ఏపీ23ఎం 3107 నంబర్ కారు కర్ణాటకలోని సెడామ్ నుంచి గుల్బర్గా మధ్యలో కిట్టాపూర్ వద్ద చివరిసారిగా సీసీ టీవీ ఫుటేజీకి చిక్కింది. దీంతో నిందితులు కారును ఆ ప్రాంతంలో వదిలేసి కర్ణాటక ఎక్స్‌ప్రెస్‌లో బెంగళూరు వెళ్లి ఉంటారన్న అనుమానంతో కొన్ని బృందాలు అక్కడ తనిఖీ చేస్తున్నాయి. సైబరాబాద్ జాయింట్ సీపీ స్టీఫెన్ రవీంద్ర కిట్టాపూర్ చుట్టుపక్కల ప్రాంతాల పోలీసులతో మాట్లాడారు. వారికి నిందితుల ఊహాచిత్రాలను కూడా పంపారు. -
‘ముత్తూట్’ దొంగల కోసం.. ‘గ్రేహౌండ్స్’
- నక్సలైట్లను గాలించేవారు తొలిసారిగా నిందితుల కోసం రంగంలోకి.. - టాక్టికల్ వింగ్‌లను కూడా బరిలోకి దింపిన సైబరాబాద్ పోలీసులు - ‘పటాన్చెరు’ నుంచే వచ్చి.. వెళ్లినట్టుగా చెబుతున్న సీసీటీవీ ఫుటేజీలు - దోపిడీ సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదం దొంగల పనేనని అనుమానం సాక్షి, హైదరాబాద్: ‘ముత్తూట్ ఫైనాన్స్’లో భారీ దోపిడీకి పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను పట్టుకునేందుకు సైబరాబాద్ పోలీసులు గ్రేహౌండ్స్ సిబ్బందిని రంగంలోకి దింపారు. నక్సలైట్లను పట్టుకునేందుకు బరిలోకి దిగే వీరిని తొలిసారిగా ఓ దోపిడీ కేసులో నిందితులను పట్టుకునేందుకు రంగంలోకి దింపడం గమనార్హం. అలాగే నిందితులు తారసపడిన సమయంలో ఎదుర్కొనే తీరుపై శిక్షణ పొందిన ‘టాక్టికల్ వింగ్’ల ద్వారా కూడా నిందితుల కోసం గాలిస్తున్నారు. బుధవారం దోపిడీ సమయంలో నిందితులు వ్యవహరించిన తీరుతో సిమీ ఉగ్రవాదులై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దోపిడీకి వచ్చి.. వెళ్లిన తీరును పరిశీలించిన పోలీసులు వీరు పక్కా ప్రొఫెషనల్స్ అయి ఉంటారన్న నిర్ధారణకు వచ్చారు. పటాన్చెరు నుంచే రాక.. పోక ముఠా సభ్యులు దోపిడీకి వినియోగించిన ఏపీ23ఎం3107 నంబర్ గల నల్ల కారు పటాన్చెరు నుంచే వచ్చినట్టు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిర్ధారించారు. బుధవారం ఉదయం 8.55 గంటలకు పటాన్చెరు దాటినట్టు, ఉదయం 8.59 నిమిషాలకు బీరంగూడలోని ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయం ముందు ఆగినట్టు సీసీటీవీ ఫుటేజీతో స్పష్టమవుతోంది. వారు కర్ణాటకలోని గుల్బర్గా నుంచి బుధవారం ఉదయం ఐదు గంటలకు బయలుదేరి ఘటనాస్థలికి తొమ్మిది గంటలకు చేరుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. 20 నుంచి 30 నిమిషాల వ్యవధిలోనే పని ముగించుకుని తిరిగి పటాన్చెరు మీదుగానే 9.35 గంటలకు వెళ్లినట్టుగా సీసీటీవీ ఫుటేజీ దృశ్యాలు చెబుతున్నాయి. శంకర్పల్లి మీదుగా వీరు వెళ్లిన వాహనం కర్ణాటకలోని సెడామ్ వరకు వెళ్లినట్టుగా తెలిసింది. ఆ తర్వాత ఆ వాహనం ఎటు వెళ్లిందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే రం గంలోకి దిగిన 16 బృందాలు ఈ ముఠాను పట్టుకునేందుకు శతాథా ప్రయత్ని స్తున్నాయి. ముత్తూట్ సిబ్బంది చెప్పిన ఆనవాళ్ల ప్రకారం వేసిన ఊహ చిత్రాలను కర్ణాటకలోని అన్ని పోలీసు స్టేషన్లకు పంపించారు. ‘రోడ్డు ప్రమాదం’వారి డ్రామానేనా... దోపిడీ జరిగిన సమయంలోనే ముత్తూట్ కార్యాలయానికి సమీపంలో ఓ బైక్ ప్రమాదం జరిగింది. దాదాపు 30 నిమిషాల పాటు ప్రజలంతా అక్కడే గుమికూడి ఉన్నారు. ఈ సమయంలోనే దొంగలు తమ పనికానిచ్చేసి ఎంచక్కా వెళ్లి ఉంటారన్న అనుమానం వ్యక్తమవుతోంది. కావాలనే ఈ రోడ్డు ప్రమాదం నాటకానికి తెరలేపి భారీ దోపిడీ చేసి ఉంటారా? అన్న దిశగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్ టు గుల్బార్గా..ఎస్కేప్
-
‘ముత్తూట్’లో ఘరానా దోపిడీ
► సీబీఐ అధికారులమంటూ 46 కిలోల బంగారంతో పరార్ ► సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో చోరీ ► పక్కా స్కెచ్‌తో వచ్చిన ఐదుగురు సభ్యుల ముఠా ► నల్లడబ్బుతో కొందరు బంగారం కొని ఇక్కడే దాచారని దబాయింపు ► లాకర్లు తెరవాలంటూ తుపాకీతో బెదిరింపు ► సిబ్బందిని బాత్రూమ్లో బంధించి బంగారంతో చెక్కేసిన ముఠా ► దొంగలను పట్టుకునేందుకు రంగంలోకి ప్రత్యేక పోలీసు బృందాలు రామచంద్రాపురం: ఒకడిది నల్లటి సఫారీ డ్రెస్.. చేతిలో పిస్టోల్.. ఇంకొకడిది ట్రాఫిక్ పోలీస్ వేషధారణ.. మరొకడి ముఖానికి మంకీ క్యాప్.. ఇలా ఐదుగురు ఐదు రకాలుగా వచ్చారు.. తామంతా సీబీఐ అధికారుల మన్నారు.. అచ్చూ పోలీసుల మాదిరే మాట్లా డారు.. నల్లడబ్బుతో కొందరు బంగారం కొని ఇక్కడే దాచారని దబాయించారు.. ఇదిగో వీడే దొంగ అంటూ ‘మంకీ క్యాప్’వేసుకున్నవాడిని చూపించారు.. లాకర్లు తెరవమన్నారు.. ‘నో’అన్నందుకు తుపాకీతో బెదిరించారు.. గదిలో బంధించారు.. 15 నిమిషాల్లోనే రూ.13 కోట్ల విలువైన 46 కిలోల బంగారంతో ఉడాయించారు! సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని బీరంగూడ కమాన్ సమీపంలో ఉన్న ముత్తూట్ ఫైనాన్స్‌లో జరిగిన ఘరానా దోపిడీ ఇది!! నిత్యం వేలాది వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే 65వ నంబరు జాతీయ రహదారిపై ఉన్న ఈ సంస్థలో బుధవారం ఉదయం సినీఫక్కీలో చోటుచేసుకున్న ఈ భారీ దొంగతనం సంచలనం సృష్టించింది. ఎలా వచ్చారు.. ఏమన్నారు..? బుధవారం ఉదయం 8.45 నిమిషాలకు రోజూలాగే ముత్తూట్ ఫైనాన్స్ సిబ్బంది కార్యాలయాన్ని తెరిచారు. రోజువారీ మాదిరే అంతర్గత సమావేశం నిర్వహించేందుకు సిద్ధ మయ్యారు. తొమ్మిది గంటల సమయంలో ఐదుగురు సభ్యులున్న దోపిడీ ముఠా ఓ నల్లటి స్కార్పియో వాహనంలో వచ్చింది. వాహనాన్ని రోడ్డుపై ఆపి.. వారంతా మొదటి అంతస్తులోని ‘ముత్తూట్’కార్యాలయంలోకి వెళ్లారు. ఫైనాన్స్ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డ్ దేవరాజ్‌తో తాము సీబీఐ అధికారులని చెప్పారు. అతడిని కూడా కార్యాలయంలోకి తీసుకెళ్లారు. వాచ్‌మన్‌ను కేబిన్ బయటే ఉంచి.. అతడికి కాపలాగా తమలో ఒకడిని ఉంచారు. మిగతా నలుగురు గదిలో సమావేశమైన సిబ్బంది వద్దకు వెళ్లారు. తాము సీబీఐ అధికారులమని, కొందరు నల్లధనంతో బంగారం కొని ఇక్కడ దాచినట్లు సమాచారం అందిందని, తనిఖీలు నిర్వహించాలని చెప్పారు. వారిలో ఒకరు తలపాగా, సఫారీతో సర్దార్జీలా ఉన్నాడు. మరో వ్యక్తి మంకీ క్యాప్‌తో ఉన్నాడు. మంకీ క్యాప్ వేసుకున్న వ్యక్తి ఎవరని సిబ్బంది అనుమానం వ్యక్తం చేశారు. ఇందుకు సఫారీ దుస్తుల్లోని వ్యక్తి.. అతడు దొంగ అని చెప్పాడు. అతను చోరీ చేసిన సొత్తును ఇక్కడే దాచినట్లు తమకు సమాచారం ఉందని.. లాకర్లు తెరవాలని బెదిరించాడు. సీబీఐ అధికారులు లాకర్లు తెరవమని అడగరంటూ ఫైనాన్స్ సిబ్బంది నిరాకరించారు. ఇంతలో సర్దార్ వేషధారణలో ఉన్న వ్యక్తి తుపాకీతో బెదిరించాడు. భయాందోళనకు లోనైన సిబ్బంది లాకర్ తెరిచారు. అందులో ఉన్న సుమారు 46 కిలోల బంగారాన్ని తమ వెంట తెచ్చుకున్న బ్యాగులో దోపిడీ ముఠా సభ్యులు నింపారు. బ్యాగు పూర్తిగా నిండటంతో వారిలో ఓ వ్యక్తి కిందకు వెళ్లి వాహనం నుంచి ఓ దుప్పటి తేగా.. అందులో కొంత మూట కట్టారు. వచ్చిన పని పూర్తయ్యేంత వరకు ఫైనాన్స్ సిబ్బందిని బాత్రూమ్ ముందు కూర్చోబెట్టారు. బంగారం మూటలతో వెళ్తూవెళ్తూ.. సీసీ కెమెరా ఫుటేజీని రికార్డు చేసే డీఆర్ బాక్స్ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. డీఆర్ బాక్స్‌ను చూపడంతో దాన్ని కూడా వెంట తీసుకెళ్లారు. పరారయ్యే ముందు ఫైనాన్స్ సిబ్బందిని బాత్రూమ్లో బంధించి బయట్నుంచి గడియ పెట్టారు. కాసేపటి తర్వాత ఫైనాన్స్‌కు వచ్చిన ఓ ఖాతాదారుడికి బాత్రూమ్ నుంచి అరుపులు రావడంతో గడియ తీశాడు. బయటకు వచ్చిన సిబ్బంది వెంటనే 100 నంబర్‌కు డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల మాదిరి ప్రశ్నలడుగుతూ.. దోపిడీ చేయడానికి వచ్చిన దుండగులు ఎవ్వరికి అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సిబ్బందితో వారు సుమారు ఐదారు నిమిషాలు హిందీ, ఇంగ్లిష్ భాషల్లో మాట్లాడినట్లు సైబరాబాద్ కమిషనర్ తెలి పారు. సిబ్బందిని వారి పేర్లు, వారి తల్లిదం డ్రుల పేర్లు, ఎవరేం చేస్తారో పోలీసుల మాదిరిగా ప్రశ్నించినట్లు తెలిసింది. దోపిడీ దొంగలు వచ్చిన నల్లటి వాహనాన్ని జాతీయ రహదారి పక్కన ఉన్న సర్వీసు రోడ్డుపై నిలిపారు. దోచుకున్న సొత్తుతో అదే వాహ నంలో పటాన్చెరు వైపు వెళ్లినట్లు పలువురు చెబుతున్నారు. పోలీసులు సంగారెడ్డి జిల్లా పరిధిలోని కంది, సదాశివపేట, జహీరాబాద్ తోపాటు జోగిపేటలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి విస్తృతంగా వాహనాలు తనిఖీలు చేపట్టారు. ముత్తూట్ ఫైనాన్స్‌ను సైబరాబాద్ కమి షనర్ సందీప్ శాండిల్యా పరిశీలించారు. సుమారు గంటకుపైగా సిబ్బందితో మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... దోపిడీ ఎలా జరిగిందో వివరించారు. దుండగులను పట్టుకునేం దుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నట్టు తెలిపారు. తాకట్టు పెట్టిన బంగారంపై ఇన్సూరెన్స్ ఉందని, ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముత్తూట్ అధికారి ఒకరు తెలిపారు. దొంగల ముఠాలో ఎవరెలా ఉన్నారంటే.. ► సర్దార్జీ: బ్లాక్ సఫారీ డ్రెస్, బూట్లు ధరించి సీబీఐ అధికారిగా చెప్పుకున్నా డు. కుడి చేతికి బంగారం ఉంగరం ధరిం చాడు. 35 నుంచి 40 ఏళ్ల వయసు ఉంటుంది. హిందీ, ఇంగ్లిష్‌లో అనర్గళం గా మాట్లాడాడు. చేతిలో పిస్టోల్ ఉంది ► రెండో వ్యక్తి: పలుచటి గులాబీ రంగు గల మంకీ క్యాప్ ధరించాడు. ఇతడినే దొంగగా చూపారు. ఇతడే బంగారం దాచి ఉండే అల్మార్లలోని సొత్తును ఒకచోటకు చేర్చి బ్యాగ్‌లో నింపాడు ► మూడో వ్యక్తి: ట్రాఫిక్ పోలీసు వేషధారణలో తెల్లటి చొక్కా, లైట్ బ్లాక్ ప్యాంట్ ధరించాడు ► నాలుగో వ్యక్తి: సఫారీ డ్రెస్‌లో ఉన్నా డు. ఇతడి వద్ద కూడా పిస్తోల్ వంటి ఆయుధం ఉంది ► ఐదో వ్యక్తి: మిలిటరీ క్యాప్ ధరిం చాడు. వైట్ షర్ట్ టక్ చేసి ఆఫీసర్లా ఉన్నాడు. గుల్బార్గాకు ముఠా... ముత్తూట్ ఫైనాన్స్‌లో దోపిడీకి పాల్పడిన దొంగల ముఠా కర్ణాటకలోని గుల్బర్గాకు వెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు. వారిని పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన 16 బృందాలు అక్కడికెళ్లాయి. ఈ దోపిడీ అంతర్రాష్ట ముఠా సభ్యుల పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ముఠా ప్రయాణించిన వాహనం నంబర్‌ను ఏపీ 28 ఎన్3107. ఇది రంగారెడ్డి జిల్లా ఇబ్ర హీంపట్నం షాయిగూడకు చెందిన తిరుమల్‌రెడ్డికి చెందిన మోటార్ సైకిల్ నం బరుగా తేలింది. పోలీసులను బురిడీ కొట్టిం చేందుకే దొంగలు ఈ నకిలీ నంబర్‌ను వినియోగించినట్టు భావిస్తున్నారు. నిందితు లు ఈ వాహనంలో కొంత దూరం ప్రయా ణించి.. ఆ తర్వాత మరో వాహనంలోకి మారి ఉంటారా? అన్న కోణంలోనూ ఆరా తీస్తున్నారు. ముఠాలో ఐదుగురు సభ్యుల తోపాటు ఓ మహిళ కూడా ఉన్నట్లు సీసీ ఫుటేజీ ఆధారంగా అంచనాకు వస్తున్నారు. -
పోలీసుల అదుపులో ముత్తూట్ ఫైనాన్స్ మేనేజర్
-
ముత్తుట్ ఫైన్సాన్స్ లో భారీ దోపిడీ
-
ముత్తూట్ ఫైన్సాన్స్ లో భారీ దోపిడీ
బీరంగూడ: సంగారెడ్డి జిల్లా బీరంగూడలో భారీ దోపిడీ జరిగింది. ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలోకి చొరబడిన ఐదుగురు దుండగులు 10 కోట్ల రూపాయల విలువ చేసే బంగారం దోచుకెళ్లారు. సీబీఐ అధికారులమని చెప్పి లోపలికి ప్రవేశించిన దుండగులు ఉద్యోగులను మారణాయుధాలతో బెదిరించి ఈ దోపిడీకి పాల్పడ్డారు. దుండగులు నలుపు రంగు స్కార్పియో కారులో వచ్చారని, ఇద్దరు వ్యక్తుల చేతుల్లో తుపాకులు ఉన్నట్టు సిబ్బంది తెలిపారు. తమను గుర్తుపట్టకుండా సీసీ కెమెరాలను దొంగలు ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేట్టారు. దోపిడీదారులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలిసినవారి పనా, లేక పాత నేరస్తులు ఎవరైనా ఈ దోపిడీకి పాల్పడ్డారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ముత్తూట్ ఫైనాన్స్ సంస్థ సిబ్బందిని అడిగి వివరాలు సేకరిస్తున్నారు. చోరీకి సంబంధించి ఐదుగురు వ్యక్తుల ఆనవాళ్లను పోలీసులు విడుదల చేశారు. నిందితుల వయస్సు 35 నుంచి 40 ఏళ్ల వయస్సు ఉంటుందని పోలీసులు తెలిపారు. మూడేళ్ల క్రితం ఇదే సంస్థలో ఉగ్రవాదులు చోరీ చేశారు. మధ్యప్రదేశ్ లోని తాండ్వా జైలు నుంచి తప్పించుకుని వచ్చిన ఉగ్రవాదులు ఈ దోపిడీకి పాల్పడ్డారు. మళ్లీ ఇదే సంస్థలో ఇప్పుడు దోపిడీ జరగడంతో భయాందోళన వ్యక్తమవుతోంది. -
దేశంలో 47 శాతం బంగారం వీరి దగ్గరే!
భారత్‌లో బంగారానికి భారీగానే డిమాండ్ ఉంటుంది. బంగారాన్ని కొనడానికే కాని అమ్మకానికి ఎవరూ ఇష్టపడరు. మరికొంతమంది బ్లాక్‌మనీని దాచుకోవడానికి బంగారాన్ని సురక్షిత మార్గంగా ఎంచుకుంటారు. అసలు భారత్‌లో బంగారం ఎవరి వద్ద ఎక్కువుందో తెలుసా? మూడు అతిపెద్ద గోల్డ్ లోన్ సంస్థలు.. ముత్తూట్ ఫైనాన్స్, మణప్పురం ఫైనాన్స్, ముత్తూట్ ఫిన్‌కార్ప్ సంస్థల వద్దే దేశంలో 47 శాతం బంగారం ఉందట. గత రెండేళ్లలో ఈ మూడు సంస్థలు కనీసం వారి బంగారం నిల్వలను 195 టన్నుల నుంచి 263 టన్నులకు పెంచుకున్నాయని టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టులో వెల్లడైంది. ఆశ్చర్యకర విషయమేమిటంటే ఈ మూడు సంస్థలు కేరళకు చెందినవే. ఆ మూడు సంస్థల్లో కూడా ముత్తూట్ ఫైనాన్స్ దేశీయ అతిపెద్ద గోల్డ్ లోన్ సంస్థగా పేరుగాంచుతోంది. గత రెండేళ్లలో ఈ సంస్థ 116 టన్నుల నుంచి 150 టన్నులకు పైగా బంగారం నిల్వలను పెంచుకుంది. ఈ నిల్వలు సింగపూర్(127.4 టన్నులు), స్వీడన్(125.7 టన్నులు), ఆస్ట్రేలియా(79.9 టన్నులు), కువైట్(79 టన్నులు), డెన్మార్క్(66.5 టన్నులు), ఫిన్లాండ్(49.1 టన్నులు) ల కంటే ఎక్కువగా ఉన్నాయి. మిగతా రెండు కంపెనీలు మణప్పురం ఫైనాన్స్ వద్ద 65.9 టన్నులు, ముత్తూట్ ఫిన్కార్పొ వద్ద 46.88 టన్నుల బంగారం నిల్వలున్నాయి. ఇవన్నీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలుగా తమ కార్యకాలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ సంస్థలు బంగారం విలువపై 75 శాతం వరకు రుణాన్ని ఇస్తాయి. పాత నోట్లను రద్దు చేసిన మొదటి రెండు వారాల్లోనే ఈ గోల్డ్ లోన్ బిజినెస్‌లు 65-70 శాతం క్షీణించాయి. ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి ఈ సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలు చెక్, స్వైపింగ్ మిషన్ లాంటి వాటిని ఎంచుకుంటున్నాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం భారత్ 558 టన్నుల బంగారం నిల్వలతో 11వ అతిపెద్ద దేశంగా ఉంది. బంగారం నిల్వలో 8,143 టన్నులతో అమెరికా అగ్రస్థానంలో ఉండగా.. దాని తర్వాతి స్థానంలో 3,378 టన్నులతో జర్మనీ నిలుస్తోంది. గ్లోబల్‌గా బంగారానికి నమోదవుతున్న డిమాండ్‌లో భారత్ నుంచే 30 శాతం డిమాండ్ ఉందని తెలిసింది. -
ముత్తూట్ ఫైనాన్స్ లో మరో భారీ చోరీ
గుజరాత్: దేశంలో అతిపెద్ద గోల్డ్‌లోన్ సంస్థ ముత్తూట్ ఫైనాన్స్ కు ఊహించని షాక్ తగిలింది. గుజరాత్‌లోని ధరోజి ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయాన్ని దొంగలు లూటీ చేశారు. సోమవారం చోటుచేసుకున్న ఈ దిగ్భ్రాంతికర సంఘటనలో సుమారు రూ.90 లక్షల సొమ్మును దోచుకెళ్లారు. తాజా నివేదికల ప్రకారం సుమారు ముగ్గురు నుంచి నలుగురు వ్యక్తులు ఈ చోరీలో పొల్గొన్నట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ సహాయంతో నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే చోరీకి గురైన సొత్తు పాత నోట్లా లేక కొత్త నోట్లా తదితర పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. విచారణ కొనసాగుతోంది. కాగా ఈ ఏడాది ఆగస్టులో సేలం ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో ఇలాంటి భారీ చోరీ జరిగింది. గోడకు రంధ్రం చేసి షాప్ లోకి ప్రవేశించిన దొంగలు రూ. 1,34,000 నగదును, అయిదున్నర కిలోల బంగారాన్నిఎత్తుకెళ్లిన సంగతి తెలిసిందే. -
ముత్తూట్ సంస్థలపై ఆకస్మిక తనిఖీలు
కొచ్చి: పన్ను ఎగవేత అరోపణల నేపథ్యంలో ముత్తూట్ సంస్థ బ్రాంచ్ లపై ఆదాయపన్ను శాఖ శుక్రవారం సోదాలు నిర్వహిస్తోంది. దేశంలోని పలు కీలక నగరాలతో పాటు కేరళలోని కొన్ని ముఖ్య పట్టణాలలో ముత్తూట్ ఆస్తులపై అధికారులు ఆకస్మిక దాడులు జరుగుతున్నాయి. తిరువనంతపురం, కొచ్చి, కొలెన్చెర్రీలతో పాటు న్యూఢిల్లీ, ముంబై, కొయంబత్తూర్, చెన్నై, బెంగళూరు నగరాలలో సోదాలు నిర్వహించిన అధికారులు కొన్ని కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్లు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నేటి (శుక్రవారం) తెల్లవారుజాము నుంచి ఇప్పటికీ కొన్ని నగరాలలో దాడులు కొనసాగుతున్నట్లు సమాచారం. తనిఖీలలో భాగంగా ఆదాయపన్ను శాఖ అధికారులకు పూర్తిగా సహకరించినట్లు ముత్తూట్ గ్రూప్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
బ్యాంకులకు ‘శని’వారం!
* ఆ రోజునే ఎంచుకుంటున్న చోరులు * మర్నాడు సెలవుతో తేలిగ్గా సేఫ్‌జోన్‌లోకి... * తాజాగా ఘట్కేసర్ ఆంధ్రా బ్యాంకులో చోరీ * అధికారులను అప్రమత్తం చేయాలని నిర్ణయం సాక్షి, సిటీబ్యూరో: సోమవారం వచ్చిందంటే చాలు... ఏ ప్రాంతంలో ఏ బ్యాంకు దొంగతనం.. చోరీ యత్నం వ్యవహారాలు వెలుగులోకి వస్తాయో? అని ఆలోచించాల్సిన పరిస్థితి పోలీసు విభాగంలో నెలకొంది. బ్యాంకుల్లో ఉన్న లోపాలకు తోడు దొంగలు అనుసరిస్తున్న పంథానే దీనికి కారణం. తీరిగ్గా తమ పని పూర్తి చేసుకోవడంతో పాటు విషయం బయటకు పొక్కేలోపే సురక్షిత ప్రాంతానికి చేరుకోవడానికి భారీ చోరులు ‘టార్గెట్ శనివారం’ సూత్రాన్ని అమలు చేస్తున్నారు. దీనిపై దృష్టి పెట్టిన పోలీసు విభాగం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. తాజాగా ఘట్కేసర్లోని ఆంధ్రా బ్యాంక్‌లో చోరీ వ్యవహారం సోమవారం వెలుగులోకి వచ్చింది. ఇదే కాకుండా వివిధ ప్రాంతాల్లో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్లో చోరీ యత్నాలు కూడా శనివారమే జరిగి... సోమవారం వెలుగులోకి వచ్చాయి. పొరుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బీహార్‌లకు చెందిన అనేక ముఠాలు బ్యాంకులు, భారీ ఫైనాన్స్ సంస్థలనే టార్గెట్‌గా చేసుకుని పంజా విసురుతున్నాయని ఇప్పటికే నిర్థారణైంది. చోరీకి గురైన సంస్థలు, బ్యాంకులు హైవేకి సమీపంలో లేదా 10-15 కి.మీ. దూరంలోనే ఉంటున్నాయి. గ్యాస్ కట్టర్లు, ఇతర ఉపకరణాలతో సహా రంగంలోకి దిగే ఈ ముఠాలు ముందుగానే ఆ ప్రాంతాలో మకాం వేసి టార్గెట్ చేసిన బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల దగ్గర పక్కాగా రెక్కీ చేస్తున్నాయి. అదును చూసి ఓ శనివారం పంజా విసురుతున్నాయి. ఘటనాస్థలిలో ఎలాంటి ఆధారం చిక్కకుండా సీసీ కెమెరాలను ధ్వంసం చేయడం, వేలిముద్రలు పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం, పోలీసు జాగిలాలు వాసన ద్వారా తాము వెళ్లిన మార్గాన్ని గుర్తించకుండా ఉండేలా కారం పొడి చల్లడం వంటివీ చేస్తున్నాయి. వెలుగు చూసేసరికే ‘సేఫ్’... బ్యాంకు, ఫైనాన్స్ సంస్థల్లో చోరీ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే దొంగలు షెల్టర్ తీసుకునే అవకాశం ఉన్న ప్రాంతాలతో పాటు వారు ప్రయాణించే మార్గాల్లోనూ పోలీసులు నిఘా వేయడం.. సోదాలు, తనిఖీలు చేయడం ద్వారా వారిని పట్టుకునే అవకాశం ఉంటుంది. దీని కోసం చోరీ సమాచారం సాధ్యమైనంత త్వరగా పోలీసులకు చేరాలి. కానీ శనివారం చోరీ చేస్తే మరుసటి రోజు సెలవు కావడంతో బ్యాంకు సిబ్బంది సహా ఎవరూ దొంగతనం విషయాన్ని గుర్తించే అవకాశం ఉండదు. సోమవారం ఉద యం వరకు ఈ విషయం వెలుగులోకి రాదు. ఇలా తమ చేతిలో ఉంటున్న 24 గంటలకు పైగా కాలాన్ని వినియోగించుకుంటున్న పొరుగు రాష్ట్రా ల ముఠాలు సురక్షితంగా తమ ప్రాంతాలకు చేరిపోతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఏకంగా తమ సొంత స్థలాలకు కూడా వెళ్లిపోతున్నాయి. ఫలితంగా దర్యాప్తు, నిందితుల అరెస్టులు కష్టసాధ్యం కావడంతో పాటు రికవరీల శాతాలు దారుణంగా పడిపోతున్నాయి. ‘టార్గెట్ శనివారం’ కారణంగానే రెండేళ్ల క్రితం మెదక్ జిల్లా జహీరాబాద్‌లో ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలో చోరీ కేసులో పూర్తిస్థాయిలో సొత్తు రికవరీ కాలేదు. బాలానగర్ ఎస్బీఐలో జరిగిన కేసు కొలిక్కి కూడా చేరలేదు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న పోలీసు విభాగం బ్యాంకులను అప్రమత్తం చేయాలని భావి స్తోంది. సున్నితమైన ప్రాంతాల్లో ఉండే బ్యాం కుల్లో నగదుతో పాటు సొత్తు సైతం ఎక్కువ ఉండకుండా చూడాలని... సెలవు రోజుల్లో ఉదయం, సాయంత్రం ఓ బాధ్యతగల ఉద్యోగి వచ్చి బ్యాంకును పరిశీ లించి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరనుంది. ఇదీ శనివారం నేరాల వరుస.. ⇒ 2014 జనవరిలో మెదక్ జిల్లా జహీరాబాద్‌లో ముత్తూట్ ఫైనాన్స్‌లో చోరీ. ⇒ అదే ఏడాది ఆగస్టులో మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్‌లోని గ్రామీణ వికాస్బ్యాంక్ను దొంగలు కొల్లగొట్టారు. ⇒ అదే ఏడాది నవంబర్‌లో చిత్తూరు జిల్లాలోని వరదయ్యపాళెంలో సప్తగిరి గ్రామీణ బ్యాంకును దోచేశారు. ⇒ అదే రోజున వరంగల్ జిల్లా భూపాలపల్లి, ఆజాంనగర్ ఏపీజీవీబీ బ్యాంకుల్లోనూ దొంగతనాలు జరిగాయి. ⇒ గత ఏడాది జనవరిలో ఇబ్రహీంపట్నంలో ఉన్న సహకార కేంద్ర బ్యాంకు, మహబూబ్‌నగర్ జిల్లా ఆమన్‌గల్‌లో ఉన్న జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో చోరీ యత్నం. ⇒ 2015 డిసెంబర్లో దిల్‌సుఖ్‌నగర్‌లోని ఎస్బీహెచ్ బ్యాంక్ శాలివాహన నగర్ బ్రాంచ్‌లో చోరీకి యత్నం. -
ఏకంగా పనిచేసే సంస్థకే కన్నం వేశాడు!
రాజమండ్రి రూరల్: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ శాఖలో అదే కంపెనీ ఉద్యోగి చోరీకి పాల్పడ్డాడు. సంస్థ కో ఆర్డినేటర్‌గా పనిచేస్తున్న కొత్తపల్లి జేమ్స్ వినియోగదారులకు విక్రయించేందుకు శాఖలో ఉంచిన 75 బంగారు నాణాలను స్వాహా చేశాడు. సుమారు 750 గ్రాముల బరువైన ఈ నాణాల విలువ సుమారు రూ.22 లక్షలు ఉంటుందని బ్యాంకు అధికారులు అంచనా వేశారు. దీనిపై ముత్తూట్ ఫైనాన్స్ ఉన్నతాధికారి జార్జిబాబు శనివారం సాయంత్రం బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పేకాట, గుర్రపు పందేలు లాంటి వ్యసనాలకు బానిసగా మారిన జేమ్స్ ఈ పనికి పాల్పడినట్టు తెలుస్తోంది. -
సినీ ఆర్టిస్టులే ముత్తూట్ నిందితులు
హైదరాబాద్: కూకట్పల్లి హైదర్‌నగర్ శాఖలోని ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలో శుక్రవారం జరిగిన దోపిడీయత్నం చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారంతా సినీ ఆర్టిస్టులని తేలింది. హైదర్‌నగర్ శాఖ ముత్తూట్ ఫైనాన్స్ శాఖలో దోపిడీకి పాల్పడేందుకు శుక్రవారం నలుగురు దుండగులు యత్నించారు. దోపిడీకి వీలుకాకపోవటంతో వెళ్తూవెళ్తూ ఫైనాన్స్‌లోని సీసీ కెమెరాలను, హార్డ్‌డిస్క్‌ను ఎత్తుకెళ్లారు. నిర్వాహకుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు చుట్టుపక్కల ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజిలను పరిశీలించి, దర్యాప్తు ప్రారంభించారు. శనివారం నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారంతా సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టులు, టీవీ నటులని తెలిసింది. వారిని కూకట్పల్లి పోలీసులు విచారిస్తున్నారు. -
‘ముత్తూట్’లో భారీ చోరీ
3.5 కిలోల నగలు.. రూ.లక్ష నగ దు కాజేసిన దుండగులు పట్టపగలు.. మహానగరానికి అతి సమీపంలో ఉన్న రామచంద్రాపురంలో దొంగలు తెగబడ్డారు. ముత్తూట్ మినీ గోల్డ్‌లోన్స్ ఫైనాన్స్‌ను లూటీ చేశారు. కత్తులతో ఫైనాన్స్ కార్యాలయంలోకిచొరబడిన ఐదుగురు దొంగలు.. సిబ్బందిని లాకర్ రూంలో బంధించి 3.5 కిలోల బంగారు నగలు, రూ లక్ష నగదు దోచుకుని వెళ్లారు. వె ళ్తూ..వెళ్తూ.. సీసీ కెమెరాల దృశ్యాలు నిక్షిప్తమై ఉన్న కంప్యూటర్ హార్డ్ డిస్క్‌ను ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన రామచంద్రాపురం పరిధిలోని బీరంగూడ జాతీయ రహదారి వద్ద జరిగింది. ప్లాన్ ప్రకారం పని పూర్తి చేసిన దుండగులు 20 నిమిషాల్లో ఘరానా చోరీ రామచంద్రాపురం/పటాన్చెరు : ముత్తూట్ మినీ గోల్డ్‌లోన్ ఫైనాన్స్ చోరీని నిశితంగా గమనిస్తే దొంగలు ముందే రెక్కీ చేసినట్లుగా తెలుస్తోంది. వారు లోపలకు వచ్చీరావడంతోనే సీసీ కెమెరాలతో పాటు ముఖద్వారం వద్ద ఉన్న అలారం వైర్లను కట్‌చేయడం ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది. దీనికితోడు సీసీ కెమెరా రికార్డు చేసే హార్డ్ డిస్క్‌ను కూడా ఎత్తుకెళ్లారంటే.. పక్కా ప్రణాళికతోనే దుండగులు రంగంలోకి తిగినట్లు స్పష్టమవుతోందని పోలీసులు, స్థానికులు అనుమానిస్తున్నారు. జాతీయ రహదారిపై నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో చోరీ చేసిన దుండగులు కేవలం 20 నిమిషాల్లోనే పని పూర్తి చేశారంటే కచ్చితంగా ముందుగానే రెక్కీ నిర్వహించి ఉంటారని భావిస్తున్నారు. సంఘటన స్థలానికి వచ్చిన క్లూస్‌టీం... దోపిడీ జరిగిన స్థలాన్ని క్లూస్ టీం సందర్శించింది. లాకర్ గదిలో దుండగులు వదిలిన పలు బట్ట పీలికలను పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ సైతం సంఘటన స్థలాన్ని పరిశీలించింది. దుండగులు వదిలి వెళ్లిన బట్ట పీలికల వాసన చూసిన జాగిలం జాతీయ రహదారిపై తిరిగింది. అనంతరం సబ్‌స్టేషన్‌ను ఆనుకొని ఉన్న టీ దుకాణం వద్దకు వెళ్లి ఆగింది. సవాలుగా మారిన ‘మూత్తూట్’ దోపిడీ పటాన్చెరు/రామచంద్రాపురం: ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ పోలీసులకు సవాలుగా నిలిచింది. విషయం దావానలంలా వ్యాపించడంతో పోలీసు అధికారులు, రాష్ట్ర స్థాయి ఐజీలు సంఘటన స్థలానికి వచ్చారు. ఐజీ నవీన్‌చంద్, డీఐజీ గంగాధర్, ఎస్పీ సుమతి గంటల తరబడి పరిశీలన జరిపారు. డీఐజీ, ఐజీలు మధ్యాహ్నం రెండు గంటల పాటు ముత్తూట్ మినీ ఫైనాన్స్‌లో గడిపారు. ఎస్పీ సుమతి ఇతర అధికారులు సాయంత్రం వరకు సంఘటన స్థలంలో ఉండి పరిశోధన చేశారు. ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన స్వీపర్ హేమను పోలీసులు చాలాసేపు విచారించారు. దుండగుల వయస్సు, వారు మాట్లాడిన తీరు ఇతర వివరాలను ఆమెనుంచి రాబట్టారు. హేమ మంగళవారం రాత్రి పూట భోజనం చేయలేదని ఆమె తల్లి పోలీసులకు వివరించినా.. వదలకుండా వారికి కావాల్సిన సమాచారాన్ని ఆమె నుంచి అడిగి తెలుసుకున్నారు. ఫైనాన్స్ సంస్థ ఉన్న భవంతి యజమాని, ఇతర సాక్షులను విచారించారు. సంగారెడ్డి నుంచి క్లూస్ టీం, జాగిలంతో సంఘటన స్థలంలో పరిశోధన చేసినా.. బుధవారం రాత్రి వరకు ఎలాంటి ఆధారాలు లభించక పోవడం పోలీసులకు సవాలుగా మారింది. త్వరలోనే నేరస్తులను పట్టుకుంటామని చెబుతున్నప్పటికీ వివరాలేవీ కనుక్కోలేకపోయారు. ఇది.. ఇంటి దొంగల పని.. అయి ఉంటుందా అనే కోణంలో కూడా ఆరా తీస్తున్నారు. రాష్ట్ర స్థాయి పోలీసులు అధికారులు సంఘటన స్థలానికి రావడం బట్టి పోలీసులు ఈ కేసును ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారనేది తేటతెల్లమవుతోంది. ఆందోళనలో బాధితులు... పటాన్చెరు: ముత్తూట్ మినీ ఫైనాన్స్ సంస్థలో దోపిడీ దొంగతనం జరగడంతో ఆ సంస్థ వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దోపిడీ సంఘటన వివరాలు తెలుసుకున్న బాధితులు ఆ సంస్థ వద్దకు వచ్చి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. తమ బాధను పోలీసుల ముందు చెప్పుకున్నారు. వినియోగదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని రామచంద్రాపురం డీఎస్పీ సురేందర్‌రెడ్డి తెలిపారు. అయితే దొంగలను పట్టుకుంటామని, సొత్తు రికవరీ చేస్తామని ఎస్పీ సుమతి కూడ వినియోగదారులకు భరోసా ఇచ్చారు. దోపిడీకి గురైన సొత్తుకు సంస్థ తరఫున ఇన్సూరెన్స్ కవరేజీ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఖాతాదారులకు ఆందోళన అవసరం లేదని తెలిపారు. -
ముత్తూట్ మినీగోల్డ్ ఫైనాన్స్‌లో భారీ దోపిడీ
-
ముత్తూట్ మినీగోల్డ్ ఫైనాన్స్‌లో భారీ దోపిడీ
బీరంగూడ: మెదక్ జిల్లాలోని రామచంద్రాపురం మండలం బీరంగూడలో బుధవారం భారీ దోపిడీ జరిగింది. ముత్తూట్ మినీగోల్డ్ ఫైనాన్స్‌లో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. కస్టమర్లలా వచ్చి పనిచేస్తున్న సిబ్బందిని లాకర్ రూంలో నిర్భంధించి 5 కేజీల బంగారం, నగదును దుండగులు దోచుకెళ్లినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. -
సినిమాకెళ్లి వచ్చేసరికి..
హైదరాబాద్ సిటీ క్రైం: హైదరాబాద్ నగరంలోని ఆల్వాల్ పరిధిలో వెంకటరమణ కాలనీలో చరణ్ అనే ముత్తూట్ ఫైనాన్స్ ఉద్యోగి ఇంట్లో శనివారం రాత్రి చోరీ జరిగింది. చరణ్ దంపతులు శనివారం రాత్రి సెకండ్ షో సినిమాకి వెళ్లినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటి కిటికీ గ్రిల్స్ తొలగించి 25 తులాల బంగారం, 3 కిలోల వెండి, రూ.36 వేల నగదు దొంగలించారు. తెలిసిన వాళ్లే పథకం ప్రకారం ఈ చోరీ చేసి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
ఉల్లంఘనపై సీరియస్
సాక్షి, సిటీబ్యూరో: కరుడుగట్టిన శివ గ్యాంగ్ స్నాచింగ్‌కు పాల్పడిన బంగారాన్ని ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీ కర్మన్‌ఘాట్ బ్రాంచ్, శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ చంపాపేట బ్రాంచ్‌ల్లో తాకట్టు పెట్టారు. ఈ రెండు ఫైనాన్స్ కంపెనీలు కూడా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలను ఉల్లంఘించాయని పోలీసులు తేల్చారు. అయితే నగలు తాకట్టుపెట్టుకునే సమయంలో ఈ రెండు ఫైనాన్స్ కంపెనీలు ఎలా వ్యవహరించాయి అనే విషయాన్ని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ స్పష్టంగా వివరించారు. చోరీ బంగారాన్ని తాకట్టుపెట్టుకున్నా, ఖరీదు చేసినా వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఆయన వెల్లడించారు. ఇతర ఫైనాన్స్ కంపెనీలు కూడా ఇదే తర హాలో వ్యవహరిస్తే వారి లెసైన్స్‌లను కూడా రద్దుచేయమని ఆర్బీఐకి లేఖ రాస్తామని ఆయన హెచ్చరించారు. నిబంధనలు-ఉల్లంఘనలు ఇలా...... నిబంధన: పాస్‌పోర్ట్, పాన్‌కార్డ్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లెసైన్స్, ఏదైనా గుర్తింపుకార్డు, బ్యాంకు పాస్‌బుక్, టెలిఫోన్ బిల్లు, ఆధార్ కార్డు, ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థ జారీ చేసిన లేఖ వీటిలో ఏవైనా మూడు ఆధారాలు తీసుకోవాలి. ఉల్లంఘన: ముత్తూట్, శ్రీరామా సిటీ యూనియన్ ఫైనాన్స్ కంపెనీలు శివ నుంచి కేవలం పాన్ కార్డు, డ్రైవింగ్ లెసైన్స్ జిరాక్స్ కాపీలను మాత్రమే తీసుకున్నారు. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా కేవలం 18 రోజుల స్వల్ప వ్యవ ధిలోనే ఈ రెండు కంపెనీలు నగలను తాకట్టు పెట్టుకుని రుణం మంజూరు చేశారు. నిబంధన: ఫైనాన్స్ కంపెనీలో ఆరు నెలలకుపైగా పనిచేసిన సీనియర్ అధికారి ఎవరైనా సరే ఖాతాదారుడిని ఇంటర్వ్యూ చేయాలి, వారి వేలి ముద్రలు కూడా తీసుకోవాలి ఉల్లంఘన: శివ గ్యాంగ్ సభ్యులను ఎలాంటి ఇంటర్వ్యూ చేయలేదు. వారి వేలి ముద్రలు కూడా సేకరించలేదు. నిబంధన: ఖాతాదారుడు సమర్పించిన మూడు గుర్తింపు పత్రాలు సరైనాలేవా అనే విషయాన్ని విచారించి నిర్దారించాలి. ఉల్లంఘన: శివ సమర్పించిన గుర్తింపు పత్రాలపై విచారించలేదు. పరిశీలించలేదు. నిబంధన: స్వచ్ఛమెన బంగారం లేదా కరిగించిన బంగారం ముద్దను తాకట్టు పెట్టుకోవడం నేరం. ఆభరణాలను మాత్రమే తాకట్టు పెట్టుకోవాలి. ఉల్లంఘన: వీరు ఆభరణాలతో పాటు బంగారం ముద్దలను తాకట్టు పెట్టుకుని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (యన్బీఎఫ్సీ ) నిబంధనలు ఉల్లంఘించారు. కలలో కూడా అనుకోలేదు... రికవరీ విషయంలో కమిషనర్ సీవీ ఆనంద్, ఇన్చార్జ్ డీసీసీ జానకీ షర్మిల తీసుకున్న చొరవ అంతాఇంతకాదు. పోయిన బంగారు గొలుసు దక్కుతుందని కలలో కూడా అనుకోలేదు. చాలా ఆనందంగా ఉంది. - లక్షీ్ష్మనర్సమ్మ -
నాతో నేను మాట్లాడుకుంటాను!
పని-జీవితాన్ని సమన్వయం చేసుకోవడానికి మూడు ‘పి’లు ముఖ్యం అని నమ్ముతాను. 1.ప్లాన్ 2.ప్రయారిటీస్ 3.ప్రయివేట్ టైమ్. ప్రయివేట్ టైమ్‌లో నా గురించి నేను...అది ఆరోగ్యం కావచ్చు, అభిరుచి కావచ్చు... రకరకాల విషయాలు ఆలోచిస్తుంటాను. నాతో నేను సంభాషించుకోవడం వల్ల ఎన్నో కొత్త ఆలోచనలు వస్తుంటాయి. కొత్త శక్తి సమకూరినట్లు అనిపిస్తుంది. త్వరగా నిద్ర లేస్తాను. నా భార్యతో కలిసి మార్నింగ్ వాక్ చేస్తుంటాను. యోగా, ధ్యానం విధిగా చేస్తాను. ప్రతి సంవత్సరం కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళుతుంటాను. ప్రకృతిని ఆసక్తిగా పరిశీలించడం, దైవాన్ని గురించి ఆలోచనలు నాలో ఎప్పటికప్పుడు కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. రకరకాల పుస్తకాలతో పాటు, ఎక్కువగా జీవితచరిత్రలు చదువుతుంటాను. మానసికంగా బలోపేతం కావడానికి ఇది ఉపయోగపడుతుంది. మసుసు ఉల్లాసంగా ఉండడానికి.... కర్ణాటక సంగీతాన్ని వింటాను. యం.యస్ సుబ్బులక్ష్మీ, బాలమురళీకృష్ణ, డీకే పట్టమ్మాళ్ నా అభిమాన గాయకులు. -యంజి జార్జ్ ముత్తూట్,ముత్తుట్ ఫైనాన్స్ ఛైర్మన్, ‘ఆసియన్ బిజినెస్‌మ్యాన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డ్ గ్రహీత -
‘ముత్తూట్’ మరవకముందే మరో చోరీ
జహీరాబాద్ : పట్టణంలో ఫిబ్రవరి 2వ తేదీ రాత్రి ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీకి గురైన సంఘటనను మరవక ముందే హనుమాన్ మందిర్ రోడ్డు లో గల రఫీ జ్యూవెలర్స్‌లో మంగళవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఈ చోరీలో 50 తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలు దొంగలు దోచుకెళ్లారు. అయితే దోపిడీలో ఆరి తేరిన వారే బంగారు దుకాణంలో దొంగతనానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దుకాణం గురించి అంచనా వేసిన అనంతరమే చోరీకి పాల్పడి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జ్యూవెలర్స్ షాప్‌లోని పై అంతస్తులో బట్టల దుకాణం కూడా నిర్వహిస్తుండడంతో దొంగలు ముందుగానే దుకాణం గురించి పూర్తిగా అవగాహన పొంది న అనంతరమే దోపిడీకి పాల్పడి ఉండవచ్చనే అభిప్రాయాన్ని పలువు రు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండ గా.. ముత్తూట్ ఫైనాన్స్‌లో అప్పట్లో భారీగా దొంగతనం జరిగింది. అంత కు ముందు కూడా జహీరాబాద్ ప్రాంతంలోని పలు బ్యాంకులలో దొంగతనం, దొంగతనం యత్నం జరిగింది. 2013 మార్చి 18న కొత్తూర్ (బీ) గ్రామంలో గల సిండికేట్ బ్యాంకులో చోరికి పాల్పడి రూ.3.75 లక్షల నగదును అపహరించారు. 2013 మార్చి 28న కోహీర్ మండలం కవేలి సిండికేట్ బ్యాంకు ను దోపిడీ చేసేందుకు ప్రయత్నించి విఫలం అయ్యారు. ఈ సందర్భంగా దొంగలు జరిపిన కాల్పుల్లో అప్పటి ఎస్ఐ వెంకటేష్ గాయపడిన విష యం తెలిసిందే. 2013 జూన్ 25న జహీరాబాద్ మండలం మల్చల్మ సిండికేట్ బ్యాంకులో దొంగలు చోరీకి ప్రయత్నించి విఫలమయ్యారు. దొంగల కోసం ప్రత్యేక టీంలు దొంగలను పట్టుకునేందుకు గాను పోలీసులు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. దొంగతనం జరిగిన తీరు ను బట్టి ఎక్కడి గ్యాంగ్ పని అయి ఉంటుందనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిసింది. ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీలో జార్ఖం డ్ ప్రాంతానికి చెందిన వారిగా అప్ప ట్లో పోలీసులు గుర్తించారు. వారిలో కొందరు ఇప్పటికే పట్టుబడ్డారు. జూయలర్స్ దుకాణం దోపిడీకి సంబంధించి పక్కనే ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన వారు ఉండి ఉంటారా అనే విషయంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. -
ముత్తూట్ ఫైనాన్స్ మేనేజర్ అరెస్టు
13 తులాల బంగారు అభరణాలు స్వాధీనం నిజామాబాద్ సిటీ: డబ్బుల కోసం కుదువపెట్టిన బంగారు అభరణాలను కాజేసిన ముత్తూట్ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజర్‌ను అరెస్టు చేసినట్లు నగర సీఐ సైదులు తెలిపారు. శనివారం నిజామాబాద్ డీఎస్పీ కార్యాలయంలో నిర్వహిం చిన సమావేశంలో ఆయనవివరాలు వెల్లడించారు. నగరంలోని హైదరాబాద్ రోడ్డు ప్రగతినగర్ ముత్తూట్ ఫైనాన్స్‌లో మరవార్ గణేష్‌కుమార్ మేనేజర్‌గా పనిచేసేవాడు. కాగా నవీపేట్ మండలకేంద్రానికి చెందిన ముత్యం, నిజామాబా ద్ నగరంలోని మహాలక్ష్మీనగర్‌కు చెందిన శ్రీనివాస్‌రావు, గౌతంనగర్‌కు చెందిన రాకేష్ తమ దగ్గరున్ను 13 తులాల బంగారు అభరణాల(విలువ రూ. 3లక్షల 50 వేలు)ను ముత్తూట్ ఫైనాన్స్‌లో కుదువపెట్టి డబ్బులు తీసుకున్నారు. ఈక్రమంలో మేనేజర్ గణేశ్ ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో వారి లాకర్లను తెరిచి బంగారు ఆభరణాలను తస్కరించా డు. అనంతరం వాటిని పోచమ్మగల్లిలోని మణప్పురం ఫైనా న్స్ లిమిటెడ్‌లో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నాడు. అయితే ఏప్రిల్ 8 నుంచి 10వ తేదీల్లో ముత్తూట్ ఫైనాన్స్ గోల్డ్ ఇన్స్పెక్టర్ బ్రాంచ్‌లో లాకర్లను తనిఖీ చేశారు. దీంతో బం గారు ఆభరణాలు మాయమైన విషయం బయటపడింది. కాగా బ్రాంచ్‌లో లాకర్ల తనిఖీలు జరుగుతున్న విషయాన్ని పసిగట్టిన గణేష్ తాను కాజేసిన బంగారు అభరణాల విష యం ఎక్కడ బయట పడుతుందోనని బ్రాంచ్‌కు రాకుండా పారిపోయాడు. అనంతరం బ్రాంచ్‌కు కోటగిరి నవీన్‌కుమార్‌ను ఇన్చార్జి మేనేజర్‌గా నియమించారు. గణేష్‌పై ఇన్చార్జి మేనేజర్ ఏప్రిల్ 15వ తేదీన నాల్గవ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫి ర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు గణేష్ శనివారం దొరికిపోయాడు. గణేష్ ఇంట్లో ఉన్నాడనే సమాచారంతో నిందితుడిని పట్టుకుని 13 తులాల బంగారు అభరణాలను స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు. -
దేశ వ్యాప్తంగా ముత్తూట్ ఫైనాన్స్ ఏటీఎంలు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బంగారం తనఖా వ్యాపార రంగంలోని ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్ వచ్చే మూడేళ్లలో దేశ వ్యాప్తంగా ఆరు వేల ఏటీఎంలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్థ డెరైక్టర్ జార్జ్ ఎం. అలెగ్జాండర్ వెల్లడించారు. బెంగళూరులోని లింగరాజపురంలో తొలి ఏటీఎంను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం అంతానికి దేశ వ్యాప్తంగా వంద ఏటీఎంలను నెలకొల్పనున్నట్లు చెప్పారు. మరో ఏడాదిలో వెయ్యి, రెండేళ్లలో రెండు వేల ఏటీఎంలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. తొలుత తమ బ్రాంచి కార్యాలయాల్లోనే ఏటీఎంలను నెలకొల్పుతామని, తదుపరి ఆఫ్ సైట్ ఏటీఎంల గురించి ఆలోచిస్తామని వివరించారు. తమ ఏటీఎంలలో నగదు తీసుకోవడం, నిల్వ వాకబులతో పాటు ఖాతా నుంచి ఖాతాకు బదిలీ, పిన్ చేంజ్, కార్డ్‌లెస్ విత్‌డ్రా, కార్డ్ టు కార్డ్ బదిలీ లాంటి సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని వివరించారు. వీటితో పాటు ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఏటీఎం సదుపాయంతో కూడిన ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి, నగదు బదిలీ, విదేశ ద్రవ్య మార్పిడి, ఎయిర్ టికెటింగ్, బిల్లుల చెల్లింపులు లాంటి సదుపాయాలు కల్పిస్తామని వెల్లడించారు. 65 శాతం ఏటీఎంలను సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వీడియో ఇంటర్యాక్టివ్ సదుపాయం, టీవీ స్క్రీన్లను నెలకొల్పడం ద్వారా ఈ ఏటీఎంలను వాడకందార్ల నేస్తాలుగా రూపొందిస్తామని తెలిపారు. -
'తులం బంగారానికి రూ. 20 వేలు ఇస్తాం'
-
'తులం బంగారానికి రూ. 20 వేలు ఇస్తాం'
మెదక్ జిల్లా జహీరాబాద్‌లోని ముత్తుట్ ఫైనాన్స్‌లో గత నెలలో చోరీకి గురైన బంగారం విషయంలో వినియోగదారులకు నగదు చెల్లించాలని ఆ ఫైనాన్స్ సంస్థ నిర్ణయించింది. నగదు కుదవ పెట్టిన వినియోగదారులకు తులం బంగారానికి రూ. 20 వేలు చొప్పున చెల్లించాలని నిర్ణయించినట్లు ముత్తుట్ ఫైనాన్స్ అధికారులు వెల్లడించారు. ముత్తుట్ ఫైనాన్స్‌లో గతంలో 50 కేజీల బంగారం చోరీకి గురైంది. పోలీసుల కేసు దర్యాప్తులో భాగంగా 7 కేజీల బంగారాన్ని మాత్రమే రికవరీ చేశారు. అయితే తమ నగలను తమకు అప్పగించాలని వినియోగదారులు ఫైనాన్స్ కంపెనీని డిమాండ్ చేశారు. ఆ క్రమంలో వినియోగదారులు తీవ్ర ఒత్తిడి చేయడంతో కుదవ పెట్టిన బంగారానికి అంత రూపంలో నగదు చెల్లించాలని ముత్తుట్ ఫైనాన్స్ నిర్ణయించింది. -
పోయింది ఏడు కాదు 50 కేజీలు!
జహీరాబాద్ ‘ముత్తూట్’లో భారీ బంగారం చోరీ ఆలస్యంగా వెలుగులోకి.. నిందితుల నుంచి 20 కేజీలు స్వాధీనం పట్టుబడింది ముగ్గురు దొంగ లే.. అత్యంత రహస్యంగా దర్యాప్తు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర చరిత్రలో భారీ బంగారు దోపిడీ..! ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 50కేజీలు! గత నెల మెదక్ జిల్లా జహీరాబాద్‌లోని ముత్తూట్ ఫైనాన్స్ కార్పొరేషన్లో దొంగలు కొల్లగొట్టిన బంగారం పరి మాణం ఇది. ఈ దొంగతనంలో పోయింది ఏడు కేజీలని ఇప్పటి వరకు భావిస్తుండగా అసలు విషయం తాజాగా వెలుగుచూసింది. కాజేసిన బంగారంలో ఇప్పటివరకు 20కేజీలు మాత్రమే పోలీసులు స్వాధీ నం చేసుకున్నారు. అత్యంత రహస్యంగా దర్యాప్తు జరుపుతున్న రాష్ట్ర పోలీసులు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌లకు చెందిన ఆరుగురు దొంగల్లో ముగ్గురిని పట్టుకుని, రూ.10 లక్షలు రికవరీ చేశారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని, మిగతా ముగ్గురు నింది తుల కోసం పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌ల్లో ముమ్మరంగా గాలిస్తున్నాయని పోలీసు ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. దొంగతనం ఇలా : జహీరాబాద్‌లోని ముత్తూట్ ఫైనాన్స్ కార్పొరేషన్లో గత నెల 3న చోరీ జరిగింది. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌కు చెందిన దొంగల ముఠా 50కేజీల బంగారం, రూ.14 లక్షల నగదు ఎత్తుకుపోయింది. బెంగాల్‌కు చెందిన ఖమ్రుద్దీన్ జహీరాబాద్‌లో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ వద్ద వాచ్‌మెన్‌గా పనిచేసేవాడు. అక్కడి పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో 9వ నంబర్ జాతీయ రహదారిపై ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయాన్ని టార్గెట్‌గా చేసుకున్నాడు. పలుమార్లు రెక్కీ చేశాక చోరీ కోసం జార్ఖండ్‌కు చెందిన అశోక్‌శర్మ, యూసఫ్, వినోద్, కమల్సహా ఆరుగురితో కలిసి రంగంలోకి దిగాడు. దొంగలు గతనెల 2వ తేదీ రాత్రి ఖమ్రుద్దీన్ పనిచేసే అపార్ట్మెంట్ వద్ద తాత్కాలిక నివాసంలో బస చేశారు. 3వ తేదీ తెల్లవారుజామున గ్యాస్‌కట్టర్లు, గడ్డపారలు, ఇనుపరాడ్లతో విరుచుకుపడ్డారు. ముత్తూట్ కార్యాలయం వెనుక భాగంలోని తలుపును తొలగించి లోనికెళ్లారు. సీసీ కెమెరా వైర్లను కత్తిరించి, గ్యాస్కట్టర్ల సాయంతో స్ట్రాంగ్ రూమ్ ఏ-1లోని సేఫ్ లాకర్లను తెరిచి వినియోగదారులు తాకట్టు పెట్టిన బంగారం, నగదును సంచుల్లో సర్దుకున్నారు. ఎంజీబీస్‌లో దొరికిన దొంగ ఉదయం ఐదుగంటలకు ఆరుగురూ కర్ణాటక ఆర్టీసీ బస్సెక్కి నేరుగా హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి విజయవాడ వెళ్లి, అట్నుంచి జార్ఖండ్ పారి పోవాలని పథకం వేశారు. ఎంజీబీఎస్‌లో ఆరోజు ఆర్టీసీ భద్రతా సిబ్బంది చేసిన తనిఖీల్లో అశోక్‌శర్మ పట్టుబడ్డాడు. అఫ్జల్‌గంజ్ పోలీసులు అతడిని విచారించేదాకా చోరీ గురించి ఎవరికీ తెలియలేదు. అశోక్‌శర్మను ప్రిజనర్స్ ట్రాన్సిట్(పీటీ) వారెంట్‌పై తీసుకువెళ్లి విచారించగా అసలు సంగతి బయటపడింది. 50కేజీలకు పైగా బంగారం చోరుల పాలైనట్లు పోలీ సులు నిర్ధారించారు. ఈ చోరీ సూత్రధారి ఖమ్రుద్దీన్ గత ఏడాది మార్చి 29న మెదక్‌జిల్లా కవేలీలోని సిండికేట్ బ్యాంక్‌ను కొల్లగొట్టేందుకు ముఠాతో కలిసి యత్నించాడు. అలారం మోగడంతో ఘటనాస్థలికి వచ్చిన ఎస్సైపై కాల్పులు జరిపి అరెస్టయ్యాడు. అనంతరం బెయిల్‌పై బయటకు వచ్చి మరో ముఠాతో కలిసి ‘ముత్తూట్ చోరీ’కి పాల్పడ్డాడు. -
తక్కువ రేట్లకే మహిళలకు రుణాలు
ముంబై: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తక్కువ వడ్డీరేట్లకు మహిళలకు రుణాలు ఆఫర్ మరో నాలుగు రోజుల్లో ముగుస్తుందని ముత్తూట్ ఫిన్‌కార్ప్ తెలిపింది. బంగారం తనఖాగా ఏడాది కాలానికి రూ.50 వేల లోపు రుణాలను 12 శాతం వడ్డీకే అందిస్తామన్న తమ ఆఫర్‌కు మంచి స్పందన లభిస్తోందని పేర్కొంది. సాధారణంగా రూ.50 వేల లోపు రుణాలకు 14 శాతం వడ్డీరేటు వసూలు చేస్తామని, మహిళా దినోత్సవం సందర్భంగా 2 శాతం తక్కువకే ఈ రుణాలందిస్తున్నామని వివరించింది. బంగారంలో 71 శాతం విలువ వరకూ రుణమిస్తామని వివరించింది. దేశవ్యాప్తంగా తమ 3,829 బ్రాంచీల్లో ఈ నెల 15 వరకూ ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. -
‘ముత్తూట్’ వద్ద పసిడి తాకట్టుదారుల ఆందోళన
జహీరాబాద్, న్యూస్‌లైన్ : ముత్తూట్ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టిన బంగారం దొంగతనానికి గురైనందున ఎలాంటి తరుగు తీయకుండా 24 క్యారెట్ల లెక్కన బంగారం అందజేయాలని తాకట్టు దారులు డిమాండ్ చేశారు. గురువారం జహీరాబాద్ పట్టణంలోని ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో బంగారం విషయమై తాకట్టు దారులు అధికారులను నిలదీశారు. ఫిబ్రవరి 2వ తేదీ రాత్రి ముత్తూట్ ఫైనాన్స్‌లో ప్రజలు అవసరాల నిమిత్తం తాకట్టు పెట్టిన బంగారం దొంగతనానికి గురైన విషయం తెలిసిందే. దొంగతనానికి గురైన బంగారు ఆభరణాల్లో కొంత నిందితుడి వద్ద నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన బంగారు ఆభరణాలు లభించాల్సి ఉంది. అయితే గురువారం ఫైనాన్స్‌లో బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టిన వారు దొంగతనం జరిగిన వాటిని సంబంధించి ఆభరణాలకు 24 క్యారెట్ల లెక్కన తరుగు లేకుండా చెల్లించాలని డిమాండ్ చేశారు. అయితే తమ ఫైనాన్స్ నిబంధనల మేరకు 22 గ్రాస్ క్యారెట్ల కింద లెక్కకట్టి, మేకింగ్ చార్జీలను కూడా కలిపి అందించడం జరుగుతుందని అధికారులు ప్రతిపాదించారు. ఇందుకు వారు నిరాకరించారు. 24 క్యారెట్ల లెక్కన అందించాలని పట్టుబట్టారు. దీంతో గురువారం మధ్యాహ్నం ముత్తూట్ ఫైనాన్స్ సికింద్రాబాద్ రీజినల్ మేనేజర్ లక్ష్మణ్‌రావు జహీరాబాద్ వచ్చి తాకట్టు దారులతో సమావేశమయ్యారు. ఫైనాన్స్ నిబంధనల మేరకే తాము నడుచుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. తాకట్టుదారుల డిమాండ్లను హెడ్ ఆఫీస్‌కు నివేదిస్తామని, అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇందు కోసం వారం రోజులు గడువు ఇవ్వాలని కోరారు. ఇందుకు తాకట్టు దారులు సమ్మతించి వెళ్లిపోయారు. నిందితుడి వద్ద నుంచి లభించిన బంగారు ఆభరణాలు సదరు తాకట్టు దారులకు త్వరలో అందించడం జరుగుతుందని ఆర్ఎం లక్ష్మణ్‌రావు పేర్కొన్నారు. మిగతా ఆభరణాలకు సంబంధించి బంగారం రూపంలో అందిస్తామన్నారు. రీజినల్ మేనేజర్‌తో తాకట్టు దారులు జరిపిన చర్చల్లో సీఐ నరేందర్, ఎస్ఐ శివలింగంలు పాల్గొన్నారు. -
విదేశీయుడి వీరంగం
నకిలీ డాలర్లు, యూరోలు మార్చేందుకు యత్నం పట్టుకున్న ముత్తూట్ ఫిన్‌కార్ప్ సిబ్బంది, పోలీసులపై దాడి సుల్తాన్‌బజార్, న్యూస్‌లైన్: నకిలీ డాలర్లు, యూరోలు చెలామణి చేసేందుకు వచ్చిన ఓ విదేశీయుడు వీరంగం సృష్టించాడు. తనను పట్టుకోబోయిన ముత్తూట్ ఫిన్‌కార్ప్ సిబ్బందితో పాటు పోలీసులపైన దాడిచేసి పారిపోవడానికి యత్నించాడు. పోలీసులు ఎట్టకేలకు అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సుల్తాన్‌బజార్ ఇన్స్పెక్టర్ జి.శ్రీనివాస్ కథనం ప్రకారం.. సౌత్ఆఫ్రికాకు చెందిన బర్రీ జాన్సన్(33) వ్యాపారం నిమిత్తం గత డిసెంబర్ 22న భారత్‌కు వచ్చాడు. శుక్రవారం ఇతను సుల్తాన్‌బజార్ ఠాణా పక్కనే ఉన్న ముత్తూట్ ఫిన్‌కార్ప్‌లో రూ. 21,245 విలువగల 350 యూఎస్ డాలర్లు, రూ. 29,120 విలువైన 350 యూరోపియన్ యూరోలు మార్పిడికి ఇచ్చాడు. వాటిని పరిశీలించిన ఫిన్‌కార్ప్ సిబ్బంది నకిలీవిగా గుర్తించారు. అయితే, ఇది గమనించిన జాన్సన్ వెంటనే బాత్రూమ్లోకి వెళ్లాడు. కొద్దిసేపటికి తిరిగి వచ్చి వీరంగం సృష్టించాడు. సిబ్బందిపై ముష్టిఘాతాలు కురిపించి తప్పించుకొనేందుకు యత్నించాడు. దీంతో ఫిన్‌కార్ప్ సిబ్బంది డోర్లు మూసేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులపై దాడి ... జాన్సన్‌ను పోలీసులు స్టేషన్‌కు తీసుకువస్తుండగా... తప్పించుకొనేందుకు యత్నించి 15 మంది పోలీసులపై దాడి చేశాడు. జమేదార్ రామ్చందర్రెడ్డి, ఎస్ఐలు మహేశ్‌గౌడ్, రామ్కృష్ణారెడ్డి, ఇతర కానిస్టేబుల్లపై ముష్టిఘాతాలు కురిపించి, తన్నాడు. అడ్డుకోబోయిన ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌పై కూడా దాడి చేశాడు. పోలీసులంతా కలిసి ఎట్టకేలకు అతడిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన పోలీసులను ఆసుపత్రికి తరలించారు. గతంలో ఫేక్‌నోట్లు చెలామణి చేసిన విదేశీయులు... గతనెలలో సుల్తాన్‌బజార్ ముత్తూట్ ఫిన్‌కార్ప్‌లో ఓ విదేశీయుడు 20 వేల విలువైన నకిలీ యూరోస్ తీసుకువచ్చి మార్చాడని ముత్తూట్ బ్రాంచి మేనేజర్ ఎం.చంద్రశేఖర్ తెలిపారు. కొద్ది రోజుల క్రితం కాచిగూడ నింబోలిఅడ్డాలో విదేశీయులు మోసానికి పాల్పడ్డారని తెలిపారు. దీంతో తమ సిబ్బంది జాన్సన్ తెచ్చిన దొంగనోట్లను క్షణ్ణంగా పరిశీలించగా నకిలీవని తేలిందన్నారు. బాత్రూంలోనే డ్రగ్స్ తీసుకున్న నిందితుడు... తాను దొరికిపోయినట్లు గమనించిన విదేశీయుడు బాత్రూంకని వెళ్లి డ్రగ్స్ తీసుకుని వీరంగం సృష్టించాడని ముత్తూట్ ఫిన్‌కార్ప్ బ్రాంచి మేనేజర్ తెలిపారు. అప్పటివరకు బాగానే ఉన్న అతను పూనకం వచ్చినట్లు ఊగూతూ తమపైన, పోలీసులపైన దాడి చేశాడని తెలిపారు. కాగా, నిందితుడి వద్ద నుంచి 12 నకిలీ డాలర్లు, యూరోలు నోట్లను స్వాధీనం చేసుకుని నిందితుడిపై 332, 420, 489 (బి) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
మహిళలకు ముత్తూట్ ప్రత్యేక గోల్డ్‌లోన్ స్కీమ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బంగారు నగలపై అధిక రుణం ఇచ్చే విధంగా ‘ఆశా’ పేరుతో ముత్తూట్ ఫైనాన్స్ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇతర పథకాలతో పోలిస్తే ఆశాపథకం కింద రుణం తీసుకునే మహిళలకు గ్రాముకు రూ.50 అదనంగా ఇవ్వనున్నట్లు ముత్తూట్ గ్రూపు డెరైక్టర్ జార్జ్ ఎం.అలెగ్జాండర్ తెలిపారు. ఈ కొత్త పథకం వివరాలను తెలియచేయడానికి మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అలెగ్జాండర్ మాట్లాడుతూ ప్రస్తుతం పుత్తడి విలువలో గరిష్టంగా 75% వరకు రుణం ఇస్తున్నట్లు చెప్పారు. గరిష్ట మొత్తానికి రుణం తీసుకుంటే 24% వరకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని, అదే కనిష్ట మొత్తానికి తీసుకుంటే 12% వడ్డీకే రుణాలను ఇస్తున్నట్లు తెలిపారు. ఆశా పథకం కింద రుణం తీసుకునే మహిళలు ఆభరణాలు తమకు చెందినవనే ధ్రువీకరణపత్రం ఇవ్వాల్సి ఉంటుందని, గరిష్టంగా రూ.50,000 వరకు రుణాలు ఇస్తున్నట్లు చెప్పారు. గతేడాది రూ.26,387 కోట్ల ఆస్తులను నిర్వహిస్తుండగా, ఈ మార్చి నాటికి ఈ విలువ కొద్దిగా తగ్గి రూ.26,000 కోట్లకు చేరుకోవచ్చని జార్జ్ వివరించారు. త్వరలో 100 ఏటీఎంలు: బ్యాంక్ లెసైన్స్కి దాఖలు చేసిన ముత్తూట్ ఫైనాన్స్ ఇప్పుడు వైట్ లేబుల్ ఏటీఎంలపై అధికంగా దృష్టిసారిస్తోంది. ఇప్పటికే రెండు ఏటీఎంలను ఏర్పాటు చేశామని, వచ్చే నెలలోగా మరో 100 ఏటీఎంలను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు జార్జ్ తెలిపారు. ఆర్బీఐ అనుమతుల ప్రకారం ముత్తూట్ ఫైనాన్స్ వచ్చే మూడేళ్లలో 9,000 ఏటీఎంలు ఏర్పాటు చేయాల్సి ఉంది. -
జార్ఖండ్ ముఠా పనే!
తిరుమలగిరి ముత్తూట్ ఫైనాన్స్‌లో చోరీ యత్నం కేసు.... పోలీసుల వలకు చిక్కని దొంగలు బొల్లారం, న్యూస్‌లైన్: తిరుమలగిరిలోని ముత్తూట్ ఫైనాన్స్ కార్పొరేషన్లో చోరీకి యత్నించింది జార్ఖండ్ గ్యాంగ్‌గా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆదివారం దొంగలు మళ్లీ రావచ్చనే అనుమానంతో రాత్రంతా.. ముత్తూట్ పరిసర బిల్డింగ్లు, ప్రాంతాల్లో తిరుమలగిరి, జహీరాబాద్ పోలీసులు మాటు వేశారు. అయితే, ఈ విషయం పసిగట్టి దొంగలు రాలేదని పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఘటన స్థలంలో చోరీకి ఉపయోగించిన సామగ్రి పోలీసులకు దొరికింది. దొంగలు వాటిని ఎక్కడ కొన్నారనే దానిపై ఆరా తీస్తున్నారు. జహీరాబాద్‌లో కూడా దొంగలు చోరీకి ఇదే తరహ సామగ్రిని ఉపయోగించినట్టు గుర్తించారు. వీటిని ఒకేచోట కొని ఉంటారని, జార్ఖండ్ గ్యాంగ్‌ల్లో ఒక ముఠా జహీరాబాద్‌లో విరుచుకుపడగా మరో ముఠా హైదరాబాద్‌లో మకాం వేసి తిరుమలగిరి ప్రాంతాన్ని టార్గెట్ చేసినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. పక్కా స్కెచ్‌తోనే... ముత్తూట్‌లో చోరీకి దొంగలు పక్కా స్కెచ్ వేసినట్లు పోలీసులు తేల్చారు. ఘటనా స్థలంలో దొరికిన చిన్న గ్యాస్ సిలిండర్, చిన్నఫ్లేమ్ మెషీన్, మూడు రకాల స్క్రూ డైవర్లు, 4 అడుగుల పొడవైన రెండు గునపాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. హైటెక్ పద్ధతిలో దొంగలుకు చోరీకి పథకం వేశారని నిర్ధారణకు వచ్చారు. వీటిని దాచేందుకు దుండగులు రెండు షోల్డర్ బ్యాగులన ఉపయోగించారు. కార్యాలయంలో రెక్కీ.... దుండుగులు తిరుమలగిరి ముత్తూట్ కార్యాలయంలో మొత్తం తిరిగి రెక్కీ చేసుకున్నట్లు పోలీ సులు గుర్తించారు. దోపిడీకి వచ్చిన వెంటనే కార్యాలయంలో ఉన్న ఐదు సీసీ కెమెరాల కనెక్షన్లతో పాటు విద్యుత్ మెయిన్ వైర్లను కూడా కట్ చేశారు. దీనిబట్టి కార్యాలయ పనివేళ్లలో సుమారు పది రోజుల పాటు ఆఫీసు మొత్తం కలియదిరిగి ప్రతీ విషయాన్ని గమనించి దోపిడీకి ప్లాన్ చేసి ఉంటారని భావిస్తున్నారు. కాగా, ఈ ముఠాలో ఒకరిద్దరు నేపాలీలు కూడా ఉన్నట్లు పోలీసులకు కీలక సమాచారం లభించింది. వీటి ఆధారంగా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దుండగుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. గ్యాంగ్ లీడర్ కమ్రానుద్దీన్? ఈ ముఠాలన్నింటికీ జార్ఖండ్‌కు చెందిన కమ్రానుద్దీన్ గ్యాంగ్ లీడర్‌గా వ్యవహరిస్తున్నారని విచారణలో వెలుగులోకి వచ్చింది. అతనిపై జార్ఖండ్‌తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ఇదే తరహా కేసులు నమోదైనట్లు తెలిసింది. అతని ఆచూకీ కోసం జహీరాబాద్ పోలీసులతో పాటు తిరుమలగిరి పోలీసు లు జార్ఖండ్‌కు వెళ్లినట్టు తెలిసింది. కమ్రానుద్దీన్ ఎలక్ట్రికల్, వెల్డింగ్ వర్క్స్‌లో నిపుణులైన యువతను ఎంపిక చేసుకుని నేరాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. -
‘ముత్తూట్’కు కన్నం
భారీ ఎత్తున చోరీ ఆరు కిలోల బంగారం..రూ. 13 లక్షల నగదు అపహరణ జహీరాబాద్‌లో ఘటన సంఘటనా స్థలాన్ని సందర్శించిన ఎస్పీ హైదరాబాద్‌లో పట్టుబడ్డ దొంగ? జహీరాబాద్, న్యూస్‌లైన్ : పట్టణంలోని పోలీసు స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో ఆదివారం రాత్రి భారీ చోరీ జరిగింది. సుమారు ఆరు కిలోల బంగారం, రూ. 13 లక్షల నగదును దొంగలు అపహరించుకుపోయినట్లు సమాచారం. అయితే ఎంత మేర బంగారం చోరీ అయిన విషయాన్ని కార్యాలయ అధికారులు, పోలీసులు నిర్ధారించలేదు. సంగారెడ్డి డీఎస్పీ వెంకటేష్, ముత్తూట్ ఫైనాన్స్ జనరల్ మేనేజర్ వెంకటేశ్వరన్ కథనం మేరకు.. ఆదివారం రాత్రి గుర్తు తెలియని దొంగలు ఫైనాన్స్ వెనుక భాగంలో ఉన్న డోర్‌ను తొలగించుకుని ప్రాంగణంలోకి ప్రవేశించారు. అనంతరం లోపలకు వెళ్లేందుకు వీలుగా కిటీకీ చువ్వల తొలగించారు. అనంతరం గదిలోని సీసీ కెమెరాల కనెక్షన్లను కట్ చేశారు. తమ వెంట తెచ్చుకున్న గ్యాస్ సిలిండర్, కట్టర్ల సాయంతో బంగారాన్ని భద్రపరచిన స్ట్రాంగ్ రూం ఏ-1 సేఫ్ లాకర్ డోర్‌ను కత్తరించి అందులోకి ప్రవేశించారు. అక్కడున్న బంగారు ఆభరణాలు, నగదును అపహరించుకు పోయారు. సోమవారం ఉదయం ఫైనాన్స్ కార్యాలయాన్ని తెరిచేందుకు వచ్చిన సిబ్బంది విషయాన్ని అధికారులు, పోలీసులకు తెలియజేశారు. వెంటనే సీఐ నరేందర్ సంఘటనా స్థలానికి చేరుకుని వేలిముద్రల నిపుణులతో ఆనవాళ్లను సేకరించారు. ఎస్పీ విజయకుమార్, సంగారెడ్డి డీఎస్పీ వెంకటేష్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. అయితే దొంగతనం వివరాలను తెలియజేసేందుకు ఎస్పీ నిరాకరించారు. కూతవేటు దూరంలో.. ముత్తూట్ ఫైనాన్స్ పోలీసు స్టేషన్‌కు కూత వేటు దూరంలోనే 9వ నెంబరు జాతీయ రహదారిపై ఉంది. అయినా దొ ంగలు మాత్రం తాపీ గానే భారీ చోరీకి పాల్పడ్డారు. స్ట్రాంగ్ రూం సేఫ్ తాళాలను కట్టర్‌తో కత్తిరించి లోపలకు ప్రవేశించి డ్రాల్లో భద్రపరచిన ఆభరణాలను, నగదును దోచుకెళ్లారు. గ్యాస్ సిలిండర్లను ఫైనాన్స్ కార్యాలయంలోనే వదిలి వెళ్లారు. అయితే సీసీ కెమెరాల్లో ఫుటేజీల్లో దొంగలు ముసుగులు ధరించి లోపలకు ప్రవేశించినట్లు ఫైనాన్స్ కార్యాలయ వర్గా లు పేర్కొంటున్నాయి. నలుగురు వ్యక్తుల ముఠా చోరీకి పా ల్పడి ఉండవచ్చని తెలుస్తోంది. ప్రజల్లో ఆందోళన ముత్తూట్ ఫైనాన్స్‌లో చోరీ జరిగిందన్న విషయం తెలుసుకున్న పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అయితే తాము కుదువ పెట్టిన బంగారు ఆభరణాలపై ఆందోళన చెందారు. దాచుకున్న సొమ్ముకు ఎలాంటి ఆందోళన వద్దని ఫైనాన్స్ అధికారులు చెప్పడంతో వెనుదిరిగారు. సొమ్మంతా అందజేస్తాం : జీఎం వెంకటేశ్వరన్ తమ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టిన బంగారాన్ని ఒక్క రూపాయి కూడా నష్టం లేకుండా అందజేస్తామని, ఈ విషయంలో ఎలాంటి ఆందోళన వద్దని ముత్తూట్ ఫైనాన్స్ జనరల్ మేనేజర్ వెంకటేశ్వరన్ ఖాతాదారులకు హామీ ఇచ్చారు ఈ విషయమై ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫైనాన్స్‌లో ఉన్న సొమ్ముకు ఇన్సూరెన్స్ ఉందన్నారు. దొంగతనానికి పాల్పడిన వ్యక్తి పోలీసులకు పట్టుబడినట్లు తమకు సమాచారం ఉందని తెలిపారు. అయితే అతడి వద్ద లభించిన సొమ్ములో కొంత తమ ఫైనాన్స్‌కు సంబంధించి ఉన్నట్లు తెలిసిందని చెప్పారు. బ్యాంకులో ఎంత మేర బంగారం, నగదు అపహరణ జరిగిందనే విషయం పోలీసు లే వెల్లడిస్తారని తెలిపారు. హైదరాబాద్‌లో పట్టుబడిన దొంగ? జహీరాబాద్‌లోని ముత్తూట్ ఫైనాన్స్‌లో భారీ చోరికి పాల్పడిన వ్యక్తి హైదరాబాద్‌లో పట్టుబడినట్లు పోలీసు, ఫైనాన్స్ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో సీఐ నరేందర్ తన సిబ్బంది తో కలిసి హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లాడు. -
ముత్తూట్ ఫైనాన్స్ లో2.25 కోట్లు చోరీ!
7 కిలోల బంగారు ఆభరణాలు.. రూ.13 లక్షల నగదు అపహరణ మెదక్ జిల్లా జహీరాబాద్‌లో ఘటన.. హైదరాబాద్‌లో చిక్కిన దొంగ సాక్షి, హైదరాబాద్, జహీరాబాద్: రాజధానిలోని తనిష్క్ జ్యువెలరీలో జరిగిన భారీ దొంగతనం తరహాలో... మెదక్ జిల్లా జహీరాబాద్‌లోని ముత్తూట్ ఫైనాన్స్‌లో ఆదివారం రాత్రి భారీ చోరీ జరిగింది. ఏకంగా దాదాపు ఏడు కిలోల బంగారంతో పాటు.. రూ. 13 లక్షల నగదు అపహరణకు గురైంది. కానీ, నిందితుడు హైదరాబాద్‌లో నాటకీయంగా పట్టుబడ్డాడు. మెటల్ డిటెక్టర్ భయంతో.. ‘దొంగ’ సొత్తును వదిలేసి పారిపోబోయాడు. సినిమాల్లో ఛేజింగ్ సీన్ల తరహాలో పోలీసులను పరుగులు పెట్టించి.. చివరికి చేతికి చిక్కాడు. నిందితుడిని జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన అశోక్ శర్మగా గుర్తించారు. అతని వద్ద బ్యాగ్‌లో ఉన్న దాదాపు ఏడు కేజీల బంగారం, సూట్‌కేసులోని రూ. 13.42 లక్షల నగదు.. మొత్తంగా రూ. 2.25 కోట్ల విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, దినసరి కూలీ అయిన తనను పశ్చిమబెంగాల్‌కు చెందిన లేబర్ కాంట్రాక్టర్ కమ్రూ అక్కడికి తీసుకువచ్చాడని అశోక్ చెప్పాడు. కమ్రూ సోమవారం ఉదయం 8.30కు నాంపల్లి రైల్వేస్టేషన్‌కు రమ్మన్నాడని.. వెళ్లాక తనకు ఆ బ్యాగ్, సూట్‌కేస్ ఇచ్చి ఎంజీబీఎస్‌కు రావాలని, తాను అక్కడ కలుస్తానని చెప్పడంతో వచ్చానని వెల్లడించాడు. మరో ముగ్గురు కూడా..: నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువుల్లో కర్ణాటక ఆర్టీసీకి చెందిన బస్ టికెట్ కూడా ఉంది. దాని ప్రకారం దర్యాప్తు చేసిన అఫ్జల్‌గంజ్ పోలీసులు... శుక్రవారం ఎంజీబీఎస్ నుంచి అశోక్ శర్మతో పాటు విశాల్, వినోద్ అనే వ్యక్తులు కలిసి జహీరాబాద్‌కు వెళ్లినట్లు తేలింది. దీంతో కమ్రూ, విశాల్, వినోద్ కూడా ఈ చోరీలో పాలు పంచుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. కమ్రూ, విశాల్, వినోద్‌ల కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. చోరీ చేసిందిలా: గుర్తు తెలియని దుండగులు ముత్తూట్ ఫైనాన్స్ ప్రాంగణం వెనుక తలుపు తెరిచి లోనికి చొరబడ్డారు. సీసీ కెమెరాల కనెక్షన్లు కత్తిరించారు. అనంతరం తమ వెంట తెచ్చుకున్న గ్యాస్ సిలిండర్, కట్టర్ల సహాయంతో స్ట్రాంగ్ రూమ్‌ను తెరిచి.. బంగారు ఆభరణాలు, నగదును అపహరించుకుపోయారు. దొరికిందిలా..: హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ సెక్యూరిటీ సిబ్బంది మెటల్ డిటెక్టర్లతో ప్రయాణికులను, లగేజీని పరిశీలిస్తుండగా.. ఒక బ్యాగు, సూట్‌కేసు పట్టుకుని వచ్చిన వ్యక్తి వాటిని వదిలి పారిపోవడం మొదలుపెట్టాడు.. బస్‌స్టాండ్ ఆవరణ నుంచి బయటకు పరుగెత్తి ఆటో ఎక్కేశాడు.. ఇది గమనించిన పోలీసులు మరో ఆటోలో వెంబడించి పట్టుకున్నారు. అనుమానితుడు వదిలేసిన బ్యాగులో.. 499 చిన్న కవర్లలో ప్యాక్ చేసి ఉన్న బంగారు ఆభరణాలను పోలీసులు గుర్తించారు. వాటిపై జహీరాబాద్‌లోని ముత్తూట్ ఫైనాన్స్ సంస్థ ముద్ర, స్టిక్కర్లను గమనించి సమాచారం ఇవ్వగా.. భారీ చోరీ విషయం వెల్లడైంది. -
ఎంజీబీఎస్‌లో నాలుగు కిలోల బంగారం స్వాధీనం
హైదరాబాద్ : హైదరాబాద్ మహాత్మాగాంధీ బస్టాప్‌లో సోమవారం పోలీసుల తనిఖీల్లో ఓ వ్యక్తి వద్ద నాలుగు కిలోల బంగారం ఉన్నట్లు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తి ఎవరు ? నాలుగు కిలోల బంగారం ఎక్కడిది ? అని పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు మెదక్ జిల్లా జహీరాబాద్ ముత్తూట్ ఫైనాన్స్‌లో దొంగలు చోరీకి విఫలయత్నం చేశారు. లాకర్లు తెరుచుకోకపోవడంతో వెనుతిరిగినట్లు తెలుస్తోంది. అయితే ఎంజీబీఎస్‌లో అదుపులోకి తీసుకున్న వ్యక్తే... జహీరాబాద్‌లో చోరీకి ప్రయత్నించింది కూడా ఒకరేనా అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇక విశాఖ జిల్లా అరకు యండపల్లివలస కెనరాబ్యాంక్‌లో చోరీకి యత్నం జరిగింది. కాగా ఎంత ప్రయత్నించినా లాకర్లు ఓపెన్ కాకపోవడంతో దొంగలు పరారయ్యారు.