దొంగల కోసమా.. ఉగ్రవాదులా?
హైదరాబాద్: ముత్తూట్ ఫైనాన్స్ సంస్ధలో దోపిడికి విఫలయత్నం చేసిన వారిని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున పోలీసులను రంగంలోకి దించారు. దాదాపు 50 మంది ఎస్సైలు, 10 మంది సీఐలు, నలుగురు ఏసీపీలు, ఒక డీఎస్పీ సహా 300 మంది పోలీసులు దొంగలు ఉన్నారని భావిస్తున్న హ్యాపీ హోమ్స్ అపార్ట్‌మెంట్ వద్దకు చేరుకున్నారు. 100 మందికి పైగా ఆక్టోపస్ బలగాలు భారీ ఎత్తున ఆయుధాలతో చేరుకుని 450 ఫ్లాట్ల తనిఖీని ప్రారంభించాయి.
ఆక్టోపస్ ఎందుకు?
ఆక్టోపస్, కౌంటర్ ఇంటలిజెన్స్, గ్రే హౌండ్స్ బలగాలను సాధారణంగా కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్లకు వినియోగిస్తారు. దొంగల కోసం ఆక్టోపస్ బలగాలను ఎందుకు రప్పిస్తున్నారన్న విషయంపై పోలీసులు క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో కేవలం దొంగలు మాత్రమే కాకుండా అపార్ట్‌మెంట్‌లో ఇంకేదో కీలకమైన విషయం ఉంటుందని భావిస్తున్నారు. మూడేళ్ల క్రితం ఇండియన్ మొజాహిద్దీన్‌కు చెందిన టెర్రరిస్టులు బ్యాంకు దోపిడికి యత్నించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముత్తూట్‌లో దోపడీ యత్నం కూడా ఉగ్రవాదులే చేసుండొచ్చనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.