ముత్తూట్‌ దొంగలు దొరికారు | muthoot robbery burglars held in karnataka | Sakshi
Sakshi News home page

ముత్తూట్‌ దొంగలు దొరికారు

Published Wed, Jan 4 2017 2:00 PM | Last Updated on Thu, Aug 2 2018 4:21 PM

ముత్తూట్‌ దొంగలు దొరికారు - Sakshi

ముత్తూట్‌ దొంగలు దొరికారు

హైదరాబాద్‌: కలకలం సృష్టించిన ముత్తూట్‌ ఫైనాన్స్‌ దోపిడీ కేసు వీడింది. దోపిడీ దారులను నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకలోని గుల్బర్గాలో నిందితులను సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. సంగారెడ్డి జిల్లా బీరంగూడలోని ముత్తూట్‌ ఫైనాన్స్‌ సంస్థలోకి సీబీఐ అధికారులమంటూ వచ్చి పట్టపగలే ఆరుగురు దుండగులు భారీ దోపిడీ చేసిన విషయం తెలిసిందే. 13 కోట్ల రూపాయల విలువ చేసే 46 కేజీల బంగారాన్ని దోచుకెళ్లారు. సీబీఐ అధికారులమని చెప్పి లోపలికి ప్రవేశించిన దుండగులు ఉద్యోగులను మారణాయుధాలతో బెదిరించి ఈ దోపిడీకి పాల్పడ్డారు.

(చదవండి.. ముత్తూట్‌లో ఘరానా దోపిడీ)

దుండగులు నలుపు రంగు స్కార్పియో కారులో వచ్చారని, ఇద్దరు వ్యక్తుల చేతుల్లో తుపాకులు ఉన్నట్టు సిబ్బంది ఆ సమయంలో వివరాలు ఇచ్చారు. తమను గుర్తుపట్టకుండా సీసీ కెమెరాలను కూడా దొంగలు ధ్వంసం చేశారు. అయితే, అదే రోజు సాయంత్రంలోగా వారు వెళుతున్న వాహనం ఆధారాలు గుర్తించిన పోలీసులు అనంతరం వారి ఊహాచిత్రాలు కూడా విడుదల చేసి గాలింపు చర్యలు మొదలుపెట్టారు. వారిని తాజాగా కర్ణాటకలోని గుల్బార్గాలో అదుపులోకి తీసుకొని ఆ ముఠా మొత్తాన్ని హైదరాబాద్‌కు తరలించారు. వీరిని ప్రస్తుతం సైబరాబాద్‌ సీపీ సందీప్‌ శాండిల్య విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement