Gold robbery
-
దొంగలను పట్టించిన డాగ్ వాక్
2024 డిసెంబర్ 12 తెల్లవారుజాము దాదాపు 4 గంటల సమయం– హైదరాబాద్, దోమలగూడ అర్వింద్నగర్లోని ఘొరాయ్ కుటుంబీకుల ఇంట్లోకి ఆరుగురు ముసుగు దొంగలు చొరబడి, మారణాయుధాలతో బెదిరించి, రెండు కేజీల బంగారం సహా దాదాపు రూ.2 కోట్ల విలువైన సొత్తు దోచుకున్నారు. 2024 డిసెంబర్ 22 మధ్యాహ్నం దాదాపు 2 గంటల మధ్య సమయం–బంజారాహిల్స్‌లోని తెలంగాణ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి, ఘొరాయ్ కుటుంబీకుడు సహా 12 మందిని అరెస్టు చేసినట్లు ప్రకటించారు. ఆధారాలు దొరక్కుండా, పక్కా పథకం ప్రకారం చేసిన ఈ బందిపోటు దొంగతనం ఒక పెంపుడు జాగిలం ద్వారా కొలిక్కి వచ్చింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన అన్నదమ్ములు రంజిత్ ఘొరాయ్, ఇంద్రజిత్ ఘొరాయ్ కొన్నేళ్ల కిందట హైదరాబాద్‌కు వలసవచ్చారు. తమ కుటుంబాలతో దోమలగూడ అర్వింద్నగర్లో స్థిరపడ్డారు. ఇద్దరూ వేర్వేరుగా నగల తయారీ వ్యాపారం ప్రారంభించారు. రంజిత్ యాభైమందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఎదిగాడు. అతడి తమ్ముడు ఇంద్రజిత్ వ్యసనాలకు బానిసై, ఆర్థికంగా చితికిపోయాడు. తమ్ముడి పరిస్థితి చూసిన అన్న రంజిత్ తనతో కలిసి ఒకే ఇంట్లో వేరే పోర్షన్లో ఉండే ఏర్పాటు చేశాడు. రంజిత్ వ్యాపారం బాగా సాగుతుండటంతో ఇంద్రజిత్ కొన్నాళ్లుగా ఈర్ష్యతో రగిలిపోతున్నాడు. ఇటీవల రంజిత్ తన భార్య పేరుతో దోమలగూడలో రెండు ఇళ్లు కొన్నాడు. ఈ విషయం తెలిశాక ఇంద్రజిత్ మరింతగా రగిలిపోయాడు. రంజిత్ వద్ద ఉండే బంగారం వివరాలను గమనిస్తూ వచ్చిన ఇంద్రజిత్– నకిలీ ఆదాయపు పన్ను దాడి చేయించడానికి ఆరు నెలల కిందట కొందరితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. వారికి నకిలీ గుర్తింపుకార్డులు తయారు చేయించినా, ఆ పథకం పారలేదు. దీంతో అన్న వద్ద ఉండే బంగారం దోచుకోవాలని ఇంద్రజిత్ భావించాడు. ప్రతి రోజూ తనతో కలిసి మార్నింగ్ వాక్ చేసే అల్తాఫ్ మహ్మద్ ఖాన్, సయ్యద్ ఇర్ఫాన్ అహ్మద్‌లతో ఇంద్రజిత్‌కు స్నేహం ఏర్పడింది. రంజిత్ ఇంట్లో భారీగా బంగారం ఉండే సమయం చెప్తానని, అప్పుడు దోపిడీ చేయిస్తే, అందరం వాటాలు పంచుకుందామని చెప్పాడు. దీనికి అంగీకరించిన అల్తాఫ్, ఇర్ఫాన్, ఈ విషయాన్ని బాలాపూర్‌కు చెందిన రౌడీషీటర్ హబీబ్ హుస్సేన్ ద్వారా మైలార్‌దేవ్‌పల్లికి చెందిన షేక్ షబ్బీర్‌కు చెప్పారు. ఈ దోపిడీకి తనకంటే మైలార్‌దేవ్‌పల్లి రౌడీషీటర్ మహ్మద్ అర్బాజ్ సమర్థుడని చెప్పిన షబ్బీర్, అతడిని పరిచయం చేశాడు. వీరంతా పలుమార్లు వివిధ హోటళ్లలో కూర్చుని, దోపిడీకి పథకం వేశారు. అర్బాజ్ తన అనుచరులతో కలిసి బందిపోటు దొంగతనానికి రంగంలోకి దిగాడు. ఇంద్రజిత్తో చర్చించి, ఒక వాహనాన్ని కూడా కొన్నాడు. తన అనుచరులతో రంజిత్ ఇంటి వద్ద రెక్కీ చేయించాడు. ఇంట్లో పెంపుడు శునకం, చుట్టూ ప్రహరీ, భారీ గేటు, గ్రిల్స్‌తో కట్టుదిట్టంగా ఉండటంతో బయటి వాళ్లు ప్రవేశించడం దుస్సాధ్యమని గుర్తించి, ఇంద్రజిత్‌కు చెప్పాడు. దీంతో అంతా కలిసి బహదూర్‌పురాకు చెందిన న్యాయవాది మహ్మద్ నూరుల్లా సహాయం కోరారు. ఘొరాయ్ ఇంట్లోని పెంపుడు శునకాన్ని ఇంద్రజిత్ రోజూ ఉదయం బయటకు తీసుకువెళుతుంటాడు. దాని కాలకృత్యాలు పూర్తయ్యాక తీసుకువచ్చి, ఇంటి ఆవరణలో వదిలేస్తాడు. దొంగతనం చేసే రోజు మాత్రం తెల్లవారుజామున పెంపుడు శునకాన్ని కాస్త తొందరగా బయటకు తీసుకుని వెళ్లాలని, తిరిగి వస్తూ ప్రధాన గేటుకు గడియపెట్టకుండా వదిలేయాలని నూరుల్లా సలహా ఇచ్చాడు. దీంతో అర్బాజ్ 2024 డిసెంబర్ 12 రాత్రి తన గ్యాంగ్‌తో రంగంలోకి దిగాడు. అర్బాజ్ నేతృత్వంలో అతడి అనుచరులు షబ్బీర్ ఇంట్లో సమావేశమయ్యారు. అక్కడ నుంచి షబ్బీర్ మినహా మిగిలిన వాళ్లు బయలుదేరి, రంజిత్ ఇంటికి చేరారు. తన అన్న కుటుంబీకులను కేవలం బెదిరించాలని ఇంద్రజిత్ పదేపదే చెప్పినా అర్బాజ్ పట్టించుకోలేదు. రంజిత్ కుటుంబాన్ని బంధించి, తన అనుచరులతో వారి పిల్లల మెడపై కత్తులు పెట్టించాడు. అడ్డుకునే ప్రయత్నం చేసిన రంజిత్ చేతిని కత్తితో నరికించాడు. తర్వాత ఇంట్లోని రెండు కేజీల బంగారం, 616 గ్రాముల వెండి, పూజ గదిలోని రెండు కేజీల ఇత్తడి సామాను దోచుకుని పారిపోయారు. పోలీసులకు ఆధారాలు దొరక్కుండా, రహదారుల్లోని సీసీ కెమెరాల్లో రికార్డు కాకుండా జాగ్రత్తపడ్డారు. కాసేపటికి రంజిత్ షాక్ నుంచి తేరుకున్నాడు. ఇంద్రజిత్ స్వయంగా పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులు అక్కడకు చేరుకుని, కేసు నమోదు చేసుకున్నారు. మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇన్స్పెక్టర్ ఖలీల్ పాషా నేతృత్వంలో ఎస్సైలు నవీన్‌కుమార్, నాగేష్, శ్రీకాంత్ తమ బృందాలతో దర్యాప్తు చేపట్టారు. ఘొరాయ్ కుటుంబం దినచర్యపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే నేరం జరిగిన రోజు ఇంద్రజిత్ తెల్లవారుజామున 3.00 గంటలకే పెంపుడు శునకాన్ని మార్నింగ్ వాక్కు తీసుకువెళ్లినట్లు గుర్తించారు. అతడిపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అతడు నోరు విప్పాడు. ఆరు నెలల కిందటి ‘ఐటీ స్కెచ్’ నుంచి తాజా బందిపోటు దొంగతనంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న పదిహేను మంది వివరాలను బయటపెట్టాడు. దీంతో అధికారులు షహబాజ్, నజీర్, జహీర్ మినహా మిగిలిన పన్నెండు మందిని పట్టుకుని, వీరి నుంచి రూ.2.9 లక్షల నగదు, కారు, ఆయుధాలతో పాటు 1228 గ్రాముల బంగారం, 616 గ్రాముల వెండి, రెండు కేజీల ఇత్తడి వస్తువులు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. -
ఇంట్లో చెదలు పోగొడతామని బెడ్రూమ్లోకి వెళ్లి...
తిరువొత్తియూరు: ప్రైవేటు సంస్థ విశ్రాంత ఉద్యోగి ఇంటిలో చెదలు పోగొట్టడానికి మందుకొట్టేందుకు వచ్చి 6 సవర్ల నగలను చోరీ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. చైన్నె కొలతూరు ప్రాంతానికి చెందిన నటరాజన్ (69) ప్రైవేటు సంస్థలో పనిచేస్తూ విశ్రాంతి పొందాడు. ఇతని ఇంటిలో చెదలు నివారణకు కోడంబాక్కంలో వున్న ప్రైవేటు సంస్థకు సమాచారం ఇచ్చాడు. మందుకొట్టేందుకు ఎన్నూర్ సునామీ క్వార్టర్స్‌కు చెందిన దయాలన్ (31) వచ్చాడు. ఈ క్రమంలో బెడ్ రూమ్‌లో ఉన్న ఆరు సవర్ల నగలు కనిపించకుండా పోయాయి. నటరాజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న దయాలన్ వద్ద పోలీసులు విచారణ చేశారు. అతను ఆరు సవర్ల నగను చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. రేషన్ దుకాణంలోకి చొరబడిన ఎలుగుబంటి తిరువొత్తియూరు: నీలగిరి జిల్లా కున్నూరు ప్రాంతంలో ఇటీవల కాలంలో ఎలుగుబంటి, అడవి దున్నలు, చిరుత పులులు ఆహారం కోసం జానావాసాల్లోకి వస్తున్నాయి. కున్నూరు నగర ప్రాంతంలో అర్ధరాత్రి సమయంలో ఒక ఎలుగుబంటి రైల్వే క్రాసింగ్ ప్రాంతంలో ఉన్న రేషన్ దుకాణం తలుపులు పగలగొట్టింది. లోపలికి వెళ్లి గదిలో ఉన్న లోపల మరో గది తలుపు వేసి ఉండడంతో ఆహారం అవి తీసుకోవడానికి వీలు కాలేదు. దీంతో ఎలుగుబంటి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఉదయం ఉద్యోగులు రేషన్ దుకాణానికి వచ్చిన సమయంలో తలుపులు పగలగొట్టబడి ఉండడం చూసి దిగ్భ్రాంతి చెందారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. దుకాణంలోకి ఎలుగుబంటి వచ్చినట్టు గుర్తించారు. దీనిపై అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. -
నెల్లూరు: కావలిలో భారీ చోరీ
-
చుట్టాల్లా వెళ్లి పట్టేశారు!
సాక్షి, సిటీబ్యూరో: అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నగల తయారీ కేంద్రంలో పని చేస్తూ రూ.కోటి విలువైన వజ్రాభరణాలతో ఉడాయించిన కార్మికులను పట్టుకోవడానికి పోలీసులు వారి చుట్టాలుగా మారారు. ఇలానే పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో గాలించి నలుగురిని అరెస్టు చేశారు. నిందితులను అక్కడి కోర్టులో హాజరుపరిచి, ట్రాన్సిట్ వారెంట్‌పై సొత్తుతో సహా సిటీకి తీసుకువచ్చినట్లు మధ్య మండల డీసీపీ ఎం.వెంకటేశ్వర్లు తెలిపారు. ఏసీపీ పూర్ణచంద్రర్‌తో కలిసి గురువారం వివరాలు వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులతోనే... పశ్చిమ బెంగాల్‌లోని హౌరా పరిసర ప్రాంతాలకు చెందిన హిమాన్షు సర్దార్, మహదేబ్ సర్దార్, ఉత్తమ్ ఓఝా ఐదేళ్ల క్రితం బతుకు తెరువు కోసం నగరానికి వలసచ్చారు. ఉప్పుగూడలోని లలితబాగ్‌లో ఉంటూ అబిడ్స్‌లోని ఆర్వీజే ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో కార్మికులుగా పని చేస్తున్నారు. బంగారు, వజ్రాభరణాలు తయారు చేసే ఈ సంస్థకు గోపాల్ కృష్ణ డైరెక్టర్‌గా ఉన్నారు. వీరు కొన్నాళ్లుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హిమాన్షు, ఉత్తమ్ కుటుంబీకులు ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో వీరికి పెద్ద మొత్తంలో నగదు అవసరమైంది. ఇదే కార్ఖానాలో పని చేసేందుకు మూడు నెలల క్రితం హౌరాకే చెందిన కార్తీక్ బాగ్ వచ్చాడు. కార్తీక్ సలహాతో... అప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ముగ్గురూ అతడు ఇచ్చిన సలహా నేపథ్యంలోనే తుది మెరుగుల కోసం యజమాని ఇచ్చిన సొత్తుతో ఉడాయించాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 18న గోపాల్ కృష్ణ రూ.కోటి విలువ చేసే 83 తులాల బంగారు ఆభరణాలు, 119 క్యారెట్ల వజ్రాలు, విలువైన రాళ్లు వీరికి అప్పగించాడు. ఆ రోజు ఉదయం 11.30 గంటలకు వీటిని తీసుకున్న నలుగురూ ఓ పెట్టెలో పెట్టుకుని మధ్యాహ్నం అక్కడినుంచి ఉడాయించారు. గోపాల్ కృష్ణ ఫిర్యాదుతో అబిడ్స్ ఠాణాలో కేసు నమోదైంది. రంగంలోకి దిగిన ఇన్స్పెక్టర్ బి.ప్రసాదరావు, డీఐ బి.అభిలాషతో కూడిన బృందం వివిధ ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్ ఆధారంగా నిందితులు నలుగురూ ట్యాక్సీ, బస్సుల్లో విజయవాడ వెళ్లి అక్కడ హౌరా వెళ్లే రైలు ఎక్కినట్లు గుర్తించారు. ఏ మాత్రం సమాచారం అందకుండా... దీంతో ప్రత్యేక బృందం అక్కడికి చేరుకుని గోపాల్ కృష్ణ ఇచ్చిన ఆధార్ కార్డుల ఆధారంగా గాలింపు చేపట్టారు. పోలీసుల రాకపై ఏ మాత్రం ఉప్పందినా నిందితులు పారిపోతారని భావించిన పోలీసులు ‘చుట్టాలుగా’ మారారు. తాము కార్తీక్ ఇంటికి వచ్చిన బంధువులమని, చాలా కాలం తర్వాత రావడంతో ఇల్లు గుర్తించలేకపోతున్నామని, అతడి ఫోన్ పని చేయట్లేదని స్థానికులకు చెప్పారు. అప్పటికే అతడు మిగిలిన ముగ్గురు నిందితులతో పాటు వచ్చి ఉండటంతో వీళ్లూ అతడి బంధువులై ఉండవచ్చునని భావించిన స్థానికులు స్పందించారు. ఇలా ఇంటిని గుర్తించిన టీమ్ స్థానిక పోలీసులను రప్పించి దాడి చేసింది. నలుగురు నిందితులతో పాటు సొత్తునూ స్వాధీనం చేసుకుంది. ఈ బృందాన్ని అభినందించిన డీసీపీ రివార్డు అందించారు. -
నాగోల్ కాల్పుల ఘటనపై దర్యాప్తు ముమ్మరం
-
హైదరాబాద్: జ్యువెలరీ షాప్‌లో దోపిడీకి పక్కా స్కెచ్? కాల్పులు జరిపి భారీ చోరీ
సాక్షి, చైతన్యపురి/నాగోలు: జ్యువెలరీ దుకాణంలో చొరబడిన దుండగులు షాపు యజమాని సహా మరొకరిపై కాల్పులు జరిపి బంగారు ఆభరణాలతో ఉడాయించిన ఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ పాలి జిల్లా లోటోపి గ్రామానికి చెందిన కల్యాణ్ చౌదరి (34) పదేళ్ల క్రితం స్నేహపురి కాలనీ రోడ్‌నంబర్– 6లో మహదేవ్ జ్యువెలరీ దుకాణం నడిపిస్తూ.. ఎన్జీవోస్ కాలనీలో కుటుంబంతో ఉంటున్నారు. గురువారం రాత్రి 9.15 గంటల సమయంలో సికింద్రాబాద్ నుంచి హోల్‌సేల్‌లో బంగారం సప్లై చేసే సుఖ్‌దేవ్ జ్యువెలరీ దుకాణానికి వచ్చాడు. అదే సమయంలో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు పల్సర్, యాక్టివా బైక్‌లపై వచ్చారు. అనంతరం దుకాణంలోకి చొరబడి షాపు షటర్‌ను మూసివేశారు. లోనికి వచ్చిన ఆగంతుకులు కాల్పులు జరిపారు. దీంతో కల్యాణ్ చౌదరితో పాటు సుఖ్‌దేవ్ గాయపడ్డారు. కాల్పులు జరిపిన అనంతరం సుఖ్‌దేవ్ చేతిలోని బ్యాగ్‌ను దుండగులు లాక్కున్నారు. దుకాణంలో నుంచి కాల్పుల శబ్దాలు రావటంతో దుకాణం వద్దకు స్థానికులు కొందరు చేరుకున్నారు. వారిలో కొందరు షాపు షటర్ తీసి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆగంతుకులు తుపాకీ చూపించి భయపెడుతూ.. వారు వచ్చిన బైక్‌లపై పరారయ్యారు. స్థానికులు వెంటపడినప్పటికీ ఆర్కేపురం వైపు వెళ్లారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్‌రెడ్డి, చైతన్యపురి ఇన్స్పెక్టర్ మధుసూధన్ క్రైం అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన ఇద్దరిని నాగోలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. దుకాణం యజమాని కల్యాణ్ చెవికి బుల్లెట్ తగలగా, సుఖ్‌దేవ్‌కు ఒకటి మెడకు, మరొకటి వీపు వెనుక భాగంలో తగిలింది. వీరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సీసీ పుటేజ్ పరిశీలిస్తున్న పోలీసులు.. కాల్పుల ఘటన జరిగిన దుకాణంలోని సీసీ కెమెరాల పుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం బృందం ఆధారాలు సేకరించారు. నిందితులను పట్టుకునేందుకు ఎస్ఓటీ, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పదిహేను బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టినట్లు ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. కాల్పులు జరిపినవారు షాపు యజమానికి తెలిసిన వారా? లేక గుర్తు తెలియని వ్యక్తులా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాచకొండ జాయింట్ సీపీ సుధీర్‌బాబు, క్రైం డీసీపీ శ్రీబాల ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. సుఖ్‌దేవ్‌ను అనుసరించే వచ్చారా? హోల్‌సేల్‌లో బంగారం సప్లై చేసే సుఖ్‌దేవ్‌ను అనుసరించే దుండగులు వచ్చి ఉండవచ్చనే అనుమానాలు తలెత్తుతున్నాయి. సుఖ్‌దేవ్ వద్ద ఉన్న నగల బ్యాగ్‌ను మాత్రమే తీసుకుని పారిపోవటంతో ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. పక్కా స్కెచ్ ప్రకారమే కాల్పులు జరిపి బంగారంతో ఉడాయించినట్లు అనుమానిస్తున్నారు. బ్యాగ్‌లో 3 కిలోల బంగారం.. రూ.5లక్షలు? సికింద్రాబాద్ మోండా మార్కెట్లోని గణపతి జ్యువెల్లర్స్ నుంచి సుఖ్‌దేవ్ బంగారం సప్లై చేసేందుకు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి అన్ని ప్రాంతాల్లో తిరిగి చివరికి స్నేహపురి కాలనీలోని మహదేవ్ బంగారం దుకాణానికి వచ్చాడు. ఆయనతో రాజ్‌కుమార్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన కూడా కాల్పులు జరిపిన సమయంలో అక్కడే ఉన్నాడు. కాల్పులు జరిపిన దుండగులు సుమారు 3 కిలోల బంగారం, రూ.5 లక్షల నగదుతో పరారైనట్లు సమాచారం. -
కోటిన్నర నగలు కొట్టేశారు.. బాలల నిర్వాకం, 4 గంటల్లో ఆటకట్టు
చెన్నై: చెన్నైలోని ఓ దుకాణం నుంచి రూ.1.50 కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలను ఎత్తుకుపోయిన ముగ్గురు బాలురను పోలీసులు నాలుగు గంటల్లోనే పట్టుకున్నారు. అస్సాంకు చెందిన ఈ ముగ్గురు నగల దుకాణానికి సమీపంలోని జ్యూస్షాప్లో పనిచేసేవారు. పథకం ప్రకారం వారు..లిఫ్టు పక్కనున్న ఖాళీ స్థలం గుండా దుకాణంలోకి ప్రవేశించారు. వారు లోపలికి చేరుకున్న వెంటనే సెక్యూరిటీ వ్యవస్థ ద్వారా దుకాణం యజమానికి వెంటనే ఉదయం 5 గంటలకు అలెర్ట్ చేరింది. అప్రమత్తమైన యజమాని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దుకాణం వద్దకు చేరుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా అప్పటికే పరారైన ముగ్గురి కోసం వేట మొదలుపెట్టి, నాలుగు గంటల్లోనే వారి ఆటకట్టించారు. -
ఆమె కోసం ఎంతకైనా.. ప్రియురాలికి గిఫ్ట్ ఇచ్చేందుకు భార్య..
తిరువళ్లూరు (చెన్నై): ప్రియురాలికి కానుక ఇచ్చేందుకు ఓ ప్రియుడు దొంగగా మారాడు. ఏకంగా భార్య, తల్లి బంగారు నగలు చోరీ చేసి, వాటి నుంచి వచ్చిన సొమ్ముతో ప్రియురాలికి కారును బహుమతిగా ఇచ్చాడు. పోలీసులకు పట్టుబడ్డాడు. తిరువళ్లూరు జిల్లా పూనమల్లి ముత్తునగర్‌కు చెందిన శేఖర్(40) స్వీట్‌స్టాల్, ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. మనస్పర్ధల కారణంగా కొద్దిరోజుల క్రితం అతని భార్య మల్లిక పుట్టింటికి వెళ్లింది. బంధువులు రాజీ కుదిర్చి తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి వచ్చిన మల్లిక బీరువాలో ఉంచిన 300 సవర్ల బంగారు నగలను పరిశీలించగా అవి మాయమయ్యాయి. అలాగే శేఖర్ తల్లికి చెందిన మరో 200 సవర్ల బంగారు నగలు, రెండు బంగారు బిస్కెట్లు కనిపించలేదు. దీనిపై శేఖర్, అతడి సోదరుడిని ఆరాతీయగా తనకు నగలు విషయం అస్సలు తెలియదని చెప్పడంతో బాధితులు పూందమల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటి దొంగల పనే.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని బీరువాను పరిశీలించారు. తాళాలు పగలగొట్టకుండా నగలు ఎలా మాయమయ్యాయనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇంటి దొంగలే చేతివాటాన్ని ప్రదర్శించి ఉంటారని నిర్దారణకు వచ్చిన పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. మొదట శేఖర్ ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. విచారణలో కుటుంబ సభ్యులకు చెందిన బంగారు నగలను దొంగతనం చేసి ప్రియురాలు స్వాతికి ఇచ్చినట్లు అంగీకరించాడు. కొన్ని నగలు అమ్మి తద్వారా వచ్చిన నగదుతో కారును గిఫ్ట్‌గా ఇచ్చినట్టు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు శేఖర్, ప్రియురాలు వేళచ్చేరికి చెందిన స్వాతిని అరెస్టు చేసి వారి నుంచి కారును సీజ్ చేశారు. కీలేడీ మల్లిక పుట్టింటికి వెళ్లిన సమయంలో శేఖర్‌కు స్వాతి పరిచయమైంది. వీరి స్నేహం కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది. ఇద్దరూ కలిసి చెన్నైలోని ప్రైవేటు హాటల్లో తరచూ కలుసుకునే వారు. ఈ క్రమంలో శేఖర్ వద్ద స్వాతి లక్షల్లో డబ్బు స్వాహా చేసింది. ఈ క్రమంలో బంగారు నగలు, కారును గిఫ్ట్‌గా ఇవ్వాలని స్వాతి కోరడంతో వేరే మార్గం తెలియని శేఖర్ ఇంట్లో నగలను దొంగిలించి కొంత కానుకగా ఇచ్చాడు. కొన్ని నగలు అమ్మి తద్వారా వచ్చిన నగదుతో కారును గిప్ట్గా ఇచ్చినట్టు పోలీసుల విచారణలో నిర్ధారించారు. శేఖర్ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు శేఖర్, స్వాతిలను అరెస్టు చేసి వారి నుంచి కారును సీజ్ చేశారు. కాగా స్వాతికి ఇదివరకే పలువురు వ్యక్తులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. మరింత సమాచారం కోసం యువతిని విచారణ చేస్తున్నారు. శేఖర్‌ను కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు. -
ప్రేమించిన అత్త కూతురు కోసం దొంగతనానికి పాల్పడి..
సాక్షి, బనశంకరి (బెంగళూరు): దొంగతనానికి పాల్పడి సొత్తును విక్రయించి అత్తకుమార్తెకు దోచిపెట్టిన నవీన్ అనే వ్యక్తిని కేపీ అగ్రహర పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడి వద్ద నుంచి రూ.4.90 లక్షల విలువైన 109 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ సంజీవ్‌పాటిల్ కథనం మేరకు.. కేపీ అగ్రహార నివాసి నవీన్, శివశంకరయ్యలు పరిచయస్తులు. గతనెల 28న శివశంకరయ్య నవీన్ ఇంటికి వెళ్లాడు. మాటల క్రమంలో ఇంటికి తాళం వేయలేదనే విషయాన్ని వెల్లడించగా నవీన్ తక్షణం శివశంకరయ్య ఇంటికి వెళ్లి 106 గ్రాముల నగలు కాజేశాడు. ఆ నగలు విక్రయించి తాను ప్రేమిస్తున్న అత్తకుమార్తెకు అందజేశాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నవీన్‌ను గురువారం అరెస్ట్ చేశారు. చదవండి: (బంధువుతో వివాహేతర సంబంధం.. భర్త బయటకు వెళ్లగానే..) -
ప్రియురాలికి స్నేహితురాలు వీడియోకాల్.. వక్రబుద్ధితో..
సాక్షి, గుంటూరు(బాపట్ల): ప్రియురాలికి ఆమె స్నేహితురాలు చేసిన వీడియోకాల్ ద్వారా మెడలో ఉన్న బంగారం చూసిన ప్రియుడు కక్కుర్తిపడ్డాడు. దాన్ని ఏదో విధంగా కొట్టేసేందుకు పక్కా ప్లాన్ వేశాడు. ఆ వక్రబుద్ధితో ప్రియురాలితో కుమ్మకై ఆమెను హత్య చేసి బంగారాన్ని వలుచుకున్నాడు. గోనె సంచిలో మృతదేహాన్ని కుక్కి కృష్ణానది ఒడ్డున పడేశారు. హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పులుగు రామకృష్ణారెడ్డి, తూమాటి మహేష్, దావూలూరి భారతీలు ఈనెల 2న ఆర్ఐ సురేష్‌బాబు సమక్షంలో లొంగిపోయి హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు డీఎస్పీ ఏ.శ్రీనివాసరావు తెలిపారు. పక్షం రోజులుగా ఉత్కంఠ రేపిన మహిళా అదృశ్యం కేసు మిస్టరీ వీడింది. ఈ మేరకు డీఎస్పీ ఏ.శ్రీనివాసరావు గురువారం స్థానిక టౌన్ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు తెలియజేశారు. బాపట్ల పట్టణం పెయింట్స్ కాలనీకి చెందిన గూడపాటి భారతి గత నెల 16వ తేదీ నుంచి కనిపించడం లేదని 19వ తేదీన ఆమె కుమార్తె ఝాన్సీ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐ పి.కృష్ణయ్య, ఎస్ఐ రఫీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలు భారతితో ఆమె స్నేహితురాలు దావులూరి భారతి చివరిసారిగా మాట్లాడటంతో కేసును ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. కర్లపాలెం మండలం పెదపులుగువారిపాలేనికి చెందిన పులుగు రామకృష్ణారెడ్డికి, ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకలకు చెందిన దావులూరి భారతితో అక్రమ సంబంధం కొనసాగడంతో నాలుగేళ్లుగా పట్టణంలోని నరాలశెట్టివారిపాలెంలో కాపురం ఉంటున్నారు. చదవండి: (తొమ్మిదేళ్ల క్రితం ప్రేమ వివాహం.. మూడు రోజులుగా భర్త మృతదేహంతోనే..) మృతురాలు భారతి కూడా చెడు వ్యసనాలు కలిగి ఉండటంతోపాటు నిందితురాలు భారతీని కూడా తనకు కాకుండా చేస్తోందని రామకృష్ణారెడ్డి తరచూ గొడవపడుతూ ఉండేవాడు. ఈ సమయంలో మార్చి 16న గుంటూరు నుంచి కారులో వస్తున్న నిందితురాలు భారతికి మృతురాలు భారతి వీడియోకాల్ చేసింది. మృతురాలి మెడలో బంగారం ఉండటంతో కారులోనే పక్కా ప్రణాళిక వేసి బాపట్ల నుంచి భారతిని ఎక్కించుకుని, అక్కడ నుంచి కృష్ణారెడ్డి స్నేహితుడైన తూమాటి మహేష్‌ను కూడా తీసుకుని సూర్యలంక వెళ్లారు. అక్కడ మృతురాలు భారతితో పాటు అందరూ మద్యం తాగి బాపట్లలో గోనె సంచి కొనుగోలు చేసి రేపల్లె రోడ్డువైపు బయలుదేరారు. చీరతో గొంతు బిగించి హత్య మృతురాలు భారతిని చీర కొంగుతో చంపి వెంట తెచ్చిన గోనెసంచిలో వేసి పెనుమూడి పులిగడ్డ వారధిలో పడేశారు. కేసును పక్కదారి పట్టించేందుకు ఆమె ఫోన్‌ను తీసుకుని రాజమండ్రి వెళ్లి అక్కడ నుంచి మాట్లాడకుండా అక్కడే దాన్ని పడేశారు. పోలీసుల్ని పక్కదారి పట్టించేందుకు ఈ విధంగా చేశారని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. చదవండి: (ఫార్మాసిస్ట్ వచ్చీరాని వైద్యం.. బాలిక మృతి) ప్రధాన నిందితుడికి నేర చరిత్ర ప్రధాన నిందితుడు పులుగు రామకృష్ణారెడ్డి 2011 సంవత్సరంలోనే హైదరాబాద్ నుంచి ఒక స్టాఫ్ నర్సును ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఆమె వద్ద నగదు తీసుకుని కర్లపాలెంలో హత్య చేసిన కేసు నమోదైందని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. నిందితుడికి నేరచరిత్ర ఉందని చెప్పారు. కేసును అత్యంత వేగంగా దర్యాప్తు చేసిన సీఐ పి.కృష్ణయ్య, ఎస్ఐలు రఫీ, సీహెచ్. సింగయ్యతోపాటు పలువురు సిబ్బందికి రివార్డులు ఇచ్చేందుకు ప్రతిపాదించినట్లు డీఎస్పీ ఏ.శ్రీనివాసరావు తెలిపారు. నిందితుల్ని కోర్టుకు హాజరు పరుస్తునట్లు చెప్పారు. -
పోలీసు ఉద్యోగానికి ఎంపికైన యువతి.. బంగారం చోరీ కేసులో అరెస్ట్
సాక్షి, చెన్నై: పోలీసు ఉద్యోగానికి ఎంపికైన ఓ యువతి 12 సవర్ల చోరీ కేసులో అరెస్టయ్యింది. వివరాలు.. విల్లుపురం జిల్లా, సెంజి అలంపూండికి చెందిన మాధవి (42). పుదుచ్చేరి కనక శెట్టి కులంలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో పని చేస్తున్నారు. పుదువై కుళవర్ పాలయం పట్టిలోని ఓ ప్రైవేటు లేడీస్ హాస్టల్లో ఉంటున్నారు. ఈ క్రమంలో ఈనెల 18వ తేదీ బంధువు వివాహ కార్యక్రమానికి 12 సవర్ల నగలు ధరించి వెళ్లారు. తర్వాత హాస్టల్‌ను వచ్చిన మాధవి నగలను తీసి గదిలో పెట్టారు. ఉదయం లేచి చూసిన సమయంలో నగలు అదృశ్యమ య్యాయి. దీంతో ఉరులియన్ పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేశారు. ఆ సమయంలో పక్క గదిలో నివాసం ఉంటున్న ఓ యువతిని ప్రశ్నించారు. విచారణలో తనే నగలు చోరీ చేసినట్లు తేలింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. కాగా నిందితురాలు రాష్ట్ర పోలీస్ పరీక్షలో ప్రతిభ చూపి ఉద్యోగానికి ఇటీవల ఎంపికైంది. మార్చి 1 నుంచి వీధుల్లో చేరాల్సి ఉంది. ఆమె ప్రేమకు తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఇంటి నుంచి బయటకు వచ్చి మహిళా హాస్టల్లో ఉంటోందని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో అరెస్టవడం చర్చనీయాంశమైంది. చదవండి: పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం .. 14 మంది మృతి.. మోదీ సంతాపం చదవండి: ప్రేమ పేరుతో వంచన.. పిల్లలు పుడితే ఒప్పుకుంటారని చెప్పి -
Jos Alukkas Jewellery Store: యూట్యూబ్‌లో చూసి రూ.10 కోట్ల విలువైన బంగారం దోపిడీ!
చెన్నై: వెల్లూరులోని ఓ నగల దుకాణంలో వారంరోజుల క్రితం గోడకు కన్నం వేసి 15 కిలోల బంగారం దోచుకెళ్లిన విషయం తెలిసిందే! ఐతే ఈ దోపిడీకి పాల్పడిన నిందితుడిని తమిళనాడు పోలీసులు అనతికాలంలోనే అరెస్ట్ చేశారు. ఐదు రోజుల పాటు ముమ్మర గాలింపులు చేసిన పోలీసులు నిందితుడి పట్టుకుని, అతని వద్ద బంగారు ఆభరణాలను స్వాదీనం చేసుకున్నారు. కొసమెరుపేంటంటే... యూట్యూబ్ వీడియోలు చూసి దోచుకోవడం ఎలాగో నేర్చుకుని పక్కాప్లాన్‌తో పనికానించాడీ ఈ ఘరానా దొంగ. డిసెంబర్ 15న జోస్ ఆలుక్కాస్ జ్యువెలరీ షాపు గోడ పగులగొట్టి, లోపలున్న15 కిలోల బంగారు ఆభరణాలను దుండగులు దోచుకెళ్లారు. ఐతే సీసీటీవీ ఫుటేజీలో ఓ వ్యక్తి సింహం ముసుగు ధరించి, స్ప్రే పెయింట్‌తో సీసీటీవీ కెమెరాల రికార్డింగ్‌ను ఆపేందుకు ప్రయత్నించినట్లు కనిపించింది. ఈ దోపిడీ ఘటనకు సంబంధించి పోలీసులకు మాత్రం అనేక అనుమానాలు తలెత్తాయి. ఆ ప్రాంతంలో అనుమానాస్పదంగా ఎవరూ కనిపించకపోవడే అందుకు కారణం. దాదాపు 200 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన 8 పోలీస్ టీమ్‌లు ఐదు రోజుల పాటు తీవ్రంగా గాలించి సోమవారం నాడు నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడు కూచిపాళయం గ్రామానికి చెందిన టిఖారాం (22)గా గుర్తించారు. యూట్యూబ్‌లో వీడియోలు చూసి దోపిడీకి ప్లాన్ చేసినట్లు, జ్యువెలరీ షాపు గోడకు రంధ్రం చేసి, శబ్దం రాకుండా షాపులోకి ప్రవేశించేందుకు10 రోజులపాటు ప్రాక్టీస్చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అలాగే సీసీటీవీని ఎలా బ్లాక్ చేయాలో కూడా యూట్యూబ్‌లోనే నేర్చుకున్నాడట. వీలైనంత త్వరగా సంపన్నుడు కావాలని ఇంతటి పన్నాగంపన్నిన టిఖారాం అనూహ్యంగా పోలీసుల వలలో చిక్కుకోవడంతో గుట్టురట్టయ్యింది. అతని వద్ద నుంచి దాదాపు రూ.10 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలను పోలీసులు స్వాధీనంచేసుకుని, ఐపీసీ 457, 380 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసధికారి ఒకరు మీడియాకు తెలిపారు. -
పోలీసు అధికారులుండే అపార్ట్మెంట్లోనే భారీ చోరీ
కాజీపేట: ఇద్దరు ఏసీపీలు, ముగ్గురు సీఐలు, ఇద్దరు ఎస్సైలు నివాసముండే అపార్ట్మెంట్లోనే దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. ధనవంతులు, వ్యాపారులు, ఉద్యోగులుండే ప్రాంతం కావడంతో చుట్టూ సీసీ కెమెరాలున్నా దొంగలు దర్జాగా లోపలికి చొరబడి బంగారు నగలను మాత్రమే చోరీ చేసి వెండి నగలతోపాటు నగదును చిందరవందరగా పడేసి వెళ్లారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన హనుమకొండ జిల్లా కాజీపేట 61వ డివిజన్ వడ్డెపల్లి ట్యాంక్‌బండ్ ప్రాంతంలోని పీజీఆర్ అపార్ట్మెంట్లో జరిగింది. మూడు ఫ్లాట్లలో దాదాపు 190 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. స్థానిక సీఐ గట్ల మహేందర్‌రెడ్డి కథనం ప్రకారం... పీజీఆర్ అపార్ట్మెంట్లో 60 కుటుంబాలు ఉంటున్నాయి. 202 ఫ్లాట్‌లో ఉండే ‘నిట్’రిటైర్డ్ ప్రొఫెసర్ ఆర్వీ చలం, 203లో ఉండే వెలిచర్ల కుమార్, 102 ఫ్లాట్ వాస్తవ్యుడు మనీశ్‌కుమార్ ఇళ్లకు తాళాలు వేసి బంధుమిత్రుల ఇళ్లకు వెళ్లారు. ఇదే అదనుగా ఆదివారంరాత్రి దొంగలు వడ్డెపల్లి రిజర్వాయర్ ట్యాంక్‌బండ్ పైభాగం నుంచి ఫెన్సింగ్ కట్ చేసి లోపలికి దిగి వాచ్మెన్ గంగారపు కొమురయ్య ఇంటికి బయటి నుంచి గొళ్లెం పెట్టి అపార్ట్మెంట్లోకి చొరబడ్డారు. మూడు ఫ్లాట్లకున్న తాళాలను పగులగొట్టి బీరువాల్లోని దాదాపు 190 తులాల బంగారు నగలను ఎత్తుకెళ్లారు. సోమవారంరాత్రి తమ ఇళ్లలో దొంగతనం జరిగినట్లుగా సమాచారం అందుకున్న చలం ఇంటికి వచ్చి చూడగా పక్క ఫ్లాట్లలోనూ చోరీలు జరిగినట్లు గుర్తించారు. ఈ మేరకు బాధితులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ పుటేజీల ఆధారంగా నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని డీసీపీ పుష్ప తెలిపారు. -
బ్యాంకులో రూ. 2.23 కోట్ల బంగారం చోరీ
బాపట్ల: గుంటూరు జిల్లా బాపట్లలోని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ)లో రూ.2.23 కోట్ల విలువైన 5 కిలోలకుపైగా బంగారం మాయమైంది. ఈ బంగారాన్ని కాజేసినవారు ఒక ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో తాకట్టుపెట్టి రూ.60 లక్షలు తీసుకున్నారు. బ్యాంకు తాత్కాలిక ఉద్యోగి ప్యార్లీ సుమంత్‌రాజ్ పరారీలో ఉన్నాడు. దీనికి సంబంధించి ఇద్దరు అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్యాంకులో తాము కుదువపెట్టిన బంగారం మాయం కావడంతో ఖాతాదారులు సోమవారం బ్యాంకు వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకు తాత్కాలిక ఉద్యోగి సుమంత్‌రాజ్ సూత్రధారిగా ఈ చోరీ జరిగినట్లు డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు సోమవారం స్థానిక టౌన్ పోలీసు స్టేషన్లో విలేకరులతో చెప్పారు. తమ బ్యాంకులో ఖాతాదారులు కుదువ పెట్టుకున్న రూ.2.23 కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయని బ్యాంక్ ఆఫ్ బరోడా రీజనల్ మేనేజర్ విద్యాసాగర్ ఆదివారం రాత్రి ఫిర్యాదు చేశారని తెలిపారు. పరారీలో ఉన్న సుమంత్‌రాజ్ కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని, ఈ వ్యవహారంలో ఇంకా ఎవరి పాత్ర ఉందనే విషయాన్ని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. చోరీచేసిన 5 కిలోల 8 గ్రాముల బంగారంలో 80 శాతాన్ని ఓ ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు పెట్టి రూ.60 లక్షలు తీసుకున్నట్లు గుర్తించారు. తాకట్టు పెట్టేందుకు సహకరించారనే అనుమానంతో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సీఐలు పి.కృష్ణయ్య, కడప శ్రీనివాసరెడ్డి, ఎస్.ఐ.లు మహ్మద్‌రఫీ, వెంకటప్రసాద్ తదితరులు దర్యాప్తు చేస్తున్నారు. చోరీ బయటపడింది ఇలా.. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ చోరీ గురించి నిందితుడే బయటపెట్టాడు. సాధారణంగా బ్యాంకులో బంగారు ఆభరణాలపై ఏడాదిలో రెండు, మూడుసార్లు శాఖాపరమైన ఆడిట్ నిర్వహిస్తారు. బాపట్ల బీవోబీలో ఆభరణాలను తనిఖీ చేసేందుకు అధికారులు వస్తున్నట్లు ఈనెల ఒకటో తేదీన ప్రకటించారు. ఈ నేపథ్యంలో సుమంత్‌రాజ్ ఒకటి, రెండో తేదీల్లో విధులకు హాజరుకాలేదు. తన విషయం బయటపడి ఉంటుందని భావించిన అతడు మూడోతేదీన బ్యాంకు ఉద్యోగి ఒకరికి.. తాను తన తల్లికి ఆపరేషన్ చేయించేందుకు బంగారు ఆభరణాలు తీసుకున్నానని వాట్సాప్ ద్వారా సమాచారం ఇచ్చాడు. ఆ ఆభరణాలను ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు పెట్టేందుకు సహకరించిన ఇద్దరి పేర్లను మరో మెసేజ్‌లో తెలిపినట్లు సమాచారం. దీంతో బ్యాంకు అధికారులు రీజనల్ మేనేజర్‌కు సమాచారం ఇచ్చి శాఖాపరమైన విచారణ చేపట్టారు. మొత్తం రూ.2.23 కోట్ల విలువైన ఆభరణాలు చోరీ అయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కోవిడ్ శవాలనూ, కొనఊపిరితో ఉన్నవారినీ వదల్లే
సాక్షి, గచ్చిబౌలి: గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రిలో కోవిడ్ కేర్ టేకర్లుగా పనిచేసిన భార్యభర్తలు ఆ వృత్తికే కళంకం తెచ్చారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న రోగులతో పాటు కోవిడ్‌తో చనిపోయిన వారి మృతదేహాల నుంచీ నగలు, సొత్తు కాజేశారు. మొత్తం ఏడు కేసులు నమోదైన ఉన్న వీళ్లని ఇలా చోరీ చేసిన సెల్‌ఫోన్ ఆధారంగానే గచ్చిబౌలి పోలీసులు పట్టుకున్నారు. మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ వెంకటేశ్వర్లు పూర్తి వివరాలు వెల్లడించారు. 2017లో నాగర్‌కర్నూల్ జిల్లా ధర్మపురికి చెందిన చింతపల్లి రాజు, లతశ్రీ ప్రేమ వివాహం చేసుకుని కూకట్పల్లి రాజీవ్ గృహకల్పలో నివాసం ఉంటున్నారు. క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్న రాజును సెకండ్ వేవ్ సమయంలో వైద్య సిబ్బంది జగద్గిరిగుట్ట నుంచి టిమ్స్‌కు తీసుకొచ్చేందుకు నియమించుకున్నారు. ఇలా ఏర్పడిన పరిచయాలతోనే తన భార్య లతశ్రీని టిమ్స్‌లో పేషెంట్ కేర్ టేకర్‌గా చేర్చాడు. కొన్నాళ్లకు రాజు కూడా అలాంటి ఉద్యోగంలోనే చేరాడు. అప్పుల్లో కూరుకుపోయిన వారి దృష్టి టిమ్స్‌లోని కోవిడ్ రోగులపై ఉన్న బంగారు ఆభరణాలపై పడింది. ఏప్రిల్ 17–మే 25 మధ్య ఏడు నేరాలు చేశారు. లతశ్రీ ముందుగా మృతదేహాలు ఉన్న చోటుకు వెళ్లి పరిశీలించేది. అక్కడ ఎవరూ లేకపోతే తన భర్త రాజును పిలిచేది. అక్కడకు వెళ్లే అతగాడు శవాలపై ఉన్న నగలు తీసి జేబులో వేసుకుని ఏమీ తెలియనట్లు డ్యూటీ చేసేవాడు. ఈ సొత్తును జగద్గిరిగుట్టలోని జగదాంబ జువెల్లర్స్‌లో కుదువ పెట్టి అప్పులు తీర్చడంతో పాటు జల్సాలు చేశారు. కేసు వివరాలను వెల్లడిస్తున్న మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు కోవిడ్‌తో మరణించిన ఉప్పరపల్లికి చెందిన ఉమాదేవి నుంచి మూడు తులాల బంగారు పుస్తెల తాడు, చెవి దిద్దులు, యూసూఫ్‌గూడకు చెందిన పరహత్ సుల్తానా ఒంటిపై ఉన్న మూడు తులాల బంగారు గాజులు, దిద్దులు, జవహర్‌నగర్‌కు చెందిన భిక్షపతి తల్లి మెడలోంచి గుండ్ల మాల తస్కరించారు. నాచారానికి చెందిన కోటమ్మ ఐసీయూలో ఉండగానే ఆమె ఒంటిపై ఉన్న నాలుగు బంగారు గాజులు కాజేశారు. ఈమెను మరో హాస్పిటల్‌కు తరలిస్తుండగా ఈ విషయం గుర్తించారు. ఈ మేరకు గచ్చిబౌలి పోలీసుస్టేషన్లో మొత్తం ఏడు కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది మే చివరి వారం నుంచి ఈ భార్యభర్తలు టిమ్స్‌లో డ్యూటీకి వెళ్లడం మానేశారు. ఓ మృతదేహం నుంచి వీళ్లు ఆభరణాలతో పాటు సెల్‌ఫోన్ కూడా తస్కరించారు. ఇటీవల దీన్ని ఆన్ చేయడంతో పోలీసులకు క్లూ లభించి ఇద్దరూ చిక్కారు. విచారణలో తాము చేసిన నేరాలు అంగీకరించారు. వీరి నుంచి పది తులాల బంగారం సహా రూ.10 లక్షల విలువైన సొత్తు స్వాదీనం చేసుకున్నారు. మరో రెండు సంస్థల్లో తాకట్టు పెట్టిన నాలుగు బంగారు గాజులు స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. నిందితుల్ని పట్టుకున్న గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ గోనె సురేష్ తదితరుల్ని అభినందించిన డీసీపీ రివార్డు ప్రకటించారు. -
అప్పులు తీర్చుకునేందుకు చోరీకి పాల్పడిన నేవీ సైలర్
-
చోరీకి పాల్పడిన నేవీ అధికారి.. సొత్తును పొదల్లో దాచి.. చివరికి
అతను రక్షణ రంగంలో ఉద్యోగి. ప్రేమ వివాహంతోపాటు ఉమ్మడి కుటుంబం. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. షేర్ మార్కెట్ అలవాటు అతన్ని తప్పుడు ఆలోచనలకు దారి తీసింది. పర్యావసానంగా ఓ బంగారం దుకాణంలో చోరీకి పాల్పడ్డాడు. పెళ్లి నాడు నాతిచరామి అని ప్రమాణం చేసి నట్టు ఈ దొంగతనంలో భార్య సహకారాన్ని కూడా తీసుకున్నాడు. చివరికి ఇద్దరు కలిసి పోలీసులకు చిక్కారు. సాక్షి, విశాఖపట్నం: బిహర్‌కు చెందిన రాజేష్ ఇండియన్ నేవీలో సైలర్‌గా పనిచేస్తున్నాడు. ఇతని భార్య అమ్రిత పూనమ్.. వీరిద్దరిదీ ప్రేమ వివాహం. కాగా రాజేష్‌ది ఉమ్మడి కుటుంబం. అక్క, చెల్లెలు, అమ్మ నాన్నతో కలిసి ఏడుగురు సంతానం. దీనికి తోడు ఇటీవల షేర్ మార్కెట్లో చాలావరకు డబ్బు పోగొట్టుకున్నాడు. మొత్తంగా దాదాపు 10 లక్షలు అప్పులు పాలయ్యాడు. ఈ దశలో విశాఖ నుంచి ముంబైకి బదిలీ అయింది. అప్పుల బెడద తీవ్రం కావడంతో రాజేష్ తప్పుడు ఆలోచనలు చేశాడు. గోపాలపట్నం సమీపంలో ఉన్న శ్రీ జ్యుయలరీలో చోరీకి పాల్పడ్డాడు. 4.50 కిలోల వెండితో పాటు 90 వేల నగదుతోపాటు కొంత బంగారు నగలు చోరీ చేశాడు. ఈ చోరీ సొత్తును నేరుగా ఇంటికి తీసుకు వెళ్ళకుండా ఎయిర్‌పోర్టు సమీపంలో ఉన్న పొదలో దాచారు. కానీ బంగారు దుకాణంలో చోరీపై విచారణ చేసిన పోలీసులకు సీసీఫుటేజ్‌లో రాజేష్ అతని భార్య ఆనవాళ్లు బయటపడ్డాయి. దీంతో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. చదవండి: బార్లో వ్యభిచారం.. ఇద్దరు యువతులు, నిర్వాహకుల అరెస్ట్ -
భారీ దోపిడీని ఛేదించిన చిత్తూరు పోలీసులు
-
ఊరు వెళ్లొచ్చే లోపల 1.2 కేజీల బంగారం చోరీ
తిరువొత్తియూరు: ఆదంబాకంలో ప్రైవేటు సంస్థ అధికారి ఇంట్లో 1.22 కేజీల బంగారు, వెండి వస్తువులు చోరీ అయ్యాయి. వివరాలు..జీవన్ నగర్ మూడో వీధికి చెందిన గణేష్ (59) పెరుంగుడిలోని ఓ ప్రైవేటు సంస్థను నడుపుతున్నాడు. ఈ నెల 17వ తేదీ ఇంటికి తాళం వేసుకుని కుటుంబంతో సొంత ఊరు తూత్తుకుడి జిల్లా తిరుచందూర్ వెళ్లాడు. సోమవారం ఉదయం గణేశ్ ఇంటి తలుపులు పగలగొట్టి ఉండడంతో పక్కింటి వారు గణేష్‌కు సమాచారం అందించారు. దీంతో అతను ఆన్లైన్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి విచారణ చేశారు. ఇంటిలో ఉన్న రెండు బీరువాలు పగలగొట్టి 150 సవర్ల నగలు, వెండి వస్తువులు, రూ. 4 వేలు చోరీ అయినట్టు తెలిసింది. మరో సంఘటన ఆదంబాకం జీవన్ నగర్ మొదటి వీధికి చెందిన వినోద్ ఇంటికి తాళాలను గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి పగులగొట్టి బీరువాలో ఉన్న మూడు సవర్ల నగలు, వెండి వస్తువులు చోరీ చేశారు. ఈ రెండు సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలిస్తున్నారు. చదవండి: బూతులు తిడుతూ, రెస్టారెంట్ సిబ్బందిని చితక్కొట్టిన మహిళలు -
దొంగల కుటుంబం: వారి టార్గెట్ అదే..
సాక్షి, సిటీబ్యూరో (హైదరాబాద్): ఓ కుటుంబ సభ్యులు, బంధువులు ఆరుగురు కలిసి ముఠాగా ఏర్పడ్డారు. ఓ సభ్యుడికి చెందిన ఆటోలో తిరుగుతూ బంగారం దుకాణాలను టార్గెట్‌గా చేసుకున్నారు. కస్టమర్లుగా నటిస్తూ వ్యాపారుల దృష్టి మళ్లించి బంగారం, వెండి ఆభరణాలు తస్కరిస్తున్నారు. నెల రోజుల్లో మూడు నేరాలు చేసిన ఈ ముఠాను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారని ఓఎస్డీ రాధాకిషన్‌రావు సోమవారం తెలిపారు. ♦ప్రకాశం జిల్లాకు చెందిన వై.రేణుక, ఆమె సమీప బంధువులు ఎం.కిరణ్, వై.రాజు, అతడి భార్యలు తులసి, శ్వేత, మరో బంధువు రాణి 15 ఏళ్ల క్రితం నగరానికి వలసవచ్చారు. ♦హయత్‌నగర్ ప్రాంతంలో స్థిరపడిన వీరు తొలినాళ్లల్లో చిన్నచిన్న పనులు చేసినా... ఆపై తేలిగ్గా డబ్బు సంపాదించడానికి నేరాలు చేయాలని నిర్ణయించుకున్నారు. రేణుక నేతృత్వంలో వీరు ముఠా కట్టారు. ♦ఈ ఐదుగురూ కిరణ్‌కు చెందిన ఆటోలో నగరంలో తిరుగుతూ దారిలో కనిపించిన జ్యువెలరీ దుకాణాల్లో తమకు అనువుగా ఉన్న దాన్ని ఎంచుకుంటారు. ♦వినియోగదారుల మాదిరిగా అందులోకి ప్రవేశిస్తారు. ఒకరు నగలు, వస్తువులు చూపించాల్సిందిగా యజమానికి చెప్తారు. ఆయన ఆ పనిలో ఉండగా మిగిలిన వారు అతడి దృష్టి మళ్లించి చేతికి చిక్కిన బంగారు, వెండి వస్తువులు తస్కరిస్తారు. ♦వీటిని తమ వస్త్రాల లోపలి భాగాల్లో ప్రత్యేకంగా కుట్టించిన అరల్లో పెట్టుకుని ఆ దుకాణం నుంచి బయటకు వచ్చేస్తారు. ఆపై అంతా కలిసి తమ ఆటోలోనే ఉడాయిస్తారు. చోరీ సొత్తును విక్రయించి వచి్చన సొమ్ము పంచుకునేవారు. ♦ఇదే తరహాలో చిక్కడపల్లిలోని రామ్‌స్వరూప్ జ్యువెలర్స్ నుంచి 600 గ్రాముల వెండి ఆభరణాలు, నాచారంలోని ఓమ్‌సాయి జ్యువెలర్స్ నుంచి 50 తులాల వెండి ఆభరణాలు, తుకారామ్‌గేట్‌లోని త్రిషాల్ జ్యువెలర్స్ నుంచి 400 గ్రాముల వెండి తస్కరించారు. ♦తుకారాంగేట్ కేసును ఛేదించడానికి నార్త్‌జోన్ టాస్‌్కఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వరరావు నేతృత్వంలో ఎస్సైలు కె.శ్రీకాంత్, జి.రాజశేఖర్‌రెడ్డి, బి.పరమేశ్వర్‌లతో కూడిన బృందం దర్యాప్తు చేసింది. ♦సోమవారం ఆరుగురినీ పట్టుకుని వీరి నుంచి ఆటోతో పాటు 1070 గ్రాముల వెండి ఆభరణాలు, సెల్ఫోన్లు స్వా«దీనం చేసుకుంది. వీటి విలువ రూ.2.5 లక్షల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. నిందితుల్ని తుకారాంగేట్ పోలీసులకు అప్పగించింది. ♦ఈ ముఠాకు చెందిన రేణుకపై గతంలో వివిధ పోలీసుస్టేషన్లలో 13 కేసులు, కిరణ్‌పై 3, తులసిపై 8, శ్వేతపై 3, రాజుపై 2 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కొన్ని పోలీసుస్టేషన్లలో వీళ్లు వాంటెడ్‌గా ఉన్నట్లు పేర్కొన్నారు. చదవండి: కూకట్‌పల్లిలో పట్టుబడ్డ గంజదొంగ బంపరాఫర్.. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ -
17 కేజీల బంగారం చోరి.. అడ్డొచ్చిన తల్లీ,కుమారుడి హత్య
సాక్షి, చెన్నై: శీర్గాలిలో దొంగలు బీభత్సం సృష్టించారు. బుధవారం ఓ నగల వ్యాపారి ఇంట్లోకి చొరబడి నలుగురిపై కత్తులతో దాడి చేశారు. ఇంట్లో ఉంచిన 17 కేజీల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. దాడిలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రంగంలోకి దిగిన పోలీసులు ఓ దొంగను ఎన్కౌంటర్ చేయగా, మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. మైలాడుతురై జిల్లా శీర్గాలి రైల్వేస్టేషన్ రోడ్డులో నగల వ్యాపారి ధనరాజ్ (50), ఆయన భార్య ఆశ(48), కుమారుడు అఖిల్(25), కోడలు నిఖిల(24) నివసిస్తున్నారు. బుధవారం వేకువజామున 6 గంటలకు దుండగులు ఆయన ఇంటి తలుపుతట్టారు. హిందీలో ఏదో అడుగుతున్నట్టుగా నటించి క్షణాల్లో ఆయనపై దాడి చేశారు. ఇంట్లోకి చొరబడ్డ దుండగులు ఆశ, అఖిల్, నిఖిలపై దాడి చేశారు. ఇనుప రాడ్డుతో విచక్షణా రహితంగా కొట్టి కత్తులతో పొడిచారు. అనంతరం బీరువాలో ఉంచిన 17 కేజీల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఇంట్లోని సీసీ కెమెరాలను ధ్వంసం చేసి బయట పార్క్ చేసిన ధనరాజ్ కారులో ఉడాయించారు. తక్షణం స్పందించిన పోలీసులు దనరాజ్ కేకలతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే ఆశ, అఖిల్ మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ ధనరాజ్, నిఖిలను ఆస్పత్రికి తరలించారు. ఎస్పీ శ్రీనాథ్, డీఎస్పీ యువప్రియ, ఇన్స్పెక్టర్ మణియన్, ఎస్ఐ మణిగండ గణేషన్ నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగింది. ధనరాజ్ కారులో ఉన్న జీపీఎస్ ఆధారంగా వారిని వెంబడించారు. ఎలుగురులో కారును వదలిపెట్టిన దుండగులు, అక్కడి నుంచి పంట పొలాల మీదుగా వెళ్లారు. కరుప్పన్నతోట్టంలో భుజాన ఓ సంచి వేసుకుని అనుమానాస్పదంగా ఉత్తరాది యువకులు తిరుగుతున్నట్టు పోలీసులకు గ్రామస్తులు సమాచారం అందించారు. అక్కడున్న ముగ్గురు యువకుల్లో ఒకరు పోలీసులను చూడగానే తనవద్దనున్న తుపాకీతో ఫైరింగ్ చేయడం మొదలెట్టాడు. దీంతో ఆత్మ రక్షణకు పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఒకరు హతమయ్యాడు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుండగుల కాల్పుల్లో స్పెషల్ టీం పోలీసులు ఇద్దరు గాయపడ్డారు. అన్ని తెలిసిన వాడే... పోలీసుల ఎన్కౌంటర్లో మణిపాల్ సింగ్ (24) హతమయ్యాడు. ఉత్తరాదికి చెందిన ఇతను గతంలో ధనరాజ్ వద్ద పనిచేశాడు. ధనరాజ్ వ్యాపారం గురించి పూర్తిగా తెలిసిన వాడు. ఇటీవల ఓ తప్పు చేసి అడ్డంగా బుక్కవడంతో పని నుంచి తొలగించారు. దీంతో తంజావూరులోని ఓ దుకాణంలో పనిచేస్తున్న ఉత్తరాదికి చెందిన మిత్రులు మనీష్(22), రమేష్(22)తో కలిసి దోపిడీకి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. లలితాలో 5 కేజీల బంగారం అపహరణ చెన్నై హబీబుల్లా రోడ్డులో లలిత జ్యువెలర్స్ ఉంది. ఇక్కడ ఆభరణాల లెక్కింపు సమయంలో 5 కేజీల బంగారం మాయమైంది. ఇక్కడ పని చేస్తున్న రాజస్థాన్‌కు చెందిన ప్రవీణ్‌కుమార్ సింగ్ చేతివాటం ప్రదర్శించి ఉండడం సీసీ కెమెరాలో నమోదైంది. తేనాంపేట పోలీసులు విచారణ చేపట్టారు. బంగారంతో ప్రవీణ్‌కుమార్ రాజస్థాన్‌కు ఉడాయించడంతో అతడి కోసం ప్రత్యేక బృందం బుధవారం అక్కడికి వెళ్లింది. -
తొలి రోజే 24 కాసుల బంగారంతో ఉడాయింపు
అమలాపురంలో పక్షవాతంతో మంచానికే పరిమితమైన ఓ వృద్ధురాలి వద్ద పని మనిషిగా చేరిన ఓ మాయ‘లేడీ’.. 24 గంటలు కాకముందే తన చేతివాటాన్ని చూపింది. ఆ వృద్ధురాలికి చెందిన రూ.ఎనిమిది లక్షల విలువైన 24 కాసుల బంగారు నగలు, రూ.20 వేల నగదు చోరీ చేసి ఉడాయించింది. సాక్షి, అమలాపురం టౌన్ : పట్టణంలోని కల్వకొలనువీధికి చెందిన పటచోళ్ల అనంతలక్ష్మి అనే 80 ఏళ్ల వృద్ధురాలి వద్ద పనిమనిషిగా చేరిన విజయవాడకు చెందిన మేరీ సునీత అనే మహిళ ఈ చోరీకి పాల్పడింది. అనంతలక్ష్మి పక్షవాతంతో కదల్లేని పరిస్థితుల్లో మంచంపైనే ఉండి చికిత్స పొందుతోంది. ఆమెకు పిల్లలు లేకపోవడంతో బంధువులు విజయవాడకు చెందిన పనిమనుషులను కుదిర్చే ఓ కన్సల్టెన్సీ సంస్థను సంప్రదించారు. ఆ సంస్థ విజయవాడ నుంచి మేరీ సునీత అనే మహిళను అమలాపురంలోని అనంతలక్ష్మి ఇంటికి ఆదివారం పంపించింది. పనిలో చేరిన ఆమెకు వృద్ధురాలికి ఎలాంటి సపర్యలు చేయాలో బంధువులు చెప్పి వెళ్లిపోయారు. ఆ ఇంట్లో వృద్ధురాలు, తాను మాత్రమే ఉండడాన్ని అవకాశంగా భావించిన ఆ మాయలేడీ వృద్ధురాలి ఒంటిపైన, బీరువాలో ఉన్న బంగారు నగలపై కన్నేసింది. ఆదివారం అర్ధరాత్రి దాటక వృద్ధురాలి ఒంటిపైన, బీరువాలో ఉన్న 24 కాసుల బంగారు నగలను పట్టుకుని పరారైంది. సోమవారం ఉదయం పని మనిషి కనిపించకపోవడంతో పాటు ఇంట్లో నగలు మాయకావడంతో అది ఆ మహిళ చేసిన పనేనని బంధువులు నిర్ధారణకు వచ్చారు. పనికి కుదిర్చిన కన్సల్టెన్సీ సంస్థను సంప్రదించినా ఆమె గురించి సరైన సమాచారం రాలేదు. దీంతో పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. డీఎస్పీ పడాల మురళీకృష్ణారెడ్డి, పట్టణ సీఐ ఎస్కే బాజీలాల్ ఆ వృద్ధురాలి ఇంటిని సందర్శించి ఆమెను విచారించారు. పనిమనిషిగా వచ్చిన మహిళ ఆచూకీ కోసం రెండు పోలీసు బృందాలను నియమించారు. హైదరాబాద్, విజయవాడలకు సోమవారం ఉదయమే ఆ రెండు పోలీసు బృందాలు బయల్దేరాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. విజయవాడకు చెందిన కన్సల్టెన్సీ సంస్థను కూడా విచారించనున్నారు. 24 కాసుల బంగారు నగలతో పాటు, రూ.20 వేల నగదు కూడా ఆ మహిళ దోచుకుపోయిందని వృద్ధురాలి బంధువులు అంటున్నారు. -
ఇంటి దొంగలను పట్టుకున్న పోలీసులు
ఆత్మకూరు: పట్టణంలోని తూర్పువీధిలో అలఘనాథస్వామి ఆలయం సమీపంలోని ఓ ఇంట్లో బంగారు ఆభరణాలు, నగదు చోరీకి గురయ్యాయి. దీనిపై మంగళవారం విచారణ చేపట్టిన ఆత్మకూరు పోలీసులు గంటల వ్యవధిలోనే దొంగలను పట్టుకున్నారు. పోలీసుల వివరాల మేరకు ఆత్మకూరులోని తూర్పువీధికి చెందిన షేక్ ఖమ్రూన్ జాన్ ఇంట్లో 6 సవర్ల బంగారు ఆభరణాలతోపాటు రూ.3 వేల నగదు చోరీకి గురైనట్లు మంగళవారం ఉదయం కుటుంబసభ్యులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ వైవీ సోమయ్య, ఎస్సై రవినాయక్ తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఇంటికి తాళాలు వేసి ఉండగా చోరీ జరగడంతో వారు అనుమానించి ఇది ఇంటి దొంగల పనేనని భావించారు. ఖమ్రూన్ జాన్ సోదరుడి కుమారుడి వివాహం ఆదివారం జరగడంతో పలువురు బంధువులు వివాహానికి వచ్చి రెండు రోజులపాటు వీరి ఇంట్లో కూడా విశ్రమించడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించారు. బాధితురాలి సోదరి నూర్జహాన్ దంపతులు ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించి ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాగా నూర్జహాన్ గతంలోనే పలు చిన్నచిన్న దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో తెలిసింది. -
మా అమ్మ జ్ఞాపకాలను కొట్టేశారు
సాక్షి, హైదరాబాద్: ఆ ఇంట్లో ఓపెద్దావిడకు కరోనా సోకింది. బాధితురాలిని ఆసుపత్రిలో చేర్చుకున్న వైద్యులు ఆమె కుటుంబ సభ్యులను క్వారంటైన్లో ఉండాల్సిందిగా సూచించారు. అయితే మూడు రోజుల అనంతరం ఆమె మృతి చెందిందని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఈ పరిస్థితుల్లో అంత్యక్రియలు కూడా ఆస్పత్రి వారే చేయాలని కుటుంబ సభ్యులు చెప్పడంతో అంత్యక్రియలు చేశారు. అయితే సదరు మహిళ చెవి కమ్మలు, బంగారు ఉంగరం, మెడలోని గొలుసు మాయమయ్యాయి. అవెక్కడని కుటుంబ సభ్యులు నిలదీయగా ఆస్పత్రి వర్గాలు నోరెళ్లబెట్టాయి. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఘటన వివరాలు ఇలా ఉన్నాయి... కోఠి, గిరిరాజ్ లేన్‌లో ఉంటున్న ఇందిరాదేవి(73) కరోనా బారిన పడటంతో ఈ నెల 23న బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని సెంచురీ ఆస్పత్రిలో చేర్చారు. ఆమెకు పాజిటివ్ వచ్చినందున కుటుంబ సభ్యులను ఎవరినీ ఆస్పత్రికి రావొద్దని ఇంట్లోనే సెల్ఫ్ క్వారంటైన్ కావా లని వైద్యులు సూచించారు. దీంతో ఇందిరాదేవి కుమారుడు ప్రకాశ్ బెల్దెతో పాటు కుటుంబ సభ్యులంతా క్వారంటైన్లో ఉన్నారు. కాగా ఇందిరాదేవి చికిత్స పొందుతూ ఈ నెల 25న మృతి చెందిందని వైద్యులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అంత్యక్రియలు కూడా ఆస్పత్రి వారే చేయాలని చెప్పడంతో అందుకు అంగీకరించారు. అంత్యక్రియలను వీడియో కాల్ ద్వారా కుటుంబ సభ్యులు వీక్షించారు. ఆస్పత్రిలో చేర్పించే సమయంలో ఇందిరాదేవి చెవికి వజ్రాలు పొదిగిన కమ్మలతో పాటు, వేలికి ఉంగరం, మెడలో గొలుసు ఉండాలని ఆమె చనిపోయిన తర్వాత అవి కనిపించలేదని కుమారుడు ఉదయ్ ప్రకాశ్ ఆస్పత్రి యాజమాన్యాన్ని నిలదీయగా, ఆస్పత్రిలో చేరేటప్పుడు ఆభరణాలు ఉన్నాయని అవి ఎలా పోయాయో తాము విచారణ చేస్తామని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. తమ తల్లి జ్ఞాపకాలను తస్కరించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రకాశ్ బెల్దె బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
నగలు మాయం చేసిన తోడి కోడలు
చిట్టినగర్(విజయవాడ పశ్చిమ): బీరువాలో నగలు మాయం చేసిన తోడి కోడలిని కొత్తపేట పోలీసులు గురువారం అరెస్టు చేశారు. సీఐ ఎండీ ఉమర్ చేసిన వివరాలు.. మహాంతిపురానికి చెందిన సుతారి వాణి, రఘుబాబు ఇంట్లో 30 కాసుల బంగారపు వస్తువులు మాయమయ్యాయి. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు తోటి కోడలైన వించిపేటకు చెందిన సుతారి శ్రీలతను అదుపులోకి తీసుకుని ఆమె వద్ద నుంచి బంగారం నగలు స్వాధీనం చేసుకున్నారు. శ్రీలత భర్త రవిబాబు, రైల్వే స్టేషన్ వెస్ట్ బుకింగ్ వద్ద టిఫిన్ బండి నడుపుతుంటాడు. శ్రీలత ఫిజియోథెరపీ ఉద్యోగం చేస్తోంది. గత కొంత కాలంగా వ్యాపారాలు లేకపోవడం, ఆర్థిక ఇబ్బందుల కారణంగానే నిందితురాలు చోరీకి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితురాలిని అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. ఆయన వెంట ఎస్ఐ కృష్ణ ఉన్నారు. -
మాయమాటలు చెప్పి బంగారం అపహరణ
సాక్షి, కల్వకుర్తి : వృద్ధ దంపతులకు మాయమాటలు చెప్పి, వారి వద్ద నుంచి 4 తులాల బంగారం అపహరించిన సంఘటన శనివారం పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం. మండలంలోని యంగంపల్లికి చెందిన ఇద్దరు వృద్ధ దంపతులు కల్వకుర్తికి వారి సొంత పని నిమిత్తం వచ్చారు. పట్టణంలోని మహబూబ్‌నగర్ చౌరస్తాకు చేరుకున్న వృద్ధల వద్దకు ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు చేరుకుని వృద్ధ దంపతులతో మాటమాట కలిపారు. మీకు లాటరీ వచ్చిందని, మాయమాటలు చెప్పి నమ్మించారు. బ్యాంక్‌కు వెళ్తే మీకు లాటరీకి సంబంధించిన డబ్బులు ఇస్తారని, ఒంటి మీద ఉన్న బంగారాన్ని తీసి వెళ్లండని చెప్పి నమ్మించి పట్టణంలోని ఓ బ్యాంక్‌కు తీసుకెళ్లారు. అనంతరం భర్తను బయట ఉంచి, భార్యను లోనికి వెళ్లమని చెప్పి పంపించారు. ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఆ వృద్ధుడి వద్దకు వెళ్లి మీ భార్య బంగారాన్ని తీసుకొని రావాలని చెప్పిందని, అతని వద్ద ఉన్న బంగారాన్ని తీసుకొని ఇద్దరూ ఉడాయించారు. బంగారంతో ఉడాయించిన వ్యక్తులతో వృద్ధ దంపతులు మోసపోయామని గ్రహించి, లబోదిబోమన్నారు. వెంటనే దంపతులిద్దరూ వారికి జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించారు. వివరాలు తీసుకున్న పోలీసులు, వారి వద్ద నుంచి ఫిర్యాదు స్వీకరించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ మహేందర్ తెలియజేశారు. -
గొంతు కోసి చంపేశాడు
ముమ్మిడివరం: ముమ్మిడివరంలో పట్టపగలు ఓ వృద్ధురాలి గొంతు కోసి అగంతకుడు బంగారు ఆభరణాలతో పరారయ్యాడు. స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం పక్కనున్న వీ«ధిలో విద్యుత్ శాఖలో లైన్ ఇన్స్పెక్టర్గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన విత్తనాల సత్యనారాయణ, అతని భార్య శ్యామల (65) నివాసం ఉంటున్నారు. సత్యనారాయణ శుక్రవారం ఉదయం నేరెళ్లపాలెంలో జరిగిన ఓ వివాహానికి వెళ్లగా శ్యామల ఇంట్లోనే ఉన్నారు. ఆ సమయంలో గుర్తుతెలియని అగంతకుడు ఇంట్లోకి ప్రవేశించి శ్యామల గొంతును కత్తితో కోసి మెడలోని బంగారు పుస్తెల తాడు, నల్ల పూసలు అపహరించుకు పోయాడు. ఇంటికి పని మనిషి వచ్చి ఎంత పిలిచినా రాకపోవడంతో తలుపులు తట్టి చూడగా మంచంపై నెత్తుటి మడుగులో శ్యామల పడి ఉండటాన్ని గమనించింది. ఈ విషయాన్ని చుట్టు పక్కల వారికి తెలియజేయడంతో వారు వైద్యుడిని పిలిచారు. ఆమె అప్పటికే మరణించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాకినాడ నుంచి క్లూస్ టీం వచ్చి వేలు ముద్రలు సేకరించింది. అమలాపురం డీఎస్పీ మసూమ్ బాషా, ముమ్మిడివరం సీఐ బి.రాజశేఖర్, ఎస్సై ఎం.పండుదొర సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. -
పిలవని పేరంటానికి వచ్చి
భువనేశ్వర్: దొంగతనానికి మార్గాలు అనేకం. పిలవని ఆతిథ్యానికి విచ్చేసి హుందాగా దోచుకుపోయిన దొంగ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఖండగిరి స్టేషన్ పోలీసులు ఆ దొంగను బుధవారం అరెస్టు చేసి నబిగా గుర్తించారు. నిందితుడి అనుచరుడి వివరాల్ని కూడా పోలీసులు ఖరారు చేసుకుని గాలిస్తున్నారు. నిందితుడి దగ్గర రూ. 3.98 లక్షల నగదుతో పాటు విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. స్థానిక చంద్రశేఖర పూర్ ప్రాంతంలోని కల్యాణ మండపంలో వివాహ విందు కార్యక్రమంలో నిందితుడు ఈ సొత్తును దోచుకున్నాడు. ఈ కార్యక్రమానికి నిందితుడికి ఎటువంటి ఆహ్వానం లేదు. వేదిక ప్రాంగణానికి హుందాగా విచ్చేసి ఆహ్వానం పొందిన అతిథులు సమర్పించిన కానుకలు, నగదును బ్యాగులో సర్దుకుని చల్లగా జారుకున్నాడు. ఈ సమగ్ర వృత్తాంతం వేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ రికార్డింగ్‌లో లభ్యమైంది. దీని ఆధారంగా వివాహ విందు ఏర్పాటు చేసిన వర్గం స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 29వ తేదీన జరిగిన వివాహ విందును పురస్కరించుకుని నిందితుడు దొంగతనానికి పాల్పడ్డాడు. -
మాజీ డ్రైవరే సూత్రధారి
సాక్షి, సిటీబ్యూరో: జూబ్లీహిల్స్ రోడ్ నెం.34లో నివసించే వ్యాపారవేత్త నసీర్ అలీఖాన్ ఇంట్లో చోటు చేసుకున్న చోరీ కేసును పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఛేదించారు. ఈ దొంగతనానికి ఆ ఇంట్లో పని చేసి మానేసిన డ్రైవరే సూత్రధారిగా తేల్చారు. మంగళవారం ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేశామని, వారి నుంచి చోరీ సొత్తు య«థాతథంగా స్వాధీనం చేసుకున్నామని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ పి.రాధాకిషన్‌రావుతో కలిసి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. ఆనుపానులన్నీ తెలుసుకుని.. బోరబండ ప్రాంతానికి చెందిన సయ్యద్ యూసుఫ్ మూడో తరగతితో చదువు మానేశాడు. కొన్నాళ్లు ఎస్సార్‌నగర్‌లో టైలరింగ్ పని చేసి.. 2007లో వివాహానంతరం డ్రైవర్‌గా మారాడు. తొలుత ఎస్సార్‌నగర్‌లోని ఓ ట్రావెల్స్‌లో పని చేసిన యూసుఫ్ ఆపై జూబ్లీహిల్స్‌కు చెందిన కన్స్ట్రక్షన్స్ వ్యాపారి నసీర్ అలీఖాన్ వద్ద డ్రైవర్‌గా చేరారు. 2013లో ఉద్యోగం కోసం సౌదీ వెళ్లి 2015లో తిరిగి వచ్చాడు. ఆ తర్వాత ఏడాది ఓలా క్యాబ్స్‌లో డ్రైవర్‌గా చేసినా.. మళ్లీ నసీర్ అలీఖాన్ వద్ద చేరాడు. గత ఏడాది జూలైలో మానివేసే సమయానికి రెండు దఫాల్లో దాదాపు ఎనిమిదేళ్లు నసీర్ అలీ ఖాన్ వద్ద పని చేశాడు. ఈ నేపథ్యంలోనే వారి ఇంట్లో అణువణువూ తెలిసి ఉండటంతో పాటు ఏ సమయంలో ఎలా ఉంటారనే దానిపైనా అవగాహన పెంచుకున్నాడు. ఇటీవల ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఇతగాడు తన మాజీ యజమాని ఇంట్లో చోరీ చేస్తే భారీ మొత్తం దక్కతుందని పథకం వేశాడు. ఈ విషయాన్ని తన స్నేహితులైన బోరబండ వాసులు షేక్ షాహిద్, సయ్యద్ షహబాజ్‌లకు చెప్పడంతో వాళ్లూ అంగీకరించారు. రంగంలోకి దిగిన ఈ త్రయం చోరీ చేస్తున్నప్పుడు ఎవరైనా అడ్డు వస్తే వినియోగించడానికి కత్తి, ఫెన్సింగ్ కట్ చేయడానికి భారీ కత్తెర ఖరీదు చేసుకున్నారు. నగలున్న హ్యాండ్‌బ్యాగుతో ఉడాయింపు.. అదను కోసం ఎదురు చూస్తున్న యూసుఫ్ ఇప్పటికీ నసీర్ అలీ ఖాన్ ఇంట్లో పని చేస్తున్న వారితో ఫోన్ ద్వారా సంభాషిస్తూ యజమానుల కదలికల్ని తెలుసుకుంటూ వచ్చాడు. ఏ దశలోనూ వారికి అనుమానం రాకుండా జాగ్రత్తపడ్డాడు. ఈ నెల 14న వీరికి ఫోన్ చేసిన యూసుఫ్ పనివాళ్ల ద్వారా తమ యజమానురాలు ఓ ఫంక్షన్‌కు వెళ్లినట్లు తెలుసుకున్నాడు. ఇలా వెళ్లిన ప్రతిసారీ ఆమె ఖరీదైన జ్యువెలరీ ధరిస్తారని, తిరిగి వచ్చిన తర్వాత అన్నీ తన హ్యాండ్‌బ్యాగ్‌లోనే ఉంచి బెడ్ పక్కనే పెట్టుకుంటారని తెలిసిన యూసుఫ్ రంగంలోకి దిగాడు. తన ఇద్దరు స్నేహితుల్నీ పిలిపించి అంతా కలిసి అర్ధరాత్రి వేళ ఆ ఇంటి వద్దకు వెళ్లారు. గోడ దూకి లోపలకు ప్రవేశించిన ఈ త్రయం సీసీ కెమెరాల్లో తమ కదలికలు కనిపించకుండా వాటిని పక్కకు తిప్పారు. నేరుగా రెండో అంతస్తులోని బెడ్రూమ్లోకి వెళ్లిన యూసుఫ్ అక్కడ ఉన్న హ్యాండ్ బ్యాగ్ తీసుకుని రావడంతో ముగ్గురూ కలిసి ఉడాయించారు. ఆ సమయంలో అదే ఇంట్లో ముగ్గురు పనివాళ్లు ఉన్నా.. వారికీ చోరుల ఉనికి తెలియలేదు. మరుసటి రోజు చోరీ విషయం గుర్తించిన నసీర్ అలీ ఖాన్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నేరగాళ్ల కోసం రంగంలోకి దిగిన వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ బి.గట్టుమల్లు నేతృత్వంలో ఎస్సైలు ఎన్.రంజిత్‌కుమార్, పి.మల్లికార్జున్, మహ్మద్ ముజఫర్ అలీ ముమ్మరంగా గాలించారు. ఎట్టకేలకు మంగళవారం ముగ్గురినీ పట్టుకుని రూ.10.10 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితుల్ని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. -
చెల్లి బంగారానికే ఎసరు..
చాంద్రాయణగుట్ట: సోదరి బంగారాన్ని కాజేసిన యువకుడిని చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ రుద్ర భాస్కర్, డీఐ కె.ఎన్.ప్రసాద్ వర్మతో కలిసి వివరాలు వెల్లడించారు. అల్ జుబేల్ కాలనీకి చెందిన సయ్యద్ యూసుఫ్ కుమారుడు సయ్యద్ అఫ్జల్ వస్త్రాల వ్యాపారం చేసేవాడు. 2019 నవంబర్ 5న తన ఇంట్లో జరిగిన శుభకార్యంలో పాల్గొనేందుకు అతడి సోదరి పుట్టింటికి వచ్చింది. అ సమయంలో అతనికి డబ్బులు అవసరం ఉండడంతో అఫ్జల్ ఆమెకు సంబంధించిన 11తులాల బంగారు నగలు, ఇంట్లో ఉన్న రూ.50 వేల నగదు తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీంతో కుటుంబసభ్యులు చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అఫ్జల్ నేరుగా గుల్బర్గ వెళ్లి, అక్కడి నుంచి బెంగుళూర్‌కు వెళ్లి రెండు నెలలు గడిపాడు. అగత జనవరిలో నగరానికి వచ్చిన అతను రూ.50 వేలతో వస్త్రాలు కొనుగోలు చేసి నాంపల్లిలోని ఓ లాడ్జిలో దిగాడు. అతడి ఫోన్ ఆన్ కావడంతో సిగ్నల్స్ ఆధారంగా ఏఎస్సై సుధాకర్ ఈ నెల 18న అతడిని అదుపులోకి తీసుకుని కుటుంబ సభ్యులకు అప్పగించాడు. ఈ విషయం తెలియడంతో వారి ఇంటికి వచ్చిన అతడి బావ తమ బంగారం తిరిగి ఇవ్వాలని కోరాడు. అయితే తాను తీసుకోలేదని చెప్పిన అఫ్జట్ మరోసారి ఎవరికీ చెప్పకుండా పరారయ్యాడు. దీంతో అతని బావ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించాడు. అతడి నుంచి 11 తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మధ్యప్రదేశ్‌లో చోరీ.. కాకినాడకు చేరి
తూర్పుగోదావరి, కాకినాడ క్రైం: మధ్యప్రదేశ్‌లోని ఓ హోటల్లో మారు తాళంతో బంగారు వ్యాపారి ఉండే రూమ్‌ను తెరచి రూ.2.300 కిలోల బంగారాన్ని దొంగిలించిన ఓ వ్యక్తిని కాకినాడలో త్రీటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వారి కథనం ప్రకారం.. చిత్తూరు జిల్లా కుప్పం గ్రామానికి చెందిన పిన్నిటి రమేష్‌బాబు కాకినాడలో కొన్ని సంవత్సరాలుగా ఇత్తడి వ్యాపారం చేస్తూ కాకినాడ రూరల్ మండలం సర్పవరం వివేకనగర్‌లో ఉంటున్నాడు. ఇతడు 20 రోజుల క్రితం మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ సిటీ, రాజ్వాడ్‌కు వెళ్లి హోటల్ పుష్కర్‌లో రూమ్ తీసుకొని ఆ హోటల్లో ఉన్న మిగిలిన రూములకు సంబంధించి నకిలీ తాళాలు తయారు చేయించారు. దీనిలో భాగంగా ఆ హోటల్లో బస చేసిన ఒక బంగారు వ్యాపారి రూమ్ తాళాన్ని తెరిచి ఆ రూమ్‌లో ఉన్న బంగారాన్ని రమేష్‌బాబు దొంగిలించాడు. దీనిపై మధ్యప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసు దర్యాప్తులో ముద్దాయి కాకినాడలో ఉన్నట్టు ఇండోర్ ఎస్పీ, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీకి తెలిపారు. దీనిపై అప్రమత్తమైన జిల్లా పోలీస్ యంత్రాంగం కాకినాడ ఎస్డీపీవో కరణం కుమార్‌ను అప్రమత్తం చేశారు. కాకినాడ మూడో పట్టణ పోలీసులు పలు చోట్ల దర్యాప్తు చేపట్టారు. ఇండోర్ పోలీసులు కాకినాడకు చేరుకోవడంతో త్రీటౌన్ శాంతి, భద్రతల విభాగం సిబ్బందితో కలసి సర్పవరం వివేకనగర్‌లో ఉన్న ముద్దాయి రమేష్‌బాబు ఇంటిని చెక్ చేయగా ఇండోర్ సిటీ, రాజ్వాడ్‌లోని హోటల్ పుష్కర్‌లో ముద్దాయి దొంగిలించి తీసుకొచ్చిన 2.300 కిలోల బంగారాన్ని సీజ్ చేసి ముద్దాయిని అరెస్టు చేసినట్టు డీఎస్పీ కరణం కుమార్, సీఐ శ్రీరామకోటేశ్వరరావు శుక్రవారం సాయంత్ర తెలిపారు. ముద్దాయి పిన్నిటి రమేష్‌బాబును నాలుగో అదనపు మొదటి న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా రిమాండ్ విధించినట్టు తెలిపారు. -
బంగారం రిక'వర్రీ'.!
బంగారం కుదువ పెట్టి రుణం తీసుకుంటే అవసరానికి ఉపయోగపడుతుందని భావించారు... తీరా బ్యాంకులో పెట్టిన బంగారం చోరీకి గురైంది. అధికారులు రికవరీ చేసి ఏడాదవుతున్నా... తమకు ఇంకా అందకపోవడంపై ఖాతాదారులు మండిపడుతున్నారు. అధికారుల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లా, బద్వేలు : పోరుమామిళ్ల స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గతేడాది మార్చి 29న భారీగా బంగారు నగలు, నగదు మాయమైన విషయం బయటకు వచ్చింది. బ్యాంకులో హెడ్ క్యాషియర్, గోల్డ్ ఇన్ఛార్జిగా పని చేస్తున్న గురుమోహన్‌రెడ్డి దీనికి బాధ్యుడిగా గుర్తించారు. దీనిపై ఉన్నతాధికారులు పరిశీలన జరిపి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగదుతో పాటు బంగారం చోరీకి గురైనట్లు తేల్చారు. ఈ బంగారమంతా బ్యాంకులో వ్యవసాయ అవసరాల కోసం పెట్టిన ఖాతాదారులకు చెందినది. పోలీసులు దర్యాప్తు చేపట్టి నెలన్నర వ్యవధిలోనే నిందితుడిని అరెస్టు చేశారు. ముత్తూట్, బజాజ్ ఫైనాన్స్‌లో కుదువ పెట్టిన బంగారంతో పాటు నిందితుడి వద్ద ఉన్న బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నారు. గతేడాది మే నెలలో పోలీసులు బంగారం రికవరీ చేసినా ఖాతాదారులకు మాత్రం అందలేదు. బ్యాంకుకు చేరినా... పోలీసులు కేసు నమోదు, దర్యాప్తు అనంతరం నాలుగు నెలల కిందట బ్యాంకు గ్యారెంటీ పెట్టుకుని నగలను బ్యాంకులో అప్పగించారు. అధికారులు సైతం నగలకు సంబంధించిన ఖాతాదారులను పిలిపించి వాటిని గుర్తింపజేశారు. త్వరలోనే తమ బంగారు అందుతుందని సంతోషపడ్డారు. కానీ బంగారు మాత్రం అందలేదు. దీనిపై ఉన్నతాధికారులను అడుగుతున్నా స్పందించడం లేదని వాపోతున్నారు. ఇదే విషయమై పోరుమామిళ్ల మాజీ ఎంపీపీ చిత్తా విజయప్రతాప్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ నాగార్జునరెడ్డి బాధితుల తరుఫున పలుమార్లు బ్యాంకు అధికారులతో చర్చించినా ఫలితం మాత్రం కనిపించడం లేదు. అధిక వడ్డీ కట్టాలంటే ఎలా.. దాదాపు 12 మందికి పైగా చెందిన మూడు కిలోల బంగారం ఖాతాదారులకు అందాల్సి ఉంది. ప్రస్తుతం తమ అవసరాలు తీరాయని రుణం జమ చేస్తామని చెబుతున్నా కట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. బ్యాంకులో జరిగిన తప్పిదంతో రుణం కట్టించుకోకపోవడంతో అధిక వడ్డీ కట్టాల్సి వస్తుందని చెబుతున్నారు. ఏదైనా శుభకార్యాలున్నా బ్యాంకు నుంచి నగలు విడిపించుకోలేక సతమతమవుతున్నాని అంటున్నారు. దీనిపై తమకు న్యాయం జరిగేలా చూడాలని వారు కోరుతున్నారు. కోర్టు ఆదేశాలతో ఇవ్వలేకున్నాం కోర్టు బ్యాంకుకు బంగారు, నగదు అప్పగించినా కేసు పూర్తయ్యే వరకు వాటిని అలానే ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో మేం ఖాతాదారులకు బంగారం ఇవ్వలేకున్నాం. దీనిపై న్యాయనిపుణులతో మాట్లాడుతున్నాం. బాధితులకు వడ్డీ పడకుండా రుణ బకాయి కట్టించుకుని రసీదు ఇస్తాం. రసీదులు కోర్టుకు సమర్పించి బాధితులకు న్యాయం చేయాలని కోరుతాం. సమస్య తీరగానే ఖాతాదారులకు వారి బంగారం అందజేస్తాం. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు.– శ్రీనివాస్, రీజినల్ మేనేజరు, కడప త్వరగా ఇవ్వాలి అవసర నిమిత్తం బ్యాంకులో 250 గ్రాముల వరకు బంగారం తాకట్టు పెట్టి రూ.3లక్షలు లోను తీసుకున్నా. ప్రస్తుతం నగదు కడతామని చెప్పినా బ్యాంకు అధికారులు కట్టించుకోవడం లేదు. కోర్టు ఆదేశాలతో ఇప్పుడే బంగారు ఇవ్వలేమంటున్నారు. రుణం కట్టకపోతే సిబిల్ స్కోరు తగ్గి భవిష్యత్తులో రుణం పొందే అవకాశం ఉండదు. – సురేష్‌బాబు, పోరుమామిళ్ల -
భారీ చోరీ.. 50 తులాల బంగారం మాయం
జవహర్‌నగర్: తాళం వేసి ఉన్న ఇంటిపై కన్నేసిన దుండగులు ఇంట్లోకి చొరబడి బంగారం, వెండితో పాటు నగదును అపహరించుకుపోయారు. ఈ సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని యాప్రాల్ మైత్రీ ఎంక్లేవ్‌లో జరిగింది. జవహర్‌నగర్ డీఐ నర్సింగరావు తెలిపిన మేరకు.. యాప్రాల్‌లోని మైత్రీ ఎంక్లేవ్ ప్లాట్ నెంబర్ 134లో దానం నర్సింగరావు కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నాడు. సోమవారం ఉదయం ఇంటికి తాళం వేసి యాదగిరిగుట్టకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. అర్ధరాత్రి వంట గదికి ఆనుకుని ఉన్న కిటికి గ్రిల్‌ను తొలగించి వంట గది తలుపును తెరిచి ఇంట్లోకి చొరబడిన దుండగులు బెడ్రూంలోని బీరువాలో ఉన్న 50తులాల బంగారం, 5 కేజీల వెండితో పాటు రూ.50వేల నగదును అపహరించుకు పోయారు. మంగళవారం ఉదయం పనిమనిషి ఇంటి వద్దకు వచ్చే సరికి ఇంటి వెనక బాగంలో ఉన్న వంట గది తలుపు తెరిసి ఉండడంతో మైత్రీ ఎంక్లేవ్ సభ్యులకు తెలిపింది. వెంటనే వారు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఘటనా స్ధలాన్ని మల్కాజిగిరి డీసీపీ రక్షిత, కుషాయిగూడ ఏసీపీ శివకుమార్‌లు చేరుకుని సమీపప్రాంతాలను పరిశీలించారు. -
77 కేజీల బంగారు నగలు చోరీ
కృష్ణరాజపురం: బెంగళూరులో అత్యంత భారీ చోరీ చోటుచేసుకుంది. ఏకంగా 77 కేజీల బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. బెంగళూరు పులకేశినగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని బాణసవాడి–హెణ్ణూరు రోడ్‌లోని లింగరాజపురం బ్రిడ్జి దగ్గర్లో ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయం ఉంది. ఇందులో తమ వినియోగదారులకు వారి బంగారం కుదువ పెట్టుకుని నగదు ఇస్తుంటారు. ఈ కార్యాలయంలో భారీగా బంగారం ఉంటుం దని భావించిన దుండగులు శనివారం రాత్రి గోడకు కన్నమేసి లోపలికి చొరబడ్డారు. బంగారం భద్రపరిచిన బీరువాలను గ్యాస్ కట్టర్లతో కత్తిరించారు. అందులోని 77 కేజీల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. పోలీసులకు ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు ముందుగా సీసీ కెమెరాలను తొలగించారు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేపట్టారు. చోరీ జరిగిన తీరు చూసి తెలిసిన వ్యక్తుల పనిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. కస్టమర్లకు భరోసా బంగారం చోరీ నేపథ్యంలో కస్టమర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బంగారానికి పూర్తిగా బీమా భద్రత ఉందని ముత్తూట్ ఫైనాన్స్ స్పష్టం చేసింది. దోపిడీ కారణంగా కస్టమర్ల బంగారానికి ఎలాంటి నష్టం వాటిల్లదని ఓ ప్రకటనలో పేర్కొంది. చోరీకి గురైన బంగారాన్ని పోలీసులు రికవరీ చేసే వరకూ కొంత సమయం ఇవ్వాలని తర్వాత వారికి పూర్తి పరిహారం చెల్లిస్తామని పేర్కొంది. నిందితులను పోలీసులు ఇప్పటికే గుర్తించారని, వారి నుంచి చోరీకి గురైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకునేందుకు అన్ని చర్యలూ చేపడుతున్నారని తెలిపింది. -
8.86 కిలోల బంగారం స్వాధీనం
ఆటోనగర్(విజయవాడ తూర్పు): బిల్లులు లేకుండా బంగారు ఆభరణాలను అక్రమంగా విజయవాడకు తరలిస్తున్న ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.3.18 కోట్ల విలువ చేసే 8.861 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ముంబై నుంచి కోట్ల రూపాయల విలువ చేసే బంగారం విజయవాడకు వస్తోందన్న పక్కా సమాచారం నేపథ్యంలో విజయవాడ పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు ఆదేశం మేరకు ఆదివారం టాస్క్‌ఫోర్స్ ఏడీసీపీ శ్రీనివాసరావు నేతృత్వంలో విజయవాడలో పలుచోట్ల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ సమీపంలోని బస్టాప్ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఎటువంటి బిల్లులు లేకుండా రెండు బ్యాగుల్లో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ముంబైకు చెందిన జయేష్ జైన్, విజయవాడ ఇస్లాంపేట వాసి పాగోలు శ్రీనివాసరావుగా గుర్తించారు. వీరిని ఇబ్రహీంపట్నం పోలీసులు విచారించగా.. ముంబైలో బంగారు ఆభరణాలను కొనుగోలు చేసి, వాటికి ఎలాంటి బిల్లులు లేకుండా అక్రమమార్గంలో విజయవాడకు చేరవేస్తున్నట్టుగా అంగీకరించారు. ఇలా అక్రమంగా రవాణా చేస్తున్న బంగారు వస్తువులను ఎటువంటి పన్నులు చెల్లించకుండా మార్కెట్ ధరలకు జ్యువెలరీ షాపులకు విక్రయిస్తున్నారని, కొంతకాలంగా ఈ దందా కొనసాగుతున్నదని పోలీసులు చెబుతున్నారు. -
బంగారం అనుకొని దోచేశారు
షాద్‌నగర్ రూరర్: బీరువాలో ఉంచిన వెండితో పాటు వన్‌గ్రామ్ గోల్డ్ నగలను అపహరించిన నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. తాళం వేసిన ఇళ్లను ఎంచుకొని చోరీలకు పాల్పడుతున్న నిందితులను కటకటాల వెనక్కి తరలించినట్లు ఏసీపీ సురేందర్ వెల్లడించారు. బుధవారం షాద్‌నగర్ పట్టణ ఠాణాలో డీఐ తిరుపతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. హైదరాబాద్ బండ్లగూడ పర్వత్‌నగర్‌కు చెందిన దీపక్ విశ్వకర్మ, హైదరాబాద్‌లోని ఉప్పుగూడ జెండా రోడ్డుకు చెందిన పండిత్ సురాజ్ పాండ్యా మిత్రులు. వీరిద్దరు కలిసి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని షాద్‌నగర్, మీర్‌పేటలో పలు దొంగతనాలకు పాల్పడ్డారు. షాద్‌నగర్ పట్టణానికి చెందిన నరేందర్ ఇంటికి ఈనెల 6న తాళం వేసి ఉండగా పగులగొట్టి దీపక్ విశ్వకర్మ, పండిత్ సురాజ్ పాండ్యా లోపలికి చొరబడ్డారు. బీరువా తలుపులు తెరిచి అందులో ఉన్న కిలోవెండితో పాటుగా బంగారు ఆభరణాలను అపహరించారు. వన్‌గ్రామ్ గోల్డును బంగారంగా భావించిన దుండగులు వెండి ఆభరణాలతో పాటుగా వాటిని కూడా దొంగిలించారు. ఈమేరకు నరేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. బుధవారం దీపక్ విశ్వకర్మ, సురాజ్ పాండ్యాను షాద్‌నగర్ పట్టణంలోని వేంకటేశ్వరస్వామి దేవాలయం సమీపంలో అదుపులోకి తీసుకొని విచారించినట్లు తెలిపారు. వారివద్ద ఉన్న సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మీర్‌పేటలో ఓ బైక్‌ను కూడా దొంగిలించినట్లు పోలీసుల విచారణలో తేలింది. మరో కేసులో.. మరో కేసులో పోలీసులు బైకులను అపహరించిన వ్యక్తిని రిమాండుకు తరలించారు. శంషాబాద్ మండలం పెద్దతూప్రా గ్రామానికి చెందిన చిర్ర యాదయ్య అలియాస్ అశోక్‌రెడ్డి కొంతకాలంగా షాద్‌నగర్, కేశంపేట, కడ్తాల్, మైలర్‌దేవ్‌పల్లి, ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ల పరిధిలో బైకులను దొంగిలించాడు. బుధవారం ఆయన షాద్‌నగర్ చౌరస్తాలోని బస్టాండ్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకొని విచారించగా బైకుల చోరీలకు పాల్పడ్డాడు. అతడి నుంచి ఐదు బైకులు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి కేసుల దర్యాప్తులో సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడినట్లు, అందరూ తమ ఇళ్లలో సీసీ కె మెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఏసీపీ సు రేందర్ సూచించారు. సీసీ కెమెరాల్లో నమోదైన పుటేజీల ఆధారంగా ముగ్గురు నిందితులను పట్టుకున్నట్లు వివరించారు. ఇళ్లకు తాళం వేసి గ్రామాలకు వెళ్తున్న వారు విధిగా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా కేసులను ఛేజించిన పోలీసు బృందాన్ని ఏసీపీ సురేందర్ అభినందించారు. రివార్డుల కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదన పంపుతామన్నారు. సీఐ శ్రీధర్‌కుమార్, ఎస్ఐలు దేవ్‌రావ్, విజయభాస్కర్, కృష్ణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
కళ్లల్లో పెప్పర్ స్ప్రే కొట్టి రూ.30లక్షలు దోపిడీ
రాంగోపాల్‌పేట్: ఓ బంగారం షాపు నుంచి మరో దుకాణానికి నగదు తీసుకుని వెళుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు కళ్లల్లో పెప్పర్ స్ప్రే కొట్టి రూ.30లక్షలు దోపిడీకి పాల్పడిన సంఘటన మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సికింద్రాబాద్ జనరల్ బజార్లో శ్రీనివాస వర్మ అనే వ్యక్తి రోహిత్ జ్యువెలర్స్ పేరుతో బంగారు నగలను ఆర్డర్‌పై తయారు చేసి షాపులకు అందజేసేవాడు. అతడి దుకాణానికి ఎదురుగానే అనిల్ అనే వ్యక్తి నవ్కార్ జూవెలరీ షాప్ నిర్వహిస్తున్నాడు. అయితే అనిల్ నుంచి శ్రీనివాసవర్మకు నగల తయారీకి సంబంధించి కొంత నగదు రావాల్సి ఉంది. దీనికితోడు మరి కొంత మొత్తాన్ని బదులు ఇవ్వాలని శ్రీనివాస వర్మ అతడిని కోరాడు. నగదు సిద్ధం చేసిన అనిల్, శ్రీనివాస వర్మకు సమాచారం అందించడంతో అతను షాపులో పనిచేసే రూపారామ్ అనే వ్యక్తిని నవ్కార్ జూవెలర్స్కు పంపించాడు. మంగళవారం రాత్రి 8గంటల ప్రాంతంలో రూపారామ్ రూ.30లక్షల నగదు తీసుకుని మొదటి అంతస్తు నుంచి కిందికి వస్తుండగా మెట్లపై గుర్తు తెలియని వ్యక్తి అతడిని అడ్డగించి కళ్లల్లో పెప్పర్ స్ప్రే కొట్టి చేతిలో బ్యాగు లాక్కుని పరారయ్యాడు. అప్పటికే రోడ్డుపై ద్విచక్ర వాహనంపై సిద్ధంగా ఉన్న మరో వ్యక్తితో కలిసి అక్కడి నుంచి ఉడాయించాడు. కొద్ది సేపటికి తేరుకున్న రూపా రామ్ యజమానికి ఈ విషయం చెప్పడంతో అతను మహంకాళి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసుల అదుపులో అనుమానితులు మంగళవారం రాత్రి టాస్క్‌ఫోర్స్ పోలీసులు 8 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు సమాచారం. రెండు షాపుల్లో పనిచేస్తున్న సిబ్బందిని టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి పిలిపించి విచారణ చేస్తున్నారు. పోలీసులకు కీలక ఆధారాలు లభ్యమైనట్లు తెలిసింది. ప్రత్యేక బృందాలతో గాలింపు చోరీపై సమాచారం అందడంతో ఉత్తర మండలం పరిధిలోని పలు పోలీస్ స్టేషన్ల అధికారులు, టాస్క్‌ఫోర్స్, సీసీఎస్ పోలీసులతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి నిందితుల కోసం గాలింపు చేపట్టాయి. నిందితులు జనరల్‌బజార్ నుంచి కళాసిగూడ, మంజు థియేటర్ మీదుగా వెళ్లినట్లు సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించారు. డీసీపీ పరిశీలన బుధవారం ఉదయం ఉత్తర మండలం డీసీపీ కల్మేశ్వర్ సింగన్వార్, ఇన్స్పెక్టర్ కావేటి శ్రీనివాస్ తదితరులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని త్వరలోనే కేసును చేధిస్తామని డీసీపీ పేర్కొన్నారు. తెలిసిన వారి పనేనా? ఈ ఘటనపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిందితుల కదలికలు, దొంగతనం జరిగిన తీరును బట్టి తెలిసిన వారే చోరీకి పాల్పడి ఉండవచ్చునని భావిస్తున్నారు. సీసీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులు బైక్‌పై బట్టర్ ఫ్లై బేకరి గల్లీ నుంచి బయటికి వచ్చి అక్కడే దాదాపు అరగంట పాటు రెక్కీ నిర్వహించినట్లు గుర్తించారు. అనంతరం వీరు మహంకాళి దేవాలయం ముందు నుంచి నవకార్ జ్యువెలరీ షాప్ వరకు వెళ్లారు. వారిలో ఒకరు బైక్‌పై కూర్చుని ఉండగా మరొకరు పైకి వెళ్లి మొదటి అంతస్తులో బయటి నుంచి చూసి కిందికి వచ్చాడు. ఆ తర్వాత రూపారామ్ నగదు తీసుకుని కిందకు దిగుతుండగా మెట్లపైనే అడ్డుకుని బ్యాగ్ లాక్కుని పరారయ్యారు. డబ్బు ఏ సమయానికి, ఎవరు, ఎలా తీసుకుని వస్తారనేదానిపై నిందితులకు పక్కా సమాచారం ఉన్నందునే నేరుగా రూపారామ్‌ను అడ్డుకుని దోపిడీకి పాల్పడి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. అయితే రూపారామ్ కళ్లల్లో పెప్పర్ స్ప్రే కొట్టినా అతను కేకలు వేయకపోవడంతో అతడి పాత్రపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అతను గట్టిగా అరిస్తే ఆ సమయంలో రోడ్డుపై వెళుతున్న ప్రజలు, వ్యాపారులు అక్కడికి చేరుకుని దొంగలను పట్టుకునే అవకాశం ఉండేది. దీనికితోడు నిందితులు ఉపయోగించిన ద్విచక్ర వాహనం హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 20 రోజుల క్రితమే చోరీకి గురైనట్లు పోలీసు రికార్డులు పేర్కొంటున్నాయి. రెండు జ్యువెలరీ సంస్థల యజమానులు పెద్ద ఎత్తున నగదు లావాదేవీలు నిర్వహిస్తుండటంతో పథకం ప్రకారమే దొంగతనానికి స్కెచ్ వేసి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. -
భర్త కాపురం చేయకపోవడంతో భారీ చోరీ!
సాక్షి, హైదరాబాద్: బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గత సోమవారం రాత్రి జరిగిన చోరీ కేసులో.. సొంత కోడలే అత్తింట్లో భారీ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. భర్తతో కాపురం సజావుగాలేని కారణంగానే కోడలు ఈ చోరీకి పథకం పన్నిందని వెల్లడించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. వారం రోజుల్లో కేసును ఛేదించి సోమవారం వివరాలు వెల్లడించారు. గత సోమవారం (ఈ నెల 21న) సాయంత్రం సరళ తన కొడుకును సికింద్రాబాద్‌లో డ్రాప్ చేసి వచ్చేసరికి ఆగంతకులు ఇంట్లోకి చొరబడి బంగారం, నగదును ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై సరళ ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా కేసును చేధించిన పోలీసులు.. ఈ చోరీకి సరళ కోడలు సుప్రియతోపాటు ఆమె తల్లిదండ్రులు, సోదరుడు సహకరించారనే విషయం కనుగొన్నారు. సుప్రియ, ఆమె భర్త ధీరజ్ మధ్య కాపురం సజావుగా సాగకపోవడంతోనే.. వారు ఈ దుస్సాహసానికి ఒడిగట్టారని వివరించారు. దొంగతనానికి సుప్రియ సోదరుడు సాత్విక్ సూత్రధారని, అతనే పథకం పన్నాడని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి రెండు కేజీల బంగారు అభరణాలు, రూ. 80 లక్షల విలువైన 6.5 కేజీల వెండి, వెగనార్ కారు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొన్నామని పేర్కొన్నారు. నిందితులు మారు తాళంతో ఇంట్లోకి చొరబడి ఈ దొంగతనం చేశారని పోలీసులు తెలిపారు. చదవండి: రూ.18లక్షల నగదు, 3 కిలోల బంగారం మాయం -
రూ.18లక్షల నగదు, 3 కిలోల బంగారం మాయం
బొల్లారం: బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి జరిగిన భారీ చోరీ కేసును ఛేదించేందుకు పోలీసులు విచారణను వేగవంతం చేశారు. అన్ని కోణాల్లో కేసును త్వరితగతిన ఛేదించి నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తును ముమ్మరం చేసే దిశగా మూడు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు బేగంపేట ఏసీపీ రాంరెడ్డి చెప్పారు. చోరీ జరిగిన ఇంటిని మంగళవారం ఉదయం నార్త్‌జోన్ డీసీపీ కళ్మేశ్వర్ సింగెన్ వార్తో కలిసి ఏసీపీ రాంరెడ్డి, సీఐ చంద్రశేఖర్ పరిశీలించారు. అనంతరం చోరీ జరిగిన తీరును బాధితులను అడిగి తెలుసుకున్నారు. ఏసీపీ రాంరెడ్డి మాట్లాడుతూ మల్లిఖార్జున్ నగర్లో నివాసముండే ఇంటి యజమాని సరళ తన కుమారులతో కలిసి సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో బోయిన్ పల్లిలోని సెంటర్ పాయింట్‌కు షాపింగ్ కోసం వెళ్లింది. ఆ సమయంలో మారుతాళంతో ఇంట్లోకి చొరబడిన ఆగంతకులు బెడ్రూంలోని బీరువాలో ఉన్న 3కిలోల బంగారం, రూ.18 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. బయటి నుంచి ఇంటికి వచ్చిన సరళ ఇంట్లోకి వెళ్లి చూడగా చోరీ జరిగినట్లు తెలుసుకుంది. వేసిన తాళాలు వేసినట్లే ఉండగా చోరీ ఎలా జరిగిందని ఆమె ఆందోళనకు గురైంది. వెంటనే విషయాన్ని బోయిన్ పల్లి పోలీసులకు తన కుమారుడితో కలిసి ఫిర్యాదు చేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని ప్రత్యేక టీంలను రంగంలోకి దింపి చోరీకి పాల్పడిన వారి కోసం విచారణ చేపడుతున్నామని ఏసీపీ తెలిపారు. తెలిసినవారి పనేనా..? మారు తాళం చెవితో సునాయాసంగా ఇంట్లోకి చొరబడటం అంటే తెలిసినవారి పనై ఉంటుందనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇంట్లోకి చొరబడ్డ నిందితులు నగదు, ఆభరణాలు భద్రపరిచిన స్థలానికి నేరుగా వెళ్లడంతో పాటు ఇంటి యాజమాని సరిగ్గా బయటకు వెళ్లి వచ్చే సరికి ఇంటిని గుల్ల చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత భారీఎత్తున నగదు, బంగారం చోరీకి గురికావడంతో స్థానికులతో పాటు పోలీసులు షాక్ అయ్యారు. మరోవైపు సరళ వడ్డీ వ్యాపారం చేస్తుండటంపై కూడా నిఘా ఉంచినట్లు తెలుస్తోంది. -
3 కేజీల బంగారం,నగదు చోరీ
-
అక్కను చంపిన తమ్ముడు
చందానగర్: తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలు తీసుకురమ్మని ఒత్తిడి చేయడంతో వరుసకు అక్కను ఉరి వేసి హత్య చేసిన ఓ నిందితుడిని చందానగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. చందానగర్ ఇన్స్పెక్టర్ రవీందర్ తెలిపిన మేరకు.. శేరిలింగంపల్లిలోని పాపిరెడ్డి కాలనీ, సురభీకాలనీకి చెందిన ఆర్. రమణరావు (36) లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అదే కాలనీలో నివాసముంటున్న ఆర్. శ్వేతలక్ష్మి (42) విడాకులు తీసుకొని పాపిరెడ్డి కాలనీలో నివసిస్తోంది. శ్వేతలక్ష్మి చిన్ననాన్న కుమారుడు రమణరావు మద్యానికి బానిసై ఇద్దరూ కలిసి ప్రతిరోజు మద్యం సేవిస్తూ ఉండేవారు. శ్వేతలక్ష్మీ వద్ద ఉన్న డబ్బు ఖర్చుచేయడంతోపాటు ఆమె ఆభరణాలు రమణరావు తాకట్టు పెట్టి మద్యం సేవించారు. ఈ క్రమంలో ఈ నెల 4న రాత్రి ఇద్దరు కలిసి మద్యం తాగుతున్న సమయంలో ఇద్దరికి బంగారం విషయంలో గొడవ జరిగింది. తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించు తీసుకురావాలని రమణరావును ఒత్తిడి చేసింది. దీంతో రమణరావు ఆమెను కొట్టగా తల గోడకు తగిలి మూర్చబోయింది. అప్పుడే రమణరావు పక్కనే ఉన్న చీరతో ఆమె గొంతుకు చున్నీచుట్టి హత్య చేసి అనంతరం ఆమెనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సృష్టించి వెళ్లిపోయాడు. అదే కాలనీలో శ్వేతలక్ష్మి సోదరుడు ఆర్. శివకుమార్ నివాసముంటున్నాడు. శివకుమార్ అక్కడికి చేరుకొని చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటహూటీన సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆమె మృతిపై అనుమానాలు రావడంతో అనుమానస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ కొనసాగించారు. పోస్టుమార్టం రిపోర్ట్ ఆ«ధారంగా శ్వేతలక్ష్మి గొంతుకు చీరతో బిగించి ఉరి వేసినట్లు నిర్ధారణ అయ్యింది. అనుమానితుడైన ఆర్. రమణరావును అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. రమణరావు తాకట్టు పెట్టిన బంగారం, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతో పోలీసులు అతని పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
మద్యానికి బానిసై చోరీల బాట
భాగ్యనగర్‌కాలనీ: మద్యానికి బానిసైన ఓ యువకుడు దొంగతనాలకు పాల్పడుతూ కటకటాల పాలైన సంఘటన కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. కూకట్పల్లి ఏసీపీ కార్యాలయంలో మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు, ఏసీపీ సురేందర్ రావు, సీఐ లక్ష్మీ నారాయణ రెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా, కొత్తూరు మండలం, కొత్త పొన్నుటూరు గ్రామానికి చెందిన ముకుందరావు మూసాపేట జనతానగర్‌లో ఉంటూ పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన కళ్యాణి జనతానగర్‌లోనే ఉండేది. ఒకే గ్రామానికి చెందినవారు కావడంతో వారి కుటుంబ విషయాలు ముకుందరావుకు తెలిసేవి. బోయినపల్లిలో ఉంటున్న కళ్యాణి కుమార్తె పావని గతంలో తన నగలను వైజాగ్‌లో తాకట్టు పెట్టింది. ఆర్మీలో జవాన్‌గా పనిచేస్తున్న పావని భర్త ఈ నెల 18న నగరానికి వస్తున్నట్లు తెలియడంతో ఆమె వైజాగ్ వెళ్లి తన ఆభరణాలను విడిపించుకుని వచ్చి గత నెల 19న తన తల్లి వద్ద భద్రపరిచింది. ఈ నెల 23న బయటికి వెళుతున్న కళ్యాణి ఇంటికి తాళం వేసి తాళం చెవిని బాత్రూంలో దాచి పెట్టింది. అప్పటికే రెక్కీ నిర్వహిస్తున్న ముకుందరావు తాళం చెవి తీసుకొని ఇంట్లోకి ప్రవేశించి బీరువాలో ఉన్న 29 తులాల బంగారు నగలను ఎత్తుకెళ్లాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు తెలిసిన వారిపనిగా నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో ముకుందరావును అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. అతడి నుంచి 23 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. మరో 6 తులాలు ముత్తూట్ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టినట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
స్నేహితురాలి ఇంట్లో నగదు చోరీ
నాగోలు: స్నేహితురాలి ఇంట్లో నగదు చోరీ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసిన సరూర్‌నగర్ పోలీసులు అతడి నుంచి రూ. 13.5 లక్షలు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఎల్బీనగర్ డీసీపీ సన్ ప్రీత్‌సింగ్ వివరాలు వెల్లడించారు.. కర్మన్‌ఘాట్, మల్రెడ్డి రంగారెడ్డి కాలనీకి చెందిన పల్లెటి మేరీకి అదే కాలనీలో ఉంటున్న సిద్దిపేటకు బొమ్మగాని శ్రీనివాస్‌తో స్నేహం ఉంది. మేరీ ప్లాట్ కోనుగోలు చేసేందుకు రూ. 14 లక్షలు తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాస్ గత నెల 2న మేరీ ఇంట్లో లేని సమయంలో ఆమె ఇంట్లోకి ప్రవేశించి బీరువా తాళం పగులగొట్టి రూ. 14 లక్షలు ఎత్తుకెళ్లాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు పరారీలో ఉన్న శ్రీనివాస్‌ను మంగళవారం అరెస్టు చేసి అతడి నుంచి రూ. 13.5 లక్షల నగదు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని రిమాండ్ తరలించారు. సమావేశంలో ఎల్బీనగర్ ఏసీపీ పృథ్వీధర్‌రావు, సరూర్‌నగర్ డీఐ వెంకటేశం, ఎస్ఐ కృష్ణయ్య, సిబ్బంది పాల్గొన్నారు. -
పగలు రెక్కీ.. రాత్రి చోరీ
గచ్చిబౌలి: బైక్‌పై కాలనీల్లో తిరుగుతూ తాళం వేసిన ఇళ్లకు గుర్తించి రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగను నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్రావు వివరాలు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఆలకుంట బాలరాజు అలియాస్ బాలు క్రేన్ వర్కర్‌గా పనిచేస్తూ కార్వాన్లో ఉంటున్నాడు. గత కొంతకాలంగా అతను ఉదయం పూట బైక్‌పై కాలనీల్లో తిరుగుతూ రెక్కీ నిర్వహించి రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడుతున్నాడు. నార్సింగి, రాజేంద్రనగర్, దుండిగల్, జీడిమెట్ల, అల్వాల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు దాదాపు 135 సీసీ కెమెరాల్లో రికార్డైన పుటేజీని పరిశీలించారు. ఈ సందర్భంగా అనుమాస్పదంగా కనిపించిన బజాజ్ డిస్కవరీ బైక్ నంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. 2011 మోడల్‌కు చెందిన సదరు బైక్ 12 మంది చేతులు మారినట్లు తెలసుకున్నారు. చివరకు బాలరాజు అనే వ్యక్తి కొనుగోలు చేసినట్లుగా గుర్తించిన పోలీసులు అనుమానంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడి నుంచి 15 తులాల బంగారు నగలు, 12.5 తులాల వెండి, బైక్, టీవీ, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో మాదాపూర్ ఏసీపీ శ్యాంప్రసాద్‌రావు, నార్సింగి సీఐ రమణగౌడ్, ఎస్ఐ దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంట్లో మనుషులు ఉండగానే భారీ చోరీ
జవహర్‌నగర్: ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో దుండగులు చొరబడి భారీ చోరీకి పాల్పడ్డారు. ఈ సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బాలాజీనగర్ ప్రధాన రహదారిసమీపంలోని ఓ ఇంట్లో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. క్రైం డీసీపీ రాంచంద్రారెడ్డి, కుషాయిగూడ ఏసీపీ శివకుమార్,జవహర్‌నగర్ సీఐ సైదులు, డీఐ నర్సింగరావులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసుల కధనం మేరకు బాలాజీనగర్‌లో నివసించే కుందారపు నాగభూషణం దంపతులు తమ ముగ్గురు కుమారులతో కలిసి నివసిస్తున్నారు. మంగళవారం రాత్రి 12గంటల సమయంలో 1వ అంతస్తులో నాగభూషణం, పద్మ దంపతులు ఆరుబయట నిద్రిస్తుండగా ఇంట్లో ఇద్దరు కుమారులు నిద్రిస్తున్నారు. ప్రధాన ద్వారం తీసే నిద్రపోవడంతో దుండగులు లోపలికి ప్రవేశించి డ్రెసింగ్ టేబుల్లో ఉన్న దాదాపు 30 తులాల బంగారు అభరణాలు, రూ.10వేల నగదును అపహరించుకుపోయారు. ఉదయం నాగభూషణం దంపతులు లేచి చోరీ జరిగినట్లు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించగా క్లూస్‌టీం సంఘటనా స్ధలానికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నారు.వారం క్రితం ఓ ఫంక్షన్ నిమిత్తం బ్యాంక్ లాకర్ నుండి బంగారాన్ని తీసుకువచ్చామని ఇంతలో దుండగులు ఇలాంటి చర్యకు పాల్పడడంతో కుటుంబ సభ్యులు కన్నీటిపర్వమయ్యారు. -
మహిళపై దాడి.. బంగారు ఆభరణాల చోరీ
మల్లాపూర్: ఓ మహిళపై దాడి చేసి బంగారు ఆభరణాలు దోచుకెళ్లిన సంఘటన నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్ఐ వెంకట్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మల్లాపూర్ గోకుల్‌నగర్ కాలనీకి చెందిన బత్తిని నాగరాజు భార్య అరుణ ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. గురువారం సాయంత్రం ఇంట్లో బెడ్రూమ్లో బట్టలు సర్దుకుంటుండగా ఓ మహిళ, ఓ వ్యక్తి ఇంట్లోకి చొరబడి ఆమె నోటికి ప్లాస్టర్‌ను వేసి అరుణ మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు గొలుసు, రెండు ఫోన్లు, రూ.1500 నగదు, ఏటీఎం కార్డులు ఎత్తుకెళ్లారు. కొద్ది సేపటి తర్వాత దీనిని గుర్తించిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అన్నం పెట్టిన ఇంటికే కన్నం
హిమాయత్‌నగర్:నమ్మకంగా పనిచేస్తూ ఇంట్లో ఎవరూ లేని సమయంలో విలువైన బంగారు ఆభరణాలతో ఉడాయించారు. దాదాపు రూ.30 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, రూ.4 లక్షల నగదు అపహరించిన ఘటన హిమాయత్‌నగర్‌లో రెండు రోజుల క్రితం జరిగింది. బుధవారం ఉదయం డాగ్‌స్క్వాడ్, ఫింగర్‌ప్రింట్ టీంలతో సంఘటనా స్థలంలో ఆధారాలను సేకరించినట్లు అబిడ్స్ అసిస్టెంట్ కమిషనర్ భిక్షంరెడ్డి, నారాయణగూడ ఇన్స్పెక్టర్ పాలేపల్లి రమేష్‌కుమార్, క్రైం ఇన్స్పెక్టర్ రవికుమార్‌లు తెలిపారు. ఈ సందర్భంగా వివరాలను వెల్లడించారు. పనిలో చేరిన నలభై రోజులకే.. హిమాయత్‌నగర్ స్ట్రీట్ నంబర్ 11లోని 3–6–685 ఇంట్లో గౌతం దుగర్, షీలా దంపతులు నివసిస్తున్నారు. వీరి ఇంట్లో నలభైరోజుల క్రితం వాచ్మెన్లుగా నేపాల్‌కు చెందిన జనక్ బహుదూర్, హీరాలు పనికి కుదిరారు. వీరితోపాటు వంట మనిషిగా అజిత్‌కుమార్ పని చేస్తున్నాడు. జనక్ బహుదూర్, హీరాలు వాచ్మెన్లుగా ఉంటూ ఆ ఇంట్లోనే ఉంటున్నారు. ఈ నెల 6న కోయంబత్తూర్‌లో జరిగిన జైన్ల ఉత్సవానికి గౌతం దుగర్, షీలా దంపతులు వెళ్లారు. అదే రోజు అర్ధరాత్రి జనక్ బహుదూర్, హీరాలు మరో ఇద్దరి సాయంతో బెడ్రూంలోకి చొరబడి బీరువా లాకర్లను తెరచి సుమారు 60 తులాల బంగారు ఆభరణాలు, వజ్రాలతో పాటు రూ.4లక్షల నగదును తీసుకుని పరారైనట్లు తమకు ఫిర్యాదు అందిందని ఏసీపీ భిక్షంరెడ్డి వెల్లడించారు. జనక్‌బహుదూర్, హీరాలు నుంచి కనిపించడం లేదని మరుసటి రోజు తమకు వంటమనిషి అజిత్‌కుమార్ సమాచారం ఇచ్చాడని, హుటాహుటీనా వచ్చి ఇంటిని చూసుకోగా..తాళాలు పగలగొట్టి ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు తెలిసిందని ఇంటి యజమానులు పోలీసులకు తెలిపారు. గతంలో తమ వద్ద పని చేసిన వాళ్లే ఈ ఇద్దరినీ పనిలో పెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మూడు ప్రత్యేక బృందాలతో గాలింపు... చోరీ జరిగిందని ఫిర్యాదు అందడంతో బుధవారం ఉదయం అబిడ్స్ ఏసీపీ భిక్షంరెడ్డి, ఇన్స్పెక్టర్లు రమేష్‌కుమార్, రవికుమార్, పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆభరణాలు చోరీ చేసి ఇంటి వెనకభాగం నుంచి గోడ దూకి పరారైనట్లు సీసీ కెమెరాల్లో నమోదైంది. ఇంట్లోని సీసీ కెమెరాల్లో ఆగంతుకుల ఆనవాళ్లు సరిగా కనిపించకపోవడంతో సమీపంలోని ఇంకొన్ని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. దీంతో పాటు మూడు ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఓ బృందం ఎంజీబీఎస్, జీబీఎస్, సిటీ బస్స్టేషన్లు, మరో బృందం సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లతో పాటు నగరంలోని అన్ని రైల్వే స్టేషన్లలో తనిఖీలు చేపట్టాయి. దీంతో పాటు మెట్రో స్టేషన్లలోని సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు. మూడో బృందం రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని డొమెస్టిక్ విభాగం వద్ద ఉన్న సీసీ కెమెరాలను ప్రత్యేకంగా పరిశీలిస్తోంది. ఫోన్లు స్విచ్ఛాఫ్.. ఈ నెల 6వ తేదీ సాయంత్రం నుంచి వాచ్మెన్ల ఫోన్లు, గతంలో వీరిని పనికి కుదిర్చిన వ్యక్తి ఫోన్లు స్విచ్ఛాఫ్ ఉన్నట్లు మొబైల్ సీడీఆర్లో వెల్లడైంది. చోరీ పక్కా ప్లాన్‌తోనే చేశారా అనే అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. గతంలో పనిచేసిన వ్యక్తి ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నాడు, అతనికి ఇప్పుడు చోరీకి పాల్పడిన వారికేమైనా సంబంధాలున్నాయా అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నేడో.. రేపో.. నేపాల్‌కు... బుధవారం రాత్రి వరకు నగరమంతా జల్లెడ పట్టిన పోలీసులకు నిందితుల జాడ లభించలేదు. గతంలో గౌతం దుగర్, షీలా దంపతుల ఇంట్లో చేసిన వ్యక్తుల వివరాలను సేకరిస్తున్నారు. ఈ ఇంట్లో నలభై రోజుల క్రితం పని చేసి మానేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టారు. అతని ద్వారా నిందితులు నేపాల్‌లో ఎక్కడ ఉంటారు, వారి పూర్తి వివరాలను సేకరించి గురువారం అక్కడికి వెళ్లేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. -
బంగారం తీసుకుని బురిడీ
సాక్షి, సిటీబ్యూరో: హోల్‌సేల్ బంగారం వ్యాపారం పేరుతో పలువురు నగల దుకాణాల యజమానుల నుంచి దాదాపు ఏడు కేజీల బంగారం సేకరించి గుజరాత్‌కు పారిపోయిన వ్యాపారి యోగేష్ జోగారామ్ సాయినిని నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. దాదాపు ఏడాది పాటు ముమ్మరంగా గాలించిన నేపథ్యంలోనే ఇతడు చిక్కాడని, నిందితుడి నుంచి 670 గ్రాముల బంగారం తదితరాలు స్వాధీనం చేసుకున్నట్లు జాయింట్ సీపీ అవినాష్ మహంతి తెలిపారు. సికింద్రాబాద్‌లోని పాట్ మార్కెట్ కేంద్రంగా 2016లో యోగేష్ రోనక్ బులియన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు. జ్యువెలరీ దుకాణాల యజమానుల నుంచి పాత బంగారు నగలు, నగదు తీసుకునే ఇతను వారికి బంగారం బిస్కెట్లు, కొత్త నగలు అందించేవాడు. ఇందుకు గాను కొంత కమీషన్ తీసుకునేవాడు. సికింద్రాబాద్‌తో పాటు మహబూబ్‌నగర్, కల్వకుర్తి, అచ్చంపేట తదితర ప్రాంతాల్లోని జ్యువెలరీ దుకాణ యజమానులు ఇతడి కస్టమర్లుగా ఉండేవారు. గత ఏడాది ‘ఎం6 బిజినెస్’గా పిలిచే ఆన్లైన్ ట్రేడింగ్ అయిన బులియన్ మార్కెట్లో భారీగా పెట్టుబడులు పెట్టాడు. మార్కెట్ పతనం కావడంతో తీవ్రంగా నష్టపోయాడు. దీంతో అప్పుదారుల నుంచి ఒత్తిడి పెరగడంతో అప్పటికే వివిధ దుకాణ యజమానుల నుంచి తీసుకున్న 7 కేజీల బంగారంతో ఉడాయించాడు. కేజీకి పైగా బంగారం కోల్పోయిన ఎస్.ప్రవీణ్ జైన్ ఫిర్యాదుతో సీసీఎస్‌లో కేసు నమోదైంది. అప్పటి నుంచి పరారీలో ఉన్న యోగేష్ కోసం సబ్ ఇన్స్పెక్టర్ పి.విజయ భాస్కర్ నేతృత్వంలోని బృందం ముమ్మరంగా గాలించింది. నగరం నుంచి పారిపోయిన ఇతను గుజరాత్‌కు వెళ్లి అక్కడ మరో దుకాణం ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. దీంతో ఆ ప్రాంతానికి చేరుకున్న స్పెషల్ టీమ్ నిందితుడిని అరెస్టు చేసి అతడి నుంచి 670.79 గ్రాముల బంగారం, ముత్యాలు, విలువైన రాళ్లు స్వాధీనం చేసుకున్నారు. యోగేష్‌ను అక్కడి కోర్టులో హాజరుపరిచి పీటీ వారెంట్‌పై నగరానికి తీసుకువచ్చి రిమాండ్‌కు తరలించారు. -
చోరీలకు పాల్పడుతున్న దంపతుల అరెస్ట్
నాగోలు: చోరీలకు పాల్పడుతున్న భార్యాభర్తలతో పాటు బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తున్న వ్యక్తితో సహా ముగ్గురిని ఎల్బీనగర్ పోలీసులు సోమవారం అరెస్టు చేసి, రూ.3లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్ ఏసీపీ పృథ్వీధర్‌రావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సాయిరాజ్ శోభారాణి అలియాస్ ఉజ్వల దంపతులు నాగోలులో ఉంటూ గతకొంత కాలంగా పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్నారు. అదే ప్రాంతానికి చెందిన గణేష్ కుటుంబం ఇంటికి తాళం వేసి ఫిబ్రవరి 22న ఊరికి వెళ్లినట్లు గుర్తించిన వీరు ఇంటి తాళం పగులగొట్టి 12.6గ్రాముల బంగారు నగలు చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ సొత్తును ఛత్రినాకలోని పాపిరెడ్డికి విక్రయించినట్లు తెలిపారు. ఎల్బీనగర్ డీఐ కృష్ణమోహన్, నిందితుడు ముగ్గురిని అరెస్టు చేసి వారి నుంచి 10తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకుని సోమవారం రిమాండ్‌కు తరలించారు. -
ఇల్లు చూస్తానని వచ్చి..
నాగోలు: అద్దెకు ఇల్లు కావాలని వచ్చి ఇంటి యజమానురాలికి చెందిన నల్లపూసల దండ, బంగారు ఉంగరం ఎత్తుకెళ్లిన మహిళను ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. డీఐ కృష్ణమోహన్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మీర్‌పేట నందనవనం కాలనీకి చెందిన ఆంజనేయులు కార్ షోరూంలో పని చేసేవాడు. అతని బార్య వైష్ణవి అలియాస్ హబీబ గృహిణి. జీతం సరిపోకపోవడంతో వైష్ణవి చోరీలకు పాల్పడుతోంది. ఈ నెల 12న ఇద్దరూ కలిసి బైక్‌పై తిరుగుతూ న్యూ శివపురి కాలనీలో టులెట్ బోర్డు ఉన్న బిల్లపట్టి నర్సింహారెడ్డి ఇంటిని టార్గెట్ చేసుకున్నారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న నర్సింహారెడ్డి భార్యను కలిసి ఇల్లు అద్దెకు కావాలని పోర్షన్ చూపించాలని కోరారు. ఆమె వారికి ఇంటిని చూపిస్తుండగా వైష్ణవి దృష్టి వంటగదిలో అలమరాలో ఉన్న నల్లపూసల దండ, బంగారు ఉంగరంపై పడింది. బయటికి వెళ్లిన కొద్ది నిమిషాల్లో తిరిగి వచ్చిన వైష్ణవి యజమానురాలితో కిచెన్ చూస్తానని చెప్పి లోపలికి వెళ్లి నల్లపూసల దండ, బంగారు ఉంగరం ఎత్తుకెళ్లింది. మరుసటి రోజులు నగలు కనిపించకపోవడంతో నర్సింహారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితుల వాహనాన్ని గుర్తించి ఆంజనేయులును అదుపులోకి తీసుకుని విచారించారు. అతడిచ్చిన వివరాల ఆధారంగా వైష్ణవిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించింది. నిందితురాలిని అరెస్ట్ చేసి నల్లపూసలదండ, ఉంగరం స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. జేబు దొంగ అరెస్ట్ నాగోలు: జేబు దొంగను అరెస్ట్ చేసిన ఎల్బీనగర్ పోలీసులు అతడి నుంచి సెల్‌ఫోన్, రూ. 6 వేల నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఎల్బీనగర్ డీఐ కృష్ణమోహన్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. స్థానిక త్రిమూర్తి కాలనీకి చెందిన విజయ్ అలియాస్ జమ్ములు( ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. వ్యసనాలకు బానిసైన అతడు జేబు దొంగతనాలకు పాల్పడేవాడు. గతంలో సెల్‌ఫోన్ చోరీ కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. అతడిపై జీడిమెట్ల, ఎల్బీనగర్ పోలీస్స్టేషన్లలోనూ కేసులు ఉన్నాయి. బుధవారం రాత్రి ఎల్బీనగర్లో అనుమానాస్పదంగా కనిపించిన విజయ్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి నుంచి సెల్‌ఫోన్, రూ.6వేల నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. -
బూచాడు.. చిక్కాడు
సాక్షి, సిటీబ్యూరో: ఒంటరిగా పాఠశాలలకు వెళ్లే చిన్నారులే అతడి టార్గెట్... పరిచయస్తుడినంటూ మాట కలిపి అదును చూసుకుని వారి ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలు కాజేస్తాడు... తొమ్మిదేళ్లుగా నేరాలు చేస్తున్న ఇతడిపై ఇప్పటి వరకు 22 కేసులు ఉన్నాయి... హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులకు మూడేళ్లుగా మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడు... ఈ నేరగాడిని నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసుల చాకచక్యంగా పట్టుకున్నట్లు కొత్వాల్ అంజనీకుమార్ పేర్కొన్నారు. డీసీపీ రాధాకిషన్‌రావుతో కలిసి శుక్రవారం తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లా, ఉమర్గాకు చెందిన షేక్ ఇస్మాయిల్ బతుకుతెరువు కోసం నగరానికి వలసవచ్చి జహీరాబాద్‌లోని శాంతినగర్‌లో ఉంటూ కూలీ పనులు చేసే వాడు. మద్యం, కల్లు తదితర వ్యసనాలకు బానిసైన అతడికి వస్తున్న ఆదాయం చాలకపోవడంతో నేరాల బాట పట్టాడు. పెద్దవాళ్లను, ఇళ్లనో టార్గెట్‌గా చేసుకుంటే దొరికే అవకాశం ఉందని అనుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అభంశుభం తెలియని చిన్నారుల నుంచే దోచుకోవాలని భావించాడు. ఏదైనా ఓ ప్రాంతాన్ని ఎంచుకునే ఇస్మాయిల్ అక్కడ సైకిల్‌పై మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వారు నివసించే ప్రాంతాల్లో సంచరిస్తుంటాడు. ఒంటరిగా పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తున్న చిన్నారులను గుర్తించి టార్గెట్ చేస్తాడు. ఆపై సైకిల్‌ను దూరంగా ఉంచి వారి వద్దకు వెళ్లే ఇస్మాయిల్ ‘మీ నాన్న స్నేహితుడిని’ అంటూ పరిచయం చేసుకుంటాడు. తాను గోల్డ్‌స్మిత్‌నని చెబుతూ మీ ఒంటిపై ఉన్న గొలుసులు/చెవి కమ్మిలు/కాళ్ల పట్టీలు/ఉంగరాలు మార్చి కొత్తవి, పెద్దవి చేయమని మీ నాన్న చెప్పారని, అందుకే వచ్చానంటూ ఎర వేస్తాడు. నిజమేనని నమ్మే ఆ చిన్నారులు తమ ఒంటిపై ఉన్నవి తీసి ఇచ్చేయడమో, తీసుకోవడానికి అంగీకరించడమో చేస్తారు. ఇక్కడే ఉంటే పది నిమిషాల్లో ఇవి మార్చి కొత్తవి తీసుకువస్తానంటూ వెళ్లి ఉడాయిస్తాడు. ఇదే పంథాలో 2010 నుంచి 2015 వరకు సనత్‌నగర్, జీడిమెట్ల, కూకట్పల్లి, జూబ్లీహిల్స్‌ల్లో 9 నేరాలు చేశాడు. 2015 మేలో ఇస్మాయిల్‌ను పట్టుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు జైలుకు తరలించారు. చర్లపల్లి జైల్లో ఏడు నెలలు శిక్ష అనుభవించి బయటకు వచ్చాడు. ఆ తర్వాత కూడా ఇస్మాయిల్‌లో మార్పురాలేదు. 2016 నుంచి మళ్లీ అదే పంథాలో నేరాలు మొదలెట్టి కాచిగూడ, చిక్కడపల్లి, ఛత్రినాక, ఆసిఫ్‌నగర్, అంబర్పేట్, జగద్గిరిగుట్ట, మార్కెట్, సైఫాబాద్, గాంధీనగర్‌ల్లో మరో 13 నేరాలు చేశాడు. రికార్డులకు ఎక్కనివి మరో పది వరకు ఉంటాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు మూడేళ్లుగా అనేక ప్రయత్నాలు చేసినా ఫలితం లేదు. దీంతో ఇస్మాయిల్ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎస్సైలు కేఎస్ రవి, కె.శ్రీకాంత్, బి.పరమేశ్వర్, జి.రాజశేఖర్‌రెడ్డి, కానిస్టేబుళ్లు శేఖర్, శ్రీకాంత్, ఈశ్వర్రావు రంగంలోకి దిగారు. నేరాలు జరిగిన ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫీడ్‌ను సేకరించి అధ్యయనం చేయగా పాత నేరగాడైన ఇస్మాయిల్ పనిగా తేలింది. అయితే పోలీసులకు చిక్కిన ప్రతిసారీ ఇతడు తన మకాం మారుస్తుంటారని గుర్తించారు. దీంతో ముమ్మరంగా గాలించిన ప్రత్యేక బృందం శుక్రవారం అతడిని అదుపులోకి తీసుకుంది. నిందితుడి నుంచి 20 జతల చెవి కమ్మిలు, తొమ్మిది జతల కాళ్ల పట్టీలు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం అతడిని గాంధీనగర్ పోలీసులకు అప్పగించారు. ఇస్మాయిల్‌పై పీడీ యాక్ట్ నమోదుకు ఉన్న అవకాశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. -
మరో ‘మెరుగు’ మోసం
విజయనగరం , సాలూరు: అపరిచితులను...మెరుగు పేరుతో వచ్చేవారిని నమ్మవద్దని పోలీస్ శాఖాధికారులు వాడవాడలా ప్రచారం చేస్తున్నా ఫలితం లేకపోతోంది. అమాయక మహిళలు మోసగాళ్ల బారిన పడి బంగారాన్ని పోగొట్టుకుంటున్నారు. గత నెల 20వ తేదీన పార్వతీపురం మండల కేంద్రం సంకావీధిలోని అత్తా,కోడళ్లయిన కాంతరత్నం, అనూషలను మెరుగు పేరుతో దుండగులు మోసం చేసి 13 తులాల బంగారు ఆభరణాలతో ఉడాయించిన సంఘటన మరువక ముందే మళ్లీ అలాంటి సంఘటనే సాలూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... పట్టణంలోని యామజాలవారి వీధికి చెందిన పెండ్రాల సుధ ఇంటిలో టైలరింగ్ చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. గురువారం ఉదయం ఇద్దరు వ్యక్తులు సుధ ఇంటికి వచ్చి తమ వద్ద వస్తువులకు మెరుగు పెట్టే పౌడర్ ఉందని.. ప్యాకెట్ కేవలం రూ. 20 మాత్రమేనని చెప్పారు. తొలుత అయిష్టత వ్యక్తం చేసిన సుధ అనంతరం వారి మాటలకు లొంగింది. ఇంకేముంది ఆమె కాళ్ల పట్టీలతో పాటు రాగి ముంతను రసాయనాల్లో ముంచి ధగధగ మెరిసేటట్లు చేశారు. ఆపై బంగారు నగలకు సైతం మెరుగు పెడతామంటూ నమ్మబలికారు. దీంతో సుధ తన మూడు తులాల చంద్రహారాన్ని, ఆమె తల్లి సూర్యకాంతం మూడు తులాల గొలుసును మోసగాళ్లకు అందించారు. దీంతో వారు చిన్న కప్పు తీసుకుని అందులో రసాయనం వేసి నగలు వేస్తున్నట్లుగా నటించి చిన్న రాయి వేశారు. కాసేపు వేడి చేస్తే నగలు మెరిసిపోతాయంటూ కప్పును సుధ చేతికందించారు. కప్పులోనే నగలు ఉన్నాయని భ్రమించిన సుధ వాటిని స్టవ్ మీద పెట్టేందుకు వెళ్తుండగా.. మోసగాళ్లు ఒక్కసారిగా పరుగందుకున్నారు. వెంటనే కప్పులో చూడగా నగలకు బదులు రాయి ఉండడంతో తల్లీకూతుల్లు లబోదిబోమంటూ వీధిలోకి పరుగెట్టారు. అప్పటికే మోసగాళ్లు పరారవ్వడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తూ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
మెరుగుపెడతామంటూ మోసం..
విజయనగరం, పార్వతీపురం/ గరుగుబిల్లి: బంగారానికి మెరుగు పెడతామని ఇద్దరు మహిళలను నమ్మించి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు 13 తులాల బంగారంతో పరారైన సంఘటన పట్టణంలో కలకలం సృష్టించింది. పట్టణ పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని సంకావీ«ధిలో కోరాడ కోటేశ్వరరావు భార్య అనూష , తల్లి కాంతరత్నం వద్దకు బుధవారం మధ్యాహ్నం 11 గంటల సమయంలో వచ్చి ఇత్తడి, బంగారం, రాగి వస్తువులకు మెరుగుపెడతామని నమ్మబలికారు. ముందుగా ఇంటిలో ఉన్న ఇత్తడి, రాగి, వస్తువులకు మెరుగు పెట్టారు. దీంతో మహిళలు తమ వలలో పడ్డారని గ్రహించిన వ్యక్తులు కుక్కర్లో నీరు, పిడికెడు పసుపు ఇస్తే బంగారు వస్తువులకు కూడా మెరుగు పెడతామని నమ్మబలికారు. ఈ మేరకు కాంతరత్నం మూడు తులాల గొలుసు, నాలుగు బంగారు కంకణాలు, అనూష మెడలోని రెండు తులాల పగడాల హారం, నాలుగు గాజులను మెరుగుపెట్టాలని అపరిచితుల చేతులో పెట్టారు. ఇంతలో ఒక వ్యక్తి ఇంటిలో నుంచి బయటకు వచ్చేశాడు. మరో వ్యక్తి బంగారు ఆభరణాలు మెరుగుపెడుతున్నట్లు నటించాడు. ఇంతలో మరింత పసుపు కావాలని అనూష, కాంతరత్నంలను ఒకరి తర్వాత ఒకరిని కోరగా ఇద్దరూ ఇంటిలోకి వెళ్లిపోయారు. ఇదే అదునుగా మోసగాళ్లు అక్కడ నుంచి పరారయ్యారు. మహిళలిద్దరూ బయటకు వచ్చేసరికి కుక్కర్లో బంగారం లేకపోవడంతో తాము మోసపోయామని గ్రహించి చుట్టుపక్కల వారికి తెలియజేశారు. అపరిచిత వ్యక్తులు చుట్టుపక్కల కనిపించకపోవడంతో అనూష తన భర్త కోటేశ్వరరావుకు ఫోన్ ద్వారా విషయాన్ని తెలియజేసింది. అనంతరం బాధితులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఎస్సై యు. మహేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా గరుగుబిల్లి మండలంలోని ముగ్గురు వ్యక్తులు బంగారానికి మెరుగు పెడతామంటూ తిరుగుతుండడంతో అనుమానం వచ్చిన స్థానికులు వారిలో ఒకరిని పట్టుకుని గరుగుబిల్లి ఎస్సై సింహాచలంనకు అప్పగించారు. -
యువకుల కలకలం
శ్రీకాకుళం, కొత్తూరు: మండల కేంద్రంలో సోమవారం ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా పరుగులు తీయండంతో స్థానికంగా కలకలం రేపింది. బంగారానికి మెరుగు పెడతామనే నెపంతో హిరమండలంలో ఇద్దరు యువకులు పుస్తెలతాడుకి తీసుకొని బైక్‌పై పరారయ్యారు. దీనిపై హిరమండలం పోలీసులు.. కొత్తూరు పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందివ్వడంతో పాటు సీసీ కెమెరా పుటేజ్‌లను పంపించారు. అప్రమత్తమైన ఎస్ఐ వై.రవికుమార్ తన సిబ్బందితో కొత్తూరులో అపరిచిత వ్యక్తులపై నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో హిరమండలం నుంచి వచ్చే వాహనాలను నిశితంగా పరిశీలించి, అనుమానం ఉన్న వ్యక్తుల నుంచి వివరాలు సేకరించారు. ఇందులో భాగంగా బైక్‌పై వస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆపే ప్రయత్నం చేయగా.. వారు నిలుపుదల చేయకుండా అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో వారిని పోలీసులు వెంబడించగా.. ఇరువురూ తలో దారిలో తప్పించుకున్నారు. ఇందులో ఒకరిని గ్రామంలోని రజక వీధి వద్ద మహిళలు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మరో యువకుడు వీధిలో పరుగులు తీస్తూ అటుగా బైక్ మీద వెళ్తున్న ఏ.భగవాన్‌కు సాయం కోరాడు. అయితే యువకుడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన వాహనదారుడు... అతడిని పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకు వచ్చారు. దీనిపై ఇరువురు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వివరాలను సేకరించారు. ఇద్దరు యువకులు ఒడిశాలోని ఖండవ గ్రామానికి చెందిన మీసాల అర్జున్, జొన్ని కొలియో అని ఎస్ఐ తెలిపారు. అయితే తాము కొత్తూరులో సినిమా చూసేందుకు వచ్చామని, పోలీసులు బైక్‌ను నిలుపుదల చేసే సరికి హెల్మెట్ లేకపోవడంతో భయంతో పరుగులు తీసామని తెలిపినట్లు సమాచారం. దీనిపై పూర్తి వివరాలు బయటకు వెల్లడించని పోలీసులు.. యువకులను పలు కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. మెరుగు పేరిట బురిడీ హిరమండలం: బంగారానికి మెరుగు పెట్టిస్తామని మాయమాటలు చెప్పి ఓ మహిళా నుంచి రెండు తులాల బంగారు పుస్తెల తాడును తీసుకొని ఇద్దరు యువకులు ఉడాయించారు. మండలంలోని కైవాడ వీధిలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ఆ వీధిలో సోమవారం మధ్యాహ్నం సమయంలో పి.ఏకాసమ్మ అనే మహిళ ఒంటరిగా వద్దకు వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తుల.. బంగారానికి మెరుగు పెడతామని నమ్మబలికారు. దీంతో బాధితురాలు మెడలో ఉన్న బంగారాన్ని వారికి అందించగా.. ఆమెను మాటల్లో పెట్టి, అక్కడి నుంచి ఉడాయించారు. దీంతో ఏకాసమ్మ పోలీసులను ఆశ్రయించగా.. ఎస్ఐ కె.గోవిందరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా దీనిపై స్థానిన దుకాణంలో ఉన్న సీసీ పుటేజ్‌లో ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా సంచరించడాన్ని పోలీసులు గుర్తించారు. దీనిపై వివరాలు సేకరిస్తున్నారు. -
దీపాల కోసం వెళ్లింది.. బీరువాపై కన్ను పడింది
ప్రొద్దుటూరు క్రైం: దీపాల కోసం వెళ్లిన కిలాడి లేడి కళ్లు బీరువాపై పడ్డాయి.. ఆలస్యం చేయకుండా పట్టపగలే బీరువాలోని నగలను లూటీ చేసి పరారైంది.. నిఘా కెమెరాలకు దొరకకుండా ఉండేందుకు మున్సిపల్ వర్కర్లా చొక్కా వేసుకుంది.. అయినా ఆమె ఆటలను పోలీసులు ఎన్నో గంటలు సాగనీయలేదు. పట్టపగలే ఓ ఇంట్లోకి వెళ్లి నగలను దొంగలించిన మహిళతో పాటు మరో వ్యక్తిని త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ శ్రీనివాసరావు త్రీ పోలీస్‌స్టేషన్ ఆవరణంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అరెస్ట్ వివరాలను వెల్లడించారు. ప్రొద్దుటూరులోని వైఎంఆర్ కాలనీలో బొల్లవరం శంకరమ్మ అనే మహిళ నివాసం ఉంటోంది. ఈ నెల 7న ఆమె ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో గుర్తు తెలియని మహిళ వచ్చి బీరువాలో ఉన్న 10.5 తులాల బంగారు నగలను దోచుకొని పారిపోయింది. ఆమె బయటికి వచ్చి చూసే లోపే దారిన వెళ్లే ఒక వ్యక్తి స్కూటీలో ఎక్కి ఉడాయించింది. బా«ధితురాలి ఫిర్యాదు మేరకు త్రీ టౌన్ పోలీసులు అదే రోజు కేసు నమోదు చేశారు. సీసీ పుటేజీల ఆధారంగా దర్యాప్తు ఇటీవల పోలీసులు పట్టణ వ్యాప్తంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేశారు. చోరీకి పాల్పడిన కిలాడి లేడి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. వీటికి సంబంధించిన ఫోటోలను పోలీసులు పత్రికలకు విడుదల చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో త్రీ టౌన్ సీఐ జయానాయక్, ఎస్ఐలు కృష్ణంరాజునాయక్, నరసయ్య తమ సిబ్బందితో కలిసి మంగళవారం జమ్మలమడుగు బైపాస్‌రోడ్డులోని పొట్టిపాడుకు వెళ్లే దారిలో వాహన తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో వెంకటేశ్వరస్వామి ఆలయం వైపు నుంచి పట్టణంలోకి వస్తున్న కడపలోని ఇందిరానగర్‌కు చెందిన తమ్మిశెట్టి వెంకటసుబ్బమ్మ అలియాస్ చిలకల ప్యారీ, అదే వీధికి చెందిన షేక్ ఖాదర్‌హుస్సేన్ బైక్‌లో వెళ్తూ పోలీసులను చూసి ఒక్కసారిగా ఆగారు. బైక్‌ను వెనక్కి తిప్పుకొని పారిపోతుండగా పోలీసులు వెంబడించి వారిని పట్టుకున్నారు. గతంలో ప్రొద్దుటూరులో చోరీకి పాల్పడినట్టు వారు పోలీసుల వద్ద అంగీకరించారు. మున్సిపల్ వర్కర్లా చొక్కా వేసుకొని.. వైఎంఆర్‌కాలనీలో నగలు దొంగలించిన వెంకటసుబ్బమ్మ అర్జంటుగా ఆస్పత్రికి వెళ్లాలని దారిన వెళ్లే ఒక వ్యక్తి స్కూటీలో ఎక్కి టీబీరోడ్డులోని కోర్టు బయట దిగింది. వెంటనే కోర్టు కాంపౌండ్‌లోకి వెళ్లిన ఆమె ఖాదర్‌హుస్సేన్ ఇచ్చిన మున్సిపల్ వర్కర్లు ధరించే బ్లూ చొక్కా వేసుకుంది. అక్కడి నుంచి వాళ్లిద్దరూ బైక్‌లో పరారయ్యారు. మరుసటి రోజు వారి ఫోటోలు పేపర్లో రావడంతో బయటి తిరిగితే గుర్తు పడతారని భావించి ముఖానికి గుడ్డ కట్టుకొని తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో బైక్‌లో వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా 2018 డిసెంబర్లో ఆటోలో వెళ్తున్న మహిళకు మాయ మాటలు చెప్పి ఆమె మెడలో ఉన్న బంగారు చైన్‌ను దొంగలించుకొని వెళ్లారు. నిందితురాలు వెంకటసుబ్బమ్మ భర్త చాన్‌బాషా తరపు నుంచి ఆమెకు ఖాదర్‌హుస్సేన్ తమ్ముడి వరుస అవుతాడు. అతను పాలిష్ బండల చప్పట వేయడానికి వెళ్తుంటాడు. కష్ట పడకుండా డబ్బు సంపాదించాలనే ఆశతో ఆమెతో కలసి అతను చోరీలకు అలవాటు పడ్డాడు. వారి వద్ద నుంచి రూ. 4లక్షల 60 వేలు విలువ చేసే 130 గ్రాముల బంగారు నగలు, బైక్, చొక్కా, సెల్‌ఫోన్, స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరు పరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగానే వారిని గుర్తించి పట్టుకున్నామని డీఎస్పీ తెలిపారు. దొంగలు చాకచక్యంగా వ్యవహరిస్తున్నారని, ప్రతి ఒక్కరూ తమ వీధుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇంత త్వరగా చోరీ కేసును ఛేదించిన త్రీ టౌన్ పోలీసులను డీఎస్పీ అభినందించారు. దీపాల కోసం వెళ్లి.. ఇళ్లలో దీపారాధన కోసం వినియోగించే దీపాలను ఆమె దొంగలించేది. దీపాలను శుభ్రం చేసి బయట ఆరబెట్టగా వాటిని దొంగిలించుకొని వెళ్లేది. శంకరమ్మ ఇంట్లో కూడా దీపాలను దొంగిలించడానికే ఆమె వెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇంట్లోకి వెళ్లిన ఆమె నేరుగా దేవుని గూడు వద్దకు Ðð వెళ్లగా అక్కడ దీపాలు కనిపించలేదు. దీంతో పక్కనే ఉన్న బీరువాపై ఆమె కన్ను పడింది. తాళం వేయకపోవడంతో సులభంగా బీరువాను తెరచి, అందులో ఉన్న బంగారు నగలను దోచుకొని వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. -
మాజీ ఎంపీపీ భర్త.. ఘరానా దొంగ
నాగోలు: కల్లుకు బానిసై చోరీలకు పాల్పడుతున్న మాజీ ఎంపీపీ భర్త, పాతనేరస్తుడు అమర్‌సింగ్‌ను ఎల్బీనగర్ పోలీస్‌లు ఆరెస్ట్ చేసి అతడి నుంచి 36 తులాల బంగారు ఆభరణాలు రూ. 2 వేల నగదు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. మంగళవారం ఎల్బీనగర్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ çసన్‌ప్రీత్‌సింగ్ వివరాలు వెల్లడించారు. నాగర్ కర్నూల్ జిల్లా, వెల్దండ మండలం, బైరాపురం నగరగడ్డతండాకు చెందిన రత్లావత్ అమర్ సింగ్ వృత్తి రీత్యా వ్యవసాయదారుడు. అతని భార్య విజయ గతంలో సర్పంచ్‌గా, ఎంపీపీగా పనిచేసింది. సొంత గ్రామంలో 20 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కల్లుకు బానిసైన ఇతను హైదరాబాద్‌లోని సింగరేణి కాలనీలో ఉంటూ చోరీలకు పాల్పడుతున్నాడు. గతంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చాడు. కొంత కాలంగా ఆమన్‌గల్‌లో ఉంటూ తరచూ నగరానికి వచ్చి వెళ్లే ఇతను సాగర్ రింగ్‌రోడ్ సమీపంలోని కల్లుకౌంపౌండ్‌లో కల్లు సేవించి రాత్రిళ్లు తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నాడు. ఇటీవల ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 14 ఇళ్లలో దొంగతనాలు చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీటీవీ పుటేజీ ఆధారంగా నిందుతుడిని అదుపులోకి తీసుకుని విచారించగా చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలో 2, కంచన్‌బాగ్‌లో ఒక చోరీకి పాల్పడినట్లు తెలిపాడు. గతంలో సరూర్‌నగర్, ఎల్బీనగర్, సైదాబాద్, వనస్థలిపురం, చైతన్యపురి, మీర్‌పేట, చందానగర్, షాద్‌నగర్, దేవరకొండ ప్రాంతాల్లో చోరీలు చేసినట్లు అంగీకరించాడు. అతడి నుంచి బంగారు ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో ఎల్బీనగర్ ఏసీపీ పృథ్వీదర్‌రావు, సీఐ అశోక్ రెడ్డి, డీఐ కృష్ణమోహన్, ఎస్ఐ మారయ్య, సిబ్బంది వెంకటేష్, శివరాజ్, సుభాష్ చంద్రబోస్ పాల్గొన్నారు. -
నకిలీ బంగారుహారంతో టోకరా
అమీర్‌పేట: పొలంలో పని చేస్తుండగా బంగారు హారం దొరికిందని చెప్పి ఇద్దరు అగంతకులు ఓ వ్యక్తిని నమ్మించి అతడి వద్ద నుండి రూ. 9 లక్షలు కాజేసిన సంఘటన ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.మధురానగర్‌కు చెందిన వై.కె.రమణారెడ్డి పండ్ల రసాల వ్యాపారం చేసేవాడు. ఇటీవల అతని వద్దకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు తమను శివాజీ, మాధవ్‌గా పరిచయం చేసుకున్నారు. తాము పొలాల్లో జేసీబీతో పనులు చేయిస్తుంటామని, ఇటీవల పని చేస్తుండగా 1250 గ్రామల బంగారు హారం దొరికిందని, తాము ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున హారాన్ని విక్రయిస్తున్నట్లు తెలిపారు. అందులోని చిన్న ముక్కను రమణరెడ్డికి ఇచ్చి అనుమానం ఉంటే పరీక్షించుకోవాలని సూచించారు. దీంతో అతను నగల దుకాణంలో పరీక్షించగా అది బంగారమేనని నిర్ధారణ అయ్యింది. దీంతో వారి మాటలు నమ్మి న రమణారెడ్డి తనకు కొంత గడువు ఇస్తే హారాన్ని కొనుగోలు చేస్తానని తెలిపాడు. అందుకు అంగీకరించి న వారు ఈ నెల 14న రమణారెడ్డికి ఫోన్ చేసి రూ. 9 లక్షలు ఇస్తే హారం ఇచ్చేస్తామని బేరం పెట్టారు. దీంతో అతను వారు అడిగిన మొత్తాన్ని చెల్లించి హారం కొనుగోలు చేశాడు. సోమవారం దానిని బంగారు నగల దుకాణానికి తీసుకువెళ్లి పరీక్షించగా హారం నకిలీదిగా తేలింది. దీంతో మంగళవారం పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భవానీ భక్తుల ముసుగులో...
అల్లిపురం(విశాఖ దక్షిణం): ఇటీవల నగర పరిధిలో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులతోపాటు, ఇంటి దొంగతనానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను నగర పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి సుమారు రూ.8లక్షల విలువ గల బంగారు ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర క్రైం డీసీపీ ఎ.ఆర్.దామోదర్ వివరాలు వెల్లడించారు. భవానీ భక్తుల ముసుగులో... పెందుర్తి మండలం, నరవ గ్రామంలో గత ఏడాది డిసెంబర్ 28న ఉదయం 6గంటల సమయంలో ఒక మహిళ మెడలోని పుస్తెల తాడు తెంపుకుపోయిన కేసులో ముగ్గురు వ్యక్తులను నగర క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.87,900ల విలువ గల బంగారు పుస్తెలు, గొలుసు స్వాధీనం చేసుకొన్నారు. వారు ఉపయోగించిన ఆటో, బైక్ స్వాధీనం చేసుకున్నారు. అక్కయ్యపాలెం ప్రాంతానికి చెందిన పెద్దిశెట్టి రూపేష్, దంగుడుబొయిన వెంకటేష్, పోలిపిల్లి మహేష్ స్నేహితులు. వీరు ముగ్గురూ భవానీ మాల ధరిం చారు. ఆటోలో అక్కయ్యపాలెం నుంచి రెక్కీ చేసుకుంటూ గోపాలపట్నం, నరవ వైపు ప్రయాణం చేసి... డిసెంబర్ 28న ఉదయం 6గంటల సమయంలో నరవ దగ్గర ఒంటరిగా నడుచుకుని వెళ్తున్న మహిళ మెడలోని పుస్తెల తాడు తెంపుకుని ఆటోలోనే పరారయ్యారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు నిందితులు ముగ్గురుని పెందుర్తి క్రైం ఇన్స్పెక్టర్ టి.నవీన్‌కుమార్, ఎస్ఐ జీడీ బాబు, కానిస్టేబుల్ వై.చిన్నారావు, కె.అప్పలరాజు అదుపులోకి తీసుకుని చోరీ సొత్తు రికవరీ చేశారు. నిందితుల్లో పెద్దిశెట్టి రూపేష్పై ఫోర్తుటౌన్ పోలీస్ స్టేషన్లో సస్పెట్ సీటు ఉంది. ఇతనిపై రెండు రోబరీ కేసులు, రెండు చైన్ స్నాచింగ్‌లు, రెండు ఆటో టైర్లు దొంగతనం కేసులు ఉన్నాయి. వీటిలో అరెస్ట్ అయి జైలు శిక్ష కూడా అనుభవించాడు. రెండో నిందితుడు దంగుడుబోయిన వెంకటేష్‌పై కూడా చైన్ స్నాచింగ్ కేసులు ఉన్నాయి. ఈ ఏడాది తగ్గిన నేరాలు : ఏటా పండగ రోజుల్లో దొంగతనాలు ఎక్కువుగా జరిగేవని, ఈ ఏడాది తీసుకున్న జాగ్రత్తల వల్ల తగ్గుముఖం పట్టాయని నగర క్రైం డీసీపీ ఏఆర్ దామోదర్ తెలిపారు. ఈ ఏడాది రద్దీగా గల దుకాణాలులో, ఇంటి దొంగతనాలు తక్కువుగా నమోదయ్యాయన్నారు. దొంగతనం కేసుల్లో స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు కీలకంగా మారుతున్నారని క్రైం డీసీపీ దామోదర్ తెలిపారు. పెందుర్తి చైన్ స్నాచింగ్ కేసులో నిందితులను పట్టుకోవటంతో తమకు సహకరించిన ఇ.మణికంఠను ఆయన ప్రత్యేకంగా అభినందించి నగదు రివార్డు అందజేశారు. అదేవిధంగా నిందితులను పట్టుకోవడంలో చురుగ్గా వ్యవహరించిన పోలీస్ సిబ్బందికి నగదు రివార్డులు అందజేసి అభినందించారు. ఇంటి తాళం పగులగొట్టి.. రాత్రి పూట ఇంటికి వేసి ఉన్న తాళం పగులగొట్టి దొంగతనానికి పాల్పడిన వ్యక్తితో పాటు, దొంగ సొత్తును కలిగి ఉన్న వ్యక్తులను ఆరిలోవ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి రూ.3.60లక్షల నగదు, రూ.7.28లక్షల విలువ గల 122.91 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. విశాలాక్షినగర్ ప్రాంతానికి చెందిన చింతపల్లి వెంకటరావు ఈ నెల 16వ తేదీన ఇంటికి తాళం వేసి కుటుంబంతో సహా బయటకు వెళ్లారు. అదే రోజు ఆర్కేబీచ్లో మూరి మిక్చర్ అమ్ముకునే దంగేటి సతీష్, అతని స్నేహితుడు మేడిశెట్టి వరప్రసాద్ మద్యం సేవించారు. తరువాత దంగేటి సతీష్ తన అత్తగారింటికి వెళ్తూ విశాలాక్షినగర్ రామాలయం వీధిలో గల మూడో అంతస్తుపైన గల ఇంటికి తాళం వేసి ఉన్న సంగతి గమనించాడు. సతీష్ తన దగ్గర గల గుణపంతో తాళం విరగ్గొట్టి ఇంటిలోకి ప్రవేశించాడు. ఇంటిలో గల బంగారం, నగదు దొంగిలించాడు. తరువాత వంట గదిలోని కారం, పసుపు ఇంట్లో జల్లి తన వేలి ముద్రలు పోలీసులకు దొరకకుండా జాగ్రత్త పడ్డాడు. తరువాత దొంగలించిన సొత్తును తన స్నేహితుడు మేడిశెట్టి వరప్రసాద్‌కు అప్పగించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఆరిలోవ పోలీసులు ద్వారకా సబ్‌డివిజన్ క్రైం ఇన్స్పెక్టర్ వి.శ్రీనివాసరావు, ఆరిలోవ క్రైం ఎస్ఐ పి.విజయకుమార్, ఎస్ఐ డి.సూరి తమ సిబ్బందితో దర్యాప్తు చేపట్టారు. తాజాగా హనుమంతువాక వద్ద దంగేటి సతీష్‌ని, మేడిశెట్టి వరప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వ్యసనాలకు బానిసైన దంగేటి సతీష్‌పై వన్టౌప్ పోలీస్ స్టేషన్లో నాలుగు కేసులు నమోదయ్యాయి. వాటిలో ఎనిమిది నెలల శిక్ష కూడా అనుభవించాడు. త్రీటౌన్‌లో ఒక కేసులో మూడు నెలల జైలు శిక్ష పడింది. రెండో నిందితుడు మేడిశెట్టి వరప్రసాద్‌పై రౌడీషీట్ ఉంది. చనిపోయిన రౌడీ షీటర్ కాశీంకు సన్నిహితుడు కూడా. ఇతనిపై ఒక హత్యకేసు, ఒక రోబరీ కేసు, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన కేసులు ఉన్నాయి. -
తల్లి, కుమార్తెను బావిలోకి తోసి..
చెన్నై , సేలం: తల్లి, కుమార్తెను బావిలో తోసి రూ.15 వేలు, 4 సవర్ల నగలతో పరారైన గుర్తు తెలియని ముఠా కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ సంఘటనలో చిన్నారి మృతి చెందింది. వివరాలు.. సేలం జిల్లా వీరగనూర్ సమీపంలో ఇలుప్పనత్తం గ్రామానికి చెందిన శివశంకర్ (34) విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతని భార్య ప్రియాంక (24). వీరి కుమార్తె శివాని (5). కాగా, శివశంకర్ విదేశాల నుంచి వేప్పూర్‌కు చెందిన అతని మిత్రుడు ఖాతాలో డబ్బులు వేస్తుంటాడు. ఆ సమయంలో ప్రియాంక వేప్పూర్‌కు వెళ్లి డబ్బులు తీసుకువస్తుంది. ఈ క్రమంలో ప్రియాంక కుమార్తె శివానితో కలిసి గురువారం డబ్బు తీసుకుని తిరిగి వస్తోంది. వీరగనూర్ బస్టాండ్ సమీపంలో గుర్తుతెలియని ముఠా వారిని అడ్డుకుని రూ.15,000 నగదు, 4 సవర్ల నగలు దోపిడీ చేశారు. తల్లి, కుమార్తెను అక్కడే ఉన్న బావిలో తోసి పరారయ్యారు. ఈ ఘటనలో బావిలో పడిన శివాని మృతి చెందగా, ప్రియాంక ప్రాణాపాయస్థితిలో ఉంది. శుక్రవారం ఉదయం అక్కడికి వెళ్లిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వీరగనూర్ పోలీసులు అక్కడికి చేరుకుని ప్రియాంకను రక్షించి చికిత్స నిమిత్తం ఇలుప్పనత్తం ప్రాథమిక వైద్య కేంద్రంలో చేర్చారు. శివాని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్తూర్ జీహెచ్‌కు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళపై దాడి చేసి బంగారం చోరీ
-
ఘరానా దొంగల ముఠా అరెస్ట్
చిత్తూరు, తిరుపతి క్రైం: ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణికులతో కలసిపోయి బస్సు ఎక్కుతున్నట్టు నటిస్తూ బంగారు ఆభరణాలు చోరీ చేసే ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.3.21లక్షల విలువ చేసే చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం క్రైం డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి తెలిపిన వివరాలు...స్థానిక టీటీ డీ భూదేవి కాంప్లెక్స్ వద్ద అనుమానాస్పదంగా తచ్ఛాడుతున్న కర్ణాటక రాష్ట్రం గదక్ తాలూకాకు చెందిన ఎం.బేల (45), ముట్టుగారి రేణుక(55), అడల్ కార్తీక్ (20), సంతోష్ గైక్వాడ్(28), వాణిశ్రీ(50), ఓవీ సవిత(30), ముట్టుగారి నాగరాజు(21), అనూప్ (24), ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన నల్లపోతల మధును క్రైం సీఐ రసూల్ సాహెబ్ అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.2.91లక్షల విలువ చేసే 97 గ్రాముల బంగారం, 30వేల నగదుతో పాటు నేరాలకు ఉపయోగించిన టాటా సుమోను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై ఇప్పటికే సీసీఎస్, ఈస్ట్ పీఎస్, తిరుచానూరులో ఒక్కొక్క కేసు నమోదై ఉన్నాయి. వీరంతా ఒక ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నట్టు తేలింది. వీరు గతంలో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో పలు నేరాలకు పాల్పడి జైలు శిక్ష కూడా అనుభవించారు. భలే కిలాడీలు ఈ దొంగలు ప్రయాణికుల వలే ఏదో ఒక వాహనాన్ని ఎంచుకుని వారు ముందుగా ఎంచుకున్న ప్రాంతానికి వస్తారు. గ్రూపులుగా విడిపోయి బస్సుల్లో, బస్టాండ్లలో, గుళ్లలో చోరీలకు పాల్పడుతుంటారు. వారం 10 రోజుల పాటు దొంగతనాలు చేసి ఆ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి జంప్ అయ్యేవారు. తిరుచానూరు గుడిలో నేరాలకు పాల్పడినప్పుడు సీసీ పుటేజీల ఆధారంగా ఈ ముఠాను గుర్తించారు. వారి కోసం గాలిస్తున్న తరుణంలో గురువారం అదుపులోకి తీసుకున్నారు. ప్రధానంగా భక్తుల రద్దీ ఉండే ఆలయాలు, ప్రయాణికుల తాకిడి ఉండే బస్టాండ్లనే టార్గెట్ చేసుకుని తమ హస్త లాఘవంతో ఆభరణాలు కొట్టేయడంలో ఈ ముఠా ఆరితేరిందని డీఎస్పీ చెప్పారు. -
దొంగల కుటుంబం
చిత్తూరు, తిరుపతి క్రైం : తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు వద్ద దారిదోపిడీకి పాల్పడిన వారిని అరెస్ట్ చేసి వారి నుంచి సుమారు 60, 51,400 రూపాయల విలువగల బంగారు, డైమండ్, వెండి ఆభరణాలను తిరుపతి సీసీఎస్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి క్రైం సబ్ డివిజన్ డీఎస్పీ ఆర్.రవిశంకర్‌రెడ్డి కథనం...ఈనెల 7న కోయంబత్తూరు వద్ద దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. 1965.530 గ్రాముల బంగారు, 15.140 గ్రాముల డైమండ్ నగలు, 248.200 గ్రాముల వెండి ఆభరణాలు దోచుకున్నారు. తమిళనాడులో దీనిపై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో, గురువారం తెల్లవారుజామున తిరుపతి టీటీడీ శ్రీకోదండరామస్వామి ధర్మశాల 3వ సత్రం ఎదురుగా ఉన్న రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వద్ద అనుమానాస్పదంగా తచ్ఛాడుతున్న ఒక మహిళ, యువకుడిని తిరుపతి సీసీఎస్ ఇన్స్పెక్టర్ సి.భాస్కర్‌రెడ్డి అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో వారిద్దరూ తల్లీకొడుకులని, తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పంజన్ తంగాళ్ రోడ్డు, జీఆర్ నగర్‌కు చెందిన రసూల్ భార్య షమా(46), ఆమె కుమారుడు మహమ్మద్ సలీం(29) అని తేలింది. అంతేకాకుండా వారి వద్ద నున్న నల్లటి బ్యాగులను తెరచి పరిశీలించగా లక్షల విలువ చేసే బంగారు, డైమండ్, వెండి నగలు ఉండటంతో విస్తుపోయారు! వీళ్లు ఘరానా దొంగలనే కోణంలో విచారణ చేసేసరికి దోపిడీ వ్యవహారం బట్టబయలైంది. షమా ఇద్దరు కుమారులు మహ్మద్ సలీం, ఫైరోజ్ డ్రైవర్లుగా పనిచేస్తున్నారని, వారిద్దరిపై వివిధ పోలీస్ స్టేషన్లలో ఎర్రచందనం అక్రమ రవాణా కేసులు నమోదైనట్టు గుర్తించారు. షమా తన చిన్నకుమారుడు, తన స్నేహితులతో కలసి కోయంబత్తూరులో దోపిడీకి పాల్పడి ఈ నగలు కాజేసినట్టు వెల్లడైంది. ఈ నగలు ఇంటి వద్ద దాచి ఉంచినపక్షంలో తమిళనాడు పోలీసులు గుర్తించి పట్టుకుంటారనే ఉద్దేశంతో తన పెద్దకొడుకుతో కలిసి రెండుమూడు రోజులుగా తిరుపతిలోని వివిధ ప్రదేశాలలో ఉంటున్నట్టు షమా నోరువిప్పింది. ఈ నగలను తిరుపతిలో విక్రయించి వెళ్లాలనే ఉద్దేశంతో వీరిద్దరూ ఇక్కడికి వచ్చినట్టు పోలీసులు భావిస్తున్నారు. దోపిడీ ఘటన సమాచారాన్ని కోయంబత్తూరు జిల్లా కేజీ చావిడి పోలీసు స్టేషన్‌కు తిరుపతి పోలీసులు చేరవేశారు. ఇద్దరు నిందితులను కోర్టులో హాజరుపరిచారు. వివిధ చోట్ల దోపిడీ చేసిన∙సొత్తును బాధితులకు అప్పగించనున్నట్టు డీఎస్పీ ఆర్.రవిశంకర్‌రెడ్డి తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో కృషి చేసిన సీఐలు భాస్కర్‌రెడ్డి, కె.శరత్చంద్ర, టి.అబ్బన్న, ఎస్ఐ డి.రమేష్ బాబు, హెడ్‌కానిస్టేబుల్ రాజేంద్ర, ఆర్.పద్మావతి, కానిస్టేబుళ్లు భగవతి ప్రసాద్, బారుసా, రవికుమార్, రెడ్డెమ్మను తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ అన్బురాజన్ అభినందించారు. వీరికి రివార్డులను సిఫారసు చేశారు. -
చెలరేగిపోయిన చైన్‌స్నాచర్లు
చైన్‌స్నాచర్లు మరోసారి చెలరేగిపోయారు. పట్టపగలే ముగ్గురు మహిళల మెడల్లోని బంగారు ఆభరణాలు తెంపుకుని ఉడాయించారు. అగనంపూడి సమీప రాజీవ్‌నగర్ సమీపంలోనూ, ఎంపీవీ కాలనీలో రెండు చోట్ల జరిగిన ఈ ఘటనలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి విశాఖపట్నం, అగనంపూడి (గాజువాక): స్నేహితురాలితో కలిసి మార్కెట్‌కు వెళ్తున్న మహిళ మెడలో నుంచి ఇద్దరు దుండగులు బంగారు గొలుసు తెంపుకొని పరారైన సంఘటన దువ్వాడ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. దువ్వాడ క్రైం ఎస్ఐ సంతోష్ తెలిపిన వివరాల ప్రకారం... రాజీవ్‌నగర్ సమీపంలోని శివసాయినగర్కు చెందిన దేవినేని పద్మ ఆమె స్నేహితురాలితో కలిసి గురువారం ఉదయం 11.30 గంటల సమయంలో రాజీవ్‌నగర్ మార్కెట్‌కు నడిచి వెళ్తున్నారు. మార్కెట్‌కు సమీపంలో గుర్తు తెలియని ఇద్దరు దుండగులు గ్రే కలర్ స్కూటీపై ఆమె పక్క నుంచి వాహనాన్ని పోనిచ్చి పద్మ మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసు తెంపుకొని పరారయ్యాయి. నిందితులను వెంబడించినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో బాధితురాలు దువ్వాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి తెలిపిన వివరాలు ప్రకారం రాజీవ్‌నగర్ కూడలిలోని సీసీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులను నిందితుల చిత్రాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎంవీపీ కాలనీలో... పెదవాల్తేరు(విశాఖ తూర్పు): పట్టపగలు రోడ్డుపై చైన్‌స్నాచర్లు చెలరేగిపోయారు. ఇద్దరు మహిళల మెడలులో నుంచి బంగారు ఆభరణాలు చోరీ చేసి పారిపోయారు. ఈ రెండు దొంగతనాలకు పాల్పడిందని ఒకరేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎంవీపీ కాలనీ సెక్టార్ – 6 రోడ్డుపై నుంచి వస్తున్న ఎస్.రమావేది మెడలోని నాలుగు తులాల బంగారు చైనుని బైకుపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు తెంపుకుని పరారయ్యారు. సెక్టార్ – 6 నుంచి మహాత్మాగాంధీ ఆస్పత్రికి వచ్చే రోడ్డులో గురువారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఎస్.రమాదేవి (64) నడుచుకుని వస్తుండగా ఈ చైన్‌స్నాచింగ్ జరిగింది. నాలుగు తులాల బరువుగల చైన్ తెంపుకుని దుండగులు ఉడాయించారు. అలాగే ఎంవీపీ కాలనీ సెక్టార్ – 8 సత్యసాయి బాబా పాఠశాల రోడ్డులో టి.సావిత్రి (51) నడుచుకుంటూ వెళ్తుండగా బైకుపై వచ్చిన ఇద్దరు దొంగలు 7 తులాల బంగారు చైను, నల్లపూసలు దండ తెంపుకుని పరారయ్యారు. ఈ రోడ్డులో నడిచి వెళ్తుండగా వెనుక నుంచి బైకుపై వచ్చిన దొంగలు మెడలోని ఆభరణాలు చోరీ చేసి పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎంవీపీ స్టేషన్ క్రైం ఎస్ఐ సూరిబాబు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లివారింట భారీ దొంగతనం
ఆరిలోవ(విశాఖ తూర్పు): నగరంలోని ఆరో వార్డు పరిధి విశాలాక్షినగర్‌లో భారీ దొంగతనం జరిగింది. సంక్రాంతికి ఊరెళ్లి వచ్చేలోపే దొంగలు ఇంట్లోపడి దొరికినకాడికి ఊడ్చేశారు. డాగ్ స్క్వేడ్ గుర్తుపట్టలేని విధగా ఇంట్లో కారం, పసుపు చల్లేశారు. ఆరిలోవ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆరో వార్డు పరిధి విశాలాక్షినగర్ రామాలయం వీధిలో చెట్టుపల్లి వెంకటరావు కుటుంబంతో నివాసముంటున్నారు. ఆయన ఓ కనస్ట్రక్షన్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తూ ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నారు. కుమార్తెకు ఈ నెల 21న వివాహం చేయాలని నిశ్చయించారు. అందుకోసం పెళ్లి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా పెళ్లి ఖర్చుల కోసం సేకరించిన రూ.10 లక్షలు, కుమార్తె కోసం ఇటీవలే కొనుగోలు చేసిన 20 తులాల బంగారు ఆభరణాలు ఇంట్లో దాచిపెట్టారు. పండగకు ఆయన కుటుంబీకులు చోడవరం వెళ్లారు. బుధవారం ఇంటికి తాళంవేసి ఆయన కూడా ఊరెళ్లారు. గురువారం మధ్యాహ్నం ఆ ఇంటి తలుపులు విరగ్గొట్టి ఉండటాన్ని స్థానికులు గమనించారు. దీంతో దొంగతనం జరిగినట్లు భావించిన స్థానికులు చోడవరంలో ఉన్న వెంటకరావుకు తెలియజేశారు. దీంతో ఆయన తన కుటుంబంతో వెంటనే విశాఖలోని ఇంటికి చేరుకొన్నారు. తలుపులు తెరిచి ఉండటం, దుస్తులు చిందరవందరగా ఉండటం, బీరువా తెరిచి ఉండడాన్ని చూసి దొంగతనం జరిగినట్లు నిర్థారించుకొన్నారు. బీరువాలోని బంగారు ఆభరణాలు, నగదు కనిపించకపోయేసరికి లబోదిబోమంటూ ఆరిలోవ పోలీసులకు తెలియజేశారు. ఆయన ఇచ్చిన సమాచారంతో సీసీఎస్ ఏసీపీ గోవిందరాజులు, ఆరిలోవ క్రైం సీఐ శ్రీనివాసరావు, క్రైం ఎస్ఐ విజయ్‌కుమార్ సిబ్బందితో వెళ్లి ఇంట్లో దొంగతనం జరిగిన తీరు పరిశీలించారు. పోలీసులు ఇచ్చిన సమాచారంతో క్లూస్ టీం సభ్యులు వచ్చి వేలిముద్రలు సేకరించారు. దోచుకొన్న అనంతరం దొంగలు ఇంట్లో కారం, పసుపు చల్లేసి వెళ్లిపోయారు. దీంతో డాగ్‌స్క్వేడ్ పరిశీలనకు వీలులేకుండాపోయింది. వెంకటరావు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కుమార్తె వివాహం కోసం సిద్ధం చేసిన రూ.10 లక్షలు నగదు, 20 తులాల బంగారు ఆభరణాలు దొంగలు పట్టుకుపోయినట్లు పేర్కొన్నారు. క్రైం ఎస్ఐ విజయకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
క్రైం పోలీసులమని టోకరా..
విశాఖపట్నం, అక్కిరెడ్డిపాలెం(గాజువాక): దుండగులు కొత్తరకం ఎత్తుగడలతో జనాన్ని బురిడీ కొట్టించి బంగారం అపహరించుకుపోయారు. ఏకంగా క్రైం పోలీసులమని చెప్పి సుమారు పదమూడున్నర తులాల బంగారం దోచుకుపోయారు. ఈ ఘటనలు కొత్త గాజువాక, నగరంలోని సిటీ సెంట్రల్ పార్కు వద్ద గురువారం చోటుచేసుకున్నాయి. గాజువాక క్రైం సీఐ పైడపునాయుడు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం, కంచిలి గ్రామానికి చెందిన పోలేశ్వరరావు గాజువాక పైడిమాంబకాలనీలో తన మనుమరాలి పుష్పవతి కార్యక్రమానికి వచ్చాడు. కార్యం అనంతరం తన స్వగ్రామం వెళ్లేందుకు గురువారం ఉదయం వరుసకు తమ్ముడైన శంకర్రావుతో కలిసి ఆర్టీసీ కాంప్లెక్స్‌కు వెళ్లేందుకు కొత్తగాజువాక హైస్కూల్ రోడ్డు జంక్షన్ వద్ద వేచి ఉన్నారు. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు వారి వద్దకు వచ్చి... తాము క్రైం పోలీసులమని చెప్పి పరిచయం చేసుకున్నారు. పోలేశ్వరరావును ఉద్దేశించి మెడలో బంగారు చైను, రెండు చేతులకు ఉన్న నాలుగు ఉంగరాలు చూసి దొంగలున్నారు జాగ్రత్త అని చెప్పారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న వ్యక్తిని పిలిచి అతడి చెంపపై కొట్టి మెడలో బంగారు చైను తీసి దాచుకోవాలని చెప్పాను కదా అంటూ ఓవర్ యాక్షన్ చేశారు. (ఆ వ్యక్తి దొంగతనానికి పాల్పడిన వారికి సంబంధించిన వాడేనని పోలీసులు అనుమానిస్తున్నారు). అనంతరం అగంతకులు పోలేశ్వరరావు మెడలో ఉన్న చైను, చేతులకు ఉన్న నాలుగు ఉంగరాలు, మనుమరాలి కోసం తెచ్చి తిరిగి తీసుకెళ్లిపోతున్న నక్లెస్, తన సోదరుడు శంకరావు చేతికి ఉన్న రెండు ఉంగరాలను తీయించి ఒక గుడ్డలో మూటకట్టారు. అనంతరం పోలేశ్వరరావు వద్ద గల బ్యాగులో పెడుతున్నట్లు నటించే సమయంలో ఒక చేతి రుమాలును దుండగులు తీసి గట్టిగా దులిపారు. ఆ సమయంలో అన్నదమ్ములిద్దరికీ కొంత మగతగా ఉన్నట్లు అనిపించడంతో అగంతకులు ద్విచక్ర వాహనంపై బంగారంతో ఉడాయించారు. దీంతో అవాక్కయిన బాధితులు లబోదిబోమంటూ గాజువాక పోలీసులను ఆశ్రయించారు. జరిగిన ఘటనలో 12 తులాలు బంగారం ఆపహరణకు గురైందని పోలీసులు తెలిపారు. సమీపంలోని సీసీ కెమెరా ఫుటేజీని సీఐ పరిశీలించారు. నిందితులను గుర్తించమని బాధితులకు కూడా ఫుటేజీ చూపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మోర్నింగ్ వాక్ నుంచి వెళ్తుండగా... అల్లిపురం(విశాఖ దక్షిణం): పోలీసులమని చెప్పి బంగారం అపహరించిన ఘటన టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. క్రైం ఎస్ఐ భాస్కరరావు తెలిపిన వివరాల ప్రకారం... అల్లిపురం ప్రాంతానికి చెందిన మజ్జి వెంకటరావు(85) గురువారం ఉదయం మోర్నింగ్ వాక్కు సెంట్రల్ పార్కుకు వెళ్లారు. తిరిగి 9 గంటల ప్రాంతంలో ఇంటికి వస్తుండగా సుమారు 9.20 గంటల ప్రాంతంలో సౌత్ జైలురోడ్డులో నలుగురు వ్యక్తులు రెండు మోటార్ సైకిళ్లపై అతని వద్దకు వచ్చి ఆపారు. తాము క్రైం పోలీసులమని చెప్పి పరిచయం చేసుకున్నారు. బంగారం కనిపించే విధంగా పెట్టుకుని వెళ్తే దొంగల బెడద ఎక్కువుగా ఉందని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అతని మెడలో గల చైన్, చేతికి ఉన్న ఉంగరాలు (సుమారు తులమున్నర బరువు) తీయించి రుమాలులో కట్టి జేబులో పెట్టుకోవాలని సూచించి వెళ్లిపోయారు. అనంతరం అక్కడి నుంచి కొంత దూరం వెళ్లిన వెంకటరావు తన జేబులోని రుమాలు తీసి చూసుకోగా అందులో బంగారు వస్తువులు కనిపించలేదు. రాళ్లు ఉండడంతో అవాక్కై పోలీసులను ఆశ్రయించాడు. వెంటనే క్రైం ఎస్ఐ భాస్కరరావు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. జరిగిన ఘటనను బట్టి దోపిడీకి పాల్పడిన వారు పాతనేరస్తులుగా భావిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అడవివరంలో పట్టపగలే భారీ చోరీ
విశాఖపట్నం, సింహాచలం(పెందుర్తి): అడవివరంలో గురువారం పట్టపగలే భారీ చోరీ జరిగింది. ప్రధాన రహదారిని ఆనుకుని పాత గోశాలకి సమీపంలో ఉన్న చందన హిల్స్ వీధిలో నివసిస్తున్న కనుమూరి సాంబమూర్తిరాజు ఇంట్లో దొంగలు చొరబడి సుమారు 40 తులాల బంగారం, రూ.8 లక్షల నగదు అపహరించుకుని పోయారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... నగరంలోని ఆటోనగర్‌లో ఉన్న సాహువాలా సిలెండర్స్ కంపెనీలో జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న కనుమూరి సాంబమూర్తిరాజు అడవివరంలోని చందన హిల్స్ వీధిలో సొంత ఇంట్లో భార్య ఉమాదేవి, కూతురుతో ఉంటున్నారు. సాంమమూర్తిరాజు గురువారం ఉదయం కంపెనీకి వెళ్లగా, కూతురు కళాశాలకి వెళ్లింది. భార్య ఉమాదేవి ఇంటికి తాళం వేసి ఉదయం 10 గంటల సమయంలో సింహగిరిపై జరిగిన బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ ప్రవచనాల కార్యక్రమానికి వెళ్లారు. తిరిగి మధ్యాహ్నం 12.30గంటల సమయంలో ఇంటికి వచ్చి ప్రధాన ద్వారం తాళం తీసి తలుçపు తొయ్యగా అది రాలేదు. దీంతో చుట్టుపక్కల వాళ్లని పిలిచి తలుపు తీసేందుకు ప్రయత్నించారు. అప్పటికీ రాకపోవడం, లోపల నుంచి వెలుగు వస్తుండటంతో వెనుక వైపుకి వెళ్లి చూశారు. వెనుక వైపున ఉన్న ద్వారం పూర్తిగా తెరిచి ఉండడంతో లోపలకి వెళ్లి చూడగా కింది బెడ్రూమ్, పై అంతస్తులోని బెడ్రూముల్లోని బీరువాల్లోని దుస్తులు చిందవరవదగా పడేసి ఉన్నాయి. బీరువాలోని నగలు, నగదు కనిపించలేదు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకుని క్రైం డీసీపీ ఎ.ఆర్.దామోదర్, ఏడీసీపీ సురేష్‌బాబు, నార్త్ ఏసీపీ ఫల్గుణరావు, గోపాలపట్నం సీఐ నవీన్‌కుమార్, ఎస్ఐ తమ్మినాయుడు, పెందుర్తి ఎస్ఐ జి.డి.బాబు సంఘటన స్థలానికి చేరుకున్నారు. చోరీ జరిగిన తీరుని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్‌టీంలు సభ్యులు తనిఖీలు చేశారు. ఇంటి వెనుక వైపు గ్రిల్, తలుపు విరగ్గొట్టి దొంగతనానికి పాల్పడినట్టు డీసీపీ తెలిపారు. ఎంతమేరకు బంగారం, నగదు పోయాయో లెక్క వేస్తున్నట్టు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. -
పోలీసుల గెటప్..బంగారంతో సెటప్
పోలీసులు నకిలీ పోలీసుల ఆట కట్టించారు. పాత సినిమా కథల మల్లే ‘దొంగా–పోలీస్ ఆట’ను ఫాలో అయిన ఈ మాయగాళ్లు మూడు రాష్ట్రాల్లో ఎందరో బాధితుల నుంచి లక్షలు కొల్లగొట్టారు. అచ్చు సినిమా క్లైమాక్స్‌లాగే దొంగా–పోలీస్ ఛేజింగ్‌లో పోలీసులకు వాహనంతో సహా పట్టుబడ్డారు. చిత్తూరు, బంగారుపాళెం: నకిలీ పోలీసులుగా ప్రజలను మోసగించే ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు బుధవారం గంగవరం సీఐ శ్రీనివాసులు తెలిపారు. ఈ నెల 20న బాధితులు బంగారుపాళెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముఠా సభ్యులను పట్టుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో సీఐ కథనం..తమిళనాడుకు చెందిన రాజు (రాణిపేట్), సంపత్ (వేలూరు), కిరణ్ (చెన్నై), రాజేష్, తిరుమల్ (వాలాజా), డేనియల్ (బెంగళూరు), సంజయ్ (ఒడీశా), మదన్‌శెట్టి (భువనేశ్వర్) ఒక ముఠాగా ఏర్పడి తక్కువ ధరకే బంగారం ఇస్తామని, ఒక ఒరిజినల్ కరెన్సీ నోటుకు రెండు నకిలీ కరెన్సీ నోట్లు ఇస్తామని బురిడీ కొట్టిస్తున్నారు. నగదు మార్పిడి చేసే సమయంలో ముందుగానే వేసిన వ్యూహం ప్రకారం ముఠాలోని సభ్యులు డేనియల్, సంజయ్, కిరణ్, రాజేష్, తిరుమల్, మదన్ పోలీసులుగా రంగప్రవేశం చేసి బాధితులు హడలెత్తిసారు. వారిని బెదిరించి డబ్బులు తీసుకుని ఉడాయిస్తారు. బురిడీ కొట్టించారిలా.. చెన్నై ఎంజే నగర్లో కెనరా బ్యాంక్‌లో అప్రైజర్‌గా పనిచేస్తున్న నటరాజన్‌కు ఈ నెల 20న రాజు ఫోన్ చేసి తాను చిత్తూరు కెనరా బ్యాంక్ ఉద్యోగిగా పరిచయం చేసుకున్నాడు. బ్యాంకులో నగలు వేలానికి వచ్చాయని, తక్కువ రేటుకు వస్తాయని నమ్మించాడు. దీంతో నటరాజ్ చెన్నైలోని తన స్నేహితులు రామకృష్ణ, ఉదయ్‌కుమార్, మహేంద్రన్‌కు ఈ విషయాన్ని చెప్పాడు. ఉదయ్‌కుమార్, రామకృష్ణ రూ.6 లక్షలు సమకూర్చుకుని నటరాజన్, మహేంద్రన్‌తో కలసి మారుతీ కారులో రాజు చెప్పిన ప్రకారం చిత్తూరు కలెక్టర్ ఆఫీసు వద్దకు వచ్చారు. ముఠాలోని సంపత్ వారిని కలసి రాజు పంపిన వ్యక్తిగా పరిచయం చేసుకున్నాడు. వారిని బంగారుపాళెం సమీపంలోని 180 కొత్తపల్లె రోడ్డులోకి తీసుకెళ్లి తన ముఠా సభ్యులకు ఫోన్ చేశాడు. ఆ తర్వాత కొంతసేపటికి డేనియల్ ఎస్ఐ గెటప్‌లో, మిగిలిన సభ్యులు పోలీసుల వేషంలో రెండు కార్లు (ఒక బొలెరో, టవేరా)లో వచ్చారు. వచ్చీ రాగానే చెన్నై వారిని చుట్టుముట్టి పోలీసులమంటూ చుట్టుముట్టడంతో వారు బెదిరిపోయారు. కేసులు పెడతాం..అరెస్ట్ చేస్తామంటూ వారిని హడలెత్తించారు. వారి నుంచి రూ.6 లక్షలు లాక్కుని అక్కడి నుంచి అదృశ్యమయ్యారు. ఉదయ్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. మూడు రాష్ట్రాల్లోనూ ఇదే తరహాలో మోసం తక్కువ ధరకే బంగారం పేరిట తమిళనాడులో నాలుగుచోట్ల, 6 నెలల క్రితం కర్ణాటకలోని బంగారుపేటలో ఇలాగే ఈ ముఠా కొందరిని బురిడీ కొట్టించినట్లు తేలింది. చిత్తూరు జిల్లాలో 4 నెలల కాలంలో గంగాధరనెల్లూరు, గుడిపాల, చిత్తూరు ప్రాంతంలోనూ ఇదే తీరులో దొంగా–పోలీస్ గేమ్‌తో మరికొందరిని మోసగించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే, మన జిల్లాలో బాధితులెవరూ ఫిర్యాదు చేయలేదని పోలీసులు చెప్పారు. ఛేజింగ్‌తో ఆట కట్టించారిలా..! మంగళవారం మధ్యాహ్నం బంగారుపాళెం–గుడియాత్తం రోడ్డులో ఇదే తరహాలో మోసగించాలని ప్రయత్నం చేశారు. ఇది తెలుసుకున్న బంగారుపాళెం ఎస్ఐ రామకృష్ణ, సిబ్బంది బండ్లదొడ్డి సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా బొలెరో, టవేరా వాహనాలను ఎస్ఐ, సిబ్బంది ఆపే ప్రయత్నం చేశారు. ఆగకుండా అవి మితిమీరిన వేగంతో వెళ్లాయి. దీంతో పోలీసులు బొలెరోను సినిమాపక్కీలో మరో వాహనంలో ఛేజింగ్ చేసి అడ్డుకున్నారు. అందులో ఉన్న డేనియల్, తిరుమల్, రాజేష్, మదన్, సంపత్‌ను అదుపులో కి తీసుకున్నారు. వాహనంలో పాటు వారి నుంచి రూ. 6 లక్షలు, 8 సెల్ ఫోన్లు, 10 వేల రూపాయల దొంగనోట్లు, పోలీస్ యూనిఫాం, వైర్లెస్ హ్యాండ్సెట్, లాఠీలు, బెల్ట్, క్యాప్ స్వాధీనం చేసుకున్నారు. టవేరాలో రాజు, సంజయ్, కిరణ్ పారిపోయారు. వారి కోసం గాలిస్తున్నారు. అరెస్టు చేసిన నిందితులను కోర్టుకు హాజరు పరచనున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు ఛేదించిన ఎస్ఐ రామకృష్ణ, పోలీసులను సీఐ అభినందించారు. రివార్డులు అందజేశారు. -
పెళ్లిలో నగలు చోరీ
కృష్ణాజిల్లా, కానూరు (పెనమలూరు) : కానూరులో పెళ్లికి వచ్చిన ఓ మహిళ వద్ద బంగారు ఆభరణాలు చోరీ జరగటంపై పోలీసులకు ఫిర్యాదు అందింది. పెనమలూరు పోలీసులు తెలిపిన వి వరాల ప్రకారం హైదరాబాద్‌కు చెం దిన వి. లక్ష్మీపావని రెండు రోజుల క్రితం కానూరులోని ఓ కల్యాణ మం డపంలో బంధువుల పెళ్లికి వచ్చింది. ఆమె తన విలువైన 150 గ్రాముల ఆభరణాలు హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టింది. కొద్ది సమయం తర్వాత బ్యాగ్‌లో చూసుకోగా బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో చోరీ జరిగిందని గుర్తించి పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. కాగా చోరీ జరిగిన బంగారు ఆభరణాల విలువ రూ.5 లక్షలు ఉంటుందని బా«ధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. -
మాయా లేడీల ఆటకట్టు
అడ్డగుట్ట: రైల్వే స్టేషన్లు, రైళ్లలో ప్రయాణికుల దృష్టి మరల్చి బ్యాగుల చోరీలకు పాల్పడుతున్న నలుగురు మహిళలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన సంఘటన సికింద్రాబాద్ జీఆర్పీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రైల్వే ఎస్పీ అశోక్ కుమార్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి...సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్‌లు, రైళ్లలో గత కొంత కాలంగా వరుస బ్యాగు చోరీలు జరుగుతున్నాయి. ప్రయాణికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు ముమ్మర తనిఖీలు చేపట్టారు. సోమవారం ప్లాట్‌ఫాం నం.1లోని బుకింగ్ ఎంట్రెన్స్ గేట్ వద్ద ప్రయాణికుల బ్యాగుల చోరీకి పాల్పడుతున్న నలుగురు మహిళలను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వీరు కర్నాటక రాష్ట్రం, బద్రావతికి చెందిన బోయ దుర్గమ్మ, బర్రె శారద, జ్యోతి, బడిగ భాగ్యలుగా గుర్తించినట్లు తెలిపారు. గార్మెంట్స్ కంపెనీలో పని చేస్తున్న వీరు సులువుగా డబ్బులు సంపాదించాలనే యోచనతో ప్రయాణికుల దృష్టి మరల్చి వారి బ్యాగుల చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. వారి నుంచి రూ. 14.50 లక్షల విలువైన 45 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్‌కు తరలించారు. అపరిచితుల వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా తినుబండారాలు ఇస్తే తీసుకోవద్దని రైల్వే ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. సమావేశంలో రైల్వే డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్, ఇన్స్పెక్టర్ ఆదిరెడ్డి, ఎస్ఐ ప్రమోద్ కుమార్, రాజ్ గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. -
గ్రామీణ దంపతుల వద్ద బంగారం అపహరణ
ప్రకాశం, చీరాల రూరల్: పండుగ రోజుల్లో దుకాణాల వద్ద జనం కిటకిటలాడిపోతుండగా దొంగలు మాత్రం తమ పని తాము ఎంచక్కా చేసుకుపోతున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద కాచుకుని కూర్చొంటున్న దొంగలు ఎవరెవరు ఏయే ఊర్ల నుంచి వస్తున్నారు. వారు ఎక్కడికి వెళ్తున్నారు.. ఏవేమి వస్తువులు కొనుగోలు చేస్తున్నారు.. పథకాలు రచిస్తూ తిరుగుతున్న దొంగలు అందినకాడికి దోచుకెళ్తున్నారు. నూతన వస్త్రాలు, బంగారం, వెండి, పచారీలు సామాన్లు వంటి వస్తువులు కొనుగోలు చేసేందుకు ముఖ్యంగా పల్లె వాసులు చీరాల పట్టణానికి పది రోజులుగా విపరీతంగా చేరుకుంటున్నారు. ఇదే అదనుగా భావించిన దొంగలు సందట్లో సడేమియాలా తమపని సులువుగా కానిస్తున్నారు. దొంగల బారిన పడిన పల్లె వాసులు బావురుమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇటువంటి ఘటన పట్టణంలో శనివారం వెలుగుచూసింది. బాధితుల కథనం ప్రకారం.. చినగంజాం మండలం చింతగుంపల్లె గ్రామానికి చెందిన బెజ్జం ప్రభుదాసు, రాణి దంపతులు బట్టలు, వెండి, బంగారు వస్తువులు కొనుగోలు చేసేందుకు శనివారం మధ్యాహ్నం చీరాల వచ్చారు. ఈ క్రమంలో వారిరువురు మార్కెట్ సెంటర్లో ఆటో దిగి నేరుగా మార్కెట్ సమీపంలోని ఓ జ్యూయలరీ దుకాణంలోకి వెళ్లి పది వేలు విలువ చేసే రెండు జతల కాళ్ల పట్టీలు, జత కమ్మలు కొనుగోలు చేశారు. అనంతరం వారిరువురు కూరగాయల మార్కెట్లో కూరగాయలు కొనుగోలు చేసి ఎంజీసీ మార్కెట్ సెంటర్ వద్ద రోడ్డు పక్కగా నిలిపిన గాజుల బండిపై గాజులు కొనుగోలు చేశారు. డబ్బులు ఇచ్చేందుకు కర్రల సంచీ వైపు చూడగా బ్లేడుతో గుర్తు తెలియని దొంగలు సంచీని కోసి ఉండటం గమనించారు. అలానే సంచీలోని వెండి, బంగారు వస్తువులు కూడా కనిపించకపోవడంతో అపహరణకు గురయ్యాయని గుర్తించిన బాధితులు లబోదిబోమంటూ ఒన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. పట్టణంలో ఏర్పాటు చేసిన సీసీ టీవీ పుటేజీలతో దొంగలను పోలీసులు పట్టుకుని ప్రజలకు మేమున్నామంటూ భరోసా ఇస్తారో లేదో వేచి చూడాల్సిందే మరి. ఇటువంటి సంఘటనలు నిత్యం పట్టణంలో జరుగుతున్నాయి. పోలీసు స్టేషన్‌కు వెళ్తే న్యాయం జరగకపోగా పోలీసులు యక్ష ప్రశ్నలు వేసి వేధింపులకు గురిచేస్తారనే భయంతో బాధితులు తమకు కేసులు ఎందుకులే అనుకుని ఉసూరుమంటూ ఇంటిదారిన పట్టే వారి సంఖ్యే ఎక్కువగా ఉంది. -
సూట్‌కేసుల్లోని 70 తులాలా బంగారం మాయం..!
సాక్షి, విజయనగరం : బొకారో రైలులో భారీ దొంగతనం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా చెల్లూరుకి చెందిన రైల్వే కాంట్రాక్టర్ సత్యనారాయణ ఒడిషాలోని ఆర్తబిరాలో ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి వెళ్లొస్తుంగా ఈ ఘటన చోటుచేసుకుంది. 77 తులాల బంగారం గల తన రెండు సూట్ కేసులు మాయమయ్యాయని బాధితుడు తెలిపాడు. తిట్లఘర్ - రాయగడ మధ్యలో దొంగతనం జరిగినట్టు వెల్లడించాడు. సూట్‌కేసుల్లో సుమారు 77 తులాల బంగారం ఉందని సత్యనారాయణ తెలిపారు. బాధితుడు తొలుత పార్వతీపురం రైల్వేస్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. భారీ దోపిడీ నేపథ్యంలో విజయనగరంలో ఫిర్యాదు చేయాలని రైల్వే అధికారులు సూచించారు. -
లేడీ కేడీ అరెస్టు
చైతన్యపురి: దేవాలయాలు, పాఠశాలల వద్ద మాటువేసి చిన్నపిల్లల ఆభరణాలు దోచుకుంటున్న ఓ కరడుగట్టిన పాత నేరస్తురాలిని సరూర్‌నగర్ పోలీసులు అరెస్టు చేసి నగదు, బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. సరూర్‌నగర్ సీఐ రంగస్వామి, డీఐ వెంకటేశం సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. కొత్తపేట శృంగేరికాలనీలో నివసించే మెహరున్నీసా అలియాస్ మమత (37) టైలర్‌గా పనిచేసేది. సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో నేరాల బాటపట్టింది. తల్లి రషీదాబేగం (70), సోదరుడు సయ్యద్ మహ్మద్ (25)తో కలిసి చోరీలకు పాల్పడేవారు. దేవాలయాలు, పాఠశాలలు, రద్దీ ప్రాంతాల్లో తిరుగుతూ 5 నుంచి 10 సంవత్సరాల బాలికలను ఎంచుకుని వారికి మాయమాటలు చెప్పి నిర్మానుష్యమైన ప్రాంతాలకు తీసుకెళ్లి వారి వంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలు దోచుకుని వదిలేసేవారు. ఈనెల 14న సరూర్‌నగర్ ప్రాథమిక పాఠశాల నుంచి ఇంటికి వెళ్తున్న 6 సంవత్సరాల బాలికకు మాయమాటలు చెప్పి బంగారు చెవిపోగులు, కాళ్ల పట్టీలు తీసుకుని పారిపోయారు. కేసు నమోదు చేసిన ఎస్ఐ కృష్ణయ్య విచారణ చేపట్టి నిందితురాలు మెహరున్నీసాగా గుర్తించారు. ఆదివారం పీఅండ్‌టీ కాలనీలో ఆమె అనుమానాస్పందంగా తిరుగుతుండటంతో అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. ఆమె వద్ద నుంచి రూ. లక్ష నగదు, 25గ్రాముల బంగారం, 160 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. సరూర్‌నగర్ స్టేషన్ పరిధిలోని ఆరుకేసుల్లో ఆమె నిందితురాలని పేర్కొన్నారు. గతంలో ఆమెపై ఎల్బీనగర్ స్టేషన్ పరిధిలో 22, మియాపూర్‌లో ఒకటి, రాయదుర్గంలో అయిదు, మైలార్‌దేవులపల్లిలో ఒకటి, రాజేంద్రనగర్‌లో రెండు, చందానగర్‌లో ఒకటి, సంతోష్‌నగర్‌లో రెండు, కాంచన్‌బాగ్‌లో ఒకటి, మాదన్నపేటలో ఒక కేసు నమోదై ఉన్నాయన్నారు. అలాగే ఆంధ్రాలో 8 కేసులు ఉన్నాయని పలు కేసుల్లో జైలుకు కూడా వెళ్లివచ్చిందని వివరించారు. మిగిలిన ఇద్దరు పరారీలో ఉన్నారని తెలిపారు. సమావేశంలో ఎస్ఐ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. -
135 సవర్ల బంగారం చోరీ
ప్రకాశం, సీఎస్‌పురం: మండల కేంద్రం సీఎస్‌పురంలో భారీ దోపిడీ జరిగింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఎస్‌పురంలోని ప్రధాన వీధిలో నగల వ్యాపారి ఇంట్లో జరిగిన 135 సవర్ల బంగారం దోపిడీ మండల ప్రజలను ఉలికి పాటుకు గురి చేసింది. స్థానిక పామూరు రోడ్డులో నగల వ్యాపారం చేసుకుంటున్న పత్తిపాటి శ్రీహరిరావు కుటుంబ సభ్యులు ముంబై వెళ్లిన సమయం గమనించిన దొంగలు శనివారం రాత్రి ఇంటి తాళాలు పగులగొట్టి దోపిడీకి పాల్పడ్డారు. శ్రీహరిరావు ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటాన్ని ఆదివారం ఉదయం గమనించిన స్థానికులు ఫోన్లో ఆయనకు సమాచారం అందించారు. బాధితులు సోమవారం ఉదయం సీఎస్‌పురం వచ్చి దొంగతనం జరిగిన విషయాన్ని నిర్ధారించుకుని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌లను రప్పించి విచారణ చేపట్టారు. కందుకూరు డీఎస్పీ ప్రకాశరావు, సీఐ మధుబాబులు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. డాగ్ స్క్వాడ్ దొంగతనం జరిగిన ఇంటి నుంచి ప్రధాన రోడ్డు వెంబడి బస్టాండ్ సెంటర్, డీజీపేట రోడ్డు మీదగా ఎంపీడీఓ కార్యాలయం వద్దకు వెళ్లింది. అనంతరం అక్కడి నుంచి ఏనిమిట్ట వీధి నుంచి దొంగతనం జరిగిన ఇంటి వద్దకే వచ్చి నిలబడింది. క్లూస్ టీమ్ ఇంట్లో వేలిముద్రలు సేకరించింది. శ్రీహరిరావు ఇంటిని దోపిడీ చేసిన దొంగలు ఆ పక్క గదిలో ఉన్న నగలషాపును పట్టించుకోక పోవడం గమనార్హం. నగల షాపులో సీసీ కెమెరాలు ఉన్నాయని, ఈ విషయం తెలిసే దొంగలు షాపు జోలికి వెళ్లలేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. బాధితుడి కథనం ప్రకారం.. బాధితుడు శ్రీహరిరావు కథనం ప్రకారం.. 135 సవర్ల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు ఎస్ఐ కె విజయ్‌కుమార్ తెలిపారు. ఆయన, ఆయన భార్య, పెద్ద కుమారుడు, కోడలు, మనుమరాళ్లకు సంబంధించిన బంగారు ఆభరణాలు దోపిడీకి గురైనట్లు బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దొపిడీకి గురైన నగలకు సంబంధించిన వివరాలను బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అధికారికంగా 135 సవర్లు మాత్రమే దోపిడీ జరిగినట్లు చెబుతున్నారని, ఆ నగలేకాక ఇంకా ఎక్కువ మొత్తంలో బంగారం, వెంగి నగలు దోపిడీ జరిగి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు. కేసు విచారణలో సీఎస్‌పురం, పామూరు, లింగసముద్రం ఎస్ఐలు కె. విజయ్‌కుమార్, రాజ్‌కుమార్, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
ఆమె కన్ను పడితే నగలు నడిచొస్తాయి
కర్ణాటక, శివాజీనగర: జల్సాలకు అలవాటుపడి భర్తతో కలిసి చోరీలకు పాల్పడుతున్న కిలేడీ ఎట్టకేలకు కటకటాల వెనక్కు చేరింది. ఆమెనుంచి పోలీసులు లక్షల విలువైన బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. ఆగ్నేయ విభాగపు డీసీపీ డాక్టర్ బోరలింగయ్య వెల్లడించిన వివరాల మేరకు... శివాజీనగర తిమ్మయ్యగార్డన్ రోడ్డులో నివాసం ఉంటున్న శాంతి (38) ధనవంతుల ఇళ్లల్లో గృహకార్మికురాలిగా చేరి విశ్వాసం గడించి చోరీలకు పాల్పడేది. గతంలో పులికేశీనగర పోలీసు స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న ఇంటిలో దొంగతనం చేస్తూ పట్టుబడి జైలుకు వెళ్లింది.బయటకు వచ్చిన తర్వాత మళ్లీ చోరీలకు అలవాటు పడింది. మొదటి భర్త మృతి చెందగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రవీ అనే వ్యక్తిని ప్రేమించి రెండో వివాహం చేసుకొని కోరమంగళలోస్థిరపడింది. జిమ్‌లలో, అపార్ట్మెంట్లలో ఇంటిపని కావాలని నెపంతో వెళ్లేవారు. ఈ సమయంలో తలుపులు తెరిచి ఉంటే క్షణంలోనే విలువచేసే వస్తువులను దొంగలించి అదృశ్యమయ్యేవారు. కోరమంగళలోని ఓ అపార్ట్మెంటులో ఇంటిపనికి చేరుకుని యజమానిని నమ్మకంగా మెలిగారు. ఇంట్లో బంగారు ఆభరణాలు ఉండటాన్ని గమనించారు. వాటిని పోలిన నకిలీ నగలు తయారు చేయించారు. వాటిని లాకర్లో ఉంచి అసలైన నగలతో ఉడాయించారు. దానిని తాకట్టు పెట్టి షాపింగ్ చేయడం, పబల్‌కు వెళ్లి జల్సాలు చేసేవారు. నకిలీ నగలతో మోసపోయినవారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి నిందితురాలిని అరెస్ట్ చేశారు. రూ.5 లక్షలు విలువచేసే 170 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. -
కటకటాల్లో కి‘లేడి’
నాగోలు: బుర్ఖా వేసుకుని నగల షాపుల్లో సేల్స్‌మెన్ దృష్టి మళ్లించి చోరీలకు పాల్పడుతున్న మహిళను చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేసి 4.8 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఎల్బీనగర్ సీపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ పోలీస్ జాయింట్ సీపీ సుధీర్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన బడా రేఖ(29) నగరానికి వచ్చి కూకట్పల్లి మూసాపేట్లో నివాసముంటోంది. 2007లో ప్రేమ వివాహం చేసుకున్న రేఖ ఆర్ధిక పరిస్థితులు సరిగాలేకపోవడంతో వివిధ షాపుల్లో పనిచేసింది. వచ్చే జీతం సరిపోకపోవడంతో సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో బుర్ఖా వేసుకొని నగల షాపులకు వెళ్లి సేల్స్‌మెన్ దృష్టి మళ్లించి చోరీలు చేసేది. ఈ క్రమంలో చైతన్యపురి సరూర్‌నగర్ పంజాగుట్ట పరిధిలోని నగల షాపులలో చోరీలకు పాల్పడింది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న చైతన్యపురి పోలీసులు సీసీ కెమరాల ఆధారంగా ఆమె గుర్తించి అరెస్ట్ చేశారు. ఆమె వద్ద రూ.4 లక్షల 80 వేల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో ఇన్చార్జి డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, ఎల్బీనగర్ ఎసీపీ పృథ్వీధర్‌రావు, చైతన్యపురి డీఐ రాము, సీఐసుదర్శన్, ఎస్ఐ వెంకటేష్ పాల్గొన్నారు. -
ట్రావెల్ బస్సులో 4కిలోల బంగారం చోరీ
-
బెట్టింగులు.. అప్పులు.. ఆపై దోపిడీ బాట
విశాఖ క్రైం: బంగారం వ్యాపారిపై పక్కాగా రెక్కీ నిర్వహించి... అదునుచూసి కంట్లో కారం జల్లి నగదు, బంగారం దోచుకుపోయిన ముఠాలోని పది మంది నిందితులను నగర పోలీసులు అరెస్ట్ చేశారు. మరో అయిదుగురు పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద నుంచి 598.67 గ్రాముల బంగారం, రూ.15.79 లక్షల నగదు, ఒక ఫిస్టల్ స్వాధీనం చేసుకున్నారు. దొండపర్తి డీఆర్ఎం కార్యాలయం రోడ్డులో సెప్టెంబర్ 23న వేకువజామున 4.45 గంటల సమయంలో బంగారం వ్యాపారిని ఫిస్టల్తో బెదిరించి... కంట్లో కారం జల్లి అతని వద్ద నుంచి 1200 గ్రాముల బంగారం, రూ.42 లక్షల నగదు ఓ ముఠా దోచుకుపోయిన ఘటన తెలిసిందే. ఈ ఘటన అప్పట్లో నగరంలో సంచలనం రేపింది. దీనిపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన రెండో పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల విజువల్స్‌తో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ మహేష్ చంద్ర లడ్డా వెల్లడించారు. అప్పులు తీర్చుకునేందుకు దోపిడీబాట మద్దిలపాలెం ప్రాంతానికి చెందిన గోగాడ గోవింద్ గతంలో నగరంలోని రెండు బంగారు దుకాణాల్లో కొంతకాలం పనిచేశాడు. అనంతరం క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతూ సుమారు రూ.5.5లక్షల వరకూ అప్పులు చేశాడు. ఆ అప్పులు తీర్చేందుకు సులువుగా డబ్బులు సంపాదించేందుకు దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా బంగారం వ్యాపారి రమేష్‌పై గోవింద్ దృష్టి సారించాడు. విశాఖ నగరంలోని శ్రీనగర్‌లో సాయి ఫ్యారడైజ్ అపార్టుమెంట్ ఐదో అంతస్తులో నివసిస్తున్న రమేష్ తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తురులో ఉంటూ వ్యాపారం నిమిత్తం విశాఖ వచ్చి వెళ్తుంటాడు. రమేష్ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న వర్రి సురేష్‌తో తనకున్న స్నేహాన్ని వినియోగించుకుని ఎప్పటికప్పుడు రమేష్ కదలికలను గోవింద్ తెలుసుకునేవాడు. ఆ క్రమంలో గతంలో రెండుసార్లు చోరీకి యత్నించి విఫలమయ్యాడు. చివరకు ఓ ముఠాను తయారు చేయాలని భావించి ఖరగ్‌పూర్‌కు చెంది నగరంలో స్థిరపడిన సాది హరిబాబు అలియాస్ పికిరితో మాట్లాడి ప్రణాళిక సిద్ధం చేశాడు. అందులో భాగంగా నగరంలోని కొందరితో ముఠా ఏర్పాటు చేయడంతోపాటు ఖరగ్‌పూర్ నుంచి మరో ఐదుగురిని తీసుకొచ్చే బాధ్యతను పికిరికి అప్పగించాడు. ఫిస్టల్తో బెదిరించి... కంట్లో కారంజల్లి దోపిడీకి ముందు రోజు సెప్టెంబర్ 22న ఖరగ్‌పూర్ నుంచి చేరుకున్న ఐదుగురితో కలిసి మొత్తం 15 మంది నిందితులూ కలిసి వ్యాపారి రమేష్ ఇంటి పరిసరాల్లో రెక్కీ నిర్వహించారు. ఆ మరుసటి రోజు వేకువజామున 4 గంటల ప్రాంతంలో కొందరు నిందితులు మూడు బైక్‌లపై రమేష్ ఇంటి వద్దకు చేరుకున్నారు. రైల్వేస్టేషన్‌కు రమేష్ బైక్‌పై వెళ్తుండగా సాయికిరణ్, చిన్నతో పాటు మరో ఐదుగురు వెంబడించారు. దొండపర్తి ఫ్లైవర్ వంతెన వద్దకు చేరుకునేసరికి ఒక్కసారిగా ముట్టడించారు. అప్పటికే ఆ ప్రాంతంలో మాటువేసి ఉన్న ఖరగ్‌పూర్‌కు చెందిన ముఠా సభ్యులు ఫిస్టల్తో బెదిరించడంతో చిన్న అనే వ్యక్తి రమేష్ కంట్లో కారం జల్డాడు. వెంటనే రమేష్ చేతిలోని సూటు కేసు, బ్యాగ్‌లో ఉన్న బంగారంతో ప్రధాన నిందితుడు గోవింద్, మిగిలిన వారంతా పరారయ్యారు. అనంతరం ఒకచోటకు చేరుకున్నక బంగారం, నగదు పంచుకున్నారు. ఖరగ్‌పూర్‌కు చెందిన ముఠా సభ్యులు తమకు వచ్చిన వాటాలో నుంచి రూ.2.3లక్షలతోపాటు ఫిస్టల్ను తమను నగరానికి తీసుకొచ్చిన సాది హరిబాబుకు ఇచ్చి వెళ్లిపోయారు. తేరుకున్న రమేష్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీ కెమెరా విజువల్స్‌ను పరిశీలించారు. అదేవిధంగా కానిస్టేబుల్ రమేష్‌రెడ్డి సేకరించిన కీలక ఆధారాలతో పది మంది నిందితులను ద్వారకానగర్ సమీపంలో అరెస్ట్ చేశారు. ఖరగ్‌పూర్‌కు చెందిన మరో ఐదుగురు పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వారు పట్టుబడితే మరికొంత బంగారం, నగదు రకవరీ చేసే అవకాశం ఉంది. నిందితులను పట్టుకోవడంతో చురుగ్గా వ్యవహరించిన రమేష్‌రెడ్డితోపాటు ఇతర సిబ్బందిని సీసీ అభినందించి రివార్డులు అందించారు. సమావేశంలో క్రైం డీసీపీ దామోదర్, ఏడీసీపీ సురేష్‌బాబు, ఏసీపీ గోవింద్రావు, సీఐ కృష్ణారావుతో పాటు సిబ్బంది పాల్గొన్నారు 10 మంది నిందితుల అరెస్ట్ మద్దిలపాలెంకు చెందిన గోగాడ గోవింద్రావు(అలియాస్ గోగు, విందు), కొయిలాడ సాయికిరణ్ (అలియాస్ రాజా, రెబల్), సాది హరిబాబు, మానాపురం మురళీకృష్ణ, పాలా భాస్కర్ (అలియాస్ భాషా), కొండపు ఢిల్లేశ్వరరావు (అలియాస్ ఢిల్లీ), కండ్రపు సౌమిత్,(అలియాస్ గోవింద్, ఆలియాస్ గోవి), సాలిపేటకు చెందిన సూర హరిదీక్షిత్రావు, తోటాడ లోకేష్, పశ్చిమ బెంగాల్ రాష్టం, ఖరగ్‌పూర్‌కు చెందిన మొద్దు తారకేశ్వరరావు(అలియాస్ చిన్నా)లను అరెస్ట్ చేశారు. ఖరగ్‌పూర్‌కు చెందిన మనోజ్‌దాస్, గణశ్యామ్, సుమీర్దాస్, గేదం సూరజ్‌కుమార్, రాకేష్ మండా పరారీలో ఉన్నారు. -
బందిపోట్లు దొరికారు?
సాక్షి, సిటీబ్యూరో: తిరుమలగిరి ఠాణా పరిధిలో పట్టపగలు చోటు చేసుకున్న బందిపోటు దొంగతనం కేసు కొలిక్కి వచ్చింది. దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు నిర్విరామంగా శ్రమించి 24 గంటల్లోనే నిందితులను గుర్తించగలిగారు. మొత్తం ఎనిమిది మంది నిందితుల్లో బుధవారం నాటికి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారి కోసం ప్రత్యేక బృందం ముమ్మరంగా గాలిస్తోంది. బాధితుల సమీప బంధువే ఈ బందిపోటు దొంగతనానికి సూత్రధారిగా గుర్తించారు. కార్వాన్‌లోని జీహెచ్ఎంసీ కార్యాలయంలో పని చేస్తున్న షానవాజ్ తిరుమలగిరి దర్గా సమీపంలో తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతడి వద్ద భారీ మొత్తంలో డబ్బు ఉంటుందని చిలకలగూడకు చెందిన సమీప బంధువు భావించాడు. దీంతో అదును చూసుకుని దోచుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకుగాను సంగారెడ్డికి చెందిన పరిచయస్తులను సంప్రదించాడు. అదే ప్రాంతానికి చెందిన నేరచరితుడైన వ్యక్తి నేతృత్వంలో మొత్తం ఎనిమిది మంది ముఠా కట్టారు. వీరికి కొన్ని రోజుల క్రితం సదరు ‘బంధువే’ షానవాజ్ ఇంటిని చూపించాడు. ఆపై పథకం వేసిన బందిపోటు దొంగలు పలుమార్లు షానవాజ్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారు. పని దినాల్లో అతను ప్రతి రోజూ ఉదయం 9.30 గంటలకు విధుల నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతాడని గుర్తించారు. ఇదే అనువైన సమయంగా భావించిన బందిపోటు దొంగలు సోమవారం సంగారెడ్డి నుంచి కారులో బయలుదేరి వచ్చారు. షానవాజ్ ఇంట్లో భార్య, తల్లి మాత్రమే ఉండటంతో ఉదయం 10.30 గంటల సమయంలో గేటు తీసుకుని ఇంట్లోకి ప్రవేశించారు. ఈ వీరు ఐదుగురిలో నలుగురు పురుషులు ముఖాలకు ముసుగులు ధరించగా... మరో మహిళ బుర్ఖా వేసుకుంది. కత్తులతో బెదిరించిన దుండగులు బాధితుల కాళ్లుచేతులు కట్టేసి, నోటికి టేప్ వేశారు. అత్తాకోడళ్లను భయభ్రాంతులకు గురి చేసేందుకు వారిపై దాడి చేశారు. అనంతరం ఇద్దరి ఒంటిపై ఉన్న ఐదు తులాల బంగారు నగలు, నగదు, 45 తులాల వెండి పట్టీలు తీసుకున్నారు. గదిలోకి వెళ్లి అల్మారాను తెరిచి ఆద్యంతం వెతికారు. అయితే భారీ మొత్తంలో బంగారం, రూ.1.5 లక్షల నగదును షానవాజ్ తన అల్మారాలోని ‘చోర్ ఖానా’లో (రహస్య ప్రాంతం) ఉంచడంతో వీరి కంట పడలేదు. పావు గంట లోపే తమపని పూర్తి చేసుకున్న దండగులు అక్కడినుంచి ఉడాయించారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో ఫీడ్‌ను అధ్యయనం చేశారు. ఈ నేపథ్యంలోనే ఓ అనుమానాస్పద కారును గుర్తించిన అధికారులు దాని నెంబర్ ఆధారంగా ముందుకు వెళ్లారు. ఫలితంగా నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని కారు, కత్తులు, బంగారం రికవరీ చేసినట్లు తెలిసింది. పరారీలో ఉన్న మరో నలుగురి కోసం ప్రత్యేక బృందం గాలిస్తోంది. మిగిలిన నిందితులను గురువారం పట్టుకుంటామని అధికారులు పేర్కొన్నారు. దుండగుల చర్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన షానవాజ్ తల్లి ఇక్బాల్ బీ మంగళవారం కన్నుమూసిన విషయం విదితమే. ఆమె మృతదేహానికి గాంధీ ఆస్పత్రి మార్చురీలో బుధవారం పోస్టుమార్టం నిర్వహించి సంబంధీకులకు అప్పగించారు. దుండగుల దాడి కారణంగానే ఇక్బాల్ బీ చనిపోయినట్లు ఫోరెన్సిక్ డాక్టర్లు నిర్ధారించారు. దీంతో బందిపోటు దొంగతనంగా (ఐపీసీ సెక్షన్ 395) నమోదైన కేసును తిరుమలగిరి పోలీసులు బుధవారం బందిపోటు దొంగతనం కోసం హత్యగా (ఐపీసీ సెక్షన్ 396) మార్చారు. కోర్టులో నేరం రుజువైతే నిందితులకు గరిష్టంగా ఉరి శిక్ష సైతం పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. -
‘బందిపోటు’ బాధితురాలి మృతి
సాక్షి, సిటీబ్యూరో: ఉత్తర మండలం, తిరుమలగిరి ఠాణా పరిధిలో సోమవారం ఉదయం జరిగిన బందిపోటు దొంగతనం ఉదంతంలో గాయపడిన బాధిత వృద్ధురాలు మంగళవారం రాత్రి కన్నుమూసింది. దీంతో ఈ కేసులో హత్యారోపణలు జోడించేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..కార్వాన్‌లోని జీహెచ్ఎంసీ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న షానవాజ్ తిరుమలగిరి దర్గా సమీపంలో తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతను ప్రతి రోజూ ఉదయం 9.30 గంటలకు డ్యూటీకి వెళ్లిపోతాడు. సోమవారం కూడా అలానే వెళ్లిపోగా... భార్య, తల్లి ఇక్బాల్ బీ మాత్రం ఇంట్లో మిగిలారు. దీనిని గమనించి పథకం ప్రకారం వ్యవహరించిన దొంగలు సోమవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో విరుచుకుపడ్డారు. ముఖాలకు మాస్క్‌లు ధరించిన నలుగురు పురుషులు, బుర్ఖా వేసుకుని ఓ మహిళ వీరి ఇంట్లోకి దూసుకువచ్చారు. అత్తాకోడళ్లను కత్తులతో బెదిరించి కట్టేయడంతో పాటు వారి నోటికి ప్లాస్టర్ వేశారు. భయపెట్టే ఉద్దేశంతో వారిపై చేయి చేసుకున్నారు. ఇద్దరి ఒంటిపై ఉన్న ఐదు తులాల బంగారు నగదు, 45 తులాల వెండి పట్టీలు తీసుకుని, అల్మారాలో వెతికి ఉడాయించారు. దుండగుల నోటికి ప్లాస్టర్ వేయడంతో ఆస్తమా రోగి అయిన ఇక్బాల్ బీ ఆ తర్వాత అస్వస్థతకు గురైంది. దుండగుల దాడిలో ఆమె చెవి ప్రాంతంలోనూ గాయాలయ్యాయి. షానవాజ్ తల్లిని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో కన్నుమూసింది. దీంతో ఈ బందిపోటు దొంగతనం కేసులో హత్యారోపణల్ని చేర్చాలని తిరుమలగిరి పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు. మరోపక్క దుండగులు వినియోగించిన కారు నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. -
బ్యాంకులో తాకట్టు బంగారం మాయం
ప్రకాశం, నర్శింగోలు (సింగరాయకొండ): జరుగుమల్లి మండలం నర్శింగోలు సిండికేట్ బ్యాంకు బ్రాంచిలో బంగారం మాయమైందన్న ఆరోపణలు రావడం ఈ ప్రాంతంలో సంచలనంగా మారింది. బ్యాంకు అధికారులు కుమ్మక్కై ఖాతాదారులు తాకట్టు పెట్టిన సుమారు కోటి రూపాయల విలువైన బంగారం మాయమైందన్న ప్రచారం జరుగుతోంది. బ్రాంచి పరిధిలోని సుమారు 8 గ్రామాలకు చెందిన 27 మంది ఖాతాదారులకు చెందిన బంగారం కనిపించడం లేదు. అవకతవకలకు పాల్పడిన బ్యాంకు సిబ్బందిపై చర్యలు తీసుకోకుండా ఆ బ్యాంకు ఉన్నతాధికారులు సైతం వారికి సహకరిస్తున్నారన్న ప్రచారంతో మిగిలిన ఖాతాదారులు బ్యాంకులోని బంగారం విడిపించుకునేందుకు పోటీపడుతున్నారు. అంతేగాక బ్యాంకులో పెట్టిన బంగారం స్థానంలో నకిలీ వస్తువులు పెట్టారేమోనన్న అనుమానంతో అనుభవం ఉన్న వారిని రప్పించుకుని మరీ బంగారం పరిశీలించుకుని విడిపించుకుంటున్నారు. 27 మంది ఖాతాదారులబంగారం మాయం బ్యాంకులో తాకట్టు పెట్టిన 27 మందికి చెందిన సుమారు కోటికిపైగా విలువైన బంగారం మాయమైనట్లు ఇటీవల బ్యాంకులో జరిగిన ఆడిటింగ్‌లో బయటపడినట్లు మండలంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా దావగూడూరు, నర్శింగోలు, అగ్రహారం, పైడిపాడు, సతుకుపాడు, రెడ్డిపాలెం, అక్కచెరువుపాలెం, రామచంద్రాపురం గ్రామానికి చెందిన ఖాతాదారుల బంగారం ఉన్నట్లు తెలుస్తోంది. గత నెల 18వ తేదీన బంగారం తాకట్టు పెట్టి 52 వేల రుణం తీసుకున్న పి.సుశీల..బ్యాంకులో అవకతవకలు జరిగాయని తెలిసి బయట 2 రూపాయల వడ్డీకి అప్పు చేసి మరీ బ్యాంకులో నగలు విడిపించుకుంది. బ్యాంకుపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేసిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాల్సిన జిల్లా అధికారులు వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఖాతాదారులు ఆరోపిస్తున్నారు. ఇంత వరకు ఒక్కరిపై కూడా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు కూడా చేయలేదని, దీన్ని బట్టి బ్యాంకు అధికారుల మనోగతం అర్థమవుతోందని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటి వరకు ఎటువంటి ఫిర్యాదు రాలేదని ఎస్ఐ సోమశేఖర్ కూడా తెలిపారు. నర్శింగోలు టు కందుకూరు నర్శింగోలు బ్రాంచిలో తాకట్టు పెట్టిన ఖాతాదారుల బంగారం కందుకూరులోని ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు పెట్టినట్లు ప్రచారం సాగుతోంది. బ్యాంకులో బంగారం తనిఖీ చేసే వ్యక్తితో పాటు సదరు బ్రాంచిలో పనిచేసిన ముగ్గురు మేనేజర్ల హస్త ఉన్నట్లు తెలుస్తోంది. 2013 నుంచి బంగారం మాయమవుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి బంగారం తాకట్టు పెట్టిన సంవత్సరం తర్వాత ఖాతాదారులకు బ్యాంకు అధికారులు నోటీసు ఇస్తారు. తాకట్టు నగలకు డబ్బులు చెల్లించండి.. లేకుంటే ఖాతా రెన్యువల్ చేసుకోండని సమాచారం ఇస్తారు. ఏళ్లు దాటినా అటువంటి నోటీసులు రాలేదని ఖాతాదారులు చెబుతున్నారు. అంతేగాక కొత్తగా వచ్చిన అధికారులు నకిలీ బంగారం పెట్టారని, వెంటనే డబ్బులు చెల్లించాలని ఖాతాదారులపై ఒత్తిడి చేస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఒంగోలు లాడ్జిలో సమావేశం బ్రాంచిలో అవకతవకలకు పాల్పడిని బ్రాంచి మేనేజర్లు, జిల్లా అధికారి ఇటీవల ఒంగోలులోని ఓ లాడ్జిలో సమావేశమై ప్రైవేటు ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి సమస్య పరిష్కరించాలని తీర్మానించారని ఖాతాదారులు చర్చించుకుంటున్నారు. ఆ ప్రకారం ఖాతాదారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించి రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. టీడీపీ నేతల సహకారం బ్యాంకులో బంగారం తనిఖీ చేసే సుబ్రహ్మణ్యం అనే వ్యక్తికి అధికార పార్టీ నాయకులు సహకరిస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇతనికి వారే భద్రత కల్పిస్తున్నారని, ఈ కేసు నుంచి అతడిని బయట పడేసేందుకు ఖాతాదారులతో మాట్లాడి ఫిర్యాదు చేయకుండా ప్రయత్నిస్తున్నారని ఖాతాదారులు ఆరోపిస్తున్నారు. -
చేతులు కట్టేసి..నోటికి ప్లాస్టర్ వేసి..
తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టపగలే దొంగలు బీభత్సం సృష్టించారు. ఇద్దరు మహిళల్ని బంధించి బంగారు ఆభరణాలు దోచుకున్నారు. ఉదయం 10.30 గంటల సమయంలో ఐదుగురు దొంగలు దర్జాగా ఇంటి గేటు తీసుకుని లోపలికి ప్రవేశించి దౌర్జన్యానికి పాల్పడ్డారు. వీరిలో ఒక మహిళ ఉందని బాధితులు తెలిపారు. ఐదు తులాల బంగారు, 45 తులాల వెండి ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. సాక్షి, సిటీబ్యూరో/రసూల్‌పురా: రాజధానిలో పట్టపగలు బందిపోటు దొంగతనం చోటు చేసుకుంది. ఓ ఇంట్లోకి ప్రవేశించిన ఐదుగురు దుండగులు అత్తాకోడళ్లను బంధించి వారి ఒంటిపై ఉన్న బంగారం, వెండి నగలను దోచుకున్నారు. మరికొంత పసిడి, డబ్బు అల్మారాలోని ‘చోర్ ఖానా’లో ఉండటంతో వీరి కంట పడలేదు. ఉత్తర మండలంలోని తిరుమలగిరి ఠాణా పరిధిలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనాస్థలికి వచ్చిన నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ నేరగాళ్లను త్వరలోనే పట్టుకుంటామన్నారు. పట్టపగలు చోటు చేసుకున్న ఈ ఉదంతం నగరంలో కలకలం సృష్టించింది. కార్వాన్‌లోని జీహెచ్ఎంసీ కార్యాలయంలో పని చేస్తున్న షానవాజ్ తిరుమలగిరి దర్గా సమీపంలో తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. అతను ప్రతి రోజూ ఉదయం 9.30 గంటలకు డ్యూటీకి బయలుదేరి వెళతాడు. సోమవారం కూడా యధావిధిగా డ్యూటీకి వెళ్లిపోగా, అతని భార్య, తల్లి మాత్రమే ఇంట్లో ఉన్నారు. వీరు ఇంటి ముందు ఉన్న గేట్‌కు గొళ్లెం పెట్టి తలుపులు తెరిచి ఉంచారు. ఉదయం 10.30 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు గేట్ తీసుకుని ఇంట్లోకి ప్రవేశించారు. ఎవరు అంటూ అత్తాకోడళ్లు ప్రశ్నిస్తుండగానే లోపలికి దూసుకువచ్చిన వీరు వారిని అక్కడే ఉన్న వస్త్రాలతో కట్టేపడేసి, ఇద్దరి నోటికి సెల్లో టేప్ వేశారు. అనంతరం ఇద్దరి ఒంటిపై ఉన్న ఐదు తులాల బంగారు నగదు, 45 తులాల వెండి పట్టీలు తీసుకున్నారు. గదిలోకి వెళ్లిన ఆగంతకులు అల్మారాను తెరిచి ఆద్యంతం వెతికారు. అయితే భారీ మొత్తంలో బంగారం, రూ.1.5 లక్షల నగదును షానవాజ్ తన అల్మారాలోని ‘చోర్ ఖానా’లో ఉంచడంతో వీరి కంట పడలేదు. (అల్మారాలు, బీరువాల్లో ఇతరులకు కనిపించని రహస్య అరలు, భాగాలను చోర్ ఖానాలుగా) పిలుస్తారు. అరగంటలో తమపని పూర్తి చేసుకున్న దండగులు అక్కడినుంచి ఉడాయించారు. ఇంటి నుంచి బయటికి వచ్చిన అత్తాకోడళ్లు ఇరుగుపొరుగు వారిని ఆశ్రయించడంతో వారు కట్లు విప్పారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఫిర్యాదు స్వీకరించారు. కేసు నమోదు చేసుకున్న తిరుమలగిరి అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఐదుగురు వ్యక్తులు ఈ దోపిడీలో పాల్గొన్నారని, వీరిలో బుర్ఖా ధరించిన ఓ మహిళ కూడా ఉన్నట్లు బాధితులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్, నార్త్‌జోన్ డీసీపీ కల్మేశ్వర్ సింగవనర్ సందర్శించారు. ఈ వ్యవహారంలో తెలిసిన వారి ప్రమేయాన్నీ అనుమానిస్తున్నారు. ఈ బందిపోటు దొంగలను పట్టుకోవడానికి శాంతిభద్రతల విభాగంతో పాటు సీసీఎస్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. షానవాజ్ ఇంటి నుంచి ప్రధాన రహదారి వరకు, అక్కడ నుంచి వివిధ మార్గాల్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను అధ్యయనం చేస్తున్నారు. మరోపక్క సాంకేతిక ఆధారాలను బట్టి దర్యాప్తు అధికారులు ముందుకు వెళ్తున్నారు. దోచేసింది రా‘బంధువులే’..? షానవాజ్ ఇంట్లో బందిపోటు దొంగతనానికి ఒడిగట్టింది బంధువులే నని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఇంట్లోకి ప్రవేశించిన ఐదుగురిలో నలుగురు పురుషులు ముసుగులు ధరించి ఉండటం, మహిళ బుర్ఖాలో ఉండటంతో బాధితులు వీరిని గుర్తించలేదు. మరోపక్క నేరం చేస్తున్న సమయంలో వీరు గొంతులు మార్చి మాట్లాడారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితురాలు బుర్ఖా ధరించడం, వారు వినియోగించిన పదజాలాన్ని పరిగణలోకి తీసుకుని ప్రాథమికంగా బాధితులు, నిందితులు ఒకే వర్గానికి చెందిన వారుగా అంచనా వేశారు. వీరిందరూ కలిసే వచ్చి ఉంటారని భావించారు. ఇందుకు ఆటో లేదా కారు వాడి ఉండవచ్చునని అనుమానించిన పోలీసులు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో ఫీడ్‌ను పరిశీలించి ఓ అనుమానాస్పద కారును గుర్తించారు. దాని నంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టి కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా.. ఆస్తి వివాదాల నేపథ్యంలోనే షానవాజ్ బంధువులు కక్షగట్టి ఈ బందిపోటు దొంగతనానికి ఒడిగట్టినట్లు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. దీంతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు కొందరు నిందితులను అదుపులోకి తీసుకున్నాయి. పరారీలో ఉన్న మరికొందరికోసం గాలిస్తున్నట్లు సమాచారం. -
తుపాకీతో హల్చల్.. బంగారం చోరికి యత్నం
సాక్షి, మేడ్చల్: తుపాకితో బెదిరించి బంగారు దుకాణంలో చోరికి ప్రయత్నించిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. సినిమా దృశ్యాన్ని తలపించిన ఈ ఘటన జవహర్ నగర్, కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. దుమ్మాయిగూడలోని దుబాయ్ బిల్డింగ్ వద్ద ఉన్న జ్యువెలరీ షాప్‌లో ఆరుగురు అగంతకులు తుపాకితో బెదిరించి చోరికి ప్రయత్నించారు. చోరీ సమయంలో ముఠా సభ్యులు అక్కడ ఉన్నవారిని బెదిరించడానికి గాల్లోకి కాల్పులు జరిపారు. పారిపోతున్న సమయంలో రోడ్డుపైన వెళ్తున్న వ్యక్తిని బెదిరించి బైక్ లాక్కుని ఉడాయించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ చోరికి యత్నించింది అంతర్ రాష్ట్ర ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు ప్రారంభించారు. అయితే జ్యువెలరీ షాప్‌లో బంగారం ఎంత చోరికి గురైందో తెలియాల్సివుంది. -
కత్తితో బెదిరించి కారులో అత్యాచారాలు..
టీ.నగర్: చెన్నైలో రోడ్డుపై వెళ్లే మహిళలను కత్తితో బెదిరించి కారులో అత్యాచారాలు జరుపుతూ వచ్చిన కామాంధుడిని పోలీసులు ఎట్టకేలకూ మంగళవారం అరెస్టు చేశారు. వివరాలు.. చెన్నై, ఈస్ట్ కోస్ట్ రోడ్డులో ఒంటరిగా నడిచి వెళ్లే మహిళలను కిడ్నాప్ చేసి వారిపై అత్యాచారాలు జరుపుతున్నట్లు, అలాగే బంగారు నగలను కాజేస్తున్నట్లు పోలీసులకు రహస్య సమాచారం అందింది. పలువురు ఫిర్యాదు చేయడానికి సంశయించడంతో నిందితుడు స్వేచ్ఛగా తిరిగాడు. కానీ ఒక 35 ఏళ్ల మహిళ మాత్రం పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేసింది. దీంతో నీలాంగరై పోలీసు ఇన్స్పెక్టర్ నటరాజన్, మహిళా పోలీసులు సదరు మహిళ చెప్పిన విషయాలతో ఆశ్చర్యానికి గురయ్యారు. తనను కారులో తీసుకువెళ్లి నిర్మాణుష్య ప్రదేశంలో కారులోనే తనపై అత్యాచారం చేసినట్లు వెల్లడించింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు రెండు వారాలకు పైగా దర్యాప్తు జరిపారు. మహిళ కారు నెంబరు నోట్ చేసుకుని పోలీసులకు అందజేయడంతో వారు ఆ కారును గుర్తించి డ్రైవర్‌ను మంగళవారం అరెస్టు చేశారు. అతని పేరు సురేష్‌గా తెలిసింది. కాల్‌టాక్సీ డ్రైవర్ అయిన ఇతను ఈస్ట్‌కోస్ట్ రోడ్డులోని అడయారు, తిరువాన్మియూరు, నీలాంగరై ప్రాంతాలలో అత్యాచారాలకు పాల్పడినట్లు తెలిసింది. పోలీసులకు వాంగ్మూలం: వివాహిత స్త్రీలంటే తనకెంతో ఇష్టమని, అందుచేత రోడ్డులో ఒంటరిగా నడిచివెళ్లే మహిళలతో మాటామంతీ కలిపి వారిని కారులో ఎక్కించుకుని నిర్జన ప్రదేశానికి తీసుకువెళతానన్నాడు. తర్వాత కారులో ఏసీని పూర్తిగా ఆన్ చేస్తానని, ఆ సమయంలో ఆమె కేకలు వేస్తే చంపేస్తానని బెదిరిస్తానన్నాడు. తర్వాత కారు కిటికీలు పూర్తిగా మూసివేసి వారిపై అత్యాచారం జరుపుతానన్నాడు. గత ఏడాదిగా ఇలాగే 10 మంది మహిళలపై అత్యాచారం చేసినట్లు తెలిపాడు. అనంతరం వారి వద్ద నున్న నగలను దోచుకుంటానన్నాడు. బాధితులు ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో ఇంతవరకు తప్పించుకున్నట్లు తెలిపాడు. దీంతో కన్నగినగర్‌కు చెందిన సురేష్‌పై అత్యాచారం, దోపిడి, హత్యాబెదిరింపులు వంటి కేసులు నమోదు చేసి పుళల్ జైలులో నిర్బంధించారు. అతన్ని కస్టడీలో తీసుకుని విచారణ జరిపేందుకు నిర్ణయించారు. గత 2014లో 15 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిపిన కేసు సురేష్‌పై ఉంది. అతనిపై ఫిర్యాదు చేసిన మహిళ రోడ్డు పక్క దుకాణం నడుపుతున్నారు. ఇలావుండగా పోలీసులు బాధిత మహిళలు ఫిర్యాదు చేయాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. -
డోన్‌లో భారీ చోరీ
డోన్ రూరల్ : పట్టణంలోని ఓనెరో పాఠశాల వద్ద ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. బాధితుల వివరాల మేరకు.. స్థానిక ఓనెరో పాఠశాల సమీపంలో లక్ష్మిదేవి అనే మహిళ కుమారుడు మనోహర్‌రెడ్డి కుటుంబంతో కలిసి ఉంటోంది. మంగళవారం సాయంత్రం పనిపై కుటుంబ సభ్యులంతా హైదరాబాద్ వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దొంగలు అదే రోజు రాత్రి ప్రధాన ద్వారం తాళం ధ్వంసం చేసి ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లోఉన్న రెండు బీరువాను పగులగొట్టి అందులో ఉన్న దాదాపు 30 తులాల బంగారు ఆభరణాలు, రూ.3 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. బుధవారం రాత్రి చుట్టుపక్కల వారు గమనించి లక్ష్మిదేవి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో వారు గురువారం ఉదయం వచ్చి పరిశీలించగా చోరీ జరిగినట్లు గుర్తించారు. దీంతో వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ రాజగోపాల్‌నాయుడు, ఎస్ఐ శ్రీనివాసులు ఘటనస్థలికి చేరుకుని బాధితులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ తెలిపారు. ఆధారాలు దొరక్కుండా.. దొంగలు పక్కా ప్రణాళిక ప్రకారమే చోరీకి తెగబడినట్లు తెలుస్తోంది. ఎలాంటి ఆధారాలు దొరకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నట్లు ఘటనస్థలాన్ని బట్టి తెలుస్తోంది. అయితే చోరీ చేసేందుకు తీసుకొచ్చిన పికాసి, ఒక రాడ్డు, ఒక కట్టె, పండ్ల స్పానర్ను ఘటన స్థలంలోనే వదిలివెళ్లారు. సీసీకెమెరాల ఫుటేజీ దొరకకుండా ఉండేందుకు ఏకంగా హార్డ్‌డిస్క్‌నే ఎత్తుకెళ్లారు. పోలీసులు కర్నూలు నుంచి క్లూస్ టీంను రంగంలోకి దింపి వేలిముద్రలు సేకరించారు. భయం గుప్పిట్లో ప్రజలు... పట్టణంలో వరుస దొంగతనాలు జరుగుతుండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ ఏడాది కొండపేటకు చెందిన మంగళి ప్రసాద్ ఇంట్లో 15 తులాల బంగారు, రూ.70 వేల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. అలాగే ఏప్రిల్ 1న ఇందిరానగర్‌కాలనీలో ఉపాధ్యాయుడు గోపాల్‌శర్మ ఇంట్లో 60 తులాల బంగారు, రూ.7 లక్షల నగదు చోరీకి గురైంది. అలాగే స్థానిక గాందీ సర్కిల్లో ఉన్న శివ జ్యువెలర్స్‌లో 30 తులాల బంగారు కేజీ వెండిని ఎత్తుకెళ్లారు. రైల్వే ఉద్యోగి ఇంట్లో కూడా 8 తులాల బంగారును దొంగలించారు. చోరీలు జరిగిన సమయంలో విచారణ పేరుతో హడావుడి చేయడం తప్ప పోలీసులు ఏం చేయడం లేదని ప్రజలు పేర్కొంటున్నారు. దొంగతనాల కేసుల్లో ఒక్కదానిలో కూడా పురోగతి లేకపోవడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. -
బంగారం కేసులో.. పోలీసుల దొంగాట
దొంగ బంగారం కేసులో అసలు కథ.. కాదు కాదు.. ఆట ఇప్పుడే మొదలైంది..కేసును ఛేదించి అసలు నిందితులను జైలులో పెట్టాల్సిన పోలీసు ఉన్నతాధికారులు ఒత్తిళ్లకు లొంగి గోప్యంగా కేసును చాపచుట్టేయాలనుకున్నారు..దాన్ని కాస్త ‘సాక్షి’ రట్టు చేయడంతో కుడితిలో పడ్డ ఎలుకల్లా కొట్టుకుంటున్నారు.. ‘గుమ్మడి కాయల దొంగ’.. అంటే భుజాలు తడుముకున్నట్లు తాజా వివరాల కోసం ఏ అధికారిని అడిగినా.. తాను చూడటం లేదంటే.. తాను చూడటం లేదని కప్పదాటు వైఖరి అనుసరిస్తున్నారు..టీడీపీ వార్డు అధ్యక్షుడిగా హల్చల్ చేస్తున్న ఓ నగల వ్యాపారి అరకేజీ దొంగ బంగారంతో నాలుగు రోజుల క్రితం దొరికిపోవడం.. ఎమ్మెల్యే ఒత్తిడితో పోలీసులు అతన్ని వదిలిపెట్టిన వైనం విశాఖ పాత నగరంలో కలకలం రేపింది.దీనికి సంబంధించి మరిన్ని వివరాల కోసం ఆరా తీసిన సాక్షికి పోలీసుల దొంగాట కూడా తెలిసొచ్చింది. తమకు సంబంధం లేదని చెబుతున్న పోలీసు అధికారులే మరోవైపు గురువారం రాత్రి ఈ కేసును సెటిల్ చేసేందుకు గోపాలపట్నం స్టేషన్లో ‘పంచాయితీ’ పెట్టడం విశేషం. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: చోరీ బంగారం కేసు విచారణలో పోలీసులు దొంగాట మొదలెట్టారు. కేసులో ప్రధాన నిందితుడు అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ వార్డు అధ్యక్షుడు కావడం, ఆ పార్టీ ఎమ్మెల్యే ఒత్తిళ్ల నేపథ్యంలో పోలీసులు ఎవరికి వారు తప్పించుకునే ధోరణి అవలంభిస్తున్నారు. ఆ కేసులో అతన్ని స్టేషన్‌కు తీసుకొచ్చి విచారణ చేపట్టిన పోలీసులు నిజాయితీగా వివరాలు చెబుతున్నప్పటికీ పై అధికారులు మాత్రం కప్పదాటు వైఖరినే నమ్ముకున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో టీడీపీ వార్డు అధ్యక్షుడిగా హల్చల్ చేసే ఓ నగల వ్యాపారి దొంగ బంగారం కేసులో అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే. దొంగ బంగారం క్రయ, విక్రయాల్లో ఆరితేరిన వ్యాపారిగా గతంలోనే రికార్డులకెక్కిన అతని తాజా భాగోతాన్ని ‘సాక్షి’ బట్టబయలు చేసింది. ‘అసలు బండారం దొంగ బంగారం’ శీర్షికతో గురువారం సాక్షిలో వచ్చిన కథనం కలకలం రేపింది. అసలేం జరిగిందంటే.. వారం కిందట కిందట కంచరపాలెం క్రైం పోలీసులకు పట్టుబడిన ఇద్దరు దొంగలు ఇచ్చిన సమాచారంతో సోమవారం రాత్రి వన్‌టౌన్ కురుపాం మార్కెట్ సమీపంలోని సదరు టీడీపీ నేతకు చెందిన జ్యూయలరీ షాపుపై పోలీసులు దాడి చేసి అరకేజీ బంగారంతోపాటు పది కేజీల వెండి స్వాధీనం చేసుకున్నారు. తాము చోరీ చేసిన బంగారాన్ని ఓ న్యాయవాది ద్వారా టీడీపీ నేతకు చెందిన షాపులోనే విక్రయించామని దొంగలు చెప్పడంతో ఆ షాపులో పనిచేస్తున్న యువకుడితో పాటు ధర్మకాటా వ్యాపారం చేసే మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తీసుకెళ్లారు. విషయం తెలిసి మంగళవారం స్టేషన్‌కు వెళ్లిన షాపు యజమాని అయిన టీడీపీ నేతను స్టేషన్లోనే కూర్చోబెట్టి తమదైన శైలిలో విచారణ చేపట్టారు. ఇంతలో టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధి.. నేర విభాగానికి చెందిన ఓ పోలీసు ఉన్నతాధికారికి ఫోన్ చేసిన దరిమిలా కంచరపాలెం పోలీసులు నిందితులను విడిచిపెట్టారు. అయితే రికవరీలో భాగంగా టీడీపీ వార్డు అధ్యక్షుడిని పది తులాల బంగారం, అతని షాపులో పని చేస్తున్న యువకుడిని ఐదు తులాలు, ఇద్దరు ధర్మకాటా వ్యాపారులను తలో పది తులాలు.. అంటే మొత్తం 35 తులాల బంగారం ఇవ్వాలన్న పోలీసుల షరతుకు వారు అంగీకరించారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి 10.30గంటల సమయంలో కంచరపాలెం పోలీసులు రీడింగ్‌రూమ్ ప్రాంతంలోని అపోలో ఫార్మసీ సమీపంలో ఉన్న ఓ జ్యూయలరీ షాపు నుంచి 100 గ్రాముల బంగారం బిస్కెట్‌ను ఓ ధర్మకాటా వ్యాపారి తరఫున తీసుకెళ్లారు. ఇంత జరిగినా పోలీసు ఉన్నతాధికారులు మాత్రం ఏమీ తెలియనట్టే వ్యవహరించడం విమర్శలపాలవుతోంది. -
అసలు బండారం.. దొంగ బంగారం
అధికారం.. అదీ రాజకీయాధికారం ఉంటే చాలు.. ఏదైనా చేసేయొచ్చు!.. ఎంత పెద్ద కేసు నుంచైనా అనాయాసంగా బయటపడిపోవచ్చు!!..గత నాలుగేళ్లుగా తెలుగుదేశం నేతలు సాగిస్తున్న దందాలు.. అధికార యంత్రాంగంపై చేస్తున్న స్వారీలు చూస్తే ఈ విషయంలో అతిశయోక్తి ఏమాత్రం లేదనపించకమానదు..భూకబ్జాలు, సెటిల్మెంట్లు, ఇతరత్రా పలు రకాల దందాలతో చోటామోటా నేతలు సైతం బడాబాబులుగా రూపాంతరం చెందుతున్నారు.. కోట్లకు పడగలెత్తుతున్నారు..ఈ దుష్ట సంస్కృతికి కొనసాగింపే.. తాజాగా వెలుగులోకి వచ్చిన దక్షిణ నియోజకవర్గానికి చెందిన ఓ చోటా టీడీపీ నేత అక్రమ దందా.. అదే దొంగ బంగారం కొనుగోలు దందా..వృత్తి కార్మికునిగా జీవితం ప్రారంభించిన ఈ టీడీపీ నేత.. తొలి నుంచీ ఈ వ్యవహారాల్లోనే రాటుదేలాడు.. కోట్లు కూడబెట్టాడు..ఇక టీడీపీ అధికారంలోకి రావడం.. స్థానిక ఎమ్మెల్యే దన్ను దొరకడం, చిన్నపాటి నామినేటెడ్ పోస్టు కూడా లభించడంతో మరింత రెచ్చిపోయి చోరీ బంగారం కొనుగోళ్ల మోతాదు పెంచాడు..అయితే పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేయడంతో పెద్దమొత్తంలో దొంగ బంగారంతో అడ్డంగా దొరికిపోయాడు..అయితే ఏం.. అధికారం ఉంది కదా.. ఇలా ఆయన్ను స్టేషన్‌కు తీసుకెళ్లడం.. అలా అక్కడి ఫోన్ మోగడం.. ఎమ్మెల్యేగారి అధికార స్వరం వినిపించడంతో.. దాడుల వరకు పక్కాగా జరిపిన పోలీసులు నీరుగారిపోయారు.. అయ్యగారిని వదిలేసి.. కేసును సాగదీస్తున్నారు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: భూకబ్జాలు, దందాలు, సెటిల్మెంట్లతో ఇప్పటికే నగరాన్ని చెరబట్టిన టీడీపీ నేతలు.. తమ దందాల్లో ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేశారు. దొంగ బంగారం కొనుగోళ్లు, విక్రయాల కేసుల్లోనూ తమదే పైచేయి అని నిరూపించుకుంటున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో తెలుగుదేశం వార్డు అధ్యక్షుడిగా, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ నాయకుడిగా హల్చల్ చేస్తున్న ఓ నగల వ్యాపారి దొంగ బంగారం కేసులో అడ్డంగా బుక్కయ్యాడు. అయితే అధికారం అండతో వెంటనే బయటకొచ్చేశాడు. వాస్తానికి దొంగ బంగారం కొనుగోలు, విక్రయాల్లో ఎప్పటి నుంచో ఆరితేరిన వ్యాపారిగా పేరున్న ఈయన ఇప్పటికే చాలాసార్లు పోలీసు రికార్డులకెæక్కాడు. తాజాగా మూడురోజుల కిందట కంచరపాలెం పోలీసులు పక్కా సమాచారంతో కురుపాం మార్కెట్ సమీపంలోని సదరు టీడీపీ నేతకు చెందిన జ్యూయలరీ షాపుపై దాడి చేశారు. అక్కడ అరకేజీకి పైగా దొంగ బంగారాన్ని స్వాధీనం చేసుకుని షాపును మూయించేశారు. సదరు వ్యాపారి కమ్ నేతను అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లారు. ఓ న్యాయవాది మధ్యవర్తిత్వంలో ఓ దొంగ నుంచి ఆ బంగారం కొనుగోలు చేశాడని నిర్ధారించుకున్న పోలీసులు ఆ మేరకు కేసు ఫైల్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. అయితే ఈలోగా టీడీపీ ఎమ్మెల్యే ఫోన్ చేసి.. ఒత్తిడి చేయడంతో, అతన్ని విడిచిపెట్టి.. ప్రస్తుతానికి విచారణను కొనసా...గిస్తున్నారు. గతమంతా నేర చరిత్రే వాస్తవానికి ప్రస్తుతం పట్టుబడిన వ్యాపారికిది మొదటి కేసేమీ కాదు. ఆయన గత చరిత్రంగా కేసులమయమే, 1991లోనే దొంగ బంగారం కేసుల్లో ఆయనపై వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేశారు. ఆ తర్వాత రాజకీయ నేతగా రూపాంతరం చెందాక సస్పెక్ట్ షీట్‌ను తీయించేసుకున్నప్పటికీ.. అతని వ్యాపారశైలి మాత్రం మారలేదు. మూడేళ్ల కిందట ఇదే వ్యాపారి అలియాస్ టీడీపీ నేతను నకిలీ పత్రాలతో ప్రభుత్వ భూమిని ఆక్రమించినందుకు గాను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. పరదేశిపాలెం సర్వే నెంబర్–2లో 5.26 ఎకరాల భూమిని అప్పటి కలెక్టర్ జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్ల నిర్మాణానికి కేటాయించారు. సదరు టీడీపీ నేత ఫోర్జరీ పత్రాలతో ఆ భూములకే టైటిల్ డీడ్, పట్టా చేయించేసుకున్నాడు. దీనిపై స్వయంగా ఇప్పటి జిల్లా కలెక్టర్, అప్పటి జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు 420, 468 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకున్నారు. ఇక 2007లో సహచర జ్యూయలరీ వ్యాపారులు పల్లా సత్తిబాబు, కొలుసు అప్పలరాజులను బంగారం రికవరీ విషయంలో ఇబ్బంది పెట్టడంతో వారు అప్పట్లో హోంమంత్రి మొదలుకుని అందరికీ ఫిర్యాదుచేశారు. విచారణ జరుపుతున్నాం: ఎస్ఐ కుమార్ దొంగ బంగారం కొనుగోలు చేశారని వచ్చిన సమాచారంతో టీడీపీ వార్డు అధ్యక్షుడు, విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్ నాయకుడిని అదుపులోకి తీసుకుని విచారించామనికంచరపాలెం క్రైం ఎస్సై కుమార్ తెలిపారు. సాక్షితో ఆయన మాట్లాడుతూ అతన్ని అదుపులోకి తీసుకున్నా ఇంకా బంగారం రికవరీ చేయలేదని, కేసు విచారణ దశలో ఉన్నందున మరిన్ని వివరాలు వెల్లడించలేమని అన్నారు. -
బావ ఇంటికే కన్నం..
సాక్షి, హైదరబాద్: జల్సాలకు అలవాటు పడిన ఓ యువకుడు బావ ఇంటికే కన్నం వేసిన సంఘటన బుధవారం హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. వనస్థలిపురం ఏసీపీ గాంధీ నారాయణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి... హయత్‌నగర్ మండలం, బ్రాహ్మణపల్లికి చెందిన పరం ముత్యం, భువనేశ్వరి దంపతులు, భువనేశ్వరికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో గత నెల 1న కర్మన్‌ఘాట్‌లోని పుట్టింటికి వెళ్లి 10 రోజులకు తిరిగి వచ్చింది. ఈ మద్యకాలంలో ఆమె సోదరుడు గొబ్బురు రాజు తరచూ బావ ఇంటికి వచ్చి వెళ్లేవాడు. ఈ నెల 30న నగలను తీసుకునేందుకు తాళం చెవి కోసం వెదికినా దొరకకపోవంతో బీరువా తాళాలు పగులగొట్టి చూడగా ఉందులో ఉన్న 17.5 తులాల ఆభరణాలు కనిపించలేదు. దీంతో ముత్యం గత సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముత్యం బామ్మర్ది రాజుపై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. -
యలమంచిలిలో చోరీ
విశాఖపట్నం, యలమంచిలి: పట్టణంలోని రామ్‌నగర్‌లో సోమవారం అర్ధరాత్రి ఓ ఇంట్లో చోరీ జరిగింది.రామ్‌నగర్ శివారు జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న గొర్లె శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇంట్లో దొంగలు ప్రవేశించి ఏడున్నర తులాల బంగారు, 20 తులాల వెండి ఆభరణాలను అపహరించారు. ఇంటి బయట శ్రీనివాసరావుతో పాటు మరో నలుగురు కుటుంబ సభ్యులు నిద్రిస్తుండగా ఇంటి వెనుక తలుపు తాళం తొలగించి దొంగలు లోపలికి ప్రవేశించారు. బీరువాలో ఉన్న బంగారు,వెండి ఆభరణాలను చోరీ చేశారు. బాధితుడు శ్రీనివాసరావు విశాఖ డెయిరీలో టెక్నికల్అసిస్టెంట్గా పనిచేస్తుండడంతో తెల్లవారుజామున లేచి డ్యూటీకి బయలుదేరే సమయంలో ఇంటిలో వెళ్లగా చూడగా వెనుక తలుపులు తీసి ఉన్నాయి. బీరువా తెరిచి, దుస్తులు చిందరవందరగా పడిఉండడంతో చోరీ జరిగినట్టు గుర్తించాడు. బాధితుని ఫిర్యాదుమేరకు యలమంచిలి టౌన్ ఎస్ఐ నారాయణరావు ఆ ఇంటికి వెళ్లి చోరీ జరిగిన తీరును పరిశీలించారు. క్లూస్‌టీమ్‌ను రప్పించి వేలిముద్రలు సేకరించారు.దొంగలను పట్టుకునేందుకు పట్టణంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్టు ఎస్ఐ నారాయణరావు తెలిపారు. -
రామవరప్పాడులో భారీ చోరీ
రామవరప్పాడు (గన్నవరం) : ఎప్పుడూ రద్దీగా ఉండే రామవరప్పాడు పాత పోస్టాఫీసు రోడ్డులో గురువారం తెల్లవారుఝామున భారీ చోరీ జరగడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనలో 10 కాసుల బంగారం, అర కేజీ వెండి, రూ.1.80 లక్షల నగదు మొత్తం సుమారు రూ.7 లక్షల ఆస్తి చోరీ జరిగింది. వివరాలాలా ఉన్నాయి. పాత పోస్టాఫీసు రోడ్డులోని ఓ భవనంలో పంచకర్ల మధుకిరణ్, శారదా భవాని దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి మనోజ్, మానస సంతానం. మనోజ్ పంజాబ్‌లోని జీఎన్ఏ యూనివర్శిటిలో బీటెక్ చేరాల్సి ఉండగా, మానస 10వ తరగతి చదువుతోంది. వీరికి పక్కనున్న మరో గదిలో మధుకిరణ్ తల్లిదండ్రులు సాంబశివరావు, వరలక్ష్మి›ఉంటున్నారు. మధుకిరణ్ ఆటోనగర్‌లో సిటీ కేబుల్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. బుధవారం రాత్రి కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేసిన అనంతరం ఉక్కబోతగా ఉందని ఏసీ ఉన్న గదిలో నలుగురు కలిసి నిద్రకు ఉపక్రమించారు. తెల్ల వారుఝామున సుమారు 2 గంటల సమయంలో ఆగంతకుడు వీరు నివసిస్తున్న భవనంలోకి చేరుకున్నాడు. తలుపులన్నీ వేసి ఉండటంతో వంట గదిలోని కిటికి గ్రిల్‌ను రాడ్డు సహాయంతో తొలగించి రంధ్రం గుండా లోపలికి ప్రవేశించాడు. కుటుంబసభ్యులు నిద్రిస్తున్న గదికి బయట నుంచి గడియ పెట్టి పక్కనున్న గదిలోకి వెళ్లాడు. హ్యాంగర్‌కు తగిలించిన తాళంతో బీరువా లాక్ తీసి అందులోని నల్లపూసల గొలుసు, నాను తాడు, గాజులు, చెవి దుద్దులు, చైన్ (మొత్తం 10 కాసులు), సిటీ కేబుల్ కలెక్షన్ డబ్బు, మనోజ్ కళాశాలకు చెల్లించాల్సిన ఫీజు కలిపి బీరువాలో ఉంచిన రూ.1.80 లక్షల నగదు, దేవుడి గదిలోని వెండి సామాన్లు అపహరించాడు. మనోజ్ కళాశాల బ్యాగ్‌లోని పుస్తకాలను తీసేసి అపహరించిన సొత్తును అందులో వేసుకుని ఉడాయించాడు. మానస నిత్యం ఉదయం 5 గంటలకు నిద్ర లేచి చదువుకుంటుంది. రోజూ మాదిరిగానే మేల్కొన్న మానస తలుపు తీసేందుకు ప్రయత్నించగా రాలేదు. దీంతో తండ్రి మధుకిరణ్‌ను లేపింది. మరో మార్గం నుంచి బయటకు వచ్చి తలుపు గడియ తీశాడు. పక్కనున్న గది తీసి ఉండటం, బీరువాలోని సామాన్లు చిందరవందరగా పడి ఉండటం చూసి దొంగతనం జరిగిందని గుర్తించి పటమట పోలీసులకు సమాచారం అందించాడు. సీఐ ఉమామహేశ్వరరావు, ఎస్ఐ సత్యనారాయణ తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితుల నుంచి వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రంగంలోకి క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్.. సమాచారం అందుకున్న క్లూస్ టీమ్ సభ్యులు రంగంలోకి దిగారు. చోరీ జరిగిన తీరును పరిశీలించి వేలిముద్రలు సేకరించారు. పోలీసు జాగిలాలు ఇంట్లో కలియతిరిగి ప్రసాదంపాడు వైపు వెళ్లి తిరిగి వెనక్కి వచ్చాయి. షార్ట్‌తో వచ్చి ఫ్యాంట్ షర్ట్‌తో వెళ్లి... సమీపంలోని ఓ హార్డ్‌వేర్ దుకాణంలో రికార్డైన సీసీ టీవీ ఫుటేజ్‌ను పోలీసులు, సీసీఎస్ పోలీసులు పరిశీలించారు. షార్ట్, బనీన్‌తో ఓ ఆగంతకుడు ప్రసాదంపాడు వైపు నుంచి వచ్చి మధుకిరణ్ ఇంట్లోకి ప్రవేశించినట్లు ఫుటేజ్‌లో గుర్తించారు. సుమారు గంట తర్వాత అదే వ్యక్తి వైట్ షర్ట్, నల్ల ప్యాంట్‌తో వెనుక బ్యాగ్ తగిలించుకుని ముఖానికి మాస్క్ ధరించి బయటకు వచ్చి తాపీగా రామవరప్పాడు రింగ్ వైపు వెళ్లిపోయాడు. సీసీ ఫుటేజ్‌ను పరిశీలించిన మనోజ్ ఆగంతకుడు వేసుకున్న డ్రెస్, బ్యాగ్ తనవేనని గుర్తించాడు. పక్కా ప్లాన్‌తోనే.. చోరీ తీరును పరిశీలిస్తే పక్కా ప్లాన్‌తోనే జరిగిందని అనుమానిస్తున్నారు. జాతీయ రహదారి నుంచి లోపలి వీధిలోకి వచ్చిన దుండగుడు ప్రారంభంలో ఉన్న నివాసాల్లోకి వెళ్లకుండా సరాసరి మధుకిరణ్ ఇంట్లోకి ప్రవేశించాడు. కేబుల్ ఆపరేటర్‌గా పని చేస్తున్న కిరణ్ ఇంట్లో కలెక్షన్ డబ్బు ఉంటుందని గ్రహించే ఈ దొంగతనానికి పాల్పడ్డాడని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రెక్కీ నిర్వహించి ఇంట్లో విలువైన వస్తువులు, బీరువా తాళాలు ఎక్కడెక్కడ ఉంటాయో తెలుసుకునే ఈ పనికి పాల్పడ్డాడని భావిస్తున్నారు. సుమారు 20 రోజుల క్రితం మధుకిరణ్ ఇంట్లోని తలుపు మరమ్మతుల నిమిత్తం ఇద్దరు వచ్చారని, ఒకవేళ ఇది వారి పని అయ్యి ఉంటుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కిటికి గ్రిల్ తొలగించిన ప్రదేశంలో నేలపై తుప్పు పట్టిన మేకులు కూడా చల్లారని బాధితులు తెలిపారు. -
షారూఖ్ తెల్లవారుజామునే చోరీలు చేస్తుంటాడు
సాక్షి, సిటీబ్యూరో: చాదర్‌ఘాట్‌కు చెందిన షారూఖ్ తెల్లవారుజామునే చోరీలు చేస్తుంటాడు. ఇంట్లో ఉన్న బంగారం, సెల్ఫోన్లు మాత్రమే తీసుకుని ఉడాయిస్తాడు. వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తుంటాడు. ఈ పంథాలో ఏడేళ్లుగా నేరాలు చేస్తున్న షారూఖ్ మరోసారి పోలీసులకు చిక్కాడు. ఈసారి హైదరాబాద్, సైబరాబాద్ పరిధుల్లో జరిగిన చోరీలకు సంబంధించి అతడితో పాటు అనుచరుడినీ సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నట్లు అదనపు డీసీపీ చైతన్యకుమార్ గురువారం వెల్లడించారు. చాదర్‌ఘాట్ ప్రాంతానికి చెందిన షేక్ షారూఖ్ (23) వేరు పడటంతో అతడిపై పర్యవేక్షణ కొరవడింది. దీంతో జల్సాలకు బానిసైన అతడికి ఆటోడ్రైవర్‌గా వచ్చే సంపాదన సరిపోయేది కాదు. ఈ నేపథ్యంలో అదనపు ఆదాయం కోసం 16వ ఏటనే దొంగగా మారాడు. తల్లిదండ్రులకు దూరమైన షారూఖ్ పాతబస్తీలోని కొందరి ఇళ్లల్లో ఆశ్రయం పొందుతూ వారికి కొంత చెల్లిస్తుంటాడు. తెల్లవారుజామున కాలనీల్లో తిరుగుతూ తలుపులకు లోపల నుంచి బోల్టులు పెట్టని ఇళ్లను గుర్తిస్తాడు. యజమానులు గుర్తించకుండా వాటిలోకి ప్రవేశించే షారూఖ్ కేవలం బంగారం, సెల్ఫోన్లు మాత్రమే తస్కరిస్తాడు. వీటిని విక్రయించగా వచ్చిన సొమ్ముతో మద్యం, మాదకద్రవ్యాలు, వ్యభిచారం వంటి జల్సాలు చేస్తాడు. చేతిలో ఉన్న డబ్బు అయిపోయాక మరో నేరం చేస్తాడు. ఇలా 2011 నుంచి ఇతడిపై 23 కేసులు నమోదయ్యాయి. 2015లో సంతోష్‌నగర్ పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించి జైలుకు పంపారు. బయటికి వచ్చినా తన పంథా మార్చుకోని షారూఖ్ బహదూర్‌పుర పరిధిలో మరో చోరీ చేసి ఈ ఏడాది ఏప్రిల్ 9న అరెస్టు అయ్యాడు. ఈ కేసులో గత నెలలో బయటకు వచ్చిన తర్వాత తలాబ్‌కట్టకు చెందిన మరో ఆటోడ్రైవర్ మహ్మద్ మజర్‌తో కలిసి ముఠా కట్టాడు. వీరిద్దరూ నెల రోజుల్లో నగరంలోని చిలకలగూడ, ఉస్మానియా వర్శిటీతో పాటు సైబరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఆరు చోరీలు చేశాడు. వీరి వ్యవహారాలపై సమాచారం అందుకున్న సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.మధుమోహన్‌రెడ్డి నేతృత్వంలో ఎస్సైలు ఎన్.శ్రీశైలం, జి.వెంకటరామిరెడ్డి, కేఎన్ ప్రసాద్‌వర్మ, మహ్మద్ థకుద్దీన్ వలపన్ని గురువారం పట్టుకున్నారు. వీరి నుంచి 150 గ్రాముల బంగారం, 130 గ్రాముల వెండి, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసును తదుపరి చర్యల నిమిత్తం రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు. -
అమ్మవారి ఆలయంలో భారీ చోరీ
మేడికొండూరు: ఆలయంలో అమ్మవారి ఆభరణాల చోరీ ఘటన సోమవారం కలకలం రేపింది. ఫిరంగిపురం మండలం అమీనాబాద్ గ్రామంలోని మూల్యాంకేశ్వరి ఆలయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఆలయంలోకి ప్రవేశించే షట్టరును పగలకొట్టిన దొంగలు గర్భగుడి ఇనుప ద్వారాన్ని సిమెంటు దిమ్మెలతో సహా ధ్వంసం చేశారు. అనంతరం 500 గ్రాముల అమ్మవారి వెండి కిరీటం, గర్భగుడిలో విగ్రహం పక్కనే ఉన్న రెండు బీరువాల్లోని రెండు వెండిప్లేట్లు, పంచహారతి ఇచ్చే వస్తువులు, అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని (పంచలోహం) ఎత్తుకెళ్లారు. ఆలయంలోని పురాత విగ్రహం సాయంతో హుండీని పగలకొట్టి డబ్బులను దొంగిలించారు. ఈ క్రమంలో ఆ విగ్రహం ధ్వంసం కావడంతో నిర్మానుష్యంగా ఉండే ప్రాంతంలో పడేశారు. మొత్తం రూ.2 లక్షల విలువ చేసే వస్తువులు చోరీకి గురైనట్లు ఆలయ పండితులు అయ్యన్న శాస్త్రి తెలిపారు. ప్రొఫెషనల్స్ పనే.. రోజు మాదిరిగానే అమ్మవారికి నైవేధ్యం పెట్టడానికి పండితులు అయ్యన్న శాస్త్రి ఆలయానికి వచ్చారు. ఈ క్రమంలో షట్టరు తాళాలు పగలకొట్టి, విగ్రహాలు ధ్వంసం చేసిన ఉండటంతో స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఫిరంగిపురం ఎస్ఐ ఉజ్వల్ ఘటనా స్థలాన్ని క్లూస్ టీం సాయంతో పరిశీలించి, ఇది ప్రొఫెషనల్స్ పనేనంటూ తేల్చిచెప్పారు. -
పథకం ప్రకారమే చోరీ
కోనేరుసెంటర్(మచిలీపట్నం):మచిలీపట్నం బలరామునిపేటలో దొంగతనం కేసులో నిందితులను పోలీసులు పట్టుకున్నారు. నిందితులు పథకం ప్రకారమే ఈ దొంగతనం చేసినట్లు జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మచిలీపట్నం బలరామునిపేటకు చెందిన నాయుడు లక్ష్మీనారాయణ ఐదేళ్ల క్రితం ఓ మొబైల్ షోరూం పెట్టాడు. ఆ సమయంలో హైదరాబాదుకు చెందిన బాల సాయిసుమ నిజాంపేటలోని తన మేనత్త ఇంటి వద్ద ఉంటూ షాపులో సేల్స్‌గర్ల్‌గా చేరింది. కొంతకాలానికి లక్ష్మీనారాయణ, సాయిసుమ మధ్య చనువు పెరిగింది. కొంతకాలానికి సాయిసుమ తిరిగి హైదరాబాదు వెళ్లిపోయింది. మూడు నెలల క్రితం నిజాంపేటలోని మేనత్త ఇంటికి వచ్చింది. పాత పరిచయం మీద ఆమెను లక్ష్మీనారాయణ స్థానిక కేబుల్ కార్యాలయంలో ఆపరేటర్‌గా చేర్పించాడు. దీంతో సాయిసుమ తరచూ లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లటం మొదలుపెట్టింది. డబ్బులు ఇవ్వకపోవడంతో చోరీ.. హైదరాబాదులో విలాసాలకు అలవాటుపడిన సాయిసుమ చేతిలో డబ్బులు లేకపోవడంతో లక్ష్మీనారాయణ ఇంట్లో చోరీ చేయాలని ఎత్తు వేసింది. అతడి తల్లి లక్ష్మీనరసమ్మతో పరిచయం పెంచుకుంది. లక్ష్మీనరసమ్మ ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు కాజేయాలని పన్నాగం వేసింది. మేనత్త వేర్ల నీలిమ సహకారం తీసుకుంది. లక్ష్మీనరసమ్మ ఒంటిపై ఆభరణాలు అపహరించేందుకు రెండు సార్లు రెక్కీ నిర్వహించింది. విఫలం చెందారు. దీంతో హైదరాబాదులోని సాయిసుమ తమ్ముడిని పిలిపించి అతడి సహకారంతో చోరీకి పాల్పడ్డారు. లక్ష్మీనారాయణ ఇంట్లో ఉండగానే చోరీ.. ఈ నెల 5వ తేదీ లక్ష్మీనారాయణ గదిలోకి సాయిసుమ వెళ్లి మాటల్లో పెట్టింది. అప్పటికే రెక్కీ నిర్వహిస్తున్న నీలిమ, అతడి మేనల్లుడు కలసి ఇంటి వెనుక నుంచి లక్ష్మీనరసమ్మ గదిలోకి చొరబడి ఆమె మొహంపై హిట్ చల్లారు. స్పృహ కోల్పోగా ఒంటిపై ఉన్న తొమ్మిది నవర్సుల బరువు గల రెండు పేటల గొలుసు, నాలుగు గాజులను అపహరించి అక్కడి నుంచి ఉడాయించారు. ఈ ఘట నపై లక్ష్మీనారాయణ అదే రోజు ఆర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. విచారించి సాయిసుమ, నీలిమలను అదుపులోకి తీసుకున్నారు. చోరీ చేసినట్లు అంగీకరించటంతో రూ.2 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను రికవరీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. చోరీ కేసును ఛేదించటంలో ప్రతిభ కనబరచిన సీఐలు రవికుమార్, వాసవి, నభీ, ఎస్ఐ లు హబీబ్‌బాషా, వెంకటేశ్వరరావులను ఎస్పీ అభినందించారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ సోమంచి సాయికృష్ణ, బందరు డీఎస్పీ మహబూ బ్బాషా, ట్రైనీ డీఎస్పీ రాజ్‌కమల్ పాల్గొన్నారు. -
మృతురాలి ఒంటిపై బంగారం అపహరణ
గుంటూరు: పోలీసు శాఖలో కొందరు అధికారుల తీరు రోజురోజుకు ప్రశ్నార్థకంగా మారుతోంది. చివరకు శవాలను సైతం వదలకుండా దోచుకోవడంలో తాము మాత్రం తక్కువ తిన్నామా అన్నట్లు వ్యవహరిస్తూ పోలీసు శాఖ ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరిస్తున్నారు. అధికారులే నేరుగా రంగంలోకి దిగి దొంగల తరహాలో శవంపై ఉన్న బంగారు ఆభరణాలను చోరీ చేసిన ఘటన సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. ఏకంగా అర్బన్ జిల్లా పరిధిలోని ఓ సీఐ తన చేతివాటం ప్రదర్శించి సుమారు 25 నుంచి 30 సవర్ల బంగారు ఆభరణాలను దర్జాగా తీసుకెళ్లి ఇంట్లో దాచుకున్నాడు. ఈ విషయమంతా మృతురాలి కుమార్తె అర్బన్ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయడంతో వెలుగు చూసింది. ఘటన పూర్వాపరాలు... అర్బన్ జిల్లా పరిధిలోని ఓ పోలీసు స్టేషన్ పరిధిలో 66 ఏళ్ల వయస్సు గల వృద్ధురాలు ఆమె నివాసంలో ఒంటరిగా నివాసం ఉంటుంది. గతేడాది మే 15న గుర్తు తెలియని అగంతకులు వృద్ధురాలిని తలపై మోది దారుణంగా హతమార్చారు. ఆపై మృతదేహాన్ని ఓ గదిలో పడేసి ఏసీ ఆన్‌చేసి ఇంటికి తాళాలు వేసి వెళ్లిపోయారు. మూడు రోజుల అనంతరం విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఏసీ పనిచేయక ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన స్థానికులు సమీపంలోని పోలీసులకు సమాచారం అందించడంతో అప్పుడు ఆ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న సీఐ, మరో కానిస్టేబుల్‌తో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని తాళాలు పగులగొట్టి ఇంట్లోకి వెళ్లారు. రక్తపు మడుగులో వృద్ధురాలి మృతదేహం పడి ఉండటంతో హత్య జరిగిందనే నిర్థారణకు వచ్చారు. ఈక్రమంలో మృతురాలు శరీరంపై, ఇంట్లో ఉన్న సుమారు 25 నుంచి 30 సవర్ల బంగారు ఆభణాలను సదరు సీఐ సర్దేశాడు. ఆవిషయాన్ని ఎక్కడా పోలీసుల రికార్డుల్లో నమోదు చేయలేదు. కేవలం హత్య కేసు మాత్రమే నమోదు చేసి చేతులు దులిపేసుకున్నారు. విషయాన్ని కృష్ణా జిల్లా దొగ్గంపూడిలో నివాసం ఉంటున్న వృద్ధురాలి కుమార్తెకు సమాచారం అందించడంతో హుటాహుటిన గుంటూరు చేరుకుని రక్తపు మడుగుల్లో విగతజీవిగా పడి ఉండటం చూసి కన్నీటి పర్యంతమైంది. వెలుగు చూసిందిలా .... ఈక్రమంలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి మృతురాలి తల్లికి అప్పగించారు. అంత్యక్రియల అనంతరం ఇంట్లో పరిశీలించగా ఎక్కడా బంగారు ఆభరణాలను కనిపించలేదు. ముందు రోజు కూడా తన తల్లి ఒంటిపై బంగారు ఆభరణాలు ఉన్నట్లు స్థానికుల ద్వారా తెలుసుకుంది. ముందుగా తాళాలు పగులగొట్టి ఇంట్లోకి వెళ్లింది. సీఐ మాత్రమే కావడంతో ఆయన తీరుపై అనుమానం వచ్చి పలుమార్లు సీఐను కలిసి ప్రశ్నించినా తనకు బంగారం విషయం తెలియదని, మళ్లీ ఇదే విషయాన్ని అడిగితే నిన్ను అనుమానించి కేసులో నిందితురాలిగా తేల్చాల్సి ఉంటుందని భయభ్రాంతులకు గురి చేశారని తెలిపింది. దీంతో బాధితురాలు గత్యంతరం లేని స్థితిలో ఇటీవల అర్బన్ ఎస్పీ సీహెచ్ విజయరావును కలిసి జరిగిన దొంగతనాన్ని వివరించి చెప్పడంతో అవాక్కైన ఎస్పీ విచారణకు ఆదేశించారు. విచారణలో నమ్మలేని నిజాలు... అర్బన్ జిల్లా పరిధిలోనే ప్రస్తుతం సదరు సీఐ విధులు నిర్వహిస్తుండటంతో నిఘా వర్గాల ద్వారా ఎస్పీ సమాచారం సేకరించి విచారణకు ఆదేశించారు. విచారణ అధికారిగా ఓ సీఐను నియమించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐను ఇటీవల ఓ పోలీసు స్టేషన్‌కు పిలిచించి విచారణ అధికారిగా వ్యవహరిస్తున్న సీఐ రెండు రోజులపాటు విచారించారు. చివరకు తన వద్ద నెక్లస్తోపాటు ఓ గాజు ఉన్నట్లు అంగీకరించి అప్పగించారని సమాచారం. మిగిలిన బంగారం కూడా సదరు సీఐ వద్దే ఉండి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటన పోలీసు శాఖలో అంతర్గతంగా చర్చనీయాంశంగా మారింది. ఇలాటి సీఐలపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటే మరో అధికారి ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ఉంటారని చర్చించుకుంటున్నారు. -
రెండు గ్రాములకు..మూడు తులాలు
పంజగుట్ట: కస్టమర్లుగా నగల దుకాణానికి వచ్చిన ఇద్దరు మహిళలు రెండు గ్రాముల రింగులు అక్కడ ఉంచి సుమారు మూడుతులాల రింగులను దొంగిలించిన సంఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. పంజగుట్టలోని త్రిభువన్దాస్ భీమ్జీ జ్వులరీ షాపునకు గత నెల 21న ఇద్దరు మహిళలు బంగారం కొనేందుకు వచ్చారు. సేల్స్‌మెన్ దృష్టి మరల్చి తమ వెంట తెచ్చుకున్న రెండు గ్రాముల చెవి రింగులను అక్కడ ఉంచి 27.9 గ్రాముల రింగులను తీసుకుని ఉడాయించారు. సేల్స్‌మెన్స్‌కు లెక్క సరిగ్గా ఉండడంతో వారు గుర్తించలేకపోయారు. ఆడిటింగ్‌లో బంగారం తక్కువగా ఉన్నట్లు గుర్తించిన మేనేజర్ చంద్రశేఖర్ బుధవారం రాత్రి పంజగుట్ట పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమరాలు పరిశీలించి నిందితులను గుర్తించారు. ఒకే రకమైన దుస్తులు ధరించిన వారు సికింద్రాబాద్ పాట్ మార్కెట్ నుండి వచ్చారని, అక్కడకూడా పలు బంగారం దుకాణాలను సందర్శించినట్లు తెలిపారు. అక్కడినుంచి పంజగుట్టకు వచ్చి చోరీ అనంతరం ఆటోలో గాంధీ ఆసుపత్రి వరకు వెళ్లినట్లు గుర్తించామన్నారు. అక్కడ ఆర్టీసీ బస్సు ఎక్కడంతో ఎటు వెళ్లారో తెలియడం లేదన్నారు. -
మందులోడే.. మాయగాడు
నాగర్‌కర్నూల్ క్రైం: షుగర్ వ్యాధికి మందిస్తానంటూ నమ్మించడమే గాక.. శాంతిపూజలు కూడా చేస్తానంటూ ఓ వ్యక్తిని బురిడీ కొట్టించి అతని నుంచి బంగారు నగలు, నగదు స్వాహా చేసి ఉడాయించాడు. ఈ సంఘటన శనివారం రాత్రి నాగర్‌కర్నూల్‌లో చోటుచేసుకుంది. బాధితుడు, పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాకేంద్రంలోని కేసరిసముద్రం రోడ్డులోని ఈదమ్మగుడి కాలనీకి చెందిన కొట్ర బాలయ్య స్థానికంగా ఇస్త్రీ షాపు నిర్వహిస్తున్నాడు. ఇతడి షాపు దగ్గరికి గత 15 రోజుల క్రితం ఓ మహిళ వచ్చి షుగర్ వ్యాధికి ఒక స్వామీజీ మందు ఇచ్చి నయం చేస్తారని, తనతోపాటు తన బంధువులకు స్వామీజీ ఇచ్చిన మందుతో నయం అయిందని ఆ స్వామీజీని ఇక్కడ చూశారా అని కొట్ర బాలయ్యను అడిగి వెళ్లిపోయింది. శనివారం ఉదయం కాషాయపు దుస్తులు ధరించిన గుర్తుతెలియని వ్యక్తి కొట్ర బాలయ్య షాపు ముందే తిరుగుతూ బాధితుడి వద్దకు వెళ్లి ఇక్కడ కుంకుమ దొరుకుతుందా అని అడగడంతో బాధితుడు స్వామీజీ వేషంలో ఉన్న మోసగాడిని షుగర్ వ్యాధి నయం చేసే వ్యక్తిగా భావించాడు. స్వామీజీ వేషంలో మోసగాడు అతనితో మాటామాట కలిపి షుగర్వ్యాధితోపాటు ఏవైనా కష్టాలు ఉంటే పూజలు చేసి వాటిని తొలగిస్తానని అతన్ని నమ్మబలికాడు. దీంతో బాధితుడు షుగర్వ్యాధికి మందు ఇచ్చి నయం చేయాలని కోరడంతో స్వామీజీ అంగీకరించి ఇంటి దగ్గర మందు తయారు చేసిస్తానని చెప్పడంతో బాధితుడు స్వామీజీ వేషంలో ఉన్న మోసగాన్ని ఇంటికి తీసుకువెళ్లాడు. ఇంటికి నరదృష్టి పేరుతో.. ఇంటికి తీసుకువెళ్లిన తర్వాత ఇంటికి నరదృష్టి ఉందని పూజలు చేయాలని నిమ్మకాయలు, కుంకుమ, బియ్యం, పసుపు కావాలని కోరడంతో వాటిని బాధితుడు ఇచ్చాడు. పూజలో బంగారంతోపాటు, నగదు ఉంచి మందును తయారు చేసిస్తానని నమ్మబలికాడు. అది నమ్మిన కొట్ర బాలయ్య అతని భార్య లక్ష్మి తన ఇంట్లో ఉన్న 3 తులాల బంగారం నగలు, రూ.5,100 నగదు స్వామీజీకి ఇవ్వడంతో అతను బంగారాన్ని, నగదు తీసి తన దగ్గర ఉన్న బాక్సులో వేసి వాటికి దారాలు చుట్టి పూజలు చేశాడు. అనంతరం స్నానానికి వెళ్లమని చెప్పడంతో బాధితుడి భార్య లక్ష్మి స్నానానికి వెళ్లింది. బాలయ్యను గేటు దగ్గరికి వేయమని చెప్పడంతో ఆయన వెళ్లి వచ్చేలోపు తన దగ్గర ఉన్న వేరే డబ్బాను అక్కడ ఉంచి బంగారం నగలు, నగదు ఉన్న బాక్సును సంచిలో పెట్టుకున్నాడు. అనంతరం స్వామీజీ పట్టణంలోని మార్కెట్ యార్డులో వదిలి వేసి ఇంటికి తిరిగి వచ్చాడు. కేసు నమోదు ఈ క్రమంలో స్వామీజీ వెళ్లిపోయిన తర్వాత బాలయ్య భార్య లక్ష్మికి అనుమానం రావడంతో వెంటనే బాక్సును తెరిచి చూడగా అందులో బియ్యం మాత్రమే ఉన్నాయి. దీంతో తాము మోసపోయామని గుర్తించిన బాధితులు వెంటనే లబోదిబోమంటూ పోలీస్‌స్టేషన్ వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ భగవంతురెడ్డి తెలిపారు. -
శివపురంలో చోరీ
నర్సీపట్నం: పట్టణంలోని శివపురంలో భారీ దొంగతనం జరిగింది. ఇంటి యజమాని కుటుంబ సభ్యులతో సహా స్వగ్రామానికి వెళ్లాడాన్ని గమనించిన దొంగలు ఇంట్లో ప్రవేశించి సుమారు రూ.8 లక్షలు విలువైన బంగారం, వెండి నగలను దోచుకుపోయారు. బాధితుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి...నర్సీపట్నం–కేడీ పేట వెళ్లే ప్రధాన రహదారి శివపురం వద్ద అయ్యంకుల వేణుగోపాల్ నివాసం ఉంటున్నాడు. గత నెల 31న ఇంటికి తాళాలు వేసుకుని స్వగ్రామమైన కృష్ణాదేవిపేటకు కుటుంబ సభ్యులతో సహా వెళ్లాడు. ఈ నెల 2న తిరిగి ఇంటికి రాగా ఇంటి ప్రధాన ద్వారం తలుపులు తీసి ఉండడాన్ని గమనించారు. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా తెరిచి ఉంది. బీరువా లాకర్ తాళాలు సైతం తీసి ఉన్నాయి. బీరువాలోని దుస్తులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. లాకర్ చూడగా అందులో భద్రపరిచిన 20 తులాల బంగారం, 20 తులాల వెండి వస్తువులు లేవు. లాకర్లో ఉన్న ఎనిమిది తులాల నల్లపూసల దండ, నాలుగు తులాల చంద్రహారం, రెండు తులాల నక్లెస్, మూడు తులాల గొలుసు, రెండు తులాల మండచైన్, అరతులం పగడపు ఉంగరం, పది తులాల వెండి గ్లాసులు, పది తులాల వెండి పట్టీలు చోరీకి గురైనట్టు బాధితులు వేణుగోపాలు, భార్య దేవి తెలిపారు. బాధితులు ఆదివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ సీఐ ఎస్.సింహాద్రినాయుడు సంఘటన జరిగిన ఇంటిని పరిశీలించారు. క్లూస్ టీమ్ వేలిముద్రలను సేకరించింది. బాధితుల ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇన్సురెన్స్ డబ్బుల కోసం..
నిజామాబాద్ క్రైం: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఆశపడి కొడుకుచే దొంగతనాలు చేయించిందో తల్లి. అయితే.. ఆమె వ్యూహం బెడిసికొట్టడంతో కటకటాలపాలైంది. పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్‌లోని నాందేవ్ వాడకు చెందిన కనుగంటి పద్మ ఇటీవల ఓ దుకాణంలో నాలుగు తులాల బంగారం కొనుగోలు చేసింది. చోరీకి గురైన సొత్తుపై 70 శాతం రికవరీ ఉంటుందని పేపర్లో చదివింది. ఏదో రకంగా డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో కొడుకుతో దొంగ అవతారం ఎత్తించింది. తన వ్యూహంలో భాగంగా పద్మ పూసలగల్లీకి కొడుకుతోనే వాహనంపై వెళ్లింది. రోడ్డుపై ఎవరూ లేని చోట ఉండిపోగా, ముఖంపై కారం చల్లి మెడలో నుంచి గొలుసును దొంగ ఎత్తుకుపోయినట్లు విలపించింది. ఆమె మాటలను నమ్మి పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలు అదే రోజు వన్‌టౌన్‌లో ఫిర్యాదు చేసింది. సీసీ కెమెరాల ఆధారంగా దొంగతనానికి ఉపయోగించిన వాహనం యజమానిని పోలీసులు పట్టుకుని విచారించగా తన స్నేహితుడు విష్ణు సిద్దార్థకు ఇచ్చినట్లు తెలిపాడు. విష్ణును విచారించగా తన తల్లే తనతో దొంగతనం చేయించిందని చెప్పడంతో అసలు విషయం బయటపడింది. ఇన్సూరెన్సు డబ్బులకు ఆశపడి తానీ పథకం రచించినట్లు పద్మ అంగీకరించిందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో తల్లి, కొడుకుపై కేసు నమోదు చేసినట్లు ఎస్హెచ్ఓ నాగేశ్వర్రావు తెలిపారు. -
పెళ్లి ఇంట్లో బంగారం చోరీ
తిమ్మాజిపేట (నాగర్‌కర్నూల్): పెళ్లి కోసం తెచ్చి ఇంట్లో దాచిన బంగారం చోరీకి గురైంది. ఈ సంఘటన మండలంలోని కోడుపర్తిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి తన కుమారుడు రాందేవ్‌రెడ్డికి గురువారం జడ్చర్లలోని ఫంక్షన్ హాల్లో వివాహం జరిపించారు. అనంతరం కుటుంబ సభ్యులతో సహా సొంత గ్రామానికి వచ్చారు. గురువారం రాత్రి శ్రీనివాసరెడ్డి కూతురు కల్పన తన నగలతోపాటు అత్తగారి బంధువులకు సంబంధించిన నగలను సూట్‌కేస్ బ్యాగులో దాచి పెట్టి ఇంటిపైన నిద్రించారు. ఉదయం లేచి గదిలో చూడగా సూట్‌కేస్ బ్యాగును కోసి అందులోని 24 తులాల బంగారాన్ని గుర్తుతెలియని వ్యక్తులు అపహరించినట్లు గమనించారు. శుక్రవారం బంగారం చోరీకి గురైనట్లు తిమ్మాజిపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన ఎస్పీ కోడుపర్తిలో పెళ్లి ఇంట్లో 24 తులాల బంగారం అపహరణకు గురైనట్లు ఫిర్యాదు రావడంతో ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్ విచారణ చేపట్టారు. డీఎస్పీ లక్ష్మీనారాయణ, సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్ఐ శ్రీనివాసులుతో కలిసి గ్రామానికి వెళ్లి విచారణ చేశారు. బంగారు నగలు ఎలా అపహరణకు గురయ్యాయో ఫిర్యాదుదారు కల్పనను అడిగి తెలుసుకున్నారు. తన నగలతోపాటు బంధువుల నగలను సూట్‌కేసులో ఉంచి తాను మేడపైన నిద్రించినట్లు ఆమె పేర్కొన్నారు. ఉదయం లేచి చూసేసరికి నగలు లేవన్నారు. దీంతో ఎస్పీ గురువారం రాత్రి ఎవరెవరు ఇంట్లో తిరిగారు.. ఇంట్లో నిద్రించిన బంధువుల వివరాలు సీఐ చేత నమోదు చేయించుకున్నారు. ప్రాథమికంగా నగలు ఎవరు అపహరించింది గుర్తించలేదని, త్వరలో నగలు దొంగిలించిన వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తామని పోలీసులు తెలిపారు. -
బస్సులో బంగారం చోరీ
బచ్చన్నపేట: మండలంలోని అలింపూర్ గ్రామ సమీపంలో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికురాలు వద్ద 9 తులాల బంగారం చోరీ అయిన సంఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తులు, బాధితురాలి వివరాల ప్రకారం... సిద్ధిపేట జిల్లా చేర్యాల మండలం ముస్త్యాల గ్రామానికి చెందిన ఎనిశెట్టి ఉమారాణి ఉదయం జనగామలో జరిగే ఓ శుభకార్యానికి హాజరయ్యారు. అనంతరం తిరుగు ప్రయాణంలో తన వద్ద ఉన్న లాంగ్ చైన్, నక్లెస్, చిన్న చైన్లను ఓ కవర్లో పెట్టి తన వద్ద ఉన్న బ్యాగులో పెట్టానన్నారు. జనగామలో ఆర్టీసీ బస్సు ఎక్కి తిరుగు ప్రయాణంలో ముస్త్యాలకు వస్తుండగా ఇద్దరు మహిళలు మూతులకు గుడ్డలు కట్టుకొని బస్సు ఎక్కి తన పక్కనే కూర్చొని చేర్యాలకు టికెట్ తీసుకున్నారని చెప్పారు. కానీ వారు అలింపూర్ గ్రామం రాగానే దిగి పోయారని, వారు మధ్యలో ఎందుకు దిగారు ఎవరివైనా వస్తువులు పోయాయా.. చూసుకోండి అని కండక్టర్ అనడంతో బ్యాగులో చూసే సరికే బంగారం కవరు అగుపించలేదని, బస్సును ఆపి దిగి చూస్తే ఎవ్వరూ లేరని లబోదిబోమన్నారు. సినీ ఫక్కీలో చోరీ జరిగిందని, ఈ విషయమై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. -
మత్తుబిళ్లలిచ్చి.. ఏమార్చి
విజయవాడ: మత్తు బిళ్లలు ఇచ్చి బంగారం దొంగతనానికి పాల్పడే నిందితురాలని సీసీఎస్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఆమె నుంచి 112 గ్రాముల బంగారం ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నగరంలో ఒన్‌టౌన్ శివాలయం ఏరియాలో అనుమానాస్పదంగా తిరుగుతున్న మహిళను సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితురాలు గుంటూరు జిల్లా రాజాగారి తోటకు చెందిన పాతిన సురేఖ అలియాస్ బుజ్జి (33) విచారణలో తేలింది. టైలరింగ్ పని చేస్తున్న ఆమెకు ఇద్దరు పిల్లలు, భర్త ఉన్నారు. భార్యాభర్తలిద్దరికి పనులు దొరకడం లేదు. దీనికి తోడు తేలికంగా డబ్బు సంపాదించాలనే అతి ఆశతో 15 రోజుల క్రితం ఆమె విజయవాడకు చేరింది. విజయవాడ బస్టాండ్ వద్ద వృద్ధురాలిని మాటలు చెప్పి, ఆటో ఎక్కించుకుని బందర్ రోడ్డులో ఆయుర్వేద హాస్పిటల్‌కు తీసుకెళ్లింది. మంచి మందులు ఇప్పిస్తానని నమ్మబలికి తేనెలో కలిపిన మత్తు బిళ్లలు వృద్ధురాలితో మింగించింది. తరువాత బంగారం వస్తువులను అపహరించుకుపోయింది. ఈ క్రమంలో గవర్నర్‌పేట పోలీసుస్టేషన్లో నమోదైన కేసు మేరకు సీసీఎస్ పోలీసులు విచారణ జరిపి నిందితురాలిని అరెస్టు చేశారు. -
దొంగలను చూసి అవాక్కయిన పోలీసులు
ఘాజియాబాద్ : కాపలా ఉండాల్సిన కంచే చేనును మేస్తే ఎలా? దొంగతనాలు జరగకుండా చూడాల్సిన పోలీసులే దొంగతనం చేస్తే ప్రజలు పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఢిల్లీ ప్రజల భయం కూడా అదే. ఒక్క దొంగతనంతో కోటీశ్వర్లు అవుదామనుకున్న ఇద్దరు పోలీసులు కటకటాలపాలయ్యారు. మార్చి 18న ఢిల్లీలోని ఓ జ్యువెలరీ షాపులో జరిగిన సుమారు 9 కేజీల బంగారం దొంగతనాన్ని ఉత్తర ప్రదేశ్ పోలీసులు ఛేదించారు. నిందుతులను చూసిన పోలీసులు అవాక్కయ్యారు. ఎందుకంటే వారు ఢిల్లీకి చెందిన అసిస్టెంట్ సబ్ ఇన్స్సెక్టర్లు సతేంద్ర సింగ్, బ్రహ్మ్ పాల్లు. వీరి దగ్గర్నుంచి 6 కేజీల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరికి సహకరించిన మరో నిందుతుడు మీరట్‌కు చెందిన శైలేంద్ర యాదవ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పదేళ్ల క్రితం జరిగిన ఓ దొంగతనం కూడా వీరే చేసారని పోలీసుల విచారణలో తేలింది. -
నగల తయారీ కేంద్రంలో బంగారం దోపీడి
-
అర్జెంటుగా కాల్ చేయాలి.. మొబైల్ ఇస్తావా అంటూ!
సాక్షి, హైదరాబాద్ : అర్జెంటుగా ఓ ఫోన్ కాల్ చేయాలి.. మొబైల్ ఇస్తావా అంటూ.. నంబరు ప్లేట్ లేని బైకుపై హెల్మెట్లు ధరించి వచ్చిన ఇద్దరు ఆగంతకులు ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌పై దాడి చేసి అతని వద్ద ఉన్న బంగారం లాక్కెళ్లిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సౌత్ లాలాగూడకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ సంతోష్‌కుమార్ బుధవారం తెల్లవారు జామున 1.30 గంటల ప్రాంతంలో విధులు ముగించుకొని బైక్‌పై తన స్నేహితుడిని కలిసేందుకు బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని ఇందిరానగర్‌కు వెళ్తూ మీల్స్ పార్శిల్ తీసుకొనేందుకు హోటల్ కోసం గాలిస్తున్నాడు. హోటల్ సుఖ్‌సాగర్ మూసి ఉండటంతో సమీపంలో మరో హోటల్‌కు వెళ్లేందుకు బైకు స్టార్ట్ చేస్తుండగా అక్కడికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు అర్జంటుగా ఫోన్ కాల్ చేసుకోవాలి, మొబైల్ ఇవ్వవా అంటూ అడుగుతూనే మరోవైపు వెనకాల కూర్చున్న వ్యక్తి అతడి చేతికున్న బ్రాస్లెట్‌తోపాటు మెడలో రెండు బంగారు గొలుసులు, మొబైల్ లాక్కున్నాడు. అడ్డుకొనేందుకు సంతోష్‌కుమార్ యత్నించగా మెడపట్టి కిందకు తోయడంతో అతడికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఘటనా స్థలంలో సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
అనంతలో దోపిడీ దొంగలు బీభత్సం
-
అనంతలో దోపిడీ దొంగలు బీభత్సం
సాక్షి, గుత్తి : అనంతపురం జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. తన ఇంట్లో చోరీకి పాల్పడ్డ దొంగలను అడ్డుకునే క్రమంలో ఇంటి యజమాని ప్రాణాలు కోల్పోయారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. జిల్లాలోని గుత్తి కుమ్మరవీధిలోని ఓ ఇంట్లో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించారు. ఇంట్లో బీరువాలు, లాకర్లు వెతుకుండగా ఇది గమనించిన ఇంటి యజమాని దొంగలను అడ్డుకున్నారు. కానీ దోపిడీ దొంగలు యజమానికి హత్యచేసి 25 తులాల బంగారం, రూ. 5లక్షల నగదుతో ఉడాయించారు. స్థానికుల నుంచి సమచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. -
పంజాగుట్టలో భారీ చోరీ
వెండి, బంగారం, రూ.4 లక్షల నగదు అపహరణ హైదరాబాద్: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. నవీన్ నగర్‌కు చెందిన జితేందర్ అనే వ్యక్తి బంధువుల ఇంట్లో వివాహానికి హాజరయ్యేందుకు కుటుంబంతో వెళ్లారు. తిరిగి వచ్చేసరికి ఇంట్లో చోరీ జరిగినట్లు గమనించారు. కిలోన్నర బంగారం, 7 కిలోల వెండి, రూ.4 లక్షల నగదు అపహరణకు గురైనట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
కళ్లలో కారం కొట్టి.. బంగారం దోపిడీ
కోయంబత్తూర్ : బంగారు ఆభరణాలు తయారుదారుని కళ్లలో కారం చల్లి కేజీ బంగారం దోచుకుపోయారు గుర్తు తెలియని దుండగులు. ఈ ఘటన కోయంబత్తూర్‌లో చోటుచేసుకుంది. స్థానిక కెంపట్టి కాలనీలోని ఓ నగల తయారీలో దుకాణంలోకి శనివారం ఉదయం నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించారు. ఆ సమయంలో దుకాణంలో నాగరాజు అనే ఉద్యోగి ఉన్నాడు. దుండగులు అతన్ని పక్కకు నెట్టేసి బంగారాన్ని ఎతుకుపోయేందుకు యత్నించగా తీవ్రంగా ప్రతిఘటించాడు. దీంతో దుండగులు నాగరాజును తీవ్రంగా కొట్టి, కళ్లలో కారం చల్లారు. అనంతరం కిలో బంగారాన్ని, ఆభరణాలను మూట కట్టుకుని ఉడాయించారు. అనంతరం మరో ఉద్యోగి శరవణకుమార్ అక్కడికి చేరుకుని పరిస్థితిని యజమానికి వివరించాడు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయటంతో వారు డాగ్‌స్క్వాడ్‌తో సంఘటన స్థలిని పరిశీలించారు. సీసీ ఫుటేజి ఆధారంగా దుండగులను గుర్తించేందుకు యత్నిస్తున్నారు. -
జగిత్యాలలో 15 తులాల బంగారం చోరీ
జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల సమీపంలో దొంగలు హల్చల్ చేశారు. స్ధానికంగా నివాసం ఉంటున్న రాచర్ల మహేష్ అనే వ్యక్తి ఇంట్లో శనివారం వేకువజామున దొంగలుపడి 15 తులాల బంగారు ఆభరణాలు, ఒక ల్యాప్‌టాప్ దోచుకెళ్ళారు. ఉక్కపోత కారణంగా కుటుంబసభ్యులు డాబాపై నిద్రిస్తుండగా ఇంటి కిటికీ ఊచలు తొలగించి లోనికి జొరబడిన దొంగలు బీరువాలోని 15 తులాల బంగారు నగలు, ల్యాప్‌టాప్ దోచుకెళ్లారు. ఉదయం లేస్తూనే చోరీ జరిగిన విషయం గమనించిన మహేష్ జగత్యాల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చోరీ ఇంటిని పరిశీలించిన పోలీసులు దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
కారు ఆపి.. నిండా ముంచింది!
కూకట్పల్లి: కూకట్పల్లి వివేకానందనగర్ ఎస్ మార్ట్ సమీపంలో ఓ వ్యాపారి దృష్టి మరల్చి కోటి రూపాయల విలువైన బంగారం ఎత్తుకెళ్లిందో మాయ ‘లేడి’. వివరాలు.. అభిషేక్ అగర్వాల్ అనే వ్యాపారి ఆదివారం రాత్రి చందానగర్ నుండి బషీరాబాగ్‌కు మూడున్నర కిలోల బంగారు నగలు తీసుకుని కారులో వెళ్తున్నాడు. మార్గం మధ్యలో కూకట్‌పల్లిలో మెయిన్ రోడ్డుపై ఏఎస్‌రాజు కాలనీ కమాన్ వద్ద ఓ మహిళ వచ్చి కారు పంక్చర్ అయిందని చెప్పింది. దీంతో వ్యాపారి కిందకు దిగగానే కారులో బంగారం ఉన్న బ్యాగ్‌ను తీసుకుని ఆమె ఉడాయించింది. వ్యాపారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా ఘటన జరిగిన సమయంలో ఓ మహిళ ఉన్నట్లు గుర్తించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆర్మీ కల్నల్ నయ్యర్ ఇంట్లో చోరీ
-
హిజ్రాభవన్లో 2 కిలోల బంగారం, నగదు చోరీ!
⇒ చుడీబజార్‌లో పట్టపగలే దోపిడీ ⇒ లబోదిబోమంటున్న హిజ్రాలు హైదరాబాద్: పెళ్లిళ్లు... పేరంటాలు... దుకాణాలు తిరిగి హిజ్రాలు కూడబెట్టుకున్న సొత్తును దుండగులు దోచుకెళ్లారు. పట్టపగలే చుడీబజార్లోని హిజ్రా భవన్‌లోకి చొరబడి దాదాపు రెండు కిలోల బంగారం, పెద్దమొత్తంలో నగదు ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. నగరంలోని 25 మంది హిజ్రాలు తాము రోజూ సంపాదించే డబ్బులు, బంగారం హిజ్రాభవన్లో నివసించే వారి నాయకురాలు జ్యోతినాయక్ (చౌదరి) వద్ద దాచుకుంటారు. ఈ భవనంలో కొందరు హిజ్రాలు కూడా నివాసముంటున్నారు. వీరు దాచుకున్న సొత్తుపై కన్నేసిన దుండగులు... భవనంలో ఎవరూ లేని సమయం చూసి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువాలు, పెట్టెలు, కప్‌బోర్డుల్లో ఉన్న బంగారు ఆభరణాలు, నగదు దోచుకుని ఉడాయించారు. ఈ మేరకు హిజ్రాలు షాహినాయత్‌గంజ్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. తాము కష్టపడి దాచుకున్నదంతా దోచుకెళ్లారంటా లబోదిబోమన్నారు. గోషామహల్ ఏసీపీ రాంభూపాల్‌రావు, ఇన్స్పెక్టర్ రవీందర్‌రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. అంతా అయోమయం... ఈ ఘటనలో ఎంత బంగారం చోరీ అయిందన్నది హిజ్రాలు ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెబుతున్నారు. ముందు 5కిలోల బంగారం, రూ.50 లక్షల నగదు పోయిందని ఫిర్యాదు చేశారు. పోలీసులు సోదా చేస్తున్న క్రమంలో 2 కిలోల బంగారం దోచుకెళ్లారన్నారు. వివరాలు సేకరిస్తున్నాం... చోరీకి గురైన బంగారంలో అసలెంతో... నకిలీ ఎంతో గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. హిజ్రాభవన్ను పరిశీలించిన ఆయన... హిజ్రాలు రోజూ తిరుగుతూ జమ చేసుకునే ఆభరణాలు చోరీకి గురికావడం విచారకరమన్నారు. సీసీ కెమెరాల ద్వారా దొంగలను పట్టుకుని, సొత్తును వారికి అప్పగిస్తామన్నారు. వాస్తవంగా ఎంత బంగారం, నగదు చోరీ అయ్యాయో లెక్క తేలాల్సి ఉందన్నారు. -
యజమానికి టోకరా.. ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్: యజమాని ఇంట్లో చోరీకి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన గణేశ్, దీపేన్కా అనే ఇద్దరు బతుకుదెరువు కోసం నగరానికి వచ్చారు. నాగోల్ లోని బండ్లగూడకు చెందిన అష్టో అనే నగల తయారీదారుని కలిసి తమకు పని ఇవ్వాలని అడిగారు. అందుకు సరేనన్న అష్టో.. ఆ ఇద్దరికీ తన దుకాణంలోనే పని కల్పించాడు. యజమానితో నమ్మకంగా ఉంటూ ఆ ఇద్దరూ అదను చూసుకుని ఇటీవల అరకిలో బంగారు ఆభరణాలతో ఉడాయించారు. దీనిపై అష్టో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఒడిశా వెళ్లి ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకుని, అక్కడి కోర్టు అనుమతితో శనివారం హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. వారి నుంచి 537 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు పంపినట్లు ఎల్బీనగర్ పోలీసులు తెలిపారు. -
ఎక్స్‌ప్రెస్ రైలులో బంగారం చోరీ కలకలం
హైదరాబాద్: నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ రైలులో బంగారం చోరీ ఘటన కొద్దిసేపు కలకలం రేపింది. ఏసీ భోగీలో ప్రయాణిస్తున్న మదన్ అనే ప్రయాణికుడు తన బ్యాగులో బంగారం చోరీకి గురయిందని చెప్పాడు. తన బ్యాగ్‌లో దాచిన అరకేజీ బంగారు ఆభరణాలను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. రైలు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు వచ్చిన వెంటనే లగేజీ సరిచూసుకున్న మదన్ ఏదో జరిగిందని అనుమానపడ్డాడు. బ్యాగులో వెతకగా బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయని గుర్తించిన వెంటనే బాధితుడు సికింద్రాబాద్ రైల్వే పోలీస్ లకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీసుల అదుపులో ‘ముత్తూట్’ దొంగలు!
♦ వాడీ నుంచి ముంబై వెళుతుండగా ఇద్దరిని పట్టుకున్నట్టు సమాచారం ♦ సర్దార్జీతో పాటు మరో ముగ్గురి కోసం ముంబైలో ప్రత్యేక బృందాల గాలింపు ♦ నాలుగుసార్లు రెక్కీ, ఐదోసారి దోపిడీ చేసినట్టుగా నిర్ధారణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముత్తూట్ ఫైనాన్స్ సంస్థ దోపిడీ కేసులో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. సర్దార్జీతోపాటు మరో ముగ్గురి వద్ద భారీ మొత్తంలో బంగారం ఉండటంతో వారి ప్రతి కదలికపై పోలీసులు ప్రత్యేక నిఘాను ఉంచినట్టు సమాచారం. సర్దార్ జీ వేషధారణలో ఉన్న ప్రధాన నిందితుడు, మిగత వారు పాత నేరస్తులు కావడంతో వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ముంబైలో గాలిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే కర్ణాటకలోని వాడీలోని వారి స్థావరాల్లో ముత్తూట్‌లో దోపిడీకి ఉపయోగించిన స్కార్పియో, బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ‘వాడీ’ కేంద్రంగానే దోపిడీకి స్కెచ్.. డిసెంబర్ 23 నుంచి 25 వరకు ఆరుగురు నిందితుల కదలికలను తెలుసుకునేందుకు 35 సీసీ టీవీ కెమెరా ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. దోపిడీ తర్వాత రాష్ట్ర సరిహద్దులు దాటేలోపు బైక్, స్కార్పియోలు రెండు సార్లు కలుసుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఏ మార్గంలో వెళితే బాగుంటుందని రెక్కీ చేసుకుని దోపిడీ తర్వాత అదే మార్గంలో వాడీ వెళ్లినట్టుగా గుర్తించారు. ఈ ఆరుగురు అంతర్రాష్ట్ర నేరగాళ్లే అని, జైలులోనే కలసి ఈ దోపిడీకి స్కెచ్ వేసి ఉంటారని సీపీ సందీప్ శాండిల్యా అనుమానం వ్యక్తం చేశారు. దోపిడీ చేయడానికి ముందు మహారాష్ట్ర(ఎంహెచ్) రిజిస్ట్రేషన్‌తో కూడిన నంబర్ ప్లేట్‌ను స్కార్పియోకు వినియోగించారు. పరిగి బస్టాండ్‌లో బైక్‌ను పార్క్ చేసిన సమయం లో కర్ణాటక రిజిస్ట్రేషన్‌తో కూడిన నంబర్ ప్లేట్‌ను వాడారు. నేరం జరిగే రోజుకు ఘటనాస్థలికి 5 కిలోమీటర్ల ముందు తమ బండి నంబర్ ప్లేట్‌ను ఏపీకి మార్చారు. రెక్కీ తీరు ఇలా.. డిసెంబర్ 14: ఏపీ23ఎం3107 నంబర్ గల స్కార్పియో బీరంగూడలో చక్కర్లు డిసెంబర్ 23: ఉదయం 5 గంటలకు వాడీ నుంచి స్కార్పియోలో సర్దార్జీ గ్యాంగ్ ప్రయాణం. ఉదయం 9 గంటలకు బీరంగూడ ముత్తూట్ కార్యాలయానికి చేరిక. ఇద్దరు వ్యక్తులు లోనికి వెళ్లి బంగారంపై ఎంత రుణం ఇస్తారని ఆరా. రాత్రి బీరంగూడకు సమీపంలోని ఓ దాబాలో ఆశ్రయం డిసెంబర్ 24: మళ్లీ ఉదయం 9 గంటలకు బీరంగూడ ముత్తూట్ కార్యాలయానికి చేరిక. మరో ఇద్దరు వ్యక్తులు వెళ్లి బంగారంపై రుణం ఆరా. సిబ్బంది ఎంత మందనే దానిపై దృష్టి. ద్విచక్ర వాహనాన్ని పరిగి బస్టాండ్‌లో పార్క్ చేసి స్కార్పియోలో వాడీకి ప్రయాణం డిసెంబర్ 26: బీరంగూడ నుంచి దోపిడీ చేశాక పోలీసుల కంట పడకండా ఏయే మార్గాల్లో తప్పించుకోవచ్చనే దానిపై చక్కర్లు. బైక్ మళ్లీ పరిగి బస్టాండ్‌లోనే పార్కింగ్. వాడీకి ప్రయాణం దోపిడీ అమలు చేసిందిలా.. డిసెంబర్ 27: ఉదయం 5 గంటలకు వాడీ నుంచి స్కార్పియోలో ఆరుగురి రాక. పరిగి బస్టాండ్‌కు చేరుకున్నాక ఇద్దరు దిగి బైక్‌ను తీసుకుని పైలట్‌గా స్కార్పియో ముందు బయలుదేరారు. సైబరాబాద్ కమిషనరేట్ సరిహద్దులోకి ప్రవేశించే సమయంలో పెట్రోలింగ్ వాహనాన్ని చూసి దోపిడీ ప్లాన్ విరమణ. బీరంగూడకు పది కిలోమీటర్ల దూరంలోని దాబాలో రాత్రి బస చేశారు. డిసెంబర్ 28: ఉదయం 8 గంటలకు బైక్‌పై ఇద్దరు వ్యక్తులు బీరంగూడ వరకు చక్కర్లు. ఆ తర్వాత స్కార్పియోలో ముత్తూట్ కార్యాలయానికి చేరుకుని 9 నుంచి 9.30 గంట మధ్యలో 46 తులాల బంగారం దోపిడీ. 9.30 నుంచి 9.40 వరకు దోపిడీ జరిగిన ప్రాంతం నుంచి 2 కిలోమీటర్ల వరకు స్కార్పియో ముందు బైక్ పైలటింగ్. వాడీలోని స్థావరంలో వాహనాలు వదిలేసి రైలులో ముంబైకి పరారీ. ఈ క్రమంలోనే ఇద్దరి అరెస్ట్. -
ముత్తూట్ ఫైనాన్స్ దొంగలు దొరికారు
-
ముత్తూట్ దొంగలు దొరికారు
హైదరాబాద్: కలకలం సృష్టించిన ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ కేసు వీడింది. దోపిడీ దారులను నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకలోని గుల్బర్గాలో నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. సంగారెడ్డి జిల్లా బీరంగూడలోని ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలోకి సీబీఐ అధికారులమంటూ వచ్చి పట్టపగలే ఆరుగురు దుండగులు భారీ దోపిడీ చేసిన విషయం తెలిసిందే. 13 కోట్ల రూపాయల విలువ చేసే 46 కేజీల బంగారాన్ని దోచుకెళ్లారు. సీబీఐ అధికారులమని చెప్పి లోపలికి ప్రవేశించిన దుండగులు ఉద్యోగులను మారణాయుధాలతో బెదిరించి ఈ దోపిడీకి పాల్పడ్డారు. (చదవండి.. ముత్తూట్‌లో ఘరానా దోపిడీ) దుండగులు నలుపు రంగు స్కార్పియో కారులో వచ్చారని, ఇద్దరు వ్యక్తుల చేతుల్లో తుపాకులు ఉన్నట్టు సిబ్బంది ఆ సమయంలో వివరాలు ఇచ్చారు. తమను గుర్తుపట్టకుండా సీసీ కెమెరాలను కూడా దొంగలు ధ్వంసం చేశారు. అయితే, అదే రోజు సాయంత్రంలోగా వారు వెళుతున్న వాహనం ఆధారాలు గుర్తించిన పోలీసులు అనంతరం వారి ఊహాచిత్రాలు కూడా విడుదల చేసి గాలింపు చర్యలు మొదలుపెట్టారు. వారిని తాజాగా కర్ణాటకలోని గుల్బార్గాలో అదుపులోకి తీసుకొని ఆ ముఠా మొత్తాన్ని హైదరాబాద్‌కు తరలించారు. వీరిని ప్రస్తుతం సైబరాబాద్ సీపీ సందీప్ శాండిల్య విచారిస్తున్నారు. -
పట్టిచ్చిన ఐడియా
దొంగ బంగారం కరిగించి జల్సాలు కరిగించిన వ్యాపారిని బెదిరించి రూ.లక్షలు స్వాహా పోలీసు పార్టీ పేరు చెప్పి బెదిరింపులు పిఠాపురం : ఒక యువకుడి దొంగ ఆలోచన పోలీసుల మతిపోగొట్టింది. ఐడీ పార్టీ పేరుతో వ్యాపారిని బెదిరించి రూ.2 లక్షలు స్వాహా చేయడమే కాకుండా మరిన్ని వసూళ్లకు యత్నించాడు. చెడు అలవాట్లకు బానిసైన ఆయువకుడు రూ.2 వేల నోట్లు మారుస్తూ పేకాడుతూ, జల్సాలు చేస్తూ తోటివారిలో చర్చనీయాంశమయ్యాడు. ఆ నోటా ఈ నోటా సమాచారం పోలీసులకు చేరడంతో వారు రంగంలోకి దిగారు. వివరాలు ఇలా ఉన్నాయి. పిఠాపురానికి చెందిన ఆయువకుడు నాలుగు నెలల క్రితం ఎక్కడ నుంచో కొంత బంగారం తెచ్చి స్థానిక గోల్డు మార్కెట్ వీధిలోని వ్యాపారి వద్ద కరిగించాడు. ఆ ముద్దను విక్రయించగా వచ్చిన సొమ్ముతో జల్సాలు చేస్తున్నాడు. సొమ్ము పూర్తి కాగానే మళ్లీ బంగారం కరిగించే వ్యాపారి వద్దకు వెళ్లి తాను తెచ్చిన బంగారం దొంగదని, ఈ విషయం పోలీసులకు తెలిసిపోయిందని, రాజమండ్రి నుంచి ఐడీ పార్టీ పోలీసులు వచ్చారని వారికి డబ్బులు ఇవ్వకపోతే ఇద్దరం జైలుకు పోతామని బెదిరించాడు. దీంతో కంగారు పడ్డ సదరు వ్యాపారి రూ.2 లక్షలు ఆయువకుడికి ఇచ్చి పోలీసులకు సర్దిచెప్పమని కోరాడు. ఆ డబ్బును సైతం ఖర్చుచేసి మళ్లీ వ్యాపారి వద్దకు వెళ్లి గతంలోలాగే బెదిరించాడు. దీంతో ఆ వ్యాపారి ససేమిరా అనడంతో ఇద్దరి మధ్యా గలాటా జరిగింది. ఈ విషయం పోలీసుల వరకూ చేరింది. వారు వ్యాపారిని ప్రశ్నించి యువకుడి వివరాలు తెలుసుకుని అదుపులోకి తీసుకున్నారు. యువకుడు తీసుకువచ్చిన బంగారంపైనా, దాన్ని కరిగించిన వ్యాపారిపైనా దర్యాప్తు చేస్తున్నారు. పట్టణ ఎస్సై కోటేశ్వరరావును ప్రశ్నించగా కేసు దర్యాప్తు చేస్తున్నామని, పోలీసుల పేరుతో డబ్బులు వసూలు చేయడంపై విచారణ జరుపుతున్నామన్నారు. -
ప్రియుడితో కలిసి దోపిడీ
ఇద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు రూ.35 లక్షల సొత్తు స్వాధీనం పోలీస్ అధికారులకు ఐజీ ప్రశంసలు నెల్లూరు (క్రైమ్) : తన ప్రియుడితో కలిసి ఒకట్నిర కేజీల బంగారు ఆభణాలను దోపిడీ చేసిన ఘటనలో ఆమెతో పాటు అతన్ని నగర డీఎస్పీ జి. వెంకటరాముడు ఆధ్వర్యంలో ఒకటో నగర పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.35 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు ఉమేష్‌చంద్ర మెమోరియల్ కాన్ఫరెన్స్ హాలులో విలేకరుల సమావేశంలో గుంటూరు రేంజ్ ఐజీ ఎన్.సంజయ్ నిందితుల వివరాలను వెల్లడించారు. నెల్లూరు నగరంలోని శిఖరంవారి వీధిలో ఈ నెల 4వ తేదీ సాయంత్రం రంజిత్‌జైన్ ఇంట్లో సుమారు 1500 గ్రాముల బంగారు ఆభరణాలను ఓ యువకుడు దోచుకెళ్లిన ఘటన తెలిసిందే. ఈ సంఘటన నగరంలో కలకలం రేకెత్తించింది. సంఘటనా స్థలాన్ని నగర డీఎస్పీ జి. వెంకటరాముడు, ఒకటో నగర ఇన్చార్జి ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి పరిశీలించారు. సంఘటన జరిగిన తీరు, రంజిత్ జైన్ భార్య పూజ చెబుతున్న వివరాలు పొంతనలేకపోవడంతో పోలీసు అధికారులకు అనుమానం వచ్చింది. రంజిత్‌జైన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. డీఎస్పీ ఆధ్వర్యంలో ఒకటో నగర ఇన్స్పెక్టర్ ఎస్కే అబ్దుల్కరీం విచారణ వేగవంతం చేశారు. పూజ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో ఆ కోణంలో కేసు దర్యాప్తు చేపట్టారు. మిస్టరీ వీడింది ఇలా.. బాధితురాలి ప్రవర్తనపై ఆది నుంచి పోలీసులకు అనుమానం ఉంది. ఆమె గురించి లోతుగా విచారించారు. పూజ రెండు, మూడు సిమ్‌లను వాడుతుందని, రెండు రోజులకొకసారి రూ. 500 వరకు రీచార్జి చేయించుకునేదని తెలిసింది. దీంతో కాల్ డిటైల్స్‌ను సేకరించి దాని ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. రాజస్థాన్‌లోని ఇండోర్ సిల్వర్నగర్కు చెందిన రమీజ్షా అనే వ్యక్తికి అనేక సార్లు ఫోన్ చేసినట్లు, సంఘటన జరిగిన రోజు సైతం అనేక సార్లు ఫోన్ చేసినట్లు నిర్ధారించుకున్నారు. విచారణలో పలు విషయాలు వెలుగుచూశాయి. పూజది ఇండోర్. ఆమెకు రమీజ్షాతో వివాహేతర సంబంధం ఉంది. భర్త వద్ద నుంచి పారిపోయి వివాహం చేసుకోవాలని వారిద్దరు నిశ్చయించుకున్నారు. అదను కోసం చూస్తుండగా, శంకర్ 1,500 గ్రాముల బంగారాన్ని తమ ఇంట్లో పెట్టడాన్ని పూజ గమనించింది. ఆ బంగారాన్ని కాజేసి ప్రియుడితో పాటు ఉడాయించాలని నిశ్చయించుకుంది. రమీజ్షాకు ఫోన్ చేసి నెల్లూరుకు పిలిపించింది. అనంతరం ఇద్దరు కలిసి దోపిడీ పథక రచన చేశారు. మంగళవారం నెల్లూరు రైల్వేస్టేషన్ వద్ద పూజ, ఆమె ప్రియుడు రమీజ్షాను పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.35 లక్షలు విలువ చేసే 1,270 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సిబ్బందికి అభినందనలు రోజుల వ్యవధిలోనే దోపిడీ ఘటనను ఛేదించిన నగర డీఎస్పీ జి. వెంకటరాముడు, ఒకటో నగర ఇన్స్పెక్టర్ ఎస్కే అబ్దుల్కరీం, ఎస్ఐ పి. జిలానిబాషా, హెచ్‌సీలు రఫి, శ్రీనివాసులు, విజయకుమారి, కానిస్టేబుల్స్ పి. శ్రీనివాసులు, దేవకిరణ్, వేణు, వెంకటేశ్వర్లు, రాజు, రమేష్, రామారావు, సురేష్‌ను ఐజీ అభినందించి రివార్డులు ప్రకటించారు. ఈ సమావేశంలో ఎస్పీ విశాల్‌గున్నీ, ఏఎస్పీ బి. శరత్‌బాబు, నగర డీఎస్పీ జి. వెంకటరాముడు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
వేంపల్లెలో చోరీ
వేంపల్లే: తాళం వేసి ఉన్న దుకాణంలో దొంగలు పడి ఉన్నకాడికి ఊడ్చుకెళ్లారు. ఈ సంఘటన వైఎస్సార్ కడప జిల్లా వేంపల్లెలో శనివారం వెలుగుచూసింది. స్థానిక పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న రెడ్డయ్య దుకాణంలో దొంగలుపడి 4 బంగారు గాజులు, ఓ చైన్ రూ.10 వేల విలువ చేసే రిచార్జ్ కార్డులు ఎత్తుకెళ్లారు. దుకాణ యజమాని వైద్యం కోసం కేరళ వెళ్లాడు. శనివారం తిరిగొచ్చి చూసేసరికి చోరీ జరిగింది. విషయం తెలుసుకున్న ఎస్సై మధుమల్లేశ్వర్ రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
అతి భారీ గోల్డ్ స్మగ్లింగ్ గుట్టు రట్టు!
న్యూఢిల్లీ: దేశ చరిత్రలోనే అతిపెద్దదిగా భావిస్తోన్న బంగారం అక్రమరవాణా గుట్టు రట్టయింది. ఒకటికాదు రెండు కాదు రూ.2000 కోట్ల విలువ చేసే 7000 కేజీల బంగారాన్ని భూతల, ఆకాశమార్గంలో తరలించిన వైనాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు సోమవారం మీడియాకు వెల్లడించారు. ఆగ్నేయాసియా దేశం మయన్మార్ నుంచి భూతల మార్గం ద్వారా పెద్ద ఎత్తున బంగారాన్ని భారత్ లోకి అక్రమంగా రవాణా చేసే స్మగ్లర్లు.. గువాహటి ఎయిర్ పోర్టు నుంచి డొమెస్టిక్ కార్గో విమానాల ద్వారా రాజధాని ఢిల్లీ సహా ఇతర ప్రాంతాలకు బంగారాన్ని తరలించేవారని డీఆర్ఐ అధికారులు చెప్పారు. ఆ విధంగా ఇప్పటివరకు 617 దఫాలుగా 7 వేల కేజీల బంగారాన్ని భారత్ లోకి స్మగ్లింగ్ చేశారని, దాని విలువ రూ.2వేల కోట్ల వరకు ఉంటుందని వివరించారు. ఇప్పటివరకు ఛేధించినవాటిల్లో అతి భారీ దందా ఇదేనని తెలిపారు. గుట్టురట్టైందిలా.. కొద్ది రోజుల కిందట ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు డొమెస్టిక్ టెర్మినల్ లో తనిఖీలు నిర్వహించిన అధికారులు గొంకను కదల్చగా ఈ భారీ స్మగ్లింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గువాహటి నుంచి ఢిల్లీకి వచ్చిన కార్గో విమానంలో 'విలువైన సరుకు'లను తనిఖీ చేసిన అధికారులు రూ.3.1 కోట్ల విలువచేసే10 కేజీల బంగారాన్ని కనుగొన్నారు. 24 కేరెట్ల స్వచ్ఛమైన బంగారాన్ని ఇతర సరుకులు అక్రమంగా రవాణాచేశారు. కాగా, కార్గో రిజిస్ట్రేషన్ చిరునామాల ఆధారంగా గువాహటికి చెందిన ఓ వ్యారవేత్తను, ఢిల్లీలోని అతని అనుచరుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అక్రమ రవాణా వ్యవహారానికి సంబంధించి విస్తుపోయే విషయాలు బయటికొచ్చాయి. విమాన సిబ్బంది హస్తం? ఇంత భారీ స్థాయిలో గోల్డ్ స్మగ్లింగ్ జరుగుతున్నా విమానాశ్రయ, విమాన సిబ్బందికి ఇంతైనా అనుమానం రాకపోవడం ఆశ్చర్యంగా ఉన్నదని, ఈ వ్యవహారంలో సిబ్బంది ప్రమేయం కూడా ఉందని అనుమానిస్తున్నట్లు, ఆ మేరకు వారిని త్వరలోనే ప్రశ్నిస్తామని డీఆర్ఐ అధికారులు చెప్పారు. -
తాళం ఉన్నఇంట్లో 35 తులాల బంగారం చోరీ
చిక్కడపల్లి : తాళాలు పగులగొట్టి దొంగలు 35 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. చిక్కడపల్లి పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక శ్రీవెంక టేశ్వర గుడి సమీపంలోని సోప్ ఫ్యాక్టరీ లైన్లో ఉండే రాజేష్ కుటుంబ సభ్యులు బుధవారం మధ్యాహ్నం ఇంటికి తాళం వేసి బయటకు వె ళ్లారు. సాయంత్రం తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. బీ రువాలో ఉన్న 35 తులాల బంగారు నగలు, రూ 5 వేలు కని పించలేదు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇల్లు అద్దెకు కావాలని నగల దోపిడీ
లంగర్‌హౌస్: ఇల్లు అద్దెకు కావాలని వచ్చిన దుండగుడు వృద్ధురాలిపై హత్యాయత్నం చేసి.. 8 తులాల బంగారు నగలు ఎత్తుకెళ్లాడు. లంగర్‌హౌస్ ఇన్స్పెక్టర్ ఎంఎ జావీద్ కథనం ప్రకారం.. మారుతీనగర్‌లో ఉన్న మూడంతస్తుల భవనంలో భాగ్యమేరీ (63) తన కొడుకు, కోడలితో కలిసి ఉంటోంది. కింది ఫ్లోర్లో కొడుకు, పై ఫ్లోర్లో వృద్ధురాలు ఉంటున్నారు. ఈమె ఉండే ఫ్లోర్లో ఒక ఫ్లాట్ ఖాళీ ఉంది. బుధవారం ఓ వ్యక్తి (40) వచ్చి తనకు ఆ ఫ్లాట్ కావాలని భాగ్యమేరీతో అన్నాడు. ఫ్లాట్ చూసిన తర్వాత మంచినీళ్లు కావాలన్నాడు. నీళ్లు తెచ్చేందుకు ఇంట్లోకి వెళ్తున్న వృద్ధురాలిపై ఒక్కసారిగా దాడి చేసి కిందపడేసి పిడి గుద్దులు గుద్దాడు. మెడకు వైర్ బిగిస్తూ.. బంగారు గొలుసు, చెవి కమ్మలు, చేతికి ఉన్న నాలుగు గాజులు లాక్కొని పారిపోయాడు. స్పృహ తప్పి పడిపోయిన భాగ్యమేరీకి కొద్దిసేపటికి స్పృహ రావడంతో కిందకు వచ్చి తన కోడలికి వి షయం చెప్పింది. సమాచారం అందుకున్న డీసీపీ వెంకటేశ్వర్రావు, ఆసిఫ్‌నగర్ ఏసీపీ గౌస్ మొహినుద్దీన్ ఘటనా స్థలాన్ని పరిశీలించి క్లూస్‌టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. -
ఖమ్మం జిల్లాలో భారీ చోరీ
ఎర్రుపాలెం : ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం రాజులదేవరపాడులో చోరీ జరిగింది. గ్రామానికి చెందిన వేమిరెడ్డి పెద్ద శివారెడ్డి ఇంట్లో 13 కాసుల బంగారం చోరీకి గురైంది. శివారెడ్డి తన కుటుంబంతో కలసి ఈ నెల 4న తిరుపతి వెళ్లారు. బుధవారం సాయంత్రం ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో ఉన్న బీరువాని పరిశీలించి చూడగా 13 కాసుల బంగారం మాయమైంది. దీనిపై శివారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శివారెడ్డి కుటుంబసభ్యులు తిరుపతి కి వెళ్లినపుడు ఇంట్లో ఆయన అత్త ఒక్కరే ఉన్నారు. పోలీసులు ఆమెను ప్రశ్నించగా.. తనకు ఏమి తెలియదని, తాను బయటికి వెళ్లినపుడు చోరీ జరిగి ఉండవచ్చునేమోనని అనుమానం వ్యక్తం చేసింది. సంఘటనాస్థలాన్ని డీఎస్పీ రాంరెడ్డి, మధిర సీఐ వెంకటేశ్వరరావు పరిశీలించారు. డాగ్స్వాడ్ తో వివరాలు సేకరిస్తున్నారు. -
బ్యాంక్‌కు బురిడీ.. దర్యాప్తు కొరవడి
ఆకివీడు కార్పొరేషన్ బ్యాంక్‌లో బంగారం చోరీ వెనుక అనుమానాలెన్నో దొంగ చేతికి తాళాలు ఇచ్చిందెవరు తెరవెనుక ఉన్నదెవరు పోలీస్ దర్యాప్తు ముగించేశారెందుకో ఏలూరు : ఆకివీడు కార్పొరేషన్ బ్యాంక్‌లో 3 కేజీలకు పైగా బంగారు ఆభరణాలను మాయం చేసిన కేసులో ఎన్నో అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ఆ బ్యాంక్‌లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న అప్రైజర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు విషయంలో చేతులు దులిపేసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బ్యాంక్ లాకర్ తాళాలు కాంట్రాక్ట్ ఉద్యోగి అయిన అప్రైజర్‌కు ఎలా ఇస్తారు, అతడు పెద్దఎత్తున బంగారు ఆభరణాలను తీసుకుపోతుంటే ఎవరూ ఎందుకు పట్టించుకోలేదు, వేరొకరి సాయం లేకుండానే అప్రైజర్ ఇలా చేయగలడా, ఈ వ్యవహారం వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే అంశాలపై పోలీసులు దృష్టి పెట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. బ్యాంక్ అధికారుల ‘ఒత్తిళ్లు‘ పోలీసులపై బాగా పని చేశాయని, వారు తమ ఉద్యోగాలు కాపాడుకోవడానికి అప్రైజర్‌ను బలి పశువును చేశారన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. బ్యాంక్‌లో ఇంకా ఎవరికైనా సంబంధం ఉందా అన్న కోణంలో కూడా పరిశీలన జరుపుతామని ఎస్పీ భాస్కర్‌భూషణ్ ప్రకటించారు. అయితే, పూర్తిస్థాయిలో విచారణ జరపకుండా అప్రైజర్ అరెస్ట్‌ను అంత హడావుడిగా చూపాల్సిన అవసరం ఏమొచ్చిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోలీసుల కథనం ప్రకారం.. ఈనెల 6న కార్పొరేషన్ బ్యాంక్ ఆకివీడు బ్రాంచి మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ వ్యక్తిగత కారణాలతో సెలవు పెట్టారు. దీంతో క్షేత్రస్థాయి అధికారి కల్యాణ్ ఆనంద్‌కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఇతను కొత్తగా చేరాడని పోలీసులు చెబుతున్నారు. కోట్లాది రూపాయల టర్నోవర్ జరిగే బ్యాంక్‌లో బ్రాంచి మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ ఒకేరోజు సెలవు పెట్టడం, అదే రోజున బంగారం పోవడం అనుమానాలకు తావిస్తోంది. పమిడి లక్ష్మీనారాయణ అనే ఖాతాదారుడు తాను తనఖా పెట్టిన నగలు విడిపించుకునేందుకు వచ్చిన సమయంలో లాకర్ తాళాలను బ్యాంక్ ఇన్చార్జి అప్రైజర్‌కు ఎలా ఇచ్చాడనే దానికి సమాధానం లేదు. అప్రైజర్ బ్యాంక్ మేనేజర్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్నందునే అతనిపై నమ్మకంతో బ్యాంక్ తాళాలు ఇచ్చినట్టు సిబ్బంది చెబుతున్నారు. దీనిని అలుసుగా తీసుకుని నగలు చోరీ చేశాడనేది పోలీసుల కథనం. బ్యాంక్ ఉద్యోగికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించిన తర్వాత.. తిరిగి బాధ్యతలు తీసుకునే సమయంలో అన్ని వస్తువులు, నగదు సక్రమంగా ఉన్నాయా అన్నది పరిశీలించాల్సిన బాధ్యత బ్యాంక్ మేనేజర్ లేదా అసిస్టెంట్ మేనేజర్‌పై ఉంటుంది. అయితే 14 రోజుల తర్వాత మరో బ్యాంక్ ఖాతాదారుడు వచ్చి తనఖా పెట్టిన బంగారం తీసుకునే వరకూ బ్యాంక్‌లోని నగలు మాయమయ్యాయనే విషయాన్ని ఎందుకు గుర్తించలేకపోయారన్నది ప్రశ్నార్థకంగా మారింది. బ్యాంక్‌లో పైస్థాయి ఉగ్యోగులు ఇటీవల ఏలూరుతోపాటు పలు నగరాల్లో ఆస్తులు కొనుగోలు చేసినట్టు సమాచారం. కార్పొరేషన్ బ్యాంక్‌లో వ్యవహారాలన్నీ అప్రైజరే చక్కదిద్దేవారని, ఈ కారణంగానే కొత్తగా విధుల్లో చేరిన ఉద్యోగులు అతడు చెప్పినట్టు చేయాల్సి వచ్చిందనేది మరో వాదన. ఈ వ్యవహారం బయటకి పొక్కడంతో ఆకివీడు బ్రాంచి మేనేజర్ ఫిర్యాదు చేయడానికి సిద్ధపడినా వద్దని, అతనిపై అనుమానంతో విజయవాడ జోనల్ కార్యాలయం నుంచి వచ్చిన చీఫ్ మేనేజర్ బాలాజీరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పరిణామాలతో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, అప్రైజర్పైనే నెపం మోపి మిగిలిన వారిని కాపాడారనే విమర్శలు వినిపిస్తున్నాయి. బ్యాంక్ అధికారుల సహకారం లేకుండా స్ట్రాంగ్ రూమ్ తాళాలు అప్రైజర్‌కు ఎలా అందుతాయని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. బ్యాంక్‌లో అప్రైజర్ తల్లి పేరున లాకర్ ఉందని, ఆ లాకర్ తెరవడానికి వచ్చినపుడు అప్రైజర్ కూడా లోపలకు వె ళ్లి బంగారు ఆభరణాలను తన లాకర్లోకి మార్చుకుని, తర్వాత బయటకు తీసుకువెళ్లాడనే ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు. బ్యాంక్‌లో విలువైన దస్తావేజులు కూడా కనిపించడం లేదన్న ప్రచారం సాగుతోంది. దీనిపై బ్యాంక్ అధికారులు స్పందించడం లేదు. ఇప్పటికైనా పోలీసులు పూర్తిస్థాయిలో ఈ వ్యవహారంపై దృష్టి పెట్టి ఇంటి దొంగల పనిపట్టాలని బ్యాంక్ ఖాతాదారులు కోరుతున్నారు. -
ఆకివీడులో బంగారం మాయం కేసు ఛేదించిన పోలీసులు
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులోని కార్పొరేషన్ బ్యాంకు లాకర్లలో మాయమైన బంగారం కేసును పోలీసులు ఛేదించారు. సదరు బ్యాంకులో పని చేసే అప్రైజర్ ప్రసాద్ ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అతడిని భీమవరం పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి దాదాపు రూ. 90 లక్షలు విలువ చేసే మూడు కేజీల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
యజమాని కళ్లుగప్పి బంగారం చోరీ
హైదరాబాద్: నగంరలోని సంతోష్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చంద్రా జ్యువెల్లరీ దుకాణంలో శుక్రవారం చోరీ జరిగింది. ఓ వ్యక్తి నగల షాపు యజమాని దృష్టి మరల్చి బంగారు గొలుసును తస్కరించాడు. చోరీ చేసిన బంగారు గొలుసు స్థానంలో బంగారుపూత పూసిన మరో చైన్‌ను అక్కడ ఉంచాడు. అనంతరం అక్కడి నుంచి పలాయనం చిత్తగించాడు. సదరు వ్యక్తి వెళ్లిపోయిన తర్వాత నగల దుకాణం యజమాని విషయం తెలుసుకుని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా చోరీకి పాల్పడిన వ్యక్తి గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
అడ్రస్ కావాలంటూ వచ్చి భారీ చోరీ..
రైల్వేకోడూరు: వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు పట్టణంలోని కృష్ణనగర్‌కు చెందిన ప్రవీణ అనే మహిళ ఇంటిముందు వరండాలో ఉండగా ఒక వ్యక్తి అడ్రస్ అడిగేందుకు వచ్చి ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లాడు. కుటుంబసభ్యులు దుండగుడ్ని వెంబడించినా కొద్దిదూరం వెళ్లిన తర్వాత అక్కడ రెడీగా ఉన్న బైక్‌పై ఉడాయించాడు. 150 గ్రాముల బంగారు గొలుసు లాక్కెళ్లాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దుండగుడి కోసం గాలిస్తున్నారు. బంగారు గొలుసు ధర సుమారు ప్రీ ప్లాన్ గా ఈ చోరీ జరిగి ఉండొచ్చునని పోలీసులు భావిస్తున్నారు. -
బంగారానికి మెరుగుపెడతామని..
ముప్పాళ్ల : బంగారానికి మెరుగుపెడతామని చెప్పి బంగారం దోచుకున్న సంఘటన గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం తురకపాలెంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఇద్దరు గుర్తు తెలియని దుండగులు వచ్చి బంగారం మెరుగు పెడతామనడంతో తన దగ్గర ఉన్న 8 సవర్ల బంగారాన్ని ఇచ్చానని..చూసుకునే లోపలే దుండగులు పరారైనట్టు బాధితురాలు సరసమ్మ తెలిపింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు ముప్పాళ్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
వ్యాపారి ఇంట్లో భారీ చోరీ
శంకర్పల్లి : రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో ఓ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జరిగింది. శంకర్‌పల్లిలో నివాసం ఉంటున్న అరుదేష్ అనే వ్యాపారి కుటుంబంతో కలిసి మూడు రోజుల క్రితం వేరే గ్రామానికి వెళ్లాడు. బుధవారం రాత్రి ఇంటికి వచ్చి చూడగా తలుపులు పగులగొట్టి ఉన్నాయి. ఇంట్లో బీరువాలో పెట్టిన 85 తులాల బంగారు, 5లక్షల రూపాయల నగదు చోరీ జరిగిందని గమనించాడు. ఈ విషయంపై శంకర్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మిస్టరీగానే ఆ స్నాచింగ్స్!
సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్): మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన ముర్తుజా నేతృత్వం లోని గ్యాంగ్‌ను అక్కడి పోలీసులు పట్టుకున్నారు... సెప్టెంబర్ 27, 29 తేదీల్లో జంట కమిషనరేట్లలో జరిగిన వరుస స్నాచింగ్స్ వీరి పనేనని తేలింది... అయితే ఫిల్మ్‌నగర్ పరిధిలో చోటు చేసుకున్న రెండు వరుస స్నాచింగ్స్తో ఈ ముఠాకు సంబంధంలేదని వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనల్లో మాజీ మంత్రి బంధువు ఒకరు బాధితురాలు కావడంతో నగర పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. సెప్టెంబర్ 29 ఉదయం ఎస్సార్‌నగర్, చిక్కడపల్లి, కూకట్పల్లి, కేపీహెచ్‌బీ, సనత్‌నగర్ ఠాణాలతో పాటు జూబ్లీహిల్స్ ఠాణా పరిధిలోనూ స్నాచింగ్స్ జరిగాయి. భోపాల్ పోలీసు ల అదుపులో ఉన్న ముర్తుజా గ్యాంగ్‌ను నగర పోలీసు బృందం విచారించగా ఫిల్మ్‌నగర్‌లో మినహా మిగిలిన స్నాచింగ్స్ తామే చేశామని అంగీకరించారు. సాంకేతిక ఆధారాలు కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి. మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు అత్త సత్యవతి ఆ రోజు ఫిల్మ్‌నగర్‌లోని ఓ గుడిలో దర్శనం చేసుకొని బయటకు వచ్చి కారు కోసం వేచి ఉండగా ఇద్దరు స్నాచర్లు ఆమె మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసు లాక్కుపోయారు. ఈ ఘటనలో కిందపడిన సత్యవతి గాయపడ్డారు. అదే దారిలో ముందుకు వెళ్లిన స్నాచర్లు ఫిల్మ్‌నగర్ బస్తీకి చెందిన మల్లీశ్వరి ఫిలింనగర్ రోడ్ నెం.1లోని బీఎన్ఆర్ బ్రిలియంట్ స్కూల్ వద్ద రోడ్డు దాటుతుండగా రెండు తులాల గొలుసు లాక్కెళ్లారు. కింద పడటంతో ఈమెకూ తీవ్ర గాయాలయ్యాయి. ఆలయం వద్ద ఉన్న సీసీ కెమెరాలో హెల్మెట్, మాస్క్‌తో ఉన్న దుండగులు ఫొటోలు రికార్డయ్యాయి. వీటిని మీడియాకు విడుదల చేసిన పోలీసులు ఆచూకీ చెప్పిన వారికి రూ.50 వేల రివార్డు ఇస్తామని కూడా ప్రకటించారు. ముర్తుజా గ్యాంగ్ అరెస్టుతో ఈ రెండు స్నాచింగ్స్ కూడా కొలిక్కి వచ్చినట్టే అని పోలీసులు తొలుత భావించారు. అయితే, విచారణలో తాము జూబ్లీహిల్స్‌లో స్నాచింగ్ చేయలేదని ముర్తుజా ముఠా చెప్పడంతో ఇప్పుడు అసలు దొంగల కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. భోపాల్ పోలీసులకు చిక్కిన ముర్తుజా గ్యాంగ్ దేశ వ్యాప్తంగా 13 నగరాల్లో పంజా విసిరింది. వీరు ఎప్పుడు పోలీసులకు పట్టుబడినా... కొన్ని నెలల్లోనే జైలు నుంచి బయటకు వచ్చి అదే రాష్ట్రంలోని మరో ప్రాంతంలో పంజా విసురుతారు. ముర్తుజా నేతృత్వంలోని గ్యాంగ్‌ను గతేడాది జనవరి 8న తమిళనాడులోని కోయంబత్తూరు పోలీసులు పట్టుకున్నారు. ఆ కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన ముర్తుజా ఏడు నెల ల్లోనే ముఠాను మార్చి చెన్నైలో పంజా విసిరాడు. వీరు సెప్టెంబర్‌లో హైదరాబాద్‌కు వచ్చినట్లే అప్పట్లో చెన్నై చేరుకున్నారు. భోపాల్ నుంచి కర్ణాటకలోని బీదర్‌కు వచ్చి, అక్కడ నుంచి రెండు బైకులతో సహా రైలులో చెన్నై వెళ్లి నేరా లు చేశారు. గతేడాది ఆగస్టు 9న చెన్నై పోలీసులకు చిక్కారు. అక్కడి జైలు నుంచి బయటకు వచ్చి బెంగళూరు, దావళగెరె, మైసూర్‌లతో పాటు హైదరాబాద్, సైబరాబాద్, విశాఖపట్నం, విజ యవాల్లో తమ ‘పనితనం’ చూపించారు. -
చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో భారీ చోరీ
సికింద్రాబాద్: చెన్నై ఎక్స్‌ప్రెస్ రైలులో నగరానికి చేరిన ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు చెందిన 42 తులాల బంగారు ఆభరణాలు కలిగిన బ్యాగు మాయమైంది. రైలు నల్గొండ దాటిన తర్వాత గుర్తించిన భాధితుడు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకుని జీఆర్పీ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశాడు. తదుపరి విచారణ నిమిత్తం కేసును సికింద్రాబాద్ రైల్వే పోలీసులు నల్గొండకు బదిలీ చేశారు. పోలీసుల కథనం ప్రకారం...నగరంలోని హైటెక్‌సిటీలో నివాసం ఉంటూ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్న రమాకాంత్ తన భార్యతో కలిసి చేన్నై ఎక్స్‌ప్రెస్ రైలులో సికింద్రాబాద్‌కు బయలుదేరాడు. బుధవారం అర్థరాత్రి దాటాక భార్యాభర్తలు ఇరువురు గాఢ నిద్రలోకి జారుకున్నాక వారి వెంట ఉండాల్సిన లగేజీబ్యాగు మాయమైంది. అందులో 42 తులాల బంగారు ఉన్నాయి. తెల్లవారుజామున గుర్తించిన రమాకాంత్ సికింద్రాబాద్‌లో రైలుదిగి పోలీసులను ఆశ్రయించాడు. అయితే నల్గొండ ప్రాంతంలో బ్యాగును దొంగిలించిన ఆగంతకులు అందులోని ఆభరణాలను తీసుకుని బ్యాగును నల్గొండ రైల్వేస్టేషన్ ప్రాంతంలో పడేసి వెళ్లిపోయారు. బ్యాగును గుర్తించిన నల్గొండ జీఆర్పీ పోలీసులు అందులో లభించిన చిరునామా ఆధారంగా సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించారు. బాధితుడి ఫిర్యాదు స్వీకరించిన సికింద్రాబాద్ పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం నల్గొండకు బదిలీ చేశారు. -
బెంగళూరునూ బెంబేలెతిస్తున్నారు...
బెంగళూరు: భారత సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులోనూ చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. గురువారం ఒక్కరోజే ఆరు చోట్ల గొలుసు దొంగతనాలు జరిగాయి. ఇవన్నీ ఉదయం 6 గంటల ప్రాంతంలో జరగడం గమనార్హం. వరుస చైన్ స్నాచింగ్ లతో బయటకు రావడానికి మహిళలు భయపడుతున్నారు. బుధవారం 8 చోట్ల దుండగులు చైన్ స్నాచింగ్ లకు తెగబడ్డారు. జేపీ నగర, జయనగర, బీజీఎం లేఅవుట్, యలహంక మారుతీనగర, బీహెచ్ఇఎల్ లేఅవుట్, పీణ్యా సిద్దార్ధ లేఅవుట్, అమృతహళ్లి ప్రాంతాల్లో గొలుసు దొంగతనాలకు పాల్పడ్డారు. బాధితులు ఆయా పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. -
ఒకే రోజు 10చోట్ల తెగబడ్డారు..
-
ఒకే రోజు 10చోట్ల తెగబడ్డారు..
హైదరాబాద్ : భాగ్య నగరాన్ని చైన్ స్నాచర్లు హడలెత్తిస్తున్నారు. మహిళలు ఒంటరిగా కనిపించటమే ఆలస్యం... వారు తమ ప్రతాపం చూపిస్తున్నారు. చైన్ స్నాచర్ల ఆగడాలకు మహిళలు బలైపోతున్న విషయం తెలిసిందే. తాజాగా దుండగులు మంగళవారం ఒక్కరోజే పదికి పైగా బంగారు గొలుసుల చోరీలకు పాల్పడ్డారు. ద్విచక్ర వాహనంపై హెల్మెట్ ధరించి వేగంగా వచ్చి... రోడ్డుపై నడుచుకుని వెళుతున్న మహిళల మెడలోని నగలు క్షణాల్లో లాక్కొని పరారవుతున్నారు. కూకట్‌పల్లిలోని ధర్మారెడ్డికాలనీ, వివేకానందా నగర్‌లోని రెండు ఘటనల్లో ఆరు తులాల బంగారు గొలుసులు అపహరించారు. ఇక సనత్‌నగర్, ఎస్ఆర్ నగర్, ఫిల్మ్‌నగర్, దోమలగూడా, అశోక్నగర్లలో 21 తులాల బంగారాన్ని తెంచుకు వెళ్లారు. గణేష్ నిమ్మజ్జనంలో రెండురోజులు అవిశ్రాంతంగా పనిచేసిన పోలీసులు, తిరిగి అసెంబ్లీ సమావేశాల్లో మునిగిపోవడంతో పక్కాప్రణాళికతో స్నాచర్లు రంగంలోకి దిగారు. అంతర్ రాష్ట్ర ముఠాలకు చెందిన పాతనేరస్తుల పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ వరుస ఘటనలతో మహిళలు రోడ్లపైకి రావడానికి వణికిపోతున్నారు. దుండగుల కోసం ప్రత్యేక బృందాలను పోలీసులు రంగంలోకి దించారు. -
తల్లికి మత్తు మందు ఇచ్చి పాప కిడ్నాప్
బీబీనగర్: నల్లగొండ జిల్లాలో ఇద్దరు మహిళా కి'లేడీ'లు ఆర్టీసీ బస్సులో చోరీకి పాల్పడటంతో పాటు ఓ పాపను కిడ్నాప్ చేశారు. హైదరాబాద్ నుంచి భువనగిరికి వెళుతున్న ఓ మహిళకు మత్తు మందు ఇచ్చి ఆమె దగ్గరున్న నగల బ్యాగును, ఆమె కుమార్తెను అపహరించుకుపోయారు. దీనికి సంబంధించి ప్రాథమిక సమాచారం మేరకు.. హైదరాబాద్‌లోని కొత్తపేటలో నివాసం ఉండే సంతోష(23) వినాయక చవితి సందర్భంగా తన కుమార్తెతో కలసి బుధవారం నల్లగొండ జిల్లా ఆత్మకూరులోని పుట్టింటికి బయలుదేరింది. ఉప్పల్‌లో భువనగిరికి వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కింది. ఊరికి వెళుతుండడంతో భద్రత కోసం 8 తులాల బంగారు ఆభరణాలను ఓ బ్యాగులో పెట్టుకుని తన వెంట తీసుకెళ్తోంది. బస్సులో వెనుక సీట్లో కూర్చున్న ఇద్దరు మహిళలు సంతోష కుమార్తెను తమ దగ్గర కూర్చోబెట్టుకున్నారు. ఏమైందో ఏమో తెలియదు గానీ, బీబీనగర్‌లో సంతోషకు తెలివి వచ్చింది. చూసేసరికి చేతిలో బ్యాగు లేదు, వెనుక సీట్లో కూర్చున్న ఇద్దరు మహిళలు, తన కుమార్తె కనిపించలేదు. బస్సు దిగి బాధితురాలు బీబీనగర్ పోలీసులకు మధ్యాహ్నం సమయంలో ఫిర్యాదు చేశారు. తనకు ఎవరో మత్తు మందు చల్లి బంగారు నగలు, తన కుమార్తెతో ఉడాయించారని ఫిర్యాదులో పేర్కొంది. మత్తు పూర్తిగా వదలకపోవడంతో ఆమె గందరగోళ పరిస్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలా తెలియాల్సి ఉంది. -
పోస్టల్ ఉద్యోగి ఇంట్లో బంగారం చోరీ
గుడివాడ : ఓ పోస్టల్ ఉద్యోగి ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన కృష్టా జిల్లా గుడివాడ నీలామహల్ థియేటర్ రోడ్డులో శనివారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన వివరాలు.. పోస్టల్ ఉద్యోగి ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చోరికి పాల్పడ్డారు. భార్యాభర్యలను కట్టేసి వారి ఇంట్లో నుంచి 18 కాసుల బంగారంతో పాటు రూ.50 వేల నగదు చోరీచేసినట్లు పోలీసులకు బాధితులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. -
నెల్లూరు 'నగల' చోరీ కేసు ఛేదించిన పోలీసులు
నెల్లూరు : నెల్లూరు నగరంలోని జయంతి జ్యువెలర్స్ దుకాణంలో జరిగిన దోపిడి కేసును పోలీసులు ఛేదించారు. అందుకు సంబంధించి ముగ్గురు దొంగలను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 7 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కి తరలించారు. పోలీసులు దొంగలను తమదైన శైలిలో విచారిస్తున్నారు. -
60 కాసుల బంగారం చోరీ
విజయవాడ(పడమట): విజయవాడ పట్టణంలోని ఓ ఇంట్లో బంగారం చోరీ జరిగింది. పట్టణంలోని పడమట ప్రాంతం సమతా రెసిడెన్సీలో నివాసముండే శాంతి కిరణ్ ఇంట్లో గురువారం మధ్యాహ్నం ఈ చోరీ జరిగింది. బాధితుడు కుటుంబంతో కలసి పూజ సామాగ్రి కొనేందుకు షాపుకు వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన దుండగులు ఇంట్లోకి చోరబడి 60 కాసుల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
35 సవర్ల బంగారం చోరీ
ఇందుకూరుపేట (నెల్లూరు జిల్లా) : ఇంట్లో భద్రపరిచిన 35 సవర్ల బంగారం చోరీకి గురైంది. ఈ సంఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మైపాడు గ్రామంలో వెలుగు చూసింది. వివరాల ప్రకారం.. మైపాడు గ్రామానికి చెందిన కృష్ణయ్య అనే వ్యక్తి ఇంట్లో 35 సవర్ల బంగారం చోరికి గురైంది. అయితే వీరు ఈ బంగారాన్ని 20 రోజుల క్రితమే బీరువాలో భద్రపరిచినట్లు సమాచారం. కాగా గురువారం బీరువాలో బంగారం కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఈ 20 రోజలు మధ్యలోనే కృష్ణయ్య కుటుంబంతో కలిసి పుష్కరాలకు కూడా వెళ్లి వచ్చినట్లు సమాచారం. దీంతో పోలీసులు దొంగతనం ఎప్పుడు జరిగిందో తెలుసుకునే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
పింఛన్ ఇప్పిస్తామని చెప్పి.. బంగారం చోరీ
చేర్యాల(వరంగల్ జిల్లా): పింఛన్ ఇప్పిస్తానని చెప్పి రెండు వేరువేరు ఘటనల్లో ఇద్దరు నిందితులు.. వృద్ధ మహిళల నుంచి బంగారు ఆభరణాలను కాజేశారు. ఈ సంఘటన మంగళవారం వరంగల్ జిల్లా చేర్యాల మండలం కేంద్రంలో జరిగింది. వివరాలు.. మండల కేంద్రంలోని బండపల్లికి చెందిన రామనర్సవ్వకు పింఛన్ ఇప్పిస్తానని నమ్మించి ఒక వ్యక్తి అంగడి బజార్‌లోని ప్రభుత్వాస్పత్రి దగ్గరకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమె మెడలో ఉన్న 3 తులాల బంగారు ఆభరణాలను దోచుకున్నాడు. మరో ఘటనలో మండలంలోని చుంచనకోట గ్రామానికి చెందిన ఎంకవ్వ అనే వృద్ధురాలిని ఒక వ్యక్తి పింఛన్ ఇప్పిస్తానని చెప్పి సబ్‌రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరకు తీసుకొచ్చి బంగారం కాజేశాడు. దీంతో బాధితులిద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. -
నేరం ఒప్పుకోవాలంటూ..
బాలికను చితకబాదిన పోలీసులు..! మల్కాజిగిరి : బంగారు నగలు చోరీ చేసిందని యాజమాని ఫిర్యాదు మేరకు ఇంట్లో పని చేసే బాలికను పోలీసులు చితకబాదారని ఆమె కుటంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మహిళ ఫిర్యాదుపై అత్యుత్సాహం చూపించిన డిటెక్టివ్ సబ్ ఇన్స్పెక్టర్ బాలికను పిలిపించి దారుణంగా ప్రవర్తించడంతో బాధితురాలు తన గోడును మీడియాకు తెలియజేసింది. బాధితురాలు, కుటుంబసభ్యులు, స్థానికుల కథనం ప్రకారం..మల్కాజిగిరి బీజేఆర్ నగర్లో నివాసముంటున్న అంజయ్య కూతురు రేణుక(17) ఇళ్లలో పనిచేస్తుంది. సత్తిరెడ్డినగర్‌కు చెందిన సరోజినిసామ్యూల్ అనే మహిళ ఇంట్లో పనిచేయడమే కాకుండా వారి చిన్నారి బాగోగులు కూడా చూసేది. మూడు రోజుల క్రితం మూడు తులాల బంగారు ఆభరణాలు దొంగతనం చేసిందని మల్కాజిగిరి పోలీసులకు మహిళ ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు రేణుకను శుక్రవారం ఉదయం స్టేషన్‌కు పిలిపించి దొంగతనం ఒప్పుకోవాలంటూ ఆమెను చితకబాదారు. అక్కడకు వెళ్లిన బాలిక తండ్రిపైనా చేయిచేసుకున్నారు. ఈ సంగతి తెలుసుకున్న ఫిర్యాదు చేసిన మహిళ వారిని వదిలిపెట్టాలని చెప్పడంతో వారిని పంపించివేశారు. కేసు నమోదు చేసి విచారించాం: ఇన్స్పెక్టర్ చోరీ చేసిందనే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి బాధితురాలిని పిలిపించి విచారించామని ఇన్స్పెక్టర్ జి.శేఖర్ గౌడ్ తెలిపారు. బాధితురాలి ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఒక వేల అలాంటి సంఘటన జరిగినట్లు ఫిర్యాదు చేస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని రావడమే కాకుండా తగిన విచారణ జరుపుతామని పేర్కొన్నారు. -
దొంగతనం చేసిందనే నెపంతో హింసించారు
హైదరాబాద్(మల్కాజ్గిరి): ఇళ్లల్లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఓ యువతిని దొంగతనం చేసిందనే నెపంతో పోలీసులు చిత్రహింసలకు గురిచేశారు. ఈ ఘటన నగరంలోని మల్కాజ్గిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం వెలుగులోకి వచ్చింది. ఓ ఇంట్లో మూడు తులాల బంగారం చోరీ జరిగింది. దీంతో యాజమాన్యం సదరు బాలికపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు యువతి(17)పై కేసు నమోదు చేశారు. అనంతరం ఆమెను విచారణ పేరుతో హింసించినట్లు తెలుస్తోంది. -
తుపాకితో బెదిరించి నగల దుకాణంలో చోరీ
నెల్లూరు టౌన్: నెల్లూరు పట్టణంలోని కాపు వీధిలో ఉన్న జయంతీ జ్యువెలరీ దుకాణంలో భారీ చోరీ జరిగింది. బుధవారం పట్టపగలే ముగ్గురు గుర్తుతెలియని దుండగులు దుకాణంలో చొరబడి తుపాకులతో బెదిరించి సుమారు 1.5 కిలోల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. దీంతో దుకాణ యజమాని జరిగిన విషయాన్ని వెంటనే పోలీసులుకు తెలియజేశాడు. సమాచారం అందుకున్న త్రీ టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
పార్సిల్ వచ్చిందంటూ.. చైన్ స్నాచింగ్
కోల్‌సిటీ : కొరియర్నంటూ వచ్చిన ఓ గుర్తుతెలియని యువకుడు వివాహిత మెడలోని బంగారు పుస్తెలతాడు తెంపుకొని పారిపోయిన సంఘటన కరీంనగర్ గోదావరిఖనిలో జరిగింది. బాధితురాలి కథనం ప్రకారం.. స్థానిక స్వతంత్రచౌక్లోని భవనం పైఅంతస్తులో నిమ్మకాలయ ఏడుకొండలు కుటుంబం ఉంటున్నారు. మధ్యాహ్నం సమయంలో ఏడుకొండలు కోడలు లలిత పైన ఆరేసిన బట్టలు తీసుకురావడానికి వెళ్లింది. అదే సమయంలో ఇంటి ముందు గుర్తుతెలియని వ్యక్తి నిలబడి కొరియర్‌ను అని పరిచయం చేసుకుని ‘కిందింటివారికి పార్సల్ వచ్చింది.. తాళం వేసి ఉంది. ప్లీజ్ మీరు సంతకం చేసి తీసుకుని వారికి అప్పగించండి మేడమ్.’ అని కోరాడు. ఇంట్లో మామయ్య, అత్తమ్మ ఉన్నారు పిల్చుకొస్తానాగండంటూ వెనక్కి తిరిగి వెళ్తుండగా అకస్మాత్తుగా ఆ యువకుడు లలిత నోటికి కర్చీఫ్ అడ్డం పెట్టి మెడలోని బంగారు పుస్తెలతాడును తెంపుకొని పారిపోయాడు. కిందపడిపోయిన ఆమె భయంతో ఇంట్లోకి పరుగెత్తి కుటుంబ సభ్యులకు వివరించింది. అనంతరం వన్‌టౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వగా బాధితురాలి నుంచి వివరాలు సేకరించి గాలింపు చేపట్టారు. నిందితుడిని గుర్తించడానికి చౌరస్తా ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. -
ఇల్లు అద్దెకు కావాలని నిలువు దోపిడీ
ఇంటి యజమానిని నిర్బంధించి దాడి బంగారం గుంజుకున్న దుండగులు ఏటీఎం నుంచి రూ.50 వేలు డ్రా... కుత్బుల్లాపూర్: ఇంట్లో అద్దెకు దిగి ఇంటి యజమానిని బెదిరించి, తాళ్లతో కట్టేసి ఆరుగురు దుండగులు ఐదు తులాల బంగారు నగలు దోచుకోవడంతో పాటు ఏటీఎం నుంచి రూ. 50 వేలు డ్రా చేసుకెళ్లారు. పేట్‌బషీరాబాద్ సీఐ రంగారెడ్డి, బాధితుడి కథనం ప్రకారం.. గోదావరి హోమ్స్‌లో నివాసముండే బులుసు రమేష్‌బాబు కారంపొడి వ్యాపారి. ఇతనికి సుచిత్ర రోడ్డులోని చర్మాస్ జీన్స్ ఫ్యాక్టరీ వెనుక ఉన్న జె.కె.నగర్లో మరో ఇల్లు ఉంది. పదిహేను రోజుల క్రితం శర్మ అనే వ్యక్తి రూ.5 వేలు చెల్లించి పైఫోర్షన్‌లో అద్దెకు దిగాడు. బుధవారం ఉదయం అదే ఇంట్లో కింద ఫోర్షన్ గోదాము కోసం కావాలని రమేష్‌బాబుకు శర్మ ఫోన్ చేశాడు. గురువారం అగ్రిమెంట్ రాసుకుందామని ఉదయం 9.15కు మరోమారు ఫోన్ చేయగా 9.30కి రమేష్ వెళ్లాడు. ఇంట్లోకి వెళ్లగానే ఆరుగురు దుంగులు అతడిని బెడ్రూమ్లోకి తీసుకువెళ్లి కాళ్లు చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి అరిస్తే చంపేస్తామని కత్తితో బెదిరించారు. ఉంగరాలు, మెడలోని గొలుసు (మొత్తం 5 తులాలు) దోచుకున్నారు. తర్వాత పర్సులో ఉన్న ఏటీఎం కార్డు లాక్కొని, చంపేస్తామని బెదిరించి పిన్ నెంబర్ తెలుసుకున్నారు. ఏటీఎం సెంటర్‌కు వెళ్లి రూ.50 వేలు డ్రా చేశారు. తర్వాత ‘నీ బ్యాంక్‌లో అకౌంట్లో పెద్ద మొత్తంలో డబ్బు ఉందని తెలిసింది, మాకు రూ.14 లక్షలు కావాలి, ఆ మొత్తానికి చెక్కు ఇవ్వు’ అని దుండగుల్లో ఒకడు రమేష్‌పై చేయి చేసుకోవడంతో పాటు చంపేస్తామని కత్తితో బెదిరించాడు. చెక్‌బుక్ గోదావరి హోమ్స్‌లోని ఇంటి వద్ద ఉందని చెప్పగా ఇంటికి వెళ్లి చెక్ బుక్‌తో జీడిమెట్ల గ్రామ సమీపంలో ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వద్దకు వెళ్లారు. ఇద్దరు వ్యక్తులు రమేష్‌ను బైక్ మధ్యలో కూర్చోబెట్టుకున్నారు. వీపుపై కత్తి పెట్టి ‘అరిస్తే చంపేస్తాం.. మీ ఇంటి వద్ద మా వాళ్లు మరో నలుగురు ఉన్నారు. ఇక్కడ ఏమైనా తేడా వస్తే మీ కుటుంబ సభ్యులందరినీ ఖతం చేస్తాం’ అని హెచ్చరించారు. కాగా, బ్యాంక్‌లోకి వెళ్లిన రమేష్ ఆందోళనతో ఉండడాన్ని గమనించిన బ్యాంక్ సిబ్బంది ఆరా తీయగా అసలు విషయం చెప్పాడు. అప్రమత్తమైన బ్యాంక్ సిబ్బంది వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేయగా క్షణాల్లో పోలీస్ వాహనం వచ్చింది. ఇది గమనించిన ఇద్దరు అక్కడ నుంచి పరారయ్యారు. అంతే కాకుండా ఇంటి వద్ద ఉన్న దుండగులు కూడా కనిపించకుండాపోయారు. ఫోన్ కాల్స్ ఆధారంగా నిందితులు గుంటూరు జిల్లాకు చెందిన వారిగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దుండగులను పట్టుకొనేందుకు పోలీసులు రెండు బృందాలను రంగంలోకి దింపారు. -
ఆఖరికి మృతదేహాలనూ వదలలేదు..
మాయమైన 60 కాసుల బంగారం కంబాలచెరువు (రాజమండ్రి) : గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన మృతదేహాలను తరలించే ప్రక్రియలో వారి శరీరంపై నున్న సుమారు 60 కాసుల బంగారం మాయమైంది. అంబులెన్స్‌ల్లో పలు దఫాలుగా వస్తున్న మృతదేహాలను ఆస్పత్రి మార్చురీ వద్ద దింపే ప్రక్రియలో కొందరు సాయం చేస్తున్నట్టు నటించి బంగారాన్ని తస్కరించారు. పోస్టుమార్టం చేసేందుకు మృతదేహాల శరీరంపై నున్న ఆభరణాలను ఆస్పత్రి సిబ్బంది తీసి వారి కుటుంబసభ్యులకు ఇచ్చేస్తారు. ఈ క్రమంలో కొందరు బయట వ్యక్తులు అక్కడకు వచ్చి మృతదేహాలను దింపే సమయంలో వారి చేతికి పని చెప్పారు. తొక్కిసలాటలో మృతిచెందిన నల్గొండ జిల్లా సూర్యాపేటకు చెందిన బొమ్మిశెట్టి అనసూయమ్మ మృతదేహాన్ని వారి కుమారులు తీసుకెళ్లేందుకు వచ్చారు. ఆ సమయంలో శరీరంపై నున్న బంగారు ఆభరణాలు కనిపించకపోయేసరికి అక్కడి సిబ్బందిని అడిగారు. వారు తమకు తెలియదని చెప్పారు. తన తల్లి శరీరంపై ఏడు కాసుల బంగారు ఆభరణాలు ఉంటాయని, అవి ఏమైపోయాయో తెలియవని అక్కడే ఉన్న ‘సాక్షి’ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. 27 మందీ ఊపిరాడకే చనిపోయారు పుష్కరాల ప్రత్యేక వైద్యాధికారి నాయక్ వెల్లడి రాజమండ్రి గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన 27 మందీ కేవలం ఊపిరాడకే మృతి చెందారు. దీనిలో మృతి చెందిన వారిపై పలు విషయాలు తెలుసుకునేందుకు వెళ్లిన ‘సాక్షి’తో ఆయన బుధవారం మాట్లాడారు. ఒక్కసారిగా జనం రద్దీ పెరిగిపోయి ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయిందన్నారు. ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో కొందరు కిందపడిపోగా, మరికొందరు జనం మధ్యలో గట్టిగా నలిగిపోయారన్నారు. 26 మంది ఘటనా స్థలంలో చనిపోయారన్నారు. ఊపిరాడక ఆస్పత్రికి 51 మంది రాగా, వారిలో ఒకరు మృతి చెందారన్నారు. మిగిలిన వారందరికీ మెరుగైన వైద్య సేవలందించి ఇళ్లకు పంపామన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో తమ వైద్యాధికారి డీసీహెచ్ఎస్ షాలినీదేవి ఆ ప్రాంతంలో ఉన్నారని, సంఘటనను చూసి తనకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో వైద్యులను అప్రమత్తం చేశామన్నారు. కొందరిని ఘటనా స్థలానికి, మరికొందరిని ఆస్పత్రి వద్ద ఉంచామన్నారు. -
బస్సులో బంగారు ఆభరణాల చోరీ
-
ట్రావెల్స్ బస్సులో భారీగా బంగారు ఆభరణాల చోరీ
మహబూబ్‌నగర్: ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీ బంగారు ఆభరణాల చోరీ జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లా ఇటిక్యాల వద్ద ఈ ఘటన వెలుగుచూసింది. ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి హైదరాబాద్ వస్తోంది. శనివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో మహబూబ్‌నగర్ జిల్లా ఇటిక్యాల బస్టాండ్‌కు చేరుకున్న సమయంలో బస్సు ప్రయాణికుడు ఒకరు తన బ్యాగ్‌లోని 11 కిలోల బంగారు ఆభరణాలు కనిపించటం లేదని గుర్తించారు. దాంతో ఆ విషయాన్ని డ్రైవర్ చెప్పి... బస్టాండ్‌లోని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోయింబత్తూరు నుంచి మొత్తం 15 కేజీల బంగారాన్ని తీసుకు వస్తున్నానని.... కానీ తన బ్యాగ్‌లో నాలుగు కేజీల బంగారం మాత్రమే ఉందని ఆ ఫిర్యాదులో బాధితుడు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా పోలీసులు బస్సులో తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. సదరు బంగారం మొత్తం హైదరాబాద్‌లోని జ్యూయలరీ షాపుకు తీసుకు వెళ్తున్నట్లు పోలీసులకు చెప్పారు. -
మెహదీపట్నంలో భారీ దోపిడీ
-
అద్దె ఇంటి కోసం వచ్చి... కత్తులతో బెదిరించారు
నెల్లూరు : అద్దె ఇంటికోసం వచ్చిన నలుగురు వ్యక్తులు ఓ గృహిణిని కత్తులతో బెదిరించి... బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లాలోని భక్తవత్సల నగరంలో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. దుండుగులు దోచుకెళ్లిన బంగారం విలువ రూ.1.15 లక్షలు ఉంటుందని బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.