
సాక్షి, విజయనగరం : బొకారో రైలులో భారీ దొంగతనం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా చెల్లూరుకి చెందిన రైల్వే కాంట్రాక్టర్ సత్యనారాయణ ఒడిషాలోని ఆర్తబిరాలో ఎంగేజ్‌మెంట్ కార్యక్రమానికి వెళ్లొస్తుంగా ఈ ఘటన చోటుచేసుకుంది. 77 తులాల బంగారం గల తన రెండు సూట్ కేసులు మాయమయ్యాయని బాధితుడు తెలిపాడు. తిట్లఘర్ - రాయగడ మధ్యలో దొంగతనం జరిగినట్టు వెల్లడించాడు. సూట్‌కేసుల్లో సుమారు 77 తులాల బంగారం ఉందని సత్యనారాయణ తెలిపారు. బాధితుడు తొలుత పార్వతీపురం రైల్వేస్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. భారీ దోపిడీ నేపథ్యంలో విజయనగరంలో ఫిర్యాదు చేయాలని రైల్వే అధికారులు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment