PARVATHIPURAM
-
పార్వతీపురంలో అక్రమంగా భూములు లాగేసుకుని.. టీడీపీ ఎమ్మెల్యే అరాచకాలు
-
కన్నులపండువగా పోలమాంబ అమ్మవారి సిరిమానోత్సవం (పోటోలు)
-
పార్వతీపురం ఎమ్మెల్యే నయా దందా.. లోకలోళ్లు వద్దు.. గెంటేయండి!
అమెరికా నుంచి దిగుమతి అయిన వాడిగా చెప్పుకుంటున్న పార్వతీపురం టీడీపీ ఎమ్మెల్యే స్థానిక నేతలను దగ్గరకు రానివ్వడంలేదు. తన కోసం కొద్దిమంది లీడర్లను బయటినుంచి తెచ్చుకుని వారితోనే దందాలు చేస్తున్నారు.. సెటిల్మెంట్స్.. లిక్కర్ ఇవన్నీ వాళ్లతోనే చేయిస్తున్నారు. స్థానిక టీడీపీ నేతలకు ఏమాత్రం ప్రాధాన్యం లేకుండా పోయింది. పార్వతీపురం (ఎస్సీ) నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే విజయ చంద్ర ఎన్నారై అనే బ్రాండ్ వేసుకొని లోకేష్ తాలూకా అని చెప్పుకుంటూ జస్ట్ ఎన్నికలకు ముందు పార్టీలో చేరారు. వస్తూనే హడావుడి చేసి అందర్నీ కలుపుకొని వెళ్తున్నట్టు నటించి గెలిచేశారు.తెలిసిన మరుక్షణం నుంచి తన గురువు చంద్రబాబు పంథాలోనే వెళుతున్నారు. అంటే గెలిచిన తర్వాత అదంతా తన గొప్పతనమేనని స్థానికంగా ఎవరు తనకు సపోర్ట్ చేయలేదని, తన సామర్థ్యం.. తన తెలివితేటలే తనని గెలిపించాలని చెప్పుకుంటూ వస్తున్నారు. వాస్తవానికి ఆయనకు మొన్నటి ఎన్నికల వరకు నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు ఎన్ని పంచాయతీలు ఉన్నాయి అన్నది కూడా స్పష్టంగా తెలియదు. ఎక్కడో వ్యాపారం చేసుకుంటూ భారీగా డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కొని అకస్మాత్తుగా ఎమ్మెల్యే అభ్యర్థి అయిపోయారు గెలిచేసారు. మాజీ ఎమ్మెల్యే చిరంజీవి.. మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్.. ఇంకా గొట్టపు వెంకట్ నాయుడు.. తదితరులంతా ఆయన కోసం పనిచేసి.. ఆయన్ని గెలిపించారు. అయితే తాను మాత్రం కార్యకర్తల ను ఏ మాత్రం లెక్క చేయకపోగా స్థానిక నాయకత్వాన్ని కూడా పూర్తిగా ఇగ్నోర్ చేశారు.సరికొత్త టీం దిగుమతిఇదిలా ఉండగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే అని ఎవరైనా స్థానికంగా అప్పటికే ఉంటున్న టీడీపీ క్యాడర్‌తో కలిసి మెలిసి పనిచేసుకుంటూ పోతారు. వారు చెప్పినట్లు చేయాలని లేకుండా వారిని కూడా కలుపుకొని పోవడం అనేది రాజకీయంగా ఒక ఆరోగ్యకరమైన వాతావరణం. కానీ విజయ్ చంద్ర మాత్రం ఎక్కడెక్కడో వేరే జిల్లాల నుంచి కొంత మందిని తీసుకొచ్చి తన చుట్టూ ఉంచుకొని వాళ్ల ద్వారా నియోజకవర్గంలో దందా చేస్తున్నారు. రెండు మూడు సార్లు ఎంపీపీలు జడ్పిటిసిలుగా చేసిన వాళ్ల సైతం విజయ్ చందన కలవాలంటే ముందు ఆ కోటరీని కలవాల్సి ఉంటుంది. వాళ్లను సంతృప్తి పరిస్తే తప్ప ఎమ్మెల్యే దర్శనం దక్కదు.. ప్రతి చిన్న విషయంలోనూ ఎమ్మెల్యే ఆయన బ్యాచ్ ఇన్వాల్వ్ అయిపోతూ బెదిరింపులు బ్లాక్ మెయిల్ వసూళ్లకు దిగుతున్నట్లు స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. ఎక్కడి నుంచో వచ్చాడని గెలిపిస్తే ఇలా పీక మీద కత్తి పెడితే ఎలా అని వారు భీతిల్లిపోతున్నారు.లిక్కర్ దందా మనదేమొన్నామధ్య లాటరీల లిక్కర్ షాపులు దక్కించుకున్న వాళ్లని సైతం ఎమ్మెల్యే పేరట అనుచరులు బెదిరించి 20 శాతం వాటా ఇస్తారా 10% కమిషన్ ఇస్తారా తేల్చుకోవాలని అల్టిమేటం జారీ చేశారు. ఇప్పటికీ మార్జిన్లు లేక నష్టాల బాటలో షాపులు నడుపుతుంటే రాబందుల్లా ఎమ్మెల్యే బ్యాచ్ దిగిపోయిందని పెట్టుబడి పెట్టకపోయినా వ్యాపారం వాటా ఇవ్వాల్సిందిగా బెదిరిస్తున్నారని లిక్కర్ లైసెన్సీలు ఆవేదన చెందుతున్నారు.ఇదీ చదవండి: ఓరి మీ యేశాలో!.. కాకినాడ పోర్టు కబ్జాకు బాబు, పవన్ ఎత్తులుఇది కాకుండా రియల్ ఎస్టేట్.. ఇసుక.. కన్స్ట్రక్షన్ వంటి అన్ని వ్యాపారాల్లోనూ విజయ చందర్ జోరుగా జోకింగ్ చేసుకుంటూ కమిషన్లు నొక్కుతున్నారు. గట్టిగా మాట్లాడితే దాని దళిత ఎమ్మెల్యే అని అంటూ సరికొత్త బ్లాక్ మెయిల్‌కి దిగుతున్నారు. మాటకు మన ఉద్యోగులు బదిలీల విషయంలో కూడా సిఫార్సు లెటర్స్ కు రేటు పెట్టి మరి వసూలు చేసుకున్నారని.. గ్రామస్థాయి ఉద్యోగాల బదిలీల్లోనూ ఆయన డబ్బులు తీసుకుని లెటర్ ఇచ్చారని ఉద్యోగులు గొల్లుమంటున్నారు. రాజకీయాలకు కొత్తగా అయినా దందాలు చేయడంలో ఆరు నెలల్లోనే ఆరితేరిపోయారని మున్ముందు ఆయన ఇంకెంత రెచ్చిపోతారో తెలీదని స్థానిక వ్యాపారుల సైతం భయపడుతున్నారు.-సిమ్మాదిరప్పన్న -
విజయనగరంలో వైద్య సేవలు నిలిపివేసిన డాక్టర్లు
-
కన్నుల పండుగగా సిరిమానోత్సవం
-
జగనన్న మా కుటుంబానికి ఎంతో మేలు చేశారు: జయ భూషణ
-
కూతురి పెళ్లికి దాచిన డబ్బు చెదల పాలు.. సాయం ప్రకటించిన 'బేబీ' సినిమా నిర్మాత
పసి వయసులో చేయి పట్టుకొని నడిపిస్తూ ఈ విశాల ప్రపంచాన్ని తొలిసారి పరిచయం చేసేది నాన్నే. భుజాలపై ఎక్కించుకుని ఆడించినా.. అల్లరి చేసినప్పుడు దండించినా బిడ్డ భవిష్యత్తే నాన్నకు ముఖ్యం. ప్రధానంగా ఆడపిల్ల ఉన్న తండ్రి ఇంకా భిన్నంగా ఆలోచిస్తాడు. ఎంతో కష్టపడి అతని చేతిలో డబ్బున్నా తన గారాల బిడ్డ చదువు, ఆమె పెళ్లి కోసం డబ్బు దాస్తాడు. తన కోసం ఏదీ కొనుక్కోడు కానీ పిల్లల కోసం తన కోరికలను, ఆశలను చంపుకుని డబ్బు కూడాబెడుతాడు. అలాంటి డబ్బే చెదల పాలు అయితే ఆ తండ్రి వేదన భరించలేనిది. పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ తండ్రి కూడా బిడ్డల భవిష్యత్ కోసం దాచుకున్న డబ్బు చెదల పాలు కావడంతో కన్నీరుమున్నీరు అయ్యాడు. తన కూతురి పెళ్లి కోసం రోజంతా కష్టపడి వచ్చిన డబ్బును తన ఇంట్లో దాచి ఉంచాడు. సుమారు రూ. 2 లక్షల మొత్తాన్ని అతను తన ఇంట్లో భద్రపరిచాడు.. కానీ ఆ డబ్బు చెదులు పట్టిందా..? లేదా ఎలుకలు కొరికాయో తెలియదు కానీ ఇలా ఆ మొత్తం డబ్బు వినియోగించుకునేందుకు పనికిరాకుండా పోయింది. ఆ డబ్బును చూసిన ఆ తండ్రి కంట కన్నీళ్లు ఆగడం లేదు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సోషల్ మీడియా ద్వారా ఆ తండ్రి కన్నీళ్లు చూసిన బేబీ సినిమా నిర్మాత ఎస్కేఎన్ (SKN) రియాక్ట్ అయ్యాడు. ఆ కుటుంబానికి సాయం చేసేందుకు ఆయన ముందుకు వచ్చాడు. ఆ తండ్రి వివరాలు తనకు పంపాలని... ఆయన కుమార్తె పెళ్లికి అవసరమయ్యే రూ. 2లక్షల డబ్బును ఆయన ఇస్తానని తన ఎక్స్‌లో తెలిపాడు. ఇందుకు గాను గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. బ్యాంకులలో డబ్బును దాచుకునేలా వారికి అవగాహన కల్పించాల్సిన భాద్యత అందరిపైన ఉందని ఆయన తెలిపాడు. దీంతో ఎస్కేఎన్ ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. కష్టంలో ఉన్న వారికి ఇలాంటి సాయం చేయడానికి ముందుకు వచ్చిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ కామెంట్లు చేస్తున్నారు. వీడేంటి రా ఇంత మంచోడు అంటూ మరోకరు తెలిపారు. ఆ సినిమా డైరెక్టర్ సాయి రాజేష్ కూడా తన ఫ్రెండ్ చేస్తున్న మంచి పనిని అభినందించినట్లు సమాచారం. ఏదేమైనా నష్టపోయిన ఆ వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలు ఎస్కేఎన్కు అందేలా చేయండని మరికొందరు తెలుపుతున్నారు. Sad to know & it's very unfortunate to see their innocence keep money like that Can any one share their contact please Would like to help them — SKN (Sreenivasa Kumar) (@SKNonline) November 19, 2023 -
సంబరంలా పార్వతీపురం సాధికార యాత్ర
సాక్షి ప్రతినిధి, విజయనగరం/ పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగిన సామాజిక సాధికార యాత్ర ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సాధించిన సాధికారతకు సూచికగా ఓ సంబరంలా సాగింది. జిల్లాలోని సీతానగరం మండలం లచ్చయ్యపేటలో ఆరంభమైన బస్సు యాత్ర పార్వతీపురం పట్టణంలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రవేశించింది. మోటారు బైకు ర్యాలీతో వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు యాత్రలో పాల్గొన్నారు. మహిళల కోలాటం, తప్పిటగుళ్ల కళాకారుల ప్రదర్శనలు, తీన్మార్ వాయిద్యాల నడుమ యాత్ర ముందుకు సాగింది. జై జగన్ నినాదాలతో పార్వతీపురం పట్టణం హోరెత్తింది. పార్వతీపురం బస్టాండ్ వద్ద జరిగిన సభలో రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలు వంగపండు ఉష ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటాపాట అందరినీ అలరించింది. సభకు తరలివచ్చిన జనంతో పార్వతీపురం పట్టణంలోని అంతర్రాష్ట్ర రహదారి కిక్కిరిసిపోయింది. ఎమ్మెల్యే అలజంగి జోగారావు అధ్యక్షతన జరిగిన సభలో పలువురు మంత్రులు, నేతలు ప్రసంగించారు. రాజ్యాంగం ఆశయాలు ఇన్నాళ్లకు సాకారమయ్యాయి: మంత్రి ధర్మాన భారత రాజ్యాంగ ఆశయాలను స్వాతంత్య్రం వచ్చి న ఇన్నాళ్లకు దేశంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్ సాకారం చేశారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. సామాజిక సాధికార సభలో ఆయన మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ప్రకారం అర్హత ప్రాతిపదికన ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్నారన్నారు. దీనివల్ల పేదవారు సైతం పిల్లలను ఉన్నత చదువులు చదివించుకోవడానికి, ఉచిత వైద్యం పొందడానికి, సొంత ఇంటిలో ఉండటానికి, స్వేచ్ఛగా జీవించడానికి అవకాశం లభించిందన్నారు. ధనిక వర్గాలకే పరిమితమైన ఆంగ్ల విద్యను అందరికీ అందిస్తున్న ఘనత సీఎం జగన్‌దేనని చెప్పారు. జగన్‌తోనే బడుగులకు మేలు: మంత్రి రాజన్నదొర రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు సీఎం జగన్‌తోనే మేలు జరిగిందని ఉప ముఖ్యమంత్రి, గిరిజన శాఖ మంత్రి పీడిక రాజన్నదొర చెప్పారు. ఎస్సీల కోసం టీడీపీ ప్రభుత్వం రూ.30 వేల కోట్లు ఖర్చు చేస్తే, సీఎం జగన్ రూ.61 వేల కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. పోడు, బంజరు భూములను గిరిజనులకు పంపిణీ చేసిన ఘనత జగన్‌దేనన్నారు. దశాబ్దాల సమస్యలు పరిష్కారం : ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఈ ప్రాంతంలో దశాబ్దాల కాలంనాటి సమస్యలను సీఎం జగన్ ప్రత్యక శ్రద్ధతో పరిష్కరిస్తున్నారని ఎమ్మెల్యే అలజంగి జోగారావు చెప్పారు. అరి్టకల్ 11, 17, 1 5(సి)ని పూర్తిగా అమలు చేస్తున్న ఘనత సీఎం జగన్‌దేనని అన్నారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, వైఎస్సార్సీపీ రిజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యేలు శంబంగి వెంకట చిన్నఅప్పలనాయుడు, కంబాల జోగులు, పుష్పశ్రీవాణి, విశ్వాసరాయి కళావతి, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, పార్టీ విజయనగరం, పారీ్వతీపురం మన్యం జిల్లాల అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు, శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, నవరత్నాల కమిటీ ఉపాధ్యక్షుడు నారాయణమూర్తి పాల్గొన్నారు. -
పార్వతీపురంలో సామాజిక సాధికార యాత్ర
-
మన్యం జిల్లాలో గజరాజుల గుంపు బీభత్సం
-
బెదిరించేందుకు మహిళ..
పార్వతీపురం: కుటుంబసభ్యులను బెదిరించేందుకు సీతానగరం మండలం గుచ్చిమి గ్రామానికి చెందిన మండల అపర్ణ మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. భర్త రామకృష్ణ, అత్తమ్మ చూస్తుండగానే వారిని భయపెట్టేందుకు ఇంట్లో ఉన్న మాత్రలు ఒక్కసారిగా మింగేసింది. దీంతో కుటుంబసభ్యులు ఆటోలో ఆమెను చికిత్సకోసం పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. -
వివాహేతర సంబంధం అనుమానంతో.. భార్యపై భర్త దాడి
పార్వతీపురం: వివాహేతర సంబంధం కలిగి ఉందన్న అనుమానంతో ఓ భర్త, భార్యపై దాడిచేసి తీవ్రంగా ఆదివారం గాయపరియాడు. ఈ సంఘటనపై పార్వతీపురం ఆస్పత్రి అవుట్‌పోస్టు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పార్వతీపురం పట్టణంలోని వేమకోటివారి వీధికి చెందిన కె. ఆదిలక్ష్మి శనివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో భర్త కృష్ణ అనుమానంతో కర్రతో కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. దీంతో ఆదిలక్ష్మికి ముఖంపై పలుచోట్ల తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఆదిలక్షి్మని కుమారుడు ద్విచక్రవాహనంపై చికిత్సకోసం పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. -
పార్వతిపురం జిల్లా బందవలసలో ఏనుగుల బీభత్సం
-
టెక్నాలజీ అంటే ఇష్టం.. రూ.13వేల ఖర్చు, పాత ఇనుప సామగ్రితో బైక్!
సాంకేతిక అంశాలు నేర్చుకోవడం అంటే ఆ యువకుడికి మహా ఇష్టం. ఆసక్తికి ఆలోచనలు తోడయ్యాయి. ఆవిష్కరణలు ఆరంభమయ్యాయి. డ్రైవర్‌లేని కార్లు, డబుల్ మైలేజీ ఇచ్చే బైక్‌లు, ఇ–బైక్‌లను తక్కువ ఖర్చుతో తయారుచేస్తూ అందరినీ ఔరా అనిపిస్తున్నాడు. యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్నాడు. విశాఖపట్నం గీతం యూనివర్సిటీలో డేటా సైన్స్ విద్యను పూర్తిచేసిన గెంబలి గౌతమ్‌కు చిన్నప్పటి నుంచి సాంకేతిక అంశాలు నేర్చుకోవడం అంటే ఇష్టం. కొత్తకొత్త ఆవిష్కరణలు చేయడం మహా సరదా. ఆదే అలవాటుగా మారింది. మైక్రో ఆర్ట్ నుంచి వినూత్న వాహనాల తయారీ వరకు వినూత్నంగా సాగిపోతున్నాడు. రోజురోజుకు పెట్రోల్ ధరలు పెరుగుతున్న వేళ.. పెట్రోల్ లేకుండా బ్యాటరీతో నడిచే వాహనాలను సొంతంగా తయారు చేసి అందరితో శభాష్ అనిపించుకుంటున్నాడు. ఆయన ఆలోచన నుంచి రూపుదిద్దుకున్న ఏ ఆవిష్కరణ అయినా ఔరా అనాల్సిందే. అతి తక్కువ ఖర్చుతో నడిచే స్కూటర్‌ను చూస్తే వావ్ అంటాం. తనకు నచ్చిన రంగులతో విభిన్నమైన ఆలోచనలతో దూసుకెళ్తూ.. యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. డబుల్ మైలేజ్.. డబుల్ ధమాకా.. ► పెట్రోల్ భారం తగ్గేలా గౌతమ్ సరికొత్త డివైజ్‌ను రూపొందించాడు. చైనాకు చెందిన హజ్ మోటారు వినియోగించి, బైక్‌లో కొన్ని మార్పులు చేశాడు. ఇప్పుడు లీటరు పెట్రోల్‌తో గతంలో నడిచిన దానికంటే డబుల్ మైలేజ్ వస్తోంది. ► ఇంట్లో ఉండే పాత ఇనుప సామగ్రిని వినియోగించి కేవలం రూ.13వేల ఖర్చుతో రెయిన్ బో స్కూటర్‌ను రూపొందించాడు. లిథియం బ్యాటరీ, మూలకు చేరిన కొన్ని వాహనాల పరికరాలను వినియోగించి దీనిని తయారు చేశాడు. తన మామయ్య కోరిక మేరకు దీనిని తీర్చిదిద్దానని, ఎంతోమందికి నచ్చడంతో ఈ తరహా బైక్స్ తయారు చేయాలంటూ ఆర్డర్లు వస్తున్నాయని గౌతమ్ చెబుతున్నాడు. ► దివ్యాంగుల కోసం దేశంలోనే మొట్టమొదటి స్టీరింగ్ లెస్ కారును తయారుచేసి దాన్ని రోడ్లపై నడుపుతూ గౌతమ్ అబ్బుర పరిచాడు. ఆయన రూపొందించిన కారుకు స్టీరింగ్ ఉండదు. కేవలం రూ.32 వేల ఖర్చుతో డిజైన్ చేసిన కారులో 350 వోల్టుల సామర్థ్యం కలిగిన 2 మోటార్లు, లిథియం బ్యాటరీ, కొంత ఐరన్ వినియోగించాడు. సోలార్‌తో పాటు బ్యాటరీతో నడిచేలా కారును తయారు చేశాడు. కాళ్ల వద్ద ఏర్పాటు చేసిన సెన్సార్ల ద్వారా ఆపరేట్ అవుతుంటుంది. చేతులు లేని విభిన్న ప్రతిభావంతులను దృష్టిలో పెట్టుకొని ఈ డిజైన్ రూపొందించినట్టు గౌతమ్ చెబుతున్నాడు. జీపీఆర్ఎస్ సిస్టమ్, బ్లూ టూత్ వంటి సదుపాయాలు ఈ కారు సొంతం. దీనికి లైసెన్స్‌తో పనిలేదు. గతంలో అంతర్జాతీయ సైన్స్దినోత్సవం సందర్భంగా ఈ కారుని చూసిన జపాన్ బృందం యువకుడి ప్రతిభను మెచ్చుకుంది. ప్రశంసల వర్షం కురిపించింది. విశాఖపట్నంలోని ఇద్దరు దివ్యాంగులకు రెండు కార్లు ప్రత్యేకంగా తయారు చేసి అందజేశాడు. పంటలకు పురుగుమందులు పిచికారీ చేసే స్ప్రేలను వినూత్నంగా తయారుచేసి రైతులకు అందజేస్తున్నాడు. 15 గంటల్లోనే ఈ బైక్ తయారీ తన స్నేహితుడైన వెల్డర్ జానకి సహాయంతో కేవలం 15 గంటల్లో ఈ–బైక్ రూపొందించాడు. దానిని రెండు గంటల పాటు చార్జింగ్ చేస్తే 50 నుంచి 60 కిలోమీటర్ల స్పీడ్‌తో 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని రుజువు చేశాడు. వాహనం తయారీకి పాత ఇనుప సామగ్రి, ఎలక్ట్రికల్ వస్తువులు, స్కూటీ టైర్లు, బీఎల్డీసీ మోటార్, లిథియం బ్యాటరీని వినియోగించాడు. యాక్సిలేటర్, ఆటో గేర్ సిస్టం, హ్యాండ్‌బ్రేక్ ఉపయోగించాడు. రాత్రి కూడా సునాయసంగా ప్రయాణించేందుకు వీలుగా బైక్‌కు ఫ్లడ్ లైట్ అమర్చాడు. పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారి జల్దు వినయ్ ఎలక్ట్రికల్ పరికరాలు ఉచితంగా ఇవ్వడంతో తన ప్రయోగం వేగంగా పూర్తిచేసినట్టు యువకుడు తెలిపాడు. ఏ ఆలోచన వచ్చినా .. ఏ ఆలోచన వచ్చినా వెంటనే అమలు చేసేందుకు ప్రయత్నిస్తుంటాను. ఇప్పటి వరకూ స్టీరింగ్ లెస్ కారుతోపాటు రెయిన్ బో స్కూటర్, రెండింతలు మైలేజీ వచ్చేలా బైక్ డిజైన్‌లో మార్పులు చేశాను. సరికొత్త బైక్ తయారీకి ప్రయత్నిస్తున్నాను. రెయిన్ బో స్కూటర్ చాలా మందికి నచ్చడంతో ఇప్పటికే కొంత మంది డిజైన్ చేసి ఇచ్చారు. చిన్నప్పటి నుంచి సరికొత్తగా ఆలోచించడం, ఏదో ఒకటి చేయాలన్న తపనతో అనేక విషయాలను నేర్చుకోవడం మొదలు పెట్టాను. చిన్నప్పుడు పిల్లలకు కరెంట్ వైర్లతో వెరైటీ ఐటెమ్స్ చేసి ఇవ్వడం, సైన్స్ ఫెయిర్ ప్రాజెక్టులకు సహకారాన్ని అందించడం వంటివి చేశాను. అప్పుడే కొత్త ఆవిష్కరణల దిశగా నా అడుగులు పడ్డాయి. – జి.గౌతమ్, పార్వతీపురం చదవండి: ఉదయాన్నే జాగింగ్, రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారా.. ఈ గ్యాడ్జెట్ మీకోసమే! -
Chicken Price Hike: కొండెక్కిన కోడి.. కిలో చికెన్ అంత ధరా?
సాక్షి, పార్వతీపురం: రోజురోజుకూ కోడి మాంసం ధర కొండెక్కుతోంది. వేసవి కాలం కావడంతో బ్రాయిలర్ కోళ్ల ఉత్పత్తి తగ్గింది. కొత్త పౌల్ట్రీలు ఏర్పాటు చేయకపోవడంతో ఉన్న పౌల్ట్రీల ద్వారానే కోళ్ల సరఫరా జరుగుతోంది. మరో వైపు జిల్లా వ్యాప్తంగా పెళ్లిళ్లు, పండగలు జరుగుతుండడంతో మాంసానికి డిమాండ్ పెరుగుతోంది. సీజన్ కావడంతో డిమాండ్ ప్రస్తుతం చికెన్, మటన్ల విక్రయాలకు డిమాండ్ పెరిగింది. ఏటా ఫిబ్రవరి నుంచి జూలై వరకూ మాంసానికి సీజన్‌గా పరిగణిస్తారు. ఈ నెలల్లో ఎక్కువగా గ్రామ దేవతల సంబరాలు, ఇంటి వారాలు, యానాళ్లు, అసిరితల్లి పండగలు వంటివి నిర్వహిస్తుంటారు. చికెన్, మటన్ వంటి వంటకాలను ప్రజలు ఎక్కువ ఇష్టపడతారు. దీంతో ఏటా ఈ సమయంలో చికెన్ ధరలు పెరుగుతుంటాయి. ఈ ఏడాది కూడా గతంలో కంటే ఎక్కువగా పెరిగాయి. గతంలో బ్రాయిలర్ కోడి చికెన్ ధర కిలో రూ. 220లు ఉండగా, ప్రస్తుతం రూ. 260 నుంచి రూ. 280 మధ్య పలుకుతోంది. మరో వైపు బ్రాయిలర్ కోడి లైవ్ కిలో ధర గతంలో రూ 140 నుంచి రూ.150 మధ్య ఉండేది. ఇప్పుడు రూ.180 నుంచి రూ. 200 మధ్య పలుకుతోంది. ఇవి కూడా చికెన్ దుకాణాల వద్ద పరిమితంగానే ఉంటున్నాయి. పౌల్ట్రీల నుంచి ఉత్పత్తులు లేకపోవడంతో కోళ్లకు డిమాండ్ పెరిగి, మాంసం ధర పైపైకి వెళ్తోంది. చదవండి👉🏾 గంగపుత్రులకు మరింత చేరువగా.. వేసవి ప్రభావం ప్రతి పౌల్ట్రీకి 4,500 నుంచి 7 వేల వరకు బ్రాయిలర్ కోళ్ల పెంపకానికి కంపెనీలు పిల్లలను అందిస్తాయి. కొంతమంది సొంతంగా కొనుగోలు చేస్తారు. ఇవి 72 రోజుల వ్యవధిలో కిలోన్నర నుంచి రెండున్నర కిలోల వరకూ పెరుగుతాయి. వేసవికాలంలో వీటిని పెంచేందుకు పౌల్ట్రీల వద్ద షెడ్డులు కూల్‌గా ఉంచాలి. ఇందుకోసం డ్రిప్ విధానాన్ని అమలుచేసి షెడ్డులు తడుపుతుంటారు. ఈ వేసవిలో ఎండ తీవ్రత అధికంగా ఉండడం, వేడి గాలులు వీస్తుండడంతో బ్రాయిలర్ కోళ్లు అధికంగా చనిపోతుండడంతో దిగుబడి పూర్తిగా పడిపోతోంది. వీటికి తోడు కోడి మేత ధర పెరిగింది. బ్రాయిలర్ కోడికి ప్రధాన మేతగా పరిగణిస్తున్న సోయాబీన్ మేత కిలో రూ.102 నుంచి రూ.113 మధ్య ఉంది. గతంలో కిలో రూ. 60 ఉండేది. సాధారణ మొక్కజొన్న మేత కిలో రూ.13 లు నుంచి రూ.23కు ఎగబాకింది. చదవండి👉🏼 వినూత్న కేజ్ కల్చర్.. అద్భుత ప్యా‘కేజ్’ ఇతర ప్రాంతాల నుంచి.. జిల్లాలో దిగుబడి తక్కువ కావడంతో విశాఖపట్నం,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి జిల్లాకు బ్రాయిలర్ కోళ్లు దిగుమతి అవుతున్నాయి. రవాణా చార్జీలు అదనంగా ఉండడంతో కోళ్ల ధరలు పెరుగుతూ వస్తున్నాయి. నాటుకోడి కొనలేం బ్రాయిలర్ కోడి విషయం పక్కన పెడితే నాటుకోడి ధర కూడా చాలా ఎక్కువగా ఉంది. నిత్యం జరిగే వారపు సంతలతో పాటు మార్కెట్లో కూడా నాటుకోళ్లు జిల్లాలో లభిస్తున్నాయి. కిలో బరువు తూగే కోడి ధర రూ. 400 దాటి 500 వరకూ పలుకుతోంది, నాటుకోడి మాంసం ధర కూడా కిలో రూ. 500 చొప్పున విక్రయిస్తున్నారు. పెరిగిన బ్రాయిలర్ చికెన్ ధర బ్రాయిలర్ కోడి మాంసం ధర మార్కెట్లో పెరిగింది. ప్రస్తుతం వేసవికావడంతో కోళ్ల ఉత్పత్తి తగ్గుతోంది. పౌల్ట్రీల వద్ద దిగుబడి పెద్దగా ఉండదు. ఈ రెండు మూడు నెలలు ఇదే పరిస్థితి. పౌల్ట్రీ నిర్వాహకులకు గతేడాది ఈ సమయంలో నష్టం వచ్చింది. ఇప్పుడు లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. -ఎ.ఈశ్వరరావు, పశుసంవర్థకశాఖ జేడీ, పార్వతీపురం మన్యం జిల్లా -
Samta Express: బోగీల నుంచి విడిపోయిన ఇంజిన్.. కిలో మీటర్ దూరం వెళ్లి..
పార్వతీపురం టౌన్/ సీతానగరం(పార్వతీపురం జిల్లా): విశాఖ నుంచి నిజాముద్దీన్ వెళ్లే సమతా సూపర్ ఫాస్ట్ రైలుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. రైలు బుధవారం ఉదయం 9.20 గంటలకు విశాఖ నుంచి బయలు దేరింది. 11 గంటలకు సీతానగరం రైల్వేస్టేషన్ దాటింది. సీతానగరం–పార్వతీపురం రైల్వే స్టేషన్ల మధ్యలో గుచ్చిమి గ్రామం రైల్వే గేట్ సమీపంలో సాంకేతిక కారణాలతో బోగీల నుంచి ఇంజిన్ విడిపోయింది. ఇంజిన్ విడిపోయిన విషయాన్ని గ్రహించిన లోకోపైలెట్ ఇంజిన్‌ను నిలుపుదల చేయకుండా కిలోమీటరు మేర ముందుకు తీసుకెళ్లి నిలిపాడు. చదవండి: ముప్పు తప్పినట్లే.. తీరం దాటిన అసని తుపాను ఇంజిన్ వేగాన్ని ఏ మాత్రం తగ్గించినా బోగీలు దానికి ఢీకొని రైలు పడిపోయి పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అయితే లోకోపైలెట్ చాకచక్యంగా ఇంజిన్ ముందుకు తీసుకెళ్లాడు. వెనుక వస్తున్న బోగీలు వేగం తగ్గి అవి పూర్తిగా నిలిచిపోయాక.. తిరిగి ఇంజిన్‌ను వెనుక్కు తీసుకెళ్లి బోగీలకు అమర్చాడు. సాంకేతిక లోపాలను సరిదిద్దాక రైలు ముందుకు సాగింది. 11.36 గం.కు పార్వతీపురం రైల్వేస్టేషన్‌కు చేరుకోవాల్సిన సమతా ఎక్స్‌ప్రెస్ 12.30 గం.కు చేరుకుంది. లోకోపైలెట్ చాకచక్యంతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణీకులు ఊపిరిపీల్చుకున్నారు. -
పార్వతీపురం ఎమ్మెల్యే జోగారావును పరామర్శించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఫోన్లో పరామర్శించారు. ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన ఎమ్మెల్యే మాతృమూర్తి సంతోషమ్మ మృతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సంతోషమ్మ మృతికి సీఎం జగన్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. చదవండి: (పార్వతీపురం ఎమ్మెల్యేకు మాతృవియోగం) -
పార్వతీపురం ఎమ్మెల్యేకు మాతృవియోగం
సాక్షి, పార్వతీపురం మన్యం(బలిజిపేట): పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు తల్లి, బలిజిపేట మండలం మాజీ ఎంపీపీ అలజంగి సంతోషమ్మ శుక్రవారం ఉదయం మృతి చెందారు. ఆమె కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతూ చిలకలపల్లిలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆమె 2001–06లో బలిజిపేట ఎంపీపీగా పనిచేశారు. ఆమె భర్త స్వర్గీయ అలజంగి సత్యం చిలకలపల్లి సర్పంచ్‌గా 1987–1998 వరకు పనిచేశారు. వీరికి ఆరుగురు మగపిల్లలు. వీరిలో ఎమ్మెల్యే జోగారావు 6వ సంతానం. బలిజిపేట మండలం జెడ్పీటీసీ సభ్యుడు ఎ.రవికుమార్ 4వ వాడుకాగా, ప్రస్తుత చిలకలపల్లి సర్పంచ్ సుందరావు 3వ సంతానం. సంతోషమ్మ కోడలు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రాస్పత్రి సూపరెంటెండెంట్‌గా పనిచేస్తున్న డాక్టర్ వాగ్దేవి. సంతోషమ్మ మృతితో గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. ఆమె కుటుంబ సభ్యులను డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పీడిక రాజన్నదొర, బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే ఎస్.జయమణి, టిడ్కోచైర్మన్ జమ్మానప్రసన్నకుమార్, వ్యవసాయ సలహామండలి జిల్లా చైర్మన్ వి.నాగేశ్వరరావు, పార్వతీపురంమున్సిపల్ చైర్పర్సన్ బి.గౌరీశ్వరి, వైస్ చైర్మన్లు రుక్మిణిబాలకృష్ణ, గున్నేశ్వరరావు, కమిషనర్ సింహాచలం, నియోజకవర్గస్థాయి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పరామర్శించారు. తల్లి మృతదేహానికి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే జోగారావు -
అనుభవజ్ఞులకు అగ్రపీఠం
విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు సమప్రాధాన్యం లభించింది. పాలనలో అనుభవజ్ఞులకు మంత్రి పదవులను సీఎం కట్టబెట్టారు. ‘సామాజిక’ న్యాయం పాటించారు. విద్యల నగరానికి చెందిన బొత్స సత్యనారాయణకు విద్యాశాఖ కేటాయించి సముచిత స్థానం కల్పించగా, గిరిపుత్రుడైన పీడిక రాజన్నదొరకు గిరిజన సంక్షేమశాఖ కేటాయించారు. డిప్యూటీ సీఎంగా గౌరవహోదానిచ్చారు. మంత్రివర్గం కొలువుదీరిన వేళ జిల్లాల్లో ‘కొత్త’ సందడి నెలకుంది. సాక్షి ప్రతినిధి, విజయనగరం: విద్యల నగరానికి అరుదైన గౌరవం దక్కింది. జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రిగా సోమవారం ప్రమాణస్వీకరం చేశారు. ఆయన ఇప్పటికే విద్యారంగ అభివృద్ధిలో తనముద్ర వేసుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జేఎన్టీయూ–విజయనగరం కళాశాలను సాకారం చేయడంలో కీలక పాత్ర పోషించారు. నాడు తండ్రి వైఎస్సార్ మంత్రివర్గంలోనే కాదు ఇప్పుడు తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాబినెట్లోనూ రెండోసారి చోటు సంపాదించారు. ఆయన హయాంలో విద్యల నగరానికి మరోసారి మహర్దశ పడుతుందని జిల్లా ప్రజలు ఆశిస్తున్నారు. జిల్లాలో విద్యాభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని అభిప్రాయపడుతున్నారు. వైఎస్‌రాజశేఖరరెడ్డి హయాం నుంచి వివిధ శాఖలకు మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ ఈసారి తొలిసారిగా విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇంతవరకు ఏ శాఖ మంత్రిగా పనిచేసినప్పటికీ జిల్లా కేంద్రానికున్న విద్యలనగరం పేరును నిలబెట్టడానికే ప్రయత్నించేవారు. ఆ దిశగా తీర్చిదిద్దడానికి విశేష కృషి చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మూడు జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఒకటి జిల్లాకు తెప్పించుకోవడంలో బొత్స ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ఆ కళాశాలనే ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి యూనివర్సిటీగా ప్రకటించారు. ఇందులో బొత్స సఫలమయ్యారు. ప్రస్తుతం 80 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న విశ్వవిద్యాలయానికి మరో 80 ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరతానని బొత్స ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. యూనివర్శిటీ ప్రకటించి కొన్ని నెలలు అయినప్పటికీ జేఎన్టీయూ–కాకినాడ యూనివర్సిటీ నుంచి విభజన ప్రక్రియ మొదలుకాలేదు. యూనివర్సిటీకి వైస్ చాన్స్‌లర్ పోస్టు భర్తీ చేయాల్సి ఉంది. బొత్స విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపడుతున్న నేపథ్యంలో అవన్నీ సాఫీగా పూర్తవుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల... టీడీపీ గత తొమ్మిదేళ్ల పాలనలో విజయనగరం స్థానికులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వ జూనియర్ కళాశాల గురించి పట్టించుకోలేదు. 70 శాతం వరకు మధ్యతరగతి కుటుంబాలున్న విజయనగరం జిల్లాకేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉండాలని బొత్స సత్యనారాయణే గతంలో రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాధించారు. వైఎస్సార్ తొలి ఐదేళ్ల పాలనలోనే ఈ కళాశాల మంజూరైంది. ప్రస్తుతం స్థానిక కస్పా మున్సిపల్ ఉన్నత పాఠశాల ఆవరణలో కళాశాలను నిర్వహిస్తున్నారు. కళాశాలకు పక్కా భవనాల నిర్మాణం కోసం నగర నడిబొడ్డున ఉన్న రాజీవ్‌నగర్ సమీపాన మున్సిపల్ స్థలాన్ని కేటాయించడం కోసం ప్రయత్నాలు జరిగాయి. ఈసారి అది ఫలించే అవకాశం ఉంది. ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్... విజయనగరం పట్టణ శివారులోని ఉన్న ఆంధ్రా యూనివర్శిటీ క్యాంపస్ విస్తరణ కోసం శివారు ప్రాంతంలో 200 ఎకరాల భూమిని కూడా బొత్స సత్యనారాయణ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని ఒప్పించి మంజూరు చేయించారు. అంతవరకు పట్టణంలో చిన్నచిన్న అద్దె భవనాల్లో ఉన్న ఈ క్యాంపస్ కోసం రూ.5 కోట్లు నిధులు కూడా సాధించారు. అలా పక్కా భవనాన్ని నిర్మించారు. స్కిల్ డెవలెప్మెంట్ కళాశాల కావాలి... ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెంపొందించే దిశగా విద్యారంగంలో ప్రభుత్వం పలు సంస్కరణలను తలపెట్టింది. అందులో భాగంగా రాష్ట్రంలో వినూత్నంగా స్కిల్ డెవలెప్మెంట్ కళాశాలలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలా ఒక కళాశాలను విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయడానికి విద్యాశాఖ మంత్రిగా వేగవంతం చేస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే తగిన స్థలం కోసం జిల్లా కేంద్రంలో పరిశీలించారు. స్థానిక ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాల ప్రాంగణంలో స్థలాన్ని ఎంపిక చేశారు. అయితే ఆ స్థలాన్ని ప్రభుత్వం ఇంకా నిర్ధారించలేదు. ఆమోదయోగ్యం పాలనా సంస్కరణల్లో భాగంగా సీఎం చేపట్టిన కొత్త మంత్రి వర్గం కూర్పు అందరికీ ఆమోదయోగ్యంగా ఉంది. ముఖ్యంగా అధికంగా ఉన్న బీసీలకు మంచి ప్రాధాన్యమిచ్చారు. బొత్స సత్యనారాయణ సీనియారిటీ, సిన్సియారిటీని సీఎం గుర్తించారు. ఆయనను మళ్లీ మంత్రివర్గంలో చేర్చినందుకు కృతజ్ఞతలు. – అప్పికొండ రవికుమార్, న్యాయవాది, నెల్లిమర్ల సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయం పాటించిన సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు. కొప్పులవెలమ సామాజిక వర్గానికి చెందిన బూడి ముత్యాలనాయుడు, పోలినాటి వెలమలకు చెందిన ధర్మాన ప్రసాదరావు, తూర్పుకాపుల్లో ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ, ఎస్టీ ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, వైశ్యసామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికి పదవులు కేటాయించడం హర్షణీయం. – నెక్కల నాయుడుబాబు, చైర్మన్, కొప్పుల వెలమ కార్పొరేషన్ సామాజిక న్యాయం.. పదవుల కేటాయింపులో పూర్తిస్థాయిలో సామాజిక న్యాయాన్ని పాటించారు. కొత్తమంత్రివర్గం కూర్పు బాగుంది. అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగనుంది. – కనకల చంద్రరావు ఎస్జీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బడుగు వర్గాలకు ప్రాధాన్యం మంత్రి పదవుల కేటాయింపులో బడుగు, బలహీన వర్గాలకు సముచిత స్థానం దక్కింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అగ్రపీఠం వేశారు. – వి.నాగేశ్వరరావు, వ్యవసాయ సలహామండలి జిల్లా చైర్మన్, బూర్జ, సీతానగరం మండలం బడుగు బలహీనుల రాజ్యం జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. తొలిసారి మంత్రివర్గంలోనే ఆ దిశగా మంత్రి పదువులు అత్యధికంగా ఇచ్చారు. ఈ సారి మంత్రివర్గ విస్తరణలో కూడా బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగ పదవులు ఇచ్చి దేశంలో ఏ రాష్ట్ర పాలకులు తీసుకోని వీరోచిత నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల్లో గొప్ప సంస్కరణకర్తగా నిలిచారు. – కొరుపోలు సత్యారావు, అవార్డీ ఉపాధ్యాయుల సంక్షేమ సంఘ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు -
పార్వతీపురంలో కూలిపోయిన పూరిళ్లు
-
ఆదర్శమంటే ఆయనే: సర్కారు కాలేజీలో పీవో కుమారుడు
సీతానగరం (పార్వతీపురం): ఒకరికి ఏదైనా సలహా ఇచ్చేముందు మనమూ దాన్ని ఆచరించేందుకు సిద్ధంగా ఉండాలనే మాటను అక్షరాల పాటిస్తున్నారు పార్వతీపురం ఐటీడీఏ పీవో కూర్మనాథ్. తన పిల్లలను ప్రభుత్వ బడి, కళాశాలలో చదివిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇటీవల పార్వతీపురం కేపీఎం మున్సిపల్ హైస్కూల్లో పదోతరగతి పూర్తిచేసిన కుమారుడు త్రివిక్రమ్‌ను గురువారం సీతానగరం మండలం జోగంపేటలో ఉన్న గిరిజన ప్రతిభ కళాశాలలో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో చేర్పించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను ప్రభుత్వం నాడు–నేడు నిధులతో సుందరంగా తీర్చిదిద్దిందని, ప్రమాణాలతో కూడిన విద్యను బోధిస్తున్నారని, అందుకే గిరిజన కళాశాలలో తన కుమారుడిని చేర్పించానని ఆయన విలేకరులకు తెలిపారు. అనంతరం అక్కడి విద్యార్థులకు బ్యాగ్‌లు, మెటీరియల్, నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. ఇవీ చదవండి: అక్కడ రూపాయికే ఇడ్లీ: ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజమే.. ఇలాంటి పందుల పోటీలు ఎప్పుడైనా చూశారా? -
షణ్ముఖప్రియ మన అమ్మాయే.. ఓటేసి గెలిపించండీ ప్లీజ్!
సీతానగరం(పార్వతీపురం): సుమధుర గానంతో దేశంలోని సంగీత ప్రియులు, అభిమానులను ఉర్రూతలూగిస్తున్న గాయని, సోనీ టీవీ 12వ ఇండియన్ ఐడల్ ట్రోఫీ తుది పోటీల్లో తలపడుతున్న షణ్ముఖప్రియ మన పార్వతీపురం అమ్మాయే. ప్రాథమిక విద్యాభ్యాసంతో పాటు స్వరపదనిసలను ఇక్కడే నేర్చుకున్నారు. తన గాన మాధుర్యంతో సంగీత ప్రియులను అలరిస్తున్నారు. లిటిల్ చాంప్స్, పాడుతా తీయగా వంటి పోటీల్లో పాల్గొని ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు ఈ నెల 15న జరిగే ఇండియన్ ఐడల్ ట్రోఫీ ఫైనల్ పోరులో నిలిచారు. ఓటేసి గెలిపించాలంటూ ఆమెతో పాటు అభిమానులు జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. స్వర పరిచయం చేసిన పార్వతీపురం షణ్ముఖ ప్రియకు పార్వతీపురం పట్టణానికి విడదీయరాని బంధం ఉంది. ఆమె తల్లి రత్నమాల పట్టణంలోని అగ్రహారం వీధిలో జన్మించారు. వీణ వాయిద్యంలో దిట్ట. రత్నమాలకు వయోలిన్ విద్వాంసులు శ్రీనివాస్ కుమార్‌తో వివాహం జరిగింది. షణ్ముఖ ప్రియ అమ్మమ్మ పార్వతీపురం మున్సిపల్ ఉన్నత పాఠశాలో ఉపాధ్యాయిని. తల్లిదండ్రులిద్దరూ సంగీత విద్వాంసులు కావడంతో చిన్నప్పటినుంచే షణ్ముఖప్రియ సంగీతంలో ఓనమాలు దిద్ది అంచెలంచెలుగా ఎదిగారు. ఆమె కుటుంబం కొన్నాళ్లు విశాఖపట్నంలోను, ప్రస్తుతం ముంబయిలో నివసిస్తున్నట్టు ఇక్కడి వివేకానంద కాలనీవాసులు చెబుతున్నారు. మన ఊరు అమ్మాయి గెలుపునకు సోనీలివ్, ఫస్ట్క్రైడాట్ యాప్‌లను డౌన్లోడ్ చేసుకుని ఓటేయవచ్చు. -
గిరిజనులతో కలిసి డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి థింసా డ్యాన్స్
-
గిరిజనులతో కలిసి డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి థింసా డ్యాన్స్
సాక్షి, పార్వతీపురం: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖామంత్రి పాముల పుష్ప శ్రీవాణి గిరిజనులతో కలిసి థింసా నృత్యం చేసి ఆకట్టుకున్నారు. ఉత్సవాల్లో ఎమ్మెల్యే అలజంగి జోగారావు డప్పు కొట్టి ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే జోగారావు, కలెక్టర్ సూర్యకుమారి, ఎమ్మెల్సీ రఘువర్మ, సబ్ కలెక్టర్ భావన, ఐటీడీఏ పీఓ కూర్మనాధ్, మున్సిపల్ చైర్పర్సన్ గౌరీశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
విజయనగరంలో గుజరాత్ యువతుల హల్చల్
-
విజయనగరంలో గుజరాత్ యువతుల హల్చల్
పార్వతీపురం: విజయనగరం జిల్లాలో గుజరాత్ యువతులు హల్చల్ చేస్తున్నారు. పార్వతీపురం రోడ్లపై గుంపులుగా తిరుగుతూ స్థానికంగా ఆందోళన రేకెత్తించారు. వారు భాష, యాస కాస్త భిన్నంగా ఉండటంతో ఈ యువతులపై మీడియా ఫోకస్ చేసింది. ప్రధానంగా వీరిపై వాహనదారులు.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగుచూసింది. వాహనదారులను ఆపి డబ్బులు డిమాండ్ చేయడమే యువతులపై ఫిర్యాదుకు కారణం. కాగా, తాము గుజరాత్లో ఉపాధి కోల్పోయిన కారణంగా ఇలా వచ్చామని సదరు యువతులు పోలీసులకు చెప్పుకొచ్చారు. ఉపాధిని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చామని వివరణ ఇచ్చే యత్నం చేశారు. వీరు ఒక లాడ్జిలో మకాం వేసే ఇలా రోడ్లపై తిరుగుతున్నారనే విషయం పోలీసుల విచారణలో వెల్లడైంది. మొత్తం 24 మంది మహిళలను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు.. వీరిని తిరిగి అహ్మదాబాద్‌కు పంపించే యత్నం చేస్తున్నారు. -
వంగపండు కుటుంబానికి మంత్రులు పరామర్శ
సాక్షి, పార్వతీపురం: ఇటీవల మరణించిన ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు కుటుంబాన్ని మంత్రులు ఆదివారం పరామర్శించారు. ఉప ముఖ్యమంత్రులు ధర్మాన కృష్ణదాస్, పాముల పుష్ప శ్రీవాణి, మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళర్పించారు. వంగపండు ప్రసాదరావు కుమార్తె ఉష, కుమారుడు దుష్యంత్, భార్య విజయలక్ష్మిలకు ముఖ్యమంత్రి తరపున మంత్రులు సంతాపం తెలిపారు. వంగపండు మృతి ఉత్తరాంధ్ర లోని పేదలు, అట్టడుగు వర్గాల వారికి లోటని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆయన కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందన్నారు. డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జానపద కళారూపాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన వ్యక్తి వంగపండు అని పేర్కొన్నారు. వంగపండు ప్రసాదరావు భౌతికంగా లేకపోయినా ఆయన పాట, మాట ఈ పుడమి వున్నంత కాలం చిరస్థాయిగా నిలిచి వుంటాయని మంత్రి పేర్ని నాని అన్నారు. అట్టడుగు వర్గాల, గిరిజనుల గొంతుక గా వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చి వాటి పరిష్కారానికి జీవితాంతం కృషి చేసిన వ్యక్తి వంగపండు ప్రసాదరావు అని మంత్రి కొడాలి నాని తెలిపారు. -
పార్వతీపురంలో వంగపండు అంత్యక్రియలు
-
ఉపాధ్యాయుని అవతారం ఎత్తిన ఎమ్మెల్యే
సాక్షి, పార్వతీపురం : పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు బుధవారం ఉపాధ్యాయుని అవతారం ఎత్తారు. బందలుప్పి జెడ్పీ ఉన్నత పాఠశాలను బుధవారం సందర్శించి విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించారు. హిందీ, గణితం, సైన్సు సబ్జెక్టులపై విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను పరీక్షించారు. అనంతరం పలు ప్రశ్నలు వేసి వాటిని సోదాహరణంగా వివరించారు. ప్రొఫెసర్‌గా పనిచేసిన అనుభవంతో అకట్టుకునేలా బోధన సాగించారు. కాలాన్ని వృథా చేయకుండా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. పదోతరగతిలో పదికి పది మార్కుల సాధనే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. చక్కగా చదువుకుని ఉన్నత స్థానాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. -
పోలీసు కేసులు ఉండకూడదని..
పార్వతీపురం: ఈ కుర్రాడి పేరు గెంబలి గౌతమ్ విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణానికి చెందిన వాసు, లక్ష్మి దంపతుల కుమారుడు. చదివింది కంప్యూటర్ సైన్స్. కానీ.. మెకానిజంలో ప్రయోగాలు చేస్తున్నాడు. దసరా సెలవులకు ఇంటికి వచి్చనపుడు ఏటా ఏదో ఒకటి చేయడం గౌతమ్ హాబీ. ఈ ఏడాది తన స్నేహితుడైన వెల్డర్ జానకి సహాయంతో కేవలం 15 గంటల్లో ఈ–బైక్ రూపొందించాడు. దానిని రెండు గంటలపాటు చార్జింగ్ చేస్తే 50 నుంచి 60 కిలోమీటర్ల స్పీడ్‌తో 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని రుజువు చేశాడు. ఇలా చేశాడు.. వాహనం తయారీకి గౌతమ్ పాత ఇనుప సామగ్రి, ఎలక్ట్రికల్ వస్తువులు, స్కూటీ టైర్లు, బీఎల్డీసీ మోటార్, లిథియం బ్యాటరీని వినియోగించాడు. యాక్సిలేటర్, ఆటో గేర్ సిస్టం, హ్యాండ్ బ్రేక్ ఉపయోగించాడు. రాత్రి కూడా సునాయాసంగా ప్రయాణించేందుకు వీలుగా బైక్‌కు ఫ్లడ్ లైట్ అమర్చాడు. పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారి జల్దు వినయ్ ఎలక్ట్రికల్ పరికరాలు ఉచితంగా ఇవ్వడంతో తన ప్రయోగం వేగంగా ముగిసిందని గౌతమ్ చెబుతున్నాడు. ఎమ్మెస్సీ కంప్యూటర్స్ చేసిన గౌతమ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని వాషన్ కంపెనీలో ప్రోగ్రాం ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. ఇప్పటివరకూ నాలుగు బైక్‌లు, ఒక కారు తయారు చేశాడు. మెజీషియన్‌గా పలు వేదికలపై ప్రదర్శనలిచ్చి మెప్పించాడు. పోలీసు కేసులు ఉండకూడదనే.. బైక్‌పై వెళుతుంటే పోలీసులు అడ్డుకుని.. లైసెన్సు ఉందా, హెల్మెట్ ఉందా, సీ బుక్ ఉందా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుండేవారు. అవి లేకపోతే కేసులు రాసేవారు. ఇలా పోలీసులకు చిక్కిన ప్రతిసారీ ఫైన్లు కట్టడం ఇష్టం లేక ఏం చేయాలా అని ఆలోచించి ఈ–బైక్ తయారు చేశా. ఇది సైకిల్ మాదిరిగా ఉంటుంది. బరువు తక్కువ. హెల్మెట్, సీబుక్ అక్కరలేదు. డీజిల్, పెట్రోల్‌తో పనిలేదు. దీనివల్ల కాలుష్యం కూడా ఉండదు. ప్రభుత్వం సహకారం అందిస్తే ఇటువంటి వాటిని తయారు చేస్తాను. పేటెంట్ కోసం ప్రయత్నిస్తున్నాను. – గెంబలి గౌతమ్ ,పార్వతీపురం -
దొరికితే దొంగ.. లేకుంటే దొర
ఆయన చేయి తడిపితే చాలు భవనాల విస్తీర్ణం తగ్గిపోతుంది. పన్నుల భారం నుంచి విముక్తి కలుగుతుంది. సర్కారు ఆదాయానికి గండికొట్టడమే తన విద్యుక్త ధర్మంగా భావిస్తున్న ఆ అధికారి ఉన్న పళంగా ఆస్తులు కూడబెట్టేశారు. సునాయాసంగా లక్షల్లో లంచాలు తీసుకుంటున్నారు. ఆయన పాపం పండింది. ఓ భవన యజమాని నుంచి లంచం ఆశించిన ఆయన అవినీతి అధికారుల వలలో చిక్కారు. ఆయనే పార్వతీపురం మునిసిపాలిటీలో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న శంకరరావు. సాక్షి, పార్వతీపురం: పార్వతీపురం మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ శంకర్రావు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు మంగళవారం పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ బీవీఎస్ నాగేశ్వరరావుకు అందిన సమాచారం మేరకు మాటు వేసి మున్సిపల్ కార్యాలయం ముందు కారులో ఆర్.శ్రీనివాసరావు అనే వ్యక్తి నుంచి అపార్టుమెంట్ అసెస్మెంట్ను తగ్గించి ట్యాక్స్ వేసేందుకు రూ.2.80లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఇంత పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వ్యక్తుల్లో ఆర్ఐ శంకర్రావు పార్వతీపురం చరిత్రలో మొదటి వ్యక్తి కావడం విశేషం. లంచం అడిగిన శంకర్రావు విషయమై భవన యజమాని శ్రీనివాసరావు ఏసీబీ అధికారులకు తెలియజేసి పథకం ప్రకారం పట్టించారు. ఏసీబీ అధికారులు శంకర్రావుపై కేసు నమోదు చేశారు. పెచ్చుమీరిన అవినీతి వరుస ఏసీబీ దాడులు జరుగుతున్నా లంచగొండుల తీరు మారడం లేదు. ఈ శాఖ ఆ శాఖ అన్న తేడా లేకుండా పని జరగాలంటే చేయి తడపాల్సిందే. ముఖ్యంగా రెవెన్యూ, పురపాలక శాఖలో లంచగొండితనం పెట్రేగిపోతుంది. దొరికిన వాడు దొంగగా ముద్ర వేసుకుంటున్నాడు. దొరకని వాడు దొరలా దర్జాగా తిరుగుతున్నాడు. లంచం ఇచ్చేవారు కూడా తమ పని అయిపోతే సరిపోతుంది అధికారుల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు అన్న కోణంలో ఆలోచన చేస్తూ అధికారుల చేయి తడుపుతూ పనులు చేయించుకుంటున్నారు. మున్సిపల్ కార్యాలయంలో.. పార్వతీపురం మున్సిపల్ కార్యాలయంలో రెవెన్యూ, పట్టణ ప్రణాళికా విభాగంలో అవినీతి పెట్రేగిపోతుంది. రెవెన్యూ శాఖలో పన్నులు వసూలు చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా నివాస గృహాలు, వాణిజ్య సముదాయాల మొండి బకాయిలు చెల్లించకుండా ఉండే వారిని బెదిరించి వారి నుంచి లంచాలు తీసుకుని వారికి లబ్ధి చేయడం పరిపాటిగా మారింది. సంవత్సరాల తరబడి పన్నులు చెల్లించని వారు ఉంటే అటువంటి వారిని టార్గెట్ చేసి పన్ను కడతారా? లేక ఆస్తులు జప్తు చేయమంటారా? అని బెదిరించి ఎంతోకొంత చేతికి ముట్ట చెబితే విడిచిపెడతామని బెదిరించి లంచాలు తీసుకుంటున్నారు. అయినా వీరు ఏసీబీ అధికారులకు చిక్కకుండా సత్యహరిశ్చంద్రుల్లా దర్జాగా తిరుగుతున్నారు. పట్టణ ప్రణాళికా విభాగం లంచగొండి తనానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. పార్వతీపురం పురపాలక సంఘం పరిధిలో ఎన్నో అనధికార భవనాలు ఉన్నాయి. కానీ వాటిపై చర్యలు ఉండవు. ఎందుకుంటే పాలకుల నుంచి అధికారుల వరకు భారీగా ముడుపులు తీసుకుని చూసీచూడనట్టు వ్యవహరిస్తుంటారు. బిల్డింగ్ ప్లాన్ కావాలంటే లంచం, భవనం విస్తీర్ణం తగ్గించాలంటే లంచం, లేఔట్ రెగ్యులైజేషన్ చేయాలంటే లంచం, కొత్త లేఔట్ వేయడానికి అనుమతులు ఇవ్వాలంటే లంచం ఇలా ప్రతీ పనికి ఒక రేటు నిర్ణయించి లంచం తీసుకుంటుంటారు. వరుస సంఘటనలు... ► మూడేళ్ల కిందట పార్వతీపురం రెవెన్యూ శాఖలో ఆర్ఐగా పని చేసిన కిరీటి లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ► పార్వతీపురం పురపాలక సంఘం పరిధిలోని పట్టణ ప్రణాళికా విభాగంలో టీపీఎస్‌గా పని చేసిన జనార్ధన్ లంచం తీసుకుంటు పట్టుబడ్డారు. ► పార్వతీపురం పట్టణంలోని జేపీ అపార్ట్మెంట్లో లంచం తీసుకుంటూ జియ్యమ్మవలసకు చెందిన తహసీల్దార్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ► ఐటీడీఏ డీఈగా పని చేసి మూడేళ్లు క్రితం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ► ఇటుక బట్టీకి విద్యుత్ సరఫరా ఇవ్వడానికి లంచం తీసకుంటూ గరుగుబిల్లి ఏఈ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. -
మంచి ఆహారంతోనే ఆరోగ్యం
సాక్షి, పార్వతీపురం(విజయనగరం) : మన దేశంలో 45 శాతం మంది పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నట్టు ఓ సర్వే నివేదిక. ఇది నిజంగా అందరినీ కలవరపెట్టే సామాజిక సమస్య. ఇదే దేశంలోని కొద్దో, గొప్పో మంది పిల్లలు విపరీతమైన జంక్‌ఫుడ్స్‌కు అలవాటు పడి ఊబకాయులుగా తయారౌతున్న పరిస్థితి. ఈ రెండింటికీ చెందని మధ్యతరగతి పిల్లలది మరో ప్రత్యేక కేటగిరి. ఈ పిల్లల ఆహారపు అలవాట్లు ఇటీవల కాలంలో చిత్రంగా తయారవుతున్నాయి. పట్టణాలు, నగరాల్లో నివసించే వారిలో అధికశాతం తల్లులు పిల్లలకు కేవలం తిండితినిపించడం పైనే శృతిమించిన శ్రద్ధ కనబరుస్తారని, అది బెడిసి కొట్టి మొదటికే మోసం వచ్చి పిల్లలు అసలు తినాలంటేనే మారాం చేసే మొండి ఘటాలుగా తయారవుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ఇష్టంగా తింటే ఒంటికి మంచిది... చందమామ రావే... జాబిల్లి రావే...కొండెక్కిరావే..గోగుపూలు తేవే... అంటూ చిన్నప్పుడు తల్లులు ఏంచక్కా పాటల పాడుకుంటూ పిల్లలకు గోరుముద్దలు తినిపించడమనేది కాస్తా వెనుకటి తరం వారికి చిరపరిచయమే. ఇప్పుడు అలాంటి కమనీయ దృశ్యాలు కనుమరుగైపోయి జీవితం యాంత్రికంగా తయారైపోయింది. ఆకలివేసినా, వేయకపోయినా పిల్లలను పట్టుకుని నోట్లో తప్పనిసరిగా ఏదో ఒకటి కుక్కాలన్నట్లుగా తల్లులు బలవంతం చేయడం, పిల్లలు అందుకు ప్రతీకారంగా తినకుండా ముప్పతిప్పలు పెట్టడం, వాంతులు చేసుకోవడం, ఆ తరువాత తన్నులు, ఆపై బుజ్జిగింపులు వంటి సంఘటనలు ప్రతి ఇంటిలో నేడు కనిపిస్తున్నాయి. చిన్న పిల్లల వైద్యుల వద్దకు వచ్చే కేసుల్లో దాదాపు 50 శాతానికి పైగా తమ పిల్లలు సరిగ్గా తినడం లేదనే ఫిర్యాదులే ఉంటాయి. ఇష్టంగా తింటేనే పిల్లల ఒంటికి మంచిదన్నది వైద్యుల సూచన. అలవాట్లను మార్చాల్సిందే... దాగుడు మూతలు, గోళీకాయలాట, బొంగరాలు, కబడ్డీ, ఖోఖో వంటి ఆటలతో బిజీగా గడపడం.. సరదాగా చదువుకోవడం.. దశాబ్దం కిందటి చదువు సంద్యల చిత్రం. కంప్యూటర్లో, లేదంటే సెల్ఫోన్లలో టెంపుల్‌రన్, హేండీక్రష్ లాంటి గేమ్సు ఆడడం, టీవీల్లో కార్టూన్ షోలకి, క్రికెట్ షోలకి పరిమితమైపోవడం.. పొద్దస్తమానం హోంవర్కులు, ట్యూషన్లు, పరీక్షలు, ర్యాంకులు ఇవీ నేటి పిల్లల ఆటపాటలు. శారీరక వ్యాయామం లేకపోవడంతో చిన్నారుల్లో రకరకాల ఆరోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. అలాగే స్వీట్లు, ఐస్క్రీమ్సు, పిజ్జాలు, బర్గర్లు, చాక్లైట్లు, కోక్ పానియాలు ఇలా నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోయి కొవ్వుగా మారిపోయే జంక్ ఫుడ్స్‌కి పిల్లలు ఇటీవల కాలంలో బాగా అలవాటు పడిపోతున్నారు. దీనికి తోడుగా ఏమాత్రం ఆటలో శారీరక శ్రమ లేకపోవడం, పైగా చదువుల ఒత్తిళ్లు ఇవన్నీ కలగలసి చిన్నపిల్లల్లో ఊబకాయంతో పాటు ప్రవర్తనా పరమైన సమస్యలు తలెత్తేలా చేస్తున్నాయి. పిల్లల ఆహారం, అలవాట్లలో మార్పు అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. -
పార్వతీపురం బహిరంగ సభలో వైఎస్ జగన్
-
ఆయనకు ఒడిశా వెళ్లాలన్న ధ్యాస లేదు : వైఎస్ జగన్
సాక్షి, విజయనగరం : తమిళనాడులో ఉన్న ఎంకే స్టాలిన్, పశ్చిమ బెంగాల్లో ఉన్న మమతా బెనర్జీ, ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసేందుకు ప్రత్యేక విమానాల్లో తిరిగే సీఎం చంద్రబాబుకు ప్రజల సమస్యలు పట్టవని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. దేశమంతా తిరిగే చంద్రబాబుకు పక్కనే ఉన్న ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను కలుసుకునే ధ్యాస లేదని ఎద్దేవా చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తలపెట్టిన జంఝావతి రబ్బర్ డ్యామ్‌ను బాబు నిర్లక్ష్యం చేశాడని ఆయన మండిపడ్డారు. ఒడిశా సీఎంతో చర్చలు జరిపి రబ్బర్ డ్యామ్‌ను అందుబాటులోకి తేవచ్చు కదా అని హితవు పలికారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్ బుధవారం విజయనగరం జిల్లా పార్వతీపురం బహిరంగ సభలో మాట్లాడారు. ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో ఎన్నికల బరిలో దిగిన వైఎస్సార్సీపీ పార్వతీపురం ఎమ్మెల్యే అభర్థి ఎ.జోగారావు, అరకు ఎంపీ అభ్యర్థి గొడ్డేటి మాధవిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే మీ ఓటు వేయండి. వీరిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి’ అని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే... ‘చంద్రబాబు ఐదేళ్ల పరిపాలన చూశాం. వెనకబడిన విజయనగరం జిల్లాకు బాబు చేసిన అభివృద్ధి ఒక పెద్ద సున్నా. 2014 ఎన్నికల్లో మాయమాటలు చెప్పాడు. ఇప్పుడు ఎన్నికల ముందు మళ్లీ అవే డ్రామాలు మొదలు పెట్టాడు. ఈ జిల్లాకు మంచి చేయాలనే ఆలోచన చేసిన ఏకైన వ్యక్తి మహానేత వైఎస్సార్ మాత్రమే. రైతుల కోరిక మేరకు ఆయన ప్రభుత్వం హయాంలో తోటపల్లి ప్రాజెక్టు చేపట్టారు. రూ.450 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో 400 కోట్లు ఖర్చుచేసి దాదాపు 90 శాతం పనులు పూర్తి చేయించారు. కానీ, మిగిలిపోయిన 10 శాతం పనులు చేయలేక చంద్రబాబు ప్రభుత్వం రైతులను దారుణంగా మోసం చేసింది. ఈ ప్రాజెక్టు కింద లక్షా 25 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉండగా.. ఇంకా 80 వేల ఎకరాలకు నీళ్లివ్వని పరిస్థితి ఉంది. ఒడిషాతో వివాదం ఉన్నా కూడా నాన్నగారు జిల్లా రైతులకు మంచి చేయడానికి ముందుకొచ్చారు. జంఝావతి రబ్బర్ డ్యామ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. చంద్రబాబు మాత్రం ఆ ప్రాజెక్టును ఏ మాత్రం పట్టించుకోలేదు. ప్రత్యేక విమానాల్లో తిరిగే చంద్రబాబు పక్కనే ఉన్న ఒడిషా సీం నవీన్ పట్నాయక్‌తో చర్చలు జరిపి ఉంటే జంఝావతి, వంశధార ప్రాజెక్టులు పూర్తయ్యేవి. రైతులకు మేలు జరిగేది’ అని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. ‘పార్వతీపురం పురపాలక సంఘంలో తాగునీటి సమస్య ఉంది. నాగవళి నేలబావులు పాడైపోతే చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. ఏరియా ఆస్పత్రిని 100 పడకల నుంచి 200 పడకల ఆస్పత్రిగా చేస్తామని చెప్పి గత ఎన్నికల్లో బాబు హామీనిచ్చాడు. కానీ, పట్టించుకోలేదు. అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉండాల్సింది పోయి.. ఆ సంస్థ ఆస్తులను కాజేయడానికి బాబు, అతని బినామీలు యత్నించారు. ఆ భగవంతుడి ఆశీస్సులు.. మీ అందరి దీవెనలతో 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేశా. ప్రతి అడుగులో.. జిల్లాలోని ప్రతి కుటుంబం పడుతున్న ఆవేదన, కష్టాలు విన్నా. ప్రభుత్వం సాయంలేక మీ అందరూ ఎంత బాధపడుతున్నారో చూశా. ఈ వేదికపైనుంచి మీ అందరికీ చెప్తున్నా. మీ అందరికీ నేనున్నాను అని మాట ఇస్తున్నా’ అని వైఎస్ జగన్ ప్రసంగం కొనసాగించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సూట్‌కేసుల్లోని 70 తులాలా బంగారం మాయం..!
సాక్షి, విజయనగరం : బొకారో రైలులో భారీ దొంగతనం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా చెల్లూరుకి చెందిన రైల్వే కాంట్రాక్టర్ సత్యనారాయణ ఒడిషాలోని ఆర్తబిరాలో ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి వెళ్లొస్తుంగా ఈ ఘటన చోటుచేసుకుంది. 77 తులాల బంగారం గల తన రెండు సూట్ కేసులు మాయమయ్యాయని బాధితుడు తెలిపాడు. తిట్లఘర్ - రాయగడ మధ్యలో దొంగతనం జరిగినట్టు వెల్లడించాడు. సూట్‌కేసుల్లో సుమారు 77 తులాల బంగారం ఉందని సత్యనారాయణ తెలిపారు. బాధితుడు తొలుత పార్వతీపురం రైల్వేస్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. భారీ దోపిడీ నేపథ్యంలో విజయనగరంలో ఫిర్యాదు చేయాలని రైల్వే అధికారులు సూచించారు. -
‘విశాఖ ఎయిర్‌పోర్టులో నాపై జరిగింది కుట్ర కాదా బాబూ’
-
పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుకు రాలేదా బాబు..!
-
‘నేనడుగు పెట్టా.. సీసీ కెమెరాలు బంద్’
సాక్షి, విజయనగరం : ‘రాజకీయంగా నన్ను ఎదుర్కొనే దమ్ములేకనే.. అంతమెందించాలని చూశారు’ అని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. టీడీపీ అరాచక పాలనలో అన్యాయానికి గురౌతున్న ప్రజల సమస్యల్ని తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్నానని చెప్పారు. ప్రజల్లో తనకు వస్తున్న ఆదరణ చూసి చంద్రబాబు ఓర్వలేకపోయాడనీ, అందుకే తనపై హత్యాయత్నం జరిగిందని వెల్లడించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ పార్వతీపురంలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు లాంటి నక్క జిత్తుల మనిషి ప్రపంచంలో మరొకరు ఉండరని వ్యాఖ్యానించారు. ‘విశాఖ ఎయిర్‌పోర్టులో నాపై జరిగింది కుట్ర కాదా’ అని చంద్రబాబును ప్రశ్నించారు. ‘బీజేపీతో నాలుగేళ్లు అధికారాన్ని పంచుకున్న టీడీపీ గత మార్చి నెలలో తెగదెంపులు చేసుకుంది. అప్పటికే ప్రజాసంకల్పయాత్రకు విశేష స్పందన రావడంతో నన్ను చంపేందుకు పథకం రచించారు. ఓ సినీ నటుడిని తీసుకొచ్చి ఆపరేషన్ గరుడ పేరుతో స్క్రిప్టు చదివించారు. దానికి ఎల్లో మీడియాలో విస్తృత ప్రచారం కల్పించారు. ఆపరేషన్ గరుడ పేరుతో బీజేపీ రాష్ట్రంలో అనిశ్చితి రగిల్చి టీడీపీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర చేస్తోందని జనాన్ని నమ్మించే ప్రయత్నం చేశారు. రాష్ట్ర ప్రతిపక్ష నేతపై దాడి జరగబోతోందని నటుడితో చెప్పించారు. కేంద్రం పరిధిలో ఉండే ఎయిర్‌పోర్టులో దాడి చేసి నన్ను చంపేస్తే బాబు ప్రభుత్వానికి ఏ సంబంధం ఉండదనుకున్నారు. ఆ ప్రయత్నం విఫలమవడంతో ఆపరేషన్ గరుడలో చెప్పినట్టే జరిగిందని ప్రచారం చేస్తున్నార’ని వైఎస్ జగన్ ప్రజలకు వివరించారు. మూడు నెలల నుంచి కెమెరాలు బంద్..! ‘పాదయాత్ర చేస్తూ ఆగస్టు నెలలో విశాఖ జిల్లాలో అడుగుపెట్టిన వెంటనే ఎయిర్‌పోర్టులో సీసీ కెమెరాలు ఆగిపోయాయి. నాపై దాడి జరిగిన అనంతరం సీసీ కెమెరా ఫుటేజీలపై ఆరా తీయగా.. మూడు నెలల నుంచి అక్కడ కెమెరాలు పనిచేయడం లేదని చెప్తున్నారు. ఇదంత కుట్ర కాదా.. బాబూ’ అని వైఎస్ జగన్ చంద్రబాబుపై విరుచుకుపడ్డాడు. కట్టుదిట్టమైన భద్రత ఉండే ఎయిర్‌పోర్టులోకి కత్తులు ఎలా వచ్చాయని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ‘బాబు సన్నిహితుడైన హర్షవర్ధన్ చౌదరి రెస్టారెంట్లో పనిచేసే వ్యక్తి నాపై దాడి చేశాడు. దానిని కూడా చంద్రబాబు రాజకీయం చేయాలని చూశాడు. ఘటన జరిగిన గంటలోపే రాష్ట్ర డీజీపీ, మంత్రులు మీడియా మందుకొచ్చి హత్యాయత్నం చేసింది జగన్ అభిమానే అని ప్రకటించారు. అభిమాని అయితే.. దాడి చేస్తారా’ అని ప్రశ్నించారు. దాడి జరిగిన అనంతరం వీఐపీ లాంజ్‌లో నిందితుడి వద్ద సీఐఎస్ఎఫ్ సిబ్బందికి ఎలాంటి లేఖ దొరకలేదని వైఎస్ జగన్ చెప్పారు. ఘటన జరిగిన 10 గంటల తర్వాత డీజీపీతో చెక్కుచెదరని, ఎక్కడా మడతలు పడని లేఖను మీడియాకు చూపించారని గుర్తు చేశారు. ‘ఇదంతా కుట్ర కాదా బాబూ’.. అని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. ‘వైఎస్ జగన్‌పై దాడి చేయించింది.. ఆయన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలే కావచ్చు అని దిక్కుమాలిన స్టేట్మెంట్లు ఇచ్చే స్థాయికి బాబు రాజకీయాలు దిగజారాయి. నాపై జరిగిన హత్యాయత్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎలాంటి ప్రమేయం లేకపోతే.. స్వతంత్ర దర్యాప్తు సంస్థతో కేసు విచారణ చేయించొచ్చు కదా’ అన్నారు. ‘ఓదార్పు యాత్ర చేపడతానన్న నాపై కాంగ్రెస్‌తో కుమ్మక్కై అక్రమ కేసులు పెట్టించావ్. నాడు సీబీఐ ముద్దు అన్నావ్. నేడు వద్దు అంటున్నావ్. రాష్ట్రంలో సీబీఐ అడుగు పెట్టొద్దని ఏకంగా జీవో జారీ చేశావ్. నాపై జరిగిన హత్యాయత్నంపై గానీ, నీ అవినీతి పాలనపై గానీ, ఓటుకు కోట్లు కేసులో గానీ సీబీఐతో విచారణ చేయిస్తే... చంద్రబాబు జైలుకు పోవడం ఖాయం. అందుకే సీబీఐకి వ్యతిరేకంగా ఇంతటి నీచమైన చర్యలు చేపట్టావ్’ అని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. అప్పటికే ఆలస్యం అయినందున ‘నవరత్నాలు’ గురించి మరో సభలో వివరిస్తానన్నారు. తనపై జరిగిన హత్యాయత్నంపై టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేయడంతో తీవ్రంగా కలత చెందినట్టు జననేత వెల్లడించారు. తన కోసం వచ్చిన ప్రజలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. -
గ్రాఫిక్స్ ఉంది.. రాజధాని ఏది బాబూ?: వైఎస్ జగన్
సాక్షి, విజయనగరం: అగ్రిగోల్డ్ ఆస్తులను కాజేసేందుకు చంద్రబాబు, లోకేష్, వాళ్ల బినామీలు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునే వారే కరువయ్యారని ఆవేదన చెందారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విజయనగరం జిల్లా పార్వతీపురంలోని పాత బస్టాండ్ సెంటర్లో భారీ బహిరంగ సభలో అశేష జనాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు అవుతున్నా రాజధానిలో ఒక్క శాశ్వత కట్టడం కూడా కట్టలేదని విమర్శించారు. ‘2014 ఎన్నికలకు ముందు ఇదే నేను కట్టబోయే రాజధాని అంటూ చంద్రబాబు గ్రాఫిక్స్ చూపించాడు. తొమ్మిదేళ్ల అనుభవముందని నమ్మబలికాడు. 2019 ఎన్నికలు కూడా రాబోతున్నాయి. నాలుగున్నరేళ్ల పాలన పూర్తయింది. అయినా, ఇంకా.. రాజధాని నిర్మాణానికి సంబంధించి గ్రాఫిక్స్ చూపిస్తూనే ఉన్నాడు. ఓరోజు జపాన్ అంటాడు. మరో రోజు లండన్ అంటాడు. ఇప్పటివరకు రాజధానికి సంబంధించి ఒక్క శాశ్వత నిర్మాణం కూడా జరగలేదు’ అని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుకు రాలేదా..! దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో దాదాపు 90 శాతం పూర్తయిన ప్రాజెక్టులను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదని వైఎస్ జగన్ మండిపడ్డారు. విజయనగరం జిల్లా ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన జంఝావతి ప్రాజెక్టు నిర్మాణాన్ని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని అన్నారు. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాజెక్టుకు వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాక మంచి రోజులొచ్చాయని చెప్పారు. దేశంలో ఎక్కడాలేని విధంగా వైఎస్సార్ జంఝావతి రబ్బర్ డ్యాంను నిర్మించారని గుర్తు చేశారు. చంద్రబాబు జంఝావతి ప్రాజెక్టు నిర్వహణను పట్టించుకోకపోవడంతో అది నిర్లక్ష్యానికి గురైందని అన్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో దేశంలోని ముఖ్యమంత్రుల వద్దకు వెళ్లే చంద్రబాబు.. పక్క రాష్ట్రమైన ఒడిషా ముఖ్యమంత్రిని మాత్రం కలవడు అని ఎద్దేవా చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తులు కొట్టేయాలని చూస్తున్నారు ‘బాబు వల్ల చెరుకు రైతులు నాశనం అయిపోయారు. నిజాం షుగర్స్ ప్రైవేటు సంస్థకు అమ్మి రైతులకు అన్యాయం చేసారు. పార్వతీపురం మున్సిపాలిటీలో తాగడానికి నీరు మూడురోజులకు ఒకసారి ఇస్తున్న పరిస్థితి ఉంది. అభివృద్ధి గురించి ఆలోచిస్తే పార్వతిపురంలో అసలు అభివృద్ధి లేదు. పార్వతీపురం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు, అగ్రిగోల్డ్ బాధితులు ఇక్కడ ఎక్కువ. వారిని పట్టించుకునే నాథుడు లేడు. అగ్రిగోల్డ్ ఆస్తులను అన్నింటినీ చంద్రబాబు, లోకేష్, బినామిలు కాజేస్తున్నారు. అగ్రిగోల్డ్ ఆస్తుల విలువను పధకం ప్రకారం తగ్గిస్తున్నారు. అత్యంత విలువైన హాయ్‌లాండ్ భూములు చంద్రబాబు లాక్కుని అది ఆగ్రోగోల్డ్ ది కాదని చెబుతున్నారు. అగ్రిగోల్డ్ ఎండీని ఎందుకు అరెస్టు చెయ్యలేదు? ఆ ఆస్తిని తప్పించడానికి బాబు పథకం వేస్తున్నార’ని జగన్ విమర్శించారు. జిమ్మిక్కులు మొదలు పెట్టాడు ‘రాష్ట్రం మొత్తం కరవు కాటకాలతో అల్లాడుతోంది. ఏడు జిల్లా పరిస్థితి దారుణం, విజయనగరం జిల్లా 26 మండలకు కరువు ఉంటే చంద్రబాబు 4 మండలాల్లో మాత్రమే కరువు ఉందని చెబుతున్నారు. రైతులకు ఇన్‌ఫుట్ సబ్సిడీకి 2 వేలకోట్లు ఇవ్వాల్సి ఉంది కాని చంద్రబాబు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు, రుణాలు రీషెడ్యూలు చెయ్యలేదు. బాబు ముఖ్యమంత్రిగా ఉండి ఏం సాధించారు? మాట్లాడితే పట్టిసీమ నుంచి నీరు తెచ్చానని చెబుతాడు. రైన్గన్లు ఏమయ్యాయి? పోలవరం పరిస్థితి దారుణం.. నాలుగున్నర సంవత్సరాలలో పునాది గోడ తప్ప మరేం కట్టలేదు. పోలవరం ప్రాజెక్టును లంచాలు ప్రాజెక్టుగా మార్చిన ఘనత బాబుదే. యనమల వియ్యంకుడు కూడా ఇందులో కాంట్రాక్టర్. ఎన్నికల సమయం సమీపిస్తున్న తరుణంలో మళ్ళీ చంద్రబాబు జిమ్మిక్కులు మొదలు పెట్టాడు. ఇప్పుడు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అంటూ శంకుస్థాపన చేశారు. ఇది గతంలో రాజన్న ప్రారంభం చేసిన పథకానికి చంద్రబాబు మళ్ళీ టెంకాయ కొడుతున్నారు. హామీలు ఒక్కసారి చూస్తే రైతులకు, మహిళలకు రుణమాఫీ అన్నాడు. ఎన్నికలు అయిపోయాయి అధికారం కూడా అయిపోయింది ఇప్పటికి రుణాలు లేవు మాఫీ లేద’ని వైఎస్ జగన్ దుయ్యబట్టారు. -
సువర్ణముఖి నదిపై వంతెన నిర్మాణం నత్తనడకగా సాగుతోంది
-
సుమధుర భరితం
పార్వతీపురం : పూలంటే మహిళలకు ప్రాణం. మూరెడు మల్లెపూలు ముడుచుకుని మురిసిపోతారు. కనీసం ఒక గులాబీనో, చామంతో.. బంతో చివరికి మందార పువ్వయినా ముడవనిదే వారికి సంతృప్తి ఉండదు. అలాంటిది.. కడియం పూల మొక్కలు కాళ్ల దగ్గరే వాలితే ఇంకేముంది. పరుగులు పెడుతూ నచ్చిన మొక్కలను కొనుగోలు చేసుకుంటూ పూల మొక్కలపై వారికున్న ప్రేమను చాటుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా కడియం గ్రామానికి చెందిన పూలమొక్కల వ్యాపారి జి.సత్యనారాయణ 22 ఏళ్లుగా పార్వతీపురంలో పూల మొక్కల వ్యాపారం చేస్తున్నారు. పలు రకాల వృక్షజాతులు, వివిధ రకాల పూల మొక్కలను పార్వతీపురం మండలం వెంకంపేట గోరీల కూడలిలో విక్రయిస్తున్నారు. ఇక్కడ హైబ్రీడ్ పూణె, గులాబీ, బెంగళూరు గులాబీ, కోల్కత్తా గులాబీ, తెల్ల గులాబీ, కాశ్మీర్ గులాబీలతో పాటు పదిహేను రకాల మందార మొక్కలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. నిమ్మ, దానిమ్మ, బత్తాయి, ఆరంజ్, యాపిల్ రేగు, జంబో నేరేడు, స్వీట్ నిమ్మ, మునగ, ఉసిరి, సపోటా వంటి పండ్ల రకాలను కూడా విక్రయిస్తుండటంతో కొనుగోలు చేసేందుకు పట్టణ ప్రజలు ఎగబడుతున్నారు. ఇంటి ఆవరణనే పూలతోటలుగా మలిచి ఆకర్షణగా తీర్చిదిద్దడం సాధారణమైంది. నిన్నటి వరకు పట్టణానికి పరిమితమైన వాతావరణం ఇప్పుడు పల్లెలకు పాకుతుండటంతో పూల మొక్కలకు మంచి డిమాండ్ పెరుగుతోంది. మొక్కలను మంచి గిరాకీ ఏర్పడుతుండటంతో వ్యాపారులు కూడా వినియోగదారుల కోరిక మేరకు అరుదైన పూలు, పండ్ల రకాల మొక్కలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. వీరి వద్ద రూ.20 నుంచి రూ.500 విలువైన పలు రకాల మొక్కలు లభిస్తున్నాయి. వేసవిలో కష్టం ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి మొక్కలను సులువుగా పెంచవచ్చు. అదే వేసవి కాలంలో అయితే మొక్కల పెంపకం కష్టంతో కూడుకున్న పని. వర్షాకాలంలో ఎక్కువ రకాల మొక్కలను వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా దిగుమతి చేస్తున్నాం. వేసవిలో నీరు లేక మొక్కలు ఎండిపోయే ప్రమాదం ఉన్నందున కొన్ని రకాల్నే అందుబాటులో ఉంచుతున్నాం. ప్రజలు కొత్త రకాల మొక్కలను కోరుకుంటున్నారు. ట్యాంకర్లతో నీటిని కొనుగోలు చేసి మొక్కలను తడపాల్సి వస్తుంది. ప్రభుత్వ పరంగా సహకారం అందిస్తే ఇతర రాష్ట్రాలు, దేశాల మొక్కలను కూడా దిగుమతి చేసుకునే వీలుంటుంది. – సత్యనారాయణ, వ్యాపారి -
విషాదం రేపిన ప్రేమజంటలు
సాక్షి, గుంటూరు/ విజయనగరం : ఆంధ్రప్రదేశ్‌లో ఒకే రోజు రెండు చోట్ల ప్రేమికులు ఆత్మహత్యా ప్రయత్నానికి ఒడిగట్టారు. ఈ ఘటనలో ఓ జంట ప్రాణాలు కోల్పోగా..మరో జంట కొన ప్రాణాలతో కొట్టు మిట్టాడుతోంది. వివరాలు..గుంటూరు జిల్లా తెనాలి గాంధీచౌక్‌లోని ఓ లాడ్జిలో ఓ ప్రేమ జంట ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతులు విజయవాడ చిట్టినగర్‌కు చెందిన పృద్వీరాజ్(30), పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన కొత్తలంక సాయిదివ్య(23)లుగా గుర్తించారు. లాడ్జి నిర్వాహకుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు. మరో ఘటనలో.. విజయనగరం జిల్లా పార్వతీపురం బెలగాం రైల్వే స్టేషన్ దగ్గర పురుగులు మందు తాగి ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు గమనించి వెంటనే దగ్గరలో ఉన్న ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితులు జీఎం వలస మండలం నీచుకవలస గ్రామానికి చెందిన పేరూర సంతోష్(23), చింతాడ గౌతమి(22)గా గుర్తించారు. ఈ ఘటనలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
టీడీపీ ఎమ్మెల్సీ బూతు పురాణం
-
టీడీపీ ఎమ్మెల్సీ కావరం.. బూతులు తిడుతూ!
సాక్షి, పార్వతీపురం : ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర మంత్రులు, అధికార టీడీపీ నేతల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. సమస్యలపై నిలదీస్తే మహిళా ఉద్యోగులనే కాదు, పార్టీకి చెందిన మహిళా నేతలను సైతం వదిలిపెట్టని ఘటనలు ఏపీలో నిత్యం కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో విజయనగరం జిల్లాలో తమ సమస్య తీర్చాలని కోరినందుకు ఓ టీడీపీ నేత బూతు పురాణం మొదలెట్టడంతో స్థానికులు కంగుతిన్నారు. జిల్లాలోని పార్వతీపురం మున్సిపాలిటీలో సమస్యలపై ప్రశ్నించగా ఉద్రిక్త వాతావారణం నెలకొంది. మమ్మల్నే నిలదీస్తారా అంటూ టీడీపీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్ దాడికి దిగి దాష్టీకానికి పాల్పడ్డారు. వాస్తవానికి విజయనగరం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీలో రెండు రోజులుగా మంచినీటి కుళాయిల్లో బురదనీరు సరఫరా అవుతోంది. ఇన్ని ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటుంటే, తాగునీరు ఇవ్వకుండా గ్రామదర్శిని కార్యక్రమం ఎలా నిర్వహిస్తారని స్థానికుల తరఫున వైఎస్సార్సీపీ నేతలు ఎమ్మెల్సీ జగదీశ్‌ను ప్రశ్నించారు. అధికార పార్టీ నేతనైన నన్నే ప్రశ్నిస్తారా అంటూ ఆగ్రహంతో ఊగిపోయిన టీడీపీ నేత జగదీష్ ఓ వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. అదేంటని ప్రశ్నించిన కారణంగా వైఎస్సార్సీపీ శ్రేణులపై సైతం బూతులు మాట్లాడుతూ దూసుకొచ్చిన టీడీపీ ఎమ్మెల్సీ దాడికి దిగడంతో ఆశ్చర్యపోవడం స్థానికుల వంతైంది. కాగా, ఈ తతంగం అంతా స్ధానిక ఎమ్మెల్యే చిరంజీవి సమక్షంలోనే చోటు చేసుకోవడం గమనార్హం. -
పార్వతీపురం టీడీపీలో ముసలం
పార్వతీపురం : పార్వతీపురం తెలుగుదేశం పార్టీలో విభేదాలు బట్టబయలయ్యాయి. పట్టణంలో కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన కాగడాల ర్యాలీకి కౌన్సిలర్లు ఎవరూ హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు నేతలు కలసి నిర్వహించిన కార్యక్రమానికి పట్టుమని పదిహేనుమంది కూడా ర్యాలీలో పాల్గొనకపోవడం విశేషం. వాస్తవానికి కాగడాల ర్యాలీ చేపడుతున్న విషయం పట్టణ అధ్యక్షుడు కోలా వెంకట్రావు(బాబు) అందరికీ చెప్పాల్సి ఉంది. కాని ఈ విషయాన్ని స్వయంగా ఎమ్మెల్యే చిరంజీవులు కౌన్సిలర్లకు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఆయన నలుగురు కౌన్సిలర్లకు ఎమ్మెల్యే సమాచారాన్ని ఇవ్వక పోవడంతో కౌన్సిలర్లంతా ఏకమై కాగడాల ర్యాలీని బహిష్కరించారు. తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడకు వచ్చిన పది మంది కార్యకర్తలతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ర్యాలీని మమ అనిపించారు. ఏఎంసీ చైర్మన్ పదవే వివాదానికి కారణం పార్వతీపురం పట్టణ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవి ఏడాది కాలంగా ఖాళీగా ఉంది. ఈ నామినేటెడ్ పదవిని పార్టీని నమ్ముకుని పార్టీకి విశేష సేవల అందించేవారికి ఇవ్వడం ఆనవాయితీ. ఈ పదవిని తెలుగుదేశం పార్టీకి చెందిన 2వ వార్డు కౌన్సిలర్ బార్నాల సీతారామారావు, పట్టణ అధ్యక్షుడు కోలా వెంకట్రావు ఆశిస్తూ వస్తున్నారు. గతంలో కోలా వెంకట్రావును ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు ప్రోత్స హిస్తూ వచ్చారు. ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ మాత్రం బార్నాల సీతారామారావుకు ఛైర్మన్ పదవిని ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. ఆ సమయంలో సీతారామారావుకు ఇవ్వడానికి ఎమ్మెల్యే ఎంతమాత్రం ఒప్పుకోలేదు. దీనివల్ల ఏడాది కాలంగా ఈ పదవి భర్తీ కావడంలేదు. ప్రస్తుతం ఆ పదవిని ఎమ్మెల్యే ఎవరికి తెలియకుండా బార్నాల సీతారామారావుకు ఇవ్వాలని సిఫారసు లేఖ రాసినట్టు తెలిసింది. స్థానిక కౌన్సిలర్లను సంప్రదించకుండా... ఏ ఒక్కరి అభిప్రాయం తెలుసుకోకుండా ఉన్న పళంగా గతంలో వ్యతిరేకించిన సీతారామారావుకు ఎలా ఇచ్చారని కౌన్సిలర్లు శుక్రవారం మున్సిపల్ వైస్ ఛైర్మన్ జయబాబు కార్యాలయంలో నిలదీశారు. ‘మిమ్మలను అడగకపోవడం నా తప్పే. నాకున్న ఒత్తిడి మేరకు అలా చేయాల్సి వచ్చింది తప్ప మిమ్ములను ధిక్కరించి నేను ఏదీ చేయలేదు’ అని చెప్పుకొచ్చారు. -
వసతిగృహాల్లో పురుగుల బియ్యం
వసతిగృహ విద్యార్థులకు పురుగుల అన్నమే దిక్కయింది. వేసవి సెలవులకు ముందొచ్చిన బియ్యాన్ని వసతిగృహాల్లో నిల్వ ఉంచగా పురుగులు పట్టాయి. వాటినే ఇప్పుడు వండి పెడుతుండడంతో విద్యార్థులు కష్టమైనా...భరిస్తూ వేరే దిక్కు లేక తింటున్నారు. పార్వతీపురం : వసతిగృహాల్లో బియ్యం పురుగు పడుతున్నాయి. వసతిగృహ అధికారులకు ముందు చూపు లేకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. వేసవి సెలవుల ముందు అధిక సంఖ్యలో బియ్యం ఇండెంట్ పెట్టడంతో వేసవి సెలవులకు విద్యార్ధులు ఇంటికి వెళ్లిపోవడం రెండు నెలలు పాటు బియ్యం నిల్వ ఉండడంతో పురుగులు పడుతున్నాయి. వేసవి సెలవుల తరువాత పాఠశాలలు ప్రారంభం కావడం వసతిగృహాలు తెరుచుకోవడంతో విద్యార్థులకు ఈ నిల్వ బియ్యాన్నే వార్డెన్లు వండి పెడుతున్నారు. పురుగులు పట్టిన బియ్యాన్ని పౌర సరఫరాల గోదాముకు అప్పగించి వాటి స్థానంలో కొత్త బియ్యాన్ని తీసుకోవల్సిన వసతిగృహ అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టకుండా ఉన్న నిల్వ బియ్యాన్నే వండి పెడుతున్నారు. దీంతో విద్యార్థులపై ప్రభావం పడే అవకాశం ఉంది. వసతిగృహ అధికారులకు ముందు చూపు లేకపోవడంతో అనేక వసతిగృహాల్లో వేసవి సెలవులకు ముందు విడిపించిన బియ్యం నిల్వ ఉండడం వేసవి సెలవుల తరువాత వాటిని తిరిగి వాడడంతో పురుగులు పట్టిన భోజనాన్ని విద్యార్థులు తినాల్సి వస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో విద్యార్థులు కంటికి కనిపించిన వాటిని ఏరుకుని కనిపించని వాటిని ఆహరంతో కలిపి తినేస్తున్నారు. పురుగులు పట్టిన బియ్యం గుర్తింపు రెండు రోజుల కిందట స్థానిక న్యాయమూర్తి ముధుబాబు వసతిగృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈయన పరిశీలనలో బియ్యాన్ని పరిశీలన చేయగా బియ్యం పురుగులు పట్టినట్టు గుర్తించారు. ఎందుకిలా అని వసతిగృహ అధికారిని ప్రశ్నించగా వేసవి సెలవులకు ముందు తెచ్చిన బియ్యం కావడంతో పురుగు పట్టాయని చెప్పడంతో న్యాయమూర్తి పిల్లలకు వీటినే పెడితే ఎలా అని మందలించారు. నిల్వ బియ్యాన్ని వెనక్కి పంపించి కొత్త బియ్యాన్ని తెప్పించుకోవాలని ఆదేశించారు. ఇలా అనేక వసతిగృహాల్లో వేసవి సెలవులకు ముందు విడిపించిన బియ్యాన్నే ప్రస్తుతం విద్యార్థులకు వండి పెడుతున్నారు. దీంతో విద్యార్ధులకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇప్పటికైనా వసతిగృహ అధికారులు నిల్వ బియ్యాన్ని తరలించి కొత్త బియ్యాన్ని తెచ్చుకుంటే బాగుంటుంది. -
విజయనగరం జిల్లాలో భారీ వర్షం
-
ఉత్తరాంధ్రలో భీకరమైన ఈదురు గాలులు..
విజయనగరం : ఉత్తరాంధ్ర జిల్లాలను ఈదురుగాలులు వణికిస్తున్నాయి.విజయనగరం జిల్లాలోని పార్వతీపురం, కురుపాం, గజపతినగరం ప్రాంతాల్లో మంగళవారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఆకాశం మేఘావృతం కావడంతో పట్టపగలే చిమ్మచీకటిని తలపిస్తోంది. విజయనగరం జిల్లాలో పిడుగులు పడి ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. భోగాపురం మండలం పెద్దకొండరాజుపాలెం వద్ద సముద్ర తీరంలో పడవలను ఒడ్డుకు చేర్చుతుండగా బలమైన ఈదురుగాలులకు ఓ వ్యక్తి సముద్రంలోకి కొట్టుకుపోయాడు. సముద్రంలో గల్లంతైన బొందు చిన్న అమ్ములు(30) స్థానికులు గాలిస్తున్నారు. అలాగే విశాఖపట్నంలోని పాడేరు, తగరపువలస, విశాఖ నగరంలో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. రోడ్లపై నీరు పొంగిప్రవహిస్తోంది. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. జ్ఞానాపురం జంక్షన్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం, మెళియాపుట్టి మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిలాల్లో పలుచోట్ల ఈదురుగాలులకు చెట్లు కూలిపోయి విద్యుత్ సరఫరాకు అంతరాయమేర్పడింది. అండమాన్‌లో ఏర్పడిన అల్పపీడనం కారణంగానే అకాల వర్షాలు పడుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. కోస్తా జిల్లాల్లో రాగలం 24 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్యుములో నింబస్ మేఘాల ప్రభావంతోనే ఈ అకాల వర్షాలు కురుస్తున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. -
పెళ్లి పీటలెక్కకుండానే..
పార్వతీపురం (విజయనగరం జిల్లా) : ఆ యువకుడికి వివాహం కుదిరింది. ఆదివారం ముహూర్తపు రాట .. ఈ నెల 24న వివాహం జరగాల్సి ఉంది. ఇంతలోనే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. శనివారం రాత్రి నుంచి కనిపించకుండా పోయిన యువకుడు ఆదివారం సాయంత్రానికి శవమై కనిపించాడు. ఆత్మహత్య చేసుకోవాల్సినంత కష్టం ఏమొచ్చిందో తెలియడం లేదు. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పార్వతీపురం పురపాలక సంఘ పరిధిలోని 4వ వార్డు తూర్పు వీధికి చెందిన రాజాన గౌరీనాథ్ (32)ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, విశాఖపట్నం బ్రాంచిలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి ఈ నెల 24న వివాహం జరిపించడానికి మూహూర్తాలు కూడా తీశారు. ఇందులో భాగంగా ఆదివారం ముహూర్తపు రాట వేయడానికి కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఇంతలో ఏమైందో ఏమో కాని శనివారం రాత్రి నుంచి ఆ యువకుడు కనిపించకుండా పోయాడు. దీంతో తల్లిదండ్రులు సన్యాసిరావు, కన్నమ్మ ఆదివారం ఉదయం తమ కుమారుడు కనిపించలేదంటూ పట్ణణ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఇంతలో పట్టణ శివారున బెలగాం హనుమాన్ టెంపుల్ వెనుక ఉన్న కల్లాల్లో గుర్తు తెలియని మృతదేహం పడిఉందన్న సమాచారం అందుకున్న పోలీసులకు అక్కడకు వెళ్లి చూడగా, గౌరీనాథ్ శవమై కనిపించాడు. పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. మనస్తాపంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. గౌరీనాథ్ మంచి కుర్రవాడని, రెండు రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇలా ఎందుకు చేశాడో అర్థం కావడం లేదని స్థానికులు అంటున్నారు. ఇదిలా ఉంటే పెళ్లికి తయారుచేసిన బంగారు వస్తువులు వేసుకుంటానని గౌరీనాథ్ అడుగగా.. ముహూర్తపు రాట వేసిన తర్వాత ఇస్తానని కుటుంబ సభ్యులు చెప్పినట్లు సమాచారం. ఈ విషయమై మనస్తాపం చెంది గౌరీనాథ్ ఆత్మహత్య చేసుకున్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమర్టం నిమిత్తం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అప్పు తీర్చలేక...పత్తి రైతు ఆత్మహత్య
కొండ కోనల్లో జీవన ప్రయాణాన్ని సాగించిన ఆ గిరిజనుడికి అప్పు రూపంలో తీర్చలేనంత కష్టమొచ్చింది. పంట సాగు కోసం చేసిన అప్పులు తడిపిమోపిడయ్యాయి. పంట దిగుబడులు బాగా వస్తే తీర్చేయవచ్చన్న ఆయన ఆశలు అడియాశలయ్యాయి. పంట దిగుబడులు చూసి అప్పు తీర్చలేనని మనస్తాపానికి గురైన ఆ పత్తి రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే... పార్వతీపురం/కొమరాడ: కోండపోడునే నమ్ముకొని రెండు దశాబ్దాలుగా వ్యవసాయం చేసుకొని జీవిస్తున్న గిరిజన రైతుకు పెద్ద కష్టమొచ్చింది. కొండపోడు ఎనిమిది ఎకరాల్లో లాభం వస్తుందని ఆశించిన కొమరాడ మండలం మసిమండ గ్రామానికి చెందిన గిరిజన రైతు జీలకర్ర చంద్రయ్య(55) పత్తి పంట వేశాడు. ఏపుగా పెరుగుతున్న మొక్కలను చూసి ఆనందించాడు. చేసిన అప్పులు తీరిపోతాయని పంట దిగుబడి కోసం ఆత్రంగా ఎదురుచూశాడు. కానీ ఆయన అంచనాలు తప్పాయి. మొక్కలైతే ఏపుగా పెరిగాయి కాని పత్తికాయలు మాత్రం కాపునకు రాలేదు. దీంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలే తెలియని స్థితిలో తీవ్ర మనస్తాపానికి గురైన చంద్రయ్య శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పత్తి పంటలో పురుగుల నివారణకు కొనుగోలు చేసిన మందునే తాగి ఆత్మహత్య చేసుకొని తనువు చాలించాడు. ఈ ఏడాది బాగా మదుపులు పెట్టి దిగుబడులపై కొండంత ఆశలు పెట్టుకున్నాడు. మదుపుల కోసం అప్పులు చేసి దిగుబడి రాకపోవడంతో ఆందోళనకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్టు భార్య జమ్మలమ్మ రోదిస్తూ చెప్పింది. ఈ ఏడాది పంట బాగా వస్తుందని, అప్పులన్నీ తీరిపోతాయని చెప్పేవాడని కన్నీరుమున్నీరైంది. అంతకు ముందు ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఇంట్లోనే పురుగుల మందును తాగిన చంద్రయ్యను చికిత్స కోసం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్యతో పాటు కుమార్తె అన్నాలు, కొడుకులు ముత్యాలు, పాపారావు ఉన్నారు. కొమరాడ ఎస్ఐ దినకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పార్వతీపురం ఏఎస్పీగా దీపిక
పార్వతీపురం: పార్వతీపురం ఏస్పీగా ఎం.దీపికను నియమించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ దినేష్ కుమార్‌పేరుతో సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటివరకు ఇక్కడ ఏస్పీగా విధులు నిర్వర్తించిన అమిత్ బర్దార్ విశాఖపట్నం జిల్లా పాడేరు ఏఎస్పీగా బదిలీ అయ్యారు. రెండు, మూడు రోజుల్లో దీపిక విధుల్లో చేరే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా మూడు నెలల క్రితం పార్వతీపురం ఏస్పీగా విధుల్లో చేరిన అమిత్‌బర్దార్‌కు ఇంత త్వరగా బదిలీ కావడం విశేషం. -
‘రథ’సారథ్యం తమ్ముళ్లకే!
సర్కారు పథకాలు వారికే అందాలి. సబ్సిడీలు వారికే మంజూరు కావాలి. పదవులు... ఉద్యోగాలు... చివరకు గ్రామాల్లో అధికారం మొత్తం ఆ పార్టీని నమ్ముకున్నవారికే అందివ్వాలి. అదే లక్ష్యంతో ప్రస్తుత పాలకులు ముందుకు సాగుతున్నారు. నిజమైన అర్హులున్నా... తమకు విధేయులు కాకుంటే వారికి రిక్తహస్తమే. తాజాగా రైతు రథం రాయితీపై ట్రాక్టర్ల సరఫరా పథకం లోనూ ఈ విధానమే కొనసాగుతోంది. దీనికి దరఖాస్తు దశనుంచే కుట్రలు మొదలయ్యాయన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. బలిజిపేట రూరల్(పార్వతీపురం): రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన రైతు రథం–రాయితీపై ట్రాక్టర్ల సరఫరా పథకాన్ని తెలుగు తమ్ముళ్ళకే వర్తింపజేసేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం పక్కాగా వ్యూహం రచించి... ఆ మేరకు మంజూరు చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. దరఖాస్తుల పర్వం నుంచే అక్రమాలకు తెరతీశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వ్యవసాయ యాంత్రీకరణలో బాగంగా రైతు రథం – 2017 పథకం కింద జిల్లాకు 320 ట్రాక్టర్లు రాయితీపై మంజూరు చేయాలని నిర్ణయించారు. గ్రామీణ నియోజకవర్గాలకు వీటిని కేటాయించాలని నిర్దేశించారు. జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో విజయనగరంలో ఒక మండలం, మిగిలిన 8 నియోజకవర్గాల కు ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. విజయనగరం నియోజకవర్గంలోని మండలానికి 8 ట్రాక్టర్లు, మిగిలిన 312 ట్రాక్టర్లు 8 నియోజకవర్గాలకు సమానంగా... ఒక్కో నియోజకవర్గానికి 39 ట్రాక్టర్లు వంతున కేటాయించారు. ఇవీ నిబంధనలు ఈ పథకానికి కొన్ని నిబంధనలు రూపొందిం చారు. ముఖ్యంగా ఇంతకు ముందు ఏ పథకంలో కూడా రైతు రాయితీ ట్రాక్టరు పొంది ఉండకూడదు. రైతుకు కనీసం 2 ఎకరాల పొలం ఉండాలి. రైతుకు సొంతంగా ట్రాక్టరు ఉండరాదు. ఏ రకం ట్రాక్టరు కొనాలో రైతే నిర్ణయం తీసుకోవాలి. మంజూరయిన ట్రాక్టర్లలో ఎస్సీ, ఎస్టీ కులాలకు తగినవిధంగా కేటాయింపులు చేయాలి. అర్హులైన రైతులు నేరుగా వ్యవసాయశాఖ నుంచి దరఖాస్తు తీసుకుని దీనికి సంబంధించిన డాక్యుమెం ట్లను జతచేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. రైతులు చేసుకున్న దరఖాస్తులను వ్యవసాయశాఖ ఉన్నతాధికారుల ద్వారా జిల్లా ఇన్చార్జ్ మంత్రికి చేరుతాయి. వారి ఆదేశాలమేరకు యూనిట్లు మంజూరవుతాయి. జిల్లాలో జరుగుతున్న తీరిదీ... పార్వతీపురం నియోజకవర్గానికి 39 మంజూరవగా బలిజిపేట మండలానికి సుమారు 12 నుంచి 14వరకు మంజూరుకావచ్చని భావిస్తున్నారు. వీటికి సంబంధించి తెలుగు తమ్ముళ్ళ దరఖాస్తులు వేరేలా, సాధారణ రైతు దరఖాస్తు వేరేగా ఉండడంతో అవకతవకలకు మార్గం సుగమం అయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సబ్సిడీ ట్రాక్టరు కావాలంటే తెలుగు తమ్ముళ్ళ దరఖాస్తు చేసుకుంటేనే వస్తుందని... లేకపోతే రథంవైపు చూడాల్సిన అవసరం లేదనే భావనలు వినిపించడంతో రైతులు నీరుగారారు. తెలుగు తమ్ముళ్ళ దరఖాస్తులో స్థానిక ఎమ్మెల్యే సూచనలకు, సంతకాలకు లోబడి ఉండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దరఖాస్తులో ‘నా యొక్క దరఖాస్తు గ్రామ, మండల జన్మభూమి కమిటీ, పార్వతీపురం నియోజకవర్గ ఎమ్మెల్యే ద్వారా వ్యవసాయ శాఖకు సమర్పించుట గురించి’ అని ఉండడం, దరఖాస్తు చివరన ఎమ్మెల్యే సంతకానికి కాలమ్ ఏర్పాటు చేశారు. అంటే ఎమ్మెల్యే సిఫార్సు చేసిన వారికి మాత్రమే రథాలు వస్తాయని వేరే చెప్పనవసరం లేదు. సిఫార్సులు లేనివారు తమ దరఖాస్తులను సాదా సీదాగా వ్యవసాయశాఖ కార్యాలయానికి అందజేశారు. రైతు రథం పథకానికి మండలంలో ఇప్పటికి 20మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. దీనిలో 14మంది తెలుగు తమ్ముళ్ళు ఉన్నట్టు సమాచారం. అంటే వారికే ట్రాక్టర్లు మంజూరవుతాయన్నది జగమెరిగిన సత్యం. ఎమ్మెల్యే సిఫార్సులుంటాయనే వస్తాయని... రైతురథం పథకంలో సబ్సిడీ ట్రాక్టరు పొందేందుకు ఎమ్మెల్యే సిఫార్సు చేసిన దరఖాస్తు ఉంటేనే వచ్చే అవకాశాలున్నాయని విశ్వయనీయంగా తెలియ డం, ఎమ్మెల్యే సూచనల మేర తెలుగు తమ్ముళ్లు అక్కడి నుంచి ప్రత్యేక దరఖాస్తులు తెచ్చుకుని ఆన్లైన్ చేయడం చూసి నేను దరఖాస్తు చేయడం మానుకున్నాను. పక్కాగా తెలుగు తమ్ముళ్ళకే వస్తాయని తెలిసిన తరువాత చేయడం ఎందుకని మానేశాను. – ప్రసాద్, సర్పంచ్, నారాయణపురం. ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు: ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. వాటిని పరిశీలించి అనర్హులను తొలగించి అర్హులైనవాటిని జిల్లా యంత్రాంగానికి అందిస్తాం. అక్కడి నుంచి ఇన్చార్జ్ మంత్రికి సమర్పిస్తాం. పథకంలో లబ్ధి పొందేది ఎవరో అప్పుడు తెలుస్తుంది. – భానులత, ఏడీ, వ్యవసాయ శాఖ, బొబ్బిలి -
వ్యాపారి మురళీని కాల్చి చంపేశారు!
-
వ్యాపారి మురళీని కాల్చి చంపేశారు!
పార్వతీపురంలో కాల్పుల కలకలం విజయనగరం: జిల్లాలోని పార్వతీపురంలో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండుగులు స్థానిక వ్యాపారి మురళీపై దాడి చేశారు. తుపాకీతో ఆయనను కాల్చిచంపి.. పరారయ్యారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీమ్స్‌తో సంఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. మురళీ వ్యాపార భాగస్వాములను ప్రశ్నిస్తున్నారు. మురళీని ఎవరు హత్య చేశారు? ఎందుకు ఈ హత్య జరిగింది? అన్న కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. -
కలెక్టర్ అవుతాడనుకుంటే... కానరాని తీరాలకు..
♦ జంఝావతి రిజర్వాయర్‌లో పడి ఏజీబీఎస్సీ విద్యార్థి మృతి ♦ ప్రమాదం నుంచి బయటపడ్డ మరో నలుగురు ♦ కన్నకొడుకు మృతి వార్త విని కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు ♦ సెలవులకోసం వచ్చి శవమవుతాడను కోలేదని రోదన చెట్టంత ఎదిగిన కొడుకును చూసి ఆ తల్లిదండ్రులు ఉబ్బి తబ్బిబ్బయిపోయారు. ఎప్పటికైనా కలెక్టర్ అవుతానని చెబితే ఎంతో మురిసిపోయారు. తల్లిదండ్రులు లేని ఓ మిత్రుడిని తీసుకొచ్చి అన్నలా ఉంచుకుందామంటే కాదనలేకపోయారు. కుమారుడి ఎదుగుదలతో వారి కలలు తీరుతాయని సంబరపడ్డారు. మరో మూడు రోజుల్లో తాను చదువుకుంటున్న పంజాబ్ వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటుంటే తనకు సహకరించారు. స్నేహితులతో కలసి బయటకు వెళ్లి వస్తామంటే సరేనన్నారు. కానీ విధి వారి ఆనందాన్ని ఎంతోకాలం నిలవనీయలేదు. వారి ఆశలు తీర్చకుండానే ఆ కొడుకును మృత్యురూపంలో తీసుకుపోయింది. జంఝావతిలో పడి మృతి చెందాడన్న వార్తతో వారి కలలు కల్లలయ్యాయని గొల్లుమన్నారు. పార్వతీపురం టౌన్/కొమరాడ: పార్వతీపురం మండలం ములగ గ్రామానికి చెందిన తాన్న రామకృష్ణ, అరుణ దంపతుల కుమారుడు తాన్న ప్రవీణ్‌కుమార్(19) ఏజీబీఎస్సీ నాల్గవ సంవత్సరం పంజాబ్‌లోని లౌలీ యూనివర్శిటీలో చదువుతున్నాడు. ప్రస్తుతం వీరు పార్వతీపురం జనశక్తి కాలనీలో నివాసం ఉంటున్నారు. ప్రవీణ్‌కుమార్ సెలవులకు ఇటీవల ఇంటికి వచ్చాడు. ఈ నెల 10వ తేదీన తిరిగి వెళ్లిపోయేందుకు ఫ్లైట్ టిక్కెట్టు కూడా బుక్ చేసుకున్నాడు. గురువారం సాయంత్రం స్నేహితులతో కలసి అలా తిరిగి వస్తానని చెప్పి బయటకు వెళ్లాడు. స్నేహితులైన గొడబసాయి, అంబటి హరీష్, ఆదిమూలం సాయిభరత్, మజ్జి విశాల్‌తో కలసి కొమరాడ మండలం రాజ్యలక్ష్మిపురం వద్ద ఉన్న జంఝావ తి రబ్బర్ డ్యామ్ వద్దకు వెళ్లారు. డ్యామ్ దిగువన ఈత కొట్టేందుకు వెళ్లిన ఆ ఐదుగురు ఓ గుంతలో పడిపోయారు. గుంతలోతుకు కూరుకుపోతున్న వారిలో గొడబ సాయి తోటి మిత్రులైన హరీష్, సాయిభరత్, విశాల్‌లను రక్షించాడు. ఇంతలో ప్రవీణ్ పూర్తిగా మునిగిపోయాడు. సంఘటనాస్థలానికి అధికారులు విషయం తెలుసుకున్న ఆర్డీఓ సుదర్శన దొర, అగ్నిమాపక సిబ్బంది, పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నా రు. చాలా సేపు అగ్నిమాప శాఖ సిబ్బంది గాలించినా ఫలితం కనిపించలేదు. చివరకు పక్క గ్రామానికి చెందిన ఓ ఈతగాడికి ప్రవీణ్ మృతదేహం లభ్యమైంది. బయటకు తీసి వెంటనే పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కన్నీరు మున్నీరైన కన్నవారు విషయం తెలుసుకున్న కన్నవారు ఆస్పత్రికి చేరుకుని గొల్లుమన్నారు. బాగా చదువుకోవాలి... ఎలాగైనా కలెక్టర్ కావాలి. మన కుటుంబంలో ఎవరూ కలెక్టర్ అవ్వలేదు. నేను కష్టపడి చదువుతాను... కలెక్టర్ అవుతాను... అని ఎప్పుడూ తల్లిదండ్రులకు చె ప్పే కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లి పోవడంతో వారంతా కన్నీరు మున్నీరై విల పించారు. ప్రవీణ్ అక్క సుధారాణి యూరఫ్‌లో ఉంటున్నారు. స్నేహితుడినే సోదరునిగా భావించి... ప్రవీణ్‌కుమార్ పంజాబ్‌లో లౌలీ యూనివర్శిటీలో చదువుతున్న చోట ప్రసన్న అనే స్నేహితుడు పరిచయమయ్యాడు. అతని తల్లిదండ్రులు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. దీంతో ప్రసన్న తనకు ఎవరూలేరని మనస్తాపం చెంది తిరుపతి కొండకు వెళ్లి అక్కడ వెంకన్నను దర్శించుకుని కొండపైనుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. చివరిసారిగా స్నేహితుడు ప్రవీణ్‌కుమార్‌కు ఫోన్‌చేసి విషయం చెప్పా డు. అది విన్న ప్రవీణ్ చలించిపోయాడు. తనను చనిపోవద్దని... తనకు అన్నలా ఉండాలనీ... ఒప్పించి ఆత్మహత్యనుంచి విరమింపజేశాడు. ఆ తరువాత ఆ స్నేహితుడిని ఇంటికి తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించాడు. అప్పటినుంచి ప్రసన్న తరచూ పార్వతీపురం వస్తూ పోతున్నాడు. ఆయన ఫీజులు కూడా ప్రవీణ్‌కుమార్ తల్లిదండ్రులే కడుతున్నారు. తాను చనిపోతానని ముందే తెలిసి ప్రసన్నను తమకు అప్పగించావా అంటూ ఆ తల్లి రోదిస్తున్న తీరు అక్కడివారిని కదిలించేసింది. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తం అవసరం
పార్వతీపురం టౌన్: ఐటీడీఏ సబ్‌ప్లాన్ మండలాల్లో సీజనల్ వ్యాధులపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ అన్నారు. మంగళవారం పార్వతీపురం వచ్చిన ఆయన ఐటీడీఏ కార్యాలయంలో ఆరోగ్యశాఖ, మలేరియా శాఖ, గ్రామీణ నీటి సరఫరా విభాగం, గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ వ్యాధులు ప్రబలకుండా వైద్యాధికారులు, వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గ్రామాల్లో ప్రత్యేక వైద్యశిబిరాలు నిర్వహించి గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. వైద్య, ఆరోగ్య సిబ్బంది మండల హెడ్క్వార్టర్సులో తప్పకుండా ఉండాలని, రోగాలను సమర్థంగా ఎదుర్కోవాలని సూచించారు. ప్రతీ మంగళ, బుధవారాల్లో ప్రజలను చైతన్యపరుస్తూ గ్రామాలు, పట్టణాల్లో ర్యాలీలు నిర్వహించాలని, ఆరోగ్యం, పారిశుద్ధ్యంపై అవగాహన కలిగించాలని చెప్పారు. అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలనీ తెలిపారు. గిరిజన గ్రామాల్లో తాగునీటి పథకాలు, బావుల్లో క్లోరినేషన్ చేయాలన్నారు. మురుగునీరు నిల్వలేకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. వ్యాధుల వివరాలు తెలుసుకునేందుకు ఐటీడీఏలో మానిటరింగ్‌సెల్ ఏర్పాటుచేయాలని సూచించారు. దోమల నివారణ మందు పిచికారీపై మలేరియా అధికారి ఎం.ఎం.రవికుమార్ రెడ్డిని ప్రశ్నించారు. తొలివిడత పూర్తయ్యిందని, రెండోవిడత జూలై 1 నుంచి ఆగస్టు 15 వరకు చేపడతామని తెలిపారు. పిచికారీ సిబ్బందికి వేతనాలు ఇవ్వలేదన్న విషయాన్ని ఆయన కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. రెండో విడత వేసేటపుడు ఉపాధి హామీ పథకం ద్వారా వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆశ్రమ పాఠశాలల్లో పిల్లలకు ఎప్పటికప్పుడు వైద్యపరీక్షలు నిర్వహించాలని చెప్పారు. సమావేశంలో ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి వి.ఎస్.ప్రభాకరరావు, ఉప సంచాలకుడు విజయ్‌కుమార్, కార్యనిర్వాహక ఇంజినీరు కుమార్, జిల్లా పంచాయతీ అధికారి సత్యనారాయణ, ,గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారిణి గాయత్రీ దేవి తదితరులు పాల్గొన్నారు. -
గర్భశోకం
సాలూరు రూరల్: గిరిశిఖర గ్రామాల ప్రజలు శాపగ్రస్థులవుతున్నారు. ఆ ప్రాంతాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్న పాలకులు, అధికారుల మాటలు నీటిమూటలవుతున్నాయి. కనీస సౌకర్యాలు కూడా కల్పించలేకపోవడంతో గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు. కనీసం వాహన రాకపోకలకు కూడా అక్కడివారు నోచుకోలేకపోతున్నారు. అత్యవసర సమయాల్లో వైద్యం అందక అడవిబిడ్డలు మృత్యువాత పడుతున్నా అధికారులు, పాలకుల్లో చలనం రావట్లేదు. తాజాగా ఓ గర్భిణికి సకాలంలో వైద్యం అందక పురిటిలోనే బిడ్డను కోల్పోయింది. మండలంలోని జిల్లేడువలస పంచాయతీ నారింజపాడుకు చెందిన గర్భిణి పాలిక రమణమ్మకు ఆదివారం మధ్యాహ్నం పురిటినొప్పులు వచ్చాయి. ఆ సమయంలో భారీ వర్షం పడడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లలేకపోయారు. మంత్రసానులు వచ్చి ప్రసవం చేసేందుకు ప్రయత్నించినా, ఫలితం లేకపోయింది. సోమవారం ఉదయం డోలీ కట్టి సుమారు ఆరు కిలోమీటర్ల దూరం రాళ్లు తేలిన రోడ్డుపై నడుచుకుంటూ కరాడవలస చేరుకున్నారు. అక్కడి నుంచి ఓ ప్రైవేట్ వాహనంలో సాలూరు సీహెచ్‌సీకి వెళ్లారు. స్పందించిన పీఓ గర్భిణి అష్టకష్టాలు పడుతూ ఆస్పత్రికి వస్తుందన్న విషయం తెలుసుకున్న పార్వతీపురం ఐటీడీఏ పీఓ లక్ష్మీషా ఆస్పత్రి సిబ్బందిని అప్రమత్తం చేశారు. వైద్యులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పరిస్థితిని సమీక్షించారు. తీరా ఆస్పత్రికి చేరుకున్న గర్భిణి రమణమ్మకు స్థానిక వైద్యులు ప్రసవం జరిపగా మగబిడ్డ జన్మించాడు. అయితే బిడ్డ ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడంతో వెంటనే విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. తమ గ్రామానికి రహదారి సౌకర్యం ఉంటే సకాలంలో ఆస్పత్రికి తెచ్చేవారమని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తమ కడుపుకోత ఎవరు తీరుస్తారంటూ కన్నీరుమున్నీరయ్యారు. -
మలేరియా నివారణకు పటిష్ట చర్యలు
పార్వతీపురం టౌన్: డివిజన్లో మలేరియా నివారణకు పటిష్టమైన ముందస్తు చర్యలు చేపట్టాలని సమగ్ర గిరిజనాభివృధ్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి డాక్టర్ జి.లక్ష్మీషా ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం సబ్‌ప్లాన్ మండలాల వైద్యాధికారులు, వైద్య సిబ్బంది, ఎంపీడీఓలతో మలేరియా నివారణపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ గతేడాది దోమలపై దండయాత్ర చేసినా మలేరియా అదుపులోకి రాలేదని చెప్పారు. ఈ ఏడాది ముందుగానే మేల్కొవాలని ఆదేశించారు. ప్రతీ శనివారం డ్రై డే గా ప్రకటించామన్నారు. గ్రామ స్థాయిలో ఏఎన్ఎం, ఆశవర్కర్, అంగన్వాడీ కార్యకర్త, పంచాయతీ సెక్రెటరీ, వెలుగు సిబ్బంది, వెటర్నరీ అసిస్టెంట్ లేదా గోపాలమిత్రలతో కూడిన కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ బృందాలు గ్రామాల్లో పర్యటించి దోమల వ్యాప్తి కారకాలను గుర్తించి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. మురికినీరు, నీటి నిల్వలు, ఖాళీ కొబ్బరి చిప్పలు, టైర్లలో దోమలు వ్యాప్తి చెందుతాయని వాటి నివారణపై గ్రామస్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. మొదటి విడత దోమల మందు పిచికారి వేగంగా పూర్తిచేయాలన్నారు. గ్రామంలో ఉన్న పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు ఇతర ప్రభుత్వ కార్యాలయాలు సందర్శించి దోమల ఆవాసాలను గుర్తించాలని చెప్పారు. గత ఏడాది 27వేల దోమ తెరలు పంపిణీ చేశామని, అవి వినియోగిస్తున్నారో లేదో లబ్ధిదారులను అడిగి తెలుసుకోవాలని వైద్య సిబ్బందికి ఆదేశించారు. విస్తృతంగా వైద్య శిబిరాలు మలేరియా గ్రామాలను గుర్తించి దోమల మందు పిచికారీ చేయాలని చెప్పారు. ముందస్తుగా వైద్య శిబిరాలు నిర్వహించాలనీ, అవసరమైన మందుల నిల్వలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఈ ఏడాది మలేరియా మరణాలు జరగకుండా వైద్యాధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. తప్పుడు నివేదికలిస్తే కఠిన చర్యలు : అనంతరం జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పనులపై సబ్‌ప్లాన్ మండలాల అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఉపాధి కూలీల వేతనాలు పెంచడంతో తప్పుడు నివేదికలు సమర్పిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉపాధి కూలీలకు తప్పని సరిగా వేతనాలు పెంచడానికి కృషిచేయాలన్నారు. పని ప్రదేశంలో కూలీలకు మజ్జిగ పంపిణీ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఫొటోలను పంపించాలని చెప్పారు. గతవారం క్షేత్ర సహాయకులకు నిర్దేశించిన లక్ష్యాలు వచ్చే వారంలోగా పూర్తిచేయకపోతే విధులనుంచి తొలగిస్తామని హెచ్చరించారు. -
వచ్చారు... వెళ్లారు...
పార్వతీపురం టౌన్: పార్వతీపురం మండలం కోరి –గంగాపురం పంచాయతీ పరిధిలోని బడేదేవర కొండపై గ్రానైట్ తవ్వకాల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. శాఖల మధ్య సమన్వయలోపం కారణంగా దీనిపై ప్రత్యేక జాయింట్ సర్వే చేపట్టాలన్న హైకోర్టు ఆదేశాలతో రాష్ట్రస్థాయి అధికారులు సోమవారం బడేదేవర కొండకు చేరుకున్నారు. ఈ కొండపై ప్రభుత్వం గ్రానైట్ తవ్వకాలకు ఇచ్చిన అనుమతులు అక్రమమని ఒకవైపు వైఎస్సార్సీపీ మరోపక్క గిరిజన సంఘాలు పోరాడుతున్నాయి. దీనిపై తొలుత జిల్లా స్థాయిలో రెవెన్యూ, అటవీశాఖలు ఇచ్చిన నివేదికలు వేర్వేరుగా ఉండటం, కోరీ–గంగాపురం పంచాయతీ పరిధిలోని సర్వేనంబర్ –1లో గ్రానైట్ తవ్వకాలకు ప్రభుత్వం అనుమతులివ్వగా వారు ఎన్.ములగ పంచాయతీ పరిధిలో గల సర్వే నంబర్ –1లో తవ్వకాలు చేపడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరు తవ్వకాలు చేపడుతున్న ప్రాంతం రిజర్వు ఫారెస్టులో ఉందంటూ పార్వతీపురం పట్టణానికి చెంది పట్లాసింగ్ రవికుమార్, ములగ ప్రకాష్ అనే వ్యక్తులు హైకోర్టులో పిల్ వేశారు. ఈ పిల్‌ను స్వీకరించిన హైకోర్టు బడేదేవర కొండపై పూర్తి సర్వేచేసి నివేదికను సమర్పించాలని రాష్ట్ర అధికారుల బృందాన్ని ఆదేశించింది. ఇందులో బాగంగానే సోమవారం సర్వే సెటిల్మెంట్సు కమిషనర్ విజయమోహన్, సర్వే డిపార్ట్మెంట్ సహాయ సంచాలకుడు గోపాలరావు, రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ సర్వే డి.బి.డి.బి.కుమార్, మైన్స్ డీడీ శ్రీధర్, ప్రిన్సిపల్ కన్సర్వేషన్ ఆఫ్ ఫారెస్టు పి,కె.సారంగి, విశాఖపట్నం చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్టు రాహుల్ పాండే, డీడీ హెడ్‌క్వార్టర్ ఏ.వెంకటేశ్వరరావు, ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే ఏ.వి.ఎస్.ప్రసాద్, డీఎఫ్ఓ జి.లక్ష్మణరావు, ఆర్డీఓ గోవిందరావు, తహసీల్దార్ అజూరఫీజాన్ బడేదేవర కొండను సందర్శించారు. ఈ మూడు శాఖలకు సంబంధించిన రికార్డులను, మ్యాప్‌లను పరిశీలించారు. పాకలో చర్చలకే పరిమితం స్పెషల్ కమిషనర్ ఆఫ్ సర్వే సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ సీహెచ్.విజయ్‌మోహన్ ఆధ్వర్యంలో వచ్చిన ఈ బృందం బడే దేవరకొండ పరిసరాలను గానీ... కొండపై తవ్వకాలను గానీ పరిశీలించలేదు. కొండదిగువ ఉన్న ఒక పాకలో వారంతా కూర్చొని రికార్డులను, మ్యాప్‌లను క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడే అధికారులు చర్చించుకున్నారు తప్ప వారు క్షేత్రస్థాయిలో పరిశీలించలేదు. కాగా దీనిపై మరోసారి సర్వే చేపట్టాలని అనంతరమే నివేదిక సమర్పించగలమని.. ఇందుకోసం మరో మరో 45 రోజులు గడువు కోసం హైకోర్టును అభ్యర్థించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. -
వేర్వేరు ప్రమాదాల్లో పది మందికి గాయాలు
పార్వతీపురం టౌన్ : జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో పదిమంది గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. పార్వతీపురం కొత్తవలసకు చెందిన కత్తిరి శ్రీనును స్థానిక రైల్వేగేట్ వద్ద పాలకొండ నుంచి పార్వతీపురం వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీను ఎడమ కాలికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు క్షతగాత్రుడ్ని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఔట్‌పోస్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. – బైక్ బోల్తా.. విజినిగిరి (జామి) : మండలంలోని విజినిగిరి వద్ద బైక్ బోల్తాపడిన సంఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. విశాఖపట్నానికి చెందిన ఎస్కే అబ్దుల్ (35) విజినిగిరిలోని తన బంధువుల ఇంటికి వచ్చి, తిరుగు ప్రయాణంలో విజినిగిరి యోగాశ్రమం వద్ద బైక్ బోల్తా పడడంతో అబ్దుల్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు అతడ్ని 108 వాహనంలో విజనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. – ట్రాక్టర్ ఢీకొని ఒకరు.. బొబ్బిలి : ట్రాక్టర్ ఢీ కొనడంతో ఉపాధ్యాయ సంఘ నాయకుడు గాయపడిన సంఘటన బొబ్బిలిలో చోటుచేసుకుంది. కురమాన జోగారావు ద్విచక్ర వాహనంపై పారాది నుంచి బొబ్బిలి వస్తుండగా స్థానిక పెట్రోల్ బంక్ సమీపంలో వెనుకనుంచి వస్తున్న ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో జోగారావు తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు క్షతగాత్రడ్ని బొబ్బిలి ఆస్పత్రికి తరలించగా, ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విశాఖ తరలించారు. ఏఎస్సై సీహెచ్ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ కెల్ల వెంకటరమణను అరెస్ట చేశారు. ద్విచక్రవాహనం నుంచి జారిపడి పార్వతీపురం టౌన్ : ద్విచక్ర వాహనం నుంచి జారిపడి ఒకరు గాయపడ్డారు. గరుగుబిల్లి మండలం గొట్టివలస గ్రామానికి చెందిన బోను తాతబాబు గుమ్మలక్ష్మీపురం మండలం నుంచి గొట్టివలస వస్తుండగా రేగిడి గ్రామం వద్ద బైక్ అదుపు తప్పి పడిపోయింది. దీంతో గాయాలపాలైన తాతబాబును స్థానికులు పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
అగ్నిప్రమాదంలో మూడు దుకాణాలు దగ్ధం
పార్వతీపురం : స్థానిక రాయగడ రోడ్డులోని రాజుగారి కోట రహదారిలో మూడు బడ్డీలు సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన అగ్నిప్రమాదంలో ఆహుతయ్యాయి. బాధితులు, స్థానికులు అందించిన వివరాలిలా ఉన్నాయి. ఎప్పటిలాగే సోమవారం రాత్రి దుకాణదారులు షాపులు కట్టుకొని ఇంటికి వెళ్లిపోయారు. రాత్రి రెండు గంటల సమయంలో బత్తుల శ్రీనివాసరావుకు చెందిన బడ్డీ కాలుతోందని సమాచారం రాగా.. ఫైర్ ఇంజన్ సిబ్బంది మంటలను అదుపు చేసి, వెళ్లిపోయారు. అనంతరం వేకువ జామున 5 గంటలకు పక్కనున్న పాలకొండ సోనియా, కక్కుల నీలకంఠంల మరో రెండు బడ్డీలు కూడా దగ్ధమవుతున్నాయని సమాచారం రావడంతో మరలా అగ్నిమాపక సిబ్బంది వెళ్లారు. అప్పటికే దుకాణాల్లో ఉన్న వస్తువులు, నగదు కాలిబూడిదయ్యారుు. సుమారు రూ.4 లక్షల మేర ఆస్తినష్టం సంభవించినట్లు అంచనా. -
మావోయిస్టులూ మనుషులే...!
మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు... పార్వతీపురం: మావోయిస్టులూ మనుషులేనని.. వారైనా... తామైనా.. పేదలకోసం పనిచేసేవారేననీ మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు వ్యాఖ్యానించారు. పార్వతీపురంలోని ఆయన నివాసంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల జరిగిన ఎన్కౌంటర్ విషయంలో ఆయన స్పందిస్తూ మావోయిస్టులూ పేదలకోసమే పనిచేస్తున్నారనీ, తామూ పేదలకోసమే పనిచేస్తామని చెప్పారు. కొమరాడ మండలంలోని తొడుము, మాదలంగి గ్రామాల మధ్య గల గుమ్మిడిగెడ్డ వద్ద రూ.7.70కోట్లతో వంతెన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని తెలిపారు. కురుపాం నియోజకవర్గంలో 1200 వరకు ఎమ్మెల్సీ ఓట్లు నమోదు చేశామన్నారు. ఆయనతోపాటు రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి బోర్డు డెరైక్టర్ మజ్జి కృష్ణమోహన్, మున్సిపల్ వైస్ చైర్మన్ బెలగాం జయబాబు, మజ్జి వెంకటేష్, మజ్జి రాజా, పొట్నూరు వెంకటనాయుడు, డీసీఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కళింగ మళ్లిబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఆర్డీవో కార్యాలయం ఎదుట వీఆర్ఏల ఆందోళన
పార్వతీపురం: ఎన్నికల హామీలను టీడీపీ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపిస్తూ విజయనగరం జిల్లా పార్వతీపురంలో గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్ఏ) ఆందోళనకు దిగారు. మంగళవారం ఉదయం వందలాది మంది వీఆర్ఏలు ధర్నాకు పూనుకున్నారు. ఎన్నికల హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని కోరారు. కనీసం రూ.18వేల వేతనం చెల్లించాలని, మెడికల్ ఇన్వాలిడేషన్‌లో వారసుల వయో పరిమితిని సడలించాలని కోరారు. తమను నాలుగో తరగతి ఉద్యోగులుగా పరిగణించవద్దని పేర్కొన్నారు. కార్యాలయం గేట్లు మూసేసి వారు నినాదాలు చేశారు. -
పార్వతీపురంలో ఉద్రిక్తం
విజయనగరం : విజయనగరం జిల్లా పార్వతీపురంలో అగ్రిగోల్డ్ బాధితుల ఆందోళన ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. శనివారం ఉదయం సుమారు వెయ్యి మంది బాధితులు, ఏజెంట్లు పట్టణంలోని ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అగ్రిగోల్డ్ బాధితులకు పోలీసులు మధ్య తోపులాటతోపాటు వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో సుమారు 50 మంది అగ్రిగోల్డ్ బాధితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో మిగిలిన బాధితులు రహదారిపై బైఠాయించి... ర్యాలీ నిర్వహించి తీరుతామని పేర్కొన్నారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
ప్రియుడే మొగుడు కావాలి
పార్వతీపురం: ఆరేళ్లు ప్రేమించిన ప్రియుడితో తనకు పెళ్లి చేయాలని ఓ ప్రియురాలు స్థానిక బెలగాంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద దీక్షకు దిగింది. ఇటీవల పోలీసుల కౌన్సెలింగ్‌లో తనను కాదన్నాడనే ఆవేదనతో పోలీసు స్టేషన్‌లోని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆయువతి మంగళవారం అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళిత సామాజిక వర్గానికి చెందిన తనను కురుపాం మండలం గొల్లవలసకు చెందిన శెట్టి వరప్రసాద్ 2010 ఏప్రిల్ నుంచి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా సంబంధం పెట్టుకొని రెండుసార్లు గర్భవతిని చేసి ఇప్పుడు కాదంటున్నాడని వాపోయింది. ఈ విషయమై పెద్దలు చెప్పినా వినలేదని బావురుమంది. వరప్రసాద్ మనసును శెట్టి నాగేశ్వరరావు, శెట్టి చంద్రర్రావు, పొన్నాడ శివరాం, శెట్టి భాస్కరరావు, శెట్టి విజయమ్మ, శెట్టి వాసదేవరావు,నారాయణరావు తదితరులు వారి కులం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే లక్షల ఆస్తి వస్తుందని మార్చారని ఆరోపించింది. ఈ సందర్భంగా ఆమె అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని అందజేసింది. మద్దతు పలికిన ఐద్వా, సీపీఎం, బీజేపీ, రైతు కూలీసంఘాలు ఆ యువతి దీక్షకు పలువురు నాయకులు, సంఘాలు మద్దతు పలికాయి. ఈ సందర్భంగా ఐద్వా నాయకురాలు రెడ్డి శ్రీదేవి అఖిలభారత రైతు కూలీసంఘం నాయకురాలు పి. రమణి, బీజేపీ నాయకులు కోరాడ సత్యనారాయణ, డొంకాడ సాయిపార్థసారథి, పట్లాసింగ్ రవికుమార్, రైతు కూలీసంఘం నాయకులు డి. వర్మ, పి. శ్రీనునాయుడు, బొత్స నర్సింగరావు, సీపీఎం నాయకులు రెడ్డి శ్రీరామ్మూర్తి, టీడీపీ మాజీ కౌన్సిలర్ మరియుదాసు తదితరులు మాట్లాడుతూ రాజకీయ నాయకులు ఇటువంటి వ్యవహారాల్లో కూడా చేతులు పెట్టడం అన్యాయమని ఇది ఎంతవరకు వెళ్లినా తాము ఆయువతి వెనుక తాము ఉంటామని స్పష్టం చేశారు. -
మహిళ ఆత్మహత్య
పార్వతీపురం: అనారోగ్యాన్ని తట్టుకోలేక ఓ మహిళ మంగళవారం ఆత్మహత్య చేసుకుంది. స్థానిక ఇందిరా కాలనీలో జరిగిన సంఘటనపై స్థానికులు, పోలీసులు అందించిన వివరాల ప్రకారం గంటా వీధికి చెందిన బూర్లి వరణమ్మ (45) కొన్ని రోజులుగా థైరాయిడ్‌తో బాధపడుతోంది. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఆమె బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు విషయం తెలుసుకొని మృతదేహాన్ని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
పార్వతీపురంలో భారీ వర్షం
పార్వతీపురం : విజయనగరం జిల్లా పార్వతీపురంలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరహాల గడ్డ సమీపంలోని రాజీవ్ గృహకల్పలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణంలోని సెంటర్ సమీపంలో భారీ వర్షానికి ఓ ఇంటి ప్రహరి గోడ కూలింది. ఆ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. -
ఏజెన్సీలో ఎక్సైజ్ దాడులు
పార్వతీపురం : పార్వతీపురం సబ్‌ప్లాన్‌లోని ఏజెన్సీ మండలాల్లో ఎక్సైజ్ అధికారులు మంగళవారం విస్తృత దాడులు జరిపారు. ఎక్సైజ్ సీఐ ఎస్.విజయకుమార్ ఆధ్వర్యంలో జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, పార్వతీపురం తదితర మండలాల్లో జరిపిన దాడుల్లో జియ్యమ్మవలస మండలం చినబుడ్డిడి గ్రామంలో బుదిరెడ్డి వేణుగోపాల నాయుడు ఇంట్లో నాటుసారా తయారీ కోసం నిల్వ ఉంచిన రెండు టన్నుల నల్లబెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. నాటుసారా తరలిస్తున్న ఓ మోటారు సైకిల్‌ను వశపరుచుకున్నారు. ఈ నల్లబెల్లంతో సంబంధం ఉన్న రాయిపిల్లి రాజును అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ చినబుడ్డిడిలో నాటుసారా తయారీ, అమ్మకాలు చేస్తున్న ప్రధాన వ్యక్తులు రాయిపల్లి ఉమ, మండంగి గౌరీశంకర్, రాయిపిల్లి రమేష్, గంట మోహన్ తదితరులు పరారయ్యారన్నారు. వారిని త్వరలోనే పట్టుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాజశేఖర్‌తోపాటు జిల్లాలోని ఆయా స్టేషన్ల పరిధిలోని ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఆటోబోల్తా..మహిళ మృతి
పార్వతీపురం/కురుపాం : మితిమీరిన ప్రయాణికులతో వెళ్తున్న ఆటో బోల్తాపడిన సంఘటనలో ఒకరు మృతి చెందగా నలుగురికి తీవ్రగాయాలైన సంఘటన కురుపాం మండలం పెదగొత్తిలి పంచాయతీ పరిధిలోని వెంపటాపురంలో మంగళవారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి బాధితుల కుటుంబీకులు, ఏరియా ఆస్పత్రి ఔట్‌పోస్టు పోలీసులు అందించిన వివరాలిలాఉన్నాయి. కురుపాం మండలం వెంపటాపురానికి చెందిన 15 మంది గిరిజనులు ఆటోలో మంగళవారం ఉదయం గుమ్మలక్ష్మీపురంలోని బ్యాంకుకు పెదగొత్తిలికి చెందిన తేజ ఆటోలో వెళ్తున్నారు. ఈ సందర్భంలో గ్రామ సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభానికి డ్రైవర్ తేజ నిర్లక్ష్యంతో అధిక లోడ్తోఉన్న ఆటోను స్పీడ్‌గా వెళ్లి ఢీకొట్టాడు. ఈ సంఘటనలో డ్రైవర్ పక్కనే కూర్చొన్న మండంగి చామంతి (35) అక్కడికక్కడే మృతిచెందగా ఆ గ్రామానికి చెందిన హిమరిక జయమ్మ, హిమరిక హిరణి, మండంగి దుర్గారావు, హిమరిక చిన్నారావులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన జరిగిన వెంటనే క్షతగాత్రులను పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మృతురాలు మండంగి చామంతికి నలుగురు పిల్లలున్నారు. భర్త రామారావు కూలిపనులు చేస్తున్నాడు. మహిళా సంఘం నాయకురాలిగా చా మంతి భర్తకు చేదోడు వాడోడుగా ఇంటికి ఆదారంగా ఉండేది. ఇప్పుడు అమె చనిపోవడంతో పిల్లలు అనాధలయ్యారని గ్రామస్థులు వాపోతున్నారు. మృతదేహాన్ని అడ్డుకున్న గ్రామస్థులు.. ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న నీలకంఠాపురం పోలీసులు కేసు నమోదు చేసి శవ పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం చేసేందుకు పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించేందుకు చర్యలు చేపట్టగా గ్రామస్థులు పోస్టుమార్టం వద్దని తమకు అప్పగించాలని అడ్డుకున్నారు. కానీ ఎస్సై ప్రయోగమూర్తి బాధితులకు సూచించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బెట్టింగ్‌ల అడ్డాగా...తోటపల్లి
బెట్టింగ్ దందా పల్లెలకూ పాకుతోంది. పలువురు బెట్టింగ్‌రాయుళ్లు యువకులను ఈ ఉచ్చులోకి లాగుతున్నారు. ఇరుక్కుని అప్పులపాలైనవారు ఆస్తులు తెగనమ్ముకుంటున్నారు. బకాయిల వసూళ్లకు యువకులను ఏజెంట్లుగా వాడుకుని ప్రశాంతంగా ఉండే గ్రామాల్లో విషసంస్కృతికి బీజం వేస్తున్నారు. వారి బంగారు భవిష్యత్తును దుర్వ్యసనాలకు బలిచేస్తున్నారు. పార్వతీపురం: కొన్నేళ్లుగా పార్వతీపురం కేంద్రంగా నడిచిన క్రికెట్ బెట్టింగ్ పోలీసుల నిఘా పెరగడంతో ఇప్పుడు పార్వతీపురం చుట్టు పక్కల ఉన్న గరుగుబిల్లి, కొమరాడ, పార్వతీపురం, జియ్యమ్మవలస తదితర మండలాల్లోని పలు గ్రామాలకు పాకినట్లు సమాచారం. ఆయా గ్రామాలకు చెందిన యువకులు క్రికెట్ బెట్టింగ్ కాస్తూ చేతులు కాల్చుకుంటున్నారు. బెట్టింగ్ ద్వారా బకాయిపడిన మొత్తాలు తీర్చమంటూ బుకీలనుంచి ఒత్తిడి ఎదురవుతుండటంతో ఎక్కడ తమ పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడతారోనన్న బెంగతో, భూములను తెగనమ్మి ఆ అప్పులు తీరుస్తున్నట్టు విస్తృతంగా ప్రచారం సాగుతోంది. తోటపల్లి కేంద్రంగా... గరుగుబిల్లి మండలం తోటపల్లి కేంద్రంగా ఈ దందా ఎక్కువైనట్టు సమాచారం. గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు, విశాఖకు చెందిన మరో వ్యక్తి కలిసి ఈ దందా సాగిస్తున్నట్లు సమాచారం. గతంలో క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో పోలీసులకు పట్టుబడిన వ్యక్తులూ ఇందులో ఉన్నట్టు తెలుస్తోంది. బాకీపడిన మొత్తాల వసూళ్లకోసం గ్రామాలకు చెందిన యువకులను ఏజెంట్లుగా నియమించుకుని వారికి మద్యం బాటిళ్లు, బిరియానీ లు నజరానాగా ఇచ్చి బైక్‌లపై పల్లెలకు పంపిస్తున్నారు. దీనివల్ల పల్లెల్లో వివాదాలు చెలరేగి శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందేమోనని పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నపళంగా ధనవంతులు ఒకప్పుడు ఏమీ లేని కొంతమంది వ్యక్తులు ఈ క్రికెట్ బెట్టింగ్ బుకీలుగా అవతారం ఎత్తాక ఉన్న ప ళం గా ధనవంతులుగా మారినట్లు సమాచారం. వీరు నిత్యం యువతకు వల విసిరి ఈ ఉచ్చులోకి దింపుతున్నారనీ, పోలీసులను కూడా తాము మేనేజ్ చేశామని ఆయా గ్రామాల్లో ప్రచారం చేసుకుంటున్నట్టు సమాచారం. పోలీసు ల నిఘా తగ్గడంవల్లే ఈ అకృత్యాలు పెచ్చుమీరుతున్నాయి. ఇప్పటికే కేసులు నమోదు చేశాం ఈ విషయమై గరుగుబిల్లి ఎస్సై వి.లోవరాజు వద్ద సాక్షి ప్రస్తావించగా భూములు అమ్ముకునే విషయం. బుకీల కలెక్షన్లు తమకు తెలియదని చెప్పారు. గతంలో క్రికెట్ బెట్టింగ్‌లు ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశామన్నారు. అనుమానితులు గ్రామంలోకి రాకుండా నిఘా పెట్టామని తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
పార్వతీపురం: స్థానిక బెలగాం చివారున, గరుగుబిల్లి మండలం తోటపల్లి సమీపంలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఈ ప్రమాదాల్లో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను విశాఖ కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. దీనికి సంబంధించి స్థానిక పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి... స్థానిక బెలగాం చివారున గల జేపీ అపార్ట్మెంట్స్ వద్ద సైకిల్, మోటారు సైకిల్ ఢీకొట్టాయి. జేపీ అపార్ట్మెంట్స్ నుంచి సైకిల్ పై వస్తున్న నిఖిల్‌ను, మోటారు సైకిల్‌పై వస్తున్న గండి సింహాచలం బలంగా ఢీ కొట్టాడు. ఈ సంఘటనలో ఇరువురికి తీవ్రగాయాలయ్యాయి. సంఘటన జరిగిన వెంటనే క్షతగాత్రులను ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రథమచికిత్స అందించి విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అలాగే గరుగుబిల్లి మండలం తోటపల్లి సమీపంలోని జంక్షన్ వద్ద కురుపాంకు చెందిన ఆటోడ్రైవర్ రాయిపల్లి సుమన్(39) మంగళవారం రాత్రి పార్వతీపురం నుంచి ఇంటికి వస్తూ తోటపల్లి జంక్షన్ వద్ద ఆటోను పక్కనబెట్టి బహిర్భూమికి వెళుతుండగా ఉల్లిభద్రకు చెందిన శెట్టి ధనుంజయనాయుడు మోటారు సైకిల్‌తో ఢీ కొట్టాడు. దీంతో సుమన్ అక్కడికక్కడే మృతి చెందగా, ధనుంజయనాయుడుకు తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు సుమన్‌కు భార్య శ్యామల, కూతురు ఆరేళ్ల శాలిని, ఐదేళ్ల కొడుకు చరణ్ ఉన్నారు. -
4న రక్షా సెక్యూరిటీ ఉద్యోగాలకు ఎంపిక
పార్వతీపురం: ఈ నెల 4న ఐటీడీఏ ఆధ్వర్యంలో, స్థానిక వైటీసీలో అనంతపురానికి చెందిన రక్షా సెక్యూరిటీ సర్వీసెస్‌లో గిరిజన యువకులకు సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలకు ఎంపిక జరుగుతుందని ఐటీడీఏ పీఓ వి.ప్రసన్న వెంకటేష్ ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు అనంతపురం జిల్లాలోని రక్షా అకాడమీలో 3 నెలల పాటు ఉచిత శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. శిక్షణ అనంతరం మంచి వేతనంతో ఉపాధి కల్పిస్తారన్నారు. ఆసక్తి గలిగిన అభ్యర్థులు ఒరిజనల్ సర్టిఫికెట్స్‌తో హాజరుకావాలన్నారు. అభ్య ర్థులు 18-30 సంవత్సరాలు వయసు కలిగి, 10వ తరతి పాస్‌తో పాటు 167 సెం.మీ ఎత్తు ఉండాలన్నారు. గిరిజన నిరుద్యోగ యువకులు ఈ అవకాశాన్ని వినియోగించు కోవాలని కోరారు. వివరాలకు 08963-220489, 9502276560, 9491044611 నంబర్లను సంప్రదించాలన్నారు. -
గాడిలో పాలన!
ఐటీడీఏ పురోగమనానికి వడివడిగా అడుగులు గ్రామ దర్శిని పేరుతో గిరిజనుల చెంతకు అధికారులు మండలాలకు ప్రత్యేకాధికారుల నియామకం ఐటీడీఏ పీఓ ప్రసన్న వెంకటేశ్ మార్కు పాలనకు శ్రీకారం పార్వతీపురం: ఐటీడీఏ కొత్త పీఓ వి.ప్రసన్న వెంకటేశ్ తన మార్కు పాలనకు శ్రీకారం చుట్టారు. ఐటీడీఏ పురోగమనానికి వడివడిగా అడుగులు వేస్తున్నారు. కొన్నాళ్లుగా గాలికి వదిలేసిన పాలనను గాడిలో పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా గిరిజనులకు ఏం కావాలో తెలుసుకుని వాటిని అందించేందుకు తనదైన ‘వెల్ఫేర్’ శైలిలో చర్యలు చేపడుతున్నారు. సబ్-ప్లాన్‌లోని గిరిజనుల స్థితిగతులు, ఇప్పటి వారెదుర్కొంటున్న సమస్యలు, అభివృద్ధి ఫలాలు వారికి చేరుతున్న తీరు తెలుసుకుని అందులో ఏమైనా లోపాలుంటే సవరించేందుకు కంకణం కట్టుకున్నారు. గ్రామ దర్శినితో గిరిజనుల చెంతకు... గిరిజనులకు అవసరమైన వాటిని సమకూర్చే లక్ష్యంతో ‘గ్రామ దర్శిని’ అనే కార్యక్రమాన్ని వారం రోజుల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం ప్రతి మండలానికి ఓ ప్రత్యేకాధికారిని నియమించి వారి ఆధ్వర్యంలో బృందాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆయా బృందాలు ఆయా మండలాల్లోని గిరిజన గ్రామాల్లో నిత్యం పర్యటించి వారి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు వీలుగా అందుబాటులో ఉంచనున్నారు. కలెక్టర్ ఆమోదానికి ప్రత్యేకాధికారుల జాబితా సబ్-ప్లాన్‌లోని 8 మండలాలకు ప్రత్యేకాధికారుల నియామకం బుధవారం నాటికి పూర్తిచేసి, జిల్లా కలెక్టర్ ఆమోదానికి పంపించే ఏర్పాట్లు చేశారు. కొమరాడ మండలానికి ఆర్.వి.వి.ప్రసాద్(ఐటీడీఏ పీహెచ్ఓ), గుమ్మలక్ష్మీపురానికి జి.విజయకుమార్(డీడీ ఐటీడీఏ), కురుపాంకు మురళి(ఏపీడీ -వెలుగు), జియ్యమ్మవలసకు ఎ.వి.సుబ్బారావు(ఈఈ-ఐటీడీఏ), పార్వతీపురానికి వి.ఎస్.ప్రభాకరరావు(ఐటీడీఏ ఏపీఓ), మక్కువ మండలానికి బొబ్బిలి పశు సంవర్థకశాఖ ఏడీ, సాలూరుకు ఆర్.గోవిందరావు(ఆర్డీఓ), పాచిపెంటకు ఆర్.శ్రీనివాసరావు(ఉద్యానవన శాఖ ఏడీ)లను నియమించారు. గ్రామ దర్శినిలో ఏం చూస్తారంటే... ప్రస్తుతం గిరిజన గ్రామాల్లో మలేరియా విస్తరిస్తోంది. దానిని కట్టడి చేయాలంటే మలేరియా నివారణ మందు అన్ని చోట్లా పిచికారీ చేసిందీ లేనిదీ పరిశీలిస్తారు. అనారోగ్యంతో ఉన్న గిరిజనులకు చక్కనైన వైద్యం అందిస్తారు. డాపౌట్స్ను గుర్తించి వారిని బడిలో చేర్పించేందుకు కౌన్సెలింగ్ చేపడతారు. జీడి మొక్కల జంటల కత్తిరింపుతో దిగుబడులు పెంచడం, అలాగే వాటర్‌షెడ్స్, ఫారమ్‌ఫాండ్స్ ఏర్పాటు, తాగునీటి పరిస్థితి తదితర వాటిని పరీశీలించి లోపాలను సరిచేస్తారు. అంగన్వాడీ సెంటర్ల పనితీరు, గిరిజన తల్లీ, పిల్లలు, గర్భిణీ స్త్రీలకు అందే పోషకాహారం, తల్లీ పిల్లల మరణాలు తగ్గించడం, ఆస్పత్రి ప్రసవాలు పెంచడం తదితర వాటిపై అవగాహన కల్పిస్తారు. గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతను తనిఖీ చేస్తారు. వారానికి ఓ రోజు తప్పనిసరిగా ఆ గ్రామాన్ని సందర్శించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. -
భగ్గుమన్న గిరిజనులు
పార్వతీపురం : బుదురువాడ పంచాయతీ పరిధిలో ఉన్న బోడికొండపై గ్రానైట్ తవ్వకాలకు అనుమతివ్వడంతో గిరిజనులు, గిరిజన సంఘాల నాయకులు భగ్గుమన్నారు. గ్రానైట్ తవ్వకాలకు అనుమతులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఐటీడీఏ కార్యాలయాన్ని సోమవారం ముట్టడించారు. రైతు కూలీ సంఘం (ఆ.ప్ర), అఖిల భారత రైతు కూలీ సంఘం, సీపీఎం, గిరిజన సంక్షేమ సంఘం, గిరిజన సంఘ నాయకులు పి.శ్రీనునాయుడు, పి.రమణి, రెడ్డి శ్రీరామమూర్తి, ఊయక ముత్యాలు, వెలగాడ కృష్ణ, సాయిబాబు, పి.రంజిత్‌కుమార్ తదితరుల ఆధ్వర్యాన బోడికొండ గ్రానైట్ బాధిత గ్రామాల గిరిజనులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. తొలుత ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఐటీడీఏ కార్యాలయం వరకు మెయిన్ రోడ్డులో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఐటీడీఏ కార్యాలయం గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నప్పటికీ దూసుకుని లోపలికి వెళ్లారు. ఆ సమయంలో సీఐ వి.చంద్రశేఖర్, పట్టణ ఎస్ఐ బి.సురేంద్రనాయుడు త దితరులతో వాగ్వాదానికి దిగారు. ఐటీడీఏ పీవో బయటకు రావాలని గిరిజనులు డిమాండ్ చేశారు. దీంతో తొలుత పీవో తన చాంబర్లో గిరిజనులు, గిరిజన సంఘ నాయకులతో మాట్లాడారు. ఆ తర్వాత గిరిజనుల వద్దకు వచ్చి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 20 గిరిజన గ్రామాలకు జీవనాధారం.. ఈ సందర్భంగా గిరిజన నాయకులు మాట్లాడుతూ తమకు అనుమతులు ప్రభుత్వం నుంచి వచ్చాయని చెబుతూ పోకర్నో గ్రానైట్ కంపెనీ తవ్వకాలకు యంత్రాలను సిద్ధం చేస్తోందని పీవోకు చెప్పారు. బుదురువాడ పంచాయతీ పరిధిలో సర్వే నంబరు 121లో సుమారు 200 ఎకరాల్లో ఉన్న బోడికొండపై ఆధారపడి 20 గిరిజన గ్రామాలు జీవనం సాగిస్తున్నాయని తెలిపారు. ఈ కొండ చుట్టూ వందలాది ఎకరాలలో జీడితోటలు, వరి, రాగులు, జొన్నలు, కొర్రలు తదితర పంటలు పండించుకుని వేలాది గిరిజనులు, గిరిజనేతరుల కుటుంబాలు జీవిస్తున్నాయని చెప్పారు. కొండపై ఉన్న వెదురు, కలపను విక్రయించి కొందరు జీవిస్తున్నారని వివరించారు. ఈ కొండపై గ్రానైట్ తవ్వకాలకు అనుమతిస్తే ప్రజలు జీవితం ఛిద్రమవుతుందన్నారు. ప్రజలు నిరాశ్రయులవుతారని పేర్కొన్నారు. పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటుందని చెప్పారు. తవ్వకాలకు అనుమతి ఇవ్వొద్దని గత ఏడాది పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించామని గుర్తుచేశారు. అప్పుడు అధికారులు, ప్రజాప్రతినిధులు బోడికొండపై గ్రానైట్ తవ్వకాలకు అనుమతులు మంజూరు చేయకుండా చూస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు పోకర్నో కంపెనీ తమకు అనుమతులు ఉన్నాయని చెబుతోందన్నారు. పోకర్నో కంపెనీకి ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని కోరారు. సర్వే చేసి రిపోర్టు ఇవ్వాలి పీవో వెంకటేష్ వెంటనే ఆర్డీవో రోణంకి గోవిందరావుతో మాట్లాడి బోడికొండపై సమగ్ర సర్వే చేసి రిపోర్టు ఇవ్వాలని చెప్పారు. ఆ రిపోర్టు అనంతరం తానే స్వయంగా పరిశీలించి ప్రభుత్వానికి విన్నవించి, అనమతులు రద్దు చేసేందుకు చర్యలు తీసుకుంటానని గిరిజనులకు హామీ ఇచ్చారు. గిరిజన ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు. -
ఐటీడీఏ కార్యాలయం ముట్టడి
పార్వతీపురం: విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయాన్ని గిరిజన సంఘాలు, గిరిజనులు సోమవారం ముట్టడించారు. మండలంలోని బోడిపంట మీద కలర్ గ్రానైట్ తవ్వకాలకు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలంటూ ధర్నాకు దిగారు. ధర్నా విషయం తెలిసి పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోలీసులకు, గిరిజనులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. స్వల్ప తోపులాట జరిగింది. -
ఐఏఎస్ యువకుడి స్కూలు జ్ఞాపకాలు..
- అసిస్టెంట్ కలెక్టర్‌గా పార్వతీపురం కుర్రాడు - ముస్సోరీలో పూర్తయిన శిక్షణ - పశ్చిమబంగలో అసిస్టెంట్ కలెక్టర్‌గా నియామకం - విధుల్లో చేరేముందు ఆర్సీఎం పాఠశాల సందర్శన - జ్ఞాపకాలను నెమరేసుకున్న యువ ఐఏఎస్ పార్వతీపురం (విజయనగరం) : ఐఏఎస్.. ఈ మూడక్షరాల పదవి భారత సివిల్ సర్వీసుల్లో అత్యున్నతమైనది. పాలనలో కీలకమైన ఈ ఉద్యోగం అఖిల భారతీయ స్థాయిలో ఎందరికో తీరని కల. అది సాధించేందుకు ఆ యువకుడు పరితపించాడు.. పరిశ్రమించాడు. పట్టుదలతో కైవసం చేసుకున్నాడు. పదిమందికీ స్ఫూర్తినిస్తున్నాడు. ఢిల్లీకి రాజైనా జన్మభూమికి బిడ్డే.. అందుకే రెండ్రోజుల్లో ఉద్యోగంలో చేరేముందు జన్మనిచ్చిన పార్వతీపురం గుర్తొచ్చింది. అంతే..జన్మభూమిపై వాలిపోయాడు. విద్యాబుద్దులు నేర్పిన పాఠశాలను సందర్శించాడు. పిల్లలతో ఆటపాటలతో ఆనందంగా గడిపాడు. లక్ష్య సాధనకు మెలకువలను వివరించాడు. అందరి అభినందనలు మూటగట్టుకుని విధుల్లో చేరేందుకు బయల్దేరాడు. అతనే యువ ఐఏఎస్ అధికారి పల్లి శ్రీకాంత్. పార్వతీపురానికి చెందిన శ్రీకాంత్ గత ఏడాది ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. ఇటీవలే ముస్సోరిలో ఐఏఎస్ శిక్షణ పూర్తయింది. ఈ నెల 20న పశ్చిమబంగ రాష్ట్రం ముర్షిదాబాద్ అసిస్టెంట్ కలెక్టర్‌గా విధుల్లో చేరాలి. దానికి ముందు రెండు రోజులు సెలవు దొరకడంతో పార్వతీపురం వచ్చారు. ఓనమాలు నేర్పిన ఆర్సీఎం (బాలురు) పాఠశాలను శనివారం సందర్శించారు. లక్ష్యం సమున్నతమైతే ఏదైనా సాధ్యమే పాఠశాల హెడ్మాస్టర్ జేమ్స్ మాస్టారు, ఇతర ఉపాధ్యాయులతో భేటీ అయిన శ్రీకాంత్ బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ.. హైస్కూల్ చదువులోనే మనసులో గట్టిగా లక్ష్యాన్ని నిర్ధేశించుకోవాలని సూచించారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా, శారీరక, మానసిక మార్పులు లక్ష్యానికి విఘాతం కల్పించినా, మొక్కవోని దీక్షతో ముందుకు సాగితే విజయం వరించడం తధ్యమన్నారు. పిల్లలు అడిగిన ప్రశ్నలకు చక్కగా, ఓపికగా సమాధానాలు చెప్పి వారిని ఆకట్టుకున్నారు. గుర్తుకొస్తున్నాయి.. పాఠశాలలోని తరగతి గదిలో గతంలో తాను కూర్చున్న బెంచీలో పిల్లల మధ్య గడిపి ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం మాట్లాడుతూ తనకు బంగారు భవితను ప్రసాదించిన పార్వతీపురంలోని ప్రతి ఒక్కరికీ.. చదువుకున్న పాఠశాలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్వతీపురం పట్టణానికి మంచి పేరు తీసుకొస్తానన్నారు. -
ఫీల్డ్‌మన్ చేతివాటం ..
పార్వతీపురం: ఎన్సీఎస్ సుగర్స్ ఫీల్డ్‌మన్ చేతివాటానికి చెరుకు రైతులు బలయ్యూరు. గతంలో కర్మాగార యూజమాన్యం చేతిలో ముప్పతిప్పలకు గురైన రైతులు నేడు ఫీల్డ్‌మన్ చేతిలో దారుణంగా దెబ్బతిన్నారు. తీసుకున్న పంటకు సంవత్సరాల తరబడి బిల్లులు చెల్లించక యూజమాన్యం మోసం చేసిన సంగతి తెలిసిందే. ఎన్నో పోరాటాల నడుమ బిల్లులు ఇవ్వడానికి యూజమాన్యం ముందుకు రాగా, తాజాగా ఆ కంపెనీలో పనిచేస్తున్న ఫీల్డ్‌మన్ శేఖర్ రైతులకు రావాల్సిన సొమ్మును సొంతానికి వాడుకుని మోసం చేశాడు. సొమ్ము తిరిగి ఇవ్వడానికి లేనిపోని ఇబ్బందులు పెడుతుండడంతో చివరకు బాధిత రైతులు గేదెల రాంబాబు, గేదెల సత్యనారాయణ, గేదెల రామినాయుడు, రాగాల గోవిందరావు, తదితరులు సీపీఎం నాయకుడు రెడ్డి శ్రీరామ్మూర్తి ఆధ్వర్యంలో బుధవారం స్థానికా ఆర్డీఓ కార్యాలయంలో ఏఓ టి. రామకృష్ణారావుకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎన్సీఎస్ సుగర్స్ కర్మాగార ప్రతినిధులు 2013-14, 2014-15 సంవత్సరాలకు సంబంధించి బిల్లులు చెల్లించలేదు. ఈ విషయమై కర్మాగారం సీఈఓను అడగ్గా, ఫీల్డ్‌మన్ వై. శేఖర్ ద్వారా బిల్లులు చెల్లించామని చెప్పినట్లు తెలిపారు. దీంతో శేఖర్‌ను నిలదీస్తే ఆ సొమ్ము సొంతానికి వాడుకున్నానని చెప్పి తన సొంత ఖాతాకు చెందిన చెక్కులిచ్చాడన్నారు. తీరా ఆ చెక్కులు పట్టుకుని బ్యాంకుకు వెళితే అందులో డబ్బులేవని వాపోయూరు. గంగన్నపాడుతో పాటు కూనయ్యవలస, నందిగాం, తదితర గ్రామాలకు చెందిన పలువురి రైతుల బిల్లులు స్వాహా చేశాడని ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయూలని కోరారు. -
వద్దంటావేం నాన్నా..
ఇంటికి నాన్న రాగానే కాళ్లకు అడ్డం పడతారు. మూట కట్టి దాచిన కబుర్లన్నీ చెవిలో వినిపిస్తారు. ఇష్టమైన వస్తువుల జాబితా చిట్టా జేబులో తోస్తారు. ఒడిలో కూర్చుని గారాలు పోతారు. ఏ కూతురైనా నాన్న ప్రేమవర్షంలో తడిసిపోతుంది.. ఆ అదృష్టం ఓ చిట్టితల్లికి దక్కలేదు. ఆ అనురాగం ఆమెపై కురవలేదు. భవిష్యత్తుకు బంగారు బాట వేయలేదు. ప్రయోజకురాలిని చేయాల్సిన నాన్న సహజీవ నాల మోజులో మునిగి తేలుతున్నాడు. కుమార్తె ఉన్నతిని గాలికొదిలేశాడు. తల్లి కన్నుమూసింది. చదువు ఆగిపోయింది. నాన్న ఆదరణ కరువైపోయింది. అదే ఆమెను కుంగదీసింది. మతిస్థిమితం లేకుండా చేసింది. ఆ అభాగ్యురాలు బుదరువాడ పంచాయతీ, టేకులోవ గ్రామానికి చెందిన విద్యార్థిని సీదరపు లక్ష్మీ సరస్వతి. బాధితురాలి సోదరుడు వెంకటేశ్వర్రావు, పెద్దమ్మ కాంతమ్మలు అందించిన వివరాలకు అక్షర రూపమిది.పార్వతీపురం: సాలూరు మండలం తోణాం స్కూలు కాంప్లెక్స్‌కు చెందిన కొట్టుపరువు కొత్తవలస పాఠశాల ఉపాధ్యాయుడు సీదరపు సన్యాసయ్య దొర తొలుత కాంతమ్మను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి సింహాచలం, వెంకటేష్ ఇద్దరు పిల్లలు పుట్టారు. అనంతరం ఆమె సొంత చెల్లెలు గంగమ్మను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి సీతారాం, లక్ష్మీ సరస్వతి పుట్టారు. లక్ష్మీ సరస్వతి స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో పదోతరగతి, ఇంటర్మీడియట్ చదివి అత్యధిక మార్కులు సాధించింది. అనంతరం విజయనగరం గొట్లాం కళాశాలలో డిగ్రీ (బయోటెక్నాలజీ)లో చేరింది. అదే సమయంలో తల్లి కాంతమ్మ మృతి చె ందింది. తండ్రి మరో స్త్రీతో సహజీవనం చేస్తూ బిడ్డల్ని పట్టించుకోవడం మానేశాడు. దీంతో లక్ష్మీసరస్వతి చదువు మధ్యలో ఆగిపోయింది. తండ్రి కనీసం పట్టించుకోకపోవడంతో తీవ్ర మానసిక ఆందోళనకు గురై మతిస్థిమితం కోల్పోయింది. కుమార్తె అనారోగ్యంపై స్పందించని తండ్రి అందం, చదువు, చలాకీతనంతో ఆడుతూపాడుతూ తిరిగే పిల్ల.. ఇప్పుడు నోటమాట రాక.. కేకలు వేస్తుంటే కుటుంబ సభ్యులే కాదు... తెలిసినవారి గుండె తరుక్కుపోతోంది. కుమార్తె ఆరోగ్యం క్షీణిస్తున్నా తండ్రి కరుణించడం లేదు. ఇంటిని పట్టించుకోకపోవడంతో పిల్లల పోషణ కష్టంగా ఉందని బాధితురాలి పెద్దమ్మ కాంతమ్మ, అన్నయ్య వెంకటేశ్వర్రావులు వాపోయారు. ఉపాధ్యాయుడైన సన్యాసయ్య దొర జీతం నుంచి కొత్తమొత్తం నెల నెలా తమకు ఇప్పించాలని ఐటీడీఏ పీఓను కోరేందుకు సోమవారం గ్రీవెన్స్కొచ్చారు. లక్ష్మీసరస్వతి దీనగాథ విన్నవారంతా చలించిపోయారు. -
పసిపాపపై పైశాచికం!
► ఐదేళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం ► పోలీసులను ఆశ్రయించిన బాలిక తల్లిదండ్రులు ► గతంలో మైనర్‌పై లైంగిక దాడికేసులో శిక్ష అనుభవించిన ప్రబుద్ధుడు ► కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాల డిమాండ్ అభం... శుభం... తెలియని ఆ చిన్నారిని కాటేసేందుకు యత్నించాడో మృగాడు. తోటి చిన్నారులతో ఆడుకుంటున్న ఆ బాలికను ఎత్తుకెళ్లి చెరిచాలనుకున్నాడు ఆ కామాంధుడు. పాపం... ఆ మానవ మృగం వికృత చేష్టలను పంటిబిగువున భరించి ఎలాగోలా అక్కడినుంచి బయటపడింది. తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా... ఆ ప్రబుద్ధుడు ఇప్పుడు పరారీలో ఉన్నాడు. విజయనగరం జిల్లా : పార్వతీపురం పట్టణ శివారున రాయగడ రోడ్డులోగల వివేకానందకాలనీలోని ఉజ్జిడితల్లి వీధిలో నిరుపేద కుటుంబం నివాసం ఉంటోంది. చిన్నపాటి టీకొట్టు నడుపుకుంటూ తమకున్న కుమారుడు, కుమార్తెను అల్లారుముద్దుగా పెంచుకుంటోంది. ఎప్పటిలాగే మంగళవారం ఉదయం టీ కొట్టు తీసేందుకు వారు వెళ్లిపోగా... వీధిలోని చిన్నారులతో వారి ఐదేళ్ల కుమార్తె ఆడుకుంటోంది. అప్పటికే పూటుగా మద్యం సేవించి ఉన్న... ఆ పక్క జనతావీధికి చెందిన యాభై ఏళ్ల అన్నాబత్తుల బాబూరావు ఆ పసికందును చిదిమేందుకు యత్నించాడు. తన ఇంటిలోకి ఎత్తుకెళ్లిపోయాడు. వికృతమైన చేష్టలతో తన కామవాంఛ తీర్చుకునేందుకు యత్నించాడు. ఎలా తప్పించుకుందోగాని. ఆ చాన్నిరి అక్కడినుంచి ఏడ్చుకుంటూ వచ్చి జరిగిన విషయం తల్లికి తెలియజేసింది. కన్నీరు మున్నీరైన ఆ తల్లి భర్తకు సమాచారం అందించగా... వీధిలోని సీపీఎం నాయకుడు బంకురు సూరిబాబుతో పాటు పెద్దలకు విషయం చెప్పారు. వెంటనే పోలీస్ స్టేషన్‌కు చేరుకొని జరిగిన సంఘటనపై పట్టణ ఎస్సై బి.సురేంద్రనాయుడుకు ఫిర్యాదు చేశారు. వారికి తోడుగా సీఐటీయూ నాయకుడు జి.వి.సన్యాసి, పట్టణ పౌర సంక్షేమ సంఘ నాయకుడు పాకల సన్యాసి, ఐద్వా నాయకురాలు గెద్ద తులసి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ మానవ మృగం బాబూరావును జనజీవనంలో తిరగనివ్వొద్దన్నారు. దీనిపై బాధిత బాలిక కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. ఐసీడీఎస్ అధికారుల పరామర్శ సంఘటన విషయం తెలుసుకున్న స్థానిక ఐసీడీఎస్ సీడీపీఓ కె.విజయగౌరి తన సిబ్బందితో సూపర్వైజర్, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులతో బాధిత బాలిక ఇంటికెళ్లి పరామర్శించారు. సంఘటన వివరాలు అడిగి తెలుసుకొన్నారు. టౌన్ ఎస్సైతో మాట్లాడారు. వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. లైంగిక దాడి కేసులో గతంలోనూ జైలు శిక్ష గతంలో ఆ కాలనీకి చెందిన ఓ మైనర్ బాలికపై లైంగికదాడికి పాల్పడిన బాబూరావు ఏడేళ్లు జైలు శిక్ష అనుభవించి బయటికొచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ మానవమృగం బాధలు పడలేక తొలి భార్య, రెండో భార్య సైతం వదిలి వెళ్లిపోయారు. -
పార్వతీపురంలో ఈదురుగాలులు
పార్వతీపురం (విజయనగరం జిల్లా) : పార్వతీపురంలో ఆదివారం సాయంత్రం నుంచి భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. వర్షంతోపాటు భారీగా ఈదురుగాలులు వీస్తుండటంతో పలుచోట్ల భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. -
ఈదురుగాలుల బీభత్సం
* ఉరుములు, మెరుపులతో భారీ వర్షం * కూలిన చెట్లు.. హోర్డింగ్‌లు... కరెంటు స్తంభాలు... * తెగిన కరెంట్ తీగలు... గాడాంధకారంలో వీధులు * పార్వతీపురం, బొబ్బిలి, ఎస్‌కోటలో కారు చీకట్లు పార్వతీపురం/బొబ్బిలి/శృంగవరపుకోట: పార్వతీపురం, బొబ్బిలి, శృంగవరపుకోట పరిసర ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ఉదయం నుంచి రోిహణి ఎండలు, ఉక్కబోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేయగా... సాయంత్రమయ్యేసరికి ఉన్నట్టుండి కరిమబ్బులు కమ్ముకుని రాత్రి 7 గంటల ప్రాంతంలో ఈదురు గాలి ఎక్కువైంది. దానికి ఉరుముల మెరుపులతో కూడిన వర్షం తోడయ్యింది. ఈదురు గాలులకు వీధుల్లో దూళి రేగి, వాహనాలు, రిక్షాలను ఎగరేసుకుపోయింది. పార్కింగ్ వాహనాలను నేల పడేసింది. పట్టణ మెయిన్ రోడ్డులోని పెద్ద పెద్ద హోర్డింగులు, చిన్న చిన్న వ్యాపార షాపుల బోర్డులు గాలికి ఎగిరిపోయాయి. అలాగే పార్వతీపురంలోని కర్షకమహర్షి ఆస్పత్రి ముందున్న తురాయి చెట్టు కూకటి వేళ్లతో కూలిపోయింది. దీని కింద పలు ద్విచక్రవాహనాలున్నాయి. అలాగే సుదర్శన్ షాపీపై ఉన్న హోర్డింగ్ భయాన్ని గొలిపేలా వేలాడుతోంది. అలాగే హోటల్ కిన్నెర సమీపంలో మేడపై ఉన్న సోలార్ ప్లేట్లు ఎగిరి మెయిన్ రోడ్డుపై ముక్క ముక్కలుగా ఎగిరిపడ్డాయి. అలాగే సిబ్బన్న భవనం సమీపంలోని ఆస్పత్రి హోర్డింగ్‌లు నేలపడ్డాయి. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకూలి, విద్యుత్ వైర్లు తెగిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పార్వతీపురంలోని బంగారమ్మ కాలనీలో-4, బైపాస్ రోడ్డులో-5 గౌడవీధిలో- 2, సాయిబాబా టెంపుల్ వద్ద 2 పెద్ద స్తంభాలు కూలిపోయి, వైర్లు తెగిపోయినట్లు విద్యుత్‌శాఖ ఏడీ ఎల్ సత్యనారాయణ తెలిపారు. ఇంకా మండలాల్లో పరిస్థితి తెలియరాలేదని, రాత్రికి విద్యుత్ సరఫరా చేయడం ఇబ్బందేనని చెప్పారు. గాలికి కేబుల్స్ కూడా తెగిపోవడంతో నెట్ సేవలు దాదాపు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు అవస్థలు పడ్డారు. ఈ గాలికి అరకొరగా ఉన్న మామిడి పంట నేలరాలిపోయినట్లు రైతులు వాపోతున్నారు. బొబ్బిలిలో... బొబ్బిలి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. బొబ్బిలి పోలీస్‌స్టేషన్‌వద్ద చెట్టుకూలి ప్రహరీ ధ్వంసమైంది. పార్వతీపురం రోడ్డులో విద్యుత్ హైటెన్షన్ వైర్లపై చెట్టుకూలింది. దీనితో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న చెట్టు కొమ్మ విరగడంతో తె ర్లాం మండలం కూనాయవలస గ్రామ మాజీ సర్పంచ్ కర్రి ప్రభాకరరావుకు చెందిన కారు ధ్వంసమైంది.. కొమ్మ కారు ముందు భాగంపై పడగానే డ్రైవరు అప్రమత్తమవడంతో ప్రమాదం తప్పింది.. పట్టణంలోని పలు హోర్డింగులు ఈ గాలులకు నేలకొరిగాయి. తారకరామాకాలనీతో పాటు పలు ప్రాంతాల్లో చెట్టు కూలాయి.. రోడ్డుపై వెళ్తున్న వాహనాలు సైతం ముందుకు కదలలేని విధంగా బలమైన గాలులు వీయడంతో ద్విచక్ర వాహనాలు, కార్లలోప్రయాణించే వారు ఇబ్బందులు పడ్డారు. రామభద్రపురం, బాడంగి, తెర్లాం మండలాల్లో కూడా గాలులు బీభ త్సం సృష్టించాయి. ఎలక్ట్రికల్ డీఈ మాసిలామణి సబ్స్టేషన్లను, తెగిన విద్యుత్ తీగలను పరిశీలించారు. అరగంట గాలితో అతలాకుతలం శృంగవరపుకోటలో శుక్రవారం రాత్రి 7.30గంటలకు ఆరంభమైన గాలులు సుమారు 20నిమిషాలు కలవర పెట్టాయి. హుద్‌హుద్ బీభత్సాన్ని జ్ఞాపకం చేశాయి. బలమైన ఈదురు గాలుల తాకిడికి పట్టణంలో పలు దుకాణాలపై బోర్డులు, హోర్డింగ్‌లు, కటౌట్లు నేలకూలాయి, ఫ్లెక్సీలు ఎగిరిపోయాయి. మారిన వాతావరణంతో జనం ఒక్కసారిగా ఇళ్లలోకి పరుగులు తీశారు. -
ఇరిగేషన్ ఉద్యోగుల్లో ‘జంఝాటం’
పార్వతీపురం: కొమరాడ మండలంలోని జంఝావతి సైట్ ఇరిగేషన్ కార్యాలయ ఉద్యోగుల గుండెల్లో ‘బీరువా రైళ్లు’ పరుగులిడుతున్నాయి. సీలు వేసిన బీరువా తెరిచిందెవరో తెలీదని, దీనికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశామని ఈఈ ఎం.భాస్కరరావు చెబుతుండగా, ఓ వ్యక్తి ఆ చెక్క బీరువా సీలు తీసి, ఓపెన్ చేస్తున్నట్లు జంఝావతి, పార్వతీపురం ప్రాంతంలో కొన్ని ఫొటోలు గత కొన్ని రోజులుగా కలకలం సృష్టిస్తున్నాయి. సీలు వేసిన బీరువా తెరవాలంటే పంచానామా చేసి, నిబంధనల ప్రకారం చేయూల్సి ఉండగా ఫొటోలలో కనిపిస్తున్న వ్యక్తి, ఉన్నతాధికారుల ఆదేశాలమేర కు బీరువా తెరిచాడా,..? లేక ఎవరూ లేనప్పుడు దొంగతనంగా తెరిచాడా...?అనే దానిపై ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు తేల్చాల్సి ఉంది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు...? కార్యాలయంతో సంబంధమేంటి...? బయట వ్యక్తా...? కార్యాలయం ఉద్యోగా...? బయట వ్యక్తి అయితే...కార్యాలయంలోని బీరువా సీలు ఎలా తీస్తాడనే ...పలు ప్రశ్నలకు సమాధానాలు తెలియూల్సి ఉంది. ఆ బీరువాలో విలువైన ఫైళ్లు ఏవీ కానరావడం లేదంటున్న అధికారులు, ఆ బీరువాలో ఏ ఏ విలువైన ఫైళ్లు, సమాచారం ఉందనేదానిపై కూడా దృష్టి సారించాల్సి ఉంది. ఇదిలా ఉండగా డ్యామ్సైట్లో జరిగిన అక్రమాలు, అవకతవకలకు సంబంధించిన కీలక సమాచారం ఫైళ్లు ఆ బీరువాలో ఉండడంతో సంబంధిత ఉద్యోగులే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఓ మ్యాన్ మజ్దూర్ చుట్టూ ఈ వ్యవహారం తీరుగుతున్నట్లు ఆయా ఉద్యోగులు చర్చించుకుంటున్నట్లు సమాచారం. ఈ ఫైళ్లు మా యం, సీలువేసిన బీరువా తాళం తెరవడానికి సంబంధించి స్థానిక గంగరేగువలస గ్రామానికి చెందిన గంటా పరాంకుశంనాయుడు, దాసరి చంద్ర, డి.హరినాయుడు తదితరులు సమాచార హక్కు చట్టంలో భాగంగా వీటికి సంబంధించి సమాచారాన్ని సంబంధిత అధికారులరు ఏప్రిల్ 28న అడిగినట్లు సమాచారం. ప్రాజెక్టు పనులు లేకపోవడంతో కార్యాలయంలో ఖాళీగా ఉంటున్న ఉద్యోగులు ఒకరిపై ఒకరు అన్నట్లు రాజకీయాలు చేసుకుంటూ...కీలకమైన ఫైళ్లు మాయం చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
పేట్రేగిపోతున్న ఏటీఎం దొంగలు
పార్వతీపురం: ఇంతవరకు మెట్రో నగరాలకే పరి మితమైన ఏటీఎం దొంగతనాలు తాజాగా పార్వతీపురంలోనూ మొదలయ్యాయి. జనశక్తి కాలనీకి చెందిన ఉపాధ్యాయుడు ద్వారపురెడ్డి సత్యనారాయణ గుర్తు తెలియని అగంతుకుడి మాయలో పడి ఏటీఎంలో డబ్బులు పొగొట్టుకున్నాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఈనెల 8న స్థానిక మెయిన్ రోడ్డులోని ఆంధ్రాబ్యాంకు ఏటీంలో డబ్బులు తీసేందుకు ఉపాధ్యాయుడు సత్యనారాయణ వెళ్లాడు. అయితే ఏటీఎంలో డబ్బులు తీసేందుకు ప్రయత్నించగా ఏటీఎం స్క్రీన్‌లోని అక్షరాలు సరిగ్గా కనిపించకపోవడంతో తికమక పడి బయటకు వచ్చేశాడు. ఇంతలో ఓ అపరిచితుడు డబ్బులు తీసి ఇస్తానని చెప్పి సత్యనారాయణచే ఆపరేటింగ్ చేయించారు. ఈ క్రమంలో ఒకసారి కార్డు పెట్టి రూ. 10 వేలు తీశారు. మరలా కార్డు అవసరం లేదంటూ అగంతకుడు మరో రూ. పది వేలు తీయించాడు. ఈలోపు అపరిచితుడు రోడ్డుమీదున్న తన ద్విచక్ర వాహనం పడిపోవడంతో వెళ్లి దాన్ని పెకైత్తి మరలా ఏటీఎంలోకి వచ్చాడు. మళ్లీ సత్యనారాయణచే కార్డు పెట్టించి రూ. పది వేలు తీయించాడు. ఈ నగదును బాధితుడు లెక్కబెడుతుండగా, ఏటీఎం నుంచి (లావాదేవీలు కొనసాగించి) మరో పది వేలు తీసుకుని అపరిచితుడు పరారయ్యాడు. దీంతో బాధితుడు లబోదిబోమని పోలీసులను ఆశ్రయించాడు. పార్వతీపురంలో గతంలో కూడా ఇటువంటి సంఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. ఏటీఎంల వద్ద గార్డులను ఏర్పాటు చేయనంతవరకు ఇటువంటి దొంగతనాలను ఆపలేమని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య
ఫెయిలయ్యానన్న మనస్తాపం విషం తాగడంతో మృతి పార్వతీపురం: పదో తరగతి ఫెయిల్ కావడంతో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కొమరాడ మండలం సోమినాయుడు వలస గ్రామంలో బుధవారం జరిగిన ఈ సంఘటనపై పార్వతీపురం ఏరియా ఆసుపత్రి ఔట్‌పోస్టు పోలీసులు అందించిన వివరాలివి. కొమరాడ మండలం సోమినాయుడు వలస గ్రామానికి చెందిన కొర్లాపు ప్రియాంక (15) మంగళవారం విడుదలైన టెన్త్ ఫలితాల్లో లెక్కలు ఫెయిలైంది. దీంతో మనస్తాపానికి గురై బుధవారం విషం తాగింది. వెంటనే కుటుంబ సభ్యులు పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తుండగా మృతి చెందింది. స్కూల్ టాపర్ స్కూల్ టాపరైన ప్రియాంకకు అన్ని సబ్జెక్టుల్లో 9 పాయింట్లు వచ్చినా, లెక్కల్లో ఫెయిలైందని మృతురాలి అన్నయ్య కొర్లాపు లక్ష్మణరావు తెలిపాడు. బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో మగతగా ఉందని, పడుకుంటానని చెప్పి కుప్పకూలిపోయిందన్నాడు. వెంటనే గ్రామంలోని ఆర్ఎంపీ వైద్యుని వద్దకు తీసుకెళ్లి, పరిస్థితి విషమించడంతో పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించగా మృతి చెందిందని తెలిపాడు. విషం ఎందుకు తీసుకుందో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. విలపించిన కుటుంబ సభ్యులు మృతురాలి తండ్రి తవిటన్నదొర, అన్నయ్య లక్ష్మణరావులిద్దరూ జేసీబీ ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు. సోదరి ప్రమీల ఉంది. తల్లి మహాలక్ష్మి కూలి పనులు చేస్తోంది. ప్రియాంక ఆత్మహత్యతో కుటుంబ సభ్యులంతా కన్నీరుమున్నీరయ్యారు. ఆసుపత్రి ప్రాంతమంతా విషాదం అలముకుంది. ప్రియాంకను ఆసుపత్రికి తెచ్చేసరికే నోటి వెంట నురగలొచ్చాయని ఏరియా ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ వెంకటరావు తెలిపారు. విషం తాగినప్పుడే ఇలాంటి పరిస్థితి ఉంటుందని, చికిత్స చేస్తుండగా మృతి చెందిందని తెలిపారు. అప్పటికే బాగా ఆలస్యమైందని స్పష్టం చేశారు. -
మనస్తాపంతో మహిళ ఆత్మహత్యాయత్నం
పార్వతీపురం : తోడబుట్టిన అన్నలు చనిపోవడంతో మనస్థాపానికి గురైన ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలి భర్త వెంకటరావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. కురుపాం మండలం మామిడిమానుగూడకు చెందిన మేనకకు మగ్గురు అన్నయ్యలున్నారు. వీరిలో కొండగొర్రి సొత్తన్న, రోనాయ్‌లు ఇటీవల కన్నుమూశారు. అప్పటి నుంచి మేనక మనోవేధనకు లోనై ఎప్పుడూ ఏడుస్తూ కనిపించేంది. తన అన్నలు కలలో కని పిస్తున్నారని, తాను కూడా చనిపోయి వారి వద్దకు వెళ్లిపోతానని తరచూ చెప్పేది. ఈ క్రమంలోనే ఆదివారం ఇంట్లో ఉన్న చీమల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంట నే ఆమె భర్త మేనకను పార్వతీపురం ఏరియూ ఆస్పత్రికి తరలించగా, వైద్యులు చికిత్స అందిస్తున్నారు. -
భౌబోయ్!
పిచ్చికుక్క దాడిలో 20మందికి తీవ్ర గాయాలు ఆరుగురిని విశాఖ తరలింపు కుక్కల ఏరివేతకు రంగం సిద్ధం పార్వతీపురం: పట్టణంలలో ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. దొరికినవారిని దొరికినట్టు దాడిచేసి కరిచేసింది. దాని బారినపడి 20మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఆరుగురిని మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. బుధవారం అర్ధరాత్రి రాయగడ రోడ్డులోని వివేకానంద కాలనీలో ఆరుబయట నిద్రిస్తున్న వారిపై తొలుత దాడి చేసి వారిని తీవ్రంగా గాయపరచింది. అక్కడి జనం తేరుకునేలోగా కొత్తవీధిలో పలువురిపై దాడిచేసింది. అక్కడినుంచి మాదిగ వీధి, దేవాంగుల వీధి, గొడగల వీధి, కుమ్మరవీధుల్లో చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరికి కండలు ఊడబెరికింది. తరువాత ఇందిరాకాలనీలో జనంపై దాడిచేసి, కొత్తవలస చేరుకొని ఎన్టీఆర్ కాలనీతోపాటు పలు వీధుల్లోని జనాన్ని గాయపరచింది. ఈ దాడిలో సిరిపురం ప్రసాద్, ఎం.తరుణ్, కన్నూరి గౌరి, చీపురుబిల్లి రాముడమ్మ, బి.ఆదినారాయణ, ఎ.రమణమ్మ, కె.వెంకటి, ఎం.అప్పలనరసమ్మ, కె.రమణమ్మ, ఎస్.భద్రమ్మ, సిహెచ్.రామచంద్రమ్మ, బి.బుచ్చిరాజు, కె.రాము, పి.మరియమ్మ, డి.నారాయణరావు, ఎం.శంకర్రావు, ఆర్.అప్పలనరసమ్మ, సుందరాడ భద్రాచలం, రాజేటి రమణ తదితరులు తీవ్రంగా గాయపడ్డారు. వారంతా బుధవారం అర్ధరాత్రి నుండే చికిత్స నిమిత్తం ఏరియా ఆస్పత్రికి క్యూ కట్టారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి.నాగభూషణరావు, డా. పెద్దింటి రవికుమార్, డా. వెంకటరావు తదితరులు బాధితులకు వైద్య సేవలందించారు. తీవ్రంగా గాయపడిన ఆరుగురిని మెరుగైన వైద్యం నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ జి.నాగభూషణరావు మాట్లాడుతూ బాధితులకు ఎటువంటి ప్రమాదం లేదని, అందరికీ ట్రీట్మెంట్ ఇచ్చామనీ తెలిపారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ వి.సిహెచ్.అప్పలనాయుడు మాట్లాడుతూ ఇప్పటికే ఆ పిచ్చికుక్కను పట్టుకునేందుకు సిబ్బందిని నియమించామనీ, కుక్కల ఏరివేత, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లకు చర్యలు చేపట్టామనీ తెలిపారు. -
దేవుడికి దిక్కెవరు..?
పార్వతీపురం : పార్వతీపురం పట్టణంలో పలు దేవాలయాల స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయి. పాత బస్టాండులోని పురాతన జగన్నాథస్వామి, సీతారామ స్వామి ఆలయాల స్థలాలను కబ్జాదారులు ఆక్రమించి బడ్డీలు, షాపులు ఏర్పాటు చేసుకున్నారు. ఈ ప్రాంతం వ్యాపారాలకు అనువైనది కావడంతో ఇక్కడ స్థలాలకు డిమాండ్ పెరిగింది. దేవాలయాలకు రాకపోకలు సాగించే తూర్పు, ఉత్తర ద్వారాలను సైతం కానరాకుండా నిర్మాణాలు చేపట్టారు. ఫలితంగా దేవాలయాలకు భక్తులు రావడం మానేశారని అర్చకులు వాపోతున్నారు. ఆయా కబ్జాదారుల అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దేవాదాయశాఖాధికారులు కూడా అండగా ఉండటంతో కబ్జాదారులు ఇష్టారాజ్యంగా ఆక్రమణల పర్వాన్ని కొనసాగిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోడ్డుపైకి జగన్నాథుని రథం.. దేవాలయ స్థలాల ఆక్రమణల ఫలితంగా ఆలయ ప్రాంగణంలో చాటుగా ఉండాల్సిన జగన్నాథుని రథం ఇప్పుడు మెయిన్ రోడ్డులో ఉంచాల్సిన దుస్థితి నెలకొంది. ప్రస్తుతం ఆయా దేవాలయాలకు ఉత్తర ద్వారాలు లేక వాటి ద్వారా రాకపోకలు సాగించేందుకు అవకాశం లేకపోయింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఆక్రమణలు తొలగించాలని పలువురు భక్తులు కోరుతున్నారు. తూర్పు, ఉత్తర ద్వారాలు ఆనవాయితీ... ఆలయాలకు తూర్పు, ఉత్తర ద్వారాలు ఆనవాయితీ. తూర్పు ద్వారం గుండా భక్తులు ఆలయానికి వచ్చి ఉత్తర ద్వారంలో బయటికి వెళ్తారు. అయితే ఆక్రమణల కారణంగా ఆరెండు ద్వారాలు లేకుండా పోయాయి. దీంతో ఇక్కడ ఆలయాలున్నాయన్న సంగతే భక్తులు మర్చిపోయారు. -జగన్నాథ పండా, ప్రధాన అర్చకులు, పార్వతీపురం దారి లేకుండా చేశారు... దేవాలయానికి రాకపోకలు సాగించేందుకు రహదారి సదుపాయం లేకుండా చేశారు. ఆలయ స్థలాలను ఆక్రమించి వ్యాపారాలు చేసుకుంటున్నారు. చుట్టూ షాపులే. ఆలయ ప్రాంగణంలో అసాంఘిక చర్యలు జరుగుతున్నాయి. ఇది మంచిది కాదు. -రమేష్ పండా, ఆలయ అర్చకులు, పార్వతీపురం 5న తొలగిస్తాం... జగన్నాథస్వామి, సీతారామస్వామి ఆలయ స్థలాల్లో ఉన్న ఆక్రమణలను వచ్చే నెల 5న పోలీసుల సహకారంతో తొలగిస్తాం. అనంతరం ఆయా దేవాలయాల స్థలాలకు రక్షణ కవచం ఏర్పాటు చేస్తాం. ఆలయాలకు తూర్పు, ఉత్తర ద్వారాలను ఏర్పాటు చేసి రహదారి సదుపాయం కల్పిస్తాం. -రోణంకి నాగార్జున, దేవాదాయశాఖ ఈఓ -
నగల దుకాణంలో భారీ చోరీ
విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఓ బంగారు దుకాణంలో భారీ చోరీ జరిగింది. పార్వతీపురం పట్టణం మెయిన్‌రోడ్డులో ఉన్న చందన జ్యుయెలర్స్ దుకాణంలో శనివారం రాత్రి చోరీ జరిగింది. ఆదివారం సెలవు రోజు కావడంతో దుకాణాన్ని తెరిచేందుకు నిర్వాహకులు సాయంత్రం రాగా షట్టర్ తాళాలు పగులగొట్టిన విషయాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో క్లూస్‌టీమ్ రంగంలోకి దిగింది. 36 బంగారు ఉంగరాలు, ఒక నెక్లెస్, ఆంజనేయస్వామి రూపులు పోయినట్టు గుర్తించారు. -
120 లీటర్ల నాటుసారా స్వాధీనం
పార్వతీపురం: ఎక్సైజ్ దాడుల్లో 120 లీటర్ల నాటుసారా, 40 నిబ్బులను స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు సీఐ ఎస్.విజయకుమార్ శుక్రవారం తెలిపారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వై.చైతన్య మురళి ఆదేశాల మేరకు ఎస్ఐలు జె.రాజశేఖర్, పి.బి.వి.ఎస్ఎన్ మూర్తి తదితరులు సిబ్బందితో వెళ్లి పార్వతీపురం మండలం గోచెక్క వద్ద తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా లావాల వెంకటరావు వద్ద నుంచి 120 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేశారు. జియ్యమ్మవలస మండలం పరజపాడు వద్ద వడ్డి సాగర్ వద్ద నుంచి 40 నిబ్బులు స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ సారా తయారు చేసినా, విక్రయించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. సారాబట్టీలపై దాడులు విజయనగరం రూరల్: కొత్తవలస, గుర్ల మండలాల్లో నాటుసారా బట్టీలపై గురువారం రాత్రి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఎన్ఫోర్స్మెంట్ సీఐ ఎంవీఎస్ లోకేశ్వరరావు ఆధ్వర్యంలో కొత్తవలస మండలం అప్పన్నదొరపాలెంలో ఉగ్గిన అండాలమ్మ వద్ద ఐదు లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని ఆమెను అరెస్ట్ చేశారు. గుర్ల మండలం దేవుని కణపాకలో దాడులు చేసి 150 లీటర్ల బెల్లం ఊటను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ కరుణలత, హెడ్ కానిస్టేబుళ్లు నాగేశ్వరరావు, గీతారాణి, కానిస్టేబుళ్లు హరికిరణ్కుమార్, కూర్మారావు, ఫాతిమాబేగం తదితరులు పాల్గొన్నారు. -
ఒకరిని ప్రేమించి మరో అమ్మాయితో...
పార్వతీపురం : తనను ప్రేమించి...మరో అమ్మాయితో ప్రియుడు పెళ్లికి సిద్ధపడ్డాడనే బాధతో ప్రియురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన కొమరాడ మండలం కొట్టు గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి బాధితురాలి కుటుంబ సభ్యులు అందించిన వివరాలిలా ఉన్నాయి. కొమరాడ మండలం కొట్టు గ్రామానికి చెందిన కలమటి రాణి అదే గ్రామంలో విద్యుత్ కార్యాలయంలో పనిచేస్తున్న కొల్లి పృథ్వి మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే కులాలు వేరు కావడంతో పృథ్వి కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి నిరాకరించారు. పైగా ఈ నెల 20న మరో యువతితో పెళ్లి చేసేందుకు పృథ్వి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన రాణి పెళ్లి విషయమై పృథ్విని నిలదీయగా, కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకే పెళ్లి చేసుకుంటున్నానని చెప్పాడు. పైగా పెళ్లి అయిన తర్వాత ఇద్దరం వెళ్లిపోదామని తెలిపాడు. ఈ ప్రతిపాదన నచ్చని రాణి గురువారం సాయంత్రం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు కురుపాం ఆస్పత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం ఆమెను పార్వతీపురం ఏరియూ ఆస్పత్రికి తరలించారు. -
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
పార్వతీపురం: అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన ఘటన పార్వతీపురంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి స్థానికులు, మృతురాలి బంధువులు, పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం గాజుల కొల్లివలసకు చెందిన సరస్వతి (25)కు గత ఏడాది అక్టోబరు 29న పార్వతీపురం నెహ్రూకాలనీకి చెందిన రాయల సంతోష్‌కు ఇచ్చి వివాహం చేశారు. వివాహ లాంఛనాల కింద లక్ష రూపాయల కట్నం, తులం బంగారం ఇచ్చారు. సరస్వతి కుటుంబ సభ్యులు మంగళవారం పార్వతీపురం వచ్చి సంతోషంగా ఉన్న తమ కుమార్తెను చూసి ఆనందంతో ఇంటికి వెళ్లారు. ఇంతలో గురువారం ఉదయం మీ కూతురు చనిపోయిందంటూ ఫోన్ చేశారని మృతురాలి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. భర్త, అత్తమామలే చంపేశారు..! ఈ విషయమై మృతురాలి సోదరుడు అనుపోజు అప్పారావు మాట్లాడుతూ మంగళవారం నాటికి సంతోషంగా ఉన్న తన సోదరి సరస్వతిని భర్త, అత్తమామలే చంపేశారని ఆరోపించాడు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నాడు. గత అక్టోబర్ 29న సింహాచలంలో పెళ్లి చేశామన్నారు. తన సోదరి భర్త రాయల సంతోష్, అత్త ఈశ్వరమ్మ, మామ రామారావులు కలిసి చంపేసినట్లు ఆరోపించారు. మద్యం మత్తులో... భార్యాభర్తలిద్దరూ మేడపై పడుకుంటారని, గురువారం ఉదయం 6 గంటల సమయంలో ఇంట్లో మృతదేహాన్ని పట్టుకొని భర్త, అత్తమామలు, ఆ ఇంటికి వచ్చిన ఓ అతిథి కనిపించారని స్థానికులు చర్చించుకుంటున్నారు. మద్యం మత్తులో భార్యను చంపేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంట్లోనే పడిపోయి కోడలు మృతి చెందిందని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఏఎస్పీ దర్యాప్తు... విషయం తెలుసుకున్న ఏఎస్పీ సిద్దార్థ కౌశిల్, సీఐ వి.చంద్రశేఖర్,పట్టణ ఎస్ఐ బి.సురేంద్రనాయుడు తన సిబ్బందితోపా టు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. కుటుం బసభ్యులు, స్థానికులతో మాట్లాడి వివరాలు సేకరించారు. -
రోడ్లకు అత్యధిక ప్రాధాన్యం
పార్వతీపురం: జిల్లాలోని మారుమూల గ్రామాలకు కూడా రహదారి సౌకర్యం కల్పించేందుకు రోడ్ల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కలెక్టర్ ఎం.ఎం. నాయక్ తెలిపారు. గురువారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే ఎన్ఆర్ఈజీఎస్లో మెటీరియల్ కాంపొనెంట్ నిధులతో రోడ్ల నిర్మాణం చకచకా జరుగుతోందన్నారు. రోడ్ల నిర్మాణం కోసం దాదాపు రూ. 180 కోట్లు వెచ్చించే పనిలో ఉన్నామని తెలిపారు. అలాగే మలేరియా నివారణకు మే 15 నుంచి మందు స్ప్రేయింగ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. ముఖ్యంగా మలేరియా తీవ్రత అధికంగా ఉన్న తాడికొండ, రేగిడి, మొండెంఖల్, కేఆర్‌బీపురం తదితర పీహెచ్‌సీల పరిధిలో ఈ కార్యక్రమం చేపడతామని స్పష్టం చేశారు. దోమ తెరలు కూడా కొనుగోలు చేస్తామన్నారు. పార్వతీపురం డంపింగ్ విషయమై చర్యలు చేపట్టామని, ఏఎన్ఎంలకు ఆస్పత్రి ప్రసవాలపై శిక్షణ ఇచ్చి మారుమూల ప్రాంతాల్లో సేవలందిస్తామని భరోసా ఇచ్చారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ శ్రీకేశ్‌బి లఠ్కర్, ఆర్డీఓ గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. -
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
పోలీసులకు ఫిర్యాదు చేసిన మృతురాలి సోదరుడు దర్యాప్తు ప్రారంభించిన ఏఎస్పీ సిద్దార్థ కౌశిల్ పార్వతీపురం : అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన ఘటన పార్వతీపురంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి స్థానికులు, మృతురాలి బంధువులు, పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం గాజుల కొల్లివలసకు చెందిన సరస్వతి (25)కు గత ఏడాది అక్టోబరు 29న పార్వతీపురం నెహ్రూకాలనీకి చెందిన రాయల సంతోష్‌కు ఇచ్చి వివాహం చేశారు. వివాహ లాంఛనాల కింద లక్ష రూపాయల కట్నం, తులం బంగారం ఇచ్చారు. సరస్వతి కుటుంబ సభ్యులు మంగళవారం పార్వతీపురం వచ్చి సంతోషంగా ఉన్న తమ కుమార్తెను చూసి ఆనందంతో ఇంటికి వెళ్లారు. ఇంతలో గురువారం ఉదయం మీ కూతురు చనిపోయిందంటూ ఫోన్ చేశారని మృతురాలి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. భర్త, అత్తమామలే చంపేశారు..! ఈ విషయమై మృతురాలి సోదరుడు అనుపోజు అప్పారావు మాట్లాడుతూ మంగళవారం నాటికి సంతోషంగా ఉన్న తన సోదరి సరస్వతిని భర్త, అత్తమామలే చంపేశారని ఆరోపించాడు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నాడు. గత అక్టోబర్ 29న సింహాచలంలో పెళ్లి చేశామన్నారు. తన సోదరి భర్త రాయల సంతోష్, అత్త ఈశ్వరమ్మ, మామ రామారావులు కలిసి చంపేసినట్లు ఆరోపించారు. మద్యం మత్తులో... భార్యాభర్తలిద్దరూ మేడపై పడుకుంటారని, గురువారం ఉదయం 6 గంటల సమయంలో ఇంట్లో మృతదేహాన్ని పట్టుకొని భర్త, అత్తమామలు, ఆ ఇంటికి వచ్చిన ఓ అతిథి కనిపించారని స్థానికులు చర్చించుకుంటున్నారు. మద్యం మత్తులో భార్యను చంపేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంట్లోనే పడిపోయి కోడలు మృతి చెందిందని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఏఎస్పీ దర్యాప్తు... విషయం తెలుసుకున్న ఏఎస్పీ సిద్దార్థ కౌశిల్, సీఐ వి.చంద్రశేఖర్, పట్టణ ఎస్ఐ బి. సురేంద్రనాయుడు తన సిబ్బందితోపాటు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. కుటుంబసభ్యులు, స్థానికులతో మాట్లాడి వివరాలు సేకరించారు. -
కూర బాగా వండలేదని...భార్యను హతమార్చిన భర్త
గుమ్మలక్ష్మీపురం/పార్వతీపురం: కూర బాగా వండలేదంటూ భర్త క్షణికావేశంతో కొట్టడంతో భార్య మృతి చెందిన ఘటన గుమ్మలక్ష్మీపురం మండలంలో చోటుచేసుకుంది. ఎల్విన్‌పేట పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. గుమ్మలక్ష్మీపురం మండలం చినగీసాడ పంచాయతీ అచ్చబ గ్రామానికి చెందిన కోలక లక్ష్మణరావు సోమవారం సేకరించిన చింతపండును కురుపాం మండల కేంద్రానికి తీసుకెళ్లి విక్రయించి సాయంత్రం ఏడున్నర ప్రాంతంలో ఇంటికి చేరుకున్నాడు. రాత్రి భోజనంలో వంటలు సరిగా వండలేదంటూ భార్య కోలక లక్ష్మమ్మ (44)తో ఘర్షణకు దిగాడు. క్షణికావేశంలో ఇంట్లో ఉన్న వెదురుకర్రతో లక్ష్మమ్మ పొట్ట, వీపుపై బలంగా కొట్టాడు. వెంటనే స్పందించిన ఇరుగు పొరుగువారు కుప్పకూలిన లక్ష్మమ్మను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు రవాణా సదుపాయం లేకపోవడంతో ఇంటి వద్దే ప్రథమ చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో లక్ష్మమ్మ ఒంటిగంట సమయంలో మృతి చెందింది. మృతురాలి సోదరుడు మిన్నారావు మంగళవారం మధ్యాహ్నం అందించిన సమాచారం మేరకు ఎల్విన్‌పేట సీఐ జి.వేణుగోపాల్, ఎస్ఐ ఎస్.రాజు, పోలీసు సిబ్బంది అచ్చబ గ్రామానికి చేరుకొని వివరాలు సేకరించారు. శవపంచనామా నిమిత్తం మృతదేహాన్ని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి నిందితుడు లక్ష్మణరావును అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మమ్మకు ముగ్గురుకు కుమార్తెలు, ఒక కుమారుడు. వారందరికీ వివాహమైంది. సాయంత్రం వరకు తమతో ఉన్న లక్ష్మమ్మ భర్త చేతిలో హతమవ్వడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. -
నచ్చిన కూర వండలేదని..
పార్వతీపురం (విజయనగరం జిల్లా) : నచ్చిన కూర వండలేదనే కారణంతో ఓ భర్త కట్టుకున్న భార్యను కడతేర్చాడు. గుమ్మలక్ష్మీపురం మండలం దేరుపాడు పంచాయతీ అచ్చిబ గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా మంగళవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. సోమవారం రాత్రి నచ్చిన కూర వండలేదని కోలక లక్ష్మమ్మ(50) అనే మహిళను ఆమె భర్త లక్ష్మణరావు కర్రతో కొట్టి చంపాడు. అనంతరం పరారయ్యాడు. బంధువులు ఆమె మృతదేహాన్ని పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్ఐ
పార్వతీపురం (విజయనగరం) : లంచం తీసుకుంటూ ఓ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ సంఘటన విజయనగరం జిల్లా పార్వతీపురంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న కిరీటి మండలానికి చెందిన దొరన్న అనే వ్యక్తి నుంచి రూ.4 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లీగల్ హైర్ సర్టిఫికెట్ కోసం దొరన్న అనే వ్యక్తి గత కొంత కాలంగా తహశీల్దార్ కార్యాలయం చుట్టు తిరుగుతుండగా.. పని త్వరగా జరగాలంటే రూ. 4 వేలు ఇవ్వాలని ఆర్ఐ కిరీటి డిమాండ్ చేశాడు. దీంతో దొరన్న ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. -
వార్త రాస్తే అంతుచూస్తా
►అన్యాయంపై నిలదీస్తే అంతు చూస్తానన్నాడు ►ఏడేళ్ల చిన్నారిపై యువకుని లైంగిక దాడి ►సెటిల్మెంట్కు టీడీపీ, సీపీఎం నేతల ఒత్తిళ్లు ►వార్త రాస్తే అంతుచూస్తానన్న సీపీఎం నేత అన్యాయం జరిగితే అడ్డుకోవాలి. బాధితులకు అండగా నిలవాలి. న్యాయ పోరాటం చేసి స్వాంతన చేకూర్చాలి. ఏ ప్రజాప్రతినిధులైనా చేయాల్సిందిదే. కానీ అభంశుభం తెలియని చిన్నారిపై అఘాయిత్యం జరిగితే.. న్యాయం చేయాల్సిన నేతలు సెటిల్మెంట్కు ప్రయత్నిస్తుంటే.. అదేమని నిలదీస్తే అంతుచూస్తామని బెదిరిస్తుం టే.. ఎవరికి చెప్పుకోవాలి?.. పార్వతీపురం పట్టణంలో అభంశుభం తెలియని ఏడేళ్ల చిన్నారిపై లైంగిక దాడి జరిగింది. కొంతకాలంగా సాగుతున్న ఓ యువకుడి పైశాచిక ప్రవృత్తి వెలుగు చూసింది. న్యాయం చేయమని కోరిన ఆమె తల్లిదండ్రులపై నేతల ఒత్తిడి పెరుగుతోంది. ఆ నేతల్లో ఒకరు టీడీపీకి, మరొకరు సీపీఎంకు చెందినవారు. చిన్నారి తల్లి ఆదివారం విలేకరులకు అందించిన వివరాలివి. పార్వతీపురం: వివేకానంద కాలనీ దేశ మ్మ తల్లి వీధిలో నివసిస్తున్న అంకుల నాగేశ్వరరావు దంపతులు పాతబస్టాండ్‌లో అద్దాలు, తాళం కప్పలు, పూసల దండలు అమ్ముకుని బతుకుతుంటారు. వారికి ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె నెలల వయసు కావడంతో ఆమెను చూసుకొనేందుకు పెద్ద కుమార్తె (7)ను ఇంటి వద్ద ఉంచి రోజూ వ్యాపారానికి వెళ్తుంటారు. గురువారం కూడా వెళ్లి రాత్రి 8గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చారు. పక్క వీధికి చెందిన రాజేష్ ఎదురుగా ఉన్న ఓ ఇంటి పెరట్లోకి చిన్నారిని తీసుకెళ్లి లైం గిక దాడి చేసినట్టు మరో బాలిక ద్వారా తెలుసుకున్నారు. చంపేస్తానని బెదిరించి.. రాజేష్ కొంతకాలంగా చిన్నారికి చాక్లెట్లు ఎరచూపి లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే అమ్మేస్తానని లేదా చంపేస్తానని బెదిరించేవాడు. ఇది తెలిసిన నాగేశ్వరరావు దంపతులు రాజేష్ ఇంటికెళ్లి అతని తల్లిదండ్రులకు విషయం చెప్పారు. అదేరోజు రాత్రి 11గంటల ప్రాంతంలో వారి బంధువు మున్నా తప్ప తాగి, కత్తి పట్టుకొని అసభ్య పదజాలంతో నాగేశ్వరరావు ఇంటిపైకి దాడికి వచ్చాడు. వెంటనే దంపతులిద్దరూ పట్టణ పోలీసుస్టేషన్‌కు వెళ్లి చెప్పినా ఫలితం లేకపోయింది. వార్డుకు చెందిన ఇద్దరు టీడీపీ, సీపీఎం నేతలు, మరో మహిళా సంఘం సభ్యురాలు సెటిల్మెంట్ కోసం శనివారం రాత్రి చిన్నారి కుటుంబంపై ఒత్తిడి తీసుకొచ్చారు. సీపీఎం నేత దౌర్జన్యం బాధితురాలి కుటుంబ సభ్యులతో ఆదివారం విలేకరులు మాట్లాడుతుండగా సమీపంలోనే ఉన్న ఓ మహిళా సంఘం సభ్యురాలు మండిపడింది. వార్త రాయొద్దని విలేకరులను హెచ్చరించింది. మరోవైపు ఆ వీధికి చెందిన సీపీఎం నేత కూడా చిందులు వేశాడు. విలేకరుల అంతు తేలుస్తానన్నాడు. విలేకరుల ఫిర్యాదుపై సంఘటన స్థలానికి వచ్చిన ఎస్ఐ బి.సురేంద్రనాయుడు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలని బాధితురాలి తల్లికి సూచించారు. ఆమె ఫిర్యాదు మేరకు ఎస్ఐ తన సిబ్బందితో ఆదివారం మధ్యాహ్నం సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. పరారీలో రాజేష్ నిందితుడు రాజేష్‌ను అతని తల్లిదండ్రులు, పెద్దలు వేరే ఊరికి పంపించినట్టు బాధితురాలి తల్లి ఆరోపించింది. తమ కుమార్తె ఫంక్షన్‌కు సంబంధించి కార్డులు పంచేం దుకు వెళ్లాడని నిందితుని తల్లిదండ్రులు విలేకరులకు తెలిపారు. -
బాలికపై లైంగిక దాడి
విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలోని వివేకానంద కాలనీలో ఓ బాలికపై 17 ఏళ్ల యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలి తల్లి కథనం ప్రకారం... సుబుద్ధి రాజేష్ (17) అనే యువకుడు గురువారం రాత్రి ఏడేళ్ల బాలికకు చాక్లెట్ ఇచ్చి, చీకట్లో ఓ ఇంటి పెరట్లోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. ఈ మేరకు ఆదివారం ఆమె పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. కాగా, ఆ వార్డుకు చెందిన ఓ టీడీపీ నాయకుడు, సీపీఎంకు చెందిన మరో నాయకుడు, ఆ వీధికి చెందిన మరికొంతమంది పెద్దలు ఈ వ్యవహారాన్ని సెటిల్ మెంట్ చేసేందుకు మూడు రోజులుగా తమ నోరు నొక్కేస్తున్నారని బాధితురాలి తల్లి మీడియా ముందు వాపోయింది. -
నత్తనడకన ట్రైకార్
పార్వతీపురం: జిల్లాలో ఐటీడీఏ ద్వారా అమలవుతున్న ట్రైకార్ యూనిట్ల గ్రౌండింగ్ ఏడాది కాలం పాటు ఆలస్యమవుతున్నాయి. 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అమలు కావల్సిన ట్రైకార్ యూనిట్ల మంజూరు, గ్రౌండింగ్, 2015-16కు సంబంధించి గ్రౌండింగ్ ఏడాది కాలం ఆలస్యంగా ఆరంభమవుతున్నాయి. అంతేకాకుండా 2013-14కు సంబంధించి యూనిట్ల గ్రౌండింగ్ ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయి. యూనిట్లకు సంబంధించి యూసీలు ఐటీడీఏ కార్యాలయానికి ఇప్పటికీ చేరలేదు. 2014-15కు సంబంధించి 491 యూనిట్లు రూ. 3.51కోట్లతో మంజూరు కాగా ఇప్పటివరకు 432 యూనిట్లు గ్రౌండింగ్ చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీటిలో ఇప్పటికీ 50 వరకు యూసీలు కార్యాలయానికి చేరలేదు. ఇప్పటికీ 2014-15కు సంబంధించిన యూనిట్ల గ్రౌండింగ్ కొనసాగుతుండగా 2015-16కు సంబంధించి యూనిట్లను ఇటీవల మంత్రి రావెల కిశోర్ ప్రారంభించారు. వీటి గ్రౌండింగ్ ఈ నెలాఖరుకు పూర్తికావల్సివుంది. ఇప్పుడిప్పుడే వీటి పనులు ప్రారంభం అవుతున్నాయి. 2015-16కు సంబంధించి 1019 యూనిట్లకు రూ. 16.46కోట్లు మంజూరవ్వగా వీటి గ్రౌండింగ్ ఈ ఏడాదంతా పట్టే అవకాశం లేకపోలేదు. ఇదే అదనుగా టీడీపీ తమ్ముళ్ళు ట్రైకార్ లబ్ధిదారుల ఎంపిక తమ గుప్పెట్లో ఉంచుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
పార్వతీపురంలో బంగారు దుకాణాల మూసివేత
కేంద్ర బడ్జెట్లో బంగారంపై విధించిన ఒక శాతం ఎక్సైజ్ పన్నును రద్దు చేయాలని కోరుతూ విజయనగరం జిల్లా పార్వతీపురంలో బంగారు వర్తక సంఘం ఆధ్వర్యంలో బుధవారం దుకాణాలు మూసివేశారు. మెయిన్రోడ్లో ర్యాలీ నిర్వహించిన అనంతరం ఆర్డీఓ రామకృష్ణకు వినతిపత్రం అందించారు. మూడు రోజుల్లోగా తమ డిమాండ్‌కు స్పందించకపోతే బంగారు దుకాణాల నిరవధిక బంద్ చేస్తామని బంగారు వర్తక సంఘం ప్రకటించింది. -
స్కాలర్షిప్ ఇవ్వకపోతే చనిపోతా
గిరిజన విద్యార్థి ఆవేదన పార్వతీపురం: స్కాలర్ షిప్ ఇవ్వకపోతే చచ్చిపోవడమే మార్గమని ఓ గిరిజన విద్యార్థి కన్నీరు మున్నీరయ్యాడు. ఐటీడీఏ కార్యాలయ ఆవరణలో సోమవారం కురుపాం మండలం వలస బల్లేరు గూడ పంచాయతీ, ఆగమగూడ గ్రామానికి చెందిన బిడ్డిక ధర్మారావు అనే గిరిజన విద్యార్థి తన ఆవేదనను సాక్షి ముందు వెళ్లబోసుకున్నాడు. తనది నిరుపేద కుటుంబమని, ఎలాగైనా చదివి ప్రయోజకుడిని కావాలనే లక్ష్యంతో ప్రభుత్వం స్కాలర్షిప్ ఇస్తుందనే ఆశతో డిగ్రీలో చేరానన్నాడు. డిగ్రీ రెండో సంవత్సరం చదువుతూ పట్టణంలోని హాస్టల్లో ఉంటున్నానన్నాడు. రెండేళ్లుగా వేలిముద్రలు పడక స్కాలర్షిప్ రాలేదని వాపోయాడు. అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం లేదన్నాడు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తనకు స్కాలర్షిప్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. -
ఇదీ నిర్మలమ్మ ఆవేదన...
ఆత్మహత్య చేసుకోవాలనుంది పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేదు ఓ మహిళా అధికారిణి ఆవేదన పార్వతీపురం: ‘క్షణ క్షణం...ప్రాణ భయం...నేర చరిత్ర కలిగిన వ్యక్తులు ఎక్కడ చంపుతారోననే భయం... పోలీ సులను ఆశ్రయించినా ఫలితం లేదు..’ ఇదీ విశాఖపట్నం ట్రెజరర్ అండ్ అకౌం ట్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డెరైక్టర్ హోదాలో ఉన్న జి.నిర్మలమ్మ అనే గ్రూప్-1 అధికారిణి ఆవేదన. పోస్టల్ సూపరింటెండెంట్‌గా పదవీ విరమణ చేసిన తన తండ్రి వద్ద నుంచి రూ.25లక్షలు అప్పుగా తీసుకున్న కొంతమంది వ్యక్తులు.. ఆ డబ్బులు అడిగితే చంపేస్తామని బెదిరింపులతోపాటు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆమె బుధవారం మీడియా ముందు కన్నీరుమున్నీరయ్యారు. ‘నా పేరు జి.నిర్మలమ్మ. విశాఖపట్నంలోని ట్రెజరర్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డెరైక్టర్ హోదాలో పని చేస్తున్నా. మా నాన్న పార్వతీపురం పట్టణానికి చెందిన విశ్రాంతి పోస్టల్ సూపరింటెండెంట్ గూనాన వెంకటయ్య వద్ద కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన రియల్ఎస్టేట్ వ్యాపారి ఇవటూరి జయరాం అనే వ్యక్తి 2014, మే 25వ తేదీన రూ.25 లక్షలు అప్పు తీసుకున్నారు. ఆయనకు అప్పు ఇచ్చే సమయంలో సాక్షులుగా పార్వతీపురం మండలం బాలగుడబ గ్రామానికి చెందిన బొత్స రవికుమార్, పార్వతీపురం పట్టణానికి చెందిన దొనకొండ గౌరునాయుడు ఉన్నారు. మా తండ్రి వెంకటయ్య 2015, నవంబర్ 25న పార్వతీపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఒక్కగానొక్క వారసురాలినైన నేను, నాన్న ఇచ్చిన అప్పు తీర్చాలని అడిగితే ఈ రోజు.. రేపు.. అంటూ సంవత్సరాలు గడిపారు. చివరికి ఇవ్వం.. నీ దిక్కున్నచోట చెప్పుకో.. అంటూ బెదిరిస్తున్నారు. అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. ష్యూరిటీ ఇచ్చిన చెక్కులు కూడా బౌన్సు కావడంతో కోర్టును ఆశ్రయించి నెలలు తరబడి వాయిదాలకు తిరుగుతున్నాను. నా తండ్రి కూడా అప్పుతీర్చాలని ఒత్తిడి చేయడంతో పథకం ప్రకారం రోడ్డు ప్రమాదం చేయించి ఉంటారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాను. మాక్కు డబ్బు ఇవ్వకుండా ఉన్న వ్యక్తితో పార్వతీపురం పట్టణానికి చెందిన ఉపాధ్యాయులు చేయి కలిపి అప్పులు ఇప్పించడం, తరువాత వారిని మోసం చేస్తున్నారు. చంపుతామని బెదిరిస్తున్నారు. ప్రస్తుతం నా తండ్రి వద్ద తీసుకున్న అప్పు తీర్చకుండా నన్ను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారు. చంపుతామని బెదిరిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు నాకు న్యాయంచేయాలి. నా తండ్రి మరణంపై దర్యాప్తు చేయాలి..’ అని ఆమె వేడుకున్నారు. నిర్మలమ్మకు ఉత్తరాంధ్ర పొలిటికల్ జేఏసీ చైర్మన్ జేటీ రామారావు అండగా నిలిచారు. నిర్మలమ్మకు న్యాయం చేయకపోతే మానవ హక్కుల కమిషన్, మహిళా కమిషన్‌ను ఆశ్రయించి ఆందోళన చేపడతామని రామారావు చెప్పారు. విలేకరుల సమావేశంలో కౌన్సిలర్ ఒ.రామారావు, గూనాన రాములు తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలి మృతి
పార్వతీపురం (విజయనగరం జిల్లా) : పార్వతీపురం బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలు మృతిచెందింది. మృతురాలు శ్రీకాకుళం వందెర మండలానికి చెందిన నగరి కోలమ్మ (60) గా గుర్తించారు. గురువారం పార్వతీపురం బస్టాండ్‌లో బస్సు కోసం ఎదురుచూస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ బస్టాండ్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగడం గత నాలుగు నెలల్లో ఇది నాలుగోసారని, అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నాకు ప్రాణహాని ఉంది
పార్వతీపురం: ‘క్షణ క్షణం...ప్రాణ భయం...నేర చరిత్ర కలిగిన వ్యక్తులు ఎక్కడ చంపుతారోననే భయం... పోలీ సులను ఆశ్రయించినా ఫలితం లేదు..’ ఇదీ విశాఖపట్నం ట్రెజరర్ అండ్ అకౌం ట్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డెరైక్టర్ హోదాలో ఉన్న జి.నిర్మలమ్మ అనే గ్రూప్-1 అధికారిణి ఆవేదన. పోస్టల్ సూపరింటెండెంట్‌గా పదవీ విరమణ చేసిన తన తండ్రి వద్ద నుంచి రూ.25లక్షలు అప్పుగా తీసుకున్న కొంతమంది వ్యక్తులు.. ఆ డబ్బులు అడిగితే చంపేస్తామని బెదిరింపులతోపాటు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆమె బుధవారం మీడియా ముందు కన్నీరుమున్నీరయ్యారు. ఇదీ నిర్మలమ్మ ఆవేదన.. ‘నా పేరు జి.నిర్మలమ్మ. విశాఖపట్నంలోని ట్రెజరర్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డెరైక్టర్ హోదాలో పని చేస్తున్నా. మా నాన్న పార్వతీపురం పట్టణానికి చెందిన విశ్రాంతి పోస్టల్ సూపరింటెండెంట్ గూనాన వెంకటయ్య వద్ద కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన రియల్ఎస్టేట్ వ్యాపారి ఇవటూరి జయరాం అనే వ్యక్తి 2014, మే 25వ తేదీన రూ.25 లక్షలు అప్పు తీసుకున్నారు. ఆయనకు అప్పు ఇచ్చే సమయంలో సాక్షులుగా పార్వతీపురం మండలం బాలగుడబ గ్రామానికి చెందిన బొత్స రవికుమార్, పార్వతీపురం పట్టణానికి చెందిన దొనకొండ గౌరునాయుడు ఉన్నారు. మా తండ్రి వెంకటయ్య 2015, నవంబర్ 25న పార్వతీపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఒక్కగానొక్క వారసురాలినైన నేను, నాన్న ఇచ్చిన అప్పు తీర్చాలని అడిగితే ఈ రోజు.. రేపు.. అంటూ సంవత్సరాలు గడిపారు. చివరికి ఇవ్వం.. నీ దిక్కున్నచోట చెప్పుకో.. అంటూ బెదిరిస్తున్నారు. అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. ష్యూరిటీ ఇచ్చిన చెక్కులు కూడా బౌన్సు కావడంతో కోర్టును ఆశ్రయించి నెలలు తరబడి వాయిదాలకు తిరుగుతున్నాను. నా తండ్రి కూడా అప్పుతీర్చాలని ఒత్తిడి చేయడంతో పథకం ప్రకారం రోడ్డు ప్రమాదం చేయించి ఉంటారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాను. మాక్కు డబ్బు ఇవ్వకుండా ఉన్న వ్యక్తితో పార్వతీపురం పట్టణానికి చెందిన ఉపాధ్యాయులు చేయి కలిపి అప్పులు ఇప్పించడం, తరువాత వారిని మోసం చేస్తున్నారు. చంపుతామని బెదిరిస్తున్నారు. ప్రస్తుతం నా తండ్రి వద్ద తీసుకున్న అప్పు తీర్చకుండా నన్ను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారు. చంపుతామని బెదిరిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు నాకు న్యాయంచేయాలి. నా తండ్రి మరణంపై దర్యాప్తు చేయాలి..’ అని ఆమె వేడుకున్నారు. నిర్మలమ్మకు ఉత్తరాంధ్ర పొలిటికల్ జేఏసీ చైర్మన్ జేటీ రామారావు అండగా నిలిచారు. నిర్మలమ్మకు న్యాయం చేయకపోతే మానవ హక్కుల కమిషన్, మహిళా కమిషన్‌ను ఆశ్రయించి ఆందోళన చేపడతామని రామారావు చెప్పారు. విలేకరుల సమావేశంలో కౌన్సిలర్ ఒ.రామారావు, గూనాన రాములు తదితరులు పాల్గొన్నారు. -
అత్తింటి వద్ద ఆందోళన
కొమరాడ/పార్వతీపురం: ప్రేమించి పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు పుట్టాక భర్త విడిచిపెట్టడంతో ఆమె న్యాయం పోరాటం చేస్తోంది. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం తన భర్త పోలా సోమేశ్వరరావు ఇంటి వద్ద అతని భార్య రజని ఆందోళన చేపట్టంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జియ్యమ్మవలస మండలం వనిజ గ్రామానికి చెందిన తనను కోదులగుంప గ్రామానికి చెందిన పోలా సోమేశ్వరరావు ఆరేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని తెలిపింది. ప్రస్తుతం తమకు నాలుగేళ్ల రాహుల్, ఏడాదిన్నర కుమార్తె సునంద ఉన్నారని, ఏడాదిగా తన భర్త తమను పట్టించుకోకుండా విడిచిపెట్టారని చెప్పారు. భర్త తీరుపై కోదులగుంప గ్రామపెద్దలకు పలుమార్లు తెలియజేసినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. కొమరాడ, పార్వతీపురం పోలీసులకు ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదని, ఈ సారి న్యాయం జరిగే వరకు ఇంటి ముందు నుంచి కదలనని స్పష్టం చేసింది. విలేకరులపై దాడులు రజని న్యాయ పోరాటం చేస్తుందన్న విషయం తెలుసుకున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియూ సిబ్బంది గ్రామానికి చేరుకుని రజనీతో మాట్లాడుతుండగా, ఒక్కసారిగా సోమేశ్వరరావు కుటుంబ సభ్యులు దాడి చేశారు. విలేకరుల కెమారాలు లాక్కొని పగులగొట్టారు. ఈ క్రమంలో రజనీని కూడా చితకబాదారు. దీంతో రజిని పోలీసులకు ఫిర్యాదు చేయాలని పార్వతీపురం వచ్చింది. దాడి చేశారు పార్వతీపురం పోలీస్టేషన్‌కు చేరుకున్న తర్వాత బాధితురాలు రజనీ మాట్లాడుతూ, తనకు న్యాయం చేయాలని భర్త ఇంటి వద్దకు వెళితే అత్త అప్పలనరసమ్మ, మామ అప్పలనాయుడు, బావ మౌళి, మరదలు దేవి లతోపాటు గ్రామానికి చెందిన వాన మన్మధ, మౌళి, బూరి బుజ్జి, ఉమ తదితరులు దాడిచేశారని భోరుమంది. జాకెట్,చీర చింపేసి దారుణంగా కొట్టారని కన్నీటిపర్యంతమైంది. తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు తనకు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
రోడ్డుప్రమాదంలో విద్యార్థికి తీవ్రగాయాలు
పార్వతీపురం (విజయనగరం) : పెట్రోల్ కొట్టించుకోవడానికి బంక్‌కు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన విజయనగరం జిల్లా పార్వతీపురం బైపాస్ రోడ్డుపై గురువారం చోటుచేసుకుంది. చంద్రంపేటకు చెందిన ఎస్.సాయికృష్ణ(22) స్థానిక కళాశాలలో బీఫార్మసీ చదువుతున్నాడు. ఈ క్రమంలో బైపాస్ రోడ్డుపై ఉన్న పెట్రోల్‌బంక్‌లోకి వెళ్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. -
పార్వతీపురంలో సూదిగాడి కలకలం
పార్వతీపురం: విజయనగరం జిల్లాలో సూదిగాడు కలకలం సృష్టించాడు. పార్వతీపురంలో బుధవారం గుర్తు తెలియని దుండగుడు ఓ బాలికను సూదితో గుచ్చి పారిపోయాడు. పట్టణంలోని జగన్నాథపురం ప్రాంతానికి చెందిన నాగేశ్వరరావు కుమార్తె మౌనిక(9) రోడ్డు పక్కన నడిచి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి ఆమె మోచేతిపై సూదితో గుచ్చి పరారయ్యాడు. బాధితురాలు నొప్పితో బాధపడుతుండగా గమనించిన స్థానికులు విషయం తెలుసుకుని చుట్టుపక్కల గాలించినా దుండగుడి ఆచూకీ తెలియలేదు. తల్లిదండ్రులు బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. ఎలాంటి అపాయం లేదని వైద్యులు చెప్పడంతో బాలిక తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. -
సమస్యలు చెప్పినందుకు గెంటేశారు..
పార్వతీపురం (విజయనగరం) : తమ సమస్యలు పరిష్కరించి ఇబ్బందులు తీర్చాలని అడిగిన ప్రజలను, వారికి మద్దతుగా నిలిచిన వైఎస్సార్ కాంగ్రెస్ నేతలను పచ్చ తమ్ముళ్లు సహించలేకపోయారు. విజయనగరం జిల్లా పార్వతీపురం 30వ వార్డులో సోమవారం జన్మభూమి ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. వారికి వైఎస్సార్సీపీ యువజన విభాగం నేత జగదీశ్ నేతృత్వంలో నాయకులు మద్దతుగా నిలిచారు. ఇది జీర్ణించుకోలేని టీడీపీ నేతలు వారందరినీ బయటకు బలవంతంగా పంపించేశారు. మొత్తం 45 నిముషాల్లోనే సభ ముగిసిందని ప్రకటించారు. అధికార పార్టీ నేతల తీరుపై ప్రజలు తీవ్రంగా నిరసించారు. -
అంగన్వాడీ కార్యకర్తల ధర్నా
పార్వతీపురం (విజయనగరం) : సీఎం చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ అంగన్వాడీ కార్యకర్తలు సోమవారం విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. తమ వేతనాల పెంపునకు ఉద్దేశించిన జీవోను సీఎం చంద్రబాబు విడుదల చేయడం లేదని నిరసన వ్యక్తం చేశారు. తమ ఉద్యమాన్ని సీఎం అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అంగన్వాడీలను ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారని, ఈ యత్నాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. -
వ్యాను ఢీకొని వ్యక్తి మృతి
వేగంగా దూసుకొచ్చిన వ్యాను నడిచి వెళుతున్న వ్యక్తిని ఢీకొన్న ఘటన బుధవారం విజయనగరం జిల్లా పార్వతీపురంలో జరిగింది. వివరాలు.. గరుగుబిల్లి మండలం రావుపల్లి గ్రామానికి చెందిన వి.వెంకీ అనే యువకుడు పార్వతీపురంలోని ఓ హోటల్లో పనిచేస్తున్నాడు. పని ముగించుకుని బుధవారం సాయంత్రం స్వగ్రామానికి బయలుదేరాడు. ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని సిగ్నల్స్ వద్ద... కూరగాయలతో వెళుతున్న వ్యాన్ అతన్ని ఢీకొంది. తీవ్ర గాయాలతో వెంకి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. -
విషాహారం తిని ఒకరు మృతి
విజయనగరం జిల్లా కొమరాడ మండలం గుణానపురంలో కలుషిత ఆహారం తినటం వల్ల ఒకరు మృతి చెందగా.. ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. వివరాల్లోకి వెళితే.. కర్రి జగన్నాథం, ఆయన భార్య కౌసల్య, మనవడు గోపీచందర్ ఆదివారం మధ్యాహ్నం తోత (రాగి సంగటి) తిన్నారు. ఆ తర్వాత జగన్నాథం మృతి చెందగా, మిగతా ఇద్దరూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కేజీహెచ్‌కు తీసుకెళ్లాలని వైద్యులు సిఫారసు చేశారు. -
కల్యాణ మండపంలో అగ్ని ప్రమాదం
పార్వతీపురం: విజయనగరం జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ఓ ఫంక్షన్ హాల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. పార్వతీపురం మెయిన్‌రోడ్డులోని సూర్యకళా ఫంక్షన్ హాల్ కింది భాగంలో ఉన్న సెల్‌షాపులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు వ్యాపించాయి. దీంతో మండపంలో ఉంచిన గ్యాస్ సిలిండర్లు పేలిపోతాయన్న భయంతో స్థానికులు పరుగులు తీశారు. అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు చర్యలు చేపట్టారు. -
వివాహిత దారుణ హత్య
పార్వతీపురం: విజయనగరం జిల్లాలో ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. పార్వతీపురం మండలం తాళ్లబురిడి గ్రామ సమీపంలోని వింజమ్మకొండ పై ఓ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు ఆదివారం పోలీసులకు సమాచారం అందించారు. కాగా.. మృతదేహం అదే గ్రామానికి చెందిన భారతి(30)దిగా గుర్తించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు అత్యాచారం చేసి ఆ తర్వాత హతమార్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఎజెండాను ఎలా ఆమోదిస్తారు..?
పార్వతీపురం: మెజార్టీ సభ్యులు సమావేశం నుంచి వాకౌట్ చేయగా మిగిలిన ఏడుగురు కౌన్సిలర్లతో ఎజెండాను ఎలా ఆమోదిస్తారని వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు గొల్లు వెంకట్రావు, సీహెచ్ శ్రీనివాసరావు,ఓ రామారావు, చీకటి అనూరాధ తదితరులు కమిషనర్ వీసీహెచ్ అప్పలనాయుడును నిలదీశారు. బుధవారం జరిగిన కౌన్సిల్ సాధారణ సమావేశానికి అధికార పార్టీకి చెందిన ఏడుగురు సభ్యులు మాత్రమే హాజరయ్యారు. మిగతా ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ సభ్యులతోపాటు ద్వారపురెడ్డి శ్రీనివాస్, అతని సతీమణి ద్వారపురెడ్డి జ్యోతి, సంగం రెడ్డి లక్ష్మీపార్వతి తదితరులు కూడా చైర్పర్సన్ ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా వాకౌట్ చేశారు. అయితే ప్రతిపక్ష, వాకౌట్ చేసిన కౌన్సిలర్ల అందరితో ముందుగానే కమిషనర్ రికార్డులో సంతకాలు చేయించారు. అనంతరం సభ్యులంతా వాకౌట్ చేయడంతో ముందు రికార్డులో ఉన్న సంతకాల ఆధారంగా ఎజెండాలోని మొత్తం అంశాలను కౌన్సిల్ ఆమోదించింది. ఈ విషయమై వారు కమిషనర్ నిలదీస్తూ మున్సిపల్ చట్టాలను తెలుసుకోవాలని సభ్యులు వాకౌట్ చేస్తే కోరం లేకుండా ఉన్న కౌన్సిల్లో ఎజెండా మొత్తాన్ని ఆమోదిస్తారా..? అని ప్రశ్నించారు. ఈ విషయమై తాము ఉన్నతాధికారులకు, న్యాయస్థానానికి నివేదిస్తామని స్పష్టం చేశారు. -
రైలు ఢీకొని వ్యక్తి మృతి
విజయనగరం జిల్లా కొమరాడ మండలం సివిని గ్రామం సమీపంలో రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు సివిని గ్రామానికి చెందిన వెంకట రమణ(49)గా పార్వతీపురం రైల్వే పోలీసులు తెలిపారు. మంగళవారం ఉదయం బహిర్భూమికి వచ్చిన అతడు పట్టాలు దాటుతున్న సమయంలో రైలు ఢీకొనడంతో మృతి చెందినట్టు చెప్పారు. రమణకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
మహిళ ఆత్మహత్యాయత్నం
పార్వతీపురం: విజయనగరం జిల్లా కురుపాం మండలం మొండెన్కల్ గ్రామానికి చెందిన ఓ వివాహిత శనివారం ఆత్మహత్యాయత్నం చేసింది. బిడ్డిక సోమన్‌ని అనే మహిళ తన చేతి గాజులను పొడి చేసుకుని దాన్ని నీటితో కలిపి తాగింది. ఆమెను స్థానికంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. మానసిక స్థితి సరిగా లేక ఆమె ఈ పని చేసినట్టు తెలుస్తోంది. సోమన్‌ని భర్త వెంకన్న డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. -
'బాబు పాలనలో మహిళలకు రక్షణ లేదు'
పార్వతీపురం (విజయనగరం) : చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర అన్నారు. టీడీపీ నాయకులు, వారి బంధువులు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని అన్నారు. రెండు రోజుల క్రితం సాలూరులో మునిసిపల్ ఉద్యోగినిపై ఓ టీడీపీ కౌన్సిలర్ అత్యాచారయత్నం చేసిన ఘటనపై శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే రాజన్న దొర మీడియాతో మాట్లాడారు. ఈ అంశాన్ని శాసనసభలో లేవనెత్తుతామని చెప్పారు. ఈ ఘటనపై మహిళా డీఎస్పీతో విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
వృద్ధురాలిపై ఎద్దు దాడి
విజయనగరం : పార్వతీపురం మున్సిపాలిటీ ఆఫీసు సమీపంలో ఓ వృద్ధురాలిని దేవర ఎద్దు పొడిచింది. ఎద్దు పొడవటంతో వృద్దురాలి పొట్ట నుంచి పేగులు బయటకు వచ్చాయి. స్థానికులు ఆమెను హుటాహుటిన పార్వతీపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. వృద్ధురాలికు సంబంధించిన చెందిన వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్యాసింజర్ రైళ్లు రద్దు
విశాఖ - రాయగఢ మార్గంలో విద్యుదీకరణ పనుల దృష్ట్యా పార్వతీపురం మీదుగా వెళ్లే ప్యాసింజర్ రైళ్లను ఈనెల 13 వరకు రద్దు చేశారు. అలాగే, ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆలస్యంగా నడుపుతున్నారు. ఈ మార్గంలో విద్యుదీకరణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. -
ఐటీడీఏ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత
ఐటీడీఏ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పాలక వర్గ సమావేశం కోసం ఐటీడీఏ కార్యాలయానికి కేంద్ర విమనయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు హాజరయ్యారు. ఆయనతో తమ సమస్యలు చెప్పుకుంటామంటూ.. గిరిజన విద్యార్థులు కార్యాలయానికి వచ్చారు. వీరిని లోపలికి అనుమతించేందుకు పోలీసులు నిరాకరించారు. కార్యాలయంలోకి వస్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. విద్యార్థులు వెనక్కి తగ్గక పోవడంతో.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. -
పార్వతీపురం ఐటీడీఏ వద్ద ఉద్రిక్తత
విజయనగరం : తమ సమస్యలు పరిష్కరించాలంటూ గిరిజన హాస్టల్ విద్యార్థులు శనివారం విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. అందులోభాగంగా కార్యాలయంలో జరుగుతున్న పాలక మండలి సమావేశాన్ని అడ్డుకునేందుకు విద్యార్థులు యత్నించారు. ఆ క్రమంలో పోలీసులు రంగప్రవేశం చేసి.. విద్యార్థులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు, విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. దాంతో ఐటీడీఏ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసి... పోలీస్ స్టేషన్‌కి తరలించారు. -
మలేరియాతో వివాహిత మృతి
విజయనగరం (పార్వతీపురం) : పార్వతీపురం ప్రభుత్వాసుపత్రిలో మలేరియా జ్వరంతో పి. ఆదిలక్ష్మి(22) అనే వివాహిత గురువారం మృతిచెందింది. బీకేపట్నం గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి తీవ్ర జ్వరంతో బుధవారం ఆసుపత్రిలో చేరింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మృతిచెందిందని కుటుంబసభ్యులు, తోటి గ్రామస్తులు ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. -
ఎమ్మెల్యేను నిలదీసిన ప్రజలు
విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలో మంగళవారం వార్డుల సందర్శన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఒకటవ వార్డు సందర్శనకు వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, చైర్పర్సన్ శ్రీదేవిని స్థానికులు అడ్డుకున్నారు. నెలరోజులుగా కుళాయిల ద్వారా బురదనీరు సరఫరా చేస్తుండడంపై మండిపడ్డారు. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండడంపై ప్రశ్నించారు. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన స్థానిక టీడీపీ నాయకులు ఎదురుదాడికి దిగారు. -
ఐటీడీఏ కార్యాలయం ఎదుట ఆందోళన
పార్వతీపురం (విజయనగరం) : విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ గిరిజన పాఠశాలలో వసతుల లేమిపై డిప్యూటీ డెరైక్టర్ చేసిన విచారణ తూతూ మంత్రంగా సాగిందంటూ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పాఠశాలలో వసతులు సరిగ్గా లేవంటూ సోమవారం విద్యార్థులు ఆందోళన చేశారు. దీనిపై స్పందించిన ఐటీడీఏ పీవో విచారణకు ఆదేశించారు. విద్యార్థుల నుంచి వివరాలు సేకరించిన డీడీ అసంపూర్తిగా నివేదిక రూపొందించారంటూ మంగళవారం గిరిజన సంఘాలు ధర్నా చేపట్టాయి. పాఠశాలలో అసౌకర్యాలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని పీవోను డిమాండ్ చేశాయి. -
పేద విద్యార్థులకు కెనరా బ్యాంకు సాయం
పార్వతీపురం (విజయనగరం) : పార్వతీపురంలోని కెనరాబ్యాంక్ శాఖ నిరుపేద విద్యార్థులకు నగదు సాయం అందించింది. స్థానిక ప్రభుత్వ హైస్కూల్లోని పేద విద్యార్థులకు కెనరా బ్యాంక్ మేనేజర్ ఎ.రవికుమార్ శుక్రవారం రూ.22,500 నగదును అందించారు. పేదరికంతో బాధపడకుండా చదువుపైనే దృష్టి పెట్టాలని, ఉన్నత స్థానాలకు ఎదగాలని ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను కోరారు. -
రోడ్లన్నీ జలమయం
పార్వతీపురం: విజయనగరం జిల్లా పార్వతీపురంలో సోమవారం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. దీంతో ఆ ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయం అయ్యాయి. అలాగే, విద్యుత్, రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంభించిపోయింది. రోడ్లన్నీ జలమయం కావడంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడ్డారు. కొన్ని గ్రామాలకు విద్యుత్ అంతరాయం కలిగింది. -
'ఫ్యాక్టరీ ఆస్తులు వేలం వేయండి'
పార్వతీపురం (విజయనగరం) : తమ బకాయిలు చెల్లించని షుగర్ ఫ్యాక్టరీ ఆస్తులు వేలం వేయాలని రైతులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన విజయనగరం జిల్లా పార్వతీపురం ఆర్డీవో ఆఫీస్‌లో సోమవారం చోటుచేసుకుంది. సీతానగరం మండలంలోని ఎన్సీఎస్ షుగర్ ఫ్యాక్టరీ.. రైతులకు దాదాపు రూ. 8 కోట్లు బకాయిపడింది. దీంతో రైతులు ఫ్యాక్టరీ యాజమాన్యం తీరుపై కోర్టుకు వెళ్లారు. బకాయిలు దఫాల వారీగా చెల్లించాలని కోర్టు తెలిపింది. దీంతో రెవెన్యూ ఉన్నతాధికారులు పరిశ్రమ యాజమాన్యంతో చర్చలు జరుపగా వారు పలు దఫాలుగా ఆగస్టు నెల ఆఖరుకు అందరికీ బకాయిలు చెల్లిస్తామని తెలిపారు. కానీ మాట ప్రకారం బకాయిలు చెల్లించలేదు. దీంతో రైతులు మళ్లీ రోడ్డెక్కారు. ఫ్యాక్టరీ ఆస్తులు అమ్మి తమ బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీవోను రైతులు కోరారు. -
పార్శిల్లో ఆడశిశువు మృతదేహం
విజయనగరం (పార్వతీపురం) : విజయనగరం జిల్లా పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద సోమవారం అప్పుడే పుట్టిన ఆడ శిశువు మృతదేహం లభ్యమైంది. గుర్తుతెలియని వ్యక్తులు ఆడశిశువును కవర్లో పెట్టి పార్శిల్లా చుట్టి పడేశారు. శిశువు మృతదేహాన్ని కనుగొన్న స్థానికులు, విద్యార్థులు ఖననం చేశారు. -
విజయనగరంలో బలవంతంగా అరెస్ట్‌లు
పార్వతీపురం(విజయనగరం జిల్లా): విజయనగరం జిల్లా పార్వతీపురంలో బంద్‌లో పాల్గొన్న వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను బలవంతంగా అరెస్ట్ చేశారు. శనివారం పట్టణంలో బంద్‌లో పాల్గొన్న వైఎస్సార్సీపీ సాంస్కృతిక విభాగం నాయకురాలు వంగపండు ఉషను పురుష పోలీసులే బలవంతంగా ఎత్తుకెళ్లి వ్యాన్ ఎక్కించారు. బంద్‌లో పాల్గొన్న పార్వతీపురం నియోజకవర్గ ఇంచార్జీ జమ్మాన ప్రసన్నకుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్సార్సీపీ చేపట్టిన బంద్‌కు వామపక్షాలు మద్దతు ప్రకటించాయి. పోలీసులు వామపక్షాల నాయకుడు రెడ్డి శ్రీరామమూర్తితో పాటు ఆపార్టీలకు చెందిన పలువురు నాయకులను అరెస్ట్ చేసి లారీల్లో తరలించారు. -
ఉల్లి కోసం తోపులాట
విజయనగరం (పార్వతీపురం) : ప్రభుత్వం కిలో ఉల్లి రూ.20 లకే అందజేస్తుండటంతో రైతు బజార్లకు తాకిడి ఎక్కువైంది. శుక్రవారం విజయనగరం జిల్లా పార్వతీపురం రైతుబజార్ వద్ద ఉల్లి కోసం తోపులాట జరిగింది. దీంతో కౌంటర్ వద్ద విక్రయం ఆపేశారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పరిస్థితి అంతా అదుపులోకి వచ్చిన తర్వాతే మళ్లీ ఉల్లి విక్రయం ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చేది రెండు కిలోలే అయినా రైతు బజార్ల వద్ద క్యూలైన్లు చూస్తే ప్రజలకు దిమ్మతిరిగిపోతుంది. నిన్న ఇదే రైతు బజార్ వద్ద క్యూలైన్లో నిల్చుని 10 మంది వృద్ధులు కళ్లు తిరిగి పడిపోయారు. -
సినీ ఫక్కీలో కిడ్నాప్!
పార్వతీపురం: ప్రశాంతతకు మారుపేరైన బొబ్బిలిలో సినీ ఫక్కీలో కిడ్నాప్, దాడి జరిగింది. ఈ సంఘటన ఆలస్యంగా మంగళవారం పార్వతీపురంలో వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి పార్వతీపురం టౌన్ ఎస్ఐ వి.అశోక్ కుమార్, బాధితుడు కనకల గణేశ్వరరావు అందించిర వివరాలు... బొబ్బిలికి చెందిన సెవెన్ సోల్స్ అనే స్వచ్ఛంద సంస్థ పార్వతీపురం సబ్-ప్లాన్‌లోని గుమ్మలక్ష్మీపురం మండలం భద్రగిరి ఏపీటీడబ్ల్యు రెసిడెన్షియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూన్ 23 నుంచి జూలై 15 వ రకు మెడికల్ క్యాంపు నిర్వహించింది. ఈ నెల 5న ఆ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ కనకల గణేశ్వరరావుకు ఆ మెడికల్ క్యాంపు నిర్వాహకులు ఫోన్ చేసి ఏవో కబర్లు చెప్పి తమ వద్దకు రమ్మని కారు పంపించారు. దీంతో వారు పంపించిన కారులో ప్రిన్సిపాల్ గణేశ్వరరావు ఈ నెల 5న బొబ్బిలి వెళ్లారు. అయితే అక్కడ వాళ్లు ప్రిన్సిపాల్‌ను కిడ్నాప్ చేసి, ఫ్లై-ఓవర్‌కు దగ్గరలోని ఓ పాడుబడిన ఇంట్లో బంధించారు. మరుసటి రోజు ఆరువ తేదీన వెంకటేశ్వరరావు, ఆనంద్ అనే ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆయనను చావ బాదారు. తమను సలోమీ అనే ఆమె పంపిందని, తాము కొట్టినట్టు ఎవరికైనా చెబితే కుటుంబాన్నీ చంపేస్తామని బెదిరించి ఆయన వద్ద ఉన్న ఏటీఎం కార్డు, *22వేల నగదు తీసుకున్నారు. అనంతరం మరో ఏపీ 31 టీవీ 4626 కారులో ఆగస్టు ఆరున సాయంత్రం భద్రగిరిలో విడిచిపెట్టారు. కారు ఇచ్చి ఇంటికి పంపిం చారు. దెబ్బలతో ఇంటికి వెళ్లిన ప్రిన్సిపాల్ రాజాం ఆస్పత్రిలో చికిత్స కోసం 7న జాయిన్ అయ్యారు. అక్కడ తనకు యాక్సిడెంట్ జరిగినట్లు చెప్పారు. పోలీసులు కూడా అలాగే కేసు నమోదు చేశారు. అయితే గాయాలు నయమయ్యాక కుటుంబ సభ్యులు ధైర్యం చెప్పడంతో అసలు విషయం బయటికొచ్చింది. దీంతో ఈ నెల 16న బొబ్బిలి పోలీస్ స్టేష న్లో ఫిర్యాదు చేశారు. అయితే ముందు పార్వతీపు రం పోలీసులకు ఇచ్చిన తప్పుడు ఫిర్యాదును వాపసు తీసుకునేందుకు ప్రిన్సిపాల్ కనకల గణేశ్వరరావు కుటుంబ సభ్యులతో పట్టణ పోలీస్ స్టేషన్‌కు వచ్చి మళ్లీ జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పట్టణ ఎసై వి.అశోక్ కుమార్ మాట్లాడుతూ ముందు ఇచ్చిన ఫిర్యాదు ఫాల్స్, కావడంతో మళ్లీ ఫిర్యాదు తీసుకున్నామన్నారు. ఈ విషయమై బొబ్బిలి ఎస్సై ప్రసాదరావు వద్ద ప్రస్తావించగా, దాడి చేసినట్లు ఫిర్యాదుచేశారు.కేసురిజిష్టర్ చేశామని చెప్పారు. -
పశు మాఫియా ! ఘోరాతి గోరం!
విజయనగరం కంటోన్మెంట్: వారపు సంతలంటే ఒకప్పుడు పాడి ఆవులతోనూ, దుక్కిటెడ్లతోనూ కళకళలాడేవి. రైతులే స్వయంగా క్రయవిక్రయాలు జరిపేవారు. అందమైన బలిష్టమైన పాడి, దుక్కిపశువులుండే ఆ సంతలు ఇప్పుడు మాఫియా నీడలో నడుస్తున్నాయి. అప్పట్లో నెలకు రూ.పది వేల వ్యాపారం జరిగితే అదే పెద్ద రికార్డు కింద లెక్క. కానీ ఇప్పుడు వారానికే దాదాపు రూ. 12 కోట్లకు పైగా లావాదేవీలు జరుగుతున్నాయి. బక్కచిక్కిన శరీరంతో దీనంగా ఆహారం కోసం, గుక్కెడు నీటికోసం ఎదురు చూస్తున్న పశువులే సంతల్లో దర్శనమిస్తున్నాయి. ఒడిశాలో పశువు రవాణా నిషేధం. దీంతో అక్కడి మారుమూల ప్రాంతాల నుంచి దళారులు దాదాపు వారంరోజులపాటు గ్రాసం, నీరు ఇవ్వకుండా నడిపిస్తూ తీసుకువచ్చి జిల్లాలోని మానాపురం, అచ్యుతాపురం,అలమండ తదితరసంతల్లో లారీల్లో కుక్కి కేరళ,చెన్నై రాష్ట్రాలకు పశువులను తరలిస్తున్నారు. జిల్లాలో పెదమానాపురం పశురవాణాకు ప్రధాన కేంద్రంగా మారింది. పశువుల రవాణాలో కనీస నిబంధనలు పాటించడంలేదు. ఒక వేగన్లో 30 నుంచి 45 వరకూ పశువులను కుక్కి తరలిస్తున్నారు. మాంసం కోసమే కదాని పశువుల కాళ్లు విరగొట్టి మరీ ఒక దానిపై మరో పశువును ఎక్కించి తరలిస్తున్నారు. పశువుల తరలింపులో కనీస నిబంధనలుకూడా పాటించడంలేదు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఈ వ్యాపారాన్ని నడిపిస్తున్నారు. అడ్డుకోవాల్సిన పోలీసు,రెవెన్యూయంత్రాంగం పశుమాఫియాకు సహకరిస్తుండడంతో వారి వ్యాపారం కోట్లకు పడగలెత్తింది. వారానికి 25వేలు .... సంతల వారీగా ఒక వారంలో తరలించే పశువుల సంఖ్య ఇది..! జిల్లాలోని పార్వతీపురం,బొబ్బిలి,కూనేరు, అడ్డాపుశీల, సాలూరు, అచ్యుతాపురం,బొద్దాం,కంది వలస,మోపాడలతో పాటు పెదమానాపురం సంతల నుంచి ప్రతీ వారం 25వేలకు పైబడి పశువులు అక్రమంగా రవాణా అవుతున్నాయి. ఒక్కొక్క పశువును రూ.4వేల నుంచి రూ. 15వేల వరకూ కొనుగోలు చేస్తున్నారు. ఒక్కొక్క పశువు ఖరీదు సగటున రూ.5వేలకు లెక్కిస్తే 25వేల పశువుల ధర రూ.12.50 కోట్లవుతుంది. 44 పోలీసు స్టేషన్లు.. 20 చెక్‌పోస్టులు ...కేసులు ఎక్కడ? ఒడిశా రాష్ట్రం నుంచి ఆంధ్రా దాటే వరకూ ఎన్నో చెక్‌పోస్టులు, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. కానీ ఎక్కడా పశురవాణాకు అడ్డుకట్ట పడడం లేదు. ఒడిశా పశువులతో పాటు, జిల్లాకు చెందిన వాటిని కూడా రవాణా చేస్తున్నారు. ఒడిశా నుంచి ఆంధ్రాకు వచ్చేందుకు రెండు దారులున్నాయి. ఆ మార్గాల గుండా పశువులు ఆంధ్రాలోకి ప్రవేశిస్తున్నాయి. జిల్లాలో 44 పోలీస్ స్టేషన్లు, రెండు పోలీస్ చెక్‌పోస్టులున్నాయి. అలాగే ఇతర శాఖలకు చెందిన మరో 18 చెక్‌పోస్టులున్నా పశువుల తరలింపుపై ఎవరూ ప్రశ్నించడం లేదు. పాచిపెంట మీదుగా వచ్చినపుడు పి కోనవలస చెక్ పోస్ట్, అక్కడే పోలీస్‌స్టేషన్, సాలూరులో సర్కిల్ కార్యాలయం,రామభద్రపురంలో పోలీస్‌స్టేషన్, ఎస్ బూర్జి వలస, పెదమానాపురంలలో పోలీస్ స్టేషన్లు,గజపతినగరంలో సర్కిల్ కార్యాలయం ఆ తరువాత బొండపల్లి, విజయనగరం పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. విజయనగరం తరువాత కూడా వరుసగా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. కానీ ఎక్కడా ఈ పశు రవాణాకు అడ్డుకట్ట పడటం లేదు. మరో పక్క రాయగడ నుంచి వచ్చినపుడు కూనేరు చెక్‌పోస్టు దగ్గర నుంచి వరుసగా పోలీస్ స్టేషన్లున్నాయి. కానీ పశు రవాణా అడ్డుకోవడం లేదు. స్థానిక నేతల సహకారంతోనే.... జిల్లాలో అన్ని రంగాల వారితో పరిచయముంటున్న కొందరు చోటామోటా స్థానిక నాయకులతో ఇతర రాష్ట్రాలకు చెందిన ఈ పశురవాణా వ్యాపారులు సంబంధాలు ఏర్పాటు చేసుకుంటారు. పశురవాణాలో ఆటంకాలు ఎదురైనప్పుడు ఈ నేతలు రంగంలోకి దిగుతారు. వెంటనే సెటిల్మెంట్కు తెర తీస్తారు. వారితో బేరంపెట్టుకుని మరెప్పుడూ ఈ పశు రవాణా జోలికి రాకుండా సెటిల్ చేస్తారు. అది ఒక్కసారే కావచ్చు! లేదా ప్రతీ వారం పెన్షన్ పద్ధతిలోనూ కావచ్చు. మొత్తానికి ఏదో ఒక సెటిల్మెంట్ ఖాయం. ఈ సెటిల్ మెంట్ అనేది చిన్న చిన్న వాళ్లయితే ఒకేసారి ఎంతో కొంత మొత్తాన్ని జేబులో పెట్టి పంపేస్తారు. నిత్యం వీడితో గొడవ పడాల్సి ఉంటుందని భావిస్తే ప్రతీ నెలా కొంత మొత్తం ఇస్తామని పరస్పర అంగీకారం జరుగుతుంది.ప్రస్తుతానికి ఈ రెండు విధానాలూ అమలవుతున్నాయి. రెవెన్యూ,పోలీస్యంత్రాంగాలకు మామ్మూళ్లు? జిల్లాలో పశు అక్రమ రవాణాను అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాల్సిన రెవెన్యూ,పోలీస్ అధికారులు ప్రతినెలా పెద్ద ఎత్తున ఠంచన్‌గా మామ్మూళ్లు అందుతుండడం వల్లే పశుఅక్రమ రవాణా అడ్డూ ఆపూ లేకుండా జరిగిపోతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వేలాది కిలోమీటర్ల నడక ! జిల్లాలో ఉన్న సంతలతో పాటు ఒడిశాలోని చిత్ర తదితర సంతల నుంచి కొనుగోలు చేసి మానాపురం వరకూ తరలిస్తారు. కాలినడకన మానాపురం వరకూ తరలించేందుకు స్థానికులతో ఒప్పందం కుదుర్చుకుంటారు. ఒక్కో వ్యక్తి 20 నుంచి 50 పశువులను అప్పగిస్తారు. వారు పశువులను తరలించినందుకుగాను ఒక్కొక్క పశువుకు రూ.150 నుంచి 200 వరకూ చెల్లిస్తారు. రాత్రీ పగలు అనే తేడా లేకుండా పశువులకు విశ్రాంతి ఇవ్వకుండా వారం రోజుల పాటు నడిపించి మానాపురం సంతకు తీసుకువస్తారు. అలా తీసుకువచ్చిన పశువులకు గడ్డి,నీరు ఇవ్వకుండా మానాపురం వద్ద సామర్థ్యానికి మించి లారీల్లో కుక్కి తాళ్లతో బంధించి రవాణా చేస్తున్నారు. చెన్నై,కేరళ,తెలంగాణ తదితరరాష్ట్రాల్లోని కబేళాలకు తరలిస్తున్నారు. జిల్లా కేంద్రం గుండా జరిగే పశువుల తరలింపుపై ఇటీవల ఏపీ గోసంరక్షణ సమాఖ్య తదితర సంస్థలు, ఇతరుల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో వ్యాపారులు రూటు మార్చారు. వేరే దారి గుండా పట్టణం వెలుపల జాతీయ రహదారి కి చేరుకుని విశాఖ మీదుగా తరలిస్తున్నారు. ఆవేదన భరితంగా అంబారావాలు రవాణా సమయంలో పశువులు దయనీయంగా అరుస్తున్నా పట్టించుకోవడం లేదు. వాటికి గడ్డీ,నీరు ఇవ్వకుండా తాళ్లతో బంధించి వందల కిలోమీటర్లు రవాణా చేస్తుండడంతో ఆకలికి అవి దీనంగా అరుస్తుంటే పెద్ద కర్రలతో కొట్టి వాటి నోరు మూయించి చెప్పనలవి కాని విధంగా హింసిస్తున్నారు. వారు పెట్టే హింస భరించలేక కబేళాకు వెళ్లకముందే పశువులు వాహనాల్లోనే మరణిస్తున్నాయి. పశువుల అక్రమ రవాణా నిషేధం రాష్ట్రంలో పశువుల అక్రమ రవాణా పై నిషేధం ఉంది. జిల్లాలో జరుగుతున్నట్టు నా దృష్టికి రాలేదు. దాడులు చేయాలని పశుసంవర్ధక శాఖ జేడీకి ఆదేశిస్తాం. కలెక్టర్ సూచనలతో అన్నిచర్యలూ తీసుకుని పశు మాఫియాపై గట్టి నిఘాపెడతాం. బి రామారావు, జాయింట్‌కలెక్టర్,విజయనగరం తిరిగి మాపై కేసులు పెడుతున్నారు. జిల్లాలో పశు అక్రమ రవాణా చేస్తున్నప్పుడు తాము అడ్డుకుంటే తిరిగి మాపై కేసులు పెట్టిస్తున్నారు. అధికారుల అండతోనే ఈ పశువుల అక్రమ రవాణా జరుగుతోంది. చీపురుపల్లిలో ఎస్సై మా కార్యకర్తను కొట్టిన విషయమై దేవాదాయ శాఖ మంత్రి ఆదేశించినా ఇప్పటికీ చర్యలు లేవు. ఇంతటి పశు మాఫియాను రాష్ట్రంలో ఎక్కడా చూడలేదు. - లోగిశ రామకృష్ణ, రాష్ట్ర అధ్యక్షుడు , ఏపీ గోసంరక్షణ సమాఖ్య -
నిలదీస్తారేమోనని వైఎస్సార్సీపీ నేతల అరెస్ట్
పార్వతీపురం (విజయనగరం): ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ సీపీ నేతలపై అప్రజాస్వామిక చర్యలు ఎక్కువైపోతున్నాయి. ఆదివారం విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలో 12 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక్కడ జరుగుతున్న ఆదివాసీ దినోత్సవాలకు రాష్ట్ర మంత్రులు మృణాళిని మరికొందరు రాబోతున్నారు. అయితే, ప్రజలకిచ్చిన హామీల అమలుపై వైఎస్సార్ సీపీ నేతలు మంత్రులను నిలదీస్తారని, ఆందోళన చేస్తారని ముందస్తు జాగ్రత్తగా పోలీసులు ఈ చర్యలకు దిగినట్టు తెలుస్తోంది. వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు మద్ది వెంకటేశ్వర్లు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఎం.రవికుమార్ సహా 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
కలర్గ్రానైట్స్కు అనుమతులు వద్దు..
పార్వతీపురం(విజయనగరం జిల్లా): కలర్ గ్రానైట్స్‌కు అనుమతులు ఇవ్వొద్దని గిరిజనులు ఐటీడీఐ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఈ సంఘటన గురువారం విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం కేంద్రంలో జరిగింది. కలర్ గ్రానైట్స్ తవ్వకాలకు అనుమతులివ్వడం ద్వారా పర్యావరణానికి ప్రమాదం ఏర్పడుతుందని గిరిజనులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పీవోకు అనుమతులు ఇవ్వొద్దంటూ కోరుతూ వినతి పత్రం సమర్పించారు. -
చచ్చిపోయిన లక్ష్యం!
ఆరోపణలు... పచ్చ అరటి మొక్కల పంపిణీ దగ్గర నుంచి డ్రిప్ మెటీరియల్ కొనుగోలు వరకూ పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేయకముందే దాదాపు లక్షా 10 వేల మొక్కలు చనిపోవడమే దీనికి నిదర్శనం. ఈ వ్యవహారం పై విచారణ జరపాలని ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలో ఎమ్మెల్యేలు పుష్పశ్రీవాణి, రాజన్నదొర కోరగా, కేంద్రమంత్రి అశోక్ గజపతి ఆదేశించారు. పార్వతీపురం : ఐటీడీఏ పరిధిలో సాగు కోసం గిరిజన రైతులకు పంపిణీ చేసిన 1.53 లక్షల టిష్యూకల్చర్ బనానా (టి.సి.బనానా, పచ్చ అరటి) మొక్క ల్లో, సుమారు 1.10 లక్షల మొక్కలు నాటకముందే చచ్చిపోయాయి. ఒక్కొక్క మొక్కను రూ.12ల చొప్పున, మొత్తం 1.53 లక్షల మొక్కలు కొనుగోలు చేసిన అధికారులు కనీస జాగ్రత్తలు తీసుకోకుండానే వాటిని రైతులకు పంపిణీ చేశారు. తొందరపాటు నిర్ణయాలతో ఐటీడీఏ హార్టి కల్చర్ అధికారులు లక్షలాదిరూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లబ్ధిదారుల ఎంపిక కూడా జరపగకముందే 1.53 లక్షల మొక్కలను లారీలతో తెప్పించిన అధికారులు, అసలు టి.సి.బనానా ఈ ప్రాంతానికి అనుకూలమైనదా...? కాదా...? రైతులకు డ్రిప్ ఉందా...? అనే ఆలోచన లేకుండా...హడావుడిగా నోటికొచ్చిన పేర్లతో లబ్ధిదారుల జాబితాను తయారు చేసి పంపిణీ చేసేశారు. రూ.10 లు విలువ చేసే ఒక్కొక్క మొక్కను రూ.12లకు నకిలీ బిల్లుతో పేమెంట్స్ జరిపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుమ్మలక్ష్మీపురం మండలంలో ఐదెకరాలలో వేసేందుకు ఐదుగురు రైతులకు 7,200 మొక్కలు పంపిణీ చేయగా, దాదాపు 5వేల మొక్కలు నాటక ముందే చనిపోయాయి. కురుపాం మండలంలో 6.5ఎకరాలలో వేసేందుకు ఐదుగురు రైతులకు 9,360 మొక్కలు పంపిణీ చేయగా, సుమారు ఏడు వేల మొక్కలు చనిపోయాయి. జియ్యమ్మవలస మండలంలో 6.5ఎకరాలలో వేసేందుకు పది మంది రైతులకు 9,360 మొక్కలు పంపిణీ చేయగా, అందులో 8,500మొక్కల వరకు చనిపోయాయి. కొమరాడ మండలంలో 28 ఎకరాలలో వేసేందుకు 27 మంది రైతులకు 40,680 మొక్కలు పంపిణీ చేయగా, అందులో 37 వేలు వరకు చనిపోయాయి. ఇక పార్వతీపురం, మక్కువ మండలాలలో వరుసగా 9, 21 ఎకరాలలో వేసేందుకు 8, 18 మంది రైతులకు 12,960, 30,240 మొక్కలు పంపిణీ చేయగా అవి నాటక ముందే చనిపోయాయి. ఆయా మండలాలలో ఒక్క మొక్క కూడా రైతులు నాట లేదు. పాచిపెంట మండలంలో రెండెకరాలకు గాను ఇద్దరు రైతులకు 2,880 మొక్కలు పంపిణీ చేయగా సుమారు 600 మొక్కలు వరకు చనిపోయాయి. సాలూరు మండలంలో 29 ఎకరాలలో వేసేందుకు 20 మంది రైతులకు 40,320 మొక్కలు పంపిణీ చేయగా, అందులో సుమారు 10వేల మొక్కలు చనిపోయాయి. ఇలా ఎనిమిది మండలాలలో నాటకుండానే దాదాపు 1.10లక్షల మొక్కలు చనిపోయాయి. దీని వల్ల రూ.13.20 లక్షల ప్రజాధనం వృథా అయింది. అంతా నాసిరకం.. ఇదిలా ఉండగా ఎనిమిది మండలాలకు గాను నాలుగు మండలాలలో మాత్రమే అది కూడా 30 ఎకరాలలో డ్రిప్ వేశారు. రైతులకు పంపిణీ చేసిన డ్రిప్ మెటిరీయల్ నాసిరకానివి కావడంతో వేసిన వారానికే పైపులు లీకులొస్తున్నాయని సాలూరు మండలం మరిపిల్లికి చెందిన జన్ని చిన్నారావు, సాలూరు బూర్జి గ్రామానికి చెందిన కొండగొర్రి నాగు తదితర రైతులు తెలిపారు. ఒక్కో డ్రిప్ నకు దాదాపు రూ.70వేలు వరకు వ్యయం చేసినట్లు సమాచారం. వీటి నాణ్యతా ప్రమాణాలు సరిగా లేవని ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు(ఏపీ ఎంఐపీ) అధికారులు అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. చచ్చిపోయిన మొక్కలు, నాణ్యతా ప్రమాణాలు చూడకుండా రైతులకు అప్పగించిన డ్రిప్ వల్ల వచ్చిన లక్షలాది రూపాయల నష్టానికి ఎవరు బాధ్యులనేదానిపై సంబంధిత అధికారులు గిరిజన ప్రజలకు సమాధానమివ్వాలని వైఎస్సార్ సీపీ కురుపాం నియోజకవర్గం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి గతంలో డిమాండ్ చేశారు. లక్ష్యం నెరవేరకుండానే సొమ్ము ఖర్చుయిపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. టి.సి.బనానా ఐటీడీఏకు పరిచయం చేసిన ఫీల్డు ఆఫీసరు మొదలుకొని, పందిరి పెండాల్స్కు వైర్‌ను కొనుగోలు చేసే రిటైల్ ఐరన్ షాపు, స్వీట్ కార్న్ విత్తనాలు సరఫరా చేసే ఫీల్డు ఆఫీసరు తదితరుల అనకాపల్లికి చెందిన వారు కాగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉన్నతాధికారిది కూడా అనకాపల్లి కావడం విశేషం. -
ఇంటి ఖర్చులడిగిందని భార్య హత్య
పార్వతీపురం రూరల్: ఇంటి ఖర్చుల కోసం డబ్బు అడిగినందుకు ఆగ్రహించిన భర్త తాగిన మైకంలో భార్యను గొడ్డలితో నరికి చంపిన ఘటన శనివార ం బందలుప్పి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. బందలుప్పి గ్రామానికి చెందిన తిరుమరెడ్డి లక్ష్మణరావు కూలి పనికి వెళ్లి ఇంటికొచ్చాడు. ఇంటి ఖర్చుల కోసం డబ్బు కావాలని అతడి భార్య వరలక్ష్మి(45) అడిగారు. అప్పటికే మద్యం తాగివున్న భర్త లక్ష్మణరావు ఆమెపై మండిపడ్డాడు. ఇంటిలో వున్న గొడ్డలితో మెడపై బలంగా నరికాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై వరలక్ష్మి అక్కడికక్కడే మరణించారు. వరలక్ష్మి మృతదేహాన్ని బంధువులు, చుట్టుపక్కలవున్నవారు చూసేసరికి లక్ష్మణరావు పారిపోయాడు. లక్ష్మణరావు గతంలో తన అత్తను చంపాడని, అయితే పిల్లల భవిష్యత్ దృష్ట్యా విషయాన్ని బయటకు పొక్కకుండా సద్దుమణిగించినట్లు బంధువులు, గ్రామస్తులు చెబుతున్నారు. ఘటనాస్థలాన్ని ఏఎస్పీ సిద్ధార్థ కౌశిల్, సీఐ చంద్రశేఖరరావు, ఎస్ఐ వి.ఎన్.మూర్తి పరిశీలించారు. హత్యకు జరిగిన కారణాలను బంధువులు, గ్రామస్తులను అడిగితెలుసుకున్నారు. స్వయంగా మృతురాలి కుమారులే హత్య జరిగిన తీరును వారికి వివరించారు. మృతురాలి పెద్ద కొడుకు పార్ధసారధి బొబ్బిలి తాండ్రపాపారాయ ఇంజనీరింగ్ కళాశాలల్లో బీటెక్ పూర్తిచేయగా రెండవ కుమారుడు శివకృష్ణ సీతానగరం మండలం మరిపివలసలోవున్న పాలిటెక్నిక్ కళాశాలలో ఫైనలియర్ చదువుతున్నాడు. తండ్రే ఇంతటి దారుణానికి పాల్పడటంతో వీరు తట్టుకోలేకపోతున్నారు. వీరి పరిస్థితి చూసిన ప్రతి ఒక్కరూ చలించిపోయారు. -
ఇంద్రకీలాద్రిపై టెన్షన్ టెన్షన్
విజయవాడ : మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు దుర్గగుడి ఘాట్‌రోడ్డుపై గురువారం బీభత్సం సృష్టించాడు. అమ్మవారి దర్శనం చేసుకునేందుకు తనను అనుమతించలేదంటూ ఘాట్‌రోడ్డులోని మొదటి మలుపు వద్ద కొండ శిఖరానికి ఎక్కి దూకేస్తానంటూ బెదిరించాడు. అగ్నిమాపక శాఖ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని కిందకు దింపడంతో పరిస్థితి సద్దుమణిగింది. వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లా పార్వతీపురం సమీపంలోని కొమరాడకు చెందిన అంపిరి గౌరీశంకర్ (26) గురువారం దుర్గమ్మ దర్శనానికి వచ్చాడు. మద్యం మత్తులో ఉన్న గౌరీశంకర్‌ను సెక్యూరిటీ సిబ్బంది క్యూలైన్లోకి అనుమతించలేదు. దీంతో గౌరీశంకర్ ఘాట్‌రోడ్డులోని మొదటి మలుపు వద్ద నుంచి కొండ శిఖరానికి చేరుకున్నాడు. అక్కడి నుంచి కేకలు వేయడంతో భక్తులు గమనించి ఆలయ ప్రాంగణంలోని పోలీస్ అవుట్‌పోస్ట్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపకశాఖ అధికారి బి.శ్రీనివాసరావు నేతృత్వంలోని సిబ్బంది వి.శివనాగిరెడ్డి, వి.శ్రీనివాసరావు, పి.శివకృష్ణ కొండ ఎక్కి గౌరీశంకర్‌కు కిందకు దింపే ప్రయత్నం చేశారు. ఇది గమనించిన గౌరీశంకర్ తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగగా, బుజ్జగించి కిందకు దింపారు. అయితే, గౌరీశంకర్ మానసిక స్థితి సరిగ్గా లేదని పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం అతడిని వన్‌టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
పార్వతీపురంలో భారీ చోరీ
పార్వతీపురం: పార్వతీపురంలో శుక్రవారం రాత్రి భారీ చోరీ జరిగింది, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ సమీప బంధువు, స్థానిక కెఎంహెచ్ రోడ్డులో నివాసముంటున్న కాపారపు జనార్దననాయుడు ఇంట్లో భారీ చోరీకి పాల్పడ్డారు. దీనికి సంబంధించి బాధితుడు అందించిన వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం రాత్రి సుమారు 3 గంటల ప్రాం తంలో మెట్ల వద్ద గల కిటికీ ఇనుప చట్రా న్ని తొలగించి రెండో బెడ్ రూమ్‌లోకి దొంగలు ప్రవేశించారు. బీరువాలతో పాటు అల్మారాలను తీసి అందులో ఉన్న సుమారు 10 కిలోల వెండి వస్తువులు, 30 తులాల బంగారు ఆభరణాలు, సుమారు రూ.50వేలు నగదు అపహరించారని జనార్దననాయుడు తెలిపారు. ఆ సమయంలో శబ్దాలు వస్తున్నట్లు అనిపించినా మేడపై నుంచి వస్తున్నాయనుకున్నామన్నారు. ఎవరైనా మేల్కొం టే దాడిచేయడానికి వీలుగా కిటికీ పక్కనే రోకలి బండ, మెట్ల వద్ద రాయిని దొంగలు ఉంచారు. అలాగే ఇంటిమెట్ల పక్కనే ఉన్న పెరటి తోటలో తొలగించిన కిటికీ ఐరన్ గ్రిల్‌ను ఉంచారు. బైక్ ప్లగ్‌ను కూడా కట్ చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పట్టణ సీఐ వి.చంద్రశేఖర్, ఎస్సైలు వి.అశోక్ కుమార్, బి.సురేంద్రనాయుడు తదితరులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, విజయనగరం నుంచి క్లూస్ టీమ్‌ను రప్పించి తనిఖీలు చేపట్టారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఏఎస్పీ సిద్దార్థ్ కౌశల్... దొంగతనం విషయాన్ని తెలుసుకున్న పార్వతీపురం ఏఎస్పీ సిద్దార్థ్ కౌశల్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. సీఐ చంద్రశేఖర్‌తోపాటు క్లూస్ టీమ్‌తో చర్చించారు. బాధితుడు జనార్దననాయుడుని అడిగి దొంగతనం వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెండు రోజులుగా హల్చల్... రెండు రోజులుగా పట్టణంలో దొంగలు హల్చల్ చేస్తున్నట్లు సమాచారం. స్థానిక సౌందర్య సినిమాహాలు పక్కనే ఉన్న శత్రుచర్ల రియల్ ఎస్టేట్‌లోని ఓ వీధిలోని ఓఇంట్లో గురువారం రాత్రి సుమారు రూ.50వేలు చోరీ చేసినట్టు తెలిసింది. అలాగే శుక్రవారం రాత్రి అదే వీధిలోని చిన్నారి శ్రీరామమూర్తి అనే టీచర్ ఇంట్లో కొళాయి ట్యాప్‌లు, షవర్ ట్యాప్‌లు, సింక్లు విప్పికెళ్లినట్లు సమాచారం. బీహార్‌తో పాటు ఒడిశా తదితర ప్రాంతాలకు చెందిన దొంగలు పట్టణంలో హల్చల్ చేస్తున్నట్లు తెలుస్తున్నా...పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకోలేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఫిర్యాదు అందింది.... పట్టణ ఎస్ఐ వి. అశోక్‌కుమార్ స్థానిక కేఎంహెచ్ రోడ్డులో జరిగిన దొంగతనంనకు సంబంధించి బాధితులు కాపారపు జనార్దననాయుడు నుంచి ఫిర్యాదు అందింది. మూడు కిలోల వెండి, 20 తులాల బంగారం పోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. -
రాత్రంతా సాగిన ఐటీ దాడులు
పార్వతీపురం: పార్వతీపురం పట్టణంలో గురువారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ విశాఖపట్నంకు చెందిన ఇన్‌కం ట్యాక్స్ కమిషనర్, అడిషనల్ కమిషనర్లు ఆర్.కె.సింగ్, నవీన్‌కుమార్‌ల ఆధ్వర్యంలో జరిగిన దాడులు వేకువజాము మూడున్నర గంటలవరకు కొనసాగాయి. పట్టణంలోని డా.యాళ్ల వివేక్, డా.యాళ్ల పద్మజలకు చెందిన జయశ్రీ ఆస్పత్రితోపాటు, యిండుపూరు బ్రదర్స్ గుంపస్వామి, గున్నేష్, ప్రభాకర్, శ్రీనివాసరావు, గోపాలరావులకు చెందిన విజయలక్ష్మీ జ్యూయలరీ మార్ట్, యిండుపూరు జ్యూయలర్స్, శ్రీ మహాలక్ష్మీ జ్యూయల్ ప్యాలెస్, మహాలక్ష్మీ జ్యూయలరీ మార్ట్, శ్రీ వెంకటేశ్వర జ్యూయలర్స్ తదితర బంగారం షాపుల్లో ఆరు బృందాలుగా ఏర్పడిన ఐటీ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. కనీసం ఎవర్నీ కదలనీయకుండా చేపట్టిన ఈ దాడుల్లో భారీ మొత్తంలో నగదు, బంగారం, ఆస్తులు గుర్తించినట్లు సమాచారం. ఈ దాడులతో పట్టణంలోని పన్ను ఎగవేతదారుల గుండెల్లో రైళ్లు పరుగులెడుతున్నాయి. అంతే కాకుండా శుక్రవారం కూడా మళ్లీ ఐటీ దాడులున్నాయన్న ప్రచారంతో పట్టణంలో దాదాపు పెద్ద పెద్ద వ్యాపార దుకాణాలు తెరచుకోలేదు. ఇదిలా ఉండగా శుక్రవారం ఉదయం ఇన్‌కం ట్యాక్స్ రేంజ్-1 అధికారి రామునాయుడు జయశ్రీ ఆస్పత్రికొచ్చి డాక్టర్ యాళ్ల వివేక్‌తో గంటల కొలది చర్చలు జరిపారు. ఈ చర్చల్లో భాగంగా శుక్రవారం కూడా జయశ్రీ ఆస్పత్రిలో దాడులు కొనసాగాయనే ప్రచారం జోరందుకుంది. అంతే కాకుండా వేరే బంగారం షాపు దాడిలో పాల్గొన్న ఆ అధికారి వచ్చి నేరుగా డాక్టర్‌తో గంటలు తరబడి చర్చలు జరపడం రెండోరోజు కూడా తనిఖీలు జరుగినట్టు చర్చించుకున్నారు. ఈ విషయమై ఆ అధికారి వద్ద విలేకరులు ప్రస్తావించగా.. తమ ఉన్నతాధికారులు మాట్లాడతారన్నారు. ఈ విషయమై డాక్టర్ వివేక్ వద్ద ప్రస్తావించగా.. సాధారణ తనిఖీలే అని చెప్పారు. ఐటీ అధికారి రామునాయుడు పార్వతీపురం ప్రాంతం అల్లుడు కావడంతో.. వైద్యం కోసం వచ్చారని, కావాలంటే ఆతని చేతిలో కళ్ల మందు చూడాలని చెప్పారు. -
‘జన్మభూమి-మాఊరు’లో రసాభాస
పార్వతీపురం రూరల్: ప్రభుత్వ స్థలంలో కాకుండా గ్రామ టీడీపీ నేతలు సూచించిన ప్రదేశంలో ‘జన్మభూమి-మాఊరు’ కార్యక్రమం నిర్వహించడం వివాదాస్పదమైంది. ఎమ్మార్ నగరంలో పంచాయతీ కార్యాలయం, పాఠశాల భవనాలు, ఎన్నో ఖాళీ ప్రభుత్వ స్థలాలున్నాయి. కానీ టీడీపీ నేతలు సూచించిన సత్యనారాయణస్వామి ఆలయం వద్ద గురువారం ‘జన్మభూమి-మాఊరు’ ఏర్పాటు చేశారు. వేదిక నిండా టీడీపీ నేతలే కూర్చోవడంతో అది పార్టీ కార్యక్రమాన్ని తలపించింది. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా జరుగుతున్న సభకు సర్పంచ్ రొంపిల్లి తిరుపతిరావు, ఎంపీటీసీ బడే రామారావు, వార్డు సభ్యులు, పలువురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున వెళ్లి అధికారులను నిలదీశారు. ఇకపై ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే చూస్తూ ఊరుకోబోమని, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడమే కాకుండా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ప్రత్యేకాధికారి రాబర్ట్స్ జోక్యం చేసుకొని ఇకపై గ్రామంలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమాలను ప్రభుత్వ స్థలాల్లోనే నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. అయిన్పటికీ గ్రామస్తులు శాంతించకపోవడంతో అర్ధాంతరంగా సమావేశాన్ని ముగించారు. వెంక ంపేట, ఎమ్మార్‌నగరం, సంగంవలస, బాలగుడబ, వీఆర్ పేట, నర్సిపురం గ్రామాల్లో జన్మభూమి-మా ఊరు కార్యక్రమాలను నిర్వహించారు. -
విదేశాల్లో గిరిజన విద్యార్థుల చదువుకు అవకాశం
పార్వతీపురం : అంబేద్కర్ ఓవ ర్సీస్ విద్యానిధి పథకం ద్వారా గిరిజన విద్యార్థులు ఇతర దేశాలలో ఉన్నత విద్యను అభ్యసించుటకు అవకాశం కల్పిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ శ్రీకేశ్ బి లఠ్కర్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం 2013-14 విద్యా సంవత్సరం నుంచి గిరిజన విద్యార్థినీ విద్యార్థులకు విదేశాలలో ఉన్నత చదువులు చదవడానికి అవకాశం కల్పిస్తుందన్నారు. ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం రాష్ట్రం మొత్తం మీద 100 మంది అర్హత గల గిరిజన విద్యార్థులకు జనాభా ప్రాతిపదిక ఆధారంగా పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు చదువడానికి అవకాశం కల్పించిందన్నా. ఆసక్తి గల గిరిజన విద్యార్థులు ఈపాస్ ఆన్లైన్ ద్వారా వారి వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. దీనికి గాను(హెచ్‌టీటీపీ// డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ . ఏపీ సోషల్వెల్ఫేర్ .సీజీజీ.జీఓవీ.ఇన్)లో ఆన్లైన్ ద్వారా సంబంధిత అధికారులు జారీచేసిన కుల ధ్రువీకరణ పత్రం, సంబంధిత అధికారులు జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం, జనన ధ్రువీకరణ పత్రం (వయస్సు 1 జూలై 2013 నాటికి 35 సంవత్సరాలు లోపు ఉండాలి). ఆధార్ కార్డు, ఈపాస్ ఐడి నెంబర్, నివాస ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్టు కాపీ, పదవ తరగతి/ ఇంటర్/ డిగ్రీ/ పీజీ లెవల్‌మార్కుల జాబితా, జీఆర్ఇ/జిమేట్ తత్సమాన పరీక్ష పాసైన ధ్రువీకరణ పత్రం, మార్కుల జాబితాకార్డు, టోఫెల్/ ఐ.ఇ.ఎల్.టి.ఎస్ స్కోర్‌కార్డు, ఫారెన్‌యూనివర్సిటీల నుంచి వచ్చిన అడ్మిషన్ ఆఫర్ లెటర్ (తత్సమానమైన), ఇటీవల కట్టిన టేక్స్ అసెస్మెంట్ కాపీ, జాతీయ బ్యాంకులో ఖాతా పుస్తక వివరాలు, ఫోటోస్కాన్‌చేసి అప్లోడ్ చేయాలి. విద్యార్హతలు: (పోస్టుగ్రాడ్యుట్ కోర్సులు 60శాతం మార్కులు ఉండవలెను, పీహెచ్డీ కోర్సులు 60శాతంమార్కులు ఉండవలెను), ఒక కుటుంబానికి ఒక విద్యార్థికి మాత్రమే ఈ పథకం వర్తించును.. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 2,50,000 మించి యుండరాదు. అమెరికా, ఇంగ్లాండ్, అస్ట్రేలియా, కెనడా, సింగపూర్ దేశాలలో మాత్రమే చదువుటకు అవకాశం కలదు. స్కాలర్షిప్ మంజూరు చేయు మొత్తము రూ. 10 లక్షలు రెండు వాయిదాలలో చెల్లింపు జరుగుతుందన్నారు. -
టీవీ నటి దీప్తి కుమార్తె అదృశ్యం
పార్వతీపురం: గతంలో హైదరాబాద్‌లో మరణించిన టీవీ నటి దీప్తి కుమార్తె జ్యోతి అదృశ్యమైనట్టు ఫిర్యాదు అందిందని పట్టణ ఎస్సై వి.అశోక్ కుమార్ ఆదివారం రాత్రి తెలిపారు. పట్టణంలోని కొత్తవలస నందమూరి కాలనీకి చెందిన పెయింటర్, జ్యోతి తండ్రి జొన్నాడ ఈశ్వరరావు(శంకర్) చేసిన ఫిర్యాదుకు సంబంధించి ఎస్సై అందించిన వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 8న మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో కిరాణా దుకాణానికి వెళ్లివస్తానని జ్యోతి తన నానమ్మకు చెప్పి వెళ్లింది. కానీ తిరిగి ఇంటికి రాలేదు. ఈశ్వరరావు రాత్రి పెయింటింగ్ పని నుంచి వచ్చి కుమార్తె గూర్చి ఆరా తీయగా ఈ విషయం తెలిసింది. బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెదికినా ఫలితం లేకపోవడంతో ఆదివారం పోలీసులను ఆశ్రయించారు. జ్యోతి స్థానిక ఆర్సీఎం పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. -
చంద్రబాబు సభలో కలకలం
విజయనగరం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్న బహిరంగం సభలో కలకలం చెలరేగింది. బుధవారం విజయనగరం జిల్లా పార్వతీపురంలో జరిగిన సభకు చంద్రబాబు హాజరయ్యారు. వేలాది మంది పాల్గొన్న సభలో ఓ రైతు విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు ఆయన్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి అగ్రిగోల్డ్ బాధితుడని సమాచారం. -
ఏనుగుల సంచారంతో హడల్
పార్వతీపురం(విజయనగరం) : నీటి కోసం అడవి జంతువులు జనావాస ప్రాంతాల్లోకి వస్తుండడంతో ప్రజలు ప్రాణభయంతో భీతిల్లుతున్నారు. వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం జిల్లేడు వలస గ్రామం సమీపంలో సోమవారం రెండు ఏనుగులు కనిపించడంతో స్థానికులు వాటిని చూసి బెంబేలెత్తిపోయారు. అవి ఎప్పుడు ఏ రూపంలో దాడి చేస్తాయోననే భయంతో వారు అటువైపు వెళ్లకుండా పోలీసులకు సమాచారం అందించారు. కాగా ఈ ప్రాంతంలోకి ఏనుగులు ప్రవేశించడంతో ఇటీవలి కాలంలో ఇదే ప్రథమం. -
...పార్వతి చనిపోయింది
పార్వతీపురం: భర్త నిప్పంటించడంతో పూర్తిగా కాలిపోయి విజయనగరం జిల్లా పార్వతీపురం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాలీల పార్వతి(25) ఆదివారం రాత్రి మృతి చెందింది. భర్తవేధింపులు తట్టుకోలేక, పడుపువృత్తి చేసి డబ్బులు సంపాదించమనడాన్ని సహించలేక అతన్ని బెదిరించేందుకు ఆదివారం ఒంటిపై కిరోసిన్ పోసుకున్న పార్వతికి భర్త శివ నిప్పంటించిన విషయం తెలిసిందే. పట్టణ ఎస్ఐ వి.అశోక్ కుమార్ కథనం ప్రకారం... నాలుగేళ్లుగా సాలీల శివ తన భార్య పార్వతిని అనుమానంతో వేధిస్తున్నాడు. నిత్యం ఆమెను కొడుతుండడంతో బాధలు భరించలేక తన పుట్టింటివారు ఉన్న జియ్యమ్మవలస మండలం గెడ్డతిరువాడకు గతంలో వెళ్లిపోయింది. తరువాత పెద్దలు సయోధ్య కుదిర్చి ఒక్కటి చేశారు. కొన్ని రోజులు బాగానే ఉన్నా తరువాత మళ్లీ వేధించడం ప్రారంభించాడు. ఆదివారం ప్లాన్ ప్రకారం పిల్లలను బయటకు పంపించి భార్యను వేధించడం ఆరంభించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. భర్తను బెదిరించేందుకు పార్వతి ఒంటిపై కిరోసిన్ పోసుకోగా, శివ నిప్పంటించాడు. ఆ వెంటనే పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. అయితే పార్వతి గట్టిగా అరవకుండా ఆమె ఆడపడుచు వికలాంగురాలైన సోమేశ్వరి ఆమె నోటిలో గుడ్డలు కుక్కి ఆమె చావుకు కారణమైందని ఎస్ఐ చెప్పారు. వారిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. తల్లి మృతి చెందడం, తండ్రి జైలు పాలు కానుండడంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. వారి పరిస్థితిని చూసిన స్థానికులు కంటతడిపెట్టారు. -
డీసీసీబీ కేసు సీఐడీకి
పార్వతీపురం : డీసీసీ బ్యాంక్‌లో జరిగిన అవకతవకలకు సంబంధించిన కేసులో పురోగతి కనిపిస్తోంది. తాజాగా సోమవారం ఈ కేసును దర్యాప్తు చేయడానికి సీఐడీ అధికారులు రంగంలోకి దిగారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలోని డీసీసీబీ, పీఏసీఎస్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. గతంలో డీసీసీ బ్యాంక్ కు సంబంధించి రూ. 9 కోట్ల కుంభకోణం జరిగినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. -
ఉపాధి ఔట్?
75శాతం పనులు సాకుగా చూపిస్తూ.. 500 మంది సిబ్బంది తొలగింపునకు సన్నాహాలు? కొత్త ఫీల్డు అసిస్టెంట్ల ఎంపిక గ్రామ కమిటీలకే ఆందోళనలో ఔట్సోర్సింగ్ సిబ్బంది పార్వతీపురం: ఉపాధి హామీ పథకంలో ఔట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న ఫీల్డు అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఈసీలను భారీ సంఖ్యలో తొలగించేందుకు సంబంధిత ఉన్నతాధికారులు చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఈ మేరకు జనవరిలోనే ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో ఉన్న ఖాళీలను, ఇప్పుడు తాజాగా లేనిపోని నిబంధనలతో చేస్తున్న ఖాళీలను భర్తీ చేసే అధికారాన్ని, దాదాపు టీడీపీ కార్యకర్తలు, నాయకులతో ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీలకు అప్పగించి, ఆయా ఖాళీలలో పార్టీ కార్యకర్తలకే స్థానం కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు భోగట్టా. జిల్లాలోని 925 పంచాయతీలలో సుమారు 200 మంది ఫీల్డు అసిస్టెంట్ల పోస్టులు ఇప్పటికే ఖాళీగా ఉన్నాయి. మిగిలిన 725 మందికి గత ఏడాది పనులపై ఈ ఏడాది 75శాతం పనులు చేయాలంటూ నిబంధనలు విధించారు. అయితే పనులు కల్పిస్తున్న వేతనదారులకు జనవరి నుంచి బిల్లులివ్వకపోవడం, ఇటీవల బడ్జెట్ విడుదలయ్యాక పోస్టల్ సిబ్బంది సమ్మెలోకి దిగడం తదితర కారణాల వల్ల, వేతనదారులు పనులపై ఇష్టం చూపకపోవడ ంతో తాము లక్ష్యాలను చేరుకోలేకపోతున్నామని ఉపాధి సిబ్బంది వాపోతున్నారు. అయితే ఇందులో ఎంపీడీఓలది పూర్తి బాధ్యత అయినప్పటికీ 75శాతం పనులను సాకుగా చెప్పి ఔట్‌సోర్సింగ్‌లో ఉన్న ఫీల్డు అసిస్టెంట్లు, టీఏలు, ఈసీలు, ఏపీఓలను తప్పించి తమ ఉపాధిని పోగొట్టడం తగదంటూ ఉద్యోగులు వాపోతున్నారు. గ్రామ స్థాయిలో ఫీల్డు అసిస్టెంట్లు, క్లస్టర్ స్థాయిలో టీఏలు, సాంకేతిక సహాయకులను, మండల స్థాయిలో ఏపీఓలను తొలగించేందుకు సన్నాహాలు చేస్తున్న తరుణంలో వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తమ పరిస్థితి ఏమిటంటూ తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మార్చి పూర్తయితే గానీ చెప్పలేం ఏపీడీ అప్పలనాయుడు అదనపు పథక సంచాలకులు, డ్వామా ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయితే గానీ 75శాతం లేబర్ బడ్జెట్ మీట్ అయ్యారా ? లేదా? అనేది చెప్పలేం. ఏప్రిల్ వస్తేగాని అటువంటి ఎనాలిసిస్కు వెళ్లలేం. అటువంటి ఆదేశాలు ఏవీ రాలేదు. ఒకవేళ వచ్చినా జిల్లాకు అంత ప్రమాదం ఉండదు. రాష్ట్రస్థాయిలో రూ. 2.04కోట్లు లేబర్ బడ్జెట్‌ను చేరుకుని జిల్లా ముందంజలో ఉంది. రూ.1.83కోట్లతో విశాఖ జిల్లా, రూ. 1.78 కోట్లతో శ్రీకాకుళం జిల్లాలున్నాయి. ఇప్పటికే జిల్లాలో ఉపాధి హామీ పథకంలో దాదాపు 200 మంది ఫీల్డు అసిస్టెంట్లు లేక ఆయా ప్రాంతాలు అవస్థలు పడుతున్నాయి. -
అరకొర వైద్యసేవలే గతి..
పార్వతీపురం :పార్వతీపురం సబ్-ప్లాన్ మండలాల్లో వైద్య సిబ్బంది సరిపడా లేకపోవడంతో గిరిజనులకు అరకొర వైద్యసేవలే అందుతున్నాయి. ప్రస్తుతం వేసవిలో రోగాలు విజృంభిస్తున్నా అధికారుల్లో చలనం రావడం లేదు. పీహెచ్‌సీల్లో పూర్తి స్థాయిలో వైద్య సిబ్బంది లేరని, ఈ విషయాన్ని పలుమార్లు జిల్లా అధికారులు, పాలకులకు తెలియజేసినా ఫలితం లేకపోయిందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న కొద్దిపాటి సిబ్బందికి కూడా వాహనాలు, క్వార్టర్స లేవు. దీంతో వారు కూడా మైదాన ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రోగులు సంచి వైద్యులను ఆశ్రయించాల్సి వస్తోంది. పార్వతీపురం సబ్-ప్లాన్‌లోని కొమరాడ, కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, మక్కువ, పాచిపెంట, సాలూరు, తదితర మండలాల్లో 20 పీహెచ్‌సీలు, 4 సీహెచ్‌సీలు, ఎనిమిది 24 గంటల ప్రసూతి కేంద్రాలు, 119 సబ్-సెంటర్లున్నాయి. వీటిలో దాదాపు 616 మంది వైద్యాధికారులు, వివిధ రకాల సిబ్బంది ఉండాల్సి ఉంది. అయితే ఇందులో రెగ్యులర్ ఉద్యోగులు, సిబ్బంది 275 మంది ఉండగా, 205 మంది వైద్యాధికారులు, సిబ్బంది కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. ఇంకా 136 పోస్టులు ఖాళీలున్నాయి. ఇందులో ప్రధానంగా చినమేరంగి సబ్ సెంటర్‌కు ఒక సివిల్ సర్జన్ స్పెషలి్స్ట్ పోస్టు మంజూరు కాగా అవి ఖాళీగానే ఉన్నాయి. భద్రగిరిలో రెండు డిప్యూటీ సివిల్సర్జన్లు, తాడికొండ, భద్రగిరిలో చెరో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు భర్తీ కాలేదు. కురుపాం, చినమేరంగిలలో చెరో డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక ఐటీడీఏ పరిధిలో 24 సూపర్వైజర్ పోస్టులు, కురుపాం, సాలూరులో మూడు రేడియోగ్రాఫర్ ఉద్యోగాలు, చినమేరంగిలో ఒక హెడ్ నర్సు, స్టాఫ్ నర్సు పోస్టులు భర్తీ కాలేదు. భద్రగిరిలో ఒక డీపీఎంఓ పోస్టు ఉండాల్సి ఉండగా అది నేటికీ భర్తీ కాలేదు. 8 హెచ్‌వీలు 37 మంది ఏఎన్ఎమ్లు, ఐదుగురు సెకెండ్ ఏఎన్ఎమ్లు, 21మంది ఎంపీహెచ్ఏ (మేల్)లు, 11ఏపీఎంఓలు ఖాళీలున్నాయి. డోకిశీల, మొండెంఖల్, కురుపాంలలో నాలుగు ఫార్మాసిస్ట్లు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే ల్యాబ్ టెక్నీషియన్లు-3, డార్క్‌రూమ్ అసిస్టెంట్లు-3 పోస్టులు భర్తీకి నోచుకోలేదు. ఇటీవల డీఎంహెచ్ఓ కొంతమంది మైదాన ప్రాంతానికి చెందిన వైద్యాధికారులు, సిబ్బందిని గిరిజన ప్రాంతాలకు డిప్యుటేషన్‌పై వేశామని ప్రకటించారు. అయితే వారు కూడా సక్రమంగా రావడం లేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆయా పీహెచ్‌సీలకు అంబులెన్స్‌లు, ఆస్పత్రులకు ప్రహరీలు, వైద్యాధికారులకు, సిబ్బందికి క్వార్టర్లు లేక నానాయాతన పడుతున్నారు. వీటితో పాటు ఇన్వెర్టర్లు, ఫ్రిజ్‌ల సదుపాయం లేక మందులు నిల్వ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి గిరిజన ప్రాంతాల్లో పూర్తి స్థాయి వైద్యసిబ్బందిని నియమించాలని గిరిజనులు కోరుతున్నారు. -
ఆశచూపి... అప్పుల్లో ముంచాడు !
పార్వతీపురం:బయోడీజిల్ మొక్కలు పెంచితే వాటి ద్వారా అధికాదాయం పొం దొచ్చని గిరిజనులకు మాయమాటలు చెప్పిన ఓ ప్రబుద్ధుడు, వారిని నిండా ముంచాడు. మెట్ట, పోడు భూముల్లో బయో డీజిల్ మొక్కలు వేస్తే మొక్కలతోపాటు వాటిని కాపాడేందుకు కూలి డబ్బులు కూడా ఇస్తానని చెప్పి నమ్మబలికిన ఆ ఘనుడు పార్వతీపురం యూనియన్ బ్యాంకు నుంచి ఒక్కొక్కరికీ రూ.2 వేల నుంచి 4వేల వరకూ ఇప్పించా డు. అయితే పంట చేతికొచ్చే సమయానికి కంపెనీ ఎత్తేశారని, పంట కొనలేమని చెప్పి తప్పుకున్నాడు. దీంతో చేసేది లేక బయో డీజిల్ పంట ను ఏమి చేసుకోవాలో తెలియక ఆయా గిరిజనులు ఆ మొక్కలను తీసిపారేశారు. అక్కడవరకు బాగానే ఉంది. అయితే ఇటీవల సంబంధిత బ్యాంకు నుంచి రూ.50 వేల బకాయి చెల్లించాలంటూ నోటీసులొచ్చాయి. దీంతో తమకు తెలియకుండానే బ్యాంకులో అప్పులెలా ఉన్నాయంటూ పార్వతీపురం మండలంలోని గంజిగెడ్డ, కొయిమెట్టవలస, డెప్పివలస, మునక్కాయ వలస తదితర గ్రామాలకు చెందిన పలువురు గిరిజనులు లబోదిబోమంటున్నారు. దీనికి సంబంధించి ఆయా గ్రామాలకు చెందిన గిరిజనులు అందించిన వివరాలిలా ఉన్నాయి...2008లో ఒడిశాకు చెందిన చందు అనే ఒక వ్యక్తి గంజిగెడ్డ, కొయిమెట్టవలస, డెప్పివలస, మునక్కాయవలస తదితర గ్రామాలకు వెళ్లి బయోడీజిల్ మొక్కలు పెంచమని కోరాడు. ఆయా గ్రామాలవారు మొదట అంగీకరించలేదు. అయితే ఈ మొక్కలు పెంచడంవల్ల అధిక లాభాలు వస్తాయని, కాసిన పిక్కలను తామే అధికరేటుకు కొం టామని, మొక్కలతో పాటు పెంపకానికి తామే డబ్బులిస్తామని చెప్పి అప్పట్లో ఒక్కొక్కరికీ రూ. 2 నుంచి రూ. 4వేలు వరకు ఇచ్చాడు. అయితే 2012లో కాపుకొచ్చాక వాటికొనుగోలుకు మధు ముందుకు రాలేదని గిరిజనులు తెలిపారు. ఈ విషయమై నిలదీస్తే కంపె నీ ఎత్తేశారని, తాము కొనలేమని తప్పించుకున్నాడన్నారు. చేసేదిలేక తాము ఆ పంటను తొలగించామన్నారు. అయితే ఒక్కొక్కరూ రూ. 50 వేల చొప్పున బకాయి ఉన్నారని, ఆ సొమ్మును వెంటనే చెల్లించాలని పార్వతీపురం యూనియన్ బాం్యక్ నుంచి ఇటీవల నోటీసులు వచ్చాయని వారు వాపోయారు. కూలి ప నులు చేసుకుంటూ బతుకుతున్న తాము వేల కొలది అప్పులెలా తీరుస్తామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల హుద్‌హుద్ తుపానుకు నష్టపోయిన పంటకు వచ్చిన పరిహారాన్ని కూడా యూనియన్ బ్యాంకు అప్పుందంటూ జమచేసుకుందని గిరిజనులు తెలిపా రు. క్రిమినల్ కేసులు పెట్టండి... ఐటీడీఏ పీఓ ఈ విషయమై సోమవారం ఐటీడీఏ పీఓ శ్రీకేశ్ బి. ల ఠ్కర్వద్ద ఆయా గ్రామాలకు చెందిన గిరిజనులు మొ రపెట్టుకున్నారు. దీనికి స్పందించి పీఓ శ్రీకేశ్ దీనిపై విచారణ చేయాలని ఐకేపీ ఏపీడీ మురళీధర్‌ను విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కేసులు పెట్టాలని సూచించారు. రూ. 4వేలు ఇచ్చారు.. మొక్కల పెంపకానికి అంటూ అప్పట్లో యూనియన్ బ్యాంకు వద్ద ఏవేవో సంతకాలు తీసుకొని రూ. 4వేలు ఇచ్చారు. ఇప్పుడు అదే బ్యాంకునుంచి రూ. 50వేలు అప్పు తీర్చాలంటూ నోటీసులు వచ్చాయి. -మండంగి కుమార్, కొయ్యిమెట్టవలస రూ. 50వేలు ఎలా తీర్చాలి.. రోజూ కూలి చేసుకొనే మేము రూ. 50వేల అప్పు ఎ లా తీర్చాలి. ఇటు బయోడీజిల్ పంటవేసి నష్టపోగా, ఇప్పుడు అప్పుల పాలయ్యాము. బ్యాంకు నుంచి నోటీసులు వచ్చేసరికి అంతా భయపడిపోయాము. - మండంగి మాకిరి, కొయ్యిమెట్టవలస హుద్‌హుద్ నష్టపరిహారాన్ని జమచేసుకున్నారు. హుద్‌హుద్ తుపానుకు జొన్నపంట నష్టపోగా రూ. 4,900లు పరిహారం వచ్చింది. నేను బ్యాంకుకు బాకీ ఉన్నానని ఆ మొత్తాన్ని బ్యాంకు సిబ్బంది జమచేసుకున్నారు. నా గతమేంకాను - మెల్లిక సరుగు, కొయ్యిమెట్టవలస -
అమ్మో బొమ్మ..!
పార్వతీపురం:ఐటీడీఏ పరిధిలో గల ఐకేపీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆరోగ్య పౌష్టికాహార కేంద్రాల కోసం కొనుగోలు చేసిన బొమ్మలకు సంబంధించిన ఫైల్స్ వెదుకు లాటలో అధికారులకు చెమటలు పడుతున్నట్లు సమాచారం. మంగళవారం ‘సాక్షి’ దినపత్రికలో ‘వినండి బొమ్మల గోల...కనండి ఐకేపీ లీల’ అంటూ ప్రచురితమైన కథనం పట్ల స్థానిక ఐకేపీ అధికారులు ఉరుకులు పరుగులు పెడుతూ బొమ్మల కొనుగోలు ఫైల్ కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు తెలిసింది. రూ.36లక్షలకు సంబంధించి బొమ్మల కొనుగోలులో ఆయా శాఖల అధికారులు, సిబ్బంది మధ్య పంపకాల ఒప్పందాలు కుదరక పోవడంతో, అందులో ఓ అధికారి బొమ్మల కొనుగోలులో ఆరోపణలను జత చేస్తూ...గత పీఓ ద్వారా సెర్ఫ్‌కు లెటర్ రాయించినట్లు సమాచారం. ఆ లెటర్‌కు స్పందించిన సెర్ఫ్ నుంచి పూర్తి డాక్యుమెంట్లు సమర్పించాలని గత ఏడాది జనవరి 27వ తేదీన ఆదేశాలు వచ్చాయి. అయితే పంపకాల ఒప్పందం కుదుర్చుకున్న అధికారులు, సెర్ఫ్ నుంచి వచ్చిన లెటర్‌ను ఐటీడీఏ పీఓ దృష్టికి తీసుకెళ్లలేదని సమాచారం. జనవరి నుంచి ఇప్పటి వరకు కనీసం సెర్ఫ్ ఆదేశాల పట్ల స్పందించకపోగా, అప్పటి పీఓ రజత్ కుమార్ సైనీ, ప్రస్తుత శ్రీకేశ్ బి లఠ్కర్ల దృష్టికి తీసుకెళ్లకపోవడమే అధికారుల అవినీతి ఆరోపణలకు ఊతమిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్తగా వచ్చిన పీఓ శ్రీకేశ్ బి లఠ్కర్‌ను ఈ బొమ్మల కొనుగోలు విషయమై ఒప్పించేందుకు అధికారులు నానా తంటా లు పడుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఐకేపీలో జరుగుతున్న పలు రకాల అవినీతికి గత కొన్ని సంవత్సరాలుగా ఆ శాఖలో ఫైనాన్స్‌లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి కేంద్ర బిందువనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా పీఓ శ్రీకేశ్ బి లఠ్కర్ దీనిపై దృష్టి సారిస్తారని గిరిజనులు, గిరిజన సంఘ నాయకులు ఆశిస్తున్నారు. ‘విదుర నీతులు’ పుస్తకావిష్కరణ విజయనగరం మున్సిపాలిటీ : రామాయణ, మహాభారతాలు దేశ ఔన్నత్యానికి ప్రతీకలు అని ప్రముఖ అధ్యాత్మిక వేత్త, విశాఖ జిల్లా నర్సీపట్నానికి చెందిన శివబాబా అన్నారు. తెలుగు భాషా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం ఆఫీసర్స్ క్లబ్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు అయిన భారతదేశంలో జన్మించడమే పూర్వజన్మ సుకృత మన్నారు. విద్యార్థుల్లో దేశభక్తిని, పెద్దల్లో ఆధ్యాత్మిక చింతనను పెంపొందించేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు సాగి సీతారామరాజు స్మారక కళాపీఠం ప్రచురిం చిన విదుర నీతులు పుస్తకాన్ని ఆవిష్కరించా రు. కళాపీఠం అధ్యక్షుడు రాజు, తెలుగు భాషా పరిరక్షణ సమితి అధ్యక్షుడు గురుప్రసాద్, శ్రీరామ్మూర్తి పాల్గొన్నారు.