సమస్యలు చెప్పినందుకు గెంటేశారు.. | TDP Followers rudely behaved with people at Janmabhoomi programme | Sakshi

సమస్యలు చెప్పినందుకు గెంటేశారు..

Published Mon, Jan 11 2016 4:16 PM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM

TDP Followers rudely behaved with people at Janmabhoomi programme

పార్వతీపురం (విజయనగరం) : తమ సమస్యలు పరిష్కరించి ఇబ్బందులు తీర్చాలని అడిగిన ప్రజలను, వారికి మద్దతుగా నిలిచిన వైఎస్సార్ కాంగ్రెస్ నేతలను పచ్చ తమ్ముళ్లు సహించలేకపోయారు. విజయనగరం జిల్లా పార్వతీపురం 30వ వార్డులో సోమవారం జన్మభూమి ముగింపు కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. వారికి వైఎస్సార్‌సీపీ యువజన విభాగం నేత జగదీశ్ నేతృత్వంలో నాయకులు మద్దతుగా నిలిచారు. ఇది జీర్ణించుకోలేని టీడీపీ నేతలు వారందరినీ బయటకు బలవంతంగా పంపించేశారు. మొత్తం 45 నిముషాల్లోనే సభ ముగిసిందని ప్రకటించారు. అధికార పార్టీ నేతల తీరుపై ప్రజలు తీవ్రంగా నిరసించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement