janmabhoomi
-
జనవరి నుంచి జన్మభూమి 2.0
సాక్షి, అమరావతి: జన్మభూమి 2.0 కార్యక్రమాన్ని వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభించనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో మంగళవారం ఆయన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ శాఖలపై సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖలో తీసుకున్న పలు నిర్ణయాలను సంబంధిత శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ వివరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘జన్మభూమి 2.0 కార్యక్రమంలో భాగంగా గ్రామాల అభివృద్ధికి ముందుకు వచ్చే వారితో కలిసి పల్లెల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతాం. గ్రామాల్లో వచ్చే ఐదేళ్లలో 17,500 కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్లు, 10 వేల కిలోమీటర్ల మేర డ్రైనేజీ కాల్వలు నిర్మిస్తాం. ఇందులో ఏడాదికి ఎంత చొప్పున పనులు చేయగలరో అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకోవాలి. పంచాయతీరాజ్ శాఖకు ఇవ్వాల్సిన రూ.990 కోట్లను వెంటనే ఆర్థిక శాఖ నుంచి విడుదల చేస్తాం. జల్‌జీవన్ మిషన్ పథకం అమలు కోసం రాష్ట్ర వాటా కింద రూ.500 కోట్లు విడుదల చేస్తాం. కేంద్రం ఇచ్చే నిధులను కూడా సద్వినియోగం చేసుకుని ఇంటింటికీ తాగునీరు అందిస్తాం’ అని చెప్పారు. ఉపాధి హామీ పథకం నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో 2,500 కిలోమీటర్ల మేర బీటీ రోడ్లు, 5 లక్షల ఫామ్‌పాండ్స్ తవ్వకాలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో అడవుల్లో టూరిజం అభివృద్ధికి చర్యలు చేపట్టాలని అటవీ, పర్యావరణ శాఖ అధికారులను చంద్రబాబు ఆదేశించారు.సాంప్రదాయేతర విద్యుత్‌కు ఏపీనే కేంద్రం సాంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తికి రాష్ట్రంలో అనేక అవకాశాలున్నాయని వాటిని సది్వనియోగం చేసుకుంటే దేశంలోనే సాంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తికి ఆంధ్రప్రదేశే అతిపెద్ద కేంద్రం అవుతుందని సీఎం అన్నారు. నూతన ఇంధన పాలసీ–ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 పై సంబంధిత శాఖాధికారులతో సీఎం సమీక్షించారు. -
‘జన్మభూమి 2’లో స్కూళ్ల అభివృద్ధి
సాక్షి, అమరావతి: త్వరలో ప్రారంభించే ‘జన్మభూమి 2’ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పాఠశాలలను అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చే వారిని ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబునాయుడు అధికారులకు చెప్పారు. విద్యా రంగ నిపుణులు, మేధావులతో చర్చించి విద్యా శాఖలో, సిలబస్‌లో మార్పులు చేయాలని ఆదేశించారు. విద్యా శాఖపై మంగళవారం సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్కూళ్లలో తెలుగుకూ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రతి విద్యార్థికీ కేంద్ర ప్రభుత్వ ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (అపార్) ఐడీ ఇవ్వాలన్నారు.పాఠశాలల్లో పేరెంట్ టీచర్ మీటింగ్‌లు నిర్వహించాలని, వీటిలో తనతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలంతా హాజరవుతారని అన్నారు. పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలని, స్పోర్ట్స్ రిపోర్ట్స్ కార్డ్స్ కూడా ఇవ్వాలని చెప్పారు. విద్యార్థుల ఆరోగ్య వివరాలను హెల్త్ ప్రోగ్రెస్ కార్డులో నమోదు చేయాలన్నారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రతిభ అవార్డులు అందజేయాలని చెప్పారు. జీవో నం.117పై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. స్కూళ్లలో ఆయాల పెండింగ్ జీతాలు చెల్లించాలని చెప్పారు. మధ్యాహ్న భోజనంపై విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్ల నుంచి ఐవీఆర్ఎస్ విధానంలో అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. డైట్ కాలేజీల్లో పోస్టులు భర్తీ చేయాలని చెప్పారు. విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ విద్యా శాఖలో నూతన విధానాలు, సంస్కరణలను వివరించారు. నైపుణ్య గణనపై అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రంలో 1.60 కోట్ల కుటుంబాల్లో 3.54 కోట్ల మంది పనిచేసే వయసున్న వారి నైపుణ్యాన్ని గణన చేయాల్సి ఉందని చెప్పారు. ఇందుకోసం 40 వేల మంది ఎన్యూమరేటర్లు అవసరమని, 8 నెలలు పడుతుందని వివరించారు. పారిశ్రామిక రంగ ప్రతినిధులతో కూడా సంప్రదించి నైపుణ్య గణన చేపట్టాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో ఆహార శుద్ధి, ఆక్వా ఇండ్రస్టియల్ పార్కులు రాష్ట్రంలో ఓడరేవులు, పారిశ్రామిక పార్కుల అభివృద్ధిపైనా సీఎం సమీక్షించారు. ఆహారశుద్ధి, ఆక్వా, ఉద్యాన రంగాలతో పాటు ఖనిజ ఆధారిత పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వెనుకబడిన ప్రాంతాల్లోనూ వీటిని ఏర్పాటు చేయాలన్నారు. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్కును వెంటనే పునరుద్ధరించాలన్నారు. పీపీపీ విధానంలో ఇంటిగ్రేటెడ్ ఓడరేవులు అభివృద్ధి చేయాలని అన్నారు. రాష్ట్ర, రా్రõÙ్టతర ప్రాంత హింటర్ ల్యాండ్ అనుసంధానంతో కూడిన ఓడరేవుల నిర్మాణం ద్వారా ఎగుమతి ఖర్చులు తగ్గి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు. కరోనాకంటే గత ప్రభుత్వమే టూరిజాన్ని దెబ్బతీసింది ఏపీలో ఎకో, టెంపుల్, బీచ్ టూరిజం అభివృద్ధికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని పర్యాటక శాఖపై జరిగిన సమీక్షలో సీఎం చంద్రబాబు చెప్పారు. టూరిజం అభివృద్ధికి నిర్దిష్టమైన ప్రణాళికతో రావాలని అధికారులకు సూచించారు. వీలైనంత త్వరగా రాష్ట్రంలో కొత్త టూరిజం పాలసీ తీసుకురావాలన్నారు. కరోనాకంటే గత పాలకుల నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో పర్యాటకం ఎక్కువగా దెబ్బతిందని అన్నారు. టీడీపీ గత ప్రభుత్వం ఐదేళ్లలో పర్యాటక రంగంపై రూ.880 కోట్లు ఖర్చు చేయగా.. గత ప్రభుత్వం రూ.213 కోట్లే ఖర్చు చేసిందన్నారు. కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 20.6 శాతం నుంచి 2019–24 మధ్య 3.3 శాతానికి పడిపోయిందన్నారు. రుషికొండపై గత ప్రభుత్వం సీఎం నివాసం కోసం రూ.500 కోట్లతో నిరి్మంచిన ప్యాలెస్‌ను ఏం చేయాలన్న విషయంపై వివిధ వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. -
షాహీ ఈద్గా కాంప్లెక్స్ సర్వేకు అలహాబాద్ హైకోర్టు ఆమోదం
లక్నో: ఉత్తరప్రదేశ్ మధురలోని షాహీ ఈద్గా కాంప్లెక్స్ ప్రాథమిక సర్వేకు అలహాబాద్ హైకోర్టు అనుమతినిచ్చింది. కోర్టు పర్యవేక్షణలో ముగ్గురు సభ్యుల అడ్వకేట్ కమిషనర్ల బృందం సర్వే నిర్వహిస్తుందని నిర్దేశించింది. ఇందుకు తగిన విధివిధానాలను డిసెంబర్ 18న నిర్ణయిస్తామని స్పష్టం చేసింది. 'షాహీ ఈద్గా మసీదును అడ్వకేట్ కమిషనర్‌తో సర్వే చేయించాలనే మా అభ్యర్థనను అలహాబాద్ హైకోర్టు ఆమోదించింది. మసీదు లోపలి భాగంలో హిందూ దేవాలయాల చిహ్నాలు ఉన్నాయి. ఈ వ్యవహారాన్ని తేల్చడానికి అడ్వకేట్ జనరల్ అవసరం. ఇది చరిత్రాత్మక తీర్పు.' అని న్యాయవాది విష్ణు శంకర్ జైన్ తెలిపారు. మధురలో దాదాపు 13.37 ఎకరాల భూమిలో ఉన్న శ్రీ కృష్ణుని ఆలయాన్ని కూల్చివేసి మొఘల్ చక్రవర్తి ఔరంగాజేబు షాహీ ఈద్గా మసీదును నిర్మించాడని హిందూ తరుపున పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ స్థలాన్ని శ్రీ కృష్ణ విరాజ్‌మాన్‌కు చెందినదిగా ప్రకటించాలని కోరుతున్నారు. మరోవైపు మసీదు ప్రాంతాన్ని కూల్చివేయవద్దని పిటీషన్లు దాఖలయ్యాయి. ఇదీ చదవండి: నిందితుల ఎంట్రీ పాస్‌లపై ఎంపీ ప్రతాప్ సింహ వివరణ -
కృష్ణజన్మభూమి కూల్చివేతలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
లక్నో: ఉత్తరప్రదేశ్ మధురలోని కృష్ణజన్మభూమి ప్రాంతంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరో పదిరోజుల పాటు ఎలాంటి కూల్చివేతలను చేపట్టవద్దని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టీ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును వెలువరించింది. మరో వారం పాటు విచారణను వాయిదా వేసింది. మధురలో రైల్వే భూభాగాల్లో అక్రమంగా నిర్మించిన ఇళ్లను కూల్చివేసే కార్యక్రమాన్ని రైల్వేశాఖ చేపట్టింది. ఆగష్టు 9న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా.. ఇప్పటికే 100కు పైగా ఇళ్లను కూల్చివేశారు. అయితే.. ఇది పూర్తిగా అన్యాయమని బాధితులు సుప్రీకోర్టును ఆశ్రయించారు. కేసు విచారించిన ధర్మాసనం ప్రస్తుతానికి కూల్చివేతలను ఆపి యధాతథ స్థితిని కొనసాగించాలని పేర్కొంటూ తీర్పును వెలువరించింది. రైల్వే ప్రాంతంలో నిర్మాణాలను అక్రమంగా కూల్చివేస్తున్నారని బాధితుల తరుపు న్యాయవాది ధర్మాసనానికి విన్నవించారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండానే ఈ కార్యక్రమాన్ని చేపట్టారని ఆరోపించారు. యూపీలో న్యాయవాదుల సమ్మె కారణంగానే కోర్టులో ఈ పిటిషన్ విచారణకు రాలేదు. దీంతో బాధితులు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గత 100 ఏళ్లుగా ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను ఉన్నపళంగా వెళ్లగొడుతున్నారని తెలిపారు. ప్రస్తుతం కేవలం 80 ఇళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయని చెప్పారు. ఇదీ చదవండి: అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్.. ఎన్నికల కమిటీ కీలక సమావేశం -
శ్రీకృష్ణ జన్మభూమి కేసు అలహాబాద్ హైకోర్టుకు బదిలీ
ఉత్తర ప్రదేశ్‌లోని మథురలో ఉన్న శ్రీ కృష్ణ జన్మభూమి వివాదానికి సంబంధించిన అన్ని కేసులు అలహాబాద్ హైకోర్టుకు బదిలీ అయ్యాయి. ప్రస్తుతం ఈ పిటిషన్లు మథుర జిల్లా కోర్టు విచారణలో ఉన్నాయి. అయితే కృష్ణ జన్మభూమి కేసు జాతీయ ప్రాధాన్యత కలిగినదని, దీనిని హైకోర్టు విచారణ చేపట్టాలని హిందూ పిటిషనర్లు కోరారు. మే 3న విచారణ చేపట్టిన హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. తాజాగా శ్రీ కృష్ణ జన్మభూమి కేసులపై తామే విచారణ చేపడతామని హైకోర్టు శుక్రవారం ప్రకటించింది. ఆ మేరకు సంబంధిత కేసులను హైకోర్టు తనకు బదిలీ చేసుకుంది. కాగా శ్రీ కృష్ణ జన్మభూమి ఆలయం పక్కన ఉన్న షాహి ఈద్గా మసీదు నిర్మితమైందంటూ భగవాన్ శ్రీ కృష్ణ విరాజ్మాన్, రంజనా అగ్నిహోత్రితోపాటు మరో ఏడుగురు సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. షాహీ మసీదు ఈద్గా నిర్వహణ కమిటీ, శ్రీ కృష్ణ జన్మభూమి ట్రస్ట్, శ్రీ కృష్ణ జన్మ స్థాన్ సేవా సంస్థాన్‌లను ఈ కేసులో ప్రతివాదులుగా చేర్చారు. మసీదు స్థలంపై హిందువులకే హక్కులు ఉంటాయని వాదించారు. హిందూ దేవాలయాలను కూలగొట్టి ఈద్గాను నిర్మించారని తెలిపారు. అలాంటి నిర్మాణం మసీదు కాబోదని పేర్కొన్నారు. ఆ భూమిని మసీదు నిర్మాణం కోసం ఎవరూ ఇవ్వలేదని తెలిపారు. చదవండి: సివిల్స్ ఫలితాల్లో ఇద్దరు అమ్మాయిలకు ఓకే ర్యాంకు.. అదెలా? -
మసీదు కాంప్లెక్స్‌లో సర్వే
మథుర: వివాదాస్పద కృష్ణ జన్మభూమి–షాహీ ఈద్గా వివాదంలో మథుర జిల్లా కోర్టు కీలక ఉత్తర్వులు వెలువరించింది. మసీదు కాంప్లెక్స్‌లో సర్వే చేపట్టాలని జిల్లా సీనియర్ డివిజన్(3) సివిల్ జడ్జీ సోనికా వర్మ ఉత్తర్వులిచ్చారు. జనవరి 20వ తేదీలోగా సర్వే నివేదికను సమర్పించాలని ఆదేశించారు. ఇక్కడి ఖాత్రా కేశవ్ దేవ్ ఆలయాన్ని ఔరంగజేబు నేలమట్టంచేసి ఈద్గాను నిర్మించారంటూ పిటిషనర్లు ఈ దావా వేశారు. శ్రీ కృష్ణ జన్మభూమి ట్రస్టు అధీనంలోని 13.37 ఎకరాల స్థలంలోనే ఈ ఈద్గాను నిర్మించారని దీనిని వేరే చోటుకు తరలించాలని కోర్టుకు విన్నవించుకున్నారు. అయితే, ఈ వివాదంపై శ్రీ కృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్, షాహీ మసీద్ ఈద్గాల మధ్య 1968 ఏడాదిలో కుదిరిన రాజీ ఒప్పందాన్నీ వారు సవాల్‌చేస్తున్నట్లు వారి లాయర్ శైలేశ్ దూబే చెప్పారు. -
గురువాణి: అమ్మ ప్రేమకన్నా...
పసిపిల్లలకు లోకంలో తల్లికన్నా ప్రియమైనది ఏదీ ఉండదు. అమ్మతో మాట్లాడడం, అమ్మని ముట్టుకోవడం, అమ్మతో ఆడుకోవడం, అమ్మ పాట వినడం, అమ్మ స్పర్శ... వీటికన్నా ప్రియమైనవి లోకంలో ఉండవు. సమస్త జీవకోటినీ సష్టించే పరబ్రహ్మ స్వరూపం అమ్మే. ఈ లోకంలోకి రాగానే పాలిచ్చి, ఆహారమిచ్చి పోషించే మొట్టమొదటి విష్ణు స్వరూపం అమ్మయే. అన్ని ప్రాణులను తన వెచ్చటి స్పర్శతో నిద్రపుచ్చే ప్రేమైకమూర్తి అయిన హర స్వరూపం కూడా అమ్మయే. అందుకే అమ్మ సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త సమాహార స్వరూపం. అటువంటి అమ్మకన్నా ప్రియమైనది ప్రపంచంలో మరేముంటుంది? అయితే ఒకటి గమనించాలి. అమ్మకడుపులోంచి వచ్చిన వాడు మళ్లీ అమ్మ కడుపులోకి పోలేడు. కానీ ఈ దేశం మట్టిలో పుట్టి... మళ్ళీ చిట్ట చివర ఈదేశం మట్టిలో కలిసిపోతాం. అందువల్ల జన్మభూమి తల్లికన్నా గొప్పది. తల్లికన్నా ప్రియమైనది. అందునా భారత దేశం. ఇంత గొప్పదేశంలో పుట్టినవాళ్ళం...భరతమాత బిడ్డలం. ఇది సామాన్యమైన భూమినా..!!! ఇది వేదభూమి, ఇది కర్మ భూమి(వేద సంబంధమైన క్రతువులు జరుపుకోవడానికి అర్హమైన భూమి)... ఎన్ని పుణ్యనదులు ప్రవహిస్తున్నాయో ఇక్కడ ఈ భావనలతో ఉప్పొంగిన ఓ మహాకవి పరవశించిపోయి ........ జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి జయ జయ జయ శత సహస్ర నర నారీ హృదయ నేత్రి జయ జయ సశ్యామల సు శ్యామచలా చేలాంచల జయ వసంత కుసుమలతా చరిత లలిత చూర్ణ కుంతల జయ మదీయ హృదయాశ్రయ లాక్షారుణ పద యుగళా జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ జయ గాయక వైతాళిక గళ విశాల పద విహరణ జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణ.... ... ఇలా అల్లి ఓ పాట రాసేసాడు. ఆయనే దేవులపల్లి కృష్ణ శాస్త్రి.. ఈ అమ్మకు పుట్టిన బిడ్డలు అనంతం. వారందరికీ అమ్మ పోలికలే వచ్చాయట... ఏమిటా పోలికలు... త్యాగం, పదిమందికీ పెట్టడం, పరోపకారం, కృతజ్ఞత, ఆతిథ్యం...ఉపకారం చేసినవాడికి ఉపకారం చేయడమే కాదు, అపకారికి కూడా ఉపకారం చేయగల విశాల హృదయం... వీటన్నింటికీ మించి ఓర్పు... ఓర్పును మించిన ధర్మం, ఓర్పును మించిన సత్యం, ఓర్పును మించిన యజ్ఞం ఉండవు... అంత గొప్ప ఓర్పు కలిగి ఉండడం, అరిషడ్వర్గాలను జయించడం, తనలో ఉన్న పరబ్రహ్మాన్ని తెలుసుకోవడం.. అమ్మకున్న ఈ లక్షణాలన్నీ బిడ్డలకొచ్చాయి. అందుకే వారి హృదయాలలో ఆమె ఎప్పుడూ పచ్చని చీర కట్టుకుని వెలిగిపోతూ కన్పిస్తూంటుంది. పరమ పవిత్రమైన ఆమె పాదాలు.. ఈ సృష్టిలో ఆమె పాదాలను ముద్దాడడం పసిపిల్లవాడి పారవశ్యం. కవిగా దేవులపల్లి ఎంత పరవశించిపోయారంటే ‘‘అక్షరమక్షరం నా మనసు కరిగితే ఈ పాటయిందమ్మా..’’.అని చెప్పుకుని ఆమె పాదపద్మాలకు సమర్పించుకున్నారు. అత్యంత పవిత్రమైన ఈ అమృతోత్సవాల సందర్భంగా ఇంత మధురమైన దేశభక్తి గేయాన్ని రాసిన దేవులపల్లి కృష్ణశాస్త్రిగారిని స్మరించుకుంటే... మనం కూడా ఆయనలా చిన్నపిల్లలమై ఆమె పాదాలను ముద్దాడే అనుభూతిని పొందుదాం. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
‘అందుకే నన్ను అరెస్ట్ చేయించాడు’
-
‘అందుకే నన్ను అరెస్ట్ చేయించాడు’
సాక్షి, విజయవాడ : టీడీపీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు తప్పు ఎత్తి చూపినందుకే తమ పార్టీ కార్యకర్తల మీద దాడి చేశారంటూ వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త వసంత కృష్ణప్రసాద్ ఆరోపించారు. శుక్రవారమిక్కడ ఏర్పాటు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మంత్రి ఉమా మహేశ్వర రావు మైలవరం నియోజకవర్గ ప్రజలను మోసగిస్తున్నారని మండి పడ్డారు. జల వనరుల శాఖ స్థలాన్ని కన్వర్షన్ చేయకుండా పేదలకు దొంగ పట్టాలిచ్చారని ఆరోపించారు. పట్టాల స్థానంలో జవాబుపత్రం అనే పనికిరాని కాగితాలను ఇచ్చి ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్నారంటూ మండి పడ్డారు. ఉమ తప్పు ఎత్తి చూపినందుకే జన్మభూమి సమావేశంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడి చేయడమే కాన తనను అరెస్ట్ చేశారని తెలిపారు. ఉమా మహేశ్వర రావు అబద్దాలు, మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని తెలిపారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే మైలవరం నియోజకవర్గంలోని పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని ప్రకటించారు. -
ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూపై కిర్లంపూడి పీఎస్‌లో దళితుల ఫిర్యాదు
-
ఎమ్మెల్యేపై దళితుల ఫిర్యాదు
సాక్షి, తూర్పు గోదావరి: టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూపై కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో రాజుపాలెం గ్రామ దళితులు ఫిర్యాదు చేశారు. గురువారం రాజుపాలెం గ్రామంలో జరిగిన జన్మభూమి సభలో ఎమ్మెల్యే తమను అవమానించారని, తమ మనోభావాలను కించపరిచేలా దూషించారని వారు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. జన్మభూమి సభలో భాగంగా తమ గ్రామంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని కోరినందుకు.. పోలీసులకు తమను సభ నుంచి గెంటేయాలని ఎమ్మెల్యే సూచించారని వారు మండిపడ్డారు. దళితులమనే చిన్న చూపుతోనే ఎమ్మెల్యే నెహ్రూ తన అగ్రకుల అహంకారం చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని రాజుపాలెం దళితులు డిమాండ్ చేస్తున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా జన్మభూమి సభల్లో టీడీపీ ప్రభుత్వ తీరుపట్ల నిరసన గళాలు వినిపిస్తునే ఉన్నాయి. సమస్యలపై ప్రశ్నించిన వారిని అడుగడుగునా టీడీపీ నాయకులు ఇబ్బందులకు, అవమానాలకు గురిచేస్తున్న విషయం తెలిసిందే. -
‘జన్మభూమి’లో పార్థసారధిపై దౌర్జన్యం
-
‘జన్మభూమి’లో పార్థసారధిపై దౌర్జన్యం
సాక్షి, కృష్ణా జిల్లా : జిల్లాలోని ఉయ్యూరు నియోజకవర్గంలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమం రసాభాసగా మారింది. సమస్యలపై ప్రశ్నించిన వైస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పార్థసారధిపై ఎమ్మెల్యే బోడె ప్రసాద్, ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ వైవీబి రాజేంద్రప్రసాద్‌లు నోరుపారేసుకున్నారు. దీంతో వైస్సార్సీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడికి యత్నించారు. సమస్యలపై ప్రజాప్రతినిధులను ప్రశ్నించింనందుకు టీడీపీ కార్యకర్తలు వీది రౌడిల్లా వ్యవహరించారు. దీంతో ఒక్కసారిగి సభ వేడెక్కింది. పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను అదుపు చేసి, పార్థసారధిని సభ నుంచి బయటకు పంపేశారు. రాజుపాలెంలో రచ్చరచ్చయిన జన్మభూమి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం రాజుపాలెంలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమం రచ్చ రచ్చయింది. గ్రామంలో జరిగిన రూ. 40లక్షల మరుగుదొడ్ల నిర్మాణం అవినీతిపై విచారణ జరిపించాలంటూ గ్రామస్తులు సభను అడ్డుకున్నారు. అవినీతిపై విచారణ జరిపించేవరకూ సభ జరపొద్దని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను గ్రామస్తులు పట్టుబట్టారు. దీంతో పోలీసుల, గ్రామస్తుల మధ్య తోపులాట జరిగింది. మరుగుదొడ్ల అవినీతిపై విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చి ఎమ్మెల్యే సభ నుంచి వెళ్లిపోయారు. విజయవాడ జన్మభూమి కార్యక్రమంలో గందరగోళం విజయవాడలోని 59వ డివిజన్లో గురువారం చేపట్టిన జన్మభూమి కార్యక్రమం గందరగోళంగా మారింది. అర్హులైన వారికి ఇళ్లు కేటాయించాలని అధికారులను వైఎస్సార్సీపీ కార్పొరేటర్ శైలజ నిలదీశారు. దీంతో మహిళా కార్పొరేటర్ శైజలపై టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. టీడీపీ నేతల దౌర్జన్యానికి నిరసనగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు జన్మభూమి కార్యక్రమం ముందు నిరసనకు దిగారు. టీడీపీ నేతలపై పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. -
రైతులపై చింతమనేని దౌర్జన్యం
సాక్షి, పశ్చిమగోదావరి : న్యాయం చేయాలంటూ వచ్చిన రైతుల పట్ల దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దారుణంగా ప్రవర్తించారు. వారిని బూతులు తిడుతూ.. అక్రమ కేసుల సైతం పెట్టడానికి సిద్ధపడ్డారు. వివరాలు.. గురువారం వట్లూరు జన్మభూమి మీటింగ్‌కు చింతమనేని ప్రభాకర్ హజరయ్యారు. ఈ సందర్భంగా వట్లూరు చెరువులో భూములు కోల్పోయిన రైతులు తమకు రావాల్సిన నష్టపరిహారం ఇప్పించాలంటూ ప్లకార్డ్స్ పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. దాంతో ఆగ్రహానికి గురైన చింతమనేని రైతులపై బూతు పురాణం ప్రారంభించారు. సహనం కోల్పోయిన అన్నదాతలు సమస్యను పరిష్కరించకుండా తమను తిట్టడం సరికాదంటూ వాదనకు దిగారు. దీంతో మరింత అసహనానికి గురైన చింతమనేని ఎమ్మార్వోతో చెప్పి సదరు రైతులపై ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు రైతుల మీద 353 సెక్షన్ కింద కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నాయకులు కొఠారు రామచంద్ర రావు, కార్యకర్తలు ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌కెళ్లి రైతులను పరామర్శించారు. -
సీఎం చంద్రబాబు సభలో మహిళల నిరసన
-
సీఎం చంద్రబాబు ఎదుటే మహిళల నిరసన
సాక్షి, శ్రీకాకుళం : ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చేపడుతున్న జన్మభూమి కార్యక్రమాలకు అడుగడుగునా నిరసన సెగలుస తగులుతున్నాయి. తాజాగా జిల్లాలోని రాజాం మండలం పొగిరిలో సీఎం చంద్రబాబు శనివారంజన్మభూమి సభ నిర్వహించారు. ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతుండగానే.. మహిళలు ఆందోళనకు దిగారు. సభలో లేచినిలబడిన మహిళలు తమకు ఇళ్లు ఇవ్వలేదని, చంద్రబాబు ప్రభుత్వం వల్ల తమకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తమ నిరసనను తెలియజేస్తూ వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సంతకవిటి మండలం తాలాడకు చెందిన గిరిజన మహిళలు ఈ మేరకు సీఎం సభలో నిరసన గళం ఎత్తారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలోని ఎల్ఎన్ పేట మండలం దనుకువాడలో జరిగిన జన్మభూమి కార్యక్రమం రసాభాసగా మారింది. ఎళ్ల తరడబి అర్జీలు ఇస్తున్నా.. సమస్యలు పరిష్కారం కావడం లేదని గ్రామస్తులు అధికారులను నిలదీశారు. గ్రామసభను అడ్డుకొని.. అధికారులను గ్రామస్తులు వెనక్కిపంపారు. నాతో పెట్టుకుంటే ఫినిష్.. కాగా ‘‘నాతో పెట్టుకుంటే ఫినిష్ అయిపోతారు జాగ్రత్త’’ అని తనను అడ్డుకున్న మహిళలను సీఎం చంద్రబాబు కాకినాడలో హెచ్చరించడంపై దుమారం రేగుతోంది. శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో నిర్వహించిన ‘జన్మభూమి–మా ఊరు’ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సీఎం కాన్వాయ్‌ను కాకినాడ ఎన్ఎఫ్సీఎల్ రోడ్డులో పలువురు అడ్డుకున్నారు. ‘సీఎం గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. దీంతో బస్సులో ఉన్న చంద్రబాబు బయటకు వచ్చి మండిపడ్డారు. మీకు ఏం కావాలంటూ రుసరుసలాడారు. తనను అడ్డుకున్న వారికి రాష్ట్రంలో ఉండే అర్హతలేదంటూ ఆగ్రహంవ్యక్తం చేశారు. ‘లేనిపోని ప్రాబ్లమ్స్ పెట్టుకోవద్దు ఇక్కడ..పెట్టుకుంటే మీరు ఫినిష్ అయిపోతారు మర్యాదగా ఉండు..చాలా సమస్యలు వస్తాయి..ఢిల్లీలో నిన్న కూడా లాఠీ చార్జీ చేశారు.ఈ నీళ్లు తాగుతున్నారు.. ఈ గడ్డ మీద ఉన్నారు... ఏయ్ ఉండండీ.. నేను అడిగింది చెప్పు.. ఏం చేశారు మీ మోదీ.. ముంచాడు అందరినీ.. రాష్ట్రాన్నీ, దేశాన్ని...బయటకు వస్తే వదలరు.. మిమ్మల్ని పబ్లిక్...ఏమన్నా ఉందా మీకు కొంచెమైనా..?’ అంటూ తనను అడ్డుకున్న మహిళలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఆరంభంలోనే ఆగ్రహావేశాలు
ఊహించిందే జరిగింది. తొలిరోజు జన్మభూమి గ్రామసభలు నిరసనలు... నిలదీతలతో సాగాయి. పాలకపక్షనాయకులు, అధికారులను ఎక్కడికక్కడే జనం అడ్డుకుని ప్రశ్నలతో బెంబేలెత్తించారు. పలు చోట్ల పోలీసులు రంగప్రవేశం చేసి నిలదీసినవారిని బయటకు నెట్టేశారు. గతంలో ఇచ్చిన అర్జీలను పరిష్కరించనందుకు కొన్నిచోట్ల... కరువు మండలాలుగా ఎందుకు ప్రకటించలేదంటూ మరికొన్ని చోట్ల... ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. పలు గ్రామాల్లో సభలకు జనం రాకపోవడంతో విద్యార్థులతో మమ అనిపించేశారు. సాక్షిప్రతినిధి, విజయనగరం: జిల్లాలో ఆరో విడత జన్మభూమి – మా ఊరు కార్యక్రమం ప్రజల అసంతృప్తుల నడుమ బుధవారం ప్రారంభమైంది. సభల్లో ప్రజాప్రతినిధులు అధికారులను స్థానికులు నిలదీస్తుంటే... మరోవైపు ఈ సభల సాక్షిగా టీడీపీ నేతలు, అధికారుల మధ్య సమన్వయ లోపం స్పష్టమైంది. నాలుగేళ్లుగా తమను పట్టించుకోకపోవడంపై ఎక్కువమంది ప్రజలు అధికారులను ప్రశ్నించా రు. పబ్లిక్ కుళాయిల వెంట నీరు రావటం లేదని... పారిశుద్ధ్య నిర్వహణ ఆధ్వానంగా ఉందని... పలువురు మహిళలు వద్ధాప్య, వితంతు పింఛన్ల కోసం ఎన్ని మార్లు దరఖాస్తు చేసుకున్నా మంజూ రు చేయటం లేదని వాపోయారు. కొందరైతే ప్రయోజనం లేనప్పుడు ఎందుకివ్వాలంటూ అర్జీలు ఇవ్వడానికి విముఖత ప్రదర్శించారు. ప్రజల కు సమాధానం చెప్పలేని పాలకులు,అధికారులు పోలీసుల సాయంతో తొలిరోజు జన్మభూమి–మాఊరు కార్యక్రమాన్ని మమ అనిపించారు. సెల్‌టవర్‌ను వ్యతిరేకిస్తూ మహిళల నిరసన విజయనగరంలో పాలకులు, అధికారుల నిర్లక్ష్యంపై స్థానిక ప్రజలు ప్రశ్నల వర్షం కురిపించారు. 15వ వార్డు పరిధిలోని దాసన్నపేట ప్రాంతంలో జరిగిన సభలో ఎమ్మెల్యే మీసాల గీత, మున్సిపల్ చైర్పర్సన్ ప్రసాదుల రామకృష్ణ, కమిషనర్ టి.వేణుగోపాల్ పాల్గొనగా జనావాసాల మధ్య ఏర్పాటు చేస్తున్న సెల్‌టవర్‌ను వ్యతిరేకిస్తూ స్థానిక మహిళలు సభను అడ్డగించేందుకు ప్రయత్నించారు. పోలీసులు, మున్సిపల్ అధికారులు జోక్యం చేసుకుని వారిని వారించే ప్రయత్నం చేశారు. సెల్ టవర్ నిర్మాణాన్ని నిలిపివేస్తామని చైర్మన్ ప్రకటించటంతో జనం శాంతించారు. వార్డు పరిధిలోని రామకృష్ణానగర్ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు తాగు నీటి కోసం బోరు బావి ఏర్పాటు చేయాలని నాలుగేళ్లుగా వినతిపత్రాలు ఇస్తున్నా స్పందించకపోవటంపై కమిషనర్ టి.వేణుగోపాల్‌ను నిలదీశారు. సంక్షేమం కొందరికేనా... సంక్షేమ పథకాలు అందరికీ అందడం లేదని, కొందరికి మాత్రమే అందివ్వడంలో ఆంతర్యమేమిటని పార్వతీపురం పట్టణంలో నిర్వహించిన జన్మభూమి సభలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త అలజంగి జోగారావు, పట్టణ అధ్యక్షుడు కొండపల్లి బాలకృష్ణ, ఫ్లోర్ లీడర్ మంత్రి రవికుమార్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నేతలు అధికారులను ప్రశ్నించారు. టీడీపీకి అనుకూలంగా ఉన్నవారికి, జన్మభూమి కమిటీ సభ్యులు సూచించిన వారికోసమే ప్రభుత్వం ఉందా అని నిలదీశారు. మంత్రి వస్తారని... తెర్లాంలో జరిగే సభకు మంత్రి సుజయ్ కృష్ణరంగారావు హాజరవుతారని తొలుత ప్రకటించడంతో పలువురు అర్జీదారులు వేచి చూశారు. తీరా ఆయన రావడం లేదంటూ తీరికగా చెప్పడంతో ప్రజలంతా ఉసూరంటూ వెనుతిరిగారు. బొబ్బిలిలో వార్డుల వారీగా జన్మభూమి కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశాలున్నా ఇక్కడ మూడు వార్డులకు కలిపి ఒకే చోట సభను నిర్వహించి మమ అనిపించేశారు. బాడంగిలో సంక్షేమ పథకాలు అమలుపై వైఎస్సార్ సీపీ ప్రచార కార్యదర్శి పెద్దింటి రామారావు అధికారులను నిలదీశారు. కొన్ని చోట్ల ఆర్జీలు ఇచ్చేందుకు ప్రజలు విముఖత ప్రదర్శించారు. కరువు కనిపించడం లేదా... కొత్తవలస, వేపాడ మండలాల్లో కరువు కనిపించడం లేదా అంటూ ఆయా మండలాల్లో జరిగిన గ్రామసభల్లో అధికారులు, ప్రజాప్రతినిధులను స్థానికులు నిలదీశారు. అసలు పంటపొలాలు పరిశీలించకుండా సభ నిర్వహిస్తే సహించబోమంటూ వేపాడ మండలం ముకుందపురంలో జరిగిన సభను అక్కడివారు అడ్డుకున్నారు. చేసేది లేక అధికారులు పొలాలు పరిశీలించారు. కొత్తవలస మండలం కంటకాపల్లిలో కరువు ప్రకటనపై ఎమ్మెల్యేను నిలదీయగా పోలీసులు అడ్డుకున్నారు. ఎస్.కోట మండలం కొట్యాడ, వీరభద్రపేట గ్రామాల్లో జరిగిన సభల్లో పాత అర్జీలు పరిష్కరించకుండా కొత్తగా ఎందుకు సభలని నిలదీశారు. ఎస్‌కోట మండలం ముషిడిపల్లిలో జనం రాకపోవడంతో గురుకుల విద్యార్థినులతో మమ అనిపించారు. పథకాలున్నా... ప్రయోజనమేదీ? పింఛన్లు, రేషన్‌కార్డులు, ఇళ్లకు అర్హులైన ఎంతోమంది ఉన్నా వారికి ఎందుకు మంజూరు చేయడం లేదంటూ గజపతినగరం మండలం కెంగువలో జెడ్పీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి, ఎమ్మెల్యే కె.ఎ.నాయుడును గ్రామస్తులు నిలదీశారు. పసుపు–కుంకుమ డబ్బు రాలేదని దత్తిరాజేరు మండలం విజయరామపురం, షికారుగంజి గ్రామాల్లో మండల ప్రత్యేక అధికారి పాండురంగను మహిళలు నిలదీశారు. ఇక నెల్లిమర్ల నియోజకవర్గంలోనూ ఆందోళనలు కొనసాగాయి. డెంకాడ మండలం నాతవలసలో నిర్వహించిన సభలో పంచాయతీ కార్యాలయానికి భవనం మంజూరు చేయాలని ఎన్నాళ్లుగా కోరుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ఆ గ్రామ మాజీ సర్పంచ్ భర్త బమ్మిడి వెంకటరమణ అధికారులను నిలదీశారు. మరుగుదొడ్ల బిల్లులివ్వరా... కురుపాంలో జన్మభూమికి వెళ్తున్న ఎంపీడీవో, సిబ్బంది, అధికారులను వ్యక్తిగత మరుగుదొడ్ల బిల్లులు చెల్లించలేదంటూ లబ్ధిదారులు అడ్డుకున్నారు. బిల్లుల కోసం ఎన్నాళ్లు కార్యాలయం చుట్టూ తిరగాలని లబ్ధిదారులకు రసూల్, వెంకటరమణ తదితరులు నిలదీశారు. చీపురుపల్లి నియోజకవర్గం గుర్ల మండలం సొలిపి, సోమరాజుపేటలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకుండా జన్మభూమి సభలెందుకని అధికారులను స్థానికులు నిలదీశారు. బిల్లులొచ్చినా చెల్లించరే ఉపాధి వేతన కార్మికులకు పోస్టాఫీసులో బిల్లులు పడినా తమకు చెల్లించడం లేదని పాచిపెంట మండలం కర్రివలసలో జరిగిన సభలో అర్జీదారులు ఆ‘గ్రహం వ్యక్తం చేశారు. సాలూరు పట్టణం గుమడాం, చిట్టులువీధిలో రేషన్ కార్డులు, పింఛన్ల కోసం ప్రశ్నించారు. మక్కువ మండలం కోన పంచాయతీలో ఇళ్ళ బిల్లుల మంజూరులో ఎందుకు జాప్యంచేస్తున్నారని ప్రశ్నించారు. మెంటాడ మండలం పెదచామలాల్లి, కుంటినవలసల్లోనూ ఇళ్ల బిల్లులు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఈ విషయంలో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు అడ్డుకున్నారు. కుంటినవలసలో సమస్యలపై మాజీ ఎమ్మెల్యే భంజ్‌దేవ్‌ను స్థానికులు ప్రశ్నించడంతో వారిని బలవంతగా పోలీసులు బయటకు నెట్టివేశారు. -
విద్యార్థుల జీవితాలతో సర్కార్ చెలగాటం
-
సీఎం చంద్రబాబు ప్రచారానికి కాలేజీ విద్యార్ధులు
-
‘మెంబర్ ఆఫ్ జన్మభూమి’ కారు హల్చల్
తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం సిటీ: మెంబర్ ఆఫ్ పార్లమెంట్, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్..ఈ పదవులు అందరికీ తెలుసు. మరి ‘మెంబర్ ఆఫ్ జన్మభూమి’అన్న పేరు ఎప్పుడైనా చూశారా? నగరంలో ఎంపీ, ఎమ్మెల్యే స్థాయిలో ‘మెంబర్ ఆఫ్ జన్మభూమి’ పేరును కారు నెంబర్ ప్లేట్‌పై రాసుకుని హల్చల్ చేస్తుండటంతో నగరవాసులు విస్తుపోతున్నారు. పిచ్చిముదురు పాకాన పడిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. టీడీపీకి చెందిన సాధారణ జన్మభూమి కమిటీ సభ్యులు.. ఆ పదవిని ఉన్నత హోదాగా భావించుకుని ఇలా తిరుగుతుండటంతో ఔరా! ఇదేమి చోద్యమంటూ అందరూ నోళ్లు వెళ్లబెడుతున్నారు. -
ఏం స్కెచ్ బాబు!
2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా చంద్రబాబు కొత్త స్కెచ్ వేశారు. ఇప్పటి వరకు జన్మభూమి కమిటీలతో తమ వాళ్లకే ప్రభుత్వ పథకాలు కట్టబెట్టి, ప్రజావ్యతిరేకత మూటగట్టుకున్న చంద్రబాబు తాజాగా పొదుపు మహిళల సహకారంతో మళ్లీ అధికారంలోకి రావాలనే ఎత్తుగడ వేశారు. వీరికి సాధికార మిత్ర హోదా కల్పించి, ప్రతి 35 కుటుంబాలకు ఒక సాధికార మిత్రను నియమించనున్నారు. వీరి ద్వారా ప్రతి కుటుంబానికి మేలు చేస్తామనే ప్రచారం చేయించుకుని ప్రజలను మభ్యపెట్టే యత్నం చేస్తున్నారు. చంద్రబాబు తన ప్రణాళిక అమలుకు అధికార యంత్రాంగం తోడ్పాటు తీసుకుంటున్నారు. అయితే బాబు వ్యూహాన్ని అర్థం చేసుకున్న పొదుపు మహిళలు సాధికార మిత్రలుగా నియమితులు కావడానికి అయిష్టత వ్యక్తం చేస్తున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కావలి: చంద్రబాబు ప్రభుత్వం తాజాగా పొదుపు గ్రూపు మహిళలను అస్త్రంగా చేసుకుని ప్రజల వద్దకు వెళ్లాలని తలపోస్తోంది. ఇప్పటికే టీడీపీ గల్లీ లీడర్లతో ఉన్న జన్మభూమి కమిటీలతో ప్రజలు విసుగెత్తిపోయారు. ఈ నేపథ్యంలో ప్రజ ల వద్దకు వారి మధ్యనే ఉన్న మహిళలనే ప్రభుత్వం తరపున రాయబారిగా పంపించే రాజకీయ వ్యూహాత్మక అడుగులు ప్రారంభమయ్యాయి. ప్రతి 35 ఇళ్లకు ఒక పొదుపు మహిళను గుర్తించి వారికి ‘సాధికార మిత్ర’ అనే ఆకర్షణీయమైన పేరును పెట్టారు. వీరు తమకు కేటా యించిన 35 నివాస గృహాలకు వెళ్లి చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు చెప్పాలి. ఆ కుటుంబంలో ఉన్న వారి సమగ్ర వివరాలతో పాటు వ్యక్తిగత మొబైల్ నంబర్లు సేకరించాలి. రానున్న ఎన్నికల్లో టీడీపీకి ఓటేస్తే వీరి ద్వారానే అన్ని కల్పిస్తామనే హామీ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే జిల్లాలోని 27,192 మంది పొదుపు మహిళలను ‘సాధికార మిత్ర’ పేరుతో అధికారులు జాబితాను సిద్ధం చేశారు. ఇదీ కార్యాచరణ ప్రణాళిక జిల్లాలో 2011 జనాభా లెక్కలు ప్రకారం 29.64 లక్షలు మంది ఉన్నారు. తాజా లెక్కల ప్రకారం 35 లక్షల మంది ఉంటారని అంచనా. 2011 జనాభా లెక్కలు ప్రకారం జిల్లాలో 7.77 లక్షలు నివాస గృహాలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 5.67 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 2.1 లక్షలు ఉన్నాయి. తాజాగా ఈ సంఖ్య జిల్లాలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 9 లక్షలు నివాస గృహాలు ఉన్నాయని అంచనా. మార్చి 21వ తేదీ లోగా ఈ ‘సాధికార మిత్ర’లు ఒక విడత 9 లక్షల కుటుంబాల ను చుట్టేసి ఆ కుటుంబాల వివరాలను చంద్రబాబు ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంది. దీని కోసం గ్రామీణ ప్రాంతా ల్లో డీఆర్డీఏ అధికారులు, సిబ్బంది, మున్సిపాలిటీ పట్టణ ప్రాంతాల్లో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అధికారులు, సిబ్బంది ఉరుకులు పరుగుల మీద కసరత్తు చేస్తున్నారు. సమాజ సేవ కోసమే ఈ పని చేయాలని ‘సాధికారిక మిత్ర’లైన మహిళలు అధికారులు చెబుతుంటే.. ఇదేం కర్మఅంటూ పొదుపు మహిళలు మండిపడుతున్నారు. జిల్లాలో ఎనిమిది కస్టర్లు జిల్లాలో గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ)లో భాగమైన వెలుగు కింద జిల్లాలోని 46 మండలాల్లో 8 క్లస్టర్లు ఉన్నాయి. ఈ క్లస్టర్ల పరిధిలో 3,90,500 మంది పొదుపు మహిళలు ఉన్నారు. వీరు 39,050 గ్రూపులుగా ఏర్పడి ఉన్నారు. ప్రతి గ్రామంలో ఒక ప్రాంతంలో వరుసగా ఉన్న 35 ఇళ్లకు ఈ పొదుపు మహిళల్లో నుంచి ఒకరిని ‘సాధికార మిత్ర’గా ఎంపిక చేశారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 20,500 మందిని ఎంపిక చేసి జాబితాను ప్రభుత్వానికి పంపారు. పట్ట ణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో 3,777 మంది, కావలి 853 , గూడూరు 508, వెంకటగిరి 471, ఆత్మకూరు 330, సూళ్లూరుపేట 310 మంది ని, నాయుడుపేట నగర పంచాయతీలో 443 మందిని ‘సాధికారమిత్ర’ లను ఎంపిక చేశారు. పట్టణాల్లో 1,26,169 మంది పొదుపు మహిళలతో ఉన్న 12, 246 గ్రూపుల నుంచి 6,692 మందిని ఎంపిక చేశారు. జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 27,192 మంది సాధికార మిత్రలతో కూడిన బాబితాను అధికారులు సిద్ధం చేశారు. వీరు ఏమి చేయాలంటే.. ప్రతి సాధికార మిత్ర వారికి కేటాయించి న ప్రతి ఇంటి వెళ్లికి కుటుంబ సభ్యుల వివరాలు, వారి వృత్తులు, వారి సామాజిక స్థితిగతులు, వారి మొబైల్ నంబర్లు సేకరించాలి. ప్రస్తుతం ఈ ప్రక్రియను ప్రారంభించి ఈ నెల 21వ తేదీ లోగా పూర్తి చేయాలి. ఇందుకు చాలామంది పొదుపు మహిళలు వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రతికూలతల నడుమ ప్రభుత్వం నిర్దేశించిన విధంగా కుటుంబాల స్థితిగతులను సేకరించి ప్రభుత్వానికి గడువులోగా అందజేసేదెలా అంటూ అధికారులు తలలు పట్టుకొంటున్నారు. ఇప్పటికే సిద్ధం చేసుకున్న జాబితాల నుంచి తొలిగించమని డిమాండ్ ఎక్కువ కావడంతో కొత్త పేర్లు చేర్చడానికి ఆపసోపాలు పడుతున్నారు. హ్యాండ్ బుక్లోనే అన్నీ గైడ్ లైన్లు ఈ మిత్రలకు పంపిణీ చేయడానికి 100 పేజీలతో ఉన్న హ్యాండ్ బుక్‌ను సిద్ధం చేశారు. అందులో మిత్రలు ఏమి చేయా లి, ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను పొందు పరిచారు. హ్యాండ్ బుక్‌లో ఉన్న అంశాలను మిత్రలు అనుసరించాలన్నారు. ప్రజలతో గౌరవ బాధ్యతలో, వినయ విధేయతలతో నడుచుకొంటూ ‘ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి’లా పని చేయాలి. ఈ సేవలు చేసినందుకు ప్రభుత్వం నుంచి నయా పైసా లబ్ధి లభించదు. ప్రజలు ప్రశ్నించినప్పుడు ఓపికగా సమాధానం చెప్పాలి, ప్రభుత్వం ద్వారా ప్రయోజనం చేకూరకపోతే∙ప్రజలకు జవాబు చెప్పాల్సి వస్తుందన్న భయంతో పని చేయాలి. బాబూ మోసంతో ఉడికి పోతున్న పొదుపు మహిళలు గత ఎన్నికల ముందు పొదుపు గ్రూపు మహిళలు తీసుకున్న రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు మోసం బ్యాంక్‌ల్లో తమ పరపతిని పోగొట్టాడని మండిపోతున్నారు. ప్రభుత్వం నుంచి తమకు నయా పైసా లాభం లేకపోయినా ప్రభుత్వ పథకాలకు, పార్టీకి తాము ప్రచార కార్యకర్తల్లా పని చేయాలా? అని ప్రశ్నిస్తున్నారు. పొదుపు సభ్యులుగా తమకు బ్యాంక్‌లు రుణాలు ఇస్తున్నా యి.. తిరిగి తామే కట్టుకుంటున్నప్పుడు ఈ ప్రభుత్వానికి ఎందుకు వెట్టి చాకిరి చేయాలని నిలదీస్తున్నారు. పొదుపు గ్రూపుల్లో సభ్యులం కావడంతో తమను చంద్రబాబు, ఆయన కుమారుడు పర్యటనలకు జనబలం చూపించుకునేందుకు వాడుకుం టున్నారని దుయ్యబట్టుతున్నారు. రోజువారీ కూలీలు, మధ్యతరగతి, రైతువారీ కుటుంబాల్లోని వారే సభ్యులుగా ఉన్నారు. తమ పనులను పక్కన పెట్టుకుని ప్రభుత్వ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. నాలుగేళ్లుగా పొదుపు మహిళలకు ఏమీ చేయకపోగా, మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు తమను పావులుగా ఉపయోగపెట్టుకునేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నాడని పొదుపు మహిళలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకే సాధికార మిత్రలను ఎంపిక చేశాం. మిత్రలుగా పనిచేయడానికి ఇష్టపడని వారి పేర్లను తొలగించి ఇతరులతో జాబితాను సిద్ధం చేస్తున్నాం. వారితో ఇంటింటికీ వెళ్లి కుటుంబాలు స్థితిగతులను తెలుసుకునే పనిని ప్రారంభిస్తాం. –లావణ్యవేణి, డీఆర్డీఏ పీడీ -
పింఛన్లకు రాజకీయ గ్రహణం
అనంతపురం టౌన్: సామాజిక పింఛన్ల లబ్ధిదారుల ఎంపికకు రాజకీయ గ్రహణం సోకింది. ఎలాంటి అర్హతలు లేకపోయినా.. లంచమిస్తే కొత్త పింఛన్ల లబ్ధికి చేకూరుస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం జన్మభూమి కమిటీ సభ్యుల కనుసన్నల్లోనే జరుగుతోంది. డబ్బు ముట్టజెపితే పనులు చకచకా జరిగిపోతుంటాయి. కమిటీ సభ్యులు కోరుకున్న మేరకు డబ్బు చెల్లించని నియోజకవర్గాల్లో లబ్దిదారుల ఎంపికకు శ్రీకారం చుట్టలేదు. మరికొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ కండువా వేసుకున్న వారిని మాత్రమే పింఛన్ లబ్ధి చేకూరుస్తామంటూ ఆ పార్టీ నాయకులు నూతన అధ్యాయనానికి తెరలేపారు. నియోజకవర్గానికి రెండు వేల పింఛన్లు జిల్లా వ్యాప్తంగా 63మండలాల్లో ప్రస్తుతం 4,04,692 పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ఐదో విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమం ప్రారంభించే ముందు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 2వేల పింఛన్లు చొప్పున 28వేల కొత్త పింఛన్లు మంజూరు చేసింది. వీటితోపాటు గ్రామసభల్లో పింఛన్ కోసం వచ్చే అర్జీలను పరిశీలించి ప్రతి మండలంతోపాటు మున్సిపాలిటీల్లో 100 మందిని చొప్పున అర్హులను గుర్తించాలని నోడల్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. ఈ లెక్కన 28వేలతోపాటు అదనంగా 7,500పింఛన్లకు అర్హులను గుర్తించి ఉగాది (మార్చి 1)కొత్త పింఛన్‌దారులకు నగదు పంపిణీ చేయాల్సి ఉంది. పరిస్థితి చూస్తుంటే మార్చి 1 నాటికి కొత్త పింఛన్ల పంపిణీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నత్తనడకన లబ్ధిదారుల ఎంపిక జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో అర్హులను గుర్తించే పనిలో ఎంపీడీఓలు నిమగ్నమయ్యారు. అయితే ఇప్పటికే దాదాపు రెండు నెలలు పూర్తి కావస్తున్న పింఛన్ లబ్ధిదారుల ఎంపిక నత్తనడకన సాగుతోంది. ఇప్పటికే దాదాపు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య లక్షకు పైగానే ఉంది. అందులో 35,500 మంది అర్హులను అధికారులు గుర్తించాల్సి ఉంది. నోడల్ అధికారులు సైతం పింఛన్‌కు అర్హులను గుర్తించడంలో నిర్లక్ష్య ధోరణి కనిపిస్తున్నట్లు స్పష్టమవుతోంది. మున్సిపాలిటీ పరిధిలో 7,500 మందికి గాను నేటికీ ఏ ఒక్కరినీ గుర్తించలేదు. ఈ నియోజకవర్గాల్లో అర్హులే లేరా?: ఉరవకొండ, గుంతకల్లు నియోజకవర్గాల్లో పింఛన్‌కు అర్హులే లేనట్లు ఉన్నారు. ఎంపిక పక్రియ పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఈ రెండు నెలల కాలంలో ఒక్కరంటే ఒక్కరిని సైతం అధికారులు గుర్తించలేకపోయారు. కదిరి నియోజకవర్గానికి 2వేల పింఛన్లు మంజూరైతే ఇప్పటి వరకు కేవలం ఇద్దరిని మాత్రమే గుర్తించారు. వేగవంతం చేస్తాం పింఛన్ లబ్ధిదారుల ఎంపిక పక్రియను గడువులోగా పూర్తి చేయాలని ఇప్పటికే అన్ని మండలాల ఎంపీడీఓలకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేశాం. త్వరతగతిన ఎంపిక చేసి మార్చి1న పంపిణీ చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నాం. – కేఎస్ రామారావు, పీడీ, డీఆర్డీఏ -
ఆ నియోజకవర్గ టికెట్ కోసం క్యూలో టీడీపీ నేతలు
2009లో వెయ్యి ఓట్లు.. 2014లో 805 ఓట్లు.. ఇలా వరుసగా రెండుసార్లు అదృష్టం వరించి అతి తక్కువ మెజారిటీతో ఎమ్మెల్యే అయిన నేత బహుశా రాష్ట్రంలో చోడవరం టీడీపీ ఎమ్మెల్యే కెఎస్ఎన్ఎస్ రాజు ఒక్కరే అయిఉంటారు. కానీ ఏం లాభం.. తొమ్మిదేళ్ల నుంచి ప్రజాప్రతినిధిగా ఉన్నా.. ‘నేను ఇది సాధించాను.. నియోజకవర్గ ప్రజలకు ఇది చేశాను’.. అని గర్వంగా చెప్పుకొనే ఒక్క పని కూడా చేయలేకపోయారు. బినామీ పేర్లతో మైనింగ్, క్వారీ వ్యాపారాలు చేసుకోవడం, ఇసుక దందా, నిధుల గోల్‌మాల్‌తో గోవాడ షుగర్ ఫ్యాక్టరీని పీల్చి పిప్పి చేయడం, ఆస్తులు సమకూర్చుకోవడం మినహా చోడవరాన్ని ఏమాత్రం పట్టించుకోలేదన్న విమర్శలనే ఆయన మూటకట్టుకున్నారు. గత ఎన్నికల సమయంలో ‘ఇదే చివరి అవకాశం.. మళ్లీ పోటీ చేయను అని బహిరంగంగానే ప్రకటించి సానుభూతి ప్రచారం చేసుకున్నారు. కానీ ఇప్పుడు మూడోసారి పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారనే అంటున్నారు. ప్రజల కనీస ‘రుణం’ తీర్చుకోకుండా మూడో ‘ముచ్చట’ తీర్చుకునేందుకు ఆయన ఉబలాటపడినా.. సరైన ‘ఫలితం’ ఇచ్చేందుకు నియోజకవర్గ ఓటర్లు అప్పుడే రెడీగా ఉన్నారు. ఆయనకే కాదు.. టీడీపీ తరఫున ఎవరు బరిలోకి దిగినా ఇదే పరిస్థితి.. ఇది తెలిసి కూడా చోడవరం టికెట్ కోసం పలువురు ఉబలాటపడుతుండటంతో చోడవరం దేశం రాజకీయం అప్పుడే రంగులు మార్చుకుంటోంది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అధికార దన్నుతో జిల్లా తెలుగుదేశం ఎమ్మెల్యేల్లో చాలామంది భూములపై పడి రూ.కోట్లకు కోట్లు కూడబెట్టుకుంటే.. చోడవరం ఎమ్మెల్యే రాజు మాత్రం గనుల దారి ఎంచుకున్నారు. బినామీ పేర్లతో ఎమ్మెల్యేలెవరూ పెద్దగా దృష్టి పెట్టని మైనింగ్, క్వారీ పనులు చేపట్టడం, శారదా నదిలో ఇసుక దందా, గోవాడ షుగర్ ఫ్యాక్టరీ వ్యవహారాల్లో మితిమీరిన జోక్యం.. వెరసి తొమ్మిదేళ్ల కాలంలో ఆయన ఆర్ధికంగా బాగానే కూడబెట్టుకున్నారు. తనను గెలిపించిన చోడవరం నియోజకవర్గానికి ఏమీ చేయలేదన్న అప్రతిష్టను అదే స్థాయిలో మూటకట్టుకున్నారు. తన వెన్నంటి ఉన్న టీడీపీ కార్యకర్తలు, నేతల బాగోగులను కూడా పట్టించుకోని సదరు ఎమ్మెల్యే రాజు విపక్ష పార్టీ శ్రేణులను మాత్రం గుర్తించుకుని మరీ టార్గెట్ చేస్తారన్న వాదనలు ఉన్నాయి. మళ్లీ పోటీకి సై గత ఎన్నికల ప్రచారంలో ఈసారికి గెలిపించండి.. ఇదే చివరిసారి.. మళ్లీ పోటీ చేయను.. అని సెంటిమెంట్ డైలాగులు కొట్టి ఎమ్మెల్యే అయిన రాజు ప్రజలకు చేసిన వాగ్దానాల్లాగే ఆ మాటను కూడా మరచిపోయినట్టున్నారు. మళ్లీ ఎన్నికల గోదాలో దిగేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యేల పనితీరు, జన్మభూమి సభల నిర్వహణలపై టీడీపీ అధిష్టానం చేసిన సర్వేల్లో ఈయనకు వరుసగా చివరి స్థానాలే దక్కుతున్నాయి. దీంతో ఈసారి రాజుకు టికెట్ ఇవ్వరనే ప్రచారం జోరుగా సాగుతోంది. తన సొంత సామాజికవర్గం ఓట్లు ఒక్కశాతం కూడా లేకపోయినా పంచాయతీ సర్పంచ్ నుంచి వివిధ పదవులు చేసి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారంటే రాజు రాజకీయ చతురత అర్ధమవుతుంది. అందువల్లే ఈసారి టికెట్ మళ్లీ ఆయనకే వస్తుందని అతని వర్గీయులు చెప్పుకుంటున్నారు. కానీ రెండుసార్లు ఎమ్మెల్యే అయినా పనులేమీ చేయకుండా తీవ్ర వ్యతిరేకత మూట కట్టుకున్న రాజుకు టికెట్ రావడం అసాధ్యమేనన్న అభిప్రాయం మెజారిటీ టీడీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. అందుకే టీడీపీ టికెట్ కోసం పోటీ పడుతున్న జాబితా పెద్దదవుతోంది. బరిలోకి ‘మల్లు’డు గోవాడ షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ గూనూరు మల్లునాయుడు ఈసారి ఎమ్మెల్యే సీటుకు సిద్ధమయ్యారని అంటున్నారు. ఈ క్రమంలోనే తమ సామాజిక వర్గానికి చెందిన మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడితో సంబంధాలు నెరుపుతూ టిక్కెట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అవంతి ఆసక్తి ‘ఎంపీగా చేద్దామా.. ఎమ్మెల్యేగా చేద్దామా.. అసలు ఎక్కడి నుంచి పోటీ చేద్దాం.. అనకాపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేద్దామా,, లేక విశాఖ నగరంలోని ఏదో ఒక నియోజకవర్గం ఎంచుకోవడమా.. లేదా చోడవరం నుంచి చేద్దామా..’ ఇలా ఇప్పటివరకు ఎటూ తేల్చుకోలేకపోయిన అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు ఈసారి చోడవరం నుంచి పోటీ చేయాలన్న యోచనలో ఉన్నారని చెబుతున్నారు.. తన సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండటం, ఎంపీగా వస్తూ పోతూ తన కంటూ ఓ ప్రత్యేక వర్గాన్ని కూడా తయారుచేసుకున్న అవంతి కన్ను చోడవరంపై ఉందన్న వాదన వినిపిస్తోంది. గంటా వారసుడొస్తాడా? చోడవరం నుంచే తొలిసారి శాసనసభకు ఎన్నికైన గంటా శ్రీనివాసరావుకు ఇప్పటికీ నియోజకవర్గంలో వర్గ ప్రాబల్యం ఉంది. ఎన్నికలకో నియోజకవర్గానికి తిరిగే గంటా ఇప్పటివరకు ఒకసారి పోటీ చేసిన సెగ్మెంట్ నుంచి మళ్లీ పోటీ చేయలేదు. ఈ లెక్కన గంటా తిరిగి చోడవరానికి రావడం అనుమానంగానే ఉన్నా.. ఆయన కుమారుడు జయదేవ్(రవితేజ)ను మాత్రం ఈసారి ఇక్కడి నుంచే రాజకీయ ఆరంగ్రేటం చేయిస్తారన్న ప్రచారం సాగుతోంది. ఆ మధ్య తాను నటించిన తొలి చిత్రం జయదేవ్ విడుదల సందర్భంగా చోడవరం వచ్చిన గంటా కుమారుడు రవితేజ... చోడవరం నుంచి పోటీ చేయాలనుందని చెప్పి టీడీపీలో కొత్త చర్చకు తెరలేపారు. ఎన్నికల్లో పోటీ విషయమై చివరి నిమిషం వరకు ఎటూ తేల్చని గంటా అటు తిరిగి ఇటు తిరిగి చివరికి ఆయనే చోడవరం వస్తారా.. లేదా తన కుమారుడిని రంగంలోకి దించుతారా అన్నది ఎన్నికల వరకు ప్రశ్నార్ధకమే. ఆడారి కుటుంబం ఇక్కడకొస్తుందా? విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు కుటుంబం నుంచి అతని కుమార్తె, కుమారుల్లో ఎవరో ఒకరిని ఇక్కడ బరిలోకి దించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. సుమారు 11వేల వరకు తమ సామాజిక వర్గ ఓట్లు ఉండటంతో ఆడారి కుటుంబం టికెట్ కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నట్టు చెబుతున్నారు. రెండు సార్లు తన విజయానికి ఆడారి తులసీరావు ఎంతో కొంత సాయం చేశారనే భక్తితో రాజు ఆయన్ను రాజకీయ గురువుగా భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఒకవేళ రాజు ఈసారి నిలబడకపోతే తమకు మద్దతు ఇవ్వాలని ఆడారి కుటుంబం అతన్ని అడిగే అవకాశముంది. వాస్తవానికి రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు తోడు.. రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసినా ఏమీ చేయని రాజు నిర్వాకానికి చోడవరంలో దేశం ప్రభ ఎప్పుడో తగ్గిపోయింది. కేవలం పోటీ కోసమే టీడీపీ నేతలు క్యూ కట్టడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. -
జన్మభూమి కమిటీ సభ్యుడు ఆత్మహత్య
శ్రీకాకుళం, నరసన్నపేట: గోపాలపెంట జన్మభూమి కమిటీ సభ్యుడు, టీడీపీ కార్యకర్త చిట్టి పాపారావు(40) ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. మంగళవారం మధ్యాహ్నం మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. సోమవారం నుంచి పాపారావు కనిపించక పోవడంతో తల్లిదండ్రులు సత్యనారాయణ, లక్ష్మినర్సమ్మ, భార్య లక్ష్మి ఆందోళన చెందారు. మంగళవారం ఉదయం నుంచి బంధువులను వాకాబు చేశారు. ఫోను కూడా పనిచేయక పోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చేందుకు సిద్ధమవుతుండగా అదే గ్రామ శివార్లలో జీడి తోటల్లో మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించారు. పాపారావు హత్యకు గురయ్యాడని ముందుగా వదంతులు వచ్చాయి. సమాచారం తెలుసుకున్న స్థానిక సీఐ పైడిపునాయుడు, ఎస్ఐ నారాయణస్వామి సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. పాపారావు ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు. మృతదేహం పక్కనే పురుగు మందు డబ్బా ఉండటం, ఆత్మహత్య చేసుకుంటున్నట్టు మృతుడి వద్ద ఉత్తరం ఉండటంతో పోలీసులు వాటి ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి తండ్రి సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెలుగు అధికారుల తీరుపై ఆరోపణలు కాగా గోపాలపెంట ఇసుక ర్యాంపు నిర్వహణ సందర్భంగా వెలుగు ఏసీ రవి, ఏపీఎం గోవిందరాజులు తనతో అనేక తప్పులు చేయించారని, దీంతో గ్రామంలో మాట పడ్డానని, ఏసీ, ఏపీఎంను మాత్రం క్షమించకూడదని పాపారావు సూసైడ్ నోట్లో పొందుపరిచాడు. ఆ తప్పులు ఏమిటి అనేది పోలీసులు దర్యాప్తు చేస్తే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. కాగా పాపారావు మృతితో కుటుంబ సభ్యుల రోదన మిన్నంటింది. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
ఏరు దాటేవరకు మల్లన్న..ఏరు దాటాక బోడి మల్లన్న..
చిత్తూరు కలెక్టరేట్: ఏరు దాటేవరకు మల్లన్న..ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్లు కొత్త రేషన్ కార్డుల మంజూరులో ప్రభుత్వ తీరు కొట్టొచ్చినట్లు కనబడుతోంది. జన్మభూమి కార్యక్రమాలు జరిగేంత వరకు ప్రతి ఒక్క కుటుంబానికి రేషన్ కార్డు అందిస్తామని చెప్పిన ప్రభుత్వం, జన్మభూమి అనంతరం కొత్త కార్డులకు మొండి చేయి చూపుతోంది. జిల్లాలో రేషన్‌కార్డు లేనివారికి కొత్త కార్డులను అందించడం కలగా మారింది. జన్మభూమిలో స్లి్పట్ కార్డుల కింద కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఆఖరు కు మొండిచేయి చూపుతోంది. సాధికార సర్వేలో వేరుకాపురం ఉన్నట్లు నమోదు చేసుకోవాలని, లేదంటే గతంలోని కార్డుల్లోనే కొనసాగాలంటూ అధికారులు సూచిస్తున్నారు. సాధికార సర్వేలో నమోదుకు వెళితే ఆ విధానం చేపట్టడం కుదరదని సంబంధిత అధికారులు తేల్చి చెబుతుండడంతో కొత్త కార్డులపై ఆశలు వదులుకోవాల్సి వస్తోంది. జిల్లాలో ఈ ఏడాది జనవరికి 10,91,262 కుటుంబాలకు రేషన్ కార్డులు ఉండగా, ఐదో విడత జన్మభూమి సమయానికి మరో 16,649 కొత్త రేషన్ కార్డులను మాత్రమే ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో ప్రజలు ప్రతి గ్రామ సభలో రేషన్ కార్డులు మంజూరు కాలేదంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడంతో పాటు అధికారులను, ప్రజాప్రతినిధులను నిలదీశారు. ముఖ్యంగా కొత్తగా వివా హం చేసుకుని కుటుంబం నుంచి విడిపోయి వేరుకాపురం పెట్టుకున్న వారికి కొత్త కార్డులు ఇవ్వడంలో ప్రభుత్వం మొండిచేయి చూపిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తప్పని తిప్పలు కొత్త రేషన్ కార్డులు పొందాలనుకునే వారికి తిప్పలు తప్పడం లేదు. జన్మభూమి గ్రామ సభలో మాత్రం అధికారులు స్లి్పట్ కార్డుల కింద జనవరి 25 నుంచి మీ–సేవా కేంద్రాల ద్వారా కొత్త రేషన్‌కార్డులు పొందే విధంగా వెసులు బాటు కల్పిస్తున్నట్లు ప్రకటించారు. జన్మభూమి ముగిశాక ప్రభుత్వం స్లి్పట్ కార్డులపై ఆశలను గల్లంతు చేస్తోంది. దీనిపై దరఖాస్తుదారులు అధికారులను ప్రశ్నిస్తే, ఒకసారి సాధికార సర్వే వెబ్సైట్ ఓపెన్ కాదని, నమోదు కుదరదని, మరోసారి వేరు కాపురం ఉన్నట్లు నమోదు చేసుకోవాలని చెప్పడం గమనార్హం. దీంతో తిరిగి పాత కార్డుల్లోనే వారి పేర్లను కొనసాగించుకునేందుకు కూడా మరో మారు దరఖాస్తు చేసుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వం పక్కా మోసం కుటుంబాల నుంచి వివాహనంతరం వేరుపడి కొత్త కాపురాలు పెట్టుకున్న, ఉమ్మడి కుటుంబం నుంచి వేరు పడిన వారికి స్లి్పట్ కార్డులు మంజూరు చేయడంలో ప్రభుత్వం మొండిచేయి చూపింది. ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజురు చేస్తే వచ్చే నష్టమేమి లేదు. అయితే ఈ కొత్త కార్డుల ద్వారా పక్కా గృహాలు, వివిధ పథకాల ఫలాలను పెంచాల్సి వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం జిల్లాలో మొత్తం 49,832 స్లి్పట్ కార్డులను రద్దు చేసినట్లు తెలుస్తోంది. కొత్త కార్డులు కావాల్సిన వారు విడిగా కాపురం ఉన్నట్లు సాధికార సర్వేలో నమోదు చేసుకుని ఉండాలని మెలిక పెడుతోంది. ఇది పక్కా మోసం చేయడమేనని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. -
పుస్తకం ముట్టితే ఒట్టు!
ఒంగోలు/చీరాల అర్బన్: ప్రభుత్వ కార్యక్రమాలతో సర్కారు పాఠశాలల్లో చదువులు గాలిలో దీపంలా మారుతున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం, దాని నిర్వహణకు ముందు రెండు రోజులు ప్రిపరేషన్, ఆ తర్వాత మరొకటి.. ఇలా ఒకటి తర్వాత ఒకటిగా కార్యక్రమాల నిర్వహణతో ప్రభుత్వ పాఠశాలలో చదువులు ముందుకు సాగడంలేదు. ఈ ఏడాది జనవరి నెల మొత్తం విద్యార్థులకు బోధన అంటే ఏమిటో తెలియకుండా గడిచిపోయింది. అసలే ప్రభుత్వ పాఠశాలలపై ఇప్పటికే సమాజంలో వ్యతిరేక భావన ఉంది. దీనికి తోడు ఇటాంటి కార్యక్రమాలతో ప్రభుత్వమే విద్యను నిర్వీర్యం చేసేలా ఉందని, పదోతరగతి పరీక్షలు ప్రారంభం కానున్న సమయంలో విద్యార్థులు ఎంతో నష్టపోతారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనందిస్తామని, డిజిటల్ క్లాసు రూములు, బయోమెట్రిక్ ఏర్పాటు అంటూ టీడీపీ సర్కారు గొప్పలు చెప్పుకుంటోంది. కానీ బడిలో పాఠం చెబుదామని పుస్తకం పట్టుకోగానే ఏదో ఒక కారణంతో విద్యార్థులను బయటకు తీసుకువెళుతుంటే తాము ఎవరికి విద్యబోధించాలో అర్థం కావడంలేదని ఉపాధ్యాయుల నుంచి ఆవేదన వ్యక్తం అవుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధనకు ఎస్‌సీఈఆర్‌టి రూపొందించిన అకడమిక్ క్యాలెండర్ ప్రామాణికమని, కానీ అది కూడా అమలు చేయలేని పరిస్థితులు నెలకొంటున్నాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదీ కార్యక్రమాల తీరు.. 2017 డిసెంబర్ 14వ తేదీ మొదలు 2018 జనవరి నెలాఖరు వరకు పాఠం చెప్పేందుకు ఉపాధ్యాయునికి సరైన అవకాశమే లేకుండా పోయిందనేది యదార్థం. డిసెంబర్ 14 నుంచి 22వ తేదీవరకు సమ్మేటివ్ 1 పరీక్షలు నిర్వహించారు. 23 నుంచి క్రిస్మస్ శెలవులు ప్రకటించారు. 28, 29 తేదీలలో జిల్లాస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఇదే సమయంలో గణిత సప్తాహాల నిర్వహణకు ప్రభుత్వం పిలుపు ఇవ్వడంతో కొన్ని రకాల తరగతులకు మంగళం పాడక తప్పలేదు. ఇక 31వ తేదీ శెలవు కావడంతో పాఠశాలల్లో ముందస్తుగా అంటే డిసెంబర్ 30వ తేదీనే పాఠశాలల అలంకరణ కార్యక్రమాలపై విద్యార్థులు దృష్టిసారించడం, ఒంగోలులో గజల్ శ్రీనివాస్ కార్యక్రమ విజయోత్సవంలో విద్యార్థులే పెద్ద ఎత్తున హాజరుకావాల్సి రావడం గమనార్హం. జనవరి 1న జిల్లాలో అత్యధిక శాతం పాఠశాలలు ఆప్షనల్ హాలిడే ప్రకటించేసుకున్నాయి. 2 నుంచి 11వ తేదీవరకు క్రీడాజన్మభూమిగా నామకరణం చేసి రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లోని విద్యార్థులు అందరినీ పదో తరగతి సహా విద్యార్థులు క్రీడల్లో పాల్గొనేటట్లు చేయాలని ఆదేశించడంతో ఒక వైపు క్రీడలు, 5కె రన్, మరో వైపు విద్యార్థులకు వ్యాసరచన, వ్యక్తృత్వ పోటీలు, పాఠశాల స్థాయి, మండల స్థాయి వంటి ఆటల పోటీలతోపాటు ఓడిఎఫ్‌పై ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 12వ తేదీనుంచి 21 వరకు సంక్రాంతి సెలవులు. 23న 3కెరన్ పోటీలు నిర్వహణ, అదేరోజు మద్యాహ్నభోజన కార్మికులు సమ్మె నోటీసు ఇవ్వడంతో విద్యార్థులకు భోజన ప్రక్రియకు అంతరాయం లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఉపాధ్యాయులపైనే పడింది. 23,24 తేదీలలో గణ తంత్ర దినోత్సవ పోటీలు నిర్వహించి 25వ తేదీ జాతీయ ఓటర్ల దినోత్సవం ర్యాలీ నిర్వహించారు. 26వతేదీ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. 27వ తేదీ సూర్య ఆరాధన కార్యక్రమంలో భాగంగా వ్యక్తృత్వం, వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. 28న ఆదివారం అయినా ఉదయాన్నే సూర్య నమస్కారాలు నిర్వహించాల్సి వచ్చింది. ఇక ఈనెల 31వ తేదీవరకు ఒక వైపు స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు, మరో వైపు డీఎస్సీ 2014 ఉపాధ్యాయులకు శిక్షణ వెరసి విద్యాబోధన కుంటుపడింది. 29 నుంచి 31వ తేదీవరకు స్టూడెంట్ లెర్నింగ్ అచీవ్మెంట్ సర్వే అంటూ పరీక్షలు పాఠశాలల్లో జరగనున్నాయి. కార్యక్రమాల వివరాలు.. జనవరి 2 నుంచి 11 వరకు – జన్మభూమి–మా ఊరు జనవరి 12 నుంచి 21 వరకు – సంక్రాంతి సెలవులు జనవరి 22 – అమ్మకు వందనం జనవరి 23 – రిపబ్లిక్ డే సందర్భంగా ఆటల పోటీలు జనవరి 24– జాతీయ బాలికా దినోత్సవం జనవరి 25 –ఓటర్ దినోత్సవం జనవరి 26– రిపబ్లిక్ దినోత్సవం జనవరి 28– సూర్యారాధన -
సమయం లేదా మిత్రమా!
సంక్షేమ పథకాలొస్తే చాలు లబ్ధిదారుల ఆనందానికి అవధులుండవు. ఎప్పుడెప్పుడు చేతికొస్తుందా అని ఎదురు చూస్తుంటారు. వాటి ఫలాలు అందుకోవాలని ఆత్రుతతో ఉంటారు. జిల్లాకు తాజాగా మంజూరైన పింఛన్ల కోసం వృద్ధులు, వికలాంగులు, వితంతువులు అదే తరహాలో కళ్లల్లో ఒత్తులు వేసుకొని ఆశగా చూస్తున్నారు. కానీ, జన్మభూమి కమిటీల అవతారమెత్తిన ‘పచ్చ’గెద్దలు వారితో పరిహాసమాడుతున్నాయి. ‘సమయం లేదా మిత్రమా!’ అన్నట్టుగా అధికారం మరెంతో కాలం ఉండదన్న ఉద్దేశంతో డబ్బులు దండుకునే పనిలో పడ్డాయి. సొమ్ములిస్తేనే పింఛన్లు వస్తాయని టీడీపీ నేతలు బాహాటంగానే చెబుతున్నారు. డీల్ కుదిరితేనే ఎంపిక చేస్తామని.. లేదంటే అంతే సంగతులని çసంకేతాలు పంపిస్తున్నారు. ప్రతి సంక్షేమ పథకానికో రేటు కట్టి.. తమ రూటే సెప‘రేట’ని చెబుతున్నారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ: వైఎస్సార్ హయాంలో శాచ్యురేషన్ మోడ్(సంతృప్తి స్థాయి)లో సంక్షేమ పథకాలు అమలయ్యేవి. అర్హులైన వారందరికీ పథకాలు దక్కేవి. కానీ, టీడీపీ అధికారంలోకి వచ్చాక శాచ్యురేషన్కు తిలోదకాలిచ్చేసింది. చిత్తశుద్ధి పక్కన పెట్టి అరకొర కేటాయిం పులతో కాలయాపన చేసుకొస్తోంది. ఇదే టీడీపీ నేతలకు కలిసొచ్చేలా చేస్తోంది. తక్కువ ఉన్నాయన్న పేరుతో డిమాండ్ సృష్టించి.. పోటీ పెట్టి.. రేటు కట్టి.. చివరకు అడిగినంత ముట్టజెప్పేవారికే కట్టబెడుతున్నారు. ఇళ్లు కావాలంటే నోట్లు ముట్టజెప్పాలి. పింఛను కావాలంటే ముడుపులు కట్టాలి. ఇలా ప్రతిదానిలో వసూళ్ల పంథానే కొనసాగిస్తున్నారు. రోజురోజుకూ మితిమీరిపోతున్న వీరి ఆగడాలు చూడలేక చివరకు మిత్రపక్షమైన బీజేపీ నేతలు సహితం బాహాటంగా నిలదీస్తున్న పరిస్థితి నెలకొంది. మిత్రపక్ష నేతగా భావించి తనకు తెలిసిన అర్హుడైన ఒకాయనకు ఇల్లు మంజూరు చేయించాలని టీడీపీ ఎమ్మెల్యేకొకరికి జిల్లాకు చెందిన బీజేపీ ప్రజాప్రతినిధి సిఫారసు చేశారు. బీజేపీ నేత చెప్పారని సదరు ఆశావహుడు ఎమ్మెల్యే వద్దకు వెళ్లగా.. తొలుత టీడీపీ కండువా వేసుకోవాలని సూచించాడు. ఆయన అనుచరులైతే తమ రూటే సెప‘రేటు’ అని పరోక్ష సంకేతాలిచ్చారు. ఇంకేముంది! సదరు వ్యక్తి అవాక్కయ్యాడు. ఇలాంటివన్నీ చూసి తట్టుకోలేక కేంద్ర ప్రభుత్వ పథకమైన ‘‘హౌస్ ఫర్ ఆల్’’ కింద వచ్చిన ఇళ్లను ముడుపులు తీసుకుని ఇస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాలకొండయ్య నేరుగా ఆరోపణలు చేశారు. పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని ఒక గ్రామంలో అర్హులైన 50 మంది పింఛను కోసం ఎదురు చూస్తున్నారు. ఆ గ్రామానికి ఐదారుగురికి మాత్రమే కొత్తగా ఇచ్చేందుకు పంపకాలు జరిగాయి. ఇంకేముంది! వచ్చిన అరకొర పింఛన్లకు డిమాండ్ పెరిగింది. ఓటుకు నోటు మాదిరిగా పింఛన్‌కు రేటు పలికింది. ఒక్క ఆ గ్రామంలోనే కాదు జిల్లావ్యాప్తంగా ఇదే దందా నడుస్తోంది. డిమాండ్ మేరకు రేటు పెడుతున్నారు. రూ.వెయ్యి నుంచి రూ.5 వేల వరకూ పింఛన్ కోసం వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా కేంద్రమైన కాకినాడలో పెద్ద రగడే జరుగుతోంది. అర్హుల్ని పక్కన పెట్టి అనర్హులకు పింఛన్లు కట్టబెడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఎవరెక్కువ ఇస్తే వారికే పింఛను అని బేరం పెడుతున్నారు. అనుకున్నట్టుగా లావాదేవీలు జరిగిన చోట సిఫారసు చేశారు. మిగతాచోట్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వ్యూహాత్మకంగా పక్కన పెట్టేశారు. ఒప్పందాలు కుదిరేవరకూ లబ్ధిదారులను సిఫారసు చేయకూడదని మొండి వైఖరితో వ్యవహరిస్తున్నారు. దీంతో పింఛన్ల మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతోంది. డబ్బే పరమావధిగా.. నియోజకవర్గానికి 2 వేల చొప్పున జిల్లావ్యాప్తంగా 38 వేల పింఛన్లను కొత్తగా ఇస్తున్నట్టు ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఇవి జిల్లాకు ఏమాత్రం సరిపోవు. ఈ అరకొర పింఛన్లతో సొమ్ము చేసుకోవడానికి జన్మభూమి కమిటీ సభ్యులు వసూళ్లకు ఉపక్రమించారు. అవి కూడా తెలుగు తమ్ముళ్లకే కట్టబెట్టేందుకు తెరలేపారు. ఈ క్రమంలో ఒప్పందాలు చకచకా జరగకపోవడంతో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. జిల్లాలో 38 వేల పింఛన్ల కోసం ఇప్పటివరకూ కేవలం 6,400 పేర్లను మాత్రమే జన్మభూమి కమిటీలు సిఫారసు చేశాయి. మిగతావి ఇంకా కొలిక్కి రాలేదు. అనుకున్న రేటు పలికే వరకూ ఖరారు చేసేలా కనిపించడం లేదు. ఇక డబ్బులు తీసుకుని సిఫారసు చేసిన దరఖాస్తుల్లో చాలావరకూ అనర్హులుండటంతో ప్రజా సాధికార సర్వేతో సరిపోల్చేసరికి వారి బాగోతం బయటపడుతోంది. అలాంటి దరఖాస్తులన్నింటినీ అధికారులు తిరస్కరిస్తున్నారు. ఈవిధంగా జిల్లాలో ఇప్పటివరకూ జన్మభూమి కమిటీలు సిఫారసు చేసిన 800 మంది దరఖాస్తుల్ని పక్కన పెట్టేశారు. -
పింఛన్ వంచన
‘మన ప్రభుత్వ హయాంలోనే బోగస్ వ్యక్తులకు పింఛన్లు మంజూరు కావడం.. మనకే మచ్చగా మిగులుతుంది.. పింఛన్ల మంజూరు బాధ్యత జన్మభూమి కమిటీలకు ఇచ్చిన తర్వాతే బోగస్ బెడద పెరిగింది.. నా నియోజకవర్గంలోనే పరిశీలిస్తే.. 1267 నకిలీ పింఛన్లు బయటపడ్డాయి’.. .. ఈ మాటలన్నది ఎవరో సాధారణ వ్యక్తి కాదు.. సాక్షాత్తు రాష్ట్ర మంత్రి అయ్యన్నపాత్రుడే పింఛన్ల బండారాన్ని ఇలా బయటపెట్టారు.. అదీ ముఖ్యమంత్రి వద్ద కుండబద్దలు కొట్టారు..టీడీపీ అధికారంలోకి వచ్చిన 2014 నుంచీ ఇదే దందా సాగుతోంది.. ఒక్క నర్సీపట్నం నియోజకవర్గంలోనే కాదు.. విశాఖ నగరంతో సహా జిల్లావ్యాప్తంగా జన్మభూమి కమిటీల నిర్వాకం ఫలితంగా వేలాది బోగస్ లబ్ధిదారులు సంక్షేమ పింఛన్లు దక్కించుకుంటే.. అర్హులైన వారు దీనంగా దిక్కులు చూస్తున్నారు. సాక్షి, విశాఖపట్నం: ‘బోగస్’ తుట్ట కదులుతోంది.. నర్సీపట్నంలో అర్హత లేనివారికి పెన్షన్లు దక్కినట్టు నిర్ధారణ కావడంతో అధికారులు జిల్లావ్యాప్తంగా మరోసారి సర్వేకు సిద్ధమవుతున్నారు. స్వయంగా మంత్రి అయ్యన్న అవకతవకలను బయటపెట్టడంతో సమగ్ర నివేదిక పంపాల్సిందిగా సీఎం చంద్రబాబు కలెక్టర్‌ను ఆదేశించారు. థర్డ్ పార్టీ ద్వారా ఈ పరిశీలన చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం రంగం సిద్ధం చేస్తోంది. నిష్పక్షపాతంగా సర్వే చేస్తే భారీ స్థాయిలో రద్దు చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. టీడీపీ హయాంలో మంజూరు చేసిన కొత్త పింఛన్లలో 80 శాతం టీడీపీ కార్యకర్తలు, ఆ పార్టీ సానుభూతిపరులకే కట్టబెట్టారు. వీరిలో 90 శాతంమంది అనర్హులే. గడిచిన మూడున్నరేళ్లలో మంజూరు చేసిన 40 వేల పింఛన్లలోనే 30 వేలకు పైగా అనర్హులకు దక్కాయని అధికారులే చెబుతున్నారు. జన్మభూమి కమిటీలు సిఫార్సు చేశాయి.. ఎమ్మెల్యేలు ఆమోద ముద్ర వేశారు కాబట్టి తాము ఆపలేకపోయామంటున్నారు. అంతేకాదు సిటీలో ఉన్న వారికి గ్రామీణ ప్రాంతాల్లోనూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న వారికి సిటీలోనూ పింఛన్లు మంజూరు చేసిన దాఖలాలు కూడా బయటçపడ్డాయి. ఐదెకరాల పంట భూములు, డూప్లెక్స్ ఇళ్లు, స్థలాలు, కార్లు ఉన్న వారికి సైతం పింఛన్లు మంజూరు చేశారు. అంతే కాదు.. 50–55 ఏళ్ల వయసున్న వారు సైతం ఆధార్ కార్డుల్లో వయసు మార్చుకొని మరీ పింఛన్లు పొందారు. మరో 3 నియోజకవర్గాల్లో భారీ అవకతవకలు నర్సీపట్నం తరహాలోనే అనకాపల్లి, పాయకరావుపేట, పెందుర్తి నియోజక వర్గాల్లో గడిచిన మూడేళ్లలో పెద్ద ఎత్తున బోగస్ పింఛన్లు మంజూరైనట్టుగా సంబంధిత శాఖాధికారులే అంగీకరిస్తున్నారు. అన్నీ తెలిసుండి కూడా తాము ఏమీ చేయలేకపోతున్నామని వాపోతున్నారు. నర్సీపట్నం తరహాలో జీవీఎంసీతోపాటు మొత్తం జిల్లా అంతటా సర్వే చేస్తే మంజూరు చేసిన వాటిలో 80 శాతం పింఛన్లు రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటున్నారు. అదే కనుక జరిగితే ప్రభుత్వానికి డామేజి వస్తుందన్న అభిప్రాయం అధికార టీడీపీ పెద్దల్లో నెలకొంది. వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై గురి బోగస్ ఏరివేత నెపంతో వైఎస్సార్సీపీకి చెందిన కార్యకర్తలు, సానుభూతిపరుల పింఛన్లపై వేటు వేసేందుకు టీడీపీ నేతలు సమాయత్తమవుతున్నట్టు ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ విధంగా ఇప్పటికే మౌఖిక ఆదేశాలు కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఐదో విడతలో మంజూరైన 30 వేల పింఛన్ల కోసం ఎంపిక చేసిన లబ్ధిదారులు అర్హులా కాదా అన్న విషయాన్ని నిర్ధారించేందుకు ప్రత్యేక బృందాలతో సర్వే చేయించనున్నారు. ఆ తర్వాత ప్రజాసాధికారత సర్వేతోపాటు ప్రస్తుతం ఉన్న వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్లను అనుసంధానించి పరిశీలించాలని భావిస్తున్నారు. నకిలీ పింఛన్ల బాగోతంతో అధికార టీడీపీలో కుదుపు మొదలైంది. -
ఎమ్మెల్యే తీరుపై రగిలిపోతున్న పార్టీ కేడర్
సాక్షి, కాకినాడ: జన్మభూమి సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వర్గాల మధ్య నెలకొన్న వివాదం చిలికిచిలికి గాలివానగా మారి ఆ పార్టీలో అసమ్మతికి తెరలేపింది. ఇప్పటికే ఎమ్మెల్యే తీరుపై తీవ్ర అసహనంతో ఉన్న టీడీపీ కేడర్ ఇప్పుడు బాహాటంగానే తమ అసంతృప్తిని వెళ్ల్లగక్కుతుండడం పార్టీ వర్గాల్లో కలవరం మొదలైంది. ఇది కాస్తా పార్టీ అధినేత చంద్రబాబునాయుడుతో పాటు ఆయన తనయుడు లోకేష్‌కు ఫిర్యాదు చేసేవరకు వెళ్లింది. ఎమ్మెల్యే ఒంటెత్తు పోకడలతో ఇప్పటికే అనపర్తి జెడ్పీటీసీ సభ్యుడు కర్రి ధర్మారెడ్డి (దొరబాబు) పార్టీ కార్యకలాపాలకు చాలాకాలంగా దూరమయ్యారు. ఇటీవల జరిగిన జన్మభూమి సభలకూ ఆయన గైర్హాజరయ్యారు. వారిరువురి మధ్యా ఎమ్మెల్యే తండ్రి మూలారెడ్డి కుదిర్చిన సయోధ్య ఎంతోకాలం నిలువలేదని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. పైగా ఎమ్మెల్యేపై అలకబూనిన జెడ్పీటీసీ సభ్యుడితో పాటు మరికొందరు నేతలు, కార్యకర్తలు ఇటీవల రహస్యంగా సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించి, అదే విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలిసింది. ఓ వైపు వైఎస్సార్ సీపీ కో–ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ఎమ్మెల్యే అవినీతిపై పోరాటం చేస్తున్న నేపథ్యంలో తాజాగా నెలకొన్న అంతర్గత వివాదం ఆ పార్టీ నేతలకు మింగుడుపడడంలేదు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ రాకుండా ఆయన బంధువర్గం నుంచి కూడా ప్రయత్నాలు గట్టిగానే జరుగుతున్నాయని టీడీపీ వర్గాల సమాచారం. ప్రస్తుతం జిల్లా స్థాయి పదవిలో ఉన్న బంధువు ప్రస్తుతంగా అంతర్గతంగా నెలకొన్న వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు పావులుకదుపుతున్నారంటున్నారు. ఈ వ్యవహారం అనపర్తి నియోజకవర్గంతోపాటు జిల్లా టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారం ఎలా ముగుస్తుందోనన్న ఆసక్తి ఆ పార్టీ శ్రేణుల్లో నెలకొంది. -
జన్మభూమి జాతర ముగిసింది
ప్రొద్దుటూరు టౌన్ : విందులు.. వినోదాలు... క్యాబరే డ్యాన్స్‌లతో జన్మభూమి జాతర ముగిసిందని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. పట్టణంలోని రామేశ్వరం రోడ్డులో ఏర్పాటు చేసిన డెమో ఇంటి వద్ద విలేకరులతో శనివారం ఆయన మాట్లాడారు. జన్మభూమి వల్ల ప్రజా ప్రయోజనం శూన్యమన్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారని పేర్కొన్నారు. మరొక్కసారి ప్రజలను ఆశల పల్లకీలో మోసేదానికి అధికారుల అవస్థలు అన్నీ ఇన్నీ కావని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడ్డాక ఐదు విడుతల్లో జన్మభూమి సభల ద్వారా ప్రజలకు ఏమేరకు ప్రయోజనం చేకూర్చారో చెప్పాలన్నారు. వారి సమసమస్యలను ఎంత వరకు పరిష్కరించారో అధికారులు, అధికార పార్టీ నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరారు. ఇందులో ఆశ్చర్యకరం, తమాషా ఏమిటంటే వారి సభలకు వారే అవార్డులు ఇచ్చుకున్నారని తెలిపారు. ఈ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నానని, ఎందుకు, ఎవరికి అవార్డులు కలెక్టర్ ప్రకటిస్తారని పేర్కొన్నారు. 10, 11 వార్డుల్లో గొప్పగా ప్రభుత్వాన్ని పొగిడినందుకా, అంతకంటే గొప్పగా ప్రజలను మోసం చేసినందుకా అనే విషయాన్ని కలెక్టర్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఏ ప్రభుత్వానికైనా, అది సాగించే పాలనకైనా అవార్డులు ఇవ్వాల్సింది ప్రజలనే విషయం తెలుసుకోవాలని అన్నారు. ఐదు విడుతల జన్మభూమి సభల్లో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఫిర్యాదులు, అభ్యర్థనలు, ఖర్చు చేసిన ప్రజాధనం ఎంత అనేది ప్రభుత్వం నిజాయితీతో శ్వేత పత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇళ్ల పట్టాలు ఇప్పిస్తామని సీఎం సభకు మహిళలు బా«ధ కలిగించే అంశం ఏమిటంటే సీఎం పులివెందులకు వస్తే ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని పదివేల మందిని ఆర్టీసీ బస్సుల్లో తరలించారన్నారు. జన్మభూమి ముగింపు సభలో మళ్లీ పట్టాలు ఇస్తామని బలవంతంగా వారి స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ మహిళలను కూర్చోబెట్టారన్నారు. ప్రజా సమస్యల గురించి ప్రశ్నిస్తే పశువులను ఈడ్చినట్లు ప్రతి పక్ష నాయకులను ఈడ్చడం దుర్మార్గమన్నారు. కేసులు పెట్టడం మరీ దారుణమన్నారు. దీన్ని ప్రజాస్వామ్యం అంటారో, మిలటరీ పాలన అంటారో సమాధానం చెప్పాలన్నారు. జన్మభూమి సభల ద్వారా ప్రభుత్వం జనంలో విశ్వాసాన్ని కోల్పోయిందని తెలిపారు. 2019 ఎన్నికల్లో టీడీపీ జన్మభూమి సభల వైఫల్యంపై మూల్యం చెల్లించుకుంటుందన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ వంగనూరు మురళీధర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్, రాష్ట్ర మహిళా కార్యదర్శి జింకా విజయలక్ష్మి, పట్టణాధ్యక్షురాలు గజ్జల కళావతి, బడిమెల చిన్నరాజా, పోసా భాస్కర్, సోములవారిపల్లె శేఖర్, స్నూకర్ భాస్కర్ పాల్గొన్నారు. -
మాకిది కావాలని అడిగేవారు తక్కువ!
ఒంగోలు టౌన్: జిల్లాలో మాకిది కావాలని అడిగేవారు చాలా తక్కువగా ఉన్నారని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. పదిరోజుల పాటు జరిగిన ఐదో విడత జన్మభూమి – మాఊరు కార్యక్రమ ముగింఫు సభ శుక్రవారం స్థానిక ఏ–1 కన్వెన్షన్ హాలులో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్లు కావాలంటూ జిల్లాకు చెందిన ప్రజలు దరఖాస్తు చేసుకున్నారని, వాటన్నింటినీ త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. జిల్లాలో పోలీసు, రెవెన్యూ శాఖలకు సంబంధించిన సమస్యలు క్లియర్ చేయడంతో జన్మభూమి–మాఊరు సాఫీగా సాగిందన్నారు. ప్రజాస్వామ్యంలో సమస్యలు వస్తుంటాయని, ఆ సమస్యల పరిష్కారానికి జన్మభూమి–మాఊరు వేదికగా నిలిచిందని చెప్పారు. ఇదే స్ఫూర్తితో రానున్న కాలంలో పనిచేసి ప్రభుత్వాలకు మంచిపేరు తీసుకురావాలని కోరారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అధికారులు సమన్వయంతో అందరికీ అందేలా చూడాలన్నారు. సీఎంను నవ్వుతూ పంపించారు.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవ్వేది చాలా తక్కువని, అలాంటి ఆయన్ను జిల్లాలో జరిగిన జన్మభూమి సభ అనంతరం అధికారులు నవ్వుతూ పంపించారని శాసనమండలి సభ్యుడు కరణం బలరామకృష్ణమూర్తి ప్రశంసించారు. జిల్లాలో మైనస్ 72శాతం రెయిన్ ఫాల్ ఉందని, రాబోయో రోజుల్లో మరింత క్రిటికల్‌గా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్ అధికారులపై చాలా ఒత్తిడి ఉంటుందన్నారు. లీకేజీలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అందుబాటులో ఉండే నీటిని సక్రమంగా సరఫరా చేసేలా చూడాలని సూచించారు. బాగా పనిచేశారు: కలెక్టర్ జన్మభూమి కార్యక్రమ నిర్వహణకు సంబంధించి భయం, ఆందోళనకరంగా ఉన్నా అధికారులు బాగా పనిచేశారని కలెక్టర్ వి. వినయ్‌చంద్ ప్రశంసించారు. చిట్టచివరి గ్రామాల వరకు జన్మభూమి గ్రామసభలు సజావుగా జరిగాయన్నారు. జన్మభూమి గ్రామసభల్లో ప్రజల నుంచి వచ్చే అర్జీలను ఏరోజుకారోజు స్వీకరించి వాటిని ట్యాబ్‌ల ద్వారా అనుసంధానం చేసి నేరుగా తనతో పాటు ముఖ్యమంత్రి చూసే విధంగా ఏర్పాట్లు చేశారని చెప్పారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉండేందుకు డ్వాక్రా మహిళలను సాధికార మిత్రులుగా నియమించినట్లు తెలిపారు. 35 కుటుంబాలకు ఒక సాధికార మిత్రను నియమించి 15 రకాల భద్రతలు, 10 రకాల హామీలు ప్రజలకు చేరువయ్యే విధంగా చూస్తున్నారన్నారు. సభలో యర్రగొండపాలెం శాసనసభ్యుడు పాలపర్తి డేవిడ్‌రాజు, జాయింట్ కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్–2 మార్కండేయులు పాల్గొన్నారు. దర్శిలో జన్మభూమి – మాఊరు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించిన సమయంలో ఆయన్ను ఆకట్టుకున్న ముండ్లమూరు మండలం బృందావనం గ్రామానికి చెందిన 8వ తరగతి విద్యార్థి విజయకుమార్ పేరున సీఎం ఆదేశాల మేరకు 50 వేల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్‌ను మంత్రి శిద్దా అందించారు. బెస్టు అవార్డులు జన్మభూమి–మాఊరు కార్యక్రమాల్లో ప్రతిభ కనబరచిన జిల్లాస్థాయి అధికారులు, మండలాలు, నగర పంచాయతీ అధికారులకు బెస్టు అవార్డులు ప్రకటించారు. శుక్రవారం స్థానిక ఏ–1 కన్వెన్షన్ హాలులో జరిగిన ముగింపు సభలో మంత్రి శిద్దా రాఘవరావు, ఎమ్మెల్సీ కరణం బలరామకృష్ణమూర్తి, శాసనసభ్యుడు పాలపర్తి డేవిడ్‌రాజు, కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి అవార్డులు అందించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి రాజ్యలక్ష్మి, పశుసంవర్థకశాఖ జాయింట్ డైరెక్టర్ రవీంద్రనాధ్‌ఠాగూర్, ఎల్డీఎం వెంకటేశ్వరరావు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి యతిరాజు, ఐసీడీఎస్ పీడీ సరోజిని, సీపీఓ కేటీ వెంకయ్యలకు ఉత్తమ అధికారులుగా అవార్డులు అందించారు. అదేవిధంగా నియోజకవర్గ ప్రత్యేక అధికారులు పోలప్ప (యర్రగొండపాలెం), రవి (దర్శి), ప్రభాకరరావు (పర్చూరు), శ్రీనివాసరావు (అద్దంకి), మురళి (చీరాల), శ్రీనివాసరావు (సంతనూతలపాడు), అన్నపూర్ణ (ఒంగోలు), మల్లికార్జున(కందుకూరు), ఉమాదేవి (కొండపి), కొండయ్య (మార్కాపురం), కిషోర్(గిద్దలూరు), కైలాస్ గిరీశ్వర్ (కనిగిరి)లకు అవార్డులు అందించారు. ఉత్తమ మండలాలుగా మార్కాపురం, జరుగుమల్లి మండలాలను ఎంపిక చేశారు. ఉత్తమ మునిసిపాలిటీలుగా కందుకూరుకు మొదటి స్థానం, మార్కాపురానికి రెండో స్థానం కింద అవార్డులు ఇచ్చారు. ఉత్తమ పంచాయతీలుగా అద్దంకి మండలం ధేనువకొండ, అర్ధవీడు మండలం అయ్యవారిపల్లి గ్రామాలకు అవార్డులు అందించారు. ఉత్తమ నగర పంచాయతీలుగా అద్దంకి, చీమకుర్తిలకు అవార్డులు అందించారు. చీరాల మునిసిపాలిటీలోని 1వ వార్డు, గిద్దలూరులోని 14వ వార్డు, కందుకూరులోని 12వ వార్డు, కనిగిరిలోని 15వ వార్డు, మార్కాపురంలోని 13వ వార్డు, ఒంగోలులోని 10వ డివిజన్‌ను ఎంపిక చేసి అవార్డులు అందించారు. చేదు అనుభవం ఐదో విడత జన్మభూమి–మాఊరు ముగింపు సభకు హాజరైన వారికి చేదు అనుభవం ఎదురైంది. సభకు జిల్లా నలుమూలల నుంచి అనేకమంది వచ్చారు. జిల్లా యంత్రాంగం వారికి అరకొరగా భోజన వసతి కల్పించింది. అతిథుల ప్రసంగాలు, సత్కారాలు ముగిసిన అనంతరం భోజనం చేసేందుకు వెళ్లిన వారికి అక్కడ టేబుళ్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. ఒకవైపు జనాలు ఉండటంతో ఆతృతగా అక్కడకు వెళ్లారు. అక్కడి సర్వర్లు తమ వద్ద మిగిలిన కిళ్లీలను ఇవ్వడం ప్రారంభించడం గమనార్హం. -
ఇదేమి విచిత్రం?
కర్నూలు, మద్దికెర: హడావుడిగా జరిపిన ఐదో విడత జన్మభూమి కార్యక్రమంలో ఓ వింత చోటు చేసుకుంది. రేషన్ కార్డులు ఇచ్చామని చెప్పుకునేందుకు అధికారులు నానా హంగామా చేసి చివరికి లబ్ధిదారులకు ఆవేదన మిగిల్చారు. మండలంలో గతంలో దరఖాస్తు చేసుకున్న వాటిల్లో 123 రేషన్ కార్డులు మంజూరయ్యాయి. వాటిని 5వ విడతలో పంపిణీ చేయాలని సిద్ధం చేశారు. తీరా కార్డుల్లో లబ్ధిదారుల ఫొటోలు లేకపోవడంతో అధికారులు నాలుక కరుచుకొని తూతూ మంత్రంగా ప్రతి పంచాయతీలో నలుగురికి చొప్పున పంపిణీ చేసి మిగతావి అలాగే ఉంచేశారు. -
జన్మభూమి సభలా.. అధికార పార్టీ సమావేశాలా..?
విజయనగరం మున్సిపాలిటీ: ప్రభుత్వం నిర్వహించిన జన్మభూమి సభలు ప్రభుత్వ కార్యక్రమంలా కాకుండా... అధికార పార్టీ సమావేశాలుగా నిర్వహించడం దారుణమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. స్థానిక సత్యకార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల ఇన్చార్జి మజ్జి శ్రీనివాసరావు, విజయనగరం, అరకు పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జిలు బెల్లాన చంద్రశేఖర్, శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్యలు మాట్లాడారు. ఈనెల 2 నుంచి 11వ తేదీ వరకు చంద్రబాబు సర్కారు నిర్వహించిన ఐదోవిడత జన్మభూమి కార్యక్రమం తీరును తుర్పూరబట్టారు. ప్రోటోకాల్ లేని టీడీపీ నాయకులను వేదికలపైకి ఎక్కించి స్థాయిగల అధికారులను కిందన కూర్చుండబెట్టడం విచారకరమన్నారు. ప్రజా సమస్యలను ప్రస్తావించేందుకు వచ్చిన ప్రతిపక్ష నేతలపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు దళితులపై భౌతిక దాడులకు పాల్పడే విష సంస్కృతిని ప్రోత్సహించటం దారుణమన్నారు. సభల పేరుతో రూ.కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు. గత నాలుగు విడతల్లో నిర్వహించిన జన్మభూమి సభల్లో జిల్లా వ్యాప్తంగా 3 లక్షల 32వేల 363 దరఖాస్తులు రాగా.. అందులో 48వేల 565 పెండింగ్‌లో ఉన్నాయని, ఇందులో రేషన్‌కార్డుల కోసం 22000 దరఖాస్తులు రాగా.. ప్రభుత్వం మంజూరు చేసినవి మాత్రం 5245 మాత్రమేనన్నారు. పింఛన్ల కోసం 9000 దరఖాస్తులు నమోదుకాగా మొండిచేయి చూపారన్నారు. లక్ష మంది పేదలకు నివాసగృహాలు అవసరంగా గుర్తించగా ఇప్పటి వరకు కేవలం 6,047 మందికి మాత్రమే మంజూరు చేయడం విచారకరమన్నారు. జిల్లా పరిషత్‌లో అధికారులపై, గజపతినగరంలో జరిగిన జన్మభూమి సభలో వెలుగు ఏపీఎంపై అధికార పార్టీ నాయకులపై దాడులు హేయమైన చర్యగా పేర్కొన్నారు. జిల్లాలో విధులు నిర్వహించేందుకు అధికారులు భయపడుతున్నారన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు బాసటగా నిలుస్తా ... పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వై.ఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలోని 1,75,000 మంది అగ్రిగోల్డ్ బాధితులకు బాసటగా నిలిచి, వారికి న్యాయం జరిగేలా పోరాటం చేస్తామని వైఎస్సార్సీపీ అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ సభ్యుడు మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. టీడీపీ పాలనలో జరిగిన మోసాలను ప్రజలు గ్రహిస్తున్నారని, తెల్లదొరలకు అభివర్ణించుకుంటున్న అధికార పార్టీ నాయకులను త్వరలోనే తరిమికొడతారన్నారు. తాగి వచ్చే భర్తలకు అన్నం పెట్టవద్దని సూక్తులు చెబుతున్న అశోక్‌గజపతిరాజు వారి ప్రభుత్వంలో విచ్చలవిడగా వెలసిన మద్యం షాపులు, బెల్టుదుఖాణాలు కోసం ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి అవనాపు విజయ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు అంబళ్ల శ్రీరాములనాయుడు, కె.వి.సూర్యనారాయణరాజు, మాజీ ఏఎంసీ చైర్మన్ ఉప్పాడ సూర్యనారాయణ, పార్టీ నాయకులు పిళ్లా విజయ్‌కుమార్, పతివాడ అప్పలనాయుడు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు భైరెడ్డి ప్రభాకకరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ గాడు అప్పారావు, పిన్నింటి చంద్రమౌళి, ముల్లు త్రినా«థ్, పిలక శ్రీనివాసరావు, పిళ్లా రామకృష్ణ, గంటా సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. -
పథకాలు అడిగితే బినామీలంటారా..
పాలకొండ రూరల్: జన్మభూమి గ్రామసభల్లో పథకాలు వర్తింపజేయాలని గట్టిగా అడిగిన వారిని బినామీలుగా మంత్రి కళావెంకటరావు వ్యాఖ్యానించడం తగదని పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి అన్నారు. శుక్రవారం స్థానిక విలేకరులతో ఆమె మాట్లాడుతూ గత నాలుగు జన్మభూమి సభల్లోనూ అర్జీలు చేసుకున్న వారే తాజా గ్రామసభలోనూ దరఖాస్తు చేసుకున్నారని, అయినా వారికి న్యాయం జరగడం లేదన్నారు. పక్షపాత ధోరణితో జన్మభూమి కమిటీలు అర్హులకుఅన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు. వితంతువులు, దివ్యాంగులు, వృద్ధులు పింఛన్ల కోసం దరఖాస్తులు అందిస్తే వారికి కొత్త పేర్లు పెట్టి అవమానించటం శోచనీయమన్నారు. ఆన్లైన్లో నమోదు ఉంటే వారు అర్హులనే విషయాన్ని మంత్రి గుర్తించాలన్నారు. పచ్చ కార్యకర్తలకు సంక్షేమ పథకాలు కట్టపెట్టిన అధికార పార్టీని ప్రజలు అన్నిచోట్టా ప్రజలు తిరస్కరించారని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వానికి త్వరలో గుణపాఠం తప్పదన్నారు. -
‘జన్మభూమి’తో సాధించిందేమిటి?
ఎల్.ఎన్.పేట: జన్మభూమి పేరుతో ఏడాదికోసారి ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేస్తూ తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమంగా మార్చుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి దుయ్యబట్టారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకు 5 విడతల్లో జన్మభూమి మాఊరు కార్యక్రమాన్ని నిర్వహించి ఏం సాధించారో ముఖ్య మంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలకు బహిరంగంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల నుంచి వచ్చిన వినతులు ఒక్కటీ పరిష్కరించలేని దుస్థితిలో పరిపాలన సాగుతోందని దుయ్యబట్టారు. సభల నిర్వహణ పేరుతో ప్రభుత్వం రూ.99 లక్షలు ఖర్చు చేసిందన్నారు. గ్రామ సభలకు వెళ్లిన అధికారులను, తెలుగుదేశం పార్టీ నాయకులను ప్రజలే నిలదీశారని గుర్తు చేశారు. నాలుగేళ్ల పాలనలో ఒక్క హామీ నెరవేర్చలేని ముఖ్యమంత్రిగా చంద్రబాబు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని ఎద్దేవా చేశారు. -
‘ఫిరాయింపు’ డబ్బుతో రోడ్డు వేయించు
కర్నూలు సీక్యాంప్: ‘వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన నీవు టీడీపీలోకి వెళ్లడానికి రూ.8 కోట్లు తీసుకున్నావట కదా?! ఆ డబ్బులో కొంత ఖర్చు చేసి మా ఊరికి రోడ్డు వేయించు..అంతవరకూ మా ఊళ్లోకి రావొద్దు’ అంటూ కర్నూలు మండలం పూడూరు గ్రామస్తులు కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీని అడ్డుకున్నారు. గ్రామరోడ్డు అధ్వానంగా ఉందని, ఈ విషయాన్ని కొన్నేళ్లుగా చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదంటూ పూడూరు వాసులు బుధవారం జన్మభూమిని బహిష్కరించిన విషయం విదితమే.దీంతో ఎమ్మెల్యే మణిగాంధీ గురువారం పోలీసులు, టీడీపీ నాయకులు, ప్రైవేటు సైన్యంతో కలిసి దాదాపు 15 వాహనాల్లో వచ్చి గ్రామంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అయితే..గ్రామస్తులు ఉదయం నుంచే ఊరి బయటకు చేరుకుని వంటావార్పు చేపట్టారు. టైర్లను కాల్చి నిరసన తెలిపారు. జన్మభూమి వద్దు.. రోడ్డు కావాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. సంక్షేమ పథకాలు ఆపేస్తామని ఎమ్మెల్యే బెదిరించినా వెనక్కి తగ్గలేదు. గ్రామంలోకి 108 వాహనం కూడా వచ్చే పరిస్థితి లేదని, రోడ్డు సరిగా లేక, సకాలంలో వైద్యమందక దాదాపు 15 మంది చనిపోయారని, ఇందుకు మీదే బాధ్యత అంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యేతో గ్రామస్తులంతా వా గ్వాదానికి దిగిన సమయంలోనే రామలక్ష్మమ్మ అనే వృద్ధురాలికి ఫిట్స్ వచ్చాయి. అమె ఫిట్స్‌తో అల్లాడిపోతుంటే ఎమ్మెల్యే మణిగాంధీ పట్టించుకోలేదు. వెంటనే గ్రామస్తులంతా 108కు ఫోన్ చేయగా ఎప్పటిలాగానే ‘పది కిలోమీటర్లు రండి.. అక్కడ మా అంబులెన్స్ సిద్ధంగా ఉంటుంద’ని సమాధానం వచ్చింది. మీ గ్రామం నా పరిధిలోకి వస్తుందా? దాదాపు నాలుగేళ్లుగా గ్రామంవైపు చూడని మణిగాంధీ గురువారం పూడూరుకు రాగా.. రోడ్డు వేయండని స్థానికులు వినతిపత్రం ఇచ్చారు. దీంతో ఆయన ‘మీ గ్రామం.. నా పరిధిలోకి వస్తుందా’ అంటూ వెటకారంగా మాట్లాడారు. గ్రామస్తులు కూడా అదే తరహాలో స్పందిస్తూ.. ‘నువ్వు ఎవరు’ అంటూ ప్రశ్నించారు. కాగా.. ఎమ్మెల్యేతో ప్రజలు మాట్లాడుతుంటే ఈ మధ్యనే టీడీపీలోకి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి కలుగజేసుకున్నారు. రాష్ట్ర పరిస్థితి బాగోలేదని, మీకు న్యాయం చేస్తామని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీనికి గ్రామస్తులు స్పందిస్తూ మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రోడ్డుగురించి మాట్లాడారని, ఇప్పుడు ఏ హోదాలో హామీ ఇస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. నియోజకవర్గంలో ఏ హామీ అయినా ప్రకాశ్‌రెడ్డే ఇస్తున్నారని, అసలు ఎమ్మెల్యే ఎవరో అర్థం కావడంలేదని అన్నారు. గ్రామస్తులు పట్టువీడకపోవడంతో చేసేదిలేక మణిగాంధీ వెనుదిరిగారు. -
మీహయాంలో చేసిన అభివృద్ధి ఏంటో చెప్పండి
లక్కిరెడ్డిపల్లె: మీ తండ్రి హయాం నుంచి లక్కిరెడ్డిపల్లెకు మీరు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలంటూ మాజీ ఎమ్మెల్యే రమేష్‌రెడ్డిపై వైఎస్సార్ జిల్లా రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.గురువారం మండలంలోని లక్కిరెడ్డిపల్లె జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జన్మభూమి గ్రామ సభలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అభివృద్ధి పేరుతో బురదజల్లే ప్రయత్నం చేశారు. అందుకు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు.దీంతో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రమేష్‌రెడ్డిల మధ్య మాటల యుద్ధం కొనసాగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్సార్ హయంలో లక్కిరెడ్డిపల్లె మండలానికి వేల పక్కాగృహాలు మంజూరు చేసిన విషయం మీరు మరిచారా అని ప్రశ్నించారు.నాలుగేళ్లలో మీరెన్ని పక్కాగృహాలు మంజూరు చేశారో ప్రజలకు తెలుసన్నారు. మండలంలో కస్తూర్బా,వెలుగు,ఆదర్శ పాఠశాలలు ఎవరి హయాంలో వచ్చాయో మీకు తెలియదా అన్నారు. ఎంపీ మిథున్‌రెడ్డి నిధులతో రూ.40 లక్షల మేర బోర్లు వేసి ప్రజలకు దాహార్తి తీర్చిన విషయాన్ని మీరు గర్తుంచుకోవాలన్నారు. తాను ఎనిమిదిన్నరేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ అధికారంలో ఆరు నెలలు మాత్రమే ఉన్నామన్నారు.ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు రావాల్సిన ఏసీడీపీ నిధులను కూడా ఇవ్వలేదని, అవి తీసుకునే అర్హతలు ముఖ్యమంత్రి మీకు కల్పించినా ఎంత వరకు అభివృద్ధి చేశారో తెలుపాలని బహిరంగంగా డిమాండ్ చేశారు.ఏనాడైనా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు సీఎం అపాయింట్మెంట్ ఇచ్చాడా అన్ని అడిగారు. పార్టీలకతీతంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసుకుంటూ పోతుంటే జన్మభూమి కమిటీల పేరుతో అర్హులకు అన్యాయం చేస్తూ టీడీపీ కార్యకర్తలకు మేలు జరిగేలా చూస్తోంది మీరు కాదా అని అన్నారు.అంతేకాక తమ ఎంపీ నిధుల ద్వారా వస్తున్న లక్షలాది రూపాయల పనులకు పంచాయితీ తీర్మానం ఇవ్వకుండా అడ్డుకుంటోంది మీరు కాదా అని అన్నారు. అభివృద్ధి విషయంలో సీఎంతోనైనా పోరాడేండుకు సిద్ధంగా ఉన్నానని, మీరు సిద్ధమైతే తేదీని ఖరారు చేయండంటూ సభ సాక్షిగా సవాల్ విసిరారు. సాక్షిపై అక్కసు వెళ్లగక్కిన ఆర్ఆర్ జన్మభూమి గ్రామసభల్లో గత నాలుగు సంవత్సరాలుగా ఇచ్చిన అర్జీలు పరిష్కారం కాలేదంటూ సాక్షి మీడియా ఎత్తి చూపించడం పట్ల టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆర్ రమేష్ కుమార్‌రెడ్డి(ఆర్ఆర్) అక్కసు వెళ్లగక్కారు. జన్మభూమి గ్రామ సభల పేరుతో అధికారులు ప్రభుత్వ పథకాలు వివరించి చేతులు దులుపుకొని పోతున్న విషయం పాలకులకు తెలిసినా ఒక్క సాక్షి మాత్రం ప్రజల దృష్టికి తీసుకొస్తోందని, అలాంటి సాక్షిపై టీడీపీ నాయకుడు అక్కసు వెళ్లగక్కడం దారుణమని గ్రామస్తులు పేర్కొంటున్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసి మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి,ఎంపీపీ రెడ్డెయ్య,ఎంపీటీసి సభ్యులు సైయ్యద్ అమీర్, రాజేంద్రారెడ్డి, సర్పంచ్ రవి రాజు,తదితరులు పాల్గొన్నారు. -
నిరసనల జన్మభూమి
‘గత జన్మభూమిలో ఇచ్చిన ఫిర్యాదుల సంగతి ముందు చెప్పండి..మాకు పింఛన్లు ఎందుకు పీకేశారు? రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వడం లేదు?. మా గ్రామాలకు సీసీ రోడ్లు లేవు..మంచినీటి సదుపాయం లేదు..ఇన్నాళ్లు ఏమైపోయారు? ముందు వీటికి సమాధానం చెప్పండి.. ఆ తర్వాతే సభలు పెట్టుకోండి అంటూ’ మంత్రులు, ప్రజాప్రతినిధులనే కాదు.. నోడల్ అధికారుల బృందాలను ఎక్కడికక్కడ జనం నిలదీశారు. ముచ్చెమటలు పోయించారు. ఈ నెల 2న ప్రారంభమైన ఐదో విడత ‘జన్మభూమి–మావూరు’ కార్యక్రమం గురువారంతో ముగిసింది. విశాఖ సిటీతో పాటు మారుమూల గ్రామీణ, ఏజెన్సీ పల్లెల్లో సైతం తొలిరోజు నుంచి చివరి రోజు వరకు నిరసనలతో హోరెత్తిపోయింది. కొన్ని చోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలను సైతం నిలదీశారు. కడిగి పారే శారు. మరికొన్ని చోట్ల సభలను బహిష్కరించి తమ నిరసనను వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు ప్రజల పక్షాన నిలిచి దాదాపు గ్రామసభ జరిగిన ప్రతి చోట ప్రజాసమస్యలపై ప్రజాప్రతి నిధులు, అధికారులను ఎండగట్టారు. సాక్షి, విశాఖపట్నం: కొత్తగా పింఛన్లు మంజూరు చేశాం..కొత్తగా రేషన్ కార్డులు ఇస్తున్నాం.. ఇంకేముంది ప్రజలు తమకు జేజేలు పలుకుతారంటూ ‘జన్మభూమి–మావూరు’ సభలకు వెళ్లిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు అడుగడుగనా నిరసనలు, ప్రతిఘటనలే ఎదురయ్యాయి. కొత్త పింఛన్లు, రేషన్ కార్డుల పంపిణీ మాట దేముడెరుగు గత జన్మభూమిలో ఇచ్చిన అర్జీల సంగతేమింటూ వెళ్లిన ప్రతిచోటా నిరసనలు మిన్నంటాయి. వైఎస్సార్సీపీ ముఖ్యనేతలు..శ్రేణులు దాదాపు జిల్లా వ్యాప్తంగా గ్రామసభల్లో పాల్గొని ప్రజల తరపున అధికారులను నిలదీశారు. కొన్నిచోట్ల వైఎస్సార్సీపీ కో–ఆర్డినేటర్లు, ముఖ్యనేతలను ముందస్తుగా అరెస్ట్ చేయడం వంటి ఘటనలు కూడా చోటు చేసుకు న్నాయి. పార్టీ శ్రేణులతో పాటు సామాన్యులను నిలువరించలేక అధికారపార్టీ నాయకులు దౌర్జన్యాలకు సైతం తెగపడ్డారు. నక్కపల్లి, చీడికాడ, బుచ్చెయ్యపేట, నర్సీపట్నం, అచ్యుతాపురం, మునగపాక తదితర మండలాల్లో జరిగిన సభలోŠల్ తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. మంత్రులకూ తప్పని నిరసనలు.. తొలిరోజే మంత్రి గంటా శ్రీనివాసరావుకు సొంత నియోజకవర్గమైన భీమిలి మండలం కాపులుప్పాడలో గ్రామస్తుల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది. ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణ మూర్తి, పల్లా శ్రీనివాసరావు, వంగలపూడి అనిత, పంచకర్ల రమేష్‌బాబులకు సైతం నిరసనల సెగ తప్పలేదు. ఇక టీడీపీ పంచన చేరిన అరకు, పాడేరు ఎమ్మెల్యేలు కిడారి సర్వేశ్వరరావు, గిడ్డి ఈశ్వరిలకు గిరిజనులు ఏకంగా చుక్కలు చూపించారు. ఇటీవల పార్టీ ఫిరాయించిన గిడ్డి ఈశ్వరి టీడీపీ తరపున గ్రామాల్లోకి వెళ్తుంటే పొలిమేరల్లో సైతం అడుగుపెట్ట కుండా గంటల తరబడి ఘెరావ్ చేశారు. ఇక పల్లెల్లో గ్రామసభలు నిర్వహించిన టీడీపీ స్థానిక ప్రజాప్రతినిధులు, నోడల్ అధికారులు కనివినీ ఎరుగని రీతిలో నిరసనలను ఎదుర్కోవాల్సి వచ్చింది. కొన్ని చోట్ల అధికార పార్టీ నాయకులు ప్రజల్లో పెల్లుబికుతున్న వ్యతిరేకతను ఎదుర్కొనలేక గ్రామాల వైపు కన్నెత్తి చూడలేదు. 70 శాతం సభల్లో ఆందోళనలు.. జిల్లాలో 923 పంచాయతీలకు నాలుగింట సభలను బహిష్కరిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. కనీసం మరో వందకు పైగా గ్రామాల్లో ప్రజల నిరసనలను అధికారులు, ప్రజాప్రతినిధులు ఎదుర్కొన్నారు. ఆయా సభలను ఐదు పదినిమిషాల్లోనే ముగించేశారు. మరో 150కి పైగా సభలు ప్రసంగాలకే పరిమితమయ్యాయి. 600కు పైగా సభల్లో నిరసనలు హోరెత్తిపోయాయి. కేవలం 120 పంచాయతీల్లోనే సభలు సజావుగా సాగినట్టుగా అధికారులు చెబుతున్నారు. అదే విధంగా 190 వార్డుల్లో సభలు జరగ్గా వాటిలో సగానికి పైగా నిరసనలు..నిలదీతలు తప్పలేదు. అన్నీ కాకిలెక్కలే.. 2016 డిసెంబర్ నాటికి జిల్లాలో 3,24,932 పింఛన్లు ఉండేవి. 2017 జనవరిలో 15వేలు కొత్తగా మంజూరు చేయగా..వాటి సంఖ్య 3,47,449కు పెరిగింది. కానీ గడిచిన ఏడాదిలో పెంచిన ఆ 10వేలకు పైగా కోత పెట్టేశారు. చివరకు గత నెలలో 3.37లక్షలకు చేరగా..ప్రస్తుతం కొత్తగా మంజూరైన వాటి మాట దేవుడెరుగు జనవరిలో 3,36,607 పింఛన్లు మంజూరుచేయగా జన్మభూమి సభల్లో పంపిణీ చేసింది. 3,07,966 మందికి మాత్రమే పంపిణీ చేయగలిగారు. కొత్తగా పింఛన్ల కోసం 50వేల మంది అప్లోడ్ చేసుకోగా 30 వేల మందికి పింఛన్లు మంజూరు చేసినట్టుగా ప్రకటించారు. కానీ వీరిలో ఏ ఒక్కరికీ ప్రస్తుత జన్మభూమి సభల్లో పింఛన్ పంపిణీ చేసిన పాపాన పోలేదు. రేషన్ కార్డుల పరిస్థితి కూడా అంతే. కొత్తగా 21వేల కార్డులు మంజూరు చేశారు. కానీ వారికి రేషన్ సరుకులు కాదు కదా.. కనీసం చంద్రన్న కానుకలు కూడా ఇవ్వలేదు. -
ఇలా తీసుకుని...అలా పడేశారు..!
తనకల్లు: తనకల్లులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన ‘జన్మభూమి–మా ఊరు’లో ప్రజల నుంచి స్వీకరించిన వివిధ దరఖాస్తులను అధికారులు ఇలా తీసుకొని అలా పడేశారు. పింఛన్లు, ప్రభుత్వ గృహాలు, రేషన్‌కార్డుల కోసం ప్రజల నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు రాగా... అధికారులు వాటన్నింటినీ తీసుకొని మధ్యాహ్నం భోజన విరామంలో గది బయట పడేసి అక్కడి నుండి మెల్లగా జారుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న వృద్ధులు, వికలాంగులు బయటపడి ఉన్న తమ అర్జీలను వెతుక్కోవడం అక్కడున్న ప్రజలను కలిచివేసింది. అధికారుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. -
జన్మభూమిలో టీడీపీ నేతల చిందులు
-
జన్మభూమిలో ‘గున్నా మామిడి’
సాక్షి, శ్రీకాళహస్తి (చిత్తూరు) : ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జన్మభూమి మా ఊరు కార్యక్రమం అధికార పార్టీ నేతల చిందులకు వేదికగా మారింది. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిర్దేశించిన కార్యక్రమంలో టీడీపీ నేతలు ‘గున్నా మామిడి’ పాటకు జోరుగా డాన్స్ వేశారు. ఈలలు వేస్తూ, ఒళ్లు మరిచిపోయి నృత్యాలు చేశారు. టీడీపీ నాయకుల నిర్వాకంపై స్థానికులు మండిపడుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించకుండా డాన్సులు కట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పచ్చబాబుల డాన్స్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. శ్రీకాళహస్తి నియోజవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున బొజ్జల గోపాలకృష్ణారెడ్డి 2014 ఎన్నికల్లో గెలుపొందారు. ఉన్నత లక్ష్యంతో ప్రారంభించిన జన్మభూమి కార్యక్రమంలో అధికార పార్టీకి చెందిన స్థానిక నేతల జోక్యం తొలినాళ్ల నుంచి తెలిసిందే. దీంతో ప్రజల పాలిట కామధేనువు కావాల్సిన జన్మభూమి అపహస్యం పాలవుతోంది. ఐదో విడత జన్మభూమి కార్యక్రమం జనవరి 2-11 మధ్య రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. కాగా, ఐదో విడత జన్మభూమి కార్యక్రమంలో పలు చోట్ల గ్రామ ప్రజల నుంచి ప్రభుత్వం ప్రతిఘటన ఎదుర్కొన్న విషయం తెలిసిందే. -
పోలీస్ జులుం
సాక్షి, అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడ సెంట్రల్): కండ్రిక 59వ డివిజన్లో జరిగిన జన్మభూమి బుధవారం రసాభాసగా జరిగింది. ఎన్నికల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, పేదలకు ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఐద్వా నాయకులు నిరసన వ్యక్తం చేయగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో మహిళా నాయకులంతా పోలీసులు తీరును నిరసిస్తూ అక్కడే బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారి ఆందోళనను చూసిన టీడీపీ నాయకులంతా ఎమ్మెల్యే బోండా ఉమాకు మద్దతుగా నినాదాలు చేస్తూ ఎదురుదాడికి దిగారు. సీపీఎం నగర కమిటీ నాయకులు అక్కడకు చేరుకుని టీడీపీ నాయకులకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. దీంతో ఇరువర్గాలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుని గందరగోళ పరిస్థితి ఏర్పడింది. పోలీసులు సీపీఎం నాయకులను వ్యానుల్లోకి ఎక్కించారు. 19 మందిని అరెస్ట్ చేసి నున్న పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
జన్మభూమిలో గందరగోళం
పిట్టలవానిపాలెం: మండలంలోని చందోలు గ్రామంలో బుధవారం జరిగిన జన్మభూమి మాఊరు ఐదవ విడత కార్యక్రమం గందరగోళంగా ముగిసింది. సభ ప్రారంభం వైఎస్సార్ సీపీ, టీడీపీ వర్గీయుల మధ్య వాదనలు, ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీంతో సభలో కొద్ది సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద జన్మభూమి గ్రామ సభను నిర్వహించకుండా నీలిబంగారయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించడం ఏమిటంటూ వైఎస్సార్ సీపీ ముస్లిం మైనార్టీ సెల్ కార్యదర్శి అహ్మద్ హుస్సేన్, గ్రామ పార్టీ అధ్యక్షులు అబ్దుల్ రహీమ్, అజీమ్,రజాక్‌లు అధికారులను నిలదీశారు. గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సమావేశం నిర్వహణకు స్థలం తక్కువగా ఉండడం వలన పాఠశాల ఆవరణలో నిర్వహించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. జన్మభూమి గ్రామ సభ గురించి స్థానిక ఎంపీటీసీ సభ్యులకు సమాచారం ఇవ్వలేదని, ప్రోటోకాల్ పాటించకుండా తమను అవమానపరచారని ఎంపీటీసీ సభ్యులు షేక్ బాజి, చేబ్రోలు వీరయ్యలు అధికారుల తీరుపై మండిపడ్డారు. అంతేకాక గ్రామంలో పింఛన్ మంజూరైన లబ్దిదారుల జాబితా ఇవ్వమని కోరితే అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 135 మంది పింఛన్ కోసం ఆన్లైన్లో దరకాస్తు చేసుకుని ఉంటే 35 మందికి మాత్రమే పింఛన్లు మంజూరు చేశారని ఆరోపించారు. అదేవిధంగా 130 మంది వరకు రేషన్ కార్డుల కోసం దరకాస్తు చేసుకుంటే 30 మందికి మాత్రమే మంజూరు చేయడం అన్యాయంగా ఉందని వాపోయారు. గ్రామానికి చెందిన ముగ్గురు మహిళలు తమకు ఇంటి నివేశనాస్థలాలు లేవని కన్నీరు పెట్టారు. దీంతో సర్పంచి భర్త అఫ్జల్ ముగ్గురికి ఇంటి స్థలంతో పాటు ,ఇళ్ళు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. అర్హత కలిగిన వారికి సంక్షేమ పథకాలు అందకుండా అధికారులు సైతం అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈవిషయాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఎంపీటీసీ సభ్యులకు సమాచారం అందించకపోవడం పొరపాటే నని అందుకు మొదటి తప్పుగా మన్నించాలని ఇన్చార్జ్ ఎంపీడీవో గణేష్‌బాబు కోరారు. తాను ఇటీవలే మండలానికి ఇన్చార్జిగా వచ్చానని ఇలాంటి పొరపాటు జరకుండా చూస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి సుల్తానా బేగం,అఫ్జల్, ఎంపీపీ బీవీ సులోచన, కరెంట్ ఏఈ పెరుగు శ్రీనివాసరావు, మండల ప్రత్యేకాధికారిణి ఉషారాణి, తహసీల్దార్ చిన్నం సుధారాణి, ఈవోపీఆర్డీ వి సుజాత, వెలుగు ఏపీఎం సుజాత, గ్రామ కార్యదర్శి అబ్దుల్ ఖాదర్ జిలాని,ఎంఈఓ వి వెంకటేశ్వరరావు,ఆర్డబ్ల్యూఎస్ ఎఈ బాష,పిఆర్ ఎఈ మోహనరావు,హౌసింగ్ ఏఈ శ్రీనివాసరావు, ఏఓ లోకేశ్వరి, ఏఈఓలు సుదర్శనరావు తదితరులు ఉన్నారు. -
చేతలు అలా... మాటలు ఇలా..
జిల్లాలో బుధవారం జరిగిన పలు జన్మభూమి సభల్లో నిరసన గళాలు వినిపించాయి. జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం క్రిష్ణవరం గ్రామంలో అధికార పక్షానికి చెందిన సర్పంచి, ఎంపీటీసీ వర్గాల మధ్య కొట్లాటకు దారితీసింది. ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకుని దాడి చేసుకున్నారు. పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లిలో కొత్తపల్లి, కుతుకుడుపల్లి గ్రామాలకు సంబంధించిన గ్రామసభలో అధికారులను నిలదీశారు. ఏలేశ్వరం, ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామాల్లో నిర్వహించిన గ్రామ సభల్లో నివేశన స్థలాలు, సమస్యలు పరిష్కరించడం లేదని సీపీఐ (లిబరేషన్) పార్టీ నాయకులు అధికారులను నిలదీశారు. ఒకే రోజు... ఒకే సమయం... విభిన్న అభిప్రాయాలు ... జన్మభూమి సభల్లో నిలదీతలు ... కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ బీసీ సంఘాల ఆందోళనలు... సీఎం చంద్రబాబు జిల్లా పర్యటనకు బుధవారం వచ్చిన సందర్భంగా జిల్లాలో చోటుచేసుకున్న పరిణామాలివీ. ముమ్మిడివరం నియోజకవర్గంలోని చెయ్యేరు గున్నేపల్లిలో జరిగిన ‘జన్మభూమి–మా వూరు’ కార్యక్రమంలో పాల్గొనడానికి సీఎం రాకను జిల్లా బీసీ సంఘాల నేతలు ‘బ్లాక్ డే’గా ప్రకటించాయి. సభా ప్రాంగణంలో నిరసనలు తెలపాలని భావించాయి. ముందస్తు హౌస్ అరెస్టులతో పోలీసులు భయోత్పాతం సృష్టించడంతో ఆయా సంఘాలు ధర్నాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. జిల్లాలో పలు ప్రాంతాల్లో జరిగిన జన్మభూమి సభల్లో జనం కన్నెర్ర చేసి నిలదీతల పరంపర కొనసాగించారు. సీఎం వచ్చి, వెళ్లేంత వరకూ ఇదే వేడి కొనసాగింది. కాపులను బీసీల్లో చేర్చుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను నిరసిస్తూ ముమ్మిడివరం మండలం చెయ్యేరు గున్నేపల్లి ‘జన్మభూమి–మా ఊరు’ సభకు బుధవారం వచ్చిన సీఎం చంద్రబాబు సభలో నిరసన తెలియజేయాలన్న బీసీల వ్యూహాన్ని పోలీసులు ఉక్కుపాదంతో అణిచివేశారు. బీసీ నేతలను గృహ నిర్బంధాలు,... ముందుస్తు అరెస్టులతో ఇళ్లకే పరిమితం చేశారు. సాక్షి, రాజమహేంద్రవరం/ముమ్మిడివరం: కాపు కార్పొరేషన్ ద్వారా 2016 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 286 మందికి రుణాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ముమ్మిడివరం మండలం చెయ్యేరు గున్నేపల్లిలో జరిగిన జన్మభూమి–మా ఊరు కార్యక్రమంలో సూర్యనారాయణ అనే వ్యక్తితో అసత్యాలు చెప్పించింది. మధ్యాహ్నం రెండున్నర గంటలకు సీఎం చంద్రబాబు సభకు చేరుకుని ప్రజలనుద్దేశించి మాట్లాడారు. అంతకు ముందు బీసీ, కాపు కార్పొరేషన్ లబ్ధిదారులతో సభలో మాట్లాడించారు. ఈ సందర్భంగా కాపు కార్పొరేషన్ నుంచి రెండు లక్షల రుణం తీసుకున్నానని, తనకు రుణం ఎలా వచ్చిందన్న విషయం సూర్యనారాయణ అనే వ్యక్తి వివరించారు. సీఎం చంద్రబాబు కాపు కార్పొరేషన్ ద్వారా జిల్లాలో 34 వేల మంది కాపులకు రుణాలు ఇప్పించారని పేర్కొన్నారు. అంతకు కొద్ది నిమిషాల ముందు సీఎం చంద్రబాబు తన ప్రసంగంలో 40 ఏళ్లుగా తాను నీతి, నిజాయతీలతో ఉన్నానని చెప్పిన తర్వాతే ప్రభుత్వం సూర్యనారాయణతో కాపు కార్పొరేషన్ ద్వారా 34 వేల మందికి రుణాలు ఇచ్చినట్లు చెప్పించడంతో సభకు వచ్చిన అధికారులు అవాక్కయ్యారు. ముమ్మిడివరంపై వరాల జల్లు ముమ్మిడివరం నియోజకవర్గంలో నిరుపయోగంగా ఉన్న ఆరు ఆర్డబ్ల్యూఎస్ మంచినీటి పథకాల మరమ్మతుకు రూ.6 కోట్లు మంజూరు చేస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఐ.పోలవరం మండలం జి.ములపొలం–గొల్లగరువులో నిలిచిపోయిన వంతెన పనులకు సంబంధించి రూ. 60 కోట్లతో తిరిగి అంచనాలు రూపొందించి టెండర్లు పిలుస్తామన్నారు. గుజరాత్ పెట్రోలియం సంస్థ నుంచి మత్స్యకారులకు రావాల్సిన 12 నెలల నష్టపరిహరం ఇపించేందుకు చర్యలు తీసుకుంటామని çహామీ ఇచ్చారు. సభకు కాలేజీ బస్సులు.. విద్యార్థులకు అవస్థలు... జన్మభూమి–మా ఊరు సభకు సీఎం చంద్రబాబు వస్తుండడంతో కోనసీమలోని వివిధ ఇంజినీరింగ్ కళాశాలలు, ప్రైవేటు పాఠశాలలకు చెందిన బస్సులను నియోజకవర్గాలలోని పలు గ్రామాలకు పంపించారు. ఆయా బస్సులలో డ్వాక్రా మహిళలు, రైతులు, పింఛన్ లబ్ధిదారులు వచ్చేలా డీఆర్డీఏ, వ్యవసాయ, రెవెన్యూ అధికారులకు అప్పగించారు. ఆయా అధికారులు వారిని తీసుకురావడానికి, సీఎం ప్రసంగం పూర్తయ్యేవరకు ఉంచటానికి పడరాని పాట్లు పడ్డారు. సీఎం మాట్లాడుతుండగానే సభ నుంచి మహిళలు వెళ్లిపోవడంతో సభ పేలవంగా మారింది. డ్వాక్రా మహిళలు వెళ్లిపోతుండగా డీఆర్డీఏ అధికారులు బలవంతంగా వారిని సభలో కూర్చోబెట్టారు. పలు పనులకు శంకుస్థాపనలు... ముందుగా సభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డీఆర్డీఏ స్టాల్స్‌ను సీఎం చంద్రబాబు పరిశీలించారు. అనంతరం రూ.35 కోట్లతో నిర్మించే ఐ.పోలవరం మండలం సలాది వారిపాలెం–పశువుల్లంక గోదావరిపాయపై వంతెన నిర్మాణ పనులకు, ముమ్మిడివరంలో రూ.45 కోట్లతో నిర్మించే 133 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్, రూ. 25 కోట్లతో నిర్మించే మహిపాల చెరువు–పల్లంకర్రు ఆర్అండ్బీ రోడ్డు పనులకు సంబంధించి శిలాఫలకాలను ఆవిష్కరించారు. హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, విద్యుత్‌శాఖ మం త్రి కిమిడి కళా వెంకటరావు, అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ, కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, జిల్లా పరిషత్ చైర్మన్ జ్యోతుల నవీన్‌కుమార్, పాల్గొన్నారు. -
‘కమీషన్ల కోసమే కాంట్రాక్టర్ల మార్పు’
సాక్షి, కాకినాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి ఉంటే ఇందిరాసాగర్ పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. కమీషన్ల కోసమే ప్రాజెక్టు కాంట్రాక్టర్లను బాబు తరచుగా మారుస్తున్నారని ఆరోపించారు. జన్మభూమి కార్యక్రమంలో వచ్చిన అర్జీలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
నన్ను నిలదీయాలని చూస్తే... ప్రభుత్వాన్నే నిలదీస్తా..
-
జన్మభూమిలో భర్తల పెత్తనం
తుమ్మపాల (అనకాపల్లి): ప్రజాప్రతినిధులైన తమ భార్యల తరఫున అధికార పార్టీ నేతలు జన్మభూమి–మా ఊరు కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా పెత్తనం చెలాయిస్తున్నారు. అనకాపల్లి మండలంలో జరుగుతున్న సభలకు ఎంపీపీ కొణతాల వెంకటసావిత్రి తరఫున ఆమె భర్త శ్రీను హాజరై ప్రసంగాలు చేస్తున్నారు. అదే కోవలో గ్రామాలలో జరుగుతున్న సభలకు మహిళా సర్పంచ్‌లు, ఎంపీటీసీల తరఫున వారి భర్తలు పాల్గొంటూ హంగామా చేస్తున్నారు. అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రొటోకాల్ పాటించాల్సిన అధికారులు కూడా ఈ విషయంలో మిన్నకుండిపోతున్నారు. జన్మభూమి సభలకు ప్రత్యేకంగా నియమించిన సీనియర్ అధికారుల పక్కనే సూపర్ సర్పంచ్‌లు, సూపర్ ఎంపీటీసీలు కూర్చుని అజమాయిషీ చేస్తున్నారు. రేబాకలో మంగళవారం జరిగిన జన్మభూమి–మా ఊరు సభలో కొందరు మరుగుదొడ్ల బిల్లుల గురించి ప్రశ్నించగా.. సర్పంచ్ భర్త సత్తిబాబు కలుగజేసుకొని మరీ పాత వాటికి బిల్లులు చెల్లించరని చెప్పేశారు. కాపుశెట్టివానిపాలెం గ్రామానికి ఒక వ్యక్తి ఇదే సమస్యపై ప్రశ్నించగా ఎంపీటీసీ భర్త చిన్నారావు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
జన్మభూమి కార్యక్రమం బహిష్కరణ
వరికుంటపాడు: వరికుంటపాడు మండలం తూర్పుబోయమడుగులలో మంగళవారం జరిగిన జన్మభూమి కార్యక్రమాన్ని స్థానిక గిరిజన సర్పంచ్ బాపట్ల చెంచయ్య బహిష్కరించగా ఆయనకు వైఎస్సార్ సీపీ నేతలు మద్దతుగా నిలిచారు. ఉదయం 10.30కు సర్పంచ్ అధ్యక్షతన ప్రారంభమైన గ్రామసభలో మండల ప్రత్యేకాధికారి కె.సత్యవాణి, తహసీల్దార్ జి.శ్రీనివాసులు, ఎంపీపీ సుంకర వెంకటాద్రి పాల్గొన్నారు. కాగా మధ్యాహ్నం సర్పంచ్ భోజనం ఏర్పాటు చేసినప్పటికీ కొందరు అధికారులు, ఎంపీపీ కలిసి గ్రామంలోని టీడీపీ నేత తోడెందుల వెంకటేశ్వర్లు ఇంట్లో భోజనం చేశారు. దీంతో ఆగ్రహించిన సర్పంచ్ తాను గిరిజనుడిననే భావనతో భోజనం ఏర్పాటు చేసినప్పటికీ ప్రత్యేకాధికారి, తహసీల్దార్ టీడీపీ నేత ఇంటికి భోజనానికి వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తహసీల్దార్ మరలా సర్పంచ్ ఏర్పాటు చేసిన భోజనం తిన్నప్పటికీ సర్పంచ్ సంతృప్తి చెందలేదు. అనంతరం గ్రామసభ ప్రారంభమైన వెంటనే సర్పంచ్, ఇతర వైఎస్సార్ సీపీ నాయకులు ధర్నా నిర్వహించి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన మండల మహిళా టీడీపీ నాయకురాలు మాగంటి శాంతి వాగ్వాదానికి దిగారు. అనంతరం సర్పంచ్ తాను గ్రామసభను బహిష్కరిస్తున్నానని, అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరారు. ఈ క్రమంలో వైఎస్సార్ సీపీ, టీడీపీ వర్గీయుల మధ్య కొంత వాగ్వాదం జరిగింది. పరిస్థితి విషమిస్తుండడంతో ఎంపీపీ, అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో గ్రామసభ అర్థాంతరంగా ఆగిపోయింది. ఈ నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం సర్పంచ్ చెంచయ్య విలేకరులతో మాట్లాడుతూ అధికారులు తనను అవమానించే రీతిలో వ్యవహరించారని ఆరోపించారు. అలాగే ప్రత్యేకాధికారి, తహసీల్దార్ మాట్లాడుతూ ఎంపీపీ భోజనానికి రమ్మంటే వెళ్లామని, సమస్య ఇంత జఠిలమవుతుందని తెలియదని తెలిపారు. కాగా వైఎస్సార్ సీపీ నేతలు మాగంటి సిద్ధయ్య, ఉప సర్పంచ్ జాన్‌ప్రసాద్ తదితరులు సర్పంచ్‌కు బాసటగా నిలిచారు. ఏం ఉద్ధ్దరించారని జన్మభూమి? బుచ్చిరెడ్డిపాళెం: ‘మాకు తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా లేవు? మీకేమో మినరల్ వాటరా? ఏం ఉద్ధరించారని జన్మభూమి కార్యక్రమం నిర్వహిస్తున్నారు’ అంటూ బుచ్చిరెడ్డిపాళెం మండలం ఇస్కపాళెం ప్రజలు కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డిపై ధ్వజమెత్తారు. గ్రామంలో మంగళవారం జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ప్రజలు తమ ఎమ్మెల్యేను తమకు రేషన్‌కార్డులు ఎందుకు మంజూరు చేయలేదని, అర్హత ఉన్నా పింఛన్ ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. ఎన్టీఆర్ ఇళ్లు టీడీపీ కార్యకర్తలకే ఇచ్చారని మండిపడ్డారు. స్థానిక సర్పంచ్ పంచాయతీని సర్వనాశనం చేసిందని ఆరోపించారు. పంచాయతీ నిధులు స్వాహా చేయడం మినహా అభివృద్ధి ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు. ఈ సారి ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని బాహాటంగానే పేర్కొన్నారు. దీంతో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే ‘‘ఆపండి’’ అంటూ ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే తీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ చొప్పా రవీంద్రబాబు, ఎంపీడీఓ పి.సుజాత, వివిధ శాఖల నాయకులు పాల్గొన్నారు. -
రెండు కాళ్లు లేకున్నా...
తెర్లాం: ఆ యువతి రెండు కాళ్లు రైలు ప్రమాదంలో కొల్పోయింది. ప్రమాదం జరిగిన సమయంలో తనను పరామర్శించేందుకు వచ్చిన జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు వికలాంగ పింఛన్, రుణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇచ్చిన హామీను నెరవేర్చలేదు. ఈ క్రమంలో జన్మభూమి కార్యక్రమంలో పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు మూడు చక్రాల బండిపై తల్లి సహాయంతో వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..వెలగవలస గ్రామానికి చెందిన రాగోలు నీలవేణికి రైలు ప్రమాదంలో రెండు కాళ్లు పోయాయి. వికలాంగ పెన్షన్ మంజూరు చేయమంటే తన తండ్రికి పింఛన్ వస్తుందని, ఆ రేషన్ కార్డులో తన పేరుందని పింఛన్ ఇవ్వడం కుదరదని అధికారులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తాను పూర్తిగా నడవలేని స్థితిలో ఉన్నానని, తనకు పెన్షన్ మంజూరు చేయకపోతే ఎలా బతకాలని నీలవేణి అధికారులను ప్రశ్నిస్తోంది. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి తనకు వికలాంగ పింఛన్ మంజూరు చేయాలని వేడుకొంది. -
గ్రామసభలు గరం... గరం...
విజయనగరం గంటస్తంభం: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జన్మభూమి కార్యక్రమంలో నిరసనలు తారాస్థాయికి చేరుతున్నాయి. వారంరోజుల్లో అనేక గ్రామసభలను బహిష్కరించి నిరసన తెలిపిన గ్రామీణ ప్రజలు ఎనిమిదో రోజైన మంగళవారం కూడా తమ వ్యతిరేకత వ్యక్తం చేశారు. సమస్యలు చెప్పుకోవడమే మినహా పరిష్కారం లేదంటూ అధికారపార్టీ నేతలను, అధికారులను అడ్డుకుని గ్రామసభలను బహిష్కరించారు. కొన్నిచోట్ల అధికారులను సమస్యలపై నిలదీసి పరిష్కారం చూపాలని కోరారు. గజపతినగరంలో ఏపీఎంపై దాడి గజపతినగరం పంచాయతీ కార్యాలయంలో జరిగిన గ్రామసభలో వెలుగు ఏపీఎం రౌతు శ్రీనివాసరావుపై తెలుగుదేశం నాయకులు చేయిచేసుకున్నారు. మహిళలతోనూ తిట్టించారు. గ్రామసభ జరుగుతున్న సమయంలో వెలుగులో జరుగుతున్న కార్యకలాపాలు తమకు చెప్పలేదంటూ గజపతినగరం–1 ఎంపీటీసీ కర్రి శ్రీదేవి, గజపతినగరం–2 ఎంపీటీసీ నగర ప్రసన్నకుమారి భర్త చందు, గ్రామ సర్పంచి నరవ ఆదిలక్ష్మి భర్త శంకర్రావు ప్రశ్నించారు. వెంటనే చెరొక వైపు పట్టుకుని దాడి చేశారు. ఈ అంశం ఇప్పుడు అధికార వర్గాలు, గజపతినగరం మండలంలో చర్చనీయాంశ«మైంది. మొన్నటికి మొన్న గజపతినగరం నియోజకవర్గానికి చెందిన నాయకులే జెడ్పీ సమావేశంలో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులపై విరుచుకుపడ్డంతో ఇప్పుడు వెలుగు ఏపీఎంపై దాడి చర్చనీయాంశమైంది. ♦ కొమరాడ మండలంలో 30గ్రామాల గిరిజనులు జన్మభూమి కార్యక్రమానికి రావద్దంటూ పూడేసు పంచాయతీ పేడుము గ్రామం వద్ద కర్రకట్టి, రోడ్డుకు అడ్డంగా భైఠాయించి అడ్డుకున్నారు. రోడ్డు సౌకర్యం, మౌలిక వసతులు కల్పించాలని ఎన్నిసార్లు గ్రీవెన్స్‌సెల్‌లో మొరపెట్టుకున్నా స్పందించనందుకు నిరసనగా ఈ చర్యకు దిగారు. దీనివల్ల అధికారులు గ్రామం బయటే ఉండిపోయారు. ♦ గజపతినగరం మండలం పురిటిపెంటలో జరిగిన గ్రామసభలో నాలుగేళ్లుగా ప్రజల నుంచి వినతులు తీసుకోవడం తప్ప పరిష్కరించడం లేదని గ్రామ సర్పంచి మండల సురేష్ నిలదీశారు. ఇందుకు నిరసనగా గ్రామసభ బహిష్కరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ♦ శృంగవరపుకోటలో జరిగిన గ్రామసభలో సమస్యలపై నిలదీసిన వైఎస్సార్సీపీ నాయకులపై అధికారపార్టీ నాయకులు జులుం ప్రదర్శించారు. అధికారాన్ని వాడుకుని పోలీసులను పంపడంతో వారు వైఎస్సార్సీపీ నాయకులను అరెస్టు చేశారు. ♦ పూసపాటిరేగ మండలం నడిపల్లిలో సమస్యలు పరిష్కరించకుండా గ్రామసభ పెట్టినందుకు తెలుగుదేశంపార్టీకి చెందిన సర్పంచి బొజ్జ ఈశ్వరమ్మ, గ్రామస్తులు గ్రామసభను బహిష్కరించి నిరసన తెలిపారు. ♦ కురుపాం మండలం కిచ్చాడ గ్రామసభ రసాభాసగా మారింది. గ్రామంలో 20ఏళ్లుగా> రోడ్డు కోసం పట్టించుకునే నాథుడే లేడని, సాగు చేస్తున్న భూములకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. అప్పుడే గ్రామసభ పెట్టాలన్నారు. దీంతో అధికారులు వారితో చర్చలు జరిపి గ్రామసభను పూర్తి చేశారు. ♦ గరుగుబిల్లి మండలం లోకడివరం పరిధిలో ఉన్న స్టోన్ క్రషర్ అనుమతులు రద్దు చేయాలని సర్పంచి అప్పలనాయుడు ఆ«ధ్వర్యంలో ప్లకార్డులతో స్థానిక జన్మభూమి కార్యక్రమంలో నిరసన తెలిపారు. ఎమ్మెల్యే పతివాడకు పరాభవం నెల్లిమర్ల మండలం తమ్మాపురం జన్మభూమి కార్యక్రమానికి హాజరైన నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి నాయుడును గ్రామస్తులు గ్రామం బయటే అడ్డుకున్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే రోడ్డు వేస్తానని హామీ ఇచ్చారని, ఇంతవరకు నెరవేరలేదని, రోడ్డు వేసిన తర్వాతే గ్రామానికి రావాలని తెగేసి చెప్పారు. గ్రామంలోకి ససేమిరా రానివ్వలేదు. ఈ సంఘటనతో తెలుగుదేశం నాయకులు సువ్వాడ రవిశేఖర్ తదతరులు రాయడానికి వీల్లేని పదాలతో బూతులు తిట్టడంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఇదేమి ‘జన్మభూమి’!
కర్నూలు (అగ్రికల్చర్): జన్మభూమి గ్రామసభలు రసాభాసగా మా రుతున్నాయి. నిరసనలు.. నిలదీతలు.. ఆందోళనలు.. బహిష్కరణలు.. ఏ ఊరు చూసినా ఇదే పరిస్థితి. సమస్యలు పరిష్కారం కాగా విసుగు చెందిన ప్రజలకు నిరసనలు తెలిపేందుకు జన్మభూమి సభలను వేదికగా మార్చుకుంటున్నారు. మంగళవారం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో జరిగిన సభలు ఇందుకు అద్దం పడుతున్నాయి. ఏదో తూతూమంత్రంగా నిర్వహించేసి తిరిగి వద్దామని వెళ్లిన అధికారులు జనాగ్రహానికి గురువుతున్నారు. గూడూరు, కర్నూలు, కోవెలకుంట్ల తదితర మండలాల్లో జరిగిన జన్మభూమి సభలు గందరగోళం మధ్య కొనసాగాయి. గూడూరు మండలం జూలకల్, కర్నూలు మండలం బి.తాండ్రపాడులో ఏకంగా ప్రజలు గ్రామసభను బహిష్కరించారు. ప్రజలను రప్పించేందుకు పలు ఆర్థిక ప్రయోజనాలను ఏరగా వేసిన ఫలితం లేకుండా పోయింది. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, శాసనమండలి చైర్మన్ ఫరూక్, జిల్లా కలెక్టర్ సత్యనారాయణలు ఓర్వకల్ మండలం హుసేనాపురం గ్రామంలో జరిగిన గ్రామసభలో పాల్గొన్నారు. గ్రామ సభల్లో రుణమాఫీ, రేషన్ కార్డులు, పింఛన్లు తదితర అంశాలపై ప్రజలు అధికారులను ఉక్కిరిబిక్కిరి చేశారు. అధికారిక కార్యక్రమమైన జన్మభూమి సభలో తెలుగుదేశం నేతల హడావుడి ఎక్కువగా కనిపిస్తోంది ప్రభుత్వ భజనకే అధికారులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటంతో జనాలు గ్రామ సభల వైపు రాలేని పరిస్థితి ఏర్పడింది. ⇔ గూడూరు మండలం జూలకల్‌లో గ్రామస్తులు జన్మభూమి కార్యక్రమాన్ని బహిష్కరించారు. గత ఏడాది ఇచ్చిన వినతులకు దిక్కు లేకపోవడం, అర్హులకు పింఛన్లు, రేషన్ కార్డులు లేకపోవడం, జన్మభూమి గ్రామ కమిటీ సభ్యులు చెప్పిన అనర్హులకే ఇస్తున్నారని తీవ్రంగా ధ్వజమెత్తుతూ.. గ్రామసభను బహిష్కరించారు. ⇔ కోవెలకుంట్ల మండలం కలుగోట్లలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమం రసాభాసగా మారింది. అర్హులకు ఎవ్వరికి పింఛన్లు రాకపోడవం, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకపోవడం, అన్ని అర్హతలు ఉన్నా.. రుణమాఫీ రాకపోవడం తదితర వాటిపై అధికారులను నిలదీయడంతో పాటు గ్రామసభ జరుగకుండా అడ్డుకున్నారు. ⇔ కోడుమూరు మండలం అనుగొండ, ఎర్రదొడ్డి గ్రామాల్లో జరిగిన గ్రామసభలు అస్తవ్యస్తమయ్యాయి. ఇది వరకు జరిగిన నాలుగు సార్లు గ్రామసభల్లో రేషన్ కార్డులు, పింఛన్లు, పక్కా ఇళ్లకు దరఖాస్తులు ఇచ్చామని ఇందులో ఒక్కటీ పరిష్కరం కాలేదని ధ్వజమెత్తారు. ⇔ డోన్‌లో జరిగిన జన్మభూమి సభను సీపీఐ నేతలు, కార్యకర్తలు తీవ్రంగా అడ్డుకున్నారు. ప్రభుత్వ ప్రచారానికి ఉపయోగపడుతుంది తప్ప ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. ⇔ ఆదోనిలోని 9వ వార్డులో జరిగిన సభలో ప్రజలు రేషన్ కార్డులపై అధికారులను ఉక్కిరిబిక్కిరి చేశారు. అర్హులెవ్వరికి రేషన్ కార్డులు రాలే దని ధ్వజమెత్తారు. ప్రజల నిరసనల మధ్య తూతూమంత్రంగా సభను ముగించేశారు. ⇔ బేతంచెర్ల, కొత్తపల్లి, ఆలూరు, అవుకు తదితర మండలాల్లో వివిధ సమస్యలపై ప్రజలు అధికారులపై విరుచుకపడ్డారు. జన్మభూమి కమిటీ సభ్యుల తీరుపై మండిపడ్డారు. రాజకీయ కారణాలతో అర్హులైన వారికి పించన్లు, రేషన్ కార్డులు, ఇళ్లు దక్కకుండా చేస్తున్నారని విమర్శించారు. ఆస్పరి మండలం ముత్తుకూరులో సభలో అధికారులను గట్టిగా నిలదీశారు. అధికార పార్టీ నేతలు చెప్పిన వారికే పింఛన్లు, కార్డులు ఇస్తే మిగతా వారి పరిస్థితి ఏమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బి. తాండ్రపాడులో ఉద్రిక్తత కర్నూలు సీక్యాంప్: కర్నూలు మండలం బి.తాండ్రపాడులో మంగళవారం జన్మభూమి గ్రామ సభను గ్రామస్తులు బహిష్కరించారు. తహసీల్దార్ టీవీ రమేష్ బాబు, మండల అధికారులను రోడ్డుమీదే నిలబెట్టి ఆందోళనకు దిగారు. 2013లో ఇళ్లు లేని 1018 కుటుంబాలకు గ్రామంలోని సర్వే నెంబర్ 277లో పొజిషన్ ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఆ స్థలాన్ని ప్రస్తుతం ఓ ప్రైవేటు కంపెనీకి ఇచ్చేందుకు పంచాయతీలో సర్పంచ్, అధికారులు తీర్మానం చేశారు. ఈ విషయంపై మూడేళ్లగా గ్రామస్తులు ఆందోళన చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామసభను అడ్డుకున్నారు. ఇళ్ల పట్టాలు ఇచ్చే వరకు అధికారులను గ్రామంలోకి రానీవ్వమని తేల్చిచెప్పారు. మధ్యాహ్నం వరకు సభ జరుగలేదు. తాలుకా సీఐ వాసుకృష్ణ అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. అధికారులు సభ నిర్వహించకుండానే వెనుది రుగారు. ఆందోళనలో గ్రామస్థులు పెద్దలక్ష్మన్న, శేఖర్, చిన్నలక్ష్మన్న, కబీర్, గౌండ వెంకటేశ్వర్లు, మోహన్‌బాబు పాల్గొన్నారు. సేవలకు సత్కారాలు జన్మభూమి కార్యక్రమంలో అత్యుత్తమ సేవలందించిన అధికారులను ఈనెల 11వ తేదీన సన్మానిస్తున్నట్లు కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం రాత్రి ఆయన క్యాంపు కార్యాలయంలో జన్మభూమి నిర్వహణపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 2 నుంచి 11వ తేదీ వరకు రోజుకో అంశంపై చర్చించి ప్రజలను విశేషంగా చైతన్యపరుస్తున్న అధికారులను గుర్తించి సన్మానించేందుకు చర్యలు తీసుకోవాలని సీపీఓను ఆదేశించారు. సాధికార మిత్ర గ్రూపులను కూడా గుర్తించి సన్మానించాలన్నారు. ఈనెల 7వ తేదీన 5కే రన్లో పాల్గొని విజేతలుగా పది మందిని ఎంపిక చేయాలని డీఎస్‌డీఓను కలెక్టర్ ఆదేశించారు. -
గొంతు నొక్కేశారు..
ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైంది. ప్రజా సమస్యలు చెప్పకుండా ప్రతిపక్షం గొంతునొక్కే కుట్ర జరి గింది. శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులు అధికారపక్షం ఆదేశాలతో వైఎస్సార్ సీపీ నేతలపై జులుం ప్రదర్శించారు. కంకిపాడు మండలం కోలవెన్ను జన్మభూమి సభకు వెళ్లొద్దంటూ పార్టీ నేత కొలుసు పార్థసారథిని గృహనిర్బంధం చేశారు. అనంతరం బయటకు వచ్చిన ఆయన్ను బలవంతంగా వాహనంలోకి ఎక్కించి రెండున్నర గంటల పాటు పలు ప్రాంతాల చుట్టూ తిప్పారు. మరోవైపు సభకు అధ్యక్షత వహించాల్సిన సర్పంచి చంద్రశేఖర్ చేతిలో మైక్ లాక్కుని కిందికి నెట్టేశారు. కంకిపాడు (పెనమలూరు): మండలంలోని కోలవెన్ను గ్రామంలో మంగళవారం పోలీసులు జులు ప్రదర్శించారు. ప్రజల సమస్యలను జన్మభూమి సభలో ప్రస్తావించాల్సిన వైఎస్సార్ సీపీ నేతల గొంతును పాలకపక్షం నేతల ఆదేశాలతో నొక్కేశారు. గ్రామంలో ఉదయం 9 గంటలకు జన్మభూమి–మా ఊరు గ్రామసభ ఏర్పాటుచేశారు. ఈ సభలో గ్రామ సమస్యలను అధికారులు, పాలకపక్షం దృష్టికి తీసుకెళ్లాలని ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నిర్ణయించింది. పార్టీ మచి లీపట్నం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి ఉదయం 8 గంటలకే సర్పంచి, పార్టీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి తుమ్మల చంద్రశేఖర్ (బుడ్డి) ఇంటికి చేరుకున్నారు. స్థానికులు రేషన్‌కార్డులు, పింఛన్లు, ఇళ్లస్థలాల సమస్యల అర్జీలను వారికి అందించారు. భారీగా మోహరించిన పోలీసులు జన్మభూమి సభకు ప్రతిపక్ష నాయకులు వెళ్తారనే సమాచారంతో డీసీపీ గజరావ్‌భూపాల్, ఏసీపీలు విజయభాస్కర్, ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసు, టాస్క్ఫోర్సు, క్యూ ఆర్టీ, ఏపీఎస్పీ బృందాలు భారీగా గ్రామానికి చేరాయి. తుమ్మల చంద్రశేఖర్ ఇల్లు, పంచాయతీ ప్రాంగణం, మండపాల సెంటరు మార్గాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. పోలీసులు అడుగడుగునా తనిఖీలు చేపట్టి, సభకు వస్తున్నవారు వైఎస్సార్ సీపీ శ్రేణులని తెలిస్తే అక్కడే ఆపేశారు. నల్లరిబ్బన్లతో నిరసన వైఎస్సార్ సీపీ నేతలు పార్థసారథి, చంద్రశేఖర్, ఉపసర్పంచి నక్కా శ్రీనివాసరావు, ఎంపీటీసీ సభ్యురాలు బూసే జ్యోతి ఇతర నాయకులు జన్మభూమి సభకు బయలుదేరుతున్నారనే సమాచారంతో చంద్రశేఖర్ ఇంటిని పోలీసులు నిర్బంధించారు. తాము గొడవ చేసేందుకు రాలేదని, సభలో సమస్యలు వివరిస్తామని పార్థసారథి పోలీసులకు స్పష్టంచేశారు. కొంత సమయం తరువాత మండపాల సెం టరు మీదుగా పంచాయతీ కార్యాలయ వద్ద నిర్వహిస్తున్న గ్రామసభకు పార్థసారథి తదితరులు బయలుదేరారు. సభా ప్రాంగణానికి వెళ్లకుండానే పోలీసులు అడ్డగించారు. పోలీసుల తీరును నిరసిస్తూ పార్థసారధి సహా ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు నోటికి నల్లరిబ్బన్లు «కట్టుకున్నారు. పార్థసారధిని అరెస్టు చేసి అక్కడి నుంచి తరలిం చారు. పార్టీ నాయకులు అడ్డుపడకుండా రోప్ పార్టీ సిబ్బంది స్థానికులను అడ్డగించారు. ఉదయం 10.30 గంట లకు సారథిని అరెస్టు చేసిన పోలీసులు రెండున్నర గంటలపాటు తమ వాహనంలో ఉయ్యూరు, ఉంగుటూరు, తేలప్రోలు, గన్నవరం ప్రాంతాల్లో తిప్పి విజయవాడలోని పార్టీ కార్యాలయం వద్ద వదిలిపెట్టారు. చంద్రశేఖర్ నుంచి మైకు లాక్కున్న పోలీసులు గ్రామసభకు వెళ్లిన సర్పంచి తుమ్మల చంద్రశేఖర్ ప్రసంగిస్తూ గ్రామంలో ఇళ్లస్థలాల సమస్య అపరిష్కృతంగా ఉందని, సంక్షేమ పథకాల సమాచారం సర్పంచినైన తనకు తెలియనీయడం లేదన్నారు. టీడీపీ శ్రేణులు ఆయన్ను అడ్డుకుని వాగ్వాదానికి దిగాయి. ఈస్ట్‌జోన్ ఏసీపీ విజయభాస్కర్, ఎస్ఐ హనీష్ వేదిక ఎక్కి సర్పంచి చేతిలో మైక్ లాక్కుని, వేదిక నుంచి కిందికి నెట్టి, లాక్కెళ్లారు. ఎమర్జెన్సీని తలపిస్తున్న పాలన అధికార పక్షం, పోలీసుల తీరు ఎమర్జెన్సీని తలపిస్తోందని వైఎస్సార్ సీపీ మచిలీపట్నం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారధి విమర్శించారు. అరెస్టుకు ముందు ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. టీడీపీ మీటింగ్ అయితే ఎవరం హాజరుకాబోమని, ప్రభుత్వ సభ కనుక, ప్రజల సమస్యలు వివరించేందుకు వెళ్తున్నామని స్పష్టంచేశారు. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సత్తెనపల్లి వెళ్లొచ్చు కానీ, ప్రతిపక్షం సభలకు వెళ్లకూడదా అని ప్రశ్నించారు. తాను మంత్రిగా ఉండగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కోలవెన్నులో 2.40 ఎకరాలు, 2 ఎకరాలు సేకరించామని గుర్తుచేశారు. అయితే నేటికీ ఇళ్లపట్టాలు మంజూరు చేయలేదని, ఇలా ఎందుకు జరుగుతోందని ప్రశ్నించకూడదా? అని పేర్కొన్నారు. మినుము పంట పరిహారం కొందరికే అందిందని, స్థిరీకరణ నిధి నుంచి రైతులు అందరికీ న్యాయం చేయాలని కోరారు. గృహ నిర్మాణాల బిల్లులు బిక్షం వేసినట్లుగా అరకొరగా మంజూరు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి కూలీలు కూలి సొమ్ము అందక అవస్థ పడుతున్నారని విమర్శించారు. పోలీసులు బందోబస్తు లేకపోతే ప్రజల్లోకి వచ్చే ధైర్యంలేని అధికారపక్షం, ప్రజలకు న్యాయం చేయకపోతే తప్పుకోవాలని ఎద్దేవాచేశారు. -
ఏపీ విప్ నోట బూతు.. బూతు.. బూతు..!
సాక్షి, ఏలూరు: దుందుడుకు చర్యలతో ఎప్పుడూ వివాదాల్లో ఉండే టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ విప్ చింతమనేని ప్రభాకర్ మరోసారి అధికారులపై చిందులు తొక్కారు. జన్మభూమి కార్యక్రమంలో బాహాటంగానే అధికారులను ఉద్దేశించి బూతులు మాట్లాడారు. ఆయన బూతులు మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా విజయరాయిలో జన్మభూమి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో విప్ చింతమనేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైక్ సరిగ్గా పనిచేయకపోవడంతో చింతమనేని తీవ్ర అసహనానికి లోనయ్యారు. గ్రామాధికారి నరసింహారావుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బహిరంగ కార్యక్రమం అన్న విషయాన్ని కూడా మరిచిపోయి.. ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టారు. ఆయన తనదైన శైలిలో దుర్భాషలాడటంతో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న వారు నివ్వెరపోయారు. -
మంత్రి లోకేష్ కోసం ‘దురాయి’
కావలి: కావలి రూరల్‌లోని తుమ్మలపెంట బాలికల గురుకుల పాఠశాలలో సోమవారం జరగనున్న జన్మభూమి కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి టీడీపీ నాయకులు ఆపసోపాలు పడుతున్నారు. ఈ క్రమంలో మండలంలోని మత్స్యకార గ్రామాల్లో ‘దురాయి’ విధించారు. దురాయి అంటే ‘మత్స్యకార గ్రామంలోని కాపులుగా ఉన్న వారు ఒక మాట చెబితే ఆ మాట మీదనే గ్రామస్తులందరూ కట్టుబడి ఉండాలి. దానిని ఉల్లంఘిస్తే నగదు జరిమానాలతో పాటు ఇతరత్రా చర్యలు ఉంటాయి.’ మండలంలోని మత్స్యకార గ్రామాలకు తుమ్మలపెంట జంక్షన్ పాయింట్. అక్కడ జరిగే జన్మభూమిలో వేలాది మంది మత్స్యకారులను పాల్గొనేలా చేసి, మంత్రి లోకేష్ వద్ద మార్కులు కొట్టేయాలనేది నేతల వ్యూహం. ఇందుకు మత్స్యకారుల్లో ఉన్న దురాయి అనే సాంఘిక దురాచార అస్త్రాన్ని నేతలు ఉపయోగించారు. మండలంలోని తుమ్మలపెంట, అన్నగారిపాలెం, పెద్దపట్టపుపాలెం గ్రామ పంచాయతీల పరిధిలో 25 మత్స్యకార గ్రామాలున్నాయి. వీటిలో 15 గ్రామాల్లో దురాయి వేయించారు. కచ్చితంగా పాల్గొనాల్సిందే... కావలి పట్టణంలోని మద్దూరుపాడు వద్ద ఉన్న పారిశ్రామికవాడలో నిర్మిస్తున్న అపార్ట్మెంట్ల మంత్రి లోకేష్ కార్యక్రమంలో లబ్ధిదారులను హాజరుకావాల్సిందేనని టీడీపీ నాయకులు హుకుం జారీ చేశారు. హాజరు కాకపోతే లబ్ధిదారుల జాబితాలో పేర్లు తొలిగిస్తామని బాహాటంగానే చెబుతున్నారు. అలాగే రెండో విడతలోని అపార్ట్మెంట్ల నిర్మాణంలో లబ్ధిదారుల జాబితాలో పేర్లు ఉండాలంటే మంత్రి కార్యక్రమంలో పాల్గొనాల్సిందే అంటున్నారు. ఇక పొదుపు గ్రూపు మహిళలు పాల్గొంటేనే వారికి ప్రభుత్వం ద్వారా అన్ని అందేలా చేస్తామని, ప్రత్యేక రుణాలు మంజూరు చేయిస్తామని టీడీపీ నాయకులు చెబుతున్నారు. రాకపోతే ఆ సంఘాలను గుర్తించి వారికి ప్రభుత్వం ద్వారా ఏవీ రాకుండా ఆపేస్తామని హెచ్చరిస్తున్నారు. మత్స్యకారులను ఎస్టీలో చేర్చుతామని హామీ ఇచ్చీ.. నేటికీ అమలు చేయలేదని వైజాగ్‌లో మత్స్యకారులు నిరాహార దీక్షలు చేస్తున్నారు. వారు చంద్రబాబును కలిస్తే ‘ఆందోళనలు చేస్తే మీ మత్స్యకారుల ఊర్లకు రోడ్లు వేయను’ అంటూ హెచ్చరించారు. ఈ వ్యవహారంతో మత్స్యకారుల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది -
ఎమ్మెల్యే అనుచరుల డిష్యుం.. డిష్యుం..
బండిఆత్మకూరు: సిద్ధాపురం ఎత్తిపోతల పథకం ప్రారంభంలో భాగంగా ముఖ్యమంత్రి సభకు జనం తరలించే విషయం టీడీపీ నేతల మధ్య విభేదాలుకు కారణమైంది. దీంతో సింగవరంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి అనుచరులు ఒకరిపై మరొకరు కట్టెలతో దాడులు చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే...ఎమ్మెల్యేకు గ్రామానికి చెందిన రామసుబ్బయ్య ఒకవైపు, వెంకటసుబ్బయ్య, నాగేష్, బూరగయ్య సోదరులు మరోవైపు అనుచరులుగా ఉన్నారు. ముఖ్యమంత్రి సభ కోసం ఇరువర్గాలకు రెండు బస్సులు పంపించారు. దీంతో ఎవరి బస్సులో వారు పట్టుదలతో సీఎం సభకు జనాలను తరలించారు. సీఎం సభ ఆవరణలో ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు జరిగినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఆ తర్వాత రాత్రి ఇరువర్గాల వారు ఇంటికి చేరుకున్నారు. రామసుబ్బయ్య వర్గానికి చెందిన మల్లయ్య బైక్‌పై వెళ్తుండగా వెంకటసుబ్బయ్య, బూరగయ్య, నాగేష్‌లు కట్టెలతో దాడి చేశారు. దీంతో రామసుబ్బయ్య వర్గానికి చెందిన వ్యక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ప్రతీకార దాడులు చేశారు. ఈ క్రమంలో బూరగయ్య, వెంకటసుబ్బయ్య, నాగేష్‌లకు గాయాలు కావడంతో అక్కడి నుంచి వారు పరారయ్యారు. ఈ క్రమంలో వారు మొదట దాడి చేసిన మల్లయ్య తలపై రక్తస్రావం కావడంతో అతని పరిస్థితి సీరియస్‌గా మారింది. ఎస్ఐ విష్ణునారాయణ గ్రామానికి వచ్చి ఇరువర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మల్లయ్య పరిస్థితి విషమించడంతో నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
పసి హృదయం.. ప్రచార కష్టం!
పాపం..పుణ్యం.. ప్రపంచ మార్గం...ఏమీ ఎరుగని చిన్నారులు వారు..వాన కురిస్తే..హరివిల్లు విరిస్తే అంతా తమకే అనుకునే అమాయకత్వం వారిది.. అలాంటి అమాయకత్వాన్ని ప్రభుత్వం తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. సంక్షేమ పథకాల ప్రచారానికి ప్రభుత్వ బడుల్లోని చిన్నారులను వాడుకుంటోంది. చిన్నారులతో డ్యాన్స్‌లు వేయిస్తోంది..ర్యాలీలు నిర్వహిస్తోంది. ఇదీ చాలక సెలవులను రద్దు చేసి ఎర్రటి ఎండలో పరుగులూ తీయిస్తోంది. అయ్యో..పాపం..లేత మనసులకు ఇంత కష్టమా..? విద్యా హక్కు చట్టం ఎందుకు అమలు కావడం లేదు? ఇదేం పాలన అంటూ విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. కర్నూలు సిటీ: పాఠశాల విద్యార్థులను ప్రభుత్వం.. ప్రచాకర్తలుగా మార్చడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. జన్మభూమి సభల్లో చిన్నారులను వినియోగించడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యాహక్కు చట్టం ప్రకారం పాఠశాలలకు సెలవు ఉన్న రోజుల్లో ఎలాంటి పరిస్థితుల్లోనైనా తరగతులు కానీ, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 2వ తేదీ నుంచి ప్రారంభించిన జన్మభూమి–మా ఊరు కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులను, వారికి చదువు చెబుతున్న ఉపాధ్యాయులను భాగస్వాములను చేస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేసేందుకు ప్రచారకర్తలుగా విద్యార్థులను వినియోగించుకుంటోంది. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లోని విద్యార్థులను మాత్రమే భాగస్వాములను చేసి, కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుతున్న వారిని మినహాయించడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేసేందుకు ప్రభుత్వ ఉద్యోగులను ఉపయోగించుకోవాలి. లేదంటే పార్టీ కార్యకర్తలతో ప్రచారం చేయించుకోవాలి. విద్యార్థులను చదువులకు దూరం చేసి తమ ప్రచారానికి వినియోగించుకోవడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ప్రచార ఆర్భాటంలో విద్యార్థులే సమిధలు! స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మించాలనేది ప్రభుత్వ లక్ష్యం. మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రజలు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులతో ప్రభుత్వం సర్వే చేయించింది. విద్యార్థులతో ఓడీఎఫ్‌పై ర్యాలీలు, ఇంటింటి సర్వేలు చేయించారు. వాస్తవానికి పాఠశాలల్లోనే మరుగుదొడ్లు నిర్మించలేదనే విషయాన్ని ప్రభుత్వం విస్మరించింది. బాలల హక్కులపై గతేడాది నవంబరు నెలలో చేపట్టి ర్యాలీలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఆ రోజున ఉదయం నుంచి ఎలాంటి అల్పాహారం ఇవ్వకుండా ర్యాలీ పేరుతో విద్యార్థులను రోడ్లపైకి తీసుకువచ్చారు. ర్యాలీ, సమావేశం ముగిసిన తరువాత వారిని స్కూళ్లకు చేర్చకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నెల 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరుగనున్న జన్మభూమి–మా ఊరు కార్యక్రమంలోనూ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులను, ఉపాధ్యాయులను భాగస్వాములను చేశారు. ఈ నెల 5వ తేదీన విద్యా వికాసం, ఓడీఎఫ్ కార్యక్రమాల గురించి విద్యార్థులతో ఎండలోనే ర్యాలీలు చేయించారు. సెలవు రోజు కూడా వదిలి పెట్టకుండా ఆదివారం.. విద్యార్థులతో 5కె రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయమే రోడ్లపైకి వచ్చి 5కె రన్లో పాల్గొనాల్సి రావడంతో కొంత మంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వ పథకాల ప్రచారానికి పేద విద్యార్థులను వాడుకోవడంపై ఉపాధ్యాయ సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు అభ్యంతరం చెబుతున్నారు. చిన్నారి చేత జేజేలు! ఆత్మకూరురూరల్: సర్వపాధారణంగా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు తమ ప్రసంగం చివర్లో ‘జై తెలుగుదేశం .. జై జన్మభూమి’ అని నినాదాలిస్తారు. ఓ చిన్నారి చేత ఈ నినాదాన్ని బట్టీ పట్టించి సీఎంకు వినిపించడం టీడీపీ నేతలకే చెల్లింది. సిద్ధాపురం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ఆదివారం సీఎం చంద్రబాబు ఏర్పాటు చేసిన సభలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జూపాడుబంగ్లా ఏపీ గురుకుల పాఠశాలకు చెందిన 6వ తరగతి విద్యార్థితో మాట్లాడించారు. ఈ సందర్భంలో ఆ విద్యార్థి తాను బట్టీ పట్టిన ఉపన్యాసం ముగిస్తూ జై తెలు గు దేశం... జై జన్మభూమి అని నినాదమిచ్చాడు. ఇది చూస్తున్న సభలో పలువురు ముక్కున వేలేసుకున్నారు. ఇంతటి ప్రచార ఆర్భాటమా అని విసుకున్నారు. -
ఏయ్.. వాళ్లను బయటకు ఈడ్చేయండి!
పెందుర్తి: ‘సార్.. సింహాచలం దేవస్థానం పంచగ్రామాల భూసమస్య పరిష్కారం కాక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.. ఎన్నికల సమయంలో 100 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామన్నారు.. కానీ నేటికీ అది నెరవేరలేదు.. వరలక్ష్మీనగర్‌లో డంపింగ్ యార్డును తరలించాలి.. చీమలాపల్లిలో శ్మశానవాటిక నిర్మించాలి.. కల్యాణ మండపం ప్రారంభించాలి’ జీవీఎంసీ 70వ వార్డు పురుషోత్తపురంలోని జన్మభూమి వేదికగా ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తికి ఆ వార్డు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ముమ్మన వెంకటరమణ విన్నపం. ‘ఏయ్ ఎవరయ్యా మీరంతా.. వైసీపీ వాళ్లు సమస్యల గురించి చెబితే మేం వినం.. ఎవడయ్యా వీళ్లను ఇక్కడికి పంపింది.. పోలీసులూ ఏం చేస్తున్నారు(వారిని దుర్భాషలాడుతూ).. ముందు వైసీపీ వాళ్లందరినీ ఇక్కడి నుంచి ఈడ్చేయండి’ అంటూ ఎమ్మెల్యే బండారు పోలీసులకు ఆదేశం. ‘ఏయ్.. ఫొటోలు కావాలా..రా పంపుతాను.. రాసుకో..రాసుకో..’ అదే వేదిక మీద నుంచి జనం చూస్తుండగా సాక్షి పత్రిక విలేఖరికి ఎమ్మెల్యే బండారు పుత్రరత్నం అప్పలనాయుడు గద్దింపు. జీవీఎంసీ 70వ వార్డు పురుషోత్తపురంలో శుక్రవారం జరిగిన జన్మభూమి–మాఊరు కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మరోసారి తన నోటి దురుసును ప్రదర్శించారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరడానికి వచ్చిన ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నాయకులపై కన్నెర్ర చేశారు. ఎన్నికల సమయంలో బండారు ఇచ్చిన హామీలను గుర్తుచేయడంతో పాటు.. ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరడంతో శివాలెత్తిపోయారు. ఏ ప్రతిపక్ష పార్టీలైనా సమస్యలను తన దృష్టికి తీసుకురావాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. పనిలో పనిగా సాక్షి మీడియాపై కూడా బండారు తన అక్కసును మరోసారి వెళ్లగక్కారు. ఎమ్మెల్యేతో పాటు తన కుమారుడి అవినీతి, అక్రమాలపై ఇటీవల వరుస కథనాలతో నిజాల నిగ్గుతేల్చుతున్న సాక్షిపై ఆయన పరుష వాఖ్యలు చేశారు. ఇదే వేదికపై ఎమ్మెల్యే కుమారుడు అప్పలనాయుడు మరో అడుగు ముందుకేసి అక్కడే ఉన్న సాక్షి విలేకరికి వేలు చూపుతూ.. ‘ఈ గొడవ ఫొటోలు నేనే పంపుతాను.. రాసేయ్.. రాసేయ్’ అంటూ బిగ్గరగా కేకలు వేయడంతో జనం నివ్వెరపోయారు. వంత పాడిన పోలీసులు ఈ క్రమంలో ఎమ్మెల్యే ఆదేశాలను పోలీసులు తూ.చ.తప్పకుండా పాటించారు. వేదిక వద్ద నుంచి వైఎస్సార్సీపీ నాయకులను బలవంతంగా బయటకు లాక్కెళ్లిపోయారు. కాసేపటికి రంగప్రవేశం చేసిన పెందుర్తి సీఐ మురళి వైఎస్సార్సీపీ వార్డు అధ్యక్షుడు ముమ్మన వెంకటరమణ, యువజన విభాగం అధ్యక్షుడు కోలా కిరణ్, నాయకులు చిప్పల చందు, జోబ్దాస్, సన్నీలను విచారించారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్‌రాజ్ ‘తమ పార్టీ వారిని ఎందుకు విచారిస్తున్నారు’ అంటూ పోలీసులను ప్రశ్నించారు. ఇలాంటి వేధింపులకు పాల్పడడం సరికాదన్నారు. ప్రజా సమస్యలు వినను అని చెప్పడం బండారు దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకుని ప్రజాక్షేత్రంలో తిరగాలని హితవు పలికారు. -
తెలుగు తమ్ముళ్ల ఢీ అంటే ఢీ
పెదపూడి (అనపర్తి): పెదపూడి మండలం పెద్దాడ గ్రామంలో శుక్రవారం జరిగిన జన్మభూమి గ్రామ సభలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు వర్గాల మధ్య గలాటా చోటు చేసుకుంది. స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న సామాజిక భవనంలో జన్మభూమి మా ఊరు గ్రామ సభ శుక్రవారం నిర్వహించారు. సభకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఇదే గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు హాజరయ్యారు. సభలో భాస్కరరామారావు మాట్లాడుతూ గతంలో గ్రామంలో మన ఇంటికి మన ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహించినప్పుడు ‘ఒక సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు.. 40 ఏళ్లు వివిధ పదవులు చేపట్టి ఆ సామాజిక వర్గానికి చెందిన గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి చేయలేదంటూ’ ఎందుకు విమర్శించారంటూ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని నిలదీశారు. అప్పటికే ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ వర్గీయులతో పాటు పోలీసు బలగాలు కూడా భారీగా మోహరించి ఉన్నాయి. భాస్కరరామారావు లేవనెత్తిన అంశాన్ని పట్టించుకోకుండా ఎమ్మెల్యే ప్రభుత్వ పథకాలపై మాట్లాడుతుండగా స్థానికుడు లేచి భాస్కరరామారావు అడిగిన దానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో ఎమ్మెల్యే వర్గీయులు అభివృద్ధి పనులపై మాట్లాడిన అనంతరం సమాధానం చెబుతారని చెప్పడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని గందరగోళానికి దారి తీసింది. వెంటనే కొంతమంది బొడ్డు భాస్కరరామారావును మీ విషయం ఎమ్మెల్యేకు చెప్పండి సమాధానం చెబుతారని చెప్పారు. దీనిపై భాస్కరరామారావు మాట్లాడుతూ గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన అనిశెట్టి బుల్లబ్బాయిరెడ్డి, నల్లమిల్లి శేషారెడ్డి, పిల్లి అనంతలక్ష్మి, నాయకర్ మొదలగు వారు గ్రామానికి వచ్చి వారి పాలనను వారు సాగించుకున్నారన్నారు. గ్రామంలో ఒక అనామకుడ్ని వెంట వేసుకుని పాలన చేస్తున్నారని అనడంతో ఆ అనామకుడు ఎవరంటూ ఎమ్మెల్యే వర్గీయులు బొడ్డు సతీష్, సత్తిరాజు తిరిగి ప్రశ్నించడంతో తోపులాట మొదలైంది. దీంతో పోలీసులు వెంటనే లాఠీచార్జి చేశారు. ఇరువర్గాల వారిని అక్కడ నుంచి తరిమి వేశారు. ఎమ్మెల్యే టీడీపీ నేత బొడ్డు సత్తిరాజు ఇంటికి వెళ్లారు. బొడ్డు భాస్కరరామారావును పోలీసుల పర్యవేక్షణలో ఇంటికి పంపించేశారు. దీంతో ఉద్రిక్తత సద్దుమణిగింది. అవినీతి పరుడిగా ఎమ్మెల్యే... పార్టీలో వ్యక్తుల మధ్య గొడవలు జరిగితే వాటిని పరిష్కరించకుండా తప్పుడు కేసులు పెట్టించి నాయకులను పార్టీకి దూరం చేస్తున్న ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిపై అధిష్టానికి ఫిర్యాదు చేస్తానని బొడ్డు భాస్కరరామారావు విలేకర్లకు తెలిపారు. ఎమ్మెల్యే తీరును ఖండిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే పెద్ద అవినీతి పరుడిగా తయారయ్యారంటూ ఆరోపించారు. ఆయన చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తామన్నారు. -
ఈ సారైనా నాకు ఓటేయండి!
సుంకిరెడ్డిపాలెం(పొన్నలూరు): మీ గ్రామంలో అభివృద్ధి పనులు చేశాను. గత ఎన్నికల్లో మీరు నాకు ఓట్లు వేయలేదు కనీసం ఈ సారైన నాకు ఓట్లు వేయండని ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి గ్రామస్తులకు విన్నవించారు. మండలంలోని సుంకిరెడ్డిపాలెం గ్రామంలో శుక్రవారం జరిగిన జన్మభూమి గ్రామసభలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మీ గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని, ఇప్పటికైన మీరు మారి ఈ సారైన నాకు ఓటు వేయాలన్నారు. ఎమ్మెల్యే పలుమార్లు గత ఎన్నికల్లో మీరు నాకు ఓట్లు వేయలేదని అనడంతో అవాక్కైన గ్రామస్తులు మీరు దగ్గరుడి చూసినట్లు పదే పదే నాకు ఓటు వేయలేదంటున్నారేమిటని ప్రశ్నించారు. స్థానిక సర్పంచ్ వరికూటి బ్రహ్మారెడ్డి ప్రభుత్వం నుంచి మంజూరైన అభివృద్ధి పనులను తనను చేయనివ్వకుండా పక్క గ్రామాలకు చెందిన అధికారపార్టీ నాయకులతో చేయించడం ఏమిటంటూ ఎమ్మెల్యేను ప్రశ్నించాడు. గ్రామంలో నిర్మించిన సీసీ రోడ్డుకు ఇరువైపులా గ్రావెల్ మట్టి తోలించి బిల్లులు చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. కార్యక్రమంలో కందుకూరు డీఎస్పీ ప్రకాశరావు, ప్రత్యేక అధికారి ఉమాదేవి, ఎంపీపీ వీరకుమారి, ఎంపీడీఓ పద్మజ, తహసీల్దార్ మహ్మద్‌హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. -
నన్నెవరూ మోసం చేయలేరు
సాక్షిప్రతినిధి, విజయనగరం: ‘ఎవ్వరూ నన్ను మోసం చేయలేరు. పింఛను కోసం వయస్సును మార్చేసుకుంటున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ హయాంలో దెయ్యాలు శ్మశానం నుంచి వచ్చి పింఛన్లు తీసుకుని తిరిగి శ్మశానానికి వెళ్లిపోయేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.’ అని సీఎం చంద్రబాబు అన్నారు. ఐదో విడత జన్మభూమి–మావూరు కార్యక్రమంలో భాగంగా బొబ్బిలి లో శుక్రవారం నిర్వహించిన సభలో ముఖ్య మంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన భవిష్యత్‌లో విద్య విషయంలో అన్ని విధాలుగా విజయనగరం జిల్లాను అభివృద్ధి చేస్తానంటూ ప్రసంగం ప్రారంభించిన సీఎం పిల్లలు ఒత్తిడికి గురి కావటంతో ఆత్మహత్మలకు పాల్పడుతున్నారన్నారు. అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రాలోనే విద్యార్థుల ఆత్మహత్యలు తక్కువగా జరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలోని కొన్ని పాఠశాలల్లో తెల్లవారితే 4 గంటలకు నిద్రలేపి రాత్రి 12 గంటల వరకు చదివించటంతో సమస్యలు వస్తున్నాయని, పిల్లల జీవితాలతో ఆడుకోవటానికి వీల్లేదన్నారు. సమైకాంధ్రంగా ఉన్నపుడు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రాష్ట్రం కాగా తానే హైటెక్ సిటీ పెట్టి, 25 ఇంజినీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు ఉంటే 300లకు పెంచానని చెప్పుకొచ్చారు. పిల్లల్ని పనిలో పెట్టుకోవటం క్షమించరాని నేరం అని, 6 నుంచి 14 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలు స్కూల్లో ఉండాలనీ తెలిపారు. ఒకప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోమని చెప్పిన తానే పిల్లల్ని కనండి జనాభా పెంచండి అని ఇప్పుడు చెబుతున్నాననీ పిలుపునిచ్చారు. లేకుంటే ఇతర దేశాల మాదిరి ముసలి వారి సంఖ్య పెరిగిపోతుందని ముందు జాగ్రత్తతో ప్రచారం ప్రారంభిస్తున్నాననీ వివరించారు. సోషల్ వెల్ఫేర్ స్కూల్స్‌ను రెసిడెన్షియల్ స్కూల్స్‌గా మార్చేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా డిజిటల్ తరగతులు అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో యూనివర్శిటీలను మెరుగుపర్చేందుకు పోటీ పెట్టి ఎక్కడికక్కడ యూనివర్శిటీ, ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలలకు ర్యాంకింగ్‌లు ఇస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్‌లో జీవితాలను మార్చేది టెక్నాలజీ అని అయితే దానికి బానిసలు కావద్దనీ హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, సుజయకృష్ణ రంగారావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. -
ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తారా ?
అనంతపురం సప్తగిరి సర్కిల్: ‘జన్మభూమి’ సభలో సమస్యలపై మాట్లాడితే మైకు లాక్కునే స్థాయికి సీఎం దిగజారడం సిగ్గుచేటని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం సాయంత్రం ఆయన వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జన్మభూమి కార్యక్రమం పెద్ద ప్రహసనంగా మారిందన్నారు. ప్రతిసారీ పింఛన్, ఇళ్లస్థలాల కోసం అర్జీలు తీసుకోవడం... వాటిని చెత్తబుట్టపాలు చేయడం ఈ ప్రభుత్వానికి అలవాటైపోయిందన్నారు. పోలవరం, ప్రత్యేకహోదా, రైల్వేజోన్ సాధన, కడప స్టీల్ పరిశ్రమ ఏర్పాటు వంటి ప్రధాన సమస్యలపై పట్టించుకోకుండా... ‘జన్మభూమి’ సభల ద్వారా సీఎం ప్రజలను మాయ చేస్తున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టును 2017 కల్లా పూర్తి చేస్తామని చెప్పిన చంద్రబాబు... ప్రస్తుతానికి దిమ్మెలు కూడా కట్టలేదన్నారు. పోలవరం 2022 నాటికైనా పూర్తవుతుందో..? కాదో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఇక దుర్గగుడిలో తాంత్రిక పూజలపై రిటైర్డ్ జడ్జీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి పేరిట చంద్రబాబు సర్కార్ దేవాలయాలు, మసీదులు, గాంధీ విగ్రహాలను కూల్చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని, అందువల్లే మహిళలపై అత్యాచారాలు, హత్యలు పెరిగాయన్నారు. వీటిని నియంత్రించాల్సిన లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందన్నారు. విద్యావ్యవస్థ నిర్వీర్యానికి కుట్ర పాఠశాల ఉపాధ్యాయులను నోడల్ అధికారులుగా నియమించి పాఠశాల విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుందని గోపాల్‌రెడ్డి విమర్శించారు. బయోమెట్రిక్ విధానం ద్వారా ఉపాధ్యాయులను భయభ్రాంతులకు గురిచేయడం తప్ప ఒరిగిందేమీ లేదన్నారు. గతంలో విద్యార్థులు, ఉపాధ్యాయులతో దోమలపై దండయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారనీ, అయితే దోమలు పోలేదు కానీ విద్యార్థులు చదువులు మాత్రం నాశనం అయ్యాయన్నారు. దోమలపై దండయాత్ర చేసే బదులు వాటి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని హితవుపలికారు. సమావేశంలో వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కొర్రపాడు హుస్సేన్‌పీరా, పార్టీ నగర అధ్యక్షుడు సోమశేఖర్‌రెడ్డిలు పాల్గొన్నారు. -
పెల్లుబికిన జనాగ్రహం
అనంతపురం అర్బన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ‘జన్మభూమి – మా ఊరు’ సభల్లో జనాగ్రహం వ్యక్తమవుతోంది. ప్రజా సమస్యలు పరిష్కరిస్తామంటూ గొప్పగా ప్రకటించుకుంటున్న ప్రభుత్వానికి ప్రజల నుంచి నిరసనలు ఎదరవుతున్నాయి. జిల్లాలో శుక్రవారం జరిగిన జన్మభూమి గ్రామసభల్లో జనం సమస్యలపై అధికారులను నిలదీశారు. సమస్యలపై ప్రశ్నించిన ఎస్సార్ సీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. రుణమాఫీ, ఇన్పుట్ సబ్సిడీ ఎక్కడ కూడేరు మండలం కొర్రకోడులో జన్మభూమి సభలో రుణమాఫీ, ఇన్పుట్ సబ్సిడీ, డ్వాక్రా రుణాలపై శాసనమండలి చీఫ్‌విప్ పయ్యావుల కేశవ్, అధికారులను రైతులు, గ్రామస్తులు నిలదీశారు. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదని ఎన్పీకుంట దనియాన్ చెరువులో జరిగిన జన్మభూమి గ్రామసభను రైతులు అడ్డుకున్నారు. సమస్యలపై ప్రతిపక్షపార్టీ నాయకుల నిరసనలు ⇔ కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండలం పాళ్ళూరులో జరిగిన గ్రామసభలో వైఎస్సార్సీపీ నాయకుడు తిమ్మారెడ్డి, కాంగ్రెస్ నాయకుడు రాంభూపాల్‌రెడ్డి అధికారులను నిలదీశారు. జన్మభూమిలో ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చకుండా మరోసారి చెవిలో పువ్వులు పెట్టేందు వచ్చారా అంటూ అధికారులు, ప్రజాప్రతినిధులకు పూలు అందజేసి నిరసన తెలపడంతో పోలీసులు వారిని సభనుంచి గెంటేశారు. దీంతో వారు రోడ్డపై బైఠాయించిన నిరసన తెలిపారు. ⇔ ప్రజాసమస్యలు పరిష్కరించలేదంటూ కుందుర్పి మండలం బెస్తరపల్లిలో జరిగిన సభలో వైఎస్సార్సీపీ నాయకులు రామదాసు, రవి, బీటీ రాము, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాసులు, రాజేష్‌లు అధికారులను అడ్డుకున్నారు. సంక్షేమ పథకాలను అర్హులైన పేదలకు కాకుండా టీడీపీ కార్యకర్తలకే అందిస్తున్నారంటూ అధికారులతో వాదనకు దిగారు. ⇔ బ్రహ్మసముద్రం మండలం నాగిరెడ్డిపల్లిలో జరిగిన జన్మభూమి సభలో సమస్యలపై అధికారులను వైఎస్సాసీపీ మండల కన్వీనర్రామాంజినేయులు ప్రశ్నించారు. దీంతో అతన్ని పోలీసులు అడ్డుకున్నారు. ప్రజాసమస్యలను చెప్పకోవడానికి అవకాశం ఇవ్వనప్పుడు జన్మభూమి నిర్వహించడం ఎందుకని నిలదీశారు. సమస్యలపై నిలదీత ⇔ ఎన్నిసార్లు విన్నవించినా గ్రామంలో రోడ్లు నిర్మించలేదని, అర్హులైన వారికి పింఛన్లు ఇవ్వలేదని, ఏ సమస్యలు పరిష్కరించలేదని గోరంట్ల మండలం బుదిలి గ్రామస్తులు మండిపడ్డారు. గ్రామంలో జరిగిన సభలో సమస్యలపై జాయింట్ కలెక్టర్‌ని గ్రామస్తులు నిలదీశారు. ⇔ మరుగొడ్లు నిర్మించుకోండంటూ ఒత్తిడి చేశారు. తీరా కట్టుకున్న తర్వాత బిల్లులు ఇవ్వలేదంటూ గుమ్మఘట్ట మండలం గలగల, కేపీ దొడ్డి గ్రామాల్లో జరిగిన జన్మభూమి సభల్లో లబ్ధిదారులు అధికారులను నిలదీశారు. మిస్సమ్మ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలి అనంతపురం న్యూసిటీ: అభివృద్ధి పేరుతో పేద రైతుల లక్షల ఎకరాల భూములను స్వాధీనం చేసుకుంటున్న సర్కార్... అన్యాక్రాంతమైన ఏడెకరాల మిస్సమ్మ స్థలాన్ని ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదని వామపక్ష పార్టీ నేతలు ఇండ్ల ప్రభాకర్ రెడ్డి, అల్లీపీరా, వెంకటనారాయణ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి, మేయర్ స్వరూపను నిలదీశారు. గురువారం 20వ డివిజన్లో శుక్రవారం నిర్వహించిన జన్మభూమి సభను వామపక్ష పార్టీ నేతలు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పదేళ్లుగా పోరాడుతున్నా అన్యాక్రాంతమైన మిస్సమ్మ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం లేదన్నారు. ఆ స్థలాన్ని కబ్జా చేసిన బీఎన్ఆర్ సోదరులు టీడీపీలో చేరాక, ఇక స్వాధీనం చేసుకుంటుందన్న నమ్మకం కూడా లేకుండా పోయిందన్నారు. ఎమ్మెల్యే, మేయర్ పేదల పక్షాన నిలబడాలనీ, అవసరమైతే రాజీనామా చేసి తాము చేసే పోరాటంలో భాగస్వామ్యులు కావాలన్నారు. అప్పుడు వారిని ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారన్నారు. మరుగుదొడ్లు నిర్మించకపోవడంతో మహిళలు బహిర్భూమికి చెంబు పట్టుకుని కంప చెట్ల వెళ్లే దౌర్భాగ్య పరిస్థితి నెలకొందన్నారు. అరాచకాలు చేస్తే సహించం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ముఠా రాజకీయాలు చేస్తున్నారనీ, పోలీసులపై నోరుపారేసుకుంటున్నా పోలీసులు వంగి వంగి సలాంలు చేస్తున్నారని వారు ఆరోపించారు. ఎక్కడి నుంచో వచ్చి నగరంలో దౌర్జన్యాలకు పాల్పడితే సహించేది లేదని వామపక్ష పార్టీల నాయకులు హెచ్చరించారు. -
'పైన పటారం.. లోన లొటారం'
సాక్షి, రాయచోటి : జన్మభూమి సభల్లో చంద్రబాబు ప్రభుత్వం సొంత డబ్బా కొట్టుకుంటోందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడయాతో మాట్లాడుతూ శ్రమదానం, జన్మభూమి, ప్రజల వద్దకు పాలన ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ఆచరణ మాత్రం శూన్యం అంటూ విమర్శించారు. ప్రస్తుతం తెలుగుదేశం పాలన 'పైన పటారం.. లోన లొటారం' అన్న చందంగా తయారైందన్నారు. గ్రామసభల్లో అధికారులు, నాయకులు ఉదయం నుంచి మద్యాహ్నం వరకూ ఏదో అది చేశాం,, ఇది చేశాం అని చెప్పుకోవడం తప్పితే ప్రజలకు చేసింది మాత్రం ఏమీలేదని విమర్శించారు. రేషన్ షాపుల్లో ఇచ్చే సరుకులను కూడా గ్రామసభలో నలుగురికి ఇచ్చి ఫొటోలకు ఫోజులు ఇస్తూ చేతులు దులుపుకుంటున్నారంటూ దుయ్యబట్టారు. ప్రతిపక్ష నేతల నుంచే మైక్ లాక్కున్న చంద్రబాబు ప్రభుత్వం ప్రజా సమస్యలను ఎంతమాత్రం పట్టించుకుంటుందంటూ విమర్శించారు. గత నాలుగు జన్మభూమి కార్యక్రమాల్లో ఇచ్చిన అర్జీలు ఎంత వరకూ పరిష్కరించారో అడుగుదామంటే గ్రామస్థలకు మైక్ కూడా ఇవ్వడం లేదని, ఎన్ని సార్లు అర్జీలు ఇస్తే ప్రజల సమస్యలను పరిష్కరిస్తారని ప్రశ్నించారు. జగన్ వైపు యువత మొగ్గు : చంద్రబాబు చేస్తున్న మోసాలను రాష్ట్రంలో యువత ఎప్పటికప్పుడు గమనిస్తోందని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు ఉన్న సమస్యలను పరిష్కరించడానికి వైఎస్ జగన్ సరైన నాయకుడని యువత భావిస్తోందని, అందుకే జగన్ వైపు మొగ్గుతున్నారని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. రాయచోటిలో నూతనంగా ఏర్పాటైన జగన్ యువసేన నాయకులతో ఎమ్మెల్యే భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి సైనికుల్లా పనిచేయాలని శ్రీకాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. -
ఏ హోదాతో ఇక్కడికి వచ్చావ్..!
సాక్షి, వైఎస్ఆర్ జిల్లా: జన్మభూమి కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులకు ఊహించని పరిణామాలు ఎదురౌతున్నాయి. ఎన్నికల హామీలు అమలు చేయడంలో విఫమైన ప్రభుత్వాన్ని, తెలుగుదేశం నాయకులను ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఏం చేశాయంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. తాజగా వైఎస్ఆర్ జిల్లాలో తెలుగుదేశం నాయకులకు ఇదే పరిస్థితి ఎదురైంది. వివరాల్లోకి వెళ్తే వైఎస్ఆర్ జిల్లా తొండూరు మండలం ఇనగలూరులో శుక్రవారం జన్మభూమి కార్యక్రమం జరిగింది. తెలుగుదేశం నేత, శాసన మండలి మాజీ వైఎస్ ఛైర్మెన్ సతీష్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే అక్కడి ప్రజలను నుంచి సతీష్ రెడ్డికి ఊహించని అనుభవం ఎదురైంది. ఏహోదాతో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారంటూ స్థానిక ప్రజలు ఆయన్ను నిలదీశారు. దీంతో సతీష్‌రెడ్డి చేసేది ఏమీలేక అక్కడి నుంచి ఆగ్రహంగా వెనుదిరిగాడు. -
గుంటూరులో టీడీపీ Vs బీజేపీ
సాక్షి, విజయనగరం: చంద్రబాబు ప్రభుత్వం జన్మభూమి కార్యక్రమం ప్రారంభించింది ప్రతిపక్ష నేతలను, కార్యకర్తలను తిట్టడానికో.. కుదిరితే కొట్టడానికో అన్నట్లు ఉంది. కార్యక్రమం మొదలైనప్పటి నుంచి ప్రతిపక్షనేతలను సభలకు పిలవడం.. ప్రసంగాన్ని అడ్డుకోవడం తంతుగా మారింది. తాజాగా విజయనగరం జిల్లాలో తెలుగుదేశం కార్యకర్తలు రెచ్చిపోయారు. డెంకాడ మండలం మోదవలసలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. జన్మభూమి కార్యక్రమంలో తమ సమస్యలను చెప్పుకోవడానికి వచ్చిన వారిపై విచక్షణారహితంగా పిడిగుద్దులు కురిపించారు. ఈ సంఘటనలో ఇద్దరు కార్యకర్తలకు తీవ్రగాయాలయ్యాయి. బాధితులను ఆటోలో ఆస్పత్రికి తరలిస్తుండగా టీడీపీ నేతలు మరోసారి డాడులకు దిగారు. గుంటూరు జిల్లాలో బీజేపీ Vs టీడీపీ గుంటూరు జిల్లా, వల్లూరివారితోటలో జన్మభూమి కార్యక్రమం రసాభాసగా మారింది. సభవేదికపై ఉన్న ఫ్లెక్సీలో ప్రధాని మోదీ బొమ్మ పెట్టలేదని బీజేపీ నేతలు, కార్యకర్తలు సభను అడ్డుకున్నారు. కేంద్ర నిధులతో మీరు ప్రచారం చేసుకుంటారా అంటూ ఎమ్మెల్యే మోదుగులను బీజేపీ కార్యకర్తలు నిలదీశారు. అయితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదంటూ తెలుగుదేశం కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలపై ఎదురుదాడికి దిగారు. దీనిపై స్పందించిన బీజేపీ నాయకులు చంద్రబాబే ప్రత్యేక పాకేజీ తీసుకొని హోదా అడగటం లేదన్నారు. దీంతో ఇరుపార్టీల నేతలు, కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. -
జన్మభూమి సభలో కలకలం
కర్నూల్ జిల్లా, డోన్ టౌన్ : చాలా ఏళ్లుగా తాము సాగు చేసుకుంటున్న భూమి వివరాలను రెవెన్యూ అధికారులు ఆన్లైన్ నుంచి తొలగించి, ఇతరుల పేరిట నమోదు చేశారనే మనస్తాపంతో ఓ రైతు జన్మభూమి సభలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మిగిలిన బాధిత రైతులు కూడా పురుగు మందు డబ్బాలతో వచ్చి నిరసన తెలిపారు. ఈ సంఘటన గురువారం కర్నూలు జిల్లా డోన్ మండలం గోసాని పల్లె గ్రామంలో జన్మభూమి సభలో గోసానిపల్లె పరిధిలోని సర్వే నంబర్ 959లో 8.56 ఎకరాల మిగులు భూమి ఉంది. దీన్ని ఇదే గ్రామానికి చెందిన చిన్న రంగస్వామి, శ్రీనివాసులు, బాబయ్య, తిక్కలప్ప, రామాంజనేయులు అనే రైతులు సాగు చేసుకుంటున్నారు. రెవెన్యూ అధికారులు చాలాకాలం క్రితమే వీరికి పట్టాదారు పాసు పుస్తకాలను సైతం మంజూరు చేశారు. రెండేళ్ల క్రితం వరకు వీరి పేర్లే ఆన్లైన్లో ఉన్నాయి. అయితే, ప్రస్తుతం వాటిని తొలగించి బోయ ఈశ్వర్ అనే వ్యక్తితోపాటు మరొక వ్యక్తి పేరు నమోదు చేశారు. బాధిత రైతులు ఈ విషయాన్ని పలుమార్లు స్థానిక రెవెన్యూ అధికారులతోపాటు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ‘చూద్దాం, చేద్దాం’ అంటూ చెబుతూ వచ్చారు తప్ప రైతుల పేర్లను తిరిగి ఆన్లైన్లో నమోదు చేయలేదు. ఈ నేపథ్యంలో వారు గురువారం గ్రామంలో ఏర్పాటుచేసిన జన్మభూమి సభకు వచ్చి, అధికారులకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. అధికారుల నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడంతో చిన్న రంగస్వామి అనే రైతు మనస్తాపానికి గురయ్యాడు. తన వెంట తెచ్చుకున్న క్రిమి సంహారక మందు డబ్బాను బయటికి తీసి.. తాగేందుకు ప్రయత్నించాడు. మిగిలిన వారు కూడా పురుగు మందు డబ్బాలను చేతబట్టుకుని అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పురుగు మందు తాగేందుకు ప్రయత్నిస్తున్న చిన్నరంగస్వామిని అడ్డుకున్నారు. మందు డబ్బాను లాగేసుకున్నారు. అతడితోపాటు మిగిలిన రైతులను సముదాయించారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని పోలీస్, రెవెన్యూ అధికారులు పేర్కొన్నారు. నాలాంటి పేదలకు న్యాయం చేయాలి ‘‘మేము ఆ భూమిని తాతల కాలం నుంచి సాగు చేస్తున్నాం. పథకం ప్రకారమే మా పేర్లను ఆన్లైన్లో నుంచి తొలగించి, ఇతరుల పేర్లను నమోదు చేశారు. ఇది రెవెన్యూ అధికారుల అవినీతికి నిదర్శనం. న్యాయం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ కనికరించడం లేదు. చివరకు విసుగెత్తిపోయాం. ఇలాంటి అన్యాయం ఎవరికీ జరగకూడదనే ఉద్దేశంతోనే ఆత్మహత్యకు ప్రయత్నించా. ఇకనైనా అధికారులు కళ్లుతెరిచి నాలాంటి నిరుపేద రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నా’’ –చిన్న రంగస్వామి, బాధితుడు ఫారెస్టు అధికారుల ఫిర్యాదుతోనే... ‘‘బాధిత రైతుల పేర్లు చాలా ఏళ్లుగా ఆన్లైన్లో ఉన్న విషయం మాకు తెలియదు. నేను ఏడాదిన్నర క్రితం ఇక్కడికి బదిలీపై వచ్చా. ఫారెస్ట్ అధికారుల ఫిర్యాదు మేరకు 959 సర్వే నంబర్లో నమోదైన బోయ ఈశ్వర్ తదితరుల పేర్లన్నింటినీ ఆన్లైన్లో నుంచి తొలగించాం. తమ పరిధిలోనే ఈ భూమి ఉందని ఫారెస్ట్ అధికారులు ఫిర్యాదు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. జాయింట్ సర్వే చేయించిన తర్వాత అసలైన రైతులను గుర్తించి వారి పేర్లనే ఆన్లైన్లో నమోదు చేస్తాం’’ – మునికృష్ణయ్య, తహసీల్దార్, డోన్ -
వారి పొరపాటు... ఈయనకు గ్రహపాటు
విజయనగరం, పూసపాటిరేగ: అధికారుల పొరపాటుకు ఓ వృద్ధుడు తొమ్మిదేళ్లుగా పింఛన్ కోల్పోవాల్సి వచ్చింది. ఆయనకు రావాల్సిన పింఛన్ వేరొకరికి వెళ్లినట్లు తాజాగా ఆన్లైన్ ద్వారా వెలుగు చూసింది. మండలంలోని పూసపాటిపాలెం గ్రామానికి చెంది న రౌతు అప్పలనాయుడు బుధవారం నిర్వహించిన జన్మభూమి – మాఊరు కార్యక్రమంలో పింఛన్‌కోసం దరఖాస్తు చేశారు. దానిని ఆన్లైన్లో అప్లోడ్ చేస్తుండగా 2008 నుంచి తమ రేషనుకార్డు డబ్ల్యూఏపీ 022504200189 నంబర్‌తో పింఛన్ తీసుకున్నట్లు ఉండటంతో వృద్ధుడు అవాక్కయ్యాడు. దీనిపై విచారణ చేయగా 2008 నుంచి అదే గ్రామానికి చెందిన భీమసింగి సుగర్‌ఫ్యాక్టరీలో సూపర్వైజర్గా చేసి పదవీవిరమణ పొందిన రౌతు నర్సినాయుడుకు ఆ పింఛన్ అందుతున్నట్టు తేలింది. ఇన్నేళ్లుగా ఇలా జరుగుతున్నా అధికారులు గుర్తించకపోవడం గమనార్హం. తొమ్మిదేళ్లుగా తాను నష్టపోయిన పింఛన్ తనకు ఇప్పించాలని రౌతు అప్పలనాయుడు కోరుతున్నాడు. తమ రేషన్ కార్డు, ఆధార్‌కార్డుతో వేరొకరికి పింఛన్ ఎలా మంజూరు చేశారని ప్రశ్నిస్తున్నాడు. -
ఎమ్మెల్యే గిడ్డికి చుక్కెదురు
సాక్షి, విశాఖపట్నం: జన్మభూమి మావూరు కార్యక్రమంలో రెండోరోజు నిరసనలు కొనసాగాయి. జన్మభూమి పేరుతో ముఖ్యమంత్రి అధికారులను ఇబ్బంది పెడుతున్నారన్నారని, అయినా అధికారులు కష్టపడి పనిచేస్తున్నారంటూ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి సీహెచ్ అయ్యన్నపాత్రుడు చెప్పుకొచ్చారు. విశాఖ ఒకటో వార్డులో జరిగిన జన్మభూమిసభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆరిలోవలో జూనియర్ కళాశాల, రైతు బజారు ఏర్పాటు చేయాలని, ఇవి ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే ఇచ్చిన హామీలంటూ సీపీఐ నాయకులు మంత్రిని నిలదీశారు. ♦ గాజువాకలో జరిగిన సభలో సమస్యలు చెప్పడానికి వేదిక వద్దకు వచ్చిన వార్ని టీడీపీ కార్యకర్తలు, పోలీసులు అడ్డుకున్నారు. తమకు సంక్షేమ పథకాలు, స్కీములు అందడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. చెప్పుకునే అవకాశం ఇవ్వని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ ప్రభుత్వానికి ఇదే చివరి జన్మభూమి అంటూ 64వ వార్డు వైఎస్సార్ సీపీ అధ్యక్షురాలు పల్లా చినతల్లి పేర్కొనడంతో మైకు లాక్కొని ఆమెను బలవంతంగా అక్కడ నుంచి పంపించివేశారు. ఆమెతో టీడీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ♦ కె.నగరపాలెం పంచాయతీలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ‘మంగమారిపేట కొండప్రాంతంలో మత్స్యకారులు ఇళ్లు నిర్మించుకుంటే పోలీసు బలగాలతో నేలమట్టం చేశారు.. సంపన్నులు బీచ్ ఒడ్డున మేడలు కట్టుకున్నా అధికారులెందుకు చర్యలు తీసుకోరు? పేదలకేనా సీఆర్‌జెడ్ నిబంధనలు’ అంటూ వైఎస్సార్సీపీ నాయకుడు వాసుపల్లి నల్లబాబు తహసీల్దారు గంగాధరరావును నిలదీశారు. ♦ హుకుంపేట మండలం వాల్డా గ్రామంలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును స్థానిక సమస్యలపై గిరిజనులను నిలదీశారు. నాలుగేళ్లగా ఒక్క హామీ కూడా అమలు చేసిన పాపాన పోలేదంటూ కిడారిపై మండిపడ్డారు. సర్దిచెప్పేందుకు ఎంతగా ప్రయత్నించినా వారు చాలా సేపటి వరకు శాంతించలేదు. సీపీఎంకు చెందిన ఎంపీటీసీ సభ్యుడు ధర్మయ్యదొర తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరినా ఎమ్మెల్యే పట్టించుకోకపోవడంతో సభను బాయ్‌కాట్ చేసి తమ అనుచరులతో బయటకు వెళ్లిపోయారు. ఎమ్మెల్యే గిడ్డికి చుక్కెదురు పార్టీ ఫిరాయించిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తీరుపై జన్మభూమి కార్యక్రమాల వేదికగా ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. బుధవారం పాడేరు మండలం వనుగుపల్లి పంచాయతీలో నిర్వహించాల్సిన జన్మభూమి–మా ఊరు కార్యక్రమాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న ఎమ్మెల్యే ఈశ్వరి బృందాన్ని పంచాయతీ గిరిజనులు అడ్డగించారు. పాడేరు–చోడవరం ప్రధాన రహదారిలోని కందమామిడి కూడలి నుంచి బంగారుమెట్ట వరకు పదిహేనేళ్ల క్రితం వేసిన తారురోడ్డు పూర్తిగా పాడైపోయిందని, ఈ విషయంపై గత నాలుగు జన్మభూమి కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోవడంతో ఐదవ విడత జన్మభూమిని తాము బహిష్కరిస్తున్నామని పంచాయతీ సర్పంచ్ పాంగి నాగరాజు ముందుగానే ప్రకటించారు. బుదవారం ఉదయం 9గంటలకు కందమామిడి జంక్షన్ వద్ద సర్పంచ్ నాగరాజు, గిరిజన సంఘం నాయకులు ఎం.ఎం.శ్రీను, ఎల్. సుందర్రావు, పాలికి లక్కు, 21 గ్రామాల గిరిజనులు రోడ్డుపై బైఠాయించారు. ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అక్కడను రావడంతో గిరిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు, నెలరోజుల్లో రోడ్డు నిర్మిస్తానని, నిర్మించకపోతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. కాని అందుకు లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని గిరిజనులు పట్టుబడటంతో ఆమె ఆవేశంతో ఊగిపోయారు. ఇకచేసేది లేక కూర్చొన్న గిరిజనుల మద్య నుంచి ఆమెను నడుకుచుకుంటూ రోడ్డు నిర్మాణానికి మీరే అడ్డంకి అని నినాదిస్తూ వనుగుపల్లికి వెళ్లారు. ఇంత అన్యాయమా? ఇది చాలా అన్యాయం. ప్రజల సమస్యలను చెబుతుంటే మైక్‌ను ఆపేస్తారా. ఇది ఎంతటి దుర్మార్గం. ఇక్కడకొచ్చి ప్రజల సమస్యలను చెప్పకుండా ప్రభుత్వానికి భజన చేయమంటారా? ప్రజల సమస్యలను చెబితే ఇక్కడి ప్రజాప్రతినిధులకు, టీడీపీ కార్యకర్తలకు నచ్చడంలేదు. అందుకే వారు నేను మాట్లాడుతున్నప్పుడు మైక్‌ను కూడా కట్ చేశారు. వారికి ప్రజలు బుద్ధి చెప్పేరోజు ఎంతో దూరంలో లేదు. – పల్లా చినతల్లి, మాజీ కౌన్సిలర్, వైఎస్సార్ సీపీ నాయకురాలు సొంతింటి కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నా.. నేను డ్రైవర్‌గా పని చేస్తున్నాను. గాజువాకలో 30 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాను. ఇప్పటి వరకు సొంత ఇల్లు లేదు. ఇల్లు కేటాయించాలని కాళ్లరిగేలా అధికారుల చుట్టూ తిరుగుతున్నా. ప్రతిసారి జన్మభూమిలో దరఖాస్తు చేస్తున్నాను. అయినా ఎవరూ పట్టించుకోవడంలేదు. – తుంపాల శ్రీరాములు, పాతగాజువాక పింఛను కోసం ప్రదక్షిణలు నా వయస్సు 68 సంవత్సరాలు. నా ఆధార్ కార్డులోను, రేషన్ కార్డులోను కూడా వయస్సు కరెక్టుగానే ఉంది. వృద్ధాప్య పింఛను ఇవ్వాలని నాలుగేళ్లుగా తిరుగుతున్నాను. ఎమ్మెల్యేను కూడా అడిగాను. అయినప్పటికీ నా మొర ఎవరూ వినడంలేదు. వీళ్లు(టీడీపీ కార్యకర్తలు, పోలీసులు) మాత్రం మమ్మల్ని స్టేజి దగ్గరకు వెళ్లనివ్వడంలేదు. – తవిటయ్య, జోగవానిపాలెం -
రేయ్.. జాగ్రత్త
అధికార పార్టీ నాయకుల బెదిరింపులు.. దాడులు. అడుగడుగునా నిరసనలు.. నిలదీతలు. పోలీసులతో గెంటివేతలు.. భగ్గుమన్న సామాన్యులు.. ఏ ఊరికెళ్లినా అదే తీరు. ఇదీ జిల్లాలో రెండో రోజు చేపట్టిన జన్మభూమి–మాఊరు సభల కొనసాగింపు. అనంతపురం అర్బన్ : జన్మభూమి మా ఊరు అంటేనే జనం అసహ్యించుకుంటున్నారు. సమస్యలు చెప్పుకోవడానికి వెళ్లిన వారిని అధికార పార్టీ నాయకులు ఎక్కడ పోలీసులతో గెంటివేయిస్తారోనని జంకుతున్నారు. జిల్లా వ్యాప్తంగా రెండో రోజు జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో కూడా ఇన్పుట్ సబ్సిడీ, పింఛన్లు, పక్కా గృహాలు తదితర సమస్యలపై ప్రజాప్రతినిధులను, అధికారులను నిలదీశారు. ఎన్టీఆర్ ఇళ్ల కోసం ఎస్సీల నిలదీత.. రాయదుర్గం రూరల్ మండలం 74 ఉడేగోళం గ్రామంలో జరిగిన సభలో ఎన్టీఆర్ ఇళ్లు, ఇంటిపట్టాల కోసం అధికారులను దళిత కాలనీ వాసులు నిలదీశారు. ఎన్టీఆర్ ఇళ్లు ఇవ్వాలని పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ఇప్పుడేమో మీ సమస్యల పరిష్కారం కోసం జన్మభూమి కార్యక్రమం అంటూ వచ్చారని అధికారులను, టీడీపీ సర్పంచ్ గురు సిద్దప్పను నిలదీశారు. అర్హత ఉన్నా పింఛన్లు ఇవ్వరా ? గుమ్మఘట్ట మండలం బేలోడు, భూపసముద్రం గ్రామాల్లో జరిగిన జన్మభూమి సభలలో అర్హతలున్నా పింఛన్లు ఎందుకు ఇవ్వడంలేదని అధికారులను ప్రజలు నిలదీశారు. పలుమార్లు అర్జీలిచ్చినా అర్హత కలిగిన మాకు పింఛను ఎందుకివ్వడం లేదని సిద్దరాంపురం గ్రామంలో అధికారులను జరిగిన సభలో వికలాంగులు, వృద్ధులు వితంతువులు నిలదీశారు. బొమ్మనహాళ్ గ్రామసభలో రోడ్డు కోసం ప్రజలు నిలదీశారు. రోడ్డు సౌకర్యం లేక పడుతున్న ఇబ్బందుల్ని పరిశీలించాలని , జన్మభూమి కార్యక్రమం నుంచి అధికారులను తీసుకెళ్లి అధ్వానంగా ఉన్న రోడ్డును చూపించారు. సోమందేపల్లి మండలంలో జరిగిన జన్మభూమి సభలో అర్హులైన రైతులకు సాగు పట్టాలు ఇవ్వాలని సీపీఎం నాయకులు ఆందోళన చేపట్టారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకుని బయటకు పంపి గేట్లు మూశారు. కణేకల్ మండలం సొల్లాపురం గ్రామంలో జన్మభూమి మూడో విడత రుణమాఫీ కాకపోవడంతో రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగు నీటి సమస్యపై అధికారులను ప్రజలు నిలదీశారు. ఉరవకొండ రూరల్ మండలం నెరిమెట్ల గ్రామంలో జరిగిన సభలో రేషన్ కార్డులు, పింఛన్లు కోసం అధికారులను వైఎస్సార్సీపీ నాయకులు నిలదీశారు. పేదలకు సంక్షేమ పథకాలు ఇవ్వలేనప్పుడు ఎవరి కోసం జన్మభూమి నిర్వహిస్తున్నారంటూ ఆగ్రహించారు. కూడేరు మండలం ఇప్పేరు గ్రామసభలో సమస్యల పై అధికారులను గ్రామస్తులు నిలదీశారు. కొనకండ్ల గ్రామ సభలో పింఛన్ల కోసం అధికారులన ప్రజలు నిలదీశారు. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు కళ్యాణదుర్గం మండలం మానిరేవులో నిర్వహించిన జన్మభూమిలో ఇన్పుట్ సబ్సిడీ కోసం రైతులు ఆందోళనకు దిగారు. గ్రామంలో సుమారు 600 మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదని రైతులు, గ్రామ నాయకులు ఎర్రిస్వామి, తిమ్మప్ప జన్మభూమి కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. తహసీల్దార్ శ్రీనివాసులును చుట్టుముట్టారు. గంట పాటు ఆందోళన చేపట్టారు. పింఛన్లు ఇవ్వలేదు.. అర్హులైన వారికి పింఛన్లు, రైతులుకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదంటూ కుందుర్పి మండలం తూముకుంట, తెనగల్లు గ్రామాల్లో జరిగిన సభల్లో అధికారులను వైఎస్సార్సీపీ నాయకులు నింగప్ప, రామిరెడ్డి, తిమ్మరాజు తదితరులు అడ్డుకున్నారు. అర్హులైన వారికి పింఛన్లు అందడం లేదని రాప్తాడు మండలం కొత్తపల్లిలో జరిగిన సభలో సర్పంచ్, వైస్ సర్పంచ్ నిరసన తెలిపారు. ఇదేం రుణమాఫీ ! కణేకల్లు : రుణమాఫీపై రైతులు మండిపడ్డారు.. ఒకటి, రెండో విడతలో రుణమాఫీ అయి మూడో విడతలో రుణమాఫీ కాక పోవడం.. అర్హులైన 50 మందికి అసలే రుణమాఫీ చేయకపోవడంతో ఇదేం రుణమాఫీనని రైతులు అధికారులపై నిప్పులు చెరిగారు. కణేకల్లు మండలం సొల్లాపురం గ్రామంలో జరిగిన జన్మభూమిలో ఇదే విషయమై రైతు సంఘం అధ్యక్షులు జయచంద్రారెడ్డి, రైతులు అధికారులు, నాయకుల్ని నిలదీశారు. ఉరవకొండ మండలం నింబగల్లు సిండికేట్‌బ్యాంకులో రుణాలు తీసుకొన్న సొల్లాపురం, ఎన్.హనుమాపురం గ్రామానికి చెందిన రెండువేల మందికి మొదటి రెండు విడతల్లో రుణమాఫీ అయ్యిందని మూడో విడతలో మాత్రం రుణమాఫీ కాలేదని మండిపడ్డారు. రేయ్.. జాగ్రత్త యల్లనూరు: నువ్వు ఎందుకు అన్నీ..పూసుకుంటున్నావ్.. రేయ్ జాగ్రత్త ..చూసుకో.. అంటూ టీడీపీ నాయకులు ప్రభుత్వ విప్, శింగనమల ఎమ్మెల్యే యామినిబాల ముందే ఓ దళిత నాయకుడ్ని అవమానించారు. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని దంతలపల్లి, శింగవరం గ్రామాల్లో అధికారులు జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించారు. శింగవరంలో జరిగిన కార్యక్రమంలో అదే గ్రామానికి చెందిన బాలనరసింహుడు ఎమ్మెల్యే ముందుకు వచ్చి గ్రామంలోని ఎస్సీ కాలనీకి తాగునీటి సౌకర్యం లేదని, అంతే కాక గతంలో గ్రామంలో చౌకదుకాణ డీలర్ షిప్‌ను ఎస్సీలకు ఇవ్వాలని, జన్మభూమికి గ్రామ సర్పంచ్ హాజరు కాకుండా ఆమె భర్త హాజరు కావడం ఏంటని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో ఆమె వెనుక వచ్చిన టీడీపీ నాయకులు ఆయనపై చిందులేశారు. అసభ్య పదజాలంతో దుర్భాషలాడారు. ఎమ్మెల్సీ విప్ పయ్యావుల నిలదీత విడపనకల్లు: మండల పరిధిలోని వేల్పుమడుగులో బుధవారం నిర్వహించిన జన్మభూమి గ్రామసభలో ఎస్సీ కాలనీవాసులు ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌ను నిలదీశారు. స్థానిక మాలవీధిలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, వెంటనే సమస్యను పరిష్కరించాలని కాలనీ మహిళలు నిలదీశారు. మరుగుదొడ్ల బిల్లులు మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులకు పింఛన్లు మంజూరు చేయాలని కోరారు. సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్సీ కేశవ్ కాలనీవాసులకు హామీ ఇచ్చారు. టీడీపీ కార్యకర్తల దాడి.. కంబదూరు మండలం కర్తనపల్లి గ్రామంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో సమస్యలను అడిగేందుకు వచ్చిన వైఎస్సార్సీపీ నాయకులు నాగరాజు, శివలపై టీడీపీ కార్యకర్తలు కుర్చీలతో దాడికి యత్నించారు. జెడ్పీటీసీ, అధికారుల సమక్షంలోనే ఈ దాడికి యత్నించారు. అలాగే శెట్టూరు మండలం చిన్నంపల్లి, బొచ్చుపల్లి గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో వైఎస్సార్సీపీ నాయకులు రాజశేఖర్, కాంగ్రెస్ నాయకుడు భాస్కర్ ప్రభుత్వ పథకాలు టీడీపీ కార్యకర్తలకేనా ఇతరులకు వర్తించవా అని నిలదీశారు. పాత గుంతకల్లు జన్మభూమిలో సమస్యలపై అధికారులను వైఎస్సార్ సీపీ నాయకులు నిలదీశారు. సమాధానం చెప్పలేక అధికారులు వెనుతిరిగారు. -
రెడీ.. వన్..టూ..త్రీ స్టార్ట్!
ప్రచార పిచ్చి పీక్ స్టేజ్‌కు వెళ్లినట్లుంది. రాష్ట్ర ప్రభుత్వం చేసేది గోరంత.. చూపించేది కొండంతలా మారింది. ఏ పని చేసినా పబ్లిసిటీ స్టంట్‌గానే మారింది. ఈదఫా జన్మభూమి ఎపిసోడ్లో సామాజిక పింఛన్లు అందుకొనే వృద్ధులు, వికలాంగులు, వితంతువులనూ నటులుగా చేర్చారు. ‘దర్శిలో సీఎంగారి సభ అంతా టీవీల్లో చూస్తేనే పింఛన్ ఇచ్చేది’ అంటూ అధికారులు.. పింఛన్ సొమ్ముకోసం పంచాయతీ కార్యాలయాల వద్దకు మంగళవారం వచ్చినవారికి షరతు విధించారు. ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల దాకా వాళ్ల డబ్బుమీద చేతులు పెట్టిఎటూ కదలనివ్వలేదు. గిద్దలూరు రూరల్: మండలంలో కె.ఎస్.పల్లి పంచాయతీ పరిధిలోని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పెన్షన్ల కోసం మంగళవారం పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అయితే అధికారులు ఎంతకూ పెన్షన్ పంపిణీ చేయకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పైగా దర్శిలో మంగళవారం చేపట్టిన సీఎం చంద్రబాబు కార్యక్రమాన్ని టీవీలో చూడాలని కార్యక్రమం అంతా పూర్తిగా చూస్తేనే పెన్షన్ల పంపిణీ చేస్తామంటు అధికారులు చెప్పారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వృద్ధులు, వికలాంగులు, వితంతువులంతా టీవీ చూస్తు ఉండిపోయారు. పెన్షన్ కోసం దిగువమెట్ట, దిగువమెట్ట తండా, పెద్ద చెరువు, ఉప్పలపాడు గ్రామాల నుంచి వచ్చినవారితో కె.ఎస్.పల్లి పంచాయతీ కార్యాలయం నిండిపోయింది. దూర ప్రాంతాల నుంచి డబ్బులు ఖర్చు చేసుకొని ఆటోల్లో వచ్చినవారు తిండీ తిప్పలు లేకుండా సాయంత్రం వరకు ఉండిపోయారు. ఇష్టం లేకున్నా బలవంతంగా కూర్చోబెట్టి టీవీ చూడమంటే ఏం చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి వద్ద పనులు మానుకుని కార్యాలయం వద్ద గంటల తరబడి వేచి ఉండాలంటే ఎలా సాధ్యమని ప్రశ్నించారు. అధికారులు మాత్రం వేలిముద్రలు వేసే యంత్రం పనిచేయకపోవడంతో పెన్షన్లను పంపిణీ చేయలేదని.. మెషీన్‌ను గిద్దలూరుకు పంపామని వచ్చిన వెంటనే పంపిణీ చేస్తామని తెలిపారు. తిండి తిప్పలు లేకుండా ఎలా కూర్చోవాలా? దిగువమెట్ట నుంచి ఉదయం 9 గంటలకు వచ్చాను. సాయంత్రం 5 గంటలవుతున్నా పెన్షన్ ఇవ్వలేదు. ఈ రోజు ఇవ్వమని చెబితే ఇంటికి వెళుతాము కదా! ఆ టీవీలో సీఎం కార్యక్రమం వస్తుంది ఇక్కడే కూర్చోమంటున్నారు. తిండి తిప్పలు లేకుండా ఎలా కూర్చోవాలి? – తిరుపతయ్య చార్జీలు పెట్టుకుని వచ్చా దిగువమెట్ట నుంచి ఉదయం ఆటోలో వచ్చాను. గంటల తరబడి ఇక్కడే వేచి ఉండమంటే ఎలా ఉండాలి. మా పెన్షన్ డబ్బులు మాకు ఇస్తే ఇంటికి వెళ్లి పనులు చేసుకుంటాం. – రామలక్ష్మమ్మబాయి ఎప్పుడిస్తారో ఏందో! చీరాల టౌన్: ఎన్టీఆర్ భరోసా పథకంలో భాగంగా వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు ప్రతినెలా ఒకటో తేదీన అందాల్సిన పింఛన్ కోసం తిప్పలు పడుతున్నారు. జీవిత చరమాంకంలో ఆర్థిక తోడ్పాటునందించేందుకు ప్రవేశపెట్టిన పింఛన్ పథకాన్ని పాలకులు, అధికారులు సక్రమంగా అమలు చేయకపోవడంతో పంచాయతీ కార్యాలయాల వద్ద ఒకటో తేదీ నుంచి వేచి చూడాల్సి వస్తోంది. ఆన్లైన్ కష్టాలు.. ఎన్నో రకాలుగా మారుతూ వస్తోన్న పింఛన్ పంపిణీ వ్యవహారం ప్రస్తుతం ఆన్లైన్ సమస్యతో ముందుకు సాగడంలేదు. ఉదయం 7 గంటల నుంచి ఎదురు చూస్తున్నా ఆన్లైన్ పనిచేయడం లేదంటూ అధికారులు లబ్ధిదారులతో బుకాయిస్తున్నారు. చీరాల మండంలోని 15 గ్రామ పంచాయతీలకు గాను కేవలం 5 గ్రామాల్లోనే సక్రమంగా పింఛన్ పంపిణీ చేస్తున్నారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పింఛన్‌దారులు ఎదురు చూసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో కనీసం బిళ్లలు కూడా కొనుక్కోలేని పరిస్థితి దాపురించింది. పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని ఏప్పుడు ప్రారంభిస్తారో కనీసం ఆ గ్రామాల్లో కూడా ప్రచారం చేయకపోవటంతో రెండు మూడు రోజులుగా లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. -
తొలిరోజే జన్మభూమిపై నిరసనలు
-
నిలదీతలతో ఆరంభం
సాక్షి, నెట్వర్క్ / అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా జన్మభూమి ఐదో విడత కార్యక్రమం తొలిరోజు నిరసనలు, నిలదీతలతో హోరెత్తింది. పాత సమస్యలపై పదేపదే వినతిపత్రాలు ఇవ్వాల్సి రావటంతో మంగళవారం పలుచోట్ల అధికార పార్టీ నేతలను ప్రజలు నిలదీశారు. అర్హులను పట్టించుకోకుండా అనర్హులకు ప్రయోజనాలు చేకూరుస్తున్నారని మండిపడ్డారు. దీంతో పోలీసు బందోబస్తుతో గ్రామసభలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ⇔ నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు గ్రామ సభలో బైరబోగు రావమ్మ అనే వృధ్దురాలు గత మూడేళ్లలో 29 సార్లు ఫించను కోసం దరఖాస్తు ఇచ్చినా మంజూరు కాకపోవడంపై కన్నీటి పర్యంతమైంది. ⇔ శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం పాతనౌపడలో తమకు ఇల్లు మంజూరు చేయకుండా రెండేసి ఇళ్లు ఉన్న వారికి ఇస్తున్నారంటూ పలువురు గ్రామస్థులు అధికారులను నిలదీశారు. ⇔ తూర్పు గోదావరి జిల్లాలో రుణమాఫీ విషయంలో ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌ను రైతులు నిలదీశారు. ⇔ బంగారు తల్లి పథకాన్ని పునరుద్ధరించాలని కొత్తపేట మండల పరిధిలోని కండ్రిగ గ్రామ సభలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ⇔ పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం జన్మభూమి గ్రామసభను అడ్డుకున్న ఎత్తిపోతల పథకం రైతులు తమ భూములకు పరిహారం పెంచాలని ధర్నా చేశారు. ⇔ బుట్టాయగూడెం మండలం దొరమామిడిలో గ్రామ సభలను ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులు అడ్డుకున్నారు. వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేరుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ⇔ పెరవలిలో నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుకు చేదు అనుభవం ఎదురైంది. రేషన్‌కార్డులు ఉన్నా రేషన్ ఇవ్వకపోవడంపై మహిళలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ⇔ కర్నూలు జిల్లా ఆదోని మండలం బసరకోడు, ఆలూరు మండలం హత్తిబెలగల్, కల్లూరు మండలాల్లో గ్రామసభలను వివిధ సమస్యలపై స్థానికులు అడ్డుకున్నారు. ⇔ అనంతపురం జిల్లాలో తాగునీటి సౌకర్యం కల్పించటం లేదని రాయదుర్గం నియోజకవర్గం డి.హీరేహళ్ మండలం ఓబుళాపురం గ్రామంలో సమాచార శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులును సిద్దనగౌడ ప్రజలు నిలదీశారు. ⇔ విశాఖపట్నం జిల్లాలో పాడేరు, అరకు ఎమ్మెల్యేలు కిడారి సర్వేశ్వరరావు, గిడ్డి ఈశ్వరిలకు జన్మభూమి సభలో గిరిజనుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. బోయ, వాల్మీకులను ఎస్టీల్లో చేరుస్తూ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని గిరిజన ఎమ్మెల్యేగా ఎలా సమర్థిస్తావంటూ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని నిలదీశారు. చినలబుడులో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుపై గిరిజనులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ⇔ భీమిలి రూరల్ మండలం కాపులుప్పాడలో జన్మభూమిలో మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రసంగిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. ‘ప్రతి జన్మభూమిలో దరఖాస్తు ఇస్తూనే ఉన్నా.. గత నాలుగు విడతల్లో ఇచ్చా.. మళ్లీ ఈ సభలో కూడా మీకే ఇస్తున్నా...’అని గ్రామానికి చెందిన కొండపు నరసింహ (70) మంత్రి గంటాను నిలదీశారు. పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి వేపగుంట వద్ద ప్రజలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘మీరు ఎన్నైనా చెప్పండి...మీ సమస్యలు విననంటే వినను. ఇది సంక్షేమం.. సంతృప్తి సభ మాత్రమే. మీ సమస్యలు వినడానికి ఇది వేదిక కాదు’ అంటూ ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ⇔ కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లి మండలంలో విద్యార్థులతో తెలుగుదేశం పార్టీ జెండాలు పట్టించి ర్యాలీ నిర్వహించారు. నూజివీడులో స్థానిక ఎమ్మెల్యే మేకా ప్రతాప్ రేషన్‌కార్డులు, డ్వాక్రా రుణమాఫీ అంశాలపై అధికారులను నిలదీయడంతో జాయింట్ కలెక్టర్ విజయ్‌కృష్ణన్ అర్ధాంతరంగా సభ నుంచి నిష్క్రమించారు. జగ్గయ్యపేటలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్ సీపీ నేత ఉదయభాను నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేశారు. ⇔ గుంటూరులో ఎమ్మెల్యే ముస్తఫా సభా వేదికపై లేకుండానే టీడీపీ ఇన్చార్జి మద్దాలి గిరి, టీడీపీ నేతలు షౌకత్ వంటి వారు వేదికపై కూర్చొని జన్మభూమి సభలో హల్చల్ చేశారు. అయితే ఎమ్మెల్యే ముస్తఫా ప్రజల్లో కూర్చొని వారి పక్షాన సమస్యల గురించి అధికారులు, నేతలను ప్రశ్నించారు. ⇔ అమరావతిలో రాజధాని గ్రామాలకు సీడ్‌యాక్సిస్ రోడ్డు భూ సేకరణ నోటిఫికేషన్‌కు సంబంధించి జన్మభూమి కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు అధికారులను నిలదీశారు. -
అన్నీ హామీలై..
బి.కొత్తకోట: చంద్రబాబునాయుడు సీఎం అయ్యాక తంబళ్లపల్లె నియోజకవర్గంలో నాలుగు సార్లు పర్యటించారు. అన్నిసార్లూ హామీలు గుప్పించారు. అసలే కరువు ప్రాంతం.. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేని పరిస్థితుల్లో హామీలపై ఇక్కడి ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆచరణలో ఒక్క హామీ కూడా నెరవేరలేదు. తొలిసారి 2014 నవంబర్ 5న కురబలకోట మండలం అంగళ్లులో జరిగిన జన్మభూమి– మాఊరు సభలో, 2015 ఫిబ్రవరి 19న బి.కొత్తకోట మండలం గుమ్మసముద్రం పెద్దచెరువులో జరిగిన నీరు– చెట్టు ప్రారంభోత్సవ సభలో, 2015 మే 7న కురబలకోట మండలం అంగళ్లులో జరిగిన రైతు సదస్సులో, 2016లో కురబలకోట మండలం ముదివేడులో జరిగిన పంట సంజీవని పనుల పరిశీలన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నో హామీలు ఇచ్చారు. రైతు సదస్సు జరిగిన మరుసటి రోజు జరిగిన విలేకరుల సమావేశంలోనూ హామీల వరద పారించారు. ఈ హామీలన్నీ హామీల స్థాయిలోనే ఆగిపోయాయి. సీఎం ఇచ్చిన హామీలను పరిశీలిస్తే.. ► 2015 వర్షాకాలంలోగా హంద్రీ–నీవా జలాలను తంబళ్లపల్లె నియోజకవర్గానికి రప్పిస్తామని ప్రకటించారు. రెండు వర్షాకాలాలు ముగిసినా నీరు పారలేదు. ► జిల్లాలో రోజుకు 22 లక్షల లీటర్ల పాలను రైతులు ఉత్పత్తి చేస్తున్నారని, దీన్ని 50 లక్షల లీటర్లకు పెంచేలా ప్రణాళిక అమలు చేస్తానన్నారు. ► కరువు పరిస్థితులతో రైతులు పశుగ్రాసం కొరత ఎదుర్కొంటున్నారని, ఈ కొరతను ఎదుర్కొనేందుకు ప్రతి గ్రామంలోనూ ఊరి వెలుపల 400 నుంచి 500 పశువులకు వసతులు కల్పించే హాస్టల్స్ నిర్మిస్తామని చెప్పారు. ఇందులోని పశువుల కోసం 50 నుంచి 60 ఎకరాల్లో సామూహికంగా పశుగ్రాసం సాగుచేసి వాటికి అందించే ఏర్పాటు చేస్తామన్నారు. ► పశువుల హాస్టల్స్‌లో లభించే పేడ, పంచితం (గోమూత్రం)తో బయోగ్యాస్ తయారు చేసి గ్రామంలోని కుటుంబాలకు సరఫరా చేస్తామన్నారు. పశువుల పేడతో ఎరువును తయారు చేసి విక్రయాలు సాగిస్తామన్నారు. ► జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి అనంతపురం జిల్లాలో అమలు చేస్తున్న కరువు ప్యాకేజీని ఇక్కడా అమలు చేసి రైతులను ఆదుకుంటామన్నారు. కరువు జిల్లాగా ప్రకటించక పోగా, అనంతపురం ప్యాకేజీని పట్టించుకోనేలేదు. ► పరిశ్రమలను ప్రోత్సహించేలా కర్ణాటకలోని బెంగళూరును కలి పేలా అనంతపురం జిల్లా మీదుగా తంబళ్లపల్లె, మదనపల్లె, పలమనేరు, కుప్పం నియోజకవర్గాలు కలిసేలా రింగ్ రోడ్డు నిర్మిస్తామన్నారు. ► పడమటి మండలాలకు ప్రత్యేక వాటర్ గ్రిడ్ ఏర్పాటు ద్వారా ప్రతి కుటుంబానికి కొళాయిల ద్వారా సురక్షితమైన తాగునీటిని అందిస్తామని చెప్పారు. హంద్రీ–నీవా కాలువ నీటిని దీనికి అనుసంధానిస్తామన్నారు. గ్రిడ్ పరిధిలోకి తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాలను కలుపుతామని ప్రకటించారు. ► బి.కొత్తకోటలో డిగ్రీ కళాశాలను ప్రారంభించి, ఉద్యోగాలు లభించే సాంకేతిక, వృత్తివిద్యా కోర్సులను ప్రారంభిస్తామని నమ్మబలికారు. ► కురబలకోటలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో చదువుకున్న బీటెక్, ఎంటెక్ విద్యార్థులు ఉద్యోగాలకోసం వలసపోకుండా స్థానికంగానే ఉద్యోగాలు కల్పించేందుకు హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్, ఐటీ సంస్థలను స్థాపిస్తామన్నారు. ► 100 రోజుల్లో లక్ష మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. ► తంబళ్లపల్లె నియోజకవర్గ టమాట రైతుకు రూ.10కోట్ల ప్యాకేజీ అమలు చేస్తామన్నారు.. ఇవన్నీ హామీలుగానే మిగిలిపోయాయి. -
నాకు చెప్పకుండా ఎవడిమ్మన్నాడు..?
► సూక్ష్మపోషకాల పంపిణీపై వివాదం ► ఎంపీఈఓపై జన్మభూమి కమిటీ సభ్యుడి దౌర్జన్యం ధర్మవరం: ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ నాయకులు, జన్మభూమి కమిటీల సభ్యుల దౌర్జన్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. నిబంధనల మేరకు సూక్ష్మపోషకాలను పంపిణీ చేసిన ఎంపీఈఓపై జన్మభూమి కమిటీ సభ్యుడు దాదాగిరీ చేశాడు. ‘‘ఏరా..? నాకు చెప్పకుండా ఎవడిమ్మన్నాడు’’ అంటూ నానా దుర్భాషలాడుతూ కొట్టినంత పని చేశాడు. దీంతో వ్యవసాయశాఖ సిబ్బంది కన్నీటి పర్యంతమవుతూ తమగోడును విలేకరులతో వెల్లబోసుకున్నారు. ఇంతకీ ఏంజరిగిందంటే... ధర్మవరం మండలం ఓబుళనాయునపల్లి గ్రామానికి మంజూరైన జిప్పం, బోరాన్, జింక్ తదితర మైక్రో న్యూట్రిన్స్ ను గురువారం అర్హులైన రైతులకు నిబంధనల ప్రకారం బయోమెట్రిక్ పద్ధతిన ఎంపీఈఓ పోతులయ్య శుక్రవారం పంపిణీ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న జన్మభూమి కమిటీ సభ్యుడు శ్రీరాములు అక్కడి వచ్చి ఎంపీఈఓపై దౌర్జన్యం చేశాడు. తమకు ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం పంపిణీ చేశామని అధికారులు చెబుతున్నా... పట్టించుకోలేదు. ‘‘ అంతా మీఇష్టమైతే మేమెందుకు.. మీరు ఏమి పని చేసినా, ఎవరికి ఏమి ఇవ్వాలన్నా మాకు చెప్పాలి’’ అంటూ నానా దుర్భాషలాడారన్నారు. అదంతా తమకు తెలియదని ఏదైనా ఉంటే ఉన్నతాధికారులను అడగాలని ఎంపీఈఓ సమాధానమివ్వడంతో కోపోద్రిక్తుడైన జన్మభూమి కమిటీ సభ్యుడు ఎంపీఈఓ పోతులయ్య గొంతుపట్టుకుని భౌతిక దాడికి యత్నించాడు. ప్రత్యేక అవసరాలుకలి్గన వ్యక్తి అన్న కనీస మర్యాద పాటించకుండా ఇలా దౌర్జన్యం చేస్తున్నారని బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు. పెత్తనం భరించలేకపోతున్నాం విలేకరులతో మాట్లాడిన పలువురు ఎంపీఈఓలు జన్మభూమి కమిటీ సభ్యుల పెత్తనాన్ని భరించలేకపోతున్నామని, ప్రతి చిన్న విషయం వారికే చెప్పాలని, లేదంటే నానా దుర్భాషలాడుతున్నారని వాపోయారు. గురువారం ఉదయం రావులచెరువు గ్రామానికి చెందిన అధికారపార్టీ నాయకుడు ఒకరు తనకు ఇన్పుట్ సబ్సిడీ పడలేదని నానాదుర్భాషలాడారని ఓ మహిళా ఎంపీఈఓ ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి సదరు రైతుకు రెండు చోట్ల భూమి ఉండటంతో అటువంటి వారి వివరాలు అన్నీ జేడీ కార్యాలయానికి పంపామని, అక్కడి నుంచి వారికి అనుమతి లభించాల్సి ఉందన్నారు. ఈ విషయాన్ని వివరించే ప్రయత్నం చేసినా ఆయన వినిపించుకోకుండా... ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడాదని ఆమె తెలిపింది. -
నీటి ప్లాంటుకు రూ.10.50 లక్షలు మంజూరు
చెన్నూరు : మండలంలోని ఉప్పరపల్లెలో నీటి ప్లాంటు నిర్మాణానికి ప్రభుత్వం రూ.10.50 లక్షల నిధులు మంజూరు చేసిందని మండల ఉపాధ్యక్షులు కె. విజయభాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల జరిగిన జన్మభూమి కార్యక్రమంలో గ్రామంలోని ప్రజలు ప్లాంటు ఏర్పాటు చేయాలని వినతి పత్రం ఇచ్చారన్నారు. ఈ మేరకు గ్రామం, మండలంలోని నాయకులు సంబంధిత అధికారులతో చర్చించి ఆర్డబ్ల్యూఎస్ శాఖ నుంచి నిధులు విడుదల చేయించామని, త్వరలోనే నీటిని ప్రజలకు అందిస్తామని చెప్పారు. -
పేనుకు పెత్తనం ఇస్తే..
రాజ్యాంగేతర శక్తిగా మారిన జన్మభూమి కమిటీలు వాటికి తలవంచిన అధికారులు రద్దు చేసిన వృద్ధుల పింఛన్లకు న్యాయపోరాటం మండల లీగల్ సెల్ అధారిటీ ఆదేశాలు బేఖాతరు ముఖ్యమంత్రి చంద్రబాబు తయారుచేసిన జన్మభూమి కమిటీ వ్యవస్థ.. రాజ్యాంగేతర శక్తిగా మారి..అధికారులను నిర్వీర్యం చేస్తోంది. ప్రభుత్వ పథకాల అమల్లో ఈ కమిటీల పెత్తనం.. ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తోంది. గ్రామాల్లో టీడీపీ కార్యకర్తలను జన్మభూమి కమిటీలుగా నియమించి వారి ద్వారా చేస్తున్న పాలన ప్రజాస్వామికవాదులను విస్తుబోయేలా చేస్తోంది. పథకాల అమలు చేయడంలో వారు చెప్పిందే వేదమన్నట్టుగా అధికారులు కూడా వ్యవహరిస్తుండడంతో అర్హులైన లబ్ధిదారులకు అన్యాయం జరిగిపోతోంది. ఈ కమిటీ పరిస్థితి.. పేనుకు పెత్తనం ఇస్తే.. అన్న చందంగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -రామచంద్రపురం రూరల్ (రామచంద్రపురం) ఎవరికైనా రుణాలు, సంక్షేమ పథకాలు కావాలంటే జన్మభూమి కమిటీలను ఆశ్రయించాల్సిందే. గ్రామ, మండల స్థాయిలో ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులను ఈ జన్మభూమి కమిటీలు.. జీరోలు చేస్తున్నాయి. మండలం కాపవరంలో కేవలం దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులన్న కారణంతో అర్హులైన 9 మంది వృద్ధులకు పింఛన్లను ఈ కమిటీలు తొలగించాయి. వీరిలో ఐదుగురు మహిళలు, నలుగురు బీసీకి చెందిన వారు ఉన్నారు. మండల, జిల్లా గ్రీవెన్స్‌సెల్‌లో వీరు ఎన్నోసార్లు లిఖిత పూర్వకంగా అర్జీలు దాఖలు చేసుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో గ్రామంలోని మానవ హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు కొల్లూరి వరాహ లక్ష్మీనరసింహశాస్త్రి (విష్ణు) సహకారంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వీరు పింఛన్లకు అర్హులేనని, ఫిబ్రవరి 4వ తేదీలోగా వీరికి పింఛన్లు పంపిణీ చేయాలని జనవరి 21న మండల లీగల్ సెల్ అధారిటీ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ విషయంలో జన్మభూమి కమిటీని కాదని తానేమీ చేయలేనంటూ ఎంపీడీఓ చేతులెత్తేశారు. దివంగత సీఎం వైఎస్ పాలనలో మంజూరు చేసిన పింఛన్లను రెండేళ్లుగా ఇవ్వనందుకు ఎవరు బాధ్యత వహిస్తారని ఈ పింఛనుదారుల నరాల లోవరాజు, గీసాల మునియ్య, నరాల పాపయ్య, వజ్రపు యల్లారమ్మ, కొల్లపు శ్రీరాములు, పెట్టా సత్యం, నరాల తణుకులు, గీసాల కృష్ణమూర్తి, కొల్లపు చినసూరయ్య ప్రశ్నిస్తున్నారు. జన్మభూమి కమిటీలను ప్రజల నెత్తిన రుద్దిన ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యత వహిస్తారా? అంటూ నిలదీస్తున్నారు. న్యాయాధికారి ఆదేశించినా పింఛను ఇచ్చేందుకు చర్యలు తీసుకోకుంటే.. న్యాయం కోసం ఎక్కడకి వెళ్లాలని వారు అడుగుతున్నారు జన్మభూమి కమిటీ శాపంలా దాపురించింది.. అధికారులకు, ఎమ్మెల్యేకు మా బాధలు చెప్పుకున్నాం. న్యాయ శాఖను ఆశ్రయించాం. అయినా మా వేదన అరణ్య రోదన అయింది. జన్మభూమి కమిటీ మా పాలిట శాపంలా దాపురించింది. - నరాల పాపయ్య రెండో పూట గడవని దుస్థితి.. ఒక పూట తింటే రెండో పూట గడవని దుస్థితి నాది. నా పింఛన్‌ను జన్మభూమి కమిటీ వాళ్లు తీసేశారు. మరో దారి లేదు. పింఛన్ తిరిగి ఇప్పించాలని అధికారులను వేడుకుంటున్నాను. - కొల్లపు చిన సూర్యారావు అధికారుల తీరు బాధాకరం వృద్ధుల పింఛన్ల రద్దు విషయంపై న్యాయ వ్యవస్థ ఆదేశించిన తరువాతైనా అధికారులు కళ్లు తెరవకపోవడం బాధాకరం. అధికారులు ఇప్పటికైనా వారికి న్యాయం చేయాలి. - కొల్లూరి వరాహ లక్ష్మీనరసింహశాస్త్రి (విష్ణు), మానవ హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ప్రజాస్వామ్యంపై నమ్మకం పోతుంది మండల లీగల్ సెల్ అధారిటీ ఆదేశించినా పింఛన్ల మంజూరుకు అధికారులు.. జన్మభూమి కమిటీకే తలొగ్గడం గర్హనీయం. పరిస్థితి ఇలా ఉంటే ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం పోతుంది. - అంగర గోపాలాచార్యులు, హైకోర్టు న్యాయవాది హైకోర్టు అప్పీలుకు వెళ్లాం వీరికి పింఛన్లు పంపిణీ చేయమని మండల లీగల్ సెల్ అధారిటీ ఆదేశించడం వాస్తవమే. అయితే జన్మభూమి కమిటీ సభ్యులు అంగీకరించకుండా ఇచ్చే పరిస్థితి లేదు. దీనిపై హైకోర్టుకు అప్పీలు వెళ్లాం. - పీవీవీ సత్యనారాయణ, ఎంపీడీఓ -
డబ్బు దండుతున్న జన్మభూమి కమిటీలు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జన్మభూమి కమిటీ సభ్యులు ప్రజల నుంచి డబ్బు దండుకుంటున్నారని, ప్రభుత్వ పథకాలు అనర్హులకు అందిస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎనిమిరెడ్డి మాలకొండయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ ఆర్అండ్బీ అతిథిగృహంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జన్మభూమి కమిటీ సభ్యులు దళారులుగా తయారయ్యారన్నారు. పిఠాపురంలో పింఛన్లు, కాకినాడ కార్పొరేషన్లో వ్యక్తిగత మరుగుదొడ్లు అనర్హులకు అందించిన విషయం ఇప్పటికే బయట పడిందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో సైతం కమిటీల పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. నిజమైన లబ్ధిదారులకు అందాల్సిన పథకాలు కమిటీల కారణంగా పక్కదోవ పడుతున్నాయన్నారు. కాకినాడలో ఇష్టానుసారంగా కార్పొరేషన్ స్థలాలు ఆక్రమించి భవనాలు నిర్మించుకుంటున్న వారికి అధికారులు అనుమతులు ఇస్తున్నారన్నారు. ఇటీవల రూ.రెండుకోట్ల స్థలం ఆక్రమణకు గురయిందని , కార్పొరేషన్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. మూడు సంవత్సరాలుగా కార్పొరేషన్ నిధులు పక్కదారి పట్టాయని, కలెక్టర్, కార్పొరేషన్ ప్రత్యేక అధికారి అరుణ్‌కుమార్ ఈ విషయంపై విచారణ చేపట్టాలని , వెంటనే బాధ్యుడైన కమిషనర్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కాకినాడకు కేంద్ర ప్రభుత్వం 4,600 ఇళ్లు మంజూరు చేసిందని, ఇప్పటివరకూ ఎంతమంది లబ్ధిదారులను ఎంపిక చేశారో అ«ధికారులు చెప్పడం లేదన్నారు. కార్పొరేషన్లో ప్రతి విభాగంలోను అవినీతి పేరుకుపోయిందన్నారు. వెంటనే విచారణ చేపట్టి అధికారులపై చర్యలు తీసుకోవాలని లేకుంటే అవినీతికి వ్యతిరేకంగా పెద్దఎత్తున ఉద్యమం చేపడతామన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిర్మిస్తున్న పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం లేదన్నారు. బీజేపీ నగర అధ్యక్షుడు పెద్దిరెడ్డి రవికిరణ్, మహిళామోర్చా నాయకురాలు కోరాడ లక్ష్మీతులసి పాల్గొన్నారు. -
జన్మభూమిలో ఫోజులు...కోటాలో కోతలు
ఇలా ఇచ్చారు.. అలా లాగేస్తారా..! బ్లాక్‌లో వేలాదిగాSరేషన్ కార్డులు కార్డుదారుల ఆశలు గల్లంతు ఎక్కడెక్కడ ఎన్నెన్ని... ∙కాకినాడలో 11 వేల రేష¯ŒSకార్డులు పంపిణీ చేశారు. సుమారు 2 వేలు బ్లాక్‌లో పెట్టారు. ∙కాకినాడ రూరల్ మండలంలో జన్మభూమిలో 2,562 రేష¯ŒS కార్డులు పంపిణీ చేయగా ఇందులో 500 బ్లాక్ చేశారు ∙రాజమహేంద్రవరం నగరంలో 6,396 రేష¯ŒS కార్డులు పంపిణీ చేస్తే 1400 కార్డులు.. రాజమహేంద్రవరం రూరల్‌లో 3960 కార్డులు పంపిణీ చేయగా, సుమారు 500 కార్డులు బ్లాక్‌లో పెట్టారు. ∙అమలాపురంలో 2,071 కార్డులు పంపిణీ చేస్తే సుమారు 300 కార్డులను బ్లాక్ చేశారు. సాక్షిప్రతినిధి, కాకినాడ : ‘ఏరు దాటే వరకూ ఓడ మల్లన్న. ఏరు దాటాక బోడి మల్లన్న’ చందంగా ఉంది సర్కారు తీరు. జన్మభూమి సభలు జరిగినప్పుడు వాటి విజయవంతం కోసం జనం కావాల్సి వచ్చింది. అందుకోసం సర్కార్ పలు తాయిలాలు ప్రకటించింది. అందులో రేష¯ŒSకార్డులు కూడా ఉన్నాయి. 91 వేల పైచిలుకు రేష¯ŒSకార్డులు మంజూరు చేసిన జిల్లా యంత్రాంగం పది రోజుల వ్యవధిలోనే వీటిని జన్మభూమి గ్రామసభల్లో పంపిణీ చేసింది. ఎమ్మెల్యేలు, మంత్రులు ఫొటోలకు ఫోజులిచ్చి జన్మభూమి సభల్లో ఈ రేష¯ŒS కార్డులను పంపిణీ చేశారు. రేపోమాపో రేష¯ŒS సహా ఇతర నిత్యావసరాలు చౌకధరల దుకాణాల నుంచి తెచ్చుకోవాలని జనం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ఇందుకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం కొత్త కార్డులకు కోటా కేటాయింపులు కూడా పూర్తి చేసింది. ఫిబ్రవరి కోటా వస్తుందని ఎదురుచూస్తున్న కార్డుదారులకు పంపిణీ చేసిన కార్డులన్నింటినీ పిడుగులాంటి వార్త చేరింది. అదేమంటే ‘బ్లాక్’లో పెట్టారని. దీంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. రేష¯ŒSకార్డులు చేతిలో పెట్టి నెల కూడా కాలేదు, కనీసం ఒక కోటా కూడా ఇంకా తీసుకోలేదు. అప్పుడే బ్లాక్‌లో పెట్టడమేమిటని మండిపడుతున్నారు. జన్మ భూమి సభలు, సమావేశాలు విజయవంతమయ్యే వరకు జనం కావాల్సి వచ్చింది, ఇప్పుడేమో ఇచ్చిన కార్డులు బ్లాక్‌లో పెడతారా అని జనం ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో పరిస్థితిదీ... జిల్లాలో 15 లక్షల 28 వేల 384 రేష¯ŒSకార్డులున్నాయి. జన్మభూమి కోసమని 91 వేల 806 రేష¯ŒSకార్డులు కేటాయించారు. మంజూరు చేసిన మేరకు అందరికీ రేష¯ŒSకార్డులు పంపిణీని పూర్తి చేశారు. తీరా ఫిబ్రవరి నెల కోటా కోసం కార్డులు తీసుకుని తహసీల్థార్ కార్యాలయాల వద్దకు వెళుతుంటే ‘మీకు రేష¯ŒS లేదు ... మీ కార్డు హోల్డ్‌లో ఉందని’ చెబుతున్నారని కార్డుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. l ఉదాహరణకు కాకినాడ నగరాన్నే తీసుకుందాం. ఇక్కడ జన్మభూమి సందర్భంగా 11 వేల రేష¯ŒSకార్డులు పంపిణీ చేశారు. అందులో సుమారు రెండువేల కార్డులు బ్లాక్‌లో పెట్టారు. సిటీని ఆనుకుని ఉన్న కాకినాడ రూరల్ మండలంలో జన్మభూమిలో 2,562 రేష¯ŒSకార్డులు పంపిణీ చేశారు. తీరా ఫిబ్రవరి కోటా కేటాయింపులు వచ్చే సరికి సుమారు 500 రేష¯ŒSకార్డులను బ్లాక్ చేశారని సమాచారం. l అమలాపురంలో 2071 కార్డులు పంపిణీ చేస్తే సుమారు 300 కార్డులు, రాజమహేంద్రవరం నగరంలో 6,396 రేష¯ŒSకార్డులు పంపిణీ చేస్తే 1400 కార్డులు, రాజమహేంద్రవరం రూరల్‌లో 3960 కార్డులు పంపిణీచేయగా, సుమారు 500 కార్డులు బ్లాక్‌లో పెట్టారు. ఈ రకంగా బ్లాక్‌లో పెట్టిన రేష¯ŒSకార్డులు అధికారికంగా ప్రాథమిక సమచారాన్ని బట్టి పరిశీలిస్తే 12 వేల వరకూ ఉన్నాయి. అనధికారిక సమాచారం ప్రకారం ఈ సంఖ్య 15 వేల వరకూ ఉంటుందని లెక్కలేస్తున్నారు. కాకినాడ పెరేడ్‌గ్రౌండ్స్‌లో గణతంత్ర వేడుకల సాక్షిగా 91,806 రేష¯ŒS కార్డులు మంజూరు చేసినట్టు జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్ ప్రకటించారు. జిల్లా విజిలె¯Œ్స అండ్ మోనిటరింగ్ కమిటీ సమావేశానికి హాజరైన ప్రజాప్రతినిధులకు సైతం అధికారులు ఇవే లెక్కలను చూపించారు. కానీ ఫిబ్రవరి కోటాకు ఈ లెక్కలన్నీ తారుమారైపోయేలా కన్పిస్తున్నాయి. ఈ కార్డులను ఎందుకు బ్లాక్‌లో పెట్టారంటే పల్స్ సర్వే మేరకు నిర్ణయం తీసుకున్నామని ఉన్నతాధికారులు చెబుతున్నారని మం డ ల స్థాయిలో సమాధానం వస్తోంది. సొంత ఇళ్లు, ఇంటి స్థలం ఉందని, నాలుగు చక్రాల వాహనం ఉందని..ఇలా పలు కారణాలు చెబుతున్నారని కార్డుదారులు ఆవేదన చెందుతున్నారు.రేష¯ŒSకార్డుకు దరఖాస్తు చేశాక అర్హత ఉందా లేదా అనేది పరిశీలించాకనే వాటిని మంజూరు చేశా రు. ఇప్పుడేమో అర్హత లేదని, పల్స్ సర్వే అంటూ కుంటిసాకులతో సర్కార్ నోటి దగ్గర కూడు తిరిగి లాగేసుకుంటోందని కార్డుదారులు లబోదిబోమంటున్నారు. ఆస్తులు లేకపోయినా ఉన్నట్టుగా... జన్మభూమిలో కొత్త రేష¯ŒS కార్డు ఇచ్చారు. కానీ సంక్రాంతి సరుకుల కోసం డీలర్ వద్దకు వెళితే మీ కార్డు డేటా రావడం లేదు సరుకులు ఇవ్వడం కుదరదన్నారు. తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి అడగ్గా కంప్యూటర్లో పరిశీలించి సొంత ఇల్లు ఉన్నట్టు చూపిస్తోంది. అందుకే కార్డు ఇ¯ŒSయాక్టివ్‌లో ఉంది అని చెబుతున్నారు. మా తాతయ్య ట్రాక్టర్ మెకానిక్ గా పని చేస్తుంటాడు వారికి ఎటువంటి ఆస్తులు లేవు. రాజీవ్ గృహకల్పలో ప్లాట్ ఉంది. – కె.ఉదయకుమార్, కాకినాడ పరిశీలించి అర్హుల కార్డులు పునరుద్ధరిస్తాం ప్రజలందరి ఆధార్ అన్నింటికీ అనుసంధానమైన నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నిర్దేశించిన ఆరు అంశాలలో ఏ ఒక్కటి ఉన్నా కొత్తగా మంజూరు చేసిన లబ్థిదారుల రేష¯ŒS కార్డులు ఇ¯ŒSయాక్టివ్‌లోకి వెళ్ళాయి. వాటన్నింటినీ పరిశీలిస్తున్నాం. అర్హులుంటే ఆ లబ్ధిదారుల కార్డులన్నీ పునరుద్ధరిస్తాం. – వి.రవికిరణ్, జిల్లా పౌరసరఫరాలశాఖాధికారి -
జన్మభూమి అర్జీలను సత్వరం పరిష్కరించాలి
రెవెన్యూ అధికారుల సమీక్షలో జేసీ సత్యనారాయణ కాకినాడ సిటీ : జన్మభూమి నాలుగో విడతలో ప్రజల నుంచి అందిన అర్జీలను సత్వరం పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కోర్టు హాలులో కాకినాడ, పెద్దాపురం డివిజన్ల ఆర్డీఓలు, తహసీల్దార్లతో రెవెన్యూ అంశాలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన్మభూమి, మీ–కోసం కార్యక్రమాల్లో అందిన అర్జీల పరిష్కారాన్ని వేగవంతం చేయాలన్నారు. కాలపరిధి దాటిన ఎఫ్‌లైన్ పిటిషన్లన్నింటినీ సత్వరం పరిష్కరించాలన్నారు. ఈ –పాస్ పుస్తకాలు, మ్యూటేషన్లు, ల్యాండ్ కన్వర్షన్, అడంగళ్ కరెక్షన్లు, అంశాల్లో పురోగతి ముమ్మరం చేయాలని, నీటి తీరువా వసూళ్లు సత్వరం పూర్తి చేయాలని ఆదేశించారు. రెవెన్యూ అధికారులు, క్షేత్ర సిబ్బంది అందరూ భీమ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని వాడడంతో పాటు ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. నగదు రహిత లావాదేవీలపై డివిజన్ స్థాయిలో వర్తకులకు రెండో విడత కార్యక్రమాలను నిర్వహించి, బయోమెట్రిక్ పరికరాలను పంపిణీ చేయాలన్నారు. జిల్లాలోని పెట్రోల్ బంకుల ద్వారా ఇప్పటి వరకూ దాదాపు రూ.22 కోట్ల మేర నగదు రహిత లావాదేవీలు జరగ్గా, రైతులు రూ.3.45 కోట్ల విలువైన ఎరువులను కొనుగోలు చేశారన్నారు. అలాగే రూ.2.18లక్షలు మేరకు మద్యం విక్రయాలు కూడా ఈ పద్ధతిలోనే జరిగాయని, జిల్లాలో నగదు రహిత లావాదేవీల స్థాయి క్రమేణా పెరుగుతోందన్నారు. జూన్ మాసాంతానికి జిల్లాను పొగరహిత జిల్లాగా మలిచేందుకు దీపం వంట గ్యాస్ పంపిణీ నూరుశాతం పూర్తి చేయాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన బడ్జెట్ నిధులను ఆర్డీఓలు, తహసీల్దార్లు పూర్తిగా వినియోగించాలన్నారు. ఈ సమావేశంలో డీఎస్ఓ వి.రవికిరణ్, డీఎం సివిల్ సప్లయిస్ కృష్ణారావు, కాకినాడ ఆర్డీఓ ఎల్.రఘుబాబు, పెద్దాపురం ఆర్డీఓ విశ్వేశ్వరరావు, తహసీల్దార్లు, ఎండీఓలు పాల్గొన్నారు. -
పింఛన్లనూ భోంచేస్తున్న ‘పచ్చ’ బకాసురులు
జన్మభూమి కమిటీలదే లబ్ధిదారుల ఎంపిక వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాజా రాజానగరం : ఏ ఆశ్రయం లేని వారికి ప్రభుత్వం అందించే పింఛన్లను సైతం అర్హులకు అందకుండా అధికార పార్టీ పెద్దలే గెద్దల్లా తన్నుకుపోతున్నారని వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆరోపించారు. ఎన్టీఆర్ భరోసా పేరుతో అమలు చేస్తున్న పథకంలో లబ్ధిదారుల ఎంపికలో అధికారులను పక్కకు నెట్టి జన్మభూమి కమిటీలతో చేయిస్తూ పచ్చ చొక్కాలు చక్రం తిప్పుతున్నాయన్నారు. అధికారంలోకి వచ్చింది మొదలు బకాసురుల్లా గోదావరిలో ఇసుక, కొండలను, చెరువులను భోంచేస్తూ వస్తున్న అధికార పార్టీ పెద్దలు ఇప్పుడు పింఛన్లను కూడా స్వాహా చేస్తున్నారని విమర్శించారు. రాజానగరం మండలం కొండగుంటూరులో శనివారం పర్యటించిన ఆయనకు అనేక మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తమకు పింఛన్లు ఇవ్వడం లేదంటూ గత రెండున్నరేళ్లుగా వాటి కోసం తాము పడుతున్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు. దానిపై ఆయన స్పందిస్తూ, గతంలో నెలకు రూ.200 చొప్పున పార్టీలకతీతంగా అర్హులైన వారందరికీ పింఛన్లను అందజేసిన ఘనత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిదేనన్నారు. ఈ మొత్తాన్ని రూ.వెయ్యి, రూ.1500 లకు పెంచుతామంటూ ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పిన మాటలను ప్రజలు నమ్మి ఓట్లు వేసి గెలిపించారన్నారు. కాని అధికారంలోకి వచ్చాక పింఛను సొమ్మును పెంచినా వడపోత పేరుతో తమ పార్టీ కాని వారందరి పింఛన్లను రద్దు చేశారని విమర్శించారు. అంతటితో ఆగకుండా కొత్తగా మంజూరైన పింఛన్లకు లబ్ధిదారులుగా కూడా తమ పార్టీకి చెందిన వారినే ఎంపిక చేస్తూ రాజకీయం చేయడం విచారకరమన్నారు. తాజా పింఛన్లలోనూ ఇదే అన్యాయం జన్మభూమి – మన ఊరు గ్రామసభలలో దరఖాస్తు చేసుకున్న వారిని ప్రాధాన్యతల ప్రకారం లబ్ధిదారులుగా ఎంపిక చేయవలసి ఉండగా టీడీపీకి చెందిన వారా, కాదా, అంటూ పరిశీలించి ఎంపిక చేయడం హేయమని రాజా అన్నారు. తాజాగా నియోజకవర్గానికి రెండు వేల చొప్పున మంజూరైన పింఛన్లకు లబ్ధిదారుల ఎంపికలోను ఇదే పంథాను అనుసరిస్తున్నారన్నారు. రాజానగరం నియోజవర్గంలో ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జన్మభూమి కమిటీ సభ్యులు రాత్రికి రాత్రి తమ అనుయాయులను లబ్ధిదారులుగా ఎంపిక చేసి, ఆన్లైన్ ప్రక్రియను కూడా పూర్తి చేశారని ఆరోపించారు. ఈ విషయంలో ఎంపీడీఓలకు కూడా ప్రమేయం లేకుండా చేస్తున్నారంటే అధికార పార్టీ అరాచకాలు ఎంత తీవ్రస్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇకనైనా వీరి ఆగడాలకు చెక్ పెట్టేందుకు ప్రజల్లో తిరుగుబాటు రావాలన్నారు. పాలకుల అకృత్యాలను, అరాచకాలను తెలియజేస్తూ, ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే తమ పార్టీ గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. పింఛన్ల బాగోతంపై సీతానగరంలో సోమవారం బహిరంగ సమావేశం నిర్వహించనున్నామన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మండారపు వీర్రాజు, రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు అనదాసు సాయిరామ్, పేపకాయల విష్ణుమూర్తి, వేమగిరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.